గోవాలో అగ్ని ప్రమాదం: సిలిండర్ పేలి 23 మంది మృతి | Cylinder Blast at Goa Nightclub 23 Members Died | Sakshi
Sakshi News home page

గోవాలో అగ్ని ప్రమాదం: సిలిండర్ పేలి 23 మంది మృతి

Dec 7 2025 3:03 AM | Updated on Dec 7 2025 3:24 AM

Cylinder Blast at Goa Nightclub 23 Members Died

ఉత్తర గోవాలోని అర్పోరాలోని ఒక క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటైన బాగాలోని బిర్చ్ బై రోమియో లేన్ అనే క్లబ్‌లో అర్ధరాత్రి సమయంలో సిలిండర్ పేలడం వల్ల మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది మరణించినట్లు సమాచారం

సమాచారం అందుకున్న వెంటనే అనేక అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. మృతుల్లో ఎక్కువ మంది క్లబ్‌లో పనిచేస్తున్న సిబ్బంది అని పోలీసులు తెలిపారు. డీజీపీతో సహా సీనియర్ పోలీసు అధికారులు, ఉత్తర గోవా జిల్లా నుంచి పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.

గోవా డీజీపీ అలోక్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పటివరకు 23 మంది మరణించినట్లు సమాచారం. అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. మంటలు ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్‌లోని వంటగది ప్రాంతంలో చెలరేగాయి. దీంతో ఎక్కువమంది సిబ్బంది మరణించారని అన్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, స్థానిక ఎమ్మెల్యే మైఖేల్ లోబో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ విషాదంలో పర్యాటకులకు ఎటువంటి హాని జరగలేదని లోబో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement