గతకొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న విజయ్ దేవరకొడ- రష్మిక మందన్నా జంట మూడు ముళ్ల బంధంలో అడుగుపెట్టారు. ఫిబ్రవరి 26న వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని మెమొంటోస్ ప్యాలెస్ ఈ వివాహ వేడుకకు వేదికగా నిలిచింది. ఈ పెళ్లి సెలబ్రేషన్స్‌కు ఇరు కుటుంబ సభ్యులతో పాటు దగ్గరి బంధుమిత్రులు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు.
ఇది నా అదృష్టం
వారిలో మలయాళ హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్ ఒకరు. విరోష్ (విజయ్-రష్మిక జంటను ఫ్యాన్స్ ముద్దుగా విరోష్ అనే పిల్చుకుంటారు) జంట పెళ్లి చూడటం తన అదృష్టమంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఓ పోస్ట్ పెట్టింది. ఎంతో మంచి మనసున్న అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్‌ను పెళ్లాడిన మధుర క్షణాలను కళ్లారా చూశాను. ఆమె అతడివైపు అడుగులు వేస్తూ వస్తున్నప్పుడు అతడు స్తబ్ధుగా కూర్చుని ఆ శబ్ధాన్ని వింటున్నాడు.
ఆనంద భాష్పాలు
ఆమె అలా మండం వైపు వస్తుంటే ఇద్దరి కళ్లలో కనిపించిన ఆనంద భాష్పాలు వారి మధ్య ప్రేమను తెలియజేస్తున్నాయి. డీప్ ఫ్రెండ్‌షిప్, పరస్పర గౌరవంతో ఒక్కటైన ఈ జంటను ఇలా చూడటం నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాను. రష్మిక- విజయ్‌కు ఇది మరో అందమైన ప్రారంభం అని రాసుకొచ్చింది.


