Reviews
-
ఐ హోస్టేజ్ రివ్యూ: వామ్మో... ఆపిల్ స్టోరా... హడలెత్తించే థ్రిల్లర్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ఐ హోస్టేజ్’ (iHostage)ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఉన్నవి రెండుపాత్రలు... వాటికి అనుసంధానంగా అడపా దడపా వచ్చే మరో డజనుపాత్రలు. కథ మొత్తం ఆ రెండుపాత్రల మధ్యే. అయినా ప్రేక్షకుడిని క్షణం కూడా కన్నార్పనీయకుండా కట్టిపడేసే విథంగా థ్రిల్లర్ జోనర్‌తో సినిమా నడపడం డచ్ దర్శకుడైన బాబీ బోర్మెన్స్కి మాత్రమే చెల్లింది. అదే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఐ హోస్టేజ్ సినిమా. ఆపిల్ స్టోర్... ఐ ఫోన్ నుండి ఐ ప్యాడ్ల వరకు ప్రతి దానికి ఆపిల్ స్టోరే కదా... ఈ సినిమాకి మూలం అదే. అమెరికా, ఆస్ట్రేలియా, చైనా తదితర దేశాలలో ఆపిల్ స్టోర్లు ఘనంగా దాదాపు 5 ఫ్లోర్లు పైనే విశాలంగా పెద్ద భవంతిలో ఉంటాయి.అది కూడా నగరానికి మధ్యలోనే ఉంటాయి. కథా పరంగా ఆమ్స్టర్డామ్ నగరం మధ్యలోని ఓ ఆపిల్ స్టోర్ బోలెడంత మంది కస్టమర్లతో కళకళలాడుతుంటుంది. అప్పుడు ఆ స్టోర్‌లోకి కూరగాయల సంచితో ఓ వ్యక్తి వచ్చి తన దగ్గర ఉన్న తుపాకీ తీసి అందరినీ హడలుగొట్టి, ఓ వ్యక్తిని బందీగా తీసుకుంటాడు. అంతేకాదు తన దగ్గర పేలుడు పదార్థాలు ఉన్నాయని బెదిరించి, తనకు మిలియన్ల డబ్బుతోపాటు అక్కడ నుండి తప్పించుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయమని అధికారులకు ఫోన్లో చెప్తాడు. ఇక సినిమా మొత్తం దాదాపుగా ఆ ఇద్దరి మధ్యే నడుస్తుంది.సినిమా ఆ ఇద్దరి మీదే నడిచినా మంచి స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకున్నారు దర్శకుడు. సినిమా చివర్లో బందీగా తీసుకున్న వ్యక్తితో తను బయటపడగలిగాడా? లేదా? తాను డిమాండ్ చేసిన డబ్బులు అందుకున్నాడా? లేదా అనేది తెలుసుకోవాలంటే మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ‘ఐ హోస్టేజ్ సినిమాని చూసేయండి. ఈ సినిమా ద్వారా మానసికంగా ప్రేక్షకుడికి భయాన్ని పూర్తిగా పరిచయం చేశారు దర్శకుడు.అది కూడా చిన్నపాటి ఘర్షణ లేకుండా, ఒక్క బుల్లెట్ పేలకుండా... మరీ ముఖ్యంగా ఎటువంటి పేలుళ్లు జరగకుండా సైకలాజికల్‌గా సినిమాని తీసుకువెళ్లారు. సినిమా చూసిన తరువాత మాత్రం వామ్మో... ఆపిల్ స్టోరా ఇంక వెళ్లొద్దు బాబు అని కనీసం పది మందిలో సగమైనా అనుకుంటారు. మరి... మీరు కూడా ఆలస్యం కాకుండా ఈ సినిమా చూసేయండి. అయితే ఆపిల్ స్టోర్‌కి మాత్రం వెళ్లడం మానకండి. – హరికృష్ణ ఇంటూరు -
మోహన్ లాల్ ‘తుడరుమ్’ మూవీ రివ్యూ
మోహన్ లాల్ సినిమాలకు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ ఉంది. ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులో విడుదలై మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ఈ మధ్య ఎల్2: ఎంపురాన్తో మంచి హిట్ అందుకున్న మోహన్ లాల్..ఇప్పుడు ‘తుడరుమ్’(Thudarum Movie Review) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 15 ఏళ్ల తర్వాత నటి శోభన మరోసారి మోహన్‌లాల్‌కు జోడీగా నటించింది. నిన్న(ఏప్రిల్ 25) మలయాళంలో విడుదలై మంచి టాక్ సంపాదించుకున్న ఈ చిత్రం నేడు(ఏప్రిల్ 26) అదే పేరుతో తెలుగులో రిలీజైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. షణ్ముగం అలియాస్ బెంజ్(మోహన్ లాల్) ఒకప్పుడు తమిళ సినిమాలకు యాక్షన్ డూప్‌గా నటించేవాడు. ఓ యాక్సిడెంట్ కారణంగా సినిమాలను వదిలిపెట్టి తన మాస్టర్ (భారతీ రాజా) కొనిచ్చిన కారుతో కేరళలో సెటిల్ అవుతాడు. భార్య లలిత(శోభన), పిల్లలు(కొడుకు, కూతురు)..వీళ్లే అతని ప్రపంచం. టాక్సీ నడుపుతూ జీవితాన్ని కొనసాగిస్తుంటాడు. ఓ సారి అనుకోకుండా తను ఎంతో అపురూపంగా చూసుకునే అంబాసిడర్ కారును పోలీసులు తీసుకెళ్తారు. ఆ కారును తిరిగి ఇంటికి తెచ్చుకునేందుకు బెంజ్ చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు. అదే సమయంలో ఇంజనీరింగ్ చదివే తన కొడుకు పవన్ కనిపించకుండాపోతాడు. పవన్‌కి ఏమైంది? బెంజ్ కారును పోలీసులు ఎందుకు జప్తు చేశారు? పోలీసులు సీజ్ చేసిన కారును తిరిగి తెచ్చుకునే క్రమంలో బెంజ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? ఎలాంటి తప్ప చేయని బెంజ్‌ని సీఐ జార్జ్(ప్రకాశ్ వర్మ) హత్య కేసులో ఎందుకు ఇరికించాడు? అసలు హత్యకు గురైన వ్యక్తి ఎవరు? అతన్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? తన ఫ్యామిలి అన్యాయం చేసినవారిపై బెంజ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేదే మిగతా కథ(Thudarum Movie Review). ఎలా ఉందంటే.. పరువు హత్యల నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. తుడరుమ్ కూడా అలాంటి కథే. కోర్ పాయింట్ అదే అయినా.. దాని చుట్టు అల్లుకున్న సన్నివేశాలు, ఈ కథకు ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. దర్శకుడు తరుణ్ మూర్తి ఈ కథను ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రారంభించి.. రివేంజ్ డ్రామాగా ఎండ్ చేశారు. మాస్ ఇమేజ్ ఉన్న మోహన్‌లాల్‌ని సింపుల్‌గా పరిచయం చేయడమే కాదు.. ఫస్టాఫ్ మొత్తం అంతే సింపుల్‌గా చూపించారు. హీరోకి భార్య, పిల్లలే ప్రపంచం అని తెలియజేయడం కోసం ప్రతి విషయాన్ని డీటేయిల్డ్‌గా చెప్పడంతో ఫస్టాఫ్ సాగినట్లుగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ ముందు వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగిన ఈ చిత్రం ఇంటర్వెల్ సీన్‌తో క్రైమ్ జానర్లోకి వెళ్తుంది. హిరో అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కోవడం.. అక్కడ ఓ ట్విస్ట్ రివీల్ అవ్వడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం రివేంజ్ యాక్షన్ డ్రామాగా సాగుతుంది. ఇక్కడే కథనం కాస్త గాడి తప్పినట్లు అనిపిస్తుంది. తన ఫ్యామిలీని ఎంతో జాగ్రత్తగా కాపాడుకునే హీరో.. పోలీసులు తన కుటుంబం వేసిన నిందను పోగొట్టడానికి ప్రయత్నించకుండా..పగను తీర్చుకోవడానికి వెళ్లడం ఎందుకో పొసగలేదు అనిపిస్తుంది. ‘దృశ్యం’ ఛాయలు కపించకూడదనే దర్శకుడు కథను ఇలా మలిచాడేమో కానీ.. సినిమా చూస్తున్నంత సేపు ఆ చిత్రం గుర్తొస్తూనే ఉంటుంది. అలాగే ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కథనం మళ్లీ సాగినట్లుగానే అనిపిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలు ఉన్నప్పటికీ దర్శకుడు ఎలివేషన్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. దీంతో ప్రేక్షకుడు ఎమోషనల్ సీన్లకు పూర్తిగా కనెక్ట్ కాలేకపోయాడు. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని ప్రకటించలేదు కానీ.. ముగింపు చూస్తే ఆ విషయం ఈజీగా అర్థమైపోతుంది. ఎవరెలా చేశారంటే..మోహన్ లాల్ ఎప్పటిలాగే మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన టాక్సీడ్రైవర్ బెంజ్ పాత్రలో ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లను ఇరగదీశాడు. బాత్రూంలో కూర్చొని ఏడిచే సీన్ హైలెట్. ఇక మోహన్ లాల్ తర్వాత బాగా పండిన పాత్ర ప్రకాశ్ వర్మది . మంచితనం ముసుగు వేసుకొని క్రూరంగా ప్రవర్తించే సిఐ జార్జ్ అనే పాత్రలో ఆయన జీవించేశాడు. చాలా ఏళ్ల తర్వాత మోహన్‌లాల్‌తో తెర పంచుకున్న శోభనకు మంచి పాత్రే లభించింది. నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో చక్కడా నటించింది. బిను పప్పు, థామస్ మాథ్యూతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జేక్స్‌బిజోయ్ తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. షాజీ కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ప్రధాన బలం. నైట్ షాట్స్‌ని అద్భుతంగా చిత్రీకరించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
70 ఏళ్లకు ప్రేమలో పడితే.. ఓటీటీ సినిమా రివ్యూ
కొత్త సినిమాలు ఎన్నో వస్తుంటాయి. కొన్ని మాత్రం మన మనసుకు నచ్చేస్తాయి. అరె ఇది మన కథలా ఉందే అనే భావన కలిగిస్తాయి. చూస్తున్నంతసేపు మనసుకు హత్తుకుంటూనే గుండెను బరువెక్కిస్తాయి. అలాంటి సినిమానే 'ప్రణయం 1947'. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ఈ తెలుగు డబ్బింగ్ మూవీ ఎలా ఉంది? రివ్యూ ఏంటనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 24 సినిమాలు) కథేంటి?శివన్న (జయరాజన్) 70 ఏళ్ల వృద్ధుడు. భార్య చనిపోవడం, కొడుకులు పెళ్లి చేసుకుని మరోచోటుకి వెళ్లిపోవడంతో సొంతూరిలో పొలం మధ్యలో కట్టుకున్న ఇంటిలో ఒంటరిగా జీవిస్తుంటాడు. దగ్గరలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తుంటాడు. అదే ఆశ్రమంలో గౌరీ (లీలా) అనే ముసలావిడ కూడా ఉంటుంది. గతంలో టీచర్ గా పనిచేసిన ఈమె సొంతింటిపై బెంగతో ఇక్కడ ఉండలేకపోతుంటుంది. ఓ సందర్భంలో శివ చెప్పిన జోక్ ని సీరియస్ గా తీసుకున్న గౌరీ.. అతడితో పాటు అతడి ఇంట్లోనే కలిసి ఉంటానని అంటుంది. కట్ చేస్తే పిల్లల అనుమతితో శివ-గౌరీ కలిసి జీవిస్తారు. తర్వాత ఏమైందనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇప్పటివరకు టీనేజీ, మధ్య వయసు ప్రేమకథలు మనం చూశాం. కానీ ఇది ఓల్డేజీ ప్రేమకథ. అంటే భార్య చనిపోయిన ఓ వ్యక్తి, భర్త చనిపోయిన ఓ మహిళ.. ఒకరికొకరు తోడుగా ఉండాలని నిర్ణయించుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనేదే 'ప్రణయం 1947'.కుటుంబం, పిల్లలు, బాధ్యతలు అంటూ చాలామంది తల్లిదండ్రులు జీవితం మొత్తం కష్టపడుతూనే ఉంటారు. కానీ ముసలితనంలో మాత్రం వీళ్లని కొడుకులు దూరం పెడుతున్నారు. దీంతో చాలామంది ఒంటరితనాన్ని భరిస్తూ బతుకుతున్నారు. వృద్ధాప్యంలో తమకు ప్రేమని పంచే ఓ తోడు ఉంటే బాగుండు అనుకునే ఎందరో తల్లిదండ్రుల మనోవేదనే ఈ సినిమా.(ఇదీ చదవండి: ప్రియదర్శి 'సారంగపాణి జాతకం' రివ్యూ) చూస్తున్నంతసేపు చాలా హృద్యంగా ఉంటుంది. సినిమాలో ఎలాంటి హంగులు, ఆర్భాటాలు ఉండవు. కొందరు సాధారణ మనషులు, వారి మధ్య జరిగే సంభాషణలు, సున్నితమైన హాస్యం, ఒకరిపై ఒకరు చూపించుకునే ప్రేమ, చిరుకోపం.. ఇలా ప్రతి సీన్ మనసుకు హత్తుకునేలా ఉంటుంది.ప్రేమకు వయసుతో సంబంధం లేదని విషయాన్ని తెరపై చూపించిన విధానం చాలా బాగుంది. పిల్లలు తమను కాదనుకోవడంతో అటు ఆశ్రమాల్లో ఉండలేక.. ఇటు ఇంటికి వెళ్లలేక లోలోపల మధనపడే పెద్దల బాధని కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్లేటులో ఇడ్లీ పెట్టి ప్రేమని వ్యక్తపరచడం, మనషుల కంటే కుక్కలే విశ్వాసంగా ఉంటాయని చెప్పే సన్నివేశాలు భలే ఉన్నాయని చెప్పొచ్చు.కేవలం 100 నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమా చూస్తున్నంతసేపు సరదాగానే ఉంటుంది. కానీ చివరకొచ్చేసరికి ట్రాజెడీ ఉంటుంది. లీనమైతే మన కంట్లో నీళ్లొచ్చేస్తాయి. 50,60 ఏళ్ల వయసు గల వ్యక్తులు ఈ మూవీ చూస్తే ఇట్టే కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే తెరపై కనిపించేది సినిమా కాదు. అలాంటి వాళ్ల జీవితం కాబట్టి.ఎవరెలా చేశారు?శివ, గౌరీ టీచర్ గా ప్రధాన పాత్రలు చేసిన జయరాజన్, లీలా సామ్సన్ జీవించేశారు. చాలా సహజ నటనతో ఆకట్టుకున్నారు. మిగిలిన పాత్రధారులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగున్నాయి. కొన్నిచోట్ల ల్యాగ్ అనిపించినప్పటికీ మంచి సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది. ఈ విషయంలో దర్శకుడు అభిజిత్ అశోకన్ ని మెచ్చుకోవాలి.ఈ వీకెండ్ ఏదైనా ఓ మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'ప్రణయం 1947' చూడొచ్చు. ఆహా ఓటీటీలో తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతుంది. కుటుంబంతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: రెండోసారి ప్రెగ్నెన్సీ.. భర్తకి తెలుగు సీరియల్ నటి సర్ ప్రైజ్) -
ప్రియదర్శి 'సారంగపాణి జాతకం'.. ప్రేక్షకుడిని కడుపుబ్బా నవ్వించాడా?
టైటిల్: సారంగపాణి జాతకంనటీనటులు: ప్రియదర్శి, రూప కొడువాయూర్, వీకే నరేశ్, తనికెళ్ల భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, హర్ష చెముడు తదితరులుదర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటినిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్నిర్మాణ సంస్థ: శ్రీదేవి మూవీస్సినిమాటోగ్రఫీ: పీజీ విందాసంగీత దర్శకుడు: వివేక్ సాగర్ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్విడుదల తేదీ: ఏప్రిల్ 25, 2025ఇటీవలే కోర్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ప్రియదర్శి మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు వచ్చారు. కోర్టు సక్సెస్ ఎంజాయ్ చేస్తుండగానే మరో మూవీ థియేటర్లలో పడిపోయింది. వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్‌లో ప్రియదర్శి నటించిన తాజా చిత్రం సారంగపాణి జాతకం. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ను టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించారు. ఇవాళ థియేటర్లలో విడుదలైన సారంగపాణి జాతకం ప్రేక్షకులను నవ్వించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.సారంగపాణి జాతకం కథేంటంటే..సారంగ(ప్రియదర్శి) ఓ కార్ల కంపెనీలో సేల్స్ మెన్. చిన్నప్పటి నుంచి యావరేజ్ మార్కులతో పాసైన సారంగకు ఆ జాబ్ సాధించడం గొప్పే అని సారంగ తల్లిదండ్రుల ఫీలింగ్. ముఖ్యంగా ఇదంతా మనోడి జాతకం తెగ నమ్మేస్తుంటారు. అలా చిన్నప్పటి నుంచి జాతకాలపై సారంగకు పూర్తి నమ్మకం ఏర్పడుతుంది. అయితే అదే కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తోన్న మైథిలి(రూప కొడువాయూర్)తో మన సారంగకు లవ్ మొదలవుతుంది. ఆమెకు సారంగ ప్రపోజ్ చేద్దాం అనుకునేలోపే మైథిలినే ఊహించని సర్ప్రైజ్ ఇస్తుంది. అలా ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలై చివరికీ పెళ్లి వరకు తీసుకెళ్తుంది. అంతా ఓకే అనుకుంటుండగానే సారంగకు చేతి రేఖలు చూసి భవిష్యత్తును డిసైడ్ చేసే జిగ్గేశ్వర్(అవసరాల శ్రీనివాస్)ను అనుకోకుండా కలుస్తాడు. ఆయన చేతిరేఖల జాతకంలో ఫేమస్ కావడంతో అతని వద్దకు సారంగ వెళ్తాడు. ఆ తర్వాత సారంగ చేయి చూసిన జిగ్గేశ్వర్ (అవసరాల శ్రీనివాస్) చేతి రేఖలు చూసి అతని జాతకంలో ఉన్న ఓ షాకింగ్ విషయం చెప్తాడు. ముందు నుంచి జాతకాలు తెగ నమ్మే సారంగ ఆ విషయం తెలుసుకుని తెగ బాధపడిపోతుంటాడు. ఆ పని పూర్తయ్యాకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయంలో తన ఫ్రెండ్ చందు(వెన్నెల కిశోర్) సాయం కోరతాడు. ఇద్దరు కలిసి సారంగ జాతకం ప్రకారం ఆ పని కోసం తమ మాస్టర్ మైండ్స్‌తో స్కెచ్ వేస్తారు. మరి అది వర్కవుట్ అయిందా? అసలు సారంగ జాతకంలో ఉన్న ఆ షాకింగ్ విషయం ఏంటి? దాని కోసం చందుతో కలిసి వేసిన ప్లాన్స్ సక్సెస్ అయ్యాయా? చివరికీ సారంగ.. తన ప్రియురాలు మైథిలిని పెళ్లి చేసుకున్నాడా? అనేది తెలియాలంటే సారంగపాణి జాతకం చూడాల్సిందే.ఎలా ఉందంటే..సాధారణంగా మనదేశంలో జాతకాలంటే జనాలకు ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. మన గ్రామాల్లో అయితే ఇలాంటివీ విపరీతంగా నమ్మేస్తుంటారు. అలా జాతకాలను తెగ నమ్మేసే ఓ యువకుడి స్టోరీనే మన ముందుకు తీసుకొచ్చారు మోహనకృష్ణ ఇంద్రగంటి. చేతి రేఖల జాతకం అనే కాన్సెప్ట్‌తో తీసుకొచ్చిన ఈ కథ ఆడియన్స్‌కు వివరించే విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. ప్రేక్షకులను నవ్వించేందుకు జాతకం అనే కాన్సెప్ట్‌ను ఎంచుకోవడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. అలా ఫస్ట్ హాఫ్‌లో లవ్, కామెడీతో ఇంద్రగంటి కట్టిపడేశారు. ప్రతి సీన్లో పంచ్‌లు, ప్రాసలు, అక్కడక్కడ అడల్డ్ జోక్స్‌తో ప్రేక్షకున్ని నాన్‌స్టాప్‌గా నవ్వించేశారు డైరెక్టర్. తన జాతకం ప్రకారం జరగాల్సిన ఆ పనిని ముందే చేస్తే ఎలా ఉంటుంది? ఆ పని కోసం హీరో(సారంగ) ప్లాన్స్ చూస్తే థియేటర్లలో నవ్వుకోని వాళ్లు ఉండరేమో? అలా ఫస్ట్ హాఫ్‌లోనే తన కామెడీ పంచ్‌లతో సగటు ప్రేక్షకున్ని సీట్ నుంచి కదలకుండా చేసేశాడు. సరదాగా వెళ్తున్న కథలో ఓ సీరియస్‌నెస్ తెప్పించే ట్విస్ట్ ఇచ్చిన ఇంద్రగంటి ఇంటర్వెల్ బ్యాంగ్ పడేశాడు. ఫస్ట్ హాఫ్‌తోనే ప్రేక్షకులను తెగ నవ్వించేసిన డైరెక్టర్.. సెకండాఫ్‌లో కొత్త పాత్రలతో కథను మరింత ఇంట్రెస్టింగ్గా మార్చేశాడు. కొత్త క్యారెక్టర్స్‌తో ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీని మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. హర్ష చెముడు, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ చేసే కామెడీ ఆడియన్స్‌కు హిలేరియస్‌గా అనిపిస్తుంది. సెకండాఫ్‌లో కథ మొత్తం ఓ హోటల్ చుట్టే ప్లాన్ చేశాడు డైరెక్టర్. హోటల్లో జరిగే సన్నివేశాలు ప్రేక్షకుల ఉహకందేలా ఉన్నప్పటికీ కామెడీతో ప్రేక్షకుడిని కట్టిపడేయడంలో ఇంద్రగంటి ఫుల్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో తనికెళ్ల భరణి(అహోబిలం రావు) ఎంట్రీతో ఆడియన్స్‌లో మరింత ఆసక్తి పెంచేశాడు. కథలో ఊహించని ట్విస్ట్‌లతో ఎక్కడా కూడా ప్రేక్షకుడికి బోరింగ్ అనే పదం గుర్తు రాకుండా చేశాడు దర్శకుడు. జాతకం అనే కాన్సెప్ట్‌తో ఇంద్రగంటి చేసిన కామెడీ.. రోటీన్ కంటే భిన్నంగా ఉందని సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు ఫీలవుతాడు. క్లైమాక్స్‌లో వచ్చే ఓ సీరియస్ సీన్లోనూ నవ్వులు పూయించడం ఆయనకే సాధ్యమైంది. సందర్భాన్ని బట్టి అక్కడక్కడా కొన్ని అభ్యంతరకర పదాలు వాడినప్పటికీ.. కామెడీ ఎంటర్టైనర్గా కావడంతో ప్రేక్షకులు అంతగా ఇబ్బందే పడే లా అయితే లేవు. ఓవరాల్‌గా జాతకం అనే కాన్సెప్ట్‌తో డైరెక్టర్ చేసిన కామెడీ తీరు ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా ఉందనడంలో సందేహం లేదు. ఎవరైనా ఫ్యామిలీతో కలిసి కడుపుబ్బా నవ్వాలనుకుంటే మీరు కూడా సారంగపాణి జాతకంపై ఓ లుక్కేయండి.ఎవరెలా చేశారంటే..ప్రియదర్శి నటన, కామెడీ టైమింగ్‌తో మరోసారి అదరగొట్టేశాడు. మిస్టర్ ప్రెగ్నెట్ హీరోయిన్ రూప మరోసారి తన అందం, నటనతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. వెన్నెల కిశోర్, అవసరాస శ్రీనివాస్, హర్ష చెముడు, వీకే నరేశ్, తనికెళ్ల భరణి తమ పాత్రల్లో ఆడియన్స్‌ను అలరించారు. సాంకేతికత విషయానికొస్తే పీజీ విందా సినిమాటోగ్రఫీ బాగుంది. మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్ ఫర్వాలేదు. కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. వివేక్ సాగర్ నేపథ్యం సంగీతం ఆకట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు శ్రీదేవి మూవీస్ సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
Sodara Review: సంపూర్ణేష్ బాబు ‘సోదరా’ మూవీ రివ్యూ
టైటిల్ : సోదరా నటీనటులు: సంపూర్ణేష్ బాబు, సంజోష్, ఆర్తి గుప్తా, ప్రాచి బన్సాల్, బాబు మోహన్, బాబా భాస్కర్ తదితరులునిర్మాణ సంస్థలు: క్యాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: చంద్ర చగన్లాఎడిటింగ్: శివ శ్రావణి దర్శకత్వం: మన్ మోహన్ మేనంపల్లిసంగీతం: సునీల్ కశ్యప్ విడుదల: ఏప్రిల్ 25, 2025డిఫరెంట్ కామెడీ సినిమాలతో నవ్వించి మెప్పించే సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu ) మొదటిసారి రియల్ ఎమోషన్ చేశాను, న్యాచురల్ కామెడీ సినిమా చేశాను అంటూ ఈ సినిమాని ప్రమోట్ చేశారు. అన్నదమ్ముల అనుబంధాన్ని చూపించాం అంటూ మూవీ యూనిట్ చెప్పుకొచ్చారు. మరి ఈ సోదరా సినిమా ఎలా ఉందొ రివ్యూలో తెలుసుకుందాం(Sodara Movie Review )కథేంటంటే..తెలంగాణలోని ఓ పల్లెటూరులో చిరంజీవి(సంపూర్ణేష్ బాబు), పవన్(సంజోష్) అన్నదమ్ములు. ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. చిరంజీవి సోడా బిజినెస్ చేస్తూ ఉంటాడు. చిరంజీవి ఏజ్ పెరిగినా ఇంకా పెళ్లవ్వట్లేదని, వచ్చిన 99 సంబంధాలు ఫెయిల్ అయ్యాయని బాధపడుతున్న సమయంలో చిరంజీవి ఎదురింట్లోకి దివి(ఆర్తి గుప్తా) ఫ్యామిలీ వస్తుంది. దివిని చూసి అన్నదమ్ములు ఇద్దరూ ఇష్టపడతారు. ఇద్దరూ దీవిని ట్రై చేస్తారు. ఈ విషయంలో ఇద్దరికీ బేధాభిప్రాయాలు వస్తాయి. అదే సమయంలో కాలేజీలో చదువుకోడానికి చిరంజీవి తమ్ముడు పవన్ ని వేరే ఊరు పంపిస్తాడు. అక్కడ కాలేజీలో భువి(ప్రాచీ బన్సాల్)తో ప్రేమలో పడతాడు పవన్. ఓ సారి పవన్ ఇంటికి వచ్చినప్పుడు దివి తన అన్నయ్యని రిజెక్ట్ చేసిందని తెలిసి మరోసారి నీ ప్రేమని చెప్పు అంటూ అర్ధరాత్రి తన అన్నయ్యని దివి ఇంటికి వెళ్లేలా చేస్తాడు. అది దివి తండ్రి చూడటంతో పెద్ద గొడవ అయి రెండు కుటుంబాలు కొట్టుకునే దాకా వెళ్తారు. ఈ గొడవతో దివి ఫ్యామిలీ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతుంది. తమ్ముడి వల్లే ఇదంతా జరిగిందని చిరంజీవి పవన్ కి దూరంగా ఉంటాడు. మరి చిరంజీవి - పవన్ మళ్ళీ అన్నదమ్ములుగా క్లోజ్ అవుతారా? దివి చిరంజీవి కోసం తిరిగి వస్తుందా? చిరంజీవి 100వ పెళ్లిచూపులు జరుగుతాయా? పవన్ లవ్ స్టోరీ ఏమైంది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. కామెడీ కథలు చేసే సంపూర్ణేష్ బాబుతో మరో హీరోని పెట్టి అన్నదమ్ముల సినిమాతో పాటు ఓ డిఫరెంట్ కథతో ఈ సినిమాని తెరకెక్కించారు. సినిమా పూర్తిగా తెలంగాణ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించారు. ఆ తెలంగాణ మట్టి వాసన, స్లాంగ్, జనాలు కాస్త రియలిస్టిగా చూపించే ప్రయత్నం చేసారు. అయితే ఫస్టాఫ్ బాగా సాగదీసారు. కాలేజీ ఎపిసోడ్స్ కాస్త బోర్ కొడతాయి. ప్రథమార్థం సింపుల్ గా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ కి ఎవరూ ఊహించని అదిరిపోయే ట్విస్ట్ ఇవ్వడంతో సెకండాఫ్‌పై ఆసక్తి నెలకొంటుంది. సెకండాఫ్‌లో కామెడీ, ఎమోషన్ పండించడానికి బాగానే కష్టపడ్డారు. కొన్ని సీన్స్ హిలేరియస్ గా నవ్వుకుంటాం. ఓ పక్క లవ్ ఎమోషన్, మరో పక్క అన్నదమ్ముల ఎమోషన్ ని బాగానే చూపించే ప్రయాతం చేశారు. క్లైమాక్స్ లో కూడా మళ్ళీ ట్విస్టులు ఇచ్చి కథ ముగిస్తారు. అయితే అన్నదమ్ముల ఎమోషన్ ని లవ్ స్టోరీలు డామినేట్ చేశాయి అనిపిస్తాయి. ఎవరెలా చేసారంటే.. ఇన్నాళ్లు నవ్వించిన సంపూర్ణేష్ బాబు ఈ సినిమాలో ఓ విలేజ్ లో సోడాలు అమ్ముకునే కుర్రాడి పాత్రలో సింపుల్ గా బాగానే నటించాడు. ఎమోషన్ పండించడానికి బాగానే ట్రై చేసాడు. సంజోష్ కూడా తెలంగాణ యువకుడి పాత్రలో యాక్టివ్ గా కనపడ్డాడు. ఆర్తి గుప్తా కాసేపే కనపడినా పర్వాలేదనిపిస్తుంది. ప్రాచి బన్సాల్ తన అందంతో అలరిస్తూనే నటనతో మెప్పిస్తుంది. బాబు మోహన్, గెటప్ శ్రీను, బాబా భాస్కర్.. మిగిలిన నటీనటులు వారి పాత్రా పరిధి మేరకు నటించారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ కావడంతో సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగానే చూపించారు. ఎడిటింగ్ లో కొన్ని సీన్స్ ఇంకా ట్రిమ్ చేస్తే బాగుంది. సినిమాలో కొంతమందికి డబ్బింగ్ సెట్ అవ్వలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగానే మెప్పిస్తుంది. పాటలు మాత్రం యావరేజ్. మొదటి సినిమా అయినా డైరెక్టర్ మంచి కథ తీసుకొని ఆసక్తికర కథాంశంతో తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు కావాల్సినంత ఖర్చుపెట్టారు. -
'డియర్ ఉమ' రివ్యూ.. మంచి ప్రయత్నం
తెలుగు చిత్రసీమలో తెలుగమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. హీరోయిన్గా మెరిసేందుకు చాలా కష్టపడుతుంటారు. అలాంటిది సుమయ రెడ్డి అయితే తన తొలి ప్రయత్నంలోనే హీరోయిన్గా, రచయితగా, నిర్మాతగా భిన్న పాత్రల్ని పోషించింది. 'డియర్ ఉమ' అంటూ ఏప్రిల్ 18న వచ్చిన ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కించారు. పృథ్వీ అంబర్, సుమయ రెడ్డి( Sumaya Reddy) హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని సాయిరాజేష్ మహాదేవ్ దర్శకత్వం వహించాడు. మరి ఈ సుమయ రెడ్డి తొలి ప్రయత్నం ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?గ్రామీణ ప్రాంతంలో పుట్టి పెరిగిన ఉమ (సుమయ రెడ్డి) వైద్య విద్యను పూర్తి చేసి సొంతంగా ఓ హాస్పిటల్ నిర్మించి తండ్రి కలను నెరవేర్చాలని అనుకుంటుంది. మరోవైపు దేవ్‌కు(పృథ్వీ అంబర్) మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. భవిష్యత్‌లో రాక్‌స్టార్ కావాలని ఎన్నో కలలు కంటాడు. కానీ, చదువులో చాలా వెనుకపడిపోతాడు. తన కాలేజీ సమయంలో దేవ్ ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే, మ్యూజిక్ కారణంగానే దేవ్‌కు ఆ అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్లిపోతుంది. ప్రేమలో విఫలమైన దేవ్ రాక్ స్టార్ అవ్వాలనే ప్రయత్నంలో అంతగా సక్సెస్ కాలేకపోతాడు. చిన్నా చితకా అవకాశల కోసం గడపగడపకూ తిరుగుతుంటాడు. అలాంటి దేవ్‌కి ఓ సారి ఉమ డైరీ దొరుకుతుంది. తనకు గాయమై హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు తన జీవితం మారిందని.. అప్పటి నుంచే ఉమ జీవితం ఆగిపోయిందని తెలుసుకుంటాడు. అసలు ఉమకి ఏం జరిగింది..? ఉమ నేపథ్యం ఏంటి? ఉమ ఎక్కడి నుంచి వచ్చింది? ఏం చేస్తుండేది? అనే ప్రశ్నలతో సతమతం అవుతుంటాడు దేవ్. ఇక ఉమ కోసం దేవ్ చేసిన పోరాటం ఏంటి? ఉమతో దేవ్ ప్రేమ ప్రయాణం ఎక్కడి వరకు దారి తీస్తుంది? ఈ కథలో దేవ్ అన్న సూర్య (కమల్ కామరాజ్) పాత్ర ఏంటి..? అన్నది కథ.వైద్యం పేరుతో కార్పొరేట్ హాస్పిటల్స్ చేసే మోసాలకు లవ్‌స్టోరీని జోడించి డియర్ ఉమ కథను సుమయ రెడ్డి రాసుకుంది. ఈ కథను సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. వైద్య రంగంలోని లోపాలను ఎత్తిచూపుతూ తెరకెక్కించాడు. ప్రస్తుత కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను గుర్తుచేస్తూ, సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలా కథను నడిపించారు. ప్రతీ ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.ఎలా ఉందంటే..?రధన్ సంగీతం సినిమా మూడ్‌కు తగ్గట్టుగా ఉంది, అయితే, కొన్ని చోట్ల మరింత మెరుగ్గా ఉండాల్సింది. రాజ్ తోట కెమెరా వర్క్ సహజంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేకమైన షాట్స్ మిస్ అయినట్టు అనిపించవచ్చు. స్క్రీన్ ప్లే సినిమాకు ఒక బలంగా నిలిచింది, ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స్ ట్విస్ట్‌లు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. అయితే, క్లైమాక్స్‌లోని ఎమోషనల్ సన్నివేశాలు కొందరికి అతిగా అనిపించవచ్చు. పతాక సన్నివేశంలోని పాట సినిమా సందేశాన్ని స్పష్టంగా చెప్పినప్పటికీ, కథలో మరింత సహజంగా కలిసిపోయి ఉంటే బాగుండేది. మొత్తానికి, "డియర్ ఉమర్" ఒక మంచి ప్రయత్నం, కానీ కొన్ని అంశాలలో మరింత శ్రద్ధ పెడితే ఇది ఒక గొప్ప చిత్రంగా నిలిచేది. తొలి చిత్రమే అయినా సుమ చిత్ర ఆర్ట్స్, నిర్మాత సుమయ రెడ్డి గొప్ప కథను అందించడంలో సక్సెస్ అయ్యారు.డియర్ ఉమ చిత్రానికి సుమయ రెడ్డి ఆల్ రౌండర్ అని చెప్పుకోవచ్చు. మంచి కథను ఇవ్వడమే కాకుండా.. ఈ కథను అనుకున్నట్టుగా తీయడంలో ఖర్చు పెట్టిన నిర్మాతగానూ సుమయ రెడ్డి సక్సెస్ అయింది. సుమయ రెడ్డిలోని రచయిత, నిర్మాతకు వంద మార్కులు వేసుకోవచ్చు. ఇక నటిగా ఇంకాస్త మెరుగు పర్చుకోవాల్సి ఉంటుందేమో. తెరపై సుమయ రెడ్డి అందంగా కనిపించారు. హీరోగా పృథ్వీ అంబర్ యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌ను పలికించాడు. కమల్ కామరాజ్ పాత్ర సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. అజయ్ ఘోష్ పాత్ర రొటీన్ అనిపిస్తుంది. ఫైమా, లోబో, సప్తగిరి, భద్రం పోషించిన పాత్రలు అక్కడక్కడా నవ్విస్తాయి. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా డియర్ ఉమను చూస్తే తప్పకుండా మెప్పిస్తుంది. -
స్కూల్ ప్రేమను గుర్తు చేసే 'మధురం'.. ఎలా ఉందంటే?
టైటిల్: మధురం నటీనటులు: ఉదయ్ రాజ్, వైష్ణవీ సింగ్, బస్ స్టాప్ కోటేశ్వర రావు, కిట్టయ్య, ఎఫ్ఎం బాబాయ్, దివ్య శ్రీ, సమ్యూ రెడ్డి తదితరులు డైరెక్టర్: రాజేష్ చికిలే నిర్మాత - ఎం. బంగర్రాజు సినిమాటోగ్రఫీ - మనోహర్ కొల్లి సంగీతం - వెంకీ వీణ ఎడిటర్ - ఎన్టీఆర్ విడుదల తేదీ ఏప్రిల్ 18, 2025 మధురం కథేంటంటే..రామ్ (ఉదయ్ రాజ్), మధు (వైష్ణవీ సింగ్) ఒక రొమాంటిక్ కామెడీ సన్నివేశంలో కలుస్తారు. వారి అమాయకమైన హృదయాలు తక్షణమే ఒకరినొకరు ఆకర్షిస్తాయి. 10వ తరగతి అమ్మాయి, 9వ తరగతి అబ్బాయితో ప్రేమలో పడటం వల్ల ఈ యువ జంట అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. చివరికీ వారి ప్రేమ కథ సక్సెస్ అవుతుందా? తల్లిదండ్రులు, సమాజం నుంచి వారు ఎదుర్కొనే సవాళ్లు ఏమిటి? వాటిని ఎలా అధిగమించారు? వాళ్లు తమ ప్రేమను గెలిచారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మధురం చూడాల్సిందే!ఎలా ఉందంటే..మధురం టైటిల్ చూస్తే లవ్ స్టోరీ అని ఆడియన్స్‌కు గుర్తుపట్టేలా ఉంది. యవ్వనంలో చిగురించిన ప్రేమే కథాంశంగా తెరకెక్కించిన తీరు బాగుంది. మొదటి భావోద్వేగాల సున్నితత్వాన్ని, గోదావరి ప్రాంతం శాశ్వత సౌందర్యాన్ని తెరపై అందంగా ఆవిష్కరించారు డైరెక్టర్. గోదావరి దాదాపు ఒక పాత్రలా కనిపిస్తూ సినిమా సన్నివేశాలను మరింత ఉన్నతంగా ఆడియన్స్‌కు పరిచయం చేశారు. స్కూల్లో ఇద్దరు విద్యార్థుల ప్రేమ చుట్టే కథ అద్భుతంగా తీర్చిదిద్దారు.అందమైన కాన్సెప్ట్‌ను ఎంచుకొని, హృదయపూర్వకంగా అందించారు దర్శకుడు రాజేష్ చికిలే . కథ పరంగా సరళంగా ఉన్నప్పటికీ, 90ల తరం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. కొన్ని రిపీటెడ్ సన్నివేశాలు, రెండు భాగాల్లో కొంత లాగ్ కాస్కా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ దర్శకుడు రాజేష్ చికిలే అందించాలనుకున్న సందేశాన్ని ఇవి దెబ్బతీయలేదు. కథలో కొన్ని భాగాలు ప్రత్యేకంగా బలంగా ఉన్నాయి. ప్రధాన పాత్రల భావోద్వేగాన్ని ప్రేక్షకులు అనుభవించేలా చేస్తాయి. వెంకీ వీణ సంగీతం ఈ సినిమాకు ప్లస్. స్క్రీన్‌పై రెండు పాటలు మాత్రమే ఆకట్టుకున్నాయి. 90ల ప్రేమ కథలను ఇష్టపడే వారికి, గోదావరి సౌందర్యాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ చిత్రం ఒక మంచి ఎంటర్టైనర్గా నిలుస్తుంది.ఎవరెలా చేశారంటే..డెబ్యూ హీరో ఉదయ్ రాజ్ తన నటనతో మెప్పించారు. గతంలో ఆచార్య, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించిన ఉదయ్.. తన నటనా నైపుణ్యాన్ని చాటాడు. వైష్ణవీ సింగ్త తన పాత్రలో ఆకట్టుకుంది. తన అందమైన రూపంతో, నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రలో పరిధిలో అద్భతంగా చేశారు. సాంకేతికత విషయానికొస్తే మనోహర్ కొల్లి సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. నందమూరి తారక రామారావు తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. వెంకీ వీణ నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' మూవీ రివ్యూ
టైటిల్ : అర్జున్ సన్నాఫ్ వైజయంతినటీనటులు: నందమూరి కల్యాణ్‌రామ్, విజయశాంతి, సయీ మంజ్రేకర్,పృథ్వి, సోహైల్ ఖాన్, శ్రీకాంత్ తదితరులునిర్మాణ సంస్థలు: అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసుఎడిటింగ్: తమ్మిరాజుదర్శకత్వం, కథ: ప్రదీప్ చిలుకూరిస్క్రీన్‌ప్లే: శ్రీకాంత్ విస్సాసంగీతం: అజనీష్ లోక్నాథ్సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్విడుదల: ఏప్రిల్ 18, 2025విజయశాంతి (Vijayashanthi), నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram) తల్లీ కుమారులుగా నటించిన సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ (Arjun son of Vyjayanthi) తాజాగా థియేటర్స్‌లోకి వచ్చేసింది. నూతన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) ఈ మాస్ చిత్రంతో డైరెక్టర్‌గా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై అశోక్ వర్ధన్, సునీల్ నిర్మించారు. అమ్మ కోసం మనం ఎన్ని త్యాగాలైనా చేయొచ్చు అని చెప్పే అర్జున్ సన్నాఫ్ వైజయంతి చిత్రం ఎలా ఉంది..? ప్రీరిలీజ్ వేడుక సమయంలో ఎన్టీఆర్ చెప్పినట్లుగా ఈ మూవీ కళ్యాణ్ కెరీర్లో ఒక స్పెషల్‌గా మిగిలుతుందా..? ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..?‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ కథ చాలా సినిమాల మాదిరే రొటిన్ స్టోరీ.. ఇందులో తల్లీకొడుకుల మధ్య బలమైన ఎమోషన్ కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో వైజయంతి IPS (విజయశాంతి) డ్యూటీలో భాగంగా ఎన్కౌంటర్ చేస్తూ తెరపైకి ఎంట్రీ ఇస్తుంది. వైజయంతి ఒక కఠినమైన, నిజాయితీతో కూడిన పోలీసు అధికారిణిగా ఉంటుంది. తన కుమారుడు అర్జున్ (కల్యాణ్‌రామ్) కూడా నిజాయితీగల IPS ఆఫీసర్ కావాలని, తన అడుగుజాడల్లో నడుస్తాడని ఆశిస్తుంది. అయితే, ఒక మాఫియా డాన్‌తో ఊహించని ఎదురుదెబ్బ అర్జున్ను మరో దారిలో నడిచేలా చేస్తుంది. ఉద్దేశపూర్వకంగా అర్జున్ నేరస్థుడు కాకపోయినా, ప్రజలను రక్షించడానికి స్థానిక మాఫియాను ఎదుర్కొనే ఆయుధంగా అర్జున్ మారతాడు. అర్జున్ చేస్తున్న మంచిపనిని చూసిన పృథ్వి తన పోలీస్ ఉద్యోగాన్ని పక్కనపెట్టి అతనితో పాటుగా అడుగులేస్తాడు. అలా వారిద్దరూ ఒక పెద్ద గ్యాంగ్‌నే ఏర్పాటు చేస్తారు. ఏకంగా పోలీస్ వ్యవస్థనే సవాల్ చేసేంతలా అర్జున్ గ్యాంగ్ బలోపేతం అవుతుంది. ఇవన్నీ అర్జున్‌కు తన తల్లితో విభేదాలకు దారితీస్తాయి.. దీంతో అర్జున్ వెళ్తున్న దారి ఎంతమాత్రం కరెక్ట్ కాదంటూ ఆమె హెచ్చరిస్తూనే ఉంటుంది. ఏకంగా అర్జున్ను ఇంటి నుంచి బయటకు పంపేసి ఒంటరిగానే ఉంటుంది. అర్జున్ తరువాత విశాఖలోని ఒక కాలనీకి వెళ్లి అక్కడే ఉంటూ నగరంలోనే టాప్ గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. పేదలజోలికి వచ్చిన వారందరిని వేటాడుతూ ముందుకు వెళ్తుంటాడు. ఐపీఎస్‌కు సెలక్ట్ అయిన అర్జున్ ప్రజల కోసం కత్తి ఎందుకు పట్టాడు..? ఉద్యోగ రిత్యా ఎన్నో ఎన్కౌంటర్లు చేసిన వైజయంతిని నేరస్థుల నుంచి అర్జున్ ఎలా కాపాడుకుంటాడు. డ్రగ్స్ మాఫీయా అర్జున్ తండ్రిని ఎందుకు చంపుతుంది..? చివరకు తన ప్రాణాలను కాపాడిన కొడుకునే వైజయంతి ఎందుకు జైలుకు పంపుతుంది..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథ చాలా పాత కథే.. ఇప్పటికే ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అయితే, ఈ సినిమాకు ప్రధాన బలం విజయశాంతి అని చెప్పవచ్చు. ఒక శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె దుమ్మురేపారు. తల్లి ఎంత స్థాయిలో ఉన్నా తన బిడ్డ భవిష్యత్ చాలా ముఖ్యం అని ఇందులో చక్కగా చూపించారు. కథలో భాగంగా వైజాక్ కమీషనర్‌గా శ్రీకాంత్ రావడంతో కథలో స్పీడ్ అందుకుంటుంది. గతంలో వైజయంతి టీమ్‌లో అతను పనిచేసిన అనుభవం ఉండటం వల్ల ఆ కుటుంబంతో దగ్గరి సాన్నిహిత్యం ఉంటుంది. ఒక సిన్సియర్ ఆఫీసర్ కుమారుడు గ్యాంగ్‌స్టర్ అవడం ఏంటి..? అని అర్జున్ గతం తెలుసుకుంటాడు. కానీ, ఆ సీన్లు ఏవీ పెద్దగా వర్కౌట్ కాలేదు.'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' సినిమా కథ పాతదే అయినా సరే అభిమానులను మాత్రం ఆకట్టుకునే విధంగానే ఉంటుంది. దర్శకుడు కూడా మాస్‌తో పాటు భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఫస్టాఫ్ కొంతమేరకు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, రెండవ భాగంలోకి కథ వెళ్ళే కొద్దీ పాత తరహా కథనే చూపిస్తున్నాడని అభిప్రాయం అందరిలో కలుగుతుంది. మాస్ యాక్షన్ బ్లాక్‌లు బాగానే టేకింగ్ చేసిన దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కథ చెప్పడంలో చాలా వరకు తడబడ్డాడని చెప్పవచ్చు. సులువుగా ఉన్న కథను కొత్తగా చెప్పే క్రమంలో స్క్రీన్‌ప్లే దెబ్బతిందని అర్థం అవుతుంది. అజనీష్ లోక్‌నాథ్ నేపథ్య సంగీతం బాగుంది. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చిన బీజీఎమ్ పీక్స్‌లో ఉంటుంది. కానీ, పాటల విషయంలో పెద్దగా మ్యూజిక్ ప్రభావం లేదు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు, తర్వాత వచ్చే సీన్లకు కల్యాణ్‌రామ్ అభిమానులు పండుగ చేసుకుంటారు. ఆ సమయంలో థియేటర్స్ దద్దరిల్లడం గ్యారెంటీ అని చెప్పవచ్చు. క్లాస్ ప్రేక్షకులకు పెద్దగా నచ్చకపోయినప్పటికీ మాస్ ఆడియన్స్‌ను మాత్రం మెప్పిస్తుంది. కంటెంట్ ఆధారంగా సినిమా చూసే వారికి ఈ చిత్రం పెద్దగా నచ్చకపోవచ్చు. సినిమా క్లైమాక్స్‌లో విజయశాంతి, కల్యాణ్‌రామ్ పోటీ పడి నటించారు. క్లైమాక్స్ కంటతడి పెట్టించేలా ఉంటుంది. కథ విషాదాంతం కాకపోయినప్పటికీ పతాక ఘట్టాల్లో ఎమోషన్స్ ఆ స్థాయిలో ఉంటాయి. ఆ భావోద్వేగాలే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కల్యాణ్‌రామ్ బలం ఎమోషన్.. దాన్ని ఈ చిత్రంలో అద్భుతంగా పండించారు. అందుకే సినిమా క్లైమాక్స్ బాగా హిట్ అయింది. ఆఖర్లో సుమార 30 నిమిషాలు అన్ని వర్గాల ప్రేక్షకులను 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి ' కట్టిపడేస్తుంది.ఎవరెలా చేశారంటే..అర్జున్‌గా కల్యాణ్ రామ్ మంచి నటనను కనబరిచాడు. వైజయంతిగా విజయశాంతి దుమ్మురేపింది. ఇద్దరూ భావోద్వేగ, యాక్షన్ సన్నివేశాలలో ఎంతమాత్రం నిరాశపరచలేదు. ఈ వయసులోనూ విజయశాంతి డూప్ లేకుండా స్వయంగా యాక్షన్ సీక్వెన్స్‌లు చేయడం అందరినీ ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. శక్తిమంతమైన తల్లి పాత్రలో ఆమె వంద శాతం న్యాయం చేసింది. పోలీస్ ఆఫీసర్‌గా ఆమె మరికొంత సమయం పాటు స్క్రీన్ మీద కనిపించి ఉండుండే బాగుండని అభిమానులకు కలుగుతుంది. అర్జున్ భార్య చిత్ర పాత్రలో సాయి మంజ్రేకర్ పరిదిమేరకు మాత్రమే ఉంటుంది. పఠాన్ పాత్రలో సోహైల్ ఖాన్ పాత్ర చిత్రీకరణ చాలా పేలవంగా ఉంటుంది. విలన్‌గా భారీ ఎలివేషన్స్‌కు మాత్రమే ఆయన పాత్ర ఉంటుంది. శ్రీకాంత్ కమిషనర్‌గా చాలా బాగా చేశాడు. తనకు ఇచ్చిన పాత్రలో సమర్థవంతంగా నటించాడు. హీరోకు ఎప్పుడు వెన్నంటి ఉండే మిత్రులలో ఒకరిగా పృథ్వీ తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఈ సినిమా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చిపెడుతుంది. బడ్జెట్ మేరకు నిర్మాణ విలువలు పర్వాలేదు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మాస్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో మెప్పించాడు. కానీ, కథ విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోలేదనిపిస్తుంది. అర్జున్ S/O వైజయంతి సినిమా మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది. అభిమానులకు పండుగలాంటి సినిమా అవుతుంది. కామన్ ఆడియన్స్‌కు మాత్రం చివరి 30 నిమిషాలు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. -
'ఓదెల 2' మూవీ రివ్యూ.. శివశక్తిగా తమన్నా మెప్పించిందా..?
టైటిల్ : ఓదెల 2నటీనటులు: తమన్నా, హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహ,యువ, మురళీ శర్మ, యువ, నాగ మహేశ్, వంశీ తదితరులునిర్మాణ సంస్థలు: సంపత్ నంది టీమ్ వర్క్స్, మధు క్రియేషన్స్నిర్మాతలు: డీ. మధుఎడిటింగ్: అవినాష్దర్శకత్వం: అశోక్ తేజ కథ, దర్శకత్వ పర్యవేక్షణ: సంపత్ నందిసంగీతం: అజనీష్ లోక్నాథ్సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్విడుదల: ఏప్రిల్ 17, 2025సుమారు మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’ చిత్రానికి కొనసాగింపుగా ‘ఓదెల 2’ చిత్రాన్ని దర్శకుడు అశోక్‌తేజ తెరకెక్కించారు. సంపత్ నంది టీమ్ వర్క్స్‌తో కలిసి మధు క్రియేషన్స్ పతాకంపై డి.మధు నిర్మించారు. తమన్నా ప్రధాన పాత్రలో నటించగా హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్.సింహ కీలక పాత్రలలో మెప్పించారు. 2022లో ఓటీటీ వేదికలో విడుదలైన ‘ఓదెల రైల్వేస్టేషన్’ ప్రేక్షకులలో మంచి గుర్తింపు పొందింది. దర్శకుడు సంపత్ నంది ఇచ్చిన కథతో, అశోక్‌తేజ ఆ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇదే కలయికలో మరింత ఘనంగా, థ్రిల్లింగ్‌గా 'ఓదెల2' చిత్రాన్ని రూపొందించామని చిత్ర ప్రమోషన్స్ కార్యక్రమాలలో చెప్పారు. విజువల్ ఎఫెక్ట్స్‌కి పెద్ద పీట వేస్తూ.. తమన్నా గుర్తుండిపోయే పాత్రలో కనిపించారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఓదెల మల్లన్న స్వామి తన గ్రామాన్ని దుష్ట శక్తుల నుంచి ఎలా రక్షిస్తాడనేది 'ఓదెల2' అసలు కథ. నేడు విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.కథేంటి..తిరుపతి (వశిష్ఠ) మరణంతో ‘ఓదెల రైల్వేస్టేషన్’ సినిమా ముగుస్తుంది. అయితే, ఓదెల 2 అక్కడి నుంచే మొదలౌతుంది. తిరుపతి మరణించడంతో గ్రామస్థులందరూ సంతోషంగా ఉంటారు. తమ గ్రామంలో కొత్తగా పెళ్ళైన అమ్మాయిల శోభనం నాడే చంపిన తిరుపతిని రాధ (హెబా పటేల్) చంపేసి మంచి పనిచేసిందని అనుకుంటారు. అయితే, తిరుపతి ఆత్మకు కూడా శాంతి ఉండకూడదని గ్రామ పెద్దలు నిర్ణయించుకుందటారు. అలా జరగాలంటే అతని అంత్యక్రియలు ఎలా చేయాలో గ్రామంలోని పూజారిని అడిగి తెలుసుకుంటారు. శాస్త్రాల ప్రకారం 'సమాధి శిక్ష' పద్ధతి ద్వారా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ గోషిస్తూ ఉంటుంది. అదే అతనికి శిక్ష అంటూ గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. అలా కొద్దిరోజులు గడిచిన తర్వాత ఆ గ్రామంలో మళ్లీ పెళ్లి జరుగుతుంది. గతం మాదిరే శోభనం నాడే అత్యంత క్రూరంగా యువతులు హత్య చేయబడుతారు. ఇలాంటి ఘటనలు రెండు జరగడంతో గ్రామంలో మళ్లీ భయం మొదలౌతుంది. పోలీసులు రంగప్రవేశం చేసినప్పటికీ వారి చావులకు అసలు కారణాలు కనుగొనలేరు. అయితే, అదే గ్రామానికి చెందిన దర్గాలో ఉన్న మురళీ శర్మ (ఫకీర్) అసలు కారణం కనుక్కొంటాడు. తిరుపతి దెయ్యంగా తిరిగొచ్చాడని చెప్తాడు. దీంతో తమ గ్రామాన్ని ఎవరు కాపాడుతారని ఆందోళనలో గ్రామస్తులు ఉంటారు. అయితే, ఒకరోజు జైల్లో ఉన్న రాధ (హెబా పటేల్) వద్దకు వెళ్లి జరిగిన హత్యల గురించి చెప్తారు. ఎలాగైనా తిరుపతి నుంచి ఓదెల గ్రామాన్ని కాపాడాలని వేడుకుంటారు. దీంతో శివశక్తి (తమన్నా) మాత్రమే కాపాడుతుందని వారికి చెబుతుంది. శివశక్తి గతం గురించి చెబుతూ ఆమె ఎక్కడ ఉంటుందో వివరాలు తెలుపుతుంది. అలా ఒదెల గ్రామాన్ని కాపాడేందుకు శివశక్తి (తమన్నా)ను అక్కడ తీసుకొస్తారు. అలా దైవశక్తికి, ప్రేతాత్మ శక్తిల మధ్య పెద్ద పోరాటమే జరుగుతుంది. మరణించిన తిరుపతి 'సమాధి శిక్ష' నుంచి ఎలా తిరిగొస్తాడు..? శివశక్తి (తమన్నా), రాధ (హెబా పటేల్) మధ్య ఉన్న బంధం ఏంటి..? శివశక్తిలా తమన్నా మారడం వెనుకన్న అసలు స్టోరీ ఎంటి..? ఫైనల్‌గా తిరుపతి అంతం అవుతాడా..? మళ్లీ తిరిగొస్తాడా..? అనేది తెలియాలంటే ఓదెల2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..దుష్టశక్తి, దైవశక్తిల పోరాటం గురించి చాలా సినిమాలు వచ్చాయి. ఓదెల2 కూడా ఇదే కోవకు చెందిన కథే.. సినిమా ఎక్కడా కూడా కొత్తగా అనిపించదు. ప్రతి సీన్ దాదాపు అంచనా వేయవచ్చు. మూడేళ్ల క్రితం వచ్చిన ‘ఓదెల రైల్వేస్టేషన్’లో చూపించిన ఉదంతాలే పార్ట్-2లో ఎక్కువ భాగం కనిపిస్తాయి. గ్రామంలోని కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు తమ శోభనం నాడే అత్యంత దారుణంగా చనిపోతారు. అందుకు కారణం ఒక ప్రేతాత్మ అనేది మాత్రమే ఇక్కడ కాస్త భిన్నంగా ఉంటుంది. ఒదెల2 కథ ప్రారంభం ఘనంగా ఉన్నప్పటికీ మొదటి 15 నిమిషాల్లోనే తేలిపోతుంది. సుమారు ఇంటర్వెల్ వరకు కొత్తగా పెళ్లైన ఇద్దరి అమ్మాయిల చావుల చుట్టే కథ మొత్తం తిరుగుతుంది. పార్ట్1 చూసిన వారికి ఇవేమీ అంత కొత్తగా అనిపించవు.. అయితే, వారి హత్యలు చాలా క్రూరంగా ఉంటాయి. మరీ వయలెన్స్ ఎక్కువ అయిందేమో అనిపించేలా ఆ సీన్స్ ఉంటాయి. శివశక్తిగా (తమన్నా) ఎంట్రీ చాలా ఆలస్యంగా ఉంటుంది. అది కాస్త ప్రేక్షకులకు రుచించకపోవచ్చు. ఎప్పుడైతే తమన్నా కథలోకి ఎంట్రీ ఇస్తుందో కథ అనేక మలుపులు తిరుగుతుందని అనుకుంటారు. కానీ, సాధారణ రొటీన్ పద్ధతిలోనే స్టోరీ కొనసాగుతుంది. ఆమె నాగసాధువుగా ఎందుకు మారిందో చెప్పిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. అయితే, ఓదెల2లో ప్రేతాత్మగా ఉన్న తిరుపతి (వశిష్ఠ) పాత్రను చాలా బలంగా రాసుకున్న రచయిత.. శివశక్తిగా (తమన్నా) పాత్రను అంత పవర్‌ఫుల్‌గా ప్రజెంట్ చేయలేకపోయాడు. దుష్టశక్తి, దైవశక్తిల పోరాటంలో పైచెయి దుష్టశక్తిదే ప్రతిసారి కనిపించడంతో ప్రేక్షకులలో విసుగు తెప్పిస్తుంది. హార్రర్ సినిమా అంటే భయపడుతారని అందరిలో అంచనాలు ఉంటాయి. కానీ, అలాంటిదేవీ ఇందులో ఉండదు.. పైగా హత్యలకు సంబంధించిన వయలెన్స్ సీన్లే ఎక్కువగా కలవరపెడుతాయి. శివశక్తిగా తమన్నాకు మొదట ఇచ్చిన అంత ఎలివేషన్ దుష్టశక్తితో పోరాడే విషయంలో ఎంతమాత్రం దాని ప్రభావం చూపించలేదు. కథలో చాలాసార్లు రిపీటెడ్ సీన్లే ఎక్కువగా కనిపిస్తాయి. సినిమా మొత్తానికి చివరి 15 నిమిషాలు చాలా హైప్ ఉంటుంది. అక్కడ మాత్రమే శివశక్తిగా తమన్నా విశ్వరూపం చూడొచ్చు.. ఈ సినిమాకు బలం తమన్నా నటన మాత్రమే.. శివశక్తిగా విశ్వరూపం చూపించాల్సిన పాత్రకు ఎలాంటి శక్తులు లేకుండా ప్రేక్షకులకు చూపించడాన్ని పెద్దగా కనెక్ట్ కాలేరు. సినిమా చివరి వరకు కూడా దుష్టశక్తి మీద దైవశక్తి పైచెయి అనేది కనిపించకపోవడం అంతగా రుచించదు. ప్రేతాత్మకు, పంచాక్షరీ మంత్రానికి మధ్య జరిగిన యుధ్దం అని చెప్పినప్పటికీ కనీసం దైవశక్తికి ఉన్న బలం ఏంటి అనేది దర్శకుడు చివరి వరకు చూపించకపోవడం పెద్ద పొరపాటుగా చెప్పవచ్చు. అయితే, పార్ట్-3 కూడా ప్రకటించారు. అందులో శివశక్తిగా (తమన్నా) పాత్ర బలంగా ఉండబోతుందేమో తెలియాల్సి ఉంది.ఎవరెలా చేశారంటే..ఓదెల-2 కేవలం తమన్నా కోసం మాత్రమే వెళ్లోచ్చు. తన ఎంట్రీ ఆలస్యంగా ఉన్నప్పటికీ కొత్తగా ఉంటుంది. ఇంటర్వెల్ సీన్లో తమన్నాను చూస్తే గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలు మాత్రమే చేసిన తమన్నా మొదటిసారి శివశక్తిగా అదరగొట్టేసింది. ఆ తర్వాత ఈ మూవీకి అజనీష్ లోక్‌నాథ్ ఇచ్చిన బీజీఎమ్‌తో పాటు సంగీతం సూపర్బ్ అనిచెప్పవచ్చు. తమన్నా ఎంట్రీ సీన్‌తో పాటు క్లైమాక్స్‌లో అదరగొట్టేశాడని చెప్పవచ్చు. ఆపై సౌందర్ రాజన్.ఎస్ అందించిన సినిమాటోగ్రఫీ కథకు బాగా సెట్ అయింది. ముఖ్యంగా రాత్రి సమయంలో తీసిన సీన్స్ బాగున్నాయి. అక్కడక్కడా ప్రేక్షకులను భయపెట్టే వర్క్ కెమెరాలతో తను మాత్రమే చేశాడని చెప్పవచ్చు. ఓదెల2లో ఎక్కువగా రిపీటెడ్ సీన్స్ వస్తున్నాయనే ఫీలింగ్ చాలామందిలో కలుగుతుంది. ఇంకాస్త కత్తెరకు పనిచెప్పింటే బాగుండు. బడ్జెట్ మేరకు వీఎఫ్ఎక్స్, నిర్మాణ విలువలు ఫర్వాలేదనిపిస్తాయి. తిరుపతి (వశిష్ఠ) ప్రేతాత్మగా చాలా బాగా చేశాడు. తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. కానీ, శివశక్తిగా (తమన్నా) పాత్రను అత్యంత బలహీనంగా రాసుకోవడమే ఈ సినిమాకు పెద్ద మైనస్.. తమన్నా పాత్ర కాస్త పవర్‌ఫుల్‌గా ఉండుంటే ఓదెల-2 బ్లాక్‌బస్టర్ గ్యారెంటీ అని చెప్పవచ్చు. -
OTT Movie Review: వీడి జాతకంలో పెళ్లి లేదా?
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం ఒరు జాతి జాతకం(Oru Jati Jathakam) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.కల్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. కానీ పెళ్లి యోగమే లేని మన కథానాయకుడు తన పెళ్లి కోసం చేసే ప్రయత్నాల హడావిడే ఈ ‘ఒరు జాతి జాతకమ్’ సినిమా. గతంలో ఇదే కథాంశం మీద ఎన్నో సినిమాలు వచ్చి ఉండొచ్చు గాని ఈ సినిమా మాత్రం డిఫరెంట్. ఇంకా చె΄్పాలంటే... ఇదో హైబ్రిడ్ పీస్. మోహనన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వినీత్ శ్రీనివాసన్ కథానాయకుడు. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... జయేష్‌కు 30 సంవత్సరాలు వచ్చినా ఏ సంబంధం కుదరదు. పెళ్లి కోసం జయేష్ పరితపిస్తుంటాడు. అంతేనా ఏకంగా మ్యారేజ్ ఏజెన్సీకి లైఫ్ టైమ్ మెంబరై వాళ్లని వేధిస్తుంటాడు. ఈ కోవలోనే శినిత అనే అమ్మాయి సంబంధం తెలుస్తుంది. శినిత తాను పామిస్ట్రీ చదివానని, జయేష్ చేయి చూస్తానని చెబుతుంది. ఇక అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. జయేష్ చేయి చూసిన శినిత... జయేష్ జీవితంలో అనుకోని సంఘటనలు చాలా జరుగుతాయని, ఓ వ్యక్తి జయేష్ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుందని అలాగే జయేష్‌కి వివాహం విచిత్రంగా అయ్యే అవకాశం కనబడుతోందని, అంతేకాదు... ఆ వివాహం వల్ల కొన్ని వర్గాల మధ్య కొట్లాటలు కూడా జరుగుతాయని చెబుతుంది.అయితే జయేష్‌కు తనతో వివాహం చేసుకునే రాత కనిపించలేదని చెప్పి వెళ్లిపోతుంది శినిత. ఈ శినిత క్యారెక్టర్ ఆఖర్లో కడుపుబ్బా నవ్విస్తుంది. ఈలోపు జయేష్‌కు తన కుటుంబం నుండి అనుకోని సమస్యలు చాలానే వచ్చి పడతాయి. మరి... జయేష్‌కు పెళ్లవుతుందా? లేదా అన్నది మాత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘ఒరు జాతి జాతకమ్’ సినిమాలో చూడాలి. ఈ సినిమా మాత్రం ఆద్యంతం కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. ఇది వేరే లెవెల్ కామెడీ అని చెప్పవచ్చు. దర్శకుడు తన కథానాయకుడు ఎలా నటించాలని అనుకున్నారో అంతకు వేయి రెట్లు వినీత్ వినూత్నంగా నటించారు. ఇట్స్ ఎ మస్ట్ వాచబుల్ కామెడీ ఫిల్మ్. – హరికృష్ణ ఇంటూరు -
చెబితే బూతులా ఉంటుంది.. ఓటీటీ మూవీ రివ్యూ
కొన్ని సినిమాలు చూసినప్పుడు అసలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది? ఒకవేళ వచ్చిన ఎలా తీసారబ్బా అని మనం అనుకుంటాం. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో తెలుగులోనూ రిలీజైన ఓ మూవీ చూస్తే సరిగ్గా ఇదే అనిపిస్తుంది. చెబితే బుతులా ఉంటుంది కానీ చూస్తుంటే తెగ నవ్వొస్తుంది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: మనోజ్‌ను పట్టుకుని ఏడ్చేసిన మంచు లక్ష్మి)కథేంటి?పరంధామయ్య ఓ పెద్దమనిషి. ఇతడికి స్వామి (సునీల్), దొర (వైభవ్) అని ఇద్దరు కొడుకులు. వీళ్లకు పెళ్లిళ్లు కూడా అయిపోయింటాయి. ఓ రోజు టీవీ చూస్తూ పరంధామయ్య చనిపోతాడు. కాకపోతే ఆయన విషయంలో బయటకు చెప్పుకోలేని ఓ సంఘటన జరుగుతుంది. అలా ఎందుకో జరిగిందో కుటుంబ సభ్యులకు అర్థం కాదు. దీంతో చావు గురించి బయటకు చెప్పలేని పరిస్థితి. మరి కుటుంబ పరువు ప్రతిష్టలు పోకుండా అంత్యక్రియలు ఎలా నిర్వహించారు? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?'పెరుసు' అంటే తెలుగులో పెద్దాయన అని అర్థం. ఊరికి పెద్దమనిషిలా ఉండే ఒకతను చనిపోతాడు. కాకపోతే అతడి శరీరంలో జరిగిన చిన్న మార్పు వల్ల కుటుంబానికి ఏం చేయాలో తెలియని పరిస్థితి. దాన్ని కవర్ చేసి ఎలా అంత్యక్రియలు చేశారనేదే స్టోరీ.చెబితే బూతులా అనిపిస్తుంది కానీ ఇలాంటి పాయింట్ తీసుకుని సినిమా తీయడమే షాకింగ్ అంటే.. దాన్ని కామెడీగా చెప్పాలనుకోవడం మరింత పెద్ద షాకిస్తుంది. ఎందుకంటే ఏ మాత్రం తేడా కొట్టినా నవ్వుల పాలైపోవడం గ్యారంటీ. కానీ దర్శకుడు చాలా జాగ్రత్తగా డీల్ చేశాడు.(ఇదీ చదవండి: స్టార్ హీరో కుమారుడితో అనుపమ డేటింగ్.. ముద్దు ఫోటోలు వైరల్)సినిమా మొదలైన ఐదు నిమిషాలకే కథలో కాన్ ఫ్లిక్ట్ పాయింట్ వస్తుంది. అక్కడి నుంచి తొలి 45 నిమిషాల పాటు శవం చుట్టూ జరిగే కామెడీ తెగ నవ్విస్తుంది. ఆ తర్వాత మాత్రం చాలాచోట్ల సాగతీతగా అనిపిస్తుంది. మళ్లీ చివరకొచ్చేసరికి క్లైమాక్స్ సర్ ప్రైజ్ చేస్తుంది.శవంతో కామెడీ చేయడం ఏంట్రా బాబు అనుకుంటే మాత్రం సినిమా అస్సలు చూడకండి. ఎందుకంటే ప్రతి సీన్ బూతులానే అనిపిస్తుంది. అడల్ట్ కామెడీ సినిమాలంటే ఇష్టముంటేనే దీన్ని చూడండి. లేదంటే మాత్రం ఒంటరిగా చూసేందుకు ప్రయత్నించండి. ఫ్యామిలీతో చూశారా మీరు బుక్ అయిపోతారు.ఎవరెలా చేశారు?పెద్దాయన కొడుకులుగా చేసిన వైభవ్, సునీల్ తమ తమ పాత్రల్లో జీవించేశారు. ఏ మాత్రం ఎక్కువ చేయకుండా కామెడీ భలే పండించారు. వీరికి తోడు భార్యలుగా నటించిన నిహారిక, చాందిని ఆకట్టుకున్నారు. రెడిన్ కింగ్ స్లీ, వీటీవీ గణేశ్ తదితరులు కూడా నవ్వించారు. మిగిలిన పాత్రధారులు కూడా జీవించేశారనే చెప్పాలి.సినిమా టెక్నికల్ గా భలే తీశారు. ఎందుకంటే రెండు గంటల సినిమాలో దాదాపు సీన్లన్నీ ఒక ఇంటిలో పెద్దాయన శవంతోనే ఉంటాయి. కానీ బోర్ కొట్టిన సందర్భాలు చాలా తక్కువ. సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. చివరకు డైరెక్షన్ గురించి చెప్పాలి. ఇళంగో రామ్.. బూతులా అనిపించే విషయాన్ని చాలా చాకచక్యంగా తీశాడు. మరి వీకెండ్ ఏదైనా డిఫరెంట్ గా ఉండే కామెడీ సినిమా చూద్దామనుకుంటే 'పెరుసు' ట్రై చేయండి. కాకపోతే ఒంటరిగానే చూడండి.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
'ప్రావింకుడు షప్పు' సినిమా రివ్యూ (ఓటీటీ)
మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎప్పటికప్పుడు సరికొత్త థ్రిల్లర్ సినిమాలు వస్తూనే ఉంటాయి. చాన్నాళ్లుగా ఈ ట్రెండ్ నడుస్తోంది. తాజాగా అలా 'ప్రావింకుడు షప్పు' పేరుతో ఓ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) కథేంటి?అడవికి సమీపంలో ఓ ఊరు. బాబు (శివజిత్) ఓ కల్లు దుకాణం నడుపుతూ ఉంటాడు. ఓ రోజు రాత్రి వర్షం కురుస్తుండటంతో ఇతడి షాపులో 11 మంది తాగుతూ తెల్లారేవరకు ఉండిపోతారు. ఓ సందర్భంగా బయటకొచ్చి చూస్తే బాబు.. దూలానికి కట్టిన ఉరితాడుకు వేలాడుతుంటాడు. దీంతో దర్యాప్తు చేయడానికి వచ్చిన పోలీస్ అధికారి సంతోష్ (బాసిల్ జోసెఫ్).. ఇది హత్య అని నిర్ధారిస్తాడు. 11 మందిలోనే నిందితుడు ఉన్నాడని అనుమానపడతాడు. చివరకు హత్య చేసినవాడు దొరికాడా? బాబుతో సునీ (చెంబన్ వినోద్), కన్నా (షౌబిన్ సాహిర్)కి గొడవేంటి? అనేదే మిగతా స్టోరీ. ఎలా ఉందంటే?సింపుల్ గా చెప్పుకొంటే.. ఓ మారుమూల గ్రామం, ఓ రాత్రి జరిగిన హత్య, 11 మంది అనుమానితులు.. మరి హంతకుడిని పోలీసులకు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీ. మలయాళంలో ఇదివరకే ఇలాంటి పాయింట్ తో చాలా సినిమాలు తీశారు. కాకపోతే ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ లో చెబుతారు. ఈ మూవీ విషయానికి వచ్చేసరికి డార్క్ క్రైమ్ జానర్ ని ఎంచుకున్నారు. కాకపోతే ఓకే ఓకే అనిపించేలా మాత్రమే తీయగలిగారు.(ఇదీ చదవండి: 'పుష్ప 2'తో ఫేమ్.. ఇప్పుడు కొత్త కారు) హత్య కేసులో 11 మంది అనుమానితులని విచారించినప్పుడు, వాళ్ల నుంచి ఒక్కో క్లూని లాగుతున్నప్పుడు సీన్స్ థ్రిల్లింగ్ గా అనిపించాలి. కానీ ఇందులో చాలాచోట్ల విసుగు పుడుతుంది. తొలుత కల్లు దుకాణంలో పనిచేసే కన్నాని పోలీసులు అనుమానిస్తారు. తర్వాత కాసేపటి సునీ అనే వ్యక్తిపై సందేహం వస్తుంది. తర్వాత మెరిండా అనే పాత్ర ఎంటరవుతుంది. వీళ్లలో దొంగ ఎవరనేది మూవీ చూసే తెలుసుకోవాలి.కథ పరంగా పెద్దగా ఆకట్టుకోనప్పటికీ సాంకేతికంగా మాత్రం అలరిస్తుంది. విజువల్స్ తో పాటు నేపథ్య సంగీతం బాగుంది. లొకేషన్స్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తాయి. డైరెక్టర్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి సరైన సీన్స్ రాసుకుని ఉంటే మంచి థ్రిల్లర్ అయ్యేది.నటీనటుల విషయానికొస్తే.. విచిత్రంగా ప్రవర్తించే పోలీస్ అధికారి సంతోష్ గా బాసిల్ జోసెఫ్ నటన ఆకట్టుకుంది. కన్నా పాత్రలో సౌబిన్ షాహిర్, సునీ పాత్రలో చెంబన్ వినోద్ చెప్పుకోదగ్గ పాత్రలు. వాటిని సునాయసంగా చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగతా పాత్రధారులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.ఓవరాల్ గా చెప్పుకొంటే.. రీసెంట్ టైంలో వచ్చిన మలయాళ థ్రిల్లర్స్ తో పోలిస్తే ఇది తేలిపోయింది. టైమ్ పాస్ కోసం చూద్దామనుకుంటే మాత్రం ఓసారి ట్రై చేయొచ్చు.-చందు డొంకాన(ఇదీ చదవండి: జాన్వీ కపూర్‌కు లంబోర్గిని కారు గిఫ్ట్) -
మిస్టర్ హౌస్‌కీపింగ్ రివ్యూ.. ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం మిస్టర్ హౌస్ కీపింగ్(Mr. Housekeeping) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సౌత్ సినిమాలకు ఓ రకమైన నేటివిటీ ఉంటుంది. ఆ చిత్రాలు భారతదేశంలోని ఏ భాషలో అనువాదమైనా ప్రేక్షకులు మన కథలు అనుకొని ఆదరిస్తారు. చిన్న లైన్ తీసుకుని ఆ లైన్‌కు రసవత్తరమైన స్క్రీన్‌ప్లే జోడించి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు సౌత్ దర్శకులు. అందులో తమిళ దర్శకులు కూడా ఉన్నారు. ఆ కోవలోనే తమిళ దర్శకుడైన అరుణ్ రవిచంద్రన్ ఓ రొటీన్ లవ్ స్టోరీలా తలపించే చిన్న లైన్ తీసుకుని, దానికి బ్యాక్‌గ్రౌండ్‌లో చక్కటి మెసేజ్‌ని ఇస్తూ, అద్భుతమైన కామెడీ అనే మసాలాని జోడించి ‘మిస్టర్ హౌస్ కీపింగ్’ అనే మెగా థాళి లాంటి సినిమా భోజనాన్ని ప్రేక్షకుడి ముందు వడ్డించారు.ఇంకేముందీ... ప్రేక్షకులు లొట్టలేసుకొని మరీ ఆస్వాదిస్తున్నారు ఈ సినిమాని. మరి... అంతలా ఏముంది ఈ సినిమాలో ఓసారి చూద్దాం. హానెస్ట్ రాజ్ కాలేజ్ రోజుల నుంచి ఇసాయ్తో ప్రేమలో ఉంటాడు. కానీ ఇసాయ్ మాత్రం రాజ్‌ను ప్రేమించదు... సరి కదా హానెస్ట్ రాజ్ చేసే పనులతో విసిగి వేసారి పోయి ఉంటుంది. హానెస్ట్ రాజ్ మరీ బద్ధకస్తుడు. ఎంతలా అంటే తిన్నాక హోటల్లో సర్వ్ చేసినట్లు ఇంట్లో కూడా చేతులు కడుక్కోవడానికి ఫింగర్ బౌల్‌ని కోరుకుంటాడు. హానెస్ట్ రాజ్ అమ్మకు కొడుకు అంటే బాగా గారాబం. తండ్రి మాత్రం రోజూ రాజ్ మీద చిటపటలాడుతుంటాడు.ఓ రోజు అనుకోకుండా తన తండ్రి ఫోన్ ద్వారా ఓ బ్లాక్ మెయిలింగ్ గ్యాంగ్‌కి కనెక్ట్ అవుతాడు రాజ్. వాళ్లకి 5000 రూపాయలు ఇవ్వవలసి వస్తే తెలియకుండానే హౌస్ కీపింగ్ టీమ్‌లో చేరతాడు. అనుకోకుండా హానెస్ట్ రాజ్ తాను కాలేజీలో ప్రేమించిన ఇసాయ్ వాళ్లింటికే హౌస్ కీపింగ్‌కి వెళతాడు. ఇసాయ్ ఇల్లు అని రాజ్‌కి తెలిసి నాలుక్కరుచుకుని ఇసాయ్ని బ్రతిమలాడి పనికి కుదురుతాడు. ఇసాయ్కి తన కొలీగ్ హరీష్ నచ్చి, పెళ్లి కుదుర్చుకుంటుంది. కానీ ఇసాయ్ ఇంట్లో పని చేస్తున్న రాజ్ మాత్రం ఇసాయ్ తనను ప్రేమిస్తుందని అనుకుంటాడు. మరి... పనివాడిగా వచ్చిన రాజ్... ఇసాయ్ మనసు గెలుచుకుంటాడా? హరీష్‌తో పెళ్లి కుదిరిన ఇసాయ్... రాజ్ ప్రేమను అంగీకరిస్తుందా? అన్నది ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న ‘మిస్టర్ హౌస్ కీపింగ్’లో చూడాల్సిందే. నేటి తరం చూడాల్సిన సినిమా ఇది. అలాగే లివింగ్ టు గెదర్ అనే ట్రెండ్‌ను విడమర్చి సినిమా భాషలో అర్థం చెప్పిన దర్శకుడికి హ్యాట్సాఫ్. ఉద్యోగస్తులు తమ తల్లి, తండ్రులతో కలిసి చూసి, చాలా తెలుసుకోవాల్సిన సినిమా ఇది. వాచ్ దిస్ విత్ యువర్ ఫ్యామిలీ.– హరికృష్ణ ఇంటూరు -
'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' రివ్యూ.. నవ్వులతో మెప్పించారా?
టైటిల్ : అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’నటీనటులు: ప్రదీప్ మాచిరాజు, దీపికా పిల్లి, వెన్నెల కిశోర్, బ్రహ్మానందం, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్,రోహిణి, ఝాన్సీ తదితరులునిర్మాణ సంస్థలు: మాంక్స్ అండ్ మంకీస్‌నిర్మాత: మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్‌ఎడిటింగ్: కొడాటి పవన్ కల్యాణ్‌దర్శకత్వం, స్క్రీన్‌ప్లే: నితిన్–భరత్‌కథ, డైలాగ్స్: సందీప్ బొల్లాసంగీతం: రధన్సినిమాటోగ్రఫీ: ఎమ్ఎన్ బాల్‌రెడ్డివిడుదల: ఏప్రిల్ 11, 2025‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ సినిమాతో హీరోగా పరిచయమైన ప్రదీప్ మాచిరాజు నటించిన కొత్త చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’(Akkada Ammayi Ikkada Abbayi) నేడు ఏప్రిల్ 11న విడుదలైంది. ఇందులో దీపికా పిల్లి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. నితిన్–భరత్ దర్శకత్వంలో మాంక్స్ అండ్ మంకీస్ ఈ మూవీని నిర్మించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ ప్రాజక్ట్ ద్వారా చాలామంది కొత్తవాళ్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సంగీతం రధన్ అందించారు. ఈ సినిమాలో దర్శకులతో పాటు హీరోయిన్ని కూడా బుల్లితెర వారినే తీసుకోవడం విశేషం. హీరోగా తన రెండో ప్రయత్నంలో ప్రదీప్ మాచిరాజు ఎలాంటి విజయాన్ని అందుకున్నాడో తెలుసుకుందాం.కథేంటి..?కథ మొదలు కావడమే తమిళనాడులోని భైరిలంక గ్రామం నుంచి మొదలౌతుంది. కొన్ని దశాబ్దాలుగా రాజన్న (జీఎమ్ సుందర్) కుటుంబానికి చెందిన వారే గ్రామ సర్పంచ్‌గా ఉంటారు. అయితే, తన తరంలో అయినా వారసత్వ రాజకీయం అంతం కావాలని ఆయన పెళ్లి కూడా చేసుకోడు. అలా ప్రజల బాగు కోసం రాజన్న ఎంతవరకైనా త్యాగం, దానం చేసేందుకు వెనకడుగు వేయడు. అయితే, ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో మగబిడ్డ మాత్రమే జన్మిస్తుండటంతో సర్పంచ్‌లో ఆందోళన మొదలౌతుంది. అలా 60 మంది తర్వాత రాజా (దీపికా పిల్లి) జన్మిస్తుంది. అప్పటి వరకు గ్రామంలో అలముకున్న అపశకునాలన్ని పోతాయి. రాజా పుట్టిన తర్వాత అక్కడ వర్షాలతో పాటు పంటలు బాగా పండుతాయి. ఆమె తమ గ్రామానికి అదృష్ట దేవత అని అందరూ భావిస్తారు. రాజా పెరిగి పెద్ద అయిన తర్వాత గ్రామం దాటనీయొద్దని, అదే గ్రామంలో ఉన్న 60 మందిలో ఒక్కరిని పెళ్లి చేసుకుని అక్కడే ఉండాలని సర్పంచ్ రాజన్న తీర్మానిస్తాడు. ఆమె ఎవరిని అయితే పెళ్లి చేసుకుంటుందో అతనే గ్రామ సర్పంచ్ అని, తనకు సంబంధించిన ఆస్తి అంతా ఆమె భర్తకే చెందుతుందని ప్రకటిస్తాడు. దీంతో ఆమెను పెళ్లి చేసుకోవాలని 60 మంది యువకులు పోటీ పడుతారు. ఇతర గ్రామాలకు చెందిన అబ్బాయిలను తమ ఊరిలో అడుగుపెట్టకుండా వారందరూ చూసుకుంటూ ఉంటారు. సరిగ్గా అలాంటి సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. అందులో భాగంగా వారి గ్రామంలో మొదట బాత్రూమ్లు నిర్మించాలని సర్పంచ్ అనుకుంటాడు. అందుకోసం ఇంజనీర్ అయిన కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) పట్నం నుంచి అక్కడకు వస్తాడు. మరో ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆ గ్రామంలో అడుగుపెట్టడం ఆ 60మందికి నచ్చదు. రాజాను పెళ్లి చేసుకునేందుకు అతను ఎక్కడ పోటీకి వస్తాడో అని వారు అడ్డుపడుతారు. అలాంటి సమయంలో ఫైనల్‌గా అక్కడ పనులు ప్రారంభం అవుతాయి. ఒకరోజు రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) ఇద్దరూ అనుకోకుండా కలవడం ఆపై ప్రేమలో పడిపోవడం జరిగిపోతుంది. అయితే, రాజా, కృష్ణల పెళ్లికి ఉన్న అడ్డంకులు ఏంటి..? వారి ప్రేమ విషయం తెలుసుకున్న గ్రామ పెద్దలందరూ కృష్ణకు పెట్టిన పరీక్ష ఏంటి..? రాజాను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ 60 మంది కలిసి కృష్ణను ఏం చేశారు..? ఫైనల్‌గా వారిద్దరూ ఒక్కటి అవుతారా..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సినిమా మొత్తం నవ్వులతోనే కొనసాగుతుంది. మంచి వినోదాన్ని పంచి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే దర్శకులు నితిన్–భరత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పవచ్చు. కథ పరిచయాన్నే చాలా ఆసక్తిగా చెప్పారు కానీ, ఇంటర్వెల్ తర్వాత కాస్త తడబడ్డారు. ఒక్క అమ్మాయి కోసం 60మంది పెళ్లి చేసుకోవాలని పోటీ పడటం చాలా ఫన్నీగా దర్శకుడు చూపాడు. ఈ క్రమంలో ఆమెను దక్కించుకునేందుకు వారందరూ పడుతున్న పాట్లు మామూలుగా ఉండవు. ప్రశాంతంగా ఉన్న ఆ గ్రామంలోకి ఒకరోజు సడెన్‌గా కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) రావడంతో వారిలో అందోళన మొదలౌతుంది. ఆ గ్రామంలోకి కృష్ణతో పాటు బిలాల్ (సత్య) కూడా కారు డ్రైవర్‌గా ఎంట్రీ ఇస్తాడు. 60మంది గ్యాంగ్‌లో పని (గెటప్ శ్రీను) ఉంటాడు. వారందరి చుట్టే కథ రన్ అవుతుంది. పల్లెటూరి అమ్మాయితో పట్నం నుంచి వచ్చిన అబ్బాయి ప్రేమలో పడటం, వారి ప్రేమ కథలో చిన్నచిన్న ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఫీల్‌గుడ్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. కథాపరంగా సినిమాలో కొత్తదనం లేకపోయినా గెటప్ శ్రీను, సత్యల మధ్య వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్రధాన బలం అని చెప్పవచ్చు. వారు స్క్రీన్‌పై కనిపించే ప్రతిసీన్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వుతారు. వారి పంచ్‌లు, ప్రాసలు గట్టిగానే పేలాయి.రాజా (దీపికా పిల్లి), కృష్ణ (ప్రదీప్ మాచిరాజు) ఇద్దరి జోడీ సరిగ్గా సెట్ అయింది. 60మంది కళ్లుకప్పి వారిద్దరూ సీక్రెట్‌గా పదేపదే కలుసుకునే సీన్లు బాగుంటాయి. వెన్నెల కిషోర్, బ్రహ్మానందం ఇద్దరూ కామియో రోల్స్‌లో ఎంట్రీ ఇస్తారు. ఉన్నది కొద్దిసేపు మాత్రమే అయినా బాగా ఫన్ ఉంటుంది. గ్రామీణ ప్రాంతం నుంచి ఆ గ్యాంగ్ మొత్తం సిటీకి చేరుకున్న తర్వాత సినిమా కాస్త నెమ్మదిస్తుంది. అక్కడి నుంచి పంచ్ డైలాగ్స్, కామెడీ అంతగా మెప్పించేలా ఉండవు. అలా ఫస్టాఫ్‌లో ఉన్న బలం సెకండాఫ్‌లో ఉండదు. సినిమాకు కాస్త ఇదే మైనస్ అని చెప్పవచ్చు. సినిమా క్లైమాక్స్ సీన్ మరీ కామెడీగా ఉంటుంది. ఇలా కూడా సినిమాను ముగించేయవచ్చా అనే సందేహం ప్రేక్షకులలో రావడం ఖాయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు చాలా వీక్.. అవి పదే పదే రావడం వల్ల ప్రేక్షకులలో విసుగును తెప్పిస్తాయి.ఎవరెలా చేశారంటే..గెటప్ శ్రీను, సత్య కామెడీ కోసం ఈ సినిమా తప్పకుండా చూడొచ్చు. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వారిద్దరే.. తమ పాత్రలతో నవ్విస్తూ దుమ్మురేపారని చెప్పవచు. ఆ తర్వాత హీరోయిన్ దీపిక తన పాత్రలో బాగా సెట్ అయిపోయింది. తను యాంకర్‌గా పలు వేదికలపై రాణించిన అనుభవం ఉండటంతో ఈజీగా తన పాత్రలో నటించేసింది. ప్రదీప్‌కు ఇదీ రెండో సినిమా కావడంతో సులువుగానే కనెక్ట్ అయిపోయాడు. అతని డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ బాగున్నప్పటికీ అక్కడక్కడా కొంత తడబాటుకు లోనయ్యాడని చెప్పవచ్చు. ప్రదీప్ తల్లిదండ్రులుగా మురళీధర్ గౌడ్,రోహిణి తమ పరిదిమేరకు మెప్పించారు. పాన్ ఇండియా పెళ్లిళ్ల బ్రోకర్‌గా బ్రహ్మాజీ కనిపించింది కొంతసేపు మాత్రమే.. అయినా తన పాత్రకు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. సంగీతం, కెమెరామెన్ పనితీరు బాగుంది. చిన్న బడ్జెట్ సినిమాలకి ఈ స్థాయి టెక్నికల్ క్వాలిటీస్ ఉండటం చాలా అరుదు. కథ బలం ఉన్నంతమేరకు నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రదీప్, దీపిక, గెటప్ శ్రీను, సత్య అభిమానులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఆపై కామెడీని ఇష్టపడే వారు హ్యాపీగా వెళ్లొచ్చు.. -
అజిత్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్.. 'గుడ్ బ్యాడ్ అగ్లీ' ఎలా ఉందంటే?
టైటిల్: గుడ్ బ్యాడ్ అగ్లీనటీనటులు: అజిత్ కుమార్, త్రిష, సునీల్, అర్జున్ దాస్, జాకీ ష్రాఫ్, సిమ్రాన్ తదితరులుదర్శకత్వం: అధిక్ రవిచంద్రన్నిర్మాణ సంస్థ: మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: నవీన్ యేర్నేని, వై రవిశంకర్ఎడిటర్: విజయ్ వేల్‌కుట్టిసినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజంసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్విడుదల తేదీ: ఏప్రిల్ 10, 2025విదాముయార్చి తర్వాత కోలీవుడ్ స్టార్ అజిత్ కుమార్ నటించిన చిత్రం 'గుడ్ బ్యాడ్ అగ్లీ'. విదాముయార్చి ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో తాజా యాక్షన్ థ్రిల్లర్‌పై అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాక్షన్ హీరోగా పేరున్న అజిత్.. ఈ సినిమాతో అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులతో గుడ్ అనిపించాడా? లేదా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.గుడ్ బ్యాడ్ అగ్లీ కథేంటంటే..ముంబయిలో పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ ఏకే(అజిత్ కుమార్) అలియాస్ రెడ్ డ్రాగన్. అతనంటే విదేశాల్లో ఉండే గ్యాంగస్టర్లకు సైతం హడల్. అలా వరల్డ్ ఫేమస్ గ్యాంగ్‌స్టర్ అయిన ఏకే.. తన భార్య రమ్య(త్రిష) కోసం తన వృత్తిని వదిలేసేందుకు సిద్ధమవుతాడు. భార్యకు, తన కుమారుడు విహాన్‌కి (కార్తీక్ దేవ్) ఇచ్చిన మాట కోసం.. జైలుకు వెళ్తాడు. అలా జైలుకెళ్లిన ఏకే దాదాపు 17 ఏళ్ల తర్వాత విడుదలై.. 18వ పుట్టినరోజు నాడు తన కుమారుడిని చూసేందుకు వచ్చిన ఏకేకు ఊహించని పరిస్థితులు ఎదురవుతాయి? తండ్రి కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విహాన్.. ఒక అమ్మాయి ప్రేమ కారణంగా.. అనూహ్యంగా ఓ కేసులో జైలుకు వెళ్తాడు. అసలు కుమారుడిని చూసేందుకు వస్తున్న అజిత్‌ను టార్గెట్ చేసింది ఎవరు? తండ్రి వల్లే తన కుమారుడు జైలుకు వెళ్లాడని భావిస్తున్న రమ్య(త్రిష) ఆ తర్వాత ఏం చేసింది? అజిత్‌కు.. విహాన్ కేసుతో ఏమైనా సంబంధం ఉందా? లేదంటే త్రిష వల్లే విహాన్ కేసులో చిక్కుకున్నాడా? చివరికీ ఈ కేసు నుంచి తన కుమారుడిని అజిత్ బయట పడేశాడా? కుమారుడిని విడిపించుకునేందుకు త్రిష ఏం చేసింది? విహాన్ ప్రేమించిన అమ్మాయి ఎవరు? అనే విషయాలు తెలియాలంటే గుడ్ బ్యాడ్ అగ్లీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..గుడ్ బ్యాడ్ అగ్లీ..టైటిల్ వినగానే అందరికీ కాస్తా కొత్తగానే అనిపిస్తూ ఉండొచ్చు. ఇది చూసి సగటు ప్రేక్షకునికి అంతా ఫుల్ యాక్షన్, వయోలెన్స్ ఉంటుందేమో అనిపించి ఉంటుంది. ముంబయి బ్యాక్‌డ్రాప్‌లో మొదలైన ఈ కథ.. స్పెయిన్‌లో ముగించేలా ప్లాన్ చేశాడు డైరెక్టర్. యాక్షన్ హీరోగా పేరున్న అజిత్‌ను ప్రేక్షకుల అంచనాలకు తగినట్లుగానే డైరెక్టర్ చూపించాడు. ఫస్ట్ హాఫ్‌లో అజిత్ జైలు జీవితం, భార్య త్రిషతో ఉన్న అనుబంధం చుట్టూ తిరుగుతుంది. జైలులో అజిత్ ఫైట్ సీక్వెన్స్ అభిమానులకు మాత్రం హై ఫీస్ట్‌లా అనిపిస్తుంది. యాక్షన్ సినిమా అంటే అంతా రక్తపాతంలా ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు.. కానీ అధిక్ మాత్రం ఫైట్స్‌ను తనదైన డిఫరెంట్ స్టైల్లో చూపించారు. టాలీవుడ్ నటుడు సునీల్ స్టైల్ మాత్రం తెలుగు అభిమానులకు కొత్తగా అనిపిస్తుంది.జైలు నుంచి రిలీజ్‌కు ఇంకా మూడు నెలలు ఉండగా.. ముందుగానే అజిత్ బయటికి రావడం..ఆ తర్వాత జరిగే పరిణామాలు సగటు ప్రేక్షకునికి రోటీన్‌గానే అనిపిస్తాయి. కానీ ఏకే బయటికి వచ్చాకే అసలు కథ మొదలవుతుంది. అలా ఇంటర్వెల్‌కు ముందు ఓ బిగ్ ఫైట్ సీన్‌తో బ్యాంగ్ పడేశాడు. ఇక్కడే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుందన్న టైమ్‌లోనే ఇంటర్వెల్‌కు ముందు ప్రధాన ప్రతినాయకుడు అర్జున్ దాస్(జానీ)కి సంబంధించిన ట్విస్ట్ రివీల్ కావడంతో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ మిస్సవుతుంది. ట్విస్ట్‌లు కాస్తా రివీల్ చేయడంతో సెకండాఫ్ ఆడియన్స్ ఉహకందేలా చేశాడు దర్శకుడు. అయితే ఫైట్ సీక్వెన్స్‌లో జీవీ ప్రకాశ్ బీజీఎం మాత్రం అదిరిపోయింది. అలాగే సాంగ్స్ కూడా ఫర్వాలేదనిపిస్తాయి.ఇక ద్వితీయార్థం వచ్చేసరికి ముంబయితో పాటు ప్రపంచవ్యాప్తంగా గ్యాంగస్టర్లకు సైతం చెమటలు పట్టించే రెడ్ డ్రాగన్‌గా ఏకే ఎలా మారాడు? అతని ప్రస్థానం ఎలా మొదలైంది? అనే అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్ టీమ్ చేసే ఫైట్స్ ఆకట్టుకునేలా ఉన్నా.. కొత్తదనం లేకపోవడంతో సగటు ప్రేక్షకుడికి కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తాయి. కానీ యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం విజువల్ ఫీస్ట్ అనే చెప్పొచ్చు. కుమారుడి(విహాన్) కోసం ఏకే చేసే పోరాట సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే సెకండాఫ్‌లో సిమ్రాన్(సుల్తానా) ఎంట్రీతో ఫుల్ యాక్షన్ మోడ్‌లో సాగుతున్న కథలో కామెడీ పండించాడు. సాంగ్స్‌లో ఎక్కువగా తమిళం స్లాంగ్ రావడంతో తెలుగు ఆడియన్స్‌కు అంతా ఆసక్తిగా అనిపించదు. క్లైమాక్స్ సీన్ వచ్చేసరికి.. అర్జున్ దాస్‌తో ఫైట్స్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోయింది. క్లైమాక్స్ యాక్షన్ సీన్స్‌లోనూ కామెడీ పండించడం అధిక్ రవిచంద్రన్‌కే సాధ్యమైంది. చివర్లో కేజీఎఫ్, యానిమల్ మూవీ స్టైల్లో క్లైమాక్స్ ఉండడంతో కొత్తగా అనిపించదు. చివరికీ మనం బ్యాడ్ నుంచి గుడ్‌గా మారినా.. మనల్ని మళ్లీ బ్యాడ్ వైపే తీసుకెళ్తే ఎలా ఉంటుందనేది గుడ్ బ్యాడ్ అగ్లీతో సందేశమిచ్చాడు డైరెక్టర్. యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారికి మాత్రం ఫుల్ మీల్స్.. అలా కాకుండా ఏదైనా కొత్తదనం ఉంటుందన్న ఆశతో వెళ్తే మాత్రం బ్రేక్ ఫాస్ట్ చేసిన ఫీలింగ్‌తో బయటికొస్తారు.ఎవరెలా చేశారంటే..యాక్షన్ హీరోగా పేరున్న అజిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే ఏకే స్టైల్లో మరోసారి అదరగొట్టారు. త్రిష తన పాత్రలో జీవించేసింది. సీనియర్ హీరోయిన్గా తన నటనతో అభిమానులను ఆకట్టుకుంది. టాలీవుడ్ నటుడు సునీల్, కోలీవుడ్ కమెడియన్ కింగ్స్లే, సిమ్రాన్, ప్రకాశ్ దేవ్, ప్రభు, ప్రసన్న, టినూ ఆనంద్, జాకీ ష్రాఫ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ప్రతి నాయకుడిగా అర్జున్ దాస్ డిఫరెంట్ స్టైల్లో ఆకట్టుకున్నారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ బాగుంది. జీవీ ప్రకాశ్ బీజీఎం ఈ సినిమాకు అదనపు బలం. అలాగే నేపథ్య సంగీతం కూడా ఫర్వాలేదు. ఎడిటర్ విజయ్ వేల్‌కుట్టి కొన్ని సీన్స్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
జాబిలమ్మ నీకు అంత కోపమా.. సినిమా రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనేప్రా జెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘నిలవక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ (Nilavuku En Mel Ennadi Kobam) ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.సినిమా అనేది 24 కళలతో రూపొందేది. అంటే 24 కళలకు సంబంధించిన కళాకారులు ఓ సినిమా కోసం పని చేస్తారన్నమాట. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. మల్టీ టాలెంటెడ్ ఇండస్ట్రీలోకి వస్తున్నారు. 24 కళలలో ఓ మూడు నాలుగు కళలు ఒక్కరే చేసేస్తున్నారు. అలా సినిమాలోని కొన్ని శాఖలను ఒక్కరే చేసి, ఓ సినిమాకి సింగిల్ కార్డుతో 80వ దశకంలోనే ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావుగారు శ్రీకారం చూట్టారు. ఇప్పుడు మళ్లీ ఆ ట్రెండ్ కొనసాగుతోంది.‘నిలవక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబమ్’ అనేది ఓ తమిళ సినిమా. ‘జాబిలమ్మ నీకు అంత కోపమా’ అన్నది తెలుగు డబ్బింగ్ వెర్షన్. ప్రముఖ హీరో ధనుష్ తాను కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. తాను రాసిన కథకు తానే నిర్మాతగా వ్యవహరించడంతో పాటు దర్శకత్వం కూడా చేశారు. ఇది ఓ రకంగా రిస్క్ అనే చెప్పాలి. అయినా ఈ సినిమాని మాత్రం ఈ తరం యంగ్ జనరేషన్‌తో పాటు నిన్న, మొన్నటి తరాలకు కూడా నచ్చే విధంగా తీర్చిదిద్దారు ధనుష్. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులను కదలనివ్వదు. అంత ప్లెజెంట్‌గా ఉంటుంది.సినిమా టైటిల్ కూడా కొంటెగా పెట్టడంలోనే తెలిసిపోతుందీ సినిమా విషయం. ఈ చిత్రం తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియోలో లభ్యమవుతోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే... ప్రభు ఓ మంచి చెఫ్. తన గర్ల్‌ఫ్రెండ్ నిలాతో విడిపోయిన తరువాత ప్రభు తల్లిదండ్రులు ప్రీతితో వివాహం నిశ్చయించి, సంబంధం కుదుర్చుకోవడానికి ప్రీతి ఇంటికి వస్తారు. ఆ సమయంలో ప్రీతికి నిలా కథ చెబుతాడు. నిలా, ప్రభు ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన పార్టీలో కలిసి ప్రేమలో పడతారు. ఓ అనుకోని సంఘటన వల్ల నిలాకి దూరమవుతాడు ప్రభు. దాంతో నిలాకి కోపమొచ్చి తండ్రి చూసిన సంబంధానికి తలూపుతుంది. నిలా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని స్నేహితులందరినీ గోవాకి పిలుస్తుంది. నిలా పెళ్లి ఆహ్వానం ప్రభుకి కూడా అందుతుంది. ప్రభు ఫ్రెండ్స్ అందరూ అతన్ని వారించినా నిలా పెళ్లికి వెళతాడు. తన మాజీ ప్రేయసి పెళ్లికి వెళ్లిన ప్రభుకి అక్కడ ఎదురైన పరిస్థితులేంటి? తరువాత ప్రీతి పరిస్థితి ఏంటి? అన్నది మాత్రం సినిమాలోనే చూడాలి. ఇది చాలా సింపుల్ స్టోరీ. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నారు ధనుష్. ఈ సినిమాలోని పాత్రధారులంతా ఫ్రెష్‌గా అనిపించడంతో పాటు ప్రతి పాత్ర ప్రేక్షకులను కనువిందు చేస్తుందనే చెప్పాలి. హ్యాట్సాఫ్ టు ధనుష్. మస్ట్ వాచ్ ఫర్ ది వీకెండ్. – హరికృష్ణ ఇంటూరు -
'టెస్ట్' సినిమా రివ్యూ.. నయనతార, మాధవన్ మెప్పించారా..?
చిత్రం: టెస్ట్నటీనటులు: ఆర్. మాధవన్, నయనతార, సిద్ధార్థ్, మీరా జాస్మిన్, కాళీ వెంకట్, నాజర్ తదితరులు దర్శకత్వం: ఎస్.శశికాంత్నిర్మాతలు: ఎస్.శశికాంత్, రామచంద్రసినిమాటోగ్రఫీ: విరాజ్ సింగ్ గోహిల్సంగీతం: శక్తిశ్రీ గోపాలన్నిర్మాణ సంస్థలు: వైనాట్ స్టూడియోస్స్ట్రీమింగ్ వేదిక: నెట్ఫ్లిక్స్భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతం.. అందుకే ఈ ఆట చుట్టూ చాలా సినిమాలు వచ్చాయి. టెస్ట్( Test) సినిమాలో కేవలం ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎంచుకుని అందులో క్రికెట్‌ను ప్రధాన అంశంగా జోడించి దర్శకుడు శశికాంత్ తెరకెక్కించాడు. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో నయనతారతో(Nayanthara) పాటు మాధవన్, సిద్ధార్థ్ (Siddharth) లీడ్ రోల్స్ చేశారు. మీరా జాస్మిన్ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఏప్రిల్ 4న ఈ చిత్రాన్ని థియేటర్లో కాకుండా నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల చేశారు. తమిళ్,తెలుగు,హిందీ,కన్నడ,మలయాళంలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.కథేంటంటే.. చెన్నైలో జరిగిన ఓ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురు వ్యక్తుల జీవితాలను ఎలా మార్చేసింది అనేది ఈ సినిమా కథ. సినిమా మొత్తం మూడు పాత్రల చుట్టే తిరుగుతుంది. కుముద (నయనతార ) ఒక స్కూల్ టీచర్‌గా పనిచేస్తూ సరోగసి ద్వారా బిడ్డను కనాలనుకుంటుంది. కుముద భర్త శరవణన్ (ఆర్ మాధవన్) భారతదేశంలోనే బెస్ట్ సైంటిస్ట్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కుముద స్కూల్‌మేట్ అర్జున్ (సిద్ధార్థ్) స్టార్ క్రికెటర్‌గా గుర్తింపు ఉన్నప్పటికీ ఫామ్ కోల్పోయి భారత జట్టులో స్థిరమైన స్థానం సంపాదించుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇలా ముగ్గురు తమ కోరికలను ఎలాగైన సరే నెరవేర్చుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో వారి లైఫ్‌లోకి బెట్టింగ్ మాఫియా ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఎవరు ఎలాంటి తప్పులు చేస్తారు అనేది దర్శకుడు చూపారు. చెన్నైలో ఇండియా, పాక్ మధ్య జరిగే టెస్ట్ మ్యాచ్‌తో వీరి ముగ్గురి జీవితాలు ఆధారపడి ఉంటాయి. శరవణన్ సైంటిస్ట్‌గా తను కనుగొన్న ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం రూ. 50 లక్షలు అప్పు చేస్తాడు. కానీ, అది ముందుకు సాగదు. అర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో కుమదతో శరవణ్‌కు గొడవలు వస్తాయి. గొప్ప చదవులు పూర్తి చేసినప్పటికీ జీవితంలో ఏమీ సాధించలేని అసమర్థుడిగా మిగిలిపోతానేమో అనుకున్న శరవణన్.. అర్జున్ కొడుకుని కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. శరవణన్‌కు బెట్టింగ్ మాఫియాతో ఎలా లింక్ ఏర్పడుతుంది..? తన స్నేహితుడి కుమారుడిని కిడ్నాప్ చేసినా కూడా అర్జున్‌కు కుముద ఎందుకు చెప్పదు..? కుమారుడిని కూడా పనంగా పెట్టి అర్జున్ ఎందుకు ఆడుతాడు..? ఈ తతంగం అంతా పోలీసులు ఎలా పసిగడుతారు..? చివరకు ఈ ముగ్గురి జీవితాలు ఎలా ముగిసిపోతాయి..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..దర్శకుడు కథ చెబుతున్నప్పుడు అద్భుతంగా అనిపించే నయనతార, సిద్దార్థ్, మాధవన్ ఒప్పుకొని ఉండొచ్చు. కానీ, స్క్రీన్‌పై స్టోరీ చూపించడంలో డైరెక్టర్ శశికాంత్ ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. మిడిల్‌క్లాస్ జీవితాలను చూపించే సమయంలో ఎమోషన్స్ లేకపోతే ఆ సీన్స్ పెద్దగా కనెక్ట్ కావు. ది టెస్ట్ సినిమాలో అదే ఫీల్ కలుగుతుంది. సినిమా టైటిల్, ట్రైలర్‌ను చూసిన వారందరూ కూడా ఈ మూవీ మరో జెర్సీ లాంటి స్పోర్ట్స్ డ్రామా, థ్రిల్లర్ సినిమానే అనుకుంటారు. కానీ, ఇందులో ఆ రెండూ బలంగా లేవు. కథలో భాగంగా ప్రతి పాత్రలో ఎక్కువ షేడ్స్ కనిపించేలా ఉండాలి. ఆపై ఆ పాత్రల చుట్టూ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న తీరు ప్రేక్షకులకు దగ్గర చేయాలి. ఇవి ఏమీ ఇందులో ఉండవు. అర్జున్ ఒక స్టార్ క్రికెటర్. అతనికి కుముద తండ్రి కోచ్‌గా ఉండేవాడని చెప్తారు. అయితే, కుముదతో ఉన్న బాండింగ్‌ను దర్శకుడు చూపిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఒక ఆటగాడికి జట్టులో చోటు దక్కడం కష్టం అంటున్న సమయంలో బ్యాట్ పట్టుకొని ప్రాక్టీస్ చేసినట్లు, ఆట కోసం శ్రమిస్తున్నట్లుగా ఒక్క సీన్ కూడా ఆర్జున్‌కు సంబంధించి వుండదు. చివరికి కొడుకుని కూడా పణంగా పెట్టి గ్రౌండ్లో అర్జున్ అడుగుపెడుతాడు. కానీ, తనకు క్రికెటే ముఖ్యం అనేలా దర్శకుడు చూపించలేకపోయాడు. దీంతో ఆర్జున్ ఆటకు ప్రేక్షకులు కనెక్ట్ కావడం చాలా కష్టం.ఎవరెలా చేశారంటే..టెస్ట్ సినిమాలో కాస్త పర్వాలేదు అనిపించే పాత్ర ఏమైనా ఉందంటే శరణన్ (మాధవన్) అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్‌లో ఆయన పెర్ఫార్మెన్స్కు ఫిదా అవుతారు. ఒక సైంటిస్ట్‌గా దేశం కోసం ఏదైనా చేస్తాను అనే పాత్రలో చక్కగా సెట్ అయ్యాడు. టెస్ట్ మ్యాచ్‌లా సాగుతున్న సినిమాను వన్డే ఆటలా మార్చేశాడు. విలన్, హీరో ఇలా రెండు షేడ్స్ ఆయనలో కనిపిస్తాయి. తన వరకు వస్తే ఒక మనిషి ఎంత అవకాశవాదో శరవన్ పాత్రలో దర్శకుడు చూపాడు. ఈ కోణంలో చూస్తే చాలామందికి నచ్చుతుంది. టెస్ట్ సినిమాలో సిద్దార్ధ్ పాత్రను ఇంకాస్త హైలెట్ చేసి చూపింటే బాగుండేది. ది టెస్ట్‌లో మంచి, చెడు, సంఘర్షణ, స్వార్ధం గెలుపు, ఓటమి ఇలా ఎన్నో షేడ్స్ ఉన్నాయి. కానీ, తెరపై చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలం అయ్యాడు. -
‘28 డిగ్రీస్ సెల్సియస్’ మూవీ రివ్యూ
పొలిమేర సినిమాలతో ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు డా. అనిల్ విశ్వనాధ్ ఆరేళ్ళ క్రితం నవీన్ చంద్రతో తీసిన ఓ లవ్ థ్రిల్లర్ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసాడు. అప్పుడెప్పుడో తెరకెక్కిన 28 డిగ్రీస్ సెల్సియస్ (28°C) అనే సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ ఇప్పుడు రిలీజయింది. పొలిమేర డైరెక్టర్ ఫస్ట్ సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం.కథేంటంటే..?కార్తీక్(నవీన్ చంద్ర)కి మెడిసిన్ చదువుతున్న సమయంలో అంజలి(షాలిని వడ్నికట్టి) పరిచయమై ప్రేమలో పడతాడు. కార్తీక్ అనాథ, వేరే కులం కావడంతో అంజలి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో అంజలి ఇంట్లోంచి వచ్చేసి కార్తీక్ ని పెళ్లి చేసుకుంటుంది. అయితే అంజలికి బాడీ టెంపరేచర్ కి సంబంధించిన ఓ ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అంజలి బాడీ 28 డిగ్రీల సెల్సియస్ వద్ద మాత్రమే బాగుంటుంది. అంతకంటే పెరిగినా, తగ్గినా కాసేపటికే చనిపోతుంది. అంజలి ట్రీట్మెంట్ కోసం కార్తీక్ తనని జార్జియా తీసుకెళ్తాడు. అక్కడ ఇద్దరూ ఓ హాస్పిటల్ లో పనిచేస్తూనే అంజలికి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అనుకోకుండా ఓ రోజు కార్తీక్ వచ్చేసరికి ఇంట్లో అంజలి చనిపోయి ఉంటుంది. అంజలి చనిపోయిన బాధలో కార్తీక్ తాగుడుకు బానిస అవుతాడు. కానీ ఆ ఇంట్లో అంజలి ఆత్మ తిరుగుతుందని అనుమానాలు వచ్చేలా కొన్ని సంఘటనలు జరుగుతాయి. అసలు అంజలి ఎలా చనిపోయింది? నిజంగానే అంజలి ఆత్మ వస్తుందా? కార్తీక్ మళ్ళీ మాములు మనిషి అవుతాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ?ముందునుంచే ఈ సినిమాని ఆరేళ్ళ క్రితం సినిమా అని ప్రమోట్ చేసారు. దీంతో ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మంచిది. ఇప్పుడంటే థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి కానీ ఆరేళ్ళ క్రితం ఒక లవ్ స్టోరీతో థ్రిల్లర్ తీయడం కొత్తే. ఒక మనిషికి ఏదో హెల్త్ సమస్య ఉండటం అనుకోకుండా వాళ్ళు చనిపోవడం, వాళ్ళు చనిపోయాక ఎలా చనిపోయారు అని థ్రిల్లింగ్ గా సాగే సినిమాలు చాలానే వచ్చాయి. ఇది కూడా అదే కోవలో థ్రిల్లింగ్ తో పాటు కాస్త హారర్ అనుభవం కూడా ఇస్తుంది(28 Degree Celsius Movie Review).ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీతోనే సాగుతుంది. లవ్ స్టోరీ మాత్రం కాస్త బోర్ కొడుతుంది. లవ్ సీన్స్, డైలాగ్స్ రొటీన్ అనిపిస్తాయి. హీరోయిన్ కి ఆరోగ్య సమస్య ఉందని తెలిసిన దగ్గర్నుంచి కథ ఆసక్తిగా మారుతుంది. ఇంటర్వెల్ కి హీరోయిన్ చనిపోవడంతో సెకండ్ హాఫ్ ఏంటి అని ఇంట్రెస్ట్ నెలకొంటుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం హారర్ థ్రిల్లర్ లా ఆసక్తిగా చూపించి కాస్త భయపెడతారు కూడా. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆశ్చర్యపరుస్తుంది. అక్కడక్కడా కామెడీ ట్రై చేసినా అంతగా పండలేదు.ఎవరెలా చేసారంటే..? నవీన్ చంద్ర ప్రేమ కథలో, భార్య చనిపోతే బాధపడే పాత్రలో బాగా నటించాడు. షాలినీ వడ్నికట్టి అందాల ఆరబోతకు దూరంగా ఉండి సింపుల్ గా పద్దతిగా కనిపిస్తూనే నటనతో మెప్పించింది. ప్రియదర్శి, వైవా హర్ష నవ్వించే ప్రయత్నం చేసారు. దేవియాని శర్మ తన పాత్రలో బాగా మెప్పిస్తుంది. సంతోషి శర్మ, అభయ్, రాజా రవీంద్ర మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు మెప్పించారు. శ్రీచరణ్ పాకాల మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. ఆరేళ్ళ క్రితం సినిమా కాబట్టి సినిమాటోగ్రఫీ విజువల్స్ ఓకే అనిపిస్తాయి. లవ్ స్టోరీ రొటీన్ అనిపించినా థ్రిల్లింగ్ పార్ట్ మాత్రం బాగా రాసుకొని తెరకెక్కించాడు డైరెక్టర్ అనిల్ విశ్వనాధ్. నిర్మాణ పరంగా అప్పట్లోనే ఈ సినిమాకు బాగా ఖర్చుపెట్టినట్టు తెలుస్తుంది.టైటిల్ : 28°Cనటీనటులు: నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి, దేవియని శర్మ, ప్రియదర్శి, వైవా హర్ష, సంతోషి శర్మ.. తదితరులునిర్మాణ సంస్థలు: వీరాంజనేయ ప్రొడక్షన్స్నిర్మాతలు: సాయి అభిషేక్ఎడిటింగ్: గ్యారీ BHదర్శకత్వం, కథ: డా. అనిల్ విశ్వనాధ్ సంగీతం: శ్రవణ్ భరద్వాజ్, శ్రీచరణ్ పాకాల సినిమాటోగ్రఫీ: వంశి పచ్చిపులుసు విడుదల: ఏప్రిల్ 04, 2025 -
లైఫ్ (లవ్ యువర్ ఫాదర్) సినిమా రివ్యూ
దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలు తనయుడు ఎస్పీ చరణ్ చాన్నాళ్ల తర్వాత నటుడిగా చేసిన సినిమా 'లైఫ్' (లవ్ యువర్ ఫాదర్). కిషోర్ రాఠీ, మహేష్ రాఠీ, రామస్వామి రెడ్డి సంయక్తంగా నిర్మించారు. పవన్ కేతరాజు దర్శకుడు. శ్రీహర్ష, కషిక కపూర్ జంటగా నటించారు. తాజాగా ఏప్రిల్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉందంటే?కథేంటి?కిశోర్(ఎస్పీ చరణ్), సిద్ధూ (శ్రీ హర్ష) తండ్రీ కొడుకులు. అనాథలకు ఆపదొస్తే సాయం చేయడంలో మిగతావారి కంటే మందుంటారు. అనాథ శవాలకు సొంత డబ్బుతో కిశోర్ దహన సంస్కారాలు జరిపిస్తుంటాడు. ఇందుకు అవసరమైన డబ్బు కోసం గుర్రపు పందెలు కాస్తుంటాడు. ప్రతిసారి ఇతడే బెట్ నెగ్గుతుంటాడు. అయితే కిశోర్ చేసే అనాథ శవాల దహన సంస్కారాల వెనుక పెద్ద స్కామ్ ఉందని వార్తలొస్తాయి. దీని వెనుక బడా బిజినెస్ మ్యాన్ కబీర్ (నవాబ్ షా) ఉంటాడు. కిషోర్, సిద్ధూను ఇతడు ఎందుకు టార్గెట్ చేశాడు? తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఈ మధ్య కాలంలో చాలా సినిమాల్లో మైథాలజికల్ అంశాలు చూపిస్తున్నారు. 'లవ్ యువర్ ఫాదర్' కూడా ఆ లిస్టులోకి వచ్చే సినిమా. కథలో ఇదే మేజర్ పార్ట్. దాన్ని డామినేట్ చేసేలా ఎక్కువ స్క్రీన్ టైమ్ కాలేజీ ఎపిసోడ్ తీసుకోవడంతో ఇంటర్వెల్ ముందు అసలు కథలో కీలకమైన ఘట్టం మొదలు అవుతుంది. సెకండాఫ్ కూడా ఫాంటసీ పాయింట్ స్టార్ట్ అయ్యాక వచ్చే కామెడీ సీన్స్ ఫ్లోని కొంత డైవర్ట్ చేసినా నవ్విస్తాయి. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. రెగ్యులర్ అన్పించే కామెడీ సీన్స్, కాలేజీ ఎపిసోడ్స్ తర్వాత వచ్చే డివోషనల్ సీన్స్ హై ఇస్తాయి. మధ్య మధ్యలో కొంత ల్యాగ్ ఉన్నా అందర్నీ మెప్పించే డివోషనల్ పాయింట్ కోసం పర్లేదు. కథలో కీలకమైన రివేంజ్ ఎపిసోడ్ ఇంకాస్త బలంగా రాసుకుంటే బాగుండేది. కథలో బలవంతంగా ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది.మణిశర్మ సంగీతమందించిన శివుని నేపథ్యంలో పాట, నేపథ్య సంగీతం బాగున్నాయి. కెమెరా వర్క్, నిర్మాణ విలువలు స్థాయికి తగ్గటున్నాయి. డైలాగ్స్ మీద వర్క్ సరిగా చేయలేదు. కామెడీపై కేర్ తీసుకుంటే సినిమా ఇంకా బాగా వచ్చేది.తండ్రిగా ఎస్పీ చరణ్ నటన బాగుంది. హీరోగా ఫస్ట్ సినిమాకు శ్రీహర్ష డీసెంట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. హీరోయిన్ కషికా కపూర్ ఓకే. మిగతా పాత్రధారులు న్యాయం చేశారు. కొంత ల్యాగ్, రొటీన్ సీన్స్ ఉన్నా డివోషనల్ పాయింట్, క్లైమాక్స్ ట్విస్ట్ పర్లేదనిపించేలా ఉన్నాయి. -
Saaree Review: ఆర్జీవీ ‘శారీ’ మూవీ రివ్యూ
ఆర్జీవి డెన్ నుంచి వచ్చిన తాజా చిత్రం ‘శారీ’(Saaree Movie Review ). ఈ మూవీకి రచనా సహకారంతో పాటు నిర్మాణంలోనూ ఆర్జీవీ భాగస్వామ్యం అయ్యాడు. అతని శిష్యుడు గిరి కృష్ణ కమల్ దర్శకత్వం వహించాడు. ఆర్జీవీ, ఆర్వీ ప్రొడక్షన్స్ ఎల్ఎల్ పీ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ వర్మ నిర్మించారు. నేడు(ఏప్రిల్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?ఆరాధ్య దేవి( ఆరాధ్య దేవి) కి చీరలు అంటే చాలా ఇష్టం. కాలేజీ కి కూడా చీరలోనే వెళ్తుంది. చీరలోనే రీల్స్ చేసి ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఒక సారి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా...చీరలో ఉన్న ఆరాధ్య నీ చూసి ఇష్టపడతాడు ఫోటోగ్రాఫర్ కిట్టు(సత్య యాదు). ఆమెను ఫాలో అవుతూ దొంగ చాటున ఫోటోలు తీస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసి ఆమెను ఫోటో షూట్ కి ఒప్పిస్తాడు. అలా ఆమెకి దగ్గరవుతాడు. ఆరాధ్య మాత్రం అతన్ని ఫ్రెండ్ లానే చూస్తుంది. ఫోటో షూట్ టైమ్ లోనే ఆరాధ్య అన్నయ్య రాజు(సాహిల్ సంభ్యాల్)..కిట్టు తో గొడవ పడుతాడు. ఆ తరువాత ఆరాధ్య కిట్టు ను దూరం పెడుతుంది. కిట్టు మాత్రం ఆరాధ్య వెంట పడుతుంటాడు. సైకో లా మారి వేధిస్తుంటాడు. దీంతో ఆరాధ్య ఫ్యామిలీ కిట్టు పై కేసు పెడుతుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఆరాధ్యను దక్కించుకునేందుకు సైకో కిట్టు ఏం చేశాడు? చివరకు కిట్టు పీడను ఆరాధ్య ఎలా వదిలించుకుంది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘నాకు నచ్చినట్లుగా సినిమా తీస్తా.. ఇష్టం అయితే చూడండి లేదంటే వదిలేయండి’ అని డైరెక్ట్‌గా చెప్పే ఏకైక డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఒకప్పుడు ఆయన సినిమాలు ట్రెండ్‌ని క్రియేట్ చేశాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌కు తగ్గట్లుగా తీయడం లేదు. గత కొన్నాళ్లుగా ఆర్జీవీ డెన్ నుంచి వచ్చే చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. మరి ‘శారీ’ అయినా ఆడుతుందా అంటే.. ‘సారీ’ అనక తప్పదు. అయితే ఇటీవల ఆర్జీవి నుంచి వచ్చిన చిత్రాలతో పోలిస్తే.. ఇది కాస్త బెటర్ అనే చెప్పాలి. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. తొలిసారి ఆర్జీవి తన చిత్రంతో ఓ సందేశం అందించాడు. సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల జరిగే దారుణాలు.. ముఖ్యంగా అమ్మాయిలు సోషల్ మీడియాతో ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ చిత్రంలో చూపించారు. అయితే దర్శకుడు మాత్రం తన దృష్టిని సందేశంపై కాకుండా చీరలోనే ఆరాధ్యను ఎంత అందంగా చూపించాలి అనే దానిపైనే ఎక్కువ పెట్టాడు. చీరను ఇలా కూడా కట్టుకోవచ్చా? అనేలా సినిమాను తెరకెక్కించారు. ఆర్జీవి గత సినిమాల మాదిరే అందాల ప్రదర్శనపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ అది వర్కౌట్ కాలేదు.(Saaree Movie Review ) తెరపై ఆరాధ్యను చూసి ఒకనొక దశలో చిరాకు కలుగుతుంది. సత్య యాదు పాత్ర కూడా అంతే. ప్రతిసారి ఫోటో తీయడం.. చీరలో ఆరాధ్యను ఊహించుకోవడం.. ఓ పాట.. ఫస్టాఫ్ అంతా ఇలానే సాగుతుంది. ఇక సెకండాఫ్ ప్రారంభంలో కాస్త ఆసక్తికరంగా అనిపిస్తుంది. కానీ సైకో చేసే పనులు పాత చిత్రాలను గుర్తుకు తెస్తాయి. కిడ్నాప్ తర్వాత ఆరాధ్య, సత్య యాదుల మధ్య వచ్చే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. కథంతా అక్కడక్కడే తిప్పుతూ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. మితీమీరిన వయోలెన్స్‌ని పెట్టి భయపెట్టె ప్రయత్నం చేశారు. అంతకు మించి కథ-కథనంలో కొత్తదనం ఏమి లేదు. ఆర్జీవి నుంచి అది ఆశించడం కూడా తప్పే సుమా..!ఎవరెలా చేశారంటే.. శారీ సినిమా టైటిల్‌కి తగ్గట్లుగానే శారీలో ఆరాధ్య అదరగొట్టేసింది. వర్మ మెచ్చిన నటి కాబట్టి.. ఆయనకు ‘కావాల్సినట్లుగా’ తెరపై కనిపించి కనువిందు చేసింది. యాక్టింప్ పరంగానూ పర్వాలేదనిపించింది. ఇక సైకో కిట్టుగా సత్య యాదు అదరగొట్టేశాడు. ఒకనొక దశలో తన నటనతో భయపెట్టేశాడు. మిగిలిన నటీనటులకు పెద్దగా ప్రాధాన్యత లేదు కానీ ఉన్నంతలో బాగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. శశిప్రీతమ్ రీరికార్డింగ్ కొన్ని చోట్ల మోతాదును మించి పోయింది. పాటలు అంతగా గుర్తుండవు. శబరి సినిమాటోగ్రఫీ బాగుంది. తెరపై ఆరాధ్యను అందంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. ఆర్జీవీ సినిమాలకు పెద్ద బడ్జెట్ ఉండడు. రెండు మూడు పాత్రలు, ఒక ఇళ్లు చాలు.. సినిమాను చుట్టేస్తాడు. ఈ సినిమా కూడా అలానే ఉంది. పెద్దగా ఖర్చు పెట్టలేదు కానీ సినిమాను ఉన్నంతలో రిచ్‌గానే తీర్చిదిద్దారు. -
మన సిద్ధ వైద్య రహస్యాలు చెప్పిన సినిమా
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం అగత్తియా ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.మనం చూసే సినిమాలలో మనకు తెలియని చరిత్రకు సంబంధించిన రహస్యాలు చాలావరకు తెలుపుతూ ఉంటాయి. అటువంటి రహస్యాలలో మన సంస్కృతికి సంబంధించిన సిద్ధ వైద్యం ఒకటి. కొన్ని వేల సంవత్సరాలకు ముందే మన పూర్వీకులు మన ఆరోగ్యం కోసం అద్భుత ఔషధాల వివరాలను గోప్యంగా పొందుపరిచారు. కోట్ల విలువైన సంపద కంటే ఈ వివరాలు ఎంతో విలువగలవి. కానీ దురదృష్టవశాత్తు అటువంటి వివరాలు చాలావరకు విదేశీయులు నాశనం చేయడమో, కొల్లగొట్టడమో జరిగింది. ఆ సమయంలో ఎంతోమంది ఎన్నో పోరాటాలు చేసి ఆ మహత్ గ్రంథాలను కాపాడిప్రాణత్యాగం చేశారు. ఆ నేపథ్యంలోనే అల్లుకున్న కథ ‘అగత్తియా’. దేవతలకు రాక్షసుల మధ్య పోరాటం అనే టాగ్ లైన్‌తో సినిమా కథాంశం నడుస్తుంది. కథానుగుణంగా సీరియస్పాయింట్ అయినా ఈ సినిమా దర్శకుడుపా. విజయ్ తన స్క్రీన్‌ప్లేతో దీనిని హారర్ కామెడీలా తెరకెక్కించారు.సినిమా మొత్తం సిద్ధ వైద్యం గొప్పతనాన్ని ప్రేక్షకులకు ఓ పక్క చెబుతూనే మరో పక్క కమర్షియల్ కామెడీ హంగులతో ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా చేశారు. ఈ సినిమాలో లీడ్ రోల్స్‌లో జీవా, రాశీ ఖన్నా నటించారు. మరో ముఖ్యపాత్రలో ప్రముఖ నటుడు అర్జున్ నటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే... అగత్యన్ అనే ఆర్ట్ డైరెక్టర్ ఓ సినిమా కోసం తాను కూడా డబ్బులు పెట్టి ఓ పురాతన బంగ్లాలో షూటింగ్ ఏర్పాటు చేసుకుంటాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ రద్దవుతుంది. పెట్టుబడి పెట్టిన డబ్బులు పోతాయనే ఉద్దేశంతో ఆ బంగ్లాని ఓ హారర్ థీమ్‌తో పర్యాటక కేంద్రంగా మారుస్తాడు. పర్యాటకులను ఆ బంగ్లాలో అనుమతించినప్పటి నుండి బంగ్లాలో కొన్ని అనూహ్య సంఘటనలు జరుగుతాయి. అంతేకాదు అగత్యన్ టీమ్‌కి ఓపాత పియానో కూడా దొరుకుతుంది. ఆ మిస్టరీ పియానో అగత్యన్కి ఆ బంగ్లా కథ చెబుతుంటుంది. అగత్యన్ తల్లి కేన్సర్‌తో బాధ పడుతుంటుంది. ఆ బంగ్లా వల్ల వాళ్ల అమ్మ కోలుకుంటుంది. అది ఎలానో మీరు సన్ నెక్ట్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘అగత్తియా’ చూసి తెలుసుకోవాల్సిందే. తెలుగు వెర్షన్ ‘అగత్యా’ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఐదేళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అల్లాడిపోయింది. అప్పుడు ఇంగ్లిషు మందులతోపాటు మనప్రాచీన వైద్యంతో కూడా చాలా మంది కోలుకున్నారు. అలానే మన సిద్ధ వైద్యం కూడా. అసలింతలా ఏముంది ఆ సిద్ధ వైద్యంలో అని అనుకుంటే ‘అగత్యా’ సినిమా చూడండి. ఉగాది పండగ రోజు పూజా పునస్కారాలయ్యాక మంచి కాలక్షేపం ఈ సినిమా. – ఇంటూరు హరికృష్ణ -
'హత్య' మూవీ రివ్యూ.. ఇది కదా అసలు నిజం!
టైటిల్: హత్య; నటీనటులు: ధన్యా బాలకృష్ణ, రవివర్మ, పూజా రామచంద్రన్, రఘు, భరత్ తదితరులు. నిర్మాత: ప్రశాంత్ రెడ్డి; కథ–స్క్రీన్ ప్లే–దర్శకత్వం: శ్రీవిద్య బసవ; సంగీతం: నరేశ్ కుమరన్.పి సినిమాటోగ్రఫీ: అభిరాజ్ నాయర్; ఎడిటర్: అనిల్ కుమార్ .పి; ఓటీటీ: అమెజాన్ ప్రైమ్ వీడియో.అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇది కల్పిత కథ అని మేకర్స్ ప్రకటించినప్పటికీ... ఈ సినిమాలోనిపాత్రలు, స్థలాలు, హత్య ఘటన, కేసు దర్యాప్తు ప్రక్రియ అన్నీ కూడా సంచలనం అయిన ప్రముఖ రాజకీయ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును పోలి ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించి దర్శక–నిర్మాతలు లోతైన పరిశోధన చేసి, దాగి ఉన్న పలు విషయాలను సేకరించినట్లుగా సినిమా చూసినవారికి అనిపించడం సహజం.ఈ హత్యకు సంబంధించిన అసలు నిజాలు చెప్పేలా కథ ఉండటంతో ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన వెంటనేపాపులర్ అయింది... నిజంగా ఏం జరిగింది? అనేదానికి ఈ సినిమా నిజమైన నమూనానా? హత్య వెనక ఉన్న నిజమైన హంతకులను ఈ సినిమా బయటపెట్టిందా? జరిగిన విషయాన్ని ఎలా తారుమారు చేసి, ప్రచారం చేస్తున్నారో ఈ సినిమా చూపించిందా? ‘హత్య’ సినిమా బయటపెట్టిన నిజాలు ఏంటి? ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది? క్రైమ్ థ్రిల్లర్ మూవీస్‌ని ఇష్టపడేవారు, వివేకానంద రెడ్డి హత్య కేసుని ఫాలో అవుతున్నవారు చూడాల్సిన చిత్రం ఇది.ఇంతకీ ఈ చిత్ర కథేంటంటే...ఇల్లందులో రాజకీయ నాయకుడు ధర్మేంద్ర రెడ్డి (రవి వర్మ) దారుణ హత్యకు గురవుతాడు. అయితే తొలుత ఆయన మరణం గుండెపోటు వల్ల జరిగిందని వార్తలు వస్తాయి. కానీ ధర్మేంద్ర గొడ్డలి వేటుతో హత్యకు గురయ్యాడని నిర్ధారణ అవుతుంది. ఈ కేసును రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ రెడ్డి (భరత్) నిజాయితీ గల ఐపీఎస్ అధికారి సుధ (ధన్యా బాలకృష్ణ)కి అప్పగిస్తాడు. ఆమె తన టీమ్‌తో కలిసి ధర్మేంద్ర రెడ్డి హత్య కేసు విచారణ మొదలుపెడుతుంది. అజాత శత్రువు అయిన ధర్మేంద్ర రెడ్డిని అంత దారుణంగా నరికి చంపింది ఎవరు? ధర్మేంద్రకు, సలీమా (పూజా రామచంద్రన్)కు ఉన్న సంబంధం ఏంటి? పొలిటికల్ ఎజెండాతో ఈ హత్య చేశారా?\ఆర్థిక సమస్యలే కారణమా? ధర్మేంద్ర కుమార్తె కవితమ్మ (హిమబిందు)ను తప్పుదోవ పట్టించింది ఎవరు? చిన్నాన్న హత్య కేసులో నిజాలను నిగ్గు తేల్చడానికి సీఎం కిరణ్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? గత ప్రభుత్వం దగ్గర అమ్ముడుపోయిన కొంతమంది అధికారులు ఈ కేసును ఎలా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు? అనేక ఒత్తిడిలను తట్టుకొని ఐపీఎస్ అధికారి సుధ ఈ మర్డర్ మిస్టరీని ఎలా ఛేదించింది? కేసు విచారణ చివరి దశలో ఉన్న సమయంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘హత్య’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా కథంతా కల్పితమే అని చిత్రబృందం పేర్కొన్నప్పటికీ.. సినిమాప్రారంభంలోనే ఇది వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. దర్శకురాలు శ్రీవిద్య బసవ ఎంతో రీసెర్చ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఆమె రాసుకున్న కథ, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నాయి. సినిమాప్రారంభం నుంచి ముగింపు వరకు ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. జేసీ ధర్మేంద్ర ఎవరన్నది చెబుతూ కథను మొదలుపెట్టారు దర్శకురాలు. ధర్మేంద్ర హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించారు. సుధ విచారణలో ఒక్కో కొత్త విషయం బయటకు వస్తుంటే.. ‘ఇది కదా అసలు నిజం’ అనిపిస్తుంది. సెకండాఫ్‌లో వచ్చే సలీమా, ధర్మేంద్రల మధ్య లవ్‌స్టోరీ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలుస్తాయి. దర్శకురాలు ఎంతో పకడ్బందీగా రీసెర్చ్ చేసి, లవ్‌స్టోరీ చెప్పినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో మంచి ఎమోషన్ పండించారు.ఎవరెలా చేశారంటే..ధర్మేంద్ర రెడ్డిపాత్రలో రవి వర్మ ఒదిగిపోయారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా ధన్యా బాలకృష్ణ తనపాత్రకు న్యాయం చేశారు. సలీమాగా ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో పూజా రామచంద్రన్ మెప్పించారు. భరత్, బిందు చంద్రమౌళి, శ్రీకాంత్ అయ్యంగార్... మిగిలిన నటీనటులు వారిపాత్రల్లో మెప్పించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నరేశ్ కుమరన్ .పి అందించిన నేపథ్య సంగీతం,పాటలు సినిమాకు ప్లస్ అయ్యాయి. అభిరాజ్ నాయర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ
టైటిల్ : మ్యాడ్ స్క్వేర్నటీనటులు: నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, శుభలేఖ సుధాకర్, మురళీధర్ గౌడ్, తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్నిర్మాతలు: సూర్యదేవర హారిక, సాయి సౌజన్యసమర్పకులు: ఎస్. నాగ వంశీఎడిటింగ్: నవీన్ నూలిదర్శకత్వం, కథ: కల్యాణ్ శంకర్ సంగీతం: భీమ్స్ సిసిరోలియో, తమన్‌సినిమాటోగ్రఫీ: శామ్దత్విడుదల: మార్చి 28, 2025'మ్యాడ్ స్క్వేర్'తో(Mad Square) మరోసారి నవ్వులు పూయించేందుకు నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ థియేటర్స్‌లోకి వచ్చేశారు. 2023లో విడుదలైన హిట్ సినిమా ‘మ్యాడ్’ (Mad) చిత్రానికి ఇది కొనసాగింపుగా ఉంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించగా.. సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. నేడు (మార్చి 28) సినిమా విడుదలైంది. కాలేజీ నేపథ్యంతో పరిచయం అయిన కొందరు స్నేహితులు వారి చదువులు పూర్తి అయిన తర్వాత మళ్లీ ఒకచోట కలిస్తే వారి అల్లరి ఎలా ఉంటుందో ఈ చిత్రంలో చూపించారు. రాయల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల(RIE)లో చదువుకోవడం ఇష్టం లేక ఓ విద్యార్థి పారిపోయే సంఘటన నుంచి మ్యాడ్ పార్ట్-1 కథ మొదలవుతుంది. ఫైనల్‌గా ఆ విద్యార్థి RIEలోనే చదివి తీరుతాననే నిర్ణయంతో కథ ముగుస్తుంది. ఇప్పుడు లడ్డు గాడి పెళ్లితో మ్యాడ్ స్క్వేర్ కథ ప్రారంభమౌతుంది. కాలేజీ నుంచి తమ చదవులు పూర్తి చేసిన తర్వాత వారు ఏం చేశారనేది మ్యాడ్ స్క్వేర్‌లో ఫుల్ ఫన్‌తో దర్శకుడు చూపించాడు.కథేంటంటే..ఈ కథలో పెద్దగా లాజిక్స్ అంటూ ఏమీ ఉండవ్.. దానిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చూస్తే ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. అశోక్ (నార్నె నితిన్), మనోజ్(రామ్ నితిన్), దామోదర్(సంగీత్ శోభన్),లడ్డు(విష్ణు) నలుగురు స్నేహితులు ఇంజనీరింగ్ పూర్తి అయిన తర్వాత విడిపోతారు. కానీ, లైఫ్‌లో సెటిల్ కాకుండా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లడ్డు(విష్ణు) పెళ్లి నుంచి ఈ సినిమా అసలు కథ మొదలౌతుంది. స్నేహితులకు చెప్పకుండా లడ్డు పెళ్లికి రెడీ అయిపోతాడు. ఈ విషయం తెలుసుకున్న అతని మిత్రులు వేడక సమయంలో సడెన్‌గా ఎంట్రీ ఇస్తారు. ఈ క్రమంలో అక్కడ భారీగా ఫన్ మొదలౌతుంది. లడ్డుకు ఎలాగైనా పెళ్లి చేయాలని తండ్రి మురళీధర్ గౌడ్ ఎదురు కట్నం ఇచ్చి సంబంధం సెట్ చేస్తాడు. ఈ క్రమంలో ఆ పెళ్లి చెడిపోకూడదని లడ్డూ ఫ్యామిలీ పడే పాట్లు నవ్వులు తెప్పిస్తాయి. ఫ్రెండ్ పెళ్లి ఘనంగా చేయాలని దామోదర్, అశోక్, మనోజ్ అనేక ప్లాన్స్ వేస్తుంటారు. వారి హంగామాకు తోడు పెళ్లికూతురు ఫ్యామిలీ నుంచి లడ్డూకు ఎదురయ్యే అవమానాలు కడుపుబ్బా నవ్విస్తాయి. తన స్నేహితులు చేసే తుంటరి పనుల వల్ల ఆ పెళ్లిలో చాలా గందరగోళం నెలకొంటుంది. పెళ్లి జరుగుతున్నంత సేపు ఎక్కడ ఆ కార్యక్రమం ఆగిపోతుందో అనే భయంతో లడ్డు ఉంటాడు. సరిగ్గా పెళ్లి అవుతుందని సమయంలో లడ్డు స్నేహితులతో పాటు వచ్చిన ఒక వ్యక్తితో పెళ్లికూతురు వెళ్లిపోతుంది. ఈ విషయం తెలిశాక లడ్డూ ఇంట్లో జరిగే పంచాయితీ, అక్కడ మ్యాడ్ గ్యాంగ్ చేసే అతి ఫుల్‌గా నవ్విస్తుంది. దీంతో తీవ్ర నిరాశలో ఉన్న లడ్డు కోసం కాస్త రిలాక్స్ ఇవ్వాలని వారందరూ గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. వారు ఎంట్రీ ఇచ్చాక గోవా మ్యూజియంలో విలువైన లాకెట్‌ను గోవాలో పెద్ద డాన్‌గా ఉన్న మ్యాక్స్ (సునీల్) మనుసులు దొంగలిస్తారు. దానిని లడ్డు బ్యాచ్ చేశారని పోలీసులు అనుమానిస్తారు. దీంతో వారిపై నిఘా ఉంచుతారు. అయితే, ఒక ఘటనలో ఆ లాకెట్ లడ్డు చేతికి దొరుకుతుంది. దీంతో దానిని తిరిగి తెచ్చివ్వాలని లడ్డు తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేస్తాడు. ఈ కేసును చేధించేందుకు ఒక ఐపీఎస్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. లడ్డు బ్యాచ్‌లో ఉన్న ఆ అధికారి ఎవరు..? లడ్డుని పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి మరో అబ్బాయితో ఎందుకు వెళ్లిపోయింది...? వారిద్దరూ కూడా గోవాకే ఎందుకు వెళ్తారు..? చివరిగా ఆ లాకెట్ కథ ఏంటి.. ఎవరి వద్ద ఉంటుంది..? ఫైనల్‌గా లడ్డును తన స్నేహితుడే జైలుకు ఎందుకు పంపుతాడు..? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..?మ్యాడ్ స్క్వేర్ విడుదలకు ముందే నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాలో కథ గురించి పెద్దగా ఏమీ ఉండదని తెలిపారు. ఆయన చెప్పినట్లుగానే కథ బలం ఉండదు. కానీ, నవ్వులతో వంద శాతం ఎంటర్టైన్ చేస్తారు. ప్రతి సీన్లో వరుస పంచ్‌లతో నవ్విస్తారు. డీడీ, లడ్డు గ్యాంగ్ కావాల్సినంత హంగామా చేస్తారు. ఆద్యంతం ఎక్కడా విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో వారు వినోదాన్ని పంచుతారు. పార్ట్-1లో కాలేజి క్యాంపస్‌ను ఎంచుకున్న దర్శకుడు.. పార్ట్‌లో లడ్డు గాడి పెళ్లి, గోవా కాన్సెప్ట్‌ను ప్రధానంగా ఎంచుకున్నాడు. యువతను ఆకట్టుకునేలా ఫుల్ పంచ్‌లతో సినిమా ఉంటుంది. ఎలాంటి డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా ప్రేక్షకులకు వినోదాన్ని పంచాడు దర్శకుడు కల్యాణ్ శంకర్. కాలేజీలో మొదలైన స్నేహం.. ఆ తర్వాత కూడా ఎంత మధురంగా ఉంటుందో లడ్డు కథతో దర్శకుడు చెప్పాడు. (ఇదీ చదవండి: ‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ)ఈ కథలో ప్రధాన పాత్రధారులైన మనోజ్, అశోక్, దామోదర్ల పేర్లలోని మొదటి అక్షరాలను తీసుకొని మ్యాడ్ అనే టైటిల్ పెట్టి హిట్ కొట్టాడు. ఇప్పుడు దానికి లడ్డుగాడి కథన కలిపి మ్యాడ్ స్క్వేర్ చేశాడని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో కథ గోవా షిఫ్ట్ అయ్యాక ఇంకాస్త స్పీడ్ పెంచాడు దర్శకుడు. ఫస్టాఫ్ అంతా లడ్డు పెళ్లితో ఫుల్ ఎంటర్టైన్ చేస్తే రెండో భాగం కాస్త ఫన్ నెమ్మదిస్తుంది. మ్యాక్స్ గ్యాంగ్ చేసే దొంగతనం మ్యాడ్ గ్యాంగ్‌కు చుట్టుకోవడం. ఆపై లడ్డూ తండ్రిని మ్యాక్స్ కిడ్నాప్ చేయడం.. ఆయన్ని ఎలాగైనా కాపాడాలని డీడీ, లడ్డూ, అశోక్, మనోజ్ చేసే ప్రయత్నాలు సెకండాఫ్‌లో ఉంటాయి.సునీల్, లడ్డు ఫాదర్ మురళీధర్ మధ్య సీన్స్ బాగున్నాయి. సత్యం రాజేష్ పోలీసు పాత్ర నుంచి వచ్చే ప్రతి సీన్ కాస్త ఫోర్స్డుగా ఉంటుంది. సినిమాలో హిట్ సాంగ్ స్వాతిరెడ్డి కూడా సరైన పాయింట్లో లేదు అనిపిస్తుంది. ప్రియాంక జవల్కార్ను కామియో రోల్ ఇచ్చారు. కానీ, అంత ఎట్రాక్ట్ అనిపించలేదు. లడ్డు మీద వరుస పంచ్‌లు పడుతున్నా సరే సినిమాను ఫుల్ స్వింగ్‌లో నడిపించాడని చెప్పవచ్చు. అక్కడక్కడ మినహాయిస్తే.. విసుగు లేకుండా ప్రతి సన్నివేశంలో ఫుల్ వినోదం ఉంటుంది. రెండు గంటలపాటు బాగా ఎంజాయ్ చేసే థియేటర్ నుంచి ప్రేక్షకుల బయటకు వస్తారని చెప్పవచ్చు.ఎవరెలా చేశారంటే..?మ్యాడ్-1లో చాలా పాత్రలు ఉంటాయి.. అక్కడ అన్ని క్యారెక్టర్స్‌కు ప్రాధాన్యత ఉంటుంది. కానీ, ఇందులో కొన్నింటికి తక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. నార్నె నితిన్ తనదైన స్టైల్లో సెట్ అయిపోయాడు. లడ్డూగా విష్ణు తన నటన తీరుతో నూటికి నూరు మార్కులు కొట్టేశాడు. ఈ సినిమాకు ప్రధాన బలం లడ్డునే అని చెప్పవచ్చు. సంగీత్ శోభన్ డీడీగా తన వేగం ఎక్కడా తగ్గనివ్వకుండా పంచ్ డైలాగ్స్ పేలుస్తూనే ఉంటాడు. ఎక్కడా కూడా తన ఎనర్జీ తగ్గకుండా మెప్పిస్తాడు. మనోజ్ పాత్రలో రామ్ నితిన్ సైలెంట్‌గా లవర్ బాయ్‌లా తన ఫెయ్యిల్యూర్ స్టోరీ చెబుతూ చుట్టేస్తూ ఉంటాడు. రఘుబాబు, మురళీధర్ గౌడ్లు తమ పాత్రల పరిధి మేరకు నవ్వులు పంచారు. జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ మరోసారి అతిథి పాత్రలో కనిపించింది కొద్దిసేపు మాత్రమే అయినప్పటికీ ప్రేక్షకులతో విజిల్స్ వేపించేలా చేశాడు. మ్యాక్స్ పాత్రలో సునీల్ విలనిజమే కాకుండా కామెడీని కూడా పండించాడు. శుభలేఖ సుధాకర తన పాత్ర పరిమితిమేరకు పర్వాలేదు. మ్యాడ్ స్క్వేర్ కథలో పెద్దగా బలం లేకున్నప్పటికీ దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన విధానం బాగుంది. కానీ, సంభాషణల విషయంలో బలవంతంగా నవ్విద్దాం అనేలా కొన్ని సీన్లు ఉన్నాయి. పాటల విషయంలో భీమ్స్ ఇంకాస్త శ్రద్ధ పెట్టింటే బాగుండు. తమన్ బీజీఎమ్ కూడా పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పవచ్చు. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి సూపర్ అనిచెప్పవచ్చు. నిర్మాణం పరంగా ఉన్నంతమేరకు బాగుంది. నిర్మాతలు సూర్యదేవర హారిక, సాయి సౌజన్యలకు మ్యాడ్ స్క్వేర్ మంచి విజయాన్ని ఇచ్చే సినిమా అని చెప్పవచ్చు. -
‘రాబిన్‌హుడ్’ మూవీ రివ్యూ
నితిన్ ఖాతాలో హిట్ పడి చాలా కాలమైంది. భీష్మ(2020) తర్వాత ఆయనకు ఆ స్థాయి విజయం లభించలేదు.దీంతో మళ్లీ భీష్మ దర్శకుడు వెంకీ కుడుములనే నమ్ముకున్నాడు. ఆయన దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’(Robinhood Review) అనే సినిమాతో నితిన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి చిత్రంతో నితిన్ హిట్ ట్రాక్ ఎక్కడా? లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రామ్ (నితిన్) అనాథ. చిన్నప్పుడు అతన్ని ఓ పెద్దాయన హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో చేర్పిస్తాడు. అక్కడ తినడానికి తిండిలేక ఇబ్బందిపడుతున్న తోటి పిల్లల కోసం దొంగగా మారతాడు. పెద్దయ్యాక ‘రాబిన్‌హుడ్’ పేరుతో ధనవంతుల ఇళ్లలో చోరీలు చేస్తుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసం రంగంలోకి దిగిన పోలీసు అధికారి విక్టర్(షైన్ చాం టాకో) ఈగోని దెబ్బతీస్తూ ప్రతిసారి దొరికినట్లే దొరికి తప్పించుకుంటాడు. దీంతో విక్టర్ రాబిన్‌ని పట్టుకోవడమే టార్గెట్‌గా పెట్టుకుంటాడు. రాబిన్‌కి ఈ విషయం తెలిసి..దొంగతనం మానేసి జనార్ధన్ సున్నిపెంట అలియాస్ జాన్ స్నో(రాజేంద్రప్రసాద్) నడిపే ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో జాయిన్ అవుతాడు.(Robinhood Review). అదే సమయంలో ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన ఇండియన్ ఫార్మా కంపెనీ అధినేత కుమార్తె నీరా వాసుదేవ్ (శ్రీలీల) ఇండియాకు వస్తుంది. ఆమెకు సెక్యూరిటీగా రాబిన్ వెళ్తాడు. ఇండియాకు వచ్చిన నీరాను గంజాయి దందా చేసే రౌడీ సామి(దేవదత్తా నాగే) మనుషులు బంధించి రుద్రకొండ అనే ప్రాంతానికి తీసుకెళ్తారు? సామి వలలో చిక్కుకున్న నీరాను రాబిన్‌హుడ్ ఎలా రక్షించాడు? నిరాను రుద్రకొండకు ఎందుకు రప్పించారు? రాబిన్‌హుడ్ సడెన్‌గా సెక్యూరిటీ ఏజెన్సీలో ఎందుకు చేరాల్సివచ్చింది? ఈ కథలో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..రాబిన్‌హుడ్ కథ అంటే ధనవంతుల నుంచి దొంగిలించి పేదవాళ్లకు పంచే ఒక నీతిగల దొంగ స్టోరీ అందరికి తెలిసిందే. తెలుగు సినిమాల్లో ఈ తరహా కథలు చాలానే వచ్చాయి. కానీ ప్రతి సినిమా దానికి తగ్గట్టుగా కొత్త రంగు, రుచి జోడించి ప్రేక్షకులను అలరించింది. రాబిన్‌హుడ్ కూడా టైటిల్‌కి తగ్గట్టే రాబిన్‌హుడ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. కథ పరంగా చూస్తే ఇందులో కొత్తదనం ఏది కనిపించదు. శారీరక బలం కంటే, మానసిక బలాన్ని ఎక్కువగా నమ్ముకునే హీరో.. దొంగతనం చేసి అవసరం ఉన్నవాళ్లకు పంచడం..కథ ఇదే లైన్లో సాగుతుంది. ఇక్కడ హీరో అనాథ పిల్లల కోసం దొంగతనం చేస్తుంటాడు. ఆ పాయింట్ వినగానే అందరికి రవితేజ ‘కిక్’ గుర్తొస్తుంది. కానీ పూర్తిగా ‘కిక్’ థీమ్‌ని అనుసరించలేదు. ( ఇదీ చదవండి: Mad Square Movie Review: 'మ్యాడ్ స్క్వేర్' మూవీ రివ్యూ)కథలో డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి. చివరకు వాటి మధ్య ఉన్న సంబంధం రివీల్ అవుతుంది. ఈ ట్విస్టులు సాధారణ ప్రేక్షకులకు కిక్ ఇస్తాయి. ఫస్టాప్ మొత్తం ఫన్‌జోన్‌లో సాగుతుంది. హీరో చిన్నప్పుడే ఎందుకు దొంగగా మారాల్సి వచ్చిందో తెలియజేస్తూ కథను ప్రారంభించాడు దర్శకుడు. హీరోను పట్టుకోవడానికి వచ్చిన పోలీసులను బురిడి కొట్టించే సీన్లన్ని పాత సినిమాను గుర్తు చేస్తాయి. హీరోయిన్ ఎంట్రీ తర్వాత కథనం కామెడీతో పరుగులు పెడుతుంది. వెన్నెల కిశోర్, రాజేంద్రప్రసాద్ మధ్య వచ్చే సన్నివేశాలల్లో కామెడీ బాగా పండింది(Robinhood Review)ముఖ్యంగా నీరా దగ్గర మంచి మార్కులు కొట్టేసేందుకు జాన్ స్నో చేసే ప్రయత్నాలు నవ్వులు పూయిస్తాయి. కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో కథనం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. విలన్ చుట్టూ సాగే సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. కథనం కూడా కొంతవరకు ఊహకందేలా సాగుతుంది. కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నప్పటికీ.. రాబిన్ అసలు రుద్రకోండకు ఎందుకు వచ్చాడనేది తెలిసిన తర్వాత మళ్లీ రొటీన్ మూడ్‌లోకి వెళ్లిపోతాం. అదే సమయంలో వచ్చిన అదిదా సర్ప్రైజ్ సాంగ్ కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ‘ట్రూత్ ఆర్ డేర్’ సీన్ ఒకటి నవ్వులు పంచుతుంది. డేవిడ్ వార్నర్ పాత్ర మినహా క్లైమాక్స్ రొటీన్‌గానే ఉంటుంది. అయితే వార్నర్ పాత్రను సరైన ముగింపు ఇవ్వకుండా.. పార్ట్ 2 కూడా ఉంటుందని హింట్ ఇచ్చేశారు. ఎవరెలా చేశారంటే..రాబిన్‌హుడ్ పాత్రలో నితిన్ చక్కగా నటించాడు. అతని కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో పలు సన్నివేశాల్లో అతని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. శ్రీలీల పాత్ర పరిమితంగా ఉన్నప్పటికీ, తెరపై చాలా అందంగా కనిపించింది. నటనపరంగా ఆమెకు పెద్దగా స్కోప్ ఉన్న పాత్రమేది కాదు. దేవదత్త పాత్ర మొదట్లో భయపెట్టేలా అనిపించినా, చివర్లో కాస్త నీరసంగా మారి ప్రేక్షకులను నిరాశపరిచింది.రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్‌ల కామెడీ బాగా వర్కౌట్ అయింది. ఇద్దరు తమదైనశైలీలో నటించి నవ్వులు పూయించారు.డేవిడ్ వార్నర్ స్క్రీన్‌పై చాలా తక్కువ సమయం కనిపించినప్పటికీ, అతని ఎంట్రీతో థియేటర్లలో విజిల్స్ మారుమోగేలా అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ చూపించాడు. శుభలేక సుధాకర్, షైన్ చాం టాకోతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవి ప్రకాశ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు వినడానికి బాగున్నా..తెరపై చూస్తే అంతగా ఆకట్టుకోలేవు. కథలో వాటిని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాకు భారీగానే ఖర్చు చేసినట్లు సినిమా చూస్తే అర్థమవుతుంది. సినిమాను చాలా రిచ్‌గా తీర్చిదిద్దారు. -
‘ఎల్2: ఎంపురాన్’ మూవీ రివ్యూ
మోహన్‌లాల్(mohalal) సినిమాలకు మాలీవుడ్‌లోనే కాదు టాలీవుడ్‌లోనూ మంచి ఆదరణ ఉంటుంది. ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని సాధించాయి. ముఖ్యంగా ‘లూసిఫర్’ చిత్రం యావత్ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీకి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే ‘ఎల్2: ఎంపురాన్’ (L2: Empuraan Telugu Movie Review ). పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లే దేశ వ్యాప్తంగా ప్రమోషన్స్ చేశారు మేకర్స్. టాలీవుడ్లో దిల్ రాజు విడుదల చేస్తుండడంతో ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(మార్చి 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. లూసిఫర్ చిత్రం ఎక్కడ ముగిసిందో అక్కడ నుంచి ఈ సినిమా కథ ప్రారంభం అవుతుంది. పీకేఆర్ మరణంతో కేరళలో రాజకీయ అలజడి మొదలవ్వడం.. సీఎం సీటు కోసం కుట్రలు చేసిన బాబీ(వివేక్ ఒబెరాయ్)ని స్టీఫెన్ (మోహన్‌లాల్) అడ్డుకొని.. పీకేఆర్ కొడుకు జతిన్ రాందాస్(టొవినో థామస్)ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తాడు. అక్కడితో లూసిఫర్ కథ ముగుస్తుంది. సీఎం అయిన తర్వాత జతిన్ రాందాస్ బుద్ది కూడా మారుతుంది. సొంత ప్రయోజనాల కోసం మతతత్వ వాది బాబా భజరంగి(అభిమన్యు సింగ్)తో చేతులు కలిపి ఎల్‌యూఎఫ్ పీకేఆర్ అని కొత్త పార్టీని స్థాపించి ఎన్నికల్లోకి వెళ్తాడు. ఈ విషయం లండన్‌లో ఉన్న స్టీఫెన్(మోహన్ లాల్)కి తెలుస్తుంది. తన రాష్ట్రాన్ని కబలించడానికి శత్రువులంతా ఏకమై రాజకీయ యుద్ధం చేయడానికి సిద్ధమైతే..స్టీఫెన్ దాన్ని ఎలా తిప్పికొట్టాడు? అనేది సినిమా కథ. అసలు స్టీఫెన్ నేపథ్యం ఏంటి? ఖురేషీ అబ్రాన్‌గా పేరు మార్చుకొని విదేశాల్లో ఏం చేస్తున్నాడు? అతని కోసం ఇతర దేశాల గుఢాచార సంస్థలు ఎందుకు వెతుకుతున్నాయి. జతిన్ కొత్త పార్టీని స్థాపించిన తర్వాత పీకేఆర్ కూతురు ప్రియ(మంజు వారియర్) ఎలాంటి నిర్ణయం తీసుకుంది? బల్రాజ్ పటేల్ కాస్త బాబా భజరంగిగా ఎలా మారాడు? భజరంగికి జయేద్ మసూద్(పృథ్విరాజ్ సుకుమార్) మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(L2: Empuraan Movie Review ) ఎలా ఉందంటే..ఆరేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్ చిత్రంలో మోహన్‌లాల్‌ని డిఫరెంట్‌గా చూపించడంతో పాటు పొలిటికల్ డ్రామాను బాగా పండించాడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్. హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్, మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. సీక్వెల్‌కి కూడా అదే ఫాలో అయ్యాడు. హీరోతో పాటు ప్రతి పాత్రకు భారీ ఎలివేషన్స్ ఇచ్చాడు.కథ-కథనాన్ని కూడా బాగానే రాసుకున్నాడు. కానీ కథ కంటే ఎక్కువ ఎలివేషన్స్‌పైనే దృష్టిపెట్టాడు. మోహల్‌లాల్ వచ్చే ప్రతి సీన్‌కి ఎలివేషన్ పెట్టడం కొన్నిచోట్ల అతిగా అనిపిస్తుంది. అలాగే సినిమాలోని ప్రతి పాతకు ఓ ప్లాష్‌బ్యాక్ స్టోరీ చూపించడంతో కథనం సాగదీసినట్లుగా సాగుతుంది. సీన్ల పరంగా చూస్తే మాత్రం సినిమా అదిరిపోతుంది. ప్రతి ఐదు పది నిమిషాలకు గూస్బంప్స్ తెప్పించే సన్నివేశం ఉంటుంది. సినిమా ప్రారంభమైన యాభై నిమిషాల వరకు మోహన్‌లాల్ తెరపై కనిపించడు. ఆయన వచ్చి ఈ రాజకీయ అలజడిని ఎలా అడ్డుకుంటాడో అనేలా కథనాన్ని నడిపించి.. ఆయన ఎంట్రీ కోసం ఎదురు చూసేలా చేశారు. ప్రేక్షకుడు ఎదురుచూపులకు ఏ మాత్రం నిరాశ కలగకుండా ఎంట్రీ సీన్ ఉంటుంది. హీరో విదేశాల్లో ఉన్నప్పుడు వచ్చే యాక్షన్ సీన్లు హాలీవుడ్ సినిమాలను గుర్తు చేస్తాయి. ఆయా సన్నివేశాలను స్టైలీష్‌గా తీర్చి దిద్దారు. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. ఇక ద్వితియార్థం మొత్తం కేరళ రాజకీయాల చుట్టే జరుగుతుంది. అయితే సినిమాల్లో చాలా లేయర్లు ఉండడం.. పార్ట్ 3 కోసమే అన్నట్లుగా కొన్ని సన్నివేశాలు పెట్టడం ఆడియెన్స్ ని డీవియేట్ చేస్తుంది. ఇక సినిమాకి మరో ప్రధాన మైనస్ ఎంటంటే.. డైలాగులు. ఈ సినిమాలోని డైలాగులలో ఎక్కువగా ఓ మతం ప్రజలు వాడే పదాలే ఎక్కువగా కలిపిస్తాయి . డబ్బింగ్ విషయంలో జాగ్రత్త పడాల్సింది. తెలుగు నేటివిటికి తగ్గట్లుగా మార్పులు చేస్తే బాగుండేది. క్లైమాక్స్‌లో మోహల్ లాల్, పృథ్విరాజ్ కలిసి చేసే ఫైటింగ్ సీన్ ఫ్యాన్స్‌ని ఈలలు వేయిస్తుంది. పార్ట్ 3పై ఆసక్తిని పెంచేలా ముగింపు ఉంటుంది. స్టీఫెన్ అలియాస్ ఖురేషీ అబ్రాన్ నేపథ్యం పూర్తిగా తెలియాలంటే ‘ఎల్ 3’ కోసం ఎదురు చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. మోహన్‌లాల్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.దేశం గర్వించదగ్గ గొప్ప నటుల్లో ఆయన ఒకరు. ఎలాంటి పాత్రలో అయినా పరకాయ ప్రవేశం చేస్తాడు. ‘ఎల్2:ఎంపురాన్’లో స్టీఫెన్‌గా, ఖురేషి అబ్రాన్‌గా రెండు పాత్రల్లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఫ్యాన్స్ సినిమా చూడడానికి ఆయన ఎంట్రీ సీన్ ఒకటి చాలు. తెరపై ఆయన కనిపించిన ప్రతిసారి ఫ్యాన్స్‌కి పునకాలే. సీఎం జతిన్ రాందాస్‌గా టోవినో థామస్ సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ తెరపై కనిపించేది కాసేపే అయినా.. తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత్ర కోసం రాసుకున్న సన్నివేశాలే సినిమాకు కీలకం. మంజు వారియర్ మరోసారి తెరపై తన అనుభవాన్ని చూపించింది. పొలిటికల్ లీడర్‌గా ఆమె బాగా నటించారు. సెకండాఫ్‌లో ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక విలన్ బాబా భజరంగీ అలియాస్ బల్రాజు పటేల్‌గా అభిమన్యు సింగ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతావారంతా తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. యాక్షన్ కొరియోగ్రఫీ సినిమా స్థాయిని పెంచేసింది. హాలీవుడ్ మూవీ స్థాయిలో యాక్షన్ సీన్లను తీర్చిదిద్దారు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించాడు. దీపక్ దేవ్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సన్నివేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేసి, నిడివిని తగ్గిస్తే బాగుండేదేమో. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ పిక్చర్స్, శ్రీ గోకులం మూవీస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘కాలమేగా కరిగింది’ మూవీ రివ్యూ
ఇండియన్ సినిమాల్లో లవ్ అనేది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ జోనర్. టాలీవుడ్లో అయితే ప్రేమ కథలకు కొదవే లేదు. స్వచ్ఛమైన ప్రేమ కథలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారు. అలా స్వచ్ఛమైన ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రమే ‘కాలమే కరిగింది’ (Kalamega Karigindi Telugu Movie Review). ఈ సినిమాను శింగర క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై మరే శివశంకర్ నిర్మించారు. శింగర మోహన్ దర్శకత్వం వహించిన ఈ పొయెటిక్ లవ్ స్టోరీ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఫణి(వినయ్ కుమార్/ అరవింద్(చిన్నప్పటి పాత్ర) ఉన్నత చదువు చదివి బాగా సెట్ అయినా లైఫ్‌లో ఏదో తెలియని వెలితి ఉంటుంది. తన తొలి ప్రేమ గుర్తుకు వచ్చి.. ప్రియురాలి బిందు((శ్రావణి/నోమిన తార(చిన్నప్పటి పాత్ర)) కోసం సొంత ఊరికి బయలుదేరుతాడు. వీరిద్దరి మధ్య టెన్త్ క్లాస్ టైమ్‌లోనే ప్రేమ చిగురిస్తుంది. అమాయకత్వం నిండిన స్వచ్ఛమైన ప్రేమ వారికి ఎంతో సంతోషాన్నిస్తుంది. తమ ప్రేమే లోకంగా జీవిస్తుంటారు ఇద్దరు. అయితే ఓ కారణంగా వీరిద్దరు దూరం అవుతారు. లైఫ్‌లో సెటిల్ అయిన తర్వాత ఫణి.. తొలి ప్రేమ జ్ఞాపకాలు వెతుక్కుంటూ ఊరికి వస్తాడు. అసలు బిందు ఎక్కడ ఉంది? ఇన్నేళ్ల తర్వాత వచ్చిన ఫణికి బిందు కలిసిందా లేదా? అప్పటికే బిందుకి పెళ్లి అయిందా లేదా ఫణి కోసం అలాగే ఉండిపోయిందా? అసలు వీరిద్దరు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది? చివరకు వీరిద్దరు కలిశారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే..ఈ సినిమా కథంతా స్కూల్ లవ్‌స్టోరీ నేపథ్యంలో సాగుతుంది. దర్శకుడు శింగర మోహన్ ఎంచుకున్న లవ్‌స్టోరీ పాయింట్ కొత్తదేమి కాదు. కానీ అప్పటి ప్రేమకథల్లో ఉండే మాధుర్యాన్ని, అమాయకత్వాన్ని కవితాత్మకంగా మలిచి సరికొత్తగా చూపించారు. స్కూల్ డేస్ లోని బాల్యప్రేమను మధురంగా మలిచారు. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే.. ఈ సినిమాలో సారీ, థ్యాంక్స్ మినహా ఎక్కడా ఇంగ్లీష్ పదాలనే వాడలేదు. సంభాషణలు అన్ని పొయెటిక్గానే ఉంటాయి. ఈ సినిమాకు నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఆయువుపట్టులా నిలిచాయి. సంగీత దర్శకుడు తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలను ప్రాణం పోశాడు. అయితే, కమర్షియల్ ఫార్మట్‌కి దూరంగా ఉండడం.. సినిమా మొత్తం నెమ్మదిగా సాగడం.. స్కూల్ ఎపిసోడ్లో కొన్ని సీన్లను తిప్పి తిప్పి చూపించడం ఈ సినిమాకు మైనస్. హీరోహీరోయిన్ల సంభాషణలు కూడా కవితాత్మకంగా ఉండడం వాస్తవికంగా అనిపించదు. ఫస్టాఫ్లోబిందు, ఫణిల లవ్‌స్టోరీ చూపించి.. సెకండాఫ్‌లో వాళ్లు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అనేది చూపించారు. బిందు, ఫణి కలుస్తారా లేదా? బిందుకి పెళ్లి అయిందా లేదా? అనేది చివరి వరకు చూపించకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటి పెంచారు. స్లోనెరేషన్తో అప్పటికే ఇబ్బంది పడుతున్న ప్రేక్షకుల సహనానికి పరీక్షలా ప్రీక్లైమాక్స్ ఉంటుంది. పొయెటిక్ లవ్‌స్టోరీలను ఇష్టపడేవారికి ఈ చిత్రం నచ్చుతుంది. ( Kalamega Karigindi Review )ఎవరెలా చేశారంటే...ఈ సినిమా మొత్తం బిందు, ఫణి పాత్రల చుట్టే తిరుగుతుంది. మధ్యలో ఒకటి రెండు పాత్రలు వచ్చి వెళ్తాయి అంతే. బాల్యంలో ఫణి బిందు క్యారెక్లర్లను అరవింద్, నోమిన తార పోషించారు. పెద్దయ్యాక ఆ పాత్రల్లో వినయ్ కుమార్, శ్రావణి మజ్జరి కనిపిస్తారు. స్కూల్ లవ్స్టోరీకే ఎక్కువ ప్రాధన్యత ఉంటుంది. ఆయా పాత్రల్లో అరవింద్, నోమిన చక్కగా నటించారు. వినయ్ కుమార్ కూడా సెటిల్‌గా ఆకట్టుకున్నాడు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. టెక్నీకల్ విషయాలకొస్తే.. ముందు చెప్పినట్లు ఈ సినిమాకు ప్రధాన బలం గుడప్పన్ నేపథ్య సంగీతం. చాలా సన్నివేశాలకు తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రాణం పోశాడు. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. వినీతి పబ్బతి సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. సీన్లను చాలా సహజత్వంగా చిత్రీకరించారు. ఎడిటర్ తన కత్తెరకు బాగా పని చెప్పాల్సింది. సినిమాలో చాలా రిపీటెడ్ సీన్లు ఉన్నాయి. వాటిని కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'ద సస్పెక్ట్' రివ్యూ.. ఈ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?
థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ క్రేజ్ ఉంటుంది. కొత్త దర్శకులు ఇండస్ట్రీలో తొందరగా పేరు తెచ్చుకోవాలంటే ఇలాంటి సినిమాలను ఎంచుకుని బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తూ ఉంటారు. తాజాగా దర్శకుడు రాధాకృష్ణ కూడా ‘ది సస్పెక్ట్’ పేరుతో మిస్టరీ థ్రిల్లర్‌ను తెరకెక్కించారు. రుషి కిరణ్, శ్వేత, రూప, శివ యాదవ్, రజిత, ఏ కె న్ ప్రసాద్, మృణాల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. టెంపుల్ టౌన్ టాకీస్‌పై కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 21న విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథప్రత్యూష(షిరిగిలం రూప) దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును ఇన్స్పెక్టర్ అర్జున్(రుషి కిరణ్) విచారిస్తాడు. అతనికి సహాయకునిగా సదాశివ(శివ యాదవ్) అంట్ టీమ్ సహకరిస్తూ ఉంటుంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో అర్జున్‌కు ఎదురయ్యే ప్రతి వ్యక్తి సస్పెక్ట్గానే కనిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో తన ప్రేయసి మీరా (శ్వేత)ను కూడా అనుమానించాల్సి వస్తుంది. అలాగే పోలీసు ఉన్నతాధికారిని, తన స్నేహితులను ఇలా ప్రతి ఒక్కరినీ సస్పెక్ట్ చేయాల్సి వస్తుంది. మరి అసలైన హంతకుడిని అర్జున్ పట్టుకుంటాడా? ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సవాళ్లు ఏంటి? ప్రత్యూషను ఎందుకు చంపారు? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే!విశ్లేషణఈ మధ్య కాలంలో థ్రిల్లర్ చిత్రాలు ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి. ఒక చిన్న లైన్ తీసుకుని దాని చుట్టూ ఆసక్తికరమైన కథనాన్ని అల్లుకుంటున్నారు. ఆ కథనం మెప్పిస్తేనే సినిమా సక్సెస్ అవుతుంది. లేదంటే బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లాపడుతుంది. తాజాగా ‘ది సస్పెక్ట్’పేరుతో తెరకెక్కిన మూవీ ఆద్యంతం ఆడియన్స్‌ను థ్రిల్‌కు గురి చేసేందుకు ప్రయత్నించింది. చివరి వరకూ హంతకులెవరన్నది ఆడియన్స్ గుర్తు పట్టలేనంత సస్పెన్స్‌తో సినిమాను ముందుకు నడిపించారు. కేసును ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులకు ఎదురయ్యే అనేకమంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోణంలో సస్పెక్ట్ గానే కనిపిస్తుంటారు. తీరా వారు కాదని తెలుస్తుంది. ప్రీ క్లైమాక్స్‌లో అసలు హంతకులు ఎవరనేది తెలిసినప్పుడు షాకవుతారు. ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఎవరినీ కించపరిచి మాట్లాడకూడదు, ఎగతాళి చేయకూడదన్న మెసేజ్ ఇచ్చారు.ముఖ్యంగా విద్యార్థులుగా ఉన్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరిగితే... వారి మనసుమీద ఎలాంటి ప్రభావం చూపి... ఎలాంటి అనర్థాలకు దారితీస్తాయనేది చక్కగా చూపించారు. ఓపక్క మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుండగా మరోవైపు హీరో, హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్.. వారి లవ్ బ్రేకప్, మళ్లీ కలుసుకోవడం చూపిస్తారు. ఇదంతా చూసే జనాలకు కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. సెకెండాఫ్‌లో సినిమా ఊపందుకుంటుంది. అక్కడక్కడా సన్నివేశాలు బలవంతంగా ఇరికించినట్లుగా అనిపిస్తాయి. కొత్తవారైన హీరో రుషి కిరణ్... ఇన్స్పెక్టర్ అర్జున్ పాత్రలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కొన్నిచోట్ల మాత్రం అతడి నటన సహజంగా అనిపించదు. కొన్ని యాక్షన్ సీన్స్ బాగా చేశారు. అతనికి జంటగా నటించిన శ్వేత గ్లామరస్‌గా కనిపించింది. ప్రత్యూష పాత్రలో రూప కూడా పర్వాలేదనిపించింది. లావణ్య పాత్రలో రజిత బాగా చేసింది. మిగతా అందరూ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.దర్శకుడు రాధా కృష్ణ ఎంచుకున్న ప్లాట్ బాగుంది. దాని చూట్టూ రాసుకున్న స్క్రీన్ ప్లే మాత్రం కాస్త గందరగోళంగా ఉంది. కొన్ని సీన్లు బోరింగ్‌గా అనిపించినా సెకండాఫ్‌లో ఇన్వెస్టిగేషన్ ఊపందుకుంటుంది. సినిమాటోగ్రాఫర్ రాఘవేంద్ర అందించిన విజువల్స్ పర్వాలేదనిపించాయి. ప్రజ్వల్ క్రిష్ బీజీఎం బాగుంది. పాటలు బాగోలేవు. ఎడిటింగ్ ఇంకాస్త బెటర్‌గా చేయాల్సింది. నిర్మాణ విలువలు పర్వాలేదు.చదవండి: ప్రముఖ నటి రజిత ఇంట విషాదం.. తల్లి కన్నుమూత -
ఆది సాయికుమార్ లేటేస్ట్ థ్రిల్లర్ మూవీ.. ఎలా ఉందంటే?
టైటిల్: షణ్ముఖనటీనటులు: ఆది సాయికుమార్, అవికా గోర్, ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని, మాస్టర్ మను సప్పని, మనోజ్ ఆది, వీర శంకర్, కృష్ణుడు, అరియానా గ్లోరీ తదితరులుదర్శకత్వం: షణ్ముగం సప్పని నిర్మాతలు: తులసి రామ్ సప్పని, షణ్ముగం సప్పని నిర్మాణ సంస్థ: సాప్‌బ్రో ప్రొడక్షన్స్సంగీతం: రవి బస్రూర్విడుదల తేదీ: మార్చి 21, 2025టాలీవుడ్ హీరో ఆది సాయి కుమార్ భిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తుంటారు. మరోసారి డిఫరెంట్ స్టోరీతో అభిమానుల ముందుకొచ్చారు. గతంలో ప్రేమకథా చిత్రాలు ఎక్కువగా చేసిన ఆది సాయికుమార్.. టాప్ గేర్ తర్వాత గేర్ మార్చాడు. వరసగా క్రైమ్, యాక్షన్ జోనర్‌తో అభిమానులను మెప్పిస్తున్నారు. సీఎస్ఐ సనాతన్ క్రైమ్ థ్రిల్లర్ తర్వాత ఆది హీరోగా నటించిన మరో యాక్షన్ అండ్ డివోషనల్ థ్రిల్లర్ 'షణ్ముఖ'. ఈ మూవీలో ఆది సరసన ఉయ్యాలా జంపాలా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ అవికా గోర్ గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.షణ్ముఖ కథేంటంటే..చిరాగ్ జానీ(విగాండ) దంపతులకు ఓ విచిత్రమైన రూపంలో కుమారుడు జన్మిస్తాడు. అతన్ని అలా చూసిన తండ్రి కొడుకు రూపాన్ని మార్చాలనే ఉద్దేశంతో కాశీకి వెళ్లి క్షుద్ర పూజలు నేర్చుకుంటాడు. ఆ తర్వాత తిరిగొచ్చిన అతను తన కుమారుడి సాధారణ రూపం కోసం బామ్మర్ది సాయంతో తాంత్రిక పూజలు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలోనే ఎస్సైగా పనిచేస్తున్న కార్తీ వల్లభన్(ఆది సాయికుమార్) ఓ డ్రగ్ మాఫియాను పట్టుకునే క్రమంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురవుతాడు. వారం రోజుల్లోనే తన తప్పును సరిదిద్దుకోవాలని కార్తీని కమిషనర్ ఆదేశిస్తాడు. ఆ తర్వాత బెంగళూరులో జర్నలిజం చేస్తున్న సారా మహేశ్(అవికా గోర్) తన ఇన్వెస్టిగేషన్ ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్‌కు వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఎస్సై కార్తీ వల్లభన్ సాయం కోరుతుంది. ఆ సమయంలోనే సారా తన రీసెర్చ్ ప్రాజెక్ట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని కార్తీకి చెబుతుంది. అసలు ఆమె చేస్తున్న రీసెర్చ్ ప్రాజెక్ట్ ఏంటి? ఆరేళ్లుగా చేస్తున్న ఆ పరిశోధనలో కనిపెట్టిన అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్లకు ఏంటి సంబంధం? దీని వెనక ఏదైనా హ్యుమన్ ట్రాఫికింగ్ మాఫియా ఉందా? అసలు సారాను చంపాలనుకున్నది ఎవరు? చివరికీ ఈ ఇన్‌స్టిగేషన్ ప్రాజెక్ట్‌లో కార్తీ, సారా సక్సెస్ అయ్యారా? లేదా? అన్నదే అసలు స్టోరీ.ఎలా ఉందంటే.. మనదేశంలో మూఢ నమ్మకాలు, క్షుద్రపూజలను నమ్మేవారు ఇప్పటికీ ఉన్నారడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తమ స్వార్థం కోసం మనుషులు ఎంతకైనా తెగిస్తారనే పాయింట్‌ను కథగా ప్రేక్షకుల ముందుకొచ్చారు డైరెక్టర్ షణ్ముగం. గతంలోనూ ఇలాంటి జోనర్లో ఎన్నో సినిమాలు వచ్చినా ఈ స్టోరీని కాస్తా భిన్నంగా చూపించారు. కథను అడవుల్లో మొదలుపెట్టిన షణ్ముగం.. చివరికీ అడవుల్లోనే ముగించాడు. ఫస్ట్ హాఫ్ అంతా రోటీన్‌గా అనిపిస్తుంది. అద్భుతమైన ఫైట్ సీన్‌తో ఆది సాయి కుమార్‌ను ప్రేక్షకులను పరిచయం చేస్తాడు. ఆ తర్వాత జరిగే సీన్స్ ప్రేక్షకులకు ఊహకందేలా ఉంటాయి. ఆది సాయికుమార్, అవికా గోర్ లవ్ స్టోరీ కూడా అంతగా ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేదు. మొదటి భాగం అంతా ఇన్‌స్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. కథలో కొత్తదనం లేకపోవడంతో ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు. అక్కడక్కడ కృష్ణుడు(సుబ్రమణ్యం)తో వచ్చే కామెడీ సీన్స్ కాస్తా నవ్వించినా అంతగా మెప్పించలేదు. కార్తీ, సారాల ఇన్‌స్టిగేషన్ ప్రాజెక్ట్ ట్విస్ట్‌లతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది.సెకండాఫ్‌కు వచ్చేసరికి కథ మొత్తం సారా, కార్తీ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇన్వెస్టిగేషన్ చుట్టే తిరుగుతుంది. అమ్మాయిల మిస్సింగ్, అబ్బాయిల సూసైడ్ ట్విస్ట్‌లతో ఆడియన్స్‌లో కాస్తా కన్ఫ్జూజన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. కొన్ని చోట్ల సీరియస్‌గా కథ సాగుతున్న సమయంలో కామెడీని తీసుకొచ్చి ప్రేక్షకుల్లో కనెక్షన్ మిస్సయ్యేలా చేశాడు. డైరెక్టర్ తీసుకున్న పాయింట్ మంచిదే.. కానీ తెరపై ఆవిష్కరించడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. లాజిక్ పరంగా ఆలోచిస్తే కొన్ని చోట్ల సన్నివేశాల్లోనూ అది పూర్తిగా మిస్సయినట్లు కనిపించింది. కొన్ని సీన్స్ ఆడియన్స్ ఊహకందేలా ఉండడంతో కథనంలో క్యూరియాసిటీ మిస్సయింది. కథను మరింత ఆసక్తిగా మలచడంలో డైరెక్టర్ సక్సెస్ కాలేకపోయాడు. క్లైమాక్స్ సీన్లో వచ్చే ట్విస్ట్‌లతో ప్రేక్షకులను కాసేపు కట్టిపడేశాడు. కానీ కొన్ని లాజిక్ లెస్ సీన్స్‌తో కథలో సీరియస్‌నెస్ అలాగే కొనసాగించలేకపోయాడు. ఓవరాల్‌గా దర్శకుడు తాను చెప్పాలనుకున్నా సందేశం మంచిదే అయినప్పటికీ.. కథనం, స్క్రీన్‌ప్లేపై మరింత ఫోకస్ చేసుంటే ఇంకా బాగుండేది. ఎవరలా చేశారంటే..ఆది సాయికుమార్ ఎస్సై పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. పోలీస్‌గా తన అగ్రెసివ్నెస్ చూపించాడు. చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అవికా గోర్ తెరపై కొత్తగా కనిపించింది. అయినప్పటికీ తన నటనతో మెప్పించింది. ఆదిత్య ఓం, చిరాగ్ జాని, షణ్ముగం సప్పని కృష్ణుడు, అరియానా గ్లోరీ తమ పాత్రల పరిధిలో ఫర్వాలేదనిపించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్ఆర్ విష్ణు సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎంఏ మాలిక్ ఎడిటింగ్‌లో తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ఈ సినిమాకు రవి బస్రూర్ అందించిన నేపథ్యం సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.-మధుసూధన్, సాక్షి వెబ్ డెస్క్ -
Killer Artiste Review :'కిల్లర్ ఆర్టిస్ట్' మూవీ రివ్యూ
సంతోష్ కల్వచెర్ల, క్రిషేకా పటేల్ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ‘కిల్లర్ ఆర్టిస్ట్’ మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. రతన్ రిషి దర్శకత్వంలో ఎస్జేకే ఎంటర్టైన్మెంట్ పతాకంపై జేమ్స్ వాట్ కొమ్ము నిర్మించిగా.. నైజాం ఏరియాలో ఈ సినిమాను మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రిలీజ్ చేసింది. దీంతో ఈ సినిమా సోషల్‌మీడియాలో ట్రెండ్ అయిపోయింది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో మొదలై, రొమాంటిక్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా టర్న్ తీసుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.కథేంటంటే..మన సమాజంలో జరుగుతున్న ఓ వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా కథ ఉంటుంది. హత్య చేయడాన్ని కళగా భావించే ఓ వ్యక్తి కథనే కిల్లర్ ఆర్టిస్ట్‌లో చూపించారు. విక్కీ (సంతోష్) స్వాతి (స్నేహ మాధురి) అన్నాచెల్లెలుగా సంతోషంగా తమ ఇంట్లో ఉన్న సమయంలో గుర్తుతెలియని కొందరు వారిపై దాడి చేస్తారు. ఈ క్రమంలో స్వాతిని హింసించి చంపేస్తారు. ఈ ఘటన విక్కీ జీవితాన్ని మార్చేస్తుంది. తన కళ్ల ముందే చెల్లెలు మరణించడం తట్టుకోలేడు. ఆమె గుర్తులు తనను వెంటాడుతూనే ఉంటాయి. దీంతో బాగా కుంగిపోతాడు. ఈ క్రమంలో విక్కీ ప్రియురాలు జాను (క్రిషేక్ పటేల్) తెరపైకి వస్తుంది. అతన్నీ మళ్లీ మామూలు వ్యక్తిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుంది. అలాంటి సమయంలో ఒక హీరోయిన్ మాస్క్ ధరించిన 'పిచ్చి రవి' అనే సైకో నగరంలోని అమ్మాయిలను టార్గెట్ చేస్తూ చంపేస్తుంటాడు. ఈ కేసును పోలీసులు ఛేదించి అతన్ని అరెస్ట్ చేస్తారు. టీవీలో వార్తలు చూసిన విక్కీకి ఆ సైకో ధరించిన మాస్క్ తన ఇంట్లో కూడా కనిపిస్తుంది. దీంతో తన చెల్లిని చంపింది ఈ సైకోనే ఉంటాడని అతను అనుకుంటాడు. ఇంతలో పోలీసుల నుంచి ఆ సైకో తప్పించుకొని పారిపోతాడు. అలా విక్కీ ప్రియిరాలు జాను పుట్టినరోజు వేడుకలో అతను ప్రత్యక్షమవుతాడు. కొన్ని సంఘటనల ద్వారా తన చెల్లిని చంపింది ఈ సైకో కాదని విక్కీ నిర్ణయించుకుంటాడు. అయితే, ఇంతకు స్వాతిని చంపింది ఎవరు..? సిటీలోని మర్డర్స్ చేస్తున్నది ఒకరా? లేక ఇద్దరా? ఆ సైకో జాను పార్టీకి ఎందుకు వచ్చాడు..? ఫైనల్‌గా తన చెల్లిని హత్య చేసిన వారిని విక్కీ ఎలా పట్టుకుంటాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌తో మొదలైన ఈ సినిమా.. ఒక హత్యతో థ్రిల్లర్ సినిమాగా మారుతుంది. కుటుంబ సభ్యులను ఎవరైన హత్య చేస్తే అందుకు ప్రతికారం తీర్చుకున్న హీరో కథలు చాలానే తెరపైకి వచ్చాయి. ఈ కిల్లర్ ఆర్టిస్ట్ చిత్రంలో కూడా తన చెల్లెల్ని చంపిన వారిపై రివేంజ్ తీర్చుకున్న యువకుడి కథ అని చెప్పవచ్చు. అయితే, ఇందులో ఎవరూ ఊహించని విధంగా మర్డర్ మిస్టరీని ప్రేక్షకులకు దర్శకుడు చూపాడు. కానీ, హత్యలకు ప్రధాన కారణం ఏంటి అనేది సరైన క్రమంలో దర్శకుడు చెప్పలేకపోయాడు. రొటీన్ పాయింట్‌తోనే ప్రేక్షకులను కన్వెన్స్ చేసేలా ఉంది. మొదటి గంట వరకు విక్కీ, జాను ప్రేమ కథతో పాటు స్వాతి హత్య చుట్టే ఉంటుంది. ఇంటర్వెల్‌కు ముందు సైకో నిజమైన హంతకుడు కాదని దర్శకుడు రివీల్ చేస్తాడు. అయితే, ఈ పాయింట్‌ను చక్కగా చూపాడు. సిస్టర్ సెంటిమెంట్‌ను ప్రధానంగా చూపాలని దర్శకుడు అనుకున్నప్పటికీ దాన్ని సరైన డ్రామాగా చిత్రీకరించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. సైకో పాత్రలో కాలకేయ ప్రభాకర్ నటన బాగున్నప్పటికీ అతని పాత్రను ఎక్కువసేపు తెరపై చూపించడం వల్ల ప్రేక్షకులకు విసుగొస్తుంది. క్లైమాక్స్‌లో విలన్ ఇతనే అని సర్ ప్రైజ్ చేసి చివర్లో ఓ మెసేజ్‌తో ముగించేస్తారు. ఇందులో అన్నాచెల్లెలు సెంటిమెంట్ బాగానే వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. కథ పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లేలో కొత్తదనం కనిపిస్తుంది. మర్డర్ చేయడం ఒక ఆర్ట్, నేను ఆర్టిస్ట్ అంటూ ప్రభాకర్‌తో చెప్పించిన సైకో డైలాగ్స్ కొత్తగా ఉంటాయి.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధనా బలం హీరో సంతోష్, కాలకేయ ప్రభాకర్... చెల్లి చనిపోతే ఒక అన్న ఎలా బాధపడుతాడో విక్సీ పాత్రలో సంతోష్ అదరగొట్టాడు. మరోవైపు క్రిషేక పటేల్ అందాలు ఆరబోస్తూనే పర్వాలేదనిపించింది. చెల్లి పాత్రలో నటించిన స్నేహ మాధురి కనిపించింది కొద్దిసేపు మాత్రమే.. అయినప్పటికీ ఆమె బాగానే నటించింది. సత్యం రాజేష్ పోలీస్ పాత్రలో మెప్పిస్తాడు. తనికెళ్ళ భరణి, బిగ్ బాస్ సోనియా అక్కడక్కడా కనిపించినా తమ పాత్రలకు న్యాయం చేస్తారు. సినిమాకు తగిన విధంగానే సాంకేతిక విలువలు ఉన్నాయి. -
Tuk Tuk Movie: ‘టుక్ టుక్’ మూవీ రివ్యూ
మన తెలుగమ్మాయి శాన్వి మేఘన, ఇటీవల కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన హర్ష్ రోషన్, సలార్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్, సోషల్ మీడియా ఫేమ్ స్టీవెన్ మధు, నిహాల్ కోదాటి.. ముఖ్య పాత్రల్లో ఈ టుక్ టుక్ సినిమా తెరకెక్కింది. మూడు చక్రాల బండిని టుక్ టుక్ అంటాం. మరి ఈ సినిమాలో టుక్ టుక్ చేసిన విన్యాసాలు ఏంటి అనేది రివ్యూలో(Tuk Tuk Telugu Movie Review) చూద్దాం. కథేంటంటే..ముగ్గురు టీనేజ్ కుర్రాళ్ళు(హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు) డబ్బుల కోసం వినాయకుడి విగ్రహం పెట్టి వినాయకచవితి చేస్తారు. ఆ ఊళ్ళో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉండటం, నిమజ్జనానికి బండి దొరకకపోవడంతో ఈ ముగ్గురు కలిసి ఒక పాత స్కూటర్ ని ముగ్గురు కూర్చునే టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఆ బండిలోనే వినాయకుడి నిమజ్జనం ఊరేగింపు చేస్తారు. ఆ తెల్లారి నుంచి ఆ బండి దానంతట అదే ఆపరేట్ అవుతుండటంతో అందులో దేవుడు వచ్చాడు అనుకుంటారు. దీంతో స్కూటర్ లో దేవుడు ఉన్నాడు, ఏం అడిగినా హ్యాండిల్ అటు ఇటు ఊపి అవునా, కదా అని సమాధానాలు చెప్తాడు అని ఊళ్ళో ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటారు.ఈ క్రమంలో ఆ స్కూటర్ లో ఉంది దేవుడు కాదు ఆత్మ అని తెలుస్తుంది. ఈ ముగ్గురు కుర్రాళ్ళని కాస్త భయపెడుతుంది కూడా. మరి ఆ స్కూటర్ లో ఉన్న ఆత్మ ఎవరిది? ఆ స్కూటర్ లో ఎందుకు ఉంది? ఈ ముగ్గురు కుర్రాళ్ళు అందులో ఆత్మ ఉందని తెలిసాక ఏం చేసారు? నవీన్(నిహాల్ కోదాటి) - శిల్ప(శాన్వి మేఘన)ల ప్రేమ కథేంటి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..వెహికల్ దానంతట అదే ఆపరేట్ అవ్వడం, భయపెట్టడం, నవ్వించడం గతంలో తెలుగులో బామ్మ మాట బంగారు బాట, కారా మజాకా, మెకానిక్ మామయ్య లాంటి పలు సినిమాల్లో చూసాం. ఈ టుక్ టుక్ కూడా అలాంటిదే. మూడు చక్రాల బండిలో ఆత్మ ఉంటే అది ఎలాంటి విన్యాసాలు చేసింది అని సరదాగా చూపించారు. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు ఓ బండి తయారు చేయడం, ఆ బండిలో దేవుడు ఉన్నాడు అని దాంతో డబ్బులు సంపాదించడం సీన్స్ అన్ని కాస్త నవ్విస్తూనే ఆసక్తిగా ఉంటాయి.ఆ బండిలో ఆత్మ ఉందని తెలిసాక వాళ్ళు భయపడటం, అది వీళ్ళను పరిగెత్తించడం బానే నవ్విస్తాయి. స్కూటర్ మాట్లాడలేదు కానీ అది పిల్లలు అడిగే ప్రశ్నలకు ఇండికేషన్స్ ఇస్తూ సమాధానాలు చెప్పడం కొత్తగా ఉంటుంది. అయితే ఆ ఆత్మ కథేంటి అని ఫ్లాష్ బ్యాక్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. అసలు ఆ ఆత్మ అందులోకి ఎలా వచ్చింది అనేది మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేదు. లవ్ స్టోరీ కొత్తగా చూపించే ప్రయత్నం చేసారు. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా సింపుల్ గా ముగించినట్టు అనిపిస్తుంది. హీరోయిన్ పాత్రను బాగా రాసుకున్నారు. అలాగే సినిమాలో ఓ మెసేజ్ చెప్పడానికి కూడా ప్రయత్నించారు. సినిమాకు సెకండ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడం గమనార్హం.ఎవరెలా చేశారంటే..మన తెలుగమ్మాయి శాన్వి మేఘన తన క్యూట్ అందంతో మెప్పిస్తునే ధైర్యవంతురాలైన పల్లెటూరి అమ్మాయి పాత్రలో చక్కగా నటించింది. ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళ పాత్రల్లో హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు ఫుల్ ఎనర్జీతో నవ్విస్తూనే బాగా నటించారు. నిహాల్ కోదాటి పర్వాలేదనిపిస్తాడు. మిగిలిన పాత్రలు కూడా తమ పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. పచ్చని లొకేషన్స్ ని సినిమాటోగ్రఫీ విజువల్స్ తో మరింత అందంగా చూపించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది. పాటలు కూడా వినడానికి బాగున్నాయి. టుక్ టుక్ బండిని బాగా డిజైన్ చేసారు. దర్శకుడు ఓ కొత్త పాయింట్ ని టుక్ టుక్ (Tuk Tuk Movie Review)బండితో నవ్విస్తూ చెప్పాడు. నిర్మాణవిలువలు చిన్న సినిమా అయినా ఉన్నతంగా ఉన్నాయి.నటీనటులు: హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి.. తదితరులునిర్మాత: రాహుల్ రెడ్డి దర్శకత్వం: సి.సుప్రీత్ కృష్ణసంగీతం: సంతు ఓంకార్ సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయి కుమార్ ఎడిటర్: అశ్వత్ శివకుమార్ విడుదల తేది: మార్చి 21, 2025 -
కుడుంబస్థాన్ సినిమా రివ్యూ (ఓటీటీ)
ప్రేక్షకులు ఇప్పుడు చాలావరకు భారీ బడ్జెట్ సినిమాలంటే థియేటర్లకు వెళ్తున్నారు. మిగతా చిన్న చితకా మూవీస్ ని ఓటీటీల్లో చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలా పరభాషా చిత్రాల్ని డబ్ చేసి డిజిటల్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. అలా కొన్నిరోజుల క్రితం జీ5లోకి వచ్చిన మూవీ 'కుడుంబస్థాన్'. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: భార్యని కూడా రేసులోకి దింపిన చైతూ)కథేంటి?నవీన్ (మణికందన్) ఓ యాడ్ కంపెనీలో పనిచేస్తుంటాడు. వెన్నెల (శాన్వి మేఘన) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. వీళ్లిద్దరూ లేచిపోయి పెళ్లి చేసుకుంటారు. కులాల వేరు కావడంతో పెద్దల నుంచి చాలా వ్యతిరేకత వస్తుంది. అయినా సరే నవీన్.. వెన్నెలని ఇంటికి తీసుకెళ్తాడు. అనుకోని పరిస్థితుల్లో ఓ రోజు నవీన్ ని ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఈ విషయం ఇంట్లో చెబితే ఇబ్బంది అవుతుందని దాన్ని దాచేందుకు చాలా ఇబ్బందులు పడతాడు. మోసానికి కూడా గురవుతాడు. మరి నవీన్ గురించి ఇంట్లో తెలిసిపోయిందా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఇండస్ట్రీలో కథల కొరత ఉందని చాలామంది అంటూ ఉంటారు. కానీ తరచి చూస్తే మన చుట్టుపక్కలా బోలెడన్ని స్టోరీలు తారసపడతాయి. అలా ఓ మధ్య తరగతి కుర్రాడి జీవితంతో తీసిన సినిమానే 'కుడుంబస్థాన్'.నవీన్-వెన్నెల లేచిపోయి పెళ్లి చేసుకోవడంతో సినిమా మొదలవుతుంది. భార్యని ఇంట్లోకి తీసుకొస్తే.. తక్కువ కులం అమ్మాయి అని తల్లి సూటిపోటి మాటలతో దెప్పిపొడుస్తుంది. మరోవైపు తీర్థయాత్రల కోసం తల్లి.. కొడుకుని డబ్బులు అడుగుతుంది. తండ్రేమో ఇంటి బాగుచేయమని గోల చేస్తుంటారు. కొన్నాళ్లకు భార్యకు ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం తెలుస్తుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఉద్యోగం పోతుంది. తర్వాత జరిగే పరిణామాలే సినిమా.(ఇదీ చదవండి: థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలోకి హిట్ సినిమా)మీరు 'కుడుంబస్థాన్' చూస్తున్నంతసేపు నవ్వుతారు, భయపడతారు, ఆలోచిస్తారు. ఎందుకంటే నవీన్ పాత్రకు చాలామంది మధ్య తరగతి యువకులు రిలేట్ అవుతారు. డబ్బులు సంపాదించకపోతే తల్లి-భార్య-తండ్రి.. ఇలా ఏ ఒక్కరు గౌరవం ఇవ్వరు అనే విషయాన్ని చూపించిన విధానం మనసుకు గుచ్చుకుంటుంది.నవీన్ కి నసపెట్టే బావ ఒకడు ఉంటాడు. ఆ పాత్ర చూస్తున్నంతసేపు ఇలాంటివాడు మన ఇంట్లో ఒకడు ఉంటే అంతే సంగతిరా బాబు అనిపిస్తుంది. మరోవైపు హీరో కాస్త డబ్బులు సంపాదిద్దామని బేకరీ పెడతాడు. కొన్నాళ్లు బాగానే ఉంటుంది కానీ హీరో షాప్ ఎదురుగా మరో బేకరీ ఓపెన్ అవుతుంది. హీరో కష్టాలు మళ్లీ మొదటకొస్తాయి. సరేలే అని రియల్ ఎస్టేట్ విషయంలో ఒక కోటీశ్వరుడికి సాయం చేస్తే వాడేమో చెప్పిన దానికంటే తక్కువ డబ్బులిస్తాడు. ఇలా ప్రతిదగ్గర తన అహం వల్ల ఎలాంటి కష్టాలు పడ్డాడు. చివరకు తన అహాన్ని తీసి పక్కనబెట్టాడా లేదా అనేదే మూవీ.ఎవరెలా చేశారు?తమిళంలో మణికందన్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మధ్య తరగతి కుర్రాడిగా భలే సెట్ అవుతాడు. ఇందులోనూ నవీన్ పాత్రలో జీవించేశాడు. వెన్నెల పాత్ర చేసిన తెలుగమ్మాయి శాన్వి మేఘన కూడా సరిగ్గా సెట్ అయిపోయింది. ఇక హీరో తల్లిదండ్రులు, అక్క-బావ, ఫ్రెండ్ పాత్రధారులు తమకిచ్చిన పనికి పూర్తి న్యాయం చేశారు. సింపుల్ గా ఉంటూ నచ్చేసే ఓ ఫ్యామిలీ డ్రామా మూవీ చూడాలంటే 'కుడుంబస్థాన్' ట్రై చేయండి.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'కోర్ట్'లో ఫెర్ఫార్మెన్స్ అదరగొట్టేసింది.. ఎవరీ 'జాబిలి'?) -
‘దిల్ రూబా’ మూవీ రివ్యూ
‘క’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కిరణ్ అబ్బవరం (kiran Abbavaram) నుంచి వస్తున్న చిత్రం ‘దిల్ రూబా’. వాస్తవానికి ‘క’ కంటే ముందే ఈ చిత్రం రావాల్సింది. కానీ కొన్ని కారణాలతో ఆసల్యంగా థియేటర్స్‌కి వచ్చింది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉంటాయనే విషయం కిరణ్‌కి కూడా తెలుసు. అందుకే ‘దిల్ రూబా’ (Dilruba Review) విషయంలో ఇంకాస్త ఫోకస్ పెట్టాడు. కొన్ని సీన్లను రీషూట్ కూడా చేసినట్లు సమచారం. పబ్లిసిటీ విషయంలోనూ కిరణ్ జాగ్రత్తలు తీసుకున్నాడు. ‘ఈ సినిమాలో ఫైట్స్ నచ్చకపోతే..చితక్కొట్టండి’ అని నిర్మాత సవాల్ విసరడం, అది నెట్టింట బాగా వైరల్ కావడంతో ‘దిల్ రూబా’పై అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే సినిమా ఉందా? కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడిందా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. సిద్ధార్థ్‌రెడ్డి అలియాస్ సిద్దు(కిరణ్ అబ్బవరం) , మ్యాగీ(ఖ్యాతి డేవిసన్) కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అనంతరం మ్యాగీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్లిపోతుంది. బ్రేకప్‌తో బాధ పడుతున్న సిద్ధుని చూసి తట్టుకోలేకపోయిన ఆయన తల్లి..ఇక్కడే ఉంటే ఆ బాధ ఎక్కువతుందని, మంగుళూరు వెళ్లి చదుకోమని చెబుతోంది. దీంతో సిద్ధు మంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు. అక్కడ తన క్లాస్మేట్ అంజలి(రుక్సార్ థిల్లాన్) (rukshar dhillon)తో ప్రేమలో పడతాడు. కొన్ని కారణాల వీళ్ల మధ్య కూడా గ్యాప్ వస్తుంది. ప్రేమించమని వెంటపడిన అంజలి..ప్రేమలో పడిన తర్వాత సిద్ధుని ఎందుకు దూరం పెట్టింది? వీళ్ల బ్రేకప్‌కి కారణం ఎవరు? అమెరికాలో ఉన్న మ్యాగీ తిరిగి ఇండియాకు ఎందుకు వచ్చింది? విక్కీతో సిద్ధుకి ఉన్న గొడవేంటి? డ్రగ్స్ మాఫియా డాన్ జోకర్(జాన్ విజయ్) సిద్ధుని ఎందుకు చంపాలనుకున్నాడు? సారీ, థ్యాంక్స్ అనే పదాలను సిద్ధు ఎందుకు దూరంగా ఉంటాడు? చివరకు అంజలి, సిద్ధుల ప్రేమకథ ఏ తీరానికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. కొత్తదనంతో వస్తున్న కథలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలో హీరో క్యారెక్టర్ని కాస్త డిఫరెంట్‌గా ప్రజెంట్ చేస్తున్నారు దర్శకులు. ఓ ఢిఫరెంట్ పాయింట్‌ని పట్టుకొని కథలు అల్లుకుంటున్నారు. అయితే కథ కొత్తగా ఉంటే సరిపోదు..తెరపై చూస్తున్నప్పుడు కూడా ఆ కొత్తదనం కనిపించాలి. దిల్ రూబా విషయంలో అది మిస్ అయింది. వాస్తవానికి ఈ స్టోరీలో రెండు కొత్త పాయింట్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయికి మాజీ ప్రేయసీ అండగా నిలవడం.. హీరో ఎవరీకీ సారీ, థ్యాంక్స్ చెప్పకపోవడం. ఈ రెండు ఎలిమెంట్స్ ఆసక్తికరమైనవే కానీ..తెరపై అంతే ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. కాలేజీ ఎపిసోడ్ యూత్‌ని ఆకట్టుకుంటుంది. అంజలీ పాత్రను ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. అయితే కాలేజీలో వచ్చే యాక్షన్ సీన్లు తెరపై చూడడానికి బాగున్నా..కథకి ఇరికించినట్లుగా అనిపిస్తాయి. విరామానికి ముందు వచ్చే ఫైట్ సీన్ బాగుంటుంది. మాజీ లవర్ రంగంలోకి దిగడంతో సెకండాఫ్‌పై ఆసక్తి పెరుగుతుంది. అంజలి, సిద్ధుల ప్రేమ కథ కొత్త మలుపు తిరుగుతుందనుకుంటున్న సమయంలో జోకర్ పాత్రను పరిచయం చేశాడు దర్శకుడు. దీంతో అసలు వీళ్ల లవ్‌స్టోరీకి జోకర్ ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుందీ. దానికి దర్శకుడు సరైన జెస్టిఫికేషనే ఇచ్చాడు. కానీ ఆ పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. సహజత్వం లోపిస్తుంది. కడప నేపథ్యంతో తీర్చిదిద్దిన సన్నివేశాలు బాగుంటాయి. క్లైమాక్స్‌లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ పర్వాలేదు. అయితే కథను ముగించిన తీరు నిరుత్సాహపరుస్తుంది.ఎవరెలా చేశారంటే.. కిరణ్ అబ్బవరం టాలెంటెడ్ నటుడు. పాత్రకు న్యాయం చేసేందుకు కష్టపడతాడు . డిఫరెంట్ పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తాడు. ‘క’తో పోలిస్తే దిల్ రూబాలో కిరణ్ది డిఫరెంట్ పాత్రే.దానికి న్యాయం చేశాడు. తెరపై అందంగా కనిపించాడు. యాక్షన్స్ సీన్లలో ఇరగదీశాడు. ఎమోషనల్ సీన్ల విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. రుక్సార్ థిల్లాన్ పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఖ్యాతి డేవిసన్ తన పాత్ర పరిధిమేర నటించింది. జాన్ విజయ్ రెగ్యులర్ విలన్ పాత్రను పోషించాడు. సత్య పండించిన కామెడీ బాగున్నప్పటికీ..అతన్ని పూర్తిగా వాడుకోలేకపోయారు. విక్కీ పాత్రలో కిల్లి క్రాంతి చక్కగా నటించారు. తులసి, 'ఆడుకాలం' నరేన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. యాక్షన్ సీన్లకు ఆయన ఇచ్చిన బీజీఎం అదిరిపోతుంది. కేసీపీడీ థీమ్‌ని ఫైట్ సీన్‌కి వాడడం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ, యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. కొన్ని డైగాల్స్ పూరీ జగన్నాథ్ మాటలను గుర్తు చేస్తాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. టైటిల్: దిల్ రూబానటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్, నజియా, ఖ్యాతి డేవిసన్, సత్య తదితరులునిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్రచన, దర్శకత్వం: విశ్వ కరుణ్సంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: డానియేల్ విశ్వాస్ఎడిటర్: ప్రవీణ్. కేఎల్విడుదల తేది: మార్చి 14, 2025 -
ప్రియమణి సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ.. ఆడియన్స్‌ను మెప్పించిందా?
టైటిల్: ఆఫీసర్ ఆన్ డ్యూటీ(మలయాళ డబ్బింగ్ సినిమా)నటీనటులు: ప్రియమణి, కుంచకో బోబన్ తదితరులుడైరెక్టర్: జీతూ అష్రఫ్నిర్మాతలు: మార్టిన్ ప్రక్కత్, సిబి చవారా, రంజిత్ నాయర్సంగీత దర్శకుడు: జేక్స్ బిజోయ్తెలుగులో విడుదల: 14 మార్చి 2025ఇటీవల తెలుగులో మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మలయాళంలో తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులోనూ సూపర్‌హిట్‌గా నిలిచాయి. మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, సూక్ష్మదర్శిని లాంటి సినిమాలు తెలుగులోనూ సత్తాచాటాయి. ముఖ్యంగా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో పాటు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఆదరిస్తున్నారు. అలా మరో సరికొత్త క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మలయాళంలో ఫిబ్రవరిలో విడుదలైన ఆఫీసర్ ఆన్ డ్యూటీని తెలుగులోనూ రిలీజ్ చేశారు. మలయాళ స్టార్ కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే..సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ప్రత్యేకమైన ఆడియన్స్ ఉంటారు. అందుకే ఈ జోనర్ సినిమాలకు ఆదరణ ఎప్పటికీ ఉంటుంది. జీతూ అష్రఫ్ తన డెబ్యూ కథగా అలాంటి జోనర్‌నే ఎంచుకున్నారు. పోలీసు అధికారి ఆత్మహత్య చేసుకునే సీన్‌తో కథ మొదలవుతుంది. ఆ తర్వాత బస్సులో చైన్ స్నాచింగ్, ఫేక్ గోల్డ్ లాంటి కేసుల చుట్టూ తిరుగుతుంది. అయితే ఇలాంటి కేసులను అవలీలగా ఛేదించే సీఐ హరిశంకర్(కుంచకో బోబన్) ఫేక్ గోల్డ్ కేసు ఎదురవుతుంది. ఆ కేసును సీరియస్‌గా తీసుకున్న హరిశంకర్ దర్యాప్తు ప్రారంభిస్తారు. ఆ సమయంలో సీఐ హరిశంకర్‌కు షాకింగ్ విషయాలు తెలుస్తాయి. అంతే కాకుండా ఈ ఫేక్ గోల్డ్ కేసు కాస్తా ఓ అమ్మాయి ఆత్మహత్యకు దారితీస్తుంది. అసలు ఈ కేసుతో ఆ అమ్మాయికి గల సంబంధం ఏంటి? ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఆ అమ్మాయి సూసైడ్‌కు హరిశంకరే కారణమా? దీని వెనక ఏదైనా మాఫియా ఉందా? ఇదేక్రమంలో హరిశంకర్‌కు భార్య ప్రియమణి(గీత)తో తీవ్రమైన గొడవ జరుగుతుంది. అన్యోన్యంగా ఉండే భార్య, భర్తల మధ్య గొడవ ఎందుకు జరిగింది? అసలు వారిద్దరు ఎందుకు విడిపోవాలనుకున్నారు? వీరి ముద్దుల కూతురు ఎందుకు సూసైడ్ చేసుకుంది? అనే విషయాలు తెలియాలంటే ఆఫీసర్ ఆన్ డ్యూటీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు అనగానే దాదాపుగా ప్రేక్షకుల ఊహకందేలా ఉంటాయి. మర్డర్ మిస్టరీని ఛేదించడం లాంటివీ కథలు రోటీన్‌గా అనిపిస్తాయి. ముఖ్యంగా ఇలాంటి జోనర్లో పోలీసులు, నిందితులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేయడం చుట్టే కథ తిరుగుతుంది. కానీ ఆఫీసర్ ఆన్ డ్యూటీలో పోలీసు అధికారులే బాధితులు కావడమనేది కొత్త పాయింట్‌ను డైరెక్టర్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఫస్ట్ హాఫ్‌లో వరుస కేసులు, దర్యాప్తు సమయంలో వచ్చే ట్విస్ట్‌లతో ఆడియన్స్‌ను ఆసక్తిని క్రియేట్ చేశాడు డైరెక్టర్. అసలు ఒక కేసు దర్యాప్తు చేయడానికి వెళ్తే.. ఆ కేసు మరో కేసుకు లింక్ కావడంతో మరింత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. నిందితుల కోసం హరిశంకర్ వేసే స్కెచ్, అతనికి పోలీసు డిపార్ట్మెంట్లో ఎదురయ్యే సమస్యలు కాస్తా రోటీన్‌గానే అనిపిస్తాయి. ఈ కేసు కీలకదశలో ఉండగానే ఊహించని ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ పడుతుంది. సెకండాఫ్‌లో మరింత ఆసక్తికర మలుపులతో ప్రేక్షకులను సీట్‌కు అతుక్కునేలా చేశాడు డైరెక్టర్ అష్రఫ్. వరుస ట్విస్ట్‌లతో ప్రేక్షకుల్లో సస్పెన్స్ క్రియేట్ చేశాడు. నిందితులను పట్టుకునే క్రమంలో వచ్చే సీన్స్, ఫైట్స్‌తో ఆడియన్స్‌కు వయొలెన్స్‌ను పరిచయం చేశాడు మన దర్శకుడు. సెకండాఫ్ మొత్తం వన్ మ్యాన్ షోగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఓ సిన్సియర్ పోలీసు అధికారి కేసు డీల్ చేస్తే ఎలా ఉంటుందనేది కోణం కూడా దర్శకుడు తెరపై ఆవిష్కరించాడు. పోలీసులు నిందితుల కోసం వేసే స్కెచ్, దర్యాప్తు సీన్స్ రోటీన్‌గా ఉన్నప్పటికీ.. ఈ జోనర్లో కథలో కొత్తదనాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కథను సస్పెన్స్‌గా తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. కొన్ని చోట్ల రోటీన్‌గా అనిపించినా.. ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్‌లతో కథను ఆసక్తిగా తీసుకెళ్లాడు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఎండింగ్లో కూడా అంతే ట్విస్ట్ ఇచ్చాడు. క్లైమాక్స్ సీన్‌తో ఆడియన్స్‌కు కాసేపు ఉత్కంఠకు గురిచేశాడు. ఓవరాల్‌గా కొత్త డైరెక్టర్ అయినా తాను అనుకున్న పాయింట్‌ను తెరపై ఆవిష్కరిచండంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఆఫీసర్ ఆన్ డ్యూటీ సరికొత్త అనుభూతిని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎవరెలా చేశారంటే..మలయాళ స్టార్ కుంచన్ బోబన్ పోలీసు అధికారిగా తన అగ్రెసివ్ యాక్టింగ్‌తో మెప్పించాడు. ముఖ్యంగా తనదైన భావోద్వేగాలతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. ప్రియమణి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేనప్పటికీ.. తన రోల్‌కు పూర్తిస్థాయిలో న్యాయం చేసింది. మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధిలో ఆడియన్స్‌ను మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. విజువల్స్ పరంగా ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా జేక్స్ బిజోయ్ బీజీఎం ఈ సినిమాకు ప్లస్. ఎడిటింగ్‌లో ఇంకాస్తా ఫోకస్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. - మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
Court Movie Review: నాని ‘కోర్ట్’ మూవీ రివ్యూ
టైటిల్:'కోర్ట్'- స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నటీనటులు: ప్రియదర్శి, శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి తదితరులుసమర్పణ: నానినిర్మాణ సంస్థ: వాల్ పోస్టర్ సినిమానిర్మాత: ప్రశాంతి తిపిర్నేనికథ, దర్శకత్వం: రామ్ జగదీష్సంగీతం: విజయ్ బుల్గానిన్సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: మార్చి 14, 2025హీరో నాని ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు కొత్త చిత్రాలను నిర్మిస్తున్నాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్త కంటెంట్‌తో పాటు కొత్త నటీనటులను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఆయన బ్యానర్లో తెరకెక్కిన చిత్రమే ‘కోర్ట్’. ‘‘కోర్ట్’ నచ్చకపోతే నా ‘హిట్ 3’సినిమా చూడకండి’ అంటూ నాని సవాల్ విసరడంతో ఈ చిన్న చిత్రంపై అందరిలో ఆసక్తి పెరిగింది. అంతేకాదు రిలీజ్‌కి రెండు రోజుల ముందే మీడియాకు స్పెషల్ షో వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా 2013లో సాగుతుంది. విశాఖపట్నంలో మంగపతి(శివాజీ)కి మంచి రాజకీయ పలుకుబడి ఉంటుంది. తన మామయ్య(శుభలేఖ సుధాకర్) ఇంట్లో కూడా తన పెత్తనమే సాగుతుంది. ఆడవాళ్లను తన హద్దుల్లో పెట్టుకోవాలనే మనస్తత్వం తనది. ఇంట్లో ఉన్న అమ్మాయిలు కాస్త ఫ్యాషన్ దుస్తులు ధరించినా సహించలేడు. అలాంటి వ్యక్తికి తన కోడలు జాబిలి(శ్రీదేవి) ప్రేమ కథ తెలుస్తుంది. ఇంటర్ చదువుతున్న జాబిలి.. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం జాబ్ చేస్తున్న వాచ్మెన్ కొడుకు చంద్రశేఖర్ అలియాస్ చందు(రోషన్)తో ప్రేమలో పడుతుంది. ఈ విషయం మంగపతికి తెలిసి.. తనకున్న పలుకుబడితో చందుపై పోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేయిస్తాడు. మరి ఈ కేసు నుంచి చందు ఎలా బయటపడ్డాడు? జూనియర్ లాయర్ సూర్యతేజ(ప్రియదర్శి) ఎలాంటి సహాయం చేశాడు? అసలు పోక్సో చట్టం ఏం చెబుతోంది? ఈ చట్టాన్ని కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకుల్ని ఎలా బలి చేస్తున్నారు? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘కోర్ట్’ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. చట్టానికి ఎవరూ అతీతులు కాదని రాజ్యాంగం చెబుతోంది. కానీ అదే చట్టాలను కొంతమంది తమ స్వార్థం కోసం ఉపయోగించి అమాయకులను జైలుపాలు చేసిన ఉదంతాలు చాలానే ఉన్నాయి. ‘కోర్ట్’ సినిమా చూస్తున్నంతసేపు అలాంటి ఘటనలు గుర్తుకొస్తూనే ఉంటాయి. చిన్న పిల్లల రక్షణ కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని కొంతమంది ఎలా మిస్ యూజ్ చేస్తున్నారు? ఇలాంటి పవర్ఫుల్ చట్టాలలో ఉన్న లొసుగులను పోలీసులతో పాటు ‘లా’ వ్యవస్థ ఎలా వాడుకుంటుంది? పోక్సో చట్టం ఏం చెబుతోంది? అందులో ఉన్న ప్లస్, మైనస్ పాయింట్స్ ఏంటి? తదితర విషయాలను ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు రామ్ జగదీష్.దర్శకుడు ఎంచుకున్న టాపిక్ చాలా సెన్సిబుల్. ఎక్కడా అసభ్యతకు తావులేకుండా చాలా నీట్‌గా ఆ టాపిక్‌ని చర్చించాడు. ఈ విషయంలో దర్శకుడిని ప్రశంసించాల్సిందే. అయితే కథనం మాత్రం ఊహకందేలా సాగించాడు. సినిమా ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి సీన్ మన ఊహకందేలా సాగుతుంది. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. అలాగే లవ్ స్టోరీని కూడా రొటీన్‌గానే చూపించాడు. కుర్రాడిపై పోక్సో కేసు నమోదైన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. బెయిల్ కోసం ప్రయత్నించిన ప్రతిసారి చట్టంలోని లొసుగులు ఉపయోగించి లాయర్ దాము(హర్ష వర్ధన్) అడ్డుపడే విధానం ఆకట్టుకుంటుంది. క్రాస్ ఎగ్జామినేషన్‌లో అవన్నీ అబద్దాలని తేలిపోతాయని తెలిసినా.. తెరపై చూస్తుంటే ఆసక్తికరంగా అనిపిస్తాయి. సెకండాఫ్ మొత్తం కోర్టు వాదనల చుట్టే తిరుగుతుంది. కొన్ని చోట్ల ప్రియదర్శి వాదనలు ఆకట్టుకుంటాయి. చిన్నచిన్న ట్విస్టులు కూడా ఎంటర్టైన్ చేస్తాయి. ఎమోషనల్ సీన్లను బలంగా రాసుకున్నాడు. క్లైమాక్స్‌లో లా వ్యవస్థను ప్రశ్నిస్తూ ప్రియదర్శి చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. ఎవరెలా చేశారంటే.. ప్రియదర్శి నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్ర అయినా సరే నేచురల్ యాక్టింగ్‌తో అదరగొట్టేస్తాడు. జూనియర్ లాయర్ సూర్యతేజ పాత్రలో ఒదిగిపోయాడు. కోర్టులో ఆయన వినిపించే వాదనలు ఆకట్టుకుంటాయి. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన హర్ష రోషన్ ఈ సినిమాలో చందు పాత్ర పోషించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. జాబిలిగా కొత్తమ్మాయి శ్రీదేవి చక్కగా నటించింది. ఇక ఈ సినిమాలో బాగా పండిన పాత్ర శివాజీది అని చెప్పాలి. తెరపై ఆయన పండించిన విలనిజం సినిమా స్థాయిని పెంచేసింది. సాయి కుమార్, రోహిణి, శుభలేఖ సుధాకర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విజయ్ బుల్గానిన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలమైంది. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
జీవీ ప్రకాశ్ కుమార్ 'కింగ్స్టన్' మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తమిళంతో పాటు తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. తాజాగా కింగ్ స్టన్ మూవీతో నిర్మాతగా కూడా మారిపోయాడు. ఈ చిత్రానికి నిర్మాతగా, హీరోగా, సంగీత దర్శకుడిగా త్రిపాత్రాభినయం చేశారు. ఈ మూవీలో హిరోయిన్‌గా దివ్య భారతి నటించారు. తెలుగు, తమిళం భాషల్లో ఈ మూవీ ఈరోజు రిలీజైంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో రివ్యులో తెలుసుకుందాం.అసలు కింగ్స్టన్ కథేంటంటే..కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్స్టన్ సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..తమిళంలో తెరకెక్కిన కింగ్స్టన్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం అంటే కథలో బలం ఉన్నందుకే. ఇలాంటి డిఫరెంట్ కథలకి సినీ ఆడియన్స్ ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేయటం అభినందనీయం. సముద్ర శాపంతో కొట్టుమిట్టాడే ఓ ఊరి ప్రాంతం.. ఉపాధి లేక అల్లాడిపోతోన్న జనం.. ఆ ఊరి జనం కోసం నిలబడే హీరో... మాస్ ఎలివేషన్స్‌తో వెండి తెరపై హీరో కనిపిస్తే బీసీ సెంటర్లలో విజిల్స్ పడాల్సిందే.ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌ను మెప్పించేలా ఎలివేషన్స్, ఎమోషన్స్ ఉన్నాయి. విలన్ వద్ద హీరో పనిచేస్తూ... అతనికే ధమ్కీ ఇవ్వాలంటే హీరోకి కావాల్సినంత మాస్ ఉండాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ విషయంలో దర్శకుడు బాగా సెట్ చేశాడు. లాజిక్స్ పక్కన పెట్టి సినిమాను చూస్తే... బాగానే ఎంగేజ్ చేస్తుంది మూవీ. సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త స్లో కావడం ప్రేక్షకుల్ని నిరాశ కలిగించినా.... సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంటుంది. క్లైమాక్స్ సీన్ కూడా అదిరిపోయింది. డైరెక్టర్ కథను ఆడియన్స్‌కు వివరించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు.ఎవరెలా చేశారంటే..జీవీ ప్రకాశ్ ఇలాంటి పాత్రలు ఈజీగా చేసేస్తుంటాడు. పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ అయిపోతాడు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ యాక్టింగ్‌తో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మాస్ లుక్‌లో అలరించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ ఫ్యాన్స్‌ను జీవీ మెప్పించాడు. ఇక దివ్య భారతి తన పరిధిలో ఆకట్టుకుంది. ఆంటోని, సాల్మాన్, బోస్, చార్లెస్ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక సాంకేతికత విషయానికొస్తే విజువల్స్, కెమెరా వర్క్, బీజీఎమ్, వీఎఫ్ఎక్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పడవ, సముద్రం, అక్కడ చూపించిన సీన్ విజువల్స్ బాగున్నాయి. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'రేఖాచిత్రం' సినిమా రివ్యూ (ఓటీటీ)
మలయాళ సినిమా అనగానే అందరికీ గుర్తొచ్చేవి థ్రిల్లర్స్. ఎప్పటికప్పుడు సరికొత్త కథలతో థ్రిల్లర్ మూవీస్ తీస్తూనే ఉంటారు. అలా ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో రిలీజై హిట్ కొట్టినంది 'రేఖాచిత్రం'. ఇప్పుడు దీని తెలుగు వెర్షన్ సోనీ లివ్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 34 సినిమాలు)కథేంటి?రాజేంద్రన్ (సిద్ధిఖ్) అనే ఓ పెద్దాయన.. మలకపార ప్రాంతంలోని అడవిలో గన్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంటాడు. చనిపోవడానికి ముందు ఓ వీడియో రికార్డ్ చేస్తాడు. 40 ఏళ్ల క్రితం ఓ అమ్మాయిని హత్య చేశామని, మరో ముగ్గురితో కలిసి ఇప్పుడు కూర్చున్న చోటే ఆమెని పాతిపెట్టాం అని సదరు వీడియోని ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తాడు. అదేరోజు ఆ ఊరి ఎస్ఐగా వివేక్ (అసిఫ్ అలీ) జాయిన్ అవుతాడు. రాజేంద్రన్ చెప్పినట్లు అక్కడ తవ్వితే నిజంగానే ఓ అమ్మాయి ఎముకలు దొరుకుతాయి. అలా ఈ కేసు దర్యాప్తు మొదలవుతుంది. ఇంతకీ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఆమెను ఎందుకు చంపారు? హత్య చేసిన వాళ్లు పట్టుబడ్డారా లేదా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు తీయడం మలయాళీ దర్శకులకు వెన్నతో పెట్టిన విద్య. అలా అని 'రేఖాచిత్రం' ఏదో డిఫరెంట్ అని కాదు. ఎప్పటిలానే ఇదో మర్డర్ మిస్టరీ. కాకపోతే దీన్ని డీల్ చేసిన విధానం. సస్పెన్స్ ఎలిమెంట్స్ ని ఒక్కొక్కటిగా రివీల్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.వివేక్ ఓ పోలీస్. కానీ డ్యూటీ టైంలో బెట్టింగ్స్ ఆడుతున్నాడని సస్పెండ్ చేస్తారు. కొన్నాళ్లకు ఓ మారుమూల పల్లెటూరికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. సరిగ్గా జాయిన్ అయిన రోజే ఓ అమ్మాయి మర్డర్ కేసు. అది కూడా 40 ఏళ్ల క్రితం ఈమెని చంపి పాతిపెట్టి ఉంటారు. రాజేంద్రన్ అనే వ్యక్తి ఈ విషయాల్ని బయటపెట్టి చనిపోతాడు. దీంతో అసలు రాజేంద్రన్ ఎవరు? చనిపోయిన అమ్మాయి ఎవరు? ఆమెకు 1985లో రిలీజైన మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి 'కాతోడు కాతరం' సినిమాకు సంబంధం ఏంటనేది వివేక్ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఈ క్రమంలోనే పలు అడ్డంకులు కూడా ఎదురవుతాయి.సినిమా మొదలైన ఐదు నిమిషాలకే మర్డర్ గురించి తెలుస్తుంది. అలా మనల్ని దర్శకుడు కథలోకి నేరుగా తీసుకెళ్లిపోతాడు. స్టోరీ ఎక్కడా పరుగెట్టదు కానీ అనవసర సీన్ ఒక్కటీ ఉండదు. యువతి కాలిపట్టితో మొదలుపెట్టి.. ఒక్కో పాత్ర ఒక్కో లింక్ ని పట్టుకుని స్టోరీ తెలిసేకొద్ది యమ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.(ఇదీ చదవండి: Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ)చనిపోయిన రాజేంద్రన్.. తనతో పాటు విన్సెంట్ కూడా హత్యలో భాగమని చెబుతాడు. నిజంగానే విన్సెంట్ హత్య చేశాడా? దీన్ని వివేక్ ఎలా నిరూపించడనేది చివరివరకు మనల్ని ఎంగేజ్ చేసే విషయం. చూస్తున్నంతసేపు ఎక్కడా మనం ఓ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ రాదు. మన చుట్టుపక్కలా జరుగుతున్నట్లే చాలా నేచురల్ గా ఉంటుంది. చివరకొచ్చేసరికి ఓ మంచి థ్రిల్లర్ సినిమా చూశామనే అనుభూతి మాత్రం కలుగుతుంది.ఓ యువతి హత్యకు మమ్ముట్టి సినిమా, షూటింగ్ తో లింక్ చేసి చూపించడం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో మమ్ముట్టి అప్పటి లుక్ కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ టెక్నాలజీ ఉపయోగించి యువకుడిలా చూపించడం కూడా బాగుంది. ప్రతి పాత్రని పరిచయం చేసిన తీరు, ముగించిన తీరు చాలా ఆకట్టుకుంటుంది.ఎవరెలా చేశారు?ఓటీటీ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు కాస్తోకూస్తో తెలిసిన అసిఫ్ అలీ, అనస్వర రాజన్.. వివేక్, రేఖ పాత్రల్లో ఇమిడిపోయారు. ఎక్కడ ఓవరాక్షన్ లేకుండా సింపుల్ గా చేసుకుంటూ వెళ్లిపోయారు. మిగిలిన ప్రతి పాత్రధారి తమ నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో పాటలు పెద్దగా లేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరిపోయింది. మిగతా టెక్నీషియన్స్ తమకిచ్చిన పనికి న్యాయం చేశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. కుటుంబంతో కలిసి ఎంచక్కా ఎంజాయ్ చేసే థ్రిల్లర్ మూవీ ఈ 'రేఖాచిత్రం'.-చందు డొంకాన(ఇదీ చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన) -
Chhaava Review: ‘ఛావా’(తెలుగు వెర్షన్) మూవీ రివ్యూ
టైటిల్: ఛావానటీనటులు: విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్, డయానా పెంటీ, సంతోష్ జువేకర్ తదితరులునిర్మాత: దినేష్ విజన్దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్సంగీతం: ఏఆర్ రెహమాన్సినిమాటోగ్రఫీ: సౌరభ్ గోస్వామి (ISc)ఎడిటర్: మనీష్ ప్రధాన్తెలుగు రిలీజ్: గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్విడుదల తేది: మార్చి 7, 2025(తెలుగులో)ఛావా.. ఫిబ్రవరి 14న కేవలం హిందీ భాషలో మాత్రమే రిలీజైన ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓ మోస్తరు అంచనాలతో రిలీజై.. రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తే బాగుండేదని చాలా మంది అనుకున్నారు. ఎట్టకేలకు గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసింది. నేడు(మార్చి 7) తెలుగు భాషలో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఛావా కథేంటంటే..ఛత్రపతి శివాజీ మరణంతో మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని, ఇక ఆ రాజ్యాన్ని సులభంగా ఆక్రమించుకోవచ్చని భావిస్తాడు మొగల్ చక్రవర్తి ఔరంగాజేబు(అక్షయ్ ఖన్నా). అతని ఆశకు అడ్డుకట్ట వేస్తూ బరిలోకి దిగుతాడు శివాజీ పుత్రుడు శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్). మొగల్ చక్రవర్తుల కోశాగారంపై దాడి చేస్తాడు. ఈ విషయం ఔరంగాజేబు వరకు చేరుతుంది. దీంతో శంభాజీని అంతం చేసేందుకు తానే రంగంలోకి దిగుతాడు. పెద్ద ఎత్తున సైన్యంతో దక్కన్ ప్రాంతానికి బయలుదేరుతాడు. కేవలం పాతిక వేల మంది సైన్యం మాత్రమే ఉన్న శంభాజీ..ఔరంగాజేబును ఎలా ఎదుర్కొన్నాడు? యుద్ధంలో అతనికి తోడుగా నిలిచిందెవరు? వెన్నుపటు పొడిచిందెవరు? స్వరాజ్యం కోసం ఆయన చేసిన పోరాటం ఏంటి? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ‘ఛావా’ అనేది మారాఠా రాజు శంభాజీకి సంబంధించిన చరిత్ర. అది ఉన్నది ఉన్నట్లుగా చూపించాలి. లేనిపోని మార్పులు చేస్తే చరిత్రకారులు విమర్శిస్తారు. అలా అని ఆసక్తికరంగా చూపించపోతే ప్రేక్షకులు మెచ్చరు. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఛావాని తెరకెక్కించాడు. శంభాజీ గురించి పూర్తిగా చెప్పకుండా.. స్వాతంత్రం కోసం, మారాఠా సామ్రాజ్యాన్ని కాపాడడం కోసం ఆయన చేసిన పోరాటాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడు. శంభాజీ చరిత్ర తెలిసివాళ్లు కూడా తెరపై ‘ఛావా’ చూస్తే ఎంటర్‌టైన్‌తో పాటు ఎమోషనల్ అవుతారు.రాజుల పాలన ఎలా ఉంటుంది? అధికారం కోసం ఎలాంటి కుట్రలు చేస్తారు? అనేది బాహుబలితో పాటు పలు చారిత్రాత్మక సినిమాల్లో చూశాం. ‘ఛావా’ కథ కూడా అదే. అందుకే ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా భారీ ఎలివేషన్స్, ఎమోషన్స్, యాక్షన్ సీన్లతో కథనాన్ని నడిపించాడు. శంభాజీ చరిత్ర తెలియని వాళ్లకు కూడా ఈజీగా అర్థం అయ్యేలా కథను తీర్చిదిద్దాడు. ఓ భారీ యుద్దపు సన్నివేశంతో హీరో ఎంట్రీని ప్లాన్ చేసి.. సినిమా ప్రారంభం నుంచే ఆసక్తిని పెంచేలా చేశాడు. ఫస్టాఫ్ మొత్తం రాజ్యాలు.. యుద్దం.. కుట్రలు ఇలానే సాగుతుంది. కథ ఊహకందేలా సాగడం.. శంభాజీని అంతం చేసేందుకు ఔరంగాజేబు చేసే కుట్రలు రొటీన్‌గా ఉండడంతో కథనం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్ని సీన్లను మరింత ఎమోషనల్‌గా చూపించే ఆస్కారం ఉన్నా..దర్శకుడు ఆ సీన్లను సింపుల్‌గా కట్ చేశాడు. ఇక సెకండాఫ్ మాత్రం చాలా పకడ్భంధీగా ప్లాన్ చేసుకున్నాడు డైరెక్టర్. ఔరంగాజేబు సైన్యాన్ని ఎదుర్కొనుందుకు శంభాజీ చేసే ప్రయత్నం..ఈ క్రమంలో వచ్చే యుద్దపు సన్నివేశాలు అదిరిపోతాయి. సంగమేశ్వరలో ఉన్న శంభాజీపై మొగల్ సైన్యం దాడి చేసే సీన్లు.. వారిని ఎదుర్కొనేందుకు శంభాజీ చేసే పోరాట ఘట్టాలు ప్రేక్షకుడికి గూస్బంప్స్ తెప్పిస్తాయి. ‘జై భవానీ’, ‘హర హర మహదేవ్’ అంటూ ఢిల్లీ సైన్యంపై మారాఠ సైన్యం విరుచుకుపడుతుంటే.. థియేటర్స్‌లో విజిల్స్ పడతాయి. ఇక శంభాజీ బంధీగా మారడం.. మొగల్ సైన్యం అతన్ని చిత్రహింసలు పెడుతుంటే.. తెలియకుండా కన్నీళ్లు వచ్చేస్తాయి. బరువెక్కిన గుండెతో థియేటర్ బయటకు వచ్చేస్తాం. ఎవరెలా చేశారంటే.. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించలేదు.. జీవించేశాడు. శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ నటించలేదు.. జీవించేశాడు. వార్, యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో నట విశ్వరూపం చూపించాడు. ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా అద్భుతంగా నటించాడు. శంభాజీ భార్య ఏసుబాయిగా రష్మిక ఇద్దరూ వారి వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశాడు.మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'వైరల్ ప్రపంచం' మూవీ రివ్యూ
టెక్నాలజీ ఎంత ఉపయోగకరమో అంత ప్రమాదకరం కూడా! టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే అవి జీవితాలనే తలకిందులు చేస్తాయి. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తాయి. తాజాగా అలాంటి జానర్లో తెరకెక్కిన మూవీ ‘వైరల్ ప్రపంచం’. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాలో ప్రియాంక శర్మ, నిత్యా శెట్టి, సాయి రోనక్, సన్నీ, నవీన్ ముఖ్య పాత్రల్లో నటించారు. బ్రిజేష్ టాంగి దర్శకత్వం వహించగా అకిల తంగి నిర్మించారు. మార్చి 7న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ‘వైరల్ ప్రపంచం’ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథఅమెరికాకు వెళ్లిన స్వప్న (ప్రియాంక శర్మ).. రవి (సాయి రోనక్)తో ప్రేమలో ఉంటుంది. తన 4 సంవత్సరాల సంబంధాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని ప్రయత్నిస్తుంది. సీన్ కట్ చేస్తే.. ఒంటరిగా జీవిస్తున్న అదితి (నిత్యశెట్టి) అనే అమ్మాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో తాను కలిసే ప్రవీణ్ (సన్నీ నవీన్)తో ఎమోషనల్ బాండింగ్‌ని ఏర్పరుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను తర్వాత ఇంటర్నెట్ను మాత్రమే నమ్ముతారు. మరి వారి నమ్మకాన్ని దెబ్బకొట్టింది ఎవరు? ప్రాణాలను బలిగొన్న ఘటన ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!‘‘మన ప్రపంచంలో ఒక్కొక్క మనిషిని ఒక్కొక్కలాగా చూస్తాం. నిజానికి ఆ మనిషి చాలా వేరు అయ్యిండొచ్చు’’ అంటూ కనెక్ట్ అయ్యే డైలాగ్‌తో అసలు కథ మొదలవుతుంది. అమ్మాయి భవనంపై నుంచి దూకడంతో కథ ఆసక్తిగా మారుతుంది. కథ మొత్తం కంప్యూటర్ స్క్రీన్లు, వరుస వీడియో కాల్స్, అనేక యూట్యూబ్ వీడియోలు, సోషల్ మీడియా కథనాల సేకరణ, కొన్ని టెక్స్ట్ మెసేజ్‌ల ద్వారా జరుగుతుంది. వర్చువల్ ప్రపంచంలో సంబంధాలు ఎలా విడిపోతాయన్నది చూపించారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందనేది కథలో చక్కగా చూపించారు. ఇంటర్నెట్లో మహిళల గోప్యతను మంటగలుపుతున్న సైబర్ నేరాన్ని కూడా కళ్లకు కట్టినట్టు చూపించారు.ఎవరెలా చేశారంటే?రవి పాత్రలో సాయి రోనక్, స్వప్న పాత్రలో ప్రియాంక శర్మ, అదితి పాత్రలో నిత్యశెట్టి, ప్రవీణ్ పాత్రలో సన్నీ నవీన్.. ఈ తరం యూత్‌కు బాగా కనెక్ట్ అవుతారు. సహజంగా నటించారు. మిగతావారు వారి పాత్రల పరిధి మేర యాక్ట్ చేశారు.సాంకేతిక విభాగంమ్యూజిక్ ఎంతో ఎమోషనల్ ఫీల్ కలిగిస్తుంది. కానీ కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకోదు. ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉండాల్సింది. కెమెరా పనితనం పర్వాలేదు.విశ్లేషణ‘ఇంటర్నెట్లో చాలా రహస్యాలు ఉంటాయి. కానీ ఏ రహస్యం కూడా దాగదు’ అనే డైలాగ్ మాదిరిగానే తాను చెప్పాలనుకున్న సబ్జెక్టును తెరకెక్కించడంలో దర్శకుడు బ్రిజేష్ టాంగి దాదాపు సఫలమైనట్లే! కానీ కొన్నిసీన్లు కాస్త బోరింగ్‌గా అనిపిస్తాయి. వీడియో కాల్స్, స్క్రీన్ రికార్డింగ్ వల్ల యువతీయువకుల జీవితాలు ఎలా మారిపోయాయనేది నేటి యువతకు అర్థమయ్యేలా చూపించారు. ఆన్లైన్ మానవ సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందని చెప్పిన తీరు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది. యువతకు విలువైన సందేశం ఇస్తుంది.చదవండి: నా భర్తతో ఎలాంటి గొడవలు లేవు.. వీడియో విడుదల చేసిన కల్పన -
‘డబ్బా కార్టెల్’ వెబ్ సిరీస్ రివ్యూ
బాలీవుడ్ వెబ్ సిరీస్‌లకి ఓటీటీలో మంచి డిమాండ్ ఉంది. అందులోనూ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లపై ప్రేక్షకుల ఆసక్తి కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ మధ్యకాలంలో ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లే వస్తున్నాయి. అలా తాజాగా నెటిఫ్లిక్స్‌లో రిలీజైన మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీసే ‘డబ్బా కార్టెల్’(Dabba Cartel Review). షబానా అజ్మీ, జ్యోతిక, షాలినీ పాండే, నిమిషా సజియన్, అంజలి ఆనంద్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ లిస్ట్‌లో ఉంది.ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. షీలా(షబానా ఆజ్మీ) కోడలు రాజీ(షాలినీ పాండే)‘లంచ్ బాక్స్’ పేరిట వ్యాపారం చేస్తుంటుంది. ఈ బిజినెస్‌లో మరో ఇద్దరు మహిళలు మాల(నిమిషా సజయన్), షాహిదా(అంజలి ఆనంద్) కూడా భాగస్వామ్యం అవుతారు. ఓ వ్యక్తి చేతిలో మోసపోయిన మాల..తప్పనిసరి పరిస్థితుల్లో లంచ్ బాక్స్‌లో ఆహారంతో పాటు గంజాయి కూడా సరఫరా చేసేందుకు అంగీకరిస్తుంది. ఈ విషయం రాజీకి తెలియగానే..మొదట నో చెప్పినా.. తర్వాత ఆమె కూడా గంజాయి సరఫరాకు ఓకే చెబుతుంది. కొన్నాళ్ల తర్వాత ఈ గంజాయి బిజినెస్ ఆపేద్దామని అనుకుంటారు. ఆ లోపే డ్రగ్స్ విక్రయించాలని వీరిపై ఒత్తిడి వస్తుంది. లంచ్ బాక్స్ మాత్రమే అందజేసే ఈ మహిళలు.. గంజాయి, డ్రగ్స్ సరఫరా ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజీ చేస్తున్న స్మగ్లింగ్ గురించి అత్తయ్య షీలాకు తెలిసినా.. ఆమె ఎందుకు వారికి సపోర్ట్ చేసింది? చివరకు ఈ మహిళలు ఆ వ్యాపారాన్ని మానేశారా లేదా? వివా ఫార్మా కంపెనీ తయారు చేసిన ఓ మెడిసిన్ ప్రమాదకరమని ప్రపంచానికి చెప్పాలన్న డ్రగ్ ఇన్స్పెక్టర్ పాఠక్ (గజరాజ్ రావ్) ప్రయత్నం ఫలించిందా? ఫార్మా కంపెనీ ఉద్యోగి శంకర్(జిషు సేన్గుప్త) సతీమణి వరుణ(జ్యోతిక)తో రాజీ గ్యాంగ్‌కు ఉన్న సంబంధం ఏంటి? రాజీ గ్యాంగ్‌తో కలిసి ఎందుకు పని చేసింది? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో ‘డబ్బా కార్టెల్’ చూడాల్సిందే.కొంతమంది తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేస్తుంటారు.ఒకసారి చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేయాల్సి వస్తుంది. అలా తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేసిన ఐదుగురు మహిళల కథే ‘డబ్బా కార్టెల్’. తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో తప్పు చేస్తే భవిష్యత్తులో ఎలాంటి చిక్కుల్లో పడతారనేది రాజీ, మాల పాత్రల ద్వార చక్కగా చూపించాడు దర్శకుడు హితేశ్ భాటియా. భార్యభర్తలు ఒకరి చేసే పని గురించి మరొకరికి పూర్తిగా తెలియాలి. భర్తకు తెలియకుండా భార్య..భార్యకు తెలియకుండా భర్త డబ్బు కోసం ప్రమాదకర పనులు చేస్తే ఎలా ఉంటుందనేది ఈ సిరీస్ ద్వారా చూపించారు. అలాగే ఫార్మా కంపెనీలో ఎలాంటి లొసుగులు ఉంటాయో కూడా కళ్లకు కట్టినట్లు చూపించారు. మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కోటి దాదాపు ముప్పావు గంట వరకు ఉంటుంది.తొలి ఎపిసోడ్ కేవలం పాత్రల పరిచయానికే సరిపోయింది. రెండు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగుతుంది. సంతోష్ అనే వ్యక్తి బ్లాక్మెయిల్ చేసి.. డ్రగ్స్, గంజాయి అమ్మించడం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయంతో రాజీ గ్యాంగ్ చేస్తున్న ఈ స్మగ్లింగ్ బిజినెస్ గురించి అత్తయ్య షీలాకి తెలిసిన తర్వాత కథనం మరింత ఉత్కంఠంగా సాగుతుంది.దర్శకుడు ఈ కథను వినోదభరితంగా నడిపించడంతో పూర్తిగా సఫలం కాలేదు. ఐదు ప్రధాన పాత్రలను ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ట్విస్టులు కూడా ఊహకందేలా ఉంటాయి.డ్రగ్స్ ఇన్స్పెక్టర్ పాత్రని ఇంకాస్త బలంగా చూపించాల్సింది. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుటుంది. సీజన్ 2కి స్కోప్ ఇస్తూ ఈ సిరీస్‌ని ముగించారు. నటీనటులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్‌గా సిరీస్ పర్వాలేదు. అసభ్యకర సన్నివేశాలు తక్కువే ఉన్నా..బూతు డైలాగులు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీలో కలిసి చూడడం కాస్త కష్టమే. ఓపిగ్గా చూద్దాంలే అనుకునే క్రైమ్ థ్రిల్లర్స్ లవర్స్‌ని ఈ సిరీస్ మెప్పిస్తుంది. -
'గార్డ్' తెలుగు మూవీ రివ్యూ
టైటిల్: గార్డ్విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ జంటగా తెరకెక్కిన సినిమా 'గార్డ్'. రివెంజ్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్. అను ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అనసూయ రెడ్డి నిర్మించగా, జగ పెద్ది దర్శకత్వం వహించారు. శిల్పా బాలకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాలో తెరకెక్కించిన గార్డ్ మూవీ నేడు (ఫిబ్రవరి 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి గార్డ్ ప్రజల్ని ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూసేద్దాం..కథఆస్ట్రేలియాలో సెటిల్ అయిన సుశాంత్(విరాజ్ రెడ్డి) హాస్పిటల్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటాడు. అక్కడ డాక్టర్ సామ్(మిమీ లియానార్డ్)తో ప్రేమలో పడతాడు. సుశాంత్ పనిచేసే హాస్పిటల్ బేస్మెంట్లో ఎప్పుడూ ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. తనను కూడా అక్కడకు తీసుకెళ్లమని సామ్ అడగడంతో తీసుకెళ్తాడు. అక్కడ ఎవ్వరూ ఓపెన్ చేయని గదిలోకి సామ్ వెళ్లడంతో ఆమెలోకి ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. ఆ ఆత్మ ఎవరిది? దాని కథేంటి? సుశాంత్‌కు, ఆ ఆత్మకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.విశ్లేషణ.. చనిపోయిన అమ్మాయి ఆత్మ తిరిగొచ్చి పగ తీర్చుకోవడం చాలా సినిమాల్లో చూశాం. అదే పాయింట్‌తో గ్రప్పింగ్ స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు డైరెక్టర్. కథనంలో కొత్తదనం చూపించారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ పాత్రల పరిచయం, వారి ప్రేమతో సాగుతుంది. ఇదంతా రొటీన్‌లా అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్లో ఇచ్చే ట్విస్ట్ మాత్రం బాగుంటుంది.సెకండ్ హాఫ్‌లో ఆత్మ ఏం చేసింది? తనని చంపింది ఎవరు? తన స్టోరీ ఏంటి? హీరో ఆ ఆత్మకు ఎలా సపోర్ట్ చేశాడు? అన్నది ఇంట్రెస్టింగ్గా చూపించారు. కానీ సినిమా మరీ అంతగా భయపెట్టేదిగా ఉండదు. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌తో నవ్వించే ప్రయత్నం చేశారు. క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం. కథ అంతా ఆస్ట్రేలియాలో జరగడం వల్ల అక్కడ నేటివిటీ ఎక్కువుగా కనిపిస్తుంది. ఎక్కువగా ఇంగ్లీష్ డైలాగ్స్ ఉంటాయి.ఎవరెలా చేశారంటే?విరాజ్ రెడ్డి చీలం కొత్తవాడైనా బాగా చేశాడు. మిమీ లియానార్డ్ అందాలు ఆరబోస్తూనే దెయ్యం పట్టిన పాత్రలో బాగా నటించింది. శిల్ప బాలకృష్ణన్ కూడా తన నటనతో మెప్పించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు అక్కడక్కడా నవ్వించాడు. నెగిటివ్ షేడ్స్ లో కమల్ కృష్ణ పర్వాలేదనిపించాడు. మిగిలిన నటీనటులు వారి పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో భయపెట్టారు. కొన్ని సీన్లు చూసినప్పుడు దర్శకుడు కాస్త తడబడినట్లుగా అనిపిస్తుంది. నిర్మాణ పరంగా కావాల్సినంత ఖర్చుపెట్టారు. చదవండి: Aghathiyaa Review: జీవా ‘అగత్యా’ రివ్యూ -
Sabdham Review: ‘శబ్దం’ మూవీ రివ్యూ
టైటిల్: శబ్దంనటీనటులు: ఆది పినిశెట్టి, సిమ్రాన్, లైలా, లక్ష్మీ మీనన్ తదితరులునిర్మాణ సంస్థ: 7G ఫిల్మ్స్ నిర్మాత: 7G ఫిల్మ్స్ శివ దర్శకత్వం: అరివళగన్సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: అరుణ్ బత్మనాభన్ఆది పినిశెట్టికి (Aadhi Pinisetty) సోలో హిట్ పడి చాలా కాలమైంది. తెలుగు సినిమాల్లో విలన్‌గా ఆకట్టుకుంటున్నాడు. కానీ హీరోగా నటించిన చిత్రాలేవి ఆశించిన స్థాయిలో ఆడడం లేదు. దీంతో తనకు ‘వైశాలి’ లాంటి బిగ్ హిట్ అందించిన దర్శకుడు అరివళగన్‌తో మరో మూవీ చేశాడు. అదే ‘శబ్దం’. (sabdham movie) ఈ సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌లో లక్ష్మీ మీనన్, సిమ్రాన్, లైలా కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల మధ్య నేడు(ఫిబ్రవరి 28) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..కేరళలోని ఓ మెడికల్ కాలేజీలో విద్యార్థులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటారు. శృతి అనే వైద్య విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మరణిస్తుంది. విద్యార్థుల మరణం వెనుక దెయ్యాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. దీంతో యాజమాన్యం ఆహ్వానం మేరకు మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఛేదించేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం(ఆది పినిశెట్టి) రంగంలోకి దిగుతాడు. ఇన్వెస్టిగేషన్లో వ్యోమ వైద్యలింగంకి తెలిసిన నిజాలు ఏంటి? కాలేజీ లెక్చరర్ అవంతిక(లక్ష్మీ మీనన్) ఎందుకు అనుమానస్పదంగా ప్రవర్తిస్తుంది? డయానా(సిమ్రాన్) ఎవరు? కాలేజీలో జరుగుతున్న మరణాలతో ఆమెకు ఉన్న సంబంధం ఏంటి? నాన్సీ(లైలా) ఎవరు? కాలేజీలో ఉన్న లైబ్రరీ నేపథ్యం ఏంటి? మరణాల వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? 42 దెయ్యాల స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా (Shabdam Review) చూడాల్సిందే. ఎలా ఉందంటే..హరర్ చిత్రాలన్ని ఓకే ఫార్మాట్లో సాగుతాయి. భయపెట్టే దెయ్యాలు.. వాటికి ఓ ఎమోషనల్ నేపథ్యం.. చివరకు వారి చావులకు కారణమైన వారికి శిక్ష పడడం..దాదాపు అన్ని హారర్ థ్రిల్లర్ సినిమాల కథ ఇలానే ఉంటుంది. శబ్దం కథ కూడా ఇలాంటిదే.కానీ కథనం డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులను భయపెట్టేందుకు దర్శకుడు అరివళగన్ రొటీన్ జిమ్మిక్కులను వాడుకోకుండా కొత్తగా ట్రై చేశాడు. టైటిల్‌కి తగ్గట్టే డిఫరెంట్ శబ్దాలతో ప్రేక్షకులను భయపెట్టారు. ఫస్టాఫ్ మొత్తం డిఫరెంట్‌గా ఉంటుంది. హారర్ జానర్లో ఇదొక ప్రయోగంలా అనిపిస్తుంది. హీరో పాత్ర పరిచయం మొదలు.. దెయ్యాలు ఉన్నాయో లేవో తెలుసుకునేందుకు చేసే ప్రయత్నం వరకు ప్రతీదీ సైంటిఫిక్ మెథడ్‌లో చెప్పారు. స్క్రీన్ ప్లే చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. ఏం జరుగుతుందోనన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇంటర్వెల్ వరకు కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం మళ్లీ రోటీన్ హారర్ చిత్రాలను గుర్తు చేస్తుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అయ్యే కొద్ది సాధారణ సినిమాను చూసిన ఫీలింగే కలుగుతుంది. 42 దెయ్యాల నేపథ్యం, వాటి లక్ష్యం తెలిసిన తర్వాత కొన్ని సందేహాలు కలుగుతాయి. కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లుగా అనిపిస్తుంది. అయితే స్క్రీన్‌ప్లే కొంతమేర కొత్తగా అనిపిస్తుంది. ఓ సీన్లో తెరపై బొమ్మ కనిపించకుండా చేసి కేవలం సౌండ్‌తోనే ప్రేక్షకుడిని భయపెట్టాడు. టెక్నికల్ అంశాలపై కొంత అవగాహన ఉంటే ఈ సినిమా బోర్ కొట్టదు. హారర్ చిత్రాలను ఇష్టపడేవారికి నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. పారానార్మల్ ఇన్వెస్టగేటర్ వ్యోమ వైద్యలింగం పాత్రలో ఆది పినిశెట్టి ఒదిగిపోయాడు. డిఫరెంట్ లుక్‌తో తెరపై కొత్తగా కనిపించాడు. నటన పరంగా ఆయనకు వంక పెట్టడానికేమి లేదు. ఇంటర్వెల్ వరకు ఆమె పాత్రతో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సిమ్రాన్ కూడా ఓ కొత్త రోల్ ప్లే చేసింది. డయానా పాత్రలో ఆమె చక్కగా నటించింది. నాన్సీగా లైలా తెరపై కనిపించేంది కాసేపే అయినా తనదైన నటనతో ఆకట్టుకుంది. రిడిన్ కింగ్స్లే కొన్ని చోట్ల నవ్వించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. ఈ సినిమాకు ప్రధాన బలం తమన్ నేపథ్య సంగీతం. తనదైన బీజీఎంతో సినిమాను నిలబెట్టాడు. కొన్ని సన్నివేశాలలో నటన కంటే బ్యాగ్రౌండ్ స్కోరే ఎక్కువ భయపెడుతుంది. డిఫరెంట్ బీజీఎంతో ఆడియన్స్‌కి కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Mazaka Review: ‘మజాకా’ మూవీ రివ్యూ
టైటిల్: మజాకానటీనటులు: సందీప్ కిషన్, రావు రమేశ్, రీతూవర్మ, అన్షు, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: ఎకె ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్నిర్మాత: రాజేశ్ దండకథ, స్క్రీన్ ప్లే, మాటలు: ప్రసన్న కుమార్ బెజవాడదర్శకత్వం: త్రినాథరావు నక్కినసంగీతం: లియోన్ జేమ్స్సినిమాటోగ్రఫీ: నిజార్ షఫీవిడుదల తేది: ఫిబ్రవరి 26, 2025యంగ్ హీరో సందీప్ కిషన్‌కి ఈ మధ్య సరైన హిట్టే పడలేదు. వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ.. బ్లాక్ బస్టర్ హిట్ అనే పదానికే దూరమయ్యాడు. అందుకే ఈ సారికి ఎలాగైన హిట్ కొట్టాలని ‘ధమాకా’ డైరెక్టర్ త్రినాథరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి ‘మజాకా’(Mazaka Review)తో సందీప్ హిట్ ట్రాక్ ఎక్కడా? సినిమా ఎలా ఉంది? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వెంకటరమణ అలియాస్ రమణ(రావు రమేశ్) ఓ ప్రైవేట్ ఉద్యోగి. అతని కొడుకు కృష్ణ(సందీప్ కిషన్) ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం కోసం వెతుకుతుంటాడు. రమణ మాత్రం ఇంట్లో ఆడదిక్కు లేదని.. కొడుక్కి త్వరగా పెళ్లి చేసి ఓ ఫ్యామిలీ ఫోటోని ఇంట్లో పెట్టుకోవాలని ఆశ పడుతుంటాడు. కానీ..ఆడదిక్కు లేని ఇంటికి పిల్లని ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రారు. దీంతో పెళ్లిళ్ల బ్రోకర్ ఇచ్చిన సలహాతో ముందుగా తానే పెళ్లి చేసుకొని..ఆ తర్వాత కొడుక్కి పిల్లని వెతుకుదామని ఫిక్స్ అవుతాడు. అదే సమయంలో బస్‌స్టాఫ్‌లో యశోద(అన్షు)ని చూసి ఇష్టపడతాడు. మరోవైపు కృష్ణ కూడా మీరా(రీతూవర్మ)తో ప్రేమలో పడతారు. ఇలా తండ్రికొడుకులిద్దరు ఒకరికి తెలియకుండా ఒకరు ఒకేసారి ప్రేమలో పడిపోతారు. వీరిద్దరి ప్రేమలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? ఇంజనీరింగ్ చదివే కొడుకు ఉన్న రమణ ప్రేమను యశోద ఎలా ఒప్పుకుంది? పగతో రగిలిపోయే వ్యాపారవేత్త భార్గవ్ వర్మ(మురళీ శర్మ)తో వీరిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? చివరకు తండ్రికొడుకుల ఆశపడినట్లు ఇంట్లోకి ఫ్యామిలీ ఫోటో వచ్చిందా రాలేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకి కథే సరిగా ఉండదు కానీ కామెడీ సీన్లతో పాసైపోతుంది. పాటలు, కామెడీ వర్కౌట్ అయితే వంద కోట్లు కలెక్షన్స్‌ని కూడా రాబడతాయి. త్రినాథరావు, ప్రసన్న కుమార్ కాంబినేషన్ దీన్నే నమ్ముకుంది. రొటీన్ కథకి బలమైన కామెడీ సన్నివేశాలను రాసుకొని ఫుల్ ఎంటర్టైనింగ్గా సినిమాను తీర్చిదిద్దుతారు. ‘ధమాకా’ వరకు వీరిద్దరి మ్యాజిక్ వర్కౌట్ అయింది. కానీ ‘మజాకా’ విషయంలో కాస్త బెడిసి కొట్టిందనే చెప్పాలి. కథే రొటీన్ అంటే స్క్రీన్‌ప్లే అంతకన్న రొటీన్‌గా ఉంటుంది. ఇక్కడో కామెడీ సీన్.. అక్కడో పాట..మధ్యలో ఎమోషనల్ సన్నివేశం..ఇలా సెట్ చేస్తే సరిపోతుంది సినిమా ఆడేస్తుంది అనుకున్నారేమో.వాస్తవానికి ఈ కథ లైన్ చాలా బాగుంది. కొడుకు పుట్టగానే భార్య చనిపోతే..మళ్లీ పెళ్లి చేసుకోకుండా, కొడుకు కోసం అలానే ఉండిపోయిన తండ్రి.. చివరకు కొడుకు పెళ్లి కోసమే..మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోవడం. ఫ్యామిలీ ఫోటో కోసం ఆశపడడం.. మంచి ఎమోషనల్ ఉన్న పాయింట్ ఇది. కామెడీ వేలో ఈ కథను చెప్పాలనుకోవడం మంచి ఆలోచననే. కానీ కామెడీ కోసం రాసుకున్న సీన్ల విషయంలోనే జాగ్రత్తపడాల్సింది. కథలో కామెడీ సన్నివేశాలను ఇరికించినట్లుగా అనిపిస్తుందే కానీ సిట్యువేషనల్‌కి తగ్గట్లుగా వచ్చినట్లు అనిపించదు.తండ్రి కొడుకులిద్దరు కలిసి ప్రేమ లేఖలు రాయడం.. ప్రేమించిన అమ్మాయి కోసం గోడలు దూకడం..‘ఖుషీ’ సీన్ రిపీట్.. ఇవన్నీ కొంతమందిని ఫుల్‌గా నవ్విస్తే..మరికొంతమందికి అతిగా అనిపిస్తాయి. ఫస్టాప్ వరకు కథ రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక సెకండాఫ్‌లో ప్రారంభంలో వచ్చే ఓ ట్వీస్ట్ ఆకట్టుకుంటుంది కానీ..ఆ తర్వాత కథనం రొటీన్‌గా సాగుతంది. కామెడీతో కూడా అంతగా వర్కౌట్ కాలేదు. అనకాపల్లి ఎపిసోడ్ అతికించినట్లుగా ఉంటుంది. కథనం ఊహకందేలా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు కొంతవరకు ఆకట్టుకుంటాయి. సినిమా ముగింపు బాగుంటుంది. ఎవరెలా చేశారంటే.. తండ్రికొడుకులుగా రావు రమేశ్, సందీప్ కిషన్ తెరపై హుషారుగా కనిపించారు. ముఖ్యంగా లేటు వయసులో ప్రేమలో పడిన రమణ పాత్రలో రావు రమేశ్ ఇరగదీశాడు. యంగ్ లుక్‌లో కనిపించడమే కాదు..డ్యాన్స్, యాక్షన్‌తో ఆకట్టుకున్నాడు. ఆయనతో వచ్చే ఒకటిరెండు కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. కృష్ణ పాత్రకి సందీప్ కిషన్ న్యాయం చేశాడు. ఆయన కామెడీ టైమింగ్ కూడా సినిమాకి ప్లస్ అయింది. రీతూ వర్మ, అన్షులకు బలమైన పాత్రలు లభించాయి. కథ మొత్తం వీరిద్దరి చుట్టూనే తిరుగుతాయి.కానీ నటనకు పెద్దగా స్కోప్ లేదు. పగతో రగిలిపోయే భార్గవ్ వర్మ పాత్రలో మురళీ శర్మ చక్కగా నటించాడు. హైపర్ ఆది కామెడీ జస్ట్ ఓకే. శ్రీనివాస్ రెడ్డి, రఘుబాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు బాగున్నప్పటకీ అవి వచ్చే సందర్భమే సరిగా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. Rating : 2.75/5 -
‘ది డెవిల్స్ చైర్’ మూవీ రివ్యూ
టైటిల్: ది డెవిల్స్ చైర్నటీనటులు: అభినయ కృష్ణ(జబర్దస్త్ అభి), ఛత్రపతి శేఖర్, స్వాతి మందల్,వెంకట్ దుగ్గి రెడ్డి తదితరులునిర్మాణ సంస్థ: బాబీ ఫిలిమ్స్, ఓం సాయి ఆర్ట్స్, సి ఆర్ ఎస్ క్రియేషన్స్ నిర్మాతలు: KK చైతన్య, వెంకట్ దుగ్గి రెడ్డి, చంద్ర సుబ్బగారి .దర్శకత్వం: గంగా సప్తశిఖరసంగీతం: బిషేక్ సినిమాటోగ్రఫీ:గంగా సప్తశిఖరవిడుదల తేది: ఫిబ్రవరి 21, 2025కథేంటంటే..ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేసే విక్రమ్(అదిరే అభి) బెట్టింగ్‌కు బానిసగా మారుతాడు. కంపెనీకి చెందిన కోటి రూపాయాలను కొట్టేసి బెట్టింగ్‌లో పెడతాడు. ఈ విషయం తెలిసి యాజమాన్యం అతన్ని ఉదోగ్యంలో నుంచి తీసేవేయడంతో పాటు కేసు కూడా పెడుతుంది. లీగల్ కేసు ఎదుర్కొంటున్న విక్రమ్‌ని ప్రియురాలు రుధిర(స్వాతి మందల్) చేరదీస్తుంది. తన ఇంట్లోనే ఉంచుకుంటూ ఆర్థికంగా ఆదుకుంటుంది. ఓ సారి రుధిర ఇష్టపడి ఓ యాంటిక్ చైర్‌ని కొని తెచ్చుకుంటుంది. ఆ చైర్లో ఓ డెవిల్ శక్తి ఉంటుంది. అది విక్రమ్‌కి మాత్రమే కనిపిస్తూ.. కండిషన్స్‌పై అతనికి అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తుంటుంది. రూ. కోటి కట్టాలని యాజమాన్యం ఒత్తిడి తేవడంతో ఆ డబ్బు కోసం మళ్లీ డెవిల్‌ని శక్తినే సంప్రదిస్తాడు. ప్రియురాలు రుధిరను చంపేస్తే రూ.5 కోట్లు ఇస్తానని ఆ డెవిల్ చైర్ ఆఫర్ ఇస్తుంది. మరి పీకల్లోతు అప్పుల్లో ఉన్న విక్రమ్ డబ్బు కోసం ప్రియురాలిని చంపేశాడా? అసలు ఆ చైర్లో ఉన్నది ఎవరు? విక్రమ్‌ని వశం చేసుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుంది? అసలు ఆ చైర్ వెనుక ఉన్న రహస్య స్టోరీ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..హారర్ చిత్రాలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. ఇప్పటికే ఈ జానర్లో చాలా చిత్రాలు వచ్చాయి.. వస్తునే ఉన్నాయి. ది డెవిల్స్ చైర్ కూడా ఆ జానర్ చిత్రమే. అయితే కంటెంట్‌తో పాటు మేకింగ్‌ని కూడా డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు గంగా సప్తశిఖర. కేవలం భయపెట్టేందుకు మాత్రమే సీన్లను రాసుకోకుండా..బలమైన కథ చెప్పే ప్రయత్నం చేశాడు. ఈ చిత్రం ఓ వైపు భయపెడుతూనే..దురాశ దు:ఖానికి చేటు అనే సందేశాన్ని ఇస్తుంది. ప్రేక్షకులకు హారర్ తో పాటు థ్రిల్ ను ఇవ్వడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. ఈజీ మనీకి అలవాటు పడిన వారు ఎలాంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారనేది ఇందులో చూపించారు. కథ ప్రారంభమే ఆసక్తికరంగా ఉంటుంది. అయితే హీరోపై లీగల్ కేసు నమోదైన తర్వాత కథనం కాస్త నెమ్మదిగా సాగుతుది. ఇంటర్వెల్ సీన్ బాగా ప్లాన్ చేశాడు. సెకండాఫ్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ప్రీక్లైమాక్స్ నుంచి వచ్చే ప్రతీ సీన్ భయానికి గురి చేస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. అయితే డెవిల్ చైర్ నేపథ్యం ఏంటి? అసలు ఆ చైర్‌లోకి వచ్చి దృష్టశక్తి ఏంటనేది పార్ట్ 2లో చూడాల్సిందే. పార్ట్ 2 కోసం ఇచ్చిన ఎలివేషన్స్ బాగున్నాయి. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు నచ్చే ప్రేక్షకులకు ‘ది డెవిల్స్ చైర్’ సినిమా నచ్చుతుంది.ఎవరెలా చేశారంటే.. ఈజీ మనీకోసం అలవాటు పడిన యువకుడు విక్రమ్ పాత్రలో అదిరే అభి చక్కగా నటించాడు. రెండు మూడు వేరియషన్స్ లో అభి అభినయం అందిరినీ ఆకట్టుకుంటుంది. తనకు జోడీగా నటించిన స్వాతి మందల్ ఎంతో క్యూట్ గా కనిపిస్తుంది. క్లైమాక్స్ లో వచ్చే సీన్ తన తన పర్ ఫార్మెన్స్ కు అద్దం పడుతుంది. అలాగే ఛత్రపతి శేఖర్ ప్రొ ఫెసర్ పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు మనోజవ పాత్రలో వెంకట్ దుగ్గిరెడ్డి, పుండాక్ష పాత్రలో చంద్ర సుబ్బగారి, నూర్జహాన్ గా మూగమ్మాయిగా అద్విత చౌదరి నటించి తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ను బాగా ఎలివేట్ చేసింది. పాటలు పర్వాలేదు. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాతలు ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. -
'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ రివ్యూ
‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు యంగ్ హీరో ప్రదీప్‌రంగనాథన్. చాలా గ్యాప్ తర్వాత ఈ సారి 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'(Return Of The Dragon Review)తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.'ఓరి దేవుడా' ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. నేడు(ఫిబ్రవరి 21) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..డి.రాఘవన్(ప్రదీప్ రంగనాథన్)(Pradeep Ranganathan) ఇంటర్మీడియట్లో 96 శాతం మార్కులతో పాస్ అయిన తర్వాత తాను ఇష్టపడిన అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆమె తనకు బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని చెబుతూ అతని ప్రేమను రిజెక్ట్ చేస్తుంది. దీంతో రాఘవన్ బ్యాడ్ బాయ్‌గా మారిపోయి బీటెక్‌లో జాయిన్ అవుతాడు. కాలేజీలో అతనికి డ్రాగన్ అని పేరు పెడతారు. ప్రిన్సిపల్(మిస్కిన్)తో సహా ఫ్యాక్టల్లీ మొత్తానికి డ్రాగన్ అంటే నచ్చదు. 48 సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతాడు. రెండేళ్ల పాటు ఖాలీగా ఉండడంతో కాలేజీలో తనను ప్రేమించిన అమ్మాయి కీర్తి(అనుపమ పరమేశ్వరన్)(Ashwath Marimuthu) బ్రేకప్ చెప్పి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.దీంతో జీవితంలో ఎలాగైన సక్సెస్ కావాలని ఫేక్ సర్టిఫికేట్స్ మంచి ఉద్యోగం సంపాదిస్తాడు. తనకున్న తెలివితో పెద్ద పొజిషియన్‌కి వెళ్తాడు. ఇల్లు, కారు కొంటాడు. బాగా ఆస్తులు ఉన్న అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్ళి కూడా ఫిక్స్ అవుతుంది. లైఫ్ అంతా సాఫీగా సాగుతున్న సమయంలో ఫేక్ సర్టిఫికెట్స్ గురించి ప్రిన్సిపల్‌కి తెలుస్తుంది. ఈ విషయం తాను ఉద్యోగం చేస్తున్న కంపెనీతో పాటు పిల్లనిచ్చి పెళ్లి చేయబోతున్న మామగారికి చెప్పకుండా ఉండాలంటే కాలేజీకి వచ్చి చదువుకొని పెండింగ్‌లో ఉన్న 48 సబ్జెక్టులు పాస్ అవ్వాలని కండీషన్ పెడతాడు. పరీక్షలకు మూడు నెలల సమయమే ఉంటుంది. దీంతో వేరే దారిలేక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ కాలేజీకి వెళ్తాడు డ్రాగన్. ఆ తర్వాత ఏం జరిగింది? కాలేజీకి మళ్లీ కీర్తి ఎందుకు వచ్చింది? ఆఫీస్‌లో,ఇంట్లో అబద్దం చెప్పి కాలేజీకి వచ్చిన డ్రాగన్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? నిజంగానే 48 సబ్జెక్టుల్లో పాస్ అయ్యాడా? లేదా? పల్లవితో పెళ్లి జరిగిందా? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే(Return Of The Dragon Review ).ఎలా ఉందంటే.. 'లవ్ టుడే'తో భారీ హిట్ కొట్టాడు ప్రదీప్ రంగనాథన్. అంతకు ముందు అతనెవరేది కూడా తెలుగు ప్రేక్షకులకు తెలియదు. కానీ ఆ ఒక్క సినిమాతో తెలుగు హీరోగా మారిపోయాడు. అతని నుంచి మరో సినిమా వస్తుందంటే టాలీవుడ్లో అంచనాలు పెరిగిపోయాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మళ్లీ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్తో వచ్చేశాడు. 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కథ, కథనంలో కొత్తదనం ఏమి లేదు కానీ..ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. కాలేజీ సీన్స్ మొదలు క్లైమాక్స్ వరకు ప్రతీ సీన్ గత సినిమాలను గుర్తు చేస్తుంది.ఊహించినట్లుగానే కథనం సాగుతుంది.అయినా కూడా బోర్ కొట్టదు. దర్శకుడు కథ విషయంలో కేర్ తీసుకోలేదు కానీ కథనం మాత్రం జాగ్రత్త పడ్డాడు. అల్రేడీ చూసిన కథలనే కొత్తగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ కాలేజీ ఎపిసోడ్ కొంతవరకు ఆకట్టుకుంటుంది. హీరో కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కథనం నెమ్మదిగా సాగుతుంది. హీరోకి ఉద్యోగం లభించిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. ఫేక్ సర్టిఫికేట్స్‌తో దొరికిపోతాడు అనుకున్న ప్రతిసారి ఓ ట్విస్ట్ ఇవ్వడం ఆసక్తిని పెంచుతుంది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కథనం ఆసక్తికరంగా సాగుతుంది. చోటా డ్రాగన్ కామెడీ నవ్విస్తుంది. అలాగే మధ్యమధ్యలో వచ్చే ట్విస్టులు బాగుంటాయి. ప్రీక్లైమాక్స్ నుంచి కథనం చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. ముగింపు ఆకట్టుకుంటుంది. ఫేక్ సర్టిఫికెట్స్‌తో ఉద్యోగాలు పొందడం కారణంగా టాలెంట్ ఉన్నవారు నష్టపోతున్నారనే విషయాన్ని దర్శకుడు తెరపై ఎంటర్టైనింగ్ చెప్పాడు. ఎవరెలా చేశారంటే.. రాఘవన్ అలియాస్ డ్రాగన్‌గా ప్రదీప్ రంగనాథ్ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో అదరగొట్టేశాడు. ఇక డ్రాగన్ ప్రియురాలు కీర్తిగా అనుపమ పరమేశ్వరన్ తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించింది. హీరోయిన్ కయాదు లోహర్ తెరపై గ్లామరస్‌గా కనిపించింది. అనుపమ కంటే ఆమె పాత్రకు స్క్రీన్ స్పేస్ ఎక్కువ. అయితే నటనతో అంతగా స్కోప్ ఉండదు. మిస్కిన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. లియోన్ జేమ్స్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు తెలుగు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
Raamam Raaghavam Review: ‘రామం రాఘవం’ రివ్యూ
టైటిల్: రామం రాఘవంనటీనటులు: సముద్రఖని, ధన్‌రాజ్, హరీష్ ఉత్తమన్, ప్రమోదిని, సత్య, పృథ్వీరాజ్, సునీల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులునిర్మాత: పృథ్వీ పోలవరపుకథ: శివప్రసాద్ యానాలదర్శకత్వం: ధన్రాజ్సంగీతం: అరుణ్ చిల్లివేరుసినిమాటోగ్రఫీ: దుర్గా ప్రసాద్ఎడిటర్ మార్తాండ్ కె.వెంకటేశ్విడుదల తేది: ఫిబ్రవరి 21, 2025కమెడియన్‌గా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు ధన్‌రాజ్. జబర్థస్త్‌తో పాటు పలు కామెడీ షోలతో కూడా అలరించాడు. ఇక ఇప్పుడు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకునేందకు రెడీ అయ్యాడు. తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా రామం రాఘవం(Raamam Raaghavam Review). తమిళ నటుడు సముద్రఖని(Samuthirakani) ప్రధాన పాత్రలో నటించగా..ధన్‌రాజ్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. భారీ అంచనాల నేడు (ఫిబ్రవరి 21) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సబ్ రిజిస్ట్రార్ దశరథ రామం(సముద్రఖని) చాలా నిజాయితీపరుడు. కొడుకు రాఘవ(ధన్‌రాజ్) అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుతాడు. డాక్టర్ని చేయాలని కలలు కంటాడు. కానీ రాఘవ చదువు మధ్యలోనే ఆపేస్తాడు. మద్యం, సిగరేట్లు తాగుతూ జులాయిగా తిరుగుతాడు. ఈజీ మనీ కోసం అనేక తప్పులు చేస్తుంటాడు. ఓ సారి డబ్బు కోసం రాఘవ చేసిన చిన్న తప్పు అతన్ని చిక్కుల్లో పడేస్తుంది. సొంత తండ్రే అతన్ని పోలీసులకు అప్పగిస్తాడు. స్టేషన్ నుంచి బయటకు వచ్చాక తండ్రినే చంపాలని కుట్ర చేస్తాడు. లారీ డ్రైవర్ దేవ(హరీస్ ఉత్తమన్)తో హత్యకు డీల్ కుదుర్చుకుంటాడు. ప్రాణంగా ప్రేమించిన తండ్రినే రాఘవ ఎందుకు చంపాలనుకుంటాడు? రాఘవ చేసిన తప్పులేంటి? హత్య కోసం దేవతో సెట్ చేసుకున్న డీల్ ఏంటి? కొడుకు కోసం రామం తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి అనేది తెలియాలంటే థియేటర్లో రామం రాఘవం(Raamam Raaghavam Review) సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..పిల్లలకు తండ్రి ఇంటి పేరు ఇవ్వగలడు కానీ మంచి పేరు ఇవ్వలేడు. అది వారి ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. నేటితరం యువతలో చాలా మంది ఆ మంచి పేరు సంపాదించుకోలేకపోతున్నాడు.చెడు అలవాట్లకు బానిసై పెరెంట్స్ ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈజీ మనీ కోసం పెద్ద పెద్ద తప్పులు చేస్తున్నారు. చివరకు డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను చంపేస్తున్నారు. ఇదే పాయింట్‌తో రామం రాఘవం సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ధన్‌రాజ్. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ ప్రస్తుత పరిస్థితులకు దగ్గరగా ఉంది. రామం, రాఘవ లాంటి పాత్రలను మనం ఎక్కడో ఒక్క చోటే చూసే ఉంటాం. అందుకే కథ ప్రారంభం నుంచే మనం ఆ పాత్రలతో కనెక్ట్ అవుతాం. రామం బాధపడిన ప్రతిసారి మన పెరెంట్స్‌ని గుర్తు చేసుకుంటాం. రాఘవ చేసే ప్రతి తప్పు నేటి యువతలో చాలా మంది గుండెని పిండేస్తుంది. మనం కూడా ఇలాంటి తప్పులే చేశాం కదా అనిపిస్తుంది. ఫాదర్, సన్ ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. అయితే కథ ఎంతసేపు అక్కడక్కడే తిరిగినట్లు అనిపిస్తుంది. తప్పు చేయడం..తండ్రికి దొరికిపోవడం..ఆ తర్వాత ఎమోషనల్ సంభాషణలు.. ఫస్టాఫ్ అంతా ఇదే ఉంటుంది. ధన్‌రాజ్ లవ్‌ట్రాక్ కథకి అడ్డంకిగానే అనిపిస్తుంది. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగించేలా ఉంటుంది.తండ్రిని చంపేస్తానని రాఘవ నిర్ణయం తీసుకున్న తర్వాత కథపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రాఘవ ప్రవర్తనపై ప్రేక్షకుడికి రకరకాల అనుమానాలు క్రియేట్ అవుతాయి. ఇక మారిపోయాడేమో అనుకున్న ప్రతిసారి ఒక ట్విస్ట్ ఇవ్వడంతో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 20 నిమిషాలు చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. హాస్పటల్ సీన్ గుండెల్ని పిండేస్తుంది. క్లైమాక్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సముద్రఖని నటన గురించి అందరికి తెలిసిందే. ఎలాంటి పాత్రల్లో అయినా జీవించేస్తాడు. రామం పాత్రకి ఆయన వందశాతం న్యాయం చేశాడు. ఎమోషనల్ సీన్లలో చక్కగా నటించాడు. ఇక ధన్‌రాజ్ దర్శకత్వంతో పాటు రాఘవ పాత్రలో కూడా నటించాడు. తొలి సినిమా అయినా కథను బాగా డీల్ చేశాడు. అనవసరపు సన్నీవేశాలను జోడించకుండా..తాను చెప్పాలనుకునే పాయింట్‌ని చక్కగా తెరపై చూపించాడు. అలాగే రాఘవ పాత్రలో కూడా జీవించేశాడు. ఎక్కడా ఎలివేషన్లు లేకుండా చాలా సింపుల్‌గా తీర్చిదిద్దిన పాత్రలో అంతే సింపుల్‌గా నటించేశాడు. తండ్రి తనయుల సంఘర్షణ ఆకట్టుకునేలా ఉంటుంది. సత్య అక్కడక్కడ నవ్వించే ప్రయత్నం చేశాడు. హరీశ్ ఉత్తమ్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ ఉన్నంతలో చక్కగా నటించాడు. ప్రమోదిని, పృథ్వి రాజ్, సునీల్, మోక్ష, శ్రీనివాస్ రెడ్డితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. అరుణ్ చిల్లివేరు బీజీఎం బాగుంది. పాటలు జస్ట్ ఓకే.దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాగుంది. స్క్రీన్‌ప్లే బాగుది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'తల' సినిమా రివ్యూ
టైటిల్: తలనటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్దర్శకుడు: అమ్మ రాజశేఖర్బ్యానర్: దీపా ఆర్ట్స్నిర్మాత : శ్రీనివాస గౌడ్డీఓపీ: శ్యామ్ కె నాయుడుమ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణడ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్ఎడిటర్ : శివ సామిప్రముఖ దర్శక కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ (Amma Rajasekhar) డైరెక్షన్లో ఆయన కుమారుడు అమ్మ రాగిన్ రాజ్ (Raagin Raj) హీరోగా నటించిన చిత్రం తల. అంకిత నస్కర్ హీరోయిన్గా యాక్ట్ చేసింది. రోహిత్, ఎస్తర్ నోరోన్హా, సత్యం రాజేష్, అజయ్, ముక్కు అవినాష్, రాజీవ్ కనకాల, ఇంద్రజ తదితరులు కీలకపాత్రలో నటించారు. వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన తల సినిమా (Thala Movie Review) ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథహీరో రాగిన్ రాజ్ తల్లి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. ఆమె కోరిక మేరకు హీరో తండ్రి కోసం వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. వాటిని దాటుకుని తండ్రిని కలుస్తాడు. తండ్రిని కలిసిన తర్వాత ఏం జరుగుతుంది? తండ్రి కుటుంబంలోని సమస్య ఏంటి? ఆ సమస్యను వారు ఎలా పరిష్కరిస్తారు? తనకు పరిచయమైన అమ్మాయి చివరిగా హీరోకు ఏమవుతుంది? అసలు హీరో తల్లిదండ్రులు కలుస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే వెండితెరపై ఈ చిత్రాన్ని చూడాల్సిందే!ఎవరెలా నటించారంటే?అమ్మ రాజశేఖర్ తనయుడు అమ్మ రాగిన్ రాజ్‌కు ఇదే ఫస్ట్ సినిమా అయినప్పటికీ ఎలాంటి బెరుకు లేకుండా నటించాడు. ప్రతి సీన్, ప్రతి ఎమోషన్ ఎంతో స్పష్టంగా చూపించాడు. అయితే తన వయసుకు మించిన యాక్షన్ సీన్స్ చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ అంకిత బాగా నటించింది. చాలాకాలం తర్వాత తెరపైకి వచ్చిన రోహిత్.. హీరో తండ్రి పాత్రకు ప్రాణం పోశారు. ఎప్పుడూ గ్లామర్‌గా కనిపించే ఎస్తర్ నోరోన్హా ఈ చిత్రంలో తల్లి సెంటిమెంట్‌తో ఎమోషన్ పండించింది. మిగతావారందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు.సాంకేతిక విశ్లేషణఈ చిత్రానికి కథ ప్రాణమని చెప్పుకోవాలి. ట్రైలర్లో చెప్పినట్లుగా అమ్మాయి కోసం ప్రాణాలు ఇస్తున్న ఈ జనరేషన్లో అమ్మకోసం కష్టపడే కొడుకు కథగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ కథను తెరపైకి తీసుకువెళ్లడంలో దర్శకుడిగా అమ్మ రాజశేఖర్ సక్సెస్ అయ్యాడు. కాకపోతే అక్కడక్కడా కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. కొన్నిచోట్ల బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ఉత్తర ప్రదేశ్ లోని రియల్ లొకేషన్స్‌లో ఈ సినిమా తీశారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి. హింస ఎక్కువగా ఉంది.చదవండి: క్షమాపణ చెబితే సరిపోతుందా?.. హీరోయిన్ అనన్య నాగళ్ల ఫైర్ -
Laila Review: ‘లైలా’ మూవీ రివ్యూ
టైటిల్: లైలానటీనటుటు: విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మ, అభిమన్యు సింగ్, వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, పృథ్వీ రాజ్ తదితరులునిర్మాణ సంస్థ:షైన్ స్క్రీన్స్నిర్మాత: సాహు గారపాటిదర్శకత్వం: రామ్ నారాయణ్సంగీతం: జేమ్స్ లియోన్సినిమాటోగ్రఫీ:రిచర్డ్ ప్రసాద్విడుదల తేది: ఫిబ్రవరి 14యంగ్ హీరో విశ్వక్ సేన్ జెడ్ స్పీడ్‌లో దూసుకెళ్తున్నాడు. సినిమా హిట్టా, ఫట్టా అన్నది పక్కన పెడితే..ఏడాదికి మూడు నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు. ఈ మధ్యే మెకానిక్ రాకీ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం విశ్వక్‌ని తీవ్ర నిరాశ పరిచింది. దీంతో ‘లైలా’పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘లైలా’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? విశ్వక్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. (Laila Movie Review)కథేంటంటే..సోను మోడల్(విశ్వక్ సేన్)(Vishwak Sen) హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంటాడు. ఆ చుట్టు పక్కల మహిళలకు సోను మోడల్ అంటే విపరీతమైన గౌరవం ఉంటుంది. తన కస్టమర్లను అందంగా రెడీ చేయడమేకాదు..కష్టం వచ్చినప్పడు ఆదుకుంటాడు కూడా. అలా ఓ కస్టమర్‌కి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా ఆమె భర్త చేస్తున్న ఆయిల్ బిజినెస్‌కి తన ఫోటో వాడుకోమని సలహా ఇస్తాడు. స్థానిక మహిళల భర్తలతో పాటు అక్కడి ఎస్సై శంకర్(పృథ్వీ)కి సోను అంటే నచ్చదు. మరోవైపు ఓల్డ్ సిటీలోనే మేకల బిజినెస్ చేసే రుస్తుం(అభిమన్యు సింగ్) కూడా సోనుపై పగ పెంచుకుంటాడు. ఓ సారి సోను చేయని నేరంలో ఇరుక్కుంటాడు. పోలీసులతో పాటు రుస్తుం మనుషులు కూడా అతని కోసం గాలిస్తారు. దీంతో సోను గెటప్ మార్చి లైలా(Laila Movie Review)గా మారుతాడు. అసలు సోనుపై వచ్చిన ఆరోపణలు ఏంటి? చేయని నేరంలో సోనును ఇరికించిందెవ్వరు? రుస్తుం సోను కోసం ఎందుకు గాలిస్తున్నాడు? లైలాగా మారిన తర్వాత సోనుకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. జెన్నీ(ఆకాంక్ష శర్మ)తో ప్రేమాయణం ఎలా సాగింది? చివరకు తనను తప్పుడు కేసులో ఇరికించిన వారిని లైలా ఎలా పట్టుకుంది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..‘కర్మలో కారం పొడి ఉంటే పళ్లెంలోకి పరమాన్నం ఎలా వస్తుంది’ అన్నట్లుగా.. కథలోనే కొత్తదనం లేనప్పుడు ఎన్ని ‘గెటప్’లు వేసినా డిఫరెంట్ సినిమా చూశామనే ఫీలింగ్ ఎలా వస్తుంది? లైలా సినిమా పరిస్థితి అలానే ఉంది. హీరోలు లేడి గెటప్పులు వేయడం కొత్త కాదు. కానీ మాస్ ఇమేజ్ ఉన్న విశ్వక్ సేన్ లాంటి యంగ్ హీరో లేడీ గెటప్ అనగానే..ఇదేదో డిఫరెంట్ చిత్రంలా ఉందే అనుకున్నారంతా. తీరా సినిమా చూశాక..‘గెటప్’లోనే కొత్తదనం.. అంతకు మించి ఏమి లేదు. లుక్ పరంగా లైలా కొంతవరకు బాగానే ఉంది కానీ, ఆ పాత్రను తీర్చిదిద్దిన విధానంలోనే లోపం ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ అందించకుండా రొట్ట రొటీన్ సీన్లతో చాలా ‘జాగ్రత్త’గా కథనాన్ని నడిపించాడు దర్శకుడు. ఆయన రాసుకున్న కామెడీ సీన్లను చూసి నిజంగానే ‘నవ్వుకుంటారు’. డబుల్ మీనింగ్ డైలాగ్స్ విని ‘జబర్దస్త్’లాంటి షోలను గుర్తు చేసుకుంటారు. అడల్ట్ కామెడీ ఉంటే చాలు సినిమా ఆడేస్తుందనుకున్నాడేమో.. ఫోకస్ అంతా దానిపైనే పెట్టాడు. కథలో సీరియస్ నెస్ లేదు..కామెడీలో కొత్తదనం లేదు. ఇక హీరోహీరోయిన్ల లవ్ ట్రాక్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచింది.వాస్తవానికి ఈ సినిమాలో పేరుకే విశ్వక్ సేన్ హీరో. కానీ కీలక సన్నివేశాలన్నీ అభిమన్య సింగ్, సునిశిత్ పాత్రలతోనే ఉంటాయి. అభిమన్యు పాత్రకు విశ్వక్‌తో సమానంగా స్క్రీన్ స్పేస్ ఉంది. సునిశిత్ తెరపై కనిపించేది తక్కువే కానీ... కీలక సన్నివేశాల్లో ఆయనే కనిపిస్తాడు. ఇక హీరోయిన్ని అందాలను ప్రదర్శించడానికి తప్ప.. నటనకు స్కోప్ ఉన్న ఒక్క సీన్ రాసుకోలేదు. ఫస్టాఫ్ అంతా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా సాగుతుంది. సోను మోడల్ బ్యూటీ పార్లర్ పెట్టడానికి గల కారణాన్ని బలంగా చూపించలేకపోయారు. హీరోయిన్‌తో లవ్‌ట్రాక్ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. ఆయిల్ బిజినెస్, ఎస్సై శంకర్ ఎపిసోడ్ అనీ.. బోరింగ్‌గా సాగుతాయి. లైలా ఎంట్రీతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి కలుగుతుంది. కానీ ఆ పాత్ర చుట్టు అల్లుకున్న కథ మళ్లీ రోటీన్‌గానే అనిపిస్తుంది. ఒకనొక దశలో లైలా పాత్రలో విశ్వక్‌ని చూడలేకపోతాం. ఇంటర్వెల్ సీన్‌తోనే సెకండాఫ్ ఎలా ఉంటుంది? క్లైమాక్స్ ఏంటనేది అర్థమైపోతుంది. ఫ్యామిలీతో కలిసి చూడలేని విధంగా డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ కామెడీ ఉంటుంది. పోని అది యూత్కైనా నచ్చేలా ఉంటుందా అంటే అదీ లేదు.మదర్ సెంటిమెంట్ రొటీన్‌గానే ఉన్నా .. కొంతవరకు ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే.. విశ్వక్ ఎప్పటిలాగే తన పాత్ర కోసం బాగానే కష్టపడ్డాడు. సోను మోడల్‌గా, లైలాగా రెండు విభిన్నమైన పాత్రలు పోషించి..తనదైన నటనతో వేరియేషన్ చూపించాడు. లైలా లుక్‌లో బాగున్నా.. నటనలో మాత్రం పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఇక హీరోయిన్ ఆకాంక్ష శర్మ జెన్నీ పాత్రకు ఉన్నంతలో న్యాయం చేసింది. అయితే ఆమెను నటన కంటే అందాల ప్రదర్శనకే ఎక్కువగా వాడేసుకున్నారు. రుస్తుం పాత్రలో అభిమన్యుసింగ్ చక్కగా నటించాడు. అతని కెరీర్లో ఇదొక డిఫరెంట్ పాత్ర. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలు ఇస్తూ ఫేమస్ అయిన సునిశిత్.. తన ఒరిజినల్ క్యారెక్టర్ని చేశాడు.కామాక్షి భాస్కర్ల డీ గ్లామర్ రోల్ చేశారు. సురభి ప్రభావతితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.జేమ్స్ లియోన్ సంగీతం జస్ట్ ఓకే. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. నేపథ్య సంగీతం కూడా ఆశించిన స్థాయిలో ఉండదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
సాయిరామ్ శంకర్ సస్పెన్స్ థ్రిల్లర్ రివ్యూ.. ఎలా ఉందంటే?
పూరి జగన్నాథ్ తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసిన హీరో సాయిరాం శంకర్. 143, బంపర్ ఆఫర్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా గ్యాప్ ఇచ్చిన ఈ ఏడాది ఒక పథకం ప్రకారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మలయాళంలో సినిమాలు చేసిన వినోద్ విజయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. రిలీజ్‌కు ముందే విలన్ ఎవరో కనిపెడితే పదివేలు ఇస్తామని మూవీ టీమ్ ప్రకటించడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా మీద పడింది. ఇవాళ థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.ఒక పథకం ప్రకారం కథేంటంటే..ఈ కథ మొత్తం 2014 విశాఖపట్నంలో జరుగుతూ ఉంటుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సిద్ధార్థ నీలకంఠ (సాయిరాం శంకర్) భార్య సీత (ఆషిమా నర్వాల్) షాపింగ్ కి వెళ్లగా అక్కడ భార్య మిస్ అవుతుంది. ఆమె ఏమైందో తెలియక ఇబ్బంది పడుతున్న సిద్ధార్థ డ్రగ్స్‌కు బానిస అవుతాడు. అయితే సిద్ధార్థతో కలిసి డ్రగ్స్ తీసుకునే దివ్య(భాను శ్రీ) అనూహ్యంగా దారుణమైన స్థితిలో హత్యకు గురవుతుంది. ఈ కేసు విచారణలో ఏసిపి రఘురాం(సముద్రఖని), సిద్ధార్థ ఈ మర్డర్ చేశాడని భావించి అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెడితే డ్రగ్స్ కేసు కారణంగా సస్పెండ్ కావడంతో ఆ స్థానంలో ప్రాసిక్యూటర్‌గా రావాలని ప్రయత్నించే చినబాబు (కళాభవన్ మణి) కూడా సిద్ధార్థని ఇరికించే ప్రయత్నం చేస్తాడు. అయితే తాను స్వతహాగా లాయర్ కావడంతో తాను హత్య చేయలేదని నిరూపించుకునే ప్రయత్నం చేస్తాడు సిద్ధార్థ్. తర్వాత ఇదే క్రమంలో అనేక హత్యలు జరుగుతున్నాయని తెలుసుకుని అసలు ఈ హత్యలకు కారణం ఎవరు అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో అతనికి ఏసీపీ కవిత(శృతి సోది) కూడా సహకరిస్తుంది. అసలు వరుస హత్యలు చేసేది ఎవరు? ఆ హత్యలకు సిద్ధార్థకి ఏమైనా సంబంధం ఉందా? సిద్ధార్థ్‌ను మాత్రమే ఇరికించాలని ఎందుకు ఏసీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సహా మరి కొంత మంది ప్రయత్నించారనే ఆసక్తికర విషయాలు తెలియాలంటే తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఈ సినిమా ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ అని ముందు నుంచే హింట్ ఇస్తూ వచ్చారు మేకర్స్ దానికి తోడు విలన్ ఎవరో కనిపెడితే పట్టుకుంటే పదివేలు అనే అనౌన్స్ చేయడంతో ఒక్కసారిగా ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పడింది. సినిమా ఓపెనింగ్ నుంచే కథపై ఆసక్తి పెంచే ప్రయత్నం చేశాడు దర్శకుడు. అయితే ఫస్ట్ హాఫ్‌లో ఏది గతమో.. ఏది ప్రస్తుతమో అర్థకాక ప్రేక్షకులు కాస్త కన్ఫ్యూజన్కి గురవడం ఖాయం. అయితే సిద్ధార్థ హత్య కేసులో చిక్కుకున్న తర్వాత సినిమా మీద ప్రేక్షకులలో కొంత క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ హీరో మీద అనుమానాలు పెంచేలా ఉంటుంది.ఆ తర్వాత సెకండ్ హాఫ్ పూర్తిగా గ్రిప్పింగ్‌గా తీసుకువెళ్లడంలో డైరెక్టర్ కొంతమేర సక్సెస్ అయ్యాడు. ప్రేక్షకులు అంచనా వేసే విధంగానే ఉన్న దానిని కనెక్ట్ చేయడం మాత్రం ఫర్వాలేదనిపించేలా ఉంది. అయితే అసలు విలన్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు అనే విషయం తెలిసిన తర్వాత సగటు ప్రేక్షకుడు ఆశ్చర్యపోతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. నిజానికి ఈ చిత్రం ఇప్పటిది కాదు.. పదేళ్ల క్రితం సినిమా కావడంతో విజువల్స్ కొన్ చోట్ల లాజిక్ లెస్ సీన్స్గా ఉన్నాయి. కానీ సస్పెన్స్ విషయంలో మాత్రం దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. క్లైమాక్స్ కూడా కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. మలయాళ దర్శకుడు కావడంతో మలయాళ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారంటే..నటీనటుల విషయానికి వస్తే లాయర్ పాత్రలో సాయిరాం శంకర్ ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ఆషిమా నర్వాల్ తన పాత్ర మేర మెప్పించింది. కొంత సేపైనా తనదైన నటనతో ఆకట్టుకుంది. సముద్రఖని, శృతి సోది, సుధాకర్ వంటి వారు తమ పాత్రల పరిధిలో న్యాయం చేశారు. ఇక సాంకేతి అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్ విషయంలో ఇంకా కత్తెరకు పని చెప్పాల్సింది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సంస్థ స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
Thandel Movie Review: 'తండేల్' మూవీ రివ్యూ
టైటిల్ : తండేల్నటీనటులు: నాగచైతన్య, సాయి పల్లవి, పృథ్వీ రాజ్, ప్రకాష్ బెలవాడి, కల్ప లత తదితరులునిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్నిర్మాతలు: బన్నీ వాసు,అల్లు అరవింద్కథ: కార్తీక్ తీడదర్శకత్వం-స్క్రీన్‌ప్లే: చందూ మొండేటిసంగీతం: దేవి శ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: షామ్‌దత్ సైనుదీన్విడుదల: పిబ్రవరి 7, 2025సంక్రాంతి సినిమాల సందడి తర్వాత బాక్సాఫీస్ వద్ద విడుదలవుతున్న పెద్ద సినిమా 'తండేల్' కావడంతో బజ్ బాగానే క్రియేట్ అయింది. 'లవ్ స్టోరీ' చిత్రంతో మంచి విజయం చూసిన నాగ చైతన్యకు ఆ తర్వాత సరైన హిట్ పడలేదు. గతేడాదిలో విడుదలైన కస్టడీ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఇండస్ట్రీలో సరైన హిట్ కోసం గత ఐదేళ్లుగా నాగచైతన్య ఎదురుచూస్తున్న సమయంలో దర్శకుడు చందూ మొండేటితో 'తండేల్' కథ సెట్ అయింది. కార్తికేయ 2 విజయంతో పాన్ ఇండియా రేంజ్లో ఆయనకు గుర్తింపు దక్కింది. ఆ మూవీ తర్వాతి ప్రాజెక్ట్ ఇదే కావడంతో వీరిద్దరి కాంబినేషన్ తప్పకుండా విజయాన్ని తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. వాస్తవ ఘటనల స్ఫూర్తితో ‘తండేల్’ స్టోరీని చూపించనున్నారు. ఈ కథలో సాయి పల్లవి ఎంపిక కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసింది. ఆపై ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ భారీ అంచనాలు పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా ఆఖరులో పెంచేశారు. జనాల్లోకి తండేల్ చొచ్చుకుపోయాడు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది..? నాగచైతన్య, చందూ మొండేటి ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా..? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..శ్రీకాకుళం జిల్లాకు చెందిన 22 మంది మూడు బోట్లలో గుజరాత్ వెరావల్ నుంచి బయలుదేరి చేపల వేట సాగిస్తుండగా పొరపాటున పాకిస్థాన్ ప్రాదేశిక జలాల్లోకి వారు ప్రవేశించారు. అప్పుడు పాక్ వారిని అరెస్ట్ చేసి జైల్లో వేస్తుంది. తండేల్ కథకు ఇదే మూలం.. డి.మత్స్యలేశం గ్రామం నుంచే తండేల్ కథ మొదలౌతుంది. రాజు (నాగచైతన్య), సత్య (సాయి పల్లవి) ప్రేమికులుగానే మనకు పరిచయం అవుతారు. ప్రాణాలకు ఎదురీదుతూ సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులు సురక్షితంగా తిరిగొస్తారనే నమ్మకం ఉండదు. వారు ఎప్పుడైతే తమ ఇంటికి చేరుతారో అప్పుడే కుటుంబ సభ్యులు ఊపిరిపోసుకుంటారు. ఇదే పాయింట్ సత్యలో భయం కలిగేలా చేస్తుంది. తను ప్రేమించిన రాజు చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్తే.. ఏదైనా ప్రమాదం జరగవచ్చని అతన్ని వేటకు వెళ్లొద్దంటూ ఆమె నిరాకరిస్తుంది. అప్పటికే తండేల్ (నాయకుడు)గా ఉన్న రాజు.. సత్య మాటను కాదని వేట కోసం గుజరాత్ వెళ్తాడు. ఇక్కడ నుంచి అసలు కథ మొదలౌతుంది. సాధారణ కూలీగా ఉన్న రాజు తండేల్ ఎలా అయ్యాడు..? వేటకు వెళ్లొద్దని సత్య చెప్పినా కూడా రాజు గుజరాత్‌కు ఎందుకు వెళ్తాడు..? ఈ కారణంతో తన పెళ్లి విషయంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది..? అందుకు ఎదురైన కారణం ఏంటి..? వేటకు వెళ్లిన వారందరూ పాక్ చెరలో ఎలా చిక్కుకుంటారు..? రాజు మీద కోపం ఉన్నప్పటికీ వారందరినీ తిరిగి ఇండియాకు రప్పించేందుకు సత్య చేసిన పోరాటం ఏంటి..? చివరగా రాజు, సత్య కలుసుకుంటారా..? అనేది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లి 'తండేల్' కథ పూర్తిగా తెలుసుకోవాలి.ఎలా ఉందంటేచందూ మొండేటి దర్శకత్వం నుంచి వచ్చిన సినిమాలన్ని కూడా ప్రేక్షకులకు ప్రత్యేకంగానే ఉంటాయి. నాగ చైత్యన్యతో ప్రేమమ్, సవ్యసాచి చిత్రాలను తెరకెక్కించిడంతో వారిద్దరి మధ్య బాండింగ్ ఉంది. అయితే, కార్తికేయ2 సినిమా తర్వాత ఒక బలమైన కథతో దర్శకుడు వచ్చాడు. అందుకు తగ్గట్లుగానే ఒక టీమ్‌ను రెడీ చేసుకుని తండేల్ బరిలోకి ఇద్దరూ దిగారు. అనకున్నట్లుగానే తండేల్ కోసం సాయి పల్లవి, నాగచైతన్య, దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ షామ్‌దత్ సైనుదీన్ నాలుగు పిల్లర్లుగా నిలబడ్డారు. శ్రీకాకుళం మత్స్యకారుడిగా నాగ చైతన్య ఇరగదీశాడని చెప్పవచ్చు. తండేల్ సినిమాతో అక్కినేని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరొగచ్చు అనేలా ఉంది. కార్తీక్ తీడ అందించిన కథకు చందు మొండేటి తనదైన స్టైల్లో భారీ ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అందుకే చాలామంది సినిమాకు కనెక్ట్ అయ్యారు.ఈ సినిమా నేపథ్యం ఇద్దరి ప్రేమకుల మధ్యనే కొనసాగుతుంది. ప్రియుడికి ఏమైనా అవుతుందేమోననే భయం ప్రియురాలిలో ఆందోళన మొదలౌతుంది. ఆ సమయంలో ఆమె పడే తపన, మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందో చూపించడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కథలో ఇది జరగవచ్చు అని మనం అంచనా వేస్తున్నప్పటికీ వారి మధ్య వచ్చే భావోద్వేగభరితమైన సీన్లు ప్రేక్షకుడిని కట్టిపడేస్తాయి. ఎక్కడా కూడా కథలో సాగదీతలు లేకుండా సింపుల్‌గానే దర్శకుడు ప్రారంభిస్తాడు. హీరో, హీరోయిన్ల పరిచయం ఆపై వారిద్దరి మధ్య ఉన్న బాండింగ్ ప్రతి ప్రేమికులకు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. క్షణం కూడా ఒకరినొకరు విడిచి ఉండలేని పరిస్థితిలో వారు ఉంటారు. అలాంటి సమయంలో కొంత కాలం ఎడబాటు ఏర్పడితే.. ఆ ప్రేమికుల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో చాలా ఎమోషనల్‌గా దర్శకుడు చూపించాడు. అందుకు తోడు దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ కథను మరో లెవల్‌కు తీసుకెళ్తాయి.చిత్ర యూనిట్ మొదటి నుంచి ఇదొక అద్భుతమైన లవ్‌స్టోరీ అంటూ చెప్పారు. వారు చెప్పినట్లుగా ప్రేమికులు అందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. సినిమా ఫస్ట్ కార్డ్‌లోనే రాజు వద్దని చెప్పిన సత్య.. మరో పెళ్లి చేసుకుంటానని తన తండ్రితో చెబుతుంది. ఆమె అలా చెప్పడానికి కారణం ఏంటి అనేది ఫస్టాఫ్‌లో తెలుస్తుంది. ఇక సెకండాఫ్‌లో పాకిస్తాన్ జలాల్లోకి తండేల్ టీమ్ వెళ్లడం.. అక్కడ వారు పాక్‌కు చిక్కడంతో జైలు జీవితం మొదలౌతుంది. అక్కడ వారి జైలు జీవితం ఎంత దారుణంగా ఉండేదో మన కళ్ళకు కట్టినట్లు దర్శకుడు చూపించడంలో విజయం సాధించాడు. కానీ, కథ మొత్తంలో పాకిస్తాన్ ట్రాకే మైనస్ అని కూడా చెప్పవచ్చు. సెకండాఫ్ అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు ఉంటుంది. గత చిత్రాలను మనకు గుర్తు చేస్తూ కొంచెం చిరాకు తెప్పిస్తాయి.అయితే, ఒక పక్క లవ్‌స్టోరీ.. మరో సైడ్ దేశభక్తితో పర్ఫెక్ట్గా చూపించారు. చివరిగా రాజు, సత్య కలిశాడా, లేదా అనే పాయింట్‌ను చాలా ఎంగేజ్ చేస్తూ అద్భుతంగా చూపించాడు. పాన్ ఇండియా రేంజ్లో సినిమా ఉండటంతో ఈ కథలో ఆర్టికల్ 370 రద్దు వల్ల పాక్ జైల్లో వారు ఎలాంటి సమస్యల్లో పడ్డారని చూపారు. ముఖ్యంగా తండేల్ కథలో లవ్‌స్టోరీ ఎంత బలాన్ని ఇస్తుందో.. దేశభక్తి కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటుంది. పాక్‌కు చెందిన తోటి ఖైదీలతో మన జాలర్లకు ఎదురైన చిక్కులు ఏంటి అనేది బాగా చూపారు.ఎవరెలా చేశారంటే..నాగచైతన్య నట విశ్వరూపం చూపారు. గత సినిమాలకు భిన్నంగా ఇందులో ఆయన పాత్ర ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఆయన తగిన జాగ్రత్తలు తీసుకున్నారనిపిస్తుంది. భాషతో పాటు ఒక మత్స్యకారుడి జీవితం ఎలా ఉంటుదో మనకు చూపించాడు. వాస్తవంగా ఒక సీన్లో సాయి పల్లవి ఉంటే అందులో పూర్తి డామినేషన్ ఆమెదే ఉంటుంది. కానీ, నాగ చైతన్య చాలా సీన్స్‌లలో సాయి పల్లవిని డామినేట్ చేశాడనిపిస్తుంది. ఎమోషనల్ సీన్ల నుంచి భారీ యాక్షన్ ఎపిసోడ్ వరకు ఆయన దుమ్మురేపాడని చెప్పవచ్చు. సాయి పల్లవి పాత్ర తండేల్ సినిమాకు ఒక ప్రధాన పిల్లర్‌గా ఉంటుంది. పృథ్వీ రాజ్, నరేన్, కరుణాకరన్, రంగస్థలం మహేష్ తమ పరిధిమేరకు నటించారు. తమిళ నటుడు కరుణాకరన్ పెళ్లికొడుకుగా అందరినీ మెప్పించగా.. మంగళవారం ఫేమ్ దివ్యా పిళ్లై కూడా సాయి పల్లవితో పాటుగా కనిపిస్తూ ఉన్నప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది.ముఖ్యంగా సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ సైనుదీన్ చాలా అద్భుతంగా చూపించాడు. ప్రతి సీన్ సూపర్ అనేలా తన కెమెరాకు పనిపెట్టాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి ఒక మిసైల్‌లా పనిచేశాడు. పాటలకు ఆయన ఇచ్చిన మ్యూజిక్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదరగొట్టేశాడు. ఈ సినిమాకు హార్ట్‌లా ఆయన మ్యూజిక్ ఉండనుంది. సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఫైనల్‌గా నాగచైతన్య- సాయి పల్లవి ఖాతాలో భారీ హిట్ పడిందని చెప్పవచ్చు.- కోడూరు బ్రహ్మయ్య, సాక్షి వెబ్‌డెస్క్ -
వరుణ్ సందేశ్ రాచరికం మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: రాచరికంనటీనటులు: వరుణ్ సందేశ్,అప్సరా రాణి, విజయ్ శంకర్ తదితరులుడైరెక్టర్: సురేష్ లంకలపల్లినిర్మాత: ఈశ్వర్నిర్మాణ సంస్థ: చిల్ బ్రాస్ ఎంటర్టైన్మెంట్ఎడిటర్: జేపీసినిమాటోగ్రఫీ: ఆర్య సాయి కృష్ణసంగీతం: వెంగీవిడుదల తేదీ: 31 జనవరి 2025వరుణ్ సందేశ్, అప్సరా రాణి, విజయ్ శంకర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘రాచరికం’. ఈ చిత్రం జనవరి 31న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజైంది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన కంటెంట్ ఆడియెన్స్‌లో బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్తో ఈశ్వర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇవాళ విడుదలైన ఈ చిత్రం ఆడియన్స్‌ను అలరించిందా లేదా రివ్యూలో చూద్దాం.రాచరికం కథేంటంటే..? 1980ల నేపథ్యంలో రాచకొండలో ఈ కథ మొదలవుతుంది. భార్గవి రెడ్డి (అప్సర రాణి), వివేక్ రెడ్డి (వరుణ్ సందేశ్) తోబుట్టువులు. వీరిద్దరూ రాజకీయంగా అడుగు పెట్టాలని ప్రయత్నిస్తారు. శివ (విజయ్ శంకర్) మన శక్తి పార్టీ యువ నాయకుడు. క్రాంతి (ఈశ్వర్)ఆర్ఎస్ఎఫ్ నాయకుడు. శివ, భార్గవి రెడ్డి ఒకరినొకరు ప్రేమించుకుంటారు. ఈ ప్రేమ వ్యవహారం గురించి ఆమె తండ్రి రాజా రెడ్డి (శ్రీకాంత్ అయ్యంగార్) తెలియడంతో భార్గవి రెడ్డి జీవితం అనూహ్య మలుపు తిరుగుతుంది. ఇక వీరి ప్రేమకు రాజకీయం అడ్డు వస్తుందా? ఈ ప్రేమ వల్ల రాచకొండలో ఏర్పడిన హింసాత్మక పరిణామాలు ఏంటి? భార్గవి, వివేక్ రెడ్డి రాజకీయాల్లో విజయం సాధించారా? తోబుట్టువుల మధ్య జరిగే కథ ఏంటి? అన్నది తెరపై చూడాల్సిందే.ఎలా తీశారంటే..దర్శకుడు సురేష్ లంకలపల్లి ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసినట్టు అనిపించింది. అయికే కథ, కథనం ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల ఊహకు అందేలా సాగుతుంది. ఇక చాలా వరకు సీన్లు ఆడియన్స్‌ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు. మొదటి సినిమా అయినప్పటికీ చాలా అనుభవం ఉన్న దర్శకుడిగా తెరకెక్కించాడు. ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఈ సినిమాకు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సినిమాకు ప్రధాన బలం. రాచరికం మంచి పొలిటికల్ డ్రామాగా మలిచాడు దర్శకుడు. ఫస్ట్ హాఫ్ రేసీగా ఉండటం, ఎమోషన్స్ కనెక్ట్ కావడం బాగా కలిసొచ్చింది.ఎవరెలా చేశారంటే..నటుడు వరుణ్ సందేశ్ తనలో కొత్త కోణాన్ని చూపించాడు. ఈ చిత్రంలోని వరుణ్ యాక్టింగ్ అంతా కూడా కొత్తగా అనిపించింది. ఆడియన్స్‌ను వరుణ్ సందేశ్ ఆకట్టుకున్నాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అప్సర రాణి మూడు విభిన్న షేడ్స్‌లో అందరినీ మెప్పించింది. హీరో విజయ్ శంకర్ మంచి ఎమోషన్స్‌తో మంచి ఫర్ఫార్మెన్స్ ఇచ్చాడు. కెరీర్ బెస్ట్ రోల్‌గా విజయ్ శంకర్ అదరగొట్టేశాడు. నిర్మాత ఈశ్వర్ ఆర్ఎస్ఎఫ్ లీడర్‌గా అసాధారణమైన నటనను కనబరిచాడు. శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి తనదైన నటనతో మరోసారి అలరించాడు. విజయ రామరాజు యాక్టింగ్ చాలా కొత్తగా ఉంటుంది. ప్రాచీ ఠాకర్,రూపేష్, ఫణి, సతీష్ సారిపల్లి, ఆది, రంగస్థలం మహేష్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు. సాంకేతికత విషయానికొస్తే ఆర్య సాయికృష్ణ అందించిన విజువల్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ ఫర్వాలేదు. ఎడిటింగ్‌లో కత్తెరకు కాస్తా పని చెప్పాల్సింది. వెంగీ నేపథ్యం సంగీతం ఫర్వాలేదనిపించింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
Madha Gaja Raja Review: ‘మదగజరాజా’ మూవీ రివ్యూ
టైటిల్: మదగజరాజానటీనటులు:విశాల్, సంతానం, వరలక్ష్మి, అంజలి, శరత్ సక్సేనా, సోనూ సూద్, మణివణ్ణన్ (లేట్), నితిన్ సత్య, సడగొప్పన్ రమేష్, ఆర్. సుందర్ రాజన్, మొట్టా రాజేంద్రన్, మనోబాలా (లేట్), స్వామినాథన్, జాన్ కొక్కెన్, టార్జాన్, విచ్చు విశ్వనాథ్ తదితరులునిర్మాణ సంస్థ: జెమినీ ఫిల్మ్ సర్క్యూట్కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్ సితెలుగు విడుదల: సత్యకృష్ణన్ ప్రొడక్షన్స్సంగీతం: విజయ్ ఆంటోనిఎడిటర్: శ్రీకాంత్ ఎన్.బి.విడుదల తేది: జనవరి 31, 2025తమిళ స్టార్ విశాల్ 12 ఏళ్ల క్రితం నటించిన చిత్రం ‘మదగజరాజా’(Madha Gaja Raja ). కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ.. ఈ ఏడాది జనవరి 12 తమిళ్లో రిలీజై పెద్ద విజయం సాధించింది. చాలా కాలం తర్వాత విశాల్ సినిమా రూ. 50 కోట్ల కలెక్షన్స్‌ని రాబట్టింది. అయితే సంకాంత్రి బరిలో పెద్ద చిత్రాలు ఉండడంతో తెలుగులో రిలీజ్ కాలేదు. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నేడు(జనవరి 31) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళ్ మాదిరే ఇక్కడ కూడా ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచిందా? మదగజరాజా తెలుగు ప్రేక్షకులను మెప్పించాడా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?అరకు చెందిన మదగజరాజా( అలియాస్ ఎంజీఆర్(విశాల్)(Vishal) ఓ కేబుల్ ఆపరేటర్. తండ్రి స్థానిక పోలీసు స్టేషన్లో ఎస్సై. తండ్రికి తోడుగా ఉంటూ.. ఊర్లోనే ఉంటుంటాడు. ఓ కేసు విషయంలో అరకు వచ్చిన అగ్గిపెట్ట ఆంజనేయులు కూతురు మాధవి(అంజలి)ని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. మాధవి కూడా ఎంజీఆర్‌ని ప్రేమిస్తుంది. కానీ ఓ కారణంగా ఆమె తండ్రితో కలిసి అరకు నుంచి వెళ్లిపోతుంది(Madha Gaja Raja Review)రాజా ఈ బాధలో ఉండగానే.. తన కూతురు పెళ్లికి రావాలంటూ చిన్నప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పిన మాస్టార్ నుంచి ఫోన్ కాల్వస్తుంది. ఈ పెళ్లి వేడుకలో బాల్య స్నేహితులంతా కలుస్తారు. పెళ్లి అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో తన స్నేహితులకు ఏవో సమస్యలు ఉన్నట్లు రాజాకు తెలుస్తుంది. ఈ సమస్యలకు మీడియా బలంతో పాటు రాజకీయ పలుకుబడి ఉన్న కాకర్ల విశ్వనాథ్(సోనూసూద్) కారణమని తెలిసి రాజా హైదరాబాద్ వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? మీడియాను అడ్డుపెట్టుకొని కాకర్ల ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డాడు? తన స్నేహితులకు కాకర్ల చేసిన మోసం ఏంటి? చివరకు తన స్నేహితుల సమస్యలను తీర్చాడా లేదా? ఈ కథలో మాయ(వరలక్ష్మి శరత్ కుమార్) పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమా ఇప్పుడు తెరకెక్కించింది కాదు. 12 ఏళ్ల క్రితమే రూపొందింది. అప్పటికి ఇప్పటికీ వెండితెరపై చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రేక్షకుల మైండ్‌సెట్ కూడా మారిపోయింది. డిఫరెంట్ కంటెంట్, కొత్త పాయింట్ ఉన్న చిత్రాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో మళ్లీ పాత సినిమాలను గుర్తు చేసింది మదగజరాజా. కథ, కథనంలో ఎలాంటి కొత్తదనం లేదు. కమర్షియల్ ఫార్మాటులో సినిమాలు తీయడంలో స్పెషలిస్ట్ అయిన సుందర్ సి. ఈ సినిమాను కూడా అదే పంథాలో తెరకెక్కించాడు. లాజిక్స్‌ని పట్టించుకోకుండా ఓన్లీ కామెడీని నమ్ముకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అదే సినిమాను నిలబెట్టింది. రొటీన్ కథే అయినప్పటికీ ఈ సినిమాలోని కామెడీ సన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా హీరో స్నేహితుడుగా సంతానం పండించిన కామెడీ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల కామెడీ కోసం వాడే సంబాషణలు ఇబ్బందికరంగా ఉన్నా.. ఓ వర్గం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు.కథగా చెప్పాలంటే ఇది చాలా చిన్న సినిమా. రాష్ట్ర రాజకీయాలను శాసించే ఓ వ్యక్తిని సామాన్యుడు ఎలా ఢీ కొట్టాడు అనేది ఈ సినిమా కథ. స్నేహితుల కష్టాలను తీర్చడం కోసం హీరో రంగంలోకి దిగడం కూడా పాత పాయింటే. అయితే అసలు స్టోరీ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. ఫస్టాఫ్‌లో అసలు కథేమి ఉండదు. కానీ ఎక్కడా బోర్ కొట్టదు. దానికి కారణం సంతానం పండించిన కామెడీనే. సంతానం వేసిన ప్రతి పంచ్ థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తుంది. కొన్ని చోట్ల శ్రుతిమించినట్లు అనిపించినా సంతానం ట్రాక్‌ని బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక సెకండాఫ్‌ని సీరియస్‌గా మార్చే అవకాశం ఉన్నా.. మళ్లీ కామెడీనే నమ్ముకున్నాడు దర్శకుడు. కాకర్లను బురిడీ కొట్టించేందుకు హీరో చేసే పనులు వాస్తవికానికి దూరంగా ఉంటాయి. మంత్రి సత్తిబాబు డెడ్‌బాడీతో హీరో, అతని గ్యాంగ్ చేసే హంగామా నవ్విస్తుంది. అయితే ఇవన్నీ సన్నివేశాలుగా చూస్తేనే బాగుంటుంది. కానీ కథగా చూస్తే అతికినట్లుగా అనిపిస్తుంది. సీన్ టు సీన్ కంటిన్యుటీ ఉండదు. ఫస్టాఫ్ కథకి సెకండాఫ్ కథకి సంబంధమే ఉండదు. ఇలాంటి లాజిక్స్‌కి పట్టించుకోకుండా కొంచెం అతి అయినా పర్లేదు భరిస్తామని అనుకుంటే.. ఈ చిత్రం మిమ్మల్ని అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే..మాస్ యాక్షన్ సినిమాలు విశాల్‌కి కొత్తేమి కాదు. కెరీర్ ప్రారంభం నుంచి ఈ తరహా పాత్రలు చేస్తూనే ఉన్నాడు. మదగజరాజాలోనూ మరోసారి మాస్ పాత్రనే పోషించాడు. యాక్షన్‌తో పాటు కామెడీ కూడా బాగానే పండించాడు. ఈ చిత్రం కోసం ఓ పాటను కూడా ఆలపించాడు. తెరపై ఆయన చేసే కొన్ని పోరాట ఘట్టాలు ఆకట్టుకుంటాయి. ఇక వరలక్ష్మీ శరత్ కుమార్, అంజలీ ఇద్దరూ తెరపై అందాలు ఆరబోయడంలో పోటీ పడ్డారు. వారిద్దరి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా.. గ్లామర్ పరంగా మాత్రం మంచి మార్కులు కొట్టేశారు. సోనూసూద్ తనకు అలవాటైన విలన్ పాత్రలో ఒదిగిపోయాడు. తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. సంతానం కామెడీ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. ఆయన పండించిన కామెడీ మాస్ ప్రేక్షకులను అలరిస్తుంది. మనోబాలతో పాటు మిగిలిన నటీటనులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. విజయ్ ఆంటోనీ అందించిన నేపథ్య సంగీతం, పాటలు 12 ఏళ్ల క్రితం వచ్చిన మాస్ కమర్షియల్ సినిమాలను గుర్తు చేస్తాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. డబ్బింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సింది. తెరపై ఒకచోట తమిళ పేర్లు..మరోచోట తెలుగు పేర్లు కనిపిస్తాయి. విశాల్‌తో సహా అందరి పాత్రలకు వేరేవాళ్లతో డబ్బింగ్ చెప్పించారు. విజువల్స్‌గా సినిమా బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఇరుగుపొరుగు చూస్తున్నారు జాగ్రత్త!
ఓటీటీలో ఇది చూడొచ్చు అనేప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో మలయాళ చిత్రం సూక్ష్మదర్శిని ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉందీ అంటే అది రహస్యమే. కానీ మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాల్సిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందనివాళ్లు బయటపెడితే అది పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపోరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే ‘సూక్ష్మదర్శిని’(sookshmadarshini). ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీన్‌ప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. ‘సూక్ష్మదర్శిని’ ఓ మళయాళ సినిమా.హాట్ స్టార్‌లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే... ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఓ ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా చేరతాడు. తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు మాన్యుల్. తన ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది.మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేట్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలు మాత్రం ‘సూక్ష్మదర్శిని’లో చూస్తే తెలిసిపోతుంది. సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి. జతిన్. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్(Nazriya Nazim), బాసిల్ జోసెఫ్(Basil Joseph) వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆఖరుగా ఒక్క మాట... ఇరుగు పోరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్‌ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్. – ఇంటూరు హరికృష్ణ -
‘గాంధీ తాత చెట్టు’ మూవీ రివ్యూ
టైటిల్: గాంధీ తాత చెట్టునటీనటులు: సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులునిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ నిర్మాతలు: వీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు రచన-దర్శకత్వం: పద్మావతి మల్లాదిసంగీతం: రీసినిమాటోగ్రఫీ: శ్రీజిత్ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తులవిడుదల తేది: జనవరి 24, 2025ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'గాంధీ తాత చెట్టు'(Gandhi THatha Chettu Review). ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. సినిమా ప్రమోషన్స్‌లో సుకుమార్ కూడా పాల్గొనడంతో ‘గాంధీ తాత చెట్టు’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య రేపు (జనవరి 24) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా మీడియా కోసం ఈ సినిమా స్పెషల్ షో వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? సుకుమార్ తనయ డెబ్యూతోనే హిట్ కొట్టిందా లేదా రివ్యూలో చూద్దాం.కథేంటంటే..?నిజామాబాద్ జిల్లా ఆలూరు గ్రామానికి చెందిన రామచంద్రయ్యకు 15 ఎకరాల పంట భూమి ఉంటుంది. తన తండ్రి నుంచి ఆస్తిగా వచ్చిన ఆ భూమితో పాటు అక్కడే ఉన్న ఓ పెద్ద వేప చెట్టు అంటే అతనికి ప్రాణం.అతని మనవరాలు గాంధీ(సుకృతి వేణి)కి తాత రామచంద్రయ్య అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి తాత చెప్పే గాంధీ కథలు విని..ఆయన మార్గంలోనే నడుస్తుంది. స్థానిక మంత్రి చేసిన కుట్ర కారణంగా ఊర్లో ఉన్న చెరకు ఫ్యాక్టరీ మూత పడుతుంది. దీంతో చెరుకు పంట వేసిన రైతులంతా అప్పులపాలవుతారు. అదే సమయంలో ఆ ఊర్లో కెమికల్ ఫ్యాక్టరీ నిర్మించి ఉపాది కల్పిస్తానంటూ వ్యాపారవేత్త సతీష్(రాగ్ మయూర్) రైతులను మభ్యపెడతాడు. ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో పంట పండే పొలాలన్ని సతీష్‌కి అమ్మేస్తారు. రామచంద్రయ్య మాత్రం ఫ్యాక్టరీ నిర్మిస్తే తను ప్రాణంగా పెంచుకుంటున్న చెట్టును తొలగిస్తారనే ఉద్దేశంలో స్థలాన్ని అమ్మేందుకు నిరాకరిస్తాడు. అతని కొడుకు మాత్రం స్థలం అమ్మేద్దామంటూ తండ్రితో గొడవపడతాడు. చెట్టుని నరికేస్తారేమోననే దిగులుతో రామచంద్రయ్య చనిపోతాడు. తాత ఇష్టపడిన చెట్టుని ఎలాగైనా రక్షించుకోవాలనుకుంటుంది గాంధీ. దాని కోసం గాంధీ తీసుకున్న సంచలన నిర్ణయం ఏంటి? గాంధీ మార్గంలోనే వెళ్లి ఊరిని, చెట్టును ఎలా కాపాడింది? అనేదే మిగతా కథ.(Gandhi THatha Chettu Review))ఎలా ఉందంటే.. గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని, ఓ చెట్టుని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేదే ఈ సినిమా కథ. టైటిల్ తగ్గట్టే ఈ సినిమా కథంతా గాంధీ, తాత, చెట్టు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. దర్శకురాలు ఎంచుకున్న పాయింట్ బాగుంది. తాను ఇవ్వాలనుకున్న సందేశాన్ని చాలా జన్యూన్‌గానే ఇచ్చింది. అయితే సందేశం బాగున్నప్పటికీ సాగదీసి చెప్పినట్లుగా అనిపిస్తుంది. మొక్కల యొక్క ప్రాముఖ్యత గురించి చెబుతూ.. అహింసవాదం గొప్పదనాన్ని ఎంటర్టైనింగ్గా చెప్పారు. చెట్టును రక్షించేందుకు గాంధీ చేసే ప్రయత్నాలు అందరిని ఆకట్టుకుంటాయి. కానీ వాస్తవికానికి కాస్త దూరంగా ఉంటుంది.ఎలాంటి సాగదీత లేకుండా సినిమా ప్రారంభంలోనే తాత,గాంధీ పాత్రలను పరిచయం చేసి.. అసలు కథను ప్రారంభించారు దర్శకురాలు. ఒకపక్క గాంధీ జర్నీని చూపిస్తూనే..మరోపక్క తాత, చెట్టుకు మధ్య ఉన్న అనుబంధాన్ని చూపించారు. మహాత్మా గాంధీని ఈ కథలో ముడిపెట్టిన విధానం బాగుంది. తాత చనిపోయినప్పుడు చెట్టు ఏడుస్తూ చెప్పే మాటలు విని తెలియకుండానే మన కళ్లు చెమ్మగిల్లుతాయి. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్ సాగినప్పటికీ.. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీసినట్లుగా అనిపిస్తుంది. అలాగే కథనం మొత్తం ఎలాంటి టర్న్‌లు, ట్విస్టులు లేకుండా ఊహకు అందినట్లే సాగుతుంది. ‘నువ్వు ఒక్క మొక్క అయినా నాటావా? చెట్టును నరికే హక్కు ఎవరిచ్చారు? నువ్వు పీల్చుకున్న గాలి ఎవరో పెంచిన మొక్కల నుంచి వచ్చిందే కానీ..నువ్వు సంపాదించుకున్నది ఏమి లేదంటూ బిజినెస్ మ్యాన్‌తో తాత చెబుతుంతుంటే.. ‘నిజమే కదా.. మనం కూడా చెట్లను పెంచలేదు. ఒక్కటైనా పెంచుదాం’ అనే ఆలోచన కొంతమందికి అయినా వస్తుంది. ‘ఏదైనా ప్రేమతో గెలవాలంటే కాస్త టైం పడుతుంది’, ‘చెడుని దులిపేయాలి...మంచిని పట్టుకోవాలి’, ‘పంట పండే స్థలాన్ని అమ్మడం అంటే కన్న తల్లిని వ్యభిచారానికి పంపించినట్లే’ అంటూ తాత చెప్పే సంభాషణలు ఆలోచింపజేస్తాయి. కమర్షియల్‌గా ఈ సినిమా ఏమేరకు సక్సెస్ అవుతుందో తెలియదు కానీ ఓ మంచి సందేశాన్ని మాత్రం అందించింది. ఎవరెలా చేశారంటే..సుకుమార్ ముద్దుల కూతురు సుకృతి వేణి నటించిన డెబ్యూ మూవీ ఇది. తొలి చిత్రంతోనే తనదైన నటనతో అందరికి ఆకట్టుకుంది. గాంధీ పాత్రలో ఆమె ఒదిగిపోయింది. ఈ పాత్ర కోసం నిజంగామే ఆమె గుండు గీసుకుంది అంటే.. ఎంత ఇష్టపడి నటించిందో అర్థం చేసుకోవచ్చు. ఎమోషనల్ సీన్లలోనూ చక్కగా నటించింది. ఇక తాత రామచంద్రయ్య పాత్రకి ఆనంద్ చక్రపాణి పూర్తి న్యాయం చేశాడు. బిజినెస్ మ్యాన్ సతీష్‌గా రాగ్ మయూర్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. గాంధీ తండ్రితో పాటు మిగిలిన నటీనటులంతా కొత్తవారే అయినప్పటికీ వారి వారి పాత్రల పరిధిమేర చక్కగానే నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రీ అందించిన పాటలలో పాటు నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లో కొన్ని సన్నీవేశాలను ఇంకాస్త క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఓటీటీలో మలయాళ హిట్ మూవీ సూక్ష్మదర్శిని.. ఎలా ఉందంటే?
ఈ ప్రపంచంలో దాచలేనిది ఏదైనా ఉంది అంటే అది రహస్యమే. కాని మనిషి తన రహస్యాన్ని బంధించగలనని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటాడు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికైనా రహస్యమనేది బహిర్గతమవ్వాలసిందే. కాకపోతే ఆ రహస్యాన్ని మన ఊహకు కూడా అందని వాళ్ళు బయటపెట్టితేనే పెద్ద విడ్డూరం. మన రహస్యాన్ని మన ఇరుగుపొరుగు వారు బయటపెడితే మనకెలా ఉంటుంది.. ఆ పంథాన రూపొందించిన సినిమానే సూక్ష్మదర్శిని. ఓ రకంగా చెప్పాలంటే ఇదో వినూత్న కథ, కథతో పాటు స్క్రీప్లే కూడా అంతే వైవిధ్యంగా నడుస్తుంది. సూక్ష్మదర్శిని ఓ మళయాళ సినిమా. హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో ఉంది. ఇక కథ విషయానికొస్తే ఇది ఓ కాలనీకి సంబంధించినది. ప్రియ తన భర్త ఆంటోని, కూతరు కాణితో అదే కాలనీలో నివసిస్తుంటుంది. ప్రియ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రియకి అదే కాలనీలో ఉంటున్న స్టెఫీ, అస్మా మంచి స్నేహితులు. ఓ రోజు ఆ కాలనీలోని ఇంట్లోకి మాన్యుల్ తన తల్లితో కొత్తగా వస్తాడు. మాన్యుల్ ప్రవర్తన ప్రియకి అనుమానాస్పదంగా అనిపిస్తుంది. మాన్యుల్ తన తల్లికి అల్జీమర్స్ వ్యాధి ఉందని చెప్పి కొంత వింతగా ప్రవర్తిస్తుంటాడు. ఈ విషయంపై ప్రియ ఫోకస్ చేసి స్టెఫీ, అస్మాతో కలిసి అసలు నిజం బయటపెడుతుంది. మాన్యుల్ ప్రవర్తించిన తీరు ఏంటి, ప్రియ వాళ్లు ఇన్వెస్టిగేషన్ చేసి బయట పెట్టిన సంగతేంటి అన్న విషయాలను మాత్రం సూక్ష్మదర్శినిలో చూస్తే తెలిసిపోతుంది.సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతూ ఆఖరున వచ్చే అద్భుతమైన ట్విస్టులతో ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ సినిమాకి దర్శకుడు యం.సి.జతిన్. ప్రముఖ మళయాళ నటులు నజరియా, బసిల్ జోసెఫ్ వంటి వారు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలలో నటించడం ప్రత్యేక ఆకర్షణ. ఆఖరుగా ఒక్కమాట ఇరుగు పొరుగు వారు మనతో కలిసి ఉంటే మంచిదే, అలాగే వాళ్లు మనల్ని ప్రత్యేకంగా గమనిస్తున్నారో లేదో కూడా తెలుసుకోవాలి. అప్పుడే మనల్ని ఏ సూక్ష్మదర్శిని ఏమీ చేయదు. వర్త్ ఫుల్ వాచ్ ఫర్ ది వీకెండ్.- ఇంటూరు హరికృష్ణ. -
‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ రివ్యూ
టైటిల్: ‘సంక్రాంతికి వస్తున్నాం’నటీనటులు: వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి, వీకే నరేశ్, వీటీ గణేష్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర లిమాయే తదితరులునిర్మాణ సంస్థ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాతలు: శిరీష్, దిల్ రాజుదర్శకత్వం: అనిల్ రావిపూడిసంగీతం: భీమ్స్ సిసిరిలియోసినిమాటోగ్రఫీ: సమీర్ రెడ్డిఎడిటర్: తమ్మిరాజువిడుదల తేది: జనవరి 14, 2025ఈ సంక్రాంతికి చివరిగా వచ్చిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunam Review). రిలీజ్ విషయంలో చివరిది అయినా.. ప్రమోషన్స్‌లో మాత్రం మిగతా సినిమాలతో పోలిస్తే ఇదే ముందంజలో ఉంది. ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు చేసినంత ప్రమోషన్ మరే సినిమాకు చేయలేదు. దానికి తోడు ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ అదిరిపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(జనవరి 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? ‘ఫ్యామిలీతో వచ్చిన ప్రతిసారి విక్టరీ గ్యారెంటీ’ అనిపించుకున్న వెంకటేశ్ ఖాతాలో మరో ‘ ఫ్యామిలీ విక్టరీ’ పడిందా రివ్యూలో చూద్దాం.కథేంటేంటే.. డీసీపీ యాదగిరి దామోదర రాజు అలియాస్ వైడీ రాజు(వెంకటేశ్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. మంచి కోసం తాను చేసే ఎన్కౌంటర్లను రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం వాడుకొని..ఆయనను సస్పెండ్ చేస్తుంటారు. ఇది నచ్చక ఉద్యోగాన్ని వదిలేసి రాజమండ్రీ వెళ్లిపోతాడు రాజు. అక్కడ భార్య భాగ్యం(ఐశ్వర్య రాజేశ్), నలుగురు పిల్లలతో కలిసి హాయిగా జీవితాన్ని గడుపుతుంటాడు. కట్ చేస్తే.. కేంద్రంతో గొడవపడి మరీ అమెరికాలోని ఓ బడా కంపెనీ సీఈఓ ఆకెళ్ల సత్యం(అవసరాల శ్రీనివాస్)ను తెలంగాణకు రప్పిస్తాడు ఇక్కడి ముఖ్యమంత్రి కేశవ్(నరేశ్). పార్టీ ప్రెసిడెంట్(వీటీ గణేశ్) కోరికమేరకు ఆకెళ్లను ఫామ్ హౌజ్ పార్టీకి పంపించగా.. బీజూ గ్యాంగ్ అతన్ని కిడ్నాప్ చేస్తుంది. ఈ విషయం బయటకు తెలిసే పరువుతో పాటు పదవి కూడా పోతుందని భయపడిన సీఎం కేశవ్.. ఎలాగైనా బీజూ గ్యాంగ్ నుంచి ఆకేళ్లను రప్పించాలకుంటాడు. ఐపీఎస్ మీనాక్షి సలహా మేరకు వైడీ రాజుకు ఈ ఆపరేషన్ని అప్పగించాలకుంటాడు. ట్రైనింగ్ టైంలో మీనాక్షి, రాజు ప్రేమలో ఉంటారు. ఓ కారణంగా విడిపోయి..ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఆపరేషన్ కోసం రాజు దగ్గరకు వెళ్తుంది మీనాక్షి. అయితే మీనాక్షి..రాజు మాజీ ప్రియురాలు అనే విషయం భాగ్యానికి తెలుస్తుంది. భర్తతో పాటు ఆమె కూడా ఆపరేషన్‌లో పాల్గొంటానని చెబుతుంది. ఒకవైపు మాజీ ప్రియురాలు..మరోవైపు భార్య మధ్య రాజు ఈ ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశాడనేదే ఈ సినిమా కథ. ఎలా ఉందంటే.. కొన్ని కథలు మన ఊహకందేలా సింపుల్‌గా ఉంటాయి. సినిమా ప్రారంభం మొదలు ఎండ్ వరకు ప్రతీది అంచనాకు తగ్గట్టే ఉంటాయి. కానీ తెరపై చూస్తుంటే తెలియని ఒక ఆనందం కలుగుతుంది. పాత కథ, రొటీన్ సీన్లే అయినప్పటికీ ఎంటర్టైన్ అవుతుంటాం. అలాంటి సినిమాలను తెరకెక్కించడం అనిల్ రావిపూడికి వెన్నతో పెట్టిన విద్య. సింపుల్ పాయింట్‌ని తీసుకొని రెండున్నర గంటల పాటు హాయిగా నవ్వుకునేలా సినిమాలను తెరకెక్కిస్తుంటాడు. గత సినిమాల మాదిరే ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్. టైటిల్ మాదిరే సంక్రాంతికి అసలైన సినిమా ఇది.(Sankranthiki Vasthunam Review)అనిల్ రావిపూడి(Anil Ravipudi) రిలీజ్ ముందే సినిమా కథంతా చెప్పేస్తుంటాడు. ఈ సినిమా విషయంలోనూ అదే చేశాడు. ట్రైలర్లోనే కథంతా చెప్పేశాడు. హీరోహీరోయిన్ల క్యారెక్టర్ ఎలా ప్రవర్తిస్తాయో కూడా ప్రమోషన్స్‌లోనే చెప్పేశాడు. స్టోరీ మొత్తం తెలిసినా కూడా తెరపై ఆ కథను చూసి ఎంజాయ్ చేయాలని ప్రతి ప్రేక్షకుడు అనుకుంటాడు. దానికి కారణం.. ఈ కథ మెయిన్ పాయింట్. భార్య, భర్త, ప్రియురాలు.. ఈ మూడు పాత్రలు ప్రతి ఒక్కరి జీవితంలోనూ కనిపిస్తాయి. వాళ్ల మధ్య వచ్చే ప్రతీ సీన్ మన నిజ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటాం. అలాంటి పాయింట్ పట్టుకోవడమే అనిల్ రావిపూడి సక్సెస్. ఓ ఫ్యామిలీ స్టోరీకి ఓ వెరైటీ ఇన్వెస్టిగేషన్ యాడ్ చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా కథనాన్ని నడిపించాడు. ఆకెళ్ల కిడ్నాప్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. అయితే ఈ కిడ్నాప్ సీన్‌ని కూడా ఎంటర్టైనింగ్గానే తీర్చిదిద్ది.. కథనం మొత్తం ఫుల్ కామెడీ వేలో సాగుతుందనే ముందే చెప్పేశాడు దర్శకుడు. ఆ తర్వాత రాజు ఫ్యామిలీ పరిచయం నవ్వులు పూయిస్తుంది. వైడీ రాజు కొడుకు బుల్లిరాజు పండించే కామెడీకి పడిపడి నవ్వుతారు. వైడీ రాజు ఇంటికి మీనాక్షి వచ్చిన తర్వాత కామెడీ డోస్ డబుల్ అవుతుంది. ఒక పక్క భార్య, మరో పక్క మాజీ ప్రియురాలుతో హీరో పడే బాధ థియేటర్లో నవ్వులు పూయిస్తుంది. ఆహ్లాదకరమైన పాటలు... పొట్టచెక్కలయ్యే కామెడీ సీన్లతో ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా ముగుస్తుంది. ఇక సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. జైలర్ జార్జ్ ఆంటోనీ(ఉపేంద్ర లిమాయే)తో వచ్చే కొన్ని సీన్లు అంతగా ఆకట్టుకోవు. ఆస్పత్రి సీన్ కూడా రొటీన్‌గానే అనిపిస్తుంది. ‘ఆవకాయ’ సీన్‌కు అయితే పడిపడి నవ్వుతారు. క్లైమాక్స్‌ని పకడ్బందీగా రాసుకున్నాడు. క్లైమాక్స్ యాక్షన్ సీన్ అయితే అదిరిపోతుంది. అక్కడ వెంకటేశ్ చెప్పే డైలాగ్స్ నవ్వులు పూయిస్తాయి. ఆడవాళ్ల మనోభావాలు దెబ్బతినకుండా.. మగవాళ్లకు మనో ధైర్యాన్ని ఇచ్చేలా ఆ డైలాగ్స్ ఉంటాయి. ముగింపులో ఇచ్చిన సందేశం ఆకట్టుకుంటుంది. మొత్తంగా సంక్రాంతికి చూడాల్సిన మాంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఎవరెలా చేశారంటే.. ఇద్దరి ఆడవాళ్ల మధ్య నలిగిపోయే పాత్రను వెంకటేశ్(Venkatesh) చేస్తే ఎలా ఉంటుందో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రంలోనే చూసేశాం. ఆయన కామెడీ టైమింగ్ గురించి అందరికి తెలిసిందే. ఈ చిత్రంలో కూడా వెంకీ అలాంటి పాత్రే చేశాడు. మాజీ ప్రియురాలు, భార్య మధ్య నలిగిపోయే యాదగిరి దామోదర రాజు పాత్రలో ఒదిగిపోయాడు. ఇద్దరి ఆడాళ్ల మధ్య నలిగిపోతూ నవ్వులు పూయించాడు. యాక్షన్‌తో అలరించడమే కాకుండా పాట పాడి ఆకట్టుకున్నాడు. ఇక చదువురాని పల్లెటూరి అమ్మాయి, రాజు భార్య భాగ్యంగా ఐశ్వర్య రాజేశ్ తనదైన నటనతో ఆకట్టుకుంది.రాజు మాజీ ప్రియురాలు, ఐపీఎస్ అధికారి మీనాక్షిగా మీనాక్షి చౌదరి అదరగొట్టేసింది. తొలిసారి ఇందులో యాక్షన్ సీన్ కూడా చేసింది. ఇక వీరందరితో పాటు ముఖ్యంగా మట్లాడుకోవాల్సిన మరో పాత్ర బుల్లి రాజు. ఈ పాత్రలో చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ ఒదిగిపోయాడు. ఇంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ.. తనదైన నటనతో అందరి దృష్టి ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగాడానికి బుల్లిరాజు పాత్ర కూడా ఒక ప్రధాన కారణం. ‘కొరికేస్తా.. కొరికేస్తా’ అంటూ ఈ బుడ్డోడు చేసిన కామెడీకి ప్రేక్షకులు పలగబడి నవ్వారు. నరేశ్, సాయి కుమార్, సర్వదమన్ బెనర్జీ,ఉపేంద్ర మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా భీమ్స్ అందించిన సంగీతం సినిమాకే హైలెట్. అద్భుతమైన పాటలతో పాటు అదిరిపోయే బీజీఎం ఇచ్చాడు. ‘గోదారి గట్టు మీద...’పాటతో పాటు ప్రతి పాట తెరపై చూసినప్పుడు మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
Daaku Maharaaj Review: ‘డాకు మహారాజ్’ మూవీ రివ్యూ
టైటిల్: డాకు మహారాజ్నటీనటులు: నందమూరి బాలకృష్ణ, బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సత్య తదితరులునిర్మాణ సంస్థలు: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యదర్శకత్వం: బాబీ కొల్లిసంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ఎడిటర్: నిరంజన్ దేవరమానే, రూబెన్విడుదల తేది: జనవరి 12, 2025కథేంటంటే..చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన విద్యావేత్త కృష్ణమూర్తి (సచిన్ ఖేడ్కర్)కి ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది. దాన్ని స్థానిక ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు(రవి కిషన్) లీజుకు తీసుకొని కాఫీసాగు పేరుతో డ్రగ్స్, వన్య మృగాల అక్రమ రవాణ సాగిస్తుంటాడు. త్రిమూర్తులు, అతని తమ్ముడు కలిసి చేస్తున్న అరాచకాలు కృష్ణమూర్తికి తెలిసి పోలీసులను ఆశ్రయిస్తాడు. దీంతో త్రిమూర్తులు కృష్ణమూర్తి మనవరాలు వైష్ణవితో పాటు ఫ్యామిలీ మొత్తాన్ని చంపేందుకు ప్రయత్నిస్తుంటారు. చిన్నారి వైష్ణవికి ప్రాణ హానీ ఉందనే విషయం చంబల్ జైలులో ఉన్న మహారాజ్(బాలకృష్ణ)కు తెలుస్తుంది. తన అనుచరుల సహాయంతో అక్కడి నుంచి తప్పించుకొని కృష్ణమూర్తి ఇంటికి చేరుతాడు. నానాజీగా పేరు మార్చుకొని కృష్ణమూర్తి ఇంట్లో డ్రైవర్‌గా చేరతాడు. చిన్నారి వైష్ణవిని చంపేందుకు ప్రయత్నించిన వారందరిని మట్టుబెడుతూ కృష్ణమూర్తి ఫ్యామిలీకి రక్షణగా నిలుస్తాడు. అసలు ఈ మహారాజ్ ఎవరు..? అతని నేపథ్యం ఏంటి..? చిన్నారి వైష్ణవికి, మహారాజ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? సివిల్ ఇంజనీర్ సీతారాం(బాలకృష్ణ), చంబల్ డాన్ బల్వంత్ ఠాకూర్(బాబీ డియోల్) మధ్య ఉన్న వైర్యం ఏంటి..? నందిని(శ్రద్ధా శ్రీనాథ్), కావేరి(ప్రగ్యా జైస్వాల్) ఎవరు..? ఇవన్నీ తెలియాలంటే థియేటర్లో సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..బాలయ్య చేసే మాస్ యాక్షన్ సినిమాల నేపథ్యం దాదాపు ఒకేలా ఉంటుంది. విలన్ చెడు పనులు చేస్తూ జనాలను హింసించడం.. దాన్ని హీరో అడ్డుకోవడం. అన్ని కథలు ఇలానే ఉంటాయి. డాకు మహారాజ్(Daaku Maharaaj Review) కూడా అలాంటి కథే. అయితే పాత కథను కూడా కొత్తగా చెప్పడం కూడా ఓ కళ. అందులో దర్శకుడు బాబీ ఎప్పుడూ సక్సెస్ అవుతుంటాడు. రొటీన్ కథనే అయినా హీరో ఫ్యాన్స్‌కి నచ్చేలా తెరకెక్కిస్తాడు.బాలయ్య తాలుకు ఇమేజ్‌ని దృష్టిలో ఫక్తు కమర్షియల్ ఫార్మెట్లో డాకు మహారాజ్ కథనాన్ని సాగించాడు. ప్రతి పది నిమిషాలకొక యాక్షన్ సీన్ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఆ యాక్షన్ సీన్లు కూడా కొత్తగా ఉంటాయి. గత సినిమాల మాదిరి బాలయ్య ఇందులో గట్టిగా అరవడం.. ఒంటి చేత్తో వందమందిని నరకడం లాంటివి ఉండవు. డీసెంట్ యాక్షన్ సీన్లతో బాలయ్యను కొత్తగా చూపించాడు. అయితే కథనం ఊహకందేలా సాగడం.. పాతకాలం నాటి సమస్యనే మళ్లీ తెరపై చూపించడం అంతగా ఆకట్టుకోదు. అలాగే మెయిన్ విలన్ని సెకండాఫ్ వరకు దాచడంతో హీరో, విలన్ల మధ్య సంఘర్షణ ఆసక్తికరంగా సాగలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమా ఎత్తుగడ బాగుంది. ఇంటర్వెల్ బ్యాంగ్‌ని ప్రారంభంలోనే చూపించి కథనంపై ఆసక్తిని పెంచేశారు. మొదటి పావుగంట కృష్ణమూర్తి ఫ్యామిలీ, ఎమ్మెల్యే త్రిమూర్తుల చుట్టూనే తిరుగుతుంది. నానాజీగా బాలయ్య ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. చిన్నారితో బాలయ్యకు ఏదో సంబంధం ఉంటుందని ఊహించినా.. అదేంటి అనేది సెకండాఫ్ వరకు దాచి ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశారు. ఇంటర్వెల్ బ్లాక్ అదిరిపోతుంది. అసలు కథంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. సివిల్ ఇంజనీర్ సీతారాం, డాకు మహారాజ్ కథంతా ద్వితియార్థంలోనే వస్తుంది. చంబల్ ప్రజలకు ఉన్న ఓ ప్రధాన సమస్యను తీర్చేందుకు సీతారాం చేసే ప్రయత్నాలు ఆకట్టుకుంటాయి. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లోనే ఎక్కువ ఊచకోత ఉంటుంది. అది బాలయ్య అభిమానులను అలరిస్తుంది. ఎమోషన్ కోసం చిన్న పిల్లల పాత్రలను మరింత హింసాత్మకంగా తీర్చిదిద్దారు. అయితే ద్వితియార్థం ప్రారంభమైన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుందని ఊహించొచ్చు. క్లైమాక్స్‌ని ఇంకాస్త షార్ఫ్ గా కట్ చేస్తే బాగుండేదేమో. బాలయ్య అభిమానులను మాత్రం ఈ సినిమా అలరిస్తుంది. ఎవరెలా చేశారంటే.. బాలయ్యకు యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు. ఇలాంటి సినిమాల్లో మరింత దూకుడుగా నటిస్తాడు. డాకు మహారాజ్లో కూడా అదే స్థాయితో నటించాడు. నానాజీగా, సీతారాంగా రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించి, ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించాడు. యాక్షన్ సీన్లలో ఎప్పటి మాదిరే అదరగొట్టేశాడు. ఇందులో గత సినిమాల మాదిరి పెద్ద పెద్ద డైలాగ్స్, అరవడాలు ఉండవు. బాలయ్య చెప్పే డైలాగ్ తీరు కొత్తగా ఉంటుంది. బల్వంత్ ఠాకూర్‌గా బాబీ డియోల్ తెరపై స్టైలీష్‌గా కనిపిస్తూనే డిఫరెంట్ విలనిజాన్ని చూపించాడు. ప్రగ్యా జైస్వాల్‌తో పోలిస్తే శ్రధ్ధా శ్రీనాథ్‌కి ప్రాధాన్యత ఉన్న పాత్ర లభించింది. అయితే తెరపై మాత్ర ప్రగ్యానే ఎక్కువసేపు కనిపిస్తుంది. ఎమ్మెల్యే త్రిమూర్తులుగా రవికిషన్ చక్కగా నటించాడు. ఫస్టాఫ్‌లో ఆయన విలనిజం ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో ఆయన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్ ఆకట్టుకుంటుంది. ఊర్వశీ రౌతేలా పాటకే దబిడిదిబిడి పాటతో ఆకట్టుకోవడమే కాకుండా.. గ్లామర్‌తో యూత్‌ని అలరించింది. సచిన్ ఖేడ్కర్, చాందీనీ చౌదరితో పాటు వైష్ణవి పాత్ర పోషించిన చిన్నారి కూడా తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. బాలయ్య సినిమా అంటే తమన్ రెచ్చిపోతాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు కూడా అదరిపోయే బీజీఎం అందించాడు. కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం గూస్బంప్స్ తెప్పిస్తాయి. పాటలు పర్వాలేదు. యాక్షన్ కొరియోగ్రఫీ బాగుంది. బాలయ్యతో కొత్త స్టంట్స్ చేయించారు. సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘గేమ్ ఛేంజర్’ మూవీ రివ్యూ
టైటిల్ : గేమ్ ఛేంజర్‌నటీనటులు: రామ్ చరణ్, కియారా అద్వానీ, ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, నాజర్ తదితరులునిర్మాణ సంస్థలు: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌నిర్మాతలు: దిల్ రాజు, శిరీష్కథ: కార్తీక్ సుబ్బరాజ్‌దర్శకత్వం-స్క్రీన్‌ప్లే: ఎస్. శంకర్‌సంగీతం: తమన్‌సినిమాటోగ్రఫీ: తిరువిడుదల: జనవరి 10, 2025సంక్రాంతి టాలీవుడ్‌కి చాలా పెద్ద పండగ. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా పండక్కి మూడు భారీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’(Game Chnager Review) నేడు(జనవరి 10) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంపై మొదటి నుంచి భారీ అంచనాలున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్, పాటలు ఆ అంచనాలను మరింత పెంచాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘గేమ్ ఛేంజర్’పై మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? శంకర్, చరణ్ ఖాతాలో బిగ్ హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి( శ్రీకాంత్) ఎన్నికలకు ఒక సంవత్సరం ముందు పూర్తిగా మారిపోతాడు. రాష్ట్రంలో ఇకపై అవినీతి జరగొద్దని, నిజాయితీగా పని చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశిస్తాడు. సీఎం నిర్ణయం ఆయన కొడుకు, మైనింగ్ మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి(ఎస్జే సూర్య)కి నచ్చదు. ముఖ్యమంత్రికి తెలియకుండా అవినీతిని కొనసాగిస్తుంటాడు. అంతేకాదు తండ్రిని తప్పించి సీఎం సీటులో కూర్చోవాలని కుట్ర చేస్తుంటాడు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌లో ఐపీఎస్‌గా విధులు నిర్వర్తిస్తూ.. సివిల్స్ పరీక్ష మళ్లీ రాసి ఐఏఎస్‌గా సెలెక్ట్ అయిన రామ్ నందన్(రామ్ చరణ్).. విశాఖపట్నం కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతాడు. జిల్లాలో అవినీతి, దౌర్జన్యాలు మానేయాలని రౌడీలకు, వ్యాపారులకు వార్నింగ్ ఇస్తాడు.ఈ క్రమంలో మంత్రి మోపిదేవి, కలెక్టర్ మధ్య వైరం ఏర్పడుతుంది. మరోవైపు సీఎం సత్యమూర్తి చివరి కోరిక అంటూ ఓ భారీ ట్విస్ట్ ఇస్తాడు. అదేంటి? అసలు సీఎం సత్యమూర్తిలో మార్పుకు గల కారణం ఏంటి? అప్పన్న(రామ్ చరణ్) ఎవరు? పార్వతి(అంజలి)తో కలిసి ఆయన పోరాటం ఏంటి? కలెక్టర్ రామ్‌కి అప్పన్నకు ఉన్న సంబంధం ఏంటి? సీఎం సీటు కోసం మోపిదేవి చేసిన కుట్రలను రామ్ ఎలా అడ్డుకున్నాడు? ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న పవర్స్‌ని ఉపయోగించి రాష్ట్ర రాజకీయాలను ఎలా మార్చాడు? దీపిక(కియారా అద్వానీ)తో రామ్ ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..శంకర్(Shankar) అద్భుతమైన ఫిల్మ్ డైరెక్టర్. అందులో డౌటే లేదు. కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు సామాజిక సందేశం ఇచ్చేలా ఆయన సినిమాలు ఉంటాయి. జెంటిల్మెన్, ఒకే ఒక్కడు, భారతీయుడు, శివాజీ, అపరిచితుడు, రోబో లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలను అందించాడు. అయితే భారతీయుడు 2 రిలీజ్ తర్వాత శంకర్ మేకింగ్‌పై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. బలమైన కథలు రాసుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. ఆ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్(Game Changer Review)పై కూడా పడింది. కానీ మెగా ఫ్యాన్స్‌తో పాటు శంకర్ అభిమానులు కూడా ఈ చిత్రం ఆయనకు కమ్‌బ్యాక్ అవుతుందని ఆశ పడ్డారు. కానీ వారి ఆశ పూర్తిగా నెరవేరలేదనే చెప్పాలి. కార్తీక్ సుబ్బరాజ్ అందించిన రొటీన్ కథను అంతే రొటీన్‌గా తెరపై చూపించాడు. ఈ సినిమా నేపథ్యం అవినీతి రాజకీయ నేతకు, నిఖార్సయిన ఐఏఎస్ అధికారికి మధ్య జరిగే ఘర్షణ అని ట్రైలర్లోనే చూపించారు. అయితే ఆ ఘర్షణను ఆసక్తికరంగా, ఉత్కంఠభరితంగా చూపించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేదు. శంకర్ గత సినిమాలను గుర్తు చేసేలా కథనం సాగుతుంది. అలా అని బోర్ కొట్టదు. మదర్ సెంటిమెంట్, తండ్రి ఎపిసోడ్ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి.ఎలాంటి సాగదీతలు లేకుండా కథను చాలా సింపుల్‌గా ప్రారంభించాడు. హీరో పరిచయానికి మంచి సీన్ రాసుకున్నాడు. ఇక హీరో కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కథనంపై మరింత ఆసక్తి పెరుగుతుంది. రామ్ చరణ్, ఎస్జే సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అదే సమయంలో హీరోయిన్‌తో వచ్చే లవ్‌ట్రాక్ ఆకట్టుకోకపోగా.. కథకు అడ్డంకిగా అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్ వర్కౌట్ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌కి ప్రేక్షకులు కనెక్ట్ కాకపోవడంతో ఆ సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. కలెక్టర్, మంత్రి మోపిదేవి మధ్య సాగే సన్నివేశాలు మాత్రం ఆసక్తికరంగా ఉంటాయి. సీఎం సీటు కోసం మోపిదేవి వేసే రాజకీయ ఎత్తులను ఐఏఎస్ అధికారిగా తనకున్న అధికారాలతో హీరో చెక్ పెట్టడం ఆకట్టుకుంటుంది.ఇంటర్వెల్ సీన్ మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు. విరామం ముందు వచ్చే ఓ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే అప్పన్న ఎపిసోడ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత కథనం మళ్లీ ఊహకందేలా రొటీన్‌గా సాగుతుంది. మోపిదేవి, రామ్ నందన్ మధ్య సాగే టామ్ అండ్ జెర్రీ వార్ బాగానే ఉన్నా.. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ బెటర్. ఎన్నికల అధికారి తనకున్న పవర్స్‌ని నిజాయితీగా వాడితే ఎలా ఉంటుందనేది తెరపై చక్కగా చూపించారు. క్లైమాక్స్ కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఈ చిత్రం ద్వారా ఎన్నికల వ్యవస్థకు, రాజకీయ పార్టీలతో పాటు ఓటర్లకు దర్శకుడు ఇచ్చిన సందేశం మాత్రం బాగుంది. అయితే ఆ సందేశాన్ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బలంగా చూపించడంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు.ఎవరెలా చేశారంటే..రామ్ చరణ్(Ram Charan) నటన ఏంటో ఆర్ఆర్ఆర్ చిత్రం ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. మరోసారి ఆ రేంజ్ నటనతో ఆకట్టుకున్నాడు. అప్పన్న, రామ్ నందన్ అనే రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించిన చరణ్.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో చరణ్ అద్భుతంగా నటించేశాడు. యాక్షన్, ఎమోషన్ సీన్లలో అదరగొట్టేశాడు. చరణ్ తర్వాత సినిమాలో బాగా పండిన పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న పొలిటిషీయన్ బొబ్బిలి మోపిదేవిగా సూర్య తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. సూర్యకు, చరణ్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అప్పన్న భార్య పార్వతిగా అంజలి అద్భుతంగా నటించింది. ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ భావోధ్వేగానికి గురి చేస్తుంది. రామ్ నందన్ ప్రియురాలు దీపికగా కియరా అద్వానీ మెప్పించింది. తెరపై కనిపించేది తక్కువ సమయమే అయినా.. తనదైన అందచందాలతో ఆకట్టుకుంది. బొబ్బిలి సత్యమూర్తిగా శ్రీకాంత్, సైడ్ సత్యంగా సునీల్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే సునీల్‌తో పాటు వెన్నెల కిశోర్‌ల కామెడీ మాత్రం సరిగ్గా పండలేదు. బ్రహ్మానందం ఒక్క సీన్లో కనిపిస్తారు. జయరాం, నవీన్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంది. తమన్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు వినడం కంటే తెరపై చూస్తే ఇంకా బాగా ఆకట్టుకుంటాయి. శంకర్ మార్క్ గ్రాండ్‌నెస్ ప్రతి పాటలోనూ కనిపించింది. సినిమాటోగ్రఫీ పని తీరు అద్భుతం. ప్రతి ఫ్రేమ్ తెరపై చాలా అందంగా, రిచ్‌గా కనిపిస్తుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపిస్తుంది. ఎడిటింగ్ పర్వాలేదు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో దిల్ రాజు ఎక్కడా వెనకడుగు వేయలేదని సినిమా చూస్తుంటే అర్థమవుతుంది.- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మార్కో’ మూవీ రివ్యూ: వయొలెన్స్.. వయొలెన్స్.. వైల్డ్ వయొలెన్స్!
టైటిల్: 'మార్కో'నటీనటులు: ఉన్ని ముకుందన్, యుక్తి తరేజా, కబీర్ దుహన్ సింగ్నిర్మాణ సంస్థ: క్యూబ్స్ ఎంటర్టైన్మెంట్స్నిర్మాత: షరీఫ్ ముహమ్మద్రచన-దర్శకత్వం: హనీఫ్ అదేనిసంగీతం: రవి బస్రూర్సినిమాటోగ్రఫీ: చంద్రు సెల్వరాజ్ఎడిటర్: షమీర్ మహమ్మద్విడుదల తేది: జనవరి 1, 2025‘మార్కో’.. ఈ ఏడాది చివరిలో(డిసెంబర్ 20) వచ్చిన ఈ మలయాళ చిత్రం అక్కడ బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రూ.100 కోట్లకు పైగా వసూళ్లని సాధించింది. మోస్ట్ వయలెంట్ చిత్రంగా పేరు తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. న్యూ ఇయర్ సందర్భంగా నేడు(జనవరి 1) ఈ చిత్రం తెలుగులో రిలీజ్ అయింది. కేరళ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ‘మార్కో’ తెలుగు వాళ్లను మెప్పించాడా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. జార్జ్ (సిద్దిఖ్ఖీ) గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో తనకు మించినవాళ్లు ఉండరు. సిండికేట్ ఏర్పాటు చేసి.. దాని లీడర్‌గా వ్యవహరిస్తుంటారు. అతని తమ్ముడు విక్టర్(ఇషాన్ షౌకాత్) అంధుడు. కానీ చాలా టాలెంటెడ్. విక్టర్ స్నేహితుడు వసీమ్‌ను ఓ ముఠా చంపేస్తుంది. దానికి సాక్షి ఉన్నాడని విక్టర్‌ను కూడా ఆ ముఠా దారుణంగా హత్య చేస్తుంది. విదేశాలకు వెళ్లిన జార్జ్ మరో తమ్ముడు(జార్జ్ వాళ్ల నాన్న పెంచిన వ్యక్తి) మార్కో(ఉన్ని ముకుందన్)కు ఈ హత్య విషయం తెలిసి వెంటనే వచ్చేస్తాడు. తను ప్రాణంగా ఇష్టపడే సోదరుడు విక్టర్ హత్యకు కారణమైనవారిని వదిలిపెట్టనని చర్చిలోనే ప్రమాణం చేస్తాడు. అసలు విక్టర్ని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? చివరకు మార్క్ వారిని ఎలా మట్టుపెట్టాడు?అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..?ఈ మధ్యకాలంలో యాక్షన్ సినిమాల్లో హింస మితిమీరిపోతుంది. అవసరానికి మించి వయొలెన్స్‌ని చూపిస్తున్నారు. ఆ మధ్య వచ్చిన ‘యానిమల్’, ఇటీవల వచ్చిన ‘కిల్’ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ దారుణంగా ఉన్నాయి. వాటిని యాక్షన్ ప్రియులు ఎంజాయ్ చేసినా.. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం చూడలేకపోయారు. కానీ యాక్షన్ ప్రియులే భయపడిపోయి.. ‘ఈ హింసను చూడలేకపోతున్నాం.. ఆపండ్రాబాబూ..’ అనుకునే సినిమా ‘మార్కో’. సెన్సార్ బోర్డ్ ఎలా ఓకే చేసిందో తెలియదు కానీ..కొన్ని సన్నివేశాలు తెరపై చూస్తుంటే ఒళ్లు జలదరిస్తుంది. అవసరానికి మించిన హింస.. జుగుప్సాకరమైన సన్నివేశాలతో ఈ సినిమా కథనం సాగుతుంది.వాస్తవానికి ఇదొక రోటీన్ రివైంజ్ డ్రామా చిత్రం. తన సోదరుడిని చంపినవాళ్లపై హీరో ఎలా పగతీర్చుకున్నాడనేది ఈ సినిమా కథ. ఇలాంటి కథలు తెలుగులోనూ చాలా వచ్చాయి. కానీ రివైంజ్ డ్రామాని ఫుల్ యాక్షన్ డ్రామాగా మలచడమే ‘మార్కో’ స్పెషల్. సినిమా ప్రారంభంలోనే హంతకులు ఎవరనేది ఆడియన్స్‌కు తెలిసిపోతుంది. కానీ హీరో వారిని కనిపెట్టి ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఆసక్తికరం. ప్రతి యాక్షన్ సీన్లోనూ రక్తం ఏరులైపారుతుంది. ఇంటర్వెల్ సీన్లో వయొలెన్స్ మరీ ఎక్కువైపోతుంది. ఇక సెకండాఫ్‌లో వచ్చే యాక్షన్ సీన్స్ చూస్తే యాక్షన్ ప్రియులే తట్టుకోలేరు. తలలు ఎగిరిపడడం.. కాళ్లు, చేతులు తెగిపడడం.. పొట్టలోని పేగులు బయటకు రావడం.. ఒకెత్తు అయితే.. యాసిడ్‌తో చంపడం.. గర్భిణీ స్త్రీ నోట్ల ఆయుధం దింపడం.. చిన్న పిల్లాడిని గ్యాస్ సిలిండెర్‌తో మోది చంపడం.. గుండెకాయను కోసి బయటకు తీయడం.. మరో ఎత్తు. ఆ సన్నివేశాలను తెరపై చూడాలంటే గుండె రాయి చేసుకోవాల్సిందే. ఒకనొక దశలో ఇంత వయొలెన్స్ అవసరమా? అనిపిస్తుంది. కథ మొత్తం ప్యామిలీ చుట్టే తిరిగినా.. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని సన్నివేశాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిన్న పిల్లలు, గుండెజబ్బు ఉన్నవారు ఈ సినిమాకు దూరంగా ఉంటే బెటర్. తెరపై హింసను ఆస్వాదించేవాళ్లు.. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవాళ్లకు మాత్రం ‘మార్కో’ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. ఉన్ని ముకుందన్ కేరళ నటుడైనా తెలుగు ఆడియన్స్‌కి సుపరిచితుడే. ‘యశోద’, ‘జనతా గ్యారేజ్’ సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు. మాలీవుడ్‌లో అతనికి మాస్ హీరో అనే ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్‌ని పెంచే చిత్రం ‘మార్కో’. టైటిల్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. మార్కో పాత్ర కోసం ఆయన శరీరాకృతిని మార్చుకున్నాడు. ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ తగ్గట్లుగా ఉన్ని తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక సిద్ధిఖీ, కబీర్ దుహాస్ సింగ్‌ల పాత్రకు కూడా బాగా పేలాయి. వారి పాత్రల పరిచయం..యాక్షన్ సీన్స్ అదిరిపోతాయి. దర్శకుడు హనీఫ్ అదేని తన రాసుకున్న పాత్రలకు తగ్గట్లుగా క్యాస్టింగ్‌ను ఎంచుకున్నాడు. ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా అదిరిపోయింది. రవి బస్రూర్ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన బలం. తనదైన బీజీఎంతో మూవీ స్థాయిని పెంచేశాడు. హీరోతో పాటు విలన్ పాత్రలకు సంబంధించిన ఎలివేషన్ సీన్లకు ఆయన అందించిన బీజీఎం నెక్ట్స్ లెవన్. పాటలు గుర్తుండవు. యాక్షన్ కొరియోగ్రాఫర్ల పనితీరు అద్భుతం. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
‘డ్రింకర్ సాయి’ మూవీ రివ్యూ
టైటిల్: డ్రింకర్ సాయి (బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్)నటీనటులు: ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, భద్రం, స్ఎస్ కాంచి, కిర్రాక్ సీత, రీతు చౌదరి,తదితరులునిర్మాణ సంస్థలు: ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్రచన, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టిసంగీతం: శ్రీవసంత్లిరిక్స్: చంద్రబోస్ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేశ్విడుదల తేది: డిసెంబర్ 27, 2024ఈ మధ్యకాలంలో ట్రైలర్‌తోనే మంచి హైప్ క్రియేట్ చేసుకున్న సినిమా ‘డ్రింకర్ సాయి’. బూతు డైలాగ్స్‌తో పాటు మంచి ఎమోషన్‌తో కూడా ఈ మూవీ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేలా చేసింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో ‘డ్రింకర్ సాయి’పై బజ్ క్రియేట్ అయింది. ఈ ఏడాది చివరిలో(డిసెంబర్ 27) వచ్చిన ఈ చిన్న చిత్రం ఎలా ఉంది? ‘డ్రింకర్ సాయి’దెబ్బకు టాలీవుడ్ బాక్సాఫీస్‌కు మత్తు ఎక్కిందా లేదా? రివ్యూలో చూద్దాంకథేంటంటే.. సాయి అలియాస్ డ్రింకర్ సాయి(ధర్మ) బాగా ధనవంతుడు. పెరెంట్స్ చనిపోవడంతో తాగుడుకు బానిసవుతాడు. నిత్యం తాగుతూ అందరితో గొడవలు పడడం..అరెస్ట్ అయితే అతని అంకుల్(శ్రీకాంత్ అయ్యంగార్) బెయిల్‌పై విడిపించడం..ఇదే తంతుగా మారుతుంది. ఓసారి బాగా తాగిఉన్న సాయిని మెడికల్ స్టూడెంట్ బాగీ(ఐశ్వర్య శర్మ) తన బైక్‌తో ఢీకొట్టి పారిపోతుంది. ఆ మరుసటి రోజు తనకు యాక్సిడెంట్ చేసింది బాగీనే అని తెలుసుకుంటాడు. అమెతో గొడవపడేందుకు వెళ్లి.. ప్రేమలో పడిపోతాడు. బాగీకి మాత్రం సాయి అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ విషయం సాయికి చెబితే ఎక్కడ గొడవ చేస్తాడోనని ప్రేమించినట్లు నటిస్తుంది. బాగీ ప్రేమను పొందేందుకు సాయి చేసిన ప్రయత్నాలు ఏంటి? బాగీ తనను ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత సాయి ఏం చేశాడు? తనకు ఉన్న తాగుడు అలవాటు ఎక్కడకు దారి తీసింది? చివరకు సాయి బాగీ ప్రేమను పొందాడా లేదా? అనేదే మితగా కథ. ఎలా ఉందంటే.. హీరో తాగుతూ జులాయిగా తిరగడం.. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడడం..ఓ మంచి పని చేసి చివరకు ఆమె ప్రేమ పొందడం..ఇలాంటి ప్రేమ కథలు తెలుగు తెరపై చాలా వచ్చాయి. డ్రింకర్ సాయి కూడా అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన లవ్‌స్టోరీనే. తాగుడుకు బానిసైన హీరో.. తనలాంటి వాడిని చూస్తేనే చిరాకు పడే హీరోయిన్ని ఎలా ప్రేమలో పడేశాడనేది ఈ సినిమా కథ. చివరిలో ఓ సోషల్ మెసేజ్ ఇవ్వడం ఈ ప్రేమకథను ప్లస్ పాయింట్. అయితే ట్రైలర్ చూస్తే మాత్రం ఇదొక బోల్డ్ మూవీ, అసభ్యకర సన్నివేశాలు చాలానే ఉంటాయని అనుకుంటారు. కానీ తెరపై సినిమా చూస్తే మాత్రం అలాంటి ఫీలింగ్ కలగదు. ఒకటి రెండు చోట్ల అలాంటి డైలాగ్స్ ఉన్నా..ఇప్పుడు వస్తున్న సినిమాలతో పోలిస్తే తక్కువే అనిపిస్తాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్, చివరిలో ఇచ్చిన మెసేజ్ బాగుంది. కానీ ఆ పాయింట్ చెప్పడానికి అల్లుకున్న కథ, రాసుకున్న స్క్రీన్‌ప్లే అంతగా ఆకట్టుకోలేదు. హీరో హీరోయిన్ వెంబడి పడడం.. ఆమె ఛీకొట్టడం.. చివరి వరకు ఇదే ఉంటుంది. లవ్‌స్టోరీలో కూడా కొత్తదనం ఉండదు. సినిమా ప్రారంభం నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఫన్‌గా సాగుతుంది. అయితే వంతెన (భద్రం) పాత్ర వచ్చిన ప్రతిసారి కామెడీ పండకపోగా.. సాఫీగా సాగుతున్న లవ్‌స్టోరీకి ఇరికించినట్లుగా అనిపిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే పాటలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సీన్ రొటీన్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ ఎక్కువ భాగం వంతెన ఆశ్రమంలో కథనం సాగుతుంది. ఓ పిల్లోడితో చేయించే కామెడీ ఇరికించినట్లుగా ఉంటుంది. చివరి అరగంట ఎమోషనల్ సాగుతుంది. టెక్నికల్‌గా బాగున్నప్పటికీ.. కథ, కథనం మాత్రం దర్శకుడు ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయాడు. చివరిలో ఇచ్చిన సందేశం బాగుంటుంది. కథ, కథనం మరింత బలంగా రాసుకొని ఉంటే డ్రింకర్ సాయి బాక్సాఫీస్‌ని ఊగించేవాడు. ఎవరెలా చేశారంటే.. ధర్మకి ఇది రెండో సినిమా. అంతకు ముందు సింధూరం అనే సినిమాలో నటించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. అయితే డ్రింకర్ సాయిలో మాత్రం రెచ్చిపోయి నటించాడు. రెండో సినిమానే అయినా.. కెమెరా ముందు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈజీగా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. ఐశ్వర్య శర్మ కూడా తనదైన నటనతో ఆకట్టుకుంది. తొలి సినిమాకే మంచి పాత్ర లభించింది. బాగీ పాత్రలో ఆమె జీవించేసింది. వంతెనగా భద్రం నవ్వించే ప్రయత్నం చేశాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. శ్రీకాంత్ అయ్యంగార్, కిర్రాక్ సీత, రీతూ చౌదరితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శ్రీవసంత్ సంగీతం సినిమా స్థాయి పెంచేసింది. పాటలు బాగున్నాయి. బీజీఎం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతీ సీన్ తెరపై రిచ్‌గా కనిపిస్తుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
కిచ్చా సుదీప్ ‘మాక్స్’ మూవీ రివ్యూ
టైటిల్ : మాక్స్ నటీనటులు: కిచ్చా సుదీప్, వరలక్ష్మీ శరత్ కుమార్, సునీల్, సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్, తదితరులునిర్మాత: కలైపులి ఎస్. థానుదర్శకత్వం: విజయ్ కార్తికేయసంగీతం: అజనీష్ లోకనాథ్సినిమాటోగ్రఫీ - శేఖర్ చంద్రఎడిటింగ్ : ఎస్ఆర్ గణేష్ బాబువిడుదల తేది: డిసెంబర్ 27, 2024కన్నడ స్టార్ 'కిచ్చా' సుదీప్(Kiccha Sudeep) హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ 'మ్యాక్స్'. వరలక్ష్మీ శరత్‌కుమార్, సునీల్ ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో తెలుగులోనూ మాక్స్‌పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. సస్పెండ్ అయిన సీఐ అర్జున్ అలియాస్ మాక్స్(సుదీప్ కిచ్చా) తిరిగి తన డ్యూటీలో జాయిన్ అయ్యేందుకు వస్తుంటాడు. అదే సమయంలో ఓ లేడీ కానిస్టేబుల్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఇద్దరిని చితక్కొట్టి అరెస్ట్ చేస్తాడు. వారిద్దరు మంత్రుల కొడులని తర్వాత తెలుస్తుంది. ఆ మంత్రులు ఇద్దరు సీఎంను దించేందుకు కుట్ర పన్ని ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. అదే రోజు రాత్రి పోలీసు స్టేషనల్లో ఉన్న మంత్రుల కొడుకులిద్దరు చనిపోతారు. వారిద్దరు ఎలా చనిపోయారు..? మినిస్టర్స్ కొడుకుల చనిపోయారనే విషయం బయటకు తెలియకుండా పోలీసులు ఆడిన డ్రామా ఏంటి? మాక్స్ దగ్గర బంధీగా ఉన్న మినిస్టర్స్ కొడుకులను బయటకు తెచ్చేందుకు క్రైమ్ ఇన్స్పెక్టర్ రూప(వరలక్ష్మీ శరత్ కుమార్), గ్యాంగ్‌స్టర్ గని(సునీల్) చేసిన ప్రయత్నం ఏంటి? తన తోటి సహచరుల ప్రాణాలను కాపాడేందుకు మాక్స్(Max Review) ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయితే.. అలాంటి కాన్సెప్ట్‌తో మరిన్ని సినిమాలు వస్తుంటాయి. అయితే వాటితో ఏదో ఒక పాయింట్ కొత్తగా ఉంటే మాత్రం ఆడియన్స్ ఆ సినిమాను ఆదరిస్తారు. కేజీయఫ్ తర్వాత ఆ తరహా చిత్రాలు చాలా వచ్చాయి. కానీ కొన్ని మాత్రమే విజయం సాధించాయి. కారణం.. ఆ సినిమాను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కానీ...ఆ సినిమాలో ఉన్నదే మళ్లీ తెరపై చూపించలేదు.మాక్స్ కూడా కార్తి సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం. ఈ మూవీ కథంతా ఒక్క రోజు రాత్రిలో జరిగిపోతుంది. సినిమా చూస్తున్నంత సేపు ఖైదీ సినిమాను గుర్తు చేస్తూనే ఉంటుంది. అలాగే కమల్ హాసన్ ‘విక్రమ్’ ఛాయలు కూడా ఇందులో కనిపిస్తాయి. అలా అని సినిమా బోర్ కొట్టదు. రేసీ స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్ సీన్లతో సినిమాను పరుగులు పెట్టించాడు దర్శకుడు. ఈ సినిమాలో కథ ఏమి ఉండదు. ఒక చిన్న పాయింట్ చుట్టు దర్శకుడు అల్లుకున్న కథనం, స్క్రీన్‌ప్లేనే సినిమాను కాపాడింది.సీఐగా బాధ్యతలు చేపట్టేందుకు హీరో బయలు దేరడం..అంతకు ముందే ఆయన గురించి ఓ కానిస్టేబుల్ భారీ ఎలివేషన్ ఇస్తూ డైలాగ్ చెప్పడంతో ముందు నుంచే కథపై హైప్ క్రియేట్ అవుతుంది. ఇక మంత్రుల కొడుకులను అరెస్ట్ చేయడం.. ఆ విషయం బయటకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా అంటూ విలన్లకు పోలీసులు ఎలివేషన్ ఇస్తూ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ ఎలివేషన్ మాదిరి తెరపై ఒక్క సీన్ కూడా లేకపోవడం మైనస్. విలన్లు చేసిన క్రూరమైన పని ఒక్కటి కూడా తెరపై చూపించపోవడంతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేడు. పోలీసు స్టేషన్..దాని చుట్టు రౌడీలు తిరగడం..వారి కంట్లో పడకుండా పోలీసులు జాగ్రత్త పడడం.. ఫస్టాఫ్ మొత్తం ఇలానే సాగుతుంది. ఒకటి రెండు యాక్షన్ సీన్ ఆకట్టుకుంటాయే తప్పా ఫస్టాఫ్ యావరేజ్‌గానే సాగుతుంది. కానీ సెకండాఫ్ మాత్రం కథనం పరుగులు పెడుతుంది. టైమ్ కౌంట్ చేస్తూ వచ్చే సీన్లు, క్లైమాక్స్ యాక్షన్ సన్నివేశాలు అదిరిపోతాయి. అయితే కథకు కీలకమైన 15 ఏళ్ల అమ్మాయి కథను సరిగా ఎలివేట్ చేయలేదనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపు కూడా హడావుడిగా ఉన్నట్లు అనిస్తుంది. అయితే ఇతర చిత్రాలతో పోల్చడం పక్కకు పెట్టి..మాస్, యాక్షన్ ఇష్టపడే వాళ్లకు ఈ చిత్రం నచ్చుతుంది. సుదీప్ ఫ్యాన్స్‌కు అయితే దర్శకుడు ఫుల్ మీల్స్ పెట్టాడు. ఎవరెలా చేశారంటే.. కన్నడలో సుదీప్‌కి ఉన్న మాస్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన యాక్షన్, మాస్ చిత్రాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. నెగెటిష్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆయన ఎలా నటిస్తాడో తెలుగు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఈ సినిమాలో కూడా అలాంటి పాత్రే పోషించాడు. సీఐ అర్జున్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న క్రైమ్ ఇన్స్పెక్టర్ రూపగా వరలక్ష్మీ శరత్ కుమార్ ఉన్నంతలో చక్కగా నటించారు. అయితే ఆమె పాత్రకు ఇచ్చిన ఎలివేషన్.. తెరపై చూపించిన తీరుకు చాలా తేడా ఉంది. రవణగా ఇళవరసు పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. ఆయన ఇచ్చిన ట్విస్ట్ బాగుంటుంది. విలన్ గనిగా సునీల్ రొటీన్ పాత్రలో కనిపించాడు. సంయుక్త హార్నడ్, సుకృతి వాగల్, అనిరుధ్ భట్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. అజనీష్ లోకనాథ్ నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. క్లైమాక్స్ ఆయన అందించిన నేపథ్య సంగీతం అదిరిపోతుంది. పాటలు అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై కనిపించింది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ రివ్యూ
టైటిల్: శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్నటీనటులు: వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల, సీయా గౌతమ్, స్నేహ గుప్తా, రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, అనీష్ కురివెళ్ల, నాగ్ మహేష్, మచ్చ రవి తదితరులునిర్మాణ సంస్థ: శ్రీగణపతి సినిమాస్నిర్మాత: వెన్నపూస రమణారెడ్డిదర్శకత్వం: రైటర్ మోహన్సంగీతం: సునీల్ కశ్యప్సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ ఎన్ఎడిటర్: అవినాష్ గుర్లింక్విడుదల తేది: డిసెంబర్ 25, 2024కథేంటంటే..ఈ సినిమా కథ 1991లో సాగుతుంది. రాజీవ్ గాంధీ హత్య(1991 మే 21)జరిగిన రోజు శ్రీకాకుళం బీచ్‌లో మేరీ అనే యువతి కూడా దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును సీఐ భాస్కర్(అనీష్ కురివెళ్ల) సీరియస్‌గా తీసుకుంటాడు. వారం రోజుల్లో హంతకులను పట్టుకుంటానని, లేదంటే తన ఉద్యోగానికి రాజీనామా చేస్తానని మీడియా ముఖంగా శపథం చేస్తాడు. అదే సమయంలో రాజీవ్ గాంధీ హత్య కేసు విషయంలో ఢిల్లీ నుంచి అధికారులు రావడంతో సీఐ భాస్కర్ స్టేషన్లోనే ఉండాల్సి వస్తోంది. వారంలో హంతకుడిని పట్టుకోకపోతే పరువు పోతుందని.. ఈ కేసు విచారణను ప్రైవేట్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్(వెన్నెల కిశోర్)కి అప్పగిస్తాడు. ఈ హత్య వెనుక మేరి స్నేహితురాలు భ్రమరాంభ(అనన్య నాగళ్ల), ఆమె ప్రియుడు బాలు(రవితేజ మహద్యం), మేరిపై మోజు పడ్డ ఝాన్సీ, సస్పెండ్ అయిన పోలీసు అధికారి పట్నాయక్(బాహుబలి ప్రభాకర్)తో పాటు ముగ్గురు జాలర్లు ఉన్నట్లు డిటెక్టివ్ షెర్లాక్ అనుమానిస్తాడు. వీరందరిని పిలిపించి తనదైన శైలీలో విచారణ ప్రారంభిస్తాడు. ఒక్కొక్కరు ఒక్కో స్టోరీ చెబుతారు. వీరిలో మేరిని హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? అసలు డిటెక్టివ్ షెర్లాక్ నేపథ్యం ఏంటి? అతను డిటెక్టివ్ వృత్తినే ఎందుకు ఎంచుకున్నాడు? మేరి హత్య కేసుతో షెర్లాక్‌కి ఉన్న సంబంధం ఏంటి? చివరకు హంతకులను ఎలా పట్టుకున్నారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..డిటెక్టివ్ కథలు టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. చిరంజీవి ‘చంటబ్బాయ్’ మొదలు నవీన్ పొలిశెట్టి ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ వరకు చాలా సినిమాలు ఈ కాన్సెప్ట్‌తో వచ్చాయి. కొన్ని కథలు సీరియస్‌గా సాగితే..మరికొన్ని కామెడీగా సాగుతూనే థ్రిల్లింగ్ గురి చేస్తాయి. కానీ అలాంటి కాన్సెప్ట్‌తో వచ్చిన వచ్చిన ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రం మాత్రం అటు కామెడీ పండించలేదు..ఇటు థ్రిల్లింగ్‌కు గురి చేయలేదు. హాలీవుడ్ రేంజ్ టైటిల్..దానికి జస్టిఫికేషన్ ఇచ్చే కథ ఎంచుకున్న దర్శకుడు మోహన్.. ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడం మాత్రం విఫలం అయ్యాడు. డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ మొదలు.. హత్య జరిగిన తీరు వరకు ఏది ఆసక్తికరంగా ఉండదు. రాజీవ్ గాంధీ హత్య జరిగిన రోజే ఈ హత్య జరిగినట్లు చూపించడానికి సరైన కారణం కూడా ఉండదు. సీఐ భాస్కర్ బిజీ కావడంతోనే ఈ కేసును ప్రైవేట్ డిటెక్టివ్‌కి ఇచ్చినట్లుగా మొదట్లో చూపిస్తారు. కానీ సినిమా చూస్తున్నంత సేపు సీఐ భాస్కర్ ఇంత ఖాలీగా ఉన్నాడేంటి అనిపిస్తుంది. ఇక డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా లేకపోయినా.. కనీసం నవ్వుకునే విధంగా కూడా ఉండదు. మధ్యలో వచ్చే ఉప కథలు కూడా చాలా రొటీన్‌గా ఉంటాయి. రాజీవ్ గాంధీ హత్యకు గురైన విషయం తెలిసి శ్రీకాకుళం సీఐ అలర్ట్ అవ్వడంతో సినిమా ప్రారంభం అవుతుంది. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా అర్థరాత్రంతా పోలీసులు పెట్రోలింగ్ చేయడం, ఘర్షనకు దిగిన ఇద్దరిని అరెస్ట్ చేయడం.. పోలీసులను చూసి ఓ కారు వెనక్కి వెళ్లడంతో ఏదో జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక హత్య జరగడం.. విచారణ కోసం డిటెక్టివ్ షేర్లక్ రంగంలోకి దిగడం వరకు కథపై ఆసక్తి పెరుగుతుంది. ఆ తర్వాత విచారణ భాగంగా వచ్చే ఉప కథలు బోరింగ్‌గా సాగుతాయి. ఒక్కోక్కరు చెప్పే స్టోరీ.. తెరపై చూడడం భారంగా ఉంటుంది. అలాగే ఝాన్సీ అనే పాత్రను తీర్చిదిద్దిన విధానం కూడా అంతగా ఆకట్టుకోదు. అయితే హంతకులు ఎవరనే విషయం చివరి వరకు ప్రేక్షకుడు కనిపెట్టకుండా చేయడం దర్శకుడు కొంతవరకు సఫలం అయ్యాడు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బెటర్. మేరిని ఎవరు హత్య చేశారు? ఎందుకు హత్య చేశారనేది ఆసక్తికరంగా ఉంటుంది. షెర్లాక్ ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ కాస్త ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే అప్పటికే విసిగిపోయిన ప్రేక్షకుడు.. ఆ ఎమోషనల్ సీన్‌కి కూడా అంతగా కనెక్ట్ కాలేకపోతాడు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ పాత్రకు వెన్నెల కిశోర్ కొంతవరకు న్యాయం చేశాడు. అయితే శ్రీకాకుళం యాసలో ఆయన పలికే సంభాషణలలో సహజత్వం కలిపించదు. కామెడీ కూడా అంతగా పండించలేకపోయాడు. అనన్య నాగళ్లకు ఓ మంచి పాత్ర లభించింది. భ్రమరాంభ పాత్రలో ఆమె చక్కగా నటించింది. ఆ పాత్రలోని వేరియేషన్స్ ఆకట్టుకుంటాయి. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టునే తిరుగుతుంది. అనీష్ కురివెళ్ల పాత్రకి వేరే వాళ్లతో డబ్బింగ్ చెప్పించడం ఆ క్యారెక్టర్ స్థాయిని తగ్గించింది. రవితేజ మహద్యం, బాహుబలి ప్రభాకర్, మురళీధర్ గౌడ్, బద్రం, నాగ్ మహేష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సునీల్ కశ్యప్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ అవినాష్ గుర్లింక్ తన కత్తెరకు ఇకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
మోహన్ లాల్ 'బరోజ్' సినిమా రివ్యూ
స్వతహాగా మలయాళీ హీరో అయిన్ మోహన్ లాల్ (Mohanlal).. 'దృశ్యం' సినిమాలతో మంచి పాపులరిటీ సొంతం చేసుకున్నారు. తెలుగులో 'జనతా గ్యారేజ్' మూవీలోనూ చేశారు. అలా తెలుగు ప్రేక్షకులకు ఈయన సుపరిచితుడే. 400కి సినిమాల్లో నటించిన ఈయన తొలిసారి 'బరోజ్' (Barroz Movie) అనే సినిమాతో దర్శకుడిగా మారారు. ఇందులో ఈయనే హీరోగానూ నటించారు. క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? మోహన్ లాల్ డైరెక్టర్‌గా హిట్ కొట్టారా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ఒకప్పుడు గోవాని పాలించిన పోర్చుగీస్ రాజు డి గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. ఆయన నిధిని అంతా బరోజ్ కాపాడుతూ ఉంటాడు. భూతంలా మారి వాళ్ల వంశస్థులకు ఇదంతా అప్పగించేందుకు గత 400 ఏళ్లుగా కాపాలా కాస్తూనే ఉంటాడు. అలా డి గామా వంశంలోని 13వ జనరేషన్‌కి చెందిన ఇసబెల్లా (మాయా రావ్) గోవా వస్తుంది. ఆమె బరోజ్‌ని శాపవిముక్తుడిని చేస్తుంది. ఇసబెల్లాకు బరోజ్ నిధి అప్పగించాడా లేదా? 400 ఏళ్ల పాటు నిధిని కాపాడుకునే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? ఇసబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?మనలో చాలామంది చిన్నప్పుడు చందమామ కథలు చదివే ఉంటారు. హాలీవుడ్ కార్టూన్ డబ్బింగ్ మూవీస్ కూడా చూసే ఉంటారు. అయితే అవి డబ్బింగ్ మూవీస్ కాబట్టి ఆ మైండ్ సెట్‌తోనే చూస్తాం. అర్థం కాకపోయినా సరే ఎంజాయ్ చేస్తాం. ఇలాంటి సినిమానే మన దగ్గర తీస్తే.. మనకు రిలేట్ అవుతుందా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేస్తాం. కానీ 'బరోజ్' మాత్రం పేరుకే మలయాళ మూవీ కానీ.. ఏదో ఇంగ్లీష్ మూవీ చూస్తున్నామా అనిపిస్తుంది. రెండున్నర గంటల నిడివి అయినప్పటికీ నాలుగు గంటల మూవీ చూసిన అనుభూతి కలుగుతుంది.మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో 'బరోజ్' మొదలవుతుంది. ఫాదో గీతంతో ఈ మూవీని ప్రారంభిద్దామని అంటారు. అసలు ఫాదో గీతం అంటే ఏంటి అనుకునేలోపు.. సడన్‌గా పోర్చుగీస్ పాట ప్లే అవుతుంది. దీని మీనింగ్ ఏంటో అర్థం కాదు. ఇదొక్కటే కాదు మూవీ అంతా దాదాపు ఇదే కన్ఫ్యూజన్. నిధిని కాపాడే భూతంగా బరోజ్ ఎంట్రీ.. అసలు ఈ నిధి సంగతేంటి? దెయ్యంగా ఎందుకు మారాడు? ఈ నిధిని ఎవరికి అప్పగించాలి అనే అంశాలే సినిమా కథ.నిధికి కాపలాగా భూతం ఉండటం.. 400 ఏళ్లుగా ఒకే గదిలో ఈ భూతం ఉండిపోవడం.. లైన్ చూస్తుంటే మంచి హాస్యం పుట్టించొచ్చు. నిధిని ఎవరైనా కొట్టేయడానికి వస్తే ఆ సీన్లని అడ్వెంరెస్గా తీయొచ్చు. కానీ 'బరోజ్'లో అలాంటి సన్నివేశాలే ఉండవు. హీరోగా నటించి దర్శకత్వం వహించింది మోహన్ లాల్ కదా. అంతా ఆయన కనిపిస్తాడనుకుంటే.. అడపాదడపా కనిపిస్తాడు. ఈయన పాత్ర భూతం కదా. జీనీలా అద్భుతాలు చేయొచ్చు. తర్వాత ఏం జరుగుతుందో అనే ఆత్రుతని కలిగించొచ్చు. కానీ మోహన్ లాల్ అలా చేయలేకపోయారు. సినిమా ప్రారంభం నుంచి ఈయన మార్క్ చూపించే, అరె భలే ఉందే అనిపించే సీన్ ఒక్కటీ ఉండదు. మోహన్ లాల్ కాకుండా మిగిలిన సీన్లలో మనకు ఏ మాత్రం పరిచయం లేని విదేశీ నటులు వచ్చిపోతుంటారు. ఒకరు తెలుగులో మాట్లాడితే మరొకరు పోర్చుగీస్‌లో మాట్లాడుతుంటారు. ఇది ఇబ్బందిగా అనిపించింది.హాలీవుడ్ సినిమాలని చూసిన మోహన్ లాల్.. వాటి స్ఫూర్తితో సినిమా చేద్దామని ఫిక్సయ్యారు. కానీ ప్రాంతీయ ప్రేక్షకులని ఆకట్టుకునేలా తీయలేకపోయారు. నేటివిటీ లేక ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయ్యారు. ఇలాంటి పాయింట్ కోసం పోర్చుగీస్ కథల వరకే వెళ్లాల్సిన అవసరం లేదు. మన జానపదాలు వెతికితే ఎన్నో అద్భుతమైన కథలు కనిపిస్తాయి. ఆ దిశగా మోహన్ లాల్ ఆలోచించి ఉంటే లోకల్ ఆడియెన్స్‌కి సినిమా ఇంకా నచ్చి ఉండేది. దర్శకుడిగా త్రీడీ మూవీ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని తపించిన మోహన్ లాల్.. కంటెంట్‌పై సరిగా దృష్టి పెట్టలేదు. దీంతో మూవీ అటోఇటో అన్నట్లు సాగుతూ వెళ్తుంది.ఎవరెలా చేశారు?బరోజ్గా టైటిల్ రోల్ చేసిన మోహన్ లాల్.. పాత్రలో సరిగ్గా సరిపోయారు. హీరో కమ్ డైరెక్టర్ నేనే కదా అని అనవసర ఎలివేషన్ల జోలికి పోలేదు. పాత్రకు ఎంత కావాలో అంత ఇచ్చారు. కానీ ఇంకాస్త థ్రిల్లింగ్, ఎంటర్టైనింగ్గా బరోజ్ పాత్రని రాసుకుని ఉంటే బాగుండేది. ఇషా పాత్ర చేసిన మాయారావు చూడటానికి బాగుంది. యాక్టింగ్ ఓకే ఓకే. మిగిలిన విదేశీ నటీనటులు బాగానే చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫీ బాగుంది. అండర్ వాటర్ త్రీడీ విజువల్స్ ఔట్పుట్ మాత్రం అనుకున్నంతగా రాలేదు. సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలే గుర్తొస్తాయి. నిర్మాణ విలువల మాత్రం టాప్ నాచ్ ఉన్నాయి. ఖర్చు విషయంలో అసలు వెనుకాడలేదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ బాగుంది.ఓవరాల్‌గా చెప్పుకొంటే మోహన్ లాల్ 'బరోజ్'తో కష్టపడ్డారు గానీ కంటెంట్ పరంగా తడబడ్డారు. దీంతో సగటు ప్రేక్షకుడు.. ఇది మా కోసం తీశారా? పోర్చుగీసు వాళ్ల కోసం తీశారా అని సందేహపడటం గ్యారంటీ.-చందు డొంకాన -
‘ బచ్చల మల్లి’ మూవీ రివ్యూ
టైటిల్: బచ్చల మల్లినటీనటులు: అల్లరి నరేష్, అమృతా అయ్యర్, అంకిత్ కోయ, హరితేజ, రావు రమేష్, కోట జయరాం, ధన్‌రాజ్, హర్ష చెముడు, అచ్యుత్ కుమార్ తదితరులునిర్మాతలు: రాజేశ్ దండా, బాలాజీ గుట్టదర్శకత్వం: సుబ్బు మంగాదేవిసంగీతం: విశాల్ చంద్రశేఖర్సినిమాటోగ్రఫీ : రిచర్డ్ ఎం నాథన్విడుదల తేది: డిసెంబర్ 20, 2024కథేంటంటే.. ఈ సినిమా కథ 1985-2005 మధ్య కాలంలో సాగుతుంది. తుని మండలం సురవరానికి మల్లి అలియాస్ బచ్చల మల్లి (అల్లరి నరేశ్) చాలా తెలివైన వాడు. పదో తరగతి పరీక్షల్లో టాపర్‌గా నిలిచి తండ్రి(బలగం జయరామ్) గర్వపడేలా చేస్తాడు. మల్లికి తండ్రి అంటే ప్రాణం. కానీ ఆయన తీసుకున్న ఓ నిర్ణయం మల్లి మనసును గాయపరుస్తుంది. అప్పటి నుంచి తండ్రిపై అసహ్యం పెంచుకుంటాడు. అప్పటి వరకు మంచి బాలుడిగా ఉన్న మల్లి.. చెడ్డవాడిగా మారుతాడు. చదువు మానేసి ట్రాక్టర్ నడుపుతూ మద్యానికి బానిసవుతాడు. నిత్యం తాగుతూ ఊర్లో వారితో గొడవ పడుతూ మూర్ఖుడిగా తయారవుతాడు. అదే సమయంలో మల్లీ లైఫ్‌లోకి కావేరి(అమృతా అయ్యర్) వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత మల్లి లైఫ్‌లో వచ్చిన మార్పులు ఏంటి? మల్లి తండ్రి తీసుకున్న నిర్ణయం ఏంటి? మంచి వ్యక్తిగా ఉన్న మల్లి మూర్ఖుడిలా మారడానికి గల కారణం ఏంటి? కావేరితో ప్రేమాయణం ఎలా సాగింది? గోనె సంచుల వ్యాపారి గణపతి రాజు(అచ్యుత్ కుమార్), మల్లికి మధ్య వైరం ఎందుకు వచ్చింది? మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల మల్లి కోల్పోయిందేంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..విలేజ్ బ్యాగ్రౌండ్, హీరో పాత్రకి నెగెటివ్ షేడ్స్ , రా అండ్ రస్టిక్ వాతావరణం.. ఈ నేపథ్యంతో కూడిన కథలు ఈ మధ్యకాలంలో చాలా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే టాలీవుడ్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. బచ్చల మల్లి కూడా అలాంటి చిత్రమే. దర్శకుడు ఎంచుకుంది ట్రెండింగ్ సబ్జెక్ట్ అయినా తెరపై ఆకట్టుకునేలా కథనాన్ని నడిపించడంలో మాత్రం విఫలం అయ్యాడు. పాత్రలను తిర్చిదిద్దిన విధానంపై పెట్టిన శ్రద్ధ.. కథనంపై పెట్టలేదు. హీరోకి విలనిజం లక్షణాలు ఉన్నా.. ప్రేక్షకులు ఆ పాత్రలో కనెక్ట్ కావాలి. అప్పుడే కథపై ఆసక్తి పెరుగుతుంది. కానీ బచ్చల మల్లి విషయంలో అది మిస్ అయింది. హీరో పాత్రతో ప్రేక్షకుడు కనెక్ట్ కాలేదు. అసలు హీరోకి ఎందుకు కోపం వస్తుంది? ఎప్పుడు వస్తుంది? అనేది అర్థం కాదు. యాక్షన్ సీన్స్ కూడా బలవంతంగా ఇరికించినట్లే ఉంటుంది. ఎమోషనల్ సీన్స్ కూడా అంతే. అప్పటి వరకు మూర్ఖంగా ఉన్న హీరో.. తల్లి ఒక మాట చెప్పగానే మారిపోవడం, హీరోయిన్ తండ్రితో చివరిలో ఓ ఎమోషనల్ డైలాగ్ చెప్పించడం..ఇవన్నీ సినిమాటిక్‌గానే అనిపిస్తాయి తప్ప.. ఎక్కడ కూడా ఎమోషనల్‌గా టచ్ చేయవు. ఇక హీరో జీవితంలో జరిగే సంఘటనలు కూడా చాలా సినిమాల్లో చూసినట్టే అనిపిస్తుంది తప్ప ఎక్కడా కొత్తదనం కనిపించదు. కథ ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. హీరో పాత్ర పరిచయం, అతను మూర్ఖుడిగా మారడానికి గల కారణాలు కన్విన్సింగ్‌గా అనిపిస్తాయి. హీరో మూర్ఖుడిగా మారిన తర్వాత కథనం రొటీన్‌గా సాగుతుంది. ఓ కొత్త పాత్ర ఎంట్రీతో వచ్చే ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే ఆ కొత్త పాత్ర నేపథ్యం తెలిసిన తర్వాత సెకండాఫ్ కూడా రొటీన్ సీన్లతో నీరసంగా సాగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. మూర్ఖత్వంతో సరిదిద్దుకోని తప్పులు చేయ్యొద్దని దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది. ఎవరెలా చేశారంటే.. బచ్చల మల్లి పాత్రలో నరేశ్ ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు . డైలాగు డెలివరీ బాగుంది. హనుమాన్ ఫేం అమృతా అయ్యర్, కావేరి పాత్రకు న్యాయం చేసింది. తెరపై అందంగా కనిపించింది. హీరో తండ్రిగా బలగం జయరాం తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అచ్యుత్ కుమార్ తన పాత్ర పరిధిమేర చక్కగా నటించాడు. అయితే ప్రధాన కథకి ఆ పాత్రతో సంబంధమే ఉండదు. హరితేజ, ప్రవీణ్, రావు రమేశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించాడు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు పర్వా లేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
ఉపేంద్ర 'యూఐ' సినిమా రివ్యూ
హీరో ఉపేంద్ర స్వతహాగా కన్నడ హీరో. కానీ తెలుగులో సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఈయన సినిమాలు అలా ఉంటాయి మరి! 25 ఏళ్ల క్రితమే 'ఏ', 'ఉపేంద్ర' లాంటి విచిత్రమైన మూవీస్ తీశారు. అప్పట్లో ఇవి జనాలకు అర్థం కాలేదు కానీ ఈ మధ్య కాలంలో మాత్రం సూపర్ బంపర్ అని తెగ పొగిడేస్తున్నారు. అలాంటి ఉపేంద్ర చాన్నాళ్ల తర్వాత ఓ మూవీకి దర్శకత్వం వహించాడు. దీంతో మూవీ లవర్స్ ఎగ్జైట్ అయ్యారు. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం!(ఇదీ చదవండి: Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ)కథేంటి?ఉపేంద్ర దర్శకత్వం వహించిన 'యూఐ' సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది చూసి జనాలు మెంటలెక్కిపోతుంటారు. మూవీ చూస్తున్నప్పుడు ఫోకస్ కుదిరినోళ్లు.. వింతగా ప్రవర్తిస్తుంటారు. ఫోకస్ కుదరనోళ్లు మళ్లీ మళ్లీ మూవీ చూస్తుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ కిరణ్ ఆదర్శ్ (మురళీశర్మ).. థియేటర్లలో ఈ మూవీ పదే పదే చూసినా సరే రివ్యూ రాయలేకపోతుంటాడు. దీంతో ఈ స్టోరీ సంగతేంటో తేలుద్దామని ఏకంగా డైరెక్టర్ ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అయితే రాసిన కథ, సినిమాలో చూపించిన కథ వేర్వేరు అని తెలుసుకుంటాడు. ఇంతకీ ఉపేంద్ర రాసిన కథేంటి? ఈ స్టోరీలో సత్య (ఉపేంద్ర), కల్కి భగవాన్ ఎవరు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే?సినిమా అంటే హీరోహీరోయిన్, పాటలు, ఫైట్స్, ట్విస్టులు, టర్న్‌లు.. ఇలా ఆయా జానర్ బట్టి ఓ ఫార్మాట్ ఉంటుంది. కానీ అలాంటివేం లేకుండా ఎవరైనా మూవీ తీస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఉపేంద్ర అదే ఆలోచించాడు. 'యూఐ' చూస్తున్నంతసేపు అబ్బురపరిచే విజువల్స్, డిఫరెంట్ యాక్టింగ్, వింత వింత గెటప్స్.. ఇలా కొందరికి నచ్చే బోలెడన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. నాణెనికి మరోవైపు అన్నట్లు మరికొందరికి సహనానికి రెండున్నర గంటల పాటు పరీక్ష పెడుతుంది.సినిమా మొదలవడమే వింత టైటిల్ కార్డ్ పడుతుంది. 'మీరు తెలివైనవాళ్లు అయితే థియేటర్ నుంచి వెళ్లిపోండి. మూర్ఖులైతేనే చూడండి' అని ఉంటుంది. దీనిబట్టే మూవీ ఎలా ఉండబోతుందనేది హింట్ ఇచ్చారు. ఈ సినిమాలో కూడా 'యూఐ' సినిమానే ఉంటుంది. దీన్ని చూసి ప్రతి ఒక్కరూ మెంటల్ అయిపోతుంటారు. ప్రముఖ రివ్యూ రైటర్ తరణ్ ఆదర్శ్‌ని గుర్తుచేసేలా కిరణ్ ఆదర్శ్ అనే వ్యక్తిని చూపిస్తారు. అతడు 'యూఐ' సినిమాని చూసి రివ్యూ రాయలేకపోతుంటాడు. అసలు ఈ సినిమా గురించి మరింత లోతుగా తెలుసుకుందామని.. నేరుగా ఉపేంద్ర ఇంటికి వెళ్తాడు. అక్కడ అతడి రాసి, మంటల్లో పడేసిన మరో స్టోరీ దొరుకుతుంది. అయితే అది అప్పటికే సగం కాలిపోయిన పేపర్లలో ఉంటుంది. కిరణ్ ఆదర్శ్ అది చదవడంతో అసలు కథ మొదలవుతుంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)అక్కడ నుంచి సత్య పాత్ర, ప్రపంచంలోని అన్ని మతాల వాళ్లు ఒకేచోట ఉండటం, దేవుడిని నమ్మకపోవడం.. ఇలా విచిత్రమైన సీన్స్ వస్తుంటాయి. సాధారణంగా హీరో ఇంట్రో అనగానే విలన్స్‌ని అతడు చితక్కొట్టేయడం చూస్తుంటాం. కానీ ఇందులో హీరో పరిచయ సన్నివేశంలో విలన్లు ఇతడిని రక్తలొచ్చేలా కొడతారు. అక్కడి నుంచి సినిమా తీరుతెన్ను లేకుండా ఎటెటో పోతూ ఉంటుంది. మధ్యమధ్యలో జనాలు ప్రస్తుతం చేస్తున్న కొన్ని పనుల వల్ల ఎలాంటి అనర్థాలు జరుగుతున్నాయోనని మెసేజులు ఇస్తూ పోతుంటారు.భూమ్మీద తొలి జంట ఆడమ్-ఈవ్ దగ్గర నుంచి మొదలుపెట్టి.. భూమిని మనుషులు దోచుకోవడం.. జాతి, ధర్మం పేరు చెప్పి మనుషులతో నాయకులు చేసే రాజకీయం.. ఇలా ఒకటేమిటి చాలానే వస్తుంటాయి. అక్కడక్కడ కాస్త నవ్వు తెప్పించే సీన్స్ ఉన్నప్పటికీ.. ప్రారంభంలోనే చెప్పినట్లు చాలా ఓపిగ్గా చూస్తే తప్పితే ఈ మూవీ అర్థం కాదు. ఇంటర్వెల్, క్లైమాక్స్ కూడా మీరు అనుకున్న టైమ్‌కి రావు. అవి ఎప్పుడు వస్తాయో కూడా ఊహించడం కష్టం. 'మీ కామం వల్ల పుట్టాడు. కానీ మీ కొడుక్కి కామం తప్పు అని చెబుతారా?' లాంటి సెటైరికల్ సీన్స్ నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి.ఎవరెలా చేశారు?ఉపేంద్ర అంటేనే కాస్త డిఫరెంట్. ఇందులో నటుడిగా ఆకట్టుకున్నాడు. దర్శకుడిగా ఆకట్టుకున్నాడా అంటే సందేహమే! హీరోయిన్ పాత్ర అసలెందుకో కూడా తెలీదు. మూడు నాలుగు సీన్లు ఉంటాయంతే! ఇతర పాత్రల్లో రవిశంకర్, అచ్యుత్, సాధు కోకిల లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నప్పటికీ.. ఒక్కర్ని కూడా సరిగా ఉపయోగించుకోలేదు. మిగిలిన యాక్టర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు.టెక్నికల్ విషయాలకొస్తే రైటర్ అండ్ డైరెక్టర్ ఉపేంద్ర గురించి చెప్పుకోవాలి. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న చాలా సమస్యలపై సెటైరికల్‌గా ఓ మూవీ తీద్దామనుకున్నాడు. దాన్ని సైకలాజికల్ కాన్సెప్ట్‌కి ముడిపెట్టి.. వైవిధ్యంగా ప్రేక్షకులకు చూపిద్దామనుకున్నాడు. తీసి చూపించాడు కూడా. కాకపోతే అది జనాలకు నచ్చుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్!బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు బాగుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడింది. అసలు ఎప్పుడు చూడని ఓ వింత ప్రపంచాన్ని సృష్టించారు. టైటిల్స్ పడిన దగ్గర నుంచి చివరివరకు సినిమాటోగ్రఫీ వైవిధ్యంగా ఉంది. గ్రాఫిక్స్ మాత్రం అక్కడక్కడ తేలిపోయింది. ఓవరాల్‌గా చూస్తే ఈ సినిమా కొంచెం కొత్తగా.. కొంచెం వింతగా ఉంది.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'పుష్ప 2' ఓటీటీ రిలీజ్ ప్లాన్ మారిందా?) -
Mufasa Review: ముఫాసా మూవీ రివ్యూ
మనం చూసే ప్రతి సినిమాలో నిజ జీవిత పాత్రలు మనలోనివారు కొంతమంది తెర మీద పోషించి మనల్ని మెప్పించడం సహజమే. కాని మనలోని భావావేశాలను జంతువులచే డిజిటల్ రూపంలో పలికించి మన మనస్సులను కదిలించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఈ విషయంలో హాలీవుడ్‌ను నిజంగా అభినందించాలి. కానీ హాలీవుడ్ కన్నా మన టాలీవుడ్ 40 ఏళ్ళ క్రితమే అంటే డిజిటల్ సాంకేతికత మనకు పరిచయమవ్వని రోజుల్లోనే ఇటువంటి కోవలో మనకు ఓ సినిమా పరిచయం చేసింది. దాని పేరే మాకూ స్వాతంత్రం కావాలి. ఇక్కడ టాలీవుడ్, హాలీవుడ్ చేసిందా అన్నది కాదు, మనుషులకు జంతువులతో కూడా భావావేశాలు పలికించవచ్చన్నదే విషయం. ముఫాసా సినిమా 2019వ సంవత్సరంలో 'ది లయన్ కింగ్' సినిమా సిరీస్‌లో వచ్చిన రెండవ భాగం. ముఫాసా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో ప్రతి భాషలో విడుదలైంది. ముఫాసా సినిమాకి అన్ని భాషల్లో పేరున్న గొప్ప నటీనటులు డబ్బింగ్ చెప్పడం మరో విశేషం. తెలుగులో ప్రముఖ నటులు మహేశ్‌బాబు, బ్రహ్మానందం, అలీ తదితరులు వాయిస్ ఇచ్చారు. కాబట్టి సినిమా చూస్తున్నంతసేపు మన నేటివిటీ ఎక్కడా తగ్గదు ఒక్క పేర్లలో తప్ప.ఈ సినిమాకి దర్శకుడు బారీ జెర్కిన్స్. కథాపరంగా లయన్ కింగ్‌కు కొనసాగింపైన ఈ ముఫాసాలో సింబా - నాలా సింహాలకు కియారా అనే ఆడ సింహం పుడుతుంది. ఆ తర్వాత సింబ- నాలా జంట టిమన్, పంబ దగ్గర కియారాను వదిలేసి ఇంకో బిడ్డకు జన్మనివ్వడానికి సెరేన్ ఒయాసిస్కు బయలుదేరతాయి. అప్పుడు రఫీకి అనే కోతి కియారాకు తాను సింబ వయస్సులో ఉన్నపుడు జరిగిన ముఫాసా కథ గురించి చెప్తుంది. ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆర్ సి యం రాజు ఈ కోతికి గాత్రదానం చేశారు. కథంతా ఈ రఫీకీయే చెప్తాడు. ముఫాసా అనే పిల్ల సింహం ఓ తుఫానులో చిక్కుకుని తన తల్లిదండ్రుల నుంచి విడిపోతుంది. అలా నీళ్లలో ముఫాసా కొట్టుకుపోతూ టాకా అనే మరో సింహం పిల్లను కలుస్తుంది. టాకా తల్లిదండ్రులు ఒబాసీ, ఇషా. వీళ్ళిద్దరూ వారి ప్రాంతంలో రాజు, రాణి. టాకాని యువరాజును చేయాలనుకుంటారు. ఇంతలో తెల్ల సింహాల గుంపు వీరి రాజ్యం మీద దాడి చేస్తుంది. వాటి నుండి ముఫాసా, టాకా తప్పించుకుంటారు. ముఫాసా తన తల్లిదండ్రులను వెతుక్కుంటూ మిలేలే అనే ప్రాంతానికి వెళ్లాలనుకుంటాడు. తరువాత సినిమా అంతా ముఫాసా తన తల్లిదండ్రులను చేరుకుంటాడా లేదా అన్నదే. పైన చెప్పుకున్నట్టు ఈ సినిమా స్క్రీన్ ప్లే పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. అలానే పెద్దల మనసును సైతం కదిలిస్తుంది. ఎక్కడా గ్రాఫిక్స్ అన్నదే తెలియకుండా నిజజీవితంలో జంతువుల కథను దగ్గరగా చూసినట్టుంది. వర్త్‌ఫుల్ మూవీ ఫర్ ఫ్యామిలీ.- హరికృష్ణ ఇంటూరు -
టాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్.. ఫియర్ మూవీ ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: ఫియర్నటీనటులు: వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులునిర్మాణ సంస్థ: దత్తాత్రేయ మీడియానిర్మాత: డా. వంకీ పెంచలయ్య, ఏఆర్ అభిరచన, ఎడిటింగ్, దర్శకత్వం : డా. హరిత గోగినేనిసంగీతం: అనూప్ రూబెన్స్సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూవిడుదల తేది: డిసెంబర్ 14, 2024వేదిక, అరవింద్ కృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ఫియర్. డా. హరిత గోగినేని డైరెక్షన్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రం డిసెంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. అయితే విడుదలకు ముందే ఈ మూవీ పలు అవార్డులు దక్కించుకుంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్ మెప్పించిందా? లేదా? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటంటే..సింధు(వేదిక) అనే అమ్మాయి సైకలాజికల్ డిజార్డర్‌తో బాధపడుతూ ఉంటోంది. లేనిది ఉన్నట్లు.. ఉన్నది లేనట్లు ఊహించుకుని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. ఒకరోజు తాను ప్రాణంగా ప్రేమించే అరవింద్ కృష్ణ(సంపత్) దూరం కావడంతో మరింత మనోవేదనకు గురి అవుతుంది. అంతేకాకుండా తన చెల్లి ఇందుతో గొడవ పడటం, పేరేంట్స్‌కు దూరంగా ఉండటం లాంటి సింధును మరింత కుంగదీస్తాయి. అసలు సింధు తన చెల్లితో ఎందుకు గొడవ పడింది? తల్లిదండ్రులకు దూరంగా ఉండటానికి కారణమేంటి? ఆమె ప్రియుడు సంపత్ తిరిగొచ్చాడా? అనేది తెలియాలంటే ఫియర్ చూడాల్సిందే.కథ ఎలా ఉందంటే..గతంలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. కానీ ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ మాత్రం చాలా అరుదుగానే ఉంటాయి. మొదటిసారి తల్లిదండ్రులను ఆలోచింపజేసేలా ఉంది ఈ ఫియర్ స్టోరీ. ఈ కథ మొత్తం సింధు చుట్టూనే తిరుగుతుంది. ఆమె ప్రియుడు సంపత్ దూరం కావడంతో మానసికంగా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. ఎక్కడికెళ్లినా ఎవరో తనను వెంబడిస్తున్నారనే భ్రమలో ఉంటూ భయానికి గురవుతుంది. కొన్ని సీన్స్‌లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్‌లో కన్ఫ్యూజన్కు గురి చేస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందన్న క్యూరియాసిటీని మిస్ అవ్వకుండా డైరెక్టర్ జాగ్రత్తపడ్డారు.సెకండాఫ్ వచ్చేసరికి అసలు సింధుకు అలా మారడానికి దారితీసిన పరిస్థితులు ఆడియన్స్‌ను ఆలోచించేలా చేస్తాయి. అసలు సింధుకు నిజంగానే సైకాలాజికల్ డిజార్డర్ ఉందా? ఎవరికీ కనిపించని వ్యక్తులు.. ఆమెకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నారు? సింధుకు కనిపిస్తున్నవారంతా ఆమె జీవితంలో ఉన్నారా? లేదంటే కావాలనే తాను అలా ప్రవర్తిస్తోందా? అనే క్యూరియాసిటీ ఉండేలా కథను మలిచాడు డైరెక్టర్. కథ మొదలైనప్పటి నుంచి సినిమా క్లైమాక్స్ వరకు ట్విస్ట్‌లు, సస్పెన్స్ ఆడియన్స్‌ను కట్టిపడేస్తాయి. అయితే డైరెక్టర్ తాను అనుకున్న కథను తెరపై చక్కగా ఆవిష్కరించారు. స్లో నేరేషన్ అక్కడక్కడా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మరింత ఫోకస్ చేయాల్సింది. కొన్ని సీన్స్‌లో కథలో కనెక్షన్ మిస్సయినట్లు అనిపిస్తుంది. ఓవరాల్‌గా సస్పెన్స్ థ్రిల్లర్‌తో పాటు తల్లిదండ్రులకు మంచి మేసేజ్ ఇచ్చేలా ఉంది ఫియర్ మూవీ.ఎవరెలా చేశారంటే..లీడ్‌రోల్ పోషించిన వేదిక ద్విపాత్రాభినయంతో అభిమానులను కట్టిపడేసింది. సంపత్ పాత్రలో అరవింద్ కృష్ణ మెప్పించాడు. పవిత్రా లోకేశ్, షాయాజీ షిండే, జయప్రకాశ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. సాంకేతికత విషయానికొస్తే ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ బాగుంది. అనూప్ రూబెన్స్ బీజీఎం ఈ సినిమాకు కాస్తా ప్లస్ అనే చెప్పొచ్చు. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉండాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి.రేటింగ్ : 2.75/5 -
Pushpa 2 Review: ‘పుష్ప 2’ మూవీ రివ్యూ
టైటిల్: పుష్ప 2: ది రూల్నటీనటులు: అల్లు అర్జున్, రష్మిక మందన్నా, ఫహద్ పాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ, రావు రమేశ్, ధనంజయ, తారక్ పొన్నప్ప, అజయ్ ఘోష్ తదితరులునిర్మాణ సంస్థలు: మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్నిర్మాతలు: నవీన్ కుమార్, రవిశంకర్రచన-దర్శకత్వం: సుకుమార్సంగీతం: దేవీశ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: మిరోస్లా కుబా బ్రోజెక్ఎడిటింగ్: నవీన్ నూలివిడుదల తేది: డిసెంబర్ 5, 2024అల్లు అర్జున్ అభిమానుల మూడేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేల పుష్ప 2 మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల తర్వాత ఆ స్థాయిలో యావత్ సినీలోకం ఎదురు చూస్తున్న తెలుగు సినిమా పుష్ప 2. అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప: ది రైజ్’కి సీక్వెల్ ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించడంతో దేశం మొత్తం ‘పుష్ప 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? బన్నీ ఖాతాలో మరో పాన్ ఇండియా హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.‘పుష్ప 2’ కథేంటంటే..?ఒక సాధారణ కూలీగా జీవీతం మొదలు పెట్టిన పుష్పరాజ్(అల్లు అర్జున్) ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియాను శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది ‘పుష్ప పార్ట్-1’లో చూపించారు. పుష్పరాజ్ సిండికేట్ లీడర్ కావడంతో ‘పుష్ప : ది రైజ్’ కథ ముగుస్తుంది. పుష్ప 2: ది రూల్ (Pushpa 2 The Rule Movie Telugu Review) సినిమా కథ అక్కడ నుంచే ప్రారంభం అవుతుంది. శ్రీవల్లి(రష్మిక)ని పెళ్లి చేసుకొని అటు వ్యక్తిగతం జీవితాన్ని హాయిగా గడుపుతూనే.. మరోవైపు ఎర్ర చందనం స్మగ్లింగ్‌ని దేశం మొత్తం విస్తరిస్తాడు పుష్పరాజ్. ఎంపీ సిద్దప్ప(రావు రమేశ్) అండతో తన వ్యాపారానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. ఓ సారి చిత్తూరుకి వచ్చిన ముఖ్యమంత్రి నరసింహరెడ్డిని కలిసేందుకు పుష్పరాజ్ వెళ్తాడు. భార్య శ్రీవల్లి కోరిక మేరకు అతనితో ఫోటో దిగేందుకు ప్రయత్నించగా..‘స్మగ్లర్‌తో ఫోటో దిగలేను’ అంటూ సీఎం నిరాకరిస్తాడు. అంతేకాదు శ్రీవల్లిని అవమానించేలా మాట్లాడతాడు. దీంతో ఆ సీఎంనే మార్చాలని పుష్పరాజ్ డిసైడ్ అవుతాడు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా సిద్దప్పను చేయాలనుకుంటాడు. దాని కోసం పుష్పరాజ్ ఏం చేశాడు? తనను అవమానించిన పుష్పరాజ్‌ని ఎలాగైన పట్టుకోవాలని చూస్తున్న ఎస్పీ షెకావత్(ఫాహద్ ఫాజిల్) ప్రయత్నం ఫలించిందా? షెకావత్‌కి పుష్పరాజ్ విసిరిన సవాల్ ఏంటి? కేంద్రమంత్రి ప్రతాప్‌రెడ్డి(జగపతి బాబు), పుష్పరాజ్ మధ్య ఎందుకు గొడవ వచ్చింది? ప్రతాప్‌రెడ్డి తమ్ముడు కొడుకు (తారక్ పొన్నప్ప) పుష్పరాజ్‌పై పగ పెంచుకోవడానికి గల కారణం ఏంటి? తనను తప్పించి సిండికేట్ లీడర్‌గా ఎదిగిన పుష్పరాజ్‌ను అణచివేసేందుకు మంగళం శ్రీను(సునీల్), దాక్షాయణి(అనసూయ)వేసిన ఎత్తుగడలు ఏంటి? చివరకు పుష్పరాజ్ అనుకున్నట్లుగా సిద్దప్పను సీఎం చేశాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని సినిమాలకు కథ అవసరం లేదు. స్టార్ హీరో.. ఆయన స్థాయికి తగ్గట్లు ఎలివేషన్స్..భారీ యాక్షన్ సీన్స్.. మాంచి పాటలు ..ఇవి ఉంటే చాలు బొమ్మ హిట్టైపోతుంది. పుష్ప 2లో డైరెక్టర్ సుకుమార్ కూడా ఇదే ఫార్ములాను అప్లై చేశాడు. పుష్ప : ది రైజ్ సినిమాతో పుష్పరాజ్ పాత్రను డ్రగ్‌లా ఎక్కించిన సుక్కు.. పార్ట్ 2లో ఆ మత్తును అలానే కంటిన్యూ చేసేశాడు. కథపై కాకుండా ఎలివేషన్స్.. యాక్షన్ సీన్స్‌పై ఎక్కువ ఫోకస్ చేశాడు. పార్ట్ 1లో ఉన్నంత కథ కూడా ఈ సీక్వెల్లో లేదు. హై ఇవ్వడమే లక్ష్యంగా కొన్ని సీన్లను అల్లుకుంటూ పోయాడు అంతే. ప్రతి పది నిమిషాలకొకసారి హై ఇచ్చే సీన్ ఉండేలా స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు. కథనం నీరసంగా సాగుతుందన్న ఫీలింగ్ ఆడియన్స్‌కి వచ్చేలోగా.. ఓ భారీ యాక్షన్ సీన్ పడుతుంది. అందులో బన్నీ నటవిశ్వరూపం చూసి గూస్బంప్స్ తెచ్చుకోవడమే తప్ప.. మరో ఆలోచన రాదు. భార్య మాట భర్త వింటే ఎలా ఉంటుందనే పాయింట్‌ని ఈ స్మగ్లింగ్ కథతో ముడిపెట్టి చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. పుష్పరాజ్ క్యారెక్టర్, అతని ప్రపంచం గురించి అల్రేడీ తెలుసు కనుక.. స్టార్టింగ్ నుంచే హీరోకి ఎలివేషన్స్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఫహాద్ పాత్ర ఎంట్రీ సీన్ అదిరిపోతుంది. ఫస్టాఫ్ అంతా షెకావత్-పుష్పరాజ్ మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్‌లా కథనం సాగుతుంది. ఎర్రచందనం పట్టుకునేందుకు షెకావత్ ప్రయత్నించడం.. పుష్పరాజ్ అతన్ని బురిడీ కొట్టించి దాన్ని తరలించడం .. ఫస్టాఫ్ మొత్తం ఇదే తంతు నడుస్తుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే స్విమింగ్ఫూల్ సీన్ అదిరిపోతుంది. ఇద్దరి జరిగే సవాల్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అలాగే శ్రీవల్లీ, పుష్పరాజ్‌ల మధ్య వచ్చే ‘ఫీలింగ్స్’ సీన్లు నవ్వులు పూయిస్తాయి. ఇక ద్వితియార్థంలో ఎమోషన్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టారు. జాతర ఎపిసోడ్ అదిరిపోతుంది. ఆ తర్వాత కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్ అయితే పూనకాలు తెప్పిస్తుంది. ఆ సీన్లో బన్నీ మాస్ తాండవం చేశాడు. క్లైమాక్స్ అంతగా ఆకట్టుకోదు. పార్ట్ 3కి ఇచ్చిన లీడ్ అంతగా కిక్ ఇవ్వలేదు. సినిమా నిడివి (దాదాపు 3 గంటల 20 నిమిషాలు) ఎక్కువగా ఉండడం సినిమాకు కాస్త మైనస్ అనే చెప్పాలి. లాజిక్స్ గురించి ఎంత తక్కువ మాట్లాకుంటే అంత మంచిది. అయితే మాస్ ఆడియన్స్‌కి ఇవేవి అవసరం లేదు. వారిని ఎంటర్టైన్ చేస్తే చాలు. అలాంటి వారికి పుష్ప 2 విపరీతంగా నచ్చుతుంది. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కి అయితే సుకుమార్ ఫుల్ మీల్స్ పెట్టారనే చెప్పాలి. ఎవరెలా చేశారంటే..పుష్ప: ది రూల్’ అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు కథనంతా తన భుజాన వేసుకొని నడిపించాడు. మాస్ లుక్‌లోనే కాదు నటనలోనూ బన్నీ అదరగొట్టేశాడు. యాక్షన్ సీన్స్‌లో అయితే ‘తగ్గేదేలే’ అన్నట్లుగా తన నట విశ్వరూపం చూపించాడు. జాతర ఎపిసోడ్, క్లైమాక్స్‌కి ముందు వచ్చే యాక్షన్ సీన్లో బన్నీ ఫెర్మార్మెన్స్ నెక్ట్స్ లెవన్‌లో ఉంది. చిత్తూర యాసలో ఆయన పలికిన సంభాషణలు అలరిస్తాయి.ఇక శ్రీవల్లీగా డీగ్లామర్ పాత్రలో రష్మిక జీవించేసింది. పార్ట్ 1తో పోలిస్తే ఈ చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా ఎక్కువగా ఉంటుంది. జాతర ఎపిసోడ్లో ఆమె చెప్పే సంభాషణలు ఆకట్టుకుంటాయి. డీఎస్పీ షెకావత్‌గా ఫహద్ పాజిల్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంపీ సిద్దప్పగా రావు రమేశ్ మరోసారి తెరపై తమ అనుభవాన్ని చూపించారు. తారక్ పొన్నప్పకు మంచి పాత్ర లభించింది. బన్నీకి ఆయన మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. స్పెషల్ సాంగ్‌లో శ్రీలీల అదరగొట్టేసింది. బన్నీతో పోటీ పడి మరి డ్యాన్స్ చేసింది. మంగళం శ్రీను పాత్రలో నటించిన సునీల్‌కి పెద్దగా గుర్తుంచుకునే సీన్లేవి పడలేదు. దాక్షయణిగా నటించిన అనసూయ పరిస్థితి కూడా అంతే. ఒకటి రెండు చోట్ల ఆమె చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. ఇక కేంద్రమంత్రి ప్రతాప్ రెడ్డిగా జగపతి బాబు ఉన్నంత చక్కగా నటించాడు. పార్ట్ 3లో ఆయన నిడివి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. జగదీశ్, ధనుంజయ, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. దేవీశ్రీ ప్రసాద్, శ్యామ్ సీఎస్ల నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. ‘సూసేకీ..’, కిస్సిక్’, ‘ఫీలింగ్స్’ పాటలు తెరపై అలరించాయి. సినిమాటోగ్రాఫర్ మిరోస్లా కుబా బ్రోజెక్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ప్రతి సీన్ చాలా రిచ్‌గా, వాస్తవాన్ని ప్రతిబింబించేలా చూపించాడు. ఆర్ట్ డిపార్ట్మెంట్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెపాల్సింది. నిడివిని కొంచెం తగ్గిస్తే బాగుండేవి. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఎక్కడా ‘తగ్గేదేలే’ అన్నట్లుగా ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు.- అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
'బ్లాక్' సినిమా రివ్యూ (ఓటీటీ)
థియేటర్ అంటే భారీ బడ్జెట్ సినిమాలు.. ఓటీటీ అంటే థ్రిల్లర్ మూవీస్ అనేది ప్రస్తుతం ట్రెండ్. అందుకు తగ్గట్లే డిఫరెంట్ కథలతో తీస్తున్న థ్రిల్లర్స్.. భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. అలా కొన్నిరోజుల క్రితం స్ట్రీమింగ్‌లోకి వచ్చిన సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 'బ్లాక్'. అమెజాన్ ప్రైమ్‌లో ఉన్న ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'పుష్ప 3'.. అసలు ఉన్నట్టా? లేనట్టా?)కథేంటి?వసంత్ (జీవా), అరణ్య (ప్రియా భవానీ శంకర్) భార్యభర్తలు. వీకెండ్ సరదాగా గడుపుదామని బీచ్ పక్కన తాము కొన్న కొత్త విల్లాలోకి వెళ్తారు. ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఇంకా పూర్తిగా పనులు జరగకపోవడం వల్ల వీళ్లు తప్పితే మరెవరు అక్కడ ఉండరు. పగలంతా బాగానే ఉంటుంది కానీ ఎప్పుడైతే రాత్రి అవుతుందో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. భయపడి పారిపోదామని ఎంత ప్రయత్నించినా.. తిరిగి తిరిగి అక్కడికి వస్తుంటారు. మరోవైపు తమ ఎదురుగా ఉన్న విల్లాలో ఎవరో ఉన్నారని అనిపిస్తుంది. వెళ్లి చూస్తే అచ్చుగుద్దినట్లు తమలాంటి ఇద్దరు వ్యక్తులే కనిపిస్తారు. ఇంతకీ వాళ్లెవరు? ఇలా జరగడానికి కారణమేంటి అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటే మూవీస్ చూద్దామనుకునే వాళ్లకు 'బ్లాక్' నచ్చేస్తుంది. 1964లో సినిమా ఓపెన్ అవుతుంది. తన ఫ్రెండ్, అతడి ప్రేయసికి మనోహర్ (వివేక్ ప్రసన్న).. బీచ్ దగ్గర్లోని తన విల్లాలో ఉంచి, తర్వాతి రోజు ఉదయం పెళ్లి చేయాలనుకుంటాడు. కానీ అనుకోని కొన్ని సంఘటనల వల్ల వాళ్లిద్దరినీ ఎవరో చంపేస్తారు. కట్ చేస్తే స్టోరీ 60 ఏళ్ల తర్వాత అంటే ప్రస్తుతానికి వస్తుంది.వసంత్, ఆరణ్య.. వాళ్లిద్దరి ప్రవర్తన, మనస్తత్వాలు ఇలా సీన్స్ వెళ్తుంటాయి. కాకపోతే ఇవి రొటీన్‌గా ఉంటాయి. ఎప్పుడైతే వీళ్లిద్దరూ విల్లాలోకి అడుగుపెడతారో విచిత్రమైన సంఘటనలన్నీ జరుగుతుంటాయి. తమలాంటి ఇద్దరు వ్యకులు వీళ్లకు కనిపించడంతో సస్పెన్స్ క్రియేట్ అవుతుంది. అలా హారర్, సూపర్ నేచురల్ ఎలిమెంట్ ఏదో ఉందనే ఉత్కంఠ కలుగుతుంది. చీకటి ప్రదేశం కారణంగా ప్రతిసారీ తాము వివిధ కాలాల్లోకి (టైమ్ లైన్) ముందుకు వెనక్కి వెళుతున్నామని వసంత్ తెలుసుకోవడం, చీకటి ప్రదేశం కారణంగానే వసంత్-ఆర్యం ఒకరికొకరు దూరమవడం.. చివరకు ఎలా కలుసుకున్నారనేది సినిమా.(ఇదీ చదవండి: కవలలకి జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్)సినిమా చూస్తున్నంతసేపు థ్రిల్లింగ్‌గా ఉంటుంది. కాకపోతే అలా జరగడానికి వెనకున్న కారణాన్ని బయటపెట్టే సీన్ మాత్రం పేలవంగా ఉంటుంది. ఏదో ఫిజిక్స్ క్లాస్ చెబుతున్నట్లు వేగంగా చూపించేశారు. దీంతో సగటు ప్రేక్షకుడికి సరిగా అర్థం కాదు. క్లైమాక్స్ కూడా ఏదో హడావుడిగా ముగించేసిన ఫీలింగ్ కలుగుతుంది. సినిమా రెండు గంటల్లోపే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారు?సినిమాలో జీవా, ప్రియా భవానీ శంకర్ పాత్రలు మాత్రమే కనిపిస్తాయి. వీళ్లిద్దరూ ఆయా పాత్రల్లో ఆకట్టుకున్నారు. వాస్తవానికి, ఊహలకు మధ్య నలిగిపోయే వ్యక్తిగా జీవా వేరియషన్స్ చూపించాడు. వివేక్ ప్రసన్నతో పాటు మిగిలిన వాళ్లది అతిథి పాత్రలే. టెక్నికల్ విషయాలకొస్తే డైరెక్టర్ కేజీ సుబ్రమణి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. కాకపోతే స్క్రిప్ట్‌లో లాజిక్స్ సరిగా ఎష్టాబ్లిష్ చేసుంటే బాగుండేది అనిపించింది. శామ్ సీఎస్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు చాలా పెద్ద ప్లస్. కొన్ని సీన్లను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా ఎలివేట్ చేసింది. మిగిలిన డిపార్ట్మెంట్స్ తమ వంతు న్యాయం చేశారు. ఓవరాల్‌గా చూసుకుంటే ఓటీటీలో థ్రిల్లర్ మూవీ ఏదైనా చూద్దామనుకుంటే 'బ్లాక్' ట్రై చేయొచ్చు. ప్రస్తుతానికి తమిళ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్ ఉన్నాయి.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లతో బయటకొచ్చిన శోభా శెట్టి) -
Vikkatakavi Review: ‘వికటకవి’ వెబ్ సిరీస్ రివ్యూ
టైటిల్: వికటకవి (ఆరు ఎపిసోడ్లు)నటీనటులు: నరేశ్అగస్త్య, మేఘా ఆకాశ్, షైజు, అమిత్ తివారీ, తారక్ పొన్నప్ప, రఘుకుంచె, నిమ్మల రవితేజ తదితరులునిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.టి.ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత: రామ్ తాళ్లూరిదర్శకత్వం: ప్రదీప్ మద్దాలిఓటీటీ: జీ5 (నవంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది)‘వికటకవి’ కథేంటంటే..ఈ సినిమా కథ 1940-70ల మధ్యకాలంలో సాగుతుంది. రామకృష్ణ(నరేశ్ అగస్త్య) డిటెక్లివ్. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యను అభ్యసిస్తూ.. డబ్బు కోసం డిటెక్టివ్‌గా మారతాడు. పోలీసులకు సైతం అంతుచిక్కని కొన్ని కేసులను తన తెలివితేటలతో పరిష్కరిస్తాడు. అతని గురించి తెలుసుకున్న ఓ ప్రొఫెసర్.. రామకృష్ణను అమరగిరి ప్రాంతానికి పంపిస్తాడు. అమరగిరిలో ఓ వింత ఘటన జరుగుతుంటుంది. రాత్రివేళలో అక్కడి దేవతల గుట్టకు వెళ్లిన జనాలు గతాన్ని మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం కారణంగానే ఇలా జరుగుతుందని ఆ ఊరి జనాలు భావిస్తారు. అందులో నిజమెంత ఉందని తెలుసుకునేందుకు రామకృష్ణ దేవతల గుట్టకు వెళతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అందరి మాదిరే రామకృష్ణ కూడా గతాన్ని మర్చిపోయాడా? దేవతల గుట్టకు వెళ్లిన రామకృష్ణకు తెలిసిన నిజమేంటి? అతనితో పాటు అమరగిరి సంస్థాన రాజు రాజా నరసింహా (షిజు అబ్దుల్ రషీద్) మనవరాలు లక్ష్మి (మేఘా ఆకాష్) కూడా దేవతల గుట్టకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? రాజా నరసింహ కొడుకు మహాదేవ్ (తారక్ పొన్నప్ప), కోడలు గౌరీ (రమ్య దుర్గా కృష్ణన్) వల్ల అమరగిరికి వచ్చిన శాపం ఏమిటి? అమరగిరి ప్రాంతానికి రామకృష్ణకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ‘వికటకవి’ సిరీస్ చూడాల్సిందే. ఎలా ఉందంటే..?డిటెక్టివ్ కథలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. ఈ కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. కానీ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ మాత్రం ‘వికటకవి’ అనే చెప్పాలి. కథ 1970 నుంచి 40కి వెళ్లడం..అక్కడ నుంచి మళ్లీ 90లోకి రావడంతో ఓ డిఫరెంట్ వెబ్ సీరీస్ చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఈ సిరీస్ ప్రారంభమైన కాసేపటికే దేవతలగుట్ట సమస్య వెనుక ఎవరో ఉన్నారనే విషయం అర్థమైపోతుంది. కానీ అది ఎవరు అనేది చివరి వరకు తెలియజేకుండా కథనాన్ని ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు ప్రదీప్ మద్దాలి సఫలం అయ్యాడు. కొన్ని ట్విస్టులు ఊహించేలా ఉన్నా... ఎంగేజ్ చేసేలా కథనాన్ని నడిపించాడు. రచయిత తేజ దేశరాజ్ ఈ కథను సాధారణ డిటెక్టివ్ థ్రిల్లర్‌గా మాత్రమే కాకుండా అనేక క్లిష్టమైన ఉపకథలను, చారిత్రక సంఘటనలను చక్కగా మిళితం చేసి ఓ డిఫరెంట్ స్టోరీని క్రియేట్ చేశాడు. ఆ స్టోరీని అంతే డిఫరెంట్‌గా తెరపై చూపించడాడు దర్శకుడు. ఓ భారీ కథను పరిమితమైన ఓటీటీ బడ్జెట్‌తో అద్భుతంగా తీర్చిదిద్దినందుకు దర్శకుడు ప్రదీప్‌ను అభినందించాల్సిందే. తొలి ఎపిసోడ్‌లోనే ఒకవైపు అమరగిరి ఊరి సమస్యను పరిచయం చేసి, మరోవైపు రామకృష్ణ తెలివితేటలను చూపించి అసలు కథను ప్రారంభించాడు. ఇక హీరో అమరగిరికి వెళ్లిన తర్వాత కథనంపై ఆసక్తి పెరుగుతుంది. దేవతల గుట్టపై ఉన్న అంతుచిక్కని రహస్యాన్ని చేధించేందుకు రామకృష్ణ చేసే ప్రయత్నం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. చివరి రెండు ఎపిసోడ్స్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ సీన్స్ అంతగా ఆకట్టుకోకపోగా.. కథనం నెమ్మదిగా సాగిందనే ఫీలింగ్ కలుగుతుంది. ముగింపులో ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ‘వికటకవి 2’ ఉంటుందని ప్రకటించి షాకిచ్చారు మేకర్స్. ‘వికటకవి 2’ చూడాలంటే.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. లాజిక్స్‌ని పట్టించుకోకుండా చూస్తే ఈ సిరీస్‌ని ఎంజాయ్ చేస్తారు. ఎవరెలా చేశారంటే.. డిటెక్టివ్ రామకృష్ణ పాత్రలో నరేశ్ అగస్త్య ఒదిగిపోయాడు. ఆయన లుక్, డైలాగ్ డెలివరీ చూస్తే..నిజమైన డిటెక్టివ్‌ని స్క్రీన్ మీద చూసినట్లే అనిపిస్తుంది. మేఘా ఆకాశ్‌కు ఓ మంచి పాత్ర లభించింది. తెరపై ఆమె చాలా హుందాగా కనిపించింది. అమిత్ తివారీ, షైజు, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సిరీస్ చాలా బాగుంది. అజయ్ అరసాడ నేపథ్య సంగీతం సిరీస్‌కి మరో ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 1940-70నాటి వాతావరణాన్ని తెరపై చక్కగా చూపించారు. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు వెబ్ సిరీస్ స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Roti Kapada Romance: ‘రోటి కపడా రొమాన్స్’ మూవీ రివ్యూ
టైటిల్: రోటి కపడా రొమాన్స్నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులునిర్మాణ సంస్థ: లక్కీ మీడియానిర్మాత: బెక్కెం వేణుగోపాల్దర్శకత్వం: విక్రమ్ రెడ్డివిడుదల తేది: నవంబర్ 28, 2024కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే టాలీవుడ్లో వరుసగా చిన్న సినిమాలు వస్తుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. పబ్లిసిటీ సరిగా చేయకపోవడంతో కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అయిన విషయం కూడా తెలియడం లేదు. చాలా రోజుల తర్వాత మంచి బజ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న చిత్రమే ‘రోటి కపడా రొమాన్స్’(Roti Kapada Romance Movie Telugu Review). వాస్తవానికి ఈ చిత్రం ఈ నెల 22నే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ చివరి నిమిషంలో వాయిదా పడింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఎట్టకేలకు నేడు(నవంబర్ 28) రిలీజైంది. ఈ నేపథ్యంలో మీడియా కోసం ప్రివ్యూ వేశారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.‘రోటి కపడా రొమాన్స్’ కథేంటంటే..?ఈవెంట్ ఆర్గనైజర్ హర్ష(హర్ష నర్రా), సాఫ్ట్వేర్ రాహుల్(సందీప్ సరోజ్), ఆర్జే సూర్య(తరుణ్), విక్కీ(సుప్రజ్ రంగ) నలుగురు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. కలిసి ఓకే గదిలో ఉంటారు. విక్కీ ఏ పని చేయకుండా స్నేహితులు సంపాదిస్తున్న డబ్బుతో ఎంజాయ్ చేస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. ఫ్యాన్ అంటూ ఆర్జే సూర్యతో దివ్య(నువేక్ష), ఒక్కరోజు బాయ్‌ప్రెండ్‌గా ఉండి ఫిజికల్‌గా హెల్ప్ చేయమని కోరుతూ హర్షతో సోనియా(కుష్బూ చౌదరి), ఉద్యోగం ఇప్పించండి అంటూ విక్కీతో శ్వేత(మేఘలేఖ) పరిచయం చేసుకుంటారు. ఇక రాహుల్‌ది మరో విచిత్రం. తన ఆఫీస్‌లో పని చేసే ప్రియ(ఠాకూర్)ని ఇష్టపడతాడు. కానీ పెళ్లి చేసుకుందాం అనేసరికి తప్పించుకొని తిరుగుతాడు. ఈ నలుగురి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాత వాళ్ల జీవితం ఎలా మారిపోయింది? ప్రేమలో పడి మళ్లీ ఎందుకు విడిపోయారు? లవ్ బ్రేకప్ తరువాత వాళ్ల రియలైజేషన్ ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. నలుగురు కుర్రాళ్లు.. స్నేహం.. లవ్, బ్రేకప్..ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి. రోటి కపడా రొమాన్స్ కూడా ఆ కోవకు చెందిన కథే. నలుగురు అబ్బాయిల జీవితంలోకి నలుగురు అమ్మాయిలు వచ్చాక ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. ఇది అందరికి తెలిసిన కథే.. చాలా సినిమాల్లో చూసిన కథే. కానీ దర్శకుడు విక్రమ్ రెడ్డి చాలా కొత్తగా తెరపై చూపించాడు. ఎలాంటి గజిబిజి లేకుండా నాలుగు డిఫరెంట్ లవ్స్టోరీస్ని ఒకే కథలో చెప్పే ప్రయత్నం చేశాడు. ప్రతి లవ్‌స్టోరీని చాలా కన్విన్సింగ్‌గా చూపిస్తూ.. ప్రస్తుతం యూత్‌లో ఉన్న కన్ఫ్యూజన్స్కి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెచ్యూరిటీ లేక తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా జరిగే నష్టాలు, అపార్థాలు, లవ్‌తో వచ్చే ప్రాబ్లమ్స్, పెళ్లి విషయంలో యువతీయువకుల ఆలోచన ఎలా ఉంటుంది?.. ఇవన్నీ నాలుగు లవ్‌స్టోరీలతో చెప్పేశాడు. దర్శకుడు ట్రెండ్‌కు తగ్గ కథను ఎంచుకోవడంతో పాటు అంతే ట్రెండీగా కథనాన్ని నడిపించాడు. ఫస్టాఫ్‌లో రొమాన్స్ కాస్త ఎక్కువే ఉన్నా.. సెకండాఫ్ వచ్చేసరికి అంతా సెట్ అయిపోతుంది. ఇక చివరి 15 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది.గోవా ట్రిప్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కరి లవ్ స్టోరీ రివీల్ అవుతుంటే కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్జే సూర్య- దివ్య, హర్ష- సోనియాల లవ్‌స్టోరీలో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువే ఉంటుంది. రాహుల్-ప్రియల లవ్‌స్టోరీలో ఓ సస్పెన్స్ కొనసాగుతుంది. ఇక విక్కీ- శ్వేతల లవ్‌స్టోరీ అయితే ఫుల్ ఎంటర్టైనింగ్గా సాగుతుంది. విక్కీ క్యారెక్టర్ పండించిన కామెడీ నవ్వులు పూయిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం నలుగురు లవ్‌స్టోరీ చెప్పి.. సెకండాఫ్‌లో బ్రేకప్ స్టోరీలను చెప్పాడు. ద్వితియార్థంలో కథనం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో ఇచ్చే సందేశం ఆకట్టుకుంటుంది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించినవారంతా దాదాపు కొత్తవాళ్లే అయినా తమ తమ పాత్రల్లో చక్కగా నటించారు. హీరోలుగా నటించిన హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగ.. తమదైన నటనతో ఆకట్టుకున్నారు. విక్కీ పాత్ర అందరికి గుర్తుండిపోతుంది. ఇక నలుగురు హీరోయిన్లు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. నటీనటుల నుంచి మంచి ఫెర్పార్మెన్స్ తీసుకోవడంలో దర్శకుడు సఫలం అయ్యాడు. సాంకేతికంగా కూడా సినిమా బాగుంది. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. పాటలు కథలో భాగంగా వచ్చి వెళ్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 2.75/5 -
'జీబ్రా' సినిమా రివ్యూ
యంగ్ హీరో సత్యదేవ్ లేటెస్ట్ మూవీ 'జీబ్రా'. బ్యాంక్ టెక్నో థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో దీన్ని తీశారు. 'పుష్ప'లో జాలిరెడ్డిగా చేసిన ధనంజయ, 'బాహుబలి' సత్యరాజ్, సత్య, సునీల్, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ట్రైలర్‌తోనే ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా (నవంబర్ 22) ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?సూర్య (సత్యదేవ్).. హైదరాబాద్‌లోని 'బ్యాంక్ ఆఫ్ ట్రస్ట్' అనే బ్యాంక్‌లో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్. మరో బ్యాంకులో పనిచేసే స్వాతి (ప్రియా భవానీ శంకర్)తో ప్రేమలో ఉంటాడు. ఓ రోజు స్వాతి.. బ్యాంకులో పనిచేస్తూ చిన్న పొరపాటు చేస్తుంది. దీంతో ఓ అకౌంట్లో డిపాజిట్ కావాల్సిన రూ.4 లక్షలు మరో అకౌంట్లో పడతాయి. ఆ వ్యక్తి ఆ డబ్బుల్ని ఖర్చు చేసేస్తాడు. దీంతో స్వాతి.. సూర్యని సాయం అడుగుతుంది. చిన్న మతలబు చేసిన సూర్య.. ఆ డబ్బులు రిటర్న్ వచ్చేలా చూస్తాడు. స్వాతిని సమస్య నుంచి బయటపడేస్తాడు. కానీ సదరు వ్యక్తి అకౌంట్లో నుంచి రూ.5 కోట్లు మాయమవుతాయి. ఈ మొత్తం సూర్యనే కొట్టేసాడని, ఆదిత్య దేవరాజ్ (డాలీ ధనంజయ) అనే డాన్ ఇతడి వెంట పడతాడు. 4 రోజుల్లో రూ.5 కోట్లు తిరిగివ్వాలని లేదంటే చంపేస్తానని బెదిరిస్తాడు? మరి సూర్య ఆ డబ్బులు తిరిగి ఇచ్చాడా? దాని కోసం ఏమేం చేశాడనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?షేర్ మార్కెట్, స్కామ్ అనగానే చాలామందికి 'స్కామ్ 1992' వెబ్ సిరీస్ గుర్తొస్తుంది. లేదంటే మొన్నీమధ్యనే తెలుగులో వచ్చిన 'లక్కీ భాస్కర్' సినిమా గుర్తొస్తుంది. పనిచేస్తున్న బ్యాంకులోనే డబ్బు కొట్టేసి, దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడు అనే కాన్సెప్ట్‌తో తీసిన 'లక్కీ భాస్కర్' అద్భుతమైన హిట్. మరీ ఒకేలా అని చెప్పలేం గానీ అలాంటి ఓ పాయింట్‌తోనే తీసిన మూవీ 'జీబ్రా'. అందులో డబ్బు కొట్టేసి హీరో ఎవరికీ దొరకడు. ఇందులో మాత్రం హీరో ఓ తప్పు చేశాడు. కానీ ఎవరో చేసిన మరో తప్పు వల్ల విలన్‌కి దొరికిపోతాడు.హీరో సూర్య చేతిలో ఓ గిఫ్ట్ బాక్స్ చూపించే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే కథ ఆరు రోజులు వెనక్కి వెళ్తుంది. సూర్య, అతడి తల్లి, అతడి ప్రేయసి స్వాతి.. ఇలా ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ కథలోకి వెళ్లిపోతాం. కాసేపటికే తనకో సమస్య వచ్చిందని స్వాతి.. హీరో సాయం కోరుతుంది. మనోడుతో చాలా తెలివితో బ్యాంకులో లూప్ హోల్స్ ఉపయోగించి ఆ సమస్య తీరుస్తాడు. కానీ ఇక్కడే ఊహించని సమస్య మరొకటి వస్తుంది. రూ.4 లక్షలతో స్కామ్ చేస్తే రూ.5 కోట్ల కనిపించకుండా పోవడం అనేది సూర్య మెడకి చుట్టుకుంటుంది. ఇక్కడ కథలో మరో కీలక పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అదే ఆదిత్య దేవరాజ్ అలియాస్ డాలీ.. పెద్ద పెద్ద గుండాలనే శాసించే ఇతడికి రూ.5 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. కానీ ఆ డబ్బు కోసం హీరోని ఎందుకు 4 రోజులు పాటు పరిగెత్తించాడనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.కథ పరంగా ఇది అర్థమయ్యేది కాదు. ఎందుకంటే బ్యాంక్ అంటే చాలామందికి డబ్బులు డిపాజిట్ చేయడం, విత్ డ్రా చేసుకోవడం మాత్రమే తెలుసు. కానీ బ్యాంక్ సిస్టమ్‌లోనూ ఎన్ని లూప్ హోల్స్ ఉంటాయనేది ఈ మూవీలో క్లియర్‌గా చూపించారు. సంస్థలో పనిచేసే హీరోనే డబ్బు కొట్టేయడం, దానికి తనతో పాటు పనిచేస్తున్న వ్యక్తుల సాయం తీసుకోవడం ఇవన్నీ కూడా భలే థ్రిల్లింగ్‌గా ఉంటాయి. ఎప్పటికప్పుడు సూర్యకి సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. కానీ ఒక్కో దాన్ని నుంచి చాకచక్యంగా తప్పించుకోవడం కూడా కన్విన్సింగ్‌గా ఉంది.చెస్‌లో మంత్రి, గుర్రం, ఏనుగు, భటులు ఇలా చాలా ఉంటాయి. ఈ సినిమాలో చెస్ గేమ్‌లా అనిపిస్తుంది. ఇందుకు సంబంధించిన మెటాఫర్స్, డ్రస్సు కలర్స్ మీరు సినిమాలో చూడొచ్చు. అన్నీ ప్లస్సులేనా మైనస్సులు ఏం లేవా అంటే కచ్చితంగా ఉన్నాయి. ఇంటర్వెల్ తర్వాత డాలీ తన కొడుక్కి తన ఫ్లాష్ బ్యాక్ చెబుతాడు. ఇది కాస్త ల్యాగ్, రొటీన్ అనిపిస్తుంది. ఐటమ్ సాంగ్‌ని కావాలనే ఇరికించినట్లు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?సూర్య పాత్రలో సత్యదేవ్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఎమోషన్స్ ఇతడి రోల్లో కనిపిస్తాయి. డాలీ అలియాస్ ఆదిత్య దేవరాజ్‌గా చేసిన ధనంజయ పాత్రకు మంచి ఎలివేషన్లు పడ్డాయి. ఒకానొక దశలో హీరో సత్యదేవ్ కంటే ఇతడి పాత్ర బాగుందనిపిస్తుంది. సత్య సిట్చుయేషనల్ కామెడీ సూపర్. డాలీని ఇరిటేట్ చేసే మదన్ గుప్తాగా సునీల్ కనిపిస్తాడు. రోల్ బాగుంది కానీ మెయిన్ లీడ్స్ వల్ల ఇతడి పాత్ర డౌన్ అయినట్లు అనిపిస్తుంది. బాబాగా చేసిన సత్యదేవ్, స్వాతిగా చేసిన ప్రియా భవానీ శంకర్.. ఎవరికి వాళ్లు పూర్తి న్యాయం చేశారు.టెక్నికల్ విషయాలకొస్తే రైటింగ్‌కి నూటికి 90 మార్కులు వేసేయొచ్చు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కథకు తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. కొన్నిచోట్ల గ్రాఫిక్స్ మాత్రం తేలిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ చూసేవాళ్లకు ఇది నచ్చదు. డిఫరెంట్ థ్రిల్లర్స్, అందులోనూ బ్యాంక్ స్కామ్ తరహా థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లకు 'జీబ్రా' నచ్చేస్తుంది. అంతా బాగానే ఉంది కానీ 'లక్కీ భాస్కర్' రిలీజైన కొన్నిరోజుల తర్వాత థియేటర్లలోకి రావడం దీనికి ఓ రకంగా మైనస్.రేటింగ్: 2.75/5- చందు డొంకాన(ఇదీ చదవండి: ముందు 20 ఏళ్ల గురించి మీకు తెలీదు.. చిరుతో బాండింగ్‌పై బన్నీ) -
‘మెకానిక్ రాకీ’ మూవీ రివ్యూ
టైటిల్: మెకానిక్ రాకీనటీనటులు: విశ్వక్ సేన్, మీనాక్షీ చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, సునీల్, నరేశ్, హైపర్ ఆది తదితరులునిర్మాణ సంస్థ: ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్నిర్మాత : రామ్ తాళ్లూరిదర్శకత్వం: రవితేజ ముళ్లపూడిసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: మనోజన్ రెడ్డి కాటసానిఎడిటింగ్: అన్వర్ అలీవిడుదల తేది: నవంబర్ 22, 2024జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇప్పటికే ఈ ఏడాదిలో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాలతో ప్రేక్షలను అలరించిన విశ్వక్.. ఇప్పుడు మెకానిక్ రాకీ అంటూ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. దానికి తోడు విశ్వక్ తనదైన స్టైల్లో ప్రమోషన్స్ చేయడంతో ‘మెకానిక్ రాకీ’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు (నవంబర్ 22) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..రాకేష్ అలియాస్ రాకీ(విశ్వక్ సేన్) బీటెక్ మధ్యలో ఆపేసి తండ్రి రామకృష్ణ(నరేశ్ వీకే)నడుపుతున్న గ్యారేజీలో మెకానిక్‌గా జాయిన్ అవుతాడు. కార్లను రిపేర్ చేస్తూ.. మరోవైపు డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటాడు. ఆ గ్యారేజీపై రంకిరెడ్డి (సునీల్) కన్ను పడుతుంది. వారసత్వంగా వస్తున్న ఆ గ్యారేజీని కాపాడుకోవడం కోసం రాకీ ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో రాకీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవడం కోసం మాయ(శ్రద్ధా శ్రీనాథ్) వస్తుంది. తాను ఇన్సూరెన్స్ కంపెనీలో పని చేస్తున్నానంటూ రాకీతో పరిచయం చేసుకుంటుంది. రాకీ సమస్య తెలిసి మాయ ఎలాంటి సహాయం చేసింది? గ్యారేజీని కాపాడుకోవడం కోసం రాకీ ఏం చేశాడు? కాలేజీలో ప్రేమించి అమ్మాయి ప్రియ(మీనాక్షి చౌదరి) గురించి రాకీకి తెలిసి షాకింగ్ విషయాలు ఏంటి? ప్రియ కోసం రాకీ ఏం చేశాడు? ప్రియ, రాకీల జీవితాల్లోకి మాయ వచ్చిన తర్వాత ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ఈ సినిమా కథ ప్రారంభ సన్నివేశాలను చూడగానే ఇదొక సాదాసీదా ప్రేమ కథ అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్, కామెడీ సీన్లన్ని రొటీన్‌గా సాగుతాయి. ఒకనొక దశలో ఇది కామెడీ లవ్‌స్టోరీ అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో సినిమా జానరే మారిపోతుంది. అప్పటి వరకు కథపై ఉన్న ఓపీనియన్ పూర్తిగా చేంజ్ అవుతుంది. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని తెలిసిన తర్వాత కథపై ఆసక్తి పెరుగుతుంది. ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే థ్రిల్లింగ్‌గా అపిపిస్తుంది. ప్రతి పాత్రకు ఒక్కో మలుపు ఉంటుంది. ఆ మలుపు సీన్లను మరింత థ్రిల్లింగ్‌గా చూపించే అవకాశం ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. కొన్ని ట్విస్టులను ముందే ఊహించొచ్చు. స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించాల్సింది. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్ ఏంటంటే.. నేటి తరం యువత చేస్తున్న ఓ పెద్ద తప్పిదాన్ని చూపించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల అవసరాన్ని, ఆశని ఆసరాగా తీసుకొని కొంతమంది చేస్తున్న ఆన్లైన్ మోసాలను ఇందులో కళ్లకు కట్టినట్లు చూపించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నా.. దాని చుట్టు అల్లుకున్న కథే రొటీన్‌గా ఉంది. భావోద్వేగాలను పండించడంలో దర్శకుడు కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. మోతాదుకు మించి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కథనం వాస్తవికానికి దూరంగా సాగితున్నందనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ కథని మరింత బలంగా రాసుకొని, స్క్రీన్‌ప్లే విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహిస్తే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. రాకీ అలియాస్ మెకానిక్ రాకీ పాత్రలో విశ్వక్ సేన్ చక్కగా నటించాడు. అయితే ఈ తరహా పాత్రలు విశ్వక్ చాలానే చేశాడు. అందుకే తెరపై కొత్తదనం కనిపించలేదు. మాయగా శ్రద్ధా శ్రీనాథ్ అదరగొట్టేసింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. మీనాక్షి చౌదరికి చాలా బలమైన పాత్ర దొరికింది. మిడిల్ క్లాస్ యువతి ప్రియగా ఆమె చక్కగా నటించింది. తెరపై శ్రద్ధా, మీనాక్షి ఇద్దరూ అందంగా కనిపించారు. హీరో తండ్రిగా నరేశ్ తనకు అలవాటైన పాత్రలో జీవించేశాడు. సునీల్, హర్షవర్ధన్, రఘు, వైవా హర్షతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జేక్స్ బిజోయ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
'కిష్కింద కాండం' సినిమా రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ 'కిష్కింద కాండం'. రూ.7 కోట్ల ఖర్చు పెట్టి థియేటర్లలో రిలీజ్ చేస్తే రూ.75 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం హాట్‌స్టార్‌లో తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అప్పు పిళ్లై (విజయ రాఘవన్) ఆర్మీ మాజీ అధికారి. అడవిని ఆనుకుని ఉండే పెద్ద ఇంట్లో ఉంటాడు. ఓరోజు ఈయన గన్ మిస్ అవుతుంది. ఎన్నికల టైం కావడంతో తుపాకీని స్టేషన్లో అప్పగించాలని నోటీసులు ఇస్తారు. కట్ చేస్తే ఓ కోతి చేతిలో గన్ కనిపిస్తుంది. అది తనదేనని అప్పు పిళ్లై కన్ఫర్మ్ చేస్తాడు. ఇతడికి అజయ్ చంద్రన్ (ఆసిఫ్ అలీ) అనే కొడుకు. అజయ్ తొలి భార్య చనిపోవడం, కొడుకు కనిపించకుండా పోవడంతో అపర్ణ (అపర్ణా బాలమురళి)ని రెండో పెళ్లి చేసుకుంటాడు. అజయ్ చంద్రన్ మొదటి భార్య ఎలా చనిపోయింది? మిస్ అయిన కొడుకు ఏమయ్యాడు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: రూమర్స్ కాదు నిజంగానే కీర్తి సురేశ్‌కి పెళ్లి సెట్!)ఎలా ఉందంటే?మిస్టరీ థ్రిల్లర్ అనగానే దాదాపు ఒకే ఫార్మాట్లో స్టోరీ ఉంటుంది. ఓ హత్య, దాని చుట్టూ సాగే దర్యాప్తు. హంతకుడిని పోలీసులు పట్టుకోవడం ఇదే కాన్సెప్ట్ కనిపిస్తుంది. కానీ 'కిష్కింద కాండం' పూర్తిగా డిఫరెంట్. పాట, ఫైట్ లాంటివి ఏం ఉండవు. ఎప్పుడూ చూసే మిస్టరీ థ్రిల్లర్ లాంటి సినిమానే కానీ నేపథ్యమే వేరు. దానిని చూపించిన విధానం చాలా కొత్తగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కథ కూడా ఎక్కువ పాత్రలు లేకుండా చాలా సింపుల్‌గా తేల్చేశారు.మతిమరపు వ్యక్తి, కనపడకుండా పోయిన తుపాకీ, బుల్లెట్ గాయంతో చనిపోయిన కోతి, తప్పి పోయిన పిల్లాడు ఇవే ఈ కథ లోని ముఖ్యమైన అంశాలు. ఇంతకీ మించి చెబితే సినిమాలోని థ్రిల్‌ని మీరు మిస్ అయిపోతారు. ఎందుకంటే చిన్న స్టోరీ లైన్ మీద ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో.. చూస్తున్న ప్రేక్షకుడిని చివరి వరకు కూర్చోబెట్టడం అంటే అంత ఈజీ కాదు. కానీ 'కిష్కింద కాండం' అది చేసి చూపించింది. రైటింగ్ పరంగా ఇది టాప్ క్లాస్ వర్క్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)కథ, మాటలు అందించిన బాహుల్ రమేశ్.. సినిమాటోగ్రఫీ కూడా చేశారు. కథ రాసుకున్న వాడే కెమెరా పడితే ఆ విజువల్స్ ఎలా ఉంటాయో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. మూవీ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. చెప్పాలంటే తొలి అరగంట జరిగే సీన్లు చూస్తే బోర్ కొట్టేస్తుంది. కానీ ఆ తర్వాత ఉల్లిపాయ ఒక్కో పొర విప్పినట్లు కథలో ఒక్కో లేయర్ రివీల్ అవుతూ ఉంటుంది. అప్పటివరకు సస్పెన్స్, థ్రిల్లింగ్‌గా సాగే ఈ చిత్రం.. క్లైమాక్స్‌కి వచ్చేసరికి ఓ రకమైన సంతృప్తితో పాటు ఎమోషనల్ అయ్యేలా చేస్తుంది.'జీవితం ముందుకు సాగాలంటే నిజంతో పాటు అబద్ధం కూడా అవసరం', 'ఎవరికీ ఉపయోగపడని నిజాలు తెలుసుకుని ఏం చేస్తాం'.. సినిమా చూసిన తర్వాత ఈ రెండు డైలాగ్స్ మీకు తెగ నచ్చేస్తాయి. అలానే తండ్రి గజిని, కొడుకు కమల్ హాసన్ అని మీకు కచ్చితంగా అనిపిస్తుంది. కమర్షియల్ మూవీస్ అంటే ఇష్టపడేవాళ్లు, స్లోగా సాగే సినిమాలంటే ఇష్టం లేనివాళ్లకు ఇది నచ్చకపోవచ్చు. కాబట్టి దానికి తగ్గట్లు ప్లాన్ చేసుకోండి. రెండు గంటల నిడివితో తీసిన మిస్టరీ థ్రిల్లర్.. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' సిరీస్ రివ్యూ
భారతదేశ స్వాతంత్య్రం కోసం సాగిన బహుముఖ పోరాటాన్ని వివరిస్తూ చరిత్ర, నాటకం యాక్షన్లను మిళితం చేస్తూ నిఖిల్ అద్వానీ 'ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్' అందించారు. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో అందుబాటులో ఉంది. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ సిరీస్‌లో పండిట్ జవహర్లాల్ నెహ్రూ (సిద్ధాంత్ గుప్తా), సర్దార్ వల్లభాయ్ పటేల్ (రాజేంద్ర చావ్లా), మహాత్మా గాంధీ (చిరాగ్ వోహ్రా), లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్ (ల్యూక్ మెక్‌గిబ్నీ) పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. రాజకీయ కుట్రల సూక్ష్మమైన విశ్లేషణ, వ్యక్తిగత త్యాగాలు, భావోద్వేగ తిరుగుబాట్లు ఆసక్తికరంగా సాగుతాయి.నెహ్రూ, పటేల్, గాంధీల విభిన్న భావజాలంతో కూడిన సన్నివేశాలతో ఈ సిరీస్ వైవిధ్యభరిత అనుభూతిని అందిస్తుంది. స్వతంత్ర భారతదేశం కోసం పోరాడిన ఈ ముగ్గురివీ.. వేటికవే విభిన్న థృక్కోణాలైనా సమర్థనీయమైనవిగా అనిపిస్తాయి. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. దేశ నిర్మాణం ఆచరణాత్మక డిమాండ్ల మధ్య చిక్కుకున్న నాయకుడి అంతర్గత సంఘర్షణ నెహ్రూ పాత్ర చిత్రణలో తెలుస్తుంది. ముహమ్మద్ అలీ జిన్నాలోని అహం, ఆశయం, తెలివిని నటుడు ఆరిఫ్ జకారియా చక్కగా చూపించాడు. సర్దార్ పటేల్‌గా రాజేంద్ర చావ్లా, లియాఖత్ అలీ ఖాన్‌గా రాజేష్ కుమార్, లార్డ్ లేడీ మౌంట్‌బాటన్‌గా కార్డెలియా బుగేజా మెరుస్తారు. మలిష్కా మెండోన్సా సరోజినీ నాయుడుగా కనిపిస్తారు.ఈ సిరీస్ 1940ల నాటి భారతదేశానికి అద్దం పట్టింది. పునర్నిర్మించిన వైస్రాయ్ హౌస్ లేదా కాంగ్రెస్ కార్యాలయాలు..ఇలా ప్రతి ఫ్రేమ్ సమగ్ర పరిశోధనను ప్రతిబింబిస్తుంది. కథ, కథనాలను భావోద్వేగభరితంగా అందించటంలో అద్వానీ దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకుటుంది. భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన ఇతర చిత్రీకరణల మాదిరిగా కాకుండా, ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్ 1944 - 1947 మధ్య కీలకమైన సంవత్సరాలకు దాని పరిధిని కుదించింది. ఇది గాంధీ–జిన్నా చర్చలు విభజనకు దారితీసిన వంటి సంఘటనలపైనే దృష్టి పెట్టింది. రాజకీయ కుతంత్రాలు, సైద్ధాంతిక వైరుధ్యాలు, తెరవెనుక చర్చలను చక్కగా చూపించారు.చదవండి: దిశా పటానిపై కంగువా నిర్మాత భార్య 'చీప్ కామెంట్స్' -
OTT: ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ ఎలా ఉందంటే?
నయనతార జీవిత ఆధారంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించిన డ్యాక్యుమెంటరీ సిరీస్‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’. అమిత్ కృష్ణన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నేటి(నవంబర్ 18) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒక గంట ఇరవైరెండు నిమిషాల నిడివిగల ఈ డ్యాక్యుమెంటరీ సిరీస్ ఎలా ఉంది? అందులో ఏం చూపించారు?🔸నయనతార జీవితం మొత్తాన్ని ఓ బ్యూటిఫుల్ స్టోరీగా మలిచి తెరపై అందంగా చూపించే ప్రయత్నం చేసింది నెట్‌ఫ్లిక్స్🔸నయనతార చిన్నప్పటి ఫోటోలను చూపుతూ..ఆమె స్కూల్ డేస్ సీన్‌తో ఈ డ్యాక్యుమెంటరీ ప్రారంభం అవుతుంది.🔸ఆమెకు సినిమా చాన్స్ ఎలా వచ్చింది? మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఎలా ఎంట్రీ ఇచ్చిందనేది ఆయాన డైరెక్టర్లతో చెప్పించారు.🔸కెరీర్ తొలినాళ్లతో నయనతార పడిన ఇబ్బందులను, బాడీ షేమింగ్ చేసినప్పుడు తను పడిన మానసిక క్షోభను పంచుకున్నారు.🔸తన పర్సనల్ లైఫ్‌పై వచ్చిన కొన్ని విమర్శల కారణంగా సినిమా చాన్స్‌లు కోల్పోయినా.. తిరిగి ఎలా ట్రాక్‌లోకి వచ్చారనేది ఆసక్తికరంగా తెలియజేశారు.🔸శ్రీరామరాజ్యం సినిమాలో సీత పాత్రకు నయనతారను తీసుకున్నప్పడు వచ్చిన విమర్శలను చూసి ఆమె ఎంత బాధపడిందనే విషయాలను ఆయా దర్శక నిర్మాతలతో చెప్పించారు.🔸తనపై వచ్చిన విమర్శలన్నింటిని పక్కన పడేసి.. ‘లేడీ సూపర్ స్టార్’గా ఎలా ఎదిగారనేది ఆసక్తికరంగా చూపించారు.🔸ఫస్టాఫ్ మొత్తం నయనతార బాల్యం, సినీ కెరీర్‌ని చూపించి..సెకండాఫ్‌లో విఘ్నేశ్‌తో ప్రేమాయణం ఎలా మొదలైంది? వివాహ జీవితం ఎలా ఉందనేది చూపించారు.🔸‘నానుమ్ రౌడీ దాన్’సమయంలో వీరిద్దరి మధ్య ఎలాంటి సంభాషణలు జరిగాయి? విఘ్నేశ్‌కి నయన్ ఎలాంటి సపోర్ట్‌ని అందించింది? ఎలా ప్రేమలో పడిపోయారనేది చక్కగా చూపించారు.🔸పెళ్లికి ముందు వీరిద్దరి రిలేషన్షిప్ ఎలా కొనసాగిందో అనేది వారి మాటల్లోనే చూపించారు. ప్రేమలో ఉన్నప్పడు వారిపై వచ్చిన మీమ్స్ గురించి కూడా సరదాగా పంచుకున్నారు.🔸గ్లాస్ హౌస్‌లోనే నయనతార ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకున్నారు? పెళ్లి రోజు వీరిద్దరు ధరించిన దుస్తుల వెనున ఉన్న కథ, వాటిని తయారు చేయడానికి డిజైనర్లు పడిన కష్టాలను చూపించారు.🔸ఇక ఈ డ్యాక్యుమెంటరీ చివరల్లో నయనతార-విఘ్నేశ్‌ల కవల పిల్లలను చూపిస్తూ.. ఆహ్లాదకరమైన ముగింపును ఇచ్చారు.🔸మొత్తంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ సిరీస్ సరదాగా సాగుతూ.. నయనతార లైఫ్‌లో చోటు చేసుకున్న కొన్ని వివాదాలు.. విమర్శలను చూపిస్తూనే..వాటిని ఎదుర్కొని ఎలా ‘లేడీ సూపర్‌స్టార్’గా ఎదిగారనేది చూపించారు. -
మనుషులను తినే వైరస్.. ఓటీటీలో ఈ మూవీ చూశారా?
టైటిల్: అపోకాలిప్స్ జెడ్: ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్డైరెక్టర్: కార్లెస్ టోరెన్స్విడుదల తే:దీ 05 అక్టోబర్ 2024ఓటీటీ: అమెజాన్ ప్రైమ్నిడివి: 119 నిమిషాలుఇప్పుడంతా ఓటీటీల హవానే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా తెరెకెక్కించిన చిత్రాలు సైతం మన ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నాం. ఈ డిజిటల్ యుగంలో మనకు నచ్చిన సినిమాను వీలైన టైమ్‌లో చూసే అవకాశం ఉంది. కంటెంట్ భాషతో సంబంధం లేకుండా సినిమాలను చూసేస్తున్నారు. ఓటీటీలో అన్ని రకాల జోనర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇటీవల విడుదలైన భయపెట్టే జాంబీ యాక్షన్ థ్రిల్లర్ అపోకలిప్స్ జెడ్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్. స్పానిష్‌లో తెరకెక్కించిన మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.స్పానిష్ ప్రజలు ఓ మహమ్మారి వైరస్ బారిన పడతారు. ప్రశాంతంగా ఉన్న ఆ దేశంలో ఒక్కసారిగా అలజడి మొదలవుతుంది. దీంతో ప్రజలంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి ఇళ్లను, నగరాలను వదిలిపారిపోతారు. ఇంతకీ ఆ వైరస్ ఏంటి? అలా తప్పిపోయిన తన ఫ్యామిలీని కలుసుకోవడానికి ఓ వ్యక్తి చేసిన సాహసమే అసలు కథ.ఇలాంటి జాంబీ యాక్షన్ చిత్రాలు గతంలోనూ చాలా వచ్చాయి. కాకపోతే ఈ మూవీ కాస్తా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలాంటి హడావుడి లేకుండా కథనం సాగుతుంది. అంతుచిక్కని వైరస్ బారిన పడినవారు.. కనపడిన ప్రతి ఒక్కరిని తినేస్తుంటారు. దీంతో ప్రభుత్వం, పోలీసులు, ఆర్మీ సైతం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి హెచ్చరికలు జారీచేస్తుంది. అలా వాటిని పట్టించుకోకుండా బయటికెళ్లిన వ్యక్తి వారి నుంచి తప్పించుకోవడానికి చేసే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఇందులో అతనితో పాటు పిల్లి కూడా ఉంటుంది. ఇందులో ఆ వ్యక్తి ప్రాణాలు దక్కించుకోవడానికి చేసే యాక్షన్ సీన్స్ అద్భుతంగా అనిపిస్తాయి. అయితే కథ నెమ్మదిగా సాగడం కాస్తా బోరింగ్‌గా అనిపిస్తుంది. కానీ కొన్ని చోట్ల ఆడియన్స్‌లో క్యూరియాసిటీ పెంచేలా ఉన్నాయి. హారర్, యాక్షన్ జోనర్ ఇష్టపడేవాళ్లు ఈ మూవీ ట్రై చేయొచ్చు. కాకపోతే కేవలం హిందీ, ఇంగ్లీష్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. సబ్ టైటిల్స్‌తో చూసేయాల్సిందే. -
‘మట్కా’ మూవీ రివ్యూ
టైటిల్: మట్కానటీనటులు: వరుణ్ తేజ్, నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి, నవీన్ చంద్ర, అజయ్ ఘోష్, కన్నడ కిషోర్, రవీంద్ర విజయ్, పి రవి శంకర్, తదితరులునిర్మాణ సంస్థ: వైర ఎంటర్టైన్మెంట్స్, SRT ఎంటర్టైన్మెంట్నిర్మాతలు: డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరిదర్శకత్వం: కరుణ కుమార్సంగీతం: జీవీ ప్రకాశ్సినిమాటోగ్రఫీ: ఎ కిశోర్ కుమార్ఎడిటర్: కార్తీక శ్రీనివాస్ ఆర్విడుదల తేది: నవంబర్ 14, 2024కథేంటంటే..బర్మా నుంచి వైజాగ్ వచ్చిన వాసు దేవ్ అలియాస్ వాసు(వరుణ్ తేజ్)..చిన్నప్పుడే అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేసి జైలుకు వెళ్తాడు. అక్కడ జైలు వార్డెన్ నారాయణ మూర్తి(రవిశంకర్)తో మంచి పరిచయం ఏర్పడుతుంది. వాసుని తన సొంత పనులకు వాడుకుంటూ మంచి ఫైటర్‌లా తయారు చేస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన వాసు.. కొప్పరికాయల వ్యాపారి అప్పల రెడ్డి(అజయ్ ఘోష్) దగ్గర పనిలో చేరతాడు. ఓ సారి ఆ ఏరియా రౌడీ కేబీఆర్ గ్యాంగ్‌ని చితక్కోట్టి..అతని ప్రత్యర్థి నానిబాబు(కిశోర్)కి దగ్గరవుతాడు. అతని అండదండలతో పూర్ణ మార్కెట్ నాయకుడిగా ఎదుగుతాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ.. చివరకు మాట్కా ఆటను ప్రారంభిస్తాడు. ఆ తర్వాత వాసు జీవితంలో చోటు చేసుకున్న మార్పులు ఏంటి? మట్కా కింగ్‌గా ఆయన ఎలా ఎదిగాడు? సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్ ని ఎలా పంపించాడు? వాసు కోసం సీబీఐ ఎందుకు రంగంలోకి దిగింది? సుజాత(మీనాక్షి చౌదరి) వాసు జీవితంలోకి ఎలా వచ్చింది? ఈ కథలో సోఫియా(నోరా ఫతేహి), సాహు(నవీన్ చంద్ర) పాత్రలు ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘మట్కా కింగ్’ రతన్ లాల్ ఖత్రీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రమే ‘మట్కా’. గ్యాoబ్లింగ్ వరల్డ్ లో రతన్ ఖత్రీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 1962లో ముంబైలో కేంద్రంగా మట్కా గ్యాంబ్లింగ్ లో దేశం మొత్తం పెద్ద నెట్‌వర్క్‌ను సృష్టించాడు. ఖత్రీ క్యారెక్టర్ స్ఫూర్తితో వాసు క్యారెక్టర్ ని డిజైన్ చేసి మట్కా చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు కరుణ కుమార్. కథగా చూస్తే ఇది కేజీయఫ్, పుష్ప లాంటి అండర్ డాగ్ స్టోరీ. చేతిలో చిల్లిగవ్వ లేని హీరో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టడం.. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి..ప్రభుత్వాలనే శాసించే స్థితికి రావడం.. గ్యాంగ్‌స్టర్ కథలన్నీ ఇలానే ఉంటాయి. మట్కా కథనం కూడా ఇలానే సాగుతుంది. అయితే ఓ ఆటను అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడనేది కొత్త పాయింట్. కథకు ఇదే మెయిన్ పాయింట్ కూడా. కానీ తెరపై మాత్రం దాన్ని అంతే బలంగా చూపించడంలో దర్శకుడు విఫలం అయ్యాడు. ఎలాంటి ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లేకుండా చాలా రొటీన్‌గా కథనాన్ని నడిపించాడు. హీరో మట్కా కింగ్‌గా ఎదిగిన క్రమం కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది కానీ ఎక్కడా సహజంగా కనిపించదు. ఇక కథకి కీలకమైన మట్కా ఆట కూడా ఇంటర్వెల్ వరకు మొదలు కాదు. సెకండాఫ్‌లో అయినా ఆ ఆటని హైలెట్ చేశారా? అంటే అదీ లేదు. కథనం మొత్తం రొటీన్‌గా సాగుతుంది. హీరో పాత్రతో ప్రేక్షకులు కనెక్ట్ కాలేరు. ఎమోషనల్ సీన్స్ కూడా అంతగా పండలేదు. ఫస్టాఫ్ మొత్తం హీరో బాల్యం, అతను ఎదిగిన క్రమం చూపిస్తూ.. మట్కా ఆటలోకి ఎలా ఎంట్రీ ఇచ్చారనే చూపించారు. ఇక సెకండాఫ్‌లో మట్కా ఆటతో వాసు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా సంక్షోభంలో పడేశాడు? అతన్ని పట్టుకునేందుకు సీబీఐ రంగంలోకి దిగడం..మరోవైపు ప్రత్యర్థులు అతన్ని చంపేందుకు కుట్ర చేయడం.. వాటిని హీరో ఎలా తిప్పికొట్డానేది చూపించారు. అయితే ఈ సన్నివేశాలేవి ఆకట్టుకునేలా ఉండవు. చివరల్లో దావూద్ పాత్రని పరిచయం చేసి.. క్రికెట్ బెట్టింగ్తో సీక్వెల్ ఉంటుందని పరోక్షంగా ప్రకటించారు. ఎవరెలా చేశారంటే.. వాసు పాత్రకి వరుణ్ తేజ్ న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ చక్కగా నటించాడు. వాసు భార్య సుజాతగా మీనాక్షి చౌదరి తనదైన నటనతో ఆకట్టుకుంది. అయితే ఆమె పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదు. సోఫియాగా నోరా ఫతేహి తెరపై అందంగా కనిపించింది. కిషోర్, నవీన్ చంద్ర, సలోని, అజయ్ ఘోష్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. జీవీ ప్రకాశ్ సంగీతం సినిమాకి ప్రధాన బలం. సినిమాటోగ్రపీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.-రేటింగ్: 2.25/5 -
Kanguva Review: 'కంగువా' మూవీ రివ్యూ
టైటిల్: కంగువానటీనటులు: సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులునిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్దర్శకత్వం: శివసంగీతం: దేవీవ్రీ ప్రసాద్సినిమాటోగ్రఫీ: వెట్రి పళనిస్వామిఎడిటర్: నిశాద్ యూసుఫ్విడుదల తేది: నవంబర్ 14, 2024కథేంటి అంటే?కంగువ కథ 1070 - 2024 మధ్య నడుస్తుంది. 2024లో ఒక ప్రయోగశాల నుంచి జీటా అనే బాలుడు తప్పించుకుని గోవా వెళ్తాడు. మరోవైపు గోవాలో ఫ్రాన్సిస్ (సూర్య), కోల్ట్ (యోగిబాబు) బౌంటీ హంటర్స్‌గా ఉంటారు. పోలీసులు కూడా పట్టుకోలేని క్రిమినల్స్‌ను వారు పట్టుకుంటూ ఉంటారు. గోవాకు చేరుకున్న జీటాని ఫ్రాన్సిస్ అదుపులోకి తీసుకుంటాడు. ఈ క్రమంలో ఒక నేరస్తుడిని పట్టుకునే క్రమంలో ఒకరిని హత్య చేస్తాడు. ఈ హత్యను జీటా చూస్తాడు. అంతేకాదు ఫ్రాన్సిస్‌ను చూడగానే ఏదో తెలిసిన వ్యక్తిలా జీటా ఫీల్ అవుతాడు. ఫ్రాన్సిస్ కూడా జీటాతో ఏదో కనెక్షన్ ఉండేవాడిలా ఫీల్ అవుతాడు. హత్య విషయాన్ని బయట చెప్పకుండా ఉండేందుకు జీటాను తన ఇంటికి తెచ్చుకుంటాడు. ఇదే క్రమంలో జీటాను పట్టుకునేందుకు ల్యాబ్ నుంచి కొంతమంది వస్తారు. వారినుంచి జీటానీ కాపాడేందుకు ఫ్రాన్సిస్ ప్రయత్నిస్తుండగా కథ 1070లోకి వెళ్తుతుంది. అసలు జీటా ఎవరు..? అతనిపై చేసిన ప్రయోగం ఏంటి..? ఫ్రాన్సిస్, జీటా ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి..? 1070కి చెందిన కంగువా(సూర్య) ఎవరు..? కపాల కోన నాయకుడు రుధిర ( బాబీ డియోల్)తో కంగువకి ఉన్న వైరం ఏంటి..? పులోమ ఎవరు? కంగువపై అతనికి ఎందుకు కోపం? భారత దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు రోమానియా సైన్యం వేసిన ప్లాన్ ఏంటి..? ప్రణవాది కోన ప్రజలను కాపాడుకోవడం కోసం కంగువ చేసిన పోరాటం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఎంత గొప్ప కథ అయినా సరే ప్రేక్షకులకు అర్థం అయ్యేలా చెప్తేనే ఆ సినిమాని ఆదరిస్తారు. ముఖ్యంగా కథ చెప్పడంలో విసిగించకుండా అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు.. కథ చెప్పాలి. లేకపోతే ఎంత మంచి కథ అయినా...అంతే సంగతి. దర్శకుడు శివ రాసుకున్న కథ చాలా గొప్పది. కానీ అంతే గొప్పగా తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. సినిమా ఫస్టాఫ్ ప్రేక్షకులను మెప్పించడంలో దర్శకుడు కాస్త విఫలం అయ్యారు. సినిమా చూస్తున్నంతసేపు సూర్య పాత్ర మాత్రమే ప్రధానంగా ఉంటుంది. అయితే, స్క్రీన్ మీద ఉన్న క్యారెక్టర్లు అన్నీ ఆడియెన్స్‌ను విసిగిస్తూనే ఉంటాయి. యోగిబాబు, రెడిన్ కింగ్స్లే కామెడీతో విసింగేచేశారనే ఫీల్ అందరిలోనూ కలుగుతుంది.సినిమా ప్రారంభమైన సుమారు 30 నిమిషాల తర్వాత అసలు కథలోకి దర్శకుడు శివ వెళ్తాడు. అప్పటి వరకు ఆడియన్స్‌ను దర్శకుడు విషింగించారనే చెప్పవచ్చు. ఎప్పుడైతే పీరియాడిక్ పోర్షన్ మొదలౌతుందో అక్కడి నుంచి కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ముఖ్యంగా సినిమా కథ అంతా సెకండాఫ్‌లోనే ఉంటుంది. అప్పుడు వచ్చే వార్ ఎపిసోడ్లు అందరినీ మెప్పించడమే కాకుండా గూస్బంప్స్ తెప్పిస్తాయి. ఫస్టాఫ్‌ను దర్శకుడు ఇంకాస్త బాగా తీసింటే కంగువా మరింత గొప్ప సినిమాగా ఉండేది. ఫస్టాఫ్‌లో సూర్య, దిశా పటానీ లవ్ స్టోరీ అంతగా కనెక్ట్ కాలేదు.విలన్‌గా బాబీ డియోల్ లుక్ బాగున్నప్పటికీ ఆయన పాత్రను చూపించడంలో ఆ క్రూరత్వం కనిపించదు. ఇక్కడ కూడా డైరెక్టర్ శివ కాస్త నిరుత్సాహపరిచారు. అయితే, భారీ ఎమోషనల్ బ్యాంగ్‌తో సినిమాను ఎండ్ చేస్తారు. క్లైమ్యాక్స్ తర్వాత మాత్రం రెండు ట్విస్టులు ఇచ్చిన దర్శకుడు శివ.. సీక్వెల్‌కు మంచి లీడ్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.ఎవరెలా చేశారంటే.. సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తారు. ఈ చిత్రం కోసం ఆయన ప్రాణం పెట్టి నటించారు. కంగువా, ఫ్రాన్సిస్ అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన సూర్య.. ప్రతి పాత్రలోనూ ఆ వేరియేషన్ చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.. ముఖ్యంగా వెయ్యేళ్ల కిందట వీరుడు కంగువాగా ఆయన నటనతో మెప్పించి సినిమాకే హైలెట్‌గా నిలిచారు. నెగెటివ్ షేడ్స్ ఉన్న ఉదిరన్ పాత్రకు బాబీ డియోల్ పూర్తి న్యాయం చేశారు. ఏంజెలీనాగా దిశాపటానీ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆమె పాత్రలో అనేక షేడ్స్ ఉంటాయి. సినిమాకు ఆమె స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి.యోగి బాబుతో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.ఇక సాంకేతిక విషయాలకొస్తే.. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదు. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. అదే సమయంలో కొన్ని చోట్ల మోతాదుకు మించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు. పాటలు పర్వాలేదు. వెట్రి పళనిస్వామి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్‌గా, రియాల్టీకీ దగ్గరగా ఉంటుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉన్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు చాలా రిచ్‌గా ఉన్నాయి. -
'రహస్యం ఇదం జగత్' మూవీ రివ్యూ
టైటిల్: రహస్యం ఇదం జగత్నటీనటులు: రాకేష్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం, కార్తీక్ తదితరులుదర్శకత్వం: కోమల్ ఆర్ భరద్వాజ్సంగీతం: గ్యానీఎడిటర్: ఛోటా కే ప్రసాద్సినిమాటోగ్రఫీ: టైలర్ బ్లూమెల్నిర్మాతలు: పద్మ రావినూతుల, హిరణ్య రావినూతులవిడుదల తేదీ : 8 నవంబర్ 2024సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలాజికల్ థ్రిల్లర్స్‌కు ఇప్పుడు ఇండస్ట్రీలో మంచి గిరాకీ ఉంది. అలా ఈ జానర్లో వచ్చిన సినిమానే రహస్యం ఇదం జగత్. పురాణ ఇతిహాసాలను తెరపై చూపిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించేందుకు ప్రయత్నించామంటున్నాడు దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్. మరి ఆయన ప్రయత్నం ఏమేరకు ఫలించిందో రివ్యూలో చూసేద్దాం..కథకథ మొత్తం అమెరికాలోనే జరుగుతుంది. ఇండియాలో ఉన్న తండ్రి చనిపోవడంతో తల్లి కోసం స్వదేశానికి తిరిగి వద్దామనుకుంటుంది అకీరా (స్రవంతి). ఈమె బాయ్ ఫ్రెండ్ అభి (రాకేష్) కూడా తనతోపాటు ఇండియా వెళ్ళిపోదామని ఫిక్స్ అవుతాడు. వెళ్లే ముందు స్నేహితులందరికీ పార్టీ ఇవ్వాలనుకుంటాడు. అలా అడవిలో ఉండే చిన్న ఊరుకు వెళ్తారు. అక్కడ వాళ్లు బుక్ చేసుకున్న హోటల్ క్లోజ్ అవడంతో ఓ ఖాళీ ఇంట్లో బస చేస్తారు. ఆ స్నేహితులలో సైంటిస్ట్ అయిన అరు మల్టీ యూనివర్స్ పై రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. దీని గురించి మాట్లాడుకునే క్రమంలో అభి, విశ్వకు గొడవ జరుగుతుంది. అదే సమయంలో విశ్వ ఓ భయంకరమైన డ్రగ్ తీసుకొని అకీరా, కళ్యాణ్ లను చంపేస్తాడు. మరోవైపు మల్టీ యూనివర్స్‌కు వెళ్లే దారి ఆ ఊళ్ళోనే ఉందని తెలుసుకొని అభిని తీసుకొని వెళ్తుంది అరు. తీరా అక్కడికెళ్లాక ఆమెను ఎవరో చంపేస్తారు. అసలు ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగానే మల్టీ యూనివర్స్ ఉందా? ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాలంటే వెండితెరపై చూడాల్సిందే!విశ్లేషణతక్కువ బడ్జెట్లో మంచి అవుట్ పుట్ ఇవ్వాలని ప్రయత్నిస్తూ తెరకెక్కించిన సినిమానే రహస్యం ఇదం జగత్. ఈ సినిమాను అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు నిర్మించారు. హాలీవుడ్ చిత్రాల నుంచి ప్రేరణ పొంది తీసినట్లు ఉంటుంది. మన ప్రేక్షకులకు కనెక్ట్ అవడానికి పురాణాలను వాడుకున్నారు. హనుమంతుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి వెళ్ళడం.. కృష్ణుడు ఒకేసారి చాలా చోట్ల కనిపించడం.. శ్రీచక్రం నుంచి వామ్ హోల్ ఏర్పడటం వంటివి చూపించారు.సినిమా నెమ్మదిగా మొదలవుతుంది. ఫ్రెండ్స్ ట్రిప్.. గొడవలు.. చంపుకోవడాలు.. ఇవన్నీ కాస్త సాగదీసినట్లుగానే అనిపిస్తాయి. ఇంటర్వెల్ ముందు అభి స్నేహితులు చనిపోవడంతో.. వాళ్ళను కాపాడుకోవడానికి వామ్ హోల్ కి వెళ్లడంతో నెక్స్ట్ ఏం జరుగుతుందన్న ఆసక్తి కలుగుతుంది. సెకండాఫ్‌లో ఆ సస్పెన్స్ కంటిన్యూ చేశాడు. ముఖ్యంగా క్లైమాక్స్ బాగా రాసుకున్నాడు. రొటీన్ సినిమా కాకుండా.. కొత్త మూవీ చూసినట్లు అనిపించకమానదు.ఎవరెలా చేశారంటే?షార్ట్ ఫిలింస్‌లో నటించి మెప్పించిన రాకేష్ హీరోగా నటించాడు. వామ్ హోల్లోకి ట్రావెల్ చేసి వచ్చే వ్యక్తిగా బాగా నటించాడు. మిగిలిన వాళ్లంతా కొత్త వాళ్లే అయినా అందులో స్రవంతి తన యాక్టింగ్‌తో మెప్పించింది. సైంటిస్ట్ పాత్రకు అరు చక్కగా సరిపోయింది. భార్గవ్ కామెడీతో నవ్వించేందుకు ప్రయత్నించాడు. కార్తీక్ విలన్‌గా బాగానే చేశాడు. అయితే వీళ్లంతా అమెరికాలోనే సెటిల్ అయినవాళ్లు కావడంతో మన ఆడియన్స్‌కు కొత్తముఖాలుగా అనిపిస్తారు. పైగా అమెరికన్ యాసలోనే మాట్లాడారు.టెక్నికల్ టీమ్సినిమాటోగ్రఫీ బాగుంది. అమెరికాలో ఉన్న మంచి మంచి లొకేషన్స్ వెతికి మరీ చూపించినట్లుగా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపిస్తుంది. పాటలు ఏవీ అంతగా ఆకట్టుకోవు. డబ్బింగ్‌పై కాస్త ఫోకస్ చేయాల్సింది. డబ్బింగ్‌ను పట్టించుకోకపోవడమే ఈ సినిమాకు మైనస్. కొన్నిచోట్ల బీజీఎమ్ డైలాగులను డామినేట్ చేసింది. దర్శకుడికి తొలి చిత్రం కావడంతో అక్కడక్కడా కాస్త తడబడ్డట్లు అనిపిస్తుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
టాలీవుడ్ మూవీ జ్యువెల్ థీఫ్ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: జ్యూవెల్ థీఫ్ - మూవీ రివ్యూనటీనటులు: కృష్ణసాయి, మీనాక్షి జైస్వాల్, అజయ్ తదితరులుడైరెక్టర్: పీఎస్ నారాయణనిర్మాత: మల్లెల ప్రభాకర్నిర్మాణ సంస్థ: శ్రీ విష్ణు గ్లోబల్ మీడియాసంగీతం: ఎం. ఎం. శ్రీలేఖవిడుదల తేదీ: 08 నవంబర్ 2024సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడైనా ఆదరణ ఉంటుంది. అందుకే సరికొత్త కంటెంట్‌తో దిగితే ప్రేక్షకులే సూపర్ హిట్ చేస్తారు. అలాంటి తరహాలో వచ్చిన తాజా చిత్రం జ్యూవెల్ థీఫ్(Beware of Burglar). ఇవాళ ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. పీఎస్ నారాయణ దర్శకత్వం వహించగా.. మల్లెల ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.అసలు కథేంటంటే..సిన్సియర్ ట్రావెల్స్ ఓనర్ కృష్ణ (కృష్ణసాయి) వజ్రాలు, బంగారం నగలు దొంగిలిస్తుంటాడు. శివారెడ్డితో కలిసి దొంతనాలు చేస్తూ వచ్చిన డబ్బులతో అనాథ పిల్లలకు పంచిపెడతాడు. నేహ (నేహా) నెక్లెస్ కూడా దొంగిలిస్తాడు. పట్టుబడి జైలుకు వెళ్లి వస్తాడు. కృష్ణ గురించి అసలు విషయం తెలుసుకుని అతన్ని ప్రేమిస్తుంది. ఇదే క్రమంలో ఒక కండీషన్ పెడుతుంది. మోసం చేయకుండా, జూదం ఆడకుండా 6 నెలల్లో 15 లక్షలు సంపాదించాలని చాలెంజ్ విసురుతుంది. ఈ క్రమంలో ధనిక కుటుంబానికి చెందిన అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి పనులు చేస్తూ, అతడిని బాగు చేస్తాడు. కానీ అనారోగ్యంగా ఉన్న వ్యక్తిని చంపినట్టు హత్య కేసులో ఇరుక్కుంటాడు. నమ్మించి భారీ దెబ్బ కొడతారు. ఇంతకీ కృష్ణను మోసం చేసింది ఎవరు? ఊహించని చిక్కుల్లో ఎలా ఇరుక్కుంటాడు? హత్య కేసు నుంచి బయటపడతాడా? లేదా? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..జ్యూవెల్ థీఫ్ అనే టైటిల్ వినగానే ఇదేదో దొంగల ముఠా కథ అయి ఉంటుందనుకుంటారు. అలాంటిదే అయినప్పటికీ ఇందులో ప్రేమకథను కూడా చూపించారు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్‌లో పాత్రల పరిచయం, హీరో, హీరోయిన్ల మధ్య ప్రేమాయణం చూపించారు. పూర్తి స్థాయి సస్పెన్స్ థ్రిల్లర్‌గానే వచ్చినప్పటికీ ఆడియన్స్‌కు అంతగా కనెక్ట్ కాలేదు.అయితే సెకండాఫ్‌లో కథలో వేగం పుంజుకుంటుంది. ఆ హత్య కేసు చుట్టే కథ మొత్తం తిరుగుగుతుంది. కథను తాను అనుకున్నట్లుగా ప్రేక్షకులకు చెప్పడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. తను రాసుకున్న కథను ఆకట్టుకునే రీతిలో తెరపై ఆవిష్కరించారు. కానీ స్క్రీన్ ప్లే మరింత ఆకట్టుకునేలా ఉంటే బాగుండేది. బ్యాంకాక్‌లో చిత్రీకరించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..హీరో కృష్ణసాయి తన పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో డాన్స్, మేనరిజం, హెయిర్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. కొన్ని సన్నివేశాలలో సూపర్ స్టార్ కృష్ణ పోలికలతో కనబడతారు. హీరోయిన్ మీనాక్షి జైస్వాల్ తన గ్లామర్, ఫర్మార్మెన్స్‌తో ఆకట్టుకుంది. సీనియర్ నటీనటులైన ప్రేమ, అజయ్ కథకు తమదైన నటనతో అలరించారు. ఇక పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతా రెడ్డి తమ పాత్రల్లో చక్కగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే ఎం.ఎం. శ్రీలేఖ అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది. బ్యాక్ గ్రాండ్ స్కోర్ ఫర్వాలేదు. సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ విజువల్స్ అందంగా చూపించారు. ఎడిటర్ జేపీ తన కత్తెరకు ఇంకాస్తా పని చెప్పాల్సింది. ఫైటర్ మాస్టర్ మార్షల్ రమణ స్టంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మూవీ రివ్యూ
నిఖిల్ సీనీ కెరీర్లో చెప్పుకోదగ్గ సినిమాల్లో ‘స్వామిరారా’ ఒక్కటి. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘కేశవ’ కూడా మంచి ప్రశంసలు దక్కించుకుంది. వీరిద్దరి కలయికలో వచ్చిన మూడో చిత్రమే ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’. హ్యాట్రిక్ మూవీ అంటే మంచి హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం వస్తుందన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. చిత్రబృందం కూడా ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా సినిమాను రిలీజ్ చేశారు. చడీ చప్పుడు లేకుండా నేడు(నవంబర్ 8) ప్రేక్షకుల ముందుకు వచ్చినీ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. రిషి(నిఖిల్) ఇండియాలో ఉన్నప్పుడు తార(రుక్మిణి వసంత్)ని చూసి ప్రేమలో పడతాడు. తన ప్రేమ విషయాన్ని ఆమెకు చెప్పేందుకు ప్రయత్నిస్తుంటాడు. స్నేహితుడు బయాజ్(వైవా హర్ష) చేసిన ఓ మిస్టేక్ కారణంగా అతన్ని ప్రేమ విఫలం అవుతుంది. దీంతో రిషి లండన్ వెళ్లిపోతాడు. అక్కడ తులసి(దివ్యాంశ కౌశిక్)తో పరిచయం ఏర్పడి,అది కాస్త ప్రేమగా మారుతుంది. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలని గుడికి వెళ్తారు. సరిగ్గా పెళ్లి సమయానికి తులసి కనిపించకుండా పోతుంది. అసలు తులసి ఎవరు? ఆమె ఎక్కడికి వెళ్లింది? తార లండన్ ఎందుకు వచ్చింది? లోకల్ డాన్ బద్రీనారాయణ(జాన్ విజయ్) రిషిని ఎందుకు వెంబడించాడు? బద్రీ అనుచరుడు మున్నా(అజయ్)కి తులసికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తారతో రిషి ప్రేమాయాణం ఎలా సాగింది? చివరకు రిషి ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘కార్తికేయ 2’తో నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. అలాంటి హీరో నుంచి ఓ కొత్త సినిమా వస్తుందంటే సహజంగానే భారీ హైప్ ఉంటుంది. కానీ ఈ చిత్రం విషయంలో అది ముందు నుంచి జరగలేదు. అసలు ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ అనే టైటిల్‌తో ఓ సినిమా వస్తుందనే విషయం కానీ, అందులో నిఖిల్ హీరోగా నటించాడనే విషయం చాలా మందికి తెలియదు. పైగా చిత్రబృందం కూడా పెద్దగా ప్రచార కార్యక్రమాలు చేపట్టలేదు. ఏదో మొక్కుబడిగా ఒకటి రెండు ఇంటర్వ్యూలు ఇచ్చి సినిమాలను వదిలారు. దీన్ని బట్టే సినిమాపై మేకర్స్‌కి కూడా నమ్మకం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సినిమా చూసిన ప్రేక్షకుడు కూడా అదే ఫీల్ అవుతాడు. ఈ సినిమాలో చెప్పుకోవడానికి కొత్త విషయం ఒక్కటైనా ఉందా అని బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఆసక్తి గొలిపే సంఘటన కానీ, మలుపు తిప్పే ట్విస్టులు కానీ, తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత కానీ లేకుండా దర్శకుడు చాలా ‘జాగ్రత్తగా’కథనాన్ని నడిపించాడు.రొటీన్ లవ్‌స్టోరీకి క్రైమ్ థ్రిల్లర్‌ని జోడించి ఓ డిఫరెంట్ స్టోరీని చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. అయితే అది తెరపై చూస్తే మాత్రం దర్శకుడు కొత్తగా ఏం చెప్పాలనుకునే విషయం మాత్రం అర్థం కాదు. నిఖిల్ సినిమా కదా కనీసం ఒక్కటి రెండు సీన్స్ అయినా ఆసక్తికరంగా ఉంటాయేమో అని ఎదురు చూసిన ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. సినిమా ప్రారంభం అయినా పది నిమిషాలకే ఇది రోటీన్ స్టోరీ అని అర్థం అయిపోతుంది. అక్కడక్కడా వచ్చే ట్విస్టులు కూడా ప్రేక్షకుడు ఈజీగా పసిగట్టగలడు. ప్రజెంట్, ఫ్లాష్‌బ్యాక్ అంటూ కథను ముందు , వెనక్కి తిప్పుతూ స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త ప్రేక్షకుడి సహనానికి పరీక్షగా మారిందే తప్పా ఎక్కడా ఆకట్టుకోలేకపోయింది.సత్య, సుదర్శన్ పాత్రలతో ఓ ప్రత్యేక ట్రాక్‌ని నడిపిస్తూ కథను చెప్పించారు. అందులో ఆరు నెలలు వెనక్కి వెళ్లడం, మళ్లీ రెండేళ్ల క్రితం జరిగిన స్టోరీ చెప్పడం.. గందరగోళానికి గురి చేసిందే తప్ప ప్రేక్షకుడిని కథలో లీనం చేయలేకపోయింది. మధ్య మధ్య వచ్చే పాటలు, యాక్షన్ సీన్స్ అన్ని ఇరికించినట్లుగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ కాస్త ఆకట్టుకుంటుంది. ఇక సెండాఫ్లో కథనం చాలా సింపుల్‌గా సాగుతుంది. ముగింపు కూడా రొటీన్‌గానే ఉంటుంది. ఎవరెలా చేశారంటే.. కార్తిక్ పాత్రలో నిఖిల్ చక్కగా నటించాడు.అయితే ఈ కథను ఆయన ఎలా ఒప్పుకున్నాడనేదే అర్థం కాదు. తార పాత్రకి రుక్మిణీ న్యాయం చేసింది. అయితే నటించగానికి పెద్ద స్కోప్‌లేని పాత్ర ఆమెది. ఇక దివ్యాంశ కౌశిక్‌కి ఓ మంచి పాత్ర లభించింది. నెగెటివ్ షేడ్స్ ఉన్న తులసి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. హర్ష కామెడీ అంతగా పండలేదు. సత్య, సుదర్శన్ సినిమాలో ఉన్నారే కానీ.. వారి స్థాయిలో నవ్వించలేకపోయారు. జాన్ విజయ్, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కార్తీక్ పాటలు, సన్నీ ఎం.ఆర్ నేపథ్య సంగీతం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్ డెస్క్ -
'బ్లడీ బెగ్గర్' సినిమా రివ్యూ
'స్టార్', 'దాదా' లాంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ మోస్తరు గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు కవిన్. ఇతడు బిచ్చగాడు పాత్రలో నటించిన మూవీ 'బ్లడీ బెగ్గర్'. దీపావళి సందర్భంగా తమిళంలో రిలీజైంది. వారం తర్వాత అంటే ఇప్పుడు (నవంబర్ 7) తెలుగులోనూ థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కళ్లు లేని కబోదిని బాబు, నడవలేని అభాగ్యుడిని బాబు.. అని మాయమాటలు చెప్పి డబ్బులు అడుక్కునే ఓ బిచ్చగాడు (కవిన్). వచ్చిన డబ్బులతో లైఫ్ జాలీగా గడిపేస్తుంటాడు. ఓ రోజు దినం భోజనాల కోసమని చాలామంది బిచ్చగాళ్లతో పాటు ఓ పెద్ద బంగ్లాకి వెళ్తాడు. భోజనాలు అన్నీ పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లిపోకుండా దొంగచాటుగా బంగ్లాలోకి వెళ్తాడు. కాసేపటివరకు బాగానే ఎంజాయ్ చేస్తాడు. కానీ ఊహించని పరిస్థితుల వల్ల లోపల ఇరుక్కుపోతాడు. ఆ తర్వాత ఏమైంది? బంగ్లా యజమానులు బిచ్చగాడిని ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ?(ఇదీ చదవండి: Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ)ఎలా ఉందంటే?సినిమాల్లో ఏదైనా పాత్ర చనిపోతే మనం బాధపడతాం. అది ఎప్పుడూ జరిగేదే. కానీ ఓ పాత్ర చనిపోయినప్పుడు కూడా మనకు నవ్వొచ్చింది అంటే అది డార్క్ కామెడీ సినిమా అని అర్థం. 'బ్లడీ బెగ్గర్' కూడా అలాంటి బ్లాక్ లేదా డార్క్ కామెడీ మూవీ అని చెప్పొచ్చు.ఓ పిల్లాడిని.. బర్త్ డే బంప్స్ పేరుతో మరో నలుగురు పిల్లలు కొట్టి చంపే సీన్‌తో సినిమా మొదలవుతుంది. కట్ చేస్తే బిచ్చగాడిని చూపిస్తారు. మాయమాటలు చెప్పి జనాల్ని ఎలా మోసం చేస్తున్నాడు? వచ్చిన డబ్బుతో జాలీగా ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు అనేది చూపించారు. ఈ బిచ్చగాడు.. ఓ పెద్ద భవంతిలోకి వెళ్లిన తర్వాత అసలు కథ మొదలవుతుంది.కొన్నాళ్ల క్రితం చనిపోయిన చంద్రబోస్ అనే స్టార్ హీరోది ఆ బంగ్లా. ఈయనకు కోట్ల ఆస్తి ఉంటుంది. నలుగురు పిల్లలు. డబ్బు, ఈగోలకు పోయి చంపడానికైనా సరే వెనకాడరు. ఆస్తి దక్కుతుందని బంగ్లాకు వచ్చిన వీళ్లకు.. తండ్రి తన సవతి కొడుకు పేరు మీద ఆస్తి అంతా రాసేశారని తెలిసి షాకవుతారు. ఆ సవతి కొడుకుని అప్పటికే లాయర్ చంపేసుంటాడు. వాడి స్థానంలో బిచ్చగాడిని ఇరికిస్తారు. ఆ తర్వాత డబ్బు కోసం ఒకరిని ఒకరు ఎలా చంపుకొన్నారనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: 'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ)రెగ్యులర్, రొటీన్ సినిమాలతో పోలిస్తే ఇదో డిఫరెంట్ కథ. బిచ్చగాడి చేతిలో డబ్బునోళ్లు కుక్క చావు చావడం అనే కాన్సెప్టే వింతగా ఉంటుంది. ఒక్కో పాత్ర తమ తోటి వాళ్లనే దారుణంగా చంపేస్తుంటారు. కాకపోతే ఆ సీన్స్‌లో మనం భయపడాల్సింది పోయి నవ్వుతాం. అంత వెరైటీగా ఉంటాయి. బిచ్చగాడు.. బంగ్లాలోకి ఎంటర్ అయిన తర్వాత కాసేపు బోర్ కొడుతుంది. కానీ సెకండాఫ్ మొదలైన తర్వాత మాత్రం ఊహించని ట్విస్టులు.. ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తాయి.భారీకాయంతో ఉండే మహిళ, జావెలిన్ త్రో విసిరే భర్త, వీళ్లకు పుట్టిన పిల్లాడు.. ఈ ముగ్గురు ఒక్కో వ్యక్తుల్ని చంపే సీన్స్ ఉంటాయి. ఇవైతే సర్ప్రైజ్ చేస్తాయి. ప్రారంభం నుంచి చూపించిన సన్నివేశాలు, వస్తువులు, ఉండే మనుషులు.. చెప్పాలంటే ప్రతి చిన్న పాయింట్‌ని దర్శకుడు మొదలుపెట్టిన తీరు.. ముగించిన విధానం అరె భలే తీశాడ్రా అనిపిస్తుంది. అలానే మనకు ఎంత డబ్బున్నా సరే కర్మ ఎప్పటికీ వదిలిపెట్టదనే విషయాన్ని కూడా ఇంట్రెస్టింగ్గా చూపించారు.ఎవరెలా చేశాడు?బిచ్చగాడి పాత్రలో కనిపించిన కవిన్ అదరగొట్టేశాడు. ప్రారంభంలో పది నిమిషాల్లోనే బిచ్చగాడు పాత్ర రూపు మారుతుంది. మరికాసేపు బిచ్చగాడి సీన్స్ ఉండుంటే బాగుండు అనిపిస్తుంది. అంత ఎంటర్టైనింగ్గా ఉంటాయి. చనిపోయిన నటుడి కొడుకు-కూతుళ్లు, మనవడు-మనవరాళ్లుగా చేసిన పాత్రధారులు ఎవరికి వాళ్లు అదరగొట్టేశారు. కన్నింగ్ లాయర్‌గా చేసిన సునీల్ సుకంద అయితే నచ్చేస్తాడు.టెక్నికల్ విషయాలకొస్తే దర్శకుడు శివబాలన్ ముత్తుకుమార్ తీసుకున్న పాయింట్ డిఫరెంట్. దాన్ని ప్రెజంట్ చేసిన విధానం అంతే డిఫరెంట్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్లేదు. సినిమాటోగ్రఫీ-ఎడిటింగ్ బాగున్నాయి. సినిమా అంతా బంగ్లాలోనే జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్లే నిర్మాణ విలువలు ఉన్నాయి. ఫైనల్‌గా చెప్పాలంటే ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. డార్క్ కామెడీ జానర్ నచ్చేవాళ్లకు మాత్రం ఎక్కుతుంది.-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన దేవర, వేట్టయన్, జనక అయితే గనక.. ఏది ఎందులో?) -
‘జితేందర్ రెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్: జితేందర్ రెడ్డినటీనటులు:రాకేశ్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్.. పలువురు ముఖ్య పాత్రలునిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డిదర్శకుడు: విరించి వర్మసంగీతం: గోపి సుందర్ఎడిటర్: రామకృష్ణ అర్రంవిడుదల తేది: నవంబర్ 8, 2024కథేంటంటే.. తెలంగాణలోని జగిత్యాలకు చెందిన దివంగత ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి బయోపిక్ ఇది. 1980లో జగిత్యాల పట్టణంలో నక్సలైట్లకు, ఆరెస్సెస్, ఏబీవీపీ నేతలకు మధ్య జరిగిన పోరాటంలో జితేందర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వామపక్ష ఉద్యమాలు బలంగా ఉన్న సమయంలో వారికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. అయితే జితెందర్(రాకేశ్ వర్రె) బాల్యం ఎలా గడిచింది? నక్సల్స్‌ని ఎందుకు ఎదురించాడు? కాలేజీ రోజుల్లో ఏబీవీపీ నాయకుడిగా రాకేశ్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? ఆయనపై ఆరెస్సెస్ నేత గోపన్న(సుబ్బరాజు) ప్రభావం ఎంతవరకు ఉంది? అతన్ని చంపడానికి నక్సల్స్ వేసిన ప్లాన్ ఏంటి? జితేందర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జగిత్యాలలో ఎలాంటి మార్పులు జరిగాయి? కాలేజీ స్నేహితురాలు, లాయర్ శారద(రియా సుమన్) అతనికి ఎలా తోడుగా నిలిచింది? చివరకు నక్సల్స్ చేతుల్లో ఎలా మరణించాడు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే.. జితేందర్ రెడ్డి గురించి జగిత్యాలతో పాటు కరీంనగర్ చుట్టుపక్క ప్రాంతాల వారికి బాగా తెలుసు. నక్సల్‌పై ఆయన చేసిన పోరాటం గురించి ఇప్పటికీ చెప్పుకుంటారు. అయితే కరీంనగర్ జిల్లా మినహా ఆయన గురించి, ఆయన కుటుంబ నేపథ్యం గురించి పూర్తిగా తెలిసినవారు అంతగా లేరు. జితేందర్ రెడ్డి ఏబీవీపీ నాయకుడని, నక్సల్స్‌కు వ్యతిరేకంగా పోరాడి వారి చేతుల్లోనే మరణించారనే విషయం మాత్రమే తెలుసు. ఈ చిత్రంలో జితేందర్ రెడ్డి గురించి బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు చెప్పారు. అయితే వీటిల్లో నిజం ఎంత అనేది పక్కకు పెడితే..సినిమా పరంగా చూస్తే దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్‌ని తెరపై చక్కగా, అందరికి అర్థమయ్యేలా చూపించాడు. జితేందర్ రెడ్డి బాల్యం మొదలు కొని చనిపోయే వరకు ఆయన జీవితంలో చోటు చేసుకున్న కీలక ఘటలన్నింటిని రెండున్నర గంటల సినిమాలో చూపించేశాడు. జితేందర్‌కి చిన్నప్పటి నుంచే దేశ భక్తి ఎక్కువని రిజిస్టర్ చేయడానికి ప్రారంభంలోనే పలు సీన్లను యాడ్ చేశాడు. సినిమాటిక్ లిబర్టీని ఎక్కువగానే వాడుకున్నాడు. యువకుడి ఎన్కౌంటర్ సీన్ తర్వాత కథపై ఆసక్తి పెంచుతుంది.ఫస్టాఫ్‌లో జితేందర్ రెడ్డి బాల్యంతో పాటు ఆయన స్టూడెంట్ లీడర్‌గా ఎదిగిన తీరును చూపిస్తూనే నక్సల్స్‌కి ఎలా టార్గెట్ అయ్యారనేది చూపించారు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్లలో నాటకీయత ఎక్కువైనట్లు కనిపిస్తుంది. కొన్ని చోట్ల సాగదీతగానూ అనిపిస్తుంది. ఇక సెకండాఫ్ మాత్రం ఆసక్తికరంగా సాగుతుంది. చాలా చోట్ల గూస్బంప్స్ సీన్లు ఉంటాయి. అప్పటి ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి నక్సల్స్‌పై చేసే ఫిర్యాదు సీన్, ఎన్నికల ప్రచారం, క్లైమాక్స్ సన్నీవేశాలు అదిరిపోతాయి. అయితే ఈ కథ మాత్రం ఓ వర్గం వారికి ఎంత బాగా నచ్చుతుందో అంతే స్థాయిలో మరో వర్గం నుంచి వ్యతిరేకత రావొచ్చేమో. సినిమాలో కీలకమైన పాత్రల్లో కూడా అంతగా గుర్తింపులేని నటీనటులను పెట్టుకోవడం కూడా కొంతవరకు మైనస్ అయిందనే చెప్పాలి.ఎవరెలా చేశారంటే..జితేందర్ రెడ్డి పాత్రకు రాకేశ్ వర్రే న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. తెరపై నిజంగానే జితెందర్ రెడ్డిని చూసినట్లుగా అనిపిస్తుంది. ఆర్సెసెస్ నాయకుడు గోపన్నగా సుబ్బరాజు తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక నక్సలైట్‌గా ఛత్రపతి శేఖర్ తన పాత్రలో పరకాయ ప్రవేశం చేశాడు. లాయర్‌గా రియా సుమన్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. జితేందర్ రెడ్డి పర్సనల్ పీఏ పాత్రలో రవిప్రకాశ్ బాగా మెప్పించాడు. రవి ప్రకాశ్ తండ్రి పాత్రను పోషించిన వ్యక్తితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సంగీతం బాగుంది. క్లైమాక్స్ సాంగ్స్ హృదయాలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. కొన్ని విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. - Rating: 2.75/5 -
అక్కడ సౌండ్ చేస్తే చచ్చిపోతారు.. ఓటీటీలోనే క్రేజీ మూవీ
విచిత్రమైన సినిమాల లిస్ట్ తీస్తే దాదాపుగా ఇంగ్లీష్ సినిమాలే ఉంటాయి. ఎందుకంటే భయపెట్టలన్నా, కవ్వించాలన్నా, గ్రాఫిక్స్‌తో మాయ చేయాలన్నా సరే వాళ్ల తర్వాతే ఎవరైనా అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ప్రపంచం అంతమయ్యే పరిస్థితులు వస్తే భూమిపై ఏం జరగొచ్చే అనే కాన్సెప్ట్‌తో లెక్కలేనన్ని మూవీస్ వచ్చాయి. అలాంటి ఓ సినిమానే 'ద సైలెన్స్'. 2019లో రిలీజైన ఈ మూవీ ఏ ఓటీటీలో ఉంది? నిజంగా ఇది అంత బాగుందా అనేది చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా)కథేంటి?ఓ పరిశోధనా బృందం.. 800 అడుగుల లోతున్న ఓ గుహని పగలగొట్టినపుడు వింత శబ్దాలు వినిపిస్తాయి. అక్కడ నుంచి 'వెస్ప్స్' అని పిలిచే కొన్ని వింత జీవులు.. సదరు సైంటిస్ట్లని క్రూరంగా చంపి బయటి ప్రపంచంలోకి వస్తాయి. వీటికి శబ్దం వస్తే నచ్చదు. అలాంటిది బయట ప్రపంచంలో మనుషులు చేసే శబ్దాలకు అల్లకల్లోలం అయిపోతాయి. మనుషుల్ని పీక్కుతింటుంటాయి. మరోవైపు అల్లీ ఆండ్రూస్ అనే అమ్మాయి తల్లిదండ్రులతో కలిసి జీవిస్తుంటుంది. వెస్ప్ అనే జీవులు అందరినీ చంపేస్తున్నాయని వీళ్ల కుటుంబానికి తెలుస్తుంది. దీంతో సౌండ్ చేయకుండా ఎక్కడికైనా వెళ్లి తలదాచుకోవాలని అనుకుంటారు. మరి వింత జీవుల నుంచి వీళ్ల తప్పించుకున్నారా? లేదా అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తీసింది కల్పిత కథే అయినప్పటికీ 'ద సైలెన్స్' చూస్తున్నంతసేపు మనకు వణుకు పుడుతుంది. ఒకవేళ మనకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏంటా అని భయమేస్తుంది. జస్ట్ గంటన్నర నిడివి ఉండే ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చక్కగా చూపించారు. అలానే ఓ ప్రమాదకర పరిస్థితి వచ్చినప్పుడు కుటుంబం ఒకరికరు ఎలా అండగా నిలబడాలో చూపించారు. ప్రధాన పాత్రధారి ఫ్రెండ్ క్యారెక్టర్‌తో ఫ్రెండ్షిప్ విలువ కూడా చెప్పకనే చెప్పారు.(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)ప్రస్తుతం మనలో చాలామంది పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాం. అడవుల్ని నరికేసి ఎన్నో జీవరాశులకు నిలువనీడ లేకుండా చేస్తున్నాయి. అవి ఏం చేయలేవు కాబట్టి సరిపోయింది. ఒకవేళ అవే గనకు వికృత రూపాల్ని సంతరించుకుని మనుషులపై తిరగబడితే ఏమవుతుంది అనే కాన్సెప్ట్‌తో తీసిన మూవీ ఇది. ఎక్కడో 800 అడుగుల లోతులో వాటి మానాన అవి ఉంటే, పరిశోధనల పేరుతో వాటిని ఇబ్బంది కలిగించడంతోనే వింత జీవులు భూమ్మీదకి వస్తాయి. మనిషికి కంటిపై కునుకు లేకుండా చేస్తాయి.ఇందులో ప్రధాన పాత్ర కుటుంబంపై ఎప్పటికప్పుడు వింత జీవులు ఎటాక్ చేస్తూనే ఉంటాయి. ప్రతిసారి వాటి నుంచి ఎలా తప్పించుకుని బయటపడ్డారనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ప్రతి నిమిషం ఉత్కంఠభరితంగా సాగే విజువల్స్, కూర్చున్న చోటు నుంచి కదలనివ్వకుండా స్టోరీ ఉన్న 'ద సైలెన్స్' మూవీ.. ఈ వీకెండ్ మీకు బెస్ట్ ఆప్షన్ అవ్వొచ్చు. ఇంకెందుకు లేటు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాపై ఓ లుక్కేసేయండి.- చందు డొంకాన -
Amaran Review: ‘అమరన్’ మూవీ రివ్యూ
శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ‘అమరన్’. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్, R. మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించారు. శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన “ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్” అనే పుస్తకంలోని “మేజర్ వరదరాజన్” చాప్టర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో టాలీవుడ్లో కూడా ఈ మూవీపై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే...ఉగ్రవాదులతో పోరాడి వీరమరణం పొందిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ ఇది. ఇందులో ముకుంద్ వరదరాజన్‌గా శివకార్తికేయన్ నటించగా.. అతని భార్య ఇందు రెబక్క వర్గీస్ పాత్రను సాయి పల్లవి పోషించారు. 2014 ఏప్రిల్ 25న మేజర్ ముకుంద్ వరదరాజన్ దక్షిణ కాశ్మీర్‌లోని ఒక గ్రామంలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందారు. ఇది మాత్రమే బయటి ప్రపంచానికి తెలుసు. తమిళనాడుకు చెందిన ముకుంద్ వరదరాజన్ ఇండియన్ ఆర్మీలోకి ఎలా వచ్చాడు? కేరళ యువతి ఇందు(సాయి పల్లవి) తో ఎలా పరిచయం ఏర్పడింది? వీరిద్దరి పెళ్లికి ఎదురైన సమస్యలు ఏంటి? 44 రాష్ట్రీయ రైఫిల్స్ చీతా విభాగానికి కమాండర్‌గా ఆయన అందించిన సేవలు ఏంటి? ఉగ్రవాద ముఠా లీడర్లు అల్తాఫ్ బాబా, అసిఫ్ వాసీలను ఎలా మట్టుపెట్టాడు? దేశ రక్షణ కోసం తన ప్రాణాలను ఎలా పణంగా పెట్టాడు? అనేదే ఈ సినిమా కథ.ఎలా ఉందంటే..బయోపిక్ మూవీ తీయడం దర్శకుడికి చాలా కష్టమైన పని. ఉన్నది ఉన్నట్లు చూపిస్తే.. అది డాక్యుమెంటరీ అవుతుంది. లేదా చొరవ తీసుకొని కమర్షియల్ హంగులను జోడిస్తే.. మొదటికే మోసం వస్తుంది. కథతో పాటు అందులోని ఆత్మనూ తీసుకుని తెరకెక్కిస్తే.. ఆ చిత్రాలను ప్రేక్షకులను ఆదరిస్తారు. ఈ విషయంలో డైరెక్టర్ రాజ్‌కుమార్ పెరియసామి సఫలం అయ్యాడు. 2014లో కశ్మిర్లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన ముకుంద్ వరదరాజన్ గురించి తెలియని చాలా విషయాలను వెండితెరపై చూపించాడు. దేశ రక్షణ కోసం ఇండియన్ ఆర్మీ చేస్తున్న గొప్ప సేవలను మరోసారి అందరికి గుర్తు చేశారు. ఉగ్రదాడిలో మేజర్ ముకుంద్ వీరమరణం పొందారనే విషయం మాత్రమే అందరికి తెలుసు. కానీ ఆయన కుటుంబ నేపథ్యం ఏంటి? ఇందు రెబక్క వర్గీస్‌తో ప్రేమాయణం.. వారిద్దరి పెళ్లికి వచ్చిన సమస్యలు? ఫ్యామిలీకి దూరంగా ఉంటూ దేశ రక్షణ కోసం ఆర్మీ చేస్తున్న సేవలను ప.. ప్రతీది కళ్లకు కట్టినట్లు చూపించారు. ఫస్టాఫ్ అంతా ముకుంద్-ఇందుల లవ్‌స్టోరీతో పాటు ఇరు కుటుంబాల నేపథ్యం..ఇండియన్ ఆర్మీలో ముకుంద్ అంచెలంచెలుగా ఎదిగి మేజర్ స్థాయికి ఎలా వచ్చారనేది గొప్పగా చూపించారు. ఇక సెకండాఫ్‌లో ఉగ్రవాదులను మట్టుపెట్టడానికి ముకుంద్ చేపట్టిన ఆపరేషన్ చుట్టే కథనం సాగుతుంది. అయితే ద్వితియార్థంలో కొన్ని చోట్ల కథనం సాగదీతగా అనిపిస్తుంది. 25 ఏప్రిల్ 2014న, షోపియాన్ జిల్లాలోని ఖాసిపత్రి గ్రామంలో ఎన్నికల అధికారుల హత్యలలో నిందితుడైన జైష్-ఎ-మహ్మద్ కమాండర్ అల్తాఫ్ వాసీతో పాటు మరికొంతమంది టెర్రరిస్టులను హతం చేయడానికి చేపట్టిన ‘ ఖాసిపత్రి’ ఆపరేషన్‌ను మేజర్ ముకుంద్ ఎలా విజవంతం చేశారనేది ఆసక్తికరంగా, ఎమోషనల్‌గా చూపించారు. ఈ సినిమాలో ఎమోషన్ బాగా వర్కౌట్ అయింది. సాయి పల్లవి, శివకార్తికేయన్ మధ్య వచ్చే చాలా సన్నివేశాలు మన మనసుని తడి చేస్తాయి. మన రక్షణ కోసం ఇండియన్ ఆర్మీ చేస్తున్న త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారమైన హృదయంతో థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధాన బలం శివకార్తికేయన్, సాయి పల్లవిల నటనే. మేజర్ ముకుంద్‌గా శివకార్తికేయన్, ఆయన భార్య ఇందుగా సాయి పల్లవి వారి వారి పాత్రల్లో జీవించేశారు. వీరిద్దరి మధ్య ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమా కోసం శివకార్తికేయన్ పడిన కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. చీతా టీమ్ సభ్యుడు విక్రమ్ పాత్రను పోషించిన నటుడితో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. జీవీ ప్రకాశ్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. కశ్మీర్ అందాలను చక్కగా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. -రేటింగ్: 3.25/5 -
KA Movie Review: ‘క’ మూవీ రివ్యూ
టైటిల్: కనటీనటులు: కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్, తదితరులునిర్మాత: చింతా గోపాలకృష్ణ రెడ్డి దర్శకత్వం: సుజీత్, సందీప్సంగీతం: సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియేల్, సతీష్ రెడ్డి మాసంఎడిటర్: శ్రీ వరప్రసాద్విడుదల తేది: అక్టోబర్ 31, 2024చాలా తక్కువ సమయంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్లాడు. అయితే ఇటీవల ఆయన నటించిన చిత్రాలన్ని బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కాస్త గ్యాప్ తీసుకొని ఏకంగా పాన్ ఇండియా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే ‘క’. టైటిల్ ప్రకటన నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆ ఆసక్తినికి మరింత పెంచేసింది. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 31) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ‘క’ కథేంటంటే..ఈ సినిమా కథంతా 1977లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్(కిరణ్ అబ్బవరం) అనాథ. చిన్నప్పటి నుంచి పక్కవాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఉంటుంది. తన వయసుతో పాటు ఈ అలవాటు కూడా పెరుగుతూ వస్తుంది. పోస్ట్ మ్యాన్ అయితే అన్ని ఉత్తరాలు చదువొచ్చు అనే ఆశతో ఆ ఉద్యోగంలో చేరుతాడు. జాబ్ కోసం రామ్(పెంపుడు కుక్క)తో కలిసి కృష్ణగిరి అనే గ్రామానికి వెళ్తాడు. అక్కడ పోస్ట్ మాస్టర్ రామారావు(అచ్చుత్ కుమార్) అనుమతితో పోస్ట్ మ్యాన్ అసిస్టెంట్‌గా జాయిన్ అవుతాడు. అదే గ్రామంలో ఉంటూ..రామారావు గారి అమ్మాయి సత్యభామ(నయని సారిక)తో ప్రేమలో పడతాడు. అనాథ అయిన వాసుదేవ్‌కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అయితే ఆ గ్రామంలో వరుసగా అమ్మాయిలు మిస్ అవుతుంటారు. వారిని కిడ్నాప్ చేసేదెవరు? కృష్ణగిరి గ్రామానికి చెందిన అమ్మాయిలే ఎందుకు మిస్ అవుతున్నారు? ఉత్తరాలు చదివే అలవాటు ఉన్న వాసుదేవ్‌కి తెలిసిన నిజమేంటి? వాసుదేవ్ ను ఓ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు ? లాలా, అబిద్ షేక్ ఎవరు? వారికి ఈ కథతో ఉన్న సంబంధం ఏంటి? చీకటి గదిలో బంధించిబడిన రాధ( తన్వి రామ్) ఎవరు? ఆమెకు వాసుదేవ్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..?ఇదొక డిఫరెంట్ సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దర్శకద్వయం సందీప్, సుజిత్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. వినడానికి చాలా డిఫరెంట్‌గా అనిపిస్తుంది. కానీ పేపర్‌పై రాసుకున్న కథను అర్థవంతంగా ప్రేక్షకులకు చూపించడంతో పూర్తిగా సఫలం కాలేదు.కథగా చూస్తే ఇది పాతదే. కానీ దానికి ఇచ్చిన ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుంది. సినిమా చివరి 20 నిమిషాల వరకు ప్రేక్షకుడికి ఒక రకమైన అభిప్రాయం ఉంటే..క్లైమాక్స్ తర్వాత ఆ అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది. కిరణ్‌తో పాటు చిత్రబృందం అంతా ప్రమోషన్స్‌లో చెప్పినట్లు నిజంగానే ఈ మూవీ క్లైమాక్స్ కొత్తగా ఉంటుంది. ఇలా కూడా ఓ కథను చెప్పొచ్చా? అని ప్రేక్షకుడు ఆలోచిస్తూ థియేటర్స్ నుంచి బయటకు వస్తారు.ముసుగు వేసుకున్న వ్యక్తి హీరోని ఓ గదిలో బంధించడం..పక్క గదిలో మరో హీరోయిన్ ఉండడం..ఇద్దరు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్పడంతో కథపై ఆసక్తి పెరుగుతుంది. అసలు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరు? ఎందుకు హీరోని బంధించాడు? తర్వాత ఏం జరుగుతుంది? అనే క్యూరియాసిటి సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడికి కలిగించారు. ముసుగు వ్యక్తిని కొంతమంది గుర్తించినా..చివర్లో ఆ పాత్ర ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఉమెన్ ట్రాఫికింగ్ పాయింట్ రివీల్ అయ్యేవరకు దర్శకులు కథను నడిపించిన తీరు బాగుంది. అయితే ఉమెన్ ట్రాఫికింగ్ ఒక్కటే ఈ సినిమాలో ప్రధానాంశం కాదు. ముఖమైన మరో పాయింట్ కూడా ఉంటుంది. ఆ పాయింట్ కూడా పాతదే అయినా దాని చుట్టు అల్లుకున్న కథనం కొత్తగా ఉటుంది. ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లో వరుసగా ట్విస్టులు రివీల్ అవుతూ ఉంటాయి. అయితే ఓ ఫ్లోలో వెళ్తున్న కథకి హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్స్ బ్రేకులు వేసినట్లుగా అనిపిస్తుంది. సంభాషణలు కూడా బలంగా ఉండకపోవడం మరో మైనస్. అయితే చివరి 20 నిమిషాలో వచ్చే సన్నివేశాలు మాత్రం సినిమా పై అప్పటి వరకు ఉన్న ఒపీనియన్‌ను మారుస్తాయి. క్లైమాక్స్ చాలా కొత్తగా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..గత సినిమాలతో పోల్చుకుంటే నటన పరంగా కిరణ్ అబ్బవరం చాలా మెరుగుపడ్డాడు. పోస్ట్ మ్యాన్ వాసుదేవ్ పాత్రలో జీవించేశాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశాడు. డైలాగ్ డెలివరీ కూడా పర్వాలేదు. హీరోయిన్ నయని సారిక తెరపై చాలా అందంగా కనిపించింది. అయితే ఆమె పాత్ర నిడివి తక్కువే అని చెప్పాలి. ఇక మరో హీరోయిన్ తన్వి రామ్‌కి మంచి పాత్రే లభించింది. స్కూల్ టీచర్ రాధగా ఆమె చక్కగా నటించింది. బలగం జయరామ్, అచ్యుత్, రెడిన్ కింగ్ స్లే, శరణ్య, అజయ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. 70ల కాలంనాటి పరిస్థితులను తెరపై చక్కగా చూపించారు. రాత్రివేళ వచ్చే సీన్స్ అద్భుతంగా తీశారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'లక్కీ భాస్కర్' సినిమా రివ్యూ
టైటిల్: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, సచిన్ ఖేడ్కర్, టిను ఆనంద్ తదితరులునిర్మాత: నాగవంశీడైరెక్టర్: వెంకీ అట్లూరిమ్యూజిక్: జీవీ ప్రకాష్ కుమార్విడుదల తేదీ: 2024 అక్టోబర్ 31మహానటి, సీతారామం సినిమాలతో తెలుగులోనూ చాలా క్రేజ్ తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఇతడి లేటెస్ట్ తెలుగు మూవీ 'లక్కీ భాస్కర్'. దీపావళి సందర్భంగా థియేటర్లో రిలీజ్ చేశారు. ఓ రోజు ముందే ప్రిమియర్స్ వేశారు. ఇంతకు సినిమా ఎలా ఉంది? దుల్కర్ మరో హిట్టు కొట్టాడా? తెలియాలంటే రివ్యూ చూసేయండి.కథేంటి?ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది. దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ.ఎలా ఉంది? 1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ దీని మీద వెబ్ సిరీస్ కూడా తీశారు. హర్షద్ మెహతా.. ప్రభుత్వాన్ని, స్టాక్ ఎక్సేంజ్ ని బురిడీ కొట్టించాడు. ఒకవేళ అతడ్ని ఓ బ్యాంక్ లో పనిచేసే కామన్ మాన్ బురిడీ కొడితే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ తో తీసిన సినిమానే లక్కీ భాస్కర్.ఈ స్టాక్ ఎక్సేంజ్, బ్యాంక్ ల్లో చాలా స్కామ్ లు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మనం న్యూస్ లో చూస్తుంటాం కానీ ఓ పట్టాన అర్థం కావు. ఒకవేళ ఎవరైనా అర్థం అయ్యేలా చెబితే.. కాదు కాదు చూపిస్తే ఎలా ఉంటుంది. వినడానికే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది కదా. లక్కీ భాస్కర్ చూస్తున్న ప్రతి సెకండ్ అలానే అనిపిస్తుంది.సీబీఐ వాళ్ళు భాస్కర్ ని అదుపులోకి తీసుకుని, బ్యాంక్ కి తీసుకుని వెళ్లి, విచారణ ప్రారంభించడంతో సినిమా మొదలౌతుంది. కట్ చేస్తే కథ మూడేళ్ల వెనక్కి వెళ్తుంది. అసలు భాస్కర్ ఎవరు? అతడి ఫ్యామిలీలో ఎవరెవరు ఉన్నారు అనేది స్వయంగా భాస్కర్.. ప్రేక్షకుల వైపు చూసి చెప్తుంటాడు. ఈ జర్నీలో డబ్బు.. భాస్కర్ ని ఎలా మార్చింది. కొందరి వల్ల చివరకు భాస్కర్.. ఈ స్కామ్ లో నుంచి బయట పడ్డాడా లేదా అనేది మీరు థియేటర్ లోనే చూడాలి.ఇందులో పేరుకే భాస్కర్ హీరో క్యారెక్టర్ కానీ.. అతడి కూడా ఉండే ప్రతి పాత్ర కథలో భాగమే.. ఏదో ఓ సందర్భంలో ఓ పాత్ర వల్ల స్టోరీ మలుపు తిరుగుతుంది. ఆ ట్విస్ట్ లు గురించి ఇక్కడ చెప్తే మీరు థ్రిల్ మిస్ అవుతారు.అన్ని ప్లస్ లేనా మైనస్ పాయింట్స్ ఏం లేవా అంటే కొన్ని కొన్ని ఉన్నాయి. ఈ సినిమా కథలో బ్యాంక్, స్టాక్ మార్కెట్ లో షేర్స్, హవాలా లాంటివి వినిపిస్తుంటాయి. కాబట్టి వాటి మీద మినిమం అవగాహన ఉంటే పర్లేదు. లేదంటే మాత్రం సినిమా అర్థం కాదు. కొన్ని చోట్ల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎందుకో లౌడ్ గా అనిపించింది.ఈ సినిమా 1992 టైం లైన్ లోనే జరుగుతుంది. దీంతో హర్షద్ మెహతా ని పోలిన పాత్ర ఒకటి పెట్టారు. హర్ష మెహ్రా అనే పేరు పెట్టారు. కానీ ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఐతే ప్రైవేటు బ్యాంక్ ల్లో ఎలాంటి స్కాములు జరుగుతాయి అనేది మాత్రం ఓ సగటు ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా కన్విన్సింగ్ గా చెప్పడం బాగుంది.ఎవరెలా చేశారు?భాస్కర్ పాత్రలో దుల్కర్ జీవించేసాడు. ప్రతి సందర్భంలోనూ భాస్కర్ గెలవాలని మనం అనుకుంటాం. భాస్కర్ భార్య సుమతిగా చేసిన మీనాక్షి చూడ్డానికి బాగుంది. కాకపోతే భాస్కర్ రోల్ వల్ల ఈమెకు సరైన స్పేస్ దక్కలేదేమో అనిపిస్తుంది. కొడుకు, తండ్రి పాత్రలు ఎందుకు ఉన్నాయిలే అనుకుంటాం. వీటితో పాటు ఆంటోనీ రోల్ కథని మలుపు తిప్పుతాయి. వీళ్లతో పాటు బ్యాంక్ మేనేజర్, భాస్కర్ ఫ్రెండ్, బార్ డ్యాన్సర్.. ఇలా ఒకటేమిటి చివరకు బిచ్చగాడి పాత్రని కూడా వేరే లెవెల్ లో వాడేసారంతే.టెక్నికల్ విషయాలకు వస్తే డైరెక్టర్ ని ఎంత మెచ్చుకున్న తక్కువే. రెగ్యులర్ గా మనం న్యూస్ పేపర్స్ లో చదివే స్కామ్స్ తో ఓ కల్పిత కథ రాసి, దాన్ని రేసీ థ్రిల్లర్ మూవీలా తీయడం సూపర్. డైలాగ్స్ కూడా ఆలోచింపజేసేలా ఉన్నాయి. శ్రీమతి గారు పాట బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గుడ్. సినిమాటోగ్రఫీ సూపర్. సెట్స్ గురించి బాగా డబ్బులు ఖర్చుపెట్టారు. ప్రతి సీన్ లో అది కనిపిస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే.. సినిమాలో హీరో లక్కీ. ఈ మూవీ చూసిన ప్రేక్షకుడు అంతకంటే లక్కీ..Rating : 3.25/5- చందు డొంకాన -
'కొండల్' సినిమా రివ్యూ (ఓటీటీ)
నడి సముద్రంలో ఓ బోటు. అందులోనే రెండున్నర గంటల సినిమా అంటే.. హా ఏముంటుందిలే అనుకోవచ్చు. కానీ 'కొండల్' అనే డబ్బింగ్ బొమ్మ నిజంగానే ఆశ్చర్యపరిచింది. చూస్తున్నంతసేపు సముద్రం మధ్యలో బోటులో ఉన్నామా అనేంతలా మనల్ని ఇన్వాల్వ్ చేస్తుంది. నెట్‌ఫ్లిక్స్‌లో రీసెంట్గా రిలీజైన ఈ మూవీ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఇది ఎలా ఉందంటే?'కొండల్' కథ విషయానికొస్తే.. అదో సముద్ర తీర ప్రాంతం. ఎందరో మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవిస్తుంటారు. వాళ్లలో ఒకడే ఇమ్మాన్యుయేల్ (ఆంటోని వర్గీస్). ఎలాంటి వాడితోనైనా సరే ఢీ కొట్టే రకం. ఓసారి కొత్త బృందంతో కలిసి సముద్రంలోకి చేపల వేటకు వెళ్తాడు. తమ బోటులోకి కొత్తగా వచ్చిన ఇతడిపై జూడ్ (షబీర్) గ్యాంగ్ కన్నేసి ఉంచుతారు. కొన్నిరోజులకు ఇమ్మాన్యుయేల్ గురించి ఓ సీక్రెట్ తెలుస్తుంది. కాదు కాదు అతడే చెబుతాడు. దీంతో ఒకరిని ఒకరు చంపుకొనేంత వరకు వెళ్తారు? ఇమ్మాన్యుయేల్ ఎవరు? డేనియల్ అనే వ్యక్తితో ఇతడికి సంబంధం ఏంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ మిస్టరీ థ్రిల్లర్.. ఇప్పుడు తెలుగులో)'కొండల్' గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదో రివేంజ్ స్టోరీతో తీసిన ఇంటెన్స్ యాక్షన్ డ్రామా. రెండున్నర గంటల సినిమాలో దాదాపు రెండు గంటల పాటు కథంతా సముద్రం మధ్యలో ఓ బోటులోనే ఉంటుంది. అసలు బోటులో ఏం స్టోరీ చెప్పగలరు? మహా అయితే ఏం చూపిస్తారులే అని మనం అనుకుంటే పప్పులే కాలేసినట్లే.మత్స్యకారులు జీవితాలు ఎలా ఉంటాయి? రోజుల తరబడి వేటకు వెళ్లిన వాళ్లు ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటారు? ఒకవేళ వేటకు వెళ్లిన వాళ్లలో గ్రూపులు ఏర్పడితే ఎలా ఉంటుంది అనే విషయాలని చాలా నేచురల్‌గా చూపించారు. ఇవన్నీ ఓ వైపు నడుస్తుంటాయి. మరోవైపు రివేంజ్ డ్రామా నడిపిన విధానం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.ఫస్టాఫ్ అంతా స్టోరీ సెటప్ కోసం వాడుకోగా.. ఇంటర్వెల్‌కి హీరో గురించి ఓ ట్విస్ట్ రివీల్ అవుతుంది. అక్కడ నుంచి అసలు కథ మొదలవుతుంది. హీరో vs విలన్ అన్నట్లు సాగుతుంది. అయితే సెకండాఫ్‌లో కొన్ని సీన్లు సాగదీతగా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్‌లో షార్క్ ఫైట్ చూసిన తర్వాత అవన్నీ మర్చిపోతాం. ఇంకా చెప్పాలంటే షార్క్ ఫైట్ అనేది 'దేవర'లో కంటే ఈ సినిమాలో ఇంకాస్త రిచ్‌గా చూపించారు.సినిమాలోని సీన్స్‌తో పాటు ప్రతి మాట కూడా ఆకట్టుకుంటుంది. తెలుగు డబ్బింగ్ బాగుంది. నటీనటులెవరు అనే విషయం పక్కనబెడితే తెరపై పాత్రల స్వభావం మాత్రమే కనిపిస్తుంది. మూవీలో యాక్ట్ చేసిన ఏ ఒక్కరు కూడా తెలుగు ప్రేక్షకులకు తెలిసుండరు. కానీ సినిమా మొదలైన కాసేపటికే లీనమైపోతాం. ఓటీటీలో ఏదైనా మంచి యాక్షన్ డ్రామా మూవీ చూడాలనుకుంటే 'కొండల్' వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్.-చందు డొంకాన(ఇదీ చదవండి: 'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
ఓటీటీలో 'ఈ కలయిక కాస్త ఘాటు గురూ'.. తెలుగులో స్ట్రీమింగ్
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘ది యూనియన్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం. ఎక్కడైనా ప్రేమికులు చాలా ఏళ్ల తరువాత కలిస్తే, చాలా హాట్ హాట్‌గా ఉంటుంది. కానీ ఈ ‘ది యూనియన్’ సినిమాలో ΄పాత ప్రేమికులు కలిసిన తరువాత ఇంత ఘాటా అని చూసే ప్రేక్షకుడు నోరెళ్లబెట్టాల్సిందే. అంతలా ఏముందీ సినిమాలో ఓసారి విశ్లేషించుకుందాం. జూలియన్ ఫరియానో దర్శకత్వం వహించిన స్పై కామెడీ థ్రిల్లర్ సినిమా ‘ది యూనియన్’. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమాని చూడవచ్చు. హేమాహేమీలైన హాలీబెర్రీ, మార్క్ వాబర్గ్, మైక్ కాల్టర్ నటించిన ఈ సినిమా పెద్దలకు మాత్రమే. ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... కథానాయకుడు మైక్ మెకన్నా న్యూజెర్సీ నగరంలో ఓ సాధారణ బిల్డింగ్ కార్మికుడు. రోజువారీ కష్టంతో తన పనేదో తాను చూసుకుపోయే మనస్తత్వం గలవాడు. కాకపోతే కాస్తంత అమ్మాయిల పట్ల పిచ్చి ఎక్కువ. హాయిగా సాగుతున్న మైక్ జీవితంలో అనుకోని ఓ అవాంతరం తన హైస్కూల్ క్రష్ అయిన రోక్సేన్ హాల్ ద్వారా ఎదురవుతుంది. 25 ఏళ్ల తరువాత కలిసిన తన ప్రేమను గుర్తు చేసుకుంటూ డాన్స్ చేస్తూ స్పృహ తప్పుతాడు మైక్. అలా న్యూజెర్సీలో స్పృహ తప్పిన మైక్ తిరిగి కళ్లు తెరిచేసరికి లండన్‌లో ఉంటాడు. మరోపక్క ఓ బ్రీఫ్‌కేస్ కోసం ఇరాన్ తీవ్రవాదులు, నార్త్ కొరియా ఏజెంట్లు, రష్యన్ గూఢచారులు తెగ వెతికేస్తుంటారు. ఆ బ్రీఫ్‌కేస్‌లో చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని కోసం యూనియన్ అనే సంస్థ తమ ప్రతినిధులను చాలా మందినే పొగొట్టుకుంటుంది. అసలు ఆ బ్రీఫ్‌కేస్‌కి, కథానాయకుడు మైక్‌కి సంబంధం ఏంటి? 25 ఏళ్ల తరువాత మైక్ ప్రియురాలు రోక్సేన్ హేల్ అతన్ని ఎందుకు కలిసింది? కలిసిన తరువాత అతను లండన్‌లో ఉండడం ఏంటి? అయినా ఓ ప్రేమికుల కలయికలో ఇంత ఘాటైన ట్విస్టులా? వీటి సమాధానాల కోసం ‘ది యూనియన్’ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా ప్రేక్షకుడిని గిలిగింతలు పెట్టిస్తూ ఆద్యంతం థ్రిల్లింగ్ కలిగిస్తుందనడంలో సందేహం లేదు. వీకెండ్ మస్ట్ వాచ్ మూవీ ‘ది యూనియన్’.– ఇంటూరు హరికృష్ణ -
షాషాంక్ రెడింప్షన్ సినిమా రివ్యూ
ఆశ.. చిన్నదో, పెద్దదో ప్రతి మనిషికీ ఉంటుంది. కష్టాల్లో ఉన్నవాడికి ఏదో ఒకరోజు అవి గట్టెక్కపోవన్న ఆశ.. సంతోషాల్లో ఉన్నవానికి ఎప్పటికైనా ఈ సంతోషం తనతోనే ఉండిపోవాలన్న ఆశ! ఈ ఆశే మనిషిని బతికిస్తుంది. చుట్టూ గాఢాంధాకారలు కమ్ముకున్నా వెలుగు వైపు నడిపిస్తుంది. అలాంటి సినిమానే ద శశాంక్ రెడింప్షన్.ఈ సినిమా ఇప్పటిది కాదు. 1994లో వచ్చింది. స్టీఫెన్ కింగ్ రాసిన రిటా హేవర్త్ అండ్ షాషాంక్ రిడంప్షన్ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. చేయని తప్పుకు నిందిస్తేనే కయ్యిమని లేస్తాం. అలాంటిది చేయని నేరానికి రెండు జీవితకాలాల జైలుశిక్ష విధిస్తే..? ఈ సీన్‌తోనే కథ మొదలవుతుంది.బ్యాంకర్ ఆండీ (టిమ్ రాబిన్స్).. భార్య తనను వదిలేసి ప్రియుడే కావాలనుకోవడాన్ని తట్టుకోలేకపోతాడు. ఆమెను చంపడానికి పూటుగా తాగి గన్ లోడ్ చేసుకుని వెళ్తాడు. కానీ మనసొప్పక తిరిగొచ్చేస్తాడు. అయితే అక్కడ నిజంగానే హత్య జరుగుతుంది. హీరో భార్య, ప్రియుడు ఇద్దరూ చనిపోతాడు. అక్కడ దొరికిన ఆనవాళ్ల ఆధారంగా ఆండీని జైల్లో వేస్తారు. చంపాలనుకున్నమాట వాస్తవమే కానీ చంపలేదని చెప్తే ఎవరూ నమ్మరు. తాను నిర్దోషినని చెప్తే ఎగతాళి చేస్తారు. తన మాట ఎవరూ లెక్కచేయరని తెలసుకున్న అతడు నాలుగుగోడల మధ్య ఇమిడేందుకు అలవాటుపడతాడు. ఒంటరిని అన్న భావం దగ్గరకు రాకూడదని ఫ్రెండ్స్‌ను ఏర్పరుచుకుంటాడు. అయితే ఎప్పటికైనా బయటకు వెళ్లి ప్రశాంతమైన జీవితం గడపాలన్నది తన కోరిక. అది చూసి ఇతరులు నవ్వుకున్నా తను మాత్రం ఆశ చంపుకోలేదు. ఆ ఆశే అతడిని జైలు నుంచి పారిపోయేలా చేస్తుంది. అతడి స్నేహితుడు ఆత్మహత్య వైపు అడుగులు వేయకుండా స్వేచ్ఛా జీవితం కోసం తపించేలా చేస్తుంది. ఐఎమ్‌డీబీలో 9.3 రేటింగ్ ఉన్న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది. జైల్లో ఉన్నవారిదే కాక అక్కడి నుంచి బయటకు వచ్చినవారి మానసిక స్థితి ఎలా ఉంటుందన్నది చక్కగా చూపించారు. ఏళ్లు గడుస్తున్నా వారి జీవనవిధానంలో ఎటువంటి మార్పు ఉండదు. ఈ సినిమా హత్య, హింస, తిరుగుబాటును చూపించలేదు.. కేవలం విముక్తి, ఆశ చుట్టూ మాత్రమే తిరిగింది. అలాగే నిజమైన స్నేహం ఎలా ఉంటుందనేది ఆకట్టుకునేలా ఆవిష్కరించారు. రెండు జీవితకాలాల జైలుశిక్ష పడ్డా కుంగిపోకుండా స్వేచ్ఛ కోసం హీరో పడే తపన చూస్తుంటే ముచ్చటేయక మానదు. సినిమా ముగిసినప్పుడు మనకూ జీవితం మీద కొత్త ఆశలు చిగురించిన భావన కలుగుతుంది. డైరెక్టర్ ఫ్రాంక్ డారాబాంట్ ఈ చిత్రాన్ని అద్భుత కళాఖండంగా మలిచాడు. ఈ మూవీని అందరికీ ఒక ఫిలాసఫీగా అందించాడు. -
సాఫ్ట్వేర్ కుర్రాడితో 'లగ్గం'.. ఎలా ఉందంటే?
టైటిల్: లగ్గంనటీనటులు: సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా, రాజేంద్రప్రసాద్, ఎల్బీ శ్రీరామ్, రఘుబాబు, రోహిణి తదితరులుదర్శకుడు: రమేశ్ చెప్పాలనిర్మాత: వేణుగోపాల్రెడ్డివిడుదల తేదీ: 25 అక్టోబర్ 2024సాయిరోనాక్, ప్రగ్యా నగ్రా జంటగా నటిస్తున్న చిత్రం లగ్గం. ఈ సినిమాకు రమేష్ చెప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదలైంది. లవ్ అండ్ ఫ్యామిలీ అభిమానులను ఏమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం.అసలు కథ ఏంటంటే?సదానందం (రాజేంద్రప్రసాద్) తన కూతురు మానస ( ప్రగ్యా నగ్రా) కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు. తన సొంత చెల్లెలైన సుగుణ( రోహిణి) కొడుకు (సాయి రోనక్) ని చూడడానికి సిటీకి వస్తాడు. అక్కడ అల్లుడి ఖరీదైన జీవితం, జీతం,సాప్ట్వేర్ లైఫ్ చూసి ఎలాగైనా సరే తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలి అని డిసైడ్ అవుతాడు. ఇంతకీ తన చెల్లి సుగుణ( రోహిణి)తో మాట్లాడి కూతురి లగ్గం ఖాయం చేసుకున్నాడా? ఆ తర్వాత తన కుమార్తె జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే లగ్గం కథ.ఎలా ఉందంటే...తెలంగాణ నేపథ్యంలో కావడంతో అక్కడి సంప్రదాయాల్ని , పద్ధతుల్ని ఆచారాల్ని, చూపిస్తూ కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథ పెళ్లి సంబురాల వైపు నడిపించాడు. బంధువులు, పెళ్లి, పద్ధతులు, ఆచారాలను ఆడియన్స్‌కు పరిచయం చేస్తూ మెల్లగా కథలోకి తీసుకెళ్లాడు. లగ్గం చుట్టూ ఉండే సరదా సరదా సన్నివేశాలతో , బంధువుల పాత్రలు నిజజీవితంలో ప్రేక్షకులను టచ్ చేసేలా చేశాడు దర్శకుడు. ఇంటర్వెల్ బ్యాంగ్‌తో ఆడియన్స్‌ను ఆలోచనలో పడేశాడు. ఫస్ట్ హాఫ్‌లో క్యారెక్టర్స్ పరిచయాలతో కథ కాస్తా మెల్లగానే సాగినట్లు అనిపిస్తుంది. ఇకపోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథఊహించని మలుపులు తిరుగుతుంది. ప్రారంభం నుంచే ఆడియన్స్‌ను ఎమోషనల్ మూడ్‌లోకి తీసుకెళ్లిపోతుంది. ద్వితీయభాగం మొదలైన కాసేపటికే ట్విస్టులు , ఎమోషనల్ సీన్స్ సగటు ప్రేక్షకుడిని దర్శకుడు కట్టిపేడేసేలా ఉన్నాయి. ఒక్క లగ్గం చుట్టూ ఇన్ని జరుగుతాయా? అనే అనుమానాన్ని ఆడియన్స్‌లో కలిగించాడు. ఒక సాఫ్ట్వేర్ లైఫ్, ఓ తండ్రి తన కూతురి కోసం పడే తపన, కుటుంబానికి దూరంగా బతికే వారి కష్టాలతో ఫుల్ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు రమేష్ చెప్పాల. క్లైమాక్స్ సీన్‌తో సగటు ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పించేశాడు. ఓవరాల్‌గా చూస్తే మంచి లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్లా అనిపించింది.ఎవరెలా చేశారంటే..సాయిరోనాక్ నటనలో మరోసారి తనదైన మార్క్ చూపించాడు. ప్రగ్యా నగ్రా తన అందంతో అభిమానులను ఆకట్టుకుంది. ఇక రాజేంద్రప్రసాద్, రోహిణి తమ నటనతో మెప్పించారు. రఘుబాబు , ఎల్బీ శ్రీరామ్, సప్తగిరి , రచ్చ రవి,చమ్మక్ చంద్ర , వడ్లమాని శ్రీనివాస్ , కిరీటి , అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత విషయానికొస్తే బాలరెడ్డి (బేబీ ఫేమ్) సినిమాటోగ్రఫీ బాగుంది. మణిశర్మ బీజీఎం ఈ సినిమాకు మరో ప్లస్. చరణ్ అర్జున్ పాటలు బాగున్నాయి. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గుట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్- 2.75/5 -
Pottel Review: ‘పొట్టేల్’ మూవీ రివ్యూ
టైటిల్: పొట్టేల్నటీనటులు: యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, ప్రియాంక శర్మ, నోయల్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులునిర్మాణ సంస్థ: నిసా ఎంటర్టైన్మెంట్స్, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్నిర్మాతలు: నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగెదర్శకత్వం: సాహిత్ మోత్కూరిసంగీతం: శేఖర్ చంద్రసినిమాటోగ్రఫీ: మోనిష్ భూపతి రాజుఈ మధ్యలో కాలంలో బాగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించుకున్న చిన్న సినిమా ‘పొట్టేల్’. పెద్ద మూవీ స్థాయిలో ప్రమోషన్స్ చేపట్టారు. దానికి తోడు ఓ ప్రెస్మీట్లో అనన్య నాగళ్లను ఓ లేడి రిపోర్టర్ అడిగిన ప్రశ్న వివాదాస్పదంగా మారడంతో ‘పొట్టేల్’మూవీ గురించి పెద్ద చర్చే జరిగింది. మొత్తంగా ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాల్లో ‘పొట్టేల్’పైనే కాస్త హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాలతో నేడు (అక్టోబర్ 25) ప్రేక్షకుల ముందుకు వచ్చిన పొట్టేల్ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..1970-80 మధ్యకాలంలో సాగే కథ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్లో ఉన్న ఓ చిన్న పల్లెటూరు గుర్రంగట్టు. అక్కడ పటేళ్లదే రాజ్యం. ఆ ఊరిలో 12 ఏళ్లకు ఒక్కసారి బాలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో పొట్టేల్ని బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండు సార్లు జాతర సమయానికి బలి ఇచ్చే పొట్టేల్ చనిపోవడంతో ఆ ఊర్లో కరువు తాండవిస్తుంది. అలాగే ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోతుంటారు. ఈసారి జాతరకు ఎలాగైనా పొట్టేల్ని బలి ఇవ్వాలని, దాని కాపాడాల్సిన బాధ్యతను గొర్రెల కాపరి పెద్ద గంగాధరి (యువచంద్ర కృష్ణ)కు అప్పగిస్తారు. పటేల్(అజయ్) చేసే మోసాలన్నీ గంగాధరికి తెలుసు. తన అవసరాల కోసమే బాలమ్మ సిగం(పూనకం రావడం) వచ్చినట్లు నటిస్తున్నాడని.. ఆయన మాటలు నమ్మొదని చెప్పినా ప్రజలెవరు పట్టించుకోరు. భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ల) మాత్రం గంగాధరి మాటలను నమ్ముతుంది. పటేళ్ల పిల్లల మాదిరే తన కూతురు సరస్వతికి కూడా చదువు చెప్పించాలనుకుంటాడు. ఇది పటేల్‌కు నచ్చదు. దీంతో ఊరి బడి పంతులు(శ్రీకాంత్ అయ్యంగార్)ని బ్రతిమిలాడి కూతురికి రహస్యంగా చదువు చెప్పిస్తాడు. ఇంతలో ఊరి జాతర దగ్గర పడుతుందనగా బాలమ్మ పొట్టేల్ కనిపించకుండా పోతుంది. గాంగాధరి తప్పిదం వల్లే పొట్టేల్ పోయిందని.. దాని తీసుకురావాల్సిన బాధ్యత అతనిదే అని పటేల్ ఆదేశిస్తాడు. అంతేకాదు బాలమ్మ పూనినట్లు నటిస్తూ.. పొట్టేల్ని తీసుకురాకుంటే ఈసారి జాతరలో గంగాధరి కూతురు సరస్వతిని బలి ఇవ్వాలని చెబుతాడు. ఊరి జనాలు కూడా ఇది బాలమ్మ ఆదేశం అని నమ్ముతారు. అసలు పొట్టేల్ ఎలా మాయం అయింది? కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం గంగాధరి ఏం చేశాడు. చివరకు పొట్టేల్ దొరికిందా లేదా? పటేల్ నిజస్వరూపం తెలిసిన తర్వాత ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే?ఎంత మంచి కథ అయినా సరే తెరపై ఆసక్తికరంగా చూపిస్తేనే విజయం సాధిస్తుంది. రెండున్నర గంటల పాటు ప్రేక్షకుడు ఆ కథ గురించే ఆలోచించాలి. ఆ పాత్రలతో కనెక్ట్ కావాలి. ప్రేక్షకుడిని ఎంటర్టైన్ చేస్తూ ఇవ్వాలనుకున్న సందేశాన్ని ఇచ్చేయాలి. ఇదంతా జరగాలంటే కథతో పాటు కథనాన్ని బలంగా రాసుకోవాలి. కథ బాగుండి.. దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించపోతే ఆశించిన స్థాయిలో ఫలితం ఉండదు. పొట్టేల్ విషయంలో అదే జరిగినట్లు అనిపిస్తుంది. దర్శకుడు రాసుకున్న కథ.. ఇవ్వాలనుకున్న సందేశం చాలా బాగుంది. కానీ దాన్ని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో కాస్త తడబడ్డాడు.పేరుకు ఇది చిన్న సినిమానే కానీ కథ మాత్రం చాలా పెద్దది. 1970-80 కాలంలో ఉన్న పటేళ్ల పెత్తనం, మూఢ నమ్మకాలు, సమాజంలో ఉన్న అసమానతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే చదువు యొక్క గొప్పదనాన్ని తెలియజేశాడు. సినిమా ప్రారంభంలోనే చాలా పాత్రలను పరిచయం చేశాడు. పటేల్ వ్యవస్థ బలంగా మారడానికి గల కారణాన్ని చూపించాడు. అలాగే బాలమ్మ జాతర నేపథ్యాన్ని కూడా ఓ యానిమేషన్ సీన్‌తో వివరించాడు. ఆ తర్వాత బుజ్జమ్మ, గంగాధరి లవ్‌స్టోరీ మొదలవుతుంది. అయితే దర్శకుడు చెప్పాలనుకునే కథ పెద్దగా ఉండడంతో ప్రేమకథను త్వరగా ముగించి మళ్లీ అసలు కథను ప్రారంభించాడు. కూతురు చదవు కోసం హీరో పడే కష్టాలు ఎమోషనల్‌కు గురి చేస్తాయి. కథ ప్రారంభం నుంచి మొదటి 30 నిమిషాలు ఆసక్తికరంగా సాగుతుంది. ఫ్లాష్ బ్యాక్, ప్రజెంట్ నెరేషన్లో కథనాన్ని సాగిస్తూ ప్రేక్షకుడు కథపై శ్రద్ధ చూపించేలా చేశాడు. అయితే హీరోహీరోయిన్ల మధ్య లవ్‌స్టోరీతో పాటు మరికొన్ని సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ సీన్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ద్వితియార్థంలో హింస ఎక్కువైనట్లు అనిపిస్తుంది. హీరో ప్రతిసారి పటేల్ చేతిలో దెబ్బలు తింటూనే ఉంటాడు. అలాగే కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయినట్లు అనిపిస్తుంది. మరికొన్ని చోట్ల కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. హింసను తగ్గించి, కథనాన్ని మరింత వేగవంతంగా నడిపించి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించినవారంతా తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. గొర్రెల కాపరి గంగాధరిగా యువచంద్ర కృష్ణ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సీన్లలో బాగా నటించాడు. అనన్య నాగళ్ల పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. సెకండాఫ్‌లో ఆమె పాత్ర నిడివి తక్కువనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో విలన్‌గా నటించిన అజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. పటెల్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. తెరపై ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆయన కెరీర్లో ఇది గుర్తుండిపోయే పాత్ర అవుతుంది. శ్రీకాంత్ అయ్యంగార్, నోయల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. శేఖర్ చంద్ర నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నాయి. - రేటింగ్: 2.75/5 -
'నరుడి బ్రతుకు నటన' సినిమా రివ్యూ
వచ్చే వారం దీపావళికి బోలెడన్ని పెద్ద సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. దీంతో ఈ వారం దాదాపు అరడజనుకి పైగా చిన్న చిత్రాలు రిలీజయ్యాయి. వాటిలో ఓ మూవీనే 'నరుడి బ్రతుకు నటన'. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిన్న సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు)కథేంటి?సత్య (శివకుమార్) నటుడు అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. యాక్టింగ్ నీకు చేతకాదని తండ్రి (దయానంద్ రెడ్డి) కాస్త పద్ధతిగా తిడతాడు. ఒక్కగానొక్క ఫ్రెండ్, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా వరస్ట్ యాక్టర్ అని సత్య ముఖంపైనే చెబుతారు. దీంతో ఎవరికీ చెప్పకుండా కట్టుబట్టలతో కేరళ వెళ్లిపోతాడు. పరిచయమే లేని డి.సల్మాన్ (నితిన్ ప్రసన్న) అనే వ్యక్తి ఇంట్లో ఇతడు ఉండాల్సి వస్తుంది. కేరళలో ఇతడికి ఎదురైన సమస్యలు ఏంటి? చివరకు నటుడు అయ్యాడా లేదా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని మంచి ఫీల్ గుడ్ సినిమాలు చూసినప్పుడు.. అసలు మన దగ్గర కూడా ఇలాంటివి తీయొచ్చు కదా అనిపిస్తుంది. ఎందుకంటే యాక్షన్ సినిమాలు మహా అయితే ఓసారి చూడొచ్చు. హీరో కోసం ఇంకోసారి చూడొచ్చేమో గానీ ఫీల్ గుడ్ చిత్రాలు మళ్లీ మళ్లీ చూడొచ్చు. అలాంటి ఓ సినిమానే 'నరుడు బ్రతుకు నటన'. ఏంటి అంత బాగుందా అని మీరనుకోవచ్చు. నిజంగా చాలా బాగా తీశారు.నువ్వో వరస్ట్ యాక్టర్.. జీవితంలో కష్టాలు తెలిస్తేనే నువ్వో మంచి నటుడివి అవుతావ్ అని హీరో సత్యని ఫ్రెండ్ తిడతాడు. అంతకుముందు ఊరు పేరు తెలియని అసిస్టెంట్ డైరెక్టర్ తిడతాడు. తండ్రి కూడా కాస్త పద్ధతిగా తిడతాడు. దీంతో కోపమొచ్చి కేరళ వెళ్లిపోతాడు. కాస్త డబ్బులు ఉండటం వల్ల కొన్నిరోజులు బాగానే ఉంటాడు. ఆ తర్వాత కష్టాలు మొదలవుతాయి. ఇంట్లో డబ్బులు అడగాలంటే అహం. దీంతో చేతిలో ఉన్న ఫోన్ అమ్మాలనుకుంటాడు. అదేమో ఓ పిల్లాడు తీసుకుని పారిపోతాడు. అలా అన్ని కోల్పోయిన సత్యకి సల్మాన్ పరిచయమవుతాడు. అతడితో అన్ని షేర్ చేసుకుంటాడు. వీళ్లిద్దరూ ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడం ఏమో గానీ చూసే ప్రేక్షకుడికి చాలా విషయాలు నేర్పిస్తారు.డబ్బు ఉంటే చాలు.. జీవితం ఆనందంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ చిన్న చిన్న విషయాలు కూడా మనకు ఎన్నో విషయాలు నేర్పిస్తాయని ఈ సినిమాలో చూపించిన విధానం సూపర్. ఎమోషనల్ స్టోరీ అయినప్పటికీ అక్కడక్కడ కాస్త కామెడీ టచ్ చేస్తూ చివరకు ఓ మంచి అనుభూతి ఇచ్చేలా మూవీని తీర్చిదిద్దిన విధానం బాగుంది. అసలు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ పలకవు అని అందరితో తిట్టించుకున్న సత్య.. తనకు తెలియకుండానే ఎన్నో ఎమోషన్స్ పలికిస్తాడు. చూస్తున్న మనం కూడా అతడితో పాటు ఫీల్ అవుతాం!చిన్న పాప ఎపిసోడ్, ప్రెగ్నెంట్ అమ్మాయి ఎపిసోడ్ మనల్ని భావోద్వేగాన్ని గురిచేస్తాయి. ఇక సల్మాన్ లవ్ స్టోరీ, మందు పార్టీ, వేశ్య దగ్గరకు వెళ్లిన సీన్స్‌లో సత్య-సల్మాన్ చేసిన సందడి నవ్విస్తుంది. చూస్తున్నంతసేపు ఓ మలయాళ సినిమా చూస్తున్నామా అనే ఫీలింగ్ వస్తుంది. దానికి తగ్గట్లే అక్కడక్కడ మలయాళ పాటలు కూడా వినిపించడం ఇక్కడ స్పెషాలిటీ. ఇవి వస్తున్నప్పుడు మనకు భాషతో ఇబ్బంది కూడా అనిపించదు. అంతలా లీనమైపోతాం. రెండు గంటల సినిమా అప్పుడే అయిపోందా అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేసిన శివకుమార్.. ఇందులో సత్యగా నటించాడు. హీరో అనడం కంటే మనలో ఒకడిలానే అనిపిస్తాడు. నితిన్ ప్రసన్న చేసిన డి.సల్మాన్ పాత్ర అయితే హైలైట్. సరదా సరదాగా సాగిపోతూనే చాలా విషయాలు నేర్పిస్తుంది. మిగిలిన పాత్రధారులు ఓకే. టెక్నికల్ విషయాలకొస్తే దాదాపు కేరళలో షూటింగ్ అంతా చేశారు. సినిమా అంతా నేచురల్‌గా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు తగ్గట్లే ఉంది. దర్శకుడు రిషికేశ్వర్ మంచి పాయింట్ తీసుకున్నాడు. అంతే నిజాయతీగా ప్రెజెంట్ చేశాడు. కాకపోతే కాస్త ఫేమ్ ఉన్న యాక్టర్స్‌ని పెట్టుకుని, మూవీని కాస్త ప్రమోట్ చేసుంటే బాగుండనిపించింది. ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని అస్సలు మిస్సవొద్దు!రేటింగ్: 2.75-చందు డొంకాన(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన డిఫరెంట్ తెలుగు మూవీ) -
ఓటీటీలో 'మంజుమ్మల్ బాయ్స్'ను మించిన సినిమా.. క్షణక్షణం ఉత్కంఠ
యథార్థ సంఘటనల ఆధారంగా స్ఫూర్తి పొంది తెరకెక్కిన ఎన్నో చిత్రాలు వెండితెరపై భారీ విజయాన్ని అందుకున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్గా వచ్చిన 'మంజుమ్మల్ బాయ్స్' దీనిని నిరూపించింది. అయితే, అలాంటి సంఘటనే 2018లో థాయ్‌లాండ్‌లో జరిగింది. 12మంది ఫుట్‌బాల్ టీమ్ పిల్లలతో 'థామ్ లువాంగ్' గుహలోకి కోచ్ వెళ్తాడు. అక్కడ అనుకోకుండా జరిగిన ఘటనతో వారు ప్రమాదంలో చిక్కుకుంటారు. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటన 'థర్టీన్ లైవ్స్' పేరుతో సినిమాగా వచ్చింది. రెస్క్యూ ఆపరేషన్ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు రోన్ హోవార్డ్ ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. యథార్థ ఘటనను కళ్లకు కట్టినట్లుగా చూపించారు. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న ఈచిత్రం కథ తెలుసుకుందాం.కథేంటంటేథాయ్లాండ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన 'థామ్ లువాంగ్' గుహలను చూసేందుకు 12 మంది ఫుట్‌బాల్ జూనియర్ టీమ్ సభ్యులతోపాటు కోచ్ కూడా వెళ్తాడు. వారు గుహ లోపలికి వెళ్లిన కొంత సమయం గడిచాక ఆ పర్వత ప్రాంతమంతా విపరీతమైన మేఘాలు కమ్ముకుని భారీ వర్షం కురుస్తుంది. దీంతో గుహ ప్రారంభం వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరటంతో పిల్లలందరూ తమ ప్రాణాలు కాపాడుకునేందుకు గుహ లోపలికి వెళ్లిపోతారు. తిరిగి బయటకొచ్చే దారి వారికి కనిపించదు. అలా వారందరూ అక్కడ చిక్కుకుపోతారు. భారీ వర్షం వల్ల గుహ లోపలికి వెళ్లే దారి నీటితో పూర్తిగా మూసుకుపోతుంది. ఇదే సమయంలో చిన్నారులు ఇంటికి రాకపోవడంతో వారి తల్లిదండ్రులు అందరూ ఆందోళన చెందుతుంటారు. బయటి ప్రంపంచంతో ఎలాంటి కనెక్టివిటీ లేని ఆ ప్రాంతంలో చిన్నారులు చిక్కుకుపోయారని అందరికీ ఎలా తెలిసింది..? సుమారు 18 రోజుల పాటు థాయ్‌లాండ్ ప్రభుత్వం ఛాలెంజింగ్‌గా చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఫలించిందా..? పది కిలోమీటర్ల పొడవైన గుహ మొత్తం నిళ్లతో నిండిపోతే ఆ రెస్క్యూ టీమ్ ఎలా వెళ్లింది..? చిన్నారులందరూ అన్నిరోజుల పాటు సజీవంగా ఎలా ఉండగలిగారు..? అన్నది తెలియాలంటే 'థర్టీన్ లైవ్స్' సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే..2018లో థాయ్ గుహల్లో చిన్నారులు చిక్కుకున్న సంఘటన ప్రపంచదేశాల అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ చిన్నారులను కాపాడేందుకు దాదాపు పదిహేడు దేశాలకు చెందిన ఐదు వేల మంది రెస్క్యూ టీమ్ ఆ ఆపరేషన్ కోసం థాయ్‌లాండ్ చేరుకుంటారు. ఈ ఆపరేషన్‌లో బ్రిటీష్ రెస్క్యూ టీమ్ రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్ ప్రాణాలకు తెగించి ఆ పిల్లలను కాపాడటానికి ఎలా ప్రయత్నాలు చేశారనేది చాలా సాహసంతో కూడుకొని ఉంటుంది. సుమారు 18 రోజుల తర్వాత ఆ చిన్నారులను బయటకు తీసుకొచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ చాలా ఉద్వేగంతో ఫీల్ అయ్యారు. ఆ సమయంలో పిల్లలు క్షేమంగా తిరిగిరావాలని ప్రతి ఒక్కరూ దేవుడిని ప్రార్థించారు. అవన్నీ ఫలించాయి. ఎంతో భావోద్వేగంతో కూడుకున్న ఈ ఘటనను తెరకెక్కించడంలో దర్శకుడు రాన్ హోవర్డ్ విజయం సాధించారు.సినిమా ప్రారభంమే కథలోకి వెళ్లిపోతాడు దర్శకుడు. ఫుట్‌బాల్ ఆడుతున్న చిన్నారులు గుహ చూద్దామని అక్కడికి చేరుకోవడంతో స్టోరీ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే భారీ వర్షం.. చిన్నారుల్లో భయం.. అలా ఒక్కో సీన్ ప్రేక్షకులకు చూపుతూ దర్శకుడు ఆసక్తి పెంచుతాడు. కొన్ని నిమిషాల్లోనే ఆ గుహ మొత్తం నీటితో నిండిపోతుంది. లోపల వారు ఉన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే, వారిని ఎలా కనిపెడుతారనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సుమారు 9 రోజుల తర్వాత సీడైవింగ్లో నిష్ణాతులైన ఇద్దరు బ్రిటిష్ డైవర్లు (రిచర్డ్ స్టాంటాన్, జాన్ వొలేథాన్) ఎంతో శ్రమించి చిన్నారులను కనిపెట్టినప్పుడు వాళ్లు ఎంత సంతోష పడ్డారో సినిమా చూస్తున్న ప్రేక్షకుడు కూడా అంతే స్థాయిలో భావోద్వేగానికి గురవుతాడు. మరోవైపు బయట జోరు వాన.. పిల్లలను రక్షించుకొందామనుకుంటే ఆ నీరు అంతా మళ్లీ గుహలోకే వెళ్తుంది. దీంతో ఆ నీటిని పంట పొలాల్లోకి మళ్లిస్తారు. అక్కడి రైతులు కూడా అందుకు సహకరిస్తారు. ఆ సీన్ అందరి కంట కన్నీరు తెప్పిస్తుంది. ఇలాంటి సీన్లు అన్నీ చాలా ఉద్విగ్నంగా ఉంటాయి.పిల్లలు ఎక్కడున్నారో కనిపెట్టారు సరే.. సుమారు 10 కిలోమీటర్లు దూరం పాటు చాలా లోతుగా ఉన్న నీటిలో నుంచి వారిని ఎలా రక్షించాలి అనేది పెద్ద సమస్యగా ఉంటుంది. ఇక అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఎదురుగా నీటి ప్రవాహం వస్తుంటే.. దానిని అదిగమించి చిన్నారులను బయటకు చేర్చాలి. అప్పటికే 18 రోజులు కావడంతో వారందరూ మరణించి ఉంటారని కనీసం తమ బిడ్డల శవాలు అయినా తీసుకొస్తే చాలు అని వారి తల్లిదండ్రులు గుహ బయటే కన్నీటితో ఎదురుచూస్తున్నారు. అలాంటి సీన్లు ప్రేక్షకుల చేత కన్నీరు తెప్పిస్తాయి. ఎంతో సాహసంతో కూడుకున్న ఈ కథ ఎలా ముగిసిందో తెలుసుకున్నాక ప్రతి ఒక్కరిలో ఉద్వేగం కట్టలు తెంచుకుంటుంది. అలాంటి మజానే ఈ 'థర్టీన్ లైవ్స్' తప్పకుండా ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది.ఎవరెలా చేశారంటేసినిమా మొత్తం రెస్క్యూ ఆపరేషన్ నేపథ్యంలోనే సాగుతుంది. ఇందులో తెలిసిన నటుడు ఒక్కరూ లేరు. అయినా ప్రతి పాత్ర మనకు కనెక్ట్ అవుతుంది. ఈ చిత్రం కోసం పనిచేసిన సాంకేతిక విభాగం ప్రధాన్ ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా అండర్ వాటర్ సీన్స్ చాలా చక్కగా తీశారు. రియల్ ఇన్సిడెంట్ కళ్ల తెరపైన చూస్తున్నామనే ఫీలింగ్ కలిగేలా సినిమా సాగుతుంది. ఇందులో ఫైట్స్ వంటివి లేకున్నా చాలా సన్నివేశాల్లో విజిల్స్ వేసేలా ఉంటాయి. ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు రాన్ హోవర్డ్.. ఈ కథను ఉత్కంఠభరితంగా చెప్పడమే కాకుండా.. ఎంతో భావోద్వేగభరితంగా ప్రేక్షకులకు చూపించారు. -
'ది డీల్' తెలుగు సినిమా రివ్యూ
ది డీల్ తెలుగు సినిమా రివ్యూప్రభాస్ ఈశ్వర్ సినిమాతో వెండితెరకు పరిచయం నటుడు 'హను కోట్ల'. ఆయన హీరోగా నటించిన కొత్త చిత్రం 'ది డీల్'.. అయితే, ఈ మూవీకి ఆయనే దర్శకుడు కావడం విశేషం. హను కోట్ల ఇప్పటికే బుల్లితెరలో ప్రసారం అయ్యే మాయాబజార్ సీరియల్ 150 ఎపిసోడ్స్ చేయడమే కాకుండా పలు యాడ్స్ చేశారు. ఈ మూవీతో ఆయన వెండితెరకు దర్శకుడి పరిచయం కావడం విశేషం. సిటాడెల్ క్రియేషన్స్, డిజిక్వెస్ట్ బ్యానర్స్ పై డాక్టర్ అనిత రావు సమర్పణలో హెచ్ పద్మా రమకాంతరావు, రామకృష్ణ కొళివి నిర్మించారు. ఇందులో చందన, ధరణి ప్రియా హీరోయిన్లుగా నటించారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ నేడు శుక్రవారం (అక్టోబర్ 18) న విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.కథేంటి..? భైరవ (హనుకోట్ల) యాక్సిడెంట్‌కి గురై కోమాలోకి వెళ్తాడు. మూడు నెలల తర్వాత నెమ్మదిగా ఆ కోమా నుంచి బయట పడుతాడు. కానీ తను గతం మర్చిపోతాడు. కోమాలో నుంచి బయటకు వచ్చినప్పుడు లక్ష్మి(ధరణి ప్రియా)ని తలుచుకుంటాడు. ఆమె తన భార్య అని, ఆమెని చూడాలని, కలవాలని అంటుంటాడు. తానెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ విలన్ ఇందు(సాయి చందన)ని చంపేసే ప్రయత్నం చేస్తుంటాడు. దీని వెనకాల మాదవ్(రవి ప్రకాష్) ఉంటాడు. ఇందు ఎవరూ లేని ఒంటరి మహిళ. తను బ్యాంక్ లో ఎంప్లాయ్‌గా పని చేస్తుంటుంది. ఇందుని కాపాడి ఆమెకి దగ్గరవుతాడు భైరవ. తనని ఎందుకు చంపాలనుకుంటున్నారనేది, అదే సమయంలో తాను ఎవరనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటాడు. ఇందుని ఆసుపత్రిలో కలవడానికి మాదవ్, లక్ష్మి వస్తారు. అక్కడ లక్ష్మిని చూసి ఆమెని కలిసేందుకు భైరవ వెళ్లగా, ఎవరో తెలియనట్టుగా వెళ్లిపోతుంది. మరోసారి తను నా భార్య అంటూ ఆసుపత్రిలో గొడవ చేస్తారు. తమ ప్లాన్స్ కి అడ్డుగా వస్తున్న భైరవని కూడా చంపేయాలనుకుంటారు మాధవ్, లక్ష్మి. మరి భైరవ భార్య అయిన లక్ష్మి మాదవ్‌ని భైరవగా ఎందుకు చెబుతుంది..? ఆయనతో ఎందుకు తిరుగుతుంది..? ఇందుని ఎందుకు చంపాలనుకుంటున్నారు..? మధ్యలో ఇందు గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కంపెనీ అధినేత రావు(రఘు కుంచె).. ఇందుకి ఒక సామాన్యుడిగా ఎందుకు పరిచయం అయ్యాడు..? ఈ మొత్తం కథకి ఇందుకి ఉన్న సంబంధమేంటి..? చివరికి కథ ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాలంటే 'ది డీల్' చూడాల్సిందే.ఎలా ఉందంటే..టాలీవుడ్లో కంటెంట్ బేస్డ్ సినిమాలు ఇప్పుడు చాలా వస్తున్నాయి. చిన్న పాయింట్ చుట్టూ కథని అల్లుతూ సినిమాలు చేసి హిట్ కొడుతున్నారు మేకర్స్. అయితే ఇలాంటి సినిమాలకు చాలా వరకు ఓటీటీలో మంచి ఆదరణ ఉంటుంది. థియేటర్లో రీచ్ తక్కువగా ఉంటుంది. కానీ కొత్తగా వస్తున్న మేకర్స్ చేసే ఇలాంటి ప్రయోగాలు అభినందనీయంగా ఉండటం విశేషం. స్క్రీన్‌ప్లేలో చేసే మ్యాజిక్‌లు హైలైట్‌గా నిలుస్తుంటాయి. ది డీల్ సినిమా కూడా అలాంటి కోవకు చెందిన చిత్రమే. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. దాని చుట్టూ అల్లుకున్న డ్రామా ఈ సినిమాలో హైలైట్ పాయింట్. ఆద్యంతం ట్విస్ట్ లతో సినిమాని నడిపించడం మరో హైలైట్ పాయింట్. ఓ అమ్మాయిని హత్య చేసేందుకు ఓ గ్యాంగ్ సుఫారీ తీసుకుని ఆమె హత్యకు చేసే ప్రయత్నాలు, అవి బెడిసికొట్టడం, ఈ క్రమంలో యాక్సిడెంట్, అనంతరం ట్విస్ట్ లు ఆకట్టుకునే అంశాలు. ఫస్టాఫ్ అంతా హీరో యాక్సిడెంట్ తర్వాత తానెవరు అని తెలుసుకునేందుకు చేసే ప్రయత్నాలతో సాగుతుంది. ఎవరు ఇందుని చంపాలనుకుంటారు? తాను ఎందుకు కాపాడతాడు? భైరవ భార్య లక్ష్మి మరో వ్యక్తితో ఎందుకు ఉంది? తన ఇంట్లో వాళ్లెందుకు ఉన్నారనే అంశాలు ఆద్యంతం సస్పెన్స్ తో సాగుతున్నాయి. ఇంటర్వెల్లో లక్ష్మి పాత్ర ఇచ్చే ట్విస్ట్ బాగుంది. అనంతరం అసలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు భైరవ ఎవరు? అనే ట్విస్ట్ రివీల్ అయిన తీరు బాగుంది.సెకండాఫ్ తర్వాత డ్రామా మరింత ఆసక్తికరంగా అనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి, క్లైమాక్స్ వరకు ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది. సినిమా స్క్రీన్‌ప్లే పరంగా, ట్విస్ట్‌ల పరంగా బాగా రాసుకున్నాడు దర్శకుడు. సినిమాని నడిపించిన తీరులో మాత్రం ఆ గ్రిప్పింగ్ మిస్ అయ్యింది. ప్రారంభం నుంచి స్లోగా, సాగదీసినట్టుగా సాగుతుంది. ఎక్కడా వేగం కనిపించదు. కానీ ట్విస్ట్‌లు కొంత రిలీఫ్ ఇస్తాయి. అమ్మ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంది. ఫ్యామిలీకి సంబంధించిన ఎలిమెంట్లు కూడా బాగున్నాయి. అయితే కథ రొటీన్‌గానే ఉంది. ఆ విషయంలో దర్శకుడు మరింత కేర్ తీసుకోవాల్సింది. ఇంకోవైపు సెకండాఫ్‌లో భైరవ ఎవరు అని తెలిసే సీన్లు, దీనికితోడు ఇందుని చంపే సీన్లు కూడా తేలిపోయేలా ఉన్నాయి. అవి కాస్త రొటీన్‌గానే ప్లాన్ చేశారు. సినిమాని వేగంగా పరిగెత్తించేలా తీసి ఉంటే బాగుండేది. స్లోగా సాగడంతో కొన్ని చోట్ల సీరియల్‌ని తలపిస్తుంది. మరోవైపు ఆర్టిస్ట్‌ల నటన కూడా చాలా వరకు అసహజంగానే అనిపిస్తాయి. అనుభవ లేమి కనిపిస్తుంది. మ్యూజిక్, ముఖ్యంగా బీజీఎం పరంగా మరింత శ్రద్ధ పెట్టాల్సింది. దీంతో ఓ మంచి సినిమా యావరేజ్‌గా మారిపోయింది.టెక్నీషియన్లుసినిమాకి ఆర్ ఆర్ ధృవన్ సంగీతం ఓకే అనిపించేలా ఉంది. బీజీఎం మైనస్‌గా చెప్పొచ్చు. శ్రవణ్ కటికనేని ఎడిటింగ్ కూడా ఇంకా బాగా ఎడిటింగ్ చేయాల్సింది. సురేంద్ర రెడ్డి కెమెరా వర్క్ ఓకే అని చెప్పొచ్చు. ఇంకా బెటర్‌గా చేయోచ్చు. నిర్మాణ విలువలు ఉన్నంతలో ఓకే అనిపించాయి. ఇక దర్శకుడు కథ రెగ్యూలర్‌గానే తీసుకున్నా, తాను ట్విస్ట్ లతో రాసుకున్న తీరు బాగుంది. అయితే దర్శకుడిగా కొంత అనుభవ లేమి కనిపించినా, ట్విస్ట్ లు సినిమాకి రిలీఫ్‌నిచ్చే అంశాలు. సినిమాలో డ్రామా మేజర్ పార్ట్‌ని పోషిస్తుంది. -
'లెవల్ క్రాస్' సినిమా రివ్యూ (ఓటీటీ)
సినిమా అంటేనే ఇలానే ఉండాలి అనేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్ మూవీస్ వస్తుంటాయి. ఇవి కొందరికి నచ్చితే మరికొందరికి నచ్చకపోవచ్చు. అలాంటి ఓ విభిన్నమైన కాన్సెప్ట్‌తో తీసిన చిత్రం 'లెవల్ క్రాస్'. ఒరిజినల్‌గా దీన్ని మలయాళంలో తీశారు. కానీ రీసెంట్గా ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ థ్రిల్లర్ సినిమా ఎలా ఉందంటే?కథేంటి?రఘు (అసిఫ్ అలీ) ఎడారి ప్రాంతంలో ఒక చోట రైల్వే గేట్ కీపర్. నిర్మానుస్య ప్రాంతంలో ఒక్కడే చెక్క ఇంట్లో నివసిస్తుంటాడు. ఓ రోజు వేగంగా వెళ్తున్న ట్రైన్లో నుంచి ఒక అమ్మాయి కింద పడినట్లు రఘు గమనిస్తాడు. దెబ్బలు తగిలి స్పృహ కోల్పోయిన ఆమెని తన ఇంటికి తీసుకొస్తాడు. కోలుకున్న తర్వాత ఆమెకు తన గురించి చెబుతాడు. ఆమె కూడా తన గురించి చెబుతుంది. ఇంతకీ ఆమె ఎవరు? ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఓ సినిమా తీయాలంటే హీరోహీరోయిన్ ఉండాలి. ఆరు పాటలు, మూడు ఫైట్స్, అవసరం లేకపోయినా సరే కామెడీ.. ఇలా పాన్ ఇండియా పేరుతో వందలకోట్ల బడ్జెట్ ఉండాలని చాలామంది అనుకుంటారు. కానీ అవేవి అక్కర్లేదని 'లెవల్ క్రాస్' సినిమా నిరూపించింది. మూడే పాత్రలు ఉంటాయి. ప్రతి పాత్ర సినిమా అంతా రెండు-మూడు డ్రస్సులో మాత్రమే కనిపిస్తారు. అలాంటి విచిత్రమైన మూవీ ఇది.ప్రతి మనిషి జీవితంలో ఎవరికీ తెలియని యాంగిల్ ఒకటి ఉంటుంది. ఒకవేళ అది మరో వ్యక్తికి తెలిస్తే.. మనుషులు ఎలా ప్రవర్తిస్తారు? ఎంతకు తెగిస్తారు అనే కాన్సెప్ట్‌తో తీసిన సినిమానే ఇది. సినిమా కథ గురించి చెబితే మళ్లీ స్పాయిలర్ అవుద్దేమో! కాస్త ఓపికతో చూస్తే మీకు డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అయితే వస్తుంది.సినిమాలో మూడు పాత్రలు ఒక్కోటి ఒక్కో స్టోరీ చెబుతాయి. కానీ ఎవరిది నిజం ఎవరిది అబద్ధం అనేది మనకు అర్ధం కాదు. ఒకటి జరుగుతుందని అనుకుంటాం. కానీ తర్వాతి సీన్లో ఊహించనది జరుగుతుంది. ఒక్కొక్కరి గతం గురించి బయటపడే ట్విస్టులు అయితే నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు. థ్రిల్లర్ సినిమాల్లో విలన్ ఎవరు? హీరో అనేది ప్రారంభంలో చాలామంది గెస్ చేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో కచ్చితంగా అలా కనిపెట్టలేరు.సైకలాజికల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తీసిన ఈ సినిమా అందరికీ నచ్చుతుందా అంటే డౌటే. ఎందుకంటే ఏదో ఆర్ట్ మూవీ తీసినట్లు చాలా నిదానంగా వెళ్తుంది. దాదాపు 45 నిమిషాల వరకు అలా సాగుతూ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కొక్క ట్విస్ట్ వస్తాయి. మధ్యలో ఓ పాట ఉంటుంది కానీ అది అనవసరం అనిపించింది.యాక్టింగ్ పరంగా అసిఫ్ అలీ, అమలాపాల్, షరాఫుద్దీన్ ఆకట్టుకున్నారు. 'దృశ్యం' డైరెక్టర్ జీతూ జోసెఫ్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసిన అర్భాజ్ ఆయూబ్ దర్శకుడు. ఎంచుకున్న పాయింట్ చాలా డిఫరెంట్. దాన్ని తీసిన విధానం అంతకంటే డిఫరెంట్. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్, యాక్షన్ మూవీస్ కాకుండా కొత్తగా ఏదైనా థ్రిల్లర్ చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి.-చందు డొంకాన -
'వీక్షణం' సినిమా రివ్యూ
సినిమాల్లో ఎవర్ గ్రీన్ జానర్ ఏదైనా ఉందా అంటే చాలామంది చెప్పేమాట థ్రిల్లర్. ఈ జానర్ మూవీస్ ఎప్పటికప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉంటాయి. అలా ఈ శుక్రవారం (అక్టోబర్ 18) థియేటర్లలో రిలీజైన మూవీ 'వీక్షణం', రామ్ కార్తీక్, కశ్వి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ ఎలా ఉందంటే?(ఇదీ చదవండి: సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు.. రూ.5 కోట్లు ఇస్తేనే)కథేంటి?ఆర్విన్ (రామ్ కార్తీక్) ఇంజినీరింగ్ పూర్తి చేసిన కుర్రాడు. ఖాళీగా ఉండేసరికి ఏం చేయాలో తెలీక పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు ఏం చేస్తుంటారా అని బైనాక్యులర్‌తో చూస్తుంటాడు. అలా తమ గేటెడ్ కమ్యూనిటీలోనే ఉండే నేహా(కశ్వి)ని చూసి ఇష్టపడతాడు. ఫ్రెండ్స్ సహాయంతో ఆమెతో ప్రేమలో పడతారు. మరోవైపు తన ఎదురింట్లో దిగిన ఓ అమ్మాయి (బిందు నూతక్కి) రోజుకి ఒకరితో రావడం గమనిస్తాడు. వాళ్లని ఆమె దారుణంగా చంపడం చూస్తాడు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? ఈ హత్యలన్నీ ఎందుకు చేస్తోంది? దీని వల్ల ఆర్విన్ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?థ్రిల్లర్ సినిమా అంటే ఓ టెంప్లేట్ ఉంటుంది. ఓ హంతకుడు ఉంటాడు. మనుషుల్ని చంపేస్తుంటాడు. అతడు/ఆమె అలా చంపడానికి కారణమేంటి? హీరో సదరు హంతుకుడిని ఎలా పట్టించాడు అనే పాయింట్‌తో పలు భాషల్లో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. 'వీక్షణం' కూడా దాదాపు అదే తరహాలో తీసిన మూవీ. కానీ స్టోరీ కోసం ఎంచుకున్న పాయింట్ బాగుంది.బాల్కనీలో నిలబడి తల తుడుచుకుంటున్న ఓ అమ్మాయి.. సడన్‌గా గ్రౌండ్ ఫ్లోర్‌లోని కారుపై పడి చనిపోతుంది. ఇలా షాకింగ్ సీన్‌తో మూవీని మొదలవుతుంది. కట్ చేస్తే గేటెడ్ కమ్యూనిటీలో ఉండే హీరో, అతడికో ఇద్దరు ఫ్రెండ్స్. బైనాక్యూలర్లో చూసి తన ఇంటి పక్కనో ఉండే అమ్మాయితో ఇష్టపడటం, ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడటం ఇలా లవ్ ట్రాక్. మరోవైపు తన ఎదురింట్లో రోజుకో వ్యక్తితో ఓ అమ్మాయి రావడం, వాళ్లందరినీ చంపుతుండటం.. ఇలా మరో స్టోరీ నడుస్తుంటుంది. ఇదంతా హీరో చూస్తుంటాడు. ఆ అమ్మాయి ఎవరా అనే విషయం తెలియడంతో ఇంటర్వెల్ ట్విస్ట్ పడుతుంది.(ఇదీ చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)సెకండాఫ్‌లో హత్యలు చేస్తున్న అమ్మాయి ఎవరు? అసలు ఆమె ఎందుకిలా చేస్తోంది? ఆమె లిస్టులో హీరోయిన్ ఎందుకుంది? అనే పాయింట్లని సెకండాఫ్‌లో చూపించారు. ఫస్టాప్ అంతా రొటీన్ లవ్ ట్రాక్ చూపించారు. అదేమంత పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉండదు. ఎప్పుడైతే ఇంటర్వెల్లో ట్విస్ట్ పడుతుందో.. సెకండాఫ్‌లో దెయ్యం కథ ఉండబోతుందా అనుకుంటాం. కానీ మనం ఊహించని విధంగా హంతకుడి విషయంలో ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఓఆర్డీ (ORD) అనే జబ్బు గురించి చెప్పి, చిన్నపాటి మెసేజ్ ఇచ్చారు. అదే టైంలో సీక్వెల్ ఉండే అవకాశముందనేలా మూవీని ముగించారు.రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాలానే తీసినప్పటికీ సెకండాఫ్‌లో ట్విస్టులు ఆకట్టుకుంటాయి. హంతకుడి విషయంలో మనం ఊహించనది జరుగుతుంది. ఇప్పటికీ సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ సమస్యని స్టోరీలో బ్లెండ్ చేసిన విధానం బాగుంది. అది ప్రేక్షకులని ఆలోచింపజేస్తుంది. రెండు గంటల నిడివి కూడా ప్లస్ పాయింట్. కాకపోతే పెద్దన్న పేరు నటులు లేరు. అలానే ఫస్టాప్ అంతా కావాలనే సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది తప్పితే ఓవరాల్‌గా మూవీ గుడ్.ఎవరెలా చేశారు?ఆర్విన్ అనే కుర్రాడిగా చేసిన రామ్ కార్తిక్ పాత్రకు తగ్గట్లు ఉన్నాడు. ఫస్టాప్ అంత లవర్ బాయ్‌లా, సెకండాఫ్‌లో హత్యలు కనుక్కొనే వాడిలో డిఫరెంట్ షేడ్స్ చూపించాడు. కశ్వి అయితే గ్లామర్ చూపించడానికి తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. కీలక పాత్రలో కనిపించిన బిందు నూతక్కి అనే అమ్మాయి పర్లేదనిపించింది. సర్ప్రైజింగ్ పాత్ర చేనిన నటుడు కూడా ఉన్నంతలో ఆకట్టుకున్నాడు. మిగిలిన పాత్రధారులు న్యాయం చేశారు.టెక్నికల్ విషయానికొస్తే థ్రిల్లర్ మూవీకి కావాల్సిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ని సమర్థ గొల్లపూడి సరిగా ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ చాలా నేచురల్‌గా ఉంది. ఇక డైరెక్టర్ మనోజ్ పల్లేటి.. తను అనుకున్న పాయింట్ గురించి బాగానే రీసెర్చ్ చేసి మరీ రాసుకున్నాడు. దాన్ని సినిమాగా తీసి మెప్పించాడు. నిర్మాణ విలువలు కూడా స్థాయిగా తగ్గట్లు ఉన్నాయి. పెద్దగా పేరున్న నటీనటులు లేరు. కాబట్టి ప్రేక్షకులు ఈ మూవీ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది చూడాలి?రేటింగ్: 2.75-చందు డొంకాన(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్.. డేంజర్ జోన్లో ఆ ఇద్దరు కానీ!) -
‘లవ్ రెడ్డి’ మూవీ రివ్యూ
టైటిల్ : లవ్రెడ్డినటీనటులు: అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, జ్యోతి మదన్, యన్.టి. రామస్వామి, గణేశ్, పల్లవి తదితరులునిర్మాణ సంస్థ: గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్‌నిర్మాతలు: సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి రచన-దర్శకత్వం: స్మరన్ రెడ్డిసంగీతం: ప్రిన్స్ హేన్రిఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావువిడుదల తేది: అక్టోబర్ 18, 2024కంటెంట్ బాగుంటే చాలు చిన్న, పెద్ద సినిమా అనే తేడా లేకుండా థియేటర్స్‌కి వెళ్తున్నారు ప్రేక్షకులు. కథలో దమ్ముంటే నటీనటులను ఎవరనేది కూడా చూడడం లేదు. అందుకే టాలీవుడ్ యంగ్ డైరెక్టర్స్ కొత్త కొత్త కథలతో సినిమాలను తెరకెక్కించి హిట్ కొడుతున్నారు. అలా తాజాగా ఓ డిఫరెంట్ లవ్‌స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు యంగ్ డైరెక్టర్ స్మరన్ రెడ్డి. అదే ‘లవ్‌రెడ్డి’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికితోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘లవ్‌రెడ్డి’ పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య రేపు(అక్టోబర్ 18) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఈ సినిమా కథంతా ఆంధ్ర-కర్ణాటక బార్డర్లో ఉన్న ఓ గ్రామంలో జరుగుతుంది. నారాయణ రెడ్డి(అంజన్ రామచంద్ర)కి 30 ఏళ్ల వయసు వచ్చినా పెళ్లి కాదు. ఇంట్లో వాళ్లు ఎన్ని సంబంధాలు చూసినా అమ్మాయి నచ్చలేదని రిజెక్ట్ చేస్తుంటాడు. ఓ సారి బస్‌లో దివ్య(శ్రావణి రెడ్డి)అనే అమ్మాయిని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుంచి లవ్‌రెడ్డిగా మారి ఆ అమ్మాయియే లోకంగా బతుకుతాడు. దివ్య కూడా నారాయణ రెడ్డితో స్నేహం చేస్తుంది. ప్రేమ విషయాన్ని చెప్పకుండానే ఇద్దరు బాగా క్లోజ్ అవుతారు. ఓ రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమ విషయాన్ని దివ్యతో చెబుతాడు. దివ్య మాత్రం అతని ప్రపోజల్‌ని రిజెక్ట్ చేస్తుంది. ప్రాణంగా ప్రేమించిన నారాయణ రెడ్డిని దివ్య ఎందుకు రిజెక్ట్ చేసింది? ఆమె నిజంగానే నారాయణను ప్రేమించలేదా? దివ్య ఎంట్రీతో నారాయణ రెడ్డి లైఫ్ ఎలా టర్న్ అయింది? వీరి ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. ‘మరణం మనుషులకే కానీ మనసులకి కాదు.. ఈ ప్రపంచంలో పూడ్చిపెట్టలేనిది, పూడ్చినా సజీవంగా ఉండేది ‘ప్రేమ’ ఒక్కటే’. సినిమా ముగింపులో రాసిన కొటేషన్ ఇది. ఈ మాటకు తగ్గట్లుగానే చిత్ర కథనమంతా సాగుతుంది. పరువు ప్రతిష్ట అనే కీలకమైన అంశంతో సాగే ఓ స్వచ్ఛమైన ప్రేమ కథ ఇది. ఓ సున్నితమైన ప్రేమకథను ఎంతో సహజంగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ స్మరన్ రెడ్డి. వినోదాత్మకంగా కథను ప్రారంభించి.. చివరిలో ప్రేక్షకుడి గుండెను బరవెక్కించి థియేటర్ నుంచి బయటకు పంపించేశాడు. తొలి సినిమానే అయినా ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిగా కథనాన్ని నడిపించాడు. కొత్త నటీనటులే అయినప్పటికీ వారి నుంచి మంచి ఫెర్పార్మెన్స్ని రాబట్టుకున్నాడు. పెళ్లి చూపుల సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. హీరో లవ్‌రెడ్డిగా మారిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. అయితే తన ప్రేమను వ్యక్తం చేయడానికి హీరో చేసే ప్రయత్నాలు రొటీన్‌గా ఉంటాయి. స్వీటీ సీన్లు కొంతవరకు వినోదాన్ని పంచుతాయి. అసలు నారాయణ రెడ్డిని దివ్య ప్రేమిస్తుందా లేదా? అనే విషయాన్ని సెకండాఫ్ వరకు తెలియజేయకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేశాడు. ఇంటర్వెల్ సీన్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా ఫస్టాఫ్ యావరేజ్‌గా అనిపించినా.. సెకండాఫ్ మాత్రం అదిరిపోతుంది. నారాయణ రెడ్డి ప్రేమను దివ్య రిజెక్ట్ చేయడానికి గల కారణం తెలిసిన తర్వాత ప్రేక్షకుడు ఎమోషనల్ అవుతాడు. దివ్య పాత్రతో నేటితరం అమ్మాయిలు చాలా వరకు కనెక్ట్ అయిపోతారు. చివరి 20 నిమిషాలు అయితే చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. క్లైమాక్స్ మన గుండెను బరువెక్కిస్తుంది. అలా అని ఈ క్లైమాక్స్ కొత్తదని చెప్పలేం. గతంలో చాలా ప్రేమ కథలకు ఇలాంటి క్లైమాక్స్ ఉంది. కానీ తెరపై చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అవుతాం. ఫస్టాఫ్‌ని ఇంకాస్త బలంగా రాసుకొని.. పేరున్న నటీనటులతో ఈ సినిమా తెరకెక్కిస్తే ఫలితం మరోలా ఉండేది. ఏదేమైనా తొలి సినిమాతోనే ఓ సున్నితమైన అంశాన్ని అంతే సున్నితంగా తెరపై చూపించినందుకు దర్శకుడిని అభినందించాల్సిందే. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాలో నటించినవారంతా కొత్త వాళ్లే. అయినా కూడా చాలా చక్కగా నటించాడు. భగ్నప్రేమికుడు నారాయణరెడ్డి పాత్రలో అంజన్ రామచంద్ర ఒదిగిపోయాడు. తొలి సినిమానే అయినా తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. ఇక దివ్య పాత్రకు శ్రావణి రెడ్డి న్యాయం చేసింది. హీరోయిన్ తండ్రిగా నటించిన ఎన్.టి రామస్వామి ఫెర్ఫార్మెన్స్ అయితే నెక్ట్స్ లెవన్. క్లైమాక్స్‌లో ఆయన ఇచ్చే ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. హీరోని ఇష్టపడే అమ్మాయి స్వీటీగా జ్యోతి మదన్ కొన్ని చోట్ల నవ్వులు పూయించారు. హీరో తమ్ముడిగా నటించిన తమ్ముడితో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ప్రిన్స్ హేన్రి సంగీతం సినిమాకు ప్రధాన బలం. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. పాటలు ఆకట్టుకుంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.- రేటింగ్: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఓటీటీలో ఒళ్లు గగుర్పొడిచే సినిమా.. మీరు చూశారా?
టైటిల్: ఇమ్మాక్యూలేట్దర్శకత్వం: మైఖేల్ మోహన్లీడ్ రోల్: సిడ్నీ స్వీనినిడివి: 90 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్విడుదల తేదీ: మార్చి 22, 2024ఓటీటీల్లో హారర్ చిత్రాలకు ప్రత్యేక డిమాండ్ ఉంటుంది. అందుకే టాలీవుడ్‌లోనూ ఇటీవల ఆ జోనర్ సినిమాలు వస్తూనే ఉన్నాయి. అయితే హాలీవుడ్లో అయితే ఈ చిత్రాలకు కొదువే లేదు. హాలీవుడ్ చిత్రాలు అత్యంత భయంకరంగా, ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటాయి. అలాంటి వాటిలో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది.గతంలో ఇలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ఈ కథ మొత్తం నన్ల చుట్టు తిరుగుతుంది. నన్‌గా మారేందుకు అమెరికా నుంచి ఇటలీకి వచ్చిన ఓ యువతి కథ. ఇందులో నన్ పాత్రలో సిడ్నీ స్వీనీ నటించారు. సిసిలియో అనే యువతిగా కనిపించారు. వృద్ధ నన్స్‌కు సేవలందించేందుకు వచ్చిన యువతి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే అసలు కథ.నన్ నేపథ్యంలో వచ్చిన కథలు చాలా భయంకరంగా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాంటిదే. హారర్ సినిమా అంటే ఇంత భయంకరంగా ఉంటుందా అనేలా స్క్రీన్ ప్లే నడిపించారు. అత్యంత భయానక దృశ్యాలు ప్రేక్షకులకు కాస్తా ఇబ్బంది కలిగించేలా కూడా ఉన్నాయి. నన్లను ట్రీట్ చేసే విధానం.. వారిని వేధింపులకు గురిచేయడం లాంటి అత్యంత దారుణమైన సీన్స్ ఆడియన్స్‌ను భయపెట్టేస్తాయి. ఒక నన్ జీవితం ఇంత దారుణంగా ఉంటుందో ఈ సినిమాలో ఆడియన్స్‌కు పరిచయం చేశారు. హారర్ చిత్రమే అయినా.. ఎక్కడా కూడా దెయ్యం అనే కాన్సెప్ట్ లేకుండానే తెరకెక్కించాడు. ఈ కథలో సిసిలియో యువతిదే కీ రోల్. ఈ హారర్ మూవీకి ఆమె నటనే బలం. ఎక్కువగా హారర్ సినిమాలు ఇష్టపడేవారు ఇలాంటివి ట్రై చేయొచ్చు. అయితే కొన్ని సీన్స్ అత్యంత భయంకరంగా ఉన్నాయి. కాకపోతే చిన్నపిల్లలు లేనప్పుడు ఈ సినిమా చూడటం ఉత్తమం. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. -
పండగ సినిమాల రివ్యూ.. ఏది ఎలా ఉందంటే?
తెలుగు రాష్ట్రాల్లో దసరా జోష్ కనిపిస్తుంది. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్లని ఎంటర్టైన్ చేయడానికా అన్నట్లు స్ట్రెయిట్, డబ్బింగ్ మూవీస్ కాస్త ఎక్కువగానే రిలీజయ్యాయి. వీటిలో రజినీకాంత్ 'వేట్టయన్', గోపీచంద్ 'విశ్వం', సుహాస్ 'జనక అయితే గనక', సుధీర్ బాబు 'మా నాన్న సూపర్ హీరో' ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేశాయి. ఇంతకీ ఇవి ఎలా ఉన్నాయంటే?వేట్టయన్రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా, మంజు వారియర్.. ఇలా బోలెడంత మంది స్టార్స్ నటించిన ఈ సినిమాని.. పోలీసులు- ఫేక్ ఎన్ కౌంటర్ చేయడం అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కించారు. తమిళనాడులో హిట్ టాక్ వచ్చింది గానీ తెలుగులో మిక్స్డ్ టాక్ వచ్చింది. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టుండాల్సిందని అంటున్నారు. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ)మా నాన్న సూపర్ హీరోసుధీర్ బాబు హీరోగా నటించిన ఈ మూవీని తండ్రి సెంటిమెంట్ స్టోరీతో తీశారు. చిన్నప్పుడే కన్న తండ్రి నుంచి దూరమైన పిల్లాడు.. మరొకరి దగ్గర పెరిగి పెద్దవుతాడు. సవతి తండ్రికి ఇతడంటే అస్సలు ఇష్టముండదు. మరి సొంత తండ్రి-కొడుకు చివరకు ఎలా కలుసుకున్నారనేది తెలియాలంటే సినిమా చూడాలి. మంచి ఎమోషనల్ కంటెంట్‌తో తీసిన ఈ చిత్రం ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చూడాలి. పూర్తి రివ్యూ ఇదిగో ('మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!)విశ్వంగోపీచంద్ లేటెస్ట్ మూవీ ఇది. దాదాపు ఆరేళ్ల తర్వాత శ్రీనువైట్ల ఈ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. అయితే రెగ్యులర్ రొటీన్ స్టోరీ కావడంతో తొలి ఆట నుంచే మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. కమర్షియల్ మూవీకి కావాల్సిన అన్ని అంశాలు ఉన్నప్పటికీ రెగ్యులర్ ఫార్మాట్లో ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవరాల్ రివ్యూ కోసం ఈ లింక్ క్లిక్ చేసేయండి. (‘విశ్వం’ మూవీ రివ్యూ)జనక అయితే గనకసుహాస్ లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. ఓ వ్యక్తి పిల్లల్ని వద్దనుకుంటాడు. సేఫ్టీ కూడా వాడుతుంటాడు. అయినా సరే భార్య గర్భవతి అవుతుంది. దీంతో కండోమ్ కంపెనీపై కేసు వేస్తాడు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. ప్రస్తుత కాలంలో పిల్లల్ని కనడం, పెంచడం ఖరీదైన వ్యవహారం. ఇదే పాయింట్ తీసుకుని, ఎంటర్టైనింగ్ చెప్పారు. ప్రీమియర్లు వేస్తే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పూర్తి రివ్యూ కూడా చదివేయండి. (‘జనక అయితే గనక’మూవీ రివ్యూ)(ఇదీ చదవండి: ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా) -
‘జనక అయితే గనక’మూవీ రివ్యూ
టైటిల్: జనక అయితే గనకనటీనటులు: సుహాస్, సంగీర్తన, రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెక కిశోర్, మురళీ శర్మ తదితరులునిర్మాణ సంస్థ: దిల్ రాజు ప్రొడక్షన్స్నిర్మాతలు : హర్షిత్ రెడ్డి, హన్షిత్ రెడ్డిదర్శకత్వం: సందీప్‌రెడ్డి బండ్లసంగీతం: విజయ్ బుల్గానిక్సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్విడుదల తేది: అక్టోబర్ 12, 2024ఈ మధ్యే ‘గొర్రె పురాణం’తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుహాస్.. ఇప్పుడు ‘జనక అయితే గనక’ అనే సినిమాతో మరోసారి థియేటర్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. సందీప్ రెడ్డి బండ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం రేపు(అక్టోబర్ 12) ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? సుహాస్ ఖాతాలో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన ప్రసాద్ (సుహాస్) కి పిల్లలు కనడం అస్సలు ఇష్టం లేదు. ఈ రోజుల్లో పిల్లలను పోషించాలంటే లక్షల్లో డబ్బులు అవసరమని, అంత డబ్బు తన వద్ద లేదని పిల్లలే వద్దనుకుంటాడు. భార్య(సంగీత విపిన్) కూడా అతని మనసును అర్థం చేసుకుంటుంది. కుటుంబ నియంత్ర కోసం కండోమ్ వాడుతారు. అయినప్పటికీ ప్రసాద్ భార్య గర్భం దాల్చుతుంది. దీంతో కండోమ్ సరిగ్గా పని చేయలేదని వినియోగదారుల కోర్టును ఆశ్రయిస్తాడు ప్రసాద్. తాను వాడిన కండోమ్ సరిగా పనిచేయలేకపోవడంతో తన భార్య గర్భం దాల్చిందని, నష్టపరిహారంగా రూపాయలు కోటి ఇవ్వాలని ఆ కంపెనీపై కేసు వేస్తాడు. ఈ కేసు ప్రసాద్ జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది? అసలు ప్రసాద్ భార్య గర్భం ఎలా దాల్చింది? చివరకు ఈ కేసులో ప్రసాద్ గెలిచాడా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే..మానవ జీవితంలో వస్తు వినియోగం తప్పని సరి. ఏదైనా ఒక వస్తువు కొని ఆ వస్తువు నకిలీ లేదా నాసిరకం అయితే అమ్మిన వ్యాపారిపై లేదా ఉత్పత్తిదారులపై కేసు వేయొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. వినియోగదారుల చట్టం పై జనాలకు అవగాహన లేదు. ఈ పాయింట్ తో తెరకెక్కిన చిత్రమే జనగా అయితే గనక. ప్రస్తుతం సమాజం ఫేస్ చేస్తున్న ఓ సీరియస్ ఇష్యూ ని కామెడీ వేలో చూపిస్తూ చివరకు ఓ మంచి సందేశాన్ని అందించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. దర్శకుడు రాసుకున్న కథ బాగుంది. కండోమ్ మీద కేసు పెట్టడమనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. కానీ అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడు.వినోదాత్మకంగా చూపించాలనే ఉద్దేశంతో చాలా చోట్ల లాజిక్ లెస్ సన్నివేశాలను జోడించాడు. ముఖ్యంగా కీలకమైన కోర్టు సన్నివేశాలు చాలా సిల్లీగా అనిపిస్తాయి . వెన్నెల కిషోర్ చేసే కామెడీ కూడా రొటీన్ గానే అనిపిస్తుంది. కోర్టు డ్రామా మొదలవగానే సినిమా క్లైమాక్స్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.ఇంటర్వెల్ ముందు వరకు అసలు కథను ప్రారంభించకుండా కథనాన్ని నడిపించాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించేందుకు ప్రసాద్ పాత్ర చుట్టు అల్లిన సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేవు. ఈ రోజుల్లో పిల్లలను కనాలంటే ఎంత ఖర్చు అవుతుందో ప్రాక్టికల్‌గా చూపించే సీన్ నవ్వులు పూయించడంతో పాటు ఆలోచింపచేస్తుంది. ఫస్టాఫ్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కష్టాలను చూపించి, సెకండ్ హాఫ్ లో వారి ఎమోషన్స్ తో కొందరు చేస్తున్న మోసపూరిత వ్యాపారాల చూపించారు. వైద్యం పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు చేస్తున్న దందా, నాణ్యమైన విద్య పేరుతో ప్రైవేట్ విద్యాసంస్థలు చేస్తున్న మోసాన్ని వినోదాత్మకంగా చూపించారు. అయితే ముందుగా చెప్పినట్లుగా కోర్డు డ్రామాలో బలం లేదు. కొన్ని చోట్ల ప్రసాద్ పాత్ర చేసే ఆర్గ్యుమెంట్స్‌కి అర్థం ఉండదు. ఇక చివర్లో వచ్చే చిన్న ట్విస్ట్ అయితే అదిరిపోతుంది.ఎవరెలా చేశారంటే..సుహాస్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా జీవించేస్తాడు . మిడిల్ క్లాస్ యువకుడు ప్రకాష్ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. కోటి సీన్లలో అతను చెప్పే డైలాగులు ఆలోచింపజేస్తాయి. హీరోయిన్ పాత్రనిడివి తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా కథంతా చుట్టే తిరుగుతుంది. లాయర్ కిషోర్ గా వెన్నెల కిషోర్ తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. జడ్జి ధర్మారావుగా రాజేంద్రప్రసాద్ కొన్నిచోట్ల నవ్విస్తాడు. లాయర్ గా మురళి శర్మ, హీరో తండ్రిగా గోపరాజు, బామ్మ పాత్రను పోషించిన నటితోపాటు మిగిలిన వారంతా తమ పాత్రల పరిధి మీద చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా పరవాలేదు. సంగీతం బావుంది. పాటలు కథలో భాగంగానే వస్తాయి. అయితే ఒక పాట మినహా మిగిలినవేవి గుర్తుండవు. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరవాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రజనీకాంత్ "వేట్టయన్" మూవీ రివ్యూ
టైటిల్: ‘వేట్టయన్- ది హంటర్’నటీనటులు:రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజు వారియర్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తదితరులునిర్మాణ సంస్థ: లైకా ప్రొడక్షన్స్ దర్శకత్వం: టి.జె.జ్ఞానవేల్సంగీతం:అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఎస్.ఆర్.కదిర్ఎడిటర్: ఫిలోమిన్ రాజ్విడుదల తేది: అక్టోబర్ 10, 2024కథేంటంటే.. ఎస్పీ అదియన్ (రజనీకాంత్) ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తప్పు చేసిన వాళ్లకు వెంటనే శిక్ష పడాలని భావిస్తాడు. అతనికి ఓ దొంగ ఫ్యాట్రిక్ (ఫహద్ ఫాజిల్) సహాయం చేస్తుంటాడు. ఓ సారి స్కూల్ టీచర్ శరణ్య(దుషారా విజయన్)ఇచ్చిన ఫిర్యాదుతో గంజాయి మాఫియా లీడర్ని అదియన్ ఎన్కౌంటర్ చేస్తాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు శరణ్య హత్యకు గురవుతుంది. ఓ వ్యక్తి స్కూల్లోనే ఆమెను హత్యాచారం చేసి దారుణంగా చంపేస్తాడు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ఎస్సీ హరీశ్ కుమార్(కిశోర్)కి అప్పగిస్తారు. ఈ కేసులో బస్తీకి చెందిన యువకుడు గుణను అరెస్ట్ చేయగా.. తప్పించుకొని పారిపోతాడు. దీంతో ఉపాధ్యాయ సంఘాలతో సామాన్య ప్రజల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. దీంతో డీజీడీ శ్రీనివాస్(రావు రమేశ్) ఈ కేసును ఎస్పీ అదియన్‌కి అప్పగిస్తాడు. ఆయన 48 గంటల్లోనే గుణను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తాడు. ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ మానవ హక్కుల సంఘం కోర్టు మెట్లు ఎక్కగా.. సీనియర్ న్యాయమూర్తి సత్యదేవ్(అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ వేస్తారు. సత్యమూర్తి విచారణలో గుణ ఈ హత్య చేయలేదని తెలుస్తుంది. మరి శరణ్యను హత్య చేసిందెవరు? ఎందుకు చేశారు? హంతకుడిని ఎస్పీ అదియన్ ఎలా కనిపెట్టాడు? ఈ కథలో రానా దగ్గుబాటి పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..'సత్వర న్యాయం'పేరుతో పోలీసులు చేసే ఎన్కౌంటర్లు ఎంతవరకు కరెక్ట్? అనే సీరియస్ పాయింట్‌తో వేట్టయన్ అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు జ్ఞానవేల్. జైభీమ్ సినిమా మాదిరే ఇందులో కూడా పేదవాడికి జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. అలా అని ఈ సినిమా కథనం జైభీమ్ మాదిరి నెమ్మదిగా, ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సాగదు. రజనీకాంత్ ఫ్యాన్స్‌కి కావాల్సిన మాస్ ఎలిమెంట్స్ అన్ని ఈ చిత్రంలో ఉన్నాయి. అయితే ఎమోషనల్‌గా మాత్రం ఈ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ కథలో చాలా డెప్త్ ఉంది. కేవలం ఎన్‌కౌంటర్‌పై మాత్రమే కాకుండా ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న విద్య దోపిడిపై కూడా దర్శకుడు ఈ చిత్రంలో చర్చించాడు. స్మార్ట్ ఎడ్యుకేషన్ పేరుతో ప్రైవేట్ సంస్థలు పేద విద్యార్థులను ఎలా దోచుకుంటున్నాయి? అనేది తెరపై కళ్లకు కట్టినట్లుగా చూపించాడు. కానీ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో విఫలం అయ్యాడు. బలమైన భావోధ్వేగాలు పండించే సీన్లను కూడా సింపుల్‌గా తీసేశారు. విలన్ పాత్రను కూడా బలంగా రాసుకోలేకపోయాడు. అలాగే ఉత్కంఠను పెంచే సన్నివేశాలేవి ఇందులో ఉండవు. పోలీసుల ఇన్వెస్టిగేషన్ కూడా అంతగా ఆకట్టుకోదు. కొన్ని చోట్ల రజనీకాంత్ తనదైన మ్యానరిజంతో ఆ తప్పులను కప్పిపుచ్చాడు. ఇంటర్వెల్‌కి 20 నిమిషాల ముందు వరకు కథనం సాదాసీదాగా సాగినా.. పహద్ పాత్ర చేసే చిలిపి పనులు, రజనీకాంత్ మాస్ ఎలిమెంట్స్‌తో ఫస్టాఫ్ బోర్ కొట్టదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుటుంది. ఇక సెకండాఫ్‌లోనే మెయిన్ స్టోరీ అంతా ఉంటుంది. అయితే బలమైన సీన్లు లేకపోవడంతో కొన్ని చోట్ల బోర్ కొడుతుంది. క్లైమాక్స్ బాగున్నా.. ‘పేదవాడిని అయితే ఎన్కౌంటర్ చేస్తారు కానీ డబ్బున్న వాడిని చేయరు’ అని అమితాబ్ పాత్రతో డైరెక్టర్ చెప్పించిన డైలాగ్‌కి ‘న్యాయం’ జరగలేదనిపిస్తుంది. ఎవరెలా చేశారంటే.. రజనీకాంత్ మ్యానరిజం, స్టైల్‌ని దర్శకుడు జ్ఞానవేల్ కరెక్ట్‌గా వాడుకున్నాడు. అభిమానులు అతన్ని తెరపై ఎలా చూడాలనుకుంటారో అలాగే ఎస్పీ అదియన్ పాత్రను తీర్చిదిద్దాడు. ఆ పాత్రకు రజనీ పూర్తి న్యాయం చేశాడు. వయసుతో సంబంధం లేకుండా తెరపై స్టైలీష్‌గా కనిపించాడు. ‘గురి పెడితే ఎర పడాల్సిందే’అంటూ ఆయన చేసే యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక న్యాయమూర్తి సత్యదేవ్‌గా అమితాబ్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. తెరపై హుందాగా కనిపిస్తాడు. అదియన్ భార్యగా మంజువారియర్ పాత్ర పరిది తక్కువే అయినా ఉన్నంతలో చక్కగా నటించింది. ఇక ఫహద్ ఫాజిల్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాలి. అదియన్ తర్వాత అందరికి గుర్తుండే పాత్ర ప్యాట్రిక్. ఒకప్పుడు దొంగగా ఉండి ఇప్పుడు పోలీసులకు సహాయం చేసే ప్యాట్రిక్ పాత్రలో ఫహద్ ఒదిగిపోయాడు. రానా విలనిజం పర్వాలేదు. కానీ ఆ పాత్రను మరింత బలంగా రాసి ఉంటే బాగుండేది. రోహిణి, అభిరామి, రితికా సింగ్, దుషారా విజయన్ తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమాగా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం బాగుంది. ‘మనసిలాయో’ పాట మినహా మరేవి అంతగా గుర్తుండవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'మా నాన్న సూపర్ హీరో' సినిమా రివ్యూ
ఈసారి దసరాకి అరడజనుకు పైగా సినిమాలు థియేటర్లలో రిలీజ్. వీటిలో వైవిధ్యభరిత చిత్రాలున్నాయి. ఇందులో ఓ మూవీనే 'మా నాన్న సూపర్ హీరో'. సుధీర్ బాబు, షాయాజీ షిండే, సాయిచంద్ ప్రధాన పాత్రలు పోషించారు. నాన్న సెంటిమెంట్‌తో తీసిన ఈ సినిమా నేడు(అక్టోబర్ 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ నాన్న.. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హీరో అనిపించుకున్నాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?ప్రకాశ్ (సాయిచంద్) ఓ లారీ డ్రైవర్. బిడ్డని ప్రసవించి భార్య చనిపోతుంది. రోజుల పిల్లాడిని అనాథశ్రమంలో ఉంచి, పనికోసం బయటకెళ్తాడు. ఊహించని విధంగా అరెస్ట్ అవుతాడు. 20 ఏళ్లు జైల్లోనే ఉండిపోతాడు. అంతలో పిల్లాడు జాని (సుధీర్ బాబు) పెరిగి పెద్ద వాడవుతాడు. ఇతడిని శ్రీనివాస్ (షాయాజీ షిండే) అనే స్టాక్ బ్రోకర్ దత్తత తీసుకుంటాడు. అయితే జాని రాకతో తన కుటుంబానికి అరిష్టం పట్టుకుందని శ్రీనివాస్‌కి కోపం. కానీ జానికి మాత్రం నాన్నే సూపర్ హీరో. తండ్రిపై విపరీతమైన ప్రేమ. ఊరంతా అప్పులు చేసే శ్రీనివాస్.. ఓ రాజకీయ నాయకుడికి కోటి రూపాయలు బాకీ పడతాడు. ఇంతకీ ఈ డబ్బు సంగతేంటి? చివరకు సొంత తండ్రి కొడుకులైన జాని-ప్రకాశ్ కలిశారా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?తమిళ, మలయాళంలో కొన్ని సినిమాలు చూసినప్పుడు.. అరె మన దగ్గర ఎందుకు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ రావట్లేదా అని చాలామంది బాధపడుతుంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోరిక తీర్చడానికి అన్నట్లు వచ్చిన మూవీ 'మా నాన్న సూపర్ హీరో'. కమర్షియల్ అంశాల జోలికి పోకుండా స్ట్రెయిట్‌గా కథ చెప్పి మెప్పించారు.చేయన నేరానికి పోలీసులకు దొరికిపోయి, కొడుక్కి ప్రకాశ్ దూరమవడంతో సినిమా ప్రారంభమవుతుంది. కట్ చేస్తే జాని, శ్రీనివాస్ పాత్రల పరిచయం. పెంపుడు తండ్రి అంటే కొడుకు జానికి ఎంత ఇష్టమో చూపించే సీన్స్. శ్రీనివాస్‌కి దత్త పుత్రుడు అంటే ఉండే కోపం, అయిష్టత. ఇలా నెమ్మదిగా ఈ రెండు పాత్రలకు అలవాటు పడతాం. ఇంతలో ప్రకాశ్ పాత్ర వస్తుంది. ఇక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. చిన్నప్పుడు విడిపోయిన తండ్రి-కొడుకు ఎలా కలుసుకుంటారా అని మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇంతలో కోటిన్నర లాటరీ టికెట్ అనేది మెయిన్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. ప్రకాశ్ దగ్గరున్న లాటరీ టికెట్‌ని కొట్టేయడానికి కొన్ని పాత్రలు ప్రయత్నిస్తూ ఉంటాయి. మరోవైపు తండ్రిని కాపాడుకునేందుకు పెంచిన కొడుకు పడే తాపత్రయం ఇలాంటి అంశాలతో సెకండాఫ్ నడిపించారు.రెండు గంటల సినిమా చూస్తున్నంతసేపు ఓ నవల చదువుతున్నట్లు ఉంటుంది. కానీ హీరోయిన్ సీన్స్, సెకండాఫ్ ప్రారంభంలో రాజు సుందరం ట్రాక్ నిడివి పొగిడించడం కోసం పెట్టారా అనే సందేహం కలుగుతుంది. ఇవి లేకపోయినా సరే సినిమా ఫ్లో దెబ్బతినదు. స్లో నెరేషన్ కూడా కొందరు ప్రేక్షకులకు ల్యాగ్ అనిపించొచ్చు. క్లైమాక్స్‌లోనూ అసలైన తండ్రి-కొడుకు కలుసుకున్నట్లు డ్రామా-ఎమోషన్స్ వర్కౌట్ చేయొచ్చు. కానీ సింపుల్‌గా తేల్చేశారా అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే మాత్రం ఓ మంచి ఎమోషనల్ డ్రామా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?సుధీర్ బాబు వరకు ఇది డిఫరెంట్ పాత్ర. ఇదివరకు బాడీ చూపిస్తూ ఎక్కువగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. ఇందులో మాత్రం సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. షాయాజీ షిండే క్యారెక్టర్ బాగుంది కానీ ఈ పాత్రకు ఇంకాస్త డెప్త్, ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది అనిపించింది. సెకండాఫ్‌లో తండ్రిగా సాయిచంద్ తనదైన యాక్టింగ్‌తో జీవించేశాడు. మేజర్ సీన్స్ అన్నీ ఈ పాత్రల చుట్టే తిరుగుతాయి. దీంతో హీరోయిన్‌తో పాటు మిగిలిన పాత్రలకు పెద్ద స్కోప్ దొరకలేదు.దర్శకుడు మంచి ఎమోషనల్ కథ అనుకున్నాడు. అందుకు తగ్గ పాత్రధారుల్ని తీసుకున్నాడు. కానీ సినిమా తీసే క్రమంలో కాస్త తడబడ్డాడు. కానీ ఇలాంటి స్టోరీ కూడా తీయొచ్చనే అతడి ప్రయత్నాన్ని మెచ్చుకోవాలి. ఎలాంటి కమర్షియల్ వాసనల జోలికి పోకుండా తీసిన డ్రామా సినిమా ఏదైనా చూద్దామనుకుంటే 'మా నాన్న సూపర్ హీరో'పై ఓ లుక్కేయండి. మరీ కాకపోయినా.. నచ్చేస్తుంది!-చందు డొంకాన -
ఓటీటీలోనే ది బెస్ట్... సలార్, కేజీఎఫ్‌కి బాబు లాంటి సినిమా
ఓటీటీలో అన్ని జానర్స్‌లో కొన్ని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మూవీస్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా వయలెన్స్ అంటే ఇష్టపడేవాళ్లు బోలెడుమంది. అలాంటి ఆడియెన్స్ కోసమా అన్నట్లు గ్యాంగ్‌స్టర్, యాక్షన్ చిత్రాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో టాప్ ప్లేసులో ఉండే మూవీ 'సిటీ ఆఫ్ గాడ్'. అయితే ఇది ఇంగ్లీష్ సినిమా కాదు. పోర్చుగీస్ భాషలో తీసిన బ్రెజిల్ మూవీ. కానీ ఇంగ్లీష్‌లో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీలో అంతలా ఏముంది? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?బ్రెజిల్ రాజధాని రియో డి జనీరో శివారులో ఉండే సిడాడె డె డెవుస్ మురికివాడ. కనీస అవసరాలైన విద్యుత్తు, రవాణా సదుపాయాలు అస్సలు ఉండవ్. చాలామంది కటిక పేదరికంలో ఉంటారు. ఇక్కడే 'టెండర్ ట్రయో' పేరుతో ముగ్గురు కుర్రాళ్లు.. దొంగతనం, దోపీడీలు చేస్తూ పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతుంటారు. పెద్ద హోటల్లో దోపీడీ చేస్తే ఇంకా ఎక్కువగా దోచుకోవచ్చని లిటిల్ డైస్ అనే పిల్లాడు సలహా ఇస్తాడు. రాత్రి అక్కడికే దొంగతనానికి వెళ్లిన ముగ్గురు కుర్రాళ్లు.. పోలీసులు వస్తే సిగ్నల్ ఇవ్వమని లిటిల్ డైస్‌ని బయట కాపలా ఉంచుతారు.దోపీడి మాత్రమే చేయాలని ఎవరినీ చంపకూడదని కుర్రాళ్లు అనుకుంటారు. కానీ లిటిల్ డైస్ సిగ్నల్ ఇవ్వడంతో వీళ్లు పారిపోతారు. తీరా మరుసటి రోజు పత్రికల్లో మాత్రం హోటల్లో చాలామంది చనిపోయినట్లు వార్తలు వస్తాయి. ఇంతకీ వాళ్లని ఎవరు చంపారు? చివరకు సిటీ ఆఫ్ గాడ్ అయిందెవరు అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?పూర్తిగా రా అండ్ రస్టిక్‌గా తీసిన ఈ సినిమా.. ఫొటోగ్రాఫర్ అవ్వాలని కలలు కనే బుస్కేప్ అనే కుర్రాడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సాగుతుంది. గ్యాంగ్‌స్టర్ ముఠా, పోలీసులకు మధ్య ఇతడు ఇరుక్కునే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అక్కడి నుంచి 1960లోకి వెళ్లి సిడాడె డె డెవుస్ అనే ఊరు. అక్కడి వాతావరణం, మనషులు ఎలా ఉంటారనేది చూపిస్తారు.అప్పుడే యవ్వనంలోకి వచ్చిన కుర్రాళ్లంతా డ్రగ్స్ వ్యాపారంలోకి రావడం, ఇబ్బడిముబ్బడిగా డబ్బు పోగేసుకోవడం, వీటితో తుపాకులు కొని హత్యలతో చెలరేగడం ఇలా చాలా వయలెంట్‌గా ఉంటుంది. ఆధిపత్యం కోసం మొదటి రెండు తరాలు ఇలానే ఒకరిని ఒకరు కాల్చుకుని చనిపోతారు. మూడో తరం కూడా అలానే తయారవబోతుందని చూపించడంతో సినిమా ముగుస్తుంది.ప్రాంతం గానీ, మనుషులు గానీ మనకు అస్సలు పరిచయం లేనివాళ్లు. కానీ చూస్తున్నంతసేపు బ్రెజిల్ శివారులోని మురికివాడల్లో ఉన్నామా అనే ఫీలింగ్ కలుగుతుంది. ఊపిరి సలపనంత స్పీడుగా ఉండే స్క్రీన్ ప్లే, దానికి తగ్గట్లే ఉండే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టేస్తుంది. ఇప్పుడంటే 'సలార్', 'కేజీఎఫ్' లాంటి సినిమాలు చూసి ఆహా ఓహో అంటున్నారు. కానీ 2002లో గ్యాంగ్‌స్టర్ జానర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇదని చెప్పొచ్చు.ఇక సినిమా చాలా సహజంగా ఉంటుంది. ఎందుకంటే స్థానికులనే లీడ్ యాక్టర్స్‌గా పెట్టారు. 100 రోజులు ట్రైనింగ్ ఇచ్చి మరీ నటింపజేశారు. దాని ఫలితం మీకు సినిమాలో కనిపిస్తుంది. అయితే ఈ సినిమాతో ఫ్యామిలీతో కలిసి చూడకండి. ఎందుకంటే బూతులు, న్యూడ్ సన్నివేశాలు ఉంటాయి. మీకు వయలెన్స్ ఎక్కువగా ఉండే గ్యాంగ్‌స్టర్ మూవీ చూడాలనుకుంటే దీన్ని అసలు మిస్సవొద్దు. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ రెండింటిలోనూ ఇది స్ట్రీమింగ్ అవుతోంది.-చందు డొంకాన -
'చిట్టి పొట్టి' సినిమా రివ్యూ
రామ్ మిట్టకంటి, పవిత్ర, కస్వి ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'చిట్టి పొట్టి'. భాస్కర్ యాదవ్ దాసరి నిర్మిస్తూ దర్శకత్వం వహించారు. చెల్లెలి సెంటిమెంట్‌తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తీశారు. తాజాగా ఇది థియేటర్లలోకి వచ్చింది. మరి సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకున్నాయనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: 'రామ్‌నగర్ బన్నీ' మూవీ రివ్యూ)కథేంటి?కిట్టు (రామ్ మిట్టకంటి) పోలీస్ అయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. అతనికి ఓ గర్ల్ ఫ్రెండ్(కస్వి). ఆమె అమెరికాలో ఉద్యోగం చేస్తుంటుంది. కిట్టుకి చిట్టి(పవిత్ర) అనే చెల్లి. ఆమె అంటే తనకు పంచ ప్రాణాలు. తన జోలికి ఎవరొచ్చినా వాళ్లని కొట్టేస్తుంటాడు. ఓ ఆకతాయి బ్యాచ్ ఆమె ఫొటోల్ని డీప్ ఫేక్ మార్ఫింగ్ చేస్తారు. అవమానం తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. తన చెల్లిని కాపాడుకుని కిట్టు ఆమెకు ఎలా పెళ్లి చేశాడు? చిన్న చిన్న మనస్పర్దలతో ఎప్పుడో దూరమైన మొత్త మూడు తరాల వారిని ఎలా ఒక్క చోటుకు చేర్చాడు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?అన్నా చెల్లెలి అనుబంధం మీద చాలా సినిమాలు వచ్చాయి. అలాంటి సిస్టర్ సెంటి మెంట్ సినిమాకు ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెడుతున్న డీఫ్ ఫేక్ మార్ఫింగ్ కాన్సెప్ట్ జోడించారు. తన చెల్లి అవమానానికి గురైతే ఓ అన్న.. దాన్నుంచి ఎలా ఆమెను బటయపడేశాడు? బాధ్యుల్ని ఎలా శిక్షించాడు అనే ఎలిమెంట్‌తో ఈ సినిమా తీశారు. దర్శకుడు ఫస్టాఫ్ అంతా అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని, సెకండాఫ్‌లో బంధువులు, వారి మూలాలు వెతుక్కుంటూ వెళ్లే సన్నివేశాలతో చాలా ఎమోషనల్‌గా సాగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ప్రతి ఒక్కరూ ఎమోషన్‌కు గురై కంటతడి పెడతారు.ఎవరెలా చేశారు?రామ్ మిట్టకంటి.. ఓ అన్నగా, ఓ కొడుకుగా అలానే యాక్షన్ సీన్స్, సెంటిమెంట్ కూడా బాగా చేశాడు. చెల్లిగా పవిత్ర కుదిరిపోయింది. హీరోయిన్ కస్వి పర్వాలేదు. మిగిలిన వాళ్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాసుకున్న సిస్టర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అన్నీ బాగా కనెక్ట్ అయ్యాయి. డీఫ్ ఫేక్ టెక్నాలజీ గురించి, బంధువుల గురించి బాగా చూపించారు. పాటలు, సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.(ఇదీ చదవండి: Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ) -
మిస్టర్ సెలెబ్రిటీ మూవీ రివ్యూ
సీనియర్ కథ, మాటల రచయిత పరచూరి వెంకటేశ్వరరావు ఫ్యామిలీ నుంచి ఓ హీరో వచ్చాడు. ఆయన మనవడు సుదర్శన్ హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా చేశాడు. ఆర్పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. చందిన రవి కిషోర్ దర్శకత్వం ఈ సినిమాకు వహించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓ మోస్తరు అంచనాలతో నేడు(అక్టోబర్ 4) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. వైజాగ్‌కి చెందిన సోషల్ యాక్టివిస్ట్ లలిత (శ్రీ దీక్ష)కు వింత అనుభవం ఎదురవుతుంది. ఆమెపై ఎవరో అత్యాచారానికి పాల్పడినట్లు కల వస్తుంది. పదే పదే అలాంటి కలలే రావడంతో డాక్టర్ని సంప్రదిస్తుంది. ప్రెగ్నెంట్ టెస్ట్ చేయగా..నిజమనే తెలుస్తుంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. కలలో వచ్చినవాడి పోలీకలతో బొమ్మను గీస్తే.. హైదరాబాద్‌కి చెందిన ఫేమస్ యూట్యూబర్ లక్కీ(సుదర్శన్) అని తెలుస్తుంది. ఎస్సై నరహరి (రఘుబాబు) అతన్ని అరెస్ట్ చేసి.. ఆ న్యూస్ వైరల్ అయ్యేలా చేస్తాడు. ఆ తరువాత లక్కీ నేరస్థుడు కాదని తెలుస్తుంది. కానీ మీడియా ఆ విషయాన్ని పట్టించుకోదు. అసలు లలితకు అలాంటి కలలు వచ్చేలా చేసిందెవరు? ఈ కేసులో లక్కీని ఎందుకు ఇరికించారు? వీరిద్దరితో పాటు ఎస్సై సరహరిని కూడా ఫేమస్ చేసి చంపుతానంటూ ఫోన్ చేసి బెదిరిస్తున్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? పద్మశ్రీ గ్రహిత, సైంటిస్ట్ రామచంద్రయ్య (నాజర్), జానకి (ఆమని)ల కథ ఏంటి? ఈ కథలో వరలక్ష్మీ శరత్‌కుమార్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..నిజం గడప దాటే లోపు.. అబద్ధం ప్రపంచమంతా చుట్టొస్తుంది అని ఊరికే అనలేదు. ప్రస్తుతం సమాజంలో చాలా మంది లేనిపోని వదంతులు సృష్టిస్తూ.. దానికి సోషల్ మీడియాను అస్త్రంగా వినియోగిస్తూ అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు అని చెప్పేలోపే అది దేశమంతా వైరల్ అవుతుంది. కొన్నిసార్లైతే అసలు నిజాన్ని బయటపెట్టినా జనాలు వినే స్థితిలో ఉండట్లేదు. నిజానిజాలు తెలుసుకోకుండా పక్కవారిపై నిందలు వేయడం ఇప్పుడు పరిపాటిగా మారింది. అలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిన సినిమానే ‘మిస్టర్ సెలెబ్రిటీ. ఒక అసత్యాన్ని ప్రచారం చేయడం వల్ల ఎంత నస్టం జరుగుతుంది? తెలియని తప్పుకు నిందలు వేస్తే..వాళ్లు ఎలా బాధపడతారు అనేది ఈ చిత్రంలో చూపించారు. దర్శకుడు రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్ని తెరపైకి తీసుకు రావడంలో కొంత వరకే సక్సెస్ అయ్యాడు.ఫస్ట్ హాఫ్ సరదా సరదాగా సాగుతుంది. రూమర్ల వల్ల ఎవరు ఎలా ఇబ్బందులు పడతారన్నది ఓ మూడు సీన్లు చూపించాడు. ఆ తరువాత హీరో ఇంట్రడక్షన్.. ఆ తరువాత సాంగ్.. ఆపై హీరోయిన్ పరిచయం, ఆమె సమస్య గురించి చెప్పడం, లలిత ఇచ్చిన ఫిర్యాదుతో లక్కీని నరహరి అరెస్ట్ చేయడం.. ఇలా సీన్లు ముందుకు వెళ్తూనే ఉంటాయి. లక్కీ, లలిత, నరహరి పాత్రలతోనే ఫస్ట్ హాఫ్ గడుస్తుంది. ఇంట్రవెల్‌కు ట్విస్ట్ వస్తుంది. ఓ ముసుగు వ్యక్తి ఇదంతా చేయిస్తాడని తెలుసుకుంటారు. దీంతో సెకండాఫ్ ఇంట్రెస్ట్‌గా మారుతుంది. వరలక్ష్మీ పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఎవరెలా చేశారంటే.. సుదర్శన్‌కి ఇది తొలి సినిమా. అయినా బాగా నటించాడు. కొన్ని సీన్లలో కాస్త తడబడినా.. కొన్ని చోట్ల అయితే అనుభవం ఉన్నవాడినా నటించాడు. పాటలు, ఫైట్లు, డైలాగ్స్ చెప్పడంలో ఓకే అనిపిస్తాడు. హీరోయిన్ శ్రీ దీక్షకు మంచి ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర దక్కింది. దానికి తగ్గట్టు ఆమె కూడా బాగానే నటించింది. నరహరి పాత్రలో రఘుబాబు ఆద్యంతం నవ్వించే ప్రయత్నించాడు. వరలక్ష్మీ పాత్ర చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. ఇలాంటి పాత్రలో కనిపించడం ఇదే మొదటి సారనిపిస్తుంది. నాజర్, ఆమని పాత్రలు ఎమోషనల్‌గా ఉంటాయి. సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీ ఇలా అందరూ తమ తమ పాత్రలకు తగ్గట్టుగా నటించారు.సాంకేతికతంగానూ ఈ సినిమా మెప్పిస్తాయి. పాటలు బాగుంటాయి. మాటలు కొన్ని చోట్ల ఆకట్టుకుంటాయి. ఆర్ఆర్ సీన్లకు తగ్గట్టుగా సాగుతుంది. కెమెరా వర్క్ ఓకే అనిపిస్తుంది. తక్కువ లొకేషన్లలో ఈ మూవీని చక్కగా తీశారు. ఎడిటింగ్ పర్వాలేదనిపిస్తుంది. ఇక ఈ చిత్రం కోసం నిర్మాతలు పెట్టిన డబ్బులు, పడిన కష్టం అయితే తెరపై స్పష్టంగా కనిపిస్తుంది. -
Swag Movie Review: ‘శ్వాగ్’ మూవీ రివ్యూ
టైటిల్: ‘శ్వాగ్’ నటీనటులు: శ్రీవిష్ణు, రీతూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోప రాజు రమణ తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత : టి.జి. విశ్వ ప్రసాద్రచన-దర్శకత్వం: హసిత్ గోలిసంగీతం: వివేక్ సాగర్సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్ఎడిటర్: విప్లవ్ నైషధంవిడుదల తేది: అక్టోబర్ 04, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ ఏడాది మార్చిలో ఓం భీమ్ బుష్ సినిమాతో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు ‘శ్వాగ్’ అంటూ మరోసారి ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. 'రాజ రాజ చోర' బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత శ్రీవిష్ణువుతో డైరెక్టర్ హసిత్ గోలి తెరకెక్కించిన రెండో చిత్రమిది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 4)ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? శ్రీవిష్ణువు ఖాతాలో మరో హిట్ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. దివాకర్ పేట ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవనభూతి(శ్రీవిష్ణు) రిటైర్మెంట్ రోజు అతనికి ఒక లెటర్ వస్తుంది. అందులో తనది శ్వాగనిక వంశం అని.. వంశ వృక్ష నిలయంలో పూర్వికుల ఆస్తి ఉందని ఉంటుంది. ఎలాగైన ఆ ఆస్తినికి కొట్టేయాలని భవనభూతి అక్కడికి వెళ్తాడు. ఆ ఆస్తికి రక్షగా నిలుస్తున్న మరో వంశం వ్యక్తి(గోపరాజు రమణ).. పూర్వికుల ఇచ్చిన పలక తీసుకొని వస్తేనే ఆస్తి దక్కుతుందని చెబుతాడు. భవనభూతి దాని వెతుకుతుండగా..మరో యువతి అనుభూతి(రీతువర్మ) ఆ పలకతో వంశవృక్ష నిలయానికి వస్తుంది. శ్వాగనిక వంశం తనదే అంటే తనదే అంటూ ఇద్దరు గొడవపడుతుంటారు. మరోవైపు యూట్యూబర్ సింగ(శ్రీవిష్ణువు) కూడా స్వాగనిక వంశం వాడేనని తెలుస్తుంది. ఆయన కూడా ఆస్తికోసం వంశ వృక్ష నిలయానికి వస్తాడు. అసలు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధ ఏంటి? వీరికి లేఖలు రాస్తున్నదెవరు? ఎందుకు రాశారు? 1550లో మాతృస్వామ్య పాలన సాగిస్తున్న వింజారమ వంశపు స్త్రీ (రితూ వర్మ) నుంచి స్వాగనిక వంశ మూలపురుషుడు భవభూతి(శ్రీవిష్ణు) అధికారాన్ని ఎలా దక్కించుకున్నాడు? మాతృస్వామ్య పాలనకు ముగింపు పలికి పితృస్వామ్య పాలన ఎప్పటికి కొనసాగించేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. పైన రాసిన కథ చదివితేనే కాస్త గందరగోళంగా అనిసిస్తుంది కదా?. మరి దాన్ని తెరపై అర్థమయ్యేలా చూపించడం చాలా కష్టమైన పని. ఈ విషయంలో డైరెక్టర్ హసిత్ గోలి కొంతమేర సక్సెస్ అయ్యాడు. విభిన్న టైమ్లైన్లలో సెట్ చేయబడిన కథ ఇది. ప్రారంభంలో కాస్త గందరగోళానికి గురైనా.. కాసేపటి తర్వాత అందరూ పాత్రలతో మూవ్ అవుతుంటారు. 1550ల నాటి కథకి ఇప్పటి వ్యక్తులకు ఉన్న సంబంధం ఏంటి అనేది బుర్రపెట్టి చూస్తే తప్ప అర్థం కాదు. అయితే ఉన్న కొద్ది సమయంలో దర్శకుడు అందరికి అర్థమయ్యేలా కథను చెప్పాలనుకున్నాడు. కానీ సాధారణ ప్రేక్షకుడికి మాత్రం అది కాస్త గందరగోళానికి గురిచేస్తుంది. పెద్ద కథ కాబట్టి అన్ని విడమర్చి చెప్పడానికి సమయం లేకపోవడంతో సింపుల్‌గా ఒక్కొ సీన్‌తో ముగించేశారు.1550 ల సమయంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగాళ్ల మధ్య ఆడవాళ్ళ ఆధిపత్య పోరు జరుగుతున్న సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. అప్పట్లో స్త్రీలే పరిపాలన చేసేవారని, మగవారు ముసుగు ధరించి ఇంట్లోనే ఉండేవారని చూపించారు. ఆ తర్వాత కథ ప్రస్తుతానికి చేరుతుంది. ఎస్సై భవనభూతి భార్య రేవతి(మీరా జాస్మిన్) ఎందుకు అతన్ని వదిలి వెళ్లిపోయింది అనేది ఆసక్తికరంగా చూపించారు. ఫస్టాఫ్‌లోనే అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి.. ఆ పాత్రల మధ్య ఉన్న సంబంధం ఏంటనే క్యూరియాసిటీని ప్రేక్షకుల్లో కల్పించారు. అయితే మొదటి 30 నిమిషాలు మాత్రం కథనం రొటీన్‌గానే సాగుతుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆసక్తికరంగా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో పాత్రల మధ్య ఉన్న సంబంధాన్ని రివీల్ చేస్తూనే ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న ఓ ప్రధానమైన సమస్యపై సీరియస్‌గా చర్చించారు. ముఖ్యంగా విభూతి(శ్రీవిష్ణువు) పాత్ర ఎంట్రీ తర్వాత కథనం మొత్తం ఎమోషనల్‌గా సాగుతుంది. కామెడీతో మొదలైన సినిమా.. చివరకు ఎమోషనల్‌గా ముగుస్తుంది. అయితే ముందుగా చెప్పినట్లు కాస్త బుర్రపెట్టి చూస్తేనే ఈ సినిమా అర్థమవుతుంది. ఎవరెలా చేశారంటే.. కంటెంట్ కింగ్ అనే బిరుదుకు శ్రీవిష్ణువు మరోసారి న్యాయం చేశాడు. మంచి కథను ఎంచుకోవడమే కాకుండా తనదైన నటనతో ఆ కథకు పూర్తి న్యాయం చేశాడు. విభిన్నమైన ఐదు పాత్రల్లో నటిస్తూ.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా విభూతి పాత్ర అయితే సినిమాకే హైలెట్. ఆ పాత్రతో శ్రీవిష్ణు నటన అద్భుతం. ఈ పాత్ర గురించి ఎక్కువగా చెబితే ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇక రీతూ వర్మ రెండు పాత్రల్లో కనిపించి.. తనదైన నటనతో ఆకట్టుకుంది. మీరా జాస్మిన్ తెరపై కనిపించేంది కాసేపే అయితే..ఉన్నంతలో బాగానే చేసింది. కథ మొత్తం ఆమె పాత్ర చుట్టే తిరుగుతుంది. సునీల్, గోపరాజు రమణతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. వివేక్ సాగర్ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదని సినిమా చూస్తే అర్థమవుతుంది. -Rating: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'రామ్‌నగర్ బన్నీ' మూవీ రివ్యూ
యాటిట్యూడ్ స్టార్‌గా పాపులర్ అయిన టీవీ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ తొలి సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. తన మేనరిజం వల్ల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ కుర్రాడు హీరోగా చేసిన ఫస్ట్ మూవీ 'రామ్‌నగర్ బన్నీ'. తాజాగా ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. ఎలా ఉంది? యాటిట్యూడ్ స్టార్ హిట్ కొట్టాడా అనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ)కథేంటి?రామ్‌నగర్ ఏరియాలో ఉండే బన్నీకి లేడీస్ వీక్నెస్. చూసిన ప్రతి అమ్మాయితో ప్రేమలో పడుతుంటాడు. అలా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురితో ఒకరి తర్వాత ఒకరు అన్నట్లు ప్రేమ కహానీ నడిపిస్తాడు. అమ్మాయిల వరకు అయితే ఏదో అనుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకుంటానని ఓ ఆంటీకి మాటిస్తాడు. ఆమె కంపెనీలో చేరతాడు. అయితే ఈమెపై తనకు ఎలాంటి ఇష్టం లేదని, తను నిజంగా ప్రేమిస్తుందని శైలు(విస్మయ శ్రీ)ని అని తెలుసుకుంటాడు. కానీ అప్పటికే ఆమెకు మరొకరితో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అవుతుంది. చివరకు బన్నీ, శైలు ఒక్కటయ్యారా అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?సోషల్ మీడియా పుణ్యాన ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారనేది చెప్పలేం. అలా ఫేమస్ అయిన కుర్రాడు చంద్రహాస్. ఇతడి పేరే మర్చిపోయేంతలా యాటిట్యూడ్ స్టార్ అని ట్రోల్ చేశారు. కానీ దీన్ని ట్యాగ్ లైన్ వాడేసి మనోడి కొత్త సినిమాని తీసుకొచ్చేశారు. ఇక ఫస్ట్ మూవీ కాబట్టి తెలుగులో ఎప్పటినుంచో ఉన్నట్లే కమర్షియల్ లెక్కలేసుకుని మరీ సినిమా తీశారు.ఓ ఆంటీ తనని బలవంతంగా పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిందని బన్నీ అనే కుర్రాడు బాధపడే సీన్‌తో సినిమా మొదలవుతుంది. అలా తన కథ చెబుతాడు. అల్లరి చేస్తూ కాలేజీ చదివే కుర్రాడు. అతడికో ఫ్యామిలీ. పక్కనే నలుగురు ఫ్రెండ్స్. అనుకోకుండా రోడ్డుపై అమ్మాయిని చూసి ప్రేమలో పడటం, కొన్నాళ్ల లవ్ చేసిన తర్వాత మరో అమ్మాయి కనిపించేసరికి ఈమెని వదిలేస్తాడు. తీరా రెండో అమ్మాయి వీడిని మోసం చేస్తుంది. వీళ్లిద్దరిపై ఉన్నది ప్రేమ కాదని, వేరే అమ్మాయిపై తనకు అసలు ప్రేమ ఉందని తెలుసుకుంటాడు. తర్వాత ఏమైంది? ఇదంతా కాదన్నట్లు బన్నీ జీవితంలోకి వచ్చిన తార అనే ఆంటీ ఎవరు అనేది చివరకు ఏమైందనేది సినిమా చూసి తెలుసుకోవాలి.సినిమా చూస్తున్నంతసేపు సరదాగా అలా సాగిపోతూ ఉంటుంది. అక్కడక్కడ కాసిన్ని కామెడీ సీన్స్, కాసిన్ని ఎమోషనల్ సీన్స్.. మధ్యలో ఓ నాలుగు పాటలు, ఇవి కాదన్నట్లు రెండు ఫైట్స్. కమర్షియల్ సినిమాకు ఇంతకంటే ఏం కావాలంటారా? ఒకవేళ ఈ తరహా మూవీస్ ఇష్టముంటే 'రామ్‌నగర్ బన్నీ' మీకు నచ్చేయొచ్చు. రెండున్నర గంటల సినిమాలో కొన్ని సీన్లు కాస్త ల్యాగ్ అనిపిస్తాయి తప్పితే ఓవరాల్‌గా చల్తా చల్తా ఎంటర్టైనర్.ఎవరెలా చేశారు?యాట్యిట్యూడ్ అని ట్రోల్ చేస్తే, దాన్నే తన పేరుగా మార్చుకున్న చంద్రహాస్.. యాక్టింగ్ పరంగా పర్వాలేదనిపించాడు. డ్యాన్స్, ఫైట్స్, రొమాన్స్, ఎమోషన్స్.. ఇలా అన్నింట్లో బాగానే కష్టపడ్డాడు. శైలుగా చేసిన విస్మయ క్యూట్‌గా ఉంది. బన్నీ ప్రేమించిన అమ్మాయిలు మిగతా ముగ్గురు ఓకే అనిపించారు. బన్నీ తండ్రిగా చేసిన మురళీధర్ గౌడ్ కామెడీ పరంగా తనవంతు ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లంతా ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే రెండు మూడు పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది కానీ హైదరాబాద్ సిటీనీ చూపించే డ్రోన్ షాట్స్, ఓ పాటలో సెల్ఫీ విజువల్స్ సినిమాలో సెట్ కాలేదు. దర్శకుడు శ్రీనివాస్ మహత్ తీసుకున్న లైన్ పాతదే. కానీ కాస్త మెరిపించే ప్రయత్నం చేశాడు. మరీ అదరగొట్టేశాడని చెప్పలేం గానీ పాస్ అయిపోయాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఫైనల్‌గా చూస్తే యాటిట్యూడ్ స్టార్ ఎంట్రీ టెస్టులో పాస్ అయిపోయినట్లే!-చందు డొంకాన.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) -
Kali 2024 Movie Review: 'కలి' సినిమా రివ్యూ
ప్రిన్స్, నరేశ్ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కలి'. ట్రైలర్‌తోనే కాస్త అంచనాలు పెంచేసిన ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. సైకలాజికల్ థ్రిల్లర్ కథ, కలి పురుషుడు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తీశారు. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు)కథేంటి?శివరామ్ (ప్రిన్స్) యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఎవరు ఏం సహాయం అడిగినా కాదనకుండా చేస్తుంటాడు. ఈ క్వాలిటీ నచ్చే వేద (నేహా కృష్ణన్) అనే అమ్మాయిని ఇతడిని ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్లుని ఎదురించి వచ్చి మరీ పెళ్లి చేసుకుంటుంది. కొన్ని పరిస్థితుల వల్ల మంచిగా బతికే శివరామ్.. కష్టాల పాలవుతాడు. ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. దీంతో కలియుగాన్ని పాలించే కలి పురుషుడు (నరేశ్ అగస్త్య) ఎంట్రీ ఇస్తాడు. తర్వాత ఏమైంది? అనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యలు ఎక్కువైపోయాయి. అడిగిన ఫోన్ కొనివ్వలేదనో, లవర్ బ్రేకప్ చెప్పిందనో ప్రతి చిన్న విషయానికి చాలామంది తమ ప్రాణాల్ని చిన్న వయసులోనే తీసేసుకుంటున్నారు. అలా భార్య వదిలేసిందని, అందరూ మోసం చేశారని అనుకునే వ్యక్తి చనిపోవాలని ఫిక్స్ అవుతాడు. సరిగ్గా ఆ టైంలో కలిపురుషుడు ఎంట్రీ ఇస్తే.. తర్వాత ఏం జరిగిందనేదే 'కలి' థీమ్.ఆత్మహత్య సరైన పని కాదని ఇప్పటికే చాలా సినిమాల్లో చూపించారు. కానీ ఇందులో చెప్పిన, చూపించిన విధానం ఇంప్రెసివ్‌గా అనిపించింది. ఎందుకంటే కలియుగాన్ని ఏలే కలి పురుషుడు భూమ్మీదకు రావడమేంటి? చనిపోవాలనుకునే మనిషితో డిస్కషన్ పెట్టడమేంటి అనిపిస్తుంది గానీ చూస్తున్నంతసేపు భలే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది.దేవుడు మనం ఎన్నాళ్లు బతకాలనేది నిర్ణయిస్తాడు. కానీ మనం ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదనే పాయింట్‌ని సైకలాజికల్ థ్రిల్లర్ కథతో చెప్పడం బాగుంది. నిడివి కూడు కేవలం గంటన్నరే. ఇలా ప్లస్సలు ఉన్నట్లే మైనస్సులు కూడా ఉన్నాయి. సినిమా అంతా కూడా శివరామ్, కలి పాత్రల మధ్య తిరుగుతుంది. యుగాలు, చనిపోవాలనుకున్న వాడితో గేమ్ ఆడటం బాగున్నప్పటికీ పదే పదే ఒకే సన్నివేశాలు చూసిన ఫీలింగ్ కలుగుతుంది.ఎవరెలా చేశారు?శివరామ్ పాత్ర చేసిన ప్రిన్స్ ఆకట్టుకున్నాడు. డిఫరెంట్ ఎమోషన్స్ బాగానే పలికించాడు. కలి పురుషుడిగా చేసిన నరేశ్ అగస్త్య సెటిల్డ్ యాక్టింగ్ చేశాడు. వేదగా చేసిన నేహాకృష్ణ ఉన్నంతలో పర్వాలేదనిపించింది. మిగిలిన పాత్రధారులు అంతా ఓకే. టెక్నికల్ విషయానికొస్తే స్టోరీ మంచి ఐడియా. కమర్షియల్ అంశాలు అని కాకుండా దర్శకుడు శివ శేషు.. చెప్పాలనుకున్న విషయాన్ని ఫెర్ఫెక్ట్గా చెప్పాడు. సినిమాటోగ్రఫీ ఓకే. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. బడ్జెట్ పరిమితులు కనిపిస్తాయి గానీ ఉన్నంతలో బాగా తీశారు. ఇక చివర్లో సీక్వెల్ ఉంటుందని కూడా హింట్ ఇచ్చారు.- రేటింగ్: 2.75/5-చందు డొంకాన(ఇదీ చదవండి: 'స్వాగ్' సినిమా ట్విటర్ రివ్యూ) -
Satyam Sundaram Review: ‘సత్యం సుందరం’ మూవీ రివ్యూ
టైటిల్: సత్యం సుందరంనటీనటులు: కార్తి, అరవింద్ స్వామి, కిరణ్, దివ్య, జయ ప్రకాశ్నిర్మాతలు: సూర్య, జ్యోతిక దర్శకత్వం: ప్రేమ్ కుమార్సంగీతం: గోవింద్ వసంత్విడుదల తేది: సెప్టెంబర్ 28, 2024ఈ వారం బరిలో ఎన్టీఆర్ ‘దేవర’ ఉండడంతో ఇక్కడ మరో చిత్రమేది రిలీజ్ కాలేదు. కొన్ని సినిమాలు ఈ డేట్ ఫిక్స్ చేసుకున్నా.. దేవర ఎంట్రీతో వెనక్కి తగ్గాయి. కానీ ఒక డబ్బింగ్ మూవీ మాత్రం టాలీవుడ్లో దేవరతో పోటీ పడేందుకు సిద్ధమైంది. అదే సత్యం సుందరం. తమిళ స్టార్ హీరోలు కార్తి, అరవింద్ స్వామి కలిసి నటించిన ఈ చిత్రానికి సెన్సిబుల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడులైన ట్రైలర్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ వేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే...ఈ కథ 1996-2018 మధ్యకాలంలో సాగుతుంది. రామలింగం(జయ ప్రకాశ్) ఇంట్లో ఆస్తి తగాదాలు వస్తాయి. దీంతో పూర్వికుల నుంచి వచ్చిన ఇంటిని, సొంత ఊరిని వదిలి కొడుకు సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి), భార్యతో కలిసి వైజాగ్‌కి వెళ్తాడు. 22 ఏళ్ల తర్వాత బాబాయ్ కూతురు భువన పెళ్లి కోసమై సత్య మళ్లీ తన సొంతూరు వెళ్లాల్సి వస్తుంది. అయిష్టంతో సత్య ఊరికి వెళ్తాడు. తనకు ఇష్టమైన చెల్లి భువన పెళ్లిలో కనబడి వెంటనే వైజాగ్‌కి తిరిగి వద్దామనుకుంటాడు. అయితే పెళ్లిలో బావా..అంటూ ఓ వ్యక్తి(కార్తి) వచ్చి సత్యను ఆప్యాయంగా పలకరిస్తాడు. అతను ఎవరో సత్యకు తెలియదు. (చదవండి: దేవర మూవీ రివ్యూ)ఈ విషయం తెలిస్తే బాధపడతాడని తెలిసిన వ్యక్తిగానే ప్రవర్తిస్తాడు. ఆ వ్యక్తి చెప్పే చిన్ననాటి విషయాలేవి గుర్తుకు రాకున్నా ఏదోలా మ్యానేజ్ చేస్తుంటాడు. తాను వెళ్లాల్సిన బస్ మిస్ అవ్వడంతో ఓ రాత్రంతా ఆ వ్యక్తితో గడపాల్సి వస్తుంది. ఆ వ్యక్తి పరిచయంతో సత్య జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి? పేరు కూడా తెలియని వ్యక్తి చూపించే అతి ప్రేమకు సత్య ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అసలు ఆ వ్యక్తి పేరు సుందరం అని సత్యకు ఎప్పుడు,ఎలా తెలిసింది? సత్యాని సుందరం అంత ఆప్యాయంగా చూసుకోవడానికి గల కారణం ఏంటి? సత్యతో సుందరానికి ఉన్న బంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..సహజత్వం ఉట్టిపడేలా తెరకెక్కే చిత్రం ఏ భాషలోనైనా విజయం సాధించడం తథ్యం. ఈ విషయం డైరెక్టర్ ప్రేమ్ కుమార్‌కి బాగా తెలుసు. అప్పుడు 96, ఇప్పుడు సత్యం సుందరం.. ఈ రెండు సినిమాల కథలు నేచురల్‌గా ఉంటాయి. హీరో పాత్ర మన చుట్టు ఉండే ఓ వ్యక్తిలాగానో లేదా మనలోనే చూసుకునేలా ఉంటుంది. 96 సినిమా మాదిరే సత్యం సుందరం కథ కూడా చాలా చిన్నది. అందరికి తెలిసిన, చూసిన కథ. అయినా కూడా తనదైన స్క్రీన్‌ప్లేతో ఎక్కడ బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించాడు. ఇది సినిమా లాగా కాకుండా ఎవరో మన ఆత్మీయులను చూస్తున్నట్లుగా, వాళ్ళ జీవితాల్లో జరిగే ప్రతి సంఘటన మనకే జరిగిన అనుభూతి కలిగిస్తుంది.సినిమా ప్రారంభం అయినా కాసేపటికే మనం కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో కనెక్ట్ అయిపోతాం. వారిద్దరి మధ్య వచ్చే సంభాషణలు..సన్నివేశాలన్నీ మన ఇంట్లోనో..లేదా మనకు తెలిసివాళ్ల ఇంట్లోనో జరిగినట్లుగా అనిపిస్తుంది. ఇద్దరు కలిసి కొన్ని చోట్ల నవ్విస్తారు..మరికొన్ని చోట్ల ఏడిపిస్తారు. స్క్రీన్ మీద పండించిన ఎమోషన్‌కి సీట్లలో ఉండే ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకుంటాడు. వాళ్లు చెప్పుకునే చిన్ననాటి ముచ్చట్లు..మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇక సత్య తన చెల్లి భువనకు పట్టీలు పెట్టే సీన్ అయితే గుండెను బరువెక్కిస్తుంది. అతి ప్రేమను చూపించే వ్యక్తి పేరు తెలియక సత్య పడే బాధను చూసి మనకు కన్నీళ్లు వస్తాయి. సుందరం అమాయకత్వం, మంచితనం చూసి నవ్వుతూనే మనలో ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయా లేదా అని వెతుక్కుంటాం. వాళ్లు ఇద్దరు కలిసి మందేస్తే.. మత్తు మనకెక్కుతుంది. సైకిల్ సీన్ చూసి.. మనకు తెలియకుండానే కళ్లు తడిసిపోతాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో ప్రేక్షకుడు ప్రయాణం అయ్యేలా చేయడం దర్శకుడు వందశాతం సక్సెస్ అయ్యాడు. అయితే, ప్రేమ్ కుమార్ మీద ఉన్న ఏకైక కంప్లైంట్ నరేషన్ మరీ స్లో ఉండడం. సినిమా నివిడి చాలా ఎక్కువ. అందుకే కొన్ని చోట్ల సాగదీతగా అనిపిస్తాయి. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన కార్తి, అరవింద్ స్వామి ఇద్దరు బడా హీరోలే. కానీ ఆ ఇమేజ్ మాత్రం తెరపై ఏ మాత్రం కనిపించదు. తెరపై మనకు సత్యం, సుందరం పాత్రలే కనిపిస్తాయి కానీ ఎక్కడా కార్తి, అరవింద్ స్వామి గుర్తుకురారు. ప్రేమ్ కుమార్ రాసిన సహజ కథకు తమదైన సహస నటనతో ఇద్దరూ న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్లలో ఇద్దరూ పోటీ పడీ నటించారు. ఇక కార్తి అయితే తన అమాయకత్వపు నటనతో కొన్ని చోట్ల నవ్వించాడు. కిరణ్, దివ్య, జయ ప్రకాశ్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ మరోసారి తనదైన మ్యూజిక్‌తో మ్యాజిక్ క్రియేట్ చేశాడు. అతను అందించిన నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాటోగ్రాఫర్ మహేందిరన్ జయరాజు పని తీరు చాలా బాగుంది. ప్రతిఫేమ్ని తెరపై చాలా అందంగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - రేటింగ్: 3.25/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
ఓటీటీలోనే విచిత్రమైన సినిమా.. 'కొట్టుక్కాళి' రివ్యూ
ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు సినిమా తీసే పద్ధతి, చూసే విధానం చాలా మారిపోయింది. కొత్తతరం దర్శకులు ఎలాంటి ప్రయోగాలకైనా వెనకాడటం లేదు. తెలుగులో తక్కువ గానీ తమిళ, మలయాళంలో డిఫరెంట్ కథలు వస్తుంటాయి. అలాంటి ఓ తమిళ మూవీనే 'కొట్టుక్కాళి'. తాజాగా ఇది ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మీనా (అన్నా బెన్) ఓ సాధారణ అమ్మాయి. ఈమె బావ పేరు పాండి (సూరి). వీళ్లిద్దరికీ పెళ్లి చేస్తామని తల్లిదండ్రులు అంటే చదువుకుంటానని మీనా చెబుతుంది. దీంతో కాలేజీలో చేర్పిస్తారు. అక్కడే మరో కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఇది మీనా ఇంట్లో తెలిసి ఆమెపై పెద్దోళ్లు కోప్పడతారు. దీంతో పూర్తిగా సైలెంట్ అయిపోతుంది. ప్రేమించిన అబ్బాయి.. తమ కూతురిపై చేతబడి చేశాడని ఈమె తల్లిదండ్రులు భావిస్తారు. ఈమెకు పట్టిన దెయ్యాన్ని వదిలించాలని కుటుంబమంతా కలిసి ఓ చోటుకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?'కొట్టుక్కాళి' అంటే తమిళంలో మొండి అమ్మాయి అని అర్థం. మలయాళ నటి అన్నా బెన్ లీడ్ రోల్ చేసింది. ఈ సినిమా కథ చాలా సింపుల్. దెయ్యం పట్టిందనుకున్న ఓ అమ్మాయిని తీసుకుని, ఈమె కుటుంబం ఓ స్వామి దగ్గరకు వెళ్తారు. ఈ ప్రయాణంలో ఒక్కక్కరు ఎలా ప్రవర్తించారు. అసలు దర్శకుడు మనకు ఏం చెప్పాలనుకున్నాడనేదే తెలియాలంటే మూవీ చూడాలి.సాధారణంగా సినిమా అంటే పాటలు, ఫైట్స్, హోరెత్తిపోయే బీజీఎం.. ఇలా బోలెడంత హంగామా. కానీ 'కొట్టుక్కాళి'లో ఇవేం ఉండవు. ఇంకా చెప్పాలంటే దాదాపు గంటన్నర పాటు ఉండే ఈ మూవీలో హీరోయిన్‌కి ఒక్కటే డైలాగ్. అది కూడా జస్ట్ ఐదే సెకన్లు మాట్లాడుతుంది. అంతే. కోడిపుంజుని తాడుతో బంధించినట్లే.. ఫ్యామిలీ అనే ఎమోషన్స్‌కి తలొగ్గి హీరోయిన్ బంధి అయిపోయి ఉంటుంది. సినిమా చూస్తే ఈ పాయింట్ అర్థమవుతుంది.అలానే పురుషాధిక్యం, దెయ్యాల్ని వదిలించే పేరుతో కొందరు వ్యక్తులు మహిళల్ని అసభ్యకరంగా తాకుతూ ఎలా ప్రవర్తిస్తున్నారనే విషయాల్ని ఇందులో చూపించారు. ఈ సినిమాకు క్లైమాక్స్ ఓపెన్ ఎండింగ్‌తో వదిలేశారు. అంటే ఎవరికి ఏమనిపిస్తే అదే క్లైమాక్స్ అనమాట.ఎవరెలా చేశారు?ప్రధాన పాత్రలు చేసిన సూరి, అన్నా బెన్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన పాత్రల్లో నటించిన వాళ్లందరూ చాలా నేచురల్‌గా ఉంటారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు పల్లెటూరిలో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. పాండి, మీనా క్యారెక్టర్స్‌తో పాటు అలా ట్రావెల్ అయిపోతాం. దొంగ స్వామిజీల గురించి దర్శకుడు ఏదో మెసేజ్ ఇద్దామనుకున్నాడు. కానీ అందరినీ ఆకట్టుకునేలా తీయలేకపోయాడు.ఇకపోతే 'కొట్టుక్కాళి' సినిమా అమెజాన్ ప్రైమ్‌లో తమిళంలో స్ట్రీమింగ్ అవుతుంది. కాస్త ఓపిక ఉండి, డిఫరెంట్ సినిమాలు చూద్దామనుకుంటే దీన్ని ట్రై చేయండి.- చందు డొంకాన -
‘దేవర’ మూవీ రివ్యూ
టైటిల్: దేవరనటీనటులు: జూ.ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శృతి మారాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులునిర్మాణ సంస్థ: ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ ,యువసుధ ఆర్ట్స్నిర్మాతలు: నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని,కొసరాజు హరికృష్ణదర్శకత్వం- స్క్రీన్‌ప్లే: కొరటాల శివసంగీతం: అనిరుధ్ రవిచందర్సినిమాటోగ్రఫీ: ఆర్.రత్నవేలుఎడిటింగ్: అక్కినేని శ్రీకర్ ప్రసాద్విడుదల తేది: సెప్టెంబర్ 27, 2024ఎన్టీఆర్ అభిమానుల ఆరేళ్ల నిరీక్షణకు తెరపడింది. ఆయన సోలో హీరోగా నటించిన ‘దేవర’ మూవీ ఎట్టకేలకు నేడు(సెప్టెంబర్ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఎన్టీఆర్, ఆచార్య లాంటి అట్టర్ ఫ్లాప్ తర్వాత డెరెక్టర్ కొరటాల శివ కలిసి చేసిన సినిమా ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘దేవర’పై భారీ హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎలా ఉంది? కొరటాల శివకు భారీ బ్రేక్ వచ్చిందా? ఎన్టీఆర్‌కు ఇండస్ట్రీ హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.కథేంటంటే..ఆంధ్ర - తమిళనాడు సరిహద్దు ప్రాంతం రత్నగిరి లోని ఎర్ర సముద్రం అనే గ్రామంలో జరిగే కథ ఇది. కొండపై ఉండే నాలుగు గ్రామాల సమూహమే ఈ ఎర్ర సముద్రం. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ( సైఫ్ అలీ ఖాన్), రాయప్ప( శ్రీకాంత్), కుంజర(షైన్ టామ్ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ(మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్ అవుతాడు. దేవర మాట కాదని భైరవతో పాటు మరో గ్రామ ప్రజలు సముద్రం ఎక్కేందుకు సిద్ధం అవ్వగా... దేవర వాళ్లకు తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. దీంతో దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు సముద్రం ఎక్కి దొంగ సరకు తీసుకురాకుండా ఉండేందుకు దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం( జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్ యతితో దేవర కథకు సంబంధం ఏంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటేదాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం కావడంతో దేవర పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఓ మాదిరిగి ఉన్నా... సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుంది. లేకపోతే ఎన్టీఆర్ ఒప్పుకోరు కదా అని అంతా అనుకున్నారు. కానీ కొరటాల మరోసారి రొటీన్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ట్రెడింగ్లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాని అప్లై చేస్తూ కథనాన్ని నడిపించడం కొంతవరకు కలిసొచ్చే అంశం. యాక్షన్ సీన్లు కూడా బాగానే ప్లాన్ చేశారు. అయితే ఇవి మాత్రమే ప్రేక్షకుడికి సంతృప్తిని ఇవ్వలేవు. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో స్థాయికి తగ్గట్టుగా కథను తీర్చిదిద్దడంతో కొరటాల సఫలం కాలేదు.గతంలో కొరటాల తీసిన సినిమాల్లో ఆచార్య మినహా ప్రతి దాంట్లో కొన్ని గూస్బంప్స్ వచ్చే సీన్లతో పాటు ఓ మంచి సందేశం ఇచ్చేవాడు. ఒకటి రెండు పవర్ఫుల్ డైలాగ్స్ ఉండేవి. కానీ దేవరలో అలాంటి సీన్లు, డైలాగ్స్ పెద్దగా లేవు. స్క్రీన్‌ప్లే కూడా కొత్తగా అనిపించదు.ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్న ఎలివేషన్ ఫార్ములాతో కథను ప్రారంభించాడు. గ్యాంగ్‌స్టర్‌ని పట్టుకునేందుకు పోలీసు అధికారి(అజయ్) ఎర్రసముద్రం రావడం.. అక్కడ ఓ వ్యక్తి (ప్రకాశ్ రాజ్) దేవరకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ పన్నెడేంళ్ల క్రితం ఆ ఊరిలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ తర్వాత కథంతా ఎర్రసముద్రం, దేవర చుట్టు తిరుగుతుంది. ప్రేక్షకుల్ని మెల్లిగా దేవర ప్రపంచంలోకి తీసుకెళ్లాడు. ఎర్ర సముద్రం నేపథ్యం, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, దేవర చూపించే భయం, ప్రతిది ఆకట్టుకుంటుంది. చెప్పే కథ కొత్తగా ఉన్నా తెరపై వచ్చే సీన్లు పాత సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం బాగా ప్లాన్ చేశాడు. ఫస్టాఫ్ అంతా దేవర చుట్టు తిరిగితే.. సెకండాప్ వర చుట్టూ తిరుగుతుంది. రెండో ఎన్టీఆర్ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా.. ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ అతికినట్లుగా అనిపిస్తాయి. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్‌గానే సాగుతాయి. ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే యాక్షన్ సీన్లు అదిరిపోతాయి. పార్ట్ 2కి లీడ్ ఇస్తూ కథను ముగించారు. క్లైమాక్స్ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా.. ట్విస్ట్ పాయింట్ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఎన్టీఆర్ నటనకు ఏం వంక పెట్టగలం. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇక దేవర, వర(వరద) అనే రెండు విభిన్న పాత్రలో కనిపించిన ఎన్టీఆర్.. ప్రతి పాత్రలోనూ వేరియేషన్ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్ తో మాస్ ఆడియన్స్‌ను అలరించటంలో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. ఇక డ్యాన్స్ కూడా ఇరగదీశాడు.ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. పల్లెటూరి అమ్మాయి ‘తంగం’ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అచ్చం తెలుగమ్మాయిలాగే కనిపించింది. కాకపోతే ఈమె పాత్ర నిడివి చాలా తక్కువనే చెప్పాలి. ఇందులో సైఫ్ అలీఖాన్ భైరవ అనే ఓ డిఫరెంట్ పాత్రను పోషించాడు. నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా నటించాడు. పార్ట్ 2 ఆయన పాత్ర పరిధి ఎక్కువగా ఉంటుంది. శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, షైన్ టామ్ చాకో, చైత్ర రాయ్ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. అనిరుధ్ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'వాళా' సినిమా రివ్యూ (ఓటీటీ)
ఓటీటీలో ప్రతివారం పదులకొద్దీ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అలా తాజాగా స్ట్రీమింగ్‌లోకి వచ్చిన మలయాళ సినిమా 'వాళా'. కేవలం రూ.4 కోట్లు పెట్టి తీస్తే రూ.40 కోట్లు వసూలు చేసిందీ చిన్న సినిమా. మలయాళంలో సూపర్ హిట్ కాగా.. ఇప్పుడు ఓటీటీలో తెలుగు వెర్షన్ కూడా రిలీజ్ చేశారు. బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్ ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?విష్ణు, అజు థామస్, మూస అనే ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఎప్పుడు అల్లరి చేస్తూ తల్లిదండ్రులకు తలనొప్పులు తీసుకొస్తుంటారు. వీళ్లకు కలామ్, వివేక్ ఆనంద్ అనే మరో ఇద్దరు ఫ్రెండ్స్ తోడవుతారు. వీళ్లంతా ఓ ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతారు. మొదటిరోజే పెద్ద గొడవ పెట్టుకుంటారు. ఏకంగా లెక్చరర్ని కూడా కొట్టేస్తారు. అలా ఆడుతూ పాడుతూ సాగిపోతున్న వీళ్లు.. ఊహించని విధంగా డ్రగ్స్ కేసులో పట్టుబడతారు. మరి వీళ్లు బయటపడ్డారా? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఎందుకంటే ఆ వయసులో చేసే అల్లరి, హంగామా అలా ఉంటుంది మరి. చదువు బిడ్డల సంగతి పక్కనబెడితే ఆవారాగా తిరిగే బ్యాచ్‌లు కూడా ఉంటాయి. అలాంటి ఓ బ్యాచ్ కథే 'వాళా'. చూస్తే సింపుల్ కథనే గానీ చెప్పిన తీరు ఆకట్టుకుంటుంది. 90ల జ్ఞాపకాలు, టీనేజీ అల్లర్లు, గొడవలు, తల్లిదండ్రులు మాట వినకపోవడం లాంటి సీన్స్ ఇప్పటికే చాలా సినిమాల్లో చూశాం. కానీ ఇందులో మాత్రం ఇంచుమించు అలానే ఉన్నప్పటికీ హాయిగా నవ్వుకునేలా చేస్తాయి.కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీ అనగానే దాదాపు ప్రతి దర్శకుడు కుర్రాళ్ల వైపు నుంచే కథ చెబుతారు. కానీ ఇందులో మాత్రం ఇటు కుర్రాళ్ల వైపు నుంచి నవ్విస్తూనే తల్లిదండ్రుల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చూపించారు. పిల్లల వల్ల వాళ్లు ఎంతలా స్ట్రగుల్ అవుతారనే విషయాన్ని చాలా చక్కగా చూపించారు. ఇంటర్వెల్ ముందు వరకు 90స్ జ్ఞాపకాల్ని నెమరవేసుకునేలా ఉంటాయి. ఆ తర్వాత మాత్రం పిల్లలు-తల్లిదండ్రుల మధ్య బంధాన్ని చూపించారు. చివర అరగంట అయితే చూస్తున్న మనం కన్నీళ్లు పెట్టుకునేంతలా ఎమోషనల్ అయిపోతాం.'వాళా' అంటే మలయాళంలో అరటి మొక్క అని అర్థం. పనిపాటా లేకుండా తిరిగే సోమరులని కూడా అదే పేరుతో పిలుస్తుంటారు. అరటి మొక్కని చూపించడంతో మొదలయ్యే ఈ సినిమా.. అరటి తోటని చూపించే సన్నివేశంతో ముగుస్తుంది. అలానే ప్రస్తుత సమాజంలోని ఎంతోమంది కుర్రాళ్లు ఈ సినిమాలో తమని తాము చూసుకోవడం గ్యారంటీ. ఎందుకంటే చాలా సీన్లు అలా కనెక్ట్ అయిపోతాయ్.ఎవరెలా చేశారు?యాక్టర్స్ ఎవరూ మనకు తెలియదు. కానీ సినిమా చూస్తున్నప్పుడు ఆ ఆలోచన మనకు రాదు. ఎందుకంటే అంత బాగా చేశారు. సినిమాటోగ్రాఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా కథకి తగ్గట్లు ఉంది. స్నేహం అంటే ఒకరి కోసం ఒకరు ఆవేశపడటం కాదు. అందరూ కలిసి ఓ బలమైన ఆశయం కోసం పట్టుదలతో ముందుకెళ్లడం, కన్నవాళ్ల కళ్లలో సంతోషం చూడటం అనే సందేశాన్ని అంతర్లీనంగా ఈ కథలో ఇచ్చారు. నిడివి కూడా 2 గంటలే. కుటుంబంతో కలిసి చూసే సినిమా ఇది.-చందు డొంకాన -
'మన్యం ధీరుడు' సినిమా రివ్యూ
బ్రిటీష్ వారి బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేయడానికి విల్లు ఎక్కుపెట్టి పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఈయన జీవిత కథను ఎన్ని సార్లు పుస్తకాల్లో చదివినా, వెండితెరపై చూసినా ఎప్పుడూ కొత్తగానే వుంటుంది. అలాంటి పాత్రలో రంగస్థల నటుడు ఆర్.వి.వి.సత్యనారాయణ నటించడమే కాకుండా తానే సినిమా నిర్మించారు. మన్యం ధీరుడు పేరుతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఆర్.వి.వి మూవీస్ పతాకంపై ఆర్.పార్వతిదేవి సమర్పణలో తెరకెక్కించారు. నరేష్ డెక్కల దర్శకత్వం వహించారు. ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మన్యం ధీరుడు ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకున్నారో చూసేద్దాం..కథబ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పొరాడిన అల్లూరి సీతారామరాజు వారి తుపాకీ గుళ్లకు బలై నేలకొరిగారు. అలాంటి పవర్ ఫుల్ పాత్రలో రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ పోషించారు. సహజసిద్ధంగా లభించిన భూమిని దుక్కి దున్ని చేసుకుంటున్న మన్యం ప్రజలపై పన్నులు వేసి... బలవంతంగా వసూళ్లను చేయడం అల్లూరి సీతారామరాజు వ్యతిరేకిస్తారు. అందుకు ప్రతిగా బ్రిటీష్ వారు ఎలా స్పందించారు? సీతారామరాజు వారిని ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టి ప్రజల తరఫున పోరాడాడు? స్వాతంత్ర్యం కోసం మన్యం ప్రజలను ఎలా మేలుకొల్పాడు? పేద ప్రజలకు ఉన్న మద్యం సేవించడం తదితర అలవాట్లను ఎలా మాన్పించి వారిని కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేశారు? లాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.విశ్లేషణటెక్నాలజీ యుగంలో కొట్టుకుపోతున్న యువతకు విప్లవ వీరుల కథలను తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.గతంలో అల్లూరి సీతారామరాజు జీవిత కథను బేస్ చేసుకుని చాలా సినిమాలు వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యాయి. ఎన్నో అవార్డులు పొందాయి. అలాంటి మన్యం వీరుడి కథను మరోసారి వెండితెరపై ఆవిష్కరించారు. ఇందులో ముఖ్యమైన ఘట్టం మన్యం ప్రాంతంలోని చింతపల్లి, రాజవొమ్మంగి తదితర పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలను అపహరించడం... వాటితో బ్రిటీష్ వారిపై పోరాటం చేయడంలాంటి సన్నివేషాలన్నీ ఆడియన్స్‌కు గూస్ బమ్స్ తెప్పిస్తాయి.అలాగే మన్యం కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రను ఎదిరించడం, బ్రిటీష్ వారి మీద పోరాటం చేసే సన్నివేషాలు మాస్ ఆడియన్స్‌ను అలరిస్తాయి. సత్యనారాయణ రంగస్థలం నుంచి రావడం వల్ల డైలాగ్ డెలివరీ స్పష్టంగా వుంది. ఫస్ట్ హాఫ్ కొంత స్లోగా వున్నా... సెకెండాఫ్‌లో యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా పరుగులు పెడుతుంది. జబర్దస్థ్ అప్పారావుతో కాసేపు నవ్వించే ప్రయత్నం చేసినా... ఓ యువజంట ప్రేమాయణం గురించి కథకు అవసరం లేకున్నా బలవంతంగా చొప్పించారనిపిస్తుంది.మద్యపానం సేవించడం సమాజానికి, కుటుంబానికి మంచిది కాదని చెప్పే ప్రయత్నం బాగుంది. అలాగే స్వాతంత్రం భారతదేశానికి ఎంత అవసరమో... బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే భారతీయులకు చెప్పడం, వారిని కూడా బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడేలా చేయడం, మన భూమిన మనం దుక్కి దున్నితే... వాళ్లకు ఎందుకు పన్ను కట్టాలి? మన పంటలను వాళ్లకు ఎందుకు ధారాదత్తం చేయాలి అనే అంశాలను బాగా చూపించారు.రంగస్థల నటుడు, చిత్ర నిర్మాత ఆర్.వి.వి.సత్యనారాయణ టైటిల్ పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాకోసం ప్రత్యేకంగా గుర్రపుస్వారీ, కత్తియుద్ధం కూడా నేర్చుకుని నటించడం విశేషం. బ్రిటీష్ వారిని ఎదిరించే మల్లుదొర పాత్రలో జీవీ త్రినాథ్ చివరి దాకా బాగా నటించారు.జబర్దస్థ్ అప్పారావు, సత్తి పండు పాత్రలు కాసేపు ఉన్నా... నవ్విస్తాయి. కలెక్టర్ రూథర్ ఫర్డ్ పాత్రలో ఉమేద్ కుమార్ పాత్ర ఆకట్టుకుంటుంది.ఈ చిత్రంలో ప్రధానంగా మెచ్చుకోవాల్సింది విలేజ్ సెట్టింగ్. మన్యంలో గూడెం ఎలా వుంటుందో చాలా నేచురల్‌గా వేశారు. అరుకు, పాడేరు, హిమాచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రాంతాల అందాలను కెమెరాలో బంధించారు. అల్లూరి సీతారామరాజు ఎలివేషన్ షాట్స్ బాగున్నాయి. నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్ ఓకే. రెండుగంటలలోపే నిడివి వుండటం ఈ సినిమాకి ప్రధాన బలం. డైరెక్టర్ కథను బాగానే డీల్ చేశారు. -
‘హైడ్ న్ సీక్’ మూవీ రివ్యూ
టైటిల్: హైడ్ న్ సిక్నటీనటులు: విశ్వంత్, శిల్పా మంజునాథ్, రియా సచ్దేవ్, శ్రీధర్ తదితరులునిర్మాణ సంస్థ: సహస్ర ఎంటర్ టైన్మెంట్స్నిర్మాత: నరేంద్ర బుచ్చిరెడ్డిగారిదర్శకత్వం: బసిరెడ్డి రానాసంగీత దర్శకుడు: లిజో కె జోష్విడుదల తేది: సెప్టెంబర్ 21, 2024కథేంటంటే..కర్నూలుకు చెందిన శివ(విశ్వంత్) ఆర్మీ డాక్టర్ కావాలనుకుంటాడు. తన తండ్రి, బావా ఇద్దరూ ఆర్మీలో పని చేస్తూ దేశం కోసం వీర మరణం పొందుతారు. తాను ఏదో ఒకరకంగా దేశానికి సేవ చేయాలనుకుంటాడు. అక్కతో కలిసి ఉంటూ మెడిసిన్ చదువుతుంటాడు.తోటి విద్యార్థిని వర్ష(రియా సచ్దేవ్)తో ప్రేమలో పడతాడు. వీరి పెళ్లికి వర్ష తండ్రి డాక్టర్ కేకే కూడా ఒప్పుకుంటాడు. ఓ రోజు శివ ఇంటి పక్కన ఒక డెలివరీ బాయ్ హత్యకు గురవుతాడు. ఎవరో అతన్ని రాడ్‌తో కొట్టి చంపుతారు. అయిదే అది యాక్సిడెంట్ అని చెప్పి పోలీసులు కేసు క్లోజ్ చేశారు. అది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి పోలీసు స్టేషన్‌కి లెటర్ వస్తుంది. ఆ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న వైష్ణవి(శిల్ప మంజునాథ్) దాన్ని సిరీయస్‌గా తీసుకోదు. ఈ సమయంలో శివ ఫ్రెండ్ చందు సుసైడ్ చేసుకుంటాడు. ముందు అందరూ దాన్ని సుసైడ్ అనుకుంటారు కానీ శివ మాత్రం అది హత్య అని నమ్ముతాడు. కట్ చేస్తే మీడియాకు అది సూసైడ్ కాదు హత్య అని శివ లెటర్ పంపిస్తాడు. దాంతో ఆ కేసు మీడియాలో సంచలనంగా మారుతుంది. పోలీసులు సీరియస్ గా తీసుకుంటారు. ఆ తరువాత ఈ కేసులో శివను ఫ్రేమ్ చేస్తారు. దాంతో శివ మర్డర్ కేసులో చిక్కుకుంటాడు. శివను ఎందుకు కార్నర్ చేశారు? ఎవరు చేశారు? అసలు కర్నూలులో వరుస హత్యలు చేస్తుందన్నదెవరు? వాళ్ల లక్ష్యం ఏంటి? చివరకు పోలీసులు అధికారి వైష్ణవి ఈ కేసును ఎలా డీల్ చేసింది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఈ మధ్య పిల్లలు చాలా మంది మొబైల్ గేమ్స్‌కి బాగా అలవాటు పడ్డారు. ఆ మధ్య పబ్జీ, బ్యూవేల్ గేమ్‌లాంటి గేమ్స్ బాగా ట్రెండ్ అయింది. అలాంటి గేమ్స్‌కి కొంతమంది యువకులు బానిసలై ప్రాణాలను సైతం కోల్పోయారు. కొంతమంది క్రిమినల్స్‌గా మారారు. గేమ్ కోసం సొంతవాళ్లను దారుణంగా హత్య చేసిన ఘటనలు జరిగాయి. అలాంటి ఆన్లైన్ గేమింగ్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రమే ‘హైడ్ న్ సిక్’, ఆన్లైన్ గేమ్ పిల్లలనే కాదు యువకులను కూడా ఎలా బానిసలుగా చేసి వారి జీవితాలతో ఎలా ఆడుకుంటుందో ఈ చిత్రం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు.దటి మర్డర్ నుంచి ఇంటర్వెల్ వరకు స్క్రీన్ ప్లే ఎంతో గ్రిప్పింగ్ రాసుకున్నారు. తరువాత ఏం జరగబోతుందో ఎవరి ఊహకు అందనట్లుగా చాలా క్రియేటీవ్ గా తెరకెక్కించారు. అయితే సెకండ్ ఆఫ్ లో సినిమా కాస్త స్లో అవుతుంది. కొంత సేపటికి మళ్లీ వేగం పుంజుకుంటుంది. అసలు మర్డర్ల వెనుక ఎవరు ఉన్నారు అనేది ఎవరు ఊహించని ఒక ట్విస్ట్. అయితే ఈ మర్డర్లను ఎవరు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు అనే విషయాలతో పాటు ఏ పద్దతిలో చేస్తున్నారు. అనేది పూరాణాలలో ఒక కథకు లింక్ చేస్తూ చెప్పే విధానం మెప్పించింది. మారణహోమం జరిగితే ఏంటి పరిస్థితి అనే ఆలోచనకు ప్రేక్షకుడిని తీసుకెళ్లి భయపెట్టిస్తుంది. తరువాత మర్డర్ ఎక్కడ ఎలా చేయబోతున్నారు అనే విషయాన్ని కనుగోనే పద్దతి మెప్పించింది. ఇలాంటి అంశాలు చాలానే ఉన్నాయి ఈ చిత్రంలో. ప్రీ క్లైమాక్స్ తరువాత మళ్లీ సినిమా వేగం పెరగుతుంది. అయితే ముందే చెప్పుకున్నట్లు ఇది రెగ్యూలర్ కమర్షియల్ చిత్రాల లాగా ఉండదు. క్లైమాక్స్ కూడా చాలా స్మూత్ గా హ్యండిల్ చేశారు. ఎవరెలా చేశారంటే..ఇన్నాళ్లు లవర్ బాయ్‌గా అలరించిన విశ్వంత్ హైడ్ న్ సిక్ చిత్రంలో ఫెరోషియస్ క్యారెక్టర్ లో కనిపించారు. బాధ్యతగల తమ్ముడిగా, స్టూడెంట్ గా ఫ్రెండ్ కేసును సాల్వ్ చేసే ఇన్వెస్టిగేటర్ గా విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో మెప్పించారు. విశ్వంత్ తరువాత పోలీసు క్యారెక్టర్ చేసిన శిల్పా మంజునాథ్ మంచి మార్కులు వేసుకుంది. ఆఫీసర్ గా తన లుక్స్ చాలా బాగున్నాయి. తన ఫేస్ లో సీరియస్ నెస్ ను మెయింటైన్ చేస్తూనే ఒక సీన్లో ఎమోషనల్ సీన్ అద్భుతంగా పండించింది. అలాగే ఇందులో కేకే క్యారెక్టర్ చేసిన ఆర్టిస్టుకు తక్కువ స్పేస్ ఉంది కానీ చాలా ఇంపాక్ట్ ఉన్న పాత్ర. ఉన్నంతలో మెప్పించారు. అలాగే మిగితా ఆర్టిస్టుల అంతా వారి వారి పాత్రల మేరకు అద్భుతంగా చేశారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. లిజో కె జోష్ నేపథ్య సంగీతం బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటో గ్రాఫర్ చిన్న రామ్ తనకు ఉన్నంతలో బాగాచేశారు.ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
ఓటీటీలోనే బెస్ట్ జాంబీ మూవీ.. ప్యాంటు తడిచిపోవడం గ్యారంటీ!
మనుషులు జాంబీలుగా మారితే ఏమవుతుందనే కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. తెలుగులోనూ 'జాంబీరెడ్డి' అనే మూవీ ఉంది. అయితే ప్రపంచంలో ఈ జానర్లో వచ్చిన బెస్ట్ సినిమా అంటే చాలామంది చెప్పే పేరు 'ట్రైన్ టూ బుసన్'. ఒరిజినల్‌గా ఇది కొరియన్ చిత్రం. కానీ ఓటీటీలోనూ తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ సినిమాలో అంతలా ఏముంది? తెలియాలంటే రివ్యూ చదివేయండి.(ఇదీ చదవండి: 'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ))కథేంటి?ఫైనాన్సియల్ కంపెనీ నడిపే హీరో. అతడికి ఓ కూతురు. ఓ రోజు తన తల్లి ఉంటున్న బుసన్ ఊరికి వెళ్దామని వేకువజామున ట్రైన్ ఎక్కుతాడు. అయితే అప్పటికే ఓ ప్రాణాంతక వైరస్ వల్ల ఈ ఊరిలోని మనుషులందరూ జాంబీలుగా మారిపోయింటారు. కనిపించిన మనుషుల్ని పీక్కుతింటూ వాళ్లని కూడా జాంబీలుగా మార్చేస్తుంటారు. ఓ లేడీ జాంబీ.. హీరో ఎక్కిన ట్రైన్‌లోకి ఎక్కేసింది. ఆ తర్వాత ఒక్కొక్కరిని కొరికేస్తూ ట్రైన్‌లోని చాలామందిని జాంబీలుగా మార్చేస్తుంది. మరి చివరకు ఏమైంది? హీరో, తన కూతురు బతికి బయటపడ్డారా అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?'ట్రైన్ టూ బుసన్' సినిమాని ఈపాటికే మీలో చాలామంది చూసే ఉండొచ్చు. ఒకవేళ చూడకపోయింటే వాళ్ల కోసమే ఈ రివ్యూ. ఇప్పటివరకు హారర్, థ్రిల్లర్, యాక్షన్.. ఇలా డిఫరెంట్ సినిమాలు. కానీ ఇది మాత్రం సర్వైవల్ థ్రిల్లర్ జానర్లోనే బెస్ట్ మూవీ. జాంబీలు ఉంటాయి కాబట్టి కావాల్సినంత భయం కూడా ఉంటుంది.(ఇదీ చదవండి: 100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ)కేవలం రెండే గంటలున్న ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి చివరి వరకు స్క్రీన్ ప్లే పరుగెడుతుంది. ఒక్కో సీన్ చూస్తుంటే ఓ పక్క వణుకు, మరోపక్క భయంతో ప్యాంట్ తడిచిపోద్ది. చెప్పుకొంటే చిన్న కథనే గానీ చాలా గ్రిప్పింగ్‌గా తీశారు. డ్రామా, హారర్, యాక్షన్, థ్రిల్లర్.. ఒకటేమిటి బోలెడన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. ఇలాంటి జాంబీ మూవీలోనూ ఓ తండ్రి-కూతురి మధ్య బాండింగ్‌ని చాలా చక్కగా మనుసుని హత్తుకునేలా ఎష్టాబ్లిష్ చేశారు. తొలుత దీన్ని కొరియన్ బాషలో రిలీజ్ చేశారు. కానీ తర్వాత బోలెడంత పాపులారిటీ రావడంతో తెలుగులోనూ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.మనం చేసిన కొన్ని పనులు వల్ల కొన్నిసార్లు మన ప్రాణాలే పోయే పరిస్థితి వస్తుంది అనే పాయింట్ ఆధారంగా దీన్ని తీశారు. కొరియన్ స్టార్ యాక్టర్స్ ఇందులో కీలక పాత్రలు పోషించారు. ఆ మధ్య ప్రభాస్ సినిమాలో విలన్‌గా చేస్తాడనే రూమర్స్ వచ్చిన డాంగ్ ఇందులో ఉంటాడు. ఒక్క గుద్దుతో జాంబీలని చంపేవాడిగా కనిపిస్తాడు. ఈ వీకెండ్ ఏం చేయాలో తెలీక ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'ట్రైన్ టూ బుసన్' చూడండి. చూసిన తర్వాత 'వర్త్ వర్మ వర్త్' అని కచ్చితంగా అంటారు!-చందు డొంకాన(ఇదీ చదవండి: 'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ)) -
'కళింగ' సినిమా రివ్యూ
ప్రస్తుతం టాలీవుడ్లో డివోషనల్ టచ్ ఉండే మూవీస్ హిట్స్ కొడుతున్నాయి. మరోవైపు హారర్ జానర్ అనేది ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసి తీసిన సినిమా 'కళింగ'. ధృవ వాయు హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. ప్రగ్యా నయన్ హీరోయిన్. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?కళింగ అనే ప్రాంతం. ఈ ఊరు పొలిమేర దాటి అడవిలోకి వెళ్లినోళ్లు ప్రాణాలతో తిరిగి రారు. ఇదే ఊరిలో ఓ అనాథ లింగ (ధృవ వాయు). అదే ఊరిలో ఉండే పద్దు (ప్రగ్యా నయన్) ని ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. కానీ ఈమె తండ్రి వీళ్ల ప్రేమకు అడ్డుచెబుతాడు. ఊరిపెద్ద దగ్గరున్న పొలం తనఖా విడిపిస్తేనే పెళ్లి చేస్తానని అంటాడు. కొన్ని గొడవల కారణంగా ఊరికి దగ్గరలోని అడవిలోకి లింగ, అతడి స్నేహితుడు వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఇంతకీ అడవిలో ఏముంది? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కళింగ అనే సంస్థానం గురించి చెబుతూ సినిమాని మొదలుపెట్టారు. ఇక్కడ ప్రజలు వింతగా ప్రవరిస్తూ తమని తాము చంపుకొంటూ ఉంటారని, అడవిలోకి వెళ్లినోళ్లు తిరిగి రారని చెప్పి క్యూరియాసిటీ పెంచారు. ఆ తర్వాత లింగ-పద్దు లవ్ స్టోరీ.. ఊరిపెద్దతో లింగ తమ్ముడు గొడవ ఇలా స్టోరీ అంతా సెట్ చేసి ఫస్టాప్ నడిపించేశారు. తన పెళ్లి కోసం అడవిలోకి లింగ వెళ్లాలని నిర్ణయించుకోవడంతో ఇంటర్వెల్ పడుతుంది. అడవిలో ఏముంది? లోపలికి వెళ్లిన వాళ్లు ఎందుకు తిరిగి రావట్లేదు? అనే ప్రశ్నలకు సమాధానాలని సెకండాఫ్‌లో చెప్పారు. చివర్లో అసురభక్షి పాంయిట్ కొత్తగా అనిపిచింది. అయితే సినిమా పరంగా చూసుకుంటే పాయింట్ బాగున్నప్పటికీ చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. కళింగ కథని వాయిస్ ఓవర్‌తో చెప్పించేశారు. విజువల్‌గా చూపించి ఉంటే బాగుండేది. లవ్ స్టోరీ రొటీన్. కథ అక్కడక్కడ పక్కదారి పట్టిన ఫీలింగ్ కలుగుతుంది. హారర్ డోస్ కూడా కాస్త తగ్గినట్లు అనిపిస్తుంది.ఎవరెలా చేశారు?హీరో కమ్ దర్శకుడిగా ధృవవాయు ఆకట్టుకున్నాడు. లింగ పాత్రలో పర్వాలేదనిపించాడు. డైరెక్టర్‌గా కొన్నిచోట్ల మాత్రం ఆశ్చర్యపరిచాడు. హీరోయిన్గా చేసిన ప్రగ్యా నయన్ గ్లామర్ పరంగా న్యాయం చేసింది. లక్ష్మణ్, ఆడుకాలం నరేన్, మురళీధర్ గౌడ్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. -
‘ ఉత్సవం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉత్సవంనటీనటులు:దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ తదితరులునిర్మాత: సురేష్ పాటిల్రచన, దర్శకత్వం: అర్జున్ సాయిసంగీతం: అనూప్ రూరబెన్స్సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్విడుదల తేది: సెప్టెంబర్ 13, 2024కథేంటంటే..అభిమన్యు నారాయణ(ప్రకాశ్ రాజ్).. అంతరించి పోయిన సురభి నాటక మండలిలో ప్రసిద్ధి చెందిన కళాకారుడు. అతని కొడుకు కృష్ణ(దిలీప్ ప్రకాశ్)కి కూడా నాటక కళాకారులు అంటే చాలా గౌరవం. అంతరించిపోతున్న నాటక కళాకారుల గొప్పదనాన్ని నేటి ప్రపంచానికి తెలియజేసి, వాళ్ల కష్టాలను గట్టేకించాలని ప్రయత్నిస్తుంటాడు. మరో రంగస్థల నటుడు మహాదేవ్ నాయుడు(నాజర్) కూతురు రమ(రెజీనా) సహాయంతో కార్పొరేట్ వీకెంట్ ఈవెంట్లో రంగస్థల నటులతో నాటక ప్రదర్శనను ఏర్పాటు చేస్తాడు. ఈ క్రమంలో రమ-కృష్ణలు ప్రేమలో పడతారు.అయితే ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు రావడంతో విడిపోతారు. మరోవైపు స్నేహితులైన అభిమన్యు, మహాదేవ్‌లు కృష్ణ, రమలకు పెళ్లి చేయాలని ఫిక్సవుతారు. అయితే ఈ విషయం తెలియకుండా ఇద్దరు పెళ్లికి ఒప్పుకుంటారు. తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి రమనే అని కృష్ణకు, పెళ్లి కొడుకు కృష్ణనే అని రమకు తెలియదు. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా ఒకరికి తెలియకుండా ఒకరు ఇంట్లో నుంచి పారిపోతారు.అయితే ఈ విషయాన్ని అటు పెళ్లికొడుకు వాళ్లు, ఇటు పెళ్లి కూతురు వాళ్లు ఇద్దరు ఒకరికి తెలియకుండా మరొకరు దాచి..పెళ్లి సమయానికల్లా వాళ్లను వెతికి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటారు. అసలు రమ-కృష్ణలు ప్రేమలో ఎలా పడ్డారు? విడిపోవాడానికి గల కారణం ఏంటి? పెద్దలు ఫిక్స్ చేసిన సంబంధం కూడా ఇదేనని ఇద్దరికి ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత ఏం జరిగింది? చివరకు రమ-కృష్ణలు ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..సినిమాలకు స్పూర్తి నాటకాలు. ఆ నాటక కళాకారుల మీద తీసిన సినిమానే ‘ఉత్సవం’. ఒకవైపు రంగస్థల కళాకారులు కష్టాలను చూపిస్తూనే ఓ చక్కని ప్రేమకథను చెప్పొకొచ్చాడు దర్శకుడు అర్జున్ సాయి. డైరెక్టర్ రాసుకున్న పాయింట్ బాగున్నా..దాన్నితెరపై చూపించడంలో మాత్రం కాస్త తడబడ్డాడు. స్క్రీన్‌ప్లేని బలంగా రాసుకోలేకపోయాడు. ఒకదానికొకటి సంబంధం లేని సన్నివేశాలు వస్తుంటాయి. అలాగే ఎమోషనల్ సీన్లు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం, ఈ మధ్యే వచ్చిన రంగమార్తండా సినిమాలను గుర్త చేస్తాయి. హీరోహీరోయిన్ల లవ్‌స్టోరీ కొంతమేర ఆకట్టుకుంటుంది. (చదవండి: మత్తు వదలరా 2 మూవీ రివ్యూ)ఫస్టాఫ్లోహీరో హీరోయిన్ల ప్రేమాయణంతో పాటు నాటక కళాకారులు కష్టాలను చూపించారు. ఇక సెకండాఫ్‌లో నాటకాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి హీరో చేసే ప్రయత్నం.. అలాగే వారిద్దరు విడిపోవడానికి గల కారణం ఏంటో చూపించారు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్ సినిమాకే హైలెట్. ఆ తర్వాత వచ్చే కొన్ని సన్నివేశాలను కథను సాగదీసినట్లుగా అనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహించినట్లే రొటీన్‌గా ఉంటుంది. ఎవరెలా చేశారంటే..దిలీప్ ప్రకాష్‌కి ఇది రెండో సినిమా . అయినా ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. ఎమోషనల్ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. తండ్రికి విలువనిచ్చే కొడుకుగా, ఓ మంచి ప్రేమికుడిగా తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక రమ పాత్రలో రెజీనా ఒదిగిపోయింది. తెరపై అందంగా కనిపించింది. ఇక హీరో తండ్రి, రంగస్థల నటుడు అభిమన్యు నారాయణగా ప్రకాశ్ రాజు జీవించేశాడు. ‘దక్ష యజ్ఞం’ ఎపిసోడ్లో శివుడి అవతారంలో కనిపించి.. తనదైన సంభాషణలతో ఆకట్టుకున్నాడు. మరో నాటక కళాకారుడు మహాదేవ్గా నాజర్ కూడా అదరగొట్టేశాడు. , రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్‌తో పాటు ప్రతి ఒక్కరు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. అనూప్ సంగీతం ఈ సినిమాకు ప్లస్ పాయింట్. మంచి పాటలతో పాటు చక్కటి నేపథ్య సంగీతాన్ని అందించాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
‘మత్తు వదలరా 2’ మూవీ రివ్యూ
టైటిల్: మత్తు వదలరా- 2నటీనటులు: శ్రీ సింహ కోడూరి, సత్య, ఫరియా అబ్దుల్లా, సునీల్, వెన్నెల కిషోర్, అజయ్, రోహిణి, రాజా చెంబోలు, ఝాన్సీ, శ్రీనివాస్ రెడ్డి, గుండు సుదర్శన్ తదితరులునిర్మాణ సంస్థలు: క్లాప్ ఎంటర్టైన్మెంట్ & మైత్రి మూవీ మేకర్స్నిర్మాతలు: చిరంజీవి (చెర్రీ), హేమలతరచన, దర్శకత్వం: రితేష్ రానాసంగీతం: కాల భైరవసినిమాటోగ్రఫీ: సురేష్ సారంగంవిడుదల తేది : సెప్టెంబర్ 13, 2024‘మత్తు వదలరా’ సినిమా తర్వాత హీరో శ్రీసింహాకు ఆ స్థాయి హిట్ ఒక్కటి కూడా లేదు. వరుస సినిమాలు చేస్తున్నా.. ఏవీ వర్కౌట్ కాలేదు. దీంతో తనకు హిట్ ఇచ్చిన సినిమాకు సీక్వెల్‌గా ‘మత్తు వదలరా 2’తొ మరోసారి బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వచ్చేశాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘మత్తు వదలరా 2’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ‘మత్తు వదలరా’సినిమా ముగింపు నుంచి ఈ కథ ప్రారంభం అవుతుంది. డెలివరీ ఏంజెంట్స్ అయిన బాబు మోహన్(శ్రీ సింహా), యేసు(సత్య)ల ఉద్యోగం పోవడంతో.. వేరే పని కోసం వెతుకుతుంటారు. అదే టైమ్‌లో హీ టీమ్(హై ఎమర్జెన్సీ టీమ్)లో రిక్రూట్మెంట్ జరుగుతున్నట్లు పేపర్ యాడ్ ద్వారా తెలుసుకుంటారు. లంచం ఇచ్చి మరీ ఆ ఉద్యోగం సంపాదిస్తారు. కిడ్నాప్ కేసులను డీల్ చేయడం వీళ్ల పని. వీరిద్దరు జట్టుగా పని చేస్తుంటారు. జీతం డబ్బులు సరిపోవడం లేదని.. కిడ్నాప్ కేసుల్లో దొరికే డబ్బు నుంచి కొంత తస్కరించి, కిడ్నాపర్‌ని పట్టుకునే క్రమంలో పోయిందని వీళ్ల హెడ్ దీప(రోహిణి)కి చెబుతుంటారు. ఓసారి ధనవంతురాలు దామిని(ఝాన్సీ) తన కూతురు రియాని ఎవరో కిడ్నాప్ చేసి రూ. 2 కోట్లు డిమాండ్ చేస్తున్నారని బాబు, యేసులను సంప్రదిస్తుంది. ఈ కేసును తమ టీమ్‌కి తెలియకుండా డీల్ చేసి రూ. 2 కోట్లు కొట్టేయాలని బాబు, యేసు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వీరిద్దరు బారు ఓనర్ ఆకాశ్(అజయ్) హత్య కేసులో ఇరుక్కుంటారు. అసలు ఆకాశ్‌ని హత్య చేసిందెవరు? బాబు, యేసును ఆ కేసులో ఇరికించిందెవరు..? రియాని కిడ్నాప్ చేసిందెవరు..? స్టార్ హీరో యువ(వెన్నెల కిశోర్)కి ఈ హత్యకు ఉన్న సంబంధం ఏంటి..? హత్య కేసులో ఇరుక్కున్న బాబు, యేసులకు వాళ్ల సీనియర్ అధికారి నిధి(ఫరియా అబ్దుల్లా) ఎలాంటి సహాయం చేసింది..? చివరకు ఏం జరిగింది అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. ఒక హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే.. కచ్చితంగా ఆ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలే పెట్టుకుంటారు. మొదటి భాగం కంటే రెండో పార్ట్ ఇంకా బెటర్‌గా ఉంటుందనే ఆశతో థియేటర్స్‌కి వస్తారు. వారి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటే ఒకే.. ఏ మాత్రం తేడా కొట్టినా అంతే సంగతి. అందుకే సీక్వెల్ తీయడం ఓ రకంగా కత్తి మీద సాము లాంటిదే. డైరెక్టర్ రితేష్ రానా ఆ సాహసం చేశాడు. కానీ పార్ట్ 1ని మించేలా కథనాన్ని నడిపించలేకపోయాడు. కథలో బలమైన పాయింట్ లేకపోవడం.. కథనం మొత్తం ఒక పాయింట్ చుట్టే తిరగడం సినిమాకు పెద్ద మైనస్. స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌గా ఉంటుంది. అయితే ఈ లోపాలన్నింటిని సత్య కామెడీ కొంతవరకు కవర్ చేస్తే.. టెక్నికల్ టీమ్ మరికొంత కవర్ చేసింది. పార్ట్ 1 చూసిన వాళ్లకు ఈ సినిమాలోని ప్రధాన పాత్రలతో మొదటి నుంచే కనెక్ట్ అవుతారు. కానీ చూడని వాళ్లకు మాత్రం కొంతవరకు కన్ఫ్యూజ్ అవుతారు. హీ టీమ్‌లో బాబు, యేసులో జాయిన్ అయ్యే సీన్ నుంచి.. రియా కిడ్నాప్ డ్రామా వరకు ప్రతి సీన్ గత సినిమాలని గుర్తు చేస్తూనే ఉంటుంది. అయితే, ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుంటుంది. (చదవండి: రావు రమేశ్ హీరోగా చేసిన మూవీ.. ఓటీటీ రిలీజ్ ఫిక్స్)ఇక సెకండాఫ్‌లో కథ మొత్తం మిస్టరీ మర్డర్, హత్య చుట్టే తిరుగుతుంది. ఫరియా, సత్య, శ్రీసింహా కలిసి చేసే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. అయితే, కథకు ఏ మాత్రం సంబంధం లేని ‘ఓరి నా కొడక’ సీరియల్ డ్రామా అయితే నవ్వించకపోవడమే కాకుండా.. ఒకానొక దశలో చిరాకు తెప్పిస్తుంది. చిరంజీవి, పవన్ కల్యాణ్ ఇమేజ్‌ని చక్కగా వాడుకున్నారు. ప్రీ క్లైమాక్స్ నుంచి చివరి వరకు సాగే కథనం.. ఈ క్రమంలో వచ్చే చిన్న చిన్న ట్విస్టులు సినిమాపై కొంతవరకు పాజిటివ్ ఒపీనియన్‌ని తెప్పిస్తాయి. ఎవరెలా చేశారంటే.. ఈ సినిమాకు ప్రధాన బలం సత్య కామెడీయే. శ్రీసింహా హీరో అయినప్పటికీ.. సత్యనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. తనదైన కామెడీ పంచులతో నవ్వులు పూయించాడు. బాబు మోహన్ పాత్రకు శ్రీసింహా న్యాయం చేశాడు. తెరపై శ్రీసింహా, సత్యల కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఇక ఫరియా అబ్దుల్లా ఈ సినిమాలో ఓ డిఫరెంట్ పాత్రను పోషించింది. హీ టీమ్‌లో పని చేసే 'నిధి' పాత్రలో ఒదిగిపోయింది. యాక్షన్ సీన్లో కూడా చక్కగా నటించింది. ఈ సినిమాలో ఓ పాట కూడా పాడి ఆకట్టుకుంది. హీ టీమ్ హెడ్‌గా రోహిణి, మైఖెల్‌గా సునీల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. కాల భైరవ నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని చాలా రిచ్‌గా తెరపై చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
‘35- చిన్న కథ కాదు’ రివ్యూ: చాలా పెద్ద కథే!
టైటిల్: 35- చిన్న కథ కాదునటీనటులు: నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అభయ్, అనన్య తదితరులునిర్మాణ సంస్థలు: . సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ నిర్మాతలు: రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లిదర్శకత్వం: నందకిషోర్ ఇమానిసంగీతం: వివేక్ సాగర్విడుదల తేది: సెప్టెంబర్ 6, 2024టాలీవుడ్లో చిన్న సినిమాల సందడి ఇటీవలే కాలంలో ఎక్కువుగా కనిపిస్తుంది. స్టార్ హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తుంటే.. చిన్న సినిమాలు తెలుగులో మాత్రమే విడుదలై విజయం సాధిస్తున్నాయి. కథలో కొత్తదనం ఉంటే హీరోహీరోయిన్లు ఎవరనేది పట్టించుకోకుండా థియేటర్స్‌కి వస్తున్నారు. అందుకే నూతన దర్శకనిర్మాతలు కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. అలా ఈ వారం వచ్చిన చిన్న చిత్రమే ‘35-చిన్న కథ కాదు’. రానా లాంటి బడా స్టార్స్ ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘35-చిన్న కథ కాదు’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాలతో రేపు(సెప్టెంబర్ 6) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం ప్రత్యేక ప్రీమియర్ షో వేశారు మేకర్స్. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..తిరుపతికి చెందిన ప్రసాద్(విశ్వదేవ్ రాచకొండ) ఓ బస్ కండక్టర్. భార్య సరస్వతి(నివేదా థామస్), పిల్లలు అరుణ్, వరుణ్‌లతో కలిసి వెంకటేశ్వరస్వామి ఆలయానికి సమీపంలో నివాసం ఉంటాడు. సరస్వతికి భర్త, పిల్లలే ప్రపంచం. ఇద్దరి పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని తపన పడతారు. చిన్నోడు వరుణ్ బాగానే చదువుతాడు కానీ, పెద్దోడు అరుణ్‌కి మాత్రం వెనకబడతాడు. అలా అని వాడు తెలివి తక్కువ వాడేం కాదు. లెక్కలు తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుంటాడు. కానీ లెక్కల విషయానికొచ్చేసరికి మనోడికి చాలా డౌట్స్ వస్తాయి. సున్నాకి ఏమీ విలువ లేనప్పుడు దానిపక్కన ఒకటి వచ్చి నిలబడితే పది ఎందుకవుతుందంటూ ఫండమెంటల్స్‌నే ప్రశ్నిస్తాడు. కొత్తగా వచ్చిన గణితం మాస్టారు చాణక్య(ప్రియదర్శి)తో పాటు ఏ ఉపాధ్యాయుడు తన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకకోవడంతో సున్నా మార్కులు తెచ్చుకుంటాడు. దీంతో అరుణ్‌కి ‘జీరో’అని పేరు పెట్టి ఆరో తరగతి నుంచి డిమోట్ చేసి తమ్ముడు చదువుతున్న ఐదో తరగతి క్లాస్ రూమ్‌కి పంపిస్తారు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల అరుణ్ ఆ స్కూల్లో చదవాలంటే.. ఈ సారి లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా సాధించాల్సి వస్తుంది. ఆ కండీషన్ పెట్టిందెవరు? ఎందుకు పెట్టారు? లెక్కలపై అరుణ్‌కి ఉన్న సందేహాలకు సరైన సమాధనం చెప్పిందెవరు? పదో తరగతి ఫెయిల్ అయిన తల్లి సరస్వతి కొడుక్కి లెక్కల గురువుగా ఎలా మారింది? చివరకు అరుణ్ లెక్కల్లో కనీసం పాస్ మార్కులు 35 అయినా తెచ్చుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ. ఎలా ఉందంటే.. సినిమా అంటే ఐదారు పాటలు.. యాక్షన్, రొమాన్స్ కచ్చితంగా ఉండాలా? అవి ఉంటేనే సినిమా విజయం సాధిస్తుందా అంటే కచ్చితంగా నో అనే చెప్పాలి. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకున్నా..మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించిన చిత్రాలెన్నో ఉన్నాయి. ‘35- చిన్నకథ కాదు’ కూడా ఆ కోవలోకి చేరే చిత్రమే అవుతుంది. నిజంగా ఇది చిన్న కథ కాదు. చాలా పెద్ద కథ. ఇందులో పిల్లలతో పాటు తల్లిదండ్రులు, సమాజం నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలను చర్చించారు. ప్రస్తుతం విద్యా విధానం ఎలా సాగుతుంది? ఎలా సాగితే పిల్లలకు ఉపయోగం అని తెలియజేసే చిత్రమిది. అలా అని ఈ కథ మొత్తం విద్యార్థుల చుట్టే తిరగదు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్, మదర్ సెంటిమెంట్ చుట్టూ కథనం సాగుతుంది. సాధారణంగా పిల్లల మదిలో రకరకాల అనుమాలు ఉంటాయి. కొన్ని సార్లు వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానమే ఉండదు. కొన్నింటికి సమాధానం ఉన్నా.. ఓపిగ్గా చెప్పలేక బెదిరించి తప్పించుకుంటాం. అలా కాకుండా వాళ్ల ప్రశ్నలకు అర్థమయ్యే రీతిలో సమాధానం చెబితే.. ఎలాంటి విషయాన్ని అయినా నేర్చుకోగలరు. ఇదే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు. అందరికి లెక్కల్లో డౌట్స్ వస్తే.. ఈ సినిమాలోని అరుణ్ పాత్రకి లెక్కలపైనే డౌట్ వస్తుంది. విలువలేని సున్నాకు ముందు ఒకటి చేరిస్తే అది విలువైన పది గా ఎలా మారుతుంది? ఆ పదిని విలువ లేని సున్నాతో గుణిస్తే సున్నా ఎందుకు అవుతుందని ప్రశ్నిస్తాడు. అది తప్పని ఉదాహరణతో సహా నిరూపిస్తాడు. లెక్కల మాస్టరు సైతం సరైన సమాధానం చెప్పలేక.. ‘జీరో’ అని టైటిల్ పెట్టి ఇచ్చి చివర్లో కూర్చొబెడతాడు. అక్కడ నుంచి కథనంపై ఆసక్తి పెరుగుతుంది. టెన్త్ ఫెయిల్ అయిన తల్లియే అతని ప్రశ్నలకు సమాధానం చెప్పడం.. చివరకు అరుణ్ గణితంలో పాస్ మార్కులు సంపాధించి జీరో నుంచి హీరోగా మారడం ఈ సినమా కథ. అయితే ఈ చిన్న పాయింట్ చుట్టు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ఫస్టాఫ్‌లో ప్రసాద్, సరస్వతిల మధ్య వచ్చే సన్నివేశాలు భార్యభర్తలు ఎలా ఉండాలి? ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేస్తాయి. స్కూల్ నేపథ్యంలో సాగే సీన్స్ మన బాల్యాన్ని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ సీన్ ఎమోషనల్ టచ్ ఇస్తుంది. ఇక సెకండాఫ్‌లో కథనం సీరియస్ మోడ్‌లో సాగుతుంది. కొడుకు కోసం తల్లి మళ్లీ చదవడం.. గణిత మాస్టారుకి కూడా సాధ్యం కానీ విధంగా ఈజీ వేలో లెక్కలు నేర్చించి, కొడుకును పాస్ చేయించుకోవడంతో కథ ముగుస్తుంది. అయితే క్లైమాక్స్ ముందే ఊహించినా..తెరపై చూసినప్పుడు భావోధ్వేగానికి లోనమవుతాం. తండ్రి మార్కుల వివరాలు చెబుతున్న క్రమంలో అరుణ్ అద్దంపై నీళ్లు చల్లి బొట్టు బిళ్లలను తుడిపేస్తుంటే.. ప్రేక్షకుడిలో కూడా విజయ గర్వంతో మురిసిపోతాడు. అయితే కథనం నెమ్మదిగా సాగడం.. కథలోని మెయిన్ పాయింట్ విషయంలో లాజిక్ మిస్ అవ్వడం ఈ సినిమాకు మైనస్. సాంకేతిక పరంగానూ కొన్ని లోపాలు ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఇది మెప్పించకపోవచ్చు కానీ.. ఫ్యామిలీ ఆడియన్స్, చిన్న పిల్లలకు మాత్రం నచ్చుతుంది. వాళ్లు కచ్చితంగా చూడిల్సిన సినిమా ఇది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో ప్రతి నటించిన ప్రతి ఒక్కరు తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా నివేదా థామస్ నటన సినిమాకు ప్లస్ అయింది. సాధారణ గృహిణి, ఇద్దరు పిల్లల తల్లి సరస్వతి పాత్రలో ఒదిగిపోయింది. సెకండాఫ్‌లో ఆమె నటన హైలెట్. కళ్లతోనే భావాన్ని పలికించింది. ఎమెషనల్ సీన్లలో అద్భుతంగా నటించింది. ఆమె భర్తగా విశ్వదేవ్ చక్కగా నటించాడు. లెక్కల మాస్టరు చాణక్యగా ప్రియదర్శి తనదైన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. అరుణ్, వరుణ్, కిరణ్ పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌ల ఫెర్ఫార్మెన్స్ బాగుంది. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. వివేక్ సాగర్ సంగీతం బాగుంది. పాటలు కథలో భాగంగానే సాగుతాయి. నేపథ్య సంగీతం చక్కగా ఉంది. సంభాషణలు బాగున్నాయి. ‘మనిషి మాటకి విలువ వినడంతో రాదు..పాటించడంతో వస్తుంది’, ‘పెరగలేనప్పడు కొంచెం తుంచాలి..అది కొడుకైనా..కొమ్మైనా!’, ‘చదువుకోవడం అంటే నేర్చుకోవడం’ లాంటి సంభాషణలు ఆలోచింపజేస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
The Goat Review: విజయ్ ‘ది గోట్’ మూవీ రివ్యూ
టైటిల్: ది గోట్(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్)నటీనటులు: దళపతి విజయ్, స్నేహ, మీనాక్షి చౌదరి, ప్రభుదేవా, ప్రశాంత్, జయరామ్, అజ్మల్, వైభవ్ తదితరులునిర్మాతలు: కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్తెలుగు విడుదల: మైత్రీ మూవీ మేకర్స్ దర్శకత్వం: వెంకట్ ప్రభుసంగీతం: యువన్ శంకర్ రాజావిడుదల తేది: సెప్టెంబర్ 5, 2024దళపతి విజయ్ పాలిటిక్స్ కి ఎంటర్ అయ్యే ముందు చేసిన చివరి సినిమా ‘ది గోట్’. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై ముందు నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. విజయ్ చివరి చిత్రం ఇదేనని ప్రచారం జరగడంతో ‘ది గోట్’పై భారీ హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు డీ ఏజింగ్ కాన్సెప్ట్ ద్వారా విజయ్ యంగ్ లుక్‌లో చూపించడంతో సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకుల్లోనూ ఓ రకమైన ఆసక్తి పెరిగింది. ఇన్ని అంచనాల మధ్య నేడు(సెప్టెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. గాంధీ(విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పని చేస్తుంటాడు. ఈ విషయం ఆయన భార్య అను(స్నేహ)కూడా తెలియదు. సునీల్(ప్రశాంత్), కల్యాణ్ సుందర్(ప్రభుదేవా), అజయ్(అజ్మల్) అతని టీమ్ సభ్యులు. నజీర్ (జయరాం) అతని బాస్. ఓ సీక్రెట్ మిషన్ కోసం గర్భవతి అయిన భార్య, కొడుకు జీవన్‌తో కలిసి గాంధీ థాయిలాండ్ వెళ్తాడు. మిషన్ పూర్తి చేసే క్రమంలో కొడుకు జీవన్ మరణిస్తాడు. కొడుకు చావుకు తానే కారణమని భావించి, గాంధీ తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు. అయితే కొన్నేళ్ల తర్వాత గాంధీ ఓ పని మీద రష్యాకు వెళ్లగా అక్కడ అతనికి కొడుకు జీవన్(విజయ్) కనిపిస్తాడు. చనిపోయాడనుకున్న కొడుకు మళ్లీ తిరిగి రావడంతో గాంధీ సంతోషంగా అతన్ని ఇండియాకు తీసుకెళ్లాడు. భార్య, పిల్లలతో కలిసి లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో.. తన బాస్ నజీర్(జయ రామ్)ని ఎవరో చంపేస్తారు. తనకు ఓ సీక్రెట్ చెప్పాలని అనుకున్న సమయంలోనే హత్య జరగడంతో గాంధీ అప్రమత్తం అవుతాడు. దీని వెనుక ఉన్నదెవరని ఎంక్వేరీ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తన సన్నిహితులు ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. మరి ఆ హత్యలు చేస్తున్నదెవరు? చనిపోయాడనుకున్న జీవిన్ తిరిగి ఎలా వచ్చాడు? మీనన్(మోహన్) ఎవరు? అతనికి గాంధీకి మధ్య ఉన్న వైరం ఏంటి? కన్న తండ్రిపై జీవన్ ఎందుకు పగ పెంచుకున్నాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..వెంకట్ ప్రభు దర్శకత్వం వహించడం, విజయ్ చివరి చిత్రమని ప్రచారం జరగడంతో తమిళ్లో ‘ది గోట్’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ రిలీజ్‌కి ముందు తెలుగులోనూ విజయ్ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే డీ ఏజింగ్ ఎఫెక్ట్‌తో తీసిన సీన్స్ ట్రైలర్లో చూపించడం..వాటిపై ట్రోల్స్ రావడంతో తెలుగులో పెద్ద అంచనాలు లేకుండానే సినిమా రిలీజ్ అయింది. ఇంకా చెప్పాలంటే..విడుదల తర్వాత వెంకట్ ప్రభు చేసిన డీ ఏజింగ్ కాన్సెప్ట్ పక్కా ట్రోల్ అవుతుందని అంతా భావించారు. కానీ ట్రోలర్స్‌కి వెంకట్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. జూనియర్ విజయ్ పాత్రను చక్కగా రాసుకోవడమే కాదు.. తెరపై అంతే చక్కగా చూపించాడు. ఈ విషయంలో విజయ్ అభిమానులు ఊపిరి పీల్చుకోవచ్చు. ఇక కథ విషయానికొస్తే మాత్రం.. ఇది రొటీన్ సినిమా అని చెప్పొచ్చు. హీరో ఓ సీక్రెట్ ఏజెన్సీలో పని చేయడం..అతని పని వల్ల ఫ్యామిలీకి ఇబ్బంది రావడం..సొంత మనుషులే నమ్మక ద్రోహం చేయడం.. చివరికి హీరో అసలు విషయాన్ని కనిపెట్టి శత్రువుని ముట్టుపెట్టడం..ఈ కాన్సెప్ట్‌తో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే తండ్రి కొడుకుల మధ్య శత్రుత్వంపై కూడా సినిమాలు వచ్చాయి. ఈ రెండు కాన్సెప్ట్‌లను మిక్స్ చేసి ‘ది గోట్’ సినిమాను తెరకెక్కించాడు వెంకట్ ప్రభు. రొటీన్ కథే అయినా తనదైన స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా కథనాన్ని నడిపించాడు. కావాల్సిన చోట హీరోకి ఎలివేషన్ ఇస్తూ విజయ్ ఫ్యాన్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సినిమా ప్రారంభం నుంచి ప్రీ ఇంటర్వెల్ వరకు కథనం రొటీన్‌గా సాగుతుంది. ఈ మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా ఈజీగానే ఊహించొచ్చు. ఇంటర్వెల్ ముందు మెట్రో ట్రైన్లో వచ్చే యాక్షన్ సీన్ అదిరిపోతుంది. ఇక ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ చాలా బెటర్. కథనం ఆసక్తికరంగా సాగడంతో పాటు మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు ఆకట్టుకుంటాయి. అయితే ఇంటర్వెల్ సీన్‌తోనే సెకండాఫ్‌లో కథనం ఎలా సాగుతుంది? క్లైమాక్స్ ఎలా ఉంటుందనేది ఊహించొచ్చు. కానీ భారీ యాక్షన్, ఎలివేషన్స్ కారణంగా క్లైమాక్స్ సీన్ బోర్ కొట్టదు. ఐపీఎల్ మ్యాచ్ ఫుటేజీని, ధోనీ ఇమేజ్‌ని చక్కగా వాడుకున్నాడు. ఊహకందేలా కథనం సాగడం, ట్విస్టులు కూడా ముందే తెలిసేలా ఉండడంతో పాటు నిడివి కూడా ఎక్కువగా ఉండడం సినిమాకు మైనస్. ఎవరెలా చేశారంటే.. విజయ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హీరోయిజం ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. ది గోట్లో స్పెషల్ ఏంటంటే విజయ్‌లోని విలనిజాన్ని చూడొచ్చు. గాంధీగా హీరోయిజాన్ని తనదైన స్టైల్లో చూపిస్తూనే.. జీవన్ అలియాస్ సంజయ్గా అద్భుతమైన విలనిజాన్ని తెరపై పండించాడు. హీరోగా కంటే విలన్‌గా విజయ్ చేసిన కొన్ని సీన్స్ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇస్తాయి. స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ టీమ్‌లో పనిచేసే ఆఫీసర్స్‌గా ప్రశాంత్, ప్రభుదేవా, ఆజ్మల్ , జయ రామ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. హీరో భార్య అనుగా స్నేహ చక్కగా నటించింది. మీనాక్షి చౌదరి తెరపై కనిపించేది కాసేపే అయినా..ఉన్నంతలో చక్కగా నటించింది. సినిమా ప్రారంభంలో ఏఐ ద్వారా కెప్టెన్ విజయ్ కాంత్‌ని తెరపై చూపించడం ఆకట్టుకుంటుంది. యోగిబాబు కామెడీ పర్వాలేదు. తమిళ్ హీరో శివ కార్తికేయన్ తెరపై కనిపించేంది కొన్ని క్షణాలే అయినా.. సందడిగా అనిపిస్తుంది. సాంకేతికపరంగా సినిమా పర్వాలేదు. యువన్ శంకర్ రాజా సంగీతం యావరేజ్‌గా ఉంది. పాటలు ఆకట్టుకోకపోవడమే కాకుండా ఇరికించినట్లుగా అనిపిస్తాయి. బీజీఎం జస్ట్ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. డీ ఏజింగ్ కాన్సెప్ట్ వర్కౌట్ అయింది. ఏఐ టెక్నాలజీని చక్కగా వాడుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
అడవుల్లో బుల్లెట్ల వర్షం.. ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ ఎలా ఉందంటే?
టైటిల్: ల్యాండ్ ఆఫ్ బ్యాడ్డైరెక్టర్: విలియమ్ యూబ్యాంక్నిర్మాణ సంస్థలు: ఆర్ యూ రోబోట్ స్టూడియోస్, హైలాండ్ ఫిల్మ్ గ్రూప్నిడివి: 113 నిమిషాలుఓటీటీ: అమెజాన్ ప్రైమ్కథేంటంటే..యాక్షన్ సినిమాలకు పేరు పెట్టింది అంటే హాలీవుడ్. కానీ డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ప్రేక్షకులను కట్టిపడేసేలా కొన్ని చిత్రాలు మాత్రమే ఉంటాయి. అలాగే మనవద్ద కూడా స్పై యాక్షన్ చిత్రాలు చాలానే వచ్చాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా టెర్రరిస్టులను అంతం చేయడమే ప్రధాన కాన్సెప్ట్. అలా ప్రత్యేక ఆపరేషన్ పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 'ల్యాండ్ ఆఫ్ బ్యాడ్'. ఓ వైమానిక అధికారి కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన టెర్రరిస్టులను అంతమొందించారా? లేదా? అన్నదే అసలు కథ. కేవలం నలుగురు కమాండోలతో చేపట్టిన టెర్రరిస్ట్ ఆపరేషన్ సక్సెస్ అయిందా? లేదా? అన్నది రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..అమెరికా ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. యూఎస్‌లో ఉన్న ఎయిర్‌బేస్ నుంచే కథ మొదలవుతుంది. ఈ ఆపరేషన్ కోసం నలుగురు ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన కమాండోలు బయలుదేరుతారు. అయితే ఆపరేషన్ మొత్తం సముద్రంలోని డెల్టా అడవుల్లోనే జరుగుతుంది. టార్గెట్ ప్రాంతానికి చేరుకున్న కమాండోలకు ఊహించని పరిస్థితి ఎదురవుతుంది. అక్కడ వారు అనుకున్న ప్లాన్ బెడిసికొట్టి.. ముందుగానే వార్‌లోకి దిగాల్సి వస్తుంది. ఆ తర్వాత జరిగే యుద్ద సన్నివేశాలు కట్టిపడేస్తాయి. ఒకవైపు టెర్రరిస్టుల నుంచి బుల్లెట్ల వర్షం, వైమానికి దాడులు అబ్బుర పరిచేలా అనిపిస్తాయి. అయితే ఈ కథలో కాన్సెప్ట్ కొత్తగా లేనప్పటికీ ఈ ఆపరేషన్ చేపట్టిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన లోకేషన్స్ మధ్య భీకరమైన బాంబు దాడులు, బుల్లెట్ల వర్షం ఆడియన్స్‌కు అద్భుతంగా ఉన్నాయి. ఎయిర్‌బేస్, కమాండోల మధ్య కమ్యూనికేషన్ అంత రోటీన్‌గానే ఉంటుంది. ఆపరేషన్ అంతా అడవుల్లోనే సాగడంతో ఎక్కడా బోర్ అనిపించదు. టెర్రరిస్టులతో ఎయిర్‌ఫోర్స్ కమాండోల పోరాడే సీన్స్ ఫుల్ యాక్షన్ ఫీస్ట్‌గా అనిపిస్తాయి. అయితే ఎయిర్‌బేస్ వైమానిక అధికారుల్లో ఆపరేషన్ పట్ల సీరియస్‌నెస్ లేకపోవడం ఈ కథకు పెద్ద మైనస్. యాక్షన్ సినిమాలు ఇష్టపడేవారికి ల్యాండ్ ఆఫ్ బ్యాడ్ మూవీ మంచి ఆప్షన్. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది. -
'నేను కీర్తన' సినిమా రివ్యూ
చిమటా రమేశ్ బాబు హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా 'నేను కీర్తన'. స్టోరీ, మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చింది కూడా ఈయనే. రకరకాల జానర్స్ కలిపి తీసిన ఈ మూవీ తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అన్యాయాన్ని ఎదురిస్తూ, ఆపదలో ఉన్నవాళ్లకు జానీ అనే యువకుడి సాయం చేస్తుంటాడు. ఇతడి జీవితంలోకి కీర్తన అనే అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జానీ లైఫ్ ఎలా టర్న్ అయింది. తనకు లభించిన ఓ వరాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా, సమాజ ప్రయోజనాలకు జానీ ఏవిధంగా ఉపయోగించాడనేది మిగిలిన కథ.(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?)ఎలా ఉందంటే?'మల్టీ జానర్ ఫిల్మ్'గా ప్రచారం చేసిన ఈ చిత్రంలో నిజంగానే అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. లవ్, సెంటిమెంట్, యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, కామెడీ, రివెంజ్, హర్రర్ వంటి అంశాలన్నీ బ్యాలెన్స్ చేశారు. చిన్న సినిమాలో ఇన్ని జానర్స్ మిక్స్ చేయడం అవసరమా అని అనిపించినా.. స్టోరీ పరంగా పర్లేదనిపించింది.నటీనటుల విషయానికొస్తే రమేష్ బాబుకి ఇది తొలి సినిమా. హీరోగా చేస్తూనే అన్ని విభాగాల్లో తలో చెయ్యి తన వరకు కష్టపడ్డారు. హీరోయిన్లతో పాటు మిగిలిన పాత్రధారులు పరిధి మేరకు నటించారు. దర్శకుడిగా పర్లేదనిపించిన రమేష్ బాబు... రైటర్‌గా ఇంకాస్త శ్రద్ధ పెట్టాలి. సినిమా నిడివి కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది. మిగతావన్నీ ఓకే ఓకే.(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?) -
'సీతారాం చిత్రాలు' సినిమా రివ్యూ
తెలుగులో ఇప్పుడంతా కంటెంట్ ఉన్న సినిమాలదే హవా నడుస్తోంది. స్టార్ హీరోలు లేకపోయినా మూవీస్ సూపర్ హిట్ అవుతున్నాయి. అలా బోలెడన్ని చిన్న చిత్రాలు ప్రతివారం తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. తాజాగా థియేటర్లలోకి వచ్చిన 'సీతారాం సిత్రాలు'. కొత్తవాళ్లతో చేసిన ఈ సినిమా ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: సరిగా కూర్చోలేకపోయిన హీరో సల్మాన్ ఖాన్.. ఏమైంది?)కథేంటి? కర్నూలు దగ్గరల్లో టీ స్టాల్ నడిపే కుర్రాడు శివ (లక్ష్మణమూర్తి). మంచి మాటలని వాట్సప్‌లో పెడుతూ 'స్టేటస్ శివ'గా ఫేమస్ అవుతాడు. జీవితంలో సక్సెస్ అవ్వాలనేది గోల్. ఓసారి టీచర్‌గా పనిచేసే పార్వతి( భ్రమరాంబిక)తో ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఆమెతోనే పెళ్లి ఫిక్స్ అవుతుంది. పెళ్లి గ్రాండ్‌గా చేసుకోవాలని భారీగా అప్పు చేసి ఏర్పాట్లు చేసుకుంటాడు. కానీ ఊహించని విధంగా పెళ్లి ఆగిపోయి, అప్పులు మిగులుతాయి. ఇంతలో విలన్ ఎంట్రీ ఇస్తాడు. దాంతో శివ లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఇది చిన్న సినిమానే గానీ ఎన్నో విషయాలను దర్శకుడు ఇందులో చూపించాడు. మనసుకు నచ్చిన పనిని మరింత ఇష్టంగా చేస్తే విజయం వరిస్తుందని... బంధువులు మాటలు చెప్పడానికే కానీ ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేందుకు పనికిరారనే జీవిత సత్యాన్ని చూపించారు. స్నేహితులు కూడా మనల్ని నమ్మించి ఎలా మోసం చేస్తారో చూపించే సీన్లు బాగున్నాయి. సీరియల్స్ మాయలో పడి ఆడవాళ్లు, ఇంట్లో వాళ్లని కూడా అందులోని పాత్రలుగా ఊహించుకోవడం ఎలా ఉంటుందో చూపించాడు.(ఇదీ చదవండి: వనపర్తిలో మా పెళ్లి.. హీరోయిన్ అదితీ ఇంకేం చెప్పింది?)ఎంచుకున్న పాయింట్‌ని చెప్పడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సెకండాఫ్‌లో కొన్ని సీన్స్ ఇంకాస్త బాగా రాసుకుని ఉంటే బాగుండేది. ముఖ్య పాత్రల్లో తెలిసిన వాళ్లను తీసుకుని ఉంటే సినిమా రేంజ్ ఇంకా పెరిగేది. ప్రస్తుతం యువత ప్రేమలో ఓడిపోతే కుంగిపోతున్నారు. అలాంటి వాళ్లు ఎలా సక్సెస్ అవ్వొచ్చో ఈ మూవీతో చూపించారు.హీరో లక్ష్మణ మూర్తి, హీరోయిన్ భ్రమరాంబిక తమ పాత్రలకు న్యాయం చేశారు. తల్లిగా చేసిన ఢిల్లీ రాజేశ్వరితో పాటు మిగిలిన నటీనటులు పర్లేదనిపించారు. దర్శకుడిగా చెప్పాలనుకున్న పాయింట్‌ని సూటిగా చెప్పాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. రుద్ర కిరణ్ సంగీతం వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్లు ఉన్నాయి.(ఇదీ చదవండి: 'పుష్ప 2'.. సందేహాలు అక్కర్లేదు అంతా క్లారిటీ) -
రివ్యూ: ‘సరిపోయిందా’ శనివారం!
టైటిల్: 'సరిపోదా శనివారం' నటీనటులు: నాని, ప్రియాంక అరుల్ మోహన్, ఎస్జే సూర్య, సాయి కుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్, తదితరులునిర్మాణ సంస్థ: డివీవీ ఎంటర్టైన్మెంట్స్నిర్మాతలు: డివివి దానయ్య, కళ్యాణ్ దాసరిరచన, దర్శకత్వం: వివేక్ ఆత్రేయసంగీతం: జేక్స్ బిజోయ్సినిమాటోగ్రఫీ: మురళి జిఎడిటర్: కార్తీక శ్రీనివాస్విడుదల తేది: ఆగస్ట్ 29, 2024కథేంటంటే.. సూర్య(నాని)కి చిన్నప్పటి నుంచి కోపం ఎక్కువ. అన్యాయాన్ని సహించడు. అయితే తల్లికి ఇచ్చిన మాట ప్రకారం వారంలో ఒక రోజు మాత్రమే తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. ఆ వారమే శనివారం. మిగతా ఆరు రోజులు ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తూ.. తనకు కోపం వచ్చేలా చేసిన వ్యక్తుల పేర్లను డైరీలో రాసుకుంటాడు. శనివారం ఆ డైరీలో రాసుకున్న వాళ్ల భరతం పడతాడు. కట్ చేస్తే.. దయానంద్ అలియాస్ దయా(ఎస్జే సూర్య) క్రూరమైన పోలిస్ ఆఫీసర్. తనకు కోపం వస్తే చాలు.. సోకులపాలెం గ్రామంలోని ప్రజలు భయంతో వణికిపోతారు. దయా చేసే అన్యాయాలను చూసి తట్టుకోలేకపోతుంది కానిస్టేబుల్ చారులత(ప్రియాంక అరుల్ మోహన్). తన పైఅధికారి కావడంతో అతన్ని ఏమి చేయలేక.. సోకులపాలెం ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రయత్నిస్తుంది. మరోవైపు సూర్య కూడా సోకులపాలెం ప్రాంతంలో జరుగుతున్నా అన్యాయాలను ఎదిరించాలని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? సోకులపాలెం ప్రజలను దయా నుంచి విముక్తి కల్పించేందుకు సూర్య, చారులత కలిసి వేసిన ప్లాన్ ఏంటి? శనివారం మాత్రమే కోపాన్ని ప్రదర్శించే సూర్య.. క్రూరమైన సీఐ దయాను ఎలా ఎదిరించాడు? దయాకు సోకులపాలెం గ్రామ ప్రజలపై కోపం ఎందుకు? చిన్నప్పుడే వేరే ప్రాంతానికి వెళ్లిపోయిన సూర్య మరదలు కల్యాణికి చారులతకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు సోకులపాలెం ప్రజలకు దయా నుంచి విముక్తి లభించిందా లేదా అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ఓ ప్రాంతాన్ని విలన్ పట్టి పీడిస్తుంటాడు. అతను చేసే అన్యాయాలను ఎదిరించి, ఆ ప్రాంత ప్రజలను కాపాడడానికి హీరో వస్తాడు. తనకు సంబంధం లేకున్నా.. వారికి అండగా నిలిచి చివరకు విలన్ నుంచి ఆ ప్రాంత ప్రజలకు విముక్తి కల్పిస్తాడు.. ఈ కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. సరిపోదా శనివారం కథ కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది. అయితే అన్ని సినిమాల్లో మాదిరి హీరో ఎప్పుడు పడితే అప్పుడు కొట్టకుండా.. కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కొట్టడం ఈ సినిమా స్పెషల్. అంతకు మించి ఇందులో కొత్తదనం ఏమీ ఉండదు. ఇదే విషయాన్ని చిత్రబృందం ముందు నుంచి చెబుతూ రావడం సినిమాకు కలిసొచ్చే అంశం. ట్రైలర్లోనే కథ ఏంటో చెప్పి ముందే ఆడియెన్స్ మైండ్ సెట్ చేశారు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కొత్త కథను చెప్పేందుకు ప్రయత్నం చేయలేదు కానీ.. రెగ్యులర్ మాస్ కమర్షియల్ సినిమాలకు వాడే ఫార్మూలతో పాత కథనే కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. మదర్ సెంటిమెంట్.. ఫ్యామిలీ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ కమర్షియల్ ఫార్మెట్లో కథనాన్ని నడిపించాడు. మొదలు.. మలుపు... దాగుడు మూతలు.. ముగింపు అంటూ కథను విడదీసి చెప్పాడు. నాని, ఎస్జే సూర్యల నుంచి అద్భుతమైన నటనను రాబట్టాడు. కానీ స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం పూర్తిగా సఫలం కాలేదు. సినిమా నిడివి కూడా ఎక్కువగా(174 నిమిషాలు) ఉండడం, ఊహకందేలా కథనం సాగడం ఉండడం సినిమాకు మైనస్. హీరో శనివారం మాత్రమే తన కోపాన్ని ప్రదర్శించడానికి గల కారణం సినిమా ప్రారంభంలోనే చూపించి.. ఆడియన్స్ మైండ్‌ని సెట్ చేశాడు. ఆ తర్వాత ఒకవైపు సూర్యకు, మరోవైపు సీఐ దయాకు భారీ ఎలివేషన్స్ ఇస్తూ..వీరిద్దరి మధ్య ఫైట్ జరిగితే ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఆలోచించేలా చేశాడు. అయితే ఈ క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు సాగదీతగా అనిపిస్తాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుంది. ఇక సెకండాఫ్‌లో మొత్తం నాని-సూర్యల చుట్టే కథనం సాగుతుంది. అయితే సెకండాఫ్ ప్రారంభం అయిన కాసేపటికే ముగింపు ఎలా ఉంటుంది అనేది తెలిసిపోతుంది. ఊహకందేలా కథనం సాగినా..నాని, సూర్యలు తమ నటనతో బోర్ కొట్టకుండా చేశారు. కొత్తదనం ఆశించకుండా వెళ్తే ఈ సినిమా ఎంటర్టైన్ చేస్తుంది. ఎవరెలా చేశారంటే.. నాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్ర అయినా.. తనదైన సహజ నటనతో ఆకట్టుకుంటాడు. ఇందులో కూడా ఓ డిఫరెంట్ పాత్ర చేశాడు. వారం మొత్తం ప్రశాంతంగా ఉండి.. ఒక్కరోజు మాత్రమే కోపం ప్రదర్శించే యువకుడు సూర్య పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషన్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా అదరగొట్టేశాడు. ఇక ఈ చిత్రం బాగా పండిన మరో పాత్ర ఎస్జే సూర్యది. నెగెటివ్ షేడ్స్ ఉన్న సీఐ దయా పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశాడు. సూర్య పాత్రను మలచిన తీరు..అతని నటన సినిమాకు ప్లస్ పాయింట్. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఆ పాత్ర గుర్తిండిపోతుంది. ఇక కానిస్టేబుల్ చారులతగా ప్రియాంక అరుళ్ మోహన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. హీరో తండ్రిగా సాయి కుమార్, కార్పెరేటర్ కుర్మానంద్గా మురళీ శర్మతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా ఈ సినిమా చాలా బాగుంది. జేక్స్ బిజోయ్ సంగీతం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేసి సినిమా నిడివిని తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'ముంజ్య' సినిమా రివ్యూ (ఓటీటీ)
హారర్ కామెడీ స్టోరీలకి సెపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. తెలుగులో కొన్నేళ్ల క్రితం ఈ తరహా కథలతో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. అయితే రీసెంట్ టైంలో హిందీలో ఇలా థియేటర్లలోకి వచ్చిన మూవీ 'ముంజ్య'. తాజాగా ఇది హాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది 1952. మహారాష్ట్రలో కొంకణ్ అనే ప్రాంతం. తనకంటే పెద్దమ్మాయిని గోట్యా అనే పిల్లాడు ప్రేమిస్తాడు. ఆమెకు పెళ్లి ఫిక్స్ కావడంతో చేతబడి చేసి వశం చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో తానే బలైపోతాడు. అప్పటి నుంచి 'ముంజ్య' అనే పిల్ల దెయ్యంగా మారిపోతాడు. ప్రస్తుతానికి వస్తే పుణెలో బిట్టు (అభయ్ వర్మ) తల్లి, నానమ్మతో కలిసి ఉంటాడు. కుక్కకి కూడా భయపడే ఇతడు.. కొంకణ్ ప్రాంతానికి వెళ్తాడు. అనుకోకుండా ముంజ్యని విముక్తి చేస్తాడు. అప్పటినుంచి బిట్టు జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. ఇంతకీ అవేంటి? చివరకు ఏమైంది? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?కోరిక తీరని ఆత్మ, దెయ్యంగా మారడం.. ఓ వ్యక్తి వల్ల బయట ప్రపంచంలోకి రావడం.. అక్కడి నుంచి అందరినీ ముప్పతిప్పలు పెట్టడం.. చివరకు కోరిక తీర్చుకునే క్రమంలో చావడం... ఈ స్టోరీ లైన్ చెప్పగానే అనుష్క 'అరుంధతి' సినిమా గుర్తొచ్చి ఉంటుందేమో! దాదాపు ఇదే కథతో తీసిన హిందీ సినిమా 'ముంజ్య'. కాకపోతే అనుష్క మూవీ మొత్తం సీరియస్‌గా ఉంటే ఇది మాత్రం కాస్త భయపెడుతూ కాస్త నవ్వించే ప్రయత్నం చేసింది.1952లో కొంకణ్ అనే ప్రాంతంలో కథ మొదలవుతుంది. గోట్య అనే పదేళ్ల పిల్లాడు, పక్కింట్లో ఉంటే మున్ని అనే అమ్మాయిని ఇష్టపడతాడు. కాకపోతే ఇతడి కంటే ఆమె ఏడేళ్లు పెద్దది. ఆమెకు పెళ్లి జరుగుతుందని తెలిసి.. ఏకంగా చేతబడి చేసి ఆమెని వశపరుచుకోవాలనుకుంటాడు. తన చెల్లినే బలివ్వాలనుకుంటాడు. ఇదంతా చెటుక్వాడి అనే దీవిలో చేస్తాడు. అనుకోకుండా అప్పుడు గోట్యా చనిపోతాడు.. పిల్ల దెయ్యంగా మారతాడు. ఇలా నేరుగా కథలోకి వెళ్లిపోయారు.ప్రస్తుతానికి వస్తే చాలా భయస్తుడైన బిట్టు(అభయ్ వర్మ)కి అప్పుడప్పుడు పిచ్చి పిచ్చి కలలు వస్తుంటాయి. అందులో ముంజ్య కనిపిస్తుంటాడు. ఊహించని పరిస్థితుల్లో చెటుక్వాడి వెళ్లి అక్కడే నిర్బంధంలో ఉన్న ముంజ్యని విడుదల చేసేస్తాడు. అప్పటినుంచి ముంజ్య.. బిట్టు వెంటపడతాడు. తనకు మున్నితో పెళ్లి చేయాలని తెగ వేధిస్తాడు. అక్కడి నుంచి మొదలైన కథ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ.పాయింట్ బాగానే ఉన్నప్పటికీ భయపెట్టే సీన్స్ అక్కడక్కడే ఉన్నాయి. హాలీవుడ్ మూవీ 'ద లార్డ్ ఆఫ్ రింగ్స్'లోని గోలుమ్ అనే పాత్రని స్ఫూర్తిగా తీసుకుని.. ముంజ్య అనే పిల్ల దెయ్యాన్ని సృష్టించారు. నిజంగానే దెయ్యమా అనే రేంజులో గ్రాఫిక్స్ ఉన్నాయి కానీ దానితో పెద్దగా భయపెట్టలేకపోయారు. రెండు గంటల సినిమానే కానీ కొన్నిచోట్ల ల్యాగ్ అనిపిస్తుంది. ఇందులో బెలా పాత్రలో శర్వరి అనే అమ్మాయి చేసింది. ఈమె పెద్దగా ఇంపార్టెన్స్ లేదేంటా అనుకుంటాం. కానీ చివర్లో దెయ్యాన్ని చేసి భయపెట్టాలని చూశారు. కానీ ఆ పార్ట్ అంతా ఓకే ఓకే.ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అభయ్ వర్మ యాక్టింగ్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మిగతా పాత్రలకు పెద్దగా స్కోప్ ఉండదు. కాబట్టి ఉన్నంతలో న్యాయం చేశారు. రీసెంట్ టైంలో హారర్ సినిమాలేం చూడలేదు. టైమ్ పాస్ అవ్వాలి అనుకుంటే హిందీలో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ముంజ్య' చూడొచ్చు.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
Unlocked Review: పోగొట్టుకున్న ఫోన్ సీరియల్ కిల్లర్‌కు దొరికితే!
ఈ రోజుల్లో కాసేపు ఊపిరి బిగపట్టుకుని ఉండమన్నా ఉంటారేమో కానీ సెల్‌ఫోన్ లేకుండా క్షణం ఉండలేరు. ప్రతిదాంట్లో మంచి చెడు ఉన్నట్లే దీనివల్ల కూడా ఉపయోగం, ప్రమాదం.. అన్నీ ఉన్నాయి. మన ఫోన్ అవతలి వ్యక్తి చేతిలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్టే అన్లాక్డ్.కథతింటున్నా, ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్తున్నా, షికారుకు వెళ్లినా, జర్నీ చేస్తున్నా, ఏం చేసినా సరే.. ప్రతీది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది నామీ. ఒకరోజు బస్‌లో తన ఫోన్ మర్చిపోతుంది. అది కాస్త సీరియల్ కిల్లర్‌కు దొరుకుతుంది. నిజానికి పాస్వర్డ్ తెలియకపోవడంతో అతడు ఏమీ చేయలేక కోపంతో ఫోన్‌ను పగలగొడతాడు. పొరపాటున ఫోన్ కిందపడి అద్దం పగిలిందని, బాగు చేసి ఇస్తానని అమ్మాయిని పిలుస్తాడు. ఆపై పాస్వర్డ్ చేప్పమని అడుగుతాడు. అక్కడి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది.తన నిశ్శబ్ధమే..ఈ క్రమంలో అక్కడికి వచ్చిన నామీ తటపటాయిస్తూనే తన పాస్వర్డ్ చెప్తుంది. దీంతో అతడు ఆమె ఫోన్‌ను హ్యాక్ చేసి ఇచ్చేస్తాడు. తన ప్రతి కదలికను గమనిస్తుంటాడు. నెమ్మది నెమ్మదిగా ఆమె జీవితాన్ని తన గుప్పిట్లోకి తీసుకుని తనకు సంతోషమనేదే లేకుండా చేస్తాడు. అయితే ఇక్కడ సీరియల్ కిల్లర్ ఎక్కువ నిశ్శబ్ధంగా ఉండటం వల్ల నెక్స్ట్ ఏం చేస్తాడన్న ఉత్సుకత కలగక మానదు.పాస్వర్డ్ అడగడమే విడ్డూరంసినిమాలో క్యారెక్టర్ల గురించి పెద్దగా పరిచయం చేయకపోవడంతో చివర్లో కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. పెద్ద ట్విస్టులు లేకుండా కథ ఒకే లైన్లో ముందుకు సాగుతుంది. అయితే ఫోన్ స్క్రీన్ మార్చడానికి పాస్వర్డ్ అక్కర్లేదు. అలాగే షాపులోని వ్యక్తి (సీరియల్ కిల్లర్)కి పాస్వర్డ్ రాసివ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఇక్కడ షాపువాడు ఫోన్ పాస్వర్డ్ అడగడం, ఆమె రాసిచ్చేయడం కొంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది.ఒక గంట 57 నిమిషాల నిడివి ఉన్న ఈ కొరియన్ థ్రిల్లర్ మూవీని ఓసారి చూసేయొచ్చు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అందుబాటులో ఉంది. -
టాలీవుడ్ మూవీ 'రేవు' రివ్యూ.. ఆడియన్స్‌ను ఆకట్టుకుందా?
టైటిల్: రేవునటీనటులు: వంశీ రామ్ పెండ్యాల, స్వాతి భీమి రెడ్డి, హేమంత్ ఉద్భవ్, అజయ్, సుమేధ్ మాధవన్, యేపూరి హరి తదితరులుదర్శకుడు: హరినాథ్ పులినిర్మాతలు : మురళి గింజుపల్లి, నవీన్ పారుపల్లిసంగీత దర్శకుడు: జాన్ కె జోసెఫ్సినిమాటోగ్రఫీ: రేవంత్ సాగర్ఎడిటర్: శివ శర్వానీవిడుదల తేదీ : ఆగస్టు 23, 2024ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే చాలు. చిన్న సినిమాలు అయినా సరే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. కొత్త నటీనటులైనా సరే కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే ఇటీవలే కొత్తవాళ్లతో తెరకెక్కించిన కమిటీ కుర్రోళ్లు సక్సెస్ సాధించింది. అలాగే అంతా కొత్తవాళ్లతో తెరకెక్కిన చిత్రం రేవు. హరినాథ్ పులి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ప్రభు, పర్వతనేని రాంబాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా నిర్మించారు. ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.అసలు కథేంటంటే...సముద్ర నేపథ్యంలోని సినిమాలు టాలీవుడ్లో గతంలో చాలానే వచ్చాయి. కోస్తాతీరంలోని మత్స్యకారుల జీవనం ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే రేవు. పాలరేవు అనే గ్రామంలో అంకాలు (వంశీరామ్ పెండ్యాల), గంగయ్య (అజయ్) అనే ఇద్దరు మత్స్యకారులు జీవనం సాగిస్తుంటారు. చేపల వేట విషయంలో వీరిద్దరి మధ్య పోటీ ఉంటుంది. అయితే వీరి మధ్యలో మూడో వ్యక్తి ఎంట్రీ ఇస్తాడు. చేపల వేటలోకి నాగేశు(యేపూరి హరి) ఎంట్రీ ఇచ్చి వీరి జీవనాధారాన్ని దెబ్బతీస్తాడు. మరీ నాగేశ్‌ను అంకాలు, గంగయ్య అడ్డుకున్నారా? పాలరేవులో చేపల వేటపై ఆధిపత్యం కోసం వీరిద్దరు ఏ చేశారన్నదే అసలు కథ?ఎలా ఉందంటే..రేవు అనగానే సముద్రతీరం, మత్స్యకారులు అని అందరికీ గుర్తొస్తాయి. టైటిల్ చూస్తేనే కథ ఎలా ఉంటుందో ప్రేక్షకులు ఊహించుకోవచ్చు. మత్స్యకారుల నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇక్కడ కథలో చేపలవేట పేరుతో రివేంజ్ డ్రామాను చక్కగా తెరకెక్కించారు. ఇద్దరు స్నేహితుల మధ్య ఈగో వస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చక్కగా తెరపై ఆవిష్కరించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులను కట్టిపడేసింది.సముద్ర నేపథ్యం అనగానే కథ మొత్తం తీరప్రాంతం చుట్టే తిరుగుతుంది. ఇందులో మత్స్యకారుల జీవనవిధానం, వారు పడే ఇబ్బందుల ఎలా ఉంటాయనేది డైరెక్టర్ తెరపై చూపించిన విధానం బాగుంది. కొత్త నటీనటులైనప్పటికీ ఎక్కడా ఆ ఫీలింగ్ రాకుండా తీశారు. కొత్త దర్శకుడు అన్న ఫీలింగ్ రాకుండా స్క్రీన్ ప్లేను అద్భుతంగా మలిచాడు హరినాథ్ పులి. కథలో సహజత్వం ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. కానీ కథలో కొత్తదనం లేకపోవడం పెద్ద మైనస్. రోటీన్ స్టోరీ కావడంతో కాస్తా బోరింగ్‌గానే అనిపిస్తుంది. కొన్ని చోట్ల సీన్స్ అయితే మరింత సాగదీసినట్లుగా అనిపిస్తాయి. కానీ క్లైమాక్స్ విషయానికొస్తే డైరెక్టర్ ఆడియన్స్‌ను మెచ్చుకునేలా కథను ముగించాడు.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో వంశీ రామ్ పెండ్యాల మత్స్యకారుడి పాత్రలో మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్‌లో బాగా రాణించాడు. హేమంత, అజయ్ నిడదవోలు తమ పాత్రల పరిధిలో జీవించారు. హీరోయిన్ గా నటించిన స్వాతి ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేర రాణించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. ఎడిటర్ మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. రేటింగ్- 2.75/5 -
టారోట్ మూవీ.. ధైర్యవంతులు మాత్రమే చూడండి!
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న వాటిలో హాలీవుడ్ చిత్రం ‘టారో’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.బ్లాక్ అండ్ వైట్ నుంచి డిజిటల్ కలర్ కాలం వరకు ప్రపంచ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ ఫేవరెట్ ఎలిమెంట్ ఏదైనా ఉంది అంటే అదే ‘దెయ్యం’. ఓ మనిషి భయానికి కారణం తన కన్నా బలవంతుడు ఎదురు పడినపుడు లేదా ప్రాణం లేని ఆత్మ కనపడినపుడు... నాటి నుంచి నేటి సినిమా దర్శకుల వరకు తమ సినిమాల్లో దెయ్యాన్ని వాడుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి. ఆ కోవలే రిలీజైన హాలీవుడ్ మూవీనే ‘టారో’. కథఈ సినిమాకి ఇద్దరు దర్శకులు స్పెన్సర్ కొహెన్–అన్నాహెల్ బర్గ్. కథాంశానికొస్తే... కాలేజ్ స్నేహితులైన ఓ గ్రూప్ హాలిడే ట్రిప్కని ఓ మారుమూల ఇంటికి వెళ్తారు. అక్కడ వాళ్ళకు అనుకోకుండా ఓ బాక్స్... అందులో కొన్ని టారో కార్డ్స్ కనబడతాయి. ఇక్కడ టారో కార్డ్స్ అంటే చూడటానికి పేకముక్కల్లా ఉండి, ఇంకా చెప్పాలంటే మన చిలక జోస్యంలో చిలక తీసేలాంటివన్నమాట. ఆ టారో కార్డ్స్‌తో ఓ అమ్మాయి... గ్రూప్‌లో మిగతా అందరికీ వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు చెప్తుంది.ఎలా ఉందంటే?ట్విస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరి భవిష్యత్తు చెప్తూ వాళ్ళ మరణం ఎలా ఉంటుందో చెప్తుంది. ఇంకా చెప్పాలంటే అలా ఆ కార్డ్స్‌లో ఉన్న దెయ్యం ఆ అమ్మాయి చేత అలా చెప్పిస్తుంది. ఆ తరువాత వాళ్లు ఆ కార్డ్స్ వల్ల ఎటువంటి ప్రమాదాలు ఎదుర్కొన్నారు? చివరకు ఆ దెయ్యాన్ని ఏం చేశారన్నదే ‘టారో’ సినిమా. గొప్ప విషయం ఏమిటంటే ఈ హారర్ హాలీవుడ్ సినిమాలో తెలుగమ్మాయి అవంతిక నటించడం. హారర్ జోనర్ ఇష్టపడేవాళ్ళకి ‘టారో’ మంచి ఛాయిస్... ఒక్క భయపడేవాళ్ళకు తప్ప. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. గో వాచ్ ఇట్. – ఇంటూరు హరికృష్ణ -
'మారుతీనగర్ సుబ్రమణ్యం' సినిమా రివ్యూ
తెలుగు సినిమాల్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్. ఇతడిని హీరోగా పెట్టి తీసిన సినిమా 'మారుతీనగర్ సుబ్రమణ్యం'. నార్మల్‌గా అయితే ఇదో చిన్న సినిమా. కానీ సుకుమార్ భార్య నిర్మాతల్లో ఒకరు కావడం, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్‌గా రావడం కాస్తంత బజ్ క్రియేట్ అయింది. తాజాగా (ఆగస్టు 23) ఈ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?మారుతీనగర్‌కి చెందిన సుబ్రమణ్యం (రావు రమేశ్).. 1998లో టీచర్ ఉద్యోగానికి సెలెక్ట్ అవుతాడు. కానీ కోర్టు స్టే వల్ల అది అలా హోల్డ్‌లో ఉండిపోతుంది. చేస్తే గవర్నమెంట్ ఉద్యోగమే చేయాలని అప్పటినుంచి మరో పనిచేయకుండా ఖాళీగానే ఉంటాడు. భార్య కళారాణి (ఇంద్రజ) గవర్నమెంట్ ఆఫీసులో క్లర్క్. వీళ్లకో కొడుకు అర్జున్ (అంకిత్ కొయ్య). అప్పులతో సంసారం చేస్తున్న సుబ్రమణ్యం అకౌంట్లో రూ.10 లక్షలు వచ్చిపడతాయి. ఇంతకీ వీటిని ఎవరు వేశారు? చివరకు గవర్నమెంట్ జాబ్ వచ్చిందా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?సినిమాలో ఎంటర్టైన్ ఉంటే చాలు. స్టార్ హీరోహీరోయిన్లు ఉన్నారా? ఐటమ్ సాంగ్ ఉందా లాంటి విషయాల్ని ప్రేక్షకుల్ని పట్టించుకోరు. అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ రావు రమేశ్‌ని హీరోగా పెట్టి తీసిన సినిమా ఇది. అప్పుడెప్పుడో 1998లో టీచర్ల ఉద్యోగానికి కోర్ట్ స్టే ఇవ్వడం, మన అకౌంట్లో అనుకోకుండా డబ్బులు వచ్చి పడటం.. ఇలా మనకి తెలిసిన వార్తల్ని కాన్సెప్ట్‌గా తీసుకుని తీసిన మూవీ 'మారుతీనగర్ సుబ్రమణ్యం'.మొదలుపెట్టడమే మారుతీనగర్ అనే ప్రాంతంలో ఉండే సుబ్రమణ్యం అసలు ఎలాంటి వాడు? అతడు కుటుంబ పరిస్థితి ఏంటి అనేది క్లియర్‌గా చెప్పి సినిమా మొదలుపెట్టారు. ఓవైపు కథ చెబుతూనే కొన్ని కామెడీ సీన్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు అన్నట్లు పేర్చుకుంటూ వెళ్లిపోయారు. సిచ్యుయేషనల్ కామెడీతో రాసుకున్న సన్నివేశాలు చాలావరకు వర్కౌట్ అయ్యాయి. కాకపోతే కొన్నిచోట్ల ఆశించిన స్థాయిలో కామెడీ పండలేదుఫ్యామిలీ డ్రామా తీసుకుని అసలు రూ.10 లక్షలు.. సుబ్రమణ్యం అకౌంట్లోకి ఎవరు వేశారు అనే చిన్న పాయింట్‌తో సినిమాని చివరి వరకు నడపడం బాగుంది. రావు రమేశ్‌కి కూడా సగటు తెలుగు హీరోల్లానే స్లో మోషన్ షాట్స్, డ్యాన్స్‌లు పెట్టారు. అంతా బాగానే ఉంది. కానీ ఇందులో సుబ్రమణ్యం కొడుకు అర్జున్ ప్రేమించే కాంచన అనే అమ్మాయి సీన్లు అయితే మరీ సినిమాటిక్‌గా, లాజిక్‌కి దూరంగా అనిపిస్తాయి. మెగా ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్, చిరంజీవి రిఫరెన్సులు కూడా సినిమాలో పెట్టారు. కాకపోతే అవి కుదిరేశాయి.తల్లిదండ్రుల ముందే రిలేషన్షిప్, బ్రేకప్ లాంటివి కాంచన పాత్ర చాలా ఈజీగా మాట్లాడేస్తూ ఉంటుంది. దీనికి ఆమె తల్లిదండ్రులు పెద్దగా షాక్ అవ్వకుండా అదేదో తమకు చాలా అలవాటు ఉన్నట్లు ప్రవర్తిస్తుంటారు. రియల్ లైఫ్ ఇలా ఎవరు ఉంటార్రా బాబు అనిపిస్తుంది. అయితే ఇదంతా యూత్ కోసం రాసుకున్న సీన్లలా అనిపిస్తాయి. అలానే సినిమాలో లక్షల డబ్బుని చాలా సులభంగా ట్రాన్స్ఫర్ చేసేస్తుంటారు. ఇదంతా కాస్త లాజిక్‌కి దూరంగా అనిపిస్తుంది. ఇలా కొన్ని పొరపాట్లు తప్పితే సినిమా ఓవరాల్‌గా సరదాగా నవ్వుకోవడానికి బాగుంది.ఎవరెలా చేశారు? రావు రమేశ్ నటన గురించి కొత్తగా చెప్పడానికేం లేదు. ఎప్పటిలానే సుబ్రమణ్యం పాత్రలో ఒదిగిపోయాడు. ఇతడి కొడుకుగా చేసిన అంకిత్.. బాగానే చేశాడు. మొన్నే 'ఆయ్'తో, ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. కాంచన పాత్ర చేసిన రమ్య పసుపులేటి.. గ్లామర్‌గా కనిపించడం తప్పితే పెద్దగా చేసిందేం లేదు. ఇంద్రజ కూడా స్టార్టింగ్‌లో ఎమోషనల్ అవ్వడం, చివర్లో డ్యాన్స్ చేయడం తప్పితే పెద్దగా స్కోప్ దొరకలేదు. మిగిలిన పాత్రల్లో ప్రవీణ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ తదితరులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే.. సినిమా చాలా రిచ్‌గా తీశారు. సినిమాటోగ్రఫీ చాలా కలర్ఫుల్గా ఉంది. పాటలు వినడానికి ప్లస్ చూడటానికి కూడా బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య.. సింపుల్ స్టోరీ లైన్ తీసుకుని, దానికి తనదైన హాస్యం జోడించి ఎంటర్టైన్ చేశాడు. గతంలో 'హ్యాపీ వెడ్డింగ్' మూవీతో ఆకట్టుకున్న ఇతడు.. ఇప్పుడు ఈ సినిమాతో మెప్పించాడు. ప్రామిసింగ్ దర్శకుడు అనిపించుకున్నాడు. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే.. ఫైట్స్ లాంటివి లేకుండా మనసారా కాసేపు నవ్వుకుందామనుకుంటే 'మారుతీనగర్ సుబ్రమణ్యం' మంచి ఆప్షన్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ-2 రివ్యూ.. ఆడియన్స్‌ను భయపెట్టిందా?
టైటిల్: డీమాంటీ కాలనీ-2నటీనటులు: ప్రియాభవానీ శంకర్, అరుల్ నిధి, ఆంటి జాస్కెలైన్, త్సెరింగ్ దోర్జీ, అరుణ్‌పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్, సర్జానో ఖలీద్, అర్చన రవిచంద్రన్ తదితరులుదర్శకుడు: అజయ్ ఆర్ జ్ఞానముత్తునిర్మాతలు: విజయ సుబ్రహ్మణ్యన్, ఆర్సీ రాజ్కుమార్నిర్మాణసంస్థలు: బీటీజీ యూనివర్సల్, వైట్ నైట్స్ ఎంటర్టైన్మెంట్సంగీతం - సామ్ సీఎస్సినిమాటోగ్రఫీ - హరీశ్ కన్నన్ఎడిటర్ - కుమరేశ్ డివిడుదల తేదీ: ఆగస్టు 23(తెలుగు)హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటే ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తారు. ఈ జానర్లో వచ్చే చిత్రాలకు కొదవే లేదు. ఏ ఇండస్ట్రీ అయినా ఇలాంటి సినిమాలకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉంటుంది. అందుకే ఇలాంటి కథలపై డైరెక్టర్స్ ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. అలా 2015లో వచ్చిన తమిళ హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ అద్భుతమైన విజయం సాధించింది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత ఆ చిత్రానికి సీక్వెల్‌గా డీమాంటీ కాలనీ-2 తీసుకొచ్చారు. ప్రియా భవానీ శంకర్, అరుల్ నిధి జంటగా నటించారు. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈనెల 23న రిలీజవుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రీమియర్ షో వేశారు. అజయ్ ఆర్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన డీమాంటీ కాలనీ 2 అభిమానులను ఎంతమేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. అసలు కథేంటంటే..తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన సామ్ ఆత్మహత్యకు పాల్పడటాన్ని అతని భార్య డెబీ (ప్రియా భవానీ శంకర్) జీర్ణించుకోలేదు. భర్త ఎందుకలా మరణించాడో తెలుసుకోవాలని ఆరాతీయడం ప్రారంభిస్తుంది. అదే సమయంలో ఆరేళ్లకు ఒకసారి లైబ్రరీలోని పుస్తకం చదవడానికి వెళ్లిన వ్యక్తులందరూ ఆత్మహత్య చేసుకున్నారని తెలుస్తుంది. దీంతో ఆ మరణాలు ఆపేందుకు డెబీ ప్రయత్నాలు స్టార్ట్ చేస్తుంది. ఆ సమయంలో శ్రీనివాస్ (అరుళ్ నిధి), అతని కవల సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి) గురించి కూడా తెలుస్తుంది. వాళ్ల ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయని తెలుసుకున్న డెబీ.. ఆ ఇద్దరు అన్నదమ్ములను డెబీ, తన మావయ్య రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో కలిసి కాపాడిందా? వీరికి టిబెట్ నుంచి వచ్చిన బౌద్ధ సన్యాసులు ఎలా సాయపడ్డారు? తన భర్త కోరికను డెబీ నెరవేర్చిందా? శ్రీనివాస్‌ను రఘునందన్ ఎందుకు చంపాలని అనుకున్నాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే డీమాంటీ కాలనీ-2 చూడాల్సిందే.ఎలా ఉందంటే..హారర్ థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా వచ్చిన డీమాంటీ కాలనీ 2. ప్రీక్వెల్‌ను బేస్ చేసుకుని ఈ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు డైరెక్టర్ అజయ్ ఆర్ జ్ఞానముత్తు. అందుకే డీమాంటీ కాలనీ చూసిన వారికైతే సీక్వెల్ కాస్తా ఈజీగా అర్థమవుతుంది. ఇక ఈ స్టోరీ విషయానికొస్తే డీమాంటీ అనే ఇంటి చుట్టే తిరుగుతుంది. ఇక హారర్ సినిమాలంటే సస్పెన్స్‌లు కామన్ పాయింట్. ఫస్ట్ పార్ట్‌లో సినిమా ప్రారంభంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం, అతని ఆత్మతో మాట్లాడేందుకు భార్య చేసే ప్రయత్నాలు కాస్తా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి.సెకండాఫ్ వచ్చేసరికి ఇందులోకి డీమాంటీ కాలనీ పాత్రలను తీసుకొచ్చిన తీరు ఆడియన్స్‌కు థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. డీమాంటీ కాలనీకి వెళ్లాకే అసలు కథ మొదలవుతుంది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో తర్వాత ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని డైరెక్టర్ చూపించారు. కథ మధ్యలో సర్ప్రైజ్లు కూడా ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. కథలో ప్రధానంగా ఆత్మతో పోరాడే సీన్స్ మరింత ఆసక్తిగా మలిచారు జ్ఞానముత్తు. ఈ హారర్ సినిమాలో బుద్ధిజం స్పిరిచువాలిటీ హైలెట్. టిబెటియన్ యాక్టర్‌తో సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ చిత్రాన్ని హారర్‌తో పాటు అన్నదమ్ముల మధ్య గొడవలు, సవతి చెల్లెలు లాంటి పాత్రలతో ఎమోషన్స్ పండించాడు. క్లైమాక్స్ విషయానికొస్తే ఆడియన్స్‌ను అద్భుతమైన థ్రిల్లింగ్‌కు గురిచేశాడు. విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. చివర్లో పార్ట్-3 పై ఇచ్చిన హింట్‌తో మరింత క్యూరియాసిటీని పెంచేశాడు జ్ఞానముత్తు.ఎవరెలా చేశారంటే..ప్రియా భవానీ శంకర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ముఖ్యంగా హారర్ సీన్స్‌లో హావభావాలు అద్భుతంగా పండించింది. అరుని నిధి ద్విపాత్రాభినయంతో అదరగొట్టేశాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల ఫరిధిలో మెప్పించారు. ఇక సాంకేతికత విషయానికొస్తే.. గ్రాఫిక్స్, సౌండ్ ఫర్వాలేదనిపించాయి. సామ్ సీఎస్ బీజీఎం ఈ చిత్రానికి హైలెట్. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌లో కాస్తా ట్రిమ్ చేయాల్సింది. నిర్మాణ విలువలు సంస్థకు తగినట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. ఓవరాల్‌గా హారర్ జానర్ ఇష్టపడేవారికి ఫుల్ ఎంటర్టైనర్ మూవీ. -- పిన్నాపురం మధుసూదన్, సాక్షి వెబ్‌డెస్క్ -
ఒక యువతిని కాపాడేందుకు ఇద్దరు హీరోల పోరాటమే 'బాడ్‌ల్యాండ్ హంటర్స్' రివ్యూ
స్టార్ హీరో డాన్ లీ.. హాలీవుడ్ సినిమా లవర్స్‌కు అభిమాన నటుడు. సౌత్ కొరియన్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్‌కు దగ్గరయ్యాడు. ఆయన నటించిన బాడ్‌ల్యాండ్ హంటర్స్ చిత్రం ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైంది. హియో మ్యుంగ్-హేంగ్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 26, 2024న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది.సౌత్ కొరియాలో ఒక భారీ భూకంపంతో కథ ప్రారంభం అవుతుంది. ఒక్కసారిగా భూకంపం రావడంతో అక్కడి ప్రాంతంలోని ప్రజలు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటారు. అతికష్టం మీద కొందరు ప్రాణాలతో బయటపడినప్పటికీ వారికి సరైన ఆహారం దొరకదు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. ఆకలితో ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వారు జీవిస్తుంటారు. సరిగ్గా అదే ప్రాంతంలో నామ్‌సామ్ (డాన్ లీ) జంతువుల్ని వేటాడుతూ జీవిస్తుంటాడు. అతనితో పాటుగా నామ్‌సామ్, చోయ్ జీ వాన్ (లీ జున్ యంగ్) ఉంటారు. వీరిద్దరూ కూడా మంచి స్నేహితులు. భూకంపం వల్ల నామ్‌సామ్ కూతురు చనిపోతుంది. ఆ బాధ నుంచి బయటపడేందుకు హన్ సునా (రోహ్ జియోంగ్) అనే యువతిని తన కూతురిగా భావిస్తుంటాడు. ఇదే క్రమంలో ఆ అమ్మాయిని చోయ్ జీ వాన్ ప్రేమిస్తుంటాడు.అలా వారి జీవితాల్లోకి వెల్ఫేర్ ఆర్గనైజేషన్ పేరుతో కొందరు ఎంట్రీ ఇస్తారు. దీంతో వారి లైఫ్ ప్రమాదంలో పడుతుంది. వారి నమ్మించి హన్ సునా (రోహ్ జియోంగ్) అనే యువతిని తమ వెంట తీసుకెళ్తారు. ఆ సమయంలో ఆమె అమ్మమ్మను క్రూరంగా చంపేస్తారు. యాంగ్ జీ సు (లీ హీ జూన్) అనే డాక్టర్ యుక్త వయసులో ఉన్న అమ్మాయిలపై ప్రమాదకర ప్రయోగాలు చేస్తుంటాడు. మనిషికి మరణం లేకుండా ఉండేందుకు సైన్స్‌కు పదునుపెడుతాడు. ఈ క్రమంలో అనేకమంది యువతులపై ప్రయోగాలు చేస్తూ ఉండలం వల్ల వారందరూ కూడా భయంకరమైన జాంబీలుగా మారిపోతుంటారు.కూతురుగా భావించిన హన్సునా ప్రమాదంలో చిక్కుకుందని తెలుసుకున్న నామ్‌సామ్ కాపాడేందుకు ప్లాన్ వేస్తాడు. తన మిత్రుడు అయిన చోయ్ జీ వాన్‌ను కూడా సాయంగా తీసుకెళ్తాడు. ఆమెను ఆ సైకో డాక్టర్ నుంచి వారిద్దరూ ఎలా కాపాడారు? డాక్టర్‌తో పాటు పనిచేస్తున్న లీ యూన్ హో ఎలా సాయపడింది? ఆమె వారికి ఎందుకు సాయం చేసింది..? డాక్టర్‌గా మంచి పేరున్న యాంగ్ జీ సు ఇదంతా ఎవరిని కాపాడేందుకు చేస్తున్నాడు..? ఆ డాక్టర్ బారి నుంచి హన్ సునా ప్రాణాలతో బయటపడిందా..? ఇవన్నీ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న బ్యాడ్‌లాండ్ హంటర్ మూవీ చూడాల్సిందే.బ్యాడ్‌లాండ్ హంటర్స్ సినిమా అంతా కూడా భూకంపంతో శిథిలమైన నగరం చూట్టే సాగుతుంది. వాస్తంగా దానిని సెట్ వేసి ప్రేక్షకులకు చూపించారు. అయినా చాలా రియలిస్టిక్‌గా సినిమాను డైరెక్టర్ మలిచాడు. ఎక్కువగా ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్‌లు ప్రేక్షకులను భారీగా మెప్పిస్తాయి.డైరెక్టర్ హియో మయాంగ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కావడంతో ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయాయి. మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ అయితే ప్రేక్షకుల అంచనాలకు మించి పీక్స్‌లో ఉంటుంది. నామ్ సామ్ పాత్రలో డాన్ లీ అదరగొట్టాడు. కేవలం ఆయన చేస్తున్న స్టంట్స్ కోసం సినిమా చూడొచ్చు. ఇదే సమయంలో లీహీజూన్ విలనిజం కూడా అంతే బలంగా ఉంటుంది. ఇందులో లవ్‌స్టోరీతో పాటు యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలు ఎవరినీ నిరుత్సాహపరచవని చెప్పవచ్చు. ఒక సైకో డాక్టర్ నుంచి ఒక అమ్మాయిని ఇద్దరు ఎలా కాపాడారు అనేది ఈ సినిమా కథ. -
'తంగలాన్' సినిమా రివ్యూ
'అపరిచితుడు', 'ఐ' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన విక్రమ్.. సాహసోపేతమైన పాత్రలకు పెట్టింది పేరు. ఇప్పుడు అలానే 'తంగలాన్' అనే మూవీలో ఓ ఆటవిక తెగ మనిషిగా నటించాడు. టీజర్, ట్రైలర్‌తోనే డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అందివ్వబోతున్నామని ఫీల్ కలిగించారు. ఇప్పుడీ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి వచ్చింది. ఇది ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?అది 1850. బ్రిటీషర్లు మన దేశాన్ని పాలిస్తుంటారు. వెప్పూర్ అనే ఊరిలో తంగలాన్ (విక్రమ్).. తన కుటుంబంతో కలిసి బతుకుతుంటాడు. అనుకోని పరిస్థితుల్లో బంగారం వెతకడం కోసం క్లెమెంట్ అనే ఇంగ్లీష్ దొరతో కలిసి తంగలాన్ వెళ్లాల్సి వస్తుంది. ఈ ప్రయాణంలో వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. మరి తంగలాన్ చివరకు బంగారం కనిపెట్టాడా? అరణ్య, ఆరతితో ఇతడికి ఉన్న సంబంధమేంటి అనేదే మెయిన్ స్టోరీ.ఎలా ఉందంటే?'దురాశ దుఃఖానికి చేటు'.. ఈ సామెత చాలాసార్లు వినే ఉంటాం. ఇదే పాయింట్‌తో తీసిన సినిమా 'తంగలాన్'. కేజీఎఫ్ సినిమా మీరు చూసే ఉంటారు. కోలార్ జిల్లాలోని ఓ చోట టన్నుల కొద్ది బంగారం దొరుకుతుంది. అయితే అదంతా ప్రస్తుతంలో జరిగిన కథలా తీశారు. 'తంగలాన్' మాత్రం ఏకంగా వందల ఏళ్ల క్రితం జరిగిన నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో తీశారు.'తంగలాన్', అతడి కుటుంబం, చుట్టూ ఉన్న పరిస్థితులని పరిచయం చేస్తూ సినిమా మొదలుపెట్టడం వరకు బాగానే ఉంది. కొంతసేపటి తర్వాత తంగలాన్.. తన కూతురికి ఓ కథ చెప్పడం.. బంగారం కోసం తన తాత, నాగిని జాతి స్త్రీతో పోరాడటం లాంటివి చెబుతాడు. అయితే సినిమాలో వైవిధ్యముంది కానీ ఎక్కడ కూడా కనెక్ట్ కాలేకపోతాం. మొదటిది సుధీర్ఘంగా సాగే సన్నివేశాలైతే, రెండోది దర్శకుడు అసలేం చెప్పాలనుకున్నాడో ఎంతకీ అర్థం కాకపోవడం.ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలదే ట్రెండ్. అంత మాత్రాన నేల విడిచి సాము చేయడం కరెక్ట్ కాదు. ప్రేక్షకుడు కనెక్ట్ అయ్యేలా మూవీ తీయాలి. ఈ విషయంలో 'తంగలాన్' ఆమాద దూరంలో ఆగిపోయింది. దాదాపు రెండున్నర గంటల నిడివి.. కానీ నాలుగు గంటల చిత్రాన్ని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడో 18వ శతాబ్దంలో మొదలైన స్టోరీ కాస్త 5 శతాబ్దం దగ్గరకు వెళ్లి ఆగుతుంది. హీరోకి అప్పుడప్పుడు కలలో కొందరు మనుషులు కనిపిస్తుంటారు. ఇందుకు కారణాన్ని క్లైమాక్స్‌లో రివీల్ చేస్తారు. కానీ అప్పటికే ఎగ్జైట్మెంట్ చచ్చిపోయింటుంది.ఇందులో హీరోని పల్లెటూరిలో పనిచేసే వాడిగా తొలుత చూపిస్తారు. కొన్నిసీన్ల తర్వాత ఇతడికి బ్రిటీషర్ల మాట్లాడిన ఇంగ్లీష్ చాలా సులభంగా అర్థమైపోతుంది. ఇక్కడ లాజిక్ మిస్సయిపోయారు. అలానే వర్ణ, కుల వివక్ష గురించి సినిమాలో అక్కడక్కడ చూపించిన సీన్లు బాగున్నాయి.ఎవరెలా చేశారు?తంగలాన్‌గా విక్రమ్ తప్ప ఎవరూ ఊహించలేం! ఎందుకంటే ఈ పాత్రలో అలా అదరగొట్టేశాడు. మధ్యలో కొన్ని సీన్లలో తప్పితే అసలు ఒంటిపై బట్టలే ఉండవు. మేకప్ కూడా ఏం ఉండదు. ఇలాంటి పాత్రని టాలీవుడ్లో కొందరు హీరోలు.. జీవితంలో చేయలేరేమో! తంగలాన్ భార్యగా చేసిన మలయాళ నటి పార్వతి తిరువత్తు.. ఉన్నంతలో ఓకే. నాగిని జాతి నాయకురాలు ఆరతిగా మాళవిక మోహనన్ వేరే లెవల్. స్క్రీన్‌పై ఆమె కనిపిస్తుంటే భయమేస్తుంది. మిగిలిన పాత్రధారులు కష్టాన్ని కూడా మర్చిపోలేం.టెక్నికల్‌గా చూసుకుంటే 'తంగలాన్' బ్రిలియంట్ మూవీ. ఆర్ట్, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్స్ ప్రాణం పెట్టేశారు. జీవీ ప్రకాశ్ కుమార్ తన సంగీతంతో సినిమాని బాగానే ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మిగిలిన విభాగాలతో పాటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా కష్టపడింది. కాకపోతే ఈ తరహా మూవీస్ అందరికీ నచ్చవు. డిఫరెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు 'తంగలాన్' మంచి ఆప్షన్. ఫైనల్‌గా చెప్పొచ్చేది ఏంటంటే కష్టం కనిపించింది కానీ చాలా సాగదీత అయిపోయింది!-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రివ్యూ
టైటిల్: డబుల్ ఇస్మార్ట్నటినటులు: రామ్ పోతినేని, కావ్య థాపర్, సంజయ్ దత్, సాయాజీ షిండే, అలీ, గెటప్ శ్రీను తదితరులునిర్మాణ సంస్థ: పూరి కనెక్ట్స్నిర్మాతలు: పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్దర్శకత్వం:పూరీ జగన్నాథ్సంగీతం: మణిశర్మసినిమాటోగ్రఫీ: సామ్ కె. నాయుడు, జియాని జియానెలివిడుదల తేది: ఆగస్ట్ 15, 2024ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ పోతినేని, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన తాజా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సినిమా ఇది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. ప్రమోషన్స్ అంతగా చేయకపోయినా.. బజ్ మాత్రం క్రియేట్ అయింది. మరి భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథ ఏంటంటే..ఇస్మార్ట్ శంకర్ (రామ్ పోతినేని) తన తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే పోగొట్టుకుంటాడు. తన తల్లి పోచమ్మ (ఝాన్సీ)ని చంపిన బిగ్ బుల్ (సంజయ్ దత్)ను పట్టుకునే పనిలో ఇస్మార్ట్ శంకర్ పడతాడు. మరో వైపు బ్రెయిన్ ట్యూమర్ వల్ల మూడు నెలల్లోనే చనిపోతానని బిగ్ బుల్‌కు తెలుస్తుంది. దీంతో తాను ఎలాగైనా బతకాలని అనుకుంటాడు. థామస్ (మకరంద్ దేశ్ పాండే) మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ గురించి చెబుతాడు. ఇస్మార్ట్ శంకర్ అనే వాడికి ఈ ప్రయోగం చేసి సక్సెస్ అయ్యారని, అలా బిగ్ బుల్ మెమోరీనీ ఇస్మార్ట్ శంకర్‌కు ట్రాన్స్ఫర్మేషన్ చేయాలని థామస్ సూచిస్తాడు.దీంతో ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం దిగుతుంది. మరో వైపు బిగ్ బుల్ కోసం ఇస్మార్ట్ శంకర్ కూడా వెతుకుతుంటాడు. ఇండియాలో బిగ్ బుల్ దిగాడని రా ఏజెన్సీకి తెలుస్తుంది. ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకుని మెమోరీ ట్రాన్స్ఫర్మేషన్ చేయిస్తాడు బిగ్ బుల్. నాలుగు రోజుల్లోనే ఇస్మార్ట్ శంకర్ కాస్తా బిగ్ బుల్గా మారిపోతాడని చెబుతారు. ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? బిగ్ బుల్‌ను పట్టుకునేందుకు రా ఏం చేస్తుంది? ఈ కథలో ఇస్మార్ట్ శంకర్ ప్రేయసి జన్నత్ (కావ్యా థాపర్) పాత్ర ఏంటి? చివరకు ఇస్మార్ట్ శంకర్ ఏం చేస్తాడు? అన్నది థియేటర్లో చూడాల్సిందే.ఎలా ఉందంటే..డబుల్ ఇస్మార్ట్ కథ, కోర్ పాయింట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అది చాలా సిల్లీగా ఉంటుంది. చిన్నతనంలోనే తన తల్లిని కోల్పోవడం, తల్లిని చంపిన వాడి కోసం ఇస్మార్ట్ శంకర్ ప్రయత్నించడం.. ఇక కథలోకి హీరోయిన్ ఎంట్రీ.. ఆమె వెనకాల హీరో పడటం ఇవన్నీ కూడా చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. మధ్య మధ్యలో బోకా అంటూ అలీ అందరినీ విసిగిస్తాడు. ఏదో అలా తెరపై ఒక సీన్లో కనిపిస్తే జనాలు నవ్వుతారేమో. కానీ పదే పదే చూపించడంతో ప్రేక్షకుడికి సహన పరీక్షలా ఉంటుంది.ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇస్మార్ట్ శంకర్‌ను పట్టుకునేందుకు బిగ్ బుల్ టీం చేసే ప్రయత్నాలతో నిండిపోతుంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథ ఇంట్రెస్టింగ్గా సాగుతుందా? ఏమైనా సీరియస్‌గా ఉంటుందా? అని అనుకుంటే పొరబాటే. సెకండాఫ్‌లో ఎమోషన్ పార్ట్ కూడా వర్కవుట్ అవ్వలేదు. షాక్ కొట్టినట్టు, అపరిచితుడులో విక్రమ్ రోల్స్ మారినట్టుగా.. ఇస్మార్ట్ శంకర్‌లో ఎలా అయితే బ్రెయిన్లో మెమోరీ మారిపోతుందో ఇందులోనూ అలానే అనిపిస్తుంది.ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌లో ప్రగతి నటన చూస్తే అందరికీ నవ్వొస్తుంది. అక్కడ ఎమోషన్ పండాల్సింది పోయి.. అందరూ నవ్వుకునేలా ఉంటుంది. ఇక సినిమా ఎండ్ కార్డ్ పడక ముందే థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చేలా కనిపిస్తోంది. పరమ రొటీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తుంది. పూరి నుంచి ఇక కొత్తదనం, కొత్త కథలు ఆశించడం కూడా తప్పేమో అన్నట్టుగా కనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..రామ్ పోతినేని నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాత్ర ఏదైనా సరే అందులో జీవించేస్తాడు. ఇక పక్కా తెలంగాణ యువకుడు శంకర్‌గా అదరగొట్టేశాడు. తెలంగాణ యాసలో ఆయన చెప్పే డైలాగులు చప్పట్లు కొట్టిస్తాయి. సంజయ్ దత్ ఈ సినిమాకు మరో స్పెషల్ అట్రాక్షన్. విలన్‌గా ఆయన అదరగొట్టేశాడు. రామ్, సంజయ్ మధ్య వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కావ్య థాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో ఆకట్టుకుంది. తెరపై అందంగా కనిపించింది. చాలా కాలం తర్వాత అలీ ఓ మంచి పాత్రలో కనిపించాడు. కానీ ఆయన కామెడీ వర్కౌట్ కాలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలు అంతంత మాత్రమే అయినా.. బీజీఎం మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లు ఉన్నతంగా ఉన్నాయి.-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘మిస్టర్ బచ్చన్’ మూవీ రివ్యూ
టైటిల్: మిస్టర్ బచ్చన్నటినటులు:రవితేజ, భాగ్యశ్రీ బోర్సే, జగపతి బాబు, సత్య, చమ్మక్ చంద్ర, రోహిణి, అన్నపూర్ణ తదితరులునిర్మాణ సంస్థ: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత: టీజీ విశ్వప్రసాద్‌దర్శకత్వం:హరీశ్ శంకర్‌సంగీతం:మిక్కీ జే మేయర్సినిమాటోగ్రఫీ:అయానక బోసేవిడుదల తేది: ఆగస్ట్ 15, 2024కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే...ఓ సూపర్ హిట్ మూవీని రీమేక్ చేయడం ఇప్పుడు కత్తిమీద సాము లాంటిదే. ఓ స్టార్ హీరో ఓ రీమేక్ చేస్తున్నాడంటే చాలు.. అది ఏ భాషా చిత్రమైనా సరే ఓటీటీలో వెతికి మరీ చూసేస్తున్నారు. ఆ తర్వాత రీమేక్ సినిమాను ఒరిజినల్‌తో పోల్చి చూస్తున్నారు. ఏమాత్రం తక్కువగా అనిపించినా విమర్శలు తప్పవు. అయితే డైరెక్టర్ హరీశ్ శంకర్ విషయంలో మాత్రం సినీ ప్రియులకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన నుంచి ఓ రీమేక్ సినిమా వస్తుందంటే..కచ్చితంగా ఒరిజినల్‌కు మించిన చిత్రంగా ఉంటుందని గట్టి నమ్మకం. ఆ నమ్మకానికి కారణం గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ సినిమాలే. ఒరిజినల్‌ను ఉన్నదున్నట్లు తీయకుండా మార్పులు చేర్పులు చేసి.. మసాలా అద్ది సినిమా రూపు రేఖలే మార్చేశాడు. అందుకే ఆ రెండూ సూపర్ హిట్‌గా నిలిచాయి. మిస్టర్ బచ్చన్ విషయంలోనూ హరీశ్ అలానే మార్పులు చేశాడు కానీ.. అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అజయ్ దేవ్‌గణ్ ‘రైడ్’ మూవీ సారాన్ని మాత్రమే తీసుకొని..దాని చుట్టు కామెడీ,రొమాంటిక్ సీన్లు అల్లుకొని మిస్టర్ బచ్చన్‌ని తెరకెక్కించాడు. అయితే ఫన్ కోసం యాడ్ చేసిన కొన్ని సీన్లు నవ్వించకపోగా..అక్కడ అవసరమా అన్నట్లుగా కథనం సాగుతుంది. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ ఎపిసోడ్, చమ్మక్ చంద్రతో వచ్చే సీన్లు.. ‘ఓహో..మనం ఇక్కడ నవ్వాలేమో..’ అని అనిపిస్తుంది. సినిమా మొత్తంగా చూస్తే..లవ్..కామెడీ..యాక్షన్ అన్నీ సమపాళ్లల్లో ఉంటాయి. అయితే అవి కథకు అనుగుణంగా కాకుండా..ఇరికించినట్లుగా అనిపిస్తుంది. అయితే బోర్ కొడుతున్నట్లుగా అనిపించిన ప్రతిసారి భాగ్యశ్రీని తెరపై చూపించి.. ప్రేక్షకుల మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో మాత్రం హరీశ్ సక్సెస్ అయ్యాడు. భాగ్యశ్రీ అందాలను తెరపై ఎంతవరకు చూపించాలో..ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారో అలానే చూపించాడు. ఇక తన గత సినిమాల మాదిరే పాటల విషయంలో తన మార్క్‌ని చూపించాడు. మిక్కీ జే మేమయర్ నుంచి మంచి సంగీతాన్ని రాబట్టుకున్నాడు. ఓ భారీ యాక్షన్ సీన్‌తో కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే కామెడీ జోన్లోకి వెళ్తుంది. రవితేజ పాత్రకు బచ్చన్ అనే పేరు పెట్టడం వెనుక ఉన్న స్టోరీ, జిక్కీతో ప్రేమాయణం..రొమాంటికి పాటలు..సత్య కామెడీతో ఫస్టాఫ్ సరద సరదాగా సాగిపోతుంది. ఇక ఇంటర్వెల్ సీన్‌తో అసలు కథ ప్రారంభం అవుతుంది. ఇక సెకండాఫ్ మొత్తం విలన్ ఇంట్లో హీరో చేసే రైడ్ చుట్టే కథనం సాగుతుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేసే తనిఖీలు కానీ.. ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అన్నీ సినిమాటిక్‌గానే ఉంటాయి తప్పితే...ఎక్కడా వాస్తవికానికి దగ్గరగా అనిపించవు. పోనీ కామెడీ అయినా వర్కౌట్ అయిందా అంటే..ఆ సీన్లు మరింత బోర్ కొట్టిస్తూ సాగదీతగా అనిపిస్తాయి. సినిమా ప్రారంభంలో జగపతి బాబుకి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చి..మధ్యలో కమెడియన్‌కి ఎక్కువ..విలన్‌కి తక్కువ అన్నట్లుగా చూపించారు. విలనిజాన్ని పండించడంలో శంకర్ పూర్తిగా విఫలం అయ్యాడు. జగపతి బాబు పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. క్లైమాక్స్ కూడా రొటీన్‌గా ఉంటుంది. అయితే రైడ్ మూవీ చూడని వాళ్లకు, లాజిక్కులను పట్టించుకొని బీ, సీ సెంటర్ల ఆడియన్స్ మాత్రం మిస్టర్ బచ్చన్ అలరించే అవకాశం ఉంది. ఎవరెలా చేశారంటే.. మిస్టర్ బచ్చన్ పాత్రలో రవితేజ జీవించేశాడు. తెరపై వింటేజ్ రవితేజను చూస్తారు. యాక్షన్‌తో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. సినిమా ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తాడు. ఇక భాగ్యశ్రీ బోర్సే సినిమాకు స్పెషల్ అట్రాక్షన్. జీక్కీ పాత్రలో ఒదిగిపోయింది. తెరపై అందాలను ప్రదర్శించడమే కాదు..చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. డ్యాన్స్ ఇరగదీసీంది. హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. విలన్‌గా జగపతి బాబు బాగానే నటించాడు. అయితే ఆయన పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. సత్య తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక స్పెషల్ రోల్లో మెరిసిన సిద్ధు జొన్నలగడ్డ తనదైన స్టైల్లో యాక్షన్ సీన్ అదరగొట్టేశాడు. తనికెళ్ల భరణి, సచిన్ ఖేదేకర్, అన్నపూర్ణమ్మ, చమ్మక్ చంద్రతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. ఇప్పటికే పాటలు సూపర్ హిట్ అయ్యాయి. అవి తెరపై మరింత ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. బీజీఎం బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. హీరోహీరోయిన్లను తెరపై అందంగా చూపించడమే కాకుండా..ప్రతీఫేమ్ చాలా రిచ్‌గా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
100 'కేజీఎఫ్'లు కలిపి తీస్తే ఈ సినిమా.. ఓటీటీలోనే బెస్ట్ యాక్షన్ మూవీ
కొన్ని సినిమాలు క్లాసిక్స్. వీటిని మ్యాచ్ చేయడం సంగతి అటుంచితే.. ఇలాంటివి మళ్లీ తీయడం ఎవరి వల్ల కాదు. ఇప్పుడంటే మన ప్రేక్షకులు 'బాహుబలి', 'కేజీఎఫ్' అని మురిసిపోతున్నారు. కానీ వీటికి బాబులాంటి మూవీ హాలీవుడ్లో దాదాపు 20 ఏళ్ల క్రితమే వచ్చింది. అదే 'అపోకలిప్టో' (2006). శతాబ్దాల క్రితం కథతో మొత్తం అడవిలో తీసిన ఈ సినిమా చూస్తుంటే ఒక్కో సీన్ దెబ్బకు మన మైండ్ బ్లాస్ట్ అయిపోవడం గ్యారంటీ. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఎలా ఉందనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం!కథేంటి?ఉత్తర అమెరికాలోని మెసో అమెరికన్ అడవులు. మాయన్ తెగకు చెందిన జాగ్వర్ పా.. ఓ రోజు వేటకు వెళ్తాడు. దొరికిన మాంసంతో రాత్రి విందు చేసుకుని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వేడుక చేసుకుంటాడు. మరుసటి రోజు ఉదయం వీళ్లపై వేరే తెగకు చెందిన కొందరు దాడి చేస్తారు. ముందే పసిగట్టిన జాగ్వర్ పా.. తన భార్య, కొడుకుల్ని ఓ బావిలో సురక్షితంగా దాచేస్తాడు. దాడి చేసిన వాళ్లు కొందరిని అతి కృూరంగా చంపేసి జాగ్వర్ పాతో పాటు మిగిలిన ఆడవాళ్లు-మగవాళ్లని బానిసలుగా చేసుకుని తమ రాజ్యంలో బలిచ్చేందుకు తీసుకెళ్తారు. ఇంతకీ జాగ్వర్ పా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌పై దాడి చేసిందెవరు? చివరకు పా తన భార్య-కొడుకుని కలుసుకున్నాడా? అనేదే స్టోరీ.ఎలా ఉందంటే?ఉత్తర అమెరికాలో శతాబ్దాల క్రితం అంతరించిపోయిన మాయన్ నాగరికత ఆధారంగా 'అపోకలిప్టో' సినిమా తీశారు. ఇప్పటివరకు వచ్చిన యాక్షన్ మూవీస్‌లో ఇది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఎందుకంటే ఎప్పుడో అంతరించిపోయిన మాయన్ తెగ, నాగరికతని స్టోరీగా ఎంచుకోవడమే పెద్ద సాహసం అనుకుంటే.. అసాధారణ రీతిలో తెరపై చూపించిన విధానం అయితే నెక్స్ట్ లెవల్ ఉంటుంది. పేరుకే హాలీవుడ్ సినిమా గానీ ఒక్క ఇంగ్లీష్ పదం కూడా వినిపించదు. పాత్రలన్నీ మాయన్ భాషలోనే మాట్లాడుతుంటాయి.ప్రధాన పాత్రల భాష, గెటప్, ఆహారపు అలవాట్లు, నిర్మాణాలు, సంస్కృతి.. ఇలా ప్రతి విషయాన్ని ఎంతో డీటైల్డ్‌గా పరిశీలించి ఈ సినిమాలో చూపించారు. సినిమా మొదలైన కాసేపటికే ప్రధాన కథానాయకుడు జాగ్వర్ పా ఉంటున్న చోటపై మరో తెగ దాడి చేయడంతో అసలు కథలోకి దర్శకుడు తీసుకెళ్లిపోయాడు. అక్కడి నుంచి ఒక్కో సీన్ అద్భుతం అనేలా ఉంటుంది. ఇక సెకండాఫ్‌లో హీరో.. విలన్ చోటు నుంచి తప్పించుకుని పరుగెడతాడు. అతడు ఎంత స్పీడుగా రన్నింగ్ చేస్తాడో.. సినిమా కూడా అంతకంటే స్పీడుగా వెళ్తుంది. చూస్తున్న మనకు కూడా ఊపిరి ఆగిపోతుందేమో అనేలా సీన్లు ఉంటాయి.దర్శకుడు మెల్ గిబ్సన్ తన మాయాజాలంతో తీసిన 'అపోకలిప్టో'.. ఇప్పటి జనరేషన్ డైరెక్టర్లకు ఓ టెక్స్ట్ బుక్ లాంటిది అని చెప్పొచ్చు. మన దగ్గర వస్తున్న 'బాహుబలి', 'కేజీఎఫ్' సినిమాలు.. దీని దరిదాపుల్లోకి కూడా రావు. ఇంతలా హైప్ ఇస్తున్నానంటే మూవీ ఎలా ఉంటుందే మీకే అర్థమైపోతుంది. అప్పటి కథ కాబట్టి మహిళా పాత్రల శరీరం కాస్త కనిపిస్తుంటుంది. కాబట్టి కుదిరితే ఒంటరిగానే చూడండి. ఓటీటీలోనే ఏదైనా మంచి యాక్షన్ మూవీ చూద్దామనుకుంటే ఇది బెస్ట్ ఆప్షన్.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ రివ్యూ
టైటిల్: కమిటీ కుర్రోళ్లునటీనటులు: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు,త్రినాద్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, సాయి కుమార్, గోపరాజు రమణ, బలగం జయరాం తదితరులునిర్మాణ సంస్థలు: పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్నిర్మాత:నిహారిక కొణిదెలదర్శకత్వం: యదు వంశీసంగీతం: అనుదీప్ దేవ్సినిమాటోగ్రఫీ: రాజు ఎడురోలువిడుదల తేది: ఆగస్ట్ 9, 2024మెగా డాటర్ నిహారికగా నిర్మించిన తొలి సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. ట్రైలర్ రిలీజ్ వరకు ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత సినిమాపై బజ్ ఏర్పడింది. దానికి తోడు చిరంజీవితో సహా మెగా హీరోలంతా ప్రమోట్ చేయడంతో ‘కమిటీ కుర్రోళ్లు’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య నేడు(ఆగస్ట్ 09) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..గోదావరి జిలాల్లోని పురుషోత్తంపల్లె అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ గ్రామంలో 12 ఏళ్లకు ఒక్కసారి భరింకాళమ్మతల్లి జాతర జరుగుతుంది. అయితే ఈ సారి ఊరి సర్పంచ్ ఎన్నికలకు పది రోజుల ముందు ఈ జాతర జరగాల్సి ఉంటుంది. ఈసారి ఎన్నికల్లో ఆ ఊరికి చెందిన యువకుడు శివ(సందీప్ సరోజ్).. ప్రస్తుత సర్పంచ్ పోలిశెట్టి బుజ్జి (సాయి కుమార్)పై పోటీకి నిలడేందుకు ముందుకు వస్తాడు. గత జాతర సమయంలో ‘కమిటీ కుర్రోళ్లు’(11 మంది) కారణంగా ఊర్లో జరిగిన గొడవలను దృష్టిలో పెట్టుకొని, ఈ సారి జాతర జరిగేంతవరకు ఎన్నికల ప్రచారం చేయ్యొద్దని ఊరి పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది?. 12 ఏళ్ల క్రితం ఊర్లో జరిగిన గొడవ ఏంటి? కమిటీ కుర్రోళ్లలో ఒకడైన ఆత్రం అలియాస్ నరసింహా ఎలా చనిపోయాడు? ఈ సారి జాతర ఎలా జరిగింది? విడిపోయిన కమిటీ కుర్రోళ్లు మళ్లి ఎలా కలిశారు? చివరకు ఎన్నికల్లో ఎవరు గెలిచారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే.. బాల్యం.. ప్రతి ఒక్కరికి ఓ మధుర జ్ఞాపకం. మనం ఎంత ఎదిగినా.. ఎంత దూరంలో ఉన్నా మన మనసుకి హత్తుకుని ఉండే గురుతులన్నీ బాల్యంతోనే ముడిపడి ఉంటాయి. కమిటీ కుర్రోళ్లు సినిమా చూస్తున్నంత సేపు 90ల తరానికి చెందిన వారంతా తమ బాల్యంలోకి తొంగి చూస్తారు. ఆ రోజులు వస్తే బాగుండని ఆశ పడతారు. మనల్నీ బాల్యంలోకి తీసుకెళ్లడంతో డైరెక్టర్ యదు వంశీ సక్సెస్ అయ్యారు. కానీ కథనాన్ని ఆసక్తికరంగా నడపడంతో తడబడ్డాడు. సినిమా ప్రారంభం బాగుంటుంది. అప్పట్లో గ్రామల్లోని పిల్లల మధ్య స్నేహం ఎలా ఉండేది.. కులం, మతం అనే తేడా లేకుండా ఎలా కలిసిమెలిసి ఉండేవాళ్లు.. అప్పటి ఆటలు.. చిలిపి చేష్టలు అవన్నీ తెరపై చూస్తుంటే నైంటీస్ కిడ్స్ అంతా ఆయా పాత్రల్లో తమను తాము ఊహించుకుంటారు. ఇంటర్వెల్ వరకు కథనం చాలా వినోదాత్మకంగా సాగుతూ.. రియాల్టీకి దగ్గరగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ సీన్ హృదయాలను బరువెక్కిస్తుంది. అయితే ఆ ఎమోషన్ని అదే స్థాయిలో ద్వితియార్థంలో కొనసాగించలేకపోయాడు. ఫస్టాఫ్‌లో టచ్ చేసిన రిజర్వేన్ల అంశానికి సరైన ముగింపు ఇవ్వలేదు. దాన్ని పక్కన పెట్టేసి ఆత్రం చావు సీన్‌ని ఎమోషనల్‌గా మలిచి కన్నీళ్లను తెప్పించాడు. ఆ తర్వాత కథనం సాగదీతగా అనిపిస్తుంది. జాతర సీన్‌ని ఆసక్తికరంగా మలచలేకపోయాడు. ఎన్నికల ఎపిసోడ్‌తో పాటు క్లైమాక్స్ సింపుల్‌గా ఉంటుంది. సెకండాఫ్‌ని ఇంకాస్త ఆసక్తికరంగా మలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో నటించిన 11 మంది హీరోలతో పాటు చాలా ప్రధాన పాత్రల్లో నటించిన వారంతా కొత్తవాళ్లే. అయినా కూడా చాలా నేచురల్‌గా నటించారు. శివగా సందీప్ సరోజ్ , సూర్యగా యశ్వంత్ పెండ్యాలా, విలియంగా ఈశ్వర్ రచిరాజు,ఇలా ప్రతి ఒక్కరు తమతమ పాత్రల్లో జీవించేశారు. పెద్దోడిగా నటించిన ప్రసాద్ బెహరా.. ఎంత నవ్విస్తాడో..కొన్ని చోట్ల అంతే ఏడిపిస్తాడు. ఇక సీనియర్ నటులైన సాయి కుమార్, గోపరాజు రమణ రోటీన్ పాత్రల్లో మెరిశారు. సత్తయ్యగా నటించిన కంచెరాపాలెం కిశోర్..కొన్ని చోట్ల తనదైన నటనతో ఎమోషనల్‌కు గురి చేస్తాడు. సాంకేతికంగా ఈ సినిమా బాగుంది. అనుదీప్ దేవ్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలం. పాటలు కథలో భాగంగా సాగుతూ.. వినసొంపుగా ఉంటాయి. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. గోదావరి అందాలను తెరపై చక్కగా చూపించాడు. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -రేటింగ్: 2.75/5-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
'సింబా' సినిమా రివ్యూ.. థ్రిల్లింగ్ చేస్తుందా..?
టైటిల్: సింబా నటీనటులు: జగపతిబాబు, అనసూయ, శ్రీనాథ్ మాగంటి, కబీర్‌సింగ్ తదితరులు నిర్మాతలు: సంపత్ నంది, రాజేందర్ దర్శకత్వం: మురళీ మనోహర్ రెడ్డి విడుదల తేది: ఆగస్ట్ 9, 2024కథేంటంటే.. ?హైదరాబాద్ నగరంలో ఓ దారణ హత్య జరుగుతుంది. చనిపోయిన వ్యక్తి ప్రముఖ వ్యాపారవేత్త పార్థ(కబీర్ సింగ్) సన్నిహితుడు కావడంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు. విచారణ కోసం పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ) నగరానికి వస్తాడు. ఈ క్రమంలో మరో హత్య కూడా అలానే జరుగుతుంది. ఈ రెండు హత్యల వెనుక స్కూల్ టీచర్ అనుముల అక్షిక(అనసూయ), ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఫాజిల్(శీనాథ్ మాగంటి) ఉన్నారని తెలిసి వారిద్దరిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టుకి తరలించే క్రమంలో హత్య చేయాలని పార్థ ప్లాన్ వేస్తాడు. అయితే వీరిద్దరు కలిసి తమను చంపాడానికి వచ్చిన వ్యక్తిని పోలీసుల ముందే చంపేస్తారు.ఈ హత్యలో డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) భాగస్వామి అవుతాడు. అసలు ఎలాంటి సంబంధంలే లేని ఈ ముగ్గురు ఎందుకు పార్థ మనుషులను చంపుతున్నారు? బొద్దింకను కూడా చంపడానికి ఇష్టపడని అక్షిక..దారుణ హత్యలు ఎలా చేసింది? పురుషోత్తమ్ రెడ్డి అలియాస్ సింబా(జగపతి బాబు) ఎవరు? ఆయనకు ఈ ముగ్గురికి మధ్య ఉన్న సంబంధం ఏంటి? పార్థకి, పురుషోత్తమ్ రెడ్డి మధ్య ఉన్న వైరం ఏంటి? పోలీసాఫీసర్ అనురాగ్ ఈ కేసును ఎలా సాల్వ్ చేశారు? అనేది తెరపై చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఇదొక రివేంజ్ డ్రామా.. బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్‌ని టాలీవుడ్‌కు డైరెక్టర్ పరిచయం చేశారు. ఓటీటీలు వచ్చాక ఇతర భాషలలో వచ్చే థ్రిల్లర్ సినిమాలను కూడా తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు. అయితే, ఇందులో వాటన్నింటికి భిన్నంగా ఆసక్తి రేకెత్తించేలా సినిమా ఉంటుంది. భవిష్యత్ సమాజం కోసం పర్యావరణ పరిరక్షణ అత్యవసరం. ఈ అంశాన్ని ఇందులో చూపించిన తీరుని డైరెక్టర్ మురళీ మనోహర్‌రెడ్డిని మెచ్చుకోవాల్సిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా పస్టాప్‌లోనే కథను ప్రేక్షకుడు అర్థం చేసుకుంటాడు. దాదాపు చాలా సీన్స్ ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే కనిపిస్తూ ఉంటాయి. వరుసగా హత్యలు జరుగుతున్న తీరును ఆసక్తిగా చూపించిన దర్శకుడు.. ఈ హత్యల వెనక ఎవరుంటారో అనేది చెప్పడంలో కాస్త విఫలం అయ్యాడు అనిపిస్తుంది.అలా వరుస హత్యలతో పస్టాఫ్ ముగుస్తుంది. సెకండాఫ్ మాత్రం కాస్త సాగదీతగా అనిపిస్తుంది. వరుస హత్యలు జరుగుతున్న క్రమంలో పోలీసుల ఇన్వెస్టిగేషన్ సిల్లీగా అనిపిస్తుంది. ఈ హత్యల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు అని ఆసక్తిగా చెప్పడం లో కాస్త విఫలం అయ్యాడు. ఫోన్ కాల్ లిస్ట్‌తోనే హంతకులను పట్టుకున్న తీరు ఏమాత్రం మెప్పించదు. సెకడాఫ్‌లో క బయాలాజికల్ మెమరీ అంశం అనేది తెరపైకి వస్తుంది. ఈ కాన్సెప్ట్ చాలా సినిమాల్లో చూసిందే. పురుషోత్తమ్ రెడ్డి (జగపతిబాబు ) కథ ఇక్కడే మొదలౌతుంది. సినిమాలో ఆయన పాత్రని చివరి వరకూ పెద్దగా ప్రభావం లేకుండా కథ నడపం కాస్త మైనస్ అనిపిస్తుంది. కథ సాధారణమై అయినా.. దర్శకుడు చూపించిన తీరు థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది.ఎవరెలా చేశారంటే..ముందుగా సింబా దర్శకుడు మురళీ మనోహర్‌రెడ్డిని మెచ్చుకోవాలి. ఉన్నంతలో బాగానే తీశాడు. జగపతిబాబు, అనసూయ లాంటి స్టార్స్‌ను పాత్రల మేరకు బాగానే ఉపయోగించుకున్నాడు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా వశిష్ఠ సింహా కీలక పాత్రలో కనిపిస్తారు. కథ చివర్లో ఆయన నటించిన తీరు మెప్పిస్తుంది. ఇందులో విలన్ పాత్రలో కనిపించిన కబీర్ పెద్దగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. బడ్జెట్ మేరకు సినిమా మించే ఉందని చెప్పవచ్చు. ఫైనల్‌గా అందరికీ మంచి సందేశాన్ని ఇచ్చే సింబా మెప్పిస్తాడు. -
I.S.S Review: అంతరిక్షంలో యుద్ధం.. ఈ ఊహే థ్రిల్లింగ్!
ఊహకు రెక్కలొస్తే కాదేదీ కథకు అనర్హం అన్న నానుడి సరిగ్గా ఈ సినిమాకి సరిపోతుంది. మరి రచయిత అంత వైవిధ్యంతో ఆలోచించాడు. సినిమా పేరు ఐఎస్ ఎస్, అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నమాట. ఇది చదవగానే ఇంకేముంది అంతరిక్ష ప్రయాణంతో ముడిపడిన కథ అని అనుకుంటారు. అలా అయితే రచయిత గురించి ఊసెందుకు. అసలా రచయిత ఊహ నిజంగా జరిగితే... ఆ ఆలోచనకే ఒకింత గగుర్పాటు వస్తుంది. ఈ సినిమా రచయిత నిక్ షఫీర్. దర్శకులు గేబ్రియలా. ఇక కథ విషయానికి వద్దాం. అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్ అమెరికా మరియు రష్యా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తుంటాయి. ఐఎస్ ఎస్ సినిమా ప్రారంభం కాగానే స్పేస్ స్టేషన్ లో అమెరికా వ్యోమగాములు రష్యా వ్యోమగాములకు స్వాగతం పలుకుతుంటారు. అందరూ ఆనందంగా స్పేస్ స్టేషన్ లో కలుస్తారు. ఇంతలో ఓ అమెరికా వ్యోమగామి భూమి వైపు చూసి మిగతా వారినందరినీ అలర్ట్ చేస్తుంది. భూమి మీద భయంకరమైన విస్ఫోటనాలు జరుగుతుంటాయి. వీరికి అర్ధం కాక భూమిని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొంత సమయం తరువాత భూమి పై అణు యుద్ధం ప్రారంభమైందని స్పేస్ స్టేషన్ తమ ఆధీనం చేసుకోవాలని వారి వారి దేశం వాళ్ళకు వర్తమానం పంపుతారు.ఉందేది అంతరిక్షలో, అదీ రెండు దేశాలకు సంబంధించి వ్యోమగాములు ఒకే స్పేస్ స్టేషన్ లో. భూమి మీద యుద్ధం. ఇదే యుద్ధం అప్పటి నుండి స్పేస్ స్టేషన్ లో కూడా ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో కుట్రలేంటి, ఎవరి మీద ఎవరు గెలిచారు, ఆఖరికి స్పేస్ స్టేషన్ ఎవరు చేజిక్కించుకున్నారు అన్నది ఐఎస్ ఎస్ సినిమాలో చూడాల్సిందే. దర్శకుడు లాగ్ లేకుండా పాయింట్ ని మంచి స్క్రీన్ ప్లే తో థ్రిల్లింగ్ గా చిత్రీకరించారు. ఐఎస్ ఎస్ సినిమా మంచి వీకెండ్ మూవీ. ఈ సినిమా జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫాం వేదికగా స్ట్రీం అవుతోంది.- ఇంటూరు హరికృష్ణ -
'ప్యారడైజ్' సినిమా రివ్యూ (ఓటీటీ)
ప్రైవసీ కోసమో, అడ్వెంచర్ చేయాలనో.. ప్రశాంతంగా ఉండే ప్రదేశాలకు ఒంటరిగా లేదంటే జంటగా వెళ్లే ప్లాన్‌లో ఉన్నారా? అయితే మీరు ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. ఎందుకంటే ఆహ్లాదం వెనుకే కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు, అనుకోని సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఓ కథతో తీసిన మలయాళ సినిమానే 'ప్యారడైజ్'. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం!కథేంటి?అది 2022 జూన్. దేశం దివాళా తీయడంతో శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఇదే టైంలో ఇండియా నుంచి కేశవ్ (రోషన్ మాథ్యూస్), అమృత (దర్శన రాజేంద్రన్) అనే జంట శ్రీలంకకి విహారయాత్రకి వస్తారు. ప్రైవసీ కోసం ఓ మారుమూల పల్లెటూరిలోని కాటేజీలో దిగుతారు. ఓ రోజు దుండగులు వీళ్ల గదిలోకి వచ్చిన ల్యాప్ ట్యాప్, ఫోన్స్ ఎత్తుకెళ్లిపోతారు. దీంతో కేశవ్-అమృత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?'ప్యారడైజ్' అంటే స్వర్గం అని అర్థం. శ్రీలంకని చాలామంది భూతల స్వర్గం అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడి లొకేషన్స్ అంత అద్భుతంగా ఉంటాయి. ఇక్కడి ప్రకృతి అందాల్ని చూసేందుకు విదేశీ టూరిస్టులు చాలామంది వస్తూనే ఉంటారు. అలా శ్రీలంకలో 2022లో అల్లరు జరుగుతున్న టైంలో అక్కడికి వెళ్లిన భారతీయ జంట ఎలాంటి అనుభవాల్ని ఎదుర్కొంది అనే కాన్సెప్ట్‌తో తీసిన థ్రిల్లర్ డ్రామా మూవీ 'ప్యారడైజ్'.చాలామంది ప్రైవసీ కోసమో లేదంటే అడ్వంచర్ చేద్దామనో శ్రీలంక లాంటి చోట్లకు వెళ్తుంటారు. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు దొంగతనం, ఇంకేదైనా జరగొచ్చేమో అనే ఓ భయం ఈ సినిమా చూసిన తర్వాత కలుగుతుంది. అలానే శ్రీలంకలో టూరిస్టులని అటు జనాలు కావొచ్చు, ఇటు పోలీసులు కావొచ్చు ఎంతలా గౌరవిస్తారనేది కూడా చాలా చక్కగా చూపించారు. సినిమాలో శ్రీలంక అందాల్ని చాలా బ్యూటీఫుల్ గా క్యాప్చర్ చేశారు.ఓ వైపు నెక్స్ట్ ఏం జరుగుతుందోనని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ థ్రిల్లర్, డ్రామా చూపిస్తూనే మరోవైపు రాముడు, రావణుడు, సీతతో పాటు రామాయణానికి సంబంధించిన కొన్ని సీన్స్ బాగుంటాయి. స్టోరీ పరంగా సింపుల్ లైన్ అయినప్పటికీ.. కొన్ని సీన్లు సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక యాక్టర్స్ ఫెర్ఫార్మెన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. లీడ్ రోల్స్ చేసిన రోషన్ మాథ్యూ, దర్శన రాజేంద్రన్ చాలా నేచురల్‌గా యాక్ట్ చేశారు. మిగిలిన వాళ్లందరూ లోకల్ యాక్టర్స్. ఉన్నవి కొన్ని పాత్రలే అయినా సరే జీవించేశారు.కేవలం గంటన్నర నిడివి మాత్రమే ఉన్న ఈ సినిమా.. ఓ డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది. అలానే లోన్లీగా ఉండే ప్రదేశాలకు వెళ్దామనుకునేవాళ్లు ఈ సినిమా చూస్తే మాత్రం కొంపదీసి సినిమాలో చూపించినట్లు జరిగితే అంతే ఇక అని భయపడేలా చేస్తుంది. రెగ్యులర్ రొటీన్ మూవీస్ కాకుండా కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనుకుంటే దీన్ని చూడండి.-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్<br>Powered by <a href="https://youtubeembedcode.com">how to embed a youtube video</a> and <a href="https://howtostopgamstop.com/">how to get around gamstop</a> -
Buddy Movie Review: అల్లు శిరీష్ 'బడ్డీ' సినిమా రివ్యూ
టైటిల్: బడ్డీనటీనటులు: అల్లు శిరీష్, గాయత్రీ భరద్వాజ్, అజ్మల్ తదితరులుదర్శకత్వం: శామ్ ఆంటోన్ నిర్మాతలు: కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజాసంగీతం : హిప్ హాప్ తమిళవిడుదల తేది: 02-08-2024టాలీవుడ్ యాక్టర్ అల్లు శిరీష్ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ చిత్రం ' బడ్డీ'. 2022లో ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో పలకరించిన శిరీష్ సుమారు రెండేళ్ల తర్వాత వెండితెరపై మెరిశాడు. అయితే, ఈసారి రీమేక్ సినిమాతో వచ్చాడు. తమిళ్లో ఆర్య నటించిన టెడ్డీకి రీమేక్‌గా వచ్చిన ఈ చిత్రానికి సామ్ ఆంటోన్ దర్శకత్వం వహించాడు. గాయత్రి భరద్వాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. థియేటర్లో సందడి చేస్తున్న ఈ బడ్డీ సక్సెస్ అయ్యాడా..? అల్లు శిరీష్ సినీ ప్రియుల్ని ఏ మేరకు అలరించాడో తెలుసుకుందాం.కథ...ఆదిత్య (అల్లు శిరీష్) ఓ పైలట్. విధి నిర్వహణలో భాగంగా తరచూ ఎయిర్ కంట్రోల్ రూమ్ లో పనిచేస్తున్న పల్లవి ( గాయత్రి భరద్వాజ్)తో మాట్లాడతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు నేరుగా కలుసుకోలేకపోయినా పరిచయంతోనే ప్రేమలో పడతారు. అయితే ఓసారి పల్లవి చేసిన తప్పిదంతో ఆదిత్య సస్పెండ్‌కు గురవుతాడు. తన కారణంగానే ఆదిత్య ఉద్యోగాన్ని కోల్పోయాడని భావించిన పల్లవి.. అతన్ని నేరుగా కలిసి క్షమాపణ చెప్పాలనుకుంటుంది. అతని కలిసేందుకు వెళుతున్న క్రమంలో పల్లవి కిడ్నాప్ అవుతుంది. గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి కోమాల్లోకి వెళ్లేలా చేస్తారు. అసలు పల్లవిని కిడ్నాప్ చేసింది ఎవరు? ఎందుకు చేశారు? కోమాలోకి వెళ్ళిన పల్లవి ఆత్మ టెడ్డిబేరులోకి ఎలా చేరుతుంది? పల్లవి కిడ్నాప్‌కి.. హాంగ్ కాంగ్లో ఉన్న డాక్టర్ అర్జున్ (అజ్మల్ అమీర్)కి ఉన్న సంబంధం ఏంటి? టెడ్డీబేర్‌లో ఆత్మ ఉందని తెలిసిన తర్వాత ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చివరకు పల్లవిని ఎలా రక్షించాడా..? లేదా..? అనేదే మిగతా కథఎలా ఉందంటే..?అవయవాల అక్రమ రవాణా ముఠా నేపథ్యంతో టాలీవుడ్లో చాలా సినిమాలు వచ్చాయి. బడ్డీ సినిమా నేపథ్యం కూడా అదే. అయితే ఓ బొమ్మకు ప్రాణం రావడం అనే పాయింట్ కొత్తగా త్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. వాస్తవానికి ఇది తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన టెడ్డీకి తెలుగు రీమేక్. అయితే బొమ్మలోకి ఆత్మ రావడం అనే ఒక పాయింట్ మాత్రమే ఆ సినిమా నుంచి తీసుకొని మిగతాదంతా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా మార్చి తెరకెక్కించాడు. దర్శకుడు మార్చిన అంశాలు బాగున్నప్పటికీ వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించడంలో తడబడ్డాడు.అవయవాల అక్రమ కార్యకలాపాలు సాగించే డాక్టర్ అర్జున్ నేపథ్యాన్ని పరిచయం చేస్తూ కథను ప్రారంభించాడు. ఆపై వెంటనే పల్లవి (గాయత్రి భరద్వాజ్) కోమాలోకి వెళ్లడం.. అనంతరం ఆమె జీవితంలోకి టెడ్డీబేర్ రావడం వంటి సీన్లు మెప్పిస్తాయి. అయితే, టెడ్డీ బేర్‌కు ప్రాణం వచ్చి రోడ్ మీద తిరుగుతుంటే ఎవరైనా సరే ఆశ్చర్యపోతారు లేదా భయపడుతారు. కానీ, ఇందులో అలాంటివి ఏవీ జరగవు. పైగా సెల్పీలు దిగేందుకు పోటీ పడుతుంటారు. అది ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాదు. అయితే చిన్ని పిల్లలకు కాస్త ఆసక్తిని కలిగించవచ్చు.సెకండాఫ్‌లో కథ అంతా హాంకాంగ్‌కు షిఫ్ట్ అయిపోతుంది. పల్లవి కోసం వెతుక్కుంటూ అల్లు శిరీష్ అక్కడికి చేరుకుంటాడు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వచ్చే యాక్షన్ సీన్ పర్వాలేదనిపిస్తుంది. మిషన్ గన్ తో టెడ్డీబేర్ చేసే యాక్షన్ సీన్ నవ్వులు పూస్తాయి. ఫ్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథ సాగదీతిగా అనిపిస్తుంది.ఎవరెలా చేశారంటే..పైలట్ ఆదిత్య పాత్రలో అల్లు శిరీష్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ అదరగొట్టేశారు. పల్లవిగా గాయత్రి భరద్వాజ్ చక్కగా నటించింది. సినిమాలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువ. విలన్‌గా అజ్మల్ ఎంట్రీ పవర్ ఫుల్‌గా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత సింపుల్‌గా అనిపిస్తుంది. ప్రిషా సింగ్ అలీ, ముకేష్ రిషితో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా బాగుంది. హిప్ హాప్ తమిళ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. -
Brinda Web Series Review: 'బృంద' వెబ్ సిరీస్ రివ్యూ
వెబ్‌సిరీస్: బృందవిడుదల: ఆగష్టు 2 నటీనటులు: త్రిష, ఇంద్రజీత్ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్సామి రచన, దర్శకత్వం: సూర్య మనోజ్ వంగల ఓటీటీ స్ట్రీమింగ్ : సోనీ లివ్జానర్: క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ఎపిసోడ్స్: 8స్ట్రీమింగ్ భాషలు: తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లాసౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా త్రిష కొనసాగుతోంది. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వెండితెరపై దూసుకుపోతుంది. గ్లామరస్ రోల్స్‌తో పాటు నటనకు అవకాశమున్న సినిమాలతో తనేంటో సత్తా చాటుతుంది. ఇండస్ట్రీలో సుమారు 25 ఏళ్లుగా పైగా రాణించిన త్రిష.. తొలిసారి బృంద అనే ఓ వెబ్‌సిరీస్‌లో నటించింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ, బంగ్లా భాషల్లో కూడా ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతుంది. తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన త్రిష.. బృందతో మెప్పించిందా..? అనేది తెలియాలంటే ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‌లో ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.కథకథ పరంగా ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేక్షకులకు తప్పకుండా క్రైమ్ థ్రిల్లర్‌ను అందిస్తుంది. ఇందులో దర్శకుడు సూర్య మనోజ్ విజయం సాధించారని చెప్పవచ్చు. సిరీస్ ప్రారంభంలోనే వీక్షకులను చూపు తిప్పుకోలేని పాయింట్‌తో కథ ప్రారంభం అవుతుంది. త్రిష చిన్నతనం ఎపిసోడ్స్‌తో మొదలైన స్టోరీ ఆమె పెద్ద అయ్యాక ఓ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా ఉద్యోగంలో చేరుతుంది. మహిళ అనే భావనతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. అంతే కాకుండా అప్పటికే అక్కడ పనిచేస్తున్న సీఐ సాల్మన్‌తో పాటు మిగిలిన సిబ్బందికి బృంద పనితీరు పట్ల అంతగా నమ్మకం ఉండదు. ఆమెను ఆఫీస్‌కే పరిమితం చేస్తారు. సరిగ్గా అలాంటి సమయంలో ఓ రోజు పోలీసులకు గుర్తు తెలియని మృతదేహం దొరుకుతుంది. గుండెల్లో సుమారు 16సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తేలుతుంది. దీంతో ఈ కేసును వదిలేయండి అంటూ ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చూపుతారు. అయితే, ఈ కేసును పట్టుబట్టి బృంద ఇన్వెస్టిగేషన్ చేయడం. అదే తరహాలో మొత్తం 16మంది అతి దారుణంగా చంపబడ్డారని ట్విస్ట్ రివీల్ అవుతుంది. దీంతో అధికారులు అందరూ షాక్ అవుతారు. అప్పుడు ఒక సిట్ ఏర్పాటు చేసి కేసును పూర్తి చేయాలని అధికారులు ఆదేశిస్తారు. ఈ టీమ్ సాయంతో సీరియల్ కిల్లర్‌ను బృంద ఎలా పట్టుకుంది అనేది కథ. త్రిష గతం ఏంటి.. ఏం జరిగింది..? త్రిష చిన్నతనంలో జరిగిన మూఢ నమ్మకాల హత్యలకు వీటికి ఉన్న లింకేంటి..? చిన్న తనంలో తప్పిపోయిన తన అన్నయ్యను త్రిష కులుసుకుందా..? వీటితో పాటు హత్యల వెనుక ఉన్నదెవరు..? అసలు సీరియల్ కిల్లర్‌గా మారడం వెనుకున్న స్టోరీ ఏంటి..? తెలుసుకోవాలంటే బృంద ఇన్వెస్టిగేషన్ చూసేందుకు భాగం కావాల్సిందే.ఎలా ఉందంటే..కథ ప్రారంభం 1996 టైమ్‌లైన్ అయినప్పటికీ కొంత సమయం తర్వాత వర్తమానంలోకి పరిచయం అవుతుంది. గంగవరం అనే అటవీ ప్రాంతంలోని ఒక తెగలో బృంద చిన్నతనం గడుస్తుంది. అక్కడ తన తల్లిని, అన్నయ్యను కోల్పోయిన బృంద ఎలా నగరానికి చేరుతంది అనే మంచి ఓపెనింగ్ సీన్‌తోనే దర్శకుడు సిరీస్‌పై క్యూరియాసిటీ కలిగించాడు. ఒక మహిళ పోలీస్ ఉద్యోగానికి పనికిరాదని హేళన చేసిన తొటి ఉద్యోగుల చేతనే శభాష్ అనిపించుకునేలా బృంద పాత్ర చాలా బాగుంటుంది. పోలీస్ ఆఫీసర్‌గా త్రిష యాక్టింగ్ మెప్పిస్తుంది. మూఢనమ్మకాల వల్ల అన్యాయానికి గురైన కొందరు ఎలాంటి పరిస్థితుల్లో సీరియల్ కిల్లర్స్‌గా మారుతున్నారు అనే అంశాన్ని చక్కగా చూపించాడు దర్శకుడు. కథపరంగా చూస్తే.. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ అయినప్పటికీ.. పోలీసు, కిల్లర్ మధ్య జరిగే సీన్స్ చాలా ఆసక్తిగా చూపించాడు దర్శకుడు. త్రిష గతంతో పాటు వర్తమాన కాలంలోని అంశాలను జత చేస్తూ చూపిన స్క్రీన్ ప్లే సరిగ్గా సెట్ అయింది. ఇన్వెస్టిగేషన్ పేరుతో నిడివి కాస్త పెరిగినట్లు అనిపించినా త్రిష నటనతో ఎంగేజ్ చేసింది.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాకు ప్రధాన బలం కథ అయితే.. అందుకు తగ్గట్లుగా పోలీసు పాత్రలో నటించిన త్రిష, హంతకుడి పాత్రలో కనిపించిన ఆనందసామి నటన. వీరిద్దరితో పాటు ఇంద్రజీత్, రవీంద్ర విజయ్, ఆమని తదితరులు తమ పరిధి మేరకు నటించారని చెప్పవచ్చు. గతం, వర్తమాన అంశాలను ప్రేక్షకులకు అర్థం అయ్యేలా మంచి స్క్రీన్‌ప్లే టెక్నిక్‌తో సిరీస్‌ను నడిపించారు. బృంద ఇన్వెస్టిగేషన్లో అక్కడక్కడ లాజిక్‌లు లేకున్నా సినిమా కదా అని చూస్తే ఫర్వాలేదు అనిపిస్తుంది. ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్‌లో 4,5 ఎపిసోడ్స్ కాస్త సాగదీతగా అనిపిస్తాయి. కాస్త నిడివి తగ్గించుంటే బాగుండు అనే భావన కలుగుతుంది. ఫైనల్‌గా బృంద ఇన్వెస్టిగేషన్తో అదరగొడుతుంది. ఎలాంటి సందేహం లేకుండా ఈ వెబ్ సిరీస్‌ను చూడొచ్చు. అందరినీ థ్రిల్లింగ్‌కు గురిచేస్తుంది. -
‘విరాజి’ మూవీ రివ్యూ
టైటిల్: విరాజి నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, తదితరులునిర్మాత: మహేంద్ర నాథ్ కూండ్లదర్శకత్వం: ఆద్యంత్ హర్షసంగీతం: ఎబినేజర్ పాల్(ఎబ్బి)సినిమాటోగ్రఫీ: జి.వి. అజయ్ కుమార్ఎడిటర్: రామ్ తూమువిడుదల తేది: ఆగస్ట్ 2, 2024వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు యంగ్ హీరో వరుణ్ సందేశ్. ఈ మధ్యే ‘నింద’సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్.. ఇప్పుడు ‘విరాజి’తో మరోసారి థియేటర్స్‌లో సందడి చేయడానికి వచ్చేశాడు. ఈ మూవీ నుంచి విడుదలైన ట్రైలర్‌కి మంచి స్పందన లభించడంతో పాటు సినిమాపై ఆసక్తిని పెంచేలా చేసింది. మరి నేడు(ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఓ పాత పిచ్చాసుపత్రిలో జరిగే కథ ఇది. రకరకాల కారణాలతో అక్కడికి సీఐ ప్రభాకర్(బలగం జయరామ్ ), డాక్టర్ సుధా( ప్రమోదీని), స్టాండప్ కమెడియన్ వేద( కుశాలిని), సినిమా నిర్మాత కోదండరాం(కాకినాడ నాని), సెలబ్రిటీస్ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణ( రఘు కారుమంచి), ఫోటోగ్రాఫర్ కాన్సెప్ట్ రాజు( రవితేజ నన్నిమాల) తో పాటు మొత్తం పదిమంది వెళ్తారు. ఈవెంట్ పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి వారిని అక్కడకు రప్పిస్తాడు. తాము మోసపోయామని తెలుసుకొని అక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. నిర్మాత కోదండరాంతోపాటు ఫోటోగ్రాఫర్ కూడా దారుణ హత్యకు గురవుతారు దీంతో మిగిలిన వారంతా భయపడి ఆ పిచ్చాసుపత్రిలోనే ఉంటారు. అదే సమయంలో ఆ ఆస్పత్రికి డ్రగ్స్‌కు అలవాటు పడిన ఆండి(వరుణ్ సందేశ్) వస్తాడు. ఆండి ఎందుకు అక్కడకు వచ్చాడు? ఆండి రాకతో ఆ పిచ్చాసుపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అసలు ఈ పది మందిని ఆసుపత్రికి వచ్చేలా ప్లాన్ చేసింది ఎవరు?ఎందుకు చేశారు? రోడ్డు ప్రమాదంలో చనిపోయిన సాగర్ కు వీళ్లకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఆ పది మంది ఆ పిచ్చాసుపత్రి నుంచి ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా కథ.ఎలా ఉందంటే..ఇదొక విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్. అంతర్లీనంగా ఓ మంచి సందేశం కూడా ఉంటుంది. సొసైటీలో ఇప్పుడున్న ఒక్క కాంటెంపరరి ఇష్యూనే కథగా తీసుకొని దానికి థ్రిల్లర్స్, సస్పెన్స్ అంశాలను జోడించి కాస్త భిన్నంగా ఈ సినిమాను తీర్చిదిద్దాడు దర్శకుడు ఆద్యంత్ హర్ష. చిన్న పాయింట్‌ని ఎంచుకొని దాని చుట్టు అల్లుకున్న కథ బాగుంది. కానీ తెరపై అంతే ఆసక్తికరంగా కథనాన్ని నడిపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. ఇంటర్వెల్‌కి పది నిమిషాల ముందు వరకు హీరో పాత్రను పరిచయం చేకుండా.. సస్పెన్స్, థ్రిల్లర్ సీన్లతో కథనాన్ని సాగించాడు. వేరువేరు నేపథ్యాలు ఉన్న పదిమంది ఒకే చోటికి రావడం.. వారిని అక్కడికి రప్పించిన వ్యక్తి ఎవరనేది తెలియకపోవడంతో.. అతను ఎవరు? ఎందుకు రప్పించారు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఆ క్యూరియాసిటీని సినిమా క్లైమాక్స్ వరకు కంటిన్యూ చేశాడు డైరెక్టర్.సినిమా ప్రారంభం ఆసక్తికరంగా ఉంటుంది. ఆ తర్వాత పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు డైరెక్టర్. పిచ్చాసుప్రతిలోకి అంతా చేరుకున్నాక కథనంపై ఆసక్తి పెరుగుతుంది. ఇంటర్వెల్ వరకు సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ లో కథనం సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకోవడంతో పాటు సెకండాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో వచ్చే ట్విస్టులు ఊహించని విధంగా ఉంటాయి. క్లైమాక్స్ లో వరుణ్ సందేశ్ తో వచ్చే సీన్ సినిమాకే హైలైట్. ఆ పదిమంది అక్కడికి రావడానికి గల కారణం ఊహించని విధంగా ఉంటుంది. బరువెక్కిన హృదయంతో ప్రేక్షకు బయటకు వస్తాడు. నిడివి తక్కువ ఉండడం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఎవరెలా చేశారంటే..ఆండీ పాత్రకు వరుణ్ సందేశ్ పూర్తి న్యాయం చేశాడు. తెరపై ఆయన చాలా కొత్తగా కనిపించాడు. సిఐ మురళిగా బలగం జయరాం చక్కగా నటించారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ రామకృష్ణగా రఘు కారుమంచి తెరపై కనిపించేది కాసేపే అయిన .. ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేశాడు. ప్రమోదిని, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణాదేవి, కుశాలిని పూలప, ప్రసాద్ బెహరా తో పాటు అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.సాంకేతిక పరంగా సినిమా బాగుంది. ఎబెనైజర్ పాల్ నేపథ్య సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్. తనదైన బిజిఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి ,నిర్మాత సైతం ఎక్కడ రాజీ పడకుండా సినిమా ని తెరకెక్కించారు. -
'తిరగబడర సామీ' సినిమా రివ్యూ
లావణ్య అనే అమ్మాయి వల్ల హీరో రాజ్ తరుణ్ గత కొన్నిరోజులుగా వార్తల్లో నిలిచాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మాయలో పడి, తనని మోసం చేశాడని ఈమె చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయిపోయాయి. అదే మాల్వి మాల్హోత్రా-రాజ్ తరుణ్ జంటగా కలిసి నటించిన 'తిరగబడర సామీ' సినిమా ఇప్పుడు థియేటర్లలోకి వచ్చేసింది. రచ్చ వల్ల చర్చల్లో నిలిచిన ఈ మూవీ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.కథేంటి?సమాజంలో తప్పిపోతున్న చాలామందిని వాళ్ల సొంతవాళ్ల దగ్గరకి చేర్చే అనాథ కుర్రాడు గిరి (రాజ్ తరుణ్). ఈ పని చేస్తుండటం వల్ల ఇతడికి పిల్లనిచ్చి పెళ్లి చేయడానికి ఎవరూ ముందుకు రారు. అలాంటిది మరో అనాథ అయిన శైలజ (మాల్వీ మల్హోత్రా), గిరిని పెళ్లి చేసుకుంటుంది. కొన్నిరోజుల్లో ప్రెగ్నెంట్ కూడా అవుతుంది. అయితే శైలజ అనాథ కాదని ఓ సందర్భంలో గిరికి తెలుస్తుంది. అప్పుడేం చేశాడు? ఇంతకీ కొండారెడ్డి అనే గుండాకు శైలజకు సంబంధమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?లావణ్య అనే అమ్మాయి వల్ల రాజ్ తరుణ్‌తో పాటు 'తిరగబడర సామీ' సినిమా కూడా వార్తల్లో నిలిచింది. కానీ అనుకున్నంతగా ఇందులో ఏం లేదు. టాలీవుడ్లో చాలాసార్లు చూసేసిన కథతోనే సినిమా తీశారు. పోనీ ఏమైనా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా అంటే ఏం లేవు. మొదలైన దగ్గర చివరివరకు తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో సాధారణ ప్రేక్షకుడు సులభంగా ఊహించేస్తాడు. అంత నీరసమైన స్క్రీన్ ప్లేతో సినిమాని నడిపించారు.తప్పిపోయిన, కనిపించకుండా పోయిన వ్యక్తుల్ని.. ఆయా వ్యక్తుల కుటుంబీకులకు అప్పగించే కుర్రాడిగా రాజ్ తరుణ్‌ని పరిచయం చేశారు. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ, కట్ చేస్తే ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాత పాటలు ఇలా చప్పగా సాగుతూ ఉంటుంది. అసలు తనని పెళ్లి చేసుకున్న శైలజ ఎవరో తెలిసే విషయంతో ఇంటర్వెల్ పడుతుంది. అయితే అనవసరమైన సీన్లతో సెకండాఫ్ ఇంకా భారంగా సాగుతుంది. ఫైట్‌తో క్లైమాక్స్ ముగుస్తుంది.గంట 55 నిమిషాల నిడివితో తీసినప్పటికీ.. ఏదో మూడు గంటల సినిమా చూస్తున్నామా అనేంత భారమైన ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడెప్పుడో 90ల్లో రాసుకున్న కథని ఇప్పుడెందుకు తీశారు? అసలు రాజ్ తరుణ్ ఇలాంటి మూవీ ఎందుకు చేశాడా అని సందేహాలు వస్తాయి. ఇందులో హీరోయిన్ ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు చెబుతారు. కానీ ఒక్కచోట కూడా పొట్ట ఎత్తుగా ఉన్నట్లు చూపించారు. ఇలాంటి లాజిక్ లేని సీన్లు సినిమాలో బోలెడు ఉంటాయి.ఎవరెలా చేశారు?రాజ్ తరుణ్ మంచి ఎనర్జీ ఉన్న నటుడు. కాకపోతే ఇందులో అతడి యాక్టింగ్ స్టామినాని సరిగా ఉపయోగించుకోలేకపోయారు. ఏదో అలా చేశాడంతే! హీరోయిన్ మాల్వీ మల్హోత్రా యాక్టింగ్ పర్లేదు. విలన్‌గా చేసిన మకరంద్ దేశ్ పాండే పాత్ర, బిహేవ్ చేసే విధానం మరీ సిల్లీగా ఉంటుంది. గ్లామర్ షో చేసేందుకే మన్నారా చోప్రా పాత్ర ఉంది. మిగిలిన పాత్రలన్నీ ఏదో ఉన్నాయంటే ఉన్నాయంతే! టెక్నికల్ విషయాలకొస్తే.. 'యజ్ఞం', 'పిల్లా నువ్వు లేని జీవితం' సినిమాలు తీసిన డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి.. మరీ ఇలా అయిపోయారేంటి అనిపిస్తుంది. పాటలు పర్లేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం మరీ లౌడ్‌గా ఉండి తెగ ఇబ్బంది పెట్టింది. సినిమాటోగ్రాఫీ, నిర్మాణ విలువలు ఓకే ఓకే. ఓవరాల్‌గా చెప్పుకొంటే రాజ్ తరుణ్-లావణ్య గొడవ వల్ల కాస్త హైలైట్ అయిన ఈ సినిమా.. కనీసం అంటే కనీసం ఆకట్టుకోలేకపోయింది! -
Shivam Bhaje Review: ‘శివం భజే’ మూవీ రివ్యూ
టైటిల్: శివం భజేనటీనటులు: అశ్విన్ బాబు, దిగంగనా సూర్యవంశీ, అర్బాజ్ ఖాన్, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ తదితరులునిర్మాణ సంస్థ: గంగా ఎంటర్టైన్మంట్స్ నిర్మాత: మహేశ్వర్ రెడ్డి మూలిదర్శకత్వం: అప్సర్సంగీతం: వికాస్ బడిససినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్రవిడుదల తేది: ఆగస్ట్ 1, 2024ప్రస్తుతం టాలీవుడ్లో డివోషనల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తున్నాయి. దీంతో మన దర్శక నిర్మాతలు డివోషనల్ టచ్ ఉన్న కథలలో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. అలా తెరకెక్కిన తాజా చిత్రమే ‘శివం భజే’. ‘హిడింబ’ తర్వాత అశ్విన్ బాబు నటించిన చిత్రమిది. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంలో ‘శివం భజే’పై బజ్ క్రియేట్ అయింది. మరి డివోషనల్ కాన్సెప్ట్ వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే: చందు(అశ్విన్ బాబు) రికవరీ ఏజెంట్‌గా పని చేస్తుంటాడు. ఓ కారు ఈఎమ్ఐ వసూలు చేస్తున్న క్రమంలో శైలజ(దిగంగన సూర్యవంశీ)తో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారుతుంది. శైలజ ఓ కెమికల్ ల్యాబ్‌లో పని చేస్తుంది. ఓ రోజు శైలజను కలిసేందుకు వెళ్లిన చందు ఆమె ఆఫీస్‌కు వెళ్తాడు. అక్కడ జరిగిన ఓ గొడవ కారణంగా అతను కంటి చూపు కోల్పోతాడు. దాంతో వైద్యులు అతనికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. కొత్త కళ్లు వచ్చిన తర్వాత చందు ప్రవర్తనలో మార్పు వస్తుంది. డే మొత్తం నిద్రబోతూ.. నైట్ టైమ్‌లో మెలకువగా ఉంటాడు. అంతేకాకుండా అతని మైండ్‌లో రెండు హత్యలకు సంబంధించిన జ్ఞాపకాలు మెదులుతుంటాయి. వైద్యులను సంప్రదిస్తే..అతని కళ్లకు సంబంధించి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. అదేంటి? అసలు ఆ కళ్లు ఎవరివి? అతని కలలోకి వస్తున్న హత్యల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? చైనా-పాకిస్తాన్ కలిసి ‘ఆపరేషన్ లామా’పేరుతో భారత్‌పై చేస్తున్న కుట్ర ఏంటి? ‘ఆపరేషన్ లామా’కు సాధారణ వ్యక్తి చందుకి ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే..కొన్ని కథలు వినడానికి ఆసక్తికరంగా ఉంటాయి. కానీ తెరపై చూస్తున్నప్పడు ఏదో మిస్ అయిన ఫీలింగ్ కలుగుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నా.. వాటిని తెరపై ఆసక్తికరంగా చూపించినప్పుడే ఫలితం ఉంటుంది. అయితే ‘శివం భజే’ విషయంలో అది కొంతవరకు మాత్రమే ఫలించింది. వాస్తవానికి దర్శకుడు అప్సర్ ఎంచుకున్న పాయింట్ చాలా కొత్తది. ఇలాంటి కాన్సెప్ట్‌తో తెలుగు తెరపై ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. కానీ డైరెక్టర్ అనుకున్న పాయింట్‌ని తెరపై ఉన్నది ఉన్నట్లుగా చూపించడంలో కాస్త తడబడ్డాడు. ఉగ్రవాదం, మెడికల్ క్రైమ్, సైన్స్, ఫ్యామిలీ, డివోషినల్..ఇలా ఐదారు జానార్లతో కలిపి ఈ కథ రాసుకున్నాడు. జీనోట్రాన్స్ప్లాంటేషన్ అనే కొత్త పాయింట్‌ని టచ్ చేశాడు. అయితే కథనాన్ని ఇంకాస్త ఆసక్తికరంగా నడిపిస్తే బాగుండేది.ఇండియా పై పాకిస్తాన్..చైనా చేసే కుట్ర సీన్ తో సినిమా ప్రారంభం అవ్తుంది. ఆ తరువాత వరుస హత్యలు..పోలీసుల ఇన్వెస్టిగేషన్ ట్రాక్ ఒక వైపు.. హీరో..హీరోయిన్ల లవ్ ట్రాక్ మరో వైపు నడుస్తుంది. ఈ రెండిటికీ మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది చెప్పకుండా కథ పై ఆసక్తి కలిగేలా చేశాడు డైరక్టర్. ఇంటర్వెల్ సీన్ అదిరిపోతుంది. సెకండాఫ్ లో కథనం మరింత ఆసక్తికరంగా సాగుతుంది. జీనోట్రాన్స్ప్లాంటేషన్ రివీల్ అవ్వడం..ఆ తర్వాత వెంటనే ‘డోగ్రా’ గురించి తెలియడం..దాని నేపథ్యం అంతా ఆసక్తికరంగా సాగుతుంది. కానీ వరుస హత్యలపై పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ చప్పగా సాగుతుంది. బలమైన విలన్ లేకపోవడం సినిమాకు మైనస్. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్.. కాంతార లెవల్లో సాగే యాక్షన్ సీన్ ఆకట్టుకుంటుంది. కథ మాదిరే స్క్రీన్‌ప్లేని కూడా మరింత బలంగా రాసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే..నటన పరంగా అశ్విన్ బాబుకి వంక పెట్టలేం. ఎలాంటి పాత్రలోనైనా ఆయన అవలీలగా నటించగలడు. తొలిసారి ఆయన ఈ చిత్రంలో పక్కింటి కుర్రాడిగా నటించాడు. రికవరీ ఏజెంట్ చందుగా ఆయన చక్కగా నటించాడు. యాక్షన్స్ సీన్స్ అదరగొట్టేశాడు. క్లైమాక్స్‌లో అశ్విన్ నటవిశ్వరూపం చూపించాడు. హీరోయిన్ దిగంగన సూర్యవంశీ పాత్రకి ఇందులో పెద్దగా స్కోప్ లేదు కానీ ఉన్నంతలో చక్కగా నటించింది. ఏసీపీ మురళీగా అర్బాజ్ ఖాన్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. హైపర్ ఆది, బ్రహ్మాజీ కామెడీ వర్కౌట్ అయింది. మురళీ శర్మ, తులసి, ఇనయ సుల్తానాతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. వికాస్ బడిస నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.- రేటింగ్: 2.75/5 -
రేపటి కోసం యుద్ధం.. ఉత్కంఠతతో సాగే 'ది టుమారో వార్'
చిత్రం: ది టుమారో వార్విడుదల: జులై 02,2021నటీనటులు: క్రిస్ ప్రాట్, వైవోన్నే స్ట్రాహోవ్స్కీ, సిమన్స్, గిల్పిన్, సామ్ రిచర్డ్సన్, ఎడ్విన్ హాడ్జ్, జాస్మిన్ మాథ్యూస్, ర్యాన్ కీరా ఆర్మ్‌స్ట్రాంగ్, కీత్ పవర్స్ తదితరులుదర్శకుడు : క్రిస్ మెక్కేసంగీతం: లోర్మీ బ్లాఫీసినిమాటోగ్రఫీ: ల్యారీ ఫాంగ్నిర్మాతలు: డేవిడ్ ఎల్లిసన్, డానా గోల్డ్బెర్గ్, డాన్ గ్రాంజెర్, జులెస్ డాలీ, డేవిడ్ ఎస్.గోయర్, ఆడమ్ కోల్బెర్నర్ఓటీటీ భాగస్వామి: అమెజాన్ ప్రైమ్ వీడియో (తెలుగు)స్ట్రీమింగ్ భాషలు: తెలుగు,ఇంగ్లీష్,హిందీ,తమిళ్,కన్నడ,మలయాళంహాలీవుడ్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులు భారీగానే ఆదరిస్తారు. అందుకే అవన్నీ తెలుగులో కూడా డబ్ అవుతుంటాయి. సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో పాటు యాక్షన్ అడ్వెంచర్ చిత్రాలను టాలీవుడ్ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మార్వెల్ చిత్రాలతో పాటు ఏలియన్స్ సబ్జెక్ట్‌తో వచ్చిన సినిమాలు ఎన్నో థియేటర్లలో సందడి చేశాయి. ఈ క్రమంలో తెరకెక్కిన మిలటరీ సైన్స్ ఫిక్షన్ సినిమానే 'ది టుమారో వార్'. 2021 కోవిడ్ సమయంలో డైరెక్ట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. హలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమా అమెజాన్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ సినిమా కథేంటో తెలుసుకుందాం. భవిష్యత్ కాలంలో భూమి మీద ఎలాంటి ఇబ్బందులు రావచ్చేనే కాన్సెప్ట్‌తో 'ది టుమారో వార్' కథ ఉంటుంది. గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే భారీ యాక్షన్ వార్‌గా చాలా ఉత్కంఠతో కూడుకొని కథ ఉంటుంది.కథ ఎంటి..?డాన్ ఫారెస్టర్ (క్రిస్ ప్రాట్) మాజీ ఇరాక్ సైనికాధికారి. రిటైర్డ్ అయ్యాక స్కూల్ పిల్లలకు బయాలజీ చెబుతూ తన భార్య (బెట్టీ గ్లిపిన్), కూతురు (రియాన్ కైరా)తో కలిసి జీవితం గడుపుతుంటాడు. ఒకరోజు ఆకాశం నుంచి ఓ ఆర్మీ యూనిట్ ఆయనముందు ప్రత్యక్షమవుతుంది. తామందరం భవిష్యత్ కాలం నుంచి వచ్చామని చెబుతూ ఎలియన్స్‌తో యుద్ధం చేసేందుకు సైన్యం అవసరం ఉందని చెబుతారు. ఆయనొక ఆర్మీ అధికారి కాబట్టి ఎలియన్స్ మీద పోరాటం చేసేందుకు తీసుకెళ్తారు. భవిష్యత్తు యుద్ధం కోసం అతను చేసిన త్యాగం ఏమిటి? ఒక బృందంగా వెళ్లిన డాన్ ఫారెస్టర్ ఏం చేశాడు..? ఏలియన్స్ ఎలా అంతమయ్యాయి..? డాన్ ఫారెస్టర్ కోసమే భవిష్యత్ కాలం నుంచి వారు ఎందుకు వచ్చారు..? ఇవన్నీ తెలియాలంటే అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతున్న 'ది టుమారో వార్' చూడాల్సిందే.ఎలా ఉందంటే..?గ్రహాంతర వాసులకు.. జీవరాశులకు మధ్య జరిగే యుద్ద నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చాలా అంశాల్లో ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఏలియన్స్ కాన్సెప్ట్‌తో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది. అన్నీ సినిమాల మాదిరి కాకుండా ది టామారో వార్ సినిమాను చాలా ప్రత్యేకంగా తెరకెక్కించారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ భిన్నమైనది. ఎలియన్స్‌ను ఎదుర్కొనేందుకు భవిష్యత్ తరం వారు సాయం కోసం వర్తమాన కాలానికి చెందిన వారిని కలవడం అనేది చాలా ఆసక్తి తెప్పించే అంశం. ఈ పాయింట్‌తో సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ క్రిస్ మెకే భారీ విజయం సాధించారు.డాన్ ఫారెస్టర్ ఆర్మీ నుంచి వచ్చిన తర్వాత ఎలా భవిష్యత్ కాలంలో అడుగుపెట్టాడో చూపించిన విధానం బాగుంది. అక్కడ ఎలియన్స్ మీద రీసెర్చ్ చేస్తున్న ఆ యూనిట్లో డాన్ ఫారెస్టర్ ఎలా కీలకం అయ్యాడో చూపించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తుంది. అప్పటికే చాలామంది ఏలియన్స్ మరణించి ఉంటారు. అలాంటి సమయంలో ఎంట్రీ ఇచ్చిన డాన్ ఫారెస్టర్ యూనిట్ మీద ఏలియన్స్ ఎటాక్ చేస్తాయి. చాలా ఉత్కంఠతతో ఆ సీన్స్ ఉంటాయి.ఈ క్రమంలో ఓ ఏలియన్‌ను డాన్ ఫారెస్టర్ యూనిట్ పట్టుకుంటుంది. ఆ సమయంలో ప్రతి ప్రేక్షకుడిని చూపుతిప్పనివ్వకుండా దర్శకుడు చిత్రీకరించాడు. సరిగ్గా ఈ సమయంలోనే మరో ఆర్మీ యూనిట్‌కు నాయకత్వం వహిస్తున్న మ్యూరి ఫారెస్టర్ తన కుమార్తె అని తెలుసుకుని డాన్ ఫారెస్టర్ చాలా సంతోషిస్తాడు. చాలా ఎమెషనల్‌గా కొన్ని సీన్లు వారి మధ్య ఉంటాయి. భవిష్యత్ కాలానికి వెళ్లి తన కుమార్తెను కలుసుకున్న ఒక తండ్రి కాన్సెప్ట్ అందరినీ మెప్పిస్తుంది. ఎలియన్స్‌ను అంతం చేయాలంటే దానితోనే వాటిని చంపాలని డాన్ ఫారెస్టర్ ఒక వ్యూహం వేస్తాడు. వారి చేతికి చిక్కిన ఎలియన్ శరీరం నెంచి టాక్సిన్ను తయారు చేసి దానితోనే వాటిని అంతం చేయాలని స్కెచ్ వేస్తాడు. అయితే, వారి చేతికి చిక్కిన ఏలియన్‌ను కాపాడుకునేందుకు మిగిలిన ఏలియన్స్ చేసిన పోరాటంతో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. అలాంటి సమయంలో డాన్ ఫారెస్టర్ వేసిన మరో అద్భుతమైన ప్లాన్ ఎంటి..? అనేది చాలా ఆసక్తిని పెంచుతుంది. యాక్షన్ చిత్రాలను ఆదరించేవారికి ఈ సినిమా మంచి థ్రిల్‌ను తప్పకుండా ఇస్తుంది.ఎవరెలా చేశారంటే..?డాన్ ఫారెస్టర్ పాత్రలో క్రిస్ ప్రాట్ అదరగొట్టేశాడు. ఆయన కూతురి పాత్రలో స్ట్రావోస్కీ కూడా మెప్పించింది. సిమన్స్, సామ్ రిచర్డ్సన్ వారి పాత్రలకు సరైన న్యాయం చేశారు. 'ది టుమారో వార్' చిత్రానికి ప్రధాన బలం విజువల్స్ అని చెప్పవచ్చు. ల్యారీ ఫాంగ్ సినిమాటోగ్రఫీ సినిమాను మరో రేంజ్‌కు చేర్చుతుంది. ఇలాంటి సినిమాలు బిగ్ స్క్రీన్ మీద చూస్తే ఆ మజానే వేరు అనేలా ఉంటుంది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లను ఎలివేట్ చేయడానికి అద్భుతమైన విఎఫెక్స్, క్వాలిటీ సీజిఐను ఉపయోగించడంతో ఈ సినిమా విజువల్ వండర్‌గా తెరకెక్కింది. అయితే దర్శకుడు కథ చెప్పే తీరు కాస్త నెమ్మదిగా ఉంటుంది. ముఖ్చంగా తండ్రీ, కూతుళ్ల మధ్య వచ్చే సన్నివేశాలు కాస్త సాగదీతగా అనిపిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త బలంగా ఉండాల్సింది. ఫైనల్‌గా ‘ది టుమారో వార్’ అద్భుతాన్ని చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్‌లో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. -
Galli Gang Stars Movie Review: గల్లీ గ్యాంగ్ స్టార్స్ మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే?
టైటిల్: గల్లీ గ్యాంగ్ స్టార్స్ నటీనటులు : సంజయ్ శ్రీ రాజ్, ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, ఆర్జే బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి తదితరులుదర్శకత్వం: వెంకటేష్ కొండిపోగు, ధర్మనిర్మాణ సంస్థ: ఏబీడీ ప్రొడక్షన్స్నిర్మాత: డా. ఆరవేటి యశోవర్ధన్సంగీత దర్శకుడు: సత్య, శరత్ రామ్ రవిఎడిటర్ : ధర్మఅసలు కథేంటంటే..గల్లీ గ్యాంగ్ స్టార్స్ మూవీ నెల్లూరు పరిసర ప్రాంతంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. గాంధీ, తప్పెట్లు, మూగోడు, చెత్తోడు, కర్రోడు, క్వార్టర్ అనే పేర్లతో నెల్లూరు గల్లీలో పెరుగుతున్న అనాధల కథే ఈ చిత్రం. ఆ గల్లిని ఎప్పటినుంచో తన గుప్పెట్లో పెట్టుకున్న గోల్డ్ రెడ్డి అనే రౌడీషీటర్. అక్కడ ఉన్న అనాధల్ని తీసుకెళ్లి వాళ్లతో డ్రగ్ అమ్మిస్తూ నేరాలు చేయిస్తూ ఉంటాడు. గాంధీ అనే వ్యక్తి గోల్డ్ రెడ్డి కింద పనిచేస్తూ ఉంటాడు. గాంధీ ప్రియురాలు లక్ష్మీని గోల్డ్ రెడ్డి ఏడిపిస్తాడు. అదేవిధంగా ఆ గల్లీ ప్రజలని భయపెడుతూ ఉంటాడు. ఈ గల్లీ కుర్రాళ్లకి సత్య అని చదువుకున్న యువకుడు తోడు అవుతాడు. ఆ తర్వాత గోల్డ్ రెడ్డి చేస్తున్న అన్యాయాన్ని అర్థం చేసుకున్న గల్లీ కుర్రాళ్ళు గల్లీ గ్యాంగ్ స్టార్స్‌గా ఎలా మారారు? ఈ ఆరుగురు అనాధలు ఎలా కలిశారు? గోల్డ్ రెడ్డిని ఎలా ఎదిరించారన్నదే అసలు కథ.ఎలా ఉందంటే..డైరెక్టర్ వెంకటేష్ కొండిపోగు కథలోకి నెమ్మదిగా ప్రేక్షకులను తీసుకెళ్లాడు. రోటీన్ వచ్చే సన్నివేశాలు, కామెడీతో హాఫ్ సాగింది. కాస్తా బోరింగ్ అనిపించిన అక్కడక్కడ నవ్వించే సీన్స్‌తో కవర్ చేశాడు. గల్లీ కుర్రాళ్లు, రౌడీషీటర్ గోల్డ్ రెడ్డి మధ్య జరిగే సన్నివేశాల్లో అంతగా వర్కవుట్ కాలేదు. సెకండాఫ్ వచ్చేసరికి కథను కాస్తా సాగదీసినట్లు అనిపిస్తుంది. గోల్డ్ రెడ్డి, కుర్రాళ్ల గ్యాంగ్‌ను ఎలా ఎదుర్కొన్నారనే దాని చుట్టే కథ తిరుగుతుంది. క్లైమాక్స్ సీన్ ఫర్వాలేదు. డైరెక్టర్ తాను రాసుకున్న కథను తెరపై ఆవిష్కరించడంలో కొత్తదనం చూపించలేకపోయాడు. చివరికీ గోల్డ్ రెడ్డిని ఆ కుర్రాళ్ల గ్యాంగ్ ఎలా ఎదిరించారో తెలియాలంటే గల్లీ గ్యాంగ్ స్టార్స్‌ను చూడాల్సిందే.ఎవరెలా చేశారంటే..ఈ సినిమాలో కొత్త వారైనా కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు. సంజయ్ శ్రీ రాజ్ గాంధీగా మంచి పాత్ర పోషించాడు. ప్రియ శ్రీనివాస్, భరత్ మహాన్, రితిక, ఆర్జే బాలు, చందు, తారక్, మురళి కృష్ణ రెడ్డి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఏబిడి ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ఫర్వాలేదు. ఎడిటర్ తన కత్తెరకు మరింత పని చెప్పాల్సింది. ధర్మ సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. సత్య శరత్ రామ్ రవి సంగీత నేపథ్యం బాగుంది. -
‘ఆపరేషన్ రావణ్’ మూవీ రివ్యూ
టైటిల్: ఆపరేషన్ రావణ్నటీనటులు: రక్షిత్ అట్లూరి, సంగీర్తన విపిన్, రాధికా శరత్ కుమార్, చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్ రాము, విద్యా సాగర్ తదితరులునిర్మాత: ధ్యాన్ అట్లూరిరచన-దర్శకత్వం: వెంకట సత్యసంగీతం: శరవణ వాసుదేవన్సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టివిడుదల తేది: జులై 26, 2024పలాస, నరకాసుర వంటి చిత్రాలతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న రక్షిత్ అట్లూరి. తాజాగా ఆయన నటించిన చిత్రం ఆపరేషన్ రావణ్. రక్షిత్ తండ్రి వెంకట సత్య ఈ మూవీలో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గట్టిగా చేయడంతో ‘ఆపరేషన్ రావణ్’పై హైప్ క్రియేట్ అయింది. మంచి అంచనాల మధ్య నేడు(జులై 26) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే.. ఆమని(సంగీర్తన విపిన్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. స్థానిక మంత్రి(రఘు కుంచె) చేసే అవినీతిపై స్టింగ్ ఆపరేషన్ చేసి ఓ స్టోరీ రెడీ చేస్తుంది. అయితే ఆ స్టోరీని టీవీ చానెల్ సీఈఓ(మూర్తి) టెలికాస్ట్ చేయకుండా జాప్యం చేస్తుంటాడు. అంతేకాకుండా అది పక్కకి పెట్టి ఓ సీరియల్ కిల్లర్ కేసుని కవర్ చేయమని ఆమనికి ఆదేశిస్తాడు. ఆమెకు అసిస్టెంట్‌గా అప్పుడే ఉద్యోగంలో చేరిన రామ్(రక్షిత్ అట్లూరి)ని పంపిస్తాడు. రామ్ ఓ నిజాన్ని దాచి ఆమని కోసం ఆ చానెల్లో ఉద్యోగిగా చేరతాడు. ఆమె ప్రేమను పొందేందుకు ప్రయత్నిస్తుంటాడు. మరోవైపు నగరంలో ఆ సీరియల్ కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి హత్యలు చేస్తుంటాడు. తన కూతురు కూడా కనిపించడం లేదని తమ్ముడి వర్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది సుజాత(రాధికా శరత్ కుమార్). పోలీసులతో పాటు ఆమని, రామ్‌లు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని విచారణ జరుపుతుంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఆ సీరియల్ కిల్లర్ ఆమనిని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు అమ్మాయిలను హత్య చేస్తున్నాడు? పెళ్లికి రెడీ అయిన సుజాత కూతుర్ని కిడ్నాప్ చేసిందెవరు? సీరియల్ కిల్లర్ నుంచి తన ప్రియురాలు ఆమనిని రామ్ ఎలా రక్షించుకున్నాడు? సుజాతకు ఆ సీరియల్ కిల్లర్‌తో ఉన్న సంబంధం ఏంటి? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే.. సాధారణంగా సైకో థ్రిల్లర్ సినిమాల్లో ఎవరు ఎవరిని, ఎందుకు చంపుతున్నారు? దాని వెనక మిస్టరీని తెలుసుకోవడంలోనే కథనం సాగిపోతూ ఉంటుంది. ఇలాంటి సినిమాల్లో నేరం జరిగిన తీరు..వాటి చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్..దాన్ని హీరో ఎంత తెలివిగా ఛేదించాడన్న అంశాలపై సినిమా విజయం ఆధారపడి ఉంటుంది. బిగిసడలని స్క్రీన్‌ప్లే ఉండాలి. అప్పుడే రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను థియేటర్స్‌లో కూర్చొబెట్టగలుగుతాం. ఆపరేషన్ రావణ్ సినిమా విషయంలో ఆ ప్రయత్నం కొంతవరకు మాత్రమే సఫలం అయింది. సైకో థ్రిల్లర్ చేసే హత్యలు.. దాన్ని చూపించిన తీరు ఉత్కంఠబరితంగా ఉన్నా.. దాని చుట్టు అల్లుకున్న మైండ్ గేమ్ మాత్రం సాదా సీదా అనిపిస్తుంది. సైకో కిల్లర్‌ని కనిపెట్టేందుకు పోలీసులతో పాటు హీరోహీరోయిన్లు చేసే ఇన్వెస్టిగేషన్ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. అయితే సైకో కిల్లర్ ఎవరని తెలిసిన తర్వాత షాక్‌కి గురవుతాం. అలాగే అతను అలా మారడానికి గల కారణం కూడా వాస్తవికంగా ఉంటుంది. సైకో ఎవరనేది చివరివరకు తెలియకుండా దర్శకుడు జాగ్రత్తగా కథనాన్ని నడిపాడు. తొలి సినిమానే అయినా..కొన్ని సీన్లను అనుభవం ఉన్న డైరెక్టర్లా తెరకెక్కించాడు. సినిమా ప్రారంభంలోనే సైకో కిల్లర్ హత్య సీన్ పెట్టి కథపై ఆస్తకి కలిగించాడు. ఆ తర్వాత హీరో ఎంట్రీ, హీరోయిన్‌తో లవ్ అంతా సాదా సీదాగా సాగిపోతుంది. కొన్ని అనవసరపు సన్నివేశాలను పెట్టి కథను సాగదీశాడు. ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరై ఉంటారనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో మరింత పెరుగుతుంది. ఇక సెకండాఫ్‌లో కథనం ఆసక్తికరంగా సాగుతుంది. సైకో కిల్లర్ ఫేస్ రివీల్ చేసే సీన్, ఫ్లాష్‌బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఆపరేషన్ రావణ్ నచ్చుతుంది. ఎవరెలా చేశారంటే.. గత సినిమాలతో పోలిస్తే రక్షిత్ అట్లూరి నటన మరింత మెరుగు పడింది. జర్నలిస్ట్ రామ్ పాత్రలో ఆయన ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. ముఖ్యంగా సైకో కిల్లర్‌ని ఛేజింగ్ చేసే సీన్ సినిమాకే హైలెట్. ఇక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ ఆమనిగా సంగీర్తన విపిన్ తనదైన నటనతో ఆకట్టుకుంది. సైకో కిల్లర్‌గా నటించిన వ్యక్తి కూడా క్లైమాక్స్‌లో తన నటనతో బయపెడతాడు. రాధికా శరత్ కుమార్ పాత్ర నిడివి తక్కువే అయినా..ఉన్నంతలో చక్కగా ఆకట్టుకుంది. చరణ్ రాజ్, కాంచి, రాకెట్ రాఘవతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. సాంకేతిక పరంగా సినిమా పర్వాలేదు. శరవణ వాసుదేవన్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు ఓకే. సినిమాటోగ్రపీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లను మరింత క్రిస్పీగా కట్ చేయాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు' సినిమా రివ్యూ
టైటిల్: పురుషోత్తముడునటీనటులు: రాజ్ తరుణ్, హాసిని సుధీర్, ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, మురళీ శర్మ, ముకేశ్ ఖన్నా తదితరులుదర్శకుడు: రామ్ భీమననిర్మాతలు: రమేశ్ తేజావత్, ప్రకాశ్ తేజావత్విడుదల తేదీ: 26 జూలై, 2024ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా, కుమారి 21 ఎఫ్ వంటి సూపర్ హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ గత కొంతకాలంగా ఫ్లాప్స్‌తో కొట్టుమిట్టాడుతున్నాడు. చాలాకాలంగా ఇతడికి మంచి హిట్ లేదు. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో కొంచెం గ్యాప్ తీసుకొని పురుషోత్తముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. టీజర్, ట్రైలర్ పర్వాలేదనిపించాయి. ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేయడంతో ఓ మోస్తరు హైప్ క్రియేట్ అయింది. మరి ఈ రోజు (జూలై 26న) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూసేద్దాం..కథరచిత రామ్ (రాజ్ తరుణ్) లండన్‌లో చదువు పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగి వస్తాడు. అతడిని తన కంపెనీకి సీఈవో చేయాలని తండ్రి (మురళీ శర్మ) భావిస్తాడు. అయితే కంపెనీ నిబంధన ప్రకారం.. సీఈవో కావాలంటే ముందు ఆ వ్యక్తి వంద రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లాలి. ఆ విషయాన్ని రామ్ పెద్దమ్మ (రమ్య కృష్ణ) అందరికీ గుర్తు చేస్తుంది. ఆ కంపెనీలో తనకు 50 శాతం వాటా ఉండటంతో రామ్ అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు. రాజమండ్రి దగ్గర్లోని కడియపులంక అనే గ్రామానికి ఒంటరిగా వెళ్లిపోతాడు.ఆ గ్రామంలో నర్సరీ నడుపుతున్న అమ్ములు (హాసిని సుధీర్) దగ్గర పనిలో చేరతాడు. ఆ గ్రామంలోని రైతుల్ని స్థానిక ఎమ్మెల్యే, అతని కుమారుడు ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో వారు రామ్ సాయం కోరతారు. మరోవైపు రామ్ వివరాలను బయటకు తెలియజేసి తను సీఈవో కాకుండా అడ్డుకోవాలని పెద్దమ్మ, ఆమె కుమారుడు (విరాన్ ముత్తం శెట్టి) కుట్ర పన్నుతారు. తమ మనుషులతో అతడి ఆచూకీ కోసం గాలిస్తుంటారు. మరి రామ్ సీఈవో అయ్యాడా? ఆ రైతుల కోసం ఏం చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే!ఎలా ఉందంటే?హీరోకు వందల కోట్ల ఆస్తి ఉన్నా అవన్నీ వదిలేసి సాధారణ జీవితం గడుపుతుంటాడు.. ఈ క్రమమంలో పేద ప్రజల జీవన విధానం, కష్టాలు తెలుసుకుని చలించిపోతాడు. వారికి సాయం చేస్తాడు.. ఈ పాయింట్‌తో శ్రీమంతుడు, బిచ్చగాడు, పిల్ల జమీందార్.. ఇలా పలు తెలుగు చిత్రాలు వచ్చాయి. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ కూడా ఇదే! కథ రొటీన్ అయినా తెరపై కాస్త కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.కానీ పాత కథే కావడంతో సినిమా చూస్తున్నంతసేపు అవే గుర్తుకు వస్తుంటాయి. కథనం కూడా ఊహకు తగ్గట్లే సాగిపోతుంది. ఫస్టాఫ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సెకండాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు సహజంగా ఉండకుండా సినిమాటిక్‌గా అనిపిస్తాయి. సినిమా అంతా కూడా పెద్దగా ట్విస్టుల్లేకుండా సాఫీగా సాగిపోతుంది. సినిమాటోగ్రఫీ, సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదనిపించాయి. చివర్లో ప్రకాశ్ రాజ్ చెప్పిన డైలాగులు బాగా పేలాయి. రన్ టైం రెండు గంటలే ఉండటం ప్లస్ పాయింట్.ఎవరెలా చేశారంటే?రామ్ పాత్రకు రాజ్ తరుణ్ న్యాయం చేశాడు. హీరోయిన్ హాసిని సుధీర్ అందంతో మెప్పించింది. నటనలోనే ఇంకాస్త ఇంప్రూవ్ అవ్వాలి. రమ్యకృష్ణ ఎప్పటిలాగే హుందాగా నటించింది. ప్రకాశ్ రాజ్, విరాన్ ముత్తం శెట్టి, మురళీ శర్మ.. తమ పాత్రల్లో లీనమైపోయారు. మిగతావారు పర్వాలేదనిపించారు. చదవండి: ఆ షోలో అన్నీ నిజమే.. నన్ను తేళ్లు కుట్టాయి: నటి -
'రాయన్' సినిమా రివ్యూ
ధనుష్‌కి తమిళంలో ఉన్నంత క్రేజ్ తెలుగులోనూ ఉంది. 'సార్', 'తిరు' లాంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. అలాంటిది ఇతడు హీరోగా నటించి దర్శకత్వం వహించిన మూవీ 'రాయన్' వస్తుందంటే ఆ మాత్రం అంచనాలు ఉంటాయి కదా! అందున ఇది ధనుష్‌కి 50వ మూవీ. ఇంతకీ ఇది ఎలా ఉంది? హిట్ కొట్టాడా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కాతవరాయన్ (ధనుష్) చిన్నతనంలోనే తల్లిదండ్రులు కనిపించకుండా పోతారు. దీంతో ఉన్న ఊరిని వదిలిపెట్టి ఇద్దరు తమ్ముళ్లు, చెల్లితో వేరేచోటకు వలస పోతాడు. పెద్దయిన తర్వాత ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకుని బతికేస్తుంటాడు. సాఫీగా సాగిపోతున్న ఇతడి జీవితం.. అదే ఊరిలో పేరు మోసిన గూండాలు దురై, సేతు వల్ల తల్లకిందులవుతుంది. ఓ టైంలో సొంత తమ్ముడే.. రాయన్ని చంపాలనుకుంటాడు. ఇలా జరగడానికి కారణమేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.ఎలా ఉందంటే?హీరో కమ్ దర్శకుడిగా ధనుష్.. ఈ పాయింట్ చాలు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవడానికి. కానీ యాక్టర్‌గా న్యాయం చేసిన ధనుష్.. రైటర్ కమ్ డైరెక్టర్‌గా విఫలమయ్యాడు. కథగా చూసుకుంటే 'రాయన్' పాతదే. ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా స్టోరీలతో మూవీస్ చాలానే వచ్చాయి. అంతెందుకు ఇలాంటి ఫ్లేవర్ ఉన్న స్టోరీల్లో గతంలో ధనుషే హీరోగా నటించాడు.ఫస్టాప్ విషయానికొస్తే.. రాయన్ బాల్యంతో కథ మొదలవుతుంది. ఊరెళ్లి వస్తానని చెప్పిన తల్లిదండ్రులు రాకపోవడం, కొన్ని అనుకోని పరిస్థితుల్లోని ఊరి నుంచి తప్పించుకుని రావడం.. ఇలా ఎక్కడో చూశామే అనిపించిన సీన్లతో టైటిల్స్ పడతాయి. ప్రస్తుతంలోకి వచ్చిన తర్వాత అయినా స్టోరీ కదులుతుందా అంటే అస్సలు కదలదు. రాయన్, అతడి షాప్, తమ్ముళ్లు, వాళ్ల చుట్టూ ఉండే వాతావరణం.. ఇలా బోరింగ్‌గా సాగుతూ ఉంటుంది. కాస్త హై ఇచ్చే ఫైట్ సీన్‌తో ఇంటర్వెల్ పడుతుంది.సెకండాఫ్‌లో అయినా ఏమైనా ఇంట్రెస్టింగ్గా ఉంటుందా అంటే అసలు కన్విన్స్ కాని, లాజిక్ లేని విధంగా స్టోరీ ఉంటుంది. మధ్య మధ్యలో వచ్చే ఫైట్ సన్నివేశాలు మినహా 'రాయన్' పూర్తిగా నిరాశపరుస్తుంది. పాత్రల మధ్య డ్రామా సరిగా వర్కౌట్ కాలేదు. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ తీద్దామనుకున్న ధనుష్.. అసలేం తీశాడో అర్థం కాని విధంగా సినిమా ఉంటుంది. సెకండాఫ్‌లో అన్నదమ్ముల మధ్య చిన్నపాటి ట్విస్ట్ పెట్టి ఏదో మేనేజ్ చేద్దామనుకున్నారు. కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోయింది.ఎవరెలా చేశారు?నటుడిగా ధనుష్ తన పాత్రకు న్యాయం చేశాడు. ఇతడి చెల్లిగా నటించిన దుశరా విజయన్, తమ్ముడిగా చేసిన సందీప్ కిషన్‌కి ఉన్నంతలో మంచి రోల్స్ పడ్డాయి. సెకండాఫ్‌లో హాస్పిటల్లో జరిగే ఫైట్ సీన్లో దుశరా యాక్టింగ్‌కి విజిల్ వేయాలనిపిస్తుంది. విలన్‌గా చేసిన ఎస్జే సూర్య యాక్టింగ్ బాగుంది కానీ కథలో దమ్ము లేకపోవడంతో ఆ పాత్ర తేలిపోయింది. వీళ్లతో పాటు ప్రకాశ్ రాజ్, అపర్ణ బాలమురళి, కాళీదాస్ జయరాం, సెల్వరాఘవన్.. ఇలా మంచి మంచి యాక్టర్స్‌ని పెట్టుకున్నారు. కానీ వీళ్లకు సరైన సీన్స్ పడలేదు. అసలు ఇంతమంది స్టార్స్‌ని సినిమాలో ఎందుకు పెట్టుకున్నారా అనే డౌట్ వస్తుంది.టెక్నికల్ విషయాలకొస్తే పాటలు అస్సలు బాలేవు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల మాత్రమే బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యాక్టర్‌గా ధనుష్‌ని వంకపెట్టడానికి లేదు కానీ దర్శకుడిగా మాత్రం ఫ్లాఫ్ అయ్యాడు. దానికి తోడు 'రాయన్' చూస్తున్నంత సేపు తమిళ ఫ్లేవర్ కనిపిస్తూనే ఉంటుంది. ఇది 'రాయన్' సంగతి!రేటింగ్: 1.75-చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్