లవర్‌ను నమ్మి 30 కోట్ల కానుక.. పుట్టినరోజున అదిరిపోయే ట్విస్ట్‌ | Canada Man Gives Girlfriend To 30 Crore Lottery Runs Away | Sakshi
Sakshi News home page

లవర్‌ను నమ్మి 30 కోట్ల కానుక.. పుట్టినరోజున అదిరిపోయే ట్విస్ట్‌

Jun 2 2025 8:12 AM | Updated on Jun 2 2025 8:20 AM

Canada Man Gives Girlfriend To 30 Crore Lottery Runs Away

మాంట్రియల్‌: మాజీ ప్రియుడికి వచ్చిన రూ.30 కోట్ల లాటరీ సొమ్ము తీసుకోని ఓ యువతి తన కొత్త ప్రియుడితో పారిపోయింది. జరిగిన మోసాన్ని గుర్తించి లబోదిబోమన్న ఆ బాధితుడు తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధితుడు కోర్టుకెక్కాడు. ఈ సంఘటన కెనడాలో చోటుచేసుకుంది.

అసలేం జరిగిందంటే.. విన్నీపెగ్‌ పట్టణానికి చెందిన లారెన్స్‌ క్యాంప్‌బెల్, క్రిస్టల్‌ యాన్‌ మెక్‌కే ప్రేమించుకున్నారు. ఏడాదిన్నరపాటు కలిసి ఓ హోటల్‌ గదిలో జీవించారు. క్యాంప్‌బెల్‌ 2024లో ఓ లాటరీ టికెట్‌ కొన్నాడు. ఆ టికెట్‌కు ఇటీవలే జాక్‌పాట్‌ తగిలింది. క్యాంప్‌బెల్‌ 5 మిలియన్‌ డాలర్ల (రూ.30 కోట్లు) సొమ్ము గెలుచుకున్నాడు. కానీ, ఈ డబ్బు తీసుకోవాలంటే అతడి వద్ద సరైన గుర్తింపు కార్డు లేదు. బ్యాంకు ఖాతా కూడా లేదు. వెస్ట్రన్‌ కెనడా లాటరీ కార్పొరేషన్‌ నుంచి లాటరీ సొమ్ము తీసుకోవడానికి తన ప్రియురాలి సాయం కోరాడు. ఆమెను పూర్తిగా నమ్మాడు.

ఈ క్రమంలో ఆమె తన ఐడీ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడంతో ఎట్టకేలకు లాటరీ సొమ్ము ఆ ఖాతాలోకి చేరింది. ఆ సయయంలో లారెన్స్‌ క్యాంప్‌బెల్, క్రిస్టల్‌ యాన్‌ మెక్‌కే నమూనా చెక్కును చేతపట్టుకొని ఫొటోలకు, వీడియోలకు ఫోజులిచ్చారు. ఇది తనకు క్యాంప్‌బెల్‌ ఇస్తున్న పుట్టినరోజు కానుక అంటూ ఆమె మురిసిపోయింది. నిజానికి ఆ యువతి అప్పటికే మరో వ్యక్తితో ప్రేమలో పడింది. పాత ప్రియుడికి చెందిన రూ.30 కోట్లలో అతడికి చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా కొత్త ప్రియుడితో పరారయ్యింది. అతడితో సంబంధాలు తెంచేసుకుంది. ఫోన్‌లో కూడా దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆచూకీ కనిపెట్టగలిగాడు. మరో వ్యక్తితో పడకపై ఆమెను చూశాడు. తాను దారుణంగా మోసపోయినట్లు గుర్తించిన క్యాంప్‌బెల్‌ న్యాయం కోసం కోర్టును ఆశ్రయించాడు.    

 

 

Advertisement
 
Advertisement
Advertisement