breaking news
Canada
-
కెనడాలో పంజాబ్‌కు చెందిన మహిళ దారుణ హత్య
కెనడాలో ఎడ్మింటన్‌లో దారుణం చోటు చేసుకుంది. భారత సంతతికి చెందిన 23 ఏళ్ల దమన్ ప్రీత్ కౌర్ దారుణ హత్య కలకలం రేపింది. ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.ఎడ్మంటన్ పోలీసుల సమాచారం ప్రకారం బాధితురాలు, జూలై 9న పంజాబ్‌లోని లుధియానా జిల్లా, సమ్రాలా నివాసి దమన్ ప్రీత్‌కౌర్ స్పృహలేకుండా, తీవ్ర గాయాలతో పడి ఉందనే సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆగ్నేయ ఎడ్మంటన్‌లోని సిల్వర్బెర్రీ నివాస ప్రాంతానికి చేరుకుని ఆమెను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కౌర్ కన్నుమూసింది. ఇది హత్యేనని పోస్ట్ మార్టంలో నివేదిక ద్వారా ధృవీకరణ అయింది. ఈ కేసులో గత కొన్నాళ్లుగా దమన్ ప్రీత్ కౌర్‌తో కలిసి నివసిస్తున్న (Live-in Partner) ఢిల్లీకి చెందిన 22 ఏళ్ల రీతీష్ కమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనే గొంతు నులిమి చంపినట్టు భావిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో వేరే అనుమానితులు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు. 'సెకండ్ డిగ్రీ మర్డర్' ఆరోపణలు నమోదు చేశారు.మరోవైపు కౌర్ మృతదేహాన్ని భారతదేశంలోని ఆమె స్వగ్రామానికి తరలించడానికి, అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబ సభ్యులకు సహాయంగా ఒక GoFundMe క్యాంపెయిన్ ప్రారంభించారు. 20 వేల డాలర్లకు గాను ఇప్పటికే దాదాపు 19వేల డాలర్ల విరాళాలు అందాయి. ఇదీ చదవండి: 150 పిజాలు, రూ. 75 వేలు : జంతర్ మంతర్‌లో మానవత్వపు పరిమళాలు -
కెనడాపై ట్రంప్ టారిఫ్ కొరడా
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పొరుగు దేశం కెనెడాపై మరోసారి టారిఫ్‌ల కొరడా ఝళిపించారు. అమెరికాలో తయారయ్యే వాహనాలు, మద్యం, పాల ఉత్పత్తులపై కెనెడా వివక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ ఆ దేశపు దిగుమతులు అత్యధికంపై యాభై శాతం టారిఫ్ విధిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. కొత్త పన్నులు మరో ముప్ఫై రోజుల్లో అమల్లోకి రానున్నాయి. ఈ పరిణామం కాస్తా ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న ఇరుదేశాల సంబంధాలను మరింత దిగజార్చడమే కాకుండా ఆర్థిక గందరగోళానికి దారితీస్తుందని అంచనా. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ట్రంప్ పలు దేశాలపై టారిఫ్‌లతో విరుచుకుపడగా చైనా, కెనెడాలు మాత్రమే ప్రతీకార పన్నులను విధించిన విషయం తెలిసిందే.ఈ కారణంగానే కెనెడాకు బుద్ది చెప్పాలని ట్రంప్ తాజా టారిఫ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా పేరు చెప్పేందుకు ఇష్టపడని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. టారిఫ్‌లను ప్రకటిస్తూ ట్రంప్ మూడు ఉత్తర్వులపై సంతకాలు చేశారని, అది కూడా 1930 నాటి వాణిజ్య చట్టంలోని వివాదాస్పద సెక్షన్ 338 కింద ఉత్తర్వులు వెలువడ్డాయని ఆ అధికారి తెలిపారు. ఆర్థిక వ్యవస్థను అస్థిరపరిచేందుకు ట్రంప్ వాడే అవకాశం ఉన్నందున ఈ సెక్షన్‌ను రద్దు చేయాలని డెమోక్రాటిక్ పార్టీ ప్రతినిధులు ఏడాదిగా కోరుతున్నారు. ట్రంప్ కొత్తగా విధించిన టారిఫ్‌ల నుంచి ఇంధన ఉత్పత్తులు, పొటాష్, చేపలు, కొన్ని కీలకమైన ఖనిజాలకు మాత్రమే మినహాయింపు ఉంది.దిగుమతి పన్నుల విషయమై జరిగిన యునైటెడ్ స్టేట్స్–మెక్సికో–కెనెడా ఒప్పందంలో రక్షణ కల్పించిన వస్తువులకు కొత్త టారిఫ్‌లు వర్తిస్తాయని అమెరికా చెబుతోంది. అయితే ఈ ఒప్పందం 2020లోనే ముగియడం తదుపరి పునరుద్ధరించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా ఉంది. తాజా టారిఫ్‌లపై కెనెడా ఇప్పటివరకూ స్పందించలేదు కానీ... ఒంటారియో అధ్యక్షుడు డగ్ ఫోర్డ్ మాత్రం ఈ నిర్ణయం కాస్తా వాణిజ్య పోరుకు దారితీసే అవకాశముందని వ్యాఖ్యానించారు.ప్రతి అదనపు టారిఫ్‌కు కెనెడా దీటుగా ప్రతి టారిఫ్‌లు విధిస్తుందని ఫోర్డ్ తన సోషల్‌మీడియా పోస్టులో తెలిపారు. కెనెడా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సీఈఓ కాన్డేస్ లియాంగ్ కూడా ట్రంప్ నిర్ణయం దురదృష్టకరమని చెబుతూ కొత్త టారిఫ్‌లు అమల్లోకి వచ్చేందుకు 30 రోజుల గడువు ఉన్నందున ఏమైనా జరగవచ్చునని అన్నారు. మరోవైపు కెనెడాపై విధించిన తాజా టారిఫ్‌లు అంతార్జతీయంగానూ ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చునని కాటో ఇన్స్టిట్యూట్కు చెందిన స్కాట్ లిన్సికోమ్ ఆందోళన వ్యక్తం చేశారు. ట్రంప్ ముందు బోలెడన్ని రిస్‌్కలు కెనెడాపై విధించిన తాజా టారిఫ్‌లు రాజకీయంగా, ఆర్థికంగానూ ట్రంప్‌కు ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పించవచ్చునని పరిశీలకుల అంచనా. నవంబరులో మధ్యంతర ఎన్నికలు జరుగుతూండటం ఒక కారణం. గత ఏడాది లిబరేషన్ డే సందర్భంగా విధించిన పన్నులు స్టాక్మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో ట్రంప్ టారిఫ్‌లపై వెనక్కు తగ్గారు. ఈ సారి ఏం చేస్తారన్నది వేచి చూడాల్సిందే. -
వీడియో కాల్స్‌లో కాదు : ఆరేళ్ల కెనడా జీవితాన్ని వీడి ఇండియాకు
ఉన్నత చదువులకోసం విదేశాలకు ఎగిరిపోవడం, వేల డాలర్లు సంపాదిస్తూ అక్కడే సెటిల్ అయిపోవడం సర్వసాధారణం. అలాగే వృద్ధులైన తల్లి దండ్రులను సైతం పట్టించుకోకుండా, వారిని వృద్ధాశ్రమాల్లో చేర్పించడం లాంటి హృదయవిదారకమైన కథనాలను చాలా చదివాం. కానీ విదేశాల్లోని సౌకర్యవంతమైన జీవితం కంటే, తల్లిదండ్రులకు భౌతికంగా దగ్గరగా ఉండటమే ముఖ్యం అని భావించి, కెనడా నుంచి బెంగళూరుకు తిరిగి వచ్చిన కొడుకు గురించి విన్నారా?పదండి వివరాలు తెలుసుకుందాం ఈ కథనంలో. కెనడాలో ఉన్నత ఉద్యోగాన్ని వీడి, వయోవృద్ధులైన తన తల్లిదండ్రులను చూసుకునేందుకు భారత్‌కు తిరిగి వచ్చేశారు టెకీ రమేష్ ఎన్.ఎన్. ఈయన ప్రస్తుతం బెంగళూరులోని 'కోర్సెంట్రిక్' (Corcentric) ఐటీ సంస్థలో ఇంజనీరింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వేల కిలోమీటర్లు దూరంలో ఉంటూ వీడియో కాల్స్ ద్వారా చూస్తూ కాలం గడపడం కంటే, కుటుంబంతో రోజూ గడిపే క్షణాలు ఎంతో విలువైనవని, కుటుంబంతో గడిపే సమయాన్ని ఎప్పటికీ వాయిదా వేయలేమని ఆయన తన లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్‌లో పంచుకున్నారు. దీంతో ఇది సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది. విదేశాలలోని సౌకర్యాలు, ఊహించదగిన జీవితం వదులుకోవడం, ఇక్కడి మౌలిక వసతులకు మళ్లీ అలవాటు పడటం కొంత కష్టంగా అనిపించినా, కుటుంబం ఇచ్చే తృప్తి ముందు అవేవీ పెద్ద కష్టంగా అనిపించలేదని రమేష్ చెప్పుకొచ్చారు. అలాగే భారత్‌కు రావడం కెరీర్‌కు ఎటువంటి ఆటంకం కలిగించలేదని, పైగా బెంగళూరులోని టెక్నాలజీ, స్టార్టప్ వాతావరణం, ప్రతిభా వంతులైన నెట్వర్క్ తనకు మరింత ఉత్తేజాన్నిచ్చాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలిఈ పోస్ట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు విశేషంగా స్పందించారు. విదేశాల్లో జీవితం, సంపాదన కాదు, మనం కుటుంబంతో పెంచుకునే అనుబంధాలే నిజమైన విజయానికి నిర్వచనమని నెటిజన్లు వ్యాఖ్యానించారు. మొదటి ఏడాది సర్దుబాటు కావడం కష్టంగా ఉన్నప్పటికీ, ఆ తర్వాత ఇక్కడి జీవితంతో చాలా ప్రశాంతత లభించిందని 2015లో అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన మరొక టెకీ స్పందించడం విశేషం.ఇదీ చదవండి: ఉద్యోగిని పెర్ఫామెన్స్ బాలేదని పెయిడ్ లీవ్ : కంపెనీకి భారీ క్రేజ్10 వేల మెట్లు, నలుగురు మనుషులు : భారీ కాయుడి డోలీ వీడియో వైరల్ -
హీరోయిన్లకు పోటీ ఇచ్చేంత అందంగా స్టార్ సింగర్ (ఫొటోలు)
-
అంతర్జాతీయ వేదికపై పాక్ పరువు పాయే!
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందం (ఐడబ్ల్యూటీ)పై కెనడా విదేశాంగ మంత్రితో పాకిస్తాన్ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఐడబ్ల్యూటీతో పాటు, కశ్మీర్ అంశంలో జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ కెనడాను కోరారు. అయితే కెనడా విదేశాంగ మంత్రితో జరిగిన ఈ సమావేశం అనంతరం ఇరు దేశాల సంయుక్త ప్రకటనలో సింధు జలాల ఒప్పందం గానీ, కశ్మీర్ అంశం గానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.అంతర్జాతీయ వేదికలపై నిత్యం భారత్‌పై నిందలు మోపే పాకిస్తాన్ ప్రయత్నాలకు కెనడాలో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెనడా పర్యటనలో ఉన్న పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆ దేశ విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘిస్తోందని, దీనిపై అంతర్జాతీయంగా ఒత్తిడి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా కశ్మీర్ వివాదంలోనూ మధ్యవర్తిత్వం వహించాలని కోరినట్లు సమాచారం.అయితే, దౌత్య సంబంధాల పరంగా పాక్ అభ్యర్థనలను కెనడా పెద్దగా పట్టించుకోలేదని స్పష్టమైంది. భేటీ ముగిసిన తర్వాత విడుదల చేసిన అధికారిక సంయుక్త ప్రకటనలో కశ్మీర్, సింధు జలాల వివాదం గురించి కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు. దీంతో అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మరోమారు పరువు తీసుకున్నట్లయ్యింది.ఇది కూడా చదవండి: అభిషేక్ బెనర్జీకి హైకోర్టు షాక్ .. కంటి చికిత్సకు సలహా! -
కెనడాకు ట్రంప్ షాక్.. 50 శాతం టారిఫ్‌ల మోత
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పన్నుల మోత మోగించారు. కెనడాకు చెందిన కొన్ని రకాల వస్తువులపై 50 శాతం మేర దిగుమతి సుంకాలను విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ కొత్త పన్నులు 30 రోజుల్లో అమల్లోకి రానున్నట్లు పేర్కొన్నారు.కెనడా,అమెరికాకు చెందిన ఆల్కహాల్ , ఆటోమొబైల్స్, డెయిరీ ఉత్పత్తుల విక్రయాల్లో విచక్షణారహితంగా వివక్షతతో కూడిన" వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ దేశ ఉత్పత్తులపై 50 శాతం పన్నులు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు.అయితే ట్రంప్ విధించిన పన్నుల నుంచి ఎనర్జీ ఉత్పత్తులు , పోటాష్, చేపలు,అత్యవసర ఖనిజాలతో పాటు ప్రత్యేక సుంకాల పరిధిలోకి వచ్చే సరుకులకు ఈ కొత్త పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఈ మినహాయించిన ఉత్పత్తులు తప్ప మిగతావన్నీ 'యుఎస్-మెక్సికో-కెనడా రవాణా వాణిజ్య ఒప్పందం' కింద దేశంలోకి ప్రవేశిస్తున్నప్పటికీ, వాటిపై ఈ నూతన సుంకాలు వర్తిస్తాయని వైట్‌హౌస్ స్పష్టం చేసింది.కెనడాలోని అడవుల్లో వస్తున్న భారీ కార్చిచ్చుల వల్ల అమెరికాలోని నగరాల్లో వాయు కాలుష్యం పెరిగిపోతోందని, దానికయ్యే నష్ట పరిహారాన్ని కూడా టారిఫ్‌ల రూపంలో కెనడా నుంచే వసూలు చేస్తామని ట్రంప్ ఇటీవలే హెచ్చరించడం గమనార్హం. -
అంత ఈజీ కాదు.. అందుకే కెనడా నుంచి వచ్చేశా!
అమెరికా, కెనడా, యూరప్ వంటి దేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించి.. మంచి జీవితాన్ని గడపాలని చాలా మంది భారతీయులు కలలు కంటారు. ఈ కారణంగానే ప్రతి ఏటా వేలాదిమంది దేశం విడిచి వెళుతుంటారు. అయితే.. విదేశాల్లో జీవితం అందరికీ ఒకేలా ఉండదు అంటున్నారు వ్యాపారవేత్త 'హర్ష్ గుప్తా'. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హర్ష్ గుప్తా సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాలు ప్రకారం.. తాను పర్మినెంట్ రెసిడెన్సీతో కెనడాలోని టొరొంటోకు వెళ్లారు. కానీ అక్కడ కేవలం 18 నెలలు మాత్రమే ఉండి, తిరిగి భారత్‌కు వచ్చేశారు. తాను తిరిగి ఇండియాకు ఎందుకు తిరిగి వచ్చారో.. చెప్పిన కారణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి.ఉద్యోగంహర్ష్ గుప్తా చెప్పిన మొదటి కారణం ఉద్యోగాల గురించి. చాలామంది అనుకునేలా కెనడాలో మంచి ఉద్యోగం సులభంగా దొరకదు. ఒక్కో ఉద్యోగానికి వేల సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటారు, పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుందని వివరించారు. అందరూ అనుకునేలా జీతాలు పెద్ద స్థాయిలో ఉండవని, కొన్ని పెద్ద కంపెనీలు మాత్రమే ఎక్కువ జీతాలు ఇస్తాయని పేర్కొన్నారు.జీవన వ్యయంజీవన వ్యయం కూడా ఇబ్బందిగా ఉంటుందని హర్ష్ గుప్తా పేర్కొన్నారు. టొరొంటోలో చిన్న అపార్ట్మెంట్కే నెలకు దాదాపు రెండు లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి వచ్చిందని చెప్పారు. తాను నెలకు దాదాపు పది లక్షల రూపాయలు సంపాదించినప్పటికీ, అందులో సగం వరకు పన్నులకే వెళ్లిపోయేదని అన్నారు. అందుకే ఎక్కువ సంపాదించినా.. చేతిలో మిగిలేది అంతంత మాత్రమే అని వెల్లడించారు.ఆరోగ్య సేవలుఆరోగ్య సేవల విషయంలో కూడా మంచి అనుభవం రాలేదని ఆయన పేర్కొన్నారు. ఒక ఫ్యామిలీ డాక్టర్‌ను పొందడానికి ఆరు నెలలు ఎదురుచూడాల్సి వచ్చిందని, స్పెషలిస్ట్ డాక్టర్‌ను కలవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టేదని తెలిపారు. అందువల్ల ప్రభుత్వ వైద్య వ్యవస్థ గురించి బయట వినిపించేంత సౌకర్యం తనకు కనిపించలేదని హర్ష్ గుప్తా చెప్పారు.కెనడాలోని చలి వాతావరణం కూడా పెద్ద సమస్య అని హర్ష్ పేర్కొన్నారు. అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు ఎక్కువగా చలి ఉండటంతో బయట తిరగడం కష్టమవుతుందని, రోజంతా చలికోట్లు వేసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఈ కారణంగా చాలామందికి ఒంటరితనం, నిరుత్సాహం కూడా కలుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.హర్ష్ గుప్తా చెప్పిన విషయాలతో అందరూ ఏకీభవించలేదు. కొందరు నిజంగానే కెనడాలో ఇంటి అద్దెలు, పన్నులు, ఉద్యోగ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని చెప్పినప్పటికీ.. మరికొందరు మాత్రం కెనడాలో ప్రశాంతమైన జీవితం, మంచి భద్రత, పిల్లలకు మంచి విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం లభిస్తాయని చెప్పారు. కుటుంబంతో జీవించడానికి కెనడా చాలా మంచి దేశమని మరికొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. విదేశాలు కొందరికి విజయాన్ని అందిస్తే, మరికొందరికి అనేక ఇబ్బందులను కూడా చూపిస్తాయని ఇంకొందరు అన్నారు.ఇదీ చదవండి: ఇలా చేస్తే.. ట్రైన్ మొత్తం బుక్ చేసుకోవచ్చు! -
అమెరికా, కెనడాపై సస్పెన్షన్ కొనసాగింపు
స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో జరిగిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక సదస్సులో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అమెరికా క్రికెట్ (USAC), క్రికెట్ కెనడాపై ఇప్పటికే అమల్లో ఉన్న సస్పెన్షన్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. ఫ్రాన్స్ క్రికెట్‌కు నోటీసు జారీ చేసింది. అలాగే మారిషస్ క్రికెట్ ఫెడరేషన్‌కు అసోసియేట్ సభ్యత్వాన్ని మంజూరు చేశారు.మారిషస్‌కు సభ్యత్వం లభించడంతో ఐసీసీ మొత్తం సభ్య దేశాల సంఖ్య 111కు చేరింది. ఇందులో 12 పూర్తి సభ్య దేశాలు, 99 అసోసియేట్ సభ్య దేశాలు ఉన్నాయి.2025 సెప్టెంబర్ నుంచి అమెరికా క్రికెట్ సస్పెన్షన్‌లో ఉంది. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నేపథ్యంలో అమెరికా క్రికెట్‌కు సభ్యత్వ పునరుద్ధరణ ప్రాధాన్యతపై సమావేశంలో చర్చ జరిగినప్పటికీ, దీనిపై తుది నిర్ణయాన్ని ఐసీసీ వాయిదా వేసింది. ప్రస్తుతానికి సస్పెన్షన్ యథాతథంగా కొనసాగనుంది.క్రికెట్ కెనడా విషయానికొస్తే, ఆ సంస్థలోని కొన్ని అంతర్గత సమస్యలను పరిష్కరించిన తర్వాతే తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే అమెరికా నిర్వహిస్తున్న మేజర్ లీగ్ క్రికెట్ (MLC)లో కెనడా జట్టును చేర్చే ప్రతిపాదనపై కూడా ఐసీసీ దృష్టి సారించినట్లు సమాచారం.మరోవైపు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను 12 జట్లకు విస్తరించి అఫ్గానిస్థాన్, జింబాబ్వే, ఐర్లాండ్లను చేర్చే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే వన్డే క్రికెట్‌ను 40 ఓవర్లకు కుదించే ప్రతిపాదనపై కూడా స్పష్టత రాలేదు. జూలై 8న ప్రారంభమైన ఐసీసీ వార్షిక సదస్సు జూలై 11న ముగిసింది. -
భారత్‌కు ‘క్లీన్ చిట్’
మూడేళ్లుగా భారత్‌ను వెన్నాడుతున్న ఒక నీలాపనింద తొలగిపోయింది. కెనడాలో ‘గుర్తు తెలియని వ్యక్తుల’ చేతుల్లో హత్యకు గురైన ఖలిస్తానీ ఉద్యమకారుడు హర్దీప్ సింగ్ నిజ్జార్ ఉదంతంలో మన ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం లేదని నిగ్గుదేలినట్టు బుధవారం అమెరికా, కెనడా ప్రకటించాయి. భారత అధికారుల కనుసన్నల్లోనే నిజ్జార్ హత్య జరిగిందంటూ కెనడా పార్లమెంటులో 2023లో అప్పటి ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. దాంతోపాటు ఇరుదేశాలూ దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించు కున్నాయి. ట్రూడో ఆరోపణలు దురుద్దేశపూర్వకం, నిరాధారం అని మన ప్రభుత్వం కొట్టిపారేసింది. చివరకు అదే రుజువైంది. కెనడాలో సిక్కు ఓట్లు పొందటం కోసం ఖలిస్తానీవాదుల్ని సంతోషపరచటానికే ట్రూడో భారత్‌పై ఆరోపణ చేశారని అప్పట్లో మన ప్రభుత్వం విమర్శించింది. అయితే భారత్ కేంద్రంగా ఖండాంతరాల్లో మూడు నేరస్త ముఠాలు పనిచేస్తున్నాయని, ఇవి తమ దేశంలోనూ, కెనడాలోనూ, యూరప్‌లోనూ హత్యలకూ, బెదిరింపులకూ, మాదకద్రవ్యాల వ్యాప్తికీ కారణమవుతున్నాయని అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ ప్రకటించటం మన పోలీసు, నిఘా వ్యవస్థల పనితీరును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఎందుకంటే ఈ నేరాల సూత్రధారుల్లో ఒకడైన లారెన్స్ బిష్ణోయ్ గుజరాత్‌లోని సబర్మతీ జైల్లో ఉన్నాడు. మరొక వ్యక్తి జగ్గూ భగవాన్‌పురియా అస్సాం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ జైళ్లనుంచే చెరో ముఠాకూ నాయకత్వం వహిస్తూ అంతర్జాతీయ కార్యకలాపాలు నడుపుతున్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. మరో వ్యక్తి రవిందర్‌సింగ్ ధండ్సా కెనడాలోనూ... బిష్ణోయ్ ముఠాలోని సతీందర్సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ అమెరికాలోనూ తప్పించుకు తిరుగుతున్నారు. వీరిలో గోల్డీ బ్రార్‌ను పట్టిస్తే 50,000 డాలర్లిస్తామని ఎఫ్‌బీఐ చెప్పడం గమనించదగ్గది. మొత్తంగా 37 మంది నిందితుల్లో 24 మందిని అమెరికా, కెనడా, యూరప్‌లు ఉమ్మడిగా సాగించిన ‘ఆపరేషన్ హార్డ్‌బాల్’లో అరెస్టు చేశారు. వీరంతా అమెరికా, కెనడా, బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లలో కార్యకలాపాలు సాగిస్తున్నారు. ప్రపంచీకరణ తర్వాత ఇతరత్రా అభివృద్ధి మాటేమోగానీ... నేర ముఠాల కార్యకలా పాలు ఊహాతీతంగా విస్తరించాయి. ఖండాంతరాలకు వ్యాపించాయి. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో చంద్రబాబు ఏలుబడిలో నక్సలైట్లను అరికట్టే పేరిట నయీం చేసిన అకృత్యా లకు అంతులేదు. అతగాడు తెలంగాణ ఉద్యమకారులనూ, మేధావులనూ బెదిరించటంతో ఊరుకోలేదు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్వరమై ఎదిగిన బెల్లి లలిత అనే యువ గాయని ప్రాణాలు తీశాడు. అనేకమందిని కిడ్నాప్ చేశాడు. వందల ఎకరాల భూముల్ని కబ్జా చేశాడు. కొన్నాళ్ళు జైలు నుంచే కార్యకలాపాలు నడిపాడు. పంజాబ్‌లో పరిస్థితి భిన్నమైనది. అక్కడ హరితవిప్లవ కాలం నుంచీ పోగుపడిన సంపదకు ప్రపంచీకరణ అనంతర పరిణామాలు తోడుకావటంతో అక్రమ వసూళ్ల దందా, సామాజిక మాధ్య మాల్లో ప్రముఖులుగా మారి, విదేశాల్లో సైతం ప్రదర్శనలిచ్చే స్థాయికి ఎదిగిన గ్రామీణ యువ కళాకారుల్ని చెప్పుచేతల్లో పెట్టుకోవటం పెరిగింది. 2022లో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకుల్ని సంపాదించి, విదేశాల్లో ప్రదర్శనలిచ్చిన యువ వాగ్గేయకారుడు సిద్ధూ మూసేవాలను గోల్డీ బ్రార్ ముఠా కాల్చిచంపింది. బిష్ణోయ్ అభీష్టానికి భిన్నంగా ఒక కబడ్డీ జట్టును ప్రోత్సహించటం ఈ హత్యకు కారణం! ఇప్పుడు జైళ్లలోవున్న లారెన్స్, భగవాన్పురియాలతోపాటు ఒక పంజాబీ అమెరికన్ కుటుంబాన్ని హత్య కేసులో ఇరికిస్తామని బెదిరించి, 4 లక్షల డాలర్లు (3.81 కోట్లు) డిమాండ్ చేసిన పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ గురిందర్ సింగ్ నాగ్రాను కూడా అప్పగించాలని అమెరికా కోరుతోంది. భగవాన్‌పురియా ముఠా చేసే పలు నేరాలకు గురిందర్ సహకరిస్తున్నాడన్నది ఎఫ్‌బీఐ ఆరోపణ. ఇవిగాక అమెరికాలో ఉంటున్న ఖలిస్తానీ ఉద్యమకారుడు గుర్పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నాడన్న అభియోగాలతో ఎన్నారై నిఖిల్ గుప్తా అమెరికా జైల్లో ఉన్నాడు. వికాస్ యాదవ్ అనే భారతీయ అధికారి ప్రోద్బలంతోనే ఈ కుట్ర జరి గిందని అమెరికా ఆరోపించింది. దేశాన్ని అప్రదిష్టపాలుచేసే ఇలాంటి వారిపట్ల కఠినంగా ఉండాలి. వారి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలి. ఎల్లకాలమూ చట్టానికి దొరక్కుండా తప్పించుకోవటం సాధ్యంకాదని తాజా పరిణామాలు తెలియ జెబుతున్నాయి. -
కెనడా–తెలంగాణ సంబంధాల బలోపేతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సౌర విద్యుదుత్పాదక, హరిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి కెనడా సహకారం అందించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి కోరారు. భారత్‌లో కెనడా హైకమిషనర్ క్రిస్ కూటర్ బుధవారం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కెనడా–తెలంగాణ మధ్య వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణల విషయంలో భాగస్వామ్యాన్ని బలోపేతం చేసే అంశంపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రాన్ని ప్రపంచస్థాయి నాలెడ్జ్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రేవంత్ చెప్పారు. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలు హైదరాబాద్‌లో తమ క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. కెనడాలోని విశ్వవిద్యాలయాలూ హైదరాబా ద్లో మల్టీ యూనివర్సిటీ క్యాంపస్ ఏర్పాటుకు పరిశీలించాలని కోరారు. పెట్టుబడులు, వ్యాపార భాగస్వాములకు తెలంగాణ మంచి వేదికగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. సీఎం నేతృత్వంలో రాష్ట్ర ప్రతినిధి బృందం కెనడాకు రావాలని కూటర్ ఆహ్వానించారు. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో సదస్సుకు కెనడా కంపెనీలు, పెట్టుబడిదారులు, విద్యాసంస్థలను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. అన్నివిధాలుగా సహకరిస్తాం: కూటర్ మూసీ పునరుజ్జీవం, హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుల్లో కెనడా భాగస్వామ్యానికి ఉన్న అవకాశాలపై రేవంత్, కూటర్ చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు కెనడా అన్నివిధాలుగా సహకరిస్తుందని కూటర్ హామీ ఇచ్చారు. తెలంగాణ–కెనడా మధ్య పారిశ్రామిక, ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని, ఫిరాన్ టెక్నాలజీ గ్రూప్ హైదరాబాద్‌లో తయారీ యూనిట్ ఏర్పాటుకు నిర్ణయించడం, సీఐబీసీ హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించడం వంటి పరిణామాలు రాష్ట్రంపై కెనడా కంపెనీల నమ్మకానికి నిదర్శనమని కూటర్ అన్నారు. సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ హైదరాబాద్‌కు చెందిన కంట్రోల్ఎస్(సీటీఆర్ఎల్ఎస్) డేటా సెంటర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుని ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిందని చెప్పారు. -
విదేశాల్లో ఘనంగా డాక్టర్ వైఎస్సార్ జయంతి
సాక్షి, అమరావతి/తిరుపతి మంగళం: మహానేత, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జయంతిని విదేశాల్లో ప్రవాసాంధ్రులు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వ ర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లోని మిడ్రాండ్లో జరిగిన కార్యక్రమానికి వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా కన్వీనర్ విక్రమ్ రెడ్డి పెట్లూరు అధ్యక్షత వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్‌ను కట్ చేసి అన్నదానం చేపట్టారు. కెనడాలోని టొరొంటో నగరంలో వైభవంగా వైఎస్సార్ జయంతి వేడుకలు కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ప్రతినిధులు నరసింహ రెడ్డి కల్లా, సూర్య రామిరెడ్డి, మురళి సోమిశెట్టి, శివ రాజవరపు, బి వెంకట సుబ్బా రెడ్డి , వాసు సింగారెడ్డి , వీరయ్య కట్టెపోగు, ఆంజనేయులు బిక్కా, మోహన్ పోలుబోయెన, అంజలి అవనిగడ్డ, మధుసూదన్ రెడ్డి పల్లె, అంజిరెడ్డి, వెంకట్ రెడ్డి ఎనుముల, శ్రీకృష్ణ రెడ్డి గరిస, కృష్ణమోహన్ రెడ్డి, సుధాకర్ కుప్పిరెడ్డి, కిషోర్ మారంరెడ్డి, హరీష్ గోరంట్ల, హరి ఆత్మకూరి, వెంకట్ మాగంటి, రాజేష్ యార్లగడ్డ , శ్రీమతి కల్పన జోసెఫ్, శివమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు కెనడాలో.. కెనడాలోని టొరంటోలో వైఎస్సార్ అభిమానులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కమిటీ సభ్యులు కేక్ కట్ చేసి వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు అలూరు సాంబశివరెడ్డి, చల్లా మధుసూదన్ రెడ్డి, కార్తీక్ ఎల్లాప్రగడ, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ ప్రదీప్ చింతా, పార్టీ కెనడా కన్వీనర్ వేణు చుక్కలూరు వర్చువల్‌గా పాల్గొన్నారు. టొరంటోలో జరిగిన కార్యక్రమంలో నరసింహ రెడ్డి గుట్టిరెడ్డి, చెన్న కేశవ, ప్రతాప్ బొల్లారం, ఆరిఫ్, నూర్, శ్రీనివాస్ రెడ్డి మరెక్కగారి, చంద్రహాస్ చల్లా, శాలిని బెక్కం, కృష్ణ రెడ్డి అల్లంపాటి, కృష్ణ చిదిరాల, శ్రీకాంత్ మద్దిరెడ్డి, రమేష్ తుంపర, సుబ్బా రావు, గుణశేఖర్ కొనపల్లి, విష్ణు వంగాల, కల్యాణ్ గుర్రంకొండ, శైలేష్ పాల్యం తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ సౌత్ ఆఫ్రికా ఆధ్వర్యంలో జోహన్నెస్‌బర్గ్‌లో భారీ కేక్ కట్ చేస్తున్న అభిమానులు ఆస్ట్రేలియాలో.. ఆ్రస్టేలియాలోని బ్రిస్బేన్‌లో వైఎస్సార్సీపీ స్థానిక నాయకులు, అభిమానులు వైఎస్సార్ చిత్రపటానికి నివాళులు అరి్పంచారు. అనంతరం కేక్‌ను కట్ చేశారు. ఈ వేడుకల్లో బ్రహ్మరెడ్డి ఎరువూరి, కిషోర్, జస్వంత్ బొమ్మిరెడ్డి, వంశీ చాగంటి, శ్రీనివాసులు రెడ్డి, చిన్నప్ప, శౌర్య పాల్గొన్నారు. అలాగే, కందుల భరత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నార్తన్ టెరిటోరీలోని డారి్వన్ నగరంలో కొమ్మిరెడ్డి చంద్ర శేఖర్ రెడ్డి, శివ హర్షవర్థన్ రెడ్డి వంగ, లక్ష్మణ్ రెడ్డి, రాఘవేంద్ర రావు, శ్యామ్ సుందర్ రెడ్డి, రవితేజ మదినేని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పెర్త్‌లో జరిగిన కార్యక్రమంలో వంశీ కృష్ణా రెడ్డి, యశ్వంత్, సతీష్ త్రినాథ్, వినయ్, శరత్ తదితరులు పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని డార్విన్ నగరంలో కేక్ కట్ చేస్తున్న వైఎస్సార్ అభిమానులు మెల్బోర్న్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఆ్రస్టేలియా కన్వీనర్ భరత్, విక్టోరియా కన్వీనర్ కృష్ణా రెడ్డి, సహ కన్వీనర్ రామాంజి, కోర్ టీమ్ సభ్యులు శిరీష, స్వాతి, యశు, బ్రహ్మ రెడ్డి, పవన్, సురేష్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, అబ్దుల్, రవి వర్మ, తేరా జయవర్ధన్ రెడ్డి, శ్రీనాథ్, నితీష్, ప్రణీత్, రోహిత్, అభిష్క్, ఉదయ్, భార్గవ్, యశ్వంత్, దశరథ్ రెడ్డి, పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం గ్లోబల్ కో–ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, పార్టీ నేతలు నూర్ ఫాతిమా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, కారుమూరి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ప్రసంగించారు.ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో వైఎస్సార్ జయంతి వేడుకలు -
ఒక్క ప్రశ్నతో ఉద్యోగం పోయింది!
జాబ్ ఇంటర్వ్యూ కోసం వెళ్లే అభ్యర్థులు సాధారణంగా అడిగే ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు సిద్ధం చేసుకుంటారు. కానీ ఇంటర్వ్యూ ముగిసే సమయంలో ''మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?'' అని అడిగితే ఎలా స్పందించాలి? అనే విషయంపై చాలామంది పెద్దగా దృష్టి పెట్టరు. ఇలాంటి సంఘటనే ఒక ఇండియన్ ప్రొడక్ట్ మేనేజర్‌కు ఎదురైంది. దీంతో అతడు ఉద్యోగం సైతం కోల్పోవాల్సి వచ్చింది.కెనడాలో పనిచేస్తున్న ఇండియన్ ప్రొడక్ట్ మేనేజర్ కరణ్ గోగ్నా ఇటీవల తనకు ఎదురైనా ఒక అనుభవాన్ని లింక్డ్ఇన్లో షేర్ చేశారు. అది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.కరణ్ గోగ్నా ఓ యూజ్డ్ కార్ల స్టార్టప్ కంపెనీలో ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశారు. ఇంటర్వ్యూలోని అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేశారు. హెచ్ఆర్ ఆయన డాక్యుమెంట్లను తీసుకోవడంతో.. ఉద్యోగం దాదాపు ఖాయమైందని భావించారు. అయితే.. ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ముందు కంపెనీ సీఈఓతో ఒక చివరి సమావేశం ఏర్పాటు చేశారు.సీఈఓతో సమావేశం బాగా జరిగిందని, ఉద్యోగం వస్తుందని నమ్మకం కలిగిందని కరణ్ తెలిపారు. చివర్లో సీఈఓ ''మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా?'' అని అడిగారు. దానికి కరణ్, ''మీ కంపెనీ భవిష్యత్తులో టూ-వీలర్ మార్కెట్లోకి కూడా ప్రవేశించాలని ఆలోచిస్తోందా?'' అని ప్రశ్నించారు.అయితే.. సీఈఓ దానికి నేరుగా సమాధానం చెప్పకుండా, ''మీ అభిప్రాయం ఏమిటి? మేం ఆ మార్కెట్లోకి వెళ్లాలా?'' అని తిరిగి ప్రశ్నించారు. ఇలాంటి ప్రశ్న ఒకటి ఎదురవుతుందని ఊహించని కరణ్ ''కంపెనీ వ్యాపారం గురించి పూర్తిగా అధ్యయనం చేశానని, కానీ టూ-వీలర్ మార్కెట్ గురించి ఎలాంటి అభిప్రాయం లేదని తెలిపారు''. దీంతో ఆ సమయంలో తడబడి స్పష్టతలేని సమాధానం ఇచ్చానని అంగీకరించారు.మరుసటి రోజు హెచ్ఆర్ నుంచి ఫోన్ వచ్చి, కంపెనీ మరో అభ్యర్థిని ఎంపిక చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనను గుర్తు చేసుకుంటూ కరణ్ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. ''ఇంటర్వ్యూకు వెళ్లేవారు సమాధానాల కోసం ఎంత సిద్ధమవుతారో, చివర్లో అడిగే ప్రశ్నల కోసం కూడా అంతే సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు''.ఎందుకంటే అభ్యర్థి అడిగే చివరి ప్రశ్న, అతని ఆలోచనా విధానం, వ్యాపార అవగాహన, విశ్లేషణ సామర్థ్యాన్ని ఇంటర్వ్యూవర్‌కు తెలియజేసే చివరి అవకాశం అవుతుందని పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందించారు. చాలామంది తమకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పారు. -
కెనడా కిక్... దక్షిణాఫ్రికా అవుట్
లాస్ ఏంజెలిస్: అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న కెనడా జట్టు ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో మరో అడుగు ముందుకు వేసింది. మూడోసారి ఈ మెగా ఈవెంట్లో పోటీపడుతున్న కెనడా జట్టు తొలిసారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రౌండ్–32 తొలి నాకౌట్ మ్యాచ్‌లో కెనడా 1–0 గోల్ తేడాతో దక్షిణాఫ్రికా జట్టును ఓడించింది. ఈ ఓటమితో దక్షిణాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. 90+2వ నిమిషంలో ‘డి’ ఏరియా పైభాగం నుంచి స్టీఫెన్ యుస్టాకియో సంధించిన కిక్‌ను దక్షిణాఫ్రికా గోల్‌కీపర్ నిలువరించలేకపోయాడు. దాంతో కెనడా 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అనంతరం స్టాపేజ్ సమయంలోని మిగతా ఐదు నిమిషాలపాటు దక్షిణాఫ్రికాను కట్టడి చేసి కెనడా విజయాన్ని అందుకుంది. -
సౌతాఫ్రికా హృదయం ముక్కలు
ఫిఫా ప్రపంచకప్-2026 టోర్నీలో సౌతాఫ్రికా ప్రయాణం ముగిసిపోయింది. రౌండ్ 32లో భాగంగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో కెనడాను సౌతాఫ్రికా నిలువరించలేకపోయింది. ఫలితంగా కెనడా చేతిలో 1-0తో ఓటమి పాలైంది.ఈ క్రమంలో కెనడా రౌండ్ 16కు దూసుకువెళ్లగా.. సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. లాస్ ఏంజెలెస్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంజూరీ టైమ్‌లో కెనడా మిడ్‌ఫీల్డర్ స్టీఫెన్ ఉస్తాకియో అద్భుత రీతిలో గోల్ కొట్టాడు. దీంతో కెనడా 1-0తో విజయం సాధించగా.. సౌతాఫ్రికా హృదయం ముక్కలైంది. తొలిసారి..ఇక కెనడా రౌండ్ 16 మ్యాచ్‌లో భాగంగా నెదర్లాండ్స్ లేదంటే మోరాకోతో తలపడనుంది. కాగా ఆతిథ్య దేశమైన కెనడా గ్రూప్ దశలో అంతగా ఆకట్టుకోలేకపోయింది. గ్రూప్-బిలో భాగంగా బోస్నియాతో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న కెనడా.. ఖతార్‌పై 6-0తో విజయం సాధించింది. అయితే, ఆఖరి మ్యాచ్‌లో భాగంగా స్విట్జర్లాండ్ చేతిలో 2-1తో ఓడిపోయింది.అయితే, బోస్నియా, ఖతార్ పేలవ ప్రదర్శన కారణంగా గ్రూప్-బిలో రెండో స్థానంలో నిలిచిన కెనడా.. నాకౌట్‌కు అర్హత సాధించింది. ఇక నాకౌట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఎలిమినేట్ చేసి మరో ముందడుగు వేసింది. కాగా కెనడా నాకౌట్ మ్యాచ్‌లో విజయం సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం. -
విమానాన్ని ముక్కలు చేసిన బాంబు.. అసలు కథ బయటకు..
కెనడా నుంచి లండన్ మీదుగా 1985 జూన్ 23న భారత్‌కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఐర్లాండ్ తీరానికి సమీపంలో గగనతలంలో పేలిపోయింది. ఆ విమానంలో ఉన్న 329 మంది అంతా మరణించారు. ఆ ఘటనను భారత్ ఎన్నటకీ మర్చిపోలేదు. 1985లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 పేలుడు వెనుక ఖలిస్తానీ ఉగ్రవాదులే ఉన్నారని భారత్ మొదటి నుంచీ చెబుతోంది. కానీ, కెనడా ప్రభుత్వం లేదా దాని గూఢచారి సంస్థలు ఇంతకాలం బహిరంగంగా "ఖలిస్తానీలే బాంబు పెట్టారు" అని స్పష్టంగా చెప్పలేదు. ఇప్పుడు తొలిసారిగా కెనడా ప్రధాన గూఢచారి సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీస్ (సీఎస్ఐఎస్) తొలిసారిగా అధికారికంగా ఆ విషయాన్ని చెప్పింది. "కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు విమానంలో బాంబు పెట్టారు. ఆ పేలుడుతో 329 మంది మరణించారు" అని పేర్కొంది. ఇన్నేళ్లుగా భారత్ చేస్తున్న ఆరోపణను కెనడా ఇప్పుడు అధికారికంగా అంగీకరించినట్లయింది. ఖలిస్తానీ తీవ్రవాదులు కెనడా నేలపై పనిచేస్తున్నారన్న భారత వాదనకు బలం చేకూరింది. కెనడా గతంలో ఖలిస్తానీ అంశంపై తీసుకున్న వైఖరిలో మార్పు కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.సీఎస్ఐఎస్ ఏమని చెప్పింది? ఈ విషాదాన్ని స్మరించుకుంటూ బుధవారం ఫేస్బుక్లో చేసిన పోస్టులో.. సీఎస్ఐఎస్ నేరుగా వేర్పాటువాద ఉద్యమాన్నే ఈ దాడికి బాధ్యులుగా పేర్కొంది. “కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులు 1985 జూన్ 23న అమర్చిన బాంబు విమానాన్ని ధ్వంసం చేసింది. అందులో ఉన్న వారంతా మరణించారు. వారిలో ఎక్కువ మంది కెనడియన్లు. ఇది ఇప్పటికీ కెనడా చరిత్రలో అత్యంత ప్రాణాంతక ఉగ్రదాడి” అని సీఎస్ఐఎస్ తెలిపింది.టొరొంటో నుంచి ముంబైకి వెళ్తున్న బోయింగ్ 747 విమానం ‘ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 ఎంపెరర్ కనిష్క’పై జరిగిన ఈ బాంబు దాడి కెనడా చరిత్రలోనే అత్యంత ఘోర ఉగ్రదాడిగా నిలిచింది. 2001 సెప్టెంబర్ 11 దాడుల వరకు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతక విమాన ఉగ్రదాడిగా నిలిచింది.నిషేధిత ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖాల్సా సభ్యులు సామాన్ల విభాగంలో అమర్చిన బాంబు పేలడంతో అట్లాంటిక్ మహాసముద్రం పైనే విమానం ముక్కలైంది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. 2005లో ఈ విషాద ఘటన వార్షిక దినమైన జూన్ 23ను ఉగ్రవాద బాధితుల జాతీయ స్మరణ దినంగా కెనడా ప్రకటించింది.ఖలిస్తానీ ఉద్యమాన్నే ఈ దాడికి బాధ్యులుగా సీఎస్ఐఎస్ స్పష్టంగా పేర్కొనడం, కొద్ది నెలల క్రితం విడుదల చేసిన వార్షిక నివేదిక తర్వాత చోటుచేసుకోవడం గమనార్హం. ఆ నివేదికలో ఖలిస్తానీ తీవ్రవాదులను జాతీయ భద్రతకు ముప్పుగా పేర్కొన్న విషయం తెలిసిందే.కెనడాలో ఉన్న ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు కెనడా భూభాగాన్ని వినియోగించి హింసాత్మక తీవ్రవాద కార్యాచరణను ప్రోత్సహిస్తున్నాయి, అలాగే హింసాత్మక కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తూ సమన్వయం చేస్తున్నాయని సీఎస్ఐఎస్ హెచ్చరించింది.భారత్‌కు కీలకం కెనడాలో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాదులే ఆ విమానానికి పేలుడు పదార్థాన్ని అమర్చారని సీఎస్ఐఎస్ స్పష్టంగా చేసిన ప్రకటన భారత్‌కు ఎంతో కీలకం. ఇరు దేశాల మధ్య ఖలిస్తానీ అంశంపై కొనసాగుతున్న దౌత్య వివాదంలో ఇది భారత్‌కు కీలక విజయంగా భావిస్తున్నారు.భారత్ ఎన్నో ఏళ్లుగా ఖలిస్తానీ కార్యకలాపాలపై ఆందోళనలు వ్యక్తం చేసినా, కెనడా వాటిని పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. భారత్‌లో ఆ ఉద్యమం క్షీణించిన తర్వాత కూడా కెనడా వాటికి ఆశ్రయం కల్పించిందని భారత్ చెబుతూ వచ్చింది.మాజీ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పాలన సహా వరుస కెనడియన్ ప్రభుత్వాలు ఈ అంశంపై భారత్‌తో వివాదానికి దిగాయి. ట్రూడో ప్రభుత్వం అయితే కెనడియన్ పౌరులపై హింసాత్మక సరిహద్దు దాటి భారత్ అణచివేత కార్యక్రమాన్ని నిర్వహించిందని కూడా ఆరోపించింది. అయితే చాలా కాలంగా తమ భూభాగంలో పనిచేస్తున్న ఖలిస్తానీ నెట్‌వర్క్‌ల వల్ల ఏర్పడిన ముప్పును కెనడియన్ సంస్థలు ఇప్పుడు గుర్తించడం ప్రారంభించడంతో, భారత్ చెబుతున్న వాదనకు బలం చేకూరినట్లు కనిపిస్తోంది. -
కెనడా, ఖతార్ మ్యాచ్.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు!
ఫిఫా ప్రపంచకప్‌లో కెనడా, ఖతార్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరుజట్ల ఆటగాళ్లు తన్నుకోవడం చర్చనీయాంశమైంది. కెనడా 6-0తో ఖతార్‌పై ఘన విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌లో కెనడా విజయం సాధించినప్పటికీ ఖతార్ ఆటగాళ్ల వైఖరిని తప్పుబట్టారు. అందుకే ఒక్కసారి మ్యాచ్‌లో ఫైనల్ విజిల్ రాగానే కెనడా ఆటగాళ్లు ఖతార్ జట్టువైపు దూసుకొచ్చారు. ఇరుజట్ల ఆటగాళ్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో మైదానంలోకి వచ్చిన సెక్యూరిటీ ఇరుజట్లను వేరు చేసి అక్కడినుంచి పంపించేశారు. ఈ సమయంలో మైదానంలో గందరగోళం నెలకొంది. ఈ చర్యను ఇరుజట్ల కోచ్‌లు తప్పుబట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. మరి కెనడా ఆటగాళ్ల కోపానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే.. ఖతార్ ఆటగాళ్ల తప్పిదాల వల్ల కెనడా మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ కోనె కాలు విరిగింది. నడవడానికి కూడా ఇబ్బంది పడడంతో అతడిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి వచ్చింది. అయితే ఇస్మాయిల్ కోనె కాలు విరగడానికి ప్రధాన కారణం ఖతార్ ఆటగాడు అస్సిమ్ మదిబో. బంతిని పాస్ అందించడానికి ఇస్మాయిల్ ప్రయత్నిస్తున్న సమయంలో అతడికి అడ్డువచ్చిన అస్సిమ్ కావాలనే తను కాలును వెనుక నుంచి అడ్డుపెట్టాడు. దీంతో కోనె కాలు బోన్ విరిగిపోయింది. ఈ దుశ్చర్యతో రిఫరీ ఖతార్ ఆటగాడికి రెడ్‌కార్డ్ జారీ చేశాడు. మ్యాచ్ విషయానికొస్తే ఆతిథ్య కెనడా.. ఖతార్‌పై పూర్తి ఆధిపత్యం కనబరిచింది. జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్‌తో కెనడా విజయంలో కీలకపాత్ర పోషించాడు.Tempers flare between Canada and Qatar after the final whistle, leading to a player scuffle to conclude a dramatic match LIVE UPDATES: https://t.co/Hb9FJ14WLh pic.twitter.com/0z5Vqmf50Z— CTV News (@CTVNews) June 19, 2026 -
కెనడా ప్లేయర్‌కు విరిగిన కాలు; కట్‌చేస్తే ఖతార్‌కు చుక్కలు!
ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య కెనడా బోణీ కొట్టింది. గ్రూప్-బిలో ఉన్న కెనడా 6-0తో ఖతార్‌పై భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్ డ్రా చేసుకున్న కెనడాకు ఇదే తొలి విజయం. కెనడా తరఫున జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్‌తో (ఆట 29వ, 45+3వ, 90+2వ నిమిషంలో) మెరవగా, సైల్ లారిన్ (ఆట 16వ నిమిషం), నాథన్ సలిబా (ఆట 64వ నిమిషం), ఖతార్ ఆటగాడు మొహమ్మద్ మనాయి (ఆట 75వ నిమిషంలో) సెల్ఫ్ గోల్ చేయడంతో అది కెనడా ఖాతాలోకి వెళ్లిపోయింది. అయితే ఖతార్ తరఫున హొమమ్ అహ్మద్ (ఆట 33వ నిమిషం), అస్సిమ్ మదిబొ (ఆట 53వ నిమిషం) గోల్స్ కొట్టినప్పటికీ తప్పిదాలతో రిఫరీ రెడ్ కార్డ్ చూపడంతో ఖతార్ గోల్స్ చెల్లలేదు. దీంతో కెనడా భారీ విజయంతో 4 పాయింట్లతో పట్టికలో తొలి స్థానంలో ఉంది. ఇదే మ్యాచ్‌లో కెనడా స్టార్ మిడ్‌ఫీల్డర్ ఇస్మాయిల్ కొనే ప్రత్యర్థి ఆటగాడి ఫౌల్ కారణంగా తన ఎడమ కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. నొప్పి భరించలేక మైదానంలోనే స్ట్రెచర్‌పై ఆక్సిజన్ మాస్క్‌తో బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.ఇక మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టిన జొనాథన్ డేవిడ్ అరుదైన ఫీట్ సాధించాడు. 2026 ఫిఫా ప్రపంచకప్‌లో మెస్సీ తర్వాత హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. మూడు కీలక గోల్స్‌తో కెనడా విజయంలో కీలకపాత్ర పోషించిన జొనాథన్నే ఫిఫా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.చదవండి: వివాదంలో మెస్సీ.. భగ్గుమన్న అభిమానులు! -
పర్మినెంట్ రెసిడెంట్ : విద్యార్థుల కలలపై నిప్పులు పోసిన దేశం
అమెరికా ఆంక్షలతో బెంబేలెత్తుతున్న విద్యార్థులకు మరో షాక్ తగిలింది. కెనడాలో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే శాశ్వత నివాసం (పీఆర్ కార్డ్) పొందాలనుకునే వేలాది మంది అంతర్జాతీయ విద్యార్థులకు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అక్కడి మానిటోబా ప్రావిన్స్ ప్రభుత్వం ఊహించని షాకిచ్చింది. కెనడాలోని మానిటోబా ప్రావిన్స్, అంతర్జాతీయ గ్రాడ్యుయేట్ల కోసం ఉన్న ఒక కీలకమైన వలస మార్గాన్ని మూసివేసింది. మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (ఎంపీఎన్‌పీ)ని, అంతర్జాతీయ విద్యా విభాగం (ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రీమ్) కింద ఉన్న కెరీర్ ఎంప్లాయ్మెంట్ పాత్వే (సీఈపీ)ని తక్షణమే రద్దు చేసింది. చదువు పూర్తైన విద్యార్థులు నేరుగా పర్మినెంట్ రెసిడెన్సీ పొందేందుకు ఇప్పటివరకు ఎంతో సులభంగా ఉపయోగపడుతున్న ఒక కీలకమైన ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని ఆ ప్రావిన్స్ ప్రభుత్వం తక్షణమే రద్దు చేస్తున్నట్లు జూన్ 11న సంచలన ప్రకటన చేసింది. ఇలా చేసిన మొట్టమొదటి కెనడియన్ ప్రావిన్స్ మానిటోబానే. దీంతో ఉత్తర అమెరికా దేశంలో శాశ్వత నివాసం కోసం స్టూడెంట్ వీసా మార్గాన్ని ఎంచుకోవాలనుకుంటున్న భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.విస్తీర్ణం పరంగా కెనడాలో అతిపెద్ద ఆరో ప్రావిన్స్ మానిటోబా, భారతదేశంతో సహా అంతర్జాతీయ విద్యార్థులకు రోజురోజుకు మరింత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోంది. దీని రాజధాని విన్నిపెగ్‌లో, టొరంటో, ఒట్టావా వంటి నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువగా ఉంటుంది, అదే సమయంలో చక్కటి ప్రభుత్వ యూనివర్శిటీలు యూనివర్శిటీ ఆఫ్ మానిటోబా, ఆర్ఆర్సి పాలిటెక్ వంటి సంస్థలు అందుబాటులో ఉంటాయి. దీనికి తోడు పీఆర్ చాలా త్వరంగా, సులువుగా వస్తుందనే కారణంతో వేలాది మంది తెలుగువారితో పాటు 80కి పైగా దేశాల నుండి దాదాపు 20వేల మంది విద్యార్థులు ఇటే మొగ్గు చూపుతున్నారు. ఇక్కడి అంతర్జాతీయ విద్యార్థుల జనాభాలో భారతీయ విద్యార్థుల వాటా గణనీయంగా ఉంది. 2021లో, 5,240 మంది భారతీయులు స్టడీ పర్మిట్ హోల్డర్లు న్నారు.మానిటోబా ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ (MPNP) ప్రకారం మానిటోబా ప్రావిన్స్‌లోని గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం ఏడాది పాటు చదివి, చదువు పూర్తి కాగానే తమ రంగానికి సంబంధించిన ఒక అర్హత కలిగిన ఉద్యోగ ఆఫర్ సంపాదిస్తే చాలు ఎటువంటి నిరీక్షణ లేకుండా నేరుగా పీఆర్‌కు దరఖాస్తు చేసుకునే లీగల్ అవకాశం ఉండేది. ముఖ్యంగా భారతదేశం నుండి కెనడా వెళ్లి అక్కడ వన్-ఇయర్ పీజీ డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు పీఆర్ సాధించి ప్రయోజనం పొందేవారు. ప్రస్తుతం ఈ విండోను పూర్తిగా మూసివేయడంతో భారతీయ విద్యార్థులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్టైంది.ఇదీ చదవండి: స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో సుందర్ పిచాయ్‌కు చేదు అనుభవంభారతదేశం నుండి 5,485 మంది కొత్త శాశ్వత నివాసితులు న్నారు. ఇది మొత్తం ప్రవేశాలలో 33.1శాతం., CEP కార్యక్రమాన్ని రద్దు చేయడం వల్ల ఈ భారతీయ విద్యార్థులు ప్రభావితమవుతారు. వీరు శాశ్వత నివాసం కోసం విద్యా అర్హతల కంటే పని అనుభవానికి ప్రాధాన్యతనిచ్చే ప్రత్యామ్నాయ కార్యక్రమాలను ఎంచుకోవలసి ఉంటుంది. ఇదీ చదవండి: ట్విన్స్ పుట్టారని సంబరం : అంతలోనే ఊహించని షాక్!రద్దయిన సీఈపీ ప్రకారం, దరఖాస్తుదారులు మూడేళ్లలో కనీసం ఒక సంవత్సరం పాటు మానిటోబాలో పూర్తికాల స్టడీ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసి ఉండాలి. కనీసం కెనడియన్ లాంగ్వేజ్ బెంచ్‌మార్క్ (CLB) 7 స్థాయి భాషా ప్రావీణ్యాన్ని కలిగి ఉండాలి. అలాగే ప్రావిన్సులో తమ దీర్ఘకాలిక వృత్తి అవకాశాలను వివరిస్తూ ఒక కెరీర్ ఎంప్లాయ్మెంట్ ప్లాన్‌ను కూడా సమర్పించాల్సి ఉండేది , కొన్ని సందర్భాల్లో, తమ వద్ద తగినంత స్థిరపడే నిధులు ఉన్నాయని నిరూపించుకోవాల్సి ఉండేది.ఇదీ చదవండి : విడాకులు మంజూరు : భర్తను వాటేసుకుని ఎమోషనల్, ఎందుకో తెలుసా?కానీ మారిన నియమాల ప్రకారం మానిటోబాలోని స్కిల్డ్ వర్కర్ ప్రోగ్రామ్, జాబ్ హిస్టరీకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అర్హత కలిగిన పూర్తికాల, దీర్ఘకాలిక ఉద్యోగ ఆఫర్‌ను స్వీకరించడానికి ముందు, ‘స్కిల్డ్ వర్కర్ ఇన్ మానిటోబా’ (Skilled Worker in Manitoba) ప్రోగ్రామ్ ప్రకారం దరఖాస్తుదారులు తప్పనిసరిగా అదే మానిటోబా యజమాని వద్ద కనీసం ఆరు నెలల నిరంతర పూర్తికాల పనిని పూర్తి చేయాలి. ఆ అనుభవ పత్రాలను సమర్పిస్తేనే పీఆర్ నామినేషన్‌కు అర్హత సాధిస్తారు. అయితే దీనికి ప్రత్యేక విద్యా అర్హత అవసరం లేదు. బదులుగా, భాషా అవసరాలు వృత్తి డిమాండ్లకు, మానిటోబాలో ఆర్థికంగా స్థిరపడగల దరఖాస్తు దారుడి సామర్థ్యానికి ముడిపడి ఉంటాయి. అలాగే ఒక సెటిల్మెంట్ ప్లాన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అంతకుముందు ఈ షరతులేదు. అంతేకాకుండా, స్వయం ఉపాధి ద్వారా లేదా పూర్తికాలం చదువుతున్నప్పుడు పొందిన వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ను పరిగణనలోకి తీసుకోరు. ఇదీ చదవండి: పోలీసులే నివ్వెరపోయేలా భర్త టార్చర్, ఇనుప గొలుసులతోనే స్టేషన్‌కి! -
అదృష్టం అంటే ఇదే.. వారం వ్యవధిలోనే రెండు లాటరీలు!
అదృష్టం ఒక్కసారి తలుపు తట్టడమే చాలా మందికి జీవితంలో మరపురాని అనుభవం. కానీ కెనడాకు చెందిన ఓ మహిళకు మాత్రం వారం రోజుల వ్యవధిలోనే రెండుసార్లు అదృష్టం వరించింది. రెండు వేర్వేరు లాటరీల్లో భారీ మొత్తాలను గెలుచుకుని ఆమె వార్తల్లో నిలిచారు.కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్‌లో ఉన్న మిస్సిసాగా నగరానికి చెందిన ట్రాంగ్ ఫామ్ తన నలుగురు సహోద్యోగులతో కలిసి గత ఏడాది ఒక లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఆ టికెట్‌కు ఏకంగా 60 మిలియన్ కెనడియన్ డాలర్ల జాక్‌పాట్ తగిలింది. భారత కరెన్సీలో దీని విలువ రూ.407 కోట్లకు పైగానే ఉంటుంది. ఈ భారీ ప్రైజ్ మొత్తాన్ని ఐదుగురు సభ్యులు సమానంగా పంచుకోవడంతో ట్రాంగ్కు కూడా గణనీయమైన మొత్తం లభించింది.అయితే ఆమె అదృష్టం అక్కడితో ఆగలేదు. తొలి లాటరీ గెలిచిన కేవలం వారం రోజులకే ట్రాంగ్ మరోసారి స్క్రాచ్ కార్డ్ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశారు. ఆశ్చర్యకరంగా ఈ టికెట్‌కు కూడా జాక్‌పాట్ తగిలింది. దీంతో ఆమెకు మరో 2,50,000 కెనడియన్ డాలర్లు లభించాయి. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.1.60 కోట్లకు సమానం.ఈ రెండో లాటరీని ఆమె వ్యక్తిగతంగా కొనుగోలు చేశారా, లేక మరెవరితోనైనా కలిసి తీసుకున్నారా అనే వివరాలు వెల్లడికాలేదు. అయితే వారం వ్యవధిలోనే రెండు భారీ లాటరీలు గెలుచుకోవడం అత్యంత అరుదైన ఘటనగా నిలిచింది. సాధారణంగా జీవితకాలంలో ఒక్కసారి కూడా లాటరీ గెలవడం కష్టమని భావించే పరిస్థితుల్లో, ట్రాంగ్ వరుసగా రెండుసార్లు జాక్‌పాట్ దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఈ ఘటన కెనడా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. లాటరీ నిపుణులు కూడా ఇలాంటి సంఘటనలు అత్యంత అరుదుగా జరుగుతాయని పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆమెను 'లక్కీ లేడీ'గా అభివర్ణిస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు. మొత్తంగా ట్రాంగ్ ఫామ్ కథ అదృష్టం ఎప్పుడు, ఎలా వరుస్తుందో చెప్పలేమనే విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. -
కెనడా-బోస్నియా మ్యాచ్ డ్రా
ఫిఫా ప్రపంచకప్-2026లో భాగంగా టొరంటో వేదికగా కెనడా-బోస్నియా మధ్య జరిగిన గ్రూపు-బి మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. ఈ డ్రాతో కెనడా తన ఫిఫా ప్రపంచ కప్ చరిత్రలోనే మొట్టమొదటి పాయింట్‌ను సొంతం చేసుకుంది. మ్యాచ్ 21వ నిమిషంలో బోస్నియా ఫార్వర్డ్ ఆటగాడు జోవో లుకిచ్ కార్నర్ కిక్ ద్వారా అద్భుతమైన గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత 78 నిమిషలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన కెనడా ఆటగాడు సైల్ లారిన్ సూపర్ గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశాడు. ఫస్ట్‌హాఫ్‌లో కెనడా స్ట్రైకర్ జోనాథన్ డేవిడ్ గోల్ చేసేందుకు మంచి అవకాశాన్ని కోల్పోయాడు. అదేవిధంగా రెండవ అర్ధభాగంలో బోస్నియా కెప్టెన్ సియాద్ కొలాసినాక్ కొట్టిన బంతి క్రాస్‌బార్‌కు తగిలి వెనక్కి రావడంతో వారికి లీడ్ సాధించే ఛాన్స్‌ను కోల్పోయారు. కాగా ఈ టోర్నీకి కెనడా సహా ఆతిథ్య దేశంగా ఉన్న సంగతి తెలిసిందే. -
కెనడాలో భారత పౌరులకు హెచ్చరికలు
కెనడాలోని భారత పౌరులకు అక్కడి అధికార యంత్రాంగం కీలక అడ్వైజరీ జారీ చేసింది. వీసా, ఇమిగ్రేషన్ హోదా, శాశ్వత నివాసం, ఉద్యోగాల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాన్సులేట్ అధికారులు లేదంటే ఇమిగ్రేషన్ విభాగం పేరుతో మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.కెనడాలో నివసిస్తున్న భారతీయులే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాము కాన్సులేట్ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నామని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు ఫోన్ కాల్స్ చేస్తున్నారు. వీసా స్టేటస్ సమస్యలు ఉన్నాయని, ఇమిగ్రేషన్ పత్రాలు అప్డేట్ చేయాలని లేదంటే తక్షణమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని భయపెట్టి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు అధికారులు హెచ్చరించారు.ఈ తరహా కాల్స్‌లో కొందరు మోసగాళ్లు ఉద్యోగ అవకాశాలు, పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెసింగ్, లేదా డిపోర్టేషన్ బెదిరింపులు వంటి విషయాలను ప్రస్తావిస్తూ ఒత్తిడి తీసుకువస్తున్నారని సమాచారం. అధికారికంగా అయితే ఎటువంటి ప్రభుత్వ సంస్థలు ఫోన్ ద్వారా డబ్బులు డిమాండ్ చేయవని స్పష్టం చేయడం జరిగింది.ఈ నేపథ్యంలో కెనడా అధికారులు, భారత కాన్సులేట్ కార్యాలయాలు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశాయి. అనుమానాస్పద ఫోన్ కాల్స్ వస్తే ఎలాంటి వ్యక్తిగత సమాచారం, పాస్‌పోర్ట్ వివరాలు, బ్యాంక్ డేటా లేదంటే ఓటీపీలు పంచుకోవద్దని గట్టిగా హెచ్చరించారు. అలాగే తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దని, అధికారిక వెబ్సైట్ లేదంటే నేరుగా కాన్సులేట్‌ను సంప్రదించాలని సూచించారు.కెనడాలోని భారతీయులు ఈ తరహా మోసాలకు బలవకుండా ఉండేందుకు జాగ్రత్తలు పాటించాలని కెనడా ప్రభుత్వం, టొరంటోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా అధికారులు స్పష్టం చేశారు. ప్రత్యేకంగా “మీ వీసా రద్దు అవుతుంది”, “తక్షణంగా ఫైన్ చెల్లించాలి”, “ఇమిగ్రేషన్ సమస్య ఉంది” వంటి మాటలు వినిపిస్తే అది మోసపూరిత కాల్‌గా భావించాలని సూచించారు.అధికారులు చెబుతున్నదాని ప్రకారం, ఇలాంటి కాల్స్‌కి స్పందించకుండా వెంటనే బ్లాక్ చేయడం, స్థానిక పోలీసులకు లేదంటే సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయడం ఉత్తమ మార్గమని సూచిస్తున్నారు. కెనడాలో భారతీయ కమ్యూనిటీ పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి హెచ్చరించారు. -
16 ఏళ్లలోపు వారికి నో సోషల్ మీడియా
ఒట్టావా: దేశంలోని 16 ఏళ్ల బాలబాలికలకు సోషల్ మీడియా వేదికలను కట్టడి చేసేందుకు ఉద్దేశించిన డిజిటల్ సేఫ్టీ బిల్లును కెనడా ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. సామాజిక వేదికల నిర్వాహకులు తగు కారణాలను చూపిన పక్షంలో కొన్ని వెసులుబాట్లను కల్పిస్తామని మాత్రం తెలిపింది. సామాజిక మాధ్యమాల కారణంగా బాలలకు హాని వాటిల్లరాదన్నదే లక్ష్యమని కెనడా మంత్రి మార్క్ మిల్లర్ తెలిపారు. చాట్‌జీపీటీ వంటి కృత్రిమ మేధ చాట్‌బాట్ సేవలను వినియోగించే విషయంలో 16 ఏళ్లలోపు వారికి పరిమితులను ఈ బిల్లులో ప్రతిపాదించారు. సామాజిక వేదికలను సురక్షితంగా వాడుకునేందుకు అవసరమైన నిబంధనలను కూడా పొందుపరిచారు. ప్రతిపాదిత సేఫ్ సోషల్ మీడియా చట్టం ద్వారా సోషల్ మీడియా సేవలు, ఏఐ చాట్‌బాట్ నిర్వాహకులు.. ఏదైనా నష్టం, హాని జరిగితే అరికట్టేలా, పూర్తి బాధ్యత వహించేలా చేస్తామని మంత్రి తెలిపారు. యూకే, ఫ్రాన్స్, స్పెయిన్, గ్రీస్, మలేసియా తదితర దేశాలు సైతం ఇలాంటి ప్రతిపాదనలను రూపొందించే పనిలో ఉన్నాయి. -
FIFA WC 2026:యువ జోరు...
నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో సత్తా చాటుకొని విశ్వవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాలని ఆయా జట్ల క్రీడాకారులు తాపత్రయపడుతుంటారు. ప్రతీ ప్రపంచకప్ కొందరిని హీరోలుగా చేస్తుంది. మరికొందరిని జీరోలుగా చేస్తుంది. ప్రపంచకప్ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని రాత్రికి రాత్రే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని ఎందరో యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉంటారు. ప్రస్తుతం సూపర్ స్టార్స్‌గా మారిన మెస్సీ, రొనాల్డో, నెమార్, ఎంబాపె, మోడ్రిచ్ తదితరులు ఈ దశను దాటి వచ్చినవాళ్లే. రేపటి నుంచి అమెరికా, కెనడా, మెక్సికోలలో మొదలయ్యే 23వ ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలోనూ పలువురు యువ ఆటగాళ్లు తమ విన్యాసాలతో అలరించేందుకు సై అంటున్నారు. ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నాడు స్పెయిన్‌కు చెందిన 18 ఏళ్ల లామినె యామల్. రెండేళ్ల క్రితం యూరో టోర్నీలో స్పెయిన్‌కు నాలుగోసారి టైటిల్ దక్కడంలో యామల్ కీలకపాత్ర పోషించాడు. తాజా ప్రపంచకప్‌లో యామల్ మెరిపిస్తే స్పెయిన్ టైటిల్ ఫేవరెట్‌గా మారుతుందనడంలో సందేహం లేదు. డిఫెండర్లను బోల్తా కొట్టించడంలో... సహచరులకు సమయస్ఫూర్తితో పాస్‌లు అందించడంలో... సుదూరం నుంచి గోల్‌పోస్ట్ లక్ష్యంగా కళ్లు చెదిరే కిక్‌లు కొట్టడంలో యామల్‌కు తిరుగులేదు. ఐదుసార్లు విజేత బ్రెజిల్ జట్టు తరఫున స్టార్ నెమార్ చివరిసారి ప్రపంచకప్‌లో ఆడుతుండగా... అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు సిద్ధమయ్యాడు 18 ఏళ్ల ఎస్టవో విలియన్. అభిమానులు ఇప్పటి నుంచే విలియన్ను ‘న్యూ నెమార్’గా పిలుస్తున్నారు. డిఫెన్స్‌ను ఛేదించి గోల్స్ కొట్టడంలో విలియన్‌కు మంచి పేరుంది. అర్జెంటీనా జట్టు కెప్టెన్ మెస్సీ రిటైరైనా ఆ జట్టు భవిష్యత్‌కు ఢోకా లేదని 18 ఏళ్ల ఫ్రాంకో మస్తాంటువానో తన ఆటతీరుతో భరోసా కల్పిస్తున్నాడు. వరుసగా రెండోసారి అర్జెంటీనా ప్రపంచకప్ టైటిల్ నెగ్గాలంటే మెస్సీతోపాటు ఫ్రాంకో ఆటతీరు కూడా కీలకం కానుంది. వరుసగా మూడోసారి ఫ్రాన్స్ జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించే అవకాశాలు సీనియర్ స్టార్స్ ఎంబాపె, డెంబెలె, 19 ఏళ్ల డిసిర్ డుయు ఆటతీరుపై ఆధారపడి ఉంది. ఇటీవల యూరో చాంపియన్స్ లీగ్ టైటిల్ నిలబెట్టుకున్న పీఎస్జీ జట్టుకు డిసిర్ డుయు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వీరితోపాటు గిల్బెర్టో మోరా (మెక్సికో), ఇబ్రహీం ఎంబాయె (సెనెగల్), నికో పాజ్ (అర్జెంటీనా), అర్దా లెర్ (టర్కీ), పౌ కుబార్స్ (స్పెయిన్), యాన్ డియోమండె (ఐవరీకోస్ట్), ఆండ్రీ సాంతోస్ (బ్రెజిల్), ఎండ్రిక్ (బ్రెజిల్), ఆంటోనియో నూసా (నార్వే) కూడా సంచలన ప్రదర్శనతో మెరిపించే అవకాశాలు ఉన్నాయి. – సాక్షి క్రీడా విభాగం -
చంపినా.. చావనంటోంది!
గోడ మీది బల్లి తోక తెగిపోతే... తోక మళ్లీ పెరుగుతుంది. ఇది మనకు తెలుసు. కానీ.. తెగిన తోకలోంచి సరికొత్త బల్లి పుట్టుకొస్తే? అట్లాంటిక్ మహా సముద్రం అట్టడుగున ఈ అద్భుతమే ఆవిష్కృతమైంది!! కెనడాలోని మెమోరియల్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అ మధ్య అట్లాంటిక్ మహా సముద్రంలో కొన్ని అన్వేషణలు జరిపారు. మంచుముద్దల అడుగున చాలా లోతులో వారికి ఓ సముద్రపు దోస దొరికింది. దోస అంటే ముళ్ల దోసకాయ వంటి రూపమున్న జీవి. శాస్త్రీయ నామం సోలస్ ఫాబ్రిచీ. సరే... దీనిపై పరిశోధనలు చేద్దామనుకున్నారు వాళ్లు. ల్యాబ్‌కు తీసుకొచ్చి ఒక ముక్క కత్తిరించి సముద్రపు నీటిలోనే పాతి పెట్టారు. కుళ్లి, కృషించి పోవడానికి ఎంత టైమ్ పడుతుందో చూద్దామనుకున్న ఆ శాస్త్రవేత్తలకు భారీ షాకే తగిలింది. ఎందుకంటే.. రోజులు, వారాలు, గడుస్తున్నా ఆ ముక్క చావనంటోంది. పైగా గాయం మానిపోవడం మొదలైంది. కణాలు చురుకుగానే ఉన్నాయి. రోగ నిరోధక వ్యవస్థ కూడా పని చేయడం మొదలైంది. కొన్ని నెలల తరువాత గమనిస్తే... కత్తిరించిన ముక్క కంటే పెద్దది అయిపోయింది. మూడేళ్లు గడిచాయి. ఆ ముక్కలో జీవం తొణికిసలాడుతూనే ఉంది. సముద్రపు నీటిలోంచి పోషకాలు పీల్చేసుకుని ఎంచక్కా బతికేస్తోంది. పునరుత్పత్తి జరగలేదు కానీ.. కత్తిరించినా అది ఇంకో జీవిలా బతికేసింది అన్నమాట! ఎందుకో.. ఏమో... ప్రకృతిలో ఎన్నో వింతలు ఉంటాయి కానీ ఇలాంటిది మాత్రం ఇదే మొదటిది అంటున్నారు రేచల్ సైప్లర్ అనే మెరీన్ బయోజియోకెమిస్ట్. బల్లి తోకలు మళ్లీ పెరిగినట్లే కొన్ని ఇతర జీవజాతుల్లోనూ అవయవాల పునరుత్పత్తి జరుగుతూంటుంది. సాల్మాండర్స్లో కీళ్లు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూంటాయి. అలాగే జెల్లీఫిష్ వృద్ధాప్యం నుంచి యవ్వన స్థితికి వెళ్లిపోగలదు. ఒక కీటకం రెండుగా విడిపోయి కూడా బతకగలదు. కానీ ఇలా అస్సలు చావని శరీర భాగాన్ని మాత్రం గతంలో ఎక్కడ చూడలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. తెగిపోయిన ఒక భాగం ఇలా చావకుండా ఏళ్లపాటు ఉంటే మనకేంటి ప్రయోజనం? చాలానే అంటున్నారు శాస్త్రవేత్తలు. కణజాలాన్ని పెంచడం, సూక్ష్మజీవుల సాయంతో గాయాలు మాన్పడం వంటివి ఈ సముద్రపు దోసపై పరిశోధనలు చేయడం ద్వారా సాధ్యం కావచ్చునని అంచనా. సుదూర భవిష్యత్తులోనైనా తెగిన చేతులను మళ్లీ మొలిపించవచ్చునేమో??? వెన్నెముక లేని జీవజాతి అకశేరుకాలకు చెందిన ఈ సముద్రపు దోసపై ఎలాంటి నైతిక, న్యాయపరమైన నియంత్రణలు లేకుండా పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంది. తద్వారా జీవం విషయంలో సరికొత్త విషయాలు తెలుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెమోరియల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు మూడేళ్ల తరువాత తమ పరిశోధనలు నిలిపివేశారు. ఇటీవలే సైన్స్ అడ్వాన్స్‌లో వివరాలు ప్రచురితమయ్యాయి. కొసమెరుపు ఏమిటంటే.. ఆ ముక్క ఇప్పటికీ చురుకుగానే అంటే జీవంతోనే ఉండటం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
వందలాది భారతీయుల డ్యాన్సింగ్ వీడియో : దుమారం, అసలు ట్విస్ట్ ఇదీ!
కెనడాలోని రద్దీగా ఉండే టొరంటో వీధుల్లో వందలాదిమంది భారతీయులు నృత్యం చేసిన ఘటన, దానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా భారతదేశపు వలసరాజ్యం లా మారిపోతోంది అంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ఆన్లైన్లో అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది. ముఖ్యంగా కెనడా స్థానికులు మాత్రం దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇలా జరగనివ్వమని స్థానికులు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు ఒక చర్చకు దారితీసింది.ఒక యూజర్ వివాదాస్పదమైన క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేయడంతో వివాదం మొదలైంది. కెనడా ఇప్పుడు భారతీయ వలసరాజ్యంగా మారిపోయింది. టొరంటోలో కెనడియన్లే ఇప్పుడు మైనారిటీలుగా మారిపోతున్నారు. వలసవచ్చిన వారి సంఖ్య గతంలో కంటే మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయింది. దీనిని మనం ఇలాగే వదిలేయ కూడదు. కెనడియన్లారా, ఇప్పటికైనా మేల్కోండి అంటూ ఎక్స్‌లో షేర్ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. అంతేకాదు రాబోయే కొద్ది సంవత్సరాల్లో కెనడాలోని 'బ్రాంప్టన్' నగరం పూర్తిగా భారతీయ మూలాలున్న వారితో నిండిపోయి, వారే మెజారిటీగా మారే నగరంగా రూపాంతరం చెందుతుంది. ఇది కెనడాపై జరుగుతున్న థర్డ్ వరల్డ్ (మూడో ప్రపంచ దేశాల) ఆక్రమణ అంటూ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు.This is neither Indian culture nor art. This is a disgusting display of a cheap Bollywood reel. Come to Canada and see how despised the community is becoming. https://t.co/PzV8uFX4dP— Ashis Basu 🇨🇦 ashis.bluesky.social (@BasuAshis) June 3, 2026 Until they aren’t creating a chaos in public, causing hindrance to people in general, no traffic snarls They are allowed to spread #IndianCulture #IndianHeritage and #IndianHistory across the globe - Period pic.twitter.com/ElBYbX2TOE— 𝐒𝐢𝐝𝐝 (@sidd_sharma01) June 3, 2026నెటిజన్ల స్పందనకల్చర్ మిస్ అవుతోంది, అసలు ఇది కెనడానా లేక ఇండియా అర్థం కావడం లేదు. కెనడా తన సొంత సంస్కృతిని కోల్పోతోంది. వలస వచ్చిన వారు ఇక్కడి సంస్కృతిని, పద్ధతులను గౌరవించాలంటూ ఒకరు అసహనం వ్యక్తం చేశారు. మరికొంతమంది ఇండియన్స్‌కు మద్దతుగా నిలిచారు. భారీగా పన్నులు చెల్లిస్తూ, కీలకమైన ఉద్యోగ కొరతను తీర్చే వలసదారుల కష్టంతోనే కెనడాఎదుగుతోందని విమర్శించారు. .మరికొందరు ఈ వేడుకల వల్ల ఎవరికి నష్టం జరిగింది. ప్రజలు ఆనందంగా గడపడం కూడా తప్పేనా అని ప్రశ్నించారు.ఇదీ చదవండి: రొటీన్ లైఫ్ బోర్ కొట్టి రెండు ఉద్యోగాలు : బైక్ రైడ్స్‌తో రోజుకు రూ. 1500మరోవైపు విదేశాల్లో భారతీయుల వ్యవహార శైలిపై కొంతమంది భారతీయులు విమర్శించారు. ఇది భారతీయ సంస్కృతీ కళ కానే కాదు. ఇది ఒక చౌకబారు బాలీవుడ్ రీల్స్ స్టంట్ అంటూ మండిపడుతూ ఆశిస్ బసు ట్వీట్ చేయగా, స్థానిక సంస్కృతిలో కలిసి పోకుండా విదేశాలలో తమ మాతృదేశ సంప్రదాయాలను ఎందుకు అనుకరిస్తున్నారని ప్రశ్నిస్తూ తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. కొంతమందైతే, ఇటువంటి వేడుకలను పూర్తిగా నిషేధించాలని కూడా డిమాండ్ చేశారు.2024 ലെ ഒരു വീഡിയോ. കാനഡയിലെ ടോറോന്റോയിൽ നിന്നുള്ളത്. ഇന്ത്യക്കാരാണ് ഡാൻസ് ചെയ്യുന്നത്. പക്ഷെ രണ്ടു വർഷത്തിന് ശേഷം, ഇപ്പോൾ വീണ്ടും ഈ വീഡിയോ സോഷ്യൽ മീഡിയയിൽ വൈറലാകുന്നുണ്ട്. ഈ ഡാൻസ് വീഡിയോയുടെ കമന്റ് സെക്ഷൻ മുഴുവൻ, വംശീയ അധിക്ഷേപങ്ങൾ കൊണ്ട് നിറഞ്ഞതാണ്. #dance #toronto pic.twitter.com/XO1RRZjQAZ— OBC - OffBeat Concerns (@OffBeatConcerns) June 5, 2026ట్విస్ట్ ఏంటంటే..ఇది 2024 నాటి వీడియో. కానీ రెండు సంవత్సరాల తర్వాత, ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ డ్యాన్స్ వీడియో కామెంట్ సెక్షన్ మొత్తం జాతి వివక్షాపూరిత దూషణలతో నిండిపోయింది. ఇదీ చదవండి: ప్రముఖ హాలీవుడ్ నటుడి దారుణ హత్య : ప్రియురాలి కొడుకు అరెస్ట్ -
'వివాదాలు వీడి' వాణిజ్యం వైపు!
వందకు పైగా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార దిగ్గజాలతో కూడిన బృందంతో భారత వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ గత వారం కెనడా పర్యటించటం ఇరు దేశాల సంబంధాలలో కీలక మలు పును సూచిస్తోంది. మార్క్ కార్నీ కెనడా ప్రధానిగా పగ్గాలు చేపట్టే సమయానికి భారత్–కెనడా సంబంధాలు అధఃపాతా ళంలో ఉన్నాయి. ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతంలో రెండు దేశాలూ పరస్పరం దౌత్య సిబ్బందిని పెద్ద మొత్తంలో బహిష్కరించాయి. ఖలిస్తాన్ వివాదం, దౌత్య స్పర్థల్ని నాటి ప్రధాని ట్రూడో తన స్థానిక రాజకీయ చదరంగంలో పావుల్లా వాడుకోవటానికి ప్రయత్నించారు. భారత సంతతికి చెందిన 18 లక్షల కెనడియన్ల ఓట్లకు గాలం వేయటానికి ట్రూడో భారత్–కెనడా సంబంధాలను ఫణంగా పెట్టారు. కెనడా పార్లమెంటులో బహిరంగంగా నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ హస్తమున్నదని (అండర్ కవర్ ఆపరేషన్) ఆరోపించారు. సంబంధాలలో సరికొత్త అధ్యాయంమార్క్ కార్నీ ప్రధాని కాగానే భారత్‌తో సంబంధాలను పునరు ద్ధరించటంపై దృష్టి పెట్టారు. 2023 అక్టోబర్‌లో దౌత్యవేత్తల బహి ష్కరణ తర్వాత 2025 సెప్టెంబర్‌లో తిరిగి హైకమిషనర్లను పునర్ని యమించారు. అదే నెలలో ఇరు దేశాల భద్రతా సలహాదార్లు సమా వేశమయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో కార్నీ నాలుగు రోజులపాటు భారత్‌లో పర్యటించటంతో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. 2010 నుండి పదహారేళ్లుగా నత్తనడక నడుస్తున్న భారత్–కెనడా వాణిజ్య చర్చలను పరుగులు పెట్టించి 2026 సంవత్సరాంతానికి ‘కాంప్రహెన్సివ్ ఎకనమిక్ అండ్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్’ (సీఈపీఏ)ను ఖాయం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 కల్లా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మూడింతలు చేసి 50 బిలియన్ డాలర్ల స్థాయికి తీసుకు వెళ్లాలని నిశ్చయించారు.భారత్–కెనడా వాణిజ్యం కేవలం కొన్ని వస్తువులు, సేవలకే పరిమితమై ఉంది. కెనడా నుండి మనం పప్పుధాన్యాలు, చమురు, గ్యాస్, బొగ్గు, కలప, కాగితం, ఎరువులు, వైమానిక పరికరాలను దిగుమతి చేసుకుంటున్నాం. కెనడాకు భారత్ విలువైన రాళ్లు, ఫార్మా స్యూటికల్స్, వస్త్రాలు, రసాయనాలను ఎగుమతి చేస్తోంది. నిజానికి ఈ వాణిజ్యాన్ని విస్తరించటానికి అవకాశాలు ఉన్నాయి. భారత్ 2070 కల్లా నెట్–జీరో కార్బన్ లక్ష్యాన్ని సాధించాలంటే అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తి సామర్థ్యాన్ని వేగంగా విస్తరింపజేయాలి. 2047 కల్లా 100 గిగావాట్ల అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తికి కనీసం సాలీనా 5 వేల టన్నుల యురేనియం అవసరమవుతుంది. మన దేశంలో సాలీనా 600 టన్నుల యురేనియంను మాత్రమే ఉత్పత్తి చేస్తున్నాం. భారత్‌లో ఉన్న 24 అణు రియాక్టర్లలో 14 యురేనియం కొరత వలన సామర్థ్యం కంటే దిగువన పని చేస్తున్నాయి. చైనాకు ప్రత్నామ్నాయంగా కెనడాకెనడా, ప్రపంచంలో రెండవ అతి పెద్ద యురేనియం ఉత్పత్తి దారు. అత్యంత నాణ్యమైన యురేనియం సిగార్ సరస్సు, మెక్– ఆర్థర్ నదీ పరివాహకాలలో ఉత్పత్తి అవుతున్నది. ప్రపంచ మార్కె ట్లలో లభించే ఆస్ట్రేలియా, కజకిస్తాన్ యురేనియంతో పోల్చితే కెనడా యురేనియం నాణ్యమైనది, చౌకగా లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే 2020లో కాలం చెల్లిన 2015 ఒప్పందం స్థానంలో భారత్– కెనడాల మధ్య 2.5 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం ఒప్పందంపై కార్నీ భారత పర్యటనలో అంగీకారం కుదిరింది.యుద్ధ విమానాలు, క్షిపణులు, అంతరిక్ష వాహక నౌకలు, ఏఐ, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ రంగాలకు కీలకమైన 24 రకాల అరుద యిన ఖనిజాల విషయంలో భారత్ దాదాపుగా చైనా దిగుమతులపై ఆధారపడుతున్నది. లాంథనం, సెరియం, నియోడిమియం, సమారియమ్, టెర్బియం, డిస్ప్రోజియం, లిథియం తదితర అరుదైన ఖనిజాలు కేరళ, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ సముద్రతీర మోనజైట్ ఇసుక లలో లభిస్తాయి. కానీ మోనజైట్‌ను శుద్ధి చేసి ఆ ఖనిజాలను వేరు చేసే సామర్థ్యం భారత్‌కు లేదు. ముడి మోనజైట్‌ను చైనాకు ఎగుమతి చేసి, శుద్ధి చేసి, వేరుపరిచిన ఖనిజాలతో తయారయిన మాగ్నెట్లను, బ్యాటరీలను చైనా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అరుదైన ఖనిజాల శుద్ధి, మాగ్నెట్లు / బ్యాటరీల తయారీ వ్యవస్థ కెనడా వద్ద ఉన్నప్పుడు చైనాపై ఆధారపడటం వ్యూహాత్మక తప్పిదం. ఈ నేపథ్యంలోనే అరుదైన ఖనిజాల శుద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, మాగ్నెట్ల తయారీకి కెనడాతో అంగీకారం కుదిరింది. ఈ సంవత్సరాంతానికి కెనడా కంపెనీల భాగస్వామ్యంతో కనీసం అయిదు ప్రాజెక్టులను ఈ రంగంలో ప్రారంభించటానికి సన్నాహాలు చేస్తున్నారు. కెనడాలోని మొత్తం విదేశీ విద్యార్థులలో భారత్ వాటా 40 శాతం. సుమారు 4.27 లక్షలమంది భారతీయులు కెనడాలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఏడాది 15 బిలియన్ డాలర్లను కెనడాకు చెల్లిస్తున్నారు. 21 కెనడా యూనివర్సిటీల అధిపతులు కార్నీ వెంట భారత్‌కు వచ్చారు. భారత్‌లో కెనడియన్ యూనివర్సిటీల క్యాంపస్‌ల ఏర్పాటుకు, భారత్–కెనడా యూనివర్సిటీల ఉమ్మడి కోర్సుల నిర్వహణకు, విద్యార్థుల మారకానికి, ఏఐ గ్రీన్ హైడ్రోజన్ క్వాంటమ్ మెకానిక్స్ వంటి రంగాలలో ఉమ్మడి పరిశోధనలకు 200కు పైగా ఒప్పందాలు జరిగాయి.సుంకాల రద్దుకు సమాలోచనలుఆర్కిటిక్, పసిఫిక్ తీరాలు కలిగి ఉన్న కెనడాలో రక్షణ–భద్రత రంగాలలో కూడా భారత్ సంబంధాలు పటిష్టం చేసుకోవటానికి ఒప్పందం జరిగింది. రానున్న దశాబ్దాలలో ఇండో–పసిఫిక్, ఆర్కి టిక్ జలాలు ప్రపంచ రాజకీయాలను శాసిస్తాయి. అందుకే నౌకా నిర్మాణం, సబ్మెరైన్లు, సముద్ర జలాలలో నిఘా వంటి అంశాలలో ఉమ్మడి భాగస్వామ్యంలో ప్రాజెక్టులను ప్రారంభించటానికి శ్రీకారం చుట్టారు. భారత ఆర్థిక సేవల రంగంలో కెనడియన్ పెన్షన్ ఫండ్ల పెట్టుబడులు కీలకం. 140 బిలియన్ కెనడియన్ డాలర్లను భారత దేశపు ఎనర్జీ, ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్, ఈక్విటీ, బాండ్ సెక్యూరిటీలలో కెనడా పెట్టుబడిగా పెట్టింది. స్వేచ్ఛా వాణిజ్యంలో భాగంగా ఇరువైపులా సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని కూడా భావిస్తున్నారు. కానీ భారత్‌కు ముఖ్యంగా వ్యవసాయోత్పత్తుల దిగుమతులపై ఇబ్బందులున్నాయి. ప్రస్తుతం కెనడా పప్పుధాన్యాలు, నూనెల దిగుమతులపై 15–30 శాతం సుంకాన్ని విధిస్తున్నాం. వ్యవసాయ దిగుమతులపై సుంకాలను పూర్తిగా ఎత్తివేస్తే మన రైతులు, వ్యవ సాయంపై ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీఈపీఏ ఒప్పందం ఖాయం చేయాలంటే సుంకాలతోపాటు అనేక ఇతర సంక్లిష్ట అంశాలలో ఒప్పందం కుదరాల్సి ఉంటుంది. ముఖ్యంగా సేవలు, పెట్టుబడుల రక్షణ, వివాదాల పరిష్కారం, మేధోహక్కుల పరిరక్షణ, కార్మిక, పర్యావరణ ప్రమాణాలు వంటి విషయాలలో మన దేశం రాజీ పడలేదు. కొత్త భాగస్వాముల వేటలో ఉన్న కెనడాతో పటిష్ట సంబంధాలు ఏర్పరచుకోవటంఉభయ తారకం.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
కెనడా క్రికెట్‌పై సస్పెన్షన్.. కీలక మార్పులకు ఐసీసీ ఆమోదం!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సోమవారం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టెస్టు క్రికెట్లో మార్పులకు ఆమోదముద్ర వేయడంతో పాటు కెనడా క్రికెట్‌పై సస్పెన్షన్, బంగ్లా క్రికెట్ బోర్డు ఎన్నికలను పర్యవేక్షించేందుకు ఐసీసీ ఉన్నతాధికారులను నియ మించడం వంటి నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా అహ్మదాబాద్ వేదికగా ఐసీసీ చైర్మన్ జైషా నేతృత్వంలో రెండు రోజులపాటు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే ఐసీసీ పలు కీలక మార్పులకు ఆమోద ముద్ర వేసింది.అవినీతి ఆరోపణలు..అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న కెనడా క్రికెట్‌ను సస్పెండ్ చేయాలని ఐసీసీ బోర్డు తీర్మానించింది. సభ్యత్వానికి సంబంధించిన బాధ్యతలను ఉల్లంఘించిన కారణమే తక్షణ సస్పెన్షన్‌కు కారణమని తెలుస్తోంది. అయితే కెనడా క్రికెట్ బోర్డుపై వేటు వేసినప్పటికీ జట్టు ఆటగాళ్ల ప్రయోజనాలను కాపాడడం ఐసీసీ మొదటి ప్రాధాన్యమని తెలిపింది. జాతీయ పాలకమండలిని ప్రభావితం చేసే పాలనపరమైన సమస్యల వల్ల ఆటగాళ్లు నష్టపోకుండా చూడడం తమ బాధ్యత అని ఐసీసీ తెలిపింది.సస్పెన్షన్‌లో ఉన్న కెనడా క్రికెట్ బోర్డులో సమస్యలను పరిష్కరించడానికి ఐసీసీ నార్మలైజేషన్ కమిటీ పనిచేయనుందని, కెనడా క్రికెట్ బోర్డును తిరిగి కొత్తగా పునరుద్ధరించేందుకు దోహదపడుతుందని పేర్కొంది.పింక్‌బాల్ ట్రయల్..ఆటలో వెలుతురు సమస్య కారణంగా ఆట నిలిచిపోకుండా ఉండేందుకు, సంప్రదాయ రెడ్ బాల్‌కు బదులుగా అవసరమైతే పింక్ బాల్ వినియోగాన్ని ట్రయల్‌గా అనుమతించేందుకు నిర్ణయం తీసుకుంది. అయితే పింక్ బాల్ ట్రయల్‌కు షరతులతో అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.ముందుగా ఇరు జట్ల అంగీకారంతో, చెడు వెలుతురు కారణంగా ఆట ఆగే పరిస్థితులు ఉంటే రెడ్ బాల్ స్థానంలో పింక్ బాల్ ఉపయోగించేందుకు ట్రయల్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రతిపాదనను ఐసీసీ క్రికెట్ కమిటీ (మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ నేతృత్వంలో) అలాగే చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ పరిశీలించి ఓకే చెప్పింది. టెస్టు క్రికెట్లో వెలుతురు తగ్గడం వల్ల ఆట తరచూ నిలిచిపోతుండటాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం. అధికారిక ప్రకటనలో పూర్తి విధివిధానాలు వెల్లడించకపోయినా, పరిస్థితులు క్షీణిస్తున్నప్పుడు మ్యాచ్ అధికారులు రెడ్ బాల్ నుంచి పింక్ బాల్‌కు మారే అవకాశం ఇవ్వబడుతుందని సమాచారం. పింక్ బాల్ సాధారణంగా డే-నైట్ టెస్టుల్లో ఉపయోగించబడుతుంది. తక్కువ వెలుతురులో మెరుగైన కనిపించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓవర్‌కాస్ట్ పరిస్థితులు, త్వరగా సూర్యాస్తమయం జరిగే దేశాల్లో బాడ్ లైట్ కారణంగా ఆట ఎక్కువగా నిలిచిపోతుండటంతో ఈ నిర్ణయాన్ని ప్రాక్టికల్ సొల్యూషన్‌గా చూస్తున్నారు.హాక్-ఐ డేటాకు అనుమతిసందేహాస్పద బౌలింగ్ యాక్షన్‌పై రిపోర్ట్ చేసే సందర్భంలో మ్యాచ్ అధికారులు ఇకపై 'హాక్-ఐ డేటాను ఉపయోగించేందుకు' ఐసీసీ అనుమతి ఇచ్చింది. .వన్డేల్లో హెడ్‌కోచ్‌లకు కొత్త అవకాశంఇక వన్డే మ్యాచ్‌లలో డ్రింక్స్ బ్రేక్ సమయంలో కోచ్‌లు మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి లభించింది. ఇప్పటివరకు ఇది కేవలం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లకే పరిమితమైంది. ప్రతి ఇన్నింగ్స్‌లో రెండు డ్రింక్స్ బ్రేక్‌లు ఉండటంతో కోచ్‌లు మ్యాచ్‌లో నాలుగు సార్లు ప్రత్యక్షంగా ఆటగాళ్లకు వ్యూహాలను చెప్పే అవకాశం పొందనున్నారు. అయితే కోచ్‌లు మైదానంలో ఎలాంటి డ్రెస్ కోడ్‌లో ఉండాలన్నది ఇంకా స్పష్టత రాలేదు.లెగ్-సైడ్ వైడ్ రూల్‌కు శాశ్వత ఆమోదంఐసీసీ లెగ్-సైడ్ వైడ్‌పై సవరించిన నిబంధనను శాశ్వతంగా అమలు చేయాలని నిర్ణయించింది. అలాగే ఎంసీసీ క్రికెట్ నిబంధనల్లో మిగిలిన మార్పులు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.మరికొన్ని నిర్ణయాలు..క్రికెట్ వరల్డ్ కప్ ఛాలెంజ్ లీగ్‌లో పాల్గొనే జట్లు, టోర్నమెంట్ సైకిల్ సమయంలో ఇతర లిస్ట్-ఏ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడేందుకు అర్హత కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. మొత్తంగా, టెస్టు క్రికెట్లో ఆట సమయాన్ని పెంచడం, ఆధునిక టెక్నాలజీ వినియోగం, అలాగే పరిమిత ఓవర్ల ఫార్మాట్లో వ్యూహాత్మక మార్పుల దిశగా ఐసీసీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. చదవండి: బీసీసీఐ ప్రాపర్టీని నాశనం చేసిన ఆర్సీబీ బ్యాటర్! -
దయ్యాల దీవి
అట్లాంటిక్ మహాసముద్రంలో కెనడాలోని న్యూఫౌండ్లాండ్ తీరానికి ఆవల ఉన్న ఈ దీవి పేరు ‘క్విర్పాన్ ఐలండ్’. అయితే, ఇది దయ్యాల దీవిగా పేరు మోసింది. దీనికి దయ్యాల దీవిగా పేరు రావడం వెనుక పదహారో శతాబ్దినాటి సంఘటన ఒకటి కారణమని చెబుతారు. ఫ్రెంచ్ నావికుడు కెప్టెన్ జ్హా ఫ్రాంకోయిస్ 1542లో మందీ మార్బలంతో నౌకాయాత్రకు బయలుదేరాడు. అదే నౌకలో ఫ్రాంకోయిస్ బంధువైన మార్గరిట్ అనే మహిళ మరో యువనావికుడితో సాన్నిహిత్యం పెంచుకుంది. ఫ్రాంకోయిస్ ఆమెను శిక్షించడం కోసం మార్గరిటేను, ఆమెకు సన్నిహితుడైన యువనావికుడిని, ఆమె సేవకుడిని ఈ నిర్జన దీవిలో విడిచి వెళ్లిపోయాడు. ఒంటరి దీవిలో వారు అగచాట్లు పడుతూ, కొన్నాళ్లకు మరణించారు. ఇప్పటికీ వారి ఆత్మలు ఈ దీవిలోనే సంచరిస్తుంటాయని చెబుతుంటారు. అయితే, ఇటీవలి కాలంలో కొందరు ఔత్సాహిక పర్యాటకులు ఇక్కడకు రాకపోకలు జరుపుతున్నారు. -
కెనడాలో భారతీయ విద్యార్థిని దారుణ హత్య
కెనడాలో గుజరాత్‌కు చెందిన 22 ఏళ్ల విద్యార్థిని దారుణ హత్యు గురైంది. మృతురాలిని గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా, బోర్సాద్‌కు చెందిన విధి కల్పేష్‌భాయ్ మేఘానిగా గుర్తించారు. దుండుగులు విధి మేఘను దారుణంగా పొడిచి చంపారు. ఆమె మృతదేహం అమెరికా–కెనడా సరిహద్దులో లభ్యమైంది. అంతర్జాతీయ మీడియా ప్రకారం మేఘ గత నాలుగేళ్లుగా కెనడాలో నివసిస్తూ, తన చదువుతో పాటు, పార్ట్‌టైమ్ ఉద్యోగాన్ని కూడా చేసుకుంటూ ఉండేది. అంతేకాదు కెనడాలో శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో ఈ నెల 15నుంచి ఆమె కనిపించకుండా పోయింది. దీనిపై కుటుంబ సభ్యులు, ఆమె సన్నిహితులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల గాలింపులో కెనడాలోని నయాగారా ప్రాంతంలో, కెనడా–అమెరికా సరిహద్దులో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటిపై కత్తిపోట్లు ఆధారంగా ఆమెను ఎవరో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఈ దాడికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇంకా అస్పష్టంగానే ఉంది. ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.ఇదీ చదవండి: సీబీఎస్ఈ వివాదం : ఎట్టకేలకు మౌనం వీడిన ధరేంద్ర ప్రధాన్ఇదీ చదవండి: భారత మామిడి పళ్లపై జపాన్ బ్యాన్ : ఎందుకో తెలుసా? -
బెదిరింపులకు విరుగుడు వ్యూహం
యూఎస్ఏ ఆధిపత్య వైఖరిని తిప్పి కొడుతున్న కెనడా విధానాలు భారత్ వంటి దేశాలకు మార్గదర్శకం. యూఎస్ఏ సుంకాల యుద్ధం, బెదిరింపులకు అనేక దేశాలు మోకరిల్లాయి. కానీ పొరుగు దేశం, చిరకాల మిత్రదేశమైన కెనడా తన దైన శైలిలో దీటుగా ప్రతిస్పందించింది. కెనడాను ట్రంప్ తన శైలిలో యూఎస్ఏ 51వ రాష్ట్రంగా వెక్కిరించాడు. కెనడా ప్రధాని కార్నీ దీనికి హుందాగా, వ్యూహా త్మకంగా బదులిస్తున్నాడు. బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌లకు గవర్నర్‌గా పనిచేసిన కార్నీ తన ఆర్థిక–బ్యాంకింగ్ రంగ అనుభవాన్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాడు.పరస్పర గమ్యంయూఎస్ఏ–కెనడా పరస్పర ఆధారిత ఆర్థిక వ్యవస్థలు. కెనడా తయారీ రంగంలో 25 శాతం వాటా ఆటోమొబైల్ రంగానిదే. ఇవి 95 శాతం యూఎస్‌కు ఎగుమతి అవుతాయి. ఒక ఫోర్డ్ కారు తయారవటానికి విడి భాగాలు కనీసం ఎనిమిదిసార్లు యూఎస్– కెనడా సరిహద్దులను దాటుతాయి. యూఎస్ ముడి చమురు దిగు మతిలో కెనడా వాటా 60 శాతం. కెనడాలోని ఆల్బర్టాలో ఉత్పత్త యిన ముడిచమురు ఎన్‌బ్రిడ్జ్ పైపు లైన్ల ద్వారా మిన్నెసోటా– విస్కాన్సిన్ రాష్ట్రాల గుండా ఇల్లినాయిస్, ఓహియో రిఫైనరీలను చేరుతుంది. కెనడాలో ఉత్పత్తయిన బరువైన ముడి చమురును శుద్ధి చేయటానికి ప్రత్యేకంగా యూఎస్‌లో రిఫైనరీలను ఏర్పాటు చేశారు. కెనడాలోని క్యుబెక్ రాష్ట్రంలో ఉత్పత్తయిన జల విద్యుచ్ఛక్తి యూఎస్ లోని న్యూయార్క్, న్యూఇంగ్లాండ్ రాష్ట్రాలలోని సుమారు మిలియన్ గృహాలు వాడుకుంటున్నాయి. యూఎస్‌లో ఉత్పత్తవుతున్న విద్యు చ్ఛక్తిలో అణు విద్యుత్ వాటా 20 శాతం. దీనికి కావాల్సిన యురే నియం అణు ఇంధనాన్ని కెనడా ఎగుమతి చేస్తుంది. యూఎస్‌లోని డెయిరీఫామ్‌లు పాల ప్రాసెసింగ్‌కు కెనడాలోని క్యుబెక్పై ఆధారపడతాయి. ఎరువుల తయారీకి కీలకమైన పొటా షియం ప్రపంచ ఉత్పత్తిలో కెనడా వాటా 30 శాతం. యూఎస్‌లోని అయోవా, కన్సాస్, నెబ్రాస్కా వ్యవసాయ క్షేత్రాలు ఎరువులకు కెనడాపై ఆధారపడతాయి. కెనడాలో వినియోగించే పండ్లు, కూర గాయలు 80 శాతం యూఎస్ నుండి దిగుమతి అవుతున్నాయి. బోయింగ్ 737 విమానాల రెక్కలు కెనడాలో తయారవుతాయి. కెనడాలో ఉత్పత్తయిన ఉక్కులో 90 శాతం యూఎస్‌కు ఎగుమతి అవుతున్నది. కెనడా బ్యాంకుల శాఖలు యూఎస్‌లో విస్తారంగా పని చేస్తున్నాయి. స్థూలంగా కెనడా ఎగుమతులలో యూఎస్ వాటా 75 శాతం. అదే సమయంలో 34 అమెరికా రాష్ట్రాల ఎగుమతులకు కెనడా ప్రధాన గమ్యం.తమ ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంబంధాలను పట్టించు కోకుండా 2025 ఫిబ్రవరిలో ట్రంప్ కెనడా దిగుమతులపై 25 శాతం సుంకాలను విధించాడు. చమురు, విద్యుచ్ఛక్తిపై పది శాతం విధించాడు. దీని ప్రభావం కెనడా స్టీల్, అల్యూమినియం, కలప, ఆటో మొబైల్ పరిశ్రమలపై తీవ్రంగా పడింది. దాంతో ‘స్నేహితులే కానీ ఆధారపడటం కాదు’ వ్యూహాన్ని కార్నీ అమలుపరచాడు. ఎగుమతి రంగంలో 75 శాతం కేవలం ఒక దేశంపై ఆధారపడటం ఆర్థిక వ్యవస్థ బలహీనతను సూచిస్తుంది. అందుకే వ్యూహాత్మక వైవిధ్యత విధానాన్ని కెనడా ఎంచుకొన్నది.తమ్ముడు తమ్ముడే...కెనడాలోని వివిధ రాష్ట్రాలు యూఎస్ వాణిజ్యంపై ప్రతిదాడి మొదలుపెట్టాయి. ఒంటారియో రాష్ట్రం యూఎస్‌లోని మిచిగన్‌కు ఎగుమతి అవుతున్న విద్యుచ్ఛక్తిపై 25 శాతం సర్‌చార్జి విధించింది. క్యుబెక్ రాష్ట్రం యూఎస్ సంస్థల వాణిజ్య బిడ్లపై 25 శాతం పన్ను విధించింది. బ్రిటిష్ కొలంబియాలో టెస్లా కార్ల దిగుమతి రిబేట్లను ఉపసంహరించుకున్నది. కెనడాలో అమ్ముడుపోయే అన్ని ప్రముఖ యూఎస్ లిక్కర్ బ్రాండ్లను సూపర్ మార్కెట్లలో నిషేధించారు. న్యూఫౌండ్లాండ్ రాష్ట్రం స్టార్ లింక్ కాంట్రాక్టును రద్దు చేసింది. సమాంతరంగా కెనడా తన వాణిజ్యాన్ని యూఎస్ కేంద్రకం నుండి మరల్చి ఇతర బలమైన ఆర్థిక వ్యవస్థలతో సంబంధాలకు శ్రీకారం చుట్టింది. యూరోపియన్ యూనియన్, చైనా, ఇండియా, జపాన్, కొరియా, యూకే, ఆస్ట్రేలియాలతో వ్యూహాత్మక వాణిజ్య, రక్షణ ఒప్పందాలను చేసుకుంటున్నది.కెనడా – యూరోపియన్ యూనియన్ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్జీ), యురే నియం, జలవిద్యుచ్ఛక్తిలను ఐరోపా దేశాలకు కెనడా ఎగుమతి చేస్తుంది. అరుదైన ఖనిజాల ఉత్పత్తి, శుద్ధిపై చైనాకు గుత్తాధిపత్యం ఉన్నది. ఈ గుత్తాధిపత్యాన్ని సవాలు చేసే శక్తి ఉన్న అతి కొద్ది దేశా లలో కెనడా ఒకటి. కెనడాలో లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ముడి ఖనిజ నిల్వలు అపారం. ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రాడార్లు, యుద్ధ విమానాల ఉత్పత్తిలో కీలకమైన బ్యాటరీల తయారీ వీటి మీద ఆధారపడి ఉన్నది. కెనడాలో ఈ ఖనిజాల త్రవ్వకం, శుద్ధిలో పెట్టుబడులకు యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. నాటో రక్ష ఛత్రంపై నీలి నీడల నేపథ్యంలో ఐరోపా తనదైన రక్షణ, భద్రతా పథకాన్ని అమలు చేస్తున్నది. సెక్యూరిటీ యాక్షన్ ఫర్ యూరప్ (సేఫ్) పథకంలో కెనడాను భాగస్వామిగా చేయటానికి ఒప్పందం జరిగింది. 150 బిలియన్ యూరోల కాంట్రాక్టులను కెనడా డిఫెన్స్ కంపెనీలకు ఇవ్వటానికి సంసిద్ధత వ్యక్తమైంది.కెనడా–చైనా వాణిజ్య ఒప్పందంలో భాగంగా చైనా ఎలక్ట్రిక్ వాహనాలపైన ఉన్న నూరు శాతం సుంకాలను ఎత్తివేశారు. కెనడా నుంచి పశువుల మాంసం, క్రొవ్వు దిగుమతికి చైనా అంగీకరించింది. కెనడాలో బ్యాటరీ ప్లాంట్లను రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఉమ్మడి భాగస్వామ్యంలో ఏర్పాటు చేయటానికి జపాన్‌తో ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియా భాగస్వామ్యంతో క్యుబెక్ రాష్ట్రంలో లిథియం ఆక్సైడ్ బ్యాటరీ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. హ్యుండాయి, కియా ఎలక్ట్రిక్ కార్లకు ఈ బ్యాటరీలను వాడతారు. మైనింగ్ రంగంలో అపార అనుభవం ఉన్న ఆస్ట్రేలియాతో యురే నియం, లిథియం, నికెల్, కోబాల్ట్ వంటి ఖనిజాలపై ఉమ్మడి పథకాలను రచిస్తున్నారు.దిక్కుతోచని ట్రంప్ఇటీవలి బీజింగ్ పర్యటనలో చైనా 200 బోయింగ్ విమానాల ఖరీదుకు సుముఖత చూపడాన్ని ట్రంప్ తన వ్యక్తిగత విజయంగా చూపించాడు. మలేషియాకు చెందిన ఎయిర్ ఏషియా సంస్థ ఏ220 తరగతికి చెందిన 150 పౌర విమానాల తయారీకి కెనడాతో 21 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. ఇది కెనడా పారిశ్రామిక రంగానికి పెద్ద విజయం. కెనడా వ్యూహాత్మక ప్రతిఘటనకు ట్రంప్‌కు దిక్కుతోచడం లేదు. అమెరికన్ సంస్థల గణాంకాల ఆధారంగా కార్నీ అమెరికన్ ప్రతిపాదనలను తూర్పారబట్టాడు. ఈ నేపథ్యంలో కార్నీని అబద్ధాల కోరుగా ట్రంప్ నోరుపారేసుకున్నాడు. డెట్రాయిట్ నదిపై డెట్రా యిట్(యూఎస్)–విండ్సర్ (కెనడా)లను కలుపుతూ కెనడా నిర్మించిన గార్డీహావే వంతెన ప్రారంభం కాకుండా చూస్తానని హూంకరించడం ట్రంప్ నిస్సహాయతను సూచిస్తున్నది. కార్నీ అవలంబిస్తున్న ఈ ప్రతిస్పందన జియోపొలిటికల్ రంగంలో కొత్త అధ్యాయానికి తెర తీసిందనటంలో సందేహం లేదు.గురజాల శ్రీనివాసరావువ్యాసకర్త అడిషనల్ రిజిస్ట్రార్ (రిటైర్డ్);సివిల్స్, గ్రూప్–1 పోటీ పరీక్షల నిపుణులు -
క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు
ఓ అంతర్జాతీయ క్రికెట్ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పుల కలకలం రేగింది. క్రికెట్ కెనడా అధ్యక్షుడు అర్విందర్ ఖోసా నివాసం బయట గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన క్రికెట్ వర్గాల్లో దుమారం రేపుతోంది.బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలోని న్యూటన్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మే 20 తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో ఖోసా ఇంటి వద్ద పలుమార్లు తుపాకీ కాల్పులు జరిగినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఇంటి తలుపులు, కిటికీలపై బుల్లెట్ గుర్తులు కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సర్రే పోలీసులు.. ఎక్స్టోర్షన్ (దందా వసూళ్ల బెదిరింపులు)కు సంబంధించిన దాడిగా భావిస్తున్నారు. ఈ ఇంటికి సంబంధం ఉన్న వ్యక్తికి గతంలో ఎక్స్టోర్షన్ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో కెనడా క్రికెట్ చుట్టూ వివాదాలు పరిపాటిగా మారాయి. భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఆ జట్టుపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఓ డాక్యుమెంటరీలో బయటపడిన వివరాల ప్రకారం.. 2026 ప్రపంచకప్‌లో భాగంగా కెనడా-న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ జరుపుతుంది. కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడిని టోర్నీకి ముందు ఆశ్చర్యకరంగా జట్టు కెప్టెన్‌గా నియమించడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది.పరిపాలనా సమస్యలు, ఆర్దికపరమైన అవకతవలు, ఫిక్సింగ్ ఆరోపణల కారణంగా ఐసీసీ ఇటీవలే క్రికెట్ కెనడాకు ఆరు నెలలపాటు ఫండింగ్‌ను ఆపింది. ఇలాంటి తరుణంలో బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. -
క్రూజ్ షిప్లో ప్రాణాంతక వైరస్.. కెనడాలో తొలి కేసు!
ఒట్టావా: అట్లాంటిక్ మహాసముద్రంలో ‘ఎంవీ హోండియస్’ క్రూజ్ షిప్లో ప్రయాణించిన వారిలో ప్రాణాంతక ‘ఆండీస్ హంటా వైరస్’ వెలుగుచూడటం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా ఈ నౌకలో ప్రయాణించిన ఓ కెనడా దేశస్థునికి ఈ వైరస్ సోకినట్లు ఆ దేశ ఆరోగ్య శాఖ అధికారికంగా నిర్ధారించడంతో విమానయాన, పర్యాటక వర్గాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.కెనడాలో తొలి కేసు నమోదుఏప్రిల్ 1న అర్జెంటీనా నుంచి బయలుదేరిన ఎంవీ హోండియస్ క్రూజ్ షిప్లో మొత్తం నలుగురు కెనడా పౌరులు ప్రయాణించారు. వీరిలో ఒకరి నమూనాలను పరీక్షించగా, మే 16న హంటా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆఫ్ కెనడా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. విన్నిపెగ్‌లోని నేషనల్ మైక్రోబయాలజీ ల్యాబొరేటరీలో చేసిన పరీక్షల్లో, అతడితో పాటు ప్రయాణించిన మరో కెనడియన్‌కు మాత్రం నెగెటివ్ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు.మనిషి నుంచి మనిషికి వ్యాప్తిసాధారణంగా ఎలుకలు, వాటి వ్యర్థాల ద్వారా మాత్రమే ఈ హంటా వైరస్ వ్యాపిస్తుంది. కానీ, ప్రస్తుతం ఈ క్రూజ్ షిప్లో వెలుగుచూసిన ‘ఆండీస్’ రకం మాత్రం మనిషి నుంచి మనిషికి నేరుగా సోకే అత్యంత ప్రమాదకరమైన వైరస్ కావడం ఆందోళన కలిగిస్తోంది. నౌకలో ప్రయాణికుల మధ్య వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించిన ఆరోగ్య సంస్థలు తక్షణమే అప్రమత్తమై, ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షణ చేపట్టాయి.కోవిడ్‌లా కాదు.. ప్రజలకు ముప్పు లేదుక్రూజ్ షిప్లో కేసులు నమోదైనప్పటికీ, కెనడాలోని సామాన్య ప్రజలకు ఈ వైరస్ వల్ల ప్రస్తుతం ఎలాంటి ముప్పు లేదని అధికారులు భరోసా ఇచ్చారు. ఇప్పటివరకు కొత్తగా ఎలాంటి కేసులు నమోదు కాలేదని, కాంటాక్ట్ ట్రేసింగ్, పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని కోవిడ్-19 మహమ్మారితో పోల్చవద్దని, ప్రజలు అనవసర భయాందోళనలకు గురికావొద్దని వైద్యాధికారులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: నాడు మన సొంతం.. నేడు పరాయి ముచ్చట! -
వేడుకగా విక్టోరియా డే!
చరిత్రతో ముడిపడిన సందర్భమే అయినా, కెనడియన్లు ఈ సమయాన్ని పూర్తిగా ఒక సమ్మర్ కిక్–ఆఫ్ ఈవెంట్‌గా భావిస్తారు. నెలల తరబడి మంచుతో, చలితో ఇబ్బంది పడే కెనడియన్లకు, చెట్లు పచ్చబడటం, వెచ్చని గాలులు వీచడం ఒక సంతోషకరమైన సమయం. అందుకే ఈ రోజున క్రీడా పోటీలు నిర్వహిస్తారు. రుచికరమైన వంటకాలతో విందులు చేసుకుంటారు. పలుచోట్ల కెనడా జాతీయ జెండాతో పాటుగా, యూనియన్ జాక్ జెండాను ఎగురవేస్తారు. రాజధాని నగరాల్లో తుపాకులతో ఘనంగా వందన కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ వేడుకల్లో కెనడా అంతటా ఒక నూతనోత్సాహం ఉట్టిపడుతుంది.కెనడాలో దేశవ్యాప్తంగా విక్టోరియా డే వేడుకలు మే 18 నుంచి మొదలవుతున్నాయి. మంచుతెరలు వీడి, ప్రకృతి పచ్చదనాన్ని పులుముకుంటున్న వేళ దేశమంతా సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ వేడుకలను విక్టోరియా రాణి పుట్టినరోజు సందర్భంగానే కాకుండా, సుదీర్ఘ శీతకాలం తర్వాత వచ్చే వెచ్చని వేసవికి స్వాగతం పలకడానికి జరుపుకొంటారు. బాణసంచా కాల్పులతో, విందు వినోదాలతో సరదాగా గడుపుతారు.విక్టోరియా మహారాణి పుట్టినరోజును అంటే మే 24న వేడుకగా జరుపుకోవడం 1845 నుంచి ఆచారంగా వస్తోంది. అప్పటి కెనడా ప్రావిన్స్ లెజిస్లేచర్ ఈ రోజును అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. 1901లో రాణి విక్టోరియా మరణానంతరం, ఈ పండుగ మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఆమె జ్ఞాపకార్థం కెనడా పార్లమెంట్ 1952లో ప్రతి సంవత్సరం మే 25కు ముందు వచ్చే సోమవారం రోజున ‘విక్టోరియా డే’ వేడుకలు నిర్వహించాలని అధికారికంగా నిర్ణయించింది. దాని ప్రకారం ఈ ఏడాది మే 18న నిర్వహించేందుకు ఘనమైన ఏర్పాట్లు చేసింది.కెనడియన్ల దృష్టిలో క్వీన్ విక్టోరియా అత్యంత గౌరవనీయురాలు. ఆమె హయాంలోనే కెనడాకు బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర ప్రతిపత్తి లభించింది. అంతేకాకుండా, ప్రస్తుత రాజధాని ఒటావాను దేశ రాజధానిగా ఎంపిక చేసింది కూడా ఆమెనే! 1956 వరకు, తదుపరి రాజుల పుట్టినరోజులను కూడా క్వీన్ విక్టోరియా పుట్టినరోజు అయిన మే 24నే నిర్వహించేవారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, క్వీన్ ఎలిజబెత్ బాధ్యతలు చేపట్టినపుడు, ఆమె అసలు పుట్టినరోజు ఏప్రిల్ 21 అయినప్పటికీ, ఆమె అధికారిక జన్మదిన వేడుకలను విక్టోరియా డే రోజున నిర్వహిస్తుండటం విశేషం. ∙ రమా జంబుల -
టెక్ మహీంద్రా చేతికి కెనడా ఐటీ కంపెనీ
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా కెనడా కంపెనీ అల్లూరి టెక్నాలజీస్ ఇంక్(అవాంట్)ను కొనుగోలు చేయనుంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా తొలుత 85% వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.8 కోట్ల కెనడియన్ డాలర్లు(రూ. 171 కోట్లు) వెచి్చంచనుంది. మూడేళ్ల తదుపరి మిగిలిన 15% వాటాను ముందుగా నిర్ణయించిన ధర ప్రకారం కొనుగోలు చేయనున్నట్లు టెక్ మహీంద్రా పేర్కొంది.అవాంట్తో.. సొంత అనుబంధ కంపెనీ టెక్ మహీంద్రా కన్సల్టింగ్ గ్రూప్(టీఎంసీజీ) వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్పీఏ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. తాజా కొనుగోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసులు, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగంలో మరింత బలపడే వీలున్నట్లు తెలియజేసింది. 2029 జూన్ 30కల్లా మిగిలిన 15% వాటా సైతం దక్కించుకోనున్నట్లు వెల్లడించింది.ఈ కొనుగోలు ద్వారా ఉత్తర అమెరికా మార్కెట్లో టెక్ మహీంద్రా తన ఉనికిని మరింత సుస్థిరం చేసుకోనుంది. ముఖ్యంగా అల్లూరి టెక్నాలజీస్‌కు ఉన్న డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ నైపుణ్యం, టెక్ మహీంద్రా గ్లోబల్ నెట్‌వర్క్‌కు తోడవ్వడం వల్ల క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విభాగాల్లో కొత్త ప్రాజెక్టులను చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. -
కెనడా కొత్త నిబంధనలు.. భారతీయులకు షాక్!
కెనడా ప్రభుత్వం ఇమ్మిగ్రేషన్ నిబంధనల్లో పలు మార్పులు చేసింది. అక్కడి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన 'బిల్ సి-12' చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం వల్ల కెనడాలో స్థిరపడాలని చూస్తున్న వారికి ఇబ్బందులు తప్పకపోవచ్చు. అయితే బిల్ సి-12 భారతీయులకు షాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే భారతీయుల్లో చాలా మంది అమెరికా తర్వాత అత్యంత ఎక్కువగా వెళ్లే దేశం కెనడానే. కొత్త నిబంధనల ప్రకారం.. కెనడాలోకి ప్రవేశించిన ఒక ఏడాది లోపు మాత్రమే రిఫ్యూజీ హోదా కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ గడువు దాటితే దరఖాస్తును స్వీకరించరు. గతంలో ఏండ్లు గడిచినా పీఆర్ రాకపోతే చివరి అవకాశంగా రిఫ్యూజీ క్లెయిమ్ చేసేవారు. ఇకపై అది సాధ్యపడదు. ఈ చట్టం కేవలం కొత్తవారికి మాత్రమే కాదు, ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న సుమారు 19వేల దరఖాస్తులపై కూడా ప్రభావం చూపనుంది. దీనివల్ల వేల సంఖ్యలో భారతీయ దరఖాస్తుదారులు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. కెనడా ప్రభుత్వం ఇప్పుడు ఏ ఒక్క వ్యక్తినో కాకుండా, ఒకేసారి పెద్ద సంఖ్యలో వీసాలను లేదా ఇమ్మిగ్రేషన్ పత్రాలను రద్దు చేసే అధికారాన్ని పొందింది. దీని కోసం ప్రతి కేసును విడివిడిగా విచారించాల్సిన అవసరం లేదు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కెనడా ప్రభుత్వం పేర్కొంది. శరణార్థుల దరఖాస్తుల విచారణను వేగవంతం చేయడం, ఇతర దేశాలతో సమాచారాన్ని పంచుకోవడం ఈ చట్టంతో సులభతరం అవుతుంది. అయితే మానవ హక్కుల సంఘాలు, ఇమ్మిగ్రేషన్ లాయర్లు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వంటి సంస్థలు దీనిని శరణార్థుల హక్కుల ఉల్లంఘనగా పేర్కొంటున్నాయి. సరైన విచారణ లేకుండానే వీసాలు రద్దు చేయడం వల్ల విదేశీయులను బలవంతంగా వెనక్కి పంపే ముప్పు పెరుగుతుందని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో కెనడా ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది. ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించడానికి ఇది అవసరమని ప్రభుత్వం చెబుతోంది. మోసపూరిత దరఖాస్తులను అడ్డుకోవడమే తమ ఉద్దేశమని స్పష్టం చేసింది. కెనడాలో భారతీయ విద్యార్థులు, వర్క్ పర్మిట్ హోల్డర్లు లక్షల్లో ఉన్నారు. పీఆర్ దక్కని వారు చాలామంది రిఫ్యూజీ దరఖాస్తుల మీద ఆధారపడుతుంటారు. కొత్త చట్టం వల్ల పాత కేసులు రీ-ఓపెన్ అవ్వడం లేదా వేగంగా తిరస్కరణకు గురవ్వడం జరిగితే.. భారతీయులు పెద్ద సంఖ్యలో డిపోర్టేషన్ ఎదుర్కొనే అవకాశాలున్నాయి. -
బహుభాషావేత్త... సోలో ట్రావెలర్ అందం బహుముఖం
ముప్పై రాష్ట్రాల అందాల ప్రతినిధులతో భువనేశ్వర్‌లో జరిగిన ‘మిస్ ఇండియా వరల్డ్ 2026’ పోటీలో విజేతగా నిలిచిన గోవా అమ్మాయి సాధ్వీ సతీష్ విశేషాలు తెలుసుకునేకొద్దీ ఆశ్చర్యపోతున్నారు అంతా. ఆమె రెండు చేతులతోనూ రాస్తుంది. చాలా స్పీడ్‌గా కారు నడుపుతుంది. ఏడు భాషలు అనర్గళంగా మాట్లాడుతుంది. కెనెడాలో ఎకనామిక్స్ చదివి సోలో ట్రావెలర్‌గా దేశాలు తిరుగుతుంది. ‘మిస్ ఇండియా’ కిరీటాన్ని గెలిచి, గోవా ఘనతను చాటింది. ఈ కాలపు అమ్మాయంటే సాధ్వీ సతీషే.‘చిన్నప్పటి నుంచి నేను కొంచెం తేడా. నలుగురితో పెద్దగా కలిసే దాన్ని కాదు. చిన్నప్పుడు ఖాళీ టైమ్ దొరికితే రెండు చేతులతో ఒకేసారి రాయడం ప్రాక్టీసు చేసేదాన్ని’ అంటోంది గోవా అందాల బరిణె సాధ్వీ సతీష్. గోవా ఇసుక తీరాల్లో ఆడుకున్న ఈ అమ్మాయి ‘మిస్ ఇండియా 2026 వరల్డ్’ టైటిల్ గెలుచుకొని 2027లో జరగనున్న ‘మిస్ వరల్డ్’ పోటీలలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనుంది.→ మొదటి గోవా అమ్మాయిభువనేశ్వర్లోని ‘కె.ఐ.ఐ.టి. విశ్వవిద్యాలయం’లో ఏప్రిల్ 18న వైభవంగా జరిగిన ‘ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2026’ ఫైనల్స్‌లో 25 ఏళ్ల సాధ్వీ సతీష్ విజేతగా గెలిస్తే, మొదటి రన్నరప్‌గా మహారాష్ట్రకు చెందిన రజ్నందిని పవార్, రెండో రన్నరప్‌గా జమ్మూ కశ్మీర్‌కు చెందిన శ్రీఅద్వైత నిలిచారు. న్యాయనిర్ణేతలుగా జీనత్ అమన్, నేహా ధూపియా, మధుర్ భండార్కర్, ఒలింపిక్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ లాంటి దిగ్గజాలు ఉన్నారు. సాధ్వీ సతీష్ ఈ టైటిల్‌ను గెలవడం వల్ల ‘మిస్ వరల్డ్’కు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్న తోలి గోవా అమ్మాయి అయ్యింది. స్వాధ్వీ సతీష్ కర్ణాటకలోని కార్వార్లో పుట్టినా తను పెరిగిన గోవానే∙ఊపిరిగా భావిస్తుంది. ఆమెకు చిన్నప్పటి నుంచి గోవా సంస్కృతి, సముద్రం ఇష్టం. బెంగళూరులోని అమృత విద్యాలయంలో చదివి, ఉన్నత విద్య కోసం కెనడా వెళ్లి అక్కడ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాలో ఎకనామిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో డబుల్ మేజర్ పూర్తి చేసింది. ఆ తర్వాత మోడలింగ్‌లో ప్రవేశించి అందాల పోటీ వరకూ ఎదిగింది.→ నాన్న ప్రోత్సాహంఅమ్మా నాన్నల ప్రోత్సాహం లేకుండా పిల్లలకు ఏ విజయమూ సిద్ధించదు. సాధ్వీ సతీష్ విజయం వెనుక తండ్రి సతీష్ కృష్ణ సెయిల్, తల్లి ప్రియాంక సెయిల్ ఉన్నారు. ముఖ్యంగా తండ్రి సతీష్ కూతురి కలలకు రెక్కలు తొడిగిన వ్యక్తి. ‘ఆడపిల్ల అయినా ప్రపంచం చుట్టి రావాలి’ అని కెనడా చదువుకు, సోలో ట్రావెలింగ్‌కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. తల్లి ప్రియాంక గోవా సంస్కృతి, సంప్రదాయాలు, కుటుంబ విలువలను సాధ్వీలో నింపింది. ‘నాన్న నన్ను ఆకాశానికి ఎగిరేలా చేశారు. అమ్మ నా కాళ్లు నేల మీద ఉంచింది. మిస్ ఇండియా కిరీటం నాది కాదు, మా అమ్మా నాన్నలది’ అంది సాధ్వీ.→ సోలో ట్రావెలర్‘కెనెడాలో చదువు పూర్తయ్యాక మెక్సికోకు మొదటి సోలో ట్రావెల్ చేశాను’ అని తెలిపింది సా«ధ్వీ. లోకం చూడటానికి ఇష్టపడే సాధ్వీ మూడేళ్లలో పది దేశాలు ఒంటరిగా తిరిగింది. కొత్త సంస్కృతులు, కొత్త మనుషులు, కొత్త సవాళ్లు అన్నింటినీ ఆహ్వానించింది. ఈ ప్రయాణాలే తనకు స్వతంత్రంగా ఆలోచించడం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడం నేర్పాయి అంటుందామె. మరో విశేషం ఏమిటంటే సాధ్వీకి తేనెటీగలంటే విపరీతమైన భయం. ఫోబియా. ఆ ఫోబియాను జయించడానికి సర్టిఫైడ్ బీకీపర్‌గా శిక్షణ తీసుకుంది. భయాన్ని బలంగా మార్చుకోవడం అంటే ఇదే.→ బ్యూటీ విత్ ఏ పర్పస్మిస్ ఇండియా పోటీకి కేవలం మూడు నెలల ముందే సిద్ధమైన సాధ్వీ క్రమశిక్షణతో పది కిలోలకు పైగా బరువు తగ్గి ‘టాప్ 5 బెస్ట్ బాడీ’లో నిలిచింది. తర్వాత కిరీటం గెలుచుకుంది. కానీ ఆమె లక్ష్యం కిరీటం కంటే పెద్దది. వినికిడి, మాటల లోపం ఉన్న పిల్లలకు మెరుగైన పోషకాహారం, సమాన అవకాశాలు కల్పించడం ఆమె ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ ప్రాజెక్ట్. టాంజానియా వేదిక కానున్న ‘మిస్ వరల్డ్ 2027’ పోటీలో భారత్ తరపున ఇలాగే విజయం సాధించాలని కోరుకుందాం. -
T20 WC 2026: వెలుగులోకి సంచలన విషయం
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇందులో పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కాగాఫిబ్రవరి 7- మార్చి 8 మధ్య భారత్- శ్రీలంక వేదికలుగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ జరిగిన సంగతి తెలిసిందే.న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఇలాఈ మెగా ఈవెంట్లో కెనడా.. న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో కలిసి గ్రూప్-డి నుంచి పోటీపడింది. ఒక్క విజయం కూడా నమోదు చేయలేక చెత్త ప్రదర్శనతో వెనుదిరిగింది. అయితే, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో మాత్రం కెనడా మెరుగ్గా ఆడింది.అనూహ్య నిర్ణయంచెన్నైలో కివీస్‌తో తలపడ్డ కెనడా నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ యువరాజ్ సమ్రా అద్భుత సెంచరీ (65 బంతుల్లో 110) కారణంగా ఈ స్కోరు సాధ్యమైంది. ఇక లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ ఆదిలో తడబడగా.. కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు.రెగ్యులర్ బౌలర్ కానప్పటికీ తానే స్వయంగా పవర్ ప్లేలో బంతితో రంగంలోకి దిగాడు బజ్వా. మొత్తంగా రెండు ఓవర్లలో 26 రన్స్ ఇచ్చి వికెట్ తీయలేకపోయాడు. బ్యాటర్‌గానూ అతడు విఫలమయ్యాడు. 39 బంతులు ఎదుర్కొని కేవలం 36 పరుగులే చేశాడు.ఈ నేపథ్యంలో దిల్‌ప్రీత్ బజ్వా వ్యవహారశైలిని ఉటంకిస్తూ ‘ది ఫిఫ్త్ స్టేట్’ అనే కెనడా ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ ప్రోగ్రామ్‌లో అతడిపై ఆరోపణలు చేసింది. ‘అవినీతి.. నేరం.. క్రికెట్’ అనే డాక్యుమెంటరీలో కెనడా క్రికెట్ బోర్డు, కెప్టెన్ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించింది.రంగంలోకి ఐసీసీ.. విచారణకు ఆదేశంఈ క్రమంలో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం రంగంలోకి దిగి విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ‘అవినీతి.. నేరం.. క్రికెట్’ డాక్యుమెంటరీ ద్వారా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ సభ్యులు కెనడా బోర్డును బెదిరించినట్లు తెలుస్తోంది.లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ బెదిరింపులుడాక్యుమెంటరీలో ఉన్న వివరాల ప్రకారం.. ‘‘మా ఆదేశాలను పాటించకపోతే మీరు, మీ కుటుంబ సభ్యులు ప్రమాదంలో పడతారు. నేను చెప్పిన ఆటగాళ్లను జట్టు నుంచి అస్సలు తప్పించకూడదు. ఒకవేళ అలా చేశారంటే మీకు చిక్కులు తప్పవు’’ అని లారెన్స్ బిష్ణోయి బెదిరింపులుకు పాల్పడ్డట్లు తెలుస్తోంది.ఈ విషయం గురించి క్రికెట్ కెనడా సన్నిహిత వర్గాలు CBCతో మాట్లాడుతూ.. ‘‘ఇలాంటి ఘటనలు జరిగినపుడు క్రికెటర్లు కూడా భయపడతారు. వాళ్లేమీ ఇందుకు అతీతులు కాదు. వాళ్లు చాలా భయపడిపోయారు. అందుకే ఈ విషయం గురించి ఎవరికీ ఏమీ చెప్పలేదు’’ అని పేర్కొన్నాయి.సీనియర్లు ఉండగా అతడికే ఎందుకు కెప్టెన్సీ?కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వాపై అనుమానాలు బలపడుతున్నాయి. సీనియర్లు ఉండగా బోర్డు 23 ఏళ్ల ఈ ఆటగాడిని.. అది కూడా టోర్నీకి దాదాపు వారం రోజుల ముందు సారథిగా నియమించడం సందేహాలకు తావిచ్చింది.అయితే, బయటి వ్యక్తుల ఆదేశాలతోనే అతడు ఫిక్సింగ్‌కు పాల్పడి ఉంటాడని సదరు వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉంటే.. బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెనడా ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చిన సంగతి తెలిసిందే.చదవండి: అందుకే IPL కాదని.. PSLలో ఆడుతున్నా: మొయిన్ అలీ -
పశ్చిమాసియా సంక్షోభం.. మామిడి ప్రియులకు గుడ్‌న్యూస్
ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందనేది తాతల కాలం నాటి సామెత... కానీ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు అది అక్షర సత్యం కూడా. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా అది ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్న సాంకేతిక యుగంలో యుద్ధం లాంటి పరిస్థితులు మరింత ప్రభావాన్ని చూపిస్తాయని ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం నిరూపిస్తోంది. నెలలుగా కొనసాగుతున్న పశ్చిమ ఆసియా సంక్షోభం ఓ వైపు గ్యాస్ పెట్రోల్ వంటి అత్యవసరాలకు ఇబ్బందులు సృష్టిస్తుంటే మరోవైపు మామిడి పండ్ల ప్రియులకు తీపి కబురు తెస్తోంది.పశ్చిమాసియా పరిస్థితుల కారణంగా ఏటా ఆకాశంలో చక్కర్లు కొట్టే మామిడి పండ్ల ధరలు ఈ సీజన్లో నేల చూపులు చూడనున్నాయి. దీనికి కారణం యుద్ధం నేపధ్యంలో విదేశాలకు ఎగుమతులు గణనీయంగా తగ్గడం. ప్రస్తుతం జనాదరణ పొందిన బెనిషాన్ రకం మామిడి పండు కిలోకు రూ. 150–200 మధ్య అమ్ముడవుతోంది. అలాగే తీపి, రసభరితమైన రుచికి ప్రసిద్ధి చెందిన రసాలు హైదరాబాద్‌లో కిలోకు రూ. 100–150కి లభిస్తున్నాయి. ఇంకా ఇప్పుడిప్పుడే సీజన్ ప్రారంభం కాబట్టి అంతగా తెలియకున్నా రాబోయే రోజుల్లో మామిడి ధరలు బాగా తగ్గే అవకాశం ఉందని పండ్ల వ్యాపారులు అంచనా వేస్తున్నారు.ప్రతి సంవత్సరం, తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ దేశాలకు మామిడి పండ్లు భారీగానే ఎగుమతి అవుతాయి. మరీ ముఖ్యంగా యూఏఈ, యూఎస్ కెనడాలకు మన దగ్గర నుంచి మామిడి పండ్ల ఎగుమతి ఎక్కువ. సగటున ప్రతి సంవత్సరం, భారతదేశం సుమారు 30 వేల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను ఎగుమతి చేస్తుంది, వాటిలో అత్యధిక వాటా అంటే దాదాపుగా 10 వేల మెట్రిక్ టన్నులకు పైగా ఒక్క యూఏఈకి వెళుతుంది.అయితే ఎడతెగని యుద్ధం, తద్వారా యుఏఈలో ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల కారణంగా, మామిడి ఎగుమతులకుు డిమాండ్ తగ్గింది. అందుబాటులో ఉన్న ఒక నివేదిక ప్రకారం, ఇప్పటికే మామిడి ఎగుమతులు 20–30 శాతం తగ్గుదలను నమోదు చేస్తున్నాయి. ఆ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితితో పాటు బాగా పెరిగిన ఎగుమతి వ్యయం కూడా దీనికి దోహదం చేస్తోంది. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల యూఎస్ కెనడా వంటి ఇతర గమ్యస్థానాలకు ఎగుమతులు కూడా దెబ్బతిన్నాయి.ఏతావాతా ఇది భారతీయ నగరాల్లో మామిడి ధరలు తగ్గడానికి దారితీయవచ్చునని అంచనా. దేశీయ మార్కెట్లో ధరలు తగ్గినప్పటికీ, అత్యుత్తమ నాణ్యత గల కొన్ని రకాల ఖరీదైన పండ్ల విక్రయాలకు ఎగుమతులే ఆధారం వాటి ఎగుమతులు పడిపోయినప్పటికీ వాటికి స్థానికంగా కొనుగోలుదారులు దొరుకుతారో లేదోనని కూడా ఎగుమతిదారులు సందేహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎగుమతిదారులు ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి రావాలని ఎదురుచూస్తున్నారు. -
కెనడా గ్యాంగ్‌వార్‌లో పంజాబ్ యువకుడి హత్య
సర్రే (కెనడా): కెనడాలో గ్యాంగ్‌వార్ కలకలం రేపింది. పంజాబ్ మూలాలు కలిగిన ఒక యువకుడిని దుండగులు సినిమా ఫక్కీలో వెంటాడి, తూటాలతో హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వాంకోవర్ సమీపంలోని సర్రే నగరంలో ఈ దారుణ హత్య చోటుచేసుకుంది.ఏం జరిగిందంటే?మృతుడిని 27 ఏళ్ల జస్మాన్ సెఖోన్గా పోలీసులు గుర్తించారు. శనివారం రాత్రి ఒక నివాస సముదాయం వద్ద జస్మాన్ను ఒక నల్లటి కారు వెంబడించింది. జస్మాన్ పారిపోయే ప్రయత్నం చేసినప్పటికీ, దుండగులు అతడిని చుట్టుముట్టారు. వాహనం నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు అతి సమీపం నుంచి జస్మాన్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న అత్యవసర సేవా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని కాపాడే ప్రయత్నం చేసినా, ఫలితం లేకుండా పోయింది.హత్య జరిగిన కొద్దిసేపటికే ఘటనా స్థలానికి సమీపంలో ఒక కారు తగలబడుతూ కనిపించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సాధారణంగా కెనడాలో గ్యాంగ్స్టర్లు తమ ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు, హత్యకు వాడిన వాహనాలను తగులబెడుతుంటారని పోలీసులు చెబుతున్నారు. ఈ కాల్పులకు, దగ్ధమైన కారుకు సంబంధం ఉందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.డ్రగ్స్ మాఫియా హస్తం?ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఐహెచ్ఐటీ)ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. జస్మాన్ సెఖోన్‌కు గతంలో డ్రగ్స్ వ్యాపారం, నేరగాళ్ల ముఠాలతో సంబంధాలు ఉన్నాయని, ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన 'టార్గెటెడ్ కిల్లింగ్' అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కాగా గత 48 గంటల్లో ఈ ప్రాంతంలో నాలుగు కాల్పుల ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. ఇది కూడా చదవండి: ‘దీదీ’ ఇలాకాలో సినీ తారల ధమాకా! -
న్యూయార్క్ సిటీలో ఘోర విమాన ప్రమాదం
-
పేరుగొప్ప దేశాల కన్నా. పెట్టుబడికి తగ్గ ప్రయోజనాలే మిన్న..
ప్రపంచవ్యాప్తంగా గత కొంతకాలంగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపధ్యంలో విదేశీ విద్యా ప్రాధాన్యతల విషయంలో భారతదేశపు విద్యార్థుల ఆలోచనా ధోరణిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతానికి భిన్నంగా స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ , సింగపూర్, న్యూజిలాండ్ దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల వైపు భారతీయులు మొగ్గు చూపడం పెరుగుతోంది.అమెరికా, కెనడా, బ్రిటన్ (యూకే), ఆస్ట్రేలియా లాంటి ఇంగ్లీష్ మాట్లాడే దేశాలకు, ముఖ్యంగా స్టెమ్ (ఎస్‌టిఇఎమ్) కోర్సుల కోసం అమెరికాకు ఇప్పటికీ అత్యధిక డిమాండ్ ఉన్నప్పటికీ.. విద్యార్థులు తమ ఎంపికలను చురుకుగా విస్త్రుతం చేసుకుంటున్నారు. విద్యకయ్యే మొత్తం ఖర్చు, విద్యాసంస్థల నాణ్యత, వీసా నిబంధనలు, ఇంటర్న్‌షిప్ ఉపాధి అవకాశాలు, అలాగే విద్యార్థుల భద్రత వంటి అంశాలు వారి వారి నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.పెట్టుబడిపై రాబడికే పెద్ద పీట...‘నేటి భారతీయ విద్యార్థులు విదేశీ విద్య విషయంలో మరింత ఆచరణాత్మకంగా ’పెట్టుబడిపై రాబడి ఆధారిత విధానంతో ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్టెమ్ (ఎస్‌టిఇఎమ్) ప్రోగ్రామ్‌ల కోసం స్పెయిన్, జర్మనీ న్యూజిలాండ్ వంటి దేశాలకు ఇటీవల బలమైన డిమాండ్ కనిపిస్తోంది. నాణ్యమైన విద్య, తక్కువ ఖర్చు, స్పష్టమైన వీసా నిబంధనలు, చదువు–ఉపాధికి మధ్య మెరుగైన సమన్వయం ఉండటమే ఇందుకు ప్రధాన కారణం,‘ అని ఆక్సిలో ఫిన్ సర్వ్ ఓవర్సీస్ లోన్ సీబీవో శ్వేతాగురు విశ్లేషించారు. భారతీయ విద్యార్ధుల సంఖ్యకు సంబంధించి సాంప్రదాయేతర యూరోపియన్ దేశాలు, 2023 నుంచి 2025 మధ్య బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఇదే ధోరణి 2026లో కూడా కొనసాగుతుందని విదేశీ విద్యా మార్కెట్ నిపుణులు అంటున్నారు.భారతీయ విద్యార్థులు తమ మొదటి ఎంపికగా ఈ కొత్త దేశాల వైపు మొగ్గుచూపుతుండడానికి కారణం..‘ సంప్రదాయంగా పేరొందిన దేశాలతో పోలిస్తే.‘కొన్ని దేశాలు పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్టెమ్ కోర్సులను దాదాపు సగం ఖర్చుతోనే అందిస్తున్నాయి. అంతేకాకుండా, వీసా సమస్యలు తక్కువగా ఉండటంతో పాటు త్వరగా పెట్టుబడిపై రాబడి కూడా లభిస్తుంది‘ అని శ్వేతా గురు వివరించారు. విదేశీ విద్య రంగంలో వస్తున్న ఈ మార్పులు.. విద్యార్థుల పరిణతి చెందిన, పరిశోధనాత్మక నిర్ణయాలను సూచిస్తున్నాయి. భారతీయ విద్యార్థులలో నవతరం ఇప్పుడు ఈ కొత్త దేశాలను కేవలం ’ప్రత్యామ్నాయంగా’ కాకుండా తమ వ్యూహాత్మక ’మొదటి ఎంపికగా’ పరిగణిస్తోంది.మార్పును సూచిస్తున్న కొన్ని గణాంకాలు..స్పెయిన్ (ఉన్నత విద్య కోసం మాత్రమే): 2023లో 865గా ఉన్న భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు 2025 నాటికి 1,192కి పెరిగాయి. ఇది రెండేళ్ల వ్యవధిలో 17 శాతం సగటు వార్షిక వృద్ధి రేటును సూచిస్తోంది. అందుబాటులో ఉండే ట్యూషన్ ఫీజులు, ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించే కోర్సుల సంఖ్య పెరుగుతుండటంతో... బిజినెస్, డేటా అనలిటిక్స్, ఇంజనీరింగ్, పబ్లిక్ పాలసీ వంటి పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో వృద్ధి కనిపిస్తోంది.పోర్చుగల్– లిథువేనియా (ఉన్నత విద్య కోసం మాత్రమే): పోర్చుగల్‌లో 2023లో 980 మంది మన విద్యార్థులు చేరగా, 2025 నాటికి ఆ సంఖ్య 1,350కి పెరిగింది. ఇదే సమయంలో లిథువేనియాలో ప్రవేశాలు 1,120 నుంచి 1,557 కు పెరిగాయి. మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ అప్లైడ్ ఇంజనీరింగ్ కోర్సుల ద్వారా ఈ దేశాలు భారతీయ విద్యార్థులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి.ఇటలీ , నెదర్లాండ్స్ (ఉన్నత విద్య కోసం మాత్రమే): ఇటలీలో 2023లో 4,145గా ఉన్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2025 నాటికి 5,196కి పెరిగింది. డిజైన్, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సులకు ఈ దేశం ప్రధాన కేంద్రంగా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. మరోవైపు, స్టెమ్ ఏఐ,, ఫిన్ టెక్, సస్టైనబిలిటీ (సుస్థిరత) ఆధారిత పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా.. నెదర్లాండ్స్‌లో అడ్మిషన్లు 2,871 నుంచి 3,512 కు పెరిగాయి.జర్మనీ (ఉన్నత విద్య, పీజీ – స్టెమ్ కోర్సులకు): ఇంగ్లీష్ మాతృభాష గా లేని యూరోపియన్ దేశాలలో భారతీయ పీజీ స్టెమ్ విద్యార్థులకు జర్మనీ అత్యంత ఇష్టమైన గమ్యస్థానంగా కొనసాగుతోంది. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో తక్కువ లేదా పూర్తిగా ఉచిత ట్యూషన్ ఫీజు, బలమైన పరిశోధనా విధానం, పరిశ్రమలతో అనుసంధానం ఇందుకు ప్రధాన కారణాలు. ఇంజనీరింగ్, ఆటోమోటివ్ టెక్నాలజీ, ఏఐ, రోబోటిక్స్ అప్లైడ్ సైన్సెస్ ప్రోగ్రామ్‌లను ఎంచుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఇక్కడ వేగంగా పెరుగుతోంది.సింగపూర్ (ఉన్నత విద్య కోసం మాత్రమే): సింగపూర్‌లో భారతీయ ఉన్నత విద్యా ప్రవేశాలు 2023లో 2,850 నుంచి 2025లో 3,250కి పెరిగాయి. పోస్ట్‌గ్రాడ్యుయేట్ స్టెమ్ ఆధారిత ప్రోగ్రామ్‌లకు ఉన్న స్థిరమైన డిమాండ్‌ను ఇది సూచిస్తోంది. తక్కువ కాలవ్యవధి గల కోర్సులు, గ్లోబల్ ర్యాంకింగ్ ఉన్న విద్యాసంస్థలు, పరిశ్రమలతో బలమైన అనుసంధానం, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో చదువు పూర్తయిన తర్వాత ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటం భారతీయ విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి. బిజినెస్ మేనేజ్మెంట్, డేటా అనలిటిక్స్, ఫైనాన్స్ , ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతిక కోర్సుల్లో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతోంది. -
ఎయిర్ ఇండియా భారీ తప్పిదం
భారతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఓ భారీ తప్పిదం చేసింది. ఓ ఫ్లైట్‌కు బదులు మరో ఫ్లైట్‌ను వినియోగించి ప్రయాణికులకు విస్మయకర అనుభవాన్ని మిగిల్చింది. సొంతంగానూ భారీ ఆర్దిక నష్టాన్ని మూటగట్టుకుంది.పూర్తి వివరాల్లోకి వెళితే.. మార్చి 20న ఉదయం 11:34 గంటలకు ఢిల్లీ నుంచి AI185 సర్వీస్ నంబర్‌తో బోయింగ్ 777-200LR విమానం ప్యాసింజర్లతో కలిసి వాంకోవర్‌కు (కెనడా) బయల్దేరింది. అయితే నాలుగు గంటల ప్రయాణం తర్వాత ఈ విమానం తప్పుడు విమానం అని అధికారులు గుర్తించారు.వాస్తవానికి ఈ సర్వీస్‌లో బోయింగ్ 777-300ER మోడల్ విమానం వాంకోవకర్కు వెళ్లాలి. అయితే ఆపరేషనల్ తప్పిదం కారణంగా 777-300ER మోడల్‌కు బదులు 777-200LR విమానం వాంకోవర్‌కు టేకాఫ్ అయ్యింది.చైనా గగనతలంలోకి ప్రవేశించాక అధికారులు తమ తప్పిదాన్ని గుర్తించారు. కెనడాకు వెళ్లేందుకు 777-300ER మోడల్‌కు మాత్రమే అనుమతి ఉందని, తాము ప్రయాణిస్తున్నది 777-200LR మోడల్ అని నాలుక కరుచుకున్నారు. దీంతో వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీకి మళ్లించారు. మొత్తం 7 గంటలు 54 నిమిషాల ప్రయాణం తర్వాత విమానం తిరిగి ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. విషయం తెలిసి ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఎయిర్ ఇండియాపై అసంతృప్తిని వెల్లగక్కారు. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పిన సంస్థ.. మరుసటి రోజు సరైన విమానం ఏర్పాటు చేసి ప్రయాణాన్ని కొనసాగించింది. అప్పటివరకు ప్రయాణికులకు ఉచిత హోటల్ వసతి, ఇతర సదుపాయాలు కల్పించింది.ఈ ఘటన ఎయిర్ ఇండియాకు భారీ ఆర్థిక నష్టాన్ని కలిగించింది. బోయింగ్ విమానానికి ఒక్క గంటలో 8–9 టన్నుల ఇంధనం ఖర్చు అవుతుంది. దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం వల్ల వందల టన్నుల ఇంధనం వృథా అయ్యింది. దీని వల్ల భారీ ఆర్దిక నష్టం చవిచూడటంతో పాటు సంస్థ ప్రతిష్టను దిగజార్చుకుంది. -
కెనడాలో వారం వ్యవధిలో.. ముగ్గురు భారత సంతతి వ్యక్తులు హత్య
అట్టావా: కెనడాలో జాతి విద్వేష ఘటనలపై భారతసంతతి వాసులు ఆందోళన చెందుతున్నారు. వారం వ్యవధిలో భారతసంతతికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. మార్చి 14వ తేదీన అల్బెర్టా ప్రావిన్స్‌లో బీరీందర్ సింగ్(22) లెడుక్ ప్రాంతంలో వాహనంలో ఉండగా కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయాడు. మార్చి 13వ తేదీన సాస్కాట్చెవాన్లోని నార్త్ బ్యాటిల్ ఫోర్డ్లో దేవీందర్ సింగ్(31), అదే రోజు ఫోర్ట్ సెయింట్ జాన్ వద్ద జరిగిన గొడవలో గుర్‌కిరీట్ మనోచా(31) మృతి చెందారు. ‘ఆ రోజు మధ్యాహ్నం సమయంలో లెడుక్ వద్ద కారులో బీరీందర్తో కలిసి కారులో ఉన్నాం. అంతలోనే ఓ పికప్ కారు మా పక్కన వచ్చి ఆగింది. అందులోని వ్యక్తులు మాపై కాల్పులు జరిపారు. తూటాలు తగిలి కారు స్టీరింగ్ వద్ద ఉన్న బీరీందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇది జాతి విద్వేష ఘటనే అనుకుంటున్నాం’అని బీరీందర్ స్నేహితుడు తెలిపారు. మారుమూల, జన సంచారం అంతగా లేని ప్రాంతాలకు వెళ్లడం ప్రమాదకరమన్నారు. కాగా, దేవీందర్ హత్యపై దర్యాప్తు జరుగుతోందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్(ఆర్సీఎంపీ) తెలిపింది. రెండో ఘటన. బ్రిటిష్ కొలంబియాకు చెందిన గుర్‌కిరీట్ సింగ్ మనోచా మేనేజ్మెంట్ డిగ్రీ చదువుకునేందుకు ఫోర్ట్ సెయింట్ జాన్‌కు మకాం మార్చాడు. ఈ నెల 13న చార్లీలేక్ బోట్ క్యాంపు వద్ద రాత్రి 11 గంటల సమయంలో జరిగిన గుర్తు తెలియని వ్యక్తులతో తలెత్తిన ఘర్షణలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు వచ్చే సరికే చనిపోయి ఉన్నాడు. ఇతడి సొంతూరు భారత్‌లోని ఉజ్జయిని. కాగా, గుర్కిరీట్తో ఘర్షణ పడిన వ్యక్తులెవరనే దానిపై పోలీసులు ఒక స్పష్టతకు రాలేదు. రాత్రి వేళ, అదీ జన సంచారం తక్కువగా ఉండే చోటుకావడంతో దర్యాప్తు నెమ్మదిగా సాగుతోందని నేర విభాగం తెలిపింది. మూడో ఘటన..మార్చి 13వ తేదీన ఉదయం 8గంటల వేళ క్యాబ్ డ్రైవర్ దేవీందర్ సింగ్‌కు హిచింగ్ పోస్ట్ మోటెల్ నుంచి పిలుపు వచ్చింది. అక్కడికి వెళ్లాక అతడిపై ఇద్దరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అతడిని తుపాకీతో కాల్చి పరారయ్యారు. తీవ్ర గాయాలతో దేవీందర్ మృతి చెందాడు. దుండగులను పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటనతో భారత సంతతి క్యాబ్ డ్రైవర్లు తీవ్రంగా భయపడుతున్నారని దేవీందర్ పనిచేసే క్రౌన్ క్యాబ్ సంస్థ యజమాని హరీశ్ కొరాఠ్ తెలిపారు. కొందరు క్యాబ్ డ్రైవింగ్ మానేశారన్నారు. -
ఇరాన్ పై ఇజ్రాయెల్,అమెరికా దాడులు.. యుద్ధంలోకి కెనడా ఎంట్రీ?
-
కెనడాలో భారతీయ ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ దారుణ హత్య
కెనడాలో నివసిస్తున్న భారతీయ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ గ్రేవాల్ (Nancy Grewal) దారుణ హత్యకు గురయ్యారు. కెనడాలోని లాసల్లె పోలీసులు ఈ హత్యను నిర్ధారించారు. దర్యాప్తు కొనసాగుతోంది. పంజాబీ మూలానికి చెందిన 45 ఏళ్ల నాన్సీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ పంజాబ్‌లో జరుగుతున్న పరిణామాలపై తన అభిప్రాయాలను, ముఖ్యంగా ఖలిస్తానీలను విమర్శిస్తూ పాపులర్ అయ్యారు. ప్రసిద్ధి చెందింది.ఈ హత్య కెనడాలోని భారతీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలో ఆగ్రహాన్ని రేకెత్తించింది .ఘటన వివరాలు ఇలా ఉన్నాయి మార్చి 3, 2026, రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో. కెనడాలోని లాసల్లే (LaSalle) నగరంలోని టాడ్ లేన్ (Todd Lane) ప్రాంతంలోని ఆమె నివాసంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమెను కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఎసెక్స్-విండ్సర్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, చికిత్స పొందుతూ ఆమె మరణించారు.షల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. రాజకీయ అంశాలపై ఆమె చాలా నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు. సోషల్ మీడియా వేదికల ద్వారా పలు వివాదాస్పద అంశాలపై స్పందించేవారు. ముఖ్యంగా భారత్-కెనడా ఉద్రిక్తతల మధ్య ఖలిస్తానీ సానుభూతి పరులను ఆమె బహిరంగంగానే ఖండించేవారు. అకాలీదళ్ నాయకత్వంపై, ముఖ్యంగా బిక్రమ్ సింగ్ మజితియాపై ఆమె తరచుగా విమర్శలు చేసేవారు. అలాగే జైలులో ఉన్న ఎంపీ అమృత్‌పాల్ సింగ్, డేరా బియాస్ అధిపతి గురీందర్ సింగ్ ధిల్లాన్‌కు వ్యతిరేకంగా కూడా ఆమె మాట్లాడారు. దీంతోపాటు 2025 జూన్‌లో భటిండాలో అనుమానాస్పద స్థితిలో మరణించిన మరో ఇన్ఫ్లుయెన్సర్ కాంచన్ కుమారి (కమల్ కౌర్ భాభి) మరణంపై కూడా ఆమె గళమెత్తారు.(విజయ్ దేవరకొండ నయా ట్రెండ్ : డైమండ్ ఎమరాల్డ్ నెక్లెస్ స్పెషల్ ఎట్రాక్షన్)లాసల్లే పోలీసులు ఈ కేసును యాక్టివ్ ఇన్వెస్టిగేషన్‌గా పరిగణిస్తున్నారు. టాడ్ లేన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ ఇంటి వద్ద ఉన్న సీసీటీవీ దృశ్యాలను పోలీసులకు అందించి సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి నిందితుడి ఆచూకీ ఇంకా లభించలేదు. ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు లేదా 'క్రైమ్ స్టాపర్స్'కు సమాచారం ఇవ్వాలని కోరారు. ఇదీ చదవండి: సంగీత్ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్, 82 లక్షల మంది ఫిదా! -
మళ్లీ బలపడిన బంధం
దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఒకసారి దెబ్బతింటే అతుక్కోవటం అంత సులభం కాదు. అందుకు సుదీర్ఘ కాలం పడుతుంది. గత రెండేళ్లుగా అందుకోసం తెర వెనుక సాగిన ప్రయత్నాలన్నీ ఫలించి కెనడా ప్రధాని మార్క్ కార్నీ మన దేశంలో నాలుగు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన ఒప్పందాలు కూడా కుదిరాయి. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యం రూ. 4.65 లక్షల కోట్లకు చేరుకునేలా ఇరుదేశాలూ కృషి చేయాలన్న నిర్ణయం జరిగింది. అలాగే అణు విద్యుదుత్పాదన కోసం ఇప్పుడు సరఫరా చేస్తున్న యురేనియంను మరింత పెంచటానికి కెనడా అంగీకరించింది. దీని విలువ రూ. 17,403 కోట్లు. ఇవిగాక పునరుత్పాదక ఇంధన వనరులతో సహా పలు అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు... రెండూ అకారణంగా ఇరాన్‌పై విరుచుకుపడుతున్న పర్యవసానంగా పశ్చిమాసియాతో పాటు ప్రపంచమంతా అలుము కున్న అస్థిర వాతావరణం నేపథ్యంలో భారత్, కెనడా తమ సంబంధాలను మెరుగు పరుచుకోవటం మంచి సందేశం పంపుతుంది.ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జార్‌ను గుర్తు తెలియని వ్యక్తులు 2023లో హతమార్చాక భారత్, కెనడాల సంబంధాలు దెబ్బతినటం నిజమే కావొచ్చు గానీ... అంతకు చాన్నాళ్లముందే అప్పటి కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో అనుసరించిన విధానాలు ఇరుదేశాల మధ్యా పొరపొచ్చాలు పెంచాయి. కెనడాలో చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్న సిక్కుల ఓటుబ్యాంకు కోసం ఆయన వేర్పాటువాదులను ప్రోత్సహించారు. భారత్‌లో నేరాలు చేసి వచ్చిన వేర్పాటువాదులను అప్పగించేందుకు ఆయన ప్రభుత్వం నిరాకరించేది. అందుకే 2018లో ట్రుడో మన దేశం పర్యటనలో ఘనమైన స్వాగత సత్కారాలు లభించలేదు. ట్రుడోను భారత్ అవమానించిందంటూ కెనడా మీడియా వ్యాఖ్యానించింది కూడా! నిజ్జార్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర ఉన్నదంటూ కెనడా ఆరోపించటం, అక్కడి మీడియాలో పుంఖానుపుంఖాలుగా కథనాలు రావటం అసలే అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు మరింత క్షీణించటానికి దోహదపడ్డాయి. వేర్పాటువాదులను ఆదరిస్తే జరిగేదేమిటో ట్రుడోకు నిరుడు ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలకు ముందే తెలిసొచ్చింది. ట్రుడో నాయకత్వం కొనసాగితే లిబరల్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు తేల్చటంతో ఆయన రాజీనామా చేయకతప్పలేదు. అనంతరం వచ్చిన మార్క్ కార్నీ స్వల్పకాలంలోనే సమర్థుడిగా పేరుతెచ్చుకుని పార్టీ విజయావ కాశాలు పెంచగలిగారు. మెరుగ్గా కనబడిన విపక్ష కన్జర్వేటివ్ పార్టీ వెనకబడటం మొదలైంది. ఈలోగా అమెరికాలో ట్రంప్ ఏలుబడి మొదలైనాక ఆయన కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకుంటామనటంతో పాటు ఏకపక్షంగా సుంకాలు విధించటం ట్రంప్‌కు సన్నిహితంగా మెలిగిన ఆ మితవాద పార్టీ ప్రాభవాన్ని దెబ్బతీసింది.నిరుడు కెనడాలో జరిగిన జీ–7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లాక దౌత్యసంబంధాలు చిగురించటం మొదలైంది. అంతక్రితం నిజ్జార్ వ్యవహారంలో ఆరోపణలు, దౌత్యవేత్తల పరస్పర బహిష్కరణ వంటివి జరగ్గా, నిరుడంతా ఇరుదేశాలూ హైకమిషనర్లను నియమించుకోవటం, రెండు దేశాల మధ్యా వివిధ మంత్రిత్వశాఖల స్థాయిలో సమన్వయం సాధించటం వంటివి చోటుచేసుకున్నాయి. కోవిడ్ మహమ్మారి కారణంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలూ పల్టీలు కొడుతుండగా, ట్రంప్ అధ్యక్షుడయ్యాక విధిస్తున్న సుంకాలు మరింత కుంగదీస్తున్నాయి. కెనడా కూడా చాలావిధాల దెబ్బతింది. ఈ పరిస్థితుల్లో వాణిజ్యాన్ని విస్తరించుకోవటం ఆ దేశానికి తప్పనిసరైంది. ఇటు మన దేశం కూడా రాగల కాలంలో విద్యుదుత్పాదనను విశేషంగా పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం మన అణువిద్యుదుత్పాదన 6,780 మెగావాట్లు మాత్రమే. వచ్చే దశాబ్ది ప్రారంభానికి ఇది 22,500 మెగావాట్లకు చేరాలి. 2047 నాటికి 100 గిగావాట్లు విద్యుత్ ఉత్పత్తయితే తప్ప మన అవసరాలు తీరబోవన్న అంచనాలున్నాయి. పదేళ్లపాటు యురేనియం ఎగుమతి చేసేందుకు కెనడాతో కుదిరిన ఒప్పందం ఇందుకు దోహద పడుతుంది. అయితే ఇరు దేశాల మధ్యా ఇంకా అపోహలు లేకపోలేదు. కలిసి కదలటం మొదలుపెడితే, స్నేహసంబంధాలు మెరుగవుతుంటే అలాంటివి పటాపంచలవుతాయి. ఆ దిశగా కార్నీ పర్యటన ఒక ముందడుగు. -
భారత్‌కు 2.6 బిలియన్ డాలర్ల యురేనియం
న్యూఢిల్లీ: యురేనియం, అరుదైన ఖనిజాల సరఫరా విషయంలో భారత్, కెనడా మధ్య కీలకమైన అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదిరాయి. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేసుకోవాలని ఇరుదేశాలు నిర్ణయానికొచ్చాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ సోమవారం ఢిల్లీలో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సంబంధాల్లో పురోగతిపై విస్తృతంగా చర్చించారు. రాబోయే రోజుల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంతోపాటు ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా నూతన ఫ్రేమ్‌వర్క్‌ను ఖరారు చేశారు.రక్షణ, క్రిటికల్ టెక్నాలజీ, చిన్న, మధ్య తరహా అణు రియాక్టర్లు, విద్య, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని మోదీ, మార్క్ కార్నీ తీర్మానించారు. కెనడా ప్రధానితో భేటీ అనంతరం మోదీ ఒక ప్రకటన విడుదల చేశారు. భారత్, కెనడా సంబంధాలు ఇప్పుడు నూతన శక్తి, పరస్పర విశ్వాసం, సానుకూలతను సంతరించుకున్నాయని ఉద్ఘాటించారు. యురేనియం ఒప్పందంలో భాగంగా భారత అణు ఇంధన రంగానికి కెనడా సహకారం అందించబోతోంది. 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా చేయనుంది. సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలి ఉగ్రవాదం, తీవ్రవాదం, హింసాత్మక భావజాలం కేవలం భారత్, కెనడాలకే కాకుండా భూగోళంపై మొత్తం మానవాళికి ముప్పుగా మారాయని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో రెండు దేశాలదీ ఒక్కటే మాట అని వివరించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంతోపాటు రాడికలైజేషన్‌పై పోరాటంలో భారత్, కెనడా మధ్య సహకారం ప్రపంచ శాంతి, స్థిరత్వానికి అత్యంత కీలకమని అన్నారు. కెనడాపై దాడులు, పశ్చిమాసియాలో తాజా పరిణామాలు, అక్కడి ప్రజల భద్రతకు సవాళ్లు ఎదురవుతుండడంపై మోదీ, మార్క్ కార్నీ చర్చించారు. అభిప్రాయాలు పంచుకున్నారు.వివాదాలు, ఘర్షణలను సంప్రదింపులు, దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని మోదీ సూచించారు. అలాంటి ప్రయత్నాలకు తమ మద్దతు కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. అక్కడ భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్నారని, వారి భద్రత కోసం ఆయా దేశాలతో కలిసి పని చేస్తూనే ఉంటామని పేర్కొన్నారు. అమెరికాతో వాణిజ్య సంబంధాలు బలహీన పడుతున్న నేపథ్యంలో భారత్‌తో వాణిజ్యానికి కెనడా అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా తమ ఇరుదేశాల వాణిజ్య సంబంధాలను మరింత విస్తృతపర్చుకోవాలని ప్రధాని మోదీ, మార్క్ కార్నీ నిర్ణయించుకున్నారు. భారత్‌లో కెనడా వర్సిటీ క్యాంపస్‌లు ద్వైపాక్షిక వార్షిక వాణిజ్యాన్ని మరో నాలుగేళ్లలో 50 బిలియన్ డాలర్లకు చేర్చడమే తమ ధ్యేయమని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేసుకుంటామన్నారు. భారత్, కెనడా మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని త్వరలోనే ఖరారు చేస్తామని, దీనివల్ల రెండు దేశాల్లో నూతన పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. కెనడా పెన్షన్ నిధి నుంచి భారత్‌లో 100 బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెట్టారని, మనదేశ ప్రగతి చరిత్ర పట్ల కెనడాకు ఉన్న బలమైన విశ్వాసానికి ఇదొక నిదర్శనమని స్పష్టం చేశారు. భారత్, కెనడాల మధ్య ప్రస్తుతం వార్షిక వాణిజ్యం 13 బిలియన్ డాలర్లుగా ఉంది. కెనడా నుంచి అరుదైన ఖనిజాలు దిగుమతి చేసుకోవడానికి అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని తెలిపారు.తద్వారా సప్లై చైన్స్ బలోపేతం అవుతాయన్నారు. ఇంధన రంగంలో ‘తదుపరి తరం భాగస్వామ్యం’ నిరి్మంచుకుంటున్నామని చెప్పారు. హైడ్రోకార్బన్లు సహా పునరుత్పాధక ఇంధనం, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ స్టోరేజీపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నామని వివరించారు. దీర్ఘకాలంలో యురేనియం కోసం కెనడాలో చరిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకున్నామని మోదీ హర్షం వ్యక్తం చేశారు.రక్షణ రంగంలో భారత్, కెనడాల మధ్య సహకారం నానాటికీ పెరుగుతుండడం రెండు దేశాల లోతైన మైత్రికి, పరస్పర విశ్వాసానికి ప్రతీక అని వివరించారు. కెనడా యూనివర్సిటీల క్యాంపస్‌లు మన దేశంలో ఏర్పాటు కాబోతున్నాయని తెలియజేశారు. విద్యా రంగంలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటాయని స్పష్టం చేశారు. కీలక రంగాల్లో భారత్‌తో సంబంధాలను పటిష్టం చేసుకోవాలన్నదే తమలక్ష్యమని మార్క్ కార్నీ తేలి్చచెప్పారు. ఇరుదేశాలు లబ్ధి పొందేలా కలిసి పని చేస్తామన్నారు. యురేనియం ఒప్పందాన్ని భారత్, కెనడాల స్నేహానికి ప్రతీకగా అభివరి్ణంచారు. సంస్కరణలు, సులభతర వాణిజ్యానికి పెద్దపీట: మోదీ భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. దేశీయంగా వినియోగం పెరుగుతుండడం, భారీగా పెట్టుబడులు వస్తుండడం, డిజిటల్ ఎకానమీ వంటివి ఇందుకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. సోమవారం ఇండియా–కెనడా సీఈఓ ఫోరమ్ సదస్సులో ఆయన ప్రసంగించారు. సంస్కరణలతోపాటు సులభతర వాణిజ్యానికి పెద్దపీట వేస్తున్నామని, ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వేగంగా పరుగులు తీయడం తథ్యమని స్పష్టం చేశారు. కెనడాతో కలిసి త్వరలోనే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఏపీఏ) కుదుర్చుకుంటామని వెల్లడించారు. ఈ సదస్సులో భారత్, కెనడా వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. -
నేటి నుంచి కెనడా ప్రధాని పర్యటన
న్యూఢిల్లీ: కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ నాలుగు రోజుల భారత పర్యటన శుక్రవారం మొదలుకానుంది. భారత ప్రధాని మోదీ, కెనడా ప్రధాని కార్నీల మధ్య చర్చలు ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే లక్ష్యంలో విజయం సాధించనున్నాయని భారత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొంది. కార్నీ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య తర్వాత ఇరుదేశాల నడుమ సంబంధాలు పూర్తిగా క్షీణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సత్సంబంధాల బలోపేతం కోసం కార్నీ భారత్‌లో పర్యటిస్తున్నారు. జూన్‌లో కననాస్కీస్, నవంబర్‌లో జొహన్నెస్‌బర్గ్‌లో ఇరుదేశాల అగ్రనేతల భేటీల తర్వాత రెండుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా పలు రంగాల్లో సహకారంపై మోదీ, కార్నీలు చర్చించనున్నారు. ఇరునేతలు సోమవారం ఇండియా–కెనడా సీఈవో ఫోరమ్‌లో పాల్గొంటారు. తర్వాత వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధనం, భూఅయస్కాంతాలు, వ్యవసాయం, విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, ఇరుదేశాల ప్రజల మధ్య సత్సంబంధాల వంటి అంశాల్లో సహకారంపై చర్చలు జరపున్నారు. -
ఘనంగా ముగించిన అఫ్గానిస్తాన్
చెన్నై: 2024 టి20 వరల్డ్ కప్‌లో సెమీఫైనల్‌కు చేరినా... ఈ సారి లీగ్ దశకే పరిమితమైన అఫ్గానిస్తాన్ భారీ గెలుపుతో టోర్నీని ముగించింది. గ్రూప్ ‘డి’లో బలమైన జట్లు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌ల చేతిలో పరాజయంతో ‘సూపర్ ఎయిట్స్’ అవకాశాలు కోల్పోయిన అఫ్గానిస్తాన్ ... కెనడాతో గురువారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇబ్రహీమ్ జద్రాన్ (56 బంతుల్లో 95 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు)... సాదిఖుల్లా (32 బంతుల్లో 44; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), గుర్బాజ్ (20 బంతుల్లో 30; 5 ఫోర్లు) మెరిపించారు. కెనడా బౌలర్లలో జస్కరణ్ సింగ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం కెనడా 20 ఓవర్లలో 8 వికెట్లకు 118 పరుగులే చేయగలిగింది. హర్ష్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్), సాద్ బిన్ (28; 3 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. నబీ 4 ఓవర్లలో 7 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి. ఈ టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌లూ ఓడిన రెండో జట్టుగా (నమీబియాతో పాటు) కెనడా నిలిచింది. అంతర్జాతీయ టి20ల్లో కెనడా తరఫున అత్యధిక పరుగులు (1305) సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందిన నవనీత్ ధలివాల్ ఈ మ్యాచ్‌తో రిటైర్మెంట్ ప్రకటించాడు. మరోవైపు గత నాలుగేళ్లుగా అఫ్గానిస్తాన్‌ను బలమైన జట్టుగా తీర్చిదిద్ది టీమ్ సంచలన విజయాల్లో కీలక పాత్ర పోషించిన హెడ్ కోచ్ జొనాథన్ ట్రాట్ కూడా ఈ మ్యాచ్ తర్వాత తన పదవి నుంచి తప్పుకుంటున్నాడు. టి20 ప్రపంచకప్‌లో నేడుఆస్ట్రేలియా X ఒమన్‌వేదిక: పల్లెకెలె; రాత్రి గం. 7 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం -
T20 WC 2026: జద్రాన్ విధ్వంసం.. ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 19) జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్, కెనడా జట్లు తలపడుతున్నాయి. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (56 బంతుల్లో 95 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడి సెంచరీకి 5 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మిగతా వారిలో సెదిఖుల్లా అటల్ (44), రహ్మానుల్లా గుర్బాజ్ (30) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. గుల్బదిన్ నైబ్ (1), అజ్మతుల్లా ఒమర్జాయ్ (13) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. దర్విష్ రసూల్ 4 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ 3 వికెట్లు తీయగా.. దిలన్ హేలిగర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కెనడా తడబడుతుంది. 5 ఓవర్ల తర్వాత ఆ జట్టు 2 వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది. కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా (13), నవ్‌నీత్ ధలివాల్ (0) ఔట్ కాగా.. యువ్‌రాజ్ సమ్రా (17), హర్ష్ ఠాకూర్ (1) క్రీజ్‌లో ఉన్నారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ముజీబ్, ఒమర్జాయ్కు తలో వికెట్ దక్కింది.కాగా, ఈ మ్యాచ్ ఫలితంతో సంబంధం లేకుండానే సూపర్-8 బెర్త్‌లు ఖరారైపోయాయి. ఆఫ్ఘన్, కెనడా జట్లు ఇదివరకే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ గ్రూప్ నుంచి సౌతాఫ్రికా, న్యూజిలాండ్ సూపర్-8కు చేరాయి. -
పసికూనల పోరులో యూఏఈదే పైచేయి
టీ20 ప్రపంచకప్‌లో ఇవాళ (ఫిబ్రవరి 13) మధ్యాహ్నం పసికూనలు యూఏఈ, కెనడా జట్ల మధ్య పోటీ జరిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా.. హర్ష్ ఠాకూర్ (50) అర్ద సెంచరీతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. నవ్‌నీత్ ధలీవాల్ (34), శ్రేయస్ మొవ్వ (21) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. మిగతా ఆటగాళ్లంతా స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా 11, యువరాజ్ సమ్రా 5, నికోలస్ కిర్టన్ 4, జస్కరన్ సింగ్ 4 (నాటౌట్), సాద్ బిన్ జాఫర్ 5, డిలాన్ హేలిగర్ 6 (నాటౌట్) పరుగులు చేశారు. యూఏఈ బౌలర్లలో జునైద్ సిద్దిఖీ (4-0-35-5) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతనికి ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సహకరించాడు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన యూఏఈ ఆదిలో కాస్త తడబడినప్పటికీ.. చివర్లో గేర్ మార్చి 19.4 ఓవర్లలో గెలుపు తీరాలకు (5 వికెట్ల నష్టానికి) చేరింది. 66 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా.. ఓపెనర్ ఆర్యాంశ్ శర్మ (74 నాటౌట్), షోయబ్ ఖాన్ (51) పట్టుదలగా ఆడి యూఏఈని గెలిపించారు. కెనడా బౌలర్లలో సాద్ బిన్ జాఫర్ (4-0-14-3) యూఏఈ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. కలీమ్ సనా (4-0-29-1), డిలన్ హేలిగర్ (4-0-33-0) కూడా పర్వాలేదనిపించారు. అయితే ఆర్యాంశ్, షోయబ్ పట్టుదల ముందు వీరి ఈ ప్రదర్శనలు ఉపయోగపడలేదు. -
T20 WC 2026: యూఏఈ తరఫున ఇరగదీసిన పాక్ జాతీయుడు
టీ20 ప్రపంచకప్ 2026లో యూఏఈకు ప్రాతినిథ్యం వహిస్తున్న పాక్ జాతీయుడు జునైద్ సిద్దిఖీ చెలరేగిపోయాడు. 33 ఏళ్ల ఈ కుడి చేతి వాటం ఫాస్ట్ బౌలర్.. ఇవాళ (ఫిబ్రవరి 13) కెనడాతో జరుగుతున్న మ్యాచ్‌లో 5 వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులకే పరిమితమైంది.సిద్దిఖీ తన కోటా 4 ఓవర్లలో 35 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ యూఏఈ బౌలర్ నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఇదే. టీ20 వరల్డ్‌కప్‌లో 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన తొలి యూఏఈ బౌలర్ కూడా సిద్దిఖీనే. చాలామంది పాక్ క్రికెటర్లలాగే సిద్దిఖీ కూడా క్రికెట్ కెరీర్ కోసం యూఏఈకి వలస వెళ్లాడు. అక్కడ పౌరసత్వం పొంది 2019 నుంచి యూఏఈ జట్టుకు ఆడుతున్నాడు.యూఏఈ తరఫున ఇప్పటివరకు 88 టీ20లతో పాటు 63 వన్డేలు ఆడిన సిద్దిఖీ మొత్తంగా 208 వికెట్లు తీశాడు. యూఏఈ జట్టులో అత్యంత అనుభవజ్ఞుడు, అత్యంత విజయవంతమైన బౌలర్ సిద్దిఖీనే.మ్యాచ్ విషయానికొస్తే.. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో యూఏఈ, కెనడా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో కెనడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే అనుకున్నట్లుగా వారికి మంచి ఆరంభం లభించలేదు. సిద్దిఖీ ఇద్దరు కెనడా ఓపెనర్లను (యువరాజ్ సమ్రా (5), దిల్‌ప్రీత్ బజ్వా (11)) 5 పరుగుల తేడాతో పెవిలియన్‌కు పంపాడు.ఆతర్వాత వచ్చిన నవ్‌నీత్ ధలివాల్ (34), హర్ష్ ఠాకూర్ (50) బాధ్యతాయుతంగా ఆడి కెనడాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 58 పరుగులు జోడించడంతో కెనడా నిర్ణీత 20 ఓవరల్లో 7 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేయగలిగింది. చివర్లో శ్రేయస్ మొవ్వ (21) ఉపయోగకరమైన పరుగులు చేశాడు. కెనడా ఇన్నింగ్స్‌లో హర్ష్, ధలివాల్, శ్రేయస్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. యూఏఈ బౌలర్లలో సిద్దికీతో పాటు ముహమ్మద్ జవాదుల్లా (4-0-16-1) సత్తా చాటాడు.అనంతరం లక్ష్య ఛేదనలో యూఏఈ కూడా తడబడుతుంది. 15 ఓవర్ల తర్వాత ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 88 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్‌లో యూఏఈ గెలవాలంటే 30 బంతుల్లో మరో 62 పరుగులు చేయాలి. -
పాఠం నుంచి పాకం దాకా
ఆమె ఎంబీఏ చేసింది. ముంబాయిలో ఓ పేరున్న కార్పొరేట్ కళాశాలలో అసిస్టెంట్ ఫ్రొఫెసర్‌గా పెద్ద జీతం మీద పాఠాలు చెబుతూ మంచి పేరే తెచ్చుకుంది. అయితే ఉన్నట్టుండి ఆమె పాఠాలు చెప్పే ఉద్యోగాన్ని మానేసి ఇంటి దగ్గరే హెల్దీ శ్నాక్స్ తయారీకి శ్రీకారం చుట్టింది. రుచిగా, శుచిగా ఉండే చిరుతిళ్లను చాలా తక్కువ ధరకే అమ్మడం మొదలు పెట్టింది. ఇప్పుడామె తయారు చేసే శ్నాక్స్ యూఎస్, కెనడా, ఆస్ట్రేలియాలతో సహా దాదాపు పదిహేను దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆమే జైపూర్‌కు చెందిన రిచాశర్మ. ఇంతకీ ఆమె ఇంత హఠాత్తుగా ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో... ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎలా ఎదిగిందో చూద్దాం...రిచాశర్మది జైపూర్. ఫైనాన్స్‌లో ఎంబీఏ చేసింది. అక్కడే ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసింది. అయితే అది ఆమెకు చాలా దూరం కావడంతో ప్రయాణాలు చేయలేక వడోదరలోని పరుల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరింది. అక్కడ నాలుగైదేళ్ల పాటు పని చేసింది. పెళ్లి తర్వాత భర్తతో కలిసి ముంబాయి మహానగరంలో కాలు పెట్టింది. అప్పుడే ఆమెకు ఇద్దరు పిల్లలు పుట్టడం, వారి ఆలనా పాలనా చూసుకోవడం తో ఇక ఉద్యోగం ఊసులేకుండా వారితోటే పూర్తికాలం గడిచి పోయింది. మెల్లగా ఆ పిల్లలు రెండు, ఆరు తరగతులకొచ్చారు. వాళ్లకోసం రకరకాల రుచికరమైన, ఆరోగ్యకరమైన చిరుతిళ్లు తయారు చేసి పెట్టేది. ఈ క్రమంలో ఆమె చేసే తినుబండారాలను పిల్లల ద్వారా వారి స్నేహితులు, వాళ్ల వాళ్ల ఇళ్లలోనిÐ éళ్లూ రుచి చూశారు. అవి వారికి బాగా నచ్చడంతో వారిలో కొందరు ‘మీ పిల్లలకోసం తయారు చేసేటప్పుడే... మరికొద్ది మొత్తంలో మా పిల్లలకు కూడా చేసి పెట్టవచ్చు కదండీ’ అని అడగడంతో రిచాశర్మ గ్లుటెన్, మైదా, డాల్డా లాంటివి లేకుండా రుచికరమైన కమ్మటి శ్నాక్స్ తయారు చేయడం మొదలు పెట్టింది. చిరుధాన్యాలైన రాగులు, జొన్నలతో లడ్డూలు, ధోక్లా, కచోరీలు, సబ్జీలు తయారు చేసేది. అవి అక్కడివాళ్లకు అమితంగా నచ్చేవి. మాకు కావాలంటే మాకు కావాలని అందరూ పోటీపడేవాళ్లు. దాంతో ఆమె ‘రిచా ప్లేటర్’ పేరుతో శ్నాక్స్ సప్లై చేసేది. కోవిడ్ మార్చేసిన జీవితంఅలా సాగుతున్న ఆమె జీవితంలో కోవిడ్ పెను మార్పు తెచ్చింది. ఇక్కడ మార్పు అనగానే ఆమె చేసే శ్నాక్స్ బిజినెస్ కాస్తా దెబ్బ తిందేమో అని జాలిపడితే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే కోవిడ్ సమయం లో రిచాశర్మ రుచిగా శుచిగా శుభ్రంగా చేసే హోమ్ మేడ్ ఫుడ్ కోసం జ నాలు ఎగబడ్డారు. దాంతో ఆమె బిజినెస్ ఇబ్బడిముబ్బడిగా పెరిగి పోయింది. అప్పుడే ఆమె తన బిజినెస్ స్కిల్స్‌ను మరింత అభివృద్ధి చేసుకుంది. ఆర్డర్లకు తగ్గట్టే ప్రిపేర్ చేయడం వల్ల మిగిలి పోవడం కానీ, తక్కువ కావడం కానీ ఎప్పుడూ జరగలేదామెకి. దాంతో అప్పటివరకు మామూలు చిన్న చిన్న తినుబండారాల తయారీ నుంచి రకరకాల స్వీట్స్ తయారీకీ శ్రీకారం చుట్టింది రిచా. మొదట్లో నెలకు 20 ఆర్డర్లతో సరిపెట్టుకున్న రిచా శర్మ చూస్తుండగానే నెలకు 500 ఆర్డర్లకు సప్లై చేసేంతగా అభివృద్ధి చెందిందామె వ్యా పారం. ఖర్, బోరివలి, అంధేరిలకే పరిమితమైన ఆమె కష్టమర్లు కోయంబత్తూరు, బెంగళూరు, ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌ల వరకు విస్తరించారు. తన బిజినెస్‌కు ‘హంబుల్ ఫ్లేవర్స్’ అనే పేరు పెట్టి దానిని ఇంకా ఇంకా పెంచింది రిచా. వచ్చిన లాభాలలో ఐదుశాతం వాటాను ఎన్జీవోలకు డొనేట్ చేస్తుంది రిచా. మరో ఐదుశాతం లాభాలను తనతో పని చేసే వారికి ఇస్తుంది రిచా. వ్యా పారం ద్వారా లాభాలను గడించడం తన లక్ష్యం కాదని, అందరికీ హెల్దీ, టేస్టీ శ్నాక్స్ అందించడంలోనే తనకు సంతృప్తి లభిస్తుందని చెప్పే రిచాను ఇండియన్ ఇన్స్పైరింగ్ హోమ్ బిజినెస్ ఉమన్ అవార్డు వరించింది. -
కెనడా కాల్పుల ఘటన: నిందితుని ఉన్మాదం వెనుక..
వాంకోవర్: కెనడాలో బుధవారం జరిగిన కాల్పుల ఘటనలో నిందితునికి సంబంధించిన విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఘటనలో ‘జెస్సీ’ అనే యువకుడు సృష్టించిన బీభత్సానికి పదిమంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. మృతుల్లో జెస్సీ కన్నతల్లి, సోదరితో పాటు ఒక ఉపాధ్యాయురాలు, అభం శుభం తెలియని పసిపిల్లలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పలువురు ఆస్పత్రులలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. 🔥 BREAKING 🔥This is Jesse.Jesse shot 35 innocent people yesterday including his mother, sister, a teacher & young children.10 are dead & many are fighting for their lives.The Government decided that instead of supporting Jesse’s mental health & helping a disturbed child… pic.twitter.com/RDS6ruOcGa— Lozzy B 🇦🇺𝕏 (@TruthFairy131) February 12, 2026ఈ ఉన్మాదానికి వెనుక ఉన్న కారణాలు ఇప్పడు వార్తల్లో నిలిచాయి. జెస్సీ గత కొంతకాలంగా తీవ్రమైన మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని, అతను ఎప్పుడైనా ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వానికి, సంబంధిత ఏజెన్సీలకు ముందే తెలుసని సమాచారం. అయినప్పటికీ అతడిని ఒక రోగిగా గుర్తించి, సరైన మానసిక చికిత్స అందించడంలో యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వం జెస్సీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సింది పోయి, అతడిని ఒక అమ్మాయిగా పరిగణించి కృత్రిమమైన పద్ధతులను ప్రోత్సహించిందనే మాట వినిపిస్తోంది. అతనికి ‘క్రాస్ సెక్స్ హార్మోన్లు’, ఇతర మందులను ఇవ్వడం ద్వారా అతని శరీరాన్ని, ఆలోచనా తీరును విషపూరితం చేశారని తెలుస్తోంది. ఒక మానసిక రోగి భ్రమలను సరిదిద్దకుండా, వాటిని మరింతగా ప్రేరేపించిన కారణంగానే అతను తనపై తాను నియంత్రణ కోల్పోయి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. -
కెనడా పాఠశాలలో కాల్పుల మోత
వాంకోవర్: ప్రశాంత కెనడాలో కాల్పుల మోత మోగింది. బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలోని టుంబ్లర్ రిడ్జ్ కొండ ప్రాంత పట్టణంలోని టుంబ్లర్ రిడ్జ్ సెకండరీ స్కూల్లో ఓ ఆగంతకురాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో పది మంది ప్రాణాలు కోల్పోయారు. 27 మంది గాయాలపాలయ్యారు. రక్తమోడుతున్న ఇద్దరిని అధికారులు హుటాహుటిన హెలికాప్టర్లో సమీప ఆస్పత్రికి తరలించారు. సమీప ఇంట్లో రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. వినబడగానే వణికిపోయాం.. ‘‘కాల్పుల శబ్దాలు రాగానే అంతా వణికిపోయాం. స్కూల్లో లాక్డౌన్ ప్రకటిస్తున్నాం. పిల్లలంతా వెంటనే మీ క్లాస్‌రూమ్‌ను లోపలి నుంచి గడియపెట్టండి అని లౌడ్స్పీకర్లలో అనౌన్స్మెంట్ వినపడింది. వెంటనే మా తరగతి గది తలుపులు మూసేశాం. వాటిని బద్దలుకొట్టకుండా అడ్డుగా టేబుళ్లను పేర్చాం. వాటిని అలాగే రెండు గంటలపాటు అదిమిపట్టాం. పోలీసులు వచ్చాకే మా ప్రాణం లేచొచి్చంది’’అని పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న డేరియన్ క్విస్ట్ చెప్పాడు. ‘‘మా స్కూల్ ప్రిన్సిపల్ లాక్డౌన్ అని అరుస్తూ కన్పించారు. వెంటనే విద్యార్థులతోపాటు తరగతి గదిలోకి పరుగెత్తి లోపలి నుంచి గడియ బిగించాం. అడ్డుగా బెంచీలను అడ్డుపెట్టాం. అలా రెండు గంటలు ఉండిపోయాం. కాల్పుల శబ్దాలు మా చెవుల్లో మార్మోగుతున్నాయి. ఈ దెబ్బకు చిన్నారులు మళ్లీ పాఠశాలకు అడుగుపెట్టడం కష్టమే’’అని మెకానికల్ సబ్జెక్ట్ ఉపాధ్యాయుడు జార్బాస్ నోరోన్హా చెప్పారు. పాఠాల ప్రతిధ్వనులు మినహా కాల్పుల మోతలు అస్సలు వినబడని కెనడా పాఠశాలల్లో ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు ఈ ఘటన జరిగింది. కాల్పులు మొదలుకాగానే పోలీసులకు సమాచారం వెళ్లింది. వాళ్లు కేవలం రెండు నిమిషాల్లోనే స్కూల్‌కు వచ్చారు’’అని బ్రిటిష్ కొలంబియా ప్రజా భద్రతా మంత్రి, సొలిసిటర్ జనరల్ నైనా క్రీగర్ వెల్లడించారు. పోలీసులు వచ్చేలోపే ఆగంతకురాలు తనను తాను తీవ్రంగా గాయపర్చుకుని చనిపోయింది. ఆమె మృతదేహాన్ని పాఠశాలలో పోలీసులు గుర్తించారు. ఆగంతకురాలి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. దాడికి కారణాలను త్వరలోనే వెల్లడిస్తామని ది రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ సూపరింటెండెంట్ కెన్ ఫ్లాయిడ్ చెప్పారు. ‘బ్రౌన్ రంగు జుట్టు ఉన్న సాయుధురాలు’’అని మాత్రమే పేర్కొన్నారు. స్కూల్‌కు ఆమెకు ఉన్న సంబంధం ఏంటనేది తెలియరాలేదు. ఘటన జరిగిన పాఠశాలలో ఏడో తరగతి నుంచి 12వ తరగతి వరకు మొత్తం 175 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది. టుంబ్లర్ రిడ్జ్ జనాభా 2,700 మాత్రమే. సమీప బొగ్గు పరిశ్రమకు సహాయకంగా 1981లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పట్టణాన్ని నిర్మించింది. -
కెనడాలో కర్నాటక వాసి కాల్చివేత
ఒట్టావా/బెంగళూరు: కెనడాలోని టొరంటో నగరంలో ఉన్న షాపింగ్ సెంటర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో కర్నాటక వాసి (37) ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడిని బ్రాంప్టన్‌లో ఉండే చందన్ కుమార్ రాజా నందకుమార్‌గా కెనడా పోలీసులు గుర్తించారు. వుడ్బైన్ షాపింగ్ సెంటర్ వాహన పార్కింగ్ ప్రాంతంలో శనివారం సాయంత్రం 3.30 గంటల సమయంలో ఘటన చోటుచేసుకుంది. కాల్పుల గురించి సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నామని పోలీసులు తెలిపారు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించామని, చికిత్స పొందుతూ అతడు చనిపోయాడన్నారు. చందన్‌కుమార్ వాహనం కిటికీల అద్దాలకు బుల్లెట్ రంధ్రాలు పడగా, డ్రైవర్ వైపు ఉన్న కిటికీ అద్దం పూర్తిగా ధ్వంసమైంది. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తుల వివరాలు తెలియనప్పటికీ, దీనిని లక్షిత ఘటనగా భావిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇంటికి రావాలని చెబుతున్నా...వినలేదు:తల్లిదండ్రులు చందన్ మరణవార్త విని కర్నాటక రాజధాని బెంగళూరులో శివారు నెలమంగళలో ఉంటున్న అతడి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. ఇలాంటిది జరుగుతుందని తాము కలలో సైతం ఊహించలేదన్నారు. దాదాపు ఏడేళ్ల నుంచి కెనడాలో ఉంటున్న చందన్‌ను ఇంటికి రావాలని ఎప్పటి నుంచో కోరుతున్నామని, కానీ వినిపించుకోలేదని తండ్రి నందన్ కుమార్ వాపోయారు. అంతిమ సంస్కారం జరిపేందుకు మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు సాయం చేయాలని భారత ప్రభుత్వాన్ని ఆయన కోరారు. చందన్ టొరంటోలో ఇటీవలే కన్నడ అసోసియేషన్‌ను స్థాపించారని, బహుశా ఇదే కక్షతో అతడిని బలి తీసుకుని ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేశారు. -
దక్షిణాఫ్రికా శుభారంభం
అహ్మదాబాద్: టి20 ప్రపంచ కప్ గత టోర్నీ రన్నరప్ దక్షిణాఫ్రికా ఈ సారి టోర్నీలో భారీ విజయంతో శుభారంభం చేసింది. సోమవారం గ్రూప్ ‘డి’లో జరిగిన లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 57 పరుగుల తేడాతో కెనడాపై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది. కెపె్టన్ ఎయిడెన్ మార్క్రమ్ (32 బంతుల్లో 59; 10 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. అన్‡్ష పటేల్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత లక్ష్య ఛేదనలో కెనడా పోరాటంతో ఆకట్టుకున్నా...చివరకు ఓటమి తప్పలేదు. కెనడా 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి ఓడింది. నవనీత్ దలివాల్ (49 బంతుల్లో 64; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, హర్‡్ష ఠాకెర్ (29 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. ఇన్‌గిడి 4 వికెట్లు పడగొట్టగా, యాన్సెన్‌కు 2 వికెట్లు దక్కాయి. మార్క్రమ్ ఫిఫ్టీ... ఓపెనర్లు మార్క్రమ్, డికాక్ (22 బంతుల్లో 25; 2 ఫోర్లు) అనుభవం లేని కెనడా బౌలర్లపై చెలరేగారు. కెపె్టన్ మార్క్రమ్ బౌండరీలతో వేగం పెంచాడు. దీంతో 4.3 ఓవర్లలో జట్టు స్కోరు 50కి చేరింది. డికాక్ వెనుదిరిగిన తర్వాత ర్యాన్ రికెల్టన్ (21 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్స్) కెపె్టన్‌తో కలిసి వేగంగా పరుగులు సాధించడంతో పదో ఓవర్ ముగియకముందే సఫారీ స్కోరు 100 దాటింది. మార్క్రమ్ 28 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో మార్క్రమ్, రికెల్టన్, బ్రెవిస్ (6) అవుటయ్యారు. డేవిడ్ మిల్లర్ (23 బంతుల్లో 39 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు), ట్రిస్టన్ స్టబ్స్ (19 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెరోవైపు నుంచి దూకుడుగా ఆడటంతో జట్టు స్కోరు 200 దాటింది. మెరిపించిన నవ్‌నీత్ దక్షిణాఫ్రికాలాంటి గట్టి ప్రత్యరి్థపై 200 పైచిలుకు లక్ష్యాన్ని ఛేదించడం ఎవరికైనా కష్టం. కెనడాలాంటి కూనకైతే అసాధ్యం! లుంగి ఇన్‌గిడి దెబ్బకు ఆరంభంలోనే ఓపెనర్లు దిల్‌ప్రీత్ (0), యువరాజ్ (12) సహా నికోలస్ కిర్టన్ (4) వికెట్లను కోల్పోయింది. పవర్‌ప్లేలోనే మొవ్వ శ్రేయస్ (9) కూడా అవుట్ కావడంతో ఏకపక్షమే అనిపించింది. అయితే నవ్‌నీత్ దలివాల్, హర్‡్ష ఠాకెర్ కాసేపు సఫారీ బౌలర్లకు సవాలుగా నిలిచారు. చక్కని సమన్వయంతో జట్టు స్కోరును వందకు తీసుకెళ్లారు. ఐదో వికెట్‌కు 69 పరుగులు జోడించాక హర్‡్ష అవుటయ్యాడు. 39 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన నవ్‌నీత్ ఆఖరి ఓవర్లో ని్రష్కమించాడు. -
మార్క్రమ్ మెరుపులు.. సౌతాఫ్రికా భారీ స్కోర్
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కెనడాతో ఇవాళ (ఫిబ్రవరి 9) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో సఫారీ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. కెప్టెన్ మార్క్రమ్ (59) విధ్వంసకర హాఫ్ సెంచరీ చేయగా.. ఆఖర్లో స్టబ్స్ (34 నాటౌట్), మిల్లర్ (39 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. డికాక్ (25), రికెల్టన్ (33) కూడా తలో చేయి వేశారు. బ్రెవిస్ (6) ఒక్కడే నిరాశపరిచాడు. కెనడా బౌలర్లలో అన్ష్ పటేల్ (4-0-31-3) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కలీమ్ సనా (4-0-38-0) వికెట్లు తీయలేకపోయినా పర్వాలేదనిపించాడు. మిగతా బౌలర్లందరినీ సఫారీ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారు. జస్కరన్ సింగ్ 4 ఓవర్లలో 49 పరుగులు, కెప్టెన్ దీల్‌ప్రీత్ బజ్వా 4 ఓవర్లలో 40 పరుగులు (ఓ వికెట్), సాద్ బిన్ జాఫర్ 3 ఓవర్లలో 38 పరుగులు, డిలాన్ హెలిగర్ ఓ ఓవర్లో 13 పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కెనడా 8 ఓవర్ల తర్వాత 4 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసి ఓటమి దిశగా సాగుతోంది. దిల్‌ప్రీత్ (0), యువరాజ్ సమ్రా (12), నికోలస్ కిర్టన్ (4), శ్రేయస్ మొవ్వ (9) ఔట్ కాగా.. నవ్‌నీత్ ధలీవాల్ (25), హర్ష్ థాకర్ (9) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో కెనడా గెలవాలంటే మరో 72 బంతుల్లో 150 పరుగులు చేయాలి. కెనడాను లుంగి ఎంగిడి (3-0-21-3) దారుణంగా దెబ్బకొట్టాడు. రబాడ (2-0-16-1) కూడా ఇబ్బంది పెట్టాడు. -
కెనడా విమానాలపై 50% టారిఫ్‌లు
వాషింగ్టన్: కెనడాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్‌ల బాంబు పేల్చారు. అమెరికాలో విక్రయించే కెనడా విమానాలపై ఏకంగా 50 శాతం సుంకాలు బాదుతానని ప్రకటించారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌సోషల్ పోస్టులో ఈ మేరకు పేర్కొన్నారు. జార్జియాకు చెందిన అమెరికా కంపెనీ గల్ఫ్‌స్ట్రీమ్ ఏరోస్పేస్‌కు చెందిన జెట్ విమానాలను సర్టిఫై చేసేందుకు కెనడా నిరాకరించిందంటూ ఆయన ఈ మేరకు బెదిరింపులకు దిగారు.కెనడా నిర్ణయానికి ప్రతిచర్యగా బొంబార్డియర్‌తో పాటు ఆ దేశానికి చెందిన అన్ని కంపెనీల విమానాలనూ తాము కూడా డీసర్టిఫై చేస్తామని హెచ్చరించారు. బొంబార్డియర్ విమానాల గుర్తింపు రద్దు తక్షణం అమల్లోకి వస్తుందని కూడా ప్రకటించారు. బొంబార్డియర్, గల్ఫ్‌స్ట్రీమ్ ఒకరకంగా ఆగర్భ శత్రువులు. ట్రంప్ ప్రకటనపై మాంట్రియల్‌కు చెందిన బొంబార్డియర్ కంపెనీ వెంటనే స్పందించింది. ఆయన హెచ్చరికలపై కెనడా ప్రభుత్వంతో చర్చిస్తున్నట్టు చెప్పింది.కెనడాపై కత్తులుకెనడాపై కొంతకాలంగా ట్రంప్ కత్తులు నూరుతున్నారు. ముఖ్యంగా కెనడా ప్రధాని మార్క్ కార్నీకి, ఆయనకు నడుమ సంబంధాలు బాగా బెడిసికొట్టాయి. కార్నీని ట్రంప్ తరచూ ‘కెనడా గవర్నర్’ అని సంబోధిస్తూ హేళన చేస్తున్నారు. పెద్ద దేశాల ఒంటెత్తు పోకడల వల్ల అంతర్జాతీయ ఒప్పందాలకు విలువే లేకుండా పోతోందంటూ ట్రంప్ తీరును దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదిక నుంచే కార్నీ తూర్పారబట్టారు.అప్పటినుంచీ వారి నడుమ మాటల యుద్ధం కొనసాగుతోంది. చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాపై టారిఫ్‌లను ఏకంగా 100 శాతానికి పెంచుతానని ఇటీవలే ట్రంప్ బెదిరించడం తెలిసిందే. అయినా కార్నీ చైనాలో పర్యటించడమే గాక ఆ దేశంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. -
వందలసార్లు కాక్‌పిట్‌లోకి చొరబాటు! ఎలా సాధ్యం?
తనను తాను విమాన పైలట్‌గా పరిచయం చేసుకుంటాడు... ఎయిర్ పోర్టు నుంచి లోపలికి వెళ్లేదాకా ఐడీ కార్డులు చూపిస్తూ దర్జాగా విమానంలోకి ప్రవేశిస్తాడు. లోపల విమానం కాక్‌పిట్‌లో ప్రత్యేకంగా ఉండే జంప్సీట్ కావాలని పట్టుబట్టి ఆ సీట్ మీద కూర్చుని ప్రయాణం చేస్తాడు. ఇలా ఒకటి.. రెండు సార్లు కాదు కొన్ని వందల సార్లు అతను వేర్వేరు విమానాల్లో ప్రయాణించాడు. కెనడా ఎయిర్ లైన్స్‌లో రెండేళ్ల పాటు ఉద్యోగం చేసి.. మానేసిన తర్వాత ఎయిర్ లైన్స్‌లో ఉండే లొసుగులను బాగా వంట పట్టించుకున్న 33ఏళ్ల డల్లాస్ పోకోర్ని ఈ మోసపు దందాకు తెర లేపాడు. 2024 జనవరి నుంచి అదే ఏడాది అక్టోబర్ల మధ్య నకిలీ ఐడీలు చూపి.. ప్రయాణాలు చేశాడు. మూడు ప్రధాన విమానయాన సంస్థలను తన మోసానికి టార్గెట్ చేసుకుని అందులో ప్రయాణించాడు. కేవలం ప్రయాణం మాత్రమే కాదు... విమానంలో సాధారణంగా... పైలట్లు... FAA ఇన్స్పెక్టర్లు, నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్ అధికారులకు మాత్రమే అనుమతి ఉన్న జంప్సీట్ను డిమాండ్ చేసి ఆ సీటుపై ప్రయాణించాడు. ఎట్టకేలకు అనుమానం వచ్చిన అధికారులు అతని ప్రయాణాలపై ఆరా తీశారు. అతను మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి అరెస్టు చేయడంతో అతని పూర్తి బాగోతం బయట పడింది. వెంటనే పనామాలో అతన్ని అరెస్టు చేశారు. హవాయిలోని ఫెడరల్ కోర్టులో అతనిపై అభియోగాలు మోపారు.దోషిగా తేలితే... అతనికి 20 ఏళ్ల జైలుశిక్ష పడే అవకాశముంది. -
భారత్ టూర్‌కు కెనడా పీఎం ఏర్పాట్లు!
ఇటీవల కాలంలో అన్ని దేశాలను విసిగించినట్లు కెనడాకు అత్యంత చిరాకు తెప్పిస్తున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాము లేకపోతే కెనడానే లేదని వ్యాఖ్యానించిన ట్రంప్.. ఆ దేశం తాను ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్‌కు మద్దతు తెలపకపోవడంతో అత్యంత అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తమకు మద్దతు తెలపని దేశాలను గుర్తుపెట్టుకుంటామని కూడా ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో కెనడా కృతజ్ఞత లేని దేశమని కూడా హాట్ కామెంట్స్ చేశారు.దీనికి ఇప్పటికే కెనడా ప్రధాని మార్క్ కార్నే కౌంటర్ కూడా ఇచ్చారు. తాము ఎవరి మీద ఆధారపడి బతకడం లేదని, కెనడియన్లకు ఒక స్థానం ఉందని, తాము కెనడాకు చెందిన వారేమనని అమెరికాకు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. తాము ఎప్పటికీ అమెరికాకు 51వ రాష్ట్రంగా ఉండబోమని తెగేసి చెప్పారు కార్నే.అయితే కెనడా ప్రధాని కార్నే.. భారత్ పర్యటనకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. త్వరలో ఆయన భారత్‌లో పర్యటించేందుకు సన్నద్ధమవుతున్నారు. భారత్‌తో కెనడాకు ఉన్న సంబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు పలు ట్రేడ్ డీల్స్ ఒప్పందం చేసుకునేందుకు కార్నే.. భారత్‌కు పర్యటన చేపట్టబోతున్నారు. ఇదే విషయాన్ని సూచనప్రాయంగా ధృవీకరించారు భారత హైకమిషనర్ దినేష్ పట్నాయక్. కెనడా ప్రధాని కార్నే.. భారత పర్యటన పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర బడ్జెట్ తర్వాత ఉండొచ్చన్నారు. ఇదీ చదవండి:అమెరికా-కెనడాల మధ్య ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అగ్గి..! -
కెనడాలో భారత సంతతి వ్యక్తి మృతి
బర్న్బీ: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా రాష్ట్రంలో రెండు ముఠాల మధ్య జరిగిన కాల్పుల్లో భారత సంతతికి చెందిన దిల్‌రాజ్ గిల్(28) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నెల 22వ తేదీన సాయంత్రం 5.30 గంటల సమయంలో బర్న్బీలోని కెనడా వేలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని వాంకోవర్‌కు చెందిన దిల్‌రాజ్ గిల్‌గా గుర్తించామని తెలిపింది. గ్యాంగ్‌ల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా ఉద్దేశపూర్వకంగా జరిగిన హత్యగా భావిస్తున్నామని తెలిపింది. కాల్పులు జరిగిన వెంటనే నిందితుడు లేదా నిందితులు ఆ ప్రాంతం నుంచి పరారయ్యారని, వాహనం దహనంతో వారికి సంబంధంముంటుందని అనుమానాలున్నాయని ఆర్సీఎంపీ పేర్కొంది. వివిధ ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు జరుగుతోందని వివరించింది. -
Canada: గ్యాంగ్ వార్ కారణమా?
కెనడాలో 28 ఏళ్ల భారత మూలాలకు చెందిన వ్యక్తిని కొంతమంది కాల్చి హత్య చేయడంపై గ్యాంగ్ వార్‌గా అనుమానిస్తున్నారు. దిల్‌రాజ్ సింగ్ గిల్ అనే వ్యక్తిని కొంతమంది దాడి చేశారు. గత గురువారం సాయంత్రం గం. 5.30 ని.లకు బర్నబీ నగరంలో గిల్‌ను పలువురు కాల్చి చంపారు. బర్నబీ ఆర్సీఎంపీ ఫ్రంట్‌లైన్ అధికారులు కెనడా వే 3700 బ్లాక్ వద్ద కాల్పులు జరిగాయని వచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి అక్కడ ఓ వ్యక్తి రోడ్డపై పడి ఉన్నాడు. అయితే అతని ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆ వ్యక్తి తుదిశ్వాస విడిచాడని పోలీసులు తెలిపారు. తమక గిల్ బాగా తెలిసిన వ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న గ్యాంగ్ వార్ కారణంగానే గిల్‌ను కాల్చి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇలా పబ్లిక్ ప్లేస్‌లో కాల్పులు జరగగంపై పోలీసుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇది పోలీసులకు మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని కూడా కలవరపెట్టే అంశం. సంఘటనా స్థలంలో ఉన్న సాక్షులు, అక్కడి ప్రజల నుండి లభించే సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. -
చైనాతో ఒప్పందం చేసుకుంటే... 100 శాతం టారిఫ్‌లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహాగ్ని తాజాగా కెనడా వైపు మళ్లింది. చైనాతో వాణిజ్య ఒప్పందం విషయంలో మొండిగా ముందుకెళ్తే కెనడాపై ఏకంగా 100 శాతం టారిఫ్‌లు విధిస్తామని శనివారం ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వాటి మధ్య ఒప్పందం కుదిరితే ఆ మరుక్షణమే సుంకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్‌సోషల్‌లో ఈ మేరకు పోస్టు పెట్టారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చైనా వస్తువులు, ఉత్పత్తులను అమెరికాలో గుమ్మరించేందుకు ఆయన కెనడాను వేదికగా మార్చజూస్తున్నారని ఆరోపించారు. ‘‘కార్నీ ఉద్దేశం అదే అయితే గనక ఆయన చాలా పొరబడుతున్నారు. అలా జరిగేందుకు నేనెప్పటికీ అనుమతించబోను’’అని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని కార్యాలయం అధికారికంగా స్పందించలేదు. ట్రంప్ తన పోస్టులో కార్నీని ‘గవర్నర్’గా సంబోధించడం విశేషం. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా విలీనం కావాలని ఆయన పలుమార్లు సూచించడం తెలిసిందే. ఈ సంబోధన తాలూకు ఉద్దేశం కూడా అదేనంటున్నారు. ట్రంప్, కార్నీ నడుమ కొంతకాలంగా మాటల యుద్ధం సాగుతోంది. ట్రంప్‌వి ఏకపక్ష పోకడలంటూ ఇటీవల కార్నీ దుయ్యబట్టారు. దాంతో చిర్రెత్తుకొచి్చన ట్రంప్, అసలు కెనడా బతుకుతున్నదే అమెరికా దయాదాక్షిణ్యాల మీద అంటూ దావోస్ వేదికగా ఎద్దేవా చేశారు. దీనిపై కార్నీ స్పందిస్తూ, నియంతృత్వ పోకడలకు తల వంచకుండా ప్రపంచానికి కెనడా ఒక ఉదాహరణగా నిలుస్తుందంటూ బదులిచ్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో గాజా పునర్నిర్మాణానికి తలపెట్టిన శాంతిమండలిలో చేరేందుకు కెనడాకు పంపిన ఆహ్వానాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ట్రంప్ ప్రకటించారు. చైనా తన విద్యుత్ వాహనాలపై టారిఫ్‌లను తగ్గించేలా కెనడాతో కొంతకాలంగా బేరసారాలాడుతోంది. ప్రతిగా కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాల తగ్గింపుకు సంసిద్ధత వెలిబుచ్చింది. ఈ మేరకు ఒప్పందం దిశగా వాటి మధ్య ముమ్మరంగా చర్చలు జరుగుతున్నాయి. దీన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఈ ఒప్పందం కుదుర్చుకుంటే కెనడాను ఆర్థికంగా, సామాజికంగా చైనా పూర్తిగా కబళించేస్తుందని ఇటీవలే ఆయన హెచ్చరించారు. అమెరికా ప్రతిపాదిత గోల్డెన్‌డోమ్ రక్షణ ఛత్రంలోకి వచ్చేందుకు కెనడా నిరాకరించడంపై కూడా ట్రంప్ తీవ్ర అసహనం వెలిబుచ్చారు. -
చైనాతో జాగ్రత్త.. కెనడాకు ట్రంప్ హెచ్చరిక
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కెనడాను టార్గెట్ చేశారు. కెనడాపై విరుచుకుపడ్డారు. గ్రీన్‌లాండ్‌పై గోల్డెన్ డోమ్ నిర్మించడాన్ని కెనడా వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో చైనాతో కెనడా వ్యాపారం చేయడం వారికే నష్టం కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు చేశారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో ట్రుత్ వేదికగా.. గ్రీన్‌లాండ్‌పై విస్తారమైన క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్మించాలనే అమెరికా ప్రణాళికను కెనడా వ్యతిరేకిస్తోంది. అయినప్పటికీ గోల్డెన్ డోమ్ కెనడాను రక్షిస్తుంది. అమెరికా నిర్మిస్తున్న గోల్డెన్ డోమ్.. కెనడాను రక్షించబోతోంది. కెనడా మా నుండి చాలా ఉచితాలను పొందుతుంది. అమెరికా కారణంగానే కెనడా మనుగడ సాగిస్తోంది. వారు కూడా కృతజ్ఞతతో ఉండాలి. అలా కాకుండా అమెరికాతో సంబంధాలను తెంచుకుకుంటున్నారు. బదులుగా చైనాతో వ్యాపారం చేసేందుకు కెనడా ఆమోదం తెలిపింది. చైనాకు అనుకూలంగా ఓటు వేశారు. మొదటి సంవత్సరమే కెనడాను చైనా తినేస్తుంది’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ చైనాతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరించడానికి బీజింగ్‌ను సందర్శించిన కొన్ని రోజుల తర్వాత ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.మరోవైపు.. ట్రంప్ వ్యాఖ్యలపై కెనడా ప్రధాని మార్క్ కార్నీ తీవ్రంగా స్పందించారు. అమెరికా మద్దతు కారణంగానే కెనడా మనుగడ సాగిస్తుందనే ట్రంప్ వాదనను తిరస్కరించారు. ఈ క్రమంలో మార్క్ కార్నీ మాట్లాడుతూ..‘కెనడాకు అమెరికాతో సంబంధమే లేదు. మనం కెనడియన్లం కాబట్టి కెనడా అభివృద్ధి చెందుతుంది. కెనడా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం. కెనడాకు మనమే యజమానులం. ఇది మన సొంత దేశం. ఇది మన భవిష్యత్తు అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, దావోస్‌లో ట్రంప్ పేరు ప్రస్తావించకుండానే చిన్న దేశాల పట్ల గొప్ప శక్తులు బలవంతం చేయడాన్ని కార్నీ తప్పుబట్టారు. -
అమెరికా-కెనడాల మధ్య ‘బోర్డ్ ఆఫ్ పీస్’ అగ్గి..!
అమెరికా-కెనడాల మధ్య డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన బోర్డ్ ఆఫ్ పీస్ అగ్గి రాజేస్తుంది. ట్రంప్ ఏర్పాటు చేసిన ఈ పీస్ బోర్డుకు కెనడా సమ్మతి తెలపకపోవడంతో అది మరొక వివాదానికి దారి తీసింది. తమకు సహకరించని దేశాలను గుర్తుపెట్టుకుంటామని వ్యాఖ్యానించిన ట్రంప్.. కెనడాపై మాత్రం పెరు పెట్టి మరీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. కెనడా కృతజ్ఞత లేని దేశం అంటూ నిప్పులు చెరిగారు. తమ వల్లే ఆ దేశం మనుగడలోకి వచ్చిందని, ఇప్పటికీ తామే ఆదేశానికి ఆధారమని ధ్వజమెత్తారు. దీనిపై కెనడా ఘాటుగా స్పందించింది. ట్రంప్.. ఇక మీ మాటలు చాలంటూ ఘాటుగా బదులిచ్చింది. దీనిపై కెనడా ప్రధాని మార్క్ కార్నే మాట్లాడుతూ.. తమకు స్వతంత్ర ప్రతిపత్తి ఉందంటూ ట్రంప్ వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. తమ ఎవరి మీద ఆధారపడి బతకడం లేదని, కెనడియన్లకు ప్రత్యేకమైన జీవన స్థితిగతులు ఉన్నాయన్నారు. ‘ అమెరికా వల్ల కెనడియన్లు జీవించడం లేదు. కెనడా అభివృద్ధి చెందుతోంది ఎందుకంటే మనం కెనడియన్లం’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో బోర్డ్ ఆఫ్ పీస్‌లో తమను జాయిన్ అవ్వమని ట్రంప్ నుంచి ఆహ్వానం అందిన విషయాన్ని కార్నే అంగీకరించారు. ఆయన రెండు దేశాల మధ్య ఉన్న అద్భుతమైన భాగస్వామ్యాన్ని కూడా ఒప్పుకున్నారు. కాకపోతే తమకు ప్రత్యేక అభిప్రాయాలుంటాయనే విషయాన్ని కార్నే తేల్చిచెప్పారు. ఆ బోర్డుకు అత్యధిక మొత్తంలో చెల్లించడానికి తాము సిద్ధంగా లేమని తెగేసి చెప్పేశాకాగా, ఇక దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలోఅమెరికా ఆధిపత్యంపై సెటైర్లు వేశారు. అమెరికా ఆధిపత్యం తగ్గిపోతున్నదని, మధ్యస్థ శక్తులు కలిసి కొత్త సహకార ప్రపంచాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ క్రమంలోనే ట్రంప్ శాంతి కూటమికి కెనడా దూరంగా ఉంది. అయితే ట్రంప్ మాత్రం కెనడాపై రెచ్చిపోయి ప్రసంగించడంతో ఆ రెండు దేశాల మధ్య సంబంధాలు ఎటు దారితీస్తాయో అనే చర్చ మొదలైంది.ఇదీ చదవండి:Trump: మరో కొత్త తలనొప్పి..! -
కెనడాపైనా ట్రంప్ కన్ను!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీరు నానాటికీ శ్రుతి మించి రాగాన పడుతోంది. అర్ధరాత్రి అధ్యక్ష దంపతులను కిడ్నాప్ చేసి చెరబట్టిన వెనెజువెలాతో పాటు గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలని కలలుగంటున్న ట్రంప్ దృష్టి పొరుగుదేశం కెనడా పైనా పడింది. ఆ మూడు దేశాలనూ అమెరికా మ్యాప్‌లో చేర్చేసి మురిసిపోయారాయన! కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్‌తో కలిపిన అమెరికా మ్యాప్‌ను సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ మంగళవారం పోస్టు చేశారు. తద్వారా అవి ఎప్పటికైనా అమెరికా భూభాగాలేనన్న సంకేతాలిచ్చారు! ఈ మేరకు ట్రంప్ పోస్టు చేసిన ఏఐ ఫొటో వైరల్‌గా మారింది. అందులో వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో పలువురు దేశాధినేతలతో ఆయన ఏదో సీరియస్‌గా చర్చిస్తూ కన్పిస్తున్నారు.నేపథ్యంలో మూడు దేశాలను అమెరికా భూభాగంతో కలిపి చూపుతున్న ఆ దేశ సరికొత్త మ్యాప్ ప్రముఖంగా కన్పిస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్, యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాండెర్ లెయన్, నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టె తదితరులు ఫొటోలో ఉన్నారు. తద్వారా... కెనడా, వెనెజువెలా, గ్రీన్లాండ్ స్వాధీనానికి ఆయా దేశాల ఆమోదముందని చెప్పడం ట్రంప్ ఉద్దేశమని విశ్లేషిస్తున్నారు.ట్రంప్ అక్కడితో ఆగలేదు! గ్రీన్లాండ్ గడ్డపై తాను సగర్వంగా అమెరికా జెండా పాతుతున్నట్టుగా మరో ఏఐ ఆధారిత ఫొటోను కూడా పోస్ట్ చేశారు. ఆయనతో పాటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఫొటోలో కన్పిస్తున్నారు. ‘‘గ్రీన్లాండ్, అమెరికా భూభాగం, స్థాపితం: 2026’ అని రాసిన బోర్డు కూడా ఫొటోలో దర్శనమిస్తోంది. కెనడా స్వచ్ఛందంగా అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని గతంలో ట్రంప్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇక డెన్మార్క్ అధీనంలోని స్వయంపాలిత ప్రాంతమైన గ్రీన్లాండ్ స్వాధీ నానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు, ఆ క్రమంలో చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు కొంతకాలంగా అంతర్జాతీయ రగడకు దారితీస్తు న్నాయి. డెన్మార్క్ తో పాటు గ్రీన్లాండ్ కూడా ట్రంప్ యత్నాలను ముక్త కంఠంతో వ్యతిరేకించాయి. అమెరికాలో కలిసేది లేదని గ్రీన్లాండ్ స్పష్టం చేసింది.గ్రీన్లాండ్కు యూఎస్ విమానం!డెన్మార్క్‌తో నానాటికీ తీవ్రతరమవుతున్న ఉద్రిక్తతల నడుమ, గ్రీన్లాండ్లోని అమెరికా సైనిక స్థావరంలో యుద్ధ విమానాన్ని మోహరించాలని ట్రంప్ తాజాగా మరో వివాదాస్పద నిర్ణ యం తీసుకున్నారు. అక్కడి పిటుఫిక్ స్థావరంలో దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం ఈ చర్య చేపడుతున్నట్టు వైట్‌హౌస్ చెప్పుకొచ్చింది. -
అమెరికాకు నో కెనడాకే జై
సాక్షి, అమరావతి: విదేశీ విద్యలో భారతీయ విద్యార్థుల ఎంపిక మారుతోంది. దశాబ్దాలపాటు తొలి స్థానంలో నిలిచిన అగ్రరాజ్యం అమెరికాను కాదని పక్కనే ఉన్న కెనడాకు క్యూ కడుతున్నారు. ఫలితంగా విదేశీ విద్యా గమ్యస్థానాల్లో యూఎస్ రెండో స్థానానికి దిగజారిపోయింది. 2024–25 విద్యా సంవత్సరంలో కెనడా అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు ఆస్ట్రేలియాను అధిగమించి యునైటెడ్ కింగ్డమ్ (యూకే) మూడో స్థానానికి ఎగబాకింది.ప్రపంచీకరణ, నాణ్యమైన ఉన్నత విద్య కోసం భారతీయుల్లో ఆసక్తి పెరుగుతోంది. ఫలితంగా విదేశాల బాటపడుతున్న వారి సంఖ్య అధికం అవుతోంది. అయితే అమెరికాకు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్య 2016లో 4.24 లక్షలు ఉండగా... 2024 నాటికి 3.38 లక్షలకు పడిపోయింది. ఈ క్రమంలోనే భారత విద్యార్థుల దృష్టి అమెరికాను ఆనుకుని ఉన్న కెనడా వైపు మళ్లుతోంది. అతి తక్కువ కాలంలోనే ఇక్కడ విద్యార్థుల చేరికల్లో భారత్ ఏకంగా 350 శాతం వృద్ధిని కనబరిచింది. 2020లో 1.79 లక్షల నుంచి 2024కు 4.27 లక్షలకు దూసుకెళ్లింది. దీంతో కెనడా అగ్రస్థానంలో కొనసాగుతోంది.నాణ్యమైన విద్యకే ప్రాధాన్యం ప్రపంచంలోనే అతి పెద్ద అంతర్జాతీయ మార్కెట్ కలిగిన భారత్ అవుట్ బౌండ్ విద్యార్థుల్లో 2016–2024 మధ్య ఏకంగా 8.84 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు కావడం విశేషం. భారతీయ విద్యార్థులు వైద్యం, సాంకేతిక రంగాల్లో నాణ్యమైన విద్యను అందించే దేశాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ఫలితంగా భారతీయ విద్యార్థుల విదేశీ విద్య ఎంపికలో ఆస్ట్రేలియా నాలుగేళ్లు (2016–2020) మూడో స్థానంలో స్థిరంగా ఉంది. ఆ తర్వాత ఒడిదుడుకులకు లోనయ్యింది. అయితే 2024లో 1.22 లక్షల విద్యార్థుల స్వల్ప పెరుగుదల ఉన్నప్పటికీ నాలుగో స్థానానికి దిగజారింది.ఆస్ట్రేలియాను వెనక్కి నెడుతూ యూకే మూడో స్థానంలోకి వచ్చింది. ఈ దేశంలో 2016లో విద్యను అభ్యసించే భారతీయ విద్యార్థుల సంఖ్య 16,559 నుంచి 2020లో 90,300కి చేరుకోగా 2024 నాటికి ఏకంగా 1.85 లక్షలకు పెరిగింది. దీంతోపాటు యూఏఈ, మధ్య ఆసియా ప్రాంతమైన కిర్గిస్తాన్ కూడా భారతీయ విద్యార్థుల ఎంపిక జాబితాలో చేరాయి. రష్యా, జార్జియా, ఫిలిప్పీన్స్ 2020 నుంచి టాప్–10లో నిలుస్తున్నాయి. -
ఇండియా వీసా వచ్చిందోచ్.. పాకిస్తానీ ఆనందం
టొరంటో: పాకిస్తాన్ సంతతికి చెందిన ఓ కెనడా పౌరుడు సుదీర్ఘ నిరీక్షణ అనంతరం భారత వీసా పొందినందుకు ఆనందం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో ద్వారా వెల్లడించాడు.సోషల్ మీడియాలో తనను తాను ఫారెక్స్ ట్రేడర్‌గా పరిచయం చేసుకునే అభయ్కు ఒక నెల కాలపరిమితి కలిగిన సింగిల్ ఎంట్రీ భారత వీసా మంజూరైంది. ఈ సందర్భంగా అతడు వీసా దరఖాస్తు ప్రక్రియ ఎంత క్లిష్టంగా ఉందో వివరించాడు.“నేను కెనడా పౌరుడిని. ప్రస్తుతం పాకిస్తాన్లో నివసించడం లేదు. అయినప్పటికీ, పాకిస్తాన్ సంతతికి చెందిన వ్యక్తినన్న కారణంతో భారత వీసా ప్రక్రియ మరింత సంక్లిష్టంగా మారింది. దానికి గల కారణాలు నాకు పూర్తిగా తెలియవు” అని అభయ్ పేర్కొన్నారు.అయితే, ఎట్టకేలకు వీసా లభించడంతో సంతోషం వ్యక్తం చేసిన అతడు, భారత అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశాడు. తనకు లభించిన ఈ అవకాశం ఎంతో విలువైనదని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Abhay (@abhayy_s) -
కెనడాలో హత్య చేసొచ్చి.. పంజాబ్‌లో హల్చల్!
సంగ్రూర్: కెనడాలో పంజాబ్‌కు చెందిన యువతిని అత్యంత కిరాతకంగా హత్య చేసి, ఆపై గుట్టుగా భారత్‌కు చేరుకున్న నిందితుడిని సంగ్రూర్(పంజాబ్) పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీకి చెందిన మన్‌ప్రీత్ సింగ్.. గత ఏడాది అక్టోబర్ 20న కెనడాలో అమన్‌ప్రీత్ కౌర్ (27) అనే యువతిని హత్య చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘాతుకం తరువాత భారత్‌కు చేరుకున్న ఇతను, సంగ్రూర్‌లోని మృతురాలి కుటుంబాన్ని కలుసుకున్నాడు. కెనడాలో తనపై ఉన్న హత్య కేసును వెనక్కి తీసుకోవాలంటూ మృతురాలి కుటుంబ సభ్యులను తీవ్రంగా బెదిరిస్తూ వస్తున్నాడు.ఈ నేపధ్యంలో మృతురాలి తండ్రి ఇందర్జిత్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు తాజాగా మన్‌ప్రీత్ సింగ్‌ను అదుపులోనికి తీసుకున్నారు.ప్రేమ నిరాకరించిందని..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలు అమన్‌ప్రీత్ కౌర్ టొరంటోలోని ఈస్ట్ యార్క్‌లో నివసిస్తూ, ఓ ఆసుపత్రిలో పర్సనల్ సపోర్ట్ వర్కర్‌గా పనిచేసేది. నిందితుడు మన్‌ప్రీత్ అదే ప్రాంతంలో టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆమెతో పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. అందుకు ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్న మన్‌ప్రీత్, అక్టోబర్ 21న ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశాడు.నయాగరా సమీపంలో మృతదేహంఅమన్ప్రీత్ కౌర్ అదృశ్యమైనట్లు ఆమె సోదరి గురుసిమ్రాన్.. కెనడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి దర్యాప్తులో నయాగరా ఫాల్స్ సమీపంలో అమన్‌ప్రీత్ మృతదేహం కనిపించగా, దానిని స్వాధీనం చేసుకున్నారు. కాగా అప్పటికే నిందితుడు భారత్‌కు పారిపోయాడని అక్కడి అధికారులు నిర్ధారించారు. భారత్ చేరుకున్న మన్‌ప్రీత్.. వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ల ద్వారా మృతురాలి సోదరిని, ఆమె కుటుంబాన్ని కేసు వెనక్కి తీసుకోకపోతే చంపేస్తానని బెదిరించాడు.కేసు వెనక్కి తీసుకోకుంటే..అంతటితో ఆగని మన్ ప్రీత్ అక్టోబర్ చివరి వారంలో మరణాయుధంతో సంగ్రూర్‌లోని మృతురాలి ఇంటిలోనికి చొరబడి, కేసు వెనక్కి తీసుకోవాలని వారిని హెచ్చరించాడు. దీంతో భయపడిన బాధిత కుటుంబం ఇంటిలో సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంది. అయితే మన్‌ప్రీత్ గత నవంబర్ 30, జనవరి 10 తేదీల్లో అర్ధరాత్రి వేళ వారి ఇంటికి వెళ్లి, ఆ సిసిటీవీ కెమెరాలతో సెల్ఫీలు దిగి, వాటిని కుటుంబ సభ్యులకు పంపి, వారిని మరింత భయభ్రాంతులకు గురిచేశాడు.మార్ఫింగ్ ఫోటోలతో..మృతురాలి కుటుంబపు పరువు తీయాలనే ఉద్దేశంతో మన్‌ప్రీత్ నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతాను సృష్టించి, అమన్‌ప్రీత్ మార్ఫింగ్ ఫోటోలను అసభ్యకరమైన కామెంట్లతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆధారంగా, జనవరి 14న సంగ్రూర్ సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), ఐటీ చట్టం కింద నిందితునిపై కేసు నమోదు చేశారు. పలు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని జనవరి 15న అరెస్టు చేశామని, ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: పుడుతూనే మధుమేహం.. ‘కొత్త కారణం’తో కలవరం -
కెనడా, చైనా స్నేహగీతం
బీజింగ్: కెనడా క్రమంగా అమెరికాకు దూరమవుతూ చైనాకు దగ్గరవుతోంది. చైనా నుంచి దిగుమతయ్యే ఎలక్ట్రానిక్ వాహనాలపై టారిఫ్‌లను 100 శాతం తగ్గించనున్నట్టు కెనడా ప్రధాని మార్క్ కార్నీ శుక్రవారం ప్రకటించారు. కెనడా వ్యవసాయ ఉత్పత్తులపై చైనా ఇప్పటికే టారిఫ్‌లను 84 శాతం నుంచి 15 శాతానికి తగ్గించింది. ఇరుదేశాల నేతలు రెండు రోజుల క్రితం బీజింగ్‌లో సమావేశమయ్యారు. వాణిజ్య బంధం బలోపేతం చేసుకోవాలని నిర్ణయానికొచ్చారు. ఐదేళ్లలో చైనా నుంచి 70 వేలకు పైగా ఈవీలను దిగుమతి చేసుకుంటామని కార్నీ వెల్లడించారు. గత రెండు రోజులు చరిత్రాత్మక, ఫలవంతమైన దినాలు అంటూ వ్యాఖ్యానించారు. కెనడాతో సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్తామని చైనా అధినేత జీ జిన్‌పింగ్ స్పష్టంచేశారు. గత ఏడాది అక్టోబర్‌లో మార్క్ కార్నీతో సమావేశమయ్యాయని, చైనా–కెనడా సంబంధాల్లో అప్పుడే నూతన అధ్యాయం ప్రారంభమైందని స్పష్టంచేశారు. గత ఎనిమిదేళ్లలో చైనాలో పర్యటించిన తొలి కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ రికార్డుకెక్కారు. వాస్తవానికి కెనడా, చైనాల మధ్య టారిఫ్‌ల యుద్ధం నడిచింది. అమెరికాతో సంబంధాలు దెబ్బతిన్న తర్వాత కెనడా ప్రభుత్వం చైనా వైపు మొగ్గుచూపుతోంది. -
400 కేజీల బంగారం దోపిడీ నిందితుడిని అప్పగించండి: కెనడా విజ్ఞప్తి
కెనడా దేశ చరిత్రలోనే అతిపెద్ద బంగారు దోపిడీగా గుర్తింపు పొందిన కేసులో ప్రధాన నిందితుడైన సిమ్రాన్ ప్రీత్ పనేసర్‌ను తమకు అప్పగించాలని కెనడా అధికారులు అధికారికంగా భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ దోపిడీకి సంబంధించి దాదాపు 20 మిలియన్ డాలర్లకు పైగా విలువైన కార్గో మాయం అయింది.ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి, బ్రాంప్టన్‌కు చెందిన 33 ఏళ్ల సిమ్రాన్ ప్రీత్ పనేసర్ 2023 ఏప్రిల్‌లో టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన భారీ దోపిడీలో కీలక పాత్ర పోషించినట్లు కెనడా పోలీసులు ఆరోపిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి వచ్చిన అధిక విలువైన రవాణాను మళ్లించడంలో అతడు లోపలి వ్యక్తిగా సహకరించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.ఈ రవాణాలో సుమారు 400 కేజీల .9999 స్వచ్ఛమైన బంగారం అంటే దాదాపు 6,600 గోల్డ్ బార్లు (కడ్డీలు), అలాగే 2.5 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దోపిడీ అనంతరం పనేసర్ భారత్‌కు పారిపోయినట్లు కెనడా అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అతనిపై కెనడా వ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడమే కాకుండా, భారతదేశానికి అధికారిక అప్పగింత అభ్యర్థన పంపారు.‘ప్రాజెక్ట్ 24K’ అనే కోడ్ నేమ్‌తో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. 2023 ఏప్రిల్ 17న టొరంటో పియర్సన్ విమానాశ్రయంలోని ఎయిర్ కెనడా కార్గో ఫెసిలిటీలో ఈ దోపిడీ జరిగింది. ఒక నిందితుడు ఐదు టన్నుల డెలివరీ ట్రక్కులో వచ్చి గిడ్డంగి నుంచి రవాణాను తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. రవాణా తాత్కాలికంగా భద్రత కలిగిన హోల్డింగ్ ఏరియాలో ఉంచినప్పటికీ, మరుసటి రోజు అది కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.ఈ దోపిడీ అత్యంత పక్కా ప్రణాళికతో, లోపలి వ్యక్తులు, బయటి సహచరుల సహకారంతో జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పది మందిపై కేసులు నమోదు కాగా, 21 మిందికి పైగా క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే దొంగిలించిన బంగారం ఎక్కువ భాగం ఇంకా స్వాధీనం కాలేదు.పీల్ రీజినల్ పోలీస్ చీఫ్ నిషాన్ దురైయప్ప ఈ అప్పగింత అభ్యర్థన ప్రాధాన్యతను నొక్కి చెబుతూ.. “మీరు ఎక్కడ దాక్కున్నా, మేము మిమ్మల్ని కనుగొంటాం. సరిహద్దులను దాటిన సంక్లిష్ట నేరాలను ఎదుర్కొనే మా సామర్థ్యాన్ని ప్రాజెక్ట్ 24Kతో చూపిస్తాం” అన్నారు.పనేసర్‌పై 5,000 డాలర్లకు పైగా దొంగతనం, నేరానికి కుట్ర వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్ లైన్ ఉద్యోగిగా అతనికి ఉన్న అంతర్గత ప్రాప్యతే ఈ దోపిడీకి కీలకంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. న్యాయ సలహా తీసుకుని స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు అతనిని కోరుతూ, దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.ఇక ఈ అప్పగింత అభ్యర్థన భారత్–కెనడా న్యాయ సహకారాన్ని పరీక్షించనుంది. ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, భారతదేశ దేశీయ చట్టాల ప్రకారం ఈ అభ్యర్థనను భారత అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో కీలక పరిణామంగా, జనవరిలో దుబాయ్ నుంచి కెనడాకు వచ్చిన అనంతరం మరో 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పనేసర్ కోసం గాలింపు చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి. -
T20 World cup 2026: మరో విదేశీ జట్టుకు కెప్టెన్‌గా భారతీయుడు
ఇటీవలికాలంలో ఇతర దేశాల క్రికెట్ జట్లలో భారతీయ మూలాలున్న ఆటగాళ్ల ప్రాతినిథ్యం ఎక్కువైంది. దాదాపు అన్ని ఐసీసీ సభ్య దేశాలు, అసోసియేట్ దేశాల జట్లలో భారతీయులు ఉంటున్నారు. ఆస్ట్రేలియా లాంటి జట్లలో సైతం భారతీయులు అవకాశాల కోసం పోటీపడుతున్నారు.న్యూజిలాండ్, వెస్టిండీస్ జట్లలో చాలాకాలం నుంచే భారతీయులకు ప్రాతినిథ్యం లభిస్తూ వస్తుంది. కనీసం ఒక్క భారత మూలాలున్న ఆటగాడైనా ఈ జట్లలో ఉంటూ వస్తున్నాడు. ఇటీవలికాలంలో సౌతాఫ్రికాలో సైతం భారతీయులు అవకాశాలు దక్కించుకుంటున్నారు. నెదర్లాండ్స్, యూఎస్ఏ, ఒమన్, కెనడా దేశాల జట్లలో అయితే సగానికి పైగా భారతీయులే ఉంటున్నారు.తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. టీ20 ప్రపంచకప్-2026 కోసం ఎంపిక రెండు విదేశీ జట్లకు భారత మూలాలున్న ఆటగాళ్లు కెప్టెన్లుగా నియమితులయ్యారు. ఒమన్ జట్టు కెప్టెన్‌గా జతిందర్ సింగ్.. కెనడా జట్టు కెప్టెన్‌గా దిల్‌ప్రీత్ బజ్వా ఎంపికయ్యారు. వీరి జట్లలో భారతీయుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఒమన్ జట్టులో సగానికి పైగా భారత మూలాలున్న ఆటగాళ్లే కాగా.. తాజాగా ప్రకటించిన కెనడా జట్టులో సైతం అదే స్థాయిలో భారతీయులు ఉన్నారు. వీరే కాక ప్రపంచకప్ కోసం ఇప్పటివరకు ప్రకటించిన జట్లలో మరికొంత మంది భారతీయ మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. న్యూజిలాండ్ జట్టులో ఐష్ సోధి, రచిన్ రవీంద్ర, నెదర్లాండ్ జట్టులో ఆర్యన్ దత్, సౌతాఫ్రికా జట్టులో కేశవ్ మహారాజ్ లాంటి భారత మూలాలున్న ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు.ఓవరాల్‌గా చూస్తే.. టీ20 ప్రపంచకప్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారతీయ మూలాలున్న ఆటగాళ్లకు ప్రాతినిథ్యం లభిస్తుంది. ఈ మెగా టోర్నీ కోసం యూఎస్ఏ జట్టును ప్రకటించాల్సి ఉంది. ఈ జట్టుకు సైతం భారత మూలాలున్న మిలింద్ కుమార్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ జట్టులో సైతం చాలామంది భారతీయులు ఉన్నారు.ఇదిలా ఉంటే, భారత్, శ్రీలంక వేదికలుగా జరుగనున్న టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యుల కెనడా జట్టును ఇవాళ ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా దిల్‌ప్రీత్ బజ్వా ఎంపికయ్యాడు. ఈ జట్టులో చాలామంది భారత మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. మెగా టోర్నీలో కెనడా ప్రయాణం ఫిబ్రవరి 9న సౌతాఫ్రికా మ్యాచ్‌తో మొదలవుతుంది. ఈ టోర్నీలో కెనడా యూఏఈ, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్‌తో పాటు గ్రూప్-డిలో ఉంది. మెగా టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది.కెనడా టీ20 ప్రపంచ కప్ 2026 జట్టు: దిల్‌ప్రీత్ బజ్వా (C), అజయ్‌వీర్ హుందాల్, అన్ష్ పటేల్, దిలోన్ హేలిగర్, హర్ష్ ఠాకర్, జస్కరన్‌దీప్ బుట్టార్, కలీమ్ సనా, కన్వర్పాల్ తత్గూర్, నవనీత్ ధాలివాల్, నికోలస్ కిర్టన్, రవీందర్‌పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్, శివమ్ శర్మ, శ్రేయస్ మొవ్వ, యువరాజ్ సమ్రా -
కెనడా తీవ్ర ఆరోపణలు.. లారెన్స్ బిష్ణోయ్ వారి మనిషే..!
కెనడా-భారత్ మధ్యసంబంధాలు ప్రస్తుతం కొంత మెరుగుపడ్డాయి. ఇటీవలే ఇరుదేశాలు తమ రాయబారులను నియమించుకున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ భారత్ తరపునే కెనడాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.భారత్- కెనడా మధ్య ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఇంతకాలం రెండుదేశాల మధ్య సంబంధాలు మెరుగ్గాలేవు. ఆ దేశంలో ఖలిస్థాన్ అనుకూల వాదులు ఎక్కువగా ఉండడం వారు తరచుగా భారత్‌ని విమర్శించడం జరిగేది. అంతే కాకుండా 2023లో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చని అప్పటి ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించారు. దీంతో ఈ ప్రకటనను భారత్ పూర్తిగా ఖండించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. కాగా ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మెరుగుపడే దశలో ఉన్నాయి.ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది. కెనడా పోలీసుల నివేదికలో" లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా హింసాత్మక మైన క్రూర సంస్థ ఇది తన క్రిమినల్ చర్యలను కెనడాతో పాటు ఇతర దేశాల్లో విస్తరిస్తుంది. ఇది భారత ప్రభుత్వం తరపునే తన క్రిమినల్ చర్యలను కొనసాగిస్తుంది" అని నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ గ్యాంగ్ మాదకద్రవ్యాల రవాణా మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతుందని తెలిపారు. ఈ గ్యాంగ్ ప్రధాన ఉద్దేశం మత సంబంధిత కారణాలు కాదని దురాశ మాత్రమేనని పోలీసులు పేర్కొన్నారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెనడా ప్రభుత్వం ఇదివరకే ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. పంజాబ్‌కు చెందిన ఈ లారెన్స్ బిష్ణోయ్ పెద్ద గ్యాంగ్ స్టార్. ఇతని గ్యాంగ్ సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ప్రస్తుతం బిష్ణోయ్ సబర్మతీ జాతీయ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇతనిపై భారత్‌లో అనేక కేసులు నమోదయ్యాయి. -
ఈ పనిచేయండి.. ఉద్యోగాలే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయ్?!
వాషింగ్టన్: ఉద్యోగార్ధులకు ముఖ్య గమనిక!. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా?. వరుస పెట్టి రెజ్యూమేలు పంపిస్తున్నారా? అయినా ఇంటర్వ్యూ కాల్స్ రావడం లేదా?. అయితే, ఉద్యోగాల కోసం మీరు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఆపేయండి. జస్ట్ ఈ పనిచేయండి చాలు. కాళ్లరిగేలా ఆఫీసులు చుట్టూ తిరగక్కర్లేదు. రిఫరెన్స్ ఇవ్వమని ప్రాధేయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. మిమ్మల్నే వెతుక్కుంటూ ఉద్యోగాలు వస్తాయి. ఎలా అంటారా? కెనడాకు చెందిన మార్మిక్ పటేల్ అమెరికాలో ఐటీ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించాడు. తన ఎడ్యుకేషన్,స్కిల్స్,ఎక్స్పీరియన్స్ ఆధారంగా అందరిలాగే తాను రెజ్యూమేలు తయారు చేసి పంపించేవాడు. పదులు,ఇరవైల నుంచి వందల కొద్దీ రెజ్యూమేలు పంపిస్తున్నాడు. ఉద్యోగం కావాలని వేల మంది రిక్రూటర్లకు మెసేజ్‌లు పెడుతున్నారు. రిక్రూటర్ల నుంచి ఎలాంటి స్పందన వచ్చేది కాదు. ఇక లాభం లేదని రూటు మార్చాడు. అంతే.. ఐదు నెలల్లో 83 మంది రిక్రూటర్లు మా కంపెనీలు ఉద్యోగం ఉందని ఆఫర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇంతకీ మార్మిక్ పటేల్ చేసిందేంటో తెలుసా? పబ్లిసిటీ.అవును ఆయన గురించి ఆయన గొప్పగా చెప్పుకోవడం. ఇలా చెప్పుకోవడం చేతగాకపోతే ఉద్యోగం చేయడం, బిజినెస్ చేయాలనే ప్రయత్నాలు పక్కన పెట్టాలని సలహా ఇస్తున్నాడు. మీరు ఎంత చదివితేం. మీకంటూ ఓ స్కిల్ ఉందని అందరికి తెలియాలి కదా. అప్పుడే మనమేంటో ఈ ప్రపంచానికి తెలిసేది. చాలా మంది అనుకోవచ్చు. నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటే ఏం బాగుంటుందని. అలా చెప్పుకోవాలి బ్రదర్. మార్కెట్లో అవకాశాలు సమానంగా పంచరు. 90 శాతం మందిలో 10శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు దక్కుతున్నాయి.ఇప్పుడు వారిలో నేనున్నందుకు సంతోషంగా ఉంది. ఇంతకీ నేను చేసిన పని ఏంటని అనుకుంటున్నారా? సంప్రదాయ పద్ధతిలో ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం అత్యంత మూర్ఖమైన పని. అందుకే ఉద్యోగాలకు అప్లయి చేసే స్ట్రాటజీ మార్చాను. నా డొమైన్‌కు సంబంధించిన స్కిల్‌ను బిల్డ్ చేశాను. కంటెంట్ క్రియేట్ చేయడం, నెట్వర్కింగ్ పెంచుకుంటూ వెళ్లా. ఫలితంగా ఊహించని విధంగా నా కెరియర్ మలుపు తిరిగింది.నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ఏఐ కంపెనీలు,వైకాంబినేటర్ స్టార్టప్స్,యూనికార్న్ కంపెనీలు ముందుకు వచ్చాయి. ప్రస్తుతం మెటా కంపెనీలో టెక్కీగా విధులు నిర్వహిస్తున్నాడు. జాబ్ కోసం ప్రయత్నించే సమయంలో ఇలాంటి వ్యూహాలు అమలు చేస్తే ఉద్యోగం పక్కగా వస్తుందని చెప్పుకొచ్చాడు. చివరిగా.. విజేతల్నే ప్రపంచం గుర్తుంచుకుంటుంది. విజయం సాధించడం, విజేతలుగా నిలవడం తప్ప మనకు వేరే మార్గం లేదని ముగించాడు. applying to jobs is the dumbest shit you can ever do.i learned the hard way. dmed a 1000 recruiters/engineers. did 670 apps. didn't get me anything. cause its not equally distributed: the top 10% of people take 90% of the jobs. it's the same everywhere else. the hottest… https://t.co/gEpcaViXS1— Marmik Patel (@Marmik_Patel19) January 12, 2026 -
ఇక సెలవు.. గెలిచిన ప్రైజ్‌మనీ రూ. 187 కోట్లు
మాంట్రియల్: కెనడా టెన్నిస్ ప్లేయర్ మిలోస్ రావ్‌నిచ్ ఆటకు వీడ్కోలు పలికాడు. 35 ఏళ్ల రావ్‌నిచ్ 2016లో కెరీర్ బెస్ట్ మూడో ర్యాంక్‌ను అందుకున్నాడు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో చివరిసారి టెన్నిస్ మ్యాచ్ ఆడిన రావ్‌నిచ్ ఆ తర్వాత బరిలోకి దిగలేదు. 2008లో ప్రొఫెషనల్‌గా మారిన రావ్‌నిచ్ తన కెరీర్లో మొత్తం 8 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్‌ను సాధించాడు. ‘సమయం వచ్చేసింది. నేను టెన్నిస్ నుంచి రిటైర్ అవుతున్నాను. ఏ క్రీడాకారుడైనా ఈ పరిస్థితిని ఎదుర్కొంటాడు. నా జీవితంలో చాలా ఏళ్లు టెన్నిస్ అంతర్భాంగా ఉంది. ఈ ఆట నాకెంతో ఇచ్చింది’ అని రావ్‌నిచ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఫెడరర్‌ను ఓడించి2016లో రావ్‌నిచ్ కెరీర్ అత్యుత్తమ దశలో నిలిచాడు. ఆ ఏడాది వింబుల్డన్ సెమీఫైనల్లో స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్‌ను ఓడించి రావ్‌నిచ్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. అయితే ఫైనల్లో ఆండీ ముర్రే (బ్రిటన్) చేతిలో ఓడిపోయి ఈ కెనడా స్టార్ రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నాడు. అదే ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో, సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ ఫైనల్స్‌లో సెమీఫైనల్ చేరిన అతను ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. కెరీర్లో సాధించిన మొత్తం ప్రైజ్‌మనీ - 2,07,64,512డాలర్లు (రూ. 187 కోట్లు).రావ్‌నిచ్ సాధించిన కెరీర్ బెస్ట్ ర్యాంక్-3.ప్రొఫెషనల్ కెరీర్లో రావ్‌నిచ్ గెలిచిన మ్యాచ్‌లు- 383కెరీర్లో సాధించిన ఏటీపీ సింగిల్స్ టైటిల్స్- 8 -
అర్ధరాత్రి, వణికించే చలిలో క్యాబ్‌లోనే ప్రసవం
టొరంటో: అర్ధరాత్రి. ఎముకలు కొరికే చలి. ఏకంగా మైనస్ 23 డిగ్రీల అతి శీతల వాతావరణం. వెనక సీట్లో నిండు గర్భిణి ప్రసవ వేదన. టైర్లకు అస్సలు పట్టు దొరక్క రోడ్డుపై నుంచి పక్కలకు జారిపోతున్న కారు. ఇంకోవైపు నొప్పులు భరించలేక సీటును తంతూ, కేకలు పెడుతూ ఆమె పడుతున్న వేదన. పక్కనే కూచుని బిక్కచచ్చిపోయి చూస్తున్న భర్త. ఆ అరుపుల్ని ఉంటూ, ఆమె బాధను వ్యూ మిర్రర్ లోంచి చూస్తూ, అత్యంత ప్రతికూలమైన ఆ పరిస్థితుల్లో తనను తక్షణం ఆస్పత్రికి చేర్చాల్సిన బాధ్యత. కెనడాలో (Canada) భారత సంతతికి చెందిన హర్ దీప్ సింగ్ తూర్ అనే క్యాబ్ డ్రైవర్ తన వృత్తి జీవితంలోనే ఎదుర్కొన్న అతి పెద్ద సవాలు ఇది. దీనికి తోడు ప్రతి జంక్షన్ లోనూ రెడ్ సిగ్నల్స్. అయినా అన్నింటికీ తట్టుకుంటూ పళ్ల బిగువున దూసుకెళ్లారాయన. అయితే ఆస్పత్రి కనుచూపు మేరలో ఉండగానే కారు వెనక సీటులోనే ప్రసవించిందా మహిళ. అనంతరం కొన్ని క్షణాల్లోనే తల్లీబిడ్డా ఇద్దరినీ భద్రంగా ఆస్పత్రికి చేరవేసి ఊపిరి పీల్చుకున్నారు హర్ దీప్. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన గత శనివారం టొరంటోలో జరిగింది. ఆ అనుభవాన్ని ఆయన స్థానిక మీడియాతో పంచుకున్నారు. ‘ఇక ఇంటిముఖం పడదామని అనుకుంటుండగా ఓ బుకింగ్ వచ్చింది. అర్జంటుగా ఆస్పత్రికి వెళ్లాలని చెప్పారు. తీరా పికప్‌కు వెళ్లాక నిండు గర్భిణిని ఆమె సహచరుడు అతి కష్టమ్మీద తీసుకొచ్చి వెనక సీట్లో పడుకోబెట్టాడు. కార్లో ప్రయాణం ఆమెకు సేఫ్ కాదనిపించింది. అంబులెన్స్ పిలుద్దామా అని ఆలోచించా. కానీ అర్ధరాత్రి, అంత చలిలో అది రావడానికి సమయం పడుతుంది. అంత ఆలస్యం చేస్తే ప్రమాదమని తెగించి బయల్దేరా. ఆ అరగంట డ్రైవ్ నా జీవితంలోనే అతి సుదీర్ఘమైనదిగా తోచింది. ఎలాగైతేనేం, చివరికి తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉండటం ఎంతో సంతోషాన్నిచ్చింది‘ అంటూ చెప్పుకొచ్చారు. ఇద్దరిని ఎక్కించుకుని ముగ్గురిని దించిన ఘనత తనకే దక్కిందంటూ నవ్వులు పూయించారు.చదవండి: ఇండియా అబ్బాయి.. జపాన్ అమ్మాయి! -
ఎయిరిండియా పైలట్ నిర్వాకం, ఆందోళనలో ప్రయాణికులు
విమాన ప్రమాదాలు, ఇండిగో సంక్షోభంతో విమానాలు రద్దు లాంటి అనేక ఇబ్బందులతో విమాన ప్రయాణ మంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సి పరిస్థితి ప్రయాణికులది. తాజాగా జరిగిన మరో సంఘటన విమాన ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. కెనడాలోని వాంకోవర్ విమానాశ్రయంలో ఎయరిండియా పైలట్ బుక్ అయ్యాడు. స్టోరీ ఏమిటీ అంటే...టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం, ఫెస్టివ్ మూడ్‌లో ఉన్న పైలట్ మద్యం సేవించి వాంకోవర్నుంచి ఢిల్లీకి బయలు దేరిన బోయింగ్ 777-AI 186 విమానంలో విధులకు సిద్ధ పడ్డాడు. విమానంలో పైలట్ భద్రతా ప్రోటోకాల్ పరీక్షల్లో పట్టుబడ్డాడు. ఆల్కహాల్ వాసన వస్తున్నట్లు గమనించిన సిబ్బంది ఈ విషయాన్ని కెనడియన్ అధికారులకు నివేదించారు. వారు తక్షణమే పైలట్‌ను బ్రీత్ అనలైజర్ పరీక్షలో పట్టుబడ్డాడు. దీంతో అతని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విమానాన్ని రెండు గంటల పాటు నిలిపి వేశారు. విషయం తెలిసి ప్రయాణీకులు ఆందోళన పడ్డారు. 2025 డిసెంబరు 23న సంఘటన చోటు చేసుకుంది. పైలట్ వ్యవహారం బయటపడటంతో ఎయిరిండియా ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. నలుగురు పైలట్లు రెండు షిఫ్ట్లతో నడిచే ఈ అల్ట్రా-లాంగ్-హాల్ విమానం స్థానిక సమయం సాయంత్రం 5 గంటలకు బయలు దేరింది. షెడ్యూల్ కంటే దాదాపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరి, వియన్నాలో కొత్త సిబ్బందితో ఢిల్లీకి బయలుదేరింది. దీనిపై ఎయిరిండియా తీవ్రంగా స్పందించింది. పైలట్‌ను ఢిల్లీకి తరలించి, దర్యాప్తు చేపట్టింది. జీరో-టాలరెన్స్ తమ విధానమని, నిబంధనల ఉల్లంఘనను సహించబోమని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణీలకు కలిగిన అసౌకర్యానికి విచారం వ్యక్తం చేసింది. అలాగే ఈ విషయాన్ని ఎయిర్‌లైన్ రెగ్యులేటరీ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA)కి నివేదించింది.మరోవైపు పైలట్ విమానాశ్రయంలో అనుకోకుండా మద్యం తాగాడని కొందరు చెప్పగా, మరికొందరు బాటిల్ కొన్న సందర్భంగా మద్యం వాసన వచ్చిందని చెబుతున్నారు. -
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్‌కు కొత్త కార్యవర్గం ఎన్నిక
కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల ప్రత్యేక సంస్థ తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF - CANADA) రానున్న రెండేళ్ల కోసం కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకుంది. జితేందర్ రెడ్డి గార్లపాటి అధ్యక్షుడిగా, వెంకట్ రెడ్డి పోలు ప్రధాన కార్యదర్శిగా పనిచేయనున్నారు. 2026-27 రెండేళ్ల పాటు ఈ కొత్త కార్యవర్గం పనిచేయనుంది.కొత్త కార్యవర్గంలో ఫౌండేషన్ కమిటీ చైర్ పర్సన్‌గా అమిత పినికేశి, ఉపాధ్యక్షుడిగా మహేందర్ కీస్రా, సంయుక్త కార్యదర్శిగా అనికేత్ రెడ్డి శామీర్ పేట, ట్రెజరర్‌గా కృష్ణా రెడ్డి చాడ, జాయింట్ ట్రెజరర్‌గా రవీందర్ రెడ్డి కొండం, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్‌గా అర్షద్ ఘోరి, కమిటీ చైర్మన్లుగా బిజినెస్ కౌన్సిల్ చైర్ పర్సన్‌గా ఇందు రెడ్డి, స్పోర్ట్స్ క్లబ్ చైర్మన్‌గా కె. మహేందర్ రెడ్డి ఎన్నికయ్యారు.కెనడాలో స్థిరపడిన తెలంగాణ వాసుల కోసం 2005లో టీడీఎఫ్ కెనడా సంస్థ ఏర్పాటైంది. తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు రాష్ట్రం ఏర్పటయ్యాక కూడా ఈ సంస్థ క్రియాశీలకంగా పనిచేస్తోంది. ప్రతీ ఏటా తెలంగాణ నైట్‌ను నిర్వహిస్తూ అక్కడి తెలుగువారిని ఏకం చేసే ప్రయత్నం చేస్తోంది. తంగేడు అనే అనుబంధ సాంస్కృతిక సంస్థ ద్వారా బతుకమ్మ పండగతో పాటు వివిధ కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. కెనడాలో స్థిరపడిన వందలాది మంది తెలుగువారు తమ కుటుంబాలతో ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం ద్వారా తమ పిల్లలకు తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. అవసరమైన అన్ని సమయాల్లో సమాజ సేవ కార్యక్రమాలను కూడా విసృతంగా ఈ సంస్థ నిర్వహిస్తోంది. టీడీఎఫ్ కెనడా ఆధ్వర్యంలో ఏర్పాటైన క్రికెట్ క్లబ్లో వందలాది మంది తెలుగు విద్యార్థులు భాగస్వామ్యులుగా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి విద్య కోసం వెళ్లిన విద్యార్థులకు కూడా ఈ సంస్థ తగిన సహాయం అందిస్తోంది.(చదవండి: విజయవంతంగా 'TTA సేవా డేస్–2025' వేడుకలు) -
భారత సంతతి వ్యక్తి మృతి.. ఎలాన్ మస్క్ రియాక్షన్ ఇదే
ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగా భారత్ సంతతికి చెందిన ఓ వ్యక్తి.. కెనడాలో మరణించడంపై టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తీవ్రస్థాయిలో స్పందించారు. కెనడా ప్రభుత్వంపై తన ఎక్స్‌లో విమర్శలు గుప్పించారు. భారత సంతతికి చెందిన ప్రశాంత్ కుమార్(44) కెనడాలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, ఈ నెల 22వ తేదీన ప్రశాంత్ కుమార్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో ఎడ్మంటన్‌లోని గ్రే నన్స్ కమ్యూనిటీ ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు.మధ్యాహ్నం 12.20 గంటల నుంచి రాత్రి 8.50 గంటల వరకు చికిత్స అందించకుండా వెయింట్ చేయించారు. ఛాతీనొప్పి ఎక్కువగా ఉందని ఆస్పత్రి సిబ్బందిని బతిమాలినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బీపీ 210కి పెరిగినా కూడా ఆయకు టైలెనాల్ మాత్రమే ఇచ్చారు. వెయిటింగ్ హాల్లో 8 గంటలు ఉంచిన తర్వాత చికిత్స ప్రారంభించారు. కొన్ని నిమిషాల్లోనే ప్రశాంత్ కుమార్ కుప్పకూలి మృతిచెందారు.కెనడా ప్రభుత్వం నిర్లక్ష్యంపై ఎలాన్ మాస్క్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వం వైద్య సేవలు అందిస్తే, అది DMV(డిపార్ట్మెంట్ ఆఫ్ మోటార్ వెహికల్స్) లాగే ఉంటుందంటూ వ్యాఖ్యానించారు. కెనడా ఆరోగ్య వ్యవస్థను US మోటారు వాహన విభాగంతో పోల్చుతూ మస్క్ విరుచుకుపడ్డారు. ఈ ఘటనపై భారత ప్రభుత్వం కూడా స్పందించింది. కెనడా ప్రభుత్వానికి లేఖ రాసింది. అతడి మృతికి కెనడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని భారత విదేశాంగ శాఖ పేర్కొంది. When the government does medical care, it is about as good as the DMV https://t.co/kRdlL3idyF— Elon Musk (@elonmusk) December 26, 2025 -
భారత్-కెనడా మధ్య చిగురిస్తున్న వాణిజ్య బంధం
భారత్-కెనడా దేశాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న దౌత్యపరమైన స్తబ్ధత వీడనుంది. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగవ్వనున్నాయి. ఈ దేశాల మధ్య అత్యంత కీలకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లేదా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ పార్టనర్షిప్ అగ్రిమెంట్-CEPA) పునరుద్ధరణకు రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అధికారికంగా చర్చలు ప్రారంభం కానున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం.కీలక పర్యటనలు - సన్నాహక చర్చలుకేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరిలో కెనడాలో పర్యటించే అవకాశం ఉంది. ఈ పర్యటనలో భాగంగా చర్చలకు పచ్చజెండా ఊపనున్నారు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య అనధికారికంగా సన్నాహక చర్చలు జరుగుతున్నాయి. ఆస్ట్రేలియా, యూకే వంటి దేశాలతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందాల తరహాలోనే కెనడా కూడా పరస్పర రాయితీలతో కూడిన ఒక బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకోవాలని రంగం సిద్ధం చేస్తోంది.మార్క్ కార్నీ రాకతో మారిన సమీకరణాలు2023 సెప్టెంబర్‌లో హర్దీప్ సింగ్ నిజ్జర్ మరణం విషయంలో జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన సంగతి తెలిసిందే. అయితే, 2025 మార్చిలో మార్క్ కార్నీ కెనడా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. ఇటీవల జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన భేటీ ఈ ఒప్పందానికి పునాది వేసింది.50 బిలియన్ డాలర్ల వాణిజ్యం లక్ష్యంఅమెరికాలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విదేశీ ఉత్పత్తులపై (భారతీయ వస్తువులపై 50% వరకు) భారీ టారిఫ్‌లు విధిస్తున్న నేపథ్యంలో భారత్-కెనడా ఒప్పందం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 2030 నాటికి ఈ ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 50 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. కెనడా ప్రభుత్వం ఇప్పటికే డిసెంబర్ 13, 2025 నుంచి జనవరి 27, 2026 వరకు ఈ ఒప్పందంపై ప్రజాభిప్రాయాలను సేకరిస్తోంది.రాజకీయ ఉద్రిక్తతలను పక్కన పెట్టి ఆర్థిక ప్రయోజనాలే పరమావధిగా భారత్, కెనడాలు ముందుకు సాగుతున్నాయి. ఫిబ్రవరిలో పీయూష్ గోయల్ పర్యటనతో ఈ ఒప్పందం పట్టాలెక్కితే అది రెండు దేశాల వ్యవసాయం, ఐటీ, తయారీ రంగాల్లోని ఎగుమతిదారులకు ఊరటనిస్తుంది.ఇదీ చదవండి: రేషన్ బియ్యం.. ‘ఉచితం’ వెనుక దాగి ఉన్న నిజం -
అమ్మ కెనడియన్, నాన్న ఇటలీ..పెరిగింది ఇండియాలో..!
కొన్ని కథలు చాల గమ్మత్తుగా, ఆశ్చర్యంగా ఉంటాయి. ఎక్కడో పుట్టి, ఎక్కడ పెరిగి..విభిన్న మనుషులను కలుస్తుంటాం. అది కెరీర్, లేదా ఉద్యోగం వల్ల అయినా. కానీ కొందరు విదేశీయలును పెళ్లాడి..మళ్లీ వాళ్ల పిల్లల్ను మరో దేశంలో పెంచిన కొన్ని స్టోరీలు వింటుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. అలాంటి సరదా స్టోరీనే షేర్ చేసింది ఓ విదేశీయురాలు. ఇది ఆమె కథనే. కానీ రెండు వేర్వురు దేశాలకు చెందని పేరెంట్స్‌కి పుట్టిన ఆమె చిరుప్రాయంలో మన భరత గడ్డపై అడుగుపెట్టిన కథ ఆద్యంతం మనసుకు హత్తకునేలా అందంగా ఉంది. బాలికి చెందిన సంగీతకారిణి బియాంక నీడు తన బాల్యమంతా భారత్‌లోనే సాగిందంటూ తన స్టోరీని షేర్ చేసుకుంది. ఆ పోస్ట్‌లో నీడు ఇలా రాసుకొచ్చారు. కెనడియన్ తల్లి, ఇటాలియన్ తండ్రికి జన్మిచిన ఆమె మూడు నెలల వయసుకుకే భారత్‌కి వచ్చినట్లు పేర్కొంది. 16వ ప్రాయం వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత లండన్, బాలికి వెళ్లినట్లు తెలిపింది. తన తల్లిదండ్రులు క్యాథీ నీడు, రాబర్టో నీడు భారత్‌లోని కలుసుకున్నారని, ఇక్కడే ప్రేమలో పడ్డారని చెప్పుకొచ్చింది.చివరికి ఇక్కడే ఒక ఇల్లు కొనుక్కుని స్థిరనివాసం ఉన్నారని చెప్పుకొచ్చింది. తన చైల్డ్‌హుడ్ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ..తన బాల్యంలో అజిల్ భవన్లో జరుపుకున్న హోలిపండుగ గురించి చెప్పుకొచ్చింది. ప్రతి ఏడాది అక్కడకు వెళ్లి హోలీ ఆడటం బాగా నచ్చేదని, అక్కడే పార్టీలు కూడా చేసుకునేవాళ్లమని తెలిపింది. అంతేగాదు ఈ పోస్ట్‌కి తాను తల్లిదండ్రులతో భారత్‌లో గడిపిన కొన్ని బాల్య జ్ఞాపకాలకు సంబంధించిన వీడియోని కూడా జత చేసి మరి పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ని చూసి చాలామంది నెటిజన్లు అద్భుతం, మీరు చాలా గ్రేట్ మీకు చాలా భాషలు వచ్చి ఉండొచ్చే అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.జీవితమే మారిపోయింది.. కాగా, బియాంకా నీడు తాను భారత్‌లో పెరగడం వల్ల తన లైఫ్ అద్భుతంగా మారిందని కూడా పేర్కొంది. భారత్‌లోని సంభాషణలు కారణంగా అప్యాయత, ఉదారతలు నేర్చుకున్నా, అలాగే ఆతిథ్యం అంటే ఏంటో తెలసుకున్నానని అంటోంది. అంతేగాదు అందరితో కలుపుగోలుగా ఉండాలో తెలిసింది. జీవితం అంటే మనం ఒక్కరమే కాదని, అందరితో కలిసి ఉండటం అని తెలిసింది అంటోంది. చివరగా పోస్ట్‌లో తాను ఇక్కడ పెరగడం వల్లే ప్రపంచంలో ఎలా జీవించాలో, ఇంటిని ఎలా చక్కదిద్దుకోవాలో తెలుసుకున్నా అని సంతోషంగా చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవ్వడమే కాదు, నెటిజన్ల హృదయాలను కొల్లగొట్టింది కూడా. View this post on Instagram A post shared by Bianca Nieddu (@biancanieddu) (చదవండి: పిల్లలు విలువలు నేర్చుకోవాలంటే భారత్ బెస్ట్..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్) -
కెనడాలో భారతీయ విద్యార్థి హత్య
-
కెనడాలో కాల్పులు.. భారతీయ విద్యార్థి మృతి
కెనడా టోరంటోలో మరో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో భారత్ విద్యార్థి ఒకరు మరణించారు. ఈ ఘటనపై భారత కాన్సులేట్ తాజాగా ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబానికి సాయం అందిస్తామని ప్రకటించింది. అయితే ఇది జాత్యంహకార హత్య.. మరేదైనా కారణమా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.శివాంక అవస్థీ(20) స్థానిక యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో క్యాంపస్ స్టూడెంట్. అయితే క్యాంపస్ ఆవరణలో మంగళవారం కాల్పలు జరిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరకునేలోపే నిందితులు పారిపోయారు. సంఘటన హైలాండ్ క్రీక్ ట్రైల్-ఓల్డ్ కింగ్స్టన్ రోడ్ ప్రాంతంలో జరిగిందని.. బుల్లెట్ గాయాలతో శివాంక అక్కడికక్కడే మృతి చెందాడని స్థానిక అధికారులు తెలిపారు. కాల్పులకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు జరుపుతున్నట్లు వెల్లడించారు. టోరంటోలో ఈ ఏడాది జరిగిన 41వ హత్య ఇది. ఈ ఘటనపై యూనివర్సిటీ ఆఫ్ టొరంటో స్కార్బరో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైఫ్ సైన్సెస్ మూడో ఏడాది చదువుతున్న శివాంక్ అవస్థీని పట్టపగలే కాల్చి చంపారని.. ఇది దర్మార్గమని ఒక ప్రకటన విడుదల చేశారు. క్యాంపస్‌లో భద్రతా లోపాలపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో నిత్యం విద్యార్థుల సంచారం ఉంటుందని.. ఇకనైనా భద్రత కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు. శివాంక్ అవస్థీ యూనివర్సిటీ చెర్లీడింగ్ టీమ్ సభ్యుడు కూడా. ఆయన మరణంపై జట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో నివాళి అర్పించింది. View this post on Instagram A post shared by UTSC Cheer (@utsccheerleading)భారత కాన్సులేట్ జనరల్ (టొరంటో) ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, అవస్థీ కుటుంబానికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది. అయితే ఈ కుర్రాడి నేపథ్యం.. ఇతర వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.టోరంటోలో తాజాగా హిమాంశి ఖురానా(30) అనే భారతీయ యువతి దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో అబ్దుల్ ఘఫూరి అనే వ్యక్తిని పోలీసులు వెతుకుతున్నారు. అయితే ఇది ‘‘ఇంటిమేట్ పార్టనర్ వైలెన్స్’’ కేసు అని అధికారులు పేర్కొన్నారు. అటు హిమాంశి కుటుంబానికి కూడా భారత కాన్సులేట్ సహాయం అందిస్తోంది. టొరంటోలో వరుస హింసాత్మక ఘటనలు భారతీయ కమ్యూనిటీలో ఆందోళనకు గురి చేస్తున్నాయి.ఇదీ చదవండి: భారతీయులకు ఆ దేశాల్లో భద్రతే లేదా?.. -
కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి భారతీయుని బలి
వాంకోవర్: ప్రశాంత్ శ్రీకుమార్ అనే 44 ఏళ్ల భారత సంతతి వ్యక్తి కెనడాలో ఆస్పత్రి నిర్లక్ష్యానికి బలైపోయాడు. ఛాతీలో భరించలేనంత నొప్పి అని మొత్తుకుంటున్నా అతనికి వైద్యమే అందించలేదు. ఈసీజీలో అంతా నార్మల్ గానే వచ్చిందని చెప్పి ఎమర్జెన్సీ గదిలో ఏకంగా 8 గంటల పాటు వేచిఉండేలా చేశారు. ఎట్టకేలకు చికిత్స కోసం తీసుకెళ్తుండగానే అతను తీవ్ర గుండెపోటుకు గురయ్యాడు. కూర్చున్న కుర్చీలోనే ఛాతీ పట్టుకుంటూ ఎగిరెగిరి పడి చివరికి నిస్సహాయంగా మరణించాడు. ‘‘నాన్నా!. ఈ నొప్పి భరించలేకపోతున్నా’ అంటూ చివరి క్షణాల్లో తన కొడుకు అల్లాడిపోయాడని తండ్రి కుమార్ రోదిస్తూ చెప్పారు. అవే తన చివరి మాటలు అయ్యాయంటూ కన్నీరు మున్నీరయ్యారు. డిసెంబర్ 22వ తేదీన జరిగిన ఈ దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. కెనడాలోని ఎడ్మాంటన్‌లో ఉండే ప్రశాంత్ తన ఆఫీసులో పని చేస్తున్న సమయంలోనే విపరీతమైన ఛాతీ నొప్పితో అలసిపోయాడు. దాంతో సహోద్యోగి ఒకరు అతడిని వెంటనే గ్రే నన్స్ కమ్యూనిటీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చాలాసేపు వెయిటింగ్ రూమ్‌లో కూచోబెట్టాక ఈసీజీ చేశారు. అందులో అంతా నార్మల్‌గానే ఉందంటూ నొప్పికి ‘టైలీనల్’ అనే మందు ఇచ్చి సరిపెట్టారు. అంతలో ఆస్పత్రికి చేరిన నాన్నతో నొప్పి భరించరానిదిగా ఉందంటూ ప్రశాంత్ వాపోయాడు. ‘తన రక్తపోటు(బీపీ) క్షణక్షణానికి పెరుగుతూనే పోయింది. కానీ ఎంత చెప్పినా నర్సులు పట్టించుకోలేదు’’ అని తండ్రి ఆక్షేపించారు. ‘‘ఎట్టకేలకు తనను చికిత్సకు తీసుకెళ్లేందుకు వచ్చారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. ప్రశాంత్ నావైపు చూస్తూనే కూర్చున్న కుర్చీలో కుప్పకూలాడు’’ అని చెప్పుకొచ్చారు. ఈ ఘటన పట్ల ఆస్పత్రి దిగ్భ్రాంతి వెలిబుచ్చింది. దీనిపై సమీక్ష జరుపుతున్నట్టు తెలిపింది. ప్రశాంత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ప్రశాంత్‌కు భార్య, ముగ్గురు పిల్లలున్నారు. -
కెనడాలో సాక్షి టీవీ గ్రాండ్ లాంచ్
తెలుగు వారి మనస్సాక్షి… సాక్షి టీవీ కెనడాలో గ్రాండ్‌గా లాంచ్ అయింది. సరిహద్దులు దాటి భారతీయ పరిమళాలను ప్రపంచమంతా వెదజల్లుతూ…కెనడాలో మొట్టమొదటిసారిగా ఓ నూతన ఆధ్యాయానికి శ్రీకారం చుడుతూ సాక్షి టీవీ కెనడా ప్రారంభమైంది. టొరంటో, మిస్సిసాగాలోని హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. భారత జాతీయగీతంతో కార్యక్రమం ప్రారంభమై ప్రవాసుల హృదయాల్లో దేశభక్తి స్ఫూర్తిని నింపింది. ఈ కార్యక్రమంలో సాక్షి టీవీ కెనడా హెడ్ కె.కె. రెడ్డి, సాక్షి టీవీ స్టాఫ్, బిజినెస్ ఓనర్స్, కమ్యూనిటీ లీడర్స్, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రదర్శించిన సాక్షి టీవీ కెనడా ప్రత్యేక AVను ప్రవాసులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. అనంతరం సాక్షి టీవీ కెనడాకు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.నార్త్ అమెరికా వ్యాప్తంగా విస్తరిస్తూ, అమెరికాలో నెంబర్ వన్ నెట్‌వర్క్‌గా ఎదిగిన సాక్షి టీవీ, ఇప్పుడు కెనడాలో కూడా సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించిందని కె.కె. రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సాక్షిటీవీ కెనడా ద్వారా అందించబోయే ప్రత్యేక కార్యక్రమాలను నిశ్చల్ వివరించారు.సాక్షి టీవీ నార్త్ అమెరికా చీఫ్ కరస్పాండెంట్ సింహా జూమ్ ద్వారా టొరంటోలో సాక్షి టీవీ కెనడా లాంచింగ్‌పై హర్షం వ్యక్తం చేశారు. కెనడాలోని తెలుగు ప్రజల గుండె చప్పుడును ప్రపంచానికి వినిపించబోయే గొప్ప అడుగు అని కొనియాడారు. మార్కెటింగ్ మేనేజర్ వెన్నెల రెడ్డి జూమ్ ద్వారా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి రీనా హోస్ట్ గా వ్యవహరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రవాసులు తమ సూచనలు, సలహాలు అందించారు. సాక్షి టీవీ కెనడా లాంఛ్ ఈవెంట్‌ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కె.కె.రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సాక్షి టీవీ కెనడాను ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రవాసులు : వరాహసూరి అప్పారావు, ప్రవీణ్ నీలా,రాజ్ సజ్జా, విశ్వ శ్రీనివాసన్, వేణుగోపాల్ రోకండ్ల, ప్రదీప్ కుమార్ కనమర్లపూడి, మహమ్మద్ సిద్ధిఖీ, సుధాకర్ రెడ్డి సింగన, ర్యాన్ సెక్వేరా, రాజేష్ ప్రసాద్, రంజిత్ పింగిలేటి, భావన పగిదేల, మురళీధర్ పగిదేల, రుక్మిణి మద్దులూరి, మధుసూధన్ కొట్టురి, యశ్వంత్ వుమ్మనేని, సూర్య కొండేటి, ప్రసన్న తిరుచిరాపల్లి, విజయ్, లక్ష్మి రాయవరపు, శ్రీనివాసులు, నూర్ అహ్మద్,విజయ్ చేగిరెడ్డి,కౌశిక్ నారాల, శ్రీని ఇజ్జాడ, సౌజన్య కసుల, ప్రతాప్ బి, విద్యా సాహితి, శైలేష్ పాలెం, అల్లంపాటి కృష్ణా రెడ్డి, విజయ్ సేతుమాదవన్, షాలిని బెక్కం, యశ్వంత్ రెడ్డి నిమ్మకాయల, గుణశేఖర్ కోనపల్లి, శ్రీనివాసులు రెడ్డి మరిక్కగారి నరసింహారెడ్డి గుత్తిరెడ్డి , చెన్న కేశవరెడ్డి కుమ్మెత, వెంకట కృష్ణా రెడ్డి గోపిరెడ్డి ,అస్లాం బేగ్, శశివర్ధన్ పట్లోళ్ల, విష్ణు వంగల , సుబ్బారావు నాయక్ బాణావతు, కళ్యాణ్ జి, కాయం పురుషోత్తం రెడ్డి, వి వి ఎన్ మూర్తి, రామ్, రమేష్ తుంపెర ,భరత్ కుమార్ సత్తి, శ్రీకాంత్ బి, నరేన్ తాడి, స్వాతి మిరియాల, పావని పులివర్తి , రవి కాసుల, సౌజన్య కాసుల, రామ్ చిమట, సుధీర్ కుమార్ సూరు, శ్రీనివాస్ కస్తూరి, వలియుద్దీన్ , లక్ష్మీ రాయవరపు, రవీందర్, వెంకట్ రామ్ రెడ్డి పలిచెర్ల, గౌతమ్ కొల్లూరి, పృధ్వీ, మహేశ్వర కనాల, నాగ వెంకట చిరంజీవి చాడ, క్రాంతి ఆర్, జగపతి రాయల, నిశ్చల్ వి, అనంత్ కందసామి, నాగార్జున, కోటేశ్వర్ రావు, వేణుగోపాల్, మణిదీప్, పలువురు పాల్గొన్నారు -
కెనడా కీలక నిర్ణయం : ఆ వీసాల నిలిపివేత, ప్రభావం ఎంత?
కెనడా కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలోవ్యాపారం చేయాలనుకునేవారికి భారీ షాక్ ఇచ్చింది. తన స్టార్ట్-అప్ వీసా(SUV) కార్యక్రమాన్ని నిలిపివేసింది. వలస వ్యవస్థాపకుల కోసం కొత్త పైలట్ విధానాన్ని సిద్ధం చేస్తున్నందున తన వ్యాపార వలస వ్యవస్థలోని కొన్ని భాగాలను నిలిపివేస్తున్నట్టు కెనడా ప్రకటించింది.స్టార్ట్-అప్ వీసా దరఖాస్తుదారులకు అందుబాటులో ఉన్న ఐచ్ఛిక వర్క్ పర్మిట్ కోసం దరఖాస్తులను ఇకపై అంగీకరించబోమని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా (IRCC) ప్రకటించింది. అయితే ఇప్పటికే కెనడాలో ఉన్న తమ ప్రస్తుత పొడిగించాలని కోరుకునే దరఖాస్తుదారులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని వెల్లడించింది. ఈ నెల 31 రాత్రి 11.59 గంటలకు కొత్త స్టార్ట్-అప్ వీసా దరఖాస్తులను అంగీకరించడం నిలిపివేస్తామని కూడా డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది.మరోవైపు దేశంలో వ్యాపారాలు ప్రారంభించే విదేశీయుల కోసం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. 2026లో పైలట్ ప్రాజెక్టు ద్వారా శాశ్వత నివాసానికి కొత్త పథకాన్ని ఐఆర్సీసీ ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పైలట్ వివరాలు 2026లో ప్రకటించబడతాయని భావిస్తున్నారు.తమ దేశంలో ఆవిష్కరణ, పోటీతత్వం , ఉద్యోగ సృష్టిని పెంచడానికి ఈ ప్రోగ్రామ్ ఉత్తమ వ్యవస్థాపకులను ఎంపిక చేస్తుందని నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.వారికి మినహాయింపు 2025లో జారీ చేయబడిన నియమించబడిన సంస్థ నుండి ఇప్పటికే ఎస్యూవీ వర్క్ పర్మిట్ అనుమతి ఉన్నప్పటికీ. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు తమ దరఖాస్తుదారులు సమర్పించుకోవచ్చు. వీరు జూన్ 30, 2026లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. భారతీయులపై ప్రభావంఇప్పటికే కెనడాను విడిచిపెడుతున్నామని, ప్రేమతో నిర్మించుకున్న అందమైన కలల గూడును వీడుతున్నామని వ్యాపార వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే చాలా దేశాలు స్టార్టప్‌లకు , వ్యాపారాలకు ఒకే విండోను అందిస్తుండగా కెనడాలో అనేక సవాళ్లు ఎదుర్కొన్నామన్నారు. కంపెనీ భవిష్యత్తుతోపాటు పిల్లలు విద్య కూడా ప్రభావితమవుంది వందలాదిమంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. కంపెనీల నిర్మాణానికి, ఆదాయాన్ని ఆర్జించడానికి, తమ కుటుంబాల శాశ్వత నివాసం కోసం కెనడాకు వెళ్లిన పలువురు ఇబ్బందుల్లో పడ్డారని భావిస్తున్నారు. ఇదీ చదవండి: పదేళ్ల డేటింగ్ : ఎట్టకేలకు పెళ్లితో ఒక్కటైన లవ్‌బర్డ్స్ -
కెనడా: ఇద్దరు భారతీయులపై కాల్పులు
మాన్సా (పంజాబ్): కెనడాలోని ఎడ్మంటన్‌లో జరిగిన కాల్పుల ఘటన పంజాబ్‌లోని మాన్సా జిల్లా పరిధిలో గల రెండు గ్రామాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో బార్రే గ్రామానికి చెందిన గురుదీప్ సింగ్ (27), ఉద్దత్ సైదేవాలాకు చెందిన రణ్వీర్ సింగ్ (19) గుర్తు తెలియని దుండగుల కాల్పులకు బలయ్యారు. ఉన్నత కెరీర్ ఆశయాలతో విదేశాలకు వెళ్లిన తమ పిల్లలు హత్యకు గురికావడంతో మృతుల కుటుంబాలు తల్లడిల్లిపోతున్నాయి.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ హత్యలు తప్పుడు గుర్తింపు కారణంగా జరిగి ఉండవచ్చు. మరో పంజాబీ యువకుని కారులోకి ఎక్కిన గురుదీప్, రణ్‌వీర్‌లపై దుండగులు కాల్పులు జరిపారు. 19 ఏళ్ల రణ్వీర్ గత మార్చిలో కెనడాకు వెళ్లాడు. అమెరికాలో అకౌంటెన్సీ వృత్తిలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. ఉద్యోగ కౌన్సెలింగ్ సెషన్‌కు హాజరైన తర్వాత ఎడ్మంటన్‌లో తన స్నేహితుడి పుట్టిన రోజు పార్టీలో పాల్గొనేందుకు వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుడి మరో ఫ్రెండ్‌కు చెందిన కారులో డ్రైవర్ సీటులో కూర్చున్న సమయంలో అతనిపై కాల్పులు జరిగాయి. రణ్వీర్ మామ మన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ ఈ ఘటనతో కుటుంబం షాక్‌లో ఉందని, కెనడియన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన మరో యువకుడు గురుదీప్ 2023లో కెనడాకు వెళ్లాడు. ట్రక్ మెకానిక్స్‌లో కోర్సు పూర్తి చేసి, ఉద్యోగ వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. త్వరలో తన భార్య అమన్‌దీప్ కౌర్‌ను ఇక్కడికి తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నాడు. గురుదీప్ మామ దర్శన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం కారు యజమాని వెనుక సీట్లలో కూర్చోగా, రణ్వీర్, గురుదీప్ ముందు సీట్లలో కూర్చున్నారు. దీంతో దుండగులు తమ టార్గెట్‌కు భిన్నంగా గురుదీప్, రణ్‌వీర్‌లపై కాల్పులు జరిపివుంటారని దర్శన్ సింగ్ అన్నారు. కాగా బాధిత కుటుంబ సభ్యులు తమ వారి మృతికి గల నిజమైన కారణం కోసం, నేరానికి సంబంధించిన వివరాల కోసం ఎదురుచూస్తున్నాయి. ఇది కూడా చదవండి: లిబియాలో భారత జంట కిడ్నాప్: రూ. రెండు కోట్లు డిమాండ్ -
న్యూయార్క్ మహిళపై ఆరోపణలు
న్యూయార్క్: కెనడా సరిహద్దుల మీదుగా అమెరికాలోకి భారత్ నుంచి దొంగచాటుగా తరలించేందుకు ప్రయతి్నస్తున్నదంటూ న్యూయార్క్‌కు చెందిన మహిళపై అధికారులు కేసు నమోదు చేశారు. పిట్స్బర్గ్కు చెందిన స్టేసీ టేలర్(42)కు అంతర్జాతీయ దొంగరవాణా ముఠాతో సంబంధాలున్నట్లు అక్టోబర్‌లో అధికారులు ఆరోపణలు చేశారు. ఈ వారంలో అల్బనీలోని ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ ఎదుట ఆమె హాజరు కావాల్సి ఉంది. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కెనడాలోని క్విబెక్, అమెరికాలోని చురుబుస్కో సమీపంలో ఈ ఏడాది జనవరిలో అమెరికా బోర్డర్ పెట్రోల్ అధికారులు స్టేసీ టేలర్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ సమయంలో ఆ వాహనంలో నలుగురు విదేశీయులు ఉన్నట్లు గుర్తించామని బోర్డర్ పెట్రోల్ విభాగం ఆరోపించింది. నలుగురిలో ముగ్గురు భారత జాతీయులుగా కాగా, ఒకరు కెనడా వాసి అని వీరిని కెనడా నుంచి అమెరికాలోకి దొంగచాటుగా తీసుకువచ్చారని పేర్కొంది. స్టేసీ టేలర్ సెల్‌ఫోన్‌ను క్షుణ్నంగా పరిశీలించగా అందులో..అంతకుముందు కూడా ఆమె ఇలా పలుమార్లు అక్రమ రవాణాకు పాల్పడినట్లు తెలిపే టెక్ట్స్ మెసేజీలున్నాయని వివరించింది. ఇతరులతో కలిపి ఆమె స్మగ్లింగ్ రాకెట్ నడుపుతున్నారని అధికారులు ఆరోపించారు. ఈ ఆరోపణలు రుజువైతే స్టేసీకి కనీసం ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. -
నా వల్ల కాదు బ్రో..ఎన్ని కష్టాలున్నా ఇల్లు ఇల్లే, వచ్చేస్తున్నా!
మంచి ఉద్యోగం, మెరుగైన జీతం, సౌకర్యవంతమైన జీవితం, కెరీర్లో అవకాశాలు వీటికోసం కలలు కంటూ చాలామంది భారతీయులు విమానాల్లో విదేశాలకు ఎగిరిపోతున్నారు. కానీ కనిపెంచిన తల్లిదండ్రులను కన్నతల్లి లాంటి ఊరినీ, వదిలి ఉండటం అంత సులువు కాదు. దేశం కాని దేశం, మన భాషకాదు..మన తిండి కాదు, మన జాన్ జిగిరీ దోస్తులు ఆసలే లేని చోట ఉండటం చాలా వేదనతో కూడుకున్నదే. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా అన్నట్టు ఒక పక్క ఒంటరితనం, మరోపక్క ఇంటి బెంగతో ఒక్కోసారి ఊపి రాడదు. ఇదీ నాన్-రెసిడెంట్ ఇండియన్ (NRI) అనుభవించే మానసిక బాధ అందుకే ఒక ఎన్ఆర్ఐ ఏం చేశాడో తెలుసా?కష్టపడి ఐదేళ్ల పాటు కెనడాలో జీవితాన్ని గడిపేసిన ఎన్ఆర్ఐ ఇక నావల్ల కాదు బాబోయ్ అంటూ ఇండియాకు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. స్వదేశానికి తిరిగి రావాలన్న తన నిర్ణయంపై సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీంతో నెటిజన్లు అతనిపై ప్రశంసలు కురిపించారు. అయిదేళ్లు కెనడాలో ఉన్నాను.విదేశాలలో జీవితం రోబోటిక్‌గా అనిపించింది. అందుకే ఇక భరించ లేను. ఇక్కడ స్నేహితులు ఉన్నప్పటికీ, కానీ సామాజిక ఒంటరితనం బాధిస్తోంది. దాన్ని వర్ణించడం చాలా కష్టం అని పేర్కొన్న రెడ్డిట్ పోస్ట్ వైరలవుతోంది.చదవండి: అందంగా ఉన్నారని నలుగుర్ని..చివరికి కన్నకొడుకుని కూడాకెనడాలో మితిమీరిన క్రమశిక్షణ భరించడం కష్టంగా ఉంది. ప్రతీదీ పద్ధతిగా సిస్టమ్యాటిగ్గా జరగాలి. కనీసం బియ్యం కొనడానికి దుకాణానికి వెళ్లాలన్నా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. స్వేచ్ఛను మిస్ అవుతున్నా అనిపిస్తోందన్నాడు. భారతదేశంలో వ్యవస్థీకృత గందరగోళం ఉంది. దానిని మిస్ అవుతున్నా. కానీ ఇండియాలో గడపబోయే జీవితంపై చాలా ఆసక్తిగా ఉన్నాను. ఇండియాలో మురికి, కనీస పౌర జ్ఞానం లేకపోవడం లాంటి లోపాలు ఉన్నాయి. ఏది ఏమైనా ఇది మన ఇల్లు. అందుకే ఇండియాకు తిగిరి వచ్చేస్తున్నానని పేర్కొన్నాడు.నెటిజన్లు అతని నిర్ణయాన్ని ప్రశంసించారు. మనసుకు నచ్చినట్టు జీవించాలి భయ్యా అని కొందరు, ప్రతి దేశానికి దాని సమస్యలు ఉంటాయి. ఏ దేశానికైనా దాని లాభనష్టాలు దానికి ఉంటాయి. ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఫైనల్‌గా ఎక్కడ సంతోషంగా ఉంటామో, అక్కడ ఉండటమే సరైంది అని మరికొందరు ఎంతైనా మన ఇల్లు ఇల్లే కదా భాయ్.. అనే కమెంట్లు వెల్లువెత్తాయి.ఇదీ చదవండి : ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య -
భారత్ 14–3 కెనడా
ఇపో (మలేసియా): టోర్నీ ఆసాంతం సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన భారత పురుషుల హాకీ జట్టు... సుల్తాన్ అజ్లాన్ షా కప్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు 14–3 గోల్స్ తేడాతో కెనడాపై విజయం సాధించింది. జుగ్రాజ్ సింగ్ నాలుగు గోల్స్‌తో జట్టు భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. మరో మ్యాచ్‌లో బెల్జియం 5–1 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌పై విజయం సాధించింది. ఆదివారం బెల్జియంతో భారత్ ఫైనల్లో తలపడనుంది. చివరి పోరులో భారత జట్టు అదరగొట్టింది. జుగ్రాజ్ సింగ్ (12వ, 26వ, 39వ, 50వ నిమిషాల్లో) నాలుగు గోల్స్‌తో విజృంభించగా... రాజిందర్ (10వ, 24వ నిమిషాల్లో), అమిత్ రొహిదాస్ (15వ, 46వ నిమిషాల్లో), అభిషేక్ (57వ, 59వ నిమిషాల్లో) డబుల్ గోల్స్‌తో ఆకట్టుకున్నారు. నీలకంఠ శర్మ (4వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (25వ నిమిషంలో), సెల్వం కార్తీ (43వ నిమిషంలో), సంజయ్ (56వ నిమిషంలో) తలా ఒక గోల్ చేశారు. కెనడా తరఫున బ్రెండన్ గురాలిక్ (11వ నిమిషంలో), మాథ్యూ సార్మెంటో (35వ నిమిషంలో), సిద్ధు (55వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ ఆరంభమైన నాలుగో నిమిషంలోనే నీలకంఠ శర్మ గోల్ కొట్టడంతో భారత జట్టు ఆధిక్యంలో నిలిచింది. మంచి ఆరంభం దక్కించుకున్న భారత జట్టు అదే జోరు కొనసాగిస్తూ... తొలి క్వార్టర్ ముగిసే సరికి మరో రెండు గోల్స్ బాదింది. అదే సమయంలో కెనడా జట్టు కూడా బోణీ కొట్టడంతో తొలి క్వార్టర్ ముగిసేసరికి భారత్ 3–1తో ముందంజలో నిలిచింది. సీనియర్లకు విశ్రాంతినిచ్చి యువ ఆటగాళ్లతో బరిలోకి దిగిన టీమిండియా... రెండో క్వార్టర్లోనూ జోరు కొనసాగించింది. రాజిందర్, జుగ్రాజ్, దిల్‌ప్రీత్ గోల్స్ చేయడంతో రెండో క్వార్టర్ ముగిసే సరికి భారత్ 7–1తో ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. మూడో క్వార్టర్లో కెనడా తరఫున ఒక గోల్ నమోదు కాగా... భారత్ తరఫున జుగ్రాజ్ మూడో గోల్ సెల్వం కార్తి ఒక గోల్ చేశారు. ఇక చివరి క్వార్టర్లో గోల్స్ వర్షం కురిసింది. భారత జట్టు ఐదు గోల్స్‌తో విరుచుకుపడగా... కెనడా ప్లేయర్ ఒక గోల్ చేశాడు. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లాడిన భారత్ 4 విజయాలు, ఒక పరాజయంతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంలో నిలిచి ఫైనల్ చేరగా... బెల్జియం ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింట గెలిచి మరొకటి ‘డ్రా’ చేసుకొని 13 పాయింట్లతో పట్టిక అగ్రస్థానంలో నిలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. -
FIFA WC 2026: రొనాల్డోకు గుడ్‌న్యూస్
జెనీవా: పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) వచ్చే ఏడాది జరగనున్న ‘ఫిఫా’ ప్రపంచకప్ (FIFA World Cup) ఆరంభ మ్యాచ్‌లో బరిలోకి దిగడంపై సందిగ్ధత వీడింది. ఇటీవల ఐర్లాండ్‌తో మ్యాచ్ సందర్భంగా రొనాల్డోకు ‘రెడ్ కార్డు’ దక్కింది. దీంతో అతడిపై మూడు మ్యాచ్‌ల నిషేధం పడింది. అయితే ఈ మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల నిషేధాన్ని ఏడాది తర్వాత అమలు చేయవచ్చని ‘ఫిఫా’ వెసులుబాటు కల్పించింది. దీంతో ఈ నెల 16న అర్మేనియాతో జరిగిన మ్యాచ్‌కు దూరమైన రొనాల్డో... వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్‌కప్ ఆరంభం నుంచి అందుబాటులో ఉండనున్నాడు.కాగా 2026 జూన్ 11 నుంచి అమెరికా, కెనడా, మెక్సికో వేదికగా ‘ఫిఫా’ ప్రపంచకప్ జరగనుండగా... దానికి ముందు పోర్చుగల్ జట్టు రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. ఫుట్‌బాట్ ప్రపంచ కప్ 2026కు అర్హత సాధించిన జట్లు ఇవే అల్జీరియా, కేప్ వెర్డే, ఈజిప్ట్ , ఘనా, ఐవరీ కోస్ట్, మొరాకో, సెనెగల్, దక్షిణాఫ్రికా, ట్యునీషియా, ఆస్ట్రేలియా, ఇరాన్, జపాన్, జోర్డాన్, ఖతార్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఉజ్బెకిస్తాన్. -
సహజకవి అందెశ్రీకి మరణం లేదు
సహజ కవిత్వం, మాటపాటలతో తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసిన అందెశ్రీకి మరణం లేదని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ (TDF) కెనడా అభిప్రాయపడింది. టొరెంటోలో స్థిరపడిన తెలంగాణ వాసులు అందెశ్రీ సంస్మరణ సభను నిర్వహించారు. స్థానిక తెలంగాణ వాసులు పెద్ద సంఖ్యలో హాజరై అందెశ్రీకి నివాళులు అర్పించారు.ఉద్యమానికి ముందూ, తర్వాత కూడా తెలంగాణ ఆత్మలా అందెశ్రీ (Ande Sri) నిలిచారని కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ భావజాల వ్యాప్తిలో ఆయన చేసిన సేవలు అనిర్వచనీయం అన్నారు. వివిధ దేశాల్లో స్థిరపడిన తెలంగాణ వాసులను కలుసుకొని తన మాట, పాటలతో జనాన్ని జాగృతం చేశారని అన్నారు. 2014లో కెనడాలో పర్యటించిన ఆయన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. అందెశ్రీ కుటుంబాన్ని ఆదుకోవటంతోపాటు, ఆయన ఇంటి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని కెనడా ఎన్.ఆర్.ఐలు (Canada NRIs) కోరారు. అలాగే అందెశ్రీ రచనలు, కవితలు, పాటలు డిజిటలైజేషన్ చేసి భవిష్యత్ తరాలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, జనరల్ సెక్రటరీ వెంకట్ రెడ్డి పోలు, సురేందర్ పెద్ది, శ్రీకాంత్ నెరవెట్ల, కృష్ణారెడ్డి చాడ, రవీందర్, అమిత పినకేసి, సుమన్ ముప్పిడి, మహేందర్ రెడ్డి, రవీందర్ కొండం, అర్షద్, ఇతర టీడీఎఫ్ సభ్యులు పాల్గొన్నారు.చదవండి: 17 ఏళ్ల తర్వాత ఇండియాకు ఎన్నారై జంట -
లేటు వయసులో వెయిట్ లాస్ జర్నీ..! గుర్తుపట్టలేనంత స్లిమ్‌గా బామ్మ..
బరువు తగ్గడం అనే ప్రక్రియ కాస్త యంగ్ ఏజ్‌లోనే ప్రారంభిస్తాం. అది వాళ్ల ఆహార్యం, హెల్త్ సమస్యల రీత్యా ఇంకాస్త మందు లేదా 40 నుంచి 50,60ల వయసులో మొదలు పెడతారు. అంతకుమించి మరీ లేటు వయసులో..అది కూడా విశ్రాంతి తీసుకునే వయసులో ఎవ్వరూ మొదలుపెట్టే సాహసం చేయరు. కానీ ఈ బామ్మ అలా కాదు. ఏడు పదలు వయసులో బరువు తగ్గాలనుకోవడమే కాదు, ఆ వయసులో కష్టతరమైన కసరత్తులు చేసి గుర్తుపట్టలేనంత నాజూకుగా మారిపోయింది. పైగా ఫిట్నెస్ టిప్స్ చెప్పేస్తోంది.కెనడాలోని ఒంటారియాకు చెందిన 79 ఏళ్ల జోన్ మెక్‌డొనాల్డ్ అసాధారణమైన సాహాసానికి పూనుకుని బరువు తగ్గాలనే ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలిచారామె. వయసు కేవలం నెంబరేనని ప్రూవ్చేసింది. అంతేగాదు 70 ఏళ్ల వయసులో జిమ్‌లో వర్కౌట్లు చేసి ఔరా అనిపించుకుంది. దాదాపు ఎనిమిదేళ్లుగా అధిక బరువుతో ఉండేదాన్ని అని ఇన్‌స్టా వేదికగా తన వెయిట్ లాస్ స్టోరీ షేర్ చేసుకుందామె. తాను ప్రతి భోజనంలో ప్రోటీన్ ఉండేలా కేర్ తీసుకున్నట్లు తెలిపింది. బరువు తగ్గడం అనేది ఎప్పుడూ కష్టతరమైన ప్రక్రియ కాదు. కూరగాయలు, ఫైబర్‌పై ఫోకస్ పెడుతూ..కండరాలను బలోపేతం చేసేలా వ్యాయామాలు చేస్తే చాలంటోంది ఈ బామ్మ జోన్. ముఖ్యంగా గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా ఎలాంటి వర్కౌట్లు చేస్తే బెటర్ అనేది తెలుసుకున్నానని వివరించింది. అందుకోసం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలిపింది. వార్మప్ నుంచి మొదలుపెట్టి..వేగవంతంగా చేసే వ్యాయామాలు దాదాపు 60 నుంచి 70 నిమిషాలు కొనసాగేవని చెప్పుకొచ్చింది. అంతేగాదు ప్రతి నెల తనలో వస్తున్న పరివర్తనను గమనించానని, అదీగాక తాను మరింత బలంగా ఫిట్‌గా ఉన్నట్లు అనిపించిందని వెల్లడించింది. ఇక వర్కౌట్ల పరంగా బామ్మ వారానికి రెండు లెగ్ సెషన్లు, రెండు అప్పర్ బాడీ, ఒక గ్లూట్-ఫోకస్డ్ సెషన్ తప్పనిసరిగా చేసేదాన్ని అని అంటోదంది ఈ బామ్మ. ఏ వయసులో వెయిట్‌లాస్ ప్రక్రియ ప్రారంభించినా..డెడికేషన్ మస్ట్ అప్పుడే సత్ఫలితాలు పొందగలరని చెప్పకనే చెప్పింది కదూ ఈ బామ్మ జోన్. View this post on Instagram A post shared by Joan MacDonald (@trainwithjoan) (చదవండి: పెళ్లి వేడుకలో కిరణ్ మజుందార్ షా, సుధామూర్తిల స్టెప్పులు..!) -
‘పరాయి ప్రతిభ’ కోసం పోటాపోటీ!
వలస కార్మికులకు మళ్లీ డిమాండ్ పెరుగుతోంది. విదేశీ ప్రతిభను ఆకర్షించడానికి దేశాల మధ్య పోటీ విస్తృతమవుతోంది. వలస కార్మికుల కోసం కెనడా భారీ ప్రణాళికను ప్రకటించగా.. విదేశీ ప్రతిభను వద్దనుకున్న అమెరికా సైతం మనసు మార్చుకుని మళ్లీ కావాలంటోంది.ఆవిష్కరణలపరంగా తమ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు కెనడా కీలక చర్యలు తీసుకుంది. 1,000 మందికి పైగా అగ్రశ్రేణి అంతర్జాతీయ పరిశోధకులు ముఖ్యంగా హెచ్ -1బి వీసా హోల్డర్లను లను ఆకర్షించే లక్ష్యంతో 1.7 బిలియన్ కెనడియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించింది. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ తన మొదటి ఫెడరల్ బడ్జెట్లోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.నైపుణ్యం కలిగిన నిపుణులు, ముఖ్యంగా నిర్బంధ యూఎస్ వీసా విధానాల వల్ల ప్రభావితమైన వారి కోసం ఫాస్ట్-ట్రాక్ ఇమ్మిగ్రేషన్ మార్గాన్ని కెనడా ప్రవేశపెడుతోంది. టెక్నాలజీ, హెల్త్ కేర్, నిర్మాణం వంటి అధిక-డిమాండ్ రంగాలను లక్ష్యంగా ఈ వ్యూహాత్మక ప్రణాళికను కెనాడా ప్రభుత్వం తీసుకొచ్చింది. విదేశీ ప్రతిభకు గుర్తింపునిచ్చేలా, వారు కెనడియన్ శ్రామిక శక్తిలో ఏకీకృతం అయ్యేలా వ్యవస్థల రూపకల్పనకు నిధులు వెచ్చిస్తోంది.అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలను కఠినతరం చేయడం, ముఖ్యంగా అధ్యక్షుడు ట్రంప్ హెచ్ -1బి వీసా రుసుములను పెంచేయడంతో విదేశీ ప్రతిభకు కలిగిన ఇబ్బందికర పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కెనడా ప్రణాళిక రచించింది. ఫాస్ట్-ట్రాక్ మార్గంతో పాటు, అగ్రశ్రేణి పరిశోధకులు, ఆవిష్కర్తలను నియమించుకోవడానికి బడ్జెట్ నిధులను కేటాయిస్తోంది.ఇది సైన్స్ అండ్ టెక్నాలజీకి గ్లోబల్ హబ్‌గా ఎదగాలన్న కెనడా ఆకాంక్షను తెలియజేస్తోంది. పరిశ్రమ నాయకులు ఈ ప్రణాళికను స్వాగతించారు. ఇది క్లిష్టమైన కార్మిక అంతరాలను భర్తీ చేయడానికి, ఏఐ, బయోటెక్, క్లీన్ ఎనర్జీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాలలో కెనడా పోటీతత్వాన్ని పెంచడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు.మనసు మార్చుకున్న అమెరికా!వలస కార్మికుల విషయంలో అమెరికా మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన కొన్నిరోజులకే వలస కార్మికులపై విరుచుకుపడిన అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ (US President Trump).. హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును లక్ష డాలర్లు (రూ.88లక్షలు)కు పెంచి అమెరికాలో స్థిరపడాలనుకొనే ఉద్యోగస్థుల ఆశలపై నీళ్లు చల్లారు. వీసాల విషయంలో కఠిన నిబంధనలను తెరపైకి తెచ్చారు.అయితే, తాజాగా ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్యూలో మాత్రం వలస కార్మికులపై ట్రంప్ సానుకూలంగా మాట్లాడారు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌తోపాటు, రక్షణ రంగంలో నైపుణ్యం కలిగిన వలస కార్మికులను నియమించుకోవాలన్నారు. ఆ రంగాలలో అమెరికన్లకు నైపుణ్యత లేదని అంగీకరించారు. -
డేవిడ్ సలాయ్కు బుకర్ ప్రైజ్
లండన్: హంగేరీ నుంచి బ్రిటన్‌కు వలసవచ్చిన ఓ సాధారణ వ్యక్తి జీవితంలోని సుఖదుఃఖాలు, విషాధాల కలబోతగా రూపుదిద్దుకున్న ఊహాత్మక ‘ఫ్లెష్’ నవల రచించిన హంగేరీ–బ్రిటన్ రచయిత డేవిడ్ సలాయ్కు 2025 బుకర్ ప్రైజ్ వరించింది. 51 ఏళ్ల సలాయ్కు సోమవారం లండన్‌లోని ప్రఖ్యాత ఓల్డ్ బిల్డింగ్స్గేట్ వేదికపై బుకర్ అవార్డ్‌ను గత ఏడాది విజేత సమంతా హార్వే ప్రదానం చేశారు. అవార్డ్‌తో పాటు 50,000 పౌండ్ల నగదు పురస్కారం సలాయ్కు అందజేశారు. ఫేవరెట్లుగా నిలిచిన తొలి ఐదుగురు పోటీదారులను వెనక్కినెట్టి సలాయ్ ఈ అవార్డ్‌ను గెల్చుకోవడం విశేషం. భారతీయ రచయిత కిరణ్ దేశాయ్ సైతం గట్టిపోటీనిచ్చినా ఆద్యంతం అద్భుతంగా సాగే ఫ్లెష్ రచనకు ప్రాణంపోసిన సలాయ్కు అవార్డ్ దక్కింది.ఒకవేళ కిరణ్ దేశాయ్ ఈ అవార్డ్‌ను గెల్చుకుని ఉంటే 56 ఏళ్ల అవార్డ్ చరిత్రలో దీనిని రెండుసార్లు గెల్చుకున్న తొలి రచయితగా ఈమె రికార్డ్ నెలకొల్పేది. ది ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్ రచనకు దేశాయ్‌కు 2006లో బుకర్ ప్రైజ్ దక్కింది. ‘ఫ్లెష్’ నవల మొత్తం హంగేరీకి చెందిన ఇస్ట్వాన్ అనే వలసదారుని చుట్టూ తిరుగుతుంది. ఇస్ట్వాన్ టీనేజీలో పక్కింటి వివాహితతో సాన్నిహిత్యం మొదలు సైన్యంలో చేరి ఇరాక్ యుద్దంలో పాల్గొనడం, తర్వాత దిక్కులేక లండన్‌కు శరణారి్థగా వెళ్లడం దాకా ఎన్నెన్నో అంశాలను ఎంతో వాస్తవిక కోణంలో రచయిత సలాయ్ రాసుకొచ్చారు.బ్రిటన్‌లో ప్రైవేట్ సెక్యూరిటీ నిపుణుడికి బౌన్సర్‌గా, డ్రైవర్‌గా పనిచేయడం ఈ క్రమంలో సంపన్న క్లయింట్‌తో వివాహం తర్వాత లండన్ ధనిక సమాజంలో పరపతి, పలుకుబడితో విలాసవంత జీవనం గడపడం దాకా ఇస్ట్వాన్ జీవిత ఘట్టాలను రచయిత ఏకబిగిన చదివేలా చేశారు. మానసిక సంఘర్షణలతో ఇస్ట్వాన్ చివరకు ఏకాకిగా మారి సాధారణ జీవితం గడుపుతాడు. ఈ నవల పేజీల పేరాల మధ్య రచయిత కొంత ఖాళీ స్థలాన్ని వదిలేశారు.పాఠకుడు సైతం నవలలో పూర్తిగా లీనమై ఇస్ట్వాన్ వ్యక్తిత్వాన్ని తనదైన శైలిలో రాసుకునేందుకు ఈ స్థలాన్ని వదిలేశారు. ఈ ఏడాది 153 నవలలు పోటీపడగా సలాయ్ రచన అవార్డ్‌ను ఎగరేసుకుపోయింది. రచయిత సలాయ్ కెనడాలో పుట్టారు. తర్వాత బ్రిటన్‌లో పెరిగారు. తాజాగా వియన్నాలో స్థిరపడ్డారు. ఈయన గతంలో రచించిన ‘ఆల్ దట్ మ్యాన్ ఈజ్’ నవల 2016లో తుదిజాబితాకు ఎంపికైనా అవార్డ్‌ను గెలవలేకపోయింది. -
భారత్ వైపు.. స్టార్టప్స్ చూపు...
న్యూఢిల్లీ: దేశీయంగా భారీ మార్కెట్, వేగవంతమైన ఆర్థిక వృద్ధి తదితర అంశాల కారణంగా పలు అంతర్జాతీయ అంకుర సంస్థలు భారత మార్కెట్లో విస్తరించే యోచనలో ఉన్నాయి. సింగపూర్, కెనడా తదితర దేశాలకు చెందిన స్టార్టప్స్ వీటిలో ఉన్నాయి. హాంకాంగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్క్స్ కార్పొరేషన్ (హెచ్‌కేఎస్‌టీపీ) నిర్వహించిన గ్లోబల్ పిచ్ కాంపిటీషన్ ’ఎపిక్ 2025’లో పాల్గొన్న సందర్భంగా పలు విదేశీ అంకుర సంస్థలు భారత్‌పై ఆసక్తి వ్యక్తం చేశాయి.70 పైగా దేశాలకు చెందిన 100 స్టార్టప్స్ నుంచి ఈ కాంపిటీషన్‌కి సుమారు 1,200 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో భారత్ నుంచి రెండు అప్లికేషన్లు ఉన్నాయి. ఈ దరఖాస్తులను ప్రధానంగా డిజిటల్ హెల్త్ టెక్, ఫిన్‌టెక్, గ్రీన్‌టెక్ అని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఎంట్రప్రెన్యూర్లను వర్ధమాన మార్కెట్లు, ఇన్వెస్టర్లు, ప్రపంచ స్థాయి ఆవిష్కరణల వ్యవస్థలకు అనుసంధానం చేసేందుకు ఎపిక్ 2025 తోడ్పడుతుందని హెచ్‌కేఎస్‌టీపీ చైర్మన్ సన్నీ తెలిపారు. సానుకూల పరిస్థితులు ఆకర్షణీయం.. భారత్‌లో స్టార్టప్‌లకు అనువైన వ్యవస్థ ఉందని బ్యాటరీ రీసైక్లింగ్ కార్యకలాపాలు సాగించే సింగపూర్ సంస్థ న్యూ బ్యాటరీ మెటీరియల్స్ చైర్మన్ బ్రయాన్ తెలిపారు. ఇక్కడ భారత్‌లో పెద్ద సంఖ్యలో టూ–వీలర్లు, త్రీ–వీలర్లతో భారీ మార్కెట్ ఉందని తెలిపారు. బ్యాటరీ రీసైక్లింగ్ వ్యాపారం నిర్వహిస్తున్న స్టార్టప్‌లు మెరుగ్గా రాణిస్తున్నాయని వివరించారు. భారత ప్రభుత్వ విధానాల గురించి మరింత తెలుసుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు. గ్రీన్‌టెక్ కేటగిరీలో న్యూ బ్యాటరీస్ మెటీరియల్స్ విజేతగా నిలి్చంది.మరోవైపు, ఏ ఇన్వెస్టరుకైనా భారత్‌లో పెట్టుబడులకు గణనీయంగా అవకాశాలు ఉన్నాయని ఎయిర్ కార్గో సాఫ్ట్వేర్ తయారు చేసే సింగపూర్ కంపెనీ ’బెల్లి’ ప్రోడక్ట్ ఇంజినీర్ జేడెన్ తెలిపారు. భారత్‌లో అంకురాలకు మంచి భవిష్యత్తు ఉండగలదన్నారు. భారత మార్కెట్లోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు కెనడాకి చెందిన కేఏ ఇమేజింగ్ ప్రెసిడెంట్ అమోల్ ఎస్ కారి్నక్ చెప్పారు. సైన్స్, మెడికల్ టెక్నాలజీల అభివృద్ధికి భారత ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుండటం తమకు ఒక అవకాశంగా ఉపయోగపడగలదని పేర్కొన్నారు. తమ సంస్థకు అనువైన మరిన్ని విధానాలపై అధ్యయనం చేస్తామని వివరించారు. -
అక్కడా మన వైద్యులే!
అభివృద్ధి చెందిన దేశాల్లోని వైద్య రంగంలో మన భారతీయ వైద్యులు, నర్సులు వెన్నెముకగా నిలిచారు. ఈ దేశాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య పరంగా తొలి స్థానంలో, నర్సుల సంఖ్యలో రెండవ స్థానంలో నిలిచి భారత్ తన హవాను కొనసాగిస్తోంది.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో భారతీయుల సత్తా ప్రపంచానికి తెలియనిది కాదు. ఒక్క ఐటీ నిపుణులే కాదు.. మన వైద్య నిపుణులకూ ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లోని ఆరోగ్య వ్యవస్థలకు భారతీయ వైద్య నిపుణులు ముఖ్య భూమిక పోషిస్తున్నారని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో–ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) విడుదల చేసిన ఇంటర్నేషనల్ మైగ్రేషన్ అవుట్‌లుక్–2025 నివేదిక వెల్లడించింది. అమెరికా, కెనడా, యూరోపియన్ దేశాలు, ఆస్ట్రేలియాతో సహా 38 ఓఈసీడీ సభ్య దేశాలు ఆరోగ్య సంరక్షణ సిబ్బంది కోసం ఇతర దేశాలపై ఆధారపడటం పెరుగుతోందని తెలిపింది. మనమే టాప్ఓఈసీడీ సభ్య దేశాల్లో ఇతర దేశాలకు చెందిన 8.30 లక్షల మంది వైద్యులు, 17.5 లక్షల మంది నర్సులు విధులు నిర్వర్తిస్తున్నారు. 38 ఓఈసీడీ సభ్య దేశాల్లోని మొత్తం వైద్యుల్లో 25 శాతం, నర్సుల్లో ఆరింట ఒక వంతు ఇతర దేశాలకు చెందినవారు. వైద్యుల్లో 40%, నర్సుల్లో 37% మంది ఆసియాకు చెందినవారు కావడం విశేషం. ఓఈసీడీ దేశాల్లో సేవలు అందిస్తున్న వైద్యుల విషయంలో సంఖ్య పరంగా భారత్, జర్మనీ, చైనా టాప్–3లో నిలి^éయి. ఇక నర్సుల విషయంలో ఫిలిప్పీన్స్, భారత్, పోలాండ్ మొదటి మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. ఐదుగురు వైద్యులు, నర్సులలో ఒకరు యూరోపియన్ ఎకనామిక్ ఏరియాకు (ఈఈఏ) చెందినవారు.ఆ నాలుగు దేశాలేవిశ్వవిద్యాలయాలు, కళాశాలలు, వృత్తిపరమైన ఉన్నత విద్యా కార్యక్రమాలలో 18 లక్షల నూతన విద్యార్థులకు 2024లో ఓఈసీడీ దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. యునైటెడ్ స్టేట్స్ 3.90 లక్షలు, యునైటెడ్ కింగ్డమ్ 3.84 లక్షల మంది విద్యార్థులకు అనుమతులను జారీచేసి అగ్రగామిగా నిలిచాయి. కెనడా 2.13 లక్షలు, ఆస్ట్రేలియా 1.82 లక్షల మంది విద్యార్థులతో ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.ప్రధాన దేశంగా..చాలా కాలంగా ఓఈసీడీ దేశాలకు వలస వెళ్తున్నవారిలో అత్యధికులు భారత్, చైనాకు చెందినవారే. కోవిడ్–19 మహమ్మారి సమయంలో ప్రధాన దేశంగా ఉన్న చైనాను అధిగమించి 2023 వరకు కూడా భారత్ ఆధిక్యంలో కొనసాగింది. ఆ ఏడాది దాదాపు 6,00,000 మంది భారతీయ పౌరులు ఓఈసీడీ సభ్య దేశాలకు వలస వెళ్లారు. 2022తో పోలిస్తే ఈ సంఖ్య 8% పెరిగింది.నలుగురిలో ఒకరు బ్రిటన్‌కు2023లో భారత్ నుంచి వలసదారులలో దాదాపు నలుగురిలో ఒకరు యునైటెడ్ కింగ్డమ్ను (1,44,000) ఎంచుకున్నారు. ఇందులో 97,000 మంది ఆరోగ్య, సంరక్షణ కార్మిక వీసాలపై వెళ్లారు. కెనడాలో 2023లో 1,40,000 మంది అడుగుపెట్టారు. యునైటెడ్ స్టేట్స్కు 68,000 మంది భారతీయులు ఉపాధి కోసం వలస వెళ్లారు.75వేల డాక్టర్లు మనవాళ్లే2021–23 మధ్య.. ఓఈసీడీ సభ్య దేశాల్లో పనిచేస్తున్న 6.06 లక్షల మంది విదేశీ వైద్యుల్లో 12 శాతం (75,000) మంది భారతీయ డాక్టర్లు. అలాగే 7.33 లక్షల మంది విదేశీ నర్సుల్లో 17 శాతం మంది (1.22 లక్షలు) భారతీయ నర్సులు కావడం విశేషం. అత్యధిక డాక్టర్లు యూకేలో, అత్యధిక నర్సులు యూఎస్‌లో ఉన్నారు. -
భారతీయులే టార్గెట్
న్యూఢిల్లీ: కెనడాలో ప్రభుత్వం మారినా, ప్రధాని మారినా భారత వ్యతిరేక విధానాల్లో ఏ మార్పూ రాలేదు. భారతీయుల వీసాలను తిరస్కరించటమే లక్ష్యంగా ఆ దేశం వలస, ఆశ్రయ చట్టానికి సవరణలు ప్రతిపాదించటమే అందుకు ఉదాహ రణగా నిలుస్తోంది. కెనడా ప్రభుత్వం ఇటీవల ఆ దేశ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్కు మరిన్ని అధికారాలు కట్టబెట్టేలా చట్ట సవరణకు అనుమతి ఇచ్చినట్టు సీబీసీ న్యూస్ సంస్థ వెల్లడించింది. ఇమిగ్రేషన్, రిఫ్యూజీ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (ఐఆర్సీసీ), కెనడా బోర్డర్ సర్వీస్ ఏజెన్సీ (సీబీఎస్ఏ) నుంచి సేకరించిన పత్రాలను విశ్లేషించి సీబీసీ న్యూస్ ఈ వివరాలు వెల్లడించింది.దీని ప్రకారం తాత్కాలిక నివాస వీసాల (టీఆర్వీ)ను గంపగుత్తగా తిరస్కరించేందుకు ఇమిగ్రేషన్ విభాగానికి అధికారాలు దఖలుపడేలా చట్టసవరణ ప్రతిపాదించారు. ఇందులో ముఖ్యంగా భారత్, బంగ్లాదేశ్ పౌరులనే టార్గెట్ చేస్తూ ఈ మార్పులు ప్రతిపాదించారని సీబీసీ కథనంలో పేర్కొంది. ఎవరిదైనా వీసా తిరస్కరించాలంటే దానిపై ప్రత్యేకంగా విచారణ జరిపి, దుర్వినియోగం అయ్యిందని తేలితే చర్యలు తీసుకుంటారు.కానీ, ఇకపై ఒక్కో కేసును కాకుండా మూకుమ్మడిగా వీసాలను తిరస్కరించేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు చెబుతున్నారు. కెనడా ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో భారతీయ విద్యార్థుల నుంచి వచ్చిన వీసా దరఖాస్తుల్లో 74 శాతం దరఖాస్తులను తిరస్కరించిందని రిపోర్టులు చెబుతున్నాయి. అదే నెలలో చైనా నుంచి వచ్చిన విద్యార్థి వీసాల్లో 24 శాతం మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. 2023 ఆగస్టులో భారతీయ విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 32 శాతం మాత్రమే.పెరుగుతున్న ఆశ్రయ దరఖాస్తులుకొన్నేళ్లుగా భారత్ నుంచి కెనడాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తులు పెరుగుతున్నాయి. 2024లో అంతర్జాతీయ విద్యార్థుల నుంచి కెనడాకు 20,245 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో భారత్, నైజీరియా నుంచే అధికంగా ఉన్నాయి. 2023 మేలో భారత్ నుంచి ఆశ్రయం కోరుతూ వచ్చిన విద్యార్థుల దరఖాస్తులు 500 వరకు ఉండగా, 2024 జూలై నాటికి నెలకు 2,000లకు పెరిగాయి.వీటికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో ఇమిగ్రేషన్ చట్టంలో సవరణలు ప్రతిపాదించినట్టు సీబీసీ పేర్కొంది. కెనడా నిర్ణయంపై వలసల హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశాయి. కెనడా ప్రభుత్వం తన ప్రయత్నాలను మానుకోవాలని దాదాపు 300 సంఘాలు విజ్ఞప్తి చేశాయి. చట్ట సవరణ అమలైతే ప్రస్తుతం అమెరికా నుంచి విదేశీయులను గెంటివేస్తున్నట్టుగానే కెనడా నుంచి కూడా విదేశీయులను మూకుమ్మడిగా గెంటేస్తారని ఇమిగ్రేషన్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తంచేశారు. -
కెనడాలో భారతీయుడికి 25 ఏళ్ల జైలు శిక్ష
ఒట్టావా: ఓ హత్య కేసులో భారత సంతతి వ్యక్తికి కెనడా న్యాయస్థానం 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మూడేళ్ల క్రితం బాల్‌రాజ్ బస్రా(25)పై నమోదైన ఆరోపణలు రుజువు కావడంతో మంగళవారం బ్రిటిష్ కొలంబియా సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెలువరించింది. 2022 అక్టోబర్ 17వ తేదీన యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియాకు చెందిన గోల్ఫ్‌క్లబ్ ప్రాంతంలో చోటుచేసుకున్న విశాల్ వాలియా(38) హత్య ఘటనలో శిక్ష పడిన వారిలో బాల్‌రాజ్ మూడో వ్యక్తి. ఈ కేసులో ఇక్బాల్ కాంగ్(24), డియాండ్రె బాప్టిస్ట్(21)అనే వారికి ఇప్పటికే 17 ఏళ్ల చొప్పున జైలు శిక్షలు పడ్డాయి. ఈ ముగ్గురూ కలిసి వాలియాను కాల్చి చంపి, వాహనానంలో అతడిని అగి్నకి ఆహుతి చేశారు. మరో వాహనంలో పరారైన అనుమానితులను వెంటనే గుర్తించి, వెంటాడి పోలీసులు కొన్ని నిమిషాల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. -
కారుపై మూత్ర విసర్జన వద్దన్నాడని..
ఎడ్మంటన్: కెనడాలో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యారు. తన కారుపై మూత్ర విసర్జన చేస్తున్న ఓ వ్యక్తిని ప్రశ్నించినందుకు.. అర్వి సింగ్ సాగూ(55) దాడికి గురై మరణించారు. కెనడాలోని ఎడ్మంటన్ నగరంలో అక్టోబర్ 19వ తేదీన ఈ ఘటన జరగ్గా, ఆయన ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడి.. గత శుక్రవారం ప్రాణాలు విడిచారు.అర్వి సింగ్ సాగూ.. తన స్నేహితురాలితో కలిసి నగరంలోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లారు. తిరిగి ఇంటికి వెళ్లడానికి తమ కారు వద్దకు వస్తుండగా.. ఓ వ్యక్తి.. సాగూ కారుపై మూత్ర విసర్జన చేస్తూ కనిపించాడు. దీంతో ఆ వ్యక్తిపై సాగూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆపమంటూ అరిచాడు. హే.. నువ్వేం చేస్తున్నావు?" అంటూ నిలదీశాడు.ఆ వ్యక్తి "నా ఇష్టం.. అంటూ దురుసుగా సమాధానం చెప్పడమే కాకుండా.. సాగూ తలపై బలంగా దాడి చేశాడు. పిడిగుద్దులు గుద్దాడు. దీంతో సాగూ.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతడి స్నేహితురాలు వెంటనే ఆయన్ని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. సాగూ సోదరుడు, ఆయన భార్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
కెనడాపై ఉరిమిన ట్రంప్.. సుంకాలు 10 శాతం పెంపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోమారు తన ప్రతాపం చూపారు. తాజాగా కెనడియన్ వస్తువులపై సుంకాలను అదనంగా 10 శాతం మేరకు పెంచుతున్నట్లు వెల్లడించారు. దివంగత అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ నాడు సుంకాలపై చేసిన ప్రసంగానికి సంబంధించిన ఆడియో క్లిప్పులను కెనడా వినియోగించిన దరిమిలా ఆగ్రహంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పొరుగు దేశమైన కెనడా రూపొందించిన ఒక టీవీ వాణిజ్య ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చలు నిలిచిపోయాయి. అమెరికా ఇటీవలే కెనడాపై 35 శాతం నుంచి 50 శాతం వరకు సుంకాలు విధించింది. అయితే ఈ సుంకాల తగ్గింపుపై రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటిపై ఒక ఒప్పందం కుదురుతుందని కెనడా అధికారులు భావిస్తున్న తరుణంలో అందుకు భిన్నంగా జరిగింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ- డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవలే ఓవల్ ఆఫీస్‌లో స్నేహపూర్వక సమావేశం జరిగింది. అయితే ఇంతలోనే ఊహించని విధంగా ట్రంప్.. కెనడాతో చర్చల రద్దును ప్రకటించారు. దీనికి కెనడాలోని ఒంటారియో ప్రావిన్స్ ప్రభుత్వం ప్రసారం చేసిన ఒక టీవీ ప్రకటన అని సమాచారం. ఈ ప్రకటనలో అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ .. సుంకాలు, ఆంక్షలు దీర్ఘకాలంలో అమెరికన్లకు ముప్పు తీసుకొస్తాయని వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన గత వారం రోజులుగా అమెరికా టీవీ ఛానెల్స్‌లో ప్రసారమవుతోంది.అమెరికా ప్రవేశపెడుతున్న సుంకాల విషయంలో అక్కడి సుప్రీంకోర్టు త్వరలోనే తీర్పు వెల్లడించనుంది. ఈ నేపధ్యంలో కోర్టు తీర్పును ప్రభావితం చేయాలనే ఉద్దేశంతోనే కెనడా ఈ ప్రకటనను ప్రచారంలోకి తీసుకొచ్చిందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. కాగా దీనిపై రొనాల్డ్ రీగన్ ఫౌండేషన్ కూడా స్పందించింది. సదరు ప్రకటనను ఖండించింది. ‘వారు ఈ ప్రకటనను వెంటనే తీసివేయాలి. అది మోసపూరితమైనదని తెలిసి కూడా వారు వరల్డ్ సిరీస్ సమయంలో దానిని ప్రసారం చేయడానికి అనుమతించారు’ అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో పేర్కొన్నారు. వాస్తవాలను తప్పుగా చూపించడంలాంటి శత్రు చర్యల కారణంగా కెనడాపై సుంకాన్ని.. వారు ఇప్పుడు చెల్లిస్తున్న దానికంటే 10 శాతం అదనంగా పెంచుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.ఇది కూడా చదవండి: ‘మహారాష్ట్ర డాక్టర్’ కేసులో కీలక పరిణామం -
కెనడా ట్రిప్‌లో అలనాటి హీరోయిన్ భాగ్యశ్రీ (ఫొటోలు)
-
నార్త్ అమెరికాలో అత్యంత ఎత్తయిన శ్రీరాముడు
ఇటీవలి కాలంలో భారతీయ సంప్రదాయాలు విశ్వవ్యాప్తం అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా హైందవ పురాణాలకు, దేవుళ్లు దేవతలకు గతంలో ఎన్నడూ లేనంత గుర్తింపు లభిస్తోంది. దీంతో విదేశాలలో పలు చోట్ల హిందూ దేవుళ్ల ఆలయాలు, విగ్రహాలు ఏర్పాటవుతున్నాయి. అదే క్రమంలో కెనడాలోని మిస్సిసాగాలో 51 అడుగుల ఎత్తైన రాముని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు, ఇది ఉత్తర అమెరికా ప్రాంతంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణంగా నిలిచింది. ఢిల్లీ, గుర్గావ్కు చెందిన ప్రఖ్యాత కళాకారుడు నరేష్ కుమార్ కుమావత్ మనేసర్‌లోని మాటు రామ్ ఆర్ట్ సెంటర్లో చెక్కిన ఈ విగ్రహాన్ని పలు భాగాలుగా కెనడాకు తరలించారు. తరువాత దీనిని అమెరికా నుంచి వచ్చిన ఇంజనీర్ల బృందం ఒకటే మూర్తిగా మలచింది. ఈ నిర్మాణం విమానాల తయారీలో తరచుగా ఉపయోగించే ఫైబర్‌గ్లాస్ స్టీల్‌తో తయారు చేయడం విశేషం. ఇటీవలే జరిగిన ఈ శ్రీరాముని విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కమ్యూనిటీ సభ్యులు మాత్రమే కాకుండా దాని సాంస్కృతిక ప్రాముఖ్యత కారణంగా భిన్న రంగాల ప్రముఖులు కూడా హాజరయ్యారు. రాజకీయ నాయకులలో, మహిళా లింగ సమానత్వ మంత్రి రీచర్ వాల్డెజ్, ట్రెజరీ బోర్డు అధ్యక్షుడు షఫ్కత్ అలీ అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మణీందర్ సిద్ధూ కూడా హాజరయ్యారు. విగ్రహం ఏర్పాటు చేసిన హిందూ హెరిటేజ్ సెంటర్ వ్యవస్థాపకుడు మాట్లాడుతూ, శ్రీరాముని కొలువుదీర్చడం వల్ల ఉత్తర అమెరికా అంతటా సందర్శకులకు ఆసక్తి పెరుగుతుందని గుర్తించామన్నారు. న్యూయార్క్ న్యూజెర్సీ ల నుంచి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారన్నారు. చదవండి: ఇండోర్ మహారాణి : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ఆ డైమండ్స్ ఎలా మోసారండీ!ప్రజలు ఆలయాన్ని సందర్శించడంతో పాటు కెనడాలోనే ఎత్తైన శ్రీరామ విగ్రహాన్ని కూడా సందర్శిస్తున్నారు‘ అని ఆయన అన్నారు. ఉత్తర అమెరికాలో అతిపెద్ద శ్రీరామ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ‘చాలా గర్వించదగ్గ విషయం‘ అని సిద్ధూ అన్నారు. ఈ మూర్తిని ఏర్పాటు చేయడం కేవలం గర్వకారణం కాదు. ఇది సమాజానికి ఒక ఆధ్యాత్మిక బహుమతి, ధర్మం ఎల్లప్పుడూ మన మార్గాన్ని నడిపించాలని గుర్తు చేస్తుంది‘ అని కేంద్రం వ్యవస్థాపకుడు ప్రధాన పూజారి ఆచార్య సురీందర్ శర్మ శాస్త్రి అన్నారు.చదవండి: డ్రీమ్ హౌస్ అంటూ గుడ్ న్యూస్ చెప్పిన స్వీట్కపుల్ఈ కార్యక్రమ ప్రధాన నిర్వాహకుడు కుషాగర్ శర్మ మాట్లాడుతూ, ‘10,000 మందికి పైగా ప్రజలు భక్తి ఐక్యత కలిసి శ్రీరాముని 51 అడుగుల ఎతై ్తన మూర్తిని ఆవిష్కరించింది‘ అని అన్నారు. ‘ఇది కేవలం మన విశ్వాసానికి ఒక వేడుక మాత్రమే కాదు, సాంస్కృతిక సామరస్యం ఆధ్యాత్మిక వారసత్వానికి విలువనిచ్చే కెనడియన్లందరికీ గర్వకారణమైన క్షణం‘ అని అన్నారు. మిస్సిసాగాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యే విమానాలు దిగేటప్పుడు ఆలయం మీదుగా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయని చెప్పారు. అలాగే ఈ అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం త్వరలో ప్రయాణీకులను స్వాగతించే మొదటి ప్రదేశాలలో ఒకటిగా మారనుందని ఆయన పేర్కొన్నారు. -
ప్రతిభను ఆకర్షించడంపై కెనడా దృష్టి
నైపుణ్యం కలిగిన ప్రతిభను ఆకర్షించడం, శ్రామిక శక్తిని పెంచడంపై దృష్టి సారించేలా కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళికను ఆవిష్కరించారు. రాబోయే బడ్జెట్లో ఈమేరకు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు. అమెరికా హెచ్1బీ వీసా ఫీజు పెంచుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో కెనడా చర్యలు కీలకంగా మారనున్నాయి.ఈ సందర్భంగా కార్నీ మాట్లాడుతూ.. ‘దేశ అవసరాలకు సరిపోలేలా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేందుకు వీలుగా బడ్జెట్లో కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రణాళికకు కేటాయింపులుంటాయి. ఈ ప్రణాళికలో ప్రతిభ, నైపుణ్యాల శిక్షణ, శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు మద్దతు ఇవ్వడానికి ఉద్దేశించిన అప్రెంటిస్‌షిప్‌లు ఉంటాయి’ అని చెప్పారు.అమెరికన్ హెచ్-1బీ వీసా ఫీజు పెంపు నేపథ్యంలో కార్నీ గ్లోబల్ టెక్ టాలెంట్‌పై దృష్టి సారించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త వీసా ఛార్జీలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సెప్టెంబర్‌లో సంతకం చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో హెచ్-1బీ వీసాలపై 1,00,000 డాలర్ల రుసుము విధిస్తామని చెప్పారు. ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇంజినీరింగ్ వంటి రంగాలలో విదేశీ ప్రతిభపై ఆధారపడే యూఎస్ కంపెనీల్లో అనిశ్చితిని సృష్టించింది. దీన్ని ఆసరాగా చేసుకుని కెనడా తమ దేశంలోకి ప్రతిభను ఆకర్షించే విధానాలు రూపొందిస్తుంది.ఇదీ చదవండి: ర్యాంక్ వారీగా ఐపీఎస్ అధికారుల వేతనాలు -
క్యాబ్ డ్రైవర్‌గా మిలటరీ వైద్యుడు..! దయచేసి అలాంటి నిర్ణయం..
విదేశాల్లో సెటిల్ అవ్వడం చాలామంది యువత డ్రీమ్. విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకుని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటారు. కానీ అలాంటి ఆలోచన చేసే ముందు అక్కడ నియమ నిబంధనలు గురించి క్షణ్ణంగా తెలుసుకోవాలి లేదంటే..తీరా కోర్సు పూర్తి చేశాక ఉద్యోగం చేసేందుకు వీలు లేకపోతే పరిస్థితి అగమ్యగోచరం. అందుకు నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించండి అంటోంది ఈ బెంగళూరు మహిళ. అసలేం జరిగిందంటే..కెనడాలో క్యాబ్ నడుపుతున్న ఒక వైద్యుడిని కలిసిన బెంగళూరుకి చెందిన మేఘన శ్రీనివాస్ అందుకు సంబంధించిన వీడియో సంభాషణను నెట్టింట షేర్ చేశారు. మిస్సిసాగా నుంచి టొరంటోకు ట్రావెల్ చేస్తుండగా ఆ డ్రైవర్ని కలిశారామె. అఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఆ డ్రైవరర్ తాను కెనడాలో డిగ్రీ చదువుతున్నట్లు తెలిపాడు. తన ఖర్చుల కోసం అని క్యాబ్నడుపుతున్నట్లు ఆమెతో చెప్పాడు. క్యాబ్ నడపుతూ తాను రూ. 3 లక్షల వరకు సంపాదిస్తున్నానని, అందులో కేవలం సింగిల్ బెడ్రూం కోసమే ఏకంగా రూ 2 లక్షలు పైనే ఖర్చు చేస్తున్నట్లు మేఘనతో వాపోయాడు. తాను గతంలో అమెరికా, కెనడా సైనిక వైద్యుడిగా పనిచేసినట్లు తెలిపారు. ప్రస్తుతం కెనడాలో ప్రజప్రతినిధిగా ఉన్నట్లు తెలిపారు. తాను కెనడాలో తన వైద్య వృత్తిని కొనసాగించడానికి, వైద్య లైసెన్సు పొందేందుకు నానా తిప్పలు పడుతున్నట్లు చెప్పుకొచ్చారు. చివరగా ఆ వీడియోలో మేఘన దయచేసి కెనడాలో సెటిల్ అవ్వాలనుకుంటే అన్ని విషయాలను తెలుసుకుని సరైన విధంగా ప్లాన్ చేసుకోవాలని సూచించారు. అలాగే భవిష్యత్తులో ఇక్కడకు రావాలనుకునే విద్యార్థులు కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ తీరు తెన్నులు..జీవిత వాస్తవాలు గుర్తించి పూర్తిగా తెలుసుకుని రావడం మంచిదని చెప్పుకొచ్చింది మేఘన. చివరగా ఆమె ఈ దేశం మనకు అద్భతమైన అవకాశాలను ఇస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు కానీ అందుకు అచంచలమైన ఓర్పు చాలా అవసరమని అన్నారామె. నెటిజన్లు సైతం ఈ వీడియోని చూసి..అంతర్జాతీయ వైద్య గ్రాడ్యుయేట్లకు సంబంధించి.. నియమాలు, చట్టాల మారాయి. స్థానికత లభించడం దాదాపు అసాధ్యం అని ఒకరు, విదేశీ వైద్యులు అక్కడ ఉద్యోగం పొందడం చాలా కష్టం అని అభిప్రాయం వ్యక్తం చేస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Meghana Srinivas | Realtor, Windsor ON (@meghana.srinivasa_) (చదవండి: 'కూతుళ్లు మన ఇంటి లక్ష్మీ దేవతలు'..! వారి రాకతోనే..: నీతా అంబానీ) -
సంబంధాల బలోపేతానికి భారత్–కెనడా రోడ్‌మ్యాప్ ఖరారు
న్యూఢిల్లీ: వాణిజ్యం, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారం బలోపేతానికి భారత్, కెనడాలు రోడ్ మ్యాప్ ఖరారు చేసుకున్నాయి. సోమవారం కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్, భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లతో చర్చలు జరిపారు. 2023లో సిక్కు ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యానంతరం రెండు దేశాల మధ్య దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడమే లక్ష్యంగా ఆమె భారత్‌కు రావడం తెల్సిందే. రెండు దేశాల వ్యూహాత్మక ప్రాముఖ్యతలు, ప్రపంచ ఆర్థిక పరిణామాల ఆధారంగా వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో సాధ్యమైనంత త్వరగా మంత్రుల స్థాయి చర్చలు ప్రారంభించాలని జై శంకర్, అనితా ఆనంద్ నిర్ణయించారు. ఈ సందర్భంగా కెనడా గడ్డపై ఖలిస్తానీ వేర్పాటు వాదులు సాగిస్తున్న కార్యకలాపాలపై జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. రెండు పక్షాలు పరస్పర ఆందోళనలు, సున్నితమైన అంశాలపై నిర్మాణాత్మక, సమతుల్య భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఇరువురు నేతలు అంగీకారానికి వచ్చారు. ఈ మేరకు వారు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘భారత్, కెనడా ప్రధాన మంత్రులు నాలుగు నెలల క్రితం రెండు దేశాల సంబంధాల్లో కొత్త ఊపును తెచ్చేందుకు ప్రాధాన్యతలను నిర్దేశించారు. వాటికి అనుగుణంగా, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించుకుంటూ పరస్పర గౌరవం ఆధారంగా కొత్త రోడ్‌మ్యాప్‌పై ఏకాభిప్రాయానికి చేరుకున్నాం’అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కెనడా యురేనియం సరఫరాదారులతో భారత అణు ఇంధన సంస్థ అధికారులు జరుపుతున్న చర్చలను ఇద్దరు నేతలు స్వాగతించారు. అంతకు ముందు, అనితా ఆనంద్ ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్యం, టెక్నాలజీ, ఇంధనం, వ్యవసాయం, ప్రజల మధ్య సహకారం పెంచుకునే అంశాలను మంత్రి అనితా ఆనంద్‌తో చర్చించినట్లు మోదీ ఎక్స్‌లో తెలిపారు. కెనడా ప్రధాని కార్నీతో చర్చలకు ఆసక్తితో ఎదురు చూస్తున్నానన్నారు. -
కెనడాలో సౌత్ ఇండియన్ సినిమాల ప్రదర్శన నిలిపివేత!
కెనడాలో భారతీయ చిత్రాల ప్రదర్శన నిలిచిపోయింది. పవన్ కల్యాణ్ ఓజీ, రిషబ్ శెట్టి కాంతార చాప్టర్-1తో పాటు పలు చిత్రాల షోలను రద్దు చేసేశారు. ఈ నిర్ణయానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే.. వారం వ్యవధిలో అక్కడి ఓ థియేటర్‌పై జరిగిన కాల్పుల నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని సమాచారం.అసలేం జరిగిందంటే.. ఒంటారియో(Ontario) ప్రావిన్సులోని ఓ థియేటర్‌పై గత వారం వ్యవధిలో రెండు దాడులు జరిగాయి. సెప్టెంబర్ 25వ తేదీన వేకువ జామున ముసుగులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు.. థియేటర్ ఎంట్రెన్స్ వద్ద లిక్విడ్‌ను చల్లి చిన్నపాటి పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో థియేటర్ బయటి భాగం స్వల్పంగా దెబ్బ తింది. అలాగే.. తాజాగా అక్టోబర్ 2వ తేదీన ముసుగులో వచ్చిన ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. అయితే ఈ ఘటనలోనూ అదృష్టవశాత్తూ సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు.कनाडा के सिनेमाघर में आग और फायरिंगकनाडा के ओकविले में स्थित Film. Ca सिनेमा थिएटर पर हमला, 2 युवकों ने थिएटर के दरवाजे पर पेट्रोल डालकर आग लगाई, दोनों चेहरे पर मास्क लगाए SUV कार में आए थे, सिनेमाघर में फायरिंग और आग लगाई, पूरा मामला CCTV में कैद#Canada | #CCTV pic.twitter.com/evEuTSsyaj— NDTV India (@ndtvindia) October 3, 2025ఈ ఘటనల నేపథ్యంలో.. భారతీయ చిత్రాలు అందునా ప్రత్యేకించి దక్షిణ భారత చిత్రాల(South Indian Films Canada) ప్రదర్శనే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయని అక్కడి థియేటర్ల నిర్వాహకులు ఓ అంచనాకి వచ్చారు. ఓక్విల్లేలోని ఫిల్మ్.సీఏ సినిమాస్(Film.ca Cinemas) ఓజీ, కాంతార ఏ లెజెండ్ చాప్టర్ 1 చిత్రాల ప్రదర్శనను మాత్రమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు ఫ్రాంచైజీ సీఈవో జెఫ్ నోల్ కూడా ఓ వీడియో సందేశంలో ఇదే విషయాన్ని పరోక్షంగా ధృవీకరించారు కూడా.ఎక్కడక్కెడంటే.. మరోవైపు అక్కడి ఆన్లైన్ బుకింగ్ జాబితాల నుంచి పలు భారతీయ సినిమాలను తొలగించారు. రిచ్మండ్ హిల్‌లోని యార్క్ సినిమాస్ కూడా ఫిల్మ్.సీఏ బాటలోనే భారతీయ సినిమాల ప్రదర్శన నిలిపివేసింది. తమ ఉద్యోగులు, ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వాళ్ల నగదును రిఫండ్ చేస్తామని ఒక ప్రకటనలో యార్క్ సినిమాస్ వెల్లడించింది. గ్రేటర్ టోరంటో ఏరియాలోనూ పలు థియేటర్లు ఇదే తరహా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. బ్రిటిష్ కొలంబియా, అల్బర్టా, క్యూబెక్, మానిటోబా ఇతర ప్రావిన్స్‌లోనూ ఈ అంశంపై చర్చ జరుగుతోంది.ఇదిలా ఉంటే.. ఇది ఖలీస్తానీల పని అయ్యి ఉండొచ్చని సమాచారం. గతంలోనూ ఇదే తరహా దాడులు జరగడమే ఆ అనుమానాలకు కారణంగా తెలుస్తోంది. అయితే హాల్టన్ పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. దాడులకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న తమను సంప్రదించాలని అక్కడి దర్యాప్తు అధికారులు కోరుతున్నారు. ఇదీ చదవండి: అనుభవానికా? లేదంటే యంగ్ బ్లడ్‌కి పట్టమా?? -
ఆ పాస్‌పోర్ట్‌తో అమెరికాలో సమస్యలు!: కెనడా హెచ్చరిక
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జనవరిలో వైట్ హౌస్‌కు తిరిగి వచ్చిన తరువాత.. తన ప్రారంభ ప్రసంగంలో "పురుషుడు & స్త్రీ అనే రెండు లింగాలు మాత్రమే ఉన్నాయని" ప్రకటించినప్పటి నుంచి ట్రాన్స్‌జెండర్స్, బైనరీయేతర వ్యక్తులపై చర్యలు తీసుకోవడం మొదలుపెట్టారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం తమ పాస్‌పోర్ట్‌లలో నాన్బైనరీ 'ఎక్స్' లింగ హోదాతో పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న పౌరులకు హెచ్చరిక జారీ చేసింది.ఎక్స్ లింగ హోదాతో పాస్‌పోర్ట్‌లను కలిగిఉన్న వారు యునైటెడ్ స్టేట్స్కు వెళితే.. ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుందని కెనడా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్‌తో పాస్‌పోర్ట్‌లను జారీ చేసినప్పటికీ.. ఇది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు తెచ్చే అవకాశం ఉందని వెల్లడించింది.ఇదీ చదవండి: అమెరికా వీడిన భారతీయ యువతి.. కన్నీటి వీడ్కోలుకెనడా 2019లో పాస్‌పోర్ట్‌లపై 'ఎక్స్' ఎంపికను ప్రవేశపెట్టింది. ఫెడరల్ డేటా ప్రకారం.. జనవరి నాటికి దాదాపు 3,600 మంది కెనడియన్లు దీనిని ఎంచుకున్నారు. కెనడా మాత్రమే కాకుండా.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ దేశాలు కూడా ఎక్స్ జెండర్ పాస్‌పోర్ట్‌లను జరీ చేస్తోంది. కానీ యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ 'ఎక్స్' జెండర్ ఐడెంటిఫైయర్‌తో పాస్‌పోర్ట్‌ల జారీని నిలిపివేసింది. కాగా ఈ విధానం అమలులోకి రాకుండా కోర్టు నిషేధం విధించింది. -
బిష్ణోయ్ గ్యాంగ్‌పై కెనడా ఉగ్ర ముద్ర
మాంట్రియల్: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చినట్లు కెనడా అధికారులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దేశంలో భయానక వాతావరణం సృష్టించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. కెనడాలో హింస, ఉగ్రవాదానికి ఎంతమాత్రం స్థానం లేదని తేల్చిచెప్పారు. ముఖ్యంగా ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులకు ప్రయత్నిస్తే సహించబోమని, కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గతవారం కెనడా జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్తో ఢిల్లీలో సమావేశమయ్యారు.భారత్–కెనడా మధ్య సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయం ప్రారంభించాలని, ఉగ్రవాదం, సీమాంతర నేరాలపై ఉమ్మడి పోరాటం సాగించాలని వారిద్దరూ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో లారెన్స్ బిష్ణోయ్ ముఠాపై కెనడా ప్రభుత్వం ఉగ్రవాద ముద్ర వేయడం గమనార్హం. దీనివల్ల ఆ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి, ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని కెనడా మంత్రి గారీ ఆనంద సంగారీ చెప్పారు. కెనడాలో అధికారిక గణాంకాల ప్రకారం 88 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి.ఇందులో బిష్ణోయ్ గ్యాంగ్‌ను కూడా చేర్చారు. ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చితే వాటి ఆస్తులను, డబ్బును, వాహనాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. ఇండియన్ గ్యాంగ్‌స్టర్ బాలకరణ్ బ్రార్ అలియాస్ లారెన్స్ బిష్ణోయ్ తన పేరిటే గ్యాంగ్ ఏర్పాటు చేశారు. ఇండియాతోపాటు కెనడాలో పలు నేరాల్లో అతడి హస్తం ఉందని గుర్తించారు. హత్య, కాల్పులు, బలవంతపు వసూళ్లు వంటి ఆరోపణలు వచ్చాయి. -
కెనడాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
ఒట్టావా: తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్ (TDF), కెనడా ఆధ్వర్యంలో బ్రాంప్టన్ నగరంలో బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. భారీ సంఖ్యలో NRI లు కుటుంబ సమేతంగా హాజరై ఆట, పాటలతో బతుకమ్మ పండుగ ను జరుపుకున్నారు.తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా తెలంగాణా డెవలప్మెంట్ ఫోరమ్,కెనడా నిర్వాహకులు ఘనంగా ఏర్పాట్లు చేసి, పసందైన తెలంగాణా వంటకాలతో భోజనాలు కూడా ఏర్పాటు చేసారు. కెనడాలోనే పుట్టిపెరిగిన తెలుగు పిల్లలు మన పండగల ప్రత్యేకత తెలుసుకోవటం ఇలాంటి కార్యక్రమాలతో సాధ్యమౌతుందని టీడీఎఫ్ ప్రతినిధులు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీఫ్ కెనడా ప్రెసిడెంట్ జితేందర్ రెడ్డి గార్లపాటి, ఫౌండేషన్ కమిటీ చైర్మన్ సురేందర్ పెద్ది, అమితా రెడ్డి, టీడీఫ్ కెనడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా గంటా రెడ్డి మాణిక్ రెడ్డి స్మారక విశేష సేవా పురస్కారాన్ని మహేష్ మాదాడి, రజిని దంపతులకు టీడీఫ్ కెనడా కమిటీ తరపున అందజేశారు. 21 సంవత్సరాల నుండి కెనడాలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించడానికి తోడ్పాడుతున్న ప్రతీ ఒక్కరికి టీడీఎఫ్ కెనడా కమిటీ ధన్యవాదములతో అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపింది. -
హెచ్-1బి వీసా రాని టెకీలకు కెనడా గాలం!
అమెరికాలో పనిచేస్తూ కొత్త ఫీజు, నిబంధనల కారణంగా హెచ్-1బి వీసా (H-1B Visa) పొందలేకపోయిన టెక్నాలజీ రంగ నిపుణలకు కెనడా దేశం గాలం వేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కొత్త వీసా ఛార్జీలకు ముందు యూఎస్‌లో పనిచేసిన టెక్ ఉద్యోగులను తమ దేశానికి ఆకర్షించాలనుకుంటున్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ.తాజాగా లండన్‌లో విలేకరులతో మార్క్ కార్నీ మాట్లాడుతూ తమ ఆలోచనను బయటపెట్టారు. గతంలో హెచ్ -1బీ వీసాలు ఉన్న వారిని ఆకర్షించే అవకాశం స్పష్టంగా ఉందని కార్నీ వెల్లడించారు. అలాంటి వారిలో టెక్ రంగ ఉద్యోగులు చాలా మంది ఉన్నారని, వారంతా వేరే ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పుకొచ్చారు.కొత్త హెచ్ -1బి వీసాలపై లక్ష డాలర్ల ఫీజు విధిస్తూ ట్రంప్ గత వారం ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్, ఇంజనీరింగ్, ఇతర ఉద్యోగాల్లో ప్రపంచ ప్రతిభను తీసుకురావడానికి కొత్త హెచ్ -1బి ప్రోగ్రామ్‌పై ఆధారపడే కంపెనీలకు గందరగోళం, నిరాశను సృష్టించింది.కెనడా (Canada) ప్రభుత్వం తన ఇమ్మిగ్రేషన్ వ్యూహాన్ని సమీక్షిస్తున్నప్పుడు, ఈ రకమైన ప్రతిభావంతులైన నిపుణులను ఆకర్షించే అంశాన్ని గ్రహించడాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని, దానిపై "స్పష్టమైన సమర్పణ" ఉంటుందని కార్నీ చెప్పారు.హెచ్-1బి వీసాలు చేజారి, అమెరికాలో పని చేసేందుకు అవకాశాలు కోల్పోయినవారిని పలు ఇతర దేశాలు కూడా ఆకర్షిస్తున్నాయి. జర్మనీ, యూకే వంటి దేశాలు నైపుణ్యం కలిగిన కార్మికులకు ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా తమను తాము పేర్కొంటున్నాయి. -
‘లక్ష డాలర్ల’ అమెరికా కన్నా లక్షణమైన దేశాలు
అమెరికా తన వర్క్ వీసా విధానంలో విప్లవాత్మక మార్పును ప్రకటించింది. సెప్టెంబర్ 21 నుండి కంపెనీలు ప్రతి హెచ్-1బి వీసా హోల్డర్‌కు వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు లక్ష డాలర్లు (రూ.88 లక్షలుపైగా) చెల్లించాల్సి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అత్యధికం. మరి అమెరికా లాంటి వర్కింగ్‌కు అనువైన మరో ఐదు దేశాల్లో వర్కింగ్ వీసాల రిజిస్ట్రీషన్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. -
ఖలిస్థానీల హెచ్చరిక.. భారత కాన్సులేట్‌ను సీజ్ చేస్తామంటూ..
ఒట్టావా: కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను టార్గెట్ చేసి వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను సీజ్ చేస్తామని తాజాగా బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఖలిస్థానీ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ హెచ్చరించింది. దీంతో, ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.వివరాల ప్రకారం.. భారత్, కెనడా మధ్య మళ్లీ దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ కెనడాలోని ఖలిస్థానీలు రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన ఖలిస్థానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్.. వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తామని పేర్కొంది. ఈనెల 18న (గురువారం) దీన్ని స్వాధీనం చేసుకుంటామని, ఆ సమయంలో ఇక్కడికి ఎవరూ రావొద్దంటూ హెచ్చరికలు చేసింది. ఇదే సమయంలో కాన్సులేట్‌కు వచ్చే వారు తన సందర్శనను వాయిదా వేసుకోవాలని సూచించింది.ఈ సందర్భంగా భారత హైకమిషనర్ దినేశ్ కె.పట్నాయక్‌ను లక్ష్యంగా చేసుకుని ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేసింది. అంతటితో ఆగకుండా.. భారత కాన్సులేట్లు గూఢచారి నెట్‌వర్క్‌ను నడుపుతున్నాయని, ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని నిఘా పెట్టాయని ఆ బృందం ఆరోపించింది. దీంతో ఇది కాస్తా తీవ్ర కలకలం రేపింది. ఇదిలా ఉండగా.. రెండు సంవత్సరాల క్రితం 18 సెప్టెంబర్ 2023న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర దర్యాప్తులో ఉందని అప్పటి ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, నాటి నుంచి భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా విభేదాలు వచ్చాయి. -
చెదిరిపోతున్న కెనడా కలలు
కెనడాలో ఉన్నత విద్య అభ్యసించడానికి భారతీయ విద్యార్థులు అమితంగా ఆసక్తి చూపుతుంటారు. అయితే, వారి ఆశలను కెనడా ప్రభుత్వం నీరుగారుస్తోంది. ఈ ఏడాది ఇప్పటిదాకా 80 శాతం ఇండియన్ స్టూడెంట్ వీసా దరఖాస్తులను తిరస్కరించింది. గత పదేళ్ల కాలంలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్షిప్ కెనడా(ఐఆర్సీసీ) ఈ విషయం స్వయంగా వెల్లడించింది. భారతీయ విద్యార్థులే ఎక్కువగా ప్రభావితం అయినట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఆసియాతోపాటు ఆఫ్రికా దేశాల విద్యార్థుల వీసా దరఖాస్తులు అధికంగా తిరస్కరణకు గురయ్యాయి. వీసాలు సులభంగా లభించే పరిస్థితి లేకపోవడంతో కెనడా విద్యాసంస్థల్లో విదేశీయుల ప్రవేశాలు సైతం తగ్గిపోతున్నాయి. 2024లో 1.88 లక్షల మంది భారతీయ విద్యార్థులు కెనడా విద్యాసంస్థల్లో చేరారు. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య 3.60 లక్షలకు పైగానే ఉండేది. భారతీయ విద్యార్థులు ఇప్పుడు జర్మనీపై దృష్టి పెడుతున్నారు. 2022లో కెనడాకు ప్రాధాన్యం ఇచ్చిన భారతీయుల విద్యార్థులు 18 శాతం ఉండగా, 2024లో అది 9 శాతానికి పడిపోయింది. జర్మనీకి వైపు ఆసక్తి చూపినవారి సంఖ్య గత ఏడాది 31 శాతంగా ఉంది.ఎందుకీ పరిస్థితి?అమెరికాలో విదేశీ విద్యార్థులపై పలు ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. విద్యార్థి వీసా నిబంధలను ప్రభుత్వం కఠినంగా మార్చింది. విదేశీ విద్యార్థుల రాకపై ఆంక్షలు విధించింది. కెనడా సర్కార్ సైతం ఇదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఇళ్ల కొరత వేధిస్తోంది. మౌలిక సదుపాయాలపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో విదేశీయుల రాకను అడ్డుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.స్థానిక రాజకీయాలకు ప్రభుత్వం తలవంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. విదేశీ విద్యార్థులపైనా ఆ ప్రభావం పడుతోంది. ఆర్థిక వనరులు బలీయంగా ఉన్న విద్యార్థులకే కెనడా వీసాలు లభించే అవకాశం ఉంది. లాంగ్వేజ్ టెస్టులోనూ మంచి ప్రతిభ చూపాల్సి ఉంటుంది. సమగ్రమైన స్టడీ ప్లాన్ సమర్పించాలి. అంతేకాకుండా రూల్స్ ఆఫ్ వర్క్‌ను సైతం కఠినంగా మార్చారు. చదువుకుంటూ ఖర్చుల కోసం పార్ట్‌టైమ్ జాబ్ చేయడం ఇక కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.గమ్యస్థానం జర్మనీఈ ఏడాది విదేశీ విద్యార్థులకు 4,37,000 వీసాలు ఇవ్వాలని కెనడా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గత ఏడాది కంటే 10 శాతం తక్కువ కావడం విశేషం. ఇందులో 73,000 వీసాలు పోస్ట్రుగాడ్యుయేట్ విద్యార్థులకు, 2,43,000 వీసాలు అండర్గ్రాడ్యుయేట్ విద్యార్థులకు నిర్దేశించారు. 1,20,000 వీసాలు రెన్యూవల్స్, పాఠశాల విద్యార్థులకు సంబంధించినవి. కెనడా వీసా చాలా ఖరీదైన అంశంగా మారిపోయింది. దరఖాస్తు, టెస్టులు, ఫీజులు తడిసిమోపెడవుతున్నాయి. ఒకసారి దరఖాస్తు తిరస్కరణకు గురైతే మళ్లీ దరఖాస్తు చేసుకోలేక చాలామంది వెనక్కి తగ్గుతున్నారు.మొత్తానికి కెనడా కలలు చెదిరిపోతున్నాయి. మరోవైపు విదేశీ విద్యార్థులపైనే ఆధారపడి మనుగడ సాగించే కెనడా కాలేజీలు, యూనివర్సిటీ పరిస్థితి దారుణంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో కొన్ని కాలేజీలు ఇప్పటికే మూతపడ్డాయి. మరికొన్ని ఇతర కాలేజీల్లో విలీనమయ్యాయి. ఇదిలా ఉండగా, కెనడాకు ద్వారాలు మూసుకుపోతుండడంతో జర్మనీ విద్యాసంస్థల్లో చేరే భారతీయుల సంఖ్య పెరుగుతోంది. 2023లో 49,500 మంది చేరారు. 2025లో ఇప్పటికే 60,000 మంది ప్రవేశాలు పొందారు. జర్మనీలో టెక్నాలజీ, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ తదితర కీలక విభాగాల్లో తక్కువ ఫీజులకే మెరుగైన విద్య లభిస్తోంది. అమెరికా, కెనడాతో పోలిస్తే జర్మనీలో జీవన వ్యయం కూడా చాలా తక్కువ. ఈ అంశాలే జర్మనీని ఉన్నత విద్యకు గమస్థానంగా మారుస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కెనడాలో ఘనంగా గణేష్ ఉత్సవాలు
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు తమ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ పండగలు, ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. తాజాగా గణేష్ ఉత్సవాలను కెనడాలో స్థిరపడిన భారతీయులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒంటారియో రాష్ట్రం ఓక్ విల్లే పట్టణంలో తెలుగువారి కుటుంబాలన్నీ ఒక్క చోట చేరి గణేష్ ఉత్సవాలను పెద్ద ఎత్తున జరుపుకున్నారు. టీమ్ యువ పేరుతో ఏర్పాటైన సంఘం ఆధ్వర్యంలో యువకులంతా ఒక జట్టుగా గణనాధుడి వేడుకలను కనులపండగగా నిర్వహించారు.పుట్టిన గడ్డకు సుదూరంలో ఉన్నా ఇక్కడ సంస్కృతీ, సంప్రదాయాలను పాటిస్తున్నామని, రానున్న తరాలైన తమ పిల్లలకు భారతీయ పండగల విశిష్టత తెలిసేలా నిర్వహిస్తున్నామని టీమ్ యువ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవాలకు ఓక్ విల్లే పార్లమెంట్ మెంబర్ సిమా అకన్, మేయర్ రాబ్ బుర్టన్ లు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. భారతీయుల పండగలు కలర్ ఫుల్ గా ఉంటాయని మెచ్చుకున్నారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఉత్సవాల కోసం ప్రత్యేక సందేశం పంపారు. భిన్నత్వంలో ఏకత్వమనే సందేశాన్ని గణేష్ నవరాత్రులు నిరూపిస్తాయని ఆమె తెలిపారు.ఆనందోత్సహాల మధ్య జరిగిన ఈ వేడుకలకు రఘు యాదవ్, మధు రెడ్డి, హరీశ్వర్, వెంకట్, శివకుమార్, అభిలాష్, అరుణ్ రెడ్డి, మనీష్, దినేష్, సృజన్ తదితరుల నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ అన్ని ఏర్పాట్లు చేసి విజయవంతం చేసింది. -
ఇంగ్లండ్‌తో ఐర్లాండ్ చారిత్రక సిరీస్.. ప్రత్యేక ఆకర్షణగా కెనడా కుర్రాడు
త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగబోయే చారిత్రక టీ20 సిరీస్‌కు ముందు ఐర్లాండ్ క్రికెట్ బోర్డు ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన 14 మంది సభ్యుల జట్టులో కెనడా కుర్రాడికి చోటు కల్పించింది. 23 ఏళ్ల బెన్ కాలిట్జ్ అండర్-19 స్థాయి వరకు కెనడాకు ప్రాతినిథ్యం వహించాడు. ఇటీవలే ఐర్లాండ్‌కు వలస వచ్చాడు. ఐర్లాండ్ పౌరసత్వం పొందడం ద్వారా కాలిట్జ్ జాతీయ జట్టు ఎంపికకు అర్హత సాధించాడు.ఎడమ చేతి వాటం బ్యాటర్, రైట్ ఆర్మ్ స్లో బౌలర్ అయిన కాలిట్జ్కు ఇదే తొలి అంతర్జాతీయ అవకాశం. కాలిట్జ్కు 17 టీ20లు, 11 లిస్ట్-A మ్యాచ్‌లు, ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. గతంలో ఐర్లాండ్ తరఫున చాలామంది విదేశీ ఆటగాళ్లు ఆడినప్పటికీ.. ఇంగ్లండ్‌తో హోం టీ20 సిరీస్‌లో కాలిట్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాడు.ఈ సిరీస్‌కు పాల్ స్టిర్లింగ్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. హ్యారీ టెక్టర్, కర్టిస్ క్యాంఫర్, జార్డన్ నీల్, లార్కన్ టక్కర్ వంటి కీలక ఆటగాళ్లు జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన ఫాస్ట్ బౌలర్ జోష్ లిటిల్ మాత్రం ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. ఈ సిరీస్ ఐర్లాండ్‌కు ఇంగ్లండ్‌తో తొలి హోమ్ టీ20 సిరీస్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ డబ్లిన్‌లోని ది విలేజ్ వేదికగా జరుగనున్నాయి.షెడ్యూల్:తొలి టీ20: సెప్టెంబర్ 17 రెండో టీ20: సెప్టెంబర్ 19 మూడో టీ20: సెప్టెంబర్ 21 ఐర్లాండ్ జట్టు: పాల్ స్టిర్లింగ్ (కెప్టెన్), రాస్ అడైర్, బెన్ కాలిట్జ్, కర్టిస్ కాంఫర్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, గ్రాహం హ్యూమ్, మాథ్యూ హంఫ్రీస్, బ్యారీ మెక్‌కార్తీ, జోర్డాన్ నీల్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్, బెన్ వైట్, క్రెయిగ్ యంగ్. -
ఖలిస్తానీలకు కెనడా నుంచే... ఆర్థిక దన్ను!
ఒట్టావా: కెనడా గడ్డనుంచి భారత్‌పై విషం కక్కుతున్న ఖలిస్తానీ ముఠాలు ఆర్థికంగా స్థానికంగానే వేళ్లూనుకుని ఉన్నట్టు మరోసారి రుజువైంది. బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్, ద ఇంటర్నేషనల్ సిఖ్ యూత్ ఫెడరేషన్ అనే రెండు స్థానిక ఖలిస్తానీ అతివాద సంస్థలకు కెనడా నుంచే ఆర్థిక మద్దతు పుష్కలంగా అందుతున్నట్టు స్వయానా కెనడా ప్రభుత్వమే విడుదల చేసిన నివేదిక తేల్చడం విశేషం. తేలింది. ‘కెనడాలో మనీ లాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రిసు్కలపై మదింపు–2025’పేరిట విడుదలైన ఈ నివేదిక, కెనడాతో పాటు ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ఖలిస్తానీ గ్రూపులు ఇష్టారాజ్యంగా నిధుల వసూళ్లకు పాల్పడుతున్నాయంటూ ఆందోళన వెలిబుచ్చింది. పంజాబ్‌లో ప్రత్యేక ఖలి స్తానీ రాజ్య స్థాపనే లక్ష్యంగా 1980ల నుంచీ కెనడా లో రాజకీయ ప్రాపకంతో కూడిన హింసాత్మక అతివాదం (పీఎంవీఈ) నిర్నిరోధంగా పెచ్చరిల్లుతోందని స్వయానా కెనడా నిఘా సంస్థే రెండు నెలల క్రితం ఓ నివేదికలో ప్రభుత్వాన్ని హెచ్చరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజా నివేదిక సంచలనం రేపుతోంది. అంతర్జాతీయంగా హమాస్, హెజ్బొల్లా వంటి ఉగ్ర, అతివాద సంస్థలు ఈ పీఎంవీఈ జాబితాలోకి వస్తాయి. కెనడాలో అతిపెద్ద మనీ లాండరింగ్ జాఢ్యాల్లో డ్రగ్స్ అక్రమ సరఫరా ఒకటి. -
ప్రపంచంలో ఎక్కడా జరగనిది.. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇదే తొలిసారి!
148 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్లో కెనడా జట్టు అత్యంత చెత్త రికార్డును మూట కట్టకుంది. ఇంటర్నేషనల్ క్రికెట్లో ఇన్నింగ్స్ తొలి రెండు బంతులకే ఓపెనర్లు వికెట్లు కోల్పోయిన మొదటి జట్టుగా కెనడా నిలిచింది. ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2లో భాగంగా ఇటీవలే కెనడా, స్కాట్లాండ్ జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన స్కాట్లాండ్ తొలుత కెనడాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కెనడాకు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. తొలి బంతికే కెనడా ఓపెనర్ అలీ నదీమ్‌ను స్కాటిష్ పేసర్ బ్రాడ్ క్యూరీ పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత క్రీజులోకి పర్గత్ సింగ్ వచ్చాడు.అయితే ఇక్కడే అనుహ్య సంఘటన చోటు చేసుకుంది. రెండో బంతిని పర్గత్ సింగ్ స్ట్రెయిట్ డ్రైవ్ ఆడాడు. కానీ దురదృష్టవశాత్తూ బంతి బౌలర్ చేతి వేలు తాకుతూ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో బెయిల్స్‌ను గిరాటేసింది. దీంతో నాన్‌స్ట్రైక్‌లో ఉన్న మరో ఓపెనర్ యువరాజ్ సమ్రా రనౌటయ్యాడు. యువరాజ్ కనీసం ఒక్క బంతి కూడా ఆడకుండా డైమండ్ డక్‌గా పెవిలియన్ చేరాల్సింది. అంతర్జాతీయ క్రికెట్లో తొలి ఓవర్లోనే ఇలా వరుస బంతుల్లో ఓపెనర్లు ఔట్ కావడం ఇదే మొదటి సారి. స్కాట్లాండ్ ఘన విజయం..ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా 48.1 ఓవర్లలో 184 పరుగులకు ఆలౌటైంది. కెనడా బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయాస్ మొవ్వ(60) టాప్ స్కోరర్‌గా నిలవగా.. జస్కరన్ సింగ్(32) పరుగులతో రాణించారు. స్కాట్లాండ్ బౌలర్ క్యూరీ నాలుగు వికెట్లు పడగొట్టి కెనడా పతనాన్ని శాసించాడు. అతడితో పాటు బ్రాండన్ మెక్‌ముల్లెన్ రెండు.. వాట్, షరీఫ్ తలా వికెట్లు సాధించారు. అనంతరం 185 పరుగుల లక్ష్యాన్ని స్కాట్లాండ్ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 41.5 ఓవర్లలో చేధించింది. ఓపెనర్ మున్సీ(84 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.చదవండి: సెంచరీతో చెలరేగిన స్టార్ ప్లేయర్.. టీమిండియా అరంగేట్రం ఖాయం!? -
కెనడా అవుట్.. రేసులోకి భారత్.. ఆతిథ్య హక్కులు మనకే!
న్యూఢిల్లీ: 2030 కామన్వెల్త్ క్రీడలను స్వదేశంలో నిర్వహించాలనే ఉద్దేశంతో వేసిన బిడ్‌ను భారత ఒలింపిక్ సంఘం (IOA) బుధవారం ఆమోదించనుంది. అంతర్జాతీయ క్రీడా పోటీలకు ఆతిథ్యమివ్వాలని చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న భారత్... 2036 ఒలింపిక్స్ నిర్వహణకు సైతం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో విశ్వక్రీడలకు ముందు కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించి మన సత్తా ప్రపంచానికి చాటాలనుకుంటోంది.ఇప్పటికే ఈ క్రీడలు నిర్వహించేందుకు ఆసక్తి ఉన్నట్లు కామన్వెల్త్ గేమ్స్ సమాఖ్యకు భారత్ వెల్లడించింది. అహ్మదాబాద్‌లో పోటీలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. బిడ్లు దాఖలు చేసేందుకు ఈ నెల 31 తుదిగడువు కాగా... దానికి ముందే ఫైనల్ బిడ్ వేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న భారత ఒలింపిక్ సంఘం ప్రత్యేక సర్వసభ్య సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో పాటు ఇతర అంశాలు సైతం సమావేశంలో చర్చకు రానున్నాయి.ఆతిథ్య రేసు నుంచి కెనడా అవుట్ఇక ఆతిథ్య రేసు నుంచి కెనడా తప్పుకోవడంతో... భారత్‌కే హక్కులు దక్కే అవకాశాలున్నాయి. కామన్వెల్త్ గేమ్స్ డైరెక్టర్ డారెన్ హాల్ నేతృత్వంలోని అధికారుల బృందం మూడు రోజుల పాటు అహ్మదాబాద్‌లో పర్యటించి వేదికలను పరిశీలించింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించింది.ఈ నెలాఖరులో కామన్వెల్త్ గేమ్స్‌కు చెందిన మరో ప్రతినిధి బృందం భారత్‌ను సందర్శించనుంది. ఆతిథ్య హక్కుల ప్రకటన ఈ ఏడాది నవంబర్‌లో వెలువడే అవకాశాలున్నాయి. ‘కామన్వెల్త్ గేమ్స్ ఆతిథ్య హక్కులు పలు అంశాలతో ముడిపడి ఉంటాయి. క్రీడా సదుపాయాలు, ప్రభుత్వ సహకారం, నిర్ణయాల్లో స్థిరత్వం, ఆకర్షణ ఇలాంటివి కీలకం. 2030 కామన్వెల్త్ ఆతిథ్య హక్కులు భారత్‌కే దక్కుతాయనే నమ్మకముంది’ అని ఐఓఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు హర్పాల్ సింగ్ పేర్కొన్నారు. చదవండి: మీకు ఆటే ముఖ్యమా?: బీసీసీఐ తీరుపై హర్భజన్ ఆగ్రహం -
పాలు రూ.396, బ్రెడ్ రూ.230: కెనడాలో ఇంత రేటా?
కెనడాలో నివసిస్తున్న.. భారతీయ మహిళ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇందులో రెండు దేశాల మధ్య కిరాణా ధరలలో వ్యత్యాసం ఎలా ఉన్నాయో చూసి.. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోతున్నారు.''బ్రెడ్, పాలు మాత్రమే కొన్న తర్వాత ఎప్పుడైనా విసుగు చెందినట్లు అనిపించిందా?.. కెనడాకు స్వాగతం. భారతదేశంలో కిరాణా ధరలు వర్సెస్ కెనడా ధరలు. షాక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి'' అంటూ.. ఇన్‌స్టా యూజర్ వీడియో షేర్ చేశారు.వీడియోలో గమనిస్తే.. ఒక క్యాలీఫ్లవర్ ధర రూ. 237.25, అల్లం రూ. 177.30, క్యారెట్ రూ. 66.88, ఒక మామిడి రూ. 106, ఒక యాపిల్ రూ. 78.87, ఒక బంగాళాదుంప రూ. 78.24, నాలుగు లీటర్ల పాలు రూ. 396.25, బ్రెడ్ రూ. 230 ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే కెనడాలో నిత్యావసరాల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.ఇదీ చదవండి: నీతా అంబానీ రూ.100 కోట్ల కారు: దీని స్పెషాలిటీ ఏంటంటే?ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ధరలు చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు సంపాదించేది డాలర్లలో ఉన్నప్పుడు, ధరలను మాత్రం రూపాయల్లో ఎందుకు పోల్చుతున్నారు అని అన్నారు. View this post on Instagram A post shared by Kanupria | Canada Explorer (@kanutalescanada) -
క్రికెట్లో పెను సంచలనం.. 5 బంతుల్లో మ్యాచ్ ఫినిష్
అండర్ -19 వరల్డ్ కప్ అమెరికా క్వాలిఫయర్స్‌లో పెను సంచలనంం నమోదైంది. క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓ జట్టు 5 బంతుల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఈ అరుదైన రికార్డును కెనడా అండర్-19 జట్టు తమ పేరిట లిఖించుకుంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి పరమ్ వీర్స్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా అర్జెంటీనా అండర్-19, కెనడా అండర్-19 జట్లు తలపడ్డాయి.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అర్జెంటీనా కెప్టెన్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే కెప్టెన్ నిర్ణయానికి అర్జెంటీనా జట్టు ఏ మాత్రం న్యాయం చేయలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అర్జెంటీనా.. కెనడా బౌలర్ల ధాటికి 19.4 ఓవర్లలో కేవలం 23 పరుగులకే కుప్పకూలింది. కెనడా పేసర్ జగ్మన్దీప్ పాల్ 6 వికెట్ల పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు డొమినిక్ డైన్స్టర్, క్రిష్ మిశ్రా తలా రెండు వికెట్లు సాధించారు. అర్జెంటీనా బ్యాటర్లలో ఒక్కరంటే ఒక్కరూ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. టొమోస్ రస్సీ(6) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 23 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కెనడా కేవలం 5 బంతుల్లోనే చేధించింది. ఓపెనర్ ధర్మ్ పటేల్ (1 నాటౌట్) తొలి బంతికి సింగిల్ తీయగా.. మరో ఓపెనర్ యువరాజ్ సమ్రా(22 నాటౌట్) నాలుగు బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు.కాగా యూత్ వన్డే క్రికెట్లో అత్యల్ప స్కోర్ రికార్డు మాత్రం స్కాట్లాండ్ పేరిట ఉంది. 2004 అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియాపై స్కాట్లాండ్ 22 పరుగులకే కుప్పకూలింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఆసీస్ 3.5 ఓవర్లలో ఛేదించింది.చదవండి: Jos Buttler: తండ్రి మరణం.. స్టార్ క్రికెటర్ భావోద్వేగం -
కపిల్ శర్మ టార్గెట్.. ఇంటి వద్ద భారీ భద్రత!
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మకు భారీగా భద్రతను పెంచారు. ఇటీవల మరోసారి కెనడాలోని ఆయన కేఫ్‌పై కాల్పులు జరగడంతో ముంబయి పోలీసులు చర్యలు చేపట్టారు. ముందస్తు చర్యల్లో భాగంగా కపిల్ శర్మ ఇంటి వద్ద భద్రత ఏర్పాటు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.కాగా.. ఆగస్టు 8న కెనడాలోని సర్రేలో ఉన్న కపిల్ శర్మ ఇటీవల ప్రారంభించిన రెస్టారెంట్ కాప్స్ కేఫ్‌పై కాల్పులు జరిగాయి. నెలలోపే ఇది రెండవ ఘటన కావడం ఆందోళనకు గురి చేస్తోంది. గతంలోనే జూలై 10న ఇదే తరహాలో దాడి జరిగింది. కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఈ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం.రెండోసారి దాడి తర్వాత బిష్ణోయ్ సన్నిహితుడు హ్యారీ బాక్సర్ నుంచి ఆడియో సందేశం వచ్చినట్లు తెలుస్తోంది. కపిల్ శర్మ నెట్‌ఫ్లిక్స్ షో ప్రీమియర్‌లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కనిపించడమే దీనిని కారణమని ఆడియో సందేశంలో పేర్కొన్నారు. సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే వారిని బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యంగా పని చేస్తుందని ఆడియోలో వార్నింగ్ ఇచ్చారు. దీంతో ముంబయి పోలీసులు ఓషివారాలోని కపిల్ శర్మ నివాసాన్ని సందర్శించి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. -
మరోసారి కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పుల కలకలం
ఒట్టావా: ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ కేఫ్‌పై మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కెనడాలోని సర్రీలో ఉన్న ఈ ‘కాప్స్ కేఫ్’పై నిందితులు కాల్పులకు తెగబడ్డారు. అయితే,ఈ దాడికి పాల్పడింది తామేనని గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోల్డీ ధిల్లాన్,లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముఠా ప్రకటించింది. ఈ కాల్పుల సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాప్స్ కేఫ్‌పై నిందితులు సుమారు 25 రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పులు జరిపే సమయంలో.. నిందితులు సంభాషణలు వెలుగులోకి వచ్చాయి. ‘మేం మిమ్మల్ని సంప్రదించే ప్రయత్నం చేశాం. కానీ మీరు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టే ఈ దాడికి తెగబడ్డాం.. ఇప్పుడు కూడా మా హెచ్చరికల్ని పట్టించుకోకపోతే.. మరో దాడి ముంబైలో జరుగుతుంది’ అని హెచ్చరించడాన్ని గమనించొచ్చు.సంభాషణ ఆధారంగా.. నిందితులు కపిల్ శర్మను కలిసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. వాళ్లు ఏ విధంగా కపిల్ శర్మను సంప్రదించే ప్రయత్నం చేశారు అన్నది తెలియాల్సి ఉంది. కపిల్ శర్మకు బెదిరింపులతో ముంబై పోలీసులు, ఇతర భద్రతా సంస్థలు అప్రమత్తయ్యాయి. కాగా,కపిల్ శర్మ కొత్తగా ప్రారంభించిన కాప్స్ కేఫ్‌పై తొలిదాడి గత జులై నెలలో జరిగింది. సిబ్బంది లోపల ఉండగానే జరిగిన ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఆస్తినష్టం మాత్రం జరిగింది. తానే కాల్పులు జరిపానని ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిత్‌సింగ్ లద్ధీ ప్రకటించాడు. కపిల్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలపై అసంతృప్తితోనే ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. -
ఓటమితో వీడ్కోలు.. టెన్నిస్ స్టార్ కన్నీటి పర్యంతం
మాంట్రియల్: కెనడాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ జెనీ బుచార్డ్ ఆటకు వీడ్కోలు పలికింది. సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో కెరీర్లో చివరి మ్యాచ్ ఆడేసింది. నేషనల్ బ్యాంక్ ఓపెన్‌లో భాగంగా గురువారం మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో బుచార్డ్ 2–6, 6–3, 4–6తో 17వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) చేతిలో ఓడింది. తొలి రౌండ్లో పోరాడి గెలిచిన బుచార్డ్... రెండో రౌండ్లో అదే ఆటతీరు కనబర్చలేకపోయింది. 2 గంటల 16 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో... తొలి సెట్లో ఓడిన బుచార్డ్... ఆ తర్వాత పుంజుకుంది. రెండో సెట్ గెలిచి... మూడో సెట్లోనూ చక్కటి పోరాటం కనబర్చినా... కీలక సమయాల్లో ఆధిక్యం కనబర్చిన బెన్‌చిచ్ విజయం సాధించింది. ప్రత్యేక అనుబంధం‘మాంట్రియల్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. కెరీర్ ఆరంభించినప్పటి నుంచి ఎదో ఒక రోజు ఇదే మైదానంలో ఆటకు వీడ్కోలు పలకాలని బలంగా అనుకునే దాన్ని. ఇప్పుడు ఆ రోజు వచ్చేసింది. ఇదో భావోద్వేగ సందర్భం. కెరీర్లో సాధించిన దాంతో సంతృప్తిగా ఉన్నా’ అని బుచార్డ్ పేర్కొంది. 2014లో కెరీర్ అత్యుత్తమ దశలో ఉన్న సమయంలో బుచార్డ్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా 5వ స్థానానికి చేరింది. ఆ ఏడాదే కెరీర్లో ఏకైక డబ్ల్యూటీఏ సింగిల్స్ టైటిల్ నెగ్గిన ఆమె.... ఆ్రస్టేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోరీ్నల్లో సెమీఫైనల్‌కు చేరింది. 2014లో వింబుల్డన్ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయిన బుచార్డ్... తిరిగి పుంజుకోలేకపోయింది. కన్నీటి పర్యంతం‘ఎన్నో కష్టనష్టాలు ఓర్చి ఇక్కడి వరకు వచ్చా. టెన్నిస్ ధ్యాసలో పడి చదువుకు దూరమయ్యా. ఇష్టాలను వదులుకొని ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి చేరుకున్నా. నేను ఆటకు ఎంతో ఇచ్చాను. ఇక ఆటకు వీడ్కోలు పలికి ఇతర విషయాలపై దృష్టి పెట్టాలనుకుంటున్నా. టెన్నిస్ నాకు తిరిగిచి్చన దాంతో సంతృప్తిగా ఉన్నా. చిన్నప్పుడు ఈ మైదానంలో కూర్చొని మ్యాచ్‌లు వీక్షించేదాన్ని. ఏదో ఒక రోజు ఈ కోర్టులో అడుగు పెట్టాలని కలలు కనేదాన్ని. అది నిజం చేసుకొని సగర్వంగా ఇక్కడే ఆటకు వీడ్కోలు పలుకుతున్నా’ అని మ్యాచ్ అనంతరం బుచార్డ్ కన్నీటి పర్యంతమైంది. -
పాలస్తీనాను గుర్తిస్తాం: కెనడా
ఒట్టావా: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో పాలస్తీనాను గుర్తించే విషయంలో ఫ్రాన్స్, యూకేల బాటలో పయనించాలని కెనడా నిర్ణయించుకుంది. గాజాలో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న అరాచకాలకు నిరసనగా పాలస్తీనా దేశాన్ని గుర్తించాలనుకుంటున్న కెనడా ప్రధాని మార్క్ కార్నీ బుధవారం ప్రకటించారు. శాంతియుతంగా చర్చల ద్వారా ఇజ్రాయెల్– పాలస్తీనా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని తమకు నమ్మకం పోయిందని ఆయన వివరించారు. అందుకే సెప్టెంబర్‌లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీ 80వ సెషన్లో పాలస్తీనా దేశాన్ని గుర్తించాలని అనుకుంటున్నామన్నారు. అయితే, సంస్కరణలతో, 2026లో సాధారణ ఎన్నికలు జరిపేందుకు పాలస్తీనా అథారిటీ నుంచి గట్టి హామీ లభించాల్సి ఉందన్నారు. భవిష్యత్తులో పాలస్తీనాలో హమాస్‌కు ఎటువంటి పాత్ర ఉండరాదని, ఎన్నికల్లో పాల్గొనరాదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి బదులుగా శాంతిని కోరుకునే ప్రజలందరి కోసమే రెండు దేశాల విధానాన్ని బలపరుస్తున్నామని కార్నీ తెలిపారు. -
#KatyTrudeau: స్నేహమా? రొమాంటిక్ రిలేషనా?
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి వార్తల్లో నిలిచారు. గ్లోబల్ పాప్ స్టార్ కేటీ పెర్రీ(40)తో సన్నిహితంగా ఉంటూ కనిపించారాయన. రెండురోజుల వ్యవధిలో.. రెండుసార్లు జంటగానే వాళ్లు కెమెరాకు చిక్కారు. దీంతో.. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. కెనడా (Canada) ప్రధాని పదవి నుంచి ట్రూడో జనవరిలో వైదొలిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన మీడియా కంట పడుతోంది చాలా తక్కువే. మరోవైపు.. తన కొత్త ఆల్బమ్ 143 ప్రమోషన్స్ కోసం పెర్రీ ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలో.. వీరిద్దరూ మాంట్రియల్లో చెట్టాపట్టాలేసుకుని కనిపించారు. తాజాగా.. జులై 28వ తేదీన ఈ జంట ప్రైవేట్ డిన్నర్‌కు వెళ్లింది. ప్రైవేట్ కార్నర్ టేబుల్ వద్ద కూర్చొని వీరిరువురూ విందు ఆరగించారు. ఆ తర్వాత ఇద్దరూ కొంత సమయం మాట్లాడుకున్నారు. ఆపై రెస్టారెంట్‌లోని కిచెన్‌ను పరిశీలించి సిబ్బందికి వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలిపారు. అక్కడి నుంచి.. సమీపంలోని ఓ బార్‌లోనూ ఈ ఇద్దరూ కనిపించారు. ఆ టైంలో వీరు కలిసి మాట్లాడుకుంటున్న దృశ్యాలను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఆ మరుసటిరోజు.. మౌంట్ రాయల్ పార్క్‌లో గంటకు పైగా జంటగా వాకింగ్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం వీళ్లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో ట్రూడో, పెర్రీలు డేటింగ్లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని ట్రూడో, పెర్రీ తరఫున ఎవరూ ఖండించలేదు. ట్రూడో(53) తన సతీమణి సోఫీ గ్రెగోయిర్తో 2023లో విడిపోయిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల తమ వివాహబంధానికి స్వస్తి పలుకుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టుల ద్వారా ఈ విషయం వెల్లడించారు. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అటు పెర్రీ కూడా ఈ ఏడాది ప్రారంభంలో నటుడు ఓర్లాండ్ బ్లూమ్తో విడిపోయారు. వీరికి ఒక కుమార్తె ఉంది.వీళ్లది స్నేహమా? లేదంటే రొమాంటిక్ రిలేషనా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. -
మోజు తగ్గుతోంది.. మొగ్గు మారుతోంది..!
విదేశాల్లో చదువు కోవడం అంటే భారత విద్యార్థులకు మోజు.. అందులోనూ అమెరికా, కెనడా, యూకే వంటి దేశాల్లో చదవడం అంటే అది మరింత క్రేజు. మరి ఇప్పుడు భారత విద్యార్థుల అభిరుచి మారిందా? అంటే అవుననక తప్పదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విదేశాల్లో చదవడం కష్టతరంగా మారింది. ప్రధానంగా వీసా నిబంధనలు కఠినతరం కావడం, ఖర్చులు పెరగడం వంటి తదితర కారణాలతో భారత విద్యార్థులు విదేశాల్లో చదవాలనే ఆసక్తి తగ్గిపోతోంది. అదే సమయంలో భారతదేశంలోనే మెరుగైన అవకాశాలు లభించడం వంటి కారణాలతో విదేశాల్లో చదువుకు వెనకడుగు వేస్తున్నారు. విదేశాల్లో భారత విద్యార్థుల చదువుల అంశానికి సంబంధించి పలు నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. యూఎస్, యూకేను వదిలేద్దాం..!గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య గణనీయకంగా తగ్గింది. 2023 నాటికి విదేశాల్లో చదివే భారత విద్యార్థుల సంఖ్య 8.92 లక్షలు ఉండగా, అది 2024 నాటికి 7.59 లక్షలకు తగ్గింది. దీనికి కారణాలు మాత్రం ప్రధానంగా అగ్రదేశాలైన యూఎస్ఏ, యూకే, కెనడాల్లో చదవాలనే కోరిక ఒకటి. అయితే ఈ దేశాల్లో వీసాల నిబంధనలు కఠినతరంగా మారాయి. దాంతో అమెరికా, యూకే, కెనడాలపై దృష్టి పెట్టడం లేదు. దాంతో విదేశాల్లో చదవాలనుకునే భారత్ విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదొక కారణంగా మారింది. ప్రస్తుతం పలువురు విద్యార్థుల మాత్రమే యూఎస్, యూకేలపై దృష్టి సారిస్తుండగా, అధిక శాతం మంది మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఇందులో కొంతమంది భారత్‌లోనే ఉన్నత చదువులకు ఆసక్తి చూపిస్తుండగా, మరి కొంతమంది మాత్రం వీసా నిబంధనలు సులభతరంగా ఉండి ఫీజులు తక్కువగా ఉండే దేశాల వైపు మొగ్గు చూపిస్తున్నారు.కెనడా అసలే వద్దు..!గతంలో అమెరికాలో చదువు కోవడానికి వీలు లేకపోతే, కెనడా వైపు దృష్టి సారించే వారు అధిక శాతం మంది భారత విద్యార్థులు. అయితే జస్టిన్ ట్రూడో హయాంలో భారత్-కెనడా దౌత్స సంబంధాలు దెబ్బ తినడంతో పాటు అక్కడ వీసా నిబంధనలు కూడా కఠినతరంగా మారాయి.ట్రూడో హయాంలో వీసా పరిమితులు, ఎస్డీఎస్ (Student Direct Stream ప్రోగ్రాం రద్దు, వర్క్ పరిమితులు వంటి మార్పులు భారత విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఒక విషయాన్ని గమనిస్తే 2023లో 2.33 లక్షల మంది విద్యార్థులు కెనడా వెళ్లగా, 2024లో అది కాస్తా1.37 లక్షలకు పడిపోయింది. అంటే కెనడా అసలే వద్దు అనే నిర్ణయానికి అధిక శాతం భారత విద్యార్థులు వచ్చారనేది ఈ గణాంకాల్ని బట్టి అర్ధమవుతోంది.బంగ్లా, ఉజ్బెకిస్థాన్‌లో ఉన్నత చదువులు..విదేశాల్లో చదువాలనుకునే భారత విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం ఒకటైతే, అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్లడానికి వీసా తదితర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో బంగ్లదేశ్, ఉజ్భెకిస్తాన్, సింగపూర్, రష్యా వైపు మొగ్గు చూపిస్తున్నారు. 2023లో 20,368 మంది భారత విద్యార్థులు బంగ్లాదేశ్ వైపు మొగ్గు చూపగా, మరుసటి ఏడాదికి అది కాస్త పెరిగి 29,232కు చేరింది. 2023 నాటికి ఉజ్బెకిస్థాన్‌లో చదువుకునే భారత విద్యార్థుల సంఖ్య 6, 601 ఉంగా, అది 2024 నాటికి 9,915 చేరింది. ఇక 2023లో రష్యా వైపు 25,503లో భారత విద్యార్థులు ఆసక్తి చూపగా, 2024 నాటికి 31,444 విద్యార్థులకు చేరింది. ఇక సింగపూర్ విషయానికొస్తే ఏడాదిలో 12,000 నుంచి 14,000 మంది విద్యార్థులకు చేరింది. ఎందుకీ మార్పు..?అసలు విదేశాల్లో చదువు అనేది భారీ ఖర్చుతో కూడుకున్నదైతే, అందులో వీసా తదితర నిబంధనల్లో భారీగా మార్పులు చేయడం మరొకటి. ఇది ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపిస్తోంది. యూఎస్, యూకే, కెనడాల్లోనే వీసా నిబంధనల్లో కఠినమైన మార్పులు వచ్చాయి. దాంతో ‘ ఎందుకీ తలనొప్పి’ అని భావించే చిన్న దేశాల వైపు చూస్తున్నారు. తక్కువ ఖర్చుతో మెడికల్, టెక్నికల్ విద్య పూర్తి చేసే అవకాశాలు అధికంగా ఉండటంతో పాటు వీసా ప్రక్రియ సులభతరంగా ఉండటం మరొక కారణం. భారతీయ విద్యార్థులకు అనుకూలమైన కోర్సులు కూడా ఆయా దేశాల్లో ఉండటం కూడా ప్రత్యామ్నాయంగా వాటివైపు చూడటానికి ప్రధానమైన అంశంగా మారింది ఇక భద్రత పరంగా కూడా అక్కడ పెద్దగా ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఉండవని భావించే బంగ్లాదేశ్, సింగపూర్, రష్యా, ఉజ్బెకిస్థాన్ తదితర దేశాల వైపు చూడటానికి మరొక కారణంగా చెప్పవచ్చు. -
రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ భామ
మాంట్రియల్: కెనడా టెన్నిస్ స్టార్ జెనీ బుచార్డ్ తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. మాంట్రియల్ ఓపెన్ టోర్నీ అనంతరం ఆటకు వీడ్కోలు పలుకుతానని గురువారం ప్రకటించింది. ఈ ఏడాది ఆఖరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ అయిన యూఎస్ ఓపెన్‌కు ముందు సన్నాహక టోర్నీగా నిర్వహించే ‘నేషనల్ బ్యాంక్ ఓపెన్’ త్వరలో మాంట్రియల్లో జరుగుతుంది.‘ప్రతీ దానికి టైమ్ ఉంటుంది. అలాగే నేను నిష్క్రమించే టైమ్ వచ్చింది. ఎక్కడ కెరీర్‌ను మొదలు పెట్టానో అక్కడే టెన్నిస్‌ను ముగించబోతున్నాను’ అని సోషల్ మీడియాలో బుచార్డ్ పోస్ట్ చేసింది. కెరీర్లో 299 విజయాలు, 230 పరాజయాల రికార్డును కలిగిన బుచార్డ్ 2023లో కెనడా గెలిచిన బిల్లీ జీన్ కింగ్ కప్‌లో కీలకపాత్ర పోషించింది. 2014లో బుచార్డ్ సూపర్ ఫామ్ చాటుకుంది.ఆ ఏడాది వింబుల్డన్‌లో రన్నరప్‌గా నిలిచిన ఈ కెనడా స్టార్ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్లలో సెమీఫైనల్ దాకా పోరాడింది. తద్వారా కెరీర్ బెస్ట్ ఐదో ర్యాంక్‌కు ఎగబాకింది. అయితే మరుసటి ఏడాది ఆ్రస్టేలియన్ ఓపెన్‌లోనూ క్వార్టర్స్ చేరిన ఆమెకు యూఎస్ ఓపెన్ చేసిన గాయం కెరీర్‌ను దెబ్బతీసింది.2015లో యూఎస్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్ చేరిన ఆమె లాకర్ రూమ్ వద్ద జారిపడింది. దీంతో కన్‌కషన్‌కు గురైన ఆమె టోర్నీ నుంచి అర్ధంతరంగా వైదొలగింది. దీనిపై యూఎస్ ఓపెన్ నిర్వాహకులపై విమర్శలు వచ్చాయి. సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఆమె గాయపడిందని జ్యూరీ విచారణలో తేలింది. -
బిష్ణోయ్ గ్యాంగ్‌కు టెర్రర్ ట్యాగ్?.. కెనడాలో పెరుగుతున్న ఒత్తిడి
ఒట్టావా: కెనడాతో సహా ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..హింస, దోపిడీ, మాదకద్రవ్యాల అక్రమ రవాణాతో పాటు, పలు హత్యలకు పాల్పడుతున్నదని కెనడియన్ నేత డేనియల్ స్మిత్ పేర్కొన్నారు. ఈ గ్యాంగ్ అంతర్జాతీయ నేర నెట్వర్క్ కలిగివున్నదని, అందుకే ఈ గ్యాంగ్‌కు టెర్రర్ ట్యాగ్ ఇవ్వాలని ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్‌లో కోరారు.లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ లక్ష్యం నేరపూరితమైనదని, హింసాత్మకమైనదని స్మిత్ ఆ పోస్టులో పేర్కొన్నారు. ఈ ముఠా కార్యకలాపాలకు ఎటువంటి హద్దులు లేవని, దీనికి దేశంలో స్థానం ఉండకూడదని అన్నారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా అధికారికంగా గుర్తించడం ద్వారా, దాని ఆటలు ఇకపై సాగవని , ప్రాంతీయ స్థాయి చట్ట అమలు సంస్థల కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడదని స్మిత్ పేర్కొన్నారు. కాగా బిష్ణోయ్ నెట్‌వర్క్‌లో కీలకంగా భావిస్తున్న గోల్డీ బ్రార్‌పై చర్యలు తీసుకోవాలని భారత్ ఎప్పటినుంచో కెనడాను కోరుతూ వస్తోంది. The Lawrence Bishnoi Gang is a transnational criminal network responsible for violence, extortion, drug trafficking and targeted killings, including here in Canada. Its reach is global, and its intent is criminal and violent.We know that gang activity knows no boundaries and… pic.twitter.com/wYwdAx3pfT— Danielle Smith (@ABDanielleSmith) July 15, 2025గత జూన్‌లో బ్రిటిష్ కొలంబియా నేత డేవిడ్ ఎబీ కెనడాకు ఇదేవిధమైన అభ్యర్థన చేశారు. ఈ ముఠా అల్బెర్టా, ఒంటారియో ప్రాంతంలోని దక్షిణాసియా ప్రజలపై పలు నేరాలకు పాల్పడిందని డేవిడ్ ఎబీ ఆరోపించారు. ఇదే సమయంలో సర్రే మేయర్ బ్రెండా లాక్ ఈ పిలుపుకు మద్దతునిచ్చారు. బిష్ణోయ్ ముఠాను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తే, కెనడియన్ చట్ట అమలు సంస్థలకు వ్యవస్థీకృత నేర నెట్‌వర్క్‌లతో పోరాడేందుకు అవకాశం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
కమెడియన్ కపిల్‌శర్మ కేఫ్‌పై కాల్పులు.. వీడియో వైరల్!
బాలీవుడ్ స్టార్ కమెడియన్ కపిల్ శర్మ కేఫ్‌పై కాల్పులు జరిపారు. కెనడాలోని ఆయన కేఫ్‌పై గుర్తు తెలియని వ్యక్తి గన్‌తో కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేఫ్‌ను కపిల్ శర్మ ఇటీవలే ప్రారంభించినట్లు తెలుస్తోంది. కారులో వచ్చిన గుర్తు తెలియిని వ్యక్తి కాల్పులు జరపినట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని తెలుస్తోంది. స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది. కపిల్ శర్మను లక్ష్యంగా చేసుకుని దాడి జరిగిందా? కేఫ్ టార్గెట్‌గా చేశారా? అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను రితేష్ లఖి అనే జర్నలిస్ట్ ట్విటర్ వేదికగా షేర్ చేశారు. కాగా.. కపిల్ శర్మ ఇటీవల కెనడాలోని సర్రేలో మూడు రోజుల క్రితమే కాప్స్ అనే పేరుతో కేఫ్‌ను ప్రారంభించారు. ఈ కాల్పుల ఘటనపై ఘటనపై నెటిజన్లు రియాక్ట్ అవుతున్నారు. ఈ సంఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందని చాలా మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.World Famous comedian Kapil Sharma's newly inaugurated restaurant KAP'S CAFE shot at in Surrey, BC, Canada last night.Harjit Singh Laddi, a BKI operative, NIA's (INDIA ) most wanted terrorist has claimed this shoot out citing some remarks by Kapil@SurreyPolice pic.twitter.com/p51zlxXbOf— Ritesh Lakhi CA (@RiteshLakhiCA) July 10, 2025 -
CANADA: కేరళకు చెందిన స్టూడెంట్ పైలట్ శ్రీహరి సుకేశ్ మృతి
-
ఆయుశ్ అదరహో
అయోవా (అమెరికా): నిరీక్షణ ముగిసింది. ఈ ఏడాది భారత ప్లేయర్ ఖాతాలో తొలి అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్ చేరింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన యూఎస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోరీ్నలో భారత ప్లేయర్ ఆయుశ్ శెట్టి విజేతగా అవతరించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ 34వ ర్యాంకర్ ఆయుశ్ శెట్టి 21–18, 21–13తో ప్రపంచ 33వ ర్యాంకర్ బ్రియాన్ యాంగ్ (కెనడా)పై గెలుపొందాడు. ఈ ఏడాది యాంగ్‌పై ఆయుశ్కిది మూడో విజయం కావడం విశేషం. మలేసియా ఓపెన్, తైపీ ఓపెన్ టోర్నీల్లోనూ యాంగ్‌పై ఆయుశ్ నెగ్గాడు. చాంపియన్‌గా నిలిచిన ఆయుశ్‌కు 18 వేల డాలర్ల (రూ. 15 లక్షల 45 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. యాంగ్తో 47 నిమిషాలపాటు జరిగిన తుది పోరులో ఆయుశ్‌కు తొలి గేమ్‌లో గట్టిపోటీ ఎదురైంది. మూడుసార్లు ఇద్దరి స్కోర్లు సమమయ్యాయి. స్కోరు 19–18 వద్ద ఆయుశ్ వరుసగా రెండు పాయింట్లు నెగ్గి తొలి గేమ్ దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో మాత్రం ఆయుశ్ దూకుడు కనబరిచాడు. ఆరంభంలోనే 6–1తో ఆధిక్యంలోకి వెళ్లిన ఆయుశ్ ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని 11–6కు పెంచుకున్నాడు. యాంగ్ కోలుకునే ప్రయత్నం చేసినా జోరు మీదున్న ఆయుశ్ ఎలాంటి అవకాశం ఇవ్వకుండా గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. 2023లో లక్ష్య సేన్ కెనడా ఓపెన్‌లో టైటిల్ సాధించిన తర్వాత ఆయుశ్ శెట్టి రూపంలో మరో భారత ప్లేయర్ అంతర్జాతీయ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్ గెల్చుకున్నాడు. ‘సీనియర్ సర్క్యూట్లో నాకిదే తొలి టైటిల్. ఈ విజయం ఎంతో ప్రత్యేకం. చాలా సంతోషంగా ఉన్నా. గత వారం రోజులుగా అద్భుతంగా ఆడాను. ఇదే జోరును కెనడా ఓపెన్‌లోనూ కొనసాగిస్తాను’ అని కర్ణాటకకు చెందిన 20 ఏళ్ల ఆయుశ్ వ్యాఖ్యానించాడు. 6 అడుగుల 5 అంగుళాల ఎత్తున్న ఆయుశ్ 2023లో ప్రపంచ జూనియర్ చాంపియన్íÙప్లో కాంస్య పతకాన్ని సాధించి వెలుగులోకి వచ్చాడు. రన్నరప్ తన్వీ శర్మ యూఎస్ ఓపెన్ టోరీ్నలో భారత్‌కు ‘డబుల్ ధమాకా’ సృష్టించే అవకాశం చేజారింది. మహిళల సింగిల్స్ విభాగంలో భారత ప్లేయర్ తన్వీ శర్మ రన్నరప్‌గా నిలిచింది. టాప్ సీడ్, ప్రపంచ 21వ ర్యాంకర్ బీవెన్ జాంగ్ (అమెరికా)తో జరిగిన ఫైనల్లో 16 ఏళ్ల తన్వీ శర్మ 11–21, 21–16, 10–21తో పోరాడి ఓడిపోయింది. కెరీర్లో తొలి వరల్డ్ టూర్ ఫైనల్ ఆడిన పంజాబ్‌కు చెందిన తన్వీ ప్రత్యరి్థకి గట్టిపోటీనిచి్చనా చివరకు అనుభవజు్ఞరాలైన బీవెన్ జాంగ్‌దే పైచేయి అయింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 66వ స్థానంలో ఉన్న తన్వీ శర్మకు 9,120 డాలర్ల (రూ. 7 లక్షల 82 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 5950 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
అత్యంత ప్రాచీన రాతి శిలలు
న్యూయార్క్: ఇవేమిటో తెలుసా? భూమిపైనే అత్యంత ప్రాచీనమైన రాతి శిలలు. తూర్పు కెనడాలో క్విబెక్ ప్రావిన్స్‌లో హడ్సన్ బే తీరంలోని నువాగిటిక్ గ్రీన్‌స్టోన్ బెల్ట్‌లో వీటిని గుర్తించారు. అయితే వీటి వయసు ఎంతన్నది సైంటిస్టుల నడుమ తీవ్ర భేదాభిప్రాయాలకు కారణమైంది. ఈ బూడిద రంగు రాళ్లు 400 కోట్ల ఏళ్ల కంటే ముందే ఏర్పడినట్లు తొలుత అంచనా వేశారు. కాదు, 308 కోట్ల ఏళ్ల క్రితం నాటివేనని మరికొందరు సైంటిస్టులు చెప్పుకొచ్చారు. ఎక్కువమంది మాత్రం 370 కోట్ల ఏళ్లనాటివన్న వాదనను అంగీకరించారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ రాళ్ల వయసు లెక్కగట్టి, దాదాపు 416 కోట్ల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయని తేల్చారు. అంటే భూమి శైశవ దశలో ఉన్నప్పుడే రూపుదాల్చాయన్నమాట. భూగోళంపై ఇంతకంటే పురాతన రాళ్లు ఎక్కడా లేవని సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. భూమి పుట్టుక, చరిత్రను అంచనా వేయడానికి ఈ పరిశోధన తోడ్పడుతుందని భావిస్తున్నారు. ‘‘భూమి తొలినాళ్లకు చెందిన హడియన్, ఆర్కియన్ యుగాలకు సంబంధించి మనకిప్పటిదాకా తెలియని ఎన్నో విశేషాలు ఈ శిలల అధ్యయనం ద్వారా వెలుగులోకి వస్తాయి. భౌగోళిక మార్పుల వల్లే ఈ శిలలు ఏర్పడ్డాయి. కాకపోతే ఇప్పటిదాకా చెక్కుచెదరకుండా నిలిచి ఉండడం అద్భుతమే’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ అధ్యయన వివరాలను జర్నల్ సైన్స్‌లో ప్రచురించారు. -
ప్రముఖ సింగర్‌కు అరుదైన గౌరవం.. ఆయన పేరిట ఏకంగా కోర్సు!
ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంజ్‌కు అరుదైన ఘనత దక్కింది. ఆయన పేరుపై ఏకంగా కోర్సు ప్రారంభించనున్నట్లు కెనడాకు చెందిన యూనవర్సిటీ ప్రకటించింది. ఈ పంజాబ్ గాయకుడిపై ఏకంగా కోర్సును అందిస్తున్నట్లు వెల్లడించింది. బోర్న్ టు షైన్ పేరుతో టొరంటో మెట్రోపాలిటన్ యూనివర్సిటీకి చెందిన ది క్రియేటివ్ స్కూల్లో వచ్చే ఏడాది నుంచి అతని పేరిట కోర్సు ప్రారంభించాలని నిర్ణయించింది. తాజాగా జరిగిన సమ్మిట్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.కాగా.. పంజాబ్‌కు చెందిన దిల్జీత్ దోసాంజ్ ప్రపంచ వేదికపై సత్తా చాటారు. గత ఇరవై ఏళ్లుగా అంతర్జాతీయ వేదికలపై తన గాత్రంతో అభిమానులను అలరించారు. 'మూన్‌చైల్డ్ ఎరా', 'గోట్' లాంటి మ్యూజిక్ ఆల్బమ్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. 'మూన్‌చైల్డ్ ఎరా' కెనడియన్ ఆల్బమ్‌ల జాబితాలో ఏకంగా 32వ స్థానానికి చేరుకుంది. ఒక భారతీయ కళాకారుడిగా అరుదైన ఘనత సాధించారు. తాజాగా ఆయనపై కోర్సు అందించడం అతని ప్రతిభకు నిదర్శనమని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.దిల్జీత్ దోసాంజ్ తన నటనా జీవితంలో అద్భుతంగా రాణించారు. 'జాట్ అండ్ జూలియట్', 'పంజాబ్ 1984', 'సజ్జన్ సింగ్ రంగ్రూట్' వంటి అనేక పంజాబీ సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. అలాగే 'ఉడ్తా పంజాబ్' లాంటి బాలీవుడ్ మూవీలోనూ కనిపించారు. గతేడాది 'చమ్కిలా' అనే చిత్రంలో నటనకు గానూ ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా 2023లో అతను తన 'దిల్-లుమినాటి' పర్యటనతో ఉత్తర అమెరికాలో చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత కెనడాలో జరిగిన అతిపెద్ద పంజాబీ కచేరీలతో పేరు సంపాదించారు. -
భారతీయ సంతతి ర్యాపర్ ఓవర్ యాక్షన్ : నెటిజన్ల తీవ్ర అగ్రహం
కెనడియన్ ర్యాపర్,మోడల్ టామీ జెనెసిస్ అత్యుత్సాహంపై సోషల్ మీడియా భగ్గుమంటోంది. తన తాజా మ్యూజిక్ వీడియో 'ట్రూ బ్లూ'లో ఆమె అవతారం కాళీ మాతను పోలి ఉండటం వివాదానికి దారి తీసింది. అసలేంటీ వివాదం? ఎవరీ టామీ జెనెసిస్ తెలుసుకుందామా.భారతీయ సంతతికి చెందిన కెనడియన్ రాపర్ టామీ తన రాబోయే ఆల్బమ్ ప్రమోషన్లో భాగంగా ట్రూ బ్లూ మ్యూజిక్ వీడియో క్లిప్పింగ్స్తోపాటు, కొన్ని చిత్రాలను శనివారం పోస్ట్ చేసింది. ట్రూ బ్లూ ప్రోమోలో నీలిరంగు బాడీ పెయింట్, బంగారు ఆభరణాలు, నుదుటిన ఎర్రటి బొట్టు, శిలువ పట్టుకుని వీడియోను పోస్ట్‌ను షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ఆమెకు ఎదురుదెబ్బ తగిలింది. బికినీ, హై హీల్స్ ధరించి, సాంప్రదాయ భారతీయ శైలి బంగారు ఆభరణాలతో అలంకరించుకోవడం పలువురికి ఆగ్రహం తెప్పించింది. అసభ్యకరంగా రెచ్చగొట్టే విజువల్స్, అనేక మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసిందంటూ నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అటు హిందూవులు, ఇటు క్రైస్తవులను అవమానించి, వారి మనోభావాల్ని అగౌరవపరిచే చర్య అని పేర్కొన్నారు.తమిళ్-స్వీడిష్ సంతతికి చెందిన కెనడియన్ రాపర్ అసలు పేరు జెనెసిస్ యాస్మిన్ మోహన్‌రాజ్. ఈమె తాజా మ్యూజిక్ వీడియోలోకాళీమాతను అభ్యంతరకరంగా చిత్రీకరించిడంతో పాటు, క్రైస్తవ శిలువను అవమానించిందంటూ వివాదం రాజుకుంది. లైక్‌లు,వ్యూస్‌కోసం దైవాన్ని దూషించడం, మనోభావాల్ని దెబ్బతీయడం ఫ్యాషన్‌గా మారిపోయిందంటూ నెటిజన్లు మండి పడుతున్నారు."ఇది కేవలం మతాలను మాత్రమే కాదు భారతీయ సంస్కృతిని కూడా అపహాస్యం చేసిందంటూ సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదీ చదవండి: ‘శ్వాస ముద్ర’ ఇజ్రాయెల్ శాస్త్రవేత్తల న్యూ స్టడీ : ఆశ్చర్యకర ఫలితాలు -
టీ20 ప్రపంచ కప్ 2026కు ఆర్హత సాధించిన కెనడా..
టీ20 ప్రపంచ కప్ 2026కు కెనడా జట్టు ఆర్హత సాధించింది. శనివారం కింగ్ సిటీ వేదికగా జరిగిన అమెరికాస్ క్వాలిఫైయర్‌లో బహామాస్‌పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన కెనడా.. వరల్డ్‌కప్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. పొట్టి ప్రపంపకప్నకు కెనడా క్వాలిఫై కావడం ఇదే రెండో సారి.అమెరికాస్ క్వాలిఫైయర్‌లో భాగంగా ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌లోనూ విజయం సాధించిన కెనడా.. పాయింట్ల పట్టికలో అగ్రస్ధానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బహామాస్ కేవలం 57 పరుగులకే ఆలౌటైంది.కెనడా బౌలర్లలో కలీం సానా, శివమ్ శర్మ తలా మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించగా.. అన్షూ పటేల్ రెండు వికెట్లు సాధించారు. అనంతరం 58 పరుగుల లక్ష్యాన్ని కెనడా కేవలం 5.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. కెనడా బ్యాటర్లలో దిల్‌ప్రీత్ బజ్వా(36) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించాడు.13వ జట్టుగా..2026 టీ 20 వరల్డ్ కప్‌లో 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో భారత్, శ్రీలంక క్వాలిఫై కాగా.. టీ20 వరల్డ్‌కప్-2024 టాప్-8లో నిలిచిన జట్లు ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, అఫ్గానిస్తాన్, దక్షిణాఫ్రికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వెస్టిండీస్ నేరుగా ఆర్హత సాధించాయి.గత టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అగ్రస్ధానంలో నిలిచినప్పటికి ఆతిథ్య హోదాలో బరిలోకి దిగనుంది. అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం న్యూజిలాండ్, పాకిస్తాన్, ఐర్లాండ్ కూడా క్వాలిఫై అయ్యాయి. . మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి.అందులో ఇప్పుడు అమెరికాస్ క్వాలిఫైయర్స్ నుంచి 13వ జట్టుగా కెనడా ఆర్హత సాధించింది. యూరప్ క్వాలిఫైయర్స్, ఆఫ్రికా క్వాలిఫైయర్స్ నుంచి రెండేసి జట్లు చొప్పున క్వాలిఫై కానున్నాయి. ఈస్ట్ ఆసియా ఫసిఫిక్ క్వాలిఫయర్స్ నుంచి మరో మూడు జట్లు ఈ మెగా టోర్నీలో అడుగుపెట్టనున్నాయి.చదవండి: IND Vs ENG: చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా.. వసీం అక్రమ్ రికార్డు బద్దలు -
కెనడాలో భారతీయ విద్యార్థిని మృతి.. ఏం జరిగింది?
ఢిల్లీ: కెనడాలో భారతీయ విద్యార్థిని మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఢిల్లీకి చెందిన తన్యా త్యాగి కెనడాలో మృతి చెందింది. అయితే, ఆమె మృతి గల కారణాలు తెలియరాలేదు. దీంతో, ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన తన్యా త్యాగి కెనడాలోని కాల్గరీ విశ్వవిద్యాలయంలో చదువుకుంటుంది. ఆమె గురువారం మరణించింది. ఈ విషయాన్ని వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ధ్రువీకరించింది. అయితే ఆమె మృతికి గల కారణాలు తెలియరాలేదని కాన్సులేట్ తెలిపింది. బాధిత కుటుంబానికి కాన్సులెట్ సంతాపం తెలిపింది. వారికి అన్నివిధాలుగా తమ సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించింది. త్యాగి మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొంది. We are saddened by the sudden demise of Ms. Tanya Tyagi, an Indian student at University of Calgary. The Consulate is in touch with the authorities and will provide all required assistance to the bereaved family. Our heartfelt condolences & prayers are with his family & friends…— India in Vancouver (@cgivancouver) June 19, 2025 -
వెండి, ఇత్తడి కళాకృతులు.. పెయింటింగ్‌లు
న్యూఢిల్లీ: ఇతర దేశాల నేతలను కలిసినప్పు డు కానుకలు అందజేయడమనే ఆనవాయితీని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనసాగి స్తున్నారు. తాజాగా రెండు రోజుల క్రితం కెనడాలోని జరిగిన జీ7 శిఖరాగ్ర భేటీలో ఆయన పాల్గొనడం తెల్సిందే. ఈ సందర్భంగా ఆయన ఆతిథ్య దేశ ప్రధాని మార్క్ కార్నీతోపాటు ఆయా దేశాల నేతలకు కలకాలం గుర్తుండిపోయే, మన ఘన వారసత్వాన్ని ప్రతిబింబించే అద్భుత మైన కానుకల్ని అందజేశారు. వీటిలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఇత్తడి, వెండి కళాకృతులతోపాటు ఆకర్షణీయమైన పెయింటింగ్‌లున్నాయి. కెనడాలోని కననాస్కిస్‌లో జీ7 భేటీ సమయంలో ఆ దేశ ప్రధాని మార్క్ కార్నీకి ప్రధాని మోదీ ఇత్తడితో రూపొందించిన బోధి చెట్టు కళా ఖండాన్ని కానుకగా అందజేశారు. గౌతమబుద్ధునికి బోధి వృక్షం కిందనే జ్ఞానోదయమైన విషయం తెల్సిందే. జ్ఞానం, శాంతి, ఆధ్యాత్మిక మేల్కొలుపును ప్రతిబింబించేలా బిహార్ కళాకారులు రూ పొందించిన కళారూపమిది. అదేవిధంగా, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ కు తమిళనాడుకు చెందిన డోక్రా నిపుణులు రూపొందించిన నంది విగ్రహాన్ని బహూక రించారు. పరమ శివుని వాహనం నందీశ్వరుడు. సంప్రదాయ భారతీయ లోహ కళను చాటి చెప్పేలా ఈ విగ్రహం కనిపిస్తుంది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షిన్బామ్ పర్డోకు సంప్రదాయ వర్లి కళాఖండాన్ని కానుకగా ఇచ్చారు. మహారాష్ట్రలోని వర్లి గిరిజనుల జానపద కళ ఇది. దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్‌కు సంప్రదాయ మధుబని పెయింటింగ్‌ను అందజేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డోక్రా కళాకృతిలో రూపుదిద్దుకున్న ఇత్తడి గుర్రం బొమ్మను దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు ప్రధాని మోదీ బహూకరించా రు. పురాతన సంప్రదాయ నైపుణ్యంతో గిరి జన చేతిపనివారు రూపొందించిన బొమ్మ ఇది. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్సియో లులా డ సిల్వాకు వెదురుతో తయారు చేసిన హంస ఆకారంలోని పడవ బొమ్మను అందజేశారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్‌కు కల్హాపురి వెండి పాత్రను బహుమతిగా ఇచ్చారు. స్వచ్ఛమైన వెండితో తయారైన ఈ పాత్రపై చేతిలో రూపొందించిన పూల నగిషీలున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఈ కళాకృతి అందంతోపాటు ఘన వారసత్వాన్ని చాటుతోంది. జర్మనీ చాన్సెలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌కు పాలరాతి తో రూపొందించిన సూర్య దేవాలయాన్ని గుర్తుకు తెచ్చే కోణార్క్ చక్రం బొమ్మను బహుమతిగా ఇచ్చారు ప్రధాని మోదీ. -
G7 Summit: కెనడా చేరుకున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ కెనడా చేరుకున్నారు. నేడు, రేపు(మంగళ,బుధ) ఆయన ఆ దేశంలో పర్యటించనున్నారు. జీ-7 సదస్సులో ప్రధాని పాల్గొనున్నారు. జీ7 కూటమి వార్షిక సదస్సు నిన్న (సోమవారం) కెనడాలో ప్రారంభమైంది.జీ7 ప్రస్తుతం ఫ్రాన్స్, అమెరికా, యూకే, జర్మనీ, జపాన్, ఇటలీ, కెనడా, యూరోపియన్ యూనియన్(ఈయూ) సభ్యదేశాలుగా ఉన్నాయి. ఇందులో భారత్‌కు సభ్యత్వం లేదు. అయినప్పటికీ ఈ ఏడాది జీ7 సదస్సుకు భారత ప్రధాని మోదీని కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. VIDEO | PM Modi (@narendramodi) arrived at Calgary International airport, Canada, earlier today for the G7 summit.(Source: Third Party) pic.twitter.com/YFjno8J9am— Press Trust of India (@PTI_News) June 17, 2025కాగా, పశ్చియాసియా, యూరప్‌లో జరుగుతున్న యుద్ధాలు, సంఘర్షణలపై భారత ప్రధాని మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇది యుద్ధాల యుగం కాదని తేల్చిచెప్పారు. వివాదాలు తలెత్తితే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, యుద్ధాలకు ముగింపు పలకాలని కోరారు. సోమవారం సైప్రస్ రాజధాని నికోసియాలో మోదీ, నికోస్ సమావేశమయ్యారు. భారత్–సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు అంతర్జాతీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించారు.మరోవైపు, ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధం ఎంతమాత్రం వాంఛనీయం కాదని జీ7 దేశాల అధినేతలు తేల్చిచెప్పారు. రెండు దేశాలు వెంటనే వెనక్కి తగ్గాలని, యుద్ధానికి స్వస్తి చెప్పాలని కోరారు. ఇజ్రాయెల్–ఇరాన్ వెంటనే చర్చలు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. పరస్పరం కలిసి చర్చించుకొని, ఘర్షణకు తెరతించాలని అన్నారు.పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు నివారించడమే లక్ష్యగా ఒక పరిష్కార మార్గం కనిపెట్టాలని తామంతా అంగీకారానికి వచ్చినట్లు బ్రిటిష్ ప్రధానమంత్రి కియర్ స్టార్మర్ చెప్పారు. ఇజ్రాయెల్–ఇరాన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.గాజాలోనూ పరిస్థితి మరింత విషమించే అవకాశం ఉందన్నారు. అణ్వాయుధాలు సొంతం చేసుకొనేందుకు ఇరాన్‌ను అనుమతించకూడదని జర్మనీ చాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ చెప్పారు. మరోవైపు జీ7 కూటమిపై డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. 2014లో రష్యాను ఈ కూటమి నుంచి తొలగించడం పొరపాటేనని చెప్పారు. రష్యాను పక్కనపెట్టడం ప్రపంచాన్ని ఇప్పుడు అస్థిరపరుస్తోందని అభిప్రాయపడ్డారు. -
నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం నుంచి ఐదు రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జీ7 శిఖరాగ్ర సదస్సు జరిగే కెనడాతో పాటు సైప్రస్, క్రొయేషియాల్లో ఆయన పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు, జూన్ 16, 17 తేదీల్లో కెనడాలోని కననాస్కిస్‌లో జరిగే జీ7 సమావేశంలో మోదీ పాల్గొంటారు. ఇంధన భద్రత, సాంకేతికత, ఆవిష్కరణలతో సహా కీలక ప్రపంచ సమస్యలపై భారత్ వైఖరిని ప్రపంచ దేశాలతో ఆయన పంచుకోనున్నట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. అందేగాక పలువురు జీ7, ఇతర దేశాధినేతలతో ప్రధాని భేటీ కానున్నారు. పాకిస్తాన్‌పై ఆపరేషన్ సిందూర్ తరువాత ఆయనకు ఇదే తొలి విదేశీ పర్యటన. ఖలిస్తానీ సమస్య కారణంగా కెనడాతో దౌత్య సంబంధాలు క్షీణించాక ఆ దేశంలో పర్యటిస్తుండటమూ ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో దౌత్య బంధాలు మెరుగవుతాయని విదేశాంగ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. ఇందుకు ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఇటీవలే చెప్పారు. 2023లో కెనడాలో ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య జరగడం తెలిసిందే. అందులో భారత ఏజెంట్ల ప్రమేయముందని నాటి ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. అంతేగాక అప్పటి భారత హై కమిషనర్ సంజయ్ వర్మతో సహా అనేక మంది మన దౌత్యవేత్తలకు నిజ్జర్ హత్యతో సంబంధముందని కూడా కెనడా ఆరోపించింది. వీటిపై భారత్ మండిపడింది. ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఈ ఉదంతంతో కెనడాతో సంబంధాలు దెబ్బతిన్నాయి. తర్వాత ట్రూడో తప్పుకోవడం, ఇటీవలి ఎన్నికల్లో మార్క్ కార్నీ ప్రధాని కావడంతో కొన్ని నెలలుగా, అధికారుల స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. కొత్త హైకమిషనర్లను నియమించే అవకాశాలను రెండు దేశాలూ పరిశీలిస్తున్నాయి. భారత్‌కు ప్రాధాన్యం భారత్ జీ7 సభ్య దేశం కాకపోయినా ఆహ్వానిత దేశంగా 12వసారి పాల్గొంటోంది. ఈ సదస్సుకు మోదీ హాజరవుతుండటం ఇది వరుసగా ఆరోసారి. 1975లో ఫ్రాన్స్ ప్రారంభించిన జీ7కు ఇది 50వ సంవత్సరం. ఫ్రాన్స్‌తో పాటు ప్రధాన ఆర్థిక వ్యవస్థలైన కెనడా, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా ఇందులో సభ్య దేశాలు. యూరోపియన్ యూనియన్ కూడా జీ7కు పూర్తిస్థాయిలో ప్రాతినిధ్యం వహిస్తోంది. అంతర్జాతీయ శాంతిభద్రతలు, ఆర్థిక స్థిరత్వం, వాతావరణ మార్పులు, దేశాల నడుమ సహకారం, అంతర్జాతీయ నేరాల కట్టడికి ఉమ్మడి చర్యలు, మౌలిక వసతులు, పెట్టుబడులు, యువత, ఉపాధి అవకాశాలు తదితరాలపై జీ7 దృష్టి సారిస్తుంది. భారత్ వంటి దేశాలను ‘ప్రచార భాగస్వామి’గా జీ7 ఏటా ఆహ్వానిస్తోంది. సైప్రస్, క్రొయేషియాలకు తొలిసారి మోదీ ఆదివారం తొలుత సైప్రస్ వెళ్తారు. అధ్యక్షుడు క్రిస్టోడౌలిడెస్‌తో పలు అంశాలపై చర్చిస్తారు. గత 20 ఏళ్లలో అక్కడ భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. అనంతరం మోదీ కెనడాలో జీ7 సదస్సులో పాల్గొంటారు. అనంతరం 18న క్రొయేషియా వెళ్తారు. భారత ప్రధాని ఒకరు ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి కానుంది. క్రొయేషియా ప్రధాని ఆంద్రే ప్లెంకోవిక్‌తో పాటు అధ్యక్షుడు జొరాన్ మిలానోవిక్‌తో కూడా మోదీ భేటీ అవుతారు. -
జర్నలిస్ట్‌ను బెదిరించిన ఖలిస్తానీ మద్దతుదారులు
వాంకోవర్: కెనడా గడ్డపై తరచూ భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఖలిస్తానీ వేర్పాటువాదులు తాజాగా కెనడియన్ జర్నలిస్ట్‌ను బెదిరించారు. ర్యాలీని తన కెమెరాలో రికార్డ్ చేస్తున్నందుకు జర్నలిస్ట్ మోకా బెజిర్గన్ను కొట్టినంత పనిచేశారు. ఆదివారం జరిగిన ఈ ఘటన తాలూకూ వివరాలను మోకా తర్వాత వెల్లడించారు. ఉద్యమకారులంతా దుండగుల్లా వ్యవహరించారని, ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకున్నారని మోకా చెప్పారు. ‘‘ ఈ ఘటన జరిగిన రెండు గంటలవుతున్నా నా శరీరం ఇంకా వణికిపోతోంది. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని కూడా చూడకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారు. నన్ను చుట్టుముట్టి బెదిరించారు. నా ఫోన్ బలవంతంగా లాక్కున్నారు. గతంలో ఖలిస్తానీ ఉద్యమాలపై సొంతంగా రిపోర్టింగ్ చేసినందుకు నాపై కక్షగట్టారు. ఖలిస్తానీవేర్పాటువాదులపై నేను తటస్థ వైఖరిని ప్రదర్శించడం వాళ్లకు నచ్చలేదనుకుంటా. అందుకే నన్ను కొట్టినంత పనిచేశారు. కెనడా, బ్రిటన్, అమెరికా, న్యూజిలాండ్‌లలో ఖలిస్తానీయుల వైఖరిని నా రిపోర్టింగ్ ద్వారా ప్రపంచానికి తెలియజేశా. అందుకే గతంలో వీళ్లు నన్ను ఆన్లైన్లో ఇష్టమొచ్చిన పదజాలంతో తిట్టారు. ఆదివారం వాంకోవర్‌లో వాళ్ల ర్యాలీని నేను కెమెరాలో రికార్డ్చేస్తుంటే అడ్డుకున్నారు. టచ్ చేస్తే ఊరుకునేది లేదని బెదిరించారు. నా పనికి అడ్డురావొద్దని వారించినా వాళ్లు వినిపించుకోలేదు. పదేపదే నా వెనకాల పడ్డారు. ముఖ్యంలో వారిలో ఒకడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు. అందుకే అతనిపై పోలీసులకు ఫిర్యాదుచేశా. గతంలోనూ అతనిపై ఫిర్యాదుచేశా’’ అని జర్నలిస్ట్ మోకా తర్వాత ఒక వీడియోను విడుదలచేశారు. కెనడాలో ఖలిస్తానీవేర్పాటువాదుల ఆగడాలు ఎక్కువయ్యాయని అక్కడి అధికార యంత్రాంగానికి భారత ప్రభుత్వం పలుమార్లు ఫిర్యాదుచేసినా కెనడా సర్కార్‌లో ఎలాంటి చలనం లేకపోవడం గమనార్హం. దీంతో ఖలిస్తానీ సానుభూతిపరులకు కెనడా స్వర్గధామంగా తయారైంది. -
‘జీ 7’కు ప్రధాని మోదీకి ఆహ్వానం.. కాంగ్రెస్ విమర్శలకు చెక్
న్యూఢిల్లీ: ఈ ఏడాది నిర్వహించబోయే జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ఇంతవరకూ ప్రధాని మోదీకి ఆహ్వానం అందలేదంటూ చర్చలు జరుగుతున్న తరుణంలో, కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్వయంగా భారత ప్రధాని మోదీకి ఫోన్ చేసి, ఈ సదస్సుకు ఆహ్వానించారు. జూన్ 15 నుంచి 17 వరకు కెనడాలోని కననాస్కిస్‌లో ఈ సదస్సు జరగనుంది. ఈ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, ఇటలీ, జర్మనీ, కెనడా దేశాధినేతలు పాల్గొననున్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 నుంచి ప్రతిసారీ జీ-7 దేశాల సమావేశానికి అతిథిగా హాజరవుతూ వస్తున్నారు. అయితే ఈ సారి ప్రధానికి ఈ సదస్సుకు ఆహ్వానం అందించడంలో కాస్త జాప్యం జరిగింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ జీ 7 శిఖరాగ్ర సమావేశాలకు భారతదేశానికి ఆహ్వానం అందకపోవడం దౌత్యపరమైన లోపమంటూ విమర్శలు గుప్పించింది. అయితే తాజాగా కెనడా ప్రధాని మార్క్ కార్నీ జీ7కు ఆహ్వానించేందుకుప్రదాని మోదీకి ఫోన్ చేశారు. దీనికి స్పందించిన మోదీ తన హాజరును ధృవీకరించారు.‘కెనడా ప్రధాని @MarkJCarney నుండి కాల్ అందుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఆయన విజయం సాధించడంపై అభినందించాను. ఈ నెల చివర్లో కననాస్కిస్‌లో జరిగే జీ7 సమ్మిట్‌కు ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అని తెలిపాను’ అని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ నేతృత్వంలో జీ 7 శిఖరాగ్ర సమావేశాన్ని జూన్ 15-17 తేదీలలో ఆల్బెర్టాలోని కననాస్కిస్ రిసార్ట్‌లో నిర్వహించనున్నారు.ఇది కూడా చదవండి: తరతరాలు మెచ్చేలా.. రాజ్‌నాథ్‌కు ‘మ్యాంగో మ్యాన్’ గిఫ్ట్ -
కెనడాలో జీ7 శిఖరాగ్రానికి మోదీ డుమ్మా!?
న్యూఢిల్లీ: కెనడాలో ఈ నెల 15 నుంచి మొదలయ్యే జీ7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ వెళ్లకపోవచ్చని తెలుస్తోంది. ఆరేళ్లుగా జీ7 సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్న ప్రధాని మోదీ మొదటిసారిగా డుమ్మా కొట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. జూన్ 15–17 తేదీల మధ్య అల్బర్టాలో ఈ భేటీ జరగనుంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా సంక్షోభం వంటి కీలకమైన అంతర్జాతీయ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లపై కూటమిలోని ప్రముఖ పారిశ్రామిక దేశాల నేతలు చర్చించనున్నారు. శిఖరాగ్రానికి రావాలంటూ ప్రధాని మోదీకి కెనడా ఇప్పటి వరకు ఆహ్వాన సైతం పంపలేదు. ఇప్పటికిప్పుడు ఆహ్వానం వచ్చినా ఇరుదేశాల మధ్య నెలకొన్న సంబంధాలు, వేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో సన్నద్ధతకు సమయం పడుతుందని చెబుతున్నారు. జీ7 కూటమిలో అమెరికా, యూకే, ఇటలీ, జర్మనీ, కెనడా, జపాన్ సభ్యదేశాలు కాగా, ప్రస్తుతం కెనడా అధ్యక్షత బాధ్యతల్లో ఉంది. -
లవర్‌ను నమ్మి 30 కోట్ల కానుక.. పుట్టినరోజున అదిరిపోయే ట్విస్ట్
మాంట్రియల్: మాజీ ప్రియుడికి వచ్చిన రూ.30 కోట్ల లాటరీ సొమ్ము తీసుకోని ఓ యువతి తన కొత్త ప్రియుడితో పారిపోయింది. జరిగిన మోసాన్ని గుర్తించి లబోదిబోమన్న ఆ బాధితుడు తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు కోర్టుకెక్కాడు. ఈ సంఘటన కెనడాలో చోటుచేసుకుంది.అసలేం జరిగిందంటే.. విన్నీపెగ్ పట్టణానికి చెందిన లారెన్స్ క్యాంప్‌బెల్, క్రిస్టల్ యాన్ మెక్కే ప్రేమించుకున్నారు. ఏడాదిన్నరపాటు కలిసి ఓ హోటల్ గదిలో జీవించారు. క్యాంప్‌బెల్ 2024లో ఓ లాటరీ టికెట్ కొన్నాడు. ఆ టికెట్‌కు ఇటీవలే జాక్‌పాట్ తగిలింది. క్యాంప్‌బెల్ 5 మిలియన్ డాలర్ల (రూ.30 కోట్లు) సొమ్ము గెలుచుకున్నాడు. కానీ, ఈ డబ్బు తీసుకోవాలంటే అతడి వద్ద సరైన గుర్తింపు కార్డు లేదు. బ్యాంకు ఖాతా కూడా లేదు. వెస్ట్రన్ కెనడా లాటరీ కార్పొరేషన్ నుంచి లాటరీ సొమ్ము తీసుకోవడానికి తన ప్రియురాలి సాయం కోరాడు. ఆమెను పూర్తిగా నమ్మాడు.ఈ క్రమంలో ఆమె తన ఐడీ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడంతో ఎట్టకేలకు లాటరీ సొమ్ము ఆ ఖాతాలోకి చేరింది. ఆ సయయంలో లారెన్స్ క్యాంప్‌బెల్, క్రిస్టల్ యాన్ మెక్కే నమూనా చెక్కును చేతపట్టుకొని ఫొటోలకు, వీడియోలకు ఫోజులిచ్చారు. ఇది తనకు క్యాంప్‌బెల్ ఇస్తున్న పుట్టినరోజు కానుక అంటూ ఆమె మురిసిపోయింది. నిజానికి ఆ యువతి అప్పటికే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. పాత ప్రియుడికి చెందిన రూ.30 కోట్లలో అతడికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా కొత్త ప్రియుడితో పరారయ్యింది. అతడితో సంబంధాలు తెంచేసుకుంది. ఫోన్లో కూడా దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆచూకీ కనిపెట్టగలిగాడు. మరో వ్యక్తితో పడకపై ఆమెను చూశాడు. తాను దారుణంగా మోసపోయినట్లు గుర్తించిన క్యాంప్‌బెల్ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు. -
కెనడాకు ట్రంప్ బంపరాఫర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడాపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కెనడా విలీన ఆఫర్‌ను ప్రకటించారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా (Canada) చేరితే.. గోల్డెన్ డోమ్‌ను ఉచితంగా పొందవచ్చు అని అన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.అమెరికా రక్షణ కోసం అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. భవిష్యత్తులో అమెరికా గగనతలంలోకి ఏ క్షిపణీ ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధమూ సమీపించకుండా ‘గోల్డెన్ డోమ్ (Golden Dome)’ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఈ ప్రాజెక్టులో చేరేందుకు అమెరికా పొరుగు దేశమైన కెనడా కూడా ఆసక్తి కనబర్చింది.#BREAKING: Donald Trump says Canada is considering his offer to become the 51st state pic.twitter.com/QNPGN7VB92— 6ixBuzzTV (@6ixbuzztv) May 27, 2025ఈ నేపథ్యంలో కెనడా విషయమై డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ.. మరోసారి విలీన డిమాండ్‌ను లేవనెత్తారు. తమ దేశంలో 51వ రాష్ట్రంగా కెనడా చేరితే.. గోల్డెన్ డోమ్‌ను ఉచితంగా పొందొచ్చని వ్యాఖ్యానించారు. లేదంటే 61 బిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కెనడా ఈ ఆఫర్‌ను పరిశీలించుకోవచ్చు అంటూ సలహా ఇచ్చారు. ఇక, ట్రంప్ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు కెనడా నుంచి ఎలాంటి ప్రతి స్పందనా రాలేదు.గోల్డెన్ డోమ్ ఇలా..అమెరికా అత్యాధునిక గగనతల రక్షణ కవచం గోల్డెన్ డోమ్‌పై డొనాల్డ్ ట్రంప్ ఈ ప్లాన్‌ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు విలువ 175 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది అమెరికాను బాలిస్టిక్, క్రూజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షిస్తుంది. గోల్డెన్ డోమ్ వ్యవస్థ భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచి రక్షణ కల్పిస్తుంది. తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. చాలావరకు అవి టేకాఫ్ అవ్వక ముందే లేదా.. మార్గమధ్యలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా వీటికి ఉండనుంది. ఈ వ్యవస్థలో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత కీలకమైంది. వీటిల్లో లేజర్ ఆయుధాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇది ఒకరకంగా రోనాల్డ్ రీగన్ ప్రతిపాదించిన స్టార్‌వార్స్ వ్యవస్థను తలపిస్తోంది.అమెరికా విశాలమైన దేశం కావడంతో.. అన్ని నగరాలు గోల్డెన్ డోమ్ కింద కవర్ అవ్వాలంటే.. అంతరిక్షంలో ఇంటర్సెప్టర్లతో ఓ నెట్‌వర్క్‌నే సృష్టించాల్సి ఉంటుందని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో ఫారెన్ పాలసీ ప్రోగ్రామ్ పరిశోధన విభాగం డైరెక్టర్ మిషెల్ ఓ హన్లోన్ అభిప్రాయపడ్డారు. లేజర్లను అంతరిక్షంలోకి పంపడం అంత తేలిక కాదని.. అందుకోసం భారీగా ఇంధనం, అద్దాలు ఇతర సామగ్రిని పెద్ద మొత్తంలో రోదసీలోకి చేర్చాల్సి ఉంటుందన్నారు. ఇది చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే దీనిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చైనా, రష్యా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవి తీవ్రస్థాయిలో అస్థిరతలను సృష్టిస్తాయని.. అంతరిక్షాన్ని యుద్ధ క్షేత్రంగా మార్చేస్తుందని ఆయా దేశాలు ఆరోపించాయి. -
విదేశీ విద్యార్థులకు కెనడా ఝలక్.. స్టడీ పర్మిట్లలో భారీ తగ్గుదల
న్యూఢిల్లీ: కెనడాలో ఉన్నత చదువుల కోసం వెళ్లే విదేశీ విద్యార్థులకు షాక్ తగిలింది. స్టడీ పర్మిట్లలో పోనుపోను భారీగా తగ్గుదల చోటు చేసుకుంది. తాజాగా వెల్లడైన ఇమిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) గణాంకాలు ఈ వివరాలను తేటతెల్లం చేశాయి.2025 తొలి త్రైమాసికానికిగానూ కేవలం భారతీయ విద్యార్థుల కోసం 30,640 పర్మిట్లు మాత్రమే జారీ అయ్యాయి. అయితే కిందటి ఏడాది ఇదే సమయంలో 44, 295 పర్మిట్లు జారీ అయ్యాయి. అంటే.. దాదాపు 31 శాతం తగ్గిందన్నమాట.2023 చివరి నుంచి వలసదారుల రాకను అరికట్టడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే.. స్టడీ పర్మిట్లను తగ్గిస్తూ వస్తున్నారు. రికార్డు స్థాయిలో వలసల వల్ల కెనడాపై అన్ని రకాలుగా తీవ్ర భారం పడుతోందని అక్కడి లిబరల్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే.. 2028 నాటికల్లా కెనడా జనాభాలో తాత్కాలిక నివాసితులు, విదేశీ ఉద్యోగులు.. విద్యార్థులు కలిపి 5 శాతానికి మించి ఉండకూదంటూ ప్రధాని మార్క్ కార్నీ ఒక ప్రకటన చేశారు.ఇక గత రెండేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. భారతీయ విద్యార్థుల స్టడీ పర్మిట్లలో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది.2023లో.. కెనడా మొత్తం 6,81,155 స్టడీ పర్మిట్లు జారీ చేయగా.. ఇందులో భారతీయులకు జారీ చేసింది 2, 78,0452024కి వచ్చేసరికి.. మొత్తం 5,16,275 పర్మిట్లు జారీ చేయగా.. అందులో భారతీయుల కోసం జారీ చేసింది 1,88,4652025 నాటికి.. ఈ ఏడాదికిగానూ తొలుత 4,85,000 పర్మిట్లు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. 4,37,000 పర్మిట్లు మాత్రమే జారీ చేయాలని ఐఆర్సీసీ ఇప్పుడు భావిస్తోంది. ఇందులో భారతీయల పర్మిట్ల సంఖ్యను లక్షకు పరిమితం చేయాలని భావిస్తోందని స్పష్టమవుతోంది. 2026 కల్లా.. ఈ పర్మిట్ల సంఖ్యను మరింత తగ్గించే యోచనలో ఉంది. మరోవైపు స్టడీ పర్మిట్ల దరఖాస్తుల కోసం తీసుకొచ్చిన కొత్త మార్గదర్శకాలు ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా మారాయి. -
పరాయి దేశానికి ఆడుతూ సెంచరీల మోత మోగించిన భారత బ్యాటర్లు
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 2023-27లో భాగంగా నిన్న (మే 17) కెనడాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో యూఎస్ఏ ప్రాతినిథ్యం వహిస్తున్న భారత క్రికెటర్లు స్మిట్ పటేల్, మిలింద్ కుమార్ సెంచరీలతో చెలరేగిపోయారు. ఫ్లోరిడా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా.. ఓపెనర్ స్మిట్ పటేల్ (137 బంతుల్లో 152 నాటౌట్; 12 ఫోర్లు, 4 సిక్సర్లు), ఐదో నంబర్ ఆటగాడు మిలింగ్ కుమార్ (67 బంతుల్లో 115 నాటౌట్; 12 ఫోర్లు, 5 సిక్సర్లు అజేయ సెంచరీలతో శివాలెత్తిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 361 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన కెనడా.. సంజయ్ కృష్ణమూర్తి (3.2-0-10-3), కెంజిగే (10-0-41-2), మిలింద్ కుమార్ (9-0-40-2), హర్మీత్ సింగ్ (10-1-38-2), జస్దీప్ సింగ్ (7-0-35-1) సత్తా చాటడంతో 46.2 ఓవర్లలో 192 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా యూఎస్ఏ 169 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.ఈ మ్యాచ్‌లో మిలింద్, స్మిట్ పటేల్ రికార్డు సెంచరీలతో కదంతొక్కడంతో యూఎస్ఏ వన్డేల్లో తమ అత్యధిక స్కోర్‌ను (361) నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో 60 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన మిలింద్.. వన్డేల్లో యూఎస్ఏ తరఫున వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో మిలింద్ టీమిండియా మాజీ బ్యాటర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును సమం చేశాడు. వన్డేల్లో రెండో వేగవంతమైన సెంచరీ చేసిన ఇండియన్ బార్న్ బ్యాటర్‌గా సెహ్వాగ్ సరసన నిలిచాడు. సెహ్వాగ్ 2009లో న్యూజిలాండ్‌పై 60 బంతుల్లో సెంచరీ చేశాడు. వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఇండియన్ బార్న్ ప్లేయర్ రికార్డు విరాట్ కోహ్లి (52 బంతులు) పేరిట ఉంది.ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 44 బంతులు తీసుకున్న మిలింద్.. ఆతర్వాత హాఫ్ సెంచరీని కేవలం 16 బంతుల్లో పూర్తి చేశాడు. ఈ క్రమంలో మిలింద్ ఓ ఓవర్లో (48వ ఓవర్లో) 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 30 పరుగులు పిండుకున్నాడు. స్మిట్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో అతను చేసిన అజేయమైన 152 పరుగుల స్కోర్ క్రికెట్ వరల్డ్‌కప్ లీగ్-2 చరిత్రలోనే రెండో అత్యుత్తమం. -
కెనడా, అమెరికా మార్కెట్లోకి హైదరాబాద్ కంపెనీ
హైదరాబాద్‌కు చెందిన బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ కెనడా, అమెరికా ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్లలోకి ప్రవేశిస్తోంది. ఈ మేరకు కెనడా సంస్థ చార్జ్ పవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ప్యూర్ కంపెనీ తెలిపింది.ఈ భాగస్వామ్యంతో ప్యూర్ అధునాతన ఎనర్జీ స్టోరేజ్ ప్రొడక్ట్ లైన్ ను కో-బ్రాండింగ్ అరేంజ్మెంట్ ద్వారా కెనడా, అమెరికాలోని వినియోగదారులకు పరిచయం చేయనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఈ ఉత్పత్తులు రెసిడెన్షియల్, కమర్షియల్ నుంచి గ్రిడ్ స్కేల్ అప్లికేషన్స్ వరకు ఉంటాయని పేర్కొంది.తమకున్న పటిష్టమైన తయారీ సౌకర్యాలతో బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్‌లో లోతైన నైపుణ్యాన్ని సాధించామని, తమ మా సృజనాత్మక, మన్నికైన, నమ్మదగిన ఇంధన నిల్వ ఉత్పత్తులకు యూఎస్, కెనడా మార్కెట్లలో విస్తృత ఆమోదం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు ప్యూర్ ఫౌండర్, ఎండీ నిశాంత్ దొంగరి అన్నారు. -
కెనడా కేబినెట్లో మనోళ్లు
ఒట్టావా: కెనడాలో మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి నేతలకు కీలక పదవులు దక్కాయి. విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్ (58) , అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా మణీందర్ సిద్ధూ (41) బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ వ్యవహారాల సహాయ మంత్రిగా రణ్‌దీప్ సరాయ్ (50), నేర నియంత్రణ శాఖ సహాయ మంత్రిగా రూబీ సహోటా (44) ప్రమాణస్వీకారం చేశారు. అనిత భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. ‘‘ఇది నాకు గర్వకారణం. కెనడియన్లకు సురక్షితమైన, న్యాయమైన ప్రపంచాన్ని అందించడానికి ప్రధాని మార్క్ కార్నీ బృందంతో కలిసి పని చేయనున్నా’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అనిత కెనడా లిబరల్ పారీ్టలో సీనియర్ సభ్యురాలు. గతంలో ప్రజా సేవలు, ఇన్నొవేషన్, సైన్స్, పరిశ్రమలు, రక్షణ మంత్రిగా పలు పదవులు నిర్వహించారు. మంత్రివర్గంలో స్థానం దక్కడం తనకు జీవిత కాలపు గౌరవమని సిద్ధూ పేర్కొన్నారు. ఆమెకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయం సాధించిన రెండు వారాల అనంతరం కార్నీ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. మంత్రివర్గం సంఖ్యను 39 నుంచి 28కి కుదించారు. వారిలో సగం మహిళలే కావడం విశేషం! కెనడా–యూఎస్ సంబంధాల ఉద్రిక్తతల మధ్య కెనడియన్లు కోరుకునే, అవసరమైన మార్పును అందించడానికి మంత్రివర్గాన్ని ఎన్నుకున్నట్లు కార్నీ తెలిపారు. కెనడాలోనే పుట్టి పెరిగిన అనిత అనిత ఆనంద్ 1967 మే 20న కెనడాలోని కెంట్విల్లేలో భారతీయులైన వైద్య దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ఎస్వీ ఆనంద్‌ది తమిళనాడు కాగా తల్లి సరోజ్ డి రామ్ పంజాబీ. వారు 1960ల్లో భారత్ నుంచి కెనడాకు వలస వెళ్లారు. 1985లో ఒంటారియోలో పొలిటికల్ సైన్స్‌లో అకడమిక్ డిగ్రీ, ఆక్స్ఫర్డ్ నుంచి న్యాయశాస్త్రంలో ఆనర్స్, డల్హౌసీ వర్సిటీ నుంచి బ్యాచిలర్స్, టొరంటో వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. న్యాయవాద వృత్తిలో, బోధన, ప్రజా సేవలో బలమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. 1995లో న్యాయవాది, వ్యాపారవేత్త జాన్ నోల్టన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. అనిత 2019లో కెనడా మంత్రివర్గంలో అడుగుపెట్టారు. ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. రక్షణ మంత్రిగా ఆమె క్రమశిక్షణ, పనితీరుకు ప్రశంసలు లభించాయి. నిరసనల ఫలితంగా గతేడాది జస్టిన్ ట్రూడో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక ఆయన వారసునిగా అనిత పేరు ప్రముఖంగా విని్పంచింది. ఇక సిద్ధూవి పంజాబీ మూలాలు. తల్లిదండ్రులతో కలిసి బాల్యంలోనే కెనడా వెళ్లారు. బ్రాంప్టన్ ఈస్ట్ ఎంపీగా ఉన్నారు. పలువురు మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశారు. రూబీవీ పంజాబీ మూలాలే. ఆమె టొరంటోలో జని్మంచారు. సరాయ్ తల్లిదండ్రులు కెనడా వలస వెళ్లారు. బ్రిటిష్ కొలంబియాలో జన్మించిన ఆయన నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 22 మంది భారత సంతతి నేతలు ఎంపీగా గెలవడం తెలిసిందే.


