హోంబలే ఫిల్మ్స్ బిగ్‌ ప్లాన్‌.. బరిలోకి దిగిన నిర్మాతలు | Hombale Films Enters Overseas Distribution To Take Indian Cinema Global, Check Out Post Inside | Sakshi
Sakshi News home page

హోంబలే ఫిల్మ్స్ బిగ్‌ ప్లాన్‌.. బరిలోకి దిగిన నిర్మాతలు

Feb 27 2026 2:38 PM | Updated on Feb 27 2026 2:54 PM

Hombale Films Enter In Overseas Distribution market

కేజీఎఫ్‌, కాంతారా, సలార్‌ వంటి చిత్రాలను నిర్మించిన హోంబలే ఫిల్మ్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు భారత్‌కు పరిమితమైన ఈ బ్యానర్‌ ఇప్పడు అంతర్జాతీయ మార్కెట్‌పై కన్నేసింది. 2012లో విజయ్ కిరగందూర్, చలువే గౌడ  నేతృత్వంలో మొదలైన ఈ సంస్థ  పునీత్ రాజ్‌కుమార్‌తో తొలి సినిమా తెరకెక్కించి భారీ కలెక్షన్స్‌ కొల్లగొట్టారు. ఆ తర్వాత కేజీఎఫ్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో గుర్తింపు పొందింది.

తాజాగా హోంబలే ఫిల్మ్స్ ఒక పోస్ట్‌ చేసింది  ఓవర్సీస్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. వాస్తవంగా అక్కడ బలమైన మార్కెట్‌ ఉన్నప్పటికీ సరైన డిస్ట్రిబ్యూషన్ లేదని పరిశ్రమకు చెందిన వారే అంటుంటారు. ఇలాంటి సమయంలో అతిపెద్ద నిర్మాణ సంస్థ ఈ వ్యాపారంలోకి ఎంట్రీ ఇవ్వనున్నడంతో అంచనాలు పెరిగాయి. భారతీయ కథలను ప్రపంచంలోని ప్రతి మూలకు చేరవేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ నిర్ణయంతో భారతీయ సినిమాలు ముఖ్యంగా దక్షిణాది చిత్రాలు ఓవర్సీల్‌లో భారీ సంఖ్యలో విడుదలయ్యే ఛాన్స్‌ రానుంది.

హోంబాలే ఫిల్మ్స్ సంస్ధ ఇప్పటికే పలు చిత్రాలను భారత్‌లో పంపిణీ చేసింది. మహావతార నరసింహ, మిరాయ్‌, L2: ఎంపురాన్ వంటి చిత్రాలను ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేసి విజయం సాధించింది.  కాగా ,ప్రస్తుతం హోంబలే ఫిల్మ్స్ చేతిలో కాంతార ప్రీక్వెల్‌తో పాటు సలార్ 2, కేజీఎఫ్‌-3, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న 'డ్రాగన్' వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement