గౌరవం, అభివృద్ధి ఉన్న చోటే మేం పెట్టుబడులు పెడతాం
ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్
అద్భుత ఆతిథ్యం ఇచ్చారంటూ సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే పదేళ్లలో రాష్ట్రంలో, ఫ్యూచర్ సిటీలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నామని ట్రంప్ మీడియా అండ్ టెక్నా లజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ ప్రకటించారు. ఆహ్వానించడంతో పాటు గౌరవం, అభివృద్ధి కనిపించిన చోటే తమ పెట్టుబడులు పెడతామని అన్నారు. గత కొన్ని నెలలుగా తమను తెలంగాణకు ఆహ్వానిస్తూనే ఉన్నా, ఆలస్యం జరిగిందని, రాష్ట్రంలో అభివృద్ధికి భారీ అవకాశాలుండడంతో రాక తప్పలేదని చెప్పారు. సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025 ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు.
భారత్‌లో అద్భుతమైన మానవ వనరులు
పెట్టుబడులు పెట్టేముందు డబ్బు తిరిగి వస్తుందా.. లాభాలు వస్తాయా? అని అందరూ ఆలోచి స్తారని, అయితే అదే ప్రధానం కాకూ డదని స్వైడర్ అన్నారు. స్వల్పకాలిక ప్రయో జనాలు కాకుండా దీర్ఘకాలిక అంశాలూ దృష్టిలో ఉంచుకో వాలని చెప్పారు. ఎక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉంటే అక్కడికి పెట్టు బడులు నీటి ప్రవాహంలా వెళ్తాయన్నారు. భారత దేశంలో అద్భుతమైన నైపుణ్య మానవ వనరులున్నాయని, ప్రపంచ టెక్నాలజీ రంగంలో ఇండియానే పెద్దన్న పాత్ర పోషిస్తోందని చెప్పారు.
ఇక్కడి ఆదరాభిమానాలు మరిచిపోలేను
సదస్సుకు ఆహ్వానించి తనకు ఊహించని రీతి లో అద్భుత ఆతిథ్య మిచ్చినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి స్వైడర్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ చూపిన ఆదరాభిమానాలు మరచిపోలేనని అన్నారు. అమెరికా అధ్య క్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు దాడి చేస్తున్న సమయంలో భావ ప్రకటన స్వేచ్ఛను రక్షించడా నికి ‘ట్రూత్’ సోషల్ మీడియాను ప్రారంభించామని ఈ సందర్భంగా చెప్పారు. తమ ఆలోచనలకు అనుగుణంగా భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని, ఇది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు


