నేటి నుంచి కెనడా ప్రధాని పర్యటన  | Canadian PM Mark Carney to visit India from 27 February to 2 March 2026 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కెనడా ప్రధాని పర్యటన 

Feb 27 2026 5:27 AM | Updated on Feb 27 2026 5:27 AM

Canadian PM Mark Carney to visit India from 27 February to 2 March 2026

ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్న మార్క్‌ కార్నీ 

న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి మార్క్‌ కార్నీ నాలుగు రోజుల భారత పర్యటన శుక్రవారం మొదలుకానుంది. భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని కార్నీల మధ్య చర్చలు ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో విజయం సాధించనున్నాయని భారత్‌ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కార్నీ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 

2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్‌సింగ్‌ నిజ్జర్‌ హత్య తర్వాత ఇరుదేశాల నడుమ సంబంధాలు పూర్తిగా క్షీణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్సంబంధాల బలోపేతం కోసం కార్నీ భారత్‌లో పర్యటిస్తున్నారు. జూన్‌లో కననాస్కీస్, నవంబర్‌లో జొహన్నెస్‌బర్గ్‌లో ఇరుదేశాల అగ్రనేతల భేటీల తర్వాత రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా పలు రంగాల్లో సహకారంపై మోదీ, కార్నీలు చర్చించనున్నారు. ఇరునేతలు సోమవారం ఇండియా–కెనడా సీఈవో ఫోరమ్‌లో పాల్గొంటారు. తర్వాత వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భూఅయస్కాంతాలు, వ్యవసాయం, విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాల వంటి అంశాల్లో సహకారంపై చర్చలు జరపున్నారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement