షీస్‌ ఇండియా షో.. | Shes India Fashion Show in Hyderabad | Sakshi
Sakshi News home page

షీస్‌ ఇండియా షో..

Dec 8 2025 3:56 PM | Updated on Dec 8 2025 4:06 PM

Shes India Fashion Show in Hyderabad

అందచందాలతో అదరగొట్టారు.. ర్యాంప్‌పై హొయలొలికించారు.. ఆహుతులను ఆకట్టుకున్నారు.. ఫ్యాషన్‌ షోకు దేశ నలుమూలల నుంచి 18 నుంచి 81 ఏళ్ల అత్యున్నతమైన 20 మంది ఫైనలిస్టులు విచ్చేశారు. హైదరాబాద్‌ యూసుఫ్‌గూడలోని ఫస్ట్‌ బెటాలియన్‌ ప్రాంగణంలో ఉన్న శౌర్య కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం రాత్రి షీ’స్‌ ఇండియా పేరుతో జరిగిన ఫ్యాషన్‌ షోలో పాల్గొన్నారు. 

ఈ పోటీలకు ఎత్తు, బరువు వంటి అర్హతలు లేవు. గృహిణుల నుంచి ఏరోనాటికల్‌ ఇంజినీర్లు వరకు, స్కూల్‌ టీచర్లు నుంచి నర్సులు వరకు, ఫ్యాషన్‌ ఇండస్ట్రీ నుంచి కార్పొరేట్‌ ఐకాన్లు వరకు అందరూ ఒక వేదికపై కలిసి వాక్‌ చేశారు. 

ఈ గ్రాండ్‌ గాలా ఫినాలేలో గెలుపొందిన మహారాణులను సత్కరించారు. డ్రీమ్‌ఫోక్స్‌ సహకారం అందించిన ఈ కార్యక్రమంలో షీ’స్‌ ఇండియా వ్యవస్థాపకులు, సహా వ్యవస్థాపకులు షారోన్‌ ఫెర్నాండెజ్, శిల్పా జైన్‌ తదితరులు పాల్గొన్నారు.   

(చదవండి:  Baghini River: చీరలకు సహజ రంగులను అందించే నది..! బాఘిని ప్రింట్‌ మాయాజాలం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement