రాష్ట్ర ఖ్యాతిని ఘనంగా చాటేలా ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్’ భారత్ ఫ్యూచర్ సిటీ మీర్‌ఖాన్‌పేటలో సోమవారం(08-12-2025) ప్రారంభమైంది.
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీనిని ప్రారంభించారు.
భారీ లక్ష్య సాధన కోసం అదేస్థాయి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల పాటు దీనిని నిర్వహించనుంది.
దేశ, విదేశాలకు చెందిన ఫార్చ్యూన్–500 కంపెనీల ప్రతినిధులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, దిగ్గజ పారిశ్రామిక కంపెనీల ప్రతినిధులు, సినీ.. క్రీడా.. ఇతర ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరు కానుండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు


