breaking news
Bhadradri District Latest News
-
●1980 నుంచి నిరాటంకంగా ఉత్సవాలు
ఖమ్మంగాంధీచౌక్: గణపతి ఉత్సవాలంటే భక్తి, ఉత్సాహమే కాదు.. సేవను భాగం చేసిన శుక్రవారంపేట గణేష్ ఉత్సవ కమిటీ ఆదర్శంగా నిలుస్తోంది. ఖమ్మంలోని సీనియర్ కమిటీల్లో ఒకటైన శుక్రవారంపేట కమిటీ 1980లో ప్రారంభమైంది. భూమా జగన్నాథం, వీరమల్ల శ్రీనివాసరెడ్డి స్థాపించగా.. వారు కాలం చేసినా వారసులుగా భూమా నవీన్ కుమార్, మధు, దేవిశెట్టి దామోదర్ తదితరులు కొనసాగిస్తున్నారు. ఈ కమిటీ ఆధ్వర్యాన గణేష్ ఉత్సవాలు నిర్వహించడమే కాక దివ్యాంగులకు అండగా నిలుస్తూ జైపూర్ కత్రిమ కాళ్లు, చేతులు అందిస్తున్నారు. కొందరు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేయడమేకాక ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో 700 మంది పేద విద్యార్థులకు నోట్ బుక్స్, కంపాస్, పెన్నులు, పెన్సిళ్లతో కూడిన కిట్లు అందిస్తున్నారు. అలాగే, ఉత్సవాలు జరిగే డివిజన్లోని పారిశుద్ధ్య కార్మికులకు నెలకు సరిపడా సరుకులను అందజేస్తూ వారి శ్రమకు గౌరవం ఇస్తున్నారు. కొందరు పేద బ్రాహ్మణులకు కూడా నెలకు సరిపడా నిత్యావసరాలను అందిస్తూ సేవాగుణం చాటుకుంటున్నారు. -
రామయ్యకు అభిషేకం, నిత్యకల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మూలమూర్తులకు ఆదివారం అంతర్గతంగా అభిషేకం జరిపారు. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని రామ సేవామండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చి స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆ తర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా పూర్తిచేశారు. గోదావరి మాతకు నదీహారతి భద్రాచలంటౌన్: భద్రాచలంలోని కరకట్ట వద్ద ఆదివారం సాయంత్రం గోదావరి మాతకు నదీహారతి సమర్పించారు. భద్రాద్రి పురోహితుల సంఘం ఆధ్వర్యాన జరిగిన వేడుకకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరై దీపకాంతుల నడుమ సాగిన హారతిని వీక్షించారు. సంఘం అధ్యక్షుడు రామవజ్జల రవికుమార్ ఆధ్వర్యానతొలుత గణపతి పూజ నిర్వహించి శ్రీ సీతారామచంద్రస్వామి, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చన చేశారు. ఈకార్యక్రమంలో చంద్రశేఖరశర్మ, రామాచార్యులు, తేజాశర్మ, తిరుపతిరావు, రిషి, సత్యనారాయణరెడ్డి, నరసింహశర్మ పాల్గొన్నారు. పెద్దమ్మతల్లికి విశేష పూజలు పాల్వంచరూరల్: మండలంలోని కేశవాపురం – జగన్నాధపురం మధ్య కొలువైన శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. సెలవు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో తరలిరాగా, అర్చకులు పూజలు చేశారు. పలువురు భక్తులు తమ పిల్ల లకు అన్నప్రాసన జరిపించగా ఒడిబియ్యం, చీరసారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజల్లో ఈఓ విజయ్‌కుమార్, వేదపండితులు, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు. పెట్రోల్ బంక్‌లో రూ.29.39 లక్షల గోల్మాల్! దుమ్ముగూడెం: దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరంలోని జియో పెట్రోల్ బంక్‌లో భారీ ఆర్థిక మోసం వెలుగుచూసింది. విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు సూపర్వైజర్లు రూ.29,39,822 మేర అవకతవకలకు పాల్పడ్డారని బంక్ యజమాని తావుర్యా ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా బంకు లావాదేవీల్లో తేడాలు వస్తుండగా ఈనెల 10వ తేదీన రికార్డులు పరిశీలించారు. ఆతర్వాత రంగంలోకి దిగిన జియో ప్రతినిధులు బంకులో ఆడిట్ చేపట్టారు. ప్రతిరోజు ఉదయం టెస్టింగ్ కోసం తీసే పెట్రోల్, డీజిల్‌ను తిరిగి ట్యాంకుల్లో పోయకుండా సిబ్బంది బయట విక్రయిస్తున్నట్లు తేలింది. తద్వారా ఆరు నెలల్లో సుమారు 10,500 లీటర్ల పెట్రోల్, 7,600 లీటర్ల డీజిల్‌ను అమ్ముకుని వచ్చిన రూ.29.39 లక్షలను సొంతానికి వాడుకున్నట్లు తేల్చారు. ఈమేరకు ముగ్గురిపై యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
డ్యామేజ్‌కు నో ఛాన్స్..
పాల్వంచ రూరల్: గత 64ఏళ్లుగా చెక్కుచెదరని పాల్వంచలోని కిన్నెరసాని డ్యామ్ పటిష్టతను చాటుతోంది. ఎంతో పటిష్టంగా వందేళ్ల పాటు ఉండాలనే ఉద్దేశంతో నాడు ఇంజనీర్లు తమ మేథోశక్తికి పదునుపెట్టి కార్మికులు, గుర్రాలు, గాడిదలు, ఎడ్లబండ్ల సాయంతో సామగ్రి తరలిస్తూ.. పదేళ్ల పాటు శ్రమించి ఈ ప్రాజెక్టును నిర్మించారు. నాడు ఎటువంటి సౌకర్యాలు, అధునాతన పరికరాలు, టెక్నాలజీ అందుబాటులో లేకపోయినా దట్టమైన అరణ్యంలో రోడ్డు మార్గం లేక, యంత్రాలు, వాహనాల సాయం లేకున్నప్పటికీ ఈ ప్రాజెక్టును పూర్తిచేశారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు పంచే కేటీపీఎస్కు, ఎన్ఎండీసీ, నవభారత్ వంటి భారీ పరిశ్రమలకే కాక 10వేల ఎకరాలకు సాగునీరు, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలకు తాగునీరు అందిస్తోంది. రేపు(మంగళవారం) నేషనల్ ఇంజినీర్స్ డే సందర్భంగా ప్రాజెక్టు వివరాలతో కథనం. స్క్రాపర్లు, ఎడ్లబండ్లను వినియోగించి.. స్క్రాపర్లు, ఎడ్లబండ్లను వినియోగించి స్థానికంగా లభించిన రాళ్లు, ఇసుకతో తోగ్గూడెం నుంచి కంకరను తీసుకొచ్చి అధునాతన, నాణ్యమైన నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్టులో ఏ క్రస్ట్ గేట్‌ను చూసిన సిమెంట్‌తో ప్లాస్టింగ్ చేసినట్లుగా కనిపించేలా నాడు సిమెంట్‌ను కలిపి రాళ్లతో నిర్మాణం చేశారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రాజెక్టు పక్కనే గుట్టపైన 1970లో ప్రారంభించిన జలదృశ్యం విశ్రాంతి భవన నిర్మాణం 1971లో పూర్తయింది. దీన్ని నాటి ఏపీ ఇరిగేషన్‌శాఖ మంత్రి వి.పురుషోత్తమరెడ్డి ప్రారంభించారు. ఎటువంటి సాంకేతికత లేని సమయాన ఎండననక, వాననక పదేళ్ల పాటు ఐదు వేల మంది కార్మికులతో జంతువులను వినియోగించుకుంటూ పటిష్టంగా నిర్మాణం చేపట్టారని చూసిన చుట్టుపక్కల ప్రజలు తెలిపారు. కాగా, గత నెలలో ప్రాజెక్టుల భద్రత, స్థిరత్వం, సమర్థత పరిశీలన (సీడీఎస్ఈ) రామరాజు బృందం కూడా ప్రాజెక్టును పరిశీలించి వందేళ్ల వరకు ఎటువంటి ఢోకాలేదని కితాబు ఇవ్వడం విశేషం. నేటి ఇంజనీర్లకు కిన్నెరసాని ప్రాజెక్టు పాఠంలా నిలుస్తుంది. ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో లేకపోయినా కిన్నెరసాని డ్యామ్‌ను తక్కువ ఖర్చుతో నిర్మించారు. వందేళ్ల వరకు ఇబ్బంది రాకుండా ప్రాజెక్టు గేట్ల కింద స్లూయిస్‌తో నిర్మించారు. ఇటీవల పరిశీలించిన సీడీఎస్ఈ బృందం కూడా ఎంతో పటిష్టంగా ఉందని చెప్పింది. – ప్రభాకర్‌రావు, చీఫ్ ఇంజనీర్, కేటీపీఎస్ 5వ దశరేపు నేషనల్ ఇంజినీర్స్ డే పాల్వంచకు 12 కిలోమీటర్ల దూరంలోని అడవి ప్రాంతంలో యానంబైల్ పంచాయతీ సమీపాన ఉన్న కిన్నెరసానివాగు ద్వారా వర్షం నీరు వృథాగా గోదావరిలో కలుస్తోంది. దీంతో ఆ నీటిని నిల్వ చేసి వినియోగించుకోవాలని నాటి ఇంజనీర్లు బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణం చేయాలని నిర్ణయించారు. దీనికితోడు థర్మల్‌పవర్ ప్లాంట్‌కు అవసరమైన బొగ్గు గునులు, అవసరమైన నీరు పాల్వంచ మండల పరిధిలో లభించడంతో 1961లో నాటి ఏపీఎస్ఈబీ సంస్థ రూ.5.58 కోట్ల వ్యయంతో కిన్నెరసానివాగుపై ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టి ప్రాజెక్టు పనులను ఇరిగేషన్ శాఖకు అప్పగించారు. దీంతో ఆ శాఖ కార్యనిర్వహణ ఇంజనీర్ రామకృష్ణరాజు నేతృత్వాన పది మంది ఇంజనీర్లు 13 క్రస్ట్ గేట్లతో చిన్నకాలువపైన 1962 నుంచి 1972 వరకు శ్రమించి రెండు దశల్లో ప్రాజెక్టు పనులు పూర్తిచేశారు. -
ఆశయ సాధనే ‘ఏచూరి’కి నివాళి
● విపక్షాలను ఐక్యం చేయడంలో సీతారాం దిట్ట ● ప్రజాస్వామ్యం, పౌర హక్కుల పరిరక్షణకు ఏకం కావాలి ● వర్ధంతి సభలో ‘న్యూస్‌క్లిక్’ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ ఖమ్మంమయూరిసెంటర్: దేశంలో ప్రజాస్వామ్య హక్కులకు భంగం వాటిల్లుతున్న ప్రస్తుత సమయాన సీపీఎం పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి భౌతికంగా లేకపోవడం తీరని లోటని సీనియర్ జర్నలిస్ట్, న్యూస్‌క్లిక్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థ పేర్కొన్నారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు అధ్యక్షతన ఆదివారం ఏచూరి రెండో వర్ధంతి సభ నిర్వహించారు. తొలుత ఆయన చిత్రపటానికి నివాళులర్పించాక ‘భారత ప్రజాస్వామ్యం–సవాళ్లు’ అంశంపై జరిగిన సెమినార్లో ప్రబీర్ పుర్కాయస్థ కీలకోపన్యాసం చేశారు. వివిధ రాజకీయ భావజాలాలు కలిగిన శక్తులను ఒకే వేదికపైకి తీసుకురాగల అరుదైన నాయకత్వ పటిమ, ప్రజా సంబంధాలు ఏచూరి సొంతమని కొనియాడారు. ఏచూరి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడితే ఆయనకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని తెలిపారు. ఎమర్జెన్సీ సమయాన జైలు శిక్ష అనుభవించిన నాటి రాజకీయ అనుభవాలను వివరిస్తూ... స్వేచ్ఛ, భావవ్యక్తీకరణ హక్కుల ప్రాధాన్యతను అప్పుడే గ్రహించామని చెప్పారు. నాటి ఎమర్జెన్సీ తరహా సవాళ్లే నేడు మళ్లీ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్నందున ప్రతీ తరం హక్కుల కోసం పోరాడక తప్పదని స్పష్టం చేశారు. ఓటర్ల తొలగింపు ఆందోళనకరం ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో తీవ్రమైన అక్రమాలు జరుగుతున్నాయని ప్రబీర్ ఆరోపించారు. కొన్ని రాష్ట్రాల్లో దాదాపు 25 – 30 శాతం మంది పౌరులు ఓటర్ల జాబితాలో పేర్లు కోల్పోవడం అత్యంత ఆందోళనకరమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ప్రతీ పోలింగ్ బూత్ వద్ద ప్రజాస్వామ్య శక్తులు పర్యవేక్షిస్తూ ప్రజల ఓటు హక్కు కాపాడాల్సిన అవసరముందని తెలిపారు. జెన్ జీ విద్యార్థులు హాస్యం, సృజనాత్మకతను మేళవించి పాలకులను నిలదీస్తున్న తీరును అభినందించారు. కాగా, దేశంలోని విభిన్న వర్గాలు ఏకమై స్వేచ్ఛాయుత, పారదర్శక ఎన్నికల వ్యవస్థ కోసం, పౌర హక్కుల రక్షణ కోసం నిరంతరం పోరాడాలని పుర్కాయస్థ పిలుపునిచ్చారు. ఇంకా ఈ సభలో సీపీఎం కేంద్రం కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం, నాయకులు పోతినేని సుదర్శన్‌రావు, పి.సోమయ్య, పొన్నం వెంకటేశ్వరరావు, బుగ్గవీటి సరళ, హిమబిందు, ఆనందాచారి, మాచర్ల భారతి, వై.విక్రమ్, బండి రమేష్, కళ్యాణం వెంకటేశ్వరరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్దన్, ఆవునూరి మధు తదితరులు పాల్గొన్నారు. -
●మట్టితోనే మహా వినాయకుడు
కరకగూడెం: వినాయక చవితి అంటే భారీ విగ్రహాలు, రంగురంగుల అలంకరణలు గుర్తుకొస్తాయి. కానీ కరకగూడెం మండలం సమత్ భట్టుపల్లి గ్రామపంచాయతీ పరిధి కుర్నవల్లికి చెందిన వైఆర్ఎస్ యూత్ ఆధ్వర్యాన విఘ్నేశ్వర కమిటీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. ఆరేళ్లుగా స్వచ్ఛమైన మట్టితో సొంతంగా విగ్రహాన్ని తయారుచేసి ఉత్సవాలు నిర్వహిస్తుండడం విశేషం. మట్టి ఎంపిక మొదలు విగ్రహానికి రూపం ఇవ్వడం, రంగులు వేయడం వరకు కమిటీ సభ్యులే చేస్తున్నారు. ఈ సందర్భంగా కమిటీ బాధ్యుడు మిద్దబోయిన ప్రశాంత్ మాట్లాడుతూ ఆరేళ్లుగా మట్టితోనే వినాయక విగ్రహాన్ని తయారు చేస్తున్నామని తెలిపారు. భక్తితో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. ప్రకృతి నుంచి తీసుకున్న మట్టితో వినాయకుడిని తయారు చేసి.. తిరిగి ప్రకృతిలోనే కలుపుతూ.. మరికొందరికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. -
ఆర్థిక సాయానికి దరఖాస్తుల ఆహ్వానం
పాల్వంచ: పేద ఆర్యవైశ్యుల విద్య, వివాహా లకు ఆర్థికసాయం కోసం దరఖాస్తులు ఆహ్వా నిస్తున్నట్లు శ్రీ వాసవీ ఆర్యవైశ్య విద్య, వివాహ సహాయ ట్రస్ట్ అధ్యక్షుడు సీహెచ్.దేవీప్రసాద్ తెలిపారు. పాల్వంచ, కొత్తగూడెం, చండ్రుగొండ, ములకలపల్లి, దమ్మపేట, బూర్గంపాడు, లక్ష్మీదేవిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన పేద ఆర్యవైశ్య విద్యార్థులు, కుటుంబాలు ఈనెల 15 నుంచి 27వ తేదీలోగా వరకు దరఖాస్తులు అందించాలని సూచించారు. వివరాల కోసం 98481 83504, 94931 22310 నంబర్లలో సంప్రదించాలని ఆయన తెలిపారు. ‘ట్రస్మా’ జిల్లా అధ్యక్షుడిగా రవిఇల్లెందు: తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల సంఘం(ట్రస్మా) జిల్లా అధ్యక్షుడిగా భద్రాచలానికి చెందిన పి.రవి ఎన్ని కయ్యారు. కొత్తగూడెంలో ఆదివారం అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించగా పలువురు పోటీ పడ్డారు. ఈమేరకు అధ్యక్షుడిగా రవి, ప్రధాన కార్యదర్శిగా పాల్వంచకు చెందిన ఎం.కృష్ణ, కోశాధికారిగా ఇల్లెందుకు చెందిన సర్వేశ్వరరావు ఎన్నికయ్యారు. భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, అశ్వారావుపేట, ఇల్లెందు డివిజన్లలోని పాఠశాలల కరస్పాండెంట్ల సమక్షాన ఈ ఎన్నిక జరిగింది. 30 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనంమణుగూరుటౌన్: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు శని వారం రాత్రి పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గుట్టమల్లారం గ్రామానికి చెందిన నర్సింహారావు పలువురి లబ్ధిదారుల నుంచి 30 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొన్నాడు. అనంతరం చింతూరు సమీపాన ఓ సంతలో ఆదివాసీలకు విక్రయించేందుకు ఆదివారం ట్రాలీలో తరలిస్తున్నాడు. ఈక్రమాన బంగ్లాస్ ఏరియాలో పట్టుకుని ట్రాలీని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్యఅశ్వాపురం: ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. మండలంలోని జగ్గారం గ్రామానికి చెందిన దేవినేని సీతయ్య(45) మిట్టగూడెం గ్రామంలో కిరాయికి ఉంటూ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా సీతయ్య కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమవుతుండగా..ఆదివారం ఇంట్లో తగాదా జరి గింది. దీంతో మనస్థాపానికి గురైన ఆయన ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు ఉండగా.. కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఎల్లయ్య తెలిపారు. హతుడి కుటుంబం వివరాల కోసం ఆరా గుండాల: ఆళ్లపల్లి మండలం సుద్దరేవులో హత్యకు గురైన గుర్తుతెలియని వ్యక్తి బంధువుల ఆచూకీ గుర్తించేందుకు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈమేరకు ఆళ్లపల్లి ఎస్సై సోమేశ్వర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఛత్తీస్‌గఢ్ నుంచి నాలుగేళ్ల క్రితం వలస వచ్చి సుద్దరేవులో ఉంటున్న పూనెం రామ్ నారాయణ గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన విషయం విదితమే. గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి హతమార్చాక జల్లేరు వాగు సమీపాన పడేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చగా, ఆయన కుటుంబ వివరాలు తెలిసిన వారు 87126 82073(టేకులపల్లి సీఐ), 87126 82078(ఆళ్లపల్లి ఎస్సై) నంబర్లకు సంప్రదించాలని ఇవ్వాలని సూచించారు. ఆరుగురు పందెంరాయుళ్లపై కేసు నమోదుదమ్మపేట: మండల పరిధిలోని జలవాగు గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో కోడి పందేలు నిర్వహిస్తున్న పందెంరాయుళ్లపై పోలీసులు ఆదివా రం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జలవాగు శివారులోని పామాయిల్ తోటలో కోడి పందేలు నిర్వహిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడిచేశారు. ఆరుగురు పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి నాలుగు కోడి పుంజులు, రెండు బైక్‌లు, రూ.3,500ల నగదును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్ఐ రాజేష్‌కుమార్ తెలిపారు. పేకాట, కోడిపందేలపై పోలీసుల నిఘా దుమ్ముగూడెం: పేకాట, కోడిపందేలు, గంజాయి రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు దుమ్ముగూడెం సీఐ వెంకటప్పయ్య తెలిపారు. ఈమేరకు ఆదివారం ఓ పేకాట స్థావరంపై దాడి చేయగా నిర్వాహకులు, ఆటగాళ్లు పరారయ్యారని పేర్కొన్నారు. వీరిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా, మండల వ్యాప్తంగా రాత్రివేళ గస్తీ ముమ్మరం చేశామని, అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు వెల్లడించారు. అసాంఘిక కార్యకలాపాల సమాచారం తెలిస్తే స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సీఐ సూచించారు. మహిళను ఢీకొట్టిన లారీ భద్రాచలంటౌన్: భద్రాచలంలో ఆది వారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి చెందింది. రామాలయం సమాచార కేంద్రం ఎదురు మెయిన్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి భద్రాచలం మీదుగా సారపాక వైపు వెళ్తున్న ఇసుక లారీ మహిళను ఢీకొట్టి సుమారు 50 మీటర్ల మేర ఈడ్చుకెళ్లింది. దీంతో మృతదేహం రెండు భాగా లుగా విడిపోయి ఛిద్రమై గుర్తుపట్ట లేని విధంగా మారింది. ఈమేరకు భద్రాచలం సీఐ నాగరాజు చేరుకుని వివరాలు ఆరా తీశారు. అయితే, ప్రమాదానికి కారణమైన లారీని వదిలి డ్రైవర్ పరారయ్యాడని సీఐ తెలిపారు. కాగా, మృతురాలిని యాచకురాలిగా భావిస్తున్నారు. ఛిద్రమైన మృతదేహం -
●21 అడుగుల భారీ గణపతి
భద్రాచలంటౌన్: పర్యావరణ పరిరక్షణలో భద్రాచలానికి చెందిన ‘యంగ్ బాయ్స్ యూత్’ అసోసియేషన్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. యూత్ సభ్యులు గత 22 ఏళ్లుగాఉత్సవాలు నిర్వహిస్తుండగా.. పదేళ్ల నుంచి మట్టి వినాయకుడినే ప్రతిష్ఠిస్తున్నారు. ఈ ఏడాది సుమారు రూ.3 లక్షల వ్యయంతో 25 అడుగుల భారీ మట్టి గణపతిని సిద్ధం చేయించారు. నిపుణులైన కళాకారులు దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఈ ప్రతిమను రసాయనాలు, కృత్రిమ రంగులు వాడకుండా కేవలం సహజసిద్ధమైన మట్టి, జూట్‌తో తీర్చిదిద్దారు. ఉత్సవాల అనంతరం విగ్రహాన్ని ప్రతిష్ఠించిన చోటే నిమజ్జనం చేయనున్నారు. -
అపూర్వం.. ఆదిదేవుడు!
ఏళ్లుగా గణపతి ఉత్సవాల నిర్వహణ ● ఉమ్మడి జిల్లాలో పలు మండపాల ప్రత్యేకతఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం నగర గణపతి ఉత్సవాల చరిత్రలో గాంధీచౌక్ యూత్‌ది మైలురాయిగా నిలిచిపోతుంది. 1979లో కొందరు యువకులు మొదలుపెట్టిన చిన్న ఉత్సవం నేడు శ్రీ విజయ గణపతి దేవస్థానంగా మారి నగరంలోని వేలాది మండపాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఖమ్మంలో తొలిసారి గాంధీచౌక్‌లో 1979లో వినాయక ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గాంధీ చౌక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యాన అనుముల రమేష్ బాబు, మువ్వల వెంకటేశ్వర్లు, పసుమర్తి శివరామకష్ణ, కుంచపర్తి రమేష్, ఉండేలా గౌరీనాథ్, చెరుకూరి భాస్కర్, గోళ్ల భాస్కర్, అనుముల శ్రీనివాసరావు తదితరులు కమిటీగా ఏర్పడి శ్రీకారం చుట్టారు. ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా భక్తులను ఆకర్షించేలా మోటార్ సైకిల్ లక్కీ డ్రా, రాత్రి వేళల్లో భక్తి సినిమాల ప్రదర్శన చేపట్టేవారు. అయితే, నగరంలో వినాయక దేవస్థానం లేకపోవడాన్ని గుర్తించిన కమిటీ గాంధీచౌక్‌లో స్థలాన్ని ఎంచుకొని శ్రీ విజయ గణపతి దేవస్థానాన్ని నిర్మించారు. ఇదే నగరంలోని తొలి వినాయక ఆలయం. ప్రస్తుతం 23 మంది శాశ్వత సభ్యులుగా ఆలయ నిర్వహణ, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఖమ్మంలోని శ్రీ విజయ గణపతి దేవస్థానంలో ఏటా నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తాం. వందలాది మంది భక్తులు మాలధారణ చేస్తారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం. బ్రహ్మోత్సవాలు సంప్రదాయాలకు అనుగుణంగా మార్గదర్శకంగా నిలుస్తున్నాం. – పసుమర్తి శివరామకృష్ణ, మువ్వల వెంకటేశ్వర్లు, దేవస్థాన చైర్మన్, కోశాధికారి -
అక్రమాలకు అడ్డుకట్ట
● ధాన్యం తనిఖీలకు ‘రాండమైజేషన్’లో ఉద్యోగులు ● అక్కడికక్కడే వివరాలు యాప్‌లో నమోదు ● ఎక్కడా తేడా రాకుండా పారదర్శకతఖమ్మం సహకారనగర్: ఏటా ప్రభుత్వం కొనుగోలు చేసే ధాన్యాన్ని బియ్యం మార్చేందుకు కస్టమ్ మిల్లింగ్ రైస్ విధానంలో మిల్లులకు కేటాయిస్తున్నారు. అయితే, కొందరు మిల్లులు యాజమాన్యాలు ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తుండగా, ఇంకొందరు సమయానికి బియ్యం అందించడం లేదు. దీంతో కొన్నాళ్లుగా మిల్లుల్లో తనిఖీలు చేపడుతున్నారు. కానీ తనిఖీ బృందాల్లో కొందరు ఉద్యోగులు మిల్లర్లతో మిలాఖత్ అయినట్లు బయటపడింది. దీంతో తనిఖీ బృందాల ఎంపిక కోసం కంప్యూటర్ ఆధారిత రాండమైజేషన్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ మంగళవారం సాయంత్రం ఎంపిక ప్రతీ బుధవారం మిల్లుల్లో అధికారులు తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఆన్లైన్ రాండమైజేషన్లో అధికారులకు ఎంపిక చేసిన మిల్లులు కేటాయిస్తారు. ఆ మిల్లులో నిల్వలను తనిఖీ చేసి ఓపీఎంఎస్(ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్) యాప్‌లో వివరాలను నమో దు చేయాల్సి ఉంటుంది. ఏ బృందం ఏ మిల్లుల్లో తనిఖీకి వెళ్లనుందో గోప్యత పాటిస్తారు. యాప్‌లో వివరాలు... జాబితాలో మిల్లుల వివరాలే కాక జిల్లా, మండలం, జీపీఎస్ కోఆర్డినేట్లు, కేటాయింపు స్థానం వంటి వివరాలు నమోదవుతాయి. బృందం మిల్లుకు చేరుకున్నాక నేతృత్వం వహించే అధికారి ఐడీ, పాస్‌వర్డ్‌తో ఓపీఎంఎస్ మిల్లర్ యాప్‌లో లాగిన్ కావాలి. అప్పటికే సదరు మిల్లుకు కేటాయించిన ధాన్యం, ఇప్పటివరకు తిరి గి ఇచ్చిన బియ్యం, తదితర వివరాలన్నీ ఉంటాయి. వీటి ఆధారంగా తనిఖీ చేపట్టి యాప్‌లో నమోదు చేస్తే, వ్యత్యాసం ఉంటే బయటపడుతుంది. నమూనాల సేకరణ తనిఖీల్లో భౌతిక నిల్వలను నిర్ధారించేందుకు ధాన్యం కుప్ప చుట్టూ ఐదు ప్రాంతాల నుంచి నమూనాలు సేకరించే విధానం అనుసరిస్తారు. ముందు, కుడి, వెనుక, ఎడమ, మధ్య ప్రాంతాల నుంచి నమూనాలు సేకరిస్తారు. అవసరమైన చోట బస్తాలు లెక్కిస్తారు. అంతేకాక తనిఖీ సమయాన జీపీఎస్ కోఆర్డినేట్లతో కూడిన ఫొటో తీసి, నివేదికపై వాంగ్మూలం తీసుకుని యాప్‌లో నమోదు చేయనుండడంతో అక్రమాలకు పాల్పడే అవకాశముండదని భావిస్తున్నారు. ఇందులోనూ తప్పుడు నివేదిక ఇచ్చినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారు. అంతేకాక నివేదికను యాప్‌లో రియల్‌టైమ్‌లో సమర్పించడం, పరిశీలనకు 48గంటల కాలపరిమితి నిర్ణయించారు. -
ఏచూరి ఆశయాలు సాధించాలి
రుద్రంపూర్: అణగారిన వర్గాల గొంతుక సీతారాం ఏచూరి ఆశయాలు సాధించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం సీపీఎం అఖిల భారత మాజీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రెండో వర్ధంతి సభ కొత్తగూడెంలో జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ లౌకికవాదంపై దాడి జరిగిన ప్రతీసారి ఏచూరి గట్టిగా ప్రతిఘటించారని గుర్తుచేశారు. ప్రజాసమస్యలపై పదునైన వాదన, మార్క్సిజంపై లోతైన అధ్యయనం.. ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయన్నారు. పార్టీ నాయకులు బండారి రవికుమార్, కొలగాని బ్రహ్మాచారి, ఏజే రమేష్ తదితరులు పాల్గొన్నారు.సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం -
లోక్ అదాలత్‌కు స్పందన
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌కు విశేష స్పందన లభించింది. జిల్లాలో 5,774 కేసులు పరిష్కారమయ్యాయి. కొత్తగూడెంలో 3,384, ఇల్లెందులో 602, భద్రాచలంలో 1,121, మణుగూరులో 422, దమ్మపేటలో 245 కేసులు పరిష్కారమైనట్లు న్యాయాధికార వర్గాలు తెలిపాయి. జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్‌లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం.రాజేందర్ మాట్లాడుతూ రాజీ కాదగిన కేసులను పరిష్కరించుకుంటే కాలం, ధనం ఆదా అవుతాయని అన్నారు. మరో కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తులకు మట్టి వినాయక విగ్రహాలను అందజేశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.ప్రేమలత, న్యాయమూర్తులు కె.సాయిశ్రీ, బి.రవికుమార్, వి.వినయ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కిరణ్ కుమార్, లైజన్ ఆఫీసర్ రాఘవ పాల్గొన్నారు. -
తల్లికి మాతృత్వం.. బిడ్డకు మాధుర్యం
భద్రాచలంఅర్బన్: సంతానంలేని తల్లిదండ్రులు, ఉన్నా మరో బిడ్డ కోసం ఎదురుచూసేవారికి భద్రాచలం శిశుగృహ వరంలా మారింది. ఇప్పటికే పలువురు దత్తత పొందగా, మరికొందరు దరఖాస్తు చేసుకుని వేచి చూస్తున్నారు. భావి తల్లిదండ్రుల వయసు, మానసిక స్థితి, కుటుంబ సభ్యుల అంగీకారం, ఆర్థిక స్థిరత్వం తదితర అంశాలు పరిశీలించాకే అధికారులు దత్తత ప్రక్రియ చేపడుతున్నారు. పిల్లలులేని తల్లిదండ్రులతోపాటు ఒంటరి మహిళలు, పురుషులు కూడా దత్తత తీసుకోవచ్చు. అధికారిక మార్గంలోనే.. దత్తత కోరుకునేవారు మధ్యవర్తులు, బ్రోకర్లను ఆశ్రయించకుండా కేంద్ర దత్తత వనరుల సంస్థ (కారా) నిర్దేశించిన విధానంలో నమోదు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో రూ.6 వేలు, దత్తత ప్రక్రియ పూర్తయ్యే సమయంలో రూ.50 వేలు చెల్లించాల్సి ఉంటుంది. దత్తత అనంతరం రెండేళ్లపాటు ఆరు నెలలకోసారి జరిగే ఫాలోఅప్‌కు సంబంధించి మొత్తం రూ.8 వేలు డీడీ రూపంలో ప్రభుత్వానికి చెల్లించాలి. చట్టబద్ధంగా దత్తతకు అందుబాటులోకి వచ్చిన చిన్నారులనే నిర్దేశిత ప్రక్రియలో కేటాయిస్తారు. అక్రమ మార్గంలో వెళ్తే కేసులు తప్పవు.. అక్రమ మార్గంలో దత్తతకు వెళ్తే మోసపోవడంతోపాటు కేసులు కూడా నమోదవుతాయి. 2024లో భద్రాచలంలో ఆడశిశువును చట్టవిరుద్ధంగా దత్తత ఇచ్చిన ఘటనలో నలుగురిపై కేసు నమోదైంది. అదే ఏడాది జూలూరుపాడు మండలంలో మూడు నెలల పాపను సుమారు రూ.లక్షకు ఇచ్చిన ఘటన బయటపడింది. తాజాగా టేకులపల్లిలో నాలుగు నెలల మగశిశువును దత్తత ఇప్పిస్తామంటూ ఓ మహిళ నుంచి రూ.1.40 లక్షలు తీసుకుని మోసం చేసిన కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. మధ్యవర్తులను నమ్మకుండా చట్టబద్ధమైన మార్గంలోనే దత్తత తీసుకోవాల్సిన అవసరాన్ని ఇలాంటి ఘటనలు గుర్తుచేస్తున్నాయి. 43 మంది దత్తత భద్రాచలం శిశుగృహలో 2021 ఆగస్టు 28 నుంచి ఈ నెల 7వ తేదీ వరకు 76 మంది చిన్నారులు చేరారు. వీరిలో 44 మందిని తల్లిదండ్రులు స్వచ్ఛందంగా అప్పగించగా, నలుగురు వదిలివేయబడిన చిన్నారులు, మరో 28 మంది సంరక్షణ, రక్షణ అవసరమైన కేటగిరీవారు ఉన్నారు. వీరిలో 43 మంది దత్తత ద్వారా కొత్త కుటుంబాల ఒడికి చేరారు. ఏడుగురిని ఇతర సంరక్షణ కేంద్రాలకు తీసుకెళ్లగా, 22 మందిని తల్లిదండ్రులు లేదా సంరక్షకులకు అప్పగించారు. ప్రస్తుతం నలుగురు చిన్నారులు శిశుగృహలో ఉన్నారు. 2024, జూలై 24న ఓ బాలిక బ్రెయిన్‌డెడ్‌తో మృతి చెందింది. దత్తత వెళ్లిన 43 మందిలో 38 మంది దేశంలోని వివిధ రాష్ట్రాలకు, ఐదుగురు విదేశాలకు వెళ్లారు. తెలంగాణలో అత్యధికంగా 26 మంది, కర్ణాటకకు ఐదుగురు, కేరళకు నలుగురు, తమిళనాడుకు ఇద్దరు, మహారాష్ట్రకు ఒకరు చొప్పున తీసుకెళ్లారు. శిశుగృహకు చేరిన ప్రతీ చిన్నారికి కుటుంబ వాతావరణం కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. దత్తతకు అర్హులైన చిన్నారులను చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తల్లిదండ్రులకు అప్పగిస్తాం. – పాయం చంటిబాబు, శిశుగృహ మేనేజర్ దత్తత ప్రక్రియలో చిన్నారి సంక్షేమం, భద్రత, భవిష్యత్కే తొలి ప్రాధాన్యం ఉంటుంది. దత్తత తల్లిదండ్రుల కుటుంబ పరిస్థితులు, చిన్నారిని పెంచే సామర్థ్యాన్ని పరిశీలించాకే బిడ్డను ఇస్తాం. – హరికుమారి, జిల్లా బాలల సంరక్షణ అధికారిదత్తత కోసం ఇప్పటివరకు 68 మంది భావి దత్తత తల్లిదండ్రులు (పాప్స్) దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో బాలుడిని కోరిన వారు 21 మంది, బాలికను కోరిన వారు 18 మంది, ఆడైనా, మగైనా ఫర్వాలేదన్నవారు 29 మంది ఉన్నారు. ఆరు దరఖాస్తులు తిరస్కరణకు గురికాగా, 12 మంది దరఖాస్తుదారులకు దత్తత ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం 50 మంది చిన్నారుల కోసం ఎదురుచూస్తున్నారు. 2022లో అత్యధికంగా 24 దరఖాస్తులు వచ్చాయి. -
ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి
కొత్తగూడెంఅర్బన్/సూపర్‌బజార్(కొత్తగూడెం): ఉపాధ్యాయులే సమాజానికి దిక్సూచి అని నల్లగొండ జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.రమాదేవి అన్నారు. యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు జె.బి. బాలు ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి అవార్డులను ప్రదానం చేశారు. కొత్తగూడెంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని 24 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించే అంశాలు భవిష్యత్‌కు భరోసా కల్పిస్తాయన్నారు. టీజీఓ జిల్లా అధ్యక్షుడు సంగం వెంకటపుల్లయ్య మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై నవారిపై మరింత బాధ్యత పెరుగుతుందని అన్నారు. జిల్లా ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ రంగా ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్ గౌరవ జిల్లా అధ్యక్షుడు బి. వీరూ నాయక్, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షుడు సాయి క్రిష్ణ, డాక్టర్ ప్రవీణ్ రెడ్డి, రత్నాకర్, హనుమాన్ జిమ్ కమలాకర్, మొక్కల బాలు, రాజేష్, రంగ, సుభాని, జయశ్రీ, వర ప్రసాద్, బాలకృష్ణ, నాగ కుమార్ పాల్గొన్నారు. -
విహంగ విహారం
ఢిల్లీపై ఒత్తిడితోనే సీతంపేటకు రైల్వేలైన్ అభ్యంతరం జిల్లాలో ప్రతిపాదిత గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ స్థలాలుగా సుజాతనగర్ మండలంలోని సీతంపేట, సుజాతనగర్, దుమ్ముగూడెం మండలంలోని దుమ్ముగూడెం, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి, దమ్మపేట మండలంలోని పాల్వంచ/దమ్మపేట, చుంచుపల్లి మండలంలోని పెనగడప ప్రాంతాలను గుర్తించారు. ఇందులో సీతంపేట–సుజాతనగర్లో ఉన్న 667 ఎకరాల స్థలం అత్యుత్తమైనదిగా ప్రాథమిక నివేదికలో పేర్కొన్నారు. ఈ స్థలానికి సమీపం నుంచి సత్తుపల్లి –భద్రాచలంరోడ్ రైల్వేలైన్ వెళ్తున్న విషయంపై ఏఏఐ బృందం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రస్తుతం చైన్నె, ఢిల్లీలలో ఉన్న ఎయిర్‌పోర్టులకు నేరుగా మెట్రో రైలు సౌకర్యం ఉంది. హై వోల్టేజ్ విద్యుత్‌తోనే ఆ రైళ్లు నడుస్తున్నాయి. త్వరలో హైదరాబాద్ మెట్రో సర్వీసును సైతం శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా ఫ్యూచర్ సిటీ వరకు పొడిగించనున్నారు. రైల్వే ట్రాక్ వల్ల ఏర్పడే ఎలక్ట్రో మాగ్నెటిక్ ఫీల్డ్‌తో ఇబ్బందులు ఉంటే దాన్ని షీల్డింగ్ టెక్నాలజీ ద్వారా అధిగమించే అవకాశం ఉంది. 4సీకే పట్టించుకోలేదు కొత్తగూడెం లాంటి చిన్న నగరాల్లో బోయింగ్, ఎయిర్‌బస్ లాంటి భారీ విమానాలకు తగ్గ డిమాండ్ ఉండదు. 26 మీటర్లు రెక్కల సైజు ఉండి, 80 సీట్ల సామర్థ్యం ఉండే చిన్న తరహా ఏటీఆర్ 72 మోడల్ విమానాలకే డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఈ చిన్న తరహా విమానాలు వచ్చి పోయేందుకు 1.5 కి.మీ నుంచి 1.6 కి.మీ పొడవైన రన్ వే సరిపోతుంది. మరోవైపు బోయిగ్ 320 సీ రకం విమానం దిగేందుకు వీలుగా పెద్దదైన రన్‌వే కావాలని ప్రతీసారి ఏవియేషన్ నిపుణుల బృందం చెబుతోంది. దీంతో స్థానికంగా కొండలు, అడవులు, వాగులు వంటి భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌ను ఎయిర్‌డ్రోమ్ రిఫరెన్స్ (ఏఆర్సీ) కోడ్ 4సీ ప్రమాణాల ప్రకారం నిర్మించాలని నిర్ణయించారు. కోడ్ 4సీ ప్రకారం 1.80 కి.మీ రన్‌వే సరిపోతుంది. ఈ రన్‌వే మీద రెక్కల సైజు 36 మీటర్లు ఉండే బోయింగ్ 320 మోడల్ విమానాలు సులభంగా టేకాఫ్, ల్యాండ్ అవగలవు. మళ్లీ అదే పాట కొత్తగూడెంలో కోడ్ 4సీని విస్మరించిన ఏఏఐ బృందం మరోసారి 2.7 కి.మీ పొడవైన రన్‌వేకు అనుగుణంగా భూమి కావాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల ఎకరాల స్థలం అవసరమని పరోక్షంగా వెల్లడించింది. రిజర్వ్ ఫారెస్ట్, అభయారణ్యం, ఎత్తైన కొండలు, నదులు, వాగులు, నల్ల రేగడి నేలలు జిల్లాలో ఎక్కువ. ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, జనాభా, పర్యాటక అవకాశాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అందుకు అనుగుణమైన ఎయిర్‌పోర్టును నిర్మించాలి. అందుకు విరుద్ధంగా 20 లక్షల జనాభాకు మించి ఉండే మెట్రో నగరాల తరహాలో భారీ రన్వేలు, టెర్మినల్స్ నిర్మించేందుకు వీలుగా స్థల సేకరణ చేయాలన్నట్టు ఏఏఐ బృందం వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం ఎంపిక చేసిన నాలుగు ప్రదేశాల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ), మల్టీ డిసిప్లీనరీ బృందం ఈ నెల 7,8 తేదీల్లో పర్యటించింది. నాలుగు స్థలాలపై పూర్తి స్థాయిలో సంతృప్తి చెందని బృందం అప్పటికప్పుడు బూర్గంపాడు మండలం సారపాక దగ్గర ఐదో స్థలాన్ని కూడా పరిశీలించింది. దీంతో ఏఏఐ బృందం పెట్టే కొర్రీలతో జిల్లాకు ఎయిర్‌పోర్టు వస్తుందా? రాదా ? అనే సందేహాలు పెరిగాయి. –సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెంక్షేత్రస్థాయి ఇబ్బందులు, పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా ఏఏఐ బృందం వెలిబుచ్చే కొర్రీలకు సాంకేతిక పరిష్కార మార్గాలు చూపడంతోపాటు రాజకీయ ఒత్తిడి కూడా తీసుకురాల్సిన అవసరం రాష్ట్ర సర్కారుతో పాటు పార్లమెంటు సభ్యులపై ఉంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న డెహ్రాడూన్, సిమ్లా, ధర్మశాల వంటి ప్రాంతాల్లో రెండు వందల ఎకరాల కనీస విస్తీర్ణంలోనే ఎయిర్‌పోర్టులు ఉంటున్నాయి. చైన్నె, ఢిల్లీ వంటి చోట ఎయిర్‌పోర్టు ప్రాంగణంలోనే మెట్రో రైలు సర్వీసులు ఉన్నాయి. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను బేరీజు వేసి, సరైన రీతిలో కేంద్రంపై రాజకీయంగా ఒత్తిడి తీసుకురాగలితేనే జిల్లాకు గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించిన బృందం -
కమనీయం.. రామయ్య కల్యాణం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో శనివారం రామయ్య నిత్యకల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీరామా సేవా మండపంలో ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. వారాంతపు సెలవు రోజులు కావడంతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామివారి సన్నిధిలో అరకు ఎంపీశ్రీ సీతారామ చంద్రస్వామివారిని శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని అరకు ఎంపీ గుమ్మ తనుజా రాణి, రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి దర్శించుకున్నారు. ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకున్నారు. పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో యటపాక వైఎస్సార్సీపీ నాయకులు అన్నెం రామిరెడ్డి, ఆకుల వెంకటరామారావు, తొట శశికుమార్, రాము, సారెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఉన్నతస్థాయికి ఎదగాలిసబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ భద్రాచలం: ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, దాతలు కల్పిస్తున్న వసతులతో విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ అన్నారు. భద్రాచలంలోని మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల (బాలికల)కు ఐటీసీ సంస్థ సీఎస్ఆర్ నిధులతో డెస్క్ టాప్‌లు, కంప్యూటర్ ల్యాబ్ ఫర్నిచర్, అదనపు డెస్క్, బెంచీలను శనివారం వితరణ చేసింది. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఐఐటీ–జేఈఈ, నీట్ ప్రిపరేషన్ మెటీరియల్ కూడా అందించినట్లు తెలిపారు. ఐటీసీ జీఎం చెంగల్ రావు తదితరులు పాల్గొన్నారు. దారి దోపిడీ ముఠా అరెస్ట్చుంచుపల్లి: యువకుడిపై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కుని ఆన్లైన్ ద్వారా డబ్బులు బదిలీ చేసుకున్న దారి దోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రాయల వెంకటేశ్వర్లు శనివారం వెల్లడించిన వివరాల ప్రకారం... జల్సాలు, మద్యానికి అలవాటుపడిన ఆరుగురు స్నేహితులు గత నెల 30న బాధితుడిని నమ్మించి బైక్‌పై శ్రీనగర్ గ్రామపంచాయతీ కార్యాలయం వెనుక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ముందే వేచి ఉన్న మిగిలిన నిందితులతో కలిసి దాడికి పాల్పడ్డారు. బాధితుడిని బెదిరించి రూ. 31 వేలను ఫోన్‌పే ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. కాగా, బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులు బానోత్ అభిలాష్, పరదేశి శ్రీరామ్, గుగులోతు చరణ్, చిక్కుళ్ళ వరుణ్ తేజ్, తేజావత్ విఘ్నేష్, జగతాని ఉపాస్లను అరెస్ట్ చేశారు. నాలుగు సెల్ ఫోన్లు, రూ.13 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. -
తాలిపేరుకు వరద ఉధృతి
చర్ల: జిల్లాతోపాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్ట్‌కు చెందిన 25 గేట్లలో నాలుగు గేట్లను ఎత్తి ఉంచి 10,297 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా 73.67 మీటర్ల వద్ద క్రమబద్ధీకరిస్తున్నారు.రెండో విడత స్టడీ టూర్సింగపూర్ వెళ్లిన ఉపాధ్యాయులు కొత్తగూడెంఅర్బన్: విదేశాల్లో విద్యావిధానాన్ని అధ్యయనం చేసి ఇక్కడ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత నెల 5న ఉపాధ్యాయుల బృందాన్ని జపాన్ పంపింది. రెండో విడతలో శనివారం మరో బృందం సింగపూర్‌కు బయల్దేరింది. ఈ నెల 19వ తేదీ వరకు టూర్ కొనసాగనుండగా, జిల్లా నుంచి పాతపాల్వంచ జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు ఏ.పద్మలత, పాలకోయతండా ఎంపీపీస్ ఉపాధ్యాయుడు షేక్ లాల్‌బీ, కొమ్ముగూడెం జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయురాలు శ్రీదేవి ఆ బృందంలో ఉన్నారు. -
ఘనంగా రామయ్య కల్యాణం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి నిత్యకల్యాణం శుక్రవారం ఘనంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. వైభవంగా అమ్మవారికి పుష్పాంజలిభద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా లక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. మేళతాళాల నడుమ స్వామివారి ఉత్సవ మూర్తులతోపాటు లక్ష్మీతాయారు అమ్మవారి ఉత్సవ మూర్తులను పల్లకీ సేవగా తీసుకొచ్చి రామ సేవా మండపంలో కొలువుదీర్చారు. వివిధ రకాల పూలతో అమ్మవారికి పుష్పాంజలి చేశారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో శుక్రవారం అర్చకులు అమ్మవారి జన్మస్థలం వద్ద పంచామృతం, పసుపు, కుంకుమ, గాజులు, హారతి సమర్పించారు. అనంతరం ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేకం, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. ఈఓ రజనీకుమారి, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.భూ సర్వే పనులు పరిశీలనసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేషన్ చిట్టిరామవరం తండాలో జరుగుతున్న భూ రీ సర్వే పనులను శుక్రవారం అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ పరిశీలించారు. సర్వే పనుల పురోగతిపై సమీక్షించి, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడి సమస్యలు, సందేహాలను అడిగి తెలుసుకున్నా రు. అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు పరస్పర సమన్వయంతో రీ సర్వే ప్రక్రియ పూర్తిచేయాలన్నారు. కొత్తగూడెం తహసీల్దార్ పుల్ల య్య, కార్పొరేటర్ డాక్టర్ స్వప్న, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గెస్ట్ ఫ్యాకల్టీ మెరిట్ జాబితాపై అభ్యంతరాల స్వీకరణ భద్రాచలంటౌన్: ఖమ్మం రీజియన్ పరిధిలోని గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకానికి సంబంధించి తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల చేసినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. జాబితా ల్లో అభ్యర్థుల పేరు, విద్యార్హతలు, మెరిట్, ఇతర వివరాల్లో తప్పులు, అభ్యంతరాలు ఉంటే తగిన ధ్రువపత్రాలతో ఈనెల 15వ తేదీ సాయంత్రం 5గంటల్లోపు భద్రాచలంలోని ఆర్సీఓ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. వివరాలకు 85001 36628 నంబర్లో సంప్రదించాలని పీఓ ఓ ప్రకటనలో తెలిపారు. దోమతెరల వితరణబూర్గంపాడు: ములుగు, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 250 ఆదివాసీ కుటుంబాలకు అందించేలా హైదరాబాద్‌కు చెందిన షిలోహు మిషనరీ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రూ.1.25 లక్షల విలువైన దోమ తెరలను వితరణ చేశారు. శుక్రవారం సారపాక గాంధీనగర్ సియోను ప్రార్థన మందిరంలో ములుగు జిల్లాలోని తాడ్వాయి, మంగపేట, పినపాక మండలాల గల శాంతినగర్, కేఎం నగర్, ఎర్రకుంట, భద్రాద్రి జిల్లాల్లోని ములకలపల్లి మండలం పాత గుండాల పాడు, పాలవాగు ప్రాంతాల్లోని వలస ఆదివాసీ కుటుంబాల ప్రాంతాల్లో పనిచేస్తున్న పాస్టర్లకు అందజేశారు. -
ముగిసిన పారంపర్య వైద్య మహాసభలు
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పారంపర్య వైద్య రాష్ట్ర మహాసభలు శుక్రవారంతో ముగిశాయి. శ్రీశైవక్షేత్ర వ్యవస్థాపక పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శివస్వామి హాజరయ్యారు. ప్రకృతి పరిరక్షణ, ఔషధ మొక్కల పెంపకం, పచ్చదనం విస్తరణ కోసం సేవలందిస్తున్న మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్, నైనిక రజువా, ఎండి.ఆఫా జైదీ తదితరులను అభినందించారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ట్రెడిషనల్ డీలర్స్ ట్రైనింగ్ వర్క్‌షాప్, మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన సర్టిఫికెట్లను కూడా అందించారు. ఈ కార్యక్రమంలో మల్లిశాల స్వామీజీ, కృష్ణయ్య స్వామి, చంద్రశేఖర రాజు, సజ్జన రమేష్, దొంతు యాత్రి, బండి వెంకటేశ్వర్లు, ఎం.డి.జమాల్ ఖాన్, రామంచి శ్రీనివాస్, భాను ప్రసాద్, దుర్గారాణి, అరుణ, వీరభద్రాచారి పాల్గొన్నారు. సుగుణారావుకు ఉత్తమ సేవా పురస్కారం కొత్తగూడెంఅర్బన్: పారంపర్య వైద్య రంగంలో ప్రకృతి వైద్యం తోపాటు, ఆల్టర్నేటివ్ తెరపిస్ట్గా విశిష్ట సేవలు అందిస్తున్న వైద్య జి. సుగుణారావుకు ఉత్తమ సేవా పురస్కారం లభించింది. భద్రాచలంలో నిర్వహించిన పారంపర్య వైద్య మహాసంఘం సభల్లో ఈ వార్డును ప్రదానం చేశారు. -
నోటీసులొస్తే కంగారు పడొద్దు
చుంచుపల్లి: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఓటర్లకు జారీ చేస్తున్న నోటీసులపై నెలకొన్న సందేహాలను జిల్లా ఎన్నికల విభాగం అధికారి రంగా ప్రసాద్ నివృత్తి చేశారు. శుక్రవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఓటర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు, 2002 నాటి ఓటర్ల జాబితా మ్యాపింగ్‌లో వ్యత్యాసాలు, ఎన్యుమరేషన్ ఫారాలు, ఓటు ఉందో లేదో తెలుసుకునే విధానం తదితర అంశాలపై స్పష్టత ఇచ్చారు. జిల్లాలో అనామలీస్, అన్‌మ్యాపింగ్ ఓటర్లు 2,40,438 మంది ఉండగా, వారిలో ఇప్పటి వరకు 1,77,790 మందికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. ఇందులో ఇప్పటివరకు 18,076 మంది ఓటర్ల హియరింగ్ ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. పేరు, తండ్రి పేరు, ఇంటిపేరు లేదా పాత ఓటర్ల జాబితా మ్యాపింగ్‌లో తేడాలు ఉన్నంత మాత్రాన ఓటు తొలగిపోదని, నిబంధనల ప్రకారం వివరాలను సరిచేసుకునే అవకాశం ఉంటుందని వివరించారు. నోటీసులు అందినంత మాత్రాన ఓటర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నోటీసులో పేర్కొన్న తేదీలో సంబంధిత బీఎల్ఓను కలిసి అందుబాటులో ఉన్న ఆధారాలను సమర్పించాలని సూచించారు. ప్రశ్న: నా పేరు, మా అమ్మ పేరు తప్పుగా ఉందని నోటీసులు వచ్చాయి. మేము ఏ ఆధారాలు ఇవ్వాలి? – బాసాని ఉమాదేవి, కొత్తగూడెంజవాబు: నోటీసులో సూచించిన తేదీలో బీఎల్ఓకు కుల ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల మెమో, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్‌లను సమర్పించాలి. ప్రశ్న: నా పేరు సయ్యద్ జానీ హుస్సేన్ కాగా జానీ సయ్యద్గా నమోదైంది. నోటీసు ఇచ్చారు. ఎలా సవరించుకోవాలి..? – సయ్యద్ జానీ హుస్సేన్, హనుమాన్ బస్తీజవాబు: పదో తరగతి టీసీ, మెమో, కుల ధ్రువీకరణ పత్రం వంటి ఆధారాల్లో ఏవైనా రెండు జిరాక్స్ ప్రతులను బీఎల్ఓకు అందజేయండి. ప్రశ్న: మా నాన్న పేరు తప్పుగా నమోదైందని నోటీసు వచ్చింది. ఏం చేయాలి..? – షేక్ పర్వేజ్ ఆలం, బూడిదగడ్డజవాబు: మీ వద్ద ఉన్న సరైన ధ్రువీకరణ పత్రాలను బీఎల్ఓకు సమర్పించండి. ప్రశ్న: 2002 జాబితాలో ఉన్న తండ్రి పేరుకు, ప్రస్తుతం నమోదైన పేరుకు తేడా ఉందని నోటీసు ఇచ్చారు? – వెంకటవీరయ్యచారి, పాత కొత్తగూడెంజవాబు: కేటాయించిన తేదీలో బ్యాంకు పాస్‌బుక్, కుల ధ్రువీకరణ పత్రం, పదో తరగతి మార్కుల మెమో వంటి ఆధారాల్లో ఏవైనా రెండు సమర్పించాలి. ప్రశ్న: 2002లో మేం ఇక్కడ లేం. మా తాత ఇక్కడే ఉండటంతో ఆయన ఆధారాలతో ఎన్యుమరేషన్ వివరాలు ఇచ్చాం. తప్పులు ఉన్నాయని ఇప్పుడు నోటీసులు వచ్చాయి. ఏం చేయాలి..? – రామకృష్ణ, అశ్వాపురంజవాబు: 2002లో స్థానికంగా లేకపోవడంతో ప్రస్తుత వివరాలను నమోదు చేసిన కారణంగా నోటీసు వచ్చి ఉండవచ్చు. కంగారు పడాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న ఇద్దరివి రెండు చొప్పున ఆధారాలను బీఎల్ఓకు సమర్పించాలి. ప్రశ్న: తండ్రి పేరు వ్యత్యాసంతో నోటీసు వచ్చింది. నా ఓటు ఉంటుందా? పోతుందా..? – కవులురి పోలయ్య, దమ్మపేటజవాబు: 2002, ఇప్పటి జాబితాల్లోని తండ్రి పేర్లలో తేడా ఉండటంతో నోటీసు ఇచ్చి ఉండవచ్చు. నోటీసులో పేర్కొన్న తేదీలో ఎన్నికల సంఘం సూచించిన 11 ఆధారాల్లో ఏవైనా రెండు సమర్పించాలి. ప్రశ్న: నా భార్యకు, నాకు సంబంధించిన ఇద్దరి ఓటు వివరాల్లో తేడాలు ఉన్నాయని ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారు.? – దుర్గాప్రసాద్, భద్రాచలంజవాబు: 2002 నాటి డేటా మ్యాపింగ్‌లో తేడాలు ఉండే అవకాశం ఉంది. స్టడీ సర్టిఫికెట్లు, కుల లేదా నివాస ధ్రువీకరణ పత్రాల్లో ఏవైనా రెండు ఆధారాలను బీఎల్ఓకు సమర్పించాలి. ప్రశ్న: ఓటరు జాబితాలో నా ఇంటిపేరు స్థానంలో భర్త ఇంటిపేరు నమోదైందని నోటీసు వచ్చింది. ఏం చేయాలి..? – శైలజ, పాల్వంచజవాబు: ఇంటిపేరు విషయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సవరణకు అవకాశం ఉంది. స్టడీ సర్టిఫికెట్, టీసీ, పదో తరగతి మెమో వంటివి, లేక ఇతర ఆధారాలను బీఎల్ఎకు సమర్పించాలి. ప్రశ్న: మా తండ్రి సింగరేణిలో పనిచేశారు. అప్పట్లో ఇంటిపేరు చిక్కుడు అని తప్పుగా నమోదైంది. ఇప్పుడు నోటీసు వచ్చింది. ఏం చేయాలి..? – కృష్ణచైతన్య, ఇల్లెందుజవాబు: ఇంటిపేరు తప్పుగా నమోదైతే ఆధారాలతో మళ్లీ సవరించుకోవచ్చు. కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు లేదా పదో తరగతి మార్కుల మెమో వంటి రెండు సరైన ఆధారాలను ఎన్నికల సిబ్బందికి సమర్పించాలి. ప్రశ్న: 2002 మ్యాపింగ్‌లో ఇంటిపేరు తేడా వచ్చింది. ఇప్పటికే పాస్‌పోర్టును ఆధారంగా సమర్పించాం. మరో ఆధారం అవసరమా..? – ప్రేమ్‌సాయి, పాల్వంచజవాబు: వీలుంటే పదో తరగతి మార్కుల మెమో లేదా నివాస ధ్రువీకరణ పత్రం వంటి మరో ఆధారాన్ని కూడా బీఎల్ఓకు అందజేయండి. ప్రశ్న: కొత్త ముసాయిదా ఓటర్ల జాబితాలో నా ఓటు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి..? – రేష్మ తస్లీమ్, చండ్రుగొండజవాబు: సమీప బూత్ లెవల్ అధికారిని సంప్రదించి ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చు. 1950 నంబర్‌కు ఫోన్ చేసి మీ ఈపిక్ నంబర్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ప్రశ్న: ఒక కుటుంబం 1997కు ముందు వాజేడు–వెంకటాపురంలో ఉండేది. 1993లో మణుగూరులో ఉండి ఓటేశారు. 2003లో పాల్వంచకు వచ్చిన తర్వాత ఓటు వేయలేదు. దరఖాస్తులు ఇచ్చినా జాబితాలో పేర్లు రాలేదు. ఏం చేయాలి..? – మసూద్, పాల్వంచజవాబు: వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సమయంలో ఓటు వివరాలు నమోదై ఉండటం, అనంతరం మ్యాపింగ్ కాకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు. 1987కు ముందు నాటి ఆధారాలు ఏమైనా ఉంటే సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైతే వారి పిల్లల వివరాలను కూడా ఇవ్వాలి. ప్రశ్న: ఎస్ఐఆర్లో కొంతమందికి నోటీసులు వచ్చాయి. మరికొందరికి రాలేదు. మాకు నోటీసు రాలేదు. మా ఓటు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి..? – గొర్రె బాబూరావు, రామవరంజవాబు: సాధారణంగా పేరు, వివరాల్లో వ్యత్యాసం లేదా మ్యాపింగ్ సమస్యలు ఉన్న ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. మీకు ఎలాంటి నోటీసు రాకపోతే ప్రస్తుత పరిశీలనలో మీ ఓటు జాబితాలో ఉన్నట్లు భావించవచ్చును. ప్రశ్న: పేరు తప్పుగా నమోదైందని బీఎల్ఓ నోటీసు ఇచ్చారు. ఏం చేయాలి..? – ఈసంశెట్టి రాము, బసవతారకం కాలనీ, పాల్వంచజవాబు: చదువుకున్నట్లయితే స్టడీ సర్టిఫికెట్లు, కుల లేదా నివాస ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి,రెండు తీసుకుని నోటీసులో పేర్కొన్న తేదీలో బీఎల్ఓను సంప్రదించాలి.ప్రశ్న: ఎన్యుమరేషన్ ఫారాలు సక్రమంగా నింపాం. అయినా మా అన్నదమ్ములకు నోటీసులు వచ్చాయి. ఎందుకు..? – దొండ నర్సింహరావు, బేతంపూడిజవాబు: వివరాల పరిశీలనలో కొన్ని అంశాల్లో వ్యత్యాసాలు కనిపించినప్పుడు నోటీసులు జారీ చేస్తారు. అన్నదమ్ముల వయసులో తొమ్మిది నెలల కంటే తక్కువ వ్యవధి వంటి అంశాలపై సందేహాలు ఉంటే ఆధారాలు కోరవచ్చు. ఇందుకు నివాస, కుల ధ్రువీకరణ పత్రాలను బీఎల్ఓకు సమర్పించవచ్చు.ఆధారాలతో బీఎల్ఓను సంప్రదించాలి -
అమరుల త్యాగాలు స్ఫూర్తిదాయకం
● కలెక్టర్ అంకిత్● ఘనంగా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం చుంచుపల్లి: విధి నిర్వహణలో అటవీ సంపద, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన అటవీశాఖ అధికారులు, సిబ్బంది సేవలు, స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అంకిత్ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం చలమల శ్రీనివాసరావు మెమోరియల్ సెంట్రల్ పార్క్‌లో అటవీ శాఖ ఆధ్వర్యంలో జాతీయ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. హాజరైన కలెక్టర్, ఇతర అధికారులు విధి నిర్వహణలో ప్రా ణాలు కోల్పోయిన చలమల శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోతు నవీన్ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ విధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లు, ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ, భద్రతా పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఇతర మౌలిక సౌకర్యాలను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉందన్నారు. నేరాల స్వభావం మారుతున్న నేపథ్యంలో అటవీ నేరాలను నియంత్రించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎప్పీ రోహిత్‌రాజు మా ట్లాడుతూ అటవీ సిబ్బంది విధి నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. విధి నిర్వహణలో తొందరపాటు, నిర్లక్ష్యానికి తావి వ్వకుండా భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. డీఎఫ్ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ అటవీ సంపద, వన్యప్రాణుల సంరక్షణలో సిబ్బంది కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మొదట ప్రకాశం స్టేడి యం నుంచి సెంట్రల్ పార్క్ వరకు అటవీ సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాల్లో విద్యుత్‌శాఖ ఎస్ఈ మహేందర్, సర్పంచ్ అజ్మీరా లైలా,అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అశ్వాపురం: భూ రీ సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని అమ్మగారిపల్లి గ్రా మంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను ఆయన పరిశీలించారు. మూడు తరాలుగా భూ ములను అనుభవిస్తున్నా రికార్డుల్లో ఉపవిభజనలు నమోదు కాకపోవడంతో ఎదురవుతున్న సమస్యలను రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. గోదావరి వరదలు, భూమి కోతల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పాత భూ సరిహద్దులు మారి పోయాయని, సీతారామ ప్రాజెక్టు పరిసరాల్లో కొన్ని చోట్ల సుమారు 250 మీటర్ల మేర మార్పులు చోటుచేసుకున్నట్లు అధికారులు వివరించా రు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పాత రికా ర్డులను సమగ్రంగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు భూములపై స్పష్టత కల్పించాలని సూచించారు. రోడ్డు నిర్మించాలని గ్రామస్తులు విన్నవించగా, భారజల కర్మాగార సీఎస్ఆర్ నిధులతో రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికా రులను కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్ సూర్యప్రకాష్, సర్వే అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, గ్రామస్తులు, ప్రజలు పాల్గొన్నారు. -
కర్ర తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్
మణుగూరు టౌన్: మారుజాతి కలప అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను అటవీ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మున్సిపాలిటీ పరిధి కమలాపురానికి చెందిన కొందరు మారుజాతి కర్రలను అక్రమంగా ట్రాక్టర్లో తరలిస్తుండగా సీజ్ చేశామని అటవీ రేంజర్ ఉపేందర్ తెలిపారు. ఈ నెల 3వ తేదీన కూడా ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశామని పేర్కొన్నారు. తనిఖీల్లో బీట్ ఆఫీసర్లు శాంతి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. పామాయిల్ గెలల చోరీదమ్మపేట: పామాయిల్ తోటలో గెలల చోరీ ఘటన మండలంలోని ముష్టిబండ గ్రామ శివారులో గురువారం రాత్రి జరిగింది. మండలంలోని ముష్టిబండ గ్రామానికి చెందిన రైతు గుర్రాల లక్ష్మీనారాయణ శుక్రవారం ఉదయం తన తోటలో 1.5 టన్నుల గెలలు నరికి అపహరించినట్లు గుర్తించాడు. బాధిత రైతు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని అదనపు ఎస్ఐ బాలస్వామి తెలిపారు. బంగారం దుకాణాల్లో బీఐఎస్ దాడులు520 గ్రాముల ఆభరణాలు సీజ్ భద్రాచలంఅర్బన్: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు శుక్రవారం భద్రాచలంలోని రెండు బంగారం దుకాణాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. బీఐఎస్ శాస్త్రవేత్తలు, జాయింట్ డైరెక్టర్లు అర్జున్, షణ్ముఖ్ శివ ఆధ్వర్యంలోని తనిఖీలు చేపట్టారు. దుకాణంలో 270 గ్రాములు, మరో దుకాణంలో 250 గ్రాములు కలిపి మొత్తం 520 గ్రాముల బంగారు ఆభరణా లను సీజ్ చేశారు. వీటి విలువ రూ.74 లక్షలు ఉంటుందని అంచనా. ఫిర్యాదులు అందడంతోపాటు ముందుగా సేకరించిన సమాచారం ఆధారంగా దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. దుకాణానికి బీఐఎస్ లైసెన్స్, ఆభరణాలపై హాల్‌మార్క్ ఉందా? అనే అంశాలనే ప్రధానంగా పరిశీలించామని చెప్పారు. ఆభరణాలపై బీఐఎస్ గుర్తు, బంగారం స్వచ్ఛతను తెలిపే గుర్తు, ఆరు అక్షరాంకాలతో కూడిన ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలన్నారు. కాగా, బీఐఎస్ అధికారుల దాడులు జరుగుతున్న క్రమంలో ఆ పరిసరాల్లోని పలు బంగారం దుకాణాలు మూసివేయడం గమనార్హం. అధికారులు మల్లేష్, అజయ్, హెచ్ఎంఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
హైడ్రా వెబ్సైట్ రూపకల్పనలో సారపాక యువతి
భద్రాచలంఅర్బన్: చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయినా కష్టాలకు ఎదురొడ్డి ఉన్నత చదువులు పూర్తి చేసిన జిల్లాకు చెందిన యువతి హర్షితారెడ్డి సాంకేతిక రంగంలో ప్రతిభ చాటుతోంది. బూర్గంపాడు మండలం సారపాకకు చెందిన శ్రీనివాస్‌రెడ్డి – కనకరత్నం దంపతుల కుమార్తె హర్షిత చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయింది. అప్పటి నుంచి నాన్నమ్మ సక్కుబాయి, తాతయ్య పాపిరెడ్డి సంరక్షణలో పెరిగింది. హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్‌లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (డేటా సైన్స్)కోర్సు 2025లో పూర్తి చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైడ్రా కార్యాలయంలో డెవలపర్‌గా పనిచేస్తుండగా, హర్షితారెడ్డి, హరినాథ్ కలిసి సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ను అభివృద్ధి చేశారు. పౌర సేవలు, అత్యవసర సాయం, ఫైర్ ఎన్ఓసీ, వర్షపాతం, చెరువులు, భూముల వివరాలు, హైడ్రా పరిధి తదితర సమాచారాన్ని ఒకే వేదికపై అందుబాటులోకి తీసుకొచ్చారు. వెబ్సైట్ ప్రారంభం సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్‌కు హర్షిత పోర్టల్ పనితీరు, సేవలను వివరించగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. -
అంగన్వాడీ అభ్యర్థులకు తప్పనిపాట్లు
సూపర్‌బజార్(కొత్తగూడెం): కలెక్టరేట్లో ఇల్లెందు ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి శుక్రవారం ఇంటర్వ్యూలు నిర్వహించగా, అభ్యర్థులకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. టెంటు, కుర్చీ, తాగునీటి సౌకర్యాలు కల్పించలేదు. అభ్యర్థుల సర్టిఫికెట్లను డీడబ్ల్యూఓ కార్యాలయంలో పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఇంటర్వ్యూ నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనీనా ఇంటర్వ్యూలు నిర్వహించారు. పసి పిల్లలతో వచ్చిన అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కలెక్టరేట్ లోపల, బయట ఉన్న గద్దెలపైనే అభ్యర్థులు, సహాయకులు నిరీక్షించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన చేపడితే అభ్యర్థులకు ఇబ్బందులు ఎదురయ్యేవి కావు. శుక్రవారం ఆ హాల్లో ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహించలేదు. -
పోస్టర్ మేకింగ్ పోటీల్లో ప్రతిభ
కొత్తగూడెంఅర్బన్: ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి పోస్టర్ మేకింగ్ పోటీల్లో జిల్లా విద్యార్థిని రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. ములకలపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎస్.ధనలక్ష్మి పోటీల్లో ప్రతిభ చాటింది. ఈ మేరకు డీఈఓ డి.వాసంతి శుక్రవారం వివరాలు వెల్లడించారు. విద్యార్థినిని, ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. 49 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులుకొత్తగూడెంఅర్బన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న 27 మంది ప్రధానోపాధ్యాయులు, 22 మంది ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి డి.వాసంతి శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆగస్టులో విద్యార్థుల హాజరు 50 శాతం కన్నా తక్కువగా నమోదైన పాఠశాలల హెచ్ఎంలు, పాఠశాలలకు ఆలస్యంగా హాజరైన 22 మంది ఉపాధ్యాయులపై చర్యలు తీసుకున్నారు. హైకోర్టు తీర్పుతో పేదలకు ఊరటకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెంలోని గాంధీనగర్, బుడిదగడ్డ ప్రాంతాల పేదలకు హైకోర్టు తీర్పుతో ఊరట లభించింది. 1999 సంవత్సరంలో 142, 143 సర్వే నంబర్లలో ఒక్కొక్కరికి 110 గజాల చొప్పున పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. దీంతో వారు నివాసం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. 2004లో ఇళ్లను తొలగించగా బాధితులు కోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాల విచారణ అనంతరం గత నెల 25న హైకోర్టు తీర్పు వెలువరించింది. శాంతియుత స్వాధీనం, అనుభవంలో జోక్యం చేసుకోవొద్దని తీర్పులో పేర్కొంది. భవిష్యత్తులో ఏదైనా అధికారిక చర్య అవసరమైతే చట్టప్రకారం, తగిన విధానాన్ని అనుసరించాలని సూచించింది. దీంతో ఇళ్ల స్థలం కోల్పోయినవారికి న్యాయం జరగనుంది. తీర్పు కాపీలను న్యాయవాది మారపాక రమేష్‌కుమార్ రెండు రోజుల క్రితం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు, కొత్తగూడెం తహసీల్దార్‌కు, డీఎస్పీకి, వన్‌టౌన్ సీఐకి, త్రీటౌన్ సీఐకి అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర మైనార్టీ నాయకుడు నయీంఖురేషి శుక్రవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. -
ఎఫ్బీఓ కుటుంబానికి రూ.30లక్షల పరిహారం
కారేపల్లి: విధినిర్వహణలో భాగంగా తనిఖీలకు వెళ్లి వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తాకి మృతి చెందిన ఫారెస్టు బీట్ ఆఫీసర్ బానోతు నవీన్‌కుమార్ కుటుంబానికి ప్రభుత్వం రూ.30లక్షల పరిహారం ప్రకటించింది. ఈమేరకు అటవీ అమరవీరుల దినో త్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు, డీజీపీ సీ.వీ.ఆనంద్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్‌నాయక్ తదితరులు నవీన్ సతీ మణి ప్రమీలకు చెక్కు అందజేశారు. కారేపల్లి మండలం వెంకిట్యాతండా గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బానోతు దేవ్లానాయక్ – సర్పంచ్ బూలి కుమారుడైన నవీన్ భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం చెరువు సింగారం బీట్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. గతనెల 11న నకిరిపేట అటవీ ప్రాంతంలో తనిఖీలకు వెళ్లిన సమయాన మృత్యువాత పడిన విషయం విదితమే. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో కారేపల్లి మండలానికి చెందిన రాజేందర్, అడ్డగోడ ఐలయ్య యాదవ్, అడపా పుల్లారావు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్‌లో చెక్కు అందజేసిన మంత్రి జూపల్లి -
బ్యాంకు ఉద్యోగుల నిరసన
కొత్తగూడెంఅర్బన్/సూపర్‌బజార్(కొత్తగూడెం): ఐదు రోజుల పనిదినాల విధానాన్ని అమలు చేయాలని బ్యాంకు ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా రోడ్డెక్కారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు శుక్రవారం జిల్లాలో వివిధ బ్యాంకుల అధికారులు, ఉద్యోగులు ఒక రోజు సమ్మె చేపట్టారు. విధులు బహిష్కరించి ఆందోళనలో పాల్గొన్నారు. కొత్తగూడెంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. నాయకులు నారెడ్ల అరుణ్‌కుమార్, కోలా నవీన్ మాట్లాడుతూ ఐదు రోజుల పనిదినాల విధానం అమలులో జాప్యం చేయొద్దని అన్నారు. బ్యాంకింగ్ రంగ ప్రయోజనాలను పరిరక్షించాలని కోరారు. ఉద్యోగులందరికీ పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఇవ్వాలన్నారు. డిమాండ్లు పరిష్కారం కాకపోతే ఈ నెల 28 నుంచి మూడు రోజుల సమ్మె, అక్టోబర్ 26 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కాగా ఉద్యోగుల సమ్మెతో బ్యాంకింగ్ సేవలు స్తంభించి ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ అసోసియేషన్ ఏజీఎస్ కె. శ్రీకాంత్, కొత్తగూడెం రీజినల్ సెక్రటరీ కె.అర్జున్, యూనియన్ బ్యాంక్ ప్రతినిధులు అరుణ్ కుమార్, శ్రీకాంత్, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రతినిధులు కె. నిశ్చల్, విద్యా సాగర్, ఎస్బీఐ అవార్డు స్టాఫ్ లీడర్ భవానీ శంకర్, డీసీసీబీ లీడర్ వెంకట కృష్ణ, సందీప్, నాగేంద్ర పాల్గొన్నారు. -
కొత్తగూడెంవాసికి డాక్టరేట్
కొత్తగూడెంఅర్బన్: నగరంలోని మధుర బస్తీకి చెందిన సింగరేణి కార్మికుడు సంధ్యాల కొమరయ్య కూతురు హైమావతి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ఇటీవల హైదరాబాద్‌లో ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన 85వ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం చాన్స్‌లర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. డాక్టర్ ఆలియా పర్యవేక్షణలో రసాయన శాస్త్ర విభాగంలో ‘డాకింగ్ స్టడీస్ అండ్ టెట్రాజోల్ డేరివేటివ్స్’అంశంపై చేసిన పరిశోధనా పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హైమావతిని కుటుంబీకులు, బంధువులు, మిత్రులు అభినందించారు. -
బస్టాండ్‌లో షార్ట్ సర్క్యూట్
ఇల్లెందు: ఇల్లెందు ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది. మధ్యాహ్నం బస్టాండ్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్న సమయంలో ఈ ప్రమాదం ఏర్పడింది. అకస్మాత్తుగా మంటలు వ్యాపించటంతో ప్రయాణికులు పరుగులు తీశారు. విద్యుత్ ప్రమాదం కారణంగా పొగ కమ్మేసింది. డిపోలో ఉన్న సిబ్బంది టీఆర్ గ్యాస్‌ను ఉపయోగించి మంటలను ఆర్పివేశారు. దీంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. రైస్ మిల్లర్ల ఆందోళనసూపర్బజార్(కొత్తగూడెం): సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైస్ మిల్లుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్, అదనపు కలెక్టర్, డీఎస్ఓ, డీఎం సివిల్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ధాన్యం మిల్లింగ్ నిలిపివేత , బిల్లింగ్ సమయంలో ఏర్పడిన తరుగు, ఎఫ్‌సీఐ ద్వారా బాయిల్డ్ రైస్ స్వీకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని రైస్ మిల్లుల్లో శుక్రవారం నుంచి మిల్లింగ్ కార్యక్రమాలు నిలిపివేసినట్లు తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు జుగల్ కిషోర్ ఖండేల్వాల్, సెక్రటరీ శ్రీనివాస రెడ్డి, ట్రెజరర్ పల్లపోతు శ్రీనివాసు, నాయకులు వెంకటేశ్వరరెడ్డి, కంచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. బాలుడు అదృశ్యంచండ్రుగొండ: మండలంలోని రామక్కబంజర్ గ్రామానికి చెందిన తెల్లం చరణ్ (17) అదృశ్యంపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 8న ఇంటి నుంచి బయటకు వెళ్లిన చరణ్ తిరిగి రాలేదు. తండ్రి రాంబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివరామకృష్ణ రాత్రి తెలిపారు. పాల్వంచలో యువకుడు.. పాల్వంచరూరల్: యువకుడి అదృశ్యంపై శుక్రవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని జగన్నాధపురం గ్రామానికి చెందిన, పాల్వంచ మెడికల్ కళాశాల్లో ల్యాబ్ టెక్షీషియన్ కోర్సు చదువుతున్న బోడా పవన్తేజా గురువారం కళాశాలకు వెళ్లి తిరిగి రాలేదు. పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. యువకుడి తండ్రి బాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు. లారీ, కారు ఢీనలుగురికి గాయాలు టేకులపల్లి: లారీ, కారు ఢీకొని నలుగురు గాయపడ్డ ఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పని చేస్తున్న దంపతులు పల్నాటి స్వప్న, నరేంద్ర తమ పిల్లలు అనుచితరామ్, ఆశ్రిత రామ్‌లతో కలిసి కారులో భద్రాచలం వెళ్తున్నారు. టేకులపల్లి మండలం తొమ్మిదోమైలుతండా పంచాయతీ సాయనపేట మలుపు వద్దకు రాగానే ఆర్టీసీ బస్సుని ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి. చిన్నారులు స్వల్పంగా గాయపడ్డారు. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్ కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇద్దరిపై కేసు నమోదుపాల్వంచరూరల్: అప్పు తీర్చాలని అడిగినందుకు దాడి చేసిన ఘటనలో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాహుల్ గాంధీ నగర్‌కు చెందిన మడంశెట్టి సాయిబాబు లక్ష్మీదేవిపల్లికి చెందిన మడిపల్లి అనిల్‌కుమార్‌కు రూ.5 లక్షల అప్పు ఇచ్చాడు. తిరిగి ఇవ్వకపోవడంతో సాయిబాబు ప్రైవేటు కేసు దాఖలు చేశాడు. దీంతో శుక్రవారం అనిల్ కుమార్, అతని తండ్రి వెంకటేశ్వర్లు వెళ్లి దాడి చేసి, చంపుతానని బెదిరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తండ్రి, కొడుకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. భూ వివాదంలో ముగ్గురిపై .. మండల పరిధిలోని పాండురంగాపురం శివారులో భూ వివాదం విషయంలో సోమ వెంకట్‌రెడ్డి ఫిర్యాదు మేరకు గంగిరెడ్డి ఆదిలక్ష్మి, సరిత, పిల్లి రఘురాంరెడ్డిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్ తెలిపారు. వివాదాస్పదంగా రోడ్డు నిర్మాణ పనులుచండ్రుగొండ: చండ్రుగొండలోని ఆర్టీసీ బస్టాండ్, ఊరకుంట చెరువు మీదుగా ఇమ్మడి రామయ్య బంజర్ గ్రామానికి, ఖబరస్తాన్ (శ్మశానవాటిక), ము త్యాలమ్మతల్లి దేవత ఆలయానికి రోడ్డు ఉంది. ఈ మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కొందరు వ్యక్తులు రోడ్డు నిర్మాణానికి అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివా దం నెలకొంది. ఈ క్రమంలో నిధులు రద్దయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామస్తులు ఐక్యమై భూములకు సంబంధించిన పట్టాదారులతోపాటు పరిస్థితిని వివరించారు. దీంతో రెవెన్యూ అధికారి తిరుపతిరావు, ఎస్ఐ శివరామకృష్ణ జోక్యం చేసుకుని శాంతింప జేశారు. -
పదేళ్లలో ప్రగతిగిరి!
ఎయిరుపోర్టు వస్తే దేశ, విదేశాల నుంచి భక్తులు జిల్లాకు విమానాన్ని రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన ప్రణాళికలు కార్యరూపం దాల్చితే ఏజెన్సీ కేంద్రం అత్యంత వేగంగా ప్రగతి పథంలో పయనించనుంది. విమానాశ్రయ ఏర్పాటుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం ఇటీవల రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించింది. జిల్లాలో ఐదు ప్రాంతాలను పరిశీలించగా, అందులో దుమ్ముగూడెం మండలంలోని పెద్ద ఆర్లగూడెం, పెద్ద కమలాపురం పరిసర ప్రాంతం కూడా ఉంది. సుమారు 671 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూమి అందుబాటులో ఉండటం, పెద్ద గుట్టలు లేకపోవడం, భూ పరీక్షలో మట్టి బాగుండటం వంటివి కలిసొచ్చే అంశాలుగా ఉన్నట్లు సమాచారం. దీనిని ప్రతిపాదిస్తే నేరుగా భద్రాచలానికి విమాన రాకపోకలు ఉంటాయి. జిల్లాలో ఏ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు వచ్చినా భద్రాచలానికి దేశ, విదేశాల నుంచి విమానం ద్వారా భక్తులు చేరుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రైల్వే లైన్ ఏర్పాటుకు సుముఖత భద్రాచలం వరకు నేరుగా రైల్వే కనెక్టివిటీ ఏర్పాటు చేయాలని భక్తులు ఏళ్ల నుంచి కోరుతున్నారు. కొత్తగూడెం వరకు రైల్వే సదుపాయం ఉండగా, అక్కడ నుంచి భద్రాచలం వరకు రోడ్డు మార్గంలో రావాల్సి వస్తోంది. పాండురంగాపురం– మల్కాన్‌గిరి రైల్వే లైన్‌పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా, ఇందులో తొలి దశలోనే పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు రైల్వే కనెక్టివిటీ పనులను చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. దీంతో ఇటీవలే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైల్వే లైన్ పూర్తయితే దేశంలోని పలు ప్రాంతాల నుంచి రైల్వే ద్వారా భద్రాచలానికి నేరుగా చేరుకునే అవకాశం ఉంటుంది. అంతర్రాష్ట్ర డిపో కూడా వస్తే.. ప్రస్తుతం భద్రాచలానికి భక్తులు ప్రధానంగా రోడ్డు మార్గం ద్వారానే వస్తున్నారు. భద్రాచలం భౌగోళికంగా తెలంగాణ సరిహద్దులకు సమీపంలో ఉండటంతో పొరుగు రాష్ట్రాల ప్రజలకు కూడా ఇది ముఖ్యమైన రవాణా కేంద్రంగా ఉంది. ఈ క్రమంలో అంతర్రాష్ట్ర బస్సు డిపో ఏర్పాటు చేస్తే భద్రాచలానికి మరింత రవాణా అనుసంధానం ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లోని ముఖ్య పట్టణాలకు నేరుగా బస్సు సర్వీసులు పెరిగితే భద్రగిరి రవాణా హబ్‌గా మారనుంది. తద్వారా ప్రయాణం సులభమవుతుంది. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలానికి మహర్దశ పట్టనుంది. ఇప్పటికే శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థాన పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. భద్రాచలం వరకు రైల్వే మార్గం కూడా సుగమమైంది. జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, భద్రాచలంలో అంతర్రాష్ట్ర ఆర్టీసీ డిపో ఏర్పాటైతే మరింత అభివృద్ధి సాధించనుంది. రోడ్డు, రైల్వే, వాయు మార్గాల్లో రాకపోకలు అందుబాటులోకి వస్తే విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్యా పెరగనుంది. – భద్రాచలం -
నీటి ఎద్దడి.. బోరు సందడి!
దమ్మపేట: మండల కేంద్రంలోని దమ్మపేట గిరిజన బాలుర వసతి గృహంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గత మూడు రోజులుగా మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో వసతి గృహానికి అతిసమీపంలో ఉన్న గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి సరఫరా చేసిన నీటిపైనే ఆధారపడాల్సి వచ్చింది. మొత్తం 106 మంది విద్యార్థులకు గాను బుధవారం 70 మంది ఉండగా పంచాయతీ తీసుకొచ్చిన నీరు ఏమాత్రం సరిపోవడం లేదు. నీటిని పొదుపుగా వాడుకుంటూ కాలకృత్యాలకు బహిర్భుమికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈక్రమాన సమస్యను సీఐటీయూ ఆధ్వర్యాన విద్యార్థులతో కలిసి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్(తహసీల్దార్) దృష్టికి తీసుకెళ్లగా ఆయన శాశ్వత పరిష్కారం చూపారు. రెండేళ్లుగా మూలనపడ్డ బోరు.. వసతి గృహంలో ఉన్న బోరు గత రెండేళ్లుగా పనిచేయడం లేదు. రిపేర్‌కు ప్రయత్నించగా.. లోపల విద్యుత్ మోటార్ ఇరుక్కుని బయటకు రాలేదు. దీంతో అధికారులు అలానే వదిలేశారు. దీనిపై ఐటీడీఏ అధికారులు ఏ మాత్రం చొరవ చూపలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు తాగునీటితో పాటు ఇతర అవసరాలకు మిషన్ భగీరథ నీటిపైనే ఆధారపడుతున్నారు. పంచాయతీ నీరే ఆధారం.. గత 20 రోజుల క్రితం భగీరథ నీరు ఆగిపోవడంతో సమీపంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలోని మినీ వాటర్ ట్యాంకు నుంచి తాత్కాలికంగా నీటిని సరఫరా చేశారు. మళ్లీ మూడు రోజుల క్రితం భగీరథ నీరు నిలిచిపోవడంతో అదే పంచాయతీ నీటిని తాగడానికి, వంటకు, అరకొరగా అత్యవసరాలకు వాడుకుంటూ స్నానాలు చేయకుండా రెండు రోజుల పాటు కాలం వెళ్లదీశారు. ఈక్రమాన మూడవ రోజు (బుధవారం) పంచాయతీ నుంచి నీరు సరఫరా అవుతున్న క్రమాన కరెంట్ పోవడం, తిరిగి వచ్చాక మోటార్ ఆన్ చేయకపోవడంతో ఆ నీరు కూడా ఆగిపోయింది. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లకుండా వసతి గృహంలోనే ఉండిపోయారు. కాగా, పంచాయతీ నుంచి ఎక్కువ నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నా, అవగాహన లోపంతో వసతి గృహ బాధ్యులు ఆ దిశగా పంచాయతీని సంప్రదించలేదు. కిలోమీటర్ నడిచి తహసీల్దార్‌కు వినతి గిరిజన వసతి గృహంలో నీటి కష్టాలపై కిలోమీటర్ దూరంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయానికి విద్యార్థులను సీఐటీయూ నాయకులు కాలినడకన తీసుకెళ్లి ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్(తహసీల్దార్) మద్దినేని మురళికి బుధవారం వినతిపత్రం అందజేశారు. వెంటనే స్పందించిన ఆయన ఆర్‌డబ్ల్యూస్ అధికారులతో మాట్లాడి భగీరథ నీటిని సాయంత్రం 4 గంటలకు పునరుద్ధరించారు. అనంతరం వసతి గృహాన్ని సందర్శించిన తహసీల్దార్ విద్యార్థులను రాజకీయాలకు వాడొద్దని, ఇలా విద్యార్థులు నడిచే క్రమాన ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ కృష్ణబాబు, సీఐటీయూ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులను బలవంతంగా తీసుకెళ్లినట్టుగా వార్డెన్‌తో పాటు విద్యార్థులు సైతం చెప్పారు. దీంతో విద్యార్థుల భద్రత, వసతుల విషయంలో మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం యుద్ధప్రాతిపదికన ఐటీడీఏ నిధులతో వసతి గృహం ఎదుట నీటి బోరు వేయించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. శుక్రవారం నాటికి బోరులో విద్యుత్ మోటార్‌ను ఏర్పాటు చేసి, నీటి బోరును వినియోగంలోకి తేవాలని ఆధికారులను ఆదేశించారు. -
విత్తనోత్పత్తిలో సంఘాల కీలకపాత్ర
ఖమ్మంవ్యవసాయం: విత్తనోత్పత్తిలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కీలకపాత్ర పోషించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన విభాగం డైరెక్టర్ డాక్టర్ నాగేష్‌కుమార్ సూచించారు. ఖమ్మంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో గురువారం నాబార్డ్ సహకారంతో ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాల స్థాయి సహకార సంఘాల చైర్మన్లు, సీఈఓలు, విత్తన ఉత్పత్తిదారులు, రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా నాగేష్ విత్తనోత్పత్తి ప్రాజెక్టు విధానాలు, మార్గదర్శకాలు, లక్ష్యాలను వివరించారు. పీఏసీఎస్‌లు విత్తన ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తే రైతులకు నాణ్యమైన విత్తనాలు అంది పంటల ఉత్పాదకత, స్థిరమైన వ్యవసాయ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. ఖమ్మం డీసీసీబీ సీఈఓ ఎన్.వెంకటఆదిత్య, విత్తన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం ప్రొఫెసర్ డాక్టర్ విద్యాధర్, విత్తన ధ్రువీకరణ అధికారి వేణు, డీసీఓలు గంగాధర్, శ్రీనివాసరావు, శ్రీరామ్, నాబార్డ్ డీడీఎం సుజిత్‌కుమార్ వివిధ అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, వైరా కేవీకేల సీనియర్ శాస్త్రవేత్తలు డాక్టర్ టి.భరత్, డాక్టర్ పావని, డాక్టర్ రాములమ్మ, డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ నాగేష్‌కుమార్ -
ప్రభుత్వం అండగా ఉంటుంది
ములకలపల్లి: హైదరాబాద్‌లో హత్యకు గురైన మండలంలోని నర్సు కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తెలిపారు. గురువారం నిర్వహించిన యువతి సంస్మరణ సభలో మాట్లాడారు. ఇందిరమ్మ ఇంటితోపాటు, ప్రభుత్వ సాయంగా రూ 7.30 లక్షలు అందించినట్లు తెలిపారు. అనంతరం యువతి సోదరుడికి ఔట్సోర్సింగ్ ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు. నర్సు పేరిట గ్రామంలో హెల్త్ సబ్‌సెంటర్, కంపగూడెం క్రాస్‌రోడ్డు వద్ద బస్‌షెల్టర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఈ నెల 6వ తేదీన చేపట్టిన పాదయాత్ర గురువారం సంస్మరణ కార్యక్రమం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆదివాసీ తొమ్మిది తెగల సమన్వయకర్త చుంచు రామకృష్ణ మాట్లాడుతూ రూ. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యేలు గుమ్మడి నర్సయ్య, తాటి వెంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీలు బత్తుల అంజి, పైడి వెంకటేశ్వర్లు, గిరిజన సంఘాలు, పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ -
అమరుల చరితను దాచలేరు
భద్రాచలంఅర్బన్: ఆదివాసీలు, బడుగు, బలహీనవర్గాల కోసం జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల చరిత్రను దాచిపెట్టడం సాధ్యం కాదని పలువురు వక్తలు అన్నారు. టీవీఆర్ చంద్రం వర్థంతి సందర్భంగా ఆయన జీవిత చరిత్ర ఆధారంగా కుమారుడు టి.జగన్ మోహన్ రచించిన ఎగరేసిన ఎర్రజెండా పుస్తకాన్ని గురువారం భద్రాచలంలోని కేకే ఫంక్షన్ హాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. అనంతరం వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత ప్రధాన కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా కడవరకు నిలిచిన వారే నిజమైన కమ్యూనిస్టులని అన్నారు. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు సింగు నరసింహారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారు రవికుమార్, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు, నాయకులు రవికుమార్, ఏజే రమేష్, చిటూరు వెంకట్రావు, పోటు రంగారావు, ముర్ల రమేష్, ఎంబీ నర్సారెడ్డి, కొలగాని బ్రహ్మచారి, పుల్లయ్య పాల్గొన్నారు.‘ఎగరేసిన ఎరజ్రెండా’ పుస్తకావిష్కరణ సభలో వక్తలు -
ఆత్మహత్యల నివారణ రోజే.. విషాదం
భద్రాచలంఅర్బన్: ఆత్మహత్యల నివారణపై అవగాహన కల్పిస్తున్న రోజే భద్రాచలం పట్టణంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవడం విషాదాన్ని నింపింది. పట్టణంలోని జగదీశ్ కాలనీకి చెందిన అనుకోజు ప్రభాకర్(25) వడ్రంగి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ మూడేళ్ల క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి 11 నెలల పాప ఉంది. అయితే కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య కొన్ని నెలలుగా పుట్టింట్లోనే ఉంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే భార్య పుట్టింటికి వెళ్లిన సందర్భాల్లో పాపను చూసేందుకు వచ్చిన ప్రభాకర్‌కు అతడి భార్యకు పలుమార్లు గొడవలు జరిగినట్లు తెలిసింది. ఓ సందర్భంలో వివాదం చేయి చేసుకునే వరకు వెళ్లడంతో భార్య స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈక్రమాన టౌన్ పోలీసులు ప్రభాకర్‌ను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాల తర్వాత కొంతకాలంగా మనస్తాపానికి గురైన ప్రభాకర్ గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఘటనకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నారు. కాగా, ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన అవగాహన ర్యాలీ నిర్వహించిన నాడే ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికులను కలచివేసింది. 11 నెలల చిన్నారి తండ్రిని కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.కుటుంబ మనస్పర్థల నేపథ్యాన యువకుడి బలవన్మరణం -
పోరాట స్ఫూర్తికి ప్రతీక ఐలమ్మ
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో భూమి, భుక్తి కోసం ధైర్యసాహసాలతో పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ అని, ఆమె సామాజిక న్యాయానికి ప్రతీకగా నిలిచారని కలెక్టర్ అంకిత్ కొనియాడారు. కలెక్టరేట్లో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గురువారం చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐలమ్మ పోరాటం, త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, ఇరత అధికారులు పద్మావతి, అనంత రామకృష్ణ, విజయలక్ష్మి, శ్రీలత, బీసీ సంఘాల నాయకులు నేరెళ్ల రమేష్, అజిత్ కుమార్, రేచర్ల సర్వేశ్వర రావు, కణతాల వసంత రావు, పోగుల లక్ష్మీనారాయణ, చిటికెన ముసలయ్య, ముదిగొండ రాంబాబు, కొదుమూరి సత్యనారాయణ పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు చర్యలు వేగవంతం చేయాలి చుంచుపల్లి: కేంద్రీయ పాఠశాల ఏర్పాటు చర్యలు వేగవంతం చేయాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పాఠశాలకు కేటాయించిన లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలోని విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రం స్థలాన్ని గురువారం ఆయన సందర్శించారు. విద్యాలయ ఏర్పాటుకు విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రం ఉన్న స్థలాన్ని త్వరతిగతిన అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. విజయ మినీ పాల శీతలీకరణ కేంద్రాన్ని చుంచుపల్లిలో కేటాయించిన స్థలంలోకి మార్చాలని సూచించారు. తహసీల్దార్ శిరీష, విజయ డెయిరీ మేనేజర్ సౌజన్య పాల్గొన్నారు. రీ సర్వేతో భూ సమస్యలు పరిష్కారంచండ్రుగొండ: రీ సర్వేతో భూముల సమస్యలు పరిష్కారమవుతాయని కలెక్టర్ అంకిత్ అన్నారు. మండలంలోని సీతాయిగూడెం గ్రామంలో చేపట్టిన రీ సర్వేను గురువారం పరిశీలించారు. పురోగతిపై ఆరా తీశారు. పాత భూరికార్డులను పరిశీలించారు. తహసీల్దార్ జగదీశ్వర్‌ప్రసాద్ పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
కేటీపీఎస్‌లో శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి
పాల్వంచ: పాల్వంచలోని కేటీపీఎస్ 5, 6వ దశల కర్మాగారాన్ని గురువారం శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తురై రాజా సందర్శించారు. పాల్వంచలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన కేటీపీఎస్ కర్మాగారాలను సందర్శించగా చీఫ్ ఇంజనీర్ ఎం.ప్రభాకర్‌రావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కోల్ ప్లాంట్, బాయిలర్, టర్బయిన్, యూసీబీ, కూలింగ్ టవర్ తదితర కీలక విభాగాలను ఆసక్తిగా పరిశీలించి కర్మాగార నిర్వహణ తీరును ప్రశంసించారు. అధికారులు మధుబాబు, సమీర్, బి.రాధాకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, వైటీఎంకే.రాజు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించాలిసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ ఆదేశించారు. గురువారం నిర్వహించిన జిల్లాస్థాయి రహదారి భద్రతా కమిటీ సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో గుర్తించిన 42 బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక, సూచిక బోర్డులు, రిఫ్లెక్టర్లు ఏర్పాటు చేయాలన్నారు. రహదారులపై పశువులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు వెంకటరమణ, అనూష, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, గడ్డం ప్రవీణ్ కుమార్, బాలాజీ పాల్గొన్నారు.. -
అటవీ అమరులను స్మరించుకుందాం
● వన సంపద సంరక్షణలో పలువురి ప్రాణత్యాగం ● గత నెలలో విద్యుత్ ఉచ్చుతో ఎఫ్బీఓ నవీన్ మృతి ● నాలుగేళ్ల క్రితం ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరావు హత్య నేడు జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవంచుంచుపల్లి: వన సంపదను కాపాడే క్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోతున్నారు. విధినిర్వహణలో అటవీ సిబ్బంది చేసిన త్యాగాలను స్మరించుకునేందుకు ఏటా జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం జరుపుతున్నారు. 1730, సెప్టెంబరు 11న రాజస్థాన్‌లోని ఖేజర్లీలో చెట్లను కాపాడేందుకు అమృతాదేవి బిష్ణోయ్‌తోపాటు వందలాది మంది ప్రాణత్యాగం చేశారు. వారిని స్మరిస్తూ జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జిల్లాలో అధికంగా అటవీ విస్తీర్ణం జిల్లా భౌగోళిక విస్తీర్ణం 6,985.65 చదరపు కిలోమీటర్లు కాగా, అందులో అటవీ విస్తీర్ణం 2,861.66 చదరపు కిలోమీటర్లు ఉంది. కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, కిన్నెరసాని వన్యప్రాణి ప్రాంతాల్లో అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 608 మంది అటవీశాఖలో విధులు నిర్వహిస్తున్నారు. ఆక్రమణల నుంచి అడవిని కాపాడే క్రమంలో, కలప స్మగ్లింగ్, వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులు, తుపాకులతో వన్యప్రాణుల వేటను నిరోధించే క్రమంలో నిత్యం దాడులను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో ఇద్దరు అధికారులు ప్రాణత్యాగం చేశారు. స్మగ్లర్ల దాడిలో.. కొత్తగూడెం ప్రాంతానికి చెందిన సోలెమన్ రాజ్ అటవీ శాఖలో బీట్ ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తూ 1987 నవంబరు 4న కలప స్మగ్లర్ల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు. భద్రాచలం నార్త్ డివిజన్‌కు చెందిన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎన్.రామ్మూర్తి 2006 మే 26న విధి నిర్వహణలో భాగంగా కలప స్మగ్లర్లను అడ్డుకునేందుకు వెళ్లి గోదావరి సుడిగుండంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాడు. భద్రాచలం సౌత్ డివిజన్‌కు చెందిన అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ బి.సోమయ్య 2012 డిసెంబరు 12న స్మగ్లర్ల చేతిలో హత్యకు గురయ్యాడు. శ్రీనివాసరావు హత్య.. మరిచిపోలేని విషాదం ఇటీవలి కాలంలో జిల్లాను కుదిపేసిన ఘటన అటవీ రేంజ్ అధికారి చలమల శ్రీనివాసరావు హత్య. 2022 నవంబర్ 22న జిల్లాలోని ఎరబ్రోడు ప్రాంతంలో అటవీ భూముల ఆక్రమణను అడ్డుకునే క్రమంలో జరిగిన దాడిలో ఆయన మృతి చెందాడు. ఈ ఘటన అటవీ అధికారుల భద్రతపై రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. లక్ష్మీదేవిపల్లి సెంట్రల్ పార్కుకు ఆయన పేరు పెట్టడంతోపాటు విగ్రహాన్ని ఏర్పాటు చేసి అటవీశాఖ ఆయన త్యాగాన్ని స్మరించుకుంటోంది. తాజాగా ఎఫ్బీఓ నవీన్ మృతి.. గత నెల 11న పాల్వంచ రేంజ్లో విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ వేటగాళ్లు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చుకు బలయ్యాడు. వన్యప్రాణులను వేటాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ ఉచ్చులను తొలగించే క్రమంలోనే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో అటవీ సిబ్బంది భద్రత మరోసారి ప్రశ్నార్థకమైంది. వేటగాళ్లు అమర్చే విద్యుత్ తీగలు, ఉచ్చులు రాత్రి సమయాల్లో బయటకు కనిపించకపోవడంతో ఫ్రంట్‌లైన్ సిబ్బందికి ప్రాణాంతకంగా మారుతోంది. నేడు ర్యాలీ జాతీయ అటవీ అమరుల దినోత్సవం సందర్భంగా జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తగూడెం ప్రకాశం స్టేడియం నుంచి సెంట్రల్ పార్కు వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అమరవీరుల కుటుంబాలను సన్మానిస్తారు. నా భర్త చలమల శ్రీనివాసరావు అటవీ శాఖలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు. మా కుటుంబానికి ప్రభుత్వం, అటవీశాఖ చాలా అండగా నిలిచాయి. –సీహెచ్.భాగ్యలక్ష్మిఅటవీ సంరక్షణలో ముందుండే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, ఇతర ఫ్రంట్‌లైన్ సిబ్బంది క్లిష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నారు. వారి సేవలు అభినందనీయం. అటవీశాఖ అమరుల కుటుంబాలకు అండగా ఉంటాం. –సిద్ధార్ధ్ విక్రమ్ సింగ్, డీఎఫ్ఓ -
పరిహారం పెంచాల్సిందే..
టేకులపల్లి : మండలంలోని సులానగర్, సీతారాంపురం స్టేజి మధ్య జాతీయ రహదారి 930పీ పరిధిలో మంజూరైన టోల్గేట్ నిర్మాణం కోసం వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులు పరిహారం పెంచాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.13 లక్షలు ఇస్తామని చెప్పడం సరికాదని, రూ. కోటి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్టీ కమిషన్‌తోపాటు కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు. ఈ నేపథ్యంలో గురువారం జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, టేకులపల్లి తహసీల్దార్ వీరభద్రం టోల్గేట్ ప్రతిపాదిత ప్రాంతాన్ని సందర్శించారు. నిర్వాసిత భూములను పరిశీలించి రైతులతో మాట్లాడారు. తమ కుటుంబాల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని రూ. కోటి పరిహారంతోపాటు ఇంటికో ఉద్యోగం కోరారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పందిస్తూ పరిహారం పెంచే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే డిమాండ్ పరిష్కారమయ్యే వరకు వెనక్కి తగ్గేది లేదని రైతులు స్పష్టం చేశారు. కాగా, టోల్గేట్ ఏర్పాటుకు సుమారు 18 మంది రైతులు భూములు కోల్పోనున్నట్లు అధికారులు గుర్తించారు.అదనపు కలెక్టర్ ఎదుట టోల్గేట్ నిర్వాసిత రైతుల డిమాండ్ -
సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యాన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ఐఏఎస్ స్టడీ సర్కిల్లో ఎనిమిది నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ ఉంటుందని పేర్కొన్నారు. కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై, 21–32 ఏళ్ల వయస్సు, రూ.3 లక్షల్లోపు వార్షిక ఆదాయం కలిగిన అభ్యర్థులు ఈనెల 23 సాయంత్రం 6 గంటల్లోపు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థులకు ఈనెల 27న స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించి, అర్హత సాధించిన వారిని శిక్షణకు ఎంపిక చేస్తామని పీఓ ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలకు బాలికల జట్టు ఎంపిక కల్లూరు రూరల్: రాష్ట్ర స్థాయి ఖో–ఖో పోటీల్లో పాల్గొననున్న ఉమ్మడి ఖమ్మం బాలికల జట్టును గురువారం ఎంపిక చేశారు. కల్లూరులోని మినీ స్టేడియంలో జరిగిన ఎంపిక పోటీలకు 101 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో ప్రతిభ కనబర్చిన గొంది మౌనిక, జమిలి రవళిక, గుండు రాధిక, గోనె శ్రావణి, కడారి భవాని, ధరావత్ ప్రవళిక, ఊకే మాధవి, కారం సమ్మక్క, వెంకటలక్ష్మి, శీలం తేజశ్రీ, మోకాళ్ల కావ్య, షేక్ సాదికతో జట్టును ఖరారు చేశారు. ఈ జట్టు 17వ తేదీన హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈకార్యక్రమంలో ఖో–ఖో అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పసుపులేటి వీరరాఘవయ్యతో పాటు కాటేపల్లి కిరణ్, మట్టూరి జనార్దన్, ఈ.నరసయ్య, ఎస్.రామారావు, ఎస్.ప్రసాద్, బి.బీమా, పి.సతీష్ కుమార్, కె.తులసి, రమాదేవి, త్రివేణి పాల్గొన్నారు. మానసిక ఒత్తిడిని ధైర్యంగా ఎదుర్కోవాలి డీఎంహెచ్ఓ తుకారాం రాధోడ్ పాల్వంచ: మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటేనే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. గురువారం ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ, కేఎల్ఆర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. వ్యక్తుల్లో ఏర్పడే ఆత్మహత్య ఆలోచనలు, మానసిక ఒత్తిడి, నిరాశ, భావోద్వేగ సమస్యలను మనసులోనే దాచుకోకుండా, ఒంటరిగా ఉండకుండా కౌన్సెలర్లు, మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవడం లేదా కుటుంబ సభ్యులు, స్నేహితులు, విశ్వసనీయ వ్యక్తులతో చర్చించాలన్నారు. ఎవరైనా తీవ్రమైన ఒత్తిడితో బాధపడుతున్నట్లు గమనిస్తే వెంటనే ఉచిత హెల్ప్‌లైన్ నంబర్ 14416కు ఫోన్ చేసి కౌన్సెలింగ్ పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, అధ్యాపక సిబ్బంది, విద్యార్ధులు, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ‘పాతకాలం’ పేరుతో కొత్త మోసం ● ‘1980’ట్రెండ్ మాటున సైబర్ వల! ● నకిలీ యాప్‌లు, ఏపీకే ఫైళ్లతో ముప్పు ● ఫొటో ఎడిటింగ్ పేరుతో చోరీకి అవకాశం ● అనధికార యాప్‌లు వాడొద్దని నిపుణుల సూచన భద్రాచలంఅర్బన్: సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్న ‘1980 ఫొటో’ట్రెండ్‌ను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే ప్రమాదం ఉంది. తమ ఫొటోలను 1980–90ల నాటి పాతకాలపు లుక్‌లోకి మార్చుకుని వాట్సాప్ స్టేటస్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో పెట్టేందుకు యువత ఆసక్తి చూపుతోంది. ఇదే అదనుగా ‘1980 ఫొటో’, ‘రెట్రో ఫొటో ఎడిటర్’తదితర పేర్లతో నకిలీ యాప్‌లు, ఏపీకే ఫైళ్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టే అవకాశం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనుకున్న ఫొటోలు రాకపోవడంతో.. ఏఐ ఆధారిత అధికారిక సేవల్లో ఆశించిన విధంగా ఫొటో రాకపోవడం, వినియోగ పరిమితులు ఎదురవడం వంటి కారణాలతో కొందరు ప్రత్యామ్నాయ యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో గుర్తుతెలియని లింకులు, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే ఏపీకే ఫైళ్లను డౌన్లోడ్ చేసుకుంటే ప్రమాదంలో పడే అవకాశముంది. ఇలాంటి అనధికార యాప్‌లకు ఫొటోలు, కాంటాక్టులు, ఎస్ఎంఎస్లు తదితర అనుమతులు ఇస్తే వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉంటుంది. ఫొటో ఎడిటింగ్ ట్రెండ్‌ను అనుసరించే క్రమంలో సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకోవద్దని, యాప్‌లను అధికారిక యాప్ స్టోర్ల నుంచే డౌన్లోడ్ చేసుకోవాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. -
సారపాకలో భారీ సూచిక బోర్డు ఏర్పాటు
బూర్గంపాడు: సారపాక మీదుగా భద్రాచలం పట్టణానికి వెళ్లే వాహనదారులకు దిశానిర్దేశం చేసేలా ప్రధాన రహదారిపై ఎన్ఎచ్ఏఐ ఆధ్వర్యంలో భారీ సూచిక బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. చర్ల, వెంకటాపురం, వాజేడు, కూనవరం, కుంట, చింతూరు, రాజమండ్రి, జగదల్పూర్ తదితర ప్రాంతాలకు వెళ్లే మార్గాలు, దూరాలను బోర్డుపై పొందుపరిచారు. భద్రాచలం పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు, పర్యాటకులతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ఈ సూచిక బోర్డు ఉపయోగకరంగా మారనుంది. వరకట్న వేధింపుల కేసులో భర్తకు ఏడాది జైలు భద్రాచలంఅర్బన్: వరకట్నం కోసం భార్యను వేధించిన కేసులో భర్తకు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధిస్తూ భద్రాచలం జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ వి.శివనాయక్ గురువారం తీర్పు వెల్లడించారు. భద్రాచలానికి చెందిన కాలంగి వర్ష తన భర్త దీపక్, అతని కుటుంబసభ్యులపై వరకట్న వేధింపులకు సంబంధించి 2021లో భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేశారు. దీంతో సాక్ష్యాధారాలు, ఇరుపక్షాల వాదనలను పరిశీలించిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో దీపక్‌కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.2వేల జరిమానా విధించారు. ప్రాసిక్యూషన్ తరఫున శ్రీధర్ వాదనలు వినిపించగా, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌గా నరసింహారావు వ్యవహరించారు. -
ఆధార్ మరింత చేరువ
కొత్తగూడెంఅర్బన్: ప్రజలకు ఆధార్ సేవలు మరింత చేరువ చేస్తున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆస్పత్రి సమీపంలో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించి మాట్లాడారు. ఆధార్ సేవల కోసం జిల్లా ప్రజలు హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్తగూడెంలోనే కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆన్లైన్లో అపాయింట్మెంట్ తీసుకుని నిర్ణీత సమయంలో ఆధార్ సేవా కేంద్రానికి రావొచ్చని చెప్పారు. రాష్ట్ర యూఐడీఏఐ రీజినల్ కార్యాలయ మేనేజర్ నరేష్ చంద్ర, బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సర్వీస్ లిమిటెడ్ రీజినల్ మేనేజర్ శ్రీనివాస్, కొత్తగూడెం ఆధార్ సేవా కేంద్రం ఆపరేషనల్ మేనేజర్ వంశీ, కొత్తగూడెం తహసీల్దార్ పుల్ల య్య, ఈ–జిల్లా మేనేజర్ సైదేశ్వరరావు, టీఎస్టీఎస్ జిల్లా మేనేజర్ కృష్ణమూర్తి పాల్గొన్నారు. భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి సూపర్‌బజార్(కొత్తగూడెం): భూ సేకరణ పనులు, సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి గురువారం రాత్రి అదనపు కలెక్టర్ వేణుగోపాల్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి తహసీల్దార్లు, ఇరిగేషన్, సంబంధిత సెక్షన్ అధికారులు, సర్వేయర్లలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టు, పులుసుబొంత ప్రాజెక్టులు, బీటీపీఎస్ల భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. భూభారతి రీ సర్వే, సాదా బైనామా, రెవెన్యూ సదస్సులు పూర్తి చేయాలని చెప్పారు. భూభారతి దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ అంకిత్ -
నర్సరీ టూ ఇంటర్..
నియోజవర్గానికి ఒకటి చొప్పున.. నియోజకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్లో హైస్కూల్, ఇల్లెందు నియోజకవర్గంలోని టేకులపల్లి మండలం బోడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పినపాక నియోజకవర్గంలోని జానంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల మండలం సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చనున్నారు. వీటిలో జానంపేట పబ్లిక్ స్కూల్‌కు రూ.9.9 కోట్లు, బోడు పబ్లిక్‌స్కూల్‌కు రూ.10 కోట్లు, అశ్వారావుపేట పబ్లిక్ స్కూల్‌కు రూ.6 కోట్లు చొప్పున ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 119 పాఠశాలలు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 119 ఇంటిగ్రేటేడ్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌ను మంజూరు చేయగా, వాటిలో 75 పాఠశాలలను మొదటి దశలో అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఇందులో జిల్లాలోని 3 స్కూల్స్‌లో ఉండగా, ఇప్పటికే నిధులు విడుదల చేసింది. టెండర్లు పిలిచి పక్కా భవన నిర్మాణంతోపాటు మౌలిక వసతుల ఏర్పాటుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. జిల్లాకు ఐదు ఇంటిగ్రేటెడ్ తెలంగాణ పబ్లిక్ పాఠశాలలు మంజూరయ్యాయి. ఇందులో బోడు, అశ్వారావుపేట, జానంపేట పాఠశాలలకు రూ.25.9 కోట్లు మంజూరయ్యాయి. వచ్చే విద్యాసంవత్సరంలోగా పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించడంతోపాటు మౌలిక వసతులు కల్పిస్తాం. – వాసంతి, జిల్లా విద్యాశాఖాధికారిక్రీడా, సాంస్కృతిక పాఠాలు కూడా.. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఒకే క్యాంపస్‌లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించారు. విశాలమైన స్థలం ఉన్న పాఠశాలను విద్యాశాఖ అధికారులు గుర్తించి అప్‌గ్రేడ్ చేశారు. ఇంటిగ్రేటేడ్ స్కూల్స్‌లో అధునాతన వసతులు కల్పించనున్నారు. క్రీడామైదానం, కంప్యూటర్‌ల్యాబ్, సైన్స్‌ల్యాబ్ తదితర సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించనున్నారు. ఆయా పాఠశాల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, సిబ్బందినే వినియోగించుకోనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. క్రీడా, సాంస్కృతిక, వ్యక్తిత్వ వికాస తదితర రంగాల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారని పేర్కొన్నారు.నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్‌స్థాయి విద్యనందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఒకే క్యాంపస్‌లో నర్సరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలలనే ఎంపికచేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ (ఇంటి గ్రేటెడ్)గా మార్చాలని నిర్ణయించింది. జిల్లాలో ఐదు పాఠశాలలను అప్‌గ్రేడ్ చేయనుండగా, ఇటీవల మూడు పబ్లిక్ స్కూళ్లకు రూ.25.9 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 2027–2028 విద్యాసంవత్సరంలోగా మౌలిక వసతులతో పక్కాభవనాలు నిర్మించనుంది. – పాల్వంచరూరల్ఒకే క్యాంపస్‌లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు -
సుజాతనగర్ వాసికి డాక్టరేట్
జూలూరుపాడు(సుజాతనగర్): సుజాతనగర్ మండలం లక్ష్మీదేవిపల్లికి చెందిన భూక్యా ప్రకాష్ హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నాడు. ఉస్మానియా ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ఎం.వి.కృష్ణారావు పర్యవేక్షణలో సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో ‘యాన్ ఎక్స్పరిమెంటల్ స్టడీ ఆన్ పెర్ఫార్మన్స్, స్ట్రెస్–స్ట్రైన్ బిహేవియర్ అండ్ మైక్రోస్ట్రక్చరల్ క్యారెక్టరిస్ట్టిక్స్ ఆఫ్ ఫైబర్ రైన్ఫోర్డ్స్ జియోపాలిమర్ కాంక్రీట్’అనే అంశంపై పరిశోధన పూర్తి చేశారు. ఈ నెల 8న విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో డాక్టరేట్ ప్రదానం చేశారు. -
కారులోనే మట్టుపెట్టాడు..
● భార్య గొంతు నులిమి హతమార్చిన వ్యక్తి ● ఇద్దరికీ రెండో వివాహం.. అనుమానంతో హత్య ఖమ్మంఅర్బన్/ఇల్లెందు: ఇద్దరిదీ రెండో వివాహమే. అయితే, ఆమె మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నందనే అనుమానంతో గొంతు నులిమి హత్య చేసిన ఘటన ఖమ్మంలో వెలుగు చూసింది. కారులో బయటకు తీసుకెళ్లి హతమార్చిన భర్త.. కారును వదిలేసి పరారు కాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి ఖమ్మం అర్బన్ సీఐ భానుప్రకాష్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. నాలుగు నెలల క్రితమే వివాహం.. ఇల్లెందు మండలం చర్చి రొంపేడుకు చెందిన మేడిపల్లి విద్యాసాగర్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యాన మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు జన్మించాక విడాకులు తీసుకున్నాడు. అనంతరం ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తున్న ఇల్లెందు స్టేషన్ బస్తీ వాసి చిన్నబోయిన రేణుక(40)తో పరిచయం ఏర్పడింది. ఆమెకు కూడా భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలు, తల్లితో కలిసి జీవిస్తోంది. ఆమెను నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్న విద్యాసాగర్ ఖమ్మంలో నివాసముంటున్నాడు. ఇటీవల రేణుక మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై గొడవలు జరుగుతుండగా బయటకు వెళ్దామని బుధవారం సాయంత్రం ఆమెను విద్యాసాగర్ కారులో ఎక్కించుకుని ఇల్లెందు వైపు బయలుదేరాడు. మార్గమధ్యలో ఘర్షణ జరిగినట్లు తెలుస్తుండగా గొంతు నులిమి హత్య చేశాడు. ఆతర్వాత విషయాన్ని ఇల్లెందులోని తన స్నేహితుడికి ఫోన్లో వివరించి, తాను కూడా ఆత్మహత్య చేసుకుంటానని చెబుతూ మృతదేహం సహా కారు వదిలేసి పారిపోయాడు. స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు విద్యాసాగర్ ఫోన్ సిగ్నళ్లు పరిశీలిస్తూ బుధవారం రాత్రి 10–30 గంటల సమయాన ప్రగతి స్కూల్ సమీపాన అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. కారులో నుంచి రేణుక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న ఖమ్మం అర్బన్ పోలీసులు ఆమె తల్లి ఉపేంద్ర ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. కాగా, రేణుక మృతదేహం వద్ద తల్లి కన్నీరు మున్నీరుగా విలపించారు. కొంతకాలంగా విద్యాసాగర్‌తో గొడవలు జరుగుతున్నందున ఆయనతో వెళ్లొద్దని చెప్పినా బలవంతంగా తీసుకెళ్లాడని ఆరోపించారు. ఆమె మృతితో ఇద్దరు పిల్లల భవిష్యత్ ఏమిటని రోదించారు. కాగా, పోస్టుమార్టం అనంతరం ఇల్లెందులోని ఇంటికి రేణుక మృతదేహాన్ని సాయంత్రం తీసుకురాగా, ప్రేమించిన వ్యక్తి చేతిలో హతం కావడంతో పిల్లలు అనాథలయ్యారంటూ బంధువులు, స్థానికులు కన్నీంటి పర్యంతమయ్యారు. -
‘సర్’లో సందేహాలా ?!
నేడు ‘సాక్షి’ ఆధ్వర్యాన ‘ఫోన్ ఇన్’చుంచుపల్లి: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో భాగంగా ప్రస్తుతం అనామలీస్, నో మ్యాపింగ్ జాబితాలోని ఓటర్లకు నోటీసుల జారీ, విచారణ కొనసాగుతోంది. అయితే, జాబితాలో ఎవరెవరి పేర్లు ఉన్నాయో తెలుసుకునేందుకు బీఎల్ఓలను సంప్రదిస్తున్నారు. అంతేకాక నోటీసులు అందుకున్న వారు ఏమేం పత్రాలు సమర్పించాలో ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యాన ఓటర్ల సందేహాలకు ‘సాక్షి’ ఆధ్వర్యాన నిర్వహించే ఫోన్ ఇన్‌లో కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారి రంగాప్రసాద్ స్వయంగా సమాధానాలు ఇవ్వనున్నారు. ఓటర్లు నిర్ణీత సమయంలో ఫోన్ చేసి తమ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. తేదీ : 11–09–2026, శుక్రవారం (నేడు) సమయం : ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ఫోన్ చేయాల్సిన నంబర్ 93929 19709 -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
జూలూరుపాడు: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ అన్నారు. బుధవారం ఆయన జూలూరుపాడు పీహెచ్‌సీని తనిఖీ చేశారు. మందుల నిల్వలు, వైద్య సేవలపై ఆరా తీశారు. కొత్తగూడెంలో ఎయిడ్స్ నిర్మూలనకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన అవగాహన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జ్వర బాధితులు పెరుగుతున్న దృష్ట్యా గ్రామాల్లో డ్రై డే ఫ్రైడే కార్యక్రమాలు చేపట్టాలని, హెల్త్ క్యాంపులు నిర్వహించాలని సూచించారు. జీవితం విలువైనదని, సమస్యలు, ఒత్తిడికి ఆత్మహత్యలు పరిష్కారం కావని అన్నారు. పోలూరి రాము నేతృత్వంలోని జానపద బృందం ఆధ్వర్యంలో కళా జాతా సాంస్కృతిక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వైద్యాధికారులు ప్రసాద్, బి.వెంకటేశ్వర్లు, ఇందిర, జాన్‌బీ, జి.శశికళ, నాగయ్య, మహమూద్ అలీ, వీరయ్య పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ -
విద్యాబోధనకే ప్రాధాన్యమివ్వాలి
టేకులపల్లి: పాఠశాలల్లో విద్యాబోధనకే ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ అంకిత్ అన్నారు. మండలంలోని తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. తరగతి గదులను పరిశీలించారు. కొన్ని తరగతుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో లేకపోవడాన్ని గుర్తించి, తరగతి సమయాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో బోధనపైనే దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడారు. ప్రయోగశాలలను పరికరాలు నిల్వ చేసే ప్రదేశాలుగా కాకుండా విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించే కేంద్రాలుగా వినియోగించుకోవాలని సూచించారు. కొత్తగా పాఠశాలలో చేరిన విద్యార్థులకు యూనిఫాం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. భోజనశాల, వంటగది, మరుగుదొడ్లు, పాఠశాల పరిసరాలను పరిశీలించి పరిశుభ్రత లోపాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ సక్రమంగా అమలు చేయాలన్నారు. వెల్నెస్ సెంటర్లో మందులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు పూర్తి జవాబుదారీతనంతో పనిచేస్తూ ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో తహసీల్దార్ వీరభద్రం, ఎంపీడీఓ కొండపల్లి శ్రీదేవి, ప్రిన్సిపాల్ నిశాంత్ కృష్ణవ, ఎంఈఓ జగన్, ఏపీఓ కె.శ్రీనివాస్, కార్యదర్శి విజయకుమారి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ అంకిత్ -
గణపతి ఉత్సవాలకు పక్కాగా కార్యాచరణ
సూపర్‌బజార్(కొత్తగూడెం): గణపతి ఉత్సవాల భద్రతకు పకడ్బందీ కార్యాచరణ రూపొందించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో బుధవారం నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో మాట్లాడారు. క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, మట్కా, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఎస్పీ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. డీఎస్పీలు ఆదినారాయణ, మల్లయ్య స్వామి, రవీందర్ రెడ్డి, వెంకన్న బాబు తదితరులు పాల్గొన్నారు. బాల్యవివాహాలు నిర్వహిస్తే చర్యలుబాల్యవివాహాలు నిర్వహించినా, సహకరించినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సంస్థ సభ్యులు ఎస్పీని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాల్యవివాహాలు నిర్వహిస్తే, 1098 లేదా డయల్ 112 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వి.రాజేష్, సభ్యులు మోహన్, మాన్సింగ్, రవిచంద్ర, నాగేంద్రబాబు, మౌనిక తదితరులు పాల్గొన్నారు. అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ తనిఖీచుంచుపల్లి: చుంచుపల్లి పోలీస్ స్టేషన్, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్‌ను ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలర్టింగ్ ఆఫీసర్లు, రౌండింగ్ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయంతో పనిచేయాలని, రాత్రి వేళలో నిఘా పెంచాలని ఆదేశించారు.పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ వాహనాలతో నిరంతరం గస్తీ నిర్వహించాలన్నారు. ప్రధాన రహదారులు, జనసంచారం తక్కువగా ఉండే ప్రాంతాల్లో పోలీసుల విజిబిలిటీ పెంచాలని ఆదేశించారు. డయల్–112కు ఫోన్ వచ్చిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని సిబ్బందికి సూచించారు.ఎస్పీ రోహిత్ రాజు -
కల్యాణం... కమనీయం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా సాగింది. తెల్లవారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని శ్రీరామ సేవామండపంలో కొలువుదీరిన స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని పూర్తిచేశారు. పెద్దసంఖ్యలో భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలిభద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి, పునరుద్ధరణ పనుల్లో వేగం పెంచి ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వార దర్శనం, పుష్కరాల నాటికి ఘాట్ల పనులు పూర్తిచేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ సూచించారు. ఆలయ అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించిన ఆయన ప్లాన్ ఆధారంగా అధికారులతో సమీక్షించారు. అనంతరం పీఓ మాట్లాడుతూ భక్తుల కోసం సౌకర్యాల మెరుగుపర్చడం, ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఆలయ అభివృద్ధి జరిగేలా నాణ్యతతో చేపట్టాలని సూచించారు. దేవస్థానం ఈఓ దామోదర్‌రావు, ఐటీడీఏ ఈఈ మధుకర్, దేవస్థానం ఈఈ రవీందర్, ఆర్కిటెక్చర్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. పౌష్టికాహారంపై అవగాహన పెంచాలిభద్రాచలంఅర్బన్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడంతో పాటు పోషకాహార లోపం నివారణపై క్షేత్రస్థాయిలో అవగాహన పెంచాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో బుధవారం 9వ పోషణ మాస కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా సంక్షేమ అధికారిణి జె.స్వర్ణలత లెనీనా, ఇతర అధికారులు రాధమ్మ, ప్రతాప్, పొనుగోటి సంపత్, బి.రాము తదితరులు పాల్గొన్నారు. తెగుళ్ల నివారణపై శిక్షణసూపర్బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పత్తి, మిరప, మొక్కజొన్న, వరి పంటల్లో చీడపీడలు, తెగుళ్ల నివారణపై బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాలుగు మండలాలకు చెందిన గిరిజన రైతులకు జీవనోపాధి భద్రతలో భాగంగా ఒక మేకల యూనిట్ (20+1) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ టి.భరత్ వివిధ పంటల్లో వచ్చే చీడపీడలు, తెగుళ్లపై రైతులకు అవగాహన కల్పించారు. మేకల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందాలని సూచించారు. ఎఫ్‌పీఓ చైర్మన్ పి పాపారావు, రైతులు పాల్గొన్నారు. రేపు జాబ్మేళారుద్రంపూర్: కొత్తగూడెంలోని వీవీసీ మోటార్స్‌లో 90 ఖాళీ పోస్టుల భర్తీ కోసం ఈనెల 11న జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కొండపల్లి శ్రీరాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. లక్ష్మీదేవిపల్లిలోని వెంకటరమణ మోటార్స్ టాటా షోరూమ్‌లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, ఐటీఐ, ఇంటర్ ఒకేషనల్ చేసినవారు అర్హులని పేర్కొన్నారు. 20న శతాధిక కవి సమ్మేళనంభద్రాచలంటౌన్: శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ నెల 20న భద్రాచలంలోని పాల్‌రాజ్ ఇంజనీరింగ్ కళాశాలలో 176వ శతాధిక కవి సమ్మేళనం నిర్వహించనున్నట్లు వేదిక జాతీయ అధికార ప్రతినిధి వరలక్ష్మి సాయిరాం తెలిపారు. బుధవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సుమారు 200 మంది కవులు పాల్గొంటారని అన్నారు. డాక్టర్ కత్తిమండ ప్రతాప్, ఈశ్వరీభూషణం, డాక్టర్ పార్థసారథి, సురేష్‌బాబు పాల్గొన్నారు. -
ఎవరు.. బెటర్ ?!
రాజకీయ వేడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు గడిస్తే మూడేళ్లు పూర్తవుతుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే తామే ప్రజా సంక్షేమంలో మేటిగా ఉన్నామని మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చెప్పుకొస్తున్నారు. ఏ చిన్న సమావేశాన్ని కూడా వదలకుండా ప్రభుత్వ పథకాలను వల్లె వేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే, తాము వచ్చాక ఉమ్మడి జిల్లాలో అభివృద్ధి పట్టాలెక్కింది.. సమస్యలు పరిష్కారం అయ్యాయని చెబుతున్నారు. ఇదే సమయాన ‘రెండేళ్లు వేచి చూశాం.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైంది’ అంటూ బీఆర్ఎస్ నేతలు వారం రోజుల ఆందోళనలు చేపట్టారు. ఆ పార్టీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు ఎక్కుపెట్టారు. మరోపక్క వామపక్ష పార్టీలు, బీజేపీ కూడా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో నిరసనలు చేపడుతున్నాయి. 2028 చివరి నాటికి ఎన్నికలు జరుగుతాయనే ఉద్దేశంతో రెండేళ్ల ముందు నుంచే పార్టీలు తమ వాణి పెంచినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రజానాడి పసిగట్టేలా.. ఎన్నికలు ఇప్పట్లో లేకున్నా ప్రజల నాడి తెలుసుకునేందుకు పార్టీలు సర్వే బాట పట్టినట్లు సమాచారం. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు నియోజకవర్గాల వారీగా ప్రతీ మూడు నెలలకోసారి ఈ ఏడాది ఇప్పటికే రెండు సర్వేలు పూర్తి కాగా తాజాగా అన్ని నియోజకవర్గాల్లో చేస్తున్నట్లు తెలిసింది. ఈ సర్వేలో ‘కాంగ్రెస్ పార్టీ మంత్రి / ఎమ్మెల్యే పనితీరు ఇప్పటి వరకు ఎలా ఉంది, సంక్షేమ పథకాలు అందుతున్నాయా.., బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పనితీరు గతంలో ఎలా ఉండేది.. ఇద్దరిలో ఎవరు, ఏ ప్రభుత్వం బెటర్, వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి, ఏ నేత బరిలో ఉంటే ఓటేస్తారు’ అంటూ సుమారు పదిహేను వరకు ప్రశ్నలు ప్రజలను అడుగుతున్నారు. పట్టణ, మండల, మేజర్ గ్రామ పంచాయతీ కేంద్రాల్లోనే ఈ సర్వేలు జరుగుతున్నాయి. నివేదికల ఆధారంగా ప్రణాళిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నందున ప్రస్తుతం చేయిస్తున్న సర్వే నివేదికలతో ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవచ్చనే భావనలో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్లోనూ ఈ సర్వే రిపోర్టుల ఆధారంగానే స్థానిక నేతల కార్యక్రమాలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. మరోపక్క పనితీరు బాగా లేదని నివేదిక వచ్చిన వారికి పార్టీ అధిష్టానం చురకలు అంటిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వేలో వ్యక్తిగత వైఫల్యాలపై ఆరా తీస్తూ పనితీరు మార్చుకోవాలని వ్యక్తిగతంగానే సూచిస్తున్నట్లు సమాచారం. ప్రజల్లో నిరంతరం ఉంటూ కార్యక్రమాల ద్వారా ఎన్నికల వరకు ఊపు కొనసాగిస్తే అధికారం తమదేనని నేతలకు పార్టీలు దిశానిర్దేశం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.సర్వే నివేదికలు ఎలా ఉన్నా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఫలానా నియోజకవర్గాలు తప్పకుండా తమ ఖాతాలోకే వస్తాయని చెప్పుకుంటున్నారు. గత ఎన్నికలకు భిన్నంగా తీర్పు ఉంటుందని బీఆర్ఎస్.. ఉమ్మడి జిల్లా అంతా మరోమారు స్వీప్ చేస్తామంటూ కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి. ఇవికాక బీజేపీ కూడా ఏయే నియోజవర్గాల నుంచి ఎవరిని బరిలోకి దింపాలి.. ఉమ్మడి జిల్లాలో నేతల్లో ఎవరు క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారని సర్వే చేయించినట్లు సమాచారం. ఇలా పార్టీల వారీగా సర్వేలతో ఆసక్తి నెలకొంది. ‘కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయి.., మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల్లో ఎవరు బెటర్’ అంటూ ప్రజలకు ప్రశ్నలు సంధిస్తూ ఉమ్మడి జిల్లాలోని నియోజకవర్గాల్లో జోరుగా సర్వేలు సాగుతున్నాయి. సాధారణ ఎన్నికలు ఇప్పట్లో లేకున్నా సర్వేలు రాజకీయ కాక పుట్టిస్తున్నాయి. ఈ సర్వేలను ఆయా పార్టీలు, నేతలే స్వయంగా చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నివేదికల ఆధారంగా ఎన్నికల నాటికి ఎలా సిద్ధం కావాలనే వ్యూహాల్లో నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంఉమ్మడి జిల్లాలో జోరుగా రాజకీయ సర్వేలు -
మృతి చెందిన బాలుడికి చికిత్స చేశారంటూ ఆందోళన
చుంచుపల్లి: బాలుడు చనిపోయాక చికిత్స అందిస్తున్నట్లు నటించి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట తల్లిదండ్రులు, బంధువులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన కిరణ్, యశోద దంపతులు తమ ఐదు నెలల బాబుకు మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు రావడంతో కొత్తగూడెం గణేష్ టెంపుల్ సమీపంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. బుధవారం ఉద యం డబ్బులు చెల్లించి బాబును తీసుకెళ్లాలని, ఇక వైద్యం చేయలేమని సిబ్బంది చెప్పినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే మంగళవారం రాత్రి నుంచి బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు బాబును చూడటానికి కూడా తల్లిదండ్రులు, బంధువులను అనుమతించలేదని వాపోయారు. మధ్యాహ్నమే బాలుడి శరీరం మొత్తం నలుపు రంగులోకి మారి ఉండటాన్ని కుటుంబ సభ్యులు గుర్తించినట్లు చెబుతున్నారు. దీంతో అప్పటికే బాబు మృతి చెంది ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశామని, అయినా మృతదేహానికి చికిత్స చేస్తున్నట్లు చెబుతూ మొత్తం బిల్లు చెల్లిస్తేనే బాబు ను అప్పగిస్తామని సిబ్బంది బెదిరింపులకు పాల్ప డ్డారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆస్పత్రి వద్ద సుమారు మూడు గంటలపాటు ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రిని సీజ్ చేయాలని నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మూడో పట్టణ పోలీసులు చేరుకుని విచారణ చేపట్టారు. -
గుండెపోటుతో వృద్ధురాలు మృతి
సత్తుపల్లిటౌన్: మంచం పైకి ఎక్కే క్రమాన కింద పడిన వృద్ధురాలు గుండెపోటుతో మృతి చెందింది. కొత్తగూడెంకు చెందిన ఏలపాటి భారతమ్మ(65) కుటుంబం సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్‌లో నాలుగేళ్లుగా నివనిస్తోంది. ఆమె కుమారుడు శ్రీనివాస్ సత్తుపల్లి జేవీఆర్ ఓసీలో పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న భారతమ్మ బుధవారం నిద్రించేందుకు మంచం ఎక్కేక్రమాన జారి కిందపడి అస్వస్థతకు గురైంది. దీంతో సత్తుపల్లిలోని సింగరేణి ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా, శ్రీనివాస్ కుమార్తె పుట్టిన రోజు నాడే భారతమ్మ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇద్దరు నిందితుల అరెస్ట్జూలూరుపాడు: ఆలయాల్లో వరుసచోరీలకు పాల్ప డుతున్న ఇద్దరు నిందితులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ ఎన్.జీనత్ కుమార్ కథనం ప్రకారం.. కొమ్ముగూడెం ఆలయంలో హుండీ పగులగొట్టి నగదు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బుధవారం జూలూ రుపాడు సాయిబాబా ఆలయం వద్ద అనుమానా స్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఖమ్మానికి చెందిన ఎస్కే ఖాజా, జి.లాలయ్య కొమ్ముగూడెం ఆలయంలోని చోరీతోపాటు గతంలో పలు ప్రాంతా ల్లోని ఆలయాల్లో హుండీలు పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లినట్లు ఒప్పుకున్నారు. రూ.5,798లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని, నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ తెలిపారు. ఎస్ఐ–2 మనీషా, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
12 రెస్టారెంట్లు తనిఖీ.. ఏడింటికి నోటీసులు
భద్రాచలంఅర్బన్: భద్రాచలంలోని రెస్టారెంట్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రతపై తాజాగా చేపట్టిన తనిఖీల్లో లోపాలు బయటపడ్డాయి. జిల్లా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శరత్ ఆధ్వర్యంలో 12 రెస్టారెంట్లను తనిఖీ చేసి, నిబంధనలు పాటించని ఏడు రెస్టారెంట్లకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేశారు. నాణ్యత, పరిశుభ్రత ప్రమాణాలకు అనుగుణంగా లేని 20 కిలోల మాంసం, 15 కిలోల గ్రేవీ, మూడు కిలోల మసాలా పేస్ట్.. మొత్తం 38 కిలోల ఆహార పదార్థాలను అధికారులు తొలగించారు. లోపాలను సరి దిద్దుకునేందుకు ఆయా రెస్టారెంట్లకు 15 రోజుల గడువు ఇచ్చారు. ఆహార పదార్థాలను సురక్షితంగా నిల్వ చేయాలని, వంట ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించాలని ఆదేశించారు. కాగా, భక్తులు, పర్యాటకులతో నిత్యం రద్దీగా ఉండే భద్రాచలంలో అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలోనూ తరచూ తనిఖీలు చేయాలని పలువురు కోరుతున్నారు. తాజా ఆహారం అందేలా చర్యలు తీసుకువాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
పతకాలు సాధించడమే లక్ష్యం
భద్రాచలంటౌన్: ప్రపంచ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో పతకం సాధించడమే లక్ష్యమని జిల్లా పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జీవీ రామిరెడ్డి తెలిపారు. అక్టోబర్ 15 నుంచి 24 వరకు అమెరికాలోని నెవాడా (రెనో)లో జరిగే వరల్డ్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్–2026 పోటీల్లో భద్రాచలానికి చెందిన డి.వి.శంకర్రావు దేశం తరఫున పాల్గొంటున్నాడని పేర్కొన్నారు. పోటీలకు వెళ్లేందుకు ఆర్థికసాయం కోసం తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ వీసీ, ఎండీ సోనీ బాలదేవికి వినతిపత్రం సమర్పించగా సానుకూలంగా స్పందించారని తెలి పారు. అసోసియేషన్ అధ్యక్షుడు భోగాల శ్రీని వాస్‌రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు. ఫామ్ పాండ్ల పరిశీలనచుంచుపల్లి: లక్ష్మీదేవిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో వీబీజీ రామ్‌జీ పథకంలో చేపడుతున్న అభివృద్ధి పనులను బుధవారం డీఆర్డీఓ ఎం.విద్యాచందన పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతపై ఆరా తీశారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. లక్ష్మీదేవిపల్లి ఎంపీడీఓ సుస్మిత, సర్పంచులు, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. మామిడి తోటలో ‘మత్తడి’ విందుఇల్లెందు: తాగునీటి చెరువు మత్తడి పడిందని మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో మొండితోగు రహదారిలోని మామిడి తోటలో పాలకవర్గం, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కార్మికులతో కలిపి బుధవారం విందు ఏర్పాటు చేశారు. గతంలో ఇల్లెందు తాగునీటి చెరువు అలుగు పడితే అక్కడి కాళీమాత ఆలయంలో ప్రత్యేక పూజలుచేసేవారు. కానీ ఈసారి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు, కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో విందు ఏర్పాటు చేశారు. భక్తి శ్రద్ధలతో కట్టమైసమ్మ, కాళీమాత అమ్మవార్ల పూజలు చేయాల్సిందిపోయి, విందు నిర్వహించడం విమర్శలకు దారితీసింది. ఈ విషయమై మున్సిపల్ డీఈ నవీన్‌ను వివరణ కోరగా.. మున్సిపల్ నిధులతో కాదని, వ్యక్తిగత నిధులతో విందు ఏర్పాటు చేశామని తెలిపారు. ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా ప్రసాద్సూపర్బజార్(కొత్తగూడెం)/అశ్వాపురం: కరీంనగర్లో ఈ నెల 6, 7, 8 తేదీల్లో జరిగిన ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల్లో నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కమిటీలో జిల్లా నుంచి 16 మంది కార్మిక నాయకులకు ప్రాతినిధ్యం దక్కింది. రాష్ట్ర కార్యదర్శిగా నరాటి ప్రసాద్, కార్యవర్గ సభ్యులుగా కంచర్ల జమలయ్య, జి నాగేష్, వేల్పుల మల్లికార్జున్ మరికొందరు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ కార్మిక సమస్యల పరిష్కారానికి పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. తిరుమలకుంట వాసికి డాక్టరేట్అశ్వారావుపేటరూరల్: మండలంలోని తిరుమలకుంట గ్రామానికి చెందిన కొనకళ్ల వరలక్ష్మి డాక్టరేట్ సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీ 85వ స్నాతకోత్సవంలో పీహెచ్డీ పట్టాను ప్రదానం చేశారు. ప్రొఫెసర్ ఉపేందర్ రెడ్డి పర్యవేక్షణలో ‘ఏ స్టడీ ఆన్ ఫిక్స్డ్ పాయింట్ రిజల్ట్స్ ఇన్ వేరియస్ మెట్రిక్ స్పేసెస్’అనే అంశంపై చేసిన పరిశోధన పూర్తి చేశారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఓయూ వీసీ కుమార్ చేతుల మీదుగా డాక్టరేట్ అందుకున్నారు. ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడిగా సురేష్కొత్తగూడెంఅర్బన్: ఎన్ఎస్యూసీ జిల్లా అధ్యక్షుడిగా ఏ.సురేష్ నాయక్ నియమితులయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి బుధవారం వివిధ జిల్లాల అధ్యక్షుల నియామకాలు చేపట్టారు. సురేష్ నియామకంపట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. -
ఓటు పునరుద్ధరణకే నోటీసులు
అశ్వారావుపేటరూరల్: ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఆధారాలు సమర్పించని ఓటర్లకు నోటీసులు అందిస్తారని, ఈ నోటీసులతో ఓటు పునరుద్ధరణ చేసుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అన్నారు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని తహసీల్దార్లు, మండల రాజకీయ పార్టీల బాధ్యులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నోటీసు ఇస్తే ఓటు తొలగించినట్లు కాదనే విషయాన్ని గమనించాలన్నారు. అనంతరం మండలంలోని దురదపాడు(దిబ్బగూడెం) గ్రామంలో పర్యటించి, గిరిజన రైతులకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాల సమస్యపై బాధిత రైతులతో మాట్లాడారు. తహసీల్దార్లు కిశోర్, బిందు, స్వాతి, స్వర్ణ, మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి, ఎన్నికల డీటీ హుస్సేన్, ఆర్ఐ తాటి కృష్ణ, పద్మావతి పాల్గొన్నారు. -
పుష్కర పనుల సందడి
● రూ.68.8 కోట్లతో తొలి విడత అభివృద్ధి పనులు ● భద్రగిరిలో ఘాట్ల విస్తరణ, డార్మెటరీ హాళ్ల నిర్మాణం ● ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రూ.46.65 కోట్ల పనులుభద్రాచలం: వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు భద్రగిరి ముస్తాబవుతోంది. సమయం సమీపిస్తుండటంతో భక్తులకు అవసరమైన వసతులు కల్పించే పనులకు శ్రీకారం చుట్టారు. తొలిదశగా జిల్లాకు కేటాయించిన రూ.68.8 కోట్లతో వివిధ శాఖల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గోదావరి స్నానఘాట్ల విస్తరణ, పాత ఘాట్ల పునరుద్ధరణ, భక్తుల వసతి సౌకర్యాలపై దృష్టి సారించారు. ఇటీవలే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్ కొన్ని పనులకు శంకుస్థాపన చేశారు. అంబ సత్రం సమీపాన భక్తుల వసతి కోసం జీ+1 అంతస్తులో డార్మెటరీ హాల్, గోదావరి ఒడ్డున నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. పుష్కరాలకు లక్షలాదిగా భక్తులు తరలిరానుండటంతో ప్రధానంగా వసతి, స్నానఘాట్లపై దృష్టి సారించారు. ఘాట్ల అభివృద్ధికి పెద్దపీట ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో రూ.46.65 కోట్లతో పలు పనులు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న ఘాట్‌ను విస్తరించడంతో పాటు హనుమాన్ దేవాలయం, పాత మెట్లు, ఇతర నిర్మాణాలను తొలగించేందుకు రూ.72 లక్షలు కేటాయించారు. కొత్త ఘాట్ విస్తరణ, మల్టీపర్పస్ మండపం, టాయిలెట్ బ్లాక్, ర్యాంప్ నిర్మాణం, పాత ఘాట్ల మరమ్మతులకు రూ.35.60 కోట్లు వెచ్చించనున్నారు. స్నానపు గదుల నిర్మాణానికి మరో రూ.62 లక్షలు కేటాయించారు. వీటికి టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులు మొదలుపెట్టగా, మిగిలిన పనులను దశలవారీగా చేపడతారు. మిగిలిన శాఖల ద్వారా కూడా.. పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం గోదావరి కారిడార్ పరిధిలో మొత్తం రూ.వేయి కోట్లు ప్రకటించింది. రెండు విడతల్లో పనులు చేపట్టాలని నిర్ణయించగా.. తొలి విడతగా రూ.646 కోట్ల పనులకు ఆమోదం లభించింది. ఇందులో భద్రాద్రి జిల్లాకు రూ.68.8 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధుల్లో ఇరిగేషన్ శాఖకు రూ.46.7 కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.17.6 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు రూ.3 కోట్లు, దేవాదాయ శాఖకు రూ.1.5 కోట్లు కేటాయించారు. పుష్కరాలకు ముందే పనులు పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది రాకుండా చూసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పనుల నాణ్యత, గడువులోగా పూర్తి చేయడం, భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడం కీలకంగా మారింది. కొత్త ఘాట్లకు మంగళం గోదావరి పుష్కరాల సందర్భంగా భద్రాచలంలో మినహా ఎక్కడా కొత్త ఘాట్లు నిర్మించడం లేదు. తొలుత ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో దుమ్ముగూడెం, మోతె, వాజేడు వద్ద కొత్త ఘాట్లకు ప్రతిపాదించినా ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. కేవలం పాత ఘాట్ల విస్తర్ణణ, మౌలిక వసతుల కల్పనపైనే దృష్టి సారించింది. ఇటీవల భద్రాచలంలో పర్యటించిన మంత్రుల సూచనలతో మళ్లీ దుమ్ముగూడెం వద్ద నూతన ఘాట్ నిర్మాణానికి రూ.8.73 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రక్రియ ఆలస్యమైనందున, అనుమతి వచ్చే అవకాశం తక్కువేనని తెలుస్తోంది. గత పుష్కరాలకు రూ.50 లక్షల మంది రాగా.. ఈసారి కోటి దాటతారనే అంచనా ఉండగా, పాత ఘాట్లపైనే ఆధారపడాల్సి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. భక్తుల సంఖ్యకు తగినట్లుగా ప్రభుత్వం నూతన ఘాట్ల నిర్మాణంపై దృష్టి సారించాలనే వినతులు వస్తున్నాయి. -
వచ్చే ఎన్నికల్లో బీజేపీదే గెలుపు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వచ్చే ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా తయారైందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కాంగ్రెస్ ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచే అవకాశం లేదని పేర్కొన్నారు. ముగ్గురు మంత్రులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఏ ఒక్క మేలైనా జరిగిందా అని ప్రశ్నించారు. భద్రాచలంలో బుధవారం నిర్వహించిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. పెనం మీద నుంచి పొయ్యిలోకి కేసీఆర్ ప్రభుత్వం రూ.6 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ 32 నెలల్లో రూ.3 లక్షల కోట్ల అప్పు చేసిందని, దీంతో తెలంగాణ ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్లయిందని అన్నారు. 22ఏ నిషేధిత జాబితాలో కోటి ఎకరాల భూమిని చేర్చి ప్రజలను రాచి రంపాన పెడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ విఫలమైందన్నారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు పవర్ ఫుల్ మంత్రులున్నా ఈ జిల్లాకు చేసింది గుండు సున్నా అని ఆయన దెప్పిపొడిచారు. ప్రధాని మోదీ ఇస్తున్నవే గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల నిధులన్నీ కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం ఇస్తున్నవేనని మంత్రి అన్నారు. జిల్లాలో 7 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు, పాల్వంచ ఇండస్ట్రియల్ పార్క్ అప్ గ్రేడేషన్ కోసం రూ. 8 కోట్ల గ్రాంట్ కేంద్రం మంజూరు చేసిందన్నారు. కొత్తగూడెంలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉందన్నారు. ప్రసాద్ స్కీంలో భాగంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి అభివృద్ధికి కోసం రూ.41 కోట్లు, పాండురంగాపురం–మల్కాన్‌గిరి రైలు మార్గానికి రూ. 3,592 కోట్ల వ్యయాన్ని కేంద్రం భరిస్తుందన్నారు. ఖమ్మం లో గ్రీన్ ఫీల్డ్ హైవే 5 ప్యాకేజీల కింద దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని, కోదాడ–ఖమ్మం–కావూరి రోడ్ నేషనల్ హైవే నిర్మాణానికి రూ. 446 కోట్లకు ఆమోదం లభించిందన్నారు. పీఎం ఆవాస్ యోజన స్కీం పేరును మార్చబోననే మాట ఇస్తే తెలంగాణకు పది లక్షల ఇళ్లు కేంద్రం నుంచి మంజూరు చేయించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు బండి ప్రకటించారు. తొలుత కుటుంబ సమేతంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ధర్మా, సంతోష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీజేపీకి బలం లేదని చెప్పడాన్ని తాను ఖండిస్తున్నట్టు వెల్లడించారు. గతంలో నిరుద్యోగ మార్చ్ చేస్తే ప్రభంజనంలా జనం తరలివచ్చారని, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మీటింగ్‌కు లక్ష మందికి పైగా హాజరయ్యారని గుర్తుచేశారు. ఖమ్మంలో బీజేపీ కేడర్ పవర్ ఫుల్‌గా ఉందన్నారు. పాలుపోసే వాడు, డ్రైవర్ సహా కార్యకర్త నిలబడ్డా ఎమ్మెల్యే, ఎంపీలుగా గెలిచేలా బీజేపీని బలోపేతం చేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో అన్ని అసెంబ్లీ స్థానాల గెలుపే తమ లక్ష్యమన్నారు. చిన్న చిన్న అభిప్రాయ బేధాలుంటే పక్కనపెట్టి సమష్టిగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. కేసులకు భయపడకుండా గెలుపుకోసం పోరాడాలని కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. ముగ్గురు మంత్రులతో జిల్లాకు ఒరిగింది శూన్యం -
ట్రాక్టర్ బోల్తా
15మంది కూలీలకు గాయాలు పాల్వంచరూరల్: రటాక్టర్ బోల్తా పడి 15 మంది కూలీలు గాయపడ్డ ఘటన మందేరకలపాడు సమీపంలో బుధవారం జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామానికి చెందిన 15 మంది మహిళలు పత్తి చేలో కలుపు తీసేందుకు ట్రాక్టర్లో వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒంటిగుడిసె వద్ద టైరు మొట్టుపైకి ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో కూలీలకు గాయాలు కాగా, పాల్వంచ, కొత్తగూడెం ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పాల్వంచ ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మాజీ జెడ్పీటీసీ యర్రంశెట్టి ముత్తయ్య, సీపీఐ నాయకులు వీసంశెట్టి పూర్ణచందర్రావు, నిమ్మల రాంబాబు, సర్పంచ్ బి.లక్ష్మి తదితరులు పరామర్శించారు. -
●జలసిరి !
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం కట్టుకాచారం వద్ద రికార్డు సమయంలో చెక్‌డ్యామ్‌ను నిర్మించగా.. ఇప్పుడు అక్కడ నీరు చేరి అలుగుపోస్తుండటంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. కట్టుకాచారం ఏటిపై నిర్మిస్తే కట్టుకాచారాం, కొంగరతో పాటు సూర్యాపేట జిల్లా కొత్తగూడెంలోని 250 ఎకరాలకు సాగునీరు అందనుండడంతో రైతుల వినతి మేరకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ చూపారు. ఈ ఏడాది జూన్ 11న పనులు మొదలుపెట్టగా 143 మీటర్ల పొడవుతో చెక్‌డ్యామ్ నిర్మాణాన్ని కేవలం 45 రోజుల్లో పూర్తిచేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు చెక్‌డ్యామ్ అలుగు పోస్తుండంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 45 రోజుల్లోనే చెక్‌డ్యామ్ నిర్మాణం -
ఇంటి ముందే ప్రమాదం.. డ్రైవర్ మృతి
చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి చెందాడు. తిప్పనపల్లికి చెందిన లారీ డ్రైవర్ ఎస్.కే.ముస్తఫా(50) చండ్రుగొండకు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నాడు. ఈక్రమాన నిమిషమైతే ఇంట్లోకి వెళ్తాడనగా ఆయన బైక్‌ను కొత్తగూడెం నుంచి చండ్రుగొండ వైపు వేగంగా వస్తున్న ప్యాసింజర్ ఆటో ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన ముస్తఫా అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చికిత్స పొందుతున్న డ్రైవర్.. జూలూరుపాడు(సుజాతనగర్): రోడ్డుప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. వివరాలిలా.. జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంకు చెందిన భూక్యా భద్రు(48) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఆయన సోమవారం ఆస్పత్రికి వెళ్తున్నట్లు చెప్పి సుజాతనగర్ వెళ్లాడు. సుజాతనగర్‌లోని నాయక్ పెట్రోల్ బంక్ వద్ద ఖమ్మం నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న కారు ఢీకొట్టగా తీవ్రగాయాలు కావడంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందాడు. ఘటనపై ఆయన భార్య భారతి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కల్యాణి తెలిపారు. బళ్లారిలో బాంబు పేలి.. పాల్వంచ వాసి మృతి పాల్వంచ: పొట్టకూటి కోసం పక్క రాష్ట్రానికి వెళ్లిన ఓ యువకుడిని ప్రమాదం బలి తీసుకుంది. పనిచేసే ప్రదేశంలో బాంబు పేలడంతో ఆయన మృతి చెందాడు. పాల్వంచ పరిధి బంగారుజాల గ్రామానికి చెందిన వజ్జ పూర్ణ(25) పాత పాల్వంచకు చెందిన నర్సయ్య కాంట్రాక్టర్ ద్వారా మరికొందరితో కలిసి కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని స్పాంజ్ ఐరన్ యూనిట్లో షట్‌డౌన్ పనుల నిమిత్తం వెళ్లాడు. యూనిట్ కిలన్‌లో బాంబ్ అమర్చగా, అది పేలకకపోవడంతో సరిచేసేందుకు వెళ్లిన సమయంలో ఒక్కసారిగా పేలింది. ఈ ధాటికి పూర్ణకు తీవ్రగాయాలై అక్కడిక్కడే మృతి చెందగా.. యాదగిరికి గాయాలయ్యాయి. ఉపాధి కోసం వెళ్లి మృతి చెందాడనే సమాచారం తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ బళ్లారికి బయలుదేరారు. కాగా, పూర్ణకు భార్య భువనేశ్వరి, ఐదేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. -
మెడికల సాకారమైంది..
ములకలపల్లి: ఎంబీబీఎస్ చదవాలన్న నిరుపేద గిరిజన విద్యార్థి కల సాకారమైంది. ఐటీడీఏ పీఓ రాహుల్‌తో పాటు దాతల సహకారంతో ఆయన చివరి రోజైన మంగళవారం ఫీజు చెల్లించడంతో మెడికల్ కాలేజీలో సీటు దక్కింది. ములకలపల్లి మండలంలోని టేకులగుంపు గ్రామానికి చెందిన నక్కా సంతోష్ తండ్రి భాస్కర్ చిన్నతనంలోనే చనిపోగా, తల్లి వెంకటమ్మ పదో తరగతిలో మృతి చెందింది. అమ్మమ్మ వద్ద ఉంటూ ఇంటర్ పూర్తి చేసిన ఆయన కూలీ పనులు చేస్తూనే నీట్ రాశాడు. ఈమేరకు ఎస్టీ కోటాలో 4,750 ర్యాంక్ సాధించిన సంతోష్‌కు దుండిగల్‌లోని అరుంధతి ఇన్స్టిట్యూట్ ఆఫ్మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. అయితే, ట్యూషన్ ఫీజు రూ.60 వేలు, సెక్యూరిటీ డిపాజిట్ రూ.40 వేలతో పాటు హాస్టల్ ఫీజు చెల్లించేందుకు చేతిలో చిల్లిగవ్వ లేక ఆవేదన చెందాడు. ఈమేరకు సంతోష్ పరిస్థితిపై ‘సంతోష’ం నిలపండి’శీర్షికన సాక్షిలో సోమవారం కథనం ప్రచురితమైంది. దీంతో విషయం ఐటీడీఏ పీఓ రాహుల్ దృష్టికి వెళ్లగా భద్రాచలం ఆదివాసీ ఐక్య సంఘం(బీఏసీ) ఆధ్వర్యాన సోమవారం పీఓను కలిశాడు. పీఓ రాహుల్ ఐటీడీఏ నుంచి తక్షణసాయంగా రూ.60 చెక్కు ఇవ్వడమే కాక నాయకులు తెల్లం రమణయ్య, కుంజా ధర్మ, కోండ్రు సుధారాణితోపాటు పలువురు నాయకులు, దాతలు, ఐటీడీఏ ఉద్యోగులు కలిసి మరో రూ.60 వేలు ఆర్థికసాయం అందజేశారు. అలాగే, ములకలపల్లివాసి, వైరా ఎస్సై పుష్పాల రామారావు చొరవతో ఖమ్మంకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయడు కొంగర పురుషోత్తం రూ.10 వేలు అంందించగా, సంతోష్ మంగళవారం మెడికల్ కళాశాలలో ఫీజు చెల్లించి అడ్మిషన్ పొందాడు. ఈసందర్భంగా ఐటీడీఏ పీఓతో పాటు దాతలకు సంతోష్ కృతజ్ఞతలు తెలిపాడు. సంతోష్‌కు ఐటీడీఏతో పాటు దాతల చేయూత -
బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
భద్రాచలంఅర్బన్: భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో వరుసగా మోటార్‌సైకిళ్ల దొంగతనా లకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ ఎం.అరుణ్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకా రం.. కొంతకాలంగా భద్రాచలంలో బైక్‌లు చోరీకి గురవుతున్నట్లు ఫిర్యాదులతో పోలీసులు నిఘా పెంచారు. ఈ క్రమాన టౌన్ ఎస్సై బి.రామకృష్ణ, సిబ్బంది సోమవారం కూనవరం రోడ్డులో వాహన తనిఖీలు చేపట్టగా సారపాక గాంధీనగర్‌కు చెందిన గుగులోత్ శ్రీను బైక్‌పై వస్తూ కనిపించాడు. వాహనానికి సంబంధించి పత్రాలు లేకపోవడంతో విచా రించగా భద్రాచలం, దుమ్ముగూడెం ప్రాంతాల్లో బైక్‌లను చోరీ చేసినట్లు అంగీకరించాడు. గతంలోనూ శ్రీనుపై కేసులు ఉండగా, నాలుగు మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించి నట్లు డీఎస్పీ తెలిపారు. ఈసమావేశంలో భద్రాచలం సీఐ నాగరాజు, ఎస్ఐ రామకృష్ణ, ఏఎస్ఐ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
పాఠం వింటేనే పర్మినెంట్!
● లైసెన్స్ దరఖాస్తుదారులకు వీడియో పాఠాలు ● ఆర్టీఏ కార్యాలయాల్లో నిర్వహణకు ఏర్పాట్లు ● మూడు గంటల పాఠం.. ఆతర్వాతే ట్రాక్ టెస్ట్ఖమ్మం క్రైం: వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆర్టీఏ అధికారులు కొత్త నిబంధన తీసుకొస్తున్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాకే లైసెన్స్ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం లైసెన్స్ దరఖాస్తుదారులకు ముందుగా వీడియో పాఠాలు బోధించనున్నారు. ఇప్పటికే ఈ విధానం హైదరాబాద్‌లోని కూకట్పల్లి ఆర్టీఏ కార్యాలయంలో అమలవుతోంది. త్వరలోనే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ నూతన విధానం ప్రవేశపెట్టనున్నారు. మూడు గంటల వీడియో సాధారణంగా వాహనదారులకు తొలుత లెర్నింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. ఇందుకోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష రాస్తే లైసెన్స్ జారీ అవుతుంది. ఇది తీసుకున్న 30రోజుల నుంచి ఆరు నెలల్లోగా పర్మి నెంట్ లైసెన్స్ తీసుకోవాలి. ఈమేరకు దరఖాస్తు చేసుకున్న వారు ఇప్పటివరకు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాలనే నిబంధన ఉంది. దీనికి తోడు ఇకపై ఆర్టీఏ కార్యాలయంలో మూడు గంటల వీడియో పాఠాలు చూడాల్సి ఉంటుంది. ఇందులో రహదారి భద్రత అంశాలు, రహదారి నిబంధనలపై అవగాహన కల్పించి ఆతర్వాత డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించి ఉత్తీర్ణులైతేనే పర్మినెంట్ లైసెన్స్ జారీ చేస్తారు. అంటే లెర్నింగ్ లైసెన్స్ ఉన్నవారు పర్మినెంట్ లైసెన్స్ కోసం తప్పనిసరిగా మూడు గంటల వీడియో పాఠాలను వినాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి టీజీ ఆన్లైన్లో వీడియో పాఠాల మాడ్యూల్స్ పొందుపరిచారు. కాగా, ఆన్లైన్లో పాఠాలు వినే సమయాన దరఖాస్తుదారుల ముఖకవళికలు కూడా నమోదు చేస్తారు. ఆతర్వాత టెస్ట్‌కు అనుమతిస్తారు. రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన ఉన్నవారికే లైసెన్స్ జారీ చేయాలనే భావనతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పర్మినెంట్ లైసెన్స్ కోసం ప్రతీ వాహనదారుడు వీడి యో పాఠాలు వినాల్సి ఉంటుంది. కూకట్‌పల్లిలో అమలవుతున్న ఈ విధానం జిల్లాలో త్వరలోనే అమలుకా నుంది. ఇప్పటికే ఈ విషయమై డ్రైవింగ్ స్కూళ్ల నిర్వాహకులకు అవగాహన కల్పించాం. ఉన్నతాధికారుల ఆదేశాలు రాగానే నూతన విధానాన్ని ప్రారంభిస్తాం. – శ్రీనివాస్, జిల్లా రవాణాశాఖాధికారి, ఖమ్మం -
వెల్నెస్ సెంటర్లో తనిఖీ
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని వెల్నెస్ సెంటర్‌ను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు మంగళవారం తనిఖీ చేశారు. హైదరాబాద్ నుండి వచ్చిన ట్రస్ట్ జనరల్ మేనేజర్ డాక్టర్ నరేష్, విజిలెన్స్ ఆఫీసర్ నారాయణరెడ్డి, డిప్యూటీ ఈఓ బి.శ్రీనివాస్ వెల్నెస్ సెంటర్లోని ఓపీతో పాటు ల్యాబ్, మందులు ఇచ్చే గదిని పరిశీలించారు. ఇటీవల సెంటర్లో మందులు సక్రమంగా ఇవ్వడం లేదనే ఫిర్యాదులు రావడంతో వివరాలు ఆరా తీశారు. మందుల లభ్యత ఆధారంగా ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టాలని సిబ్బందికి సూచించారు. అలాగే, ఇటీవల సెంటర్లోని మహిళా వైద్యులు, సిబ్బందిని డెంటల్ వైద్యుడు వేధించాడనే ఆరోపణలపై కూడా వివరాలు తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డిరేటర్ పి.సతీష్, జిల్లా మేనేజర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
రూ 9.33లక్షల గంజాయి స్వాధీనం
బూర్గంపాడు: వాహనాలు తనిఖీ క్రమాన బూర్గంపాడు పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బూర్గంపాడు ఎస్ఐ నాగభిక్షం ఆధ్వర్యాన మార్కెట్ యార్డు వద్ద మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ మేరకు మోటార్‌సైకిల్‌పై రెండు బ్యాగులతో వెళ్తున్న ఇద్దరికి తనిఖీ చేయగా రూ.9.33లక్షల విలువైన 18.600 కిలోల గంజాయి లభించింది. పట్టుబడిన వారు కర్ణాటకకు చెందిన నవీన్‌కుమార్, విజయకుమార్‌గా గుర్తించగా ఒడిశాలో గంజాయి కొనుగోలు చేసి తీసుకెళ్లున్నట్లు తేలింది. వీరిద్దరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్హెచ్ఓ మేడ ప్రసాద్ తెలిపారు. మోసం చేశాడని కానిస్టేబుల్‌పై ఫిర్యాదు పాల్వంచరూరల్: ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆతర్వాత ముఖం చాటేశాడని మంగళవారం ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పాల్వంచ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఓ యువతిని పాల్వంచ రూరల్ పోలీసుస్టేషన్లో విధులు నిర్వర్తించే కానిస్టేబుల్ తనను మోసం చేశాడని ఫిర్యాదులో వెల్లడించింది. -
●మంచు కొండలు కావివి.. రెల్లుగడ్డి !
మండలంలో సీతారామ ప్రాజెక్టు కెనాల్ నిర్మాణానికి తవ్వకాలు చేపట్టి తీసిన మట్టిని పక్కనే గుట్టలుగా పోశారు. ఆ గుట్టలపై పెరిగిన తెల్లటి రెల్లుగడ్డి మంచు కొండలను తలపిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. ఇటీవల వర్షాలకు మట్టి గుట్టలపై దట్టంగా పెరిగిన రెల్లుగడ్డి తెల్లటి పుష్పాలతో కమ్మేయడంతో గాలి వీచినప్పుడల్లా పూల గుత్తులు అలల మాదిరిగా ఊగుతున్నాయి. మట్టి గుట్టలకు ప్రకృతి సహజసిద్ధంగా అందాన్ని అద్దడంతో వాహనదారులు, స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. – అశ్వాపురం -
వ్యవసాయ కళాశాలలో విద్యార్థులు, డీలర్లు
అశ్వారావుపేటరూరల్: అశ్వారావుపేటలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాలను మంగళవారం వివిధ ప్రాంతాల విద్యార్థులు, దేవీ డీలర్ల బృందం వేర్వేరుగా సందర్శించారు. అశ్వారావుపేటలోని వీకేడీవీ జూనియర్ కళాశాలకు చెందిన 80 మంది ఇంటర్ సెకండియర్ విద్యార్థులు, మహబూబాబాద్ జిల్లాకు చెందిన 40 మంది దేశీ డీలర్ల బృందం కళాశాలను సందర్శించగా.. ఉద్యాన పంటలు, సాగు విధానాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. వీరికి కళాశాల ప్రొఫెసర్లు డాక్టర్ నీలిమ, డాక్టర్ రాములు, డాక్టర్ శివ అవగాహన కల్పించారు. జాతీయస్థాయి పోటీలకు జిల్లా క్రీడాకారులుసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాకు చెందిన గరిడేపల్లి భావన, కొమరోజు శ్రీరామ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ప్రతిభ చూపి డెహ్రాడూన్‌లో జరగనున్న జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. కేరళ త్రివేండ్రంలో నిర్వహించిన సౌత్‌జోన్ రైఫిల్ పిస్టల్ షూటింగ్ పోటీల్లో ప్రతిభ చాటిన వీరిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. క్రీడాకారులు, కోచ్ ఎం.డీ.నబీని డీవైఎస్ఓ ఎం.పరంధామరెడ్డి మంగళవారం అభినందించారు. సాహసవీరుడికి పురస్కారం అశ్వారావుపేటరూరల్: మండలంలోని నారంవారిగూడెం కాలనీ గ్రామానికి చెందిన సాహసవీరుడు భూక్యా కృష్ణనాయక్‌కు మరో పురస్కారం దక్కింది. ఏపీలోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రానికి చెందిన ఎం.వీ.రావు ఫౌండేషన్ ఆధ్వర్యాన వివిధ రంగాల్లో రాణిస్తున్న ప్రముఖులకు అవార్డులు ప్రకటించారు. ఇందులో భాగంగా సాహస విన్యాసాలు చేయడంతో పాటు మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్న కృష్ణను ఎంపిక చేయగా, సంస్థ చైర్మన్ ముప్పవరపు లీలా మోహన్‌కృష్ణ పురస్కారం అందజేశారు. -
బెట్టింగ్ గుట్టు రట్టయ్యేనా?
● ఉద్యోగాల పేరిట వసూళ్ల కేసులో ఎమ్మెల్యే పీఏ అరెస్టుతో సరి! ● రూ.8కోట్ల రికవరీపై అస్పష్టతభద్రాచలంఅర్బన్: ఉద్యోగాల ఆశ చూపి 54 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.8 కోట్ల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కోర్ల కళ్యాణ్‌కుమార్ వ్యవహారంలో అసలు గుట్టు ఎప్పుడు రట్టవుతుందన్న ప్రశ్నకు సమాధానం లభించడంలేదు. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, బూర్గంపాడు ప్రాంతాలకు చెందిన నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేయగా.. పోలీసులు దర్యాప్తు అనంతరం కళ్యాణ్‌ను అరెస్ట్ చేశారు. అయితే, విచారణలో ఆయన సొమ్మంతా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు చెప్పాడని పోలీసులు ప్రకటించినా.. అది నిజమేనా, కాదా అన్నది తేలాల్సి ఉంది. ఏయే ఖాతాల ద్వారా బెట్టింగ్‌కు మళ్లించాడు, ఎంత పోగొట్టుకున్నాడు, ఏయే ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగాయో విచారించకుండా ఆయన అరెస్టుతోనే సరిపెడతారా అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇంకా ఎవరు ఉన్నారు? రూ.8 కోట్ల మేర వసూళ్ల పర్వం కళ్యాణ్‌కుమార్ ఒక్కడితోనే సాగిందా, ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది తేలాల్సి ఉంది. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపడితే వివరాలు వెల్లడి కానున్నాయి. అంతేకాక కళ్యాణ్‌కుమార్ రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ కాగా, భద్రాచలం ఎమ్మెల్యే పీఏగా విధులు నిర్వర్తించిన సమయాన వసూళ్లకు పాల్పడ్డాడు. అయితే, పోలీసులు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లో రెవెన్యూ శాఖ సీనియర్ అసిస్టెంట్‌గా పేర్కొని ఎమ్మెల్యే పీఏ హోదాను ప్రస్తావించకపోవడం గమనార్హం. కాగా, ఉద్యోగాల ఆశతో డబ్బు చెల్లించిన బాధితులు రికవరీపై ఆశ పెట్టుకున్నారు. ‘వసూలు చేశాడు.. బెట్టింగ్‌లో పోగొట్టుకున్నాడు’ అన్నట్లు ముగించకుండా సొమ్ము రికవరీ చేస్తేనే తమకు న్యాయం జరుగుతుందని వారు చెబుతున్నారు. ఈవిషయంలో పోలీసులు తీసుకునే చర్యలపై అందరూ ఎదురుచూస్తున్నారు. నా కొడుక్కి ఉద్యోగం వస్తుందని ఆశతో ఆటోను తాకట్టు పెట్టడమే కాక అప్పు చేసి మరీ కళ్యాణ్‌కు రూ.10 లక్షలు ఇచ్చాను. చివరకు ఉద్యోగం రాకపోగా, డబ్బూ తిరిగి రాలేదు. ఇప్పుడు ఆ డబ్బంతా బెట్టింగ్‌లో పోయిందని చెప్పాడని తెలియడంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు. మాకు ఎవరి మీద కక్ష లేదు.. డబ్బు తిరిగి వస్తే చాలు. పోలీసులు రికవరీ చేపట్టి మాకు న్యాయం చేయాలి. – రాయల శ్రీను, బాధితుడు, ఆటో డ్రైవర్, భద్రాచలం -
అంజన్న ఆలయం నేలమట్టం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పరిధి అభయాంజనేయస్వామి ఉపాలయాన్ని మంగళవారం కూల్చివేశారు. ఆల య అభివృద్ధిలో భాగంగా ఈ ఉపాలయాన్ని పునర్ నిర్మించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం జీర్ణోద్ధరణ, కళావాహన పూజలు చేసి మూలమూర్తులను రంగనాయకుల గుట్టపైకి చేర్చారు. ఇక కూల్చివేత పూర్తిచేయడంతో ప్రధానాలయం, రాజ గోపురం మినహా నాలుగు వైపులా ప్రాకారా లు, ఉపాలయాల తొలగింపు పూర్తయింది. కాగా, ఇదే ప్రదేశంలో రామకోటి స్తంభాలను మాత్రం యథాతధంగా ఉంచనున్నారు. పనులను పరిశీలించిన ఈఓ.. ప్రభుత్వ లక్ష్యాల మేరకు ఆలయ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని రామాలయం ఈఓ దామోదర్‌రావు సూచించారు. దేవస్థానంలో అభయాంజనేయస్వామి ఆలయం తొలిగింపు ఇతర పనులను ఈఓ మంగళవారం పరిశీలించారు. అనంతరం పనులపై కాంట్రాక్టర్‌కు సూచనలు చేశారు. -
పెద్దాస్పత్రికి ‘సుడా’ అండ
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రి కొంత రూపు సంతరించుకోనుంది. సమృద్ధిగా నిధులు సమకూరుతుండడంతో మౌలిక వసతులు అందుబాటులోకి వస్తున్నాయి. కలెక్టర్ దివాకర చొరవ, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్య సహకారంతో పెద్దాస్పత్రిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం సుడా(స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) నిధులు కేటాయించడంతో పనులు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే వివిధ పనులు తుది దశకు చేరగా.. మరికొన్ని కూడా చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. హెచ్‌డీఎస్ నిధుల లేమితో... ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)కి నిత్యం 1,200 – 1,500 మంది వైద్య సేవలకు వస్తున్నారు. అలాగే ఇన్‌పేషంట్ల తాకిడి కూడా ఉంటోంది. ఇక సీజనల్ సమయాన ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. అయితే, జనానికి తగినట్లు సౌకర్యాలు లేకపోగా.. హెచ్‌డీఎస్ నిధుల లేమితో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈక్రమాన కలెక్టర్ దివాకర, కేఎంసీ కమిషనర్ అభిషేక్ ప్రత్యేక దృష్టితో ‘సుడా’ నిధులు కేటాయించారు. గత ఏడాది నుంచి రూ.2.32 కోట్లు వెచ్చించగా ఈ నిధులతో చేపట్టిన పనులు చివరి దశకు చేరాయి. ఎంసీహెచ్, జనరల్ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్, లేబర్ రూంల ఆధునికీకరణ పనులను రూ.14.90 లక్షలతో పూర్తి చేశారు. అలాగే రూ.30 లక్షలతో దివ్యాంగులకు సదరమ్ వెయిటింగ్ హాల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇక రూ.40లక్షల వ్యయంతో సంప్, రూ.7.95 లక్షలతో టాయిలెట్లు నిర్మించడమేకాక రూ. 33.50 లక్షలతో పాత టాయిలెట్లను ఆధునికీకరించారు. అంతేకాక రూ. 33.30 లక్షలతో ఇతర పనులు చేపడుతుండంతో పాటు రూ.49 లక్షలతో ఆస్పత్రి ఆవరణలో బీటీ రోడ్డు నిర్మించారు. అలాగే, సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ. 21.25 లక్షలు, ఫైర్ సేప్టీ పనులకు రూ.2లక్షలు కేటాయించారు. మరికొన్ని కూడా... తొలి దశలో ‘సుడా’ నిధులతో చేపట్టిన పనులు చివరి దశకు చేరడంతో మరికొన్ని పనులకు ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ దివాకర ఆదేశించారు. ఈక్రమాన అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కలెక్టర్, కేఎంసీ కమిషనర్ సానుకూలంగా స్పందించి ‘సుడా’ నిధులు కేటాయించాలని నిర్ణయించారు. రూ.3.08 కోట్లతో చేపట్టే పనులకు టెండర్ల ప్రక్రియపై దృష్టి సారించారు. ఈ నిధులతో పాత ఓపీ భవనంలో దెబ్బతిన్న నీటి పైప్లైన్ల మార్పిడి, పైకప్పు మరమ్మతులు, ఆపరేషన్ థియేటర్, హెచ్ఓడీ బ్లాక్‌ల ఆధునికీకరణ, లిఫ్ట్ ఏర్పాటు పనులు జరగనున్నాయి. -
మరింత సమయం
● రెండో రోజూ కొనసాగిన ఏఏఐ బృందం పర్యటన ● దుమ్ముగూడెం, బూర్గంపాడు, ములకలపల్లి మండలాల్లో పరిశీలన ● సమాచారం విశ్లేషించాక ఎయిర్‌పోర్ట్‌పై తుది నిర్ణయం సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం/బూర్గంపాడు/దుమ్ముగూడెం: గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పరిస్థితులు ఎక్కడ అనుకూలంగా ఉన్నాయనే అంశాన్ని నిర్ధారించడానికి మరింత సమయం పడుతుందని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ)కి చెందిన సాంకేతిక నిపుణుల బృందం వెల్లడించింది. స్థలాల పరిశీలన కోసం జిల్లాకు వచ్చిన బృందం పర్యటన రెండో రోజైన మంగళవారం కొనసాగింది. ఈ మేరకు ములకలపల్లి మండలం తిమ్మంపేట, దుమ్ముగూడెం మండలం అర్లగూడెం, పెద్ద కమలాపురంతో పాటు బూర్గంపాడు మండలం సారపాక సమీపాన పుష్కరవనం భూములను నిపుణులు పరిశీలించారు. దుమ్ముగూడెం సానుకూలం దుమ్ముగూడెంలో ఎంపిక చేసిన భూమి అనుకూలంగా ఉండడం, విమానాశ్రయానికి పెద్దగా అడ్డంకులు లేవని ఏఏఐ బృందం గుర్తించింది. ఇదే సమయాన అటవీ ప్రాంతం ఎక్కువగా ఉండడాన్ని ప్రతికూలంగా పేర్కొంది. భూమి విస్తీర్ణం మాత్రమే కాక భూమి ఎత్తుపల్లాలు, రన్‌వే దిశ, విమానాల అప్రోచ్ మార్గం, పరిసర కొండలు, అటవీ ప్రాంతాలు, నీటి ప్రవాహ మార్గాలు, రైల్వే – రహదారి మార్గాలు, విద్యుత్ లైన్లు, గాలి వేగం – దిశ, వర్షపాతం, భూసాంకేతిక పరిస్థితులు వంటి అనేక అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఏఏఐ సాంకేతిక బృందం స్పష్టం చేసింది. మరింత స్థలం ములకలపల్లి మండలం తిమ్మంపేట దగ్గర ప్రతిపాదించిన సుమారు 500ఎకరాల విస్తీర్ణాన్ని మ్యాప్ ద్వారా నిపుణులు పరిశీలించారు. విమానాశ్రయానికి అవసరమైన రన్ వే, అప్రోచ్, ఇతర అనుబంధ సౌకర్యాల దృష్ట్యా అదనపు ప్రాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని బృందం వెల్లడించింది. ప్రధానంగా అప్రోచ్ ప్రాంతానికి సుమారు 1.5 కి.మీ. వరకు అదనపు స్థలం అవసరమని పేర్కొంది. కాగా, సోమవారం పరిశీలించిన సుజాతనగర్ స్థలానికి రైల్వే లైన్‌తో ఉన్న సాంకేతిక ఇబ్బందులను ఇప్పటికే ఏఐఐ టీమ్ గుర్తించినట్లు సమాచారం. పూర్తిస్థాయిలో విశ్లేషించాక... ప్రతిపాదిత స్థలాలపై క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను కాంటూర్ మ్యాప్‌లు, టోపోగ్రాఫికల్ మ్యాప్‌లు, గత 10 – 40 ఏళ్ల వర్షపాతం వివరాలు, గాలి వేగం – దిశకు సంబంధించిన సమాచారంతో అనుసంధానం చేసి సాఫ్ట్వేర్ ఆధారిత విశ్లేషణ, సిమ్యులేషన్ నిర్వహించనున్నట్లు ఏఏఐ టీమ్ తెలిపింది. విమానాశ్రయ కార్యకలాపాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, సివిల్ ఇంజినీరింగ్ అంశాలను వేర్వేరుగా పరిశీలించి సమగ్ర సాంకేతిక సాధ్యాసాధ్యాలను అంచనా వేయనున్నారు. ఈ ప్రక్రియకు సుమారు 6 – 8 వారాల సమయం పట్టే అవకాశం ఉందని సాంకేతిక బృందం తెలిపిందిప్రస్తుతం జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలన ప్రాథమిక సాంకేతిక అధ్యయనంలో భాగమేనని, ఏ ప్రాంతాన్ని విమానాశ్రయానికి ఎంపిక చేస్తూ ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదని కలెక్టర్ అంకిత్ వెల్లడించారు. అలాగే, ప్రతిపాదిత ప్రాంతాలకు సంబంధించిన రెవెన్యూ, సర్వే, అటవీ, రహదారులు, రైల్వే, భౌగోళిక, వాతావరణ తదితర వివరాలను సాంకేతిక బృందానికి అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కొత్తగూడెం ఆర్డీఓ మధు, సీపీఓ సునీత, తహసీల్దార్లు స్వాతిబిందు, కేఆర్కే.ప్రసాద్, అశోక్‌కుమార్, వివిధ శాఖల అధికారులు శ్రీనివాస్, నర్సింహారావు, ఉపేందర్, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దంపతులకు ఒకేసారి డాక్టరేట్!
ఉద్యోగాలు చేస్తూనే ఓయూ నుంచి పరిశోధన రఘునాథపాలెం: ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో రఘునాథపాలెం మండలం ఈర్లపూడికి దంపతులు డాక్టర్ బి.సృజన్‌లాల్, డాక్టర్ జి.మోనికాజాదవ్ డాక్టరేట్లు అందుకుని ప్రత్యేకత చాటారు. వీరిద్దరూ మేనేజ్మెంట్ విభాగంలో పరిశోధన పూర్తిచేయడం మరో విశేషం. ప్రస్తుతం సృజన్‌లాల్ ఎస్బీఐలో, మోనిక ఎస్పీడీసీఎల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూనే ఉన్నత విద్యపై ఆసక్తితో పీహెచ్డీ పూర్తి చేసిన వీరిద్దరు డాక్టరేట్ అందుకున్నారు. సృజన్‌లాల్ తల్లిదండ్రులు బి.సుందర్‌లాల్, శైలజ ఓయూ పూర్వ విద్యార్థులు కావడంతో అదే విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందాలనే లక్ష్యం నిర్దేశించుకున్నట్లు చెబుతున్నారు. -
పకడ్బందీగా భూముల రీసర్వే
క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ అంకిత్ పాల్వంచరూరల్: ఏ మాత్రం తేడా రాకుండా భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. పాల్వంచ మండలం నాగారం గ్రామపంచాయతీ పరిధి రేపల్లేవాడ, బోజ్యాతండాల్లో 458 ఎకరాలకు సంబంధించి సర్వే జరుగుతుండగా కలెక్టర్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వేయర్లు, స్థానిక రైతుల నుంచి ఆయన వివరాలు ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వివాదాలకు తావులేకుండా సర్వే చేపడుతూ ప్రతీ భూయజమాని హద్దులను క్షేత్రస్ధాయిలో పరిశీలించి సరిపోల్చాలని ఆదేశించారు. రీసర్వేతో హద్దులు, విస్తీర్ణం వివరాలు స్పష్టంగా నమోదు కానున్నందున రైతులు కూడా సహకరించాలని తెలిపారు. తహసీల్దార్ దారా ప్రసాద్, ఆర్ఐ నళినికుమార్ తదితరులు పాల్గొన్నారు. వేగంగా భూసేకరణ సూపర్‌బజార్(కొత్తగూడెం): సీతారామ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూసేకరణలో వేగం పెంచాలని కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. క్యాంపు కార్యాలయం నుంచి ఆయన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూసేకరణ, పైలట్ గ్రామాల్లో భూముల రీ సర్వే, ‘ఎస్ఐఆర్’లో నోటీసుల జారీ, విచారణపై సూచనలు చేశారు. -
భక్తరామదాసు నుంచి బిరబిరా...
కూసుమంచి/తిరుమలాయపాలెం: వర్షాలు లేక పంటలు వడలిపోతుండడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యాన సాగులో ఉన్న పంటలను కాపాడేందుకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు జల వనరుల శాఖ అధికారులు మంగళవారం భక్తరామదాసు ప్రాజెక్టు మోటార్‌ను ఆన్ చేసి నీరు విడుదల చేశారు. వారం పాటు నీరు విడుదల చేస్తూ, తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లోని చెరువులు నింపుతామని ఇరిగేషన్ డీఈ బాణాల రమేష్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టులోని ఒక మోటార్ ద్వారా 270 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, మార్గమధ్యలో రైతులు మోటార్ల ద్వారా నీరు తోడినా, గండ్లు పెట్టినా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తాగు, సాగు నీటి అవసరాలు తీర్చేలా చెరువులు నింపేందుకు విడుదల చేసిన నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా, నీటి విడుదలతో ఇబ్బందులు తప్పనున్నాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, కూసుమంచి మండలం ఎర్రగడ్డతండా వద్ద భక్తరామదాసు ప్రాజెక్టు నుంచి అధికారులు నీటిని విడుదల చేయగా, తిరుమలాయపాలెం మండలంలోని మాదిరిపురం వద్ద కాల్వలోకి నీరు చేరింది. పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ జలాలు చేరుతుండటంతో నీటిమట్టం 21అడుగులకు చేరింది. దీంతో ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేశారు.చెరువులు నింపేందుకు నీటి విడుదల -
కిన్నెరసానిలో పుట్టీ తిరిగేదెన్నడో?
పాల్వంచరూరల్: పర్యాటకులను ఆకట్టుకోవడమే కాక స్థానికులకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో మండలంలోని కిన్నెరసాని కెనాల్లో పుట్టీ నడిపించాలని నిర్ణయించారు. పూర్వ కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ఈ విషయమై చొరవ చూపి రూ.40వేల వ్యయంతో మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణలో పుట్టీ తెప్పించారు. అంతేకాక మత్స్య సొసైటీ సభ్యులకు అప్పగించి, ఇద్దరికి శిక్షణ కూడా ఇప్పించారు. అయితే, పునుకుల గ్రామానికి చెందిన మత్స్య సొసైటీ సభ్యులు శిక్షణ తీసుకున్నా, కారణాలేమిటో తెలియదు కానీ పుట్టీ నడపడం లేదు. పర్యాటకులను ఆకట్టుకుంటూ ఆదాయం సాధించే అవకాశం ఉన్నా పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. కలెక్టర్ లేదా టూరిజంశాఖ అధికారులు స్పందిస్తే కిన్నెరసాని కెనాల్ పుట్టీలో పర్యటించే అవకాశం పర్యాటకులకు దక్కనుంది. -
దరఖాస్తులు సరే.. పరిష్కారం?!
● కార్పొరేషన్ ప్రజావాణిపై నీలినీడలు ● ఆరు వారాల్లో 190 వినతులు ● పరిష్కారంపై మాత్రం అస్పష్టతకొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారం కోసం జూలై నుంచి ప్రజావాణి నిర్వహిస్తున్నారు. మేయర్ మూడ్ గణేష్‌తో పాటు కమిషనర్, అధికారులు పాల్గొని దరఖాస్తులు, వినతులు స్వీకరిస్తున్నారు. అయితే, దరఖాస్తులకు సంబంధించి పరిష్కారం మాత్రం లభించడం లేదని ప్రజలు వాపోతున్నారు. పరిశీలనలోనే ఆలస్యం... ప్రజావాణిలో అందే దరఖాస్తులను సంబంధిత సెక్షన్‌కు వెంటనే పంపించాలి. ఆ మరుసటి రోజే సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే సమస్యకు పరిస్కారం లభిస్తుంది. కానీ కొన్నింటి విషయంలో అధికారులు, సిబ్బంది ఆలస్యం చేయడం వల్ల ఫలితం దక్కడం లేదు. ఇంకొన్ని సమస్యల విషయంలో పరిశీలన చేపట్టినా పరిష్కారం చూపించకుండా వెనక్కి వెళ్తున్నారనే విమర్శలు వస్తున్నారు. దీంతో ప్రజావాణి లక్ష్యం నీరుగారే పరిస్థితి ఎదురవుతోంది. కార్పొరేషన్‌లోని పలు డివిజన్లలో రహదారుల ఆక్రమణ, పారిశుద్ధ్య సమస్య, నీటి సరఫరాలో లోపాలు, కోతుల బెడద తదితర అంశాలపై ఫిర్యాదులు అందుతున్నా పరిష్కారానికి నోచుకోవడం గమనార్హం. కొత్తగూడెం కార్పొరేషన్లో జూలై 22వ తేదీ నుంచి ప్రతీ బుధవారం ప్రజావాణి నిర్వహిస్తుండగా, ప్రజలు తమ సమస్యలు వెంటనే పరిష్కారం లభిస్తుందని భావించారు. కానీ కాలక్రమంలో ఆ నమ్మకం కోల్పోగా... దరఖాస్తులు కూడా నానాటికీ తగ్గిపోతున్నాయి. స్పష్టత కరువు ఇప్పటివరకు ఆరు బుధవారాలు ప్రజావాణి నిర్వహించారు. ఇందులో 190 దరఖాస్తులు నమోదైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఇందులో ఎన్ని పరిష్కరించారు, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలు వెల్లడించడానికి కార్పొరేషన్ అధికారులు విముఖత వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఇకనైనా పరిష్కారంలో వేగం పెంచకపోతే ప్రజావాణిపై నమ్మకం సన్నగిల్లే అవకాశమున్నందున పాలకవర్గం, అధికారులు స్పందించాల్సిన అవసరముంది.తేదీ అందిన దరఖాస్తులు జూలై 22 26జూలై 29 23ఆగస్టు 05 64ఆగస్టు 12 34ఆగస్టు 19 32సెప్టెంబర్ 02 1 1మొత్తం 190 -
కనుల పండువగా పట్టాభిషేకం
భద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిత్యకల్యాణం, పునర్వసు నక్షత్రం సందర్భంగా పట్టాభిషేకం కనుల పండువగా సాగాయి. తెల్ల వారుజామునే గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మిథిలా స్టేడియంలోని శ్రీరామ సేవా మండపంలో కొలువుదీర్చి స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. ఆతర్వాత స్వామికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవం, ఆపై పట్టాభిషేకం పూర్తిచేశారు.జిల్లాకు కేంద్ర మంత్రి బండి సంజయ్ చుంచుపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి దర్శనంతో పాటు కుటుంబ వేడుకకు హాజరయ్యేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ మంగళవారం జిల్లాకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా సాయంత్రం కొత్తగూడెం చేరుకోగా అధికారులు, బీజేపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం భద్రాచలం బయలుదేరిన కేంద్ర మంత్రి సారపాకలోని ఐటీసీ గెస్ట్‌హౌస్‌లో రాత్రి బస చేశారు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించుకున్నాక, బంధువుల వివాహ వేడుకకు హాజరవుతారు. ఈనేపథ్యాన ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షించారు. జిల్లా టూరిజం నోడల్ అధికారిగా అనూష సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లా టూరిజం నోడల్ అధికారిగా జిల్లా పంచాయతీ అధికారి అనూషకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు కలెక్టర్ అంకిత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి, వాటి అభివృద్ధికి ప్రణాళికలను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. ఇప్పటివరకు డీవైఎస్ఓ పరంధామరెడ్డి టూరిజం శాఖాధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహించారు. ఆ స్థానంలో ఇప్పుడు అనూష నియమితులయ్యారు. ఎఫ్బీఓ కుటుంబానికి రూ.30లక్షల పరిహారం బూర్గంపాడు: వేటగాళ్లు అమర్చిన విద్యుత్ తీగలు తాకి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన చెరువు సింగారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ కుటుంబానికి అటవీశాఖ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈమేరకు రూ.30లక్షల పరిహారం మంజూరు చేస్తూ పీసీసీఎఫ్ వినయ్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పరిహారాన్ని నవీన్ భార్య ప్రమీలకు అందించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గత నెల 11వ తేదీన నకిరిపేట అటవీప్రాంతంలో వన్యప్రాణులను వేటాడేందుకు వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చగా, తనిఖీలకు వెళ్లిన నవీన్ వాటిని గుర్తించక తాకడంతో అక్కడికక్కడే మృతిచెందిన విషయం విదితమే. ఘటనకు కారకులైన నిందితులను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈక్రమాన బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. నాణ్యమైన వైద్యసేవలే లక్ష్యం డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్ చుంచుపల్లి/పాల్వంచ: జిల్లాలో అమలవుతున్న జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారం రాథోడ్ ఆదేశించారు. పాల్వంచలోని కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన ఆరోగ్య సూపర్వైజర్లతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ గర్భం దాల్చిన మహిళల వివరాలు నమోదు చేసి, షెడ్యూల్ ప్రకారం వైద్య పరీక్షలకు వచ్చేలా అవగాహన కల్పించాలని సూచించారు. అంతేకాక హైరిస్క్ గర్భిణులను పర్యవేక్షించాలని తెలిపారు. అంతేకాక అసంక్రమిత వ్యాధుల గుర్తింపునకు స్క్రీనింగ్ నిర్వహించాలని చెప్పారు. గర్భిణులతో పాటు అర్హులైన ప్రతీ చిన్నారికి టీకాలు అందేలా చూడాలని, కుష్టు బాధితులు నిరంతరం మందులు వాడేలా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ అధికారులు డాక్టర్ భూక్యా రామ్‌దాస్, డాక్టర్ టి.ప్రతాప్, డాక్టర్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. -
అనారోగ్యంతో అద్దె ఇంట్లో మృతి
● ఇంటి ముందు మృతదేహం ఉంచేందుకు యజమాని నిరాకరణ ● అండగా నిలిచిన దూరపు బంధువు పాల్వంచ: సొంతిల్లు లేకపోవడం, ఇంటి యజ మాని నిరాకరించడంతో అనా రోగ్య సమస్యలతో మృతిచెందిన వ్యక్తికి కడసారి వీడ్కోలు చెప్పేందుకు కూడా చోటులేని దుస్థితి పాల్వంచ పట్టణ పరిధి లోని బొల్లేరుగూడెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మహబుబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వాయిలాలకు చెందిన గుమ్మడి రాజు భిక్షపతి(50)కి ముఫ్పై సంవత్సరాల క్రితం ఓ ప్రమాదంలో రెండు కళ్ల, చేయి కోల్పోయాడు. తల్లిదండ్రుల తదనంతరం పాల్వంచ బొల్లేరుగూడెంలోని నివసించే అక్క, బావ గాదే రాములమ్మ, కొమురయ్య దంపతులు భిక్షపతిని తమ వద్దకు తీసుకువచ్చి చూసుకుంటున్నారు. వారు ఉండే అద్దె ఇంట్లో భిక్షపతి సోమవారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఇంటి ముందు మృతదేహాన్ని ఉంచేందుకు యజమాని ఒప్పుకోకపోవడంతో రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు ముదిగొండ రాంబాబు దృష్టికి వెళ్లడంతో, అదే సంఘానికి చెందిన బంధువు గుడికందుల సమ్మయ్య, విజయలకు సమాచారం అందించారు. దీంతో సమ్మయ్య మానవతా దృక్పథంతో మృతదేహాన్ని తన ఇంటి ముందే ఉంచి అంతిమ లాంఛనాలను నిర్వహించారు. దశ దినకర్మ జరుపుకోవడానికి ఆశ్రయమిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. క్లిష్ట సమయంలో అండగా నిలిచిన సమ్మయ్య కుటుంబాన్ని నాయకులు, స్థానికులు అభినందించారు. -
మండలంలోని పలు ప్రాంతాలను పొగమంచు పూర్తిగా కప్పేసింది. పల్లె దారులు, పచ్చని పొలాలు, చెట్టు చేమలు మంచు ముసుగులో మురిసిపోయాయి. రహదారులు సక్రమంగా కనిపించక రాకపోకలకు వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఈ దృశ్యాలు సోమవారం కరకగూడెంలో కనిపించాయి. – కరకగూడెం
కిరాణా వ్యాపారి ఐపీ దాఖలుసూపర్బజార్(కొత్తగూడెం): ఇల్లెందు స్టేషన్ బస్తీకి చెంది మహిళా కిరాణా వ్యాపారి జోగునూరి నాగమణి సోమవారం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ కోర్టులో రూ 10.90 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. 2020 నుంచి 2025 డిసెంబర్ వరకు కిరాణా షాపు నిర్వహణకు అప్పులు చేసి వడ్డీలు కట్టడంతో ఆర్థికంగా చితికి పోయినట్లు తెలిపారు. న్యాయవాది కె.నాగేశ్వరరావు ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలుబూర్గంపాడు: మండలంలోని సారపాకలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఐటీసీ గేటు వైపు నుంచి సారపాక సెంటర్‌కు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తాళ్లగొమ్మూరుకు చెందిన వీరయ్య గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయనను భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్ ఆత్మహత్యటేకులపల్లి: అప్పుల ఊబిలో కూరుకుపోయిన హెడ్‌కాని స్టేబుల్ సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఇల్లెందు మండలం సుభాష్ నగర్‌కు చెందిన ఊకే సురేష్ (35) చాతకొండ 6వ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. అప్పులు తీర్చే మార్గం లేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లలో డబ్బులు కోల్పోవడం వల్లే ఆయన అప్పుల పాలయ్యారనే ప్రచారం స్థానికంగా సాగుతోంది. కాగా, సోమవారం రోళ్లపాడు క్రాస్ రోడ్డు సమీపంలోని ఆరోమైలు అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐ కె.తిరుపతి సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం వద్ద లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా మృతుడి వివరాలను ధ్రువీకరించుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో పసిపిల్లల ఆక్రందనలు ప్రతీ ఒక్కరినీ కలచివేస్తున్నాయి. -
అర్జీలకు పరిష్కారం చూపాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజల నుంచి స్వీకరించే ప్రతీ వినతిని నిశితంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, విద్యాచందనతో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించి మాట్లాడారు. అర్జీలను పరిశీలించి పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటి వివరాలు ● గ్రామంలో డ్రెయినేజీ సమస్యను పరిష్కరించా లని కోరుతూ జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామ ప్రజలు అందజేసిన దరఖాస్తును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని జూలూరుపాడు ఎంపీడీఓకు ఎండార్స్ చేశారు. ● 35 ఏళ్లుగా నివసిస్తున్నా తమ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాల లేదని బూ ర్గంపాడు మండలం సారపాక గ్రామపంచా య తీ పరిధిలోని శ్రీరాంపురం ఎస్టీ కాలనీకి చెందిన 65 గిరిజన కుటుంబాలవారు విన్నవించారు. దీంతో తగిన చర్యలు తీసుకోవాలని ఐటీడీఏ పీఓకు ఎండార్స్ చేశారు. ● తనకు సర్వేనంబర్ 617లో ఐదెకరాల పట్టా భూమి ఉండగా, రెండెకరాలను సింగరేణి ఓపెన్ కాస్టు కోసం ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఇల్లెందు మండలం సుదిమల్ల గ్రామానికి చెందిన ధనసరి పగిడిద్దరాజు తెలిపారు. మిగిలిన మూడు ఎకరాల భూమికి సంబంధించిన పాత రికార్డులను సవరించి, తన పేరుపై నూతన పట్టాదారు పాస్‌బుక్ జారీ చేయాలని కోరారు. ఈవీఎం గోదాం తనిఖీ త్రైమాసిక తనిఖీ ల్లో భాగంగా సోమవారం కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత ఎన్నికల అధి కారుల సమక్షంలో ఈవీ ఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచిన గదులను పరిశీలించారు. అనంత రం తిరిగి సీల్ చేయించారు. కొత్తగూడెం ఆర్డీఓ మధు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, బీఆర్ఎస్, సీపీఎం నాయకులు లక్ష్మణ్ అగర్వాల్, రాంబాబు, అనుదీప్, సలీం, సిబ్బంది పాల్గొన్నారు.నోటీసుల జారీ వేగవంతం చేయాలిఎస్ఐఆర్ నోటీసుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఎస్ఐఆర్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి హాజరైన కలెక్టర్ అంకిత్ మాట్లాడు తూ దాదాపు 60శాతం నోటీసుల జారీ ప్రక్రి య పూర్తయిందని తెలిపారు. హియరింగ్ నిర్దేశిత కార్యాచరణ ప్రకారం నిర్వహిస్తున్నామని తెలిపారు. నోమ్యాపింగ్, అనామలీస్‌కు సంబంధించిన ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని వివరించారు. కలెక్టర్ అంకిత్ -
అంజన్న గుడి జీర్ణోద్ధరణ
భద్రాచలం: భద్రగిరిలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు ఊపందుకున్నా యి. ఉపాలయమైన తూర్పు దిక్కున ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయం కూల్చి, మూలమూర్తులను తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సోమవా రం ఆలయ జీర్ణోద్ధరణ, కళావాహన కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమాలకు ముందుగా ఆదివారం రాత్రి అంకురార్పణ చేపట్టారు. వేద మంత్రోచ్ఛరణలు, ప్రత్యేక పూజలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జీర్ణోద్ధరణ పనుల్లో భాగంగా ఆంజనే య స్వామి విగ్రహాలను రంగనాయకుల గుట్టపైకి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విగ్రహాల తరలింపునకు సంబంధించిన క్రతువులను ఆగమ శాస్త్ర సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారు. జీర్ణోద్ధరణ పూర్తయ్యే వరకు స్వామివారి విగ్రహాలను గుట్టపై ఉంచి నిత్యపూజలు జరపనున్నారు. వరుసగా పరివార ఆలయాల పునరుద్ధరణ ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఇప్పటికే లక్ష్మీతాయారు, గోదాదేవి అమ్మవారు, ఇతర ఆళ్వార్లు మూలమూర్తులకు జీర్ణోద్ధరణ, కళావాహన కార్యక్రమాలు జరిపారు. ప్లాన్‌లో ఆంజనేయస్వామి ఆలయాన్ని కూడా చేర్చడంతో సోమవారం తొలగింపు పనులు చేపట్టారు. దీంతో ప్రధానాలయంలోని మూలమూర్తులు మినహా అన్ని ఉపాలయాల తొలగింపు పూర్తయ్యాయి. విస్తా కాంప్లెక్స్ తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి నాటికి ఉత్తర ద్వారం పూర్తి చేసేలా పనులు చేపడుతున్నారు. ఘనంగా సీతారాముల నిత్యకల్యాణం దేవస్థానంలో సోమవారం సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో కొలువుదీర్చారు. స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. -
రాష్ట్ర క్రికెట్ జట్టుకు ఎంపిక
మణుగూరు రూరల్: అండర్–19 రాష్ట్ర క్రికెట్ జట్టుకు మణుగూరుకు చెందిన గుండెల నేహా ఎంపికై ంది. ఇటీవల ఖమ్మంలో జరిగిన హెచ్‌సీఏ అండర్–19 ఎంపికల్లో ప్రతిభ కనబరిచి అవకాశం దక్కించుకుంది. మణుగూరు పోలీస్ స్టేషన్లో హోంగార్డ్‌గా పని చేస్తున్న గుండెల కల్యాణ్ కుమార్తె నేహా చిన్ననాటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకుంది. ఖమ్మంలో శిక్షణ పొందుతూ ఆటతీరును మెరుగుపరుచుకుంది. ఈ సందర్భంగా ఆమెను పలువురు అభినందించారు. కరాటేలో చిన్నారి ప్రతిభపాల్వంచరూరల్: మండల పరిధి లక్ష్మీదేవిపల్లిలో నివాసం ఉంటున్న రాజేష్ భవాని దంపతుల కుమారుడు రిస్వా న్ శింబా కరాటేలో ప్రతిభ చూపుతున్నాడు. ఈ నెల 5,6వ తేదీల్లో హైదరాబాద్‌లోని గౌచ్చి బౌలి స్టేడియంలో ఆల్ ఇండియా ఓపెన్ కరాటే పోటీల్లో పాల్గొన బంగారు పతకం గెలుచుకున్నాడు. రెజీనా కాన్వెంట్లో ఫస్ట్‌క్లాస్ చదువుతున్న శింబాను ఈ సందర్భంగా పలువురు అభినందించారు. పుష్కరాల పనులు వేగవంతం చేయాలిదేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సూపర్‌బజార్(కొత్తగూడెం): గోదావరి పుష్కరాల సందర్భంగా టైర్–1లో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని దేవా దాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ కలెక్టర్లను ఆదేశించారు. ఆమె సోమవారం కలెక్టర్లతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదనలు, పరిపాలనా ప్రక్రియలకే పరిమితం కాకుండా పనులను వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా నుంచి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ, టెండర్ ప్రక్రియలను వేగవంతం చేస్తామని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేస్తామని అన్నారు. రోడ్డుప్రమాదంలో యువకుడు మృతి వివాహం జరిగి ఆరు నెలలకే మృత్యుఒడికి.. పెనుబల్లి: ఆ ఇద్దరూ ప్రేమించుకున్నారు... నూరేళ్లు కలిసుందామని ప్రమాణం చేసి భవిష్యత్‌పై కలలతో పెళ్లి చేసుకుని జీవితం మొదలుపెట్టారు. త్వరలోనే బిడ్డ పుట్టనుందనే సంతోషంలో ఉండగానే విధి ఆ జంటను ప్రమాదంలో రూపంలో విడదీసింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. పెనుబల్లి మండలం ముత్తగూడెం గ్రామంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైరా మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి కడారి రాకేష్(25) మృతి చెందాడు. ఆయన బైక్‌పై ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వెళ్తుండగా కంటైనర్ ఢీకొట్టింది. ఘటనలో తీవ్రగాయాలైన రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన ఆరు నెలల క్రితమే ప్రేమ వివాహం చేసుకోగా, ఇటీవల రాకేష్ భార్య గర్భం దాల్చింది. ఇంతలోనే ప్రమాదం జరగగా, పెనుబల్లి ఆస్పత్రికి తీసుకొచ్చిన ఆయన మృతదేహం వద్ద బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య రఘునాథపాలెం: ఆర్థిక ఇబ్బందులతోపాటు అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని ఈర్లపూడికి చెందిన రైతు చల్లా గోవర్దన్ (55) నాలుగేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స ఖర్చులతో పాటు వ్యవసాయ పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన పురుగుల మందు తాగాడు. కాసేపటికి గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై గోవర్దన్ కుమారుడు వంశీకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ ఉసా్మ్న్ షరీఫ్ తెలిపారు. గంజాయి స్వాధీనం ఖమ్మంక్రైం: ఖమ్మం నెహ్రూనగర్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రి సమీపంలో సోమవారం పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు గంజాయితో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. జహీరపుర ప్రాంతానికి చెందిన గోళ్ల శరత్ వద్ద రూ.19వేల విలువైన 380 గ్రాముల గంజాయి లభించడంతో అరస్ట్ చేశారు. భార్యపై కత్తితో దాడిటేకులపల్లి: ఓ వ్యక్తి తన భార్యపై కత్తి దాడి చేయగా, తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని రోళ్లపాడు పంచాయతీ రుక్మాతండా గ్రామానికి చెందిన భార్యాభర్తలు ఆదివారం రాత్రి ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో భర్త కోపోద్రిక్తుడై కత్తితో దాడి చేయగా భార్య దస్లీకి తీవ్రగాయాలయ్యా యి. చికిత్స నిమిత్తం ఆమెను ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఎమ్మెల్యే పీఏ కల్యాణ్ రిమాండ్
● ఉద్యోగాలు ఇప్పిస్తానని 54 మంది నుంచి రూ.8 కోట్లు వసూలు ● అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చినట్లు వెల్లడించిన డీఎస్పీ అరుణ్కుమార్భద్రాచలంఅర్బన్: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 54 మంది నిరుద్యోగుల నుంచి సుమారు రూ.8 కోట్ల వరకు వసూలు చేసి మోసం చేసిన కేసులో రెవెన్యూ శాఖ సీనియర్ అసిస్టెంట్, భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కోర్ల కల్యాణ్‌ను భద్రాచలం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డీఎస్పీ అరుణ్‌కుమార్ కథనం ప్రకారం.. మణుగూరు మండలం సమితి సింగారం గ్రామానికి చెందిన కల్యాణ్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వద్ద పీఏగా పనిచేస్తున్న క్రమంలో అధికార వర్గాలతో పరిచయాలు పెంచుకున్నాడు. భద్రాచలం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు, చర్ల, దుమ్ముగూడెం, వాజేడు, బూర్గంపాడు ప్రాంతాల్లోని నిరుద్యోగులకు బీటీపీఎస్ ఐటీసీ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేశాడు. భద్రాచలానికి చెందిన రాయల శ్రీను ఫిర్యాదుతో పది రోజుల క్రితం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో ఈ నెల 6న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారించగా ఉద్యోగాల పేరుతో డబ్బు వసూళ్లు, బెట్టింగ్‌లో పోగొట్టుకున్నట్లు తేలింది. సోమవారం మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా రిమాండ్‌కు తరలించారు. వివిధ ప్రాంతాల్లో అతనిపై నమోదైన కేసులు విచారణలో ఉన్నట్లు డీఎప్పీ తెలిపారు. కాగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు సొమ్ము రికవరీ చేసి, తమకు అందించాలని బాధితులు కోరుతున్నారు. రూ.8 కోట్ల వసూళ్లలో కల్యాణ్ ఒక్కడే ఉన్నాడా? ఇంకెవరైనా ఉన్నారా? అనేది తేలాల్సి ఉంది. -
ఎక్కడ అనుకూలం?
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుపై ముందడుగు పడింది. గతంలో పరిశీలించిన రెండు ప్రాంతాలు సాంకేతిక కారణాలతో అనుకూలం కాదని తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన ఆరు ప్రత్యామ్నాయ ప్రాంతాలపై కేంద్ర సాంకేతిక బృందం, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. జిల్లాలో రెండు రోజులు పర్యటించనుండగా, సోమవారంమొదటిరోజు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టింది. సుజాతనగర్ మండలంలోని సీతంపేట, గరీబ్‌పేట, చుంచుపల్లి మండలంలోని పెనగడప, ములకలపల్లి మండలంలోని చాపరాలపల్లి, అన్నపురెడ్డిపల్లి మండలం అబ్బుగూడెం ప్రాంతాలను పరిశీ లించింది. ఏఏఐ సభ్యుడు భరత్ రెడ్డి నేతృత్వంలోని బృందం భూమి లభ్యత, స్థల విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రన్‌వే ఏర్పాటుకు అనుకూలత, విమానాల రాకపోకలకు అవసరమైన అప్రోచ్ ఫన్నెల్, నైట్ ల్యాండింగ్, భద్రతా ప్రమాణాలు తదితర అంశాలను అధ్యయనం చేసింది. ఎంపీ, కలెక్టర్‌తో సమావేశం అనంతరం సింగరేణి గెస్ట్‌హౌస్‌లో ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు రామసహాయం రఘురాంరెడ్డి, కలెక్టర్ అంకిత్‌తో సమావేశమైంది. ప్రతిపాదిత విమానాశ్ర య ఏర్పాటు అంశాలపై చర్చించింది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయడం, ఏటీఆర్–72 తరహా విమానాలతోపాటు పెద్ద ఎయిర్‌బస్ ఏ320/ఏ321 విమానాల రాకపోకలకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించారు. పెద్ద విమానాల రాకపోకలకు అనుగుణంగా సుమారు 2,500 నుంచి 2,700 మీటర్ల రన్‌వేకు అవసరమయ్యే అవకాశాలను పరిశీలించింది. ప్రతిపాదిత ప్రాంతానికి సమీపంలో ఉన్న విద్యుదీకరించిన బొగ్గు రవాణా, రైల్వే లైన్ కూడా సాంకేతిక బృందం పరిశీలనలో ప్రధాన అంశంగా నిలిచింది. రైల్వే మార్గం విమానాల అప్రోచ్ ఫన్నెల్ పరిధిలోకి వచ్చే అవకాశాల నేపథ్యంలో దాని వల్ల ఏర్పడే సాంకేతిక ప్రభావాలను పరిశీలిస్తున్నారు. రైల్వే శాఖ నుంచి అవసరమైన ఎన్ఓసీ పొందే అంశంపై చర్యలు చేపట్టనున్నారు. విమానయాన సదుపాయం సాకారం అయ్యే దిశగా అడుగులు పడుతుండటంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి మాట్లాడుతూ విమానాశ్రయం ఏర్పాటు జిల్లా అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాల అభివృద్ధితోపాటు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయన్నారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ పరిశీలనకు అవసరమైన రెవెన్యూ, సర్వే, సాంకేతిక సమాచారాన్ని సిద్ధంగా ఉంచామని అన్నారు. కాగా, మంగళవారం దుమ్ముగూడెం, పాల్వంచ మండలాల్లో ప్రతిపాదిత స్థలాలను పరిశీలించనున్నారు. అనంతరం సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుంది. ఈ పర్యటనలో సంబంధిత రెవెన్యూ, సర్వే, ఇంజినీరింగ్, ఇతర శాఖల అధికారులు, ఏఏఐ సాంకేతిక ప్రతినిధులు కొత్తగూడెం మేయర్ గణేష్ పాల్గొన్నారు. కాగా, బృందం వెంట ఉన్న సీపీఐ జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా మాట్లాడుతూ ఎమ్మెల్యే కూనంనేని కృషితో ఎయిర్‌పోర్డు ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయని విలేకరులకు తెలిపారు. -
అర్హులకు ఓటు హక్కు కల్పించాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఎస్ఐఆర్ రోల్ అబ్జర్వర్ ఏ. శ్రీ దేవసేన అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం కలెక్టర్ అంకిత్‌తో కలిసి ఎన్నికల నమో దు అధికారులు, సహాయ ఎన్నికల నమోదు అధికా రులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటు హక్కు రాజ్యాంగం కల్పించిందని, ప్రతి ఒక్కరికీ ఆ హక్కు లభించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బీఎల్ఓ నోటీస్ అందజేసినట్లు రసీదును యాప్‌లో నమోదు చేయాలన్నారు. తుది జాబితాను అక్టోబర్ 19న ప్రచురిస్తామని తెలిపారు. ఓటర్లకు సందేహా లుంటే 1950 టోల్‌ఫ్రీ నంబర్లో సంప్రదించాలని చెప్పారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8,63,413 మంది సాధారణ ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. 2,40,438 మంది ఓటర్లకు నోటీసులు జారీచేయాల్సి ఉండగా, సోమవారం 7న మధ్యాహ్నం 12 గంటల వరకు 2,40,435 మందికి నోటీసులు సిద్ధం చేశామని వివరించారు. 1,42,392 నోటీసులను ఓటర్లకు అందజేయగా, ఇంకా 98,043 నోటీసులు అందజేయాల్సి ఉన్నట్లు వెల్లడించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఐటీడీఏ పీఓ రాహుల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రావు, తహసీల్దార్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ రోల్ అబ్జర్వర్ శ్రీ దేవసేన -
అసంపూర్తిగా ‘డబుల్’ ఇళ్లు
చుంచుపల్లి: పాత కొత్తగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్ట్ ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతోంది. భవనాలు అసంపూర్తిగా నిలిచిపోవడంతో లబ్ధిదారులకు నిరాశే ఎదురవుతోంది. తొమ్మిదేళ్లుగా పనులు సాగుతుండటంతో నిర్మాణ దశలోనే ఇళ్లు శిథిలాల మాదిరిగా కనిపిస్తున్నాయి. నాణ్యతపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవనాల మధ్య పిచ్చిచెట్లు దట్టంగా పెరుగుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందు సుమారు 600 మంది లబ్ధిదారులను హడావుడిగా ఎంపిక చేశారు. నేటికీ ఇళ్లు పూర్తికాకపోవడంతో లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అంచనాల్లో భారీ వ్యత్యాసం నాటి కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం పాత కొత్తగూడెం 2బీహెచ్‌కే ప్రాజెక్ట్‌లో 840 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. డీపీఆర్‌లో మాత్రం 828 ఇళ్లు, 23 బ్లాకులు, జీ+2 నిర్మాణంగా పేర్కొన్నారు. రూ.43.88కోట్ల అంచనా వ్యయం ఉండగా, రూ.31.07 కోట్లకే వర్కింగ్ ఎస్టిమేట్ రూపొందించడం అనుమానాలకు తావి స్తోంది. అంచనా, వర్కింగ్ ఎస్టిమేట్ల మధ్య రూ. 12.81 కోట్ల వ్యత్యాసం ఉండటంపై సమగ్ర విచారణ జరపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రూ.17.56 కోట్లు విడుదలైనా నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ప్రభుత్వం వెచ్చించిన నిధుల వినియోగం, పనుల పురోగతిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వివిధ దశల్లో నిర్మాణాలు ప్రాజెక్ట్ పరిధిలో 828 ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. 228 ఇళ్లు ప్రీ గ్రౌండింగ్ దశలో, 96 ఇళ్లు బేస్మెంట్ లెవల్లో, 425 ఇళ్లు రూఫ్ దశలో, 43 ఇళ్లు వాలింగ్ దశలో, మరో 36 ఇళ్లు ప్లాస్టరింగ్ దశల్లో నిలిచిపోయాయి. అత్యధికంగా 425 ఇళ్లు రూఫ్ దశలోనే ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడం లబ్ధిదారులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ప్రాజెక్టు అంచనా వ్యయం, వాస్తవ పనుల ఎస్టిమేట్, నిధుల కేటాయింపు, నిర్మాణ పనులు, నాణ్యతా ప్రమాణాలపై విచారణ, తనిఖీలు జరపాలని, ఇళ్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసి అందించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. పాత కొత్తగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రాజెక్టు ప్రారంభమై తొమ్మిదేళ్లు గడిచినా నిర్మాణాలు పూర్తికాలేదు. అసంపూర్తిగా ఉన్న నిర్మాణాల చుట్టూ పిచ్చిచెట్లు పెరిగి, కొన్ని ప్రాంతాలు శిథిలా వస్థకు చేరుకున్నాయి. కలెక్టర్ చొరవ చూపి నిర్మాణాలు పూర్తి లబ్ధిదారులకు ఇళ్లను అందించాలి. –కొండపల్లి శ్రీధర్, సమగ్ర అభివృద్ధి వేదిక వ్యవస్థాపకుడు -
గిరిజనాభివృద్ధికి ప్రభుత్వం కృషి
భద్రాచలం: గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి.రాహుల్ అన్నారు. సోమవారం ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అధికారులు సమన్వయంతో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థలు, ఖమ్మం రీజియన్ పరిధిలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బందికి పదోన్నతుల పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు డేవిడ్‌రాజ్, ఆనందకుమార్, అరుణకుమారి, మధుకర్, సైదులు, ఉదయ్ కుమార్, వేణు, రాంబాబు, గన్యా, మణిధర్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ విద్యారులకు అండగా.. ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన పేద గిరిజన విద్యార్థులకు పీఓ ఐటీడీఏ తరఫున ఆర్థికసాయం చేశారు. ములకలపల్లి మండలం సీతాయిగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ విద్యార్థి నక్క సంతోష్‌కు రూ.60 వేలు, కోదాడ మండలం కొత్తగూడెం తండాకు చెందిన భూక్య వాసికి రూ.50వేల ఆర్థికసాయాన్ని అందించారు. భద్రాచలం కోయ కుల సంఘం పటేల్ తెల్లం రమణయ్య, ఆదివాసీ నాయకులు కుంజాధర్మా, కుంజా సంతోష్, పూనెం వీరభద్రం, గుండు శరత్, పాయం రవివర్మ, ముర్ల రమేష్, పూనెం నాగేశ్వరరావు, కొండ్రు వీరస్వామి, కొండ్రు సుధారాణి, కణితి రాధ, ఎం.నాగమణి పాల్గొన్నారు.ఐటీడీఏ పీఓ రాహుల్ -
రామాలయానికి రూ.5 లక్షల విరాళం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరిగే పలు కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన భక్తురాలు సోమవారం విరాళం అందజేశారు. భీమవరంలోని ఏఎస్ఆర్ నగర్ కాలనీకి చెందిన చింతలపాటి సీతమ్మ గోశాల నిమిత్తం రూ.3 లక్షలు, శాశ్వత నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.2లక్షలు ఇచ్చారు. ఈఓ దామోదర్‌రావుకు వారి తరఫున ఆలయ ఈఈ రవీందర్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. కేఎల్ఆర్ యాజమాన్యానికి ‘శిక్షా రత్న’ పురస్కారాలుపాల్వంచ: విద్యారంగంలో విశేష సేవలు అంది స్తున్న కేఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్ పర్సన్ కె.నాగమణి, కేఎల్ఆర్ డిగ్రీ కళా శాల ప్రిన్సిపాల్ ఎ.నరసింహారావులకు శిక్షా రత్న–2026 పురస్కారాలు లభించాయి. ఆది వారం హైదరాబాద్‌లోని కన్హా శాంతివనంలో హరి విశ్వవిద్యాలయం, సూపర్ ఏఐ అకాడమీ, సాక్షి ఎడ్యుకేషన్, ఆదాబ్ హైదరాబాద్, స్టడీ9 మీడియా సంస్థలు సంయుక్తంగా పురస్కారాలను ప్రదానం చేశాయి. ఈ సందర్భంగా తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ డాక్టర్ వి.బాలకృష్టారెడ్డి, ఐసీఏఆర్–ఏఐసీఆర్పీ డైరెక్టర్ డాక్టర్ తారా సత్యవతి అవార్డులను అందజేశారు. ప్రజావాణి వద్దే పశువైద్యంవెటర్నరీ డాక్టర్‌కు పలువురి అభినందన ములకలపల్లి: మండలకేంద్రంలోని రైతువేదిక వద్ద సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఎంపీడీఓ సత్యనారాయణ, డీటీ భాగ్యలక్ష్మి, వివిధ శాఖల అధికారులు హాజరై దరఖాస్తులను స్వీకరించారు. అదే సమయంలో ములకలపల్లి, సమీప గ్రామానికి చెందిన అన్నె శ్రీనివాసరావు, గుమ్మడి వెంకటేశ్వర్లు తమ పశువులను స్థానిక పశువైద్యశాలకు తీసువచ్చారు. వెటర్నరీ ఆస్పత్రిలో నాలుగు పోస్టులు ఉండగా, ప్రస్తుతం డాక్టర్ రామకృష్ణ ఒక్కరే విధులు నిర్వరిస్తున్నారు. ఆయన కూడా ప్రజా వాణికి హాజ రయ్యారు. పశువైద్యం కోసం సంప్రదించగా రైతు వేదిక వద్దకే రప్పించి పశువులకు చికిత్స అందించారు. ఈ సందర్భంగా రామకృష్ణను పలువురు అభినందించారు. పెద్దమ్మతల్లి ఆలయంలో నిత్యాన్నదానం ప్రారంభంపాల్వంచరూరల్: పెద్దమ్మతల్లి ఆలయంలో నిత్యాన్నదానం కార్యక్రమాన్ని సోమవారం ఈఓ రజనీకుమారి ప్రారంభించారు. మండల పరిధి లోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయం ప్రాంగంలోని అన్నదాన సత్రంలో అమ్మవారి భక్తురాలైన జ్యోతి జన్మదినం సందర్భంగా రూ.5,116 విరాళం అందించగా అన్నదాన కార్యక్రమం చేపట్టారు. మరో భక్తుడు కొండం పుల్ల య్య కూడా మంగళవారం అన్నదానం కోసం రూ.5,116 విరాళం అందించారు. సమతుల ఆహారంపై అవగాహనచుంచుపల్లి: పోషకాహార వారోత్సవాల సందర్భంగా ప్రజలకు సమతుల ఆహారం, పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల పై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ తుకారామ్ రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు. సోమవారం రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తని ఖీ చేశారు. అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు తగిన మోతాదులో తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. -
పసిబిడ్డకు ప్రాణం పోస్తూ..
● విశేష సేవలందిస్తున్న నవజాత శిశు సంరక్షణ కేంద్రం ● భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో 14 ఏళ్ల క్రితం ఏర్పాటు ● ఇప్పటివరకు 22,919 మంది శిశువులకు మెరుగైన చికిత్స భద్రాచలంఅర్బన్: బిడ్డ పుట్టగానే ఆనందం.. ఆ శిశువు అనారోగ్యంగా ఉందనే వేదన నడుమ తల్లిడిల్లిపోయే తల్లిదండ్రులకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రం(ఎస్ఎన్సీయూ) మనోధైర్యాన్ని కల్పిస్తోంది. ఎస్ఎన్సీయూ భద్రాచలం ఏజెన్సీ, గ్రామీణ ప్రాంతాలకు వరంగా మారింది. ఈ కేంద్రం 2012 ఆగస్టు 8న ప్రారంభంకాగా, 14 ఏళ్లలో 22,919 మంది నవజాత శిశువులకు సేవలందించారు. ● 2014–2025 మధ్య 18,277 మంది చిన్నారులు చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా, 2026 జూలై వరకు మరో 663 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తంగా 18,940 మంది చిన్నారులు చికిత్స అనంతరం కుటుంబాల ఒడికి చేరారు. ● ఈ ఏడాది జనవరిలో 111 మంది, ఫిబ్రవరిలో 79, మార్చిలో 97, ఏప్రిల్‌లో 122, మేలో 116, జూనన్లో 107, జూలైలో 93 మంది చిన్నారులు అడ్మిట్ కాగా, ఏడు నెలల్లో 725 మంది శిశువులకు సేవలందాయి. ● వీరిలో 486 మంది ఇన్‌బోర్న్, 239 మంది అవుట్‌బోర్న్ శిశువులు ఉన్నారు. వీరిలో 663 మంది డిశ్చార్జి కాగా, 30 మంది మృత్యువాత పడ్డారు. పరిస్థితి విషమంగా ఉన్న 21 మందిని మెరుగైన వైద్యం కోసం ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేశారు. ● ఏరియా ఆస్పత్రిలో జన్మించిన శిశువులతోపాటు ఇతర ఆస్పత్రులు, మారుమూల ప్రాంతాల నుంచి కూడా అనారోగ్యంతో ఉన్న నవజాత శిశువులను ఇక్కడికి తీసుకొస్తున్నారు. 2014–2025 మధ్య 15,232 మంది ఇన్‌బోర్న్, 6,962 మంది అవుట్‌బోర్న్ శిశువులు చికిత్స పొందారు. 20 పడకలతో ప్రత్యేక సంరక్షణ తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, శ్వాస సంబంధిత సమస్యలు ఉన్నవారు, పుట్టిన వెంటనే ప్రత్యేక పర్యవేక్షణ అవసరమైన చిన్నారులకు ఇక్కడ వైద్య సేవలు అందుతున్నాయి. అత్యవసర సమయంలో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుండటంతో ప్రయాణ సమయం, ఆర్థిక భారం కూడా తగ్గుతోంది. ఎస్ఎన్సీయూ 10 పడకలతో ప్రారంభించగా, ప్రస్తుతం 20 పడకలకు విస్తరించారు. క్లిష్ట పరిస్థితుల్లో రిఫరల్.. స్థానికంగానే చికిత్స అందించడం సాధ్యం కాని పరిస్థితుల్లో మెరుగైన వైద్య సదుపాయాలున్న ఆస్పత్రులకు రిఫర్ చేస్తారు. 2014–2025 మధ్య 894 మంది, 2026 జూలై వరకు మరో 21 మంది.. మొత్తంగా 915 మంది చిన్నారులను తదుపరి వైద్యం కోసం రిఫర్ చేశారు. ఇదే సమయంలో 2014–2025 మధ్య 1,399 మంది, 2026 జూలై వరకు 30 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. కాగా, ఎస్‌ఎన్‌సీయూలో కై లాస్మోహన్ సేవలు ప్రత్యేకంగా గుర్తుండిపోతాయి. నవజాత శిశువుల సంరక్షణపై ఆయన చూపిన శ్రద్ధ, సేవాభావం ఎంతోమంది కుటుంబాలకు ధైర్యాన్నిచ్చాయి. -
కారు ఢీకొని సింగరేణి కార్మికుడి మృతి
సూపర్‌బజార్(కొత్తగూడెం)/రుద్రంపూర్: విధులకు వెళ్తున్న సింగరేణి కార్మికుడిని కారు రూపంలో మృత్యువు కబళించింది. టూటౌన్ పరిధిలోని సింగరేణి కొత్తగూడెం ఏరియా రుద్రంపూర్ ఫిల్టర్‌బెడ్‌లో పంప్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఎస్.కోటేశ్వరరావు(55) ఆదివారం రాత్రి డ్యూటీకి వెళ్లాడు. ఈ క్రమంలో రోడ్డు దాటుతుండగా విజయవాడ నుంచి భద్రాచలం వెళ్లే కారు ఢీ కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనం ద్వారా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఏరియా ఉపాధ్యక్షుడు ఎండీ రజాక్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ప్రమాదం ముసుగులో ఫోన్ చోరీ ఖమ్మంక్రైం: ద్విచక్రవాహనం పైనుంచి పడినట్లు నటించిన ఇద్దరు వ్యక్తులు.. సాయం చేయడానికి వచ్చిన వ్యక్తి నుంచి విలువైన సెల్‌ఫోన్ చోరీ చేసి ఉడాయించారు. ఖమ్మం కొత్త బస్టాండ్ సమీపంలోని సీపీఐ కార్యాలయ కాంప్లెక్స్ వద్ద సోమవారం బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు కింద పడ్డారు. దీంతో కాంప్లెక్స్‌లో వ్యాపారం చేస్తున్న సాంబశివరావు ముందుకొచ్చి వారిని లేపాడు. గాయాలయ్యాయా అని వాకబు చేస్తుండగా, వారిద్దరు ఆయన నుంచి రూ.1.30లక్షల విలువైన ఐ ఫోన్ తీసుకుని వెళ్లిపోయారు. కాసేపటికి సాంబశివరావు వద్ద ఫోన్ లేకపోవడంతో షాపు ముందు ఉన్న సీసీ కెమెరాల పుటేజీ పరిశీలించగా బైక్‌పై వచ్చిన యువకులు చోరీ చేసినట్లు తేలడంతో ఖమ్మం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
కొబ్బరి బోర్డు ఏర్పాటయ్యేనా?
దమ్మపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో కొబ్బరి బోర్డు ప్రాంతీయ కార్యాలయం రాష్ట్ర విభజన తర్వాత విజయవాడకు తరలిపోయింది. దీంతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో సుమారు 4,366 ఎకరాల్లో కొబ్బరి తోటలు సాగు చేస్తున్నారు. ఇందులో జిల్లాలోనే అత్యధికంగా 2,800 ఎకరాల్లో సాగవుతోంది. ఎకరాకు రూ.2 లక్షల వరకు స్థిర ఆదాయం ఇచ్చే పంట కావడం, జీవిత కాలం 60 ఏళ్ల వరకు ఉండటంతో క్రమంగా సాగు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కొబ్బరి బోర్డు ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు ఆవశ్యకత ఏర్పడింది. విజయవాడకు తరలిన ప్రాంతీయ కార్యాలయం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనంలో కేరళలోని కొచ్చిలో కొబ్బరి అభివృద్ధి బోర్డు ఉండగా, దేశవ్యాప్తంగా 9 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. వీటిలో ఒకటి హైదరాబాద్‌లో ఉండేది. ప్రాంతీయ కార్యాలయం విజయవాడకు తరలిపోగా, ప్రస్తుతం కొబ్బరి సాగులో సమస్యలు ఉత్పన్నమైతే, రైతులు సలహాల కోసం అక్కడికి వెళ్లాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బోర్డు ఏర్పాటుకు చొరవచూపారు. ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను ఈ నెల 2న కలిసి విజ్ఞప్తి చేశారు. పామాయిల్ పరిశోధన కేంద్రం మంజూరు చేయాలని, ఆయిల్ పామ్‌కు టన్నుకు రూ.25,000 కనీస మద్దతు ధర ప్రకటించాలని కూడా కోరారు. బోర్డు మంజూరైతే కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేటలలో ఏదేని ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. కాగా, రాష్ట్రంలో ఏకై క ప్రభుత్వ కొబ్బరి నర్సరీ అశ్వారావుపేట మండల పరిధిలోనే ఉండగా, ఏటా లక్షకు పైగా మొక్కలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇవీ ప్రయోజనాలు ● మొక్కలు, ల్యాబ్, శిక్షణ, మార్కెటింగ్ వంటి అవకాశాలు లభిస్తాయి. ● అధిక దిగుబడిని ఇచ్చే నాణ్యమైన వంగడాల అభివృద్ధి ● పంట సాగుకు ప్రోత్సాహకంగా సబ్సిడీ, బీమా సౌకర్యం ● తెగుళ్ల నివారణకు సమీపంలోనే ఉచిత సాంకేతిక సలహాలు ● కొబ్బరి నూనె, పాలు, పీచు, తాడు పరిశ్రమలు వల్ల ఉపాధి అవకాశాలు ● విలువ ఆధారిత పరిశ్రమలకు రాయితీ, మార్కెటింగ్ సులభతరం, అంతర్జాతీయ ఎగుమతులు పామాయిల్ పరిశోధన కేంద్రం కూడా.. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 2.5 లక్షల ఎకరాల్లో పామాయిల్ పంట సాగు చేస్తున్నారు. ఏటా 40 వేల ఎకరాల సాగు పెరుగుతోంది. జిల్లాలోనే 95 వేల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దేశంలోనే ఏకై క జాతీయ ఆయిల్ పామ్ పరిశోధన సంస్థ(ఐఐఓపీఆర్) ఏపీలోని ఏలూరు జిల్లా పెదవేగిలో ఉంది. దీంతో పామాయిల్ సాగులో ఎదురయ్యే సవాళ్లకు తెలంగాణ ఆయిల్ ఫెడ్ యాజమాన్యం ఏపీపై ఆధారపడాల్సివస్తోంది. ఇక్కడి రైతులకు మేలు జరగాలంటే స్థానికంగా పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. -
ట్రైబల్ జర్నలిస్టుల కమిటీ ఎన్నిక
కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ ట్రైబల్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ కాలనీలో ఉన్న శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. సమావేశానికి కొత్తగూడెం, వైరా ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు, మాళోత్ రాందాస్ నాయక్ హాజరై మాట్లాడా రు. జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామ ని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చా రు. అధ్యక్షుడిగా మాళోత్ అశోక్, ప్రధాన కార్యదర్శిగా భూక్యరాము, ట్రెజరర్‌గా బానోత్ రాందాస్, వైస్ ప్రెసిడెంట్‌గా బదావత్ దశరథ్, గౌరవ సలహాదారులుగా హాలావత్ రామారావుతో మరికొందరిని సభ్యులుగా ఎన్నుకున్నారు. మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె.సాబీర్‌పాషా, మార్కెట్ కమి టీ చైర్మన్ బానోత్ లాల్‌సింగ్, అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు బానోత్ వీరూ నాయక్, జర్నలిస్టు సంఘాల నాయకులు యోగానంద, రవి నాయక్, బి. వెంకటరత్నం, కల్లోజి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదుఅశ్వాపురం: మండల పరిధిలోని మొండికుంట గ్రామశివారు అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిపై అశ్వాపురం పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... కొత్తగూడెంలోని గౌతంపూర్‌కు చెందిన తోట వరుణ్(35), పద్దం ముత్తయ్య(38) బైక్‌పై మణుగూరు వచ్చి వెళ్తున్నారు. ఈ క్రమంలో మొండికుంట గ్రామం దాటాక అటవీ ప్రాంతంలో బైక్ అదుపు తప్పి కింద పడి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించగా వరుణ్ అప్పటికే మృతి చెందాడు. సింగరేణి ఉద్యోగి పద్దం ముత్తయ్య తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరగా, కొత్తగూడెంలో సింగరేణి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహిత ఆత్మహత్యపాల్వంచరూరల్: అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని నాగారం గ్రామ పంచాయతీ రేపల్లేవాడ గ్రామానికి చెందిన నారకట్ల నాగమ్మ(50) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. వైద్యఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావడంతో మనస్తాపం చెంది శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకుని మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ సురేష్ కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్తుండగా ప్రమాదంఐదుగురికి తీవ్ర, ముగ్గురికి స్వల్ప గాయాలు కొండపాక(గజ్వేల్): గణనాథుడి విగ్రహాన్ని తీసుకెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర, ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దుద్దెడ శివారులో రాజీవ్ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా.. కొత్తగూడేనికి చెందిన 8 మంది యువకులు హైదరాబాద్‌లో విగ్రహం కొనుగోలు ట్రాక్టరుపై తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ నుంచి వరంగల్ దారి వెంట ఉన్న లోలెవల్ బ్రిడ్జిల వద్ద నుంచి తీసుకెళ్లడం సాధ్యం కాదని సిద్దిపేట, హుస్నాబాద్ మీదుగా బయలుదేరారు. కాగా దుద్దెడ శివారులోని కలెక్టరేట్ వద్ద రాజీవ్ రహదారిపై రెండు వైపులా విద్యుత్తు వైర్లు అడ్డుగా ఉండటంతో గణనాథుడిని తీసుకెళ్తున్న యువకులు దిగి కర్ర సహాయంతో వైర్లను సరి చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపునకు వెళ్తున్న సిమెంట్ ట్యాంకర్ యువకులను, గణనాథుడిని తీసుకెళ్తున్న ట్రాలీని ఢీకొట్టింది. దీంతో ఐదుగురు యువకులకు తీవ్ర, మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతోపాటు గణనాథుని విగ్రహం ఎగిరి సుమారు 10 గజాల దూరంలో రోడ్డుపై పడటంతో దెబ్బ తిన్నది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, సిమెంట్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆడిట్‌పై అవగాహన ఖమ్మం సహకారనగర్: ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతతో వ్యవహరించడమే కాక చట్టబద్ధమైన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్, ఆడిటర్ పి.మందాకృష్ణ సూచించారు. తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ల అసోసియేషన్(ట్రస్మా) ఆధ్వర్యాన ఖమ్మంలో ఆదివారం అవగాహన సదస్సు నిర్వహించారు. అకౌంట్లు, రికార్డుల నిర్వహణ, వార్షిక బడ్జెట్ తయారీ, ఫీజుల నిర్ణయం, వార్షిక ఆడిట్, పారదర్శక ఆర్థిక విధానాలపై అవగాహన కల్పించారు. -
భద్రగిరికి రైలు దిశగా..
● పాండురంగాపురం–సారపాక లైన్ నిర్మాణంలో తొలి అడుగు ● మల్కాన్‌గిరి మార్గంలో తొలుత ఈ లైన్ పూర్తి చేసేందుకు సుముఖత ● రాష్ట్ర మంత్రి తుమ్మల విన్నపానికి కేంద్ర రైల్వే మంత్రి సానుకూల స్పందనభద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి కొలువైన భద్రగిరికి రైలు మార్గం కల సాకారం దిశగా తొలి అడుగు పడింది. ఎన్నో ఏళ్లుగా భక్తులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు కోరుతున్న రైల్వే కనెక్టివిటీకి తాజాగా కదలిక వచ్చింది. పాండురంగాపురం–మల్కాన్‌గిరి రైల్వే లైన్ నిర్మాణానికి అవరోధాలు ఉన్న నేపథ్యంలో తొలుత పాండురంగాపురం నుంచి సారపాక(సాకేతపురి) వరకు సుమారు 16 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మాణం చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తొలుత పాండురంగాపురం–సారపాక వరకు పాండురంగాపురం–మల్కాన్‌గిరి రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణ, అటవీ అనుమతులు, గోదావరి వంతెనతోపాటు ఇతర రైల్వే వంతెనల నిర్మాణం వంటి అంశాలు ప్రధాన అవరోధాలుగా మారాయి. దీంతో నిర్మాణానికి మరికొంత సమయం పట్టే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో మొత్తం లైన్ కోసం వేచి ఉండకుండా, పాండురంగాపురం–సాకేతపురి వరకై నా తొలిదశలో లైన్ నిర్మించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ చేపట్టి రైల్వే శాఖకు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించి పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపట్టాలని రైల్వే అధికారులను ఆదేశించారు. ఫలితంగా భద్రాచలానికి రైల్వే కనెక్టివిటీ కల్పించే ప్రక్రియలో ముందడుగు పడినట్లయింది. ఇది పూర్తయితే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలానికి భక్తుల రాకపోకలు పెరగనున్నాయి. మల్కాన్‌గిరి–పాండురంగాపురం రైల్వే లైన్ ప్రతిపాదన, భూ సేకరణకు కేంద్ర ప్రభుత్వం 2024లో ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో తొలివిడతలోనే పాండురంగాపురం–భద్రాచలం వరకు లైన్ నిర్మించాలని, దీంతో భక్తులకు ప్రయాణం సులభతరంగా ఉంటుందని పలుమార్లు ‘సాక్షి’ కథనాలు ప్రచురించింది. ఆ దిశగానే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ చూపుతుండటంతో భక్తులు, పర్యాటకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది
జూలూరుపాడు: కేసీఆర్ నాయకత్వంలో గడిచిన పదేళ్లలో ప్రతీ పల్లెకు కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకం ద్వారా నీళ్లు అందిస్తే, కాంగ్రెస్ పాలనలో పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవి చంద్ర అన్నా రు. కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం ‘పల్లెలు విధ్వంసం–పడకేసిన పారిశుద్ధ్యం’పై నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరంఆర్యవైశ్య కల్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీరు అందక, కరెంటు కోతలతో రైతులు విలవిల్లాడుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ శ్రేణుల జోలికొస్తే ఊరుకోం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని మాజీ మంత్రి పువ్వా డ అజయ్ కుమార్ హెచ్చరించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొందరు పోలీసులు హింసను ప్రేరేపించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మాజీ ఎంపీ నామ నాగేశ్వరరా వు మాట్లాడుతూ కాంగ్రెస్ మూడేళ్ల పాలనలో పల్లెల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మా రిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేడాక్టర్ బానో త్ చంద్రావతి, బీఆర్ఎస్ నాయకులు ఆర్జేసీ కృష్ణ, లకావత్ గిరిబాబు, కూరాకుల నాగభూషణం, బానోత్ మనీషా లక్ష్మి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు భూక్యా కళావతి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సీహెచ్. రామ్మూర్తి, నాయకులు పాల్గొన్నారు. -
‘సంతోష’ం నిలపండి!
ములకలపల్లి: నీట్లో ర్యాంకు సాధించి ఎంబీబీఎస్‌లో చేరేందుకు ఆర్థికసాయం కోసం ఓ గిరిజన విద్యార్థి ఎదురుచూస్తున్నాడు. ఈనెల 8వ తేదీ (మంగళవారం)లోగా ఫీజు చెల్లించకపోతే సీటు కోల్పోతానని ఆవేదన చెందుతున్నాడు. మండలంలోని సీతాయిగూడెం పంచాయతీ టేకులగుంపు గ్రామానికి చెందిన నక్కా సంతోష్ తండ్రి భాస్కర్ చిన్నతనంలోనే చనిపోయాడు. అమ్మమ్మ పాండ్ర రాజమ్మ ఇంట్లో ఉంటూ, తల్లి వెంకటమ్మ కూలి పనిచేస్తూ కొడుకును సాకింది. సంతోష్ పదో తరగతి చదువుతున్నప్పుడు 2021లో తల్లి కరోనా బారినపడి మృతిచెందింది. తల్లిదండ్రులను కోల్పోయినా పట్టుదలతో విద్యలో రాణిస్తున్నాడు. ఇంటర్ వరకు ప్రభుత్వ గిరిజన విద్యాసంస్థల్లోనే చదివాడు. హైదరాబాద్‌లోని రాజేంద్రగనగర్లోని ట్రైబల్ వెల్ఫేర్స్టడీ సెంటర్లో ఇంటర్ పూర్తి చేసి 976/100 మార్కులు సాధించాడు. గతడాది నీట్లో ఆలిండియా స్థాయిలో 2.70లక్షల ర్యాంక్ రాగా, ఒక్క మార్కు తేడాతో ఎంబీబీఎస్ సీటు కోల్పోయాడు. అయినా పట్టువదలకుండా ఈ ఏడాది కూడా పరీక్ష రాశాడు. అమ్మమ్మతో కలిసి కూలి పని చేసుకుంటూనే నీట్‌కు సన్నద్ధమయ్యాడు. 424/720 మా ర్కులు సాధించి ఆలిండియాలో 2,17,301 ర్యాంక్, ఎస్టీ కేటగిరీలో 4,750 ర్యాంకు పొందాడు. ఈక్రమంలో ఇటీవల మండల పర్యటనకు వచ్చిన ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సంతోష్‌ను అభినందించారు. దాతలు స్పందిస్తేనే .. సంతోష్‌కు దుండిగల్‌లోని అరుంధతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో ఎంబీబీఎస్ సీటు దక్కింది. మంగళవారం(8వ తేదీ సాయంత్రం 4 గంటలు)లోగా ట్యూషన్ ఫీజు రూ.60వేలు, సెక్యూరిటీ రిపా జిట్ రూ. 40 వేలతోపాటు హాస్టల్ ఫీజు చెల్లిస్తేనే సీటు కేటాయిస్తారు. లేకపోతే రద్దవుతుంది. దాతలు ఆదుకోవాలని ఆదివాసీ యువకుడు అర్థిస్తున్నా డు. సహాయంచేసేవారు 91545 80908 నంబర్లో సంప్రదించాలని కోరుతున్నాడు. -
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం కలెక్టరేట్లో ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమానికి అధికారులు సకాలంలో హాజరు కావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం, అన్ని మండల పరిషత్ కార్యాలయాల్లో కూడా ప్రజా వాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. గిరిజన దర్బార్ భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్నిశాఖల అధికారులు హాజరుకావాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో... సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని భద్రాచలం డివిజన్ ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఒక ప్రకటనలో కోరారు. నేడు రౌండ్ టేబుల్ సమావేశంసూపర్బజార్(కొత్తగూడెం): ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన గిరి జన నర్సు హత్య, అత్యాచారం ఘటనపై సోమవారం సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రాజకీయ, ప్రజా, సామాజిక సంఘాల నాయకులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. మహిళలకు రక్షణ కరువైందిటీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ములకలపల్లి: కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. హైదరాబాద్‌లో దారుణ హత్యకు గురైన నర్సు కుటుంబాన్ని ఆదివారం ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాలకపక్షం కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఘటనపై సీబీఐ విచారణ జరపాలని, ఘటన చోటు చేసుకున్న ఆస్పత్రి సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి రూ. 50 వేలు ఆర్థికసాయం అందించారు. పార్టీ రాష్ట్ర నాయకులు ఇస్మాయిల్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు మనోజ, రాష్ట్ర కార్యదర్శి కనగాల చైత న్య, జిల్లా ఇన్చార్జ్ వీరన్న, వాసం రామకృష్ణ, కోరం వెంకటేశ్వర్లు, లకావత్ సురేష్, వాకుడోతు రవి పాల్గొన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటంఆదిలాబాద్ ఎంపీ నగేష్ ములకలపల్లి: దారుణ హత్యకు గురైన నర్సు కు టుంబానికి న్యాయం జరిగే వరకూ బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్ అన్నారు. బాధిత కుటుంబా న్ని ఆదివా రం పరామర్శించారు. మృతురాలి చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిందితులు, ఆస్పత్రి బాధ్యులపై కఠి న చర్యలు తీసుకోవాలని కోరారు. మృతురాలి కు టుంబానికి రూ.కోటి పరిహారంతోపాటు, పది ఎకరాలవ్యవసాయ భూమి, ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆధ్వర్యంలో రూ. లక్ష ఆర్థికసాయం చేశారు. మాజీ ఎంపీ సీతారాం నాయ క్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నాయకులు విజయచంద్రారెడ్డి, బాలరాజు, కుంజా ధర్మ, పుణ్యం భిక్షపతి, వెంకన్న, శ్రీనివాస్ పాల్గొన్నారు. కిన్నెరసానిలో పర్యాటక సందడిపాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతా ల నుంచి సందర్శకులు తరలివచ్చారు. డీర్ పార్కులోని దుప్పులను, జలాశయాన్ని వీక్షించారు. అనంతరం బోటు షికారు చేశారు. 427 మంది పర్యాటకులు కిన్నెరసానిని సందర్శించారు. 230 మంది బో టింగ్ చేశారు. పలువురు సఫారీలో విహరించారు. దీంతో రూ.40,595 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు. -
పోలీస్ ఉద్యోగాల ఉచిత శిక్షణకు స్క్రీనింగ్ టెస్ట్
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఉన్న నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ అందించేందుకు ఆదివారం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. శిక్షణ కోసం 1,216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 1,030 మంది స్క్రీనింగ్ టెస్ట్‌కు హాజరయ్యారు. జిల్లాలోని ఐదు సబ్ డివిజన్లపరిధిలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎస్పీ రోహిత్‌రాజు కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రాన్ని సందర్శించి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంపికై న అభ్యర్థులకు రాత, శారీరక దారుఢ్య పరీక్షల్లో ప్రతిభ చూపాలని శిక్షణ ఇస్తామని తెలిపారు. సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొని పరీక్ష ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. 1,216 దరఖాస్తులు.. 1,030 మంది అభ్యర్థులు హాజరు -
హస్తానికి ప్రతికూలత!
● అభివృద్ధిలో వెనుకబడుతున్న జిల్లా ● పవర్ చూపించలేకపోతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ● పరిస్థితి చేయిదాటకముందే దిద్దుబాటు జరిగేనా? సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా నుంచి కేబినెట్ బెర్త్ దక్కకపోవడంతో ఇటు ప్రభుత్వం అటు పార్టీ పరంగా బలమైన నేత కరువయ్యారు. ఫలితంగా జిల్లాలోని ఐదు నియోజకర్గాల్లో ఆశించిన వేగంతో పనులు ముందుకు సాగడం లేదు. దీని తాలుకూ ప్రతికూల ఫలితాలుక్రమంగా కాంగ్రెస్‌పార్టీ మెడకు చుట్టుకుంటున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. కనిపించని పాయం మార్క్ మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పాయం వెంకటేశ్వర్లు జిల్లాలోని ఐదుగురు ఎమ్మెల్యేల్లో సీనియర్ ఇసుక లారీల కోసం రిజర్వ్ ఫారెస్టులో నుంచి రోడ్డు వేయడం, లారీలతో ఇబ్బందులపై ప్రశ్నించిన ఓ ఉద్యోగిపై పోలీస్ స్టేషన్లోనే ఇసుక వ్యాపారులు చేయిచేసుకోడానికి ప్రయత్నించడం వంటి ఘటనలు పాయం ఇమేజ్ను మసకబారేలా చేశాయనే ఆరోపణలు వస్తున్నాయి. నియోజకర్గ అభివృద్ధిలో తనదైన మార్క్ కూడా చూపలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి తగ్గట్టు ‘ఎమ్మెల్యే పాయం తన ఇంటి ముందు ఉన్న రోడ్డునే బాగు చేయించుకోలేడు. ఇక నియోజకర్గాన్ని ఏం బాగు చేస్తాడు’ అంటూ ఆయన రాజకీయ ప్రత్యర్థి రేగా ఇప్పటికే మాటల దాడిని మొదలెట్టడం హస్తం పార్టీకి నష్టం కలిగించే విషయమే. లెక్కసరిచేయని కోరం ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రెండు సార్లు గెలిచాడు. తొలిసారి గెలిచినప్పుడు సీతారామ ప్రా జెక్ట్‌కు కీలకమైన రోళ్లపాడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఆయన నియోజకర్గంలోనే ఉంది. తదుపరి ఎన్నికల్లో ఆయన ఓడిపోయాక రోళ్లపాడుతో పాటు ఇల్లెందు నియోజకవర్గం కూడా సీతారామ లబ్ధిదా రుల జాబితా నుంచి మాయమైంది. రెండోసారి గెలిచాక సీతారామ నీళ్లు తెస్తారని ఇక్కడి ప్రజలు ఆశించగా.. వెయ్యి రోజుల పాలనలో ప్రభుత్వం నుంచి కనీసం స్పష్టమైన హామీ కూడా సాధించలేకపోయారు. ఆఖరికి రూ.200కోట్లతో మంజూ రైన యంగ్ ఇండియా స్కూల్ పనులను సైతం పట్టాలెక్కించలేకపోయారు. ఇప్పటికే స్థలం, భవనాల కొరత వల్ల ఇల్లెందుకు సంబంధించిన గురుకుల విద్యాసంస్థలన్నీ పక్క నియోజకర్గాల్లో కొనసాగుతున్నాయి. ఇవన్నీ కాంగ్రెస్‌కు చేటు, ప్రత్యర్థికి మేలు చేస్తున్నాయి. తెల్లం తప్పులు కాంగ్రెస్ ఖాతాలో భద్రాచలంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలి చిన తెల్లం వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్‌తో సన్నిహత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇటీవల ఉద్యోగాల కల్పన పేరుతో ఎమ్మెల్యే తెల్లం పీఏ కల్యాణ్ చేసిన వసూళ్ల దందా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదం తాలుకూ ప్రతికూల అంశాలు కాంగ్రెస్ పార్టీకి చుట్టుకుంటున్నాయి. ఇదే అదనుగా అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. హస్తం పార్టీలో నష్టనివారణ చర్యలు చేపట్టేవారూ లేరు. దీనికి తోడు ఇక్కడ పొదెం వీరయ్య, తెల్లం వెంకట్రావు వర్గాలు ఉన్నా యి. వెయ్యిరోజలు పాలనలో వీరిద్దరు ఒక్కటిగా పనిచేసిన కార్యక్రమాలను వేళ్లపై లెక్కపెట్టవచ్చు. కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐ నుంచి ఎమ్మెల్యేగా కూనంనేని సాంబశివరావు ఉన్నారు. ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో సైతం మేయర్ స్థానం ఆ పార్టీకే దక్కింది. అదే సమయంలో జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నేత కరువయ్యారు. ఇప్పటికే ముగ్గురు కేబినెట్ మంత్రులు, ఎంపీ రేణుకా చౌదరి పేరుతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌లో నాలు గు గ్రూపులు పని చేస్తున్నాయి. అవే ఛాయలు కొత్తగూడెంలోనూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చి వెయ్యిరోజులు దాటినా ఇంతవరకు ఆ పార్టీకి కార్యాలయమే లేదు. వేర్వేరు వర్గాల వారీగానే ఆఫీసులు ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సొంతూరు దమ్మపేట మండలం గండుగులపల్లి. ఇదే ఊరు నుంచి రాజకీయ దురంధరుడు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఉన్నారు. గతంలో అశ్వారావుపేట, దమ్మపేటలు సత్తుపల్లి నియోజకర్గంలో భా గంగా ఉండేవి. దీంతో ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావుకంటూ ప్రత్యేక వర్గం ఉంది. దీంతో మంత్రి పొంగులేటి, జారే వర్గం, తుమ్మల వర్గం మధ్య నివురుగప్పిన నిప్పులా ఇక్కడ పరిస్థితి నెలకొంది. -
రెండు రోజుల్లో ముగియనున్న ‘గుర్తింపు’
● సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం రెండేళ్ల కాలపరిమితి పూర్తి.. ● ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టని కార్మికశాఖ ● 8వ విడత ఎన్నికలపై సందిగ్ధంలో కార్మికవర్గంరుద్రంపూర్: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం పదవీ కాలం ఈ నెల 9వ తేదీతో ముగియనుంది. 2023 డిసెంబర్ 27న రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరగ్గా 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. సంస్థవ్యాప్తంగా 11 ఏరియాలు ఉండగా ఏఐటీయూసీ(సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూ నియన్) 5 ఏరియాల్లో, ఐఎన్టీయూసీ (సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్) ఆరు ఏరియాల్లో గెలిచింది. పోలైన ఓట్లలో 43.20 శాతం ఏఐటీయూసీ సాధించగా, ఐఎన్టీయూసీ 37.86 శాతం ఓట్లు సాధించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ఓటింగ్ ఎక్కువ వచ్చిన ఏఐటీయూసీ గుర్తింపు సంఘంగా నిలిచింది. 1998 నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు ఎన్నికలు నిర్వహించారు. 7వ దఫా ఎన్నికలు 2023 డిసెంబర్ 27న జరిగాయి. అయితే గెలుపు సాధించాక సుమారు 9 నెలలకు కార్మిక శాఖ 2024 సెప్టెంబర్ 9న గుర్తింపు సంఘానికి అధికారిక పత్రం అందజేసింది. రెండేళ్ల కాలం ఈ నెల 9వ తేదీతో ముగియనుండగా, 8వ విడత ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. లేబర్ కోడ్ల ప్రకారం 51 శాతం ఓటింగ్ వస్తేనే.. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ల విధానంతో 51 శాతం ఓటింగ్ వస్తేనే గుర్తింపు సంఘంగా, కనీసం 20శాతం వస్తేనే కార్మిక సంఘంగా యాజమాన్యాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. పాత పద్ధతిలో ఎక్కువ ఓటింగ్ వచ్చిన సంఘమే గుర్తింపు సంఘంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎన్నికలు కొత్త విధానం ద్వారా పెట్టాలా? పాత విధానంలో పెట్టాలా అనే సందిగ్ధంలో సింగరేణి యాజమాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రచారం ప్రారంభించిన యూనియన్లు సుమారు రెండు నెలల క్రితం నుంచే కార్మిక సంఘాల, ప్రజా సంఘాలు, పార్టీలు సింగరేణి వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాలని కొన్ని సంఘాలు కోర్టుకు కూడా వెళ్లాయి. కొన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో విజయ అవకాశాలను అంచనా వేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నుంచి డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు సంస్థ అభివృద్ధి పేరుతో ప్రచారం నిర్వహించగా, బీజేపీ నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు ప్రచారం చేశారు. హెచ్ఎంఎస్ తరఫున తెలంగాణ రక్షణ సేన బాయిబాట పేరుతో ప్రచారం సాగించింది. కార్మికుల సమస్యల పేరుతో సీఐటీయూ, ఐఎఫ్టీయూ కూడా ప్రచారం చేస్తున్నాయి. -
● పక్కనే డంపింగ్ యార్డు ఉండటంతో చెత్తతో నిండిపోయిన శ్మశానవాటిక దారి ● తొలగించాలని కోరినా స్పందించని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ● చివరకు డంపింగ్ యార్డు రోడ్డుపైనే దహనసంస్కారాలు పూర్తి
రోడ్డుపైనే అంత్యక్రియలు!కొత్తగూడెంఅర్బన్: పక్కనే డంపియంగ్ యార్డు ఉండటంతో శ్మశానవాటికకు వెళ్లే దారిలో చెత్త నిండిపోవడంతో అంత్యక్రియలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో రోడ్డుపైనే అంత్యక్రియలు పూర్తి చేయాల్సి వస్తోంది. ఆదివారం కొత్తగూడెంలోని 11వ డివిజన్ గౌతంనగర్ శ్మశాన వాటిక వద్ద ఇలాంటి ఘటనే జరిగింది. కార్పొరేషన్ పరిధిలోని గౌతంనగర్‌కు చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు శ్మాశన వాటికకు వెళ్లి పరిశీలించగా, రోడ్డు చెత్తాచెదారంతో నిండిపోయి ఉంది. పక్కనే ఉన్న కార్పొరేషన్ డంపింగ్ యార్డులో చెత్త నిండిపోగా, రోడ్డుపైనే వేస్తున్నారు. కాగా, శ్మశానవాటిక రోడ్డుపై ఉన్న చెత్త తొలగించాలని బంధువులు కార్పొరేషన్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా.. ఆదివారం తామేమీ చేయలేమని చేతులు ఎత్తివేశారు. దీంతో చేసేది ఏమీలేక మృతుడి కుటుంబ సభ్యులు డంపింగ్ యార్డు రోడ్డుపైనే దహనసంస్కారాలు పూర్తి చేశారు. ఈ ఘటన కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అందరినీ కలవరపరిచింది. సమీపంలో ఇళ్లు ఉండటంతో ఇప్పటికే చెత్తాచెదారంతో దుర్వాసన వస్తోంది. అంత్యక్రియలు కూడా రోడ్డుపైనే నిర్వహించడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. ఎట్టకేలకు ఎమ్మెల్యే పీఏ అరెస్ట్?భద్రాచలంఅర్బన్: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశానే ఆరోపణల కేసులో భద్రాచలం ఎమ్మెల్యే పీఏ కల్యాణ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ నెల 28న ఎఫ్ఐఆర్ నమోదు కాగా, తొమ్మిది రోజులపాటు భద్రాచలం డీఎస్పీ అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగించినట్లు తెలుస్తోంది. ఫిర్యాదుదారుల వాంగ్మూలాలు నమోదు చేయడంతోపాటు నగదు లావాదేవీలు, ఇతర కీలక ఆధారాలను పోలీసులు సేకరించినట్లు సమాచారం. ఉద్యోగాల పేరుతో మొత్తం రూ.9 కోట్ల వరకు నగదు వసూలు చేయగా, బాధితులకు సుమారు రూ.3 కోట్ల మేర నగదును తిరిగి చెల్లించినట్లు, మిగిలిన సుమారు రూ.6 కోట్లను బెట్టింగ్‌లో కోల్పోయినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. వసూలు చేసిన నగదు ఎవరెవరి నుంచి వచ్చింది? ఎంత మొత్తాన్ని ఎవరికి తిరిగి ఇచ్చారు? అనే అంశాలపై పోలీసులు మరింత లోతుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. కాగా, కేసు పూర్తి వివరాలను సోమవారం పోలీసులు మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది. -
భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు
భద్రాచలం: శ్రీ సీతారాముల దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా సౌకర్యాలు కల్పించనున్న ట్లు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్ తెలిపారు. గోదావరి పుష్కరాల పనుల్లో భాగంగా అంబసత్రం సమీపంలోని దేవస్థానం సంస్కృత పాఠశాల స్థలంలో జీ+1 విధానంలో డార్మెటరీ హాల్ నిర్మాణానికి ఆదివారం వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడు తూ రూ.1.50కోట్లతో డార్మెటరీ హాల్ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. భక్తులకు బస, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. కలెక్టర్ అంకిత్ మాట్లాడు తూ గోదావరి పుష్కరాల దృష్ట్యా అభివృద్ది పనులను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తొలుత దేవస్థాన పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈఓ కే. దామోదర్‌రావు, ఏఈవోలు శ్రవణ్‌కుమార్, భవాని రామకృష్ణ, ఈఈ రవీందర్, సిబ్బంది పాల్గొన్నారు. రామయ్యకు సువర్ణ పుష్పార్చన దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియంలోని రామ సేవా మండపంలో ఉత్సవ మూ ర్తులను కొలువుదీర్చారు. స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. నయనానందకరంగా నదీహారతిభద్రాచలంటౌన్: భద్రాచలంలోని కరకట్ట వద్ద ఆదివారం గోదావరి మాతకు నిర్వహించిన నదీహారతి నయనానందకరంగా సాగింది. గణపతి పూజ, శ్రీ సీతారామచంద్రస్వామి, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చనలు చేసి ప్రత్యేక హారతులు సమర్పించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ అంకిత్ -
పెద్దమ్మగుడికి పోటెత్తిన భక్తజనం
పాల్వంచరూరల్: శ్రావణమాసం చివరి రోజు, ఆది వారం కావడంతో పెద్దమ్మతల్లి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మండలంలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. వివిధప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆల య ప్రాంగణం కిటకిటలాడింది. భక్తులు క్యూ లైన్ ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించారు. పూజా కార్యక్రమాల్లో ఈఓ రజనీకుమారి, వేదపండితులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు. భక్తులపాట్లు శ్రావణమాసం చివరి రోజు కావడంతో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట చెట్ల కింద నైవేద్యం వండుకుని అమ్మవారికి సమర్పించారు. చెట్ల కింద వంట చేసుకునే ప్రదేశంలో పైపులైన్ నిర్మా ణం కోసం తీసిన కాలువను పూడ్చకపోవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. ప్రమాదకరంగా ఉన్న పైపులైన్ కాలువను పూడ్చివేయాలని ఈఓను కోరారు. ఆలయంలో నేడు అన్నదానంపెద్దమ్మతల్లి ఆలయంలో నిత్యాన్నదానం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ఎన్.రజనీకుమారి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నదాన సత్రంలో సోమవారం భక్తుల సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అమ్మవారికి విశేష పూజలు -
కరువుఛాయలు
అలుముకుంటున్న ● ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేర కురవని వర్షాలు ● జిల్లాలో ఇంకా నిండని ప్రాజెక్టులు, చెరువులు ● సీజన్ ప్రారంభం నుంచి 17 మండలాల్లో లోటు వర్షపాతమే సూపర్‌బజార్(కొత్తగూడెం)/పాల్వంచరూరల్: వానాకాలం సీజన్ మొదలై మూడు నెలలు గడిచినా ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన మేరకు వానలు కురవలేదు. చెరువులు, జలాశయాలు, ప్రాజెక్ట్‌లు పూర్తిస్థాయిలో నిండకపోవంతో సాగుకు ప్రతికూలంగా మారింది. అడపాదడపా వర్షాలు కురుస్తున్నా వరి సాగుకు అనుకూలంగా లేవు. జూన్, జూలై నెలల్లో వానలు లేకపోవడంతో రైతులు ఆగస్టుపై ఆశలు పెట్టుకున్నారు. ఆగస్టులో కూడా అదే పరిస్థితి నెలకొనగా రైతుల ఆశల ఆవిరయ్యాయి. వాగులు, బోర్ల కింద నాట్లు వేసిన రైతులు కూడా వర్షం కోసం ఆకాశం వైపు చూస్తున్నారు. నీళ్లు లేక మెట్టపంటలు కూడా వాడిపోతున్నాయి. వెరసి జిల్లాలో కరువు ఛాయలు అలుముకుంటున్నాయి. లోటు వర్షపాతం జిల్లాలో సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటిరవకు లోటు వర్షపాతమే నమోదైంది. కేవలం ఆరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. 16 మండలాల్లో లోటు, ఒక మండలంలో అతి తక్కువ వర్షపాతం నమోదైంది. గుండాల, ఇల్లెందు, టేకులపల్లి, జూలూరుపాడు, చండ్రుగొండ, కొత్తగూడెం మండలాల్లో వర్షపాతం సాధారణానికే పరిమితమైంది. కరకగూడెం, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, అశ్వాపురం, మణుగూ రు, ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం, ములకలపల్లి, అశ్వారావుపేట మండలాల్లో లోటు వర్షపాతం నమోదైంది. దమ్మపేట మండలంలో అతి తక్కువ వర్షం కురిసింది. ప్రతి నెలా తక్కువే జిల్లాలో జూన్ నుంచి ఇప్పటి వరకు 18,376.9 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా 12,361.7 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. జిల్లా సరాసరి వర్షపాతం 799 మి.మీ కాగా 537.5 మి.మీ వర్షపాతమే నమోదైంది. జూన్మాసంలో 168.9మి.మీ వర్షానికి 161.7 మి.మీ, జూలైలో 312.7మి.మీ వర్షానికి 213.3 మి.మీ, ఆగస్టులో 295.4 మి.మీ వర్షానికి 160.9 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. ఈనెలలో ఇప్పటివరకు 22 మి.మీ వర్షం కురవాల్సి ఉండగా కేవలం 1.5 మి.మీ మాత్రమే నమోదు కావడం గమనార్హం. పడిపోతున్న భూగర్భ జలాలు వర్షాలు లేకపోవడంతో జిల్లాలో భూగర్భ జలమట్టం కూడా పడిపోతోంది. ఆగస్టులో జిల్లాలో భూగర్భ జలమట్టం 8.26 మీటర్లుగా నమోదైంది. జూలైలో 9.35 మీటర్లుగా నమోదుకాగా, నెల రోజుల కాలంలో 1.09 మీటర్ల భూగర్భ జలాలు పడిపోయాయి. దుమ్ముగూడెం మండలంలో 0.42 మీటర్ల లోతులోనే నీటిమట్టం ఉండగా, కొత్తగూడెంలో అత్యధికంగా 34.16 మీటర్ల లోతుకు భూగర్భ జలమట్టం పడిపోయింది. చెరువులు ఏ మేరకు నిండాయంటే జిల్లాలో చెరువులు, కుంటలు 2,384 ఉండగా పావుశాతం వరకు పూర్తిగా నిండాయి. 829 చెరువులు 25శాతం, 930 చెరువులు 25నుంచి 50శాతం, 619 చెరువులు 50 నుంచి 75 శాతంతో నీటితో నిండాయి. 421 చెరువుల్లో 75నుంచి 100 శాతం వరకు నీరు చేరగా, 60 చెరువులు అలుగు పోశాయి.మండలం సాధారణం కురిసినది కరకగూడెం 892.2 557.2 పినపాక 884.2 495.4 చర్ల 982.4 702.2 దుమ్ముగూడెం 941.3 508.4 అశ్వాపురం 854.4 588.0 మణుగూరు 930.4 456.8 ఆళ్లపల్లి 735.0 563.4 గుండాల 737.6 598.6 ఇల్లెందు 766.5 731.4 టేకులపల్లి 716.5 582.0 జూలూరుపాడు 712.2 620.2 చండ్రుగొండ 710.5 750.8 మండలం సాధారణం కురిసినది అన్నపురెడ్డిపల్లి 734.7 481.1 చుంచుపల్లి 740.7 511.2 సుజాతనగర్ 717.9 525.0 కొత్తగూడెం 759.2 642.6 లక్ష్మీదేవిపల్లి 731.3 539.8 పాల్వంచ 807.4 589.6 బూర్గంపాడు 870.3 443.4 భద్రాచలం 817.3 377.0 ములకలపల్లి 838.9 479.0 దమ్మపేట 793.4 289.2 అశ్వారావుపేట 712.6 329.6 జిల్లా సరాసరి 799.0 537.5 -
గుండెపోటుతో ఉపాధి కూలీ మృతి
అశ్వాపురం: మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీ, మాజీ ఉపసర్పంచ్ రాగం సత్యం(63) శనివారం గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామంలో చింతకుంట ప్రాంతంలో ఫారంపాండ్‌లో కూలీలు ఉపాధి హామీ పథకం పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సత్యం ఒక్కసారిగా గుండెనొప్పితో కుప్పకూలిపోయాడు. కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆటోలో ఆర్ఎంపీ వద్య ప్రథమ చికిత్స చేయించి, భద్రాచలం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడ ని పేర్కొన్నారు. ఎంపీడీవో ముత్యాలరావు, ఏపీఓ సీతారామయ్య ఆస్పత్రికి చేరుకుని సంతాపం తెలిపారు. పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు.. గుండాల: గుండెపోటుతో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలు శనివారం మృతి చెందింది. మండలంలోని సాయన్నపల్లి గ్రామానికి చెందిన బొమ్మెర్ల లక్ష్మి (50) గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. శుక్రవారం ఓ వివాహ వేడుకల్లో పాల్గొన్న ఆమె సాయంత్రం అస్వస్థతకు గురికాగా గుండాల ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె కుమారు డు గతంలో గ్రామపంచాయతీ డ్రైవర్‌గా పనిచేస్తూ ట్రాక్టర్ బోల్తా పడి మృతిచెందాడు. ఇప్పుడామె మృతితో కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యదుమ్ముగూడెం: మండలంలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన పడిగపాటి భాస్కరరెడ్డి(36) శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ శ్యామ్‌ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రామకృష్ణాపురం గ్రామానికి చెందిన భాస్కర్‌రెడ్డికి భద్రాచలానికి చెందిన యువతితో వివాహం జరిగింది. దంపతుల మధ్య ఇటీవల గొడవలు జరగడంతో భార్య భద్రాచలం పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 3న ఫిర్యాదు చేసింది. దీంతో స్టేషన్ నుంచి పోలీసులు ఫోన్ చేయడంతో క్షణికావేశంలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
కార్మిక సంక్షేమాన్ని విస్మరించాయి
టీబీజీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ మణుగూరుటౌన్: సింగరేణిలో గుర్తింపు, ప్రాతి నిధ్య కార్మిక సంఘాలు సంక్షేమాన్ని విస్మరించాయని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ విమర్శించా రు. శనివారం పీకేఓసీ–2 గేట్ సమావేశంలో, అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది ప్రజాపాలన కాదని, 1000 రోజుల ప్రజా పీడన అని విమర్శించారు. కార్మికులకు ఎన్నికల సమయాల్లో హామీలు ఇచ్చిన గెలిచిన యూనియన్లు వాటిని మరిపోయాయని ఆరోపించారు. ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీలు కార్మికుల నోట్లో మట్టి కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని అన్నారు. 100శాతం ఇన్వాలిడేషన్ చేయాలని, రూ.60 వేల కోట్ల బకాయి చెల్లించాలని డిమాండ్ చేశా రు. అనంతరం ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు నాగెల్లి వెంకట్, వూకంటి ప్రభాకర్‌రావు, జంగం రాజ్‌కుమార్, మునిగెల నాగేశ్వరరావు, సుద్దాల సంపత్‌కుమార్, మురళీకృష్ణ, బద్దుల ప్రవీణ్, బీఆర్ఎస్ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, వట్టం రాంబాబు, కుంట లక్ష్మణ్ పాల్గొన్నారు.ఎంబీబీఎస్ సీటు సాధించిన పేదింటి బిడ్డఅశ్వారావుపేటరూరల్: మండలంలోని వినా యకపురం కాలనీకి చెందిన గ్రామదీపిక కొయ్య లక్ష్మి–శ్రీనివాస్ దంపతుల కుమారుడు మణిదీప్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు సాధించాడు. నీట్–2026లో ఆల్ ఇండియా ర్యాంక్ 1,59,399, స్టేట్ మెరిట్ ర్యాంక్ 3,007 సాధించి నాగర్ కర్నూల్ ప్రభు త్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటుకు అర్హత పొందాడు. పేద కుటుంబానికి చెందిన మణిదీప్ 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు పాలేరులోని జవహర్ నవోదయలో విద్యనభ్యసించాడు. ఈ సందర్భంగా విద్యార్థిని పలువు రు అభినందించారు. ఓసీ పనులు వేగవంతం చేయాలిఇల్లెందు: ఇల్లెందు ఏరియాలో పూసపల్లి ఓసీ ఏర్పాటు పనులు వేగవంతం చేయాలని సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్) కె.వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన కేఓసీ, పూసపల్లి ఓసీ ప్రాంతాలను సందర్శించారు. పనుల పురోగతిపై సమీక్షించారు. నిర్ణీతకాలంలో అన్ని పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం రొంపేడు –1 ఇంక్లైన్ ప్రాంతాన్ని సందర్శించి మైనింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. విజయలక్ష్మి నగర్లో పర్యటించి అధికారులతో చర్చించారు. జీఎం వీసం కృష్ణయ్య, ఇతర అధికారులు రామదాసు, జాకీర్ హుస్సేన్, మాధవరా వు, రవికుమార్, నాగరాజు నాయక్, ప్రభాకర్, రామ్మూర్తి, దిలీప్‌కుమార్, శివ వీరకుమార్, సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అండర్–16 టోర్నమెంట్‌కు ఎంపికభద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన ఆరుగురు క్రీడాకారులు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహించనున్న అండర్–16 ఇంటర్ స్కూల్ క్రికెట్ టోర్నమెంట్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా జట్టు నుంచి ఎంపికయ్యారు. ప్రసన్న కుమార్, ఉజ్వల్ గణేష్, సాయి కిశోర్, చైతన్య సాయి, దీపక్ నాయక్, ధీరాజ్ ఎంపికై న వారిలో ఉన్నారు. ఈ మేరకు కోచ్ చరణ్ తేజ శనివారం వివరాలు వెల్లడించారు. రేషన్ బియ్యం స్వాధీనంబూర్గంపాడు: రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని శనివారం పోలీసులు పట్టుకున్నారు. మణుగూరు నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరుకు ట్రాలీ ఆటోలో తరలిస్తున్న 20 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని క్రాస్‌రోడ్డు వద్ద స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నిందితులు మణుగూరు మండలం రామానుజవరం గ్రామానికి చెందిన శ్రీనివాస్, చింతూరుకు చెందిన అజ్గర్అలీపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మేడ ప్రసాద్ తెలిపారు. హత్యకేసులో మరో నలుగురు అరెస్ట్మణుగూరు టౌన్: మున్సిపాలిటీలోని గాంధీబొమ్మ సెంటర్‌కు చెందిన సింహాద్రి శివ హత్యకేసులో మరో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. మణుగూరులోని నేతాజీ సుభాష్‌చంద్రబోస్ మైదానంలో ఎంకే గ్యాంగ్ కొట్టి హతమార్చిన విషయం విదితమే. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే 23 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపారు. తాజాగా మిగిలిన శివరాత్రి సాంబశివరావు, నాగేంద్రబాబు, చాబోతుల యేసు, పల్ల పు మల్లికార్జున్లను అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ నాగబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. -
రీ సర్వే సకాలంలో పూర్తి చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రీ సర్వే ప్రక్రి య తక్షణమే పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అన్నా రు. ఇంకా పది మండలాల్లో సర్వే ప్రారంభమే కాలేదని అన్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుంచి శనివారం రాత్రి ఆన్లైన్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఎస్డీసీ, ఇరిగేషన్, సంబంధిత సెక్షన్ అధికారులు, సర్వేయర్లతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టు సర్వే, రీ సర్వే పనులు మిషన్ మోడ్ విధానంలో పూర్తి చేయాలన్నారు. తహసీల్దార్లు, సర్వేయర్లు రీ సర్వేను సీరియస్‌గా తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ మండలంలో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు సర్వేయర్లతో సర్వే చేయించాలన్నారు. తక్షణమే కొత్తగూడెం, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, ములకలపల్లి, జూలూరుపాడు, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో గ్రామసభలు నిర్వహించి రీ సర్వే ప్రారంభించాలని ల్యాండ్ సర్వే ఏడి శ్రీనివాసులును ఆదేశించారు. కేవలం పాల్వంచ ప్రాంతంలోనే తొమ్మిది సర్వే నంబర్లు ఉన్నాయని, వాటిలో నాలుగు సర్వే నంబర్లలో సర్వే పూర్తయిందని తెలి పారు. మిగతా నంబర్లలో కూడా యుద్ధ ప్రాతిపదికన సర్వే పూర్తిచేసేలా సర్వేయర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కలెక్టర్ అంకిత్ -
ఆయిల్‌ఫెడ్ ఆస్తులు కాపాడాలి
అశ్వారావుపేటరూరల్: ఆయిల్‌ఫెడ్ ఆస్తులు కాపాడాలని అశ్వారావుపేట జోన్ ఆయిల్‌పాం గ్రోయర్స్ సొసైటీ బాధ్యులు తుంబూరు ఉమా మహేశ్వరరెడ్డి, కొక్కెరపాటి పుల్లయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని నారంవారిగూడెం వద్దనున ఆయిల్‌ఫెడ్ డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదారాబాద్‌లోని ఆయిల్‌ఫెడ్ స్థలా న్ని ఆయిల్‌పాం రైతుల ప్రయోజనాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించొద్దని కోరారు. అనంతరం డీఓ శంకర్‌కు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో దొడ్డా లక్ష్మీనారాయణ, మోరంపూడి శ్రీనివాసరావు, ఊగంటి రవి, సీసం రాము, కారం శ్రీరాములు, చక్రధర్ రెడ్డి, దుర్గారావు, గడ్డం సత్యనారాయణ, చిరంజీవి పాల్గొన్నారు. -
దత్తత ఇప్పిస్తామని నమ్మించి..
● సంగారెడ్డి మహిళను టేకులపల్లి రప్పించిన కేటుగాళ్లు ● రూ.1.40 లక్షలు తీసుకుని భయాందోళన సృష్టించి ఉడాయింపు టేకులపల్లి: పిల్లలులేని ఆవేదనను ఆసరాగా చేసుకుని, దత్తత పేరిట ఓ అమాయక మహిళను మోసగించి నగదు దోచుకున్న అంతర్ జిల్లా కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం టేకులపల్లి సర్కిల్ కార్యాలయంలో సీఐ సత్యనారాయణ, ఎస్ఐ కే.తిరుపతితో కలిసి ఇల్లెందు డీఎస్పీ యు.వెంకన్న వెల్లడించిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం బీరంగూడ గ్రామానికి చెందిన గౌరిగారి ప్రమీలకు వివాహమై 8 సంవత్సరాలు గడుస్తున్నా సంతానం కలగలేదు. దీంతో పిల్లల కోసం ఇన్‌స్ట్రాగామ్ ద్వారా ఆవేదన పంచుకుంది. ఆమె ఆవేదనను ఆసరాగా చేసుకుని ఖమ్మానికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ ద్వారా సంప్రదించాడు. రూ. నాలుగు లక్షలు ఇస్తే, బాబును దత్తత ఇప్పిస్తామని చెప్పి రూ. 1,40,000 ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను ఈ నెల 4న టేకులపల్లి పరిధిలోని ఏ కాలనీతండా వైకుంఠధామం సమీపానికి రప్పించి నగదు తీసుకున్నాడు. నటిస్తూ.. పరార్ ముందస్తు పథకం ప్రకారం అదే సమయంలో లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన యదళ్లపల్లి రాంబాబు, అతని కుమారుడు రోహిత్ మరికొందరితో బైక్‌లపై వచ్చి గొడవ పడుతున్నట్లు నటించి భయాందోళన సృష్టించారు. డబ్బులు తీసుకున్న వ్యక్తి వారి బైక్ ఎక్కి పారిపోగా, బాధితురాలు మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది. విచారణ ప్రారంభించిన పోలీసులు శనివారం కారుకొండ క్రాస్ రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను గమనించి పట్టుకున్నారు. విచారించడంతో దత్తత మోసం బయటపడింది. దీంతో కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలానికి చెందిన యదళ్లపల్లి రాంబాబు, రోహిత్, తాటి నాగరాజు, ఈసం రాంబాబు, మడివి వెంకటేష్, మడివి శారదలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రధాన సూత్రధారి ఖమ్మానికి చెందిన వ్యక్తితోపాటు మరో కొందరు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రూ. 1.40 లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదు అందాక తక్కువ సమయంలోనే సాంకేతిక పరిజ్ఞానం, సమయస్ఫూర్తితో కేసును చాకచక్యంగా ఛేదించిన సీఐ సత్యనారాయణ, ఎస్ఐ తిరుపతి , పోలీసు సిబ్బందిని డీఎస్పీ వెంకన్నబాబు ప్రత్యేకంగా అభినందించారు. -
ఆధునిక హంగులతో బస్టాండ్లు
చుంచుపల్లి: ఆధునిక హంగులతో బస్టాండ్లను తీర్చిదిద్దనున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. శనివారం రాత్రి ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్‌తో కలిసి ఆయన కొత్తగూడెం బస్టాండ్‌ను పరిశీలించారు. బస్టాండ్‌లో నెలకొన్న అధ్వాన పరిస్థితులను, వర్షాకాలంలో ప్రయాణికులు పడుతున్న తీవ్ర ఇబ్బందులను ఉన్నతాధికారులకు కూనంనేని వివరించారు. అనంతరం మాట్లాడుతూ నూతన భవన నిర్మాణం కోసం నియోజకవర్గ అభివృద్ధి నిధుల (సీడీఎఫ్) నుంచి రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కొత్తగూడెం బస్టాండ్ సమగ్ర ఆధునికీకరణకు రూ.20 కోట్లు, పాల్వంచ బస్టాండ్‌ను నూతనంగా నిర్మించేందుకు మరో రూ.10 కోట్లతో సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అధికారులు జాప్యం లేకుండా టెండర్ల ప్రక్రియను పూర్తి చేయాలని అన్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు కందుల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు పాల్వంచ బస్టాండ్ తనిఖీ పాల్వంచ: ఆర్టీసీ బస్టాండ్‌ను శనివారం రాత్రి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజశేఖర్‌తో కలిసి తనిఖీ చేశారు. బస్టాండ్ పరిసరాలను పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు -
ఉపాధ్యాయులది గురుతర బాధ్యత
ఐటీడీఏ పీఓ రాహుల్ భద్రాచలం: ఉపాధ్యాయులది వృత్తి మాత్రమే కాద ని, గురుతర బాధ్యత అని భద్రాచలం ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అన్నారు. శనివారం ఉపాధ్యాయ దినో త్సవం సందర్భంగా గిరిజన భవన్లో నిర్వహించిన గురుపూజోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపాధ్యాయుడు విద్యార్థుల జీవితా నికి, ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శిగా ఉంటాడని పేర్కొన్నారు. అనంతరం వంద శాతం ఫలితాలు సాధించిన పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులను సత్కరించారు. ఉత్తమ టీచర్లకు పురస్కారాలు అందజేశారు. ఉద్దీపకం–3, వారధి రూపకల్పనలో సహాయ సహకారాలు ఆర్పీలకు, క్రీడలలో ఓవరాల్ చాంపియన్‌షిప్ సాధించిన పీడీ, పీఈటీలకు పురస్కారాలు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం ఉపాధ్యాయులు ఐటీడీఏ అధికారులను సన్మానించారు. అధికారులు డేవిడ్‌రాజ్,చందన, అరుణకుమారి, రమేష్, రాము లు, రాధమ్మ, చంద్రమోహన్, భారతీదేవి, వీరు నాయక్, గోపాలరావు, అలివేలు మంగతాయారు పాల్గొన్నారు. -
విద్యార్థినికి అభినందన
చర్ల: చర్లకు చెందిన 6వ తరగతి విద్యార్థిని లేక్ష్యశ్రీ హైదరాబాద్‌లో జరిగిన కరాటే పోటీలలో ఉత్తమ ప్రతిభ చూపి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సాధించింది. దీంతో చిన్నారిని శనివారం వనవాసీ కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యకరమంలో పరిషత్ కొమరం భీం విద్యార్థి నిలయ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ, గోగి కార్ రామలక్ష్మణ్, వేములపల్లి ప్రవీణ్ బాబు, వరలక్ష్మి సంతోష్, ముఖేష్, గాదంశెట్టి ప్రసన్నలక్ష్మి, గాదంశెట్టి సుధారాణి, నంబూరి అశ్విని పాల్గొన్నారు. కొత్త ప్లాంట్ కోసం ఐక్యంగా కృషి చేయాలిపాల్వంచ: పాల్వంచలో మరో 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ కేంద్రాల సాధన కోసం ఐక్యంగా కృషి చేయాలని పలువురు ప్రముఖులు, నాయకులు అన్నారు. శనివారం కేటీపీఎస్ ఇంజనీర్స్ అసోసియేషన్ హాల్లో పవర్ ప్లాంట్ సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాల్వంచ భవిష్యత్ కోసం అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల కలిసి పోరాటాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలోడిప్యూటీ మేయర్ లలితకుమారి, నాయకులు,కార్పొరేటర్లు సీతారామి రెడ్డి, మంగీలాల్,సమీర్, యాస్మీన్, సుగుణ, భవిత, శ్రీను,జీవీఆర్, మధుచంద్, కీర్తి, కొత్వాల శ్రీనివాసరావు, శివరాంప్రసాద్, మహిపతి రామలింగం, కార్మిక సంఘాలనాయకులు తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులు, యువతతో చెలగాటమాడొద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): విద్యార్థులు, యువత జీవితాలతో చెలగాటమాడిన పాలకులు బతికి బట్టకట్టిన దాఖలాలు లేవని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర అన్నారు. కాంగ్రెస్ సర్కార్ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలను నిలదీస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం విద్యార్థులు, నిరుద్యోగ యువతతో కలిసి పాదయాత్ర చేశారు. కొత్తగూడెం మార్కెట్ యార్డు నుంచి సూపర్ బజార్ వరకు ప్లకార్డులు చేబూని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్‌ను నిరసిస్తూ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువత చేపట్టిన ఆందోళనతో ప్రధాని నరేంద్రమోదీ దిగివచ్చి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో రాజీనామా చేయించా డని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి వెయ్యి అబద్ధాలతో అధికారంలోకి వచ్చి విద్యార్థులు, యువతను అరి గోస పెడుతున్నారని అన్నారు. విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్‌కు గుదిబండగా మారే జీఓ నంబర్97ను రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్, పార్టీ మండల అధ్యక్షులు, కార్పోరేటర్లు, మాజీ ప్రజా ప్రతి నిధులు, నాయకులు పాల్గొన్నారు. ఇల్లెందురూరల్: మండలంలోని సుభాష్‌నగర్ గ్రామపంచాయతీలో ముత్యాలమ్మ, నాభిశిల విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం శనివారం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవి చంద్ర, ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. సర్పంచ్ వల్లాల మంగమ్మ, ఆలయ కమిటీ పెద్దలు చిట్టిబాబు, వరద రాంచందర్, ఆళ్ళ నాగేశ్వరరావు, వెంకటరెడ్డి, వల్లాల నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర -
వన్యప్రాణుల లెక్కెంత?
● కిన్నెరసాని అభయారణ్యంలో జంతువుల అడుగుజాడల కోసం సర్వే ● ములుగు ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్ విద్యార్థుల పరిశోధనపాల్వంచరూరల్: అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల ఆనవాళ్లు, అడుగుజాడల కోసం విద్యార్థులు సర్వే నిర్వహిస్తున్నారు. సిద్ధిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ సెంటర్లో బీఎస్సీ(ఫారెస్ట్) తృతీయ సంవత్సరం చదువుతున్న 15 మంది విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా జంతువులపై అధ్యయనం చేసేందుకు వచ్చారు. డీఎఫ్ ఓ సిద్ధార్థ విక్రమ్‌సింగ్, వైల్డ్‌లెఫ్ ఎఫ్డీఓ బాబు వారిలో పది మందిని కిన్నెరసాని అభయారణ్యంలోకి, మరో ఐదుగురిని అశ్వారావుపేట రేంజ్లో కేటాయించారు. నెలరోజులపాటు సర్వే జరగనుండగా విద్యార్థులు అటవీ జంతువుల అడుగుజాడలను గుర్తించి నివేదిక అందించనున్నారు. విద్యార్థులకు ఎఫ్‌బీఓలు సహకరిస్తున్నారు. సర్వే ప్రారంభించి పక్షం రోజులు పూర్తయింది. అశ్వారావుపేట రేంజ్, అభయారణ్యంలోని యా నంబైలు, ఆళ్లపల్లి, రంగాపురం రేంజ్‌లలో సర్వే పూర్తికాగా, ప్రస్తుతం చింతోని చెలక ఏరియాలో సర్వే నిర్వహిస్తున్నారు. 15మంది విద్యార్థుల్లో ఐదుగురు విద్యార్థినులు కూడా ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అటవీ ప్రాంతంలో సంచరిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. రాత్రి అడవిలోని బేస్ క్యాంప్‌ల్లోనే వంటావార్పు చేసుకుని అక్కడే నిద్రిస్తున్నారు. ఫారెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్స్ సెంటర్లో విద్యార్థులు కోర్సులో భాగంగా ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఏటా ఏదో ఒక అంశంపై పరిశోధన సాగించాలి. ఈసారి వన్యప్రాణి సంచారం, జీవన విధానంపై సర్వే నిర్వహిస్తున్నారు. మరో 15 రోజులైతే సర్వే ముగుస్తుంది. అనంతరం నివేదిక అందిస్తారు. –బి.బాబు, వైల్డ్‌లైఫ్ విభాగం ఎఫ్డీఓ -
జ్ఞాపకాల ప్రయాణం
● సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలు ఏర్పాటు చేసి యాభై ఏళ్లు పూర్తి ● 1976 సెప్టెంబర్ 2న కొత్తగూడెం, బెల్లంపల్లి మధ్య ప్రారంభం ● కోల్‌బెల్ట్ లైఫ్‌లైన్‌గా మారిన రైలు సౌకర్యంఅంతకుముందు 24 గంటల ప్రయాణం 1975లో గోదావరిఖని, మందమర్రి, శ్రీరాంపూర్, రవీంద్రఖని, మణుగూరు ఏరియాల్లో బొగ్గు తవ్వకాలు మొదలయ్యాయ. లక్షల మంది కార్మికులు గనుల్లో పనిచేశారు. దీంతో బెల్లంపల్లి నుంచి గోదావరిఖని (రామగుండం) మీదుగా కొత్తగూడెం వరకు రాకపోకలు పెరిగాయి. ఇందుకోసం కొత్తగూడెంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ప్యాసింజర్ రైలు ఎక్కి సాయంత్రం 6:30 గంటలకు డోర్నకల్‌లో దిగాల్సి వచ్చేది. అక్కడ రాత్రి 9 గంటలకు పూరీ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టుకుని అర్ధరాత్రి 2 గంటలకు కాజీపేటలో దిగేవారు. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు కాజీపేట – వార్థా ప్యాసింజర్ రైలు ఎక్కితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల మధ్య రామగుండం – మందమర్రి – బెల్లంపల్లి స్టేషన్లలో దిగేవారు. అటు నుంచి ఇటు కూడా ఇదే విధంగా జఠిలమైన ప్రయాణం ఉండేది. బెల్లంపల్లిలో పని చేసే కార్మికులు, వారి కుటుంబాల వారు ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెం వచ్చేందుకు 24 గంటల సమయం పట్టేది. దీంతో డోర్నకల్, కాజీపేటలలో తినేందుకు వీలుగా ప్రయాణికులు చద్దిమూట కట్టకుని వెళ్లేవారు. ఈ అలవాటును 2006లో కాజీపేట జంక్షన్ బైపాస్ అయ్యే వరకు కొనసాగింది. 1976లో ప్రారంభం సింగరేణి కార్మికులు, అధికారులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైల్వేశాఖ భద్రాచలంరోడ్ – బెల్లంపల్లి మధ్య 1976 సెప్టెంబరు 2న సింగరేణి ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించింది. దీంతో ఉదయం ఆరు గంటలకు కొత్తగూడెంలో ఈ రైలు బయల్దేరితే మధ్యాహ్నం 11 గంటలకు బెల్లంపల్లి చేరుకునేది. అక్కడ తిరుగు ప్రయాణమై రాత్రి 8 గంటలకు కొత్తగూడెం వచ్చేది. ఆరంభంలో ఏసీ కోచ్‌లు కూడా ఉండేవి. సింగరేణి ఉన్నతాధికారులు నేరుగా రైలు ఎక్కేందుకు వీలుగా ప్లాట్‌ఫారమ్ మీదకు కార్లు వచ్చే సౌకర్యం కొత్తగూడెం స్టేషన్లో ఉండేది. ఆ రోజుల్లోనే కొత్తగూడెం, రామగుండం, బెల్లంపల్లి స్టేషన్లలో ఏసీ వెయిటింగ్ హాల్స్ ఉండేవి. రైలు ప్రారంభానికి గుర్తుగా రైల్వేశాఖ ప్రత్యేకంగా పోస్ట్‌కార్డును విడుదల చేయడమనేది ఆ రోజుల్లో దేశవ్యాప్తంగా కొత్తగూడేనికి ఉన్న ప్రాధాన్యతను ఇప్పటికీ గుర్తుచేస్తోంది. ఆరంభించడమే ఆలస్యం సింగరేణి రైలు ఎప్పుడు ప్రయాణికులతో కిటకిటలాడేది. కొత్తగూడెం నుంచి బెల్లంపల్లి వరకు ఒక్కటే రైలు కావడంతో కాలకమ్రంలో స్టాపులు పెరిగాయి. ఎక్స్‌ప్రెస్ హోదా పోయి ఫాస్ట్ ప్యాసింజర్ స్థాయికి పడిపోయింది. దీంతో ప్రయాణ సమయం పెరగడంతో దాన్ని తగ్గించేందుకు కాజీపేట – సిర్పూర్ కాగజ్‌నగర్‌ల మధ్య రామగిరి పేరుతో రేక్ షేరింగ్ రైలు మొదలు పెట్టాల్సి వచ్చింది. సింగరేణి ప్రయాణంలో లంచ్‌బ్రేక్ స్టేషన్‌గా పేరున్న కాజీపేటను 2006 తర్వాత బైపాస్ చేశారు. ఆ తర్వాత ఐసీఎఫ్ కోచ్‌లను తీసి పుష్పుల్ రైలుగా మార్చారు. ఈ మార్పులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేయడంతో వాష్ రూమ్స్ సౌకర్యం ఉన్న కోచ్‌లను అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు సింగరేణికి జోడిగా మొదలైన ఇల్లెందు – కారేపల్లి – డోర్నకల్ ప్యాసింజర్ కథ కూడా అర్ధంతరంగా ముగిసింది. జెన్‌జీ తరానికి సింగరేణి ప్రాముఖ్యత పెద్దగా తెలియకపోవచ్చు కానీ బేబీ బూమర్స్, జనరేషన్ ఎక్స్, మిలీనియల్స్‌కు సింగరేణి అంటే ఓ ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాల సమ్మేళనం. -
విద్యార్థులను తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే
కొత్తగూడెంఅర్బన్: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దేది ఉపాధ్యాయులేనని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్లో శనివా రం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. తొలుత పలు పాఠశాలల చిన్నారులు నృత్యాలతో అలరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. డీఈఓ డి.వాసంతి, జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పి. వీరబాబు కూడా ప్రసంగించారు. ఆ తర్వాత ఉత్తమ ఉపాధ్యాయులు 50 మందికి అవా ర్డులు, సర్టిఫికెట్లు అందజేశారు. డిప్యూటీ మేయర్ సిరిపురపు లలితకుమారి, కొత్తగూడెం మార్కెట్ కమిటీ చైర్మన్ లాల్‌సింగ్, ఆర్డీఓ మధు, ఏసీ మాధవరావు, ఏఎంఓ మాధవరావు, ప్లానింగ్ కో ఆర్డినేటర్ సతీష్, డీఎస్ఓ సంపతకుమార్, జీసీడీఓ జానకి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్న నీరజ, అనురాధ
చుంచుపల్లి: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కొత్తగూడేనికి చెందిన ఇద్ద రు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకున్నారు. బాబూక్యాంపు పీఎంశ్రీ ప్రభు త్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బూ రుగు నీరజ, కొత్తగూడెం ఎస్ఆర్ ఆర్ట్స్ ఆండ్ సైన్స్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.అనురాధలను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, ఉన్నత విద్యా కమిషనర్ దేవసేన, ఆర్జేడీ డాక్టర్ బాలభాస్కర్ చేతుల మీదుగా అవార్డులు స్వీకరించారు. విద్యారంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు లభించాయి. ఈ సందర్భంగా వారిని పలువురు అభినందించారు. -
ఉత్సాహంగా ఉట్ల ఉత్సవం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో శనివారం ఉట్ల ఉత్సవాన్ని కమనీయంగా జరిపారు. శ్రీ కృష్ణాష్టమి మరుసటి రోజున దేవస్థానంలో ఉట్ల వేడుకను జరపటం ఆనవాయితీ. స్వామివారికి ఆలయ ప్రాంగణంలోనే తిరువీధి సేవ జరిపారు. అనంతరం యటపాకకు చెందిన యాదవ వంశస్తులు ఉట్టి కొట్టే వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్‌రావు, అర్చకులు, పండితులు, భక్తులు పాల్గొన్నారు. నేడు డార్మెటరీ హాల్‌కు శంకుస్థాపన గోదావరి పుష్కరాల పనులలో భాగంగా భక్తుల కోసం ఆదివారం డార్మెటరీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అంబసత్రం ఎదురుగా ఉన్న సంస్కృతి పాఠశాల స్థలంలో జీ ప్లస్ వన్ నిర్మాణం చేపట్టనున్నారు. రామయ్యకు సువర్ణ తులసీ అర్చనభద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులకు శనివారం సువర్ణ తులసీ అర్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కా లం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి మిథిలా స్టేడియం ప్రాంగణంలో ఉన్న శ్రీరామా సేవా మండపంలో ఉత్సవమూర్తులను కొలువుదీర్చారు. స్వా మివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచ నం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ మహోత్సవాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. -
నేడు మంత్రి తుమ్మల పర్యటన
అశ్వారావుపేటరూరల్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం అశ్వారావుపేటలో పర్యటిస్తారని ఆయిల్‌ఫెడ్ డీఓ ఎస్.శంకర్ తెలిపారు. శనివారం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని నారంవారిగూడెం ఆయిల్‌ఫెడ్ నర్సరీలో రైతులకు పామాయిల్ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు జారె ఆదినా రాయణ, మట్టా రాగమయితో కలిసి ప్రారంభిస్తారని చెప్పారు. అనంతరం పామాయిల్ రైతులతో ముఖాముఖి ఉంటుందని, ఆ తర్వా త అశ్వారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని సందర్శిస్తారని పేర్కొన్నారు. నేడు మారెళ్లపాడు లిఫ్ట్ ట్రయల్ రన్అశ్వాపురం: మండల పరిధిలోని బీజీ కొత్తూరులోని సీతారామ ప్రాజెక్ట్ పేస్–1 పంప్‌హౌస్ సమీపంలో నిర్మించిన మారెళ్లపాడు ఎత్తిపోతల పథకానికి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. గత నెల 15న లిఫ్ట్ ద్వారా తుమ్మల చెరువుకు నీరు వదలాల్సి ఉంది. అనంతరం గత నెల 29న మంత్రుల చేతుల మీదుగా ప్రారంభించాలని నిర్ణయించారు. పనులు పూర్తికాకపోవడంతో మంత్రుల పర్యటన రద్దు కావడంతోపాటు ప్రారంభోత్సవం జరగలేదు. ప్రస్తుతం పనులు పూర్తి కావడంతో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ట్రయల్ రన్ నిర్వహించనుండగా, నీటిపారుదల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. లిఫ్ట్ ద్వారా సీతారామ ప్రాజెక్ట్ జలాలు తుమ్మలచెరువుకు తరలించనున్నారు. 7,8 తేదీల్లో అలింకో క్యాంపుకొత్తగూడెంఅర్బన్: తెలంగాణ సమగ్ర శిక్ష, అలింకో ఆధ్వర్యంలో పాతకొత్తగూడెంలోని ఆనందఖని పాఠశాలలో ఈ నెల 7, 8 తేదీల్లో దివ్యాంగ విద్యార్థులకు అసెస్మెంట్ అండ్ ఐడెంటిఫికేషన్ క్యాంపు నిర్వహించనున్నట్లు డీఈఓ వాసంతి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీడబ్ల్యూఎస్ఎన్కు సంబంధించిన క్యాంపులో పిల్లలను పరీక్షించి వారికి కావా ల్సిన మెటీరియల్ అందజేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఆధార్ కార్డు, యూడీఐడీ కార్డు, ఆదాయం సర్టిఫికెట్ తెచ్చుకోవాలని కోరారు. 7న ఆళ్లపల్లి, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, అశ్వాపురం, భద్రాచలం, బూర్గంపాడు, చర్ల, చంద్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, దుమ్ముగూడెం మండలాల వారికి, 8న గుండాల, జూలూరుపాడు, కొత్తగూడెం, కరకగూడెం, లక్ష్మీదేవిపల్లి, ములకలపల్లి, మణుగూరు, పాల్వంచ, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు, పినపాక మండలాల వారికి క్యాంపు ఉంటుందని వివరించారు. సింగరేణిలో 34 మంది మైనింగ్ అధికారుల బదిలీరుద్రంపూర్: వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న 34 మంది మైనింగ్ అధికారులను బదిలీచేస్తూ శనివారం రాత్రి సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ఇద్దరు ఏజీఎంలు, నలుగురు డీవైజీఎంలు, ముగ్గురు ఎస్వోఎంలు, కాలరీ మేనేజర్ ఒకరు, 8 మంది అడిషనల్ మేనేజర్లు, ఐదుగురు డిప్యూటీ మేనేజర్లు, ఏడుగురు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ మైనింగ్ ఇంజనీర్లు, సీనియర్ అండర్ మేనేజర్ ఒకరు, మేనేజ్మెట్ ట్రైనీ (మైనింగ్) అధికారులు ముగ్గురు ఉన్నారు. వీరందరూ ఈ నెల 10వ తేదీన వారికి కేటాయించిన ఏరియాల్లో విధుల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మరమ్మతులు వేగవంతం చేయాలిజెన్కో డైరెక్టర్లు లక్ష్మయ్య, రాజశేఖర్ రెడ్డి పాల్వంచ: కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో మరమ్మతులు వేగవంతం చేయాలని జెన్కో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాదావత్ లక్ష్మయ్య, థర్మ ల్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. కర్మాగారంలో సాంకేతిక సమస్యతో ఉత్పత్తి నిలిచి పోవడంతో బీహెచ్ఈఎల్ ఆధ్వర్యంలో చేపడుతు న్న మరమ్మతు పనులను శనివారం పరిశీలించారు. రూ.20కోట్లతో ఉత్తరాఖండ్ నుంచి తెప్పించి బిగిస్తున్న రోటర్ పనులను పర్యవేక్షించారు. రోటర్‌ను యూసీబీలో ఏర్పాటు చేసే పనులతోపాటు, ఎలక్ట్రికల్, మెకానికల్ పరీక్షలు, ఇతర విభాగాల్లో జరుగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంస్థకు నష్టం వాటిల్లుతున్న తరుణంలో మరమ్మతులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం కోల్ యార్డులో బొగ్గు నిల్వలను పరిశీలించారు. సీఈ ఎం.ప్రభాకర్ రావు, ఎస్ఈలు యుగపతి, శ్రీనివాసరావు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు. -
మంత్రియోగం లేదా?
● జోరందుకున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రచారం ● తెలంగాణ వచ్చాక ప్రతీసారి ఖమ్మానికే కేబినెట్లో బెర్త్ ● జిల్లాకు ఈసారైనా చోటు కల్పించాలని ప్రజల వేడుకోలు సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణపై నెలరోజులుగా ప్రచారం సాగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటన ముగియడంతో ఇక కేబినెట్లో మార్పులు జరుగుతాయనే వార్తలు మరింత జోరందుకున్నాయి. దీంతో మంత్రుల పర్యవేక్షణలేక కనీసం రోడ్డు మరమ్మతులు సైతం సకాలంలో చేసుకోలేని దుస్థితిలో నిలిచిన జిల్లాకు కేబినెట్లో చోటు కల్పించాలనే డిమాండ్ ఏజెన్సీ ప్రజల నుంచి వస్తోంది. మరమ్మతులకూ దిక్కులేదు భద్రాచలంలో గోదావరిపై నిర్మించిన రెండో వంతెన అప్రోచ్ వాల్ ఏప్రిల్‌లో కూలిపోయింది. వంతెన జాతీయ రహదారి 30పై ఉంది. జూలై, ఆగస్టులో గోదావరికి వచ్చే భారీ వరదలను దృష్టిలో ఉంచుకుని వంతెన మరమ్మతు పనులను నెలరోజుల్లోపే ముగించాలి. అయితే, పనుల పురోగతిని పట్టించుకునే వారు కరువైపోవడంతో సెప్టెంబర్ వచ్చినా ఇంకా పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఐదు నెలలుగా రెండో వంతెనపై రాకపోకలు ఆపేశారు. ఒకే వంతెనపై ట్రాఫిక్ రద్దీ కారణంగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి చనిపోయిన తర్వాత రెండో వంతెనపై ట్రాఫిక్‌కు అనుమతి వచ్చింది. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ఉన్న గోధుమవాగు, ముర్రేడు వాగు వంతెనలపై ఉన్న గోతులు రోజురోజుకు పెద్దవిగా మారుతున్నాయని తప్పితే మరమ్మతులకు నోచుకోవడం లేదు. పర్యవేక్షణ కరువైపోవడమే దీనికి కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇవి మచ్చుకు రెండు ఉదాహరణలే. లెక్క తీస్తే ఇలాంటివి మండలానికి పదికి తక్కువ కాకుండా ఉంటాయి. ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే జిల్లాకు కూడా కేబినెట్లో చోటు కల్పించాలనే డిమాండ్‌కు రోజురోజుకూ మద్దతు పెరుగుతోంది. ఖమ్మానికే కేబినెట్ తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు మూడు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. మూడు సార్లు కేబినెట్ బెర్తులు ఖమ్మం జిల్లాకే దక్కాయి. తొలి సారి తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత ఆయన పాలేరు నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అనంతరం ఖమ్మం నుంచి గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్ కేబినెట్లో చోటు దక్కించుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో మధిర నుంచి భట్టి విక్రమార్క, ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రులుగా కొనసాగుతున్నారు. మొత్తంగా పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజకర్గాలకు రెండు సార్లు అదృష్టం వరించింది. కానీ జిల్లాలో కూడా ఖమ్మం తరహాలోనే ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నా ఒక్కసారి కూడా కేబినెట్ బెర్త్ దక్కలేదు. తొలిసారి కొత్తగూడెం నుంచి గెలిచిన జలగం వెంకట్రావుకు పార్లమెంట్ కార్యదర్శి పదవి ఇవ్వగా కోర్టు జోక్యంతో అది మూణ్నాళ్ల ముచ్చటేగానే ముగిసింది. రెండోసారి పినపాక నుంచి గెలిచిన రేగా కాంతారావుకు విప్ పదవి దక్కింది. ఇవి రెండు ప్రొటోకాల్ వరకే కేబినెట్ స్థాయిని కలిగి ఉంటాయి తప్పితే పరిపాలనలో వీటి ప్రాధాన్యత దాదాపు శూన్యమనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కేబినెట్లో ఆ స్థాయి కూడా జిల్లాకు దక్కలేదు. అర్హత, అనుభవం కలిగినవారు ఉన్నా.. ● గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐలు మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. కొత్తగూడెం నుంచి సీపీఐ తరఫున కూనంనేని సాంబశివరావు ఉన్నారు. 50 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం, ప్రజా పోరాటాలు ఆయన సొంతం. రెండోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని కొనసాగుతున్నారు. ● ప్రస్తుతం మంత్రులుగా ఉన్న భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు రాజకీయాల్లోకి రాకముందే పాయం వెంకటేశ్వర్లు రాజకీయాల్లో ఉన్నారు. రద్దయిన బూర్గంపాడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఆయపకు ఉంది. మూడుసార్లు మూడు వేర్వేరు పార్టీల నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. ● కోరం కనకయ్య ఇల్లెందు నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. జిల్లా పరిషత్ చైర్మన్‌గా కూడా పని చేశారు. మంత్రి పదవి అప్పగించేందుకు అవసరమైన రాజకీయ అనుభవం కనకయ్యకు ఉంది. ● జారే ఆదినారాయణ తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. రాజకీయ అనుభవం తక్కువైనా విద్యార్థి దశ నుంచే ఎన్సీసీ సభ్యుడిగా క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా పేరుంది. -
మహనీయుడు జగ్జీవన్‌రామ్
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఏఐసీసీ అధికార ప్రతినిధి అన్పుల్ అవిజిత్పాల్వంచ: దేశ సామాజిక సమత, సమానత్వాల కోసం పోరాడిన మహానీయుడు మాజీ దేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఏఐసీసీ అధికార ప్రతినిధి, బాబూ జగ్జీవన్ రామ్ మనుమడు డాక్టర్ అన్పుల్ అవిజిత్ అన్నారు. శుక్రవారం బస్టాండ్ సెంటర్లో బాబూ జగ్జీవన్‌రామ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు, బలహీన, వర్గాలు, దళితుల హక్కుల కోసం బాబుజీ చేసి పోరాటాలు అజరామరమైనవని అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా దేశంలోని ఆహార ధాన్యాల కొరతను నివారించేందుకు హరిత విప్లవం తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాడని కొనియాడారు. మానకొండూరు, కొత్తగూడెం ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, కూనంనేని సాంబశివరావు, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య మాట్లాడుతూ అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడ్డారని అన్నారు. ఈ సందర్బంగా వారిని గజమాలతో సత్కరించారు. ఏపూరి సోమన్న కళాబృందం ఆటాపాటతో అలరించింది. ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్‌పాషా, ఝాన్సీ, కొత్వాల శ్రీనివాసరావు, విగ్రహా కమిటీ అధ్యక్షుడు దండోర శ్రీను, కాల్వ భాస్కర్ రావు, కొత్తపల్లి సోమయ్య, కాల్వ దేవదాస్, ఎ.అబ్బురామ్, రవితేజ, కాల్వ ప్రకాష్, పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. నేటి నుంచి ‘సర్’పై ప్రత్యేక ప్రచారంసూపర్బజార్(కొత్తగూడెం): అక్టోబర్ 1 అర్హత తేదీగా రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ కోసం జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఓటర్లు సంబంధిత పోలింగ్ స్టేషన్లో అందుబాటులో ఉంచిన ముసాయిదా ఓటర్ల జాబితాను పరిశీలించుకోవాలని సూచించారు. ఏవైనా తప్పులు ఉంటే లేదా కొత్తగా పేరు నమోదు, తొలగింపు, మార్పులు అవసరమైతే నిర్ణీత ఫారం–6, ఫారం–7, ఫారం–8 ద్వారా సంబంధిత బీఎల్ఓ, ఈఆర్ఓలకు అభ్యంతరాలు అందజేయవచ్చని పేర్కొన్నారు. బీఎల్ఓలు తప్పనిసరిగా అందుబాటులో ఉంటారని తెలిపారు. -
పొదల్లో పసికందు..
దమ్మపేట: తల్లి ఒడిలో సేదతీరాల్సిన పసికందు.. చెట్టు కింద ఉన్న పొదల మధ్య అనాథగా కనిపించింది. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ఓ ఇంటి ప్రహరీ వెనక భాగాన చెట్టు కింద పొదలు, రాళ్లురప్పలు ఉన్న ప్రదేశంలో వదిలివెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దమ్మపేట మండలం పట్వారీగూడెం ఎస్సీ కాలనీలోని ఓ ఇంటి ప్రహరీ వెనుక ఉన్న పొదల నుంచి గురువారం తెల్లవారుజామున పసికందు ఏడుపు వినిపించింది. దీంతో ఇంట్లోని మహిళ వెళ్లి చూడగా అప్పుడే పుట్టిన మగశిశువు కనిపించింది. బుధవారం అర్ధరాత్రి ప్రసవించిన పసికందును అక్కడ వదిలేసి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో సదరు మహిళ ఆ శిశువును సత్తుపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తుండగా పోలీసులు ఘటనాస్థలంలో వివరాలు సేకరించారు. అయితే, పట్వారిగూడెంలో ఉండే ఐసీడీఎస్ సిబ్బంది శుక్రవారం వరకు స్పందించలేదు. చికిత్స అనంతరం శుక్రవారం శిశువును పోలీసులకు సదరు మహిళ అప్పగించాక ఐసీడీఎస్ సీడీపీఓ హేమసత్య, సిబ్బందితో చేరుకుని శిశువును సంరక్షణలోకి తీసుకున్నారు. అనంతరం భద్రాచలంలోని శిశుగృహకు తరలించగా.. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మానవత్వం చూపిన ఓ మాతృమూర్తి -
అక్షరాల నిధి.. భవితకు పెన్నిధి
అక్షరం నేర్పడం ఉపాధ్యాయుల విధి. ఆ అక్షరంతో జీవితాన్ని గెలిపించేలా తీర్చిదిద్దడం ఉత్తమ ఉపాధ్యాయుల లక్షణం. అమాయకత్వంతో బడిలోకి అడుగుపెట్టిన పిల్లలను సమాజం మెచ్చే పౌరులుగా, నలుగురికీ దారిచూపే విజేతలుగా తీర్చిదిద్దే అద్భుత శిల్పులు ఉపాధ్యాయులు. పాఠాలకే పరిమితం కాకుండా కష్టాల్లో ధైర్యం నూరిపోయడం, కలలకు రెక్కలు తొడిగి బతుకు బాటలో వెలుగుదివ్వెలుగా నిలిచే ప్రత్యక్ష దైవాలే గురువులు. నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని పలువురు విద్యార్థులను పలకరించగా.. వారి మనస్సులో చెరగని ముద్ర వేసిన ఉపాధ్యాయుల ప్రత్యేకతలను వివరించారు. ● ఉపాధ్యాయులే సమాజ వెలుగుదివ్వెలు ● విద్యార్థుల భవితను తీర్చిదిద్దుతున్న టీచర్లకు వందనం విద్యాబోధనతో పాటు మానసిక పరిణితి, శారీరక దారుఢ్యం, సమాజాన్ని చదవగలిగే ప్రజ్ఞను పిల్లలకు అందించే బాధ్యత కూడా ఉపాధ్యాయులపై ఉంటుంది. ఇందుకోసం ఉపాధ్యాయులు విద్యార్థి స్థాయికి వెళ్లి వారికి అర్థమయ్యే భాషలో, వీలైతే ప్రయోగాత్మక బోధన అవలంబిస్తే పిల్లలకు మేలు జరుగుతుంది. ఉపాధ్యాయులు పిల్లలందరికీ మంచి భవిష్యత్‌ను అందించడమే కాక తమ వైపు నుంచి భరోసా అందిస్తూ ధైర్యంగా ముందడుగువేసేలా మార్గనిర్ధేశం చేయాలి. విద్యార్థిలోని మంచి గుణాలను వెలికితీసి ఏ దారిలో వెళ్లాలనుకుంటున్నారో గుర్తించి తనదైన శైలిలో ప్రోత్సహించడంలో ప్రముఖ పాత్ర ఉపాధ్యాయులదే. అంతేకాక క్రమశిక్షణ, మంచి అలవాట్లు పెంపొందిస్తే విద్యార్థుల విజయానికి బాటలు పడతాయి. – అశ్వారావుపేటరూరల్/ఇల్లెందు రూరల్ -
అందరిలో కొందరు !
ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల్లో కొందరు ప్రత్యేకంగా నిలుస్తున్నారు. అవార్డులు వచ్చినా, రాకున్నా.. ఉన్నతాధికారులు గుర్తించినా, లేకున్నా... విద్యార్థుల అభివృద్ధే లక్ష్యంగా బోధన సాగిస్తున్నారు. వినూత్న పద్ధతుల్లో పాఠాలు చెబుతూ పిల్లల భవిష్యత్‌కు పాటుపడుతున్నారు. నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అలాంటి వారిలో కొందరు ఉపాధ్యాయుల పరిచయం.వైరా: అవార్డుల కోసం చూడకుండా, కరోనా సమయంలోనూ విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు చెప్పి వారి భవిష్యత్‌కు బంగారు బాటలు వేస్తున్నారు వైరా మండలం ఖానాపురం ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు బానోతు రామ్. 2006 డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికై న ఆయన కొణిజర్ల మండలం సింగరాయపాలెం, వైరా మండలం దాచాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వర్తించాక 2018నుంచి ఖానాపురం పాఠశాలలో పని చేస్తున్నారు. 2023 నుంచి ఇప్పటివరకు ఆదివారం, ప్రభుత్వ సెలవులు తప్ప వ్యక్తిగత అవరాల కోసం రామ్ ఒక్క సెలవు కూడా తీసుకోకపోవడంవిశేషం. పాఠశాలలో మొత్తం 75 మంది విద్యార్థులు ఉండగా 1, 2వ తరగతుల విద్యార్థులకు చేతి రాతలో ప్రత్యేక తర్ఫీదు ఇచ్చేందుకు పుస్తకాలు సమకూరుస్తున్నారు. విద్యార్థులకు డిక్షనరీలు అందించి ఇంగ్లిషు బోధిస్తున్నారు. ఉదయం ముందుగా పాఠశాలకు వచ్చి వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఈసీఆర్(ఎవ్రీ చైల్డ్ రీడింగ్)లో జిల్లాలోనే ఖానాపురం యూపీఎస్ ప్రథమ స్థానానా నిలిచింది. ఇవన్నీ కాక రామ్ తన కుమార్తె చరిత్రశ్రీని పనిచేసే పాఠశాలలో చేర్పించడం విశేషం. విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలో మొక్క నాటించి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్నారు.ఇల్లెందురూరల్: క్రమశిక్షణ, తపన, సేవాదృక్పథంతో ఉపాధ్యాయుడు కబ్బాకుల రవి ఎక్కడ పనిచేసినా అధికారులు, తల్లిదండ్రుల ప్రశంసలు అందుకున్నారు. ఇల్లెందు మండలం ముత్తారపుకట్ట ప్రాథమిక పాఠశాలలో ఐదేళ్ల క్రితం రవి ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఇరుకు గదులు, అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న పాఠశాలకు గ్రామస్తుల సహకారంతో ఒక రూపం తీసుకురావడంతో పాటు ప్రజాప్రతినిధుల సహకారంతో రెండు గదుల భవనం మంజూరు చేయించారు. దాతల చేయూతతో బెంచీలు, డిజిటల్ బోధన కోసం టీవీ సమకూర్చారు. అట్టలకు అక్షరాలను అతికించి వాటి ఆధారంగా పలక లేకుండానే బోధిస్తుండడంతో సత్ఫలితాలు వచ్చాయి. రోజూ పాఠశాలలో బోధించిన అంశాలను ఇంటి వద్ద మననం చేసుకునేలా విద్యార్థులను సన్నద్ధం చేశారు. తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటుచేసి విద్యార్థి చదువుకునే ఫొటో తీసి గ్రూప్‌లో పోస్ట్ చేసేలా అవగాహన కల్పించారు. ప్రతీనెల తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతి నివేదికలను ఇవ్వడంతో పాటు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను బహుమతులతో ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమాన హెచ్ఎం రవి, సహ ఉపాధ్యాయుల కృషితో ముత్తారపుకట్ట పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 20నుంచి 60కి చేరింది. అంతేకాక గతేడాది నవోదయ ప్రవేశ పరీక్షలో పాఠశాల నుంచి హాజరైన విద్యార్థులందరూ అర్హత సాధించారు.కొణిజర్ల: పుస్తకాలతో కుస్తీ పడుతూ బట్టీ పట్టే కాలం పోయింది. చదువు అంటే ర్యాంకుల వేటే కాదు జీవితాంతం గుర్తుండే జ్ఞానమని నిరూపిస్తున్నాడో ఉపాధ్యాయుడు. పనికి రావని పడేసిన వ్యర్థాలనే అస్త్రాలుగా మలిచి దాదాపు 150 రకాల టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ తయారు చేసి తరగతి గదిని ప్రయోగశాలగా మార్చి పాఠాలు బోధిస్తూనే మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తున్నారు కొణిజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఫిజిక్స్ ఉపాధ్యాయుడు బానోత్ హనుమ. పరీక్షల కోసమే బోధన అన్నట్లు కాకుండా వారిలో జ్ఞానం పెంచాలనే సంకల్పంతో వ్యర్థాల సాయంతో టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ తయారు చేశారు. ఇందులో న్యూటన్ గమన నియమాలు, జడత్వ నియమాలు, గురుత్వ కేంద్రం, విద్యుత్ ప్రవాహానికి సంబంధించిన ప్రయోగాలు, కాంతి పరావర్తన నియమాలు, సూర్య, చంద్ర గ్రహణ నమూనాలు వంటివి ఉన్నాయి. అంతేకాక మూఢనమ్మకాలను నిర్మూలించేలా అవగాహన కల్పిస్తారు. గాజు పెంకులపై నడవడం, నాలుకపై శూలాలు గుచ్చుకోవడం, అరచేతి నుంచి విభూతి రప్పించడం వంటివి శాసీ్త్రయంగా వివరిస్తారు. ఈక్రమంలో హనుమ ఈ ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు.నేడు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం -
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
భద్రాచలం: భద్రాచలంలో జరుగుతున్న శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ, నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులకు, కాంట్రాక్టర్‌కు సూచించారు. శుక్రవారం ఆయన భద్రాచలంలో పర్యటించారు. తొలుత స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే ముక్కోటి ఉత్సవాలలోపు ఉత్తర ద్వారం అభివృద్ధి పనులు పూర్తి చేయాలని, వచ్చే ఏడాది ఏప్రిల్‌లో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలలోపు అన్ని పనులు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్, జూలైలో జరిగే గోదావరి పుష్కరాల ప్రారంభంలోపు గోదావరి పరీవాహక ప్రాంతంలో ఘాట్ల నిర్మాణాలు, పూర్తి చేయాలని అన్నారు. అనంతరం పురుషోత్తపట్నంలో ఉన్న గోశాలలో రాజ గోపుర, ఇతర శిల్ప నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అంకిత్, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, ఐటీడీఏ పీఓ రాహుల్, ఆలయ ఈఓ దామోదర్, తహసీల్దార్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిభద్రాచలంఅర్బన్: పాల్వంచ మండలంలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ(ఐఆర్సీఎస్) చర్యలు చేపడుతోంది. ఇందులో కేన్సర్ వ్యాధి నిర్ధారణ కేంద్రం, డయాలసిస్ సెంటర్, బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేయాలని శుక్రవారం సంస్థ ప్రతినిధులు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడిని కలిసి విన్నవించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ అంకిత్‌ను ఆదేశించారు. ఐఆర్సీఎస్ జిల్లా కో ఆర్డినేటర్ ఎస్ఎల్ కాంతారావు, పి.వెంకటేశ్వరరెడ్డి, వై.సూర్యనారాయణ, జి.రాజారెడ్డి, వి.కామేశ్వరరావు, హరిశ్చంద్ర నాయక్, సోమరౌతు శ్రీనివాసరావు, డా.భాను ప్రసాద్, బి.సిద్ధారెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. -
స్వర్ణ కవచాలతో రామయ్య దర్శనం
భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. స్వామివారి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ కృష్ణా జన్మాష్టమి సందర్భంగా స్వామివారికి అభిషేకం జరిపారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా సేవా మండపంలో అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, పూజలు జరిపారు. పెద్దమ్మతల్లికి పంచామృతాభిషేకంపాల్వంచరూరల్: మండలంలోని శ్రీ కనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయంలో అమ్మవారికి పంచామృతాభిషేకం జరిపారు. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు అధిక సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. ఆలయంలోని మూలవిరాట్‌కు పంచామృతంతో అభిషేక పూజలు, పంచహారతులు, నివేదన, నీరాజనం, మంత్రపుష్పం పూజలతోపాటు కుంకుమ పూజ, గణపతిహోమం నిర్వహించారు. జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికకొత్తగూడెంఅర్బన్: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అన్నీ కేటగిరీల్లో కలిపి మొత్తం 50 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. శుక్రవారం డీఈఓ డి.వాసంతి వివరాలు వెల్లడించారు. వీరందరినీ శనివారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం క్లబ్లో సన్మానించనున్నారు. ఆహ్వాన కమిటీ చైర్మన్, కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగే వేడుకలకు రాష్ట్ర మంత్రులు హాజరవుతారని డీఈఓ తెలిపారు. కేటగిరీల వారీగా పీజీహెచ్ఎం/ఎంఈఓ కేటగిరీలో ఐదుగురు ఎంపికయ్యారు. ఎస్ఏ కేటగిరీలో 18 మంది, ఎస్జీటీ కేటగిరీలో 17 మంది, బెస్ట్ పెర్ఫార్మింగ్ ఎంప్లాయీస్ విభాగంలో 10 మందిని ఎంపిక చేశారు. ఇక రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపికైన ఉపాధ్యాయులకు హైదరాబాద్‌లో అవార్డులు అందజేసి సన్మానించనున్నారు. -
సైబర్మ్యూల్ గుట్టురట్టు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: కమీషన్‌కు ఆశపడి సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ, అక్రమ లావాదేవీలకు చేయూతగా నిలుస్తున్న వారి మ్యూల్ ఖాతాల గుట్టురట్టయింది. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీసీఎస్బీ) ఈ దందాను ఛేదించింది. ఖమ్మం జిల్లా పోలీసులతో పాటు 40 మంది పోలీసు అధికారులతో కూడిన 11 బృందాలు రెండు రోజులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాయి. తాజాగా ఇద్దరిని అరెస్టు చేసి వీరు తీసిన 10 మ్యూల్ ఖాతాలను గుర్తించారు. టీజీసీఎస్బీ ప్రత్యేక ఆపరేషన్‌లో 30 బ్యాంకు శాఖల్లో 121 మ్యూల్ ఖాతాలు, పెద్ద మొత్తంలో ఏటీఎం విత్‌డ్రాతో సంబంధం ఉన్న 273 ఖాతాలు ఉన్నట్లు తేలింది. అలాగే, రూ.20 వేల కన్నా ఎక్కువ మొత్తంలో చెక్కులు విత్‌డ్రా చేసిన 12 ఖాతాలు, 25 అనుమానిత ప్రాంతాలను గుర్తించారు. ఇవన్నీ రాష్ట్రంలోనే కాక దేశంలోని పలు సైబర్ నేరాలతో ముడిపడి ఉన్నట్లు తేలింది. వీటికి సంబంధించి రూ.7.84 కోట్ల లావాదేవీలు జరగగా.. అందులో రూ.6.23 కోట్లు వివాదాస్పద లావాదేవీలుగా గుర్తించారు. ఈ వివరాలను టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఎనిమిది స్టేషన్లలో 25 ఎఫ్ఐఆర్లు.. మ్యూల్ అకౌంట్లకు సంబంధించి జిల్లాలోని ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో 25 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. ఖమ్మం టూ టౌన్, ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లలో ఏడు చొప్పున, ఖమ్మం వన్ టౌన్లో నాలుగు, ఖమ్మం త్రీ టౌన్, ఖమ్మం రూరల్‌లో రెండేసి, కారేపల్లి, నేలకొండపల్లి, కామేపల్లి పోలీస్ స్టేషన్లలో ఒక్కో కేసు ఇందులో ఉన్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో టీజీసీఎస్బీ నిర్వహించిన ‘ఆపరేషన్ క్రాక్‌డౌన్ – 1.0’లో ఖమ్మం యూనిట్ పరిధి ఆరు బ్యాంకు శాఖల్లో 75 మ్యూల్ ఖాతాలను గుర్తించింది. వీటి ఆధారంగా 75 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 25 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో వ్యాపారులు, కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు, నిరుద్యోగులు, మాజీ సీఎస్బీ బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు. ఇతర రాష్ట్రాల నెట్‌వర్క్‌లపై ఆరా.. మ్యూల్ ఖాతాలు, ఏటీఎం, చెక్కు ఉపసంహరణలు, పరికరాలు, లబ్ధిదారులు, ఇతర లావాదేవీల వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నగదు ప్రవాహాన్ని గుర్తించడంతోపాటు ఖాతాలను నిర్వహించిన వ్యక్తులు, ఇతర రాష్ట్రాల్లోని సైబర్ నేర నెట్‌వర్క్‌లతో ఉన్న సంబంధాలను వెలికితీసేలా దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, కమీషన్ వస్తుందని ఇతరుల కోసం ఖాతాలు తెరవడం లేదా వివరాలు ఇవ్వడం చేయొద్దని టీజీసీఎస్బీ సూచించింది. ఖాతాలు, ఏటీఎం కార్డులు, పిన్, ఓటీపీ, ఇతర బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని పేర్కొంది. ఇలాంటి ఖాతాలను సైబర్ నేరాలకు ఉపయోగిస్తే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖా గోయల్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.జిల్లాకు చెందిన కొందరు తమ ఖాతాలను సైబర్ మోసాల ద్వారా వచ్చిన డబ్బు స్వీకరణ, బదిలీ కోసం మోసగాళ్లకు అందించినట్లు గతంలో నమోదైన కేసుల ద్వారా తెలిసింది. జిల్లాలోని వీఎం.బంజర, సత్తుపల్లి పోలీసుస్టేషన్లలో నమోదైన కేసుల్లో ఈ అంశాన్ని గుర్తించారు. ఖాతాలు ఇచ్చిన వారిలో వ్యాపారులు, కూలీలు, కార్మికులు, ప్రైవేట్ ఉద్యోగులు, నిరుద్యోగులు ఉండగా.. లావాదేవీలకు ఉపయోగించడంతో పాటు టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా విదేశాలకు చెందిన చైనా ఆపరేటర్లతో లింకులు ఉన్నట్లు తేలింది. ఈ ఆపరేటర్ల సమన్వయంతో అక్రమ ఆన్లైన్ గేమింగ్‌కు సంబంధించిన నగదు చెల్లింపుల స్వీకరణకు ఉపయోగించినట్లు గుర్తించారు. ఈ కేసులు టీజీసీఎస్బీకి బదిలీ కావడంతో జిల్లాపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈనెల 2, 3వ తేదీల్లో జిల్లాలోని పలు బ్యాంకు శాఖలు, ఏటీఎం కేంద్రాలు, అనుమానిత ప్రాంతాల్లో టీజీసీఎస్బీ ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. ఈ సందర్భంగా బడిస మురళీకృష్ణ, వడ్లమూడి సాయినివాస్‌ను అరెస్టు చేశారు. వీరు సైబర్ నేరాల లావాదేవీలకు మ్యూల్ ఖాతాలను సమకూర్చినట్లు గుర్తించారు. వీఎం.బంజర, సత్తుపల్లిలో నమోదైన కేసుల్లో గతంలోనే 52 మంది అరెస్టయ్యారు. 10 మ్యూల్ ఖాతాల గుర్తింపు సైబర్ దందా చేసే వాళ్లు మెసేజ్‌లు పంపి ఓటీపీ చెప్పమంటారు. అలాగే కమీషన్ల ఆశ చూపి బ్యాంకు ఖాతా వివరాలు అడుగుతారు. ఇలాంటి వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కమీషన్లకు ఆశపడి మ్యూల్ ఖాతాలు తెరిస్తే నేరాల్లో భాగమైనట్టే. తద్వారా చట్టరీత్యా చర్యలు ఉంటాయి. – సునీల్‌దత్, ఖమ్మం పోలీసు కమిషనర్ -
ప్రభుత్వాస్పత్రిలో ఒకే రోజు ఐదు ప్రసవాలు
అశ్వారావుపేటరూరల్: ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఒకే రోజు ఐదు ప్రసవాలు జరిగాయి. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధా రుక్మిణి శుక్రవారం వివరాలు వెల్లడించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి రోజు రాత్రి 9గంటలోపు ఐదుగురు గర్భిణులు పురిటి నొప్పులతో ఆస్పత్రిలో చేరారు. వీరిలో నలుగురు గర్భిణులకు సాధారణ ప్రసవాలు చేయగా, కాన్పు కష్టమైన మరో గర్భిణికి సిజేరియన్ చేసి శిశువు ప్రాణాలు కాపాడినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని పేర్కొన్నారు. మెరుగైన సేవలందిస్తున్న వైద్యులు, సిబ్బందిని పలువురు అభినందిస్తున్నారు. -
ప్రయోగాత్మక బోధనతో..
సామాన్యశాస్త్రం అంటే తొలి నుంచి నాకు భయంగా ఉండేది. కానీ విజయలక్ష్మి టీచర్ బోర్డుపై మంచిగా చిత్రాలు వేస్తూ గుర్తుండిపోయేలా పాఠాలు బోధిస్తారు. ప్రయోగాత్మకంగానూ వివరిస్తుండడంతో సబ్జెక్టుతో నానాటికీ ఆసక్తి పెరిగింది. – సనప సాయితేజ, 9వ తరగతి, 21పిట్ హైస్కూల్, ఇల్లెందు మా పాఠశాలలో ఇంగ్లిష్ టీచర్ బోధన అంటే ఇష్టం. ఆంగ్లంపై భయాన్ని పోగొట్టి, సులువుగా అర్థమయ్యేలా బోధిస్తారు. తెలుగుతో పాటు ఇంగ్లిష్ అవసరాన్ని వివరిస్తూ మాట్లాడేలా శిక్షణ ఇస్తున్నారు. దీంతో ఇంగ్లిష్‌పై ఇష్టం పెరిగింది. – సవలం నందిని, 10వ తరగతి, దమ్మపేట -
కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాఫ్
సూపర్‌బజార్(కొత్తగూడెం)/ఇల్లెందు: వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన అట్టర్ ప్లాఫ్ అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రుల ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అందిన కాడికి దోచుకుంటున్నారని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దశలవారీ ఆందోళనలలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ ధర్నాచౌక్‌లో వంటా వార్పు నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి భోజనాలు చేశారు. ఇల్లెందు జగదాంబా సెంటర్లోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట కూడా వాంటావార్పు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా హామీలు అమలు చేయడంలేదన్నారు. రైతులకు యూరియా కూడా ఇవ్వలేకపోతోందని అన్నారు. పట్టా భూములను కూడా నిషేధిత జాబితాలో పెట్టి అక్రమంగా డబ్బులు దండుకుంటున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి కనీసం జిల్లాకు సాగునీరు ఇవ్వలేకపోయిందని విమర్శించారు. బీసీ మహిళా మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేసి, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను అవమానించిందని ఆరోపించారు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వద్దిరాజు కొత్తగూడెం ప్రజలకు అండగా ఉంటారని, ప్రజాభీష్టం మేరకు రాబోయే ఎన్నికల్లో ఆయన్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్, కార్పొరేటర్లు సింధు తపస్వి, గుణ చరిత్, రాంబాబు, మధు చంద్, సాగర్, శ్రీవల్లి, వీరమ్మ, నాయకులు ఎండీ జాఫర్, శీలం రమేష్, ఎస్ రంగనాధ్, దేవీలాల్, సత్యనారాయణ, కిలారు నాగేశ్వరరావు, కొట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
నో చెబుతారు... ప్రశ్నిస్తారు !
2024–25 విద్యా సంవత్సరంలో గర్ల్ చైల్డ్, అడాలసెంట్ సేఫ్టీ క్లబ్ పేరుతో రాష్ట్రప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అయితే, భద్రాచలం బాలికోన్నత పాఠశాలలో 2018 నాటికే సేఫ్టీ క్లబ్ ఏర్పాటైంది. ప్రైవేట్ పాఠశాలల నుంచి విపరీతమైన పోటీ ఉన్నప్పుడు సైతం ఇక్కడ 500తగ్గకుండా బాలికలు చదువుకునేవారు. ఈక్రమాన పోకిరీల బారి నుంచి బాలికలు రక్షించుకునేలా అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ సహకారంతో ఇక్కడ సేఫ్టీ క్లబ్ ఏర్పాటు చేశారు. క్లబ్‌కు ప్రిన్సిపాల్ కన్వీనర్‌గా, ఒకరు లేదా అంతకు మించి ఉపాధ్యాయులు ఫ్రెండ్లీ టీచర్లుగా వ్యవహరిస్తారు. ప్రతీ తరగతి నుంచి ఇద్దరు విద్యార్థినులు సభ్యులుగా ఉంటారు. ప్రతీనెల సభ్యులు సమావేశమై బాలికలు ఎదుర్కొనే సమస్యలు – పరిష్కార మార్గాలు – ఆచరణపై చర్చిస్తారు. దాదాపు పదేళ్లుగా కొనసాగుతున్న ఈ క్లబ్ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాచలం పరిసర ప్రాంత బాలికలకు ఎంతో భరోసా కల్పించడమే కాక పంటి బిగువున భరిస్తున్న సమస్యలకు పరిష్కారం చూపింది. ఇబ్బందికర పరిస్థితుల్లో సర్దుకుపోయేందుకు బదులు సమస్యను ఎదిరించే తెగువను నేర్పిస్తోంది. ఎప్పుడు హుషారుగా ఉండే ఓ విద్యార్థిని తీరు అకస్మాత్తుగా మారడమే చదువులోనూ వెనుకబడింది. ఆ బాలిక ఇంట్లో తాత వయస్సు ఉన్న వ్యక్తి ప్రవర్తిస్తున్న తీరు అందుకు కారణమని తెలిసింది. ఇంట్లో అమ్మకు సైతం చెప్పుకోలేక, వృద్ధుడిని ఎదురించలేక నరకం చూసింది. చివరకు ఈ విషయం సేఫ్టీ క్లబ్ ద్వారా ఫ్రెండ్లీ టీచర్ దృష్టికి వెళ్లింది. దీంతో నెల పాటు విద్యార్థినికి దగ్గరైన ఉపాధ్యాయురాలు... విషయం బయటకు చెప్పించి ‘వద్దు.. నో’ అని చెప్పడంపై అవగాహన కల్పించారు. మూడు నెలల తర్వాత కౌన్సెలింగ్ ఫలించడంతో తప్పుడు పనులు చేసేందుకు ముందుకొచ్చిన ‘పెద్ద’ వ్యక్తి చేతులు వెనక్కి వెళ్లాయి. మళ్లీ మునుపటి చిరునవ్వు ఆ బాలిక మోముపై రావడంతో పదో తరగతి పూర్తి చేసి పైచదువుల్లో రాణిస్తోంది. బాలికలు పాఠశాలకు వెళ్లివచ్చే దారుల్లో పోకిరీలు తిష్ట వేస్తుంటారు. అసభ్యకరమైన కామెంట్లు చేయడం, మౌనంగా భరించడాన్ని ఆమోదంగా భావించి మరింత చొరవ చూపడం సాధారణమైపోయింది. ఇవన్నీ ఇంట్లో చెబితే బడి మాన్పిస్తారనే భయం, వెళ్లాలంటే పోకిరీల బెడద తట్టుకోవడం ఎలాగో తెలియక ఇబ్బంది పడ్డారు. ఈక్రమాన సేఫ్టీ క్లబ్ సభ్యులు, ఫ్రెండ్లీ టీచర్ల చొరవతో ఈవ్‌టీజింగ్ ఎదురైతే డయల్ 112, షీ టీమ్స్‌కు ఫోన్ చేసి చెప్పే ధైర్యం పెంచుకున్నారు. విద్యార్థులు ఏటా వార్షిక పరీక్షలు రాయడానికి ముందు జనవరి, ఫిబ్రవరిలో ఫ్రెండ్లీ టీచర్లకు పరీక్ష ఎదురవుతోంది. ప్రేమ పేరుతో వెంటపడే అబ్బాయిలు ఈ సమయాన బాలికలపై విపరీతమైన ఒత్తిడి తీసుకురావడమే ఇందుకు కారణం. విద్యార్థినుల దృష్టి మరల్చేందుకు పన్నాగాలు వేస్తుంటారు. ఈ సమయాన ఉపాధ్యాయినులు ప్రత్యేకంగా విద్యార్థినులను గమనిస్తూ ప్రలోభాల బారిన పడకుండా కాపాడడం మొదలుపెట్టారు.నిత్య జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను బయటకు చెప్పుకోలేక కొందరు విద్యార్థినులు సతమతం అవుతుంటారు. ఇలాంటి వారి కోసం పాఠశాలలో ‘సలహాల పెట్టె’ ఏర్పాటుచేశారు. విద్యార్థినులు తమ పేరు రాయకుండా సమస్య రాసి అందులో వేస్తే సరిపోతుంది. సేఫ్టీ క్లబ్ సభ్యులు ఈ పెట్టెలో ఉన్న లేఖలను పరిశీలించి సమస్యల పరిష్కారానికి పాటుపడుతుండడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.భద్రాచలం బాలికల హైస్కూల్లో ‘సేఫ్టీ క్లబ్’ ఏ పరీక్షలో మార్కులు ఎక్కువ వస్తే ఆ సబ్జెక్టు బోధించే గురువులకే గుర్తింపు ఎక్కువగా దక్కుతోంది. అయితే, పాఠ్యాంశాలే కాక నిత్యజీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునే తీరు నేర్పించే గురువులు కొందరే ఉంటారు. అడుగడుగునా సవాళ్లతో కూడిన జీవితం ఎదుర్కొనే బాలికలకు ఇది ప్రధాన అవసరం. అందుకే విద్యార్థి దశ నుంచే పాఠాలతో పాటు సమస్యలు పరిష్కరించుకునే నైపుణ్యాలు నేర్పేలా భద్రాచలం బాలికోన్నత పాఠశాలలో అమలుచేస్తున్న సేఫ్టీ క్లబ్ విధానం సత్ఫలితాలను ఇస్తోంది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం -
ఆదివాసీల చెంతకే ఉచిత న్యాయ సేవలు
టేకులపల్లి: సామాన్య, పేద ప్రజలకు న్యాయాన్ని మరింత చేరువ చేసేందుకు నల్సా 60 రోజుల మెగా డ్రైవ్‌లో భాగంగా టేకులపల్లి మండలం రోళ్లపాడు గ్రామంలో ‘విలేజ్ లీగల్ ఎయిడ్ క్లినిక్’(గ్రామ న్యాయ సహాయ కేంద్రం)ను ఏర్పాటు చేశారు. బుధవారం ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి ఎం.రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘న్యాయం పొందడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు‘అని స్పష్టం చేస్తూ, ఉచిత న్యాయ సలహాలు, సహాయం అందించడంలో ఈ కేంద్రాలు మైలురాయిగా నిలుస్తాయన్నారు. అనంతరం ఐటీడీఏ ఆధ్వర్యాన స్థానిక ప్రజల కోసం ఏర్పాటు చేసిన ‘గొర్రెల పెంపకం శిక్షణ యూనిట్’ను ప్రారంభించి వారి ఆర్థిక స్వావలంబనకు సరికొత్త బాటలు వేశారు. అనంతరం స్వయంగా గ్రామంలో పర్యటించి స్థానికుల సమస్యలపై ఆరా తీశారు. చట్టాలపై అవగాహనతో పాటు ఉపాధి మార్గాలను అన్వేషిస్తూ ముందుకు సాగాలని, చట్టపరమైన రక్షణ, ఆర్థిక ప్రోత్సాహం ఒకే వేదికపై లభించడం రోళ్లపాడు గ్రామ అభివృద్ధికి సరికొత్త మార్గం సుగమం చేసిందన్నారు. న్యాయ వ్యవస్థ, సంక్షేమ శాఖల భాగస్వామ్యంతో జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాఘవమ్మ, కార్యదర్శి రాజు, నాయకులు నాగరాజుతో పాటు ఐటీడీఏ సిబ్బంది, పారా లీగల్ వలంటీర్లు ఎన్.చరణ్‌కుమార్, బి.భారతి, పి.రాజకుమారి, సతీష్ ఖండేల్వాల్ పాల్గొన్నారు. -
అత్యవసర వేళ.. సత్వర వైద్యం
భద్రాచలంఅర్బన్: భద్రాచలం సరిహద్దు ఏపీలోని ఎటపాక మండలంలో అస్వస్థతకు గురైన చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చేరారు. మంగళవారం రాత్రి ఒకేసారి పెద్దసంఖ్యలో బాధితులు చేరడం, అత్యవసర పరిస్థితి ఎదురైనా వైద్యులు, నర్సులు, సిబ్బంది సత్వరం స్పందించి వైద్యసేవలు అందించారు. మొత్తం 80 మందిలో ఒకరు మృతి చెందగా, మిగిలిన వారిలో 13 మందికి మలేరియా పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం. కాగా, మంగళవారం సాయంత్రం 7గంటల వరకు ఆస్పత్రిలో కేవలం పది మంది సిబ్బంది మాత్రమే అందుబాటులో ఉండగా విషయం తెలిసి 50 – 60 మంది వరకు వైద్య బృందం చేరుకుని సమన్వయంతో పనిచేశారు. తీవ్ర ఆందోళన చెందిన చిన్నారుల తల్లిదండ్రులకు ధైర్యం చెబుతూ, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స చేస్తున్నారు. అధికారుల ప్రశంసలు.. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు ఆస్పత్రిలో వైద్య సేవలపై ఆరా తీసేందుకు రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పోలవరం కలెక్టర్ దినేష్‌తో పాటు ఇతర అధికారులు బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రిని సందర్శించారు. అత్యవసర సమయంలో భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందించిన సేవలను కలెక్టర్ దినేష్ అభినందించారు. ఆస్పత్రికి అవసరమైన మందుల జాబితాను అందిస్తే వాటిని సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పినట్లు తెలిసింది. అలాగే, మంగళవారం రాత్రి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు, వారి కుటుంబ సభ్యులకు స్థానికులు, ఆస్పత్రి నిర్వాహకుల సమన్వయంతో భోజన ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రుల హర్షం.. ఒకేసారి 80 మంది ఆస్పత్రిలో చేరినా క్లిష్ట పరిస్థితుల్లో పరిమిత సిబ్బందితో ప్రారంభమైన వైద్య సేవలు కొద్ది గంటల్లోనే అత్యవసర స్పందనగా మారింది. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది సమష్టి కృషితో తమ పిల్లలకు అండగా నిలిచి చికిత్స అందించడంపై తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. అస్వస్థతతో వచ్చిన ఏపీ వాసులు 80 మంది -
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం ఈశ్వరమాదారం, పాలేరులో మంత్రి పర్యటిస్తారు. అలాగే, కూసుమంచిలో జీపీ భవన నిర్మాణానికి, 11 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ 22వ వార్డులో గిరిజన బాలుర వసతిగృహ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆతర్వాత ఖమ్మంలో ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ప్రారంభిస్తారు. అనంతరం మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో సమీక్షించనున్న మంత్రి, సాయంత్రం ములకలపల్లి మండలం చౌటిగూడెంలో ఇటీవల హత్యకు గురైన నర్స్ కుటుంబాన్ని పరామర్శిస్తారు. సీజనల్ వ్యాధుల కట్టడికి ముందస్తు చర్యలు భద్రాచలంఅర్బన్: వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో డెంగీ, మలేరియా, వైరల్ జ్వరాల వ్యాప్తికి అవకాశం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్ ఆదేశించారు. భద్రాచలం ఐటీడీఏలో బుధవారం అధికారులతో ఆయన పలు అంశాలపై సమీక్షించారు. సమస్యాత్మక గ్రామాల్లో తొలి విడత ఇంటీరియర్ రెసిడ్యువల్ స్ప్రే నిర్వహించి, 30 రోజుల వ్యవధిలో రెండోసారి చేపట్టాలని తెలిపారు. ఆర్డీటీ పరీక్షల్లో మలేరియా పాజిటివ్‌గా తేలిన కేసులకు తప్పనిసరిగా రక్త నమూనాలు సేకరించి జిల్లా, రాష్ట్రస్థాయి ప్రయోగశాలలకు పంపాలని చెప్పారు. అలాగే, పోషకాహార వారోత్సవాలు, నేత్రదాన పక్షోత్సవాల నిర్వహణపై సూచనలు చేశారు. వివిధ విభాగాల అధికారులు సైదులు, శ్రీధర్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. విత్తనోత్పత్తికి రైతులు ముందుకు రావాలి బూర్గంపాడు: క్షేత్రస్థాయిలో విత్తన ఉత్పత్తికి రైతులు ముందుకు రావాలని కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ భరత్ సూచించారు. బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు, సంజీవరెడ్డిపాలెం గ్రామాల్లో తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాబార్డు, పీఏసీఎస్ సంయుక్త ఆధ్వర్యాన నిర్వహిస్తున్న సీడ్ ఉత్పత్తి రైతు క్షేత్రాలను బుధవారం శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ రైతులు మేలైన విత్తనాలను ఎంపిక చేసుకుని స్థానిక అవసరాలకు తగినట్లుగా పండించాలన్నారు. అంతేకాక సొంతంగా విత్తనోత్పత్తితో అధిక లాభాలను సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు గాదె వెంకటేశ్వరరెడ్డి, మేకల నర్సింహారావు, కైపు రోశిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో నర్స్ మృతి
భద్రాచలంఅర్బన్: హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న నర్స్(25) అనుమానాస్పద స్థితిల్లో మృతి చెందింది. భద్రాచలానికి చెందిన ఆమె నర్సింగ్ పూర్తి చేశాక హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ వైద్యుడి వద్ద పనిచేస్తోంది. బుధవారం ఉదయం కుటుంబ సభ్యులతో మాట్లాడిన ఆమెను 10–30 గంటల సమయాన ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తున్నామని కుటుంబ సభ్యులకు సమాచారం అందినట్లు తెలిసింది. ఆతర్వాత అరగంటకే మృతి చెందినట్లు సమాచారం చేరింది. యువతి ఏదో ఇంజక్షన్ చేసుకుందని తెలుస్తుండగా కుటుంబీకులు హైదరాబాద్ వెళ్లారు. కాగా, ఆస్పత్రికి తరలించిన సమయంలో ఆమెకు తీవ్ర జ్వరం, ఛాతినొప్పి ఉన్నాయని, చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందినట్లు తెలిసింది. తొలుత ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరగగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అత్తారింటికి వెళ్తూ అనంతలోకాలకు..ట్రాక్టర్ ఢీకొని ఒకరు దుర్మరణం అశ్వారావుపేటరూరల్: అత్తారింటికి వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం రాత్రి అశ్వారావుపేట మండలంలో జరిగింది. ఎస్ఐ టి.యయాతీ రాజు కథనం ప్రకారం.. ఏపీలోని జీలుగుమిల్లి మండలం రామచంద్రాపురం గ్రామానికి చెందిన దాబా మంగబాబు(30) ద్విచక్రవాహనంపై కొల్లూరిగూడెంలోని అత్తారింటికి వెళ్తున్నాడు. ఈక్రమాన అశ్వారావుపేట మండలం కన్నాయిగూడెం శివారుల మూలమలుపు వద్ద ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మంగబాబుకు తీవ్ర గాయాలు కాగా అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య సంధ్య ,ఇద్దరు సంతానం ఉన్నారు. ఘటనపై మంగబాబు భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గోవులు తరలిస్తున్న కంటైనర్ పట్టివేతదమ్మపేట: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఆవులతో వెళ్తున్న కంటైనర్ లారీని పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. భాగ్యనగర్ గో సంరక్షణ సమితి వారి సమాచారం మేరకు పోలీసులు మండలంలోని మందలపల్లి క్రాస్ రోడ్డు వద్ద గోవులతో వెళ్తున్న కంటైనర్ లారీను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పరిశీలించగా.. 90 ఆవులు ఒకదానిని మరొ కటి కనిపించాయి. దీంతో ఆవులను ఏపీలోని నూజి వీడు సమీపంలోని గోశాలకు తరలించి, అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కేసు నమోదు చేశామని ఎస్సై రాజేష్ కుమార్ తెలిపారు. -
విద్యార్థుల ఆరోగ్యంపై అశ్రద్ధ చేయొద్దు
పాల్వంచరూరల్: ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ, వారి ఆరోగ్యంపై అశ్రద్ధ చేయకుండా పర్యవేక్షించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశించారు. పాల్వంచ మండలం ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లిలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం తనిఖీ చేసిన ఆయన బోధన, మెనూను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశాక మాట్లాడారు. కూరల్లో కారం ఘాటు తగ్గించాలని హెచ్ఎంకు సూచించి, రాత్రి వేళ పిల్లలు బయటకు వెళ్లకుండా ఏఎన్ఎంలు పర్యవేక్షించాలన్నారు. అలాగే, ఉద్దీపకం వర్క్‌బుక్‌ల ద్వారా బోధన, ఇతర అంశాలపై సూచనలు చేశారు. ఏటీడీఓ చంద్రమోహన్, ఎస్సీఆర్ హిరాలాల్, హెచ్ఎం విజయలక్ష్మి, సర్పంచ్ వజ్జ లలిత, ఉప సర్పంచ్ రాంబాబు ఉన్నారు. పోటీ పరీక్షల్లో రాణించేందుకే ‘వారధి’ భద్రాచలంటౌన్: గిరిజన విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతోనే ‘వారధి’ పుస్తకాన్ని రూపొందించినట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. బీఈడీ కళాశాలలో ఇంగ్లిష్, గణితం ఉపాధ్యాయులకు బుధవారం నిర్వహించిన శిక్షణకు ఆయన హాజరైన ఆయన పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. విద్యార్థుల కోసం వారానికి మూడు‘వారధి’ తరగతులు నిర్వహించాలని సూచించారు. భద్రాచలంలోని యువజన శిక్షణ కేంద్రం (వైటీసీ) ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 74 మంది యువత ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వైటీసీలో ఐటీ హెల్ప్‌డెస్క్, సాఫ్ట్వేర్ డెవలపర్ కోర్సుల్లో శిక్షణ పొందిన వారిలో 40మంది రిజల్యూట్ స్కైక్వాడ్ ఎలక్ట్రానిక్స్‌కు, 34మంది ఫాక్స్కాన్కంపెనీకి ఎంపిక కాగా పీఓ రాహుల్ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీడీ చందన, ఈఈ మధుకర్, ఏసీఎంవోలు రమేష్, రాములు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఏపీవో డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ, డీడీ చందన, ఈఈ మధుకర్, వైటీసీ మేనేజర్ శ్రీను, ఏసీఎంఓలు రమేష్, రాములు పాల్గొన్నారు. ఐటీడీఏ పీఓ రాహుల్ -
తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష
సూపర్‌బజార్(కొత్తగూడెం): తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. కాంగ్రెస్ వెయ్యిరోజుల పాలనలో హామీలు అమలు చేయలేదని ఆరోపిస్తూ జిల్లా కేంద్రంలోని సూపర్‌బజార్ సెంటర్లో బుధవారం బీఆర్ఎస్ ఆధ్వర్యాన నిర్వహించిన నిరసనలో ఎంపీ రవిచంద్ర మాట్లాడారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే కుట్రతో అబద్దాల పునాదులపై కాంగ్రెస్ నోటికొచ్చిన హామీలిచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలు, 432 హామీలు, 13 డిక్లరేషన్ల పేరుతో ప్రజలను దగా చేశారని విమర్శించారు. రైతన్నలకు రూ.2 లక్షల చొప్పున రూ.49వేల కోట్లు రుణమాఫీ చేస్తామని చివరకు రూ.18వేల కోట్లు మాత్రమే చేసిందన్నారు. రైతుభరోసా పేరిట ఎకరాకు రూ.15 వేల చొప్పున ఇస్తామని చెప్పి మాట మార్చిందని మండిపట్టారు. అంతేకాక ప్రభుత్వం రైతుబీమా ఎగ్గొట్టిందని, కౌలు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని, సాగునీళ్లు లేవంటే వరద నీళ్లను కిందకు వదిలిపెడుతూ సీఎం రేవంత్‌రెడ్డి తన గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని, ప్రజలంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఉద్యోగులకు పీఆర్సీ లేదని, ఆరు డీఏలు లేవని, ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాక నిరుద్యోగ యువత, ఫీజుల బకాయిలు అందక విద్యార్థులు, ఇస్తామన్న సాయం అందక ఆటో డ్రైవర్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయకపోవడంతో మహిళలు పాలకులపై మండిపడుతున్నారని వివరించారు. రేవంత్‌రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను తిడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని ఆ రెండు పార్టీల నాయకులు అధికారంలో లేని బీఆర్ఎస్ను అణచివేయాలని కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ముచ్చటగా మూడోవసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని అన్నారు. కాగా, కొత్తగూడెం రైల్వేస్టేషన్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి, కాంగ్రెస్ హామీలతో కూడిన 420 మీటర్ల భారీ బ్యానర్‌ను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ దామోదర్‌తో పాటు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. నిరసనలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర -
సైబర్ మోసాల బారిన పడొద్దు..
ఎస్పీ రోహిత్ రాజు జూలూరుపాడు(సుజాతనగర్): విద్యార్థులు అప్రమత్తంగా ఉంటూ సైబర్ మోసాల బారిన పడొద్దని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. సుజాతనగర్ మండలం వేపలగడ్డలోని అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ సైబర్ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. డిజిటల్ అరెస్ట్, పెట్టుబడులపై లాభాలు వంటి ప్రకటనలు వస్తే నమ్మొద్దని సూచించారు. అంతేకాక సోషల్ మీడియాలో పరిచయం లేని వ్యక్తులతో చాటింగ్ చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వల్ల ఇబ్బందులు వస్తయని తెలిపారు. కాగా, సైబర్ మోసాలకు గురైతే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అంతేకాక డ్రగ్స్ అలవాటు చేసుకుని విలువైన జీవితాలను కోల్పోవద్దని ఎస్పీ హితవు పలికారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించగా.. సైబర్ నేరాలు, సోషల్ మీడియా, డ్రగ్స్, పోక్సో కేసులు, వ్యక్తిగత భద్రత అంశాలపై సమాధానాలు ఇచ్చారు. అనంతరం సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యాన రూపొందించిన క్యాలెండర్లను ఆవి ష్కరించారు. కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ, సీఐ ఆర్.వెంకటేశ్వర్లు, ఎస్సైలు రమణారెడ్డి, జుబేదాబేగం, కల్యాణి, రమాదేవి పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి అడ్లూరి పర్యటన రద్దు భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏలో ఈనెల 5వ తేదీన జరగాల్సిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ పర్యటన రద్దయింది. మంత్రి ఐటీడీఏను సందర్శించి ఉమ్మడి జిల్లా అధికారులతో సమీక్షిస్తారని తొలుత షెడ్యూల్ వెల్లడించి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే ఆయన పర్యటన రద్దయినట్లు బుధవారం సమాచారం అందింది. నానో వినియోగంతో మరింత ప్రయోజనం ఇల్లెందురూరల్: నానో యూరియా, డీఏపీ విని యోగంతో రైతులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుతాయని జిల్లా వ్యవసాయశాఖ అధికా రి బాబూరావు అన్నారు. మండలంలోని బొజ్జాయిగూడెం గ్రామంలో నానో యూరియా, డీఏపీ ద్రవరూప ఎరువును డ్రోన్ ద్వారా పిచి కారీ చేసే విధానంపై వ్యవసాయశాఖ ఆధ్వర్యాన బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. ప్రస్తుత ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల్లో యూరియా, డీఏపీ, పొటాష్ ఎరువులు వేయలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రత్యామ్నాయంగా ద్రవరూపంలోని నానో యూరియా, డీఏపీ పిచికారీకి డ్రోన్ వాడకం వల్ల సమయం ఆదా అవుతుందని, కూలీల కొరతను కూడా అధిగమించవచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అరెం ప్రియాంక, ఉపసర్పంచ్ అరెం కిరణ్, పీఏసీఎస్ చైర్మన్ మెట్టెల కృష్ణ, ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ జిల్లా అధ్యక్షుడు సోమసుందర్, ఉపాధ్యక్షుడు రామలింగయ్య, వ్యామసాని జనార్థన్, నారాయణదాస్ లాహో టి, ఏడీఏ లాల్‌చంద్, ఏవో సతీష్, టెక్నికల్ ఏఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడం గర్హనీయంములకలపల్లి: హైదరాబాద్‌లో నర్స్ అత్యాచారం, హత్య ఘటనపై హోం మంత్రిత్వ శాఖ చూస్తున్నసీఎం రేవంత్‌రెడ్డి స్పందించకపోవడం గర్హనీయమని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మండిపడ్డారు. ములకలపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన నర్సు కుటుంబాన్ని బుధవారం ఆయన పరామర్శించి, మాట్లాడారు. ఘటనపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా సత్వర విచారణ జరిపించి, ఆరు నెలల్లోగా నిందితులను కఠిన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి రూ.50 వేల నగదు సాయం అందజేశారు. కాగా, బాధిత కుటుంబంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో మాట్లాడారు. గటనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని, కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, సర్పంచ్ తానం పద్మ, నాయకులు ఉప్పల వెంకటరమణ, ఒగ్గెల పూజ, మోరంపూడి అప్పారావు, తాండ్ర రాంబాబు, పుష్పాల చందర్రావు తదితరులు పాల్గొన్నారు. ●కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు హైదరాబాద్‌లో నర్స్‌గా పనిచేస్తున్న గిరిజన యువతి దారుణ హత్య ఘటన బాధాకరమని జనసేన నాయకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి రూ.20వేల ఆర్థిక సాయం అందజేసి ఆయన మాట్లాడారు. నాయకులు తాటికొండ ప్రవీణ్, గరికె రాంబాబు పాల్గొన్నారు. -
ఆర్టీసీకి గిరాఖీ..
● ఆరు రోజుల్లో రూ.11.07 కోట్ల ఆదాయం ● 3,834 బస్సులు.. 17.15 లక్షల కిలోమీటర్ల ప్రయాణం ● 472 ప్రత్యేక సర్వీసులతో రూ.1.81 కోట్ల రాబడి ● రక్షాబంధన్ రోజు 109 శాతం ఓఆర్, రూ.2.31 కోట్ల ఆదాయంఖమ్మంమయూరిసెంటర్: రాఖీ పండుగ.. వరుస సెలవులు టీజీఎస్ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించాయి. సోదరులకు రాఖీలు కట్టేందుకు పల్లెలకు బయలుదేరిన మహిళలు పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను ఆశ్రయించారు. దీంతో గత నెల 26 నుంచి 31వ తేదీ వరకు బస్సుల్లో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగింది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేసి సాధారణ సర్వీసులతో పాటు ప్రత్యేక బస్సులను నడిపారు. రాఖీ రోజున 109 శాతం ఓఆర్.. రక్షాబంధన్ పండుగ రోజైన గత నెల 28న ప్రయాణికుల రద్దీ మరింత పెరిగింది. ఈ సందర్భంగా ఖమ్మం రీజియన్‌లో 697 సర్వీసులను నడిపారు. బస్సులు 109 శాతం ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) సాధించగా.. ఒక్కరోజులోనే రూ.2,31,19,114 ఆదాయం సమకూరింది. ఆదివారం అదే జోరు.. రాఖీ పండుగ అనంతరం వచ్చిన ఆదివారం కూడా ఆర్టీసీ బస్సులకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాలు, ప్రాంతాల నుంచి ఉమ్మడి జిల్లాకు వచ్చిన వారు తిరుగు పయనమయ్యారు. గత నెల 31న 712 సర్వీసులను అధికారులు నడిపారు. ఈ సర్వీసుల్లో 100 శాతం ఓఆర్ నమోదై.. ఆ రోజున సంస్థకు రూ.2,24,68,253 ఆదాయం వచ్చింది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా.. రాఖీ పండుగతో పాటు వారాంతపు సెలవులు రావడంతో ప్రయాణికుల రద్దీ ఉంటుందని ముందుగానే అంచనా వేశారు. రీజినల్ మేనేజర్ ఎ.సరిరామ్ నేతృత్వాన అధికారులు సాధారణ సర్వీసులకు అదనంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచడంతో ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు సౌకర్యవంతంగా చేరుకున్నారు. ప్రయాణికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడంతో పాటు సంస్థకు గణనీయమైన ఆదాయం సమకూరింది. ఖమ్మం రీజియన్‌లో ఏడు డిపోల పరిధిలో ఆరు రోజుల పాటు మొత్తం 3,834 బస్సు సర్వీసులను అధికారులు నడిపించారు. ఈ బస్సులు 17,15,503 కిలోమీటర్లు ప్రయాణించి మొత్తం రూ.11,07,96,505 ఆదాయం సమకూర్చాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా 472 ప్రత్యేక సర్వీసులు నడపగా.. వీటి ద్వారా రూ.1,81,74,894 ఆదాయం వచ్చింది. -
●ఇక్కడ నో అడ్మిషన్స్..!
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు ఎప్పుడైనా దొరుకుతాయనుకుంటే పొరపాటే.. సీట్లు లేవని చెప్పినా అదే పాఠశాలలకు రావడంతో చివరకు స్కూల్ గేటుకు ‘నో అడ్మిషన్’బోర్డు పెట్టాల్సి వచ్చింది. ఇదెక్కడో కాదండి పాల్వంచ పట్టణం కేటీపీఎస్ కాలనీలోని ప్రభుత్వ పీఎంశ్రీ జిల్లా పరిషత్ అభ్యుదయ బాలికోన్నత హైస్కూల్లోనే. ఈ విద్యాసంవత్సరంలో 6 నుంచి 10వ తరగతుల్లో 587 మంది విద్యార్థినులకు గాను 603 మంది చేరారు. గతేడాది కేవలం 533 మంది మాత్రమే ఉండగా.. ఈసారి పోటీపడి చేరడంతో తరగతి గదులన్నీ నిండిపోయాయి. వరండాలో కూర్చోబెట్టి మరీ చదువులు చెప్పించాల్సి వస్తోందని, అందుకే నో అడ్మిషన్ బోర్డు పెట్టినట్లు హెచ్ఎం రమాదేవి తెలిపారు. – పాల్వంచరూరల్ -
40 కేజీల గంజాయి స్వాధీనం
అశ్వాపురం: మండల పరిధిలోని గొల్లగూడెంలో సీతారామ ప్రాజెక్ట్ కెనాల్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా కారులో తరలిస్తున్న 40.560 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. గత నెల 30న ఒడిశా రాష్ట్రంలోని కలిమెల నుంచి భద్రాచలం, మణుగూరు, ఏటూరునాగారం మీదుగా షిర్డీకి టాటా నెక్సాన్ కారులో భార్యాభర్తలు గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు అశ్వాపురం ఎస్ఐ రాజేష్ తన సిబ్బందితో గొల్లగూడెం గ్రామ శివారులోని సీతారాం కెనాల్ బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారన్నారు. ఈ క్రమంలో ఓడీ 30ఈ 0342 నంబర్ గల టాటా నెక్సాన్ కారు ను ఆపి తనిఖీ చేయగా కారులో తరలిస్తున్న 40.560 కిలోల గంజాయి పట్టుబడిందని, దీని విలువ సుమారు రూ.20లక్షలు ఉంటుందన్నారు. గంజాయిని తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఒడిశా రాష్ట్రంలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెలకు చెందిన అరబిందో బిశ్వాస్ అతని భార్య సుప్రియ బిశ్వాస్‌లు కలిమెలలోని సాలబాగ్ గ్రామానికి చెందిన హరిశ్చంద్ర మిసీ్త్ర, సుశాంత్ మండల్ వద్ద గంజాయిని తీసుకుని షిర్డీలోని రోహిత్ యాబిన్ అనే వ్యక్తికి సరఫరా చేసేందుకు వెళ్తున్నట్లు అంగీకరిచారన్నారు. ఈ ఘటనపై ఎస్ఐ రాజేష్ ఫిర్యాదు మేరకు ఇన్స్పెక్టర్ ఎల్లయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి రవాణా, విక్రయాలు, వినియోగానికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, గంజాయి, ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలు పోలీస్ శాఖకు సహరించాలని కోరారు. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ -
పత్తికి.. పక్కా ప్లాన్!
ఖమ్మంవ్యవసాయం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధమైంది. మున్నెన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం సెప్టెంబర్ నుంచే కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈక్రమాన కేంద్ర ప్రభుత్వం రూ.8,667ల మద్దతు ధరతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వారా పత్తి కొనుగోళ్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గతంలో మాదిరిగా వ్యవసాయ మార్కెట్లను సీసీఐ కేంద్రంగా చేసి, ఆయా మార్కెట్ల పరిధిలోని జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తిని కొనుగోలు చేయాలని నిర్ణయించారు. జిన్నింగ్ మిల్లులు పత్తి కొనుగోలుకు టెండర్లు వేసిన తరువాత, సీసీఐ అంగీకారంతో అందించే నివేదికల ఆధారంగా కలెక్టర్ జిన్నింగ్ మిల్లులకు అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. అందుబాటులో తొమ్మిది మార్కెట్లు.. పత్తి సాగు చేసే ప్రాంతాల ఆధారంగా రైతులకు అందుబాటులో ఉండేలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొమ్మిది వ్యవసాయ మార్కెట్ల పరిధిలో పత్తి కొనుగోళ్లకు నిర్ణయించారు. ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మద్దులపల్లి, మధిర, వైరా వ్యవసాయ మార్కెట్లతో పాటు ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలో కూడా పత్తి కొనుగోళ్లు చేయనున్నారు. నేలకొండపల్లి వ్యవసా య మార్కెట్ పరిధిలో ఉన్న ముదిగొండ మండలా న్ని మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ పరిధిలోకి చేర్చి ఆ మండలంలోని జిన్నింగ్ మిల్లు నుంచి పత్తి కొనుగోళ్లకు నిర్ణయించారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, ఇల్లెందు వ్యవసాయ మార్కెట్ల పరిధిలోని ఆరు జిన్నింగ్ మిల్లుల్లో పత్తి కొనుగోళ్లు చేయనున్నారు. గత ఏడాది నాలుగు జిన్నింగ్ మిల్లుల్లో నిర్వహించిన కొనుగోళ్లు ఈ ఏడాది మరో రెండు మిల్లుల్లో చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. కపాస్ కిసాన్ యాప్‌తోనే.. పత్తి విక్రయాల్లో గత ఏడాది అవలంబించిన కపాస్ కిసాన్ యాప్ ద్వారానే ఈ ఏడాది కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులు యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకొని పత్తిని విక్రయించుకోవచ్చు. విక్రయాల్లో ఏదైనా సమస్యలు తలెత్తితే సహాయ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5779, వాట్సాప్ చాట్ బాట్ నంబర్ 88972 81111ను కూడా అందుబాటులో ఉంచారు. కొనుగోలు కేంద్రాల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలనూ ఏర్పాటు చేస్తున్నారు. 4.71 లక్షల ఎకరాల్లో సాగు.. ఈ ఏడాది జూన్‌లో కురిసిన వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతులు మెట్ట పంటగా 4,71,085 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. ఇందులో ఖమ్మం జిల్లాలో 2,34,566 ఎకరాలు, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2,36,515 ఎకరాల్లో సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, చింతకాని, కొణిజర్ల, బోనకల్, ముదిగొండ, కారేపల్లి, కామేపల్లి, ఏన్కూ రు, వైరా, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ మండలాల్లో సాగు చేయగా, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం, సుజాతనగర్, టేకులపల్లి, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ, ఇల్లెందు, గుండాల, పినపాక, మణుగూరు, అశ్వాపురం తదితర మండలాల్లో పత్తిని సాగు చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా పత్తి సాగు విస్తీర్ణం తగ్గింది. వ్యవసాయ మార్కెట్ జిన్నింగ్ మిల్లు ఖమ్మం జీఆర్ఆర్ ఇండస్ట్రీస్ వెంకటగిరి, ఖమ్మం రూరల్ మండలం శ్రీ సాయిబాలాజీ జన్నింగ్ అండ్ ఆయిల్ మిల్ తల్లంపాడు, ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీ, గోలితండా, తిరుమలాయపాలెం మండలం జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్స్, పొన్నెకల్లు మధిర మంజీర కాటన్ లిమిటెడ్, మాటూరు కనకదుర్గా కాటన్ ఇండస్ట్రీస్, మధిర శ్రీ శివ గణేష్ కాటన్ ఇండస్ట్రీస్, ఇల్లెందులపాడు వైరా స్టాప్లరిచ్ జిన్నింగ్ ఇండస్ట్రీస్, తల్లాడ మత్కేపల్లి శ్రీ లీల కాటన్ ఇండస్ట్రీ, ముదిగొండ కొత్తగూడెం మంజిత్ కాటన్ జిన్నింగ్ మిల్, సుజాత్‌నగర్ బూర్గంపాడు అనుశ్రీ ఇండస్ట్రీస్, బూర్గంపాడు శ్రీలక్ష్మీనరసింహా కాటన్ ఇండస్ట్రీ, బూర్గంపాడు రమేష్, కాటన్ ఇండస్ట్రీస్, బూర్గంపాడు భద్రాచలం శ్రీరామా కాటన్ జిన్నింగ్ మిల్, అశ్వాపురం ఇల్లెందు శ్రీలక్ష్మీప్రియ కాటెక్స్ జిన్నింగ్ మిల్, కారేపల్లి సెప్టెంబర్ నుంచే కొనుగోళ్లకు రెడీ.. జిల్లాలో పత్తి సాగు విస్తీర్ణానికి అనుకూలంగా, పంట పడించే ప్రాంతాలకు అనువుగా సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. జిన్నింగ్ మిల్లుల ద్వారా పత్తి కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే ముందస్తు కొనుగోళ్లు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. – రత్నం సతోష్కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి -
పత్తికి.. పక్కా ప్లాన్ !
ప్రస్తుతం పత్తి పూత, కాత దశలో ఉండడంతో పంట చేతికి రాగానే కొనుగోలు చేసేలా అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.క్లోరోక్విన్ మాత్రలు తీసుకుని అస్వస్థతకు గురైన వారు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి వచ్చినా సకాలంలో వైద్యం అందించిన భద్రాచలం ఏరియా ఆస్పత్రి వైద్యులు, సిబ్బందిని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ఈ మేరకు బుధవారం ఆయన కార్యాలయం నుంచి ‘ఎక్స్’ వేదికగా ప్రకటన జారీ చేశారు. చిన్నారులు, పెద్దలను గొల్లగుప్ప నుంచి ఆస్పత్రికి తరలించగా, వైద్య బృందం వెంటనే స్పందించి మెరుగైన చికిత్స అందించిందని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ అత్యవసర, నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. -
ఉరి వేసుకుని ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
మూసాపేట: ఓ వ్యక్తి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన కూకట్పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంకు చెందిన ములుగురి రమేష్(40)కు రాధికతో ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. కూకట్పల్లి దేవీనగర్‌లోని భాస్కర ప్యాలెస్‌లో నివాసం ఉంటూ ఐటీ ఉద్యోగిగా ఆయన పనిచేస్తున్నాడు. ఈనెల 1వ తేదీన రాధిక పుట్టిన రోజు సందర్భంగా ఆమె అక్క, తమ్ము డు వచ్చారు. ట్యాంక్ బండ్‌కు వెళ్దామని అడగగా రమేష్ రానని చెప్పడంతో మిగతా వారు వెళ్లారు. అర్ధరాత్రి రాత్రి 12:30కు భార్య రాధికకు ‘పారపాటు జరిగింది సారీ గుడ్ బై’అని మెసేజ్ పెట్టడంతో ఇంటికి వచ్చి చూడగా అప్పటికే రమేష్ చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో యువకుడి ఆత్మహత్య బూర్గంపాడు: సారపాకకు చెందిన కొండేటి సాయి(30) అప్పుల బాధతో మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయాన పురుగు మందు తాగాడు. అపస్మారక స్థితికి చేరిన ఆయనను కాసేపటికి గుర్తించిన కుటుంబీకులు భద్రాచలం ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించగా బుధవారం మధ్యాహ్నం మృతిచెందాడు. ఘటనపై ఆన తల్లి నాగమణి ఫిర్యాదుతో కేసు నమోద చేసినట్లు ఎస్ఐ మేడా ప్రసాద్ తెలిపారు. మైనర్‌కు పెళ్లి.. నలుగురిపై కేసు భద్రాచలంఅర్బన్: మైనర్ పెళ్లి ఘటనలో నలుగురిపై భద్రాచలం టౌన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. భద్రాచలం పట్టణంలోని కేసీఆర్ కాలనీకి చెందిన 17 ఏళ్ల బాలికకు వివాహం జరిపించారు. ఈక్రమాన ఐసీడీఎస్ అధికారులు పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో భద్రాచలం టౌన్ పోలీసులు ఆ పెళ్లికి సహకరించిన వరుడితో సహా నలుగురిపై కేసు నమోదు చేశారు. -
రాములోరి ఆలయ పనుల పై దృష్టి
● రేపు పరిశీలించనున్న మంత్రి పొంగులేటి ● 7న ఆంజనేయస్వామి కళావాహణభద్రాచలం: భద్రాచలంలోని శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పరిశీలించనున్నారు. దేవస్థానంలో ఇప్పటికే దక్షిణ, పడమర, ఉత్తర మెట్లను తొలగించి పనులను చేపడుతుండగా.. ఉత్తర దిక్కున ముక్కోటి నాటికి ఉత్తర ద్వారాన్ని సిద్ధం చేసేందుకు పనుల్లో వేగం పెంచారు. అలాగే,పడమర దిక్కున ఉన్న శ్రీ అభయాంజనేయస్వామి ఉపాలయాన్ని సైతం పునఃనిర్మించనున్నారు. తొలుత ప్లాన్‌లో ఈ ఉపాలయం లేనప్పటికీ తాజాగా దీనిని చేర్చారు. దీంతో స్వామి వారి విగ్రహాలను తొలగించేందుకు ఈ నెల 7వ తేదీన కళావాహన జరపనున్నారు. కాగా, మంత్రి పొంగులేటి పర్యటించనున్న నేపథ్యాన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ బుధవారం ఆలయ పరిసరాలను పరిశీలించి పనుల పురోగతిపై ఆరా తీశారు. నాణ్యతతో, భక్తులు మెచ్చేలా పనులు జరగాలని నిర్మాణ సంస్థ బాధ్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ దామోదర్‌రావు, ఈఈ రవీందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కమనీయంగా రామయ్య కల్యాణం.. దేవస్థానంలో బుధవారం రామయ్య కల్యాణం కమనీయంగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజల అనంతరం నిత్య కల్యాణానికై బేడా మండపంలో కొలువుదీరిన స్వామి వారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవేత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణమహోత్సవాన్ని శాస్త్రోక్తంగా, సంప్రదాయబద్ధంగా జరిపారు. భక్తులు ఆర్జిత సేవల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. -
పశువైద్యం అంతంతే!
● పశుసంవర్థక శాఖలో భర్తీకి నోచుకోని ఖాళీలు ● 219 పోస్టులకు 156 మంది అధికారులు, సిబ్బంది ● 63 ఖాళీలు నింపకుండా కాలయాపన ● అందుబాటులోలేని పాముకాటు మందులు పాల్వంచరూరల్: జిల్లా పశువైద్యశాఖలో ఖాళీ పోస్టులను భర్తీ చేయకపోవడంతో పశువులకు వైద్యం సేవలు పూర్తిస్థాయిలో అందడంలేదు. దీంతో పశువుల పెంపకందారులు ప్రైవేటు వైద్యం అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 80 పశువైద్యశాలలు ఉన్నాయి. పాల్వంచ, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందులలో ఆరు ప్రాంతీయ పశువైద్యశాలలతోపాటు 30 ప్రాథమిక పశువైద్యశాలలు, 44 ప్రాథమిక ఉప పశువైద్యశాలలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా నల్ల, తెల్ల పశువులు, గొర్రెలు, మేకలు, పెరటికోళ్లు మొత్తం 22,71,166 లక్షలు ఉన్నట్లు పశుసంవర్ధకశాఖ గణాంకాలు చెబుతున్నాయి. పశుసంవర్థకశాఖలో జిల్లావ్యాప్తంగా 219 పోస్టులు ఉండగా, ప్రస్తుతం 156 మంది సిబ్బందే ఉన్నారు. 63 ఖాళీలు ఉన్నాయి. జిల్లా పశువైద్యాధికారి ఇన్చార్జే.. జిల్లా పశువైద్యాధికారి రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. ఆ స్థానంలో ఎవరినీ నియమించలేదు. కార్యాలయంలో ఏడీకి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి నెట్టుకొస్తున్నారు. ఇక ఆరు ప్రాంతీయ పశువైద్యశాలలు ఉండగా, ఇవి అడిషనల్ డైరెక్టర్(ఏడీ) పర్యవేక్షణలో ఉంటాయి. కానీ ప్రస్తుతం ముగ్గురే ఏడీలు ఉన్నాయి. పాల్వంచ, బూర్గంపాడు, భద్రాచలం ఏడీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. భద్రాచలంలో ఏడీ రెండేళ్లుగా వరంగల్‌లోని కోళ్ల పరిశోధన సంస్థలో డిప్యూటేషన్‌పై పనిచేస్తున్నారు. ఇక రామవరం, చంచుపల్లి, వినాయకపురం, ములకలపల్లి ప్రాథమిక పశు వైద్య కేంద్రాల్లో పశువైద్యాధికారి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ములకలపల్లి జేఏఓ పాల్వంచ ఏడీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. యానంబైల్ పశువైద్యాధికారి హిందుతేజ్కు రామవరం పశువైద్యాధికారిగా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పాము కాటు మందులు లేవు.. జిల్లాలోని పశువులకు విషసర్పాలు, పురుగులు కరిస్తే ఇచ్చే మందులు పశువైద్యశాలలో అందుబాటులేదు. దీంతో పశువులు విషసర్పాల కాటుకు మృత్యువాత పడుతున్నాయి. ఇటీవల గోదావరి వరద వచ్చిన ప్రాంతంలో సారపాకలో మేతకు వెళ్లిన పశువును పాము కాటువేయడంతో మృతి చెందింది. పశువైద్యశాలలో రిఫ్రిజిరేటర్లు లేకపోవడంతో పాము కాటు మందులు అందుబాటులో ఉండటంలేదు. దీంతో రైతులు ప్రైవేటు దుకాణాల నుంచి కొనగోలు చేయాల్సి వస్తోంది. గత మంగళవారం గాయాలపాలైన ఓ దుప్పిని అటవీశాఖ అధికారులు ఆస్పత్రికి తీసుకొస్తే పశువైద్యులు అందుబాటులో లేరు. దీంతో సకాలంలో వైద్యం అందక జింక, దాని కడుపులోని శిశువు మృత్యువాత పడ్డాయి. కేడర్ పోస్టులు ప్రస్తుతం ఖాళీలు ఉన్నది అసిస్టెంట్ డైరెక్టర్ 6 3 3 వెటర్నరీ ఆఫీసర్ 30 26 4 జూనియర్ వెటర్నరీ ఆఫీసర్ 18 12 6 వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్ 10 3 7 లైవ్ స్టాక్ అసిస్టెంట్ 24 23 1 వెటర్నరీ అసిస్టెంట్ 23 14 9 అటెండర్ 69 40 29 వెటర్నరీ వాక్సినేటర్ 14 2 12పశువైద్యశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. జిల్లాలో పాముకాటు మందులు పశువైద్యశాలలో లేని మాట నిజమే. భద్రపరిచే రిఫ్రిజ్‌రేటర్లు లేకపోవడం వల్లే ఆ మందులను పశువైద్యశాఖ పరిధిలో ఉంచలేదు. – బొల్లం మల్లయ్య, జిల్లా ఇన్చార్జి పశువైద్యాధికారి -
సీఎస్సార్ నిధులతో ‘పోలీస్’ హాల్
మణుగూరు టౌన్: మణుగూరులో పోలీస్‌శాఖ నిర్మించనున్న కౌన్సెలింగ్, ఫిర్యాదుల పరిష్కార హాల్ నిర్మాణానికి సింగరేణి సీఎస్సార్ నిధులు రూ.50 లక్షలు మంజూరు చేశారు. రెండో విడత రూ.25 లక్షల చెక్కును ఎస్పీ రోహిత్‌రాజుకు ఆయన చాంబర్లో మణుగూరు ఏరియా జీఎం దుర్గం రాంచందర్ మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ రూ.50 లక్షల్లో గతంలోనే రూ.25 లక్షలు అందజేశామని, మిగిలిన ప్రస్తుతం అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఏజీఎం(పర్సనల్) సలగల రమేశ్, డీజీఎం(సీవిల్) శివ ప్రసాద్ తదితరులు ఉన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ రోడ్డు పనుల పరిశీలనసూపర్బజార్(కొత్తగూడెం): జిల్లా నూతన పోలీస్ కార్యాలయ సముదాయానికి నిర్మిస్తున్న రోడ్డు మార్గం పనులను ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం పరిశీలించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పాటించాలని సూచించారు. కొండ ప్రాంతాలు, సరిహద్దు భూభాగాల్లో రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో భద్రతా ప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ డీఎస్పీ ఆర్.సతీష్ కుమార్, ఇతర అధికారులు శ్రీనివాస్, కృష్ణారావు, రమణారెడ్డి, సాయి కిషోర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. రూ.25 లక్షల చెక్కు అందజేసిన సింగరేణి జీఎం -
ప్రజారంజకంగా వేయి రోజుల పాలన
సూపర్‌బజార్(కొత్తగూడెం): కాంగ్రెస్ వేయి రోజుల పాలన ప్రజారంజకంగా సాగిందని డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజా పాలన వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యానగర్ కాలనీలో ఉన్న మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాలు, దళిత ముఖ్యమంత్రి, మూడు ఎకరాల భూమి, నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలతో పది సంవత్సరాలపాటు కుటుంబ పాలన సాగించి రాష్ట్రాన్ని దోచుకుని, దాచుకుని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన ఘన చరిత్ర కేసీఆర్ కుటుంబానిదేనని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 25 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ, రైతు భరోసా, ఉచిత కరెంటు, వరి పంటకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 15 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు, కోటి కుటుంబాలకు సన్నబియ్యం, రూ.10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ, పేద విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలు, 72 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు, రూ.500 కే గ్యాస్ సిలిండర్ తదితర సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. నాయకులు ఆళ్ల మురళి, చీకటి కార్తీక్, వై.శ్రీనివాస్ రెడ్డి, మంద హనుమంతు, ఎస్కే జానీ పాషా, కొదుమూరి శ్రీనివాసరావు, పైడా రాజేంద్రప్రసాద్, లోశెట్టి నాగార్జున, ఆంతోటి పాల్, చింతలపూడి రాజశేఖర్ పాల్గొన్నారు. అభివృద్ధిలో ముందంజచర్ల: వేయి రోజుల కాంగ్రెస్ ప్రజాపాలనలో రాష్ట్రం అనిన రంగాల్లో అభివృద్ధిలో ముందు వరుసలో ఉందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపు దుర్గాప్రసాదరావు అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ మండల అధ్యక్షుడు కె.విజయకుమార్ నాయుడు, నాయకులు చీమలమర్రి మురళీకృష్ణ, కొసరాజు రాజా, పిలకా వెంకటరమణరెడ్డి, లంక రాజు, చీమకుర్తి సాయి చరణ్, మురళీదర్నాయుడు, చింతూరి రజనీకాంత్ పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న -
సీపీఎస్‌ను రద్దు చేయాలి
సూపర్‌బజార్(కొత్తగూడెం): సీపీఎస్(కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్)ను రద్దు చేసి, ఓపీఎస్‌ను పునరుద్ధరించాలని ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలిపారు. మంగళవారం పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా టీజీ ఈజేఏసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శన చేపట్టారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని నినదించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన్ అమరనేని రామారావు, కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ పెన్షన్ ఉద్యోగికి ఇచ్చే వరం కాదని, సామాజిక భద్రత, హక్కు అని అన్నారు. సీపీఎస్ విధానంలో పెన్షన్ ప్రయోజనాలు పెట్టుబడుల రాబడిపై ఆధారపడటంతో ఉద్యోగుల భవిష్యత్తులో అనిశ్చితి ఏర్పడుతోందని విమర్శించారు. జిల్లా కేంద్రంతోపాటు మండల, డివిజన్ కేంద్రాలు, వివిధ కార్యాలయాల్లో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు నిర్వహించారని అన్నారు. ఈ నెల 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జేఏసీ నాయకుల రాజు, ఎం.వెంకటేశ్వరరావు, లాల్ మహమ్మద్, తుక్కాని శ్రీనివాసరెడ్డి, హరిలాల్, లక్ష్మణ్ నాయక్, వనమా శ్రీనివాస రావు, డీవీ దినేష్ మాట్లాడారు..ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కృష్ణయ్య, దస్రు, రాణి, రమేష్, కామేశ్వరరావు, వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ ఉద్యోగ జేఏసీ నిరసన -
పెసర రైతుల గోస..
ఖమ్మంవ్యవసాయం: ప్రభుత్వం కొనుగోళ్లు లేకపోవడంతో పెసలకు కనీస మద్దతు ధర నమోదు కావడం లేదు. పంట చేతికి వస్తున్నా ప్రభుత్వం కొనుగోళ్లపై దృష్టి సారించకపోవడాన్ని అదునుగా తీసుకున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించి రైతులను దగా చేస్తున్నారు. జిల్లాలో అపరాల పంటల్లో మెట్ట పంటగా రైతులు పెసర సాగు చేస్తుంటారు. ఈ సారి ఉమ్మడి జిల్లాలో సాగు విస్తీర్ణం పెరిగినా తగిన వర్షాలు లేక దిగుబడులు అంతంత మాత్రంగా ఉన్నాయి. అరకొరగా వచ్చిన పంటకు సైతం కనీస మద్దతు ధర దక్కక రైతులకు నష్టం ఎదురవుతోంది. దిగుబడి రాక.. ధర లేక... పెసర పంట ఈ ఏడాది అంతంత మాత్రంగా దిగుబడులు వచ్చాయి. విత్తనం వేసిన సమయంలో వర్షాలు అనుకూలించినా, పూత, కాత దశలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభావం దిగుబడిపై పడింది. ఎకరాకు రెండు నుంచి మూడు క్వింటాళ్లకు మించి దిగుబడి రావడం లేదు. ఎకరం సాగుకు రూ.15 వేల వరకు పెట్టుబడి రైతులు అందులో రూ.5 వేల వరకు నష్టపోతున్నారు. ప్రభుత్వ కొనుగోళ్లపై ఆశలు వ్యాపారులు పెసలకు కనీస మద్దతు ధర చెల్లించకపోవడంతో రైతులు ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. ఇకనైనా కేంద్రాలు ఏర్పాటుచేసి రూ.8,780 ధరతో కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, పంట చేతికందుతున్నా కొనుగోళ్లపై స్పష్టత రాలేదు. మార్క్‌ఫెడ్ మాత్రం పెసల కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌కు లేఖ రాసింది. నాఫెడ్ అనుమతిస్తే త్వరలోనే కొనుగోలు చేస్తామని మార్క్‌ఫెడ్ ఉమ్మడి జిల్లా మేనేజర్ నరసింహారావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పెసలు క్వింటాకు రూ.8,780గా మద్దతు ధర నిర్ణయించింది. అయి తే, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ఈ ధర దక్కేది. కానీ అలా జరగకపోవడంతో వ్యాపారులే ధర నిర్ణయిస్తున్నారు. గ్రామాల్లో నాణ్యత ఆధారంగా క్వింటాకు రూ.5వేల నుంచి రూ. 5,500 వరకు చెల్లిస్తుండగా... ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రూ.6వేల నుంచి రూ.7వేల వరకు ధర పలుకుతోంది. పంటకు డిమాండ్ ఉన్నా వ్యా పారులు సిండికేట్‌గా ఏర్పడడంతో రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. ఫలితంగా క్వింటా కు రూ. 2,500 మేర నష్టపోతున్నారు. ఇక నాణ్యత లేని పంటను రూ.5 వేలకు మించి కొనుగోలు చేయడం లేదు.మూడున్నర ఎకరాల్లో పెసర సాగు చేస్తే ఎకరాకు 2క్వింటాళ్లు మించి దిగుబడి రాలేదు. క్వింటాకు రూ.7వేలు వస్తుందనుకుంటే రూ.6,200 మాత్రమే చెల్లించారు. దీంతో ప్రయోజనం లేకపోగా శ్రమ వృథా అయింది. – జోయినబోయిన బాబు, పుట్టకోట ప్రభుత్వం పెసలను కొనుగోలు చేస్తే మద్దతు ధర లభించేది. వ్యాపారులు పెసలు నాణ్యతగా ఉన్నా రూ. 6,300 చొప్పునే కొనుగోలు చేశారు. ప్రభుత్వం పట్టింపు లేక వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. – గుడ్ల జగన్నాథం, కూసుమంచిజిల్లా అంచనా సాగు ఖమ్మం 15,606 30,152 భద్రాద్రి కొత్తగూడెం 900 7,747 -
క్రికెట్ పోటీల్లో రాణించిన గురువిద్వా
భద్రాచలంటౌన్: భద్రాచలానికి చెందిన క్రికెటర్ గురువిద్వా హైదరాబాద్‌లో జరుగుతున్న అండర్–19 స్టేట్ ప్రాబబుల్స్ క్రికెట్ పోటీల్లో అద్భుతంగా రాణించాడు. వరుస మ్యాచ్‌ల్లో 70, 101 పరుగులు సాధించి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. గతంలో అండర్–14, అండర్–16 జాతీయ పోటీల్లోనూ రాణించిన ఇతడు ఇంపాక్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా గురువిద్వాను కోచ్ చరణ్ తేజ, స్థానికులు అభినందించారు. మైనర్‌కు పెళ్లి.. రిసెప్షన్‌కు బ్రేక్భద్రాచలంఅర్బన్: బాలికకు వివాహం జరిపి రిసెప్షన్ నిర్వహిస్తుండగా మంగళవారం ఐసీడీఎస్ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. పట్టణంలోని కేసీఆర్ కాలనీలో జరుగుతున్న రిసెప్షన్ కార్యక్రమాన్ని నిలిపివేశారు. బాల్య వివాహం జరిపినట్లు గుర్తించిన ఐసీడీఎస్ అధి కారులు బాలిక తల్లిదండ్రులపై ఫిర్యాదు చేయగా, పోలీసులు విచారణ చేపట్టారు. బాల్య వివాహం చట్టరీత్యా నేరమని అధికారులు తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.


