నిత్య జీవితంలో రోజువారీ పనులతో అలసిపోయి సరదాగా గడపడానికి నైట్‌క్లబ్‌లకు వెళితే ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోంది. గోవా నైట్‌క్లబ్బులో 25 మంది మరణించడం సంచలనం సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా నైట్‌క్లబ్సుల్లో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కాలక్షేపం, వినోదం, విశ్రాంతి కోసం వచ్చిన పర్యాటకులు విగత జీవులుగా మారారు.

2015 అక్టోబర్: రొమేనియా దేశంలోని బుకారెస్ట్ కలెక్టివ్ నైట్‌క్లబ్‌లో అగి్నప్రమాదం జరగడంతో 64 మంది మృతి.
2016 డిసెంబర్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఘోస్ట్‌షిప్ క్లబ్‌లో మంటలు చెలరేగడంతో 36 మంది బలి.
2022 జనవరి: ఆఫ్రికా దేశం కామెరూన్‌లోని యావోన్‌డే నైట్‌క్లబ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో 16 మంది మృతి.
2022 జనవరి: ఇండోనేషియాలో వెస్ట్‌పపువా ప్రావిన్స్‌లో సోరోంగ్ నైట్‌క్లబ్‌లో మంటలు. తుదిశ్వాస విడిచిన 19 మంది టూరిస్టులు.
2022 ఆగస్టు: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లోని మౌంటైన్ బీ క్లబ్‌లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు. 23 మంది అగ్నికి ఆçహుతి.
2023 అక్టోబర్: స్పెయిన్‌లోని మర్సియాలో నైట్‌క్లబ్ కాంప్లెక్స్‌లో అగ్ని ప్రమాదం. 13 మంది మృతి.
2024 ఏప్రిల్: టర్కీలోని ఇస్తాంబుల్‌లో మస్కరేడ్ నైట్‌క్లబ్‌లో చెలరేగిన మంటలు. 29 మంది అక్కడికక్కడే మృతి.
2025 మార్చి: ఉత్తర మాసిడోనియాలోని నైట్‌క్లబ్‌లో బాణాసంచా కాలుస్తుండగా మంటలు అంటుకోవడంతో 62 మంది మృతి.
ఇదీ చదవండి:


