breaking news
Investments
-
అభిషేక్ బచ్చన్ సక్సెస్ మంత్రం ఇదే..
సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న అభిషేక్ బచ్చన్ ఇప్పుడు వ్యాపార, పెట్టుబడి విభాగంలోనూ వ్యూహాత్మకంగా ఎదుగుతున్నారు. కేవలం లాభాల కోసమో లేదా బ్రాండ్ విలువ కోసమో కాకుండా తాను స్వయంగా వాడే వస్తువులపైనే పెట్టుబడి పెట్టడం ఆయన ప్రత్యేకత. ఇటీవల జరిగిన ‘గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ 2026’లో పాల్గొన్న అభిషేక్ తన పెట్టుబడి ప్రయాణం, బ్రాండ్ ఎండార్స్మెంట్ల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తండ్రి బాటలో రియల్ ఎస్టేట్..పెట్టుబడుల విషయంలో తన తండ్రి అమితాబ్ బచ్చన్ ప్రభావం తనపై ఎంతో ఉందని అభిషేక్ అంగీకరించారు. ‘జమీన్ హై తో సబ్ టీక్ హై’ (నేల బాగుంటే అంతా బాగున్నట్లే) అనే నమ్మకాన్నే తాను కూడా అనుసరిస్తున్నట్లు తెలిపారు. స్క్వేర్ యార్డ్స్ డేటా ప్రకారం ముంబై అంతటా అభిషేక్, ఆయన కుటుంబం సుమారు రూ.219 కోట్ల విలువైన పెట్టుబడులను కలిగి ఉన్నట్లు అంచనా. సురక్షితమైన ఇన్వెస్ట్మెంట్గా బంగారాన్ని ఎంచుకున్న అభిషేక్ తన భార్య ఐశ్వర్య రాయ్ కోసం వెండిలో కూడా పెట్టుబడులు పెట్టినట్లు సరదాగా వ్యాఖ్యానించారు.అభిషేక్ బచ్చన్ పెట్టుబడి సూత్రం చాలా సరళం. తాను సదరు వస్తువులను వాడితేనే పెట్టుబడి పెడతానని చెప్పారు. 2019లో ప్రారంభమైన ‘నాగిన్ హాట్ సాస్’ బ్రాండ్‌ను అభిషేక్ స్వయంగా రుచి చూసి, తనకు నచ్చడంతో కంపెనీని సంప్రదించి వ్యూహాత్మక భాగస్వామిగా మారారు. థానేలోని ప్రసిద్ధ ‘మామ్లేదార్ మిసాల్’(వంటకం) పట్ల తనకున్న మక్కువతో రోజూ స్విగ్గీ ద్వారా ఆర్డర్ చేసేవారు. ‘నేను మీ సర్వీసుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తున్నాను. మీ కంపెనీలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి’ అని సరదాగా అడిగి అందులోనూ పెట్టుబడి పెట్టినట్లు ఆయన వివరించారు. ఇదే క్రమంలో జెప్టో వంటి క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా ఆయన పెట్టుబడులు కొనసాగుతున్నాయి.బ్రాండ్ ఎండార్స్మెంట్నేటి కాలంలో సెలబ్రిటీలు ఏదో ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం సర్వసాధారణం. కానీ అభిషేక్ మాత్రం ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటారు. ‘నేను స్వయంగా ఉపయోగించని ఉత్పత్తిని ప్రజలకు అమ్మడం నాకు మోసపూరితంగా అనిపిస్తుంది. అందుకే నేను 20 ఏళ్లుగా ఒమేగా వాచ్‌నే ధరిస్తున్నాను. ఫోర్డ్ బ్రాండ్‌తో పనిచేసినప్పుడు ఫోర్డ్ కారునే నడిపాను. ఇప్పటికీ నా దగ్గర ఐడియా మొబైల్ నంబర్, అమెక్స్ క్రెడిట్ కార్డ్, మోటరోలా ఫోన్ ఉన్నాయి’ అని చెప్పారు.స్పోర్ట్స్ వెంచర్స్, ఇతర పెట్టుబడులుకేవలం టెక్, ఎఫ్ఎంసీజీ రంగాలు మాత్రమే కాకుండా క్రీడారంగంలోనూ అభిషేక్ పెట్టుబడులున్నాయి. ప్రో కబడ్డీ లీగ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు యజమానిగా వ్యవహరిస్తున్నారు. చెన్నైయిన్ ఎఫ్‌సీ.. ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ క్లబ్లో సహ యజమానిగా ఉన్నారు. సచిన్ టెండూల్కర్‌తో కలిసి వహ్దమ్ టీ గ్లోబల్ బ్రాండ్‌కు మద్దతునిస్తున్నారు.ఇదీ చదవండి: యూఎస్-ఇరాన్ యుద్ధ భయాలు.. ఒక్కసారిగా క్రూడ్ ధరలు.. -
ఏఐ ‘విండోస్’!
న్యూఢిల్లీ: ఢిల్లీలో జరుగుతున్న ఏఐ ఇండియా ఇంపాక్స్ ఎక్స్‌పోకు సందర్శకులు పోటెత్తుతున్నారు. వారితో పాటు పలు అంతర్జాతీయ దిగ్గజ ఏఐ కంపెనీల సీఈఓలు తదితరులతో బుధవారం ఎక్స్పో వేదిక, స్టాళ్లు కళకళలాడాయి. ఏఐ భవితవ్యంతో పాటు పలు కీలక అంశాలపై ఔత్సాహికులతో ప్రముఖులంతా తమ అభిప్రాయాలను పంచుకుంటూ కని్పంచారు. అంతేగాక సరికొత్త స్టార్టప్‌లు, పెట్టుబడులు తదితరాలకు సంబంధించి పలు ఏఐ కంపెనీల సీఈఓలు ఈ సందర్భంగా కీలక ప్రకటనలు చేశారు. సముద్రగర్భంలో ఇండో–యూఎస్ కేబుల్ రూ.272 కోట్లతో ఏఐ సైన్స్ చాలెంజ్ ∙గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటన భారత్‌లో దాగున్న అపారమైన ఏఐ సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఒడిసిపట్టడమే తమ లక్ష్యమని ఐటీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. భారత్, అమెరికా మధ్య ఏఐ కనెక్టివిటీని మరింత పెంపొందించే లక్ష్యంతో సముద్రగర్భంలో కేబుల్ మార్గాలు ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఏఐ ఎక్స్పో వేదిక వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘2 కోట్ల మంది ప్రభుత్వోద్యోగులకు ఏఐ శిక్షణ ఇస్తాం. ఇందుకోసం కర్మయోగి భారత్ పథకంలో గూగుల్ భాగస్వామి కానుంది. అంతేగాక 1.1 కోట్ల మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్య సాధనలో మద్దతుగా నిలుస్తుంది. గూగుల్ ఏఐ ప్రొఫెషనల్ సరి్టఫికెట్ కోర్సులు అందజేస్తుంది. దీనికోసం 10 వేల అటల్ టింకరింగ్ ల్యాబ్స్‌తో సమన్వయంతో గూగుల్ పని చేస్తుంది’’అని వెల్లడించారు. కృత్రిమ మేధను మన జీవితకాలాల్లో చోటుచేసుకుంటున్న అతి పెద్ద పరిణామంగా పిచాయ్ అభివరి్ణంచారు. అలాంటి కీలక రంగంలో భారత్ శరవేగంగా దూసుకుపోతోందంటూ పిచాయ్ ప్రశంసించారు. భిన్న రంగాల్లో ప్రపంచ స్థాయి ఏఐ పరిశోధనలను ప్రోత్సహించేందుకు రూ.272 కోట్లతో ‘ఏఐ ఫర్ సైన్స్ ఇంపాక్ట్’చాలెంజ్‌ను ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఏఐ సామర్థ్యాలను మరింతగా ఒడిసిపట్టేందుకు గూగుల్ డీప్‌మైండ్ సాయంతో ఐఐటీ మద్రాస్‌తో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో పని చేస్తున్నట్టు తెలిపారు. గూగుల్ ఏఐ మోడ్ ఇప్పటికే 200 దేశాల్లో 35 పై చిలుకు భాషల్లో అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు. మున్ముందు వాయిస్, కెమెరా ఆధారిత రియల్‌టైమ్ లైవ్ సెర్చ్ వంటి అధునాతన ఆప్షన్లను కూడా తేనున్నట్టు వెల్లడించారు. మోదీతో పిచాయ్ భేటీ అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీతో పిచాయ్ భేటీ అయ్యారు. భారత్‌లో వ్యవసాయం, ఆరోగ్యంతో సహా అన్ని రంగాల్లోనూ సమగ్రాభివృద్ధికి ఏఐ వాడకంలో గూగుల్ పోషిస్తున్న కీలక పాత్రపై మోదీతో చర్చించా. సమాచారాన్ని అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తేవడం, స్టార్టప్‌లకు దన్నుగా నిలవడం వంటివి కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఏఐలో భారత్ చేస్తున్న కృషి, ఈ రంగంలో విద్యార్థులు, ఉద్యోగుల నైపుణ్యాల పెంపులో గూగుల్ పాత్ర గురించి చర్చించాం’’అని వివరించారు. పిచాయ్‌తో భేటీ ఫలప్రదంగా సాగినట్టు ఎక్స్ పోస్టులో మోదీ పేర్కొన్నారు.పదేళ్లలో రూ.45 లక్షల కోట్లు! మైక్రోసాఫ్ట్ ఏఐ పెట్టుబడి ప్రణాళికలు కృత్రిమ మేధ రంగంలో వచ్చే పదేళ్లలో గ్లోబల్ సౌత్‌లో ఏకంగా రూ.45 లక్షల కోట్ల (50 బిలియన్ డాలర్ల) మేరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారీ ప్రకటన చేసింది. గ్లోబల్ సౌత్‌లో ఏఐ యాక్సెస్‌ను మరింత విస్తరించేందుకు ఈ నిధులను వెచ్చిస్తామని పేర్కొంది. మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, సంస్థ వైస్ చైర్మన్ నటాషా క్రాంప్టన్ ఈ మేరకు వెల్లడించారు. ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్‌పోలో వారు మాట్లాడారు. ‘‘గ్లోబల్ సౌత్‌తో పోలిస్తే ఉత్తరార్ధ గోళంలో ఏఐ వాడకం దాదాపు రెండింతలుగా ఉంది. ఈ అంతరాన్ని పూడ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’అని తెలిపారు. కీలకమైన ఈ సవాలును ఏఐ సదస్సు అజెండాలో కీలకంగా ఉంచడం అభినందనీయమని స్మిత్ అన్నారు. తద్వారా సరైన సమయంలో దీన్ని తెరపైకి తేవడం తీసుకొచ్చారన్నారు. విద్యుత్ సదుపాయం విషయంలో కూడా దక్షిణ, ఉత్తరార్ధ గోళాల నడుమ శతాబ్దానికి పైగా అంతరాలు కొనసాగాయని ఆయన గుర్తు చేశారు. ఏఐ అంతరాలు పెరిగితే వర్ధమాన దేశాలకు ఆర్థిక వృద్ధి తదితర అవకాశాలు తగ్గిపోతాయని ఆందోళన వెలిబుచ్చారు. మౌలిక సదుపాయాలు, నైపుణ్య పెంపు, భిన్న భాషల్లో ఏఐ అభివృద్ధి, స్థానిక ఇన్నొవేషన్లు, ఏఐ అడాప్షన్ మెజర్మెంట్... ఇలా తమ భారీ పెట్టుబడులను ఐదంచెల్లో వెచ్చిస్తామని స్మిత్ వెల్లడించారు.ఒక్క గత ఆర్థిక సంవత్సరంలోనే భారత్, మెక్సికో సహా మొత్తం గ్లోబల్ సౌత్‌లో మౌలిక సదుపాయాల డేటా సెంటర్లపై మైక్రోసాఫ్ట్ ఏకంగా రూ.72 వేల కోట్లు వెచ్చించినట్టు తెలిపారు. క్లౌడ్, ఏఐ, డిజిటల్ స్కిల్లింగ్ తదితరాలపై ఈ ఏడాది రూ.18 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. 2030 నాటికి భారత్‌లో 2 కోట్ల మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ అందిస్తామని ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా 2 లక్షల సంస్థలకు చెందిన 20 లక్షల మంది టీచర్లకు ఏఐ సామర్థ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఉద్దేశించిన ‘ఎలివేట్ ఫర్ ఈక్వేటర్స్’కార్యక్రమాన్ని కూడా స్మిత్ ఈ సందర్భంగా ప్రకటించారు.వర్సిటీలతో జట్టు: ఓపెన్ఏఐ కృత్రిమ మేధ విస్తృతిని రెండు చేతులతోనూ అందిపుచ్చుకునేందుకు భారత్‌కు చెందిన ప్రఖ్యాత విద్యా సంస్థలతో కలిసి పని చేస్తామని ఐఏ దిగ్గజం ఓపెన్ఏఐ ప్రకటించింది. ‘‘మేనేజ్మెంట్, ఆరోగ్యం, ఇంజనీరింగ్ వంటి పలు రంగాల్లో యువతలో, విద్యార్థుల్లో ఏఐ సామర్థ్యాలను విస్తృతంగా పెంపొందించడమే మా లక్ష్యం. ఇందుకోసం ఆయా ఉన్నత విద్యా సంస్థలతో భాగస్వామ్యం అవుతాం’’అని ఓపెన్ఏఐ విద్యా విభాగం సారథి రాఘవ్ గుప్తా వెల్లడించారు. తొలి దశలో ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్, ఎయిమ్స్–న్యూఢిల్లీ, మనిపాల్ అకాడెమీ, యూపీఈఎస్, పెరల్ అకాడెమీతో జట్టు కట్టనున్నట్టు తెలిపారు. తద్వారా వచ్చే ఏడాది కాలంలో లక్ష మందికి పైగా విద్యార్థులు, బోధన సిబ్బందిని ఏఐ, సంబంధిత టూల్స్ వాడకంల నిష్ణాతులుగా తీర్చిదిద్దాలన్నది తమ ఉద్దేశమని చెప్పారు. ‘‘ప్రస్తుతం మానవ వనరులపై ఆధారపడుతున్న కోర్ స్కిల్స్‌లో కనీసం 40 శాతం 2030 నాటికి ఏఐ ఆధారితంగా మారిపోతాయని పలు అధ్యయనాలు నొక్కిచెబుతున్నాయి. కనుక అందుకు తగ్గట్టుగా మన భావి తరాలను ఏఐ నైపుణ్యాలతో తీర్చిదిద్దుకోవడం తప్పనిసరి. ఇందులో విద్యా సంస్థలదే కీలక పాత్ర’’అని గుప్తా అభిప్రాయపడ్డారు. తమతో భాగస్వామ్యానికి ఓపెన్ఏఐ ముందుకు రావడం పట్ల ఐఐటీ ఢిల్లీ, ఐఐఎం అహ్మదాబాద్, ఎయిమ్స్ ఢిల్లీ హర్షం వెలిబుచ్చాయి. ఎడ్టెక్ వేదికల రూపకల్పన నిమిత్తం ఫిజిక్స్‌వాలా, అప్‌గ్రేడ్ వంటి విద్యా సంస్థలతో కూడా ఓపెన్ఏఐ జట్టు కట్టనుందని గుప్తా తెలిపారు.నైపుణ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదుఎయిర్బస్ ఇండియా చీఫ్ యురిగన్ కృత్రిమ మేధ ఎంతగా విస్తరించినా మానవ నైపుణ్యానికి అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని ఎయిర్‌బస్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు యురిగన్ వెస్టర్మెయిర్ అభిప్రాయపడ్డారు. అయితే మానవ సామర్థ్యాల పెంపుదలకు ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని గుర్తు చేశారు. ఏఐని ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంతరాలను పూడ్చే వంతెనగా చూడాలని అభిప్రాయపడ్డారు. ఎయిర్‌బస్ ఇండియా చీఫ్ యురిగన్ కృత్రిమ మేధ ఎంతగా విస్తరించినా మానవ నైపుణ్యానికి అది ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాబోదని ఎయిర్‌బస్ ఇండియా, దక్షిణాసియా అధ్యక్షుడు యురిగన్ వెస్టర్మెయిర్ అభిప్రాయపడ్డారు. అయితే మానవ సామర్థ్యాల పెంపుదలకు ఏఐ ఎంతగానో తోడ్పడుతుందని గుర్తు చేశారు. ఏఐని ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక అంతరాలను పూడ్చే వంతెనగా చూడాలని అభిప్రాయపడ్డారు. అంతరిక్ష కార్యకలాపాల్లో కృత్రిమ మేధ వాడకానికి అవకాశాల అన్వేషణ తదితరాలకు భారత అంతరిక్ష రంగ కంపెనీ ఇన్‌స్పేస్ రూ.6 కోట్ల గ్రాంట్ ప్రకటించింది. ఇన్‌స్పేస్ తాలూకు సీడ్ ఫండ్ పథకం ‘ఏఐ ఇన్‌సై్పర్డ్’(ఇన్నొవేటింగ్ స్పేస్ ప్రోగ్రాం విత్ ఇంటలిజెంట్ రెజీలియంట్ ఇంజన్స్ డెవలప్మెంట్) కింద ఈ నిధులను అందజేయనున్నట్టు సంస్థ డైరెక్టర్ వినోద్‌కుమార్ వెల్లడించారు. ఎంపిక చేసిన సంస్థలకు ఈ ఆర్థిక సాయం అందుతుందని తెలిపారు. దీర్ఘకాలికంగా దేశ ప్రాథమ్యాలకు అవసరమైన ఏఐ పరిష్కరాలను అభివృద్ధి చేసే సంస్థలకు గ్రాంట్ అందిస్తాం. కనీసం ఆరు సంస్థలను ఎంపిక చేస్తాం. ఒక్కో సంస్థకు గరిష్టంగా రూ.కోటి మేరకు చెల్లిస్తాం’’అని ఆయన వివరించారు.భారత యువతకు సువర్ణావకాశం డీప్‌మైండ్ సీఈఓ హస్సబిస్ కృత్రిమ మేధ వృద్ధికి సారథులుగా మారే సువర్ణావకాశం భారత యువత ముందుందని గూగుల్ డీప్‌మైండ్ సీఈఓ డెమిస్ హస్సబిస్ అభిప్రాయపడ్డారు. సరికొత్త ఏఐ టూల్స్‌లో తిరుగులేని నైపుణ్యం సాధించడమే అందుకు కీలకమని సూచించారు. వచ్చే పదేళ్లలో ఇది భారత్‌ను అన్ని రంగాల్లోనూ సూపర్ పవర్‌గా నిలుపుతుందని జోస్యం చెప్పారు. ఇండియా ఏఐ ఎక్స్పో వేదికగా ఔత్సాహికులతో ఆయన ముచ్చటించారు. సాంకేతికత నానాటికీ అనూహ్య మార్పులకు లోనవుతున్న నేపథ్యంలో యువత తమ సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని చెప్పారు. ‘‘భారత్‌లో దాగున్న ఎనలేని శక్తి సామర్థ్యాలు చూసి ఎంతో ముచ్చటేస్తోంది. ముఖ్యంగా ఏఐ విషయంలో ఇక్కడి యువత సానుకూల భావనతో ఉరకలెత్తుతోంది. రానున్న దశాబ్దాల్లో ఇది భారత్‌కు గొప్ప సానుకూలత కానుంది’’అని అభిప్రాయపడ్డారు. -
లైఫ్ సైన్సెస్‌లో సహకారం
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబడులు, కంపెనీలు పెట్టాలనుకునే గ్లోబల్ ఇన్వెస్టర్లకు అన్ని రకాల సహాయాన్ని అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మహానగరంలో ఇప్పటికే ఎన్నో లైఫ్ సైన్సెస్ కంపెనీలు తమ జీసీసీ (గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్)లను ఏర్పాటు చేశాయని గుర్తు చేశారు. ఫ్యూచర్ సిటీలో జీసీసీల కోసం ఒక ప్రత్యేక జోన్ ఏర్పాటునకు రేవంత్‌రెడ్డి ప్రతిపాదించారు.మంగళవారం హైటెక్స్‌లో 23వ బయో ఆసియా సదస్సు–2026 ప్రారంభమైన సందర్భంగా... లైఫ్ సైన్సెస్‌లో గ్లోబల్ కంపెనీల ప్రతినిధులు, ఎగ్జిక్యూటివ్‌లతో రేవంత్ రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వివిధ కంపెనీలు తెలంగాణలో తాము పెట్టదలచుకున్న పెట్టుబడులను ప్రకటిస్తూ ఒప్పందాలు చేసుకున్నాయి.ఇవీ ఒప్పందాలు ⇒ ఫ్రాన్స్‌లో తన ప్రపంచ ప్రధాన కార్యాలయంతో సనోఫీ నుంచి విడిపోయిన గ్లోబల్ కన్సూ్యమర్ హెల్త్‌కేర్ కంపెనీ అయిన ఒపెల్లా హెల్త్‌కేర్, తన జీసీసీ కార్యకలాపాలను 42,000 చ.అ సౌకర్యంతో విస్తరిస్తోంది. వచ్చే ఏడాదిలోపు 500 ఉద్యోగాలను కల్పించనుంది. ⇒ జీఏపీఎఫ్ఏ ఇండోనేషియా విభాగమైన... వాక్సిండో యానిమల్ హెల్త్ ప్రైవేట్ లిమిటెడ్, జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక బీఎస్ఎల్3 వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ కేంద్రం కోళ్లు, పశువులు, ఆక్వాకల్చర్ కోసం వ్యాక్సిన్లను ఉత్పత్తి చేయడంపై దృష్టి పెడుతుంది. ⇒ ఏఐ, డేటా సైన్స్ కంపెనీగా పేరొందిన ట్రెడెన్స్ ఐఎన్‌సీ.. ఏఐ ఆధారిత హెల్త్ కేర్, లైఫ్ సైన్సెస్‌పై కీలక సేవలు అందించిన సంస్థ, తన కార్యకలాపాలను హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ కేంద్రం 18వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండగా, దీనిలో ప్రపంచ స్థాయి కార్యకలాపాలను నిర్వహించనుంది. దీంతో ఏఐ ఆధారిత హెల్త్ కేర్ రంగంలో మరింత ఆధునికత రానుంది. ⇒భారత లైఫ్ సైన్సెస్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీలో భారీ స్థాయిలో ఫార్మాట్ లైఫ్ సైన్సెస్ క్యాంపస్‌ను అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్ట్ 12 ఎకరాల స్థలంలో 1 మిలియన్ చదరపు అడుగుల అడ్వాన్డ్స్ ల్యాబ్, మౌలిక సదుపాయాలను కలిగి ఉంటుంది. -
జీవ విజ్ఞాన రాజధానిగా హైదరాబాద్!
సాక్షి, హైదరాబాద్: ‘ప్రభుత్వం, కంపెనీలు, నిపుణులు, ప్రజలు..అందరం కలిసి పనిచేస్తే ప్రస్తుతం ప్రపంచ వ్యాక్సిన్ రాజధానిగా ఉన్న హైదరాబాద్ ప్రపంచ జీవ విజ్ఞాన రాజధానిగా ఎదుగుతుంది. తెలంగాణ అంటే వ్యాపారం. తెలంగాణ ఎదుగుతోంది. ఈ ఎదుగుదలలో మీరు భాగస్వాములు కావాలి..’ అంటూ కంపెనీలు, పారిశ్రామికవేత్తలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘23 ఏళ్ల క్రితం బయో ఆసియా సదస్సు ప్రారంభమైనప్పుడు, హైదరాబాద్ అంటే చార్మినార్, బిర్యానీ, ఔషధ తయారీ, సాఫ్ట్వేర్ నగరం అన్న గుర్తింపు ఉండేది. అదే హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచ వ్యాక్సిన్ తయారీ కేంద్రంగా నిలిచింది. దూరదృష్టి గల నాయకత్వం, స్పష్టమైన విధానాలు, నైపుణ్యంతో కూడిన మానవ వనరులు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు అనే బలాల ఆధారంగా హైదరాబాద్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ)కు, పరిశోధన, డిజైన్‌లో విశిష్టతకు ప్రపంచ కేంద్రంగా ఎదిగింది. బల్క్ డ్రగ్స్ నుంచి బయాలజిక్స్ వరకు, తయారీ నుంచి ఆవిష్కరణ వరకు.. భారత్ నుంచి ప్రపంచ స్థాయి వరకు తెలంగాణ ముందుకు సాగుతోంది. ప్రపంచంలోని అగ్రగామి క్లస్టర్లతో పోటీ పడుతున్నాం. భవిష్యత్ మార్పులతో కూడిన ప్రపంచానికి తెలంగాణ సిద్ధంగా ఉంది..’ అని సీఎం చెప్పారు. మంగళవారం హైటెక్స్‌లో ‘బయో ఆసియా–2026’ సదస్సు ప్రారం¿ోత్సవంలో ఆయన మాట్లాడారు. దృఢమైన దృష్టి, ముందుచూపు ఫలితం ‘హైదరాబాద్ ఇప్పటికే జీసీసీలకు ప్రాధాన్య గమ్యస్థానంగా మారింది. దీన్ని మనమంతా కలిసి సమగ్ర జీవ విజ్ఞాన రంగానికి ప్రపంచ కేంద్రంగా తీర్చిదిద్దుదాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టండి. మీ జీసీసీలను స్థాపించండి. ఆవిష్కరణ కేంద్రాలు నిర్మించండి. మాలిక్యూల్స్, ఔషధాలను తయారు చేయండి. క్లినికల్ అనలిటిక్స్‌ను నడపండి. ఏఐ ప్లాట్‌ఫామ్స్ అభివృద్ధి చేయండి. డిజిటల్ తయారీని ముందుకు తీసుకెళ్లండి. మా ప్రభుత్వం, అధికారులు, శాస్త్రవేత్తలు, నైపుణ్య యువత మీ విజయంలో భాగస్వాములు అవుతారు. గత రెండేళ్లలోనే జీవ విజ్ఞాన రంగంలో రూ.73 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఇటీవల దావోస్‌లో కొత్త లైఫ్ సైన్సెస్ పాలసీని ప్రకటించాం. జీనోమ్ వ్యాలీని విస్తరించాం. ప్రపంచ స్థాయి పరిశోధన, ఆవిష్కరణలకు ‘వన్–బయో’ను ప్రారంభించాం. గ్రీన్ ఫార్మా సిటీని వేగవంతం చేశాం. అనేక జీసీసీలను ఆహా్వనించాం. ఇది సాధారణ అభివృద్ధి కాదు. దృఢమైన దృష్టి, ముందుచూపు ఫలితం ఇది..’ అని సీఎం పేర్కొన్నారు. బయో వరల్డ్ దిశగా.. ‘బయో ఆసియా తన పేరును దాటి, బయో వరల్డ్‌గా మారుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 ప్రముఖ సంస్థలకు చెందిన 4 వేల మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఫార్మా, బయోసైన్సెస్, బయోటెక్, బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, ఆరోగ్య రంగాల్లో ప్రముఖులు, బిజినెస్ లీడర్స్ మనతో ఉన్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ సదస్సు.. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి అంతర్జాతీయ గుర్తింపు పొందుతుందన్న నమ్మకం ఉంది. ఇటీవల తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌ను ప్రకటించాం. 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగడం మా లక్ష్యం. ప్రస్తుత జీవ విజ్ఞాన ధోరణులను చూస్తే.. పరిశోధన సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు, చిన్న మధ్య తరహా సంస్థలు, ప్రభుత్వం మధ్య బలమైన భాగస్వామ్యం అవసరం. మీరు విశ్వసనీయమైన, స్థిరమైన, భవిష్యత్తు కోసం మంచి వాతావరణాన్ని కోరుకుంటున్నారు. తెలంగాణ అది అందిస్తుంది. హైదరాబాద్ మీ సమాధానం..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్‌గా హైదరాబాద్: శ్రీధర్‌బాబు ఫార్మా రాజధానిగా పేరొందిన హైదరాబాద్‌ను ‘ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్’గా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చెప్పారు. ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచంలోని టాప్ 3 లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో రాష్ట్రాన్ని ఒకటిగా నిలిపేందుకే ‘తెలంగాణ నెక్సŠట్ – జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ(2026– 2030)‘ రూపొందించామని తెలిపారు. తెలంగాణ స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ఎంఆర్ఎన్ఏ, జీన్ ఎడిటింగ్, ఏఐ ఆధారిత డ్రగ్ డిస్కవరీ వంటి అత్యాధునిక రంగాల్లో ‘రెడీ టూ వర్క్ ఫోర్స్‘గా ఇక్కడి యువతను తయారు చేస్తున్నామని చెప్పారు. -
వడివడిగా ఏఐ దిశగా...
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సకల రంగాలనూ ఆవరించిన వేళ కృత్రిమ మేధ (ఏఐ) శిఖరాగ్ర సదస్సు సోమవారం దేశ రాజధాని నగరంలో ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో భారత్ ‘బాధ్యతాయుత ఏఐ’ అనే భావన నుంచి కోట్లాదిమంది వినియోగదారులు నేరుగా, భద్రంగా వాడుకునే పూర్తిస్థాయి ఏఐ వినియోగంలోకి తెచ్చే స్థాయికి ఎదిగింది. భారత్–విస్తార్ పేరిట 24 గంటలూ అన్ని ప్రాంతాల రైతులకూ వారి భాషల్లోనే సాగు రంగ సమస్యలపై సమాధానాలిచ్చే ఏఐ ‘డిజిటల్ సాగు నిపుణుడు’ రాబోతున్నాడు. ఇంకా ఆరోగ్య రంగంతో పాటు ఆరు కోట్ల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు అక్కరకొచ్చే ఏఐ మోడళ్లు రంగప్రవేశం చేయబోతున్నాయి. ఈ సదస్సు ద్వారా దేశ ఏఐ రంగంలో 20,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు రావాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఎన్విడియా, బ్లాక్‌స్టోన్ తదితర సంస్థలు 12,000 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. ట్రంప్ సృష్టించిన అనిశ్చితి సంగతలా ఉంచి, ఏఐ రంగంలో అంతర్లీనంగా ఇమిడి ఉన్న సమస్యలు సైతం పెట్టుబడుల విషయంలో ఊగిసలాటకు తావిస్తున్నాయి. భవిష్యత్తు ఏఐదే అనే భరోసా ఉన్నమాట నిజమే అయినా... హఠాత్తుగా ఊహించని రీతిలో దూసుకొస్తున్న సరికొత్త ఆవిష్కరణలు అప్పటికే నిలదొక్కుకున్న సంస్థల్ని అయోమయంలో పడేస్తున్నాయి. భారీ పెట్టుబడులతో తీసుకొస్తున్న ఆవిష్కరణలు కాస్తా, అంతకన్నా చవగ్గా తయారవుతుంటే... వినియోగదారులు అటువైపు పరుగులు పెడుతుంటే ఆ సంస్థలకు దిక్కుతోచటం లేదు. 1,300 కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఏళ్ల తరబడి శ్రమించి చాట్ జీపీటీ మోడల్‌ను తీసుకొచ్చిన సామ్ ఆల్ట్మాన్ ఆధ్వర్యంలోని ఓపెన్ ఏఐ... నిరుడు జనవరిలో డీప్‌సీక్ ఉరుములేని పిడుగులా వచ్చిపడేసరికి బెంబేలెత్తిపోయింది. దాంతోపాటు దిగ్గజ సంస్థలు అనేకం నిరాశలోకి జారుకున్నాయి. కానీ ఆ వెంటనే డీప్‌సీక్‌పై భారీ స్థాయి సైబర్ దాడి జరగటం, పైగా అది చైనా నియంత్ర ణలకు లోబడి ఉంటుందని తెలియడం పర్యవసానంగా అనేక దేశాలు పలు నియంత్రణలు విధించాయి. దాంతో డీప్‌సీక్ దూకుడుకు కాస్త కళ్లెం పడింది. ఇటీవల ఆంత్రోపిక్ సృష్టించిన ప్రకంపనలు సామాన్యమైనవి కాదు. గూగుల్, ఓపెన్ ఏఐ వంటి దిగ్గజ సంస్థలు దాని ధాటికి విలవిల్లాడాయి. అది తీసుకొచ్చిన క్లాడ్ 3.5 సానెట్, క్లాడ్ 3 ఓపస్ మోడళ్లు చాట్ జీపీటీని తలదన్నేలా ఉండటమే అందుకు కారణం. ఏఐ అవకాశాలను అందిపుచ్చుకుని, అందులో నాయకత్వ పాత్ర పోషించాలని మన దేశం నిశ్చయించుకుంది. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు రెండు దశాబ్దాలపాటు పన్ను మినహాయింపునిస్తామని ఇటీవలి కేంద్ర బడ్జెట్లో ప్రకటించటం అందులో భాగమే. కనుకనే భిన్న దిగ్గజ సంస్థలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ముందు కొస్తున్నాయి. ఏఐ రంగంలో 90 శాతం పేటెంట్లు అమెరికా, యూరప్, చైనాలవే. 2024లో అమెరికా నుంచి వచ్చిన ఏఐ మోడళ్లు 40 కాగా, 15తో చైనా రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో ఉన్న యూరప్ ఖాతాలో మూడే ఉన్నాయి. దాన్నిబట్టి మనం మరెంతగా ఎదగాలో అర్థం చేసుకోవచ్చు. పరిశోధన, అభివృద్ధికి భారీ కేటాయింపులు చేస్తేనే అందులో మన కంటూ మెరుగైన స్థానం దక్కుతుంది. మన జీడీపీలో ఇందుకోసం కేటాయిస్తున్నది అక్షరాలా 0.7 శాతం మాత్రమే. అమెరికా 3.5 శాతం,చైనా 2.7 శాతం వెచ్చిస్తున్నాయి. ట్రంప్ వ్యవహార శైలి వల్ల అంతర్జాతీయంగా అమెరికా విశ్వసనీయత దెబ్బతింది. అది హఠాత్తుగా సహాయ నిరాకరణ చేస్తే సర్వం స్తంభించిపోయే స్థితి ఏర్పడుతుందని తెలిసిరావటం వల్ల చాలా దేశాలు సార్వభౌ మత్వాన్ని కాపాడుకునే స్థాయి ఏఐ కావాలని కోరుకుంటున్నాయి. మనం మెరుగైన వ్యూహంతో, అందుకు తగిన ఆచరణతో ముందుకెళ్తే ఏఐ రంగంలో నాయకత్వ స్థాయికి ఎదగటానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని ఈ పరిణామాలు చెబుతున్నాయి. ఏఐ నుంచి అచ్చం మనిషిలా సొంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో గలిగిన ఏజీఐ (కృత్రిమ సాధారణ మేధ) స్థాయికి సాంకేతికత చేరుకోబోతున్న ఈ దశలో ఢిల్లీ శిఖరాగ్ర సదస్సు తీసుకోబోయే నిర్ణయాలు భారత్‌ను ఈ రంగంలో అగ్రగామిగా నిలబెట్టగలవని ఆశించాలి. -
‘బంగారం బాట’లో యువ భారతం
న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా... యువ భారతం బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా 18–39 ఏళ్ల మధ్య వయసు కలిగిన 5,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో ‘స్మిట్టెన్ పల్స్ఏఐ’ ఒక నివేదిక విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది పెట్టుబడుల్లో తొలి ప్రాధాన్యతం బంగారానికి ఇచ్చారు. గతంలో బంగారం కొనాలంటే ఇంటి పెద్దల సలహా తీసుకునేవారు. కానీ ఇప్పుడు 66.7% మంది యువత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయిదు గ్రాముల లోపే పసిడి కొన్నామని 62% మంది వెల్లడించారు. 2 గ్రాముల లోపు కొనుగోలు చేసిన వాళ్లు 27.5% మంది కాగా.. 2–5 గ్రాముల మధ్య కొనుగోలు చేసిన వాళ్లు 34.4% మంది ఉన్నారు. → తమ మొదటి జీతం/సంపాదనతో తొలిసారి 24% మంది పసిడిని కొనుగోలు చేశారు. కేవలం పెట్టుబడిగా పసిడిని కొనుగోలు చేసినట్లు 23.9% మంది వెల్లడించారు. ఆర్థిక అనిశ్చితి సందర్భాల్లో, బ్యాంకు సేవింగ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీలతో పోలిస్తే 65.7% మంది బంగారమే అత్యంత సురక్షితమైన సాధనంగా భావిస్తున్నామని తెలిపారు. సుమారు 65.7% మంది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ల (ఎంఎఫ్) కంటే పసిడినే అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారని సర్వేలో తేలింది. → ఒకవేళ రూ.25,000 నగదు రూపంలో ఉంటే.., పసిడి కొంటామని 61.9% మంది పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్లకు 16.6%, డిపాజిట్లు 13%, షేర్లు 6.6%, క్రిప్టో 1.9% మంది ఆసక్తి చూపారు. రత్నాలు, ఆభరణ ఎగుమతులు డీలా గత నెల(జనవరి)లో రత్నాలు, బంగారు ఆభరణ ఎగుమతులు డీలా పడ్డాయి. 2025 జనవరితో పోలిస్తే 6% క్షీణించి 2,239 మిలి యన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2025 జనవరిలో ఇవి 2,376 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణ ఎగుమతుల ప్రో త్సాహక సమితి(జీజేఈపీసీ) వివరాలివి. ప్రపంచ వాణిజ్య సవాళ్లు, కీలక మార్కెట్లలో టారిఫ్ ఒత్తిళ్లు ప్రభావం చూపాయి. ఈ బాటలో ప్రస్తు త ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి 10 నెల ల(ఏప్రిల్ 2025–జనవరి 2026)నూ ఇవి నామమాత్ర వెనకడుగు వేశాయి. 0.6% తగ్గి 23,186 మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతే డాది(2024–25) ఇదే కాలంలో ఇవి 23,335 మిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధా నంగా దేశీ ఆభరణ ఎగుమతులకు ప్రధాన మార్కెట్‌గా నిలిచే యూఎస్‌కు షిప్‌మెంట్స్ 45% నీరసించడం ప్రభావం చూపింది. -
పీఎల్ఐ పథకానికి 55 కంపెనీలు సై..
న్యూఢిల్లీ: స్పెషాలిటీ స్టీల్ విభాగంలో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) పథకం మూడో రౌండ్‌ను కేంద్ర స్టీల్ మంత్రి హెచ్డీ కుమారస్వామి తాజాగా ప్రవేశపెట్టారు. అప్‌గ్రేడెడ్ అలాయ్ స్టీల్ తయారీలో 8.7 మిలియన్ టన్నులను అదనంగా జత చేసుకునే లక్ష్యంతో తాజా రౌండ్‌కు తెరతీశారు. ఇందుకు అనుగుణంగా 55 కంపెనీల మధ్య 85 అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) కుదిరాయి.వీటిలో పీఎస్‌యూ దిగ్గజం సెయిల్ సేలం స్టీల్ ప్లాంట్‌తో స్టీల్ శాఖ ఒప్పందం సైతం కలసి ఉంది. వెరసి పీఎల్ఐ 1.2లో భాగంగా రూ. 13,203 కోట్ల విలువైన పెట్టుబడులకు తెరలేవనుంది. ప్రధాని నరేంద్ర మోడీ విజన్‌కు అనుగుణంగా ప్రపంచస్థాయి పోటీతత్వ స్పెషాలిటీ స్టీల్ ఎకోసిస్టమ్ ఏర్పాటులో పీఎల్ఐ 1.2 కీలక ముందడుగుగా మంత్రి కుమారస్వామి పేర్కొన్నారు.మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్.. లక్ష్యాలు రెండింటికీ తాజా పథకం ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వివరించారు. తద్వారా దేశీయంగా ఆధునిక, వ్యూహాత్మక స్టీల్ ప్రొడక్టుల తయారీ సామర్థ్యాలకు ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు తెలియజేశారు. తాజా ప్రాజెక్టులతో 2030–31కల్లా 8.7 మిలియన్ టన్నుల స్పెషాలిటీ స్టీల్ సామర్థ్యాలు జత కలిసే వీలున్నట్లు అంచనా వేశారు. -
లక్షను 40 లక్షలు చేసిన స్టాక్.. జేబులు నింపుకున్న ఇన్వెస్టర్లు..
-
రీట్, ఇన్విట్‌ల్లో పెట్టుబడులు.. సెబీ కీలక మార్పులు
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (ఇన్విట్)ల నియంత్రణల్లో కీలక మార్పులను సెబీ ప్రతిపాదించింది. వీటిల్లో లిక్విడ్ ఫండ్స్ పెట్టుబడులకు అనుమతించడం ఇందులో కీలకమైనది. ఇతర పెట్టుబడుల’ కింద 20 శాతం పరిమితికి లోబడి లిక్విడ్ ఫండ్స్ రీట్లు, ఇన్విట్లలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.ఇన్విట్లు స్పెషల్ పర్పస్ వెహికల్స్ (ఎస్పీవీలు)ను వాటి రాయితీ కాలం ముగిసిన తర్వాత కూడా కొనసాగించేందుకు అనుమతించనుంది. ప్రైవేటు ఇన్విట్లు తమ ఆస్తుల్లో 10 శాతం వరకు గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు సైతం ప్రతిపాదించింది. అలాగే ఇన్విట్ల ఆస్తుల విలువలో నికర రుణ భారం 49 శాతం మించినప్పుడు, తాజా రుణాల వినియోగ పరిధినీ విస్తృతం చేయాలన్నది మరో ప్రతిపాదన.ఆస్తుల కొనుగోలు, అభివృద్ధి కోసమే కాకుండా... మూలధన విస్తరణ, ఆస్తుల నిర్వహణ కోసం సైతం ఇన్విట్లు తాజా రుణ సమీకరణకు అనుమతించనుంది. ఇందుకు సంబంధించి చర్చా పత్రాన్ని సెబీ విడుదల చేసింది. దీనిపై ఈ నెల 26 వరకు అభిప్రాయాలు తెలియజేయాలని సెబీ కోరింది. -
అత్యాశతో బంగారం కొంటున్నారా? ఎంత ముప్పో తెలుసా?
సాక్షి, ముంబై: దేశీయంగా వెండి, బంగారం రేట్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. దీంతో తక్కువ రేటు ఉన్నపుడు కొనలేకపోయాయే అన్న బెంగ ఒకవైపు, మరోవైపు కాస్త ధరలు తగ్గగానే భారీ లాభాలను ఆర్జించాలనే అత్యాశతో కొంతమంది పెట్టుబడి దారులు పసిడి వెంట పరుగులు పెడు తున్నారు. ఇది దురాశే అవుతుందని, చాలామంది రిటైల్ పెట్టుబడుదారులు భారీగా నష్టపోతున్నారని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు.ఆర్థిక సలహాదారు ఆదిత్య షా ఇటీవల ఎక్స్‌లో చేసిన పోస్ట్ నెట్టింట చర్చకు దారి తీసింది. ధర పెరుగు తుందన్న అంచనాలతో తన ఫాలోయర్ ఒకరు నష్టాన్ని మూటగట్టుకున్న వైనాన్ని ఆయన వివరించారు. ఆర్థిక అవగాహన ప్రాముఖ్యతపై ఆన్లైన్లో తీవ్రమైన చర్చకు దారితీసింది.షా తన పోస్ట్‌లో వివరించిన దాని ప్రకారం ఒక్క నెలలో 10-12 శాతం లాభాలొస్తాయన్న అంచనాతో అతను ఏకంగా 10 లక్షల రూపాయల విలువైన బంగారం, వెండి కొనుగోలు చేశాడు. అదీ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి. కట్ చేస్తే.. ధరలు మరింత భారీగా క్షీణించాయి. దీంతో అతను చిక్కుల్లో పడిపోయాడు. ధరలు పడిపోవడం వల్ల ఒక నష్టమైతే, గడువు లోపు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాల్సి రావడం మరో కష్టం. మార్కెట్‌పై అవగాహన, నియంత్రణలేని దురాశకు ఇది మచ్చుతునక అని షా అభివర్ణించారు.నెటిజనుల చర్చచాలామంది మధ్యతరగతి పెట్టుబడిదారులు బంగారాన్ని ఈక్విటీ స్టాక్ లాగా చూస్తున్నారని, బంగారం సాంప్రదాయకంగా స్వల్పకాలిక వాణిజ్య సాధనంగా కాకుండా దీర్ఘకాలిక హెడ్జ్‌గా ఉన్నప్పటికీ, లాభాలు సాధించాలనే ఉద్దేశ్యంతో కొనుగోలు చేస్తున్నారని ఒకరు పేర్కొన్నారు.ఇక్కడ సాధారణ మార్కెట్ దిద్దుబాట్ల సమయంలో కూడా తీవ్రమైన ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉందని మరొకరు వ్యాఖ్యానించారు.నష్టాలు తొందరగా వస్తాయి.. లాభాలు చాలా అలస్యంగా వస్తాయి. అందుకే సామాన్య ట్రేడర్లు ఆచితూచి అడుగువేయాలని మరికొందరు భావించారు. లివరేజ్‌ను ఉపయోగించినట్లయితే, అనుభవం, ప్రణాళిక, తక్కువ వడ్డీకి దీర్ఘకాలిక రుణాల ప్రాప్యత లాంటివి అవసరమని చాలామంది నొక్కి చెప్పారు. ఇలాంటి ట్రేడింగ్స్‌లో స్పష్టమైన నిష్క్రమణ వ్యూహం లేదా రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ లేకుండా దాదాపు విఫలమయ్యే అవకాశం ఉందని వారు వాదించారు.Yeasterday was talking to a follower ..His credit card is fully exhausted he had taken 10 lkhs of gold and silver …And now he is in debt because of prices drop of gold and silver and also next month he has to pay dues ..Crazy idea behind this to earn 10% to 12% in a month…— Aditya Shah (@AdityaD_Shah) February 2, 2026లాంగ్ ఇన్వెస్ట్మెంట్ , రిస్క్ మేనేజ్మంట్ ప్లాన్ వెండి, బంగారం, ఇతర విలువైన మెటల్స్ ధరలు డాలరు, రూపాయి మారకం, అంతర్జాతీయ పరిస్థితులతో అనేక అంశాలమీద ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవలి కాలంలో దేశంలో బంగారం, వెండి ఎంత స్థాయిలో పెరిగాయో అదే స్థాయిలో అస్థిరతలు కొనసాగుతున్నాయి. బంగారం, వెండి లాంటి వాటిపై పెట్టుబడులు దీర్ఘకాలిక ప్రాతిపదికన ఉండాలనీ తెలిపారు. ప్రధానంగా జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఉన్నపుడు నిపుణుల సలహాలను గమనించాలని, గోల్డ్ పెట్టుబడుల్లో అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ పండితులు, ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అతి విశ్వాసంతో స్వారీ
మొత్తంగా చూస్తే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతా రామన్ ప్రతిపాదించిన కేంద్ర బడ్జెట్ 2026–27... ప్రధానంగా నమ్మకం, ఆశ, దృఢ విశ్వాసం వంటి వాటిపై స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2025–26) కూడా ఆశించిన మేర ఆదాయ అంచనాలను చేరుకోలేదు. దీనిని బట్టి ప్రభుత్వపరంగానూ ఆయా అంశాలు, రంగాల్లో ఆశించిన మేర పెట్టుబడులు, ఖర్చు పెట్టలేదు. గత బడ్జెట్లోనూ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై రూ.వెయ్యి కోట్లు ప్రతిపాదించినా అందులో రూ. 200 కోట్లు కూడా ఖర్చుచేయలేదని ఆ రంగానికి చెందినవారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో... ప్రైవేట్ రంగం నుంచి ఆశించిన మేర పెట్టుబడులు రాకపోతే ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు పెట్టిన పెట్టుబడులు ఏ మేరకు ఉపయోగపడతాయనేది చర్చనీయాంశమవుతోంది. మన బడ్జెట్లన్నీ కూడా ఎక్కువ మటుకు పెట్టుబడి దారులకు అనుకూలంగానే ఉంటున్నాయి. వీటిపై సమ తూకం సాధించే క్రమంలో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తామనీ, దీనినుంచి మంచి ఫలితాలు వస్తా యనీ చెబుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతుందనేది చూడాల్సి ఉంది. 7.5 కోట్ల యూనిట్లలో 32 కోట్ల మంది ఉపాధి, ఉద్యోగాలు పొందుతున్నందున, గ్రామీణ ప్రాంతాల్లోని ఎంఎస్ఎంఈలు కూడా క్రియా శీలమై కొంత శాతం ఉపాధిని కల్పిస్తే వీటి పునరుద్ధరణ జరిగే అవకాశాలున్నాయి. జాతీయస్థాయిలో 6.4 శాతం నుంచి 7.2 శాతం దాకా వృద్ధిరేటు సాధిస్తామని ప్రభుత్వం చెబుతున్నా... ఈ వృద్ధి నుంచి ఏ వర్గానికి ఎంత పంపిణీ అవుతుందనేది ముఖ్యం. కొన్నేళు్లగా చూస్తే మన వృద్ధి ఎగుడుదిగుళ్లు గానే ఉంటోంది. ఉదాహరణకు.. తాజా ఇన్‌ఈక్వాలిటీ రిపోర్ట్ ప్రకారం చూస్తే... మొత్తం వంద రూపాయల జీడీపీ ఉత్పత్తిలో పై వర్గానికి 60 శాతం, మధ్య తరగతికి 25 శాతం, దిగువన ఉన్న వారికి 15 శాతం వస్తోంది. అధిక ఆదాయం పొందుతున్న వారు కొంత అధిక పన్ను కట్టాల్సి ఉండగా ఈ వర్గాన్ని ముట్టుకునే సాహసం చేయడం లేదు. అదీగాకుండా ఆరోగ్య రంగం విషయాని కొస్తే... మెడికల్ టూరిజంను ప్రోత్సహించడం ద్వారా డబ్బు భరించగలిగిన విదేశీయులకు నాణ్యతా పరమైన వైద్యసేవలు అందించి, దేశంలోని పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుచేయలేని సామాన్యులకు ఆ నాణ్యమైన వైద్య సేవలు ఏవనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దేశ పౌరు లందరికీ సమానమైన వైద్య సేవలను అందించి... అప్పుడు వ్యాపారం చేస్తే బాగుంటుంది. బడ్జెట్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేయడమే కాకుండా, దానికి అధిక ప్రాధాన్యమిస్తున్నారు. అయితే ప్రైవేట్ రంగంలో పెట్టుబడుల్లో గత కొన్నేళ్లలో ఎలాంటి వృద్ధీ లేదు. దీనికి భిన్నంగా భారత పెట్టుబడిదారులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం ఎక్కువైంది. దేశీయంగా తగిన డిమాండ్ లేదనీ, తమ పరి శ్రమల్లో పూర్తిస్థాయి ఉత్పత్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడం లేదనీ వారు చెబుతున్నారు. తాజాగా బడ్జెట్లో... విదేశాల్లో పెట్టుబడులపై నిబంధనలను మరింతగా సులభతరం చేశారు. దేశంలోకి విదేశీ పెట్టుబడులు రావడం కంటే కూడా ఇక్కడి నుంచి బయటి దేశాల్లో పెట్టే పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు దేశీయంగా కేంద్రప్రభుత్వం మాత్రమే పెట్టు బడులు పెడుతోంది. మౌలిక సదుపాయాల కల్పన పెట్టుబడులు గతేడాది రూ.11.20 లక్షల కోట్ల నుంచి ఈ ఏడాది రూ.12.25 లక్షల కోట్లకు పెంచుతామని బడ్జెట్లో ప్రతిపాదించారు. వృద్ధిరేటును నిలబెట్టేందుకు ఈ పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వపరంగా రోడ్లు, కమ్యూ నికేషన్లు, తదితరాలన్నీ చేస్తుంటే దానిని ప్రోత్సాహకంగా తీసుకుని, ప్రైవేట్ పెట్టుబడులు రావాలి. కానీ అవి రావడం లేదు. మెరుగైన ఆర్థిక పరిస్థితి, వృద్ధిరేటు వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం అతి విశ్వాసం, నమ్మకం పెట్టుకోవడం వల్ల మిగతా ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టడం లేదు. గతంలో ఎన్నడూలేని విధంగా దేశ రక్షణ బడ్జెట్‌ను ఒక్కసారిగా రూ.27 లక్షల కోట్లు (గతం కంటే 21 శాతం పెంపుదల) ప్రతిపాదించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా విజయం సాధించామనే భావనతో ఈ రంగానికి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. దేశ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి దీనిని ఎవరూ ప్రశ్నించలేని పరిస్థితి ఉంది. అయితే ఇతర దేశాలతో పోల్చితే ద్రవ్యోల్బణం తక్కువగా ఉండటం, వృద్ధి రేటు 6–7 శాతం మధ్యలో ఉండటం కలిసొచ్చే అంశాలు. ప్రొఫెసర్ డి. నర్సింహా రెడ్డి వ్యాసకర్త ఆర్థికవేత్త, హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ సోషల్‌సైన్సెస్ మాజీ డీన్ -
డేటా సెంటర్ పెట్టుబడులపై స్పష్టత
భారతదేశాన్ని గ్లోబల్ డేటా హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విదేశీ సంస్థలు భారత్‌లో డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ఉన్న పన్ను సంబంధిత అడ్డంకులను తొలగిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బడ్జెట్ అనంతర విలేకరుల సమావేశంలో స్పష్టతనిచ్చింది. క్లౌడ్ ఆధారిత సేవలు అందించే అంతర్జాతీయ సంస్థలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది.పార్లమెంట్లో బడ్జెట్ సమర్పణ అనంతరం మీడియా సమావేశంలో ఆర్థికశాఖ వివరాల ప్రకారం.. ‘ఒక అంతర్జాతీయ సంస్థ భారత్‌లో డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసినంత మాత్రాన ఆ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆదాయంపై భారత్‌లో పన్ను విధించబోం. విదేశీ సంస్థలు ఇక్కడ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడం వల్ల స్థానిక ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ఇది దేశానికి నికర ఆర్థిక వెసులుబాటు అందిస్తుంది. భారత్‌లో ఉన్న డేటా సెంటర్ కార్యకలాపాలకు మాత్రమే పన్ను వర్తిస్తుంది. సదరు సంస్థ తన సేవలను భారత్‌లోని రీసెల్లర్ ద్వారా విక్రయిస్తే, ఆ విక్రయాలపై వచ్చే ఆదాయానికి యథావిధిగా పన్ను విధిస్తారు’ అని తెలిపింది.ఎందుకు ఈ నిర్ణయం?క్లౌడ్ సేవలు అందించే సంస్థలు ప్రపంచవ్యాప్తంగా వందలాది డేటా సెంటర్లను ఉపయోగిస్తాయి. ఏ నిర్దిష్ట సెంటర్ వల్ల ఎంత ఆదాయం వచ్చిందో లెక్కించడం సాంకేతికంగా చాలా క్లిష్టమైన ప్రక్రియ. ‘గ్లోబల్ సంస్థలు భారతదేశంలో తమ సేవలను పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. పన్నుల భయంతో వారు వెనకడుగు వేయకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.దీనివల్ల కలిగే ప్రయోజనాలుఅమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు భారత్‌లో మరిన్ని డేటా సెంటర్లను నిర్మించే అవకాశం ఉంది. నిర్మాణ, నిర్వహణ రంగాల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయి. దేశంలో డేటా స్టోరేజ్ సామర్థ్యం పెరగడం వల్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ప్రభుత్వం ప్రకటించిన ఈ సరళీకృత నిబంధనలు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలకు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి భరోసా ఇస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.ఇదీ చదవండి: నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలోని కీలక ప్రకటనలు -
దావోస్ పెట్టుబడులు రూ.28,693కోట్లు
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సును ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధుల బృందం విజయవంతంగా పూర్తి చేసుకుంది. మూడు రోజుల పాటు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలతో జరిపిన చర్చలు, సంప్రదింపులు ఫల ప్రదంగా ముగిశాయి. రాష్ట్రంలో రూ.28,693 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం దావోస్ పర్యటనలో ఆశించిన లక్ష్యాలను సాధించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘డబ్ల్యూఈఎఫ్–2026 సదస్సు’లో పెట్టుబడుల సాధన కంటే ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ లక్ష్యాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరినట్లు ప్రకటించాయి. గత నెలలో హైదరాబాద్‌లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రాష్ట్ర ప్రభుత్వం భారీగా రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించిన విషయాన్ని గుర్తు చేశాయి. పెట్టుబడులు.. కీలక ఒప్పందాలు మూడు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు), డేటా సెంటర్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించింది. ఏఐ, సుస్థిర అభివృద్ధి, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన పలు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి డబ్ల్యూఈఎఫ్ నిర్వహించిన రెండు కీలక సెషన్లలో పాల్గొన్నారు. హెదరాబాద్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు నిర్వహించాలంటూ సీఎం చేసిన ప్రతిపాదనపై డబ్ల్యూఈఎఫ్ వర్గాలు సానుకూలంగా స్పందించాయి. స్వదేశానికి మంత్రులు ప్రపంచ స్థాయి ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక దిగ్గజాలతో జరిగిన 12 ముఖాముఖి సమావేశాల్లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. పలు కీలక సమావేశాలు, ప్రత్యేక సెషన్ల అనంతరం.. తెలంగాణ ప్రతినిధి బృందం మూడు రోజుల దావోస్ పర్యటన గురువారం సాయంత్రం ముగిసింది. దావోస్‌లో కార్యక్రమాలు ముంగించుకున్న ముఖ్యమంత్రి.. రోడ్డు మార్గంలో జ్యూరిచ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్తారు. తెలంగాణ బృందంలో సభ్యులుగా ఉన్న మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు స్వదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. -
ఇంట్రస్ట్.. ఇన్వెస్ట్
సాక్షి, హైదరాబాద్: డక్టైల్ ఐరన్ (డీఐ) పైపుల తయారీలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రష్మి గ్రూప్, తెలంగాణలో స్టీల్ ఉత్పత్తి యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. రూ.12,500 కోట్ల పెట్టుబడికి సంబంధించి అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12 వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 2026’సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ప్రతినిధి బృందం రష్మి గ్రూప్‌తో భేటీ అయ్యింది. తెలంగాణలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే అవసరమైన బొగ్గు సరఫరా లింకేజీ సహా ఇతర సహకారం అందిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు హామీ ఇచ్చారు. చర్చల అనంతరం ఎంవోయూ కుదిరింది. గ్రీన్ మాన్యుఫాక్చరింగ్, సర్క్యులర్ ఎకానమీ వంటి రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యంపై కూడా రష్మి గ్రూప్ చర్చించింది. ఈ భేటీలో సంస్థ ప్రమోటర్ సజ్జన్‌కుమార్ పటా్వరి, డైరెక్టర్ సంజీబ్‌కుమార్ పటా్వరి పాల్గొన్నారు. కాగా డబ్ల్యూఈఎఫ్ సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి నేతృత్వంలోని బృందం బుధవారం మరికొన్ని కీలక భేటీలు జరిపింది. వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి పలు ఒప్పందాలు కుదుర్చుకుంది. మరికొన్ని అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ కీలక ప్రకటనలు చేశాయి. రూ.6 వేల కోట్ల పెట్టుబడికి ఈఓఐ క్లీన్ ఎనర్జీ రంగంలో రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆసక్తి వ్యక్తీకరణ పత్రం (ఈఓఐ) సమరి్పంచింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి బృందంతో జరిగిన భేటీలో ఐక్యూ క్యాపిటల్ గ్రూప్ చైర్మన్ డా.న్ బాబిక్, సీఈఓ, డైరెక్టర్ అనిల్‌కుమార్ బావిశెట్టి, గ్రీన్ హౌస్ ఎన్విరో సీఈఓ, డైరెక్టర్ మొలుగు శ్రీపాల్‌రెడ్డి, స్లోవాక్ రిపబ్లిక్ కాన్సుల్ మాటుస్ జెమెస్ పాల్గొన్నారు. 2047 నాటికి కాలుష్య రహిత తెలంగాణ సాధన లక్ష్యంతో తమ ప్రభుత్వం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులను ప్రోత్సహిస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు. స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్‌కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ఏర్పడింది. ఇది గరిష్టంగా 300 మెగావాట్ల సామర్థ్యంతో తెలంగాణలో కొత్త విద్యుత్ ప్రాజెక్టు స్థాపనకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. ‘సర్గడ్’రూ.1,000 కోట్ల పెట్టుబడులు విమానయాన రంగంలో పేరొందిన అమెరికాకు చెందిన ‘సర్గడ్’సంస్థ రాష్ట్రంలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ నెలకొల్పనుంది. రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో దశల వారీగా రూ.1,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకుంది. సీఎం రేవంత్‌తో ‘సర్గడ్’సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ శ్రీనివాస్ తోట భేటీ సందర్భంగా జరిగిన చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో విమానాల నిర్వహణ, మరమ్మతులు, పునరుద్ధరణ (ఎమ్మార్వో) కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆసక్తిని సంస్థ ప్రతినిధులు వ్యక్తం చేశారు. వరంగల్, ఆదిలాబాద్‌లో కొత్తగా ఏర్పాటయ్యే విమానాశ్రయాల్లో ఏదో ఒకచోట ఎమ్వార్వో కేంద్రం ఏర్పాటు చేస్తే ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. ‘సర్గడ్’పెట్టుబడితో రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలకు తయారీ రంగంలో కొత్త అవకాశాలు వస్తాయని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లో లోరియల్ బ్యూటీ టెక్ జీసీసీ ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు లోరియల్ సంస్థ ప్రకటించింది. అంతర్జాతీయంగా ఆవిష్కరణలు, టెక్నాలజీ, డేటా, సప్లై చైన్ కార్యకలాపాలకు కీలక కేంద్రంగా నిలిచే ఈ జీసీసీ నవంబర్‌లో ప్రారంభమవుతుంది. దీని ద్వారా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ, అనలిటిక్స్ రంగాల్లో రూపొందించే సాంకేతిక పరిష్కారాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న లోరియల్ యూనిట్లకు అందుతాయి. మెడ్‌టెక్, హెల్త్టెక్తో పాటు ‘బ్యూటీ టెక్’వంటి కొత్త విభాగాల్లోనూ తెలంగాణ ముందుంటోందని శ్రీధర్‌బాబు అన్నారు. తమ జీసీసీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా రేవంత్, శ్రీధర్‌బాబులను లోరియల్ ఆహ్వానించింది. కాగా రేవంత్‌రెడ్డి, లోరియల్ సీఈవో నికోలస్ హియోరోనిమస్ నడుమ జరిగిన భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ జీసీసీ ద్వారా 2030 నాటికి 2 వేల టెక్, ఏఐ, డేటా ఇంజనీరింగ్ ఉద్యోగాల కల్పన జరుగుతుంది. ‘బ్లైజ్’విస్తరణ హైదరాబాద్‌లోని తమ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని విస్తరించేందుకు కాలిఫోరి్నయాకు చెందిన ‘బ్లైజ్’సంస్థ ఎంవోయూ కుదుర్చుకుంది. బ్లైజ్ కో ఫౌండర్, సీఈఓ దినకర్ మునగాల, ముఖ్యమంత్రి మధ్య జరిగిన భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్‌కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్‌వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను ఈ సంస్థకు చెందిన డేటా సెంటర్ అభివృద్ధి చేస్తోంది. విస్తరణకు ‘ఏబీ ఇన్బెవ్’పెట్టుబడి ప్రపంచ వ్యాప్తంగా 50కి పైగా దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న అతిపెద్ద బీరు తయారీ సంస్థ ‘ఏబీ ఇన్బెవ్ ’రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న తమ తయారీ యూనిట్ విస్తరణకు పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. సీఎం రేవంత్‌రెడ్డితో సంస్థ చీఫ్ లీగల్ అండ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ జాన్ బ్లడ్తో సమావేశమయ్యారు. తెలంగాణలో ప్రస్తుతం రెండు తయారీ యూనిట్లు నిర్వహిస్తున్న ఏబీ ఇన్బెవ్, సుమారు 600 మందికి ఉపాధి కల్పిస్తోంది. స్టేడియంల అభివృద్ధికి టాటా గ్రూప్ సంసిద్ధత – సంస్థ చైర్మన్‌తో సీఎం రేవంత్ భేటీ సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం దవోస్‌లో టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్‌తో సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్–2047, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. హైదరాబాద్‌లోని ప్రధాన క్రీడా మైదానాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసే ఆలోచన ఉందని చెప్పారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, 2036 ఒలింపిక్స్‌లో భారత్ పతకాలు సాధించేలా క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా మార్చడంలో టాటా టెక్నాలజీస్‌తో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. కాగా స్పోర్ట్స్ స్టేడియాల అభివృద్ధిలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు చంద్రశేఖరన్ సంసిద్ధత వ్యక్తం చేశారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుపై ఆయన ఆసక్తి చూపారు. రాష్ట్రంలో హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుపై కూడా చర్చలు జరిగాయి. మేడారం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయ ప్రాంతాల్లో హోటళ్ల ఏర్పాటుకు టాటా గ్రూప్ ఆసక్తి చూపింది. శ్రీశైలం రహదారి వెంబడి అంతర్జాతీయ స్థాయి రిసార్ట్ ఏర్పాటుపై సానుకూలంగా స్పందించింది. ఏఐ డేటా సెంటర్లు, సెమీ కండక్టర్, ఈవీ తయారీ రంగాల్లో తెలంగాణలో కొత్త పరిశ్రమలు నెలకొల్పే అవకాశాలపై కూడా చంద్రశేఖరన్ ఆసక్తి చూపారు.ఈ సమావేశంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇలావుండగా..సీఎం నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’బృందం సిస్కో సంస్థ ప్రతినిధులతోనూ భేటీ అయ్యారు. -
స్టాక్ మార్కెట్ క్రాష్.. ప్రధాన కారణాలు ఇవే!
దేశీయ స్టాక్ మార్కెట్లు రెండో రోజు భారీ నష్టాన్ని చవిచూశాయి. సెన్సెక్స్ 1,092.44 పాయింట్ల నష్టంతో 82,153.74 వద్ద, నిఫ్టీ 360.05 పాయింట్ల నష్టంతో 25,225.45 వద్ద నిలిచాయి. స్టాక్ మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో.. ఒక్క రోజులోనే మదుపర్ల సంపద రూ.9 లక్షల కోట్ల వరకు ఆవిరైంది.ప్రస్తుత పరిస్థితులు.. పెట్టుబడిదారులలో భయాన్ని రేకెత్తించాయి. సోమవారం మొదలైన అమ్మకాల ఒత్తిడి.. ఈ రోజు (జనవరి 20) కూడా కొనసాగడంతో.. దలాల్ స్ట్రీట్ నేలచూపులు చూస్తోంది. స్టాక్ మార్కెట్ భారీగా పడిపోవడానికి ప్రధాన కారణాలు ఏమిటనే విషయానికి వస్తే..స్టాక్ మార్కెట్ పతనం: ప్రధాన కారణాలువాణిజ్య యుద్ధ భయాలు: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న దూకుడు వైఖరితో పాటు, యూరప్ దేశాలపై టారిఫ్‌లను విధిస్తామనే హెచ్చరికలు చేయడం ప్రపంచ మార్కెట్లను కలవరపెడుతున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా ప్రతీకార టారిఫ్‌లపై ఆలోచిస్తోందన్న వార్తలు అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలను పెంచాయి. ఈ అనిశ్చిత పరిస్థితి భారత మార్కెట్‌పై కూడా ప్రతికూల ప్రభావం చూపుతోంది.క్యూ3 (Q3) ఫలితాలు: మూడో త్రైమాసిక కార్పొరేట్ ఫలితాలు ఆశించిన స్థాయిలో ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. లాభాల్లో పెద్దగా పాజిటివ్ సర్ప్రైజ్లు లేకపోవడం వల్ల ఇప్పటికే బలహీనంగా ఉన్న మార్కెట్ సెంటిమెంట్ మరింత తగ్గింది. అయితే ఆటో రంగ ఫలితాలు కొంత ఊరటనిచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.విదేశీ అమ్మకాలు: జనవరిలో ఇప్పటివరకు విదేశీ పెట్టుబడిదారులు సుమారు రూ. 29,000 కోట్ల విలువైన ఇండియా షేర్లను విక్రయించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనత, లాభాలు - విలువల మధ్య అసమతుల్యత వంటి అంశాలు ఈ విక్రయాలకు కారణమయ్యాయి. ఇది కూడా మార్కెట్ పతనానికి ప్రధాన కారణమైంది.పెట్టుబడులు: పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్లకు ప్రత్యామ్నాయంగా.. బంగారం, వెండి వంటి సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది కూడా మార్కెట్ పతనానికి ఒక కారణం.బడ్జెట్ 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై మార్కెట్ భారీ అంచనాలతో ఎదురుచూస్తోంది. ఆర్థిక వృద్ధి, ఉద్యోగ సృష్టి, వినియోగ డిమాండ్ పెంచే చర్యలు ఉంటాయని ఆశిస్తున్నారు. అయితే ఆర్థిక లోటు నియంత్రణపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టి, మూలధన వ్యయాన్ని తగ్గిస్తుందేమో అన్న భయం పెట్టుబడిదారుల్లో జాగ్రత్తను పెంచుతోంది. ఈ ఆందోళన కూడా మార్కెట్ పతనానికి కారణమైంది.ఇదీ చదవండి: వడ్డీ వస్తుందా.. అందుకేనా స్విస్ బ్యాంక్‌లో డబ్బు! -
మీరు యాక్టివా.. పాసివా?
స్టాక్ మార్కెట్లపై పెద్దగా అవగాహన లేనివారు... షేర్ల గురించి ఎక్కువగా తెలియని వారు కూడా మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఎందుకంటే ఏ షేర్లో ఎప్పుడు ఎంత ఇన్వెస్ట్ చేయాలో, ఎప్పుడు వెనక్కు తీసుకోవాలో అవన్నీ చూసుకోవటానికి మ్యూచువల్ ఫండ్లలో ఓ పెద్ద వ్యవస్థ ఉంటుంది. అవన్నీ చేస్తూ... ఏడాది తిరిగేసరికల్లా చక్కని రాబడినిస్తాయి కనక మ్యూచువల్ ఫండ్లు చాలామందిని ఆకర్షిస్తుంటాయి. బ్యాంకు వడ్డీని మించి రాబడి సాధించాలన్నా... ద్రవ్యోల్బణాన్ని తట్టుకోవాలన్నా ఇదో మంచి మార్గం. సరే! మరి ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి? అంటే షేర్లలోను, బాండ్లలోను ఇన్వెస్ట్ చేసేయాక్టివ్ ఫండ్స్లోనా? లేక ఇండెక్స్‌లో మాత్రమే పెట్టుబడి పెట్టే పాసివ్ ఫండ్స్లోనా? ఏది బెటర్? దీన్ని వివరించేదే ఈ ‘వెల్త్ స్టోరీ’...భారతదేశ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ ఏకంగా రూ.81 లక్షల కోట్లకు చేరిందిపుడు, ఒకరకంగా ఇది రికార్డు స్థాయి. ఇందులో పాసివ్ ఫండ్స్ విలువ దాదాపు రూ.14 లక్షల కోట్లు. మిగిలిన విలువ యాక్టివ్ ఫండ్స్‌ది. అసలు మనదేశంలో ఇండెక్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేసే పాసివ్ ఫండ్ల విలువ రూ.14 లక్షల కోట్లకు చేరుతుందని ఎవరైనా ఊహించారా? మున్ముందు ఇది ఇంకా పెరుగుతుందనేది నిపుణుల మాట. దీంతో పాసివ్ ఫండ్లు మంచివా... లేక యాక్టివ్ ఫండ్సా అనే చర్చ మళ్లీ జోరందుకుంది. నైపుణ్యం, అనుభవం ఉన్న ఫండ్ మేనేజర్లు మాత్రమే, నిరంతరం మార్కెట్‌ని మించి రాబడులు అందించగలరనే భావన కొన్నాళ్ల కిందటిదాకా ఉండేది. కానీ, ఇపుడు చాలా మంది ఇన్వెస్టర్లు క్రమంగా ఖర్చులను ఆదా చేసే, సరళంగా ఉండే, దీర్ఘకాలికంగా విశ్వసనీయంగా ఉండే పాసివ్ విధానంవైపు మళ్లుతున్నారు. ఈ రెండింట్లో ఉండే సానుకూల, ప్రతికూలాంశాలు చూస్తే...ఇండెక్స్ వర్సెస్ యాక్టివ్ ఫండ్స్..ఇండెక్స్ ఫండ్స్ అంటే, సెన్సెక్స్, నిఫ్టీ50, నిఫ్టీ– 500 లాంటి నిర్దిష్ట మార్కెట్ సూచీని ప్రతిబింబించేవి పాసివ్ ఫండ్స్. ఇవి ఆ సూచీలోని స్టాక్స్‌లో, అదే పరిమాణంలో ఇన్వెస్ట్ చేస్తాయి. ప్రత్యేకంగా షేర్లను ఎంచుకోవడం, మంచి సమయం కోసం వేచి ఉండటంలాంటిది ఉండదు. ఈ తరహా ఫండ్స్‌లో ఖర్చులు చాలా తక్కువ. దాదాపు సదరు ఇండెక్స్ స్థాయిలో పనితీరు కనపరుస్తాయి (కొంత వ్యయాలు పోగా).అదే యాక్టివ్ ఫండ్స్‌ని తీసుకుంటే బెంచ్‌మార్క్‌కి మించిన రాబడులను అందించేలా వీటిని ప్రొఫెషనల్స్ నిర్వహిస్తుంటారు. ఇందుకోసం అధ్యయనం, షేర్ల ఎంపిక, వ్యూహాత్మకంగా సర్దుబాట్లు చేయడంలాంటి హడావిడి ఉంటుంది. ఈ తరహా ఫండ్లు ప్రామాణిక సూచీలకు మించిన పనితీరు సాధించే అవకాశం ఉంటుంది. వీటిల్లో పరిశోధనలు, ట్రేడింగ్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే, ఖర్చుల నిష్పత్తి కూడా ఎక్కువే.ఏవి ఎలా ఉంటాయ్..ఇండెక్స్ ఫండ్స్ పూర్తి పారదర్శకంగా ఉంటాయి. ఏదో ఒక్క మేనేజరు మీదే ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు. మార్కెట్ హెచ్చుతగ్గులపరమైన ప్రభావమే తప్ప నిర్దిష్ట స్టాక్పరమైన ప్రతికూల ప్రభావం ఉండదు. మరోవైపు, యాక్టివ్ ఫండ్స్ విషయానికొస్తే ఇవి నిర్దిష్ట సాధనాల్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేయడం వల్ల, తీవ్ర ఒడిదుడుకులు ఏర్పడితే పెట్టుబడిపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. తప్పుడు నిర్ణయాలు తీసుకున్న పక్షంలో ఫండ్ పనితీరు దెబ్బతినే అవకాశాలూ ఉంటాయి.వాస్తవ పరిస్థితిఆర్థిక సమాచార సేవల సంస్థ ఎస్ అండ్ పీకి చెందిన ఎస్పీఐవీఏ ఇండియా నివేదిక ప్రకారం (2025 మధ్య, అంతకు ముందు ట్రెండ్స్) దాదాపు 65–66 శాతం లార్జ్ క్యాప్ యాక్టివ్ ఫండ్స్, 2025లో తమ తమ బెంచ్‌మార్క్ సూచీలకన్నా తక్కువ రాబడులను అందించాయి. దీర్ఘకాలికంగా అంటే పదేళ్ల పైగా వ్యవధిలో చూస్తే సుమారు 80 శాతం మిడ్, స్మాల్ క్యాప్ యాక్టివ్ ఫండ్స్ వెనుకబడ్డాయి. అయితే, కొన్ని యాక్టివ్ ఫండ్లు తీవ్ర హెచ్చుతగ్గుల మార్కెట్లలో కూడా రాణించగలిగే విధంగా ఉంటాయి. మరోవైపు, పాసివ్ ఫండ్స్ అనేవి కొంత రిస్కు తక్కువ వ్యవహారంగా విశ్వసనీయమైన స్థాయిలో రాబడులు అందించేందుకు అవకాశం ఉంది. ఎవరికి .. ఏవి అనువు..ఇండెక్స్ ఫండ్స్: తొలిసారి ఇన్వెస్ట్ చేస్తున్నవారు, దీర్ఘకాలిక సిప్ ఇన్వెస్టర్లు, రిటైర్మెంట్ ప్రణాళికల్లో ఉన్నవారు. పెట్టుబడుల ప్రక్రియ సరళంగా ఉండాలనుకునేవారు. ప్రతి రోజూ మార్కెట్లను, పెట్టుబడులను చూస్తూ కూర్చోవడానికి ఇష్టపడని వారు. యాక్టివ్ ఫండ్స్: పనితీరును సమీక్షించుకోవడానికి ఇష్టపడే అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లు, నిర్దిష్ట రంగాలు/థీమ్‌ల్లో పెట్టుబడుల ద్వారా భారీ లాభాలను కోరుకునేవారు.ఖర్చులు కీలకం..ఇండెక్స్ ఫండ్స్‌కి సంబంధించిన పెద్ద సానుకూల అంశం ఖర్చులు తక్కువగా ఉండటం. డైరెక్ట్ ప్లాన్లయితే సాధారణంగా 0.1 శాతం నుంచి 0.3 శాతం వరకు ఉంటాయి. మరోవైపు, యాక్టివ్ ఫండ్లు సాధారణంగా 1.5 – 2.5 శాతం శ్రేణిలో చార్జీలు విధిస్తాయి. కాలక్రమేణా ఈ చార్జీలన్ని కలిపితే తడిసి మోపెడవుతుంది. దీర్ఘకాలంలో ఇదొక సైలెంట్ వెల్త్ కిల్లర్లాంటిది. 20–25 ఏళ్ల వ్యవధిలో చూస్తే ఆఖర్లో ఈ వ్యయాల భారం పెట్టుబడి, నిధిని బట్టి లక్షలు, కోట్లల్లోనూ ఉంటుంది. ఆ మేరకు రాబడీ తగ్గుతుంది.హైబ్రిడ్ వ్యూహంతో మేలు..చాలా మంది నిపుణులు ప్రస్తుతం పెట్టుబడులకు సంబంధించి హైబ్రిడ్ వ్యూహమైన ‘కోర్–శాటిలైట్’ విధానాన్ని సూచిస్తున్నారు. అంటే 60–70 శాతం మొత్తాన్ని (కోర్) తక్కువ వ్యయాలతో కూడుకుని ఉండే ఇండెక్స్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటి నిర్వహణ వ్యయాలు తక్కువగా ఉంటాయి, పోర్ట్‌ఫోలియోకి స్థిరత్వం లభిస్తుంది. ఇక 30–40 శాతం మొత్తాన్ని అనుబంధంగా (శాటిలైట్), అధిక లాభాలను ఆర్జించి పెట్టే అవకాశమున్న నిర్దిష్ట యాక్టివ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే, ఇక్కడో విషయం గుర్తుంచుకోవాలి. అందరికీ ఒకే రకం పెట్టుబడి వ్యూహం ఉపయోగపడకపోవచ్చు. ఇండెక్స్ ఫండ్లతో ఖర్చులు ఆదా అవుతాయి. రాబడులు కాస్త అంచనాలకు అందే విధంగా ఉంటాయి. దీర్ఘకాలికంగా కాంపౌండింగ్ ప్రయోజనాలు దక్కుతాయి. ముఖ్యంగా నిలకడగా మార్కెట్‌ని మించి రాబడులను సాధించడం కష్టంగా ఉండే లార్జ్–క్యాప్ సెగ్మెంట్‌కి సంబంధించి ఇవి అనువైనవిగా ఉంటాయి. యాక్టివ్ ఫండ్స్ అనేవి అధిక రాబడుల ఆశలు కలి్పస్తాయి, కానీ ఫీజులు, రిసు్కలు అధికంగా ఉంటాయి. ఏదైతేనేం.. వీలైనంత ముందుగా పెట్టుబడులను ప్రారంభించాలి. యాంఫీ, ఫండ్ ఫ్యాక్ట్ షీట్లు, విశ్వసనీయమైన ప్లాట్‌ఫాంల ద్వారా ఫండ్‌ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. మీ రిస్క్ ప్రొఫైల్, లక్ష్యాలకు అనువుగా ఉండే దాన్ని ఎంచుకోవాలి. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేయాలి.ఇదీ చదవండి: డేటా పంచుకోలేం.. కోర్టును ఆశ్రయించిన గూగుల్! -
లక్ష పెట్టుబడి.. నాలుగేళ్లలో రూ. 64 లక్షలు చేసిన కంపెనీ
-
ఐపీఓలంటే అద్భుతాలు కావు!
స్టాక్ మార్కెట్లలోని కంపెనీలన్నీ ఎప్పుడో ఒకప్పుడు పబ్లిక్ ఇష్యూకు వచ్చినవే. కాకపోతే వాటిలో అగ్రశ్రేణి కంపెనీలుగా (లార్జ్‌క్యాప్) మారినవి కొన్నే. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలు. ఐపీఓల్లో ఇన్వెస్ట్ చేయాలో.. వద్దో తెలిసిపోతుంది. ఎందుకంటే ఐపీఓలంటే అద్భుతాలు కావు. ఆటోమేటిగ్గా సంపదను సృష్టించే సాధనాలూ కావు. అవి అవకాశాలతో పాటే రిస్కులనూ మన ముందుంచుతాయి. అలాగని ఐపీఓలకు దూరంగా ఉండమని కాదు. ఐపీఓ అంటే... మార్కెట్లు పంపే ఆహ్వాన పత్రికలు. దేన్ని స్వీకరించాలో... దేన్ని తిరస్కరించాలో మనమే నిర్ణయించుకోవాలి. అది ఎలాగో.. 2025లో ఐపీఓకు వచి్చన కంపెనీల పరిస్థితేంటో... 2026లో ఎలా వ్యవహరించాలో సమగ్రంగా వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ...ప్రస్తుతం ప్రైమరీ (ఐపీఓ) మార్కెట్ మంచి దూకుడు మీదుంది. దాదాపు 200కు పైగా కంపెనీలు లిస్టింగ్‌లకు సన్నద్ధమవుతున్నాయి. వీటిలో ఫిన్‌టెక్ యూనికార్న్‌లు, గ్రీన్ ఎనర్జీ వెంచర్ల నుంచి కన్జూమర్ బ్రాండ్లు, ఇన్ఫ్రా రంగ దిగ్గజాల వరకు చాలా ఉన్నాయి. జీడీపీ ఏడు శాతానికి పైగా కొనసాగుతుందనే సానుకూల అంచనాలు, డీమ్యాట్ ఖాతాలు 15 కోట్ల స్థాయిని దాటిపోవడం, ప్రతి నెలా సిప్ల ద్వారా రూ. 25 వేల కోట్లకు పైగా పెట్టుబడులు మార్కెట్లలోకి వస్తుండటం వంటి పరిణామాలు కంపెనీలకు మంచి ఊపునిస్తున్నాయి.ఐపీవోలు ఎందుకు..కంపెనీలు వివిధ కారణాలరీత్యా పబ్లిక్ ఇష్యూల ద్వారా నిధులను సమీకరిస్తుంటాయి. అవేంటంటే.. → కార్యకలాపాలను విస్తరించడానికి, కొత్త టెక్నాలజీల ద్వారా వ్యాపారాన్ని పెంచుకోవటానికి → రుణాలుంటే తీర్చెయ్యడానికి... → ప్రారంభ దశలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు, అలాగే ప్రమోటర్లు తమ వాటాలను విక్రయించుకోవటానికి → బ్రాండ్‌ని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్రచారం చేసుకునేందుకు ఇలాంటి అవసరాలకు సంబంధించి ఐపీవోలనేవి కంపెనీకి సహాయకరంగానే ఉంటాయి. అయితే, షేరు ధర అదే పనిగా పెరుగుతూనే ఉంటుందనే గ్యారంటీ ఏమీ ఉండదు. మార్కెట్లు ర్యాలీ చేస్తున్నప్పుడు కొన్ని కంపెనీలు లిస్టింగ్‌లో మంచి లాభాలే ఇవ్వొచ్చు. మరికొన్ని కంపెనీలు లిస్టింగ్ వేళ నిరాశపర్చినా, ఆ తర్వాత కొన్నాళ్లకు మళ్లీ పుంజుకుని మెరుగైన రాబడులు అందించే అవకాశం ఉంది. అదే సమయంలో చాలా మటుకు కంపెనీలు తీవ్రమైన పోటీ ఎదుర్కొనలేక చతికిలబడి, షేర్లు కనుమరుగైపోతుంటాయి కూడా.రిటైల్ ఇన్వెస్టర్ల తప్పులివీ...ఆ ఐపీవో బాగా లిస్టయ్యింది.. ఈ ఇష్యూ బాగా లాభాలు తెచ్చిందనే అత్యుత్సాహంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తప్పులో కాలేస్తుంటారు. చేతులు కాల్చుకుంటూ ఉంటారు. కొందరు గ్రే మార్కెట్లను ఫాలో అవుతూ అక్కడ ప్రీమియం రేటు పలికే వాటి వెంటబడుతుంటారు. ఇంకొందరు భారీగా ఓవర్సబ్్రస్కయిబ్ అయ్యింది కదా కచి్చతంగా లాభాలొచ్చేస్తాయనుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. మరికొందరు లిస్టింగ్ రోజున భలే ఎగ్జైటింగ్‌గా ఉంటుందని పెట్టుబడులు పెడుతుంటారు. కానీ, ఈ అత్యుత్సాహంలో కొన్ని విషయాలు విస్మరిస్తుంటారు. వ్యాపారం మోడల్ నిజంగా బలమైనదేనా? దీర్ఘకాలికంగా నిలబడేదేనా? ప్రమోటర్ల ట్రాక్ రికార్డు బాగుందా లేదా? ఐపీవో ద్వారా తీసుకున్న డబ్బును కంపెనీ ఏ అవసరాల కోసం వాడుకుంటోంది? ఇలాంటివి పెద్దగా పట్టించుకోరు. 2025లో ఏం జరిగిందంటే... గతేడాది ఐపీవోలు తీపి, చేదు జ్ఞాపకాలు రెండింటినీ ఇచ్చాయి. దాదాపు 373 కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.1.95 లక్షల కోట్లు సమీకరించాయి. వీటిలో 103 మెయిన్ బోర్డ్ ఇష్యూ లు కాగా 270 కంపెనీలు ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై లిస్టయ్యాయి. టాటా క్యాపిటల్ (రూ.15,512 కోట్లు), హెచ్డీబీ ఫైనాన్షియల్ సరీ్వసెస్ (రూ.12,500 కోట్లు) వంటి దిగ్గజాలు భారీగా నిధులు సమీకరించాయి. కొత్త తరం సంస్థలు మీషో రూ. 5,421 కోట్లు సమీకరించగా, గ్రో క్యాపిటల్ రూ.6,632 కోట్లు రాబట్టుకుంది. వీటిలో లిస్టింగ్ నాడు ఏకంగా 136 శాతం లాభాన్నిచి్చన స్టాలియన్ ఇండియా ఫ్లోరోకెమికల్స్ లాంటి కంపెనీలతో పాటు తొలిరోజే 56 శాతం నష్టాన్నిచ్చిన గ్లోటిస్ లిమిటెడ్ వంటి కంపెనీలూ ఉన్నాయి. ఇక పెద్ద పెద్ద ఇష్యూల్లో మీషోనే తీసుకుంటే ఇష్యూ ధర రూ.111 అయితే దాదాపు 46 శాతం అధికంగా రూ.162.50 వద్ద లిస్టయ్యింది. అలాగని అన్నీ ఇదే రీతిలో లిస్టింగ్ లాభాలిచ్చాయనుకోవడానికి లేదు. గతేడాది సగటున లిస్టింగ్ లాభాలు చూస్తే 8 శాతం స్థాయికే (అంతకు ముందటి సంవత్సరాలకన్నా తక్కువగా) పరిమితమయ్యాయి. వీటిలో దాదాపు సగ భాగం లిస్టింగ్‌లో ఏడాది చివరి నాటికి లాభాల్లోనే ఉండగా, మిగతావి ఇష్యు రేటు కన్నా కిందికి పడిపోయాయి. ఇక ఎస్ఎంఈ ఐపీవోలైతే మరీ తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. కొన్ని మలీ్టబ్యాగర్లుగా మారినప్పటికీ మిగతావి భారీగా పడిపోయాయి. హైప్ అనేది ఎల్లకాలం ఉండదని, వాస్తవంగా వ్యాపారానికి ఉండే బలమే కీలకమనే పాఠాన్ని 2025 మరోసారి నేరి్పంది.2026 ప్రత్యేకత ఏంటి.. ఈసారి 200 పైగా కంపెనీలు ఐపీవోలకు సిద్ధమవుతున్నాయి. ఇవి రూ. 2.5 లక్షల కోట్లకు మించి సమీకరించవచ్చనే అంచనాలున్నాయి. వీటిలో పలు కంపెనీలు భారీ వేల్యుయేషన్లతో రాబోతున్నాయి. ఉదాహరణకు రూ. 11– 12 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో రిలయన్స్ జియో ఐపీవో దేశంలోనే అతి పెద్ద ఇష్యూగా ఉంటుందనేది నిపుణుల అంచనా. ఇది 2026 ప్రథమార్ధంలోనే రావచ్చు. అలాగే ఎన్ఎస్ఈ, ఫోన్‌పే, ఫ్లిప్‌కార్ట్, ఓయో, జెప్టో, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్... ఇలా బోలెడు పెద్ద కంపెనీలు రాబోతున్నాయి. ఈ ఇష్యూల ద్వారా పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు తమ వాటాలను విక్రయించుకుని ని్రష్కమించనున్నాయి. డీమ్యాట్ ఖాతాలు పెరుగుతుండటం, సిప్ పెట్టుబడుల వెల్లువతో వీటికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి భారీగానే డిమాండ్ ఉంటుందనే అంచనాలున్నాయి. వెరసి ఈసారి కూడా స్టాక్ మార్కెట్లు సందడిగానే ఉండనున్నాయి.ఏం చేయాలంటే... ఇదంతా చూసిన తర్వాత ఇంతకీ ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అంటే... ఇవి మీ పోర్ట్‌ఫోలియోలో స్మార్ట్ భాగంగా ఉండొచ్చు. సముచిత రేటులో లభిస్తున్న బలమైన కంపెనీల ఐపీవోల్లో ఇన్వెస్ట్ చేయండి. కానీ పెట్టుబడులకు సంబంధించి అదొక్కటే వ్యూహంగా మాత్రం పెట్టుకోవద్దు. → మంచి అవకాశాల కోసం కాస్త వేచి చూడండి. ఇలాంటివి ఏడాదిలో 4– 6 వరకు వస్తుంటాయి. → బాగుందనిపించగానే ఇన్వెస్ట్ చేసేయొద్దు. వ్యాపార ప్రాథమిక విషయాలను తెలుసుకునేందుకు ప్రాస్పెక్టస్‌ని కూడా కాస్త తిరగేస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. → పబ్లిక్ ఇష్యూల్లో పెట్టుబడులను మీ దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్ లేదా బ్లూ–చిప్ స్టాక్స్‌కి అనుబంధంగానే ఉంచుకోవడం మంచిది. చివరిగా చెప్పేదేమిటంటే పబ్లిక్ ఇష్యూలంటే లాటరీలు కావు! యుఫోరియాకి లోను కాకుండా జాగ్రత్త వహించాలి. లిస్టింగ్‌కి వచ్చిన కంపెనీ ఫండమెంటల్స్ పటిష్టంగా ఉంటే కేవలం లిస్టింగ్ రోజునే కాదు దీర్ఘకాలికంగా కూడా మంచి రాబడులను అందుకోవచ్చని గుర్తుంచుకోవాలి. -
ప్రపంచంలో అస్థిరత్వం.. భారత్‌లో స్థిరత్వం
రాజ్‌కోట్: ప్రపంచమంతటా అస్థిర పరిస్థితు లు, ఉద్రిక్తతలు కొనసాగుతుండగా, భారత్ లో మాత్రం గతంలో ఎన్నడూ లేనంత రాజకీయ స్థిరత్వం ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. దేశంలో వ్యాపార ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయ ని పేర్కొన్నారు. ఈ అవకాశాలు ఉపయోగించుకోవాలని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్‌లో పెట్టుబడులకు పూర్తి సానుకూల వాతావరణం ఉందన్నారు. ఆదివారం గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో వైబ్రాంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సును ప్రధాని మోదీ ప్రారంభించారు. భారత ఆర్థిక వ్యవస్థ నేడు అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. దేశ ప్రగతిలో గుజరాత్ కీలక పాత్ర పోషిస్తోందని గుర్తుచేశారు. భారత్ పట్ల ప్రపంచ దేశాలు ఆకాంక్షలు నానాటికీ పెరుగుతున్నాయని, తాజా గణాంకాలు ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. దేశంలో మధ్య తరగతి వర్గం వేగంగా విస్తరిస్తోందని, వారి కొనుగోలు శక్తి పెరుగుతోందని చెప్పారు. తద్వారా వ్యాపార అభివృద్ధికి అవకాశాలు సైతం అదే స్థాయిలో పెరుగుతు న్నాయని వెల్లడించారు. మొబైల్ డేటా వినియోగంలో భారత్ అగ్రస్థానంలో ఉందన్నారు. వైబ్రాంట్ గుజరాత్ సదస్సుకు దేశ విదేశీ పెట్టుబడిదారులు హాజరయ్యారు. -
సిప్ సూపర్ హిట్
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి డిసెంబర్లో నికరంగా రూ.28,054 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్‌లో రూ.29,911 కోట్ల పెట్టుబడులతో పోల్చి చూస్తే 6 శాతం తగ్గాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో వచి్చన పెట్టుబడులు రూ.24,690 కోట్లుగా ఉన్నాయి. ఈక్విటీ, గోల్డ్ ఈటీఎఫ్‌లు నికరంగా పెట్టుబడులను ఆకర్షించగా, డెట్ ఫండ్స్‌లో అమ్మకాలు చోటుచేసుకున్నాయి. దీంతో మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నుంచి డిసెంబర్లో రూ.66,591 కోట్ల పెట్టుబడులు బయటకు వెళ్లాయి. డివిడెండ్ ఈల్డ్, ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) తప్ప మిగిలిన అన్ని ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. నవంబర్ చివరికి ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) రూ.80.80 లక్షల కోట్లుగా ఉంటే, డిసెంబర్ చివరికి రూ.80.23 లక్షల కోట్లకు తగ్గాయి. ఈ వివరాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. సిప్ ద్వారా రికార్డు స్థాయి పెట్టుబడులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో పెట్టుబడులు డిసెంబర్లో సరికొత్త గరిష్టానికి చేరాయి. రూ.31,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్‌లో సిప్ పెట్టుబడులు రూ.29,445 కోట్లుగా ఉన్నాయి. ఫండ్స్ నిర్వహణలోని మొత్తం సిప్ పెట్టుబడులు రూ.3.34 లక్షల కోట్లకు చేరాయి. విభాగాల వారీ పెట్టుబడులు.. → అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ విభాగంలోకి రూ.10,019 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. నవంబర్‌లో ఈ విభాగంలోకి వచి్చన పెట్టుబడులు రూ.8,135 కోట్లుగానే ఉన్నాయి. → మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.4,176 కోట్ల పెట్టుబడులను రాబట్టాయి. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,094 కోట్లు వచ్చాయి. → స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.3,824 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.1,567 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → వ్యాల్యూ ఫండ్స్ రూ.1,088 కోట్లు, మల్టీక్యాప్ ఫండ్స్ రూ.2,255 కోట్లు, ఫోకస్డ్ ఫండ్స్ రూ.1,057 కోట్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి. → గోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు)లోకి పెద్ద మొత్తంలో రూ.11,647 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. -
వెంచర్ క్యాపిటల్‌కు బై ఐపీఓకు.. హాయ్
ఇటీవల కొద్ది రోజులుగా చిన్న, మధ్యస్థాయి స్టార్టప్‌లు తదుపరి దశ నిధుల సమీకరణలో పబ్లిక్ రూట్‌కే ప్రాధాన్యమిస్తున్నాయి. ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే ఐపీవోకు వెళ్లడానికే ఆసక్తి చూపుతున్నాయి. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండింగ్, టాలెంట్, టెక్నాలజీ వృద్ధికి వీలుంటుందని భావిస్తున్నాయి. వివరాలు చూద్దాం.. ప్రైమరీ మార్కెట్లు రెండేళ్లుగా రికార్డు నిధుల సమీకరణ ద్వారా కదం తొక్కుతుండటంతో చిన్న, మధ్యస్థాయి స్టార్టప్‌లు లిస్టింగ్‌వైపు చూస్తున్నాయి. ఇందుకు దేశీయంగా కనిపిస్తున్న ఇన్వెస్టర్ల ఆసక్తి, అత్యధిక లిక్విడిటీ తోడ్పాటునిస్తున్నాయి. ఫలితంగా తొలి, మలిదశలలో వృద్ధి నిలుపుకునేందుకు.. తద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన నిధుల కోసం పబ్లిక్ మార్కెట్‌కు ప్రాధాన్యమిస్తున్నాయి. వెరసి ప్రయివేట్ రంగ పెట్టుబడులకంటే స్టాక్ ఎక్సే్ఛంజీలలో నమోదయ్యేందుకే చిన్న, మధ్యస్థాయి స్టార్టప్‌లు ఆసక్తిని చూపుతున్నాయి.. కాగా.. ఇంతక్రితం చాలా స్టార్టప్‌లు బిలియన్ డాలర్ల కంపెనీలు(యూనికార్న్)గా ఎదిగిన తదుపరి మాత్రమే లిస్టింగ్‌వైపు చూసేవి. అంతకుముందు పెట్టుబడుల కోసం పీఈ, తదితర ఇన్వెస్ట్మెంట్ సంస్థలను ఆశ్రయిస్తుండేవి. అయితే ఇటీవల ఈ ట్రెండ్‌కు విరుద్ధంగా చాలా ముందుగానే ఐపీవో బాట పడుతుండటం గమనార్హం! బ్రాండ్ బిల్డింగ్.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయితే బ్రాండ్ బిల్డింగ్తోపాటు.. టాలెంట్‌ను ఆకట్టుకోవడం, కొత్త టెక్నాలజీలపై గురి పెట్టడం తదితరాలకు వీలుంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా కంపెనీకి సరైన విలువ లభించడం, పారదర్శక పాలన, తగినంత లిక్విడిటీకి వీలుండటం ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేశాయి. వెరసి రూ. 300–400 కోట్ల ఆదాయ స్థితికి చేరిన స్టార్టప్‌లు ఐపీవోకు సిద్ధపడుతున్నట్లు తెలియజేశాయి. రెండేళ్లుగా అటు ఎస్ఎంఈ, ఇటు మెయిన్ బోర్డులో రికార్డ్‌స్థాయిలో కంపెనీలు లిస్టవుతుండటం స్టార్టప్‌లకు జోష్‌నిస్తున్నట్లు వివరించాయి.జాబితా ఇలా.. స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్పట్ల ఆసక్తిగా ఉన్న మధ్యస్థాయి స్టార్టప్‌ల జాబితాలో స్క్రిప్‌బాక్స్, మైగేట్, ఫ్యాబ్‌హోటల్స్, క్లాస్‌ప్లస్ ముందువరుసలో ఉన్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవో చేపట్టేందుకు వీలుగా గత నెల(2025 డిసెంబర్)లో ఫ్యాబ్‌హోటల్స్ క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. రానున్న 6 నెలల్లో లిస్టయ్యేందుకు స్క్రిప్‌బాక్స్ సైతం సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ప్రధానంగా రూ. 300–600 కోట్ల సమీకరణ ప్రణాళికలున్న స్టార్టప్‌లు అధికంగా ఐపీవో బాటవైపు చూస్తున్నట్లు ఇన్‌క్రెడ్ క్యాపిటల్ ఎండీ ప్రతీక్ ఇండ్వార్ పేర్కొన్నారు. రూ. 600–700 కోట్ల పరిమాణంలో నిధుల సమీకరణపై కన్నేసిన స్టార్టప్‌లు సైతం అధికంగా లిస్టింగ్‌కు సిద్ధపడుతున్నట్లు ప్రోజస్ గ్రూప్ గ్లోబల్ హెడ్ గజానన్ శుక్లా తెలియజేశారు. ఇదీ తీరు తొలి, మలి దశ స్టార్టప్‌లు ప్రధానంగా ఏంజెల్ ఫండింగ్, వెంచర్ క్యాపిటల్ సంస్థల ద్వారా నిధు లు సమీకరిస్తుంటాయి. ఈ జాబితాలో సీక్వోయా, యాక్సెల్, బ్లూమ్ వెంచర్స్, కళారి, వై కాంబినేటర్, లెట్స్వెంచర్, ఫండ్ఆఫ్ ఫండ్స్ ఉన్నాయి. ఆపై ప్రయివేట్ ఈక్విటీ సంస్థలను సైతం సంప్రదిస్తుంటాయి. నిజానికి 2019లో మధ్యస్థాయి స్టార్టప్‌లు ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు 145 రౌండ్ల ద్వారా మైనారిటీ వాటాలు విక్రయించాయి. తద్వారా 5.7 బిలియన్ డాలర్లు సమకూర్చుకు న్నాయి. తదుపరి 2020, 2022లలో నిధుల సమీకరణ మరింత పుంజుకున్నప్పటికీ 2025లో నీరసించింది. 2019 స్థాయిలోనే 152 రౌండ్ల ద్వారా 5.4 బిలియన్ డాలర్లు అందుకున్నాయి. ఇందుకు సంస్థలు పెరిగినప్పటికీ ఐపీవో బాట పట్టడం ప్రభావం చూపినట్లు నిపుణులు తెలియజేశారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
రియల్ ఎస్టేట్‌కి పెట్టుబడులు బూస్ట్
రియల్ ఎస్టేట్ రంగంలో ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (సంస్థాగత) గతేడాది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. 8.47 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్టు కొలియర్స్ ఇండియా తెలిపింది. 2024లో వచ్చిన 6.56 బిలియన్ డాలర్ల కంటే 29 శాతం అధికమని పేర్కొంది. ఇందులో దేశీ పెట్టుబడులు గణనీయంగా పెరగ్గా, విదేశీ పెట్టుబడులు తగ్గాయి. దేశీ ఇన్వెస్టర్ల నుంచి 4.82 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.2024లో దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు 2.24 బిలియన్ డాలర్లతో పోల్చి చూస్తే 120 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులు మాత్రం అంతకుముందు ఏడాదితో పోల్చితే 2025లో 16 శాతం తగ్గి 3.65 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ వివరాలతో కొలియర్స్ ఇండియా ఒక నివేదిక విడుదల చేసింది. సంస్థాగత ఇన్వెస్టర్లలో ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్ గ్రూప్‌లు, విదేశీ బ్యాంక్‌లు, ప్రొప్రయిటరీ బుక్‌లు, పెన్షన్ ఫండ్స్, ప్రైవేటు ఈక్విటీ, రియల్ ఎస్టేట్ ఫండ్–డెవలపర్స్, ఎన్బీఎఫ్సీలు, రీట్లు, సావరీన్ వెల్త్ ఫండ్స్ ఉన్నట్టు ఈ నివేదిక తెలిపింది.‘‘2025లో అధిక శాతం పెట్టుబడులను ఆఫీస్ ఆస్తులు ఆకర్షించాయి. మొత్తం పెట్టుబడుల్లో 54 శాతం (4.53 బిలియన్ డాలర్లు) ఆఫీస్ ఆస్తుల్లోకి వచ్చాయి. ఆ తర్వాత నివాస ప్రాజెక్టులు, పారిశ్రామిక, గోదాముల్లోకి వెళ్లాయి’’అని కొలియర్స్ ఇండియా ఎండీ, సీఈవో బాదల్ యాజ్ఙిక్ తెలిపారు. 2026లో సంస్థాగత పెట్టుబడులు మరింత బలపడతాయని, అంతర్జాతీయంగా పెట్టుబడులకు రిస్క్ ధోరణి పెరగడం, దేశీ ఇన్వెస్టర్లు ఇందుకు మద్దతుగా నిలవనున్నట్టు పేర్కొంది. -
ఇలా చేస్తే..! 12 ఏళ్లలో 50 లక్షలు మీదే..!
-
బ్యాలెన్స్ లేకుంటే పడతారు..!
కేలండర్ మారుతోంది. కొత్త ఏడాది వస్తోంది. మరి ఇన్వెస్ట్మెంట్ల సంగతేంటి? 2025 ధోరణే కొనసాగిద్దామా? లేక కొంతయినా మారుద్దామా? అందరిదీ ఇదే సందేహం. స్టాక్ మార్కెట్ల వైపు చూస్తే... ఇండెక్స్‌లు జీవితకాల గరిష్టాలకు దగ్గర్లో ఉన్నాయి. అంతకుముందు రెండేళ్లు అసాధారణంగా ర్యాలీ చేసిన స్మాల్, మిడ్‌క్యాప్ షేర్లు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. ఏడాదిలో సెన్సెక్స్ 10 శాతం పెరిగినా.. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ 7 శాతం తగ్గింది మరి. పోనీ రిసు్క లేకుండా ఓ మోస్తరు రాబడులిస్తాయనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కాస్తా తగ్గి కూర్చున్నాయి. పెట్టుబడి పెట్టేలోపే బంగారం, వెండి అనూహ్యంగా పరుగులు పెడుతున్నాయి. మరి ఈ పరుగులెంతకాలం? ఎల్లకాలమూ ర్యాలీ చేస్తూనే ఉండవు కదా? ఇక రియల్ ఎస్టేట్ మొదట్లో కూలబడి... ఇపుడిపుడే కోలుకుంటోంది. ఇలాచూస్తే ఇపుడు సరైన ఇన్వెస్ట్మెంట్ ఇదీ... అని చెప్పలేని పరిస్థితి. మరేం చేద్దాం? మన పోర్టుఫోలియో ఎలా ఉండాలి? ద్రవ్యోల్బణాన్ని మించి 4– 6 శాతం మేర వాస్తవిక రాబడులను ఎలా దక్కించుకోవాలి? ఎందులో.. ఎంత ఇన్వెస్ట్ చేయాలి? ఇవన్నీ వివరించేదే ఈ ‘వెల్త్’ స్టోరీ... ఇపుడున్న పరిస్థితుల్లో బ్యాలెన్స్డ్ పోర్టు ఫోలియో తప్పనిసరి ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. ఉదాహరణకు ఈక్విటీల్లో 30–45 శాతం, డెట్– ఫిక్స్డ్ ఇన్‌కం సాధనాలకు 25–35 శాతం, రియల్ ఎస్టేట్‌కి 20– 30 శాతం, పసిడి, వెండికి 10–15 శాతం మేర కేటాయించవచ్చు. ఇలా బ్యాలెన్స్ చేసుకుంటే కొన్నింట్లో ఆశించిన ఫలితాలు రాకున్నా.. మిగిలినవి రాణించే చాన్సుంటుంది. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే రాబడులొస్తాయి. ఒక్కో సాధనాన్నీ విడివిడిగా చూద్దాం...2026 కొంత కొత్తగా... తేదీ మారినంత మాత్రాన జీవితమేమీ మారిపోదు. సంవత్సరం మారినంతమాత్రాన సంపదేమీ వచ్చి ఒళ్లో వాలదు. భారతీయ మధ్య తరగతి ఇప్పుడు ఆర్థిక కూడలిలో అయోమయంగానే నిలుచుంది. ఎందుకంటే జీతాలు బాగా పెరుగుతున్నాయి. కానీ చదువు, ఆరోగ్యం, ఇల్లు, డిజిటల్ లైఫ్కయ్యే ఖర్చు అంతకు మించి పెరుగుతోంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణకు పాత సూత్రాలు పనికిరావిప్పుడు. కొత్తగా చెయ్యాలి. కొంతయినా!!. నెల జీతం... ఫిక్స్డ్ డిపాజిట్లు.. బంగారం. దశాబ్దాలుగా భారతీయుల పొదుపు సూత్రమిదే. మరిప్పుడో..? ఉద్యోగాలకు రక్షణ లేదు. మారిన జీవనశైలి పొదుపును మింగేస్తోంది. ఆసుపత్రికెళితే బిల్లును అంచనా వెయ్యలేం. ఎల్కేజీ నుంచే ఫీజులకు జీతాలు సరిపోవట్లేదు. మరేం చెయ్యాలి? ధనంతో అనుబంధాన్ని... అంటే ధనబంధాన్ని మార్చుకోవాలి. తక్షణ లాభాలు, సోషల్ మీడియా టిప్‌లకు దూరంగా ఉందాం. లగ్జరీ వస్తువులు కొనేముందు... అత్యవసర నిధికి ప్రాధాన్యమిద్దాం. మొహమాటం కోసం కొనే పాలసీలకన్నా... నిజంగా రక్షణనిచ్చే బీమా కావాలి. ఆద్భుతాలు చేసే పథకాలకన్నా... స్థిరంగా పెరిగే పెట్టుబడులు చూడాలి. సంపద రాత్రికిరాత్రే రాదు. మెరుగైన అలవాట్లతో నెలలు, సంవత్సరాలు వేచిచూస్తేనే చెంతకొస్తుంది. ‘సాక్షి’ వెల్త్‌తో కలిసి ఇప్పటినుంచైనా కొత్త ప్రయాణం మొదలు పెడదాం..! ఎందులో, ఎలా ఇన్వెస్ట్ చేయొచ్చుఈక్విటీలు (30–45 శాతం కేటాయింపు) లార్జ్ క్యాప్ స్టాక్స్‌లోను, ఇండెక్స్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. మార్కెట్‌ను నిరంతరం ఫాలో అయ్యే అవకాశం లేనివారు, మార్కెట్లపై పెద్దగా అవగాహన లేనివారు ఇండెక్స్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు. అలాగే నెలవారీగా ఇంత మొత్తం (ఇప్పుడు వారంవారీ, రోజువారీవి కూడా వచ్చాయి) చొప్పున పెట్టుబడి పెట్టేలా సిప్ (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) తరహా ఇన్వెస్టింగ్ విధానాన్ని అనుసరించవచ్చు. అంతేతప్ప డే ట్రేడింగ్, టిప్స్ మాయలో పడొద్దు. తక్షణ లాభాలొస్తాయంటూ వచ్చే కాల్స్‌ను ఆన్సర్ చేయొద్దు. ఈక్విటీల్లో పెట్టుబడులు దీర్ఘకాలికంగా ఉండాలి. రిటైర్మెంట్ తరువాతి జీవనానికి, పిల్లల చదువుకు ఉపయోగపడతాయి.డెట్, ఫిక్స్డ్ ఇన్‌కం (25–35 % కేటాయింపు)భారీ రిటర్నుల కన్నా పోర్ట్‌ఫోలియోని స్థిరంగా ఉంచేందుకు ఈ సాధనం ఉపయోగపడుతుంది. బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు (ఎఫ్డీ), డెట్ మ్యూచువల్ ఫండ్లు, కార్పొరేట్ బాండ్లు వంటివన్నీ ఈ కేటగిరీలోకి వస్తాయి. ఇతరత్రా సాధనాలతో పోలిస్తే ఈ తరహా సాధనాలపై రాబడులు ఒక మోస్తరుగానే దక్కే అవకాశం ఉన్నప్పటికీ.. మన పెట్టుబడి మొత్తానికి పెద్దగా రిస్కు ఉండదు. భద్రత అధికం. డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధులను ప్రభుత్వ బాండ్లు, కార్పొరేట్ బాండ్లు, ట్రెజరీ సాధనాల్లాంటి స్థిరాదాయాన్ని అందించే సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. కంపెనీలు తమ వ్యాపార అవసరాల కోసం నిధులను సమీకరించుకునేందుకు జారీ చేసే వాటిని కార్పొరేట్ బాండ్లుగా వ్యవహరిస్తారు. ఎఫ్డీలతో పోలిస్తే ఇవి కాస్త ఎక్కువ రాబడినిచ్చే విధంగా ఉంటాయి. అయితే, వీటిలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ట్రిపుల్ ఏ రేటెడ్ సాధనాలను మాత్రమే ఎంచుకోవడం మంచిది.రియల్ ఎస్టేట్ (20–30 శాతం) ఎకానమీ పరిస్థితి ఎలా ఉన్నా రియల్ ఎస్టేట్ అవసరాలు పెరుగుతూనే ఉన్నాయి. దానికి తగ్గట్లుగా ధరలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి పోర్ట్‌ఫోలియోలో ఓ 20–30 శాతాన్ని ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్వయంగా నివసించేందుకు కొనుక్కోవడం కావచ్చు... అద్దె రూపంలో రాబడులిచ్చే రెంటల్ ప్రాపరీ్టపై లేదా ఫ్రాక్షనల్ కమర్షియల్ ప్లాపరీ్టలో కావచ్చు. ఆర్థికంగా వెసులుబాటను బట్టి పెట్టుబడులు పెట్టొచ్చు. అయితే, స్పెక్యులేషన్‌కి తావివ్వకుండా క్యాష్ ఫ్లోపై ప్రధానంగా దృష్టి పెట్టాలి.బంగారం, వెండి (10–15 శాతం)సాధారణంగా బంగారం, వెండి లాంటి మెటల్స్‌కు, ఈక్విటీలకు నెగటివ్ కో–రిలేషన్ ఉంటుంది. చాలా సందర్భాల్లో షేర్ మార్కెట్ పెరిగినప్పుడు ఈ మెటల్స్ ధరలు నిదానించడం, పసిడి ధర పెరిగినప్పుడు షేర్లు తగ్గడంలాంటిది జరుగుతుంది. కానీ 2025లో పరిస్థితి అలా లేదు. సూపర్‌గా పరుగులు తీసిన సాధనంగా బంగారం నిల్చింది. అంతటి పరుగును కూడా వెండి దాటేసింది. అంతర్జాతీయంగా చూస్తే బంగారం 74%, వెండి 160% మేర పెరిగాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పరుగు కొనసాగవచ్చనే అంచనాలున్నాయి. పేపర్ కరెన్సీలాగా కాలక్రమేణా మారకం విలువను కోల్పోకుండా, పెరిగే ధరల పెరుగుదల భారాన్ని ఎదుర్కొనేందుకు సహాయపడే సురక్షితమైన హెడ్జింగ్ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తారు. తన విలువను కాపాడుకుంటూ, ఈక్విటీలు తగ్గినా సంక్షోభ సమయాల్లో ఆదుకునే పసిడి, వెండిలో ఓ పది నుంచి పదిహేను శాతం ఇన్వెస్ట్ చేస్తే పోర్ట్‌ఫోలియోకి శ్రీరామరక్షగా ఉంటుంది. క్యాష్, లిక్విడ్ ఫండ్స్ (5 శాతం) అత్యవసర పరిస్థితులేవైనా తలెత్తితే చేతిలో ఎంతో కొంత నగదు ఉండటం చాలా ముఖ్యం. కాబట్టి సంపద వృద్ధి కోసం ఎందులో ఎంత ఇన్వెస్ట్ చేసినప్పటికీ, ఎమర్జెన్సీలో ఆదుకునేందుకు కనీసం ఆరు నెలల ఆర్థిక అవసరాలకైనా సరిపడే ఫండ్ అనేది ఒకటుండాలి. దీన్ని సేవింగ్స్ ఖాతాలోనైనా ఉంచుకోవచ్చు. లేదా దానికన్నా కాస్త ఎక్కువ రాబడినిచ్చే అవకాశాలున్న లిక్విడ్ ఫండ్స్‌లోనైనా సుమారు 5 శాతం మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయొచ్చు.కొన్ని తప్పిదాలకు దూరం.. కొత్త సంవత్సరంలోనైనా కొన్ని తప్పిదాలకు దూరంగా ఉంటే శ్రేయస్కరం. పెట్టుబడులకు సంబంధించి డైవర్సిఫికేషన్ సూత్రం అంటూ ఒకటుంటుంది. అంటే, ఎప్పుడూ చేతిలో ఉన్నదంతా తీసుకెళ్లి ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఏ సాధనానికైనా కొన్ని సాధకబాధకాలుంటాయి. ఒకోసారి పెరుగుతుంది. ఒకోసారి తగ్గుతుంది. పెరిగితే ఫర్వాలేదు బాగానే ఉంటుంది. కానీ తగ్గినప్పుడే సమస్య. మొత్తం అంతా అందులోనే ఉంచేయడం వల్ల సవాళ్లు తప్పవు. మళ్లీ అది కోలుకునేంత వరకు ఓపిగ్గా కూర్చువడమో లేదా నష్టానికి అమ్ముకుని బైటపడటమో చేయాల్సి రావచ్చు. కాబట్టి డబ్బంతా ఒకే దానిలో ఇన్వెస్ట్ చేయకుండా వివిధ సాధనాల్లో కొంత చొప్పున డైవర్సిఫై చేస్తే మంచిది. ఇక పోయినేడాది రాబడి బాగా వచి్చంది.. ఈసారి కూడా అదే స్థాయిలోనో లేదా దానికి మించిన స్థాయిలోనో రాబట్టాలి అని పంతం పట్టుకుని కూర్చుంటే మొదటికే మోసం రావచ్చు. కాబట్టి పరిస్థితులను బట్టి రాబడులను సహేతుకంగా అంచనా వేసుకుని, తగిన నిర్ణయం తీసుకోవాలి. బీమాను, పెట్టుబడిని కలిపి చూడొద్దు. బీమా అనేది అనూహ్య పరిస్థితులు తలెత్తినప్పుడు ఆర్థికంగా ఆదుకోగలిగే సాధనం. పెట్టుబడి అనేది సంపదను సృష్టించుకునేందుకు, రాబోయే రోజుల్లో ఆర్థిక భద్రతను సాధించుకునేందుకు ఉపయోగపడే సాధనం. బీమా, పెట్టుబడి ప్రయోజనాలను కలిపి అందించే సాధనాలు మార్కెట్లో ఉన్నప్పటికీ వివేకవంతంగా నిర్ణయం తీసుకోవాలి. తక్కువ ప్రీమియంతో అధిక కవరేజీని ఇచ్చే బీమా పాలసీని ఎంచుకుని, విడిగా పెట్టుబడులు పెట్టడం ప్రయోజనకరం. – ఎడిటర్ -
హయర్ ఇండియాలో భారతీకి వాటా
న్యూఢిల్లీ: కన్జూమర్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం దేశీ యూనిట్ హయర్ ఇండియాలో డైవర్సిఫైడ్ దిగ్గజం భారతీ ఎంటర్ప్రైజెస్ వ్యూహాత్మక పెట్టుబడులకు తెరతీస్తోంది. యూఎస్ పీఈ దిగ్గజం వార్బర్గ్ పింకస్‌తో కలసి 49 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు తెలియజేసింది. అయితే డీల్ విలువను వెల్లడించçప్పటికీ 2 బిలియన్ డాలర్లు(రూ. 17,956 కోట్లు) వెచ్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. చైనీస్ హయర్ గ్రూప్ అనుబంధ సంస్థ హయర్ ఇండియాలో వార్‌బర్గ్‌తో కలసి వ్యూహాత్మక పెట్టుబడులను చేపట్టనున్నట్లు పేర్కొంది. తద్వారా ఏసీలు, టీవీల తయారీ దిగ్గజంలో సంయుక్తంగా 49 శాతం వాటా సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. హయర్ గ్రూప్ యాజమాన్యం 49 శాతం వాటాను అట్టిపెట్టుకుంటుందని.. మిగిలిన 2% వాటా సంస్థ మేనేజ్మెంట్ టీమ్ చేతిలో ఉంటుందని వివరించింది. హయర్ ఇండియా వాషింగ్ మెషీన్లు, ఏసీలు, టీవీలు, రిఫ్రిజిరేటర్స్‌సహా పలు కిచెన్ అప్లయెన్సెస్ తయారు చేసే సంగతి తెలిసిందే. కంపెనీలో వాటా కొనుగోలుకి సజ్జన్ జిందాల్ గ్రూప్ జేఎస్‌డబ్ల్యూ, ముకేశ్ అంబానీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ పోటీపడినట్లు తెలుస్తోంది. హయర్ ఇండియా విజన్.. మేడిన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియాకు తాజా భాగస్వామ్యం దన్నునిస్తుందని భారతీ ఎంటర్ప్రైజెస్ పేర్కొంది. స్థానిక ప్రాధాన్యత, తయారీ సామర్థ్య విస్తరణ, నూతన ప్రొడక్టుల ఆవిష్కరణలు ఇందుకు తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. తద్వారా మార్కెట్లో మరింత లోతుగా విస్తరించనున్నట్లు అభిప్రాయపడింది. -
యూఏఈలో విమానయాన రంగం కొత్త పుంతలు
అబుదాబి: యూఏఈలో విమానయాన రంగం కొత్త పుంతలు తొక్కనుంది. వచ్చే ఏడాది నాటికి దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్స్ అందుబాటులోకి రానున్నాయి. తద్వారా 1.28 లక్షల కోట్ల దిర్హమ్ల పెట్టుబడులు ఆకర్షించగలుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. దుబాయ్ వరల్డ్ సెంట్రల్ నుండి షార్జా, రాస్ అల్ ఖైమా వరకు మరిన్ని రన్వేలు, టెర్మినల్స్, స్మార్ట్ మౌలిక సదుపాయాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.షార్జా:2028 నాటికి షార్జా విమానాశ్రయం విస్తరణ పూర్తవుతుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా అంతర్జాతీయ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.రాస్ అల్ ఖైమా:2031 నాటికి కొత్త టెర్మినల్ ప్రారంభం కానుంది. 11 కోట్ల ప్రయాణికుల సామర్థ్యంతో ఇది మధ్యప్రాచ్యంలో కీలక కేంద్రంగా మారనుంది.2043 నాటికి యూఏఈ మొత్తం 53 కోట్ల ప్రయాణికులను ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యాన్ని సాధించాలన్నది ప్రధాన లక్ష్యం. ఈ విస్తరణ ప్రాజెక్టులు గల్ఫ్ ప్రాంతాన్ని ప్రపంచ విమానయాన రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టనున్నాయని అంచనా. విమానాశ్రయాల విస్తరణతో పర్యాటక రంగం, వాణిజ్యం, ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరగనున్నాయి. ఏఐ ఆధారిత సిస్టమ్స్, సస్టైనబుల్ ఎనర్జీ వినియోగం ఈ ప్రాజెక్టుల ప్రత్యేకత. దోహా, ఒమాన్, బహ్రెయిన్ వంటి దేశాలతో యూఏఈ పోటీ పడనుంది. తద్వారా యూఏఈ విమానాశ్రయ విస్తరణ ప్రాజెక్టులు కేవలం గగనతల ప్రయాణాన్ని సులభతరం చేయడమే కాకుండా, మధ్యప్రాచ్యాన్ని ప్రపంచ విమానయాన రంగంలో కీలక కేంద్రంగా నిలబెట్టే దిశగా అడుగులు వేస్తున్నాయి. -
ఆకాశమే హద్దు
ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ గ్రూప్ విమానాశ్రయాల బిజినెస్‌పై భారీగా ఇన్వెస్ట్ చేయనుంది. రానున్న ఐదేళ్లలో ఇందుకు రూ. లక్ష కోట్లు వెచి్చంచనున్నట్లు అదానీ ఎయిర్‌పోర్ట్స్ డైరెక్టర్, బిలియనీర్ గౌతమ్ అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీ పేర్కొన్నారు. ఈ నెల 25న నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో దేశీ విమానాశ్రయ పరిశ్రమపై అత్యంత ఆశావహంగా ఉన్నట్లు తెలియజేశారు. వెరసి తదుపరి 11 ఎయిర్‌పోర్టుల బిడ్డింగ్‌లో మరింత భారీగా పాలుపంచుకోనున్నట్లు వెల్లడించారు. దేశీయంగా ఏవియేషన్ రంగం వార్షిక పద్ధతిలో 15–16 శాతం విస్తరించవచ్చునని అంచనా వేశారు. గ్రూప్ విమానాశ్రయ పోర్ట్‌ఫోలియోలో నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎన్‌ఎంఏఐఎల్) తాజాగా చేరనుంది. తద్వారా దేశీ ఏవియేషన్ రంగంలో కార్యకలాపాలు మరింత విస్తరించనుంది. ఎన్‌ఎంఏఐఎల్‌లో అదానీ గ్రూప్ వాటా 74% కాగా.. 2025 డిసెంబర్ 25న వాణిజ్య ప్రాతిపదికన కార్యకలాపాలకు తెరతీయనుంది. రూ. 19,650 కోట్లు అదానీ గ్రూప్ రూ. 19,650 కోట్ల తొలి దశ పెట్టుబడులతో ఎన్‌ఎంఏఐఎల్‌ను అభివృద్ధి చేసింది. వార్షికంగా 2 కోట్లమంది ప్రయాణికులను హ్యాండిల్ చేయగల సామర్థ్యంతో ఏర్పాటైంది. తదుపరి సామర్థ్యాన్ని 9 కోట్లమంది ప్రయాణికులకు అనువుగా విస్తరించనుంది. తద్వారా ప్రస్తుతం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఎదుర్కొంటున్న సామర్థ్య సవాళ్లకు చెక్ పెట్టనుంది. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్(ఎంఐఏఎల్)ను జీవీకే గ్రూప్ నుంచి అదానీ గ్రూప్ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇవికాకుండా అదానీ గ్రూప్ అహ్మదాబాద్, లక్నో, గువాహటి, తిరువనంతపురం, జైపూర్, మంగళూరులోనూ ఎయిర్‌పోర్టులను నిర్వహిస్తోంది. -
స్లో అయినా తగ్గని ఫ్లో
దేశీయంగా వెల్లువెత్తుతున్న స్టార్టప్‌లు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడంలోనూ ముందున్నాయి! ఈ బాటలో మహిళలు తెరతీస్తున్న స్టార్టప్‌లు సైతం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. వివరాలు చూద్దాం..న్యూఢిల్లీ: దేశీయంగా టెక్ స్టార్టప్‌లకు ప్రస్తుత కేలండర్ ఏడాది(2025) 10.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు లభించాయి. గతేడాది(2024) అందుకున్న 12.7 బిలియన్ డాలర్లతో పోలిస్తే 17 శాతం తగ్గాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా చూస్తే యూఎస్, యూకే తదుపరి భారత్ మూడో ర్యాంకులో నిలవడం గమనార్హం! ఈ బాటలో చైనా, జర్మనీ కంటే ముందు నిలవడం విశేషం! మార్కెట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ ట్రాక్షన్ నివేదిక వివరాలివి. వీటి ప్రకారం స్టార్టప్‌ల ఫండింగ్‌లో దేశీయంగా బెంగళూరు, ముంబై టాప్ ర్యాంకును కొల్లగొట్టాయి. కాగా.. దేశీ టెక్ స్టార్టప్‌లు 2023లో 11 బిలియన్ డాలర్లు సమీకరించాయి. వీటితో పోలిస్తే తాజాగా నిధుల సమీకరణ 4 శాతం క్షీణించింది. దశలవారీగా విభిన్నం టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు వివిధ దశలలో విభిన్నంగా నమోదయ్యాయి. ఈ ఏడాది సీడ్ దశలో 1.1 బిలియన్ డాలర్లు లభించగా.. 2024తో పోలిస్తే 30 శాతం నీరసించాయి. 2023తో చూసినా ఇది 25 శాతం క్షీణత. ఇక తొలి దశ ఫండింగ్ 7 శాతం పుంజుకుని 3.9 బిలియన్ డాలర్లను తాకింది. 2024లో ఇది 3.7 బిలియన్ డాలర్లుకాగా.. 2023లో సాధించిన 3.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే 11 శాతం అధికం. వృద్ధికి సిద్ధంగా ఉన్న, బలపడే వీలున్న టెక్ స్టార్టప్‌లపట్ల గ్లోబల్ ఇన్వెస్టర్లలోగల విశ్వాసాన్ని తాజా ట్రెండ్ ప్రతిబింబిస్తోంది. అయితే చివరిదశ స్టార్టప్‌లు పెట్టుబడులను ఆకట్టుకోవడంలో వెనకడుగు వేశాయి. 2024లో 7.5 బిలియన్ డాలర్లు సమకూర్చుకోగా.. ప్రస్తుత ఏడాది 26 శాతం తక్కువగా 5.5 బిలియన్ డాలర్లు మాత్రమే లభించాయి. క్రమశిక్షణాయుతంగా దేశీ టెక్ స్టార్టప్‌లలో క్రమశిక్షణాయుత పెట్టు బడులు నమోదవుతున్నట్లు ట్రాక్షన్ సహవ్యవస్థా్థపకుడు నేహా సింగ్ పేర్కొన్నారు. తొలి దశ ఫండింగ్‌లో పెట్టుబడులు కొనసాగుతుండటం, ఐపీవో యాక్టివిటీ పుంజుకోవడం, యూనికార్న్‌ల ఆవిర్భావంలో నిలకడ వంటి అంశాలు బలపడిన ఎకోసిస్టమ్‌ను ప్రతిబింబిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో వృద్ధికి వీలున్న, అత్యంత నాణ్యమైన బిజినెస్‌లకు ప్రాధాన్యత పెరుగుతున్నట్లు తెలియజేశారు. వెరసి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్, రిటైల్, ఫిన్‌టెక్ సంస్థల పట్ల ఆసక్తి కనిపిస్తున్నట్లు వివరించారు. భారీ డీల్స్.. ఈ ఏడాది దేశీయంగా 10 కోట్ల డాలర్లకుపైబడిన 14 పెట్టుబడి రౌండ్లు నమోదయ్యాయి. 2024లో ఇవి 19కాగా.. 2023లో ఈ తరహా 16 డీల్స్ నమోదయ్యాయి. ప్రధానంగా ట్రాన్స్‌పోర్టేషన్, లాజిస్టిక్స్ టెక్, ఎని్వ రాన్మెంట్ టెక్, ఆటో టెక్ రంగాలలో భారీ డీల్స్ నమోదవుతున్నాయి. వీటిలో బిలియన్ డాలర్ల ఎరిషా ఈ మొబిలిటీ డీ రౌండ్, 30 కోట్ల డాలర్ల జెప్టో సిరీస్ హెచ్ రౌండ్, 27.5 కోట్ల డాలర్ల గ్రీన్‌లైన్ సిరీస్ ఏ ఫండింగ్‌ను చెప్పుకోదగ్గ డీల్స్‌గా నివేదిక ప్రస్తావించింది. ఆయా సంస్థల మెచ్యూరిటీ, విలువ, భిన్న లక్ష్యాల ఆధారంగా స్టార్టప్‌ల ఫండింగ్‌లో ఏ, డీ, హెచ్ తదితర రౌండ్ల(సిరీస్‌లు)కు తెరతీసే సంగతి తెలిసిందే.మహిళా సంస్థలుదేశీయంగా మహిళలు సహవ్యవస్థాపకులుగా ఆవిర్భవించిన టెక్ స్టార్టప్‌లు ఈ ఏడాది బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. వీటిలో 6.2 కోట్ల డాలర్ల జివా సిరీస్ సి, 5.2 కోట్ల డాలర్ల ఆమ్నెక్స్ సిరీస్ ఏలను నివేదిక పేర్కొంది. రిటైల్, ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అత్యధికంగా నిధులు అందుకున్న రంగాలుకాగా.. ఇందుకు బ్రాండ్ ఆధారిత ఎగ్జిక్యూషన్, పటిష్ట కన్జూమర్ డిమాండ్, ఎంటర్ప్రైజ్ నిర్వహణ ప్రభావం చూపాయి. మహిళలు తెరతీసిన స్టార్టప్‌లలో బెంగళూరు, ముంబై, ఢిల్లీ ముందున్నాయి. -
టోకనైజేషన్ బిల్లు కోసం పార్లమెంట్లో డిమాండ్
ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) ఎంపీ రాఘవ్ చద్దా ఇటీవల పార్లమెంట్లో టోకనైజేషన్ బిల్లు గురించి చేసిన ప్రతిపాదన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాన్యులకు కూడా భారీ పెట్టుబడుల ఫలాలను అందించేలా ఆర్థిక వ్యవస్థను ఆధునీకరించాలని ఆయన కోరారు. ఈ నేపథ్యంలో అసలు టోకనైజేషన్ అంటే ఏమిటి, దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం.టోకనైజేషన్ అంటే ఏమిటి?సాధారణ భాషలో చెప్పాలంటే.. ఒక భారీ ఆస్తిని (ఉదాహరణకు ఒక పెద్ద కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్) చిన్న చిన్న డిజిటల్ భాగాలుగా విభజించడాన్నే టోకనైజేషన్ అంటారు. ఈ ఒక్కో భాగాన్ని టోకెన్ అని పిలుస్తారు.ఉదాహరణకు ఒక హైవే ప్రాజెక్ట్ విలువ వందల కోట్లు అనుకుందాం. అందులో సామాన్యులు పెట్టుబడి పెట్టలేరు. కానీ, దాన్ని కోటి టోకెన్లుగా విభజిస్తే.. ఒక్కో టోకెన్ ధర కేవలం వంద రూపాయల్లోనే ఉండవచ్చు. ఇలా సామాన్యులు సైతం ఆ ప్రాజెక్టులో భాగస్వాములు కావచ్చు.ఈ బిల్లును ఎందుకు ప్రతిపాదించారు?ప్రస్తుతం రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కేవలం బిలియనీర్లు లేదా పెద్ద సంస్థలకు మాత్రమే పరిమితమయ్యాయి. మధ్యతరగతి ప్రజలు కేవలం బ్యాంక్ ఎఫ్డీలు లేదా మ్యూచువల్ ఫండ్స్‌కే పరిమితం అవుతున్నారు. ఈ బిల్లు వస్తే సామాన్యులు కూడా భారీ ఆస్తుల్లో వాటాలను కొనుగోలు చేసి అధిక లాభాలను పొందవచ్చని ఎంపీ చెప్పారు.విదేశీ మూలధనంసింగపూర్, యూఏఈ, అమెరికా వంటి దేశాల్లో ఇప్పటికే ఇటువంటి చట్టాలు ఉన్నాయి. భారత్‌లో కూడా స్పష్టమైన చట్టపరమైన నిబంధనలు ఉంటే అంతర్జాతీయ పెట్టుబడులు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.మధ్యతరగతికి మేలుమధ్యతరగతి ప్రజలు తమ పొదుపు మొత్తాన్ని కేవలం తక్కువ వడ్డీ వచ్చే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాల్లో ఉంచుతున్నారు. టోకనైజేషన్ ద్వారా వారికి రియల్ ఎస్టేట్, గోల్డ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో చిన్న మొత్తాలతోనే పెట్టుబడి పెట్టే అవకాశం దక్కుతుంది.ప్రయోజనాలుసాధారణంగా ఒక ఇల్లు లేదా భూమి అమ్మాలంటే చాలా సమయం పడుతుంది. కానీ డిజిటల్ టోకెన్లను షేర్ మార్కెట్ తరహాలోనే సులభంగా, త్వరగా విక్రయించుకోవచ్చు. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, రిజిస్ట్రేషన్ గొడవలు లేకుండా నేరుగా బ్లాక్‌చెయిన్ ద్వారా లావాదేవీలు నిర్వహించవచ్చు. దీనివల్ల ప్రతి లావాదేవీ పక్కాగా రికార్డ్ అవుతుంది. మోసాలకు తావుండదు. ఒకేసారి లక్షల రూపాయలు పెట్టక్కర్లేదు. కేవలం రూ.500 లేదా రూ.1000తో కూడా ఆస్తిలో భాగస్వామ్యం పొందవచ్చు. లాభాలను పంచుకోవచ్చు.ప్రస్తుతానికి ఇది ప్రతిపాదన మాత్రమే. ప్రభుత్వం దీనిపై ఇంకా అధికారికంగా ఎటువంటి ముసాయిదాను విడుదల చేయలేదు. అయితే ఇప్పటికే భారత రిజర్వ్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డుల భద్రత కోసం ‘కార్డ్ టోకనైజేషన్’ విధానాన్ని అమలు చేస్తోంది. దానికంటే విస్తృతమైన అసెట్ టోకనైజేషన్(ఆస్తుల టోకనైజేషన్) కోసం ప్రత్యేక చట్టం కావాలని ఎంపీ కోరుతున్నారు.ఇదీ చదవండి: ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ బోర్డులు -
ఖర్చులు కట్...లాభాలకు బూస్ట్
ముంబై: మార్కెట్లో పెట్టుబడులపై వ్యయాల భారం తగ్గి, లాభాలు పెరిగేలా ఇన్వెస్టర్లకు మరింత ప్రయోజనం చేకూర్చే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ పలు సంస్కరణలకు తెరతీసింది. బోర్డు సమావేశంలో నిబంధనల్లో పారదర్శకతను పెంచేందుకు వ్యయ నిష్పత్తి ఫ్రేమ్‌వర్క్, బ్రోకరేజీ చార్జీల పరిమితుల్లో మార్పులతో పాటు అనేక చర్యలు తీసుకుంది. కొత్త నిబంధనలు వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం వ్యయ నిష్పత్తి పరిమితుల నుంచి ఎస్టీటీ, జీఎస్టీ, సీటీటీ, స్టాంప్ డ్యూటీలాంటి లెవీలను తొలగించినట్లు సెబీ చీఫ్ తుహిన్ కాంత పాండే తెలిపారు. ఇకపై వ్యయ నిష్పత్తి పరిమితులను బేస్ ఎక్స్పెన్స్ రేషియోగా పరిగణిస్తారని పేర్కొన్నారు. వివిధ స్కీములపై అదనంగా 5 బేసిస్ పాయింట్ల (బీపీఎస్) వ్యయాలను విధించేందుకు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలకి ఇస్తున్న వెసులుబాటును తొలగించారు. 2018లో ప్రవేశపెట్టిన 0.05 శాతం ఎగ్జిట్ లోడ్ నిబంధనను సెబీ తొలగించింది. 1963లో ప్రారంభమైన మ్యుచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణలో ప్రస్తుతం రూ. 80 లక్షల కోట్ల పైగా ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. మరిన్ని నిర్ణయాలు... → బ్రోకరేజీ చార్జీలు క్యాష్ మార్కెట్ లావాదేవీలపై 12 బీపీఎస్ నుంచి 6 బీపీఎస్‌కి, డెరివేటివ్ లావాదేవీలపై 5 బీపీఎస్ నుంచి 2 బీపీఎస్‌కి తగ్గింపు. → స్కీము పనితీరు ఆధారంగా వ్యయ నిష్పత్తి అమలు. ఏఎంసీలు దీన్ని స్వచ్ఛందంగా అమలు చేయొచ్చు. → ట్రస్టీలు సమావేశం కావాల్సిన ఫ్రీక్వెన్సీ తగ్గింపు. స్కీముల్లో మార్పులను తెలియజేసేలా పత్రికా ప్రకటనలు ఇవ్వాలన్న నిబంధన తొలగింపు. ప్రకటనల స్థానంలో ఆన్లైన్లో వివరాలు పొందుపరిస్తే సరిపోతుంది. → రియల్ ఎస్టే ట్ మ్యూచువల్ ఫండ్స్, ఇన్ఫ్రా డెట్ ఫండ్ స్కీముల్లో పునరావృతమయ్యే చాప్టర్ల తొలగింపు. దీనితో నిబంధనల పరిమాణం 162 పేజీల నుంచి 88 పేజీలకు తగ్గింది. పదాల సంఖ్య కూడా 67,000 నుంచి 54 శాతం తగ్గి 31,000 పదాలకు పరిమితమవుతుంది. → డెట్ మార్కెట్‌పై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెంపొందించే దిశగా సీనియర్ సిటిజన్లు, మహిళలు, రిటైల్ ఇన్వెస్టర్స్లాంటి వారికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు డెట్ ఇష్యూయర్లను అనుమతించే ప్రతిపాదనకు ఆమోదముద్ర. → రిటైల్ ఇన్వెస్టర్ల సౌలభ్యం కోసం కంపెనీలు.. డీఆర్‌హెచ్ పీ దశలో కీలక వివరాలతో కూడుకున్న సంక్షిప్త ప్రాస్పెక్టస్‌ను కూడా అందుబాటులో ఉంచాలి. → ఇతరత్రా ఆర్థిక రంగ నియంత్రణ సంస్థల పరిధిలోని ఆర్థిక సాధనాలకు కూడా రేటింగ్స్ సేవలను అందించేందుకు వెసులుబాటు కలి్పంచేలా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నిబంధనల్లో మార్పులు. → సెబీ (స్టాక్ బ్రోకర్స్) రెగ్యులేషన్స్ 1992 స్థానంలో కొత్తగా సెబీ (స్టాక్ బ్రోకర్స్) రెగ్యులేషన్స్ 2025 (ఎస్బీ రెగ్యులేషన్స్) అమల్లోకి వస్తుంది. కొత్త ఫ్రేమ్‌వర్క్‌లో పదకొండు చాప్టర్లు ఉంటాయి. పాతబడిన కొన్ని షెడ్యూల్స్‌ను, పనరావృతమయ్యే నిబంధనలను సెబీ తొలగించింది. కొన్నింటిని సమగ్రపర్చింది. మరింత స్పష్టతను ఇచ్చే విధంగా క్లియరింగ్ మెంబర్, ప్రొప్రైటరీ ట్రేడింగ్ మెంబర్‌లాంటి కీలక నిర్వచనాలను సవరించింది. సులభతరంగా అర్థం చేసుకునేలా నిబంధనలకు సంబంధించిన పేజీల సంఖ్యను 59 నుంచి 29కి, పదాల సంఖ్యను 18,846 నుంచి 9,073కి తగ్గించినట్లు సెబీ తెలిపింది. -
ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్లు
అమ్మాన్: భారత్–జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండు రెట్లు వృద్ధి చెందాలని, రాబోయే ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్లకు చేరుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారత్‌లో ఆర్థిక అభివృద్ధికి అత్యధిక అవకాశాలు ఉన్నాయని, భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని జోర్డాన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ మంగళవారం రాజధాని అమ్మాన్లో జోర్డాన్ రాజు అబ్దుల్లా–2, యువరాజు అల్ హుస్సేన్‌తో కలిసి బిజినెస్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు.ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తోందని చెప్పారు. త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. దేశంలో వ్యాపార అభివృద్ధికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. 140 కోట్ల మందితో కూడిన వినియోగ మార్కెట్, బలమైన తయారీ కేంద్రాలు, స్థిరమైన, పారదర్శక ప్రభుత్వ విధానాలు భారత్ సొంతమని వెల్లడించారు. ఈ అవకాశాలు అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. భారత్–జోర్డాన్ మధ్య చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత బలపడనుందని ఉద్ఘాటించారు. ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు బలోపేతం కావాలని చెప్పారు. పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలి ‘‘భారత ఆర్థిక వ్యవస్థ 8 శాతానికిపైగానే వృద్ధి సాధిస్తోంది. ఉత్పత్తికి ప్రోత్సాహం ఇచ్చే పాలన, నవీన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చే విధానాల వల్ల జీడీపీ అత్యధికంగా నమోదవుతోంది. జోర్డాన్‌కు మూడో అతిపెద్ద వ్యాపార భాగస్వామి భారత్. నేటి వ్యాపార ప్రపంచంలో అంకెలే కీలకం. కానీ, నేను అంకెలు వల్లెవేయడానికి ఇక్కడికి రాలేదు. గణాంకాలకు అతీతంగా జోర్డాన్‌తో దీర్ఘకాలిక, విశ్వసనీయ సంబంధాలు నిర్మించుకోవడానికి వచ్చా. ఇరుదేశాల నాగరికతల మధ్య చక్కటి సంబంధాలున్నాయి. రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 5 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేద్దాం. ఇండియాలో డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, ఐటీ, ఫిన్‌టెక్, హెల్త్‌టెక్, అగ్రిటెక్ రంగాలతోపాటు విభిన్న స్టార్టప్‌లలో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, వైద్య పరికరాల తయారీ రంగాలు ఇండియాకు ప్రధాన బలం.భౌగోళికంగా కీలక స్థానంలో జోర్డాన్‌కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫార్మా, వైద్య పరికరాల విషయంలో పశ్చిమ ఆసియా, ఆఫ్రికా దేశాలకు జోర్డాన్ ఒక హబ్‌గా మారాలి. అలాగే వ్యవసాయం, కోల్డ్ చైన్, ఫుడ్ పార్కులు, ఎరువులు, మౌలిక సదుపాయాలు, అటోమొబైల్, హరిత రవాణా, సాంస్కృతిక పర్యాటకం వంటి రంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలి. పునరుత్పాదక ఇంధన వనరులు, నిర్లవణీకరణ, నీటి శుద్ధి, పునరి్వనియోగం వంటి అంశాల్లో రెండు దేశాల్లో పారిశ్రామిక వర్గాలు భాగస్వామ్యం ఏర్పర్చుకోవాలి’’ అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో మాట్లాడుతూ.. తమ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు, భారత ఆర్థిక వృద్ధి ఒక్కటైతే ఇక తిరుగుండదని అన్నారు. దక్షిణాసియా, పశ్చిమాసియా మధ్య ఎకనామిక్ కారిడార్‌ను సృష్టించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అబ్దుల్లా–2తో మోదీ భేటీ ప్రధాని మోదీ జోర్డాన్ రాజు అబ్దుల్లా–2తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్, జోర్డాన్ ద్వైపాక్షిక సంబంధాలపై విస్తృతంగా చర్చించారు. పునరుత్పాదక ఇంధన వనరులు, నీటి నిర్వహణ, డిజిటల్ మార్పు, సాంస్కృతిక సంబంధాలు సహా కీలక రంగాల్లో సంబంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చలు జరిపారు. రెండు దేశాల పౌరుల అభివృద్ధి, సౌభాగ్యానికి నూతన ద్వారాలు తెరుచుకుంటాయని మోదీ ఉద్ఘాటించారు. జోర్డాన్ పర్యటన ఫలవంతంగా సాగిందని పేర్కొన్నారు. జోర్డాన్ రాజుకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అబ్దుల్లా–2, మోదీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇరుదేశాల సంబంధాల్లో పురోగతి పట్ల హర్షం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ మంగళవారం జోర్డాన్ పర్యటన ముగించుకొని ఇథియోపియాకు చేరుకున్నారు. కారు నడుపుతూ మోదీని తీసుకెళ్లిన యువరాజు ప్రధాని మోదీ పట్ల జోర్డాన్ యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా–2 ప్రత్యేకంగా గౌరవాభిమానాలు ప్రదర్శించారు. మంగళవారం తానే స్వయంగా కారు నడుపుతూ మోదీని జోర్డాన్ మ్యూజియానికి తీసుకెళ్లారు. భారత్–జోర్డాన్ మధ్యనున్న స్నేహ సంబంధాలను మరోసారి చాటిచెప్పారు. మహ్మద్ ప్రవక్త వంశంలో 42వ తరానికి చెందిన వారసుడు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లా–2. మ్యూజియంలో జోర్డాన్ చరిత్ర, సంస్కృతిని తనకు కళ్లకు కట్టేలా వివరించినందుకు యువరాజుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అల్ హుస్సేన్‌తో ఎన్నో అంశాలపై చర్చించానని, జోర్డాన్ ప్రగతి పట్ల ఆయన తపన ఎంతగానో ఆకట్టుకుందని వెల్లడించారు. జోర్డాన్ మ్యూజియాన్ని 2014లో నిర్మించారు. ఇందులో ఎన్నో విలువైన కళాఖండాలు, వస్తువులు ఉన్నాయి. -
బఫెట్ సూత్రాలు: స్టాక్ మార్కెట్లో విజయం!
వారెన్ బఫెట్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే.. బెర్క్‌షైర్ హాత్వే చైర్పర్సన్ & దిగ్గజ పెట్టుబడిదారుడుగా ప్రపంచంలోని లక్షలాదిమంది ప్రజలకు సుపరిచయమే. ఈయన స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి సులభమైన నియమాలను వెల్లడించారు. విజయవంతమైన పెట్టుబడికి.. మార్కెట్ అంచనాలతో సంబంధం లేదని, క్రమశిక్షణ, స్వీయ అవగాహన, మీ ఆలోచనలతో ఎక్కువ సంబంధం ఉందని పేర్కొన్నారు.వారెన్ బఫెట్ ప్రకారం.. పెట్టుబడి విషయంలో వాస్తవికంగా ఉండటం గురించి చెబుతారు. మీరు అర్థం చేసుకున్నది తెలుసుకోవడమే కాకుండా, మీకు తెలియనిది తెలుసుకోవడం.. దానికి ప్రలోభపడకుండా ఉండటం ముఖ్యమని, ఇది స్టాక్ మార్కెట్లో విజయం సాధించడానికి దోహదపడుతుందని అంటారు.తత్వశాస్త్రం గురించి మాట్లాడుతూ.. అదుపులేని దురాశ, దీర్ఘకాలిక రాబడికి అతిపెద్ద శత్రువులలో ఒకటి బఫెట్ హెచ్చరించారు. మీరు చాలా దురాశపరులైతే, అది విపత్తు అవుతుందని ఆయన అంటారు.పెట్టుబడి అంటే అది క్లిష్టమైన ప్రక్రియ కాదంటారు బఫెట్. అయితే దీనికి ఖచ్చితంగా క్రమశిక్షణ అవసరం అని స్పష్టం చేశారు.బఫెట్ తన పెట్టుబడి తత్వశాస్త్రంలో ఎక్కువ భాగాన్ని బెంజమిన్ గ్రాహం బోధనలకు ఆపాదించారు. దశాబ్దాల మార్కెట్ పరిణామం తర్వాత కూడా అతని ఆలోచనలు సాటిలేనివిగా ఉన్నాయని అతను నమ్ముతారు. ఈ ప్రాథమిక విధానం ప్రకారం.. మీరు స్టాక్లను వ్యాపారాలుగా భావించి, ఆపై మంచి వ్యాపారాన్ని ఏది చేస్తుందో అంచనా వేయాలని ఆయన అన్నారు. ఈ పద్దతిలో ప్రధానమైనది భద్రతా మార్జిన్ అని బఫెట్ అన్నారు. -
నెలకు రూ.2000 పొదుపుతో.. రూ. 5 కోట్లొచ్చాయ్
-
టెక్ దిగ్గజాల పెట్టుబడులజోరు..
సాంకేతిక ఆవిష్కరణలకు భారత్ మెగా హబ్‌గా మారే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ నుంచి ఇంటెల్ వరకు పలు అగ్రగామి సంస్థలు వరుస కడుతున్నాయి. దేశీయంగా డేటా సెంటర్లు, ఏఐ ఆవిష్కరణలకు ప్రోత్సాహం లభించడంతో పాటు లక్షల సంఖ్యలో ఉద్యోగాల కల్పనకు కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల 17.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగేళ్ల వ్యవధిలో క్లౌడ్, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక సదుపాయాల కల్పనపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నారు. ఆసియాలో మైక్రోసాఫ్ట్ ఇంత భారీగా ఇన్వెస్ట్ చేయడం ఇదే ప్రథమం. భారత్ సాంకేతిక సామర్థ్యాలపై కంపెనీకి గల నమ్మకానికి ఇది నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక చిప్ దిగ్గజం ఇంటెల్ కూడా భారత్ సెమీకండక్టర్ల లక్ష్యాల సాధనకు మద్దతుగా నిల్చేందుకు ముందుకొచ్చింది. ఇందుకోసం టాటా ఎలక్ట్రానిక్స్‌తో జట్టు కట్టింది. కంపెనీ సీఈవో లిప్–బు టాన్ ప్రధాని మోదీతో కూడా సమావేశమయ్యారు. అటు మరో అగ్రగామి సంస్థ అమెజాన్ సైతం భారత్‌పై మరింతగా దృష్టి పెడుతోంది. ఏఐ, ఎగుమతులు, ఉద్యోగాల కల్పనపై 35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఇక్కడ అదనంగా పది లక్షలకుపైగా ఉద్యోగావకాశాలను కల్పించాలనే ప్రణాళికల్లో ఉంది. భారత్ నుంచి 80 బిలియన్ డాలర్ల ఈ–కామర్స్ ఎగుమతులను లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఇక సెర్చ్ దిగ్గజం గూగుల్ .. వైజాగ్‌లో డేటా సెంటర్‌పై 15 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఓపెన్ఏఐ కూడా భారత్‌లో డేటా హబ్ ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. రియల్టీకి కూడా ఊతం.. దేశవ్యాప్తంగా డేటా సెంటర్లను నిర్మించడంపై పెద్ద సంస్థలు ఆసక్తిగా ఉన్న నేపథ్యంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతం లభించనుంది. డేటా సెంటర్ల రాకతో నిర్మాణ, రిటైల్, నిర్వహణ విభాగాల్లో పెద్ద సంఖ్యలో పరోక్ష ఉద్యోగాలకు ఊతం లభించనుంది. వైజాగ్‌లో గూగుల్ ఏఐ, డేటా సెంటర్ హబ్‌తో 1,00,000 పైగా ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని అంచనా. కన్సల్టెన్సీ సంస్థ పీడబ్ల్యూసీ అధ్యయనం ప్రకారం డేటా సెంటర్లతో వచ్చే ఒక్క ప్రత్యక్ష ఉద్యోగంతో ఆరు రెట్లు పరోక్ష ఉద్యోగాల కల్పన జరిగే అవకాశం ఉంది. ఏఐ డేటా సెంటర్ బూమ్‌తో ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, నిర్మాణ రంగ వర్కర్లు, రిటైల్ తదితర పరి శ్రమలలో మరింత ఉద్యోగ కల్పన జరగనుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రెండు రోజులుగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో పారిశ్రామికవేత్తలు భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. రెండు రోజుల్లో మొత్తంగా రూ. 5,75,000 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. సమ్మిట్ తొలిరోజైన సోమవారం రూ. 2.43 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు కుదరగా రెండో రోజైన మంగళవారం రూ. 3,32,000 కోట్ల మేర పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం వివరించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిపింది. సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం 20కిపైగా సంస్థల ప్రతినిధులతో ముఖాముఖి చర్చలు జరిపారు. ఐటీ, విద్యుత్, ఫార్మా, క్రీడలు, పర్యాటకం, అటవీ, ఆహార ఉత్పత్తులు, గృహ సముదాయాల నిర్మాణానికి సంబంధించిన కంపెనీలు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఎంఓయూలు కుదుర్చుకున్న ప్రముఖ సంస్థల్లో రిలయన్స్, గోద్రెజ్, ఫోర్టిస్, హెటెరో, మహీంద్ర అండ్ మహీంద్ర, భారత్ బయోటెక్, అరబిందో, గ్రాన్యూల్స్, బయోలాజికల్–ఈ, వింటేజ్ కాఫీ, కేజేఎస్, కేన్స్ టెక్నాలజీస్, జేసీకే ఇన్ఫ్రా, అక్విలాన్ నెక్సస్, ఏజీపీ గ్రూప్, ఇన్ఫ్రాకీ డీసీ పార్క్స్, ప్యూర్‌వ్యూ గ్రూప్, ఎంఎస్ఎన్, సత్వా, సుమధుర ఉన్నాయి. సీఎం సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్న పలు సంస్థలకు గ్రీన్ ఫార్మాసిటీలో భూములు కేటాయించడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.రంగాలవారీగా మంగళవారం వివిధ సంస్థలు కుదుర్చుకున్న ఎంవోయూలు ఇలా..డేటా సెంటర్లు, జీసీసీ..ఇన్ఫ్రాకీ డీసీ పార్క్స్: రూ. 70 వేల కోట్లతో 150 ఎకరాల్లో ఏఐ ఆధారిత ఒక గిగావాట్ డేటా పార్క్ ఏర్పాటు.జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్: రూ. 9,000 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటు. యాన్సిలరీ మౌలిక వసతుల కల్పన. 2,000 మందికి ఉపాధి కల్పన.ఏజీపీ గ్రూప్: రూ. 6,750 కోట్లతో 120 ఎకరాల విస్తీర్ణంలో ఒక గిగావాట్ హైపర్‌స్కేల్ డేటా సెంటర్ ప్రాంగణం ఏర్పాటు.కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్: ప్రస్తుత ప్లాంట్‌కు అదనంగా రూ. 1,000 కోట్లతో విస్తరణ.ప్యూర్‌వ్యూ గ్రూప్: గ్లోబల్ కేపబులిటీ సెంటర్ (జీసీసీ), ఏఐ డేటా సెంటర్ క్యాంపస్. 3,000 మందికి ఉపాధి. 10 ఎకరాల్లో ఏర్పాటు.అక్విలిన్ నెక్సెస్ లిమిటెడ్: గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు. 50 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటు.వ్యవసాయ, అనుబంధ రంగాలు..ఫోర్టిస్ ఇండియా లిమిటెడ్: వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల రంగంలో క్రాప్ న్యూట్రిషన్లో పరిశోధనల కోసం రూ. 2,200 కోట్లతో రెండు దశల్లో పెట్టుబడి. 100 ఎకరాల్లో 800 మందికి ఉపాధి.రిలయన్స్ కన్సూ్యమర్ పోడక్ట్స్ లిమిటెడ్: రూ. 1,500 కోట్ల పెట్టుబడితో ఆహార, పానీయాల ఉత్పత్తి ప్లాంట్. 1,000 మందికి ఉపాధి.వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్: రూ. 1,100 కోట్ల పెట్టుబడితో 15 ఎకరాల్లో ప్రీమియం కాఫీ పొడి ఎగుమతుల ప్లాంట్. 1,000 మందికి ఉపాధి.కేజేఎస్ ఇండియా: ఫుడ్ అండ్ బేవరేజెస్ రెండో యూనిట్.. రూ. 650 కోట్లు పెట్టుబడి, 44 ఎకరాల విస్తీర్ణంలో 1,050 మందికి ఉపాధి. గోద్రెజ్: పాడి రంగంలో రూ. 150 కోట్ల పెట్టుబడి. ప్రతిరోజూ 5 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి సామర్థ్యంతో 40 ఎకరాల్లో డెయిరీ ప్లాంట్ విస్తరణ. 300 మందికి ప్రత్యక్ష ఉపాధి.పర్యాటక రంగంలో..» మొత్తం పెట్టుబడులు: రూ. 7,045 కోట్లు. ప్రత్యక్ష ఉపాధి 10 వేలు, పరోక్షంగా 30 వేలు.» ఫుడ్ లింక్ ఎఫ్ అండ్ బీ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్: రూ. 3,000 కోట్లతో భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ట్రేడ్, ఎగ్జిబిషన్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్ హాల్ ఏర్పాటు.» అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ (మాల్దీవులు): రూ. 800 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ వెల్నెస్ రిట్రీట్ కేంద్రం.» ఫ్లూయిడ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్: రూ. 300 కోట్ల పెట్టుబడి.» పొలిన్ గ్రూప్ (టర్కీ) అండ్ మల్టీవర్స్ హోటల్స్ (హైదరాబాద్): రూ. 300 కోట్ల పెట్టుబడితో ప్రపంచ శ్రేణి అక్వమెరైన్ పార్క్, అక్వా టన్నెల్ నిర్మాణం.» కేఈఐ గ్రూప్ అండ్ అసోసియేట్స్ (కామినేని గ్రూపు): గండిపేట మండలం కిస్మత్పూర్లో రూ. 200 కోట్లతో గ్లాస్,–గ్రీన్ హౌజ్ కన్వెన్షన్ సెంటర్.» రిధిరా గ్రూప్: రూ. 120 కోట్లతో భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా యాచారంలో నోవాటెల్ ఆతిథ్య రంగంలో పెట్టుబడి.ఫార్మా రంగంలో..బయోలాజికల్–ఈ లిమిటెడ్: రూ.3,500 కోట్ల పెట్టుబడితో వ్యాక్సిన్ పరిశోధన, ఉత్పత్తులకు సంబంధించి మలిదశ విస్తరణ కోసం 150 ఎకరాల్లో గ్రీన్ ఫార్మాసిటీలో ఏర్పాటు. 3,000 మందికి ఉపాధి. అరబిందో ఫార్మా: ఔషధ రంగంలో రూ.2,000 కోట్ల మేర పెట్టుబడులు. 3,000 మందికి ఉపాధి అవకాశాలుహెటెరో గ్రూప్: రూ.1,800 కోట్లతో 100 ఎకరాల్లో దేశీయ, అంతర్జాతీయ ఫార్మా ఉత్పత్తుల తయారీ, ఎగుమతులు. 9,000 మంది ఉపాధి.గ్రాన్యూల్స్ ఇండియా: రూ.1,200 కోట్ల పెట్టుబడితో కేన్సర్ వ్యాధి నివారణకు ఉపయోగించే ఔషధాలు, పరికరాల ఉత్పత్తికి 100 ఎకరాల్లో గ్రీన్ ఫార్మా సిటీలో ప్లాంట్ ఏర్పాటు. 3,000 మందికి ఉపాధి.భారత్ బయోటెక్: పరిశోధన, అభివృద్ధి, తయారీ రంగాల్లో రూ. 1,000 కోట్ల పెట్టుబడి. 200 మందికి ఉపాధి.విద్యుత్ఆర్సీటీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్: రూ. 2,500 కోట్ల పెట్టుబడితో మూడు దశల్లో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు, 1,600 మందికి ఉపాధిఇతర సంస్థలు» విజ్హీ హోల్డింగ్ ఐఎన్‌సీ: రూ. 2,500 కోట్లతో ప్రాణాంతక వ్యాధుల నివారణపై పరిశోధనల కోసం అత్యాధునిక ల్యాబ్ ఏర్పాటుకు ఒప్పందం. » అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్: రూ. 2,500 కోట్లతో ఎల్రక్టానిక్స్ తయారీ యూనిట్ స్థాపన. » టీడబ్ల్యూ గ్రూప్: రూ. 1,100 కోట్లతో ప్రపంచ తొలి ప్లగ్ ఇన్ మోటార్ బైక్ ఉత్పత్తుల పరిశ్రమ. » ఇండియన్ ఇమ్యునాలాజికల్స్ లిమిటెడ్: రూ. 700 కోట్లతో జినోమ్ వ్యాలీలో టీకాల తయారీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఎంఓయూ. » మహీంద్రా అండ్ మహీంద్రా: రూ. 500 కోట్లతో వచ్చే నాలుగేళ్లలో జహీరాబాద్‌లో ఎల్రక్టానిక్ ట్రాక్టర్లు, గ్రీన్‌ఫీల్డ్ ఇంజిన్ షాప్ ఇతర ఉత్పత్తుల ఎగుమతుల కోసం ఒప్పందం. » ఇండియా ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ ప్రైవేట్ లిమిటెడ్: రూ. 500 కోట్ల పెట్టుబడితో 20 ఎకరాల్లో సాహస క్రీడలు, వినోద కార్యక్రమాల నిర్వహణ కేంద్రం ఏర్పాటు. » బయోవరం: రూ. 250 కోట్లతో టిష్యూ ఇంజినీరింగ్, రీజెనరేటివ్ మెడిసిన్, ఏఐ ఆధారిత ఆరోగ్య సాంకేతికతలు, కణ, జన్యు చికిత్సలకు సంబంధించి అత్యాధునిక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ఏర్పాటుకు ఒప్పందం. » అనలాగ్: ఏఐ ఆధారిత ఆర్ అండ్ డీ సెంటర్ హైదరాబాద్‌లో ఏర్పాటు. ప్లగ్ అండ్ ప్లే సౌకర్యాలు, ల్యాబ్‌లు, విశ్వవిద్యాలయాలతో అనుసంధానం, టీఎస్ ఐ–పాస్ సమన్వయంతో ఏర్పాటు. » ఆల్ట్‌మ్యాన్ సంస్థ బ్యాటరీ మెటీరియల్ తయారీ యూనిట్. » అజయ్ దేవ్‌గణ్ ఫిలిం స్టూడియో: వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, వర్క్‌షాప్‌లు, స్థానిక నైపుణ్యాల వెలికితీత.» జ్యూరిక్ ఇన్సూరెన్స్: హైదరాబాద్‌లో సంస్థ మొదటి జీసీసీ. » కెనడియన్ ఇంపీరియల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్: తొలి జీసీసీ ఏర్పాటు. సైబర్ సెక్యూరిటీ గ్లోబల్ ఇంజనీరింగ్ హబ్, దేశంలో తొలి బ్యాంక్ ఏర్పాటు. » మాగ్జిమస్ (అమెరికా): భారత్‌లో తొలిసారి గ్లోబల్ పబ్లిక్ సెక్టార్ టెక్నాలజీ ఆపరేషన్ హబ్. ఆరోగ్య, పర్యావరణ రంగాల్లో పెట్టుబడులు » జీఎంఆర్ స్పోర్ట్స్, వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్: భారత్ ఫ్యూచర్ సిటీలో శాటిలైట్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు. స్టేడియాలు, క్రీడాకారులకు శిక్షణ, మౌలిక సదుపాయాల కల్పన. » బ్లాక్ స్టోన్ ఏసియా: డేటా సెంటర్ల ఏర్పాటు. » సత్వా గ్రూప్: అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం, ప్రణాళికాబద్ధ అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి ప్రాజెక్టుల ఏర్పాటు. » బ్రిగేడ్ గ్రూప్: భారత్ ఫ్యూచర్ సిటీ–ఐటీ కారిడార్‌లో ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ల నిర్మాణం.. ఆతిథ్య రంగంలో భారీ పెట్టుబడులు » సుమధురగ్రూప్: మధ్యాదాయ వర్గాలకు, ఐటీ, పారిశ్రామిక వాడలకు దగ్గరలో గృహ సముదాయాల నిర్మాణం » ఫిఫా–ఏఐఎఫ్ఎఫ్ ఫుట్‌బాల్ అకాడమీ: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి అకాడమీ ఏర్పాటుకు ఒప్పందం. -
పదేళ్లలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో, ఫ్యూచర్ సిటీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని ట్రంప్ మీడియా అండ్ టెక్నా లజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ప్రకటించారు. ఆహ్వానించడంతో పాటు గౌరవం, అభివృద్ధి కనిపించిన చోటే తమ పెట్టుబడులు పెడతామని అన్నారు. గత కొన్ని నెలలుగా తమను తెలంగాణకు ఆహ్వానిస్తూనే ఉన్నా, ఆలస్యం జరిగిందని, రాష్ట్రంలో అభివృద్ధికి భారీ అవకాశాలుండడంతో రాక తప్పలేదని చెప్పారు. సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.భారత్‌లో అద్భుతమైన మానవ వనరులుపెట్టుబడులు పెట్టేముందు డబ్బు తిరిగి వస్తుందా.. లాభాలు వస్తాయా? అని అందరూ ఆలోచి స్తారని, అయితే అదే ప్రధానం కాకూ డదని స్వైడర్ అన్నారు. స్వల్పకాలిక ప్రయో జనాలు కాకుండా దీర్ఘకాలిక అంశాలూ దృష్టిలో ఉంచుకో వాలని చెప్పారు. ఎక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటే అక్కడికి పెట్టు బడులు నీటి ప్రవాహంలా వెళ్తాయన్నారు. భారత దేశంలో అద్భుతమైన నైపుణ్య మానవ వనరులున్నాయని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇండియానే పెద్దన్న పాత్ర పోషిస్తోందని చెప్పారు. ఇక్కడి ఆదరాభిమానాలు మరిచిపోలేనుసదస్సుకు ఆహ్వానించి తనకు ఊహించని రీతి లో అద్భుత ఆతిథ్య మిచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి స్వైడర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ చూపిన ఆదరాభిమానాలు మరచిపోలేనని అన్నారు. అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు దాడి చేస్తున్న సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడా నికి ‘ట్రూత్’ సోషల్ మీడియాను ప్రారంభించామని ఈ సందర్భంగా చెప్పారు. తమ ఆలోచనలకు అనుగుణంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని, ఇది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు -
ఫుడ్ ప్రాసెసింగ్‌లో భారీగా ఇన్వెస్ట్ చేయండి
ఫుడ్ ప్రాసెసింగ్ రంగం వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి ఎ.పి. దాస్ జోషి తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రాసెసింగ్ స్థాయిని, ఎగుమతులను పెంచే దిశగా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయాలంటూ కార్పొరేట్లకు ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు.‘మనం భారీగా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తున్నప్పటికీ సుమారు 12 శాతం మాత్రమే ప్రాసెస్ అవుతోంది. ఈ విషయంలో అమెరికా, యూరోపియన్ యూనియన్లను అటుంచితే కనీసం ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌కి కూడా దగ్గర్లో లేము. దేశవ్యాప్తంగా 24 లక్షల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉండగా, వాటిలో రెండు శాతమే సంఘటిత రంగంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు, దేశీయంగా ప్రైవేట్ పెట్టుబడులు పెట్టేందుకు గణనీయంగా ఆస్కారం ఉంది. దీని వల్ల గ్రామీణ రైతాంగానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది‘ అని జోషి చెప్పారు.2014–15లో మొత్తం వ్యవసాయ ఎగుమతుల్లో 11 శాతంగా ఉన్న ప్రాసెస్డ్ ఫుడ్ వాటా ప్రస్తుతం 22 శాతానికి పెరిగిందని తెలిపారు. 2030 నాటికి ఇది 30–32 శాతానికి చేరవచ్చని, పరిశ్రమకు అపరిమిత వృద్ధి అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన లేబర్ కోడ్లు, కార్మిక శక్తి ఎక్కువగా ఉండే ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాలకు ప్రయోజనకరంగా ఉంటాయని వివరించారు. -
మీరూ కావచ్చు... మిస్టర్ బాండ్!
రెండ్రోజుల కిందటే ఆర్బీఆఐ రెపోరేటు మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అంటే... వడ్డీ రేట్లు తగ్గుతాయన్న మాట. వాస్తవంగా చూస్తే అటు రుణాలపై చెల్లించాల్సిన వడ్డీరేటూ తగ్గాలి.. ఇటు మన డిపాజిట్లపై వచ్చే వడ్డీ రేటూ తగ్గుతుంది. కాకపోతే మన బ్యాంకులకు వాటి వ్యాపారమే తొలి ప్రాధాన్యం. కాబట్టి రుణాలపై వడ్డీ రేట్లకు సంబంధించి కాస్త లేటుగా స్పందిస్తాయి. కానీ డిపాజిట్లపై వడ్డీ రేట్లు వెంటనే తగ్గించేస్తాయి. పాపం... డిపాజిట్లు చేసుకుని, వాటిపై వడ్డీతో బండి లాగించేవారికి ఇది ఇబ్బందికరమే. మరి డిపాజిట్లపై వడ్డీ తగ్గుతూ పోతున్న ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? ప్రత్యామ్నాయ మార్గాలేంటి? చాలామంది స్టాక్ మార్కెట్లవైపు చూస్తారు. మార్కెట్లలో డబ్బులు సంపాదించాలంటే వాటి గురించి బాగా తెలిసి ఉండాలి. అందుకే మ్యూచువల్ ఫండ్లను ఆశ్రయిస్తారు. అవి కొంతవరకూ బెటరే అయినా... వీటిలో ఎక్కడా రాబడులపై గ్యారంటీ ఉండదు. మరి ఎలా? ఇదిగో... ఇలాంటి వారి కోసమే కార్పొరేట్ బాండ్లున్నాయి. అవేంటో చూద్దాం...కంపెనీలు నేరుగా ప్రజల నుంచి డబ్బులు సమీకరించడానికి బాండ్లు (రుణపత్రాలు) జారీ చేస్తుంటాయి. వాటికి నిర్దిష్ట కాలపరిమితి ఉంటుంది. పైపెచ్చు వార్షికంగా చెల్లించేలా స్థిరమైన వడ్డీ రేటుంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్లపై దాదాపు 7 శాతమే వడ్డీ వస్తున్న తరుణంలో బాండ్లపై మాత్రం 8 నుంచి 12% వరకూ వడ్డీ వచ్చే అవకాశం ఉంది. దీనికి గ్యారంటీ కూడా ఉంటుంది. కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.అవసరాలకు అనుగుణంగా..కంపెనీలు తమ వ్యాపార విస్తరణ కోసమో, వర్కింగ్ క్యాపిటల్ కోసమో లేదా అధిక వడ్డీపై తీసుకున్న రుణాలను తీర్చేసేందుకో నిధుల సమీకరణ కోసం జారీ చేసే బాండ్లను కార్పొరేట్ బాండ్లుగా పిలుస్తారు. అంటే ఈ బాండును కొనుక్కున్న వాళ్లు, సదరు కంపెనీకి నిర్దిష్ట కాల వ్యవధికి అప్పు ఇచి్చనట్లు లెక్క. దీనికోసం ఆ కంపెనీ మధ్య మధ్యలో (అంటే నెల, మూడు నెలలు, వార్షికంగా..) వడ్డీ చెల్లిస్తుంది. మెచ్యూరిటీ తీరాక అసలును చెల్లిస్తుంది. ఈ వడ్డీ రేటును బాండ్ల పరిభాషలో కూపన్ రేటుగా వ్యవహరిస్తారు. కూపన్ కాకుండా సాధారణ మార్కెట్లో వడ్డీ రేట్లు పెరిగినప్పుడు బాండు విలువ కూడా పెరగవచ్చు. ఆ విధంగా వడ్డీతో పాటు, పెట్టిన పెట్టుబడి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. బాండ్ ఫండ్స్.. ప్రతి బాండును క్షుణ్నంగా అధ్యయనం చేసి, సరైన దాన్ని ఎంపిక చేసుకోవడం కష్టతరంగా అనిపించే వారి కోసం బాండ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన నిధుల్లో కనీసం 80 శాతం మొత్తాన్ని అత్యుత్తమ క్రెడిట్ రేటింగ్ ఉండి, ఆర్థికంగా పటిష్టంగా ఉన్న సంస్థల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. నిప్పన్ ఇండియా కార్పొరేట్ బాండ్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ కార్పొరేట్ బాండ్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ కార్పొరేట్ బాండ్ ఫండ్, కోటక్ కార్పొరేట్ బాండ్ ఫండ్, యాక్సిస్ కార్పొరేట్ బాండ్ ఫండ్ మొదలైనవి వీటిలో ఉన్నాయి. ఇవి వార్షికంగా సగటున ఏడు శాతానికి పైగా రాబడులు అందించాయి. ఇవి 2–5 ఏళ్ల కాలవ్యవధికి అనువుగా ఉంటాయి. ఇదీ.. బాండ్ పరిభాష.. కూపన్ రేటు: కంపెనీ చెల్లించే వడ్డీ ఈల్డ్: ధరల్లో మార్పుల వల్ల చేతికి అందే మొత్తం రాబడి క్రెడిట్ రేటింగ్: తిరిగి చెల్లించడంలో కంపెనీకి ఉండే సామర్థ్యం మెచ్యూరిటీ: అసలును తిరిగి చెల్లించే సమయం లిక్విడిటీ: బాండ్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించే వీలు కొన్ని రిస్క్ లుంటాయి .. అధిక రాబడులు ఇచ్చే అవకాశాలు ఉన్నట్లే ఈ బాండ్లలో రిస్క్ లు కూడా ఉంటాయి. సాధారణంగా బ్యాంకుల్లో రూ.5 లక్షలలోపు చేసే డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుంచి బీమా రక్షణ ఉంటుంది. కానీ కార్పొరేట్ బాండ్లకు అలాంటిదేమీ ఉండదు. వాటి ధరలు కూడా వడ్డీ రేట్లను బట్టి ప్రభావితమవుతూ ఉంటాయి. పైపెచ్చు ఆ కంపెనీ తాలూకు క్రెడిట్ రేటింగ్‌ను బట్టి కూడా మారుతుంటాయి. ఇష్యూ చేసే కంపెనీ క్రెడిట్ రేటింగ్, వడ్డీ రేట్లను బట్టి మారిపోతుంటాయి. ఎక్కడ కొనొచ్చు.. జిరోధా, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, ఏంజెల్ వన్, అప్‌స్టాక్స్ ెలాంటి బ్రోకరేజ్ ప్లాట్‌ఫాంలతో పాటు ఇండియా బాండ్స్, బాండ్ బజార్, గ్రిప్ ఇన్వెస్ట్లాంటి సెబీ రిజిస్టర్డ్ ప్లాట్‌ఫాంల ద్వారా రిటైల్ ఇన్వెస్టర్లు.. తమకు కావాల్సిన కార్పొరేట్ బాండ్లను ఎంచుకుని, కొనుగోలు చేయొచ్చు. కొనుగోలు, అమ్మకం లావాదేవీలను బట్టి స్వల్ప చార్జీలు ఉంటాయి. ప్లాట్‌ఫాంను బట్టి కనీస పెట్టుబడి రూ. 1,000 నుంచి ఉంటోంది. కొనుక్కున్న తర్వాత ఒకటి రెండు రోజుల్లో డీమ్యాట్ ఖాతాలోకి బాండ్లు క్రెడిట్ అవుతాయి. ఎంచుకోవడం ఇలా.. తీసుకున్న మొత్తాన్ని ఆ కంపెనీ తిరిగి సక్రమంగా చెల్లించగలదా లేదా అనేది ఇన్వెస్టర్లు తెలుసుకునేందుకు వీలుగా ఇక్రా, క్రిసిల్, కేర్ లాంటి రేటింగ్ ఏజెన్సీలు .. ఏ ప్లస్, ఏఏ, ట్రిపుల్ ఎ, బి ప్లస్ అంటూ బాండ్లకు రకరకాల రేటింగ్ ఇస్తాయి. దీన్ని బట్టి వాటిలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనేది ఇన్వెస్టర్లు నిర్ణయించుకోవచ్చు. సాధారణంగా ట్రిపుల్ ఏ నుంచి ట్రిపుల్ బి మైనస్ వరకు రేటింగ్ ఉన్న వాటిని అత్యంత సురక్షితమైనవిగా, డబుల్ బీ ప్లస్ నుంచి బీ మైనస్ వరకు రేటింగ్‌ను ఒక మోస్తరు రిస్కు ఉన్నవాటిగా పరిగణిస్తారు. షేర్ల మాదిరిగానే ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ ఎక్సే్చంజీల్లో ఇవి ట్రేడవుతూ ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని విక్రయించుకోవచ్చు, కొనవచ్చు కూడా.ఎవరికి అనువైనవంటే.. → మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా అంటే ఏడాది నుంచి సుమారు పదేళ్ల వ్యవధికి గాను స్థిరంగా ఆదాయాన్ని అందించే సాధనాల కోసం చూస్తుంటే → బ్యాంక్ డిపాజిట్లకే పరిమితం కాకుండా ఇతరత్రా ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ సాధనాల్లో పెట్టుబడులను డైవర్సిఫై చేయదల్చుకుంటే → ఎఫ్డీలకు మించి మెరుగైన రాబడులు ఆశిస్తున్నా... రిటైర్మెంట్ తరువాత స్థిరంగా నెలవారీ ఆదాయాన్ని కావాలనుకుంటున్నా → పిల్లల చదువుల కోసం ప్లాన్ చేసుకుంటున్న తల్లిదండ్రులు... పెద్దగా రిస్క్ లను ఇష్టపడకుండా ఎఫ్డీలు కాకుండా ఇతర సాధనాలను చూస్తున్నవారికిరేటింగ్ బట్టి రాబడి.. AAA: తక్కువ రిస్కు : 7–8 శాతం AA: మధ్య స్థాయి రిస్కు : 8–9.5 శాతం A: అధిక రిస్కు : 10–12 శాతం -
బాబు సొంత పెట్టుబడులు ఏపీలో ఎందుకు పెట్టరు?: ఉండవల్లి
సాక్షి,రాజమహేంద్రవరం: రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులు తీసుకొస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సొంత వ్యాపారాలు ఏపీకి ఎందుకు తీసుకురావడంలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రశ్నించారు. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన రోజు సందర్భంగా రాజమహేంద్రవరం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ పెట్టుబడులు ఆకర్షిస్తున్నామని చెప్పుకుంటున్న బాబు తన సొంత పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి తాను వ్యతిరేకంకాదని.. అయితే రాజధాని నిర్మాణానికి అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న పవన్‌కళ్యాణ్ కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని వ్యాఖ్యానించడం తగదన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. -
అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌కు డిమాండ్
న్యూఢిల్లీ: అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ పెరుగుతోంది. పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం చూపిస్తుండడంతో అక్టోబర్ చివరికి నాటికి అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) రూ.2.5 లక్షల కోట్లకు చేరాయి. ఏడాది కాలంలో ఏయూఎం విలువ 13 శాతం పెరిగింది. 2024 అక్టోబర్ చివరికి వీటి విలువ రూ.2.21 లక్షల కోట్లుగా ఉంది. ఈక్విటీ సూచీలు ఏడాదికి పైగా దీర్ఘకాలం పాటు దిద్దుబాటును చవిచూసిన కాలంలో అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్ ఆస్తులు పెరగడం అన్నది.. ఇన్వెస్టర్లు ఈక్విటీ, హైబ్రిడ్‌తో కలయిక ద్వారా పెట్టుబడుల వృద్ధితోపాటు స్థిరత్వానికి ప్రాధాన్యం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని ఫోలియోలు ఏడాది కాలంలో 4 లక్షలు పెరిగి అక్టోబర్ చివరికి 60.44 లక్షలకు చేరాయి. 2024 అక్టోబర్ చివరికి ఇవి 56.41 లక్షలుగా ఉన్నాయి. ఒక పథకంలో ఒక ఇన్వెస్టర్ పెట్టుబడికి కేటాయించే సంఖ్యను ఫోలియోగా చెబుతారు. ఇలా ఒకే ఇన్వెస్టర్‌కు ఒకటికి మించిన పథకాల్లో ఫోలియోలు ఉండొచ్చు. మెరుగైన రాబడులు అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ బలమైన రాబడులు ఇస్తుండడం కూడా ఇన్వెస్టర్లు వీటిల్లో మరింత పెట్టుబడులకు ముందుకొస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విభాగం గత ఏడాది కాలంలో 7 శాతం చొప్పున సగటు రాబడినివ్వగా, రెండేళ్లలో 16.5 శాతం (వార్షిక) చొప్పున పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టాయి. ఐదేళ్ల కాలంలోనూ 17 శాతం రాబడినిచ్చాయి. రెండు, ఐదేళ్ల కాలాల్లో నిఫ్టీ 50 హైబ్రిడ్ కాంపోజిట్ డెట్ 65:35 ఇండెక్స్‌ను అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ పనితీరు పరంగా అధిగమించినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఈ విభాగంలో పనితీరు పరంగా ముందుంది. రెండేళ్లలో ఏటా 19.6 శాతం చొప్పున కాంపౌండెడ్ రాబడిని ఇచ్చింది. ఐదేళ్లో అయితే ఏటా 24.7 శాతం రాబడి తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మహీంద్రా మాన్యులైఫ్ అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ రెండేళ్ల కాలంలో ఏటా 19.3 శాతం, ఐదేళ్లలో ఏటా 20.4 శాతం చొప్పున ఇన్వెస్టర్లకు రాబడిని అందించింది. బంధన్, ఎడెల్వీజ్, ఇన్వెస్కో ఇండియా అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ సైతం రెండేళ్ల కాలంలో ఏటా 18–19% మధ్య, ఐదేళ్లలో ఏటా 16.5–19.9% మధ్య ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టాయి. ఈ విభాగంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్, మహీంద్రా మాన్యులైఫ్ అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్ ఇక మీదటా దీర్ఘకాలంలో మెరుగైన పనితీరు చూపించగలవని విశ్లేషకుల అంచనా.భవిష్యత్తులో మరింత డిమాండ్.. ‘‘ఈక్విటీ–డెట్ కలయికతో ఉంటాయి కనుక రెండు విభాగాల నుంచి ఈ ఫండ్స్ ప్రయోజనం పొందుతాయి. బలమైన విభాగంగా బ్యాలన్స్డ్ ఫండ్స్ ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈక్విటీ విభాగంలో హెచ్చుతగ్గులు ఉన్న కాలంలో డెట్ పెట్టుబడులు రాబడులకు రక్షణ కల్పిస్తాయి. ఈక్విటీ పెట్టుబడులు వృద్ధిని చూస్తున్న తరుణంలో మంచి రాబడులను సొంతం చేసుకుంటాయి. మధ్యస్థ లేదా తక్కువ రిస్క్ తో కూడిన ఇన్వెస్టర్లకు ఇవి ఎంతో అనుకూలం’’అని మావెనార్క్ వెల్త్ సీఈవో శంతను అవస్థి తెలిపారు. సెబీ నిబంధనల ప్రకారం అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో 65–80 శాతం మధ్య ఈక్విటీల్లో, మిగిలినది డెట్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. -
పెట్టుబడులు.. అంకెల గారడీ.. అదన్నమాట సంగతి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు సక్సెస్ అయిందా?లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి ఇరవై లక్షల ఉద్యోగాల నుంచి ఏకంగా ఐదేళ్లలో ఏభై లక్షల ఉద్యోగాలు టార్గెట్‌గా పెట్టినట్లు ప్రకటించడం ఆసక్తికరమైన అంశమే. అంతేకాదు. పదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పించాలన్నది తమ లక్ష్యమని ఆయన తెలిపారు. వినడానికి విడ్డూరంగా ఉంటుంది. అలా మాట్లాడడమే ఆయన సక్సెస్ మంత్ర అనుకోవాలి. భారీగా అంకెలు, గణాంకాలు చెబితే అది అసత్యమైనా నమ్మేవారు కూడా ఉంటారు.పదిహేనేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇంతవరకు ఎందుకు ఆ స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోయారన్న అనుమానం రావచ్చు. కాని ఎప్పటికప్పుడు కొత్త అంకెలు చెబుతూ ఏదో జరుగుతోంది అని భ్రమ కల్పించడమే ఇందులోని లక్ష్యమన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో కీలకంగా మారిన మంత్రి లోకేష్ వచ్చే మూడేళ్లలో విశాఖలోనే ఐదు లక్షల ఐటి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. తండ్రి బాటలోనే ఆయన కూడా పయనిస్తున్నట్లు అనించడం లేదూ! ఈ సమ్మిట్ లో మొత్తం మీద పదమూడు లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఇవన్ని వినడానికి ఎంత బాగుంటాయి. నిజంగానే వాస్తవ రూపం దాల్చితే ఎంత మంచిగా ఉంటుంది అనిపిస్తుంది!గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పారిశ్రామిక సదస్సు జరిగినా చంద్రబాబు నాయుడి ఏకపాత్రాభినయం అధికంగా కనిపించేది. ఈ సారి సదస్సులో కొంత మార్పు కనిపించింది. అదేమిటంటే చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా ఈ సదస్సులో ప్రముఖంగా మారారు. అంటే ఈ విడత వీరిద్దరూ కలిసి షో నిర్వహించారన్న అభిప్రాయం ఆయా వర్గాలలో కలిగింది. దీనిని పెద్దగా తప్పు పట్టనవసరం లేదు. నిజంగానే టీడీపీ మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటివి ప్రచారం చేసినట్లుగా ఈ పెట్టుబడుల సదస్సు సూపర్ హిట్ అయినా, పండగలా జరిగినా సంతోషించవచ్చు. కాని ఎప్పుడు ఇలాంటి సదస్సులు సఫలం అయినట్లు అంటే ఈ పెట్టుబడులు వాస్తవ రూపం దాల్చినప్పుడే అన్న సంగతి గుర్తుంచుకోవాలి.ఈ ఒప్పందాలన్నిటిని మూడున్నరేళ్లలోనే ఆచరణలోకి తెస్తామని చంద్రబాబు తెలిపారు. ఆయన చెప్పిన రీతిలో జరిగితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. అలా చేస్తే ఆయనకు భారీ ఎత్తున సన్మానం చేయవచ్చు. కాని గత అనుభవాల రీత్యా చూసినా, వాస్తవాల ప్రకారం పరిశీలించినా అదంత తేలికైన సంగతి కాదు. ఉదాహరణకు ఒక సంస్థ పెట్టుబడి ప్రతిపాదన చేసిన తర్వాత ఏంతో ప్రాసెస్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వేగంగా చర్యలు తీసుకున్నా, అదొక్కటే సరిపోదు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ పారిశ్రామికవేత్తకు ఏ సమస్య వచ్చినా తనకు ఫోన్ చేయవచ్చని, ఒక ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానని భరోసా ఇచ్చే యత్నం చేసేవారు. ఆయన టైమ్‌లో పలు పరిశ్రమలు కూడా వచ్చాయి.రెన్యుబుల్ ఎనర్జీలో రికార్డు స్థాయిలో సుమారు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వాటిలో కొన్ని పనులు కూడా ఆరంభించాయి. అయినా చంద్రబాబు మాత్రం గతంలో పరిశ్రమలను తరిమేశారని అంటూ అబద్దాన్ని చెప్పడాన్ని మానుకోవడం లేదు. రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని తెలిసినా, అలాంటి వ్యాఖ్యలను పారిశ్రామికవేత్తల ముందు చేయడానికి వెనుకాడకపోవడం దురదృష్టకరం. అంటే వచ్చేసారి వైఎస్సార్సీపీ గెలిస్తే ఎలా అని పెట్టుబడిదారులలో ఉన్న సందేహం అంటూ ఇప్పటికే పలుమార్లు ప్రచారం చేశారు. దీనిని పారిశ్రామికవేత్తలు నమ్మితే ఇప్పుడు పెట్టుబడులు ఎందుకు పెడతారు అంతేకాదు.. ప్రముఖ పారిశ్రామికేత్త జిందాలపై తప్పుడు కేసు పెట్టి వేధించే యత్నం కూటమి సర్కార్ చేసిందా?లేదా?ఆయన ఏపీకి రాకుండా మహారాష్ట్రలో మూడు లక్షల కోట్ల పెట్టుబడి పెట్డడానికి ఎందుకు సిద్ధమయ్యారు. లోకేష్ విరచిత రెడ్ బుక్ ప్రబావం గురించి పారిశ్రామికవేత్తలకు తెలియదా! నిజానికి చంద్రబాబు టైమ్‌లో వచ్చిన పరిశ్రమలకన్నా అధికంగా జగన్ టైమ్‌లోనే గ్రౌండ్ అయ్యాయి. రెండేళ్ల కరోనా సంక్షోభం వచ్చినా అనేకమంది పారిశ్రామికవేత్తలను ఆయన ఏపీకి రప్పించగలిగారు. జగన్ ప్రభుత్వ టైమ్‌లో జరిగిన సమ్మిట్ లో రిలయన్స్ ముకేష్ అంబానీ వచ్చి భారీ పెట్టుబడిని ప్రతిపాదించారు. జగన్ చెంతనే కూర్చుని సదస్సుకు నిండుదనం తెచ్చారు. మరి ఇప్పుడు అంబానీ ఎందుకు రాలేదో తెలియదు.ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమ్మిట్‌లో పాల్గొనకపోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. అప్పట్లో ఆదిత్య మిట్టల్, నవీన్ జిందాల్, బివిఆర్ మోహన్ రెడ్డి, భంగర్, కరణ్ అదానీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఇప్పుడు టీడీపీ కూటమి హయాంలో జరిగిన సమ్మిట్‌లో కరణ్ అదాని తప్ప మిగిలిన ప్రముఖులు పలువురు ఎందుకు రాలేదో తెలియదు. కరణ్ అదాని తన ప్రసంగంలో ఏమి చెప్పారు?. విశాఖలో వస్తున్నది అదాని డేటా సెంటర్ అని, దానికి గూగుల్ భాగస్వామి అవుతోందని ప్రకటించారా?లేదా? దానిపై చంద్రబాబు, లోకేష్‌లు కిమ్మనలేకపోయారే? ఆదాని డేటా సెంటర్ తో పాటు ఐటి బిజెనెస్ సెంటర్ కు ఆనాడు జగన్ శంకుస్థాపన చేసిన సంగతి విస్మరించి, అంతా గూగుల్ డేటా సెంటర్ అనుకోవాలని ప్రయత్నించి భంగపడడం ప్రభుత్వానికి ఏ పాటి మర్యాద అవుతుంది.ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లిఖార్జునరావు తదితరులు అప్పుడూ వచ్చారు. ఇప్పుడూ వచ్చారు. 2014-19 టరమ్‌లో కూడా చంద్రబాబు సదస్సులు నిర్వహించారు. ఇరవై లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నట్లు, నలభై లక్షల ఉద్యోగాలు వస్తాయని తెగ ప్రచారం చేశారు. ఆ పెట్టుబడుల ప్రగతి గురించి చంద్రబాబు ప్రభుత్వం ఒక నివేదిక సమర్పించి, తదుపరి మళ్లీ ఏభై లక్షల ఉద్యోగాలు అన్నా, కోటి ఉద్యోగాలు అన్నా జనం నమ్ముతారు. అంతే తప్ప ప్రజలను మభ్య పెట్టడం కోసం ఇలా లక్షల ఉద్యోగాలు అని చెబితే చివరికి కూటమి ప్రభుత్వానికే నష్టం అన్న సంగతి మర్చిపోకూడదు.కాకపోతే ఎప్పటి ప్రచారం అప్పటికే అన్నట్లుగా తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుంటారు. గతంలో జగన్ టైమ్‌లో రెన్యూ పవర్, హీరో ఫ్యూచర్స్, ఎనర్జీస్, వంటి కొన్ని సంస్థలు సుమారు మూడున్నర లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు చేశాయి. మళ్లీ అవే ఒప్పందాలను ప్రస్తుత ప్రభుత్వం కూడా తిరిగి కుదుర్చుకుందన్న వార్తలు వచ్చాయి. ఈ ఏడాదిన్నర కాలంలో పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేసినట్లు చెప్పడం ఆరంభించారు. చంద్రబాబు స్టైల్ ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఇప్పుడు దానినే లోకేష్ కూడా ఫాలో అవుతున్నారు.ఇంకో సంగతి చెప్పాలి. చంద్రబాబు బ్రాండ్ చూసి పరిశ్రమలవారు తరలి వచ్చేస్తారని టీడీపీ నేతలు చెబుతుంటారు. తీరా చూస్తే ఆ బ్రాండ్ విలువ ఎంతో తెలియదు కాని, విశాఖ వంటి కీలకమైన ప్రాంతంలో ఎకరా 99 పైసలకే కంపెనీలకు లీజుకు ఇవ్వవలసి వస్తోంది. వేల కోట్ల రాయితీలు ఇచ్చి పారిశ్రామికవేత్తలను ఆకర్షించే యత్నం చేస్తున్నారు. దీంతో ఇతర రాష్ట్రాలవారు చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అని, ఈ పద్దతి వల్ల రాష్ట్రాలు ఆర్థికంగా విధ్వంసం అవుతాయని చెప్పుకుంటున్నారని ఒక వ్యాసకర్త పేర్కొన్నారు. చంద్రబాబులో ఉన్న విశిష్టత ఏమిటంటే తాము చేస్తే అది ప్రజలకు ఉపయోగం, ఎదుటివారు చేస్తే విధ్వంసం అని ప్రచారం చేస్తుంటారు.ఉదాహరణకు రిషికొండపై జగన్ అద్బుతమైన రీతిలో ప్రభుత్వ భవనాలు నిర్మిస్తే పర్యావరణం దెబ్బతిన్నదని విషం చిమ్మారు. రిషికొండను గుండు చేస్తారా అని ప్రశ్నించారు. ఇప్పుడు చంద్రబాబు అవే కొండలను ప్రైవేటు కంపెనీలకు ఇస్తామని, సముద్రం ఎదురుగా ఉండే ఈ కొండలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయని చెబుతున్నారు. ఇలా ఉంటుంది ఆయన తీరు. ఏది ఏమైనా ఈ సమ్మిట్ లోకేష్‌కు మంచి ఎలివేషన్ ఇచ్చుకోవడానికి బాగానే ఉపయోగపడిందని అనుకోవచ్చు.-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
టీసీఎస్, టీపీజీ నుంచి డేటా సెంటర్
ముంబై: ఐటీ సరీ్వసుల దేశీ దిగ్గజం టీసీఎస్, పీఈ దిగ్గజం టీపీజీ డేటా సెంటర్ల బిజినెస్‌లోకి ప్రవేశిస్తున్నాయి. రెండు సంస్థల భాగస్వామ్యంలో ఇందుకు రూ. 18,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించే యోచనలో ఉన్నట్లు వెల్లడించాయి. హైపర్‌వాల్ట్ పేరుతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు టీపీజీ బిలియన్ డాలర్లు(రూ. 8,870 కోట్లు) వెచ్చించనుంది. తద్వారా భాగస్వామ్య వెంచర్లో 27.5–49 శాతం మధ్య వాటాను పొందనుంది. టీపీజీని వ్యూహాత్మక పెట్టుబడుల భాగస్వామిగా చేసుకోవడం ద్వారా వాటాదారులకు పటిష్ట రిటర్నులందించేందుకు వీలుంటుందని టీసీఎస్ పేర్కొంది. అంతేకాకుండా పెట్టుబడి అవసరాలు తగ్గడంతోపాటు.. డేటా సెంటర్ ప్లాట్‌ఫామ్‌కు దీర్ఘకాలిక విలువ చేకూరుతుందని తెలియజేసింది. డేటా సెంటర్లలోకి భారీస్థాయిలో ప్రవేశించనున్నట్లు గత నెలలో టీసీఎస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 6.5 బిలియన్ డాలర్లు దేశీయంగా 1 గిగావాట్ సామర్థ్య ఏర్పాటుకు 6.5 బిలియన్ డాలర్లు(రూ. 57,650 కోట్లు) వెచి్చంచనున్నట్లు టీసీఎస్ తెలిపింది. వేగంగా పెరుగుతున్న డిమాండుకు అనుగుణంగా దేశంలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు టీపీజీ భాగస్వామికావడం సంతోషకరమని టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేర్కొన్నారు. దీంతో హైపర్‌స్కేలర్స్, ఏఐ కంపెనీలతో తమ భాగస్వామ్యం మరింత పటిష్టంకానున్నట్లు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా డేటా సెంటర్ల సామర్థ్యం 1.5 గిగావాట్M >గా.. 2030కల్లా 10 గిగావాట్లకు బలపడనున్నట్లు అంచనా. ఇప్పటివరకూ డేటా సెంటర్ల బిజినెస్ 94 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకోవడం గమనార్హం! టీసీఎస్ షేరు యథాతథంగా రూ. 3,146 వద్ద ముగిసింది. -
మెరుగైన రాబడి కోసం.. మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్
మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి పెట్టుబడులపై మెరుగైన రాబడి కోరుకునే ఇన్వెస్టర్ల ముందున్న ఎంపికల్లో మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒకటి. వీటిల్లో రిస్క్ అధికం. రాబడి కూడా అధికంగానే ఉంటుంది. లార్జ్‌క్యాప్ కంటే దీర్ఘకాలంలో అదనపు రాబడి మిడ్‌క్యాప్ ఫండ్స్‌తో సాధ్యపడుతుందని గత గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ విభాగంలో క్వాంట్ మిడ్‌క్యాప్ ఫండ్ మంచి పనితీరు చూపిస్తోంది. పదేళ్లు అంతకుమించిన దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్టర్లు ఈ పథకంలో పెట్టుబడులను పరిశీలించొచ్చు.రాబడులుస్వల్పకాలం నుంచి దీర్ఘకాలంలోనూ ఈ పథకంలో పనితీరు మెరుగ్గా ఉండడం కనిపిస్తుంది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో ఈ పథకం ఎలాంటి రాబడిని ఇవ్వలేదు. అదే సమయంలో నష్టాలను మిగల్చలేదు. గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీలు దిద్దుబాటు దశలో ఉండడం తెలిసిందే ఇది మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ రాబడులు పటిష్టంగా ఉన్నాయి. మూడేళ్లలో చూస్తే ఏటా 18 శాతం చొప్పున డైరెక్ట్ ప్లాన్‌లో రాబడి నమోదైంది. ఐదేళ్లలోనూ ఏటా 28 శాతం చొప్పున ప్రతిఫలాన్ని అందించింది. ఇక ఏడేళ్ల కాలంలో 23 శాతం, పదేళ్లలోనూ 18.34 శాతం చొప్పున రాబడి తెచి్చపెట్టింది. బీఎస్ఈ 150 మిడ్‌క్యాప్ టీఆర్ఐ సూచీతో పోల్చి చూస్తే ఐదేళ్లు, ఏడేళ్లలో అదనపు రాబడి ఇచి్చంది. పదేళ్ల కాలంలోనూ సూచీతో సమాన రాబడిని అందించింది. ముఖ్యంగా గడిచిన ఐదేళ్ల కాలంలో ఏ ఏడాది కూడా ఈ పథకం నికరంగా నష్టాలను ఇవ్వలేదు.పెట్టుబడుల విధానంఇది యాక్టివ్ ఫండ్. అంటే ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు చేస్తుంటుంది. మార్కెట్, రంగాల వారీ పరిస్థితులు, పెట్టుబడుల అవకాశాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో కొత్త స్టాక్స్‌ను చేర్చుకోవడం, ప్రస్తుత స్టాక్స్‌లో ఎక్స్పోజర్ తగ్గించుకోవడం, పూర్తిగా వైదొలగడం వంటి బాధ్యలను ఫండ్ పరిశోధక బృందం ఎప్పటికప్పుడు చేస్తుంటుంది. ముఖ్యంగా ఏదో ఒక విధానానికి పరిమితం కాబోదు. మూమెంటమ్, వ్యాల్యూ, గ్రోత్ ఇలా అన్ని రకాల విధానాల్లోనూ పెట్టుబడుల అవకాశాలను ఈ పథకం పరిశీలిస్తుంటుంది. అవకాశాలకు అనుగుణంగా పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది.పోర్ట్ఫోలియోఈ పథకం నిర్వహణలో ప్రస్తుతం రూ.8,525 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 90.52 శాతం పెట్టుబడులను ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసింది. డెట్ సెక్యూరిటీల్లో 2.8 శాతం పెట్టుబడులు పెట్టింది. 6.68 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. ముఖ్యంగా ఈక్విటీ పోర్ట్ఫొలియోని గమనించినట్టయితే మొత్తం 29 స్టాక్స్ ఉన్నాయి. టాప్–10 స్టాక్స్‌లోనే 58 శాతం పెట్టుబడులు ఉన్నాయి. ఈక్విటీ పెట్టుబడులను గమనిస్తే.. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 59 శాతం ఇన్వెస్ట్ చేసింది. అదే సమయంలో 29 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెన్లీలో ఇన్వెస్ట్ చేసింది. లార్జ్‌క్యాప్ పెట్టుబడులు రిస్క్‌ను తగ్గిస్తాయి. మిడ్‌క్యాప్ పెట్టుబడులు మెరుగైన రాబడులకు అవకాశం కలి్పస్తాయని అర్థం చేసుకోవచ్చు. ఇంధన రంగ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ 18 శాతం పెట్టుబడులను ఈ రంగాల కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఇండ్రస్టియల్స్ కంపెనీలకు 16.71 శాతం, హెల్త్ కేర్ కంపెనీలకు 15.30 శాతం, టెక్నాలజీ కంపెనీలకు 11.22 శాతం చొప్పున కేటాయింపులు చేసింది. -
తక్కువ పెట్టుబడి.. మెరుగైన రాబడులు: ఎంపిక విషయంలో..
నేను ఇండెక్స్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మంచి ఇండెక్స్ ఫండ్ ఎంపిక విషయంలో ఏ అంశాలను చూడాలి? - కృష్ణ శర్మఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఇవి తక్కువ వ్యయాలకే మెరుగైన రాబడుల అవకాశాలను కల్పిస్తాయి. వీటి ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ఇండెక్స్ ఫండ్ ఏ సూచీలో అయితే పెట్టుబడులు పెడుతుందో గమనించి, ఆ ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల తీరు ఎలా ఉందన్నది చూడాలి. ఇండెక్స్‌తో పోలిస్తే పథకం పనితీరు ఎలా ఉందన్న సమాచారాన్ని ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. ఇండెక్స్‌కు, ఆ ఇండెక్స్ అనుసరించే ఫండ్స్‌కు రాబడుల్లో అతి స్వల్ప వ్యత్యాసం ఉండే అవకాశం లేకపోలేదు. అంటే ఇండెక్స్ 2 శాతం పెరిగితే.. ఫండ్ పెట్టుబడుల విలువ వృద్ధి అదే కాలంలో 2.01 శాతం, 1.99 శాతంగా ఉండొచ్చు.ముఖ్యంగా ఎక్స్పెన్స్ రేషియో ఎంతో కీలకమైన అంశం అవుతుంది. రెండు ఇండెక్స్ పథకాల్లో ఒకటి 10 బేసిస్ పాయింట్లు చార్జ్ చేస్తుంటే, మరో పథకం 25 బేసిస్ పాయింట్లు చార్జ్ తీసుకుంటుంటే.. అప్పుడు 10 బేసిస్ పాయింట్ల పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది. ఇండెక్స్ ఫండ్స్ సూచీలను అనుసరించే పెట్టుబడులు పెడుతుంటాయి. కనుక ఎక్స్పెన్స్ రేషియో ఒక్కటే ఇక్కడ ప్రామాణికం అవుతుంది.నెలవారీ సంపాదన నుంచి రిటైర్మెంట్, ఇతర జీవిత లక్ష్యాల కోసం ఏ మేరకు కేటాయించుకోవాలి. - విశేష్మీకు నెలవారీగా వస్తున్న ఆదాయం, జీవిత లక్ష్యాలు, వాటికి ఎంత కాలవ్యవధి ఉంది? తదితర అంశాల ఆధారంగా పొదుపు, పెట్టుబడులను నిర్ణయించుకోవాలి. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని అయినా పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎంత చొప్పున విభజించాలనే దానికి ఇదమిత్థమైన సూత్రం లేదు. ఎంత ఇన్వెస్ట్ చేయగలరు, ఎంత కాలంపాటు, ఎంత రాబడి కోరుకుంటున్నారనే దాని ఆధారంగా ఈ కేటాయింపులు ఆధారపడి ఉంటాయి. ముందు కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి.దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవి మెరుగైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3 నుంచి 5 ఏళ్ల స్వల్ప కాల లక్ష్యాల కోసం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసిన అనంతరం ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే పనిచేస్తున్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న సమయంలో ఈక్విటీ పెట్టుబడులను కొద్ది కొద్దిగా వెనక్కి తీసుకుని, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లలో పతనాల రిస్క్‌ను అధిగమించొచ్చు.ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
బంగారానికి డబ్బులు కాస్తాయ్!
ధర ఎంతున్నా.. తమ తాహతు మేరకు పసిడి కొనుగోలు అన్నది భారతీయ కుటుంబాల్లో సాధారణంగా కనిపించే ధోరణి. మోర్గాన్ స్టాన్లీ సంస్థ 2025 అక్టోబర్ నివేదిక ప్రకారం.. భారతీయుల ఇళ్లల్లో 34,600 టన్నుల బంగారం నిల్వలు ఉన్నాయి. వీటి విలువ 3.8 ట్రిలియన్ డాలర్లు (సుమారు రూ.334 లక్షల కోట్లు). దేశ జీడీపీలో 88.8 శాతానికి సమానం. పసిడి ధరలు రికార్డు గరిష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇంతటి విలువైన పసిడిని బీరువాల్లోనో.. లేదంటే బ్యాంక్ లాకర్లలో పెట్టే వారి ముందు మెరుగైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాడకంలో లేని పసిడిని ఉత్పాదకతకు వినియోగించుకోవచ్చు. అదనపు రాబడి మార్గాలను ప్రయతి్నంచొచ్చు. బంగారం రుణాలు, గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్, పసిడి ఆధారిత పెట్టుబడుల పథకాలు ఇలా ఎన్నో సాధనాలున్నాయి. వాటి గురించి తెలియజేసే కథనమే ఇది. గోల్డ్ మానిటైజేషన్ పథకం కేంద్ర సర్కారు 2015లో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ (జీఎంఎస్/పసిడి నగదీకరణ పథకం)ను తీసుకొచ్చింది. భౌతిక రూపంలో ఉన్న బంగారాన్ని ఉత్పాదకత వైపు తీసుకువచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది. ఈ పథకం కింద వ్యక్తులతోపాటు సంస్థలు భౌతిక బంగారాన్ని ఎంపిక చేసిన బ్యాంకుల్లో డిపాజిట్ చేయొచ్చు. జమ చేసిన మేర బంగారం విలువపై ఏటా 2.25–2.5 శాతం మేర వడ్డీని పొందొచ్చు. దీనివల్ల సదరు బంగారాన్ని ఎక్కడ భద్రంగా నిల్వ చేసుకోవాలన్న ఆందోళన ఉండదు. బంగారం ఆభరణాలు, కాయిన్లు, కడ్డీలను అధీకృత కేంద్రానికి తరలించి అక్కడ స్వచ్ఛత పరీక్షిస్తారు. ఈ పథకం కింద కనీసం 10 గ్రాముల బంగారం నుంచి ఎంత వరకు అయినా డిపాజిట్ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. జమ చేసిన మేర బంగారానికి (స్వచ్ఛత అనంతరం) బ్యాంక్‌లు డిపాజిట్ రసీదును జారీ చేస్తాయి. సదరు బంగారాన్ని కరిగించి వినియోగంలోకి తెచ్చుకుంటాయి. గడువు ముగిసిన తర్వాత జమ చేసినంత బంగారాన్ని తిరిగి పొందొచ్చు. లేదంటే అప్పటి విలువ మేరకు నగదు రూపంలోనూ తీసుకోవచ్చు. 2025 మార్చి నుంచి మధ్య, దీర్ఘకాల గోల్డ్ మానిటైజేషన్ డిపాజిట్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఏడాది, మూడేళ్ల కాలానికే ప్రస్తుతం ఈ పథకం కింద బంగారం డిపాజిట్‌కు అనుమతి ఉంది. దీర్ఘకాలం కోసం డిపాజిట్ చేయాలనుకునే ఇన్వెస్టర్లు మూడేళ్ల మెచ్యూరిటీ తర్వాత రెన్యువల్ చేసుకోవచ్చు. మంచి విలువైన పథకం అయినప్పటికీ దీనిలో పాల్గొనే వారు చాలా తక్కువగా ఉంటున్నట్టు ఆనంద్‌రాఠి వెల్త్ మ్యూచువల్ ఫండ్స్ విభాగం హెడ్ స్వేత రజని తెలిపారు. బంగారం ఆభరణాలతో ఉన్న దీర్ఘకాల అనుబంధం, సెంటిమెంట్‌ను ఇందుకు కారణాలుగా పేర్కొన్నారు. కనీసం దెబ్బతిన్న ఆభరణాలు, వినియోగించని వాటి విషయంలో అయినా గోల్డ్ మానిటైజేషన్ పథకం ఎంతో అనుకూలం. రిస్క్ లేని రాబడులను అందుకోవచ్చు. ఆభరణాలతో భావోద్వేగమైన బంధం ఉన్న వారికి ఇది అనుకూలం కాదు. ఎందుకంటే మానిటైజేషన్ కింద డిపాజిట్ చేస్తే వాటిని పూర్వపు రూపంలో తిరిగి పొందలేరని రజని తెలిపారు. → ఇది ప్రభుత్వ హామీ కలిగిన పథకం. ఇందులో డిపాజిట్ చేసిన బంగారంపై వార్షిక వడ్డీ రాబడి 2.25–2.5%. వడ్డీని ఏటా చెల్లిస్తారు. → ఆభరణాలు, కాయిన్లను డిపాజిట్ చేయొచ్చు. గడువు తీరిన తర్వాత తిరిగి బంగారం లేదంటే నగదు రూపంలో తీసుకోవచ్చు. → కేవలం 1–3 ఏళ్ల కాలానికే అందుబాటులో ఉంటుంది. వేగంగా నగదు మార్చుకోవడానికి ఇందులో అవకాశం లేదు. గడువు ముగిసే వరకు ఆగాల్సిందే. → 10 గ్రాముల్లోపు బంగారండిపాజిట్కు అవకాశం లేదు. నగలపై రుణం.. వినియోగించకుండా ఉన్న ఆభరణాలను, వాటితో ఉన్న అనుబంధం దృష్ట్యా గోల్డ్ మానిటైజేషన్‌కు మనసొప్పని వారు.. వాటిని రుణాల కోసం వినియోగించుకోవచ్చు. తక్కువ వడ్డీ రేటుపై రుణాన్ని వేగంగా పొందొచ్చు. బంగారం తాకట్టు విలువపై 75 శాతం వరకు రుణం కింద బ్యాంక్‌లు, ఎన్బీఎఫ్సీలు ఇస్తుంటాయి. రూ.5 లక్షల్లోపు రుణాలకు 85 శాతం విలువ వరకు కూడా (ఎల్టీవీ) ఇస్తాయి. ప్రతి నెలా వడ్డీ చెల్లించి, గడువు ముగిసిన తర్వాత అసలు చెల్లించొచ్చు. కొన్ని బ్యాంకులు గడువు చివర్లో వడ్డీ, అసలు చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. కాకపోతే వడ్డీని ప్రతి నెలా చార్జ్ చేస్తుంటాయి. దీంతో ఏ నెలకు ఆ నెల వడ్డీ కట్టకపోతే, దానిపై రెండో నెలలో వడ్డీ భారీగా పెరిగిపోతుంది. రుణాన్ని సమాన నెలసరి వాయిదాల్లో (ఈఎంఐ) చెల్లించే ఆప్షన్ కూడా ఉంటుంది. బంగారం తాకట్టుపై ఓవర్‌డ్రాఫ్ట్ రుణాన్ని కూడా పొందొచ్చు. అనుమతించిన రుణాన్ని అవసరానికి అనుగుణంగా ఎప్పుడైనా డ్రా చేసుకోవచ్చు. తిరిగి ఎప్పుడైనా చెల్లించొచ్చు. ఎలాంటి ఆదాయపత్రాలు, క్రెడిట్ స్కోర్ ఈ రుణాలకు అవసరం లేదు. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు 12–15 శాతం వరకు ఉంటోంది. అదే బంగారంపై రుణాలు 8 శాతం రేటు నుంచి లభిస్తున్నాయి. గోల్డ్ అప్రైజర్, ప్రాసెసింగ్ చార్జీల పేరుతో కొంత చార్జీ భరించాల్సి ఉంటుంది. ముందుగా రుణాన్ని చెల్లించేస్తే ఎలాంటి చార్జీ పడదు. కొన్ని సంస్థలు ముందస్తు చెల్లింపులపై కొంత చార్జీ వసూలు చేస్తున్నాయి. రుణ గడువు ముగిసిన తర్వాత చెల్లింపుల్లో విఫలమైతే 30–60 రోజుల వ్యవధి అనంతరం, బ్యాంక్‌లు/ఎన్బీఎఫ్సీలు వేలం వేస్తుంటాయి. → ఆభరణాల విలువపై 85 శాతం వరకు రుణంగా పొందొచ్చు. → వ్యక్తిగత రుణాలు తీసుకుని అధిక వడ్డీ భారం మోస్తున్న వారు.. తమ వద్ద నిరుపయోగంగా ఉన్న బంగారం ఆభరణాలు, కాయిన్లపై రుణంతో భారాన్ని తగ్గించుకోవచ్చు. → గడువులోపు రుణాన్ని తీర్చివేయడంలో విఫలమైతే బంగారాన్ని వేలం వేస్తారు. → రుణం తీసుకున్న తర్వాత బంగారం ధరలు గణనీయంగా పడిపోతే, కొంత మొత్తాన్ని మధ్యంతరంగా చెల్లించాల్సి రావడం ప్రతికూలత.బంగారం లీజుకు.. బంగారాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా కొంత రాబడి పొందొచ్చు. నగల వ్యాపారులకు (జ్యుయెలర్) మూలధన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వారు దుకాణాల్లో ఆభరణాల నిల్వ కోసం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి అవసరం పడుతుంది. కనుక నగల వ్యాపారులు ఆభరణాలను లీజుకు తీసుకుని ఈ అవసరాలను గట్టెక్కుతుంటారు. దీనిపై కొంత రాబడి చెల్లిస్తుంటారు. దీనివల్ల బంగారాన్ని బీరువా లేదా బ్యాంకు లాకర్లకు పరిమితం కాకుండా, ఆదాయాన్ని తెచ్చిపెట్టే సాధనంగా మార్చుకోవచ్చు. సేఫ్గోల్డ్ అనే ప్లాట్‌ఫామ్ ఇందుకు వీలు కలి్పస్తోంది. ఈ సంస్థను సంప్రదించినట్టయితే అనుమతి తీసుకుని, లీజుకు ఇచ్చిన బంగారాన్ని కరిగించి అందులోని స్వచ్ఛతను నిర్ధారిస్తుంది. అనంతరం 24 క్యారెట్ బంగారం కిందకు మారుస్తారు. అనంతరం సంబంధిత వ్యక్తి పేరుపై డిజిటల్ గోల్డ్ ఖాతా తెరిచి బంగారం విలువ మేరకు జమ చూపిస్తారు. అనంతరం సేఫ్గోల్డ్ ప్లాట్‌ఫామ్‌పై లిస్ట్ అయిన నగల వ్యాపారులకు మీ బంగారాన్ని లీజుకు ఇవ్వొచ్చు. ఏటా 2–5 శాతం మధ్య రాబడి లభిస్తుంది. రాబడిని రూపాయిల్లో కాకుండా తిరిగి బంగారం రూపంలోనే జమ చేస్తారు. దీనివల్ల దీర్ఘకాలంలో తాము లీజుకు ఇచ్చిన బంగారానికి అదనంగా మరికొంత పసిడిని పోగుచేసుకోవచ్చు. పెరుగుతున్న బంగారం ధరలకు అనుగుణంగా, దీర్ఘకాలంలో అదనపు రాబడిని ఈ మార్గంలో సంపాదించుకోవచ్చు. → ఈ విధానంలో ఆభరణాలు, కాయిన్లను కరిగించి, వాటి విలువపై 2–5 శాతం మధ్య రాబడి చెల్లిస్తారు. → కోరుకున్నప్పుడు తిరిగి పాత ఆభరణాలను పొందడం సాధ్యపడదు. ఒకవేళ భౌతిక బంగారం రూపంలోనే వెనక్కి తీసుకునేట్టు అయితే డెలివరీ చార్జీలు చెల్లించుకోవాలి. ఫండ్స్‌లోకి మార్చుకోవడం భౌతిక బంగారాన్ని గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి మార్చుకోవడం మరో మార్గం. దీనివల్ల భద్రతపరమైన రిస్క్ ఉండదు. అవసరమైనప్పుడు వేగంగా నగదుగా మార్చుకోవచ్చు. ఇందులో లాభ, నష్టాలు రెండూ ఉన్నాయి. నాణ్యత, నిల్వ, భద్రతాపరమైన రిస్‌్కలను తొలగించుకోవడం సానుకూలతలు. పెద్ద మొత్తంలో బంగారం కలిగిన వారికి, దాన్ని కాపాడుకోవడం, ఒక చోట నుంచి మరో చోటకు తీసుకెళ్లడం పెద్ద సవాలే. ఇలాంటి వారు మొత్తం కాకపోయినా సగం బంగారాన్ని అయినా డిజిటల్ రూపంలోకి మార్చుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఏడాది నిండిన తర్వాత డిజిటల్ గోల్డ్‌ను విక్రయించిన సందర్భంలో వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. → భౌతిక బంగారాన్ని విక్రయించి, డిజిటల్‌గా మారిపోవడం వల్ల పారదర్శకత, భద్రత, పన్ను ప్రయోజనాలు లభిస్తాయి. కానీ, డిజిటల్ రూపంలో (ఈటీఎఫ్‌లు) ఉంటే స్వల్ప స్థాయిలో ఎక్స్పెన్స్ రేషియో చెల్లించాల్సి వస్తుంది. → భౌతిక బంగారాన్ని విక్రయించినప్పుడు మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. భౌతిక బంగారాన్ని కొనుగోలు చేసిన రెండేళ్లలోపు విక్రయిస్తే వచ్చిన లాభాన్ని తమ వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. రెండేళ్ల తర్వాత విక్రయిస్తే వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి.కొత్త ఆభరణాలకు అప్‌గ్రేడ్... కొందరు ఇంట్లో వినియోగంలో లేని బంగారాన్ని అలాగే ఉంచేసి, కొత్త ఆభరణాలు కొనుగోలు చేస్తుంటారు. దీనికి బదులు పాత బంగారాన్ని కొత్త ఆభరణాల కిందకు అప్‌గ్రేడ్ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. కొత్త ఆభరణాల కిందకు మార్చుకోవడం వల్ల నిరుపయోగంగా ఉన్న పసిడి వినియోగంలోకి వస్తుంది. దీంతో కొత్తవాటి కొనుగోలుకు అదనపు పెట్టుబడి అవసరం రాదు. కొత్త డిజైన్లకు, తయారీ కోసం చార్జీల వరకు చెల్లిస్తే చాలు. సున్నా తరుగు లేదా అతి తక్కువ తరుగు చార్జీల ఆఫర్లను వినియోగించుకోవడం ద్వారా చార్జీల భారాన్ని తగ్గించుకోవచ్చు. ట్రెండ్‌కు అనుగుణంగా కొత్త ఆభరణాలను ధరించామన్న సంతృప్తి దక్కుతుంది. → గతంలో ఎప్పుడో కొన్న ఆభరణాల్లో స్వచ్ఛత పాళ్లు తక్కువ. ఇప్పుడు వాటిని హాల్‌మార్క్ ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు. → వినియోగంలో లేని ఆభరణాలనే కొత్త ఆభరణాల అప్‌గ్రేడ్ కోసం పరిశీలించొచ్చు. → బంగారం విలువలో 10–15 శాతం చార్జీలను భరించాల్సి రావచ్చు. జీఎస్టీ కూడా పడుతుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
చంద్రబాబు సమర్పించు పెట్టుబడుల సినిమా.. ఉత్త ఒప్పందాలే
సాక్షి, అమరావతి: రెడీ.. యాక్షన్.. కెమెరా..! అంటూ విశాఖలో ప్రివ్యూ షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ల తరహాలో.. క్రెడిట్ చోరీతో ప్రజలకు మరోమారు పెట్టుబడుల సినిమా చూపించేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది! శుక్ర, శనివారాల్లో విశాఖ వేదికగా సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు సినిమా చూపించనున్నారు. 2014– 19 మధ్య అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే తరహా సినిమాలను రాష్ట్ర ప్రజలకు చూపించారు. 2016, 2017, 2018లో వరుసగా మూడేళ్లు సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్స్ పేరిట విశాఖలో సమావేశాలు నిర్వహించి భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ మూడు సమావేశాల్లో 1,761 ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రానికి ఏకంగా రూ.19.6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు పత్రికల్లో ప్రధాన శీర్షికల్లో పేర్కొన్నారు. ఈ ఒప్పందాల ద్వారా 34 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని ఊదరగొట్టారు. రూ.19.6 లక్షల కోట్ల ఒప్పందాల సంగతి దేవుడెరుగు.. ఆఖరికి పరిశ్రమల శాఖ స్వయంగా కుదుర్చుకున్న రూ.7.68 లక్షల కోట్ల విలువైన 327 ఒప్పందాల్లో వాస్తవంగా అమల్లోకి వచ్చింది 45 మాత్రమే. అంటే 13 శాతమే కార్యరూపం దాల్చా యి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే వచ్చిన పలు కంపెనీలతో తాజాగా విశాఖ వేదికగా మళ్లీమళ్లీ ఒప్పందాలు చేసుకుంటూ అందుకోసం ఆర్నెల్లుగా సీఎం, పలువురు మంత్రులు విదేశీ పర్యటనలు చేసి రావడం గమనార్హం. ఎస్ఐబీపీలకూ దిక్కులేదు.. పార్టనర్షిప్ సమ్మిట్ ఒప్పందాలే కాదు.. ముఖ్యమంత్రి అధ్యక్షత వహించే పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం పొందిన ప్రాజెక్టులకు సైతం 2014–19 మధ్య టీడీపీ హయాంలో దిక్కు లేకుండా పోయింది. ఎక్కడైనా ఎస్ఐపీబీ ఆమోదం లభించిందంటే ప్రాజెక్టులు పరుగులు పెట్టాల్సిందే. 2014–19 మధ్య చంద్రబాబు అధ్యక్షతన మొత్తం 17 సార్లు ఎస్ఐపీబీ సమావేశాలు జరిగాయి. అందులో మొత్తం రూ.1,70,036 కోట్ల విలువైన 91 మెగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. వీటి ద్వారా 2,04,183 మందికి ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. అయితే నాడు టీడీపీ ప్రభుత్వం గద్దె దిగిపోయే నాటికి ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన వాటిలో 5.69 శాతం మాత్రమే అమల్లోకి వచ్చాయి. రూ.9,681 కోట్ల విలువైన ఒప్పందాలు మాత్రమే వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా ఉపాధి లభించింది 36,140 మందికి మాత్రమే. 2014 –19 కితకితలే కితకితలు..!చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు హైపర్ లూప్ దగ్గర నుంచి సుఖోయ్ యుద్ధవిమానాల వరకు రాష్ట్రంలోకి వచ్చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. అసలు ప్రపంచంలోనే అమల్లోకి రాని హైపర్‌లూప్ కాన్సెప్ట్‌తో అమరావతి నుంచి విశాఖ నిమిషాల్లో చేరుకోవచ్చంటూ ఆయన చేసిన ప్రచారం ఇప్పటికీ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే దొనకొండ వద్ద డ్రోన్ డిఫెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, సుఖోయ్ ఎయిర్‌క్రాఫ్ట్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ కలిపి రూ.14,000 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రచారం చేశారు. సెమీ కండక్టర్స్ విభాగంలో ఎటువంటి అనుభవం లేని నెక్ట్స్ ఆర్బిట్ వెంచర్స్ రాష్ట్రంలో రూ.50,000 కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్స్ యూనిట్ ఏర్పాటు చేస్తోందని ప్రచారం చేశారు. ఆ కంపెనీ ద్వారా 1,10,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే హల్దియా రూ.62,714 కోట్లతో కాకినాడ వద్ద పెట్రో కెమికల్ యూనిట్ నెలకొల్పుతోందంటూ ఎటువంటి అనుమతులు లేకుండానే ఎన్నికల ముందు హడావుడిగా 2019 జనవరిలో శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం 2023లో కుదుర్చుకున్న ఒప్పందాలలో 91 శాతం వాస్తవరూపం దాల్చినట్టుగా పరిశ్రమల శాఖ అధికారులు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం గుడియాన్ టెక్నాలజీస్ రూ.40,000 కోట్లతో రెన్యువబుల్ ఎనర్జీ ప్లాంట్, రూ.23,285 కోట్లతో సోలార్గైజ్ ఇండియా, రూ.22,500 కోట్లతో టైటాన్ ఏవియేషన్ విమానాల తయారీ యూనిట్ ఏర్పాటు చేస్తోందంటూ టీడీపీ హయాంలో ఒప్పందాలు చేసుకున్నారు. ఇవికాకుండా హెచ్‌పీసీఎల్ గెయిల్ క్రాకర్ కాంప్లెక్స్ (రూ.40,000 కోట్లు), అనంత్ టెక్నాలజీస్ (రూ.4,500 కోట్లు), సిరీన్ డ్రగ్స్ (రూ.8,200 కోట్లు), రాయల విండ్ పవర్ (రూ.16,500 కోట్లు) తదితర సంస్థలు టీడీపీ హయాంలో ఒప్పందం చేసుకున్న తర్వాత మొహం చాటేశాయి. 2018లో ఒప్పందం చేసుకున్న వాటిలో ఎస్బీ ఎనర్జీ (రూ.13,200 కోట్లు), మైత్ర మొబైల్ (రూ.7,000 కోట్లు), కోనసీమ ఫెర్టిలైజర్స్ (రూ.5,000 కోట్లు), బద్వే ఇంజనీరింగ్ (రూ.4,200 కోట్లు) లాంటి సంస్థలు అనంతరం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపలేదు. స్విట్జర్లాండ్‌కు చెందిన ఏరోస్పేస్ వెంచర్స్ రూ.9,600 కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకోగా భూమి కేటాయించినా ఇప్పటికీ పనులు మొదలు కాలేదు. ఎన్టీపీసీ ఒప్పందం అప్పటిదే.. పాతవాటికి కొత్తవిగా కలరింగ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను తమ ఖాతాల్లో వేసుకోవడమే కాకుండా ఇప్పుడు కొత్తగా విస్తరణ ఒప్పందాలు కుదుర్చుకుంటూ చంద్రబాబు వాటిని తమ ఖాతాలో వేసుకుంటున్నారు. 2023 మార్చి4న నాటి సీఎం వైఎస్ జగన్ సమక్షంలో విశాఖ జీఐఎస్ సదస్సులో ఎన్టీపీసీతో ఒప్పందం కుదిరిన రూ.1.85 లక్షల కోట్ల గ్రీన్ హైడ్రోజన్ యూనిట్ (అనకాపల్లి వద్ద)ను ఇప్పుడు చంద్రబాబు నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకున్నారు. అలాగే రూ.69,000 కోట్లతో ఇండోసోల్ ప్రాజెక్టు, తిరుపతిలో రూ.7,500 కోట్లతో జిందాల్ స్టీల్, రూ.3,700 కోట్లతో రెన్యూ ఎనర్జీ, రూ.4,500 కోట్లతో సత్యసాయి జిల్లాలో ఉత్కర్ష అల్యూమినియం ధాతు నిగం లిమిటెడ్ లాంటి కంపెనీలన్నీ గత ప్రభుత్వ హయాంలోనే ఒప్పందాలు చేసుకోగా, ఇప్పుడు బాబు సర్కారు వాటిని తన ఖాతాలో వేసుకుంటున్నారు. గత ప్రభుత్వంలోనే వచ్చిన ఎన్టీపీసీ, రెన్యూ పవర్, సెంచురీయన్, ఏటీసీ టైర్స్, రిలయన్స్ ప్రాజెక్టులతో తాజాగా విశాఖ సదస్సులో తిరిగి కొత్త ఒప్పందాలకు బాబు ప్రభుత్వం సిద్ధమైంది.జగన్ హయాంలో 91 శాతానికి పైనే..వైఎస్సార్సీపీ హయాంలో విశాఖ వేదికగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ద్వారా పరిశ్రమల శాఖ నుంచి 99 ఒప్పందాలు జరిగాయి. వీటి ద్వారా రూ.6,60,068.72 కోట్ల విలువైన పెట్టుబడులతోపాటు 7,56,455 మందికి ఉపాధి లభించనుంది. ఆ ఒప్పందాలు జరిగిన రెండేళ్లలోపే 90కిపైగా యూనిట్లు నిర్మాణ పనులు ప్రారంభించగా.. అందులో 39 కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తిని కూడా ప్రారంభించి వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించాయి. మొత్తం పెట్టుబడుల్లో 91.06 శాతం అంటే రూ.6,01,071.72 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చినట్లు తాజాగా చంద్రబాబు ప్రభుత్వమే లిఖితపూర్వకంగా తెలియచేసింది. ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన వాటిలో ఏజీపీ సిటీ గ్యాస్ (రూ.10,000 కోట్లు) ఐవోసీ (రూ,4,300), ఇండోసోల్ (రూ.69,000 కోట్లు), జిందాల్ స్టీల్ ఆంధ్రా (రూ.7,500 కోట్లు), జేఎస్‌డబ్ల్యూ స్టీల్ (రూ.16,350), ఎన్టీపీసీ (రూ.1,85,000 కోట్లు), ఆ్రల్టాటెక్ సిమెంట్ (రూ.4,000 కోట్లు), ఉత్కర్ష (రూ.4,500 కోట్లు), శ్రీసిమెంట్స్ (రూ.5,500 కోట్లు), అలయన్స్ టైర్స్ విస్తరణ (రూ.1,100 కోట్లు), బ్లూస్టార్ (రూ.550 కోట్లు), కలర్‌షైన్ ఇండియా (రూ.510 కోట్లు), దాల్మియా సిమెంట్స్ (రూ.650 కోట్లు), దివీస్ ల్యాబ్ (రూ.790 కోట్లు), ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ (రూ.1,113 కోట్లు), ఇగులా స్టెర్లెస్ (రూ.600 కోట్లు), గ్రీన్లామ్సౌత్ (రూ.825 కోట్లు), జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ (రూ.550 కోట్లు), కింబెర్లీ క్లార్క్ ఇండియా (రూ.700 కోట్లు), లైఫస్ ఫార్మా (రూ.2,319 కోట్లు), లారస్ (రూ.1200 కోట్లు), ఎల్జీ పాలిమర్స్ (రూ.240 కోట్లు), శ్రీసిమెంట్స్ (రూ.2,500 కోట్లు), టీసీఎల్ (రూ.500 కోట్లు) లాంటి పలు ప్రధాన కంపెనీలున్నాయి. -
పెట్టుబడులకు ముఖద్వారం: సీఎం రేవంత్
గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవుతాం తెలంగాణ సీఎం ఆహ్వానం మేరకు మా సభ్యులలో ఎక్కువ మంది డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు హాజరవుతాం. తెలంగాణ విజన్‌ను సమీపం నుంచి తెలుసుకోవాలని మేమంతా ఆసక్తితో ఉన్నాం. – డాక్టర్ ముఖేష్ ఆఘి, యూఎస్ఐఎస్పీఎఫ్ అధ్యక్షుడుసాక్షి, న్యూఢిల్లీ: అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, పరిశ్రమలకు పూర్తిగా అనువైన వాతావరణం, భద్రతకు ఎటువంటి ఢోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్.. ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్య స్థానమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత, వేగవంతమైన వృద్ధి రేటుతో తెలంగాణ రాష్ట్రం ఉందని తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు–భారతదేశం వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో (యూఎస్ఐఎస్పీఎఫ్) సీఎం ప్రసంగించారు. సదస్సు ప్రారంభంలో తెలంగాణ రైజింగ్–2047 విజన్‌ను ప్రదర్శించారు. పెట్టుబడిదారులకు అందరి మద్దతు ‘తెలంగాణకు గత 35 ఏళ్లుగా కాంగ్రెస్‌తో పాటు అనేక పారీ్టలు, ప్రభుత్వాలకు సారథ్యం వహించాయి. అయితే.. పెట్టుబడులకు, పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారు. భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ముఖ ద్వారం. జీసీసీలకు గ్యమస్థానంగా ఉన్న హైదరాబాద్‌లో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. మహిళా సాధికారత, నాణ్యమైన విద్య, యువతకు నైపుణ్య శిక్షణ, పట్టణాభివృద్ధితో పాటు మెరుగైన వసతులు, అత్యున్నత జీవన ప్రమాణాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను నిలిపేందుకే మా ప్రథమ ప్రాధాన్యత..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. చైనా ప్లస్ 1మోడల్‌కు గ్లోబల్ సమాధానంగా తెలంగాణ ‘గత 23 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. 30 వేల ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో రూపొందుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ దేశంలోనే నూతన నగరంగా మారుతుంది. మూసీ నదీ పునరుజ్జీవనం పూర్తయితే లండన్, టోక్యో, దుబాయ్, సియోల్ రివర్ ఫ్రంట్ల మాదిరే హైదరాబాద్ నైట్ ఎకానమీ కూడా కొత్త దశలోకి ప్రవేశిస్తుంది. డ్రై పోర్ట్, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్, రేడియల్ రోడ్లు, ఓఆర్ఆర్–ఆర్ఆర్ఆర్ మధ్య మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వంటి కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. చైనా ప్లస్1 మోడల్‌కు గ్లోబల్ సమాధానం తెలంగాణ అవుతుంది. హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ వంటి ఐవీ లీగ్ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్‌లు ఏర్పాటు చేస్తే.. తక్కువ ఖర్చు, సులభమైన వీసా విధానాలతో దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్) విద్యార్థులకు నాణ్యమైన విద్య లభిస్తుంది. ఈ దిశగా ప్రపంచ స్థాయి విద్యా సంస్థలు దృష్టి సారించాలి..’ అని రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. నగరంలో ప్రధాన రోడ్లకు టెక్ సంస్థల పేర్లు ‘భారతదేశంలో రోడ్లకు ఎక్కువగా నేతల పేర్లు ఉంటాయి. హైదరాబాద్‌లో ఆ ట్రెండ్‌ను మార్చాలని అనుకుంటున్నాం. ముఖ్యమైన రోడ్లకు గూగుల్, మెటా, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి కంపెనీల పేర్లను పెడతాం..’ అని సీఎం వెల్లడించారు. కాగా తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి లక్ష్యానికి యూఎస్ఐఎస్పీఎఫ్ వార్షిక సదస్సులో విశేష ఆదరణ లభించిందని సీఎంఓ పేర్కొంది. గ్లోబల్ ఇన్వెస్టర్లకు పెట్టుబడుల అవకాశాలు వివరిస్తూ.. రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగం అంతర్జాతీయ వ్యాపార వర్గాలను ఆకట్టుకుందని తెలిపింది. రేవంత్ రెడ్డి విజన్ బోల్డ్, క్లియర్, అచీవబుల్ ‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజన్ పారదర్శకంగా,సాహసోపేతంగా (బోల్డ్), సాధించగలిగేలా (అచీవబుల్) ఉంది. ఆయన చెప్పిన ప్రాజెక్టులు, వాటి సామాజిక ప్రభావం ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది..’ అని సిస్కో మాజీ సీఈఓ జాన్ ఛాంబర్స్ అన్నారు. -
పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?
నా వద్ద రూ.30 లక్షలు ఉన్నాయి. మెరుగైన రాబడుల కోసం ఈక్విటీల్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి? – జయ్దేవ్ముందుగా సరైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకోవాలి. రాబడితోపాటు పెట్టుబడి రక్షణకూ ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. కనుక ప్రతీ పెట్టుబడి ఆప్షన్లో ఉండే సానుకూల, ప్రతికూలతలను చూడాలి. ఈక్విటీ పథకాలు స్వల్పకాలంలో రాబడులు ఇస్తాయని కచి్చతంగా చెప్పలేం. రాబడులు ఇవ్వొచ్చు. నష్టాలూ ఇవ్వొచ్చు. అస్థిరతలు ఎక్కువ. మార్కెట్ ఏ సమయంలో అయినా దిద్దుబాటుకు గురికావచ్చు. పెట్టుబడి అవసరమైన సమయంలో మార్కెట్లు దిద్దుబాటును చూస్తే రాబడిని నష్టపోవాల్సి రావచ్చు. కనుక స్వల్పకాలం కోసం అయితే అస్థితరల రిస్క్‌ను అధిగమించేందుకు డెట్ సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఐదేళ్లు, అంతకుమించిన కాలం కోసం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక మీ పెట్టుబడులను వివిధ రకాల మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుకోవడం ద్వారా వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి.ఒకవేళ ఏదైనా ఫండ్ బలహీన పనితీరు చూపిస్తే, మరో ఫండ్ మంచి పనితీరుతో రాబడుల్లో స్థిరత్వం ఉంటుంది. క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసుకోవడం మరో మార్గం. ఇందుకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్)ను ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల అస్థిరతల ప్రభావాన్ని అధిగమించొచ్చు. మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యం, రాబడుల అంచనాల ఆధారంగా డెట్, ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసుకోవడం సరైన నిర్ణయం అవుతుంది.నేను సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్)లో రూ.4 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. మూడేళ్లు అయింది. ఇప్పుడు నా పెట్టుబడిని వెనక్కి తీసుకుంటే పెనాల్టీ చెల్లించాలా? – శ్యామ్ ముఖర్జీసీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ కాల వ్యవధి ఐదేళ్లు. 8.2 శాతం వార్షిక రాబడిని మూడు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తారు. ఈ పథకం వడ్డీ రేటును ప్రతి మూడు నెలలకు ఒకసారి కేంద్ర ఆర్థిక శాఖ సమీక్షిస్తుంటుంది. అయినప్పటికీ డిపాజిట్ చేసే రోజు ఉన్న రేటు ఐదేళ్ల కాలానికి అమలవుతుంది. అంటే కొత్తగా ప్రారంభించే ఖాతాలకే సవరించిన రేటు అమల్లో ఉంటుంది. ఈ పథకం కాలవ్యవధి ఐదేళ్లకు ముందుగానే వైదొలగాలంటే అందుకు ఫారమ్-2 సమర్పించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసిన కాలవ్యవధి ఆధారంగా కొంద పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.డిపాజిట్ చేసిన ఏడాది లోపు వెనక్కి తీసుకుంటే ఎలాంటి వడ్డీ చెల్లించరు. అప్పటి వరకు మూడు నెలలకు ఒకసారి చెల్లించిన వడ్డీ మొత్తాన్ని అసలు నుంచి మినహాయించుకుంటారు. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య డిపాజిట్‌ను రద్దు చేసుకుంటే పెట్టుబడిలో 1.5 శాతాన్ని జరిమానా కింద మినహాయించి, మిగిలినది చెల్లిస్తారు. ఇక రెండు నుంచి ఐదేళ్ల మధ్యలో డిపాజిట్ రద్దు చేసుకుంటే అప్పుడు పెట్టుబడిపై 1 శాతం జరిమానా పడుతుంది. మీరు మూడేళ్ల తర్వాత డిపాజిట్‌ను వెనక్కి తీసుకోవాలని అనుకుంటున్నారు. కనుక మీరు మీ పెట్టుబడి మొత్తం రూ.4 లక్షలపై ఒక శాతం చొప్పున రూ.4,000 పెనాల్టీ మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని చెల్లిస్తారు. మొదటి ఐదేళ్ల కాలానికే ఈ నిబంధనలు అమలవుతాయి. ఎస్సీఎస్ఎస్ పథకాన్ని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. ఇలా పొడిగించిన కాలంలో ఏడాది నిండిన తర్వాత, అంటే మొత్తంగా ఆరేళ్ల తర్వాత ఎప్పుడు ముందస్తుగా రద్దు చేసుకున్నా, ఎలాంటి పెనాల్టీ పడదు.ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
రండి.. పెట్టుబడులు పెట్టండి
సాక్షి, హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్శించేందుకు ప్రజాపాలన–ప్రజావిజయోత్సవాల పేరిట రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025’నిర్వహించనుంది. వచ్చే నెల 8,9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలోని మీర్ఖాన్పేటలో ఈ సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్ల కోసం స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్‌రంజన్ అధ్యక్షతన ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టి రెండేళ్లు పూర్తవడంతోపాటు డిసెంబర్ 9న సోనియాగాంధీ పుట్టిన రోజు కావడంతో ఈ సదస్సును ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ విజన్ రైజింగ్–2047 డాక్యుమెంట్‌ను విడుదల చేస్తారు. ఫ్యూచర్ సిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను అదే రోజు విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతోపాటు కొత్త ఇండస్ట్రీ, మైనింగ్, ఎడ్యుకేషన్ పాలసీలను విడుదల చేస్తారు. ఏడుగురితో ప్రత్యేక కమిటీ టీజీ ఎస్పీడీసీఎల్, జలమండలి, హెచ్ఎండీఏ, ఐటీ, ట్రాన్స్‌కో, హౌసింగ్, ట్రాన్స్పోర్ట్ వంటి పలు ప్రభుత్వ విభాగాల సమన్వయానికి జయేశ్‌రంజన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు వికాస్‌రాజ్, సంజయ్‌కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తాని యా, టీజీ ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీ ఫారూఖీ, టీజీఐఐసీ ఎండీ శశాంక, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈవీ నర్సింహారెడ్డిలు సభ్యులుగా ఉన్నారు. ఫార్చ్యూన్–500 కంపెనీలకు ఆహ్వానం గ్లోబల్ సమ్మిట్‌కు ఫార్చ్యూన్–500 కంపెనీలకు ఆహ్వానించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. భారత్ ఫ్యూచర్ సిటీ, మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్‌రోడ్ వంటి కీలక ప్రాజెక్టుల అభివృద్ధి ఎలా ఉంటుందో వివరించనున్నారు. రెండు రోజుల సదస్సులో ఫ్యూచర్ సిటీలో పలు ప్రభుత్వ విభాగాలకు భూములను కేటాయించనున్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్‌కుమార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఇలంబర్తి, టీజీఐఐసీ ఎండీ, ఫ్యూచర్ సిటీ కమిషనర్ శశాంక ఆధ్వర్యంలో ఎంఓయూ, అనౌన్స్మెంట్ కమిటీని ఏర్పాటు చేశారు. ప్రతినిధుల భద్రత ఏర్పాట్ల కోసం అదనపు డీజీ డీఎస్ చౌహాన్, ఐజీ ఎం.రమేశ్, రాచకొండ కమిషనర్ సు«దీర్బాబులతో సెక్యూరిటీ అండ్ ప్రోటోకాల్ కమిటీని ఏర్పాటు చేశారు. -
బెర్క్‌షైర్ భారీ నగదు నిల్వలు.. దేనికి సంకేతాలు?
లాభాలు పెరిగినప్పటికీ, మార్కెట్లపై అప్రమత్త ధోరణిని చూపిస్తూ బెర్క్‌షైర్ (Berkshire) హాతవే సంస్థ రికార్డు స్థాయి నగదు నిల్వలను ప్రకటించింది. కంపెనీ నగదు నిల్వలు మూడవ త్రైమాసికంలో 381.7 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇది బెర్క్‌షైర్ చరిత్రలో అత్యధికం.వారెన్ బఫెట్ (Warren Buffett) సీఈఓ హోదాలో తన చివరి త్రైమాసిక నివేదికను విడుదల చేసిన సందర్భంలో ఈ ప్రకటన వచ్చింది. 95 ఏళ్ల బఫెట్ ఈ ఏడాది చివర్లో పదవీ విరమణ చేయనున్నారు.స్టాక్ విక్రయాలు, బైబ్యాక్ నిలిపివేతబెర్క్షైర్ వరుసగా 12వ త్రైమాసికంలో కొనుగోలు కంటే ఎక్కువ స్టాక్స్‌ను విక్రయించింది. దాని 283.2 బిలియన్ డాలర్ల ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో యాపిల్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి హోల్డింగ్స్ ఉన్నాయి. కంపెనీ ఐదవ వరుస త్రైమాసికంగా తన సొంత స్టాక్ బైబ్యాక్‌ను నిలిపివేసింది. అయినప్పటికీ దాని షేర్ ధర విస్తృత మార్కెట్‌ను మించకపోవడం గమనార్హం.లాభాల్లో పెరుగుదల, కానీ వృద్ధి మందగింపుతక్కువ బీమా నష్టాలు మూడవ త్రైమాసిక ఆపరేటింగ్ లాభాన్ని 34% పెంచి 13.49 బిలియన్ డాలర్లకు చేర్చాయి. ఇది విశ్లేషకుల అంచనాలను మించిపోయింది. నికర లాభం 17% పెరిగి 30.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అయితే మొత్తం ఆదాయం కేవలం 2% మాత్రమే పెరిగింది. ఇది అమెరికా ఆర్థిక వృద్ధి రేటుకంటే తక్కువ.కంపెనీ ప్రకారం.. ఆర్థిక అనిశ్చితి, వినియోగదారుల విశ్వాసం తగ్గడం ప్రధాన అవాంతరాలుగా మారాయి. ఈ ప్రభావం క్లేటన్ హోమ్స్, డ్యూరాసెల్, ఫ్రూట్ ఆఫ్ ది లూమ్, స్క్విష్మాలోస్ తయారీదారు జాజ్వేర్స్ వంటి అనుబంధ వ్యాపారాలపై కనిపించింది.నాయకత్వ మార్పు దిశగా..వారెన్ బఫెట్ వైదొలుగుతున్న తరుణంలో, 63 ఏళ్ల గ్రెగ్ అబెల్ కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. బఫెట్ మాత్రం చైర్మన్‌గా కొనసాగుతారు. కాగా అబెల్.. బఫెట్ కంటే కూడా “మరింత హ్యాండ్-ఆన్” మేనేజర్‌గా ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో బెర్క్‌షైర్ భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి.👉 ఇది ఇంకా చదవలేదా? అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్! -
ఆర్థిక అనిశ్చితి.. స్థిరాస్తి రంగంపై ప్రభావం!
సాక్షి, సిటీబ్యూరో: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయాలు, పలు దేశాల నడుమ యుద్ధాలు, ముడి చమురు, బంగారం ధరలు వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి ఏర్పడింది. దీని ప్రభావం భారత స్థిరాస్తి రంగంపై పడింది. దేశీయ రియల్టీ రంగంలో విదేశీ పెట్టుబడులు భారీగా తగ్గాయని వెస్టియాన్ నివేదిక వెల్లడించింది.ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశీయ రియల్టీలోకి 1.76 బిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. అయితే 2025 క్యూ2లోని 1.80 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్లతో పోలిస్తే ఇది 2 శాతం తగ్గుదల కాగా.. గతేడాది క్యూ3లోని 0.96 బిలియన్ డాలర్ల ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్ట్ మెంట్స్‌తో పోలిస్తే మాత్రం 83 శాతం అధికం.2025 క్యూ3లోని సంస్థాగత పెట్టుబడులలో అత్యధికం వాణిజ్య సముదాయంలోకి వచ్చాయి. 79 శాతం వాటాతో ఈ విభాగంలోకి 1,397.21 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఇక, 11 శాతం వాటాతో నివాస సముదాయంలోకి 191.67 మిలియన్ డాలర్లు, 5 శాతం వాటాతో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకి 85.79 మిలియన్ డాలర్లు, 5 శాతం వాటాతో డైవర్సివైడ్ విభాగంలోకి 84.82 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. -
మిక్స్ అండ్ మ్యాచ్.. పెట్టుబడుల కొత్త ఫ్యాషన్
గడిచిన ఏడాది కాలంలో ఈక్విటీల్లో ఎలాంటి రాబడుల్లేవు. ఎన్నో ఆటుపోట్లను చూస్తున్నాం. ఇదే కాలంలో పసిడి, వెండి ధరలు రెట్టింపయ్యాయి. డెట్ సాధనాలు సైతం స్థిరమైన రాబడులను అందించాయి. అంతెందుకు అంతర్జాతీయంగా ఎన్నో ఈక్విటీ మార్కెట్లు (యూఎస్, జపాన్, చైనా తదితర) గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు సానుకూల రాబడులను పంచాయి. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేసుకోవడం తెలివైన నిర్ణయం కాదని ఈ గణాంకాలు గుర్తు చేస్తున్నాయి. పెట్టుబడులు ఎప్పుడూ కూడా ఒకే గూటి పక్షులు కాకూడదు. ఎందుకంటే ప్రతికూలతలు ఎదురైతే రాబడులు లేకపోగా, నికర నష్టాలను చూడాల్సి వస్తుంది. భిన్న సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవడం ద్వారా రిస్క్ తగ్గించుకుని, నికర రాబడుల దిశగా సాఫీగా ప్రయాణం చేయొచ్చు. ఇందుకు హైబ్రిడ్ ఫండ్స్ వీలు కల్పిస్తాయి. హైబ్రిడ్ ఫండ్స్‌లో మొత్తం ఆరు విభాగాలు. వివిధ సాధనాల్లో పెట్టుబడులు పెడుతూ వైవిధ్యాన్ని ఆఫర్ చేస్తుంటాయి. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్లో వీటికి సైతం చోటివ్వాలి. తద్వారా లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చు. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ గతంలో బ్యాలెన్స్డ్ ఫండ్స్‌గా వీటికి పేరు. చాలా కాలం నుంచి పనిచేస్తున్నాయి. ఈక్విటీలకు, డెట్ పెట్టుబడులను జోడించి స్థిరత్వాన్ని అందిస్తాయి. సెబీ నిబంధనల ప్రకారం ఇవి కనీసం 65–80 శాతం మేర ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. మిగిలిన మొత్తాన్ని స్థిరాదాయ సాధనాల్లో (డెట్ ఇన్స్ట్రుమెంట్లు) పెట్టుబడిగా పెడతాయి. కొంత పెట్టుబడిని డెట్‌లోకి మళ్లించడం వల్ల ఆటుపోట్లను తట్టుకోగల సామర్థ్యం ఏర్పడుతుంది. హైబ్రిడ్ ఫండ్స్‌లోనూ కొన్ని ఈక్విటీలకు 75–80 శాతం వరకు కేటాయిస్తుంటాయి. హైబ్రిడ్ ఫండ్స్ దీర్ఘకాలంలో లార్జ్‌క్యాప్ మాదిరిగా, బెంచ్‌మార్క్ స్థాయిలో రాబడులను అందిస్తుంటాయి. క్వాంట్ అగ్రెస్సివ్ హైబ్రిడ్, బీవోఐ మిడ్ అండ్ స్మాల్‌క్యాప్ ఈక్విటీ అండ్ డెట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ ఈక్విటీ అండ్ డెట్ ఫండ్స్ అయితే గత ఐదేళ్లలో ఏటా 23–24 శాతం స్థాయిలో కాంపౌండెడ్ వార్షిక రాబడులను (సీఏజీఆర్) అందించాయి. 65 శాతం తగ్గకుండా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నందున.. రూ.1.25 లక్షలకు మించిన దీర్ఘకాల మూలధన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. మధ్యస్థం నుంచి అధిక రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు, దీర్ఘకాల లక్ష్యాల కోసం వీటిని ఎంపిక చేసుకోవచ్చు.బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్వీటిని డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ అని కూడా అంటారు. ఇవి మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను (నిర్వహణ ఆస్తులు/ఏయూఎం) ఈక్విటీలు–డెట్ సాధనాల మధ్య మార్పులు, చేర్పులు చేస్తుంటాయి. రూ.3.05 లక్షల కోట్ల ఏయూఎంతో హైబ్రిడ్ ఫండ్స్‌లో ఇది అతిపెద్ద విభాగంగా ఉంది. అగ్రెస్సివ్ హైబ్రిడ్ ఫండ్స్ అన్నవి స్థిరమైన పెట్టుబడుల విధానంతో పనిచేస్తుంటాయి. డైనమిక్ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ దీనికి భిన్నంగా పనిచేస్తాయి. ఈక్విటీ మార్కెట్ల విలువలు అసాధారణ స్థాయికి చేరాయని భావించినప్పుడు అక్కడ పెట్టబడులను గణనీయంగా తగ్గించుకుని (30–40 శాతానికి పరిమితం), డెట్‌లోకి మళ్లిస్తాయి. ఈక్విటీల వ్యాల్యూషన్లు చౌకగా, ఆకర్షణీయంగా మారినప్పుడు తిరిగి డెట్ నుంచి అధిక మొత్తాన్ని (70 శాతం) వెనక్కి మళ్లిస్తాయి. దీనివల్ల పెట్టుబడుల విలువ పెద్దగా పతనం కాకుండా రక్షణ ఉంటుంది. ఇవి సాధారణంగా పీఈ, పుస్తకం విలువ, అస్థిరతలు ఇలా ఎన్నో అంశాల ఆధారంగా వ్యాల్యూషన్లపై అంచనాకు వస్తాయి. లాభాలపై ఈక్విటీ పన్ను ప్రయోజనం కోసం ఈ విభాగంలో చాలా ఫండ్స్ 65 శాతం తగ్గకుండా ఈక్విటీలు, ఆర్బిట్రేజ్ అవకాశాల్లో (రెండు స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో ధరల వ్యత్యాసం) పెట్టుబడుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. గత ఏడాది కాలంలో నిఫ్టీ 100 టీఆర్ఐ 4 శాతం నష్టపోగా, బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ నష్టం 0.8 శాతానికి పరిమితమైంది. గత ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతం వార్షిక రాబడి (5.2–29 శాతం మధ్య) ఈ పథకాల్లో నమోదైంది. ఈక్విటీ కేటాయింపులు 65 శాతం కంటే తక్కువగా ఉండే పథకాల్లో రాబడిపై పన్ను బాధ్యత భిన్నంగా ఉంటుంది. ఇవి నాన్ ఈక్విటీ, నాన్ డెట్ కిందకు వస్తాయి. ఈ తరహా ఫండ్స్‌లో రెండేళ్లు నిండిన పెట్టుబడులపై వచ్చే రాబడిలో 12.5 శాతం పన్ను కింద చెల్లించాలి. రెండేళ్లు నిండకుండా విక్రయించే పెట్టుబడులపై వచ్చే రాబడిని వార్షిక ఆదాయానికి కలిపి చూపించాలి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్పెట్టుబడులకు అస్థిరతలు చాలా తక్కువగా ఉండాలని భావించే వారికి కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలం. ఇవి పెట్టుబడుల్లో కనీసం 75 శాతాన్ని డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాలి. కేవలం 10–25 శాతం మధ్యే ఈక్విటీలకు కేటాయిస్తుంటాయి. కనుక ఇవి డెట్ ప్రధానమైన పెట్టుబడులతో పనిచేస్తాయి. స్వల్ప మొత్తాన్ని ఈక్విటీలకు కేటాయించడం వల్ల దీర్ఘకాలంలో (పదేళ్లకు మించిన) వార్షిక రాబడి.. అచ్చమైన డెట్ సాధనాలతో పోల్చి చూస్తే 1–3 శాతం మధ్య అదనంగా వస్తాయని ఆశించొచ్చు. ఇవి అధిక శాతం డెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి కనుక పెట్టుబడులు పెట్టే ముందు వాటి పోర్ట్‌ఫోలియోని ఒకసారి గమనించాలి. ఈ విభాగంలో ఎక్కువ శాతం ఫండ్స్ డెట్ పెట్టుబడుల్లో క్రెడిట్ రిస్క్ తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటాయి. ఇందుకోసం అధిక శాతం పెట్టుబడులను ఏఏఏ రేటెడ్ సాధనాల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంటాయి. గత ఐదేళ్లలో రాబడులను గమనిస్తే 3.5 శాతం నుంచి 13.7 శాతం మధ్య ఉన్నాయి. సగటున 9 శాతం వార్షిక రాబడులను గమనించొచ్చు. డెట్ ఫండ్స్ కిందకు వస్తుండడంతో.. 2023 బడ్జెట్ తర్వాత నుంచి వచ్చిన కొత్త పన్ను నిబంధనల ప్రకారం.. ఎంతకాలం పాటు ఇన్వెస్ట్ చేశారన్నది సంబంధం లేకుండా మూలధన లాభాలను వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాలి. ఆర్బిట్రేజ్ ఫండ్స్ హైబ్రిడ్ ఫండ్స్ విభాగంలో అతి తక్కువ రిస్‌్కను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో చూడొచ్చు. సెబీ నిబంధనల ప్రకారం ఇవి కనీసం 65 శాతం పెట్టుబడులను ఈక్విటీలకు కేటాయించాలి. కనుక వీటిని ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణిస్తారు. ఇవి ప్రధానంగా ఏం చేస్తాయంటే.. ఉదాహరణకు రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర క్యాష్ మార్కెట్లో రూ.1,400 వద్ద ఉందని అనుకుందాం. అదే ఫ్యూచర్స్‌లో 1,410 వద్ద ఉందనుకుంటే.. క్యాష్‌లో కొని, ఫ్యూచర్స్‌లో విక్రయిస్తాయి. దీనివల్ల రూ.10 ప్రయోజనం దక్కుతుంది. ఈ విధంగా స్పాట్, ఫ్యూచర్స్ విభాగాల్లో ధరల వ్యత్యాసం ఉన్న స్టాక్స్‌ను గుర్తించి ఎక్స్పోజర్ తీసుకుంటాయి. ఒక్కోసారి ఒకే స్టాక్ ధర రెండు ఎక్ఛేంజ్‌ల్లో (బీఎస్ఈ, ఎన్ఎస్ఈ) కొంత వ్యత్యాసంతో ట్రేడవుతుంటాయి. అలాంటి అవకాశాలపైనా ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇక మిగిలిన నిధులను స్వల్పకాల డెట్ సాధనాలకు కేటాయిస్తుంటాయి. కనుక వీటిల్లో రిస్క్ అతి తక్కువగా ఉంటుంది. గత ఐదేళ్లలో ఈ ఫండ్స్‌లో వార్షిక సగటు రాబడి 5.8 శాతంగా ఉంది. ఈక్విటీ ఫండ్స్ కిందకు వస్తాయి కనుక, పన్ను ప్రయోజనం (ఏటా రూ.1.25 లక్షలపై లాభం లేదు) సొంతం చేసుకోవచ్చు. స్వల్పకాలం కోసం (6–18 నెలలు) ఈ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్ పేరులో ఉన్నట్టుగా ఒకటికి మించిన ఆస్తుల్లో (అసెట్స్) ఇవి ఇన్వెస్ట్ చేస్తుంటాయి. సెబీ నిబంధనల ప్రకారం ఈ ఫండ్స్ కనీసం మూడు రకాల అసెట్ క్లాసెస్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి ఏమీ లేదు. ఇక ప్రతీ అసెట్ క్లాస్‌కు కనీసం 10 శాతం పెట్టుబడులు కేటాయించాలన్నది నిబంధన. ఈ పథకాలతో ఉన్న గొప్ప ప్రయోజనం వైవిధ్యం. ఈ విభాగంలో 31 ఫండ్స్ పనిచేస్తున్నాయి. ఇవి ఈక్విటీలు, డెట్, ఆర్బిట్రేజ్ అవకాశాలు, బంగారం, వెండి ఈటీఎఫ్‌లు, కమోడిటీ డెరివేటివ్‌లు, విదేశీ ఈక్విటీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్), ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (ఇన్విట్) తదితర సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటాయి. కోటక్, సుందరం, హెచ్డీఎఫ్సీ మల్టీ అసెట్ ఫండ్స్ అయితే ఈక్విటీ పన్ను ప్రయోజనం దృష్టితో కనీసం 65 శాతాన్ని ఈక్విటీలకు కేటాయిస్తున్నాయి. ఎడెల్వీజ్ మల్టీ అస్సెట్ ఫండ్ అయితే డెట్‌లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తోంది. వివిధ సాధనాలకు పెట్టుబడుల కేటాయింపుల్లో ఈ పథకాల మధ్య ఏకరూపత ఉండదు. కనుక రాబడులను పథకాల వారీగా చూడాల్సి ఉంటుంది. దీర్ఘకాలంలో వీటి రాబడి వార్షికంగా 10–15 శాతం మధ్య ఉంటుందని ఆశించొచ్చు. గత ఏడాది కాలంగా ఈక్విటీలు ఎలాంటి రాబడులు ఇవ్వనప్పటికీ, ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు రెట్టింపు కావడాన్ని గమనించాలి. ఈ దృష్టితో మల్టీ అస్సెట్ అలోకేషన్ ఫండ్స్‌కు కొంత పెట్టుబడులు కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ సెబీ నిబంధనల ప్రకారం ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ తమ నిర్వహణలోని పెట్టుబడుల్లో కనీసం 65 శాతాన్ని ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనుక ఇవి 15–30 శాతం మధ్య నేరుగా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. మరో 35–45 శాతం మేర పెట్టుబడులను ఈక్విటీ ఆర్బిట్రేజ్ అవకాశాలకు కేటాయిస్తుంటాయి. 25–35 శాతం మధ్య డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తాయి. 65 శాతం కేటాయింపుల కారణంగా ఈక్విటీ పెట్టబుడులకు మాదిరే లాభాలపై పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకాల్లో గత ఐదేళ్ల కాల పనితీరును గమనిస్తే.. సగటు వార్షిక రాబడి 10 శాతంగా ఉంది. డెట్ ఫండ్స్ కంటే స్వల్ప అదనపు రాబడి ఈ పథకాల నుంచి ఆశించొచ్చు. ఈక్విటీల్లోనూ రిస్క్ తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్ కంపెనీలకు ఇవి ఎక్కువగా కేటాయిస్తుంటాయి. కనుక ఈక్విటీ పెట్టుబడుల కారణంగా ఏదురయ్యే రిస్క్ చాలా పరిమితమే. రిస్క్ పెద్దగా తీసుకోకుండా, కొంత మెరుగైన రాబడి ఆశించే వారికి ఈ పథకాలు అనుకూలం. అంతేకాదు రిటైర్మెంట్ తీసుకున్న వారు సైతం లంప్సమ్గా ఇన్వెస్ట్ చేసుకుని, ప్రతి నెలా కొంత చొప్పున ఉపసంహరించుకునే ఎస్‌డబ్ల్యూపీ ప్లాన్‌కు అనుకూలం. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్‌లో పెట్టుబడులకు అనుమతి
సిల్వర్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్) ఫండ్ ఆఫ్ ఫండ్ (ఎఫ్‌వోఎఫ్) పథకంలోకి తాజా పెట్టుబడులను అనుమతిస్తున్నట్టు టాటా మ్యూచువల్ ఫండ్ ప్రకటించింది. మార్కెట్ పరిస్థితులు కుదుటపడడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. వెండి ధరలు గరిష్టాల నుంచి కొంత దిద్దుబాటుకు గురికావడంతో తాజా పెట్టుబడులకు అనుమతించినట్టు తెలుస్తోంది.సిల్వర్ ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్‌లో ఏక మొత్తంలో పెట్టుబడి, క్రమానుగత పెట్టుబడి (సిప్), క్రమానుగత పెట్టుబడి బదిలీ (ఎస్టీపీ)లను నిలిపివేస్తున్నట్టు ఈ నెల 14న టాటా మ్యూచువల్ ఫండ్ ప్రకటించడం గమనార్హం. ధరలు అనూహ్యంగా పెరుగుతూ వెళుతున్న తరుణంలో రిస్క్ నియంత్రణలో భాగంగా ఈ చర్య చేపట్టింది. మార్కెట్ పరిస్థితులు సాధారణంగా మారడంతో తిరిగి ఏక మొత్తంలో పెట్టుబడులు, తాజా సిప్‌లు, ఎస్టీపీలను అనుమతిస్తున్నట్టు టాటా మ్యూచువల్ ఫండ్ పేర్కొంది.ఇదీ చదవండి: ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా? ఉచితంగా రూ.7 లక్షలు బీమా -
లక్ష కోట్ల పెట్టుబడులు.. 5 లక్షల మందికి ఉపాధి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగంలో 2030 నాటికి కొత్తగా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను రప్పించడం ద్వారా 5 లక్షల మందికి ఉపాధి కల్పించేలా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగ ఆర్థిక వ్యవస్థ విలువ ప్రస్తుతం 80 బిలియన్ డాలర్లు కాగా, 2030 నాటికి 250 బిలియన్ డాలర్లకు చేర్చాలని లక్ష్యంగా త్వరలో ‘కాంప్రహెన్సివ్ లైఫ్ సైన్సెస్ పాలసీ’ని అమలు చేస్తామని ప్రకటించారు.గడిచిన 20 నెలల్లో రాష్ట్రానికి రూ.3.2 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, అందులో లైఫ్ సైన్సెస్ రంగంలోనే రూ.63 వేల కోట్లుగా ఉందన్నారు. తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్‌గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ సంస్థ ‘ఆస్ బయో టెక్’, విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం మెల్బోర్న్లో సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆస్ బయోటెక్ ఇంటర్నేష నల్ కాన్ఫరెన్స్ 2025’లో మంత్రి శ్రీధర్‌బాబు గురు వారం కీలకోపన్యాసం చేశారు. లైఫ్ సైన్సెస్ రంగంలో గడిచిన రెండేళ్లలో తెలంగాణ సాధించిన పురోగతి, భవిష్యత్ ప్రణాళికలు, అవకాశాలు, పెట్టు బడులకు ఉన్న అనుకూల తలను మంత్రి వివరించారు.అత్యుత్తమ లైఫ్‌సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్‘ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ సీబీఆర్ఈ రూపొందించిన ’గ్లోబల్ లైఫ్ సైన్సెస్ అట్లాస్ 2025’లో ప్రపంచంలోని అత్యుత్తమ లైఫ్ సైన్సెస్ క్లస్టర్లలో హైదరాబాద్‌కు చోటు దక్కి ంది. బోస్టన్, శాన్ ఫ్రాన్సిస్కో, కేంబ్రిడ్జ్, బీజింగ్, టోక్యో సరసన హైదరాబాద్ నిలిచింది. లైఫ్ సైన్సెస్ ఆఫీస్ లీజింగ్ 2022లో 0.6 మిలియన్ చదరపు అడుగులు కాగా, 2024 నాటికి నాలుగు రెట్లు పెరిగి 2.4 మిలియన్ చదరపు అడుగు లకు చేరింది.లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీ, యంగ్‌ఇండియా స్కిల్క్స్ యూనివర్సిటీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్, ఇతర అంతర్జాతీయ దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో భవిష్యత్ బయో –డిజిటల్ యుగానికి కావాల్సిన అత్యుత్తమ నైపుణ్యమున్న మానవ వనరులను తయారు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసు కుంది. ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ సద స్సు ‘విక్టోరియా తెల ంగాణ ఇన్నోవేషన్ కారిడార్’కు నాంది పలకాలి’అని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరా బాద్‌లో జరిగే బయో ఏషియా సదస్సు కు హాజరు కావాలని దిగ్గజ లైఫ్ సైన్సెస్ పరిశ్రమలను మంత్రి ఆహ్వానించారు. సదస్సులో విక్టోరియా మంత్రులు రోస్ స్పెన్స్, డానీ పియ ర్సన్, ఆస్ బయోటెక్ చైర్మన్ డాక్టర్ జేమ్స్ క్యాంప్‌బెల్, తెల ంగాణ ఇన్వెస్ట్మెంట్ సెల్ డైరెక్టర్ మధుసూదన్, తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈవో శక్తి నాగప్పన్ పాల్గొన్నారు. -
మోసాలే ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: కంటికి కనిపించకుండా మన కష్టార్జితాన్ని కాజేసే సైబర్ మోసగాళ్లు ఎప్పటికప్పుడు సరికొత్త రకం మోసాలకు తెరతీస్తూనే ఉన్నారు. లాటరీ వచ్చిందని, ఆఫర్లు ఉన్నాయని, ఆన్లైన్ జాబ్‌లు ఇస్తామని, పెట్టిన పెట్టుబడి రోజులు, నెలల వ్యవధిలోనే ఎన్నో రెట్లు పెరుగుతుందని.. ఇలా నిత్యం ఏదో ఒక రకమైన మోసపూరిత వల విసురుతూనే ఉన్నారు. అయితే, గతేడాదితో పోలిస్తే 2025లో సెప్టెంబర్ వరకు సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల సంఖ్యలో తగ్గుదల కాస్త ఊరటనిచ్చే అంశం. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అందుతున్న ఫిర్యాదులలో ఎక్కువగా ఐదు రకాల మోసాలకు సంబంధించినవే ఉన్నట్టు సమాచారం. ఇన్వెస్ట్మెంట్ మోసాలు ఇందులో మొదటి స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత స్థానాల్లో ఐడెంటిటీ థెఫ్ట్ (వ్యక్తిగత సమాచారం సేకరించి మోసాలు) మోసాలు, అడ్వరై్టజ్‌మెంట్ ఫ్రాడ్స్, లోన్ ఫ్రాడ్స్, బిజెనెస్–పార్ట్‌టైం జాబ్ మోసాలు ఉన్నాయి. అత్యాశే అనర్థాలకు మూలం.. పెట్టిన పెట్టుబడి రోజులు, నెలల్లోనే రెట్టింపు అవుతుందన్న ప్రకటనలు నమ్మి మోసపోతున్నవారే అధికంగా ఉంటున్నారు. ప్రజల అత్యాశనే సైబర్ నేరగాళ్లు తమ ఆయుధంగా మార్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు, సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అధిక రాబడి వాగ్దానాలను నమ్మవద్దు. నెలకు 10 నుంచి 20 శాతం రిటర్న్‌ల వంటి వాగ్దానాలు ఇస్తున్నారంటే అది మోసమని గ్రహించాలి. ఆన్లైన్ ట్రేడింగ్ యాప్‌లతో జాగ్రత్తగా ఉండాలి. సెబీ (సెక్యురిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఆమోదం లేని యాప్‌లు వాడవద్దు. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ నేరగాళ్లు సూచించిన యాప్‌లలో లాభాలు చూపి, రియల్ అకౌంట్లో నష్టం కలిగిస్తారని మరవొద్దు అని నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి.. తెలంగాణలో నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ 18 నుంచి 20 శాతం వరకు ఉంటున్నాయి. ఈ తరహా మోసాలకు ఎక్కువగా రిటైర్డ్ ఉద్యోగులు బలవుతున్నారు. ఆ తర్వాత 30 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్న ఐటీ ఉద్యోగులు, డాక్టర్లు, ఇతర విద్యాధికులు ఉంటున్నారు. అయితే, స్టాక్స్ ఇతర షేర్లలో పెట్టుబడులకు సంబంధించి వెరిఫైడ్ ఏజెన్సీల నుంచి మాత్రమే సూచనలు తీసుకోవాలి. అదేవిధంగా డీమ్యాట్ అకౌంట్ ద్వారానే చెల్లింపులు చేయాలి. వాట్సాప్ లింక్‌లలో వచ్చే సందేశాలు నమ్మి మోసపోవద్దు. మీరు పెట్టుబడి పెట్టే స్టాక్స్ వివరాలు ముందుగా ఆన్లైన్లో చెక్ చేసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టాలి. – శిఖాగోయల్, డైరెక్టర్, టీజీ సీఎస్బీ (ఫొటో కామన్‌లో శిఖాగోయల్ పేరిట ఉంటుంది) -
దీపావళి కోణంలో స్టాక్ మార్కెట్ పెట్టుబడులు..
దీపావళి పండగకి సంబంధించి తినుబండారాల కోణంలో మార్కెట్లను అభివర్ణించాల్సి వస్తే .. జిలేబీగా అభివర్ణించవచ్చు. అవును, మార్కెట్లు కూడా జిలేబీలాగే మెరిసిపోతూ, వంకర్లు తిరుగుతూ, అనూహ్యమైన విధంగా ఉంటాయి. వీటిని అర్థం చేసుకోవాలంటే బోలెడంత సహనం ఉండాల్సిందే.జిలేబీ ఆకారంలాగే ఈ ఏడాదంతా అంతర్జాతీయంగా ఒడిదుడుకులు, వడ్డీ రేట్ల అంచనాల్లో మార్పులు, భౌగోళికరాజకీయపరంగా ఆశ్చర్యపర్చే పరిణామాలు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో రణగొణ ధ్వనులతో గడిచింది. అయినప్పటికీ ప్రశాంతంగా, పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు చాలా తియ్యని అనుభవాలే ఎదురయ్యాయి. స్పెక్యులేషన్‌కి పోకుండా క్రమశిక్షణతో ఉంటూ, ఓర్పు వహించినందుకు బహుమతిగా చిన్న చిన్న విజయాలు, నేర్చుకునే అవకాశాలు లభించాయి.ఈ ఏడాది బంగారం, వెండి టపాసుల్లాగా పేలాయి. సంప్రదాయ సిద్ధంగా సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడి తన పాత్రను చక్కగా పోషించింది. అనిశ్చితి నెలకొన్న తరుణంలో స్థిరత్వాన్ని అందించింది. ఒక్కసారిగా ఎగిసిన వెండి దీనికి మరింత హంగులు దిద్దింది. పాతతరం వివేకం, కొత్త తర పు ఉత్సాహం రెండూ కూడా కలిసి మెరిసేందుకు అవకాశం ఉందని ఇవి తెలియజేశాయి. అవకాశం, భద్రత మధ్య సమతుల్యతను పాటించడమే పోర్ట్‌ఫోలియో పటిష్టతకు కీలకమని తెలియజేశాయి. ఒకవేళ దీపావళి బహుమతులను తనదైన ప్రత్యేకత ఉన్న అసెట్ క్లాస్‌గా వరి్ణంచాల్సి వస్తే బంగారాన్ని వారసత్వ నెక్లెస్‌గా అభివరి్ణంచవచ్చు. కాలాతీతమైనదై, భావోద్వేగాలతో కూడుకున్నదై, తరతరాలుగా తన విలువను కాపాడుకుంటూ వస్తోంది పసిడి. ఇక బాండ్లను డ్రై ఫ్రూట్ బాక్సుగా అభివర్ణించవచ్చు. ఆకట్టుకునే మెరుపులు ఉండకపోయినా, ఇవి నమ్మకమైనవిగా, నిశ్శబ్దంగా అండగా నిలుస్తాయి.ఈక్విటీల విషయానికొస్తే.. ఇంట్లో తయారు చేసిన స్వీట్లలాంటి. చాలా ఓపిగ్గా, నమ్మకంతో, ఆశాభావంతో ఇవి తయారవుతాయి. అప్పుడప్పుడు గందరగోళంగా అనిపించినా ఆ తర్వాత చాలా సంతృప్తిని కలిగిస్తాయి. మరి క్రిప్టో విషయమేంటి? ఇవి పక్కింటివాళ్ల డ్రోన్ షో లాంటివి. చాలా ఆర్భాటంగా, పట్టించుకోకుండా ఉండలేని విధంగా ఉంటాయి. కానీ వీటిని కాస్త సురక్షితమైన దూరం నుంచే ఆస్వాదించడం మేలు. సంక్షోభ సమయాల్లోనే పసిడి రాణిస్తుందనే అపోహ ఒకటుంది. ఈ పండుగ సీజన్లో దాన్నుంచి బైటపడాలి. వాస్తవానికి బంగారమంటే, మార్కెట్లు బాగా లేనప్పుడు నీడనిచ్చే సాధనం మాత్రమే కాదు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్నికూడా అందిస్తుంది. పర్ఫెక్ట్ దీపావళి పోర్ట్‌ఫోలియో ఎలా ఉంటుందంటే.. సమతూకంగా గల మల్టీ–అసెట్ థాలీలాగా ఉంటుంది. వృద్ధి కోసం ఈక్విటీలు .. స్థిరత్వం కోసం పసిడి .. క్రమశిక్షణ కోసం బాండ్లు .. ఇక సమర్ధత, డైవర్సిఫికేషన్, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కోసం మ్యుచువల్ ఫండ్‌లో చక్కగా చుట్ట చుట్టినట్లుగా ఉంటుంది. సాధారణంగా పండుగల సందర్భంలో మార్కెట్ సెంటిమెంటు ఉత్సాహంగా ఉంటుంది. కానీ, ఊదరగొట్టే అన్‌లిస్టెడ్ ఐడియాలు, సైక్లికల్ థీమ్‌లు ఇక ముగింపు దశకొస్తున్నాయనే వార్తలు, ‘దీపావళి టిప్’ స్టాక్‌లు మొదలైన వాటి విషయంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలి. మార్కెట్లు ఉత్సాహభరిత వాతావరణాన్ని ప్రతిబింబించవచ్చు కానీ అంతిమంగా మాత్రం ఎమోషన్లను కాకుండా ఆదాయాలనే ఫాలో అవుతాయి. వచ్చే దశాబ్దకాలం కోసం పోర్ట్‌ఫోలియోను రూపొందించుకోవడమే ఈ దీపావళికి మీకు మీరు ఇచ్చుకునే అత్యుత్తమ బహుమతి అవుతుంది. ఎందుకంటే సిసలైన సంపద కూడా, అందమైన రంగవల్లిలాంటిదే. ఓ లక్ష్యం పెట్టుకుని, ఎంతో ఓపిగ్గా, సమతూకాన్ని పాటిస్తూ డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నాళ్లకి దీపం కొండెక్కినా, ఈ సుగుణాలే దీర్ఘకాలం పాటు నిలిచి ఉంటాయి. -
ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా?
ప్రతి సంవత్సరం దీపావళి పండుగ సందర్భంగా వచ్చే ధన త్రయోదశి (ధన్‌తేరాస్) రోజున బంగారం కొనడం భారతదేశంలో ఒక శుభప్రదమైన సంప్రదాయం. ఈ రోజున పసిడిని కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరం పొడవునా సంపద సమకూరుతుందని ప్రజలు బలంగా నమ్ముతారు. అయితే ఈ ఏడాది కాలంలో బంగారం, వెండి ధరలు సామాన్యులు కొనలేనంత భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చితి, రూపాయి విలువ పతనం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు, ద్రవ్యోల్బణం వంటి అంశాలు బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా బంగారు ఆభరణాలు కొనడం కంటే మెరుగైన, ఆర్థికపరంగా లాభదాయకమైన పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం.నేరుగా ఆభరణాలు కొంటే..ధరలు భారీగా పెరగడంతో ఆభరణాల రూపంలో బంగారం కొనుగోలు చేయాలనుకోవడం చాలా మందికి ఆర్థిక భారంగా ఉంటుంది. రికార్డు స్థాయిలో ఉన్న ధరల కారణంగా చిన్న వస్తువు కొనుగోలుకు కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాలి. బంగారు ఆభరణాల తయారీలో తరుగు రూపంలో కొంత మొత్తాన్ని అదనంగా చెల్లించాలి. వీటికి తయారీ ఛార్జీలు (Making Charges) అదనం. బంగారం ధర, తయారీ ఛార్జీలపై జీఎస్టీ వర్తిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఆభరణాలు అమ్మినప్పుడు తయారీ ఛార్జీలు, తరుగు కారణంగా కొనుగోలు ధర కంటే తక్కువ ధరకే విక్రయించాల్సి వస్తుంది.ఈ ఛార్జీలు, నష్టాల నేపథ్యంలో బంగారంలో పెట్టుబడి పెట్టడానికి నిపుణులు మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తున్నారు. బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి భౌతిక బంగారాన్ని నిల్వ చేయాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన, పారదర్శకమైన, తక్కువ ఖర్చుతో కూడుకున్న కొన్ని మార్గాలు అందుబాటులో ఉన్నాయి.గోల్డ్ ఈటీఎఫ్లుగోల్డ్ ఈటీఎఫ్‌లు అనేవి స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో షేర్ల మాదిరిగా ట్రేడ్ చేయబడే ఫండ్లు. ఇవి దేశీయ భౌతిక బంగారం ధరను ట్రాక్ చేస్తాయి. వీటిని లైవ్ మార్కెట్ నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దీనివల్ల తయారీ ఛార్జీలు, జీఎస్టీ వంటి అదనపు ఛార్జీలు ఉండవు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వేళల్లో ఎప్పుడైనా సులభంగా కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. భౌతిక బంగారంలాగా దొంగిలించబడుతుందనే భయం ఉండదు. రియల్ టైమ్ మార్కెట్ ధరలకు అనుగుణంగా వీటి ధరలు ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడానికి డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతా అవసరం.డిజిటల్ గోల్డ్PhonePe, Paytm వంటి యాప్‌ల ద్వారా 99.9% స్వచ్ఛమైన బంగారాన్ని కొద్ది మొత్తంలో డిజిటల్ రూపంలో కొనుగోలు చేయవచ్చు. ఈ బంగారం మీ తరపున భౌతిక రూపంలో లాకర్లో నిల్వ చేస్తారు. అయితే అమ్మాలనుకుంటే మాత్రం జీఎస్టీ వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. ఈ విధానంలో చాలా తక్కువ డబ్బుతో కూడా కొంత మొత్తంలో కొనుగోలు చేయవచ్చు. భౌతికంగా నిల్వ చేయాలనే ఆందోళన అవసరం లేదు. అయితే దీనికి కొనుగోలు పరిమితులు ఉంటాయి. ఈ పెట్టుబడి RBI లేదా SEBI నియంత్రణలో ఉండదని గమనించాలి.ఇదీ చదవండి: లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలింది.. ఏం జరిగిందంటే.. -
హ్యుందాయ్ పెట్టుబడుల ధమాకా!
ముంబై: కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ ఇండియా(హెచ్ఎంఐఎల్) దేశీయంగా భారీ పెట్టుబడులకు తెరతీస్తోంది. దక్షిణ కొరియా మాతృ సంస్థ హ్యుందాయ్ మోటార్ కో ప్రెసిడెంట్, సీఈవో జోస్ మునోజ్ 2030కల్లా దేశీ యూనిట్ రూ. 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. తద్వారా హ్యుందాయ్ కార్ల తయారీ, అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా రెండోపెద్ద కేంద్రంగా భారత్ నిలవనున్నట్లు తెలియజేశారు. భారత్‌లో తొలిసారి పర్యటిస్తున్న మునోజ్ ఎగుమతుల్లో హెచ్ఎంఐఎల్ వాటా 30 శాతానికి పెంచాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా వృద్ధి లక్ష్యాలలో భాగంగా కంపెనీ ఆదాయాన్ని సైతం 1.5 రెట్లు పెంచుకోవాలని చూస్తోంది. వెరసి 2030కల్లా రూ. లక్ష కోట్ల మైలురాయిని అధిగమించే ప్రణాళికల్లో ఉన్నట్లు హెచ్ఎంఐఎల్ ఎండీ అన్సూ కిమ్ తెలియజేశారు. ఇందుకు వీలుగా 2030కల్లా 26 ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు తెలియజేశారు. వీటిలో 7 కొత్త ప్రొడక్టులకు కంపెనీ తెరతీయనుంది. తద్వారా ఎంపీవీ, ఆఫ్‌రోడ్ ఎస్యూవీ విభాగాలలోకి ప్రవేశించనుంది. వీటితోపాటు 2027కల్లా స్థానికంగా డిజైన్ చేసి అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని దేశీ మార్కెట్కోసం తయారు చేసే లక్ష్యంతో ఉంది. ఈ బాటలో లగ్జరీ విభాగ బ్రాండ్ జెనిసిస్‌ను దేశీయంగా 2027కల్లా విడుదల చేయాలని ఆశిస్తోంది. మూడు దశాబ్దాలు దేశీయంగా మూడు దశాబ్దాల విజయం తరువాత గతేడాది ఐపీవో ద్వారా కంపెనీ లిస్టయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి దశ వృద్ధి ప్రణాళికలను అమలు చేయనున్నట్లు మునోజ్ కంపెనీ తొలిసారి నిర్వహించిన ఇన్వెస్టర్ డే సందర్భంగా పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా 2030కల్లా రూ. 45,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు వెల్లడించారు. పెట్టుబడుల్లో 60 శాతం ప్రొడక్ట్, ఆర్అండ్డీపైనా.. మిగిలిన 40 శాతం సామర్థ్య విస్తరణ, అప్‌గ్రెడేషన్ కోసం వినియోగించనున్నట్లు వివరించారు. అమ్మకాలరీత్యా ప్రస్తుతం హ్యుందాయ్‌కు భారత్ మూడో పెద్ద మార్కెట్‌గా నిలుస్తున్నట్లు తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియా విజన్‌కు అనుగుణంగా ప్రపంచ ఎగుమతుల కేంద్రంగా భారత్‌ను అభివృద్ధి చేయనున్నట్లు మునోజ్ పేర్కొన్నారు. కాగా.. కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ 2026 జనవరి 1నుంచి ఎండీ, సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. తొలిసారి భారతీయ వ్యక్తికి సారథ్యం అప్పగించడమనేది మాతృ సంస్థకు దేశీ కార్యకలాపాలపై ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తున్నట్లు మునోజ్ పేర్కొన్నారు. హ్యుందాయ్ క్యాపిటల్ దేశీయంగా 2026 రెండో త్రైమాసికం నుంచి కార్యకలాపాలు ప్రారంభిస్తుందని చెప్పారు.చిన్న కార్లు వీడేదిలేదు దేశీయంగా చిన్న కార్లకు ప్రాధాన్యత ఉన్నదని మునోజ్ పేర్కొన్నారు. ద్విచక్ర, త్రిచక్ర వాహనదారులు అప్‌గ్రేడ్ కావడానికి వీలయ్యే చిన్న కార్ల విభాగాన్ని వీడబోమని స్పష్టం చేశారు. ఎంట్రీలెవల్ కస్టమర్లు తదుపరి దశలో అప్‌గ్రేడ్ అయ్యేందుకు వీలయ్యే ప్రొడక్టులపైనా దృష్టి కొనసాగించనున్నట్లు తెలియజేశారు. భారత్‌ను రెండు మార్కెట్లుగా పేర్కొనవచ్చని, గ్లోబల్ మార్కెట్ల తరహాలో మరిన్ని ఎస్‌యూవీలు, ఆఫ్‌రోడ్ వాహనాలకు వీలున్నట్లే మరోపక్క ఎంట్రీలెవల్ కార్లకు డిమాండ్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. -
రియల్టీలోకి పీఈ పెట్టుబడులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) దేశీయంగా రియల్ ఎస్టేట్ రంగంలో ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు 819మిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన 967 బిలియన్ డాలర్లతో పోలిస్తే 15 శాతం తగ్గాయి. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ అనుబంధ సంస్థ అనరాక్ క్యాపిటల్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఇక 2025–26 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో పీఈ పెట్టుబడులు 2.6 బిలియన్ డాలర్ల నుంచి 15 శాతం క్షీణించి 2.2 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో వచి్చన మొత్తం ఇన్వెస్ట్మెంట్లలో విదేశీ పెట్టుబడుల వాటా 73 శాతంగా ఉంది. తొలి త్రైమాసికంలో కాస్త ఆశావహ ధోరమి కనిపించినప్పటికీ అది కొన్నాళ్ల ముచ్చటే అయిందని, రెండో త్రైమాసికంలో కార్యకలాపాలు నెమ్మదించాయని అనరాక్ క్యాపిటల్ సీఈవో శోభిత్ అగర్వాల్ తెలిపారు. పూర్తి సంవత్సరం ప్రాతిపదికన చూస్తే పీఈ పెట్టుబడులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయని వివరించారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 6.4 బిలియన్ డాలర్ల నుంచి 2025 ఆర్థిక సంవత్సరంలో 3.7 బిలియన్ డాలర్లకు పడిపోయాయని పేర్కొన్నారు. రెసిడెన్షియల్ సెగ్మెంట్లో అమ్మకాల జోరు.. రెసిడెన్షియల్ విభాగంలో రియల్ ఎస్టేట్ అమ్మకాల పరిమాణం భారీగా ఉందని, దీంతో డెవలపర్లకు నగదు ప్రవాహం గణనీయంగా మెరుగుపడిందని అగర్వాల్ తెలిపారు. దీనితో వారు ఖరీదైన ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్)పై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. అలాగే బ్యాంకుల వద్ద కూడా పుష్కలంగా నిధులు ఉండటంతో, గతానికి భిన్నంగా, అవి రియల్టికి రుణాలిచ్చేందుకు మరింత సానుకూలంగా ఉన్నాయని ఆయన వివరించారు. అటు కమర్షియల్ రియల్ ఎస్టేట్ విషయం తీసుకుంటే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం చాలా అనిశ్చితి నెలకొన్నట్లు చెప్పారు. దీనితో ద్రవ్యోల్బణంతో పాటు అంతర్జాతీయంగా ఇతరత్రా స్థూల ఆర్థిక అనిశ్చితి కూడా పెరుగుతోందని వివరించారు. ‘అందుకే విదేశీ పెట్టుబడుల ప్రవాహం నెమ్మదించంది. భారత్ గణనీయంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గానే కాకుండా పెట్టుబడులు వృద్ధి చెందేందుకు ఆస్కారమున్న అతి తక్కువ దేశాల్లో ఒకటిగా నిలుస్తోంది కాబట్టి ఇది తాత్కాలిక ధోరణే కావొచ్చు. అనిశ్చితులు తొలగిపోయి, స్పష్టత వచి్చందంటే చాలు కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లోకి పీఈ పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటాయి‘ అని అగర్వాల్ చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఇండ్రస్టియల్, లాజిస్టిక్స్ విభాగంలోకి పీఈ పెట్టుబడులు అసలు రాలేదు. రిటైల్, మిక్సిడ్–యూజ్, కమర్షియల్ అసెట్స్ విభాగంలో గణనీయంగా వచ్చాయి. హోటల్స్, డేటా సెంటర్లలోకి కూడా పెట్టుబడులు మెరుగ్గానే వచి్చనట్లు అనరాక్ క్యాపిటల్ తెలిపింది.జోరుగా ఈక్విటీ పెట్టుబడులుసెపె్టంబర్ త్రైమాసికంలో 3.8 బిలియన్ డాలర్లున్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ రంగంలోకి ఈక్విటీ పెట్టుబడుల రాక సెపె్టంబర్ త్రైమాసికంలో బలంగా నమోదైంది. 48 శాతం అధికంగా 3.8 బిలియన్ డాలర్ల ఈక్విటీ పెట్టుబడులు వచ్చినట్టు సీబీఆర్ఈ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈక్విటీ పెట్టుబడుల రాక 2.6 బిలియన్ డాలర్లుగానే ఉంది. ప్రధానంగా భూ సమీకరణ, అభివృద్ధి, ఆఫీస్/రిటైల్ ఆస్తుల నిర్మాణంపై ఇన్వెస్టర్లు పెట్టుబడులు కుమ్మరించారు. ఇక ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఈక్విటీ పెట్టుబడులు 14 శాతం ఎగసి 10.2 బిలియన్ డాలర్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 8.9 బిలియన్ డాలర్లుగానే ఉన్నాయి. 2024 సంవత్సరం మొత్తం మీద వచి్చన ఈక్విటీ పెట్టుబడులు 11.4 బిలియన్ డాలర్లుగా ఉండడం గమనార్హం. ‘‘వేగవంతమైన వృద్ధి దశలోకి రియట్ ఎసేŠట్ట్ రంగం అడుగుపెట్టింది. ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన విశ్వాసం ఇందుకు మద్దతుగా నిలుస్తోంది. రానున్న త్రైమాసికాల్లో గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుల అభివృద్ధికి బలమైన డిమాండ్ ఉంటుంది. ఇళ్లు, ఆఫీస్, మిశ్రమ వినియోగ వసతులు, డేటా సెంటర్లు, పారిశ్రామిక, రవాణా వసతుల వ్యాప్తంగా సమతూకం ఉంటుంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మ్యాగజిన్ తెలిపారు. పెట్టుబడుల్లో మరింత వైవిధ్యం ఉన్నట్టు, నిర్మాణం పూర్తయిన, నిర్మాణంలో ఉన్న ఆస్తుల్లోకి పెట్టుబడులు వస్తున్నట్టు సీబీఆర్ఈ ఎండీ గౌరవ్ కుమార్ పేర్కొన్నారు. -
గోల్డ్ ఇలా పెట్టుబడి పెడితే మీరే కోటిశ్వరుడు
-
బ్యూటీ బ్రాండ్స్‌లోకి పెట్టుబడుల జోరు..
న్యూఢిల్లీ: గ్లోబల్ బ్రాండ్స్ భారత మార్కెట్లోకి విస్తరిస్తున్నప్పటికీ, దేశీ ఆన్లైన్ డైరెక్ట్–టు–కన్జూమర్ (డీ2సీ) సౌందర్య, వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్స్‌లోకి కూడా భారీగా పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. 20 అగ్రగామి డీ2సీ బ్రాండ్స్‌లోకి గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది (జనవరి–సెప్టెంబర్ మధ్య కాలంలో) ఇన్వెస్ట్మెంట్స్ 7 శాతం పెరిగాయి. సుమారు 63.1 మిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 560 కోట్లు) పైగా వచ్చినట్లు బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ ట్రాక్షన్ డేటాలో వెల్లడైంది. 2020లో నమోదైన 21.6 మిలియన్ డాలర్లతో పోలిస్తే పెట్టుబడులు సుమారు మూడు రెట్లు ఎగియడం గమనార్హం. ఫండింగ్ సమకూర్చుకున్న సంస్థల్లో షుగర్ కాస్మెటిక్స్, ఇన్నోవిస్ట్, ఫే బ్యూటీ, రెనీ కాస్మెటిక్స్లాంటివి ఉన్నాయి. బ్యూటీ కేటగిరీలో పెట్టే పెట్టుబడులపై సగటున 10 నుంచి 25 రెట్లు రాబడులు వస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ విభాగంలో మార్జిన్లు అధికంగా ఉండటం, మూలధనాన్ని సమర్ధంగా వినియోగించుకునేందుకు అవకాశం ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నాయి. ప్రీమియం ఉత్పత్తులకి, వినియోగానికి గణనీయంగా డిమాండ్ నెలకొనడం ఈ కేటగిరీకి సానుకూలాంశమని, ఇతరత్రా మిగతా ఏ కేటగిరీల్లోనూ ఇలాంటి పరిస్థితి లేదని వివరించాయి. ఫాక్స్టేల్కి 30 మిలియన్ డాలర్లు.. ఆర్ఏఎస్ లగ్జరీ స్కిన్‌కేర్ సంస్థ ఈ ఏడాది యూనిలీవర్ వెంచర్స్ నుంచి 5 మిలియన్ డాలర్లు, ఆయుర్వేదిక్ బ్యూటీ బ్రాండ్ ఇండి వైల్డ్ కూడా దాదాపు అంతే మొత్తాన్ని సమకూర్చుకున్నాయి. ఇందులోనూ యూనిలీవర్ వెంచర్స్ సారథ్యంలోని ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికాలో కార్యకలాపాల విస్తరణ కోసం కంపెనీ ఈ నిధులను సమకూర్చుకుంది. ఇక ఆగస్టులో రెనీ కాస్మెటిక్స్ సంస్థ సిరీస్ సీ విడత కింద ప్లేబుక్, మిడాస్ పార్ట్నర్స్, ఇతర ఇన్వెస్టర్ల నుంచి 5.8 మిలియన్ డాలర్లు సేకరించింది. ఇక ఫాక్స్‌టేల్ సైతం సిరీస్ సీ విడత కింద పాంథెరా, కోసీ కార్పొరేషన్ తదితర సంస్థల నుంచి ఏకంగా 30 మిలియన్ డాలర్లు దక్కించుకుంది. అటు బేర్ అనాటమీ, కెమిస్ట్ ఎట్ ప్లే, సన్సూ్కప్లాంటి బ్రాండ్స్ మాతృ సంస్థ ఇన్నోవిస్ట్ సైతం ఐసీఐసీఐ వెంచర్, మిరాబిలిస్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ నుంచి 16 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంది. 45 బిలియన్ డాలర్లకు చేరనున్న పరిశ్రమ .. 2025 ఆర్థిక సంవత్సరంలో భారతీయ బ్యూటీ, పర్సనల్ కేర్ ఉత్పత్తుల మార్కెట్ పరిమాణం సుమారు 24 బిలియన్ డాలర్లుగా ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. 2030 నాటికి ఇది 40–45 బిలియన్ డాలర్లకు చేరే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ మార్కెట్లో ఆన్లైన్ కేటగిరీ వాటా 2023లో 13 శాతంగా ఉండగా 2024లో దాదాపు 17 శాతానికి పెరిగినట్లు వివరించాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి మార్కెట్లలో ఈ–కామర్స్ బూమ్ నెలకొనడంతో కొత్త కస్టమర్లకు చేరువయ్యేందుకు అవకాశాలు లభిస్తున్నాయని తెలిపాయి. దీంతో వేగంగా వృద్ధి సాధించేందుకు, విస్తృత శ్రేణిలో ఉత్పత్తులను అందించేందుకు, మార్కెట్లో మరింత విస్తరించేందుకు దేశీ బ్యూటీ బ్రాండ్స్ నిధులను సమకూర్చుకుంటున్నట్లు ట్రాక్షన్ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో బడా కంపెనీలు, ఇలాంటి బ్యూటీ బ్రాండ్స్‌ను కొనుగోలు చేయడంపై ఆసక్తిగా ఉంటున్నాయి. దేశీ స్కిన్ కేర్ బ్రాండ్ మినిమలిస్ట్‌లో హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) 90.5 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 2,706 కోట్లు వెచి్చంచింది. అటు మారికో సంస్థ దాదాపు రూ. 400 కోట్లతో బియర్డోను కొనుగోలు చేసింది. ది మ్యాన్ కంపెనీని ఇమామీ దక్కించుకుంది. గ్లోబల్ బ్రాండ్స్ వెల్లువ.. దేశీయంగా వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లోకి పలు అంతర్జాతీయ బ్రాండ్స్ కూడా పెద్ద ఎత్తున ఎంట్రీ ఇస్తున్నాయి. స్వీడిష్ బ్రాండ్ హెచ్అండ్ఎం ఇటీవలే భారత్‌లో బ్యూటీ సెగ్మెంట్లోకి ప్రవేశించగా, రిలయన్స్‌కి చెందిన టీరాతో కలిసి పాప్ ఐకాన్ రిహానా తన ఫెంటీ బ్రాండ్‌ను ప్రవేశపెట్టింది. అటు ఎంఏసీ, హుడా, అనస్టాషియా బెవర్లీ హిల్స్, స్మాష్బాక్స్, చార్లొట్ టిల్బరీ కూడా రంగంలోకి దిగాయి. ఇక ఓటీటీ ప్లాట్‌ఫాంలలో కొరియన్ కంటంట్కి ఆదరణ పెరుగుతుండటంతో, ప్రీమియం ఉత్పత్తులతో ఇన్నిస్‌ఫ్రీ, కాస్ఆర్ఎక్స్, బ్యూటీ ఆఫ్ జోసియోన్లాంటి కొరియన్ బ్రాండ్లు కూడా భారత వినియోగదారులకు గాలమేస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్‌పై కుటుంబాల ఆసక్తి
న్యూఢిల్లీ: దేశీయంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపట్ల కుటుంబాలలో ఆసక్తి కనిపిస్తున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చేపట్టిన సర్వే పేర్కొంది. కుటుంబ ఆదాయాలలో 10 శాతం సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేసింది. కుటుంబీకులలో 63 శాతం కనీసం ఒక మార్కెట్ ప్రొడక్ట్‌పై అవగాహన ఉన్నట్లు సెబీ ఇన్వెస్టర్ల సర్వే వెల్లడించింది. సెక్యూరిటీలలో పట్టణ ప్రాంతాల నుంచి 15 శాతం పార్టిసిపేషన్ కనిపించగా.. గ్రామీణ ప్రాంతాలలో 6 శాతమే పెట్టుబడులు నమోదయ్యాయి. రాష్ట్రాలలో 20.7 శాతం వాటాతో ఢిల్లీ ఆధిపత్యంవహించగా.. 15.4 శాతం కుటుంబాల పార్టిసిపేషన్‌తో గుజరాత్ తదుపరి ర్యాంకులో నిలిచింది. అయితే 36 శాతంమంది ఇన్వెస్టర్లకు మాత్రమే సెక్యూరిటీ మార్కెట్లపట్ల ఓమాదిరి అవగాహన ఉన్నట్లు సర్వే తెలియజేసింది. దీంతో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ విస్తరించవలసిన అవసరం ఉన్నట్లు అభిప్రాయపడింది. పెట్టుబడి రక్షణకే ఓటు సెబీ తాజా సర్వే ప్రకారం 80 శాతం కుటుంబీకులు అధిక రిటర్నులకంటే పెట్టుబడి పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నారు. వెరసి వివిధ వయసులవారు రిస్క్ తీసుకోవడంలో విముఖత చూపుతున్నట్లు సర్వే తెలియజేసింది. నిజానికి జెన్‌జెడ్ కుటుంబీకులలోనూ 79 శాతంమంది రిస్‌్కలకు వెనకాడుతున్నట్లు పేర్కొంది. ప్రధానంగా ఫైనాన్షియల్ ప్రొడక్టులలో క్లిష్టత, అవగాహనాలేమి, విశ్వాసరాహిత్యం, నష్టాల భయం వంటి అంశాలు అధికశాతం మందిలో పెట్టుబడులకు అడ్డుతగులుతున్నట్లు వివరించింది. దేశీ మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ)తోపాటు.. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ, ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్ తదితర మార్కెట్ ఇన్ఫ్రా సంస్థల సహకారంతో సెబీ ఇన్వెస్టర్ల సర్వే చేపట్టింది. సుమారు 400 పట్టణాలలోని 90,000 కుటుంబాలు, 1,000 గ్రామాలలో సర్వే నిర్వహించింది. -
రూ.80 లక్షల కోట్ల పెట్టుబడులు.. 1.5 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో భారత్‌లోకి రూ. 80 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. 1.5 కోట్ల పైగా ఉద్యోగాల కల్పన జరగనుందని వివరించారు. దేశీయంగా మారిటైమ్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, భవిష్యత్తులో ప్రపంచ మారిటైమ్ సూపర్‌పవర్‌గా భారత్ ఎదగనుందని పేర్కొన్నారు.కేంద్రం తలపెట్టిన సాగరమాల ప్రోగ్రాంతో 2035 నాటికి రూ. 5.8 లక్షల కోట్ల విలువ చేసే 840 ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయని సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రూ. 1.41 లక్షల కోట్ల విలువ చేసే 272 ప్రాజెక్టులు పూర్తయినట్లు పేర్కొన్నారు. రూ. 76,000 కోట్లతో మహారాష్ట్రలో ఏర్పాటవుతున్న వాధ్వాన్ పోర్టు అంతర్జాతీయంగా టాప్ 10 కంటైనర్ పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుందని సోనోవాల్ వివరించారు. దీనితో 12 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు. -
జోరుమీదునున్న రియల్ ఎస్టేట్: 15 ఏళ్లలో..
గత పదిహేనేళ్లలో భారత రియల్టీ రంగంలో 80 బిలియన్ డాలర్ల(రూ.7 లక్షల కోట్లకుపైగా) పెట్టుబడులు ప్రవహించినట్లు క్రెడాయ్, కొలియర్స్ ఇక్కడ విడుదల చేసిన సంయుక్త నివేదిక వెల్లడించింది. 2010 నుంచి దేశీ రియల్టీ రంగం సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకట్టుకుంటున్నట్లు తెలియజేసింది. గత దశాబ్దన్నర కాలం పెట్టుబడుల్లో విదేశీ ఇన్వెస్టర్లు 57 శాతం సమకూర్చినట్లు నివేదిక పేర్కొంది.దేశీ రియల్టీ సమాఖ్య క్రెడాయ్, రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా సంయుక్తంగా నివేదికను విడుదల చేశాయి. క్రెడాయ్ నిర్వహించిన వార్షిక జాతీయ సదస్సు(నాట్కన్)లో ‘భారత రియాల్టీ: ఈక్విటీ పురోభివృద్ధి, ఆర్థిక వృద్ధికి ఊతం’ పేరిట నివేదికను వెలువరించాయి.కోవిడ్ మహమ్మారి తదుపరి దేశీ పెట్టుబడులు సైతం పుంజుకున్నట్లు నివేదిక పేర్కొంది. సంస్థాగత ఇన్వెస్టర్ల జాబితాలో కుటుంబ కార్యాలయాలు, విదేశీ కార్పొరేట్ గ్రూప్‌లు, విదేశీ బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ప్రయివేట్ ఈక్విటీ, విదేశీ పెట్టుబడులున్న ఎన్బీఎఫ్సీలు, రీట్లు, సావరిన్ వెల్త్ ఫండ్స్ ఉన్నట్లు నివేదిక వివరించింది.దేశీ రియల్టీ మార్కెట్ పరిమాణం 2047కల్లా 5-10 ట్రిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది. 2047కల్లా దేశీ రియల్టీ రంగాన్ని కేవలం చదరపు అడుగులు లేదా ఆస్తుల విలువ ద్వారా కాకుండా కోట్లమంది ప్రజల కోసం సృష్టించిన నాణ్యమైన జీవనం ద్వారా మదింపు చేయవలసి ఉంటుందని క్రెడాయ్ ప్రెసిడెంట్ శేఖర్ పటేల్ వ్యాఖ్యానించారు. -
టెక్నోడోమ్, టెక్సానా కార్యకలాపాలు ప్రారంభం.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: కొప్పర్తిలో టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించటంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తమ హయాంలో కొప్పర్తి పారిశ్రామికవాడలో అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టాయని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. 2019 ఆగస్టులో కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్‌ను ప్రతిపాదించగా.. 2021 మార్చిలో STPI అనుమతి పొందిన ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటయ్యాయి. కొప్పర్తిలో ఏర్పాటయిన పరిశ్రమలు జిల్లాకే పేరు ప్రఖ్యాతలను తెచ్చాయి’’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.‘‘టెక్నోడోమ్, టెక్సానా సంస్థలు 2022–2023లో నిర్మాణ పనులను ప్రారంభించి చాలా త్వరగా వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించటం హర్షణీయం. ఈ సందర్భంగా ఆ రెండు సంస్థల యాజమాన్యాలకు, ఉద్యోగులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్తున్నా. మా హయాంలో రాష్ట్రానికి స్థిరమైన అభివృద్ధిని సాధించాం...ముఖ్యంగా తయారీ రంగం ఎంతో కీలకమని నమ్ముతూ దానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాం. అందుకే 2019–2024 మధ్య ఏపీలో తయారీ రంగం GSDP 11.12% వార్షిక వృద్ధి రేటుని సాధించింది. దేశ సగటు వృద్ధిరేటు 6.9% మాత్రమే ఉన్నప్పటికీ రాష్ట్ర వృద్ధిరేటు ఎక్కువగా సాధించగలిగాం’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారుI am very pleased to learn of the commencement of operations in the manufacturing facilities established by Teknodome and Texana in Kopparthy. The Mega Industrial Hub at Kopparthy was proposed in August 2019, the EMC at Kopparthy could secure approval from STPI in March 2021, and… pic.twitter.com/EjaN09Kmgu— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2025 -
ఏఐ స్టార్టప్‌లకు వీసీ నిధుల బూస్ట్!
దేశీయంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రవేశించే ప్రాథమికస్థాయి కంపెనీలకు వెంచర్ క్యాపిటల్ (వీసీ) సంస్థలు పెట్టుబడులు అందించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఏఐ అభివృద్ధి వ్యవస్థ (ఎకోసిస్టమ్)లో ఇటీవల పలు కొత్తతరహా స్టార్టప్‌లు ఊపిరి పోసుకుంటున్న నేపథ్యంలో వీసీ నిధులకు ప్రాధాన్యత ఏర్పడింది. వివరాలు చూద్దాం.. –సాక్షి, బిజినెస్ డెస్క్ప్రధానంగా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలపర్ టూల్స్ విభాగాలలోని దేశీ కంపెనీలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు వీసీ సంస్థలు క్యూ కడుతున్నాయి. పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న సంస్థల జాబితాలో వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్, ఎలివేషన్ క్యాపిటల్, యాక్సెల్, లైట్‌స్పీడ్, ప్రోజస్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ తదితరాలు చేరాయి. దీంతో ఏఐలో మౌలిక, డెవలపర్ విభాగాలపై దృష్టిపెట్టిన కంపెనీలు ఎంటర్‌ప్రైజ్‌లుగా అభివృద్ధి చెందేందుకు వీసీ నిధులు తోడ్పాటునివ్వనున్నాయి. వెరసి ఎజెంటిక్ ప్లాట్‌ఫామ్స్‌కు జోష్ లభించనుంది. తద్వారా స్వతంత్ర ఏఐ ఏజెంట్ల అభివృద్ధికి వీలు చిక్కనుంది.అంటే వివిధ టాస్‌్కలను స్వతంత్రంగా నిర్వహించగల సామర్థ్యమున్న సాఫ్ట్వేర్ ఆధారిత టూల్స్ ఊపిరిపోసుకోనున్నాయి. ఇవి సంబంధిత ఆర్గనైజేషన్లలో క్లిష్టతరహా పనులను చక్కబెట్టడంతోపాటు.. విభిన్న వ్యవస్థలతో సమీకృతంకాగలవని పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వీటికి ప్రత్యేకించిన సర్విసులను పూర్తి చేయడంపై ఆయా ప్లాట్‌ఫామ్స్ దృష్టిపెడతాయని తెలియజేశాయి. ఒకే టాస్్కకు పరిమితమయ్యే సంప్రదాయ ఏఐ టూల్స్‌తో పోలిస్తే వీటి పరిధి విస్తారంగా ఉంటుందని వివరించాయి. పలు కార్యకలాపాలను ఆటోమేషన్తో అనుసంధానించవచ్చని తెలియజేశాయి. కొత్త తరహా టూల్స్ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంటిగ్రేషన్, డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ (డెవ్ఆప్స్) ఆటోమేషన్, భారీస్థాయి ఎడాప్షన్ ప్లాట్‌ఫామ్స్‌పై దృష్టిపెట్టిన స్టార్టప్‌లకు ప్రాధాన్యత ఏర్పడుతోంది. ఫలితంగా ఆయా స్టార్టప్‌లలో పెట్టుబడులకు వీసీ సంస్థలు ముందుకొస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఆధునిక, సరికొత్త మోడళ్లు ఊపిరిపోసుకున్న ప్రతిసారీ ప్లాట్‌ఫామ్స్ మారిపోతుంటాయని ఎలివేషన్ క్యాపిటల్ ఏఐ పార్ట్నర్ కృష్ణ మెహ్రా తెలియజేశారు.దీంతో పూర్తిస్థాయిలో సరికొత్త అవకాశాలకు తెరలేస్తుంటుందని తెలియజేశారు. ఇలాంటి సందర్భాలు(సైకిల్స్) ఆయా స్టార్టప్‌ల వ్యవస్థాపకులకు అవకాశాలను కల్పిస్తాయని, తద్వారా ప్రపంచస్థాయిలో పోటీపడగల సంస్థలుగా తీర్చిదిద్దేందుకు వీలు చిక్కుతుందని వివరించారు. వెరసి ఈ కేలండర్ ఏడాది(2025) జనవరి నుంచి జూలైవరకూ దేశీ జెన్ఏఐ స్టార్టప్‌లు 52.4 కోట్ల డాలర్లు(సుమారు రూ. 4,600 కోట్లు) అందుకున్నట్లు వెంచర్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.పెట్టుబడుల తీరిదీ..సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం ఎలివేషన్ క్యాపిటల్ గత రెండేళ్లలో 15–20 ఏఐ పెట్టుబడులను చేపట్టడం గమనార్హం! ఇక ఎంటర్‌ప్రైజెస్‌లు కనెక్ట్ అయ్యేందుకు, తమ సాఫ్ట్వేర్ టూల్స్‌ను క్రమబద్ధీకరించుకునేందుకు సహకరించే యూనిఫై యాప్స్ వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ నుంచి 2–2.5 కోట్ల డాలర్లు(సుమారు రూ. 200 కోట్లు) సమీకరించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. 2023లో ఏర్పాటైన ఈ సంస్థలో ఎలివేషన్ సైతం ఇన్వెస్ట్ చేసింది. అప్లికేషన్ల బిల్డింగ్, టెస్టింగ్, డిప్లాయింగ్ చేపట్టే ఎమర్జెంట్ ఏఐ.. లైట్‌స్పీడ్ వెంచర్ తదితర సంస్థల నుంచి 2 కోట్ల డాలర్లు సమకూర్చుకుంది.కేవలం రెండు నెలల్లోనే ఈ సంస్థ కోటి డాలర్ల(రూ.87 కోట్లు) వార్షిక రికరింగ్ టర్నోవర్ సాధించడం విశేషం! ఈ బాటలో లైట్‌స్పీడ్ తదితర సంస్థల నుంచి ఎజెంటిక్ స్టార్టప్.. కంపోజియో 2.5 కోట్ల డాలర్లు సమీకరించింది. ఎంటర్ప్రైజ్ ఏపీఐ ఇంటిగ్రేషన్స్ ఆటోమేట్ చేసే రీఫోల్డ్ ఏఐ.. ఎనియాక్ వెంచర్స్, టైడల్ వెంచర్స్ తదితరాల నుంచి 6.5 మిలియన్ డాలర్లు(రూ.56 కోట్లు) సీడ్ఫండ్గా అందుకుంది. ప్రోజస్,యాక్సెల్, ఎక్సీడ్ వెంచర్స్ నుంచి సాఫ్ట్వేర్ ప్రొడక్టివిటీ ప్లాట్‌ఫామ్.. కోడ్కర్మ 2.5 మి. డాలర్లు(రూ.21 కోట్లు) పొందింది. -
మీ పెట్టుబడికి మాదీ భరోసా
మాదాపూర్: రాష్ట్రంలోకి వచ్చే పెట్టుబడులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత తన ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. స్వదేశీ పెట్టుబడిదారులను నిర్లక్ష్యం చేస్తున్నామని కొందరు తమపై దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ దేశాలు తిరిగి పెట్టుబడులు తెస్తున్న తాము.. మనదేశంలోని పెట్టుబడిదారులను ఎందుకు ప్రోత్సహించం అని ప్రశ్నించారు. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో మూడు రోజులపాటు నిర్వహించనున్న క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షోను ఆయన శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వచ్చి అభివృద్ధి దానంతట అదే వేగంగా జరుగుతుంది. గతంలో పాలించినవారు పాలసీ పెరాలసిస్ లేకుండా చూడడం వల్లనే నేడు మన హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడగలుగుతోంది. మీరు అపోహలకు లోబడితే అది అంతిమంగా రాష్ట్రానికి, దేశానికి కూడా నష్టాన్ని కలిగిస్తుంది. పోటీ పడండి, పాలసీలు అడగండి, అభివృద్ధి ఎలా చేయాలో సూచనలు ఇవ్వండి. మీ అనుభవాన్ని మాతో పంచుకోండి’అని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. ఎయిర్‌పోర్టులు పెరిగితే మరింత అభివృద్ధి గత పాలకులు కాళేశ్వరం కార్పొరేషన్ పేరుమీద 11.5 శాతం వడ్డీకి రూ.1 లక్ష కోట్ల అప్పు తెస్తే.. తాను 50 సార్లు ప్రధానమంత్రిని కలిసి రుణ పునర్వ్యవస్థీకరణ చేయించి, వడ్డీని 7.5 శాతానికి తగ్గించానని సీఎం తెలిపారు. ‘తెలంగాణలో ఒక్కటే ఎయిర్‌పోర్టు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో ఆరేడు ఉన్నాయి. మహారాష్ట్రలో 40 ఉన్నాయి. తెలంగాణకు అదనంగా వరంగల్‌లో ఒకటి, ఆదిలాబాద్‌లో మరొక ఎయిర్‌పోర్టుకు అనుమతులు తెచ్చాం. ఎయిర్‌పోర్టులు వస్తే రెండు, మూడోస్థాయి నగరాలు కూడా అభివృద్ధి చెందుతాయి.పారిశ్రామికాభివృద్ధి జరిగితే ప్రజల, ప్రభుత్వాల ఆదాయాలు పెరుగుతాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీని మన రాష్ట్రానికి ఆహ్వనిస్తే పోర్ట్ ఎంతదూరం ఉందని అడుగుతున్నారు. ఔటర్ రింగురోడ్డు 160 కిలోమీటర్ల నిర్మాణం జరిగితే రాష్ట్ర ఆదాయం రూ.3 లక్షల కోట్లకు చేరింది. అందుకే 360 కిలోమీటర్ల రీజినల్ రింగు రోడ్డు కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. రీజినల్ రింగురోడ్డుతోపాటు రీజినల్ రింగ్‌రైల్, ఫ్యూచర్‌సిటీ టు అమరావతి, బందర్ పోర్ట్ లైన్ ఎక్స్‌ప్రెస్ హైవే, రైల్వే కనెక్టివిటీ ఏర్పా టు చేసి ఇరువైపులా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేయాలని కేంద్రం ముందు ప్రతిపాదన పెట్టాం’అని వివరించారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎన్.జయదీప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి క్రాంతికిరణ్‌రెడ్డి, కనీ్వనర్ కుర్ర శ్రీనాథ్, కో కన్వీనర్ అరవింద్‌రావు, జాతీయ అధ్యక్షుడు రాంరెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.నేను మిడిల్ క్లాస్ సీఎంను తమ ప్రభుత్వం రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతో కృషి చేస్తోందని సీఎం తెలిపారు. ‘నేను సగటు మధ్యతరగతి అలోచన ఉన్న ముఖ్యమంత్రిని. సంపద కొల్లగొట్టి విదేశాలకు తరలించుకుపోవాలన్న అలోచన నాకు లేదు’అని స్పష్టంచేశారు. ప్రయాణికులు అధికంగా ఉండే మార్గాల్లోనే మెట్రో రైల్ విస్తరణ ఉంటుందని తేల్చి చెప్పారు.‘హైటెక్ సిటీ పక్కన చెరువులు, అడవులే అధికం. ఇక్కడ మెట్రో రైల్ ఎవరు ఎక్కుతారు? అందుకే నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఒవైసీ హాస్పిటల్, చాంద్రాయణగుట్ట, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కొత్త హైకోర్టు, శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రీడిజైన్ చేశాం. ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు, కూకట్పల్లి, బీహెచ్ఈఎల్, పటాన్చెరు దాటి మెట్రోను పొడిగించాలి. మెట్రోకి, మూసీ ప్రక్షాళనకు, ఎలివేటెడ్ కారిడార్స్కు అనుమతులతోపాటు నిధులు ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వమే. కేంద్రం నుంచి మేం తెచ్చిన అనుమతుల జాబితాను అసెంబ్లీలో పెడతాం’అని సీఎం తెలిపారు. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద!
న్యూఢిల్లీ: అమెరికాతో టారిఫ్లపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. జూలైలో నికరంగా రూ. 42,702 కోట్ల ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఈ విభాగానికి సంబంధించి నెలవారీగా చూస్తే ఇది రికార్డు స్థాయి. జూన్‌లో నమోదైన రూ. 23,587 కోట్లతో పోలిస్తే ఏకంగా 81 శాతం ఎగిశాయి. అలాగే, వరుసగా 53వ నెలా ఈక్విటీల్లోకి పెట్టుబడులు వచి్చనట్లు ఫండ్స్ పరిశ్రమ అసోసియేషన్ యాంఫీ విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడైంది. వీటి ప్రకారం పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) తొలిసారిగా రూ. 75 లక్షల మార్కును దాటింది. ‘టారిఫ్ యుద్ధం వల్ల అనిశ్చితి నెలకొన్నప్పటికీ భారత వృద్ధి గాథ పటిష్టంగానే ఉంది. నెమ్మదించిన ద్రవ్యోల్బణం, లిక్విడిటీ.. పొదుపు మెరుగుపడటం తదితర అంశాల ఊతంతో ఈక్విటీల్లోకి భారీగా పెట్టుబడులు వస్తుండటం ఇందుకు నిదర్శనం‘ అని యాంఫీ సీఈవో వెంకట్ ఎన్ చలసాని చెప్పారు. మార్కెట్లు మధ్యమధ్యలో కరెక్షన్లకు లోనవుతుండటమనేది ఇన్వెస్టర్లు ఎంట్రీ ఇచ్చేందుకు ఆకర్షణీయమైన అంశంగా నిలి్చందని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా ప్రిన్సిపల్ హిమాంశు శ్రీవాస్తవ తెలిపారు. యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. → జూలైలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలోకి రూ. 1.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూన్‌లో నమోదైన రూ. 49,000 కోట్లు, మే నెలలో రూ. 29,000 కోట్లతో పోలిస్తే ఇది గణనీయంగా అధికం. పెట్టుబడుల ప్రవాహంతో జూన్‌లో రూ. 74.4 లక్షల కోట్లుగా ఉన్న పరిశ్రమ ఏయూఎం జూలైలో రూ. 75.36 లక్షల కోట్లకు చేరింది. → ఈక్విటీ ఆధారిత ఫండ్స్‌కి సంబంధించి సెక్టోరల్/థీమాటిక్ ఫండ్స్‌లోకి అత్యధికంగా రూ. 9,426 కోట్లు నికరంగా వచ్చాయి. ఈ సెగ్మెంట్లో కొత్త స్కీములు మొత్తం రూ. 7,404 కోట్లు సమీకరించాయి. తర్వాత స్థానంలో రూ. 7,654 కోట్ల పెట్టుబడులతో ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఉన్నాయి. వివిధ మార్కెట్ క్యాపిటలైజేషన్లవ్యాప్తంగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉండటం వీటికి సానుకూలంగా నిలిచింది. ఇక స్మాల్ క్యాప్ ఫండ్స్ (6,484 కోట్లు), మిడ్ క్యాప్ ఫండ్స్ (రూ. 5,182 కోట్లు), లార్జ్..మిడ్ క్యాప్ ఫండ్స్ (రూ. 5,035 కోట్లు)లోకి కూడా భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీముల నుంచి మాత్రమే రూ. 368 కోట్లు తరలిపోయాయి. → జూన్‌లో నమోదైన రూ. 27,269 కోట్లతో పోలిస్తే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్) ద్వారా పెట్టుబడులు రూ. 28,464 కోట్లకు పెరిగాయి. → రూ. 1.06 లక్షల కోట్ల పెట్టుబడులతో డెట్ ఫండ్స్ జూలైలో పటిష్టంగా పుంజుకున్నాయి. లో–డ్యూరేషన్, మనీ మార్కెట్ ఫండ్స్‌తో పాటు లిక్విడ్, ఓవర్‌నైట్ ఫండ్స్‌లోకి కూడా పెట్టుబడులు వచ్చాయి. జూన్‌లో రూ. 1.711 కోట్ల పెట్టుబడులు నికరంగా తరలిపోయాయి. → గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు జూన్‌లో నమోదైన రూ. 2,081 కోట్లతో పోలిస్తే క్షీణించి రూ. 1,256 కోట్లకు పరిమితమయ్యాయి. వేగం నెమ్మదించినప్పటికీ వరుసగా మూడో నెలా ఇన్వెస్ట్మెంట్స్ రావడం గమనార్హం. అనిశ్చితి వేళ పెట్టుబడుల డైవర్సిఫికేషన్‌కి అనువైన సాధనంగా పసిడి ఆకర్షణీయత కొనసాగుతోందని మారి్నంగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మేష్రామ్ తెలిపారు. -
భయంతోనే బంగారం కొంటున్నారా?
పెట్టుబడుల ప్రపంచంలో వారెన్ బఫెట్ అగ్రస్థానంలో ఉన్నారు. అధిక రాబడులనిచ్చే స్టాక్స్ ఎంచుకునే చాతుర్యానికి పేరుగాంచిన బఫెట్ స్టాక్ మార్కెట్లో తిరుగులేని రారాజు. మరి ఆయన సంపద ఎంతనుకుంటున్నారు..? 140 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు రూ.12 లక్షల కోట్లు. ఇంత భారీ సంపద ఉన్నా ఆయన దగ్గర రవ్వంత బంగారం కూడా లేదంటే నమ్ముతారా?బంగారంపై ఇన్వెస్ట్ చేసే విషయానికి వస్తే వారెన్ బఫెట్ చాలా క్లియర్ గా ఉంటాడు. ఆయనకు బంగారంపై ఎటువంటి పెట్టుబడులు లేవు. బంగారం వంటి ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టకూడదనేది వారెన్ బఫెట్ గోల్డెన్ రూల్. తన వాల్యూ ఇన్వెస్ట్ మెంట్ స్ట్రాటజీకి బంగారం సరిపోదని కొన్నేళ్లుగా ఆయన చెబుతూ వస్తున్నారు. బఫెట్‌కు ఏకైక బంగారు పెట్టుబడి బారిక్ గోల్డ్ అనే గోల్డ్ మైనింగ్ కంపెనీలో ఉండేది. అది కూడా ఆయన అంతర్గత మనీ మేనేజర్లలో ఎవరైనా స్వతంత్రంగా పెట్టి ఉండవచ్చు. దాన్ని తర్వాత ఆరు నెలలోనే బఫెట్ విరిమించుకున్నారు.బఫెట్ దగ్గర బంగారం ఎందుకు లేదంటే..?బఫెట్ బంగారాన్ని ఉత్పాదకత లేని ఆస్తిగా భావిస్తారు. ‘బంగారంలో రెండు ముఖ్యమైన లోపాలు ఉన్నాయి. అది పెద్దగా ఉపయోగం లేనిది అలాగే ఉత్పాదకత లేనిది’ అని 2011లో వారెన్ తన షేర్ హోల్డర్లతో అన్నారు. బంగారానికి కొంత పారిశ్రామిక ఉపయోగం, ఆభరణాలుగా పనికొస్తుంది కానీ అంతకు మించి ఇంకేం లేదు. ఇది తప్పుడు పెట్టుబడి అనేది ఆయన అభిప్రాయం.2011లో బఫెట్ ఈ వైఖరి తీసుకున్నప్పుడు 1,750 డాలర్లుగా ఉన్న ఔన్స్ బంగారం ప్రస్తుతం 3,350 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంటే పద్నాలుగేళ్లలో బంగారం ధర రెట్టింపు అయింది. దీన్ని బట్టి బఫెట్ అభిప్రాయం తప్పని చాలా మందికి అనిపిస్తుంది. కానీ కాంపౌండ్ యాన్యువలైజ్డ్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) పరంగా చూస్తే ఇది కేవలం 5 శాతం మాత్రమే. ఇదే సమయంలో యూఎస్ స్టాక్స్ 14 శాతానికి పైగా సీఏజీఆర్ పెరిగాయి. కాబట్టి బంగారం విషయంలో బఫెట్ అభిప్రాయం కరెక్టే..బంగారం ధర పెరగడానికి భయమే కారణంపెట్టుబడిదారులకు వారెన్ బఫెట్ చెప్పే ప్రసిద్ధమైన మాట ఏమిటంటే ‘ఇతరులు అత్యాశతో ఉన్నప్పుడు భయపడాలి.. ఇతరులు భయంతో ఉన్నప్పుడు ఆశ పడాలి’. బంగారం విషయంలో ఇదే వర్తిస్తుందంటాయన. బంగారం ధర పెరగడానికి భయమే కారణమనేది ఆయన అభిప్రాయం. -
సిప్.. సిప్.. హుర్రే!
మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ సిప్ల (సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్) ద్వారా పెట్టుబడులు పెరగడం కొనసాగుతోంది. జూన్ త్రైమాసికంలో కొత్త సిప్ ఖాతాలు 1.67 కోట్ల మేర నమోదయ్యాయి. క్రితం క్వార్టర్లో నమోదైన 1.41 కోట్లతో పోలిస్తే ఇది అధికం. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ యాంఫీ విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వీటి ప్రకారం 41.9 లక్షల కొత్త సిప్‌లు, 25 శాతం మార్కెట్ వాటాతో గ్రో సంస్థ అగ్రగామిగా నిలిచింది. నెలవారీగా చూస్తే జూన్‌లో గ్రోలో కొత్త సిప్‌లు 15.7 లక్షలుగా రిజిస్టరయ్యాయి. విలువపరంగా చూస్తే కొత్త సిప్‌లు 32 శాతం పెరిగి రూ. 1,116 కోట్లకు చేరాయి. మరోవైపు, ఏంజెల్ వన్‌లో కొత్తగా 15 లక్షల సిప్‌లు, ఎన్జే ఇండియాఇన్వెస్ట్లో 5.9 లక్షలు, హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌లో 3.8 లక్షలు, డిజిటల్ ప్లాట్‌ఫాం ఫోన్‌పేలో 5.9 లక్షల సిప్‌లు నమోదయ్యాయి. ఈక్విటీ మార్కెట్లలో ఒడిదుడుకులు కొనసాగుతున్నప్పటికీ మ్యూ చువల్ ఫండ్స్‌పై రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తి మెరుగ్గానే ఉంటోంది.మరిన్ని వివరాలు..మ్యూచువల్ ఫండ్స్‌లో జూన్‌లో రికార్డు స్థాయిలో రూ. 27,269 కోట్ల మేర సిప్ పెట్టుబడులు వచ్చాయి. సిప్ల ఏయూఎం (నిర్వహణలోని ఆస్తుల పరిమాణం) గతేడాది జూన్ 30 నాటి గణాంకాలతో పోలిస్తే ఈసారి జూన్ 30 నాటికి రూ. 15.3 లక్షల కోట్లకు చేరింది. 2025లో మ్యూచువల్ ఫండ్ విశిష్ట ఇన్వెస్టర్ల సంఖ్య 5.4 కోట్లకు చేరింది. 2023లో 3.8 కోట్లతో పోలిస్తే 42 శాతం, 2024లోని 4.5 కోట్లతో పోలిస్తే 20 శాతం పెరిగింది. 2025 జూన్ ఆఖరు నాటికి పరిశ్రమ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రికార్డు స్థాయిలో 74.4 లక్షల కోట్లకు చేరింది. క్రితం క్యూ1లో నమోదైన రూ. 63.2 లక్షల కోట్లతో పోలిస్తే 18 శాతం పెరిగింది.రిటైల్ ఇన్వెస్టర్లు సంప్రదాయ పొదుపు విధానాల నుంచి పెట్టుబడుల మైండ్‌సెట్ వైపు మళ్లుతున్నారు. మ్యుచువల్ ఫండ్స్‌ను దీర్ఘకాలిక సంపద సృష్టి సాధనాలుగా భావిస్తున్నారు.సులభతరంగా ఇన్వెస్ట్ చేసే విధానాలను డిజిటల్–ఫస్ట్ ప్లాట్‌ఫాంలు మరింతగా అందుబాటులోకి తేవడంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అలాగే యాంఫీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు కూడా ఇన్వెస్టర్లలో అవగాహన పెంచేందుకు ఉపయోగపడుతున్నాయి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ విధానాన్ని ప్రోత్సహించడంలో, మ్యుచువల్ ఫండ్ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఇదీ చదవండి: కరెంట్ బిల్లు పరిధి దాటితే ఐటీఆర్ ఫైల్ చేయాల్సిందే! -
రిటైర్ అవుతున్నారా? అద్దె ఆదాయం కొంత వరకే!
పింఛను సదుపాయం ఏర్పాటు చేసుకున్న వారిని మినహాయిస్తే రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి స్థిరమైన ఆదాయం పెద్ద సవాలుగా మారుతుంది. రిటైర్మెంట్ తర్వాత స్థిరాస్తులు కొందరు ఇంటి అద్దె రూపంలో ఆదాయ మార్గంపై ఆధారపడుతుంటారు. కానీ ఇంటి అద్దె స్థిరమైనదని చెప్పలేం. కిరాయిదారు ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. కొత్త వారు రావడానికి కొంత సమయం పడితే అప్పటి వరకు అద్దె ఆదాయం ఉండదు.ఇంటికి మరమ్మతులు, పన్నులు తదితర ఇతర నిర్వహణ వ్యయాల భారం మోయాల్సి ఉంటుంది. ఇల్లు పాతదవుతుంటే అద్దె పెరుగుదల ఆశించిన మేర ఉండదు. కరోనా సమయంలో చాలా మంది ఇంటి అద్దెలను సకాలంలో చెల్లించలేకపోయారు. ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాల్లోనూ కిరాయిదారు అద్దెను సకాలంలో చెల్లించలేకపోవచ్చు. కొందరు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. కానీ, ఇందులో రిస్క్ ఎక్కువ. కాబట్టి పెట్టుబడులపై స్థిరమైన ఆదాయానికి మార్గం చూడాలి.పెట్టుబడి వృద్ధి చెందేలా..పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనం కచ్చితంగా ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందేలా ఉండాలి. అలాంటప్పుడే నెలవారీ రాబడి మేర ఉపసంహరించుకున్నా కానీ, పెట్టుబడి విలువను స్థిరంగా కాపాడుకోవచ్చు. ఈక్విటీలు ఈ విషయంలో ఎంతో మెరుగైనవి. ఉదాహరణకు రూ.20 లక్షల మొత్తాన్ని 7 శాతం రాబడినిచ్చే డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20,000 చొప్పున ఉపసంహరించుకున్నారనుకోండి. ఏడాది ముగిసిన తర్వాత రూ.18.92 లక్షల పెట్టుబడి మిగిలి ఉంటుంది. అంటే ఏడాదిలో రూ.3 లక్షలను ఉపసంహరించుకోవడంతో పెట్టుబడి సైతం రూ.1.08 లక్షలు తరిగింది.ఇదీ చదవండి: ‘వేగంగా ఏఐ విస్తరణ.. మార్పునకు సిద్ధపడాలి’ఇలాగే ఉపసంహరించుకుంటూ వెళితే 12 ఏళ్లకు ఆ పెట్టుబడి కరిగిపోతుంది. అదే ఈక్విటీల్లో అయితే 12% వరకు సగటు వార్షిక రాబడి ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉండే హైబ్రిడ్, సేవింగ్స్ ఫండ్స్‌లో అయితే 10% వరకు రాబడిని ఆశించొచ్చు. ఈ తరహా సాధనాలతో స్థిరమైన ఆదాయానికి తోడు పెట్టుబడినీ కాపాడుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. ఇదే రూ.20 లక్షలను 12% రాబడినిచ్చే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఉపసహరిస్తే 26 ఏళ్ల కాలానికి ఆ పెట్టుబడి స్థిర ఆదాయాన్నిస్తుంది. 10% రాబడి ప్రకారమైనా 17 ఏళ్ల పాటు ఆదాయాన్నిస్తుంది. వార్షిక రాబడి రేటులో మైనస్ 3% చొప్పున ఉపసంహరణకు పరిమితం కావడం వల్ల.. మిగిలిన 3% పెట్టుబడి వృద్ధికి చాన్సుంటుంది. దీంతో ద్రవ్యోల్బణం వల్ల పెరిగే జీవన వ్యయాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. -
ఐటీసీ రూ.20,000 కోట్ల పెట్టుబడులు
కోల్‌కతా: ఐటీసీ మధ్య కాలానికి తన వ్యాపారాలపై రూ.20,000 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. తద్వారా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేసుకోనున్నట్టు చైర్మన్, ఎండీ సంజీవ్ పురి ప్రకటించారు. ఏ వ్యాపారాలపై వెచ్చించేదీ స్పష్టం చేయలేదు. ఇటీవలి కాలంలో ఎనిమిది ప్రపంచస్థాయి తయారీ కేంద్రాలపై రూ.4,500 కోట్లను ఐటీసీ ఖర్చు చేసినట్టు కంపెనీ వార్షిక సమావేశంలో వాటాదారులకు వెల్లడించారు. ఎఫ్ఎంసీజీ, ప్యాకేజింగ్, ఎగుమతులకు సంబంధించి విలువ ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులపై ఈ పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. 40 అత్యాధునిక తయారీ వసతులను నిర్మించినట్టు గుర్తు చేశారు. 250 తయారీ కేంద్రాలు, 7,500 ఎంఎస్ఎంఈలతో కూడిన ఐటీసీ ఎకోసిస్టమ్‌ను ఇవి బలోపేతం చేస్తాయన్నారు. ‘‘కంపెనీ వ్యాపారాలన్నింటా 90 శాతం మేర అదనపు విలువ జోడింపు చర్యలను చేపట్టాం. వేగంగా వృద్ధి చెందుతున్న ఆన్లైన్ ఫుడ్ సేవల విభాగంలోకి ప్రవేశించాం. ఇప్పటికే ఐదు పట్టణాల్లో 60 క్లౌడ్ కిచెన్లను ‘ఐటీసీ మాస్టర్ చెఫ్ ఆపరేషన్స్, ఆశీర్వాద్ సౌల్ క్రియేషన్స్, సన్‌ఫీస్ట్ బేక్డ్ క్రియేషన్స్, శాన్షో బ్రాండ్ల కింద ఏర్పాటు చేశాం’’అని సంజీవ్ పురి వివరించారు. మూడేళ్లలో ఈ వ్యాపారం ఏటా 108 శాతం వృద్ధిని చూసినట్టు చెప్పారు. గత మూడేళ్లలో 300 కొత్త ఉత్పత్తులను కంపెనీ విడుదల చేసినట్టు వాటాదారుల ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భారత బ్రాండ్లు ప్రపంచ వేదికపై సత్తా చాటాలన్నది తమ అభిమతమంటూ.. ఈ విషయంలో భారత్‌కే తొలి ప్రాధాన్యమని చెప్పారు. డీమెర్జర్‌పై సరైన సమయంలో నిర్ణయాలు ఐటీసీ ఇన్ఫోటెక్ సహా తన వ్యాపారాల డీమెర్జర్ (వేరు చేసి లిస్ట్ చేయడం) విషయమై ఎప్పటికప్పుడు అవకాశాలను ఐటీసీ మదింపు వేస్తుందని సంజీవ్ పురి తెలిపారు. పోటీ వాతావరణం, వ్యాపారం పరిపూర్ణతకు రావడం, అవకాశాలు, విలువ జోడింపు తదితర అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. -
హైదరాబాద్ కంపెనీ.. రూ.1,000 కోట్ల పెట్టుబడులు
గ్లాస్ కంటైనర్ల తయారీ సంస్థ ఏజీఐ గ్రీన్‌ప్యాక్ సంస్థ కొత్తగా అల్యూమినియం క్యాన్ల విభాగంలోకి ప్రవేశిస్తోంది. ఇందుకోసం ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్త ప్లాంటుపై రూ. 1,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. రెండు దశలుగా ఈ పెట్టుబడులు పెట్టనున్నట్లు కంపెనీ సీఎండీ సందీప్ సోమానీ తెలిపారు.ఇది తొలుత 95 కోట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో 2028 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అందుబాటులోకి రాగలదని చెప్పారు. దీన్ని 2030 ఆర్థిక సంవత్సరం నాటికి 160 కోట్లకు పెంచుకోనున్నట్లు సందీప్ తెలిపారు. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత క్యూ1తో పోలిస్తే 41%పెరిగి రూ. 63 కోట్ల నుంచి రూ. 89 కోట్లకు చేరింది.మెరిల్లో ఏడీఐఏ 200 మిలియన్ డాలర్ల పెట్టుబడులుఅబుదాబీ ఇన్వెస్ట్మెంట్ ఆథారిటీ(ఏడీఐఏ), భారత్‌కు చెందిన మెడికల్ డివైజెస్ తయారీ సంస్థ మైక్రో లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(మెరిల్)లో 200 మిలియన్ డాలర్ల(రూ.1,670 కోట్లు) పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడితో మెరిల్లో ఏడీఐఏకు 3% వాటా లభించనుంది.తద్వారా మెరిల్ మార్కెట్ విలువ 6.6 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.56,859 కోట్లు)చేరుతుందని అంచనా. పెట్టుబడి నిధులను వ్యాపార విస్తరణ, పరిశోధన–అభివృద్ధి (ఆర్అండ్డీ) కార్యకలాపాలకు వినియోగించుకుంటామని మెరిల్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ భట్ తెలిపారు. గుజరాత్‌లోని వాపి కేంద్రంగా పనిచేసే మెరిల్ సంస్థ... గుండె సంబంధిత పరికరాలు, సర్జికల్ రోబోటిక్స్, ఆర్థోపెడిక్ ఇంప్లాంట్లు వంటి వైద్య పరికరాలు తయారు చేస్తుంది. -
CBN: హద్దుల్లేని స్వోత్కర్ష ఎంత కాలం?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌లు పెట్టుబడులకు సంబంధించి చేసే ప్రకటనలు గమ్మత్తుగా ఉంటాయి. ఎప్పుడు ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతారో.. ఎవరూ ఊహించ లేరు. తాజాగా చంద్రబాబు ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిందని అన్నారు. దాంతోపాటే ఎనిమిదిన్నర లక్షల ఉద్యోగావకాశాలు వస్తాయని అని కూడా వక్కాణించారు. రానున్న నాలుగేళ్లలో ఇంకో రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధిస్తామని కూడా చెప్పారు. నిజమైతే సంతోషపడవచ్చు కానీ.. రాష్ట్రంలో పరిస్థితులు అలా లేవు. ఇండోసోల్ వ్యవహారమే పైన చెప్పుకున్నదానికి ఒక ఉదాహరణ. ఈ కంపెనీ సౌర విద్యుత్తు పరిశ్రమ కోసం రూ.70 వేల కోట్ల పెట్టుబడులు సిద్ధం చేసుకుంది. ఇప్పటికే వందల కోట్ల రూపాయల వ్యయం కూడా చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం తీరు పుణ్యమా అని ఇప్పుడు ఆ కంపెనీ భవిష్యత్తు గందరగోళంలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఏ కంపెనీ కూడా సాహసిస్తుందా?. ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో చంద్రబాబు మాట్లాడుతూ టాటా గ్రూపు సంస్థల ఛైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలోని బృందం తయారు చేసిన టాస్క్‌ఫోర్స్ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదిలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు చెప్పారు. అయితే ఇది ఆ సమావేశంలో పాల్గొన్న వారికి కూడా ఆశ్చర్యం కలిగించి ఉంటుంది. చంద్రశేఖరన్ వంటి బిజీ పారిశ్రామికవేత్త ఒక రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక తయారు చేసేంత తీరిక ఉంటుందా? అన్నది ప్రశ్న. నివేదికకు కాస్త మర్యాద దక్కుతుందని ఆయన పేరు జోడించారేమో తెలియదు! అయినా ఫర్వాలేదు కానీ ఆ నివేదికను పరిశీలించినా, చంద్రబాబు మాటలు చూసినా నేల విడిచి సాము చేసే తీరులోనే ఉన్నట్టు అనిపించక మానదు. 2014-19 మధ్యకాలంలోనూ చంద్రబాబు ఇలాంటి సమావేశాలు బోలెడు పెట్టారు. అదిగో పెట్టుబుడులు.. ఇదిగో అభివృద్ధి అని డాబుసరి కబుర్లు చెప్పేవారు. 2029 నాటికి ఏపీ దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రం అవుతుందని, ఆ తర్వాత ప్రపంచంలోనే టాప్-5లో ఉంటుందని ఏవేవో చెప్పేవారు. అంతేకాదు.ఆయా జిల్లాలలో ఏఏ రంగాలను అభివృద్ది చేస్తారో, ఏ ప్రాజెక్టులు వస్తాయో చెబుతూ అసెంబ్లీలో పెద్ద స్పీచ్ ఇచ్చారు కూడా. అప్పట్లో వైసీపీలో ఉండి.. ఇప్పుడు టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చంద్రబాబు ప్రకటనలు రియల్ ఎస్టేట్ బ్రోచర్తో పోల్చారు కూడా. చివరకు అయ్యింది కూడా అదే. చంద్రబాబు హామీలేవీ అమలు కాలేదు.2024లో అధికారం దక్కిన తరువాత మరోమారు చంద్రబాబు తన పాత స్టైల్‌ను భుజాలకు ఎత్తుకున్నట్లు కనిపిస్తోంది తాజా ప్రకటన చూస్తే. గత ఏడాది దావోస్ పర్యటనకు ముందు కూడా నానా ఆర్భాటమూ జరిగింది. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తాయని టీడీపీ మీడియా ఊదరగొట్టింది. తీరా చూస్తే వచ్చింది హళ్లికి హళ్లి! దీని కవరింగ్ కోసం ‘‘ఏపీ గుడ్‌విల్ పెంచేందుకు వెళ్లాము తప్ప పెట్టుబడుల కోసం కాదు’’ అన్న బుకాయింపులు! దావోస్ పర్యటన వైఫల్యంతో చంద్రబాబు తన రూటు మార్చారు. కొంతకాలం తరువాత రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయి అని ప్రకటించారు. ఆ తరువాత ఈ అంకెలు ఐదు లక్షల కోట్లకు, మరికొన్ని నెలలకు ఎనిమిది లక్షల కోట్లకు చేరుకున్నాయి. మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని శాసనమండలిలోనూ ప్రకటించారు. లక్షల ఉద్యోగాలు వచ్చేశాయన్న చందంగా జవాబు ఇవ్వడం వివాదాస్పదమైంది కూడా. ఇప్పుడు తాజాగా చంద్రబాబు పాట రూ.పది లక్షల కోట్లకు చేరుకుంది!. పారిశ్రామిక దిగ్గజాలుగా పేరొందిన మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ వంటి రాష్ట్రాలకే మూడు, నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం కష్టంగా ఉంటే, ఆ స్థాయిలో పారిశ్రామికీకరణ జరగని ఏపీకి ఏడాదిలోనే రూ.పది లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వస్తున్నాయని సీఎం చెబితే వెరైనా నమ్ముతారా? సీఐఐ సదస్సుల్లో పాల్గొనే పారిశ్రామికవేత్తలకు ఈ విషయాలు తెలియవా? కనీసం వచ్చిన పెట్టుబడులు ఏ ఏ రంగాలకు చెందినవి, ఏ కంపెనీలు పెడుతున్నాయని చెప్పి ఉంటే కొంతైనా నమ్మకం కలిగేదేమో! అదేమీ చేయరు. తోచిన గణాంకాలు చెప్పడం తప్ప వాటికి ఆధారాలు చూపే అలవాటు లేదు. గతంలో జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తోందంటూ నోటికి వచ్చిన అంకెను చెబుతుండే వారు. చివరకు ఈ అప్పుల అంకె రూ.14 లక్షల కోట్లకు చేరుకుంది కూడా. కానీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక మంత్రి స్వయంగా అప్పులు రూ.ఆరు లక్షల కోట్లేనని ఒప్పుకోవాల్సి వచ్చింది. చంద్రబాబు వ్యవహార శైలి ఇలా ఉంటుంది!. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్శించాలన్న చిత్తశుద్ధి ఉంటే.. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రామాయపట్నం వద్ద ఇండోసోల్ రూ.40 వేల కోట్లతో ప్రతిపాదించిన సౌరశక్తి పరిశ్రమకు కొత్త చిక్కులు తెచ్చే వారా! ఆ కంపెనీ ఇప్పటికే రూ.1200 కోట్ల వరకూ వ్యయం చేసింది. పంటలు పెద్దగా పండని భూములు ఐదువేల ఎకరాలను ఈ కంపెనీ రూ.500 కోట్లతో సేకరిస్తే... ప్రభుత్వం ఇప్పుడు వాటిని వెనక్కు తీసుకోవాలని ప్రయత్నించడం ఎంతవరకూ సబబు? భూములివ్వమని భీష్మించుకున్న కరెడు ప్రాంతంలో భూ సేకరణకు నోటిఫికేషన్ ఇవ్వడం ఆ కంపెనీ భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టేయడమే అవుతుంది. పైగా ఇండోసోల్ సేకరించిన భూమిని వస్తుందో, రాదో తెలియని బీపీసీఎల్‌కు ఇస్తారట. దీనికి వేరేచోట భూమి కేటాయిస్తే నష్టమేమిటి? ఈ విషయాలు.. దాని వెనుక మతలబులు పారిశ్రామిక వర్గాలకు తెలియకుండా ఉంటాయా?.. రానున్న పాతికేళ్లలో 2.4 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యమని కూడా చంద్రబాబు ఆ సమావేశంలో ప్రకటించారు. ఇది కూడా గతంలో చంద్రబాబు చెప్పిన ‘విజన్-2020’ బాపతు వ్యవహారమే. ఒక్కసారి ఆ డాక్యుమెంట్ తరచి చూస్తే బాబుగారి డొల్లతనం ఏమిటో బయటపడుతుంది. పాతికేళ్ల క్రితం కుటుంబానికో ఐటి ఫ్రొఫెషనల్ నినాదంతో పని చేశామని చంద్రబాబు చెప్పడం ఇంకో విడ్డూరం. బెంగళూరు, చెన్నై, పూణె వంటి నగరాలు ఐటీకి పెట్టింది పేరుగా ఉన్న ఆ సమయంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐటీ రంగం పురోగమించాలన్న లక్ష్యంతో హైటెక్ సిటీకి శంకుస్థాపన కూడా చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తరువాత సీఎం పీఠమెక్కిన చంద్రబాబు భవన నిర్మాణాన్ని పూర్తి చేశారు. అంతే. కానీ.. హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని తానే మొదలుపెట్టానని, హైటెక్ సిటీ మొత్తం తన సృష్టి అని మాట్లాడటం అతిశయోక్తి తప్ప ఇంకోటి కాదు. 2004- 2009 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్‌రోడ్డు వంటి అద్భుత మౌలిక సదుపాయాలను కల్పించారు. దీంతో నగరం రూపురేఖలు మరింత మారిపోయాయి. కానీ కాంగ్రెస్ పార్టీ దానిని సరిగా ప్రచారం చేసుకోలేకపోయింది.2004లో ఓటమి పాలైన తర్వాత చంద్రబాబుకు హైదరాబాద్‌తో అధికారికంగా సంబంధం లేనట్లే. కానీ.. రెండు దశాబ్దాల తర్వాత కూడా హైదరాబాద్ తనే అభివృద్ది చేశానని చెప్పుకుంటూటారు ఆయన! విభజన తరువాత 2014లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యారు. ఐటీలో హైదరాబాద్‌ను తానే వృద్ధి చేశానని చెప్పిన మాటలే నిజమైతే 2014- 19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్‌కు ఆ స్థాయిలో ఎందుకు ఐటీ పరిశ్రమలను తేలేకపోయారన్నది ప్రశ్న. విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాలను ఎందుకు అభివృద్ది చేయలేకపోయారు? స్వోత్కర్ష చంద్రబాబుకు బాగా వచ్చు. మిగిలిన వారు సెల్ఫ్ డబ్బా అని విమర్శించినా పట్టించుకోరు. ఇతర రాష్ట్రాల నుంచో, ఇతర దేశాల నుంచో ఎవరో ఒకరిని తీసుకు వస్తారు. మర్యాద కోసం వారు ఆయనను ఉద్దేశించి ఒక మాట పొగిడితే, దానిని తెలుగుదేశం మీడియాతో హోరెత్తేలా ప్రచారం చేయించుకోగలరు. ఇప్పుడు పది లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని చెప్పడం కూడా అలాంటి వ్యూహంలో ఒక భాగమే!.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
భారత్‌లోకి ప్రత్యామ్నాయ పెట్టుబడుల వెల్లువ
కోల్‌కతా: దేశీయంగా ప్రత్యామ్నాయ పెట్టుబడుల మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది. ఈక్విటీలతో పోలిస్తే తక్కువ రిస్క్‌లు, ఒడిదుడుకులతో అత్యధిక రాబడులను కోరుకునే ఫ్యామిలీ ఆఫీస్‌లు, కార్పొరేట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు వీటి వైపు మొగ్గు చూపుతున్నట్లు పరిశ్రమ నిపుణులు తెలిపారు. దీనితో ఈ విభాగంలోకి గణనీయంగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వెంచర్ క్యాపిటల్, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, కమోడిటీల్లాంటివి ప్రత్యామ్నాయ పెట్టుబడుల కేటగిరీలోకి వస్తాయి. 2025 మార్చి నాటికి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌లోకి (ఏఐఎఫ్) రూ. 13.5 లక్షల కోట్ల పెట్టుబడులు హామీలు వచి్చనట్లు ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ హోల్–టైమ్ సభ్యుడు అనంత నారాయణ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఇది రూ. 1.7 లక్షల కోట్లు అధికమని వివరించారు. గత అయిదేళ్లుగా చూస్తే ఏఐఎఫ్ ఇన్వెస్ట్మెంట్ హామీలు, పెట్టుబడులు వార్షికంగా 30 శాతం వృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. భారత్‌లో ఈ విభాగం ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ. 25,000–40,000 కోట్లుగా ఉన్న పరిశ్రమ 2027 నాటికి పది రెట్లు పెరిగి రూ. 2 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నట్లు కార్యక్రమంలో పాల్గొన్న అథా గ్రూప్ ప్రెసిడెంట్ విశాల్ విఠ్లానీ తెలిపారు. సంప్రదాయ ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాలతో పోలిస్తే అత్యధికంగా 16–18 శాతం ఈల్డ్‌లు అందిస్తూ, ఏఐఎఫ్‌లు ప్రస్తుతం ఆకర్షణీయంగా ఉన్నాయని పేర్కొన్నారు. -
మన రైతులకు కావాలి... రూ. 6.4 లక్షల కోట్లు!
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులను తట్టుకుని రైతులు అభివృద్ధి చెందాలంటే భారత్‌లో రైతులకు ఏకంగా 75 బిలియన్ డాలర్ల (రూ.6.4 లక్షల కోట్ల)పెట్టుబడులు అవసరమని ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (ఐఎఫ్ఏడీ)అధ్యక్షుడు అల్వారో లారియో అన్నారు. ప్రపంచవ్యాప్తంగానే గాక భారత్‌లోనూ గ్రామీణ సమాజాలకు సాయం అందించడం అతి పెద్ద సవాలని ఆయన తెలిపారు. వ్యవసాయాన్ని రైతులకు మరింత లాభదాయకంగా చేయడం, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ఉత్పాదకతను పెంచుకోవడం, ఆహార భద్రత నుంచి పోషకాహార భద్రతకు ఎదగడం వంటి అంశాలపై ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. ‘‘భారత్‌లోని రైతుల్లో చిన్న, సన్నకారు రైతులు 86.2శాతం మంది ఉన్నారు. నీటికొరత, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచుగా కరువులు ఎదుర్కొంటున్నారు. కొన్ని వాతావరణ స్మార్ట్ పద్ధతులను అవలంబించడానికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి పెట్టుబడులు పెట్టాలి. పంటల వైవిధ్యం, మెరుగైన నీటి నిర్వహణ లేదా సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థలు, కమ్యూనిటీ విత్తన బ్యాంకులను సృష్టించడం, కరువును తట్టుకునే విత్తనాలను ఉపయోగించడం ద్వారా రైతుల ఆదాయాన్ని పెంచడంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇవి దిగుబడిని పెంచుతాయి’’ అని లారియో తెలిపారు. ‘‘పేదరైతులకు పెట్టుబడులు, వారికి మార్కెట్ అనుసంధానం కీలకం’’ అన్నారు. -
ప్రపంచ దేశాలతోనే పోటీ: సీఎం రేవంత్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తుల ఎగుమతి విషయంలో మాకు దేశంలోని ఏ రాష్ట్రంతోనూ పోటీ లేదు. అమెరికా, సింగపూర్, కొరియా, యూకే వంటి అభివృద్ధి చెందిన ప్రపంచ దేశాలతోనే మాకు పోటీ ఉంటుంది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై సహా దేశంలోని ఏ ఒక్క నగరం కూడా మన హైదరాబాద్‌తో పోటీ పడలేదు..’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహేశ్వరం మండలంలోని పారిశ్రామిక జనరల్ పార్క్‌లో 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన మలబార్ బంగారు, వజ్రాభరణా ల తయారీ సంస్థను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ‘తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. ఇక్కడ పెట్టుబడి పెట్టిన వారికి, వారి ఆస్తులకు పూర్తి రక్షణ లభిస్తుంది. గత 20 ఏళ్లలో పాలకులు మారారే కానీ.. పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ఆయా ప్రభుత్వాల విధానాలు మాత్రం మారలేదు. మేం పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి దారులను కడుపులో పెట్టి చూసుకుంటుంది. ఇక్కడ పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు ఆర్జించొచ్చు. కొనుగోళ్లలో తెలుగు మహిళల ముందంజ బంగారు, వజ్రాభరణాల కొనుగోలు విషయంలో ఇతర రాష్ట్రాల మహిళలతో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల మహిళలే ముందుంటారు. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల మహిళలు ఉంటారు. బంగారు ఆభరణాల తయారీకి మహేశ్వరం అనువైన ప్రదేశం. ఇక్కడ దేశంలోనే అతిపెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేయడం అబినందనీయం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మహేశ్వరం, ముచ్చర్ల, బేగరి కంచె కేంద్రంగా 30 వేల ఎకరాల్లో భారత ఫ్యూచర్ సిటీని తీర్చి దిద్దబోతున్నాం. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే కాదు వారికి లభాలు చేకూరేలా ప్రభుత్వం సహకరిస్తుంది..’అని సీఎం హామీ ఇచ్చారు. తయారీ రంగానికీ హబ్‌గా మార్చేందుకు కృషి: శ్రీధర్‌బాబు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా రంగాల మాదిరే తయారీ రంగానికీ తెలంగాణను హబ్‌గా మార్చేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లు చెప్పారు. తెలంగాణ తయారీ రంగం గ్రాస్ వాల్యూ యాడెడ్ (జీవీఏ) 2022–23లో రూ.1.34 లక్షల కోట్లు ఉండగా, 2023–24లో 9 శాతం వృద్ధితో రూ.1.46 లక్షల కోట్టకు చేరిందని తెలిపారు. తెలంగాణ జీఎస్డీపీలో తయారీ రంగం వాటా 19.5 శాతం ఉండగా, జాతీయ స్థాయిలో ఇది 17.7 శాతమే ఉందని చెప్పారు. తెలంగాణ తయారీ రంగ ఎగుమతులు రూ.1.2 లక్షల కోట్ల మార్కు దాటాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్, ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్, మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
స్వల్పకాల పెట్టుబడికి మెరుగైన సాధనాలు
నేను స్వల్పకాలం కోసం పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూలమైన సాధనాలు ఏవి? – నళినీ ప్రకాశ్స్వల్పకాలం కోసం పెట్టుబడులు పెట్టే వారు పెట్టుబడిని కాపాడుకోవడానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పెట్టుబడి భద్రంగా ఉన్నప్పుడే రాబడులు సాధ్యపడతాయి. స్వల్పకాల పెట్టుబడులకు సంబంధించి ఇన్వెస్టర్ల ముందు పలు ఆప్షన్లు ఉన్నాయి. బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లో ఇన్వెస్ట్ చేయడం ఒక మార్గం. సేవింగ్స్ ఖాతాలో ఉంచడం వల్ల వచ్చే రాబడి కంటే ఎఫ్‌డీలోనే అధికంగా లభిస్తుంది. కచ్చితమైన రాబడి కావాలని కోరుకునే వారికి ఎఫ్డీ కంటే మెరుగైన సాధనం లేదు. బ్యాంకులో రూ.5 లక్షల వరకు డిపాజిట్‌పై బీమా రక్షణ ఉంటుంది. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ (డీఐసీజీసీ) రూపంలో ఆర్బీఐ ద్వారా ఈ బీమా సదుపాయం లభిస్తుంది. ఒకవేళ బ్యాంకు సంక్షోభంలో పడినా రూ.5 లక్షల వరకు ఒక వ్యక్తికి భరోసా ఉంటుంది. కానీ, ఈ తరహా సందర్భాలు చాలా అరుదనే చెప్పుకోవాలి. ఎఫ్‌డీల రూపంలో వచ్చే వడ్డీ ఆదాయం సంబంధిత పెట్టుబడిదారుడి వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఎఫ్డీపై రాబడి పన్ను వర్తించే ఆదాయం కిందకే వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉంటే కనుక ఎఫ్డీ ద్వారా వచ్చే నికర ఆదాయం పెద్దగా ఉండదని అర్థం చేసుకోవాలి. డెట్ మ్యూచువల్ ఫండ్స్ఇక స్వల్పకాల పెట్టుబడుల కోసం డెట్ మ్యూచువల్ ఫండ్స్‌ను కూడా పరిశీలించొచ్చు. ఫండ్స్ నుంచి పెట్టుబడిని వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను పడుతుంది. డెట్ ఫండ్‌లో స్వల్ప, దీర్ఘకాల మూలధన లాభం అని లేదు. 2023 ఏప్రిల్ 1 నుంచి డెట్ సాధనాల్లో పెట్టుబడులు పెట్టి.. ఆ తర్వాత కాలంలో విక్రయించినట్టయితే వచ్చే మూలధన లాభం సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఏ శ్లాబు పరిధిలో ఉండే ఆ రేటును చెల్లించాల్సి వస్తుంది. ఇన్వెస్టర్లు తమ అవసరాలు, పరిస్థితులకు అనుగుణంగా వీటిల్లో అనుకూలమైనదాన్ని ఎంపిక చేసుకోవాలి. కొన్ని వారాల నుంచి కొన్ని నెలల కోసం అయితే మంచి లిక్విడ్ ఫండ్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఒక ఏడాది అంతకుమించిన కాలానికి అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ మంచి ఎంపిక. అంతకుమించిన కాలానికి అయితే షార్ట్ డ్యురేషన్ ఫండ్ అనుకూలం. డెట్ ఫండ్స్ అన్నవి రాబడులకు కానీ, పెట్టుబడికి కానీ హామీ ఇవ్వవు. కానీ, ఎఫ్‌డీల్లో పెట్టుబడి, రాబడికి హామీ ఉంటుంది. డెట్ ఫండ్స్‌లో మెరుగైన రేటింగ్ పేపర్లలో ఇన్వెస్ట్ చేసే పథకాన్ని ఎంపిక చేసుకోవాలి. తక్కువ నాణ్యమైన పేపర్లలో పెట్టుబడులు పెట్టే డెట్ ఫండ్స్‌లో రాబడులతో పాటు రిస్క్ కూడా ఎక్కువ. డిపాల్ట్ రిస్క్ ఉంటుంది. నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్ చాలా ఉన్నాయి కదా.. వీటి నుంచి మంచి పథకాన్ని ఎలా ఎంపిక చేసుకోవాలి? – వెంకటస్వామిఇండెక్స్ ఫండ్ ఎంపిక విషయంలో ముఖ్యంగా చూడాల్సింది ఎక్స్పెన్స్ రేషియో. ప్రస్తుతం ఇండెక్స్ ఫండ్స్ మధ్య చాలా పోటీ ఉంది. 10–15 బేసిస్ పాయింట్ల (0.1–0.15 శాతం) ఎక్స్పెన్స్ రేషియోకే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కనుక అంతకంటే ఎక్కవ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతోపాటు ట్రాకింగ్ ఎర్రర్‌ను కూడా గమనించాలి.ఇదీ చదవండి: ఐటీ అధికారులకు సీబీడీటీ సూచనఒక ఇండెక్స్ ఫండ్.. అది పెట్టుబడులను అనుసరించే ఇండెక్స్‌తో పోలిస్తే రాబడుల విషయంలో ఎంత మెరుగ్గా పనిచేసిందన్నది తెలియజేస్తుంది. ఇండెక్స్ ఫండ్ నిర్వహణ బృందం సామర్థ్యాన్ని ఇది ప్రతిఫలిస్తుంది. తక్కువ ఎక్స్పెన్స్ రేషియోతోపాటు.. ట్రాకింగ్ ఎర్రర్ తక్కువగా ఉన్న పథకం మెరుగైనది అవుతుంది. ఈ రెండు అంశాలను ప్రామాణికంగా ఇండెక్స్ ఫండ్‌ను ఎంపిక చేసుకోండి.-ధీరేంద్ర కుమార్, సీఈఓ వ్యాల్యూ రీసెర్చ్. -
మార్కెట్ మరింత స్పీడు!
ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్లు మరింత జోరు చూపవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. గత వారం అంచనాలకు అనుగుణంగా బీఎస్ఈ సెన్సెక్స్ 84,000 పాయింట్ల మైలురాయిని అధిగమించగా.. ఎన్ఎస్ఈ నిఫ్టీ సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్‌ను దాటి నిలిచింది. ఈ స్పీడ్ కొనసాగనున్నట్లు అధిక శాతం మంది నిపుణులు భావిస్తున్నారు. వివరాలు చూద్దాం.. – సాక్షి, బిజినెస్ డెస్క్దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌కు ఇకపై ఆర్థిక గణాంకాలు కీలకంగా నిలవనున్నాయి. నేడు(30న) మే నెలకుగాను వార్షికంగా పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ), కరెంట్ ఖాతా 2025 జనవరి–మార్చి లోటు గణాంకాలు వెలువడనున్నాయి. ఏప్రిల్‌లో ఐఐపీ 2.7 శాతం పుంజుకుంది. 2024 అక్టోబర్–డిసెంబర్లో 11.5 బిలియన్ డాలర్ల లోటు నమోదైంది. మంగళవారం(జులై 1న) జూన్ నెలకు తయారీ రంగ పీఎంఐ, 3న సర్విసుల రంగ పీఎంఐ వివరాలు వెల్లడికానున్నాయి. ఆర్డర్లరాకతోపాటు పరిశ్రమల రంగ ప్రగతిని తయారీ పీఎంఐ తెలియజేయనున్నట్లు బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ పేర్కొంది. వీటికితోడు రుతుపవన కదలికలకు ప్రాధాన్యత ఉన్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. విదేశీ అంశాలు.. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ మార్కెట్లకు సానుకూల అంశంకాగా.. 1న జపనీస్ తయారీ రంగ క్యూ1 వివరాలు వెల్లడికానున్నాయి. ఇదే రోజు జూన్ నెలకు చైనా తయారీ పీఎంఐ తెలియనుంది. 3న జూన్ నెలకు యూఎస్ ఉపాధి, నిరుద్యోగ గణాంకాలు వెలువడనున్నాయి. ఇవికాకుండా 9న యూఎస్ టారిఫ్‌ల గడువు ముగియనుంది. యూఎస్, భారత్ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు తగ్గడంతో చమురు ధరలు చల్లబడ్డాయి. ఈ నేపథ్యంలో విదేశీ అంశాలు సైతం కీలకంగా నిలవనున్నట్లు నాయిర్ తెలియజేశారు. ఎఫ్‌పీఐల దన్ను విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) గత వారం భారీస్థాయిలో రూ. 13,108 కోట్ల విలువైన దేశీ స్టాక్స్ కొనుగోలు చేశారు. ఫలితంగా జూన్‌లో ఇంతవరకూ నికరంగా రూ. 8,915 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లయ్యింది. ఆర్బీఐ రెపో రేటులో 0.5 శాతం కోతకుతోడు.. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాలు ఉపశమించడం, యూఎస్ టారిఫ్‌ల ఆందోళనలు సైతం తగ్గడం ఎఫ్‌పీఐల పెట్టుబడులకు దోహదం చేస్తున్నట్లు జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడుల ప్రధాన వ్యూహకర్త వీకే విజయకుమార్ తెలియజేశారు. గతేడాది అక్టోబర్ మొదలు అమ్మకాలకే ప్రాధాన్యమిస్తూ వచి్చన ఎఫ్‌పీఐలు ఏప్రిల్ చివరి నుంచి దేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపుతూ వస్తున్నారు. వెరసి ఏప్రిల్‌లో నికరంగా రూ. 4,223 కోట్లు ఇన్వెస్ట్ చేయగా..మే నెలలో రూ. 19,860 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.26,100 పాయింట్లపై కన్ను అత్యధిక శాతం మంది విశ్లేషకులు అంచనా వేసినట్లుగానే గత వారం దేశీ స్టాక్ మార్కెట్లలో బ్రేకవుట్ నమోదైంది. 5 వారాలుగా ఒక పరిమిత శ్రేణిలోనే కదిలిన మార్కెట్లు పరిధిని చేదించాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ అంచనాలకు అనుగుణంగా సాంకేతికంగా కీలకమైన 25,200 పాయింట్ల రెసిస్టెన్స్‌ను అధిగమించి నిలిచింది. ఫలితంగా 25,600 పాయింట్లను దాటింది. బీఎస్ఈ సెన్సెక్స్ 84,000 పాయింట్ల మైలురాయిని మరోసారి అధిగమించింది. ఈ బాటలో మరింత బలపడే వీలున్నట్లు స్టాక్ నిపుణులు విశ్లేíÙస్తున్నారు. వెరసి నిఫ్టీ 25,800 పాయింట్లను దాటి 26,100వరకూ పరుగు తీయవచ్చని భావిస్తున్నారు. మధ్యకాలంలో నిఫ్టీ చరిత్రాత్మక గరిష్టం 26,277 పాయింట్లవైపు పరుగు తీయవచ్చని అంచనా వేస్తున్నారు. ఇలాకాకుండా బలహీనపడితే 25,300 వద్ద మద్దతు లభించే వీలున్నట్లు పేర్కొన్నారు. గత వారమిలా ఐదు వారాల కన్సాలిడేషన్ తదుపరి గత వారం చివరి 4 రోజుల్లో మార్కెట్లు జోరందుకున్నాయి. సెన్సెక్స్ 2,162 పాయింట్లు జంప్‌చేసింది. దీంతో నికరంగా గత వారం సెన్సెక్స్ 1,651 పాయింట్లు(2 శాతం) జమ చేసుకుంది. 84,059 వద్ద ముగిసింది. ఈ బాటలో చివరి 4 రోజుల్లో 666 పాయింట్లు దూసుకెళ్లిన నిఫ్టీ నికరంగా 525 పాయింట్లు(2.1 శాతం) లాభపడింది. 25,638 వద్ద స్థిరపడింది. ఇక బీఎస్ఈ మిడ్‌క్యాప్ మరింత అధికంగా 2.35 శాతం, స్మాల్‌క్యాప్ 3.6 శాతం చొప్పున జంప్ చేయడం గమనార్హం! -
రియల్టీలో తగ్గనున్న సంస్థాగత పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంస్థాగత (ఇనిస్టిట్యూషన్స్) పెట్టుబడులు ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (జనవరి–జూన్) 37 శాతం తక్కువగా 3.06 బిలియన్ డాలర్లు (రూ.26,300 కోట్లు)గా ఉండొచ్చని ఈ రంగానికి చెందిన కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. ఇందులో హౌసింగ్ ప్రాజెక్టుల వాటా 38 శాతం ఉంటుందని అంచనా వేసింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశి్చతులు, ఆర్థిక సవాళ్లు నెలకొనడాన్ని కారణంగా పేర్కొంది. దీంతో పెట్టుబడుల లావాదేవీల గడువు పొడిగింపునకు గురవుతున్నట్టు వివరించింది. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో రియల్ ఎస్టేట్‌లో ఇనిస్టిట్యూషన్స్ 4.89 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో.. విదేశీ ఇన్వెస్టర్ల వాటా 68 శాతంగా ఉంటే, దేశీ ఇనిస్టిట్యూషన్స్ మిగిలిన 32 శాతం వాటాను ఆక్రమించినట్టు పేర్కొంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లు (రీట్ లు), క్వాలిఫైడ్ ఇనిస్టిట్యూషన్ ప్లేస్మెంట్ (క్యూఐపీలు), లిస్టెడ్ సంస్థల్లో సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడులు కొనసాగుతున్నట్టు జేఎల్ఎల్ ఇండియా నివేదిక వెల్లడించింది. పెట్టుబడులకు ఆకర్షణీయం.. ‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం ఇప్పటికీ పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా ఈ ఏడాది మొదటి 6 నెలల్లో సవాళ్లు నెలకొన్నప్పటికీ దేశీ, విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసం కొనసాగింది’’అని జేఎల్ఎల్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ హెడ్ లతా పిళ్లై తెలిపారు. గత 5 ఏళ్లుగా రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లకు మించి నమోదవుతున్నట్టు గుర్తు చేశారు. ఈ ఏడాది దీనికి అనుగుణంగానే ఉండొచ్చన్నారు. -
స్థిరమైన ఆదాయానికి.. ఎస్‌డబ్ల్యూపీ మంత్ర!
సంపాదనకు గుడ్‌బై చెప్పిన తర్వాత విశ్రాంత జీవనం సాఫీగా సాగిపోవాలంటే స్థిరమైన ఆదాయ వనరు తప్పనిసరి. అప్పటి వరకు చేసిన పెట్టుబడులు, రిటైరయ్యాక స్థిరమైన ఆదాయానికి దారి చూపాలి. ఎక్కువ మంది రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయ ప్రణాళిక విషయంలోనే గందరగోళానికి గురవుతుంటారు. ఈక్విటీల్లో లేదా డెట్‌లో ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్నది అంత సులభంగా తేల్చుకోలేరు. అప్పటి వరకు పొదుపుతో సమకూర్చుకున్న విలువైన వనరులను వివేకంగా వినియోగించుకోవడం ఎలానో తెలియని వారే ఎక్కువ. రిటైర్మెంట్ తర్వాత ఒకట్రెండు దశాబ్దాల పాటు జీవిత అవసరాలను గట్టెక్కడం అంత సులువేమీ కాదు. ‘కూర్చుని తింటే కొండలైనా కరుగును’ అన్నట్టు.. కష్టార్జితంతో కూడబెట్టుకున్న నిధిని మిగిలిన జీవిత కాలం పాటు పొదుపుగా వాడేందుకు సమర్థవంతమైన ప్రణాళిక తప్పకుండా ఉండాలి. రిటైర్మెంట్ తర్వాత చాలా మంది చేసే తప్పు.. తమవద్దనున్న నిధులన్నింటినీ తీసుకెళ్లి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లలో, లేదా ఇతర డెట్ సాధనాల్లోనో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్థిరమైన రాబడి, భద్రత దృష్ట్యా ఇలా చేయడం గమనించొచ్చు. కానీ, వీటి నుంచి వచ్చే రాబడులు ద్రవ్యోల్బణాన్ని మించి ఏమంత గొప్పగా ఉండవు. దీర్ఘకాలంలో సగటు ద్రవ్యోల్బణం 6 శాతం అనుకుంటే, వీటిల్లో రాబడి 7 శాతం స్థాయిలో ఉంటుంది. కనుక ఇలాంటి సాధనాలను ఎంపిక చేసుకోవడం వల్ల.. అక్కడి నుంచి పదేళ్ల కాలంలో కరెన్సీ విలువ తగ్గిన మేర వారి పెట్టుబడి వృద్ధి చెందదు. అందుకే పెట్టుబడుల్లో ఈక్విటీలకూ చోటివ్వడం ఎంతో అవసరం. ఈక్విటీ ఫండ్స్‌లో నిరీ్ణత కాలానికోసారి పెట్టుబడులకు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ఎలా అయితే ఉపకరిస్తుందో.. ఈక్విటీ పెట్టుబడుల నుంచి క్రమానుగతంగా కొద్ది మొత్తం చొప్పున ఉపసంహరించుకునేందుకు సిస్టమ్యాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (ఎస్‌డబ్ల్యూపీ) అనుకూలిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడిని ఈ మార్గంలో అందుకోవచ్చు. స్థిరమైన ఆదాయం పింఛను సదుపాయం ఏర్పాటు చేసుకున్న వారిని మినహాయిస్తే రిటైర్మెంట్ తర్వాత చాలా మందికి స్థిరమైన ఆదాయం పెద్ద సవాలుగా మారుతుందన్నది నిపుణుల విశ్లేషణ. రిటైర్మెంట్ తర్వాత కొందరు ఇంటి అద్దె రూపంలో ఆదాయ మార్గంపై ఆధారపడుతుంటారు. కానీ ఇంటి అద్దె స్థిరమైనదని చెప్పలేం. కిరాయిదారు ఉన్నట్టుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవచ్చు. కొత్త వారు రావడానికి కొంత సమయం పడితే అప్పటి వరకు అద్దె ఆదాయం ఉండదు. ఇంటికి మరమ్మతులు, పన్నులు తదితర ఇతర నిర్వహణ వ్యయాల భారం మోయాల్సి ఉంటుంది. ఇల్లు పాతదవుతుంటే అద్దె పెరుగుదల ఆశించిన మేర ఉండదు. కరోనా సమయంలో చాలా మంది ఇంటి అద్దెలను సకాలంలో చెల్లించలేకపోయారు. ఉద్యోగాలు కోల్పోయిన సందర్భాల్లోనూ కిరాయిదారు అద్దెను సకాలంలో చెల్లించలేకపోవచ్చు. కొందరు వడ్డీ వ్యాపారం చేస్తుంటారు. కానీ, ఇందులో రిస్క్ ఎక్కువ. కనుక పెట్టుబడులపై స్థిరమైన ఆదాయానికి మార్గం చూడాలి. పెట్టుబడి కరగకూడదు.. పెట్టుబడికి ఎంపిక చేసుకునే సాధనం.. కచి్చతంగా ద్రవ్యోల్బణాన్ని మించి వృద్ధి చెందేలా ఉండాలి. అలాంటప్పుడే నెలవారీ రాబడి మేర ఉపసంహరించుకున్నా కానీ, పెట్టుబడి విలువను స్థిరంగా కాపాడుకోవచ్చు. ఈక్విటీలు ఈ విషయంలో ఎంతో మెరుగైనవి. ఉదాహరణకు రూ.20 లక్షల మొత్తాన్ని 7 శాతం రాబడినిచ్చే డెట్ సాధనంలో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20,000 చొప్పున ఉపసంహరించుకున్నారనుకోండి. ఏడాది ముగిసిన తర్వాత రూ.18.92 లక్షల పెట్టుబడి మిగిలి ఉంటుంది. అంటే ఏడాదిలో రూ.3 లక్షలను ఉపసంహరించుకోవడంతో పెట్టుబడి సైతం రూ.1.08 లక్షలు తరిగింది. ఇలాగే ఉపసంహరించుకుంటూ వెళితే 12 ఏళ్లకు ఆ పెట్టుబడి కరిగిపోతుంది. అదే ఈక్విటీల్లో అయితే 12% వరకు సగటు వార్షిక రాబడి ఉంటుంది. రిస్క్ తక్కువగా ఉండే హైబ్రిడ్, సేవింగ్స్ ఫండ్స్‌లో అయితే 10% వరకు రాబడిని ఆశించొచ్చు. కనుక ఈ తరహా సాధనాలతో స్థిరమైన ఆదాయానికి తోడు పెట్టుబడినీ కాపాడుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. ఇదే రూ.20 లక్షలను 12% రాబడినిచ్చే ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి ప్రతి నెలా రూ.20వేల చొప్పున ఉపసహరిస్తే 26 ఏళ్ల కాలానికి ఆ పెట్టుబడి స్థిర ఆదాయాన్నిస్తుంది. 10% రాబడి ప్రకారమైనా 17 ఏళ్ల పాటు ఆదాయాన్నిస్తుంది. వార్షిక రాబడి రేటు లో మైనస్ 3% చొప్పున ఉపసంహరణకు పరిమితం కావడం వల్ల.. మిగిలిన 3% పెట్టుబడి వృద్ధికి చాన్సుంటుంది. దీనివల్ల ద్రవ్యోల్బణం వల్ల పెరిగే జీవన వ్యయాలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. పన్ను ప్రయోజనాలు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. అదే ఈక్విటీ ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ఉపసంహరించుకునే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల మొత్తంపై పన్ను లేదు. డెట్ సాధనాలపై రాబడి వ్యక్తిగత వార్షిక ఆదాయానికి కలిపి, ఏ శ్లాబు పరిధిలో వస్తే ఆ మేరకు పన్ను రేటు చెల్లించాలి. అదే ఈక్విటీ రాబడులపై పన్ను విడిగా ఉంటుంది. రూ.1.25 లక్షలు మించిన దీర్ఘకాల రాబడిపై 12.5 శాతం పన్ను చెల్లిస్తే చాలు. కేవలం మొదటి ఏడాది ఉపసంహరణ మొత్తంలో రాబడిపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఏడాది తర్వాత నుంచి రాబడి దీర్ఘకాల మూలధన లాభాల పరిధిలోకే వస్తుంది. నగదు ప్రవాహాలపై సౌలభ్యత ఎస్‌డబ్ల్యూపీతో నెలవారీ ఎంత అవసరమో అంతే వెనక్కి తీసుకోవచ్చు. తమ అవసరాలకు అనుగుణంగా ఈ మొత్తాన్ని పెంచుకోవచ్చు. నెలవారీ, త్రైమాసికానికి ఒకసారి చొప్పున వెనక్కి తీసుకోవచ్చు. ఈక్విటీ మార్కెట్ సంక్షోభాలను ఎదుర్కొంటుంటే..వాటి నుంచి ఉపసంహరణను గణనీయంగా తగ్గించుకోవడం లేదంటే తాత్కాలికంగా నిలిపివేసి.. డెట్ పెట్టుబడుల నుంచి ఉపసంహరణతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఎస్డబ్ల్యూపీలోనూ రకాలున్నాయి. కోరుకున్నంత స్థిరంగా ఉపసంహరించుకోవడం ఇందులో ఒకటి. క్యాపిటల్ అప్రీసియేషన్ ఎస్‌డబ్ల్యూపీలో అయితే.. పెట్టుబడుల వృద్ధి వరకు (రాబడి) వెనక్కి తీసుకోవచ్చు. అసలు పెట్టుబడి అలాగే కొనసాగుతుంది. అస్థిరతల్లో పరిష్కారం.. రాబడి ఒక్కటే కాదు పెట్టుబడిని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. ఈక్విటీలు దిద్దుబాటుకు గురైనప్పుడు అందులోని పెట్టుబడుల విలువ క్షీణిస్తుంటుంది. కనుక ఆ సమయంలో ఈక్విటీ పెట్టుబడుల నుంచి ఉపసంహరణ ఎప్పటి మాదిరిగా కొనసాగించకపోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఈక్విటీల్లో దిద్దుబాటు ముగిసే వరకు గట్టెక్కేందుకు డెట్ పెట్టుబడులను వినియోగించుకోవాలి. దీనివల్ల తిరిగి ఈక్విటీలు ర్యాలీ చేసిన సమయంలో పెట్టుబడుల విలువ గణనీయంగా వృద్ధి చెందేందుకు వీలుంటుంది.డెట్ పెట్టుబడులూ అవసరమే విశ్రాంత జీవనంలో అవసరాలకు పూర్తిగా ఈక్విటీలపై ఆధారపడడం రిస్క్ నిర్వహణ పరంగా మెరుగైన నిర్ణయం కాబోదు. ఈక్విటీ, డెట్ కలబోతగా ఉండాలి. ఎస్‌డబ్ల్యూపీ కోసం ఈక్విటీ, డెట్‌లో ఇన్వెస్ట్ చేసే హైబ్రిడ్ సాధనాలను ఎంపిక చేసుకున్నప్పటికీ అదే సమయంలో విడిగా డెట్ సాధనాలనూ పోర్ట్‌ఫోలియోలో చేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. పైన చెప్పుకున్నట్టు ఈక్విటీ పతనాల్లో ఎస్‌డబ్ల్యూపీని తాత్కాలికంగా నిలిపివేయాల్సి రావచ్చు. ఈక్విటీ మార్కెట్లు దీర్ఘకాలంలో బేరిష్ దశలోకి వెళ్లినప్పుడు డెట్ పెట్టుబడులు ఆదుకుంటాయి. రిస్క్‌ను వైవిధ్యం చేసుకున్నట్టు అవుతుంది. ఇన్వెస్టర్ల వద్దనున్న మొత్తం పెట్టుబడి, ఆదాయ అవసరాలు, రాబడి అంచనాలకు అనుగుణంగా ఈక్విటీ, డెట్ కేటాయింపులు ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఈ విషయంలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. ఎవరికి అనుకూలం..? ఎస్‌డబ్ల్యూపీ రిటైర్మెంట్ తీసుకున్న వారికోసమే అనుకోవద్దు. పెట్టుబడిపై స్థిరమైన నగదు ప్రవాహాలు కోరుకునే ప్రతి ఒక్కరికీ ఈ ప్లాన్ మెరుగైనదన్నది నిపుణుల సూచన. రిటైర్మెంట్ తీసుకున్న వారు, రిటైర్మెంట్ సమీపంలో ఉన్న వారు, అదనపు ఆదాయం కోరుకునే వారికి ఇది అనుకూలమని బంధన్ అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ) సేల్స్ హెడ్ గౌరబ్ పరిజ తెలిపారు. ‘‘ఇప్పట్లో పదవీ విరమణ తీసుకోని వ్యక్తులు సైతం, జీవన అవసరాలకు వీలుగా అదనపు ఆదాయం కోసం ఎంపిక చేసుకోవచ్చు. జీవితంలోని వివిధ దశల్లో అదనపు ఆదాయం కోసం ఇదొక పరిష్కారం. కాకపోతే రిటైర్మెంట్ తీసుకున్న వారు ఎక్కువగా దీన్ని వినియోగిస్తుంటారు’’ అని వివరించారు. పొరపాట్లకు చోటివ్వొద్దు.. → ఎస్‌డబ్ల్యూపీ అన్నది చాలా శక్తివంతమైన సాధనం. అయితే, సరైన ప్రణాళిక లేకపోవడం లేదా నిపుణుల సూచన లేకుండా చేయడం వల్ల ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు. → అధిక రాబడుల కోసం రిస్క్ తీసుకోవద్దు. అతి రాబడుల అంచనాలు విశ్రాంత జీవనంలో బెడిసి కొడతాయి. ముఖ్యంగా మార్కెట్ ఆటుపోట్లలో మోస్తరు రాబడులకే పరిమితం కావాలి. → నిపుణుల సూచనకు మించి అధిక మొత్తాన్ని వెనక్కి తీసుకోకపోవడమే మంచిది. ఎప్పుడో ఓసారి తప్పిస్తే.. అవసరాలకు చాలడం లేదని ప్రణాళికకు మించి ఉపసంహరణ బాట పడితే పెట్టుబడి వేగంగా క్షీణిస్తుంది. → ద్రవ్యోల్బణం ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు పెట్టుబడి విలువ ఏటా ఎంతో కొంత వృద్ధి చెందడమే కాదు.. అదే ద్రవ్యోల్బణం కారణంగా పెరిగే జీవన అవసరాలకు వీలుగా నగదు ఉపసంహరణ కూడా పెంచుకోవాల్సి వస్తుంది. సరైన ప్రణా ళికతోనే ఇది సాధ్యమని గుర్తుంచుకోవాలి. సిప్ ఉద్యోగంలో చేరిన నాటి నుంచి పదవీ విరమణ వరకు ప్రతి నెలా నిరీ్ణత మొత్తాన్ని సిప్ ద్వారా ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రిటైర్మెంట్ నాటికి భారీ నిధిని సమకూర్చుకోవచ్చు. కాంపౌండింగ్ మహిమతో కొద్ది పెట్టుబడి దీర్ఘకాలంలో చెప్పుకోతగ్గంత నిధిగా సమకూరుతుంది. 25 ఏళ్ల వయసు నుంచి ప్రతి నెలా రూ.10,000 చొప్పున ఈక్విటీ ఫండ్‌లో సిప్ ప్రారంభించి, 60 ఏళ్లు వచ్చే వరకు 35 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేస్తూ వెళితే.. 12% వార్షిక రాబడి అంచనా మేరకు చివర్లో సమకూరే మొత్తం రూ.5.51 కోట్లు. ఇందులో పెట్టుబడి రూ.42 లక్షలు కాగా, మిగిలినదంతా కాంపౌండింగ్‌తో వృద్ధి చెందిన సంపద. కొంచెం ఆలస్యంగా 30 ఏళ్ల నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున 30 ఏళ్లపాటు ఇన్వెస్ట్ చేసినా 60 ఏళ్లకు రూ.3.08 కోట్లకు సమకూరుతుంది. ఎస్‌డబ్ల్యూపీ సిప్ ద్వారా ఈక్విటీల్లో చేసిన పెట్టుబడి 60 ఏళ్లకు పెద్ద మొత్తమే సమకూరుతుంది. వృద్ధాప్యానికి వచ్చామని చెప్పి ఈక్విటీ పెట్టుబడులు పూర్తిగా ఉపసంహరించుకోనక్కర్లేదు. కనీసం 50–70 శాతం మేర ఈక్విటీల్లో అలాగే కొనసాగించి, ఎస్‌డబ్ల్యూపీ ద్వారా ప్రతి నెలా కావాల్సినంత ఉపసంహరించుకోవచ్చు. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలున్నాయి. ఈక్విటీల్లో పెట్టుబడి ఇతర సాధనాల కంటే మెరుగ్గా వృద్ధి చెందుతుంది. రిటైర్మెంట్ అనంతరం అదే ఫండ్ నుంచి ప్రతి నెలా కావాల్సినంత వెనక్కి తీసుకోవచ్చు. ఒకేసారి పెట్టుబడులు అన్నింటినీ విక్రయించడం వల్ల దీర్ఘకాల మూలధన లాభాలపై (రూ.1.25 లక్షలు దాటిన మొత్తంపై) 12.5% పన్ను చెల్లించాల్సి వస్తుంది. దీని బదులు 50–70% ఈక్విటీల్లోనే కొనసాగిస్తే పన్ను భారం తగ్గుతుంది. ఎస్‌డబ్ల్యూపీ వ్యూహం→ రిటైర్మెంట్ ఫండ్‌ను మూడు భాగాలుగు చేసుకోవాలి. → ఇందులో కోర్ భాగం ఒకటి. దీర్ఘకాలం పాటు ఇది మెరుగ్గా వృద్ధి చెందేందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇందుకు ఈక్విటీ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ అనుకూలిస్తాయి. → బఫర్ పేరుతో రెండో భాగంలో.. 3 నుంచి 5 ఏళ్ల పాటు ఆదాయ అవసరాలకు సరిపడా మొత్తాన్ని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. → లిక్విడ్ పేరుతో మరొక భాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. తక్షణ అవసరాల్లో వెనక్కి తీసుకునేందుకు వీలుగా లిక్విడ్ లేదా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్‌లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. → తమ పెట్టుబడిని ఇలా వేర్వేరు భాగాలు చేసుకోవడం ద్వారా రిస్క్‌ను వైవిధ్యం చేసుకోవచ్చు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
గోల్డ్ ఈటీఎఫ్‌లకు మళ్లీ ఆదరణ
న్యూఢిల్లీ: బంగారం ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు)కు మే నెలలో తిరిగి డిమాండ్ ఏర్పడింది. ఇన్వెస్టర్లు రూ.292 కోట్ల పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఈ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను వెనక్కి తీసుకోగా, మార్చిలోనూ రూ.77 కోట్ల పెట్టుబడులను ఇవి కోల్పోవడం గమనార్హం. గోల్డ్ ఈటీఎఫ్‌ల పట్ల ఇన్వెస్టర్లలో తిరిగి ఆసక్తి పెరిగినట్టు తెలుస్తోంది. మే చివరికి గోల్డ్ ఈటీఎఫ్‌ల నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ రూ.62,453 కోట్లకు పెరిగింది. ఏప్రిల్ చివరికి ఇది రూ.61,422 కోట్లుగా ఉంది. ‘‘మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు పెరగడం ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతుండడాన్ని సూచిస్తోంది. బంగారం ధరలు గరిష్టాల్లో స్థిరంగా ఉండడం, అంతర్జాతీయంగా అనిశి్చతులు కొనసాగుతుండడంతో హెడ్జింగ్‌కు బంగారం మంచి సాధనంగా కనిపిస్తోంది’’అని మారి్నంగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెష్రామ్ పేర్కొన్నారు. ముఖ్యంగా మే నెలలో బంగారం ధరలు స్థిరంగా ఉండడంతో పోర్ట్‌ఫోలియో రీబ్యాలన్స్కు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించి ఉంటారని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న అవగాహన తమ పెట్టుబడుల్లో బంగారాన్ని కూడా కలిగి ఉండాలని ఇన్వెస్టర్లు తెలుసుకుంటున్నాని, దీంతో గోల్డ్ ఈటీఎఫ్‌ల కొనుగోళ్లు పెరిగినట్టు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సర్వీసెస్ సీఈవో సంతోష్ జోసెఫ్ తెలిపారు. ‘‘బంగారం అన్నది వినూత్నమైన సాధనం. ఇది డాలర్ డినామినేషన్లో ఉంటుంది. ఈక్విటీలతో సంబంధం లేనిది. ఈక్విటీలకు ప్రతికూల సంబంధం కలిగి ఉంటుంది. కనుక పోర్ట్‌ఫోలియో హెడ్జింగ్‌కు ఇదొక చక్కని సాధనం’’అని జోసెఫ్ చెప్పారు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో రూ.1,980 కోట్లుగా ఉండడం గమనార్హం.అంటే మే నెలలో కాస్త మెరుగుపడినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోవాల్సి ఉందని తెలుస్తోంది. బంగారం ధరలు గత కొన్నేళ్లలో స్థిరమైన ర్యాలీ చేయడం గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులను గణనీయంగా వృద్ధి చేసిందని చెప్పుకోవాలి. ఇక మే నెలలో గోల్డ్ ఈటీఎఫ్‌ల పరిధిలో ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 2.24 లక్షలు పెరిగాయి. దీంతో మే చివరికి మొత్తం ఫోలియోలు 73.69 లక్షలకు చేరాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో ట్రేడ్ అయ్యే డిజిటల్ బంగారం సాధనం. భౌతిక బంగారం ధరలను ఇవి ప్రతిఫలిస్తుంటాయి. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారానికి సమానంగా ఉంటుంది. -
ఎఫ్‌డీఐల ఆకర్షణలో 14వ స్థానంలో ఏపీ
సాక్షి, అమరావతి: విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ 14వ స్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,957.04 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించింది. ఇందులో శ్రీసిటీలో ఏర్పాటు చేసిన డైకిన్, పానాసోనిక్ ,ఏటీసీ టైర్స్ వంటి సంస్థల నుంచి ఈపెట్టుబడులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ) తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2024–25 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా రూ.4,21,929 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి.అందుకు ముందు ఏడాదితో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం విదేశీట్ట్టుబడుల్లో 50 శాతానికి పైగా పెట్టుబడులు మహారాష్ట్ర, కర్ణాటకకే రావడం గమనార్హం. మొత్తం పెట్టుబడుల్లో 39.07 శాతం వాటా రూ.1,64,875 కోట్లతో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలిచింది. 13.27 శాతం వాటా రూ.56,030 కోట్లతో కర్నాటక రెండవస్థానం సాధించింది. అత్యధికంగా మారిషస్, సింగపూర్ నుంచే.. మన దేశంలోకి వస్తున్న విదేశీ పెట్టుబడుల్లో అత్యధికంగా 49 శాతం మారిషస్, సింగపూర్ దేశాల నుంచే వస్తున్నాయి. డాలర్ల పరంగా చూస్తే మారిషస్ మొదటిస్థానంలో ఉంటే అదే రూపాయల పరంగా చూస్తే సింగపూర్ మొదటిస్థానంలో ఉంది.ఏప్రిల్–2000 నుంచి ఇప్పటివరకు మారిషస్ నుంచి రూ.10,92,900 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం వచ్చిన పెట్టుబడుల విలువలో ఇది 25 శాతం. ఇదే సమయంలో 24 శాతం వాటాతో సింగపూర్ నుంచి రూ.12,18,108 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఆ తర్వాత అమెరికా, నెదర్లాండ్స్, జపాన్, బ్రిటన్ నుంచి అత్యధికంగా పెట్టుబడులు వచ్చాయి. సర్వీసు, కంప్యూటర్స్, ట్రేడింగ్, టెలికమ్యూనికేషన్స్, ఆటోమొబైల్ రంగాల్లోకి అత్యధికంగా పెట్టుబడులు వస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. 2024–25లో ఎఫ్‌డీఐ ఆకర్షించిన టాప్–5 రాష్ట్రాలు ఇవే.. మహారాష్ట్ర 1,64,875కర్నాటక 56,030 గుజరాత్ 51,540 ఢిల్లీ 47,947 తమిళనాడు 31,103 -
భారీ ఏయూఎం ఉన్న స్మాల్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చా?
ఒక స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) భారీ స్థాయికి చేరితే.. అది పనితీరును ప్రభావితం చేస్తుందా? ఏయూఎం ఏ స్థాయి వరకు ఉంటే సురక్షితం? – రజత్స్మాల్క్యాప్ పథకాలు పెద్ద స్థాయికి చేరితే పెట్టుబడుల ఆలోచనల పరంగా సమస్యను ఎదుర్కొంటాయి. స్మాల్‌క్యాప్, లార్జ్‌క్యాప్, డైవర్సిఫైడ్ ఈక్విటీ ఫండ్ల నిర్వహణ మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వేర్వేరు మేనేజర్లు నిర్వహించే వివిధ లార్జ్‌క్యాప్ ఫండ్స్‌ను పరిశీలిస్తే వాటి పోర్ట్‌ఫోలియోలో ఏకరూపత 80 శాతం మేర ఉంటుంది. ఎందుకంటే లార్జ్‌క్యాప్ ఫండ్స్ ప్రధానంగా టాప్–100 కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. లార్జ్‌క్యాప్ ఫండ్స్‌తో మరో వెసులుబాటు ఏంటంటే లిక్విడిటీ సమృద్ధిగా ఉంటుంది. ఒకే రోజు రూ.100–200 కోట్ల పెట్టుబడుల లావాదేవీలు నిర్వహించినా గానీ పెద్దగా వ్యయ ప్రభావం పడదు. స్మాల్‌క్యాప్ విషయంలో ఈ సానుకూలతలు ఉండవు. ఎందుకంటే చాలా స్మాల్ క్యాప్ కంపెనీల మార్కెట్ విలువ రూ.1,000–1,500 కోట్ల స్థాయిలోనే ఉంటుంది. రూ.100–200 కోట్ల నిర్వహణ ఆస్తులు నిర్వహించే ఫండ్స్ ఈ తరహా చిన్న కంపెనీల్లో చెప్పుకోతగ్గ మేర వాటాను తీసుకోగలవు.కానీ ఎక్కువ స్థాయిలో ఏయూఎం ఉన్న స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు చిన్న కంపెనీలో 5 శాతం వాటా తీసుకోవడం సాధ్యపడదు. అంతేకాదు ఆ వాటాలను విక్రయించడం కూడా సమస్యగా మారుతుంది. కనుక స్మాల్‌క్యాప్ పథకంలో పెట్టుబడుల నిర్వహణ చాలా కష్టం. ఒక్కసారి ఏయూఎం పరంగా స్మాల్‌క్యాప్ ఫండ్ పెద్దగా మారిపోతే.. అప్పుడు ఎన్నో కొత్త ఆలోచనలు చేయాల్సి వస్తుంది. లిక్విడిటీ పరంగా చూసినా ఎక్కువ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అన్ని కంపెనీలను గుర్తించడం కూడా సవాలే. వ్యాల్యూయేషన్లు ఖరీదుగా లేని కంపెనీలను గుర్తించడం కోసం ఎంతో శ్రమించాల్సి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో విజేతలైన పథకాలకు పెట్టుబడుల ప్రవాహం వెల్లువెత్తుతుంటుంది. స్మాల్‌క్యాప్ ఫండ్ మంచి రాబడులను చూపిస్తే అందులో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తారు. దీంతో ఏయూఎం ఇంకా పెద్దది అవుతుంది. పనితీరుపై దీని ప్రభావం కచ్చితంగా ఉంటుంది.ఇదీ చదవండి: చదువు కొంటున్నారా?ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్‌లలో ఏది మెరుగైనది? – దినేష్ జనార్దన్వ్యయాల పరంగా చూస్తే ఈటీఎఫ్ (ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్) పథకాలకు అనుకూలత ఎక్కువ. 5–7 బేసిస్ పాయింట్లకే ఈటీఎఫ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అదే సమయంలో 10–15 బేసిస్ పాయింట్ల ఎక్స్పెన్స్ రేషియోకి సేవలు అందించే ఇండెక్స్ ఫండ్స్ డైరెక్ట్ ప్లాన్లు సైతం ఉన్నాయి. వ్యయాల పరంగా ఈటీఎఫ్, ఇండెక్స్ ఫండ్స్ మధ్య పెద్ద వ్యత్యాసం లేదు. లిక్విడిటీ పరంగా చూస్తే, ఇండెక్స్ ఫండ్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈటీఎఫ్‌ల విషయంలో లిక్విడిటీ వివిధ పథకాల మధ్య కొంత భిన్నంగా ఉండొచ్చు. కొన్ని పథకాలు రోజువారీగా అధిక వ్యాల్యూమ్ (పరిమాణం)లో ట్రేడ్ అవుతుంటాయి. కనుక ఇన్వెస్ట్ చేయడానికి ముందు ఆయా పథకాల ట్రేడింగ్ పరిమాణాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేసేట్టు అయితే ఇండెక్స్ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలను ఈటీఎఫ్ కోసం తెరవాల్సిన శ్రమ తప్పుతుంది. డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలున్న వారికి ఈటీఎఫ్‌లు కూడా మెరుగైన ఎంపికే అవుతుంది. -
72 లక్షల ’హరిత’ కొలువులు
ముంబై: దేశీయంగా పర్యావరణహిత (గ్రీన్) సాంకేతిక సామర్థ్యాలను పెంచుకోవడంపై భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో 2027–28 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ రంగంలో 72.9 లక్షల కొలువులు రానున్నాయి. రెన్యూవబుల్ ఎనర్జీ, వ్యర్థాల నిర్వహణ, ఎలక్ట్రిక్ వాహనాలు, పర్యావరణహిత నిర్మాణాలు మొదలైన విభాగాల్లో అత్యధికంగా ఉద్యోగాల కల్పన జరగనుంది. గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ టాలెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ ఎన్ఎల్బీ సరీ్వసెస్ ఒక నివేదికలో ఈ అంశాలు తెలిపింది. పరిశ్రమలో ధోరణులు, డిమాండ్, స్థూల వ్యవస్థ మొదలైన వాటిపై విశ్లేషణ ఆధారంగా దీన్ని రూపొందించింది. దీని ప్రకారం .. దేశీ కార్పొరేట్లు పర్యావరణానికి పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో 2047 నాటికి 3.5 కోట్ల కొత్త కొలువులు వచ్చే అవకాశం ఉందని వివరించింది. ‘గత 4–5 ఏళ్లలో పునరుత్పాదక విద్యుత్, ఈవీ, పర్యావరణహిత మౌలిక సదుపాయాలరంగంలో కొత్త కొలువులు వస్తున్నాయి. నైపుణ్యాల అవసరాలు మారుతున్నాయి. పర్యావరణహితమైన విధంగా విధులను నిర్వర్తించడంతో పాటు డిజిటల్ సామర్థ్యాలు కూడా కావాల్సి ఉంటోంది. ఏఐ, ఐవోటీ, బ్లాక్‌చెయిన్, జీఐఎస్, డేటా ఆధారిత టూల్స్లాంటివి కొత్త కెరియర్లకు బాటలు వేస్తున్నాయి‘ అని ఎన్ఎల్బీ సర్వీసెస్ సీఈవో సచిన్ అలగ్ చెప్పారు. నియామకాల విషయంలో సంప్రదాయ విద్యార్హతల కన్నా నైపుణ్యాలకు కంపెనీలు ప్రాధాన్యతనిస్తున్నాయని వివరించారు. మరిన్ని విశేషాలు..→ గ్రీన్ ఉద్యోగార్థులకు ముంబై, బెంగళూరు, ఢిల్లీ లాంటి మెట్రో నగరాలు ఆకర్షణీయంగా ఉంటు న్నాయి. విశాఖపట్నం, ఇండోర్, అహ్మదాబాద్, జైపూర్ తదితర ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అవకాశాలు ఉంటున్నాయి. → లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్, పర్యావరణహిత వ్యవసాయం లాంటి రంగాలు ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లో సానుకూల హైరింగ్‌కి తోడ్పడనున్నాయి. గ్రీన్ విభాగంలో కొత్తగా వచ్చే 72.9 లక్షల కొలువుల్లో 35–40 శాతం ఉద్యోగాలు ఈ నగరాల్లోనే ఉండొచ్చని అంచనాలు నెలకొన్నాయి. → ప్రస్తుతం దేశీయంగా గ్రీన్ జాబ్స్‌లో మహిళల వా టా 11–12 శాతంగానే ఉంది. సాంకేతిక విద్య అంతగా అందుబాటులో లేకపోవడం, సంస్కృతిపరమై న అడ్డంకులు, వర్క్‌ప్లేస్‌లో భద్రతాపరమైన సవాళ్లు ఇందుకు కారణం. సంస్థలు సమ్మిళిత నియామక విధానాలను అమలు చేస్తున్నాయి. ప్రధానంగా మహిళల కోసం నైపుణ్యాల్లో శిక్షణ కల్పనపై ఇన్వెస్ట్ చేస్తున్నాయి. దీనితో గ్రీన్ జాబ్స్‌లో మహిళల వాటా వచ్చే 5–6 ఏళ్లలో మరింత మెరుగుపడనుంది. -
డేటా సెంటర్ల బూమ్..
న్యూఢిల్లీ: దేశీ డేటా సెంటర్ (డీసీ) పరిశ్రమ భారీగా విస్తరిస్తోంది. వచ్చే అయిదారేళ్లలో కొత్తగా 20–25 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులను ఆకర్షించనుంది. దీనితో సెంటర్ల ఏర్పాటు కోసం వినియోగించే రియల్ ఎస్టేట్ కూడా మూడు రెట్లు పెరగనుంది. ప్రస్తుతం 15.9 మిలియన్ చ.అ.లుగా ఉన్న స్పేస్ 2030 నాటికి 55 మిలియన్ చ.అ.లకు చేరనుంది. రియల్ ఎస్టేట్ కన్సల్టింగ్ సంస్థ కొలియర్స్ ఇండియా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. క్లౌడ్ కంప్యూటింగ్, ఏఐ, ఐవోటీ వినియోగం పెరుగుతుండటం, వివిధ రంగాల వ్యాప్తంగా డిజిటలీకరణ వేగవంతం అవుతుండటం తదితర అంశాల దన్నుతో డేటా సెంటర్ల మొత్తం సామర్థ్యాలు మూడు రెట్లు పెరిగి 2030 నాటికి 4.5 గిగావాట్లకు చేరనున్నాయి. 2018లో 307మెగావాట్లుగా ఉన్న డీసీల సామర్థ్యం ఈ ఏడాది ఏప్రిల్ నాటికి, అంటే కేవలం ఏడేళ్ల వ్యవధిలో సుమారు నాలుగు రెట్లు పెరిగి 1.26 గిగావాట్లకు చేరింది. పరివర్తన దశలో పరిశ్రమ.. ప్రస్తుతం పరిశ్రమ పరివర్తన దశలో ఉందని నిపుణులు తెలిపారు. మెట్రో నగరాల్లోనే కాకుండా ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరిస్తోందని వివరించారు. డీసీల విషయంలో ముంబై, చెన్నైల ఆధిపత్యం ఉంటోంది. మొత్తం సామర్థ్యాల్లో మూడింట రెండొంతుల వాటా వీటిదే ఉంటోంది. అత్యధికంగా 41 శాతం వాటాతో ముంబై అగ్రస్థానంలో, 23 శాతంతో చెన్నై రెండో స్థానంలో, 14 శాతం వాటాతో ఢిల్లీ ఎన్సీఆర్ మూడో స్థానంలో ఉన్నాయి. ఈ మూడు మార్కెట్లు కలిసి గత 6–7 ఏళ్లలో డేటా సెంటర్ రియల్ ఎస్టేట్ మూడు రెట్లు పెరిగేందుకు దోహదపడ్డాయి. ‘‘తక్కువ లేటెన్సీ, రియల్ టైమ్ అనాలిసిస్, మెరుగైన యాప్‌ల పనితీరు, వివిధ పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలు తమను తాము మల్చుకోవాల్సి వస్తుండటం తదితర అవసరాలరీత్యా డేటా సెంటర్లు భారీగా విస్తరిస్తున్నాయి’’ అని కొలియర్స్ ఇండియా వెల్లడించింది. 2030 నాటికి డీసీల కెపాసిటీ 4.5 గిగావాట్లకు ఎగియడానికి కూడా ఇదే దోహదపడుతుందని పేర్కొంది. పునరుత్పాదక విద్యుత్, 3 గిగావాట్ల విద్యుత్ మిగులులాంటివి చౌకగా హోస్టింగ్ సేవలు అందించడంలో భారత్‌కు సానుకూలాంశాలని క్యాపిటలాండ్ ఇన్వెస్ట్మెంట్ వర్గాలు తెలిపాయి. అతి కొద్ది దేశాలకు మాత్రమే ఈ ప్రయోజనం ఉంటుందని వివరించాయి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబైలో తలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం క్యాపిటలాండ్ మొత్తం మీద 1.15 బిలియన్ సింగపూర్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తోంది. 2020 నుంచి పెట్టుబడుల ప్రవాహం.. భారత డిజిటల్ మౌలిక సదుపాయాలపై ఇన్వెస్టర్లకు పెరుగుతున్న నమ్మకానికి నిదర్శనంగా భారీగా పెట్టుబడులు తరలి వస్తున్నాయి. 2020 నుంచి 14.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా 2030 నాటికి మరో 20–25 బిలియన్ డాలర్లు రావచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తక్కువ లేటెన్సీ, అత్యుత్తమ పనితీరు కోసం ఓటీటీ ప్లాట్‌ఫాంలు, కంటెంట్ డెలివరీ నెట్వర్క్ (సీడీఎన్) సేవల సంస్థల నుంచి డిమాండ్ నెలకొన్నట్లు నె్రక్ట్‌సా బై ఎయిర్టెల్ సీఈవో ఆశీశ్ ఆరోరా తెలిపారు. ఈ సంస్థ 65 పైగా నగరాల్లో 120 ఎడ్జ్ డేటా సెంటర్లు, 14 హైపర్‌స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తోంది. తాము ప్రాంతీయంగా చిన్న పట్టణాల్లోకి కూడా విస్తరించడంపై దృష్టి పెడుతున్నామని ఆరోరా వివరించారు. విజయవాడ, అగర్తలా, పాటా్న, గువాహటి, సంబల్పూర్, గంగాగంజ్‌లాంటి కీలక నగరాల్లో తమ ఎడ్జ్ సెంటర్లను విస్తరించినట్లు వివరించారు. వీటితో మెట్రోల వెలుపల తృతీయ శ్రేణి నగరాల్లోని యూజర్లకు కూడా డిజిటల్ మౌలిక సదుపాయాలు మరింతగా అందుబాటులోకి వస్తున్నాయని, లైవ్.. హై–డెఫినిషన్ స్ట్రీమింగ్కి సంబంధించి లేటెన్సీ.. బ్యాండ్‌విడ్త్ వ్యయాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. డీసీల విభాగంలో కొత్త పరిణామాలు చూస్తే అదానీకనెక్స్ సంస్థ చెన్నైలో 100 మెగావాట్ల క్యాంపస్‌ను, నోయిడాలో 50 మెగావాట్ల సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. మరిన్ని ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ ఏర్పాటు చేసే ప్రణాళికల్లో ఉంది. ఇప్పటికే గ్రేటర్ నోయిడాలో ఉన్న యోటా డీ1తో పాటు హైపర్‌స్కేల్ క్యాంపస్‌ల విస్తరణపై యోటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రూ. 39,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. క్యాపిటల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ తమ నవీ ముంబై సెంటర్‌పై రూ. 1,940 కోట్ల పెట్టుబడులు ప్రకటించింది. ఎస్టీటీ జీడీసీ ఇండియా, ఎన్టీటీ గ్లోబల్ తదితర సంస్థలు హైదరాబాద్, చెన్నై, పుణె, బెంగళూరు నగరాల్లో కొత్త హైపర్‌స్కేల్ సెంటర్స్‌తో కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి.హైదరాబాద్, ముంబై సారథ్యం.. 2020 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్యకాలంలో భారత్‌లో కొత్తగా 859 మెగావాట్ల డీసీ సామర్థ్యాలు జతయ్యాయి. ఇందులో ముంబై వాటా 44 శాతంగా, చైన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ వాటా సంయుక్తంగా 42 శాతంగా ఉంది. 2023 నుంచి అయిదేళ్ల వ్యవధిలో కొత్తగా 3 – 3.7 గిగావాట్ల కొత్త సామర్థ్యాలు జత కానున్నాయి. చెరి 1–1.2 గిగావాట్ల సామర్థ్యాలతో హైదరాబాద్, ముంబై ఇందుకు సారథ్యం వహించనున్నాయి. హైదరాబాద్ వర్ధమాన హైపర్‌స్కేల్ హబ్‌గా ఎదుగుతోంది. పుణె 300–450 మెగావాట్లు, చెన్నై 400–450 మెగావాట్ల కొత్తగా సామర్థ్యాలను జతపర్చుకోనున్నాయి. -
లాభాలకు తగ్గట్లు జీతాలు పెంచండి
న్యూఢిల్లీ: లాభదాయకతకు అనుగుణంగా పెట్టుబడులు, ఉద్యోగుల వేతనాలను పెంచడంపై దృష్టి పెట్టాలని కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ సూచించారు. అప్పుడే భారత్ 6.5 శాతం పైగా ఆర్థిక వృద్ధిని నిలకడగా సాధించగలదని, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగగలదని ఆయన చెప్పారు. పెట్టుబడుల సానుకూల వలయాన్ని వివరిస్తూ, ఇన్వెస్ట్మెంట్లతో సామర్థ్యాలు పెరగడంతో పాటు మరింత అధిక వేతనాలతో మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని, ఇది కుటుంబాలు ఇంకాస్త ఎక్కువ పొదుపు చేసేందుకు దోహదపడుతుందని నాగేశ్వరన్ చెప్పారు. కానీ ప్రస్తుతం వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉంటోందని, వచ్చే 25 లేదా 30 ఏళ్ల పాటు ఇదే తీరు కొనసాగితే నిర్దేశించుకున్న లక్ష్య సాధన దిశగా పురోగమించలేమని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి సమస్య సంపన్న దేశాల్లోనే కనిపిస్తుందే తప్ప భారత్‌లాంటి వర్ధమాన దేశాల్లో ఉండదని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నాగేశ్వరన్ చెప్పారు. 21వ శతాబ్దపు రెండో దశాబ్దంలో భారతీయ ప్రైవేట్ రంగ లాభదాయకత రూ. 7.2 లక్షల కోట్ల నుంచి రూ. 28.7 లక్షల కోట్లకు నాలుగు రెట్లు పెరిగినప్పటికీ, పెట్టుబడులు మాత్రం మూడు రెట్లే పెరిగాయని ఆయన చెప్పారు. ఇన్ఫ్రాలో కూడా ఇన్వెస్ట్ చేయాలి.. రాబోయే 25 ఏళ్లలో మౌలిక సదుపాయాలతో పాటు సామర్థ్యాల పెంపుపై భారత్ గణనీయంగా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని, ప్రైవేట్ రంగం ఇటు పెట్టుబడులు అటు ఉద్యోగుల వేతనాల మధ్య సమతూకం ఉండేలా చూసుకోవాలని నాగేశ్వరన్ పేర్కొన్నారు. కుటుంబాల ఆదాయాలు, పొదుపు పెరిగితేనే నిలకడగా వృద్ధి సాధ్యపడుతుందని వివరించారు. పెట్టుబడులతో మరిన్ని ప్రయోజనాలను రాబట్టాలంటే పరిశ్రమలపై రెగ్యులేటరీ భారం తగ్గాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, ప్రైవేట్ రంగం మధ్య విశ్వసనీయత పెరగాలని నాగేశ్వరన్ చెప్పారు. కొన్ని సార్లు నియంత్రణ సంస్థలపరంగా దేన్ని డీరెగ్యులేట్ చేయాలనే దానిపై స్పష్టత ఉన్నప్పటికీ ఎలా చేయాలనేది సవాలుగా ఉంటుందని ఆయన తెలిపారు. నియంత్రణల తొలగింపు అనేది కొన్ని సందర్భాల్లో అవాంఛితమైన విధంగా దురి్వనియోగానికి కూడా దారి తీసే అవకాశాలు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. వికసిత భారత్ లక్ష్యాలు సాధించాలంటే ఇరుపక్షాలు పరస్పరం నమ్మకంతో కలిసి పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కాకుండా, దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు, ప్రైవేట్ రంగం మధ్య కూడా నమ్మకం ఉండాలి. సమిష్టిగా కలిసి పని చేస్తే తప్ప వచ్చే 25 ఏళ్లలో మనం నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాన్ని సాధించలేం‘ అని నాగేశ్వరన్ చెప్పారు. మరోవైపు, ఎకనమిక్ సర్వేలో పేర్కొన్నట్లు భారత్ 6.3–6.8 శాతం మధ్య వృద్ధి రేటును నమోదు చేసిందని .. రుతుపవనాలు మెరుగ్గా ఉండటం, ప్రభుత్వ పెట్టుబడుల దన్ను, పన్నులపరమైన ఉపశమనం, వడ్డీ రేట్ల తగ్గుదల తదితర సానుకూలాంశాలతో ఇదే స్థాయి వృద్ధి సుదీర్ఘకాలం పాటు కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. -
పెట్టుబడుల్లో బాద్షా ఈ దేవర
ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ నటనలో ప్రతిభ కనబరచడంతోపాటు పెట్టుబడులపై ఆసక్తి ఉన్న తెలివైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందుతున్నారు. వెండితెర ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించిపెట్టినప్పటికీ, అతడి ఆర్థిక చతురత, వ్యూహాత్మక పెట్టుబడులు వ్యాపార మొఘల్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేశాయి. ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా..డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్స్జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు అతీతంగా ఆకట్టుకునే ఇన్వెస్ట్మెంట్ పోర్ట్‌ఫోలియోను నిర్మించారు. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సుమారు రూ.25 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం సహా ఆయన ఆస్తులు విభిన్న రంగాల్లో విస్తరించాయి. ఎన్టీఆర్ విలాసవంతమైన జీవనశైలికి, ఆర్థిక విజయానికి నిదర్శనంగా రూ.80 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ ఉంది. రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ, పోర్షే, లంబోర్ఘిని ఉరుస్ వంటి హై-ఎండ్ బ్రాండ్ కార్లను కలిగి ఉన్నారు.సంపదను పెంచుకోవాలని, వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎన్టీఆర్ వ్యాపార మనస్తత్వం ఎన్నో విలువైన పాఠాలను నేర్పుతుంది. రియల్ ఎస్టేట్, ప్రొడక్షన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లగ్జరీ అసెట్స్‌లో ఎన్టీఆర్ విజయవంతంగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇన్వెస్టర్లు తమ వనరులన్నింటినీ ఒకే రంగంలో పెట్టుబడి పెట్టడం మానుకోవాలి. అందుకు బదులుగా స్థిరమైన ఆర్థిక వృద్ధి కోసం బహుళ పరిశ్రమల్లో ఇన్వెస్ట్ చేయాలనే అందులో దాగిఉంది.ఇదీ చదవండి: మెహుల్ చోక్సీకి రూ.2 కోట్ల డిమాండ్ నోటీసుజూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ ఎండార్స్మెంట్లలో కొన్ని..మలబార్ గోల్డ్ & డైమండ్స్అప్పీ ఫిజ్బోరో ప్లస్ పౌడర్జాండు బామ్నవరత్న ఆయిల్ -
అలా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే..
ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో లార్జ్‌క్యాప్, లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం మధ్య ఏ ఫండ్స్ మెరుగైనవి? – వీణారాణి దీర్ఘకాలంలో ఏ విభాగం మంచి పనితీరు చూపిస్తుందన్నది ఊహించడమే అవుతుంది. ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నప్పుడు కాల వ్యవధి కనీసం ఐదేళ్లకు తగ్గకుండా ఉండాలి. ఇన్వెస్ట్ చేసిన ఆ ఐదేళ్ల కాలంలోనూ మార్కెట్ సైకిల్ ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ కంపెనీలు మంచి పనితీరు చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో మిడ్‌క్యాప్ మంచి ప్రదర్శన చేస్తాయి. కొన్ని సందర్భాల్లో స్మాల్‌క్యాప్ ఇంకా మంచి రాబడులను ఇస్తుంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం సానుకూలం. ఫ్లెక్సీక్యాప్ ఫండ్ ఏ విబాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛతో ఉంటుంది. మార్కెట్లో ఒక విభాగం మంచి పనితీరు, మరో విభాగం బలహీన పనితీరు చూపిస్తున్న సందర్భాల్లో ఫ్లెక్సీక్యాప్ పథకంలో పెట్టుబడుల ద్వారా దీన్ని చక్కగా అధిగమించగలరు. నేను అధిక పన్ను శ్లాబులోకి వస్తాను. ఎఫ్డీలపై ఆదాయం సైతం పన్ను పరిధిలోకి వస్తుంది. అత్యవసర నిధిని డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చా..? – జగన్నాథ స్వామిమీ అత్యవసర నిధిలో కొంత భాగాన్ని డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం మంచి నిర్ణయమే అవుతుంది. అత్యవసర నిధిని మూడు భాగాలుగా వర్గీకరించుకుని ఇన్వెస్ట్ చేసుకోవాలి. మొదటి భాగం అత్యవసర నిధిని నగదు రూపంలోనే ఉంచుకోవాలి. రెండో భాగాన్ని బ్యాంకు ఖాతా లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకోవచ్చు. లేదా వెంటనే నగదుగా మార్చుకోగలిగిన మరొక సాధనంలో అయినా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మూడో భాగాన్ని లిక్విడ్ ఫండ్ లేదా అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. దీనివల్ల రాబడులు సానుకూలంగా ఉంటాయి. పన్ను పరంగా ప్రత్యేక అనుకూలతలు ఏవీ లేవు. ఫిక్స్డ్ డిపాజిట్ల మాదిరిగా కాకుండా.. డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకున్నప్పుడే రాబడులపై పన్ను వర్తిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అయితే ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ వడ్డీ ఆదాయాన్ని పన్ను చెల్లింపుదా రు తన వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. వారి శ్లాబు రేటు ప్రకారం పన్ను చెల్లించాలి. అధిక పన్ను శ్లాబు పరిధిలోకి వచ్చే వారికి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో వచ్చే ఆదాయంపై 30 శాతం పన్ను పడుతుంది. డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ 2023 ఏప్రిల్ 1 తర్వాత చేసిన పెట్టుబడులను విక్రయిస్తే.. ఎంతకాలం అన్నదానితో సంబంధం లేకుండా లాభం మొత్తం వార్షిక ఆదాయానికి కలుస్తుంది. కనుక ఈ ఆదాయంపైనా మీరు గరిష్ట పన్ను చెల్లించాల్సి వస్తుంది. అయితే, ఎఫ్డీలతో పోలిస్తే డెట్ ఫండ్స్ కాస్త మెరుగైన రాబడులిస్తాయి. కానీ, డెట్ ఫండ్స్‌లో రాబడులకు హామీ ఉండదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మాదిరి ఒక్కో ఇన్వెస్టర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల పెట్టుబడికి బీమా రక్షణ హామీ కూడా ఉండదు. లిక్విడ్ ఫండ్స్, అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ తక్కువ రిస్క్ విభాగంలోకి వస్తాయి.సమాధానాలు: ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
సంపన్న నటుడు.. టామ్ క్రూజ్ నెట్‌వర్త్ ఎంతో తెలుసా?
చెప్పులు లేకుండా సైకిల్ తొక్కడం, హెలికాఫ్టర్లలో నుంచి కిందికి దూకడం, బుర్జ్ ఖలీఫా ఎక్కడం, మోటార్ సైకిల్‌తో కొండపై నుంచి దూకడం వంటి స్టంట్స్ చేస్తూ.. ఎంతోమంది ప్రేక్షలకుల మనసు కొల్లగొట్టిన హాలీవుడ్ స్టార్ 'టామ్ క్రూజ్' ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందే వారిలో ఒకరు. ఇంతకీ ఈయన నెట్‌వర్త్ ఎంత అనే విషయాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం.ఆరు పదుల వయసు దాటినా.. తన నటనతో దూసుకెళ్తున్న టామ్ క్రూజ్.. 'మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రికనింగ్' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది. 2025లో విడుదలైన హాలీవుడ్ సినిమాల్లో మొదటి రోజే ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాల్లో ఇదే మొదటిస్థానంలో నిలిచింది.టామ్ క్రూజ్ నికర విలువఅత్యంత సంపన్న నటులలో ఒకరిగా నిలిచిన టామ్ క్రూజ్ నికర విలువ.. పరేడ్ మ్యాగజైన్ ప్రకారం సుమారు 600 మిలియన్ డాలర్లు (రూ. 51.36 కోట్ల కంటే ఎక్కువ). సినిమాల్లో నటించడం ద్వారా మాత్రమే కాకుండా.. ఈయన బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా కూడా సంపాదిస్తున్నారు.బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా టామ్ క్రూజ్ సుమారు 100 మిలియన్ డాలర్లు సంపాదించినట్లు ది మ్యూజిక్ ఎసెన్షియల్స్ తెలిపింది. అంతే కాకుండా ఈయనకు సొంత నిర్మాణ సంస్థ కూడా ఉంది. రికార్డింగ్ స్టూడియోలో 30 శాతం వాటాను కలిగి ఉన్నారు. సైంటాలజీ సంబంధిత వెంచర్లలో కూడా పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.ఇదీ చదవండి: 'అమెరికాలో ఉంటున్న భారతీయులకు హెచ్చరిక'రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియో విషయానికి వస్తే.. టామ్ క్రూజ్ బెవర్లీ హిల్స్‌లో నివాసాన్ని 2007లో కొనుగోలు చేశారు. ఆ తరువాత 2021లో తన 10,000 చదరపు అడుగుల కొలరాడో భవనాన్ని 40 మిలియన్ డాలర్లకు విక్రయించారు. 2015లో క్రూజ్ లండన్ సమీపంలోని 14 ఎకరాల ఎస్టేట్‌ను 7.3 మిలియన్ డాలర్లకు విక్రయించి.. హాలీవుడ్ కాంపౌండ్‌లోని నివాసాన్ని 12 మిలియన్ల రెసిడెన్సీ కొనుగోలు చేశారు. -
పాత ప్రాజెక్టులకే కొత్త పూత..!
సాక్షి, అమరావతి: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించలేక గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను తాము సాధించినట్లు చెప్పుకోవడానికి కూటమి సర్కారు విఫలయత్నం చేస్తోంది. పాత ఒప్పందాలు, ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి విస్తరణ చేపట్టిన వాటిని కొత్త ప్రాజెక్టులుగా పేర్కొంటూ గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 6వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. వివిధ రంగాలకు చెందిన మొత్తం రూ.33,720 కోట్ల విలువైన 19 ప్రాజెక్టుల ద్వారా 34,621 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ ప్రాజెక్టుల్లో అత్యధికం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వచి్చనవే కావడం గమనార్హం. ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే.. » జపాన్‌కు చెందిన ఏటీసీ టైర్స్ (యకహోమా) రూ.3,079 కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి ఈ ప్రతిపాదనకు 2020 నవంబరులో అప్పటి సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమవగా 2022 ఆగస్టులో వైఎస్ జగన్ ఈ పరిశ్రమను ప్రారంభించారు. తొలి దశలో రూ.1,750 కోట్లు పెట్టిన ఏటీసీ టైర్స్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. అప్పుడే రెండో దశను కూడా ప్రకటించింది. కానీ, ఈ విస్తరణ ప్రతిపాదనను కూటమి సర్కారు నిస్సిగ్గుగా ఇప్పుడు తన ఖాతాలో వేసుకుంది. » పీఎల్ఐ కింద డైకిన్ సంస్థ శ్రీ సిటీలో దక్షిణాదిలోనే అతిపెద్ద ఎయిర్ కండిషన్ తయారీ యూనిట్ నిర్మాణాన్ని 2022లో మొదలుపెట్టింది. 2023 నవంబరులో ఉత్పత్తి కూడా ప్రారంభించింది. రూ.1,000 కోట్లతో 75 ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు చేసిన డైకిన్ విస్తరణ కోసం 2024లో మరో 33 ఎకరాలను కొనుగోలు చేసింది. దీన్ని కూడా కూటమి సర్కారు తన ఖాతాలో వేసుకుంది.»డీఆర్డీవోతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నవంబరులో రక్షణ శాఖ అప్పటి కార్యదర్శి గిరిధర్ నాటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఈ ప్రతిపాదన చేశారు. అదే రోజు మచిలీపట్నంలో జరిగిన బీఈఎల్ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇదేదో కొత్తగా వచ్చినట్లు ఇప్పుడు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది.» దక్కన్ ఫైన్ కెమికల్స్‌కు తూర్పుగోదావరి జిల్లా కేశవరం వద్ద ఎప్పటినుంచో ప్రత్యేక రసాయనాల తయారీ యూనిట్ ఉంది. ఏలూరు జిల్లా వట్టిగుడిపాడులో మోహన్ స్పిన్‌టెక్ 2007లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలోనే యూనిట్ నెలకొల్పింది. రామభద్ర ఇండస్ట్రీస్ 2006లో తణుకు కేంద్రంగా ఏర్పాటైంది. ఈ కంపెనీల విస్తరణ ప్రాజెక్టులకు తాజాగా ఎస్ఐపీబీ ఓకే చెప్పింది. ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ: చంద్రబాబు ఎస్ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి. ప్రతి ప్రాజెక్టు పురోగతి పరిశీలనకు డాష్ బోర్డ్ తీసుకురావాలి. టూరిజంలో హోటళ్లు, రూముల కొరత ఉంది. కొత్తగా 50 వేల రూమ్‌లు అందుబాటులోకి తీసుకురావాలి. కారవాన్స్‌కు సంబంధించిన పాలసీని కూడా సిద్ధం చేసి అమల్లోకి తేవడం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచాలి. టెంట్లు (గుడారాలు) ఏర్పాటు ప్రారంభించాలి. వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టకుండా చిన్నచిన్న ప్లాంట్ల ద్వారా సర్క్యులర్ ఎకానమీగా మార్చాలి’ అని సూచించారు. -
క్విక్ కామర్స్ కంపెనీలో కీలక పెట్టుబడులు
న్యూఢిల్లీ: మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సహవ్యవస్థాపకులు మోతీలాల్ ఓస్వాల్, రామ్‌దేవ్ అగర్వాల్ తాజాగా క్విక్‌కామర్స్ కంపెనీ జెప్టోలో ఇన్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. విడిగా 5 కోట్ల డాలర్లు(రూ.424 కోట్లు) చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. సెకండరీ లావాదేవీ ద్వారా విదేశీ ఇన్వెస్టర్ల నుంచి వాటాలు కొనుగోలు చేసినట్లు వెల్లడించాయి. వీటి విలువ 10 కోట్ల డాలర్లు(రూ.848 కోట్లు)గా ఉంది.మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మరో 25 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసే ప్రణాళికల్లో ఉన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి పబ్లిక్ ఇష్యూ సన్నాహాల్లో ఉన్న జెప్టో తాజా లావాదేవీ ద్వారా దేశీ యాజమాన్య వాటా పెంపువైపు సాగుతున్నట్లు తెలియజేశాయి. ప్రస్తుతం దేశీ యాజమాన్యానికి కంపెనీలో 42% వాటా ఉంది. ఇతర లావాదేవీల ద్వారా ఐపీవో కంటే ముందే వాటాను 50%కిపైగా పెంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: భారత సైన్యం వేతన వివరాలు ఇలా..2024 ఆగస్ట్‌లో సాధించిన 5 బిలియన్ డాలర్ల విలువలో లావాదేవీలు నమోదైనట్లు వెల్లడించాయి. కాగా.. మోతీలాల్ ఓస్వాల్ ఆధ్వర్యంలో ఎడిల్వీజ్, హీరో ఫిన్‌కార్ప్ తదితర సంస్థలు 25 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమకూర్చనున్నట్లు సమచారం. తదుపరి దశలో భాగంగా 25 కోట్ల డాలర్ల పెట్టుబడికి జూన్‌లో తెరతీయనున్నట్లు తెలుస్తోంది. -
డెట్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏప్రిల్ నెలలో మంచి జోరు చూపించాయి. ఈ విభాగంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఎక్కువ మంది ముందుకు వచ్చారు. అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొంత రక్షణాత్మక ధోరణితో డెట్ విభాగం వైపు మొగ్గు చూపించినట్ట తెలుస్తోంది. ఫలితంగా ఏప్రిల్ నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నికరంగా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. అంతకుముందు నెలలో (2025 మార్చిలో) ఇదే డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.2.02 లక్షల కోట్లను ఉపసంహరించుకోవడం గమనార్హం. అంటే ఒక్క నెలలోనే ఇన్వెస్టర్ల ప్రాధాన్యంలో స్పష్టమైన మార్పు కనిపించింది. ఆర్థిక సంవత్సరం చివరి నెల కావడంతో పెట్టుబడుల్లో మార్పులు–చేర్పులు కూడా ఇందుకు కారణమై ఉండొచ్చు. సంస్థాగత ఇన్వెస్టర్లు ముందస్తు పన్ను చెల్లింపులు, బ్యాలన్స్ షీట్ల సర్దుబాట్లు మార్చి నెలలో పెట్టుబడుల ఉపసంహరణకు కారణమై ఉండొచ్చని మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెచ్చ్ ఇండియా సీనియర్ అనలిస్ట్ నేహల్ మెస్రామ్ తెలిపారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.6,525 కోట్లను ఇన్వెస్టర్లు ఉపసంహరించుకోగా.. జనవరిలో రూ.1.28 లక్షల కోట్లను ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. లిక్విడ్ ఫండ్స్‌లోకే అధికం.. → డెట్‌లో లిక్విడ్ ఫండ్స్‌లోకి అత్యధికంగా ఏప్రిల్ నెలలో రూ.1.18 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → ఓవర్‌నైట్ ఫండ్స్ రూ.23,900 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ రూ.31,507 కోట్ల చొప్పున పెట్టుబడులను ఆకర్షించాయి. → అల్ట్రా షార్ట్ ఫండ్స్‌లోకి రూ.26,734 కోట్లు, లో డ్యురేషన్ ఫండ్స్‌లోకి రూ.9,371 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. → గిల్ట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.425 కోట్లను ఉపసంహరించుకున్నారు. క్రెడిట్ రిస్క్ ఫండ్స్ నుంచి రూ.302 కోట్లు, గిల్ట్ ఫండ్స్ నుంచి 39 కోట్లు చొప్పున బయటకు వెళ్లిపోయాయి. → మొత్తానికి ఏప్రిల్ నెలలో మ్యూచువల్ ఫండ్స్‌లోని అన్ని విభాగాల్లోకి కలిపి నికరంగా రూ.2.77 లక్షల కోట్ల పెట్టుబడులు వచి్చనట్టు యాంఫి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ.17.57 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు ఏప్రిల్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ పెట్టుబడులు (ఏయూఎం) రూ.17.57 లక్షల కోట్లకు చేరాయి. అంతకుముందు మార్చి చివరికి డెట్ నిర్వహణ ఆస్తుల విలువ రూ.17.02 లక్షల కోట్లుగా ఉంది. ఇక డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్ల సంఖ్యలోనూ వృద్ధి కనిపించింది. ఏప్రిల్‌లో కొత్తగా 1.44 లక్షల ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) ప్రారంభమయ్యాయి. మొత్తం డెట్ ఫోలియోలు 79.36 లక్షలకు చేరాయి. డెట్‌లో మొత్తం 16 కేటగిరీలు ఉంటే అందులో 12 కేటగిరీల్లోకి నికరంగా పెట్టుబడులు వచ్చాయి. ‘‘ఏప్రిల్‌లో డెట్ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రాక పెరగడం అన్నది స్థిరాదాయ పథకాల పట్ల ఇన్వెస్టర్లలో ఉన్న విశ్వసానికి నిదర్శనం’’అని మార్నింగ్ స్టార్ మెస్రామ్ తెలిపారు. లిక్విడ్ ఫండ్స్‌లోకి ఎక్కువ పెట్టుబడులు రావడం అన్నది స్వల్పకాల పెట్టుబడుల పట్ల ప్రాధాన్యాన్ని సూచిస్తున్నట్టు ఈక్విరస్ వెల్త్ ఎండీ అంకుర్ పంజ్ తెలిపారు. -
డేటా సెంటర్లపై బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: డిజిటల్ మౌలిక సదుపాయాల వ్యాపార కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా టెక్నో డిజిటల్ ఇన్ఫ్రా పేరిట సంస్థను ప్రారంభించినట్లు టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజినీరింగ్ కంపెనీ (టీఈఈసీఎల్) వెల్లడించింది. ఇది సుమారు 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా మొత్తం మీద 250 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌స్కేల్, ఎడ్జ్ డేటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. చెన్నైలో 36 మెగావాట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్ (హెచ్‌డీసీ) కార్యకలాపాలను ప్రారంభించిన సందర్భంగా టీఈఈసీఎల్ ఈ విషయాలు పేర్కొంది. తదుపరి హెచ్డీసీలను కోల్‌కతా, నోయిడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించింది. మరోవైపు, 23 రాష్ట్రాలవ్యాప్తంగా 102 నగరాల్లో ఎడ్జ్ డేటా సెంటర్లను నిర్మించేందుకు రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు టీఈఈసీఎల్ తెలిపింది. క్లౌడ్ మాధ్యమం ద్వారా పెద్ద కంపెనీలకు భారీ డేటా స్టోరేజీ, ప్రాసెసింగ్ సరీ్వసులు అందించేందుకు హెచ్డీసీలు ఉపయోగపడతాయి. యూజర్లకు సమీపంలో స్థానికంగా ఏర్పాటు చేసే చిన్న డేటా సెంటర్లను ఎడ్జ్ సెంటర్లుగా వ్యవహరిస్తారు. -
ఏ రంగంపై ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఉన్నారంటే..
భారత్-పాక్ యుద్ధం నేపథ్యంలో భౌగోళిక రాజకీయ మార్పుల కారణంగా భారతదేశ రక్షణ సాంకేతిక రంగాన్ని పెట్టుబడిదారులు అవకాశంగా చూస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం బలమైన విధాన మద్దతు, వేగవంతమైన సాంకేతిక పురోగతి ఇందుకు కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. రక్షణ రంగంలో స్వావలంబన సాధించేందుకు కేంద్రం దృష్టి సారించడం, పరిశ్రమ ఆవిష్కరణలు, వ్యూహాత్మక పరిష్కారాలకు భారత్ గ్లోబల్ హబ్‌గా రూపాంతరం చెందే అవకాశం ఉండడంతో ఇన్వెస్టర్లు ఈ రంగంపై ఆసక్తిగా ఉన్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.పెట్టుబడుల వృద్ధికి కారణాలుదేశీయ రక్షణ తయారీని బలోపేతం చేసే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను ప్రారంభించింది. ఈ చర్యల వల్ల వివిధ కంపెనీలతో ఇటీవల 253 అవగాహన ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకోవడంతో రూ.53,439 కోట్ల పెట్టుబడులు సమకూరే అవకాశం ఉంది. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేయడం వల్ల రక్షణ సాంకేతిక పరిజ్ఞానంలో పెట్టుబడిదారులకు భారత్ ఆకర్షణీయంగా మారుతోంది.సాంకేతికత అభివృద్ధిసివిలియన్, మిలిటరీ అప్లికేషన్లకు సర్వీసులు అందించే డ్యుయల్-యూజ్ టెక్నాలజీలపై పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. నిఘా, వ్యూహాత్మక కార్యకలాపాల కోసం స్వయంప్రతిపత్తి కలిగిన డ్రోన్ల తయారీ సంస్థలపై దృష్టి సారిస్తున్నారు. రియల్ టైమ్ ముప్పును గుర్తించడం కోసం ఏఐ ఆధారిత నిఘా వ్యవస్థలను రూపొందించే కంపెనీలను గుర్తిస్తున్నారు. సముద్ర భద్రత, అన్వేషణ కోసం అండర్ వాటర్ డ్రోన్లు, అధునాతన డిఫెన్స్ ఇమేజింగ్, ఇంటెలిజెన్స్ కోసం హైపర్ స్పెక్ట్రల్ ఉపగ్రహాల వంటి వాటిపై పెట్టుబడి పెట్టాలని యోచిస్తున్నారు.ఇదీ చదవండి: ఐఫోన్ అంతరించనుందా..?కంపెనీల తీరుడిఫెన్స్ టెక్ స్టార్టప్‌లు డీప్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డీ), మాడ్యులర్ టెక్నాలజీ, రెగ్యులేటరీ ప్రమాణాలకు అనుగుణంగా ప్రాధాన్యత ఇస్తూ దీర్ఘకాలిక పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉన్నాయి. కంపెనీలు తక్కువ ఖర్చుతో సుస్థిరమైన, కృత్రిమ మేధ ఆధారిత రక్షణ పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నాయి. -
1,600 డీల్స్.. వీసీ పెట్టుబడుల జోరు..
న్యూఢిల్లీ: రెండేళ్ల పాటు నెమ్మదించిన ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ (పీఈ–వీసీ) పెట్టుబడులు గతేడాది మళ్లీ జోరందుకున్నాయి. 9 శాతం పెరిగి 43 బిలియన్ డాలర్లకు చేరాయి. సుమారు 1,600 డీల్స్ నమోదయ్యాయి. ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ), బెయిన్ అండ్ కంపెనీ రూపొందించిన ’ఇండియా ప్రైవేట్ ఈక్విటీ రిపోర్ట్ 2025’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.ఆసియా–పసిఫిక్‌లోకి వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో దాదాపు ఇరవై శాతం భారత్‌లోకి ప్రవహించాయని రిపోర్ట్ వివరించింది. తద్వారా ఈ ప్రాంతంలో పీఈ–వీసీ ఇన్వెస్ట్మెంట్లకు రెండో అతి పెద్ద గమ్యస్థానంగా భారత్ స్థానం మరింత పటిష్టమైందని తెలిపింది. దేశీయంగా స్థూల ఆర్థిక పరిస్థితుల స్థిరత్వంపై ఇన్వెస్టర్లలో నమ్మకం పెరుగుతుండటాన్ని ఇది సూచిస్తోందని పేర్కొంది. నివేదికలోని మరిన్ని అంశాలు.. ఇన్వెస్టర్లు పెట్టుబడుల ద్వారా స్వల్ప వాటాలతో సరిపెట్టుకోకుండా సంస్థలను పూర్తిగా కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. 2022లో నమోదైన పీఈ డీల్స్ విలువలో సంస్థల కొనుగోళ్ల ఒప్పందాల వాటా 37 శాతంగా ఉండగా 2024లో 51 శాతానికి పెరిగింది. వివిధ రంగాలవ్యాప్తంగా అత్యంత నాణ్యమైన అసెట్స్‌లో నియంత్రణాధికారాలను చేజిక్కించుకోవడంపై ఇన్వెస్టర్లు మరింతగా దృష్టి పెడుతుండటాన్ని ఇది సూచిస్తోంది. గతేడాది వచ్చిన మొత్తం పీఈ–వీసీ పెట్టుబడుల్లో రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలు 16 శాతం వాటా దక్కించుకున్నాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే డీల్ విలువ 70 శాతం పెరిగింది. ఆర్థిక సేవల విభాగం 25 శాతం వృద్ధి చెందింది. 14 డీల్స్ నమోదయ్యాయి. వీటిలో 100 మిలియన్ డాలర్ల పైగా విలువ చేసే డీల్స్ ఏడు ఉన్నాయి. హెల్త్‌కేర్ విభాగంలోకి కూడా గణనీయంగా నిధులు వచ్చాయి. హెల్తియం వంటి భారీ మెడ్‌టెక్ లావాదేవీల దన్నుతో ఒప్పందాల పరిమాణం 80 శాతం పెరిగింది. ఫార్మా సీడీఎంవోల్లోకి పెట్టుబడులు పెరిగాయి. పెర్ఫీషియంట్ (3 బిలియన్ డాలర్లు), ఆల్టిమెట్రిక్ (900 మిలియన్ డాలర్లు), జీఈబీబీఎస్ (865 మిలియన్ డాలర్లు) లాంటి భారీ డీల్స్ ఊతంతో ఐటీ ఆధారిత సర్వీసులు, ఐటీ రంగం 300 శాతం మేర అసాధారణ వృద్ధి కనపర్చింది. ఇన్వెస్టర్లు పలు సంస్థల నుంచి నిష్క్రమించడంలోనూ ఆసియా–పసిఫిక్‌లోని ఇతర మార్కెట్లను భారత్ అధిగమించింది. ఇలాంటి డీల్స్ విలువ 33 బిలియన్ డాలర్లుగా నమోదైంది. మెరుగ్గా ఉన్న ఈక్విటీ మార్కెట్లలో తమ వాటాలను విక్రయించడం ద్వారా వైదొలగడం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. దేశీయంగా నిధుల సమీకరణ 2024లో కొత్త గరిష్టాలకు చేరింది. కేదార క్యాపిటల్ 1.7 బిలియన్ డాలర్ల నిధులు, క్రిస్‌క్యాపిటల్ 2.1 బిలియన్ డాలర్లు సమీకరించాయి. పటిష్టమైన జీడీపీ వృద్ధి, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ప్రైవేట్ వినియోగం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ మెరుగుపడటం, పాలసీలపరంగా సానుకూల చర్యలు మొదలైన అంశాల తోడ్పాటుతో 2025పై అప్రమత్తతతో కూడుకున్న ఆశావహ అంచనాలు నెలకొన్నాయి. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.24,269 కోట్లు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక ఏప్రిల్ నెలలో స్వల్పంగా క్షీణించింది. మార్చి నెలలో వచ్చిన పెట్టుబడులు రూ.25,082 కోట్లతో పోల్చి చూస్తే 3 శాతం క్షీణించి రూ.24,269 కోట్లుగా ఉన్నాయి. ఏప్రిల్‌లో ఈక్విటీ మార్కెట్లు నష్టాల నుంచి కోలుకున్నప్పటికీ పెట్టుబడులు తగ్గడం గమనార్హం. ఏప్రిల్‌లో బీఎస్ఈ సెన్సెక్స్ 3.65 శాతం, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 సూచీ 3.46 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఏప్రిల్ నెలలో వచ్చిన పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరాయి. ఈ మేరకు ఏప్రిల్ నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి నెలవారీ పెట్టుబడుల రాక తగ్గడం వరుసగా నాలుగో నెలలోనూ నమోదైంది. అయినప్పటికీ ఈక్విటీ పథకాల్లోకి వరుసగా 50వ నెలలోనూ నికర సానుకూల పెట్టుబడులు వచ్చాయి. ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు రాక తగ్గడం అన్నది యూఎస్ టారిఫ్‌ల పట్ల అనిశి్చతి, డెట్, హైబ్రిడ్ పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇవ్వడం కారణమని ఈక్విరస్ వెల్త్ ఎండీ అంకుర్ పుంజ్ తెలిపారు. సిప్ పెట్టుబడులు రూ.26,632 కోట్లు ఇన్వెస్టర్లు దీర్ఘకాల లక్ష్యాల కోసం చేసే సిప్ పెట్టుబడులు ఏప్రిల్ నెలలో రూ.26,632 కోట్లుగా ఉన్నాయి. ఒక నెలలో సిప్ గరిష్ట పెట్టుబడులు ఇదే ప్రథమం. మార్చి నెలలో సిప్ పెట్టుబడులు రూ.25,926 కోట్లతో పోల్చి చూస్తే 3 శాతం పెరిగాయి. ఏప్రిల్‌లో కొత్తగా 46.01 లక్షల సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. మార్చిలో కొత్త సిప్ ఖాతాలు 40.18 లక్షలుగా ఉన్నాయి. మొత్తం సిప్ ఖాతాలు 8.38 కోట్లకు చేరాయి. సిప్ నిర్వహణ ఆస్తుల విలువ మార్చి చివరికి రూ.13.35 లక్షల కోట్లుగా ఉంటే, ఏప్రిల్ చివరికి రూ.13.89 లక్షల కోట్లకు పెరిగింది. ‘‘ఏప్రిల్‌లో సిప్ పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్టం అయిన రూ.26,632 కోట్లకు చేరాయి. మ్యూచువల్ ఫండ్స్‌ను క్రమశిక్షణతో కూడిన దీర్ఘకాల పొదుపు సాధనంగా ఇన్వెస్టర్లు పరిగణిస్తుండడం వల్లే పెట్టుబడులు ఇలా క్రమంగా పెరుగుతున్నాయి’’అని యాంఫి సీఈవో వెంకట్ చలసాని పేర్కొన్నారు. అన్ని మారెŠక్ట్ సైకిల్స్‌లోనూ పెట్టుబడులు కొనసాగించడానికి ఉన్న ప్రాధాన్యం పట్ల ఇన్వెస్టర్లలో అవగాహన పెరుగుతున్నట్టు చెప్పారు. విభాగాల వారీ పెట్టుబడులు → ఏప్రిల్‌లో డెట్ ఫండ్స్‌లోకి మొత్తంగా రూ.2.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో రూ.2.02 లక్షల కోట్లను ఉపసంహరణతో పోలి్చతే సీన్ రివర్స్ అయింది. → డెట్‌లోని మొత్తం 16 విభాగాలకు గాను 12 రకాల పథకాల్లోకి పెట్టుబడులు సానుకూలంగా ఉన్నాయి. అత్యధికంగా రూ.1.18 లక్షల కోట్లు లిక్విడ్ ఫండ్స్‌లోకే వచ్చాయి. → మొత్తం మీద అన్ని రకాల మ్యూచువల్ ఫండ్స్‌లోకి ఏప్రిల్‌లో రూ.2.77 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. మార్చిలో రూ.1.64 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. → దీంతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థల నిర్వహణలోని మొత్తం ఆస్తుల (అన్ని విభాగాలు సహా) విలువ ఏప్రిల్ చివరికి రూ.70 లక్షల కోట్లకు చేరింది. మార్చి చివరికి ఇది రూ.65.74 లక్షల కోట్లుగా ఉంది. → ఈక్విటీ పథకాల్లోకి ఈ ఏడాది ఫిబ్రవరిలో రూ.29,303 కోట్లు, జనవరిలో రూ.39,688 కోట్లు, 2024 డిసెంబర్లో రూ.41,156 కోట్ల చొప్పున వచ్చాయి. → ఈక్విటీ విభాగంలో ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ అత్యధికంగా రూ.5,542 కోట్ల పెట్టుబడులను ఏప్రిల్‌లో ఆకర్షించాయి. → మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌కు ఆదరణ కొనసాగింది. మిడ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.3,314 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.4,000 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి. → లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లోకి రూ.2,671 కోట్లు వచ్చాయి. మార్చి నెలలో ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.2,479 కోట్లుగా ఉన్నాయి. → హైబ్రిడ్ ఫండ్స్ రూ.14,247 కోట్లను ఆకర్షించాయి. మార్చి నెలలో ఈ పథకాల నుంచి ఇన్వెస్టర్లు రూ.946 కోట్లను ఉపసంహరించుకున్నారు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో అమ్మకాలుగోల్డ్ ఎక్సే్ఛంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (గోల్డ్ ఈటీఎఫ్‌లు) నుంచి ఇన్వెస్టర్లు రూ.6 కోట్లను ఉపసంహరించుకున్నారు. మార్చిలోనూ గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి రూ.77 కోట్లకు వెనక్కి తీసుకోవడం గమనార్హం. బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరుకోవడంతో ఇన్వెస్టర్లు తాజా పెట్టుబడులు నిలిపివేయడంతోపాటు లాభాల స్వీకరణకు మొగ్గు చూపించినట్టు తెలుస్తోంది. -
Miss World 2025: కాస్ట్లీ కాంటెస్ట్
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరం వేదికగా ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు జరగనున్న ప్రపంచ సుందరి అందాల పోటీల మొత్తం విలువ రూ.700 కోట్లపైనే ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బడా వాణిజ్య, వ్యాపార, ఉత్పత్తి సంస్థలతో ఒప్పందాల ద్వారా మిస్ వరల్డ్ నిర్వహణ సంస్థకు రూ. 400–500 కోట్ల మేర ఆదాయం వస్తుందనేది అనధికార అంచనా. పోటీల నిర్వహణ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం సగం భరిస్తున్నప్పటికీ స్పాన్సర్షిప్ ఆదాయంలో మాత్రం 90 శాతానికిపైగా ఆదాయం మిస్ వరల్డ్ సంస్థకే చెందనుంది. రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్లు మిస్ వరల్డ్ పోటీల నిర్వహణకు రూ. 57 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, మిస్ వరల్డ్ లిమిటెడ్ చెరి సగం చొప్పున భరిస్తున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండా స్పాన్సర్షిప్స్ ద్వారా ఆ మొత్తాన్ని రికవరీ చేసుకుంటామని.. కేవలం రూ. 2 కోట్ల వరకే ఖజానాపై భారం పడుతుందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గతంలో పేర్కొన్నారు. ఈ లెక్కన స్పాన్సర్షిప్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ. 25 కోట్ల మేర సమకూరుతోందన్నది దాని సారాంశం. ప్రసార హక్కులు, టికెట్ల విక్రయాలతోనూ.. మిస్ వరల్డ్ అందాల పోటీలను 150కిపైగా దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. వాటి ప్రసార హక్కుల కోసం పలు చానళ్లు ఇప్పటికే మిస్ వరల్డ్ సంస్థతో ఒప్పందం చేసుకోవడంతో ఈ రూపంలోనూ ఆ సంస్థకు భారీ మొత్తం సమకూరనుంది. అలాగే పోటీలను ప్రత్యక్షంగా తిలకించేందుకు ఉండే టికెట్ల (హైదరాబాద్ పోటీల విషయంలో ఇప్పటివరకు అధికారికంగా వెల్లడించలేదు) విక్రయాల రూపంలో సైతం ఆ సంస్థకు ఆదాయం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఉండే ఒప్పందం మేరకు ఇందులో వాటా ఇస్తుంది. డిజిటల్, సోషల్ మీడియా హక్కులు ప్రధాన మీడియా చానళ్లలోనే కాకుండా కొన్ని డిజిటల్, సోషల్ మీడియా చానళ్లలోనూ మిస్ వరల్డ్ పోటీల ప్రత్యక్ష ప్రసారం జరగనుంది. అలాంటి సంస్థలకు కూడా హక్కులు విక్రయించడం ద్వారా మిస్ వరల్డ్ సంస్థ ఆదాయం పొందనుంది. యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్స్‌లో వాణిజ్య ప్రకటనల ప్రసారం ద్వారా కూడా ఆదాయంలో మిస్ వరల్డ్ సంస్థ వాటా పొందుతున్నట్లు సమాచారం. ఆదాయ వివరాల్లో గోప్యత.. ప్రపంచ సుందరి పోటీల నిర్వహణకు సంబంధించిన ఖర్చు వివరాలు మాత్రమే వెల్లడవుతుండగా ఆదాయ వివరాలను మాత్రం మిస్ వరల్డ్ సంస్థ గోప్యంగా ఉంచుతోంది. ఇతర అంతర్జాతీయ కార్యక్రమాలు, క్రీడా పోటీల ద్వారా స్పాన్సర్షిప్స్ ఆదాయంపై కొంత స్పష్టత ఉంటున్నా అందాల పోటీల విషయంలో మాత్రం సంపూర్ణ గోప్యతే కొనసాగుతోంది. పోటీల నిర్వహణకు అయ్యే ఖర్చుతో పోలిస్తే 10 నుంచి 15 రెట్ల ఆదాయం ఉంటుందని తెలుస్తోంది. భారత్‌లోనే ఖర్చు తక్కువ.. 2023లో మిస్ వరల్డ్ పోటీలకు తొలుత యూఏఈని ఎంపిక చేశారు. ఆ సమయంలో పోటీల నిర్వహణ బడ్జెట్‌ను రూ. 250 కోట్లుగా అంచనా వేశారు. కానీ అనివార్య కారణాలతో పోటీలు ముంబైకి మారాయి. ముంబైలో పోటీలకు చేసిన ఖర్చు, యూఏఈ అంచనాలో కేవలం 35 శాతంగా ఉన్నట్లు సమాచారం. రూ. 100 కోట్లలోపు ఖర్చుతోనే పోటీలను ముగించారు. ఇప్పుడు హైదరాబాద్‌లో అంతకంటే తక్కువ మొత్తాన్నే ఖర్చు చేస్తున్నారు. అయితే నగర సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చు దీనికి అదనం. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. అయితే స్పాన్సర్షిప్స్, ఇతర రూపాల్లో వచ్చే ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి మిస్ వరల్డ్ సంస్థ చెల్లించనుందని సమాచారం. కానీ ఇందులో స్పష్టత లేదు.విజేతకు వజ్రాల కిరీటం..ప్రపంచ సుందరి విజేతకు వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ధరింపచేస్తారు. గతేడాది ముంబైలోజరిగిన పోటీల్లో విజేతగా నిలిచిన చెక్ రిపబ్లిక్ సుందరి క్రిస్టీనా పిజ్కోవాకు అందించిన కిరీటం విలువ రూ. 6.21 కోట్లని తెలుస్తోంది. ఈసారి విజేతకు ప్రైజ్‌మనీగా రూ. 12 కోట్ల నుంచి రూ. 15 కోట్ల మొత్తాన్ని చెల్లించనున్నట్లు సమాచారం. -
ఇదీ తెలంగాణ బ్రాండ్..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ బ్రాండ్‌కు గుర్తింపు దక్కేలా మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విదేశీ పెట్టుబడులు వీలైనంత ఎక్కువగా ఆకర్షించాలంటే తెలంగాణకు విశ్వవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు అవసరమని భావిస్తోంది. ఇందుకు ప్రపంచ సుందరి పోటీలు సరైన అవకాశమని భావిస్తోంది. వీటిని విజయవంతం చేయడం ద్వారా రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనే పట్టుదలతో ఉంది. ఇటీవలే ప్రత్యేకంగా టూరిజం పాలసీని తీసుకొచ్చిన ప్రభుత్వం.. దాన్ని ఈ పోటీల నిర్వహణతో ముడిపెట్టి విశ్వవ్యాప్త ప్రచారం కల్పించనుంది. ‘తెలంగాణ.. జరూర్ ఆనా, తెలంగాణ.. హార్ట్ ఆఫ్ ది డెక్కన్’లాంటి నినాదాలను విస్తృతంగా వినియోగిస్తోంది. మిస్ వరల్డ్ పోటీల లోగోలో కూడా వీటిని పొందుపరిచింది. నాలుగు అంశాలు.. నలుదిక్కులా ప్రచారం ప్రపంచ సుందరి 72వ ఎడిషన్ పోటీలు ఈ నెల 10 నుంచి నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో 120కి పైగా దేశాలకు చెందిన సుందరీమణులు పాల్గొంటున్నారు. ఈ పోటీలను కవర్ చేసేందుకు 150 దేశాలకు చెందిన మీడియా ప్రతినిధులు హైదరాబాద్‌లో మకాం వేస్తున్నారు. పోటీలకు సంబంధించిన వివిధ ఘట్టాలు హైదరాబాద్‌లోని వివిధ వేదికల్లో జరుగుతున్నప్పటికీ, ఈ హడావుడి కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా యావత్ తెలంగాణను భాగస్వామ్యం చేసేలా.. పోటీ దారులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించేలా ఏర్పాట్లు చేసింది. నాగార్జునసాగర్ బుద్ధవనం, చార్మినార్, చౌమొహల్లా ప్యాలెస్, వరంగల్, రామప్ప ఆలయం, యాదగిరిగుట్ట ఆలయం, పోచంపల్లి, మహబూబ్‌నగర్ పిల్లలమర్రి, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, ఐపీఎల్ మ్యాచ్ సందర్శన, శిల్పారామం.. తదితర ప్రాంతాలను సుందరీమణులు సందర్శించనున్నారు. ప్రతి టూర్‌కు అంతర్జాతీయ మీడియా ప్రచారం కల్పించనుంది. సురక్షిత ప్రాంతం, మౌలిక వసతుల నిలయం, ఘనమైన చారిత్రిక వారసత్వం, ఆధునిక వైద్యం..అంశాల ఆధారంగా తెలంగాణ బ్రాండ్‌ను ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సురక్షిత ప్రాంతంప్రశాంత వాతావరణం ఉండే చోటుకే పెట్టుబడులు ఎక్కువగా వచ్చే వీలుంటుంది. ఈ అంశాన్ని ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచ సుందరి పోటీల్లో చిన్నపాటి అవాంఛనీయ ఘటనా జరగకూడదని పోలీసు శాఖను ఆదేశించింది. దీంతో కనీవినీ ఎరుగని రీతిలో భద్రత ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌త పాటు మిస్ వరల్డ్ పోటీదారులు పర్యటించే అన్ని ప్రాంతాల్లోనూ పటిష్టమైన భద్రతా ఏరాట్లు చేస్తున్నారు. వారికి ప్రత్యేక కాన్వాయ్ ఏర్పాటుతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సుమారు 1,200 మంది రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. మౌలిక వసతులుపోటీలకు హాజరయ్యే వారికి నగరంలో అత్యంత అభివృద్ధి చెందిన, మౌలిక వసతుల పరంగా మెరుగ్గా ఉన్న హైటెక్ సిటీలోని స్టార్ హోటళ్లలో బస కల్పించారు. ప్రధాన పోటీలు జరిగే వేదికలను ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాలపై పోటీదారులు, మీడియా దృష్టి పడేలా చేయడం ద్వారా హైదరాబాద్‌లో మౌలిక వసతులపై ప్రపంచ వ్యాప్తంగా కొంత అవగాహన కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇదే సమయంలో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వివిధ దేశాలతో ఉన్న కనెక్టివిటీని వివరించడంతో పాటు పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్, కొత్త సచివాలయ భవనం లాంటి వాటిని వారికి చూపించనున్నారు. మెడికల్ టూరిజంఅభివృద్ధి చెందిన దేశాలకు దీటుగా ఆధునిక వైద్యవసతి హైదరాబాద్‌లో ఉందని అతిథులకు వివరించబోతున్నారు. అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే 80 శాతం తక్కువ ఖర్చుకే ఆ స్థాయి ఆధునిక వైద్యాన్ని అందించే ఆసుపత్రులకు హైదరాబాద్ కేంద్రమని ప్రత్యేకంగా పోటీదారులు, విదేశీ మీడియాకు తెలియజేయనున్నారు. పోటీదారులను నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి ప్రత్యేకంగా తీసుకెళ్లి ఇక్కడి ఆధునిక వైద్య పద్ధతులు ప్రత్యక్షంగా తెలుసుకునే ఏర్పాటు చేశారు. ఏయే దేశాల నుంచి ఎంతమంది ఇక్కడికి వైద్యం కోసం వస్తున్నదీ, వారికి ఇక్కడ అందుబాటులో ఉండే వసతులు, వైద్య సదుపాయాలను ప్రపంచం ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. ఘనమైన చరిత్ర, సంస్కృతి, ప్రపంచ రుచులు మెడికల్ టూరిజం తరహాలో ఇటీవల స్ట్రీట్‌ఫుడ్ టూరిజం కూడా విస్తృతమవుతోంది. స్ట్రీట్ ఫుడ్‌ను ఆస్వాదించే పర్యాటకుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఘనమైన వారసత్వం, చరిత్ర, సంస్కృతి ఉన్న నగరంలో విహరిస్తూ అక్కడి సంప్రదాయ భోజనం ఆస్వాదించటాన్ని ఈ పోటీల సందర్భంగా షోకేస్ చేసే దిశలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం విఖ్యాత చౌమొహల్లా ప్యాలెస్‌లో స్వాగత విందు (డిన్నర్) ఏర్పాటు చేశారు. ఇందులో 38 రకాల తెలంగాణ సంప్రదాయ వంటకాలను వడ్డించబోతున్నారు. కాంటినెంటల్ వెరైటీలకు సైతం హైదరాబాద్ వేదికే అన్న విషయం కూడా తెలిసేలా వివిధ ప్రాంతాల రుచులను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. ఈ బాధ్యతను ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌కు అప్పగించారు. ఇక తాజ్ ఫలక్‌నుమా, చార్మినార్ ప్రాంతాలను చూపటం ద్వారా హైదరాబాద్ చారిత్రక నేపథ్యాన్ని కూడా కళ్లకు కట్టబోతున్నారు. పోటీలకు ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష మిస్ వరల్డ్ పోటీల కోసం జరుగుతున్న ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీనియర్ పోలీస్, ఇతర అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వాటిపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని చెప్పారు. అతిథుల బస విషయంలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రత, బందోబస్తుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. విమానాశ్రయం, హోటళ్ల వద్ద, అంతర్జాతీయ కార్యక్రమాల వేదికల వద్ద పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. పర్యాటక శాఖ తరఫున పోటీదారులకు అందజేయడానికి వివరణాత్మక బుక్‌లెట్‌ను సిద్ధం చేయాలని సూచించారు. అతిథులు, పోటీల్లో పాల్గొనేవారు సందర్శించే అన్ని ప్రదేశాలను సుందరీకరించాలని జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. డీజీపీ జితేందర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (సీఎంఓ) జయేశ్ రంజన్, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టినా చోంగ్తు, ఐఅండ్‌పీఆర్ ఇన్చార్జి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
రియల్ ఎస్టేట్‌లోకి పెట్టుబడుల వెల్లువ
సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని రియల్ ఎస్టేట్ రంగంలోకి ప్రత్యామ్నాయ పెట్టుబడులు(ఏఐఎఫ్) వెల్లువెత్తుతున్నాయి. 2024 డిసెంబర్ చివరి నాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. గతేడాది డిసెంబర్ నాటికి అన్ని రంగాల్లో ఏఐఎఫ్‌లు కలిపి రూ.5,06,196 కోట్లు రాగా.. ఇందులో 15 శాతం వాటా రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చాయని అనరాక్ నివేదిక వెల్లడించింది.నిధుల లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రాజెక్ట్‌లకు ఏఐఎఫ్ పెట్టుబడులు జీవాన్నిస్తున్నాయని, డెవలపర్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధికంగా ఐటీ, ఐటీఈఎస్ రంగంలోకి రూ.30,279 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి.ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.26,807 కోట్లు, ఎన్బీఎఫ్సీ రూ.21,929 కోట్లు, బ్యాంకులు రూ.21,273 కోట్లు, ఫార్మా రూ.18,309 కోట్లు, ఎఫ్ఎంసీజీ రూ.12,743 కోట్లు, రిటైల్ రూ.11,550 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.11,433 కోట్ల చొప్పున ఏఐఎఫ్ పెట్టుబడులు ఆకర్షించగా.. ఇతర రంగాల్లోకి రూ.2,77,970 కోట్ల పెట్టుబడులు వెళ్లాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్న నిధుల సమస్యకు ఏఐఎఫ్ రూపంలో పరిష్కారం లభించినట్టయింది.ఏమిటీ ఏఐఎఫ్ పెట్టుబడులు?దేశంలో సంపన్నులైన పెట్టుబడిదారులు ముఖ్యంగా కనీసం రూ.కోటి పెట్టుబడి పెట్టగల హై నెట్‌వర్త్ ఇండివిడ్యూవల్స్ (HNI), సంస్థల కోసం ఉద్దేశించిన ప్రైవేట్ పెట్టుబడి సమీకరణ సాధనాలే ఈ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్). 2012 ఏఐఎఫ్ నిబంధనల ప్రకారం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) వీటిని నియంత్రిస్తుంది.స్టాక్స్, బాండ్లు లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి సంప్రదాయ పెట్టుబడులకు భిన్నంగా ప్రైవేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, కమోడిటీస్, డెరివేటివ్స్ వంటి సంప్రదాయేతర ఆస్తుల తరగతులలో ఏఐఎఫ్ పెట్టుబడులు పెడతారు. -
ఇదిగో ఇన్వెస్ట్మెంట్కూ ఇదే సూత్రం..
మీరో రోడ్ ట్రిప్‌కు బైల్దేరారు. కారు విండోలు కిందికి దించి, స్వేచ్ఛగా, ఝామ్మంటూ, జోరుగా దూసుకెళ్తున్నారు. దారిలో ఏ అడ్డంకి వచ్చినా దాటేయగలను అనే ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నారు. కానీ, ఇంతలోనే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కుండపోతగా వాన మొదలైంది. ముందేమీ సరిగ్గా కనిపించడం లేదు. కారు పట్టు తప్పిపోతోంది. అప్పటిదాకా థ్రిల్లింగ్ అనిపించిన జర్నీ కాస్తా, ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. అప్పుడు అనిపిస్తుంది. మీరు అనుకున్నంత స్థాయిలో రిస్కులను ఎదుర్కొనేంత సన్నద్ధత మీకు లేదేమోనని. ఇదిగో, పెట్టుబడులకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. చాలా మంది ఇన్వెస్టర్లకు తాము చాలా రిస్కు తీసుకోగలమనో లేదా ఒక మోస్తరుగా తీసుకోగలమనో తమ తమ రిస్కు సామర్థ్యాల విషయంలో ఒక భావన ఉంటుంది. కానీ వాస్తవ ప్రపంచంలో పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఈ ధీమాను విపరీతంగా పరీక్షిస్తాయి. మార్కెట్లో ఒడిదుడుకులను ఆచరణలో ఎదుర్కొనడమనేది థియరీలో చెప్పినంత సులువైన వ్యవహారం కాదు. ఇలా, మనకు ఉన్నాయనుకునే రిస్కు సామర్థ్యాలకు, వాస్తవంగా ఉన్న సామర్థ్యాలకు మధ్య వైరుధ్యం నెలకొన్నప్పుడు, భావోద్వేగాలకు లోనై, నిర్ణయాలు తీసుకుంటాం.కంగారుపడిపోయి, ముందుగానే తప్పుకుంటాం లేదా సామర్థ్యానికి మించి మరింత రిస్కు తీసుకుంటాం. ఊహించుకుంటున్న సామర్థ్యాలకు, వాస్తవ సామర్థ్యాలకు మధ్య వ్యత్యాసాన్ని ముందుగానే గుర్తించి, క్రియాశీలకంగా చక్కదిద్దుకుంటే సంపద సృష్టికి దోహదపడుతుంది. లేకపోతే సంపద నాశనానికి దారితీస్తుంది. మరికొందరు ఇన్వెస్టర్లు, మరింత ఎక్కువగా రిస్కులు తీసుకోగలిగినప్పటికీ, తమకు అంత సామర్థ్యం లేదని భావిస్తుంటారు. ఇలా మరీ మెతక వైఖరి వల్ల వృద్ధి అవకాశాలను కోల్పోతుంటారు. అవగాహన ఉండాలి.. రిస్కు సామర్థ్యం అనేది ఆర్థిక లక్ష్యాలు, పెట్టుబడుల వ్యవధి, వ్యక్తిత్వాన్ని బట్టి ఇన్వెస్టరు ఏ స్థాయిలో రిస్కును తీసుకోగలుగుతారనేది చూచాయగా తెలియజేస్తుంది. ఇక రిస్క్ సహనశీలత అనేది, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు ఇన్వెస్టరు వాస్తవంగా – ఇటు భావోద్వేగాలపరంగా అటు ఆర్థికంగా – ఎంత వరకు రిస్కు తీసుకుంటారనేది తెలియజేస్తుంది. ఉదాహరణకు ఈక్విటీల విషయంలో తాను ఎంతైనా రిస్కు తీసుకోగలనని ఓ ఇన్వెస్టరు అనుకోవచ్చు. కానీ మార్కెట్లు పతనమవుతున్నప్పుడు కంగారుపడిపోయి, అమ్మేయొచ్చు. అంటే, తాము రిస్కుల విషయంలో ముందుగా ఊహించుకున్న దానికన్నా సహనశీలత చాలా తక్కువగా ఉందని అర్థం. ఇలా ఊహించుకునే దానికి, వాస్తవానికి మధ్య ఉండే వ్యత్యాసం వల్ల భావోద్వేగాలకు లోనై నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థిక ప్రణాళికలు తల్లకిందులవుతాయి. రిస్కులపై భ్రమలు.. మనం ఊహించుకునే రిస్కు సామర్థ్యాలకు, వాస్తవ పరిస్థితికి మధ్య వ్యత్యాసాలకు చాలా కారణాలే ఉంటాయి: మార్కెట్ పరిస్థితులు: బుల్ మార్కెట్లు మనకు ఆత్మవిశ్వాసం ఉన్నట్లు భ్రమింపచేస్తాయి. మరోవైపు, మార్కెట్లు పతనమైనప్పుడు తీవ్రమైన భయం వేస్తుంది. దీంతో ఇన్వెస్టర్లు, ముందూ వెనుకా ఆలోచించకుండా తమ రిస్కు సామర్థ్యాలను పక్కనపెట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. అనుభవం: మొదటిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్నవారు, మార్కెట్ల పతనాన్ని తొలిసారి చవిచూసే వరకు తాము ఎలాంటి రిస్కులనైనా ఎదుర్కొనగలమనే భావనలో ఉండొచ్చు. కానీ అనుభవజ్ఞులైన ఇన్వెస్టర్లకు మాత్రమే వాస్తవిక దృక్కోణం ఉంటుంది. భావోద్వేగాలపరమైన పక్షపాత ధోరణులు: నష్టాన్ని అస్సలు ఇష్టపడకపోయే ధోరణి ఉంటే, లాభాలు ఎంత వచ్చినా గానీ కాస్తంత నష్టం వస్తే చాలా కష్టంగా అనిపించేలా చేస్తుంది. అలాగే, ఇటీవలి కాలంలో కనిపించిన ధోరణుల వైపు మొగ్గు చూపే ఆలోచన విధానం ఉంటే, మార్కెట్లు స్వల్పకాలిక ఒడిదుడుకులకు లోనైనా ఇన్వెస్టర్లు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తలెత్తుతుంది. గుంపును అనుసరించి ముందుకెళ్లే ధోరణి, ఇన్వెస్టర్లు తమకు అనువు కాని రిస్కులను తీసుకునేలా ప్రేరేపిస్తుంది. జీవితంలో మార్పులు: యువ ప్రొఫెషనల్స్‌కు కాస్తంత రిస్కులు తీసుకునే సామర్థ్యాలు ఎక్కువే ఉండొచ్చు. కానీ పెళ్లి, పిల్లలు, రిటైర్మెంట్కు దగ్గరవుతుండటంలాంటి పరిస్థితుల కారణంగా ప్రాధాన్యతలు మారొచ్చు. దానికి అనుగుణంగానే రిస్క్ సామర్థ్యాలూ మారొచ్చు. కాలవ్యవధిపై భ్రమలు: పెట్టుబడులు మొదలెట్టినప్పుడు తమకు బోలెడంత సమయం ఉందని ఇన్వెస్టర్లు భావిస్తుంటారు. కానీ స్వల్పకాలికంగా నష్టాలు ఎదురైనప్పుడు, అసలు సమయమే లేదనే రీతిలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సామర్థ్యాలకు తగ్గట్లుగా పెట్టుబడులు.. ఇన్వెస్టర్లు తమ వాస్తవిక రిస్కు సామర్థ్యాల గురించి అర్థం చేసుకున్న తర్వాత, తదనుగుణంగా పోర్ట్‌ఫోలియోను సరి చేసుకోవడం చాలా కీలకం. ఈక్విటీలు, ఫిక్సిడ్ ఇన్‌కం, ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలతో పోర్ట్‌ఫోలియోలో వైవిధ్యాన్ని పాటిస్తే, రిస్కులను సమర్ధంగా ఎదుర్కొనేందుకు వీలవుతుంది. పెట్టుబడులను దీర్ఘకాలికంగా కొనసాగించడం ద్వారా ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు (సిప్) ఉపయోగపడతాయి. జీవితంలోని దశలు, మార్కెట్ పరిస్థితులను బట్టి రిస్క్ సామర్థ్యాలు మారిపోతుంటాయి కాబట్టి, మధ్యమధ్యలో పోర్ట్‌ఫోలియోను సమీక్షించుకుంటూ ఉండాలి.క్రమం తప్పకుండా రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే రిస్కులకు తగ్గట్లుగా మెరుగైన రాబడులను పొందేందుకు సాధ్యపడుతుంది. ప్రొఫెషనల్ సలహాలను తీసుకుంటే మనకు అనువైన వ్యూహాలను అమలు చేసేందుకు వీలవుతుంది. పెట్టుబడులు విజయవంతం కావాలంటే మనపై మనకు అవగాహన ఉండటం ముఖ్యం. తప్పుగా అంచనా వేసుకుంటే, భావోద్వేగాలపరమైన నిర్ణయాలతో అంతిమంగా ఆర్థిక ప్రణాళికలు పట్టాలు తప్పుతాయి. క్రమం తప్పకుండా సమీక్షించుకుంటూ ఉండటం, క్రమశిక్షణతో పెట్టుబడులు, సమతుల్యమైన వ్యూహాలు వంటి అంశాలు లక్ష్యాల సాధన దిశగా ముందుకెళ్లేందుకు ఉపయోగపడతాయి.ఎలా గుర్తించాలి.. వాస్తవిక రిస్క్ సామర్థ్యాలను అర్ధం చేసుకోవాలంటే గతంలో చేసిన పెట్టుబడుల ధోరణులను ఒకసారి విశ్లేషించుకోవాలి. మార్కెట్లు పతనమైనప్పుడు కూడా పెట్టుబడులను కొనసాగించారా లేదా కంగారు పడిపోయి, నిష్క్రమించారా? అనే అంశాన్ని పరిశీలించుకోవాలి. ఆదాయ స్థిరత్వం, పెట్టుబడుల కాలవ్యవధి, ఒడిదుడుకుల విషయంలో భావోద్వేగాలపరమైన స్పందన తదితర అంశాలను పరిగణనలోకి తీసుకునే రిస్క్ ప్రొఫైలింగ్ సాధనాలు ఇందులో కాస్త సహాయపడగలవు. ఇక అసెట్లకు జరిపే కేటాయింపులు కూడా మనం ఎంతవరకు రిస్కులను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉంటామనే విషయాన్ని తెలియజేస్తుంది.ఉదాహరణకు పెట్టుబడుల విషయంలో చాలా దూకుడుగా, చురుగ్గా ఉంటాననుకునే వ్యక్తి ఎక్కువగా ఫిక్సిడ్ ఇన్‌కం అసెట్స్వైపే మొగ్గు చూపుతున్నారంటే, తాము ఊహించుకుంటున్న దానికన్నా వారి రిస్క్ సామర్థ్యాలు తక్కువగా ఉన్నట్లు భావించవచ్చు. పెట్టుబడుల కాలవ్యవధి, ఆర్థిక లక్ష్యాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. స్వల్పకాలిక లిక్విడిటీ అవసరాలు ఉన్న వారితో పోలిస్తే దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు సాధారణంగా కాస్తంత ఎక్కువ రిస్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒక చిన్న స్ట్రెస్ టెస్టుతో వాస్తవ పరిస్థితులను అంచనా వేసుకోవచ్చు. పోర్ట్‌ఫోలియో 20 శాతం పడిపోయినా ఎలాంటి మార్పులు, చేర్పులూ చేయకుండా ఓర్చుకోగలమా అనే చిన్న ప్రశ్న వేసుకుంటే మన రిస్క్ సామర్థ్యాలు మనకు అర్థమవుతాయి.- రోహిత్ మట్టూ, నేషనల్ హెడ్ – రిటైల్ సేల్స్, యాక్సిస్ మ్యుచువల్ ఫండ్ -
హైబ్రిడ్ ఫండ్స్‌కి ఆదరణ
న్యూఢిల్లీ: హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి 2024–25లో రూ.1.19 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2023–24లో వచ్చిన పెట్టుబడులు రూ.1.45 లక్షల కోట్లతో పోల్చి చూస్తే 18 శాతం తగ్గాయి. అయినప్పటికీ గణనీయంగా పెట్టుబడులు రావడం గమనించొచ్చు. అంతేకాదు, ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలతో (ఫోలియోలు)పాటు, హైబ్రిడ్ ఫండ్స్ నిర్వహణలోని పెట్టుబడులు (ఏయూఎం) అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలి్చతే వృద్ధి చెందడం గమనార్హం. ఫోలియోలు (పెట్టుబడి ఖాతాలు) 1.35 కోట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరం చివరికి 1.56 కోట్లకు పెరిగాయి. ఇక వీటి నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.7.23 లక్షల కోట్ల నుంచి రూ.8.83 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ఏయూఎంలో 22 శాతం వృద్ధి నమోదైంది. ఈక్విటీ మార్కెట్లో అనిశి్చతులు పెరిగిపోవడం, కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం వంటి పరిణామాలు పెట్టుబడులపై ప్రభావం చూపించినట్టు నిపుణులు చెబుతున్నారు. హైబ్రిడ్ ఫండ్స్ ఈక్విటీ, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయని తెలిసిందే. హైబ్రిడ్ పథకాల్లో డెట్ పెట్టుబడులకు ఉండే రక్షణ దృష్ట్యా అవి గణనీయమైన పెట్టుబడులను ఆకర్షించినట్టు ట్రేడ్జినీ సీవోవో త్రివేష్ తెలిపారు. అచ్చమైన ఈక్విటీలతో పోలి్చతే ఈ పథకాల్లో పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు అంత ఆందోళన చెందక్కర్లేదన్నారు. 2022–23లో ఇదే విభాగం నికరంగా రూ.18,813 కోట్లను కోల్పోవడం గమనార్హం. -
ఫారిన్ ఫ్లో: స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడుల వెల్లువ..
ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి నెలకొంటే.. మన దేశం మాత్రం వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి సాధిస్తోంది. దేశీయ స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరుగుతున్నాయి. దేశాభివృద్ధిపై దేశీయ పెట్టుబడిదారులకు విశ్వాసం ఉన్నప్పటికీ.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో విదేశీ పెట్టుబడిదారుల భాగస్వామ్యం పెరిగింది. దేశంలో బలమైన ఆర్థిక వృద్ధి, వేగవంతమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రోత్సాహకర ప్రభుత్వ విధానాలు, సులభతర పెట్టుబడి విధానం వంటి రకరకాల కారణాలతో విదేశీ పెట్టుబడిదారుల వాటా గతేడాది తొలి త్రైమాసికం(క్యూ1)లో 2 శాతం నుంచి ఈ ఏడాది క్యూ1 నాటికి ఏకంగా 43 శాతానికి పెరిగిందని వెస్టియన్ నివేదిక వెల్లడించింది. - సాక్షి, సిటీబ్యూరోవిదేశీ పెట్టుబడుల వెల్లువ..దేశంలోకి 2024 క్యూ1లో 552.1 మిలియన్ డాలర్ల సంస్థాగత పెట్టుబడులు వచ్చాయి. ఇందులో విదేశీ పెట్టుబడులు కేవలం 4 శాతమే. అంటే 11 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. అదే 2025 క్యూ1 నాటికి మొత్తం 813.3 మిలియన్ డాలర్ల పెట్టుబడులు రాగా.. ఇందులో విదేశీ పెట్టుబడుల వాటా ఏకంగా 43 శాతం. 346.9 మిలియన్ డాలర్ల ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. నివాసంలోకే అత్యధికం.. నివాస విభాగంలో పెట్టుబడులకే విదేశీయులు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గృహ రంగంలోకి 506 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. మొత్తం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో రెసిడెన్షియల్ సెక్టార్ వాటా 62 శాతం. గతేడాది క్యూ1తో పోలిస్తే ఇది 41 శాతం అధికం. విలువల పరంగా చూస్తే.. పెట్టుబడులు వార్షికంగా 125 శాతం వృద్ధి నమోదు చేశాయి. ఆ తర్వాత వాణిజ్య విభాగంలోకి 307.2 మిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి.ఇదీ చదవండి: పెరిగిన అద్దెలు.. హైదరాబాద్‌లో అక్కడే ఫుల్ డిమాండ్!ఈ త్రైమాసికంలో వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో ఈ విభాగం వాటా 38 శాతం. అయితే ఈ క్యూ1లో పారిశ్రామిక, గిడ్డంగుల విభాగంలోకి ఎలాంటి పెట్టుబడులు రాలేదు. అయితే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ–కామర్స్ రంగం, లాజిస్టిక్ ఖర్చుల తగ్గింపు నేపథ్యంలో భవిష్యత్తులో ఈ విభాగంలోకి పెట్టుబడులు వచ్చే అవకాశాలు అపారంగా ఉన్నాయి. -
రియల్ ఎస్టేట్‌లోకి ఏఐఎఫ్ పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ రంగంలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు) పెట్టుబడులు 2024 డిసెంబర్ నాటికి రూ.73,903 కోట్లకు చేరాయి. రియల్ ఎస్టేట్ రంగ కన్సల్టెంట్ సంస్థ ‘అనరాక్’ ఏఐఎఫ్‌లకు సంబంధించి డేటాను విశ్లేషించి ఒక నివేదిక విడుదల చేసింది. గత డిసెంబర్ నాటికి ఏఐఎఫ్‌లు అన్ని రంగాల్లోనూ కలిపి రూ.5,06,196 కోట్లను ఇన్వెస్ట్ చేసినట్టు తెలిపింది. ఇందులో 15 శాతం మేర (రూ.73,903 కోట్లు) రియల్ ఎస్టేట్‌లోకి వచ్చాయని.. రంగాల వారీగా అత్యధిక పెట్టుబడులు రియల్టీకే దక్కినట్టు ఈ నివేదిక తెలిపింది. ‘‘ఏఐఎఫ్‌లతో దేశ రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ (రుణ సదుపాయం) గణీయమైన మార్పునకు గురైంది. నిధుల్లేమితో ఇబ్బందులు పడుతున్న ప్రాజెక్టులకు ఏఐఎఫ్ పెట్టుబడులు జీవాన్నిస్తున్నాయి. డెవలపర్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి’’అని అనరాక్ తెలిపింది. ఏ రంగంలోకి ఎంత మేర.. రియల్ ఎస్టేట్ తర్వాత అత్యధికంగా ఐటీ/ఐటీఈఎస్ రంగంలోకి రూ.30,279 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.26,807 కోట్లు, ఎన్బీఎఫ్సీ రూ.21,929 కోట్లు, బ్యాంకులు రూ.21,273 కోట్లు, ఫార్మా రూ.18,309 కోట్లు, ఎఫ్ఎంసీజీ రూ.12,743 కోట్లు, రిటైల్ రూ.11550 కోట్లు, పునరుత్పాదక ఇంధన రంగం రూ.11,433 కోట్ల చొప్పున ఏఐఎఫ్ పెట్టుబడులను 2024 డిసెంబర్ నాటికి ఆకర్షించినట్టు అనరాక్ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఇతర రంగాల్లోకి రూ.2,77,970 కోట్ల ఏఐఎఫ్ పెట్టుబడులు వెళ్లాయి. రియల్ ఎస్టేట్ అభివృద్ధి పరంగా వివిధ దశల్లో ఉన్న నిధుల సమస్యకు ఏఐఎఫ్ రూపంలో పరిష్కారం లభించినట్టు అనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ ప్రశాంత్ ఠాకూర్ పేర్కొన్నారు. సంప్రదాయ నిధుల సమీకరణ మార్గాల్లో ఇబ్బందులకు ఈ రూపంలో పరిష్కారం లభించినట్టు చెప్పారు. ఏఐఎఫ్‌లు ప్రైవేటు ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ తదితర రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. ఇవి ఇన్వెస్టర్లకు అధిక రిస్క్‌తో కూడిన రాబడులను ఆఫర్ చేస్తుంటాయి. దేశ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి పెద్ద మొత్తంలో నిధులు సమీకరించి, తమ ప్రణాళికలకు అనుగుణంగా పెట్టుబడులు పెడుతుంటాయి. గడిచిన దశాబ్ద కాలంలో సెబీ వద్ద నమోదైన ఏఐఎఫ్‌లు 36 రెట్లు పెరిగాయి. 2013 మార్చి నాటికి 42గా ఉన్నవి 2025 మార్చి 5 నాటికి 1,524కు పెరిగినట్టు డేటా తెలియజేస్తోంది. -
జపాన్ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
-
బంగారంపై పెట్టుబడి కష్టమే!.. ప్రత్యామ్నాయ మార్గాలివిగో..
భారతదేశంలో బంగారం ధర రూ. లక్ష దాటేసింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 78వేలు (10 గ్రా) వద్ద ఉన్న గోల్డ్.. నాలుగు నెలలు పూర్తి కాకుండానే, భారీ పెంపును పొందింది. పసిడి రేటు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. అయితే ధరలు భారీగా పెరగడంతో.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో తెలియక కొంతమంది సతమతమవుతుంటారు. బంగారం మీద కాకుండా.. ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభదాయకంగా ఉంటుందో ఈ కథనంలో చూసేద్దాం..రియల్ ఎస్టేట్బంగారం మీద పెట్టుబడి వద్దనుకుంటే.. రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ డబ్బుకు అధిక మొత్తంలో లాభం రావాలంటే.. ఇల్లు, స్థలాల మీద ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం. ఈ రంగంలో ముందస్తు పెట్టుబడిగా భారీ మొత్తంలో వెచ్చించాల్సి ఉంటుంది. అయితే ఇది స్థిరమైన.. దీర్ఘకాలిక ఆస్తి. తప్పకుండా భవిష్యత్తులో మంచి లాభలను తెచ్చిపెడుతుంది.గోల్డ్ ఈటీఎఫ్‌లు & సావరిన్ గోల్డ్ బాండ్లుబంగారం కొనుగోలు వద్దనుకుంటే.. గోల్డ్ ఈటీఎఫ్‌లు లేదా సావరిన్ గోల్డ్ బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. సావరిన్ గోల్డ్ బాండ్లు (SGBs) భారత ప్రభుత్వం తరపున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేసే ఒక రకమైన ప్రభుత్వ బాండ్. ఇందులో కూడా అధిక లాభాలు పొందవచ్చు.ఇదీ చదవండి: ఒకేసారి రూ.3000 పెరిగిన గోల్డ్: లక్ష దాటేసిన రేటుస్టాక్‌లు & మ్యూచువల్ ఫండ్‌లుబ్లూ-చిప్ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం కూడా.. బంగారం మీద పెట్టుబడికి ప్రత్యామ్నాయమే. అయితే ఇందులో కాలక్రమేణా రాబడి పెరుగుతుంది. ఒక్కోసారి మార్కెట్లలో నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.ఫిక్స్డ్ డిపాజిట్లు & బాండ్లుకార్పొరేట్ బాండ్లు, ప్రభుత్వ బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి వాటిలో కూడా పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక్కడ కొంత తక్కువ రిస్క్ ఉంటుంది. స్థిరమైన రాబడి లభిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా కూడా మంచి రాబడులు పొందవచ్చు.డిజిటల్ గోల్డ్ఎంఎంటీసీ-పీఏఎంపీ, ఆగ్మోంట్, సేఫ్ గోల్డ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో 24 క్యారెట్ల బంగారాన్ని డిజిటల్‌గా కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ గోల్డ్ వెయిట్ ప్రకారం లేదా ధర ప్రకారం కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేసిన తర్వాత, మీరు దానిని నగదుకు విక్రయించవచ్చు లేదా భౌతిక బంగారంగా రీడీమ్ చేయవచ్చు. -
రియల్ఎస్టేట్లో తగ్గిన ‘పీఈ’ పెట్టుబడులు
సాక్షి, సిటీబ్యూరో: దేశీయ స్థిరాస్తి రంగంలోకి వచ్చిన ప్రైవేట్ ఈక్విటీ(పీఈ) పెట్టుబడులు కాస్త తగ్గాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన పెట్టుబడులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 3 శాతం మేర తగ్గినట్లు రియల్టీ కన్సల్టెంట్ అనరాక్ క్యాపిటల్ వెల్లడించింది.2024–25లో ఈ పెట్టుబడులు 3.7 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు తెలిపింది. అంతకుముందు ఏడాది ఇవి 3.8 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఆఫీసు భవనాలకు ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడమే ఈ క్షీణతకు కారణం. 2020–21లో అత్యధికంగా 6.4 బిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులు రాగా.. 2021–22లో ఇవి 4.3 బిలియన్ డాలర్లకు తగ్గాయి.అయితే 2022–23 కల్లా 4.4 బిలియన్ డాలర్లకు పెరిగినప్పటికీ.. తర్వాత తగ్గుముఖం పట్టాయి. ఐదేళ్లుగా దేశీ రియల్టీలో పీఈ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతూ వచ్చాయి. 6.4 బిలియన్ డాలర్ల నుంచి 3.7 బిలియన్ డాలర్లకు అంటే 43 శాతం మేర క్షీణించాయి. -
పెట్టుబడి రంగంలో మార్పులు: భారీగా పెరిగిన కొత్త డీమ్యాట్ అకౌంట్స్
ముంబయి: భారతదేశంలో పెట్టుబడి రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) 84 లక్షలకు పైగా కొత్త డీమ్యాట్ ఖాతాలను జోడించింది. ఇది సంవత్సరానికి 20.5% వృద్ధిని సూచిస్తుంది. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య 4.92 కోట్లకు చేరింది. ఈ వృద్ధిలో గ్రో అనే బ్రోకరేజ్ సంస్థ ముందంజలో నిలిచింది.ఇది మొత్తం కొత్త ఖాతాలలో 40% కంటే ఎక్కువ భాగాన్ని సొంతం చేసుకుంది. దీంతో గ్రో దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రోకరేజ్ వేదికగా నిలిచింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం.. గ్రో చురుకైన క్లయింట్ల సంఖ్య 2024 మార్చిలో 95 లక్షల నుండి 2025 మార్చి నాటికి 1.29 కోట్లకు పెరిగింది. ఇది 36% వృద్ధిని సూచిస్తోంది. ఇది పరిశ్రమ సగటు వృద్ధి కంటే గణనీయంగా ఎక్కువ.గ్రో యొక్క మార్కెట్ వాటా 23.28% నుండి 26.26%కు పెరిగింది, ప్రతి నెలా స్థిరమైన పురోగతిని నమోదు చేసింది. ఇతర బ్రోకరేజ్ సంస్థలతో పోలిస్తే, రెండో అతిపెద్ద బ్రోకర్ జీరోధా 5.8 లక్షల ఖాతాలను జోడించి, ఎన్ఎస్ఈ మొత్తం వృద్ధిలో 6.9% దోహదం చేసింది. ఏంజెల్ వన్ 14.6 లక్షల ఖాతాలను జోడించి 17.38% దోహదం చేసింది. వీటి మార్కెట్ వాటాలు వరుసగా 16% మరియు 15.38%గా ఉన్నాయి. 2025 జనవరిలో ఎన్ఎస్ఈ చురుకైన డీమ్యాట్ ఖాతాల సంఖ్య 5.02 కోట్లతో గరిష్ట స్థాయికి చేరింది. అయితే, ఆర్థిక సంవత్సరం చివరి రెండు నెలల్లో మార్కెట్ అస్థిరత కారణంగా స్వల్ప తగ్గుదల నమోదైంది.పెరుగుతున్న మహిళా పెట్టుబడిదారులు..గ్రో సగటు నెలవారీ క్లయింట్ వృద్ధి 3%గా ఉంది, ఇది పరిశ్రమ సగటు 1.74% కంటే ఎక్కువ. గ్రో యొక్క డిజిటల్-ప్రధాన విధానం, సరళమైన వినియోగదారు అనుభవం, టైర్ II, III, IV నగరాల నుండి మొదటిసారి పెట్టుబడిదారులతో బలమైన అనుబంధం ఈ వృద్ధికి కారణాలుగా చెప్పవచ్చు. ఈ డేటా వ్యక్తిగత పెట్టుబడుల పెరుగుదలను సూచిస్తుంది, ఇందులో యువ, సాంకేతిక పరిజ్ఞానం గల తరం సులభమైన వేదికలు, పారదర్శక ప్రక్రియలు, సరళమైన ఆన్‌బోర్డింగ్‌ను ఎంచుకుంటోంది. కొత్త డీమ్యాట్ ఖాతాదారుల సగటు వయస్సు క్రమంగా తగ్గుతోంది, దాదాపు 30 ఏళ్లలోపు వారు ఎక్కువగా ఉన్నారు. అంతేకాక, మహిళా పెట్టుబడిదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రతి నలుగురు కొత్త పెట్టుబడిదారులలో ఒకరు మహిళగా ఉండటం ఆర్థిక భాగస్వామ్యంలో సానుకూల మార్పును సూచిస్తుంది.ఇదీ చదవండి: ఎండలో కారు చల్లగా ఉండాలంటే: ఇదిగో టాప్ 5 టిప్స్.. -
రూ.29 వేల కోట్ల ‘గ్రీన్’ పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.29,000 కోట్ల భారీ పెట్టుబడులతో 5,579 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులతోపాటు 15 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టుల స్థాపనకు ముందుకొచ్చిన రెండు ప్రైవేటు వ్యాపార సంస్థలతో రాష్ట్ర పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో) పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకుంది. తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్లో బుధవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సమక్షంలో రెడ్కో ఈ మేరకు మొత్తం నాలుగు ఎంఓయూలు కుదుర్చుకుంది. ఈ ప్రాజెక్టుల స్థాపనతో రాష్ట్రంలో 19,200 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎకోరెన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.27,000 కోట్ల పెట్టుబడులతో మొత్తం 5,579 మెగావాట్ల సామర్థ్యంతో మూడు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మూడు ఎంఓయూలు కుదుర్చుకుంది.» సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లోని మూడు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 3,279 మెగావాట్ల పవన–సౌర హైబ్రిడ్ విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. » జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 7 ప్రాంతాల్లో మొత్తం 1,650 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును స్థాపించనుంది. » జోగుళాంబ గద్వాల జిల్లాలో 650 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ మూడు ప్రాజెక్టుల ఏర్పాటుతో 16,200 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలతో పాటు రాష్ట్రానికి జీఎస్టీ రూపంలో రూ.1600 కోట్ల ఆదాయం రానుంది. » జీఎస్పీఆర్ ఆర్య సంస్థ రూ.2000 కోట్ల పెట్టుబడులతో 15 జిల్లాల్లో 15 కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ఎంఓయూ చేసుకోగా, 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. » వరి గడ్డి నుంచి బయోగ్యాస్‌ను ఉత్పత్తి చేయనుండగా, ఒక్కో ప్రాజెక్టు 15 టన్స్ పర్డే(టీపీడీ)ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండనున్నాయి. ఎనర్జీ పాలసీతోనే : భట్టి తెలంగాణ క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీకి ఆకర్షితులై జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణభాస్కర్, రెడ్కో వీసీ, ఎండీ వి.అనీల, ఎకోరెన్ కంపెనీ ఎండీ ప్రసాద్, జీపీఎస్ఆర్ ఆర్య కంపెనీ ఎండీ దీపక్ అగర్వాల్ పాల్గొన్నారు. -
Satyameva Jayate: స్టాక్ మార్కెట్ లో డబ్బులు పెడుతున్నారా? అయితే జాగ్రత్త!
-
విదేశీ కంపెనీలకు ఆహ్వానం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారత్‌లో ఇన్వెస్ట్ చేయమంటూ ఆస్ట్రియన్ కంపెనీలకు తాజాగా ఆహ్వానం పలికారు. నూతన, వర్ధమాన రంగాలలో ఇందుకు పలు అవకాశాలున్నట్లు పేర్కొ న్నారు. ఆ్రస్టియా రాజధాని వియన్నాలో ఏర్పాటైన ఇండియా– ఆస్ట్రియా బిజినెస్ రౌండ్‌టేబుల్ సందర్భంగా భారత్‌లో పెట్టుబడి అవకాశాలను వినియోగించుకోవలసిందిగా సూచించారు.ఆర్థిక పురోభివృద్ధి, సులభతర బిజినెస్ నిర్వహణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో దేశం వేగంగా ముందుకెళుతున్నట్లు తెలియజేశారు. వర్ధమాన రంగాలలో పలు అవకాశాలు పుడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రీన్ హైడ్రోజెన్, ఎలక్ట్రిక్ వాహనాలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్లను ప్రస్తావించారు. ఆసియా, దక్షిణ ప్రపంచానికి భారత్ అద్భుతమైన గేట్వేగా అభివర్ణించారు.ఇదీ చదవండి: అమెరికా దెబ్బకు చైనా ఔట్?ఇండియా–ఆస్ట్రియా ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యం మరింత బలపడుతుందని, అత్యధిక అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. భారత్‌లో విస్తరించిన తయారీ, సామర్థ్యాలను ప్రస్తావిస్తూ ఆస్ట్రియన్ కంపెనీలు కేపబిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. తద్వారా దేశీయంగా లభించే అత్యున్నత ఐటీ, డిజిటల్ నైపుణ్యాలను వినియోగించుకోవచ్చని చెప్పారు. -
ఈక్విటీ పెట్టుబడులు.. 11 నెలల కనిష్టానికి
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లోకి పెట్టుబడుల రాక మార్చి నెలలో రూ.25,082 కోట్లకు తగ్గింది. నెలవారీ ఈక్విటీ పెట్టుబడుల్లో ఇది 11 నెలల కనిష్టం (2024 ఏప్రిల్ తర్వాత) కావడం గమనార్హం. ఫిబ్రవరిలో ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన నికర పెట్టుబడులు29,303 కోట్లుగా ఉన్నాయి. అటు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో వచ్చే పెట్టుబడులు సైతం నాలుగు నెలల కనిష్టానికి తగ్గి రూ.25,925 కోట్లుగా నమోదయ్యాయి. ముఖ్యంగా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి కొనసాగింది. ఈ మేరకు మార్చి నెల గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి నుంచి ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక క్రమంగా తగ్గుతోంది. ఇక 2024–25 ఆర్థిక సంవత్సరం మొత్తంమీద ఈక్విటీ ఫండ్స్‌లోకి వచ్చిన పెట్టుబడులు రూ.4.17 లక్షల కోట్లుగా ఉన్నాయి. 2023–24లో వచ్చిన రూ.1.84 లక్షల కోట్లతో పోల్చితే గణనీయంగా పెరిగాయి. సిప్ ఫర్వాలేదు.. సిప్ పెట్టుబడులు మార్చిలో రూ.25,925 కోట్లుగా నమోదయ్యాయి. ఫిబ్రవరిలో రూ.25,999 కోట్లు, జనవరిలో రూ.26,400 కోట్లు, 2024 డిసెంబర్లో రూ.26,459 కోట్ల చొప్పున సిప్ ద్వారా ఫండ్స్‌లోకి పెట్టుబడులు వచ్చాయి. 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు సిప్ పెట్టుబడులు రూ.24,113 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ.16,602 కోట్ల చొప్పున ఉంది. → మార్చిలో అత్యధికంగా ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి రూ. 5,165 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. → ముఖ్యంగా సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ విషయంలో ఇన్వెస్టర్ల ధోరణిలో పూర్తి మార్పు కనిపించింది. ఫిబ్రవరిలో ఈ విభాగం ఇన్వెస్టర్ల నుంచి రూ.5,711 కోట్లను ఆకర్షించగా.. మార్చిలో రూ.735 కోట్లకు పెట్టుబడులు తగ్గిపోయాయి. → మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల జోరు కొనసాగింది. మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ.3,439 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.4,092 కోట్ల చొప్పున ఆకర్షించాయి. → లార్జ్‌క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులు రూ.2,479 కోట్లకు తగ్గాయి. ఫిబ్రవరిలో ఈ విభాగంలోకి వచ్చిన పెట్టుబడులు రూ.2,866 కోట్లుగా ఉన్నాయి. → మార్చి నెలలో డెట్ ఫండ్స్ నుంచి ఇన్వెస్టర్లు రూ.2.02 లక్షల కోట్లను ఉపసంహరించుకున్నారు. ఫిబ్రవరిలో ఉపసంహరణ రూ.6,525 కోట్లుగానే ఉంది. → లిక్విడ్ ఫండ్స్ నుంచి రూ.1.33 లక్షల కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఆ తర్వాత ఓవర్‌నైట్ ఫండ్స్ నుంచి రూ.30,015 కోట్లు, మనీ మార్కెట్ ఫండ్స్ నుంచి రూ.21,301 కోట్ల చొప్పున ఇన్వెస్టర్లు వెనక్కి తీసుకున్నారు. → గోల్డ్ ఈటీఎఫ్‌లలో రూ.77 కోట్లు బయటకు వెళ్లిపోయాయి. ఫిబ్రవరిలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో ఇన్వెస్టర్లు రూ.1,980 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. → మొత్తం మీద మార్చి నెలలో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ (అన్ని విభాగాలూ కలసి) రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ప్రతికూలతల వల్లే.. సెక్టోరల్, థీమ్యాటిక్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక గణనీయంగా తగ్గడం మొత్తం మీద ఈక్విటీ పెట్టుబడులను తగ్గించేసినట్టు మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ మేనేజర్ నేహల్ మెష్రామ్ తెలిపారు. ‘‘ఇన్వెస్టర్లు అనిశ్చితులను ఇష్టపడరు. తరచూ వస్తున్న ప్రతికూల వార్తలతో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించారు’’అని యూనియన్ ఏఎంసీ సీఈవో మధునాయర్ పేర్కొన్నారు. 51 లక్షల సిప్ ఖాతాలు బంద్ మార్చి నెలలో సిప్ పెట్టుబడుల నిలిపివేత మరింత పెరిగింది. 51 లక్షల సిప్ ఖాతాల నుంచి పెట్టుబడులు ఆగిపోయాయి. అదే సమయంలో కొత్తగా 40 లక్షల సిప్ ఖాతాలను ఇన్వెస్టర్లు ప్రారంభించారు. నికరంగా చూస్తే 11 లక్షల మేర సిప్ ఖాతాలు తగ్గినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరిలో సిప్ నిలిపివేత నిష్పత్తి 122 శాతంగా ఉంటే, మార్చి నెలకు 127.5 శాతానికి పెరిగింది. -
అన్ని కాలాలకూ అనుకూలం
ఇటీవలి కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ కంపెనీల విలువలు గణనీయంగా పెరిగిపోవడం, అక్కడి నుంచి అదే తీవ్రతతో దిద్దుబాటుకు గురికావడం చూస్తున్నాం. దీంతో ఇన్వెస్టర్లలో అప్రమత్త ధోరణి నెలకొంది. పోర్ట్‌ఫోలియోలో లార్జ్‌క్యాప్ ప్రాధాన్యాన్ని వారు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. స్మాల్, మిడ్‌క్యాప్‌తో పోల్చిచూసినప్పుడు లార్జ్‌క్యాప్ కంపెనీల్లో (మార్కెట్ విలువలో టాప్100 కంపెనీలు) అస్థిరతలు తక్కువ. అంతేకాదు ఆయా రంగాల్లో ఇవి బలమైన కంపెనీలు కూడా. కనుక మొదటిసారి ఇన్వెస్టర్లకు సైతం లార్జ్‌క్యాప్ ఫండ్స్ పెట్టుబడులకు అనుకూలమని నిపుణులు సూచిస్తుంటారు. ఈ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న పథకాల్లో నిపాన్ ఇండియా లార్జ్‌క్యాప్ ఫండ్ ఒకటి. రాబడులుఈ పథకం గడిచిన ఏడాది కాలంలో పెట్టుబడులపై 9 శాతం రాబడిని అందించింది. అదే మూడేళ్ల కాలాన్ని పరిశీలిస్తే వార్షిక రాబడి 18 శాతానికి పైనే ఉంది. ఐదేళ్లలో ఏటా 26.64 శాతం, ఏడేళ్లలో 14.91 శాతం, పదేళ్లలో 12.89 శాతం చొప్పన ఇన్వెస్టర్లకు ప్రతిఫలాన్ని తెచ్చిపెట్టింది. నిఫ్టీ 100 టీఆర్ఐ సూచీ, లార్జ్‌క్యాప్ ఫండ్స్ విభాగం కంటే ఈ పథకమే దీర్ఘకాలంలో మెరుగైన పనితీరు చూపించింది. పదేళ్ల క్రితం ఈ పథకంలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి ఉంటే, అది ఇప్పుడు రూ.4.78 లక్షలుగా మారేది. గత పదేళ్లలో ప్రతి నెలా రూ.5,000 చొప్పున సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఇన్వెస్ట్ చేసి ఉంటే, ఆ మొత్తం రూ.15.44 లక్షలు అయ్యేది. గత పదేళ్లలో ఏ ఒక్క ఏడాది ఈ పథకం ప్రతికూల రాబడిని ఇవ్వలేదు. రూ.100 నుంచి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.మెరుగైన పనితీరుమార్కెట్ కరెక్షన్ల సమయాల్లో పెట్టుబడుల విలువ క్షీణతను తక్కువకు పరిమితం చేయడంలో పోటీ పథకాలతో పోలిస్తే ఈ పథకం ముందుంది. ఈ పథకం కనీసం 80 శాతం మేర లార్జ్‌క్యాప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడుతుంది. మిడ్, స్మాల్‌క్యాప్‌లో మంచి అవకాశాలున్నాయని భావించినప్పుడు మిగిలిన పెట్టుబడులను ఆయా విభాగాలకు కేటాయిస్తుంది. వివిధ రంగాల్లో ఇప్పటికే దిగ్గజాలుగా అవతరించి, వ్యాపార పరంగా బలమైన మూలాలున్న వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. అంతేకాదు, భవిష్యత్‌లో దిగ్గజాలుగా అవతరించే వాటిని గుర్తించి పెట్టుబడులు పెడుతుంది. బలమైన మూలాలున్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడమే కాదు, దీర్ఘకాలం పాటు కొనసాగడం ఈ పథకం మెరుగైన పనితీరుకు కారణాల్లో ఒకటి. మంచి వృద్ధికి అవకాశాలున్న కంపెనీలను సహేతుక విలువల వద్ద గుర్తించి పెట్టుబడి పెడుతుండడాన్ని గమనించొచ్చు.ఇదీ చదవండి: ఇక ఒక రాష్ట్రం–ఒక ఆర్ఆర్బీ!పోర్ట్‌ఫోలియో చూస్తే..ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.34,212 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో 98.46 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయగా, కేవలం 1.53 శాతం నగదు రూపంలో కలిగి ఉంది. ఈక్విటీల్లోనూ 91 శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్‌లో 8.69 శాతం, స్మాల్‌క్యాప్‌లో 0.26 శాతమే పెట్టుబడులు కలిగి ఉంది. మిడ్, స్మాల్ క్యాప్ విలువలు అధిక స్థాయిలకు చేరడంతో ఈ విభాగాలకు పెట్టుబడులను తక్కువకు పరిమితం చేసినట్టు తెలుస్తోంది. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీల్లో అత్యధికంగా 36 శాతం ఇన్వెస్ట్ చేసింది. ఇంధన రంగ కంపెనీల్లో 12.34 శాతం, కన్జ్యూమర్ డిస్క్రీషినరీ కంపెనీల్లో 11.23 శాతం, టెక్నాలజీ కంపెనీల్లో 11 శాతం చొప్పున పెట్టుబడులు ఉన్నాయి. -
ఫిన్‌టెక్ సంస్థలకు పెట్టుబడుల జోష్..
ముంబై: దాదాపు రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఫిన్‌టెక్ రంగంలోకి పెట్టుబడులు మళ్లీ పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వెంచర్ ఇంటెలిజెన్స్ డేటా ప్రకారం 2025లో ఇప్పటివరకు వృద్ధి దశలో ఉన్న అంకుర సంస్థలు దాదాపు 550 మిలియన్ డాలర్లు సమీకరించాయి. మరికొన్ని డీల్స్ ముగింపు దశలో ఉన్నాయి. పీక్ ఫిఫ్టీన్ పార్ట్నర్స్, ఎపిస్, యాక్సెల్, మిత్సుబిషి యూఎఫ్‌జే ఫైనాన్షియల్ గ్రూప్, ఎస్ఎంబీసీ గ్రూప్ లాంటి భారీ ఫండ్స్, ఫిన్టెక్లో భాగమైన వివిధ విభాగాల్లోని సంస్థల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. నియంత్రణ నిబంధనలపరమైన అనిశ్చితి తగ్గడంతో రాబోయే రోజుల్లో ఫిన్‌టెక్ రంగంలో మరిన్ని డీల్స్ నమోదవుతాయని వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ వర్గాలు తెలిపాయి. ఫిన్‌టెక్ రంగంలోకి 2023, 2024లో కేవలం 1.3 బిలియన్ డాలర్లు మాత్రమే రాగా.. తాజాగా ఈ ఏడాది తొలి నాళ్లలోనే అర బిలియన్ డాలర్ల పైగా పెట్టుబడులు రావడం సానుకూల పరిస్థితులను సూచిస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరించాయి. వెల్త్టెక్కు ప్రాధాన్యం.. ఫండ్స్ పెట్టుబడుల్లో వెల్త్‌టెక్ విభాగానికి ఎక్కువగా ప్రాధాన్యం లభిస్తున్నప్పటికీ, పేమెంట్స్, బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల్లాంటి ఇతరత్రా విభాగాలకు కూడా గత మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో గ్రోత్ స్టేజ్ పెట్టుబడులు మెరుగ్గానే లభిస్తున్నాయి. బెంగళూరుకు చెందిన క్యాష్‌ఫ్రీ సంస్థ ఫిబ్రవరిలో 43 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంది. అలాగే, టోన్‌ట్యాగ్ అనే సౌండ్ ఆధారిత పేమెంట్స్ స్టార్టప్ 78 మిలియన్ డాలర్లు అందుకుంది. ఇక ఈజ్‌బజ్ అనే పేమెంట్ అగ్రిగేటర్ సంస్థలో బెస్సీమర్ వెంచర్ పార్ట్నర్స్ సారథ్యంలో ఇన్వెస్టర్లు 40 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారు. టోన్‌ట్యాగ్‌కు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ దన్ను ఉంది. ఈ విభాగంలో వృద్ధి చాలా నెమ్మదిగా ఉండొచ్చు కానీ తాజా పరిణామాలతో వ్యాపారాలకు కాస్త స్థిరత్వం లభిస్తుందని ఓ వెంచర్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. మరోవైపు, ఫిన్‌టెక్ రంగంలో అంతర్గతంగా వెల్త్‌టెక్ విభాగం విస్తరణకు గణనీయంగా అవకాశాలు కనిపిస్తున్నాయి. కోటక్ చెర్రీ సీఈవో శ్రీకాంత్ సుబ్రమణియన్, ఐఐఎఫ్ఎల్ వెల్త్‌కి చెందిన సందీప్ జెత్వానీ వంటి ప్రముఖ వెల్త్ మేనేజర్ల సారథ్యంలోని సంస్థలపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. పేటీఎం మనీ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ప్రవీణ్ జాదవ్ నెలకొలి్పన ధన్ సుమారు 1.1 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో దాదాపు 200 మిలియన్ డాలర్లు సమీకరించే యత్నాల్లో ఉంది. 2022లో ప్రారంభమైన స్టేబుల్ మనీ సంస్థ 130 మిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో 20 మిలియన్ డాలర్లు సమకూర్చుకుంటోంది. 2024 జూన్‌లో నిధులు సమీకరించినప్పటితో పోలిస్తే వేల్యుయేషన్ మూడు రెట్లు పెరిగింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి నియంత్రణ నిబంధనల విషయంలో స్పష్టత నెలకొనడమే ఈ విభాగంపై వెంచర్ క్యాపిటల్ సంస్థలకు ఆసక్తి పెరగడానికి కారణమని పలువురు ఇన్వెస్టర్లు వెల్లడించారు. -
ట్రంప్ సుంకాలు భారత్‌కే మేలు
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరించి ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల అధికార ప్రతినిధులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కోరారు. శనివారం హైదరాబాద్‌లో గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం (జీఐబీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండియా – లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల వాణిజ్య సదస్సు’ రెండో ఎడిషన్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహకాలను వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాల ఉత్పత్తులపై సుంకాలు విధించటం ఒక రకంగా భారత్‌కు మేలు చేస్తుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబ డులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని మనకు అనుకూలంగా మార్చుకుని.. ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 6 అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయని వెల్లడించారు.రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఆగ్రో ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించి అన్నదాతలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జీఐబీఎఫ్ ప్రతినిధులు జోషి, చక్రవర్తి, డా. సీతారాం తదితరులు పాల్గొన్నారు. -
మానసిక ఆరోగ్యమస్తు
సాక్షి, హైదరాబాద్: మనిషి జీవనవిధానంలో చోటుచేసుకుంటున్న మార్పులు నిత్య జీవితంలో అనేక సమస్యలకు కారణమవుతున్నాయి. శారీరక సమస్యలతోపాటు మానసిక రుగ్మతలు కూడా పెరుగుతున్నాయి. ఐదేళ్ల క్రితం వచ్చిన కోవిడ్ మహమ్మారి తర్వాత అందరూ మానసిక ప్రశాంతత అవసరాన్ని గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మానసిక ఆరోగ్యం, వెల్నెస్ రంగంలో కూడా వేగంగా మార్పులు వస్తున్నాయి. భారతీయుల్లో ముఖ్యంగా యువత, విద్యార్థులు ‘మెంటల్ హెల్త్ అండ్ వెల్నెస్’పై దృష్టిపెడుతూ మానసిన వైద్య నిపుణుల వద్ద ‘కౌన్సెలింగ్’ తీసుకునేందుకు సిద్ధపడుతున్నారు. డిమాండ్ పెరుగుతుండటంతో మనదేశంలో ‘మెంటల్ హెల్త్ సెక్టార్’లో పెట్టుబడులు కూడా పెరుగుతున్నాయి. బెయిన్ ఇండియా ప్రైవేట్ ఈక్విటీ రిపోర్ట్–2024 ఇదే విషయాన్ని వెల్లడించింది. మెంటల్ హెల్త్ వెల్నెస్ రంగంలో అవకాశాలు భారీగా పెరుగుతున్నట్టు పేర్కొంది. 2023లో 372 బిలియన్ డాలర్లుగా ఉన్న ఇండియా హెల్త్‌కేర్ మార్కెట్ విలువ.. 2025 చివరికల్లా 638 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసీ నివేదిక అంచనా వేసింది. మనదగ్గరా పెరిగిన డిమాండ్ తెలంగాణలో కూడా మెంటల్ హెల్త్ నిపుణులకు క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. దీంతో మెంటల్ హెల్త్ ఎకోసిస్టమ్ ఏర్పడేందుకు దోహపడేలా మెంటల్ హెల్త్ స్టార్టప్‌ల స్థాపన మొదలైంది. అగర్తలా ఎన్ఐటీలో బీటెక్ పూర్తిచేసిన హైదరాబాద్‌కు చెందిన తరుణ్‌సాయి 2020లోనే మెంటల్ వెల్బీయింగ్ ఫైండ్హోప్ స్టార్టప్‌ను ప్రారంభించాడు. ఇది భారత్‌లోనే మొట్టమొదటి మెంటల్ హెల్త్ స్టార్టప్‌గా గుర్తింపు పొందడంతోపాటు కేంద్ర ప్రభుత్వ ‘స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్’నుంచి నిధులు కూడా సాధించింది.నగరంలో లాభాపేక్ష లేని స్మార్ట్ మైండ్స్ కౌన్సెలింగ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కూడా అందుబాటులోకి వచ్చింది. ‘లైఫ్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్’పై శిక్షణా తరగతులను కూడా ఈ సంస్థ నిర్వహిస్తోంది. అదేవిధంగా యూ అండ్ మీ కౌన్సిలింగ్ సెంటర్ విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, దంపతులు వంటి వారికి కౌన్సెలింగ్ సేవలు అందిస్తోంది. ‘పాజ్ ఫర్ పర్స్పెక్టివ్–మెంటల్ హెల్త్ సరీ్వసెస్’, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ తెలంగాణ విభాగం, అన్ని ప్రధాన ఆసుపతుల్లోనూ మెంటల్ హెల్త్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాయి.కౌన్సెలింగ్‌కు వచ్చేవారి సంఖ్య పెరిగింది మెంటల్ హెల్త్ రంగంలో కౌన్సెలింగ్‌కు సంబంధించిన స్టార్టప్‌లతో పాటు యాప్‌లు కూడా విరివిగా వస్తున్నాయి. అవి ఇంకా విస్తృతంగా జనబాహుళ్యంలోకి రాలేదు. మానసిక ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు అన్నివర్గాల వారు మా కౌన్సెలింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. గతంతో పోలి్చతే వైవాహికబంధంలో సమస్యలు, రిలేషన్షిప్స్ విషయంలో కౌన్సెలింగ్ కోసం వచ్చేవారి సంఖ్య పెరుగుతోంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్, యూ అండ్ మీ కౌన్సెలింగ్ సెంటర్ -
రియల్ఎస్టేట్ పెట్టుబడులు పెరిగాయ్..
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ రంగంలో సంస్థాగత పెట్టుబడులు 2025 జనవరి–మార్చిలో 31 శాతం జంప్ చేసినట్లు రియల్టీ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా పేర్కొంది. ప్రధానంగా రెసిడెన్షియల్ విభాగంలో పెట్టుబడులు పుంజుకోవడంతో 1.3 బిలియన్ డాలర్లను తాకినట్లు ఒక నివేదికలో వెల్లడించింది. నివేదిక ప్రకారం వీటిలో 60 శాతం వాటాతో దేశీ ఇన్వెస్టర్లు ప్రధాన పాత్ర పోషించారు. వార్షికంగా 75 శాతం వృద్ధితో 0.8 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశారు. పెట్టుబడుల్లో ఇండస్ట్రియల్, వేర్‌హౌసింగ్, ఆఫీస్ విభాగాలకు ప్రాధాన్యత ఇచ్చారు.హౌసింగ్ విభాగంలో నిధులు 3 రెట్లు ఎగసి 30.29 కోట్ల డాలర్లకు చేరగా.. గతేడాది ఇదే కాలంలో 10.26 కోట్ల డాలర్లు మాత్రమే లభించాయి. ఆఫీస్ కాంప్లెక్సులలో సంస్థాగత పెట్టుబడులు 23 శాతం క్షీణించి 43.42 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. గత జనవరి–మార్చిలో 56.3 కోట్ల డాలర్లుగా నమోదయ్యాయి. -
నేరుగా వాట్సాప్‌లో.. ఇన్వెస్టర్లకు సరికొత్త ఫీచర్
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ హెచ్డీఎఫ్సీ అసెట్ మేనేజ్మెంట్ వాట్సాప్ ఆధారిత ఇన్వెస్ట్మెంట్ ప్లాట్‌ఫామ్ ‘ట్యాప్2ఇన్వెస్ట్’ను ప్రవేశపెట్టింది. ఈ ఇండస్ట్రీ-ఫస్ట్ ఫీచర్ ప్రస్తుత కేవైసీ-వెరిఫైడ్ ఇన్వెస్టర్లను వాట్సాప్‌లో క్లిక్ ఆధారిత ఇంటర్ఫేస్ ద్వారా మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుందని మ్యూచువల్ ఫండ్ హౌస్ ఒక ప్రకటనలో తెలిపింది.టెక్ట్స్ కమాండ్లపై ఆధారపడే సాంప్రదాయ వాట్సాప్ ఆధారిత పెట్టుబడి సేవల మాదిరిగా కాకుండా, ట్యాప్ 2ఇన్వెస్ట్ వాట్సాప్‌లో యూజర్ ఫ్రెండ్లీ, యాప్ లాంటి అనుభవాన్ని అందిస్తుంది. పెట్టుబడిదారులు నేరుగా వాట్సాప్ (+91-82706 82706) ద్వారా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ప్రారంభించవచ్చు. లేదా పెద్ద మొత్తం పెట్టుబడులను సైతం పెట్టవచ్చు.యూపీఐ ఆటోపే, నెట్ బ్యాంకింగ్, ఇతర డిజిటల్ పేమెంట్ ఆప్షన్లకు ఈ ప్లాట్‌ఫామ్ సపోర్ట్ చేస్తుందని ఫండ్ హౌస్ తెలిపింది. వాట్సాప్ వంటి సుపరిచిత ప్లాట్ఫామ్లో ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులను నిర్వహించడానికి ‘ట్యాప్2ఇన్వెస్ట్’ సురక్షితమైన మార్గాన్ని అందిస్తుందని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ, సీఈఓ నవనీత్ మునోత్ వివరించారు. -
ప్రపంచ దృష్టిని ఆకర్షించేందుకే అందాల పోటీ
సాక్షి, హైదరాబాద్: అందాల పోటీ ద్వారా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేస్తామని, ఇందులో తప్పేముందని ఆబ్కారీ, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. చాలా దేశాలకు తెలంగాణ అంటే తెలియదని, అందుకే హైదరాబాద్‌లో ఈ పోటీ నిర్వహిస్తున్నామని చెప్పారు. దీన్ని కొంతమంది వక్రీకరించడం సరికాదన్నారు. ఎక్సైజ్, పర్యాటకశాఖ పద్దులపై శాసనసభలో మంగళవారం చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన పలు సందేహాలకు మంత్రి బదులిచ్చారు. పర్యాటకరంగం ద్వారా ఉద్యోగ ఉపాధి పెద్దఎత్తున కల్పిస్తున్నామని, పర్యాటక పాలసీ ద్వారా ఐదేళ్లలో రూ. 15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.రాష్ట్రంలో ఎకోవెల్నెస్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని, యాదగిరిగుట్ట సహా 27 ప్రత్యేక టూరిజం కేంద్రాలను గుర్తించినట్టు చెప్పారు. అంతర్జాతీయ సమావేశాలకు 20 వేల మంది సామర్థ్యంతో కన్వెన్షన్ సెంటర్ కట్టాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉందని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో బెల్ట్‌షాప్‌ల నియంత్రణలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. 1,200 మంది కొత్త వృద్ధ కళాకారులకు పెన్షన్లు ఇవ్వబోతున్నామని, తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన గద్దర్ సహా పలువురు ప్రముఖ కళాకారులకు రూ. కోటి ఇవ్వనున్నట్టు చెప్పా రు. కాగా, అందాల పోటీ వల్ల ఆదాయం వస్తుందని, ఉద్యోగాలు వస్తాయని చెప్పడం ఏం న్యాయమని బీఆర్ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు. ఈ పోటీలకు రూ.54 కోట్లు వ్యయం చేస్తున్న సర్కారు, అదే ఫార్ములా వన్‌కు నిధులు వ్యయం చేయడాన్ని తప్పుపట్టడం డబుల్ స్టాండర్డ్ కాదా అని ప్రశ్నించారు. సచివాలయం ఎదుట అంబేడ్కర్ విగ్రహానికి ఎందుకు ముసుగు తొలగించలేదని అడిగారు. దీనికి మంత్రి జూపల్లి బదులిస్తూ, అంబేడ్కర్ విగ్రహం పెట్టడానికి బీఆర్ఎస్కు పదేళ్లు ఎందుకు పట్టిందని ప్రశ్నించారు. పలు పద్దులు ఆమోదం సుదీర్ఘ చర్చ అనంతరం పలు పద్దులను శాసనసభ మంగళవారం ఆమోదించింది. ఇందులో పాఠశాల, ఉన్నత, సాంకేతిక విద్య, క్రీడలు, యువజన సేవ లు, రోడ్లు, భవనాలు, మద్య నిషేధం, సాంస్కృతి క, పురావస్తు, దేవాదాయ, అడవులు, శాస్త్ర సాంకేతిక, పర్యావరణం సంబంధిత పద్దులు ఉన్నాయి. -
ఎంఎస్ఎంఈల వర్గీకరణకు నోటిఫికేషన్
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలను (ఎంఎస్ఎంఈ) వర్గీకరించడానికి సంబంధించి పెట్టుబడులు, టర్నోవరు ప్రమాణాల్లో గణనీయంగా మార్పులు చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. వీటి ప్రకారం రూ. 2.5 కోట్ల వరకు పెట్టుబడులున్న సంస్థలను సూక్ష్మ సంస్థలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 1 కోటిగా ఉంది. అలాగే వీటి టర్నోవరు పరిమాణాన్ని రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్లకు సవరించారు. ఇక చిన్న సంస్థల హోదాకు సంబంధించి పెట్టుబడుల పరిమాణాన్ని రూ. 10 కోట్ల నుంచి రూ. 25 కోట్లకు, టర్నోవరు పరిమితిని రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పెంచారు. రూ. 125 కోట్ల వరకు పెట్టుబడులు, రూ. 500 కోట్ల వరకు టర్నోవరు ఉన్న సంస్థలను మధ్య తరహా సంస్థలుగా పరిగణిస్తారు. ప్రస్తుతం వీటి పెట్టుబడుల పరిమితి రూ. 50 కోట్లుగా ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఎంఎస్ఎంఈల వర్గీకరణకు సంబంధించి కొత్త ప్రమాణాలను ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. పెట్టుబడులు, టర్నోవరు పరిమితులను వరుసగా రెండున్నర రెట్లు, రెండు రెట్లు పెంచేలా బడ్జెట్లో ప్రతిపాదించారు. -
వాటిపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా?.. పుత్తా శివశంకర్‌రెడ్డి సవాల్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులపై పదే పదే అబద్ధాలు ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం, మరోసారి అదే పని చేసి, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. ఆ దిశలోనే మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో ఈ తొమ్మిది నెలల్లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 4 లక్షల ఉద్యోగాలకు అవకాశం ఉందంటూ ప్రగల్భాలు పలికారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, కూటమి ప్రభుత్వం వచ్చాక, రాష్ట్రంలో వచ్చిన పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందులో అన్ని వివరాలు పొందుపర్చాలని పుత్తా శివశంకర్‌రెడ్డి కోరారు.ఆయన ఇంకా ఏమన్నారంటే..శ్వేతపత్రం విడుదల చేస్తారా?:కూటమి ప్రభుత్వ ఈ 9 నెలల పాలనలో రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి నారా లోకేష్ ఆర్భాటంగా చెప్పారు. దాదాపు నెల రోజుల క్రితం, గత నెల 24న గవర్నర్ ప్రసంగంలో రాష్ట్రంలో అప్పటి వరకు రూ. 6.50 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా 4 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయని చెప్పుకున్నారు. నెల కూడా గడవక ముందే, రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు.ఈ వ్యవధిలోనే రూ.50 వేల కోట్లు పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి!. నిజానికి గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా రాష్ట్రంలో రూ.6.50 లక్షల కోట్ల పెట్టుబడులపై మండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు నిలదీస్తే, సమాధానం చెప్పకుండా దాటవేశారు. ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. అలాగే ఉద్యోగాలు కల్పించామని చెప్పలేదని, అన్ని ఉద్యోగాలకు అవకాశం ఉందని చెప్పామని, పచ్చి అబద్ధం చెప్పారు. ప్రభుత్వానికి నిజంగా ఈ విషయంపై చిత్తశుద్ధి ఉంటే, వారు చెబుతున్నట్లుగా రాష్ట్రంలో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులపై పూర్తి వివరాలతో వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎక్కడెక్కడ, ఎంతెంత పెట్టుబడులతో ఏయే పరిశ్రమలు ఏర్పాటయ్యాయి? వాటి ద్వారా ఎంత మందికి ఉపా«ధి లభించింది? అన్న పూర్తి వివరాలు ప్రకటించాలి.ఆ ధైర్యం మీకుందా?:గత మా ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పథకాల అమలుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే వాళ్లం. ఎందుకంటే అంత పారదర్శకంగా ఎక్కడా ఏ లోపం లేకుండా, అర్హతే ప్రామాణికంగా అన్నింటినీ అమలు చేశాం. ఇప్పుడు మీరు కూడా అలా, మీ పనులను, పథకాల అమలును.. ముఖ్యంగా రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడుల వివరాలను ఆయా ప్రాంతాల్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రదర్శించగలరా? ఆ ధైర్యం మీకుందా?. నిజానికి కూటమి ప్రభుత్వం వచ్చాక పరిశ్రమలు రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితి నెలకొంది. దాడులు, కమీషన్ల వేధింపులకు పారిశ్రామికవేత్తలు బెంబేలెత్తిపోతున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ. కూటమి ప్రభుత్వ వేధింపులతో జిందాల్ స్టీల్ ప్లాంట్ మహారాష్ట్రకు పారిపోయింది. మీడియాను అడ్డం పెట్టుకుని దావోస్ పర్యటనలో హడావుడి చేయడం తప్ప, మీరు సాధించిందేమీ లేదు. దావోస్ పర్యటనను పెయిడ్ హాలిడేగా వాడుకున్నారు.2018కి పూర్వమే ఆ యూనిట్:విజయవాడ సమీపంలోని ఏపీఐఐసీ కారిడార్‌లో 2018కి పూర్వమే అశోక్ లీలాండ్ యూనిట్ ప్రారంభం కాగా, ఆ తర్వాత కోవిడ్ కారణంగా డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి కూడా తగ్గింది. కానీ నిన్న (19వ తేదీ, బుధవారం) అక్కడ నారా లోకేష్ చేసిన అతి చూస్తే 2024లో తాము అధికారంలోకి వచ్చాకే, ఆ యూనిట్ ఏర్పాటైనంత బిల్డప్ ఇచ్చారు. ఆ యూనిట్‌కు తామే అనుమతి ఇచ్చినట్లు, దాన్ని తామే తెచ్చినట్లు చెప్పుకోవడం హాస్యాస్పదం. ఎప్పుడో ఉత్పత్తి ప్రారంభించిన యూనిట్లో ఇప్పుడు 600 ఉద్యోగాలు రాబోతున్నట్టు ప్రచారం చేసుకోవడం మరీ విడ్డూరం.లోకేష్.. మంత్రిగా మీరు అశోక్ లీలాండ్ బస్పు ఎక్కడం కాదు.. ఎన్నికల్లో సూపర్‌సిక్స్ హామీల్లో మీరిచ్చిన మహిళలకు ఉచిత బస్సు హామీని అమలు చేసి టికెట్లు లేకుండా వారిని బస్సుల్లో తిప్పండి. తన శాఖ తప్ప, అన్ని శాఖల్లో జోక్యం చేసుకుంటున్న మంత్రి నారా లోకేష్, రాష్ట్రంలో విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించారు. గవర్నమెంట్ స్కూళ్లలో డ్రాపవుట్స్ పెరుగుతున్నా, విద్యాశాఖను సరిగ్గా నిర్వహించలేకపోతున్న లోకేష్, తనది కాని పరిశ్రమల శాఖలో వేలు పెట్టి హడావుడి చేశాడని పుత్తా శివశంకర్‌రెడ్డి ఆక్షేపించారు. -
‘చిప్’ల కోసం ట్రంప్ స్కెచ్
వాషింగ్టన్/తైపీ: సెమీ కండక్టర్ల తయారీలో ద్వీపదేశమైన తైవాన్‌దే అగ్రస్థానం. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగిస్తున్న సెమీ కండక్టర్లలో 90 శాతానికిపైగా తైవాన్‌లో తయారైనవే. సెల్ఫోన్ల నుంచి అత్యాధునిక డ్రోన్ల దాకా ప్రతి ఎల్రక్టానిక్ పరికరంలో ఈ చిప్‌లు ఉండాల్సిందే. చిప్‌ల రారాజుగా తైవాన్ తలపై ఉన్న కిరీటాన్ని తన్నుకుపోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పెద్ద స్కెచ్ వేశారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సంస్థగా పేరున్న తైవాన్ సెమీకండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ)తో అమెరికాలో 100 బిలియన్ డాలర్ల (రూ.8.69 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఈ మేరకు ఆ కంపెనీని ఒప్పించారు. గతవారం ఒప్పందం కూడా చేసుకున్నారు. ఈ నిధులతో టీఎస్ఎంసీ అమెరికాలో సెమీకండక్టర్ల తయారీ యూనిట్లు ఏర్పాటు చేయనుంది. అంటే సెమీకండక్టర్లు అమెరికాలోనే ఉత్పత్తి అవుతాయి. అక్కడి నుంచే విదేశాలకు చిప్‌ల ఎగుమతి జరుగుతుంది. ఆదాయం చాలావరకు అమెరికా ఖాతాలోకి వెళ్లిపోతుంది. చిప్‌ల ఉత్పత్తిలో తైవాన్ ప్రాధాన్యం తగ్గిపోతుంది. ఇదే ఇప్పుడు తైవాన్‌లో మంటలు రాజేస్తోంది. జాతీయ భద్రతా సంక్షోభం తైవాన్ అధికార డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టి(డీపీపీ)పై మాజీ అధ్యక్షుడు మా యింగ్–జియూ నిప్పులు చెరిగారు. చైనా బారి నుంచి తైవాన్ను కాపాడుతున్నందుకు ట్రంప్‌కు ‘ప్రొటెక్షన్ ఫీజు’ చెల్లిస్తున్నారని డీపీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. టీఎస్ఎంఎస్ను అమెరికాకు అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామం జాతీయ భద్రతా సంక్షోభమేనని తేల్చిచెప్పారు. అమెరికాలో 8.69 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడాన్ని తప్పుపట్టారు. చిప్‌ల తయారీలో తైవాన్ స్థానాన్ని దిగజార్చడం తగదని అన్నారు. ట్రంప్‌తో కుదుర్చుకున్న ఒప్పందం తైవాన్ ప్రజల విశ్వాసాన్ని, ఇతర సంబంధాలను దెబ్బతీస్తుందని మా యీంగ్–జియూ ఆందోళన వ్యక్తంచేశారు. భవిష్యత్తులో భౌగోళిక రాజకీయాల్లో తైవాన్ హోదాను దిగజారుస్తుందని అన్నారు. అయితే, అమెరికాలో పెట్టుబడులపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తైవాన్ అధ్యక్షుడు లా చింగ్–తే స్పష్టంచేశారు. టీఎస్ఎంసీ విస్తరణ కోసమే ఈ పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించారు. దేశ ప్రతిష్టకు వచ్చే ముప్పేమీ లేదని ప్రజలకు హామీ ఇచ్చారు. తైవాన్ను గాలికొదిలేస్తారా? తైవాన్‌పై పొరుగు దేశం చైనా ఎప్పటి నుంచో కన్నేసింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని, ఏనాటికైనా విలీనం కాక తప్పదని చైనా చెబుతోంది. మరోవైపు అమెరికా మద్దతుతోనే తైవాన్ స్వతంత్ర దేశంగా మనుగడ సాగిస్తోంది. గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం తైవాన్ రక్షణ బాధ్యతను అమెరికా స్వీకరించింది. ఇందుకోసం తైవాన్ రిలేషన్స్ యాక్ట్ తీసుకొచ్చారు. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తైవాన్ విషయంలో అమెరికా స్వరం మారింది. ప్రధానంగా తైవాన్‌కు జీవనాడిగా ఉన్న చిప్‌ల తయారీ రంగంపై ట్రంప్ దృష్టి పెట్టారు. అక్కడి పరిశ్రమను క్రమంగా అమెరికా తరలించాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమ దేశాన్ని పీల్చిపిప్పి చేసి, ఆఖరికి గాలికి వదిలేయాలన్నదే ట్రంప్ ప్లాన్ అని తైవాన్ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. తైవాన్ మరో ఉక్రెయిన్‌లా మారినా ఆశ్చర్యం లేదని అంటున్నాయి. అమెరికా–తైవాన్ సంబంధాల భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ‘ఈ రోజు ఉక్రెయిన్, రేపు తైవాన్’ అనే మాట తైవాన్‌లో తరచుగా వినిపిస్తోంది. -
త్వరలో మన ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు
న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు (రూ.435.17 లక్షల కోట్లు) చేరుకోవడం ఇక ఎంతోదూరంలో లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. దేశంలో ఆర్థిక ప్రగతికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ప్రజలపై, ఆర్థిక వ్యవస్థపై, నవీన ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టాలని భాగస్వామ్యపక్షాలకు పిలుపునిచ్చారు. ఆర్థిక వృద్ధికి, ఉద్యోగాల సృష్టికి పెట్టుబడులు అత్యంత కీలకమని వివరించారు. ‘బడ్జెట్ అనంతరం ఉద్యోగాలు, ఉపాధి కల్పన’పై బుధవారం జరిగిన వెబినార్‌లో ప్రధాని మోదీ మాట్లాడారు. 2014 నుంచి తమ ప్రభుత్వం 3 కోట్ల మంది యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచి్చందని అన్నారు. దేశవ్యాప్తంగా 1,000 ఐటీఐలను అప్‌గ్రేడ్ చేయాలని, ఐదు ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లు నెలకొల్పాలని నిర్ణయించినట్లు తెలిపారు. 2015 నుంచి 2025 దాకా ఇండియా ఆర్థిక వ్యవస్థ 66 శాతం వృద్ధి చెందినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐఎంఎఫ్ నివేదిక వెల్లడించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం మన ఆర్థిక వ్యవస్థ 3.8 ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని హర్షం వ్యక్తంచేశారు. వెబినార్‌లో ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... సరైన దిశలో సరైన పెట్టుబడులు ‘‘ప్రపంచంలోని అత్యున్నత ఆర్థిక వ్యవస్థలను మనం అధిగమించాం. ఇండియా త్వరలో 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం తథ్యం. ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టాలంటే సరైన దిశలో సరైన పెట్టుబడులు పెట్టడం అత్యంత కీలకం. ఇందుకోసం కేంద్ర బడ్జెట్లో పలు ప్రతిపాదనలు చేశాం. వాటిని అమలు చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. భాగస్వామ్యపక్షాలన్నీ ఇందులో పాలుపంచుకోవాలి. ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టాం. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ భవిష్యత్తుకు బ్లూప్రింట్‌గా నిలుస్తుంది. మౌలిక సదుపాయాలు, పరిశ్రమలు, ప్రజలు, ఆర్థికం, నవీన ఆవిష్కరణలపై పెట్టుబడులకు సరిసమాన ప్రాధాన్యం ఇస్తున్నాం. యువతలో ప్రాక్టికల్ స్కిల్స్ పెంచడానికి, నూతన అవకాశాలు కలి్పంచడానికి ‘పీఎం ఇంటర్న్‌షిప్ పథకం’ ప్రవేశపెట్టాం. పరిశ్రమ వర్గాలు సైతం ఈ పథకంలో భాగస్వామిగా మారాలి. ఈ ఏడాది బడ్జెట్లో అదనంగా 10 వేల మెడికల్ సీట్లు ప్రకటించాం. రాబోయే ఐదేళ్లలో కొత్తగా 75 వేల మెడికల్ సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.గ్లోబల్ టూరిజం, వెల్నెస్ హబ్గాఇండియా పర్యాటక రంగంలో ఉద్యోగాల కల్పనకు ఎన్నో అవకాశాలున్నాయి. అందుకే ఈ రంగానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ కలి్పంచాలని నిర్ణయం తీసుకున్నాం. దేశ జీడీపీలో 10 శాతం సమకూర్చగల సత్తా పర్యాటక రంగానికి ఉంది. దేశంలో 50 ప్రాంతాలను అద్భుతమైన పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేయబోతున్నాం. అక్కడి హోటళ్లకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తాం. దీనివల్ల టూరిజం అభివృద్ధి చెందడంతోపాటు స్థానిక యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.అర్బన్ చాలెంజ్ ఫండ్‌కు రూ.లక్ష కోట్లు జనాభా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ చాలా కీలకం. ఇందులో భాగంగా అర్బన్ చాలెంజ్ ఫండ్‌కు రూ.లక్ష కోట్లు కేటాయించాలని నిర్ణయించాం. ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ కోసం ప్రైవేట్ రంగం.. ప్రధానంగా రియల్ ఎసేŠట్ట్ చొరవ తీసుకోవాలి. దేశ ఆర్థిక ప్రగతిలో కృత్రిమ మేధ పాత్ర ఎంతో కీలకం. అందుకే ఏఐ ఆధారిత విద్య, పరిశోధనల కోసం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించాం. ఏఐ కెపాసిటీని అభివృద్ధి చేయడానికి నేషనల్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్‌ను ఏర్పాటు చేయబోతున్నాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. -
గిఫ్ట్ సిటీ ఫండ్స్‌లో భారీగా ఎన్నారైల పెట్టుబడులు
ముంబై: గిఫ్ట్ సిటీలోని ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్‌లో ప్రవాస భారతీయులు దాదాపు 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు (Investments) పెట్టినట్లు ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ చైర్మన్ కె రాజారామన్ తెలిపారు. అలాగే ఇతరత్రా బ్యాంకింగ్ సాధనాల్లో దాదాపు 5,000 మంది ఎన్నారైలు (NRIs) ఒకటిన్నర బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసినట్లు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్స్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. గిఫ్ట్ సిటీలోని 30 బ్యాంకుల నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) 78 బిలియన్ డాలర్ల స్థాయిని దాటినట్లు వివరించారు. ఇందులో సుమారు 50 బిలియన్ డాలర్ల మొత్తాన్ని దేశీ కార్పొరేట్లు రుణాలుగా తీసుకున్నట్లు, ఇటీవలే ఒక బడా భారతీయ కార్పొరేట్ దిగ్గజం 3 బిలియన్ డాలర్ల రుణం కోసం దరఖాస్తు చేసుకున్నట్లు రాజారామన్ చెప్పారు. ఐపీవోకి ప్రణవ్ కన్స్ట్రక్షన్స్ దరఖాస్తు న్యూఢిల్లీ: రియల్ ఎస్టేట్ సంస్థ ‘ప్రణవ్ కన్స్ట్రక్షన్స్’ ఐపీవోకు వచ్చేందుకు సెబీ వద్ద ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. రూ.392 కోట్ల విలువ చేసే తాజా ఈక్విటీ షేర్లను ఐపీవోలో భాగంగా కంపెనీ విక్రయించనుంది. అలాగే, ప్రమోటర్‌తోపాటు ఇన్వెస్టర్ షేర్‌హోల్డర్ 28.57 లక్షల షేర్లను ఓఎఫ్ఎస్ రూపంలో విక్రయించనున్నారు. ఐపీవో (IPO) ద్వారా మొత్తం రూ.78 కోట్లను సమీకరించాలన్నది కంపెనీ ప్రణాళిక. తాజా ఈక్విటీ షేర్ల జారీ రూపంలో సమకూరే రూ.224 కోట్లను ప్రభుత్వ, చట్టపరమైన అనుమతులు, అదనపు ఫ్లోర్ స్పేస్ కొనుగోలుకు తదితర అవసరాలకు వినియోగించనుంది. రూ.74 కోట్లను రుణ చెల్లింపులకు ఉపయోగించనుంది. ఈ సంస్థ ప్రధానంగా ముంబై, పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది.అదానీ విల్మర్ చేతికి ‘టాప్స్’ న్యూఢిల్లీ: టాప్స్ బ్రాండుతో పచ్చళ్లు, సాస్‌లు తయారు చేసి విక్రయిస్తున్న జీడీ ఫుడ్స్‌ను కొనుగోలు చేసినట్లు ఎఫ్ఎంసీజీ దిగ్గజం అదానీ విల్మర్ (Adani Wilmer) తాజాగా పేర్కొంది. ఇందుకు జీడీ ఫుడ్స్ మ్యాన్యుఫాక్చరింగ్ (ఇండియా) ప్రయివేట్ లిమిటెడ్‌తో తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా తొలుత 80 శాతం వాటా కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. తదుపరి మూడేళ్లలో మిగిలిన 20 శాతం వాటాను చేజిక్కించుకోనుంది.చదవండి: రియల్టీ ప్లాట్‌ఫామ్ సిలాలో ఎంఎస్ ధోని పెట్టుబడులు ఐపీఏ గూటికి క్వాలిటీ యానిమల్ ఫీడ్స్ ముంబై: ఇండియన్ పౌల్ట్రీ అలయెన్స్(ఐపీఏ) తాజాగా క్వాలిటీ యానిమల్ ఫీడ్స్‌ను కొనుగోలు చేసింది. ఇందుకు రూ. 300 కోట్లు వెచ్చించినట్లు అల్లన గ్రూప్ అనుబంధ సంస్థ ఐపీఏ వెల్లడించింది. తాజా కొనుగోలు ద్వారా దేశీ పౌల్ట్రీ పరిశ్రమలో పటిష్టపడనున్నట్లు ఐపీఏ ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ ఫ్రోజెన్ హలాల్ మీట్, తృణధాన్యాలతోపాటు ఫ్రూట్ పల్ప్‌లు, కాఫీ, పెట్ ఫుడ్ తదితర కన్జూమర్ ప్రొడక్టుల తయారీ, ఎగుమతులను చేపడుతోంది. -
ఫండ్స్‌లో ‘సిప్’ చేస్తున్నారా..?
‘‘స్మాల్, మిడ్‌క్యాప్‌లో సిప్‌లను ఇక నిలిపేయాల్సిన సమయం వచ్చిందని భావిస్తున్నా. ఎందుకంటే వాటి వేల్యుయేషన్లు చాలా అధిక స్థాయిలో ఉన్నాయి’’ మ్యూచువల్ ఫండ్స్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న వెటరన్ ఫండ్ మేనేజర్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సీఈవో ఎస్.నరేన్ తాజాగా చేసిన సంచలనాత్మక వ్యాఖ్యలు ఇవి. దీంతో స్మాల్, మిడ్‌క్యాప్ విభాగంలో మరింత అమ్మకాల ఒత్తిడి పెరిగిపోయింది. నరేన్ వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఆందోళనకు దారితీశాయి. సిప్పై సందేహాలు ఏర్పడ్డాయి. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో ఈక్విటీ ఫండ్స్‌లోకి నెలవారీ రూ.26 వేల కోట్లకు పైనే పెట్టుబడులు వస్తున్నాయి. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాలకు కావాల్సినంత సమకూర్చుకునేందుకు సిప్ మెరుగైన సాధనమన్న నిపుణుల సూచనలు, ఫండ్స్ పరిశ్రమ ప్రచారంతో ఇన్వెస్టర్లలో దీనిపై ఆకర్షణ పెరిగిపోయింది. వేతన జీవులతోపాటు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్ (హెచ్ఎన్ఐలు/ధనవంతులు) సైతం సిప్‌కు జై కొడుతున్నారు. అన్ని కాలాలకూ అనువైన సాధనంగా సిప్‌ను భావిస్తుంటే, దీనిపై నరేన్ వ్యాఖ్యలు అయోమయానికి దారితీశాయి. ఈ తరుణంలో అసలు సిప్ దీర్ఘకాల లక్ష్యాల సాధనకు ఏ మేరకు ఉపకరిస్తుంది? ఇందులో ప్రతికూలతలు ఉన్నాయా? తదితర అంశాలపై నిపుణులు ఏమంటున్నారో తెలిపే కథనమిది... సిప్ అంటే..? నిర్ణిత మొత్తం, నిర్ణిత రోజులకు ఒకసారి చొప్పున ఎంపిక చేసుకున్న పథకంలో ఇన్వెస్ట్ చేయడానికి వీలు కల్పించేదే సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్). రోజు/వారం/పక్షం/నెల/మూడు నెలలకోసారి సిప్ చేసుకోవడానికి ఫండ్స్ అనుమతిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ సంస్థల వద్ద 10.26 కోట్ల సిప్ ఖాతాలుంటే.. వీటి పరిధిలో జనవరి చివరికి మొత్తం రూ.13.12 లక్షల కోట్ల నిర్వహణ ఆస్తులు (ఏయూఎం) ఉన్నాయి. మొత్తం ఈక్విటీ ఫండ్స్ నిర్వహణ ఆస్తుల్లో సిప్‌కు సంబంధించే 40 శాతానికి పైగా ఉన్నాయి. పొదుపు–మదుపులో క్రమశిక్షణ సిప్‌తో నిర్బంధ పొదుపు, మదుపు సాధ్యపడుతుంది. ఇన్వెస్టర్ ప్రమేయం లేకుండా ప్రతి నెలా నిర్ణిత తేదీన నిర్ణీత మొత్తం పెట్టుబడిగా మారిపోతుంది. సిప్ కాకుండా.. ఇన్వెస్టర్ వీలు చూసుకుని ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే ఎక్కువ సందర్భాల్లో సాధ్యపడకపోవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల సాధనకు కావాల్సింది క్రమశిక్షణ. అది సిప్ ద్వారా సాధ్యపడుతుంది.దీర్ఘకాలంలో సంపద సృష్టి 10 ఏళ్లలో కారు కొనుగోలు. 15–20 ఏళ్లలో పిల్లల ఉన్నత విద్య, 25 ఏళ్లకు పిల్లల వివాహాలు, అప్పటికి సొంతిల్లు.. ఇలా ముఖ్యమైన లక్ష్యాలను ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులతో సాకారం చేసుకోవచ్చు. ఇలా ప్రతి లక్ష్యానికి నిర్ణీత కాలం అంటూ ఉంది. అన్నేళ్లలో అంత సమకూర్చుకునేందుకు ప్రతి నెలా, ప్రతి ఏటా ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలన్నది నిపుణుల సాయంతో తెలుసుకోవాలి. వారు చెప్పిన విధంగా.. మార్కెట్ అస్థిరతలను పట్టించుకోకుండా నియమబద్ధంగా సిప్ పెట్టుబడి చేసుకుంటూ వెళ్లిపోవడమే. దీనివల్ల కాంపౌండింగ్ ప్రయోజనం లభిస్తుంది. కాలాతీతం.. ఈక్విటీ మార్కెట్లు ఎప్పుడు ఎటు వైపు చలిస్తాయో ఇదమిత్థంగా ఎవరూ చెప్పలేరు. ఈ స్థాయి నుంచి ఇంకా పెరుగుతాయని, ఫలానా స్థాయి నుంచి కరెక్షన్కు వెళతాయని.. దిద్దుబాటులో ఫలానా స్థాయిల నుంచి మద్దతు తీసుకుని తిరిగి ర్యాలీ చేస్తాయని.. గమనాన్ని ఎవరూ కచి్చతంగా అంచనా వేయలేరు. మార్కెట్లు సహేతుక స్థాయిలో దిద్దుబాటుకు గురైనప్పుడు ఇన్వెస్ట్ చేస్తే అక్కడి నుంచి దీర్ఘకాలంలో పెట్టుబడిపై అద్భుత రాబడులు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ, దిద్దుబాటు సమయంలో ఎప్పుడు, ఏ స్థాయిల వద్ద ఇన్వెస్ట్ చేయాలనేది సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు అర్థం కాని విషయం. లమ్సమ్ (ఏకమొత్తం) ఇన్వెస్ట్ చేస్తుంటే, ఒకవేళ మార్కెట్లు గరిష్టాల్లో ఆ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఎందుకంటే అక్కడి నుంచి మార్కెట్లు పతనాన్ని చూస్తే.. రాబడి చూడడానికి చాలా కాలం పట్టొచ్చు. విసిగిపోయిన ఇన్వెస్టర్ నష్టానికి తన పెట్టుబడిని వెనక్కి తీసుకునే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారమే సిప్. మార్కెట్ ర్యాలీ చేస్తోందా? లేక పతనం అవుతోందా? అన్నదానితో సంబంధం లేదు. ఒక పథకంలో ప్రతి నెలా 1వ తేదీన రూ.5,000 ఇన్వెస్ట్ చేయాలని సిప్ దరఖాస్తు సమరి్పస్తే.. కచి్చతంగా ప్రతి నెలా అదే తేదీన బ్యాంక్ ఖాతా నుంచి ఆ మొత్తం డెబిట్ అయి పెట్టుబడి కింద మారుతుంది. దీనివల్ల కొనుగోలు వ్యయం సగటుగా మారుతుంది. ఉదాహరణకు ఎఫ్ అనే పథకంలో రూ.2,000 సిప్ చేస్తున్నారు. ఆ ఫండ్ యూనిట్ ఎన్ఏవీ 2025 జనవరి 1న రూ.40గా ఉంది. దీంతో 50 యూనిట్లు వస్తాయి. ఫిబ్రవరి 1కి కరెక్షన్ వల్ల అదే ఫండ్ ఎన్ఏవీ 34కు తగ్గింది. దీంతో 58.82 యూనిట్లు వస్తాయి. జనవరి నెల సిప్‌తో పోలి్చతే ఫిబ్రవరిలో దిద్దుబాటు వల్ల 8.82 యూనిట్లు అదనంగా వచ్చాయి. మార్చి1న ఫండ్ యూనిట్ ఎన్ఏవీ ఇంకా తగ్గి రూ.32కు దిగొస్తే.. అప్పుడు 62.5 యూనిట్లు వస్తాయి. ఈక్విటీ విలువల్లో మార్పులకు అనుగుణంగా ఫండ్ ఎన్ఏవీ మారుతుంటుంది. దీనికి అనుగుణంగా సిప్ కొనుగోలు సగటు ధర తగ్గుతుంది. దీనివల్ల 10–15–20 ఏళ్లు అంతకుమించిన కాలాల్లో మంచి రాబడులకు అవకాశం ఉంటుందని గత చరిత్ర చెబుతోంది.స్వల్ప మొత్తం... చాలా పథకాల్లో ఏకమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.5,000 అవసరం, కొన్ని పథకాలకు ఇది రూ.1,000గా ఉంది. అదే సిప్ రూపంలో అయితే రూ.500 స్వల్ప మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ ఇటీవలే రూ.250 సిప్‌ను (జన్నివే‹Ù) ప్రారంభించింది. రోజువారీ/వారం వారీ అయితే రూ.100 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.కేవలం ఈక్విటీలకేనా..? సిప్ ప్రయోజనం ఎక్కువగా ఈక్విటీ పెట్టుబడులపైనే లభిస్తుంది. డెట్ పెట్టుబడులపై రాబడి వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. ఈ వడ్డీ రేట్లు ఈక్విటీలంత చంచలంగా ఉండవు. నిర్ణిత సైకిల్ ప్రకారం రేట్లు చలిస్తుంటాయి. డెట్ ఫండ్స్‌లోనూ సిప్ చేసుకోవచ్చు. దీనివల్ల ఈక్విటీల మాదిరి అస్థిరతలను అధిగమించి, రాబడులు పెంచుకునే ప్రత్యేక ప్రయోజనం ఉండదు. డెట్, ఈక్విటీ కలయికతో కూడిన హైబ్రిడ్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌లో సిప్‌తో మెరుగైన ప్రతిఫలం పొందొచ్చు. సౌలభ్యం.. సిప్ కోసం సమ్మతి తెలిపామంటే.. కచి్చతంగా పెట్టుబడి పెట్టి తీరాలనేమీ లేదు. వీలు కానప్పుడు, లేదా పథకం పనితీరు ఆశించిన విధంగా లేనప్పుడు ఆ సిప్‌ను నిలిపివేసే స్వేచ్ఛ, వెసులుబాటు ఇన్వెస్టర్లకు ఎప్పుడూ ఉంటుంది. మార్కెట్‌తో ముడిపడి.. ప్రతి నెలా రూ.1,000 చొప్పున గత ఐదేళ్లలో రూ.60 వేలు ఈక్విటీ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేశారని అనుకుందాం. ఏటా 15 శాతం కాంపౌండెడ్ రాబడి వస్తే ఐదేళ్లకు ఆ మొత్తం రూ.90 వేలకు చేరుతుంది. సరిగ్గా ఆ సమయంలో మార్కెట్ 25 శాతం పడిపోయిందనుకుంటే.. రూ.90 వేల పెట్టుబడి కాస్తా.. రూ.67,500కు తగ్గుతుంది. నికర రాబడి రూ.7,500కు తగ్గిపోతుంది. దీంతో వచ్చే వార్షిక కాంపౌండెడ్ రాబడి 4.5 శాతమే. డెట్ సెక్యూరిటీల కంటే తక్కువ. చారిత్రక డేటాను పరిశీలిస్తే లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లోనూ పలు సందర్భాల్లో ఐదేళ్ల సిప్ రాబడులు 5 శాతం కాంపౌండెడ్గానే (సీఏజీఆర్) ఉన్నట్టు తెలుస్తుంది. ప్రతికూల రాబడులు వచి్చన సందర్భాలూ ఉన్నాయి. అదే మిడ్, స్మాల్‌క్యాప్ పెట్టుబడులపై ఈ ప్రభావం ఇంకా అధికంగా ఉంటుంది.అనుకూలం/అననుకూలం→ 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి, అవసరమైతే 20 ఏళ్లపాటు పెట్టుబడిని కొనసాగించే వెసులుబాటు ఉన్న వారికే సిప్ అనుకూలం. → అధిక రిస్క్ తీసుకునే వారే మిడ్, స్మాల్ క్యాప్‌లో సిప్ చేసుకోవాలి. → సిప్‌తో సగటు కొనుగోలు ధర తగ్గుతుందన్నది సాధారణంగా చెప్పే భాష్యం. కానీ, ఈక్విటీలు కొంత కాలం పాటు భారీ దిద్దుబాటు అన్నదే లేకుండా అదే పనిగా ర్యాలీ చేస్తూ వెళ్లి.. అక్కడి నుంచి భారీ పతనంతో కొన్నేళ్లపాటు బేర్ గుప్పిట కొనసాగితే రాబడులు కళ్లజూసేందుకు కొన్నేళ్లపాటు వేచి చూడాల్సి రావచ్చు. → సిప్ మొదలు పెట్టిన తర్వాత మార్కెట్లు కుదేలైతే.. పెట్టుబడి విలువ క్షీణతను ఎంత వరకు భరించగలరు? అని ప్రశి్నంచుకోవాలి. 50–60 శాతం పడిపోయినా ఓపిక వహించే వారికే అనుకూలం. → ‘ఈక్విటీ పెట్టుబడులు సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్’ అన్న హెచ్చరికను కచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. మార్కెట్ల పనితీరు మెరుగ్గా ఉంటేనే సిప్పై మెరుగైన రాబడి వస్తుంది. అంతేకానీ సిప్పై లాభానికి గ్యారంటీ లేదు.అధిక రాబడులు ఎలా ఒడిసిపట్టాలి..? సిప్ చేస్తూనే.. మార్కెట్ పతనాల్లో పెట్టుబడిని రెట్టింపు చేయాలి. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5,000 సిప్ చేస్తుంటే.. మార్కెట్ దిద్దుబాటు సమయంలో రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. దిద్దుబాటు ముగిసి, బుల్ ర్యాలీ మొదలైన తర్వాత అదనపు సిప్‌ను నిలిపివేసుకోవచ్చు. 10 ఏళ్లకు మించిన సిప్ పెట్టుబడులపై రాబడిని స్వల్ప స్థాయి కరెక్షన్లు తుడిచి పెట్టేయలేవు. అదే 15–20 ఏళ్లు, అంతకుమించిన దీర్ఘకాలంలో రాబడులు మరింత దృఢంగా ఉంటాయి. ఒకవేళ పెట్టుబడిని ఉపసంహరించుకునే సమయంలో మార్కెట్ కరెక్షన్లోకి వెళితే, తిరిగి కోలుకునే వరకు లక్ష్యాన్ని వాయిదా వేసుకోవడమే మార్గం. ఇలాంటి పరిస్థితిని నివారించాలంటే.. ఆర్థిక లక్ష్యానికి రెండేళ్ల ముందు నుంచే క్రమంగా సిప్ పెట్టుబడులను విక్రయిస్తూ డెట్‌లోకి పెట్టుబడులు మళ్లించాలి. చివరి మూడేళ్ల పాటు ఈక్విటీ పథకంలో కాకుండా డెట్ ఫండ్‌లో సిప్ చేసుకోవాలి. ప్రత్యామ్నాయాలు.. పెట్టుబడులు అన్నింటినీ ఈక్విటీలకు కేటాయించుకోకూడదు. ఈక్విటీ, డెట్, బంగారం, రీట్, ఇని్వట్లతో కూడిన పోర్ట్‌ఫోలియో ఉండాలి. ఈక్విటీ ఫండ్స్, డెట్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్‌లో వేర్వేరుగా పెట్టుబడి పెట్టుకోవాలి. ఆర్థిక ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడుల ఉపసంహరణ అవసరమైతే ఈక్విటీ పెట్టుబడులను కదపకుండా.. డెట్, గోల్డ్ తదితర ఫండ్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకోవచ్చు. సిప్ ఎప్పుడు స్టాప్ చేయాలి? → ఒక పథకం గతంలో మెరుగైన రాబడి ఇచి్చందని అందులో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తుంటారు. భవిష్యత్తులోనూ అదే స్థాయి రాబడిని ఆ పథకం నుంచి ఆశిస్తుంటారు. ఒక పథకం 3, 5, 10 ఏళ్లలో సగటున మెరుగైన ప్రతిఫలం ఇచ్చి ఉండొచ్చు. కానీ ఆయా కాలాలను మరింత లోతుగా విశ్లేషిస్తే మధ్యలో ఒక్కో ఏడాది తక్కువ, ప్రతికూల రాబడులు ఇచి్చన సందర్భాలూ ఉంటాయి. సిప్ మొదలు పెట్టిన తొలి ఏడాదే రాబడిని ఆశించడం అన్ని వేళలా అనుకూలం కాదు. కనీసం రెండు మూడేళ్లకు గానీ పథకం అసలు పనితీరు విశ్లేషణకు అందదు. అందుకే ఒక పథకం ఎంపిక చేసుకునే ముందు.. ఆ విభాగంలోని ఇతర పథకాలతో పోల్చి చూసినప్పుడు రాబడి మెరుగ్గా ఉందా? కనీసం సమానంగా అయినా ఉందా అన్నది నిర్ధారించుకోవాలి. → ఒక ఫండ్ మేనేజర్ పనితీరు నచ్చి పథకంలో సిప్ చేయడం మొదలు పెట్టారు. తర్వాతి కాలంలో ఆ మేనేజర్ మరో సంస్థకు మారిపోయారు. అప్పుడు కొత్తగా వచ్చిన ఫండ్ మేనేజర్ చరిత్రను ట్రాక్ చేయాలి. → పై రెండు ఉదాహరణల్లోనూ పథకం పనితీరు ఆశించిన విధంగా లేకపోతే సిప్ నిలిపివేయొచ్చు. ప్రతికూల రాబడులు ఇటీవలి మార్కెట్ పతనంతో 26 స్మాల్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో ఏడాది కాల సిప్ పెట్టుబడులపై రాబడి ప్రతికూలంగా మారింది. అంటే నికర నష్టంలోకి వెళ్లింది. క్వాంట్ స్మాల్‌క్యాప్ ఫండ్‌లో సిప్ పెట్టుబడిపై ఎక్స్ఐఆర్ఆర్ (రాబడి) మైనస్ 22.45 శాతంగా మారింది. మహీంద్రా మాన్యులైఫ్ స్మాల్‌క్యాప్ ఫండ్‌లో మైనస్ 21.84 శాతంగా మారింది. ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్ ఫండ్ ఎక్స్ఐఆర్ఆర్ మైనస్ 18.25 శాతంగా ఉంది. ఇవే పథకాలు రెండేళ్లు, మూడేళ్లు, ఐదేళ్ల సిప్‌లపై డబుల్ డిజిట్ రాబడులు అందించడం గమనార్హం. దశాబ్దాల పాటు కుదేలైతే..? జపాన్ ‘నికాయ్ 225’ ఇండెక్స్ 1989 డిసెంబర్లో చూసిన 38,271 గరిష్ట స్థాయి నుంచి 2009 ఫిబ్రవరిలో 7,416 కనిష్ట స్థాయికి పతనమైంది. నెమ్మదిగా కోలుకుంటూ 35 ఏళ్ల తర్వాత.. 2024 మార్చిలో తిరిగి 1989 నాటి గరిష్ట స్థాయిని అధిగమించింది. రియల్ ఎస్టేట్ బబుల్ బద్దలు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. 1989 డిసెంబర్ నాటి ముందు వరకు సిప్ లేదా లమ్సమ్ రూపంలో జపాన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకుని, దీర్ఘకాలం పాటు వేచి చూసే అవకాశం లేని వారు.. ఆ తర్వాత నష్టానికి అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఉండిపోయారు. స్టాక్ మార్కెట్ ర్యాలీ ఆర్థిక వృద్ధిపైనే ఆధారపడి ఉంటుంది. జపాన్ ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలం పాటు స్తబ్దుగా కొనసాగడం వల్లే ఇన్నేళ్లపాటు అక్కడి మార్కెట్ ర్యాలీ చేయలేదు. ప్రస్తుతం చైనాలోనూ ఇలాంటి వాతావరణమే నడుస్తోంది. అలాంటి పరిస్థితులు భారత్ మాదిరి వర్ధమాన దేశాలకు అరుదు. నరేన్ ఏం చెబుతున్నారు? అర్థం, పర్థం లేని అధిక విలువలకు చేరిన అస్సెట్ క్లాస్‌లో (అది స్మాల్ లేదా మిడ్ లేదా మరొకటి అయినా) ఇన్వెస్ట్ చేస్తే ఆ తర్వాత కొన్నేళ్ల పాటు ఆ సిప్‌లపై రాబడి రాదన్నది నరేన్ విశ్లేషణగా ఉంది. ఇందుకు 2006 నుంచి 2013 మధ్య కాలాన్ని ప్రస్తావించారు. ఆ కాలంలో స్మాల్, మిడ్‌క్యాప్ ఫండ్స్‌లో సిప్ చేసిన వారికి ఎలాంటి రాబడులు రాలేదని చెప్పారు. కనీసం 20 ఏళ్లపాటు తమ పెట్టుబడులను కొనసాగించే వారికే స్మాల్, మిడ్‌క్యాప్ పెట్టుబడులకు మంచి వేదికలు అవుతాయన్నారు. అంతకాలం పాటు ఆగలేని వారికి మల్టిక్యాప్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ లేదా మల్టీ అస్సెట్ ఫండ్స్ అనుకూలమని చెప్పారు. నరేన్ అభిప్రాయాలతో ఎడెల్వీజ్ మ్యూచువల్ ఫండ్ సీఈవో రాధికా గుప్తా విభేధించారు. ‘‘2006 గరిష్టాల నుంచి 2013 కనిష్టాల మధ్య రాబడులను చూస్తే అంత మంచిగా కనిపించవు. కానీ, మార్కెట్లో అలాంటివి సాధారణమే. మార్కెట్లో సంపద సృష్టి జరగాలంటే కనీసం 10 ఏళ్లు అంతకుమించిన కాలానికి సిప్ ద్వారా పెట్టుబడి పెట్టుకోవడం అవసరం’’ అని రాధికా గుప్తా సూచించారు. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలతో ముందడుగు
న్యూఢిల్లీ: భారత్ వాణిజ్యం, పెట్టుబడుల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షికవాదం కొత్త ఉ్రత్పేరకంగా కనిపిస్తుందన్నారు. బీఎస్ మంథన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. సవాళ్లతో కూడిన కాలంలో భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్ట చెప్పారు. ‘‘ద్వైపాక్షికవాదం ఇప్పుడు ప్రముఖ అజెండాగా మారుతోంది. చాలా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను ఇతోధికం చేసుకోవాల్సి ఉంది. కేవలం వాణిజ్యం లేదా పెట్టుబడుల కోసమే కాదు, వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా కూడా అవసరమే. కొత్త ప్రపంచ క్రమంలో భారత్ తనకున్న టెక్నాలజీ, నిపుణుల బలంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి చోదకంగా మారగలదు’’అని వివరించారు. మల్టీలేటరల్ ఇనిస్టిట్యూషన్స్ క్రమంగా కనుమరుగవుతున్నాయంటూ.. వాటి పునరుద్ధరణకు చేసే ప్రతి ప్రయత్నం ఆశించిన ఫలితాన్నివ్వడం లేదన్నారు. ప్రపంచ వాణిజ్య విధానాల్లో మార్పులు.. ప్రపంచ వాణిజ్యం పూర్తిగా మార్పునకు గురవుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘మల్టీలేటరల్ ఇనిస్టిట్యూషన్లు, వాటి సేవలు ఉనికిని కోల్పోతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సమర్థంగా పని చేయడం లేదు. ప్రాధాన్య దేశం హోదా (ఎంఎఫ్ఎన్) అన్నదానికి అర్థం లేకుండా పోయింది. ప్రతి దేశం తమను ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటోంది. ఒకవేళ డబ్ల్యూటీవో బలహీనపడితే లేదా మల్టీ లేటరల్ ఇనిస్టిట్యూషన్లు సమర్థవంతంగా పనిచేయకపోతే.. అప్పుడు వాణిజ్యం విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలే కీలకంగా మారతాయి’’అని మంత్రి చెప్పారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై దృష్టి బ్రిటన్ (యూకే) సహా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల దిశగా భారత్ చర్చలు ప్రారంభించినట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. 27 దేశాల సమూహం అయిన ఐరోపా యూనియన్ (ఈయూ)తోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రుణ నిర్వహణ, ద్రవ్య క్రమశిక్షణ పరంగా ప్రభుత్వం మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. ‘‘సంస్కరణలన్నవి కేవలం కేంద్ర ప్రభుత్వ అజెండాగానే ఉండిపోకూడదు. ప్రతి రాష్ట్రం దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలని కోరుకుంటున్నాను’’అని మంత్రి సీతారామన్ చెప్పారు. పోటీతత్వాన్ని పెంచుకోవాలి స్వీయ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి పరిశ్రమలకు వాణిజ్య మంత్రి గోయల్ పిలుపు ముంబై: పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ సహకారంపై ఆధారపడకుండా.. తమ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టి, మరింత పోటీతత్వంతో ముందుకు రావాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గోయల్ మాట్లాడారు. ‘‘ప్రభుత్వ సహకారం కోసం ఎంత కాలం పాటు చూస్తారు? లేదా సబ్సిడీలు, సహకారం, ప్రోత్సాహకాలు, అధిక దిగుమతి సుంకాలు ఎంతకాలం పాటు కోరుకుంటారు? ప్రపంచంతో రక్షణాత్మక వైఖరి ఎంత కాలం? ఈ తరహా రక్షణాత్మక మనస్తత్వం, బలహీన ఆలోచనా ధోరణి నుంచి బయటకు రావడంపై నిర్ణయం తీసుకోవాలి’’అంటూ దేశీ పరిశ్రమ స్వీయ సామర్థ్యాలతో ఎదగాలన్న సంకేతం ఇచ్చారు. ఆవిష్కరణలు, తయారీ విధానాల నవీకరణ, నైపుణ్యాలు, సామర్థ్యాల నుంచే పోటీతత్వం వస్తుందన్నారు. పోటీతత్వంతో ఎదగనంత వరకు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరవని, ప్రపంచంతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోకపోతే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించలేమన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. చమురు, రక్షణ, ఆహారం వంటి కొన్ని రంగాల్లోనే కొన్ని మినహాయింపులు ఉన్నట్టు చెప్పారు. సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి పీయూష్ గోయల్.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల్లో ఎన్నో ముఖ్యమైన కార్యకలాపాల నడుమ తీరిక లేకుండా ఉన్నట్టు చెప్పారు. ట్రంప్ విధానాలతో దేశాల మధ్య పెద్ద ఎత్తున చర్చలు మొదలైనట్టు తెలిపారు. భారత్–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించినట్టు చెప్పారు. నాణ్యత భారత్‌కు దీర్ఘకాలిక సవాలుగా ఉన్నట్టు గోయల్ గుర్తు చేశారు. ఫార్మాలో తగిన అనుమతులు ఉన్న బడా సంస్థలు చిన్న కంపెనీలకు మద్దతుగా నిలవాలని సూచించారు. -
స్టాక్స్ అమ్మి ఫ్లాట్ కొనడం మంచిదా?
స్టాక్స్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న పెట్టుబడులను విక్రయించి, ఉత్తర బెంగళూరులో ఫ్లాట్ కొనాలన్నది నా ఆలోచన. వచ్చే ఐదేళ్ల కాలానికి ఇది మంచి ఆప్షన్ అవుతుందా? లేదంటే మరో ఐదేళ్లపాటు ఈ పెట్టుబడులు కొనసాగించిన అనంతరం ఫ్లాట్ కొనుగోలు చేసుకోవాలా? ఈ రెండింటిలో ఏది మెరుగైన ఆప్షన్? – శంకర్ కృష్ణమూర్తిఈ విషయంలో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్లాట్ కొనుగోలు చేస్తే ఎంత మేర లాభపడొచ్చు? దీని ద్వారా వచ్చే అద్దె ఆదాయం ఏ మేరకు ఉంటుంది? ఇవన్నీ పరిశీలించాలి. ఫ్లాట్‌పై పెట్టుబడి విలువకు వృద్ధి ఉండి, 4–6 శాతం మేర అద్దె రాబడి వచ్చేట్టు అయితే ఇప్పుడే స్టాక్స్ విక్రయించి కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను విక్రయించేంత వరకు ఎలాంటి పన్నులు చెల్లించక్కర్లేదు. కనుక పెట్టుబడి వృద్ధి, రిస్క్, పెట్టుబడి పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అద్దె ఇంట్లో ఉంటూ, సొంత అవసరాల కోసం ఇల్లు కొనుగోలు చేస్తున్నట్టు అయితే ఇప్పుడు కొనుగోలు చేయడం మంచి నిర్ణయం అవుతుంది. అలాంటప్పుడు తక్కువ రాబడి వచ్చినా ఫర్వాలేదు.మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ తమ నిర్వహణ ఆస్తుల్లో (ఏయూఎం/పెట్టుబడులు) 30 శాతాన్ని లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా లార్జ్‌క్యాప్ ఫండ్‌లో పెట్టుబడికి బదులు ఒకే మిడ్‌క్యాప్ ఫండ్‌లో ఎందుకు పెట్టకూడదు? దీనివల్ల రీబ్యాలన్స్ చేయాల్సిన అవసరం తప్పుతుందిగా? – రాఘేవేంద్ర సోరబ్మిడ్క్యాప్ ఫండ్‌లో అంతర్గతంగా ఉండే అస్థిరతల పట్ల సౌకర్యంగా ఉండేట్టు అయితే ఇన్వెస్ట్ చేయడం మంచి వ్యూహమే అవుతుంది. మిడ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌కు నిబంధనల పరంగా కొంత వెసులుబాటు ఉంది. అవి తమ నిర్వహణ ఆస్తుల్లో కనీసం 65 శాతాన్ని మిడ్‌క్యాప్ స్టాక్స్ కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన 35 శాతం పెట్టుబడులను లార్జ్‌క్యాప్ లేదా స్మాల్‌క్యాప్‌లో ఎక్కడైనా, ఎంత మేరకు అయినా కేటాయింపులు చేసుకోవచ్చు. ఇది ఫండ్ మేనేజర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుంది. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఫండ్ మేనేజర్లు 35 శాతం పెట్టుబడులను వివిధ విభాగాల మధ్య మార్పులు, చేర్పులు చేసుకోవచ్చు. అయితే, చాలా మిడ్‌క్యాప్ ఫండ్స్ లార్జ్‌క్యాప్‌కు చాలా తక్కువగా అంటే.. సగటున 12 శాతం మేర కేటాయింపులు చేస్తున్నాయి. ఇవి ఎక్కువ శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్ స్టాక్స్‌కే కేటాయిస్తుంటాయి. ఇదీ చదవండి: ఆరోగ్య బీమా.. భారం తగ్గేదెలా?మిడ్‌క్యాప్ ఫండ్ ఆస్తుల సైజు చిన్నగా ఉంటే అప్పుడు ఫండ్ మేనేజర్ లార్జ్‌క్యాప్ ఎక్స్పోజర్ బదులు నూరు శాతం పెట్టుబడులను మిడ్‌క్యాప్ కోసమే కేటాయించడం సరైన విధానం అవుతుంది. లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ వ్యాప్తంగా వైవిధ్యమైన పెట్టుబడులను మీరు కోరుకుంటుంటే అప్పుడు మిడ్‌క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయం కాబోదు. మల్టీక్యాప్ ఫండ్స్ అయితే లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్ విభాగాల్లో కనీసం 25 శాతం చొప్పున పెట్టుబడులు పెడుతుంటాయి. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌కు ఏ మార్కెట్ క్యాప్ విభాగంలో అయినా ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ వీటికి ఉంటుంది. అయినప్పటికీ ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ 80 శాతం వరకు లార్జ్‌క్యాప్ కంపెనీలకే కేటాయిస్తుంటాయి.ధీరేంద్ర కుమార్, వ్యాల్యూ రీసెర్చ్ సీఈవో -
ఆర్బిట్రేజ్ ఫండ్స్‌తో మెరుగైన రాబడులు
వేగంగా మారిపోయే పెట్టుబడుల ప్రపంచంలో సాధారణంగా మనం ఊహించని సందర్భాల్లో అవకాశాలు వస్తుంటాయి. ధరలపరంగా ఉండే వ్యత్యాసాలను ఉపయోగించుకుని, లబ్ధిని పొందే వ్యూహమే ఆర్బిట్రేజ్. మార్కెట్లో ఇలాంటి అవకాశాలను అందిపుచ్చుకుని, మెరుగైన రాబడులను అందించే లక్ష్యంతో ఏర్పడ్డ కొత్త తరహా మ్యుచువల్ ఫండ్సే ‘ఆర్బిట్రేజ్ ఫండ్స్’. వీటితో ఇన్వెస్టర్లకు ప్రయోజనం ఏమిటి, ఇవి ప్రాచుర్యంలోకి పొందడం వెనుక కారణాలేంటి, ప్రస్తుతం భారత మార్కెట్లో నెలకొన్న పరిస్థితుల్లో ఆదరణ ఎందుకు పెరుగుతోంది అనే ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకునేందుకు ఒకసారి ఆర్బిట్రేజ్ ఫండ్స్ కాన్సెప్టు, పని తీరు, సామర్థ్యాల గురించి తెలుసుకుందాం.ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఇలా..‘అ’ అనే కంపెనీ ఈక్విటీ షేర్లు, క్యాష్ మార్కెట్లో రూ.100 వద్ద, ఫ్యూచర్ మార్కెట్లో రూ.102 వద్ద (ధర ప్రీమియంలో వ్యత్యాసాల వల్ల) ట్రేడవుతున్నాయనుకుందాం. ఫండ్ మేనేజరు ‘అ’ కంపెనీ షేర్లను క్యాష్ మార్కెట్లో రూ.100కు కొని, వాటిని ఫ్యూచర్స్ మార్కెట్లో రూ.102కు అమ్మాలని అనుకున్నారనుకుందాం. సాధారణంగా నెలాఖరున, ఫ్యూచర్ కాంట్రాక్టు ఎక్స్పైర్ అయిపోయే సమయానికి క్యాష్ మార్కెట్, అటు ఫ్యూచర్స్ మార్కెట్ ధరలు ఒకే స్థాయికి సర్దుబాటు అవుతాయి. అప్పుడు ఫండ్ మేనేజరు తన ట్రేడింగ్ లావాదేవీని రివర్స్ చేసి, రెండు ధరల మధ్య వ్యత్యాసమైన రూ.2 మొత్తాన్ని రాబడిగా పొందుతారు.స్టాక్స్, డెరివేటివ్స్ మార్కెట్లలో ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసే మ్యుచువల్ ఫండ్స్‌ను ఆర్బిట్రేజ్ ఫండ్స్‌గా పరిగణిస్తారు. మరింత సరళంగా చెప్పాలంటే ఒక అసెట్ స్పాట్ ధర (స్టాక్ మార్కెట్లో), దాని ఫ్యూచర్ ధర (డెరివేటివ్స్ మార్కెట్లో) మధ్య ఉండే వ్యత్యాసాన్ని ఉపయోగించుకుని ఈ ఫండ్స్ లబ్ధిని పొందుతాయి. అల్గోరిథమ్‌లు, నిపుణులైన ఫండ్ మేనేజర్ల సహాయంతో స్పాట్, ఫ్యూచర్స్ మార్కెట్లలో ధరల వ్యత్యాసాన్ని ఈ ఫండ్స్ నిరంతరం పరిశీలిస్తూ ఉంటాయి. అయితే, అవకాశాలు క్షణాల్లో ఆవిరైపోతాయి కాబట్టి, ఈ వ్యూహాన్ని అమలు చేయడమనేది చెప్పినంత సులువైన వ్యవహారం కాదు. ధరపరంగా వ్యత్యాసం చాలా తక్కువ పర్సెంటేజీ పాయింట్లలోనే ఉండొచ్చు, కానీ మార్కెట్లోని మిగతా వారు కూడా ఆ అవకాశాన్ని గుర్తించే ఆస్కారం ఉంది, కాబట్టి ఆ వ్యత్యాసం చాలా వేగంగా మాయమైపోవచ్చు. కనుక మిగతావారికన్నా వేగంగా స్పందించాల్సి ఉంటుంది.ఆర్బిట్రేజ్ ఫండ్స్ ఆకర్షణీయంఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) సెగ్మెంట్‌ను ప్రోత్సహించే విధంగా సెబీ ఇటీవలే కొన్ని చర్యలు ప్రకటించింది. 2024 నవంబర్ 29 నుంచి అదనంగా 45 సెక్యూరిటీల్లో ఎఫ్‌అండ్‌వో కాంట్రాక్టులను అనుమతించింది. అలాగే, మార్కెట్ వృద్ధికి అనుగుణంగా ఉండేలా 2024 నవంబర్ 20 నుంచి ఇండెక్స్ డెరివేటివ్స్ కాంట్రాక్టు సైజును రూ.15 లక్షలకు పెంచింది. ఈ చర్యలన్నీ, దేశీయంగా డెరివేటివ్స్ మార్కెట్‌ను విస్తరించేందుకు, వైవిధ్యభరితంగా మార్చేందుకు, మరింత సమర్ధవంతంగా తీర్చిదిద్దేందుకు, రిటైల్ ఇన్వెస్టర్లు మరింతగా పాలుపంచుకునేలా ప్రోత్సహించేందుకు దోహదపడతాయి. కొత్త ఫ్యూచర్స్ అందుబాటులోకి రావడం వల్ల ఫండ్లు వివిధ రంగాలు, కంపెనీలు, మార్కెట్ క్యాప్‌లవ్యాప్తంగా తమ వ్యూహాలను మరింత వైవిధ్యంగా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుంది.ఇదీ చదవండి: బంగారం లాభాలపై పన్ను ఎంత?పెట్టుబడులతో ప్రయోజనాలుమిగతావాటితో పోలిస్తే తక్కువ రిస్క్: మార్కెట్ గమనంతో పట్టింపు లేకుండా ఈ విధానం చాలా సింపుల్‌గా ఉంటుంది. మార్కెట్లో స్ప్రెడ్లను గుర్తించి, తదుపరి ఎక్స్పైరీ వరకు ‘లాకిన్’ చేయడంపైనే ఫండ్ దృష్టి పెడుతుంది.ఒడిదుడుకుల మార్కెట్లలో అనుకూలం: మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పుడు రాబడులను అంచనా వేయడమనేది చాలా మటుకు మ్యుచువల్ ఫండ్ స్కీములకు కష్టమైన వ్యవహారంగా ఉంటుంది. మరోవైపు, మార్కెట్లు స్థిరంగా ఉన్నప్పుడైనా, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడైనా తక్కువ రిస్క్‌తో కూడుకున్న వ్యూహాలుగా ఆర్బిట్రేజ్ ఫండ్లు మెరుగ్గా రాణించగలుగుతాయి. మార్కెట్ ఒడిదుడుకుల్లో షేర్ల ధరలు గణనీయంగా హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి కాబట్టి, వివిధ మార్కెట్లలో వాటిని అప్పటికప్పుడు కొని అమ్మేయడం ద్వారా, ఆ పరిస్థితిని ఆర్బిట్రేజ్ ఫండ్స్ తమకు అనువైనదిగా మార్చుకుంటాయి. పన్ను ప్రయోజనాలు: ఈ ఫండ్స్ స్వభావరీత్యా హైబ్రిడ్ ఫండ్సే అయినప్పటికీ ఈక్విటీ ట్యాక్సేషన్కి అర్హత ఉంటుంది. ఫండ్ మొత్తం అసెట్స్‌లో కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడమే ఇందుకు కారణం. ఆర్బిట్రేజ్ ఫండ్‌ను ఏడాదికన్నా ఎక్కువ కాలం అట్టే పెట్టుకుంటే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) కింద 12.5 శాతం పన్ను రేటే వర్తిస్తుంది (రూ. 1.25 లక్షల మినహాయింపునకు లోబడి). పన్ను ఆదా చేస్తూ, స్థిరమైన రాబడులను అందించే సాధనాలను కోరుకునే ఇన్వెస్టర్లకు, ఆర్బిట్రేజ్ ఫండ్లు ఆకర్షణీయమైన ఆప్షన్‌గా ఉండగలవు. మార్కెట్లో ఒడిదుడుకులను అవకాశాలుగా మల్చుకునే అధునాతన వ్యూహాలతో ఆర్బిట్రేజ్ ఫండ్స్ పనిచేస్తాయి. హెచ్చుతగ్గులు, లిక్విడిటీ, నియంత్రణపరంగా స్థిరత్వం నెలకొన్న భారత మార్కెట్లో, పెట్టుబడిని కాపాడుకుంటూ స్థిరమైన వృద్ధి కోరుకునే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్లు ఆకర్షణీ యమైన ఆప్షన్. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి రక్షణ కోసం హెడ్జింగ్ కోరుకునే ఇన్వెస్టర్లు, ఆర్బిట్రేజ్ ఫండ్లను తప్పక పరిశీలించవచ్చు.- కార్తీక్ కుమార్, ఫండ్ మేనేజర్, యాక్సిస్, మ్యుచువల్ ఫండ్ -
పెట్టుబడులకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే!
-
తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి
మాదాపూర్: వాణిజ్యం, వ్యాపారం లేకుండా ప్రభుత్వాలు, వ్యవస్థలు నడవలేవని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో గురువారం హైబిజ్ టీవీ బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ 2వ ఎడిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కీలక రంగాలలో అమూల్యమైన సేవలు అందించిన వారికి అవార్డులను అందజేసినందుకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఏడాదికాలంలో ప్రభుత్వం వ్యాపారరంగ అభివృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించిందని తెలిపారు. 2023లో తెలంగాణ అభివృద్ధి 2ఎక్స్‌గా ఉందని, రాబోయే నాలుగు సంవత్సరాలలో దాన్ని 10ఎక్స్‌కు చేరుస్తామన్నారు. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని, దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో రూ.1.7 లక్షల కోట్ల పెట్టుబడులను రాష్ట్రం సాధించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అలాంటి వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నందుకు హర్షం వ్యక్తంచేశారు. పారిశ్రామిక రంగానికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా 11 మందికి లెజెండ్ పురస్కారాలను అందజేశారు. సీఎస్ఆర్ కేటగిరీలలో ఉత్తమ గ్రూప్‌గా ఐటీసీకి అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, టీజీఐఐసీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ వై.కిరణ్, భారతీ సిమెంట్ మార్కెటింగ్ డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, హైబిజ్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. -
మార్కెట్‌కు దేశీ ఇంధనం!
సుమారు 15 ఏళ్ల తదుపరి తొలిసారి దేశీ స్టాక్ మార్కెట్లలో సరికొత్త ట్రెండ్‌కు తెరలేవనుంది. ఇటీవల దేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (డీఐఐలు) పెట్టుబడులు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) అమ్మకాలను మించుతున్నాయి. దీంతో ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో డీఐఐల వాటా ఎఫ్పీఐలకున్న పెట్టుబడుల విలువను అధిగమించనుంది! ఫలితంగా తొలిసారి లిస్టెడ్ కంపెనీలలో ప్రమోటర్ల తదుపరి అతిపెద్ద వాటాదారులుగా డీఐఐలు నిలవనున్నాయి. వెరసి రేసులో ఎఫ్‌పీఐలను వెనక్కి నెట్టనున్నాయి.దేశీ లిస్టెడ్ కంపెనీలలో ఈ ఏడాది ప్రమోటర్లేతర ఓనర్íÙప్లో ఆధిపత్యం చేతులు మారనుంది. 1992లో దేశీ స్టాక్ మార్కెట్లలో ఎఫ్‌పీఐలను అనుమతించాక భారీ పెట్టుబడులతో దూకుడు చూపుతున్నారు. డీఐఐల పెట్టుబడులకంటే అధికంగా ఇన్వెస్ట్ చేస్తూ దేశీ స్టాక్స్‌లో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల ట్రెండ్ మారుతోంది. గత నాలుగేళ్లుగా బుల్ ట్రెండ్‌తో దేశీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను తాకుతూ వచ్చాయి. ఇందుకు ప్రధానంగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లుగా పిలిచే మ్యూచువల్ ఫండ్స్, బీమా కంపెనీలు, పెన్షన్ ఫండ్స్ పెట్టుబడులు ప్రభావం చూపుతున్నాయి. అయితే గతేడాది అక్టోబర్ నుంచి ఎఫ్‌పీఐలు యూటర్న్ తీసుకున్నారు. ఇదే సమయంలో డీఐఐలు మరిన్ని పెట్టుబడులు కుమ్మరిస్తున్నారు. వెరసి ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో ఎఫ్‌పీఐల వాటా తగ్గుతుంటే.. డీఐఐల వాటా పెరుగుతోంది.2015తో పోలిస్తే 2025లో ఎఫ్‌పీఐలు, డీఐఐల పెట్టుబడుల విలువ మధ్య అంతరం 2009 తదుపరి అత్యంత కనిష్టానికి చేరింది. ఎన్ఎస్ఈ లిస్టెడ్ కంపెనీలలో 2024 డిసెంబర్‌కల్లా ఎఫ్‌పీఐల వాటా 17.23 శాతానికి దిగిరాగా.. డీఐఐల వాటా 16.90 శాతానికి బలపడింది. అంటే అంతరం 33 బేసిస్ పాయింట్లు(0.33 శాతం) మాత్రమే. నిజానికి 2015లో ఎఫ్‌పీఐ, డీఐఐ వాటాల మధ్య అంతరం 1032 బేసిస్ పాయింట్లు(10.32 శాతం)గా నమోదైంది. జనవరిలోనూ ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగడం, పెట్టుబడుల బాటలో డీఐఐలు కొనసాగుతుండటంతో త్వరలో ఎఫ్‌పీఐలపై డీఐఐలు ఆధిపత్యం వహించనున్నట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఫండ్స్ ఆధిపత్యం డీఐఐలలో మ్యూచువల్ ఫండ్స్‌దే అగ్రస్థానంకాగా.. వీటికి రిటైల్ ఇన్వెస్టర్ల నుంచే అధిక బలం సమకూరుతోంది. గత నెల(జనవరి)లో ఎఫ్‌పీఐలు నికరంగా రూ. 78,000 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయిస్తే.. డీఐఐలు రూ. 86,000 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. ఇక 2024 అక్టోబర్–డిసెంబర్లో ఎఫ్‌పీఐలు రూ. లక్ష కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ.1.86 లక్షల కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశాయి. విలువపరంగా డీఐఐల వద్ద గల ఈక్విటీలు రూ. 73.5 లక్షల కోట్లు! ఎఫ్‌పీఐల వాటాల విలువకంటే 1.9 శాతమే తక్కువ! దశాబ్దంక్రితం ఎఫ్‌పీఐల పెట్టుబడులలో దేశీ ఫండ్స్ ఈక్విటీల విలువ సగమేకావడం ఈ సందర్భంగా ప్రస్తావనార్హం! ఈ బాటలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువలో మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు) పెట్టుబడులు 10వ వంతుకు చేరడం విశేషం!రిటైలర్ల బలమిది ఇటీవల కొన్నేళ్లుగా రిటైల్ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్లకు తరలి వస్తున్నారు. ఎంఎఫ్‌లలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫలితంగా 2019లో రూ. 7.7 లక్షల కోట్లుగా నమోదైన ఫండ్స్ నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) 2024 డిసెంబర్‌కల్లా రూ. 31 లక్షల కోట్లను తాకింది! ఇదే కాలంలో సిప్ ద్వారా పెట్టుబడులు రూ. 8,518 కోట్ల నుంచి రూ. 26,549 కోట్లకు జంప్ చేశాయి. 2024 చివరి క్వార్టర్లో రిటైలర్లు స్టాక్స్‌లో రూ. 57,524 కోట్లు ఇన్వెస్ట్ చేశారు! ఈ జోష్‌తో గతేడాది 91 కంపెనీలు ఐపీఓలతో రూ.1.6 లక్షల కోట్లకుపైగా సమకూర్చుకోవడం కొసమెరుపు!!జనవరిలో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. 78,000 కోట్లుదేశీ ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ. 86,000 కోట్లు అక్టోబర్–డిసెంబర్లో ఎఫ్‌పీఐల అమ్మకాలు రూ. లక్ష కోట్లు ఇదే కాలంలో డీఐఐల కొనుగోళ్లు రూ. 1.86 లక్షల కోట్లు –సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఖర్చు పెట్టించేందుకు ఇది చాలదు!
భారతదేశ మధ్య తరగతి బహుశా గడచిన మూడు దశాబ్దాల్లో ఇలాంటి బడ్జెట్ చూడ లేదు. ఆదాయ పన్నులో ఎంతో కొంత ఉపశమనం కలిగిస్తుందని మోదీ సర్కారుపై అందరూ ఆశలు పెట్టుకున్నారు. కానీ ఇంత భారీ ఊరట లభిస్తుందని మాత్రం ఊహించలేదు. నగరాల్లో నెలకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఉన్నవారిని మాత్రమే మధ్య తరగతిగా పరిగణించాలని నేను గతంలో వాదించాను. అయితే, ఇలాంటి వాళ్లు దేశం మొత్తమ్మీద నాలుగైదు శాతం మాత్రమే ఉంటారు. ఇంత మొత్తం ఆర్జిస్తున్నవాళ్లు కూడా పన్నులు కట్టే పని లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ఎందుకీ ఉపశమనం?ఫలితంగా ఈ స్థాయి ఆదాయమున్న వారి జేబుల్లోకి ప్రతి నెల ఆరు వేల రూపాయలు అదనంగా వచ్చి చేరుతుంది. ఈ డబ్బును ఇంటికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు వాడుకోవచ్చు. లేదంటే దాచుకుని చిరకాలంగా ఆశపడుతున్న స్మార్ట్‌ఫోన్ నైనా సొంతం చేసుకోవచ్చు. మీ ఆదాయం నెలకు రెండు లక్షల రూపాయలనుకుంటే, మారిన పన్ను రేట్ల కారణంగా మీకు నెల నెలా రూ. 9,000 అదనంగా ఆదా అవుతుంది. దీన్ని రోజువారీ ఖర్చుల కోసం వాడు కోవచ్చు. ఫ్యాన్సీ రెస్టారెంట్‌కు వెళ్లి భోంచేయొచ్చు. ఏడాదిలో రూ. 1.10 లక్షలు మిగులుతుంది. ఈ డబ్బుతో 55 అంగుళాల టీవీ, అత్యాధునిక వాషింగ్ మెషీన్ కొనుక్కోవచ్చు. ఇంకోలా చెప్పాలంటే, పన్నుల మినహాయింపు పొందిన మధ్య తరగతి విరగబడి కొనుగోళ్లు చేస్తుందనీ, తద్వారా ఆర్థిక వ్యవస్థకు ఊతమొస్తుందనీ మోదీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదే జరిగితే దేశంలో, ముఖ్యంగా నగర మధ్యతరగతి వినియోగం తగ్గుతోందన్న ఫిర్యాదులకు ఫుల్స్టాప్ పడుతుంది. 2022–23లో దేశంలో దాదాపు 7 కోట్ల మంది ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించారని దాఖలైన ఆదాయ పన్ను రిటర్న్స్ చెబుతున్నాయి. వీరిలో దాదాపు రెండు కోట్ల మంది పన్నులు చెల్లించారు. ప్రస్తుతం వేతనాల్లో పెంపును పరిగణనలోకి తీసుకున్నా, పన్ను రేట్లలో వచ్చిన మార్పుల కారణంగా సుమారు 1.5 కోట్ల మంది పన్ను పరిధిలోంచి జారిపోతారు. అంటే, పన్ను చెల్లింపుదారుల సంఖ్య సుమారు 1.4–1.6 కోట్లకు పడిపోనుంది. వీరిలో ఏడాదికి రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వారూ ఉంటారు. ఇది మొత్తం మన శ్రామిక శక్తిలో కేవలం 4 శాతం మాత్రమే. ప్రభుత్వ అంచనా వేరే!పరిస్థితి ఇలా ఉంటే, ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ పన్ను రాబడుల లెక్కలు ఇంకోలా ఉన్నాయి. 2025 బడ్జెట్ అంచనాల ప్రకారం, ఆదాయపు పన్ను రూపంలో వచ్చే మొత్తం రూ.1.8 లక్షల కోట్లు ఎక్కువ కానుంది. ఇంకోలా చెప్పాలంటే ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం వచ్చిన దానికంటే రానున్న సంవత్సరం వచ్చే మొత్తం 14 శాతం ఎక్కువ. గతేడాది ప్రభుత్వ అంచనాలతో పోలిస్తే ఇది 21 శాతం ఎక్కువ. దీన్నిబట్టి చూస్తే ఆర్థిక మంత్రి చెప్పినట్లుగా పన్ను రేట్లలో మార్పుల వల్ల ప్రభుత్వానికి ఒక లక్ష కోట్ల రూపాయల నష్టం జరగడం లేదు. పాత రేట్లు, శ్లాబ్స్ కొనసాగి ఉంటే ప్రభుత్వం 22 శాతం వరకూ ఎక్కువ ఆదాయపు పన్నులు వసూలు చేసి ఉండేది. ఆదాయ పన్ను రాబడి పెరిగేందుకు ఒకే ఒక్క మార్గం... వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రజల వ్యక్తిగత ఆదాయం బాగా పెరగడం! ఇలా జరిగే సూచనలైతే లేవు. నిజానికి కృత్రిమ మేధ, వేర్వేరు ఆటో మేషన్ పద్ధతుల ప్రాచుర్యం పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగాల సంఖ్య తగ్గేందుకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫలితంగా జీతాలు కూడా స్తంభించిపోతాయి. తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు ఏడాదికి రూ.12 లక్షల ఆదాయం ఆర్జిస్తున్న వ్యక్తి గురించి ఆలోచిద్దాం. ఆదాయపు పన్ను కొత్త విధానాన్ని ఎంచుకుంటే ఇతడికి రూ.70 వేల వరకూ మిగులుతుంది. ఇంత మొత్తాన్ని వస్తు, సేవల కోసం ఖర్చు పెట్టగలడు. ఒకవేళ ఆదాయం పది శాతం తగ్గితే? అప్పుడు పన్ను మినహాయింపులు అక్కరకు రావు. వాస్తవికంగా ఖర్చు పెట్టడం ఇప్పటికంటే మరింత తక్కువైపోతుంది.ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఖర్చు చేయడం తగ్గించుకుంటోంది కాబట్టి ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారనుంది. గత ఏడాది కంటే ఈసారి ప్రభుత్వం పెట్టిన ఖర్చు 6.1 శాతం మాత్రమే ఎక్కువ. వచ్చే ఆర్థిక సంవత్సరం ఇంకో 5 శాతమే అదనంగా ఖర్చు పెట్టాలని యోచిస్తోంది. ద్రవోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే ఈ పెంపుదల కేవలం 1.5 శాతమే అవుతుంది. పెట్టుబడులు తగ్గించుకుంటున్న ప్రభుత్వంరోడ్లు, హైవేలు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రభుత్వం గతంలో ఖర్చు పెట్టినదానికి ఇది పూర్తి భిన్నం. ఆ ఖర్చులో పెరుగుదల జీడీపీ పెంపునకు దారితీసింది. ఈసారి మూలధన వ్యయం గత ఏడాది కంటే కేవలం ఒకే ఒక్క శాతం ఎక్కువ ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. ద్రవ్యోల్బణాన్ని పరిగణిస్తే అసలు మొత్తం ఇంకా తక్కువగా ఉంటుంది కాబట్టి... ఈ ఏడాది మౌలిక వసతులపై పెట్టే ఖర్చు తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదు. అంటే, మౌలిక వసతుల రంగానికి అనుబంధమైన స్టీల్,సిమెంట్, తారు, జేసీబీల్లాంటి భారీ యంత్రాలు, బ్యాంకులు కూడా డిమాండ్‌లో తగ్గుదల నమోదు చేయవచ్చు. ఇదే జరిగితే ఆయా రంగాల్లో వేతనాల బిల్లులు తగ్గించుకునే ప్రయత్నం అంటే... వేత నాల్లో కోతలు లేదా ఉద్యోగాల కుదింపు జరుగుతుంది. ఇది మధ్య తరగతి వారి ఆదాయాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రభుత్వం ఈ ఏడాది కార్పొరేట్ కంపెనీల ద్వారా ఎక్కువ ఆదా యపు పన్ను ఆశించడం లేదని అంచనా కట్టింది. జీడీపీ విషయంలోనూ ఇంతే. వృద్ధి నామమాత్రమేనని ప్రభుత్వం భావిస్తోంది.పెట్టుబడులు పెరగకపోతే?ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తాను లక్ష్యించుకున్న కార్పొరేట్ పన్నులు కూడా పూర్తిగా వసూలు చేయలేకపోయింది. మొత్తం 10.2 లక్షల కోట్లు కార్పొరేట్ కంపెనీల ద్వారా వస్తుందని ఆశిస్తే వసూలైంది రూ.9.8 లక్షల కోట్లు మాత్రమే. అదే సమయంలో ఆదాయపు పన్ను రాబడులను మాత్రం రూ.11.9 లక్షల కోట్ల నుంచి రూ.12.6 లక్షల కోట్లకు సవరించింది. అంటే ప్రభుత్వం కార్పొరేట్ పన్నుల కంటే 28 శాతం ఎక్కువ ఆదా యపు పన్ను రూపంలో వసూలు చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరం కూడా కార్పొరేట్ పన్నుల కంటే ఆదాయపు పన్నులు 33 శాతం ఎక్కువ వసూలు చేస్తామని చెబుతోంది. ఇది ఆర్థిక వ్యవస్థ బాగు పడుతోందనేందుకు ఏమాత్రం సూచిక కాదు. ప్రభుత్వం లేదా ప్రైవేట్ రంగం నుంచి ఎక్కువ పెట్టుబడుల్లేకుండా... కేవలం ఆదాయపు పన్ను రాయితీలతోనే వినియోగం పెరిగిపోతుందని ఆశించడంలో ఉన్న సమస్య ఇది. మధ్య తరగతి ప్రజల జేబుల్లో కొంత డబ్బు మిగిల్చితే, కొన్ని రకాల వస్తు సేవలకు తాత్కాలిక డిమాండ్ ఏర్పడవచ్చు. కానీ, ఆర్థిక వ్యవస్థ విస్తృత స్థాయిలో ఎదగకపోతే ఆ డిమాండ్ ఎక్కువ కాలం కొనసాగదు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌పై మరింత పెట్టుబడి పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా కనిపించడం లేదు. వీరి ప్రాజెక్టుల్లో అధికం ప్రభుత్వ మౌలిక వసతుల కల్పనకు సంబంధించినవే. అవే తగ్గిపోతే, కార్పొరేట్ కంపెనీలు కూడా తమ పెట్టుబడులను కుదించుకుంటాయి. దీంతో పరిస్థితి మొదటికి వస్తుంది. ఆదాయపు పన్ను రిబేట్లు ఆర్థిక వ్యవస్థకు ఏమాత్రం సాయం చేయనివిగా మిగిలిపోతాయి!అనింద్యో చక్రవర్తి వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్, ఆర్థికాంశాల విశ్లేషకులు(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడుల జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి భారీస్థాయిలో పెట్టుబడులు ప్రవహించాయి. గత క్యాలండర్ ఏడాది(2024)లో రూ. 3.94 లక్షల కోట్ల నిధులు లభించాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇవి రెట్టింపుకాగా.. ఇది మార్కెట్లపట్ల ఇన్వెస్టర్లలో పెరిగిన విశ్వాసాన్ని, దీర్ఘకాలిక పెట్టుబడులపట్ల ఆసక్తిని ప్రతిబింబిస్తోంది. ప్రధానంగా ఇందుకు క్రమానుగత పెట్టుబడి పథకాలు(సిప్‌లు) ఉపయోగపడుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే కొత్త ఏడాది(2025)లో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. 2024 డిసెంబర్ ప్రారంభం నుంచి మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) పరిశ్రమలో పెట్టుబడులు తగ్గడం ప్రారంభమైనట్లు జెరి్మనేట్ ఇన్వెస్టర్ సరీ్వసెస్ సీఈవో, సహవ్యవస్థాపకుడు సంతోష్ జోసెఫ్ పేర్కొన్నారు. ఇందుకు స్టాక్ మార్కెట్ల ఆటుపోట్లు కారణమైనట్లు తెలియజేశారు. చరిత్ర ప్రకారం మార్కెట్ల ఆధారంగానే ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు ప్రవహిస్తుంటాయని వివరించారు. మార్కెట్ల ఒడిదుడుకులు ఇన్వెస్టర్లపై ప్రభావం చూపుతుంటాయని అందువల్ల ప్రస్తుత హెచ్చుతగ్గుల కారణంగా 2025లో కొత్త ఫండ్ ఆఫర్లు(ఎన్‌ఎఫ్‌వోలు), ఈక్విటీ ఫండ్ల నిధుల సమీకరణ తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పెట్టుబడులు కొనసాగవచ్చు పరిస్థితులు సర్దుకున్నాక పెట్టుబడులపై లబ్ది చేకూరే వీలుండటంతో దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించే వీలున్నదని సంతోష్ తెలియజేశారు. గతేడాది మొత్తం ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత పథకాలకు రూ. 3.94 లక్షల కోట్లు లభించినట్లు మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వెల్లడించింది. 2023లో రూ. 1.61 లక్షల కోట్ల పెట్టుబడులు మాత్రమే అందుకున్నట్లు తెలియజేసింది. కాగా.. గతేడాది భారీ పెట్టుబడుల నేపథ్యంలో ఎంఎఫ్ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) 40 శాతం ఎగశాయి. దీంతో 2024 డిసెంబర్‌కల్లా రూ. 30.57 లక్షల కోట్లకు ఏయూఎం చేరింది. 2023లో రూ. 21.8 లక్షల కోట్లుగా నమోదైంది. మార్కెట్లు నిలకడగా బలపడటం, ఆరి్ధక అవగాహన మెరుగుపడటం, ఇన్వెస్టర్లు సిప్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు 2024లో ఈక్విటీ ఫండ్ల ఉత్తమ పనితీరుకు తోడ్పాటునిచ్చాయి. రిటైల్ ఇన్వెస్టర్లు ఈక్విటీ పెట్టుబడులపై అవగాహన పెంచుకోవడం ద్వారా సంపద వృద్ధికి వీలు దోహదపడినట్లు బజాజ్ ఫిన్సర్వ్ ఏఎంసీ సీఈవో గణేశ్ మోహన్ పేర్కొన్నారు. మార్కెట్లు నిలకడగా బలపడటం, పెట్టుబడుల్లో డిజిటైజేషన్‌తో ఈక్విటీ ఎంఎఫ్‌లు పెట్టుబడులను ఆకట్టుకున్నట్లు తెలియజేశారు. థిమాటిక్ ఫండ్స్ స్పీడ్ గతేడాది ఈక్విటీ పథకాలలో థిమాటిక్ ఫండ్స్ అత్యధికంగా రూ. 1.55 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ రూ. 32,465 కోట్లు, రూ. 34,223 కోట్లు చొప్పున అందుకున్నాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి రూ. 19,415 కోట్లు ప్రవహించాయి. పెట్టుబడుల్లో రూ. 2.5 లక్షల కోట్లతో సిప్‌లు ప్రధాన పాత్ర పోషించాయి. -
ఆర్థిక యుద్ధం గెలవగలరా?
అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎన్ని ఉత్తర్వుల తుఫానును సృష్టిస్తున్నా, వాటన్నింటి అంతిమ లక్ష్యం ఆర్థిక సంబంధ మైనదే. ఆయన తన మొదటి విడత పాలనా కాలంలో (2017–21) ఇచ్చి ఈసారి మళ్లీ ఇస్తున్న ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా) నినాదంలోని ఉద్దేశం కూడా అదే. పౌరసత్వా లపై, వలసలపై ఆంక్షలు; దిగుమతులపై భారీగా సుంకాలు; గ్రీన్లాండ్, పనామా కాలువల స్వాధీనం; చైనాపై వాణిజ్య యుద్ధం; చమురు ధరలు తగ్గించాలనీ, తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలనీ అరబ్ దేశాలపై ఒత్తిడులు; ఇతరులు అమెరికా చమురునే ఖరీదు చేయాలనటం; తాము అధిక నిధులు ఇస్తున్నామంటూ డబ్ల్యూహెచ్ఓ, ప్యారిస్ ఒప్పందాల నుంచి ఉపసంహరణ; డాలర్‌కు పోటీ రావద్దంటూ బ్రిక్స్ కూటమికి బెదిరింపులు... ఇట్లా దేనిని గమనించినా వాటన్నింటి వెనుక కనిపించేది ఆర్థిక విషయాలే.ఆధిపత్యపు గుప్పిటిఏ అధ్యక్షుడైనా తమ దేశం ఆర్థికంగా బలంగా ఉండాలనీ, ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలబడాలనీ కోరుకోవటంలో ఆక్షేపించ వలసింది ఏమీ లేదు. వాస్తవానికి, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి బ్రిటిష్ సామ్రాజ్యం కుప్పగూలినప్పటి నుంచి అమెరికాదే అగ్రస్థానం. అయినప్పటికీ ట్రంప్ ఆర్థిక యుద్ధం అనదగ్గ రీతిలో పై చర్య లను ఎందువల్ల ప్రకటిస్తున్నట్లు? అమెరికా బలానికి మూలస్తంభాలు నాలుగున్నాయి. ఒకటి, ఆర్థిక స్థితి. రెండు, సైనిక శక్తి. మూడు, ఉన్నత విద్యతోపాటు శాస్త్ర–సాంకేతిక రంగాలలోని ప్రతిభా సామ ర్థ్యాలు. నాలుగు, ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, ఐక్య రాజ్యసమితి వంటి ప్రపంచ వ్యవస్థలపై ఆధిపత్యం. ఈ నాలుగు అమెరికా గుప్పిట్లో ఉన్నంతకాలం అమెరికా సామ్రాజ్యానికి ముప్పు ఉండదు. ఈ పాఠాలను వారు బ్రిటిష్ సామ్రాజ్య పతనం నుంచి నేర్చుకున్నారు. కనుక ఈ ఆధిపత్యాలు చెదరకూడదు.రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ జర్మనీ ఓడిన తర్వాత సోవియెట్ యూనియన్ నాయకత్వాన కమ్యూనిస్టు శిబిరం బలపడి, అమెరికాకు మొదటి పెద్ద సవాలుగా నిలిచింది. కానీ, సోవియెట్ కూటమి అమెరికాకు సైద్ధాంతికంగా, సైనికంగా మాత్రమే సవాలు అయింది తప్ప, పైన పేర్కొన్న మొత్తం నాలుగు రంగాలలోనూ కాలేకపోయింది. చివరకు పలు స్వీయాపరాధాలవల్ల కుప్పకూలింది. ఇది 1991 చివరి దశ మాట. తర్వాత 30 ఏళ్లపాటు అమెరికాకు ఎదురులేక పోయింది. చైనా సవాలుఆ విధంగా తమకు ఎదురు లేదని భావిస్తుండగా రష్యా తన అపారమైన సహజ వనరుల బలంతో నెమ్మదిగా పుంజుకోవటం మొదలైంది. దానితోపాటు మరికొన్ని పరిణామాలు అమెరికాకు సరికొత్త సవాలుగా మారసాగాయి. ఈ పరిణామాలలో అన్నింటి కన్నా ప్రధానమైంది చైనా అనూహ్యమైన అభివృద్ధి. అందుకు ఆరంభం ఆ దేశం 2001లో డబ్ల్యూటీఓలో ప్రవేశించటంతో మొదలైంది. 1980–90 మధ్య తెంగ్ శియావ్ పింగ్ ఆర్థిక సంస్కరణలకు పునాదులు వేయగా, డబ్ల్యూటీఓ ప్రవేశంతో అందుకు మహా వేగం వచ్చింది. పదేళ్లయేసరికి అమెరికా తర్వాత రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. 2017 నాటికైతే పర్ఛేజింగ్ పవర్ పేరిటీ (పీపీపీ; దేశాల మధ్య కొనుగోలు శక్తిలోని తారతమ్యం) కొలమానాల ప్రకారం అమెరికాను సైతం మించిపోయింది.ఇక్కడ చెప్పుకోవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అది సోవియెట్ యూనియన్ వ్యూహానికీ, చైనా వ్యూహానికీ మధ్యగల తేడా. సోవియెట్ పతనం నుంచి పాఠాలు నేర్చుకున్న చైనా, అమెరికా వలెనే ఒక సమగ్ర వ్యూహాన్ని అనుసరించేందుకు ప్రయత్నిస్తూ వస్తున్నది. ఆర్థికాభివృద్ధి, సైనికాభివృద్ధి, విద్యతోపాటు శాస్త్ర–సాంకేతిక రంగాల అభివృద్ధి, అంతర్జాతీయ సంస్థలలో పలుకు బడిని క్రమంగా పెంచుకోవటం. ఇవిగాక, అమెరికా, యూరోపియన్ దేశాలు ప్రపంచవ్యాప్తంగా గల చిన్న దేశాల సహజ వనరులను, మార్కెట్లను కొల్లగొడుతూ వాటిని తమ చెప్పు చేతలలో ఉంచుకునేందుకు ప్రయత్నిస్తుండగా, చైనా తన అపారమైన ధన సంపదతో వాటి అభివృద్ధికి సహకరించటంతో పాటు తాను కూడా లాభపడే వ్యూహాన్ని అనుసరించటం మొదలుపెట్టింది.అమెరికా, యూరప్ ఉత్పత్తుల ఖర్చు పెరగటంతో పరిశ్రమలను తమంతట తామే చైనాకు, ఆగ్నేయాసియా దేశాలకు తరలించటం, అక్కడి నుంచి చవకగా దిగుమతి చేసుకోవటం అనే వ్యూహం తొలుత బాగానే పనిచేసింది. కానీ తర్వాత అదే వారికి సమస్యగా మారింది. అనేక ఆధునిక పరిశోధనలు, ఉత్పత్తుల విషయంలో చైనా తదితర దేశాలు అమెరికా కన్నా ముందుకు వెళ్లి పోయాయి.బ్రిక్స్ సవాలుఅమెరికా కూటమికి దీనికిదే ఒక జంకుగా మారగా, చైనా చొరవతో ఏర్పడిన బెల్ట్ అండ్ రోడ్ పథకం, బ్రిక్స్ కూటమి పెద్ద సవాళ్లు అయాయి. ఇండియా కొన్ని కారణాల వల్ల బెల్ట్ పథకంలో చేరలేదుగానీ, 2009లో వ్యవస్థాపితమైన బ్రిక్స్‌లో వ్యవస్థాపక సభ్య దేశం కావటం గమనించదగ్గది. అమెరికా ఏక ధృవ ప్రపంచంవల్ల కలుగుతున్న హానిని గుర్తించిన ముఖ్యమైన దేశాలు కొన్ని బహుళ ధృవ ప్రపంచం అనే భావనను అజెండా పైకి తెచ్చాయి. ఒకప్పుడు అమెరికా, సోవియెట్ యూనియన్లతో ద్విధృవ ప్రపంచం ఉండగా, సోవియెట్ పతనం తర్వాత అది ఏకధృవంగా మారింది. దీనితో ఈ కొత్త సవాలును భగ్నం చేసేందుకు అమెరికా, యూరోపియన్ యూనియన్లు చతురోపాయాలను ప్రయోగిస్తు న్నాయి గాని సఫలం కావటం లేదు. వారు ఎంత వ్యతిరేకించినా బెల్ట్ పథకపు సభ్య దేశాల సంఖ్య 150కి మించి పోయింది. విశేషమేమంటే, అమెరికా కూటమిలోని యూరోపియన్ దేశాలు కొన్ని కూడా అందులో చేరాయి. బ్రిక్స్‌లో మరికొన్ని పెద్ద దేశాలు కొత్తగా చేరగా డజన్ల కొద్దీ దరఖాస్తు చేశాయి. సరిగా ట్రంప్ అధికార స్వీకరణ చేస్తుండిన రోజులలోనే ఇండోనేసియా చేరగా, తాము కూడా చేరను న్నట్లు మలేసియా ప్రధాని ప్రకటించారు. బ్రిక్స్ కూటమి జీడీపీ ప్రపంచ జీడీపీలో ఇప్పటికే 35 శాతానికి చేరగా, జీ–7 జీడీపీ 30 శాతం దగ్గర ఆగిపోయి ఉంది. మరొకవైపు చైనాతో అమెరికా వాణిజ్య లోటు సంవత్సరాల తరబడిగా తీరటం లేదు. దాదాపు 120 దేశాలతో చైనా వాణిజ్యం అమెరికాను మించిపోయింది.ఈ విధమైన మార్పులతో కలవరపడినందువల్లనే ట్రంప్ తన మొదటి హయాంలో చైనాపై బహిరంగంగా వాణిజ్య యుద్ధం ప్రక టించారు. సుంకాలు పెంచారు. అమెరికన్ కంపెనీలు అక్కడి నుంచి తరలి వెళ్లకపోతే వాటి ఉత్పత్తులపైనా సుంకాలు పెంచుతామన్నారు. చైనాకు ముడి వనరులు, సాంకేతికతలు అందకుండా వీలైనన్ని ప్రయ త్నాలు చేశారు. కానీ, ఆయన పాలన ముగిసే నాటికి, ఆ యుద్ధం విఫలమైనట్లు అమెరికా సంస్థలే తేల్చి చెప్పాయి. చైనాకు కలిగిన నష్టం కన్నా అమెరికా నష్టాలు ఎక్కువని లెక్కలు వేసి చూపించాయి. ఆ తర్వాత బైడెన్ కూడా అదే వ్యూహాన్ని అనుసరించి విఫల మయ్యారు. ఇప్పుడు ట్రంప్ వైఖరి చిత్రంగా ఉంది. ఒకవైపు తిరిగి వాణిజ్య యుద్ధాన్ని ప్రకటిస్తూనే, మరొకవైపు చైనాతో చర్చలు జరప గలమని అంటున్నారు. అమెరికా ఆధిపత్యానికి డాలర్ శక్తి ఒక ముఖ్యాధారం. బ్రిక్స్ కూటమి ప్రత్యామ్నాయ కరెన్సీ సృష్టించగలమని చెప్పలేదు గానీ, వివిధ దేశాల మధ్య వాణిజ్య చెల్లింపులు డాలర్‌కు బదులు స్థానిక కరెన్సీలలో జరిగేందుకు ప్రయత్నించ గలమన్నది. ఈ మార్పులు డాలర్‌ను బలహీనపరచగల అవకాశం ట్రంప్ ఆగ్రహానికి కారణమైంది. ఇంతకూ ట్రంప్ ఈ రెండవ విడత వాణిజ్య యుద్ధం ఫలించగలదా అన్నది ప్రశ్న.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
అందుకే పెట్టుబడులొచ్చాయ్: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: దావోస్ పర్యటనలో తెలంగాణకు రూ.1.80 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం ఆయన తెలంగాణ సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి చూపించాయన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన కంపెనీలకు ధన్యవాదాలు తెలిపిన రేవంత్.. తమ ప్రభుత్వ కృషి వల్లే పెట్టుబడులు వచ్చాయన్నారు.‘‘ఈ పెట్టుబడులు ద్వారా వేలాది ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణను వన్ ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తాం. పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్రలు చేశారు. ఎన్నో అపోహలు, అనుమానాలు సృష్టించారు. కానీ ఇన్వెస్టర్లు విశ్వాసాన్ని చాటుకున్నారు. దావోస్ పర్యటనలో పెద్ద ఎత్తున పెట్టబడులు తీసుకొచ్చాం. ప్రణాళికతో వెళ్లాం కాబట్టే పెట్టుబడులొచ్చాయి’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు.పెట్టుబడులు కార్యరూపం దాల్చినప్పుడే విజయం సాధించినట్లు: శ్రీధర్‌బాబు‘‘రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉన్నందునే అత్యధిక పెట్టుబడులు వచ్చాయని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఎంఓయూల రూపంలో వచ్చిన పెట్టుబడులు కార్యరూపం దాల్చినప్పుడే మనం విజయం సాధించినట్లు. మూసీ నది పునరుజ్జీవనం అవసరం.. సింగపూర్ కంపెనీలతో చర్చలు జరిపాం..ఓ వైపు పెట్టుబడులతో కంపెనీలు ఏర్పాటు చేస్తూనే.. మరోవైపు నిరుద్యోగులకు స్కిల్ పెంచే ప్రయత్నం చేస్తున్నాం. గత సంవత్సరం 18 కంపెనీలతో ఎంఓయూ చేసుకుంటే.. 17కంపెనీల పనులు జరుగుతున్నాయి’’ అని శ్రీధర్‌బాబు వివరించారు.ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ అంటే వైఎస్సార్.. రైతుబంధు అంటే కేసీఆరే గుర్తొస్తారు: కేటీఆర్ -
జ్ఞానోదయం కలిగేది ఎప్పుడు?
విజన్ ఉన్న ఏ నాయకుడు కూడా విధ్వంసాన్ని ప్రేరేపించడు. అలా చేసేవారు పాలకులైతే పెట్టుబడులు రాకపోవడం అటుంచి ఉన్న పరిశ్రమలూ వేరే చోటుకు తరలిపోతాయి. దావోస్‌లో ఇటీవల జరిగిన ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ సదస్సుకు కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి నారా వారు చేసిన పెట్టుబడుల సాధన పర్యటన నీరు గారిపోయింది. ఇందుకు కారణం వారి ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’ ప్రకారం సృష్టించిన విధ్వంసకాండే అనేది వేరే చెప్పవలసిన పనిలేదు. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎంతోమంది పారిశ్రామిక దిగ్గజాలను కలిసినా వారితో ఒక్క మెమోరాండం ఆఫ్ అండర్‌స్టాడింగ్ (ఎంఓయూ)ను కూడా ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోలేక పోయింది. ‘ఉద్యోగం కోసం... ఉపాధి కోసం నువ్వీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లు. నువ్వు అక్కడకు వెళ్లే లోపే నీ చరిత్ర అక్కడ టేబుల్ మీద ఉంటుంది’ అని ఓ ఇంగ్లీష్ సామెత ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల కాలంలో చిందించిన రక్తాన్ని దావోస్‌కి వచ్చిన పారిశ్రామిక దిగ్గజాలు, వారి తాలూకు ప్రతినిధులు ఎలా మర్చిపోగలరు? లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ధాటికి పెట్టుబడులు కూడా ముఖం చాటేశాయి. సాధారణంగా పారిశ్రామిక వేత్తలు వ్యాపారానికి అనుకూల పరిస్థితులు ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడతారు. ముఖ్యంగా శాంతిభద్రతలు బాగుంటేనే కొత్త పరిశ్రమలు వస్తాయి. విధ్వంసం, రక్తపాతాన్ని ప్రోత్సహించేవారు పాలకులుగా ఉన్న రాష్ట్రాల్లో నయాపైసా పెట్టుబడి పెట్టినా వ్యర్థమని పారి శ్రామికవేత్తలు అనుకుంటారు. ఇప్పుడు దావోస్‌లో ఏపీ ప్రభుత్వం సంప్రదించినవారు ఇందుకే పెట్టు బడులకు ఆసక్తి చూపించలేదని పరిశీలకుల అంచనా. అధికారంలోకి వచ్చీ రాగానే రెడ్‌బుక్ చేతిలో పట్టుకుని చూపిస్తూ... తమ వ్యతిరేకులను అక్ర మంగా అరెస్టుచేసి జైళ్లలో కుక్కడం, దాడులు, హత్యలు చేయడంతో ప్రజలతో పాటు పెట్టుబడి దారులు కూడా భయపడిపోయారు. ‘సింగిల్‌విండో’ విధానంలో అన్ని అనుమతులు ఇస్తా మన్నా ఏపీలో పెట్టుబడులు పెట్టే ప్రసక్తే లేదని ముక్తకంఠంతో తీర్మానించుకున్నట్లున్నారు పారి శ్రామికవేత్తలు. అందుకే ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలేదు. నేను చేసేది చేసేదే. ఇది నా రాజ్యం. ఇది నా రెడ్ బుక్ రాజ్యాంగం అన్నట్లు రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి వ్యవహరిస్తుంటే పెట్టుబడులు ఎలా వస్తాయి? దావోస్ వేదికగా ఇది ఏపీకి జరిగిన అవమానం కాక మరేమిటి? తండ్రీ – కొడుకులు చేసిన తప్పిదాలే ఇప్పుడు ఏపీ ప్రజలకు శాపాలుగా పరిణమించాయి. ఈ అవమానంనుంచి ప్రజలను పక్కదారి పట్టించడానికి ఇంకో ‘కల్తీ తిరుమల లడ్డు’ను తెరమీదకు తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. పెట్టుబడులు తీసు కొస్తామని దావోస్ వెళ్లి నయాపైసా పెట్టుబడి తేకుండా వచ్చిన మన ప్రభుత్వ నిర్వాకం వల్ల అయిన ఖర్చు దాదాపు 75 కోట్ల రూపాయల పైమాటే! మరి ఇంత డబ్బూ బూడిదలో పోసిన పన్నీరేనా? పాలకులకు ఎకౌంటబిలిటీ ఉండాల్సిన అవసరం లేదా? ఈ ప్రజా ధన నష్టానికి బాధ్యత వహిస్తూ ఏమి చేయగలరో సీఎం, ఐటీ మంత్రులే చెప్పాలి.తాజాగా దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వం రూ. 1.79 లక్షల కోట్లు, మహా రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 లక్షల కోట్ల మేర ఎంవోయూలు కుదుర్చుకున్నాయి. ముందు శాంతి భద్రతల మీద పట్టు సాధించి ఆ దిశగా పురోగమిస్తే ఏ రాష్ట్రమైనా ఇటువంటి పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అంతే తప్ప... రెడ్ బుక్ రాజ్యాంగాలు అమలు చేసే నెత్తుటి గడ్డలపై ఉన్న పాలకులు ‘మేం సుద్దపూసలం. మా రాష్ట్రం వెన్నపూస’ అంటే అంతర్జాతీయ పారిశ్రామిక దిగ్గజాలు ఎంత మాత్రమూ విశ్వసించే పరిస్థితి లేదు. ఇది మన రాష్ట్ర ప్రస్తుత పాలకులు ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. – ఆర్కేడి నాయుడు ‘ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ -
దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక మిథ్య
సాక్షి, అమరావతి: ‘పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్ వెళుతున్నా. 1995లో సీఎం అయినప్పటి నుంచి ఏటా దావోస్ వెళ్లి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నా. ఎవరూ సీఐఐ, దావోస్‌ను పట్టించుకోని తరుణంలో వాటిని నేనే ప్రమోట్ చేశా. ఇతర రాష్ట్రాలతో పోటీపడి పెట్టుబడులు సాధించా’ నిన్నటివరకు ఇలా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు దావోస్ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగి వచ్చిన తర్వాత మాట మార్చేశారు. అసలు దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయన్నది ఒక మిథ్య మాత్రమేనని, ఇటువంటి నెగెటివ్ ఆలోచనల నుంచి మీడియా తక్షణం బయటకు రావాలంటూ సరికొత్త రాగం అందుకున్నారు. శనివారం ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచం ఎటువైపు పోతోందన్న విషయంపై జ్ఞానం పెంచుకోవడంతోపాటు అనేక దేశాల పారిశ్రామికవేత్తలను ఒకేచోట కలిసే నెట్వర్కింగ్ కేంద్రం దావోస్’ అంటూ సెలవిచ్చారు. ఒప్పందాల కోసం దావోస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదని అవి ఇక్కడే చేసుకోవచ్చన్నారు. ఈసారి దావోస్ పర్యటనలో గడిచిన ఐదేళ్లలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్‌ను పునరుద్ధరించడంపై దృష్టి సారించామని, పెట్రోనాస్, డీపీ వరల్డ్, సిస్కో, వాల్‌మార్ట్, యూనీలీవర్, పెప్సికో వంటి అనేక సంస్థల ప్రతినిధులతో సమావేశమైనట్టు తెలిపారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలకు పెట్టుబడులు రావడాన్ని స్వాగతిస్తున్నామని, పెట్టుబడుల విషయంలో రాష్ట్రాల మధ్య పోటీ ఉండటం మంచిదేనని అన్నారు. దేశానికి ముంబై ఆర్థిక రాజధాని కావడంతో అక్కడ భారీ పెట్టుబడులు వచ్చాయని, తాను గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేయడంతో అక్కడ పెట్టుబడులు వచ్చాయన్నారు. హైదరాబాద్ కేవలం తెలంగాణ వారిది కాదని, తెలుగు వారందరిగా దానిని చూడాలన్నారు. గతంలో దావోస్ అంటే ధనవంతుల కోసం అనే భ్రమ ఉండేదని, అందుకే దేశంలోని రాజకీయ నాయకులు అక్కడికి వెళితే తమ ఓట్లు పోతాయని భయపడేవారని చెప్పారు.అటువంటి సమయంలో 1995 నుంచి ఇండియాలో దావోస్‌ను తాను ప్రమోట్ చేశానన్నారు. తాను వెళ్లడం ప్రారంభించిన తర్వాతే అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ దావోస్‌కు వచ్చి పెట్టుబడుల కోసం పోటీ పడేవారని, తాను హైదరాబాద్‌ను ప్రమోట్ చేస్తే కృష్ణ బెంగళూరును ప్రమోట్ చేస్తూ పెట్టుబడులను ఆకర్షించేవారన్నారు.పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులుకొత్తగా నిర్మిస్తున్న పోర్టులతో రాష్ట్రంలోకి భారీ పెట్టుబడులు వస్తున్నాయని చంద్రబాబు చెప్పారు. రామాయపట్నం వద్ద బీపీసీఎల్ భారీ రిఫైనరీ, అనకాపల్లి వద్ద అర్సెలర్ మిట్టల్ 14 మిలియన్ టన్నుల స్టీల్ప్లాంట్స్ పోర్టు ఆధారంగా ఏర్పాటవుతున్నాయన్నారు. దీంతోపాటు ఎల్జీ రాష్ట్రంలో రూ.5 వేల కోట్లు, గ్రీన్కో కంపెనీ కాకినాడ వద్ద గ్రీన్ అమ్మోనియా, విశాఖ వద్ద ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ యూనిట్, రిలయన్స్ రూ.60 వేల కోట్లతో 500కు పైగా బయో ఫ్యూయల్ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాయని.. రానున్న కాలంలో గ్రీన్ ఎనర్జీలో ఏపీ ప్రధాన హబ్‌గా తయారు కానుందన్నారు. టెక్నాలజీ రంగంలో సహకారం అందించేందుకు గూగుల్ ముందుకు వస్తోందని, అమెరికాలోని పన్ను చెల్లింపుల సమస్యపై ఒక స్పష్టత రాగానే విశాఖలో గూగుల్ సేవలను ప్రారంభిస్తుందన్నారు. ఇప్పటికే విశాఖకు టీసీఎస్ వచ్చిందని, గూగుల్ రాకతో విశాఖ ఐటీ హబ్‌గా మారుతుందన్నారు. టాటా గ్రూపుతో కలిసి ఎయిర్‌పోర్టు నిర్మించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరఫున రాష్ట్రంలో వైద్య, వ్యవసాయ రంగాల్లో టెక్నాలజీ వినియోగం పెంచే అంశంపై దృష్టి సారించాల్సిందిగా బిల్‌గేట్స్‌ను కోరినట్టు తెలిపారు. సీఐఐ సహకారంతో రాష్ట్రంలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి జిందాల్ గ్రూపుతో దావోస్‌లో చర్చలు జరిపానని, రాష్ట్రం నుంచి జిందాల్ గ్రూపు వెళ్లిపోతోందన్న వార్తల్లో నిజం లేదన్నారు. విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీకి రాజీనామా చేయడమనేది ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పార్టీ మీద నమ్మకం లేకపోతే ఎవరైనా మారతారని, ఈ అంశంపై ఇంతకంటే ఎక్కువ మాట్లాడను అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్ రాకపోతే నేర్పించా..ఇండియాలో దావోస్‌ను, సీఐఐని నేనే ప్రమోట్ చేశా» గతంలో దావోస్ అంటే కేవలం ధనికులు అనే ముద్ర ఉండేది. అక్కడికి వెళితే ఓట్లు పోతాయన్న భయంతో రాజకీయ నాయకులు వెళ్లేవారు కాదు. సీఎంగా నేను వెళ్లినప్పటి నుంచే మిగిలిన వాళ్లు రావడం మొదలు పెట్టారు.» 1997లో దావోస్ వెళ్లి హైదరాబాద్ అనగానే ఏది పాకిస్థాన్‌లోని హైదరాబాదా అని అడిగేవారు.» 25 హైస్కూల్స్ కూడా లేని రంగారెడ్డి జిల్లాలో 200 ఇంజనీరింగ్ కాలేజీలు ఏర్పాటు చేశాను.» నన్ను చూసి దావోస్ వచ్చిన అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణ హైదరాబాద్‌లో ఏముంది బెంగళూరు రండి అనేవారు. ఆ తర్వాత నేను హైదరాబాద్‌లో చేసిన ప్రగతి చూసి ఎస్ఎం కృష్ణ కాంప్రమైజ్ అయ్యారు.» ఐటీ అంటే ఏమిటో మనవాళ్లకు అర్థంకాని సమయంలో ప్రపంచమంతా తిరిగి కంపెనీలను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాను.» నేను అప్పట్లో పీసీ (పర్సనల్ కంప్యూటర్) అంటే అందరూ పోలీస్ కానిస్టేబుల్ అని అర్థం చేసుకునేవారు. ఇక్కడి వాళ్లకు ఇంగ్లిష్ సరిగా మాట్లాడటం రాకపోతే లండన్ నుంచి ప్రొఫెసర్లను రప్పించి ఇంగ్లిష్‌లో నైపుణ్య శిక్షణ ఇప్పించాను.» 1995లో ఐటీని ప్రమోట్ చేస్తే.. ఇప్పుడు 2025లో ఏఐని ప్రమోట్ చేస్తున్నా.» కార్పొరేట్–పబ్లిక్ గవర్నెన్స్‌లో రాణించే విధంగా సాధారణ వ్యక్తులను అసాధారణ వ్యక్తులుగా గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ద్వారా తయారు చేస్తా.» హైదరాబాద్‌ని తెలంగాణ వాళ్లదిగా చూడకూడదు. అది తెలుగు వారందరిగా పరిగణించాలి. ఆ విధంగానే హైదరాబాద్‌ను ప్రమోట్ చేశాను.» ఏడాదికి సగటున 15 శాతం వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.58 లక్షల నుంచి 2047నాటికి రూ.58 లక్షలకు పెంచుతాను.» నేను ఇప్పుడివన్నీ చెబితే మీకు కథలుగా కనిపిస్తాయి. కానీ గత 30 ఏళ్లలో జరిగిన.. నేను చేసిన అభివృద్ధే దీనికి నిదర్శనం.» గతంలో నువ్వు ల్యాప్‌టాప్‌లోని డాష్‌బోర్డుతో హైదరాబాద్ గురించి చక్కగా ప్రమోట్ చేశావు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ప్రమోట్ చేస్తున్నావా అని బిల్‌గేట్స్ అడిగారు.» మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో (ఏఐ) మహారాష్ట్రను హబ్‌గా చేస్తాను అంటే.. ఇక్కడ నేను ఉన్నాను. అది నీవల్ల అయ్యేపని కాదు. ప్రతి ఇంటికి ఒక ఏఐని తీసుకువస్తా అని చెప్పాను. -
ప్లేటు ఫిరాయించిన చంద్రబాబు.. ‘దావోస్’ వైఫల్యంపై కవరింగ్
సాక్షి, విజయవాడ: దావోస్(Davos) వైఫల్యంపై సీఎం చంద్రబాబు(Chandrababu) బుకాయింపులకు దిగారు. దావోస్‌లో అసలు ఎంవోయూలు చేసుకోరంటూ వింత సమాధానం ఇచ్చారు. దావోస్ వెళితే పెట్టుబడులు (Investments) వస్తాయన్నది ఓ భ్రమ అంటూ చంద్రబాబు భాష్యం చెప్పారు. దావోస్‌లో అసలు ఎంవోయూలు చేసుకోవాల్సిన పనిలేదంటూ కవరింగ్ ఇచ్చారు. దావోస్ వెళ్లేముందు పెట్టుబడుల కోసమేనంటూ టీడీపీ, ఎల్లో మీడియా బిల్డప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.గతంలో దావోస్‌నే ఏపీకి తెస్తానంటూ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కానీ అక్కడ ఆయన టీమ్ ఘోర వైఫల్యం చెందింది. దీంతో దావోస్‌లో ఏపీకి ఘోర అవమానమే మిగిలింది. జీరో ఎంవోయులతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తిరిగొచ్చారు. తీవ్రంగా విమర్శలు రావడంతో సీఎం చంద్రబాబు ప్లేటు ఫిరాయించేశారు.‘‘దావోస్ అంటే ఒక మిత్ ఉంది. ఎన్ని ఎంవోయూలు చేశారు.. ఎంత డబ్బులొచ్చాయన్నది ఓ మిత్. ఇక్కడుండే ఎంవోయూలు అక్కడ చేసుకునే పనిలేదు. దావోస్ కేవలం నెట్ వర్క్ ప్లేస్ మాత్రమే. ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తలు అక్కడికి వస్తారు’’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: దావోస్ తుస్.. పవన్ ఫుల్ ఖుష్!దావోస్ పర్యటనకు ఈసారి మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. చంద్రబాబుతోపాటు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుల్లో పాల్గొన్నారు. మహారాష్ట్ర, తెలంగాణ రూ.లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించగా ఎటువంటి పెట్టుబడుల ఒప్పందాలు లేకుండా ఏపీ బృందం రిక్త హస్తాలతో వెనుదిరిగింది. మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది. రిలయన్స్, ఎల్ అండ్ టీ, అమెజాన్, వర్థన్ లిథియం, జేఎస్‌డబ్ల్యూ, టాటా తదితర దిగ్గజ సంస్థలు మహారాష్ట్రలో పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.తెలంగాణ ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించింది. రాజకీయాల్లో 40 ఏళ్ల అనుభవం ఉందని, నాలుగోసారి ముఖ్యమంత్రిని అయ్యానని, 1995 నుంచి దావోస్‌కు వెళుతున్నానని గొప్పలు చెప్పుకున్న చంద్రబాబు మాత్రం ఒక్క పెట్టుబడిని కూడా ఆకర్షించలేకపోయారు. మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగి సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న బిల్‌గేట్స్‌తో సమావేశమై ఆ ఫోటోను ఎల్లో మీడియాలో గొప్పగా ప్రచారం చేసుకున్నారు. అసలు మైక్రోసాఫ్ట్ పెట్టుబడులకు, బిల్‌గేట్స్‌కు ఇప్పుడు సంబంధం లేదన్న విషయాన్ని కూడా పట్టించుకోకుండా ఆ పత్రికలు బాకాలూదాయి.ఇదీ చదవండి: చంద్రబాబు దావోస్ పర్యటన.. దారి ఖర్చులు 'దండగ'! -
తెలంగాణకు పెట్టుబడులు.. కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ సవాల్
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులపై ఎప్పుడైనా సరే చర్చకు సిద్ధమంటూ మాజీ మంత్రి కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడుతూ, సీఎం దావోస్ పర్యటన తెలంగాణకి ఇక ధమాకా.. పెట్టుబడుల విషయంలో తెలంగాణలో ఒక చరిత్ర నెలకొందన్నారు. కాంగ్రెస్ ఉంటేనే పెట్టుబడులు వస్తాయని మరోసారి నిరూపితమైందని మహేష్ గౌడ్ అన్నారు.విదేశీ పెట్టుబడిదారులకు కాంగ్రెస్‌పై నమ్మకం ఉంది. రైజింగ్ 2050 నినాదం.. గేమ్ ఛేంజర్‌గా మారింది. తనకి తాను సుపర్ స్టార్‌గా చెప్పుకునే కేటీఆర్ పదేళ్లలో ఎన్ని పెట్టుబడులు తెచ్చాడు. కేసీఆర్ పదేళ్ల కాలంలో రూ.27 వేల కోట్లు మాత్రమే పెట్టుబడులు తెచ్చారు. కేసీఆర్‌కి విజన్ లేకపోవడం వల్లే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది’’ అని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. -
తెలంగాణలో అమెజాన్ పెట్టుబడి 60 వేల కోట్ల రూపాయలు.. డేటా సెంటర్ల ఏర్పాటు కోసం కీలక ఒప్పందం
-
తెలంగాణకు పెట్టుబడులు.. రూ.1.78 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో రికార్డు స్థాయిలో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులు, 49,500 ఉద్యోగాల కల్పనకు సంబంధించి పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం’.. ముందెన్నడూ లేనిరీతిలో భారీ ఫలితాన్ని సాధించినట్లు తెలిపింది. గత ఏడాది జరిగిన సదస్సులో కేవలం రూ.40 వేల కోట్ల పెట్టుబడులు సాధించగా.. ప్రస్తుత సదస్సులో నాలుగింతలకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొంది. ఈ నెల 16న విదేశీ పర్యటనకు బయలుదేరిన రేవంత్‌రెడ్డి బృందం 17 నుంచి 19వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించింది. అనంతరం దావోస్‌కు చేరుకుని మూడురోజుల పాటు డబ్ల్యూఈఎఫ్ సమావేశాల్లో పాల్గొంది. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు ఈ బృందంలో ఉన్నారు. సమావేశాలు సక్సెస్ అయ్యాయన్న సర్కారు దావోస్‌లో పారిశ్రామికవేత్తలతో తెలంగాణ రైజింగ్ బృందం నిర్వహించిన సమావేశాలు విజయవంతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. అమెజాన్, సన్ పెట్రో కెమికల్స్, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్, మేఘా ఇంజనీరింగ్ సంస్థలు భారీ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఐటీ రంగంలో దిగ్గజ కంపెనీలు హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, విప్రో హైదరాబాద్ కేంద్రంగా విస్తరణ ప్రణాళికలు ప్రకటించాయి. డేటా సెంటర్ల రంగంలో అమెజాన్, టిల్మాన్, ఉర్సా, సిఫి, కంట్రోల్ ఎస్ సంస్థలు పెట్టుబడులను ప్రకటించాయి. సోలార్ సెల్స్, రాకెట్ తయారీ, రక్షణ రంగంలోనూ భారీ ఎత్తున పెట్టుబడుల ఒప్పందాలు కుదిరినట్లు ప్రభుత్వం తెలిపింది. వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలున్నాయని పేర్కొంది. తెలంగాణ రైజింగ్– 2050 లక్ష్య సాధనపై అంతర్జాతీయ పెట్టుబడిదారులు, వాణిజ్యవేత్తలు, విధాన నిర్ణేతల నుంచి పెద్దయెత్తున సానుకూలత వ్యక్తమైనట్లు ప్రకటించింది. యూనీలివర్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, సుహానా మసాలా, ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్, ఫోనిక్స్, అగిలిటీ, స్కైరూట్ ఏరోస్సేస్, జేఎస్‌డబ్ల్యూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపింది. అనేక రంగాల్లో అనుకూలతలు: సీఎం రేవంత్ ‘అంతర్జాతీయగా వాణిజ్యానికి పర్యాయపదంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం. సాఫ్ట్వేర్, ఫార్మా రంగాల్లో హైదరాబాద్, తెలంగాణకు అనుకూలతలు ఉన్నాయి. డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్రి్టక్ వాహనాలు, సెమీ కండక్టర్లతో పాటు ఇతర రంగాల్లో పురోగతికి కూడా అనేక అవకాశాలు ఉన్నాయి. కోవిడ్ తర్వాత సరఫరా వ్యవస్థలు చైనా బయట అవకాశాలను (చైనా ప్లస్ వన్) అన్వేషిస్తున్న నేపథ్యంలో ఆ అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తోంది. వన్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు క్లస్టర్ల ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నాం. ఔటర్ రింగు రోడ్డు లోపలి వైపు సేవలు, ప్రతిపాదిత రీజినల్ రింగు రోడ్డు, ఓఆర్ఆర్ నడుమ తయారీ, ట్రిపుల్ ఆర్ బయట ఉన్న గ్రామీణ తెలంగాణను ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దుతాం. ఉద్యోగాల కల్పన, ఆదాయం పెంపు, వాణిజ్య అవకాశాలు, మరింత మెరుగైన సంక్షేమం కోసం ఆర్థికాభివృద్ధి దిశగా ముందుకు సాగుతాం..’ అని దావోస్ పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. -
విశాఖలో గూగుల్ చిప్ డిజైన్ కేంద్రం పెట్టండి
సాక్షి, అమరావతి: విశాఖలో చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని గూగుల్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సర్వర్ల నిర్వహణ సేవల విషయంలో ఏపీని ప్రధాన కేంద్రంగా చేసుకోవాలని గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ను కోరారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబు.. మూడో రోజు వివిధ కంపెనీల ప్రతినిధులను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్రో కెమికల్ హబ్‌గా అవతరిస్తున్న మూలపేటలో, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లో పెట్టుబడులు పెట్టాలని మలేసియాకు చెందిన పెట్రోనాస్ ప్రెసిడెంట్, గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొహమ్మద్ తౌఫిక్‌ను సీఎం ఆహ్వానించారు. పెప్సీకో ఇంటర్నేషనల్ బెవరేజస్ సీఈవో యూజీన్ విల్లెంసెన్, పెప్సీకో ఫౌండేషన్ చైర్మన్ స్టీఫెన్ కెహోతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఇప్పటికే ఏపీలోని శ్రీసిటీలో బాట్లింగ్ ప్లాంట్ నిర్వహిస్తున్న పెప్సికో బెవరేజెస్.. విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్‌గా చేసుకుని పెప్సీకో డిజిటల్ హబ్ ఏర్పాటు చేయవచ్చని సీఎం సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్‌ను విశాఖకు విస్తరించాలని కోరారు. కుర్కురే మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌తో పాటు పెప్సీకో సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్ఎఫ్తో భాగస్వామ్యం కావాలని సూచించారు. బహ్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ కార్యాలయం ప్రతినిధి హమద్ అల్ మహ్మద్, ముంతాలకత్ సీఈవో అబ్దుల్లా బిన్ ఖలీఫా అల్ ఖలీఫాతోనూ సీఎం సమావేశమయ్యారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజనెస్ కోసం ఏపీకి రావాలని వారిని కోరారు. స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయండి ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ ఏర్పాటు చేయాలని కంటైనర్ టెర్మినల్ రంగంలో ప్రతిష్టాత్మక సంస్థ డీపీ వరల్డ్‌ను చంద్రబాబు కోరారు. కాకినాడ, కృష్ణపట్నం, మూల పేట ఇందుకు అనుకూలమని వివరించారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న సీ పోర్టుల్లో, ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్స్‌లోనూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య, విద్య, ఆవిష్కరణల కేంద్రంగా మార్చేందుకు సహకరించాలని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు, బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ఫౌండర్ బిల్ గేట్స్‌ను చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్, డయాగ్నోస్టిక్స్ ప్రారంభించాలని, ఈ కేంద్రం ప్రజలకు అధునాతన ఆరోగ్య సదుపాయాలు అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్శిటీ కోసం బిల్ గేట్స్‌ను సలహాదారుల మండలిలో భాగస్వామ్యం కావాలని ఆహ్వానించారు.ఏపిలో పామాయిల్ ఇండస్ట్రీ!యూనిలీవర్ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉజ్జెన్‌తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో రూ. 330 కోట్లతో పామాయిల్ ఇండస్ట్రీ ఏర్పాటు చేయాలని యూనిలీవర్ భావిస్తోంది. బ్యూటీ పోర్ట్‌ఫోలియో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం అనుకూలంగా ఉంటుందని విల్లెం ఉజ్జెన్‌కు బాబు వివరించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సెంటర్ ఫర్ ఎనర్జీ అండ్ మెటీరియల్స్ (సెన్మట్) హెడ్ రాబర్టో బోకాతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. గ్రీన్ హైడ్రోజన్, బ్యాటరీ స్టోరేజ్, సోలార్ మాన్యుఫాక్చరింగ్ వంటి రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు గ్లోబల్ కంపెనీల పెట్టుబడులు తరలివచ్చేలా సెన్మట్ సహకారం అందించాలని కోరారు. క్లీన్ ఎనర్జీ నాలెడ్జ్ – స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌కు డబ్ల్యూఈఎఫ్ మద్దతివ్వాలని అభ్యర్ధించారు. -
బాబు కక్ష ఖరీదు.. రూ.3 లక్షల కోట్లు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు సర్కారు బరితెగించి అమలు చేస్తున్న రెడ్‌బుక్ రాజ్యాంగం రాష్ట్ర అభివృద్ధికి తీవ్ర విఘాతంగా మారింది. టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ అంటేనే హడలెత్తిపోతున్నారు. పెట్టుబడులు కాదు కదా కనీసం ఇటువైపు చూసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారు. ఈ కక్ష సాధింపు దుష్పరిణామాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి. అంతర్జాతీయ గుర్తింపు పొందిన పారిశ్రామిక సంస్థ జేఎస్‌డబ్లూ గ్రూపు ఏపీ అంటేనే ముఖం చాటేయడం దీనికి తాజా తార్కాణం. వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న ఆ సంస్థ తాజాగా మన రాష్ట్రాన్ని కాదని.. మహారాష్ట్రలో రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వెచ్చించేలా ఒప్పందం చేసుకోవడం గమనార్హం. అంతేకాకుండా రూ.800 కోట్లతో తెలంగాణలో డ్రోన్ టెక్నాలజీ యూనిట్ నెలకొల్పాలని జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ నిర్ణయించింది. జేఎస్‌డబ్లూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్‌ను కేంద్ర బిందువుగా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం అక్రమ కేసులతో వేధించడంతోనే ఆ సంస్థ ఆంధ్రప్రదేశ్అంటే హడలిపోయి మహారాష్ట్ర, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధపడింది. టీడీపీ సర్కారు కక్ష సాధింపు చర్యలతో ఆంధ్రప్రదేశ్ ఏకంగా రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు కోల్పోయిన ఉదంతం ఇలా ఉంది...జిందాల్‌ను వేధించిన బాబు సర్కారు– మాయలేడిని అడ్డం పెట్టుకుని కుట్రలు..దేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సజ్జన్ జిందాల్‌ను చంద్రబాబు ప్రభుత్వం బరి తెగించి వేధించింది. వలపు వల (హనీట్రాప్)తో బడా బాబులను బురిడీ కొట్టించి ఆస్తులు కొల్లగొట్టే ఓ మాయలేడీని అడ్డం పెట్టుకుని సజ్జన్ జిందాల్ లాంటి పారిశ్రామికవేత్తను వేధించడం యావత్ దేశాన్ని నివ్వెరపరిచింది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కుట్రకు తెర తీసింది. వలపు వల విసిరి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడి ఆస్తులు కొల్లగొట్టడమే ట్రాక్ రికార్డుగా కలిగిన ముంబైకి చెందిన కాదంబరి జత్వానీ అనే మోడల్‌ను టీడీపీ పెద్దలు తమ ఆయుధంగా మార్చుకున్నారు. ఆమె ఫోర్జరీ పత్రాలతో తన ఆస్తులను విక్రయించేందుకు యత్నిస్తోందని వైఎస్సార్సీపీ హయాంలో కుక్కల విద్యాసాగర్ అనే పారిశ్రామికవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ దర్యాప్తులో దీనిపై పూర్తి ఆధారాలు లభించడంతో విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరి జత్వానీని అరెస్టు చేసి అక్కడి న్యాయస్థానంలో హాజరు పరిచారు. న్యాయస్థానం అనుమతితో ఆమెను రాష్ట్రానికి తీసుకువచ్చి ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆమెకు రిమాండ్ విధించడంతో జైలుకు పంపించారు. అనంతరం ఆమెకు బెయిల్ మంజూరైంది. అంతా చట్టబద్ధంగా సాగిన ఈ వ్యవహారాన్ని వక్రీకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. కాదంబరి జత్వానీ ద్వారా తప్పుడు ఫిర్యాదు ఇప్పించి ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, టి. కాంతిరాణా, విశాల్ గున్నీలపై కేసులు నమోదు చేసి వారిని సస్పెండ్ చేసింది. పారిశ్రామికవేత్త కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసింది. కాదంబరి జత్వానిని గతంలో పోలీసులు అరెస్టు చేయడం వెనుక ప్రముఖ పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ ఉన్నారంటూ చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ అనుకూల మీడియాకు లీకులు ఇచ్చి ప్రచారంలోకి తెచ్చింది. ఆయన తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ జత్వానీ గతంలో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కేసును ఉపసంహరించుకునేలా చేసేందుకు... విచారణకు హాజరు కాకుండా అడ్డుకునేందుకే వైఎస్సార్సీపీ హయాంలో ఏపీ పోలీసులు ముంబై వెళ్లి జత్వానీని అరెస్టు చేశారంటూ చంద్రబాబు ప్రభుత్వం దుష్ప్రచారం సాగించింది. జిందాల్ రాష్ట్రానికి వస్తే కేసు పెట్టి ఆయన్ను అరెస్ట్ చేస్తారనే రీతిలో కూటమి సర్కారు హడావుడి చేసింది.ఏపీలో పెట్టుబడులకు ససేమిరా...– అనుకూల పరిస్థితులు లేవని గ్రహించే..చంద్రబాబు సర్కారు తన నిర్వాకాలతో పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్ పరపతికి తీవ్ర భంగం కలిగించింది. తాను ఆంధ్రప్రదేశ్‌లో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంటే... చంద్రబాబు ప్రభుత్వం తనను వేధించడం పట్ల ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన గుర్తించారు. దాంతో రాష్ట్రంలో కొత్త పెట్టుబడి ఒప్పందాలను ఆయన వ్యతిరేకించినట్లు సమాచారం.మహారాష్ట్రకు తరలిపోయిన రూ.3 లక్షల కోట్లు..– ఈవీ, సోలార్ పరిశ్రమలతో వేలాది ఉద్యోగాలుసజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్లూ గ్రూపు మహారాష్ట్రంలో ఏకంగా రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈమేరకు దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీ నగర్, గడ్చిరోలి, నాగ్‌పూర్ ప్రాంతాల్లో ఈ భారీ పెట్టుబడులు పెట్టనుంది. ఇనుము–ఉక్కు, సౌర విద్యుత్తు, ఆటోమొబైల్, సిమెంట్ పరిశ్రమలను నెలకొల్పాలని నిర్ణయించింది. చైనాకు చెందిన ఎస్ఏఐసీ మోటార్స్‌తో సంయుక్తంగా ఎలక్ట్రానిక్ వాహనాలు (ఈవీ), హైపర్ఫార్మెన్స్ బ్యాటరీల తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. 2027 డిసెంబరుకు ఈవీ వాహనాలను మారెŠక్ట్‌లోకి ప్రవేశపెడతామని తెలిపింది. జేఎస్‌డబ్లూ గ్రూపు ద్వారా రూ.3 లక్షల కోట్లు పెట్టుబడులతో మహారాష్ట్రలో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని సజ్జన్ జిందాల్ ప్రకటించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆయన్ని అక్రమ కేసులతో వేధించకుంటే ఆ పెట్టుబడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కే వచ్చి ఉండేవని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.నాడు.. పెట్టుబడులకు రాచబాట..– పారిశ్రామికవేత్తలకు వైఎస్ జగన్ భరోసావైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలకు పూర్తి అనుకూల పరిస్థితులు ఉండేవి. వారికి ఎలాంటి ఇబ్బంది ఎదురైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే పరిష్కరిస్తామని.. పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటామని వైఎస్ జగన్మోహన్రెడ్డి గట్టి భరోసా ఇచ్చారు. అందువల్లే సజ్జన్ జిందాల్ గ్రూపు నాడు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. కడపలో రూ.8,500 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సిద్ధపడింది. విజయనగరం జిల్లాలో భారీ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకుంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్రమ కేసులు, వేధింపులతో పారిశ్రామికవేత్తలు హడలిపోతున్నారు. సజ్జన్ జిందాల్‌కు చెందిన జేఎస్‌డబ్లూ గ్రూపు ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా మహారాష్ట్ర, తెలంగాణలో రూ.3 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులకు ఒప్పందం చేసుకోవడం దీనికి తాజా నిదర్శనం. -
సజ్జన్ జిందాల్‌కు క్షమాపణ చెప్పండి: Yanamala Nagarjuna Yadav
-
కూటమి సర్కార్.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్
సాక్షి, తాడేపల్లి: ఒక వైపు కూటమి నాయకులు, ఎమ్మెల్యేలే స్వయంగా బడా పారిశ్రామికవేత్తలను కమీషన్ల కోసం బెదిరిస్తూ.. మరోవైపు పెట్టుబడులు (Investments) పెట్టమని ప్రాధేయపడితే, వారెలా ముందుకొస్తారని వైఎస్సార్సీపీ(YSRCP) అధికార ప్రతినిధి నాగార్జునయాదవ్(Nagarjuna Yadav) సూటిగా ప్రశ్నించారు. పెట్టుబడుల ఆకర్షణ కోసమంటూ దావోస్ వెళ్లిన తండ్రీకొడుకులు పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సానుకూల పరిస్థితి ఉందా? అన్న విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరారు. చంద్రబాబు తీరుతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఆగిపోయిందన్న నాగార్జునయాదవ్.. రాష్ట్రం విడిచివెళ్లిన సజ్జన్ జిందాల్‌కు క్షమాపణ చెప్పి, ఆ రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు.ఏపీ ప్రతిష్టను దిగజార్చారు..దేశంలో పేరున్న పారిశ్రామిక వేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటేనే వణికిపోతున్నారు. కూటమి పార్టీల నాయకుల్లో కమీషన్ల కోసం కొందరు, రాజకీయ ఎత్తుగడలతో మరికొందరు ఏడు నెలల్లోనే రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చారు. రాష్ట్రంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో దావోస్ పర్యటనకు వెళ్లిన తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్.. ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని పెట్టుబడుల ప్రవాహం వస్తుందని మోసపు మాటలతో మళ్లీ నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు.రాష్ట్రం నుంచి తరిమేశారు..జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.3 లక్షల కోట్లతో మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థతో పాటు, మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. వాస్తవానికి ఇదే కంపెనీ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ దాదాపు రెండేళ్ల క్రితం గత ప్రభుత్వ హయాంలో కడపలో రూ.8800 కోట్లతో గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకొచ్చి భూమి పూజ కూడా చేశారు. ఇంకా రాష్ట్రంలో సుమారు రూ.50,500 కోట్ల పెట్టుబడులకు 2022లో 6 ఒప్పందాలు కూడా చేసుకున్నారు. పెట్టుబడులతో ముందుకొచ్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాల్సిన వ్యక్తిని సాదరంగా ఆహ్వానించకుండా చంద్రబాబు ప్రభుత్వం భయపెట్టి రాష్ట్రం నుంచి తరిమేసింది.కమీషన్ల కోసం బెదిరింపులుముంబైకి చెందిన కాదంబరి జెత్వాని అనే నటిని తీసుకొచ్చి ఆమెతో సజ్జన్ జిందాల్‌పై నిందారోపణలు చేసి, అక్రమ కేసులు బనాయించి దారుణంగా వేధించి రాష్ట్రం నుంచి పారిపోయేలా చేశారు. జిందాల్ మాత్రమే కాదు.. కూటమి ప్రభుత్వం కొలువు తీరాక పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. దాల్మియా గ్రూప్‌నకు చెందిన 11 లారీలను కూటమి నాయకులు కప్పం కట్టలేదని నాశనం చేశారు. మరో పెద్ద సంస్థ అదానీ పోర్టుకి ఎమ్మెల్యే సోమిరెడ్డి స్వయంగా కమీషన్ల కోసం వెళ్లి ఉద్యోగులను బెదిరించి వచ్చాడు. అందుకే ఇకనైనా కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల పెద్దలు తమ వైఖరి మార్చుకోవాలి. రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు తరలిపోకుండా చూడాలి.జిందాల్‌కు క్షమాపణలు చెప్పాలిఇంకా కూటమి ప్రభుత్వ తీరు కారణంగా వెళ్లిపోయిన పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్‌కు క్షమాపణలు చెప్పి రాష్ట్రానికి తిరిగి తీసుకురావాలని, గతంలో ప్రభుత్వంతో ఆయన కుదుర్చుకున్న 6 ఒప్పందాలకు సంబంధించిన రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూడాలని నాగార్జునయాదవ్ డిమాండ్ చేశారు. మొత్తం ఈ అస్తవ్యస్త పరిస్థితికి మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని ఆయన తేల్చి చెప్పారు.ఇదీ చదవండి: ఏపీలో బడా నేతల కాలక్షేపం కబుర్లు! -
రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: మేఘా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్‌తో రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాల కల్పనకు సంబంధించి మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది. దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో జరుగుతున్న సమావేశాల్లో ఈ ఒప్పందాలు కుదిరాయి. రూ.11 వేల కోట్లతో 2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును తెలంగాణలో మేఘా సంస్థ ఏర్పాటు చేయనుంది. తద్వారా నిర్మాణ దశలో వేయి, నిర్వహణ దశలో 250 ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థకు సంబంధించిన ప్రాజెక్టులనూ ఈ సంస్థ స్థాపిస్తుంది. తద్వారా పునరుత్పాదక ఇంధనం, సుస్థిర అభివృద్ధిలో రాష్ట్రం అగ్రస్థానం చేరేందుకు తోడ్పడుతుంది. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక ప్రదేశాల్లో రూ.3 వేల కోట్లతో వేయి మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను స్థాపిస్తుంది. తద్వారా వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా వేయి, పరోక్షంగా మూడు వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసేలా వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో రూ.వేయికోట్లతో వెల్నెస్ రిసార్ట్‌ను మేఘా సంస్థ నెలకొల్పుతుంది. తద్వారా నిర్మాణ దశలో 2వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాల్లో భాగంగా రెండోరోజు మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. మేఘాతో ఒప్పందాలపై మంత్రి శ్రీధర్ బాబు హర్షం వ్యక్తంచేశారు. ‘స్కై రూట్’ పెట్టుబడులు రూ.500 కోట్లు హైదరాబాద్‌ను త్వరలోనే ప్రైవేటు రంగంలో అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో ప్రైవేటు రంగంలో రూ.500 కోట్లతో రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కై రూట్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్‌లో ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఒప్పందం పట్ల హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు చెందిన సంస్థ ఆధునిక సాంకేతిక రంగంలో విజయం సాధించటం గర్వంగా ఉందన్నారు. తెలంగాణకు చెందిన యువకులు ప్రపంచంలోనే అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించడంతోపాటు, రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకు రావడాన్ని అభినందించారు. స్కైరూట్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటిచెబుతుందని సీఎం అన్నారు. తెలంగాణ, హైదరాబాద్ రైజింగ్ లక్ష్యసాధనలో తాము భాగస్వామ్యం వహిస్తామని స్కై రూట్ కో ఫౌండర్ పవన్ కుమార్ చందన అన్నారు. యూనీలివర్‌తో ఒప్పందం దావోస్ పర్యటనలో భాగంగా దిగ్గజ కంపెనీ యూనిలీవర్ సంస్థ సీఈఓ హీన్ షూమేకర్, చీఫ్ సప్లై ఆఫీసర్ విల్లెమ్ ఉయిజెన్తో సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు బృందం చర్చలు జరిపింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి వి.శేషాద్రి, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణలో వ్యాపారం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన యూనీలివర్ బృందానికి రేవంత్ వివరించారు. తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్ ఉందని, తమ ప్రభుత్వం అనుసరిస్తున్న సులభతర వాణిజ్య విధానాలు వ్యాపారాలకు అనువుగా ఉంటాయన్నారు. చర్చలు ఫలప్రదం కావడంతో తెలంగాణలో పెట్టుబడులకు యూనిలీవర్ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్‌తోపాటు రాష్ట్రంలో బాటిల్ క్యాప్‌ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ యూనిట్ ఏర్పాటుతో ఇతర ప్రాంతాల నుంచి బాటిల్ క్యాప్‌ల దిగుమతి చేసుకుంటుండగా ఇకపై స్థానికంగా తయారవుతాయి. కాగా, కామారెడ్డిలో అవసరమైన భూమిని కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారు. వివిధ సంస్థలతో సంప్రదింపులు కాలిఫోర్నియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ హార్డ్‌వేర్, ఏఐ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్‌లో పేరొందిన ‘సాంబనోవా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ’చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు బృందం చర్చించింది. తెలంగాణలో సెమీకండక్టర్ పరిశ్రమల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివరించింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తెలంగాణ పెవిలియన్‌లో జరిగిన సమావేశంలో శ్రీధర్ బాబు లాజిస్టిక్స్ కంపెనీల్లో పేరొందిన ఎజిలిటీ సంస్థ చైర్మన్ తారెక్ సుల్తాన్‌ను కలిశారు. వ్యవసాయ రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించటంతో పాటు రైతుల ఆదాయాన్ని స్థిరంగా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతలను మంత్రి శ్రీధర్ బాబు వివరించారు. ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్ దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశాలు ‘ఇండస్ట్రీస్ ఇన్ ఇంటెలిజెంట్ ఏజ్’అనే థీమ్‌తో ప్రారంభమయ్యాయి. శాస్త్ర సాంకేతిక అధునాతన పరిజ్ఞానానికి అనుగుణంగా పారిశ్రామిక వ్యూహాల మార్పు, పెరుగుతున్న ఇంధన అవసరాలు సమకూర్చుకోవాలనే ఇతివృత్తంతో రౌండ్ టేబుల్ సమావేశాలు, సెమినార్లు నిర్వహిస్తున్నారు. వివిధ దేశాలు, రాష్ట్రాల ప్రతినిధులతోపాటు ఆయా రంగాలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తలు దాదాపు మూడు వేలమంది ఈ సదస్సులో పాల్గొంటున్నారు. దావోస్ పర్యటనలో భాగంగా అమెజాన్, సిఫీ టెక్నాలజీస్ కంపెనీల ప్రతినిధులతో రాష్ట్ర బృందం చర్చలు జరపనుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) సారథ్యంలో వివిధ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ భేటీ అవుతారు. -
జ్యూరిక్‌లో రేవంత్, చంద్రబాబు భేటీ
సాక్షి, హైదరాబాద్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ‘రైజింగ్ తెలంగాణ’బృందం సోమవారం ఉదయం ఆ దేశంలోని జ్యూరిక్ పట్టణానికి చేరుకుంది. జ్యురిక్ ఎయిర్‌పోర్టులో సీఎం బృందానికి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. మరోవైపు దావోస్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని బృందం కూడా జ్యురిక్ చేరుకుంది. ఎయిర్‌పోర్టులోనే ఇద్దరు సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం. ఈ భేటీలో కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్, చంద్రబాబులతో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధి బృందాలు ఫొటోలు దిగాయి. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా.. రాష్ట్ర ప్రతినిధి బృందం జ్యూరిక్ నుంచి రైలులో దావోస్ నగరానికి చేరుకుని ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటుంది. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఇందులో పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సీఎం బృందం భేటీ కానుంది. అంతర్జాతీయ పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేలా ప్రణాళికలను వెల్లడించనుంది. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకోనుంది. -
ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా భారత్..
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా సవాళ్లతో కూడుకున్న పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ ప్రకాశవంతమైన కాంతిపుంజంగా నిలుస్తోందని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ఒక సర్వే నివేదికలో వెల్లడించింది. ప్రైవేట్ పెట్టుబడులకు దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత అనుకూలంగా ఉందని పేర్కొంది. గత ముప్ఫై రోజులుగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ సర్వే ఫిబ్రవరి తొలి వారంలో పూర్తవుతుందని. ఇప్పటివరకు అందిన వివరాల ఆధారంగా మధ్యంతర నివేదికను రూపొందించినట్లు వివరించింది. మొత్తం 500 సంస్థలు సర్వేలో పాల్గొంటుండగా.. 300 సంస్థల అభిప్రాయాల ఆధారంగా ప్రస్తుత నివేదిక రూపొందింది. దీని ప్రకారం 79 శాతం సంస్థలు గత మూడేళ్లలో మరింత మంది ఉద్యోగులను తీసుకున్నట్లు వివరించాయి. 75 శాతం సంస్థలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు .. ప్రైవేట్ పెట్టుబడులకు అనుకూలంగా ఉన్నాయని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో తాము ఇన్వెస్ట్ చేస్తామంటూ 70 శాతం సంస్థలు వెల్లడించిన దాన్ని బట్టి చూస్తే వచ్చే కొద్ది త్రైమాసికాల్లో ప్రైవేట్ పెట్టుబడులు పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ వివరించారు. కీలక వృద్ధి చోదకాలైన ప్రైవేట్ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన సానుకూలంగా కనిపిస్తున్నందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు స్థిరంగా 6.4–6.7 శాతం స్థాయిలో, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 7 శాతం మేర ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇదీ చదవండి: అడుగు పెట్టిన చోటల్లా.. ఆధిపత్యం!రాబోయే సంవత్సరకాలంలో వచ్చే పెట్టుబడుల ప్రణాళికలతో తయారీ, సేవల రంగాల్లో ప్రత్యక్ష ఉద్యోగాల కల్పన సగటున వరుసగా 15 నుండి 22 శాతంగా ఉండొచ్చని అంచనా. ఈ రెండు రంగాల్లో పరోక్ష ఉద్యోగాల కల్పన దాదాపు 14 శాతం పెరగవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. సర్వేలో పాల్గొన్న సంస్థల ప్రకారం సీనియర్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్/సూపర్వైజరీ స్థాయిలోని ఖాళీల భర్తీ కోసం 1 నుండి 6 నెలల సమయం పడుతోండగా, రెగ్యులర్.. కాంట్రాక్ట్ వర్కర్లను భర్తీ చేసుకోవడానికి తక్కువ సమయం పడుతోంది.గత ఆర్థిక సంవత్సరం తరహాలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోను సీనియర్ మేనేజ్మెంట్, మేనేజీరియల్/సూపర్వైజరీ ఉద్యోగులు, రెగ్యులర్ వర్కర్లకు వేతన వృద్ధి సగటున 10 నుండి 20 శాతంగా ఉంటుందని 40–45 శాతం సంస్థలు తెలిపాయి. -
రాజధానిలో కొత్త ఐటీ పార్క్
సాక్షి, హైదరాబాద్: సింగపూర్‌కు చెందిన క్యాపిట ల్యాండ్ రియల్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్‌లో రూ.450 కోట్లతో అత్యాధునిక ఐటీ పార్కు ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఐటీ పార్క్‌ను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. సింగపూర్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆదివారం క్యాపిటల్యాండ్ ప్రతినిధి బృందంతో నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, క్యాపిటల్యాండ్ సంస్థ పరస్పర అవగాహన ఒప్పందం చేసుకున్నాయి. క్యాపిటల్యాండ్ కొత్త ఐటీ పార్కు హైదరాబాద్ అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలుస్తుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. బ్లూచిప్ కంపెనీలు కోరుకునే ప్రీమియం సదుపాయాలు, గ్లోబల్ కేపబులిటీ సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అందుకునేలా అన్ని సౌకర్యాలను ఈ ఐటీ పార్కులో అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. సీఎం రేవంత్ సారథ్యంలో హైదరాబాద్ సుస్థిరంగా వృద్ధి చెందుతోందని, అక్కడ తమ సంస్థ కార్యకలాపాలను విస్తరించటం ఆనందంగా ఉందని క్యాపిటల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్మెంట్ సీఈవో గౌరీ శంకర్ నాగభూషణం పేర్కొన్నారు.ఇప్పటికే పలు పెట్టుబడులు..క్యాపిటల్యాండ్ సంస్థ ఇప్పటికే హైదరాబాద్‌లో అంతర్జాతీయ టెక్ పార్క్ (ఐటీపీహెచ్), అవాన్స్ హైదరాబాద్, సైబర్ పెర్ల్ పార్కులను చేపట్టింది. గతంలో ఈ సంస్థ ప్రకటించిన 25 మెగావాట్ల ఐటీ లోడ్ డేటా సెంటర్ ఈ ఏడాది మధ్యలో అందుబాటులోకి రానుంది. ఐటీపీహెచ్ రెండో దశ కూడా ఈ ఏడాది ప్రారంభమై 2028 నాటికి పూర్తి కానుంది. సింగపూర్‌లో జరిగిన ఈ చర్చల్లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, రాష్ట్ర ఉన్నతాదికారులు, క్యాపిటల్యాండ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్ కియాతానీ పాల్గొన్నారు.మెరీనా బేలో సీఎం పడవ ప్రయాణంసీఎం రేవంత్‌రెడ్డి సింగపూర్‌లోని మెరీనా బేలో ఫెర్రీ ప్రయాణం చేశారు. మెరీనా బే తీరంలో నిర్మించిన ఆకాశహర్మ్యాలను తిలకించి, వాటి విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడ పర్యాటకాభివృద్ధికి చేపట్టిన చర్యలను పరిశీలించారు.ముగిసిన సింగపూర్ పర్యటనసీఎం రేవంత్‌రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు రోజుల సింగపూర్ పర్యటన ముగిసింది. సీఎం, మంత్రి శ్రీధర్‌బాబు, అధికారులు అక్కడి నుంచి ఆదివారం రాత్రి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌కు బయలుదేరారు. సోమవారం దావోస్‌కు చేరుకుంటారు. అక్కడ నాలుగు రోజుల పాటు జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొంటారు. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి పెట్టుబడుల గమ్యస్థానంగా పరిచయం చేసే లక్ష్యంతో దావోస్‌కు వెళుతున్నట్టు రాష్ట్ర ప్రతినిధి బృందం పేర్కొంది. ఇక సింగపూర్‌లో తమ పర్యటన విజయవంతమైందని తెలిపింది. సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ)తో తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరస్పర అవగాహన కుదుర్చుకోవటం కీలక పరిణామం అని అధికార వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో రూ.3,500 కోట్లతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఎస్టీ టెలీ మీడియా ఒప్పందం, రూ.450 కోట్లతో భారీ ఐటీ పార్కు ఏర్పాటుకు క్యాపిటల్ ల్యాండ్ ఒప్పందం కీలక అంశాలని పేర్కొంటున్నాయి. రాష్ట్రంలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమలు, పెట్టుబడుల అవకాశాలపై సింగపూర్ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అసోసియేషన్‌తో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయని చెబుతున్నాయి.చివరి రోజు వరుస సమావేశాలుసింగపూర్ పర్యటనలో ఆదివారం సీఎం బృందం వ్యాపార సంస్థల అధినేతలు, సింగపూర్ బిజినెస్ ఫెడరేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఇండియన్ ఓషన్ గ్రూప్ ఫౌండర్, సీఈవో ప్రదీప్‌తో బిశ్వాస్, డీబీఎస్ కంట్రీ హెడ్ లిమ్ హిమ్ చౌన్, డీబీఎస్ గ్రూప్ హెడ్ అమిత్ శర్మ, బ్లాక్ స్టోన్ సింగపూర్ సీనియర్ ఎండీ, చైర్మన్ గౌతమ్ బెనర్జీ, బ్లాక్ స్టోన్ రియల్ ఎస్టేట్ సీనియర్ ఎండీ పెంగ్ వీ టాన్, మెయిన్ హార్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షాజాద్‌తో భేటీ అయింది. హైదరాబాద్‌లో పెట్టుబడుల అవకాశాలు, ప్రభుత్వ విధానాలను వివరించింది. -
బాబూ.. ఇందులో ఒక్కటైనా వచ్చిందా?
సాక్షి, అమరావతి: పెట్టుబడుల ఆకర్షణ అంటూ ఏటా స్విట్జర్లాండ్‌లోని దావోస్(Davos) వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు(Chandrababu) వెళ్లడం, దానికి అనుకూల మీడియా బాకా ఊదడం తెలిసిందే. తాజాగా దావోస్(Davos) పర్యటనకు వెళుతున్న చంద్రబాబు(Chandrababu) అనుకూల మీడియాకు అదనంగా జాతీయ మీడియా ఎన్డీటీవీ, సీఎన్‌బీసీ టీవీ18, బిజినెస్ టుడే పత్రికలకు రూ.కోట్లు వెచ్చించి మరీ ప్రచారం చేయించుకోవడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రచారం మాట అటుంచి.. 2014–19 మధ్య దావోస్(Davos) పర్యటనల్లో ప్రకటించిన పెట్టుబడుల ఒప్పందాలు ఏమయ్యాయి.. ఇందులో ఒక్కటైనా మీకు గుర్తుందా బాబు అంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు.ప్రపంచంలోని కుబేరులతో ఫొటోలు తీయించుకుని ప్రచారం చేయించుకోవడమే కానీ.. దావోస్(Davos) పర్యటనలతో రాష్ట్రానికి ఏ ఒక్క ప్రాజెక్టయినా తీసుకొచ్చినట్టు చంద్రబాబు(Chandrababu) చెప్పగలరా... అని ప్రశ్చిస్తున్నారు. 2015 నుంచి 2018 వరకు వరుసగా నాలుగుసార్లు చంద్రబాబు(Chandrababu) దావోస్(Davos) పర్యటనకు వెళితే... ఎన్నికల ఏడాది 2019లో అప్పటి ఐటీ మంత్రి నారా లోకేశ్ బృందం దావోస్(Davos) పర్యటనకు వెళ్లింది. మొత్తం దావోస్(Davos) పర్యటనకు రూ.55 కోట్ల వరకు ప్రజాధనం వ్యయం చేయగా, రూ.ఒక కోటి పెట్టుబడి కూడా రాలేదని అప్పటి దావోస్(Davos) పర్యటనలో పాల్గొన్న అధికారులు పేర్కొన్నారు.రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి దావోస్(Davos)కు వెళ్లిన అప్పటి సీఎం చంద్రబాబు(Chandrababu) పదేళ్ల తర్వాత మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలుసుకోవడంతో పాటు సీఈవో సత్య నాదెళ్లతో చర్చలు జరిపామని, విశాఖలో బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు ఆసక్తిగా ఉన్నట్టు భారీగా ప్రచారం చేసుకున్నారు. ఆ ప్రకటన వచ్చి పదేళ్లయినా ఇప్పటి వరకు మైక్రోసాఫ్ట్ మన రాష్ట్రం వైపు చూడకపోగా... తాజాగా సత్య నాదెళ్ల హైదరాబాద్ పర్యటనకు వచ్చి తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వెళ్లారే కానీ.. మన రాష్ట్రం వైపు కన్నెత్తి చూడలేదు. అంతేకాదు ఇన్ఫోసిస్, విప్రో, డెలాయిట్, పెగా సిస్టమ్స్... ఇలా అనేక ఐటీ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నట్టు ఊదరగొట్టారే కానీ... ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా చంద్రబాబు(Chandrababu) హయాంలో తీసుకురాలేకపోయారు.వైఎస్ జగన్ ఒకసారి పర్యటనతో రికార్డుస్థాయి ఒప్పందాలుకేవలం రూ.11.9 కోట్ల వ్యయంతో 19 మంది అధికారుల బృందంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి(YS Jaganmohan Reddy) ముఖ్యమంత్రి హోదాలో 2022లో దావోస్(Davos) సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ సమావేశాల్లో రూ.1.26 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానితో మర్యాదపూర్వక భేటీలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్టు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించారు. రూ.200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రారంభించేలా చూశారు.అలాగే రూ.60 వేల కోట్లతో అదానీ గ్రూపు గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, గ్రీన్కో రూ.37 వేల కోట్లతో, అరబిందో రూ.28 వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు దావోస్(Davos)లో ఒప్పందం కుదుర్చుకుని వాటిని అమల్లోకి తీసుకువచ్చారు. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా వైఎస్ జగన్ పెట్టుబడులను వాస్తవ రూపంలోకి తీసుకువస్తే.. 2016లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చంద్రబాబుతో భేటీ అయి తెలుగు పచ్చళ్లు, తెలుగు వంటలు గురించి చర్చించారని, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఆంధ్ర పెవిలియన్‌లో ఏర్పాటు చేసిన పాలకూర పప్పు, బెండ వేపుడును పారిశ్రామికవేత్తలు మెచ్చుకుంటున్నారని ప్రచారం చేసుకోవడంతోనే సరిపోయిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు.2014–19 మధ్య దావోస్(Davos)లో చంద్రబాబు(Chandrababu) పర్యటించి ప్రకటించిన కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు ఇవీ... ఇందులో ఒక్కటీ వాస్తవ రూపం దాల్చలేదు 2015లో⇒ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్‌గేట్స్, సీఈవో సత్య నాదెళ్లతో సమావేశం ⇒ విశాఖకు మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇన్ఫోసిస్, విప్రో డేటా సెంటర్లు అంటూ ప్రకటన ⇒ రాష్ట్రంలో భారీ హార్డ్‌వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ముందుకొచ్చిందంటూ ప్రచారం2016లో⇒ మియర్ బర్గర్, ఫిస్లోం సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు ⇒ రూ.2 వేల కోట్లతో ఘెర్జి టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు ⇒ఇండానీ గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతోపాటు నెస్లే, వెల్సపన్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి 2017లో⇒ ఐటీ, హెల్త్‌కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ రూ.43 వేల కోట్ల పెట్టుబడులు ⇒ విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు ⇒ విశాఖ ఫార్మాసిటీలో నోవార్టిస్ ఆర్ అండ్ డీ కేంద్రం ఏర్పాటు 2018లో⇒ కృష్ణపట్నం వద్ద సౌదీ ఆరామ్కో చమురు శుద్ధి కర్మాగారం ⇒ గూగుల్, యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు ⇒ ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో హిటాచీ పెట్టుబడులు 2019లో⇒ జేఎస్‌డబ్ల్యూ రూ.3,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందం ⇒డెలాయిట్, పెగా సిస్టమ్స్ రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి


