జర్మనీలో నివసిస్తున్న ఒక భారతీయ వ్యవస్థాపకుడు ,పరిశోధకుడు, మయూఖ్ పంజా దాదాపు దశాబ్ద కాలంగా విదేశాల్లో ఇక్కడి పౌరసత్వాన్ని తీసుకునేందుకు నిరాకరించాడు. తన భారతీయ పాస్‌పోర్ట్‌ను వదులుకోవడానికి సిద్ధంగా లేనని ప్రకటించాడు. తాను ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో కూడా వివరించాడు. దీంతో ఇది నెట్టింట సందడిగా మారింది.
మయూఖ్ సోషల్ మీడియా పోస్ట్ ప్రకారం తొమ్మిది సంవత్సరాలకు పైగా జర్మనీలో నివసిస్తున్న అతనికి గత ఏడాది పౌరసత్వానికి అర్హత సాధించాడు. కానీ దరఖాస్తు చేయ కూడదని నిర్ణయించుకున్నాడు.తాను జర్మన్ పౌరుడిగా గాకుండా, ఎప్పటికీ భారతీయుడి గానే ఉంటాని ఆయన వివరించాడు. మయూఖ్ పంజా తొమ్మిదేళ్ల క్రితం జర్మనీ వెళ్లాడు.. డాక్టోరల్ రీసెర్చ్ కోసం వెళ్లిన మయూఖ్ అక్కడే పాపులేషన్స్ అనే ఏఐ సంస్థను స్థాపించాడు. గతేడాదే జర్మన్ పౌరసత్వం పొందేందుకు అర్హుత సాధించాడు. అయినా సిటిజన్ షిప్ కోసం దరఖాస్తు చేయలేదట. పాస్ పోర్ట్ అంటే తన దృష్టిలో కేవలం అదొక డాక్యుమెంట్ కాదని, అది వ్యక్తిత్వ గుర్తింపని చెప్పుకొచ్చాడు. భారతీయతను వదులుకోలేక పోతున్నానని వెల్లడించారు.
జర్మనీ కథలు, చరిత్ర, భాష,సంస్కృతిని అర్థం చేసుకున్నాడు. వాటితో తాను మమేకం కాలేక పోతున్నానని, బెర్లిన్ వాతావరణం, సాంకేతిక శాస్త్రీయ పరిస్థితులలో తాను సుఖంగా ఉన్నప్పటికీ, అది తన సొంతఇంట్లో ఉన్నట్లు భావించడం లేదని ఆయన అన్నారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జర్మనీ గెలుపు లేదా ఓటమి తనకు పెద్దగా తేడాను కలిగించదని, భారతదేశం ప్రపంచ కప్ గెలిచినప్పుడు తన ఆనందమే వేరు అంటూ ఒక ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. తాను జర్మనీ స్నేహితుడినే తప్ప ఆ దేశంలో భాగమని భావించే వ్యక్తిని కాదన్నాడు
పంజా ప్రకారం, జర్మన్ పౌరుడిగా మారడం అంటే జర్మన్ విలువలు మరియు ఆదర్శాలతో తనను తాను సమలేఖనం చేసుకోవడం. కానీ కొత్త పౌరుడిగా, శతాబ్దాల నాటి సంస్కృతి తన ఇష్టానికి అనుగుణంగా ఉంటుందని ఆయన భావించడలేదు. పైగా భారత పౌరసత్వాన్ని కాపాడుకోవడం అనేది ఏదైనా చట్టపరమైన ప్రయోజనానికి సంబంధించిందికాదు,కానీ తన నిజమైన గుర్తింపుతో కనెక్ట్ అవ్వడానికి ఒక మార్గం అని మయూఖ్ పంజా తెలిపారు.
I have been here 9 + years and I became eligible for the German passport a year back. I could have applied for citizenship a year ago, but I did not. I have thought about this a lot and I am increasingly coming to the conclusion that I can’t do this. Because I don’t feel German.… https://t.co/amUbrxgObK
— Mayukh (@mayukh_panja) December 5, 2025
సోషల్ మీడియా మయూఖ్ నిర్ణయానికి సానుకూలంగా స్పందించింది. ఆయన నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.


