గోవా ప్రమాదం: తొలిసారి స్పందించిన నైట్‌క్లబ్‌ | Goa fire Accident Nightclub statement of assurance | Sakshi
Sakshi News home page

గోవా ప్రమాదం: తొలిసారి స్పందించిన నైట్‌క్లబ్‌

Dec 8 2025 12:11 PM | Updated on Dec 8 2025 12:25 PM

Goa fire Accident Nightclub statement of assurance

గోవా: గోవాలోని నార్త్ గోవా నైట్‌క్లబ్ ‘బిర్చ్ బై రోమియో లేన్’లో జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం జరిగిన అనంతరం క్లబ్ యజమాని సౌరభ్ లూత్రా పరారీలో ఉన్నాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు.

తాజాగా క్లబ్ యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. జరిగిన ప్రాణనష్టంపై తాము తీవ్రంగా చలించిపోయామని విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చింది. కాగా క్లబ్  వ్యవహారాలను చూస్తున్న మేనేజర్ భరత్‌ను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన తర్వాత, లూత్రా అదృశ్యం చర్చనీయాంశమైంది. భారతదేశం అంతటా 50 రెస్టారెంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకున్న లూత్రా, ‘రోమియో లేన్’, ‘బిర్చ్  అండ్‌ మామాస్ బుయోయి’కి ఛైర్మన్‌గా వ్యవహరిస్తు​న్నారు. కాగా గోవాకు చెందిన సామాజిక కార్యకర్త తాహిర్ నోరోన్హా మాట్లాడుతూ లూత్రా.. గోవాకు అరుదుగా వస్తుంటాడని, చట్టపరమైన చర్యలకు దూరంగా ఉంటూ, అన్నింటికీ తన ప్రతినిధులను పంపుతాడన్నారు. క్లబ్‌ సిబ్బంది  మాట్లాడుతూ లూత్రా నెలకు ఒకసారి మాత్రమే క్లబ్‌ను సందర్శిస్తారని, ఉద్యోగులతో అరుదుగా మాట్లాడతారని తెలిపారు.  పరారీలో ఉన్న లూత్రో కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.
 

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో సుమారు 100 నుండి 200 మంది డ్యాన్స్ ఫ్లోర్‌లో ఉన్నారని సమాచారం. మంటలు చుట్టుముట్టడంతో, ప్రాణాలను కాపాడుకోవడానికి కొందరు వంటగదివైపునకు పరుగెత్తారు. అక్కడే వారు సిబ్బందితో పాటు చిక్కుకుపోయారు. కాగా గోవా పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. యజమాని సౌరభ్ లూత్రాను, అతని సోదరులను పట్టుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.ఈ క్రమంలో లూత్రా కోసం దేశవ్యాప్తంగా లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. అగ్నిప్రమాదానికి దారితీసిన సంఘటనల పూర్తి క్రమాన్ని, భద్రతా ఉల్లంఘనలను అధికారులు పరిశీలిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో క్లబ్‌లో సరైన నిష్క్రమణ మార్గాలు లేకపోవడం, ఫైర్ సేఫ్టీ ప్రమాణాలు పాటించకపోవడం తదితర అంశాలపై అధికారులు దృష్టి సారించారు.

ఇది కూడా చదవండి: తొలిసారి గోవా వెళ్లి.. ఢిల్లీ కుటుంబం విషాదాంతం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement