వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు అతి సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. నేషనల్ గార్డ్స్‌పై జరిగిన కాల్పుల ఘటనలో నేషనల్ సైనికురాలు గార్డ్ సారా బెక్‌స్ట్రోమ్ ప్రాణాలొదిలింది. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయం ప్రకటించారు. 20 ఏళ్లకే తనువు చాలించిన సారా బెక్‌స్ట్రోమ్ ఎవరు?
ఈమె మరణం పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అత్యంత గౌరవనీయమైన, అద్భుతమైన యువతి అని ఆమె సేవలను కొనియాడారు. క్రైమ్ ఫైటింగ్ మిషన్‌లో భాగంగా వెస్ట్ వర్జీనియా నేషనల్ గార్డ్ వాషింగ్టన్‌కు వందలాది మంది సైనికులను మోహరించింది. థాంక్స్ గివింగ్ సెలవుదినం సందర్భంగా బెక్‌స్ట్రోమ్ దేశ రాజధానిలో పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారని అటార్నీ జనరల్ పామ్ బోండి కాల్పుల మీడియతో చెప్పారు.
సారా బెక్‌స్ట్రోమ్ ఎవరు?
పశ్చిమ వర్జీనియాలోని సమ్మర్స్‌విల్లేకు చెందిన సారా బెక్‌స్ట్రోమ్ 2023 జూన్ 6 నేషనల్ గార్డ్స్‌లో ఉద్యోగిగా తన సేవను ప్రారంభించింది. వెస్ట్ వర్జీనియా ఆర్మీ నేషనల్ గార్డ్ 111వ ఇంజనీర్ బ్రిగేడ్‌లోని 863వ మిలిటరీ పోలీస్ కంపెనీకి ఎంపికైంది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం బెక్‌స్ట్రోమ్ మిలిటరీ పోలీసుల కోసం పనిచేసింది. FBIలో ఎదగాలనే డ్రీమ్‌తో నేషనల్ గార్డ్‌లో చేరింది.
బోయ్ ఫ్రెండ్ భావోద్వేగం
ఎంతో ప్రేమగల దయార్ద్ర హృదయురాలు., సున్నితమైన మనసునున్న మనిషి బెక్‌స్ట్రోమ్ అంటూ ఆమె సహచరుడు ఆడమ్ కార్ గుర్తు చేసుకున్నాడు. ఆమెకు ప్రకృతి, రోడ్డు ప్రయాణాలన్నా, తన కుటుంబంతో సమయం గడపడం అన్నా చాలా ఇష్టపడేది. ముఖ్యంగా తనను ప్రేమించేవారి సంతోషం కోసం ఎక్కువ తపించేంది. ఆమె కుటుంబమే ఆమె ప్రపంచం. ఎవరికైనా ఏదైనా చేసేది.. ఉదయం తను పనికి వెళ్ళే ముందు భోజనం తయారు చేయడం దగ్గర్నించీ, తిరిగి వచ్చి తనని ప్రేమగా హగ్ చేసుకునేదాకా ఉత్సాహంగా వేచి ఉండేదని తలచుకుని కంటతడి పెట్టారు.మొదట్లో వాషింగ్టన్ వెళ్లడానికి ఆమె ఉత్సాహంగా లేకపోయినా, చివరికి బెక్‌స్ట్రోమ్ ఒప్పుకుంది. ఆ తరువాత మ్యూజియలను, స్మారక చిహ్నాలను దర్శిచుకోవడం లాంటి తనకెంతో ఇష్టమైన పనులు వెస్ట్ వర్జీనియాలో చేశానని సంతోషపడేదని కార్ చెప్పారు.
భరించలేని విషాదం : తండ్రి
కుమార్తె అకాల మరణంపై సారా తండ్రి గ్యారీ బెక్‌స్ట్రోమ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. బెక్‌స్ట్రోమ్ ఆమె మరణం తర్వాత హృదయ విదారకమైన నోట్ రాశారు. " ఇది భరించలేని విషాదం నా బిడ కీర్తిని పొందింది" అని గ్యారీ ఫేస్‌బుక్‌లో రాశారు.
కాగా కాల్పులుఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. వైట్ హౌస్ సమీపంలో ముష్కరుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సైనికుల్లో సారా ఒకరు.కాల్పుల తర్వాత ఆమెకు అత్యవసర శస్త్రచికిత్స జరిగినా ఫలితం లేకపోయింది. అమెరికా వైమానిక దళానికి చెందిన మరో బాధితుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స తీసుకుంటున్నాడు.


