పంజాబ్‌లో ఆప్‌కు షాక్‌  | Three AAP MLAs join BJP ahead of Punjab Assembly election | Sakshi
Sakshi News home page

పంజాబ్‌లో ఆప్‌కు షాక్‌ 

Nov 3 2026 6:26 AM | Updated on Nov 3 2026 6:26 AM

Three AAP MLAs join BJP ahead of Punjab Assembly election

బీజేపీలో చేరిన ముగ్గురు రెబెల్‌ ఎమ్మెల్యేలు

న్యూఢిల్లీ/చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీకి మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనుండగా అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)కి గట్టి షాక్‌ తగిలింది. పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆప్‌ను వీడి కాషాయదళంలో చేరారు. వీరు సమానా ఎమ్మెల్యే చేతన్‌ సింగ్‌ జౌరమాజ్రా, సనౌర్‌ ఎమ్మెల్యే హర్మిత్‌ సింగ్‌ పఠాన్‌మాజ్రా, అమృత్‌సర్‌(నార్త్‌) శాసనసభ్యుడు కున్వర్‌ విజయ్‌ ప్రతాప్‌ సింగ్‌ సోమవారం ఢిల్లీలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పంజాబ్‌ వ్యవహారాల ఇన్‌చార్జి సతీశ్‌ పూనియా, పంజాబ్‌ బీజేపీ చీఫ్‌ కేవల్‌ సింగ్‌ ధిల్లాన్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ముగ్గురు నేతలను పునియా తమ పార్టీలోకి ఆహా్వనించారు. 

2027 అసెంబ్లీ ఎన్నికలకు గాను 40 మంది అభ్యర్థులతో కూడిన మొదటి జాబితాను సీఎం మాన్‌ విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ సందర్భంగా బీజేపీ ప్రధాన కార్యాలయంలో పునియా మీడియాతో మాట్లాడారు. ముగ్గురు నేతల రాజకీయ, సామాజిక, పరిపాలనా పరమైన అనుభవం పార్టీ బలోపేతానికి, పంజాబ్‌ ఎన్నికల్లో విజయానికి దోహదపడుతాయని చెప్పారు. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత, బీజేపీకి అనుకూలత పైకి కనిపించని రీతిలో పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. పంజాబ్‌కు డ్రగ్స్‌ బెడద అతి ముఖ్యమైన సమస్యగా మారిందని పునియా వివరించారు. సీఎం మాన్‌ హయాంలో పంజాబ్‌ యువత జీవితాలను హెరాయిన్‌ తీవ్రంగా నాశనం చేస్తోందని చెప్పారు. దీంతోపాటు అవినీతి, నేరాలు మరో ప్రధాన సమస్యగా మారాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement