breaking news
Bhadradri District News
-
యూరియా కొరత లేదు
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ప్రస్తుత యాసంగి సీజన్ కు యూరియా, ఎరువుల కొరత లేదని కలెక్టర్ జితేష్ వి పాటిల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాసంగి పంటల సాగును దృష్టిలో ఉంచుకుని ముందస్తు ప్రణాళికతో యూరియా సరఫరాకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ సీజన్లో మొక్కజొన్న, వరి ప్రధానంగా సాగు చేస్తున్నారని, జిల్లాలో ఇప్పటివరకు మొక్కజొన్న 38,500, వరి 8,750 ఎకరాల్లో సాగైందని వెల్లడించారు. వరినాట్లు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లాకు 28,500 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, ఇప్పటికే 8,750 మెట్రిక్ టన్నులు సరఫరా అయిందని, జిల్లాలోని గోదాంల్లో ఇంకా 1,35,800 బస్తాల యూరియా నిల్వలు ఉన్నాయని, అదనంగా 1,51,200 బస్తాలు త్వరలో చేరకుంటాయని వివరించారు. రైతులు యూరియా కోసం ఆందోళన చెందొద్దని సూచించారు. పీఏసీఎస్‌ల ద్వారా నిరంతరం సరఫరా చేస్తామని, రైతులు అవసరానికి మించి యూరియా ముందుగా కొనుగోలు చేయొద్దని కోరారు. యూరియా పంపిణీలో అక్రమాలు జరగకుండా అధికారులను అప్రమత్తం చేసినట్లు తెలిపారు. పంపిణీలో అలసత్వం వహిస్తే చర్యలు మణుగూరు రూరల్: జిల్లాలో ఎరువుల కొరత లేదని డీఏఓ వి.బాబూరావు తెలిపారు. మంగళవారం ఆయన మణుగూరులో మాట్లాడుతూ.. 35 పీఏసీఎస్‌లు, 10 ఏఆర్ఎస్కే సెంటర్లు, ఒక డీసీఎంఎస్ పాయింట్, 364 ప్రైవేట్ దుకాణాల ద్వారా యూరియా సరఫరా చేస్తున్నామని వివరించారు. వరి, మొక్కజొన్న సాగు చేసే రైతులకు ఎకరానికి ఒక బ్యాగు చొప్పున అందిస్తామని చెప్పారు. ఎరువుల కోసం క్యూలో నిల్చోవాల్సిన అవసరం లేదన్నారు. త్వరలో యాప్ ద్వారా ఎరువులు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎరువుల కొరత లేకుండా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తున్నారని చెప్పారు. ఎరువుల పంపిణీలో అలసత్వం వహిస్తే తగిన చర్యలు తీసుకుంటామని సంబంధిత సిబ్బందిని హెచ్చరించారు. సమావేశంలో మణుగూరు ఏఓ రాహుల్‌రెడ్డి, ఏఈఓ కొమరం లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ -
క్రీడోత్సవాలకు రండి
ముఖ్యమంత్రిని ఆహ్వానించిన ఎమ్మెల్యే పాయం పినపాక: మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో జనవరి 7 నుంచి జరిగే జాతీయస్థాయి అండర్ –17 బాలుర కబడ్డీ పోటీలకు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఎన్నారై కంది విశ్వభారతి రెడ్డితో కలిసి సీఎం వద్దకు వెళ్లారు. మారుమూలన ఉన్న ఏడూళ్లబయ్యారంలో జాతీయస్థాయి పోటీలు నిర్వహించే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 7న ఉమ్మడి జిల్లాలో కేటీఆర్ పర్యటన ఖమ్మంవైరారోడ్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చేనెల 7న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గెలిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు జరిగే సన్మాన కార్యక్రమాల్లో పాల్గొంటారని వెల్లడించారు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం చేరుకోనున్న కేటీఆర్ అక్కడ సన్మానంలో పాల్గొన్న అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు ఖమ్మం వస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలకు నూతన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డుసభ్యులు సహా పార్టీ శ్రేణులు హాజరుకావాలని ఎంపీ ఓ ప్రకటనలో కోరారు. వన్యప్రాణులను వేటాడితే చర్యలు తప్పవుడీఎఫ్ఓ కిష్టాగౌడ్ గుండాల : వన్యప్రాణులను వేటాడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీఎఫ్ఓ కిష్టాగౌడ్ హెచ్చరించారు. మండల పరిధిలోని అడవులు, ప్లాంటేషన్లను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవుల్లో పెంచుతున్న ప్లాంటేషన్ల్పై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని రకాల మొక్కలకు ఎప్పటికప్పుడు నీరందిస్తూ కాపాడాలని సూచించారు. కొత్తగా పోడు నరికేవారిపై చర్యలు తీసుకోవాలని, అడవులపై అవగాహన కల్పించాలని అన్నారు. కొత్త ప్లాంటేషన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎఫ్డీఓ కరుణాకరాచారి, రేంజర్ నర్సింహా రావు తదితరులు ఉన్నారు. ఇండోర్ స్టేడియాన్ని వినియోగించుకోండిదుమ్ముగూడెం : మండలంలోని ములకపాడులో రూ.2.26 కోట్లతో నిర్మించిన ఇండోర్ స్టేడియాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. మంగళవారం ఆయన స్టేడియాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్టేడియంలో ఏర్పాటు చేసిన క్రీడా పరికరాలను ఉపయోగించుకుని యువత క్రీడల్లో రాణించాలని అన్నారు. పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలని ఐటీడీఏ డీఈ హరీష్‌కు సూచించారు. అంతకుముందు పర్ణశాల శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ఎస్పీ దర్శించుకున్నారు. పంచవటీ కుటీరాన్ని సందర్శించి ప్రాశస్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ వెంకటప్పయ్య, ఎస్ఐలు గణేష్, రాజశేఖర్ ఉన్నారు. -
లక్ష్యాన్ని సాధించడమే అసలైన విజయం
● కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ● ముగిసిన పీఎంశ్రీ జిల్లా స్థాయి పోటీలుపాల్వంచరూరల్: చదువు, ఆటల్లో గెలుపోటములు వస్తాయని.. ఇవన్నీ దాటుకుంటూ ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడమే అసలైన విజయమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో మంగళవారం జిల్లా స్థాయి పీఎంశ్రీ పాఠశాలల క్రీడా పోటీలు నిర్వహించగా డీఈఓ బి.నాగలక్ష్మి ప్రారంభించారు. ఈ పోటీలకు ఆరు జోన్ల నుంచి 450 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరై కబడ్డీ, ఖో–ఖో, అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్‌బాల్ పోటీల్లో తలపడ్డారు. ఈ మేరకు సాయంత్రం నిర్వహించిన ముగింపు సమావేశంలో విజేతలకు బహుమతులు అందజేశాక కలెక్టర్ మాట్లాడారు. జిల్లాస్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్థులు రాష్ట్రస్థాయిలోనూ సత్తా చాటాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి ఎ.నాగరాజశేఖర్, ఎంఈఓలు శ్రీరామ్మూర్తి, ఆనందకుమార్, జిల్లా సైన్స్ అధికారి సంపత్‌కుమార్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి నరేష్కుమార్, సోషల్ వెల్ఫేర్ పాఠశాలల జిల్లా కోఆర్డినేటర్ కె.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా, జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చిన 76 మంది విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశామని, ఇందులో 43 మంది బాలురు, 33మంది బాలికలు ఉన్నారని డీఈఓ నాగలక్ష్మి వెల్లడించారు. విజేతలు వీరే.. వాలీబాల్ బాలుర విభాగంలో గుండాల టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్, పాల్వంచ సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాల, బాలికల విభాగంలో కే.రేగుబల్లి ఆశ్రమ పాఠశాల, ఎల్చిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాల జట్లు మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. కబడ్డీ బాలుర విభాగంలో అన్నపురెడ్డిపల్లి సాంఘిక సంక్షేమ గురుకులం, దమ్మపేట టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్, బాలికల విభాగంలో సుదిమళ్ల టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్, కే.రేగుబల్లి ఆశ్రమ పాఠశాల జట్లు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఖోఖో బాలుర విభాగంలో గుండాల టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్, పాల్వంచ సాంఘిక సంక్షేమ గురుకులం, బాలికల విభాగంలో కే.రేగుబల్లి ఆశ్రమ పాఠశాల, సుదిమళ్ల టీజీటీడబ్ల్యూఆర్‌ఎస్, ఫుట్‌బాల్ బాలుర విభాగంలో పాల్వంచ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులం, దమ్మపేట టీడబ్ల్యూఆర్‌ఎస్ జట్లు మొదటి రెండు స్థానాలు దక్కించుకున్నాయి. ఇక అథ్లెటిక్స్ 100 మీటర్ల పరుగు పందెంలో బి.అభిలాష్, కె.శ్రీకాంత్, బాలికల్లో పి.దీవెన, పి.నాగరాణి, లాంగ్‌జంప్ బాలురలో కె.శ్రీకాంత్, సాయిచరణ్, బాలికల్లో జె.శ్రీవైష్ణవి, పి.దీవెన, షాట్‌ఫుట్ బాలుర విభాగంలో వి.రాహుల్, జి.రాహుల్తేజ్, బాలికల్లో జె.పూజిత, బి.సుభద్ర మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. కాగా, విద్యార్థులకు హాల్లో కూర్చోబెట్టి కాకుండా క్యూలో నిల్చోబెట్టి భోజనాలు వడ్డించడంతో కొంత ఇబ్బంది పడ్డారు. -
భూలోక వైకుంఠమే..
ముక్కోటి ఏకాదశి వేళ భద్రగిరి భూలోక వైకుంఠంగా మారింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, ధూపదీపాల నడుమ జయ గంటలు మోగుతుండగా మంగళవారం తెల్ల వారుజామున ఉత్తర ద్వార దర్శన వేడుక ఆద్యంతం నేత్ర పర్వంగా సాగింది. రామచంద్రమూర్తి గరుడ వాహనంపై, సీతమ్మవారు గజవాహనంపై, లక్ష్మణస్వామి హనుమత్ వాహనంపై ఉత్తర ద్వారం వద్దకు చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటలకే ప్రారంభమైన ఈ వేడుకలు ఉదయం 6 గంటలకు ముగిశాయి. 5 గంటల సమయాన ఉత్తర ద్వారాలు తెరుచుకోగా, ధూపదీపాలు, హారతి వెలుగుల నడుమ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. – భద్రాచలంస్వామివారికి ప్రత్యేక పూజలు.. ఉత్తర ద్వార దర్శనానికి ముందు శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. సంప్రదాయం ప్రకారం సుప్రభాత సేవ, విశేష అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మంగళవాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ స్వామివారు వెండి గరుడ వాహనంపై ఉత్తర ద్వారంలోకి ప్రవేశించారు. తొలుత దేవస్థాన హరిదాసులు శ్రీరామ కీర్తనలు ఆలపించారు. అనంతరం స్థానాచార్యులు కేఈ స్థలశాయి వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. ఈ ఏకాదశి రోజున వైకుంఠంలో స్వామి వారిని ముక్కోటి దేవతలు దర్శించుకుంటారని, వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శిస్తే ముక్కోటి దేవతలను దర్శించుకున్నంత పుణ్యఫలం సిద్ధిస్తుందని చెప్పారు. మార్మోగిన రామనామం.. సరిగ్గా తెల్లవారుజామున 5 గంటలకు మంగళ వాయిద్య గంట మోగుతుండగా ఉత్తర ద్వారం తలుపులు తెరుచుకున్నాయి. వైకుంఠాన్ని మైమరిపించేలా ప్రత్యేకంగా అలంకరించిన ఈ ద్వారంలో ధూప, దీపాల నడుమ శ్రీ సీతారామ లక్ష్మణులు భక్తులకు దర్శనమిచ్చారు. గంట పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయగా, ‘శ్రీ రామాయనమః’ అంటూ భక్తుల రామనామ స్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఆ తర్వాత చుతర్వేద పారాయణం చేసి, నివేదన, మంత్రపుష్పం సమర్పించారు. చివరగా 108 వత్తులతో కూడిన హారతి సమర్పించాక శరణాగతి, దండకం అనంతర ం ఉత్తర ద్వార దర్శన ప్రాశస్త్యాన్ని అర్చకులు వివరించారు. వైభవంగా తిరువీధి సేవ ఉత్తర ద్వార దర్శనానంతరం శ్రీసీతాలక్ష్మణ సమేతుడైన రామయ్య తిరువీధి సేవకు బయలుదేరారు. గరుడ వాహనంపై స్వామి వారు, గజ వాహనంపై సీతమ్మవారు, హనమత్ వాహనంపై లక్ష్మణస్వామిని కొలువుదీర్చి రాజవీధి మీదుగా తాతగుడి వరకు తిరువీధి సేవ నిర్వహించారు. వందలాది మంది భక్తులు స్వామివారి వెంట నడువగా గోవిందరాజ స్వామివారి ఆలయం వరకు వెళ్లిన స్వామి వారు ప్రత్యేక పూజల అనంతరం తిరిగి ఆలయానికి చేరుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, ఉత్సవాల ప్రత్యేక అధికారి శ్రీనివాసరావు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, సబ్‌కలెక్టర్ మ్రిణాల్శ్రేష్ట, ఐటీడీఏ పీఓ బి. రాహుల్, ట్రైనీ కలెక్టర్ సౌరబ్ శర్మ, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఎస్పీ రోహిత్‌రాజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ఆలయ ఈఓ దామోదర్‌రావు, భద్రాచలం సర్పంచ్ పూనెం కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తగ్గిన వీవీఐపీల రాక భద్రాచలంలో జరిగిన తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు ఈ ఏడాది వీవీఐపీల రాక తగ్గింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో మంత్రులు ఉత్సవాలకు హాజరు కాలేకపోయారని అధికారులు భావిస్తున్నారు. మంత్రుల సతీమణులు సైతం ఉత్సవాలకు రాలేదు. ఎట్టకేలకు ఉత్సవాలు విజయవంతం కావడంతో జిల్లా ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్తర ద్వార దర్శనం అనంతరం నిర్వహించే తిరువీధి సేవకు స్వల్ప ఆలస్యం జరిగింది. స్వామి వారి వాహనాలు మోసే బోయీలు అందుబాటులో లేకపోవడంతో పలుమార్లు మైక్‌లో అనౌన్స్ చేశారు. కాగా సెక్టార్లన్నీ నిండిపోవడంతో బోయిలు దూరంగా వెళ్లాల్సి రావడంతో సుమారు 15 నిమిషాల పాటు జాప్యం జరిగింది. ఇక వీవీఐపీ, మీడియా సెక్టార్లలో అనుమతి లేకుండా అనేక మంది రావడంతో అవన్నీ ముందుగానే నిండిపోయాయి. భద్రగిరిలో నేత్రపర్వంగా ఉత్తర ద్వార దర్శనం -
యాసంగిలోనూ తప్పని తిప్పలు
జూలూరుపాడు: వానాకాలం సీజన్లో యూరియా కోసం ఇబ్బంది పడిన రైతులకు యాసంగిలోనూ కష్టాలు తప్పడం లేదు. ప్రస్తుతం మొక్కజొన్న, వరి సాగు చేస్తుండగా అవసరమైన యూరియా కోసం గంటల కొద్దీ క్యూలో నిల్చోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూలూరుపాడు సహకార సంఘం కార్యాలయం వద్ద మంగళవారం బారులుదీరిన రైతులు.. ఎన్ని ఎకరాల్లో సాగు చేసినా ఒక్కొక్కరికి రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారని, వాటి కోసం ఎంతో సేపు వేచి ఉండాల్సి వస్తోందని అంటున్నారు. ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్‌తో రెండు, మూడు రోజులుగా పీఏసీఎస్ చుట్టూ తిరుగుతున్నామని చెప్పారు. పంటలకు సరిపడా ఇవ్వకుండా రెండు బస్తాలు ఇస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. సరిపడా ఇచ్చేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాగా, పీఏఎసీఎస్ కార్యాలయంలో సరిపడా యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఆందోళన చెందవద్దని జూలూరుపాడు ఏఓ దీపక్ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. యూరియా అవసరమైన రైతులు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం జిరాక్స్ అందించి నిర్ణీత ధర ప్రకారం తీసుకోవచ్చని పేర్కొన్నారు. యాప్ ఇంకా అందుబాటులోకి రాలేదని, ప్రస్తుతం పాత విధానంలోనే విక్రయిస్తున్నామని వెల్ల డించారు. ఎరువుల దుకాణాల్లో యూరియా అందుబాటులో ఉంటే రైతులు కొనుగోలు చేయవచ్చని సూచించారు. -
రాపత్తు సేవలు షురూ..
డీఎస్పీ బంగ్లాలో తొలి వేడుక వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా రామాలయంలో మంగళవారం రాపత్తు సేవలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఈ సేవను నిర్వహించగా.. ప్రత్యేకంగా అలంకరించిన స్వామి వారిని పల్లకీ సేవగా ఏఎస్పీ కార్యాలయం(డీఎస్పీ బంగ్లా) వద్ద నున్న మండపంలో కొలువుదీర్చారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి సమర్పించారు. కార్యక్రమంలో ఎస్పీ రోహిత్‌రాజ్, భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఐ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
● మార్మోగిన రామనామం
ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రగిరిలో రామనామం మార్మోగింది. ఉత్తర ద్వార దర్శనానికి ముందు శ్రీసీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ స్థానాచార్యులు కేఈ స్థలశాయి వైకుంఠ ద్వారా దర్శన ప్రాశస్త్యాన్ని వివరించారు. ఉత్తర ద్వారంలో పూజలు, భక్తుల సందర్శనానంతరం స్వామివారు తిరువీధి సేవకు బయలుదేరారు. కాగా, ఈ ఏడాది వేడుకలకు మంత్రులు ఎవరూ హాజరుకాలేదు. భద్రాచలం, పినపాక ఎమ్మెల్యేలు వెంకట్రావ్, పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్ – మనీషా దంపతులతో పాటు ఇతర అధికారులు స్వామివారిని దర్శించుకున్నారు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం -
నవభారత్ సేవలు అమూల్యమైనవి
పాల్వంచ: విద్యాభివృద్ధికి నవభారత్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ అందిస్తున్న సహకారం అమూల్యమైనదని డీఈఓ, జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. మంగళవారం స్థానిక నవభారత్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్వంచ, బూర్గంపాడు, టేకులపల్లి, మణుగూరు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు 250 డెస్క్ బల్లాలను వితరణగా అందించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థుల చదువు కోసం సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. సంస్థ అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలని ఆకాంక్షించారు. అనంతరం జీఎం (సీఎస్ఆర్) ఎంజీఎం ప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలకు 4,500 బల్లాలను అందించామన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శ్రీరామ్మూర్తి, నవభారత్ స్కూల్ ప్రిన్సిపాల్ ఎన్వీకే ప్రసాద్, ప్రధానోపాధ్యాయులు పి.జ్యోతి, రాజేశ్వరరావు,రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. క్రీడావిద్యార్థుల అవస్థలు పాల్వంచరూరల్: మండలంలోని లక్ష్మీదేవిపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలుర కళాశాలలో మంగళవారం డీఈఓ పర్యవేక్షణలో పీఎంశ్రీ జిల్లాస్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు భద్రాచలం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, కొత్తగూడెం, దమ్మపేట ఆరుజోన్ల నుంచి సుమారు 450 మంది విద్యార్థులు హాజరై ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. అయితే, క్రీడలు నిర్వహించిన మైదానం వద్ద విద్యార్థులకు నీడ లేకపోవడంతోపాటు తాగునీటి వసతి కూడా ఏర్పాటు చేయకపోవడంతో నానా అవస్థలు పడ్డారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికగుండాల: జిల్లాస్థాయి వాలీబాల్, ఖో–ఖో క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ సురేశ్ తెలిపారు. మంగళవారం పాల్వంచలో జరిగిన జిల్లాస్థాయి క్రీడల్లో గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని, వాలీబాల్, ఖో–ఖో క్రీడల్లో ప్రథమస్థానం, షాట్‌పుట్‌లో ద్వితీయ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. విజేతలకు కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ పతకాలు అందించారని చెప్పారు. ‘పర్షియన్ వానిషర్’ నవల ఆవిష్కరణ కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని వసుంధర – సుమంగళి అధినేత తాటిపల్లి శంకర్‌బాబు మనవరాలు అవ్యక్త గెల్లా రచించిన ‘పర్షియన్ వానిషర్’నవలను మంగళవారం కొత్తగూడెంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైశ్య ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాసగుప్తా మాట్లాడుతూ.. అవ్యక్త గెల్లా 13 ఏళ్ల వయస్సులోనే నవల రచించడం అభినందనీయమన్నారు. అనంతరం పాటల రూపంలో నవల సారాంశాన్ని వివరించడం ఆకట్టుకుంది. కార్యక్రమంలో దోపాటి వెంకటేశ్వరరావు, కోనేరు పూర్ణచందర్రావు, సాబీర్‌పాషా, రంగాకిరణ్, నాగా సీతారాములు, ఆళ్ల మురళి, తూము చౌదరి, కొదుమూరి శ్రీనివాస్, నాగేంద్రత్రివేది, అబ్దుల్ భాసిత్ పాల్గొన్నారు. వ్యక్తి అదృశ్యం అశ్వారావుపేటరూరల్: ఓ వ్యక్తి కనిపించకుండా పోయిన ఘటనపై మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ యాయతి రాజు కథనం ప్రకారం.. పట్టణంలోని పాత పేరాయిగూడేనికి చెందిన చిప్పనపల్లి రవీంద్ర కొద్దిరోజులుగా మద్యానికి బానిసై భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ నెల 28వ తేదీన అతిగా మద్యం సేవించి గొడపడి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని భార్య నాగేశ్వరి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పురపోరుకు సన్నాహాలు
ఇల్లెందు: మున్సిపల్ ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలో 117 మున్సిపాలిటీలు, ఆరు కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్‌కు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. వార్డులవారీగా హద్దులను ఖరారు చేసి దాని పరిధిలోని పోలింగ్ కేంద్రాలను గుర్తించే ప్రక్రియను అధికారులు చేపట్టారు. గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఇల్లెందు.. 136 ఏళ్ల చరిత్ర కలిగిన ఇల్లెందును 1986లో గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అంతకు ముందు 1964లో గ్రామపంచాయతీగా ఉంది. అనతి కాలంలోనే ఆనాటి పాలకులు నగర పంచాయతీగా మార్చారు. 1981 నాటి జనాభా లెక్కల ప్రకారం ఆనాడు 27 వేల పైచిలుకు ఓటర్లు, 50 వేల జనాభా 20 వార్డులు ఉండటంతో 1986లో గ్రేడ్–3 మున్సిపాలిటీగా గుర్తించారు. 1987లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో సీపీఎం నుంచి వై.వినయ్‌కుమార్ చైర్మన్‌గా గెలుపొందారు. అయితే, కాలక్రమేణా బొగ్గు బావులు మూత పడటంతో వేలాది మంది కార్మికులు, కుటుంబాలతో ఇతర ప్రాంతాలకు బదిలీపై తరలిపోయారు. దీంతో 1995లో నగర పంచాయతీగా మారిపోయింది. ఈ క్రమంలో 2000లో 43 వేల జనాభా, 28 వేల ఓటర్లు ఉండటంతో మళ్లీ మున్సిపాలిటీ హోదా లభించింది. 2005లో ఓటర్లు, జనాభా తగ్గింది. 2014లో జరిగిన ఎన్నికల్లో 33 వేల జనాభా, 27 వేల ఓటర్లకు తగ్గారు. 2020లో 24 వార్డులు 32,002 మంది ఓటర్లు, 50 వేల జనాభా ఉండగా ప్రస్తుతం 2025 నాటికి 33,732 మంది జనాబా, 32 వేల మంది ఓటర్లు, 24 వార్డులు ఉన్నాయి. తగ్గిన కార్మికులు ఇల్లెందుకు రైలు కలగానే మిగిలిపోయింది. ఇల్లెందు నుంచి మణుగూరు, కొత్తగూడెం, విజయవాడ, హైదరాబాద్, ఆదిలాబాద్ వరకు వెళ్లే సింగరేణి ప్యాసింజర్ రైలును రద్దు చేశారు. బొగ్గు గనులు మూతపడటంతో ఇల్లెందు జనాభాపై తీవ్ర ప్రభావం చూపింది. 1982లో ఇల్లెందులో ఐదు బొగ్గు బావుల్లో 6,838 ఉద్యోగులు పని చేశారు. 1985లో ఏడు బొగ్గు బావులు ఉండగా 7,258 ఉద్యోగులు పని చేశారు. 1988 నాటికి 9,092కు ఉద్యోగులు పెరగడంతో ఇల్లెందు కళకళలాడింది. తర్వాత బొగ్గు బావుల మూసివేతతో కార్మికుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఇల్లెందు ఏరియా ఉద్యోగుల సంఖ్య 450కి చేరింది. కాగా, మున్సిపాలిటీ పరిధిలో 32,002 మంది ఓటర్లు ఉండగా.. ఇందులో పురుషులు 15,515 మంది, మహిళా ఓటర్లు 16,487మంది వరకు ఉన్నారు. 24 వార్డుల్లోనూ బీసీలు అధికంగా ఉన్నారు. ఇప్పటి వరకు చైర్మన్లు వీరే.. ఇల్లెందు మున్సిపాలిటీ 1985లో ఏర్పడింది. 1986–91లో జరిగిన ఎన్నికల్లో సీపీఎం నుంచి వై.వినయ్‌కుమార్ గెలుపొందగా 1991–94 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 1995 నుంచి 2009 వరకు సీహెచ్ రాజమల్లు, 2000 నుంచి 2005 వరకు యదళ్లపల్లి అనసూర్య, 2005 నుంచి 2010 వరకు మొలబాబు, 2010 నుంచి 2014 వరకు ప్రత్యేక అధికారి పాలన సాగింది. 2014 నుంచి 2019 వరకు మడత రమావెంకట్‌గౌడ్, 2020 నుంచి 2025 వరకు దమ్మాలపాటి వెంకటేశ్వరరావు చైర్మన్లుగా ఉన్నారు. అశ్వారావుపేట 22 20,040 2,457 3,310 ఇల్లెందు 24 33,732 2,574 6,894 కొత్తగూడెం(కార్పొ) 60 1,70,897 30,904 33,287 ఏదులాపురం 32 38,210 4,024 8,770 కల్లూరు 20 22,748 3,732 5,516 మధిర 22 30,856 1,083 8,322 సత్తుపల్లి 23 31,857 1,996 4,765 వైరా 20 31,056 2,090 7,226 ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కసరత్తు -
మతోన్మాద రాజకీయాన్ని తిప్పికొట్టాలి
తిరుమలాయపాలెం: కేంద్రంలో బీజేపీ ఆలంబిస్తున్న మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా సీపీఎం శ్రేణులు సమశీల పోరాటాలకు సిద్ధం కావా లని పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పిలుపునిచ్చా రు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో మంగళవారం జరిగిన పాలేరు నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలు ఆర్థిక భారాలు మోయలేక ఉద్యమాల్లోకి రాకుండా మతోన్మాద రాజకీయాలు చేస్తూ రెచ్చగొడుతోందని ఆరోపించారు. ఈమేరకు సైద్ధాంతికంగా ఎదుర్కొనేలా సీపీఎం కార్యకర్తలు సిద్ధం కావడమేకాక ప్రజల సమస్యలపైనా పోరాడాలని సూచించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ఆరోపించారు. గ్రామపంచాయతీ స్థానిక ఎన్నికల్లో సీపీఎంకు మద్దతు ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లతో పాటు వార్డు సభ్యులను సన్మానంచారు. అనంరం పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ పాలేరు డివిజన్లో ఎనిమిది మంది సర్పంచ్‌లు, ఏడుగురు ఉప సర్పంచ్‌లు, 100కు పైగా వార్డుసభ్యులు గెలవడం అభినందనీయమన్నారు. పొన్నం వెంకటేశ్వరరావు, షేక్ బషీరుద్దీన్, బండి రమేష్, బండి పద్మ, ఎర్ర శ్రీనివాసరావు కూడా మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ -
వందేళ్ల వేడుకల్లో భాగస్వాములు కావాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచ: సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగస్వాములై విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా కోరారు. మంగళవారం ఆయన కొత్తగూడెంలోని శేషగిరిభవన్లో నిర్వహించిన పార్టీ పట్టణ విస్తృతస్థాయి సమావేశంతోపాటు పాల్వంచలోని గణేశ్‌సాయి ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల, పట్టణ విస్తృతస్థాయి సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కమ్యూనిస్టు పార్టీ వందేళ్ల చరిత్ర కార్మిక, కర్షక, పేద ప్రజల పోరాటాలతో ముడిపడి ఉందని, జనవరి 18న ఖమ్మంలో జరిగే బహిరంగ సభకు భారీగా తరలిరావాలని కోరారు. జనవరి 3 నుంచి 7వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ప్రచారజాత నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కమ్యూనిస్టు భావజాలం అవసరమని, ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ అగ్రభాగాన నిలబడి పోరాడుతుందని స్పష్టం చేశారు. ఆయా కార్యక్రమాల్లో కంచర్ల జమలయ్య, కందుల భాస్కర్, ఎస్కె ఫహీమ్, నేరెళ్ల రమేశ్, గోనె మణి, విజయలక్ష్మి, వంగా వెంకట్, గడ్డం రాజయ్య, ఎండీ యూసుఫ్, పిడుగు శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, గుత్తుల శ్రీనివాస్, పి.సత్యనారాయణచారి, తూముల శ్రీనివాస్, ముత్యాల విశ్వనాథం, వీసంశెట్టి పూర్ణచందర్రావు, రాహుల్, విశ్వేశ్వరరావు, పద్మజ, వెంకటేశ్వర్లు, అజిత్, రాంబాబు, శ్రీనివాసరావు, చెన్నయ్య, కృష్ణ, రామారావు, చేరాలు, రెహమాన్, యాకయ్య, జకరయ్య, సత్యనారాయణ, వెంకన్న, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు. -
మిస్ టీన్ ఇండియా ప్రీతికి సత్కారం
భద్రాచలంటౌన్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇటీవల నిర్వహించిన ‘ఫరెవర్ స్టార్ ఇండియా సీజన్–5’పోటీల్లో మిస్ టీన్ ఇండియా 2025 (తెలంగాణ విజేత)గా నిలిచిన భద్రాచలం వాసి ప్రీతియాదవ్ను బీఆర్ఎస్ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రావులపల్లి రాంప్రసాద్, మానే రామకృష్ణ, కోటగిరి ప్రబోధ్‌కుమార్, దానేశ్వరరావు, రేపాక పూర్ణచంద్రరావు, అకోజు సునీల్, అయినవోలు రామకృష్ణ, అజీమ్, కావూరి గోపి, మోహన్‌రావు, కావూరి సీతామహాలక్ష్మి, పూజల లక్ష్మి, తెల్లం రాణి పాల్గొన్నారు. బైక్‌ను ఢీకొట్టిన కారు.. అశ్వాపురం: మండలంలోని గోపాలపురం నుంచి కల్యాణపురం వరకు మణుగూరు – కొత్తగూడెం ప్రధాన రహదారిపై బైక్‌లను ఢీకొట్టి వేగంగా కార్లు ఆపకుండా వెళ్లిపోతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం మిట్టగూడెం గ్రామానికి చెందిన భారజల కర్మాగారం ఉద్యోగి గుండ్రెడ్డి రామిరెడ్డి బైక్‌పై భారజల కర్మాగారం విధులకు వెళ్లి తిరిగి వస్తుండగా అశ్వాపురం నుంచి మణుగూరు వైపు వెళ్తున్న కారు అతివేగంగా బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. రామిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు 108లో అశ్వాపురం పీహెచ్‌సీకి తరలించారు. పలుమార్లు కార్లు బైక్‌లను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిన ఘటనలు చోటుచేసుకుంటుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోపాలపురం, మిట్టగూడెం క్రాస్‌రోడ్డు, కల్యాణపురంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి దుమ్ముగూడెం: మండలంలోని చిన్నఆర్లగూడెం శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజుపేటకు చెందిన తుర్స నరసింహారావు (18) మృతి చెందాడు. మరొకరికి గాయాలయ్యాయి. తుర్స నరసింహారావు, తుర్స జంపన్న కలిసి ద్విచక్రవాహనంపై లక్ష్మీనగరం గ్రామానికి గ్యాస్ సిలిండర్ కోసం వచ్చారు. కాగ గ్యాస్ దొరక్క పోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా చిన్నఆర్లగూడెం శివారులో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. నర్సింహారావు అక్కడికక్కడే మృతిచెందగా.. జంపన్నకు తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి తండ్రి రాజు ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగావకాశాలు ఖమ్మం రాపర్తినగర్: నర్సింగ్ శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్(టామ్‌కామ్), కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యాన జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఖమ్మం జిల్లా ఉపాధికల్పన శాఖ అధికారి కొండపల్లి శ్రీరాం తెలిపారు. జర్మనీ భాషలో శిక్షణ ఇచ్చిన అనంతరం ఉద్యోగాలు కల్పన ప్రక్రియ చేపడుతారని వెల్లడించారు. బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం పూర్తి చేసి 1–3 ఏళ్ల ఆనుభవం ఉండడంతో పాటు 22నుంచి 38 ఏళ్ల వయస్సు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాల కోసం 94400 51581 నంబర్లో సంప్రదించాలని ఆయన సూచించారు. -
నిధులొస్తేనే ఊరట
చుంచుపల్లి: చాలాకాలంగా గ్రామపంచాయతీలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. కొత్తగా ఎన్నికై న పాలకవర్గాలు కూడా నిధుల లేమిపై ఒకింత ఆందోళనతోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పంచాయతీలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు మంజూరు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం ఊరట కలిగించినట్లయింది. మేజర్ పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5 లక్షల చొప్పున 2026 ఆరంభంలోనే ఎస్డీఎఫ్ నిధులిస్తామని కొండగల్ బహిరంగ సభలో సీఎం ప్రకటించారు. ఈ చొప్పున జిల్లాలో 471 గ్రామపంచాయతీలకు సుమారు రూ.26 కోట్ల మేర నిధులు అందనున్నాయి. చిన్న పంచాయతీల పరిస్థితి దయనీయం పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు నెలకు రూ.10.32 కోట్ల చొప్పున విడుదలవుతుంటాయి. వీటిని గ్రామ జనాభా ఆధారంగా పంచాయతీలకు పంచుతారు. ఇవి గ్రామాలకు ఎటూ సరిపోవడం లేదు. చిన్న పంచాయతీలకు రూ. 60 వేల నుంచి రూ.లక్షలోపే ఆర్థిక సంఘం నిధులు అందుతుండంతో ట్రాక్టర్ల నిర్వహణ, డీజిల్ ఖర్చులు, పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లులకే సరిపోతున్నాయి. ఇతర ప్రజోపయోగ కార్యక్రమాలకు నిధులు ఉండటంలేదు. దీంతో ఐదారేళ్లుగా చిన్న పంచాయతీల్లో పాలన మరింతగా కుంటుపడుతోంది. పెద్ద పంచాయతీలకు ఇంటి పన్నులతోపాటు ఇతర ఆర్థిక వనరులు ఉండటంతో కొంత వెసులుబాటు ఉంటోంది. కాగా సీఎం నిధులు విడుదల చేస్తే గ్రామాల్లో డ్రెయినేజీలు, సీసీ రోడ్లు నిర్మాణం, తాగునీటి వనరుల ఏర్పాటు తదితర అవసరాలకు వినియోగించుకునే వీలు కలుగుతుందని నూతన పాలకవర్గాలు భావిస్తున్నాయి. పంచాయతీల గత పాలకవర్గాల గడువు 2024 జనవరితో ముగియగా, ఆ తర్వాత 22 నెలలపాటు ప్రత్యేకాధికారుల పాలన సాగింది. పాలకవర్గం లేకపోవడం, ఆర్థిక సంఘం నిధులు కూడా రాకపోవడంవతో అభివృద్ధి కుంటుపడింది. రోజూవారీ కార్యక్రమాల నిర్వహణ ఖర్చులను కూడా పంచాయతీ కార్యదర్శులే భరించాల్చి వచ్చింది. ఇటీవల గ్రామ పంచాయతీల ఎన్నికల జరగ్గా, ఈ నెల 22న కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరారు. నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న గ్రామ పంచాయతీలకు ముఖ్యమంత్రి తీపి కబురు చెప్పడంతో కొత్త సర్పంచులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 471 గ్రామపంచాయతీలు ఉండగా, 8,67,927 మంది గ్రామీణ జనాభా ఉంది. వెయ్యిలోపు జనాభా కలిగిన గ్రామ పంచాయతీలు 166 కాగా, 1000 నుంచి 4 వేలలోఫు జనాభా ఉన్న పంచాయతీలు 282 వరకు ఉన్నాయి. 4 వేల నుంచి 10 వేల వరకు జనాభా కలిగిన పంచాయతీలు 18 వరకు ఉన్నాయి. ఇక 10 వేలకుపైగా జనాభా కలిగిన భద్రాచలం, సారపాక, అశ్వాపురం, సమితి సింగారం, కూనవరం 5 మేజర్ పంచాయతీలు ఉన్నాయి. ఎస్డీఎఫ్ నుంచి విడుదల చేస్తామని సీఎం ప్రకటన -
వెండి ఆభరణాలు బహూకరణ
బూర్గంపాడు: ముక్కోటి సందర్భంగా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలోని రామాలయానికి అదే గ్రామానికి చెందిన అత్తిపట్ల పుల్లయ్య, విజయ దంపతులు, అత్తిపట్ల వెంకటేశ్వరరావు, అరుణ దంపతులు, అత్తిపట్ల శ్రీను, ప్రవీణ దంపతులు వెండి ఆభరణాలను సోమవారం బహుకరించారు. శ్రీసీతారామ చంద్రస్వామివారికి రూ.1.80లక్షల విలువైన వక్షస్థల పాదుకలు, కర్ణపత్రాలు వెండి ఆభరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మురళీకృష్ణమాచార్యులు, ఆలయ కమిటీ ప్రతినిధులు మొండెద్దుల వెంకటేశ్వరరెడ్డి, దౌపాటి కృష్ణమూర్తి, బిజ్జం శ్రీనివాసరెడ్డి, మెట్టు నాగిరెడ్డి, బానోతు రామదాసు తదితరులు పాల్గొన్నారు. -
100 శాతం ఉద్యోగావకాశాలు
యువత శిక్షణ పొందాలని కలెక్టర్ పిలుపుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో లాజిస్టిక్స్ స్కిల్ కౌన్సిల్ (ఎల్ఎస్సీ), రెడింగ్టన్ ఫౌండేషన్(సీఓఎల్టీఈ) సహకారంతో శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు ఎంపికై న 26 మందిని సోమవారం కలెక్టరేట్ నుంచి ప్రత్యేక బస్సు ద్వారా ట్రైనింగ్ సెంటర్‌కు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన యువత ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతూ ఎక్కువ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్న రంగం లాజిస్టిక్స్ ఎక్స్స్పోర్ట్, ఇంపోర్ట్ రంగమని తెలిపారు. ఇందులో వంద శాతం ప్లేస్మెంట్ అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు శిక్షణ తీసుకోవాలని పిలుపునిచ్చారు. అత్యధిక మంది యువత ఉద్యోగాలు పొంది జిల్లాకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. -
లాహిరి..లాహిరి.. లాహిరిలో..
మంగళవారం శ్రీ 30 శ్రీ డిసెంబర్ శ్రీ 2025భద్రాచలం: భక్తుల జయజయ ధ్వానాలు, శ్రీరామనామస్మరణల నడుమ శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రస్వామి జలవిహారం చేస్తుండగా గోదావరి తీరం పులకించింది. కరకట్ట, స్నానఘాట్ల నిండుగా భక్త జనం వీక్షిస్తుండగా స్వామి వారు లాహిరి.. లాహిరి.. లాహిరిలో అంటూ జల విహారం చేశారు. భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం పవిత్ర గోదావరి నదిలో శ్రీ సీతారాముల తెప్పోత్సవం కనులపండువగా సాగింది. కట్టుదిట్టమైన భద్రత తెప్పోత్సవం సందర్భంగా ఎస్పీ రోహిత్‌రాజ్, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్ ఆధ్వర్యాన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, ముక్కోటి ఉత్సవ అధికారి శ్రీనివాసరావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజుతో పాటు జిల్లా అధికారులు తరలివచ్చారు. ముగిసిన పగల్‌పత్తు ఉత్సవాలు తెప్పోత్సవానికి ముందు ప్రధాన ఆలయంలో పగల్‌పత్తు ఉత్సవాలకు సంబంధించిన ప్రత్యేక పూజలు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం అనంతరం సేవాకాలం, తిరుమంగై అళ్వార్ పరమపదోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతి పూజలతో పగల్ పత్తు ఉత్సవాలు ముగిశాయి. ఆ తర్వాత గర్భగుడిలో ప్రభుత్వోత్సవం(దర్బార్ సేవ) నిర్వహించారు. నేటి నుంచి రాపత్తు సేవలు వైకుంఠ ఏకాదశి ముగిసిన తర్వాత శ్రీ సీతారామచంద్రస్వామి వారికి రాపత్తు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. స్వామివారికి వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మంగళవారం నుంచి జనవరి 12 వరకు ఈ సేవలు నిర్వహిస్తారు. తొలిరోజు శ్రీరామరక్షామండపం(డీఎస్పీ కార్యాలయ ప్రాంగణం) వద్ద రాపత్తు విలాసోత్సవం జరగనుంది.సోమవారం సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక పల్లకీపై ఊరేగింపుగా శ్రీ సీతారాముల వారు గోదావరి తీరానికి బయలుదేరారు. పల్లకి ముందు కోలాటాల నడుమ భక్తజనం కదిలింది. బారులుదీరిన భక్తుల మధ్య నుంచి గోదావరి తీరానికి చేరాక అర్చకులు ముందు పుణ్య జలాలతో హంసవాహనాన్ని సంప్రోక్షణ చేశారు. ఊరేగింపుగా వచ్చిన స్వామి వారిని హంసవాహనం చెంతకు తీసుకొచ్చారు. అందులో ఏర్పాటు చేసిన పచ్చిపూల మండపంలో తూర్పు ముఖంగా వేంచేపు చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు చతుర్వేదాలు, నాళాయిర దివ్యప్రబంధం, పంచసూత్రాలు పఠించారు. అనంతరం మంగళహారతి, చకె ్కరపొంగలి నివేదిస్తూ సుమారు గంట పాటు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చివరగా హారతి ఇచ్చి వీఐపీలకు దర్శనానికి అనుమతి ఇచ్చారు. నేడు ఉత్తర ద్వార దర్శనంబ్రహ్మకాలంలో ప్రారంభం కానున్న పూజలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు మంగళవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారంలో దర్శనమివ్వనున్నారు. ఏడాదిలో ఒకసారి మాత్రమే జరిగే ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భద్రగిరికి పోటెత్తారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా బ్రహ్మ కాలంలో ప్రత్యేక వాహనంపై ఆశీనులైన లక్ష్మణ సమేత సీతారాములను ఉత్తర ద్వారం వద్ద కొలువుదీరుస్తారు. వైకుంఠ ఏకాదశి వైభవం, మంగళ వాద్యఘంట, వేద పారాయణం తర్వాత ఆరాధన, శ్రీరామ షడాక్షరి మంత్ర సంపుటిత అష్టోత్తర శతనామార్చన వంటి పూజాదికాలు నిర్వహిస్తారు. ఉత్తర ద్వార దర్శన ప్రాశస్థ్యాన్ని స్థానాచార్యులు వివరించాక 108 వత్తులతో హారతి ఇస్తూ శరణాగతి గద్య విన్నపం చేస్తారు. ఆ తర్వాత వైకుంఠ ద్వారం తెరిచి భక్తులు దర్శన భాగ్యం కలిగిస్తారు. పూజా విశేషాలు ఇలా తెల్లవారు జామున 4.30 నుంచి ఉదయం 5 గంటల వరకు వైకుంఠ ఏకాదశి వైభవం 5 నుంచి 5:40 వరకు ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వార దర్శన విశిష్టత వివరణ ఆ తర్వాత 108 వత్తులతో హారతి.. శరణాగతి గద్యవిన్నపం ఉదయం 6 గంటలకు ఉత్తర ద్వారాలు నెమ్మదిగా తెరుచుకుంటుండగా ధూపాన్ని చీల్చుతూ హరతి వెలుగుల నడుమ స్వామివారి దర్శనం హంస వాహనంలో శ్రీ సీతారాముల జల విహారం పాంచరాత్ర ఆగమ శాస్త్రాన్ని అనుసరిస్తూ చేపట్టిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాక సాయంత్రం 6–03 గంటలకు హంస వాహనం కదిలింది. ఉత్తర దిశగా గోదావరి నదిలో ముందుకు సాగి, ఆ తర్వాత సవ్యదిశలో పరిక్రమణం ప్రారంభమైంది. విద్యుత్ దీప కాంతులతో ధగధగా మెరుస్తున్న హంస వాహనం, అందులో ఆశీనులైన సీతారాములను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. అప్పటికే పుష్కరఘాట్‌లో ఉన్న మెట్లన్నీ వేలాదిగా భక్తులతో నిండిపోయాయి. మెట్లపై స్థలం లేకపోవడంతో కరకట్టపైనా, లాకుల వద్దనున్న ఎత్తయిన ప్రాంతంలో నిలబడి సీతారాముల జల విహారాన్ని తిలకించారు. ఆ సమయంలో జై శ్రీరామ్ నామస్మరణతో గోదారి తీరం మార్మోగింది. ఐదు పర్యాయాలు స్వామివారు నదిలో విహరించగా, ఒక్కో పరిక్రమణానికి సగటున 13 నిమిషాల సమయం పట్టింది. తెప్పోత్సవాన్ని పురస్కరించుకుని గతేడాది తరహాలోనే గోదావరి తీరంలో పుష్కరఘాట్ దగ్గర ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికపై శాసీ్త్రయ, గిరిజన సంప్రదాయ నృత్య, గాన ప్రదర్శనలు కొనసాగాయి. తెప్పోత్సవం అనంతరం ఆగమ శాస్త్ర పద్ధతులు అనుసరిస్తూ సీతారాములను తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. -
అన్ని సంఘాలకు సమాన హోదా కల్పించాలి
రుద్రంపూర్: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం కాలపరిమితి ఈ నెల 27తో పూర్తయిందని, మళ్లీ ఎన్నికలు జరిగే వరకు అన్ని యూనియన్లకు సమాన హోదా కల్పించాలని హెచ్ఎంఎస్ అద్యక్షుడు రియాజ్ అహ్మద్ అన్నారు. సోమవారం కొత్తగూడెంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 2024లో గుర్తింపు సంఘం ఎన్నికకు సంబంధించిన హక్కు పత్రాలు అందాయని, అప్పటి నుంచి రెండేళ్ల (2026 సెప్టెంబర్ ) వరకు గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా చెలామణి అవుతాయని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ ఉవ్విళ్లు ఊరుతున్నాయని, ఇది సరికాదని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచే ప్రోటోకాల్ అమలు చేశారని, దీని వల్ల గడువు పూర్తయిందని వివరించారు. ట్రాన్స్‌కో, జెన్కోల నుంచి సింగరేణికి రావాల్సిన సుమారు రూ. 47 వేల కోట్లను వసూలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో వై.ఆంజనేయులు, ఎం శ్రీనివాస్, ఎండీ.ఆసీఫ్, బి. సుమన్ తదితరులు పాల్గొన్నారు. మాస్టర్ అథ్లెటిక్స్‌లో ప్రతిభదుమ్ముగూడెం : మండలంలోని గౌరారం బాలికల ఆశ్రమ పాఠశాల జీవశాస్త్రం ఉపాధ్యాయుడు తోలం శ్రీనివాసరావు లాంగ్ జంప్‌లో రజత, 100 మీటర్ల పరుగులో కాంస్య పతకం సాఽధించాడు. ఈ నెల 27, 28 తేదీల్లో కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో ఆయన ప్రతిభ చాటాడు. ఈ సందర్భంగా శ్రీనివాసరావును హెచ్ఎం మడకం మోతీరు తదితరులు అభినందించారు. భద్రాద్రికి భక్తుల పాదయాత్రభద్రాచలంటౌన్: ఎన్టీఆర్ జిల్లా సత్యలపాడు మండలం గంపలగూడెం గ్రామానికి చెందిన సుమారు 550 మంది రామభక్తులు సోమవారం పాదయాత్రగా శ్రీసీతారామచంద్ర స్వామివారిని పల్లకీలో మోసుకుంటూ భద్రాచలం చేరుకున్నారు. ఈ నెల 25న గంపలగూడెం నుంచి బయలుదేదారు. భద్రాద్రి పుణ్యక్షేత్రానికి చేరుకుని గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్నారు. ఐదు రోజులపాటు సాగిన ఈ పాదయాత్రలో మహిళలు, వృద్ధులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. 4న పెరిక సంఘం సమావేశంకరకగూడెం: జిల్లా పురగిరి క్షత్రియ (పెరిక) సంఘం నూతన కమిటీ ఎన్నిక, సర్వసభ్య సమావేశం జనవరి 4న పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద గల భవానీ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర పెరిక సంఘం అధ్యక్షుడు యర్రంశెట్టి ముత్తయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి రంగారావు తెలిపారు. సోమవారం కరకగూడెం మండలంలోని అనంతారం, కరకగూడెం, భట్టుపల్లి గ్రామాల్లో కరపత్రాలు ఆవిష్కరించి మాట్లాడారు. నాయకులు అంకతి ఉమామహేశ్వరరావు, పూజారి వెంకటేశ్వర్లు, తిప్పని శ్రీనివాసరావు, అంకతి మల్లి కార్జున్ రావు, చిట్టి వెంకటేశ్వర్లు, అత్తె నాగేశ్వరరావు, కొమ్మ ప్రసాద్, అత్తె సత్యం, బాలరాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 3,189 మెట్రిక్ టన్నుల యూరియా చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు సీఐఎల్ కంపెనీకి చెందిన 3,189.42 మెట్రిక్ టన్నుల యూరియా సోమవారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,499.42 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి జిల్లాకు 450 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 1,040 మెట్రిక్ టన్నులు కేటాయించారు. మిగతా మిగతా 200 మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేసిన ఏఓ (టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల పోస్టర్లు ఆవిష్కరణఖమ్మంమయూరిసెంటర్/చింతకాని: సీపీఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా వచ్చేనెల 18న ఖమ్మంలో నిర్వహించే బహిరంగ సభ పోస్టర్లను సోమవారం గిరిప్రసాద్ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగే సభకు ఐదు లక్షల మందిని సమీకరిస్తున్నట్లు తెలిపారు. దేశం నలుమూలల నుంచి పార్టీకి ప్రాతి నిధ్యం వహిస్తున్న నాయకులతో పాటు40 దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. అలాగే, 19, 20వ తేదీల్లో సీపీఐ జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఖమ్మంలో నిర్వహించనున్నట్లు తెలి పారు. కాగా, బహిరంగ సభ విజయవంతానికి ఖమ్మంలోని పలు కూడళ్లలో ప్రచారం చేయగా సీపీఐ నగర కార్యదర్శి ఎస్కే.జానీమియా మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్, నాయకులు మహ్మద్ సలాం, యానాలి సాంబశివరెడ్డి, చెరుకుపల్లి భాస్కర్, యాకన్న, ఆరెంపుల సతీష్, పాల్గొన్నారు. -
‘ఆది కర్మయోగి’ లఘు చిత్రానికి ప్రశంస
చర్ల: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్, షార్ట్ ఫిల్మ్, పాటల పోటీల్లో చర్ల మండలానికి చెందిన ఆదివాసీ యువకులు రూపొందించిన ఆది కర్మ యోగి లఘు చిత్రం ప్రశంసలు అందుకుంది. సోమవారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో లఘు చిత్రానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దిల్ రాజు సమక్షంలో ప్రశంసాపత్రం అందజేశారు. లఘు చిత్రానికి లక్ష్మణ్‌కుమార్ దర్శకత్వం వహించగా, సరవనన్ నిర్మాతగా వ్యవహరించారు. కోర్సా శివప్రసాద్, కారం వైష్ణవి, మడివి మహేష్, తెల్లం కవిత, మీడియం అర్జున్, మునగల నానాజీ, దుబ్బ వినోద్, కుంజ అశోక్ తదితరులు నటించారు. అనుమతిలేని వ్యాపారులకు జరిమానా ఇల్లెందు: లైసెన్స్ లేకుండా పంట ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న వ్యాపారులకు మార్కెటింగ్ శాఖ అధికారులు జరిమానా విధించారు. సోమవారం ఇల్లెందు మార్కెట్ కమిటీ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి సుచిత్ర, మూడో గ్రేడ్ కార్యదర్శి నరేష్కుమార్ ఇల్లెందు, రొపేడులలో తనిఖీలు చేపట్టారు. అనుమతుల్లేని రైస్ మిల్లులు, ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోళ్ల దుకాణాలను సోదా చేశారు. ఓ వ్యాపారికి, రూ.16,800, మరో వ్యాపారికి రూ. 10 వేలు జరిమానా విధించారు. ఇతర వ్యాపారుల గోదాంలను తనిఖీ చేసి సరుకు స్టాక్, రికార్డులను పరిశీలించారు. రికార్డు రాయని వ్యాపారులకు నోటీస్‌లు జారీ చేశారు. కాగా మార్కెట్ అధికారులపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్లో బెదిరింపులకు పాల్పడినట్లు, ఇదే తరహాలో జరిమానాలు విధిస్తే ఏసీబీ ట్రాప్ చేయిస్తామని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అటవీశాఖ ఉద్యోగి ఇంట్లో అక్రమంగా కలప నిల్వ● స్వాధీనం చేసుకున్న అధికారులు జూలూరుపాడు: మండలంలోని పాపకొల్లు గ్రామంలో ఓ అటవీ ఉద్యోగి నివాసంలో నిల్వ చేసిన కలపను అటవీశాఖ అధికారులు ఆదివారం రాత్రి పట్టుకున్నారు. అటవీ ఉద్యోగి తన నివాసంలో టేకు, నారవేప దుంగలను నిల్వ చేసినట్లు సమాచారం తెలియడంతో అధికారులు దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న కలపను జూలూరుపాడు ఎఫ్ఆర్ఓ కార్యాలయానికి తరలించారు. స్థానిక అటవీ నర్సరీలో ఎండిపోయిన టేకు చెట్లను కోసి సైజు దుంగలు, నారవేప దుంగలను అటవీ ఉద్యోగి తన ఇంట్లో దాచినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై జూలూరుపాడు ఎఫ్ఆర్ఓ జి.ప్రసాద్‌రావును వివరణ కోరగా.. అటవీ ఉద్యోగి ఇంట్లో నిల్వ చేసిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. -
ఇక మున్సిపోల్‌కు సన్నద్ధం!?
● కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో ఓటర్ల జాబితాకు నోటిఫికేషన్ ● వచ్చేనెల 10న వార్డుల వారీగా తుదిజాబితా ● నోటిఫికేషన్లో కానరాని కేఎంసీ, మణుగూరు మున్సిపాలిటీ ● ఫిబ్రవరిలో ఎన్నికలు ఉంటాయని ప్రచారంఖమ్మంమయూరిసెంటర్: గ్రామపంచాయతీ ఎన్నికలు ముగియడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సోమవారం నోటిఫికేషన్ జారీచేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఐ.రాణి కుముదిని విడుదల చేసిన నోటిఫికేషన్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లోని పలు మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ వివరాలు ఉన్నాయి. అయితే, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, మణుగూరు మున్సిపాలిటీ వివరాలను ఇందులో పొందుపర్చలేదు. కేఎంసీలో డివిజన్ల పెంపు ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వానికి చేరిన నేపథ్యాన స్పష్టత వచ్చాకే ఓటర్ల జాబితా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా రూపకల్పనపై నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యాన ఫిబ్రవరిలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగుతాయనే చర్చ మొదలైంది. నేటి నుండి ప్రారంభం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో తుది ఓటర్ల జాబితా రూపొందించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మంగళవారం పోలింగ్ కేంద్రాల డేటాను మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా సర్దుబాటు చేయడంతో మొదలుపెట్టి జనవరి 10న వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రచురణతో ముగిస్తారు. ఈనెల 31న వార్డుల వారీగా డేటా పునర్వ్యవస్థీకరణ, జనవరి 1న ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరించాక జనవరి 5, 6వ తేదీల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. చివరగా 10వ తేదీన పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. ఈ జాబితాను 2025 అక్టోబర్ 1 నాటి అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల జాబితా ఆధారంగా రూపొందిస్తున్నట్లు ఎన్నికల సంఘం నోటిఫికేషన్లో వెల్లడించింది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం వివరాలను ఉత్తర్వుల్లో పొందుపరిచారు. వార్డులు, జనాభా వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్, రెండు మున్సిపాలిటీలు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి. కొత్తగూడెం కార్పొరేషన్ పరిధి లో 60 వార్డులకు గాను 2011 లెక్కల ప్రకారం జనాభా 1,70,897గా ఉంది. ఇందులో ఎస్సీ జనాభా 33,287, ఎస్టీ జనాభా 30,904గా నమోదైంది. అలాగే, 24 వార్డులతో ఉన్న ఇల్లెందు మున్సిపాలిటీ జనాభా 33,732 కాగా, ఇందులో ఎస్సీలు 6,894, ఎస్టీలు 2,574 మంది ఉన్నారు. ఇక అశ్వారావుపేట మున్సిపాలిటీ 22 వార్డులను కలిగి ఉండగా.. 20,040 మంది జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ జనాభా 3,310, ఎస్టీలు 2,457 మంది ఉన్నారు. ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగే అవకాశముంది. ఏదులాపురం మున్సిపాలిటీ జిల్లాలో అత్యధికంగా 32 వార్డులు కలిగి ఉంది. ఇక్కడ 38,210 మంది జనాభాకు గాను ఎస్సీ జనాభా 8,770, ఎస్టీ జనాభా 4,024 మంది ఉన్నారు. సత్తుపల్లి 23 వార్డులతో 31,857 జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ జనాభా 4,765, ఎస్టీ జనాభా 1,996 ఉన్నారు. వైరా 20 వార్డులతో 31,056 జనాభా కలిగి ఉంది. ఇందులో ఎస్సీ జనాభా 7,227, ఎస్టీ జనాభా 2,090 మంది ఉన్నారని నోటిఫికేషన్ పొందుపరిచారు. మధిర మున్సిపాలిటీ 22 వార్డులకు గాను 30,856 జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ 8,322, ఎస్టీలు 1,083 మంది ఉన్నారు. కల్లూరు 20 వార్డులతో ఇటీవల మున్సిపాలిటీగా ఏర్పడగా 22,748 జనాభా ఉన్నారు. వీరిలో ఎస్సీ జనాభా 5,516, ఎస్టీ జనాభా 3,732 మంది ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. -
మణిహారంగా ఎర్త్ సైన్సెస్..
కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైనింగ్‌ను యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా మార్చుతూ ఈ ఏడాది జూన్ 5న రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి జూలై 9న డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. 300 ఎకరాల విస్తీర్ణంలో గల ఈ యూనివర్సిటీలో యూజీ, పీజీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభం కాగా 50 మందికి పైగా విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. జాతీయ స్థాయిలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చే మణిహారంగా మారిన యూనివర్సిటీని ఈనెల 2న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అయితే నూతన భవనాలు, తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు కాక విద్యార్థులు, అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నారు. ఇక కొత్తగూడెంలో ప్రారంభమైన కేంద్రీయ విద్యాలయంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి సెంట్రల్ సిలబస్ బోధించనున్నారు. దీంతో విద్యార్థులకు కొంత ప్రయోజనం కలగనుంది. -
యాచకురాలు మృతి
జూలూరుపాడు: జూలూరుపాడులో ఓ యాచకురాలు(50) సోమవారం మృతి చెందింది. ఎస్ఐ బాదావత్ రవి కథనం ప్రకారం... యాచకురాలు జూలూరుపాడు, వెంగన్నపాలెం గ్రామాల్లో కొంతకాలంగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. జూలూరుపాడు ఇండియన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఓ టైర్ పంచర్ వర్క్ షాపు వద్ద ఆమె విగతజీవిగా పడి ఉండగా, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆమె వివరాలు లభ్యం కాలేదు. మృతురాలు కనకంబరం రంగు చీర, లేత పచ్చరంగు స్వెట్టర్ ధరించి ఉంది. సర్పంచ్, పంచాయతీ సెక్రటరీ, స్థానికుల సహాయంతో మృతదేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. వివరాలు తెలిస్తే నంబర్లో 87126 82041 సంప్రదించాలని పోలీసులు కోరారు. చికిత్స పొందుతున్న వ్యక్తి.. దమ్మపేట: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తి సోమవారం మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం... సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామానికి చెందిన నీరజ్‌కుమార్(20) ములకలపల్లి మండలం పూసుగూడెం గ్రామానికి చెందిన సోయం ప్రవీణ్, దుష్యంత్ ఈ నెల 19న రాత్రి సమయంలో కారులో పాల్వంచ నుంచి దమ్మపేట వైపు వస్తున్నారు. మండల పరిధిలోని గుర్వాయిగూడెం శివారులో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి ముగ్గురూ గాయపడ్డారు. నీరజ్కుమార్ను విజయవాడ తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సాయికిషోర్ రెడ్డి తెలిపారు. -
రిజర్వ్ ఫారెస్టులో బోరు వేస్తున్న లారీ సీజ్
కారేపల్లి: కారేపల్లి ఫారెస్టు రేంజ్ పరిధి చీమలపాడు రిజర్వు ఫారె స్టు ప్రాంతంలో బోర్ వేస్తున్నారనే సమాచారంతో అటవీఉద్యోగులు తనిఖీలు చేపట్టారు. రాఘబోయినగూడెం నార్త్ బీట్‌లో ఆదివారం తెల్లవారుజామున తనిఖీ చేస్తుండగా బోరువెల్ లారీని గుర్తించి సీజ్ చేసినట్లు ఎఫ్డీఓ మంజుల తెలిపా రు. ఈమేరకు లారీని కారేపల్లి కార్యాలయానికి తరలించి ముగ్గురిపై కేసు నమోదు చేశామనివెల్లడించారు. రిజర్వ్ ఫారెస్టు ప్రాంతంలో అక్రమంగా తవ్వ కాలు చేపట్టినా, బోర్లు వేసినా బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈమేరకు సోమవారం కారేపల్లిలో సదస్సు నిర్వహించి అవగాహన కల్పించారు. ఎఫ్ఎస్ఓ పి.కిషోర్‌కుమార్, ఎఫ్‌బీఓలు సైదా, ఉష తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి దిశగా అడుగులు..
కొత్తగూడెంఅర్బన్: విద్యా, పారిశ్రామిక రంగాల్లో జిల్లా అభివృద్ధి దిశగా పయనిస్తున్నా.. నిధుల కొరతతో పనుల్లో జాప్యం జరుగుతోంది. పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో ఈ ఏడాది చెప్పుకోదగిన అభివృద్ధి, కొత్త ప్రాజెక్టులు లేకున్నా కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో మాత్రం అడుగులు ముందుకు పడుతున్నాయి. 60 డివిజన్లతో కార్పొరేషన్.. మున్సిపాలిటీలుగా ఉన్న కొత్తగూడెం, పాల్వంచతో పాటు సుజాతనగర్ మండలంలోని ఏడు గ్రామ పంచాయతీలను కలిపి 60 డివిజన్లతో జూన్ 2న కొత్తగూడెం కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ చేశారు. రెండు నెలల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు నిధులు కేటాయించగా, కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో చేపట్టాల్సిన పనుల ప్రతిపాదనలను అధికారులు సిద్ధం చేశారు. రాబోయే 20 సంవత్సరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్‌ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. ఇక జిల్లాకు ఈ ఏడాది రూ.7,700.87 కోట్ల రుణ ప్రణాళిక ఖరారు చేయగా.. రైతులు, స్వయం సహాయక సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ పథకాలకు కేటాయించారు. రైల్వేలైన్ పనుల్లో జాప్యం జిల్లాలోని పాండురంగాపురం నుంచి ఒడిశాలోని మల్కన్‌గిరి వరకు రైల్వే లైన్ నిర్మాణ పనులు మంజూరు కావడం శుభ పరిణామమే అయినా.. కేంద్రం చొరవ చూపి నిధులు విడుదల చేస్తేనే పనులు ప్రారంభమవుతాయి. ఇక పాండురంగాపురం నుంచి సారపాక రైల్వే లైన్ పనులు కూడా అసంపూర్తిగానే ఉన్నాయి. ఈ లైన్ పూర్తయితే భద్రాచలం వెళ్లే భక్తులకు సౌకర్యాలు మెరుగయ్యే అవకాశం ఉంది. వీటికి నిధులు విడుదల చేయాలని, ఈ మేరకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. ● లక్ష్మీదేవిపల్లి మండలం ముర్రేడువాగుపై రిటర్నింగ్ వాల్ నిర్మించాలి. ప్రతీ ఏడాది వర్షాకాలం నీటి వదర వస్తే ఈ వాగు సమీపంలోని ఇళ్లన్నీ ముంపునకు గురవుతున్నాయి. ● కొత్తగూడెం కార్పొరేషన్‌గా ఏర్పాటైనా ఇప్పటివరకు చెప్పుకోదగిన అభివృద్ధి పనులేవీ జరగలేదు. ప్రజలకు ఆహ్లాదం పంచేలా పార్కులు, సుందరీకరణ పనులు, అభివృద్ధి పనులు చేయాల్సిన అవసరముంది. -
ఎదగని వరినారు
చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో వరినారుపై తీవ్రప్రభావం పడుతుంది. రైతులు సాయంత్రం నారు మళ్లలోని నీటిని బయటకు వదిలేయాలి. రాత్రి వేళ నారుమళ్లలో నీరు ఉంచకూడదు. ఉదయం కొత్తనీరు పెట్టుకోవాలి. చలి వల్ల జింక్ లోపం వచ్చే అవకాశాలున్నాయి. దీని నివారణకు జింక్‌ను నారుపై పిచికారీ చేయాలి. వీలైతే మంచు పడకుండా టార్పాలిన్లు, కవర్లు కప్పుకుంటే నారు తొందరగా ఎదుగుతుంది. – బి.తాతారావు, ఏడీఏ, మణుగూరు డివిజన్బూర్గంపాడు: పదిహేను రోజులుగా పెరుగుతున్న చలి, రాత్రి వేళ పడిపోతున్న ఉష్ణోగ్రతలు, కురుస్తున్న మంచు వరినారుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. నారు ఎదగకపోవడంతో వరినాట్లు ఆలస్యమవుతున్నాయి. రైతులు జాగ్రత్తలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. యాసంగిలో జిల్లాలో 80వేల ఎకరాల్లో వరిసాగు చేయనున్నారు. వరినారు పోసిన రైతులు నాట్లు వేసుకునేందుకు భూములు సిద్ధం చేసుకున్నారు. అక్కడక్కడా నాట్లు మొదలుపెట్టారు. నారు పోశాక 25 రోజుల నుంచి నాటు వేస్తారు. ప్రస్తుతం 25రోజులు దాటినా వరినారు నాట్లు వేసే దశకు చేరలేదు. చలి తీవ్రత, మంచు ప్రభావంతో ఎదగలేదు. చలితో నారు సరిగా మొలకెత్తలేదు. మొలిచినా చలితీవ్రతతో పసుపు రంగులోకి మారి ఎర్రబడుతోంది. వెరసి యాసంగి వరినాట్లు పదిహేను రోజులు ఆలస్యమయ్యే పరిస్థితి నెలకొంది. నెలరోజుల్లోపు నాటితేనే దిగుబడి యాసంగిలో రైతులు స్వల్పకాలిక రకాలను సాగు చేస్తున్నారు. వరినారు నెలరోజుల్లోపు, లేత దశలో నాటుకుంటేనే సరైన దిగుబడి వస్తుంది. వరి నాటాక నెలరోజుల వ్యవధిలోనే దుబ్బు చేస్తుంది. నాట్లు ఆలస్యమైతే దుబ్బు చేసే కాలం తగ్గి, దుబ్బు సరిగ్గా చేయదు. చీడపీడలు కూడా ఆశిస్తాయి. దీంతో దిగుబడులపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చలి తీవ్రత నుంచి వరినారును కాపాడుకునేందుకు రైతులు సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. రాత్రివేళల్లో నీరు నిల్వ ఉండకుండా చేస్తున్నారు. ఎరువులు వేస్తే నారు ఎదిగేందుకు గ్రోత్ ప్రమోటర్లను పిచికారీ చేస్తున్నారు. కొందరు రైతులు నారుమళ్లలో నీటిని ఉదయం, సాయంత్రం మారుస్తున్నారు. అయినా వాతావరణ పరిస్థితులతో నారు అనుకున్న స్థాయిలో ఎదగడంలేదు. -
సిబ్బంది కృషితోనే ఐటీడీఏకు గుర్తింపు
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ యూనిట్ అధికారుల నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకు అందరూ ఐక్యతతో పనిచేయడం వల్లే రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు, మంచి పేరు వచ్చాయని పీఓ బి.రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో వివిధ విభాగాల అధికారులతో ఆయన సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సంస్థ సాధించిన విజయాలను వివరించారు. ఆశ్రమ పాఠశాలల్లో ‘పది’ ఫలితాలు మెరుగ్గా రావడం, క్రీడల్లో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించడం అభినందనీయమన్నారు. గిరిజన మ్యూజియం ఏర్పాటుతో వారి సంస్కృతి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, కోయ భాషాభివృద్ధికి, గోత్రాలపై బుక్లెట్ రూపకల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిరుద్యోగులకు డ్రైవింగ్ శిక్షణతో పాటు త్వరలో గ్రూప్స్ శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మహిళా స్వయం ఉపాధికి ఎంఎస్ఎంఈ ద్వారా ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నామన్నారు. గిరి బజార్ ద్వారా గిరి మాల్ట్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. గిరిజనులకు మరిన్ని సేవలు అందించేందుకు వచ్చే ఏడాదికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, సిబ్బంది సమయపాలన పాటిస్తూ మరింత ఉత్సాహంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏపీఓ డేవిడ్‌రాజ్, ఆర్సీఓ అరుణకుమారి, ఏఓ సున్నం రాంబాబు, అధికారులు లక్ష్మీనారాయణ, సమ్మయ్య, వేణు తదితరులు పాల్గొన్నారు. మహిళా గ్రూపునకు రూ.లక్ష చెక్కు.. ఆదివాసీ గిరిజన మహిళలు ఐకమత్యంతో కుటీర పరిశ్రమలు నెలకొల్పి ఆర్థికాభివృద్ధి సాధించాలని పీఓ రాహుల్ అన్నారు. చర్ల మండలం సున్నం గుంపు గ్రామానికి చెందిన ‘శ్రీ ముత్యాలమ్మ జాయింట్ గిరిజన మహిళా సొసైటీ’ సభ్యులకు ఆహార పదార్థాల తయారీ, సామగ్రి కొనుగోలుకు రూ.లక్ష చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పపువ్వు లడ్డూలు, నల్లేరు పచ్చడి వంటి పోషక పదార్థాల తయారీతో పది మందికి ఉపాధి కల్పించడం అభినందనీయమన్నారు. ఈ నిధులతో సోలార్ కుక్కర్లు, డ్రమ్ములు, గ్యాస్‌స్టవ్ వంటి పరికరాలు కొనుగోలు చేసి పరిశ్రమను లాభాల బాటలో నడపాలని సూచించారు. కార్యక్రమంలో జేడీఎం హరికృష్ణ, గ్రూప్ సభ్యులు సమ్మక్క, రమాదేవి, ఈశ్వరి, శిరీష పాల్గొన్నారు. -
సమన్వయంతో పని చేయండి
● జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను విజయవంతం చేయాలి ● డీఈఓ నాగలక్ష్మి సూచనపినపాక: మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో జనవరి 7 నుంచి నిర్వహించే అండర్ –17 జాతీయస్థాయి కబడ్డీ పోటీల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఈఓ నాగలక్ష్మి సూచించారు. ఈ బయ్యారం జెడ్పీ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతమైన బయ్యారంలో జాతీయ స్థాయి పోటీలు నిర్వహించడం గర్వించదగిన విషయమన్నారు. పోటీల నిర్వహణకు అధికారులతో పాటు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా సహకరించాలని కోరారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే క్రీడాకారుల రవాణా, వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో ఎంఈఓ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. -
అప్పులే మిగిలాయి
ఆరుగాలం శ్రమిస్తే.. ప్రకృతి వైపరీత్యాలతో ఏడాదంతా రైతులకు కష్టాలు, కడగండ్లే ఎదురయ్యాయి. తొలకరిలో సమృద్ధిగా వర్షాలు కురిసినా ఆగస్టు, సెప్టెంబర్‌లో అధిక వర్షపాతం నమోదు కావడంతో పంటలు దెబ్బతిన్నాయి. అంచనాకు మించి సాగు చేసిన పత్తి, వరి పంటలు నష్టాన్నే మిగిల్చాయి. వానాకాలం సీజన్లో జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5,91,714 ఎకరాలుకాగా, 6,11,512 ఎకరాల్లో పంటలు సాగు చేశారు. పత్తి దిగుబడి, మిర్చి ధర తగ్గి రైతులు ఆర్థికంగా కుదేలయ్యారు. –సూపర్‌బజార్ (కొత్తగూడెం)తగ్గిన మిర్చి సాగు జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోయింది. గతేడాది 10,283 ఎకరాల్లో సాగు చేయగా, ఈ ఏడాది 4,482.11 ఎకరాల్లో మాత్రమే వేశారు. విదేశాల నుంచి ఆర్డర్లు లేకపోవడంతో ఇక్కడ ప్రధానంగా సాగు చేసే ‘తేజా’ రకం మిర్చికి డిమాండ్ తగ్గింది. క్వింటాల్ ధర రూ.20 వేల నుంచి రూ.12 వేలకు పడిపోయింది. పెట్టుబడి ఖర్చులు పెరగడంతోపాటు తెగుళ్ల ప్రభావంతో దిగుబడి కూడా తగ్గింది. దీంతో రైతులకు పెట్టుబడి కూడా రాలేదు. ఆయిల్ పామ్‌పై మొగ్గు జిల్లాలో ఈఏడాది ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం గణనీ యంగా పెరిగింది. ప్రభుత్వం ఎకరాకు రూ.50వేల వరకు ప్రోత్సాహకాలను అందిస్తుండటం,నేలలు, నీటి వనరులు అనుకూలంగా ఉండటం, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే పంట కావడంతో రైతులు మొ గ్గు చూపారు. జిల్లాలో 19,968 మంది రైతులు 80, 635.62 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. యూరియా కష్టాలు జిల్లాలో పంటల సాగుకు ఏప్రిల్ నుంచి 46,679 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా, 38,098 మెట్రిక్ టన్నులు సరఫరా చేశారు. పంటల సాగువిస్తీర్ణం పెరగగా, యూరియా సరఫరా తగ్గడం తో రైతులు పడరాని పాట్లు పడ్డారు. సహకార సంఘాల వద్ద రోజుల తరబడి బారులుదీరారు. సకా లంలో, అవసరమైన యూరియా లభించక పంట దిగుబడులపై ప్రభావం పడింది. యాసంగి సీజన్లో కూడా యూరియా కష్టాలు మొదలయ్యాయి. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. 63,614 మంది రైతులు వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాల్లో రూ. 455.33 కోట్లను మాఫీ చేసింది. పంటల సాగుకు పెట్టుబడిగా రైతు భరోసా పథకం పేరిట ఎకరాకు రూ.6 వేల చొప్పున గడిచిన వానకాలం సీజన్‌కు 1,78,380 మంది రైతులకు రూ. 318.69 కోట్లను అందించారు. రైతు బీమా పథకం కింద 221 మంది కుటుంబాలు అర్హులు కాగా, ఇప్పటివరకు 168 మందికి రూ. 8.40 కోట్లు జమ చేశారు. ఇంకా 53 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. యాసంగి సీజన్ ప్రారంభం యాసంగి సీజన్లో 1,56,667 లక్షల ఎకరాల్లో ప్రధాన పంటల సాగవుతాయని వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. వానాకాలంలో వరి, పత్తి పంటలతో నష్టపోయిన రైతులు మొక్కజొన్న సాగుపై దృష్టి సారించారు. మాగాణి పొలాలు దున్నుతూ వెదజల్లే పద్ధతిలో వరి విత్తుతున్నారు. పలుచోట్ల వరినార్లు పోశారు. నీటి వనరుల ఆధారంగా వరి 79 వేలు, మొక్కజొన్న 69వేల ఎకరాలతోపాటు పెసర, మిను ము, వేరుశనగ పంటల సాగు లక్ష్యాలను వ్యవసాయ శాఖ ఖరారు చేసి ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఒడిదుడుకులతో సాగిన వ్యవసాయం పంటల ఉత్పత్తి దశలో కురిసిన వర్షాలు రైతులకు నష్టాలను మిగిల్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన వానలతో పాటు అక్టోబర్‌లో సంభవించిన మోంథా తుపాను పంటలను దెబ్బతీశాయి. అధిక వానలతో పూత, కాత దశలో ఉన్న పత్తికి తీరని నష్టం వాటిల్లింది. ఎకరాకు సగటున 10 నుండి 12 క్వింటాళ్ల వరకు రావాల్సిన దిగుబడులు 5 నుండి 6 క్వింటాళ్లకు పడిపోయింది. తుపానుతో కోత దశలో ఉన్న వరి పంట నేలవాలగా, పత్తి పింజలు నల్లబడి కారిపోయాయి. ఆగస్టులో కురిసిన వర్షాలతో 50 మంది రైతులకు చెందిన 28.05 ఎకరాల్లో పంట లకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. రూ. 2,81,000 నష్టం జరిగిందని నివేదిక ఇచ్చారు. పంటనష్టం వేల ఎకరాల్లో జరిగినా సర్వే లోపాలతో అధికారులు అన్యాయం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలతో జిల్లాలో పంటల సా గు సంతృప్తికరంగా ఉంది. సంప్రదాయ పంట వరి సాగు విస్తీ ర్ణం పెరిగింది. అధిక వర్షపాతం వల్ల పత్తిదిగుబడిపై ప్రభావం చూపింది. మిర్చి విస్తీర్ణం తగ్గింది. యాసంగి సాగు ప్రారంభమైంది. –ఽవి.బాబూరావు, జిల్లా వ్యవసాయాధికారి -
ముగ్ధమనోహరం.. శ్రీకృష్ణావతారం
భద్రాచలం: ముగ్ధమనోహరమైన రూపం... చూడచక్కని ఆకారం, కిరీటంపై నెమలి ఈకలు.. చెంతనే సీతామహాదేవి, పక్కన లక్ష్మణస్వామితో బంగారపు ఊయలలో ఊగుతున్న రామయ్యకు భక్తులు నీరాజనం పలికారు. భద్రగిరి రామయ్య శ్రీకృష్ణావతారంలో దర్శనమివ్వగా భక్తులు వీక్షించి తరించారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా రామాలయంలో జరుగుతున్న పగల్‌పత్తు ఉత్సవాలను పురస్కరించుకుని చేపడుతున్న స్వామివారి ఆవతారాలు ఆదివారం నాటి శ్రీకృష్ణావతారంతో ముగిశాయి. రాత్రి వేళ నిర్వహించిన ఏరు ఉత్సవం అలరించగా, నేటి తెప్పోత్సవానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. వైభవోపేతంగా కిట్టయ్యకు ఊంజల్ సేవ శ్రీ కృష్ణావతారుడైన శ్రీసీతారామ చంద్రస్వామివారికి వైభవోపేతంగా ఊంజల్ సేవ జరిపారు. ఆస్థాన విద్వాంసులు కీర్తనలు ఆలపించారు. అనంతరం హారతి సమర్పించారు. డోలోత్సవంలో పాల్గొని స్వామివారిని చూసి తరించిన భక్తులకు ఎంతో పుణ్యం దక్కుతుందని పండితులు తెలిపారు. వెన్న, అటుకులు, బెల్లాన్ని భక్తులు తీసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. ఆలయ ప్రాంగణం రామనామస్మరణతో మార్మోగింది. క్లాత్ అండ్ రెడిమేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభాయాత్ర బాలదుర్గా టాప్ ఇన్ టౌన్, క్లాత్ అండ్ రెడీమేడ్ అసోసియేషన్ సహాయ సహకారాలతో శోభా యాత్ర జరిపారు. కళాకారులు కోలాటాలు, విభిన్న వేషధారణలతో ఆకట్టుకున్నారు. దేవస్థానం ఈఓ దామోదర్‌రావు దంపతులు స్వామివారి పల్లకీ సేవ చేశారు. స్వామివారికి మిథిలా స్టేడియంలో హారతి సమర్పించారు. భక్తుల దర్శనం అనంతరం తిరువీధి సేవ జరిపారు. ఆస్థాన మండపంలో దర్బార్ సేవ, ఆరాధన, నివేదన ఇచ్చి పవళింపు సేవ నిర్వహించారు. సోమవారం ఆస్థాన మండపంలో తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవం నిర్వహించనున్నారు. అలరించిన ఏరు ఉత్సవం గోదావరి తీరంలో నిర్వహించిన ఏరు ఉత్సవం అలరించింది. సంప్రదాయ నృత్యాలతో కళాకారులు ఆహూతులను ఆకట్టుకున్నారు. వేడుకలకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్, పీఓ రాహుల్, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హాజరై కళాకారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో ముక్కోటి ఉత్సవాలపై కలెక్టర్ సమీక్ష జరిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వేడుకలకు ఏర్పాట్లు పూర్తి భద్రాచలంలో సోమ, మంగళవారాల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గోదావరి తీరంలో తొలిసారిగా షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం లక్ష లడ్డూలను తయారు చేయిస్తున్నారు. అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు, వైద్యశాఖ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్‌లు ఏర్పాటు చేశారు. ఎస్పీ రోహత్రాజు పర్యవేక్షణలో 1100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఓఎస్డీ, ఏఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 21 మంది సీఐలు, 60 మంది ఎస్సైలు, 150 మంది ఏఎస్సైలు, 400 మంది కానిస్టేబుళ్లు, 70 మంది మహిళా కానిస్టేబుళ్లు, 275 మంది హోంగార్డులు విధులు నిర్వర్తించనున్నారు. నేడు తెప్పోత్సవం శ్రీ సీతాలక్ష్మణ సమేతుడైన రామయ్యకు పవిత్ర గోదావరిలో సోమవారం తెప్పోత్సవం నిర్వహించనున్నారు. వేడుకలకు హంస వాహనాన్ని అలంకరించారు. సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించిన తర్వాత 11 రోజు (ఏకాదశి)ని మధ్యగా చేసుకుని అటు పది రోజులు ఇటు పదిరోజులు మొత్తంగా 21 రోజులపాటు వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్ర పద్ధతులను పాటిస్తూ ఏకాదశికి ముందు పగల్‌పత్తు, ఏకాదశి తర్వాత రాపత్తు ఉత్సవాలు జరుపుతారు. వేడుకల్లో పదో రోజు రామయ్య జల విహారం చేయనుండగా, ఆగమంలో దీన్ని ప్లవోత్సవంగా పేర్కొంటారు. వ్యవహారికంలో తెప్పోత్సవంగా పిలుస్తారు. సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, ట్రైనీ, డిప్యూటీ కలెక్టర్లు సౌరభ్ శర్మ, మురళి, కోటేష్, శ్రావణ్‌కుమార్, సర్పంచ్ పూనెం కృష్ణ పాల్గొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సేవాకాలం, తిరుమంగై ఆళ్వారుల పరమపదోత్సవం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు రాజభోగం, శాత్తుమురై, పూర్ణ శరణాగతి సేవ, పగల్‌పత్తు సమాప్తి మధ్యాహ్నం 3గంటలకు దర్బారుసేవ సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు స్వామివారిని ఊరేగింపుగా గోదావరి నది వద్దకు చేర్చుతారు. సాయంత్రం 5గంటల నుంచి 8 గంటల వరకు హంస వాహనంపై తెప్పోత్సవం జరుపుతారు. -
పెద్దమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపండితుడు పద్మనాభశర్మ, అర్చకుడు రవికుమార్‌శర్మ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సైకిల్‌పై శబరిమలై..అశ్వాపురం: మండల పరిధిలోని జగ్గారం గ్రామానికి చెందిన బాలిన శ్రీను(గురుస్వామి) సైకిల్‌పై శబరిమలై యాత్రకు బయల్దేరాడు. యాత్రను ఆదివారం మాజీ సర్పంచ్ సున్నం రాంబాబు ప్రారంభించారు. తాను ఐదోసారి సైకిల్‌పై శబరిమలై వెళ్తున్నట్లు శ్రీను తెలిపాడు. -
మేడారం జాతరకు ఆర్టీసీ సిద్ధం
● ఖమ్మం రీజియన్ నుంచి 244 ప్రత్యేక బస్సులు ● కొత్తగూడెం డిపో నుంచి అత్యధికంగా కేటాయింపు ● జనవరి 25 నుంచి 31 వరకు సర్వీసుల నిర్వహణ ఖమ్మంమయూరిసెంటర్: ఆసియా ఖండంలో నే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క – సారలమ్మ జాతర సమీపిస్తోంది. జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జరిగే జాతరకు వెళ్లే భక్తుల కోసం బస్సులు నడిపించేలా టీజీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. గతఅనుభవాలను పరిగణన లోకి తీసుకోవడమేకాక భారీ సంఖ్యలో జాతరకు వెళ్లే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయా ణం అందించేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ప్రతీ ఆదివారం మేడారా నికి బస్సులునడిపిస్తుండగా, జాతర సమయా న ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు పూర్తిచేశారు. ముందస్తు ప్రణాళిక మేడారంలో సమ్మక్క – సారలమ్మ అమ్మవార్ల ను దర్శించుకునేందుకు పల్లె,పట్నంతేడా లేకుండా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తుంటారు. ఉమ్మడి జిల్లా నుంచి కూడా మేడారం జాతరకు వెళ్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. 2024 నాటి జాతరలో ఉమ్మడి జిల్లా నుంచి 2,36,909 మంది భక్తులు ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగించారు. ఈసారి ఈ సంఖ్య మరింత పెరిగినా మెరుగైన సేవలందించేందు కు ఆర్టీసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఆర్ఎం డిపో మేనేజర్లు, సూపర్వైజర్లతో పలుమార్లు సమీక్షలునిర్వహించగా.. తాజాగా శనివారం ఈడీ సోలోమన్ ఉమ్మడి జిల్లా అధి కారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. 25 నుంచే జాతర బస్సులు మేడారం జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుంది. ఇప్పటికే భక్తులు వెళ్లివస్తుండగా జనవరి 25 నుంచి ఈ సంఖ్య మరింత పెరగనుంది. దీంతో ఖమ్మం రీజి యన్‌లోని పది పాయింట్ల నుంచి 244 బస్సులు నడిపించేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఈ బస్సులు జనవరి 25 ఆదివారం నుంచి 31వ తేదీ శనివారం వరకు కొనసాగుతాయి. ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం పాయింట్ల నుంచి అధిక సంఖ్యలో బస్సులు నడపాలని నిర్ణయించారు. వీటితో పాటు పాల్వంచ, చర్ల, వెంకటాపూర్, మణుగూరు, మంగపేట, ఏటూరునాగారం, ఖమ్మం జిల్లా కేంద్రాల్లోనూ బస్సు పాయింట్లు ఏర్పాటుచేస్తారు. ఉమ్మడి జిల్లాలోని డిపోల నుంచి సాధ్యమైనంత ఎక్కువ బస్సులను సద్వినియోగం చేసుకుంటూ రద్దీకి అనుగుణంగా నడపాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కాగా మహాలక్ష్మి పథకంతో ఆర్టీసీకి భక్తుల తాకిడి పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత బస్సు సౌకర్యం ఉండడంతో మహిళా భక్తుల సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. డిపో పాయింట్ బస్సులు కొత్తగూడెం కొత్తగూడెం 110 కొత్తగూడెం ఇల్లెందు 41 భద్రాచలం భద్రాచలం 21 భద్రాచలం పాల్వంచ 15 సత్తుపల్లి ఏటూరునాగారం 17 సత్తుపల్లి చర్ల 03 సత్తుపల్లి వెంకటాపూర్ 06 మణుగూరు మణుగూరు 16 మణుగూరు మంగపేట 05 ఖమ్మం ఖమ్మం 10 -
100 శాతం బొగ్గు ఉత్పత్తికి కసరత్తు
● భూగర్భ గనుల్లో డిసెంబర్ వరకు 58 శాతమే పూర్తి ● క్షేత్రస్థాయిలో సమస్యలు ఆరా తీస్తున్న అధికారులు రుద్రంపూర్: సింగరేణి సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025 – 26)లో 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఓసీల్లో ఆశించిన స్థాయిలో ఉత్పత్తి నమోదవుతున్నా భూగర్భ గనుల్లో మాత్రం ఫలితం కానరావడం లేదని చెబుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా 21 భూగర్భ గనుల్లో 100 శాతం ఉత్పత్తి సాధనకు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. గనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ అక్కడ ఉద్యోగులతో మమేకమై ఉత్పత్తి సాధనకు ఎదురవుతున్న అవాంతరాలపై ఆరా తీస్తున్నారు. లక్ష్యంలో సగమే.. సింగరేణివ్యాప్తంగా 12 ఏరియాల్లో 21 భూగర్భ గనులు ఉన్నాయి. వీటిలో డిసెంబర్ నాటికి 50,61,368 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాల్సి ఉంది. కానీ, ఇప్పటి వరకు 29,35,132 టన్నుల (58 శాతం) ఉత్పత్తే నమోదైంది. దీంతో లక్ష్యం మేర బొగ్గు ఉత్పత్తి సాధించేలా ఉన్నతాధికారులు సంస్థలోని ఉద్యోగులు, కార్మికులను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే 25వ తేదీన కొత్తగూడెం ఏరియా పరిధిలోని పీవీకే–5 గనిని కోల్ మూవ్మెంట్ ఈడీ వెంకన్న పరిశీలించారు. ఒక్కోగనిలో రోజుకు 700 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తుండగా దీనిని వేయి టన్నులకు పెంచేలా పర్యవేక్షిస్తున్నాం. ఈక్రమంలోనే గనుల్లో సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తాం. అందరూ సహకరించి లక్ష్యాలను సాధించాలి. –బి.వెంకన్న, ఈడీ, కోల్ మూవ్మెంట్ -
పట్టుదలతో అవరోధాలను అధిగమించవచ్చు
ఖమ్మంమయూరిసెంటర్: మనిషిలో పట్టుదల ఉంటే ఎంతటి అవరోధాన్ని అయినా అధిగమించి విజయాలను సాధించవచ్చని జిల్లా సంక్షేమ అధికారిణి వేల్పుల విజేత అన్నారు. ఆదివారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో దివ్యాంగులకు ఆటల పోటీలు నిర్వహించారు. వీటిని ప్రారంభించిన విజేత మాట్లాడుతూ.. మనిషిలో పోరాట పటిమ ఉంటే లక్ష్య సాధనకు శారీరక వైకల్యం అడ్డే కాదన్నారు. పలు రంగాల్లో దివ్యాంగులు అనేక విజయాలను సాధించి, ఉన్నత స్థానాలను అధిరోహించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఉత్సాహంగా పోటీలు.. ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన దివ్యాంగుల ఆటల పోటీల్లో 250 మంది పాల్గొన్నారు. అంధులు, బదిరిలు, మూగ, పోలియో విభాగాల వారీగా నిర్వహించిన పోటీల్లో దివ్యాంగులు ప్రతిభ కనబరించారు. వీరి కోసం అధికారులు రన్నింగ్, క్యారమ్స్, చెస్, జావలిన్ త్రో, షార్ట్‌పుట్ నిర్వహించారు. విజేతలకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయనున్నట్లు విజేత వెల్లడించారు. కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది బిందుప్రసాద్, వేణుగోపాల్, సునీత, రమేష్, చారి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల ఆటల పోటీల ప్రారంభంలో సంక్షేమ అధికారిణి విజేత -
భద్రాద్రి రామయ్య సేవలో అదనపు కమిషనర్
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామిని రాష్ట్ర దేవాదాయ శాఖ అదనపు కమిషనర్, ముఖ్య ఉత్సవ అధికారి ఈ.శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. చిత్రకూట మండపంలో ఆయనకు వేదాశీర్వచనం, ప్రసాదాలను అందజేశారు. అనంతరం ముక్కోటి ఉత్సవాల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమంలో ఈఓ దామోదర్‌రావు, ఏఈఓ శ్రవణ్‌కుమార్, రవీందర్, భవానీరామకృష్ణ, అర్చకులు పాల్గొన్నారు. ముక్కోటి ఉత్సవాల్లో ‘కళా’కాంతులు భద్రాచలంటౌన్: భద్రాచలంలో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా గోదావరి తీరం ఆదివారం సందర్శకులతో నిండిపోయింది. ఏరు ఉత్సవాల సందర్భంగా నదీ తీరంలో ఏర్పాటు చేసిన ‘ఓపెన్ ఆర్ట్ స్పేస్’సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన చిత్రకారులు తమ సృజనాత్మకతకు పదును పెట్టా రు. ప్రత్యక్ష చిత్రలేఖనం (లైవ్ పెయింటింగ్) ద్వారా భక్తి భావాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని కాన్వాస్‌పై అద్భుతంగా ఆవిష్కరించారు. కిన్నెరసానిలో సందడి పాల్వంచరూరల్: మండలంలోని కిన్నెరసానికి ఆదివారం జిల్లాతోపాటు పొరుగు జిల్లాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా డ్యామ్ పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 975 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించడం ద్వారా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.51,515 ఆదా యం.. 550 మంది బోటుషికారు చేయడం ద్వారా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.27,680 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 30న ‘పీఎంశ్రీ’ క్రీడా పోటీలుకొత్తగూడెంఅర్బన్: పీఎంశ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడా పోటీలు ఈ నెల 30న పాల్వంచలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో నిర్వహించనున్నట్లు డీఈఓ బి. నాగలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వాలీబాల్, కబడ్డీ, ఖో ఖో, 100 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, షార్ట్ పుట్ అంశాల్లో బాలబాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. జిల్లాస్థాయి ఫుట్‌బాల్ జట్టును కూడా ఎంపిక చేస్తామని తెలిపారు. జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజు శేఖర్, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి వి.నరేష్ కుమార్ పోటీలను పర్యవేక్షిస్తారని వివరించారు. పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు చేరిన యూరియా చింతకాని: మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆర్ఎఫ్సీఎల్ కంపెనీకి చెందిన 3,017.16 మెట్రిక్ టన్నుల యూరియా ఆదివారం చేరింది. టెక్నికల్ ఏఓ పవన్‌కుమార్ ఆ యూరియాను ఖమ్మం జిల్లాకు 1,417.16 మెట్రిక్ టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 420 మెట్రిక్ టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 980 మెట్రిక్ టన్నులు, ఖమ్మం సీఆర్పీకి 200 మెట్రిక్ టన్నులను కేటాయించి సరఫరా చేశారు. ఇసుక నిల్వలు సీజ్ ములకలపల్లి: అక్రమంగా నిల్వ చేసిన ఇసుక రాశులను రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. గిర్ధావర్ – 2 భద్రు కథనం ప్రకారం.. మండలంలోని సీతారాంపురం శివారులో ఇసుక అక్రమంగా నిల్వ చేసినట్లు సమాచారం అందగా దాడులు నిర్వహించి, 6 ట్రాక్టర్ల ఇసుకను స్వాధీనం చేసుకున్నారు. ఇసుకను తహసీల్దార్ కార్యాలయానికి తరలించామని భద్రు వివరించారు. -
కేసు నిర్వహణ సమర్థవంతంగా ఉండాలి
ఖమ్మంవ్యవసాయం: అటవీ, వన్యప్రాణుల కేసుల్లో దర్యాప్తు, అభియోగాలు సమర్థవంతంగా ఉండాలని పలువురు పేర్కొన్నారు. ఆదివారం ఖమ్మం అటవీశాఖ కార్యాలయంలో అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఎ.శంకర్, అదనపు ప్రాసిక్యూటర్లు, అటవీ శాఖ అధికారులు, లీగల్ సెల్ ప్రతినిధులు పాల్గొన్నారు. అటవీ, వణ్య ప్రాణుల కేసుల నమోదు, సరైన దర్యాప్తు, నిర్వహణ, సంబంధిత న్యాయస్థానాల్లో అభియోగాలపై చర్చించారు. న్యాయ స్థానాల ముందు కేసులను సమర్థవంతంగా ప్రస్తావించేందుకు అటవీ శాఖ, ప్రాసిక్యూషన్ శాఖల మధ్య సమన్వయం అవసరమని అధికారులు పేర్కొన్నారు. -
అలరించిన సినీ సంగీత విభావరి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో ఆదివారం రాత్రి స్వర సుధ కల్చరల్ యూనిట్ ‘మదిలో వీణలు మ్రోగే’పేరిట నిర్వహించిన సినీ సంగీత విభావరి కళాభిమానులను అలరించింది. గాయకుడు, ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు, గాయనీ, గాయకులు పాటలు పాడి సభికులను ఆకట్టుకున్నారు. ఆదిరాజు పురుషోత్తమరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో న్యాయవాది లక్ష్మీనారాయణ, నెల నెలా వెన్నెల నిర్వాహకులు ఏఎస్ కుమార్, సెలవోటి చంద్రమోహన్, ప్రకాష్, ఆరేపల్లి పున్న య్య, ఎస్వీ రమణ, మోహన్‌రావు, మాలతీనాయు డు, జనార్దన్, దేవీప్రియ, శ్రీదేవి, స్నేహ పాల్గొన్నారు. -
మోడ్రన్ కబడ్డీ విజేత మేడ్చల్..
కామేపల్లి: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణంలో జరిగిన రాష్ట్రస్థాయి మోడ్రన్ కబడ్డీ పోటీల్లో మేడ్చల్ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆ జట్టు నల్లగొండపై విజయం సాధించింది. ద్వితీయ స్థానంలో నల్లగొండ, తృతీయ స్థానంలో హైదరబాద్, నాలుగో స్థానంలో కరీంనగర్ జట్లు నిలిచాయి. మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరెం రవి నేతృత్వంలో ఈ పోటీలు జరగగా 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. విజేతలకు వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, ఇండియన్ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాంరెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ అజ్మీరా బుల్లి, ఎస్ఐ శ్రీకాంత్, గింజల నరసింహారెడ్డి, తోటకూరి శివయ్య, గుజ్జర్లపూడి రాంబాబు, రాంరెడ్డి జగన్నాథరెడ్డి, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ముగిసిన రాష్ట్రస్థాయి పోటీలు -
మార్చిలో రైతు సంఘం రాష్ట్ర మహాసభలు
రుద్రంపూర్: మార్చి 16,17,18 తేదీల్లో కొత్తగూడెం పట్టణంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు నిర్వహించనున్నట్లు అఖిల భారత కిసాన్ సభ జాతీయ కమిటీ సభ్యులు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం పట్టణంలోని రామటాకీస్ రోడ్లో నిర్వహిచింన మహాసభల ఆహ్వాన సంఘం సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ దేశాన్ని లూటీ చేసిందని, రూ. 200 లక్షల కోట్లు అప్పు చేసిందని విమర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నను దివాళా తీయించి రోడ్డున పడేసిందన్నారు. విత్తన చట్టం పేరుతో రైతులకు నష్టం చేసేలా, కార్పొరేట్లకు అనుకూలంగా బిల్లు తీసుకొస్తున్నారని ఆరోపించారకు. రాష్ట్ర కార్యదర్శి సాగర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రైతులను ఐక్యపరిచి ఉద్యమాలు నిర్మిస్తామని అన్నారు. ఎలమంచిలి వంశీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నాయకులు పోతినేని సుదర్శన్ రావు, ఎం.సాయిబాబు, నున్నా నాగేశ్వరరావు, మచ్చా వెంకటేశ్వర్లు, బొంతు రాంబాబు, మూడ్ శోభన్, మా దినేని రమేష్, అన్నవరపు కనకయ్య, ఏజే రమేష్, అన్నవరపు సత్యనారాయణ, కొక్కెరపాటి పుల్లయ్య, కారం పుల్లయ్య, కే.బ్రహ్మాచారి, నర్సారెడ్డి, బాలరాజు, రేపాలకు శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకుడు నాగా సీతారాములు, తదితరులు పాల్గొన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూలకంటి రంగారెడ్డి -
చదువుకోవాలనే పట్టుదల ఉండాలి..
పాల్వంచరూరల్: విద్యాలయాల్లో సౌకర్యాలు ఉన్నా, లేకున్నా.. చదువుకోవాలనే పట్టుదల ఉండాలని, అప్పుడే విద్యార్థి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాడని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఐ పీఓ బి.రాహుల్ అన్నారు. మండలంలోని కిన్నెరసాని డ్యామ్‌సైడ్ గిరిజన గురుకుల బాలుర పాఠశాలకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా పూర్వ విదార్థులు నిర్వహించిన స్వర్ణోత్సవాలకు ఆదివారం వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. గిరిజన గురుకులంలో 50 ఏళ్ల క్రితం నాటిన మొక్క మహావృక్షమైందన్నారు. విద్యార్థులు ఉన్న వనరులు, అవకాశాలను వినియోగించుకుంటూ చదువుకోవాలనే కసి, పట్టుదలతో ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. కాగా, కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఐటీడీఏ పీఓలను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పూర్వ ఉపాధ్యాయులు ఎన్.చక్రవర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్సీఓ అరుణకుమారి, ఏపీఓ డేవిడ్‌రాజు, ప్రిన్సిపాల్ రమేశ్, ఎస్.శ్యామ్‌కుమార్, ఖాదర్, రమేశ్‌రెడ్డి, రాజు పాల్గొన్నారు. ఆత్మీయ పలకరింపులు.. కిన్నెరసాని గిరిజన గురుకుల స్వర్ణోత్సవాల సందర్భంగా ఏపీ, తెలంగాణ నలుమూలల నుంచే కాకు ండా విదేశాల నుంచి కూడా పూర్వ విద్యార్థులు, పూర్వ గురువులు (వజ్జ) కుటుంబ సమేతంగా హాజరయ్యారు. 1975లో ఇక్కడ చదువుకుని వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసిన, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరై ఆత్మీయంగా పలకరించుకున్నారు. నాటి స్మృతులను గుర్తు చేసుకున్నారు. గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాల కోసం నేను ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నుంచి వచ్చాను. 1988లో పదో తరగతి చదివాను. పూర్వ విద్యార్థులను కలుసుకోవడం సంతోషంగా ఉంది. తన తండ్రి జ్ఞాపకార్థం పాఠశాలలో రూ.2.50 లక్షలతో వేదికను నిర్మాణం చేశాను. –తేజావత్ జానకీరామ్ (ఎన్ఆర్ఐ) నాడు పాఠశాలలో సౌకర్యాలు లేకున్నా నాటి గురువులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విన్నాను. ప్రతీ రోజు వేకువజామున నిద్ర లేచి చదువుకునే వాళ్లం. తర్వాత ఉన్నత చదువులు చదువుకుని అమెరికాలోని టెక్సాస్‌లో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. అప్పుడు అన్ని సౌకర్యాలు ఉన్నా చదువుపై దృష్టి సారించడం లేదు. – రవికిరణ్‌కుమార్, యూఎస్ఏ 40 సంవత్సరాల క్రితం ఇక్కడ విద్యార్థులకు బోధన చేసి విరమణ పొందాడు. నాటి వి ద్యార్థులను కలుసుకునేందుకు స్వర్ణోత్సవాలకు వచ్చాను. నాటి విద్యార్థులను కలుసుకుని, అప్పటి ఘటనలను గుర్తుచేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. – ప్రభాకర్‌రెడ్డి, పూర్వ ఉపాధ్యాయులు, చిత్తూరు గురుకులంలో మొదటి బ్యాచ్ విద్యార్థి నేను. నాడు ఇంటికి ఉత్తరం రాసినా, ఉత్తరం ఇంటి నుంచి వచ్చినా టీచర్లు వాటిని అందరి సమక్షంలో చదివి వినిపించేవారు. ఎంతో క్రమశిక్షణతో విద్యాబోధన అందించారు. – అభిమన్యుడు, రిటైర్డ్ జేడీఏ గురుకులంలో మొదటి బ్యాచ్ మాది. అప్పుడు క్రమశిక్షణతో చదువుకున్నాం. పాఠశాల చుట్టూ అడవి ఉండేది. రాత్రి సమయంలో జంతువుల అరుపులు వినిపించేవి. నాటి గురువుల బోధనల మూలంగా చాలామంది ఉద్యోగాలు సాధించారు. – బుర్ర చంద్రశేఖర్, పూర్వ విద్యార్థి -
కేయూ క్రికెట్ విజేత ‘ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్’
ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మం జోన్ డిగ్రీ కళాశాలల క్రికెట్ పోటీల్లో ఖమ్మంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల జట్టు టైటిల్ దక్కించుకుంది. ఖమ్మంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కాకతీయ యూనివర్సిటీ పరిధి క్రికెట్ టోర్నీ ఫైనల్స్ ఆదివారం జరిగాయి. ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ – జీడీసీ పాల్వంచ జట్లు తలపడగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ జట్టు పరిమిత ఓవర్లలో 66 పరుగులు చేసింది. ఆ తర్వాత పాల్వంచ జట్టు నాలుగు పరుగుల తేడాతో ఓటమి చెందింది. అంతకు ముందు జరిగిన రెండో సెమీస్‌లో కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాల జట్టుపై జీడీసీ పాల్వంచ జట్టు విజయం సాధించింది. టోర్నీ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ బి.వెంకన్న ట్రోఫీలు అందజేయగా, పీడీలు జి.గోపీకృష్ణ, కోటేశ్వరరావు, జె.ఉపేందర్ పాల్గొన్నారు.రెండో స్థానంలో జీడీసీ పాల్వంచ -
కాంగ్రెస్‌తోనే సమగ్రత, అభివృద్ధి
కొత్తగూడెంఅర్బన్: కాంగ్రెస్‌తోనే దేశ సమగ్రత, అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోట దేవీ ప్రసన్న అన్నారు. పార్టీ ఆవిర్భావ వేడుకలను త్రీ టౌన్ సెంటర్లోని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత జాతిపిత మహాత్మా గాంధీ, దేశ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, మతసామరస్యం కోసం పార్టీ నాయకులు పాటుపడాలని అన్నారు. రానున్న మున్సిపల్ కార్పొరేషన్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కోనేరు సత్యనారాయణ, ఆళ్ల మురళి, నాగ సీతారాములు, జేబీ బాలశౌరి, ఏనుగుల అర్జున్ రావు, చీకటి కార్తీక్, పౌలు, సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్ వై. శ్రీనివాసరెడ్డి, చింతలపూడి రాజశేఖర్, బాలపాసి, రావి రాంబాబు, మేరెడ్డి జనార్ధనరెడ్డి, పరమేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా పేదల సంక్షేమమే కాంగ్రెస్ ఎజెండా అని టీపీసీసీ సభ్యుడు, ఎస్సీ సెల్ కన్వీనర్ జేబీ శౌరి అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ అధ్యక్షుడు గౌస్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాయకులు నరసింహారావు, అజ్మీర సురేష్, ఎండి కరీం, కాజా బాక్స్, కసనబోయిన భద్రం, నిసార్, భిక్షపతి, కరీం తదితరులు పాల్గొన్నారు.డీసీసీ అధ్యక్షురాలు దేవీప్రసన్న -
సంచి లేకుండా సరదాగా..
ఖమ్మంసహకారనగర్: పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు బ్యాగుల మోతతో, రివిజన్లతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతిరోజు పాఠశాలకు ఈ బ్యాగులను మోసుకెళ్లాల్సిందే. దీనిని గుర్తించిన ప్రభుత్వం నెలలో ఒక్కరోజు అయినా ‘నో బ్యాగ్ డే’నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ఆదేశించినా కొన్ని చోట్ల మాత్రమే దీని అమలు చేస్తున్నారు. మూడు నెలలుగా జిల్లాలో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి చొరవతో ప్రతీ నెల 4వ శనివారం నో బ్యాగ్ డేను నిర్వహిస్తున్నారు. ఆ రోజున ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యార్థులు బ్యాగ్‌లు, పుస్తకాలు లేకుండా పాఠశాలకు వచ్చి పూర్తిస్థాయిలో ఆహ్లాదకర వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్చుకోవడంతోపాటు ఆటలు, పాటలు, ప్రయోగాలతో గడపుతున్నారు. విద్యార్థుల్లో ఆహ్లాదాన్ని నింపేందుకు.. ప్రతీ రోజు విద్యార్థులు తరగతులు, క్లాస్‌రూంలో పాఠాలు, పుస్తకాల బరువుతో పాఠశాలలకు వచ్చి వెళ్తుంటారు. దీంతో విద్యార్థులు పాఠశాలకు రావాలంటే ఉత్సాహం కనబర్చడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం వారిలో పాఠశాలల పట్ల ఆసక్తిని, ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేసింది. నెలలో ఒకరోజు నో బ్యాగ్ డే నిర్వహించాలని విద్యాశాఖను ఆదేశించింది. ఈ క్రమంలో జిల్లాలో ఆగస్ట్ నుంచి అన్ని పాఠశాలల్లో ప్రతీ నెల నాలుగో శనివారం నో బ్యాగ్ డేను అమలు చేస్తున్నారు. అప్పటి నుంచి నాలుగో శనివారం విద్యార్థులు తప్పనిసరిగా పాఠశాలలకు హాజరవుతూ ఉత్సాహభరిత, వాతావరణంలో విద్యాభ్యాసం చేస్తున్నారు. నృత్యాల ద్వారా కూడా అభ్యసనం చేస్తున్నారు. సృజనాత్మకత వెలికితేసేలా.. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసేలా చిన్న చిన్న పనులు అప్పగిస్తుంటారు. వెజిటబుల్ కార్వింగ్‌తో చిన్న చిన్న వస్తువుల ఆకారాలను తయారు చేయిస్తారు. ఈసీఆర్ కాంపిటీషన్స్, ఇసుకతో సైకత నమూనాలు చేసేలా ప్రోత్సహిస్తారు. పలు రకాల క్రీడలు నిర్వహించి, విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపుతారు. ఆరు నుంచి 10వ తరగతి విద్యార్థులకు సులభతర సైన్స్ ప్రయోగాలు, టీఎల్ఎం ఎక్స్పో, స్ఫూర్తి ప్రదాతల స్పీచ్‌లు, క్విజ్ కాంపిటీషన్స్, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతారు. -
హాకీ పోటీల్లో గౌరారం విద్యార్థినుల ప్రతిభ
దుమ్ముగూడెం: ప్రతిభకు ప్రోత్సాహం తోడైతే పరిమితులు ఎన్ని ఉన్నా అద్భుతాలు సృష్టించవచ్చని గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు నిరూపించారు. పాఠశాలలో అందజేస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని తమలోని క్రీడా ప్రతిభను బయటకు తీసి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్ర పాఠశాల క్రీడల సమాఖ్య ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలో నిర్వహించిన అండర్–14 అంతర్ జిల్లా హాకీ టోర్నీలో పాల్గొన్న మండలంలోని గౌరారం బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన విద్యార్థినులు 9వ తరగతికి చెందిన పోడియం సుగుణ, కల్లూరి రిషికవర్ధిని, కొమరం నవ్య, మీడియం సునీత, కంగాల సంధ్య, 8వ తరగతికి చెందిన మడకం మౌనిక, పొడియం అనూష, 6వ తరగతికి చెందిన సోడే అద్విత ప్రతిభ చూపి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకొచ్చారు. వీరిలో పోడియం సుగుణ జాతీయస్థాయికి ఎంపిక కాగా శనివారం పాఠశాలలో పాఠశాల హెచ్ఎం మడకం మోతీర్ ఆమెను ప్రత్యేకంగా అభినందించడంతో పాటు మిగతా క్రీడాకారులను అభినందించి భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను అభినందించిన వారిలో డిప్యూటీ వార్డెన్ పూనెం లక్ష్మీపతిరావు, వ్యాయామ ఉపాధ్యాయుడు పూనెం రవీందర్, తోలెం శ్రీనివాసరావు, సోడే శ్రీనివాసరావు, శ్యామల సత్యవతి, మట్ట రామారావు, ఎం.సురేష్ బాబు, ఉమాదేవి, ఆదిలక్ష్మి, రాధిక, వెంకటేశ్వర్లు, దుర్గాబాయి, ఎ.హరిలాల్ రుక్మిణీ, లక్ష్మీదేవి తదితరులు ఉన్నారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికై న సుగుణ -
సంక్షేమమే లక్ష్యంగా పాలన
● ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతాం ● తొమ్మిది నెలల్లో సమీకృత భవన నిర్మాణాలు పూర్తి ● రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఖమ్మంరూరల్: పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృధ్ధి పనుల నిర్వహణలోనూ వెనక్కు తగ్గకుండా తమ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని తరుణి హాట్లో నిర్మిచనున్న రూరల్ మండల కార్యాలయాల సమీకృత భవన నిర్మాణ పనులకు శనివారం ఆయన కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఖమ్మం రూరల్ మండలంలో సమీకృత కార్యాలయాల నిర్మాణానికి రూ. 45 కోట్లు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు ఏదులాపురం మున్సిపాలిటీ, రూరల్ మండలంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.221 కోట్లతో పలు పనులు చేపట్టామని వివరించారు. అవసరమైన రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సరఫరా, ఇతర పనులు పూర్తి చేస్తామని, ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా తీర్దిదిద్దుతామని హామీ ఇచ్చారు. సమీకృత కార్యాలయ భవనాలను తొమ్మిది నెలల్లో అందుబాటులోకి తేవాలని అధికా రులను ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండడంతో ప్రజలకు సుపరిపాలన అందుతుందని అన్నారు. కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ.. రూరల్ మండలానికి సంబంధించి 13 శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం 129 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ భైరు హరినాథ్‌బాబు, ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓ నర్సింహారావు, తహసీల్దార్ పి.రాంప్రసాద్, ఆర్అండ్బీ ఎస్ఈ యాకో బు, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, నాయకులు చినవెంకటరెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. -
‘బార్’ ఎన్నికలకు నామినేషన్ దాఖలు
ఖమ్మంలీగల్: తెలంగాణ బార్ కౌన్సిల్‌కు పోటీ చేస్తున్న మందడపు శ్రీనివాసరావు శనివారం హైకోర్టు ప్రాంగణంలోని తెలంగాణ బార్ కౌన్సిల్ కార్యాలయంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) తరఫున తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్థసారథి, నేషనల్ కౌన్సిల్ మెంబర్లు జలసూత్రం శివరామ్‌ప్రసాద్, ఏడునూతల శ్రీనివాసరావు, ఐలు మహిళా వింగ్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సభ్యులు గాదె సునంద, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు కె.పుల్లయ్య రావిలాల రామారావు, కిలారు పురుషోత్తంరావు, పోశం భాస్కరరావు, వుడతనేని శ్రీనివాసరావు, నవీన్ చైతన్య, చింతనిప్పు వెంకట్, రామబ్రహ్మం, శ్రీలక్ష్మి, డి.నారాయణ, పాపయ్య, మీసాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కేయూ జోనల్ క్రీడలు ప్రారంభం ఖమ్మంస్పోర్ట్స్: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఖమ్మం జోనల్ క్రికెట్ పోటీలు శనివారం నగరంలోని ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రారంభమయ్యాయి. వీటిని డీవైఎస్ఓ సునీల్‌రెడ్డి, సత్తుపల్లి జెవీఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.గోపి ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నగరంలో క్రికెట్ స్టేడియం వచ్చే ఏడాది నాటికి పూర్తి అవుతుందని, జిల్లా క్రికెటర్లు జాతీయస్థాయిలో రాణించేలా కష్టపడాలని సూచించారు. క్రమశిక్షణతోనే క్రీడల్లో రాణించగలరని తెలిపారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రవికుమార్, ఖమ్మం జోన్ క్రీడల కార్యదర్శి బి.వెంకన్న, నెట్ క్రికెట్ కోచ్ ఎండీ మతిన్, జి.గోపీకృష్ణ, జె.ఉపేందర్, రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, రెండు రోజుల పాటు జరిగే టోర్నీలో 11 జట్లు పాల్గొన్నాయి. తొలి రోజు యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, జేవీఆర్ సత్తుపల్లి, ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కొత్తగూడెం, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల ఖమ్మం ముందజ వేశాయి. సెమీ ఫైనల్స్‌కు ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ఖమ్మం, జేవీఆర్ సత్తుపల్లి చేరాయి. అయితే, తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ ఖమ్మం – ప్రియదర్శిని డిగ్రీ కళాశాల కొత్తగూడెంపై నెగ్గి ఫైనల్స్‌కు ప్రవేశించింది. ఇసుక ట్రాక్టర్ పట్టివేత అశ్వాపురం: మండలంలో అమ్మగారిపల్లిలో గోదావరి నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను తహసీల్దార్ మణిధర్ ఆదేశాల మేరకు శనివారం రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న కుమ్మరిగూడేనికి చెందిన పాయం నాగేశ్వరరావు ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఘర్షణలో ఒకరికి గాయాలు భద్రాచలంటౌన్: భద్రాచలం పట్టణం చర్ల రోడ్డులోని ఓ వైన్ షాపు వద్ద శనివారం జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి గాయాలయ్యాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి మరో వ్యక్తిపై లిక్కర్ బాటిల్‌తో దాడి చేయడంతో గాయాలైనట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి ఇరువర్గాల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ నాగరాజు తెలిపారు. -
బాల్‌బ్యాడ్మింటన్ టోర్నీ షురూ
ఖమ్మంస్పోర్ట్స్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలస్థాయి బాల్ బ్మాండ్మింటన్ టోర్నీ (పులి రామస్వామి స్మారక ఇన్విటేషన్ పోటీలు) శనివారం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. వీటిని డీవైఎస్ఓ టి.సునీల్‌రెడ్డి, రాష్ట్ర బాల్ బ్యాడ్మింటన్ కార్యదర్శి వీవీ రమణ, జిల్లా అధ్యక్షుడు వేజెళ్ల సురేశ్, టోర్నీ కన్వీనర్ డాక్టర్ రాధాకృష్ణమూర్తి ప్రారంభించారు. రెండు రాష్ట్రాల నుంచి 24 జట్లతో పాటు 40 మంది జాతీయ క్రీడాకారులు పాల్గొన్నారు. పోటీలు లీగ్ కం నాకౌట్ పద్ధతిలో జరుగుతాయన్నారు. కార్యక్రమంలో విజయ్‌ప్రసాద్, టి.రామచంద్రరాజు, పులి మధు, విజయ్కలామ్, ఎర్రగుట్ట స్వామి, మణి భూషణచారి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. తొలిరోజు విజేతలు వీరే.. తొలిరోజు పోటీల్లో కూకట్పల్లి జట్టుపై భూపాలపల్లి విజయం సాధించింది. అలాగే.. అనంతరపూర్ – వరంగల్‌పై.. మణికొండ – రమణస్ వైజాగ్‌పై.. ఈస్ట్ గోదావరి – బీహెచ్‌ఈఎల్‌పై.. ఎస్సీఆర్ గుంటూరు – నునాపర్తిపై.. కరీంనగర్ – ఖమ్మంపై విజయం సాధించాయి. ఆదివారం సాయంత్రం బహుమతి ప్రదానం ఉంటుందని నిర్వాహకులు వెల్లడించారు. రెండు రాష్ట్రాల నుంచి 24 జట్లు హాజరు.. -
ప్రతీ పైస.. ప్రజల అభివృద్ధికే
నేలకొండపల్లి : ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పైస ప్రజల సంక్షేమం, అభివృద్ధికే ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి శనివారం ఆయన.. మండలంలోని అనంతనగర్‌లో రూ.2.25 కోట్లతో నిర్మించిన విద్యుత్ సబ్‌స్టేషన్ ప్రారంభం, రూ.1.75 కోట్లతో నిర్మించనున్న సబ్ష్టేషన్కు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ.. గత పాలకులు రాష్ట్ర ప్రజలపై రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపినా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ వంటి పథకాలను అవమలు చేయలేదని అన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని, లబ్ధిదారుల ఖాతాల్లో ప్రతీ వారం బిల్లులు జమ చేస్తున్నామని చెప్పారు. మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఎన్ని కష్టాలు ఎదురైనా పేదల ముఖంలో ఆనందం చూడాలనే లక్ష్యంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూసల సీతారాములు, నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, బచ్చలకూరి నాగరాజు, జెర్రిపోతుల అంజిని, తిగుళ్ల భవాని, పెంటమళ్ల పుల్లమ్మ, గరిడేపల్లి రామారావు, కడియాల నరేష్, పాకనాటి కన్నారెడ్డి, కొమ్మినేని విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క -
నేడే గురుకుల స్వర్ణోత్సవం..
పాల్వంచరూరల్: కిన్నెరసాని డ్యామ్‌సైడ్ గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలకు సిద్ధమైంది. పాఠశాలను స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించనున్నారు. అర్ధశతాబ్ద కాలంలో ఇక్కడ చదువుకుని దేశ, విదేశాల్లో స్థిరపడిన పూర్వవిద్యార్థులు వేడకకు హాజరుకానుండగా.. అన్ని తామై ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ స్వర్ణోత్సవాల వేడుకకు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి సీతాలక్ష్మితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, కలెక్టర్ జితేష్ వి.పాటిల్, పీఓ రాహుల్‌లు ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. కాగా , 50 ఏళ్ల క్రితం 70 ఎకరాల విస్తీర్ణం కలిగిన పాఠశాల ప్రాంగణంలో నిర్మించిన భవన సముదాయం శిథిలావస్థకు చేరడంతో గతేడాది కూల్చివేశారు. సమస్యలతో సతమతం.. మండల పరిధిలోని కిన్నెరసాని డ్యామ్సైడ్లో ఏపీ రెసిడెన్సీ ఇన్స్టిట్యూషన్స్ బాలుర స్కూల్‌ను 1975 డిసెంబర్ 25న సంజయ్‌గాంధీ, అప్పటి రాష్ట్ర సీఎం జలగం వెంగళరావు శంకుస్థాపన చేయగా ఏడాది తర్వాత ప్రారంభించారు. మొదట స్కూల్, తర్వాత కళాశాలగా అప్‌గ్రేడ్ కాగా, ప్రస్తుతం 500 మందికి పైగా గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కానీ వారి సంఖ్యకు అనుగుణంగా వసతులు లేక తరగతి గదిలోనే చదువుకుంటూ, రాత్రివేళ అందులోనే పడుకోవాల్సి వస్తోంది. చుట్టూ ప్రహరీ లేకపోవడం, భోజనశాల శిథిలావస్థకు చేరడం, తరగతి గదులు కురుస్తుండడంతో విద్యార్థులు చదువులపై దృష్టి సారించలేకపోతున్నారు. బెంచీలు, బల్లాలు కూడ విరిగి పనికిరాకుండా పోయాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి 12 గదులతో కూడిన అకడమిక్ బ్లాక్, హాస్టల్ బ్లాక్‌ను మంజూరు చేయాలని మండలవాసులు కోరుతున్నారు. -
5.3 కిలోల ఎండు గంజాయి స్వాధీనం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద శనివారం నిర్వహించిన తనిఖీల్లో గంజాయి పట్టుబడింది. ఖమ్మం ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. పట్టణంలోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద ఎకై ్సజ్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టగా అనుమానాస్పదంగా వస్తున్న టీఎస్ 05 యూఏ 8153 నంబర్ కారును ఆపి తనిఖీ చేయగా.. అందులో 5.3 కిలోల ఎండు గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా రాష్ట్రం మల్కాజగిరి జిల్లా గిరికాన్పల్లికి చెందిన శిబ్ శంకర్ సర్దార్ మల్కాజగిరి నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకెళ్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పట్టుబడిన గంజాయితో పాటు ఒక కారు, ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని భద్రాచలం ఎకై ్సజ్ స్టేషన్లో అప్పగించిన్నట్లు సీఐ తెలిపారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ బాలు, కానిస్టేబుళ్లు సుధీర్, వెంకట్, వీరబాబు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రామిక విభజనను వ్యతిరేకిద్దాం..
● వచ్చే ఏడాది కార్మిక సంఘాలకు కీలకం ● సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు పద్మనాభన్ఖమ్మంమయూరిసెంటర్ : ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శ్రామిక వర్గాన్ని విభజించి కార్పొరేట్ శక్తులకు లబ్ధి చేకూర్చేలా ప్రయత్నిస్తోందని, దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ఎ.కె. పద్మనాభన్ అన్నారు. ఖమ్మంలో నిర్మించిన సీఐటీయూ జిల్లా కార్యాలయం (బీటీ రణదివే) భవనాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అంతకుముందు పెవిలియన్ గ్రౌండ్ నుంచి గట్టయ్య సెంటర్లోని భవనం వరకు కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రణదివే పేరుతో ఉన్న స్మారక భవనాన్ని ప్రారంభించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. సీఐటీయూ అన్ని కార్మిక సంఘాల వంటిది కాదని, వర్గపోరాటాలు నిర్వహించడంలో దీని పాత్ర భిన్నమైనది, సవాళ్లతో కూడుకున్నదని అన్నారు. 2026 శ్రామిక వర్గానికి ముఖ్యమైన సంవత్సరంగా ఉండబోతుందన్నారు. సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ కార్పొరేట్లకు బీజేపీ ప్రభుత్వం ఊడిగం చేస్తోందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వేదికై న ఖమ్మంలో సీఐటీయూ భవనానికి బీటీ రణదివే పేరుపెట్టడం గర్వకారణమని అన్నా రు. అంతకుముందు సంఘ పతాకాన్ని సీనియర్ నేత పి.రాజారావు ఆవిష్కరించారు. సభలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు, ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య, రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌రావు, ఉపాధ్యక్షులు నున్నా నాగేశ్వరరావు, నాయకులు బి.మధు, జ్యోతి, వజ్రాల శ్రీనివాసరావు, కళ్యాణం వెంకటేశ్వరరావు, తుమ్మ విష్ణు, పిన్నింటి రమ్య తదితరులు పాల్గొన్నారు. -
వ్యర్థంతోనూ అద్భుతమైన కళాకృతులు..
ఇల్లెందురూరల్:అవగాహన పెంపొందించుకొని అందుకు అనుగుణంగా సాధన చేస్తే వ్యర్థాలతోనూ అద్భుతమైన కళాకృతులను సృష్టించవచ్చని ఎన్జీసీ రాష్ట్ర కో–ఆర్డినేటర్ నాగరాజుశేఖర్ అన్నారు. మండలంలోని రొంపేడు ఆశ్రమ పాఠశాలలో శనివారం వేస్ట్ టు వెల్త్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇల్లెందు, గుండాల మండలాల పరిధిలోని పలు ప్రభుత్వ, గిరిజన సంక్షేమ పాఠశాలల విద్యార్థులు వ్యర్థాలతో తయారు చేసిన కళాకృతులను వేడకలో ప్రదర్శించి ఆకట్టుకున్నారు. పలు విభాగాల అధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రదర్శనను తిలకించి విద్యార్థుల ప్రతిభను పరిశీలించారు. ఈనేపథ్యాన రొంపేడు ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ప్రథమ, కొమరారం ఉన్నత పాఠశాల విద్యార్థులు ద్వితీయ, ఇల్లెందు మార్గదర్శిని పాఠశాల విద్యార్థులు తృతీయ స్థానంలో నిలవగా.. వీరికి కో–ఆర్డినేటర్‌తో పాటు ఎంపీడీఓ ధన్సింగ్, ఎంఈఓ ఉమాశంకర్ ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మన చుట్టూ ఉండే వనరులపై అవగాహన పెంచుకుని ప్రతీ వ్యర్థాన్ని వినియోగంగా తీర్చిదద్దాలన్న ఆకాంక్షను బలపర్చుకోవాలని, అందుకు అనుగుణంగా పలు కళాకృతులకు రూపకల్పన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొమ్ముగూడెం సర్పంచ్ తాటి యశోద, ఏసీఎందో రమేష్‌బాబు, డీఎస్ఓ సంపత్, చలపతిరావు, రొంపేడు ఆశ్రమ పాఠశాల హెచ్ఎం పద్మ, వార్డెన్ భీమా, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
స్వీయ జాగ్రత్తలతోనే రక్షణ
● చలికాలంలో వృద్ధులు, పిల్లలపై అప్రమత్తంగా ఉండాలి ● సాక్షి ‘ఫోన్‌ఇన్’లో డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారామ్ రాథోడ్చుంచుపల్లి: జిల్లాలో ఇటీవల చలి తీవ్రత ఎక్కువైనందున పిల్లలు, పెద్దలకు స్వీయ జాగ్రత్తలే శ్రీరామ రక్షగా నిలుస్తాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారామ్ రాథోడ్ సూచించారు. సాక్షి ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘ఫోన్ ఇన్’కార్యక్రమంలో జిల్లా ప్రజలు శీతాకాలంలో ఎదుర్కొంటున్న సమస్యలు, సందేహాలను నివృత్తి చేశారు. ప్రశ్న: చలికాలంలో ప్రధానంగా వచ్చే వ్యాధులు ఏమిటీ..? ఎన్.సారయ్య, కొత్తగూడెం డీఎంహెచ్ఓ: శీతాకాలంలో గొంతునొప్పి, చలి జ్వరం, ఆస్తమా, బ్రాంకై టీస్, నిమోనియా, ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంది. ప్రశ్న: ఆరోగ్యం పట్ల ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి? రమాదేవి, కొత్తగూడెం డీఎంహెచ్ఓ: చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్స్ రాసుకోవాలి. చల్లగాలిలో తిరగొద్దు. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. రోజూ 6 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. వెచ్చటి దుస్తులు ధరించాలి. తల, చెవి భాగాలు మఫ్లర్‌తో కప్పి ఉంచాలి. ప్రశ్న: గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బి.నారాయణ, చాతకొండ డీఎంహెచ్ఓ: ఉబ్బసం, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు చలికాలంలో ప్రయాణం చేస్తే బీపీ పెరిగి రక్తనాళాలు ముడుచుకు పోయి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. ప్రశ్న: చలికాలంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఎస్.వెంకటేశ్వరరావు, రేగళ్ల డీఎంహెచ్ఓ: చలికాలంలో కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. నువ్వులతో చేసిన ఆహార పదార్థాలు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవాలి. ఆలుగడ్డ, బీట్రూట్, క్యారెట్, మష్రూమ్స్ వంటి దుంప కూరలు, యాపిల్, అరటిపండ్లు, బొప్పాయి వంటివి తీసుకోవచ్చు. ప్రశ్న: మందులు అందుబాటులో ఉన్నాయా? జి.రాజేష్, సుజాతనగర్ డీఎంహెచ్ఓ: చలికాలం నేపథ్యంలో వచ్చే జలుబు, దగ్గు, ఆస్తమా, జ్వరం వంటి సమస్యలకు అన్ని పీహెచ్‌సీల్లో మందులు, సిరప్లు అందుబాటులో ఉంచాం. ప్రశ్న: సుజాతనగర్ పీహెచ్సీలో సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు? జయరాంరెడ్డి, వేపలగడ్డ డీఎంహెచ్ఓ: సిబ్బంది నిత్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: చలి కాలంలో వృద్ధులు ఎదుర్కొనే సమస్యలు ఏమిటీ.?: జి.సంతోష్, ప్రశాంతి నగర్ డీఎంహెచ్ఓ:చలికాలంలో వృద్ధుల్లో పొడి దగ్గు, పిల్లి కూతలు, ఛాతీలో బరువు వంటి లక్షణాలు కనిపిస్తే ఆస్తమాగా భావించాలి. ఆస్తమా మందులు వాడేవారు ఇన్హేలర్లు వినియోగించాలి. -
బలరాముడిగా ‘అందరి బంధువు’
భద్రాచలం: అందరి బంధువుగా భక్తులు కీర్తించే అందాల రామయ్య బలరామయ్యగా భక్తులకు కనువిందు చేశాడు. అధ్యయనోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రామయ్యను బలరామావతారంలో అలంకరించారు. శేష తల్పమున సేదదీరి రెండు చేతుల్లో శంకు చక్రాలు, మరో రెండు చేతుల్లో నాగలిని, గదను చేబూని సీతాలక్ష్మణులతో దర్శనమిచ్చిన బలరాముడికి భక్తులు జేజేలు పలికారు. శ్రీహరికి శయన ఆదిశేషుని అంశతో జన్మించి, శ్రీకృష్ణునికి అన్నగా ఆయనకు ధర్మస్థాపనలో సహకరి స్తూ, అపర పరాక్రముడిగా పేరొందిన బలరామ య్య దర్శనమిచ్చాడని అర్చకులు అవతార విశిష్టతను వివరించారు. స్వామివారికి ఆలయంలో తెల్ల వారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుప్రభాతం, ఆరాధన సేవలు జరిపారు. స్వామి వారిని బలరామావతారంలో అలంకరించిన బేడా మండపంలో భక్తుల దర్శనార్థం కొద్దిసేపు ఉంచారు. ఘనంగా శోభాయాత్ర పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా జరిగిన బలరామావతారాన్ని శనివారం లారీ అసోసియేషన్ సహాయ సహకారాలతో వైభవోపేతంగా జరిపారు. సంఘబాధ్యులు, ఆలయ అధికారులు స్వామివారిని పల్ల కీపై ఊరేగింపుగా మహిళల కోలాటాలు, బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాల నడుమ మిథిలా స్టేడియం వద్దకు శోభాయాత్రగా తీసుకొచ్చారు. ప్రత్యేకంగా అలంకరించిన వేదిక వద్ద స్వామివారిని కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు స్వామివారికి హారతిని సమర్పించారు. భక్తులకు స్వామివారి ఆశీర్వచనాలను అందచేసి నైవేద్యాన్ని ప్రసాదంగా అందజేశారు. తిరువీధి సేవను ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కేరింతలతో ఫ్లాష్ మాబ్యువతీ యువకుల కేరింతలు, ఆటపాటల ఫ్లాష్ మాబ్, శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం అర్చకులు సమర్పించిన నదీ హారతిలతో గోదావరి తల్లి పులకించింది. ముక్కోటి ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ప్రత్యేక కార్యక్రమాలను రూపకల్పన చేశారు. భద్రాచలంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో స్నానఘాట్ల మెట్ల వద్ద శని వారం ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. రఘుకుల తిలక రారా.., సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా తదితర గీతాలకు విద్యార్థులు నృత్యప్రదర్శనలు చేశారు. గోదావరి మాతకు రామాలయ అర్చకులు, పండితులు నదీ హారతి సమర్పించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ హాజరై నృత్యం చేసి యువతను ఉత్సాహపరిచారు. ఈఓ దామోదర్ రావు, ఈఈ రవీందర్, ఇతర అధికారులు ధనియాల వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్, వెంకటేశ్వర్లు, సర్పంచ్ పూనెం కృష్ణ పాల్గొన్నారు.లారీ అసోసియేషన్ సహకారంతో శోభాయాత్ర -
జలవిహారం
శ్రీరాములుతోనే● 1971 నుంచి కనుల పండువగా తెప్పోత్సవం ● ముఫ్పై ఏళ్లుగా ‘శ్రీరాములు’ లాంచీనే హంసవాహనం ● ఆగమశాస్త్ర ప్రకారం దేవేరుల జలవిహారంసాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోల్కొండ నవాబుగా తానీషా ఉన్న 17వ శతాబ్ద కాలంలో భద్రాచలంలో శ్రీరామచంద్రస్వామి ఆలయాన్ని కంచర్ల గోపన్న నిర్మించాడు. 1798లో గోదావరికి అవతలి వైపు ఉన్న భద్రాచలం ఏజెన్సీని బ్రిటీషర్లకు నిజాం రాజులు దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి హైదరాబాద్‌తో సంబంధాలు పలుచబడి రాజ మండ్రితో భద్రాచలానికి సంబంధాలు పెరిగాయి. రాజమండ్రి, భద్రాచలం మధ్య దట్టమైన శంకరగిరి మాన్యాలు (రంపచోడవరం అడవులు) ఉండటంతో ఈ రెండు ప్రాంతాలను గోదావరిపై జల రవాణా వ్యవస్థనే కలిపి ఉంచేది. రాజమండ్రి నుంచి నిత్యావసర వస్తువులు భద్రాచలం ఏజెన్సీకి వస్తే ఇక్కడి నుంచి పంట ఉత్పత్తులు, కలప, లంక పొగాకు తదితరాలు రాజమండ్రికి వెళ్లేవి. అలా స్వాతంత్య్రం వచ్చే సమయానికి భద్రాచలం ఏజెన్సీకి రాకపోకలు సాగించేందుకు రాజమండ్రి కేంద్రంగా పదిహేను వరకు లాంచీలు నడిచేవి. ఉదయం 5 గంటలకు రాజమండ్రిలో బయల్దేరి సాయంత్రం 5 గంటలకు కూనవరం, మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలానికి చేరుకునేవి. ప్రస్తుత చప్టా దిగువ ప్రాంతం అంత్యంత రద్దీ మార్కెట్‌గా ఉండేది. సరిగ్గా దీనికి అవతల ఒడ్డున గొమ్మూరు లంగరు ఉండేది. తెప్పోత్సవం రామయ్య స్వామికి పంచారాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి నిత్య పూజలు నిర్వహించేందుకు శ్రీరంగం నుంచి ఐదు శ్రీ వైష్ణవ సంప్రదాయం పాటించే కుటుంబాలను ఇక్కడకు తీసుకొచ్చారు. ఆ సంప్రదాయాలను అనుసరించి ఆరంభంలో తెప్పలో సీతారాములను గోదావరిలో జల విహారానికి తీసుకువచ్చేవారు. బూర్గంపాడు–భద్రాచలం ప్రాంతాలను కలుపుతూ గోదావరిపై వంతెన నిర్మాణం జరిగాక భద్రాచలానికి మేలైన రోడ్డు మార్గం అందుబాటులోకి వచ్చింది. భక్తుల రాక గణనీయంగా పెరిగింది. దీంతో 1971లో భారీ వేడుకగా లాంచీలలో తెప్పోత్సవం నిర్వహించారు. అప్పటి నుంచి క్రమంగా లాంచీ సైజు అలంకరణలో భారీతనం చోటు చేసుకుంటూ వచ్చింది. అప్పటి నుంచి ‘శ్రీరాములు’ రోడ్డు మార్గం అందుబాటులోకి వచ్చిన తర్వాత జలరవాణా తన వైభవాన్ని కోల్పోయింది. కేవలం వానాకాలంలో అప్రమత్తతకే లాంచీలు పరిమితమయ్యాయి. 1986 వరదల తర్వాత జూన్ నుంచి సెప్టెంబరు వరకు వరుసగా మూడు నెలల పాటు లాంచీలను ప్రభుత్వం లీజుకు తీసుకునేది. లాంచీలు భద్రాచలం కేంద్రంగా సేవలు అందించేవి. ఈ క్రమంలో శ్రీరాములు లాంచీ 1995లో తెప్పోత్సవంలో భాగమైంది. ఆ ఏడు ఈ లాంచీకి చేసిన హంస అలంకారం అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని ప్రముఖ ఆలయాల్లో తెప్పోత్సవానికి స్ఫూర్తిని ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ శ్రీరాములునే ముక్కోటి పర్వదినానికి ముందు రోజు హంసగా మారుతుంది. రాముడి సేవలోనే 30ఏళ్లుగా ‘శ్రీరాములు’ రాముడి సేవకే అంకితమైంది. పదిహేను రోజుల పాటు హంస అలంకారం చేస్తారు. ఉత్సవాలు ముగిసిన తర్వాత అలంకారం తీయడానికి మరో పది రోజుల సమయం పడుతుంది. ప్రతీ మూడేళ్లకు ఒకసారి ఈ లాంచీని నీటి నుంచి బయటకు తీసి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపడతారు. ఆ రోజుల్లో ఈ బోటు తయారీకి రూ. 3లక్షల ఖర్చయింది. ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కొత్త బోటు తయారు చేయాలంటే రూ. 1.50 కోటి వరకు ఖర్చు అవుతుంది. ప్రతీ ఏడు వరదల సీజన్లో మూడు నెలల పాటు ప్రభుత్వం చెల్లించే లీజు ఆధారంగా లాంచీ నిర్వహణ సాగుతోంది. ఆ తర్వాత భద్రాచలం సమీపంలోనే లంగరు వేసి ఉంటుంది. వినాయకచవితి, దసరా సందర్భంగా విగ్రహాల నిమజ్జనంలో సాయం అందిస్తుంది. ముక్కోటి సమయంలో నెల రోజుల ముందుగా భద్రాచలం పుష్కరఘాట్‌కి తీసుకువస్తారు. మా నాన్న పేరు సీతారాములు. నా లాంచీ పేరు శ్రీరాములు. మాది రామభక్తుల కుటుంబం. ఆలయ ఈవోగా ప్రేమ్ అనే అధికారి ఉన్నప్పుడు రాముడికి సేవలు చేసి ఫీజు అడుగుతావా అని అడిగాడు. అంతే అప్పటి నుంచి ఇప్పటి వరకు తెప్పోత్సవానికి మా లాంచీని ఉచితంగానే అందుబాటులో ఉంచుతున్నాం. –రామకృష్ణ, లాంచీ యజమాని -
కొండరెడ్ల అభివృద్ధికి కృషి
దమ్మపేట: కొండరెడ్ల సమగ్ర అభివృద్ధి, స్వయం సమృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని కొండరెడ్ల ఆవాస గ్రామం పూసుకుంటను ఆయన ఎమ్మె ల్యే జారే ఆదినారాయణతో కలిసి సందర్శించారు. పామాయిల్ మొక్కలను పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఇద్దరు మహిళలకు రెండు పిండి మిల్లులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం అధికారులతో సమీక్ష జరి పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వ యం ఉపాధి కల్పిస్తామని, హెల్త్ కార్డులు పంపిణీ చేస్తామని అన్నారు. పంచాయతీ కార్యాలయం, ప్రా థమిక ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్మిస్తామని చెప్పా రు. పిల్లలందరూ పాఠశాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బీటీ రోడ్డు, కల్వర్టులను ఉగాదిలోపు పూర్తి చేయాలని, సరుకుల రవాణాకు వాహనం మంజూరు చేయాలని చెప్పా రు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన గొత్తి కోయలకు ఇంటి స్థలాలు కేటాయిస్తామని అన్నారు. సమీక్షకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకో వాలని ఐటీడీఏ పీఓను ఆదేశించారు. ఎమ్మెల్యే జారే మాట్లాడుతూ పూసుకుంటలో రెండేళ్లుగా ఎంతో అభివృద్ధి జరిగిందన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ మాట్లాడుతూ పూసుకుంటను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకుని పట్టు పురుగులు, మునగ చెట్లు, మేకలు, కౌజు పిట్టల పెంపకం వంటివి చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ రాహుల్, పలు శాఖల అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వాసం రాణి,పూసుకుంట సర్పంచ్ యాట్ల రాజిరెడ్డి, ఉపసర్పంచ్ బాబూరావు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు -
బయ్యారంలో జాతీయ పోటీలు
జనవరి 7 నుంచి ఐదురోజులపాటు కబడ్డీ క్రీడలు పినపాక: జాతీయస్థాయి అండర్–17 బాలుర కబడ్డీ పోటీలకు పినపాక మండలంలోని ఈ. బయ్యారం జిల్లా పరిషత్ హై స్కూల్ ఎంపికై ంది. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించిన అనుభవం, గ్రామస్తుల సహకారంతో జాతీయస్థాయి పోటీలకు పాఠశాల ముస్తాబవుతోంది. జనవరి 7 నుంచి ఐదు రోజులపాటు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాలుర కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. పోటీలకు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల బాలుర జట్లు పాల్గొననున్నాయి. బాలికల జాతీయస్థాయి పోటీలు మధ్యప్రదేశ్‌లో నిర్వహించనున్నారు. రాష్ట్ర బాలుర జట్టు ఎంపిక జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే బాలుర జట్టు ను ప్రకటించారు. బి నాగచైతన్య, సాయిరాం, యశ్వంత్, గౌతమ్ (ఖమ్మం), దేవరాజ్ (వరంగల్), రాఘవేందర్, రవికుమార్, ఉమేష్ (హైదరాబాద్), భాను ప్రకాష్ (నల్గొండ), చందు (రంగారెడ్డి), రంగా (మెదక్), శ్రీనివాస్ (నిజామాబాద్), విష్ణువర్ధన్ (కరీంనగర్), లచ్చు (ఆదిలాబాద్), నందు (మహబూబ్ నగర్), సుమన్ (కరీంనగర్)లు రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యారు. బాలికల జట్టును అధికారులు ఎంపిక చేసి ఈనెల 26న మధ్యప్రదేశ్‌కు పంపించారు. కాగా పోటీలకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంది విశ్వభారత్ రెడ్డి పోటీలకు సహకారం అందించనున్నారు. బాలికల జట్టుకు కూడా దుస్తులు, క్రీడా సామగ్రి అందజేశారు. భద్రతకు ప్రాధాన్యమివ్వాలిమణుగూరు టౌన్: సింగరేణి ప్రాజెక్టుల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ నిరంతర పర్యవేక్షణ, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని చీఫ్ సెక్యూరిటీ అధికారి బాలరాజు అన్నారు. శని వారం ఆయన వ్యూపాయింట్ నుంచి మణుగూరు ఓసీ, బంకర్ చెక్‌పోస్ట్ ఏరియా, బోర్వెల్ ఏరియా, మెయిన్ మ్యాగజిన్లను పరిశీ లించారు. ఎస్అండ్పీసీ సిబ్బందితో సమావేశమై భద్రతా అంశాలపై చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన్ను ఏరియా జీఎం దుర్గం రాంచందర్ శాలువాతో సన్మానించారు. ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్, జూనియర్ ఇన్స్పెక్టర్ రాజనర్సు తదితరులు ఉన్నారు. -
నిర్మాణాలకు అనుమతులు ఉండాలి
అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ పరిధిలో భవనాల నిర్మాణాలు, పక్కా గృహాలకు అనుమతులు తీసుకోవాలని ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ అన్నారు. శనివారం ఆయన అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని లక్కీ అపార్ట్మెంట్ ఏరియా, పోకల బజార్, వికలాంగుల కాలనీ, ఫైర్ కాలనీ, ఆటో నగర్ ప్రాంతాలను సందర్శించారు. స్థానికులతో మాట్లాడి చెత్త సేకరణ, ఇంటి పన్నుల చెల్లింపులు, భవన నిర్మాణ అనుమతులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ నిబంధనల ప్రకారం పన్నులు చెల్లించాలని, నిర్మాణాలకు అనుమతి తీసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ బి.నాగరాజు, సిబ్బంది ఉన్నారు. ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ -
నేరాలు తగ్గినా.. మరణాలు పెరిగాయి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గతేడాదితో పోల్చితే ఈ ఏడాది జిల్లాలో నేరాల తీవ్రత స్వల్పంగా తగ్గింది. వరకట్న మరణాలు, పోక్సో, బలహీన, అణగారినవర్గాలపై దాడులు వంటి కేసులు పెరిగాయి. ఓవరాల్‌గా రోడ్డు ప్రమాదాలు తగ్గినా, ఆ ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య పెరిగింది. 2025కి సంబంధించిన వార్షిక నివేదికను ఎస్పీ బి.రోహిత్‌రాజు శనివారం కొత్తగూడెంలో వెల్లడించారు. ఈ ఏడాది జిల్లాలో 326 మంది మావోయిస్టులు లొంగిపోయారని, నలుగురు అరెస్టయ్యారని తెలిపారు. రాబోయే రోజుల్లో గంజాయి అక్రమ రవాణాకు చెక్ పెట్టడంతో పాటు పోక్సో చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు విద్యాశాఖతో కలిసి పని చేస్తామన్నారు. మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామన్నారు. 2025 వార్షిక నివేదికలో ఇతర అంశాలు ఇలా ఉన్నాయి. ఏడుగురికి జీవిత ఖైదు జిల్లా వ్యాప్తంగా 3,559 కేసులు నమోదయ్యాయి. ఇందులో పోలీసుల సమర్థవంతమైన విచారణ ఫలితంగా 51.47 శాతం అంటే 1,827 కేసుల్లో నేరస్తులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడ్డాయి. ఇందులో జీవితఖైదు పడిన కేసులు 7, ఇరవై ఏళ్ల జైలుశిక్ష పడిన కేసులు రెండు, పదేళ్లు పడిన కేసులు 5, ఏడేళ్లు శిక్ష పడిన కేసులు 3, ఐదేళ్ల శిక్ష పడిన కేసులు 38, ఏడాదిలోగా శిక్ష పడిన కేసులు 79 ఉన్నాయి. లోక్ అదాలత్‌లో 2,656 కేసులు పరిష్కారమయ్యాయి. 23 మందిపై రౌడీషీట్ జిల్లా వ్యాప్తంగా 153 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. ఇందులో 23 మందిపై ఈ ఏడాది కొత్తగా రౌడీషీట్ నమోదైంది. 98 మంది అనుమానితుల జాబితాలో ఈ ఏడాది చేరారు. దొంగతనాలకు సంబంధించి 146 కేసులు నమోదు కాగా, 332 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో డెకాయిట్ 1, రాబరీ 2, అతిక్రమణలు 62, చోరీ కేసులు 82 ఉన్నాయి. రూ.1.21 కోట్ల విలువైన ప్రాపర్టీని రికవరీ చేశారు. ఈ కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న ప్రాపర్టీలో ఇది 46 శాతంగా ఉంది. సైబర్ క్రైం సైబర్ క్రైం విభాగంలో జిల్లా వ్యాప్తంగా 1,613 ఫిర్యాదులు అందాయి. ఇందులో 196 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మోసగాళ్ల ఖాతాలోకి వెళ్లిన రూ.1.45 కోట్ల నగదును సీజ్ చేశారు. రూ.22.63 లక్షల నగదును రికవరీ చేశారు. ఇసుక, రేషన్ బియ్యం, పశువుల అక్రమ రవాణా నిరోధంలోనూ గణనీయమైన పురోగతి సాధించారు. గంజాయి అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. గడిచిన ఏడాదిలో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి 70 కేసులు నమోదు అవగా, రూ.28.53 కోట్ల విలువ చేసే 5,707 కేజీల గంజాయిని సీజ్ చేశారు. ఇందులో నిబంధనలను అనుసరిస్తూ రూ.17,37 కోట్ల విలువైన 4,359 కేజీల గంజాయిని నాశనం చేశారు. గంజాయి కేసులకు సంబంధించి 221 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో మన రాష్ట్రానికి చెందిన వారు 152 మంది ఉండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 69 మంది ఉన్నారు. టేకులపల్లి, భద్రాచలానికి చెందిన ఇద్దరు నిందితులకు పదేళ్లకు పైగా జైలు శిక్ష పడింది. ముగ్గురి మీద పీడీ యాక్ట్ పెట్టారు. గంజాయి సేవించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచారు. ఈమేరకు కొత్తగా 69 మందిని అనుమానితుల జాబితాలో చేర్చారు. మొత్తంగా జిల్లాలో గంజాయికి సంబందించి 324 మంది అనుమానితులు జాబితాలో ఉన్నారు. -
భద్రాద్రిలో భక్తజన సంద్రం..
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. 2025 ఏడాది ముగుస్తుండడంతో పాటు వరుస సెలవులు రావడంతో తెలుగు రాష్ట్రాల నుంచే కాక పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. శుక్రవారం తెల్లవారుజాము నుండే గోదావరి స్నానాలు ఆచరించిన భక్తులు స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. ఏడాది చివరి వారం కావడంతో స్వామివారి ఆశీస్సుల కోసం కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ దామోదర్‌రావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. రద్దీ పెరిగినా భక్తులకు అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వరుస సెలవులతో పోటెత్తిన జనం -
దేవాదాయ చట్టాల సవరణ అనివార్యం
ఖమ్మంగాంధీచౌక్: సమస్యలు పరిష్కారం కావాలంటే దేవాదాయ, ధర్మాదాయ శాఖ చట్టాలను సవరించడం తప్పనిసరని అర్చక, ఉద్యోగ సంఘాల రాష్ట్ర జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రర్మ పేర్కొన్నారు. ఖమ్మం పవనసుత జలాంజనేయ స్వామి దేవస్థానంలో అర్చక, ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షులు దాములూరి వీరభద్రరావు, తోటకూర వెంకటేశ్వర్లు అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను సవరించినా దేవాదాయ శాఖ చట్టాన్ని విస్మరించారని ఆరోపించారు. ఫలితంగా పదేళ్లకు పైగా పనిచేస్తున్న అర్చక, ఉద్యోగుల రెగ్యులరైజేషన్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్, ఔట్ సోర్సింగ్ అర్చక, ఉద్యోగుల క్రమబద్ధీకరణలో జాప్యం జరుగుతోందని తెలిపారు. జేఏసీ రాష్ట్ర కన్వీనర్ డీవీఆర్.శర్మ మాట్లాడుతూ అసమానతలు తొలగించి అర్చక, ఉద్యోగులందరికీ ఒకే వేతన విధానం, డీడీఎన్ అర్చకులకు 1999 పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నరహరి రామకృష్ణాచార్యులు, బగాది మురళి, కృష్ణమాచార్యులు, శ్రీనివాసశర్మ, రామశర్మ తదితరులు పాల్గొన్నారు.అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్ ఉపేంద్రశర్మ -
నేడు డీఎంహెచ్ఓతో ‘సాక్షి’ ఫోన్ ఇన్
చుంచుపల్లి: ఇటీవల జిల్లాలో పెరిగిన చలి తీవ్రత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, మహిళలు జలుబు, దగ్గు, ఆస్తమా, ఎలర్జీ, వైరల్ ఫీవర్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. చలికాలంలో సంక్రమించే వ్యాధులపై సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ‘సాక్షి’ డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారామ్ రాథోడ్‌తో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. నిర్ణీత సమయంలో ప్రజలు ఫోన్ చేసి తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. తేదీ: 27.12.2025 శనివారం సమయం: సాయంత్రం 3 గంటల నుంచి 4 గంటల వరకుఫోన్ చేయాల్సిన నంబర్ 9492670207 -
క్రీడల్లో ప్రావీణ్యంతో మెరుగైన అవకాశాలు
కామేపల్లి: విద్యార్థులు, యువత చదువుకుంటూనే క్రీడల్లో ప్రావీణ్యం సాధించాలని.. తద్వారా ఉద్యోగ, ఉపాధి రంగాల్లో మెరుగైన అవకాశాలు దక్కుతాయని ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. కామేపల్లిలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో తెలంగాణ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆరెం రవి ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి సీనియర్ పురుషుల కబడ్డీ పోటీలను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. గెలుపోటములను సమానంగా స్వీకరించాలని, ఓడిపోయిన వారు మరింత కష్టపడితే విజయాలు దక్కుతాయని చెప్పారు. ఇండియన్ మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాంరెడ్డి మాట్లాడుతూ పోటీలకు 33 జిల్లాల జట్లు హాజరుకాగా, విజేతలను జాతీయ స్థాయికి ఎంపిక చేస్తామని తెలిపారు. అసోసియేషన్ రాష్ట్ర, జిల్లా ప్రధాన కార్యదర్శులు తిరుపతి, ఈసం రంగారావు, తెలంగాణ వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషన్ డైరెక్టర్ రాంరెడ్డి గోపాల్‌రెడ్డి, సర్పంచ్ అజ్మీరా బుల్లి, ఎస్సై శ్రీకాంత్‌తో పాటు గింజల నరసింహారెడ్డి, పుచ్చకాయల వీరభద్రం, గుజ్జర్లపూడి రాంబాబు, తోటకూరి శివయ్య, రాంరెడ్డి జగన్నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకం
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి వైభవంగా పంచామృతాభిషేకం నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజు లు, హారతిని సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమపూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈఓ రజనీకుమారి తదితరులు పాల్గొన్నారు. నేడు మంత్రి తుమ్మల పర్యటనదమ్మపేట: మండల పరిధిలోని పూసుకుంట గ్రామంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారని గండుగులపల్లి క్యాంపు కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన వెలువడింది. ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రికి వితరణ రూ. 8 లక్షల విలువైన వైద్యపరికరాలు, సామగ్రి అందజేతచర్ల: మండలంలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన, అమెరికాలో స్థిరపడిన అల్లూరి శ్రీని వాసరాజు కుటుంబ సభ్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వితరణ చేశారు. రూ.5లక్షల విలువైన వైద్య పరికరాలు, రూ.3లక్షల విలువైన భవన మరమ్మతుల సామగ్రిని అందజేయగా, శుక్రవారం భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ పుట్టి పెరిగిన గ్రామంపై మమకారంతో దాతృత్వం చూపడం అభినందనీయమన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీధర్, ఎన్ఆర్ఐ కుటుంబీకులు పాల్గొన్నారు. చుంచుపల్లి తహసీల్దార్‌కు పదోన్నతిచుంచుపల్లి: చుంచుపల్లి తహసీల్దార్‌గా పనిచేస్తున్న పానెం కృష్ణకు డిప్యూటీ కలెక్టర్‌గా ప్రభుత్వం పదోన్నతి కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2023 సాధారణ ఎన్నికల బదిలీల్లో భాగంగా ఆయన ఇక్కడకు వచ్చారు. సీనియారిటీ ప్రకారం ప్రభుత్వం పదోన్నతి కల్పించగా, పోస్టింగ్‌కు ఆదేశాలు రావాల్సి ఉంది. -
ముగిసిన వాజ్‌పేయ్ శత జయంతోత్సవం
చుంచుపల్లి: భారతరత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారి వాజ్‌పేయ్ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని బీజేపీ ఆధ్వర్యాన శుక్రవారం కొత్తగూడెం ఐఎంఏ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జ్ డాక్టర్ విజయ్ చందర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు మాట్లాడుతూ.. ఎవరి మద్దతు లేకుండా ప్రధానమంత్రి పదవిని తునప్రాయంగా వదిలేసి ప్రజా తీర్పు కోసం మళ్లీ ప్రజల్లోకి వెళ్లిన మహనీయుడు వాజ్‌పేయ్ అని ఆయన సేవలను గుర్తు చేశారు. ఒక గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. దొంగ ఓట్లు ఉన్నాయని ఈ దేశ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పదేపదే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జీవీకే మనోహర్‌రావు, కుంజా ధర్మ, జంపన సీతారామరాజు, జిల్లా కార్యదర్శి నోముల రమేష్, నాయకులు పాల్గొన్నారు. -
పీఏసీఎస్‌లో ‘నామినేటెడ్’!
● త్రీమెన్ కమిటీలతో నాన్ అఫీషియల్ సొసైటీల ఏర్పాటుకు కసరత్తు ● ఈ నెల 19న సహకార సంఘాల పాలకవర్గాలు రద్దుటేకులపల్లి: రైతుల సంక్షేమం, ఆర్థికాభివృద్ది కోసం పని చేస్తున్న సహకార సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న రద్దు చేసింది. దీంతో పాలన పర్సన్ ఇన్‌చార్జ్‌ల చేతుల్లోకి వెళ్లింది. ఇప్పటికే పర్సన్ ఇన్‌చార్జ్‌లు ఆయా సొసైటీలకు వెళ్లి చార్జ్ కూడా తీసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21, ఖమ్మం జిల్లాలో 79 సొసైటీలు ఉన్నాయి. ఇక నుంచి ఎన్నికల ద్వారా కాకుండా పాలక మండలిని నామినేటేడ్ నియామకాల ద్వారా ఎన్నుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పాలకవర్గాలు కొలువుదీరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీ తరహాలో ఒక చైర్మన్, ఇద్దరు సభ్యులతో నాన్ అఫీషియల్ పీఏసీఎస్‌లను ఏర్పాటు చేసే యోచనతోపాటు, ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే నియామకాలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. సహకార శాఖ చట్టంలో మార్పులేమీ చేయకుండానే ఉన్న నిబంధనలకు అనుగుణంగానే నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. భారీగా టర్నోవర్ బేతంపూడి సొసైటీ అందరి సహకారంతో కోట్ల రూపాయల టర్నోవర్‌తో ముందుకు దూసుకుపోతోంది. రుణాల ద్వారా రూ.25 కోట్లు, పురుగు మందుల విక్రయాల ద్వారా రూ.80 లక్షలు, ఎరువుల విక్రయాల ద్వారా రూ.3 కోట్లు, విత్తనాల విక్రయాల ద్వారా రూ.30 లక్షలు, ధాన్యం కొనుగోలు ద్వారా రూ.20 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. సొసైటీకి గోడౌన్, పెట్రోల్‌బంక్, ఫార్మసీ మంజూరయి. వీటి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సీఎస్సీ సెంటర్ కూడా సొసైటీలో కొనసాగుతోంది. నామినేటెడ్‌పై అప్పుడే చర్చలు! నామినేటేడ్ పాలకవర్గ వ్యవహారంపై అధికార పార్టీ వర్గాల్లో ఇప్పటికే చర్చలు, సంప్రదింపులు మొదలయ్యాయి. 2013లో జరిగిన ఎన్నికల్లో బేతంపూడి సొసైటీకి లక్కినేని సురేందర్‌రావు చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఒకటిన్నర సంవత్సరం పాలన అనంతరం జెడ్పీటీసీగా గెలుపొందారు. దీంతో వాంకుడోత్ పూన్యాకు ఇన్చార్జ్ ఇచ్చారు. ఆరు నెలల తరువాత దళపతి శ్రీనివాస్ రాజును చైర్మన్‌గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఒకటిన్నర సంవత్సరాలకు దళపతిని తొలగించి పూన్యాకు ఇన్చార్జ్ ఇచ్చారు. 2018లో ఎన్నికలు జరగాల్సి ఉండగా ఆరు నెలలకు ఒకసారి వాయిదా వేసుకుంటూ రెండు సంవత్సరాలు కొనసాగించి 2020లో ఎన్నికలు నిర్వహించగా మళ్లీ లక్కినేని చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 14, 2025తో పాలన ముగిసినప్పటికీ ఆరు నెలలు చొప్పున వాయిదా వేస్తూ వచ్చారు. ఈ నెల 19న పాలకవర్గాలు రద్దు కాగా, నామినేటెడ్ పోస్టులు ఎవరు దక్కించుకుంటారోననే చర్చ సాగుతోంది. సుమారు 9 వేల మంది సభ్యులతో బేతంపూడి సొసైటీ అభివృద్ధి పథంలో కొనసాగుతోంది. రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పరిపాలన ఇబ్బందిగా మారింది. జిల్లాలో ఇప్పటికే ఆళ్లపల్లి, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి, దుమ్ముగూడెం, పాల్వంచ, బూర్గంపాడు మొత్తం 8 కొత్త సొసైటీలు మంజూరయ్యాయి. టేకులపల్లి మండలంలోనూ నూతన సొసైటీ ఏర్పాటు ఆవశ్యకత ఉంది. 2005కు ముందు మండలంలో బొమ్మనపల్లి, బేతంపూడి రెండు సొసైటీలు ఉండేవి. 2005 తర్వాత బొమ్మనపల్లిని బేతంపూడిలో విలీనం చేశారు. రైతులకు ప్రభుత్వ పథకాలు, సంక్షేమం, అభివృద్ది ఫలాలు చేరువ కావాలంటే టేకులపల్లి మండలంలో బొమ్మనపల్లి, బోడు, కోయగూడెం సహకార సంఘాలు ఏర్పాటు చేయాలని పలువురు కోరుతతున్నారు. కాగా బేతంపూడి సొసైటీకి పర్సన్ ఇన్చార్జ్గా సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.ఆదినారాయణ నియమితులయ్యారు. -
గోదావరి తీరాన ఏరు ఉత్సవాలు
● నేడు 230 మంది యువతతో ఫ్లాష్ మాబ్ ● వివరాలు వెల్లడించిన కలెక్టర్ జితేష్ వి.పాటిల్భద్రాచలంటౌన్: గోదావరి తీరంలో ‘ఏరు–ది రివర్ ఫెస్టివల్’వేడుకల్లో భాగంగా శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. పట్టణంలోని తెప్పోత్సవ ఘాట్ వద్ద ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 230 మంది స్థానిక యువతతో ఫ్లాష్ మాబ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సామూహిక నృత్య ప్రదర్శన, నదీ హారతి కార్యక్రమాలు కూడా ఉంటాయన్నారు. ఏరు ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. అలరించిన ఏరు ఉత్సవం.. దుమ్ముగూడెం: మండల పరిధిలోని బొజ్జిగుప్ప గ్రామంలో శుక్రవారం రాత్రి నిర్వహించిన ఏరు ఉత్సవం ఆహూతులను అలరించింది. గిరిజన నృత్యాలు, క్యాంప్ ఫైర్ తదితర కార్యక్రమాలు సందడిగా సాగాయి. కలెక్టర్ జితేష్ వి.పాటిల్, అసిస్టెంట్ కలెక్టర్ సౌరభ్ శర్మ, కేంద్ర హౌసింగ్ అధికారి కుశాల్ తదితరులు హాజరై ఉత్సవాలను వీక్షించారు. ఆదివాసీ గిరిజనుల సంస్కృతి ప్రాచుర్యం చెందేలా ప్రయత్నిస్తామని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అశోక్‌కుమార్, ఎంపీడీఓ వివేక్‌రామ్, ఆర్ఐలు కల్లూరి వెంకటేశ్వరరావు, నరసింహారావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
మధిర: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శని, ఆదివారం జిల్లాలో పర్యటించనున్నారు. శనివారం సాయంత్రం నేలకొండపల్లి మండలంలోని అనంతనగర్, ఖమ్మం రూరల్ మండలంలోని కామంచికల్‌లో విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేస్తారు. అలాగే, ఆదివారం ఉదయం 11 గంటలకు మధిరలో జరిగే కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భట్టి పాల్గొంటారు. అనంతరం మధిర మున్సిపల్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 30నుంచి రెండు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం చెరువుమాధారంలో ఈనెల 30వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిటీ బాధ్యులు తెలిపారు. ఈమేరకు శుక్రవారం నిర్వాహకుడు సూరేపల్లి శ్రీను మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా ఏటా మాదిరిగానే కబడ్డీ పోటీలు ఏర్పాటుచేశామని చెప్పారు. అలాగే, ముగ్గులు, ట్రాక్టర్స్ రివర్స్ పోటీలు ఉంటాయని, ఆసక్తి ఉన్న వారు పాల్గొనాలని కోరారు. కారు, ఇసుక టిప్పర్ ఢీ.. ● తప్పిన పెనుప్రమాదం.. దుమ్ముగూడెం: వరుస సెలవులతో పాటు ముక్కోటి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యాన పర్ణశాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నాయి. ఈక్రమంలో శుక్రవారం భద్రాచలం –వెంకటాపురం రోడ్డులో బుర్రవేములా దగ్గర ముందున్న కారును వెనక వస్తున్న ఇసుక టిప్పర్ ఢీకొట్టి సుమారు 20 అడుగుల మేర లాక్కొనివెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే మండల ప్రధాన రహదారి మీదుగా అధికారులు ఇసుక రవాణా నిలువరించలేరని తేటతెల్లం అవుతోంది. కనీసం భద్రాచలం, పర్ణశాలలో జరిగే ప్రత్యేక కార్యక్రమాల సమయంలోనైనా ఇసుక లారీల రవాణా నిలిపివేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని మండలవాసులు కోరుతున్నారు. వివాహిత అదృశ్యం ములకలపల్లి: వివాహిత మహిళ అదృశ్యంపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై మధుప్రసాద్ కథనం మేరకు.. మండలంలోని మొగరాలగుప్ప గ్రామానికి చెందిన కుర్పం జయలక్ష్మి, భర్త కన్నయ్యతో కలసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈక్రమాన బుధవారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో బంధువులు, సమీపస్తులను విచారించినా ఆచూకీ తెలియరాలేదు. దీంతో ఆమె భర్త శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పాండురంగాపురంలో యువతి.. పాల్వంచరూరల్: ఇంట్లోనుంచి తెల్లవారుజామున బయటకు వెళ్లిన యువతి అదృశ్యమైన ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు కథనం ప్రకారం.. మండల పరిధి పాండురంగాపురం ఉమ్మడి పంచాయతీకి చెందిన డిగ్రీ చేసి ఇంటి వద్ద ఉంటున్న 24 ఏళ్ల యువతి శుక్రవారం తెల్లవారుజామున ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆమె కుటుంబీకులు ఎక్కడా వెతికిన ఆచూకీ లభ్యం కాకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. ఇసుక లారీ పట్టివేత బూర్గంపాడు: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. మండల పరిధిలోని బుడ్డగూడెం గ్రామం వద్ద కిన్నెరసాని నుంచి ఇసుకను తరలిస్తుండగా.. మోరంపల్లిబంజర వద్ద పోలీసులు పట్టుకుని లారీని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు. అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి తల్లాడ: తల్లాడ మండలం అంజనాపురానికి చెందిన ఓ యువకుడు శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అంజనాపురం గ్రామంలో నాయనమ్మ ఇంట్లో మూడ్ పవన్(23) జీవిస్తున్నాడు. గురువారం రాత్రి ఆయన ఇంటి ఎదుట కొందరు కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ కడుతుండగా పవన్ అడ్డుచెప్పాడు. దీంతో ముగ్గురు ఆయనపై దాడి చేస్తుండగా స్థానికుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. అయితే, శుక్రవారం ఉదయంకల్లా ఆయన ఇంట్లో కూర్చున్న స్థితిలో చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ విషయాన్ని బంధువులు గుర్తించగా ఆయన పెదనాన్న కొడుకు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఎన్.వెంకటకృష్ణ తెలిపారు. -
కోటెమ్మ ఆలయంలో మంత్రి సీతక్క పూజలు
ములకలపల్లి: నర్సాపురం శివారులోని కోటెమ్మ తల్లి ఆలయంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క శుక్రవారం ప్రత్యేక పూజ లు చేశారు. జగన్నాథపురం నుంచి కోటెమ్మ తల్లి ఆలయం వరకు డబుల్ రోడ్డు నిర్మించాలని కోరు తూ స్థానికులు మంత్రికి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సర్పంచ్ కుంజా వినోద్, ఆలయకమిటీ అధ్యక్షుడు బజ్జూరి కృష్ణ, కారం సుధీర్, అడపా నాగేశ్వరరావు, కుంజా సంతోష్, గుంట్రు సాయి, బజ్జూరి వినయ్ తదితరులు ఉన్నారు. -
సీతాలక్ష్మణ సమేత..
● భద్రగిరి రామయ్య నిజరూప దర్శనం ● కొనసాగుతున్న అధ్యయనోత్సవాలుభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. చక్కని సీతమ్మ ఒడిలో, పక్కన తమ్ముడు లక్ష్మణుడు, రెండు చేతుల్లో శంఖుచక్రాలతో మరో రెండు చేతుల్లో ధనస్సు, బాణాలను ధరించి లోకరక్షణకు నేనున్నానంటూ భక్తులకు అభయమిస్తూ శుక్రవారం భద్రగిరి రామ య్య నిజరూప దర్శనమిచ్చాడు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి ఆరాధన గావించారు. బేడా మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులతోపాటు 12మంది ఆళ్వార్లను కొలువుదీర్చి వేదపండితులు 200 పాశుర పఠనం చేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర శ్రీరామవతార శోభాయాత్రను లయన్ క్లబ్ సహాయ సహకారాలతో కనుల పండువగా జరిపా రు. సంస్థ బాధ్యులు, భక్తుల జై శ్రీరామ్ నామస్మరణల నడుమ శోభాయాత్ర సాగింది. వేదపండితుల మంత్రోచ్ఛరణలు, మేళతాళాలు, మహిళల కోలా టాలు మిథిలాస్టేడియంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామివారిని కొలువుదీర్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విచిత్ర వేషధారణలు, కోలాటాలు ఆకర్షించాయి. నిత్యం అంతరాలయంలో భక్తులచే పూజలందుకునే జగపతి రాముడు.. తన ఆశీస్సులను అందించడానికి వచ్చిన స్వా మివారి అవతారాన్ని చూసి భక్తులు మురిశారు. వ్యక్తిగత సౌఖ్యాలకన్న ధర్మాచరణయే ఉత్తమమైనదని, అదే శాశ్వతమైనదని శ్రీరాముడు లోకానికి చాటి చెప్పాడని, పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడు, ధర్మ స్వరూపుడు రాముడేనని ఆలయ అర్చకులు, పండితులు రామవతార విశిష్టతను వివరించారు. భక్తులు స్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో బారులుదీరారు. చివరిగా తిరువీధి సేవను ఘనంగా జరిపా రు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్‌రావు, ఏఈవో శ్రవణ్‌కుమార్, ట్రస్టుబోర్డు మాజీ మెంబర్ బూసిరెడ్డి అంకిరెడ్డి, ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.శ్రీహరికి శయనమైన ఆదిశేషువుని అంశతో జన్మించి, ‘కృషితో నాస్తి దుర్భిక్షం’అన్న నానుడికి ప్రతీకగా నాగలిని ఆయుధంగా ధరించి శ్రీకృష్ణునికి అన్నగా నిలిచి, ఆయనకు ధర్మ స్థాపనలో సహకరించిన అవతారం శ్రీ బలరామావతారం. సంకర్షణునిగా పిలవబడే బలరాముడు ప్రలంబాసురడనే రాక్షసుని సంహరించాడు. ఈ అవతారాన్ని దర్శించిన వారికి మాందిగుళికా గ్రహాల బాధలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారు శనివారం బలరామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
రైల్వేలైన్.. పరిహారం లేట్
కారేపల్లి: డోర్నకల్ నుంచి భద్రాచలం రోడ్డు(కొత్తగూడెం) వరకు కారేపల్లి జంక్షన్ మీదుగా రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. ఈక్రమాన భూమి సేకరించాల్సి ఉండగా వ్యవసాయ భూములు, ఇళ్లకు పరిహారం లెక్క కట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఆరు నెలలుగా సర్వేలు, గ్రామసభలు కొనసాగుతున్నా పరిహారంపై స్పష్టత ఇవ్వకపోవడంతో వ్యవసాయ భూములు కోల్పోనున్న రైతులు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు కోల్పోనున్న ప్రజలు ఎదురుచూస్తూ కాలం గడపాల్సి వస్తోంది. అయితే, మార్కెట్ ధరపై పది రెట్లు పరిహారం ఇవ్వాలనే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటారా లేక నామమాత్రంగా చెల్లిస్తే తాము బతకడం ఎలా అన్న ప్రశ్నలు వారిని వేధిస్తున్నాయి. మండలంలో 54 ఎకరాలు కారేపల్లి మండలంలోని కమలాపురం, గేటుకారేపల్లి, కారేపల్లి, గాంధీనగర్, చీమలపాడు, రేలకాయపల్లి గ్రామాల్లో రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణం కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించారు. ఆయా గ్రామాల్లో 54 ఎకరాలు అవసరమని గుర్తించిన రైల్వే అధికారులు సర్వే కూడా చేశారు. ఇందులో సింగరేణి రెవెన్యూలో 60 – 70 మంది రైతుల నుంచి 11.35 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించాల్సి ఉంది. అలాగే, కారేపల్లి స్టేషన్ విస్తరణ, రెండో ప్లాట్‌ఫాం, అదనపు ట్రాక్‌ల నిర్మాణానికి 20 కుటుంబాలు ఇళ్లు కోల్పోవాల్సి వస్తోంది. ట్రాక్ నుంచి 45 మీటర్ల మేర వ్యవసాయ భూమి, రైల్వేస్టేషన్ పరిధిలో 65మీటర్ల మేర భూమితో పాటు పలువురి ఇళ్లు సేకరించాల్సి ఉండగా.. అధికారులు మార్కింగ్ సైతం వేశారు. నెలలు గడుస్తున్నా కొలిక్కిరాని ధర -
శత వసంతాల సభకు తరలిరావాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): సీపీఐ శత వసంతాల ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చే నెల 18న ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా తెలిపారు. సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తి కావడంతో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఎరజ్రెండాలు ఎగురవేసి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ 1925లో కాన్పూరులో ఆవిర్భవించిన సీపీఐ శుక్రవారంతో శత వసంతాలు పూర్తి చేసుకుందని అన్నారు. స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిందని గుర్తుచేశారు. జనవరి 18న ఖమ్మంలో నిర్వహించే సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు చంద్రగిరి శ్రీనివాసరావు, కంచర్ల జమలయ్య, దుర్గరాశి వెంకన్న, వాసిరెడ్డి మురళీ, జి వీరస్వామి, ఫయిమ్, భూక్యా శ్రీనివాస్, ధీటి లక్ష్మీపతి, గెద్దాడ నగేష్, మునిగడప వెంకన్న, నేరేళ్ల రమేష్, మునిగడప పద్మ పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా -
పాఠాలు ఎవరు చెప్పాలి?
ప్రారంభించారు సరే.. డాక్టర్ మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని హడావిడి చేశారు. కొత్తగూడెంలో అట్టహాసంగా ప్రారంభించారు. కానీ సదుపాయాలు మాత్రం పూర్తిస్థాయిలో కల్పించలేదు. ఒక్కరు కూడా రెగ్యులర్ అధ్యాపకులు లేరు. ఆరుగురు గెస్ట్ ఫ్యాకల్టీతో నడిపిస్తున్నారు. మరో వైపు జనవరిలో సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. – కొత్తగూడెంఅర్బన్ఈ నెల 2న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అట్టహాసంగా ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ప్రారంభించారు. వర్సిటీ ఏర్పాటు నేపథ్యంలో నెలలపాటు ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు హడావిడి చేశారు. వర్సిటీకీ మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు పెట్టడం గర్వకారణమని, గిరిజన జిల్లాకు అంతర్జాతీయస్థాయిలో ఖ్యాతి వస్తుందని ప్రగల్భాలు పలికారు. కానీ కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేదు. అధ్యాపకుల నియామకంపై దృష్టి పెట్టలేదు. ఇప్పటికై నా మంత్రులు దృష్టిసారించి వర్సిటీ బలోపేతానికి చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. -
గోదావరిలో విషాదం..
● చేపల వేటకు వెళ్లిన గజ ఈతగాడు మృతి ● ఉరితాడైన మెడలోని దుప్పటి?అశ్వాపురం: అర్ధరాత్రి చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గోదావరీలో మునిగి మృత్యువాత పడ్డాడు. మండల పరిధిలోని చింతిర్యాల గ్రామానికి చెందిన నాగుల వెంకటరమణ(48) శుక్రవారం తెల్ల వారుజామున తన సహచరులతో కలిసి చేపలవేటకు వెళ్లారు. ఒక పట్టు చేపలు ఒడ్డుకు చేర్చి రెందో పట్టుకు పడవలో గోదావరిలో వెళ్తుండగా.. ఇంజన్ స్టార్ట్ చేస్తున్న క్రమంలో ప్రమాదశాత్తు ఇంజన్ చక్రంలో తన మెడపై ఉన్న దుప్పటి పడి లాగేయడంతో దుప్పటి మెడకు బలంగా బిగుసుకొని గోదావరిలో పడి గల్లంతయ్యాడు. వెంకటరమణ చేపల వేట, గోదావరిలో ఈతలో అనుభవజ్ఞుడు కావడంతో ఈదుకుంటూ వస్తాడులే అని సహచరులు ఎదురుచూశారు. కానీ ఎంతకీ రాకపోవడంతో గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ అశోక్‌రెడ్డి, సిబ్బంది పర్యవేక్షణలో తొమ్మిది గంటల పాటు గాలించగా.. వెంకటరమణ మృతదేహం లభ్యమైంది. మెడలో దుప్పటి ఆయన మెడకు బిగియడంతో ఉరిలా పడి అందులో పడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. అనుభవం ఉన్నా.. ప్రాణంతో గోదావరిలో పడితే ఎంత లోతు నుంచైనా ఈదుకుంటూ బయటకు రాగల సమర్థుడు.. చేపల వేటలో అనుభవజ్ఞుడు.. అయినా అనుకోని ప్రమాదంలో వెంకటరమణ గోదావరిలోనే మృతి చెందాడు. కాగా, గోదావరి వరదల సమయాన మండలంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో పడవల సాయంతో స్థానికులను పునరావాస కేంద్రాలకు తరలింపులో ఆయన కీలక పాత్ర పోషించాడు. కాగా, వెంటకరమణకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యాన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పాత పద్ధతిలోనే..
జిల్లాలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అందుబాటులోకి రాకపోవడంతో శుక్రవారం పాత పద్ధతుల్లోనే యూరియా విక్రయించేందుకు పీఏసీఎస్ అధికారులు చర్యలు తీసుకున్నారు. గత నెలరోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో పీఏసీఎస్ గోదాంలలో ఉన్న 700యూరియా బస్తాలకు వేయిమందికి పైగా రైతులు తమ ఆధార్, పట్టాదారు పుస్తకాలతో క్యూకట్టారు. ఇందులో 20శాతం మందికి కూడా యూరియా అందలేదు. మళ్లీ లారీ వచ్చే వరకు రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితులున్నాయి. దీంతో రైతులు సమీపంలోని ఆంధ్రప్రదేశ్‌లోని కుక్కునూరు, కూనవరం మండలాలకు వెళ్లి ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు కోరుతున్నారు. -
కిన్నెరసానిలో క్రిస్మస్ సందడి
పాల్వంచరూరల్: క్రిస్మస్ వేడుకల సందర్భంగా కిన్నెరసానికి పర్యాటక రద్దీ పెరిగింది. శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. ట్రైనీ కలెక్టర్ సౌరభ్ శర్మ కూడా సందర్శించి ప్రకృతి అందాలను ఆస్వాదించారు. 988 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.52,110 ఆదాయం లభించింది. 400 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.23,900 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. మొత్తం రూ.86,010 ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. -
విద్యుత్ శాఖలో బదిలీలు ?
● త్వరలోనే విధివిధానాలు వెల్లడయ్యే అవకాశం ● రెండేళ్లు ఒకేచోట ఉన్న వారికి తప్పనిసరి ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఉద్యోగుల బదిలీలపై చర్చ మొదలైంది. ఒకేచోట రెండేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడమే కాక ఫిర్యాదులు ఉన్న వారిని నాన్ పోకల్ పోస్టుల్లోకి మార్చాలనే భావనకు వచ్చినట్లు తెలిసింది. తద్వారా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని దూర ప్రాంతాలకు బదిలీ చేసేలా విధివిధానాలు రూపొందిస్తున్నట్లు సమాచారం. మార్చి, ఏప్రిల్ నాటికి బదిలీల ప్రక్రియను పూర్తి చేసే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులను మూడేళ్లకోసారి బదిలీ చేస్తారు. కానీ ప్రభుత్వం ఈసారి రెండేళ్ల సర్వీస్‌నే పరిగణనలోకి తీసుకుని బదిలీలకు సిద్ధమైంది. విద్యుత్ సంస్థలో అవినీతి పెరిగిందని, కొత్త సర్వీసుల మంజూరు, ట్రాన్స్ఫార్మర్ల మార్పు, కొత్తవి ఏర్పాటు, మీటర్ల మార్పు ఇలా అన్ని పనులకు సిబ్బంది డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఫిర్యాదులతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినప్పుడు కూడా అధికారులు, సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు పెరగడంతో ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన వారికి స్థానచలనం కల్పించాలని, తద్వారా అవినీతికి అడ్డుకట్ట వేయొచ్చనే భావనకు వచ్చినట్లు సమాచారం. జిల్లాలో భారీగా స్థానచలనం విద్యుత్ ఉద్యోగుల బదిలీల్లో రెండేళ్ల సర్వీస్‌నే పరిగణనలోకి తీసుకోనుండడంతో ఖమ్మం సర్కిల్ పరిధిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఇంజనీరింగ్, అకౌంట్స్, ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఎక్కువ సంఖ్యలో బదిలీ కావొచ్చని భావిస్తున్నారు. దీర్ఘకాలంగా దూర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తుండగా, జిల్లా కేంద్రం, ఇతర పట్టణాల్లో పనిచేసే వారు పెదవి విరుస్తున్నారు. ఇక యూనియన్లకు ప్రాతినిధ్యం వహించే నాయకులు ఇదే అదునుగా అనుకూలమైన చోటకు బదిలీ చేయించుకునేలా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లు సమాచారం. విద్యుత్ శాఖలో 18 – 19 ఉద్యోగ సంఘాలు ఉండగా కొందరు యూనియన్‌లో కీలక స్థానం ఉన్నట్లు లెటర్ ప్యాడ్లు సృష్టించి ఎంచుకున్న పోస్టింగ్ సాధించిన దాఖలాలు ఉన్నాయి. ఫలితంగా దూర ప్రాంతాల్లో పనిచేసే పలువురు అక్కడే కొనసాగాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం బదిలీలకు సిద్ధమవుతున్న నేపథ్యాన ఈ వ్యవహారంలో మార్పులు తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. కాగా, ఖమ్మం సర్కిల్ పరిధిలోని వివిధ కేటగిరీల్లో 1,132 మంది ఉద్యోగులు, 250 మంది ఆర్టిజన్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇందులో వీరిలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు, ఇంజనీర్లు బదిలీ అయ్యే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. అయితే, మార్గదర్శకాలు విడుదలైతేనే ఈ అంశంలో స్పష్టత రానుంది. -
సింగరేణికి దక్కేనా..?
● మణుగూరు ఏరియాలో పీకే ఓసీ–2 డీప్ సైడ్ బ్లాక్ వేలంపై ఉత్కంఠ ● ఆశగా ఎదురుచూస్తున్న కార్మికులు, పరిసర ప్రాంతాల ప్రజలు మణుగూరు మనుగడ కొనసాగాలంటే పీకేఓసీ–2 డీప్ సైడ్ బ్లాక్ వేలంలో సింగరేణికే దక్కాలి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి బ్లాక్ సింగరేణికి దక్కేలా చూడాలి. –వై.రాంగోపాల్, ఏఐటీయూసీ బ్రాంచి కార్యదర్శి మణుగూరు భవిష్యత్, వేలాది కార్మికుల జీవనోపాధితో ముడిపడి ఉన్న పీకేఓసీ–2 డీప్‌సైడ్ బ్లాక్‌ను సింగరేణికే అప్పగించాలి. వేలంలో సింగరేణితో పాటు విద్యుత్ సంస్థ మాత్రమే పాల్గొంటోంది. ప్రభుత్వం చొరవ చూపాలి. –కృష్ణంరాజు, ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్మణుగూరు టౌన్: సింగరేణి మణుగూరు ఏరియా భవిష్యత్‌పై సర్వత్రా చర్చ మొదలైంది. కొద్దిరోజుల్లో పీకే ఓసీ–2 దిగువ భాగం వేలం నిర్వహించనుండగా, కార్మికులు, పరిసర ప్రాంతాల ప్రజలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. సింగరేణి వ్యాప్తంగా మణుగూరు ఏరియాలోనే అధికంగా బొగ్గు ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ ఒక భూగర్భగని, రెండు ఓపెన్‌కాస్ట్‌లు ఉండగా, పీకే ఓసీలోని అంతర్భాగమైన పీకేఓసీ–2 ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. గనిలో ఏటా 10 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుండగా, అందులో 6 మిలియన్ టన్నులు పీకేఓసీ–2 నుంచే వెలికితీస్తున్నారు. ఇక్కడ సుమారు 55 మిలియన్ టన్నుల నిక్షేపాలు మాత్రమే ఉన్నాయి. మరో నాలుగున్నరేళ్లలో నిల్వలు అడుగంటుతాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. 2030 తర్వాత ఏరియా మనుగడ కొనసాగాలంటే పీకేఓసీ–2 డీప్ సైడ్ బ్లాక్ సింగరేణికి దక్కాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. తాజాగా బొగ్గు బ్లాకుల వేలానికి దరఖాస్తు గడువు ముగియగా, సింగరేణితోపాటు మరొక కంపెనీ దరఖాస్తు చేసుకుంది. జనవరి రెండో వారంలోగా వేలం వేయనున్నారు. బ్లాక్‌లో 115 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలుండగా, జీవిత కాలం 20 ఏళ్లు ఉండే అవకాశం ఉంది. దీంతో సమీప ప్రాంతాల అభివృద్ధి, స్థానికులకు ఉపాధి, కార్మికుల స్థిరీకరణతో అభివృద్ధి జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, సింగరేణి, స్థానిక ఎమ్మెల్యేలు చొరవ తీసుకుని ఏరియా బొగ్గు బ్లాక్ దక్కేలా కృషి చేయాలని కార్మిక నాయకులు, స్థానికులు కోరుతున్నారు. -
యాభై ఏళ్ల యాదిలో..
కిన్నెరసాని.. రాష్ట్రంలో పేరొందిన పర్యాటక ప్రాంతం. ఇక్కడ 50 ఏళ్ల క్రితం గిరిజన బాలుర రెసిడెన్షియల్ పాఠశాల ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జూనియర్ కళాశాలగా ఉన్నతీకరించారు. వేల మంది గిరిపుత్రులు గురుకులం ఒడిలో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదిగారు. ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులుగా దేశ, విదేశాల్లో పనిచేస్తున్నారు. ఈ నెల 28న స్వర్ణోత్సవాలు నిర్వహించనుండగా, వారంతా తరలిరానున్నారు. కొద్దిరోజులుగా పలువురు పూర్వ విద్యార్థులు ఏర్పాట్లలో తలమునకలయ్యారు. –పాల్వంచరూరల్ కిన్నెరసాని గురుకుల పాఠశాల్లో సీటు వచ్చిందటే ఆ రోజుల్లో ఆ విద్యార్థిని గొప్పగా చూసేవారు. ఇక్కడ చదివిన విద్యార్థుల తలరాతలతో పాటు చేతిరాతలు అద్భుతంగా మారాయి. – నల్లాన్ చక్రవర్తుల చక్రవర్తి, పూర్వ ఉపాధ్యాయుడు స్కూల్ మొదటి బ్యాచ్ 1978లో 10వ తరగతి పూర్తి చేశా. నాగార్జున సాగర్‌లోని కాలేజీలో ఇంటర్మీడిఝెట్, వరంగల్ ఎన్ఐటీలో బీటెక్ చదివాను. ముంబైలో ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్‌గా పనిచేసి పదవి విరమణ పొందాను. – పి.పిర్యానాయక్, ఆదాయ పన్ను శాఖ రిటైర్డ్ కమిషనర్ కిన్నెరసాని గురుకులంలో 1979లో చదువుకున్నాను. ఇక్కడ చదివిన నాకు ఎంతో విజ్ఞానాన్ని అందించింది. నేడు ఒమన్ దేశం మస్కట్‌లో ఆపరేషన్, మెయింటెనెన్స్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నాను. – గొంది సతీష్‌కుమార్, ఉద్యోగి 2000 సంవత్సరంలో ఇక్కడి గురుకులంలో పదో తరగతి చదివి ఉత్తీర్ణత సాధించిన నేను ఆతర్వాత ఉన్నత విద్యను అభ్యసించాను. ప్రస్తుతం ఇదే గురుకుల కళాశాలల్లో ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉంది. – గొగ్గెల రమేష్, గురుకుల కళాశాల ప్రిన్సిపాల్పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిన్నెరసాని డ్యామ్సైడ్లో 1975లో ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో గిరిజన బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశారు. ఏడాది తర్వాత పక్కా భవన నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా 1976, డిసెంబర్ 25న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, సంజయ్‌గాంధీలు శంకుస్థాపన చేశారు. గురుకులంలో 50 ఏళ్ల కాలంలో ఒక్కో బ్యాచ్‌కు 80 మంది చొప్పున సుమారు 3,500 మంది విద్యార్థులు విద్యనభ్యసించారు. ఉన్నత విలువలతో కూడిన విద్యా బోధన అందించడంతో ఉన్నతస్థాయికి ఎదిగారు. దేశ, విదేశాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో స్థిరపడ్డారు. పలువురు అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, మస్కట్‌లో ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా పనిచేయడంతోపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బ్యాంక్ మేనేజర్లు, టీచర్లు, పోలీసులుగా సేవలందిస్తున్నారు. స్వర్ణోత్సవాలకు ఏర్పాట్లు.. గురుకుల పాఠశాల స్థాపించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవాల వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు 3 వేల మంది పూర్వ విద్యార్థులు కలిసికట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పాఠశాల ప్రాంగణంలో సావనీర్, ఫొటో గ్యాలరీ, పూర్వ ఉపాధ్యాయులకు సత్కారం, లైబ్రరీ ఏర్పాటు కోసం పుస్తకాల సేకరణ, స్వర్ణోత్సవాల నిర్వహణకు నిధుల సేకరణ, 50ఏళ్ల స్మృతి పైలాన్, ఫొటో సెల్ఫీపాయింట్లు ఏర్పాటు చేస్తున్నారు. స్వర్ణోత్సవాలకు సిద్ధమైన గిరిజన గురుకులం -
వాజ్‌పేయ్‌కి ఘన నివాళి
పాల్వంచరూరల్ : మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయ్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. మండలం, పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన వేడుకల్లో వాజ్‌పేయ్ చిత్రపటానికి జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాల్లో పట్టణఅధ్యక్షుడు రాపాక రమేష్, చింతలచెరువు శ్రీనివాసరావు, భూక్యా రవి, రంజిత్, నాగరాజు, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, బుడగం రవికుమార్, గంధ మల్లయ్య, దున్నపోతులరాజు, ప్రవీణ్, కార్తీక్, కనగాల క్రాంతికుమార్, కాల్వ సుధాకర్ పాల్గొన్నారు. నేడు అర్చక, ఉద్యోగుల సమావేశం ఖమ్మంగాంధీచౌక్: దేవాదాయ, ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అర్చక, ఉద్యోగల సమావేశాన్ని ఖమ్మంలోని పవనసుత జలాంజనేయ స్వామి ఆలయం వద్ద శుక్రవారం నిర్వహిస్తున్నట్లు సంఘం బాధ్యులు దాములూరి వీరభద్రరావు, తోటకుర వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ వేతనాలు, కారుణ్య నియామకాలు, ఉద్యోగ భద్రత, పెన్షన్ల సమస్యలు, హెల్త్ కార్డులపై చర్చించనున్న ఈ సమావేశానికి అర్చక, ఉద్యోగులు హాజరుకావాలని కోరారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి
జూలూరుపాడు: జూలూరుపాడు భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. పాల్వంచ మండలం యానంబైలు గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ తగిరష శివ(26) కొత్తగూడెం నుంచి ఆటోలో ప్రయాణికులను తీసుకొచ్చి, జూలూరుపాడులో దింపి వెనుదిరిగాడు. ఈ క్రమంలో భారత్ పెట్రోల్ బంక్ సమీపంలో కొత్తగూడెం–తల్లాడ ప్రధాన రహదారిపై ఆటోను యూటర్న్ చేస్తుండగా ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలై శివ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కారు, బైక్ ఢీకొని వృదుడు.. ములకలపల్లి(అన్నపురెడ్డిపల్లి): కారు, బైక్ ఢీకొని వృద్ధుడు మృతి చెందగా, బాలుడు గాయపడ్డ ఘటన గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. అన్నపురెడ్డిపల్లి మండలం పెంట్లం గ్రామంలో కూతురు వద్ద ఉంటున్న తండు వెంకటేశ్వర్లు (60) ద్విచక్రవాహనంపై భాస్కరాపురానికి చెందిన బాలుడిని బైక్‌పై లిఫ్ట్ ఎక్కించుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రాజాపురం నుంచి సత్తుపల్లి వైపు వెళుతున్న కారు కంపగూడెం గ్రామశివారులో ఢీకొట్టింది. దీంతో వెంకటేశ్వర్లుకు తీవ్ర గాయాలు కాగా 108 వాహనంలో కొత్తగూడెం ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. బాలుడికి చేయి విరిగింది. పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి విచారణ చేపట్టారు. రామాలయ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు రోశిరెడ్డి మృతిబూర్గంపాడు: మండలంలోని సారపాకకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు మాజీ సభ్యుడు ఎడమకంటి రోశిరెడ్డి గురువారం మృతి చెందారు. ఏపీలో విశాఖపట్టణానికి పని మిత్తం వెళ్లిన ఆయనకు అక్కడే గుండెపోటు రావడంతో కన్నుమూశారు. కాగా, టీపీపీసీ కార్యదర్శిగా వ్యవహరించిన రోశిరెడ్డి మృతిపై పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. -
పునాదివరకు ఇళ్లు నిర్మించాక..
అశ్వాపురం: మండలంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు 18 మందిని అనర్హులుగా ప్రకటించారు. ఇళ్ల మంజూరు పత్రాలు ఇవ్వడంతో లబ్ధిదారులు పునాది వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఆన్లైన్లో పునాది బిల్లుకు ప్రతిపాదనలు పంపి మంజూరు కోసం ఆశతో ఎదురుచూస్తుండగా, అర్హుల కాదంటూ తిరస్కరించారు. దీంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అర్హుల ఎంపిక సమయంలో అద్దెకు ఉన్న భవనాల వద్ద ఫొటోలు దింపడంతో ఎల్–3 జాబితాలోకి పోయి అనర్హులుగా గుర్తించినట్లు తెలుస్తోంది. అధికారులు, స్థాని క ఎమ్మెల్యే స్పందించి ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు మంజూరు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అనర్హులుగా ప్రకటించిన లబ్ధిదారులు వీరే ఇర్పా రవికుమార్, పాయం అమల(అమ్మగారిపల్లి), బల్లెం ఆదిలక్ష్మి, కె.సందీప్ (ఆనందాపురం), వంకాయలపాటి చాందిని, తురం రామలక్ష్మి(అశ్వాపురం), పాయం రోజా(చింతిర్యాలకాలనీ), గుంజాల సమ్మక్క, చెరుకు సోమయ్య(మల్లెలమడుగు), మడకం తిరుపతమ్మ(మనుబోతులపాడు), వేల్పుల లక్ష్మి(మిట్టగూడెం), తెల్లం తులసమ్మ, పొడియం నరసమ్మ (మొండికుంట), ఎలిగేటి స్నేహ, పొడిశెట్టి రజిత(నెల్లిపాక), తెల్లం రజిని(సండ్రలబోడు), చిలకా మమత(సీతరాంపురం), కోరెం సీత(వెంకటాపురం)18 మంది ఇందిరమ్మ లబ్ధిదారులను అనర్హులుగా ప్రకటన -
ప్రేమ, ఆప్యాయత వెల్లి విరియాలి
● డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మధిర: రాష్ట్రమంతా ప్రేమ, ఆప్యాయతలు వెల్లివిరియాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఏసుప్రభువును ప్రార్థించినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మధిరలోని బయ్యారం చర్చిలో బుధవారం అర్ధరాత్రి నుంచి మొదలైన ప్రత్యేక ప్రార్థనలకు ఆయన హాజరయ్యారు. చర్చి నిర్మించి 125ఏళ్లు గడిచిన సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం భట్టి మాట్లాడారు. అందరికీ మంచి జరగాలని ప్రార్థించినట్లు తెలిపారు. అయితే, ప్రభువు సందేశం ఇచ్చినట్లుగా ప్రతీఒక్కరు ఇతరులకు అండగా నిలవాలని, పరస్పరం సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చర్చి బాధ్యులు, మత పెద్దలు, పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.28న జిల్లాస్థాయి క్రాస్ కంట్రీ ఎంపికలు ఖమ్మంస్పోర్ట్స్: ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ ఎంపిక పోటీలు ఈనెల 28న నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మందుల వెంకటేశ్వర్లు, షఫీక్ అహ్మద్ తెలిపారు. అండర్–16, 18, 20 బాలబాలికల విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. అండర్ –16 బాలబాలికలకు 2 కిలోమీటర్లు, అండర్–18లో బాలురకు ఆరు, బాలికలకు నాలుగు కి.మీ., అండర్–20 విభాగంలో బాలురకు ఎనిమిది కి.మీ., బాలికలకు ఆరు కి.మీ., మహిళలు, పురుషులకు 10 కి.మీ. క్రాస్ కంట్రీ ఉంటుందని తెలిపారు. ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఈనెల 28 ఉదయం 10 గంటలకల్లా స్టేడియంలో రిపోర్టు చేయాలని సూచించారు. చర్చి నిర్మాణానికి రూ.2లక్షల విరాళం రఘునాథపాలెం: క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చర్చి నిర్మాణానికి గురువారం విరాళం అందజేశారు. ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన ఆయన క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రఘునాథపాలెం మండలం మంచుకొండలో నిర్మించే చర్చికి రూ.2లక్షల విరాళం అందించగా మతపెద్దలు పువ్వాడకు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్ శంకర్, నాయకులు పాల్గొన్నారు. పేకాట శిబిరంపై దాడి దమ్మపేట : మండల పరిధిలోని నాగుపల్లి గ్రామ శివారులో ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరో నలుగురు పరారయ్యారు. రెండు ద్విచక్ర వాహనాలు, రూ.4,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని ఎస్సై సాయికిషోర్ రెడ్డి తెలిపారు. బాలుడి మృతదేహం కోసం గాలింపు ఖమ్మంక్రైం: సాగర్ కాల్వలో బుధవారం గల్లంతైన బాలుడు శశాంక్ మృతదేహం ఇంకా లభించలేదు. కాల్వలోని మూడుచోట్ల పోలీసులు గాలించినా మృతదేహం కనిపించకపోవటంతో లోపల ఏదైనా రాయికి చిక్కుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో బాలుడి తల్లిదండ్రుల కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శశాంక్ తోపాటు గల్లంతైన మరో బాలుడు సుహాన్ మృతదేహం బుధవారమే లభ్యమైన విషయం విదితమే. -
వేగంగా ముక్కోటి ఏర్పాట్లు
● చకచకా ర్యాంప్, హంసవాహన పనులు ● ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ భద్రాచలం: భద్రాచలం దివ్యక్షేత్రంలో ఈ నెల 29, 30వ తేదీల్లో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రధానంగా తెప్పోత్సవ పనులు వేగవంతమయ్యాయి. హంసాకృతికి సంబంధించిన చెక్కలకు రంగులు వేసి లాంచీకి అమర్చారు. హంసవాహనంపైకి స్వామి వారిని తీసుకెళ్లేందుకు ర్యాంప్ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. పనులు పూర్తయ్యాక అన్ని శాఖల అధ్వర్యంలో ట్రయల్‌రన్ నిర్వహిస్తారు. అలాగే గతేడాది ప్రత్యేకాకర్షణగా నిలిచిన సాంస్కృతిక కార్యక్రమాలను ఈ ఏడాది సైతం ఏరు ఉత్సవంలో భాగంగా మూడు రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యేక సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. భక్తులకు అవసరమైన లడ్డూలు తయారు చేయడంతో పాటు విక్రయానికి కౌంటర్లను సిద్ధం చేస్తున్నారు. ఇక ఉత్తర ద్వార దర్శనానికి సెక్టార్ల విభజన చేయాల్సి ఉంది. కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఇప్పటికే పలుమార్లు ఏర్పాట్ల పనులను పరిశీలించి దిశా నిర్దేశం చేశారు. పూర్తి కావొచ్చిన టికెట్ల విక్రయం ఉత్తర ద్వార దర్శనానికి ఆన్లైన్లో ఉంచిన వివిధ సెక్టార్ల టికెట్ల విక్రయం దాదాపు పూర్తి కావొచ్చింది. మొత్తం 1,777 టికెట్లకు 1,167 టికెట్లను భక్తులు కొనుగోలు చేయగా ఇంకా 610 టికెట్లు మిగిలాయి. ఇందులో రూ.2వేల విలువ గల 487 టికెట్లు పూర్తిగా, రూ.500 విలువైన సెక్టార్ సీ, డీ టికెట్లు సైతం పూర్తిగా అమ్ముడుపోయాయి. రూ.1000 విలువ గల 75 టికెట్లు, రూ.500 విలువ గల సెక్టార్ బీ టికెట్లు 263, రూ.250 విలువ గల 272 టికెట్లు అందుబాటులో ఉన్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు. -
స్నేహభావంతో మెలగాలి
భద్రాచలంటౌన్ : క్రీడాకారులు స్నేహభావంతో మెలగాలని, గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ అన్నారు. గిరిజన మ్యూజియం ఆధ్వర్యంలో నిర్వహించిన ఔట్‌డోర్ షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ గురువారంతో ముగిసింది. ఈ సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయన విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. క్రీడాకారులు పట్టుదలతో ఆడి నైపుణ్యాన్ని ప్రదర్శించారని అభినందించారు. త్వరలో మ్యూజియంలో పాఠశాల విద్యార్థులతో ‘కల్చరల్ వీకెండ్’ కార్యక్రమాలు చేపడతామన్నారు. పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన కుంజా సురేష్ కుమార్ – సోడె శ్రీను జంటకు రూ.8 వేలు, ద్వితీయ బహుమతి సాధించిన తాటి పవన్ – సాయికి రూ.6 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన కిరణ్ – లక్ష్మణ్‌కు రూ.4 వేలు, నాలుగో స్థానం సాధించిన హరీష్ బృందానికి రూ.2 వేల నగదుతో పాటు మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో కీడ్రాధికారులు గోపాల్ రావు, నాగేశ్వరరావు, రాంబాబు, ముత్తయ్య, హరికృష్ణ, గొంది వెంకటేశ్వర్లు, విజయరావు, కృష్ణ ప్రసాద్, మల్లేష్, రాజా రమేష్, బాలకిరణ్, వరుణ్ నాగరాజ్ పాల్గొన్నారు. -
లక్ష్య సాధనకు ఐక్యంగా కృషి చేయాలి
రుద్రంపూర్ : బొగ్గు ఉత్పత్తిలో వార్షిక లక్ష్య సాధనకు అందరూ ఐక్యంగా కృషి చేయాలని కోల్ మూమెంట్ ఈడీ, చీఫ్ విజిలెన్స్ అధికారి బి.వెంకన్న సూచించారు. కొత్తగూడెం ఏరియా పరిధిలో నూతనంగా ఏర్పాటవుతున్న వీకే–7 ఓసీని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓసీ నుంచి జనవరి నెలాఖరు నాటికి ఉత్పత్తి ప్రారంభం కావాలని, వినియోగదారులకు ఇచ్చిన హామీ మేరకు నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్, ఇతర పరిశ్రమలకు సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలన్నారు. వార్షిక లక్ష్యానికి మూడు నెలలు మాత్రమే గడువు ఉన్నందున రక్షణతో కూడిన మెరుగైన ఉత్పత్తి సాధించాలని సూచించారు. రోజుకు వే యి టన్నులు ఉత్పత్తి చేయాలి పీవీకే–5 ఇంక్లైన్ భూగర్భ గనిలో రోజుకు 1000 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని వెంకన్న అఽధికారులను ఆదేశించారు. సీఎమ్మార్ ద్వారా ఉత్పత్తి అవుతున్న గ్రేడ్ జీ–6 బొగ్గుకు మార్కెట్లో మంచి ధర ఉందని చెప్పారు. గనిలో యంత్రాల పని గంటలు పెంచితేనే రోజుకు అదనపు ఉత్పత్తి సాధ్యమవుతుందని సూచించారు. కార్యక్రమంలో ఏరియా జీఎం ఎం. శాలేంరాజు, వీకే–7 ఓసీ పిఓ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. కోల్ మూమెంట్ ఈడీ వెంకన్న -
ఆప సోపానాలు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వైకుంఠ ఏకాదశి వేడుకలకు భద్రాచల పుణ్యక్షేత్రం ముస్తాబవుతోంది. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ముక్కోటి పర్వదినం రోజున భద్రాచలం వచ్చే భక్తుల్లో చాలా మందికి గోదావరిలో పుణ్యస్నానం ఆచరించడం అందని ద్రాక్షే అవుతోంది. పుష్కరఘాట్ల వద్ద ఉన్న మెట్లు ఎక్కి, దిగడమంటే తీవ్ర ఇబ్బందిగా మారింది. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా.. భద్రాచలం పుణ్యక్షేత్రంలో సీతారాముల దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. వారంతా గోదావరిలో పుణ్యస్నానాలు చేయాలని కోరుకుంటారు. స్నానం వీలు పడకుంటే కనీసం గోదావరి నీటిని తలపై చిలకరించుకుంటారు. అయితే గోదావరి వరదల నుంచి భద్రాచలానికి రక్షణ కల్పించేందుకు 2002లో కరకట్ట నిర్మించారు. వానాకాలం మినహాయిస్తే మిగిలిన రోజుల్లో గోదావరి ఇక్కడ 20 అడుగుల ఎత్తుకు అటు ఇటుగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహంలోనే భక్తులు పుణ్యస్నానాలు చేస్తుంటారు. పితృ తర్పణాలు వదులుతుంటారు. దీపారాధన వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక అయ్యప్ప, హనుమాన్ మాలధారులు కచ్చితంగా నదీ స్నానం ఆచరిస్తారు. అందుబాటులో లేని ర్యాంప్‌లు ప్రజలు వినియోగించే అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాకపోకలు సాగించేందుకు వీలుగా గతంలో మెట్లు ఉండేవి. అయితే దివ్యాంగులు, మోకాళ్ల నొప్పులున్న వారు మెట్లను ఉపయోగించడం ఇబ్బందిగా మారింది. దీంతో జన సమూహం వచ్చిపోయే దగ్గర ప్రభుత్వం ర్యాంపులను తప్పనిసరి చేసింది. ప్రస్తుతం పాఠశాల, ఆస్పత్రి, బస్టాండ్, రైల్వేస్టేషన్, పోలీస్ స్టేషన్, కాలేజీలు, సులభ్ కాంప్లెక్స్‌ల వద్ద కూడా ర్యాంపులు ఉంటాయి. మెట్ల మార్గంలో రాకపోకలు సాగించలేని వారు ఈ ర్యాంపులను ఉపయోగించుకుంటున్నారు. ఇక వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్సులు, రైళ్లలో సైతం వారికి ముందు వరుసలోనే సీట్లు కేటాయిస్తారు. కానీ ఇలాంటి ప్రత్యేక సౌకర్యలేమీ భద్రాచలం వచ్చే భక్తులకు మాత్రం అందుబాటులో లేవు. ఏరు పేరుతో మెట్లు ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఏరు పేరుతో వేడుకలు నిర్వహిస్తోంది. గతేడాది భద్రాచలం కరకట్ట వద్ద వెదురు బొంగులు, రెడీమేడ్ టెంట్లతో ఏరు సిటీని నిర్మించింది. కానీ భక్తులు, పర్యాటకులను ఆకట్టుకోవడంలో ఈ టెంట్ సిటీ విఫలమైంది. మరోవైపు దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్పలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సైతం ఇవే బాటలో నడిచాయి. దీంతో ఈసారి పర్యాటకులను టెంట్‌సిటీకి ఆకర్షించేందుకు కొత్తగా కరకట్ట నుంచి టెంట్‌సిటీకి వెళ్లేందుకు అనువుగా మెట్లు నిర్మించారు. ఇదే తరహాలో మెట్లు ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకుని ర్యాంపులు కూడా నిర్మించా ల్సిన అవసరం ఉంది. గోదావరిలో పుణ్యస్నానాలకు భక్తుల ఆసక్తి భద్రాచలం వచ్చే భక్తులు గోదావరిలో స్నానం చేయాలంటే 80 అడుగుల ఎత్తుతో ఉన్న కరకట్ట దాటి వెళ్లాలి. కరకట్టపైకి వెళ్లేందుకు 48 మెట్లు ఎక్కాల్సి ఉండగా, అక్కడి నుంచి గోదావరిలోని నీటి పాయల వద్దకు వెళ్లేందుకు 93 మెట్లు దిగాల్సి వస్తోంది. దీంతో మెకాళ్ల నొప్పులు ఉన్న భక్తులు ఈ మెట్లు ఎక్కి దిగేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గోదావరిలో స్నానం చేయాలని, అక్కడి నీటిని తలపై చల్లుకోవాలనే కోరిక తీరకుండానే తిరిగి వెళ్తున్నారు. ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు, గోదావరి స్నానాన్ని సెంటిమెంట్‌గా భావించే వారు నొప్పులను పంటి బిగువున భరిస్తూ గోదావరిలోకి వెళ్లి వస్తున్నారు. ప్రతీ రోజు కనీసం పదుల సంఖ్యలో ఇలాంటి ఇబ్బందికర దృశ్యాలు కరకట్ట వెంట కనిపిస్తాయి. ఇక ముక్కోటి, శ్రీరామనవమి, కార్తీక పౌర్ణమి, ఆదివారం, ఇతర సెలవులు/ పర్వదినాల్లో అయితే వందలు, వేల సంఖ్యలో భక్తులు మెట్లు ఎక్కి దిగేందుకు ఇక్కట్లు పడుతుంటారు. ముఖ్యంగా వయసు పైబడిన వారి కష్టాలైతే వర్ణణాతీతం. -
పెద్దమ్మతల్లికి సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం హారతి, మంత్రపుష్పం, నివేదన సమర్పించారు. కార్యక్రమంలో ఈఓ రజనీకుమారి, పాలకమండలి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.లక్ష విరాళంములకలపల్లి: మండలంలోని పొగళ్లపల్లి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తాండ్ర నారాయణరావు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్, ఎన్నారై తాండ్ర వెంకటేశ్వరరావు గురువారం రూ.లక్ష విరాళం ఎస్సై మధుప్రసాద్కు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో నేర నియంత్రణకు పోలీస్ శాఖకు సహకరిస్తూ, తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో వితరణ అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నరాటి ప్రసాద్, తాండ్ర చిట్టిబాబు, కొదుమూరి పుల్లారావు, పూరేటి నర్సింహారావు పాల్గొన్నారు. ‘మిస్ టీన్ తెలంగాణ’ పోటీల్లో ప్రతిభభద్రాచలంటౌన్: రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఇటీవల నిర్వహించిన ‘ఫరెవర్ మిస్ టీన్ ఇండియా–2025’ అందాల పోటీల్లో భద్రాచలం పట్టణానికి చెందిన విద్యార్థిని ప్రీతి యాదవ్ ప్రతిభ చాటింది. ఈనెల 19 నుంచి 21 వరకు జైపూర్‌లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె ‘ఫరెవర్ మిస్ టీన్ తెలంగాణ–2025’ కిరీటాన్ని కై వసం చేసుకుంది. దేశ వ్యాప్తంగా 10 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా.. వివిధ దశల్లో వడపోతల తర్వాత ఫైనల్స్ చేరుకున్న 101 మందిలో ప్రీతి యాదవ్ విజేతగా నిలిచింది. భద్రాచలం పట్టణంలో పానీపూరి వ్యాపారం చేసే ప్రకాష్ యాదవ్, రేణు యాదవ్ దంపతుల కుమార్తె ప్రీతి స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సామాన్య కుటుంబం నుంచి వచ్చినా ఆత్మవిశ్వాసంతో జాతీయ వేదికపై తెలంగాణ గర్వపడేలా రాణించిన ప్రీతిని పలువురు అభినందించారు. ఓవరాల్ చాంపియన్‌గా ‘తనికెళ్ల’ కొణిజర్ల: ఉమ్మడి జిల్లాస్థాయి మైనార్టీ బాలుర గురుకులాల క్రీడాపోటీల్లో తనికెళ్లలోని మైనార్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. పలు విభాగాల్లో పతకాలు సాధించడమే కాక ఓవరాల్ చాంపియనషిప్ కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉమ్మడి జిల్లా ప్రాంతీయ సమన్వయ అధికారి(ఆర్ఎల్సీ) ఎంజే. అరుణకుమారి అభినందించారు. పాఠశాల ప్రిన్సిపాల్ ఎల్.జితేష్ సాహిల్, పీడీ ఎం.రవికుమార్, పీఈటీ బండారు సాయికృష్ణతో డిప్యూటీ వార్డెన్ యాకూబ్ పాషా పాల్గొన్నారు. -
కాలినడకన తడ‘బడి’..
దుమ్ముగూడెం: ఆ ఊర్లో 3 నుంచి 5వ తరగతి వరకు చదివే చిన్నారులు 28 మంది ఉన్నారు. కానీ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం మినహా ప్రభుత్వ పాఠశాల లేదు. దీంతో విద్యార్థులకు రెండు కిలోమీటర్ల దూరంలోని పక్క గ్రామాల్లో గల సర్కారు బడులే శరణ్యం. కాలినడకన వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం కూడా లేదు. కాల్వలు, పొలం గట్లు దాటుతూ వెళ్లాల్సి వస్తోంది. తమ గ్రామంలో కనీసం ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. కాల్వ దాటాల్సిందే.. దుమ్ముగూడెం మండలంల మాంగ్వాయిబాడ్వ గ్రామంలో ప్రాథమిక పాఠశాల లేక చిన్నారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. దీంతో విద్యార్థులు రెండు కిలోమీటర్ల దూరం నడిచి అంజుబాక లేదంటే శ్రీనగర్ కాలనీ పాఠశాలలకు వెళ్లాల్సి వస్తోంది. ఆ గ్రామాలకు వెళ్లాలన్నా.. కనీసం రహదారి సౌకర్యం కూడా లేదు. తాలిపేరు బ్యాకింగ్ కాల్వ, పొలం గట్ల మీదుగా నడవాల్సి వస్తోందని తల్లిదండ్రులు, స్థానికులు చెబుతున్నారు. తమ పిల్ల లు బడికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేంత వరకూ భయం భయంగా గడుపుతున్నామని, పిల్లలు సైతం ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుందని, ఈ పరిస్థితి తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధ్వానంగా రహదారి.. గ్రామంలోని రహదారి అధ్వానంగా, గోతులమయంగా మారింది. అయినా ఈ మార్గంలోనే పిల్లలు బడికి నడిచి వెళ్లాల్సి వస్తోంది. గ్రామంలో రోడ్డు నిర్మాణాలు చేపట్టక సంవత్సరాలు గడుస్తున్నాయని, ఏ నాయకుడూ తమ సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు అంటున్నారు. వర్షాకాలంలో రోడ్డంతా బురదమయం అవుతోందని, ఇప్పటికై నా పాలకులు, అధికారులు దృష్టి సారించి రహదారి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. అంతేకాకుండా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, గ్రామస్తులు వేడుకుంటున్నారు. -
పరశురామా.. పాహిమాం
● భద్రగిరిలో కొనసాగుతున్న అధ్యయనోత్సవాలు ● లాడ్జీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో శోభాయాత్ర భద్రాచలం: ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాద్రి రామయ్య గురువారం పరశురామావతారంలో దర్శనమిచ్చారు. తండ్రి జమదగ్నిని చంపిన వేయి చేతుల కార్య వీర్యార్జునుని సంహరించి 21 పర్యాయాలు భూమిని అంతా గాలించి దుష్టులైన వారిని సంహరించుటకు అవతరించిన ‘పరశురామయ్యకు పాహిమాం’ అంటూ భక్తులు వేన్నోళ్ల కీర్తించారు. తొలుత గర్భగుడిలో సుప్రభాత సేవ, ఆరాధన నిర్వహించాక పరశురామావతారంలో అలంకరించిన స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. కనులపండువగా శోభాయాత్ర ఉత్సవాల్లో భాగంగా లాడ్జీ యజమానుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేత్రపర్వంగా శోభాయాత్ర నిర్వహించారు. స్వామివారిని మేళతాళాలు, భక్తుల కోలాటాల నడమ ఊరేగింపుగా తీసుకొచ్చి మిథిలా స్టేడియం వేదికపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు స్వామి వారిని దర్శించుకున్నాక తాతగుడి సెంటర్లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ నిర్వహించారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారు శుక్రవారం తన నిజరూపమైన రామావతారంలో దర్శనమివ్వనున్నారు. వ్యక్తిగత సౌఖ్యాల కన్న ధర్మాచరణయే ఉత్తమమైనదని, అదే శాశ్వతమని భావించి, పరిపూర్ణ మానవుడు ఎలా ఉండాలో ఆచరించి చూపించిన ఆదర్శ పురుషుడు, ధర్మ స్వరూపుడు శ్రీరామచంద్రుడు. సూర్యగ్రహ బాధలున్న వారు రామావతారాన్ని దర్శిస్తే విముక్తి పొందుతారని పండితులు చెబుతున్నారు. -
●ఆర్సీఎం.. ఆధ్యాత్మిక శోభ
పాల్వంచ: రాష్ట్రంలో మరెక్కడా లేనట్టుగా పాల్వంచలోని ఆర్సీఎం చర్చి నిర్మాణ శైలి ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇక్కడ చర్చిని గోర్తిక్ ఆర్ట్స్ విధానంలో నిర్మించారు. ఏడు ఎకరాల ప్రాంగణంలో 13 ఏళ్ల పాటు నిర్మాణం సాగగా, కేరళ రాష్ట్రానికి చెందిన ఆర్కిటెక్ట్ ఆగస్టీన్ దీనికి రూపకల్పన చేశారు. అలాగే, అప్పటి ఫాదర్ బెనడిక్ట్ నిర్మాణ పనులు పర్యవేక్షించారు. 1975 సెప్టెంబర్ 17న ప్రారంభమైన ఈ చర్చి ఆవరణలో దేవదూతల విగ్రహాలు, మరియమ్మ, బాలయేసు ప్రతిమలు ఆకట్టుకుంటాయి. ఏటా క్రిస్మస్ సందర్భంగా వేలాది మంది భక్తులు ఇక్కడ ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. -
●125 ఏళ్ల సీఎస్ఐ చర్చి
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని సీఎస్ఐ(చర్చి ఆఫ్ సౌతిండియా) చర్చికి ఘన చరిత్ర ఉంది. డోర్నకల్ డయోసిస్ పరిధిలో ఖమ్మం, కొత్తగూడెంలో రెండు పెద్ద చర్చిలు ఉండగా, మరో 167 చర్చిల నిర్వహణ కొనసాగుతోంది. ఇందులో ఖమ్మం చర్చి నిర్మాణానికి 1899 ఏప్రిల్ 2వ తేదీన శంకుస్థాపన జరిగింది. నిర్మాణం పూర్తి చేసి 1900 ఫిబ్రవరి 15వ తేదీన ప్రారంభించారు. 125 ఏళ్లు పూర్తి చేసుకున్న ఇక్కడ ఏటా క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. చర్చి నిర్మాణంలో జేబీ పెయిన్స్ కీలకంగా పనిచేయగా, తొలి బిషప్‌గా వి.ఎస్.సుందరయ్య వ్యవహరించారు. ఇక్కడ చర్చి నిర్మాణం జరిగాక ఈ ప్రాంతానికి చర్చి కాంపౌండ్‌గా పేరు వచ్చింది. దేశ, విదేశాలకు చెందిన ప్రముఖల సహకారంతో చర్చిని అభివృద్ధి చేయడమే కాక వైద్య, విద్యా సేవలు కూడా కొనసాగిస్తున్నారు. అనుబంధంగా కొనసాగుతున్న సెయింట్ మేరీస్ హాస్పిటల్(మిషన్ హాస్పిటల్)కు వివిధ జిల్లాల ప్రజలు చికిత్స కోసం వస్తుంటారు. ఏటా జనవరిలో విదేశాల నుంచి వైద్యులు ఈ ఆస్పత్రికి వచ్చి చికిత్స అందిస్తుంటారు. ఆస్పత్రికి అనుబంధంగా డే కేర్ సెంటర్, పోలియో హోమ్ కొనసాగుతున్నాయి. అలాగే, సెయింట్ మేరీస్ పాఠశాల ద్వారా విద్యార్థులకు బోధన అందుతోంది.అనుబంధంగా విద్య, వైద్య సేవలు -
వినియోగదారుల హక్కులు కాపాడాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మాట్లాడుతూ.. వినియోగదారులు రాయితీలు, ఉచిత ప్రకటనలను ఆన్లైన్లో చూసి మోసపోవద్దన్నారు. ఇలాంటి మోసాలను హ్యాకర్లు గుర్తించి దోచేస్తారని, పాస్‌వర్డ్‌ను సులువుగా పెట్టుకోవద్దని, ఓటీపీలను ఇతరులతో పంచుకోవద్దన్నారు. కొనుగోలు చేసిన వస్తువు తయారీ, చిరునామా, గడువు తేదీ, కస్టమర్ కేర్ నంబర్‌ను సరి చూసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు రశీదు తప్పనిసరిగా తీసుకోవాలని, డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్, మొబైల్ యాప్ ద్వారా చెల్లింపుల్లో వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. రైతులు విత్తనాలు, మందులు కొనేటప్పుడు బోగస్ కంపెనీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, మోసానికి గురైతే వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ అధికారి ప్రేమ్‌కుమార్, పౌరసరఫరాల శాఖ మేనేజర్ త్రినాథ్‌బాబు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, వాలంటరీ ఆర్గనైజర్ జూలూరి రఘుమాచారి, గుగులోతు బాలు, మహమ్మద్ రియాజ్, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ -
లోకమంతా మననం
●క్రీస్తు జననం..నేడు క్రిస్మస్ పర్వదినం ● ఉమ్మడి జిల్లాలో వందేళ్లు దాటిన ప్రార్థనామందిరాలెన్నో.. ● సుందరంగా ముస్తాబైన చర్చిలు ఏసుక్రీస్తు జననాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పర్వదినాన్ని గురువారం ఘనంగా జరుపుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి నుంచే ప్రార్థనలు మొదలుకాగా, కేక్ కట్ చేసిన మతపెద్దలు ఏసు జనన వృత్తాంతాన్ని వివరించారు. కాగా, ఉమ్మడి జిల్లాలోని పలు చర్చిలు వందేళ్ల క్రితం నిర్మాణమయ్యాయి. జిల్లా మీదుగా రైల్వేలైన్ వెళ్లడం, సింగరేణి గనులు ఉండడంతో విధులు నిర్వర్తించేందుకు వచ్చిన బ్రిటీషర్ల కాలంలో వీటిని నిర్మించగా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఇందులో కొన్ని చర్చిల ప్రత్యేకతలతో కథనం. -
ఖర్చులు పక్కాగా
● సర్పంచ్, వార్డు అభ్యర్థులకు నోటీసులు ● గెలిచిన, ఓడిన వారే కాక ఏకగ్రీవ స్థానాల్లో కూడా తప్పనిసరి ● విడతల వారీగా గడువు ప్రకటించిన అధికారులు అప్పగించాల్సిందే.. వైరా/నేలకొండపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేశారు. ఓడిన వారే కాక గెలిచిన వారు అప్పుల లెక్కలు వేసుకుంటున్నారు. ఈక్రమాన పోటీ చేసిన అభ్యర్థులంతా వ్యయం వివరాలు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ మేరకు గ్రామ కార్యదర్శుల ద్వారా నోటీసుల జారీకి సిద్ధమవుతున్నారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా గెలుపు కోసం అడ్డుగోలుగా ఖర్చు చేసిన అభ్యర్థులు నిబంధనల ప్రకారం ప్రతీ రూపాయి లెక్క చెప్పాల్సి ఉంటుంది. లేదంటే అనర్హత వేటు పడే ప్రమాదముంది. ఖర్చు చేయడం ఒక ఎత్తయితే దానిని నిబంధనల ప్రకారం చెప్పడం తలకు మించిన భారం కావడంతో అభ్యర్థులు మల్లగుల్లాలు పడుతున్నారు. కాగా, వ్యయ వివరాలు సమర్పించేందుకు 45 రోజులు గడువు ఇవ్వనుండగా, ఈసారి ముందుగానే గడువు విధించడం గమనార్హం. సమర్పించకపోతే వేటే.. ఎన్నికల సంఘం నిబంధల ప్రకారం సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు వారికి గుర్తులు కేటాయించిన రోజు నుంచి ఫలితాలు వెలువడే వరకు చేసిన ఖర్చు వివరాలను ఎంపీడీఓలకు సమర్పించారు. లేనిపక్షంలో పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 23 ప్రకారం వేటు పడుతుంది. గెలిచిన అభ్యర్థులు పదవి కోల్పోనుండగా.. మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధానికి గురవుతారు. ఓడిన వారు సైతం మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతారు. త్వరలోనే పార్టీ గుర్తులపై జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు జరగనున్నందున అభ్యర్థులు జాగ్రత్త పడాల్సి ఉంది. మూడు విడతలుగా పంచాయతీ ఎన్నికలు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మూడు విడతలుగా గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి ఏకగ్రీవాలు మినహా మొదటి విడతలో 172 జీపీలు, రెండో విడతలో 160, మూడో విడతలో 168 జీపీలకు ఎన్నికలు జరిగాయి. ఇక భద్రాద్రి జిల్లాలో వరుసగా 145, 138, 145 జీపీలకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పటికే సర్పంచ్‌లు, పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేయగా, నెలకోసారి పాలకవర్గ సమావేశం, రెండు నెలలకోసారి గ్రామసభ నిర్వహించాల్సి ఉంటుంది. పంచాయతీ వార్షిక ఆడిట్లు, లెక్కలు పూర్తి చేయకపోయినా, అవినీతికి పాల్పడినా పదవి కోల్పోయే ప్రమాదం ఉన్న నేపథ్యాన సర్పంచ్‌లకు అవగాహన కల్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీడీఓలకు.. ఆపై ఆన్లైన్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన అభ్యర్థులు తాము చేసిన ఖర్చుల వివరాలను ఎంపీడీఓలకు అందజేసి రశీదు తీసుకోవాలి. ఆపై వివరాలను టీ–పోల్ సైట్లో ఫిబ్రవరి 15వ తేదీలోగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రతీ మండలంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను కేటాయించాలని ఎంపీడీఓలకు ఆదేశాలు అందాయి. కాగా, 5 వేల లోపు జనాభా ఉన్న జీపీల్లో సర్పంచ్‌గా పోటీ చేసిన అభ్యర్థి గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు ఖర్చు చేసే అవకాశముంది. వార్డు సభ్యులైతే రూ.30 వేల వరకు ఖర్చులు చూపించవచ్చు. ఇక 5 వేలకు పైగా జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థి రూ.2.50 లక్షల వరకు, వార్డు అభ్యర్థులు రూ.50 వేల వరకు ఖర్చు చేసే అవకాశముండగా, పూర్తి వివరాలతో లెక్కలు అప్పగించాల్సి ఉంటుంది. విడత గడువు తేదీ మొదటి విడత అభ్యర్థులు జనవరి 03 రెండో విడత జనవరి 06 మూడో విడత జనవరి 09 జిల్లా మొదటి విడత రెండో విడత మూడో విడత సర్పంచ్‌లు వార్డుసభ్యులు సర్పంచ్‌లు వార్డుసభ్యులు సర్పంచ్‌లు వార్డుసభ్యులు ఖమ్మం 488 3,424 451 3,352 485 3,369 భద్రాద్రి 461 2,567 386 2,820 470 2,802 -
ఐటీడీఏ కబడ్డీ జట్టుకు కాంస్యం
భద్రాచలంటౌన్: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో నిర్వహించిన జాతీయస్థాయి పీసా మహోత్సవాల్లో భద్రాచ లం ఐటీడీఏ క్రీడాకారులు సత్తా చాటారు. పురుషుల కబడ్డీ విభాగంలో జట్టు మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ (కాంస్యం) పతకం కై వసం చేసుకుంది. బుధవారం జరిగిన ముగింపు వేడుకల్లో కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, డైరెక్టర్ రమిత్ మౌర్య, ఏపీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్ చేతుల మీదుగా ఐటీడీఏ ఏపీఓ డేవిడ్‌రాజ్, క్రీడాకారులు పతకంతో పాటు రూ.50 వేల నగదు పారితోషికాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ బి.రాహుల్ క్రీడాకారులను అభినందించారు. మహోత్సవంలో భద్రాచలం ఐటీడీఏ ఏర్పాటు చేసిన గిరిజన వంటకాల స్టాల్, కోయా క్రాఫ్ట్ వస్తువులు పది దేశాల ప్రతినిధులను విశేషంగా ఆకట్టుకున్నాయని పీఓ తెలిపారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏఓ సున్నం రాంబాబు, స్పోర్ట్స్ ఆఫీసర్ జ్యోతి, సుభాష్‌చంద్రగౌడ్, సుధారాణి, దుర్గ, లత, నిఖిల్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పేద యువతుల వివాహాలకు చేయూత ఖమ్మంమామిళ్లగూడెం: ఇద్దరు పేద, అనాథ యువత వివాహానికి ఆవామే హింద్ అండ్ వెల్ఫేర్ చారిటబుల్ ఫౌండేషన్, ముస్లిం ఐక్య సంఘం బాధ్యులు చేయూతగా నిలిచారు. ఖమ్మానికి చెందిన యువతి వివాహానికి రూ.25 వేల విలువైన సామగ్రి, భద్రాద్రి జిల్లా పెన గడప యువతి వివాహానికి రూ.10 వేల విలువైన సామగ్రిని బుధవారం అందజేశారు. ఫౌండేషన్ చైర్మన్ హఫీజ్ మహ్మద్ జవ్వాద్ అహ్మద్‌తో పాటు సంస్థల బాధ్యులు పాల్గొన్నారు. పోలీసులు అదుపులో ప్రవీణ్? సత్తుపల్లి: హైదరాబాద్ కేంద్రంగా సైబర్ నేరా లకు పాల్పడి పలువురి నుంచి రూ.కోట్లలో నగ దు కాజేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్లూరు మండలం ఎర్రబోయినపల్లికి చెందిన పోట్రు ప్రవీణ్‌ను సత్తుపల్లి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆయనను హైదరాబాద్ నుంచి బుధవారం రాత్రి వీఎం బంజర పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. సైబర్ నేరాల ద్వారా సంపాదించిన నగదును గ్రామపంచాయతీ ఎన్నికల్లో విచ్చలవిడిగా ఖర్చుపెట్టినట్టు ఆరోపణలు రాగా, ఓడిపోయిన అభ్యర్థులు పలువురు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈక్రమాన ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు. 15ఏళ్ల తర్వాత కుటుంబం చెంతకు.. ఖమ్మంఅర్బన్: మతిస్థిమితం కోల్పోయి అచేతనంగా పడి ఉన్న వ్యక్తికి సపర్యలు చేసిన అన్నం ఫౌండేషన్ బాధ్యులు ఆయన కోలుకున్నాక వివరాలు తెలుసుకుని కుటుంబం చెంతకు చేర్చారు. ఖమ్మం సమీపాన సదరు వ్యక్తి తిరుగుతుండగా కొన్నాళ్ల క్రితం అన్నం సేవా ఫౌండేషన్‌లో చేర్చుకున్న నిర్వాహకుడు శ్రీనివాసరావు వైద్యం చేయించారు. ఇటీవల కోలుకున్న ఆయన తన పేరు కనగాల చలపతిరావు అని స్వస్థలం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి అని చెప్పడంతో బుధవారం అక్కడకు తీసుకెళ్లి గ్రామపెద్దల సమక్షాన కుటుంబానికి అప్పగించారు. పదిహేనేళ్ల క్రితం మతిస్థిమితం కోల్పోయిన ఆయన ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఎక్కడ తిరిగినా ఆచూకీ లభించలేదని కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం చలపతిరావు తమ చెంతకు చేరడంతో వారు అన్నం శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. రైలు ఢీకొని టైలర్ మృతి ఖమ్మంక్రైం: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఖమ్మం గాంధీచౌక్‌లో టైలర్‌గా పనిచేస్తున్న బుర్హాన్‌పురానికి చెందిన రామగిరి రాములు(75) బుధవారం సాయంత్రం ఇంటికి వెళ్తున్నాడు. ఈక్రమాన పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఆయన మృతదేహన్ని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సహకారంతో మార్చురీకి తరలించినట్లు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపారు. -
పెట్టుబడి కాదు భవిష్యత్‌కు పునాది
సాక్షిప్రతినిది, ఖమ్మం: ‘రాష్ట్రాభివృద్ధిలో విద్య అంత్యంత కీలకమైంది. విద్యాశాఖపై ఖర్చు చేసే ప్రతీ రూపాయిని రాష్ట్ర భవిష్యత్‌కు ఉపయోగపడే పెట్టుబడిగా భావించాలి. అధికారులు విద్యావ్యవస్థను పటిష్టం చేయడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.’ అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క సూచించారు. ఖమ్మం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుధవారం ఆయన విద్యాశాఖ, సంక్షేమ పథకాల అమలుతీరుపై అధికారులతో సమీక్షించారు. ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలు పాటించాలి ప్రైవేట్ విద్యాసంస్థల నిర్వహణ, అనుమతుల పునరుద్ధరణపై ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ప్రభుత్వ నిబంధనలన్నీ పాటించడంతో పాటు సరైన ఆటస్థలం, ల్యాబ్‌లు, విద్యార్థుల భద్రతపై దృష్టి సారించని స్కూళ్లకు అనుమతులు పునరుద్ధరించొద్దని నిర్ణయించినట్లు చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం కల్లా విద్యాసంస్థల్లో సదుపాయాలు సమకూర్చుకోకపోతే అనుమతి విషయంలో ఇబ్బందులు తప్పవని తెలిపారు. నిబంధనలు పాటించని సంస్థలకు అనుమతి ఇస్తే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేర్చడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ సీఎం భట్టి హెచ్చరించారు. రానున్న రెండేళ్లు అత్యంత కీలకంగా భావిస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతీ రూపాయి ప్రజలు కట్టిన పన్నుల ద్వారానే వస్తున్నందున అధికారులు వారికి జవాబుదారీగా ఉండాలని చెప్పారు. కాగా, అటవీ భూ హక్కుల చట్టం కింద భూములు పొందిన గిరిజన రైతులకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా ఉచితంగా సోలార్ విద్యుత్, పంపుసెట్లు, డ్రిప్, ప్లాంటేషన్ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కలెక్టరేట్లో సమీక్ష అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొణిజర్ల మండలం తనికెళ్లలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బాలికల గురుకుల డిగ్రీ కళాశాలను తనిఖీ చేశారు. విద్యార్థినులు, ప్రిన్సిపాల్‌తో మాట్లాడి మెనూ అమలు, బోధనపై ఆరాతీశాక వంటలను తనిఖీ చేయడమే కాక విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి.శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్, కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ఐటీడీఏ పీఓ బి.రాహుల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.A°² Ķæ*fÐ]l*-¯éÅÌS ç³Ç«¨ÌZ° {糿¶æ$™èlÓ ´ëuý‡-Ô>-ÌS-ÌZÏ ÝûMýS-Æ>Å-Ë$ MýS͵çÜ$¢-¯é²-Ð]l$° yìlç³NÅsîæ ïÜG… õ³ÆöP-¯é²Æý‡$. ´ëuý‡-Ô>-ÌS-Ë$, Ð]lç܆ VýS–àÌZÏ Ñ§éÅ-Æý‡$¦-ÌSMýS$ Ððl$Æý‡$-OVðS¯]l ÝûMýS-Æ>Å-Ë$ MýS͵…^èl-yýl-Ðól$-M>MýS E´ë-«§éÅ-Ķæ¬ÌS °Ä¶æ*-Ð]l$-M>°MìS {´ë«§é-¯]lÅ™èl CçÜ$¢-¯]l²r$Ï ™ðlÍ´ëÆý‡$. MýSÌñæ-MýStÆŠ‡ Ððl¬§ýl-Ë$ A«¨M>Æý‡$-ÌS…™é ç³Æý‡Å-Ðól-„ìS…_ ÑÐ]l-Æ>ÌS¯]l$ B¯ŒS-OÌñ毌S-ÌZ ¯]lÐðl*§ýl$ ^ólĶæ*-ÌS° çÜ*_…^éÆý‡$. {糿¶æ$™èlÓ, {ò³•ÐólsŒæ ѧéÅ-çÜ…-çܦ-ÌZÏ HO§ðl-¯é çœ$r¯]l fÇW™ól C¯ŒS-^éÆŠḥj A«¨M>ǰ »ê«§ýl$Å-Ë$V> ^ólÝë¢-Ð]l$° çܵçÙt… ^ólÔ>Æý‡$. Ð]l^óla-ѧéÅ-çÜ…-Ð]l-™èlÞÆý‡… ¯ésìæMìS Ð]l$«¨Æý‡ °Äñæ*-fMýS-Ð]l-Æý‡Y…ÌZ° Ð]lÊyýl$ Ððl*yýlÌŒæ ´ëuý‡-Ô>-ÌS-ÌS¯]l$ A…§ýl$-»êr$-ÌZMìS ¡çÜ$-MýS$-Æ>ÐéÌS-¯é²Æý‡$. Ķæ$…VŠæ C…yìlĶæ* çÜÒ$MýS–™èl VýS$Æý‡$-MýS$-ÌêÌS °Æ>Ã-×êË$, þ°Ä¶æ$ÆŠ‡ M>Ìôæ-iÌZÏ Ð]l$Æý‡-Ð]l$Ã-™èl$-ÌSOò³ MýS*yé çÜ*^èl-¯]l-Ë$ ^ólÔ>Æý‡$. B…VýSÏ…, VýS×ìæ™èl…, OòܯŒSÞ-ÌZ °ç³#-׿$-OÌñæ¯]l E´ë-«§éÅ-Ķæ¬-ÌS¯]l$ VýS$Ç¢…_ B¯ŒS-OÌñ毌S ѧé¯]l…-ÌZ 8 & 10Ð]l ™èlÆý‡-VýS-™èl$ÌS ѧéÅ-Æý‡$¦-ÌSMýS$ {ç³™ólÅMýS ™èlÆý‡-VýS-™èl$-Ë$ °Æý‡Ó-íßæ…^éÌS° ™ðlÍ´ëÆý‡$. -
● నేత్రపర్వంగా సాగుతున్న అధ్యయనోత్సవాలు ● కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభాయాత్ర
వామనావతారం.. సుమనోహరం భద్రాచలం : బలి చక్రవర్తి గర్వమును అణిచేందుకు వెలిసి మూడు అడుగులను కోరి రాక్షసరాజుకు గర్వభంగం చేసిన వామనావతారంలో దర్శనమిచ్చిన భద్రగిరి రామయ్యకు భక్తులు నీరాజనం పలికారు. భద్రాచల దేవస్థానంలో కొనసాగుతున్న వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు బుధవారం ఐదో రోజుకు చేరుకోగా, సీతాలక్ష్మణ సమేతుడైన రామచంద్రమూర్తి వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తొలుత గర్భగుడిలో సుప్రభాత సేవ, ఆరాధన నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు బేడా మండపంలో పూజలు నిర్వహించగా, వేద పండితులు 200 పాశురాల ప్రంబంధాలను సమర్పించారు. వైభవంగా శోభాయాత్ర పగల్ పత్తు ఉత్సవాల్లో భక్తులను భాగస్వాములను చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో బుధవారం కెమిస్ట్, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు పరిమి సోమశేఖర్ ఆధ్వర్యంలో స్వామివార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. స్వామివారిని ప్రత్యేక పల్లకీలో వేంచేపుజేసి ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకొచ్చారు. అక్కడి వేదికపై ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకున్నాక తిరువీధి సేవ నిర్వహించారు. నేడు పరశురామావతారం వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా స్వామివారు గురువారం పరశురామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. శ్రీ మహావిష్ణువు జమదగ్ని అనే మహర్షికి కుమారుడిగా జన్మించి పరశురాముడు(భార్గవరాముడు) అని పిలవబడుతూ దుష్టులైన కార్తవీర్యార్జునుని, దుర్మార్గులైన రాజులను ఇరవై ఒక్కసార్లు దండెత్తి సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. శుక్రగ్రహ బాధలున్నవారు ఈ అవతారాన్ని దర్శిస్తే శుభ ఫలితాలు పొందుతారని ప్రతీతి. -
అనాథకు ఆపన్నహస్తం
ఇల్లెందురూరల్: నా అన్న వాళ్ల ను కోల్పోయి చచ్చుపడిన కాళ్ల తో నవడలేక నేలపై పాకుతూ చలికి వణుకుతూ భిక్షాటన చేస్తున్న దివ్యాంగుడు గుగులోత్ దేవ్లాపై ‘ఎవ్వరూ లేని అనాథ..’శీర్షికతో బుధవారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి పలువురు స్పందించారు. మండలంలోని సీఎస్పీబస్తీకి చెందిన ఆటోడ్రైవర్ ముజాహిద్ గుగులోత్ దేవ్లాను తన ఆటోలో తీసుకెళ్లి కటింగ్, స్నానం చేయించి నూతన దుస్తులు కొనిచ్చాడు. భోజనం తినిపించాడు. నవడలేని స్థితిలో ఉన్న గుగులోత్ దేవ్లా దుస్థితిని తెలుసుకున్న కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ స్పందించి సెర్ప్ అధికారులతో మాట్లాడగా.. సెర్ప్ సీసీ స్వర్ణలత, డిజేబుల్ అధికారి వరప్రసాద్ దేవ్లాకు ట్రైసైకిల్ అందజేశారు. కాగా, ఉండటానికి గూడు కూడా లేని దేవ్లాకు ఉన్నతాధికారులు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి, దివ్యాంగుల పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని ఆటోడ్రైవర్ ముజాహిద్, స్థానికులు కోరుతున్నారు. -
●నల్ల నేలపై పచ్చని హారం
ఈ దృశ ్యం చూస్తే దట్టమైన అటవీ కొండల్లా ఉన్నాయి కదూ.. కానీ, సింగరేణి కాలరీస్ మణుగూరు ఏరియాలోని ఓసీ–2, ఓసీ–4 డంప్‌యార్డులు ఇవి. సింగరేణి హరితహారం కార్యక్రమంలో భాగంగా డంప్‌యార్డులు, గనుల పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటించి, వాటి పర్యవేక్షణను ఓ కాంట్రాక్టర్‌కు అప్పగించింది. ఏరియా జీఎం దుర్గం రాంచందర్ సూచనల మేరకు అటవీ, పర్యావరణ అధికారులు చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటించడం, మొక్కలు ఎండకు ఎండిపోకుండా నీటి సదుపాయం కల్పించడంతో పాటు నిరంతర పర్యవేక్షణను చేపట్టారు. దీంతో అప్పుడు నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి దట్టమైన అటవీ ప్రాంతాలను తలపిస్తున్నాయి. ఈ చిత్రాలు సింగరేణికి హరితహారంపై ఉన్న స్ఫూర్తికి అద్దం పడుతున్నాయి. –మణుగూరుటౌన్ -
●ఆరు శతాబ్దాల చరిత్ర
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం రైటర్‌బస్తీలోని ఆర్సీఎం చర్చికి ఆరు శతాబ్దాల చరిత్ర ఉంది. 1923లో కొందరు కేథలిక్‌లు బొగ్గు గనుల్లో పనిచేయడానికి వచ్చి కొత్తగూడెంలో స్థిరపడ్డారు. వీరి కోసం ప్రార్థనలు నిర్వహించేందుకు కాజీపేట నుంచి ఫాదర్ వచ్చేవారు. తొలుత 1928లో ఫాదర్ జీ సెమినాటి చర్చిని నిర్మించారు. ఆ తర్వాత జీ.పజ్జాలింగిని, డాల్ బాల్కన్, జీ.బెరెట్టా నేతృత్వాన ప్రస్తుతం ఉన్న చర్చిని 1944లో నిర్మించారు. మొదటి ఫాదర్‌గా జే టింటి, మొదటి ప్రెస్బైటరీగా కార్లోసిల్వా వ్యవహరించారు. ఆపై 1971లో కొత్తగూడెం చర్చిని మంజుమ్మల్ ప్రావిన్స్‌లోని ఓసీడీ మిషనరీలకు అప్పగించారు. ప్రస్తుతం కార్మైలెట్ మిషనరీలు కొనసాగిస్తుండగా ప్రస్తుతం ఓసీడీగా జయానంద్ వ్యవహరిస్తున్నారు. -
హెచ్ఆర్ఎస్ ఏఈఓకు ఉత్తమ అవార్డు
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట ఉద్యాన పరిశోధన స్థానం(హెచ్ఆర్ఎస్)లో ఏఈఓగా విధులు నిర్వహిస్తున్న ఎండీ హుస్సేన్‌కు ఉత్తమ క్షేత్రస్థాయి అవార్డు దక్కింది. ఈ మేరకు సిద్దిపేట జిల్లా ములుగులో నిర్వహించిన శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం 11వ వ్యవస్థాపక దినోత్సవంలో యూనివర్సిటీ వైస్ చాన్సలర్ చేతుల మీదుగా ఆయన అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. హుస్సేన్‌ను తోటి ఉద్యోగులు, సిబ్బంది అభినందించారు. పర్యావరణ సెమినార్‌కు ఆహ్వానంభద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన పర్యావరణవేత్త, న్యాయవాది పామరాజు తిరుమలరావుకు అరుదైన గౌరవం దక్కింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విశాఖపట్టణం ఆంధ్రా యూనివర్సిటీలో ‘ఫోరమ్ ఫర్ ఎన్విరాన్మెంట్’ ఆధ్వర్యంలో జరగనున్న సెమినార్లో ప్రసంగించాల్సిందిగా ఆ సంస్థ చైర్మన్ డాక్టర్ సీహెచ్. హనుమంతరావు బుధవారం తిరుమలరావుకు ఆహ్వానం పంపారు. గ్రీన్ భద్రాద్రి కో–ఆర్డినేటర్‌గా పర్యావరణ పరిరక్షణకు ఆయన చేస్తున్న కృషికి గాను ఈ గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టే లలిత, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కోట దేవదానం తదితరులు తిరుమలరావుకు అభినందనలు తెలిపారు. అధునాతన సౌకర్యాలతో ‘సూపర్’ఫాస్ట్ రైలుఅశ్వాపురం: మణుగూరు – సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ రైలు అధునాతన సౌకర్యాలతో బుధవారం నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. కొత్త ఎల్‌హెచ్‌బీ కోచ్ రైలు ముందుగా మణుగూరు చేరుకుని, ఆ తర్వాత ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లింది. ఈ ఎల్‌హెచ్‌బీ కోచ్ భద్రత, గరిష్ట వేగం 200 కి.మీ.తో ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపడనున్నాయి. ఎయిర్ సస్పెన్షన్ సిస్టం, విశాలమైన కిటికీలు, కొత్త సీట్లతో రూపొందించారు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధితులకు సత్వర న్యాయం చేయాలిసూపర్బజార్(కొత్తగూడెం): ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం తన చాంబర్లో ఎస్పీ రోహిత్‌రాజ్‌తో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ శాఖలో ప్రస్తుతం 34 అండర్ ఇన్వెస్టిగేషన్ అట్రాసిటీ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, విచారణ వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని అన్నారు. ప్రతీ కేసును పారదర్శకంగా, నిబంధనల మేరకు విచారించి తగిన చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులను ఆదేశించారు. అత్యాచారానికి గురైన మహిళలకు భరోసా కల్పించేందుకు భరోసా కేంద్రం ద్వారా అవసరమైన సహాయం, మానసిక ధైర్యం అందేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ యువత ఉపాధి అవకాశాల కోసం నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో చట్టపరమైన అన్ని నిబంధనలను కఠినంగా అమలు చేస్తూ దర్యాప్తు వేగవంతంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు. సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖాధికారి శ్రీలత, వివిధ శాఖల అధికారులు హనుమంతరావు, ప్రసాద్, కమిటీ సభ్యులు సామ్యా నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, లక్ష్మీబాయి పాల్గొన్నారు. -
ఆహ్లాదభరితం.. ఆధ్యాత్మిక కేంద్రం
పాల్వంచ: పాల్వంచ శ్రీనివాసనగర్‌లో గల శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం(శ్రీనివాసగిరి) ఆహ్లాదభరిత ఆధ్యాత్మిక కేంద్రమని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. యేరు ఉత్సవంలో భాగంగా బుధవారం ఆయన గుట్టపై ట్రెక్కింగ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు తోలేటి నగేష్‌శర్మ, ఆరుట్ల ఫణిరాజాచార్యులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్నాక తీర్థప్రసాదాలు స్వీకరించిన కలెక్టర్ మాట్లాడుతూ.. మంచి పర్యాటక ప్రాంతం అందుబాటులో ఉందని, కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి దర్శించుకుని ఉల్లాసంగా గడిపే అవకాశం ఉందని చెప్పారు. కార్యక్రమంలో డీవైఎస్ఓ ఎం.పరంధామ రెడ్డి, తహసీల్దార్లు దుర్గాప్రసాద్, భగవాన్‌రెడ్డి, ఆలయ బాధ్యులు కొత్త వెంకటేశ్వర్లు, ఆరుట్ల లక్ష్మణ్, టీఎన్జీఓ నాయకులు చైతన్య భార్గవ్, అథ్లెటిక్ సెక్రటరీ మహిధర్, కోచ్‌లు నాగేంద్ర, కల్యాణ్, నబీ, రమేష్, గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ అనురాధ, పీడీ శ్వేత పాల్గొన్నారు. విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి.. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించేలా కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. నవభారత్ పబ్లిక్ స్కూల్లో బుధవారం జరిగిన క్రీడా దినోత్సవాల్లో ఆయన మాట్లాడారు. జ్ఞానంతోనే జీవితంలో రాణించగలుగుతామని అన్నారు. ఉపాధ్యాయ వృత్తి ఆదర్శనీయమైనదని చెప్పారు. అనంతరం విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకోగా, క్రీడా పోటీల విజేతలకు కలెక్టర్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.వి.కె.ప్రసాద్, జాతీయ వాలీబాల్ రిఫరీ సీహెచ్.కాంతారావు తదితరులు పాల్గొన్నారు.శ్రీనివాసగిరి గుట్టపై కలెక్టర్ ట్రెక్కింగ్ సూపర్‌బజార్(కొత్తగూడెం): వివిధ కారణాలతో ఏళ్లుగా క్లెయిమ్ చేసుకోకుండా మిగిలిన ఆర్థిక పరమైన ఆస్తులను తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘మీ డబ్బు – మీ హక్కు’ను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లో బుధవారం వివిధ బ్యాంకులు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు ఇప్పటివరకు క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా పాలసీల రాబడులు, ఇతర ఆర్థిక సంస్థల వద్ద నిలిచిపోయిన మొత్తాలను తిరిగి పొందేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని అన్నారు. బ్యాంకుల్లో పదేళ్లకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను ఆర్బీఐ నిర్వహిస్తున్న ఉద్గమ్ వెబ్సైట్ ద్వారా తెలుసుకుని క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో సుమారు రూ.46 కోట్ల అన్‌క్లెయిమ్ డిపాజిట్లు ఉన్నాయని వెల్లడించారు. అలాగే ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన డిపాజిట్లను ఈనెల 31లోపు క్లియర్ చేయాలని ఆదేశించారు. లేదంటే సంబంధిత అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. సదస్సులో అదనపు కలెక్టర్ విద్యాచందన, రిజర్వ్ బ్యాంక్ ఎల్డీఓ శ్రీనివాస్, ఎస్బీఐ ఆర్ఎం సత్యనారాయణ, నాబార్డ్ డీడీఎం సుజిత్ కుమార్, యూనియన్ బ్యాంక్ డీజీఎం హనుమంత రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
●ఆసియా ఖండంలోనే ఖ్యాతి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద చర్చిగా కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని సీఎస్ఐ చర్చి నిలుస్తోంది. ఆంగ్లేయుల కాలంలో ఈ చర్చి తొలుత డంగు సున్నంతో నిర్మించారు. రానురాను భక్తుల సంఖ్య పెరగడంతో 2000 సంవత్సరంలో నూతన చర్చిని నిర్మించి ప్రార్థనలు చేస్తున్నారు. కొత్త భవనాన్ని 2005 మే 1వ తేదీన మెదక్ చర్చి దివంగత ఫాదర్ బీపీ సుగంధన్ ప్రారంభించారు. ప్రతీ ఆదివారం ఐదు వేల మందికి పైగా భక్తులు ఇక్కడ ప్రార్థనలకు హాజరవుతారు. ఫాస్టరేట్ చైర్మన్‌గా డీమాల అభిజిత్ వ్యవహరిస్తున్న ఈ చర్చి డోర్నకల్ అధ్యక్ష మండలి పరిధిలో కొనసాగుతోంది. -
చికిత్స పొందుతున్న యువకుడు మృతి
పాల్వంచరూరల్: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు ఉరివేసుకోగా.. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. మండలంలోని ఉల్వనూరు కొత్తూరు గ్రామానికి చెందిన, వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కాలం దిలీప్‌కుమార్ (28) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 21వ తేదీ రాత్రి ఇంటి వెనుక రేకుల షెడ్లో తాడుతో ఉరివేసుకోగా.. కుటుంబ సభ్యులు గమనించి పాల్వంచ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి తండ్రి రాందాస్ బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ కృష్ణ తెలిపారు. అనుమానంతో భార్యపై కత్తితో దాడిభద్రాచలంఅర్బన్: పట్టణంలోని పాత మార్కెట్ ప్రాంతంలో బుధవారం సాయంత్రం సోడే లక్ష్మిపై ఆమె భర్త సత్యం కత్తితో దాడి చేశాడు. వివరాలిలా ఉన్నాయి.. గత ఏప్రిల్‌లో సోడె సత్యం తన భార్యపై పులిగుండాలకు చెందిన ఉపాధ్యాయుడు లైంగికదాడి చేశాడని చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి నుంచి భార్యతో సత్యం దూరంగా ఉంటున్నాడు. లక్ష్మి భద్రాచలం పట్టణంలోని తన మేనమామ ఇంట్లో ఉంటోంది. కాగా, మూడు రోజులుగా లక్ష్మి కదలికలపై సత్యం నిఘా పెట్టాడు. పట్టణంలోని పాత మార్కెట్లో గల ఓ వస్త్ర దుకాణంలో బట్టలు కొనుగోలు చేసిన లక్ష్మి చర్చికి వెళ్తున్న క్రమంలో సత్యం కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన స్థానికులను కూడా బెదిరించాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మిని స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. టౌన్ ఎస్ఐ స్వప్న బాధితురాలి కుటుంబ సభ్యులను ఆరా తీస్తున్నారు. టీవీ చోరీపై విచారణ పాల్వంచరూరల్: మండలంలోని పాండురంగాపురం రైతువేదికలోని టీవీని గత నవంబర్‌లో గుర్తుతెలియని దుండగులు అపహరించగా.. విచారణ అధికారి, కొత్తగూడెం ఏడీఈ బుధవారం విచారణ చేపట్టారు. రూ.2 లక్షల విలువైన టీవీ చోరీకి గురవడంపై ఏఈఓ అనురిను, ఏఓ శంకర్‌ను ఆయన విచారించారు. పోలీసుల అదుపులో గంజాయి ముఠా? బూర్గంపాడు: మండలంలోని మోరంపల్లిబంజరలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. గ్రామస్తుల సమాచారం మేరకు బుధవారం రాత్రి పోలీసులు దాడి చేసి గంజాయి సేవిస్తున్న ముగ్గురి అదుపులోకి తీసుకోగా.. మరికొందరు పరారైనట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వ్యక్తులను విచారిస్తున్నట్లు తెలిసింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం సుజాతనగర్: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధమైన ఘటన కొత్త అంజనాపురం పంచా యతీ పరిధిలోని రూప్లాతండాలో బుధవారం చోటుచేసుకుంది. గ్రా మానికి చెందిన భూక్యా లాల్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ముందు భాగంలో తాత్కాలికంగా రేకులషెడ్ వేసుకొని అందులో నివాసం ఉంటున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాగా మంటలు చెలరేగాయి. నిర్మాణంలో ఉన్న ఇంటి కోసం తెచ్చిన రూ.5.50 లక్షల నగదు, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బంగారు ఆభరణాలు, కుమారుడి సర్టిఫికెట్లు కాలి బూడిదయ్యాయని బాధితుడు కన్నీటి పర్యంతమయ్యాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరాడు. ఆర్ఐ వీరభద్రం ఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చులే కారణం? మధిర: మండలంలోని ఆత్కూరు గ్రామానికి చెందిన చౌరపు సత్యనారాయణ (40) బుధవారం అనుమానా స్పద స్థితిలో మృతిచెందాడు. సత్యనారాయణ ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండగా, మరో ముగ్గురితో కలిసి దెందుకూరు సమీపాన ఆంధ్ర సరిహద్దులో అడ వి పందుల వేటకు వెళ్లినట్లు తెలిసింది. ఆ ప్రాంతంలో అప్పటికే అడవి పందుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తాకడంతో సత్యనారాయణ తీవ్ర గాయాలై మృతి చెందినట్లు సమాచారం. దీంతో ఆయన వెంట వెళ్లిన వ్యక్తులు సత్యనారాయణ మృతదేహాన్ని వైరా రోడ్డులోని పీవీఆర్ కల్యాణమండపం సమీపంలో రోడ్డు పక్కన వేసి వెళ్లినట్లు తెలుస్తోంది. రోడ్డు ప్రమాదంలో మృతిచెందినట్లుగా చిత్రీ కరించే ప్రయత్నంలో అలా చేసినట్లు తెలుస్తుండగా, వాహనదారులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సత్యనారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఘటనపై కేసు నమోదు చేసినట్లు మధిర టౌన్ సీఐ రమేష్ తెలిపారు. -
ఎత్తిపోతలకు గ్రహణం
బూర్గంపాడు: ఎత్తిపోతల పథకాలకు నిధుల గ్రహణం వీడడం లేదు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను గాలికొదిలేశాయి. వాటి మోటార్లు, పైప్లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతులకు గురైనా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి వాగులు, నదులు, చెక్‌డ్యామ్‌ల్లో నీరు అందుబాటులో ఉన్నా.. ఎత్తిపోతల పథకాలు మరమ్మతులకు గురి కావడంతో యాసంగికి సాగునీరు అందే పరిస్థితి లేదు. పినపాక నియోజకవర్గంలోని పలు లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయకపోవడంతో రైతులు యాసంగి పంటల సాగుకు దూరమవుతున్నారు. మూలనపడిన ‘మోతె’.. కరకగూడెం మండలం మోతె గ్రామంలో రూ.11 కోట్లతో పెద్దవాగుపై 2014లో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పథకం ప్రస్తుతం మూలనపడింది. పెద్దవాగు నీటిని వృథా చేయకుండా మండల పరిధిలోని ఎనిమిది చెరువులకు పైప్లైన్లతో తరలించేలా ఈ స్కీమ్‌ను ప్రారంభించారు. తొలుత 1,023 ఎకరాలకు సాగునీరు అందించేలా ప్రారంభించి దశలవారీగా విస్తరించారు. ఈ స్కీమ్‌కు విద్యుత్ సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ రెండేళ్ల క్రితం చోరీకి గురైంది. దీనికి తోడు నిర్వహణ లోపంతో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పంప్‌హౌస్ చెత్త, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. నీటి నిల్వ కోసం ఏర్పాటు చేసిన చెక్‌డ్యామ్ ఇసుకతో పూడుకుపోయింది. రైతుల నిధులతోనే.. పినపాక మండలంలోని టీ కొత్తగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మరమ్మతులకు గురైనా పట్టించుకునే వారు లేకపోవడంతో ఆయకట్టు రైతులు రూ.18 లక్షలు పోగుచేసి రిపేర్ చేయించారు. ఆ తర్వాత విద్యుత్ మోటార్లు, కాపర్ వైరు చోరీకి గురై ఈ పథకం పూర్తిగా మూలన పడింది. సింగిరెడ్డిపల్లి ఎత్తిపోతల పథకం కూడా మరమ్మతుల కారణంగా పని చేయడం లేదు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం లిఫ్ట్ ఇరిగేషన్ సీతారామ కాల్వల తవ్వకంతో మూలనపడింది. బూర్గంపాడు మండలం సోంపల్లి, బుడ్డగూడెం పథకాలు కూడా మరమ్మతులకు గురయ్యాయి. సాగునీటి రంగానికి భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు పాలకులు చెబుతున్నా.. ఈ లిఫ్ట్‌లను మాత్రం పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికై నా మరమ్మతులు చేయించి తమకు సాగు నీరు అందించాలని కోరుతున్నారు. బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామంలోని తుమ్మల ఎత్తిపోతల పథకం మరమ్మతులకు గురై నిరుపయోగంగా మారింది. 2002లో నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రూ.3.06 కోట్లతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌ను ప్రారంభించారు. దీని పరిధిలో 733 మంది రైతులకు చెందిన రెండువేల ఎకరాలకు సాగునీరు అందగా రెండు పంటలు సాగు చేసేవారు. 200 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన నాలుగు, 100 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన నాలుగు మోటార్లతో సాగునీరు అందేది. ప్రస్తుతం మోటార్లు కాలిపోగా ఒకటి బాగానే ఉన్నా.. దాన్ని కూడా నడపడం లేదు. దీంతో రైతులకు సాగునీరు అందడం లేదు. ఇక పైప్లైన్లు కూడా మరమ్మతులకు గురై నీరు లీకవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకానికి నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేయించాలని రైతులు మూడేళ్లుగా కోరుతున్నా ప్రయోజనం లేదు. -
ఏరు ఉత్సవానికి ఏర్పాట్లు
భద్రాచలం: పర్యాటక రంగంలో ఏరు ఉత్సవం జోష్ నింపుతోంది. ఆధ్యాత్మికత, ప్రకృతిని అనుసంధానిస్తూ పర్యాటక రంగానికి సరికొత్త శోభ నింపేలా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రణాళికలు రూపొందించారు. గతేడాది ప్రారంభించిన ఈ ఉత్సవాన్ని ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నారు. అయితే దీన్ని నిరంతరం కొనసాగించాలని పర్యాటక ప్రేమికులు కోరుతున్నారు. మొక్కుబడిగా కాకుండా శాశ్వత పనులు చేపడితే అనేక మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నారు. ప్రత్యేకంగా నిలుస్తున్న గిరిజన సంస్కృతి.. ఏజెన్సీ ప్రాంతంగా పేరుగాంచిన జిల్లా సహజ సిద్ధమైన ప్రకృతి అందాలకు నెలవు. అలాగే దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం రామాలయం ఉంది. వీటితో పాటు గిరిజన సంసృతి సంప్రదాయాలు ఇక్కడ ప్రత్యేకం. వీటన్నింటినీ అనుసంధానం చేస్తూ కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఏరు ఉత్సవం చేపట్టారు. గతేడాది ముక్కోటి వేడుకల సమయంలో చేపట్టిన ఈ ఉత్సవానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఆ తర్వాత పర్యవేక్షణ లేక ఆదరణ కోల్పోయింది. మళ్లీ ఈ ఏడాది ముక్కోటి ఉత్సవాలు ఆరంభం కావడంతో ఏరు ఉత్సవాన్ని తిరిగి చేపట్టారు. 30 వరకు ప్రత్యేక ప్రణాళికతో కార్యాచరణ.. ఈ నెల 22 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక ప్రణాళికతో కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలో సోమవారం బెండాలపాడులోని కనకగిరి గుట్టల ట్రెక్కింగ్, మంగళవారం గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో కిన్నెరసాని నది పొడవునా రివర్ వాక్ చేపట్టారు. బుధవారం పాల్వంచలోని శ్రీనివాసగిరి గుట్ట ట్రెక్కింగ్, 26వ తేదీ సాయంత్రం దుమ్ముగూడెం మండలం బొజ్జిగుప్పలో ట్రైబల్ ఈవెనింగ్ కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా 27, 28, 29వ తేదీల్లో గోదావరి ఒడ్డున సంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటితో పాటు భక్తులు, పర్యాటకుల వసతి కల్పించి ప్రకృతి, గోదావరి అందాలను తెలకించేలా ఏరు క్యాంప్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం టెంట్లు, వ్యూ పాయింట్, వాష్‌రూంల పనులు గోదావరి ఒడ్డున వేగంగా సాగుతున్నాయి. అలాగే కరకట్ట పైనుంచి ఈ క్యాంపునకు వచ్చేలా నూతన మెట్లు నిర్మిస్తున్నారు. సోషల్ మీడియాతో ప్రచారం.. జిల్లాలోని అందాలు, ఏరు ఉత్సవం, పర్యాటక రంగాలకు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రాచుర్యం కల్పించేలా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లను భాగస్వాములను చేయాలని కలెక్టర్ భావించారు. ప్రత్యేక రీల్స్ చేయాలంటూ వారితో ఇటీవల సమావేశం నిర్వహించారు. టూరిజం అభివృద్ధితో అందరికీ ఉపాధి కలుగుతుందని వివరించారు. కాగా జిల్లాను ఎకో టూరిజం హబ్‌గా మార్చేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రకృతి, పర్యాటక ప్రేమికులు, స్థానికులు కోరుతున్నారు. కేవలం శీతకాల, ముక్కోటి ఉత్సవాలకే పరిమితం కాకుండా శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని, ఈ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేసేలా ఒత్తిడి తేవాలని అంటున్నారు. -
ప్రకృతి అందాలు అద్భుతం
కిన్నెరసానిని సందర్శించిన ట్రెయినీ ఐపీఎస్‌లు పాల్వంచరూరల్ : కిన్నెరసాని ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నాయని నలుగురు ట్రెయినీ ఐపీఎస్‌లు కితాబిచ్చారు. మంగళవారం వారు కిన్నెరసానిని సందర్శించారు. అభయారణ్యంలో జంతవుల సంరక్షణ, అటవీ సంపద గురించి తెలుసుకున్నారు. ఇక్కడ ప్రకృతి అందాలు ‘సో బ్యూటీఫుల్’గా ఉన్నాయని చెప్పారు. ఐపీఎస్ శిక్షణలో భాగంగా తాము ఇక్కడికి వచ్చామని హైదరాబాద్‌కు చెందిన రాహుల్, మనీషా నెహరా, సోనమ్ సునీల్, ఆయేషా ఫాతిమా వెల్లడించారు. అనంతరం బోటు షికారు చేశారు. వారి వెంట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ జీవన్ ఉన్నారు. క్రీడలతో మానసిక ప్రశాంతత ఐటీడీఏ పీఓ రాహుల్భద్రాచలంటౌన్ : క్రీడలు శరీర ఆరోగ్యానికే కాకుండా మానసిక ప్రశాంతత, మేధాశక్తి పెంపునకు దోహదం చేస్తాయని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. భద్రాచలం ట్రైబల్ మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రీడల్లో గెలుపోటములను సమానంగా తీసుకోవాలని, ఓడిన వారు నిరుత్సాహపడకుండా పట్టుదలతో కృషి చేసి విజయం సాధించాలని సూచించారు. క్రీడాకారులు రోజూ సాధన చేస్తూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. మ్యూజియం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో 32 జట్లు పాల్గొంటున్నాయని, బుధవారం ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయని తెలిపారు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.8 వేలు, ద్వితీయ బహుమతి రూ.6 వేలు, తృతీయ బహుమతి రూ.4వేలు, నాలుగో బహుమతి రూ.2వేలతో పాటు ట్రోఫీలు అందజేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ స్పోర్ట్స్ అధికారి గోపాల్ రావు, ఆర్గనైజర్ సురేష్ కుమార్, నాగేశ్వరరావు, పీడీలు, పీఈటీలు హరికృష్ణ, ముత్తయ్య, రాంబాబు పాల్గొన్నారు. ఆకట్టుకుంటున్న ‘ఐటీడీఏ’ స్టాళ్లు భద్రాచలంటౌన్ : విశాఖపట్టణం పోర్టు స్టేడియంలో జరుగుతున్న జాతీయ స్థాయి పెసా మహోత్సవాల్లో ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గిరిజన వంటకాలు, కోయ హ్యాండీక్రాఫ్ట్ స్టాళ్లు ఆకట్టుకుంటున్నాయని పీఓ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వేడుకలకు తెలంగాణ తరఫున ఐటీడీఏ నుంచి క్రీడాకారులను, వివిధ స్టాళ్లను పంపామని చెప్పారు. గిరిజన వంటకాలు, కోయ హ్యాండీక్రాఫ్ట్ స్టాళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు సందర్శించి అభినందించారని వివరించారు. క్రీడల్లో ఐటీడీఏ క్రీడాకారులు సత్తా చాటుతున్నారని తెలిపారు. విశాఖపట్టణం వెళ్లిన వారిలో ఏపీఓ డేవిడ్‌రాజ్, ఏఓ సున్నం రాంబాబు, జ్యోతి తదితరులు ఉన్నారని పేర్కొన్నారు. -
ముక్కోటి సజావుగా సాగాలి..
సూపర్‌బజార్(కొత్తగూడెం): ముక్కోటికి హాజర య్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ రోహిత్‌రాజ్ పోలీస్ అధికారులకు సూచించారు. పోలీస్ హెడ్క్వార్టర్లలో మంగళవారం పోలీస్ అధికారులతో సమీక్షించారు. తొలుత పంచాయతీ ఎన్నికల్లో వర్టికల్స్ వారీగా ఉత్తమ ప్రతిభ కనబరిచినవారికి ప్రశంసాపత్రాలు అందించి, మాట్లాడారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, వాటి నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ఏడాది చివరలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నిత్యం వాహన తనిఖీలు చేపట్టాలని, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి సమగ్ర దర్యాప్తు చేపట్టి భాదితులకు న్యాయం చేయాలని, పోక్సో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా కృషి చేయాలని సూచించారు. మాదకద్రవ్యాల రవాణా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపాలని, సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. ఈ నెల 29, 30 తేదీల్లో భద్రాచలంలో జరగనున్న తెప్పోత్సవం, ముక్కోటి ఉత్సవాలు సజావుగా సాగేలా బందోబస్తు ప్రణాళిక రూపొందించాలని చెప్పారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ఉండాలని, షీ టీమ్స్, భరోసా కేంద్రాల ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని ఎస్పీ వివరించారు. సమావేశంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, డీఎస్పీలు రెహమాన్, మల్లయ్యస్వామి, ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, రమాకాంత్, ఐటీ సెల్ సీఐ రాము తదితరులు పాల్గొన్నారు.అందుకు అన్ని ఏర్పాట్లు చేయాలి: ఎస్పీ -
వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): రైతులు వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చుకోవాలని, అడవులను కాపాడుకుంటూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం కిసాన్ సమ్మాన్ దివస్, కిసాన్ మేళా నిర్వహించారు. తొలుత అభ్యుదయ రైతులు వ్యవసాయ పరికరాల స్టాల్‌ను సహాయ విస్తరణ సంచాలకులు డాక్టర్ చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. రైతులకు కృషి విజ్ఞాన కేంద్రం అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన వంగడాలను రైతులు పండించుకోవాలని సూచించారు. ఖమ్మం నాబార్డ్ డీడీఎం సుజీత్‌కుమార్ మాట్లాడుతూ.. నాబార్డ్ ద్వారా అందిస్తున్న పథకాల గురించి వివరించారు. కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ భరత్ మాట్లాడుతూ.. రైతులు చేస్తున్న కృషిని గుర్తించి వారిని సన్మానించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఉన్న 40 మంది అభ్యుదయ రైతులను సత్కరించామని తెలిపారు. మణుగూరు సహాయ వ్యవసాయ సంచాలకులు తాతారావు మాట్లాడుతూ.. రైతులు కొత్త పద్ధతులు పాటిస్తూ ఆదాయాన్ని పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు శరత్, శివ తదితరులు పాల్గొన్నారు. కేవీకే కిసాన్ మేళాలో వక్తలు -
అంతర్జాతీయ సంస్థగా సింగరేణి
సత్తుపల్లి: ఇన్నాళ్లు తెలంగాణలో మాత్రమే బొగ్గు వెలికితీతకు పరిమితమైన సింగరేణి సంస్థ అనేక రంగాల్లోకి అడుగుపెడుతూ ప్రపంచ స్థాయికి ఎదుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తెలిపారు. సత్తుపల్లిలో నిర్మించిన ఏరియా జీఎం కార్యాలయాన్ని మంగళవారం ఆయన సింగరేణి సీఎండీ కృష్ణభాస్కర్, సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేక్‌ను కట్ చేశాక సభలో మాట్లాడారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తికే పరిమితం కాకుండా సోలార్ ఎనర్జీ, మినరల్స్ రంగంలో అడుగు పెట్టిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌లను విక్రయిస్తున్నందున సాధ్యమైనన్ని బొగ్గు బ్లాక్‌లను దక్కించుకునేలా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. జైపూర్‌లో 1,500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను రాజస్థాన్ ప్రభుత్వంతో కలిసి ఏర్పాటుచేస్తున్నామని చెప్పారు. సింగరేణి భవిష్యత్ కార్మికుల చేతుల్లో ఉందని గుర్తించి ఉత్పత్తి పెంచాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ సింగరేణి సంస్థ వల్ల ఈ ప్రాంతానికి అభివృద్ధి జరుగుతున్నప్పటికీ సైలో బంకర్ కారణంగా కిష్టారంలో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు. ఓసీ, సైలో బంకర్ పరిశీలన జేవీఆర్ ఓపెన్‌కాస్టును సత్తుపల్లి, వైరా ఎమ్మెల్యేలు రాగమయి, రాందాస్ నాయక్‌తో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. ఓపెన్‌కాస్టులో బొగ్గు తవ్వకాలు చేపడుతున్న తీరు, బొగ్గు నాణ్యత వివరాలు ఆరా తీశాక కిష్టారంలోని సైలో బంకర్‌ను పరిశీలించారు. ఆతర్వాత సత్తుపల్లి జీఎం కార్యాలయంలో సింగరేణి అధికారులతో పలు అంశాలపై భట్టి సమీక్షించారు. విద్యుత్ వెతలు ఉండవు... తల్లాడ: విద్యుత్ డిమాండ్ ఎంత పెరిగినా అవాంతరాలు లేకుండా సరఫరా చేసేలా అవసరమైన చోట సబ్స్టేషన్లు నిర్మిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తల్లాడ మండలం పినపాక, అన్నారుగూడెం, కల్లూరు మండలం లింగాలల్లో రూ.10.53కోట్ల వ్యయంతో నిర్మించే మూడు సబ్స్షేన్లకు పినపాకలో ఆయన ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో భట్టి మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నందునే గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపర్చిన 85 శాతం మందిని సర్పంచ్‌లుగా గెలిపించాలరని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, పోలీస్ కమిషనర్ సునీల్‌దత్, డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్, కల్లూరు సబ్‌కలెక్టర్ అజయ్‌యాదవ్, సింగరేణి డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, సూర్యనారాయణ, తిరుమలరావు, జీఎం చింతల శ్రీనివాస్, పీఓలు ప్రహ్లాద్, సునీల్‌కుమార్‌వర్మ, రాయల నాగేశ్వరరావు, నూతి సత్యనారాయణ గౌడ్, గుర్రం శ్రీనివాసరావు, ఎస్ఈలు ఇనుగుర్తి శ్రీనివాసాచారి, యాకోబు, ఎం.వెంకటేశ్వర్లు, వసుంధర యాదవ్, డాక్టర్ మట్టా దయానంద్, రాములు, సతీష్, కాపా సుధాకర్, జక్కంపూడి కిషోర్, కాపా అప్పయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఉత్తమ రైతు పురస్కారాలు ప్రదానం
దమ్మపేట/టేకులపల్లి/అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ రంగంలో ఉత్తమ సేవలకు గాను మండలంలోని అల్లిపల్లి గ్రామానికి చెందిన ఆలపాటి రామచంద్రప్రసాద్ (పామాయిల్ సలహాదారు కమిటీ సభ్యుడు)ను కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఉత్తమ రైతుగా ఎంపిక చేసింది. మంగళవారం కొత్తగూడెంలో జరిగిన కిసాన్ దివాస్–2025 కార్యక్రమంలో భాగంగా ఆయనకు పురస్కారం అందించారు. అలాగే, టేకులపల్లి మండలం చింతోనిచెలక గ్రామానికి చెందిన కవలలు కంభంపాటి నరేశ్, నవీన్, బేతంపూడి గ్రామానికి చెందిన బచ్చలకూరి అశోక్, వెంకట్యాతండాకు చెందిన బాణోతు వీరన్న సైతం ఉత్తమ రైతు అవార్డులు అందుకున్నారు. కంభంపాటి నవీన్, నరేశ్ ప్రత్యేకంగా కవలల సేద్యం ప్రశంసాపత్రాన్ని అందుకోవడం విశేషం. అలాగే, అశ్వారావుపేట మండలం మల్లాయిగూడేనికి చెందిన దారా ప్రసాద్ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో కేవీకే శాస్త్రవేత్త హేమశరత్ చంద్ర, ప్రొగ్రాం కోఆర్డినేటర్ టి.భరత్, ఏడీఏ తాతారావు పాల్గొన్నారు. -
అత్యున్నత అభ్యసన వైపు..
కరకగూడెం: పేద విద్యార్థుల విద్యా ప్రమాణాలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగువేసింది. ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా బలోపేతం చేసి, ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య అందించేందుకు ప్రతీ మండలానికి ఒక బెస్ట్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బృహత్తర లక్ష్యాన్ని సాధించే దిశగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 23 మండలాల నుంచి విద్యార్థుల సంఖ్య, వసతులు, ఉపాధ్యాయుల లభ్యత ఆధారంగా ఎంపిక చేసిన పాఠశాలల ప్రతిపాదనలను జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులు గత నెలలో ప్రభుత్వానికి పంపారు. పూర్వ ప్రాథమిక స్థాయి నుంచి పదో తరగతి వరకు పూర్తిస్థాయి మౌలిక వసతులు, డిజిటల్ తరగతి గదులు, పక్కా భవనాలతో ఇవి రూపుదిద్దుకోనున్నాయి. మౌలిక వసతుల కల్పన.. ఎంపికై న బెస్ట్ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని వాతావరణంలో విద్యను అభ్యసించేలా చర్యలు చేపట్టనున్నారు. ఆధునిక డిజిటల్ తరగతి గదులు, సౌకర్యవంతమైన ఫర్నిచర్, మెరుగైన తాగునీరు, పరిశుభ్రమైన టాయిలెట్లు, పూర్తిస్థాయి ప్రయోగశాలలు, గ్రంథాలయాల ఏర్పాటుతోపాటు నూతనంగా పెయింటింగ్ వేయనున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు అందిన వెంటనే ఈ ఎంపికై న పాఠశాలల్లో అన్ని వసతులు కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టనున్నారు. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు నమోదు పెరిగి, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య చేరువ చేయాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని విద్యావేత్తలు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రతి మండలంలో ఉత్తమ పాఠశాల ఏర్పాటు కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జిల్లా స్థాయిలో అమలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కార్యక్రమం కేవలం భవనాల నిర్మాణం లేదా సౌకర్యాల జోడింపు కాదు. ప్రతి విద్యార్థికి ఉన్నత స్థాయి అభ్యాస అనుభవాన్ని అందించాలనే సమష్టి నిబద్ధతకు అద్దం పడుతుంది. విద్యారంగంలో సమానత్వాన్ని సాధించడం, అత్యంత వెనుకబడిన విద్యార్థికి కూడా మెరుగైన అవకాశాలను కల్పి ంచడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ప్రభుత్వ ఆదేశాలు అందిన వెంటనే ఈ నమూనా పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుదల, వృత్తిపరమైన ఉపాధ్యాయ శిక్షణ, అత్యాధునిక అభ్యాస వనరుల అందుబాటుపై దృష్టి సారిస్తాం. ఇది విద్యాభివద్ధిలో నవశకం. –నాగలక్ష్మి, డీఈఓమండలానికి ఒక బెస్ట్ స్కూల్‌ను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులు కఠినమైన ప్రమాణాలతో కూడిన పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ ఎంపిక ప్రక్రియ జాతీయ విద్యా విధానాన్ని దృష్టిలో ఉంచుకుని చేపట్టినట్లు తెలుస్తోంది. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు అధికంగా ఉండేలా, అన్ని సబ్జెక్టులు బోధించడానికి సరిపడా ఉపాధ్యాయులు అందుబాటులో ఉండి పక్కా భవనం కలిగి ఉండడంతో పాటు క్రీడా మైదానం తప్పనిసరిగా ఉండేలా చూసుకున్నారు. ప్రస్తుతం ఒకే ఆవరణలో ప్రాథమికస్థాయి నుంచి పదో తరగతి వరకు విద్యాబోధన కొనసాగుతున్న పాఠశాలలను ఎంపిక చేశారు. జిల్లాలో ఆళ్లపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, గుండాల, కరకగూడెం, జూలూరుపాడు, ములకలపల్లి, పాల్వంచ జెడ్పీహెచ్ఎస్లతో పాటు అన్నపురెడ్డిపల్లిలో ఎరగ్రుంట, అశ్వాపురంలో మల్లెలమడుగు, భద్రాచలం బాలికల జెడ్పీహెచ్ఎస్, బూర్గంపాడులో మోరంపల్లి, చర్లలో సత్యనారాయణపురం, చుంచుపల్లిలో రుద్రంపూర్, దమ్మపేటలో నాగుపల్లి, దుమ్ముగూడెంలో నర్సాపురం, పినపాకలో ఏడూళ్ల బయ్యారం జెడ్పీహెచ్‌ఎస్‌లు ఎంపికయ్యాయి. పాత కొత్తగూడెం ప్రభుత్వ పాఠశాల, లక్ష్మీదేవిపల్లిలో హేమచంద్రాపురం పీఎంశ్రీ జెడ్పీహెచ్ఎస్, మణుగూరు జెడ్పీహెచ్ఎస్ కో–ఎడ్యుకేషన్, సుజాతనగర్లో పీఎంశ్రీ, టేకులపల్లి ప్రభుత్వ పాఠశాల, ఇల్లెందు జెడ్పీహెచ్ఎస్, సుభాష్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలను కూడా ఎంపిక చేశారు. ప్రతి మండలానికో బెస్ట్ స్కూల్ ఏర్పాటు -
గ్లోబల్ సంస్థగా సింగరేణి
● 2047 వరకు విజన్ డాక్యుమెంట్ ● రాష్ట్రాభివృద్ధిలో సంస్థ భాగస్వామ్యం ● ఆవిర్భావ వేడుకల్లో డైరెక్టర్(ఆపరేషన్ ్స) సూర్యనారాయణ సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణకు తలమానికమైన సింగరేణి గోబల్ సంస్థగా ఎదుగుతోందని, 2047 వరకు విజన్ డాక్యుమెంట్ ఉందని సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ చెప్పారు. సింగరేణి ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ఆవిర్భావ వేడుకలను ఆయన జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. పతాకావిష్కరణ అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 136 సంవత్సరాల చరిత్రలో అనేక విజయాలు సాధించిన సింగరేణి.. కార్మికుల శ్రేయస్సుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. ఉద్యోగులు, కార్మికులతో పాటు కాంట్రాక్టు కార్మికులకూ బీమా సౌకక్యం కల్పించినట్లు చెప్పారు. తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమగా విరాజిల్లుతూ రాష్ట్ర అభివృద్ధిలోనూ భాగస్వామ్యం అవుతోందని అన్నారు. శ్రమ, క్రమశిక్షణ, నమ్మకమే సింగరేణి బలమని అన్నారు. కీలక ఖనిజాలు, అనుబంధ రంగాల్లో అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డైరెక్టర్లు కె.వెంకటేశ్వర్లు(పీఅండ్‌పీ), ఎం.తిరుమలరావు(ఈఅండ్ఎం) హాజరయ్యారు. ఉత్తమ ఉద్యోగులకు సన్మానం.. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కార్పొరేట్ పరిధిలో ఉత్తమ అధికారిగా ఎంపికై న బి.శ్రీనివాసరావు, ఉత్తమ ఉద్యోగులు కె.వేంకటేశ్వర ప్రసాద్, డి.వి.వి. నాగేంద్ర ప్రసాద్‌ను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రధాన ఆస్పత్రిలో నిర్వహించిన వెల్ బేబీ షోలో విజేతలుగా నిలిచిన చిన్నారులకు బహుమతులు అందజేశారు. పర్సనల్ జీఎం జి.వి.కిరణ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సి.త్యాగరాజన్, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ టి. లక్ష్మీపతిగౌడ్తో పాటు వివిధ విభాగాల జీఎంలు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా, సింగరేణి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించకపోవడాన్ని నిరసిస్తూ గుర్తింపు సంఘం ఏఐటీయూసీ హాజరు కాలేదు. -
నరసింహావతార రూపుడై..
భద్రాచలం: ప్రియ భక్తుడు ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడు అనే రాక్షసుడి బారి నుంచి రక్షించేందుకు వెలిసిన నరసింహావతారంలో అలంకరించిన రామయ్యను దర్శించుకున్న భక్తులు పులకించిపోయారు. వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారు మంగళవారం నరసింహావతారంలో దర్శనమిచ్చి కనువిందు చేశారు. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తులకు గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ మూర్తులను నృసింహావతారంలో అలంకరించి బేడా మండపంలో కొలువుదీర్చి పూజలు చేశాక వేద పండితులు 200 పాశురాల ప్రంబంధాలను పఠించారు. వైభవంగా శోభాయాత్ర.. ఉత్సవాల్లో భాగంగా భద్రాచలం నృసింహసేవా వాహిని సభ్యులతో పాటు అహోబిల మఠానికి చెందిన కృష్ణ చైతన్య స్వామివార్లకు పట్టువస్త్రాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన శోభాయాత్ర కనులపండువగా సాగింది. నరసింహావతారంలో ఉన్న స్వామివారిని ప్రత్యేక పల్లకిపై కోలాట ప్రదర్శనలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా మిథిలా స్టేడియం వేదికపైకి తీసుకొచ్చి కొలువుదీర్చారు. అర్చకులు అవతార విశిష్టతను వివరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత తాతగుడి వరకు తిరువీధి సేవ నిర్వహించారు. గ్రామ రక్షకుడిగా స్వామివారు.. గ్రామ రక్షణార్థం స్వామి వారు నరసింహావతారంలో పురవీధుల గూండా తిరువీధి సేవ కొనసాగడం ఈ అవతారం ప్రత్యేకత అని వేదపండితులు తెలిపారు. గ్రామంలోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా, ఎలాంటి ఆపదలు కలగకుండా ఉండేందుకే నరసింహావతారంలో స్వామి వారు పురవీధులలో సంచరిస్తారని వివరించారు. ఆ తర్వాత తిరిగి అంతరాలయానికి తీసుకెళ్లారు. నేడు వామనావతారం.. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు బుధవారం వామనావతారంలో దర్శనమివ్వనున్నారు. దేవతల సర్వసంపదలను తన స్వాధీనం చేసుకున్న రాక్షస రాజైన బలిచక్రవర్తి దగ్గరికి శ్రీహరి వామన రూపంలో వెళ్లి మూడు అడుగులు దానంగా స్వీకరించి, ఒక అడుగుతో భూమిని, రెండవ అడుగుతో ఆకాఽశాన్ని, మూడవ అడుగును బలి తలపై మోపి త్రివిక్రముడవుతాడు. ఈ అవతారాన్ని దర్శిస్తే గురు గ్రహ బాధలు తొలుగుతాయని వేదపండితులు చెబుతున్నారు. కాగా, శ్రీ సీతారామచంద్ర స్వామివారిని పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి బాలస్వామీజీ మంగళవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
వేంకటేశ్వర స్వామికి పుష్పయాగం
ఖమ్మంగాంధీచౌక్: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం కమాన్‌బజార్‌లోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం స్వామికి పుష్పయాగం నిర్వహించారు. స్వామివార్ల ఉత్సవ విగ్రహాలతో పాటు ఆలయం ఆవరణను పూలతో అలంకరించారు. అనంతరం ఈఓ కె.వేణుగోపాలాచార్యులు పర్యవేక్షణలో అర్చకులు పుష్పాభిషేకం నిర్వహిచారు. భక్తులతో పాటు గోవింద మాలధారులు,శరణాగతి దీక్ష ధరించిన వారు హాజరయ్యారు. మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్యఇల్లెందురూరల్: మండలంలోని బాలాజీనగర్‌కు చెందిన సంగం బక్కయ్య (36) మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకొని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి చంద్రమ్మ కథనం ప్రకారం.. బక్కయ్య భార్య శిరీషతో తనకు అక్రమ సంబంధం ఉందని సంజయ్‌నగర్‌కు చెందిన తరుణ్ తన కుమారుడికి నేరుగా చెప్పడంతో పెద్దమనుషుల వద్ద పంచాయతీ చేశామని, ఇదే విషయమై రెండు రోజుల క్రితం తరుణ్‌తో ఘర్షణ పడిన బక్కయ్య మనస్తాపంతో మంగళవారం ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి చంద్రమ్మ ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ సురేశ్ తెలిపారు. చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి బూర్గంపాడు: మండలంలోని కృష్ణసాగర్ గ్రామ పంచాయతీలోని బట్టిగూడెం వలస ఆదివాసీ గ్రామానికి చెందిన సోడి భీమా (36) పురుగుమందు తాగి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. సోడి భీమాకు నందమ్మతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు లేకపోవటంతో భీమా మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో నవంబర్ 30వ తేదీన భార్య నందమ్మ కూలి పనులకు వెళ్లిన తరువాత ఇంట్లో పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం కరకగూడెం: మండలంలోని వెంకట్రాంపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసిన దుండగులు అందులోని అల్యూమినియం తీగను చోరీ చేశారు. గ్రామానికి చెందిన గొంది బాలకృష్ణ తన పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసు కుని వరి సాగు చేస్తున్నాడు. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు ట్రాన్స్ఫార్మర్ను ధ్వంసం చేసి, అల్యూమినియం తీగను ఎత్తుకెళ్లారు. బాధితులు మంగళవారం విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా, ఇన్చార్జ్ ఏఈ రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫార్మర్ సామగ్రి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని ఆయన వెల్లడించారు. -
కిన్నెరసాని రోడ్డులో ట్రాఫిక్‌జామ్
పాల్వంచరూరల్: బూడిద లారీలను రోడ్డుపై గంటల తరబడి నిలిపివేయడంతో రాత్రి సమయంలో కిన్నెరసానివైపు వాహనదారులు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ శివారు కరకవాగు వద్ద కేటీపీఎస్ యాష్పాండులోపలికి వెళ్లే బూడిద లారీలను రాత్రి సమయంలో కిన్నెరసానిరోడ్డులో నిలుపుతున్నారు. దీంతో కిన్నెరసాని నుంచి పాల్వంచకు, పాల్వంచ నుంచి కిన్నెరసాని, ఉల్వనూరు వైపు వెళ్లే వాహనాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంగళవారం రాత్రి కూడా బూడిద లారీలు రోడ్డుపై నిలిపివేయడంతో ట్రాఫిక్ జామ్ కావడంతో లారీల డ్రైవర్లతో వాహనదారులు గొడవ పడ్డారు. నిత్యం గొడవ జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ప్రైవేటీకరణకు నిరసనగా ధర్నాపాల్వంచ: కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజనీర్స్ పిలుపు మేరకు కేటీపీఎస్ టీజీపీఈఏ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక కేటీపీఎస్ అంబేడ్కర్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ సెక్రటరీ డి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన న్యూక్లియర్ బిల్లును రద్దు చేయాలని, విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బ్రహ్మాజీ, యాస్మిన్, మహేశ్, రాధాకృష్ణ, గిరిధర్, వెంకటేశ్వర్లు, రవీందర్, నాగేశ్వరరావు, జయభాస్కర్, అఖిలేశ్, శ్రీపాల్, యాకూబ్, పావని, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎవ్వరూ లేని అనాథ.. ● చలికి వణుకుతూ భిక్షాటన చేస్తున్న వృద్ధుడు ఇల్లెందురూరల్: మండలంలోని కరెంటాఫీసు ఏరియాలో కొంతకాలంగా గుగులోత్ దేవ్లా రోడ్డుపై పాకుతూ భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మండలంలోని వేపగలగడ్డ తండాకు చెందిన దేవ్లా బార్య నీలా, కుమారుడు రవి ఇరువురు మృతి చెందడంతో ప్రస్తుతం అతను ఎవరూ లేని అనాథ అయ్యాడు. నడవలేని స్థితిలో ఉన్న ఇతడికి సొంత ఇల్లు కూడా లేదు. ఎవరైనా ఆదరిస్తారన్న ఆశతో బతుకు ఈడుస్తున్న ఈ వృద్ధుడు కరెంటాఫీసు ఏరియాలో చలికి వణుకుతూ భిక్షాటన చేస్తున్నాడు. రెండు కాళ్లు చచ్చుబడిన ఇతడికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వికలాంగుల ధ్రువీకరణ పత్రం ఇప్పించి పింఛన్ మంజూరు చేయించాలని స్థానికులు కోరుతున్నారు. 28న కవయిత్రి ఓల్గాకు పౌరసన్మానంఖమ్మం మామిళ్లగూడెం: ప్రముఖ కవయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఓల్గాకు ఈనెల 28న పౌరసన్మానం ఏర్పాటుచేసినట్లు స్వేఛ్ఛావరణం నిర్వాహకురాలు సుమ తి తెలిపారు. ఖమ్మంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ వేదిక ఫంక్షన్ హాల్లో జరిగే సన్మానంలో ప్రముఖ సాహితీ వేత్తలు మృణాళి ని, కాత్యాయని విద్మహే, ప్రతిమ, పాటిబండ్ల రజని తదితరులు హాజరవుతారని వెల్లడించా రు. తొలుత ‘ఓల్గా తీరం’ పుస్తకాన్ని ఆవిష్కరించనుండగా, ఆమెరచనలపై ఎగ్జిబిషన్ ఉంటుందని, నృత్యరూపకాన్ని కూడా ప్రదర్శించనునట్లు తెలిపారు. ఇప్పటికే ఓల్గా రచనలపై నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందచేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో రచయిత్రి వురిమళ్ల సునంద పాల్గొన్నారు. గడ్డ కట్టిన సిమెంట్ పాల్వంచరూరల్: నాలుగు, ఐదు నెలల కిందట జీపీ భవనం స్లాబ్‌కు వినియోగించిన సిమెంట్ గడ్డగట్టింది. మండలంలోని దంతలబోరు ఎస్సీకాలనీ జీపీ భవన నిర్మాణం కోసం తెప్పించిన సిమెంట్‌ను స్లాబ్‌కు కొంత వినియోగించగా మిగిలినదానిని వదిలేశారు. దీంతో సిమెంట్ బస్తాలు పూర్తిగా గడ్డకట్టిపోయాయి. ఏఈ శ్రీకాంత్‌ను వివరణ కోరగా భవన నిర్మాణం తర్వాత మిగిలిన సిమెంట్ బస్తాలు అక్కడే ఉంచడంతో గడ్డకట్టాయని నష్టం కాంట్రాక్టరే భరిస్తాడన్నారు. -
పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తాం
‘కిన్నెరసాని వాక్’లో కలెక్టర్ జితేష్ వి.పాటిల్ గుండాల: కిన్నెరసాని నది, ఏరు పరీవాహక ప్రాంతాల సహజ సౌందర్యాన్ని కాపాడుతూ పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ వెల్లడించారు. ఏరు –2025 ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఆయన ఆళ్లపల్లి మండలం రాయిపాడు కిన్నెరసాని నదిలో నిర్వహించిన ‘కిన్నెరసాని వాక్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి కిన్నెరసాని వాగులో పూజలు చేసి, ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆహ్లాదకర వాతావరణంలో నడిచారు. అనంతరం ఇసుక తిన్నెలపై ఏర్పాటు చేసిన సమావేశంలో నదులు, ఏరుల ప్రాముఖ్యతను వివరించారు. రాయిపాడు కిన్నెరసాని వాగును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తే వేసవిలో విద్యార్థులకు, పర్యాటకులకు ఆకర్షణగా నిలుస్తుందని అన్నారు. కార్యక్రమంలో ట్రెయినీ ఐఏఎస్ సౌరభ్‌శర్మ, డీవైఎస్ఓ పరంధామరెడ్డి, తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్, ఎంపీడీఓ శ్రీను, ఎంఈఓ శాంతారావు, సర్పంచ్ చిన్నపాపయ్య, రేవంత్, కృష్ణయ్య, వరుణ్ పాల్గొన్నారు. 15 రోజుల్లో భూసేకరణ చేయాలి.. సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ, డేటా మ్యాపింగ్ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ, సీతమ్మసాగర్ ప్రాజెక్టు భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. ఓటరు జాబితాలో ఉన్న డూప్లికేట్ ఎంట్రీలు, బ్లర్ ఫొటోలు, ఇతర లోపాలను గుర్తించి నిబంధనల ప్రకారం సరిచేయాలని సూచించారు. ఏఈఆర్ఓలు తమ పరిధిలోని బీఎల్ఓలకు లక్ష్యాలు నిర్దేశించాలని, మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. తహసీల్దార్లు బుధవారం ఎక్కువ, తక్కువ ఓటర్లు గల పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఏమైనా ఇబ్బందులొస్తే ఉన్నతాధికారులకు తెలియజేయాలన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు సంబంధించిన భూసేకరణను 15 రోజుల్లోగా పూర్తి చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. అన్నపురెడ్డిపల్లి, బూర్గంపాడు, అశ్వాపురం, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, జూలూరుపాడు, కొత్తగూడెం, ములకలపల్లి, పాల్వంచ, సుజాతనగర్ మండలాల్లో అవసరమైన భూసేకరణ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు మండలాల్లోని 30 గ్రామాల్లో భూసేకరణ వేగవంతం చేయాలన్నారు. సమావేశంలో ఎస్డీసీ కాశయ్య, ఎన్నికల సూపరింటెండెంట్ రంగాప్రసాద్, భూసేకరణ సిబ్బంది యాసిన్, ఎన్నికల శిక్షకుడు సాయికృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
బలమైన శక్తిగా కాంగ్రెస్
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైన శక్తిగా ఎదుగుతోందని, తమ పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథ్ తెలిపారు. కొత్తగూడెంలో మంగళవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమష్టి కృషితో జిల్లాలో పార్టీని మరింతగా బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీ మద్దతుతో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని చెప్పడానికి డీసీసీ పదవుల్లో వారికి ప్రాధాన్యత కల్పించడమే నిదర్శనమన్నారు. పార్టీ కోసం కష్టపడే పనిచేసే వారికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలోనే పెద్దదైన భద్రాద్రి జిల్లాకు కూడా మహిళా అధ్యక్షురాలినే నియమించామని గుర్తు చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చాలని మోడీ ప్రభుత్వం చేసే కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ దురాగతాలకు బలైన నాయకుల పేర్లను మార్చాలని చూడడం దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు. సమావేశంలో అశ్వారావుపేట, ఇల్లెందు, పినపాక ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు నాగ సీతారాములు, మోత్కూరి ధర్మారావు, డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ జె.బి. శౌరి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు చీకటి కార్తీక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాఽథ్ -
26న డాక్ అదాలత్
ఖమ్మంగాంధీచౌక్: తపాలా సేవలకు సంబంధించి సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26వ తేదీన ఆన్లైన్ విధానంలో డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి తెలిపారు. కోర్టులో ఉన్న అంశాలు మినహా ఉద్యోగులకు సంబంధించిన అంశాలు, సేవలు, పెండింగ్ అంశాల పై ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు. ఈమేర కు ఫిర్యాదులను 25వ తేదీలోగా ‘డాక్ అదాల త్, సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీస్, ఖమ్మం డివిజన్ – 507003’ చిరునామాకు పంపించాలని తెలిపారు. ఫిర్యాదుపై ఫోన్‌నంబర్ లేదా ఈ మెయిల్ పొందుపర్చాలని సూచించారు. -
సీహెచ్‌పీ ‘ప్రైవేట్’పరం
● టెండర్లలో దక్కించుకున్న ‘ఇనార్గో’ ● ఇప్పటికే ఉద్యోగ నియామకాలు కూడా.. ● ఆందోళన బాటలో సింగరేణి కార్మిక సంఘాలుసత్తుపల్లి: సింగరేణి సంస్థలో అత్యంత నాణ్యమైన బొగ్గు వెలికితీస్తున్న సత్తుపల్లి పరిధిలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్(సీహెచ్‌పీ)ను ప్రైవేట్ పరం చేయడంపై కార్మికులు, సంఘాల నాయకులు మండిపడుతున్నారు. సంస్థ చరిత్రలోనే తొలిసారి ఆరు కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ప్లాంట్ నిర్వహణకు టెండర్లు పిలవగా ఇప్పటికే ఇనార్గో కంపెనీ చేజిక్కించుకుంది. అంతేకాక సంస్థ బాధ్యులు ఉద్యోగ నియామకాల ప్రక్రియ కూడా మొదలుపెట్టడం గమనార్హం. కానీ టెండర్ల కనీస సమాచారం బయటకు పొక్కకుండా సింగరేణి యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక అద్భుతమని.. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్‌ను రాంచీలోని సెంట్రల్ మైన్స్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇన్స్టిట్యూట్ సహకారంతో రూ.398 కోట్ల వ్యయంతో బొగ్గు లోడింగ్ కోసం సత్తుపల్లి మండలం కిష్టారంలో నిర్మించారు. కోల్‌మైన్ ఇండియాకే పరిమితమైన ఇలాంటి ప్లాంట్‌ను తొలిసారి సింగరేని పరిధిలో నిర్మించగా 2022 మే 28 నుంచి రోజుకు 7 – 8 రేక్‌ల ద్వారా సుమారు 30 వేల నుండి 35 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు రవాణా జరుగుతోంది. అయితే, ప్లాంట్ బంకర్లో ఏడాదిన్నర క్రితం పగుళ్లు రావటంతో పరిశీలన కోసం యాజమాన్యం కమిటీలను నియమించింది. నిర్మించిన సమంతా కంపెనీ నుంచే మరమ్మతుల ఖర్చులు రాబడతామని అధికారులు చెబుతున్నా.. కార్యాచరణ అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. అయితే, బంకర్లను మరమ్మతు చేయించి ప్రైవేట్ సంస్థకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు చెబుతున్న అధికారులు, మరమ్మతులు ఎవరు చేపడుతారో స్పష్టత ఇవ్వడం లేదు. బదిలీలు తప్పవా? జేవీఆర్ ఓసీకి అనుసంధానంగా పనిచేస్తున్న సీహెచ్‌పీలో 340 మంది సింగరేణి కార్మికులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం దీన్ని ప్రైవేట్‌పరం చేయడంతో ఇంజనీరింగ్, టెక్నికల్ సిబ్బంది తప్ప మిగిలిన వారిని ప్రైవేట్ సంస్థే సమకూర్చుకుంటుంది. దీంతో ఇక్కడ కార్మికుల్లో కొందరిని జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలో సర్దుబాటు చేశాక మిగిలిన వారి బదిలీ తప్పదనే చర్చ జరుగుతోంది. సమ్మెకు వెనుకాడం సీహెచ్‌పీని ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవడమే సంస్థే నిర్వహించాలని హెచ్ఎంఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇందుకోసం ఆందోళనలు చేపట్టడంతో పాటుఅవసరమతే సమ్మెకు వెనుకాడేదని లేదని తెలిపారు. ఈమేరకు సంఘం నాయకులు సోమవారం సత్తుపల్లి జీఎం చింతల శ్రీనివాస్‌కు లేఖ అందజేశారు. ప్రైవేట్ సంస్థలు లాభాపేక్షతో పని చేస్తాయని.. అవగాహన లేని కార్మికులను నియమిస్తే ప్రమాదాలకు అస్కారం ఉంటుందని తెలిపారు. అదే తరహాలో.. సీహెచ్‌పీ నిర్మాణ సమయాన ప్రజామోదం కోసం గ్రామసభ నిర్వహించని అధికారులు ఇప్పుడూ అదే తరహాలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నా యి. సైలో బంకర్ నిర్మాణ సమయంలో దుమ్ముదూళిపై ఎలాంటి అవగాహన కల్పించకపోవడంతో కిష్టారం అంబేద్కర్ కాలనీ వాసులు పలువురు శ్వాసకోశ వ్యాధులతో మృత్యువాత పడ్డారు. అంతేకాక నెలల తరబడి ఆందోళనలు చేసినా పట్టించుకోని అధికారులకు ప్రైవేట్ పరం చేసే హక్కు ఎక్కడిదని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సీహెచ్‌పీని నిర్వహణ ప్రైవేట్ సంస్థకు అప్పగించాం. అయినా టెక్నికల్, ఇంజనీరింగ్ సిబ్బంది సింగరేణి ఉద్యోగులే ఉంటారు. అదనంగా ఉన్న కార్మికులను ఇతర ఓసీల్లో సర్దుబాటు చేస్తాం. ఇందుకోసం డిప్యూటేషన్‌పై వచ్చిన వారిని తిరిగి పంపిస్తాం. పగుళ్ల విషయంలో సమంతా సంస్థ నుంచి జరిమానా వసూళ్లకు అధికారులు చర్యలు చేపట్టారు. – చింతల శ్రీనివాసరావు, సత్తుపల్లి ఏరియా జీఎం -
సింగరేణి పవర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బ్రిటిష్ అధికారులు ఇల్లెందు సమీపంలో 1871లో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. తొలి గని 1889లో ప్రారంభమైంది. క్రమంగా కార్మిక హక్కులను గరిష్ట స్థాయిలో అమలు చేసే సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 1990వ దశకంలో అయితే ఏకంగా లక్షా ఇరవై వేల మందికి ఉపాధి కల్పించే సంస్థగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత నిర్వహణ లోపాలతో నష్టాల బాట పట్టింది. అయితే, మళ్లీ పుంజుకుని కార్మికులకు లాభాలు అందించే స్థాయికి సంస్థ ఎదిగింది. వందేళ్లకు పైగా బొగ్గు ఉత్పత్తికే పరిమితమైన సంస్థ క్రమంగా ఇతర రంగాలపైనా దృష్టి సారించింది. పవర్ సెక్టార్లో దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే బొగ్గులో సింగరేణి వాటా పది శాతమే. కానీ కోలిండియా చేయలేని సాహసాన్ని సింగరేణి తలకెత్తుకుంది. అందులో భాగంగా 2011లో మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద 1,200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం మొదలెట్టింది. ఈ ప్లాంట్ నుంచి 2016లో విద్యుత్ ఉత్పత్తి మొదలైన తర్వాత అనేక రికార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఇక్కడే మరో 800 మెగావాట్ల ప్లాంట్‌ను నిర్మించనున్నారు. దీంతో పాటు ఒడిశాలోని నైనీ వద్ద 2,400 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మాణం ప్రతిపాదన దశలో ఉంది. రాజస్థాన్‌లో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంట్ నిర్మాణానికీ సన్నాహాలు జరుగుతున్నాయి. గ్రీన్ ఎనర్జీలో గడిచిన పదేళ్లుగా సోలార్ విద్యుత్ ప్లాంట్లను సింగరేణి స్థాపిస్తోంది. ప్రస్తుతం సోలార్ విద్యుత్ సామర్థ్యం 240 మెగావాట్లుగా ఉంది. అతి త్వరలోనే ఇది 540 మెగావాట్లకు చేరుకోనుంది. దీంతో జీరో నెట్ సంస్థగా సింగరేణి గుర్తింపు పొందనుంది. సోలార్ రంగంలో వచ్చిన విజయాలతో పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ స్టోరేజీ పవర్ సెక్టార్‌లోకి అడుగు పెడుతోంది. ఈ ఉత్సాహంతోనే రాజస్థాన్(1,500 మెగావాట్లు), ఒడిశా(2,500 మెగావాట్లు)ల్లో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా సింగరేణి అడుగులు వేస్తోంది. కార్మిక, సామాజిక బాధ్యత కార్మిక సంక్షేమం కోసం ప్రత్యేకంగా ఎడ్యుకేషన్ సొసైటీని సింగరేణి నిర్వహిస్తోంది. దీని ఆధ్వర్యంలో స్కూళ్లు, కాలేజీలు ఉన్నాయి. ఇటీవల సెంట్రల్ సిలబస్ కూడా ప్రవేశపెట్టారు. గోదావరిఖని, కొత్తగూడెంలో ప్రధాన ఆస్పత్రులు ఉన్నాయి. సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. రామగుండం మెడికల్ కాలేజీకి ఆర్థిక సాయం అందించింది. సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు రాజీవ్ అభయహస్తం ద్వారా తన వంతు చేయూతను అందిస్తోంది. ఖ్వాజా హయాం నుంచి.. స్వాతంత్య్రానికి పూర్వమే నైజాం జమానాలో బ్రిటీషర్లు ఇల్లెందులో బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. హైదరాబాద్ (దక్కన్) కంపెనీ లిమిటెడ్ పేరుతో 1889లో బొగ్గు తవ్వకాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1920 డిసెంబర్ 23న కంపెనీ పేరును సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌గా మార్చారు. కాగా 2002లో అప్పటి సింగరేణి సీఎండీ ఖ్వాజా డిసెంబర్ 23న సింగరేణి డేగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ప్రతీ సంవత్సరం డిసెంబర్ 23న సింగరేణి డే నిర్వహిస్తున్నారు. అయితే, ఈసారి వేడుకలకు బడ్జెట్ తగ్గించడం, ప్రకాశం స్టేడియంలో ఉత్సవాలు నిర్వహించకపోవడం పట్ల కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి వెళ్లిన తొలి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణి ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్లోనూ తన ముద్ర వేసే పనిలో ఉంది. సింగరేణి బొగ్గు గనుల్లో వచ్చే ఓవర్ బర్డెన్ (ఓబీ), థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే బాటమ్ యాష్లలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉన్నట్టుగా గుర్తించారు. వీటిపై చేపట్టిన ప్రయోగాలు చివరి దశకు వచ్చాయి. దీంతో పాటు అసోంలో గ్రాఫైట్, కర్ణాటకలో రాగి, బంగారం ఎక్స్ప్లోరేషన్లోనూ సింగరేణి అడుగు పెట్టింది. లాటిన్ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో విస్తరించే దిశగా ఆలోచనలు సాగుతున్నాయి. -
కొలువుదీరిన పాలకవర్గాలు
● కోలాహలంగా ప్రమాణ స్వీకార వేడుకలు ● సర్పంచ్‌లుగా 468 మంది బాధ్యతల స్వీకరణ ● 4,148 మంది వార్డు సభ్యులు కూడా.. చుంచుపల్లి : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులతో ఆయా గ్రామాల కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు సైతం పదవీ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో 471 పంచాయతీలు, 4,168 వార్డులకు గాను మూడు సర్పంచ్ స్థానాలు, 20 వార్డులకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. మిగిలిన 468 మంది సర్పంచ్‌లు, 4,148 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అసౌకర్యాల నడుమ.. చిన్న పంచాయతీల్లో ప్రమాణ స్వీకార వేడుకలు ఇరుకు గదుల్లోనే కొనసాగాయి. అనేక చోట్ల ఆరు బయట చెట్ల కింద, ప్రభుత్వ పాఠశాలలు, ఇతర భవనాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రమాణ స్వీకారం అనంతరం నూతన పాలక మండలి సభ్యులను ఘనంగా సన్మానించారు. జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన వారిలో 425 మంది సర్పంచ్‌లు కొత్తగా ఎన్నికై న వారే కావడం గమనార్హం. రిజర్వేషన్లు తారుమారు కావడంతో ఎక్కువ మంది కొత్తవారే బరిలో నిలిచి గెలుపొందారు. గతంలో పురుషులు ఉన్న చోట రిజర్వేషన్ ఈసారి మహిళలకు కలిసి రావడంతో చాలా మంది వారి భార్యలతో పోటీ చేయించి గెలిపించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 60 శాతం మంది మహిళలు సర్పంచ్‌లుగా కొలువుదీరడం విశేషం. ఇక ఈసారి సర్పంచ్‌లుగా గెలిచిన వారిలో ఎక్కువ మంది 35 ఏళ్ల లోపే వారే ఉన్నారు. వీరిలో పలువురు డిగ్రీ, ఆపై విద్యార్హతలు గల వారు ఉన్నారు. జిల్లాలో 468 మంది సర్పంచ్‌లకు గాను 266 మంది మహిళలు, వీరిలో 35 ఏళ్లలోపు వారు 197 మంది ఉన్నారని అధికారులు వెల్లడించారు. భద్రాచలంఅర్బన్ : భద్రాచలం మేజర్ గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సం వైభవంగా సాగింది. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య హాజరు కాగా, ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సర్పంచ్ పూనెం కృష్ణతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ తర్వాత వార్డు సభ్యులతో గ్రామ పంచాయతీ ఈఓ శ్రీనివాసరావు ప్రమాణం చేయించారు. నూతన పాలకవర్గాన్ని ఎమ్మెల్యే తదితరులు ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ కృష్ణ ఆధ్వర్యంలో సాధారణ సమావేశం నిర్వహించి, భద్రాచలంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కాగా, భద్రాచలంలో ఎనిమిదేళ్ల తర్వాత పంచాయతీ పాలకవర్గం కొలువుదీరడం గమనార్హం. తెలంగాణ ఆవిర్భావానికి ముందు 2013లో ఎన్నికలు జరగగా, 2018లో ఆ పాలకవర్గ పదవీ కాలం ముగిసింది. ఆ తర్వాత మున్సిపాలిటీగా మారుతుందని కొన్ని రోజులు, మూడు పంచాయతీలుగా విభజన జరుగుతుందని కొంత కాలం ఎన్నికలు నిర్వహించలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక భద్రాచలాన్ని తిరిగి ఒకే గ్రామ పంచాయతీగా చట్ట సవరణ చేయడం, ఆ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమం అయింది. -
లోక్ అదాలత్‌లో 4,598 కేసుల పరిష్కారం
సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయ మెగా లోక్ అదాలత్‌లో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 4,598 కేసులు పరిష్కారం అయ్యాయని ఎస్పీ రోహిత్‌రాజ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో క్యాలెండర్ కేసులు 383, డ్రంక్ అండ్ డ్రైవ్ 3,098, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘన, ఈ–పిటీ కేసులు 1,117 ఉన్నాయని వివరించారు. పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది గత వారం రోజులుగా కక్షిదారులను కలిసి రాజీమార్గమే మేలని, లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం అందుతుందని అవగాహన కల్పించిన ఫలితంగానే కేసులు పరిష్కారం అయ్యాయని వివరించారు. ఈ మేరకు కృషి చేసిన పోలీస్ అధికారులను, సిబ్బందిని అభినందించారు. వారికి తగిన రివార్డులు అందజేస్తామని తెలిపారు. జిల్లాలో నమోదైన 71 సైబర్ క్రైమ్ కేసులు పరిష్కరించామని, నగదు కోల్పోయిన బాధితులకు రూ.15,86,229 కోర్టు ద్వారా అందజేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీలో డీఎంల బదిలీ ఖమ్మంమయూరిసెంటర్: టీజీఎస్ ఆర్టీసీలో పలువురు డిపో మేనేజర్లను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఖమ్మం రీజియన్‌లో సత్తుపల్లి డిపో మేనేజర్ వి.సునీత సూర్యాపేటకు, సూర్యాపేట డీఎం జీ.ఎల్.నారాయణ సత్తుపల్లికి బదిలీ అయ్యారు. అలాగే, మధిర డిపో మేనేజర్ డి.శంకర్‌ను మియాపుర్ డిపో ఏడబ్ల్యూఎం, బీబీ యూగా బదిలీ చేశారు. అంతేకాక భద్రాచలంలో అసిస్టెంట్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.రామయ్యకు డిపో మేనేజర్‌గా పదోన్నతి కల్పిస్తూ మధిర డీఎంగా నియమించారు. దరఖాస్తుల ఆహ్వానంరుద్రంపూర్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 32 స్పెషలిస్ట్ డాక్టర్ల పోస్టుల (రెగ్యులర్ బేసిస్) నియామకానికి యాజమాన్యం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 22 నుంచి జనవరి 3వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించి, జనవరి 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. జనరల్ సర్జన్–4, గైనకాలజిస్ట్–7, అనస్తీషియా–7, పిల్లల వైద్యులు–4, చెస్ట్ ఫిజీషియన్–3, ఈఎన్టీ సర్జన్–2, పాథాలజిస్ట్–1, హెల్త్ ఆఫీసర్–3 పోస్టులు ఉన్నట్లు వివరించింది. స్వర్ణోత్సవాలకు రండి..పాల్వంచరూరల్ : ఈనెల 28న నిర్వహించే కిన్నెరసాని గురుకుల స్వర్ణోత్సవాలకు హాజరుకావాలని ఎస్పీ రోహిత్‌రాజ్, ట్రెయినీ కలెక్టర్ సౌరభ్శర్మను కళాశాల ప్రిన్సిపాల్ రమేష్, పూర్వ విద్యార్థులు సోమవారం ఆహ్వానించారు. గిరిజన బాలుర గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నామని, ఈ క్రమంలో 26వ తేదీన పూర్వ విద్యార్థుల ర్యాలీ ఉంటుందని, అందుకు అనుమతించాలని కోరారు. కాగా, వేడుకలకు హాజరయ్యేందుకు ఎస్పీ, ట్రెయినీ కలెక్టర్ సుముఖత వ్యక్తం చేశారని ప్రిన్సిపాల్ తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రమేష్ రాథోడ్, కుంజా రాజేష్, దారావత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. -
పూరిల్లు దగ్ధం
అశ్వాపురం: మండల పరిధిలోని చింతిర్యాల కాలనీలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో దామెర్ల రాజా పూరి ల్లు దగ్ధమైంది. అర్ధరాత్రి దాటాక ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లో నిద్రిస్తున్న కుటంబ సభ్యులు మేల్కొని బయటకు రాగా, పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తుండగా ఇటీవల బిల్లు మంజూరు కావడంతో ఇంట్లో బీరువాలో ఉన్న సుమారు రూ. లక్ష నగదు, సామాన్లు, బట్టలు పూర్తిగా కాలిపోయాయి. కాగా బాధిత కుటుంబానికి దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్, శివకామేశ్వరి గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు బట్టలు, గిన్నెలు, నిత్యావసర వస్తువులు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొర్సా అలివేలు, ఉపసర్పంచ్ ఎన్నా అశోక్‌కుమార్, మాజీ జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు షర్పియుద్దిన్, కొర్లకుంట రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి ఆత్మహత్యఇల్లెందురూరల్: మండలంలోని మామిడిగూడెం గ్రామపంచాయతీ చింతలబోడు గ్రామానికి చెందిన బిజ్జ కనకరాజు (35) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టభద్రుడైన కనకరాజు వార్డెన్ ఉద్యోగం కోసం పరీక్ష రాసేందుకు సన్నద్ధమై ఈ నెల 20న ఇంటి నుంచి బయలుదేరి గ్రామశివారులోని అడవిలో పురుగుల మందు తాగాడు. అటుగా వెళ్లిన గ్రామస్తులు కనకరాజును గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య కృష్ణవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ సురేష్ సోమవారం తెలిపారు. మద్యం తాగొద్దన్నందుకు.. సత్తుపల్లిరూరల్: మద్యానికి బానిసైన ఓ వ్యక్తిని కుటుంబ సభ్యులు మందలించడంతో ఉరి వేసుకుని ఆత్మహ త్య చేసుకున్నాడు. సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామానికి చెందిన వాసం ఆదినారాయణ(55) ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తూ తరచూ మద్యం సేవించేవాడు. మద్యం అలవాటుతో డబ్బు వృథా చేస్తున్నావని కుటుంబ సభ్యులు మందలించటంతో సోమవారం ఉదయం భార్య నిర్మల, కొడుకు వెంకటప్పయ్య కూలి పనులకు వెళ్లాక గది తలుపులు పెట్టుకుని ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. ఇంటికి వచ్చాక కుటుంబీకులు ఈ విషయాన్ని గుర్తించారు. ఘటనపై ఆదినారాయణ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.చెల్లని చెక్కు కేసులో ఏడాది జైలుశిక్ష ఖమ్మం లీగల్: అప్పు చెల్లించే క్రమాన ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో ఓ మహిళకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ ఖమ్మం రెండో అదనపు ప్రథమ శ్రేణి కోర్టు న్యాయాధికారి ఏపూరి బిందుప్రియ సోమవారం తీర్పు చెప్పారు. భద్రాద్రి జిల్లా బూర్గంపాడుకు చెందిన మంగిపుడి నాగమణి వద్ద అదే గ్రామానికి చెందిన బార్ల రత్నకుమారి 2020 మే నెలలో రూ.5లక్షల అప్పు తీసుకుంది. తిరిగి 2021 సెప్టెంబర్‌లో చెక్కు జారీ చేసినా ఆమె ఖాతాలో సరిపడా నగదు లేక తిరస్కరణకు గురైంది. దీంతో నాగమణి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేసి కోర్టులో ప్రైవేట్ కేసు దాఖలు చేసింది. విచారణ అనంతరం రత్నకుమారికి జైలుశిక్ష విధించడమే కాక ఫిర్యాదికి రూ.5లక్షలు చెల్లంచాలని న్యాయాధికారి తీర్పు చెప్పారు. -
అర్హులైన గిరిజనులకు ప్రభుత్వ ఫలాలు
భద్రాచలం: ఏజెన్సీలోని అర్హులైన గిరిజనులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. తన చాంబర్లో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వినతులు స్వీకరించి, పరిష్కారానికి సంబంధిత అధికారులకు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గిరిజన నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షల నిమిత్తం ఐటీడీఏ అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు, నిరుద్యోగులు ఉద్యోగాలపై ఆధారపడకుండా స్వయం ఉపాధి రంగాల వైపు దృష్టి సారించాలని అన్నారు. దీనికి తమ సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ అశోక్, ఈఈ మధుకర్, అధికారులు లక్ష్మీనారాయణ, వేణు, ఉదయ్‌కుమార్, ఆదినారాయణ, అనసూయ పాల్గొన్నారు. ఉమ్మడి ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం.. గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2026 – 27 సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పీఓ రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను టీజీ గురుకుల వైబ్సైట్లో జనవరి 21లోపు అప్లోడ్ చేయాలని, వివరాలకు సమీప గురుకులాల్లో సంప్రదించాలని సూచించారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు
భద్రాచలంఅర్బన్: ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. కొత్తగూడెం గణేష్ టెంపుల్ ఏరియాకు చెందిన బిశాల్ తమంగ్ కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ నెల 9న కత్తితో గొంతు కోసుకోగా, పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో డీసీహెచ్ రవిబాబు, జనరల్ సర్జన్ సోమరాజు దొర శస్త్రచికిత్స జరిపారు. అనంతరం భద్రాచలం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించి, సోమవారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యులను అభినందించేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్‌తోపాటు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మాట్లాడారు. ప్రభుత్వాస్పత్రుల్లో కార్పొరేట్‌స్థాయి వైద్య సేవలు అందుతున్నాయనడానికి ఈ శస్త్రచికిత్సే నిదర్శమని అన్నారు. బాధితుడికి సేవలందించి పాల్వంచ, భద్రాచలం ఆస్పత్రుల వైద్యులను, డీసీహెచ్ రవిబాబును అభినందించారు. భద్రాచలం ఆస్పత్రిలో సీటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ యంత్రాలను అందుబాటులోకి తెస్తామన్నారు. అనంతరం పాల్వంచ, భద్రాచలం వైద్యులను బాధితుడు బిశాల్ తమంగ్ దంపతులు శాలువాతో ఘనంగా సత్కరించారు. వైద్యాధికారులు రామ కృష్ణ, రాంప్రసాద్, రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ జితేష్ వి.పాటిల్. -
పంచాయతీ కార్మికుడు మృతి
గుండాల: వ్యక్తిగత పనిపై వెళ్లిన గ్రామ పంచాయతీ కార్మికుడు సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు, స్థానికుల కథనం ప్రకారం.. లూనావత్ దేవేందర్(35) ఏడేళ్లుగా గుండాల గ్రామ పంచాయతీలో అవుట్ సోర్సింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నారు. విధుల్లో అలసత్వం వహించడంతో రెండు నెలల నుంచి విధులకు దూరంగా ఉంటున్నాడు. సోమవారం ప్రమాణ స్వీకారం పూర్తవగానే నూతన పాలకవర్గాన్ని కలసి విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. అనంతరం పాలకవర్గం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి వెళ్లాడు. ఆ పరిసరాల్లోనే రోడ్డు పక్కన విగత జీవిగా కనిపించాడు. మృతుడికి శరీరంపై తీవ్రమైన గాయాలు ఉన్నాయని, ఎవరో హత్య చేసి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు గుండాల ఎస్సై సైదా రవూఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ .. పాల్వంచరూరల్: పురుగుల మందు తాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆటో డ్రైవర్ సోమవారం మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని పుల్లాయిగూడెం గ్రామానికి చెందిన కోండ్రు భదయ్య(46) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొద్ది రోజులుగా అధికంగా మద్యం తాగుతుండటంతో కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో ఆదివారం ఇంట్లోనే పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోగా కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి కుమారుడు ప్రదీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు.మృతిపై అనుమానాలు -
అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉండాలి
బూర్గంపాడు: ప్రకృతి వైపరీత్యాలు, విపత్తుల వంటి అత్యవసర సమయాల్లో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్‌రాజ్ అన్నారు. బూర్గంపాడులో సోమవారం నిర్వహించిన మాక్ డ్రిల్‌లో వారు మాట్లాడుతూ.. అప్రమత్తంగా ఉంటే నష్టాలను నివారించవచ్చన్నారు. విపత్తుల సమయంలో యువత, విద్యార్థులు, అధికారులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని, తరచూ వరద ముంపునకు గురయ్యే బూర్గంపాడు మండల ప్రజలకు ఇలాంటి మాక్ డ్రిల్లు ఎంతో అవసరమని అన్నారు. విపత్తుల సమయంలో అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. ఆ తర్వాత అంబేడ్కర్ కాలనీలో నిర్వహించిన మాక్‌డ్రిల్‌లో లైఫ్ జాకెట్లు, బోట్ల వినియోగంపై అవగాహన కల్పించారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు, వైద్యసేవలు, తాగునీటి సరఫరా, భోజన వసతి వంటి సేవలను డెమో రూపంలో ప్రదర్శించారు. కార్యక్రమంలో భద్రాచలం సబ్ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, ఎన్డీఆర్ఎఫ్ అధికారి శ్రీనయ్య పాల్గొన్నారు. చిన్ననాటి నుంచే మొక్కలు పెంచాలిచండ్రుగొండ : ప్రతీ ఒక్కరు చిన్న నాటి నుంచే మొక్కలు పెంచడంతోపాటు వాటి ప్రాముఖ్యతను తెలుసుకోవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మండలంలోని బెండాలపాడు గ్రామ శివారులో ఉన్న కనకగిరి గుట్టల ప్రాంతాన్ని సోమవారం ఆయన వివిధ కళాశాలల స్కౌట్ విద్యార్థులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అడవుల పెంపకంతో పాటు వాటి అవశ్యకత తెలుసుకోకుంటే భవిష్యత్‌లో ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని హెచ్చరించారు. ఈ అంశంపై ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. విపత్తుల నివారణ మాక్‌డ్రిల్‌లో కలెక్టర్, ఎస్పీ -
‘కుష్ఠు’ సర్వే వేగవంతం చేయాలి
● డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ బూర్గంపాడు: కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వేను వేగవంతం చేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. బూర్గంపాడు, గౌతమీపురం గ్రామాల్లో నిర్వహిస్తున్న సర్వేను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యాధిగ్రస్తుల పూర్తి వివరాలు నమో దు చేయాలని సిబ్బందికి సూచించారు. అనంతరం బూర్గంపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విపత్తుల నివారణ మాక్‌డ్రిల్‌లో వైద్యారోగ్యశాఖ ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించారు. ప్రాణాపాయ స్థితిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీధర్, అడిషనల్ డీఎంహెచ్ఓ సైదులు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నికసూపర్బజార్(కొత్తగూడెం): రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఈజీఆర్ జాన్‌వెస్లీ, జనరల్ సెక్రటరీగా ఎం.కోటేశ్వరరావు, ఫైనాన్స్ సెక్రటరీగా ఎస్కే గులాం అహ్మద్, అసోసియేట్ అధ్యక్షుడిగా కె.రాంబాబు, వైస్ ప్రెసిడెంట్లుగా భాస్కర్, రాయలింగు, సీహెచ్‌ఎంఎం భానుమతి, సెక్రటరీలుగా బి.కేశవరావు, కె.నాగయ్య, జాయింట్ సెక్రటరీలుగా సారయ్య, సీహెచ్ కాంతారావులతో మరికొందరు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జి.దామోదర్‌రెడ్డి పర్యవేక్షించగా, వెంకటరెడ్డి, శ్రీశైలం పాల్గొన్నారు. టీపీసీసీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్‌గా పడిసిరిభద్రాచలంటౌన్: టీపీసీసీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్‌గా సీనియర్ న్యాయవాది పడిసిరి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పార్టీ బలోపేతానికి, న్యాయవాదుల సంక్షేమానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా శ్రీనివాసరావు తెలిపారు. కార్పొరేట్లో ఉత్తమ ఉద్యోగుల ఎంపికకొత్తగూడెఅర్బన్: సింగరేణి ఆవిర్భావ దినోత్స వం సందర్భంగా కార్పొరేట్ ఏరియాలో ఉత్తమ ఉద్యోగులను ఎంపిక చేశారు. ఎక్స్‌ప్లోరేషన్ జీఎం బి. శ్రీనివాసరావును, ప్రధాన ఆస్పత్రి సీనియర్ టెక్నీషియన్ కే.వేంకటేశ్వర ప్రసాద్, సెంట్రల్ వర్క్‌షాపు ఫిట్టర్ డీవీవీ నాగేంద్రప్రసాద్లన ఎంపిక చేయగా, వీరికి మంగళవారం కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయంలో బహుమతులు ప్రదానం చేయనున్నారు. నేడు కాంగ్రెస్ సమావేశం కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం క్లబ్లో మంగళవారం కాంగ్రెస్ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశానికి ఖమ్మం–భద్రాద్రి కొత్తగూడెం ఇన్‌చార్జ్‌లు, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్‌లు హాజరవుతారని పేర్కొన్నారు. జిల్లాలోని శాసనసభ్యులు, రాష్ట్ర, జిల్లా కార్పొరేషన్ చైర్మన్లు, పీసీసీ కమిటీ సభ్యులు, మండల, బ్లాక్, బూత్ స్థాయి నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, నూతనంగా ఎన్నికై న సర్పంచులు, వార్డు మెంబర్లు సమావేశానికి హాజరుకావాలని కోరారు. మహిళ అదృశ్యంఇల్లెందు: మహళ అదృశ్యంపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని కొత్తకాలనీకి చెందిన 48 ఏళ్ల బోల్ల అలివేలు ఈ నెల 18న ఖమ్మంలోని పుట్టింటికి బయల్దేరింది. కానీ అక్కడికి చేరుకోలేదు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంత కాలం క్రితం భర్త చనిపోయాడు. అప్పటి నుంచి మానసికంగా కుంగిపోయి, అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె కుమారుడు సంపత్ ఫిర్యాదుతో సీఐ టి. సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పశువులు స్వాధీనం అశ్వారావుపేటరూరల్: అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న పశువులను సోమవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. స్థానిక రింగ్ రోడ్ సెంటర్లో నిర్వహించిన తనిఖీల్లో ఏపీలోని ఆలమంద సంత నుంచి వరంగల్ జిల్లా జనగామ వైపు వ్యాన్‌లో 13 ఆవులు తరలిస్తుండగా పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సరైన పత్రాలు లేకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని, ఇంకా కేసు నమోదు చేయలేదని ఎస్సై యయాతీ రాజు తెలిపారు. -
ప్రమాణంలో పదనిసలు
పాల్వంచరూరల్: పలు గ్రామ పంచాయతీలకు పక్కాభవనాలు లేని కారణంగా నూతన పాలకవర్గ స్వీకారమహోత్సవం పాఠశాల ప్రాంగణంలో, అద్దెభవనాల్లో నిర్వహించారు. దంతలబోరు ఎస్సీకాలనీ పంచాయతీలో స్కూల్ ప్రాంగణంలో, రెడ్డిగూడెంలో స్కూల్ వద్ద, నాగారం కాలనీ పంచాయతీ పాలకవర్గం అంగన్వాడీ కేంద్రం వద్ద ప్రమాణస్వీకారం చేశారు. నాగారంలో టెంట్ సరిపోకపోవడంతో పాలకవర్గ సభ్యులు, కార్యక్రమానికి వచ్చిన గ్రామస్తులు ఎండలో కూర్చువాల్సి వచ్చింది. కనీసం తాగునీరు సౌకర్యం కూడా కల్పించలేదు. కాగా దంతలబోరు ఎస్సీకాలనీ సర్పంచ్ సోడే వెంకటరమణ తన కుమారుడిని ఒడిలో కూర్చొబెట్టుకుని ప్రమాణస్వీకారం చేశారు.గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులు జిల్లావ్యాప్తంగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పలుచోట్ల దంపతులు, అన్నాచెల్లెళ్లు, బంధువులు ఒకే పాలకవర్గంలో కొలువుదీరారు. కొన్ని గ్రామాల్లో పంచాయతీలకు కార్యాలయాలు లేకపోవడంతో ప్రమాణ స్వీకార మహోత్సవానికి అవస్థలు ఎదురయ్యాయి. పాఠశాల, అంగన్వాడీ ప్రాంగణాల్లో, ఎండలోనే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో పాలకవర్గ సభ్యులతోపాటు హాజరైన ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామపంచాయతీ సర్పంచ్‌గా మడకం కుమారి, ఇదే పంచాయతీ 4వ వార్డు నుంచి ఆమె భర్త మడకం వీర్రాజు(ఆండ్రయ్య) గెలుపొందారు. వీరిద్దరు సోమవారం ఒకే వేదికపై ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు 1, 2, 9, 10వ వార్డుసభ్యులు సోయం ప్రసాద్, కుంజా స్వర్ణ, కుంజా రాంబాబు, పాయం జగధాంబ స్వగ్రామం నెమలిపేట కావడం విశేషం. ఇందులోనూ రాంబాబు, స్వర్ణ దంపతులు కావడంతో ఒకే పంచాయతీ పాలకవర్గంలో రెండు జంటలు ఉన్నట్లయింది.ఇల్లెందురూరల్: మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా ఆరెం ప్రియాంక సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఉపసర్పంచ్‌గా ఆమె పెదనాన్న కుమారుడు అరెం కిరణ్ బాధ్యతలు స్వీకరించారు. పదవులలో అన్నా, చెల్లెలు కొలువుదీరడంతో ఆ కుటుంబంలో ఆనందం నెలకొంది. -
వరాహ రూపంలో వరాల రామయ్య
● వాగ్గేయకార వంశీయుల ఆధ్వర్యంలో శోభాయాత్ర ● అధ్యయనోత్సవాలకు పోటెత్తిన భక్తజనం ● నేడు నరసింహావతారంలో స్వామివారుభద్రాచలం: లోకకంఠకుడైన హిరణ్యాక్షుడుని సంహరించి భూమిని తన కోరలతో పైకెత్తి లోకసంరక్షణ చేపట్టిన వరాహావతారంలో దర్శనమిచ్చిన రామయ్యకు భక్తులు నీరాజనం పలికారు. ‘వరాలు ఇచ్చే రామయ్య’ నామస్మరణలతో భద్రగిరి పులకించింది. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతుండగా.. పగల్ పత్తు ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారిని వరాహావతారంలో అలంకరించారు. తెల్లవారుజామున సుప్రభాత సేవ నిర్వహించి ఆరాధన, నివేదన సమర్పించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చి పూజలు చేశారు. ఆ తర్వాత వేద పండితులు దివ్య ప్రబంధాలు పఠించారు. అనంతరం గర్భగుడి నుంచి బేడా మండపానికి తీసుకొచ్చి ఆళ్వార్లతో సహా కొలువుదీర్చారు. వైభవంగా శోభాయాత్ర.. భద్రాచలం రామాలయానికి ఆధ్యులు, భక్త రామదాసుగా పిలిచే కంచర్ల గోపన్న, ఆలయ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన వాగ్గేయకారులు తూము నర్సింహదాసు వంశీయుల ఆధ్వర్యంలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. మంగళవాయిద్యాలు, భక్తుల కోలాహలం నడుమ స్వామివారిని పల్లకీ సేవగా మిథిలా స్టేడియం వేదికపైకి తీసుకొచ్చారు. భక్తుల సందర్శనాననంతరం తాతగుడి సెంటర్లోని గోవిందరాజస్వామి ఆలయం వరకు తిరువీధి సేవ సాగింది. నేడు నరసింహావతారం.. తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుని అనేక బాధలకు గురిచేస్తున్న హిరణ్యకశివుడు అనే రాక్షసుడిని సంహరించడానికి నారాయణుడు నరసింహావతారాన్ని ధరించాడు. ఈ అవతార నిడివి స్వల్పకాలమైనా.. భగవానుడి సర్వవ్యాపకతను తెలియజేస్తుంది. భూత గ్రహ బాధలు, కుజ గ్రహ బాధలు ఉన్నవారు ఈ అవతారాన్ని దర్శిస్తే విముక్తి పొందుతారని శాస్త్రం చెబుతోంది. -
జాతీయస్థాయి క్రీడల్లో ఐటీడీఏ జట్ల హవా
భద్రాచలంటౌన్ : ఏపీలోని విశాఖపట్టణంలో నిర్వహిస్తున్న జాతీయస్థాయి పెసా క్రీడా పోటీల్లో భద్రాచలం ఐటీడీఏ క్రీడాకారులు హవా కొనసాగిస్తున్నారు. ఈ మేరకు పీఓ రాహుల్ సోమవారం వివరాలు వెల్లడించారు. ఐటీడీఏ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న పురుషుల, మహిళల కబడ్డీ జట్లు తొలి లీగ్ మ్యాచ్‌ల్లో ఘన విజయాలు సాధించాయని తెలిపారు. పురుషుల విభాగంలో జరిగిన పోటీలో మహారాష్ట్ర జట్టుపై తెలంగాణ జట్టు విజయం సాధించగా, మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ జట్టుపై విజయకేతనం ఎగురవేసిందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో సత్తా చాటిన క్రీడాకారులను, కోచ్‌లను పీఓ అభినందించారు. ఇదే ఉత్సాహంతో మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. -
సామాన్యులకు అందని నాణ్యమైన విద్య
ఖమ్మం సహకారనగర్: కేంద్రప్రభుత్వం విద్యారంగంలో తీసుకొస్తున్న సంస్కరణలతో సామాన్యులకు విద్య అందకపోగా, అందరికీ సమానమైన నాణ్యమైన విద్య కూడా సాధ్యం కావడం లేదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ అభిప్రాయపడ్డారు. ఖమ్మంలో టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వెంగళరావు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విద్యారంగానికి ఏటా బడ్జెట్ తగ్గించడమే కాక ప్రాథమిక విద్యారంగానికి నిధులు కేటాయించకుండానే కొత్త పేర్లతో పాఠశాలలను ప్రారంభిస్తున్నారని తెలిపారు. అనంతరం వై.అశోక్ కుమార్, ఎం.సోమయ్య, కె.రవిచంద్ర, ఏ.రామారావు, వి.మనోహర్‌రాజు మాట్లాడగా తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడిగా డాక్టర్ సీహెచ్.రమేష్, అధ్యక్షులుగా టి.వెంగళరావు, ప్రధా న కార్యదర్శిగా రాజు, అసోసియేట్ ఉపాధ్యక్షులుగా ఏ రామారావు ఎన్నికయ్యారు. అలాగే, ఉపాధ్యక్షులుగా ఎం.రవీందర్, జి.రమేష్, పి. నాగేశ్వరరావు, కృష్ణయ్య, నాగమణి, ఎస్.పూర్ణచంద్రరావు, పి.వీరభద్రం, అదనపు ప్రధాన కార్యదర్శిగా ఎన్.కృష్ణారావు, కార్యదర్శులుగా వెంకటేష్, జి.మస్తాన్, ఐ.రామకృష్ణ, లక్ష్మీనా రాయణ, కె.రామ్మోహన్రావు, అజీజ్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. -
టర్మినేట్ ఉద్యోగులకు ఇంటర్వ్యూలు
కొత్తగూడెంఅర్బన్: వివిధ కారణాలతో విధుల నుంచి తొలగించిన జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ(జేఎంఈటీ)లను తిరిగి ఉద్యోగంలోకి తీసుకునేందుకు సోమవారం సింగరేణి ప్రధాన కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరిగాయి. హైపవర్ కమిటీ సభ్యులు, జీఎంలు ఏ.మనోహర్, కే.సాయిబాబు, కవితా నాయుడు, ఆర్.విజయ ప్రసాద్, బొజ్జ రవి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో సింగరేణి యాజమాన్యం, గుర్తింపు కార్మిక సంఘం మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం టర్మినేట్ అయిన ఉద్యోగులను తిరిగి నియమిస్తున్నట్లు తెలిపారు. సంస్థ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. 34 మందిని ఇంటర్యూలకు పిలువగా 33 మంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అధికారులు అజయ్ కుమార్, జాఫర్, శంకర్ రెడ్డి పాల్గొన్నారు. -
భారీగా గంజాయి సీజ్
మణుగూరు టౌన్: సీలేరు నుంచి స్టేషన్ ఘన్‌పూర్‌కు నిషేధిత గంజాయిని తరలిస్తున్న వ్యక్తులను మణుగూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. సీఐ నాగబాబు కథనం ప్రకారం.. పోలీసులు తోగ్గూడెం సమ్మక్క– సారలమ్మ ఆలయం సమీపంలో వాహనాల తనిఖీ చేపడుతున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి కారును తనిఖీ చేయగా రూ.16.10లక్షల విలువైన గంజాయి లభ్యమైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కి చెందిన మారుపాక యుగంధర్, మచ్చ క్రాంతికుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా విప్పల్రెడ్డిగూడేనికి చెందిన విజయ్‌భాస్కర్‌రెడ్డి సీలేరులోని చిత్రకొండకు చెందిన సుంద్రు సుందర్రావు వద్ద 33 కేజీల కొనుగోలు చేసి తరలిస్తుండగా, పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేశారు. -
ముమ్మరంగా ముక్కోటి ఏర్పాట్లు
భద్రాచలంటౌన్: ఈనెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ సీతారామచంద్ర స్వామివారి తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శన వేడుకల ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. భద్రాచలంలోని గోదావరి కరకట్ట, రివర్ ఫెస్టివల్ వేదికలను ఆదివారం పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. గతేడాది తరహాలోనే ఈసారి కూడా గోదావరి రివర్ ఫెస్టివల్‌ను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. కరకట్ట వద్ద రోజూ సాంస్కృతిక కార్యక్రమాలు, ఆదివాసీ కళారూపాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 22 నుంచి 30 వరకు జిల్లాలోని కిన్నెరసాని, బెండలపాడు కనిగిరి గుట్టలు, బొజ్జిగుప్ప వంటి పర్యాటక ప్రాంతాలను భక్తులు సందర్శించేలా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. తహసీల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ డీఈ వెంకటేశ్వర్, ఏఈ వెంకటేశ్వర్లు, ఆర్.డబ్ల్యూఎస్ ఏఈఈ రాము, డీఈ రవితేజ, దేవస్థానం డీఈ రవీందర్, ఏపీఎం త్రిగుణ, జగదీశ్వర్, జీపీఈఓ శ్రీనివాస్ పాల్గొన్నారు. యువత క్రీడల్లో రాణించాలి యువత క్రీడల్లో రాణించాలని, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవరుచుకోవాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భద్రాచలం ఫుట్‌బాల్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. అనంతరం అండర్–14 విభాగంలో గెలుపొందిన అశ్వాపురం విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. క్రీడాకారులకు ఫుట్‌బాల్ కిట్లు, దుస్తులను పంపిణీ చేశారు. చందు, సలీం, మన్మధ, రాజు, జీవీ రామిరెడ్డి, జీఎస్ శంకర్ రావు పాల్గొన్నారు. కేయూ విజేతలకు అభినందన పాల్వంచ: ఈ నెల 19,20 తేదీల్లో జరిగిన కాకతీయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో ఏడు బంగారు, ఒక రజిత, 11 కాంస్య పతకాలు, వర్సిటీ ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన విద్యార్థులను ఆదివారం శ్రీనివాస కాలనీ మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ అభినందించారు. జాతీయ స్థాయి టెన్నిస్‌లో 55 సంవత్సరాలు పైబడిన విభాగంలో విన్నర్ కప్ సాధించిన అన్నం వెంకటేశ్వర్లును, కోచ్ పి.నాగేంద్రబాబును సత్కరించారు. డీవైఎస్వో పరంధామ రెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ మహిధర్, ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ నరేష్, ప్రిన్సిపాల్ అనురాధ, టెన్నిస్ కోచ్ డానియేల్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ -
సమయం వచ్చినప్పుడు బుద్ధి చెబుతాం..
చర్ల: మండలంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్, వార్డు అభ్యర్భుల ఓటమికి కారకులైన వారందరికీ సమయం వచ్చినప్పుడు సరైన రీతిలో బుద్ధి చెబుతామని మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య హెచ్చరించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండలంలో గెలుపొందిన కాంగ్రెస్ సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీని ఆదివారం చర్లలో నిర్వహించగా.. కాంగ్రెస్ పార్టీ జిల్లా అద్యక్షురాలు తోట దేవీప్రసన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ గెలిసే ప్రాంతాల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన ఇసుక మాఫియా తమ ధన బలాన్ని ప్రయోగించి కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి కారణమయ్యారని, వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. అనంతరం దేవీ ప్రసన్న మాట్లాడగా.. కార్యక్రమంలో చర్ల పంచాయతీ సర్పంచ్ పూజారి సామ్రాజ్యం, ఉప సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్పా శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ ఇర్పా శాంత, నాయకులు పాల్గొన్నారు. -
గిరిజన సంస్కృతిని ఆస్వాదించాలి
భద్రాచలంటౌన్: భద్రాద్రి రామయ్యను దర్శించుకునేందుకు వచ్చే భక్తులు, పర్యాటకులు ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియాన్ని సందర్శించి గిరిజన సంస్కృతిని ఆస్వాదించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. రామాలయం సమీపాన ఉన్న మిథిలా స్టేడియం పక్కన ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం సమాచార బోర్డును ఆదివా రం రాత్రి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, కళలు వారి జీవనశైలిని ప్రతిబింబించేలా మ్యూజియంలో పెయింటింగ్స్, కళాఖండాలను పొందుపరిచామన్నారు. యాత్రికులు గిరిజన వారసత్వాన్ని ఆస్వాదించడంతో పాటు అక్కడ లభించే గిరిజన సంప్రదాయ వంటకాలను రుచి చూడాలని కోరారు. గిరిజన మ్యూజియం గొప్పతనాన్ని పర్యాటకులు తమ ప్రాంతాల్లో ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ డేవిడ్ రాజ్, డీఎస్ఓ ప్రభాకర్‌రావు, సిబ్బంది వంశీ, దినేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ బి.రాహుల్ -
సింగరేణి మాజీ సీఎండీకి ఆత్మీయ వీడ్కోలు
రుద్రంపూర్: సింగరేణి సంస్థకు ఎనలేని సేవలందించిన మాజీ సీ అండ్ ఎండీ బలరామ్‌కు ఆదివారం ఇల్లెందు క్లబ్లో బీఎంఎస్ యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించి ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యూనియన్ జాతీయ నాయకుడు మాదవ నాయక్ మాట్లాడుతూ.. 2018లో డైరెక్టర్ ఫైనాన్స్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థలో డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్, డైరెక్టర్ పా, డైరెక్టర్ ఆపరేషన్స్, సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంటి కీలక బాధ్యతలు చేపట్టి ఆయన సింగరేణిలో కార్మిక, కేంద్రిత పరిపాలనకు దిశా నిర్దేశం చేశారన్నారు. కార్మికులకు ప్రమాద బీమా, కోవిడ్ మహమ్మరి సమయాన వ్యాక్సినేషన్ ద్వారా కార్మికుల ప్రాణాలను కాపాడిన గొప్ప వ్యక్తిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ నాయకులు, కార్మికులు పాల్గొ న్నారు. -
హత్య కేసులో తొమ్మిది మంది అరెస్ట్..
● వివరాలు వెల్లడించిన ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ భద్రాచలంటౌన్: పట్టణంలో సంచలనం సృష్టించిన సజ్జ రవి హత్య కేసులో ప్రధాన నిందితులతో సహా తొమ్మిది మందిని పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్‌సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 17వ తేదీ సాయంత్రం చర్ల రోడ్డులోని ఓ వైన్స్ సమీపాన సజ్జ రవి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ప్రధాన నిందితులు పంగి శివ, బోయిన దుర్గా ప్రసాద్, జలకం నాగరాజులతో పాటు బొడ్డు అఖిల్, లంకపల్లి వెంకటేష్, ముత్యాల జయరాం, రిక్క వీర శివశంకర్‌రెడ్డి, కాపుల శివ, కాపుల కృష్ణ ఉన్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాలకు చెందిన నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఏఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ ఎం.నాగరాజు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
శ్రీకనక దుర్గమ్మతల్లికి విశేష పూజలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గమ్మతల్లికి అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి)ఆలయానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. తలనీలాలు సమర్పించుకున్నారు. ఒడిబియ్యం, చీరలు, కుంకుమ, పసుపు, గాజులు అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించారు. అర్చకులు అభిషేకం జరిపారు. ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, డైరెక్టర్లు పాల్గొన్నారు. సైక్లింగ్‌తో ఫిట్నెస్జిల్లా యువజన క్రీడల శాఖాధికారి పరంధామ రెడ్డి సూపర్‌బజార్(కొత్తగూడెం): ఫిట్‌నెస్‌కు సైక్లింగ్ ఉత్తమ మార్గమని జిల్లా యువజన, క్రీడల శాఖాధికారి పరంధామ రెడ్డి అన్నారు. ఆదివారం కొత్తగూడెం పట్టణంలో సండే సైక్లింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అమలవుతున్న ఫిట్ ఇండియా మిషన్ కార్యక్రమంలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ‘ఫిట్ ఇండియా–సండే సైక్లింగ్’’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు సైక్లింగ్‌లో పాల్గొన్నారని అన్నారు. ఎస్జీఎఫ్ సెక్రటరీ నరేష్, సైక్లింగ్ అసోసియేషన్ సెక్రటరీ బీవీజీ కృష్ణ, నాగేశ్వరరావు, ఉదయ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్లు కవిత, శైలజ పాల్గొన్నారు. నేడు గిరిజన దర్బార్ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే దర్బార్‌లో గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని కోరారు. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం ప ర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పా ర్కులోని దుప్పులను వీక్షించారు. 330 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.22,730 ఆదాయం లభించింది. 260మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్‌కు రూ.13,190 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఓఎస్డీ అవినాశ్ కుమార్ కుటుంబీకులతో కలిసి కిన్నెరసానిని సందర్శించారు. జలాశయంలో బోటు షికారు చేశారు. ఎస్ఐ సురేష్ ఉన్నారు. -
గ్లోబల్ కంపెనీగా..
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ట్రిపుల్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ దిశగా తెలంగాణ సర్కారు అడుగులు వేస్తోంది. అందులో తన వంతు భాగస్వామ్యం కోసం సింగరేణి ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే ఇవి ఎంతవరకు అమలవుతాయనే చర్చ జరుగుతోంది. సింగరేణి సంస్థ వందల ఏళ్లుగా బొగ్గు ఉత్పత్తికే పరిమితమైంది. తెలంగాణ ఏర్పడ్డాక సింగరేణి సీఎండీగా ఎన్.శ్రీధర్ ఉన్న సమయాన తొలిసారి థర్మల్ విద్యుత్ రంగంలోకి సంస్థ అడుగు పెట్టింది. ఆ వెంటనే సోలార్ పవర్‌పైనా దృష్టి సారించగా, నెట్‌జీరో సంస్థగా రేపోమాపో గుర్తింపు పొందనుంది. ఆపై కేంద్రంలో ఐఆర్ఎస్ సర్వీసులో ఉండి డిప్యూటేషన్‌పై తెలంగాణకు వచ్చి శ్రీధర్ తర్వాత సీఎండీగా బాధ్యతలు స్వీకరించిన ఎన్.బలరాం సింగరేణి విస్తరణను మరింత వేగవంతం చేశారు. విద్యుత్ రంగంలో పంప్డ్ స్టోరేజీ, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ పథకాలను పట్టాలెక్కించారు. సంస్థ కార్యకలాపాలను తెలంగాణలోనే కాకుండా ఒడిశా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలకు విస్తరించారు. అక్కడితో ఆగకుండా ఘనా, ఆస్ట్రేలియా వంటి దేశాలతోనూ వ్యాపార ఒప్పందాలు చేసుకున్నారు. బొగ్గుతోపాటు రాగి, బంగారం మైనింగ్ కోసం హక్కులు దక్కించుకున్నారు. ఎన్నాళ్ల నుంచో పీటముడి పడిన బొగ్గు బ్లాక్‌ల వేలం విషయంలో మౌనం వీడి బహిరంగ వేలానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా కృషి చేశారు. బొగ్గు గనులు విస్తరించిన ప్రాంతంలో రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నట్టు గుర్తించి వాటి అన్వేషణ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. సంధి దశలో ఒడిశాలో దక్కించుకున్న నైనీ బ్లాకు సింగరేణికి కీలకం కానుంది. ఈ మైన్‌ను ఆధారంగా చేసుకుని ఒడిశాలో 2,400 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్, 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్, 500 మెగావాట్ల ఫ్లోటెడ్ సోలార్ ప్లాంట్, 500 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ల నిర్మాణానికి ఒడిశా సర్కారు సిద్ధమైంది. సింగరేణి – ఒడిశా సర్కార్ నడుమ ఈనెల 18న అవగాహన ఒప్పందం కుదిరింది. సింగరేణి ఆధ్వర్యంలో రాజస్థాన్ ఎడారుల్లో రూ. 15,600 కోట్ల వ్యయంతో 4,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల స్థాపనకు ఆ రాష్ట్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. ఆపై కర్ణాటకలో కాపర్, గోల్డ్ మైనింగ్‌కు లీజులు దక్కాయి. ఇవి కాకుండా గ్రాఫైట్ మైనింగ్‌కు సంబంధించి అరుణాచల్‌ప్రదేశ్‌లో ఒక బ్లాక్ లీజ్ వచ్చింది. కీలకమైన ప్రాజెక్టులు కీలకమైన రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ విషయంలో ప్రాథమిక దశను ఇప్పటికే సింగరేణి దాటింది. గోదావరి–ప్రాణహిత లోయలో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్(అరుదైన మూలకాల) విషయంలో సీఎస్ఐఆర్, ఐఎంఎటీ(భువనేశ్వర్), జేఎన్ఆర్ఏడీడీసీ వంటి సంస్థలతో ఒప్పందం చేసుకుంది. గోదావరి లోయలో నియోబియం, ట్రాన్సియంలను వెలికి తీయవచ్చని నివేదిక వచ్చింది. రేపోమాపో పనులు ప్రారంభించే అవకాశముంది. రేర్ ఎర్త్ విషయంలో సింగరేణి అనుసరించిన మోడల్‌ను తమకు వర్తింపజేయాలని ఇప్పటికే అసోం ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దేశవ్యాప్తంగా రేర్ ఎర్త్ మైనింగ్‌లో సింగరేణి కీలకంగా మారింది. ఇవి కాకుండా ఆఫ్రికాలోని ఘనా దేశంలో క్రిటికల్ మినరల్స్ మైనింగ్ విషయంలో అక్కడి ప్రభుత్వంతో సింగరేణి ఎంఓయూ చేసుకుంది. స్ట్రాటెజిక్ మినరల్స్ మైనింగ్ విషయంలో ఆస్ట్రేలియా, చిలీ, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో కార్యకలపాలు మొదలు పెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది.కొత్త కంపెనీలు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇటీవల సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్, సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ పేర్లతో కొత్త కంపెనీలను ఈ ఏడాది నవంబర్‌లో నమోదు చేశారు. ప్రస్తుతం అంకుర దశలో ఉన్న రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, స్ట్రాటెజిక్ మినరల్స్, కాపర్, బంగారం, గ్రాఫైట్ మైనింగ్, ఫ్లోటెట్ సోలార్, పంప్డ్ స్టోరేజీ పవర్ తదితర ప్రాజెక్టులను కాగితాలకే కాకుండా క్షేత్రస్థాయిలో బలంగా నిలబెట్టాల్సి ఉంది. అయితే, సింగరేణి విస్తరణలో ఇప్పటి వరకు కీలక భూమిక నిర్వహిస్తూ వచ్చిన సీఎండీ బలరాం ఇటీవల డిప్యూటేషన్ ముగియడంతో తిరిగి కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. ఇన్చార్జ్ సీఎండీగా కృష్ణభాస్కర్ విధుల్లో చేరారు. ఇప్పటికే ఆయనపై అనేక ఇతర బాధ్యతలు ఉన్నాయి. దీంతో విస్తరణ విషయంలో గత వేగం కనిపించేనా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. గ్లోబల్ కంపెనీగా బలమైన పునాదులు పడే వరకు బలరాంనే ఈ పోస్టులో కొనసాగించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపించి ఉండాల్సిందనే వాదనలు వినిపిస్తున్నాయి. -
కూర్మావతారంలో రామయ్య..
శ్రీసీతారామచంద్ర స్వామివారికి భక్తజనం జేజేలు భద్రాచలం: క్షీరాబ్ది సమయంలో మందరగిరిని తన వీపున మోసి దేవతలకు అమృతం అందించిన కూర్మావతార రాముడిని భక్తులు కనుల నిండుగా దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశీ ప్రయుక్త అధ్యయనోత్సవాలలో భాగంగా భద్రాచల రామయ్య ఆదివారం కూర్మావతారంలో దర్శనమిచ్చారు. తెల్లవారుజామున 4గంటలకు ఆలయాన్ని తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి ఆరాధన, ఆరగింపు ఇచ్చారు. వేద పండితులు స్వామివారికి దివ్య ప్రబంధం చేశారు. రెండు వందల నాళాయిర దివ్య ప్రబంధాలను చదివారు. పన్నెడు మంది ఆళ్వార్లకు పరివట్టం కట్టి పూలమాలలు వేసి తులసి దళాలు సమర్పించారు. అనంతరం కూర్మావతారంలో ప్రత్యేకంగా అలంకరించిన స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చారు. రోటరీ క్లబ్ సంస్థ సహకారంతో శోభాయాత్ర కూర్మావతారానికి భద్రాచలం రోటరీ క్లబ్ బాధ్యులు పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం ప్రత్యేక పల్లకీపై స్వామివారిని ఉంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. స్వామివారిని మాడవీధుల మీదుగా మిథిలా స్టేడియం ప్రాంగణంలోని అధ్యయనోత్సవ వేదిక వద్దకు తీసుకొచ్చి హారతి సమర్పించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులుదీరారు. స్వామివారిని దర్శించుకుని నైవేద్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా భక్తులకు అర్చకస్వాములు ఆశీర్వచనాలు అందజేశారు. వైభవంగా తిరువీధి సేవ అధ్యయనోత్సవ వేదికపై ప్రత్యేక పూజలు అందుకున్న స్వామివారు ఊరేగింపుగా తిరువీధి సేవకు వెళ్లారు. తాతగుడి వీధిలోని విశ్రాంతమండపం వద్దకు తీసుకెళ్లి అక్కడ కొద్దిసేపు ఉంచి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఊరేగింపుగా తాతగుడి వరకు స్వామివారిని తీసుకెళ్లి తిరిగి గర్భగుడికి తీసుకొచ్చారు. దారి పొడవునా భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి ప్రసాదాలు అందుకున్నారు. నేడు వరాహావతారంలో.. అధ్యయనోత్సవాలలో భాగంగా రామయ్య సోమవారం వరాహావతారంలో దర్శనమివ్వనున్నారు. ప్రజాసృష్టి చేద్దామనుకున్న స్వయంభువుని, బ్రహ్మాదుల మొర విన్న నారాయణుడు నీటిలో మునిగిఉన్న భూమిని బయటికి తీయడానికి వరాహావతారాన్ని ధరించాడు. భూమిని తన కోరలతో పైకెత్తాడు. ఈ కార్యంలో ఆటంకం కలిగించిన లోకకంటకుడైన హిరణ్యాక్షుడు అనే రాక్షసుడుని సంహరించి భూమిని రక్షించాడు. రాహు గ్రహ బాధలున్న వారు ఈ అవతారాన్ని దర్శిస్తే బాధల నుంచి విముక్తులవుతారని భక్తులు విశ్వసిస్తారు. -
పల్లెకు కొత్త కళ
చుంచుపల్లి: పల్లెల్లో పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 1,033 పంచాయతీలు, 9,304 వార్డులకు ఈ నెల 11,14,17 తేదీల్లో మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. అవే రోజుల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. కొత్తగా ఎన్నికై న సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నూతన పాలకవర్గాలు కొలువుదీరాక గ్రామపాలన గాడిలో పెట్టే అవకాశం ఉంది. రెండేళ్లుగా పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ నిధులు ఆగిపోయాయి. తాజాగా పాలకవర్గాలు ఏర్పడటంతో ఇక నుంచి విడతల వారీగా నిధులు అందనున్నాయి. రెండేళ్లపాటు ప్రత్యేకాధికారుల పాలన గత పాలకవర్గాల గడువు 2024, జనవరి 31తో ముగియగా, ఫిబ్రవరి 2న ప్రత్యేకాధికారుల పాలన విధించారు. దాదాపు రెండేళ్లుగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతుండగా, అధికారులు గ్రామాలవైపు కన్నెత్తి చూడలేదనే ఆరోపణలున్నాయి. గ్రామాలకు నియమించిన ప్రత్యేకాధికారులు తమ సొంత శాఖ పనులకే పరిమితమయ్యారు. దీంతో గ్రామ కార్యదర్శులే అన్నీ తామై పాలన సాగించారు. మరోవైపు పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సకాలంలో అందక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడింది. చెత్త సేకరణకు వినియోగించే ట్రాక్టర్లకు డీజిల్, మరమ్మతుల కోసం నిధులను కార్యదర్శులు సొంతంగా వెచ్చిస్తున్నారు. కొన్నిచోట్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ట్రాక్టర్లు మూలనపడ్డాయి. వీధి దీపాల నిర్వహణ, పారిశుద్ధ్య పనులు, తాగునీటి వసతుల మరమ్మతులు, పైపులైన్ లీకేజీలు తదితర పనుల నిధుల కొరత ఏర్పడింది. ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రజాప్రతినిధులు కూడా లేకపోవడంతో గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఫాగింగ్ యంత్రాలు సైతం నిరుపయోగంగా మారాయి. నేటి నుంచి సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పాలన రానుండటంతో సమస్యలన్నీ పరిష్కరించాలని పల్లె ప్రజలు కోరుతున్నారు. నేడు కొలువుదీరనున్న పాలకవర్గాలు జిల్లా వార్డుసభ్యులు సర్పంచ్‌లు మహిళలు పురుషులు ఖమ్మం 5,156 565 297 268 భద్రాద్రి 4,148 468 266 202 మొత్తం 9,304 1,033 563 470ప్రశాంతినగర్ గ్రామ పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాను. ప్రధానంగా మురుగు కాల్వలు, పారిశుద్ధ్య పనులపై ఎప్పటికప్పుడు దృష్టి పెడతాను. గ్రామంలో అందరి సహకారంలో సమస్యల పరిష్కారంతో పాటు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాను. అజ్మీర లైల, ప్రశాంతి నగర్ సర్పంచ్జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. కొత్తగా ఎన్నికై న పాలకవర్గాల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేశాం. సోమవారం అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో కార్యదర్శులు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. – సుధీర్‌కుమార్, జిల్లా పంచాయతీ అధికారి -
‘ఫిట్నెస్’ తూచ్..!
రుద్రంపూర్: కొత్తగూడెం ఏరియా పరిధిలోని వీకే–7 ఓసీలో నడుస్తున్న వోల్వోలు ఫిట్నెస్ లేని కారణంగా గడిచిన 40 రోజుల్లో మూడు ప్రమాదాలు జరిగాయి. క్వారీలో పనిచేసే ఉద్యోగులు, ఇతర సిబ్బంది సెల్ఫోన్లు వాడదరాలని, ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయని సంస్థ ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులు, ఉద్యోగులకు ఆదేశాలు జారీ చేసినా.. పట్టించుకోకపోవడంతో ప్రమాదాలకు నిలయంగా మారింది. అంతేకాక ఉద్యోగులకు సరైన శిక్షణ (ఎంవీటీసీ) కూడా లేదని, దీనికి తోడు క్వారీలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యంతో ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికలు వాపోతున్నారు. సంస్థలో పనిచేసే ఉద్యోగులకు ఎంవీటీసీతో పాటు ఇతర అన్ని రకాలు శిక్షణలు ముగిసిన తరువాతే క్వారీలో పనుల్లోకి వెళ్లాల్సి ఉండగా.. వీకే–ఓసీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నా.. ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. గతంలో ఎన్నడూ లేని ఒరవడి.. ఇదిలా ఉండగా, గతంలో ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫీసర్‌గా పనిచేసే అధికారి ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఏ పనైనా జరిగేది. ఆయన ప్రతీ అంశాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పి ఇక్కడి నుంచి బదిలీ చేయించారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని నూతన ఒరవడి ఏరియాలో వినిపించడంతో కార్మికులను విస్మయానికి గురిచేస్తోంది. సింగరేణి సంస్థలో ఒక ఉద్యోగి విధుల్లో చేరాలంటే ఎంవీటీసీతో పాటు వాహనాలు నడిపే వ్యక్తికి శిక్షణ అందుకు సంబంధించిన సర్టిఫికెట్లు అవసరం. కానీ కొత్తగా ఏర్పాటవుతున్న ఓసీలో శిక్షణలేని డ్రైవర్లు పనిచేయడంతో ఇటీవల మూడు ప్రమాదాలు జరిగాయి. క్వారీలో నడిచే వాహనాలకు బ్రేక్‌లు ఫెయిల్ అవడం విడ్డూరంగా ఉంది. ఏరియా సేఫ్టీ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. – ఆంజనేయులు, హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడుఏంటికి ఏమి కాకముందే ఇన్ని ప్రమాదాలు జరిగితే మరో 25 ఏళ్లు నడిచే ఓసీలో మరెన్ని ప్రమాదాలు సంభవిస్తాయోనని కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు రక్షణ వారోత్సవాలు జరిగిన మూడు రోజులకే ప్రమాదం జరగడం విస్మయానికి గురి చేస్తోంది. ఈ క్రమంలో సేఫ్టీ కమిటీ ఏ విచారణ చేశారో అర్థం కానీ అంశం. జరిగిన ప్రమాదం మరోమారు జరగకుండా చూడాల్సిన అధికారులే తప్పిదాన్ని కప్పిపుచ్చుకోవడంపై కార్మికుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికై నా కార్పొరేట్ సేఫ్టీ, ఏరియా ఉన్నతాధికారులు స్పందించి మరోమారు ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. వీకే–7 ఓసీలో ఫిట్‌నెస్‌లేని వోల్వోలు -
చికిత్స పొందుతున్న యువకుడి మృతి
పాల్వంచరూరల్: యూటర్న్ తీసుకునే క్రమంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. పోలీసులు కథనం ప్రకారం.. మండల పరిధి జగన్నాధపురం గ్రామానికి చెందిన గుగులోతు కార్తీక్(24) ఈనెల 13న బీసీఎం జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో అదే సమయానికి అదే గ్రామానికి చెందిన చరణ్ ద్విచక్ర వాహనంపై ఎదురురావడంతో ఆ రెండు వాహనాలు ఢీకొన్నా యి. ఈక్రమంలో కార్తీక్ తలకు తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు చరణ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. కారు ఏసీలో మంటలు.. ● పూర్తిగా దగ్ధమైన కారు టేకులపల్లి: కారు ఏసీలో మంటలు చెలరేగడంతో కారు మొత్తం దగ్ధమైంది. వివరాలిలా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన లకావత్ కిషన్ మణుగూరులో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం తన భార్య లక్ష్మితో కలిసి కామేపల్లి మండలం గోవింద్రాలలో జరుగుతున్న ఇరుముడి కార్యక్రమానికి కారులో వయా ఇల్లెందు టేకులపల్లి మీదుగా బయలుదేరారు. బొమ్మనపల్లి వద్దకు రాగానే ఏసీ ఆన్ చేసిన కొద్ది సేపటికే పొగలు రావడంతో గమనించి కారుకొండ క్రాస్‌రోడ్ తరువాత ఆపి చూడగా.. అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కారులో ఉన్న ముఖ్యమైన పత్రాలను తీసుకున్నారు. కొత్తగూడెం నుంచి ఫైర్ ఇంజన్ వచ్చే సరికి కారు మొత్తం మంటల్లో దగ్ధమైంది. అనంతరం బాధితులు టేకులపల్లి పోలీసు స్టేషన్లో రాతపూర్వకంగా తెలియజేశారు. -
జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన
సూపర్‌బజార్(కొత్తగూడెం): జాతీయ లోక్ అదాలత్‌కు అనూహ్య స్పందన లభించిందని, ఆదివారం జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో 7,233 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నారు. ఈ సందర్భంగా కక్షిదారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో న్యాయమూర్తి మాట్లాడుతూ రాజీమార్గమే రాజమార్గమని, చిన్న తగాదాలను లోక్ అదాలత్‌లో పరిష్కరించుకుని స్నేహ పూర్వక వాతావరణంలో ఉండాలని కక్షిదారులకు సూచించారు. కొత్తగూడెంలో 3,990, ఇల్లెందులో 614, భద్రాచలంలో 1,400, మణుగూరులో 1,229 కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ మాట్లాడుతూ లోక్ అదాలత్ కేసు పరిష్కారమై అవార్డు పాస్ చేస్తే అది అంతిమ తీర్పు అవుతుందన్నారు. కక్షిదారులకు పులిహోర, మంచినీటి సదుపాయాన్ని ఎస్బీఐ సౌజన్యంతో కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కె.కిరణ్ కుమార్, మెజిస్ట్రేట్లు సుచరిత, రవికుమార్, వినయ్ కుమార్, మెండు రాజమల్లు, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెలగల నాగిరెడ్డి, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జె గోపికృష్ణ, డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ పీ నిరంజన్‌రావు, ఆర్ రామారావు, ఎస్బీఐ బ్యాంకు అధికారులు, పోలీసు అధికారులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
రాజ్యాంగ పరిరక్షణ అందరి బాధ్యత
సూపర్‌బజార్(కొత్తగూడెం): భారత రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ అన్నా రు. కొత్తగూడెం క్లబ్లో శనివారం నిర్వహించిన ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ఐఎల్పీ ఏ) రాష్ట్ర సదస్సులో ఆయన మాట్లాడారు. రాజ్యాంగం కేవలం చట్టాల సమాహారం మాత్రమే కాదని, ప్రజల జీవన విధానాన్ని దిశానిర్దేశం చేసే మహత్తర గ్రంథమని అన్నారు. సమాన హక్కులు, గౌరవం, స్వేచ్ఛ, సోదరభావం వంటి విలువలను ప్రజలందరికీ అందించే సంకల్పంతోనే రాజ్యాంగా న్ని రాశారని వివరించారు. అందులో పొందుపర్చిన మౌలిక హక్కులు, సూత్రాలు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పునాదులుగా నిలుస్తున్నాయని చెప్పా రు. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఇలాంటి రాష్ట్ర స్థాయి మహాసభలు న్యాయవాదుల మధ్య చర్చకు, ఆలోచనలకు, మార్గదర్శకత్వానికి దోహదపడతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు రాజ్యాంగం, న్యాయస్థానాల విధులు, చట్టాలపై అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వేదికగా నిలిచిన ఐఎల్పీఏ తెలంగాణ యూనిట్‌ను అభినందించారు. ఐఎల్పీఏ జాతీయ అధ్యక్షురాలు కె.సుజాత చౌదంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సరిత, న్యాయమూర్తులు కిరణ్‌కుమార్, కవిత, రాజేందర్, సుచరిత, రవికుమార్, వినయ్‌కుమార్, సూరిరెడ్డి, ఎం.రాజమల్లు, కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఐఎల్పీఏ బాధ్యులు శాంసన్, దేవరాజ్ గౌడ్, లక్ష్మీదేవి, నాగేందర్, అదనం ఖమర్ పాల్గొన్నారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ -
మత్స్యావతార రూపుడై..
భద్రాచలం : ‘మమ్మేలే రామయ్య.. మత్స్యావతారంలో దర్శనమిచ్చాడు’ అంటూ భక్తులు స్వామివారిని తిలకించి పులకించిపోయారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. గర్భగుడిలో మూలమూర్తుల వద్ద ఉత్సవాల నిర్వహణకు అనుజ్ఞ తీసుకున్న అర్చకులు, వేద పండితులు.. స్వామివారి ఉత్సవమూర్తులను, ఆళ్వార్లను మేళతాళాలతో బేడా మండపంలో కొలువుదీర్చారు. ప్రత్యేక పూజల అనంతరం ప్రబంధాలు, సేవాకాలాన్ని స్వామివారికి నివేదించారు. ప్రత్యేక ఆరాధన, విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించాక వైదిక పరిపాలనా సిబ్బందికి దీక్షా వస్త్రాలు అందజేశారు. మత్స్యావతారుడైన రామయ్య.. వెకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున శ్రీ సీతారామచంద్రస్వామి వారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ అలంకరణలో ఉన్న స్వామివారిని ఆళ్వార్లతో కలిసి బేడా మండపంలో కొలువుదీర్చి పూజలు చేశారు. అనంతరం మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల కోలాటాల నడుమ ఊరేగింపుగా తీసుకెళ్లి మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కొలువుదీర్చారు. అనంతరం తాతగుడి సెంటర్ వరకు తిరువీధి సేవ నిర్వహించి తిరిగి ఆలయానికి తీసుకొచ్చారు. కాగా, ఈ ఏడాది ప్రవేశపెట్టిన విధానంలో తొలిరోజు ఉత్సవ ఖర్చుతో పాటు పట్టు వస్త్రాలను భద్రాచలానికి చెందిన హోల్‌సేల్, రిటైల్ వర్తక అసోసియేషన్ వారు అందజేసి ఉత్సవానికి హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు స్వామివారి పల్లకీ మోసి, పూజల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, స్థానాచార్యులు స్థలశాయి, వేదపండితులు గుదిమెళ్ల మురళీకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. నేడు కూర్మావతారం.. అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి వారు ఆదివారం కూర్మావతారంలో భక్తులకు దర్శనమివ్వన్నునారు. దేవతలు, రాక్షసులు మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసుకొని, అమృతం కోసం క్షీరసాగరాన్ని చిలకుతున్న సమయంలో ఏ ఆధారం లేక మంధగిరి మునిగిపోగా, దేవతలు, రాక్షసుల ప్రార్థనపై శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మునిగిపోయిన మంధర పర్వతాన్ని తన వీపున నిలిపి పైకెత్తాడు. ఈ అవతారాన్ని దర్శిస్తే శని గ్రహ సంబంధమైన దోషాలు తొలగుతాయని పండితులు చెబుతున్నారు. -
ప్రమాదాల నివారణకు పక్షోత్సవాలు
రుద్రంపూర్: జీరో ప్రమాదాల సింగరేణిగా నిలిపేందుకు సంస్థవ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల్లో ఈ నెల 8వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రక్షణ పక్షోత్సవాలు నిర్వహించామని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కె. వెంకటేశ్వర్లు తెలిపారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా 21 భూగర్భ గనులు, 16 ఓపెన్‌కాస్ట్ గనులు, తాడిచెర్ల గనిని మూడు గ్రూపులుగా విడదీసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. 11 సీహెచ్‌పీలు, 11 వర్క్‌షాపులు, నాలుగు 132 కేవీ/33కేవీ సబ్స్టేషన్లు, 11 సోలార్ ప్లాంట్లు, 10 ఎంవీటీసీలు, 12 ఆస్పత్రులతోపాటు ఎక్స్‌ప్లోరేషన్ వర్క్‌షాపుల్లో ప్రత్యేక బృందాలతో తనిఖీ చేశామని అన్నారు. బృందాలు ఆయా ఏరియాల్లో లోపాలను గుర్తించి, నష్టాలను వివరించి, రక్షణ పక్షోత్సవాలు జరిపారని చెప్పారు. లోపాలులేని గనులకు, జాగ్రత్తలు పాటిస్తున్న సిబ్బందికి మెమెంటోలు అందిచామని తెలిపారు. గనుల వద్ద అప్రమత్తంగా ఉండాలంటూ నాటికలు, ఆట, పాట రూపంలో అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికులు, అధికారులు రక్షణ సూత్రాలు పాటిస్తూ ఉత్పతి, ఉత్పాదకతను పెంచాలని సూచించారు.సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు ప్రతిభ చాటి రెండు స్వర్ణ, ఒక రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శనివారం విజేతలను అభినందించి సర్టిఫికెట్లు అందజేశారు. అంతేకాక ఈ నెల 25 నుంచి జనవరి 1 వరకు మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న ఆర్.గణేష్, మణికంఠ, వి సాయికిరణ్‌ను అభినందించారు. జాతీయ పోటీలకు సిద్ధం కావడానికి అవసరమైన సామగ్రి అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి పరంధామరెడ్డి, ఎస్జీఎఫ్ అసోసియేషన్ సెక్రటరీ వాసిరెడ్డి నరేష్,, తిరుమలరావు, బాక్సింగ్ కోచ్ శ్రీనివాస్, మట్టపర్తి రమేష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు.. పాల్వంచరూరల్ : కిన్నెరసాని మోడల్ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికై నట్లు కోచ్ వాసు తెలిపారు. ఇటీవల పెద్దపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ పోటీల్లో ప్రతిభ చాటిన బొర్ర లోకేష్, కె.వెంకన్నబాబు అండర్ – 14 విభాగంలో జనవరిలో హిమచల్‌ప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. ఖమ్మంలో జరిగిన రాష్ట్రస్థాయి బీచ్ వాలీబాల్ పోటీల్లో ప్రతిభ చూపిన వై.రుషీవర్మ గోవాలో జరిగే జాతీయ పోటీలకు ఎంపికయ్యాడని పేర్కొన్నారు.


