ఆహ్లాదం పంచాల్సిన చోట అంత్యక్రియలా..? | - | Sakshi
Sakshi News home page

ఆహ్లాదం పంచాల్సిన చోట అంత్యక్రియలా..?

Feb 5 2026 7:33 AM | Updated on Feb 5 2026 7:33 AM

ఆహ్లాదం పంచాల్సిన  చోట అంత్యక్రియలా..?

ఆహ్లాదం పంచాల్సిన చోట అంత్యక్రియలా..?

బూర్గంపాడు: మండలంలోని తాళ్లగొమ్మూరు పల్లె ప్రకృతి వనం స్మశానవాటికగా మారుతుండడం కలకలం రేపుతోంది. గతంలో ఒక వ్యక్తి తన భార్య అంత్యక్రియలు నిర్వహించి అక్కడే సమాధిని నిర్మించగా.. తాజాగా మరొకరు ప్రకృతి వనంలోనే అంత్యక్రియలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. బుధవారం ఈ విషయం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పంచాయతీ కార్యదర్శి మురళి తక్షణమే స్పందించి ప్రకృతి వనాన్ని శుభ్రం చేయించారు. ప్రజల ఆహ్లాదం కోసం నిర్మించిన చోట అంత్యక్రియలు నిర్వహించడం చట్టవిరుద్ధమని అన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ప్లెక్సీ ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement