‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Vishnu Vinyasam Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

Vishnu Vinyasam Review: ‘విష్ణు విన్యాసం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Feb 27 2026 2:59 PM | Updated on Feb 27 2026 4:08 PM

Vishnu Vinyasam Movie Review And Rating In Telugu

టైటిల్‌: విష్ణు విన్యాసం
నటీనటులు: శ్రీ విష్ణు, నయన సారిక, సత్య, బ్రహ్మాజీ, ప్రవీణ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, సత్యం రాజేష్, శ్రీనివాస్ వడ్లమాని, గోపరాజు రమణ
 తదితరులు
నిర్మాత: సుమంత్ నాయుడు జి
రచన, దర్శకత్వం: యదునాథ్ మారుతీ రావు
సంగీతం: రధన్
సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్
విడుదల తేది: ఫిబ్రవరి 27, 2026

వరస కామెడీ చిత్రాలతో దూసుకెళ్తున్నాడు  శ్రీవిష్ణు. ఆ మధ్య సీరియస్‌ కంటెంట్‌ చిత్రాలు చేసినప్పటికీ..అవి బెడిసి కొట్టాయి. దీంతో తనకు అచ్చొచ్చి కామెడీ జానర్‌లోనే సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకుంటున్నాడు. అదే జోష్‌లో ఇప్పుడు విష్ణు విన్యాసం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. గత సినిమాల మాదిరే విష్ణు విన్యాసం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందా? శ్రీవిష్ణు ఖాతాలో మరో హిట్‌ పడిందా లేదా? రివ్యూలో చూద్దాం.

కథేంటంటే..
విష్ణు(శ్రీవిష్ణు) ఓ జూనియర్‌ లెక్చరర్‌. జాతకాల పిచ్చి. ఎంతలా అంటే.. వాస్తు బాగోలేదని పక్కింటి వాళ్ల ఇంట్లోని వాష్‌రూమ్‌ని వాడుకునేంత. తనకున్న మూఢనమ్మకాల పిచ్చితో 30 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోడు. అతన్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడుతుంది మరో లెక్చరర్‌ మనీషా(నయనసారిక). ఆమె అలవాటు, ప్రవర్తన చాలా విచిత్రంగా ఉన్నప్పటికీ.. విష్ణు కూడా ఆమెను ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యే ముందు మనీషా ఓ నిజాన్ని రివీల్‌ చేస్తుంది. అదేంటి? ఆ నిజం తెలిసిన తర్వాత వీరిద్దరి లవ్‌స్టోరీలో వచ్చిన మలుపులు ఏంటి? చివరికి విష్ణు, మనీషాలు పెళ్లి చేసుకున్నారా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..
ఈ సినిమా కాన్సెప్ట్‌ కొత్తదేమి కాదు. రాజేంద్ర ప్ర‌సాద్ ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’ మొదలు మొన్నటి ప్రియదర్శి ‘సారంగపాణి’ వరకు జాతకం కాన్సెప్ట్‌తో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. అలాగే ఇందులో ఉన్న హీరోయిన్‌ సమస్య కూడా పాతదే. ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ తెరకెక్కించిన ఓ సూపర్‌ హిట్‌ సినిమాలో ఆ పాయింట్‌ టచ్‌ చేశారు. ఇలా పాత కాన్సెప్ట్‌ని ఎంచుకొని.. శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా సీన్లను రాసుకొని జెంజీ బ్యాచ్‌ని ఆకట్టుకునేలా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు యధునాథ్ మారుతీ రావు. కథ, కథనం కంటే  శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ పైనే  ఎక్కువ దృష్టి పెట్టాడు. అతనితో పలికించిన వన్ లైన్ పంచులు సినిమాకు ప్లస్‌ అయ్యాయి.  కానీ కథకి ఆడియన్స్‌ కనెక్ట్ అవ్వకపోవడంతో ఆ కామెడీని కూడా పూర్తిగా ఎంజాయ్‌ చేయలేకపోయారు. 

హీరోయిన్‌కి ఏదో పెద్ద సమస్య ఉన్నట్లుగా చూపిస్తూ సినిమాను ప్రారంభించారు. ఆ తర్వాత పెళ్లి చూపుల సీన్‌తో హీరోని పరిచయం చేశారు. హీరోకి జాతకాల పిచ్చి ఉండడం.. ప్రతి పనికి గురువు(శ్రినివాస్‌ రెడ్డి)గారి అనుమతి తీసుకోవడం..ఇందంతా కొంతవరకు నవ్విస్తుంది. ఇక కాలేజీలో హీరోహీరోయిన్లు కలిసినప్పటి నుంచి అసలు కథ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌ వింతగా ప్రవర్తించడం.. దానికి తోడు శ్రీవిష్ణు వేసే వన్‌లైనర్‌ పంచ్‌లు.. కొంతమేర ఎంటర్‌టైన్‌ చేస్తాయి. హీరోయిన్‌ సమస్య ఏంటనేది ఇంటర్వెల్‌ వరకు చెప్పకపోవడంతో కథనంపై ఆసక్తి  పెరుగుతుంది. 

కానీ ఆ సమస్య తెలిసిన తర్వాత మాత్రం ఉన్న కాస్త ఆసక్తి కూడా తగ్గిపోతుంది. సోష‌ల్ మీడియాలోని మీమ్స్ వాడుకొని విష్ణు కొంత కామెడీ చేసే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ సరైన కంటెంట్‌ లేకపోవడంతో అది కూడా పూర్తిగా వర్కౌట్‌ కాలేదు. హీరోహీరోయిన్ల లవ్‌ట్రాక్‌తో పాటు శ్రీవిష్ణు చేసే  కామెడీ అంతా కూడా ఆర్గానిక్‌గా అనిపిస్తుంది. కథలో నుంచి కామెడీ పుట్టించే ప్రయత్నం చేయకుండా..కేవలం సంభాషణలతోనే నవ్వించే ప్రయత్నం చేశారు.  అవి జెంజీ బ్యాచ్‌ని ఎంటర్‌టైన్‌ చేస్తాయి. 

ఎవరెలా చేశారంటే..
ఎప్పటిమాదిరే శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో అదరగొట్టేశాడు. ఆయన హవాభావాలు, సంభాషణలు అన్నీ కొంతవరకు నవ్విస్తాయి. మనీషా పాత్రకి నయ‌న సారిక న్యాయం చేసింది. కమెడియన్‌ సత్య కొంతవరకు నవ్వించే ప్రయత్నం చేశాడు కానీ ఆయనను సరిగా వాడుకోలేకపోయారనిపించింది. మురళీ శర్మ, గోపరాజు రమణ రెగ్యులర్‌ పాత్రల్లో కనిపించారు. బ్ర‌హ్మాజీ, స‌త్యం రాజేష్‌, శ్రీ‌నివాస‌రెడ్డితో పాటు మిగిలినవారంతా తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. రధన్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. టైటిల్‌ సాంగ్‌ మిగతా మిగతావేవి అంతగా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ క్రిస్పీగా ఉంది. సినిమా నిడివి తక్కువగా ఉండడం(2:07 గంటలు)  ప్లస్‌ అయింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement