Bhadradri
-
మనస్థాపంతో వృద్ధుడి ఆత్మహత్య
టేకులపల్లి: ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సోమవారం కేసు నమోదైంది. టేకులపల్లి ఎస్ఐ పోగుల సురేష్ కథనం ప్రకారం.. మండలంలోని మద్రాస్‌తండా గ్రామానికి చెందిన బాదావత్ చిన్న లక్ష్మా (60) భార్య నాలుగేళ్ల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి మనోవేదనకు గురవుతున్నాడు. ఆదివారం ఉదయం పొలానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు వెతకగా పొలం వద్ద పురుగుల మందు తాగి మృతి చెంది ఉన్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మద్యం మత్తులో మరొకరు... దమ్మపేట: భార్య మందలించిందనే కారణంగా మద్యం మత్తులో ఓ వ్యక్తి సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం... దమ్మపేట గ్రామానికి చెందిన పాండ్ల నాగరాజు(42) మద్యానికి బానిసగా మారి ఏ పనీ చేయకుండా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో భార్య సత్యావతి మందలించింది. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అదనపు ఎస్సై బాలస్వామి తెలిపారు. పేకాట శిబిరంపై దాడిదమ్మపేట: మండల పరిధిలోని మొద్దులగూడెం శివారులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు సోమవారం దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, రూ.2,500 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఏఎస్సై బాలస్వామి తెలిపారు. అత్యాచార యత్నంఇల్లెందు: అత్యాచారానికి యత్నించిన వ్యక్తిపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నెహ్రూనగర్ గ్రామానికి చెందిన భూక్య సునీతపై అదే గ్రామానికి చెందిన నాగరాజు ఇంట్లోకి ప్రవేశించి అత్యాచారానికి యత్నించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ తెలిపారు. బియ్యం లారీ సీజ్అశ్వాపురం: మణుగూరు నుంచి పాల్వంచ వైపు అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని సోమవారం పోలీసులు పట్టుకున్నారు. సీఐ అశోక్‌రెడ్డి, పోలీస్ సిబ్బందితో ప్రత్యేక నిఘా పెట్టి మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ ఎదుట బియ్యం తరలిస్తున్న లారీని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. లారీలో సుమారు 180 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్టు సమాచారం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
రేపు దివ్యాంగుల ఉపకరణాలు పంపిణీ
కొత్తగూడెంఅర్బన్: దివ్యాంగ విద్యార్థులకు ఈ నెల 19న సహాయ ఉపకరణాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తన్నట్లు సమ్మిళిత విద్య కోఆర్డినేటర్ ఎస్కే సైదులు తెలిపారు. సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమగ్ర శిక్షా, ఆర్టిఫిషియల్ లింబ్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో గతేడాది ఆగస్టులో ప్రత్యేక శిబిరం నిర్వహించి, 288 మంది అర్హులను గుర్తించినట్లు పేర్కొన్నారు. వారికి ఈ నెల 19న కొత్తగూడెంలోని ఆనందఖని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలెక్టర్ చేతుల మీదుగా ఉపకరణాలు పంపిణీ చేస్తామని తలెఇపారు. ఎంపికై న అభ్యర్థులు రెండు ఫొటోలు, సదరం ధ్రువపత్రం, పాఠశాల హెచ్ఎం, ఎంఈఓ ధ్రువీకరణతో ప్రభుత్వ వైద్యుడి నుంచి తీసుకున్న మెడికల్ సర్టిఫికెట్, ఆదాయ ధ్రువీకరణ పత్రం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు జిరాక్స్ తీసుకుని రావాలని కోరారు. బ్రెయిలీ కిట్లు–13, హియరింగ్ ఎయిడ్–33, వీల్చైర్లు–76, ఎంఆర్ కిట్లు–96, ట్రైసైకిళ్లు–16, రోలెటర్లు–29, కాలిఫర్స్–23, బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ ట్రైసైకిల్–2, ఇతరాలు–64 పంపిణీ చేస్తారని ఆయన వివరించారు. సమావేశంలో హెచ్ఎం మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదిలో 290 సెల్ఫోన్ల రికవరీ
ఖమ్మం క్రైం: సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వారు సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేస్తుండగా, ఐటీ సెల్ బృందం ట్రాక్ చేశాక స్వాధీనం చేసుకుని బాధితులకు అందిస్తున్నామని ఖమ్మం అదనపు డీసీపీ నరేష్కుమార్ తెలిపారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో రూ.7లక్షల విలువైన 48 ఫోన్లను యజమానులకు ఆయన అందజేసి మాట్లాడారు. ఇందులో రూ.10వేలు మొదలు రూ.1.50 లక్షల విలువైన ఫోన్లు ఉన్నాయని తెలిపారు. ఈ ఏడాది ఇప్పటికే 680 ఫోన్లు పోగొట్టుకున్నట్లు పోర్టల్‌లో నమోదు కాగా 582ఫోన్లను గుర్తించి, 290 ఫోన్లు రికవరీ చేశామని చెప్పారు. ఇందులో కీలకంగా వ్యవహరించిన ఐటీ సెల్ నోడల్ ఆఫీసర్, ఏసీపీ వెంకటేశ్, ఎస్సై సత్యనారాయణ, హెడ్ కానిస్టేబుల్ హేమనాధ్, కానిస్టేబుళ్లు నరేష్, శ్రీనును కమిషనర్, అదనపు కమిషనర్ అభినందించారు. ఖమ్మం అదనపు డీసీపీ నరేష్కుమార్ -
రోడ్డు ప్రమాదంలో సాక్షి ఉద్యోగి మృతి
కొత్తగూడెంటౌన్: మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాక్షి దినపత్రిక ఉద్యోగి సోమవారం మృతి చెందాడు. కొత్తగూడెం వన్‌టౌన్ పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని న్యూగొల్లగూడేనికి చెందిన తాటిపల్లి రాజేష్‌కుమార్(38) సాక్షి దినపత్రికలో సీనియర్ యాడ్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న మధ్యాహ్నం బైక్‌పై రామవరంలో స్నేహితుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట కొత్తగూడెం వైపు వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో రాజేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు అదే కారులో క్షతగాత్రుడిని కొత్తగూడెం జిల్లా సర్వజన ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు, అనంతరం హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి భార్య నాగలక్ష్మి, ఏడేళ్లలోపు కూతుళ్లు ఇద్దరు ఉన్నారు. సాక్షులపై బెదిరింపులు? పోలీసుల విచారణలో ప్రమాదానికి కారణమైన కారు రుద్రంపూర్ తిలక్‌నగర్‌కు చెందిన వ్యక్తిదిగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ప్రభుత్వ సబ్సిడీపై పొందిన కారు అయినప్పటికీ మూడేళ్లుగా నంబర్ ప్లేట్ లేకుండా నడుపుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో కారు నడిపింది ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదాన్ని చూసిన సాక్షులను సైతం కారుతో ఢీకొట్టినవారు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై కొత్తగూడెం వన్‌టౌన్ సీఐ ఎం.కరుణాకర్‌ను వివరణ కోరగా.. బైక్‌ను కారు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. కారు రుద్రంపూర్ తిలక్‌నగర్‌కు చెందిన వ్యక్తిదిగా గుర్తించామని, కేసు దర్యాప్తు చేస్తున్నామని, మృతుడి కుటుంబ సభ్యుల నుంచి ఇంకా ఫిర్యాదు అందలేదని వివరించారు. -
సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి
మణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని పీకే–1 ఇంక్లైన్ ఏరియాలో నిర్మిస్తున్న సెల్ టవర్‌ను నిలిపివేయాలని స్థానికులు సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇప్పటికే బీటీపీఎస్, సింగరేణి, సోలార్ ప్లాంట్, హెచ్‌డబ్ల్యూపీ(ఎం) పరిశ్రమల కారణంగా అధిక కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని, దీనికితోడు సెల్ టవర్ నిర్మిస్తే రేడియేషన్ ప్రభావంతో అనారోగ్యం పాలవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణం సీసా చట్టం, గిరిజన హక్కులకు వ్యతిరేకంగా జరుగుతోందని ఆరోపించారు. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌కు వినతి -
ఇద్దరు నిందితుల అరెస్ట్
భద్రాచలంఅర్బన్: మహిళ మెడలో నుంచి బంగారు ఆభరణాలను అపహరించిన ఇద్దరు వ్యక్తులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ కథనం ప్రకారం.. గత నెల 19న పట్టణంలోని ఇందిరా మార్కెట్లోని కిరాణా షాపులో ఉన్న మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తులు ఆభరణాలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చోరీ ఘటనకు సంబంధించి ఈ నెల 11న ఒకరిని అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందుతులు పరారీలో ఉండగా గాలింపు చేపడుతున్నారు. సోమవారం పట్టణంలోని బ్రిడి్‌జ్ సెంటర్లో వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రూ. 2.35 లక్షల విలువైన ఆభరణాలు, బైక్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. -
న్యూట్రిషియన్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: క్షయ వ్యాధిగ్రస్తులు న్యూట్రిషియన్ కిట్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ డి.వేణుగోపాల్ సూచించారు. సోమవారం లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆయన న్యూట్రిషియన్ కిట్లను పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లాలో 1,050 మందికి కిట్లను అందజేస్తున్నట్లు తెలిపారు. బాధితులకు ప్రభుత్వమే ఉచితంగా ఆరు నెలలపాటు పూర్తిగా ఉచితంగా మందులు అందిస్తుందని పేర్కొన్నారు. వైద్యాధికారులు బి.బాలాజీ, హరీష్, పాయం శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. వేసవిలో జాగ్రత్తలు తీసుకోవాలిఅన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : వేసవిలో చిన్నపిల్లల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి జేఎంఎస్ లెనీనా అన్నారు. మండలంలోని ఎర్రగుంట సెక్టార్ శాంతినగర్ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సోమవారం ఆమె సందర్శించి మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో మొక్కలు నాటి పెంచాలని సూచించారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ సలోని, సూపర్వైజర్ రాణి పాల్గొన్నారు. మహిళపై దాడి ఇల్లెందు: మండలంలోని ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన బానోత్ మంగమ్మ సోమవారం చేను వద్ద పనిచేస్తుండగా అదే గ్రామానికి చెందిన సంపత్ అత్యాచారానికి యత్నించాడు. తప్పించుకుని వెళ్తుండగా రాయితో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నాగరాజు తెలిపారు. ఇసుక ట్రాక్టర్లు సీజ్దుమ్ముగూడెం : అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీఐ అశోక్ కథనం ప్రకారం.. రేగుబల్లి గ్రామ శివారులో గోదావరి నది నుంచి ఇసుక తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో పాత మారేడుబాక గ్రామానికి చెందిన గుండి చిట్టిబాబు, కుర్శం కనకరాజు, తూరుబాక గ్రామానికి చెందిన గుమ్మడి శ్రీనులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. పరస్పరం దాడి : కేసు నమోదుకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం న్యూగొల్లగూడెంలోని ఇద్దరు అన్నదమ్ములు పరస్పరం దాడి చేసుకోగా త్రీటౌన్ పోలీసు స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. న్యూగొల్లగూడేనికి చెందిన సోదరులు గుమ్మడేల్లి రమణ, దుర్గా మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సోమవారం అనుచరులతో ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. పరస్పరం ఫిర్యాదు చేసుకోగా పోలీసులు ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు. కాపర్ వైరు చోరీ చేస్తున్న వ్యక్తి పోలీసులకు అప్పగింత అశ్వాపురం: వ్యవసాయ మోటార్లలో కాపర్ వైరు చోరీ చేస్తున్న వ్యక్తిని రైతులు సోమవారం పట్టుకున్నారు. మండల పరిధిలోని జగ్గారం గ్రామంలో రైతులు పర్శబోయిన సుధాకర్, రాసబంటి లింగరాజు, నాగరాజు, ఆవుల ఎల్లయ్య, మదమంచి నరసింహారావుకు చెందిన మోటార్ల కాపర్ వైరు చేసిన పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామానికి చెందిన మొద్దుల నరేష్‌ను రైతులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇతనిపై గతంంలో పాల్వంచ మండలంలో కేసు కూడా నమోదైనట్లు సమాచారం. మనస్తాపంతో లారీడ్రైవర్ బలవన్మరణం కొణిజర్ల: ఓ వైపు అప్పుల బాధ, మరోవైపు పెళ్లయిన కొద్దిరోజులకే కూతురి భర్త మృతి చెందడాన్ని జీర్ణించుకోలేక మద్యానికి బానిసైన ఓ లారీ డ్రైవర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మండలంలోని తనికెళ్ల గంగెడ్లపాడుకు చెందిన లారీ డ్రైవర్‌కు తాళ్ల ఆనందరావు(51)కు భార్య శౌరమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురు వివాహం చేయగా ఈ ఏడాది జనవరిలో అల్లుడు మృతి చెందాడు. అప్పటి నుంచి మనస్తాపంతో మద్యానికి బానిసైన ఆనందరావు సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయాన ఉరివేసుకుని మృతి చెందాడు. ఘటనపై భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జి.సూరజ్ తెలిపారు. -
అన్నార్తులకు అండగా..
శ్రీరంగనాథ స్వామి ఆశ్రమ సేవా కార్యక్రమాలు ● ప్రతీ గురువారం నిరుపేదల ఇంటి వద్దకే భోజనం ● నిర్వహణతోపాటు ఆర్థికంగా తోడ్పడుతున్న స్థానికురాలు శ్రీదేవి ● దాతలు, మిత్రుల సహకారంతో వారానికోసారి అన్నదానం శ్రీ రంగనాథ స్వామి ఆశ్రమం (ఫైల్) (ఇన్సెట్) షిరిడీ సాయిబాబాశ్రీ రంగనాథ స్వామి ఆశ్రమం అన్నార్తుల ఆకలి తీర్చుతోంది. పరిసర ఐదారు గ్రామాల్లోని అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి గురువారం వారి ఇంటివద్దకే భోజనాలు పంపిస్తోంది. దాతల సహకారంతో వారంలో ఒకసారి 200 మందికి ఆహారం అందిస్తోంది. శివనామస్మరణకు వచ్చిన భక్తుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, స్థానిక మహిళ ఒకరు సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు చూస్తోంది. ఆర్థికంగా అండగా నిలుస్తోంది. –దమ్మపేట ఆశ్రమ ప్రస్థానం దేశంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రాలు శ్రీశైలం, శ్రీకాళహస్తి, అరుణాచలం, కాశీ వంటి సమీప ఆశ్రమాల్లో శివ నామస్మరణ సాధన చేసిన రంగనాథస్వామి అనే భక్తుడు 2017లో మండలంలోని ముష్టిబండ గ్రామ శివారులో వేంచేసియున్న స్వయంభూ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ సన్నిధికి చేరుకున్నాడు. శివాలయం సమీపంలో గుట్టపై ప్రశాంత వాతావరణం ఉండటంతో ధ్యానం చేయసాగాడు. దీంతో పలువురు భక్తులు కూడా ధ్యానానికి రావడం ప్రారంభించారు. భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో దాతల సహకారంతో 2021లో చిన్నపాటి భవనం నిర్మించి ఆశ్రమం ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రతి గురువారం అన్నదానం చేస్తున్నాడు. తొలుత 11 మందితో అన్నదానం ప్రారంభమైంది. సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి.. ముష్టిబండకే చెందిన యూకేలో, అనంతరం బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన కూకలకుంట శ్రీదేవి గ్రామానికి వచ్చినపుడు ఆశ్రమానికి ఆర్థికసాయం అందించేంది. 2018లో నెలకు రూ.1.20 లక్షల ఉద్యోగం మానేసి ఆశ్రమంలో సేవకు అంకితమై నిర్వహణ బాధ్యతలు చూసుకుంటోంది. విదేశాల్లో ఉంటున్న తన సోదరి, మిత్రుల సహకారంతో అన్నదానం కార్యక్రమం కొనసాగిస్తోంది. ప్రస్తుతం ప్రతి గురువారం సుమారు 200 మందికి భోజనాలు అందిస్తున్నారు. దాతలు, సేవకుల సహకారంతో ఆశ్రమం వద్దనే వంట చేసి, పార్సిళ్లు కట్టించి నిరుపేదల ఇంటికి చేర్చుతున్నారు. ముష్టిబండ, వడ్లగూడెం, మందలపల్లి, మల్కారం తదితర గ్రామాల్లో అనాథలు, వృద్ధులు, దివ్యాంగులకు ఆకలి తీర్చుతున్నారు. సమీప గ్రామాలకు చెందిన సుమారు 10 మంది వరకు మహిళలు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. ఇతర సేవా కార్యక్రమాలు ఆశ్రమం ఆధ్వర్యంలో చలికాలంలో దుప్పట్లు, స్వెటర్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కరోనా సమయంలోబాధితులకు నిత్యావసరాలను వితరణ చేశారు. ప్రతి గురువారం పేదల ఇంటి వద్దకే భోజనం పంపిస్తున్నామని దాతల సహకారం అందిస్తే ఆశ్రమంలోనే అనాధ శరణాలయం ప్రారంభిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. 2023లో సాయిబాబా ఆలయ నిర్మాణం ఆశ్రమంపై మొదటి అంతస్తులో షిరిడీ సాయిబాబా ఆలయం నిర్మించారు. ఆశ్రమ బాధ్యురాలైన శ్రీదేవి తన సొంత డబ్బులతో పాటు దాతలు, బంధువులు, మిత్రుల ఆర్థిక సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఆలయంలో శ్రీదత్తాత్రేయ, గణపతి సహిత సాయిబాబా విగ్రహాలను ప్రతిష్టించారు. 2023 అక్టోబర్ 23న ఆలయం ప్రారంభంకాగా, 2024 అక్టోబర్ 21న విగ్రహా ప్రతిష్ఠాపన జరిగింది. -
‘పది’ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
కొత్తగూడెంఅర్బన్ : ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఎస్.మాధవరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది 12,282 మంది రెగ్యులర్, 686 మంది ప్రైవేట్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, వీరి కోసం 73 కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు 73 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 77 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 871 మంది ఇన్విజిలేటర్లు, 73మంది సిట్టింగ్, 5 ఫ్లయింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలి పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరిగే పరీక్షలకు విద్యార్థులు గంట ముందుగానే కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కేంద్రాల్లోకి అనుమతించరని, పరీక్ష విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు సైతం సెల్‌ఫోన్ అనుమతి లేదని స్పష్టం చేశారు. పరీక్ష సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసివేయిస్తామని, 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ నంబర్ 99666 00678 ను సంప్రదించాలని సూచించారు. మాధారం పాఠశాలలో తనిఖీములకలపల్లి: మండలంలోని మాధారం ప్రాథమికోన్నత పాఠశాలను డీఈఓ వెంకటేశ్వరా చారి, జిల్లా ప్లానింగ్ కో–ఆర్డినేటర్ సతీష్‌కుమార్ సోమవారం తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో నిర్మిస్తున్న టాయిలెట్లను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి, వారి సామర్థ్యాలను పరిశీలించారు. డీఈఓ వెంకటేశ్వరా చారి -
ఇంటి వద్దకే రాములోరి తలంబ్రాలు
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాచలంలో వచ్చేనెల 6న జరగనున్న శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణానికి హాజరుకాలేని భక్తులకు తలంబ్రాలు ఇంటి వద్దే అందించనున్నట్లు ఆర్టీసీ ఖమ్మం రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. టీజీఎస్ ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇందుకోసం భక్తులు రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో ద్వారా బుక్ చేసుకుంటే ముత్యంతో కూడిన తలంబ్రాల ప్యాకెట్‌ను ఇంటి వద్దే అందిస్తామని తెలిపారు. ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా లేదా బస్టాండ్లలోని కార్గో పాయింట్లు, ఏజెంట్ల వద్ద బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ●సత్తుపల్లిటౌన్: భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ ముత్యాల తలంబ్రాల బుకింగ్ వివరాలతో రూపొందించిన కరపత్రాలను సత్తుపల్లిలో ఆర్టీసీ డీఎం యు.రాజ్యలక్ష్మి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ విజయశ్రీ, ఎంఎఫ్ ఎస్.సాహితీ, మునీర్‌పాషా, బాబురావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ కార్గో ద్వారా చేరవేసేలా ఏర్పాట్లు ఆన్లైన్ లేదా కార్గో పాయింట్లలో బుకింగ్‌కు అవకాశండిపోల వారీగా సంప్రదించాల్సిన నంబర్లు ఖమ్మం 91542 98583 మధిర 91542 98584 సత్తుపల్లి 91542 98585 భద్రాచలం 91542 98586 కొత్తగూడెం 91542 98587 మణుగూరు 91542 98588 ఇల్లెందు 91542 98587 -
ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యం
మణుగూరు రూరల్: విద్యుత్ ఉద్యోగుల సంక్షేమానికి జెన్కో సంస్థ ప్రాధాన్యమిస్తోందని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ సీఈ బి.బిచ్చన్న తెలిపారు. తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ యూనియన్(టీఎస్‌పీఈయూ)–1535 వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులు వృత్తి నైపుణ్యం పెంపొందించుకుంటూ అధిక ఉత్పత్తికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు వి.ప్రసాద్, ఆర్.రామచందర్, ఎం.రాజమనోహర్, ఎస్డి రఫీ, టి.అనిల్‌కుమార్, ఎ.వెంకటేశ్వర్లు, జార్జ్, పుల్లారావు, జి రవికుమార్, వీరబాబు, వింజమూరు మురళి, చిక్కా వెంకటరమణ, ఆర్.రవిచంద్ర, జానీ బేగం, ఈశ్వరి, సునీత తదితరులు పాల్గొన్నారు. బీటీపీఎస్ సీఈ బిచ్చన్న -
‘రాబిన్ హుడ్’ ప్రేక్షకులకు నచ్చుతుంది..
● సినీ నిర్మాత రవిశంకర్ ● హీరో నితిన్‌తో కలిసి గుబ్బల మంగమ్మ ఆలయ సందర్శన అశ్వారావుపేటరూరల్: ఛలో, భీష్మ సినిమాల తర్వాత హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్లో నిర్మించిన రాబిన్ హుడ్ చిత్రం ప్రేక్షకులకు నచ్చుతుందని మైత్రీ మూవీ మేకర్ బ్యానర్ నిర్మాత రవిశంకర్ అన్నారు. ఏపీ – తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులోని అశ్వారావుపేట అటవీ ప్రాంతంలో గల శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయాన్ని హీరో నితిన్‌తోపాటు చిత్ర బృందం సోమవారం సందర్శించింది. హీరో నితిన్ అమ్మవారికి మొక్కులు చెల్లించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ.. ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా పలు థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సెన్సార్ వర్క్ జరుగుతోందని, ప్రమోషన్ల పనుల్లో ఉన్నట్లు చెప్పారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా సినిమా ఉంటుందన్నారు. దర్శకుడు వెంకీ మాట్లాడుతూ.. తన తొలి చిత్రం ఛలో, ఆ తర్వాత వచ్చిన భీష్మ సినిమాలు గుర్తింపు తెచ్చాయని, తాజా సినిమా ద్వారా ప్రేక్షకులకు వినోదంతోపాటు మంచి సందేశం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ హీరో చిరంజీవితో కూడా త్వరలోనే సినిమా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ ప్రకాశ్‌రావు, కుడుముల రంగారావు, మదాల నాగేశ్వరరావు, రాజు పాల్గొన్నారు. -
సీజ్ చేసిన వాహనాలు దగ్ధం
ములకలపల్లి: వివిధ ఘటనల్లో అధికారులు సీజ్ చేసిన వాహనాలు అగ్గికి ఆహుతయ్యాయి. మండలకేంద్రంలోని పాత పోలీస్‌స్టేషన్ ఎదురుగా గెస్ట్‌హౌస్ సమీపంలో సుమారు పదేళ్లుగా స్వాధీనం చేసుకున్న వాహనాలను నిలిపి ఉంచారు. సోమవారం ఆ ప్రదేశంలో నిప్పు అంటుకుని మంటలు చెలరేగాయి. మంటలు అంటుకుని వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. స్థానికులు, గ్రామపంచాయతీ సిబ్బంది వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు చల్లి మంటలను అదుపు చేశారు. కాగా పోలీస్ స్టేషన్‌ను నూతన ప్రదేశంలో మార్చిన క్రమంలో వాహనాలను కూడా అక్కడికి తరలిస్తే ముప్పు తప్పి ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. -
మిర్చి తగులబెట్టిన ఘటనలో...
పినపాక: ఇటీవల వెంకటరావుపేట గ్రామంలో కల్లంలో మిర్చిని తగలబెట్టిన నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ.బయ్యారం పోలీసుల కథనం ప్రకారం..అదే గ్రామానికి చెందిన తాండ్ర బాలకృష్ణ, అతని బంధువు పంచర్ల వెంకటేశ్వర్లు కలిసి పురుషోత్తం అనే రైతుకు చెందిన మిర్చిపై ఈ నెల 10న అర్ధరాత్రి పెట్రోల్ పోసి నిప్పంటించారు. పురుషోత్తం చేతబడి చేయడంతోతోనే తన భార్య చనిపోయిందని బాలకృష్ణ కక్ష పెంచుకుని ఈ ఘటనకు పాల్పడినట్లు విచారణలో వెల్లడయింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజ్ కుమార్ తెలిపారు. -
సింగరేణి ఆస్తులను కాపాడాలి
సింగరేణి(కొత్తగూడెం): శిక్షణలో నేర్చుకున్న అంశాలను విధి నిర్వహణలో అమలు చేస్తూ సంస్థ ఆస్తులను కాపాడాలని సింగరేణి ఎస్అండ్పీసీ ట్రైనింగ్ ఆఫీసర్, సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ జాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు. సోమవారం కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని ట్రైనింగ్ సెంటర్లో 35వ బ్యాచ్ సిబ్బందికి ఫస్డ్ ఎయిడ్ అండ్ ఫైర్ ఫైటింగ్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సెక్యూరిటీ సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి.నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన బాలాజీ బ్రహ్మోత్సవాలు
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా యజ్ఙాచార్యులు ప్రతాపురం గిరిధరాచార్యులు ఆధ్వర్యంలో ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు స్వామివారికి మహాపూర్ణాహుతి, బలిహరణం, చక్రస్నానం, ద్వజావరోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి శృంగార డోలోత్సవంతో వేడుకలు ముగిసినట్లు అర్చకులు ప్రకటించారు. ఆలయ ఇన్చార్జ్ మేనేజర్ పాకాల వెంకటరమణ పాల్గొన్నారు. రామాలయంలో సుదర్శన హోమంభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో సోమవారం చిత్తా నక్షత్రం సందర్భంగా సుదర్శన హోమం చేశారు. అలాగే స్వామివారి మూలమూర్తులను ముత్తంగి రూపంలో అలంకరించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలిభద్రాచలం: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ అన్నారు. ఐటీడీఏలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన గిరిజన దర్బార్‌లో దరఖాస్తులను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ వినతిపత్రాలు సమర్పించే వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి దరఖాస్తును నమోదు చేసి ఆర్హతల మేరకు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్డీసీ రవీంద్రనాథ్, గురుకులాల ఆర్సీఓ నాగార్జున రావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ చంద్రశేఖర్, ఎస్ఓ భాస్కర్, మణిధర్, ఉదయ్‌కుమార్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ‘బైరెడ్డి’చుంచుపల్లి: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర నాయకత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల విభజనకు ముందు కూడా ఆయన జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. విభజన తర్వాత 2017 నుంచి 2020 వరకు భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. అనంతరం ములుగు, మహబూబాబాద్ జిల్లాల అధ్యక్షుడిగా కూడా కొంతకాలం పనిచేశారు. తిరిగి రెండో సారి ప్రభాకర్‌రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఆయన నియామకం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు..కొత్తగూడెంఅర్బన్: గతేడాది జనవరిలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 31 మంది స్టాఫ్ నర్సులకు, 33 మంది ఎంఎల్‌హెచ్‌పీ అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలు అందించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ భాస్కర్‌నాయక్ మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు బాలాజీ, సుదర్శన్, సిబ్బంది చిన్నోజీ, ధనుజా తదితరులు పాల్గొన్నారు. -
పక్షం రోజుల్లో పరిష్కారం
పెదవాగు సమస్యకు అశ్వారావుపేటరూరల్/చండ్రుగొండ/ములకలపల్లి : పెదవాగు ప్రాజెక్టు సమస్యను 15 రోజుల్లో కొలిక్కి తెస్తానని, దీనిపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎస్‌లకు నోటీసులు జారీ చేసి ఢిల్లీకి వచ్చేలా చేస్తానని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ అన్నారు. గతేడాది జూలై 18న గండ్లు పడిన పెదవాగు ప్రాజెక్టును సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన తర్వాత ఇది ఇంటర్ స్టేట్ ప్రాజెక్టుగా మారిందని, పునఃనిర్మాణం చేయాలంటే జీఎంఆర్బీ నిబంధనల ప్రకారం తెలంగాణ 15 శాతం, ఏపీ 85 శాతం వాటా నిధులు కేటాయించాల్సి ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల సమన్వయంతోనే నిధుల విడుదల సాధ్యమని చెప్పారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో పాటు భద్రాద్రి, ఏలూరు జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ ఎస్ఈలను ఢిల్లీ పిలిపించి ఈ సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని తెలిపారు. ఇద్దరు ముఖ్యమంత్రులతోనూ చర్చిస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయలపై మాట్లాడుతూ అసభ్య పదజాలం వాడడంతో ఉన్నతాధికారులు, రైతులు, ప్రజలు విస్మయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన ప్రసంగం పూర్తి కాకముందే సభకు హాజరైన పలువురు వెనుదిరిగారు. అంతకుముందు ఆయన రెడ్డిగూడెంలో కొండరెడ్లతో మాట్లాడి జాతీయ ఎస్టీ కమిషన్, ట్రైకార్, ఐటీడీఏ ద్వారా కల్పించే అవకాశాలు, రుణాల గురించి వివరించారు. పెదవాగు సమీపంలోని శ్రీ గంగానమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. వెంగళరాయ సాగర్ పరిశీలన.. చండ్రుగొండ మండలం సీతాయిగూడెం సమీపంలోని వెంగళరాయసాగర్‌ను హుస్సేన్‌నాయక్ పరిశీలించారు. ఇది శిథిలావస్థకు చేరి ఆరేళ్లయినా పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికీ శాశ్వత మరమ్మతులు చేయించలేదని, ఒక పంటకు కూడా నీళ్లు సరిపోవడం లేదని రైతులు, చేపలు సక్రమంగా పెరగడం లేదని మత్స్యకారులు ఆయన దృష్టికి తెచ్చారు. అనంతరం మాట్లాడుతూ జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా పేదరైతులు ఆధారపడిన ఈ ప్రాజెక్ట్ మరమ్మతులకు నిధులు మంజూరు చేయకపోవడం విచారకరమన్నారు. పేదల దుస్థితిపై మంత్రులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. గిరిజనుల ఓట్లతో గెలుపొందిన వారు పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. ఆర్ఓఆర్ పట్టాలు పొందిన భూముల్లో విద్యుత్ సదుపాయం, బోరుబావుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్‌కు సూచించారు. ఆ తర్వాత ములకలపల్లి మండలం సండ్రకుంటలో జరిగిన ఎస్టీ కోయ ఇష్టాగోష్టిలో మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర పోతోందని ఆరోపించారు. ఆదివాసీలకు ఏమైనా సమస్యలుంటే ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఎస్టీ కమిషన్ కోర్టు లాంటిదని, సత్వర సమస్యల పరిష్కారానికి ఇది మంచి మార్గమని తెలిపారు. మారుమూల ఏజన్సీ గ్రామాల్లో జేవీఆర్ ట్రస్ట్ చేపడుతున్న సేవలు అభినందనీయమన్నారు. గ్రామంలో సిమెంట్ రేకులతో షెడ్డును పోలిన అంగన్వాడీ కేంద్రాన్ని చూసి విస్మయం వ్యక్తం చేశారు. గ్రామానికి చెందిన సత్యావతి అంగన్వాడీ టీచర్‌గా పని చేస్తున్నారని, ఆమె అత్త నాగమ్మ రెండు కుంటల భూమి దానం ఇవ్వడంతో, తాత్కాలికంగా రేకులు వేసి, క్లాసులు నిర్వహిస్తున్నట్లు చెప్పగా పక్కా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీడీఏ పీఓ రాహుల్, ఆర్డీఓ మధుసూదన్, డీఎఫ్ఓ కృష్ణాగౌడ్, మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు, ఎన్పీడీసీఎల్ ఎస్ మహేందర్, ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, ఐటీడీఏ డీడీ మణెమ్మ ఎస్ఈ శ్రీనివాసరెడ్డి, ఈఈ సురేష్‌కుమార్, డీఈలు కృష్ణ, బాపనయ్య ములకలపల్లి తహసీల్దార్ పుల్లారావు, ఎంపీడీఓ రేవతి పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల అధికారులతో ఢిల్లీలో చర్చిస్తా రెండు రాష్ట్రాల సీఎంలతోనూ మాట్లాడుతా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ వెల్లడి అశ్వారావుపేట, చండ్రుగొండ, ములకలపల్లి మండలాల్లో పర్యటన సమన్వయంతోనే సాధ్యంపెదవాగు ప్రాజెక్టు పునఃనిర్మాణానికి సాంకేతిక సమస్యలు ఉన్నాయని, ఇరు రాష్ట్రాల సమన్వయంతోనే పరిష్కారం సాద్యమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ప్రాజెక్టు పునఃనిర్మాణానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని, ఇప్పుడున్న మూడు గేట్లను పెంచాల్సి ఉంటుందని చెప్పారు. డిజైన్ సక్రమంగా ఉంటేనే మరో 50 ఏళ్ల పాటు ప్రాజెక్టు నిలుస్తుందని వివరించారు. వెంగళరాయ ప్రాజెక్ట్ శాశ్వత మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు. ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు ఆయిల్‌పాం సేద్యంపై దృష్టి సారించాలని సూచించారు. -
●జాతి వైరం మరిచి..
కుక్క పిల్లను లాలిస్తున్న వానరం డీఎస్పీ జవహర్లాల్ మృతి తీరని లోటు రఘునాథపాలెం: ప్రజలకెంతో సేవ చేసే మంచి అధికారిని కోల్పోవడం తీరని లోటు అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, విత్తన, గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ సోదరుడు డీఎస్పీ జవహర్లాల్ సంతాపసభ ఆదివారం మండలంలోని ఆయన స్వగ్రామం ఈర్లపుడిలో నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్లాల్ చిత్రపటానికి పూలమాల వేసిన వారు మాట్లాడారు. నివాళులర్పించిన వారిలో మార్కెట్ కమిటీ చైర్మన్ వై.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే మదనలాల్, లింగాల కమల్‌రాజు, గుండాల కృష్ణ, నాగండ్ల కోటేశ్వరరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బచ్చు విజయ్‌కుమార్, గుత్తా రవి, మెంటం రామారావు, చెరుకూరి ప్రదీప్, తాత వెంకటేశ్వర్లు, దయాకర్, మాటేటి కిరణ్, అబ్బాస్, నరసింహారావు, వెంకటేశ్వర్లు, చిన్నా, శ్రీనివాస్, వాంకుడోత్ దీపక్, పుచ్చకాయల వీరభద్రం, పోటు లెనిన్, మల్లికార్జున్‌రావు, బానోతు మంజుల, తనయ్రాదే, ఆకాంక్ష, రామకోటి, సుందర్‌లాల్, మంగీలాల్, మోతీలాల్, మణిలాల్ తదితరులు ఉన్నారు. -
తాగునీటిలో విషప్రయోగం
తిరుమలాయపాలెం: కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుని అంతమొందించేందుకు తాగునీటిలో విషం కలిపి హత్య చేసిన ఘటన మండలంలోని సోలీపురం శివారు పీక్యాతండాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన బానోతు రామోజీ (59) కాకరవాయి గ్రామంలో ఓ రైతు భూమిని కౌలుకి తీసుకున్నాడు. రామోజీ పక్కనే ఇదే తండాకు చెందిన బానోతు రవి మరో రైతు భూమిని అధిక ధరకు కౌలుకి తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఈ క్రమంలో రామోజీ చేస్తున్న భూమిని కౌలుకి తీసుకునేందుకు కుట్ర పన్నాడు. కొన్నిసార్లు వివాదాలు కూడా చోటుచేసుకున్నాయి. గత నెల (ఫిబ్రవరి) 12న రామోజీ చేను వద్ద తాగునీటి క్యాన్ని పెట్టుకోగా ఎలాంటి అనుమానం రాకుండా రవి విషం కలిపాడు. ఇది గమనించని రామోజీ ఆ నీటిని సేవించి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా విషం కలిపిన నీటిని సేవించినట్లు గుర్తించి రామోజీ కుమారుడు కొందరు అనుమానితులపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. బానోత్ రవిపై అనుమానం వచ్చి పోలీసులు విచారించగా తాగునీటిలో విషం కలిపింది తానేనని ఒప్పుకున్నాడు. చికిత్స పొందుతున్న రామోజీ శనివారం సాయంత్రం మృతిచెందాడు. దీంతో పీక్యాతండాలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకోవడంతో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయగా అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కూచిపూడి జగదీశ్ తెలిపారు. నీరు సేవించిన రైతు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి -
పొలాల్లో మోటార్ల వైరు చోరీ
అశ్వారావుపేటరూరల్: పంట పొలాల్లో ఉన్న విద్యుత్ మోటార్లకు సంబంధించిన సర్వీస్ వైర్లను గుర్తు తెలియని దుండగులు శనివారం అర్ధరాత్రి అపహరించారు. బాధిత రైతుల కథనం ప్రకారం.. మండలంలోని తిరుమలకుంట, తిరుమలకుంట కాలనీ, రెడ్డిగూడెం, బండారిగుంపు, తోగ్గూడెం, పాకలగూడెం గ్రామాల్లో ప్రధాన రహదారుల పక్కనే ఉన్న రైతుల పొలాల్లో 30 మోటార్లకు సంబంధించిన సర్వీస్ వైర్లను చోరీ చేశారు. ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు.. మోటార్ల వైర్లు కట్ చేసి ఉండటాన్ని గుర్తించారు. ఎవరో చోరీ చేశారని రైతులు తెలిపారు. ఎస్ఐ యయాతి రాజును వివరణ కోరగా.. చోరీ ఘటనలపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు అందలేదని తెలిపారు. రెండు కార్లు ఢీ : పలువురికి గాయాలు ములకలపల్లి: మండలంలోని కొత్తగంగారం అటవీ ప్రాంతంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో పలువురు గాయాలపాలయ్యారు. స్థానికుల కథనం మేరకు.. కాకినాడకు చెందిన భక్తుబృందం కారులో ఆదివారం భద్రాచలం సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకొని తిరిగి బయలుదేరారు. వెంకటాపురానికి చెందిన కొందరు కారులో రాజమండ్రి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గంగారం అటవీ ప్రాంతంలో ఈ రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొనగా.. రెండు కార్లలోని పలువురు గాయాలపాలైనట్లు తెలిసింది. ఎస్ఐ రాజశేఖర్‌ను వివరణ కోరగా.. ఘటనా స్థలాన్ని పరిశీలించామని, ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. -
ఆ మొక్కలూ ఆఫ్టైపే..
స్పందించని ఆయిల్ ఫెడ్ యాజమాన్యం దమ్మపేట: పామాయిల్ సాగులో కొన్ని మొక్కలు చనిపోగా, వాటి స్థానంలో ఆయిల్ ఫెడ్ నర్సరీ అందజేసిన మొక్కలు కూడా ఆఫ్‌టైప్ కావడంతో రైతులు నిర్ఘాంతపోతున్నారు. మండలంలోని జగ్గారం గ్రామానికి చెందిన రైతు చెలికాని సూరిబాబు తన కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న 30 ఎకరాల భూమిలో ఏడేళ్ల నుంచి పామాయిల్ సాగు చేస్తున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల కిందట తోటలో 50 మొక్కలు చనిపోగా, వాటి స్థానంలో ఆయిల్ ఫెడ్ నర్సరీ నుంచి తెచ్చిన కొత్త మొక్కలను నాటి, సాగు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో మూడేళ్ల సాగు అనంతరం 50 మొక్కల్లో 30 మొక్కలు ఆఫ్టైప్కి చెందినవని తెలిసింది. ఈ మొక్కలకు ఎలాంటి గెలల కాపు లేకపోగా, వాటి సాగుకు పెట్టిన పెట్టుబడి సైతం వృథాగా భావించిన రైతు, వాటిని నరకడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ఆయిల్ ఫెడ్ ఫీల్డ్ అసిస్టెంటు, ఉన్నతాధికారులు వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించే వరకు నరకవద్దని సూచించారు. రోజులు గడుస్తున్నా ఏ ఒక్క ఉన్నతాధికారి తోట సందర్శనకు వచ్చిందే లేదని రైతు వాపోతున్నాడు. ఈ ఆఫ్‌టైప్ మొక్కలతో రూ.లక్షల్లో రైతులకు నష్టం జరుగుతున్నప్పటికీ ఆయిల్‌ఫెడ్ యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం శోచనీయమన్నాడు. ఉన్నతాధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, రైతులకు న్యాయం చేయాలని కోరారు. -
గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయం
జూలూరుపాడు: గ్రామాల సమగ్రాభివృద్ధే ధ్యేయమని వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్‌నాయక్ అన్నారు. ఆదివారం రాత్రి జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఆయన శంకుస్థాపన చేశారు. పూనెం కృష్ణకుమారి, పూనెం నాగేంద్రమ్మ, బండారు నాగేశ్వరరావు, బండారు చిన్న నరసింహారావు లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. పేదోడి సొంతింటి కలను నిజం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అనంతారం గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారని, 85 ఇళ్లను రూ.4.25 కోట్లతో నిర్మిస్తారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి పథకాలను కొనసాగిస్తోందని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని వరంగల్ రైతు సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటిస్తే.. ఆగస్టు 15వ తేదీ నాటికి రాష్ట్రంలోని రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించారని వెల్లడించారు. కార్యక్రమంలో లేళ్ల వెంకటరెడ్డి, మాళోత్ మంగీలాల్‌నాయక్, అల్లాడి నరసింహారావు, శంకర్, కరుణాకర్‌రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, బాదావత్ రవి, డేవిడ్, ఆదినారాయణ, దొండపాటి శ్రీనివాసరావు, బానోత్ లాలునాయక్, వేల్పుల నరసింహారావు, కంచర్ల హరీశ్, ధరావత్ రాంబాబు, కొర్సా రమేశ్, ఉసికల వెంకటేశ్వర్లు, మల్కం వీరభద్రం, లబ్ధిదారులు పాల్గొన్నారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ -
ఘనంగా పసుపు దంచే వేడుక..
పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాసగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం(గుట్ట)పై మార్చి 24వ తేదీన జరగనున్న శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవెంకటేశ్వర స్వామి కల్యాణ మహోత్సవం పురస్కరించుకుని ఆదివారం పసుపు దంచే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు తోలేటి నగేశ్‌శర్మ, ఆరుట్ల ఫణిరాజాచార్యులు ఆధ్వర్యంలో సుమారు 800 నుంచి 1000 మంది మహిళలు పసుపుకొట్టి స్వామి వారి కల్యాణ తలంబ్రాలు కలిపారు. ఈ సందర్భంగా స్వామి కల్యాణ విశేషాలను తెలుపుతూ వీడియో టీజర్‌ను వికాస తరంగిణి జిల్లా అధ్యక్షురాలు దేవినేని రోజారమణి ఆవిష్కరించారు. ఈ నెల 22 జరగనున్న శ్రీనివాస గిరి సంకీర్తన కరపత్రాన్ని కంచర్ల భార్గవ్ – శ్రావ్య, బుగ్గవీటి ఫణీంద్రబాబు – విజయలక్ష్మి దంపతులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆరుట్ల లక్ష్మణాచార్యులు, పసుమర్తి వెంకటేశ్వరరావు, కందుకూరి రామకృష్ణ, తాటికొండ శ్రీలత, లక్ష్మిరెడ్డి, వంకదారు నర్సింహకుమార్, బండి వెంకటేశ్వర్లు, కంఠాల వెంకటేశ్వరరావు, మేదరమెట్ల శ్రీనివాసరావు, మిట్టపల్లి నర్సింహారావు, పురుషోత్తం, జమ్ముల సీతారామిరెడ్డి, రమేశ్, రాంజీఅంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు. 24న శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం -
రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు షురూ..
కొత్తగూడెంటౌన్: పట్టణంలోని ఉర్దూ ఘర్‌లో ఆదివారం రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలను జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్డర్ గంగిరెడ్డి యుగేందర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విజేతలకు ఆయనతోపాటు ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జిల్లా సెక్రటరీ మొగిలి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో లగడపాటి రమేశ్, తైక్వాండో అధ్యక్షులు నిట్ట ప్రసాద్, నాగా సీతారాములు, నగేశ్, కనుకుంట్ల కుమార్, సారంగపాణి, శ్రీను, నరసింహారావు, భువనేశ్, రమాదేవి, జగన్, పద్మ, కింటూ తదితరులు పాల్గొన్నారు. విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలి ఖమ్మంమయూరిసెంటర్: విద్యారంగానికి బడ్జెట్లో 30 శాతం నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ సమితి సభ్యులు ఇటికాల రామకృష్ణ కోరారు. ఆదివారం ఖమ్మంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యారంగానికి ఎన్నో చేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం నిధులు కేటాయించడం లేదని, దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని వాపోయారు. కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఖమ్మంలో యూనివర్సిటీ ఎర్పాటు చేస్తామని హామీ ఇచ్చిందని, దీనిని అమలు చేయాలన్నారు. సమీకృత గురుకులాల ఏర్పాటు ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేయడమేనని రామకృష్ణ ఆరోపించారు. సమావేశంలో లక్ష్మణ్, మధు, శివనాయక్, మనోజ్, గోపి, ప్రతాప్, నరేశ్, సాయి తదితరులు పాల్గొన్నారు. లోక్యాతండాలో ముగిసిన హోలీకూసుమంచి: మండలంలోని లోక్యాతండాలో మూడు రోజుల హోలీ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. తండాలో రంగోలి కార్యక్రమాన్ని నిర్వహించారు. తండావాసులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ, డప్పులు వాయిస్తూ ఆట పాటలతో ఆనందంగా గడిపారు. మహిళలు సైతం నృత్యం చేస్తూ సందడి చేశారు. దేవాలయాల నిర్మాణాలకు విరాళం కామేపల్లి: మండలంలోని మర్రిగూడెం, తాళ్లగూడెం, కెప్టెన్‌బంజర గ్రామాల్లోని దేవాలయాల నిర్మాణాలకు మర్రిగూడెం గ్రామానికి చెందిన డీఎన్సీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దిరిశాల నరేశ్చౌదరి ఆదివారం కమిటీ సభ్యులకు విరాళాలు అందజేశారు. కెప్టెన్బంజరలోని శ్రీ రామాలయంలో ధ్వజస్తంభానికి, మర్రిగూడెంలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయ నిర్మాణానికి తొలుత రూ.3 లక్షలు కమిటీ సభ్యులకు అందజేశారు. తాళ్లగూడెంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ నిర్మాణానికి రూ.5 లక్షలు అందిస్తామని చెప్పి కమిటీ సభ్యులకు రూ.2 లక్షల నగదును అందజేశారు. దీంతో గ్రామస్తులు దాత నరేశ్చౌదరిని సత్కరించారు. కార్యక్రమంలో దిరిశాల ధనమ్మ, తోటకూరి శివయ్య, నల్లమోతు లక్ష్మయ్య, నల్లమోతు వెంకటనర్సయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పేకాటస్థావరంపై దాడి ఎర్రుపాలెం: మండలంలోని కాచవరం సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఎస్ఐ వెంకటేశ్ కథనం ప్రకారం.. విశ్వసనీయ సమాచారం మేరకు ఏపీ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా మొర్సుమల్లి గ్రామానికి చెందిన ఆరుగురు కాచవరం సమీపంలో పేకాట ఆడుతుండగా అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.3 వేల నగదు, ఐదు సెల్ఫోన్లు, 4 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
మక్కల కొనుగోళ్లకు రెడీ..
● మార్క్‌ఫెడ్ ద్వారా రెండు జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటు ● వచ్చేనెల రెండో వారం నుంచి కొనుగోళ్లకు సిద్ధం ● ఉమ్మడి జిల్లాలో 1.27లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగుఖమ్మంవ్యవసాయం: యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట కొనుగోళ్లకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా మక్కల కొనుగోళ్లకు ప్రభుత్వం నిర్ణయించగా.. సీజన్ సమీపించడంతో మార్క్‌ఫెడ్ రాష్ట్ర అధికారులు ఇటీవల జిల్లాల అధికారులకు దిశానిర్దేశం చేశారు. పంట సాగు చేసిన ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాల గుర్తింపు, రవాణా తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే సమయాన కొనుగోలు చేసిన పంట రవాణాకు సంబంధించి గత విధానం కాకుండా ఆన్లైన్ టెండర్ విధానాన్ని అమలు చేయాలని పేర్కొన్నారు. అత్యధికంగా జిల్లాలో... రాష్ట్రంలో మొక్కజొన్న యాసంగి పంట సాగు విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లాల్లో ఉమ్మడి ఖమ్మం కూడా ఒకటి. మొక్కజొన్నలను ప్రధానంగా కోళ్ల పరిశ్రమల్లో దాణాగా వినియోగిస్తుంటారు. అయితే, ఇటీవల కోళ్లకు వైరస్ వ్యాపిస్తోందని పరిశ్రమల యజమానులు వాటి ఉత్పత్తిని తగ్గించడంతో ప్రైవేట్ మార్కెట్లో మక్కల ధరపై సందిగ్ధత నెలకొంది. కాగా, ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం మక్కలకు క్వింటాకు రూ. 2,225గా మద్దతు ధర నిర్ణయించింది. కానీ ప్రైవేట్ మార్కెట్లో క్వింటా ధర రూ.2,150 మించకపోగా, భవిష్యత్ పరిస్థితి ఏమిటో తెలియడం లేదు. దీంతో రైతులకు మద్దతు ధర దక్కేలా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గత ఏడాదితో పోలిస్తే ఎక్కువే.. ప్రస్తుత యాసంగి సీజన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1.27 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశారు. నీటి వనరుల ఆధారంగా ఖమ్మం జిల్లాలో 94 వేల ఎకరాల్లో, భద్రాద్రి జిల్లాలో 33 వేల ఎకరాల్లో పంట వేశారు. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 80 వేల ఎకరాల్లో పంట సాగైతే ఈ ఏడాది మరో 50 వేల ఎకరాల్లో సాగవడం విశేషం. వానాకాలం కురిసిన వర్షాలతో జలాశయాల్లో నీరు ఉండడం, జిల్లాకు ప్రధాన నీటి వనరైన నాగార్జునసాగర్ నుంచి యాసంగి పంటలకు నీరు విడుదల కావడంతో వరి, మొక్కజొన్న పెద్దమొత్తంలో సాగు చేశారు. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల, చింతకాని, బోనకల్, వైరా, ముదిగొండ, మధిర, ఎర్రుపాలెం, తిరుమలాయపాలెం, ఏన్కూరు, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కూసుమంచి తదితర మండలాల్లో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టేకులపల్లి, ఇల్లెందు, గుండాల, పాల్వంచ, చంద్రుగొండ, సుజాతనగర్, జూలూరుపాడు, బూర్గంపాడు తదితర మండలాల్లో మక్క పంటను వేశారు. ఏప్రిల్ మొదటి, రెండో వారం నుంచి పంట చేతికందే అవకాశం ఉంది. రైతులకు అందుబాటులో ఉండేలా... ఉమ్మడి జిల్లాలో పంట సాగైన ప్రాంతాల ఆధారంగా రైతులకు సౌకర్యంగా ఉండేలా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గత ఏడాది ఖమ్మం జిల్లాలో 34 కేంద్రాలు ఏర్పాటు చేసి 64,413 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాలో ఐదు కేంద్రాల ద్వారా 3,344 మెట్రిక్ టన్నుల మక్కలను కొనుగోలు చేశారు. ఈ ఏడాది పంట సాగు విస్తీర్ణం పెరగడతో ఖమ్మం జిల్లాలో 45 – 50 వరకు, భద్రాద్రి జిల్లాలో 15 కేంద్రాల వరకు ఏర్పాటు చేసే అవకాశం ఉంది.సన్నాహాలు చేస్తున్నాం... యాసంగిలో సాగు చేసిన మొక్కజొన్న పంట కొనుగోళ్లకు సమాయత్తమవుతున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాలతో పంట రవాణాకు ఆన్లైన్ టెండరింగ్ విధానంపై దృష్టి సారించాం. పంట సాగు ఆధారంగా అక్కడ కేంద్రాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇస్తాం. – సునీత, మార్క్‌ఫెడ్ మేనేజర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా -
పట్టు కోసం ఎత్తులు!
కొత్తగూడెంఅర్బన్: మున్సిపల్ పాలకవర్గాల పదవీ కాలం ముగిసినా వార్డుల్లో పట్టు నిలుపుకునేందుకు మాజీ కౌన్సిలర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. పని లేకపోయినా వార్డుల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ పోటీకి సై అంటున్న సదరు నాయకులు.. ప్రజల్లో ఆదరణ తగ్గొద్దనే భావనతో ముందుకు సాగుతున్నారు. కౌన్సిలర్‌గా ఉన్న గత ఐదేళ్లలో కొందరు తమ వార్డులోని అన్ని కుటుంబాలకూ సమన్యాయం చేయలేదనే అపవాదు మూటగట్టుకున్నారు. ఆ నిందల నుంచి బయటపడేందుకు ఇప్పుడు ముప్పుతిప్పలు పడుతున్నారు. తమకు వ్యతిరేకంగా ఉన్న ప్రజల ఇళ్లలోనూ ఏ కార్యక్రమం జరిగినా తామున్నామంటూ వెళుతున్నారు. ఆయా వార్డుల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలు ఏవి జరిగినా పోటాపోటీగా పాల్గొంటూ ప్రజల ఆదరణ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీగానే ఎన్నికలు జరిగితే ఎలా నడుచుకోవాలి, కార్పొరేషన్‌గా మారితే ఎలా వ్యవహరించాలనే విషయంలో వ్యూహాలు పన్నుతున్నారు. గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన వార్డుతో పాటు పక్కనున్న ఒకటి, రెండు వార్డుల్లోనూ తిరుగుతూ ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఇక ఖర్చు పెట్టే విషయంలోనూ మున్సిపాలిటీ అయితే ఎంత, కార్పొరేషన్లో అయితే ఎంత అని లెక్కలు వేసుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో ఇలా.. జిల్లాలో కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల పాలకవర్గ పదవీ కాలం జనవరిలో ముగిసింది. కొత్తగూడెంలో 36 వార్డులు ఉండగా 2020లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ – 29, సీపీఐ –04, ఇండిపెండెంట్లు –02, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుపొందాయి. ఇక ఇల్లెందు మున్సిపాలిటీలో 24 వార్డులుండగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ –21, రెబల్ అభ్యర్థి ఒకరు, న్యూడెమోక్రసీ, సీపీఐ అభ్యర్థులు ఒక్కొక్కటి చొప్పున గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో చాలా మంది మాజీ కౌన్సిలర్లు ఆ పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో పాటు కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐకి చెందిన ఎమ్మెల్యే ఉండడంతో మరి కొంతమంది మాజీ కౌన్సిలర్లు ఆ పార్టీలోనూ ఉన్నారు. బీఆర్ఎస్ను నమ్ముకుని ఉన్నవారు అందులోనే పని చేస్తున్నారు. అయితే మాజీ కౌన్సిలర్లు పార్టీ ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు అందరితోనూ కలిసి ఐక్యతా రాగం పాడుతున్నారు. మున్సిపాలిటీల్లో మాజీ కౌన్సిలర్ల హడావిడి వార్డుల్లో పర్యటిస్తూ సమస్యలపై ఆరా.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ పోటాపోటీగా హాజరు అందరితోనూ సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నాలు చైర్మన్ పదవిపై గురి.. ఈ సారి మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడొస్తాయనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత లేకున్నా.. పలువురు అభ్యర్థులు అప్పుడే చైర్మన్ పీఠంపై గురి పెడుతున్నారు. గత పాలకవర్గంలో కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ పదవి కావాలని ఆశించి భంగపడిన నలుగురు.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చైర్మన్ స్థానాన్ని కై వసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నారు. అందుకు ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదంటున్నారు. అన్ని వార్డుల్లో టికెట్లు ఆశిస్తున్న వారితో.. గెలిస్తే తనకే మద్దతు ఇవ్వాలంటూ రహస్య మంతనాలు సాగిస్తున్నారు. -
విద్య, వైద్యానికి పెద్దపీట
ఇల్లెందు: ఇందిరమ్మ రాజ్యంలో విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఇల్లెందులో రూ.37.50 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ఏరియా ఆస్పత్రి పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇల్లెందు ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలందేలా ఆస్పత్రి నిర్మిస్తున్నామని, ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలకు కూడా భూమిపూజ జరగాల్సి ఉండగా, ఆ స్థలం తనదంటూ ఓ రైతు కోర్టును ఆశ్రయించడంతో తాత్కాలికంగా నిలిచిపోయిందని చెప్పారు. ఆ రైతు వెనక ఉన్న కొందరు ‘పెద్దలు’ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, వారి కలలు కల్లలే అవుతాయని అన్నారు. కాస్త ఆలస్యం కావచ్చే తప్ప ప్రతిపక్షాల కాకిగోలతో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకూ అండగా నిలవాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని పొంగులేటి చెప్పారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, యువతకు ఉద్యోగాలు, ఆడబిడ్డలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, రైతులు, దళిత, మైనార్టీ వర్గాల వారికి అన్ని విధాలా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పూబెల్లిలో 83 ఇళ్లకు శంకుస్థాపన.. ఇల్లెందురూరల్: మండలంలోని పూబెల్లి గ్రామంలో 83 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఇంకా ఆర్అండ్బీ రోడ్డు నుంచి మామిడిగుండాల వరకు రూ.4.46 కోట్లతో, రొంపేడు చెక్‌పోస్టు నుంచి మిట్టపల్లి వరకు రూ.3 కోట్లతో, ఆర్అండ్బీ రోడ్డు నుంచి బోయితండా వరకు రూ.1.50 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు సైతం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల వారు తమ సమస్యలు పరిష్కరించాలంటూ మంత్రి పొంగులేటితో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించారు. సీలింగ్ భూములకు పట్టాలివ్వాలని మామిడి గుండాల గ్రామస్తులు విన్నవించారు. మసివాగుపై వంతెన లేక వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నామని బోయితండా వాసులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఆయా సమస్యలన్నీ తక్షణమే పరిష్కరించాలని పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, డీఆర్డీఓ విద్యాచందన, మార్కెట్ చైర్మన్ బానోత్ రాంబాబు, ఆర్డీఓ మధు, ఆర్అండ్బీ ఈఈ వడ్లమూడి వెంకటేశ్వరరావు, టీఎంఐడీసీ డీఈ విద్యాసాగర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ జి. రవిబాబు, ఇల్లెందు ఆస్పత్రి సూపరింటెండెంట్ హర్షవర్దన్, నాయకులు డి.వెంకటేశ్వరరావు, మేకల మల్లిబాబుయాదవ్, పులి సైదులు, మెట్టెల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి ఇల్లెందులో 100 పడకల ఆస్పత్రి పనులకు శంకుస్థాపన హాజరైన ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ, అధికారులు -
నేత్రపర్వం.. రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య కల్యాణ వేడుకలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలుపాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి ఆదివారం విశేష పూజలు చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్యం, పసుపు, కుంకుమ, చీరలు, గాజులు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు తమ పిల్లలకు అన్నప్రాశన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో ఈఓ రజినీకుమారి, అర్చకులు, వేద పండితులు పద్మనాభశర్మ, రవికుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రామయ్యకు ముత్యాలు బహూకరణభద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తెలంగాణ దేవాదాయ ట్రిబ్యునల్ చైర్మన్, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి మండా వెంకటేశ్వర్లు ఆదివారం ముత్యాలు బహూకరించారు. ముందుగా ఆయనకు ఆర్చకులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.1.30 లక్షల విలువైన 500 గ్రాముల ముత్యాలను ఆలయ ఈఓ రమాదేవికి అందజేశారు. ఆలయ అధికారులు న్యాయమూర్తికి స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. కార్యక్రమంలో పీఆర్వో సాయిబాబు, వేద పండితులు, సిబ్బంది పాల్గొన్నారు. నేడు ప్రజావాణి రద్దు సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ సోమ, మంగళ వారాల్లో జిల్లాలో పర్యటిస్తున్నందున కలెక్టరేట్లో నేడు నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధికారులు ఈ పర్యటన కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నందున గ్రీవెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి దరఖాస్తులు ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు రావొద్దని కోరారు. -
నేడు గిరిజన దర్బార్
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం గిరిజన దర్బార్ నిర్వహిస్తున్నామని, అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరు కావాలని పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే గిరిజన దర్బార్‌లో ఆదివాసీలు తమ సమస్యలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదులు అందజేయాలని పేర్కొన్నారు. కిన్నెరసానిలో పర్యాటకుల సందడిఒకరోజు ఆదాయం రూ.21, 945పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కిన్నెరసానికి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా తరలివచ్చారు. డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్‌పార్కులో దుప్పులను వీక్షించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 339 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.11,625, 250 మంది బోటు షికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్‌కు రూ.10, 320 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
అంతరపంటలు సాగు చేయాలి
● వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి ● రైతులకు కలెక్టర్ పాటిల్ సూచనఇల్లెందురూరల్ : సంప్రదాయ పద్ధతిలో కాకుండా అధిక లాభాలు వచ్చే పంటలు సాగు చేయాలని, తద్వారా అధిక ఆదాయం పొందాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ రైతులకు సూచించారు. మండలంలోని పూబెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్‌ను పలువురు రైతులు కలిసి.. ‘సార్ మా చేలకు విద్యుత్ సౌకర్యం కల్పించండి.. బోర్లు వేసుకునేందుకు అనుమతి ఇప్పించండి.. మోటార్లు మంజూరు చేయించండి..’ అంటూ విన్నవించారు. దీంతో స్పందించిన కలెక్టర్ ‘ఇవన్నీ చేసినా మీరంతా మొక్కజొన్న సాగు చేస్తూ విత్తనాలు, యూరియా అంటూ మా వెంట పడతారు.. ఇంకా మూస పద్ధతిలోనే సాగు చేస్తే ఎలా.. లాభదాయక సాగుపై దృష్టి పెట్టండి’ అని అన్నారు. లాభదాయక సాగు వనరులపై విస్తృతంగా ప్రచారం చేయడమే కాక సబ్సిడీలు ప్రకటిస్తున్నా పలువురు రైతులు మొక్కజొన్న సాగుకే ప్రాధాన్యమిస్తున్నారని అన్నారు. వేసవిలో మునగసాగు చేయాలని చెప్పడమే కాక సాగుకు అనేక రాయితీలు ప్రకటిస్తున్నా ఎవరూ ముందుకు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయిల్‌పామ్ సాగుకు ఈ ప్రాంత భూములు అనువుగా ఉన్నాయని, అందులో అంతరపంటగా మునగ సాగు చేస్తే నాటిన ఏడాది నుంచి మూడేళ్ల పాటు ఆదాయం వస్తుందని, ఆ తరువాత ఆయిల్‌పామ్ ద్వారా కూడా ఆదాయం పొందవచ్చని సూచించారు. మార్కెట్లో అధిక ధర పలుకుతున్న కూరగాయల సాగుకు రైతులు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ధన్సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఏపీఎం దుర్గారావు, కార్యదర్శి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
సర్కారు స్కూళ్లలో ఏఐ
● పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో ఆరు పాఠశాలల ఎంపిక ● 331 మంది విద్యార్థులకు కృత్రిమ మేధ బోధన ● పిల్లల్లో పెరుగుతున్న ఆసక్తి..పాల్వంచరూరల్ : ‘మారుతున్న కాలంలో విద్యారంగంలో ప్రమాణాలు పడిపోతున్నాయి.. ప్రభుత్వ స్కూళ్లలో ఏటా ప్రవేశాలు తగ్గుతున్నాయి. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి రూ.80 వేలకు పైగా ఖర్చు చేస్తున్నాం. అయినా ప్రైవేట్ పాఠశాలల్లోనే ఎక్కువగా పిల్లలు చేరుతున్నారు. తల్లిదండ్రులకు సర్కారు స్కూళ్లపై నమ్మకం కలిగించాలి’ అని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో బోధనను మెరుగు పర్చేందుకు ఆరిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)కు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆరు పాఠశాలలను ఎంపిక చేసి 331 విద్యార్థులకు ఏఐ బోధన చేపట్టారు. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు.. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రాథమిక స్థాయి విద్యార్థులు అభ్యసన సామర్థ్యాల్లో వెనుకబడిపోతున్నారు. విద్యార్థుల సామర్థ్యాన్ని మెరుగుపర్చేందుకు పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నా అశించిన ఫలితాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో 3, 4, 5 తరగతుల వారిని మెరుగుపరిచేందుకు ప్రయోగాత్మకంగా కృత్రిమ మేధ చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా ఆరు పాఠశాలలను ఎంపిక చేశారు. ఆయా స్కూళ్లలో సీ గ్రేడ్ విద్యార్థులు 331 మందిని గుర్తించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా ఏఐ బోధన చేపట్టారు. ఇందుకోసం ఆయా పాఠశాలలు లేదా పక్కన ఉన్న పాఠశాలల్లోని కంప్యూటర్లను వినియోగిస్తున్నారు. ఆరు పాఠశాలలు.. 331 మంది విద్యార్థులు.. జిల్లాలో ఏఐ బోధన కోసం ఆరు పాఠశాలలను పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. వీటిలో భద్రాచలంలోని తాత గుడి ప్రాథమిక పాఠశాల, బూర్గంపాడు మండలం సారపాక, నాగినేనిప్రోలు, మోరంపల్లి బంజర, అంజనాపురం, బూర్గంపాడులోని ప్రాథమిక పాఠశాలలను గుర్తించారు. ఆయా పాఠశాలల పరిధిలోని 331 మంది విద్యార్థులకు ఏఐ ద్వారా బోధన చేయనున్నారు. ఎంపికై న పాఠశాలల్లో చదువుతున్న 3, 4, 5 తరగతుల విద్యార్థులను గ్రూప్‌గా ఏర్పాటుచేసి గణితం, తెలుగు వాచకాలపై 20 నుంచి 30 నిమిషాల పాటు ఏఐ విధానంలో బోధిస్తున్నారు. పది స్థాయిల్లో బోధన జిల్లాలోని ఆరు పాఠశాలలను పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి ఏఐ విధానంలో బోధిస్తున్నాం. కంప్యూటర్లో నేర్చుకోవడం అంటే పిల్లలు ఆసక్తి కనబరుస్తున్నారు. పది స్థాయిల్లో వారికి పాఠాలు బోధిస్తున్నాం. ప్రతి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను గుర్తించి గతంతో పోలిస్తే పురోగతి ఎలా ఉందో పరిశీలించి నివేదిక తయారుచేస్తాం. జిల్లాలో కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇటీవలే ఏఐ బోధనను ప్రారంభించారు. – నాగా రాజశేఖర్, జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ -
‘ఉద్యాన’ పరిశోధనలు పెంచాలి
అశ్వారావుపేటరూరల్: ఉద్యాన పంటలపై పరిశోధనలను మరింతగా పెంచాలని శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం ఆయన స్థానిక హెచ్ఆర్ఎస్తో పాటు మండలంలోని అల్లిగూడెంలో సాగు చేస్తున్న బూడిద గుమ్మడి, మునగ, మిర్చి పంటలను, దమ్మపేట మండలం లింగాలపల్లిలో మామిడి తోటలను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉద్యాన తోటల పరిశోధనలకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఉద్యాన పంటల సాగులో పాటించాల్సిన జాగ్రత్తలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం స్థానిక హెచ్‌ఆర్‌ఎస్‌లో జరిగిన వేలం పాటకు హాజరయ్యారు. ఉద్యాన పరిశోధన కేంద్రం ద్వారా సాగు చేస్తున్న మామిడి, జీడి మామిడి, కొబ్బరి, సపోటా, పనస తోటలకు వేలం నిర్వహించగా పలువురు వ్యాపారులు కై వసం చేసుకున్నారు. తద్వారా హెచ్ఆర్ఎస్కు రూ.10,78,500 ఆదాయం సమకూరినట్లు లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో హెచ్ఆర్ఎస్ శాస్త్రవేత్తలు డాక్టర్ విజయ్ కృష్ణ, డాక్టర్ కె నాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు.డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ లక్ష్మీనారాయణ -
ఓటరు జాబితాపై అవగాహన ఉండాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాజకీయ పార్టీల నాయకులకు ఓటరు జాబితాపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు శనివారం ఆయన ఐడీఓసీలో ఆయా పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నూతన ఓటర్ల నమోదు, జాబితాలో తప్పుల సవరణ, ఓటర్ల తొలగింపు తదితర అంశాలపై అవగాహన అవసరమని తెలిపారు. ఫామ్ 6 దరఖాస్తు ద్వారా కొత్తగా ఓటు కోసం, ఫామ్ 7 ద్వారా తొలగింపు, అభ్యంతరాలపై దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆయా దరఖాస్తులను బీఎల్ఓలు విచారించిన తర్వాతే పేర్లు తొలగిస్తామని చెప్పారు. తప్పుల సవరణ, ఫొటో మార్పు, ఓటు బదిలీ తదితర సేవలకు ఫామ్ 8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీలు కూడా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలన్నారు. పోలింగ్ బూత్‌లు, ఓటరు జాబితాలో ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫామ్ 6,7,8 లలో 19,514 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 10,944 దరఖాస్తులను పరిష్కరించామని, 1,310 దరఖాస్తులు తిరస్కరించామని, 7,260 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని వివరించారు. నూతన ఓటుహక్కు రిజిస్ట్రేషన్, మార్పులు చేర్పుల కోసం ఎక్కడికీ తిరగాల్సిన అవసరం లేకుండా బీఎల్ఓ యాప్ ద్వారా అన్ని సేవలూ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ యాప్‌పై వచ్చే శనివారం శిక్షణ ఉంటుందన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. వంట చేసిన కలెక్టర్.. దమ్మపేట : ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌పై స్వయంగా వంట చేసిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కుక్కర్ వినియోగంపై ఆదివాసీ మహిళలకు అవగాహన కల్పించారు. మండలంలోని కొండరెడ్ల గ్రామమైన పూసుకుంటను శనివారం రాత్రి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వినియోగం, వంట సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ రవీంద్రరెడ్డి, ఇన్చార్జ్ తహసీల్దార్ కె.వాణి తదితరులు పాల్గొన్నారు.రాజకీయ పార్టీల నేతలకు కలెక్టర్ సూచన -
పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం..
చర్ల: పోస్టల్ ఉద్యోగుల నిర్లక్ష్యంతో అందాల్సినవి అందక ప్రజలు నానా అవస్థలు పడుతున్నాట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటన మండలంలో శనివారం వెలుగులోకి వచ్చింది. చినమిడిసిలేరు నుంచి తిమ్మిరిగూడెంనకు వెళ్లే మార్గంలోని అటవీ ప్రాంతంలో ఆధార్, పాన్, ఓటర్ ఐడీ కార్డులు, వివిధ కార్యాలయాల నుంచి వచ్చిన సర్టిఫికెట్లు పడి ఉండడాన్ని పశువుల కాపరులు గమనించారు. వారు మీడియాకు సమాచారం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి వెళ్లి చూడగా సుమారు 200కు పైగా పలు కార్డులు, సర్టిఫికెట్ల కవర్లు దర్శనమిచ్చాయి. ఇవి చినమిడిసిలేరుకు సమీపంలో ఉన్న బ్రాంచ్ పోస్టాఫీస్‌కు చెందినవని తేలగా.. అక్కడ పనిచేస్తున్న వారే వీటిని పడేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోస్టల్ సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకొని వాటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిని చినమిడిసిలేరులోని బ్రాంచ్ పోస్టాఫీస్‌లో పనిచేస్తున్న ఓ వ్యక్తి ఇంట్లో ఉండే వృద్ధురాలు.. పనికిరాని మందులతో పాటు పోస్టల్ బ్యాగులోని ఉత్తరాలు, కవర్లు, పలు గుర్తింపు కార్డులను చెత్త కాగితాలుగా భావించి పడేసినట్లుగా తెలిసింది. ఈ విషయమై సత్యనారాయణపురం సబ్ పోస్టాఫీస్‌కు చెందిన పోస్మాస్టర్ను వివరణ అడిగేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు. అడవిలో దర్శనమిచ్చిన విలువైన కార్డులు, ఉత్తరాలు -
లైంగికదాడికి యత్నించిన వ్యక్తి అరెస్ట్
కొత్తగూడెంఅర్బన్: గత నెల 10వ తేదీన కూలీ పని ఉందంటూ యువతిని ఆటోలో లక్ష్మీదేవిపల్లి మండలంలోని అనిశెట్టిపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం లక్ష్మీదేవిపల్లి పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన నర్సింహారావు.. కూలి పని ఉందని, అందుకోసం రూ.700 చెల్లిస్తానని చెప్పి ఇద్దరు మహిళలను మహబూబాబాద్‌లో గతంలో చోరీ చేసిన ఆటోలో ఎక్కించుకొని పాల్వంచ దగ్గరలోని పెట్రోల్ బంకు వద్ద ఉన్న సమ్మక్క – సారక్క ఆలయం వద్ద ఓ మహిళను దించాడు. కూరగాలయలు తీసుకొస్తామని మరో మహిళను తీసుకొని అనిశెట్టిపల్లి అటవీ ప్రాంతానికి తీసువెళ్లి లైంగికదాడికి యత్నించాడు. మహిళ ఎదిరించడంతో జేబులో నుంచి కత్తి తీసి బెదిరించే క్రమంలో మహిళ చెంపకు గాయమైంది. దీంతో నర్సింహారావు ఆటోను అక్కడే వదిలేసి పారిపోయాడు. జల్సాలకు అలవాటు పడిన నర్సింహారావు హన్మకొండలోని కోర్టు పరిసరాల్లో ఉన్న ఆటో, అందులోని సెల్‌ఫోన్‌ను చోరీ చేసి, పాపకొల్లు వస్తూ మధ్యలో వినోబానగర్‌లోని ఓ ఇంట్లో సెల్‌ఫోన్‌ను చోరీ చేశాడు. శనివారం ఇల్లెందు క్రాస్ రోడ్డు సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో నర్సింహారావును పోలీసులు పట్టుకుని విచారించగా చోరీల విషయం తెలిసింది. దీంతో నర్సింహారావు చోరీ చేసిన సెల్ఫోన్లు, ఆటోను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని డీఎస్పీ వివరించారు. సమావేశంలో సీఐ వెంకటేశ్వర్లు సిబ్బంది పాల్గొన్నారు. -
ఈ నవమికీ ఇక్కట్లేనా..?
ఆదివారం శ్రీ 16 శ్రీ మార్చి శ్రీ 2025సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: శ్రీరామనవమి సందర్భంగా దేశం నలుమూల నుంచి జిల్లాకు వచ్చే భక్తులకు ఈసారి కూడా బస, వసతి కోసం ఇక్కట్లు తప్పేలా లేవు. భద్రాచలంలో గదులు దొరకని భక్తులు పాల్వంచ, కొత్తగూడెంలో కూడా వసతి కోసం వాకబు చేస్తారు. ఈ రెండు పట్టణాల్లో నిర్మిస్తున్న హరిత హోటల్, కిన్నెరసాని కాటేజీలు ప్రారంభిస్తే కనీసం వంద గదులు భక్తులకు అందుబాటులోకి వస్తాయి. ముగ్గురు మంత్రులు వచ్చినా.. కిన్నెరసాని డ్యామ్ వద్ద ఏళ్ల తరబడి నిర్మాణ పనులు సాగుతున్న అద్దాల మేడ, రివర్వ్యూ కాటేజీలతో పాటు ఇల్లెందు క్రాస్‌రోడ్ దగ్గర 56 గదులతో నిర్మిస్తున్న హరిత హోటల్ పనులను గతేడాది ఆగస్టులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మూడు గంటలకు పైగా పరిశీలించారు. వరల్డ్ బెస్ట్ కన్సల్టెన్సీకి కిన్నెరసాని అభివృద్ధి పనుల ప్రణాళిక రూపొందించే పనిని అప్పగిస్తామన్నారు. ఈ పనులకు సాంకేతిక ఇబ్బందులు రాకుండా ఇరిగేషన్, అటవీ, విద్యుత్, పర్యాటకంతో పాటు ఇతర శాఖలను సమన్వయం చేస్తామని చెప్పారు. మూడు నెలల్లో కాటేజీలు, హరిత హోటల్ అందుబాటులోకి తెస్తామన్నారు. వారు నిర్దేశించిన గడువు దాటి.. మరో మూడు నెలలు కావస్తున్నా ఆ హామీలేవీ అమలుకు నోచుకోలేదు. కానరాని కన్సల్టెంట్లు.. 2023 డిసెంబర్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక గతేడాది ఆగస్టు 12న డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించారు. డ్యామ్ మధ్యలో ఉన్న ఆనందద్వీపం వద్ద ఎకో టూరిజంలో భాగంగా చేపట్టబోయే పనులకు అంతర్జాతీయ స్థాయి కన్సల్టెంట్లను నియమిస్తామని ప్రకటించారు. ఇక తొమ్మిదేళ్లుగా నిర్మాణం జరుపుకుంటూనే ఉన్న అద్దాల మేడ, రివర్ వ్యూ కాటేజీలను 2024 నవంబర్ లేదా డిసెంబర్ నాటికి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. సా..గుతూనే ఉన్నాయి.. భద్రాచలం వచ్చే రామభక్తులతో పాటు పారిశ్రమిక ప్రాంతాలైన కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరుకు అనుకూలంగా ఉండేలా ఇల్లెందు క్రాస్‌రోడ్ దగ్గర హరిత హోటల్, కాటేజీ, కన్వెన్షన్ సెంటర్ నిర్మాణ పనులు ఏడున్నరేళ్ల కిత్రం ప్రారంభించారు. రూ.15 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు నాలుగేళ్ల కిందటే పూర్తయ్యాయి. కేవలం విద్యుత్ కనెక్షన్, సీలింగ్, డెకరేషన్, ఫర్నిచర్, ఏసీల ఏర్పాటు పనులే మిగిలాయి. ఇలా ఐదేళ్లు దాటినా ఇప్పటికీ ఈ హోటల్ అందుబాటులోకి రాలేదు. గతేడాది ఏప్రిల్‌లో హరిత హోటల్లో ఈ పనులు మొదలుపెట్టారు. 2024 డిసెంబర్ నాటికి పూర్తి చేసి హోటల్ ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు.న్యూస్రీల్భక్తులకు సరిపడా లేని వసతి సౌకర్యాలు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హోటల్, కాటేజీల నిర్మాణం పదేళ్ల క్రితమే పనులు ప్రారంభమైనా ఇంకా పూర్తికాని వైనం గత ఆగస్టులో మంత్రుల పరిశీలన, మూడు నెలల గడువు డెడ్‌లైన్ ముగిసినా కొనసాగుతూనే ఉన్న పనులునవమికి అందుబాటులోకి తెస్తాం ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద నిర్మిస్తున్న హరిత హోటల్‌ను శ్రీరామనవమి నాటికి అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం ఎలక్ట్రికల్‌తో పాటు ఇతర పనులను వేగంగా నిర్వహిస్తున్నాం. కిన్నెరసాని దగ్గరున్న అద్దాల మేడ, కాటేజీలు పూర్తయ్యాయి. వాటిని ఎకో టూరిజం విభాగానికి అప్పగించేందుకు ప్రతిపాదనలు పంపాం. వారు హ్యాండోవర్ చేసుకుని, వినియోగంలోకి తేవాల్సి ఉంది. –రామకృష్ణ, టూరిజం శాఖ డీఈ -
తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతలు
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి విద్యాచందన ఇల్లెందు/ఇల్లెందురూరల్: జలశక్తి అభియాన్ పథకం కింద అతి తక్కువ ఖర్చుతో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మున్సిపల్ ప్రత్యేక అధికారి విద్యాచందన కోరారు. శనివారం ఇల్లెందు మున్సిపాలిటీలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేసవి కాలం దృష్టిలో ఉంచుకుని నీటి ఎద్దడి లేకుండా తగిన ప్రణాళిక రూపొందించాలని, నీటి ఎద్దడిపై ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ప్రత్యేక రిజిస్టర్లో నమోదు చేసుకోవాలని కోరారు. ఇంటి పన్నులు వచ్చే 10 రోజుల్లో నూరు శాతం వసూలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో కమిషనర్ శ్రీకాంత్, మేనేజర్ అంకుషావలి, డీఈ మురళి, ఏఈ, ఏఓ, ఆర్ఐ ఇతర సిబ్బంది పాల్గొన్నారు. కాగా, మండలంలోని సుదిమళ్ల, సుభాష్‌నగర్‌లలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను అదనపు కలెక్టర్ విద్యాచందన తనిఖీ చేశారు. నెలాఖరు నాటికి ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. అనంతరం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. ఎంపీడీఓ ధన్సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఏపీఓ శంకర్, పంచాయతీ కార్యదర్శులు రజినీకాంత్, అజహర్, సిబ్బంది పాల్గొన్నారు. -
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
అశ్వాపురం: మండలంలోని మొండికుంట సెంటర్లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి ఓ కారు దూసుకొచ్చింది. దీంతో ఇద్దరు గాయపడ్డారు. కొత్తగూడెం నుంచి మణుగూరు వైపు వెళ్తున్న కారు మొండికుంట గ్రామంలో నెల్లిపాకబంజర – భద్రాచలం సెంటర్లో వేగంగా దూసుకొచ్చి ఓ దుకాణం బోర్డు, బీఆర్ఎస్ దిమ్మె, మరో దిమ్మెను ఢీకొట్టి ప్రయాణికులపైకి దూసుకొచ్చింది. బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికుల్లో నెల్లిపాకబంజర గ్రామానికి చెందిన వద్దిపర్తి శ్రీఅంజన, తుమ్మలచెరువు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మురళికి గాయాలయ్యాయి. మురళి కారు కింద పడగా ఎలాంటి ప్రమాదం జరగలేదు. శ్రీఅంజనకు కాలు విరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో భద్రాచలం తరలించారు. కారు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. నిల్వ ఉంచిన ఇసుక సీజ్ పినపాక: అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. ఈ మేరకు తహసీల్దార్ నరేశ్ మాట్లాడుతూ.. మండలంలోని బయ్యారం క్రాస్‌రోడ్‌లో ప్రైవేట్ బంక్‌లో అక్రమంగా ఇసుక నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు దాడి చేశామని, సుమారు పది ట్రాక్టర్ల ఇసుకను సీజ్ చేశామని తెలిపారు. ప్రహరీ కూల్చిన మహిళపై కేసు పాల్వంచరూరల్: తన ఇంటి హద్దులో ప్రహరీ నిర్మించారని ఆరోపిస్తూ.. ఓ మహిళ ఆ గోడను కూల్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని కోడిపుంజులవాగు గ్రామానికి చెందిన కొర్ర కీమియా తన కుమారుడి వివాహం చేయడం కోసం ఇటీవల రూ.20 వేలతో ఇంటి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. ఈ గోడ తన ఇంటి హద్దులో ఉందని బానోతు లక్ష్మీ సుత్తితో ఈనెల 9వ తేదీన కూల్చింది. అంతేకాకుండా దుర్భాషలాడుతూ చంపుతామని బెదిరించిందని, చర్యలు తీసుకోవాలని కీమియా శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్ష్మీపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. స్కూటీని ఢీకొట్టిన లారీడ్రైవర్పై.. పాల్వంచరూరల్: ఎదురుగా వచ్చి స్కూటీని ఢీకొట్టిన లారీడ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వంచ పట్టణంలోని జాట్ఫాట్ రాములు కుమారుడు కార్తీక్ ఈనెల 7వ తేదీన భద్రాచలంలో పనిచేసి స్కూటీపై ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆర్టీఏ చెక్‌పోస్టు సమీపంలో భద్రాచలంవైపు వెళ్తున్న లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టడంతో కార్తీక్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కార్తీక్ తండ్రి రాములు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా లారీడ్రైవర్ సత్తిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి శనివారం సువర్ణ తులసీ అర్చన నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిత్యాన్నదానానికి విరాళం భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి ఏపీలోని కృష్ణా జిల్లా పెనమలూరు గ్రామానికి చెందిన చంద్రశేఖర్–సౌజన్య దంపతులు రూ.లక్ష చెక్కు ఆలయ అధికారులకు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించగా, ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదం, జ్ఞాపిక అందజేశారు. ఆలయ పీఆర్వో సాయిబాబు తదతరులు పాల్గొన్నారు. కాగా, ఆదాయ పన్ను శాఖ ప్రన్సిపల్ కమిషనర్ దండా శ్రీనివాస్–లక్ష్మితాయారు దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. వారి వెంట అధికారులు నెల్లూరు సింధు, ఉమామహేశ్వరరావు, ప్రియాంక, రాంజేందర్రెడ్డి, శ్రీనివాస్, సుబ్బారావు ఉన్నారు. రేపటి నుంచి జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడి పర్యటనభద్రాచలంటౌన్: జిల్లాలోని చండ్రుగొండ, అశ్వారావుపేట మండలాల్లో ఈ నెల 17, 18 తేదీల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ పర్యటించనున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం ఉదయం చండ్రుగొండ మండలం సీతాయిగూడెం ప్రాజెక్టును సందర్శిస్తారని, ఆ తర్వాత చండ్రుకుంట గ్రామంలోని గిరిజనుల పోడు భూములను పరిశీలించి రైతులతో సమావేశం అవుతారని వివరించారు. సాయంత్రం పెదవాగు ప్రాజెక్ట్ సందర్శించి రాత్రికి అశ్వారావుపేటలో బస చేస్తారని తెలిపారు. 18వ తేదీ ఉదయం పండువారిగూడెం, గాండ్లగూడెం, కావడి గుండాల గ్రామాల్లో గిరిజన సంఘాల నాయకులతో జరిగే సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలను సందర్శిస్తారని తెలిపారు. సంబంధిత తహసీల్దార్లు, ఇరిగేషన్, ఐటీడీఏ అధికారులు ఈ పర్యటనలో పాల్గొనాలని సూచించారు. పెదవాగును పరిశీలించిన అధికారులు.. అశ్వారావుపేటరూరల్: మండలంలోని గుమ్మడవల్లి వద్ద గల పెదవాగు ప్రాజెక్ట్‌ను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ సందర్శించనున్న నేపథ్యంలో ఇరిగేషన్ ఏఈఈ శ్రీనివాస్, సీఐ కరుణాకర్, ఎస్సై యయాతిరాజు శనివారం పరిశీలించారు. గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షం, వరదతో ప్రాజెక్ట్ ప్రధాన ఆనకట్టకు గండ్లు పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఇటీవల మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లగా, కమిషన్ సభ్యుల బృందం ప్రాజెక్టు వద్దకు రానున్నారు. ‘గూడెం’ వాసికి సాహిత్య రత్న అవార్డుసింగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరం 8వ వార్డుకు చెందిన సింగరేణి మాజీ ఉద్యోగి జినుకల సదానందానికి సాహిత్య రత్న అవార్డు లభించింది. హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో తీరా అర్ట్స్ ఆకాడమీ వారు సాంస్కృతిక, ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రముఖ సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఈ పురస్కారాలను అందించారు. కాగా, కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 ఇంక్లైన్ గనిలో సుమారు 35 సంవత్సరాలు పనిచేసిన సదానందం.. సంస్థ అభివృద్ధికి కృషి చేయడమే కాక తన కథలు, కవితలు, నాటికలతో కార్మికులను చైతన్యపరిచారు. కోలిండియా స్థాయిలోనూ అనేక ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు సాధించారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం శాలేంరాజు సదానందాన్ని అభినందించారు. -
ఎట్టకేలకు మోక్షం!
● 100 పడకల ఆస్పత్రి, ఐటీఐ నిర్మాణాలు ● పూబెల్లిలో 90 ఇందిరమ్మ గృహాలకు శంకుస్థాపన ● నేడు మంత్రి పొంగులేటి రాక ఇల్లెందు: పట్టణంలో ఏడాది కాలంగా ఎదురుచూస్తున్న ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం కలుగుతోంది. జేకే ఏరియాలో సింగరేణి క్వార్టర్లను కూల్చి పట్టణ నడిబొడ్డున 100 పడకల ఆస్పత్రితో పాటు ఐటీఐ నిర్మించనుండగా ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు పైలాన్ల నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. అనంతరం కోటిలింగాల క్రాస్ రోడ్ నుంచి మామిడి గుండాల వరకు రోడ్డు, రొంపేడు – రామగుండాల రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన, మాణిక్యారం – కొమరారం – బోయితండా రోడ్డు పనులను ప్రారంభించనున్నారు. పోలారం పంచాయతీ ఇరుపవారి గుంపు – భద్రుతండా రోడ్డుకు. అనంతరం పూబెల్లిలో 90 ఇందిరమ్మ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఐటీఐతో నిరుద్యోగులకు మేలు.. ఇల్లెందులో ఐటీఐ ఏర్పాటుతో నిరుద్యోగులకు ఎంతో మేలు జరుగనుంది. ఇందులో ఐదు ట్రేడ్లు నెలకొల్ప నుండగా ఒక్కో ట్రేడ్‌లో 40 మంది విద్యార్ధులకు అవకాశం కల్పిస్తారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభమయ్యేలా ఇప్పటికే ప్రిన్సిపాల్‌ను కూడా నియమించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదా వైటీసీలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో ఇంతకాలం డబ్బు చెల్లించి ఐటీఐ చేసే ఈ ప్రాంత నిరుద్యోగులకు ఫీజుల భారం తప్పనుంది. ఎలక్ట్రీషియన్ కోర్సులో 2 యూనిట్లలో 40 మంది, ఫిట్టర్ రెండు యూనిట్లలో 40 మంది, ఐఓటీ స్మార్ట్ అగ్రికల్చర్ ఏడాది కోర్సుకు రెండు యూనిట్లలో 40 మంది, ఫ్యాషన్ డిజైనర్ టెక్నాలజీ రెండు యూనిట్లలో 40 మంది, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్ కోర్సు రెండు యూనిట్లలో 40 మంది చొప్పున విద్యార్థులకు తరగతులు బోధించనున్నారు. ఆస్పత్రిలో పురోగతి ఇలా... ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రి వైద్య విధాన పరిషత్‌లోకి మారిన తర్వాత డాక్టర్లు, సిబ్బంది సంఖ్య పెరిగింది. పేషెంట్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో 12 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. ఇక 100 పడకల ఆస్పత్రిగా మారితే సుమారు 30 మంది వైద్యులు, 60 మంది నర్సులు, 40 మంది ఇతర సిబ్బంది పనిచేసే అవకాశం ఉంది. నేడు మంత్రి పొంగులేటి పర్యటన ఇల్లెందురూరల్: రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఇల్లెందులో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు ఇల్లెందు మండలం పూబెల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఇల్లెందు జేకే బస్టాండ్ వద్ద 100 పడకల ఆస్పత్రి నిర్మాణానికి భూమి పూజ చేయనున్న మంత్రి, అనంతరం బోయితండాలో బీటీ రోడ్డు, రొంపేడులో చెక్‌పోస్టు, కోటిలింగాలలో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అక్కడి నుండి బయలుదేరి జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యే సభలో పాల్గొనేందుకు మంత్రి పొంగులేటి బయలుదేరతారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధం
మణుగూరురూరల్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిల్లు దగ్ధమైన ఘటన శనివారం మండలంలోని పగిడేరు గ్రామంలో చోటుచేసుంది. గ్రామానికి చెందిన కుంజా కేశవరావు, కుటుంబ సభ్యులు రోజులాగానే పనులపై బయటికి వెళ్లారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగగా స్థానికులు అగ్నిమాపకశాఖకు సమాచారం అందించారు. మాజీ సర్పంచ్ తాటి సావిత్రీ – భిక్షం దంపతులు స్థానికుల సాయంతో మంటలను ఆర్పేందుకు యత్నించారు. అయినప్పటికీ పూరిల్లు మొత్తం దగ్ధమైంది. ఇంట్లోని దుస్తులు, విలువైన సామగ్రి కాలిబూడిదైంది. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. -
64మంది మావోయిస్టుల లొంగుబాటు
కొత్తగూడెంటౌన్: ఆపరేషన్ చేయూతలో భాగంగా మావోయిస్టు పార్టీకి చెందిన 64 మంది మల్టీజోన్ –1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ రోహిత్‌రాజ్ ఎదుట శనివారం లొంగిపోయారు. వారిలో 48 మంది పురుషులు, 16 మంది మహిళలు ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.16లక్షల ఆర్థిక సాయాన్ని ఐజీ వారికి అందజేశారు. ఈ మేరకు హేమచంద్రాపురంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేయూత కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని, దీనికి ఆకర్షితులైన మావోయిస్టులు లొంగిపోవడానికి మొగ్గు చూపుతున్నారని అన్నారు. ప్రస్తుతం లొంగిపోయిన వారిలో బస్తర్ ఏసీఎం మడకం జిమ్మి అలియాస్ లక్ష్మి, పార్టీ క్రియాశీలక సభ్యులు 10 మంది, ప్రజా విప్లవ సంఘం సభ్యులు తొమ్మిది మందితో పాటు ఇతర అనుబంధ సంఘాల సభ్యులు ఉన్నారని వివరించారు. గత రెండున్నర నెలల్లో 122 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. మిగితా వారు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఆదివాసీ గిరిజనుల్లో మావోయిస్టులపై నమ్మకం, ఆదరణ సన్నగిల్లుతున్నాయని చెప్పారు. కాలం చెల్లిన సిద్ధాంతాలు అనుసరిస్తున్న మావోలు ఏజెన్సీ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ఏజెన్సీ అబివృద్ధి చెందితే తమకు మనుగడ ఉండదనే కారణంతో అమాయక ఆదివాసీలను ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలు వచ్చేలా పోలీసు యంత్రాంగం ఎప్పుడూ కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, సీఆర్పీఎఫ్ కమాండెంట్లు రితేష్ఠాకూర్, ప్రీత, రాజేష్ డోగ్రా తదితరులు పాల్గొన్నారు. ఐజీకి ఘన స్వాగతం.. జిల్లా పర్యటనలో భాగంగా ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి తొలుత ఇల్లెందు క్రాస్ రోడ్‌లోని సింగరేణి గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హేమచంద్రాపురంలోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజ్, షీ టీం ఎస్సై రమాదేవి ఆధ్వర్యంలో పోలీసులు ఘనంగా స్వాగతం పలికి పరేడ్ నిర్వహించగా, ఐజీ గౌరవ వందనం స్వీకరించారు. మిగిలిన వారూ జనజీవన స్రవంతిలో కలవాలి మల్టీజోన్–1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సూచన ఒక్కొక్కరికి రూ.25వేల సాయం అందజేత -
వేసవిలో వేటగాళ్ల ముప్పు
● వేటకు బలవుతున్న అడవి జంతువులు ● ప్రమాదకరంగా విద్యుత్ వైర్లతో జీవాల వధ ● జిల్లాలో నిత్యకృత్యంగా మారుతున్న వైనం ● నాలుగేళ్లలో 49 జంతువధ కేసులు నమోదు జిల్లాలోని దట్టమైన అడవిలో పెరిగే వన్యప్రాణులు వేసవి కాలంలో ఆహారం లేదా తాగునీటి కోసం.. జనావాసాల వైపు వస్తుంటాయి. ఇలావచ్చే మూగ జీవులు వేటగాళ్ల ఉచ్చుకు బలవుతున్నాయి. నదులు, చెరువులు, వాగుల వద్ద దట్టమైన పొదల్లో ఉరులు, ఉచ్చులను బిగించి వేటగాళ్లు వన్యప్రాణులను పొట్టన పెట్టుకుంటున్నారు. మరికొన్ని చోట్ల అత్యంత ప్రమాదకరమైన కరెంట్ వైర్ల సాయంతో జంతువులను వధిస్తున్నారు. దుండగులు వేటకు విద్యుత్ తీగలనే ఎక్కువగా వాడుతున్నారు. వీటితో మనుషుల ప్రాణాలకు సైతం ప్రమాదం పొంచి ఉంది. – చుంచుపల్లిగతంలో వేటగాళ్లు వన్యప్రాణులను వేటాడి మాంసాన్ని అమ్ముతూ పట్టుపడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. జంతువులను వేటాడి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో వేటగాళ్లు జంతువుల కొమ్ములు, మాంసం, గోర్లు, చర్మాలు వంటి భాగాలను విక్రయిస్తున్నారు. జింకలు, అడవి పందులు, ముళ్ల పందులు, కొండ గొర్రెలు, ఎలుగుబంట్లు, దుప్పులు, ఉడుములు, నక్కలు, అడవిపిల్లులు, ముంగిసలు, ఇతర జంతువులకు జిల్లాలో దట్టమైన అటవీ ప్రాంతం అనువుగా ఉంది. అయితే, వేటగాళ్ల వల్ల రానురాను వీటి రక్షణ ప్రశ్నార్థకంగా మారుతోంది. వేసవిలో వన్యప్రాణులను వేటాడే వేటగాళ్లను కట్టడి చేయకపోతే అడవి జంతువుల సంఖ్య కనుమరుగయ్యే ప్రమాదముందని జంతుప్రేమికులు వాపోతున్నారు. వన్యప్రాణులను వధిస్తే కఠిన శిక్షలు జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కిన్నెరసాని వంటి ఆరు అటవీ డివిజన్ల పరిధిలో 10.45 లక్షల ఎకరాల అడవులు విస్తరించి ఉన్నాయి. అడవి జంతువులను పెంచుకోవడం, వేటాడటం వంటిది పూర్తిగా నిషేధం. మన పరిసరాల్లోనూ వాటిని మచ్చిక చేసుకోవడంతో పాటు మాంసం కలిగి ఉండటం నేరమని వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 చెబుతోంది. ఈ చట్టంలోనూ ఇటీవల కొన్ని మార్పులు చేశారు. జంతువులను వేటాడిన కేసులో నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. అవసరమైతే నేరాన్ని బట్టి ఈ రెండింటినీ అమలు చేయొచ్చుని అధికారులు చెబుతున్నారు. ఇక కొన్ని జంతువుల వేట విషయంలో నేరం జరిగితే బెయిల్ కూడా లభించదు. అంతరించిపోతున్న వన్యప్రాణుల రక్షణ అందరి కర్తవ్యం. గ్రామ పరిసరాల్లోకి అడవి జంతువులు వస్తే వాటికి హాని తలపెట్టకుండా సంబంధిత అధికారులకు తెలపాల్సి ఉంది. అడవులు, పొలాల్లో వేటకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేయడం, ఉచ్చులు, వలలు అమర్చడం కూడా చట్టరీత్యా నేరం. అలాంటిది పచ్చని అడవుల్లో స్వేచ్ఛగా తిరగాల్సిన వన్యప్రాణులకు వేటగాళ్ల నుంచి ప్రమాదం ముంచుకొస్తోంది. వేసవి కాలం.. వన్యప్రాణులకు మరింత ప్రాణసంకటంగా మారుతోంది. 2021 డిసెంబర్లో దమ్మపేట మండలం రంగువారిగూడేనికి చెందిన ప్రొద్దుటూరి డానియేలు, రాకేశ్ తండ్రీకొడుకులు ఇద్దరు వేటకు వెళ్లి జంతువుల కోసం అమర్చిన అదే విద్యుత్ తీగలు తగిలి మృత్యువాత పడిన ఘటన జిల్లాలో సంచలనమైంది. 2022 మార్చిలో కొత్తగూడెం పట్టణానికి చెందిన సునీల్‌కుమార్ చుంచుపల్లి మండలం పెనుబల్లి అడవి ప్రాంతంలో స్నేహితులతో కలిసి వేటకు వెళ్లాడు. ఈ క్రమంలో జంతువుల వేటకు వేరొకరు అమర్చిన విద్యుత్ తీగలు తగలడంతో మృత్యువాత పడ్డాడు. 2023 మార్చిలో ఫారెస్ట్ స్పెషల్ టీం కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద పులి చర్మం అమ్మడానికి వెళ్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. సుజాతనగర్ మండలం ఒడ్డుగూడెంలో కుక్కలదాడిలో చుక్కల దుప్పి మృత్యువాత పడింది.ఇక జంతువులను వేటాడిన అంశంలో జిల్లాలో నాలుగేళ్లలో 2021–22లో 14, 2022–23లో 19, 2023–24లో 07, 2024–25లో 9 చొప్పున జంతువధ కేసులు నమోదయ్యాయి.వేటగాళ్లపై కఠినంగా వ్యవహరిస్తాం వేసవి కాలంలో వన్యప్రాణులు నీళ్ల కోసం ఎక్కువగా చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వస్తూ ఉంటాయి. ఇది అదునుగా భావించి వేటగాళ్లు వాటిని హతమార్చేందుకు కరెంట్ తీగలు, ఉచ్చులు అమర్చుతుంటారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. నిరంతరం నిఘాపెట్టి పర్యవేక్షణ చేయాలని సిబ్బందిని ఆదేశించాం. అడవి జంతువుల వేటకు పాల్పడిన వారిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. – కిష్టాగౌడ్, జిల్లా అటవీశాఖ అధికారి -
సైలో బంకర్ సమస్య పరిష్కరించండి
సింగరేణి సీఎండీని కలిసిన ఎమ్మెల్యేసత్తుపల్లి/సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలంలోని ఓసీల నుంచి బొగ్గు రవాణాకు ఏర్పాటుచేసిన సైలోబంకర్ ద్వారా స్థానికులు అనారోగ్యం బారిన పడుతున్న నేపథ్యాన స్పందించాలని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు. ఈమేరకు హైదరాబాద్‌లో సింగరేణి సీఎండీ బలరాంను శనివారం కలిసిన ఆమె సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో సమస్యలు, కిష్టారం వాసుల దీక్షలపై వివరించారు. కాలుష్య ప్రభావంతో పలువురు మృతి చెందగా, బాంబ్ పేలుళ్లులో ఇళ్లు దెబ్బతిన్నందున బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే కోరారు. అలాగే, మాజీ ఎమ్మెల్యే వెంకటవీరయ్య వినతితో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సింగరేణి ఓసీలు, సైలోబంకర్ ద్వారా ఎదురవుతున్న సమస్యలను శనివారం శాసన మండలిలో ప్రస్తావించారు. రేపటి నుంచి స్పోర్ట్స్ స్కూళ్ల ప్రవేశాలకు ఎంపిక పోటీలు పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసాని బాలుర, గుండాల మండలం కాచనపల్లిలోని బాలికల క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు సోమవారం డివిజన్‌స్థాయి ఎంపికలు నిర్వహించనున్నామని ఐటీడీఏ స్పోర్ట్స్ అధికారి గోపాల్‌రావు శనివారం తెలిపారు. దమ్మపేట డివిజన్ పరిధిలోని అంకంపాలెంలో 17న, కమలాపురంలో 18న, భద్రాచలం డివిజన్లోని గొందిగూడెంలో 17న, ఆర్గగూడెంలో 18న, ఇల్లెందు డివిజన్ పరిధిలోని కాచనపల్లిలో 17న, బొజ్జాయిగూడెంలో 18వ తేదీన బ్యాటరీ టెస్ట్‌లు నిర్వహించి ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. ఎంపికలకు వచ్చే విద్యార్థులు తమ వెంట స్టడీ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, రెండు పాస్‌ఫొటోలు, టీషర్ట్, షార్టులు తెచ్చుకోవాలని సూచించారు. 108లో గర్భిణి ప్రసవం కొత్తగూడెంఅర్బన్/పాల్వంచ రూరల్ : ఓ గర్భిణి 108 అంబులెన్స్‌లో ప్రసవించి, ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాలిలా ఉన్నాయి.. పాల్వంచ మండలం జగ్గుతండాకు చెందిన జ్యోతి రామవరంలోని ఎంసీహెచ్‌లో ఇటీవల చేరింది. రక్తహీనత, అధిక రక్తపోటు కారణంతో వైద్యులు వరంగల్ ఎంజీఎంకు రిఫర్ చేయగా శనివారం చుంచుపల్లి 108 సిబ్బంది వరంగల్ తరలిస్తున్నారు. మార్గమధ్యలో నొప్పులు ఎక్కువై అంబులెన్స్‌లోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని, వారిని మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రిలో చేర్పించినట్లు 108 సిబ్బంది, ఈఎంటీ స్నేహ, పైలట్ హరిశంకర్ తెలిపారు. ఇల్లెందు కోర్టు ఏజీపీగా అరుణ ఇల్లెందు: ఇల్లెందు కోర్టు ఏజీపీగా వి.అరుణను నియమించారు. 24 ఏళ్లుగా ఇల్లెందు కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు. దీంతో ఆమెను ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్‌గా ప్రభుత్వం నియమించింది. తన నియామక ఆర్డర్ కాపీని కోర్టు న్యాయమూర్తికి అందజేసినట్లు అరుణ వెల్లడించారు. ఆమె వెంట సీనియర్ న్యాయవాదులు చెన్నకేశవరావు, బార్ అధ్యక్షుడు బి.రవికుమార్ ఉన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి ఇల్లెందు: పట్టణంలోని 17వ వార్డులో ఓ వ్యక్తి తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. షేక్ అబ్దుల్ అజీజ్ (40) ఇంట్లో మృతిచెంది ఉండటంతో చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా విగతజీవిగా పడిఉన్నాడు. భార్య దూరంగా ఉండటంతో కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్నాడు. రెండు రోజుల కిందట డ్యూటీకి వెళ్లి వచ్చి మద్యం మత్తులో డీహైడ్రేషన్‌కు గురై మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఎస్ఐ బి.సూర్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బైక్ అదుపుతప్పి యువకుడు మృతి దమ్మపేట: బైక్ అదుపుతప్పి యువకుడు మృతి చెందిన ఘటన మండలంలోని గండుగులపల్లి శివారులో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ములకలపల్లి మండలం ముత్యాలంపాడు గ్రామానికి చెందిన పొడియం సందీప్ (24) తన ఇద్దరు స్నేహితులు ఊకే రాజు, పొడియం బాబూరావుతో కలిసి బైక్‌పై శుక్రవారం రాత్రి సత్తుపల్లి మండలం బుగ్గపాడులో జరుగుతున్న జాతరకు వచ్చారు. అనంతరం తిరుగు ప్రయాణంలో బైక్‌ను సందీప్ అతివేగం, నిర్లక్ష్యంతో నడుపుతుండగా గండుగులపల్లి శివారులో అదుపుతప్పి కిందపడింది. సందీప్, రాజుకు తీవ్రగాయాలు కాగా.. బాబూరావుకు స్వల్పగాయాలయ్యాయి. ఈ క్రమంలో బాబూరావు మిగతా ఇద్దరిని 108 ద్వారా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. సందీప్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి వివాహం కాగా ఒక కుమారుడు ఉన్నాడు. మృతుడి తల్లి రాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ఎస్ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు. -
కాంటా కొడుతున్నారు..
కొత్తగూడెంలోని రైతుబజార్, మున్సిపల్ మార్కెట్లలో చాలా మంది వ్యాపారులు పాతకాలం నాటి తరాజులు, బాట్లనే వినియోగిస్తున్నారు. పావు కిలో, అరకిలో బాట్లు లేకున్నా వాటి బదులు టమాటాలు, ఆలుగడ్డలను వాడుతుండడం కనిపించింది. తద్వారా 50 నుంచి 100గ్రాములకు పైగా తేడా వస్తోంది. అలాగే, బాట్లపై ఏటా తూనికలు, కొలతల శాఖ వద్ద స్టాంప్ వేయించాల్సి ఉన్నా ఎక్కడా కానరాలేదు.జ్యూయలరీ షాపుల్లో ఎలక్ట్రికల్ వేయింగ్ మిషన్లు వాడుతున్నా అవి సరిగ్గా పని చేస్తున్నాయా.. లేదా అనేది స్పష్టత రాలేదు. అధికారులు ఏటా ఓసారి తనిఖీలు చేస్తున్నామని చెబుతున్నా చాలా మిషన్లపై స్టాంప్‌లు కనిపించలేదు.ప్రస్తుతం కేజీ మటన్ రూ.800కుపైగానే పలుకుతుండగా మటన్ దుకాణాల్లోనూ పాతకాలం నాటి తరాజులనే వినియోగిస్తున్నారు. దీంతో అటు తూకం, ఇటు నాణ్యత విషయంలోనూ మోసపోతున్నామని వినియోగదారులు వెల్లడించారు. ప్రతీ కేజీ మటన్‌కు 100 గ్రాములపైగా తేడా వస్తోందని చెప్పారు. స్టాంప్ లేని బాటుతో కూరగాయాలు తూకం -
కొలువు.. మాకిది సులువు..
● పట్టుబట్టారు.. ఉద్యోగాలు సాధించారు.. ● ఒకటికి మించి జాబ్‌లు కొల్లగొట్టిన యువత ● ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూనే విజయకేతనం ఎగురవేసిన కొందరు ● గ్రూప్ 1, 2, 3కి తోడు జేఎల్‌గా ఎంపికై న పలువురు యువత అనుకుంటే సాధించలేనిదేదీ లేదని, కొలువు కొట్టడం మాకెంతో సులువైన పని అని పలువురు నిరూపించారు. స్పష్టమైన లక్ష్యాలు ఉండడం లేదని, గాలివాటంగా వెళ్తున్నారని కొన్ని కుటుంబాల్లో పెద్దల నుంచి ఫిర్యాదులు వస్తున్నప్పటికీ ఇంకొందరు మాత్రం వాటిని పటాపంచలు చేస్తూ సత్తాచాటుతున్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్ – 1, 2, 3 ఫలితాలతోపాటు జూనియర్ లెక్చరర్లుగా ఎంపికై న వారిని పరిశీలిస్తే కఠోర శ్రమ.. పట్టుదల చూపించి.. ఉద్యోగాలు సాధించారని వెల్లడవుతోంది. స్పష్టమైన లక్ష్యాన్ని ఎంచుకోవడమే కాక నిరంతరం శ్రమించడం, ఒక ఉద్యోగం వచ్చినా పట్టు వీడకుండా మరిన్ని ఉద్యోగాలు సాధిస్తున్న యువత ఇంకొందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ●సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి.. తల్లాడ: మండలంలోని మల్లవరానికి చెందిన కటికి ఉపేంద్రకు సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చినా వదులుకుని ప్రభుత్వ ఉద్యోగం కోసం శ్రమించాడు. తాజాగా ఆయన గ్రూప్–3లో 384వ ర్యాంక్ సాధించాడు. ఆయన రెండేళ్ల వయస్సులోనే తండ్రి బాబూరావు ప్రమాదవశాత్తు మృతి చెందగా తల్లి ప్రోత్సాహంతో పట్టుదలగా చదివాడు. ఆయన 1 – 4వ తరగతి వరకు సాయిచైతన్య, 5 – 10వ తరగతి వరకు బాలభారతి విద్యాలయం, ఇంటర్ ఖమ్మం రెజోనెన్స్, బీటెక్ హైదరాబాద్‌లో పూర్తిచేశాడు. తల్లి సాయమ్మ ప్రోత్సాహంతో ప్రభుత్వ ఉద్యోగం సాధించిన ఉపేంద్రను పలువురు అభినందిస్తున్నారు. -
ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీ
అశ్వారావుపేటరూరల్: ఎదురెదురుగా రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ఒకరు దుర్మరణం చెందారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన శుక్రవారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం టి.గంగన్నగూడెం గ్రామానికి చెందిన కొర్సా సత్తిబాబు (35), జంగారెడ్డిగూడెం మండలం చల్లావారిగూడేనికి చెందిన తన బావ మాదాసు శ్రీను కలిసి బైక్‌పై అశ్వారావుపేట మండలం తిరుమలకుంట గ్రామంలో జరిగిన ఓ శుభ కార్యక్రమానికి హాజరయ్యారు. తర్వాత పక్కనే ఉన్న సత్తిబాబు అత్తారింటికి వెళ్లి తిరిగి తమ గ్రామానికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. ఈ క్రమంలో ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రామానికి చెందిన అమరవరపు మనోహర్ వినాయకపురం నుంచి తన స్వగ్రామానికి బైక్‌పై వెళ్తున్నాడు. రెండు బైక్‌లు తిరుమలకుంట శివారులో ఉన్న ఆంజనేయస్వామి ఆలయం ఎదురెదురుగా ఢీకొన్నాయి. సత్తిబాబు అక్కడికక్కడే మృతిచెందగా శ్రీను, మనోహర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. దుకాణాల్లోకి దూసుకెళ్లిన వాహనం చర్ల: మండల కేంద్రంలోని గొల్లగట్ట సమీపంలో గల సూపర్బజార్లోని దుకాణాల్లోకి మ్యాజిక్ వాహనం దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. అంబేడ్కర్ సెంటర్ వైపు నుంచి తహసీల్దార్ కార్యాలయం సెంటర్ వైపునకు వెళ్తున్న టాటా మ్యాజిక్ సూపర్‌బజార్ సెంటర్లోని ఆంజనేయస్వామి విగ్రహం ఎదురుగా ఉన్న మెకానిక్ షెడ్, ఎలక్ట్రికల్ రిపేరింగ్ దుకాణంలోకి వేగంగా దూసుకెళ్లింది. దీంతో ఎలక్ట్రీషియన్ వాసు, చక్రమ్మ మరొకరికి గాయాలయ్యాయి. చక్రమ్మను మెరుగైన వైద్యం కోసం భద్రాచలం తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేని సీఐ రాజు వర్మ తెలిపారు. ఒకరు దుర్మరణం.. ఇద్దరికి తీవ్ర గాయాలు -
ప్రశ్నిద్దాం.. అది మన హక్కు
● వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక చట్టం ● 1986లో ఏర్పాటు.. 2019లో మరింత బలోపేతం ● ఇప్పటివరకు జిల్లాలో 10,206 కేసులు.. 10,055 పరిష్కారం నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవంఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై సస్పెన్షన్ అనైతికం ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నం పోతమ్మ తల్లిని దర్శించుకున్న మంత్రి దమ్మపేట: మండలంలోని మొద్దులగూడెం శివారులో ఏకుల పోతమ్మ ఆలయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ జాతరలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయగా ఆలయ కమిటీ బాధ్యులు సన్మానించారు. చైర్మన్ దొడ్డా భాస్కరరావు, కాంగ్రెస్ నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, కేవీ సత్యనారాయణ, దొడ్డా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైభవంగా వెంకటేశ్వరస్వామి కల్యాణం అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలాజీ వెంకటేశ్వరస్వామి తిరుకల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి నిర్వహించారు. వేలాదిగా హాజరైన భక్తుల నడుమ అర్చకులు స్వామి కల్యాణాన్ని జరిపించారు. ఆలయ ఇన్చార్జ్ మేనేజర్ పీ.వీ.రమణ ఏర్పాట్లను పర్యవేక్షించగా, మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, శివాలయం వ్యవస్థాపక ధర్మకర్త మారగాని శ్రీనివాసరావుతో పాటు వనమా గాంధీ, పర్సా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.తాటి చెట్టు ఎక్కుతూ కిందపడి వ్యక్తికి గాయాలు ఇల్లెందురూరల్: తాటి ముంజల కోసం చెట్టు ఎక్కుతూ కింద పడటంతో పట్టణంలోని 14 నంబర్బస్తీకి చెందిన బాలప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు. బంధువుల కథనం ప్రకారం.. కొమరారం శివారులో తమ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న తాటి చెట్ల నుంచి ముంజలు కోసేందుకు శుక్రవారం తోటకు వెళ్లిన బాలప్రసాద్ చెట్టు ఎక్కుతున్న క్రమంలోనే పట్టుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఖమ్మంలీగల్: కొనుగోళ్లు, సేవల కోసం డబ్బు చెల్లించే ప్రతీఒక్కరు వినియోగదారులుగానే పరిగణనలోకి వస్తారు. ఈసమయాన నాణ్యతను ప్రశ్నించడం, రశీదు తీసుకోవడం, ధరల తెలుసుకోవడం హక్కుగా సంక్రమిస్తాయి. అదేసమయాన చౌకబారు, నాణ్యత లేని వస్తువులు వచ్చినట్లు తెలిస్తే ప్రశ్నించడం కూడా వినియోగదారుల హక్కుగానే భావించాలి. నేడు(శనివారం) వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా హక్కుల రక్షణకు ఉన్నచట్టం, ఫిర్యాదు చేయాల్సిన తీరు, ఇటీవల వెలువడిన తీర్పులపై కథనం న్యాయం.. నష్టపరిహారం వినియోగదారుల రక్షణ చట్టం –1986 ద్వారా ఫిర్యాదు వినడంతో పాటు న్యాయం చేయడమే కాక నష్ట పరిహారం ఇప్పించడానికి ఒక వ్యవస్థ ఏర్పడింది. ఈ చట్టం 1986లో వచ్చింది. అంతకుముందు వినియోగదారులు 40 రకాల చట్టాలపై ఆధారపడాల్సి వచ్చేది. దీంతో ఇంగ్లాండ్, అమెరికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లోని చట్టాలను అధ్యయనం చేశాక ప్రత్యేక తీసుకొచ్చారు. ఆ తర్వాత 2019లో మరింత బలోపేతం చేస్తూ కొత్త చట్టం ఏర్పరిచారు. అంతర్జాల వేదికలు, ఈ–కామర్స్ ద్వారా కూడా రక్షణ లభించేలా ఇందులో నిబంధనలు పొందుపరిచారు. చట్టం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 10,206 కేసులు నమోదు కాగా.. వీటిలో 10,055 పరిష్కారమయ్యాయి. చట్టం లక్ష్యాలు దోపిడీకి గురైన, మోసపోయిన, దొంగ వ్యాపారంతో విసిగిపోయిన వినియోగదారులకు రక్షణ కవచంలా ఈ చట్టం ఉపయోగపడుతుంది. కష్టాలు, నష్టాలు, కడగండ్ల నుంచి తప్పించడానికి సాయపడుతోంది. సాధారణ, తక్కువ ఖర్చు, కాలయాపన లేకుండా న్యాయం చేకూర్చడమే ఈ చట్టం ఉద్దేశం. ఫిర్యాదులు జిల్లా పరిధిలో ఫిర్యాదులు స్వీకరించి పరిష్కారానికి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటైంది. ఎవరైనా వ్యక్తిగా, సామూహికంగా ఫిర్యాదు చేయొచ్చు. అలాగే, కేంద్ర, రాష్ట్ర, జిల్లాస్థాయిలో మూడంచెలుగా న్యాయవ్యవస్థ, జాతీయ కమిషన్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల నివారణ కమిషన్, జిల్లా స్థాయిలో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఏర్పాటైంది. కొన్న వస్తువులు పాడైనా, నాసిరకంవి వచ్చినా, ఆశించిన రీతిలో లేకున్నా, లోపాలు ఉన్నా, అధికధర వసూలు చేసినా రాతపూర్వకంగా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయొచ్చు. జరిమానా.. శిక్షలు ఎవరికి వ్యతిరేకంగానైతే ఉత్తర్వులు జారీ అవుతాయో, వాళ్లు ఆ ఉత్తర్వులను అమలుపర్చకపోతే వారికి శిక్ష విధించే అధికారం ఫోరమ్‌లు, కమిషన్లకు ఉంటుంది. వ్యక్తికి నెల తగ్గకుండా మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.2వేలు తగ్గకుండా రూ.10వేల వరకు జరిమానా లేదా ఈ రెండింటినీ విధించవచ్చు. అయితే, వీటిపై అప్పీల్‌కు వెళ్లొచ్చు. క్లుప్తంగాఫిర్యాదు చేయడం ఇలా... వస్తువు ధర ఆధారంగా రూ.50లక్షల నష్టపరిహారం వరకు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో ఫిర్యాదు చేసే అవకాశముంది. ఇక రూ.50లక్షలకు పైన రాష్ట్ర వినియోగదారుల ఫోరం, ఆపైన జాతీయ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాలి. కోర్టు రుసుముతో పాటు ఫిర్యాదు ఆధారంగా ఫీజు చెల్లించి పూర్తి వివరాలు సమర్పించాలి. వినియోగదారుల తరుపున న్యాయవాది లేదా సొంతంగానూ వాదనలు వినిపించవచ్చు. అయితే, వివాదం తలెత్తిన రెండేళ్ల లోపు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. e.jagrithi.gov. in ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించారు. ఇతర వివరాల కోసం 08742– 254347 నంబర్లో సంప్రదించవచ్చు.ధంసలాపురానికి చెందని తుమ్మ అప్పిరెడ్డి భార్యతో కలిసి విహార యాత్రకు వెళ్లేందుకు హైదరాబాద్‌లోని అర్చన ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ టూర్ ఆపరేటేర్ బద్దం బోజిరెడ్డి ద్వారా 2023 ఏప్రిల్‌లో రూ.71వేలు చెల్లించి ప్యాకేజీ తీసుకొన్నారు. ఆపై రకరకాల కారణాలతో వాయిదా వేస్తుండగా, అప్పిరెడ్డి జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కారం కమిషన్‌ను ఆశ్రయించారు. విచారణ చేసిన అనంతరం టూర్ కోసం చెల్లించిన రూ.71వేలు, కేసు నమోదు చేసిన నాటి నుంచి ఏడు శాతం వడ్డీతో కలిపి చెల్ల్లిండచమే కాక ఇబ్బందికి వేదనకు రూ.10వేలు, లిటిగేషన్ ఖర్చులకు రూ.10వేలు కూడా చెల్లించాలని తీర్పునిచ్చింది. తల్లాడ మండలం మల్లవరానికి చెందిన దుగ్గిదేవర వెంకటలాల్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. కోవిడ్ బారిన పడిన ఆయన ఆస్పత్రిలో చికిత్సకు రూ.54,963 బిల్లు చెల్లించాడు. ఈ బిల్లు ఇవ్వాలని బీమా కంపెనీని సంప్రదిస్తే నిరాకరించారు. దీంతో సేవాలోపం కింద ఆయన జిల్లా వినియోగదారుల కమిషన్‌లో 2022 జనవరి 28న ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఇరుపక్షాల వాదనలు విన్న సేవా లోపం జరిగిందని నిర్ధారించారు. దీంతో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ(వనస్థలిపురం) తరఫున ఫిర్యాదికి రూ.73,707 చెల్లించాలని తీర్పు చెప్పారు. -
నేడు వినియోగదారుల హక్కుల దినోత్సవం
● కూరగాయల నుంచి బంగారం వరకు ఇదే తంతు.. ● అడుగడుగునా మోసపోతున్న వినియోగదారులు ● అయినా తమకేమీ పట్టనట్లుగా అధికారుల తీరు కొత్తగూడెంఅర్బన్: నిత్యం ఉపయోగించే ఉప్పు, పప్పు మొదలు ఫోన్లు, టీవీలు ఇలా ఏదైనా సరే డబ్బు చెల్లించి కొంటున్న వారంతా వినియోగదారులే. కానీ చాలా మంది నాణ్యత, ధరలు, ప్యాకింగ్‌లో తేడాతో మోసపోతున్నారు. వ్యాపారుల తీరుతో ఈ పరిస్థితి ఎదురవుతుండగా తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీల మాటే మరువడంతో మోసాల స్థాయి నానాటికీ పెరుగుతోంది. ఈ నేపథ్యాన నేడు(శనివారం) వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పలు షాపుల్లో శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యాన పరిశీలించగా నాణ్యతలో లోపాలే కాక కల్తీ జరుగుతున్నట్లు తేలింది. మోసాలకు అడ్డుకట్ట ఏదీ? కూరగాయల దుకాణాలతో పాటు కిరాణం షాపులు, సూపర్మార్కెట్లలో వినియోగదారులు నిత్యం మోసానికి గురవుతున్నట్లు తేలింది. చాలావరకుషాపుల్లో ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్లకు బదులు తరాజులు, బాట్లు వాడుతున్నారు. వీటిని ఏటా తనిఖీ చేసి బరువు సరిగ్గా ఉందని నిర్ధారించి స్టాంప్ వేయించాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అటు అధికారులు కూడా తనిఖీల మాటెత్తకపోవడంతో వ్యాపారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. జిల్లాలో కేసులు ఇలా... జిల్లాలో ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు తూనికలు, కొలతల శాఖ అధికారులు 353 కేసులు నమోదు చేసి రూ.13 లక్షల జరిమానా విధించారు. అయితే, ఎవరైనా ఫిర్యాదు చేస్తేనో, తమకు తోచినప్పుడు మాత్రమే తనిఖీలు చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. అలాకాకుండా నిత్యం తనిఖీలు చేపడితే వ్యాపారుల తీరులో మార్పు రావడమే కాక వినియోగదారులకు నష్టం జరగకుండా అడ్డుకట్ట వేయొచ్చు. కాగా, వినియోగదారులు మోసపోయామని భావిస్తే 98491 28458 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి సూచించారు. తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలి డబ్బు చెల్లించే వారంతా వినియోగదారులుగానే భావించాలి. ప్రతీ వస్తువుకు బిల్లు తీసుకుంటే ఏ మాత్రం తేడా ఉన్నా వినియోగదారుల వివాదాల పరిష్కారం కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. కానీ చాలామంది బిల్లులు తీసుకోకపోవడంతో నష్టపోయామని తెలిసినా పరిహారం అందే పరిస్థితి ఉండడం లేదు. – జూలూరి రఘుమాచారి, కన్జూమర్స్, ఇన్ఫర్మేషన్ రైట్స్ అవేర్నెస్ ఫోరం అధ్యక్షుడు -
గోటి తలంబ్రాలతో కాలినడకన..
బూర్గంపాడు/టేకులపల్లి: బూర్గంపాడు మండలం సారపాకలోని శ్రీదాసాంజనేయ స్వామి ఆలయం, గాంధీనగర్ శ్రీకృష్ణమందిరంలో భక్తులు భద్రాద్రి రామయ్య కల్యాణానికి గోటితో తలంబ్రాలు వలిచారు. శుక్రవారం కాలినడకగా భద్రాచలం వెళ్లి రామాలయంలో తలంబ్రాలు సమర్పించారు. అలాగే, టేకులపల్లి నుంచి గోటితలంబ్రాలతో భద్రాచలానికి భక్తులు బయలుదేరారు. తొలుత టేకులపల్లి శ్రీకోదండ రామాలయంలో గుడిపూడి సబిత ఆధ్వర్యాన పూజలు చేయగా, ఆమెడ రమాదేవి, కేసా పద్మజ, ఆమెడ రేణుక, తుమ్మల సరిత, నెల్లూరి కస్తూరి, జాలాది కవిత, తోటకూరి స్వరూప, అనంతుల వసంత, వెంకటలక్ష్మి, రమ, రాయల ఇందిర, గుర్రం సుజన్య, ఎం.బుచ్చమ్మ తదితరులు పాల్గొన్నారు. -
●గోపీచంద్.. లక్ష్యం ఐఏఎస్
జూలూరుపాడు: గ్రూప్–3 ఫలితాల్లో మండలంలోని సూరారానికి చెందిన బానోత్ గోపీచంద్ 450 మార్కులకు 279 మార్కులతో 611వ ర్యాంకు సాధించాడు. గ్రూప్–2లోనూ 345వ ర్యాంకు సాధించడం విశేషం. వ్యవసాయ కుటుంబానికి చెందిన మాజీ సర్పంచ్ బానోత్ హరిలాల్ – పార్వతి దంపతుల కుమారుడైన గోపిచంద్ బీటెక్ తర్వాత హైదరాబాద్‌లో ఉంటూ గ్రూప్స్‌కు సిద్ధమయ్యాడు. గ్రూప్–1లో మెరుగైన ఫలితం రాకున్నా గ్రూప్–2, 3లో సత్తా చాటాడు. అయితే, గ్రూప్–2 ఉద్యోగం ఎంచుకున్నా ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని గోపీచంద్ తెలిపాడు. -
వైభవంగా చండీహోమం, అభిషేక పూజలు
పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మ తల్లి) ఆలయ యాగశాలలో పౌర్ణమిని పురస్కరించుకుని చండీహోమం, అమ్మవారి సన్నిధిలో పంచామృతాభిషేకం నిర్వహించారు. తొలుత మేళతాళాల నడుమ అర్చకులు అమ్మవారి జన్మస్థలంలో పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చి చండీహోమం చేశారు. పూజల్లో ఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు, వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొన్నారు. జానకీ సదనానికి రూ.6లక్షల విరాళం భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన నిర్మించే జానకీ సదనంలో ఓ గది నిర్మాణానికి దాతలు శుక్రవారం రూ.6 లక్షల విరాళం అందజేశారు. నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన ఎన్.కృష్ణదేవరాయులు – అచల దంపతులు, శాంత పార్వతిదేవి, ఎన్.విజయలక్ష్మీదేవి ఉమ్మడిగా చెక్కు రూపంలో విరాళం అందజేశారని అధికారులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, దాతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నాణ్యతలో రాజీ పడొద్దు.. ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావురఘునాథపాలెం: రఘునాథపాలెం మండలంలో వేలాది ఎకరాల ఆయకట్టుకు సాగర్ నీరు అందించడానికి రూ.66కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మంచుకొండ ఎత్తిపోతల పథకం పనులు నాణ్యతగా చేస్తూనే సకాలంలో పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. మండలంలోని వీ.వీ.పాలెం వద్ద సాగర్ ప్రధాన కాల్వకు ఆనుకుని నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్ పనులను శనివారం ఆయన పరిశీలించారు. ఉగాది నాటికి ట్రయల్ రన్ జరిపేలా పనుల్లో వేగం పెంచాలని, ఏక కాలంలో పంప్‌హౌస్, పైపులైన్ పనులు చేపడితే సకాలంలో పూర్తవుతాయని తెలిపారు. తద్వారా సాగర్ జలాలను మండలంలోని చెరువుల్లో నింపొచ్చని మంత్రి పేర్కొన్నారు. -
రంగుల హరివిల్లు..
ఊరువాడ ఘనంగా హోలీ వేడుకలుజిల్లావాసులు హోలీ వేడుకలు శుక్రవారం వేడుకగా జరుపుకున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా రంగులు చల్లుకుంటూ సంబరంగా గడిపారు. కాలనీలు, అపార్ట్మెంట్లలో సామూహికంగా రంగుల పండుగ జరుపుకోగా.. పలువురు జట్లుగా విడిపోయి స్నేహితుల ఇళ్లకు వెళ్లి రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. హేమచంద్రాపురంలోని పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో ఉద్యోగులతో కలిసి ఎస్పీ రోహిత్‌రాజ్ హోలీ జరుపుకున్నారు. పాటలకు అనుగుణంగా డప్పు మోగిస్తూ నృత్యం చేసిన ఆయన ఉద్యోగులను ఉత్సాహపరిచారు. కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, ఎన్.చంద్రభాను, రవీందర్‌రెడ్డితో పాటు సీఐ బత్తుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాగా, అశ్వారావుపేటలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు రంగులకు బదులు బురదలో హోలీ వేడుకలు జరుపుకోవడం విశేషం. – సాక్షి నెట్వర్క్ -
సాగుకు పైసల్లేవు..
● కౌలు రైతులపై కనికరం చూపని ప్రభుత్వం ● పెట్టుబడి సాయంపై ఆశలు వదిలేసుకుంటున్న అన్నదాతలు ● ఎన్నికల హామీని పాలకులు విస్మరించారని ఆవేదన బూర్గంపాడు: గత ప్రభుత్వ పాలనలో పెట్టుబడి సాయం అందక ఇబ్బందులు పడిన కౌలు రైతులకు ప్రస్తుత ప్రభుత్వం కూడా మొండిచేయి చూపుతోందని ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా కౌలురైతులకూ పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించడం లేదు. రైతు భరోసా నిధుల విడుదలలో ఎక్కడా కౌలు రైతుల ఊసెత్తడం లేదు. గత పది నెలల క్రితం మంత్రులతో సబ్ కమిటీ వేసిన ప్రభుత్వం కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించినా ఇప్పుడు పట్టనట్లు వ్యవహరిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. 55 వేల మంది.. 1.30లక్షల ఎకరాలు జిల్లాలో సుమారు 55వేల మంది వరకు కౌలు రైతులు ఉండగా.. వీరు సుమారు 1.30లక్షల ఎకరాల్లో పట్టాదారుల నుంచి భూమి కౌలుకు తీసుకుని పంటలు సాగుచేస్తున్నారు. వీరికి గత ప్రభుత్వం అమలుచేసిన రైతుబంధు పథకం వర్తించలేదు. పంటలు సాగు చేసినా, చేయకున్నా పట్టాదారుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు నగదు జమయ్యేది. అలాగే బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునే అవకాశం కూడా లేదు. కేవలం ప్రైవేట్ అప్పులతోనే కౌలు రైతులు పంటలు సాగు చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్టపోయినా వీరికి రూపాయి పరిహారం కూడా అందదు. పట్టాదారులు కనికరిస్తే తప్ప వారికి పంట నష్టపరిహారం కూడా అందే పరిస్థితులు లేవు. ఇక కౌలు రైతులు పండించిన పంటలను ప్రభుత్వ కేంద్రాల్లో అమ్మాలంటే మళ్లీ పట్టాదారుల పేరుమీదనే అమ్మ డం.. ఆపై వారి ఖాతాల్లో నగదు అయితే తీసుకోవ డం పరిపాటిగా మారింది. మరోపక్క కౌలురైతులు సాగు చేసే పంటలకు ప్రభుత్వం అందించే పంటల బీమా కూడా వర్తించడం లేదు. ఈ పరిస్థితులను గుర్తించి కౌలురైతులకు కూడా పెట్టుబడి సాయమందిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయాన హామీ ఇచ్చినా ఆ హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. గుర్తించడమే సమస్య కౌలు రైతుల గుర్తింపే ప్రభుత్వాలకు పెద్దసమస్యగా భావిస్తున్నారు. పట్టాదారులెవరూ తమకు వచ్చే రైతు భరోసాను వదులుకుని కౌలురైతులకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండరు. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కౌలురైతు చట్టం ప్రకారం భూయజమాని, కౌలురైతులు ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్మాట్లో సంతకాలు చేసేవారు. నాడు బ్యాంకుల్లో కౌలు రైతుల పంటరుణాల కోసం ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రస్తుతం భూ యజమానులు తమకు ప్రభుత్వం నుంచి వచ్చే రైతుభరోసాను వదులుకుని కౌలు రైతులకు ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో కౌలు రైతుల గుర్తింపు, వారికి రైతు భరోసా వర్తింపుపై నీలినీడలు కమ్ముకున్నాయి. -
●ఆఫ్రిద్.. వరుస ఉద్యోగాలు
సింగరేణి(కొత్తగూడెం): చుంచుపల్లి మండలం రుద్రంపూర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు మహ్మద్ రజాక్ – ఫాతిమా దంపతుల రెండో కుమారుడు ఆఫ్రిద్ వరుసగా ఉద్యోగాలు సాధిస్తున్నాడు. బీఈ మెకానికల్ ఇంజనీరింగ్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసిన ఆయన గతంలోనే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో ఉద్యోగాలు సాధించాడు. అలాగే, గ్రూప్–4లో జిల్లాలో మొదటి ర్యాంక్ సాధించి ప్రస్తుతం రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తూ గ్రూప్–1లో 448 మార్కులు, గ్రూప్–2లో 377 మార్కులతో రాష్ట్రస్థాయి 313 ర్యాంకు, గ్రూప్–3లో 22వ ర్యాంక్ సాధించడం విశేషం. ఇక జూనియర్ లెక్చరర్ పరీక్షలో రాష్ట్రస్థాయి 21వ ర్యాంక్ సాధించిన ఆఫ్రిద్ పలువురి అభినందనలు అందుకుంటున్నాడు. -
సీతారామా.. తలంబ్రాలు ఇవిగో..!
● రామయ్య కల్యాణానికి సమర్పించిన భక్తజనం ● భక్తి శ్రద్ధలతో పండించి.. గోటితో వలిచి తీసుకొచ్చిన పలువురు ● ఉమ్మడి రాష్ట్రం నుంచి తరలివచ్చిన భక్తులు ఐదేళ్లుగా సమర్పిస్తున్నా.. భద్రాచలంలో స్వామి కల్యాణంలో వినియోగించే తలంబ్రాలలో మేం పండించి తీసుకొచ్చిన తలంబ్రాలు కలిపేందుకు ఐదేళ్లగా వస్తున్నాం. మా కాలనీలో పలువురు భక్త మండలిగా ఏర్పాటై కాలినడకన వచ్చి రామయ్యకు తలంబ్రాలు సమర్పిస్తున్నాం. –సరస్వతి, మహబూబాబాద్ భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో అత్యంత వైభవంగా జరిగే సీతారాముల కల్యాణ ఘట్టంలో తలంబ్రాలు ప్రధానమైనవని చెప్పాలి. స్వామి, అమ్మ వార్ల కల్యాణ తంతు ముగియగానే వారి పైనుంచి జాలువారిన తలంబ్రాలు దక్కించుకునేందుకు భక్తజనం పోటీ పడతారు. కొందరు తలంబ్రాలను ఇళ్లలో దేవుళ్ల చిత్రపటాల వద్ద ఉంచి పూజలు చేస్తే.. ఇంకొందరు పంట భూముల్లో చల్లితే దిగుబడి పెరుగుతుందని నమ్ముతారు. ఇంతటి విలువైన తలంబ్రాలను భక్తిశ్రద్ధలతో పండించి.. స్వయంగా గోటితో వలిచి స్వామి వారికి సమర్పించేందుకు దేశ నలుమూలల నుంచి భద్రగిరికి వస్తారు. రామయ్య కల్యాణ పనులు మొదలైన రోజునే తలంబ్రాలను కలపడం ఆనవాయితీ కావడంతో ఎప్పటిలాగే పౌర్ణమి రోజు జరిగిన ఈ క్రతువుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుదూర ప్రాంతాల భక్తులు గురువారం రాత్రికల్లా భద్రాచలం చేరుకోగా.. శుక్రవారం ఉదయం ఆలయ ఆవరణలో తలంబ్రాలు కలిపే కార్యక్రమానికి తరలిరావడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొనగా.. రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కాలినడకన సైతం.. భద్రాచలంలో నిర్వహించే శ్రీసీతారాముల కల్యాణంలో వినియోగించే తలంబ్రాలను పండించేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ఈ క్రమాన తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల భక్తులు తమ భూముల్లో భక్తి శ్రద్ధలతో వరినాట్లు వేసి పంట పండించాక... ధాన్యాన్ని గోటితో వలిచి తలంబ్రాలు సిద్ధం చేస్తారు. ఆపై కాలినడకన భద్రగిరికి వచ్చిన పలువురు దేవస్థానంలో ప్రధాన అర్చకులతో ప్రత్యేక పూజలు చేయించి రామయ్యకు సమర్పించారు. ఇలా భక్తులు సమర్పించిన తలాంబ్రాలతో పాటు దేవస్థానం తరఫున తలంబ్రాలు, ముత్యాలను కలిపి సీతారాముల కల్యాణంలో వినియోగించడం ఆనవాయితీగా వస్తోంది. తలంబ్రాలు కలిపేందుకు వచ్చాం ఏటా సీతారాముల కల్యాణంలో వినియోగించే తలంబ్రాలు కలిపేందుకు బంధువులతో వస్తున్నా. రామనామ స్మరణతో తలంబ్రాలు కలుపుతుంటే సంతోషంతో మనసు పులకించిపోతుంది. పదేళ్లుగా వస్తున్నా ఎప్పటికీ కొత్త అనుభూతే ఉంటుంది. –రమణ, హైదరాబాద్ -
సప్తవర్ణాల రామయ్య!
● భద్రగిరిలో సీతారాముల పెళ్లి పనులు ప్రారంభం ● పసుపు దంచడంతో పాటు తలంబ్రాల తయారీ ● వైభవోపేతంగా వసంతోత్సవం, డోలోత్సవం భద్రాచలం: ఇంద్రధనస్సును తలపించేలా రంగులు.. వేలాదిగా హాజరైన భక్తజనం.. తలంబ్రాల తయారీతో మహిళల ఆనందోత్సవాలు... పాదయాత్రగా గోటి తలంబ్రాలు తీసుకొచ్చిన భక్తుల రామనామస్మరణతో భద్రగిరి సందడిగా మారింది. భద్రాచలంలో శ్రీరామనవమికి ముందు ఏటా నిర్వహించే తొలి వేడుక శుక్రవారం వైభవోపేతంగా సాగింది. ప్రతీ జంటకు ఆదర్శంగా నిలిచే కల్యాణ రాముడి పెళ్లి పనుల్లో భాగంగా మహిళలు సంప్రదాయబద్ధంగా పసుపు కొమ్ములు దంచే పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం వసంతోత్సవం, డోలోత్సవ సంబురాలతో దక్షిణ అయోధ్యగా పేరున్న భద్రాచలం మురిసిపోయింది. పసుపు కొమ్ములు దంచి.. తలంబ్రాలు కలిపి ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున పసుపు కొమ్ములను దంచి తలంబ్రాల తయారీతో పెళ్లి పనులకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీ. రెండేళ్లుగా భక్తులను సైతం భాగస్వాములను చేస్తుండడంతో మిథిలా స్టేడియం, వైకుంఠ ద్వారం వద్ద ఈ ఏడాదీ కొనసాగించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, భక్తు ల కోలాటాల నడుమ పల్లకీసేవగా స్వామి ఉత్సవ మూర్తులను ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ స్వామి వారికి, రోళ్లు, రోకళ్లకు అర్చకులు, పండితులు పూజలు చేశారు. ఆపై ఆలయ ఈఓ రమాదేవి, అర్చకుల, పండితుల సతీమణులతో పసుపు కొమ్ములు దంచి పెళ్లి పనులను ప్రారంభించారు. ఆపై బియ్యంలో పసుపు, రోజ్‌వాటర్, గులామ్, సుగంధద్రవ్యాలను కలిపి తలంబ్రాలను సిద్ధం చేయడంతో పాటు తొలి తలంబ్రాలను ఆలయ అధికారులు తలపై ధరించి స్వామి వారి మూలమూర్తుల పాదాల చెంతన ఉంచారు. వసంతోత్సవంతో శోభ శ్రీ సీతారాములకు వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించిన అర్చకులు తొలుత బేడా మండపంలో స్వామి వారి ఉత్సవమూర్తులతో పాటు సువర్ణలక్ష్మి అమ్మవారికి పంచామృతంతో కలశాభిషేకం, సహస్రధారతో స్నపనం జరిపారు. ప్రత్యేకంగా అలకరించిన ఊయలపై శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యను ఆశీనులు చేశారు. ఆస్థాన గాయకులు రామదాసు కీర్తనలను ఆలపిస్తుండగా అర్చకులు పూజలు చేశారు. అనంతరం స్వామికి నక్షత్ర హారతి సమర్పించడంతో పాటు వసంతాలను శ్రీ సీతారాములపై చల్లిన అర్చకులు వసంతోత్సవాన్ని ప్రారంభించారు. ఆపై భక్తులపైనా రంగులు చల్లడంతో బేడా మండపం రంగులమయంగా మారింది. ఇక సాయంత్రం లక్ష్మీ అమ్మవారికి సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. -
పూజారి ఇంట ఇఫ్తార్ విందు
ఇల్లెందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు స్టేషన్ బస్తీలోని గణేశ్ ఆలయ పూజారి హరగోపాల్ శర్మ గురువారం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ప్రస్తుతం రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతుండగా.. రోజా పాటించే వారిని సాయంత్రం ఆహ్వానించిన శర్మ.. వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన పలు రకాల వంటకాలను వడ్డించారు. ఈ సందర్భంగా అక్కడి ముస్లింలు శర్మను అభినందించారు.కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని..లింగాలఘణపురం: కొడుకు కులాంతర వివాహం చేసుకున్నాడని, ఆయన తండ్రి అంత్యక్రియలకు కులస్తులు దూరంగా ఉన్న సంఘటన జనగామ జిల్లా లింగాలఘణపురంలో గురువారం జరిగింది. విష యం తెలుసుకున్న ఎస్సై శ్రావణ్‌కుమార్ వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. దయ్యాల భిక్షపతి (60) బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. అతడి కొడుకు అనిల్ ఆరు నెలలక్రితం నెల్లుట్లకు చెందిన శ్రావణిని ప్రేమ వివాహం చేసుకొని జన గామలో ఉంటున్నాడు. కొంతమంది పాలి వారు, కుల పెద్దలు కొడుకు తలకొరివి పెట్టవద్దని, మృతుడి భార్య పెడితేనే వస్తామని చెప్పడంతో అందుకు ఆమె అంగీకరించలేదు. విషయం తెలుసు కున్న ఎస్సై వారి వద్దకు వెళ్లి కౌన్సెలింగ్ ఇవ్వగా కొంతమంది మాత్రం అంత్యక్రియలకు హాజరయ్యారు. -
కూలీకి రూ.22 లక్షల జీఎస్టీ నోటీసు!
చండ్రుగొండ: ఓ సాధారణ వ్యవసాయ కూలీకి రూ.22 లక్షలు జీఎస్టీ చెల్లించాలంటూ నోటీసు జారీ అయింది. ఇటీవల పోస్టు ద్వారా అందిన నోటీసుతో నిరక్షరాస్యుడైన ఆ కూలీ బిత్తరపోయాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండకు చెందిన జానపాటి వెంకటేశ్వర్లు (వెంకటేష్) కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఆయనకు ఈ నెల 4వ తేదీన జీఎస్టీ నోటీసు అందింది. తనకు చదువు రాకపోవటంతో తెలిసివారికి ఆ లేఖను చూపగా, విజయవాడ బెంజ్ సెంటర్లోని కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయం నుంచి అందిన నోటీసుగా చెప్పారు.విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ పేరుతో రూ.కోటి విలువైన గ్రానైట్ వ్యాపారం చేశారని, 2022 ఏడాదిలో చేసిన ఈ వ్యాపారానికి జరిమానాతో కలిపి జీఎస్టీ రూ.22,86,014 బకాయి పడ్డట్లు అందులో ఉంది. దీంతో ఆందోళన చెందిన వెంకటేశ్వర్లు.. విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ ఎవరిదో కనుక్కునేందుకు ఈ నెల 12న విజయవాడ వెళ్లాడు. అయితే ఆ అడ్రస్‌లో కార్యాలయమే లేదని తేలడంతో వెనుదిరిగాడు. 2022 ఏడాదిలో ఆయనకు పాన్‌కార్డు కూడా లేదు.ఆరు నెలల క్రితమే చండ్రుగొండలోని మీ సేవ కేంద్రానికి పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేయటానికి వెళ్తే.. ఆ పేరు, ఆధార్ నంబర్‌తో అప్పటికే పాన్‌కార్డు జారీ అయిందని చెప్పారు. అయితే, వెంకటేశ్వర్లు ఆధార్‌కార్డు అక్రమార్కుల చేతికి ఎలా వెళ్లింది? ఆయన పేరుతో వ్యాపార లైసెన్స్ తీసుకున్నది ఎవరేది తేలాల్సి ఉంది. ఈ విషయమై బాధితుడు మాట్లాడుతూ రెక్కాడితే కాని డొక్కాడని తనకు ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని, అధికారులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరాడు. -
‘ప్రకృతి’ సభలకు రండి
కలెక్టర్‌కు ప్రకృతి ప్రేమికుల ఆహ్వానంసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమంలో ఈనెల 23న నిర్వహించనున్న ప్రకృతి ఆరోగ్య మహాసభలకు హాజరు కావాలని కోరుతూ కలెక్టర్ జితేష్ వి పాటిల్‌కు గురువారం ప్రకృతి ప్రేమికులు ఆహ్వానించారు. జిల్లాలో ప్రకృతి పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న పాటిల్‌ను ఈ మహాసభలకు హాజరై సందేశం ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆశ్రమ సభ్యులను అభినందించిన కలెక్టర్.. సభలకు హాజరవుతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ గ్రీన్ అంబాసిడర్ మొక్కల వెంకటయ్య, సభల కో ఆర్డినేటర్ జి.సుగుణారావు, మొక్కల రాజశేఖర్, బంగారి శంకర్, దయానందసాగర్, రాజేష్ పాల్గొన్నారు. ఐటీఐకి అనువైన స్థలం గుర్తించాం.. గ్రామీణ నియోజకవర్గాల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ఏర్పాటుపై రాష్ట్ర ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్‌కుమార్ గురువారం అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్.. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి హాజరై జిల్లా వివరాలు వెల్లడించారు. అశ్వారావుపేటలో ఐటీఐ స్థాపనకు అనువైన స్థలాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఆ స్థలం రహదారికి సమీపంలో ఉందని, ఆర్టీసీ రవాణా సౌకర్యం కూడా ఉందని చెప్పారు. సమీపంలో పరిశ్రమలు కూడా ఉన్నాయన్నారు. అశ్వారావుపేట రాష్ట్రంలోనే ఆయిల్‌పామ్‌కు హబ్‌గా ఉందని, ఇక్కడ వ్యవసాయ కళాశాల కూడా ఉన్నందున ఐటీఐలో వ్యవసాయ సంబంధిత కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. దీంతో ఎలాంటి కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ఎక్కువ లాభం చేకూరుతుందో తగిన నివేదికలను అందజేయాలని ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్‌కు సూచించారు. -
పూర్వ వీఆర్‌ఓల్లో ఆశలు
● ఉగాది నాటికి ‘భూభారతి’ ● తద్వారా సొంత శాఖలోకి తీసుకుంటారని ప్రచారం ● ఉమ్మడి జిల్లాలో 562మంది ఎదురుచూపులు ఖమ్మం సహకారనగర్: రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. దీంతో మళ్లీ తాము సొంత శాఖ అయిన రెవెన్యూలోకి వెళ్తామని పూర్వ వీఆర్వోల్లో ఆశలు తలెత్తుతున్నాయి. గత ప్రభుత్వం నవంబర్ 19, 2020న వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి 2022 జూలై 23న వీఆర్వోలను ఇతర శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో సర్దుబాటు చేసింది. ఆ సమయాన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల ఖాళీ లేక.. జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్ కలిగిన వీఆర్వోలను అటెండర్, స్వీపర్, కామాటి, కుక్, తోటమాలి, జీపు డ్రైవర్, రికార్డు కీపర్, రికార్డ్ అసిస్టెంట్, వార్డు అధికారి, సీనియర్ స్టెనో, జూనియర్ స్టెనో తదితర పోస్టుల్లో సర్దుబాటు చేశారు. అయితే, సరైన స్థాయి పోస్టులు లేక, ఆశించిన గౌరవం కూడా లభించటం లేదని వారు ఆవేదన చెందుతున్నారు. మళ్లీ ఇన్నాళ్లకు... కొత్త ప్రభుత్వం ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకొస్తామని చెబుతుండగా, పూర్వ వీఆర్వోలు ఆశలు రెకేత్తాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 11వేల పోస్టులు భర్తీ చేస్తామని చెబుతున్న క్రమంలో పూర్వ వీఆర్వోలు 5వేల మందిని ఈ పోస్టుల్లోకి తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఫలితంగా పూర్వ వీఆర్వోలను రెవెన్యూ శాఖలోకి తీసుకోనుండగా, ఇంకొందరు నిరుద్యోగులకూ ఉద్యోగాకాశాలు దక్కే అవకాశముంది. ఏం పేరు? రాష్ట్రప్రభుత్వం భూభారతిలో విధులు నిర్వర్తించే వారికి గ్రామ పరిపాలన అధికారి(జీపీఏ) లేదా విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(వీఏఓ)గా పేరు పెట్టే అవకాశముందని రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది. ఉగాది నాటికి స్పష్టత వచ్చే అవకాశముంది. అయితే, గ్రామస్థాయిలో వీఆర్వోలు కీలకం కానున్నందున జీపీఏనే పేరు ఖరారు చేసే అవకాశముందని చెబుతున్నారు. ఈ సమస్యలూ పరిష్కరిస్తే... తమను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయడంతో సర్వీస్ రక్షణతో పాటు పదోన్నతులు కోల్పోయామని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇంక్రిమెంట్లు కోల్పోయామని, నేటికీ సర్వీస్ క్రమద్ధీద్దీకరణ జరగలేదని, ప్రొబేషనరీ పీరియడ్ ఖరారు చేయడం లేదనే వాదన ఉంది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జీసీసీలో సేల్స్మెన్లుగా, పెట్రోల్ బంక్ ఆపరేటర్లుగా కేటాయించిన 16మందికి వేతనాలు అందడం లేదని చెబుతున్నారు. అంతేకాక ఇద్దరు వీఆర్వోలు మృతి చెందడంతో కారుణ్య నియామకాల్లోనూ అవకాశం ఇవ్వలేదని ఆవేదన చెందుతున్నారు. కాగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఇటీవల రెవెన్యూ అసోసియేషన్‌తో కలిసి పూర్వ వీఆర్వోలు సమావేశమయ్యారు. భూభారతిలో అవకాశం కల్పించడమే కాక ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆయనను కోరారు.ఉమ్మడి జిల్లాలో గ్రామాలు, వీఆర్వోల వివరాలు జిల్లా మండలాలు రెవెన్యూ వీఆర్వోలు గ్రామాలు ఖమ్మం 21 352 329 భద్రాద్రి 23 240 233 మొత్తం 44 592 562సీనియారిటీతో పదోన్నతులు రాష్ట్ర ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చి అప్పగించే ప్రతీ పనిని బాధ్యతగా చేస్తాం. అయితే, మా సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు కామన్ సీనియారిటీ ద్వారా పదోన్నతులు వర్తింపచేయాలి. ప్రతీ గ్రామానికి ఒక సహాయకుడిని నియమిస్తే క్షేత్రస్థాయిలో సులువుగా పాలన సాగుతుంది. – గరికె ఉపేంద్రరావు, వీఆర్వోల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడువేతనాలు అందడం లేదు వీఆర్వో వ్యవస్థ రద్దయ్యాక నన్ను గిరిజన కార్పొరేషన్ సొసైటీ(జీసీసీ)కి కేటాయించారు. ప్రభుత్వం 60శాతం, కార్పొరేషన్ 40శాతం నిధులతో వేతనం ఇవ్వాలి. కానీ సక్రమంగా వేతనాలు అందక ఇబ్బందిగా ఉంది. ఇతర శాఖల్లో మాదిరి కార్పొరేషన్లో పీఎఫ్, ఈఎస్ఐ, పెన్షన్లు సౌకర్యాలు అందడం లేదు. – మట్టా వెంకటమ్మ, జీసీసీ ఉద్యోగి, మణుగూరు -
నేడు వేణుగోపాలస్వామి కల్యాణం
బూర్గంపాడు: గోదావరి తీరంలో కొలువైన ఇరవెండి సంతాన వేణుగోపాలస్వామి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14వ తేదీన రుక్మిణీ సమేత సంతాన వేణుగోపాల స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరగనుంది. చోళుల కాలంనాటి పురాతన సంతాన వేణుగోపాలస్వామి ఆలయంలో కల్యాణం రోజున గరుడ ముద్దలు పంపిణీ చేస్తారు. సంతానం లేనివారు ఈ గరుడ ముద్దలు స్వీకరిస్తే సంతానం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు విశ్వాసం. పూర్వం ఈ ఆలయంలో స్వామివారిని వెండిపూలతో పూజించేవారని చెబుతుంటారు. అందుకే ఈ గ్రామానికి విరివెండిగా పేరువచ్చిందని, కాలక్రమంలో ఇరవెండిగా మారిందని, ఈ ఆలయం ఎదుట అష్టభుజ సత్తెమ్మ తల్లి విగ్రహం ఉండగా.. ఆలయానికి ఆమె రక్షణగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. హోలీ పండుగ రోజున జరిగే స్వామివారి కల్యాణానికి ఆలయ కమిటీ బాధ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం స్వామివారి మేలుకొలుపు, అభిషే కాలు, ఆర్జిత సేవలు.. కల్యాణం అనంతరం అన్న సమారాధన, సాయంత్రం తిరువీధిసేవ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. కల్యాణాన్ని వీక్షించేందుకు జిల్లాతో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య వెల్లడించారు. -
నవమి నాటికి మ్యూజియం ప్రారంభిస్తాం
● సుందరీకరణ పనులు సాగుతున్నాయి.. ● పెయింటింగ్‌లు చివరి దశకు చేరాయి ● ఐటీడీఏ పీఓ రాహుల్ వెల్లడిభద్రాచలంటౌన్ : భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో నిర్మిస్తున్న ట్రైబల్ మ్యూజియం పనులు చివరి దశకు చేరాయని, ఈనెల 22 వరకు పూర్తి చేస్తామని, శ్రీరామనవమి నాటికి మ్యూజియాన్ని ప్రారంభించేలా చర్యలు చేపడుతున్నామని పీఓ బి.రాహుల్ తెలిపారు. మ్యూజియం పనులను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యాటకులకు ఆదివాసీ గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుండి పోయేలా రూపొందిస్తున్నామని, మ్యూజియాన్ని చూడగానే కొత్త అనుభూతి వచ్చేలా సుందరీకరణ పనులు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం పాతకాలపు ఇల్లు నిర్మాణంతో పాటు కోయ సంస్కృతికి సంబంధించిన పెయింటింగ్‌లు పూర్తి కావొస్తున్నాయని అన్నారు. పండుగలకు సంబంధించిన బొమ్మల చిత్రీకరణ కొనసాగుతోందని, బాక్స్ క్రికెట్ గ్రౌండ్, బోటింగ్ చెరువుతో పాటు ఆర్చరీ గ్రౌండ్ పనులు పూర్తి కావచ్చాయని వెల్లడించారు. మ్యూజియం సందర్శనకు వచ్చే వారికి గిరిజన వంటకాలతో పాటు చైనీస్ ఫుడ్ అందుబాటులో ఉంచుతున్నామని, ఈ మేరకు స్టాళ్లు సిద్ధం చేశామని చెప్పారు. సందర్శకులు కొనుగోలు చేసేందుకు కోయ కల్చర్ బొమ్మలు అందుబాటులో ఉంచుతామని, పాత తరానికి చెందిన కళాఖండాలు సిద్ధం చేశామని వివరించారు. కార్యక్రమంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ ఆయా శాఖల అధికారులు చంద్రశేఖర్, ఉదయ్‌కుమార్, హరీష్, గోపాలరావు, నర్సింగరావు, వేణు, ప్రభాకర్ రావు, శ్రీనివాసరావు, చిట్టిబాబు, మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. -
రామయ్య పెళ్లి పనులకు నేడు శ్రీకారం
● మిథిలా స్టేడియం వద్ద తలంబ్రాల తయారీకి ఏర్పాట్లు ● తీర్థబిందెతో వసంతోత్సవానికి అంకురార్పణ ● నేడు స్వామివారి నిత్యకల్యాణం రద్దుభద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవ పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. పెళ్లి పనులకు ఆదిమూలంగా భావించే పసుపు కొమ్ములను దంచి తలంబ్రాలు కలిపే వేడుకకు వైకుంఠ ద్వారం, మిథిలా స్టేడియం ప్రాంగణం సిద్ధమయ్యాయి. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా దేవస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకను అంగరంగవైభవోపేతంగా జరపడం ఆనవాయితీ. గత రెండేళ్లుగా భక్తులు సైతం పాల్గొనేలా మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఈ వేడుకను ఆలయ ఈఓ రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. తలంబ్రాల తయారీతో మొదలు.. వసంతోత్సవం రోజున భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలు కలిపే వేడుకను ప్రారంభించడం సంప్రదాయం. భక్తులు అత్యంత ఆధ్యాత్మికంగా భావించే ఈ కార్యక్రమాన్ని రెండేళ్లుగా మిథిలా స్టేడియం ప్రాంగణం, వైకుంఠద్వారం వద్ద నిర్వహిస్తున్నారు. పెళ్లి పనుల్లో భక్తులందరినీ భాగస్వాములు చేసేందుకు ఈ వేడుకకు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది 200 క్వింటాళ్ల తలంబ్రాలు కలిపేలా అధికారులు సన్నాహాలు చేస్తుండగా తొలి రోజు పసుపు, కుంకుమ దంచి, ప్రత్యేక గులాములతో 20 క్వింటాళ్ల తలంబ్రాలను సిద్ధం చేయనున్నారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం నిత్యకల్యాణం రద్దు చేశామని, శనివారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని ఆలయ వర్గాలు వెల్లడించాయి. తీర్థ బిందెతో శ్రీకారం.. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా భద్రాద్రి రామాలయంలో శుక్రవారం జరగనున్న డోలోత్సవం, వసంతోత్సవానికి గురువారం అంకుకార్పణ చేశారు. మేళతాళాలు, అర్చకుల వేద మంత్రాల నడుమ పవిత్ర గోదావరి నదీ జలాలను తీసుకొచ్చి అంకురార్పణ చేశాక యాగశాలలో వాస్తుహోమం నిర్వహించారు. నేడు వసంతోత్సవం, డోలోత్సవం.. బేడా మండపంలో శుక్రవారం వసంతోత్సవం, డోలోత్సవం జరపనున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి సహస్రధారలతో స్నపనం, అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారిని ఊయలలో ఆశీనులు చేసి డోలోత్సవం నిర్వహించనున్నారు. శ్రీ స్వర్ణ లక్ష్మీ అమ్మవారికి పంచామృత స్నపనం, సాయంత్రం 4 గంటలకు సామూహిక కుంకుమార్చన గావిస్తారు. ముత్యాల తలంబ్రాలు ఎంతో ప్రత్యేకం.. భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం ఎంత ప్రత్యేకమో.. జానకిరాముల నుదిటి పైనుంచి జాలు వారే ముత్యాల తలంబ్రాలకూ అంతే ప్రత్యేకత ఉంటుంది. స్వామి, అమ్మవార్ల నుదుటి పైనుంచి జాలువారే తలంబ్రాలను తమపై చల్లుకుంటే ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, భోగభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఆది దంపతులు, అన్యోన్యానికి ప్రతీకలైన సీతారాముల కల్యాణంలో ఉపయోగించే ఈ తలంబ్రాలను తమ ఇంట ఉంచుకోవడానికి భక్తులు తహతహలాడుతుంటారు. ఇక ఇళ్లలో జరిగే వివాహ వేడుక సందర్భంగా తయారుచేసే తలంబ్రాలలో ఈ ముత్యాలు కలిపిన స్వామి వారి తలంబ్రాలు కలిపితే దంపతుల నడుమ మరింత అనురాగం పెంపొందుతుందని, అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఉన్న శ్రీ సీతారాముల ఆశీస్సులు లభిస్తాయని పలువురు నమ్ముతుంటారు. అందుకే ఏటా భద్రాచలంలో దొరికే ముత్యాల తలంబ్రాలకు ఆదరణ పెరుగుతోంది. ఇక ఏపీ, తెలంగాణ రాష్ట్రాల వారు భక్తిశ్రద్ధలతో గోటితో ఒడ్లను ఒలిచి తలంబ్రాలు తయారుచేసి రామయ్య కల్యాణానికి సమర్పించి స్వామి వారి కృపకు పాత్రులవుతున్నారు. -
ఓటరు జాబితా సవరణ పూర్తిచేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): మార్చి 19 లోపు ఓటరు జాబితా సవరణ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం ఆయన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ దారాప్రసాద్, ఎన్నికల సిబ్బంది నవీన్ పాల్గొన్నారు. సీసీ రోడ్ల నిర్మాణాలు తనిఖీ అశ్వాపురం: మండలంలోని మల్లెలమడుగు గ్రామంలో సీసీ రోడ్ల నిర్మాణాలను గురువారం క్వాలిటీ కంట్రోల్ డీఈ శశికళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యతా ప్రమాణాలతో నిర్మిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీసీ రోడ్లను నిర్దేశిత సమయానికికల్లా పూర్తి చేయాలని సూచించారు. దరఖాస్తుల ఆహ్వానం సుజాతనగర్: 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను స్థానిక మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలల గురుకుల పాఠశాలలో 6, 7, 8, 9 తరగతుల్లో (ఇంగ్గిష్ మీడియం) మిగిలిపోయిన ఖాళీ సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ వి.బ్యూలారాణి గురువారం ప్రకటనలో తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, ఈబీసీలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ నెల 31 వరకు తుది గడువు అని, ఏప్రిల్ 20న ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు. ‘దుమ్ము, ధూళితో ఇబ్బంది పడుతున్నాం..’టేకులపల్లి: సింగరేణి నిధులతో రేగులతండా నుంచి దాసుతండా వరకు ఏడాది కిందట చేపట్టిన రోడ్డు నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో దుమ్ము, ధూళితో ఆస్పత్రి పాలవుతున్నామని, ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొందని రేగులతండాలో సంత్ శ్రీ సేవాలాల్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ ఇస్లావత్ నామానాయక్ ఆధ్వర్యంలో సింగరేణి వాహనాలను నిలిపి నిరసన తెలిపారు. దీంతో కార్మికులను విధులకు తరలించే బస్సు, బొగ్గు లారీలు, టిప్పర్లు నిలిచిపోయాయి. కనీసం నీటి పిచికారీ కూడా సరిగ్గా చేయడం లేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఇల్లెందు ఏరియా జీఎం వీసం కృష్ణయ్య, టేకులపల్లి సీఐ సురేశ్.. నామానాయక్తో ఫోన్లో మాట్లాడారు. ఈ నెల 25 లోపు రోడ్డు నిర్మాణం పూర్తయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. దీక్షలు విరమించండి.. సీఎండీకి నివేదిస్తా సత్తుపల్లి: సైలో బంకర్‌తో స్థానికులకు ఎదురవుతున్న సమస్యలు తమ దృష్టిలో ఉన్నందున దీక్షలు విరమిస్తే ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని సింగరేణి డైరెక్టర్(పా) వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని కిష్టారం అంబేద్కర్‌నగర్‌లో సైలో బంకర్‌కు వ్యతిరేకంగా 30రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షా శిబిరాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. స్థానికులు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులను సింగరేణి సీఎండీ బలరాంనాయక్ దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం లభించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ మాట్లాడుతూ సైలోబంకర్ సమస్యను ఎమ్మెల్యే రాగమయి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతో పాటు అసెంబ్లీలో ప్రస్తావించారరని తెలిపారు. ప్రజల ఆవేదనపై ప్రభుత్వంతోనైనా గట్టిగా చర్చించనున్నందున తమపై నమ్మకంతో దీక్షలు విరమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం షాలేం రాజు, పీఓలు ప్రహ్లాద్, నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే, మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సైతం సైలో బంకర్ బాధితులు కలిశారు. సమస్యపై సింగరేణి సీఎండీతో కలిసి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులం మాట్లాడతామని, అయినా ఫలితం లేకపోతే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు. ఈమేరకు దీక్షలను విరమించాలని ఆయన సూచించగా, చర్చించుకుని శనివారం చెబుతామని అటు సింగరేణి డైరెక్టర్, ఇటు మంత్రికి అంబేద్కర్‌నగర్ కాలనీవాసులు బదులిచ్చారు. -
భూములు ఇచ్చి కూలీలుగా మారాలా?
మణుగూరుటౌన్: మూడు పంటలు పండే భూములు ఇచ్చిన రైతులతో సింగరేణి అధికారులు కూలీ పనులు చేయించాలని భావిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. మణుగూరు ఓసీ విస్తరణలో భాగంగా భూసేకరణకు కొత్త కొండాపురం వద్ద గువారం పిసా గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత భూసేకరణ ప్రత్యేకాధికారి సుమ మాట్లాడుతూ.. భూమి కోల్పోతున్న గిరిజనులకు ఎకరాకు రూ.22.50 లక్షలు, ఆర్అండ్ఆర్ కింద రూ.5.50 లక్షలు అందిస్తామని, గిరిజనేతరులకు చట్టప్రకారం పరిహారం చెల్లించడమే కాక సింగరేణిలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. అలాగే, చెరువులో సగ భాగం సింగరేణి తీసుకుంటున్నందున రూ.17 కోట్లతో మరో వైపు చెరువును విస్తరిస్తామని పేర్కొన్నారు. సింగరేణి ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడుతూ.. మణుగూరు ఓసీ విస్తరణతో మరో 20 ఏళ్ల భవిష్యత్ ఉంటుందని, రెండు దశాబ్దాలు ఉపాధి లభిసుందన్నారు. దీంతో పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ.. పెద్దచెరువు విస్తీర్ణం గతంలో 90 ఎకరాలు ఉండేదని ఓసీ ఏర్పాటులో కొంత భాగం గతంలోనే పోయినా మత్స్యకారులకు న్యాయం జరగలేదని, ఇప్పుడు మిగిలిన చెరువును తీసుకుంటామనడం సరికాదన్నారు. మత్స్యకారులకు హామీ ఇవ్వకుండా భూసేకరణకు సిద్ధం కావడం ఏమిటని ప్రశ్నించారు. కాగా, నర్సింహ అనే వ్యక్తి తన భూములు మూడు సార్లు సింగరేణి సేకరిస్తే కాంట్రాక్ట్ ఉద్యోగం, పరిహారం కూడా ఇవ్వలేదని వాపోయారు. పద్మగూడెం, కొమ్ముగూడెం గ్రామాలను సింగరేణి తీసుకున్నప్పుడు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చి, తమకు మాత్రం ఎందుకు ఇవ్వరని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం భూసేకరణకు ఆమోదం తెలపాలని అధికారులు కోరగా, ఉద్యోగాలు ఇచ్చి, చెరువుపై ఆధారపడిన మత్స్యకారుల పరిస్థితిపై స్పష్టత ఇచ్చేవరకు భూములు ఇవ్వబోమని స్థానికులు తేల్చిచెప్పి వెనుదిరిగారు. గ్రామసభ అధ్యక్షుడు చందా నాగేశ్వరరావుతో పాటు గనిబోయిన కన్నయ్య, సున్నం మంగయ్య, కుర్రం రవి, కారం నర్సింహారావు, కోడి నాగరాజు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్మశానవాటికకు నిధులు కేటాయించాలి సింగరేణి పునరావాస గ్రామాలైన కొత్త కొండాపురం, కొత్త కొమ్ముగూడెం గ్రామాల్లో శ్మశానవాటికల నిర్వహణకు నిధులు కేటాయించాలని నిర్వాసితులు ఇఫ్టూ ఆధ్వర్యాన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమకు వినతిపత్రం ఇచ్చారు. దీంతో ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థలంలో పిచ్చిమొక్కలు తీయించాలని అధికారులకు సూచించారు. మెరుగైన పరిహారం ఇవ్వాలి మణుగూరురూరల్: ఓసీ విస్తరణలో భాగంగా భూములు కోల్పోతున్న రైతులందరికీ మెరుగైన పరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ సందర్భంగా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమకు వినతిపత్రం అందజేశారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్, సొసైటీ అధ్యక్షుడు కుర్రి నాగేశ్వరరావుతో పాటు తాళ్లపల్లి యాదగిరిగౌడ్, పి.శ్రీనివాస్, జావీద్, రంజిత్‌కుమార్ పాల్గొన్నారు. ఓసీ విస్తరణ భూసేకరణ సభలో గ్రామస్తుల ఆగ్రహం -
‘పెదవాగు ప్రాజెక్ట్’ పూర్వ వైభవానికి కృషి
అశ్వారావుపేటరూరల్: దశాబ్దాల కాలంగా పంట పొలాలకు సాగునీరు అందించి ఆయకట్టు రైతులకు అన్నం పెట్టిన పెదవాగు ప్రాజెక్ట్‌కు పూర్వ వైభవం వచ్చేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి జలగం ప్రసాద్‌రావు అన్నారు. మండలంలోని గుమ్మడవల్లి వద్దగల పెదవాగు ప్రాజెక్టు ఆనకట్టకు గతేడాది జూలై 18న కురిసిన భారీ వర్షాలు, వరద కారణంగా గండ్లు పడగా, ఆయన గురువారం పరిశీలించారు. ముందుగా ప్రాజెక్ట్ వద్దగల శ్రీ గంగానమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అనంతరం ఆయకట్టు రైతులతో సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల కిందటే తాను ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులను కలిసి పెదవాగు ప్రాజెక్ట్ పరిస్థితి వివరించానని, కమిషన్ సభ్యులు ఈ నెల 17వ తేదీన ప్రాజెక్టును పరిశీలించేందుకు వస్తున్నారని, ఆయకట్టు రైతులంతా అందుబాటులో ఉండి వారికి సమస్య, ప్రాజెక్టు స్థితిగతులను వివరించాలని సూచించారు. కార్యక్రమంలో నారాయణపురం సొసైటీ చైర్మన్ నిర్మల పుల్లారావు, రైతులు సత్యనారాయణ, వేలేరుపాడు రైతులు అమరవరపు అశోక్, పిట్టా ప్రసాద్ పాల్గొన్నారు. -
●అత్యాధునికంగా ఖమ్మం స్టేషన్ !
ఖమ్మం రాపర్తినగర్: అమృత్ భారత్ పథకం కింద ఎంపికై న ఖమ్మం రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఈ స్టేషన్లో ముఖద్వారం, ప్లాట్‌ఫాంల ఆధునికీకరణ, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల ఏర్పాటు, బ్రిడ్జిల నిర్మాణానికి రూ.25.41 కోట్లు కేటాయించగా ఇప్పటికే 45 శాతం మేర పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. కొద్దినెలల్లో పనులు పూర్తికానుండగా స్టేషన్ కొత్తరూపు సంతరించుకునే అవకాశముంది. కాగా, ఒకేసారి రెండు రైళ్లు వచ్చినా సాఫీగా రాకపోలు జరిగేందుకు రెండు మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఆఖరు దశకు చేరాయని, రెండేసి లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ప్లాట్‌ఫాం పొడిగింపు, దివ్యాంగుల కోసం కొత్త టాయిలెట్ బ్లాక్ నిర్మాణం, వెయిటింగ్ హాల్ నిర్మాణం కూడా పూర్తికావొస్తున్నాయి. వేగంగా ఆధునికీకరణ పనులు -
యువకుడి ఆత్మహత్య..
భద్రాచలంఅర్బన్: పట్టణంలోని అశోక్నగర్కాలనీకి చెందిన గడ్డం ఆకాష్ (20) గురువారం ఉదయం ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఆకాష్ రెండు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతూ స్థానికంగా ఉన్న పలు ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నాడు. ఎంతకూ కడుపునొప్పి తగ్గకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతుడు అంబేడ్కర్ సెంటర్లోని ఓ ప్రైవేట్ మెడికల్ ల్యాబ్‌లో పనిచేస్తున్నాడు. మృతుడి తండ్రి వెంకన్న ఫిర్యాదు మేరకు టౌన్ ఎస్ఐ విజయలక్ష్మి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత టేకులపల్లి: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను టేకులపల్లి పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. శంభునిగూడెం సమీపంలోని మొర్రేడు వాగు నుంచి అక్రమంగా ఇసుక లోడుతో వస్తున్న రెండు ట్రాక్టర్లను బొమ్మనపల్లి వద్ద పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రవాణా చేస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వివాహిత అదృశ్యంపై కేసు భద్రాచలంఅర్బన్: వివాహిత కనిపించకుండా పోయిన ఘటనపై పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పట్టణంలోని ఏఎస్ఆర్కాలనీకి చెందిన రాజేశ్ సతీమణి మనీష ఈ నెల 4వ తేదీన ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ దొరక్కపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఆమె భర్త రాజేశ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయలక్ష్మి తెలిపారు. చికిత్స పొందుతున్న హెచ్ఎం మృతి సత్తుపల్లిటౌన్: సత్తుపల్లిలోని వెంగళరావునగర్ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉపాధ్యాయుడు అగ్గి రవి (42) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంటకు చెందిన ఆయన ప్రస్తుతం భీమునిగూడెం ప్రాథమిక పాఠశాల హెచ్ఎంగా పనిచేస్తున్నారు. సత్తుపల్లి నుంచి రాకపోకలు సాగిస్తుండగా ద్విచక్ర వాహనంపై ఎర్రగుంటకు వెళ్లే క్రమాన జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో రవిని ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన భార్య కవిత దమ్మపేట మండలం మొండివర్రె ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుండగా, వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, రవి సోదరుడు కూడా గతంలో రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందినట్లు తెలిసింది. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. ఆ తర్వాత అమ్మవారికి నివేదన, హారతి, మంత్రపుష్పం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు. బాలాజీ ఆలయంలో ధ్వజారోహణంఅన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగతాయారు సమేత బాలాజీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన గురువారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో పండితుల వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివారికి సుప్రభాతసేవ, ఆరాధన, బాలభోగ నివేదన, తీర్థప్రసాద గోష్టి, చతుః స్థానార్చన, బలిహరణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. ఇన్చార్జ్ మేనేజర్ పాకాల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. డైరెక్టర్(పా)గా అదనపు బాధ్యతలుసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్)గా విధులు నిర్వర్తిస్తున్న కొప్పుల వెంకటేశ్వర్లుకు డైరెక్టర్ (పా)గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ యాజమాన్యం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లును ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, నాయకులు వంగా వెంకట్, రమణమూర్తి తదితరులు ఘనంగా సత్కరించారు. నీళ్లు రాక ఎండుతున్న పొలాలు పాల్వంచరూరల్: యాసంగిలో సాగుచేసిన వరి పొలాలకు నీళ్లు లేక తడారిపోతున్నాయని బాధిత రైతులు చెబుతున్నారు. మండలంలోని రెడ్డిగూడెంలోని రాళ్లవాగు ప్రాజెక్టు నీటిని నమ్ముకుని యాసంగిలో వరి సాగుచేశారు. రాళ్లవాగులో నీరు అడుగంటి తూము నుంచి రావడం లేదు. దీంతో ప్రాజెక్టు కింద సాగుచేసిన కనీసం బోర్లు, వ్యవసాయ బావులు లేని వరి పొలాలు సుమారు 50 ఎకరాలు బీటలువారి ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబూరావు, ఏఓ శంకర్, ఇరిగేషన్ ఏఈ రాథోడ్ గురువారం రాళ్లవాగు ప్రాజెక్టులోని నీరు, సాగునీరు అందక ఎండిపోతున్న వరి పొలాలను పరిశీలించారు. 16న అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఖమ్మం స్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ఈనెల 16న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నారు. అండర్–14, 16, 18, 20, పురుషులు మహిళల విభాగాల్లో 100, 400, జావెలిన్‌త్రో అంశాల్లో పోటీలు ఉంటాయని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షపీక్ అహ్మద్ తెలిపారు. క్రీడాకారులు వయస్సు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. -
‘సీతారామ’తో 8లక్షల ఎకరాలకు సాగునీరు
● ఈ నెలాఖరుకల్లా రైతులందరికీ భరోసా జమ ● రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సత్తుపల్లిటౌన్: రానున్న నాలుగేళ్లలో సీతారామ ప్రాజెక్టును పూర్తి చేయడమే తన లక్ష్యమని, తద్వారా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఏడు నుంచి ఎనిమిది లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందుతాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సీతారామ ప్రాజెక్టులో భాగమైన సత్తుపల్లి మండలం యాతాలకుంటలోని ట్రంక్ టన్నెల్ పనులను గురువారం ఆయన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కలెక్టర్లు ముజమ్మిల్‌ఖాన్, జితేష్ వి.పాటిల్‌తో కలిసి పరిశీలించారు. ఈక్రమంలో టన్నెల్లోకి మంత్రి తుమ్మల స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ వెళ్లి పనులను పరిశీలించాక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి ట్రంక్ పూర్తయితే ఉగాదికల్లా బేతుపల్లి చెరువు, లంకాసాగర్ ప్రాజెక్టులోకి గోదావరి జలాలు చేరతాయని, తద్వారా సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి మండలాల్లో రెండు లక్షల ఎకరాలకు నీరు అందుతుందని చెప్పారు. జిల్లా యంత్రాంగానికి ప్రజల సహకారం.. ఆపై శ్రీరామచంద్రుడి దయతో పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భద్రాద్రి జిల్లాలో జూలూరుపాడు టన్నెల్ భూసేకరణ, అటవీ అనుమతుల కోసం కలెక్టర్ చొరవ చూపితే పాలేరుకు సైతం గోదావరి జలాలు చేరతాయన్నారు. ఇద్దరు కలెక్టర్లు కష్టపడుతూనే మనస్సు పెట్టి పనిచేస్తున్నారని మంత్రి కితాబిచ్చారు. త్వరలోనే భరోసా, బోనస్ రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా ఎకరాకు రూ.6వేల చొప్పున రూ.10వేల కోట్లు ఈనెలాఖరు నాటికి జమ చేస్తామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఖజానాలో నిల్వలు లేనప్పటికీ అప్పోసప్పో చేసైనా నిధులు విడుదల చేస్తామన్నారు. అలాగే, సన్నధాన్యం అమ్మిన రైతులకు రూ.1,100 కోట్ల బోనస్‌కు గాను ఇప్పటి వరకు రూ.900 కోట్లు చెల్లించామని, మిగతావి సైతం త్వరలో అందిస్తామన్నారు. ఇక ఖమ్మం–రాజమండ్రి గ్రీన్‌ఫీల్డ్ హైవే ఆగస్టు 15 కల్లా ఈ రహదారి అందుబాటులోకి వస్తుందని మంత్రి తెలిపారు. బుగ్గపాడు ఫుడ్‌పార్కులో మరో రెండు పరిశ్రమలు ఏర్పాటు కానుండగా, ఉగాది నాటికి కల్లూరుగూడెంలో పామాయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తామని వెల్లడించారు. సంప్రదాయ పంటలు వద్దు.. నీళ్ల విలువ రైతులకే ఎక్కువగా తెలుస్తుందని భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈమేరకు సంప్రదాయ పంటలు కాకుండా ఆయిల్‌పామ్ వంటివి సాగు చేస్తే రైతులు రాజుల్లా బతకవచ్చన్నారు. ఉపాధిహామీ పథకంతో ఉచితంగా నీటి గుంతలు తవ్విస్తున్నందున రైతులు ముందుకు రావాలని సూచించారు. ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్‌ఖాన్ మాట్లాడుతూ రైతులు అవగాహనతో లాభదాయక వ్యవసాయం చేస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా బాగు పడతాయని తెలిపారు. ఖమ్మం జెడ్పీ సీఈఓ దీక్షారైనా, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఎస్ఈలు శ్రీనివాసరెడ్డి, శ్రీనివాసాచారి, మార్కెట్ చైర్మన్లు దోమ ఆనంద్‌బాబు, భాగం నీరజాచౌదరి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎన్.రాజేశ్వరి, ఎఫ్డీఓ మంజులతో పాటు బాలసాని లక్ష్మీనారాయణ, డాక్టర్ మట్టా దయానంద్, సాధు రమేష్‌రెడ్డి, పువ్వాళ్ల దుర్గాప్రసాద్, చల్లగుళ్ల నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. -
పింక్‌లో ఏముందో..!?
సర్వేలతోనే సరి .. భద్రాద్రి జిల్లా తెలంగాణ రాష్ట్ర సరిహద్దుగా ఉంది. రైల్వే పరంగా ఇతర రాష్ట్రాలను కలుపుతూ గతంలో భద్రాచలంరోడ్ – కొవ్వూరు, కొత్తగూడెం – కొండపల్లి, మణుగూరు – రామగుండం, మణుగూరు – కిరండోల్ మార్గాల నిర్మాణానికి పలుమార్లు సర్వే చేశారు. దీంతో పాటు డోర్నకల్ జంక్షన్ – భద్రాచలంరోడ్ డబ్లింగ్ పనులకూ సర్వే జరిగింది. ఇబ్బడి ముబ్బడిగా లైన్లకు సర్వే చేసినా నిధులు మాత్రం మంజూరు కాలేదు. కానీ గతేడాది అనూహ్యంగా మల్కన్‌గిరి – భద్రాచలం – పాండురంగాపురం వరకు కొత్త లైన్‌ను కేంద్రం మంజూరు చేసింది. దీంతో పాటు ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయిన భద్రాచలంరోడ్ – డోర్నకల్ జంక్షన్ డబ్లింగ్, మణుగూరు – రామగుండం లైన్లనూ నిర్మిస్తామని ప్రకటించింది. స్వయంగా ప్రకటించిన కేంద్రం.. భద్రాచలంరోడ్ – మణుగూరు రైల్వే లైన్లో ఉన్న పాండురంగాపురం స్టేషన్ నుంచి భద్రాచలం మీదుగా ఒడిశాలోని మల్కన్‌గిరి – జైపూర్ – గుణుపూర్ మీదుగా పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ వరకు కొత్తగా రైలు మార్గం నిర్మిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా గతేడాది ఈ ప్రాజెక్ట్‌ను మంజూరు చేశామని, త్వరితగతిన పనులు ప్రారంభిస్తామని పేర్కొంది. దాదాపు 270 కి.మీ. నిడివి కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.7,383 కోట్ల వ్యయం అవుతుంది. కొండలు, అడవుల గుండా ఈ మార్గం నిర్మించాలి. పర్యావరణ అనుమతులు సాధిస్తూ భారీ వంతెనలతో కూడిన ఈ ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి వచ్చేందుకు దశాబ్దానికి పైగా సమయం పట్టినా ఆశ్చర్యం లేదు. పని చిన్నదే.. ఫలితం పెద్దది మల్కన్‌గిరి – భద్రాచలం రైల్వేలైన్‌లో తెలంగాణ పరిధిలోకి వచ్చే పాండురంగాపురం నుంచి సారపాక వరకు 12 కి.మీ. మేరకు నిర్మించాల్సిన లైన్‌కు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కేంద్ర రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు లేఖ రాశారు. కేవలం 12 కి.మీ. లైన్ నిర్మించడం ద్వారా పుణ్యక్షేత్రమైన భద్రాచలం పట్టణానికి తక్షణమే రైలు కనెక్టివిటీ ఏర్పడుతుందని ఆయన కోరారు. ప్రస్తుత బడ్జెట్లో ఈ లైన్ నిర్మాణానికి నిధులేమైనా మంజూరయ్యాయా లేదా అనేది తేలడం లేదు. కనీసం మంత్రి తుమ్మల విజ్ఞప్తికి సానుకూల స్పందన వచ్చినా రామయ్య భక్తులకు తీపి కబురు అందినట్టే. ఇక గతంలో జిల్లా నుంచి నడిచిన పాత రైళ్ల పునరుద్ధరణ, షిర్డీ, తిరుపతి, బెల్లంపల్లితో పాటు సత్తుపల్లి మార్గంలో కొత్త ప్యాసింజర్ రైళ్ల ప్రకటన వంటివి ఇప్పటికీ ఎండమావిగానే మిగులుతున్నాయి. నిధులు కేటాయించారా..?మణుగూరు – రామగుండం రైల్వేలైన్‌ను 1999లో ప్రతిపాదించారు. అనేక సార్లు సర్వేలు జరిగిన తర్వాత గత సెప్టెంబర్‌లో గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. 207 కి.మీ.నిడివి గల ఈ లైన్ నిర్మాణానికి రూ.3,600 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఈ లైన్ నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియ సాగుతోంది. ఇక భద్రాచలంరోడ్ – డోర్నకల్ మధ్య ప్రస్తుతం సింగిల్ లైన్ ఉంది. పెరిగిన రద్దీ కారణంగా దీన్ని డబ్లింగ్ చేయాలని నిర్ణయించారు. 54.65 కి.మీ. నిడివి గల ఈ లైన్ నిర్మాణానికి భూసేకరణ పూర్తయింది. నిర్మాణ వ్యయం రూ.770 కోట్లు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. నిధుల కేటాయింపు జరిగితే పనులు ప్రారంభించడమే తరువాయి అన్నట్టుగా ఉంది ఈ లైన్ పరిస్థితి. అయితే 2025 – 26 బడ్జెట్లో ఈ రెండు పనులకు నిధులు కేటాయించారా లేదా అనే సందేహం నెలకొంది. మరోవైపు భద్రాచలంరోడ్ – కొవ్వూరు మార్గం నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే ప్రకటనలు ఏపీ నుంచి వినిపిస్తున్నాయి. గతంలో జిల్లాకు పలు రైల్వే లైన్లు మంజూరు నిధుల కేటాయింపు వివరాలు పింక్‌బుక్‌లో నమోదు కేంద్ర బడ్జెట్ ప్రకటించి నెల రోజులైనా వెల్లడించని సర్కారు కొత్త ప్రాజెక్టులకు నిధుల విడుదలపై స్పష్టత కరువు కేంద్ర బడ్జెట్ ప్రకటించి నెలరోజులు దాటినా రైల్వే పరంగా కీలకమైన పింక్‌బుక్ వివరాలు ఇప్పటికీ వెల్లడి కాలేదు. దీంతో జిల్లాకు సంబంధించి ఏ ప్రాజెక్టుకు ఎన్ని నిధులు వచ్చాయి.. ఇప్పటికే మంజూరైన పనుల్లో పురోగతి ఎలా ఉంటుంది..అనే అంశాలపై స్పష్టత రావడం లేదు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
జానపద కళాకారుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
పాల్వంచ: తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం జిల్లా నూతన కమిటీని బుధవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా షేక్ గద్దర్బాషా, ప్రధాన కార్యదర్శిగా డప్పు జానకీరామ్, గౌరవ సలహాదారులుగా మోదుగు జోగారావు, కొండల్రావు, ఉపాధ్యక్షులుగా శంకర్‌నాయక్, మహిళా ప్రతినిధిగా మణుగూరు జ్యోతి, సహాయ కార్యదర్శిగా మెంతెన కొండల్రావు, కోశాధికారిగా షేక్ ఖాసీం, ఉపాధ్యక్షులుగా ఎండీ ముర్తూజ, సంయుక్త కార్యదర్శిగా కాటూరి రాము, వీర జయమ్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా తాళ్ల మంగ, ప్రచార కార్యదర్శిగా కనకం కొమరయ్యను ఎన్నుకున్నారు. వారితో సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు వంగ శ్రీనివాస్‌గౌడ్, సుంచు లింగయ్య, పమ్మి రవి ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఈశ్వర్ బహుదూర్, రమేశ్, పోలూరి రాము, సుద్దుల శ్రీను, ప్రేమ కుమారి తదితరులు పాల్గొన్నారు. -
చోరి కేసులో ముగ్గురి అరెస్ట్
రూ.7,19,000 నగదు, అర తులం బంగారం రికవరీ సుజాతనగర్: మండలంలోని సర్వారం గ్రామ పంచాయతీ, హలావత్తండాలో ఈ నెల 7వ తేదీన జరిగిన చోరీ కేసులో పోలీసులు బుధవారం ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ వివరాలు వెల్లడించారు. హలావత్‌తండాకు చెందిన జర్పుల కిషన్ ఇంట్లో ఈ నెల 7న తలుపులు, బీరువా పగలగొట్టి 5,20,000 నగదుతో పాటు అర తులం బంగారాన్ని కొందరు ఎత్తుకెళ్లారు. కిషన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ ఎం.రమాదేవి వేపలగడ్డ వద్ద బుధవారం వాహన తనిఖీ చేపట్టగా హలావత్‌తండాకు చెందిన జర్పుల నరేశ్ పారిపోయేందుకు యత్నించగా పట్టుకున్నారు. తన బాబాయి అయిన జర్పుల కిషన్ ఇంట్లో తాను చోరీ చేశానని నరేశ్ అంగీకరించాడు. చండ్రుగొండ, సుజాతనగర్, జూలూరుపాడు, కొత్తగూడెం ప్రాంతాల్లో పలు ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్లను కూడా చోరీ చేశాడని, కాపర్ వైర్లను అతడి వద్ద కొనుగోలు చేసిన మధురబస్తీకి చెందిన బెల్లంకొండ ఈశ్వర్రావు, పాల్వంచకు చెందిన కొంచాడ సత్యం కూడా అరెస్ట్ చేశామని డీఎస్పీ తెలిపారు. నరేశ్ వద్ద నుంచి రూ.5 లక్షల నగదుతో పాటు మొబైల్, ఈశ్వర్రావు వద్ద నుంచి రూ.19 వేలు, సత్యం వద్ద నుంచి రూ.2 లక్షల నగదును రికవరీ చేసి ముగ్గురిని అరెస్ట్ చేశామని డీఎస్పీ రెహమాన్ వెల్లడించారు. కార్యక్రమంలో సీఐ రాయల వెంకటేశ్వర్లు, సిబ్బంది పాల్గొన్నారు. జాతరకు వెళ్లి వస్తూ దుర్మరణం కుటుంబంలో విషాదం నింపిన రోడ్డుప్రమాదం అశ్వారావుపేటరూరల్: జాతర ఉత్సవాలకు వెళ్లి, తిరిగి స్వగ్రామానికి వస్తున్న క్రమంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ యయాతి రాజు కథనం ప్రకారం.. ఏపీలోని ఏలూరు జిల్లా పోలవరం మండలం శివగిరి గ్రామానికి చెందిన నడికుదురు గోపి (32), స్నేహితుడు అర్జున్‌రెడ్డితో కలిసి మంగళవారం రాత్రి జీలుగుమిల్లిలో జరుగుతున్న జగదాంబ తల్లి జాతరకు వెళ్లారు. తిరిగి తాను నివాసం ఉంటున్న ఏపీలోని జీలుగుమల్లి మండలం రాచన్నగూడేనికి ద్విచక్రవాహనంపై అశ్వారావుపేట మీదుగా వెళ్తున్న క్రమంలో స్థానిక కాకతీయ గేట్ సమీపంలో కాకినాడ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గోపి అక్కడికక్కడే దుర్మరణం చెందగా వెనుక కూర్చున్న అర్జున్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. మృతుడి తండ్రి నరసింహారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జాతరలో సరదగా గడిపిన గోపి.. ఇంటికి వస్తున్న క్రమంలో మృతిచెందటంతో వారి కుటుంబంలో విషాదం నింపింది. భార్యతో గొడవ పడి భర్త ఆత్మహత్య పాల్వంచరూరల్: భార్యతో గొడవ పడిన భర్త పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని పాండురంగాపురం శివారులోని రాజీవ్‌నగర్‌కాలనీకి చెందిన మడివి దేవయ్య (38) మంగళవారం రాత్రి భార్యతో గొడవపడి పురుగులమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి.. అక్కడి నుంచి కొత్తగూడెం ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. తాటి చెట్టు పైనుంచి పడి గీతకార్మికుడి మృతి ఇల్లెందురూరల్: మండలంలోని పోలారం గ్రామానికి చెందిన గీత కార్మికుడు మోటపోతుల అప్పారావు (40) బుధవారం తాటిచెట్టు పైనుంచి కిందపడి మృతిచెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. పోలారం గ్రామానికి చెందిన అప్పారావు మర్రిగూడెం గ్రామ పంచాయతీ రామకృష్ణాపురంలో గీత వృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగా బుధవారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కిన అప్పారావు ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. చెట్టుకింద ఉన్న కొయ్యలు గుచ్చుకోవడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేశామని ఎస్ఐ సోమేశ్వర్ తెలిపారు. ఐదుగురిపై కేసు నమోదుజూలూరుపాడు: తంబోలా ఆడుతూ పట్టుబడిన ఐదుగురిపై బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. కప్పలకుంట చెరువు సమీపంలో కొందరు ప్రభుత్వం నిషేధించిన తంబోలా ఆడుతున్నారనే సమాచారంతో హెడ్‌కానిస్టేబుల్ దయానంద్, కానిస్టేబుళ్లు దాడి చేసి, ఐదుగురిని అదుపులోకి తీసుకొన్నారు. వారి వద్ద నుంచి రూ.3,500 నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
రామయ్యకు గోటి తలంబ్రాలు
దమ్మపేట: దమ్మపేట గ్రామానికి చెందిన మహిళలు 8 లక్షల 11 వేల గోటి తలంబ్రాలను రామయ్య కల్యాణానికి సిద్ధం చేశారు. శ్రీసీతారామ భక్త కమిటీ ఆధ్వర్యంలో మహిళలు చేతి గోళ్లతో ఒలిచి తలంబ్రాలను తయారు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజు ఈ కార్యక్రమం ప్రారంభించి బుధవారం నాటికి పూర్తి చేశారు. వీటిని భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి ఆలయంలో సమర్పించనున్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ భక్త కమిటీ అధ్యక్షురాలు మురహరి గంగ, సభ్యులు సత్యవతి, సరస్వతి, అత్తులూరి కుమారి, కందుకూరి విజయ తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రగా భద్రాచలం.. జూలూరుపాడు:ఽఽ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో గోటి తలంబ్రాలను సమర్పించేందుకు బుధవారం పలువురు రామభక్తులు పాదయాత్రగా వెళ్లారు. ధర్మ జాగరణ సమితి ఆధ్వర్యంలో కొత్తూరు గ్రామ పంచాయతీ పెద్దహరిజనవాడ, జూలూరుపాడు, వెంగన్నపాలెం, అనంతారం, తది తర గ్రామాల రామభక్తులు నెల రోజులుగా గోటి తలంబ్రాలను ఒలిచే కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీసీతారాముల కల్యాణమహోత్సవానికి గోటి తలంబ్రాలను సమర్పించేందుకు పాదయాత్రగా వెళ్లారు. -
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
కొత్తగూడెంటౌన్: అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. బుధవారం హేమచంద్రాపురంలో ఉన్న పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన నేరు సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ కేసులు లేకుండా చూడాలన్నారు. పోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు పడేలా చేయాలని ఆదేశించారు. అనంతరం వర్టికల్ విభాగంలో ప్రతిభ చాటిన అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, డీఎస్పీలు అబ్దుల్ రెహమాన్, చంద్రభాను, రవీందర్, సతీష్‌కుమార్, మల్ల య్యస్వామి, సీఐలు శ్రీనివాస్, రమాకాంత్, నాగరాజురెడ్డి, ఎస్సైలు హారిక, హసీనా పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్‌రాజు -
ఏదీ ఆహ్లాదం..?
● అస్తవ్యస్తంగా మారిన పట్టణ ప్రకృతి వనాలు ● అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా పార్కులు ● వాకింగ్ ట్రాక్‌ల్లో వెలసిన పుట్టలు, పేరుకుపోయిన చెత్తాచెదారం ● కొరవడిన మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కొత్తగూడెంఅర్బన్: మున్సిపాలిటీల్లో నివసించే ప్రజలు నిత్యం కాలుష్య సమస్యతో సతమతమవుతుంటారు. వాహనాల రద్దీ, వాటి నుంచే వచ్చే పొగ, పరిశ్రమల నుంచి వ్యర్థాలు, వాసనలతో కూడిన గాలి పీల్చుకుంటూ అనారోగ్యం బారిన పడుతుంటారు. ఈ నేపథ్యంలో పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదం అందించేందుకు గత ప్రభుత్వం పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. కానీ నిర్వహణలోపంతో అవి ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. విషసర్పాల పుట్టలకు నిలయంగా మారాయి. విశ్రాంతి కోసం ఏర్పాటు చేసిన సిమెంట్ బల్లలు విరిగిపోయాయి. చెత్తాచెదారం పేరుకుపోయి కళావిహీనంగా తయారయ్యాయి. రాత్రి వేళల్లో కొందరు వనాల్లో మద్యం తాగుతున్నారు. మరోవైపు మున్సిపల్ అధికారులు, సిబ్బంది నిర్వహణను పట్టించుకోవడం లేదు. పట్టణాల్లో శానిటేషన్ పనులు చేసేందుకే సిబ్బంది సరిపోవడం లేదని, ఇక పట్టణ ప్రకృతి వనాల్లో పనులు ఎలా చేస్తారని కొందరు అధికారులు పేర్కొంటున్నారు. రూ. లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన పట్టణ వనాలు నిరుపయోగంగా మారాయి. పుట్టలు పెరిగిపోయి వాటి నుంచి జనావాసాల్లోకి పాములు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముళ్ల పొదలతో.. పట్టణ ప్రకృతి వనాల్లో సేద తీరే పండ్ల చెట్లు, సుందరీకరణ మొక్కలు, నీడనిచ్చే చెట్లు, వేప, రావి, మర్రి కానుగ, బాదం వంటివి మొక్కలను పెంచారు. పూల, ఔషధ, ఉసిరి, నేరేడు, సీమచింత, కరివేపాకు, జామ వంటి మొక్కలు కూడా నాటారు. వాకింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీల్లో నిర్వహణ బాధ్యత పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించారు. కానీ రెండేళ్లుగా నిర్వహణ లేకపోవడంతో పిచ్చిచెట్లు, ముళ్ల పొదలతో నిండిపోయాయి. ఎండిపోతున్న మొక్కలు జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లెందు, మణుగూరు మున్సిపాలిటీల్లోని పట్టణ ప్రకృతి వనాలు ప్రజలు వెళ్లేందుకు వీలు లేకుండా ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక్కో మున్సిపాలిటీలో 10 నుంచి 20 వరకు పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వెచ్చించారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో 16, పాల్వంచలో 18, ఇల్లెందులో ఆరు, మణుగూరులో 8 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఇవన్నీ అధ్వానంగా మారాయి. నీరులేక మొక్కలు ఎండిపోతున్నాయి. మున్సిపాలిటీ అధికారులు స్పందించి నిర్వహణ మెరుగు పరిచి ప్రజలకు ఆహ్లాదం పంచేలా పట్టణ ప్రకృతి వనాలను మార్చాలని పలువురు కోరుతున్నారు. పట్టణ ప్రకృతి వనాలపై కొత్తగూడెం మున్సిపాలిటీ ఇన్చార్జ్ కమిషనర్‌ను ఫోన్లో వివరణ కోరేందుకు ప్రయత్నించగా.. స్పందించలేదు.అధికారుల పర్యవేక్షణ కరువు ఇల్లెందు: పట్టణంలోని కొత్తకాలనీలో ఆరు నెలల క్రితం రెండెకరాల విస్తీర్ణంలో ప్రారంభించిన చిల్డ్రన్స్ పార్కు అస్తవ్యస్తంగా మారింది. రూ. 1.36 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో పార్క్ ఏర్పాటు చేశారు. ఆహ్లాదం కోసం గార్డెన్, జిమ్, వాకింగ్ ట్రాక్, బల్లాలు తదితర సౌకర్యాలు కల్పించారు. సోలార్ లైటింగ్, నీటి కోసం బోర్లు, మోటార్లు అందుబాటులోకి తెచ్చారు. కానీ అధికారుల పర్యవేక్షణ కొరవడి పార్క్ చెత్తాచెదారంతో నిండిపోయింది. మున్సిపల్ పాలకవర్గ పదవీ కాలం రెండు నెలల క్రితం ముగిసింది. అప్పటి నుంచి అధికారుల్లో నిర్లిప్తత ఏర్పడింది. నీరులేక మొక్కలు ఎండిపోతున్నాయి. శానిటేషన్ లేకపోవటంతో చిన్నారులు ఆటపాటలకు వచ్చేందుకు ఆసక్తి చూపటం లేదు. మున్సిపల్ అధికారులు స్పందించి పార్కు నిర్వహణపై దృష్టి సారించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
అశ్వారావుపేటరూరల్: ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ అన్నారు. బుధవారం ఆయన అశ్వారావుపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. డయాలసిస్ వార్డును పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రికార్డులు, ల్యాబ్, ఫార్మసీ, ఇతర వార్డులను తనిఖీ చేశారు. నిర్మాణంలో ఉన్న పోస్టుమార్టం భవనం, నిర్మాణం పూర్తయిన సీఎస్ఆర్ భవనాలను పరిశీలించారు. అనంతరం అశ్వారావుపేటలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, రక్త పరీక్షా కేంద్రాలు, స్కానింగ్ సెంటర్లను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఫీజు వివరాలను బోర్డుల్లో ప్రదర్శించాలని, ప్రైవేటు ఆస్పత్రుల్లో పరిమితికి మించి వైద్యం చేయవద్దని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో డీఐఓ బాలాజీ నాయక్, ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి, వైద్యులు విజయ్‌కుమార్, వినాయకపురం పీహెచ్సీ వైద్యులు రాందాస్, విజయ్ కుమార్, సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సమష్టిగా కృషి చేయాలిసూపర్బజార్(కొత్తగూడెం): కుష్ఠు రహిత జిల్లా కోసం సమష్టిగా కృషి చేయాలని డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ అన్నారు. ఈ నెల 17 నుంచి 30వ తేదీ వరకు జరిగే కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు కార్యక్రమంపై బుధవారం నిర్వహించిన ఆశాకార్యకర్తలు, యూనియన్ నాయకుల సమావేశంలో మాట్లాడారు. అనుమానిత వ్యక్తులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పంపించాలని సూచించారు. కాగా జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భర్తీ చేసిన 9మంది ఆయుష్ ఫార్మసిస్ట్ అభ్యర్థులకు బుధవారం డీఎంహెచ్ఓ నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు బి.బాలాజీ, భద్రు, శ్రీనివాస్, రాంప్రసాద్, యూనియన్ నాయకులు రవికుమార్, ఝాన్సీ, విజయలక్ష్మి, లత, సరిత, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.డీఎంహెచ్ఓ డాక్టర్ భాస్కర్ నాయక్ -
కృత్రిమ మేధస్సుతో బోధన మేలు
బూర్గంపాడు: చదువులో వెనుకబడిన పిల్లలకు కృత్రిమ మేధస్సుతో విద్యాబోధన చేయడం ఎంతో ఉపకరిస్తుందని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ అన్నారు. బుధవారం సారపాక గాంధీనగర్ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కృత్రిమ మేధస్సుతో విద్యార్థులకు విద్యా బోధన చేస్తున్న తరగతులను ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం చదువులో వెనుకబడిన పిల్లలను గుర్తించి అభ్యాసన మెరుగుపడటానికి స్థాయిని అంచనా వేయడానికి ఎంతో ఉపకరిస్తుందన్నారు. ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని గాంధీనగర్ పాఠశాలలో ప్రారంభించిందని చెప్పారు. కార్యక్రమంలో ఎదు నర్సింహారావు, హెచ్ఎం శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు లక్ష్మీప్రసన్న, గోపాల్‌రావు, శ్రీనివాసరావు విద్యార్థులు పాల్గొన్నారు. కాగా, మండలంలోని గుట్ట లక్ష్మీపురం గ్రామంలోని అభ్యుదయ రైతు సేంద్రియ ఎరువులతో సాగు చేస్తున్న పుచ్చ, మిరప, జామ పంటలను ఐటీడీఏ పీఓ రాహుల్ పరిశీలించారు. రూ.20 లక్షల ఖర్చుతో 20 ఎకరాల్లో పుచ్చకాయ పంట సాగు చేయడంతో పాటు కోత్కతా నుంచి వచ్చిన ఈ–మ్యాక్స్ విత్తనంతో కేవలం 70 రోజుల్లో దిగబడి రావడం గురించి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏడీ ఉదయ్‌భాస్కర్, హెచ్ఓ వేణుమాధవ్ తదితరులు ఉన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నతంగా ఎదగాలి ఇల్లెందురూరల్: విద్యార్థి దశ నుంచే చదువుపై ఆసక్తి పెంచుకొని ఉన్నతంగా ఎదగాలని ఐటీడీఏ పీఓ రాహుల్ సూచించారు. మండలంలోని బొజ్జాయిగూడెం ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. వంట, వసతి గదులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రాథమిక తరగతుల నుంచి విద్యార్థుల్లో నైపుణ్యం పెంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను అందుబాటులోకి తెచ్చామని, ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నతంగా ఎదిగేందుకు భవిష్యత్ ప్రణాళిక అవసరమని, అందుకోసం కెరీర్ గైడెన్స్ పేరుతో విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్‌లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏటీడీఓ సూర్నపాక రాధ, హెచ్ఎం నాగమణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జలసంచయ్ జన్ భగీదారి క్యాచ్ ది రైన్ అమలులో జిల్లాను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. హమాలీకాలనీలో జల సంచయ్ కార్యక్రమం అమలులో భాగంగా బుధవారం కలెక్టర్ స్వయంగా ఇంకుడు గుంతను తవ్వారు. స్థానిక యువకులతో మమేకపై నిర్మాణ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంకుడు గుంతల నిర్మాణాల్లో అగ్రస్థానంలో ఉండాలని పేర్కొన్నారు. ఇంకుడు గుంతలతో భూగర్భ జలాల వృద్ధి పెరుగుతుందని అన్నారు. భవిష్యత్‌లో నీటిఎద్దడి లేకుండా ప్రతి నీటి బొట్టు వృథా కాకుండా చూడాలని చెప్పారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, అధికారులు పాల్గొన్నారు. ఉపాధి లక్ష్యాలను పూర్తి చేయాలిచుంచుపల్లి: జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం నుంచి అదనపు కలెక్టర్లు డి.వేణుగోపాల్, విద్యాచందనలతో కలిసి ఉపాధి హామీ పథకం అమలు, ఆస్తి పన్ను వసూలు, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులు తదితర అంశాలపై మండల స్థాయి, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూలీలకు వంద పని దినాలు కల్పించాలని, ఈ నెల 31 లోపు వందశాతం ఉపాధి పనులు పూర్తి చేయాలన్నారు. బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతుల జాబితా తయారు చేయాలని, వ్యవసాయ భూమిలో ఫారం పాండ్స్ ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని వివరించారు. యువతను భాగస్వామ్యం చేస్తూ అన్ని పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతల తవ్వకాలు చేపట్టాలన్నారు. ఈ నెల 15 లోగా ఆస్తి పన్ను బకాయిల వసూళ్లు పూర్తి చేయాలన్నారు. బకాయిలు చెల్లించనివారి పేర్లు ఫ్లెక్సీల ద్వారా గ్రామాల ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేయాలని, లేదా ఇంటిముందు డప్పులు వాయించాలని కలెక్టర్ తెలిపారు. ధరణి, ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తులను, తాగునీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల ఎల్–1 జాబితా శనివారంలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించి పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖ అధికారులు చంద్రమౌళి, శంకర్, వెంకటేశ్వరా చారి, బాబూరావు, శ్రీనివాసరావు, తిరుమలేష్, నళిని, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
హస్తంలో మల్లగుల్లాలు!
పేరుపై చర్చ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ పేర్లతో చేపట్టిన ప్రాజెక్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రద్దు చేసిందనే అభిప్రాయాన్ని ప్రస్తుత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న కొందరు నేతలు వ్యక్తం చేస్తున్నారు. డీపీఆర్‌కు అనుమతులు సాధించడం మొదలు భారీ స్థాయిలో నిధులు సైతం తమ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నందున, సీతారామ బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌కు గతంలో ఉన్న ఇందిరాసాగర్ లేదా రాజీవ్‌సాగర్ పేరు పెట్టే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎలా ఉంటుందనే చర్చ ఇటీవల ముఖ్యనేతల మధ్య జరిగినట్టు సమాచారం. తొమ్మిదేళ్లుగా... సీతారామ ప్రాజెక్ట్ పనులు 2016లో మొదలైతే తొమ్మిదేళ్లు గడిచినా ఇప్పటివరకు పూర్తికాలేదు. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఉన్నపళంగా గోదావరి జలాలను కృష్ణా ఆయకట్టుకు తరలించేందుకు రాజీవ్ సాగర్ లింక్ కెనాల్‌ను ప్రతిపాదించింది. ఏడాది కాలంలో ఈ కాలువ పనులు పూర్తి చేశారు. దీంతో తొలిసారిగా సాగర్ ఆయకట్టుకు ఈ నెల 5న గోదావరి జలాలను తరలించారు. మరోవైపు గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 8 వేల కోట్ల నుంచి రూ. 13 వేల కోట్లకు పెరిగింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంచనా వ్యయాన్ని రూ.19 వేల కోట్లకు సవరించాల్సి వచ్చింది. ఫాయిదా వచ్చేనా ? ఉమ్మడి ఖమ్మం జిల్లా అనాదిగా భద్రాచల సీతారాముల పేరుతోనే ప్రసిద్ధి పొందింది. తానీషా కాలం నుంచి నేటి ముఖ్యమంత్రుల వరకు సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. సీతారామ పేరు ఈ జిల్లాకు సెంటిమెంట్‌తో ముడిపడిన అంశంగా ఉంది. ఇప్పుడు ప్రాజెక్టు పేరులో మార్పులు చేస్తే ఫలితాలు ఎంత మేరకు సానుకూలంగా ఉంటాయనే అనుమానాలు కూడా అధికార పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. రాజీవ్ కెనాల్ తరహాలో సీతారామ ప్రాజెక్టు స్వరూప స్వభావాల్లో ఎలాంటి మార్పులు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా లింక్ కెనాల్‌ను తెర మీదకు తెచ్చింది. దీనికి రాజీవ్ లింక్ కెనాల్ అని పేరు పెట్టగా, ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. పైగా కాంగ్రెస్ శ్రేణుల నుంచి హర్షాతిరేకాలు వచ్చాయి. ఇదే తరహాలో సీతారామ పేరు మార్చకుండా భవిష్యత్‌లో ఈ ప్రాజెక్ట్‌కు అనుబంధంగా చేపట్టబోయే ఇల్లెందు నియోజకవర్గ మాస్టర్ ప్లాన్‌కు రాజీవ్/ఇందిరా సాగర్ల పేరును పరిశీలిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయాలు ఇంజనీరింగ్ వర్గాల నుంచి వస్తున్నాయి. పైగా సీతారామకు సంబంధించిన తొలి శంకుస్థాపన సైతం ఇల్లెందు నియోజకర్గంలోనే జరిగింది. కానీ తర్వాత మార్పుల్లో ఈ నియోజకవర్గాన్ని సీతారామ లబ్ధిదారుల జాబితా నుంచి దాదాపుగా మినహాయించారు. అనుబంధ పనులు ప్రస్తుతం సీతారామలో ఎక్కడా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లేదు. రోళ్లపాడు దగ్గర 10 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మించే అంశంపైనా ప్రస్తుత ప్రభుత్వం చర్చ చేసింది. దీంతోపాటు సీతారామ ద్వారా నీరు అందని భద్రాచలం, తక్కువ ప్రయోజనం పొందే పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాల కోసం కొత్తగా ఎత్తిపోతలు చేపట్టే ప్రతిపాదనలు ఉన్నాయి. సీతారామకు అనుబంధంగా చేపట్టబోయే పనులు అనేకం ఉన్నందున, వాటికి కొత్తగా పేర్లు పెట్టడం ద్వారా స్వామికార్యం, స్వకార్యం రెండూ జరిగిపోతాయనే చర్చ హస్తం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సీతారామ ఎత్తిపోతల పథకం పేరు మార్పు యోచన? ఇందిరా/రాజీవ్ పేరు పెట్టాలని కాంగ్రెస్ ముఖ్యనేతల్లో చర్చ వైఎస్ హయాంలో రాజీవ్, ఇందిరాసాగర్లు ప్రారంభం తెలంగాణ వచ్చాక సీతారామగా మార్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్ ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టారు. దుమ్ముగూడెం ఆనకట్ట ఆధారంగా రాజీవ్ సాగర్ ఉండగా, కొత్తగా వేలేరుపాడు మండలం రుద్రంకోట కేంద్రంగా ఇందిరాసాగర్ నిర్మించేలా డిజైన్ చేశారు. వీటికి సంబంధించి కొంతమేర పనులు చేపట్టాక రాష్ట్ర విభజన జరిగింది. దీంతో ఇందిరాసాగర్ ప్రాంతం పూర్తిగా ఏపీ పరిధిలోకి వెళ్లిపోయింది. తెలంగాణ ఏర్పడ్డాక ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్లను రద్దు చేస్తూ కొత్తగా సీతారామ బహుళార్థ సాధక ఎత్తిపోతల పథకానికి అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
నాణ్యమైన విద్యుత్ అందిస్తాం..
జూలూరుపాడు: రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తామని టీజీఎన్పీడీసీఎల్ ఎస్ఈ మహేందర్ అన్నారు. బుధవారం కాకర్ల గ్రామంలో విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మహేందర్ మాట్లాడారు. కెపాసిటర్లు బిగించుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు, ఆటో స్టార్టర్లు పెట్టడం వల్ల కలిగే నష్టాల గురించి రైతులకు వివరించారు. అక్రమంగా వ్యవసాయ మోటార్లు నడుపుతున్న రైతులు తప్పనిసరిగా విద్యుత్‌శాఖకు డబ్బులు చెల్లించి రశీదు తీసుకొని సర్వీస్ రెగ్యులరైజ్ చేసుకోవాలన్నారు. అనంతరం విద్యుత్ సబ్‌స్టేషన్ స్థలాన్ని ఎస్ఈ పరిశీలించారు. త్వరలో నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పడమటనర్సాపురం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ టౌన్ ఫీడర్‌ను ఎస్ఈ ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈ రంగస్వామి, ఏడీఈ రవికుమార్, జూలూరుపాడు ఏఈ సతీశ్, సబ్ ఇంజనీర్ ప్రవీణ్, అసిస్టెంట్ లైన్మెన్ ఎన్.భాస్కర్‌రావు, రైతులు అల్లాడి నరసింహారావు, వందనపు సత్యనారాయణ, చావా వెంకటరామారావు, అల్లాడి లింగారావు, చావా కృష్ణయ్య, తదితరులు పాల్గొన్నారు. -
భక్తుల పాలిట కొంగుబంగారం.. బాలాజీ
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన వెంకటేశ్వరస్వామి ఆలయం (ఇన్సెట్) స్వామివారి ఉత్సవ విగ్రహాలు అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఈనెల 12 నుంచి 17 వరకు ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14వ తేదీ రాత్రి 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరగనుంది. 17న శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి. చారిత్రక నేపథ్యం ఇలా.. కాకతీయుల సామ్రాజ్యంలో అన్నపురెడ్డి అనే సేనాని ఈ ప్రాంతానికి వచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ పేరుతోనే గ్రామానికి అన్నపురెడ్డిపల్లి అని నామకరణం జరగగా.. ఆయన ఇక్కడ చిన్న గుడి నిర్మించారు. అంతేకాక ఈ ప్రాంతంలో రాముడు చెరువు, నల్లచెరువును కూడా నిర్మాణం చేశారు. అనంతరం ఈ ప్రాంతానికి వచ్చిన కళ్లూరి వెంకటప్పయ్య మాత్యులు 1870 ప్రాంతంలో గుడిని విస్తరింపజేసినట్లు తెలుస్తోంది. 1969లో ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. 1974లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. నైజాం నవాబు కాలంలోనే అప్పటి నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేలాది ఎకరాల భూమిని అగ్రహారంగా ఇచ్చినట్లు సమాచారం. అందులో ప్రస్తుతం 2,300 ఎకరాల భూములు స్వామివారికి ఉన్నాయి. అన్ని ఏర్పాట్లు చేశాం స్వామివారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలువైపుల నుంచీ వేలాది మంది భక్తులు వస్తారు. వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. చలవ పందిళ్లు వేయించాం. భక్తుల కోసం ప్రత్యేకంగా సత్తుపల్లి, కొత్తగూడెం డిపోల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తాయి. –పాకాల వెంకటరమణ, ఆలయ ఇన్చార్జ్ మేనేజర్నేటి నుంచి అన్నపురెడ్డిపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు -
ఐటీసీ సహకారంతో ఆర్థిక భరోసా
బూర్గంపాడు: నిరుపేద, ఒంటరి, వితంతు మహిళలకు వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి, వారి జీవనోపాధికి ఐటీసీ సహకారం అందిస్తుందని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. సారపాకలోని ఐటీసీ కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమానికి పీఓతో పాటు పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. పేద మహిళల ఆసక్తిని గుర్తించి వారికి అయా రంగాల్లో ఐటీసీ శిక్షణ ఇస్తుందన్నారు. ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి ఏజెన్సీ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఐటీసీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సీఎస్సార్ నిధులతో గ్రామాల్లో మౌలికవసతులు, విద్య, వైద్య రంగాల్లో అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఏజెన్సీలోని పేదల ఆర్థికాభివృద్ధికి ఐటీసీ అన్ని విధాల చేయూతనందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్, జనరల్ మేనేజర్(హెచ్ఆర్) శ్యామ్‌కిరణ్, చెంగలరావు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యేలు పాయం, తెల్లం -
కొలిక్కివచ్చిన స్థల సేకరణ!
25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ స్థలంపై చిక్కుముడి వీడే అవకాశం ఉంది. మున్సిపల్ డంప్ యార్డు నుంచి రైల్వే లైన్ వరకు ఉన్న 25 ఎకరాల స్థలంలో భవన నిర్మాణం చేయాలని నిర్ణయించారు. అయితే అక్కడి రైతులు కొందరు ఆ భూమి తమదంటూ కోర్టును ఆశ్రయించారు. సదరు రైతుల చూపుతున్న భూమి ఆ సర్వే నంబర్లో లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇదే విషయం కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సర్వే చేశారు. రెండు మూడు రోజుల్లో స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేస్తామని సింగరేణి జీఎం వి.కృష్ణయ్య, తహసీల్దార్ కె.రవికుమార్ కలెక్టర్ జితేష్‌కు, ఎమ్మెల్యే కోరం కనకయ్యకు వివరించారు. ఐటీఐ, ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలకు ఈ నెల 17న మంత్రులు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. ఆలోగా అధికారులు స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తిచేయాల్సిఉంది. కాగా ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు సుమారు రూ. 200 కోట్లు, ప్రభుత్వాస్పత్రికి రూ.37 కోట్లు, ఐటీఐకి రూ.11 కోట్లు.. మొత్తం రూ.248 కోట్లను ప్రభుత్వం కేటాయించిన విషయం విదితమే. ఇల్లెందు: నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న ప్రభుత్వ ఐటీఐ, 100 పడకల ఆస్పత్రి, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణాలకు స్థలాల ఎంపిక తుది దశకు చేరింది. ఇటీవల కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఇల్లెందులోని మెయిన్రోడ్లో ఉన్న సింగరేణి స్థలాలను స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి పరిశీలించి సుముఖత వ్యక్తం చేశారు. కొందరు సింగరేణి ఉద్యోగులు క్వార్టర్లలో నివాసం ఉంటుండగా, వారిని మరోచోటకు తరలించాల్సి ఉంది. వారం పది రోజుల్లో సింగరేణి సీఎండీ నుంచి కూడా ప్రభుత్వ ఐటీఐ స్థలం కోసం అనుమతి వచ్చే అవకాశం ఉంది. మూడు ప్రధాన భవనాల నిర్మాణాలకు 35 ఎకరాల స్థలాల ఎంపిక దాదాపుగా ఒక కొలిక్కివచ్చింది. నాన్‌వెజ్ మార్కెట్, సింగరేణి స్థలంలో ఆస్పత్రి, ఐటీఐ ఇల్లెందులో రూ.4.50 కోట్లతో గత ప్రభుత్వం వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేపట్టింది. నిధుల్లేక పనులు నిలిచిపోగా మరో వైపు పట్టణానికి దూరంగా ఉండటంతో ప్రజలు, వ్యాపారులు వచ్చే అవకాశం ఉండదని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పూర్తిగా నిలిపివేసింది. తాజాగా ఆ స్థలాన్ని ప్రభుత్వ ఐటీఐ భవనం కోసం కేటాయించాలని నిర్ణయించారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి నుంచి ఉప్పిడి మిల్లు వరకు సుమారు అర కిలోమీటర్ మేర సింగరేణి క్వార్టర్లు ఉన్నాయి. వాటిలో 15 మంది సింగరేణి ఉపాధ్యాయులు, కార్మికులను అయ్యప్ప టెంపుల్ ఏరియా, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వెనుక ఉన్న ఖాళీ క్వార్టర్లకు తరలించనున్నారు. ఇక ప్రైవేటు వ్యక్తులను క్వార్టర్ల నుంచి ఖాళీ చేయించనున్నారు. మార్కెట్, సింగరేణి క్వార్టర్ల స్థలం కలుపుకుని రోడ్డు వెంట ఉన్న దాదాపు పదెకరాలను 100 పడకల ఆస్పత్రి, ఐటీఐల కోసం ప్రభుత్వం తీసుకోనుంది. దీంతో ప్రభుత్వాస్పత్రి, ఐటీఐ ప్రభుత్వ నడిబొడ్డున ఏర్పాటుకానున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూల్, ప్రభుత్వాస్పత్రి, ఐటీఐలకు 35 ఎకరాలు గుర్తింపు సుమారు రూ.248 కోట్లతో మూడు ప్రధాన భవనాల నిర్మాణం ఇల్లెందులో ఈ నెల 17న మంత్రులు శంకుస్థాపన చేసే అవకాశం -
శ్రమించారు.. గ్రూప్స్‌లో మెరిశారు
ఇల్లెందు: జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు గ్రూప్– 1, గ్రూప్–2 పరీక్షల్లో ప్రతిభ చూపారు. ఇల్లెందు ఎస్ఐ దొడ్డపనేని సందీప్ కుమార్ గ్రూపు–1లో సత్తా చాటారు. మెయిన్స్ పరీక్షలో 502 మార్కులు సాధించారు. ఇప్పటివరకు ఆరు ఉద్యోగాలు కై వసం చేసుకుని ప్రస్తుతం ఎస్ఐగా పని చేస్తున్నారు. ఆయనది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామం కాగా, తల్లిదండ్రులు సర్వేశ్వరరావు, పద్మ వ్యవసాయం చేస్తున్నారు. గ్రూప్–4, రైల్వేలో రెండు ఉద్యోగాలు, పంచాయతీ కార్యదర్శి, ఫారెస్టు శాఖలో కొలువు కొట్టారు. తాజాగా గ్రూప్–1 సాధించడంతో ఆర్డీఓ లేదా డీఎస్పీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. గ్రూప్–2లో 61వ ర్యాంక్ఇల్లెందురూరల్: మండలంలోని ఇందిరానగర్ గ్రామానికి చెందిన పేరాల రాజ్‌కిషోర్ తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 61వ ర్యాంకు సాధించాడు. కోచింగ్‌కు వెళ్లకుండా ఇంటివద్దే ఆన్లైన్లో గ్రంథాలయాల్లో చదివి పరీక్షకు సన్నద్ధమయ్యాడు. కుమారుడు విజయం సాధించడంతో తల్లిదండ్రులు సరిత, రాజేంద్రప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.గ్రూప్–1లో సత్తా చాటిన ఎస్ఐ -
సీసీ కెమెరాల ఏర్పాటు
అశ్వారావుపేట: అశ్వారావుపేట సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పౌరసరఫరాల శాఖ అధికారులు సోమవారం సీసీ కెమెరాలను అమర్చారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యంపై ‘బియ్యం దందాను ఆపేదెవరు’అనే శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలతో నిఘా పెంచారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా మెట్పల్లి, కోదాడ వద్ద కెమెరాలు ఏర్పాటు చేశామని, తాజాగా అశ్వారావుపేట వద్ద కూడా ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ అసోసియేట్ శ్రవణ్, అసిస్టెంట్ అక్బర్ తెలిపారు. వారి వెంట అశ్వారావుపేట సివిల్ సప్లయీస్ డీటీ గుర్రం ప్రభాకర్ ఉన్నారు.రేపు జిల్లా సీనియర్ హాకీ మెన్ ఎంపికలుకొత్తగూడెంటౌన్: లక్ష్మీదేవిపల్లిలోని రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 13న సీనియర్ హాకీ మెన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బట్టు ప్రేమ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ చూపినవారిని ఈనెల 16 నుంచి 18 తేదీ వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు హాకీ ఇండియా గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు తీసుకురావాలని సూచించారు. యువికకు దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: యువశాస్త్రవేత్తలను తయారుచేసేందుకు ఇస్రో చేపట్టిన కార్యక్రమం యువికకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి, జిల్లా సైన్స్ అధికారి చలపతిరాజు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. 9వ తరగతి విద్యార్థులు అర్హులని, ఈ నెల 23వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 7న ఎంపికై న జాబితా విడుదల చేస్తారని, ఎంపికై న విద్యార్థులకు మే 19 నుంచి 30వ తేదీ వరకు ఇస్రోకు చెందిన ఏడు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారని వివరించారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలని కోరారు. ఎకై ్సజ్ ఉద్యోగులకు రివార్డులుఖమ్మంక్రైం: గంజాయి రవాణా, అమ్మకం కేసుల్లో నిందితుల అరెస్ట్, శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టిన ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎకై ్సజ్ ఉద్యోగులు రివార్డులు అందుకున్నారు. వీరిని హైదరాబాద్‌లో మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఖమ్మం, కొత్తగూడెం ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు నాగేందర్‌రెడ్డి, జానయ్య, మణుగూరు, భద్రాచలం సీఐలు రాజిరెడ్డి, రహీమున్నీసాబేగంతో పాటు రాజు, సర్వేశ్వరరావు, రవికుమార్, కానిస్టేబుళ్లు మారేశ్వరావు, నాగేశ్వరరావు, పగిడిపర్తి గోపి రివార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఏసీబీకి చిక్కిన ఎకై ్సజ్ ఉద్యోగి ఖమ్మంక్రైం: ఉద్యోగ విరమణ సమయం సమీపించినా తీరు మార్చుకోలేని ఎకై ్సజ్ ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం బస్ డిపో రోడ్డులో సాయికృష్ణ బార్ నిర్వహించిన శ్రీనివాస్ ఆరేళ్ల క్రితం మూసివేశాడు. మళ్లీ తెరవాలని నిర్ణయించుకున్న ఆయన ఏడాది లైసెన్స్ ఫీజు చెల్లించగా ఎకై ్సజ్ శాఖ అధికారులు అనుమతించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో బార్ లైసెన్స్‌కు జిరాక్స్ కాపీ కావాలని న్యాయవాది చెప్పడంతో శ్రీనివాస్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లానాయక్‌ను సంప్రదించాడు. ఇందుకోసం రూ.2వేలు డిమాండ్ చేయగా ఆర్థిక సమస్యలతో అంత ఇచ్చుకోలేనని చెప్పాడు. అయితే, లైసెన్స్ శ్రీనివాస్ తల్లి పేరిట ఉన్నందున ఆమెనే తీసుకురావాలని సూచించాడు. కానీ వృద్ధురాలైన ఆమె రాలేదని చెప్పినా ససేమిరా అనడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారి సూచన మేరకు రూ.1,500 ఇస్తానని శ్రీనివాస్ చెప్పగా సోమ్లానాయక్ అంగీకరించాడు. ఈమేరకు నగదుతో శ్రీనివాస్‌ను పంపించి మాటువేసిన ఏసీబీ అధికారులు డబ్బు తీసుకుంటుండగా సోమ్లాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోన్నారు. కాగా, ఏసీబీ దాడి జరిగిన సమయాన ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి సహా పలువురు అధికారులు ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను హైదరాబాద్‌లో రివార్డులు అందుకుంటుండడం గమనార్హం. 2012లో ఇదే ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి పట్టుబడిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు. -
పీహెచ్‌సీని సందర్శించిన డీఎంహెచ్ఓ
చండ్రుగొండ : చండ్రుగొండలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని డీఎంహెచ్ఓ భాస్కర్‌నాయక్ మంగళవారం సందర్శించారు. ‘పీహెచ్సీలో చెట్లు దగ్ధం’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. ఆస్పత్రిని సందర్శించి డాక్టర్ తనుజ, సిబ్బందితో మాట్లాడి చెట్ల దగ్ధమైన సంఘటనపై ఆరా తీశారు. కాలిపోయిన ప్రదేశాన్ని శుభ్రం చేయించి కొత్తగా మొక్కలు నాటించాలని సూచించారు. అనంతరం పీహెచ్‌సీని, రికార్డులను పరిశీలించారు. ఆ తర్వాత ఎర్రగుంట పీహెచ్‌సీని సందర్శించి అసంక్రమిత వ్యాధులపై సర్వే పక్కాగా నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఆరోగ్య ఉపకేంద్రాల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. డాక్టర్ ప్రియాంక, డీపీఎంఓ శ్రీనివాస్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు. -
కేసులు సత్వరమే పరిష్కరించాలి
కొత్తగూడెంటౌన్: కేసుల్లో ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నిక్షిప్తం చేయాలని, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. మంగళవారం కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసు స్టేషన్ల వారీగా కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులతో సమన్వయం చేసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీలో అలసత్వం వహించొద్దన్నారు. నేరస్తులకు శిక్షపడేలా చేసి కన్వీక్షన్ రేటు పెంచాలని కోరారు. ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, నాగరాజురెడ్డి, ఎస్సైలు హారిక, హసీనా తదితరులు పాల్గొన్నారు.ఎస్పీ రోహిత్‌రాజు -
బీటీపీఎస్‌కు జనరేటర్ ట్రాన్స్ఫార్మర్..
పాల్వంచరూరల్: భారీ వాహనంలో పెద్ద జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ను మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. మంగళవారం పాల్వంచలోని బీసీఎం జాతీయ రహదారి మీదుగా విద్యుత్ కేంద్రానికి తరలిస్తుండగా పలువురు ఆసక్తిగా తిలకించారు. మణుగూరు బీటీపీఎస్‌లో గత జూన్ చివరిలో జీటీ(జనరేటర్ ట్రాన్స్ఫార్మర్)–1 పిడుగు పడి కాలిపోయింది. దీంతో మరమ్మతులకు తమిళనాడు రాష్ట్రంలోని చైన్నెకు తరలించారు. మరమ్మతులు పూర్తికావడంతో సుమారు 15 రోజుల క్రితం 112 టైర్లు కలిగిన భారీ వాహనంపై జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుని ఇంజనీర్లు బయల్దేరారు. పాల్వంచ మీదుగా వెళ్తున్న వాహనం బుధవారం మణుగూరుకు చేరే అవకాశం ఉంది. -
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని అభయాంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.16న జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలుకొత్తగూడెంటౌన్: దమ్మపేటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈనెల 16న జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు నిర్వహించనున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.మహీదర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అండర్–14, 16, 18, 20 విభాగాల్లో జావెలిన్‌త్రో, 100, 400 మీటర్ల పరుగుపందెంలో బాలురు, బాలికలు, సీ్త్ర, పురుషులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇక్కడ ప్రతిభ చాటిన క్రీడాకారులను ఈనెల 23న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేస్తామని, వివరాలకు కోచ్ జె.కృష్ణ(70135 52707)ను సంప్రదించాలని సూచించారు. స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులుభద్రాచలం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యాన కొనసాగుతున్న మోడల్ స్పోర్ట్స్ స్కూళ్లలో వచ్చే విద్యాసంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. కిన్నెరసానిలోని బాలురు, కాచనపల్లిలోని బాలికల స్పోర్ట్స్ స్కూళ్లతో పాటు హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో ఐదో తరగతికి ప్రవేశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ మేరకు డివిజన్ స్థాయిలో ఈనెల 16 నుంచి 18వరకు, జిల్లాస్థాయిలో 26 నుంచి 28వ తేదీ వరకు పోటీలు ఉంటాయని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 9 – 11 ఏళ్ల వయస్సు కలిగిన గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు అర్హులని వెల్లడించారు. భద్రాద్రి జిల్లా విద్యార్థులు కిన్నెరసాని స్పోర్ట్స్ స్కూల్లో, ఖమ్మం జిల్లా విద్యార్థులు ఉసిరికాయలపల్లిలోని ఆశ్రమ ఉన్నత పాఠశాలలో జరిగే డివిజన్ స్థాయి పోటీలకు అన్ని ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. అపై జిల్లా స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు తుది ఎంపిక పోటీలు నిర్వహించి ప్రవేశాలకు అర్హులను ఎంపిక చేస్తామని పీఓ తెలిపారు. సింగరేణిలో లైజన్ ఆఫీసర్ల నియామకంసింగరేణి(కొత్తగూడెం): సింగరేణి వ్యాప్తంగా విస్తరించి ఉన్న 11 ఏరియాలకు 11 మంది లైజన్ ఆఫీసర్లను యాజమాన్యం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేట్ ఏరియాకు వి.మురళి, కొత్తగూడెం ఏరియాకు ఆవధూత శ్రీధర్, ఇల్లెందుకు జి.నాగశేషు, మణుగూరుకు పి, వీరభద్రరావు, ఆర్జీ–1కు పి.శ్రీనివాస్, ఆర్జీ–2కు పి.వేణుగోపాల్. ఆర్జీ –3కి చంద్రశేఖర్, భూపాలపల్లి ఏరియాకు పి.బాలరాజు, బెల్లంపల్లికి ఎం,మధుకుమార్, మందమర్రికి ఎండీ ముస్తఫా, శ్రీరాంపూర్ ఏరియాకు ఎన్. సత్యనారాయణను నియమిస్తున్నట్లు ప్రకటించింది. -
ఐటీసీ సహకారంతో ఆర్థిక భరోసా
బూర్గంపాడు: నిరుపేద, ఒంటరి, వితంతు మహిళలకు వృత్తి విద్యా శిక్షణ ఇచ్చి, వారి జీవనోపాధికి ఐటీసీ సహకారం అందిస్తుందని ఐటీడీఏ పీఓ రాహుల్ అన్నారు. సారపాకలోని ఐటీసీ కళాభారతి ఆడిటోరియంలో మంగళవారం జరిగిన ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమానికి పీఓతో పాటు పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. పేద మహిళల ఆసక్తిని గుర్తించి వారికి అయా రంగాల్లో ఐటీసీ శిక్షణ ఇస్తుందన్నారు. ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమాన్ని మరింతగా విస్తరించి ఏజెన్సీ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఐటీసీ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సీఎస్సార్ నిధులతో గ్రామాల్లో మౌలికవసతులు, విద్య, వైద్య రంగాల్లో అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ ఏజెన్సీలోని పేదల ఆర్థికాభివృద్ధికి ఐటీసీ అన్ని విధాల చేయూతనందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఐటీసీ బంగారు భవిష్యత్ కార్యక్రమంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో ఐటీసీ పీఎస్పీడీ యూనిట్ హెడ్ శైలేంద్రసింగ్, జనరల్ మేనేజర్(హెచ్ఆర్) శ్యామ్‌కిరణ్, చెంగలరావు తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్, ఎమ్మెల్యేలు పాయం, తెల్లం -
పేరు మారినా సేవలు అంతంతే..
● సమస్యలకు నిలయంగా అశ్వారావుపేట పట్టణం ● ఇన్‌చార్జ్‌లతోనే నెట్టుకొస్తున్న మున్సిపల్ పాలన అశ్వారావుపేట : ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు అశ్వారావుపేట మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. కానీ సేవలు మాత్రం ఇంకా గ్రామ పంచాయతీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ మున్సిపాలిటీకి ఇన్చార్జ్ కమిషనర్, జేఏఓ, టీపీఓలను నియమించిన ప్రభుత్వం.. ఆ తర్వాత పట్టింపు లేనట్టుగా వ్యవహరిస్తోంది. రెగ్యులర్ అధికారులను నియమించకపోవడం, అవసరమైన నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోయాయి. బిల్ కలెక్టర్లు వసూలు చేసే పన్నుల జమ, ఖర్చులు చూసుకోవడం మినహా మరో పనేమీ జరగడం లేదు. ఇంటి అనుమతుల కోసం వచ్చేవారిని ఎల్ఆర్ఎస్ పేరుతో వెనక్కు పంపుతున్నారు. పారిశుద్ధ్య పనులు, చెత్త సేకరణ అంతంతమాత్రంగానే జరుగుతున్నాయి. అశ్వారావుపేట, గుర్రాలచెరువు, పేరాయిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో పనిచేసే మల్టీపర్పస్ వర్కర్లే ప్రస్తుతం మున్సిపాలిటీలో విధులు నిర్వర్తిస్తున్నారు. పట్టణ పరిధిలోని జాతీయ రహదారిని ఊడ్చిన దాఖలాలు లేవు. రహదారి మొత్తం దుమ్ము, ధూళితో దర్శనమిస్తుండగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక జాతీయ రహదారి వెంట కూడా వీధి దీపాలు వెలగడం లేదు. తాగునీటి సరఫరా కూడా గతం కంటే మెరుగుపడలేదు. ఖమ్మం రోడ్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద తాగునీటి పైప్‌లైన్ నెల రోజులుగా లీకవుతూ నీళ్లు వృథాగా పోతున్నాయి. ఆ తర్వాత అవే మురికి నీరు పైపులైన్ ద్వారా సరఫరా అవుతున్నాయి. ప్రతిరోజూ ఇద్దరు, ముగ్గురు వచ్చి పగటి వేళలో నీళ్లు తోడి పోతుండగా మరుసటి రోజు తెల్లారేసరికి మళ్లీ గుంత నిండుతోంది. ఇదే నిత్యకృత్యం తప్ప సమస్య పరిష్కారం కాలేదు. గ్రామపంచాయతీలుగా ఉన్నప్పటి తాగునీటి ట్యాంకర్లను మోడల్ కాలనీలో అనధికారికంగా ఇళ్ల నిర్మాణాలకు, పునాదుల్లో నీళ్లు నింపేందుకు వినియోగిస్తున్నారు. గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా మారినా పాత పంచాయతీ కార్యదర్శులే సేవలందిస్తున్నారు. మున్సిపల్ పాలన ఎప్పుడు ప్రారంభిస్తారని ఇన్చార్జ్ కమిషనర్ సుజాతను వివరణ కోరగా.. ఇంకా పూర్తిస్థాయిలో సిబ్బంది స్థాయిలో రాలేదని.. మరికొంత సమయం పడుతుందని చెప్పారు. -
14న ఫాల్గుణ పౌర్ణమి వేడుకలు
భద్రాచలం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఈనెల 14న ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ రమాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామయ్య పెళ్లి పనులకు ఆరోజే శ్రీకారం చుట్టనున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద పసుపు దంచి తలంబ్రాలు కలిపే వేడుక ప్రారంభం అవుతుందని, అనంతరం వసంతోత్సవం, డోలోత్సవం ఉంటాయని తెలిపారు. ఈ సందర్భంగా బేడా మండపంలో జరిగే నిత్యకల్యాణాన్ని రద్దు చేశామని పేర్కొన్నారు. భద్రాచలం దివ్యక్షేత్రానికి అనుబంధంగా ఉన్న పర్ణశాలలోనూ ఈ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ వ్యక్తులు ప్రసాదాలు విక్రయించొద్దు.. శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో ప్రైవేట్ వ్యక్తులు, తోపుడు బండ్ల వారు, ఇతరులు ప్రసాదాల పేరుతో లడ్డూలు, పులిహోర విక్రయించడాన్ని నిషేధించినట్లు ఈఓ రమాదేవి తెలిపారు. ఈ నిబంధనలను అతిక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామయ్య పెళ్లి పనులకు ఆ రోజే శ్రీకారం -
ప్రగతికి బాటలు పడేనా ?
వాతావరణ ం జిల్లాలో బుధవారం ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదవుతాయి. ఉదయం ప్రారంభమయ్యే ఎండ మధ్యాహ్నానికి తీవ్రమవుతుంది. బుధవారం శ్రీ 12 శ్రీ మార్చి శ్రీ 2025పారిశ్రామిక రంగంలో.. పాల్వంచ కేటీపీఎస్‌లో కొత్తగా 400 ఎకరాల స్థలం అందుబాటులోకి వచ్చింది. అక్కడ టీజీ జెన్కో ఆధ్వర్యంలో కొత్త యూనిట్ ప్రారంభించాలనే డిమాండ్ ఉంది. అలాగే ఏపీ స్టీల్స్, స్పాంజ్ ఐరన్ స్థలాలను సెమీ కండక్టర్ల తయారీ వంటి న్యూఏజ్ పరిశ్రమలకు కేటాయించేలా విధానపరమైన మార్పులు తీసుకురావాల్సిన అవసరముంది. దీంతో పాటు కొత్తగూడెంలో మూతబడిన బేరియం ఫ్యాక్టరీ, కిన్నెర స్టీల్స్ తదితర పరిశ్రమల స్థలాలు సైతం నిరూయోగంగా ఉన్నాయి. వీటిని ఎలా వినియోగంలోకి తేవాలనే అంశాలపై దృష్టి సారించాలి. జిల్లాలో ఇప్పటికే పత్తి విరివిగా సాగవుతుండగా కొత్తగా వరి, పామాయిల్ సాగు పెరుగుతోంది. దీనికి తగ్గట్టుగా రైస్ మిల్లుల వంటి అనుబంధ పరిశమ్రలు ప్రైవేట్, గిరిజన సహకార సంఘాల ఆధ్వర్యంలో వచ్చేలా ఈ బడ్జెట్లో ప్రోత్సహకాలు అందితే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. యూనివర్సిటీకి ఇప్పటికే ప్రతిపాదనలు.. జిల్లాలోని అన్ని ప్రాంతాలకూ మొబైల్ నెట్వర్క్ సౌకర్యం కలించాల్సిన అవసరముంది. ప్రతీ గ్రామానికి రోడ్డు సౌకర్యం, అందుకోసం అటవీ శాఖ నుంచి అనుమతులు ఇప్పించాలని అసెంబ్లీలో గొంతు విప్పేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నారు. దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇప్పటికీ యూనివర్సిటీ లేదు. కొత్తగూడెంలో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. దీనిపై ఈ బడ్జెట్లో సానుకూల నిర్ణయం వస్తుందని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ‘సీతారామ’తో న్యాయం దక్కేనా ? ఉమ్మడి జిల్లాకు వరప్రదాయినిగా పేర్కొంటున్న సీతారామ ప్రాజెక్టుతో జిల్లాలోని భద్రాచలం, ఇల్లెందు నియోజకవర్గాలకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదు. పినపాక, కొత్తగూడెం నియోజకవర్గాలకూ అంతంతమాత్రమే. దీంతో గోదావరి జలాలు జిల్లాలోని పొలాల్లో ప్రవహించేలా అనుబంధ పథకాలు కావాలని జిల్లా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రస్తావించనున్నారు. ఎయిర్‌పోర్టు గురించి మాట్లాడుతా నియోజకవర్గానికి కావాల్సిన కేటాయింపులపై ఇప్పటికే పలుమార్లు లేఖలు అందించా. ప్రధానంగా కొత్తగూడెం ఎయిర్‌పోర్టు, కార్పొరేషన్ ఏర్పాటు, హరిత హోటల్ వంటి అంశాలపై అసెంబ్లీలో చర్చిస్తా. ప్రజా ప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కార్ సామాన్య, మధ్యతరగతి వర్గాలకు మేలు చేసేలా బడ్జెట్ ప్రవేశపెడుతుందని ఆశిస్తున్నా. బడ్జెట్లోని అంశాలను పరిశీలించాక స్పష్టమైన అభిప్రాయాన్ని అసెంబ్లీలో చెబుతా. – కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే విద్య, వైద్యంపై ఫోకస్ అన్నపురెడ్డిపల్లిలో 100 పండకల ఆస్పత్రి ఏర్పాటు చేయాలని కోరుతా. యంగ్ ఇండియా స్కూల్‌కు భూమి గుర్తించినందున నిధులు మంజూరు చేయాలని అడుగుతా. అశ్వారావుపేట మున్సిపల్ భవనం నిర్మాణానికి, మూకమామిడి, వెంగళరాయసాగర్, గుమ్మడవెల్లి మధ్య తరహా ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని అసెంబ్లీలో ప్రస్తావిస్తా. – జారే ఆదినారాయణ, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఎత్తిపోతలకు నిధులపై మాట్లాడుతా ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రగళ్లపల్లి ప్రాజెక్ట్ నిర్మాణంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. దీని వల్ల 40 వేల ఎకరాలకు రెండు పంటలకు నీరందుతుంది. అన్ని గ్రామాలకూ తాగునీరు అందించడంతో పాటు విద్య, వైద్య రంగాల్లో సేవల విస్తరణకు తగిన నిధులు కావాలని అడుగుతా. – తెల్లం వెంకట్రావు, భద్రాచలం ఎమ్మెల్యే అటవీ అనుమతులపై ప్రస్తావిస్తా ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి అటవీ అనుమతులు ఇప్పించే అంశంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా. ఏజెన్సీ గ్రామాల్లో విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరిచేలా నిధులు కేటాయించాలని కోరుతా. సీతారామ ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గానికి గరిష్ట స్థాయిలో మేలు చేయాల్సిన అవసరంపై మాట్లాడుతా. – పాయం వెంకటేశ్వర్లు, పినపాక ఎమ్మెల్యే కాలేజీలు కావాలి ఇల్లెందు నియోజకవర్గ కేంద్రంలో పాలిటెక్నిక్ కళాశాల, నర్సింగ్ కాలేజీలు మంజూరు చేయాలని కోరుతా. నియోజకవర్గానికి సీతారామ ప్రాజెక్టు నీటిని తరలించాలని డిమాండ్ చేస్తా. ఇల్లెందు కేంద్రంగా రెవెన్యూ డివిజన్, కొమురారం, బోడు మండలాల ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తా. – కోరం కనకయ్య, ఇల్లెందు ఎమ్మెల్యే భక్తుల కొంగుబంగారం.. అన్నపురెడ్డిపల్లి శ్రీబాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. . 8లోన్యూస్రీల్ఎకో – టెంపుల్ టూరిజం.. పారిశ్రామిక ప్రాంతంగా వెలుగొందుతున్న జిల్లా ఎకో – టెంపుల్ టూరిజంలో అవకాశాలు ఎయిర్‌పోర్టు, యూనివర్సిటీపై గంపెడాశలు సీతారామ ద్వారా జిల్లాకు న్యాయం దక్కేనా.. అసెంబ్లీలో వాణి వినిపించనున్న ఎమ్మెల్యేలు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు బుధవారం ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్.. జిల్లా ప్రగతికి అన్ని విధాలా బాటలు వేయాలని పలువురు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు తమ ప్రాంత అభివృద్ధి, సంక్షేమం కోరుతూ రాష్ట్ర సర్కారుకు నివేదికలు సమర్పించారు. ఇక అసెంబ్లీలో తమ వాణి వినిపించేందుకు సిద్ధం అవుతున్నారు. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంభద్రాచలం, పర్ణశాల, అన్నపురెడ్డిపల్లి, కిన్నెరసాని అభయారణ్యం, కనకగరిగి గుట్టలు, మోతెగడ్డ వంటివి ఎకో – టెంపుల్ టూరిజానికి అనువుగా ఉన్నాయని ఇప్పటికే గుర్తించారు. గతంలో ప్రకటించిన టూరిజం పాలసీలో వీటికి చోటు కూడా దక్కింది. దీనికి కొనసాగింపుగా ఈ బడ్జెట్లో ఎకో – టెంపుల్ టూరిజానికి నిధులు మంజూరైతే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అలాగే గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా హోం స్టే విధానాలకు ప్రోత్సాహకాలు దక్కితే ఇంకా బాగుంటుంది. గతంలో ప్రతిపాదన దశలో ఉన్న భద్రకాళి – భద్రాచలం సర్క్యూట్లో భాగంగా మణుగూరు దగ్గరున్న రథం గుట్టలు – వెన్నెల జలపాతం వద్ద అభివృద్ధికి అవకాశం కల్పించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. -
యూడీఐడీ కార్డుల జారీపై అపోహలు వద్దు
చుంచుపల్లి: దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ ఐడీ కార్డుల జారీపై ఎలాంటి అపోహలు వద్దని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. ఐడీఓసీలో దివ్యాంగులు, మీసేవా కేంద్రాల నిర్వాహకులకు మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. దివ్యాంగులకు ఇకపై సదరం సర్టిఫికెట్ల జారీ విధానం ఉండదని, అందుకే యూడీఐడీ కార్డులు జారీ చేయనున్నామని తెలిపారు. వైద్యులు ధ్రువీకరించిన వైకల్య శాతం సర్టిఫికెట్తో పాటు దివ్యాంగుల పూర్తి వివరాలను యూడీఐడీ పోర్టల్‌లో నమోదు చేస్తే ఐడీ కార్డులు స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా వారి చిరునామాకు చేరుతాయని వెల్లడించారు. ఈ కార్డుల కోసం మీ–సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుందన్నారు. గతంలో సదరం ద్వారా 8 రకాల వైకల్యాలకు మాత్రమే ఉండేదని, ఇప్పుడు యూనిక్ కార్డులను 21 రకాల వైకల్యాలు గల వారికి మంజూరు చేస్తున్నామని తెలిపారు. యూడీఐడీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ఐదు రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. దరఖాస్తుదారులు పేరు, ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, జెండర్, ఫొటో, సంతకం, ఆధార్ కార్డు నంబర్, అడ్రస్ తదితర సమాచారాలను నమోదు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దివ్యాంగుల అభివృద్ధికి ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. మీసేవా కేంద్రాలకు వచ్చే దివ్యాంగులకు ఉత్తమ సర్వీస్ అందించాలని నిర్వాహకులకు సూచించారు. వారి నుంచి అధిక రుసుము వసూలు చేసినా, సేవల్లో నిర్లక్ష్యం వహించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మీసేవా కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా సంక్షేమ శాఖాధికారి స్వర్ణలత లెనినా, ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని వినియోగించుకోవాలిసూపర్బజార్(కొత్తగూడెం) : మార్చి 31 నాటికి భూ క్రమబద్ధీకరణ చేసుకునేలా ప్రభుత్వం కల్పించిన ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. కలెక్టరేట్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 2020 తర్వాత లేఔట్ చేసిన వెంచర్లలో ప్లాట్లు తీసుకున్న 5,488 మంది ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారని, అందులో 400 మంది మాత్రమే డబ్బు చెల్లించారని తెలిపారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల ద్వారా ఇప్పటికే నోటీసులు జారీ చేసినా ఫోన్ నంబర్లు, చిరునామాల్లో తేడాలు ఉండడంతో కొందరికి చేరడం లేదన్నారు. పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో 2,112 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అవకాశాన్ని వినియోగించుకోకుంటే ఆయా ప్లాట్లలో ఇల్లు నిర్మించుకోవాలంటే అప్పటి ప్లాట్ విలువపై ప్రో రేటా ఫీజుతో పాటు 14 శాతం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. భవిష్యత్‌లో ప్లాట్ అమ్ముకోవాలన్నా ఎల్ఆర్ఎస్ ఉంటేనే విలువ పెరుగుతుందని చెప్పారు. సమావేశంలో సబ్ రిజిస్ట్రార్ వేణుమాధవ్, కొత్తగూడెం, పాల్వంచ టౌన్ ప్లానింగ్ ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆన్లైన్లో ‘నవమి’ టికెట్లు
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రి ల్ 6, 7 తేదీల్లో జరగనున్న శ్రీ సీతారాముల కల్యాణం, మహా పట్టాభి షేకం ఉత్సవాలకు బుధవారం నుంచి ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కల్యాణానికి ఉభయదాతల టికెట్లు రూ.7,500, సెక్టార్ల టికెట్లు రూ.2,500, రూ.2,000, రూ.1,000, రూ.300, రూ.150, పట్టాభిషేక మహోత్సవానికి రూ.1,500, రూ.500, రూ.100 టికెట్లను ఆన్లైన్లో ఉంచామని వివరించారు.ఉత్సవాలకు రాలేని భక్తుల గోత్రనామాలతో కల్యాణం జరిపించే సేవల కోసం రూ.5,000, రూ.1,116 టికెట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. htts://bhadradritemple.telangana.gov.in వెబ్సైట్ ద్వారా భక్తులు టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు. వారు ఈనెల 20వ తేదీ ఉదయం 11 గంటల నుంచి.. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 6 గంటల వరకు దేవస్థానం సమీపంలోని తానీషా కల్యాణ మండపంలో ఒరిజినల్ గుర్తింపు కార్డు చూపించి టికెట్లు పొందాలని సూచించారు. నేరుగా విక్రయానికి ప్రత్యేక కౌంటర్లు.. ఈనెల 20వ తేదీ నుంచి భద్రాచలంలో నేరుగా సెక్టార్ టికెట్లు విక్రయించనున్నారు. రామాలయం వద్ద మెయిన్ కౌంటర్, తానీషా కల్యాణ మండపం, సీఆర్వో కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేశారు. భద్రాచలం ఆర్డీవో ఆఫీసు వద్ద వచ్చే నెల 1 నుంచి కౌంటర్ అందుబాటులో ఉంటుంది. -
శభాష్ లక్ష్మీరెడ్డి..
రైతును అభినందించిన వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల బూర్గంపాడు: బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు యారం లక్ష్మీరెడ్డిని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. సోమవారం లక్ష్మీరెడ్డికి స్వయంగా ఫోన్‌చేసి మాట్లాడారు. పుచ్చ సాగులో ఎకరాకు 20 టన్నుల నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నందుకు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పుచ్చ, బొబ్బాయి వంటి పంటల్లో అధిక దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం అభినందనీయమని అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని రైతులు ఉద్యానవన పంటలు సాగుకు ముందుకు రావాలన్నారు. నాణ్యమైన పంటల సాగుకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సహకాలను అందిస్తోందని మంత్రి తెలిపినట్లు రైతు లక్ష్మీరెడ్డి వివరించారు. అప్రెంటిస్ మేళాలో 136 మంది ఎంపికిసంగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో సోమవారం నిర్వహించిన పీఎం నేషనల్ అప్రెంటిష్ మేళాకు 300 మంది అభ్యర్థులు హాజరుకాగా, 136 మంది అప్రెంటిస్‌కు ఎంపికయ్యారు. టాటా ఏరోస్పేస్ 40 మంది, మేథో సర్వే డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) 13 మంది, ఎల్అండ్టీ (చైన్నె) 54 మంది, టీ హబ్ హైదరాబాద్ కంపెనీ 29 మందిని ఎంపిక చేసుకున్నాయి. ఏజీఎం రామ్మోహన్రావు, ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు. Ayýl-ÑÌZ ^ðlÌS-Æó‡-VýS$-™èl$¯]l² Ð]l$…rË$˘ ములకలపల్లి: మండల పరిధిలోని రామాంజనేయపురం శివారులో మంటలు ఎగసి పడుతున్నాయి. సీతారామ ప్రాజెక్ట్ కాలువ వద్ద సోమవారం రాత్రి అటవీ ప్రాంతంతోపాటు, తెలంగాణా స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఎఫ్డీసీ) పరిధిలోని ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. చెట్లు అగ్గికి బుగ్గి అవుతున్నాయి. పురుగుల మందు తాగి ఆత్మహత్యములకలపల్లి: పురుగుల మందు తాగి సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. ములకలపల్లిలోని శివాలయం వీధికి చెందిన పొదిల సతీష్ (38)కు ఏలూరుకు చెందిన జ్యోతితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన సతీష్ ఏ పనీ చేయకుండా తిరుగుతుండగా పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో భార్య మనస్తాపం చెంది రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనోవేదన చెందిన సతీష్ ఈ నెల 8న పురుగుల మందు తాగాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి దుర్గ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
వన సంరక్షణే ధ్యాసగా..
అవార్డులతో రాములు● అటవీప్రాంత పరిరక్షణకు పాటుపడుతున్న అన్నపురెడ్డిపల్లివాసి ● పలు అవార్డులు పొందిన చెదురుపల్లి రాములు అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): ఓ సామాన్యుడు వన సంరక్షణకు పాటుపడుతున్నాడు. ప్రకృతి సంపద పరిరక్షణకు నిత్యం కృషి చేస్తున్నాడు. దాదాపు ఏడు వందల హెక్టార్లలో ఉన్న వనసంరక్షణ సమితి(వీఎస్ఎస్) అడవిలో ఒక్క ఎకరంలో కూడా పోడు నరకకుండా అడ్డకున్నాడు. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన, వీఎస్ఎస్ చైర్మన్ చెదురుపల్లి రాములు గౌడ్ అటవీ ప్రాంత సంరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ప్రభుత్వాలు పలు అవార్డులు సైతం ఇచ్చాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడుతోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాడు. శ్రీలంక దేశానికి చెందిన ప్రముఖ అధికారులు అన్నపురెడ్డిపల్లి వచ్చి అటవీ సంరక్షణకు ఇతని నుంచి సలహాలు తీసుకున్నారు. వీఎస్ఎస్ చైర్మన్ అయిన రాములు రోజూ కిలోమీటర్ల కొద్దీ కాలినడకనే తిరుగుతూ అటవీప్రాంతాన్ని పర్యవేక్షిస్తాడు. అటవీశాఖలో సామాన్య ఉద్యోగి నుంచి ఐఎఫ్ఎస్ అధికారి వరకు రాములును అన్నా అని సంబోధిస్తారు. 2002 నుంచి 2006 వరకు పలు అవార్డలు పొందిన రాములు ప్రస్తుతం 60 ఏళ్ల వయసులోనూ వన సంరక్షణకు కృషి చేస్తున్నాడు. ఎక్కువ సమయం అడవిలోనే.. చిన్ననాటి నుంచే నాకు అడవి అంటే ఇష్టం. 1996లో వనసంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి 700 హెక్టార్లల అడవిని కాపాడుతున్నాను. మూడు దశాబ్దాల్లో ఎక్కువకాలం అడవిలోనే గడిపాను. ఉమ్మడి జిల్లాలో అప్పట్లో 300 వనసంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయగా, ప్రస్తుం మా కమిటీ ఒక్కటే పనిచేస్తోంది. – రాములు, వీఎస్ఎస్ చైర్మన్, అన్నపురెడ్డిపల్లి -
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి మూలమూర్తులు సోమవారం ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామిని తెలంగాణ ఉద్యోగ జేఏసీ కార్యదర్శి, టీజీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాసరావు సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. టీజీవోస్ జిల్లా అధ్యక్షుడు వెంకటపుల్ల య్య, టీఎన్జీవోస్ అధ్యక్ష, కార్యదర్శులు డెక్క నర్సింహారావు, గగ్గూరి బాలకృష్ణ,తో పాటు పడిగ నరసింహారావు, సాదిక్‌బాషా తదితరులు పాల్గొన్నారు. 30 నుంచి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలుభద్రాచలం/దుమ్ముగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి, పర్ణశాల ఆలయాల్లో ఈ నెల 30 నుంచి వసంత పక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు ఆలయ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. 30వ తేదీ ఉగాది రోజున రక్షాబంధనం, ఉత్సవాంగ స్నపనం, మృత్సంగ్రహణం, 31 ఏప్రిల్ 1 తేదీల్లో తిరువీధి సేవలు, 2న గరుడ పట లేఖనం, సార్వభౌమ వాహన సేవ, 4న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, భేరీ పూజ, బలిహరణం, హనుమద్వాహన సేవ, 5 సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం జరగనున్నాయి. 6న శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, 7న మహాపట్టాభిషేకం, 8న సదస్యం, హంసవాహన సేవ, 9న తెప్పోత్సవం, చోరోత్సవం, అశ్వవాహన సేవ, 10న ఊంజల్ సేవ, సింహవాహన సేవ, 11న వసంతోత్సవం, ఉదయం సూర్యప్రభ వాహన సేవ, రాత్రి గజవాహన సేవ, 12న చక్రతీర్థం, పూర్ణాహుతి, శేషవాహన సేవ, ధ్వజావరోహణం, పుష్పయాగంలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఈఓ రమాదేవి వెల్లడించారు. కాగా, పర్ణశాలలో ఈ నెల 14న ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా కల్యాణ తలంబ్రాలు కలపడంతో పాటు పసుపు దంచే వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్చార్జ్ అనిల్‌కుమార్ తెలిపారు. పెద్దమ్మతల్లి ఆలయ హుండీల లెక్కింపు137 రోజులకు రూ.41.23 లక్షల ఆదాయం పాల్వంచరూరల్ : మండల పరిధిలోని పెద్దమ్మతల్లి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను సోమవారం దేవాదాయ శాఖ కొత్తగూడెం డివిజన్ పరిశీలకులు పి.భేల్‌సింగ్, ఈఓ ఎన్.రజనీకుమారి పర్యవేక్షణలో లెక్కించారు. 137 రోజులకు గాను రూ.41,23,907 లభించాయని, ఈ నగదుతో పాటు వివిధ విదేశీ కరెన్సీ, మిశ్రమ వెండి, బంగారం లభించాయని ఈఓ వివరించారు. కార్యక్రమంలో కరూర్ వైశ్యా బ్యాంక్ మేనేజర్ మధుసూదన్, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.డాక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో వైద్యుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ రవిబాబు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. భద్రాచలం, మణుగూరు, ఇల్లెందు, అశ్వారావుపేటలోని ఏరియా ఆస్పత్రులు, పాల్వంచ సీహెచ్‌సీలో గైనకాలజిస్ట్, పిల్లల వైద్య నిపుణులు, జనరల్ ఫిజీషియన్, జనరల్ సర్జరీ, మత్తు, రేడియాలజీ, నేత్ర వైద్య నిపుణులు, ఆసక్తి గల ఇతర నిష్ణాతులైన వైద్య నిపుణులను కాంట్రాక్టు పద్ధతిన నియమిస్తామని వివరించారు. గైనకాలజిస్ట్, రేడియాలజిస్ట్, వైద్య నిపుణులకు రూ.2 లక్షలు, మత్తు, జనరల్ ఫిజీషియన్, పిల్లల వైద్య నిపుణులకు రూ.1.50 లక్షలు, ఇతర వైద్య నిపుణులకు రూ.లక్ష వేతనం ఇస్తామని పేర్కొన్నారు. -
సమస్యలు సత్వరమే పరిష్కరించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజావాణిలో వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన ప్రజల నుంచి అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్‌తో కలిసి వినతులు స్వీకరించారు. పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఎండార్స్ చేశారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్ని.. ● లక్ష్మీదేవిపల్లి మండలం రేగళ్ల గ్రామానికి చెందిన రైతు వనపర్తి వీరభద్రం.. తనకు 68 ఏళ్లు వచ్చింనదున వ్యవసాయం చేయలేకపోతున్నానని, వృద్ధాప్య పింఛన్ ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేయగా డీఆర్డీఓకు ఎండార్స్ చేశారు. ● సీతారామ ప్రాజెక్టు కింద నష్టపోయిన తమ భూములకు పరిహారంగా ప్రభుత్వం ఇచ్చిన సొమ్మును గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు, బ్యాంకు సిబ్బంది కలిసి తమకు మాయమాటలు చెప్పి సంతకాలు చేయించుకుని, ఆ డబ్బును వారి ఖాతాల్లో వేసుకున్నారని అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామ రైతులు ఫిర్యాదు చేశారు. తమకు పోడుభూములు ఇప్పిస్తామని, భూముల్లో బోర్లు వేయిస్తామని నమ్మించారని, వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని చేసిన దరఖాస్తు చేయగా ఎస్పీకి ఎండార్స్ చేశారు. ● పాల్వంచ నవభారత్ గాంధీనగర్‌లో మున్సిపల్ రోడ్డు, డ్రైనేజీపై ఉన్న స్థలంలో నలుగురు వ్యక్తులు చట్టవిరుద్ధంగా గోడ కట్టారని, దానిని తొలగించి రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీని నిర్మించాలని శ్రావణబోయిన మల్లీశ్వరి చేసిన దరఖాస్తును పాల్వంచ మున్సిపల్ కమిషనర్‌కు ఎండార్స్ చేశారు. ఉద్యోగులు సమయపాలన పాటించాలి కలెక్టరేట్లో వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు సకాలంలో విధులకు హాజరు కావాలని, లేకుంటే చర్య తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. ఉదయం 10.30 – 10.45 వరకు విధులకు రాకుంటే గైర్హాజరుగా పరిగణిస్తామని, అవసరమైతే షోకాజ్ నోటీసు ఇస్తామని స్పష్టం చేశారు. ఏఐతో బోధన సులభం.. బూర్గంపాడు: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో విద్యాబోధన సులభమని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. అంజనాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో ఏఐ విద్యాబోధనను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు, సులువుగా అర్థమయ్యేందుకు ఏఐ సహకరిస్తుందన్నారు. విద్యార్థులు ఏఐ క్లాసులను వినియోగించుకోవాలన్నారు. బూర్గంపాడు మండలంలో అంజనాపురం, మోరంపల్లిబంజర, బూర్గంపాడు–2, నాగినేనిప్రోలు, గాంధీనగర్ ప్రాథమిక పాఠశాలల్లో ఏఐ తరగతులను ప్రారంభించామని తెలిపారు. అనంతరం బూర్గంపాడు గురుకుల బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం భోజనం అందుతోందా అని ఆరా తీశారు. పాఠశాలలో అవసరమైన వసతులపై నివేదిక ఇవ్వాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఎంపీ బంజరలో నూతన కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓ యదుసింహరాజు, డీటీ రామ్‌నరేష్ పాల్గొన్నారు. ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
ప్రభుత్వ పథకాలు గిరిజనుల దరి చేరాలి
భద్రాచలం: ప్రభుత్వ సంక్షేమ పథకాలు గిరిజనుల చెంతకు చేర్చేలా అధికారులు కృషి చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన వినతులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ.. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించాలని సూచించారు. అర్హతల మేరకు వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దరఖాస్తుల రిపోర్టును తనకు ఎప్పటికప్పుడు అందజేయాలన్నారు. కెరీర్ గైడెన్స్ అమలుపై అభినందనలు.. రాష్ట్రంలోని అన్ని ఐటీడీఏల పరిధిలోని గిరిజన విద్యా సంస్థల్లో పీఓ రాహుల్ ప్రారంభించిన కెరీర్‌గైడెన్స్ అమలు చేయడంపై అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. అనంతరం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా అధికారులు, సిబ్బందితో పీఓ కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. గిరిజన సంస్కృతి ప్రతిబింబించాలి.. గిరిజన మ్యూజియంలో చిత్రాలు, కళాకృతుల ద్వారా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాలని పీఓ అన్నారు. గిరిజన మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన బీచ్ వాలీబాల్, బాక్స్ క్రికెట్ గ్రౌండ్, బోటింగ్ కు ఏర్పాటు చేస్తున్న చెరువు పనులను పది రోజుల్లో పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. గిరిజనుల ఆరాధ్య దైవాల చరిత్ర, దేవతల ప్రతిమలు, సమ్మక్క సారక్క గద్దెలు డిజైన్ చేయించి అమర్చాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఎస్డీసీ రవీంద్రనాథ్, ఏఓ సున్నం రాంబాబు, ఈఈ చంద్రశేఖర్, గురుకులం ఆర్సీఓ నాగార్జున రావు, ఆర్ఓఎఫ్ఆర్ డీటీ లక్ష్మీనారాయణ, ఏపీఓ వేణు, వ్యవసాయ శాఖ ఏడీ భాస్కరన్, అధికారులు మనిధర్, ఉదయ్‌కుమార్, ప్రభాకర్‌రావు, గోపాల్‌రావు, నవ్య, ఆదినారాయణ, నారాయణరావు, జయరాజ్, మ్యూజియం ఇన్చార్జ్ వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించాలి భద్రాచలంటౌన్: డిగ్రీ విద్యార్థులకు నాణ్యమైన బోధనతో పాటు వృత్తి శిక్షణ తరగతులు నిర్వహించాలని పీఓ రాహుల్ అన్నారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ (అటామస్) కళాశాల ప్రచార కరపత్రాలను సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కళాశాల వివరాలతో పాటు సౌకర్యాలు, సాధించిన విజయాలు, కళాశాల ప్రాముఖ్యతను వివరించేలా కరపత్రాలను తీర్చిదిద్దారని అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జాన్ మిల్టన్, అధ్యాపకులు పాల్గొన్నారు. -
పామాయిల్ క్షేత్రంలో పరిశీలన
దమ్మపేట : పామాయిల్ నర్సరీ డివిజనల్ ఇన్చార్జ్ మేనేజర్ నాయుడు రాధాకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ జగ్గారం శివారులోని రైతు చెలికాని సూరిబాబు పామాయిల్ క్షేత్రాన్ని సోమవారం సందర్శించారు. ‘ఆఫ్‌టైప్ మొక్కల నరికివేత’శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి ఆయిల్ ఫెడ్ అధికారులు స్పందించారు. దిగుబడి రాకపోవడంతో నరికివేసిన ఆఫ్టైపు మొక్కలను పరిశీలించారు. ఆఫ్‌టైప్, నాణ్యతలేని గెలలు వస్తున్న మొక్కల వివరాలు, సాగు చేస్తున్న విధానంపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొద్దినెలల వరకు మొక్కలను నరకొద్దని అధికారులు సూచించగా.. నాణ్యతలేని మొక్కలకు ఏమైనా భరోసా ఇవ్వగలరా అని రైతు ప్రశ్నించాడు. కానీ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. నష్టపరిహారం కోసం బాఽధిత రైతు నుంచి దరఖాస్తు మాత్రం స్వీకరించారు. పరిహారం కోసం బాధిత రైతు నుంచి దరఖాస్తు స్వీకరించిన అధికారులు -
మారితే.. మనం ఎటు?!
అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల పునర్విభజనపై పార్టీల్లో చర్చ ● చివరిగా 2008లో స్థానాల పునర్విభజన ● అప్పుడు తొమ్మిది నుంచి 10కి పెరిగిన అసెంబ్లీ సీట్లు ● రిజర్వేషన్లలోనూ మార్పులు ● ఈసారి పెంపు, రిజర్వేషన్లపై సర్వత్రా ఉత్కంఠఅసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన అంశం ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో జరిగిన పునర్విభజనతో నియోజకవర్గాల రూపురేఖలు, రిజర్వేషన్లు మారిపోయాయి. కొన్ని స్థానాలు జనరల్ నుంచి రిజర్వ్‌లోకి, రిజర్వ్డ్గా ఉన్న స్థానాలు కొన్ని జనరల్‌కు మారాయి. అలాగే, తొమ్మిదిగా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పదికి చేరింది. ఇక వచ్చే సాధారణ ఎన్నికల సమయానికి పునర్విభజన చేపట్టేలా కేంద్రప్రభుత్వం కసరత్తు చేస్తోందనే ప్రచారంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉంటుందోనని రాజకీయ విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. అయితే, 2026 తర్వాత జనాభా లెక్కల అనంతరమే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని చట్ట సవరణ చేయగా.. ఇప్పడు ఈ ప్రక్రియపై ఎందుకు కసరత్తు జరుగుతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంరెండుగా ఖమ్మం.. ఈసారి చేపట్టనున్న డీలిమిటేషన్ విధి విధానాలు ఇప్పటివరకై తే బయటకు రాలేదు. ఒక్కో నియోజకవర్గానికి ఎంత మంది జనాభాను పరిగణనలోకి తీసుకుంటారో తేలాల్సి ఉంది. అయితే, డీ లిమిటేషన్ చేపడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతాయనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఖమ్మంతో పాటు భద్రాద్రి జిల్లాలో 2001 జనాభా లెక్కలతో పోలిస్తే ఇప్పుడు పెరిగింది. గత పునర్విభజన సమయాన కొత్తగా అశ్వారావుపేట నియోజకవర్గం ఏర్పడింది. ప్రస్తుత జనాభాను పరిశీలిస్తే ఈసారి పునర్విభజనలో ఒక్క నియోజకవర్గమైనా పెరుగుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గం జనాభా పరంగా రెట్టింపు అయినందున ఈ నియోజకవర్గం రెండుగా ఏర్పడే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది.ఇప్పుడే ఎందుకు? పెరుగుతున్న జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడుతుంటారు. తద్వారా నియోజకవర్గాల సంఖ్య పెరగడమే కాక సరిహద్దులు మారుతుంటాయి. ఇందుకోసం తొలిసారిగా 1963లో డీ లిమిటేషన్ కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిషన్ పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి నియోజకవర్గాల సరిహద్దులు, రిజర్వేషన్లు నిర్ణయిస్తుంది. చివరిసారి 2008లో 2001 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేపట్టారు. ఆ సమయంలోనే 84వ చట్ట సవరణ ద్వారా 2026 తర్వాత జరిగే మొదటి జనాభా లెక్కల ఆధారంగా మరోమారు పునర్విభజన చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యాన ఇప్పుడు పునర్విభజనకు సిద్ధం కావడాన్ని కొన్ని పార్టీలు తప్పుపడుతున్నాయి. మారిన రిజర్వేషన్లు.. 2008లో చేపట్టిన డీలిమిటేషన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నియోజకవర్గాల పరిధి, రిజర్వేషన్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. తద్వారా కొందరు నేతలకు ఇబ్బంది ఎదురుకాగా, మరికొందరికి కలిసొచ్చింది. అప్పటి వరకు తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా.. కొత్తగా అశ్వారావుపేట ఏర్పాటైంది. ఇందులో అశ్వారావుపేట, దమ్మపేట, చండ్రుగొండ, ములకలపల్లి, కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు చేరాయి. రాష్ట్ర విభజన తర్వాత కుక్కునూరు, వేలేరుపాడు ఏపీలోకి వెళ్లగా.. ఇక్కడ కొత్తగా అన్నపురెడ్డిపల్లి మండలం చేరింది. ఇక బూర్గంపాడు నియోజకవర్గం రద్దయి ఆ స్థానంలో పినపాక చేరింది. అంతేకాక జనరల్ నియోజకవర్గమైన సుజాతనగర్ రద్దు కాగా.. ఆ స్థానంలో ఎస్టీ రిజర్వ్డ్గా వైరా నియోజకవర్గం ఏర్పడింది. అలాగే సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలు జనరల్ నుంచి ఎస్సీ రిజర్వ్‌కు, ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న పాలేరు జనరల్ కేటగిరీలోకి వచ్చింది. ఈ క్రమంలో జనరల్ కేటగిరీలో కొత్తగూడెం, ఖమ్మం, పాలేరు మాత్రమే మిగిలాయి. ఏం చేద్దాం.. ఎలా వెళ్దాం నియోజకవర్గాల పునర్విభజన చర్చ మొదలవడంపై రాజకీయ పార్టీల నాయకులు దృష్టి సారించారు. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే తమకు బలమైన ఓటు బ్యాంక్ ఉన్న మండలాలు ఇతర నియోజకవర్గంలో కలిసే అవకాశం ఉందా అన్న అంశంపై ఆరా తీస్తున్నారు. అయితే నియోజకవర్గానికి ఎంత జనాభా ఉండాలనే అంశంపై స్పష్టత రాకపోవడంతో ఇంకొందరు వేచిచూసే ధోరణి అవలంబిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకు గాను మూడు జనరల్‌గా ఉన్నాయి. ఈసారి పునర్విభజనపై పూర్తి వివరాలు వెల్లడి కాకపోవడంతో రిజర్వ్ స్థానాలు తగ్గుతాయా, పెరుగుతాయా.. రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయా, స్థానాల సంఖ్య పెరుగుతుందా అన్న అంశంపై అయోమయం నెలకొంది. కాగా, గత పునర్విభజన సమయాన కీలక నేతలు కొందరు సిట్టింగ్ స్థానాలు వదిలి ఇతరచోట్ల నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. సుజాతనగర్ నుంచి రాంరెడ్డి వెంకటరెడ్డి పాలేరుకు వెళ్లగా, పాలేరులో పోటీ చేసి పలుమార్లు గెలిచిన సంభాని చంద్రశేఖర్, ఒకసారి గెలిచిన సండ్ర వెంకటవీరయ్య సత్తుపల్లికి, సత్తుపల్లి నుంచి తుమ్మల నాగేశ్వరరావు సైతం తమ కార్యక్షేత్రాన్ని మార్చా రు. ఈసారీ ఇలాంటి పరిస్థితులే ఏర్పడతాయా అన్న అనుమానాలు నేతల్లో వ్యక్తమవుతున్నాయి. -
తొమ్మిది నిమిషాలు లేట్..
ఇంటర్మీడియట్ పరీక్షకు అనుమతించని అధికారులు పాల్వంచరూరల్: నిర్దేశించిన సమయం కంటే తొమ్మిది నిమిషాలు ఆలస్యంగా వచ్చిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని సోమవారం అధికారులు పరీక్షకు అనుమతించలేదు. వేడుకున్నా అధికారులు కనికరించకపోవడంతో రోదిస్తూ వెనుదిరిగింది. మండల పరిధిలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ పరీక్ష రాసేందుకు చర్లకు చెందిన జి.సుభాషిణి సోమవారం ఉదయం 9 గంటల 9 నిమిషాలకు చేరుకుంది. పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తులసిని అర్ధగంటసేపు వేడుకున్నా కనికరించలేదు. సమయం మించిపోయిందని లోపలకు రానివ్వకుండా గేటు వద్దే నిలిపివేశారు. విషయం జిల్లా నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లినా అనుమతి ఇవ్వలేమని తెలిపారు. దీంతో విద్యార్థిని కన్నీరు పెట్టుకుని వెనుదిరిగి వెళ్లిపోయింది. కాగా సోమవారం నిర్వహించిన సెకండియర్ ఇంగ్లిష్ పరీక్షకు పాల్వంచలోని నాలుగు కేంద్రాల్లో 969 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 24మంది గైర్హాజరయ్యారు. 945 మంది హాజరయ్యారు. -
క్రీడాసామర్థ్యం లేని విద్యార్థుల తొలగింపు
పాల్వంచరూరల్: జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేలా క్రీడాపాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే, నెలల తరబడి శిక్షణ ఇచ్చినా తగిన స్థాయిలో సామర్థ్యం కనబర్చని వారిని తొలగించాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం ఐటీడీఏ పర్యవేక్షణలో పాల్వంచ మండలం కిన్నెరసానిలో గిరిజన బాలురు, గుండాల మండలం కాచనపల్లిలో గిరిజన బాలికలకు క్రీడాపాఠశాలలు ఏర్పాటు చేశారు. బ్యాటరీ టెస్ట్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులు 240మంది చొప్పున చదువుతుండగా ఉదయం, సాయంత్రం కోచ్‌ల ద్వారా వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. అయితే కొందరు క్రీడల్లో ఆశించిన స్థాయిలో ప్రతిభ చాటడం లేదు. దీంతో కిన్నెరసాని పాఠశాల నుంచి 15మంది, కాచనపల్లి పాఠశాల నుంచి 18మంది కలిపి 33మందిని వచ్చే ఏడాది స్కూల్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈవిషయమై ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్‌రావును వివరణ కోరగా.. అనారోగ్యం తదితర కారణంగా క్రీడల్లో రాణించలేని విద్యార్థులను తొలగించి, ఇతర పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. కిన్నెరసాని, కాచనపల్లి క్రీడాపాఠశాలల్లో 33మంది -
ఆఖరులో ఆగమాగం!
● గడువు చివరలో నిధులు కేటాయింపు ● ఉపాధి హామీలో 974 పనులు మంజూరు ● సీసీ రోడ్లకు రూ.49.98 కోట్ల మేర నిధులు చుంచుపల్లి: గ్రామీణ ప్రాంతాల్లో మట్టి రోడ్లను సీసీ రహదారులుగా మార్చడానికి ఉపాధి హామీ పథకంలో కేంద్రప్రభుత్వం జిల్లాకు భారీగా నిధులు కేటా యించింది. ఈ నిధులతో పల్లెల్లో సీసీరోడ్లు నిర్మిస్తుండగా ఈ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేలా పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు ముందుకు సాగుతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లో భారీగా పనులు మంజూరు చేస్తుండగా ఈ సంవత్సరం కూడా జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.49.98 కోట్లు మంజూరయ్యాయి. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పనుల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నిధులు కేటాయించారు. 974 సీసీ రోడ్లు మంజూరు.. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 974 సీసీ రోడ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటికోసం రూ.49.98 కోట్లు నిధులు కేటాయించింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో 143 పనులకు రూ.11.60 కోట్లు, కొత్తగూడెంలో 165 పనులకు రూ.6.74 కోట్లు, ఇల్లెందులో 136 పనులకు రూ.7.54 కోట్లు, భద్రాచలంలో 193 పనులకు రూ.8.44 కోట్లు, పినపాక నియోజకవర్గంలో 316 పనులకు రూ.14.15 కోట్లు, వైరా నియోజకవర్గంలోని జూలూరుపాడు మండలంలో 21 పనులకు రూ.1.11 కోట్ల చొప్పున కేటాయించారు. ఈనెల 31తో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా ఆ లోపే పనులన్నీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే నిధులు వెనక్కు వెళ్లిపోతాయి. దీంతో పలుచోట్ల అధికారులు ఆగమేఘాల మీద పనులు చేపడుతున్నారు. అయితే హడావిడిగా చేపడుతున్న సీసీ రోడ్ల పనుల్లో నాణ్యత, పర్యవేక్షణ లోపిస్తోందని గ్రామస్తులు అంటున్నారు. పలు చోట్ల సిమెంట్ తక్కువగా పోయడం, అక్కడక్కడా నాణ్యత లేని ఇసుక ఉపయోగిస్తుండడం, క్యూరింగ్ సక్రమంగా చేయకపోవడం వంటి లోపాలు కనిపిస్తున్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం అనంతరం కనీసం 28 రోజుల పాటు క్యూరింగ్ చేయాల్సి ఉండగా చాలాచోట్ల వరి గడ్డి వేసి వారం రోజుల పాటు నీటి తడితో ముగిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం ఎండలు ముదురుతుండడంతో సీసీ రోడ్లకు రోజూ క్రమం తప్పకుండా క్యూరింగ్ చేయాలి. లేకపోతే రోడ్డు నాణ్యతపై ప్రభావం చూపుతుందని స్థానికులు అంటున్నారు. ఇదిలా ఉండగా ప్రతీ సారి ఈజీఎస్‌లో చేపడుతున్న సీసీ రోడ్ల బిల్లుల కోసం కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధులు నెలల కొద్దీ ఎదురుచూడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆర్థిక సంవత్సరం చివరలో మంజూరవుతున్న పనులను ఆగమేఘాల మీద చేపట్టి పూర్తి చేస్తున్నా వీరికి సకాలంలో డబ్బులు అందక ఇబ్బందులు పడుతున్నారు. పలువురు బయట నుంచి అప్పులు తెచ్చి మరీ సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ నెలాఖరు నాటికి పూర్తి చేస్తాం జిల్లాలో 974 సీసీ రోడ్లు మంజూరయ్యాయి. ఆయా పనుల్లో జాప్యం చేయకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశాం. జిల్లాలో ఇప్పటికే చాలా వరకు పనులను మొదలుపెట్టాం. మిగిలిన పనులను సైతం రెండు, మూడు రోజుల్లో చేపట్టి గడువులోగా పూర్తి చేస్తాం. నాణ్యతలో ఎలాంటి అవకతవకలు జరగకుండా పర్యవేక్షిస్తాం. – ఎస్.శ్రీనివాసరావు, పీఆర్ ఈఈ -
వన సంరక్షణే ధ్యాసగా..
అవార్డులతో రాములు● అటవీప్రాంత పరిరక్షణకు పాటుపడుతున్న అన్నపురెడ్డిపల్లివాసి ● పలు అవార్డులు పొందిన చెదురుపల్లి రాములు అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): ఓ సామాన్యుడు వన సంరక్షణకు పాటుపడుతున్నాడు. ప్రకృతి సంపద పరిరక్షణకు నిత్యం కృషి చేస్తున్నాడు. దాదాపు ఏడు వందల హెక్టార్లలో ఉన్న వనసంరక్షణ సమితి(వీఎస్ఎస్) అడవిలో ఒక్క ఎకరంలో కూడా పోడు నరకకుండా అడ్డకున్నాడు. అన్నపురెడ్డిపల్లి గ్రామానికి చెందిన, వీఎస్ఎస్ చైర్మన్ చెదురుపల్లి రాములు గౌడ్ అటవీ ప్రాంత సంరక్షణకు చేస్తున్న కృషిని గుర్తించి ప్రభుత్వాలు పలు అవార్డులు సైతం ఇచ్చాయి. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడుతోపాటు అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌క్లింటన్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్నాడు. శ్రీలంక దేశానికి చెందిన ప్రముఖ అధికారులు అన్నపురెడ్డిపల్లి వచ్చి అటవీ సంరక్షణకు ఇతని నుంచి సలహాలు తీసుకున్నారు. వీఎస్ఎస్ చైర్మన్ అయిన రాములు రోజూ కిలోమీటర్ల కొద్దీ కాలినడకనే తిరుగుతూ అటవీప్రాంతాన్ని పర్యవేక్షిస్తాడు. అటవీశాఖలో సామాన్య ఉద్యోగి నుంచి ఐఎఫ్ఎస్ అధికారి వరకు రాములును అన్నా అని సంబోధిస్తారు. 2002 నుంచి 2006 వరకు పలు అవార్డలు పొందిన రాములు ప్రస్తుతం 60 ఏళ్ల వయసులోనూ వన సంరక్షణకు కృషి చేస్తున్నాడు. ఎక్కువ సమయం అడవిలోనే.. చిన్ననాటి నుంచే నాకు అడవి అంటే ఇష్టం. 1996లో వనసంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాను. అప్పటి నుంచి 700 హెక్టార్లల అడవిని కాపాడుతున్నాను. మూడు దశాబ్దాల్లో ఎక్కువకాలం అడవిలోనే గడిపాను. ఉమ్మడి జిల్లాలో అప్పట్లో 300 వనసంరక్షణ కమిటీలను ఏర్పాటు చేయగా, ప్రస్తుం మా కమిటీ ఒక్కటే పనిచేస్తోంది. – రాములు, వీఎస్ఎస్ చైర్మన్, అన్నపురెడ్డిపల్లి -
ఎవరికి వారే.. వేసవి వ్యూహాలు
మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ (ఫైనల్ మిషన్)ను కేంద్ర బలగాలు చేపట్టాయి. ఈక్రమంలోనే బస్తర్ అడవుల్లో నెత్తురు ఏరులై పారింది. ఎదురుకాల్పుల్లో 300 మందికి పైగా మావోయిస్టులు చనిపోయారు. అయితే ప్రభుత్వ దళాల దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు మావోయిస్టులు (Maoists) ఎదురుదాడులకు సిద్ధమయ్యారని సమాచారం అందుతోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంవేసవి వ్యూహం..వేసవి (Summer) సమీపించడంతో ఆకులు రాలిపోయి అడవులు వెలవెలబోతాయి. దీంతో ప్రతి వేసవిని మావోయిస్టులు గడ్డుకాలంగానే పరిగణిస్తారు. అడవిలో చాటు తగ్గిపోవడంతో పాటు నీటి వనరుల లభ్యత పరిమితంగా ఉంటుంది. దీంతో అడవుల్లోకి పోలీసులు, భద్రతా దళాలు చొచ్చుకురాకుండా ‘ట్యాక్టిక్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్’ పేరుతో ముందుగానే ఎదురుదాడులకు దిగే వ్యూహాన్ని ఆ పార్టీ అమలు చేస్తోంది. కానీ పెరిగిన నిర్బంధం వల్ల ప్రస్తుతం బస్తర్ అడవుల్లో మావోయిస్టులు, వారి సానుభూతిపరులకు మధ్య సంబంధాలు గతంలో పోలిస్తే తగ్గిపోయాయి. సానుభూతిపరుల నుంచి అవసరమైన మేర సాయం అందే పరిస్థితి లేదు. ఈ లోటును పూడ్చుకునేందుకు తమ సాయుధ బలగాలనే ఏకం చేసి వ్యూహాత్మక దాడులు చేయాలనే ప్లాన్‌లో మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం.ఏకమవుతున్న దళాలు.. బస్తర్ అడవులు కేంద్రంగా కేంద్ర కమిటీతో పాటు వివిధ రాష్ట్రాలు, ఏరియా కమిటీలు పనిచేస్తున్నాయి. ఈ కమిటీలకు రక్షణగా పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన సాయుధులు రక్షణ కల్పిస్తున్నారు. దీనికి తోడు ప్రతి కమిటీకి సాయుధ దళాలు ఉంటాయి. వేసవి ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వ భద్రతా బలగాలను ఎదుర్కోవాలంటే దళాలు వేర్వేరుగా కాకుండా కలిసికట్టుగా దాడులు చేయాలనే వ్యూహానికి మావోలు పదును పెడుతున్నట్టు సమాచారం. ఈ మేరకు దండకారణ్యం, అబూజ్మడ్ అడవుల్లో తమకు పట్టున్న ప్రాంతానికి వివిధ దళాలు చేరుకున్నట్టు తెలుస్తోంది.సురక్షితంగా ఎంట్రీ–ఎగ్జిట్.. ఒకప్పుడు రెడ్ కారిడార్ అంటే నేపాల్ నుంచి దక్షిణ భారతదేశం వరకు ఉండేది. ప్రస్తుతం బస్తర్ అడవులు మాత్రమే మిగిలాయి. ఇందులోనూ చాలా ప్రాంతం భద్రతా దళాల అధీనంలోకి వెళ్లింది. అయినప్పటికీ దక్షిణ బస్తర్, ఏవోబీ, ఛత్తీస్‌గఢ్ – మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఇప్పటికీ మావోల గుప్పిట్లోనే ఉన్నాయి. దీంతో తమకు పట్టు ఉన్న ప్రాంతానికి చేరుకుంటున్న దళాలు... ఆయా ప్రాంతాల నుంచి ఎంట్రీ, ఎగ్జిట్, రిట్రీవ్ రూట్లు సేఫ్‌గా ఉండేలా ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. తమ స్థావరాల సమీపంలోకి భద్రతా దళాలు వస్తే భీకరంగా ఎదురుదాడి చేయాలని మావోయిస్టులు లక్ష్యంగా పెట్టుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. జవాన్ల జోరు తగ్గిందా? ఈ ఏడాది ఆరంభంలో జనవరి 16, 21, ఫిబ్రవరి 9న భారీ ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఘటనల్లో 80 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సైతం ప్రాణాలు కోల్పోయారు. కానీ గడిచిన నెలరోజులుగా భారీ ఎన్కౌంటర్లు ఎక్కడా జరగలేదు. నక్సలైట్ల వేసవి వ్యూహాలను పసిగట్టడం వల్లనే గడిచిన నెల రోజులుగా గాలింపు చర్యలను భద్రతా దళాలు ఆచితూచి చేపడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దూకుడుగా అడవుల్లోకి వెళ్లి మావోయిస్టుల వలలో చిక్కితే భారీగా ప్రాణనష్టం జరగడంతో పాటు జవాన్ల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్లే కూంబింగ్‌కు సమాంతరంగా బేస్ క్యాంపులను సుస్థిరం చేయడం, కొత్తగా అధీనంలోకి వచ్చిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై భద్రతా దళాలు ఫోకస్ చేస్తున్నాయి. కవ్వింపు చర్యలు తీవ్ర నిర్బంధం కొనసాగుతున్నప్పటికీ మార్చి 6న దంతేవాడ జిల్లా కేంద్రానికి 40 కి.మీ. దూరంలో బస్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించారు. విప్లవ ద్రోహులుగా పేర్కొంటూ అక్కడ కొన్ని కుటుంబాలను ఊరు వదిలి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. గాలింపు చర్యల్లో భద్రతా దళాల దూకుడు తగ్గడంతో వారిని రెచ్చగొట్టి అడవుల్లోకి రప్పించేందుకే మావోయిస్టులు ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రి స్వాధీనందుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా చింతల్నార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గోమ్గూడ క్యాంపు బలగాలు ఆదివారం మావోయిస్టుల ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. గోమ్గూడ క్యాంపు నుంచి డీఆర్జీ, కోబ్రా, 241 బెటాలియన్, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో గోమ్గూడ క్యాంపు పరిధిలోని జాలేర్గూడ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు స్పైక్(పదునైన కడ్డీలు)లను ఏర్పాటు చేశారు. వాటిని తొలగించుకుంటూ గాలిస్తుండగా.. మావోయిస్టులకు చెందిన ప్రింటింగ్ స్థావరం బయటపడింది. అక్కడ మావోయిస్టులు దాచిపెట్టిన ప్రింటర్లు, ఇన్వర్టర్ యంత్రాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మావోయిస్టులకు లొంగుబాటే శరణ్యమా? -
అభివృద్ధిలో ముందుంచుతాం
సాక్షిప్రతినిధి, ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధికి కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికలతో ముందుకుపోతోందని, ఉమ్మడి జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుపుతామని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రాభివృద్ధిపై ఆదివారం ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీలు రేణుకాచౌదరి, పోరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాంరెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిని దృష్టిలో పెట్టుకొని జిల్లాలో తాగు, సాగునీరు, విద్యుత్ సరఫరా వంటి అంశాలను కూలంకషంగా చర్చించినట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా నిలబెట్టేందుకు అనుసరించాల్సిన ప్రణాళికలపై విస్తృతంగా చర్చించామన్నారు. జిల్లాలో అత్యవసర అభివృద్ధి పనులకు మినరల్ ఫండ్, జిల్లా అభివృద్ధి నిధులు, జిల్లా ఇన్చార్జ్ మంత్రి నిధులను వినియోగించుకోవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. హ్యామ్ రోడ్ల మంజూరులో ఉమ్మడి జిల్లాకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేస్తామని అన్నారు. సమావేశంలో పినపాక, భద్రాచలం, వైరా, సత్తుపల్లి, అశ్వారావుపేట, ఇల్లెందు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావ్, మాలోత్ రాందాస్ నాయక్, మట్టా రాగమయి, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య పాల్గొన్నారు. అత్యవసర పనులకు మినరల్, జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఫండ్ వినియోగించుకోండి ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి హాజరైన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, ఎంపీలు, ఎమ్మెల్యేలు -
‘తాయిలం’ అందేనా ?
● ఏటా రామాలయంపైనే ఉత్సవాల భారం ● నిర్వహణ ఖర్చులకు హుండీ ఆదాయమే మార్గం ● ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపులు భద్రాచలం: భద్రగిరి రామయ్యకు సర్కారు తాయిలం అందడం లేదు. ప్రతీ ఏడాది ఉత్సవాల సమయంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నా నిరుత్సాహమే మిగులుతోంది. దేవస్థానంలో జరిగే ప్రధాన ఉత్సవాల నిర్వహణ వ్యయం తలకు మించిన భారం అవుతుండడంతో అధికారులు తల పట్టుకుంటున్నారు. చివరికి భక్తులు సమర్పించే హుండీ ఆదాయమే దిక్కుగా మారడంతో ఆ నిధులనే ఉత్సవాల నిర్వహణకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో ఆలయ అభివృద్ధి కుంటుపడుతోందని ఇటు భక్తులు, అటు అధికారులు ఆవేదన చెందుతున్నారు. నవమి వ్యయం రూ.2 కోట్లకు పైగానే.. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే ఉత్సవాల్లో ముక్కోటి, శ్రీరామనవమి ముఖ్యమైనవి. వీటితో పాటు భక్తరామదాసు జయంతి ఉత్సవాలనూ ఘనంగా నిర్వహిస్తారు. అయితే వీటిలో ముక్కోటి సందర్భంగా తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం, శ్రీరామనవమి వేడుకలకు భక్తులు భారీగా హాజరవుతుంటారు. ఆ సమయాల్లో విధులు నిర్వహించే సిబ్బంది సైతం వందల సంఖ్యలో ఉంటారు. కాగా, ఈ ఉత్సవాల నిర్వహణకు అధిక మొత్తంలో ఖర్చవుతుంది. వస్తువుల ధరలు, వివిధ విభాగాల కార్మికుల జీతభత్యాలు పెరుగుతుండగా ఏటేటా నిర్వహణ వ్యయం సైతం పెరుగుతోంది. గతంలో రూ. కోటి – కోటిన్నర మధ్యలో ఖర్చు కాగా, ఈ ఏడాది రూ.రెండు కోట్లకు పైగానే అవసరమని అధికారులు అంటున్నారు. వీటిలో ఉత్సవ నిర్వహణ పనులకు రూ.కోటిన్నర, క్రతువు నిర్వహణ, తలంబ్రాలు, పట్టువస్త్రాలు, ఇతర ఖర్చులకు మరో కోటి వరకు ఖర్చవుతుందని అనధికారికంగా చెబుతున్నారు. ముక్కోటికి సైతం రూ.కోటిన్నర వరకు వ్యయం అవుతున్నట్లు అంచనా. కాంగ్రెస్ సర్కారైనా.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దేవస్థానంలో ఉత్సవాల నిర్వహణకు ఒక్క పైసా విదల్చలేదు. ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామన్న హామీని సైతం విస్మరించింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారైనా నిధులు ఇవ్వకపోతుందా అని భక్తులు కోటి ఆశలు పెట్టుకున్నారు. గతేడాది శ్రీరామనవమి ఉత్సవాలకు నిధులు కేటాయిస్తుందని భావించినా విడుదల చేయలేదు. ఈ ఏడాదైనా రామయ్యపై కరుణ చూపేనా అని భక్తులు, అధికారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గత ఏడాది ఎన్నికల కోడ్ కారణంగా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి హాజరు కాలేదు. ఈ ఏడాది హాజరు కావడంతో పాటు ఆలయ అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశం ఉందని పలువురు ఆశిస్తున్నారు. తక్షణమే సాయం అందించాలి భక్తుల ఆదాయం భక్తులకే చెందాలి. ఉత్సవాల నిర్వహణ పేరుతో పక్కదారి పట్టించడం సరైంది కాదు. హుండీ ఆదాయాన్ని భక్తుల వసతుల కల్పనకు కేటాయించాలి. ఆలయంలో జరిగే ఉత్సవాల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి. వీటికి అయ్యే ప్రతి పైసా ప్రభుత్వమే భరించాలి. – బూసిరెడ్డి శంకర్ రెడ్డి, భద్రాద్రి పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఖర్చులకు కానుకలే దిక్కు.. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి వేడుకలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అయితే ప్రభుత్వం నుంచి అందే సాయం మాత్రం రూ.15వేలు మాత్రమే. అది కూడా పేపర్లపై లెక్కలు చూపడం మాత్రమే. అంతకుమించి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి వచ్చేది లేదు. నవమి వేడుకలకు సాయం అందించాలని అటు అధికారులు, ఇటు భక్తులు ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఫలితం లేదు. రెండేళ్లకోసారి జరిగే మేడారం జాతరకు అందించే స్థాయిలో కాకున్నా భక్తుల మనోభావాలను గౌరవించి ఉత్సవాల నిర్వహణకు ఎంతో కొంత అందించాలని పలువురు కోరుతున్నారు. కాగా హుండీల ద్వారా భక్తులు సమర్పించే కానుకలనే ఉత్సవాల నిర్వహణకు వెచ్చిస్తున్నారు. గతం కంటే ఆదాయం పెరిగినా ఆలయ అఽభివృద్ధికి, భక్తులకు మరింతగా వసతుల కల్పనకు వెచ్చించాల్సిన నిధులను ఉత్సవాల కోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. భద్రాచలంలో భక్తులకు వసతి కష్టాలు నిత్యం ఎదురవుతుంటాయి. ఆలయానికి వచ్చే ఆదాయంతో రంగనాయకుల గుట్ట మీద, కింద దేవస్థానం భూముల్లో డార్మెటరీ, 100 గదుల వసతి గృహాలను నిర్మిస్తే ఈ సమస్య తీరే అవకాశం ఉంటుంది. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపరం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి అర్చకులు ఆదివారం విశేష పూజలు చేశారు. జిల్లా నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు.. పసుపు, కుంకుమ, చీరలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. నేడు హుండీ లెక్కింపు.. పెద్దమ్మతల్లి అమ్మవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను సోమవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు. -
రామయ్యను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
● పెద్దమ్మతల్లి ఆలయంలో పూజలు ● కొత్తగూడెం కోర్టులో వెయిటింగ్ హాల్ ప్రారంభం భద్రాచలంఅర్బన్/పాల్వంచరూరల్/కొత్తగూడెంటౌన్ : భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా ఆదివారం దర్శించుకున్నారు. ఆమెకు ఈఓ రమాదేవి స్వాగతం పలకగా వైదిక పెద్దలు ఆశీర్వచనం అందజేశారు. ప్రధాన ఆలయంతో పాటు ఆంజనేయస్వామి, లక్ష్మీతయారమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. అనంతరం జస్టిస్ నందా భద్రాచలం జ్యుడీషియల్ కోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఆ తర్వాత బార్ అసోసియేషన్ సభ్యులు సన్మానించి రాముల వారి ప్రతిమ అందజేశారు. అనంతరం జస్టిస్ నందా పెద్దమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా ఈఓ రజనీకుమారి జడ్జికి అమ్మవారి శేషవస్త్ర ప్రసాదాలు అందజేశారు. కొత్తగూడెం కోర్టులో.. కొత్తగూడెం కోర్టులో నిర్మించిన వెయిటింగ్ హాల్‌ను న్యాయమూర్తి సూరేపల్లి నందా ఆదివారం ప్రారంభించారు. ఆమెకు జిల్లా జడ్జి పాటిల్ వసంత్, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నందా మాట్లాడుతూ.. న్యాయ సేవలను అందుబాటులోకి తేవడంలో, లీగల్ ఆవేర్నేస్ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టడంలో న్యాయవాదులు కీలకపాత్ర పోషిస్తున్నారని అభినందించారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి శివనాయక్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి బత్తుల రామారావు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సాయిశ్రీ, మణుగూరు, దమ్మపేట జూనియర్ సివిల్ జడ్జీలు కె. సూరిరెడ్డి, బి.భవానీ, ఎస్పీ రోహిత్‌రాజు, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, భద్రాచలం, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట దేవదానం, లక్కినేని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సమానత్వం కోసం ఉద్యమించాలి
భద్రాచలంఅర్బన్: మహిళలంతా సామాజిక, రాజకీయ, ఆర్థిక సమానత్వంపై ఉద్యమించాలని, మహిళలపై జరుగుతున్న హింసను తిప్పికొట్టాలని ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ పిలుపునిచ్చారు. పీఓడబ్ల్యూ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఆదివారం భద్రాచలంలోని గిరిజన అభ్యుదయ భవన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సు పీఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు కప్పల సూర్యకాంతం అధ్యక్షతన నిర్వహించారు. అందే మంగ మాట్లాడుతూ.. నాడు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం మొత్తం దెబ్బతిని పరిశ్రమలకు పనికి వెళ్లిన వారిని శ్రమదోపిడీ చేసి విశ్రాంతి తీసుకుంటే కూడా వేతనం కట్ చేసి ఇచ్చేవారని, ఈ దోపిడీ నుంచి పుట్టిన పోరాట ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని పేర్కొన్నారు. సభలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు, భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీశ్ తదితరులు పాల్గొన్నారు. -
ఐలయ్య ఆదర్శప్రాయుడు
సుజాతనగర్: అమరజీవి కాసాని ఐలయ్య ఆదర్శప్రాయుడని, ఆయనను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు జాన్‌వెస్లీ, కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సుజాతనగర్లో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో వారు మాట్లాడారు. కొత్తగూడెం ప్రాంతంలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో కాసాని ఐలయ్య అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఐలయ్య స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాసాని ఐలయ్య అలుపెరుగని పోరాటాలు సాగించారని గుర్తు చేశారు. సభలో పలువురు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు. 15 నుంచి చర్లలో అంతర్రాష్ట క్రికెట్ టోర్నీ చర్ల: ఈ నెల 15 నుంచి మండలంలో నక్కిబోయిన శ్రీనివాసరావు జ్ఞాపకార్థం అంతర్రాష్ట క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు చర్ల యూత్ ఒక ప్రకటనలో తెలిపింది. చర్ల (రాళ్లగూడెం)లోని రాళ్లగూడెం క్రీడా మైదానంలో నిర్వహించే పోటీలకు 13వ తేదీ వరకు ఎంట్రీలు నమోదు చేస్తామని, మొదటి బహుమతి రూ.60,116, రెండో బహుమతి రూ.40,116, మూడో బహుమతి రూ.20,116, నాలుగో బహుమతి రూ.10,116 నగదుతో పాటు మెమెంటోలను ఇవ్వనున్నట్లు యూత్ బాధ్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 88975 29795, 96664 03331, 79972 57068 నంబర్లలో సంప్రదించాలని కోరారు. గాయనికి అవార్డు మణుగూరురూరల్: హనుమకొండలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మణుగూరు మండలానికి చెందిన గాయని పూజారి జ్యోతికి విస్డం చారిటబుల్ ట్రస్ట్.. ఉమెన్ ఐకాన్–2025 అవార్డు అందించింది. జ్యోతికి అవార్డు రావడంపై తోటి గాయకులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు. దద్దరిల్లుతున్న బాంబుల మోత ఆరెంపుల వాసుల ఆందోళన.. ఖమ్మంరూరల్: మండలంలోని ఆరెంపుల శివారు ఇరవై ఎకరాల భూమిలో కొందరు అనుమతి లేకుండా పేలుళ్లకు పాల్పడుతున్నారు. జనావాసాల నడుమ.. రాత్రింబవళ్లు బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో బండలను పేలుస్తుండగా రాళ్లు ఎగిరి పడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బండరాళ్లను పేల్చడానికి తోడు భూమిని చదును చేసేందుకు ఇప్పటికే వందకు పైగా తాటిచెట్లను నేలమట్టం చేయగా తాము జీవనాధారం కోల్పోతున్నామని గీతకార్మికులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, ఎకై ్సజ్ అధికారులు అటువైపు కన్నెతి కూడా చూడకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమంగా బ్లాస్టింగ్ చేసి, తాటిచెట్లను నరికి వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంపై రూరల్ సీఐ రాజును వివరణ కోరగా.. బ్లాస్టింగ్‌కు సంబంధించి ఎవరూ అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎవరైనా బ్లాస్టింగ్‌కు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మనువాదం ప్రజలను పీడిస్తోంది
● ప్రజా పోరాటాల్లో పెద్దన్న రవన్న ● వర్ధంతి సభలో వీపీవీ నేత పట్నాయక్ ఖమ్మంమయూరిసెంటర్ : దేశంలో మనువాదం, మార్కెట్ భావజాలం అనే కవల పిల్లలు ప్రజలను పీడిస్తున్నాయని, దీనికి వ్యతిరేకంగా ప్రజలు సమరశీల పోరాటాలు నిర్వహించాలని విద్యా పరిరక్షణ వేదిక జాతీయ నాయకులు రమేష్ పట్నాయక్ పిలుపునిచ్చారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ (ఎంఎల్ )మాస్‌లైన్–రవన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రాయల సుభాస్ చంద్రబోస్ (రవన్న) 9వ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ.. దేశ సంపదను లూటీ చేసేలా కార్పొరేట్ శక్తులకు పాలకులు సేవ చేస్తున్నారని అన్నారు. పేదలను మరింత బలహీనంగా మారుస్తూ సోమరిపోతులుగా చూస్తున్నారని విమర్శించారు. నిత్యావసరాల ధరలు మండుతున్నాయని, కోట్లాది కుటుంబాలు పేదరికంలో కూరుకుపోతుంటే కార్పొరేట్ వర్గాల వారు శత కోటీశ్వరులుగా మారుతున్నారని అన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం విద్యుత్, సాగు, తాగునీరు, సేవా రంగం, సంక్షేమ పథకాలు ఇవన్నీ ప్రజలకు అందించాల్సిన బాధ్యత పాలకవర్గాలపై ఉందన్నారు. ప్రముఖ సంపాదకులు సతీష్ చందర్ మాట్లాడుతూ సమాజంలో అన్ని రంగాలను పెట్టుబడిదారీ వ్యవస్థ నియంత్రిస్తోందన్నారు. మనువాద చాందస భావాలకు వ్యతిరేకంగా సమష్టిగా ఉద్యమించాలని కోరారు. సీపీఐ(ఎంఎల్) మాస్‌లైన్ నాయకులు కేజీ రామచందర్ మాట్లాడుతూ రవన్న అతివాద, అవకాశవాదాలకు వ్యతిరేకంగా అంతర్గత పోరటం చేసి విప్లవోద్యమాన్ని సరైన దిశలో నడిపారని అన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, నాయకులు కెచ్చల రంగయ్య, గుర్రం అచ్చయ్య, కె.రమ, గోకినపల్లి వెంకటేశ్వర్లు, చండ్ర అరుణ, ముద్ద భిక్షం, పుసులూరి నరేందర్, చిన్న చంద్రన్న, హన్మేశ్, ఎస్ఎల్ పద్మ, ఆవుల వెంకటేశ్వర్లు, సి.వై.పుల్లయ్య జి.రామయ్య, మనోహర్ రాజు, కల్పన, ఆవుల అశోక్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్ముదామా.. ఆగుదామా?!
మిర్చికి ఆశించిన ధర లేక సందిగ్ధంలో రైతులు ● నిల్వ చేయడానికే ఎక్కువ మంది మొగ్గు.. వ్యాపారులదీ అదే దారి ● విదేశీ ఆర్డర్లతో ధర పెరుగుతుందని ఆశలు ● నిండిపోతున్న కోల్డ్ స్టోరేజీలు ఖమ్మంవ్యవసాయం: ఆశించిన ధర రాకపోవడంతో మిర్చి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రతికూల పరిస్థితుల్లో సాగు చేసినా ఆశించిన దిగుబడి రాక.. వచ్చిన పంటకూ సరైన ధర దక్కక ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ధర లేకపోవడంతో ఎక్కువ మంది నిల్వ చేయాలని భావిస్తున్నారు. మరోవైపు రైతుల నుంచి కొనుగోలు చేసిన వ్యాపారులు సైతం ఇదే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ కోల్డ్ స్టోరేజీ వద్ద చూసినా మిర్చి బస్తాలతో వచ్చిన వాహనాలు బారులుదీరి కనిపిస్తున్నాయి. ఏడాదిలో ఎంత తేడా.. గతేడాది సీజన్లో క్వింటా మిర్చికి రూ.20 వేల నుంచి రూ.23వేల వరకు ధర పలకగా.. ఈ ఏడాది అందుకు భిన్నమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గత సంవత్సరం కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికి 2024 అక్టోబర్‌లో రూ.19 వేలు, నవంబర్‌లో రూ. 18వేల ధర పలకగా.. ఈ ఏడాదిసాగు చేసిన మిర్చికి రూ.17వేల వరకు ధర పలికింది. అయితే ఆ తర్వాత ధర పతనం అవుతుండగా తొలి కోతలు కావడంతో మైలకాయకు ధర తక్కువ ఉండడం సహజమమేనని భావించారు. కానీ రోజురోజుకూ ధర మరింత పతనం కాసాగింది. కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసిన మిర్చికీ ధర పడిపోయింది. డిసెంబర్లో నిల్వ మిర్చి క్వింటా ధర రూ.16 వేలకు, కొత్త మిర్చి ధర రూ.15,500కు, జనవరిలో నిల్వమిర్చి ధర రూ. 14,500కు, కొత్త మిర్చి ధర రూ.15 వేలకు పడిపోయింది. ఇక ఫిబ్రవరిలో రెండో కోతగా నాణ్యమైన మిర్చి వచ్చినా ధరలో పురోగతి లేకవడంతో రైతులకు ఆవేదనే మిగిలింది. ఫిబ్రవరిలో గరిష్టంగా రూ.14వేలు, మోడల్ ధర రూ.13,500గా పలికింది. కోల్డ్ స్టోరేజీల బాట.. మిర్చికి ప్రస్తుతం ఆశించిన ధర లేకపోగా.. మున్ముందు గిట్టుబాటు ధర వస్తుందనే ఆశతో రైతులు నిల్వకు ప్రాధాన్యత ఇస్తున్నారు. జిల్లాలో 2,17,360 మెట్రిక్ టన్నుల మిర్చి నిల్వచేసే సామర్థ్యం కలిగిన 48 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఫిబ్రవరి ఆరంభం నుంచే ధర ఆశాజనకంగా లేదని రైతులు పంట నిల్వ చేస్తుండగా, వ్యాపారులు భవిష్యత్‌పై అంచనాలతో నిల్వ పెడుతున్నారు. జిల్లాకు తోడు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట, నల్లగొండ జిల్లాల రైతులు కూడా ఖమ్మం బాట పడుతుండడంతో ఇక్కడ కోల్డ్ స్టోరేజీలన్నీ నిండిపోతున్నాయని తెలుస్తోంది. అన్ సీజన్‌పై ఆశలు ఈ ప్రాంతంలో పండించే ‘తేజా’ రకం మిర్చికి చైనా సహా పలు దేశాల్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో అక్కడి ఆర్డర్ల ఆధారంగా ఎగుమతిదారులు కొనుగోలు చేయడంతో గత ఏడాది మంచి ధర పలికింది. కానీ ఈ ఏడాది ఆ పరిస్థితి లేక ధరలో పురోగతి లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యాన అన్ సీజన్లో గతేడాది మాదిరిగా రూ.20 వేలు – రూ.23 వేల ధర వస్తుందనే ఆశతో అటు రైతులకు తోడు ఇటు వ్యాపారులు సైతం పంట నిల్వ చేస్తున్నారు.పెట్టుబడులు కూడా రావని... జనవరిలో 50 బస్తాల మిర్చి క్వింటాకు రూ.13,200 చొప్పున విక్రయించా. రెండో కోత పంటకు ధర పెరుగుతుందనుకున్నా ప్రయోజనం లేదు. ఇప్పుడు అమ్మితే పెట్టుబడి కూడా దక్కదని 42 బస్తాలు నిల్వ చేస్తున్నా. – బానోత్ మట్టా, గోవింద్రాల, కామేపల్లి మండలం జూన్ తర్వాత ఆలోచిస్తా... ప్రస్తుత ధర పెట్టుబడులను పూడ్చే స్థితిలో లేదు. గత ఏడాది మిర్చి రూ. 20 వేలకు విక్రయిస్తే ఈసారి రూ.14 వేలే వచ్చింది. జూన్, జూలై తరువాత ధర పెరుగుతుందనే ఆశ ఉంది. అప్పటివరకు చూసి అమ్ముతా. – చిరసవాడ రాజు, ఎదుళ్లచెరువు, తిరుమలాయపాలెం మండలం -
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
అశ్వాపురం: మండలంలో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. పల్లె ప్రకృతి వనంలో ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేపట్టారు. రామాలయంతో పాటు అంతర్భాగంలో ఆంజనేయస్వామి, శివాలయం, విఘ్నేశ్వరస్వామి ఉపాలయాల్లో విగ్రహాలు, నవగ్రహాల విగ్రహాలు ప్రతిష్ఠించారు. రామనామస్మరణతో మొండికుంట మారుమోగింది. సీఐ అశోక్‌రెడ్డి, ఎస్ఐలు తిరుపతిరావు, రవూఫ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల వద్ద భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. భక్తరామదాసు మునిమనమడు కంచర్ల శ్రీనివాసరావు, భద్రాచలం రామాలయం ఈఓ రమాదేవి, మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి దంపతులు, డీసీసీబీ డైరెక్టర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
మహిళా ఉత్పత్తులకు హైదరాబాద్‌లో విశేష ఆదరణ
కొత్తగూడెం అర్బన్/చుంచుపల్లి: కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆలోచన మేరకు, ‘ఎక్స్ ప్లోర్ భద్రాద్రి కొత్తగూడెం’కార్యక్రమంలో భాగంగా ఆదివారం హైదరాబాద్ మాదాపూర్‌లోని నాలెడ్జి సిటీలో ఓ ఆర్గనైజేషన్ నిర్వహించిన ‘రన్ ఫర్ హర్’అనే కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మహిళలు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో 10 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 3 కిలోమీటర్ల రన్ నిర్వహించగా సుమారు 1,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి మహిళలు స్వయంగా తయారు చేసిన కరక్కాయ టీపౌడర్, తేనే, ఫ్లేవర్ తేనే, విప్పపూలు, విప్పనూనె, మిల్లెట్స్‌తో తయారు చేసిన మిల్లెట్ బిస్కెట్స్, గిరి ప్రొడక్ట్స్ అయిన సబ్బులు, న్యూట్రిమిక్స్, డ్రైమిక్స్ వంటి వివిధ ఉత్పత్తులు ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లో ప్రదర్శించారు. ఈవెంట్లో పాల్గొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వైద్యులు, వివిధ రంగాల్లో ఉన్న మహిళలు కొనుగోలు చేశారు. కార్యక్రమంలో డీపీఎం నాగజ్యోతి, ఏపీఎం వెంకయ్య తదితరులు పాల్గొని మహిళల ఉత్పత్తులకు ప్రోత్సాహం అందించారు. -
సింగరేణిలో ముగిసిన పరీక్షలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో ఖాళీ పోస్టులకు ఇంటర్నల్ అభ్యర్థులతో నిర్వహించిన మూడు రకాల పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి. జూనియర్ మైనింగ్ ఆఫీసర్ (ఈ గ్రేడ్–1) 87 పోస్టులకు 21 మంది దరఖాస్తు చేసుకోగా 17 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఇక జూనియర్ ఆఫీసర్ (ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్) నాలుగు పోస్టులకు ఆరుగురు దరఖాస్తు చేసుకోగా ఐదుగురు, జూనియర్ సర్వే ఆఫీసర్ 64 పోస్టులకు 71 మంది దరఖాస్తు చేసుకుని 67 మంది పరీక్షకు హాజరయ్యారు. మొత్తం మూడు విభాగాల్లో 155 ఖాళీలకు 98 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా, అందులోనూ 89 మంది మాత్రమే పరీక్ష రాశారని సింగరేణి యాజమాన్యం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. స్థానిక సింగరేణి మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహించగా రిక్రూట్మెంట్ సెల్ జీఎం నికోలస్ పర్యవేక్షించారు. పరీక్ష ఫలితాలను ఆదివారం రాత్రికే సింగరేణి వెబ్‌సైట్‌తో పాటు, సింగరేణి ప్రధాన కార్యాలయంలోని నోటీస్ బోర్డ్‌లో ప్రదర్శించినట్లు తెలిపారు. -
మున్నేటిలో పడి విద్యార్థి మృతి
ఖమ్మంరూరల్: మండలంలోని గోళ్లపాడు వద్ద మున్నేటిలో ప్రమాదవశాత్తు పడి విద్యార్థి ఎర్రం మహేశ్ (22) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం మొగళ్లపల్లి గ్రామానికి చెందిన మహేశ్ ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతూ.. గట్టయ్యసెంటర్‌లో స్నేహితులతో కలిసి అద్దెకుంటున్నాడు. కాగా, ఈ నెల 8న స్నేహితులతో కలిసి కాల్వ వద్దకు వెళ్లి అందులో పడి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అన్నం ఫౌండేషన్ చైర్మన్ అన్నం శ్రీనివాసరావు, సిబ్బంది సాయంతో మృతదేహాన్ని వెలికి తాశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజు తెలిపారు. చెట్టుకు ఢీకొన్న బైక్: ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం టేకులపల్లి: వేగంగా వచ్చిన బైక్ చెట్టును ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారిన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లి గ్రామానికి చెందిన జోగా వంశీ (22), పొడుగు ప్రవీణ్ బైక్‌పై టేకులపల్లి మండలంలో శుభకార్యానికి వచ్చారు. తిరుగు ప్రయాణంలో వేగంగా బైక్ నడుపుతూ తుమ్మలచెలక క్రాస్‌రోడ్ సమీపంలో అదుపుతప్పి చెట్టుని ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ స్థానికులు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వంశీ మృతిచెందాడు. ప్రవీణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ పట్టివేత చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి వద్ద ఎదుళ్లవాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా శనివారం రాత్రి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ శివరామకృష్ట ఆదివారం తెలిపారు. డ్రైవర్ అంచ రమేశ్, ట్రాక్టర్ యజమాని పి.రాధాకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మహిళ ఆత్మహత్యాయత్నం పాల్వంచరూరల్: కుటుంబ కలహాల కారణంగా ఓ మహిళ ఇంట్లో ఉన్న మాత్రలు అధికంగా మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన పాతసూరారంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పాత సూరారం గ్రామానికి చెందిన 28 ఏళ్ల మహిళ ఆదివారం ఇంట్లో గొడవల కారణంగా మాత్రలు అధికంగా మింగడంతో ఆపస్మారకస్థితికి చేరింది. కుటుంబ సభ్యులు పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతోంది. -
శ్రీనివాస గిరి కల్యాణ ప్రచార రథం ప్రారంభం
పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాస కాలనీ శ్రీనివాస గిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం(గుట్ట)పై మార్చి 24వ నుంచి 27 వరకు నిర్వహించే శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక కల్యాణ మహోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ చేపట్టిన ప్రచార రథాన్ని ఆదివారం కేటీపీఎస్ 7వ దశ సీఈ శ్రీనివాసబాబు, కొత్త వెంకటేశ్వర్లు, వైద్యులు బిక్కసాని సుధాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా భక్త సమాజ మండలి అధ్యక్షుడు ఆరుట్ల లక్ష్మణాచార్యులు మాట్లాడుతూ.. ప్రచార రథం ఉమ్మడి జిల్లా, చుట్టు పక్కల ప్రాంతాల్లో పర్యటించనుందన్నారు. కార్యక్రమంలో సునీల్‌కుమార్, ధర్మపురి రాము, ఊకె భద్రయ్య, కందుకూరి రామకృష్ణ, తాటికొండ శ్రీలత, వంకదారు నర్సింహకుమార్, మిట్టపల్లి నర్సింహారావు, కంఠాల వెంకటేశ్వరరావు, బండి వెంకటేశ్వర్లు, కిలారు పురుషోత్తం, మేదరమెట్ల శ్రీనివాసరావు, బండి నారాయణ, ఏటుకూరి నరేశ్, రమేశ్, రాంజీ, వెంకి, వెంకట సుబ్బయ్య, చనుమోలు శ్రీనివాసరావు, కనగాల శ్రీనివాసరావు, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన
కొత్తగూడెంటౌన్: జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. దాదాపు 4,997 కేసులకు పరిష్కారం లభించింది. కొత్తగూడెంలో సివిల్ కేసులు 11, క్రిమినల్ కేసులు 3,174, పీఎల్సీ కేసులు 310 కేసులు మొత్తం 3495 కేసులను పరిష్కరించారు. ఇల్లెందులో సివిల్ కేసులు 6, క్రిమినల్ కేసులు 278, పీఎల్సీ కేసులు 138 మొత్తం 422 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ అదాలత్‌లో కక్షిదారులు సమస్యలను పరిష్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో కుటుంబ కలహాలు పెరిగాయని, చిన్నచిన్న గొడవలు, క్షణికావేశంలో చేసిన నేరాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. రాజీమార్గమే రాజమార్గమని, రాజీ ద్వారా సమయం, డబ్బులను ఆదా చేసుకోవచ్చని చెప్పారు. కక్షిదారులకు యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్‌జడ్జి బత్తుల రామారావు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సాయిశ్రీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరావు, ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.ఆర్ రవిచంద్ర, మహ్మద్ సాధిక్‌పాషా, వి.పురుషోత్తమరావు, పి. నిరంజన్‌రావు పాల్గొన్నారు.జిల్లావ్యాప్తంగా 4,997 కేసుల పరిష్కారం -
బీఎస్ఎన్ఎల్.. ఏది సిగ్నల్..?
● దురదపాడులో నెలరోజులుగా పని చేయని వైనం ● టవర్ వద్ద గిరిజనుల నిరసన అశ్వారావుపేటరూరల్: అటవీ ప్రాంతాల్లోని గిరిజన పల్లెలకు సెల్‌ఫోన్ సేవలు అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మవోయిస్టు ప్రభావిత నిధులతో ఏర్పాటు చేసిన బీఎస్ఎన్ఎల్ టవర్లు నిరూపయోగంగా మారాయి. దీంతో స్థానికులు టవర్ వద్ద సెల్ఫోన్లతో నిరసన వ్యక్తం చేశారు. అశ్వారావుపేట మండలంలోని దిబ్బగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని దురదపాడు గిరిజన గ్రామంలో కొన్నేళ్ల కిందట మావోయిస్టు ప్రభావిత నిధులతో బీఎస్ఎన్ఎల్ టవర్ ఏర్పాటు చేశారు. దీని పరిధిలో నెల రోజులుగా సెల్‌ఫోన్ సిగ్నల్స్ రావడం లేదు. ఒకపక్క ప్రైవేట్ సెల్ కంపెనీలు పోటీలు పడి రోజురోజుకూ టెక్నాలజీ సాయంతో ఉత్తమ సేవలు అందిస్తుండగా, బీఎస్ఎన్ఎల్ అధికారులు మాత్రం మొద్దు నిద్ర పోతున్నారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. బీఎస్ఎన్ఎల్కు ఆదరణ తగ్గిపోతోందనే ప్రచారం ఎప్పటినుంచో ఉంది. కాగా, నెల రోజులుగా ఈ టవర్ పరిధిలో సిగ్నల్స్ అందకపోవడంతో ఫోన్, ఇంటర్నెట్ వినియోగదారులంతా అవస్థ పడుతున్నారు. టవర్ ఉండటంతో స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో బీఎస్ఎన్ఎల్ సిమ్‌లనే వాడుతున్నారు. సిగ్నల్స్ అందక గ్రామంలో ఉన్న టవర్ నిరుపయోగంగా మారందని వినియోగదారులు చెబుతున్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే (108 వాహనం, ఫైర్, డయల్ 100) సమాచారం ఇచ్చేందుకు దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. బీఎస్ఎన్ఎల్ అధికారులకు చెప్పేందుకు ప్రయత్నించగా వారు అందుబాటులో లేరని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కాగా, బీఎస్ఎన్ఎల్ ఎస్డీఈ హర్షవర్దన్‌రెడ్డికి వివరణ కోసం ఫోన్ చేయగా స్పందించలేదు. -
వీల్‌చైర్ క్రికెట్ క్రీడాకారులను అభినందించిన ఎంపీ
ఖమ్మంవన్‌టౌన్: నేషనల్ వీల్‌చైర్ క్రికెట్ టోర్నీ లో ప్రతిభ చాటిన జిల్లా క్రీడాకారులను ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి శనివారం అభినందించారు. జిల్లాకు చెందిన ఎస్.కే.సమీరుద్దీ న్, బండి రాము, సురేష్, రమావత్ కోటేశ్వర్, మహ్మద్ సమీ జట్టు విజయానికి తోడ్పడ్డారు. ఈ సందర్భంగా వారిని ఎంపీ ఖమ్మంలో సన్మానించగా మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారా యణ, పాపానాయక్ పాల్గొన్నారు. పార్లమెంట్లో గళం విప్పుతా.. ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ పనులకు నిధులు కేటాయించేలా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎంపీల సమావేశం జరగగా ఆయన మాట్లాడారు. కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటు, పాలేరు నియోజకవర్గం మీదుగా వెళ్లే రైల్వేలైన్ అలైన్మెంట్ మార్పు, బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు ఉమ్మడి జిల్లాలో జాతీయ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరనున్నట్లు తెలిపారు. కొండ గొర్రె మాంసం పట్టివేత గుండాల: వేటగాళ్లకు కొండ గొర్రె మాంసాన్ని పంచుకుంటుండగా పట్టుకొని కేసు నమోదు చేశామని అటవీశాఖాధికారులు శనివారం తెలిపారు. చింతలపాడు గ్రామానికి చెందిన ఇద్దరు చేపల వేటకు వెళ్లగా కుక్కలు ఓ కొండ గొర్రెను వేటాడాయి. ఆ మాంసాన్ని తెచ్చుకున్న ఇద్దరు అటవీ శాఖ అధికారులకు పట్టుబడ్డారు. జిల్లా అధికారుల ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించామని అటవీశాఖ అధికారులు నరసింహారావు, బాలాజీ తెలిపారు. -
ఈసారి మామిడి తింటామా?
చేతికొచ్చే పంట చేజారుతోంది.. ● ఏటా వెంటాడుతున్న తెగుళ్ల బెడద ● మాడిపోతున్న పూత, రాలుతున్న పిందెలు ● మామిడి దిగుబడిపై రైతుల్లో ఆందోళన ఇల్లెందురూరల్: వరుసగా ఆరేళ్లుగా దిగుబడి తగ్గి కుదేలైన మామిడి రైతుకు ఈ ఏడాది కూడా కాలం కలిసిరావడం లేదు. పూత, పిందె దశలో ఆశిస్తున్న చీడపీడలు రైతును కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ సారైనా కోలుకుందామనుకుంటే ఆలస్యంగా పూత రావడం, వచ్చిన పూతకు మస్సి పట్టేయడం, చిగురుగా మారడం, పిందెలు రాలిపోవడం.. వంటి కారణాలతో చేతికొచ్చే పంట చేజారుతోందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 53 వేల ఎకరాల్లో మామిడి సాగు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మామిడి 53 వేల ఎకరాల్లో సాగవుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 11 వేల ఎకరాల్లో, ఖమ్మం జిల్లాలో 42 వేల ఎకరాల్లో మామిడి పంటను సాగు చేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో అత్యధికంగా అన్నపురెడ్డిపల్లి, ముల్కలపల్లి, టేకులపల్లి, ఇల్లెందు, అశ్వారావుపేట మండలా ల్లో, ఖమ్మం జిల్లాలో ఎర్రుపాలెం, తల్లాడ, పెనుబల్లి, వేంసూరు, కల్లూరు, కామేపల్లి మండలాల్లో అత్యధిక విస్తీర్ణంలో మామిడి పంట సాగవుతోంది. ఆయా తోటల్లో అత్యధికంగా బంగినపల్లి, దశేరీ, కేసరి, హిమాయత్, రాయల్ స్పెషల్, తోతాపురి, చిన్నరసాలు, పెద్దరసాలు ప్రధానంగా కనిపిస్తాయి. పూత దశలోనే చీడపీడలు ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు పూత వచ్చి జనవరిలో అక్కడక్కడా కాయలు కాయడం మామిడి లక్షణం. ఈ ఏడాది మంచు ప్రభావంతో కొంత ఆలస్యంగా పూత వచ్చింది. వచ్చిన పూతకు తేనె మంచు పురుగు, బూడిద తెగులు ఆశించింది. ఇంతేకాకుండా ఆకుల నుంచి రసం కారడం ప్రారంభమైంది. దీనికితోడు పూత పెద్ద ఎత్తున రాలిపోయింది. మొదట ఒక చెట్టుకు సోకిన తెగులు మరునాడు దాని పక్కనే ఉన్న చెట్లకు ఇలా తోటంతా సోకిందని రైతులు చెబుతున్నారు. కొందరైతే అధికంగా తెగుళ్లు సోకిన కొమ్మలను తొలగిస్తూ ఉన్న కాస్త పంటనైనా దక్కిచుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఆశించిన ఫలితానివ్వలేదు. తెగుళ్ల ప్రభావంతో ప్రస్తుతం చెట్లపై పూత మాడిపోయి ఒట్టి కాడలే కనిపిస్తున్నాయి. ఆలస్యంగా వచ్చిన పూత చిగురుగా మారి రైతులను కలవరపాటుకు గురిచేస్తున్నాయి. వెంటాడుతున్న నష్టాలు వరుసగా ఆరేళ్లు మామిడి రైతులకు నష్టాలు తప్పడం లేదు. 2020లో భారీ వర్షాల కారణంగా పూత, పిందె పూర్తిగా రాలిపోయింది. 2021, 22లలో కాత కొంత ఆశాజనకంగా ఉన్నా కరోనా ప్రభావంతో విక్రయాలు సన్నగిల్లి ధరపై తీవ్ర ప్రభావం చూపింది. 2023లో పూత, కాత సంతృప్తిగా ఉండటంతో దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుకు కాయ పక్వానికి వచ్చే సమయంలో నల్లి రూపంలో తీవ్ర నష్టం వాటిల్లింది. గతేడాది పూత సంతృప్తికరంగా ఉన్నప్పటికీ వాతావరణం అనుకూలించలేదు. మంచు ప్రభావంతో పూత క్రమంగా చిగురుగా మారి దిగుబడిపై ప్రారంభంలోనే నీళ్లు చల్లింది. ఈ ఏడాది పూత దశ నుంచే చీడపీడలు ఆశించడం, పిందెలు రాలిపోవడంతో దిగుబడిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు, కరోనా తదితర కారణాలతో వరుసగా ఆరేళ్లుగా మామిడి రైతులు నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆందోళనలో కౌలుదారులు మామిడి రైతులు అత్యధికంగా పూత దశలోనే తోటలను కౌలుకు ఇస్తుంటారు. తోటలను పరిశీలించిన కౌలుదారులు ధర నిర్ణయించి రైతులకు ముందస్తుగా కొంత, పంట చేతికందని తరువాత మిగతా సొమ్ము చెల్లిస్తారు. ఈ ఏడాది కూడా రూ.లక్షలు కౌలు చెల్లించి మామిడి తోటలు తీసుకున్న కౌలుదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. కౌలు డబ్బు, ఎరువుల పెట్టుబడి, పురుగు మందుల పిచికారీ వారికి మరింత భారమవుతోంది. తోటల్లో చీడపీడల ప్రభావం అధికంగా ఉండటంతో నాలుగైదు సార్లు పురుగు మందు పిచికారీ చేసినా ఫలితం కనిపించక ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి భారమవుతోంది ఈ ఏడాది పూత దశలోనే చెట్లను తెనె మంచు, బూడిద, మస్సిరోగం ఆశించాయి. మంచు ప్రభావంతో చాలా చెట్లకు ఆలస్యంగా వచ్చిన పూత క్రమంగా చిగురుగా మారింది. పూతను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు తోటల్లో చీడపీడల నివారణకు పెట్టిన పెట్టుబడి భారంగా మారింది. – మంచె కృష్ణయ్య, మామిడి రైతు, కొమరారం, ఇల్లెందు మండలం వరుస నష్టాలు కుంగదీస్తున్నాయి ఆరేళ్లుగా మామిడి కలిసిరావడం లేదు. అతివృష్టి, అనావృష్టి, చీడపీడలు.. ఏదో ఒక రూపంలో వరుస నష్టాలు కుంగదీస్తున్నాయి. నివారణకు రూ.లక్షల్లో పెట్టుబడి పెట్టినా ఫలితం కనిపించడం లేదు. ఈ ఏడాది కూడా పిందెలు రాలిపోవడం, చీడపీల ఉధృతి వంటి కారణాలు దిగుబడిపై ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. –తోకల జానయ్య, మామిడి రైతు, కొమరారం, ఇల్లెందు మండలం -
భవిత కేంద్రాల అభివృద్ధికి నిధులు
పాల్వంచరూరల్: విద్యావనరుల కేంద్రాల(భవిత కేంద్రాలు) అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. విద్యావనరుల కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన 5 నుంచి 18 ఏళ్ల వయస్సు బాలబాలికలకు ఆటపాటలతో కూడిన బోధన కొనసాగుతోంది. ఇందులో విద్యాబుద్ధులు నేర్పిస్తూనే మాట్లాడడం, నడిపించడం తదితర 21 రకాల వైకల్యాలను అధిగమించేందుకు సమ్మిళిత విద్యా రిసోర్స్ పర్సన్లు(ఐఈఆర్‌పీఎస్) విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఈ కేంద్రాల్లో వసతుల కల్పన, అవసరైన పరికరాల కొనుగోలుకు గత పదేళ్లుగా నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం సొంత భవనాలు కలిగిన కేంద్రాలకు సామగ్రి కొనుగోలు, వసతుల కల్పన కోసం రూ.2లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు కేంద్రాలకు రూ.12లక్షలు, ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కామేపల్లి(కొత్తలింగాల), ఖమ్మం రూరల్, కొణిజర్ల, మధిర, పెనుబల్లి, సత్తుపల్లి కేంద్రాలకు రూ.16లక్షలు మంజూరయ్యాయి.ఉమ్మడి జిల్లాకు రూ.28 లక్షలు మంజూరు -
వివరాలు సేకరించిన నిపుణులు
ఆన్లైన్ విధానంలో మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భద్రాద్రి–కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసింది. ఈ క్రమంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా, విద్యాశాఖ కమిషనర్ నరసింహారెడ్డి, కలెక్టర్ జితేష్ వి.పాటిల్‌తో చర్చలు జరిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆన్లైన్ విభాగ నిపుణుడు ప్రశాంత్‌రెడ్డి గత గురువారం కొత్తగూడెంలో పర్యటించి కావాల్సిన సమాచారాన్ని సేకరించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి, కొత్తగూడెం ఎంఈఓ ప్రభుదయాల్ నుంచి పూర్తి వివరాలు సేకరించారు. నెల పూర్తికాగానే బిల్లులు జనరేట్ అవుతూ ఏకకాలంలో చెల్లింపులు జరిగేలా మార్పులు చేయనున్నారు. -
రామాలయానికి ఈ–స్కానర్లు బహూకరణ
భద్రాచలంఅర్బన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానానికి శనివారం ఎస్బీఐ రామాలయం శాఖ మూడు ఈ–కానుక స్కానర్లను బహూకరించింది. ఈ కార్యక్రమంలో భద్రాచలం దేవస్థానం ఏఈఓ శ్రావణ్ కుమార్, దేవస్థానం ఈఓ సీసీ శ్రీనివాసరెడ్డి, ఎస్బీఐ ఆర్ఎం సత్యనారాయణ, మేనేజర్ మధుసూదన్ శర్మ తదితరులు పాల్గొన్నారు. నాలుగు రోజుల్లో కుమార్తె వివాహం ● గుండెపోటుతో తండ్రి మృతి పాల్వంచరూరల్: మరో నాలుగు రోజుల్లో కుమార్తె వివాహం ఉండగానే అంతలోనే రైతు గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని మొండికట్ట గ్రామానికి చెందిన రైతు, సొసైటీ మాజీ డైరెక్టర్ చిల్లా వెంకన్న (50) శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి భార్య పుణమ్మ, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తె వివాహానికి సంబంధించిన శుభలేఖలు పంపిణీ చేసి, ఇంటికి వచ్చి రాత్రి ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. కొత్వాల శ్రీనివాసరావు, యర్రంశెట్టి ముత్తయ్య, రౌతు రామారావు, అంబేడ్కర్, మోహన్‌రావు తదితరులు వెంకన్న మృతదేహాన్ని సందర్శించారు. రేషన్ బియ్యం పట్టివేత టేకులపల్లి: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని శనివారం స్థానిక పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సురేశ్ కథనం ప్రకారం.. మండలానికి చెందిన భూక్య లాలు మండల కేంద్రంలోని బోడబజారు నుంచి బొలేరో వాహనంలో రేషన్ బియ్యం తరలిస్తున్నాడనే సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వాహనంలో 34.20 క్వింటాళ్ల బియ్యం ఉండటంతో వాటిని పౌరసరఫరాలశాఖ డీటీకి అప్పగించారు. భూక్య లాలు, డ్రైవర్ లచ్చిరాంపై కేసు నమోదు చేసి, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ వివరించారు. -
‘థర్డ్ డిగ్రీ’పై విచారణ చేపట్టాలి
● పోలీస్ స్టేషన్ వద్ద బాధితుడు, దళిత సంఘాల డిమాండ్ అశ్వారావుపేట: కోడి పుంజు చోరీ కేసులో తనపై థర్డ్ డిగ్రీ, కరెంట్ షాక్ ఇచ్చిన స్థానిక అదనపు ఎస్ఐ రామ్మూర్తిని తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని బాధితుడు, దళిత సంఘాల బాధ్యులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. మండలంలోని నారంవారిగూడేనికి చెందిన కలపాల నాగరాజుపై అదే గ్రామానికి చెందిన అప్పారావు కోడి పుంజు చోరీ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ నెల 1వ తేదీ రాత్రి నాగరాజును ఒప్పుకోవాలని స్థానిక అదనపు ఎస్ఐ రామ్మూర్తి థర్డ్ డిగ్రీ ప్రయోగించి, కరెంట్ షాక్ ఇచ్చినట్లు బాధితుడు ఆరోపించిన సంగతి తెలిసిందే. కాగా, శనివారం బాధితుడిని కుటుంబీకులు, దళిత సంఘాల నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి న్యాయం చేయాలని కోరారు. అలాగే, సీఐ కరుణాకర్‌ను కలిసి అదనపు ఎస్ఐపై లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుడు, దళిత సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు తగరం రాంబాబు మాట్లాడారు. కోడి పుంజు కేసు నెపంతో తీవ్రవాదిలా వ్యవహరించి థర్డ్ డిగ్రీకి పాల్పడి, చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు. దళితుడికి రక్షణ కల్పించాల్సిన పోలీసులు, ఇలాంటి దాష్టికానికి పాల్పడటం దారుణమని మండిపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర డీజీపీ, ఎస్పీ స్పందించి సమగ్ర విచారణ జరిపించాని డిమాండ్ చేశారు. చోరీ నిందితుడి అరెస్ట్ పాల్వంచ: పట్టణంలోని నవభారత్ ఎంప్లాయీస్ క్వార్టర్లలో దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం సీఐ సతీశ్ వివరాలు వెల్లడించారు. శనివారం పట్టణంలోని సీ–కాలనీ వద్ద అనుమానాస్పదంగా ఓ వ్యక్తి ఉన్నట్లు సమాచారం అందడంతో సీఐ సతీశ్, పట్టణ ఎస్ఐ సుమన్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు. నవభారత్ ఎంప్లాయీస్ క్వార్టర్లలో చోరీలకు పాల్పడిన, మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లా తండా పోలీస్ స్టేషన్ పరిధిలోని అనిల్ సింఘూర్గా గుర్తించారు. గత జనవరి 25న మరో ముగ్గురితో కలిసి నవభారత్ క్వార్టర్లలో చోరీలకు పాల్పడ్డాడని, అతని వద్ద నుంచి రూ.2 లక్షల నగదు, ఒక స్మార్ట్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని సీఐ పేర్కొన్నారు. పరారీలో ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఆయన వివరించారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి మరో నెలలో పెళ్లికి సిద్ధమవుతుండగా ఘటన కారేపల్లి: మండలంలోని సూర్యతండా గ్రామానికి చెందిన యువకుడు మహబూబా బాద్ జిల్లా బయ్యారం మండలం మిర్యాలపెంట సమీపాన శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యతండాకు చెంది న బానోతు కళ్యాణ్ (26), అజ్మీరా విజయ్ ద్విచక్రవాహనంపై శుక్రవారం గంగారం మండలం ఒట్టయిగూడెంలో తన స్నేహితుడి పెళ్లికి వెళ్లి రాత్రి తిరిగి వస్తున్నారు. ఈక్రమాన మిర్యాలపెంట వద్ద బైక్ అదుపు తప్పి వాహనం నడుపుతున్న కల్యాణ్‌కు రోడ్డుపక్కన ఉన్న చెట్టు దుంగ బలంగా తాకడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. విజయ్ స్వల్పగాయంతో బయటపడ్డాడు. దీంతో స్థాని కులు వీరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే కళ్యాణ్ మృతి చెందా డు. పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని సూర్యతండాకు శనివారం తీసుకొచ్చారు. కాగా, కళ్యాణ్‌కు రెండు నెలల క్రితమే వివాహం నిశ్చయమైంది. హోలీ పండుగ తర్వాత ముహూర్తం పెట్టుకోవాలని భావిస్తుండగానే ఆయన మృతి చెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. -
ఇక ఆన్లైన్ చెల్లింపులు!
● మధ్యాహ్న భోజన బిల్లుల్లో జాప్యం లేకుండా చర్యలు ● భద్రాద్రితోపాటు పెద్దపల్లి జిల్లా పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక ● పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన సాంకేతిక నిపుణులు ● ఎండీఎం కార్మికుల సమస్యలకు చెక్ పెట్టేలా ప్రభుత్వ కసరత్తు కొత్తగూడెంఅర్బన్: మధ్యాహ్న భోజన పథకం(ఎండీఎం) కార్మికులు అప్పుల్లో కూరుకుపోతున్నారు. వేతనాలు, బిల్లులు ప్రతి నెలా విడుదల కాకపోవడంతో అవస్థ పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టింది. ఆన్లైన్ బిల్లులు చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది. గత ఫిబ్రవరిలో జిల్లాలో కొత్తగూడెం మండలంలోని పాఠశాలల్లో కార్మికుల వేతనాలు, బిల్లుల పెండింగ్ తదితర అంశాలపై కలెక్టర్ జితేష్ వి.పాటిల్, డీఈఓ, ఎంఈఓతో చర్చించారు. విద్యార్థుల ఫేస్ రికగ్నేషన్‌ను మరింత అభివృద్ధి పరిచి కార్మికులకు వేతనాలు, బిల్లులు చెల్లిస్తే జాప్యం ఉండదని కలెక్టర్ నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా పరిశీలించి ఆమోదించింది. ట్రెజరీ ద్వారా బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ఆలస్యమవుతోందని, నేరుగా ఆన్లైన్ నుంచే బిల్లులు చెల్లించే అవకాశాలను పరిశీలిస్తున్నామని, ఇందుకు యాప్ రూపొందిస్తున్నామని ఇటీవల రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం, పెద్దపల్లి జిల్లాల్లో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసుకుని, నెల రోజులపాటు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన బిల్లులను ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్ బిల్లులతో ఎదురుచూపులకు చెక్ పడే అవకాశం ఉంటుందని మధ్యాహ్న భోజన కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. 2,150 మంది కార్మికులు జిల్లాలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు 2,150 మంది ఉన్నారు. వీరందరికీ ఒకేసారి బిల్లులు మంజూరు కావడం లేదు. జిల్లాలోని 23 మండలాలు ఉండగా, అన్నీ మండలాలకు ఒకేసారి బిల్లులు రావడం లేదు. మూడు, నాలుగు నెలలకోసారి పది మండలాలకు వస్తే, రెండో దఫా, మూడో దఫాలో మిగతా మండలాలకు బిల్లులు మంజూరవుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేయడంతో ఇక్కడి ఎండీఎం కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా బిల్లుల చెల్లింపు ప్రక్రియ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. -
భవిత కేంద్రాల అభివృద్ధికి నిధులు
పాల్వంచరూరల్: విద్యావనరుల కేంద్రాల(భవిత కేంద్రాలు) అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. విద్యావనరుల కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన 5 నుంచి 18 ఏళ్ల వయస్సు బాలబాలికలకు ఆటపాటలతో కూడిన బోధన కొనసాగుతోంది. ఇందులో విద్యాబుద్ధులు నేర్పిస్తూనే మాట్లాడడం, నడిపించడం తదితర 21 రకాల వైకల్యాలను అధిగమించేందుకు సమ్మిళిత విద్యా రిసోర్స్ పర్సన్లు(ఐఈఆర్‌పీఎస్) విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఈ కేంద్రాల్లో వసతుల కల్పన, అవసరైన పరికరాల కొనుగోలుకు గత పదేళ్లుగా నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం సొంత భవనాలు కలిగిన కేంద్రాలకు సామగ్రి కొనుగోలు, వసతుల కల్పన కోసం రూ.2లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు కేంద్రాలకు రూ.12లక్షలు, ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కామేపల్లి(కొత్తలింగాల), ఖమ్మం రూరల్, కొణిజర్ల, మధిర, పెనుబల్లి, సత్తుపల్లి కేంద్రాలకు రూ.16లక్షలు మంజూరయ్యాయి.ఉమ్మడి జిల్లాకు రూ.28 లక్షలు మంజూరు -
రామయ్యకు సువర్ణ తులసీ అర్చన
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో స్వామివారి మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన పూజలు చేశారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. రామాలయానికి రూ.5,02,116 విరాళంఅశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి మిట్టకంటి రామిరెడ్డి–చంద్రకళ దంపతుల కూతురు, అల్లుడు సామ శ్రీ హర్షిత–శ్రీకాంత్‌రెడ్డి శని వారం రూ.5,02,116 విరాళం అందజేశారు. ఖండాలు దాటినా పుట్టిన ఊరుపై మమకారంతో భారీ విరాళం అందజేసిన హర్షిత–శ్రీకాంత్‌రెడ్డి దంపతులను గ్రామస్తులు అభినందించారు. మిట్టకంటి రామిరెడ్డి ఉపాధ్యాయుడిగా గ్రామంలో ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పారని పేర్కొన్నారు. బూర్గంపాడు మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, రామకొండారెడ్డి దంపతులు రూ. 10 వేలు, ఎస్కేటీ గ్రూప్ అధినేత దోసపాటి పిచ్చేశ్వరరావు రూ.25,116 విరాళం అందజేశారు. ‘పర్ణశాల’ ముఖద్వారానికి ఇత్తడి తొడుగుదుమ్ముగూడెం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల శ్రీ సీతారామ చంద్రస్వామివారి ఆలయ ము ఖ ద్వారానికి హైదరాబాద్ వాసి మహాలక్ష్మి ఇత్తడి కవచం వితరణ చేశారు. సుమా రు రూ.3 లక్షల వ్యయంతో ముఖ మండప ద్వారం, తలుపులతో సహా ఇత్తడి తొడుగు చేయించారు. ఈ తొడుగులను హైదరాబాద్‌కు చెందిన రాఘవ తయారుచేశారు. ఈఓ రమాదేవి, అనిల్‌కుమార్ పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో మంత్రి తుమ్మలదమ్మపేట : మండల పరిధిలోని అప్పారావుపేట గ్రామ శివారులో ఉన్న సొంత వ్యవసాయ క్షేత్రాన్ని శనివారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. క్షేత్రంలో సాగు చేస్తున్న క్యాబేజీ, కాలీఫ్లవర్, టమాట, సొరకాయ తదితర పంటలను పరిశీలించి కోయించారు. తుమ్మలతోపాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు కాసాని నాగప్రసాద్, తుమ్మల శేషుబాబు, ఎర్రా వసంతరావు తదితరులు ఉన్నారు. రేపటి నుంచి రెండో విడత టెండర్లు● తొలివిడతలో తునికాకు సేకరణకు రెండు యూనిట్లలోనే ఖరారు పాల్వంచరూరల్ : ఈ నెల 10, 11 తేదీల్లో రెండో విడత తునికాకు టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈసారి తునికాకు టెండర్ల ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడంలేదు. ఏజెన్సీలో ఏటా రెండు నెలలపాటు గిరిజనులు, గిరిజనేతరులకు ఉపాధి కల్పించే తునికాకు సేకరణకు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆన్లైన్లో టెండర్లు నిర్వహిస్తోంది. ఈ సీజన్లో మొదటి విడతగా గత నెల 27, 28 తేదీల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. జిల్లాలోని ఆరు డివిజన్ల పరిధిలో 59 యూనిట్లు ఉండగా, కేవలం చర్ల, దుమ్ముగూడెం రేంజ్‌లోని రెండు యూనిట్లలో మాత్రమే తునికాకు సేకరణకు టెండర్లు ఖరారయ్యాయని డీఎఫ్ఓ జి.కృష్ణాగౌడ్ తెలిపారు. ఇంకా 57 యూనిట్లకు టెండర్లు ఖరారు కావాల్సి ఉండగా, రేపటి నుంచి రెండో విడత, ఈ నెల 20, 21 తేదీల్లో మూడో విడత టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలి
దుమ్ముగూడెం: మహిళల సమానత్వం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం మండలంలోని బొజ్జిగుప్ప ఎకో టూరిజం స్పాట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతీయ సమాజంలో మహిళకు సముచిత స్థానం ఉందని పేర్కొన్నారు. టీచర్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్, పైలట్‌గా రాణిస్తున్న ఆమె ఇంటిని కూడా చక్కదిద్దుతోందని అన్నారు. బొజ్జుగుప్ప గిరిజనులు చాలా కష్టజీవులని, టూరిజం స్పాట్ ఏర్పాటుకు ఎంతో శ్రమించి ముందుకు వచ్చారని అభినందించారు. కరక్కాయలు, ఇప్పపూల ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురోగమించేలా చేయడమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత కలెక్టర్, ఎమ్మెల్యే కూడా మహిళలను సన్మానించి, గిరిజన మహిళలు తయారుచేసిన రాగిజావ తాగారు. పర్ణశాలలో షాపుల క్రమబద్ధీకరణ.. పర్ణశాలలో షాపుల క్రమబద్ధీకరణ చేపడతామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శనివారం భద్రాచలం ఎమ్మెల్యేతో కలిసి పర్ణశాలలో పర్యటించి మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, సీఐ అశోక్, ఎంపీడీఓ రామకృష్ణ, ఆలయ ఇన్చార్జ్ అనిల్‌కుమార్, ఆర్ఐ కల్లూరి వెంకటేశ్వరరావు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు. మహిళా దినోత్సవంలో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన
కొత్తగూడెంటౌన్: జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. దాదాపు 4,997 కేసులకు పరిష్కారం లభించింది. కొత్తగూడెంలో సివిల్ కేసులు 11, క్రిమినల్ కేసులు 3,174, పీఎల్సీ కేసులు 310 కేసులు మొత్తం 3495 కేసులను పరిష్కరించారు. ఇల్లెందులో సివిల్ కేసులు 6, క్రిమినల్ కేసులు 278, పీఎల్సీ కేసులు 138 మొత్తం 422 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మాట్లాడుతూ అదాలత్‌లో కక్షిదారులు సమస్యలను పరిష్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడంతో కుటుంబ కలహాలు పెరిగాయని, చిన్నచిన్న గొడవలు, క్షణికావేశంలో చేసిన నేరాలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు. రాజీమార్గమే రాజమార్గమని, రాజీ ద్వారా సమయం, డబ్బులను ఆదా చేసుకోవచ్చని చెప్పారు. కక్షిదారులకు యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. భానుమతి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్‌జడ్జి బత్తుల రామారావు, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సాయిశ్రీ, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు తోట మల్లేశ్వరావు, ప్రధాన కార్యదర్శి ఎం.ఎస్.ఆర్ రవిచంద్ర, మహ్మద్ సాధిక్‌పాషా, వి.పురుషోత్తమరావు, పి. నిరంజన్‌రావు పాల్గొన్నారు.జిల్లావ్యాప్తంగా 4,997 కేసుల పరిష్కారం -
అతిథులకు ఆహ్వానం..
● భద్రాచలంలో ఆధ్యాత్మికతతోపాటు వినోదం ● ఆకర్షణీయంగా మారుతున్న గిరిజన మ్యూజియం ● ఐటీడీఏ ప్రాంగణంలో పార్క్, ఓపెన్ జిమ్ పూర్తి ● ప్రత్యేకంగా దృష్టి సారించిన కలెక్టర్, పీఓ భద్రాచలం: ఏజెన్సీ అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులు, రామయ్య దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్వానం పలికేందుకు భద్రాచలంలో గిరిజన మ్యూజియం సిద్ధమవుతోంది. చిన్నారులను ఆటపాటలతో అలరించనుంది. గిరిజన సంస్కృతీ సంప్రదాయాలు వీక్షకులకు తెలిసేలా రూపుదిద్దుకుంటోంది. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్ పర్యవేక్షణలో పనులు వేగవంతంగా సాగుతున్నాయి. శరవేగంగా పనులు.. భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియంలో ఆదివాసీల దుస్తులు, పనిముట్లు, వస్తువులు ప్రదర్శనకు ఉంచారు. గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా ‘గిరిజన పల్లె’తరహాలో వెదురు, మట్టి నిర్మాణాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. చిన్నారుల ఆట పాటలకు బొమ్మలతో పార్క్, ఓపెన్ జిమ్ సిద్ధం చేశారు. పెడల్ బోటింగ్‌కు పాండ్ రూపొందించారు. యువత, పెద్దలకు బీచ్ తరహాలో ‘ఇసుక వాలీబాల్’, బాక్స్ క్రికెట్, షెటిల్ కోర్టులను సిద్ధం చేస్తున్నారు. వీటి పనులు శరవేగంగా సాగుతుండగా, గిరిజన వంటకాలు, వస్తువులతో స్టాల్స్, గిరిజన ఉత్పత్తులను సైతం రెడీ చేస్తున్నారు. శ్రీరామనవమిలోగా అందుబాటులోకి.. ముక్కోటి నాటికి గిరిజన పల్లె పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని భావించారు. కానీ కలెక్టర్, పీఓ సూచనల మేరకు ఆహ్లాదం కల్పించేలా మరికొన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెడల్ బోటింగ్, ఓపెన్ జిమ్, పార్క్‌లను సిద్ధం చేశారు. వచ్చే నెల 6న శ్రీరామనవమి జరగనున్న నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ లోపు అన్ని పనులు పూర్తి చేయాలని పీఓ ఆదేశాలు జారీ చేశారు. ఈసారి శ్రీరామనవమికి వచ్చే భక్తులు, పర్యాటకులకు ఆధ్యాత్మికతతోపాటు ఆట పాటలతో వినోదం కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
మంచి నడవడిక నేర్పాలి
సింగరేణి(కొత్తగూడెం): సృష్టిలో అందరికీ మొదటి గురువు అమ్మేనని, పిల్లలకు మంచినడవడిక నేర్పితే వారు మహిళల పట్ల గౌరవంగా ఉంటారని జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి భానుమతి అన్నారు. శనివారం కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు ధైర్య సాహసాలతో విపత్తులను ఎదుర్కోవాలని, మహిళా సాధికారతకు కృషి చేయాలని అన్నారు. ప్రస్తుతం మహిళలు అంతరిక్ష రంగం నుంచి భూగర్భ గనుల వరకు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని తెలిపారు. విశిష్ట అతిథిగా హరిణీ సత్యనారాయణరావు హాజరయ్యారు. అన్ని రంగాల్లో రాణించాలి మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్‌లోని ఆర్‌సీఓఏ క్లబ్లో సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. మహిళలు వేగవంతంగా పురోగతి సాధించాలని చెప్పారు. అనంతరం అదనపు కలెక్టర్‌తోపాటు ఎఫ్డీఓ శాతంపురి సుజాత, భద్రాచలానికి చెందిన డాక్టర్ కట్ట సాగరికను సన్మానించారు. ఆ తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన ఆటల పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సేవా ఇన్చార్జి అధ్యక్షురాలు పద్మజా కోటిరెడ్డి పాల్గొన్నారు.జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి భానుమతి -
క్రీడలతో వ్యసనాలు దూరం
ఎస్పీ రోహిత్రాజ్చర్ల: క్రీడలతో చెడు వ్యసనాలను దూరం చేసుకోవచ్చని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మండలస్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఏదో ఒక క్రీడ ఆడాలని సూచించారు. పోటీల్లో మండలం నుంచి 49 జట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి 7 జట్లు పాల్గొనడం అభినందనీయమన్నారు. మొదటి, రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన చీమలపాడు, సుందరయ్యకాలనీ, పెదుట్లపలి(ఛత్తీస్‌గఢ్), మామిడిగూడెం జట్లకు షీల్డ్‌లతోపాటు వరుసగా రూ. 15 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.5 వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఆర్పీఎఫ్ కమాండెంట్ రాజ్‌కుమార్, సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్, పీడీలు పి.శ్రీనివాస్, ఏ ఈశ్వర్, వీ దశమిబాబు, పీ శ్రీను, పీఈటీలు కె.వెంకటేష్, ఎన్.బాబూరావు, రాజేష్, హరికృష్ణ, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
జయహో.. జన ర ుుత్రి
●మహిళల రక్షణ, అభివృద్ధే ధ్యేయంగా.. ●కార్యకర్తల కష్టసుఖాల్లో అండగా ఉంటూ, ప్రజలతో మమేకం. మధిర : రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి, అమ్మ ఫౌండేషన్ ఛైర్మన్ మల్లు నందిని నిరంతరం ప్రజల్లో ఉంటూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతున్నారు. నిరంతరం శ్రమిస్తూ, ప్రజలతో మమేకమవుతూ ముదుకు సాగుతున్నారు. మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర రాజకీయూల్లో నిత్యం బిజీగా ఉంటూ, రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా ఉండడంతో పాటు కాంగ్రెస్ పార్టీ జాతీయు రాజకీయూల్లో సైతం బిజీగా ఉంటున్నారు. మల్లు నందిని నియోజకవర్గంలో కార్యకర్తల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ, నాయకులకు కొండంత అండగా ఉంటున్నారు. మండలాల్లో పార్టీ నాయుకులను సమన్వయుం చేస్తూ అన్ని వర్గాల ప్రజల అభిరుచులకు అనుగుణంగా ముందుకు వెళుతున్నారు. అంతేకాకుండా తన భర్త హోదాను దుర్వినియోగం చేయుకుండా, అధికారిక కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకుండా ఆమె తనదైన శైలిలో రాణిస్తున్నారు. అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ, ఆప్యాయంగా చేరదీస్తూ మల్లు నందిని చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. నియోజకవర్గ ప్రజలు ఆప్యాయుతగా అమ్మ అంటూ పిలిస్తే, నేనున్నానంటూ కార్యకర్తలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. అమ్మ ఫౌండేషన్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహణ, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ల్యాప్‌ట్యాప్‌లు పంపిణీ, వికలాంగులకు ట్రై సైకిళ్ళు ఉచితంగా పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని పొందుతున్నారు. నియోజకవర్గానికి చెందిన వ్యక్తులు ఎవరైనా ప్రమాద ఘటనలో గాయపడినా, మృతి చెందిన వారి కుటుబాలను పరామర్శిస్తూ వారికి అండగా ఉంటూ భరోసా కల్పిస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యాలకు ఫోన్ చేస్తూ వైద్య బిల్లులు తగ్గించేలా కషి చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలు, నాయుకులు, కార్యకర్తలు ఆమెను తలైవిగా పిలుస్తూ ఫ్లెక్సీలు కడుతూ నందినమ్మకు మహిళా దినోత్సవం సందర్భంగా అభినందనలు తెలుపుతున్నారు. ఖమ్మం జిల్లాలో అమ్మ ఫౌండేషన్ తరపున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
అటు ఉద్యోగం.. ఇటు ట్రెయినర్
సంస్థలో ఎంజేటీ(మేనేజ్మెంట్ ట్రెయినీ) హోదాలో ఉద్యోగం చేస్తూనే రెస్క్యూ ట్రెయినర్గానూ కొనసాగుతున్నా. కొన్ని సందర్భాల్లో గనుల్లో వెలువడే గ్యాస్‌తో ప్రాణాపాయం ఎదురవుతుంది. అయినా బీటెక్ మైనింగ్ తర్వాత ఈ ఉద్యోగం ఎంచుకున్నా. – అంబటి మౌనికప్రైవేట్ సంస్థ నుంచి సింగరేణిలోకి.. మైనింగ్ బీటెక్ పూర్తిచేశాక రాజస్తాన్‌లోని హిందుస్తాన్ జింక్ లిమిటెడ్‌లో మూడేళ్లు పనిచేశా. ఆ అనుభవంతో సింగరేణిలో మైనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. కొత్తగూడెం భూగర్భగనిలో నాతో కలిపి ఆరుగురు మహిళా ఉద్యోగులం పనిచేస్తున్నాం. – చెల్లా గాయత్రి● -
అడుగు ముందుకే..
‘అమ్మే నా తొలి గురువు. ఆమె పెద్దగా చదువుకోలేదు. కానీ నన్ను ముందుకు నడిపించింది. ఎక్కడ పడిపోతే.. అక్కడి నుంచే నీ కొత్త ప్రయాణం మొదలుపెట్టమని చెప్పింది. నన్ను జడ్జిగా చూడాలన్న ఆమె కోరికను నెరవేర్చగలిగాను. మహిళలు తమ లక్ష్యాలను చేరుకోవడానికి దృఢ సంకల్పంతో ముందడుగు వేయాలి.’ అని ఖమ్మం జిల్లా ఒకటో అదనపు న్యాయమూర్తి కె.ఉమాదేవి పేర్కొన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ‘సాక్షి’ యూనిట్ కార్యాలయంలో కుటుంబ న్యాయస్థానం జడ్జి అర్చనా కుమారితో కలిసి ఆమె గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పేజీ లే ఔట్, మహిళా దినోత్సవ ప్రత్యేక కథనాలపై చర్చించి సూచనలు చేశారు. అనంతరం న్యాయమూర్తి ఉమాదేవి మాట్లాడగా ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. –సాక్షిప్రతినిధి, ఖమ్మంనిరాశకు తావివ్వొద్దు.. మహిళలు ఏ రంగాన్ని ఎంచుకున్నా.. అందులో వంద శాతం కృషి చేయాలి. ఏ పనైనా ఇష్టంతో చేయాలి. లక్ష్యాలను చేరుకోవడానికి దృఢ సంక ల్పంతో ముందడుగు వేయాలే తప్ప ఎక్కడో ఏదో జరిగిందని కుంగిపోవద్దు. మనకు మన లక్ష్యమే కనపడాలి. మంచి, చెడును సమానంగా స్వీకరించగలిగే స్థితప్రజ్ఞత సాధించాలి. మహిళలు ఆత్మస్థైర్యాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. ఇక చాలు నా జీవితం అయిపోయిందనే భావనను మనసులోంచి తీసేయాలి. అప్పుడే అనుకున్న దాని కన్నా మంచి స్థితిలో ఉంటాం. చిన్నతనం నుంచే మహిళలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం ముఖ్యం. వారి లక్ష్యాలకు అండగా ఉండాలి. అమ్మే నా మొదటి గురువు.. మేము నలుగురు ఆడపిల్లలం. నాన్న ఫిజికల్ డైరెక్టర్. ఆయన అందరినీ లెక్చరర్లుగా చేయాలనుకున్నారు. కానీ నన్ను జడ్జిగా చూడాలన్నది అమ్మ కోరిక. నా మొదటి గురువు ఆమే. ఏం చేయాలి.. ఎలా వెళ్లాలి.. ఎక్కడైతే పడిపోతామో అక్కడే లేచి నిలబడమని చెప్పేది.. అంత సపోర్ట్ ఉండడంతో ఆమె కల నెరవేర్చగలిగాను. దృఢ సంకల్పంతో సాగితేనే విజయం నన్ను జడ్జిగా చూడాలన్నదే మా అమ్మ కల జిల్లా అదనపు న్యాయమూర్తి ఉమాదేవి మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ గెస్ట్ ఎడిటర్‌గా విధులు ఎవరేం అనుకుంటారోనని ఆలోచించొద్దు.. మహిళల్లో ఎక్కువ మంది వాళ్లేం అనుకుంటారో.. వీళ్లేం అనుకుంటారో అని ఆలోచిస్తుంటారు. అలా కాకుండా మనమేం అనుకుంటున్నామో అదే ముఖ్యం. నలుగురు ఏమనుకుంటారో అనే భావన తీసేస్తేనే జీవితంలో ఎదగగలుగుతాం. అప్పుడే ఎంత కఠినమైన పనైనా చేయగలం. జీవితంలో ఏదీ సులువు కాదనే విషయాన్ని అంగీకరించాలి. -
ఇంట్లో ఓకే.. బయటే భయం !
మహిళలపై కొనసాగుతున్న వివక్ష ● ఇంకా కనిపిస్తున్న ఆడామగ తేడాసమాజంలో అందరూ సమానేమనే భావన నానాటికీ పెరుగుతోంది. పురుషులతో సమానంగా కుటుంబ పోషణలో పాలు పంచుకుంటున్న మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తుండడం ఇందుకు కారణమవుతోంది. కానీ అతివలపై వివక్ష మాత్రం కొన్నిచోట్ల కొనసాగుతూనే ఉంది. అయితే ఇళ్లలో తల్లిదండ్రులు, తోబుట్టువుల నుంచి ఆ పరిస్థితి ఎదురుకాకున్నా... పని ప్రదేశాలు, విద్యాసంస్థలు, బస్టాండ్ల వంటి చోట మాత్రం ఈ సమస్య తప్పడం లేదు. మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లో 100 మంది మహిళలను సర్వే చేయగా ఈ విషయం వెల్లడైంది. ‘సాక్షి’ అడిగిన ప్రశ్నలకు వారు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి. – ఖమ్మంమయూరిసెంటర్/కొత్తగూడెంఅర్బన్ -
కొత్తగూడెం ఓఎస్డీ బదిలీ
సంగారెడ్డి ఎస్పీగా నియామకం కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న పరితోష్ పంకజ్‌ను పదోన్నతిపై బదిలీ చేశారు. సంగారెడ్డి ఎస్పీగా నియమితులయ్యారు. బిహార్ రాష్ట్రం భోజ్‌పూర్ జిల్లాకు చెందిన ఆయన 2020 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తొలుత గ్రేహౌండ్స్ అసాల్డ్ కమాండర్‌గా నియమితులైన పరితోష్ 2023లో భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2024, జూలై 1న అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్డీగా పనిచేస్తున్నారు. గంజాయి రవాణను అరికట్టడంలో, గోదావరి వరదల సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించారనే పేరు ఉంది. మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలిఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలం: భక్తుల కోసం భద్రాచలంలో ఐటీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శాశ్వత మరుగుదొడ్ల పనుల వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని కాపా రామలక్ష్మి ఏరియాలో, బస్టాండ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పార్క్ పక్కన ప్రదేశాల్లో జరుగుతున్న శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. భక్తులు బస చేసే ప్రదేశాల్లో టాయిలెట్లు, స్నానాల గదులు నిర్మించాలన్నారు. గ్రామపంచాయతీ ద్వారా చేపట్టిన నిర్మాణాలను ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా తొలుత పీఓ ఏఎంసీ కాలనీ, మనుబోతుల చెరువు వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ సమస్యలను స్థానికులు వివరించగా.. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించాలని ఏఈఈని ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్మాణం జరుగుతున్న డైనింగ్ హాల్ పనులను పరిశీలించారు. అధికారులు చంద్రశేఖర్, హరీష్, నారాయణ రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్కొత్తగూడెంటౌన్ : కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి శుక్రవారం ఒక ప్రకటలో తెలిపారు. క్రిమినల్, ప్రమాద, సివిల్, చీటింగ్, చిట్‌ఫండ్, భూ తగాదాలు, వివాహ సంబంధ తదితర కేసులను ఇందులో పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు. -
సాగు చేస్తూ.. దారి చూపిస్తూ!
● యూట్యూబర్‌గా రాణిస్తున్న మహిళా రైతు లక్ష్మీప్రసన్న ● 3.23 లక్షల మంది సబ్స్క్రైబర్లతో గుర్తింపు ● పంటలన్నీ సేంద్రియ విధానంలోనే.. బూర్గంపాడు: ఆమె తన భర్త సహకారంతో సేంద్రియ విధానంలో పంటలు సాగు చేస్తోంది. సాగు సమయాన ఎదురయ్యే ఇక్కట్లు, పంటలను ఆశించే తెగుళ్ల నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టడం సర్వసాధారణమే. అయితే, శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలతో తీసుకుంటున్న రక్షణ చర్యలు సత్ఫలితాలను ఇస్తుండడంతో అవి తనకు మాత్రమే సొంతం కావొద్దని.. మరికొందరు రైతులకూ ఉపయోగపడాలనే భావనతో ఆ మహిళా రైతు అందరికీ అందుబాటులో ఉన్న యూట్యూబ్‌ను ఎంచుకుంది. సాగులో తాము అవలంబించే రక్షణ చర్యలు, జాగ్రత్తలను వీడియో తీసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడంతో రైతుల మన్ననలు అందుకుంటోంది. ఇప్పటి వరకు ఏడేళ్లలో 200 పైగా వీడియోలు అప్లోడ్ చేయగా.. ఆమె నిర్వహిస్తున్న చానల్‌కు 3.23 క్షల మంది సబ్‌స్క్రై బర్లు ఉండడం విశేషం. మారుమూల గ్రామం నుంచి... పినపాక మండలం ఏడూళ్లబయ్యారం గ్రామానికి చెందిన పాపాల సాయి లక్ష్మీప్రసన్న ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. ఆ తర్వాత ఆమెకు రాంబాబుతో వివాహమైంది. భర్తతో కలిసి తమకున్న పదెకరాల భూమిలో వివిధ రకాల పంటలను సేంద్రియ విధానంలో సాగుచేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు పంటల సాగులో వస్తున్న మార్పులు, నూతన సాంకేతిక విధానాలు, నాణ్యమైన ఉత్పత్తులు, మార్కెటింగ్, భూసంరక్షణపై అవగాహన పెంచుకుంది. అయితే, ఈ అంశాలన్నీ అందరికీ చేరవేయాలనే లక్ష్యంతో ‘ఎస్ఆర్ విలేజ్ అగ్రికల్చర్ యూట్యూబ్ చానల్’ ప్రారంభించింది. ఆర్గానిక్ విధానంలో కూరగాయలు సాగు చేస్తూ ఆర్యోగకరమైన ఉత్పత్తులు సాధించే క్రమాన ఆమెకు ఎదురైన సవాళ్లు, వాటిని అధిగమించిన తీరు, భూసంరక్షణ, విత్తన శుద్ధి, విత్తనాల ఎంపిక, ఎరువులు, నీటి యాజమాన్యం, సస్యరక్షణ చర్యలు, పంటలు ఆరబెట్టడం, మార్కెటింగ్ వసతులు తదితర అంశాలే కాక వ్యవసాయ అనుబంధ రంగాలైన నాటు కోళ్ల పెంపకం, పాడి పరిశ్రమపైనా ఆమె అప్లోడ్ చేస్తున్న వీడియోలు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. సాయి లక్ష్మీప్రసన్న చక్కటి మాట తీరుతో వ్యవసాయ విధానాలను కళ్లకు కట్టినట్లుగా వీడియోలను తమ సెల్ఫోన్లోనే చిత్రీకరించి ఎలాంటి ఎడిటింగ్ లేకుండానే అప్లోడ్ చేస్తుండడం విశేషం. ఈ వీడియోలు చూసిన చాలా మంది రైతులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పిన వాటికంటే బాగా అర్థమవుతున్నాయని చెబుతుండ డం ఆమె కృషికి దక్కిన నిదర్శనం. కాగా, యూ ట్యూబ్ ద్వారా వస్తున్న పారితోషికాన్ని పొలం పనులకు సహకరిస్తున్న కూలీలు, తోటి రైతుల అవసరాలకు అందిస్తుండడం మరో విశేషం.ఆమె రాణిస్తోంది.. మరికొన్ని కథనాలు 9లో -
గనిలో నారీమణులు
సింగరేణి(కొత్తగూడెం): గతంలో వంటింటికే పరిమి తమైన మహిళలు నేడు ఉద్యోగ నిర్వహణలోనూ రాణిస్తున్నారు. అయితే, కొన్నాళ్ల పాటు కార్యాలయాలకే పరిమితమయ్యే ఉద్యోగాలను మాత్రమే ఎంచుకోగా ఇప్పుడు ఈ స్థితినీ దాటేశారు. క్లిష్టమైన పరిస్థితులు, సంక్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించడానికీ అతివలు వెనుకాడడం లేదు. అందులో భాగంగానే సింగరేణిలోని భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి, పర్యవేక్షణ బాధ్యతలను నిస్సంకోచంగా, విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. పురుషులు సైతం భయంభయంగా పనిచేసే రెస్య్కూ విధులనూ మహిళలు ఎంచుకుంటుండడం విశేషం. మైనింగ్ ఆఫీసర్లుగా మహిళలు.. సింగరేణిలో సుమారు 56 విభాగాలు విధులు నిర్వర్తిస్తేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుంది. వీట న్నింటిలోనూ గతంలో పురుషులే ఉండేవారు. అయితే, ఇటీవల నియామకాల్లో మహిళలకు అన్ని విభాగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం.. డిపెండెంట్ ఉద్యోగాల కల్పనలోనూ సానుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు సంస్థ వ్యాప్తంగా 2వేల మంది మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో కొందరు ఎగ్జిక్యూటివ్ హోదాలో ఎలక్ట్రికల్, మైనింగ్, సివిల్, ఎకౌంట్స్, ఎస్టేట్స్, పర్సనల్ విభాగాల్లో ఉండగా.. ఉత్పత్తికి సంబంధించి మరో 16 విభాగాల్లోనూ మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. కాగా, సింగరేణిలో మైనింగ్ ఆఫీసర్ విధులు క్లిష్టంగా ఉంటాయి. గనుల్లో బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేయడం, గనుల్లో వెలువడే గ్యాస్‌ను గుర్తించడమే కాక మైనింగ్ విభాగంలో సర్దార్, ఓవర్మెన్లకు విధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇలాంటి విధులను మహిళలు అలవోకగా నిర్వర్తిస్తూ భేష్ అనిపించుకుంటున్నారు. భూగర్భంలో సాహస విధులు సింగరేణిలో సర్దార్, ఓవర్‌మెన్ పర్యవేక్షణ బాధ్యతలు ఏటా సంస్థలో పెరుగుతున్న మహిళా ఉద్యోగులు -
ఆఫీస్ వేరు.. గని వేరు
బొగ్గు బ్లాస్టింగ్ సమయాన అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమరపాటుగా ఉంటే ప్రమాదమే. అందుకే పనిచేసే వారంతా అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆఫీస్ పనులకు, ఇక్కడ విధులకు వ్యత్యాసమున్నా చాలెంజ్‌గా తీసుకుని పని చేస్తున్నాం. – ఈసం కృష్ణవేణి అత్యంత అప్రమత్తంగా.. బొగ్గు ఉత్పత్తి సమయాన ఏ మాత్రం అజాగ్రత్త వహించినా ఫలితాలు తారుమారవుతాయి. ఈక్రమాన రక్షణ సూత్రాలు తప్పక పాటించాలి. ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తూ, సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ అప్రమత్తంగా పనిచేస్తున్నాం. – రమ్యశ్రీ -
అర్హులకే ఇందిరమ్మ ఇళ్లు
కొత్తగూడెంఅర్బన్: అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటేల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి దరఖాస్తులు పరిశీలించాలని, ఎల్–1,ఎల్–2,ఎల్ –3 జాబితా లు తయారు చేయాలని సూచించారు. అర్హత ఉండి కూడా జాబితాలో పేరు రాని వారిని తిరిగి నమోదు చేయాలన్నారు. జాబితాలో తండ్రి పేరు ఉండి, పెళ్లయిన కుమారుడు దరఖాస్తు చేసుకుంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ఎంపీడీఓలు బాధ్యతగా వ్యవహరించి అనర్హుల పేర్లు జాబితాలో లేకుండా చూడాలని సూచించారు. భూముల క్రమబద్ధీకరణకు ఈనెల 31 వరకు కల్పి స్తున్న 25 శాతం రాయితీని అందరూ సద్వినియోగపరుచుకునే అవగాహన కల్పించాలని అన్నారు. రుచికరమైన భోజనం అందించాలి.. పాల్వంచరూరల్ : విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ సిబ్బందికి సూచించారు. పాత పాల్వంచ జెడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, స్పోర్ట్స్ కిట్లను పరిశీలించారు. భోజనం బాగుందా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. భోజనంలో లోపాలుంటే ఉపాధ్యాయులు, నిర్వాహకులపై చర్య తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆయన వెంట డీఈఓ వెంకటేశ్వరాచారి, జిల్లా కోఆర్డినేటర్ సైదులు, సతీష్‌కుమార్, ఎంఈఓ శ్రీరాంమూర్తి, హెచ్ఎం పద్మలత ఉన్నారు. ‘ప్రైవేట్’కు దీటుగా విద్యాబోధన.. సుజాతనగర్ : ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో విద్యాబోధన అందుతోందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక బీసీ బాలుర గురుకుల పాఠశాలలో శుక్రవారం వార్షికోత్సవం జరగగా, కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నేటి విద్యార్థులే రేపటి సమాజ నిర్మాతలని, ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యంతో చదివితేనే అనుకున్నది సాధిస్తారని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ రాంబాబు, పాఠశాల ప్రిన్సిపాల్ వి.బ్యూలారాణి పాల్గొన్నారు. -
ఆలయ పాలకవర్గం జాబితాపై గోప్యం
పాల్వంచరూరల్ : పెద్దమ్మగుడి పాలకవర్గ జాబితాను వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం చర్చనీయాంశంగా మారింది. 14 మంది సభ్యులతో కూడిన జాబితా గురువారం ఈఓకు చేరినా.. వివరాలు వెల్లడించకుండా రహస్యంగా ఉంచారు. జాబితాలో పేర్లున్న వారితో కలిసి ఈఓ, దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ శుక్రవారం రహస్యంగా సమావేశమై మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎటువారు అటు వెళ్లిపోయారు. ఆలయ గత పాలకవర్గ పదవీకాలం 2024 మార్చితో పూర్తికాగా, నూతన పాలకవర్గ నియామకానికి దేవాదాయ శాఖ డిసెంబర్లో నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో అసక్తి గల 30 మంది నాయకులు దరఖాస్తులు చేసుకున్నారు. అందులో ఎవరికి స్థానం దక్కిందనేది సస్పెన్స్‌గా మారింది. -
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎస్పీ రోహిత్రాజ్బూర్గంపాడు: సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. బూర్గంపాడు పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు తీసుకోవాలని, వారితో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సైబర్ నేరాలు నానాటికీ పెరుగుతున్నందున ప్రజల్లో విస్తృతంగా చైతన్యం తీసుకురావాలని, నేరాల తీరును వారికి అర్థమయ్యేలా అవగాహన కల్పించాలని అన్నారు. అప్పనంగా డబ్బు వస్తుందనే ఆశతో సెల్‌ఫోన్‌లోని యాప్‌లు, లింక్‌లను క్లిక్ చేయవద్దని ప్రజలకు సూచించారు. ఆయన వెంట సీఐ నాగరాజు(స్పెషల్ బ్రాంచ్), ఎస్ఐలు రాజేష్, నాగభిక్షం తదితరులు ఉన్నారు. -
ప్రశాంతంగా ఇంటర్ ‘ద్వితీయ’ పరీక్షలు
కొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని 36 కేంద్రాల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా 9,030 మంది విద్యార్థులకు గాను 8,759 మంది పరీక్ష రాయగా, 271 మంది గైర్హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టిస్ ఘటనలు చోటుచేసుకోకుండా సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, విద్యార్థులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే తక్షణ చికిత్స కోసం వైద్యారోగ్య సిబ్బందితో పాటు మందులు అందుబాటులో ఉంచారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్ట పోలీసులు బందోబస్తు నిర్వహించారు. 9,030 మందికి 8,759 విద్యార్థుల హాజరు