రాజ్యసభకు నితిన్‌ నబీన్ | BJP president Nitin Nabin set for Rajya Sabha entry | Sakshi
Sakshi News home page

రాజ్యసభకు నితిన్‌ నబీన్‌

Mar 4 2026 4:55 AM | Updated on Mar 4 2026 4:55 AM

BJP president Nitin Nabin set for Rajya Sabha entry

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యసభ ఎన్నికలకు సన్నాహాలను వేగవంతం చేసింది. మంగళవారం 9 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో పార్టీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ను బిహార్‌ నుంచి బరిలోకి దించనుంది.

తొలివిడతగా మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఖాళీ అయ్యే స్థానాలకు బీజేపీ ప్రకటించిన పేర్లు ఇవే..బిహార్‌ నుంచి నితిన్‌ నబీన్, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి శివేష్‌ కుమార్, అసోంనుంచిఎమ్మెల్యే తెరాష్‌ గోవాలా, రాష్ట్ర మంత్రి జోగెన్‌ మోహన్, ఛత్తీస్‌గఢ్‌ నుంచి పార్టీ రాష్ట్ర విభాగం ఉపాధ్యక్షురాలు లక్ష్మీ వర్మ, హరియాణా నుంచి లోక్‌సభ మాజీ ఎంపీ సంజయ్‌ భాటియా, ఒడిశా నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్‌ సామల్, రాజ్యసభ ఎంపీగా ఉన్న సుజీత్‌ కుమార్, పశ్చిమ బెంగాల్‌ నుంచి పార్టీ రాష్ట్ర మాజీ చీఫ్‌ రాహుల్‌ సిన్హా ఉన్నారు. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 37 రాజ్యసభ స్థానాలకు ఈనెల 16వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement