నాగరికతకు నిలువెత్తు నిదర్శనం | PM Modi At Somnath Temple during Somnath Swabhiman Parv | Sakshi
Sakshi News home page

నాగరికతకు నిలువెత్తు నిదర్శనం

Jan 10 2026 9:29 PM | Updated on Jan 11 2026 10:45 AM

PM Modi At  Somnath Temple during Somnath Swabhiman Parv

సోమనాథ్‌ ఆలయాన్ని కీర్తించిన ప్రధాని మోదీ

శ్రీ సోమనాథ్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ హోదాలో ఆలయ సందర్శన

వెరావల్‌(గుజరాత్‌): గతంలో విదేశీ రాజుల దండయాత్రల్లో పలుమార్లు ధ్వంసమైనాసరే తెగించి నిలబడిన భారతదేశ నాగరికతకు సోమనాథ్‌ ఆలయం నిదర్శనమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మూడ్రోజుల గుజరాత్‌ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ శనివారం గిర్‌ సోమనాథ్‌ జిల్లాలోని ప్రఖ్యాత సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు. శ్రీ సోమనాథ్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ హోదాలో ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా మోదీ తన సామాజిక మాధ్య ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక పోస్ట్‌ పెట్టారు. ‘‘ నాగరికత, తెగువకు నిదర్శనంగా భాసిల్లుతున్న సోమనా థ్‌ ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగా నాకు దక్కిన భాగ్యం. 1026లో తొలిదాడి మొ దలు శతాబ్దాల కాలంలో ఎన్నో సార్లు విదేశీ రాజుల దాడులకు గురైనా సరే చెక్కుచెదరక భారతీయ నాగరికతా తెగువ నిదర్శనంగా నిలబడింది. ఇంతటి గొప్ప ఆలయంలోకి నాకు సాదర స్వాగతం పలికిన స్థానికులకు నా కృతజ్ఞతలు’’ అని మోదీ అన్నారు. 

సోమనాథ్‌ ఆలయం తొలిసారిగా మొహమ్మద్‌ గజనీ సారథ్యంలో 1026 ఏడాదిలో దాడికి గురై 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సోమనాథ స్వాభిమాన్‌ పర్వ్‌ వేడుకల్లో పాల్గొనేందుకు మోదీ విచ్చేశారు. ఈ సందర్భంగా శ్రీ సోమ నాథ్‌ ఆలయ ట్రస్ట్‌ చైర్మన్‌ హోదాలో సర్క్యూ ట్‌ హౌస్‌లో బోర్డ్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, డెప్యూ సీఎం హర్‌‡్ష సంఘ్వీ, ఇతర ట్రస్టీలు, అధికారులు పాల్గొన్నా రు. వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే వేలాది మంది భక్తులకు ఏమాత్రం అసౌకర్యం కల్గకు ండా ఏర్పాట్లుచేయాలని అధికారులకు సూచి ంచారు. ఆలయ ప్రాంగణంలో మరమ్మతుల, ఆధునీకరణ, మౌలకవసతుల మెరుగు తదితర పనుల పురోగతిపై సమీక్ష జరిపారు. 
 

ఆకట్టుకున్న డ్రోన్‌ షో...
తర్వాత సాయంత్రం ఆలయం ప్రాంగణంలో ఓంకార మంత్రాన్ని పఠించే కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత రాత్రి చిమ్మచీకట్లో అరేబియా సముద్రంపై వినువీధిలో 3,000 చిన్నపాటి డ్రోన్లతో ఏర్పాటుచేసిన షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సౌర మండలం, సోమనాథ్‌ ఆలయం, భారీ శివలింగం, త్రిశూలం, ఢమరుకం ఆకృతుల్లో డ్రోన్లు ఎగిరి అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. స్వాభిమాన్‌ పర్వ్‌ ఆదివారందాకా కొనసాగనుంది. ఆదివారం ఉదయాన్నే ఇక్కడ జరిగే శౌర్యయాత్రలో మోదీ పాల్గొంటారు. సోమనాథ్‌ ఆలయాన్ని కాపాడే క్రమంలో వీరమరణం పొందిన వాళ్లకు మోదీ నివాళులర్పిస్తారు. వీరుల త్యాగానికి ప్రతీకగా 108 అశ్వాలతో ర్యాలీ చేపట్టనున్నారు. 

పలు కార్యక్రమాలతో మోదీ బిజీ..
తర్వాత మోదీ ఒక ప్రజాకార్యక్రమంలో పాల్గొంటారు. తర్వాత మోదీ రాజ్‌కోట్‌కు వెళ్తారు. అక్కడ కఛ్, సౌరాష్ట్ర ప్రాంతాల అభివృద్ధి కోసం ఏర్పాటుచేసిన వైబ్రెంట్‌ గుజరాత్‌ రీజనల్‌ కాన్ఫెరెన్స్‌ సదస్సులో ప్రసంగిస్తారు. తర్వాత అక్కడి పారిశ్రామిక ఉత్పత్తుల వస్తు ప్రదర్శనశాలను ఆవిష్కరి స్తారు. తర్వాత గుజరాత్‌ పారిశ్రామికాభివృద్ధి కార్పొరేషన్‌ ప్రాంగణంలో 14 గ్రీన్‌ఫీల్డ్‌ స్మార్ట్‌ ఎస్టేట్‌లు, వైద్య ఉపకరణాల పార్క్‌ అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. తర్వాత సాయంత్రం అహ్మదాబాద్‌ చేరుకుంటారు. అక్కడ సెక్టార్‌ 10ఏ నుంచి మహాత్మా మందిర్‌ వరకు నిర్మించిన అహ్మదాబాద్‌ మెట్రో ఫేస్‌2ను ప్రారంభిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement