యూపీలోని బదౌన్‌కు చెందిన ఈ యువతి ఏకంగా శ్రీకృష్ణుడినే పెళ్లాడింది. శ్రీకృష్ణుడిని అమితంగా ఆరాధించే యువతి, సాక్షాత్తూ ఆ శ్రీకృష్ణుడినే భర్తగా ప్రకటించుకుంది. గ్రామమంతా తరలివచ్చి ఈ పెళ్లి తంతును ఆసక్తిగా తిలకించడం విశేషం.
ఉత్తరప్రదేశ్‌లోని బుడాన్ జిల్లాకు చెందిన 28 ఏళ్ల మహిళ హిందూ సంప్రదాయ వేడుకలో కృష్ణుడి విగ్రహాన్ని వివాహం చేసుకోవడం విస్తృత చర్చకు దారితీసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన పింకీ శర్మ కుటుంబం, బంధువులు, గ్రామ నివాసితులు సమక్షంలో సంప్రదాయ బద్ధంగా ఈ వివాహ తంతునుముగించారు. ఇస్లాంనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బైయూర్ కాశీమాబాద్ గ్రామంలో జరిగిన ఈ ప్రత్యేకమైన వేడుక పలువురి దృష్టిని ఆకర్షించింది.
దైవిక వరుడితో సాంప్రదాయ వివాహం
ఈ సందర్భంగా పింకీ ఇంటిని అలంకరించారు. ఆమె సమీప బంధువు ఇంద్రేష్ కుమార్ వరుడిలా అలంకరించిన శ్రీకృష్ణుడి విగ్రహాన్ని వివాహ మండపానికి తీసుకొని వచ్చారు. దాదాపు 125 మందితో ఊరేగింపుగా తరలి వచ్చారు.
పింకీ విగ్రహాన్ని తన చేతులతో ఎత్తుకొని ఆచారాల కోసం వేదికపైకి అడుగుపెట్టింది. ఆమె దేవుడితో దండలు మార్చుకుంది, తరువాత సిందూర వేడుక జరిగింది. వేడుకల్లో భాగంగా బృందావనం నుండి వచ్చిన కళాకారులు భక్తి నృత్యాలు చేశారు. మొత్తం గ్రామం అంతా వివాహ విందును సిద్ధం చేశారు. పింకీ ఏడు సాంప్రదాయ వివాహ రౌండ్ల కోసం కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి పవిత్ర అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేసింది. వీడ్కోలు వేడుక మరుసటి రోజు ఉదయం జరిగింది. ప్రస్తుతం ఆమె తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తోంది.
बदायूं की पिंकी शर्मा ने भगवान श्रीकृष्ण जी से की शादी
बदायूं जिले के इस्लामनगर थाना क्षेत्र के गांव ब्यौर कासिमाबाद में 28 साल की पिंकी शर्मा ने श्रीकृष्ण की प्रतिमा के साथ धूमधाम से विवाह कर लिया। पूरे गांव ने घराती की भूमिका निभाई और परिवार ने विवाह की पूरी रस्में पूरी कीं pic.twitter.com/dtT9fjfARU— Arjun Chaudharyy (@Arjun5chaudhary) December 7, 2025
వధువు తండ్రి ఏమన్నారంటే
ఆమె తండ్రి సురేష్ చంద్ర మాట్లాడుతూ, పింకీ చిన్నప్పటి నుండి కృష్ణ భగవానుడుఅంటే ఆమెకు ఎంతోభక్తి ఉండేదనీ,తరచుగా బృందావనానికి తనతో పాటు వచ్చేదని చెప్పారు. తన కుమారుల మాదిరిగానే కుటుంబ ఆస్తిలో ఆమెకు వాటా ఇస్తానని వాగ్దానం చేశానని చెప్పాడు. ఆమె తల్లి రామేంద్రి మాట్లాడుతూ, ఈ ఆలోచన మొదట్లో అసాధారణంగా అనిపించినప్పటికీ, పింకీ ఇది భక్తి భావంతో కూడుకున్నది కనుక కుటుంబం అంగీకరించిందని అన్నారు.
ఇదీ చదవండి: ఎప్పటికీ భారతీయుడిగానే ఉంటా : ఎన్ఆర్ఐ పోస్ట్ వైరల్
బంగారు ఉంగరం
దాదాపు నాలుగు నెలల క్రితం, ఆమె దైవిక జోక్యంగా భావించిన ఒక అనుభవాన్ని అనుభవించిందట. బాంకే బిహారీ ఆలయంలో ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు, ఒక బంగారు ఉంగరం ఆమె కండువాలో పడింది. దీంతో ఇది వరమని పింకీ నమ్మింది. అందుకే తానిక ఏ మానవుడిని వివాహం చేసుకోనని, కృష్ణుడిని మాత్రమే వివాహం చేసుకుంటాని నిర్ణయించుకుంది. ఇటీవలి అనారోగ్యంగా ఉన్నపుడు బృందావనం ద్వారా బరువైన కృష్ణ విగ్రహాన్ని మోసుకెళ్లి గోవర్ధన పరిక్రమను పూర్తి చేసి తరువాత కోలుకుంది. ఇది తన వివాహానికి మరొక సంకేతంగా భావించిందట. తన జీవితం దేవునికి అంకితమని పింకీ వెల్లడించింది. తన జీవితంలో విద్యాతోపాటు, , భక్తి ,కృష్ణుడికి లొంగిపోవడంలోనే తనకు శాంతి అని తెలిపింది. కాగా ఇలా కృష్ణుడ్ని వివాహ మాడిన ఘటనలు యూపీలో గతంలోకూడా నమోదైనాయి.
చదవండి: మంచు గడ్డలా ప్రియురాలి మృతదేహం : ప్రియుడు ఎంత పనిచేశాడు


