Telugu Movie News, Latest Cinema News in Telugu, Movie Ratings, Gossips, Photo Galleries, Videos - Sakshi
Sakshi News home page

Cinema Top Stories

Advertisement
Advertisement
Advertisement

A to Z

గాసిప్స్

View all
 

రివ్యూలు

View all

సినీ ప్రపంచం

 Kiran Abbavaram K RAMP Tikkal Tikkal Lyrical Video out now1
కిరణ అబ్బవరం కె ర్యాంప్.. మరో సాంగ్ వచ్చేసింది!

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం నటిస్తోన్న తాజా చిత్రం కె-ర్యాంప్. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రొమాంటిక్‌ కామెడీ మూవీలో యుక్తి తరేజా హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, రుద్రాంశ్‌ సెల్యులాయిడ్‌ పతాకాలపై రాజేశ్‌ దండా, శివ బొమ్మ నిర్మిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దీపావళి పండగ సందర్భంగా అక్టోబర్‌ 18న విడుదల కానుంది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ మూవీ నుంచి టైటిల్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా నుంచి టిక్కల్ టిక్కల్‌ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు సురేంద్ర కృష్ణ లిరిక్స్ అందించగా.. సాయిచరణ్ భాస్కరుని పాడారు. ఈ సాంగ్‌కు చైతన్ భరద్వాజ్ సంగీతమందించారు. ఇప్పటికే రిలీజైన కలలే కలలే.. అంటూ సాగే పాట ఆడియన్స్‌ను తెగ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

akkineni Nagarjuna Shared Fans Special Video in Social Media2
29 ఏళ్ల నిన్నే పెళ్లాడతా.. ఫ్యాన్స్‌ వీడియో వైరల్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన కల్ట్ మూవీ నిన్నే పెళ్లాడతా. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. 1996లో వచ్చిన ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించగా.. అక్కినేని నాగార్జునే నిర్మాతగా వ్యవహరించారు. ఈ మూవీ రిలీజై అక్టోబర్ 4వ తేదీ నాటికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో నాగార్జున సరసన టబు హీరోయిన్‌గా మెప్పించింది. ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానులు ఫిదా అయిపోయారు.ఈ చిత్రం విడుదలైన 29 ఏళ్లు పూర్తి కావడంతో ఫ్యాన్స్‌ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సినిమాలోని పాటలు పాడుతూ ఎంజాయ్ చేశారు. ఏటో వెళ్లిపోయింది మనసు.. ఎలా ఒంటరైంది మనసు.. ఓ చల్లగాలి..ఆచూకి తీసి.. కబురివ్వలేవా ఏమైయిందో.. అంటూ సాగే పాట పాడుతూ చిల్ ‍అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను నాగ్ అభిమాని ట్విటర్‌లో షేర్ చేశారు. అభిమానుల శక్తి అద్భుతం.. ఫ్యాన్స్ కలిసి వచ్చినప్పుడు నిజంగా ఒక ప్రత్యేక అనుభవం అంటూ పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.The power of fandom is incredible, and when fans come together, it's truly a special experience! 👏Cult King Fan's at one frame 😍 .@iamnagarjuna ❤️ 😍 💖 #29YearsForNinnePelladutha ❤️#KingNagarjunaForver ❤️ 😍 💖 #King100 🔥 🔥 pic.twitter.com/M22sNnl0kZ— NagaKiran Akkineni (@NagaKiran60) October 7, 2025

BRS MLA Malla Reddy Comments about movie offer in Tollywood3
తెలుగు సినిమాలో మూడు కోట్ల ఆఫర్.. ఆ రోల్‌కు ఒప్పుకోలేదు: మల్లా రెడ్డి

రెండు తెలుగు రాష్ట్రాల్లో మల్లా రెడ్డి గురించి తెలియనివారు ఉండరు. రాజకీయాల్లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడు తనలోని కళామతల్లిని బయట పెడుతుంటారు. ఏదైనా ఈవెంట్స్‌కు వెళ్లినప్పుడు డ్యాన్స్‌తోనూ అలరిస్తూ సందడి చేస్తుంటారు. మల్లా రెడ్డి యూనివర్సిటీలో సినిమా ఈవెంట్స్‌ జరిగితే తనలో టాలెంట్‌ను ఒక్కసారిగా బయటికి తీసుకొస్తారు. అందుకే మల్లారెడ్డి అంటే కేవలం రాజకీయ నాయకుడే కాదు..కళాకారుడిగా కూడా ఆయనకు పేరు ఉంది.అయితే ఇటీవల దసరా సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లారెడ్డి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తనకు టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమాలో విలన్‌ పాత్రను ఆఫర్ చేశాడని చెప్పారు. ఆ రోల్‌ కోసం మా కాలేజీకి వచ్చి ఒక గంటసేపు వెయిట్ చేశాడని తెలిపారు. అంతేకాకుండా రూ.3 కోట్ల పారితోషికం కూడా ఆఫర్ చేశాడని వెల్లడించారు. అయినా కూడా నేను ఆ పాత్రను ఒప్పుకోలేదని మల్లారెడ్డి వివరించారు. విలన్‌గా చేస్తే ఇంటర్వెల్‌దాకా నేను హీరోను కొడతా.. ఆ తర్వాత హీరో నన్ను కొడతాడు.. తిడతాడు అంటూ హాస్యంగా మాట్లాడారు. ఈ కామెంట్స్‌ కాస్తా నెట్టింట వైరల్‌గా మారాయి.

Baahubali The Epic Run Time revealed By producer4
రాజమౌళి 'బాహుబలి ది ఎపిక్'.. వామ్మో అంత రన్‌ టైమ్?

దర్శకధీరుడు రాజమౌళి మరోసారి బాహుబలిని టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు భాగాలను కలిపి బాహుబలి: ది ఎపిక్‌ (Baahubali: The Epic) పేరుతో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా రన్‌ టైమ్‌ గురించి తెగ చర్చ నడుస్తోంది. రెండు పార్ట్స్‌ ఓకేసారి కావడంతో నిడివిపై ఫ్యాన్స్‌ ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత శోభు యార్లగడ్డ రన్‌ టైమ్ గురించి మాట్లాడారు.బాహుబలి: ది ఎపిక్‌ మూవీ రన్‌టైమ్ 3 గంటల 40 నిమిషాలని నిర్మాత శోభు యార్లగడ్డ వెల్లడించారు. బాహుబలి 1 ముగిశాక ఇంటర్వెల్‌..ఆ తర్వాత ‘బాహుబలి 2 ఉంటుందని తెలిరపారు. దాన వీర శూర కర్ణ (3 గంటల 46 నిమిషాలు) తర్వాత ఎక్కువ నిడివి ఉన్న సినిమాల జాబితాలో బాహుబలి: ది ఎపిక్‌ చేరనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ చిత్రంలో ఓ సర్‌ప్రైజ్‌ కూడా ఉంటుందని తెలిపారు. బాహుబలి డాక్యుమెంటరీ ఈ ఏడాది చివరిలో ఓటీటీలో స్ట్రీమింగ్ రావొచ్చని కూడా తెలిపారు.

Priyadarshi Pulikonda Comments about jathi Rathnalu 2 movie 5
జాతి రత్నాలు-2 చేస్తే నటిస్తారా?.. ప్రియదర్శి సమాధానం ఇదే!

ప్రియదర్శి పులికొండ, నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం జాతి రత్నాలు. ఈ యూత్‌ఫుల్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ సాధించింది. ‍అనుదీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ సినీ ప్రియులను అలరించింది. అప్పట్లో ఓవర్‌సీస్‌లోనూ వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను దాటిన చిత్రంగా ఘనత సాధించింది.తాజాగా ప్రియదర్శి మరో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‍మిత్రమండలి సినిమాతో మరోసారి జాతిరత్నాల్లాంటి ఎంటర్‌టైన్‌ అందించేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ ట్రైలర్ విడుదల చేయగా విపరీతంగా నవ్వులు తెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటర్వ్యూకు హాజరైన ప్రియదర్శి జాతిరత్నాలు సినిమాపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఆ టైమ్‌లో వచ్చిన జాతి రత్నాలు ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అయ్యిందని ప్రియదర్శి అన్నారు. జాతిరత్నాలు సినిమాకు, మిత్రమండలికి చాలా వేరియషన్‌ ఉంటుందన్నారు. ఒకవేళ ఇప్పుడు కనుగ జాతిరత్నాలు-2 తీస్తే నేను మాత్రం అస్సలు చేయనని ప్రియదర్శి షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాంటి క్లాసిక్‌ సినిమాను మళ్లీ తీయొచ్చేమో కానీ.. నేను మాత్రం నటించనని స్పష్టం చేశారు.కాగా.. విజయేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రియదర్శితో పాటు విష్ణు, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా, నిహారిక ఎన్ఎమ్ ప్రధాన పాత్రల్లో నటించిన మిత్రమండలి అక్టోబరు 16న థియేటర్లలోకి రానుంది.

80s Reunion Telugu Tamil Actors Latest Video6
80'స్ రీ యూనియన్.. వీడియో వైరల్

1980ల్లో దక్షిణాది భాషల్లో హీరోహీరోయిన్లుగా నటించిన స్టార్స్.. ప్రతి ఏడాది ఒక్కచోటకు చేరి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా చెన్నైలో రీయూనియన్‌ జరిగింది. రెండు రోజుల క్రితం ఫొటోలు బయటకు రాగా ఇప్పుడు వీడియో బయటకొచ్చింది. అందరూ దీన్ని తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.ఇది 12వ రీ యూనియన్ అని నటుడు నరేశ్ పోస్ట్ పెట్టాడు. ఈ ఏడాది వీరంతా చిరుత థీమ్‌ని ఎంచుకున్నారు. చిరుత థీమ్‌లో దుస్తులు ధరించి సందడి చేశారు. చిరంజీవి, వెంకటేశ్‌, జాకీ ష్రాఫ్‌, శరత్‌ కుమార్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి, నరేశ్‌, సుప్రియ, నదియ, రాధ, రమ్యకృష్ణ, సుమలత, జయసుధ, శోభన తదితరులు ఉత్సాహంగా డ్యాన్సులు వేస్తూ ఆడిపాడుతూ కనిపించారు.All about 80’s Reunion ❤️ pic.twitter.com/U0yUq9NbAP— Naresh Vijaya Krishna (@ItsActorNaresh) October 7, 2025

Sreeleela Interesting Comments On Ravi Teja At Mass Jathara Special Interview7
గాయంతోనూ షూటింగ్‌.. రవితేజ సహజ నటుడు : శ్రీలీల

మాస్‌ మహారాజా రవితేజ(Ravi Teja) నటించిన తాజా చిత్రం ‘మాస్‌ జాతర’(Mass Jathara). భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటించింది.శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ ఎప్పుడో రిలీజ్‌ కావాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల పలు మార్లు వాయిదా పడుతూ.. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేఫథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో జోరు పెచ్చింది చిత్రబృందం. తాజాగా యాంకర్‌ సుమతో కలిసి ఒక ఫన్‌ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో రవితేజపై హీరోయిన్‌ శ్రీలీల ప్రశంసల వర్షం కురిపించింది.ఆయనతో కలిసి పనిచేయడం చాలా సులభంగా ఉంటుందని, అత్యంత ఆహ్లాదకరమైన సహనటులలో ఆయన ఒకరని శ్రీలీల తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.రవితేజ అంకితభావం గురించి మాట్లాడుతూ.. గాయంతో బాధపడుతున్నప్పటికీ, ఆయన ఆసుపత్రికి వెళ్లే ముందు 'తూ మేరా లవర్' పాటను పూర్తి చేసి, తన నిబద్ధతను చాటుకున్నారని శ్రీలీల కొనియాడారు. మాస్ జతారలో తాను సైన్స్ టీచర్‌గా, శ్రీకాకుళం యాసలో మాట్లాడే ఉల్లాసభరితమైన పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తానని ఆమె వెల్లడించారు. తన మునుపటి పాత్రలకు పూర్తి భిన్నంగా ఇది ఉంటుంది. స్క్రిప్ట్ చదివినప్పుడే తాను నవ్వుకున్నానని, ఇక సెట్ లో దానిని ప్రదర్శించే సమయంలో ఆ నవ్వులు రెట్టింపు అయ్యాయని శ్రీలీల పేర్కొన్నారు.రవితేజ ఈ సినిమాలో తాను పోషించిన ఆర్‌పిఎఫ్(రైల్వే పోలీస్ ఫోర్స్) అధికారి పాత్ర గురించి మాట్లాడుతూ, ఇది తన సినీ ప్రయాణంలో ప్రత్యేకమైన పాత్ర అని అభివర్ణించారు. అలాగే చిత్ర దర్శకుడు భాను భోగవరపు, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోపై ప్రశంసలు కురిపించారు. భాను ప్రతిభావంతుడని, చిత్రీకరణ సమయంలో కూడా సన్నివేశాన్ని ఇంకా మెరుగ్గా మలచడానికి ప్రయత్నిస్తుంటాడని, చాలా వేగంగా మార్పులు చేయగలడని కొనియాడారు. భీమ్స్ ఎంతో కృషి చేసి, ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించాడని అన్నారు. ఇక మాస్ జాతర సినిమా గురించి మాట్లాడుతూ.. వినోదం, మాస్ అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాలతో నిండి ఉంటుందని తెలిపారు.

Baahubali Producer Shobu Yarlagadda has finally revealed the truth8
బాహుబలి ప్రభాస్ కోసం కాదు.. ఆ హీరో కోసమే.. నిర్మాత ఏమన్నారంటే?

టాలీవుడ్‌ ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకధీరుడు రాజమౌళి. ఆయన డైరెక్షన్‌లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి-2 చిత్రాలు తెలుగు సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాయి. ఆ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సైతం ఆస్కార్‌ ఘనతను సాధించింది. తెలుగు సినిమాను విశ్వవ్యాప్తం చేసిన రాజమౌళి.. మరోసారి బాహుబలిని అభిమానుల ముందుకు తీసుకొస్తున్నారు. రెండు పార్ట్‌లను కలిసి బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 31న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ నేపథ్యంలో బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఈ సందర్భంగా చాలా రోజులుగా వైరలవుతోన్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. బాహుబలి చిత్రానికి మొదట అనుకున్నది ప్రభాస్‌ను కాదని.. బాలీవుడ్ స్టార్ హృతిక్‌ రోషన్‌ అని గతంలో చాలాసార్లు రూమర్స్ వచ్చారు. ఈ వార్తలపై నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. బాహుబలిలో ప్రభాస్ పాత్ర కోసం మేము హృతిక్‌ను సంప్రదించినట్లు ఆన్‌లైన్‌లో వచ్చిన వార్తలు విన్నానని అన్నారు.అయితే అవన్నీ కేవలం ఊహగానాలేనని కొట్టిపారేశారు. ఈ సినిమాను కేవలం ప్రభాస్‌ కోసమే సిద్ధం చేశామని శోభు వెల్లడించారు. ఈ పాత్ర మొదటి నుంచి ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకుని రాశారని తెలిపారు. ఇతర నటులు ఎవరికీ కూడా ఆడిషన్లు నిర్వహించలేదని అన్నారు. ఆ పాత్రకు హృతిక్ రోషన్‌ కోసం సంప్రదిచారని చాలా కాలంగా వస్తున్న రూమర్స్‌కు చెక్‌ పెట్టారు నిర్మాత యార్లగడ్డ.హృతిక్‌పై రాజమౌళి వివాదాస్పద కామెంట్స్..కాగా.. బాహుబలి దర్శకుడు రాజమౌళి హృతిక్ రోషన్ పట్ల 2009లో చేసిన కామెంట్స్ వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. మెహర్ రమేశ్ తెరకెక్కించిన బిల్లా సినిమాను ప్రమోట్ చేస్తున్న కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడారు. ధూమ్ -2 రెండేళ్ల క్రితం విడుదలైనప్పుడు బాలీవుడ్ మాత్రమే ఇలాంటి నాణ్యమైన సినిమాలు ఎందుకు చేయగలదా? అని ఆశ్చర్యపోయానని అన్నారు. మనకు హృతిక్ రోషన్ లాంటి హీరోలు లేరా? బిల్లా పాటలు, పోస్టర్, ట్రైలర్ చూశా.. నేను ఒక్క విషయం మాత్రమే చెప్పగలను.. ప్రభాస్ ముందు హృతిక్ రోషన్ అసలు ఏం కూడా కాదు. తెలుగు సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లినందుకు మెహర్ రమేష్ (దర్శకుడు)కి కృతజ్ఞతలు అంటూ రాజమౌళి మాట్లాడారు. ఈ కామెంట్స్‌ వివాదానికి దారి తీయడంతో రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత నా ఉద్దేశ్యం అతన్ని ఎప్పుడూ కించపరచడం కాదని.. హృతిక్ రోషన్‌ను చాలా గౌరవిస్తానని అన్నారు.

Mouni Roy And Aparna Das Latest News9
పెళ్లి కూతురిలా అపర్ణ.. చేతులకు పారాణితో మౌనీ

చేతులకు పారాణితో లెహంగాలో మౌనీ రాయ్పెళ్లి కూతురిలా ముస్తాబైన హీరోయిన్ అపర్ణ దాస్ఒంటరిగా దాండియా ఆడేస్తూ ప్రియా వారియర్క్యారవాన్ ఫన్ మూమెంట్స్‌తో మృణాల్ ఠాకుర్పారిస్ దేశంలో విహారయాత్రలో అనన్య పాండేసముద్రం, ఆకాశాన్ని గుర్తుచేస్తున్న అనుపమ డ్రస్ View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Aparna Das💃🏻 (@aparna.das1) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Anikha surendran (@anikhasurendran) View this post on Instagram A post shared by mon (@imouniroy) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday) View this post on Instagram A post shared by Komalee Prasad (@komaleeprasad)

Varun Sandesh Talk About Constable Movie At Pre Release Event10
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి : వరుణ్‌ సందేశ్‌

‘నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం "హ్యాపీడేస్" 2007లో ఇదే నెలలో విడుదలై, ఘన విజయం సాధించి, నా కెరీర్ నే మలుపు తిప్పింది. అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండి పోయింది. ఇప్పుడు కానిస్టేబుల్‌ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు.వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, సందేశం వంటి అంశాలను మిళతం చేసి రూపొందించడం జరిగింది" అని అన్నారు.నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ, "ఈ చిత్రానికి సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 10న చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నాం. ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని చూపించాం. అమ్మాయిలతో పాటు తల్లి తండ్రులు కూడా ఈ సినిమాను చూడాలి" అని అన్నారు.దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని పెంచింది. నిర్మాత కథను నమ్మి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈ సినిమా తెరపైకి వచ్చింది" అని అన్నారు.

Advertisement
Advertisement