మోదీ యూట్యూబ్‌ చానల్‌కు 3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు | PM Modi YouTube Channel Surpasses 3 Crore Subscribers | Sakshi
Sakshi News home page

మోదీ యూట్యూబ్‌ చానల్‌కు 3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు

Mar 4 2026 4:51 AM | Updated on Mar 4 2026 12:26 PM

 PM Modi YouTube Channel Surpasses 3 Crore Subscribers

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ యూట్యూబ్‌ చానల్‌ 3 కోట్ల సబ్‌స్క్రైబర్ల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఇంత పెద్ద సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు ఉన్న ఏకైక రాజకీయ నాయకుడిగా మోదీ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.

ఇక రెండోస్థానంలో బ్రెజిల్‌ మాజీ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో కొనసాగుతున్నారు. ఆయనకు మోదీకున్న ఫాలోవర్లలో నాలుగోవంతు సబ్‌స్క్రైబర్లున్నారు. ఇక, దేశంలోనూ ఇతర నాయకులతో పోలిస్తే మోదీకి ఎక్కువ సబ్‌స్క్రైబర్లున్నారు. గత నెలలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో 10కోట్ల ఫాలోవర్ల చరిత్రాత్మక మైలురాయిని ప్రధాని అధిగమించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement