ప్రపంచంలోనే ఎత్తైన రామ విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగింది. శుక్రవారం గోవాలో పర్యటించిన ఆయన.. సౌత్ గోవా కానాకోనలోని గోకర్ణ జీవోత్తం మఠంలో ఏర్పాటు చేసిన 77 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మఠం 550 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుక కార్యక్రమం జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని మఠాన్ని సందర్శించి, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
VIDEO | Canacona, Goa: PM Modi (@narendramodi) unveils 77-feet-tall bronze statue of Lord Ram at Shree Samsthan Gokarn Jeevottam Mutt in South Goa.
(Source: Third Party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/3sDm0qngb1— Press Trust of India (@PTI_News) November 28, 2025


