గురుకుల బాలికల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

గురుకుల బాలికల ప్రతిభ

Feb 27 2026 7:32 AM | Updated on Feb 27 2026 7:32 AM

గురుకుల  బాలికల ప్రతిభ

గురుకుల బాలికల ప్రతిభ

కారేపల్లి: కారేపల్లిలోని మైనార్టీ గురుకుల బాలికల విద్యాలయం విద్యార్థినులు జాతీయ స్థాయి రబ్బీ క్రీడలో ప్రతిభ చాటారు. ఈనెల 22, 23వ తేదీల్లో తమిళనాడు రాష్ట్రం చైన్నెలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగిన అస్మిత ఖేలో ఇండియా రబ్బీ పోటీల్లో 9వ తరగతి విద్యార్థినులు కె.సుజాత, ఎం.అక్షిత, బి.కరుణ ప్రతిభ కనబరిచి జట్టు కాంస్య పతకం సాధించడంలో కీలకంగా నిలిచారు. పతకాలతో పాటు రూ.48వేల నగదు ప్రోత్సాహకం అందుకున్న విద్యార్థినులు గురువారం కారేపల్లి చేరుకోగా ఎంఈఓ దుగ్గిరాల జయరాజు, ప్రిన్సిపాల్‌ సావిత్రి ఆధ్వర్యాన బస్టాండ్‌ సెంటర్‌లో స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీగా పాఠశాలకు తీసుకెళ్లి సన్మానించారు. పీడీ జారె అనూష, పీఈటీ నాగేంద్రమ్మ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement