పెళ్లి తర్వాత మోదీ, అమిత్‌ షాలను కలిసిన 'విరోష్‌' జోడీ | Vijay Deverakonda And Rashmika Mandanna Invites PM Modi And Amit Shah For Wedding Reception, Photos Viral On Social Media | Sakshi
Sakshi News home page

పెళ్లి తర్వాత మోదీ, అమిత్‌ షాలను కలిసిన 'విరోష్‌' జోడీ

Feb 27 2026 12:14 PM | Updated on Feb 27 2026 12:28 PM

Vijay Deverakonda And rashmika Invite Modi for wedding reception

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఏడడుగుల బంధంతో  ఒక్కటయ్యారు. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో ఎక్కడ చూసినా సరే ‘విరోష్‌’ జోడీ పేరుతో  వారి ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. నిన్న ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగిన విషయం తెలసిందే. అయితే, మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్‌కు రావాలని ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్రమంత్రి అమిత్‌ షాను విజయ్‌, రష్మిక ఆహ్వానించారు. పెళ్లి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత  నూతన దంపతులు కలిసి అహ్వానం అందించారు. ఇప్పటికే వారిద్దరికీ శుభాంకాక్షలు చెబుతూ మోదీ ఒక లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో రిసెప్షన్ జరగునుంది. ఈ రిసెప్షన్ కోసం ఇప్పటికే పలువురు రాజకీయ సినీ వ్యాపారవేత్తలను  విజయ్,  రష్మిక ఆహ్వానించారు.

‘గీత గోవిందం’ సినిమాలో హీరో హీరోయిన్లుగా పెళ్లి పీటల మీద కూర్చున్న విజయ్‌ దేవరకొండ – రష్మికా మందన్నా నిజ జీవితంలో ఏడడుగులు వేశారు. ముందు స్నేహితులై, ఆ తర్వాత ప్రేమికులుగా మారి ఇప్పుడు భార్యాభర్తలయ్యారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల మెమెంటోస్‌ ప్యాలెస్‌లో ఉదయం 10 గంటల 10 నిమిషాలకు వైభవంగా, ఆహ్లాదకరంగా జరిగింది. ఉదయం తెలుగు, సాయంత్రం కొడవ (కర్ణాటకకు చెందిన కొడగు జిల్లా రష్మిక సొంతూరు) సంప్రదాయం పరంగా పెళ్లి వేడుకలు జరిగాయి. దండలు మార్చుకున్నప్పుడు వధూవరులిద్దరూ ఆనందబాష్పాలతో ఉద్వేగానికి గురయ్యారు. భావోద్వేగాలు, చిరునవ్వులు మధ్య జరిగిన ఈ వివాహ వేడుకల్లో పాల్గొన్నవారు నూతన వధూవరులిద్దర్నీ ఆశీర్వదించారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement