గోరేటి వెంకన్న పాడిన 'సంచారమే' సాంగ్‌ విన్నారా? | EPIC First Semester: Sancharame Video Song Released | Sakshi
Sakshi News home page

ఎపిక్‌: గోరేటి వెంకన్న పాడిన 'సంచారమే..' సాంగ్‌ వచ్చేసింది

Mar 9 2026 4:24 PM | Updated on Mar 9 2026 4:28 PM

EPIC First Semester: Sancharame Video Song Released

'బేబి' సినిమా జోడీ ఆనంద్‌ దేవరకొండ- వైష్ణవి చైతన్య మరోసారి జంటగా నటిస్తున్న చిత్రం "ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌". 90's సిరీస్‌ ఫేమ్‌ ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సోమవారం నాడు ఈ సినిమా నుంచి సంచారమే వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేశారు. హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందించడంతో పాటు పాట ఆలపించాడు. ప్రజాకవి గోరేటి వెంకన్న కూడా హమ్మింగ్‌ చేస్తూ మధ్యమధ్యలో లిరిక్స్‌ అందుకున్నాడు. 

గోరేటి వెంకన్న నోట..
వెంకన్న గొంతుక ఈ పాటకు మరింత అందాన్నిచ్చింది. సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందం ఏమున్నది? అంటూ పాట మొదలవుతుంది. ఊరు నుంచి విదేశాలకు వెళ్లిన సంచారి అనుభవాలను, ఎగ్జయిట్‌మెంట్‌ను పాటలో చూపించారు. ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌ విషయానికి వస్తే.. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

 

చదవండి: అప్ప ట్లో వాష్‌రూమ్స్‌ కూడా లేవు: బాలీవుడ్‌ నటి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement