వాట్సాప్ గ్రూప్ ద్వారా రూ.1.29 కోట్ల టోకరా.. మరో రూ.20 లక్షలు డిమాండ్! | Man joins WhatsApp group, downloads trading app and loses above Rs 1crore | Sakshi
Sakshi News home page

వాట్సాప్ గ్రూప్ ద్వారా రూ.1.29 కోట్ల టోకరా.. మరో రూ.20 లక్షలు డిమాండ్!

Oct 31 2026 8:53 PM | Updated on Oct 31 2026 9:03 PM

Man joins WhatsApp group, downloads trading app and loses above Rs 1crore

థానే: మహారాష్ట్రలో సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. షేర్ మార్కెట్‌లో పెట్టుబడుల పేరుతో అధిక లాభాలు వస్తాయని నమ్మించి ఓ 70 ఏళ్ల వృద్ధుడి నుంచి ఏకంగా రూ.1.29 కోట్లు కాజేశారు. అయితే ఆ నేరగాళ్లు అంతటితో ఆగకుండా, డబ్బులు వెనక్కి ఇవ్వాలంటే వారికి మరో రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

థానే జిల్లా భివాండికి చెందిన బాధితుడిని జులై 10న 'Finsol' అనే వాట్సాప్ గ్రూపులో చేర్చారు. అందులోని సభ్యులు 'FINSOL' అనే ట్రేడింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని బాధితుడికి సూచించారు. అనంతరం అధిక లాభాలు వస్తాయనే ఆశతో బాధితుడు పలు బ్యాంకు ఖాతాల నుంచి మొత్తం రూ.1,29,96,593 వారికి బదిలీ చేశాడు.

అయితే పెట్టుబడులు, లాభాలను ఆ వృద్ధుడు వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించగా మరో రూ.20 లక్షలు చెల్లించాలని మోసగాళ్లు షరతు విధించారు. ఉన్నదంతా అందులోనే పెట్టుబడి పెట్టిన ఆ వ్యక్తి తను మోసపోయాడని గుర్తించాడు. అనంతరం జరిగిన ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.

బాధితుడి ఫిర్యాదుతో థానే సైబర్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. FINSOL యాప్ నిర్వాహకులు, వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లు, సంబంధిత బ్యాంకు ఖాతాదారులు సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

ఇదీ చదవండి: ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement