పాఠశాలలకు 16 రోజులపాటు దీపావళి సెలవులు! | Mumbai Schools Diwali Holidays Dates full details | Sakshi
Sakshi News home page

బీఎంసీ పాఠశాలలకు 16 రోజులపాటు దీపావళి సెలవులు!

Nov 2 2026 8:14 PM | Updated on Nov 2 2026 8:21 PM

Mumbai Schools Diwali Holidays Dates full details

ఈ నెల 5 నుంచి 23 వరకు బడులకు విరామం.. 25న పునఃప్రారంభం

సాక్షి, ముంబై: నగరంలోని బృహన్ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ) పరిధిలోని ప్రాథమిక పాఠశాలలకు దీపావళి సందర్భంగా 16 రోజులపాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు బీఎంసీ విద్యాశాఖ 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి అధికారిక సర్క్యులర్‌ను విడుదల చేసింది. విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 5 నుంచి 23వ తేదీ వరకు పాఠశాలలకు దీపావళి సెలవులు ఉంటాయి. మధ్యలో వచ్చే ఆదివారాలతో కలిపి మొత్తం 16 రోజులపాటు విద్యార్థులకు సెలవులు లభించనున్నాయి. 24న గురునానక్‌ జయంతి సందర్భంగా మరో సెలవు ఉండటంతో పాఠశాలలు నవంబరు 25న తిరిగి ప్రారంభం కానున్నాయి.

పరిమితికి లోబడి మార్పునకు వెసులుబాటు  
బీఎంసీ పరిధిలోని అన్ని మాధ్యమాల మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాలలతోపాటు ప్రైవేటు ఎయిడెడ్‌ ప్రాథమిక పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి.ఈ మేరకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఒకే ప్రాంగణంలో ప్రాథమిక, మాధ్యమిక విభాగాలు కొనసాగుతున్న పాఠశాలల్లో సెలవుల తేదీల మధ్య వ్యత్యాసం ఉంటే, విద్యాశాఖ అధికారుల అనుమతితో వార్షిక సెలవుల పరిమితికి లోబడి మార్పులు చేసుకోవచ్చు. మ‌హారాష్ట్ర‌ ప్రభుత్వం భవిష్యత్తులో సెలవులకు సంబంధించి కొత్త నిబంధనలు జారీ చేస్తే, వాటికి అనుగుణంగా మార్పులు చేసే అధికారం విద్యాశాఖ అధికారులకు ఉంటుందని సర్క్యులర్‌లో పేర్కొన్నారు.

ఇదీ చ‌ద‌వండి: అయ్యో మ‌ల్ల‌య్యా.. ఎంత పని జ‌రిగింద‌య్యా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement