ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మంం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డికి అంతర్జాతీయ పార్లమెంటరీ స్థాయిలో కీలక బాధ్యత దక్కింది. భారత్–స్విట్జర్లాండ్ పార్లమెంటరీ ఫ్రెండ్‌షిప్ గ్రూప్ సభ్యుడిగా ఆయనను లోక్‌సభ స్పీకర్ నామినేట్ చేశారు. ప్రస్తుత 18వ లోక్‌సభ కాలానికి సంబంధించి భారత్, స్విట్జర్లాండ్ దేశాల మధ్య పార్లమెంటరీ స్నేహ సంబంధాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఈ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇందులో రఘురాంరెడ్డికి స్థానం కల్పించినట్లు సమాచారం అందింది. ఈ గ్రూప్ ద్వారా రెండు దేశాల పార్లమెంటరీ సభ్యుల మధ్య పరస్పర సహకారం, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. కాగా, ఎంపీ కీలక గ్రూప్‌లో స్థానం దక్కడంపై ఉమ్మడి జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


