breaking news
Parvathipuram Manyam
-
కరుసైపోయావా నాగార్జునా..!
–IIలోశుక్రవారం శ్రీ 10 శ్రీ అక్టోబర్ శ్రీ 20254జీ టవర్ల ఏర్పాటు వేగవంతం చేయాలిమారుమూల గిరిజన గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను అందించేందుకు టవర్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని జేసీ ఆదేశించారు.పాడి రైతులపై దాడి కూటమి సర్కార్ అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలో కూటమి నేతలు మరింతగా రెచ్చి పోతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: తన మటుకు తాను పడుకున్న సింహాన్ని జూలు పట్టి లాగి లేపి బక్కిరించుకున్నట్టు అయ్యింది జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కిమిడి నాగార్జున పరిస్థితి. ఆత్మ గౌరవం.. ఆవకాయ బద్ద అనుకుంటూ ఏదేదో ఊహించుకొని అనవసరంగా ముళ్ల కంపలో పడినట్టు అయిపోయింది. దశాబ్దాలుగా డీసీసీబీ కాంపౌండ్‌లో కూర్చుని సిరిమానును చూసే సత్తిబాబును నాగార్జున తన ఉనికి కోసం అక్కడ నుంచి ఖాళీ చేయించి పాత అర్బన్ బ్యాంకు భవనం ప్రాంగణానికి మార్పించారు. ఇదేమయ్యా.. అంటే డీసీసీబీ వాళ్ల జాగిరు కాదు.. ప్రస్తుతం నా కంట్రోల్లో ఉంది.. నా కార్యకర్తలు, మా పార్టీ డైరెక్టర్లు, చైర్మన్లు వచ్చి కూర్చుంటారు.. మేం కూడా సిరిమానును చూస్తాం.. ఇది మా ఆస్తిత్వం.. ఆత్మ గౌరవానికి సంబంధించిన అంశం అంటూ ఏదేదో చెప్పారు. ఈ అంశంపై సత్తిబాబు పెద్దగా ఏమి స్పందించకుండా ప్రభుత్వం కేటాయించిన జాగాలోనే కూర్చుని సిరిమాను చూసేందుకు సిద్ధమయ్యారు. ఆ అర్బన్ బ్యాంకు వద్ద ఏర్పాటు చేసిన వేదిక నాసిరకం కావడం.. నేల చదును చేయకపోవడం వంటి కారణాల వల్ల వేదిక అలా కిందికి దిగిపోగా బొత్స సత్తిబాబుతో పాటు వైఎస్సార్సీపీ నాయకులు బెల్లాన చంద్రశేఖర్, సురేష్‌బాబు, బొత్స అప్పలనర్సయ్య వంటి వాళ్లు వేదిక పైనుంచి పడిపోయారు. ఈ సంఘటన సిరిమానోత్సవం రోజు పద్ద చర్చనీయాంశమైంది. చక్కగా డీసీసీబీ ప్రాంగణంలోనే కూర్చుని సిరిమాను చూసే సత్తిబాబును వేరే చోటకు మార్పించి, అక్కడ సరిగా ఏర్పాట్లు చేయలేదన్న అంశం ప్రజల్లోకి వెళ్లింది. ఈ మొత్తం ఎపిసోడ్లో ఇంకో చిత్రం ఏమిటంటే సిరిమాను కదిలేటపుడు ఎప్పట్లానే రాజ కుటుంబీకులు కూర్చునే కోట వద్ద.. ఇంకా ఈసారి సత్తిబాబు కూర్చున్న అర్బన్ బ్యాంకు వద్ద కొన్ని క్షణాలు ఆగి కాస్త వంగి ఆశీర్వదించి వెళ్లింది తప్ప డీసీసీబీ వద్ద అర క్షణం కూడా నిలవలేదు. అంటే సత్తిబాబు ఎక్కడ కూర్చున్నా.. ఆయన ప్రాధాన్యం, గౌరవం ఏమాత్రం తగ్గదని మరోసారి రుజువైంది. వ్రతం చేసినా.. ఫలితం దక్కలేదు.. అశోక్‌కు ఎదురుగా టెంట్ వేయడమా.. ఎంత ధైర్యం! డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున సెల్ఫ్ గోల్ -
రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి
కురుపాం: సామాజిక ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి సూచించారు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తనిఖీలకు వచ్చిన రోగులతో ఆసుపత్రి రద్దీగా ఉండగా కలెక్టర్ అందుతున్న సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్షల కోసం రోగులు బారులు తీరడంతో ఇకపై రోగుల సౌకర్యార్ధం ఆసుపత్రి బయట ఆవరణలో రక్త పరీక్షలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. అక్కడ చికిత్స పొందుతున్న గురుకులం, ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయాన్ని సందర్శించి విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడారు. విధి నిర్వహణపై ఆరా తీశారు. ఎంపీడీవో ఉమామహేశ్వరితో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అలాగే మృతి చెందిన కురుపాం గురుకుల విద్యార్థిని తోయక కల్పన స్వగ్రామమైన దండుసూర గ్రామాన్ని సందర్శించారు. అక్కడ పారిశుధ్య పనులు, వైద్య శిబిరాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎంహెచ్‌వో భాస్కరరావు, సిబ్బంది పాల్గొన్నారు. మలేరియా నివారణకు చర్యలు పార్వతీపురం రూరల్: జిల్లాలో మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్టమైన నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. మలేరియా ప్రభావిత గ్రామాలను గుర్తించి, యాంటీ లార్వా పిచికారీ చేయాలన్నారు. ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, రాత్రి పూట దోమతెరల వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు. అనుమానితులకు రక్త పరీక్షలు చేసి, పాజిటివ్ వస్తే వెంటనే మందులు అందించాలని స్పష్టం చేశారు. సమావేశంలో జేసీ యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్వో హేమలత, డీఎంహెచ్‌వో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
చోరీకి పాల్పడిన ఇద్దరు నిందితుల అరెస్టు
కురుపాం: మండలంలోని గుమ్మ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆయుష్మాన్ భవన్ మందిర్ కార్యాలయంలో దొంగతనానికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కురుపాం ఎస్సై నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ గుమ్మ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ఆయష్మాన్ భవన్ కార్యాలయంలో గల కంప్యూటర్ల పరికరాలైన సీపీయూ, కీబోర్డులు చోరీకి గురైనట్లు సంబంధిత సిబ్బంది బుధవారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఈ సందర్భంగా గుమ్మ గ్రామ సమీపంలో చిట్టిగెడ్డ దగ్గర అనుమానస్పదంగా తిరుగుతున్న బర్లి చందు, సింగమహంతి అవినాష్‌లను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చోరీకి పాల్పడినట్లు అంగీకరించారన్నారు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని తెలిపారు. చోరీ చేసిన కంప్యూటర్ పరికరాల విలువ రూ.లక్ష వరకు ఉంటుందన్నారు. దర్యాప్తులో ఏఎస్సై సత్యనారాయణ, కానిస్టేబుల్ శేఖర్మధు పాల్గొన్నట్లు చెప్పారు. -
ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేయాలి : కలెక్టర్
విజయనగరం ఫోర్ట్: ఖరీఫ్‌కుగాను 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించామని, పంట కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లుతో సిద్ధంగా ఉండాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ధాన్యం సేకరణపై గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల స్థాయి, గ్రామ స్థాయి కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. పంట రకం, దిగుబడి వచ్చే సమయం, సేకరణపై మండల స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో సిబ్బందికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. మద్దతు ధర, ట్రక్ షీట్ విధానం తదితర అంశాలపై విసృత్తంగా ప్రచారం చేయాలని సూచించారు. పౌర సరఫరా అధికారి మిల్లులను ట్యాగ్ చేయడం, బ్యాంకు గ్యారంటీను తీసుకోవడం, అన్ని మిల్లుల పని చేస్తున్నదీ.. లేనిదీ.. తనిఖీ చేయడం, సీఎస్‌డీటీలకు శిక్షణ పూర్తి చేయాలని పేర్కొన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన సామగ్రిని సరఫరా చేయాలన్నారు. వర్షాలు పడితే టార్పాలిన్లు సరఫరా చేయడానికి మండల కేంద్రాల్లో సిద్ధం చేయాలని మార్కెటింగ్ ఏడీ రవికిరణ్‌కు సూచించారు. పీఏసీఎస్‌ల ద్వారా ధాన్యం కొనుగోలు చేయడానికి 57 సోసైటీలు సిద్ధంగా ఉన్నాయని వాటికి శిక్షణ పూర్తి చేయాలన్నారు. సమావేశంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ బొడ్డేపల్లి శాంతి, ఆర్డీవోలు కీర్తీ, రాంమోహన్, జిల్లా వ్యవసాయ అఽధికారి, జిల్లా సహకార అధికారి రమేష్ పాల్గొన్నారు. -
మృతి చెందిన పోలీసు కుటుంబానికి ‘చేయూత‘
విజయనగరం క్రైమ్: జిల్లాలోని తెర్లాం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేసి, ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బి.నాగభూషణరావు కుటుంబానికి ‘చేయూత’ సహాయం ద్వారా రూ.1,48,600ల చెక్కును ఆయన భార్య ధనలక్ష్మికి ఎస్పీ ఏఆర్ దామోదర్ తన చాంబర్లో గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాఖలో పని చేస్తూ ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో మరణించిన పోలీసు కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకునేందుకు సిద్ధగా ఉన్నామన్నారు. ఇందుకోసం ప్రతి సిబ్బంది స్వచ్ఛదంగా ముందుకు వచ్చి వారి నెలవారి జీతంలోకొంత నగదు పోగు చేసి ఇస్తుండడం స్ఫూర్తిదాయకమని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ తరహా చర్యలు పోలీసు ఉద్యోగుల్లో ఐకమత్యం పెంచడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉన్నామన్న భరోసా కల్పించడమేనన్నారు. కార్యక్రమంలో ఏఓ పి.శ్రీనివాసరావు, ఆఫీసు సూపరింటెండెంట్ టి.రామకృష్ణ, పోలీసు సంక్షేమ సంఘం అడహాక్ కమిటీ అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, పోలీసు కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.పిడుగుపాటుతో ఇద్దరికి అస్వస్థతబొండపల్లి: మండలంలోని గొట్లాం గ్రామంలో గురువారం సాయంత్రం ఇంటిడాబాపై పని చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు పిడుగుపాటు బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన సింగవరపు సీతారాం, సీహెచ్.ఆదినారాయణలు ఇంటి డాబాపై పని చేస్తుండగా సాయంత్రం ఉరుములు, మొరుపులతో భారీ వర్షం కురవడంతో పిడుగుపాటుకు గురయ్యారు. దీంతో వారిద్దరినీ జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పపత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రసుత్తం ఇద్దరి పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. షిప్‌యార్డ్‌లో ఉద్యోగాలకు శిక్షణపార్వతీపురంటౌన్: విశాఖపట్నంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ కంపెనీలో ఉద్యోగాల కోసం 3 నెలల నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి కె.సాయికృష్ణ చైతన్య తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విశాఖపట్నం స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్‌లో ఐటీఐ అభ్యర్థులకు 3 నెలలు నైపుణ్య శిక్షణ ఇచ్చి షిప్ యార్డులో ఉద్యోగం కల్పిస్తున్నట్లు వివరించారు. కావున ఆసక్తి గల అభ్యర్థులు ఫోన్ 9676965949 నంబర్‌ను సంప్రదించాలని ఆయన ప్రకటనలో కోరారు. నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలి నెల్లిమర్ల రూరల్: విద్యార్థులు, యువత నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని ఎన్సీసీ గ్రూప్ కమాండింగ్ అధికారి సుమంత్ రాయ్ సూచించారు. మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయాన్ని ఆయన గురువారం సందర్శించి, విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఎన్సీసీ ద్వారా క్రమశిక్షణ అలవడుతుందని, అర్హులైన ప్రతిఒక్కరూ ఎన్సీసీలో చేరాలన్నారు. అనంతరం బీహార్‌కు బదిలీపై వెళ్తున్న ఎన్సీసీ కమాడింగ్ అధికారి కల్నల్ తపస్ మండల్‌ను ఘనంగా సత్కరించి, వీడ్కోలు పలికారు. అలాగే కొత్త కమాండింగ్ అధికారి సుమంత్రాయ్కు స్వాగతం పలికారు. కార్యక్రమంలో చాన్సలర్ ప్రొఫెసర్ జీఎస్ఎన్ రాజు, వైస్ చాన్సలర్ ప్రశాంత్‌కుమార్ మహంతి, రిజిస్ట్రార్ పల్లవి తదితరులు పాల్గొన్నారు. గడ్డి మందు తాగి ఆటోడ్రైవర్ ఆత్మహత్యవీరఘట్టం: మండలంలోని చిదిమి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ బౌరోతు సాయి(23) బుధవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ఎస్సై జి.కళాధర్ తెలిపిన వివరాల ప్రకారం ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు గల కారణాలు ఇలా ఉన్నాయి. కాంచన అనే ఆమెతో ఏడాది క్రితం సాయికి వివాహం జరిగింది. బార్యభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తరచూ గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై మృతుడి తల్లిదండ్రులు మోహనరావు, విజయల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రహదారుల కోసం సర్వే చేశాం..
పార్వతీపురం రూరల్: జిల్లాలోని 142 గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించేలా సమగ్ర సర్వే చేసి అంచనాలు తయారు చేశామని జిల్లా పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి వీఎస్ నగేష్‌బాబు గురువారం తెలిపారు. అంచనాల ప్రతిపాదనలను కలెక్టర్‌కు సమర్పించామని, అవి ఆమోదం పొందిన వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. ఈ నెల 9న సాక్షి దినపత్రికలో గిరిసీమకు దారేది శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆయన స్పందించారు. జిల్లాలోని రహదారులు లేని గ్రామాలకు కనీ సం అంబులెన్స్ వెళ్లే విధంగా రహదారులు వేయడానికి కలెక్టర్ ఆదేశాల మేరకు అంచ నాలు తయారు చేశామన్నారు. కలెక్టర్ ఆమోదం పొందిన తక్షణమే పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని తెలిపారు. -
అట్రాసిటీ బాధితురాలికి పెన్షన్ బకాయిల మంజూరు : కలెక్టర్
పార్వతీపురం రూరల్: జిల్లాలోని పాచిపెంట మండలం మోసూరు గ్రామానికి చెందిన గండిపల్లి అచ్చమ్మకు రూ.1,81,236 పెన్షన్ బకాయిలను మంజూరు చేస్తూ కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2019లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో హత్యకు గురైన ఆమె భర్త గండిపల్లి తౌడు తరఫున ఈ పరిహారం అందుకోనున్నారని తెలిపారు. 2023 మే నెల నుంచి 2025 ఆగస్టు నెల వరకు రావల్సిన పెన్షన్, కరువు భత్యంతో కలిపి ఈ మొత్తాన్ని మరికొద్ది రోజుల్లో నేరుగా ఆమె బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నట్టు కలెక్టర్ వెల్లడించారు. పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ వారి ఆలయానికి దసరా ఉత్సవాల సందర్భంగా రూ.32,93,397 ఆదా యం సమకూరిందని ఆలయ ఈవో సూర్యనారాయణ గురువారం తెలిపారు. ఇందులో హుండీల ద్వారా రూ.17,98,058 ద్వారా వచ్చిందని తెలిపారు. కుంకుమార్చనల టికెట్ల ద్వారా రూ.2,61,650, అంతరాలయం టికెట్ల ద్వారా రూ.1920, ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వా రా రూ.3,01,400, శ్రీఘ్ర దర్శన టికెట్ల ద్వారా రూ.4,71,240ల ఆదాయం వచ్చిందని తెలిపా రు. పూజలు, ఘటాలు, కేశ ఖండన తదితర ఇతర టికెట్ల ద్వారా రూ. 4,62,609 ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. గత ఏడాది దసరా ఉత్సవాలకు రూ. 24,47,839లు సమకూరిందని వివరించారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.8,45,558 ఆదాయం అధికంగా వచ్చిందని తెలిపారు. పార్వతీపురం రూరల్: కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. వాతావర ణ మార్పుల నేపథ్యంలో వ్యాధులు ప్రబలకుండా ఈ నెల 8న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు 15 మండలాల పరిధిలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతిగృహాల్లో 65 చోట్ల నీటి నమూనాలను పరీక్షించినట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులకు స్వచ్ఛమైన నీరు అందించేందుకు అన్ని తాగునీటి ట్యాంకుల్లో ప్రతీ రోజు క్లోరినేషన్ చేయాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. -
పాడి రైతులపై దాడి
గంట్యాడ: కూటమి సర్కార్ అరాచకాలకు అడ్డూఅదుపులేకుండా పోతోంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఇలాకాలో కూటమి నేతలు మరింతగా రెచ్చి పోతున్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై నిన్న, మొన్నటి వరకు తమ ప్రతాపాన్ని చూపించిన కూటమి నేతలు తాజాగా పాడి రైతులపై కూడా అరాచకానికి తెరలేపారు. దీంతో కడుపు మండిన రైతులు తీవ్రస్థాయిలో పోలీసులు, రెవెన్యూ అధికారులను ప్రతిఘటించారు. పశువుల శాలలు తొలగించే ప్రయత్నం నీలావతి గ్రామంలో పాడి రైతులకు చెందిన పశువుల శాలలను తొలగించేందుకు గురువారం ప్రయత్నించారు. ఈ మేరకు ఉదయం 7 గంటలకే భారీగా పోలీసులు, రెవెన్యూ సిబ్బంది జేసీబీలతో సహా గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నేత గ్రామంలో ఉన్న 25 మంది పశువుల శాలలను తొలగించాలని తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు దారు అధికార పార్టీ వ్యక్తి కావడంతో అధికారులు కూడా పశువులు శాలలు తొలగించేందుకు సిద్ధమయ్యారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా ఫిర్యాదు చేసిన వ్యక్తి చెప్పిన విధంగా చేయాలని అధికారులను ఆదేశించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశువుల శాలలను రెవెన్యూ అధికారులు తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా రైతులు వారిని అడ్డుకున్నారు. మరో వైపు జేసీబీతో శాలను తొలగించేందుకు దించుతుండగా మహిళలు, రైతులు జేసీబీని అడ్డుకున్నారు. పశువులకు, మాకు గోతులు తీసి అందులో పాతిపెట్టిన తర్వాత మీరు పశువుల శాలలను తొలగించుకోండి. మా లాంటి పేదవారి ఉసురు కచ్చితంగా మీకు తగులుతుందంటూ శాపనార్థాలు పెట్టారు. తీవ్రప్రయత్నం చేసిన అధికారులు పశువుల శాలలను ఏవిధంగా నైనా తొలగించేందుకు రెవెన్యూ, పోలీస్ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఒకవైపు రెవెన్యూ సిబ్బంది పశువుల శాలలకు చెందిన చెక్కలు, కర్రలు, కమ్మలు తొలగించడంతో రైతులు అడ్డుకోగా మరోవైపు జేసీబీతో శాలలను తొలగించేప్రయత్నం చేశారు. ఉదయం7గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంట వరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వర్షాకాలం ఉన్న పళంగా వెళ్లిపోమంటే పశువులను ఎక్కడ కట్టాలి. వట్టి గడ్డిని ఎక్కడ వేయాలి. మాకు నెలరోజులు సమయం ఇవ్వండని రైతులు తహసీల్దార్ నీలకంఠేశ్వరరెడ్డిని కోరారు. నా చేతిలో ఏమి లేదు, నేను ఏమీ చేయలేనని ఆయన అనడంతో అయితే మాపీకలు కోసేసి మీరు శాలలు తీసుకోండని తీవ్ర స్థాయిలో ప్రతిఘటించారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు వెనుదిరిగారు. నీలావతి గ్రామంలో పశువుల శాలల తొలగింపు యత్నం తీవ్రంగా ప్రతిఘటించిన రైతులు జేసీబీల అడ్డగింత వెనుదిరిగిన పోలీస్, రెవెన్యూ అధికారులు -
నేటి నుంచి బోధనేతర పనుల బహిష్కరణ
వీరఘట్టం: మితిమీరిన బోధనేతర కార్యక్రమాల వలన బోధనా సమయం హరించుకుపోతున్నదని, ఉపాధ్యాయులకు కూడా బోధనపై ఆసక్తి తగ్గిపోయే విధంగా బోధనేతర కార్యక్రమాలు పెరిపోయాయని, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోనందున ఈ నెల 10 (శుక్రవారం) నుంచి బోధనేతర పనులను బహిష్కరిస్తున్నట్టు ఫ్యాప్టో నాయకు లు గురువారం ప్రకటించారు. ఈ మేరకు ఎంఈవో డి.గౌరినాయుడుకు మెమొరాండం అందజేశారు. పాఠాలు చెబుతాం, పిల్లలకు భోజనం పెడతాం, విద్యాశక్తి కార్యక్రమం బహిష్కరిస్తాం, జీఎస్టీ 2.0 వంటి రాజకీయ కార్యక్రమాలు పాఠశాలలో జరగనివ్వమని తీర్మాన పత్రంలో పేర్కొన్నారు. సీపీఎస్ పై సరైన నిర్ణయం చేయకుంటే మరో ఉద్యమానికి సై అంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తక్షణమే 12వ పీఆర్సీ నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని, కారుణ్య నియామకాలు చేపట్టాల ని, ఆర్థిక బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర స్థాయిలో పోరుబాట చేపట్టేందుకు ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎంఈవోను కలిసిన వారి లో ఫ్యాప్టో నాయకులు ఎం.పైడిరాజు, ఎం.మురళి, బి.రామారావు, ఆర్.ధనుంజయనాయుడు, బి.దుర్గాప్రసాద్, ఎం.నరహరి, కె.సింహాచలం ఉన్నారు. -
● మరో టెంట్..
ఇదిలా ఉండగా దశాబ్దాల నాటి నుంచి తెలుగుదేశానికి సిరిమానోత్సవం వేళ వీక్షించేందుకు ఒకే ఒక్క టెంటు ఉంటూ వస్తుంది. అశోక్గజపతిరాజుగానీ, టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇతరత్రా నాయకులంతా కూడా అశోక్ కూర్చునే కోట బురుజు మీదకు వెళ్లి ఆయనతో పాటు కూర్చుని సిరిమానును వీక్షించేవారు. అంతేగానీ టీడీపీకి ఎంత ఎక్కువ మంది నాయకులున్నా.. ఇంకో టెంట్ అనేది వేయడం గతంలో ఎన్నడూ జరగలేదు. అంతేకాకుండా అశోక్‌ను కాదని వేరే టెంట్ కింద నిలబడేందుకు కూడా టీడీపీ కార్యకర్తలకు ధైర్యం లేదు. నాగార్జునకు ఆ ఆలోచన కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆత్మగౌరవం పేరిట నాగార్జున కొత్తగా టెంట్ వేసి అశోక్‌గజపతికి ఎదురుగా కూర్చుని జనానికి విక్టరీ సింబల్ చూపిస్తూ నిలబడడం ఆయన కేరీర్ పాలిట పెనుముప్పు అని ఆ పార్టీ వారే గుసగుసలాడుకుంటున్నారు. నాగార్జున కూడా కోట పైకెక్కి అశోక్‌గజపతి కుర్చీ వెనకాల కూర్చుని సిరిమానును చూస్తే అయిపోయేది కదా.. కొద్ది గంటల కార్యక్రమం కోసం నాగార్జున ఏకంగా అశోక్ గజపతి కళ్లలో ఎందుకు పడాలి.. సొంతంగా ఎందుకు టెంట్ వేయాలి.. ఇదంతా ఆయన రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బంది కాదా.. అని టీడీపీ నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా నాగార్జున కూర్చున్న డీసీసీబీ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులు ఎవరూ లేరు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరత్రా నాయకులంతా అశోక్‌గజపతి వెనకాల కూర్చుని సిరిమాను చూశారు. మచ్చుకై నా ఒక్క ఎమ్మెల్యే కూడా నాగార్జున దగ్గర కూర్చుని కాసేపైనా ఉన్నారా... అంటే అదీ లేదు. నాగార్జున, కొద్ది మంది పీఏసీఎస్ డైరెక్టర్లు.. కొందరు చోటా నేతలు తప్ప ఆయన దగ్గర ఎవరూ లేరు. ఇదంతా చూస్తుంటే నాగార్జున సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? అని కొందరు ఆ పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏమిటో నాగార్జున చేసిన పని చూస్తుంటే డిక్కీ బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్టుగా ఉందని కొందరు లోలోన గుసగుసలాడుతున్నారు. ఇంకో చిత్రం ఏమంటే... -
రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
● భార్యకు తీవ్ర గాయాలు పార్వతీపురం రూరల్: సీతానగరం మండలంలోని అప్పయ్యపేట గ్రామానికి చెందిన దంపతులు గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదానికి గురి కాగా భర్త అంబటి సుధాకర్ మృతిచెందాడు. భార్య కల్యాణి తీవ్ర గాయాలపాలైంది. ఈ ప్రమాదం వివరాలిలా ఉన్నాయి. భార్య కల్యాణితో కలిసి సుధాకర్ గురువారం స్కూటీపై అంటిపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ సీతానగరంలో ఇంటికి కావాల్సిన సరుకులు కోనుగోలు చేసి తిరిగి వారి గ్రామానికి వెళ్తున్న క్రమంలో సీతానగరం వంతెనపై వారి స్కూటీని విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలో సుధాకర్ (47) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన భార్య కల్యాణిని 108 వాహనంలో పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖపట్నం తరలించారు. సుధాకర్ గతంలో ఎంపీటీసీగా పనిచేసి, ప్రస్తుతం సీతానగరంలో రేషన్ డీలర్‌గా పనిచేస్తున్నారు. వారికి పాప, బాబు ఉన్నారు. ఈ మేరకు వివరాలు సేకరించినట్లు పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రాస్పత్రి అవుట్‌పోస్ట్ పోలీసులు తెలిపారు. సుధాకర్ అకాల మరణంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తండ్రిని చంపిన తనయుడు
బాడంగి: వ్యసనాలకు బానిసైన కొడుకు మద్యం కోసం డబ్బు లివ్వలేదని కన్నతండ్రినే హతమార్చాడు. బాడంగిలో జరిగిన ఈ విషాదకర సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలకేంద్రంలోని సినిమా కాలనీలో నివాసముంటున్న బలిజిపేటకు చెందిన బోనుగిరి రాజేశ్వరరావు(70)ను చిన్నకుమారుడు లక్ష్మణరావు చెప్పులు కుట్టుకునే గూటంతో కొట్టి హతమార్చాడు. మద్యం కొనుగోలుకోసం డబ్బులిమ్మని అడగ్గా తండ్రీకొడుకుల మధ్య బుధవారం రాత్రి జరిగిన ఘర్షణలో ఆవేశపరుడైన కుమారుడు చెప్పులు కుట్టే గూటంతో తండ్రి చెవిపైన బలంగా కొట్టగా తండ్రి రాజేశ్వర రావు స్పృహకోల్పోయి అక్కడికక్కడే కుప్పకూలాడు. గురువారం తెల్లవారుజామువరకు ఈవిషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడి సాధారణ మరణంగా నమ్మబలికే ప్రయత్నం చేశారు. కుమారుడే కాలయముడన్న విషయం చుట్టుపక్కల వారికి తెలిసిపోవడంతో చేసేదిలేక హతుడి భార్య ఉమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి ముగ్గురు పిల్లలు కాగా పెద్దకుమారుడు గతంలో రైలు ప్రమాదంలో చనిపోగా కుమార్తెకు వివాహంచేసి అత్తవారింటికి పంపారు. చిన్నకుమారుడు లక్ష్మణరావు సిమెంట్పని, పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ వ్యసనాలకు బానిసగా మారి తరచూ తల్లిదండ్రులతో తగాదాలు పడుతుంటాడని ఇరుగుపొరుగు వారి సమాచారం మేరకు తెలిసింది. హత్య సంఘటనపై సమాచారం అందుకున్న బొబ్బిలి రూరల్ సీఐ నారాయణ రావు, ఎస్సై తారకేశ్వరరావు, డీఎఎస్పీ భవ్యరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేయగా, సీఐ దర్యాప్తు చేస్తున్నారు. -
4జీ టవర్ల ఏర్పాటు వేగవంతం చేయాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాలకు 4జీ ఇంటర్నెట్ సేవలను వేగంగా అందించేందుకు టవర్ల నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి జియో, బీఎస్ఎన్ఎల్ సంస్థలను ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ తొలిదశలో భాగంగా వాహనాలు వెళ్లే సౌకర్యం ఉన్న కొమరాడ, సాలూరు, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పది గ్రామాల్లో వెంటనే పనులు మొదలు పెట్టాలని సూచించారు. రహదారి సౌకర్యం లేని గ్రామాలకు ఉపాధిహామీ పథకం కింద రోడ్లు నిర్మించి, పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలన్నీ ఇంటర్ నెట్‌తో ముడిపడి ఉన్నందున ఏ గ్రామంలోనూ సిగ్నల్ సమస్యలు ఉండరాదని ఆయన తెలిపారు. టవర్ల ఏర్పాటుకు స్థలాలు అనుకూలంగా లేకపోతే ప్రత్యామ్నాయాలు చూడాలని ఇప్పటికే ఉన్న టవర్ల సిగ్నల్ సమస్యలను కూడా పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. ఈ సమావేశంలో సబ్కలెక్టర్లు ఆర్.వైశాలి, పవర్సప్నిల్ జగన్నాథ్, ఉప కలెక్టర్లు ధర్మచంద్రారెడ్డి, దిలీప్‌చక్రవర్తి, డీఎంజీఓ శ్రీనివాసరావు, పలు మండలాల తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి -
రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌లో విజేతలుగా నిలవాలి
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న స్కూల్ గేమ్స్ క్రీడా పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు విజేతలుగా నిలవాలని జిల్లా స్కూల్ గేమ్స్ ఫేడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మిలు ఆకాంక్షించారు. ఈనెల 10 నుంచి 12 వరకు పశ్చిమగోదావరి జిల్లా రాజమండ్రిలో అండర్ 14,17 బాక్సింగ్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు, ఈ నెల 10 నుంచి 12 వరకు బాపట్ల జిల్లా రేపల్లెలో జరగబోయే అండర్ 14 తైక్వాండో పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారులు గురువారం పయనమయ్యారు. వారికి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు పలు సూచనలు, సలహాలు చేశారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ క్రీడా ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో బాక్సింగ్ కోచ్ బి.ఈశ్వర్, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
గోడకూలి మహిళ..
● మరో ఇద్దరికి తీవ్రగాయాలు బొబ్బిలి: పట్టణంలోని గొల్లవీధి జంక్షన్లో నిర్మాణంలో ఉన్న ఇంటి గోడ కూలి ఎరుకల వీధికి చెందిన తోనంగి అప్పయ్యమ్మ(52) అక్కడికక్కడే మృతి చెందగా కూలీలు రామలక్ష్మి, పొందూరు లక్ష్మణలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఎస్సై రమేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇంటి నిర్మాణ పనులకు వెళ్తున్న వారు ముగ్గురు ఎప్పటిలాగానే లక్కోజు శ్రీనివాసరావు ఇంటి పనులు చేస్తున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇటుకల గోడ నానిపోయి పనిచేస్తున్న వారిపై పడగా అప్పయ్యమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. రామలక్ష్మి, లక్ష్మణ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సీహెచ్‌సీకి తరలించి చికిత్స అందిస్తున్నట్లు, అప్పయ్యమ్మ మృతదేహానికి పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు.అప్పయ్యమ్మ బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలియజేశారు. -
చెరువులో పడి పూజారి మృతి
గరుగుబిల్లి: చెరువులో స్నానానికి దిగిన ఓ పూజారి ప్రమాదవశాత్తు మృతిచెందాడు. గరుగుబిల్లి మండలంలో గురువారం జరిగిన సంఘటనపై స్థానిక ఎస్సై ఫకృద్ధీన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రావుపల్లిలో బుధవారం రాత్రి గ్రామానికి చెందిన తెలగవీధిలోని రామమందిరం ఆలయ పూజారిగా పనిచేస్తున్న సంగం చంద్రశేఖర్ (53) స్నానానికి బోటువాని చెరువులో దిగుతున్న సందర్భంలో ప్రమాదవశాత్తు కాలుజారి చెరువులో పడి మునిగిపోయాడు. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో నీటిలో మునిగి చనిపోయాడు. కొద్ది సమయం తరువాత చెరువులో చంద్రశేఖర్ మునిగిపోయినట్లు స్థానికులు గుర్తించి స్థానిక ఎస్సైకి సమాచారం అందించడంతో ఆయన సిబ్బందితో వచ్చి మృతదేహం కోసం స్థానికుల సహయంతో గాలింపు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు గ్రామంలో సర్పంచ్ బొంతాడ మహేశ్వరరరావు సమక్షంలో శవ పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆస్పత్రికిచ మృతదేహాన్ని తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆలయ పూజారి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. వేపాడ: మండలంలోని బానాది గ్రామానికి చెందిన సంపర్తి ఆంజనేయులు (32) కోనేరులో జారిపడి గురువారం మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి వల్లంపూడి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన సంపర్తి ఆంజనేయులు తల్లి ఎర్రయ్యమ్మచెరువులో బట్టలు ఉతకడానికి వెళ్లింది. బట్టలు మూటకడుతుండగా మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో ఆంజనేయులు కాలుజారి కోనేరులో పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు మృతుడి తల్లి ఎర్రయ్యమ్మ ఫిర్యాదుపై వల్లంపూడి హెచ్‌సీ శివకేశవరావు కేసు నమోదుచేసి మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం ఎస్.కోట ఆస్పత్రికి తరలించారు. -
బాణసంచా విక్రయాలపై కఠిన చర్యలు
విజయనగరం అర్బన్: జిల్లాలో అనుమతి లేకుండా బాణసంచా విక్రయాలు లేదా తయారీ జరుగుతున్న చోట కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో కూడా తనిఖీలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లో గురువారం జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా వ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, తయారీ పరిస్థితులపై పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ విభాగాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ శ్రీనివాసమూర్తి మాట్లాడుతూ జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లలో మొత్తం ముగ్గురు తయారీదారులు, 15 మంది హోల్‌సేల్ విక్రేతలు ఉన్నారని తెలియజేశారు. ఆర్డీఓలు డి.కీర్తి, మోహనరావు, ఆశయ్య తమ పరిధిలో జరుగుతున్న విక్రయాలపై వివరాలు సమర్పించారు.కలెక్టర్ రామ్‌సుందర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, బాణసంచా విక్రయం ఏ స్థాయిలోనైనా నిర్వహించాలంటే అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. హోల్‌సేల్ షాపులపై పోలీస్, ఫైర్, రెవెన్యూ అధికారులు సంయుక్త తనిఖీలు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో జరిగే విక్రయాలను వీఆర్ఓలు పర్యవేక్షించాలని సూచించారు. అనుమతి పొందిన విక్రేతలు భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి. అగ్నిప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. నీరు అందుబాటులో ఉంచాలి. ఫైర్ సిలిండర్ లభ్యతను నిర్ధారించాలని కలెక్టర్ చెప్పారు. తాత్కాలిక విక్రయాల ప్రాంతాల్లో ఫైర్ ఇంజిన్ వెళ్ళేందుకు తగిన ఖాళీ ఉంచాలని, టెంట్లకు బదులు రేకులతో షెడ్లు నిర్మించాలని సూచించారు. విక్రేతలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారికి నిబంధనలు, భద్రతా మార్గదర్శకాలు వివరించాలని ఆర్డీఓలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో జిల్లా అగ్నిమాపక అధికారి రాంప్రసాద్, డీఎస్పీ వీర్‌కుమార్, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్ల సత్తా
● సాఫ్ట్‌బాల్‌లో బాలురు, బాలికలకు ప్రథమస్థానం తెర్లాం: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర, బాలికల జట్లు సత్తా చాటాయి. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలుర, బాలికల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. అండర్–14 సబ్ జూనియర్ రాష్ట్రస్థాయి పోటీలు విశాఖపట్నం జిల్లా గొలుగుగొండ మండలం కృష్ణదేవిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో ఈనెల 4 నుంచి జరిగాయి. ఈ పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు, బాలికల జట్లు పాల్గొని మొదటి నుంచి మంచి ప్రతిభ కనబరచిన జిల్లా జట్లు ఫైనల్ పోటీలకు చేరాయి. ఫైనల్ పోటీల్లో జిల్లాకు చెందిన బాలురు జట్టు గుంటూరు జిల్లా జట్టుతో పోటీపడి విజయం సాధించి ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. అలాగే జిల్లాకు చెందిన బాలికల జట్టు చిత్తూరు జిల్లా జట్టుతో ఫైనల్ పోటీలో తలపడింది. ఈ పోటీల్లో విజయనగరం బాలికల జట్టు విజయం సాధించి ప్రథమస్థానాన్ని సొంతం చేసుకుంది. జిల్లాకు చెందిన రెండు జట్లు అత్యుత్తమ ఆటతీరును కనబరిచి రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని సంపాదించి వ్యక్తిగత గోల్డ్ మెడల్స్‌తోపాటు షీల్డ్‌లను కై వసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇరుజట్ల క్రీడాకారులను జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, పలువురు పీడీలు, పీఈటీలు, కోచ్‌లు అభినందించారు. రానున్న మరిన్ని పోటీల్లో బాగా రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. -
ముందుచూపు అవసరం
● కళ్లను పరిరక్షించుకోవాలి ● కంటిచూపు లేకపోతే జీవితం అంధకారమే ● నేడు ప్రపంచ దృష్టి దినోత్సవం విజయనగరం ఫోర్ట్: మానవ శరీరంలో అతి ముఖ్యమైనవి కళ్లు, కంటి చూపు కోల్పోతే జీవితం అంధకారమే. ప్రకృతి అందాలను సైతం చూడలేని పరిస్థితి. అందువల్ల నేత్రాల సంరక్షణలో ప్రత్యేక శ్రద్ధ కనబరచాలి. గురువారం ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అనేకమంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు వివిధ రకాల కంటి సమస్యల బారిన పడుతున్నారు. మొబైల్ ఫోన్లు అధికంగా చూడడం వల్ల చాలా మందికి దృష్టి లోపం సమస్య వస్తోంది. ప్రపంచంలో ప్రతి ఒక సెకెనుకు ఒక వ్యక్తి దృష్టి కోల్పోతున్నాడు. వివిధ కారణాలతో ప్రతి ఒక నిమిషానికి ఒక చిన్నారి దృష్టి కోల్పోతున్నాడు. 2022వ సంవత్సరంలో నిర్వహించిన సర్వే అధారంగా భారత దేశంలో 49 లక్షల మంది అంధత్వంతో బాధపడుతున్నారు. అదేవిధంగా 3.50కోట్ల మంది దృష్టి లోపంతో బాధపడుతున్నారు. వారిలో 80 శాతం మంది సకాలంలో నేత్ర పరీక్షలు చేసుకోవడం ద్వారా దృష్టి లోపాన్ని నివారించగలిగారు. ఒక వ్యక్తి అంధత్వం బారిన పడడం వల్ల తలసరి స్థూల జాతీయ ఆదాయం రూ.1,70, 624 నష్టం వాటిల్లుతుందని అంచనా వేస్తున్నారు. కంటి వెలుగు ద్వారా ఎంతో మందికి చూపు కంటి ప్రాధాన్యతను గుర్తించిన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంతో మందిని అంధత్వం బారిన పడకుండా సకాలంలో కంటి పరీక్షలు నిర్వహించి వారికి చూపును ప్రసాదించింది. కంటి శస్త్రచికిత్సలు అవసరమైన వారికి చేయించింది. అదేవిధంగా కంటి అద్దాలు అవసరమైన వారికి కంటి అద్దాలు కూడా అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కంటి వెలుగు కార్యక్రమానికి మంగళం పాడేసింది. 2,92,462 మంది విద్యార్థులకు తొలివిడతలో పరీక్షలు డా.వైఎస్సార్ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా తొలివిడతలో 3357 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2,92,462 మంది విద్యార్ధులకు విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. రెండోవిడతలో13,109 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 3844 మందికి కంటి అద్దాలు అవసరమని గుర్తించి కంటి అద్దాలు అందించారు. మెల్ల కన్ను శస్త్రచికిత్సలు 18 మందికి, కంటి శుక్లం శస్త్రచికిత్సలు ఐదుగురికి, రెప్పవాలడం శస్త్రచికిత్సలు 20 మందికి నిర్వహించారు. కంటివెలుగు మూడో విడతలో1, 79, 890 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 28, 213 మందికి కంటి శస్త్రచికిత్సలు అవసరం కాగా చేశారు. 43,938 మంది అవ్వాతాతలకు కళ్లజోళ్లు అందించారు.కంటిసమస్యల పట్ల నిర్లక్ష్యం కూడదు కంటి సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయకూడదు. చాలా మంది కంటి సమస్యలకు పసర మందులు, నాటు వైద్యులను అశ్రయిస్తుంటారు. దీని వల్ల చూపు కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది. కంటి సమస్యలు వచ్చినప్పడు దగ్గరలో ఉన్న కంటి వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అదేవిధంగా కంటి సమస్యలకు సొంత వైద్యం చేయకూడదు. -
వీఎల్ఎస్ఐ కిట్ల విరాళం
విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాలలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగానికి, సింథటిక్ ప్రొఫెసర్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న డ్రీమ్ చివ్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నాలుగు వీఎల్ఎస్ఐ డిజైన్ కిట్లు విరాళంగా అందించింది. ఈ సందర్భంగా డ్రీమ్ చిప్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి బులుసు గోపీకుమార్ బుధవారం మాట్లాడుతూ ఈ కిట్లు ఎఫ్‌పీజీఏ ఆధారిత చిప్ డిజైన్, పరిశీలన కార్యకలాపాలకు అవసరమైన సాంకేతిక మద్దతుతో రూపొందించినట్లు తెలిపారు. అలాగే ఎంబెడెడ్ ఏఐ చిప్ డిజైన్, కన్జూమర్ టెక్నాలజీ చిప్ డిజైన్ ఇండస్ట్రీయల్ కంట్రోల్ చిప్ డిజైన్, డ్రోన్ చిప్ డిజైన్, మెడికల్ టెక్ చిప్ డిజైన్, అటోమోటివ్ చిప్ డిజైన్, ఫిన్‌టెక్ చిప్ డిజైన్ వంటి అనేక పరిశ్రమల్లో ఉపయోగపడతాయని ఆయన చెప్పారు. ఈ కిట్లకు డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ సంస్థ నుంచి ఈ మెయిల్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ వీఎల్ఎస్ఐ డిజైన్ కిట్లు తమిళనాడులోని చైన్నెలో రూపొందించబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఆంధ్ర మెడ్ టెక్ జోన్లో డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో తయారుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డ్రీమ్ చిప్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధి బులుసు మురళి, జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ బబులు, ఈసీ విభాగాఽధిపతి ప్రొఫెసర్ కేసీబీ రావు, ఇతర బోధకులు పాల్గొన్నారు. -
గిరిసీమకు దారేదీ?
పార్వతీపురం రూరల్: స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా, ఆధునిక ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతున్నా, ఏజెన్సీ ప్రాంతంలోని అనేక గిరిజన గ్రామాలకు నేటికీ కనీస రహదారి సౌకర్యం కలగానే మిగిలిపోయింది. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఏకంగా 226 గ్రామాలకు సరైన దారి లేక అక్కడి ప్రజలు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. వాగులు, వంకలు, కొండలు, గుట్టలే వారికి శ్రీరామరక్షగా మారాయి. ప్రభుత్వ పాలకుల హామీలు నీటి మీద రాతల్లా మిగులుతున్నాయే తప్ప, వారి తలరాతలు మాత్రం మారడం లేదని గిరిజనం కన్నీటి పర్యంతమవుతోంది. అడుగు బయటపెడితే అష్టకష్టాలు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో రహదారుల దుస్థితికి అద్దం పట్టే గ్రామాలు కోకొల్లలు. ప్రధానంగా 63.30 కిలోమీటర్ల మేర రహదారులను నిర్మించా ల్సి ఉన్నప్పటికీ, పనులు నత్తనడకన సాగుతున్నా యి. మరీ ముఖ్యంగా, 52 గ్రామాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయంటే, వాటికి కనీసం కాలిబాట కూడా లేకపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. వ ర్షాకాలం వస్తే ఆ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. అత్యవసర వైద్యం అవసరమైతే డోలీలే వారికి అంబులెన్సులు. చదువుకోవాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాల న్నా, కిలోమీటర్ల కొద్దీ బురద, రాళ్ల మధ్య ప్రాణాల ను పణంగా పెట్టి ప్రయాణం చేయాల్సిందే. గ్రామాల వారీగా గణాంకాలు అధికారిక లెక్కల ప్రకారం, కురుపాం, మక్కువ, జియ్యమ్మవలస, పాచిపెంట, సాలూరు మండలాల పరిధిలో 25 గ్రామాలకు రోడ్లు లేవు. సాలూరు మండలంలోని గంజాయిభద్ర, నేరెళ్ల వలస, కొదమ, సారిక వంటి పంచాయతీలలోని 14 గ్రామాలకు రహదారి నిర్మాణం అత్యవసరం. పాలకొండ, గుమ్మలక్ష్మీపురం, సీతంపేట, పార్వతీపురం వంటి అనేక మండలాల్లోని గిరిజన గ్రామాలది కూడా ఇదే దుస్థితి. ప్రతి ఏటా అధికారులు సర్వేలు చేయడం, ప్రతిపాదనలు పంపడం సాధారణ ప్రక్రియగా మారిందే తప్ప, ఆచరణలో పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. నిధుల కొరతో, అటవీ అనుమతుల జాప్యమో కారణం ఏదైనా, శిక్ష అనుభవిస్తున్నది మాత్రం అమాయక గిరిజనులు. ఇటీవల బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆదేశాలతో సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో రోడ్డు సౌకర్యం లేని గిరిజన గ్రామాల్లో సర్వే నిర్వహించారు. ఈ క్రమంలో ఉపాధిహామీ పథకం ద్వారా రోడ్డు పనులు చేపట్టాలని ఆదేశించారు. ఈ దఫా అయినా పనులు చేస్తారా? లేదా ఎప్పటిలాగానే చేసిన సర్వే లేక్కలు కాగితాలకే పరిమితమవుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి. పాలకుల ప్రగల్భాలు.. సంక్షేమ రాజ్యమని, సుపరిపాలన అందిస్తున్నామని ఊదరగొట్టే పాలకుల మాటలకు, గిరిజన ప్రాంతాల్లో వాస్తవ పరిస్థితికి మధ్య ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంది. అధికారం చేపట్టి ఏడాదిన్నర కాలం గడుస్తున్నా, జిల్లాలోని 226 ఆదివాసీ గ్రామాలకు కనీసం కాలిబాటను కూడా నిర్మించలేని ఈ ప్రభుత్వానికి అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడిది? అంటూ గిరిజన సంఘాలు నిలదీస్తున్నాయి. గిరిజనుల బతుకులు కన్నీటి సుడుల్లో చిక్కుకుంటే, పాలకులు మాత్రం ప్రగల్భాలు పలుకుతూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడుతున్నారు. రహదారి సౌకర్యం లేని 226 గిరిజన గ్రామాలు బాహ్య ప్రపంచంతో తెగిపోయిన సంబంధం నిత్యం నరకం చూస్తున్న ప్రజానీకం వైద్యం అవసరమైతే డోలీలే అంబులెన్సులుగిరిజనుల గోడు పట్టదా? ఎవరికై నా జ్వరం వచ్చినా, గర్భిణికి పురిటినొప్పులొచ్చినా ప్రాణాల మీద ఆశ వదులుకని డో లీలో ప్రయాణించాల్సిందే. వర్షాకాలం వస్తే మ రింత దారుణమైన పరిస్థితి. గిరిజనులు పిల్లల చదువులు, అరకొర అందించే రేషన్ అన్నీ ఆగిపోతాయి. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వచ్చిన కుటమి నాయకులు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చూసే హామీలు అమలు చేసిన దాఖలాలు లేవు. ఇటీవల కలక్టర్ ఆదేశంతో సర్వే చేసిన గిరిజన గ్రామాలకు తక్షణమే రోడ్డు సౌకర్యం కల్పించాలని గిరిజన సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. – పాలక రంజిత్ కుమార్, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధన కార్యదర్శి -
గుర్తు తెలియని వ్యక్తికి తీవ్ర గాయాలు
బొండపల్లి: మండలంలోని బోడసింగిపేట గ్రామానికి సమీపంలో గల పెట్రోల్ బంకు దరి బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. గజపతినగరం నుంచి విజయనగరం వెళ్తున్న బైక్‌ను విజయనగరం నుంచి జక్కువ వెళ్తున్న అర్టీసీ పల్లెవెలుగు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వ్యక్తి తనది ఎస్.కోట అని చెప్పి కోమాలోకి వెళ్లిపోవడంతో తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై మహేష్ తెలియజేశారు. తీవ్ర గాయాలైన వ్యక్తిని జిల్లా కేంద్రంలోని కేంద్ర సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. కారు ఢీకొని మరో వ్యక్తికి.. బొండపల్లి మండల కేంద్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తికి గాయాలయ్యాయి. . పార్వతీపురం నుంచి బొండపల్లి మండలంలోని బి.రాజేరు గ్రామానికి పైల ఈశ్వర్రావు తన బైక్‌పై భార్య, ఇద్దరు కుమార్తెలతో వస్తుండగా విజయనగరం నుంచి గజపతినగరం వస్తున్న కారు ఢీకొనడంతో బైక్ నడుపుత్నున ఈశ్వరరావుకు గాయాలయ్యాయి. గాయపడిన ఈశ్వర్రావును గజపతినగరంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. -
ఇతర సమస్యలతో మరణాలు
పార్వతీపురంటౌన్: జిల్లాలో నిమ్మక సుమన్, నిమ్మక ప్రశాంత్‌లు పచ్చకామెర్ల వల్ల కాదని ఇతర సమస్యలతో మృతి చెందారని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. ఎస్.భాస్కరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన తన చాంబర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నివాసి నిమ్మక సుమన్ (23) సెప్టెంబర్ 14వ తేదీన గుమ్మలక్ష్మీపురల మండలం బాలేసు గ్రామానికి వచ్చాడన్నారు. కుటుంబసభ్యుల సమాచారం మేరకు ఆయన గత నెల రోజులుగా నెల్లూరులో స్టోర్ కీపర్ గా పని చేస్తున్నాడని, సెప్టెంబర్ 30న ఒడిశా రాష్ట్రం లోని దుర్గపాడు జలపాతాన్ని సందర్శించి, అదే రోజు సాయంత్రం తిరిగి వచ్చాడన్నారు. అక్టోబర్ 4న జ్వరం, రెండు సార్లు విరేచనాలు, వాంతులు, పొత్తికడుపు నొప్పితో బాధపడుతూ ఉదయం 11 గంటలకు కురుపాం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు రాగా వైద్యుడు పరిశీలించి అక్టోబర్ 5న మధ్యాహ్నం 12 గంటల సమయంలో పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేయడంతో చికిత్స అందించినట్లు పేర్కొన్నారు. జిల్లా ఆస్పత్రిలో చేర్చిన సమయానికి రోగి స్థిరంగా,చురుగ్గా ఉన్నాడని, దురదృష్టవశాత్తు అక్టోబర్ 6న అర్ధరాత్రి పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో ఎన్సెఫలోపతి కారణంగా మరణించాడని చెప్పారు. అదేవిధంగా నిమ్మక ప్రశాంత్ (31) జియ్యమ్మవలస మండలం చినడోడిజ గ్రామంలో అక్టోబర్ 5న తీవ్రమైన కడుపునొప్పితో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న అనంతరం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారన్నారు. అయితే అప్పటికే దీర్ఘకాలంగా మద్యపానం అలవాటు వల్ల మల్టిపుల్ ఆర్గానన్స్ పెయిల్యూర్ కావడంతో మయోకార్డియల్ ఇన్ఫెక్షన్తో అక్టోబర్ 5 తేదీన రాత్రి మృతి చెందినట్లు వివరించారు. ఈ మరణాలు ఇతర సమస్యల కారణంగా జరిగినవే తప్ప , పచ్చకామెర్ల వల్ల కాదని స్పష్టం చేశారు. డీఎంహెచ్ఓ డా. ఎస్.భాస్కరరావు -
జేసీబీతో ఇసుక అక్రమ తవ్వకాలు
బొబ్బిలిరూరల్: ఇసుక తరలింపులో యథేచ్ఛగా అధికార పార్టీ నాయకులు చెలరేగిపోతున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అర్ధరాత్రిపూట ఇసుక దందా కొనసాగిస్తున్నారు.విషయం తెలిసినా అధికార పార్టీ నాయకులు కావడంతో అధినేత ఆగ్రహానికి గురికాకూడదని అధికారులు సైతం మౌనముద్ర వహిస్తున్నారు. దీంతో ఏకంగా నదిలో జేసీబీని వినియోగించి పెద్ద ఎత్తున ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. బొబ్బిలి మండలంలోని అలజంగి గ్రామం వద్ద వేగావతి నదిలో మంగళవారం ఆర్ధరాత్రి నుంచి బుధవారం తెల్లవారు జాము వరకు జేసీబీతో ఇసుకను తవ్వి ట్రాక్టర్లతో తరలించారు. దాదాపు 80 ఇసుక ట్రాక్టర్ల లోడ్ల ఇసుకను జేసీబీతో తవ్వి తీసి కొంతమేర పట్టణంలోని కాంట్రాక్టర్లకు అమ్ముకోగా మరికొన్ని ఇసుక లోడ్లు గ్రామంలోని కొత్తకాలనీలో రహదారిపై వేశారు. అడిగితే గ్రామంలోని రహదారులేకనని నమ్మించే ప్రయత్నం చేయగా గ్రామంలో కొంతమంది ప్రతిరోజూ అలజంగిలో జరుగుతున్న ఇసుక దందాపై ఇతరులకో నీతి,అధికార పార్టీనాయకులకో నీతి అంటూ చర్చించుకుంటున్నారు. పరిశ్రమలకు రాత్రిపూట తరలింపు ఇదిలా ఉండగా గ్రోత్‌సెంటర్‌లో ఫెర్రోపరిశ్రమలకు సైతం రాత్రి వేళల్లో ఇసుక అక్ర తరలింపు జరుగుతోంది. స్టాక్ పాయింట్ నుంచి తీసుకోవాల్సిన ఇసుకను ట్రాక్టర్ల యజమానులను సంప్రదించి పెంట వద్ద వేగావతి నది నుంచి రాత్రి 11 గంటలనుంచి తెల్లావార్లూ ఇసుక అక్రమరవాణా జరుగుతోందని, రోడ్లు కొట్టుకు పోతున్నాయని సాక్షాత్తు ఆయా గ్రామాల ప్రజలు తహసీల్దార్ ముందు వాపోయారు. అయినా అధినేత అంక్షలతో చూసీచూడనట్లు అధికారులు వ్యవహరిస్తున్నారు. నా దృష్టికి రాలేదు అలజంగి గ్రామంలోని వేగావతి నదిలో మంగళవారం రాత్రి ఇసుక తవ్వకాలపై తహసీల్దార్ ఎం.శ్రీను వద్ద ప్రస్తావించగా తమ దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. -
చెట్టు మీద పడి పోడు రైతు మృతి
పార్వతీపురం రూరల్/కొమరాడ: కొమరాడ మండలంలో బుధవారం వ్యవసాయ పనులకు వెళ్తున్న ఓ రైతు మీద మామిడి చెట్టు పడడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని గూడాతలేసు పంచాయతీ పరిధి తీలేసు గ్రామానికి చెందిన పువ్వుల రామారావు(47) కొండపోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు. రోజులాగానే బుధవారం ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి బయల్దేరాడు. మార్గమధ్యంలో ఒక్కసారిగా పెనుగాలి వీయడంతో ఓ భారీ మామిడి చెట్టు రామారావుపై పడింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోగా గమనించిన స్థానికులు హుటాహుటిన 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, రామారావు మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తెకు వివాహం కాగా, డిగ్రీ పూర్తి చేసిన చిన్న కుమార్తె తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. రామారావు ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
నదిలో దూకిన వ్యక్తి మృతదేహం లభ్యం
వంగర: మండల పరిధి రుషింగి వంతెన పై నుంచి నాగావళి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన కళ్లేపల్లి జగదీష్ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఈ నెల 7వ తేదీన గరుగుబిల్లి మండలం రావివలస వద్ద చేపల వ్యాపారం ముగించుకుని అదే మండలం మగ్గూరు గ్రామానికి వస్తుండగా మార్గమధ్యంలో భార్యాభర్తల మద్య తగాదా రావడంతో జగదీష్ వంతెనపై నుంచి దూకేసిన విషయం పాఠకులకు విదితమే. స్థానిక హెచ్‌సీ దూసి రాములు ఆధ్వర్యంలో పోలీసులు, గజ ఈతగాళ్లు రుషింగి, తలగాం, శివ్వాం తదితర ప్రాంతాల వద్ద నాగావళి నదీతీరంలో గాలింపు చేపట్టారు. చివరికి వీరఘట్టం మండలం మొట్ట–వంగర మండలం సంగాం గ్రామాల సమీపంలో నాగావళి నదిలో మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని రాజాం సీహెచ్‌సీకి తరలిస్తున్నట్లు హెచ్‌సీ దూసి రాములు తెలిపారు. -
పక్షం దాటాక.. పరామర్శలా..!
సాలూరు: జిల్లాలో కురుపాం బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర పేర్కొన్నారు. పట్టణంలోని తన గృహంలో విలేకరులతో బుధవారం ఆయన మాట్లాడారు. గిరిజన విద్యార్థినులు అనారోగ్యంతో మరణిస్తుంటే సంబంధిత మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సంధ్యారాణిపై నిప్పులు చెరిగారు. విద్యార్థినులు మరణించిన పక్షం రోజుల తరువాత తీరుబడి చూసుకుని మంత్రి సంధ్యారాణి విశాఖపట్నం కేజీహెచ్‌కు, కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు వెళ్లడం చూస్తుంటే గిరిజనుల పట్ల మంత్రికి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధమవుతుందని మండిపడ్డారు. విద్యార్థిని చనిపోయిందని తెలిసే సమయానికి మంత్రి స్థానికంగా సాలూరులోనే ఉన్నారని అయినా ఆమె పరామర్శకు వెళ్లలేదని పేర్కొన్నారు. సీఎం స్పందించారని తెలుసుకుని తీరుబడిగా కేజీహెచ్‌కు, తరువాత ఇన్చార్జి మంత్రిని తీసుకుని కురుపాం పాఠశాలకు వెళ్లారని చెప్పారు. విద్యార్థినుల మరణాలతో రాజకీయం చేస్తున్నారంటూ మంత్రి సంధ్యారాణి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఎక్కడైనా మరణాలు సంభవిస్తే ఇవి ప్రభుత్వ హత్యలని, ప్రభుత్వ చేతగానితనమే కారణమని నాడు సంధ్యారాణి గగ్గోలు పెట్టేవారని, నేడు ఈ మరణాలపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థులకు సంబంధించి పాడేరు ఐటీడీఏ పీవో డబ్బులివ్వకపోవడంతో కేజీహెచ్ ట్రైబల్సెల్ వారు ఆ విద్యార్థులను కేజీహెచ్ నుంచి తీసుకువెళ్లిపోతున్న సంఘటనలు దురదృష్టకరమన్నారు. ఏఎన్ఎంల నియామకంపై మంత్రిగా సంధ్యారాణి తొలి సంతకం చేసి ఏడాదిన్నరైనా నేటికీ ఆ హామీ అమలు కాలేదని ఎద్దేవా చేశారు. సాలూరు మండలం కేజీబీవీ పాఠశాలలో విద్యార్థుల భోజన విషయంలో వార్డెన్, పీవీటీ గిరిజనురాలైన స్పెషలాఫీసరును మంత్రి దగ్గరుండి తొలగించారని, మరి మంత్రి సొంత జిల్లాలో 11 మంది మరణించారని, అల్లూరి సీతారామరాజు జిల్లాలోనూ గిరిజన విద్యార్థులు మరణించారని వీటికి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు బాధ్యత వహించరని ప్రశ్నించారు. మంత్రి సంధ్యారాణిని ఎందుకు తప్పించకూడదని నిలదీశారు. బాధిత విద్యార్థినుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారం శాశ్వతం కాదని పాలకులు గుర్తించాలని సూచించారు. జగన్మోహన్రెడ్డిపై విమర్శలా? విద్యార్థినుల మరణాలపై దిగ్భ్రాంతి చెందిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి చలించి మానవత్వంతో స్పందించి ఒక్కో విద్యార్థిని కుటుంబానికి రూ.2లక్షలు సాయం ప్రకటించి ఇచ్చారని ఇది ఆయన మానవత్వానికి, మంచితనానికి నిదర్శనమన్నారు. అటువంటి వ్యక్తిపై, తనపై మంత్రి సంధ్యారాణి అభ్యంతరకర పదజాలాలతో విమర్శలు చేస్తున్నారని గుర్తు చేశారు. గిరిజన విద్యార్థినుల మృతికి మంత్రి సంధ్యారాణి బాధ్యత వహించాలి బాధిత కుటుంబాలకు మానవత్వంతో స్పందించి రూ.2 లక్షలిచ్చిన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డిని విమర్శించడమా? మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
● ఆ పార్టీ కార్యకర్తల కోసమేనా..
పండగ మొత్తం తెలుగుదేశం కార్యకర్తల కోసమే చేసినట్టుగా ప్రజల భావించాల్సిన పరిస్థితి నెలకొంది. వీధి, వార్డు స్థాయి కార్యకర్త కూడా రాష్ట్ర స్థాయి ప్రొటోకాల్ ఉన్నట్లుగా భావిస్తూ రొమ్ము విరుచుకుంటూ గుడి పరిసరాల్లో తిరుగుతున్నా.. ఏమాత్రం పట్టించుకొని పోలీసులు సాధారణ భక్తులను మాత్రం ఈడ్చి పారేశారు. అదేమిటో... దేవుళ్లు కూడా పెద్దలు.. డబ్బున్నవాళ్లనే కరుణిస్తాడు.. తప్ప పేదలను కనీసం కనికరించరు. దీంతో చాలా మంది భక్తులు బయట నుంచి అమ్మవారికి దండం పెట్టుకుని అమ్మా ఈ ఒక్క దండాన్ని కోటి దండాలుగా భావించుకో అని రిక్వెస్ట్ పెట్టుకున్నారు. -
కలుషిత జలం.. వ్యాధులకు గాలం!
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా కురుపాం గిరిజన విద్యార్థుల మరణాల ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ప్రధానంగా కలు షిత నీటి వల్లే పచ్చకామెర్లు సంభవించాయన్న ఒక వాదన ఉంది. మరోవైపు జిల్లా కేంద్రంలోనే తీవ్ర తాగునీటి కష్టాలు పుర వాసులకు ఎదురవుతున్నాయి. రోజుల తరబడి ఇవ్వకపోవడం.. కుళాయిల ద్వారా అప్పుడప్పుడు వదిలినా.. బురదనీరే రావడం పరిపాటిగా మారింది. ఎండగట్టేయడం.. లేదంటే బురద నీరు అంటగట్టేయడం దాదాపు రెండు వారాలుగా మున్సిపల్ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో ఉన్న 30 మురికివాడల ప్రజలతో పాటు పార్వతీపురంలో దాదాపు 80 శాతం మందికి మున్సిపల్ కుళాయిలే ఆధారం. రెండు వారాలుగా నీటి సరఫరా కాకపోవడంతో వారంతా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. బయట ప్లాంట్లలో కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి. బుధవారం నీటి సరఫరా అయినా.. ఎర్ర నీరే దర్శనమిచ్చింది. బకెట్లు, బిందెలతో పట్టుకున్నా.. అడుగంతా బురదే ఉంటోందని మహిళలు వాపోతున్నారు. తాగేందుకే కాదు.. వినియోగానికీ పనికిరావని చెబుతున్నారు. ఈ నీటిని తాగితే దగ్గు, జలుబు, గొంతు నొప్పి, టైఫాయిడ్, పచ్చకామెర్లు వంటి రోగాలు వస్తున్నాయని వాపోతున్నారు. వేసవొచ్చినా.. వానొచ్చినా ఇదే గతి వేసవి, వర్షాకాలం వచ్చిందంటే.. మున్సిపల్ వాసులకు ఈ బురదనీరే గతి అవుతోంది. నాగావళి నది నుంచి పట్టణానికి నీరు సరఫరా అవుతుంది. వేసవిలో భూగర్భ జలాలు అడుగంటిపోవడం.. వర్షాకాలంలో వరద నీరు కారణంగా బురద నీరు తప్పడం లేదు. పార్వతీపురం పట్టణంలో 30 వార్డులున్నాయి. 65 వేల మంది జనాభాకు 8,700 కుళాయిల ద్వారా.. అయిదు రిజర్వాయర్ల నుంచి నీటి సరఫరా అవుతోంది. తోటపల్లి వద్దనున్న నాగావళి నదిలో ఇన్ఫిల్ట్రేషన్ బావులున్నాయి. అక్కడ నుంచి మోటార్ల ద్వారా నీరు బూస్టర్ పంప్ హౌస్‌కు చేరి, అక్కడ శుద్ధి చేశాక, రిజర్వాయర్లకు పంపిస్తుంటారు. ప్రస్తుతం శుద్ధి ప్రక్రియ ఎక్కడా జరగడం లేదు. మున్సిపల్ అధికారులు రాజకీయాల మీద వహించే శ్రద్ధ.. ప్రజలకు తాగునీరు, ఇతర సౌకర్యాలను కల్పించడంలో చూపడం లేదని పట్టణ వాసులు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కౌన్సిలర్లు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై కమిషనర్ వద్ద మొర పెట్టుకున్నా.. ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాపోతున్నారు. ‘వరదొస్తే నేనేం చేస్తా.. నేను ఎక్కడి నుంచి తేగలను. మంచినీరు వస్తే ఇవ్వగలను..’ అంటూ బాధ్యాతారాహిత్యంగా సమాధానమిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నీరు తాగితే పచ్చ కామెర్లే కాదు.. ఏ వ్యాదైనా రావచ్చు! జిల్లా కేంద్రంలో 10 రోజులుగా తాగునీటి సరఫరా బంద్ వదిలినా.. బురద నీరే గతి -
జీవో 13ను తక్షణమే రద్దు చేయాలి
సాలూరు: కార్పొరేటర్లకు అడవులను అప్పగించే జీవో నంబరు 13ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పలువురు నాయకులు, హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. పాచిపెంట మండలంలో గుమ్మకోట జంక్షన్ నుంచి శతాబి వరకు హైడ్రో పవర్ ప్రాజెక్టు వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో గిరిజనులు విల్లంబులతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర, రాష్ట్ర నాయకులు బాలదేవ్, సీపీఎం మన్యం జిల్లా కార్యదర్శి గంగునాయుడు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో ఉన్న అపారమైన ఖనిజ సంపదను అదాని, అంబానీ, నవయుగ వంటి కార్పొరేటర్లకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకుని ప్రభుత్వాలు పని చేస్తున్నాయని విమర్శించారు. అందులో భాగంగానే అనంతగిరి, పాచిపెంట మండలాలను ముంపునకు గురి చేస్తూ గిరిజనులకు తీవ్ర ద్రోహం చేసేందుకు జీవో 13 విడుదల చేసిందన్నారు. దీని ద్వారా నవయుగ సంస్థకు ఈ ప్రాంత ప్రజలను బలి చేసేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయన్నారు. దీనిపై గిరిజనులంతా సమష్టి పోరాటానికి సిద్ధంగా ఉండాలన్నారు. పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
పచ్చకామెర్లతో గిరిజన యువకుడు మృతి
● ఆలస్యంగా వెలుగులోకి.. గుమ్మలక్ష్మీపురం: పచ్చకామెర్ల వ్యాధితో కురుపాంలోని బాలికల గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు పువ్వల అంజలి, తోయక కల్పన మృతిచెందిన సంగతి తెలిసిందే. ఆ పాఠశాలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు పచ్చకామెర్లతో బాధపడుతూ విశాఖపట్నంలోని కేజీహెచ్, పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలోని బాలేసు గ్రామానికి చెందిన గిరిజన యువకుడు నిమ్మక సుమన్ (21) పచ్చకామెర్ల వ్యాధితో పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డిగ్రీ వరకూ చదువుకున్న సుమన్ ప్రయోజకుడై తమను పోషిస్తాడని ఆశించిన తల్లిదండ్రులు సుమన్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. -
ఘనంగా వాల్మీకి జయంతి
విజయనగరం అర్బన్: రామాయణాన్ని అందించిన మహర్షి వాల్మీకి అని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి అన్నారు. జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం మహర్షి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలిత డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వాల్మీకి రచించిన రామాయణం నేడు యావత్ ప్రపంచానికి ఆదర్శమని కొనియాడారు. వాల్మీకి మహర్షి జయంతిని పురష్కరించుకొని వారి జీవిత చరిత్రను ఒకసారి స్మరించుకోవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని గురించి రామాయణంలోని ఉత్తరకాండలో వివరించబడిందన్నారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమాధికారిణి జె.జ్యోతి, సీపీవో పి.బాలాజీ, జిల్లా టూరిజం కల్చర్ అధికారి కుమారస్వామి, ఐసీడీఎస్ పీడీ విమలారాణి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాణి, మార్క్‌ఫెడ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎస్.జానకమ్మ, బీసీ వసతిగృహ సంక్షేమాధికారులు, కలెక్టరేట్లోని వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు. -
తప్పిన ప్రమాదం
గుమ్మలక్ష్మీపురం: మండలంలోని దేరువాడ గ్రామ సమీపంలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం ఉదయం బీరుపాడు గ్రామం నుంచి ప్రయాణికులతో వయా కురుపాం పార్వతీపురానికి బయల్దేరిన ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు మార్గమధ్యలోని దేరువాడ సమీపానికి వచ్చే సరికి ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనానికి దారి మళ్లించే క్రమంలో రోడ్డు పక్కకు దిగడంతో టైర్లు మట్టిలో దిగబడిపోయాయి. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహారించి బస్సును నిలుపుదల చేయడంతో పక్కకు బోల్తా పడకుండా ఆగింది. దీంతో ఆ బస్సులో ఉన్న సుమారు 118 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతగిరి సమీపంలో ఏనుగులు భామిని: మండలంలో ఏబీ రోడ్డు పక్కనే గల అనంతగిరి సమీపంలో ఏనుగులు మంగళవారం కనిపించాయి. గ్రామానికి ఆనుకొని ఉన్న మొక్కజొన్న పంట చేలలో నాలుగు ఏనుగులు తిరుగాడుతూ పంటలను ధ్వంసం చేస్తుండడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏబీ రోడ్డుపైకి ఏ క్షణం అయినా రావచ్చని వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ముమ్మరంగా పారిశుధ్య పనులు : కలెక్టర్ పార్వతీపురం రూరల్: జిల్లాలో గత రెండు రోజులుగా చేపట్టిన పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతూ మార్పుతో కూడిన ప్రగతి సంతరించుకున్నట్టు కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పారిశుధ్య కార్యక్రమంలో భాగంగా మంచినీటి ట్యాంకుల క్లోరినేషన్ కాలువల శుభ్రత వంటి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయన్నారు. తహసీల్దార్లకు నోడల్ అధికారులుగా నియమిస్తూ ఆ మండలాల పరిధిలో ఉన్న గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిపారు. ఈ మేరకు మంచినీటి ట్యాంకులు క్లోరినేషన్ చేయడంతో పాటు మురుగునీటి కాలువలు శుభ్రపరచడం, బ్లీచింగ్ చల్లడం, పూడికలు తీసి స్ప్రేయింగ్ చేయడం గత రెండు రోజులుగా 15 మండలాల్లోని 1125 మంచినీటి ట్యాంకులను శుభ్రపరచి 2,388 మురునీటి కాలువలను శుభ్రపరచినట్టు తెలిపారు. 1398 ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లి స్ప్రేయింగ్ చేసినట్టు కలెక్టర్ వివరించారు. గంజాయి స్వాధీనం పాచిపెంట: మండలంలోని పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద ముగ్గురు వ్యక్తుల నుంచి ఐదు కేజీల గంజాయిని మంగళవారం పట్టుకున్నట్టు ఎస్ఐ వెంకటసురేష్ తెలిపారు. ఒడిశా రాష్ట్రం గుప్తేశ్వరంలో కొనుగోలు చేసి, కాశికి తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నామని దీనిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. రైతు సేవా కేంద్రంలో చోరీ కురుపాం: మండలంలోని గుమ్మ గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రంలో దొంగతనం జరిగింది. వివరాల్లోకి వెళితే మంగళవారం రైతు సేవా కేంద్రానికి చెందిన ఉద్యోగులు విధి నిర్వహించేందుకు వెళ్లారు. కేంద్రానికి వేసిన తాళం పగులగొట్టి కంప్యూటర్‌తో పాటు సంబంధిత పరికరాలను సైతం సోమవారం రాత్రి చోరీ చేసినట్టు ఉద్యోగులు గుర్తించారు. వెంటనే రైతుసేవా సిబ్బంది కురుపాం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాడుల కేసులో విచారణ వేగవంతంగుర్ల: మండలంలోని జమ్ములో జరిగిన దాడుల కేసులో విచారణ వేగవంతం చేస్తున్నట్టు సీఐ జి.శంకరరావు తెలిపారు. జమ్ములో ఫోరెనిక్స్ బృందం మంగళవారం ఆధారాలు సేకరించింది. దాడులలో నమోదు అయిన రెండు కేసుల్లో ఇప్పటికే 20 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించినట్టు చెప్పారు. ఓడ్రుబంగి వాసి ఒడిశాలో మృతి గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఓడ్రుబంగి గ్రామానికి చెందిన పి.పారయ్య(45) ఒడిశాలో మృతి చెందాడు. అదే గ్రామానికి చెందిన ఇరువురు వ్యక్తులతో కలిసి ఒడిశాలోని శిఖల ప్రాంతంలో వెటకు వెళ్లగా.. ప్రమాదవశాత్తు వారి వెంట తీసుకెళ్లిన నాటుతుపాకీ తూటా తగిలి మృతి చెందాడని.. సమాచారం తెలుసుకున్న కుటుంబీకులు ఆ మృతదేహాన్ని మంగళవారం ఓడ్రుబంగి గ్రామానికి తీసుకొచ్చారు. అయితే ఒడిశాలో మృతి చెందడం వలన ఒడిశాకు చెందిన రామన్నగూడ పోలీసులకు అందిన సమాచారం మేరకు మృతదేహాన్ని మరలా స్వాధీన పర్చుకుని, దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
కూటమి కక్ష!
ఆరోగ్యమిత్రలపై..విజయనగరం ఫోర్ట్: ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) పథకంలో పని చేస్తున్న ఆరోగ్యమిత్రల పట్ల కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా వారికి రెండు నెలలుగా జీతాలు నిలిపివేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జీతాలు అందకపోవడంతో ఆరోగ్యమిత్రలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ జీతాల గురించి అధికారులను అడిగితే సరైన సమాధానం చెప్పడం లేదని ఆరోగ్యమిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల గురించి ఆరోగ్యశ్రీ అధికారులను అడిగితే అప్కాస్‌లో సమస్య అని, అప్కాస్ వారిని అడిగితే ట్రస్టులో సమస్య అని ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారని ఆరోగ్యమిత్రలు వాపోతున్నారు. జిల్లాలో 94 మంది ఆరోగ్యమిత్రలు జిల్లాలో 34 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు ఉన్నాయి. వీటిల్లో 94 మంది ఆరోగ్య మిత్రలు పని చేస్తున్నారు. వీరిలో 72 మంది ఆరోగ్య మిత్రాలకు గత రెండు నెలలుగా జీతాలు అందడం లేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల జీతాలు వీరికి అందలేదు. సమాన పనికి సమాన వేతనం ఇప్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్యమిత్రలు కోర్టును ఆశ్రయించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్ ఆరోగ్య మిత్రలకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో అత్యధికంగా విజయనగరం జిల్లాకు చెందిన ఆరోగ్యమిత్రలకే జీతాలు నిలిచిపోవడం గమనర్హాం. ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ )పరిధిలో ఉన్న వ్యాధులకు చికిత్స కోసం వచ్చే వారికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత వైద్యుని దగ్గరకు వీరు పంపిస్తారు. ఆస్పత్రిలో చికిత్స కోసంగాని, శస్త్రచికిత్స కోసం చేరినట్టయితే వారికి సకాలంలో చికిత్స, శస్త్రచికిత్స జరిగేటట్టు చూడడం ఆరోగ్యమిత్రల యొక్క విధులు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ రోగులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా.. లేదా.. అని పర్యవేక్షించడం, ఏదైనా ఆస్పత్రి సిబ్బంది సేవలు అందించడం కోసం చేతి వాటం ప్రదర్శించినట్టయితే వారి ఫిర్యాదును కో ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లడం వీరి యొక్క విధి. జీతాలందక అవస్థలు జీతాలు అందకపోవడం వల్ల ఆరోగ్యమిత్రలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుటుంబ పోషణ, స్కూలు ఫీజులు వంటివి చెల్లించడానికి ఇబ్బంది పడుతున్నారు. తమతో పని చేయించుకుంటున్న అధికారులు జీతాల గురించి మాత్రం ఏ సమాధానం చెప్పకుండా దాట వేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు.. జిల్లాలో 72 మంది ఆరోగ్యమిత్రలకు జీతాలు రెండు నెలలుగా రాలేదు. దీనిపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులను అడిగితే అప్కాస్‌లో సమస్య అని, అప్కాస్ అధికారులను అడిగితే ట్రస్ట్‌లో సమస్య ఉందని ఒకరిపై ఒకరు నెట్టుకుంటున్నారు. సరైన సమాధానం చెప్పడం లేదు. కోర్టును ఆశ్రయించామని జీతాలు నిలిపివేసారో, మరో ఏ కారణం తెలియడం లేదు. జీతాలు రాక పోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. – జెర్రి పోతుల ప్రదీప్, ఆరోగ్యమిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడువాస్తవమే.. ఆరోగ్యమిత్రలకు జీతాలు రాని మాట వాస్తవమే. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. – డాక్టర్ కుప్పిలి సాయిరాం. ఆరోగ్యశ్రీ జిల్లా కో ఆర్డినేటర్ సమాన పనికి సమాన వేతనం కావాలని కోర్టును ఆశ్రయించిన ఆరోగ్యమిత్రలు దీంతో 72 మందికి జీతాలు ‘ నిలిపివేసారనే ఆరోపణలు రెండు నెలలుగా జీతాలు అందని పరిస్థితి అవస్థలు పడుతున్న ఆరోగ్యమిత్రలు రాష్ట్రంలో విజయనగరం జిల్లాకు చెందిన మిత్రలకే ఎక్కువ మందికి జీతాలు అందని పరిస్థితి -
సమాజానికి వాల్మీకి ఆలోచనలు ఆదర్శనీయం
●ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి పార్వతీపురం రూరల్: ఆదికవి, మహర్షి వాల్మీకి ఆలోచనలు సమాజానికి మార్గదర్శకమని కలెక్టర్ ఎన్.ప్రభాకర్‌రెడ్డి, ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి అన్నారు. కలెక్టర్, పోలీస్ కార్యాలయాల్లో మంగళవారం వాల్మీకి జయంతిని నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకి బోధించిన సత్యం, ధర్మం, మానవతా విలువలను ప్రతీఒక్కరు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన చూపిన ధర్మ పఽథం నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో సీఐలు రమణమూర్తి, శ్రీనివాసరావు, ఆర్ఐలు రాంబాబు, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గిరిజన విద్యార్థుల మరణాలు
● మంత్రి సంధ్యారాణి వ్యాఖ్యలపై రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ధ్వజంపార్వతీపురం రూరల్: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థుల మరణాలకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని, దీనిపై మంత్రి సంధ్యారాణి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి మంగళవారం తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు ఇళ్ల వద్ద చనిపోయారంటూ ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకోవాలని చూడటం దారుణమన్నారు. ప్రభుత్వం సరైన వసతులు కల్పించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. గిరిజన విద్యార్థుల బాగోగులను ప్రభుత్వం సరిగా పర్యవేక్షించి ఉంటే 120 మందికి పచ్చకామెర్లు ఎలా వచ్చాయి? పది నెలల్లో 11 మంది ఎలా చనిపోయారు? అని ఆయన ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. కలుషిత నీరు, అపరిశుభ్రతే ఈ అనర్థాలకు మూలమని, ఏళ్ల తరబడి ఏఎన్ఎంలను నియమించకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.30 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి హాస్టల్లో వెంటనే ఏఎన్ఎంను నియమించి, సురక్షిత నీరు, పౌష్టికాహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
మరణంలోనూ వీడని బంధం!
పెంచిన మమకారం...తండ్రితో ఉన్న అనుబంధం ఆ కొడుకును నిలవనీయలేదు.. జన్మ కారకుడైన తండ్రి ఇక లేడనే విషాదం ఆ కొడుకు గుండె తట్టుకోలేకపోయింది. తండ్రి మృతిని తలుచుకుంటూ శ్మశాన వాటిక నుంచి ఇంటికి వస్తూనే కుమిలిపోసాగాడు. ఆ బాధను ఆ గుండె తట్టుకోలేకపోయింది. అటు తండ్రి చితి ఆరక ముందే తనువు చాలించాడు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే... రాజాం సిటీ: తండ్రి చితి ఆరక ముందే కుమారుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన మండల పరిధి బొద్దాం గ్రామంలో చోటు చేసుకుంది. తండ్రీకొడుకు 24 గంటల వ్యవధిలో మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఈ ఘటన అందరినీ కలచివేసింది. మండల పరిధి బొద్దాం గ్రామానికి చెందిన కొన్న బాలకృష్ణ (65) ఈ నెల 6వ తేదీన వేకువజామున గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఈయన డోలక్ వాయిద్యంలో ప్రసిద్ధిగాంచిన కళాకారుడుగా గుర్తింపు పొందాడు. జిల్లా, రాష్ట్ర స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. పౌరాణిక, సాంఘిక నాటకాలకు డోలక్ వాయిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు. ఈయనకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు కనకరాజు తెలంగాణాలో పోలీసుగా విధులు నిర్వహిస్తున్నాడు. రెండో కుమారుడు అప్పలరాజు ఇంటి వద్దే ఉంటూ పెయింటింగ్ పనులు చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు సాయికృష్ణ ఉపాధ్యాయునిగా స్థిరపడ్డాడు. తండ్రి చితి ఆరక ముందే.. కొన్న బాలకృష్ణ మృతి చెందిన 24గంటలు గడవక ముందే తన రెండో కుమారుడు అప్పలరాజు (32) మృతి చెందాడు. తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ దహన సంస్కారాల అనంతరం ఇంటికి చేరిన కాసేపటికే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కుటుంబీకులు, సహచరులు హుటాహుటిన రాజాం ఆస్పత్రికి తరలించగా అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ నెల 6న అర్థరాత్రి దాటిన తరువాత మృతి చెందినట్టు గ్రామస్తులు తెలిపారు. ఈయనకు ఏడాది క్రితమే వివాహం జరిగింది. 24 గంటల వ్యవధిలో తండ్రీకొడుకు మృతి చెందడంతో కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ విషాద ఘటన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. తండ్రి చితి ఆరక ముందే కొడుకు మృతి తండ్రి మృతిని తట్టుకోలేక 24 గంటలు గడవక ముందే తనువు చాలించిన కుమారుడు బొద్దాంలో హృదయ విదారక ఘటన -
రాత్రి వేళ కానరాని ఆర్టీసీ పండగ సర్వీసులు
విజయనగరం అర్బన్: పైడితల్లి అమ్మవారి పండగ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు మంగళవారం రాత్రి వేళ కనిపించలేదు. వర్షం కారణంగా సిరిమానోత్సవం షెడ్యూల్ రెండు గంటల పాటు జాప్యం జరిగిన నేపథ్యంలో భక్తుల తిరుగు ప్రయాణం రాత్రి 9 గంటల వరకు కొనసాగింది. అయితే ఆర్టీసీ ప్రత్యేక సేవలను సాయంత్రం 7 గంటలకే ఆపేయడం వల్ల జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన భక్తులు ఇళ్లకు చేరడానికి ఇబ్బంది పడ్డారు. నిజానికి ప్రత్యేక సర్వీసుల షెడ్యూల్ ప్రకారం పండగ రెండవ రోజు మంగళవారం 80 బస్సులను ఏర్పాటు చేయాలి. సిరిమానోత్సవం జరిగేది సాయంత్రం 3 గంటలకు కాబట్టి ఆ తర్వాత ఎక్కువ సర్వీసులు వేయాలి, కానీ వేయకపోడం వల్ల జిల్లా కేంద్రం నుంచి విశాఖ, సింహాచలం, అనకాపల్లి, శ్రీకాకుళం, చీపురుపల్లి, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట ప్రాంతాల రూట్లలో రాకపోకలకు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. -
కేజీహెచ్ నుంచి 8 మంది విద్యార్థినుల డిశ్చార్జి
● పార్వతీపురం పీహెచ్‌సీకి తరలింపు ● ఆస్పత్రిలో చేరిన మరో ఏడుగురు విద్యార్థినులు మహారాణిపేట: పచ్చకామెర్ల వ్యాధి బారిన పడి కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న 8 మంది విద్యార్థినులను మంగళవారం పార్వతీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఈ విద్యార్థినులకు వ్యాధి తగ్గుముఖం పట్టడంతో, వైద్యుల నివేదికల ప్రకారం తరలించినట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఐ.వాణి తెలిపారు. డాక్టర్ గిరినాథ్ (గ్యాస్ట్రో ఎంట్రాలజీ), డాక్టర్ శివ కల్యాణి (మైక్రోబయాలజీ), డాక్టర్ కృష్ణవేణి (కమ్యూనిటీ మెడిసిన్), డాక్టర్ వాసవీలత (జనరల్ మెడిసిన్), డాక్టర్ చక్రవర్తి (పిల్లల వైద్యుడు)లతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం సమర్పించిన నివేదికల ఆధారంగా విద్యార్థులను తరలించినట్లు చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం గురుకుల బాలికల పాఠశాలకు చెందిన 129 మంది విద్యార్థినులు పచ్చకామెర్ల బారిన పడిన విషయం తెలిసిందే. వీరిలో తొమ్మిదో తరగతి విద్యార్థిని తోయిక కల్పన, 10వ తరగతికి చెందిన పువ్వల అంజలి పచ్చకామెర్లతో మృత్యువాత పడ్డారు. మంగళవారం మరో ఏడుగురు విద్యార్థినులు ఆస్పత్రిలో చేరడంతో.. ప్రస్తుతం కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 50కి చేరుకుంది. -
రేషన్ బియ్యం స్వాధీనం
గుమ్మలక్ష్మీపురం: మండలం నుంచి ఒడిశాకు రెండు పికప్ వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న నాలుగున్నర టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు శ్రీకాకుళం విజిలెన్స్ సీఐ డివివి.సతీష్‌కుమార్ తెలిపారు. ఈ మేరకు తమకున్న సమాచారం మేరకు విజిలెన్స్ ఎస్ఐ బి.రామారావు, రెవెన్యూ సిబ్బందితో కలిసి మంగళవారం ఇరిడి సమీపంలో వేచి ఉండగా రెండు పికప్‌లతో వస్తున్న రేషన్ బియ్యాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఓ పికప్ వద్ద 50 బస్తాలు, మరో పికప్ వద్ద 40 బస్తాలు ఉన్నాయని, వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని, రెండు వాహనాలతో పాటు, పట్టుబడిన బియ్యాన్ని సీజ్ చేసి, బియ్యం తరలించిన వారిపై రెవెన్యూ అధికారులచే 6 ఏ కేసును నమోదు చేయించినట్టు సీఐ ఈ సందర్భంగా పేర్కొన్నారు. వీరి వెంట సీఎస్‌డీటీ శ్రీనివాసరావు, ఆర్ఐ బి.శివ తదితరులు ఉన్నారు. -
కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు చైర్పర్సన్ ఫిర్యాదు
● కౌన్సిల్ తీర్మానాన్ని లెక్క చేయడం లేదు.. ● తగు చర్యలు తీసుకోవాలని వినతి పార్వతీపురం రూరల్: జిల్లా కేంద్రంలో పార్వతీపురం మున్సిపల్ పరిధిలో నిరాశ్రయుల వసతిగృహం నిర్వహణ బాధ్యతల అప్పగింతపై నెలకొన్న సమస్యపై మున్సిపల్ కమిషనర్ ఏకపక్ష వైఖరితో కౌన్సిల్ తీర్మానాన్ని అమలు చేయకుండా అడ్డుకుంటున్నారని మున్సిపల్ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి కలెక్టర్ డా. ఎన్.ప్రభాకరరెడ్డిని మంగళవారం కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ బోను గౌరీశ్వరీ మాట్లాడుతూ పురపాలక సంఘం పరిధిలోని నిరాశ్రయుల వసతిగృహ నిర్వహణ కోసం స్థానికత ఉన్న ఆదర్స్ రూరల్ అండ్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు బాధ్యతలు అప్పగించాలని 30 సెప్టెంబర్ 2024న కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానం నంబరు 633 ద్వారా నిర్ణయించిందని పేర్కొన్నారు. అయితే కొత్తగా వచ్చిన కమిషనర్ దీనిపై అభ్యంతరాలు లేవనెత్తడంతో ఈ ఏడాది 31 జూలైన మరోసారి పాత తీర్మానాన్ని బలపరుస్తూ తీర్మానం నంబరు 765ను ఆమోదించినట్టు తెలిపారు. ఈ నిర్ణయాన్ని మినిట్ బుక్‌లో కూడా స్పష్టంగా నమోదు చేశామన్నారు. అయితే మున్సిపల్ చట్టం ప్రకారం కౌన్సిల్ తీర్మానం మినిట్ బుక్‌లో నమోదయ్యాక దానిని అమలు చేయాల్సిన బాద్యత కమిషనర్‌పై ఉంటుందని వివరించారు. కానీ నెలలు గడుస్తున్నా కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తే ఫైల్ కలెక్టర్ వద్ద ఉందని, ఆయనే తేలుస్తారంటూ తప్పించుకుంటున్నారని వెల్లడించారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికై న పాలకవర్గాన్ని, కౌన్సిల్ అధ్యక్షురాలైన తనను ఈ విధంగా వ్యవహరిస్తూ అవమానించడమేనని ఆమె స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. కలెక్టర్ ఈ విషయంలో స్పందించి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి అర్హత పొందిన సంస్థకు తక్షణమే నిరాశ్రయుల వసతిగృహం బాధ్యతలు అప్పగించేలా కమిషనర్‌ను ఆదేశించాలని కోరినట్టు చైర్పర్సన్ తెలిపారు. కమిషనర్ వైఖరితో నిరాశ్రయులకు అందాల్సిన సేవల్లో జాప్యం జరుగుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
నాగావళిలో దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం
వంగర: మండల పరిధి రుషింగి వంతెన పైనుంచి నాగావళి నదిలో దూకి ఓ వ్యక్తి మంగళవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వీరఘట్టం మండలం బిటివాడ గ్రామానికి చెందిన కళ్లేపల్లి జగదీష్ (33) వంగర మండలం మగ్గూరు గ్రామానికి చెందిన పార్వతిని కొన్నేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చేపల వ్యాపారం రీత్యా గరుగుబిల్లి మండలం రావివలసలో స్థిరపడ్డారు. చేపల వ్యాపారం ముగించుకుని మగ్గూరు వస్తుండగా మార్గమధ్యలో ఉన్న రుషింగి వంతెన సమీపం వచ్చే సరికి వ్యాపార నిమిత్తం భార్యాభర్తలు ఇరువురు తగాదా పడ్డారు. ఈ క్రమంలో వంతెన వద్దే బండిని నిలిపివేసి భార్య ముంగిటే నదిలో దూకి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కిమ్మి, రుషింగి గ్రామాలకు చెందిన ప్రజలు అక్కడకు చేరుకుని గాలించినా ప్రయత్నం లేకపోయింది. భార్య పార్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నదిలో గల్లంతైన జగదీష్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని హెచ్‌సీ దూసి రాములు తెలిపారు. -
పురవీధుల్లో పూజారి రూపంలో పైడితల్లి విహారం
విజయనగరం టౌన్/విజయనగరం: పూజారి రూపంలో సిరులతల్లి పైడితల్లి కదలివచ్చిన వేళ భక్తజనం పరవసించింది. తల్లి చల్లని కరుణాకటాక్షాల కోసం పరితపించింది. అరటిపళ్లను విసిరి ఆశీస్సులు అందుకుంది. సిరిమానోత్సవానికి తరలివచ్చిన అశేష భక్తజనంతో పైడితల్లి సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. లక్షలాది మంది భక్తుల జయజయధ్వానాల మధ్య మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. అమ్మవారికి ప్రతి రూపమైన పూజారి సిరిమానును అధిరోహించి భక్త జనావళికి ఆశీర్వచనాలు అందజేశారు. నిర్ణీత సమయానికన్నా గంట ఆలస్యంగా సిరిమాను సంబరం ప్రారంభమైనా అమ్మవారిని తిలకించేందుకు భక్తులు ఓపికగా నిరీక్షించారు.● గంట ఆలస్యంగా..అధికారుల పర్యవేక్షణా లోపం.. ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో నిర్ణీత సమయానికన్నా (మధ్యాహ్నం 3.05 నిముషాలకు) సిరిమాను సంబరం గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అప్పటికే ఓ వైపు మేఘాలు కమ్ముకుంటూ వర్షం కురిసే సూచనలు కనిపిస్తున్నా సిరిమాను రథాన్ని తయారు చేయించడంలో అధికార యంత్రాంగం లోపం కొట్టిచ్చినట్లు కనిపించింది. ఏటా మూడు నుంచి మూడున్నర గంటల మధ్యలో సిరిమాను సంబరం అరంభమయ్యేది. సిరిమాను సిద్ధంకాకపోవడంతో చీకటిపడేవరకూ సంబరం సాగింది.● పర్యవేక్షణలో అధికార యంత్రాంగంసిరిమానోత్సవానికి లక్షలాది మంది భక్తజనం తరలివచ్చారు. జిల్లా పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో మూడంచెల పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. కమాండ్ కంట్రోల్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దారు. ఆలయానికి నాలుగువైపులా ట్రాఫిక్ మళ్లింపులు చేశారు. దూరప్రాంతాల నుంచి వాహనాల ద్వారా వచ్చేవారికి ఎక్కడికక్కడ పార్కింగ్ స్థలాలను కేటాయించారు. 2,600 మంది పోలీస్ సిబ్బందితో డ్రోన్ కెమెరాల పర్యవేక్షణ, క్రైమ్ పార్టీలు, కలెక్టర్ రామ్‌సుందర్ రెడ్డి, జేసీ సేతుమాధవన్, ఎస్పీ దామోదర్, అదనపు ఎస్పీ సౌమ్యలత స్వీయపర్యవేక్షణతో ఉత్సవం ప్రశాంతంగా ముగిసింది.జాతర ముచ్చట్లు.. సిరిమాను సాగిందిలా...సిరి జాతర సంప్రదాయబద్ధంగా సాగింది. మంగళవారం మధ్యాహ్నం 4.03 గంటలకు సిరిమానుపై పూజారి ఆశీనులయ్యారు. 4.24 గంటలకు భక్తుల జై పైడిమాంబ.. జైజై పైడిమాంబ జయజయ ధ్వానాల మధ్య కదిలిన సిరిమానును తనివితీరా చూడాలని లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దుష్టశక్తులను పారదోలుతూ పాలధార ముందుకు కదలగా, జాలరివల, ఎల్ల ఏనుగు, అంజలిరథం వెన్నంటి ఉండి ఉత్సవాన్ని ముందుకు నడిపించాయి. భక్తజన కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ప్రతిరూపమైన సిరిమాను భక్తులందరినీ అలరిస్తూ ్డముందుకు కదిలింది. సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. జిల్లా వాసులే కాకుండా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి చేరుకున్న భక్తులు అమ్మను దర్శించారు. గగనాన విహరించే పూజారి బంటుపల్లి వెంకటరావును అమ్మకు ప్రతిరూపంగా భావించి మొక్కుకున్నారు. చదురుగుడి నుంచి ప్రారంభమైన సిరిమానోత్సవం డెంకేషావలీబాబా దర్గా మీదుగా కోటకు చేరుకుని కోట శక్తికి మూడుసార్లు అభివాదం చేయడం ఆనవాయితీ. సిరిమాను తిరువీధి మూడుసార్లు పూర్తిచేసుకున్న వెంటనే కురిసిన వర్షంతో దేవతమూర్తులపై నుంచి తమకు వర్షపు నీటిబొట్ల రూపంలో ఆశీర్వచనాలను అందించారని భక్తజనం మురిసిపోయింది. 5.47 గంటలకు సిరిమానోత్సవం ముగిసింది.సిరిమానోత్సవం సందర్శకులకు రెవెన్యూ సంఘం ఉచిత సేవలు అందించింది. పట్టణంలోని రైల్వేస్టేషన్, రెవెన్యూ హోమ్ ప్రాంతాల్లో భక్తులకు ఉచిత అన్నదానం కార్యక్రమాలను కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి ప్రారంభించారు. జిల్లా రెవెన్యూ సంఘం అధ్యక్షుడు తాడ్డి గోవింద్ మాట్లాడుతూ 2017 నుంచి ఉచిత సేవలు అందిస్తున్నామని తెలిపారు.పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు అందరిపైనా ఉండాలని మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి ఆకాంక్షించారు.శ్రీపైడితల్లి అమ్మవారి పండగను రాజకీయాలకు వాడుకోవడం మా తత్వం కాదని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. అమ్మవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.సిరులతల్లి సిరిమాను జాతర ఓ వైపు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సమయంలో చదురుగుడిలో పైడితల్లికి వేదపండితులు లక్షపుష్పార్చన సేవను నిర్వహించారు. ఆలయమంతా వేదమంత్రోచ్ఛరణతో మార్మోగింది. జై పైడిమాంబ జైజై పైడిమాంబ నినాదాలతో భక్తజనం లక్ష పుష్పార్చన సేవలో తరించారు.భక్తులు తమ మొక్కుబడులు చెల్లించేందుకు విసిరిన అరటి పండ్లు, పసుపు, కుంకుమలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు సుమారు 200 మంది కార్మికులు పనిచేశారు. కార్పొరేషన్ కమిషనర్ పల్లి నల్లనయ్య, ప్రజారోగ్యాధికారి డాక్టర్ కె.సాంబమూర్తి, ఏసీపీ రమణమూర్తి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఉత్తరాంధ్రుల కల్పవల్లి పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర దిగ్విజయంగా జరిగిందని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఉత్సవం ప్రశాంతంగా విజయవంతంగా జరగడానికి కృషి చేసిన అధికారులు, పోలీసు యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బందికి ముఖ్యంగా సంపూర్ణంగా సహకరించిన భక్తులందరికీ ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు.– విజయనగరం అర్బన్/విజయనగరం/ విజయనగరం ఫోర్ట్ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలురాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించారు. ఉదయం 11 గంటల సమయంలో ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం పూజాక్రతువులు పూర్తిచేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం మరోసారి అమ్మవారిని దర్శించి పట్టువస్త్రాలను సమర్పించారు.కోటపై నుంచి పూసపాటివంశీయులైన అశోక్‌తో పాటు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, సుధా గజపతి, ఊర్మిళా గజపతి, ఇతర రాజకుటుంబీకులు ఎప్పటిలాగే కోట బురుజుపై నుంచి తిలకించారు. వీరితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, తదితరులు సిరిమానోత్సవాన్ని వీక్షించారు. మరోపక్క అర్బన్ బ్యాంక్ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేదిక నుంచి శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కె.వి.సూర్యనారాయణరాజు, జిల్లా అధికార యంత్రాంగం ఉత్సవాన్ని తిలకించారు.పూర్వజన్మసుకృతంఅమ్మ ఆశీస్సులు అందరిపైనా ఉండాలి. తొమ్మిదోసారి అమ్మవారి సిరిమానును అధిరోహించడం పూర్వజన్మసుకృతం. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో ఆనందమయ జీవితం గడపాలి. పంటలు సమృద్ధిగా పండాలి. ఉత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరిపైనా అమ్మ ఆశీస్సులు ఉంటాయి.– బంటుపల్లి వెంకటరావు, సిరిమాను పూజారి -
మౌలిక సదుపాయాల కల్పనకు కృషి
● కురుపాం బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ కురుపాం: స్థానిక బాలికల గురుకులంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషిచేస్తామని గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఎం.ఎం.నాయక్ అన్నారు. పాఠశాలను మంగళవారం సందర్శించారు. గురుకులంలో కొత్తగా ఏర్పాటు చేసిన మరుగుదొడ్లు, ఆర్వో ప్లాంట్‌ను పరిశీలించారు. కిచెన్ గదులను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్య, వైద్యంతోపాటు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు ఎంతైనా ఖర్చు చేస్తామన్నారు. బాలికలతో మాట్లాడి సౌకర్యాలు, సమస్యలపై ఆరా తీశారు. విద్యార్థులు, కలెక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి, జేసీ సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి, సబ్‌కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరితో కలిసి మధ్యాహ్నం సహపంక్తి భోజనం చేశారు. ఆయన వెంట డీడీ కృష్ణవేణి, గిరిజన సంఘం నాయకులు నిమ్మక జయరాజ్ , పాఠశాల సిబ్బంది ఉన్నారు. -
గిరిజన సంఘాలను ఎందుకు అడ్డుకున్నారు?
సాక్షి, పార్వతీపురం మన్యం/పార్వతీపురం రూరల్ : ఒకరేమో జిల్లాకు చెందిన మంత్రి.. స్వయంగా గిరిజన సంక్షేమం, మాతాశిశు సంక్షేమ శాఖలు చూస్తున్నారు. మరొకరేమో.. పక్క జిల్లా శ్రీకాకుళా నికి చెందిన మంత్రి, పార్వతీపురం మన్యం ఇన్చార్జి మంత్రి కూడానూ... దసరా సెలవులకని ఇళ్లకు వెళ్లిన కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులకు ఆరోగ్యం బాలోదు. ఈలోగానే ఇద్దరు బాలికలు మరణించారు. మరో వందమందికిపైగా జిల్లా ఆస్పత్రి, విశాఖ కేజీహెచ్ల్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు మంత్రులకూ.. వారిని పరామర్శించే తీరిక దొరకలేదు. మరోవైపు తమ నియోజకవర్గానికి చెందిన పిల్లలు ఈ పరిస్థితిలో ఉంటే, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి జిల్లా ఆస్పత్రివైపు కన్నెత్తి చూడలేదు. తన పరిధిలోనే ఉన్న జిల్లా ఆస్పత్రిలో పదుల సంఖ్యలో విద్యార్థు లు అస్వస్థతతో చికిత్స పొందుతున్నా.. స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర పట్టించుకోలేదు. బాధ్యత గల నేతగా.. జరిగిన ఘటనను, పాలనా వైఫల్యాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రశ్నిస్తే గానీ ఏ ఒక్కరూ మేల్కొనలేదు. హడావిడిగా ఆదివారం సాయంత్రం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. స్వయానా వారి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీస్తే గానీ... పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికలను చూసేందుకు రాలేదు. అంతెందుకు.. మూడు రోజుల కిందట ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పార్వతీపురం విచ్చేశారు. ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక్కడికి కూతవేటు దూరంలో ఉన్న జిల్లా ఆస్పత్రికి వెళ్లాలన్న ఆలోచన రాలేదు. స్థానిక ఎమ్మె ల్యేలకూ తీరిక లేదు? ఇదీ.. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జిల్లా ఇన్చార్జి మంత్రి అచ్చెన్నాయుడు, కూటమి ఎమ్మెల్యేలకు గిరిజనులపై ఉన్న శ్రద్ధ!జిల్లా ఇన్చార్జి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తొలుత సోమవారం మధ్యాహ్నం కురుపాంలోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. వైద్య, గిరిజన సంక్షేమ శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు. విద్యార్థుల అస్వస్థతకు గల కారణాలపై ఆరా తీశారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారు లను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యవేక్షణ చేస్తున్నారని.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. బాలికలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, మోడల్ గురుకుల పాఠశాలగా తీర్చిదిద్దుతామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై.. బాలికలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలికల తల్లిదండ్రులు.. ఇక్కడ తమను ఎవరూ పట్టించుకోవడం లేదని, ఏం వైద్యం అందిస్తున్నారో కూడా చెప్పడం లేదని వాపోతున్నారు. కనీసం గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఒక అధికారిని కూడా పర్యవేక్షణకు ఉంచలేదని మంత్రి వ్యాఖ్యలకు విరుద్ధంగా చెబుతుండడం గమనార్హం.విద్యార్థులకు, వారి కుటుంబాలకు న్యాయం చేయా లని కలెక్టరేట్ వద్ద గిరిజన సంఘాల నాయకులు.. బాధిత తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు. అనంతరం ఆస్పత్రివద్దకు చేరుకున్నారు. మంత్రులను కలసి సమస్య చెప్పుకొందామని భావించారు. పోలీసుల సాయంతో కూటమి ప్రభుత్వ పెద్దలు వారి గొంతు నొక్కేశారు. వారెవరూ ఇక్కడ ఉండటానికి వీల్లేదని.. ఇక్కడ నుంచి పంపించేయాలని ఓ ఎమ్మెల్యే పోలీసులకు చెప్పారు. వెంటనే వారు గిరిజన సంఘాల నాయకులను ఈడ్చుకుంటూ అక్కడ నుంచి బయటకు పంపించేశారు.అనంతరం మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. మీడియాతో మాట్లాడారు. ప్రసుత్తం 140 మంది విద్యార్థులు జిల్లా ఆస్పత్రి, విశాఖ కేజీహెచ్ల్లో చికిత్స పొందుతున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. 37 మంది కోలుకుని డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. పిల్లలు ఇళ్ల వద్దే చనిపోతే ప్రభుత్వానిది ఎలా బాధ్యత అవుతుందని ప్రశ్నించారు. మానవతా దృక్పథంతో స్పందించామని, ఆస్పత్రిలో చేర్చి, మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇద్దరు పిల్లలూ ఇళ్ల వద్దే చనిపోవడం వల్ల పరిహారం ఎలా ఇవ్వగలమని.. ఇన్చార్జి మంత్రి, ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణ యం తీసుకుంటామని తేల్చిచెప్పారు. ఈ ఘటనపై నా రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు కురిపించారు. తనదైన శైలిలో మాజీ ముఖ్యమంత్రి జగన్ పైనా, వైఎస్సార్సీపీ నేతలపైన ఆరోపణలు గుప్పించారు. జిల్లాలో 11 మంది చనిపోయినట్లు అవాస్తవాలు మాట్లాడుతున్నారని తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నం చేశారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త.. ఇప్పటి వరకు 13 మంది గిరిజన విద్యార్థులు మృతి చెందారు. అందులో గిరిజన ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు 9 మంది, గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కురుపాం విద్యార్థులు ఇద్దరు.. కొమరాడ, సాలూరు కేజీబీవీల్లో చదువుతున్న ఒక్కొక్క గిరిజన విద్యార్థి మరణించారు. ఇదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావించారు. ఇళ్ల వద్దే చనిపోయారు.. ప్రభుత్వానికి ఏం సంబంధం?మంత్రి సంధ్యారాణి.. దీనిని వక్రీకరిస్తూ, ఇద్దరే చనిపోయారని, అది కూడా ఇళ్ల వద్దే అనారోగ్యం పాలయ్యారని, ప్రభుత్వానికి ఏం సంబంధమని సర్దిచెప్పుకోవడం గమనార్హం. ఇద్దరు పిల్లలూ ఇళ్ల వద్దే అనారోగ్యం పాలైతే.. ఒకే పాఠశాలకు చెందిన వంద మందికిపైగా విద్యార్థులు ఎందుకు పచ్చకామెర్ల బారిన పడ్డట్లు? మంత్రి చెప్పుకొన్నట్లుగా అది ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తే.. అది పాఠశాలలోనే జరిగినట్లు కాదా? 611 మంది విద్యార్థులకు అపరిశుభ్రంగా ఉన్న 30 మరుగుదొడ్లు ఎలా సరిపోతాయి? అంతమంది గిరిజన విద్యార్థులు ఒకేసారి అస్వస్థతకు గురైతే, వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంటే.. తమకు సంబంధం లేదని ప్రభుత్వం అనుకోవ చ్చా? సొంత జిల్లాలో గిరిజన విద్యార్థులు ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. బాధ్యత గల ప్రజాప్రతినిధులుగా వారిని పరామర్శించాల్సిన అవసరం లేదా? అన్న ప్రశ్నలు గిరిజన సంఘాల నుంచి వ్యక్తమవుతున్నాయి. -
సంబరం.. శుభారంభం
● అంగరంగ వైభవంగా తొలేళ్ల పండగ ●ఘటాలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తజనం ● అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనువంశిక ధర్మకర్త ● అలరించిన వేషధారణలు, సాంస్కృతిక కార్యక్రమాలు ● కోలాహలంగా మారిన చదురుగుడి, వనంగుడి ● నేటి మధ్యాహ్నం 3.05 గంటలకు సిరిమానోత్సవం ప్రారంభం సాక్షిప్రతినిధి, విజయనగరం: ఉత్తరాంధ్రుల ఆరాధ్యదైవం పైడితల్లి అమ్మ వారి జాతరలో కీలక ఘట్టమైన తొలేళ్ల ఉత్సవం సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి జాతరను తొలేళ్ల ఉత్సవంతో శ్రీకారం చుట్టారు. తొలిఏరుగా రైతులు జరుపుకునే పండగలో భాగంగా వేకువజామునుంచే అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, అర్చన లు, పూజాధికాలను నిర్వహించగా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదా యం ప్రకారం ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారికి పట్టువస్త్రాలు, సారెను సమర్పించారు. వేదపండితులు వేదమంత్రోచ్చారణలతో శాస్త్రోక్తంగా ఆలయ సంప్రదా యం ప్రకారం పూజలు చేపట్టారు. పైడితల్లి అమ్మవారిని తొలేళ్ల రోజున దర్శించుకున్న వారిలో... జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కుటుంబ సమే తంగా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌బాబు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అది తిగజపతిరాజు, ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, మాజీ డిప్యూటీ స్పీకర్, వైఎస్సార్సీపీ సీఈ సీ సభ్యుడు కోలగట్ల వీరభద్రస్వామి, బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే శంబంగి చినవెంకట అప్పలనాయుడు తదితరులు పైడితల్లిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఘటాలతో నివేదన.. అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం నగరంలోని పలువురు భక్తులు వివిధ వేషధారణలతో... డప్పు ల మోతలతో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. తొలేళ్ల ఉత్సవం రోజున సుమారు 20 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఉచిత సేవలు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఎన్సీసీ, రెడ్‌క్రాస్, పోలీస్ సేవాదళ్‌తో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు మంచినీరు, మజ్జిగ, ఆహారపొట్లాలను ఉచితంగా అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కలెక్టర్ రామ్ సుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్ స్వీయపర్యవేక్షణ చేశా రు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు సిరిమాను రథాన్ని హుకుంపేట నుంచి పైడితల్లమ్మ వారి చదురుగుడి ప్రాంగణానికి తరలించేలా ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. నిర్ణీత సమయానికి అమ్మవారి సిరిమానోత్సవం ప్రారంభమయ్యే లా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ గతంలో 2వేల మంది మాత్రమే బందోబస్తు విధులు నిర్వహించేవారని, ఈ ఏడాది 3వేల మందివరకూ సిబ్బందిని నియమించామన్నారు. డ్రోన్ కెమెరాలు, బాడీవార్న్ కెమెరాలు, మఫ్టీలో 70 మంది పోలీస్, ఏఆర్, బాంబ్ స్క్వాడ్, చెకింగ్, డాగ్ స్క్వాడ్ బృందాలు స్వీయపర్యవేక్షణ చేస్తున్నాయన్నారు. సోమవారం రాత్రి అమ్మవారి చదురుగుడి నుంచి ఘటాలతో నడుచుకుంటూ పూజారి వెంకటరావుతో పాటూ పలువురు పెద్దలు, దీక్షాపరు లు కోటలో ఉన్న కోటశక్తికి పూజలు చేశారు. ఆరు ఘటాలను కోట వద్ద నుంచి తిరిగి చదురుగుడికి తీసుకెళ్లి అమ్మవారి చదురువద్ద పెట్టా రు. సిరిమాను పూజారి వెంకటరావు అమ్మవా రి కథను భక్తులకు వినిపించారు. అనంతరం రైతులకు విత్తనాలను అందజేసి, ఆశీర్వచనాల ను అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమ వారం రాత్రి నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. సిరులతల్లి సిరిమానోత్సవం మధ్యాహ్నం 12 గంటలకు హుకుంపేట నుంచి బయలు దేరనుంది. ఆలయం వద్దకు రెండు గంటల ప్రాంతానికి చేరు కుంటుంది. అక్కడ నుంచి సిరిమా ను పనులను వడ్రంగులు, నిపుణులు పర్యవేక్షిస్తారు. ముహూ ర్తం ప్రకారం 3.05 గంటలకు సిరిమాను బయలు దేరుతుందని సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు వెల్లడించారు. -
విజయనగరం విజయదుందుభి
● రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో బాల, బాలికల జట్లకు ప్రథమ స్థానంగొలుగొండ: రాష్ట్ర స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో విజయనగరం విజయదుందుభి మోగించింది. అండర్–14 బాల, బాలికల విభాగాల్లో హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లలో ఈ జిల్లా జట్లు ప్రథమ స్థానం సాధించాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామ హైస్కూల్లో ఈ నెల 4న ప్రారంభమైన పోటీల్లో రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి బాల, బాలికల జట్లు పాల్గొన్నాయి. సోమవారం నిర్వహించిన ఫైనల్ పోటీల్లో విజయనగరం, గుంటూరు బాలుర జట్లు తలపడ్డాయి. ఇందులో 2 పాయింట్లు తేడాతో విజయనగరం జట్టు విజేతగా నిలిచింది. గుంటూరు జట్టు ద్వితీయ స్థానానికి పరిమితమైంది. అనంతరం బాలికల పోరులో విజయనగరం, చిత్తూరు జట్లు తలపడ్డాయి. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ పోటీలో విజయనగరం బాలికలదే పై చేయి అయింది. ఒక పాయింట్ తేడాతో విజేతగా నిలిచింది. చిత్తూరు జట్టు ద్వితీయ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సందర్భంగా గెలుపొందిన జట్లకు నర్సీపట్నం టౌన్ సీఐ గోవిందరావు, కృష్ణదేవిపేట పూర్వపు ఎస్ఐ తారకేశ్వరరావు, సాఫ్ట్‌బాల్ నిర్వహణ ప్రతినిధులు రమణ, శ్రీనివాసరావు, సుమంత్‌రెడ్డి, సూర్య దేముడు, సతీష్, భవానీ, చంద్రమోహన్ బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. -
ప్రతి ఫిర్యాదునూ పరిష్కరించాలి
● ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి పార్వతీపురం రూరల్: అర్జీదారులు తెలియజేసిన ప్రతి సమస్యనూ పరిష్కరించాలని ఎస్పీ ఎస్వీ మాధవ్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రుల వేధింపులు, భర్త/అత్తారింటి వేధింపులు, భూ, ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరిట మోసాలపై ఎక్కువగా ఫిర్యాదలు వచ్చాయి. ఆయా ఫిర్యాదులను క్షుణ్ణంగా విన్న ఎస్పీ వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, ఎస్సై రమేష్‌నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
గోల్డ్‌స్టార్ జంక్షన్ వద్ద విధ్వంసం
● కోర్టు తీర్పు ఉందంటూ జేసీబీలతో ఇళ్లు నేలమట్టం ● పోలీసులను ఆశ్రయించిన ఇరువర్గాలులక్కవరపుకోట: కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని చెబుతూ మండలంలోని గోల్డ్‌స్టార్ జంక్షన్ వద్ద గల ఇళ్లను మూడు జేసీబీలతో నేలమట్టం చేసి విధ్వంసం సృష్టించిన సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు, ఎస్సై నవీన్ పడాల్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మల్లివీడు రెవెన్యూ పరిధి గోల్డ్‌స్టార్ జంక్షన్ వద్ద గల 30 సెంట్ల భూమికి సంబంధించి రెల్లిగౌరమ్మపేట గ్రామానికి చెందిన పినిశెట్టి కిష్టప్పదొర, గేదెల అప్పన్నదొరల మధ్య 2015 సంవత్సరం నుంచి వివాదం నడుస్తోంది. సదరు స్థలంలో మూడు కుటుంబాల వారు ఇళ్లు నిర్మించుకోవడంతో పాటు 9 షాపులు నిర్మించుకుని చిరు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో గత నెల 27న అప్పన్నదొరకు అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చిందని అప్పన్నదొర తమ్ముడు ప్రముఖ వైద్యుడు గేదెల రాము తెలిపారు. ఈ మేరకు నాలుగు రోజుల కిందట సంబంధిత జడ్జిమెంట్ అంశాన్ని స్థానిక ఎస్సై నవీన్ పడాల్‌కు తెలియజేసి వివాదా స్థలంలో గల కబ్జాలను తొలిగించేందుకు సహకరించాలని రాము కోరారు. దీంతో శాశ్వత జడ్జిమెంట్ వస్తే తప్పనిసరిగా సహకరిస్తానని ఎస్సై బదులిచ్చారు. ఇంతలోనే రాము విశాఖపట్నం, ఎస్.కోట ప్రాంతాలకు చెందిన కిరాయి వ్యక్తులను సుమారు 30 మందిని తీసుకువచ్చి మూడు జేసీబీల సహాయంతో సోమవారం తెల్లవారు జామున ఇళ్లను, షాపులను కూల్చేశారు. విషయం తెలుసుకున్న పినిశెట్టి కిష్టప్పదొర సంఘటనా స్థలానికి వచ్చేసరికి కిరాయి వ్యక్తులు అతనిపై దాడికి దిగారు. ఇంతలో రెల్లిగౌరమ్మపేట గ్రామానికి చెందిన యువకులు సంఘటనా స్థలానికి రావడంతో కిరాయి వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో యువకులు వారిని వెంబడించి కొంతమందిని పట్టుకుని, జేసీబీలతో సహా పోలీసులకు అప్పగించారు. దీంతో ఇరువర్గాలూ ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకున్నారు. కూటమి నేతల అండతోనే.. వివాదానికి సంబంధించిన స్థలంలో గడిచిన 40 సంవత్సరాలుగా 9 కుటుంబాల వారు చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చిందని హడావిడిగా జేసీబీలతో ఇళ్లు, షాపులును కూల్చేశారని బాధితులు వాపోయారు. కనీసం సామాన్లు తీసుకునేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని.. కూటమి నాయకుల అండతోనే ఇదంతా జరిగిందని ఆరోపిస్తున్నారు. -
పైడితల్లి పండుగకు ఆర్టీసీ సర్వీసులు
విజయనగరం అర్బన్: పైడితల్లి జాతర సందర్భంగా వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సర్వీసులు నిర్విహిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి జి. వరలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చేందుకు సోమవారం 40 బస్సులు వేయగా.. మంగళవారం 70, బుధవారం 30 బస్సులు తిప్పనున్నట్లు పేర్కొన్నారు. విశాఖ, సింహాచలం, అనకాపల్లి, శ్రీకాకుళం, చీపురుపల్లి, పాలకొండ, సాలూరు, పార్వతీపురం, ఎస్.కోట ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం కల్పి స్తున్నట్లు తెలిపారు. భక్తులు ఆర్టీసీ సర్వీసులను వినియోగించుకోవాలని కోరారు. వైభవంగా మహా పూర్ణాహుతి నెల్లిమర్ల రూరల్: రామతీర్థం సీతారామస్వామి దేవస్థాన క్షేత్ర పాలకులైన ఉమా సదాశివాలయంలో కామాక్షి అమ్మవారికి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమి సందర్భంగా అమ్మవారి సన్నిధిలో మహా పూర్ణాహుతి కార్యక్రమం అత్యంత వైభవంగా చేపట్టారు. ప్రధానార్చకుడు మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో ముందుగా గణపతి పూజ నిర్వహించిన అనంతరం శివుడికి ప్రత్యేక అభిషేకాలు జరిపించారు. అనంతరం కామాక్షి అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, స్వర్ణాభరణాలతో సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు, అర్చనలు నిర్వహించారు. సుమారు మూడు గంటల పాటు హోమాలు చేపట్టి మహా పూర్ణాహుతి జరిపించారు. పూర్ణాహుతిలో మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, బడ్డుకొండ ప్రదీప్ నాయుడు, నగర పంచాయతీ వైస్ చైర్మెన్ కారుకొండ కృష్ణారావు, సర్పంచ్ అంబళ్ల కిరణ్, నాయకులు అట్టాడ శ్రీధర్, సత్యనారాయణ, భక్తులు పాల్గొన్నారు. -
తక్కువ ధరకే బంగారం పేరిట మోసం
● రూ. 12 లక్షలు కాజేసిన వైనం ● నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులుపార్వతీపురం రూరల్: తన భార్యకు విద్యాబుద్ధులు చెప్పిన టీచర్నే మోసం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఆమె బలహీనతను ఆసరాగా చేసుకొని ఏకంగా రూ. 12 లక్షలు కాజేశాడు. తక్కువ ధరకే బంగారాన్ని ఇప్పిసానంటూ నమ్మించి నిలువునా ముంచేసిన ఈ కేటుగాడితో పాటు మరో 8 మంది సభ్యుల ముఠాను పార్వతీపురం రూరల్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని కేసును ఛేదించారు. అసలేం జరిగిందంటే... శ్రీకాకుళానికి చెందిన ప్రధానోపాధ్యాయురాలు శ్రీలక్ష్మి గతంలో శ్రీకాకుళం రూరల్ మండలం సింగువలస వద్ద పనిచేసే సమయంలో నిందితుడు కొత్తూరు మండలం గొట్టుపల్లి పంచాయతీ పుల్లగూడకు చెందిన జి. రిషివర్థన్ భార్య చదువుకునేది. దీంతో ప్రధానోపాధ్యాయురాలితో రిషివర్థన్కు పరిచయం ఉంది. ఈ క్రమంలో తాను బంగారం వ్యాపారం చేస్తున్నానని.. చాలా తక్కువ ధరకే నాణ్యమైన బంగారు బిస్కెట్లు ఇప్పించగలనని ప్రధానోపాధ్యాయురాలిని నమ్మబలికాడు. అతని మాయమాటలు నమ్మిన ఆమె ఈ ఏడాది ఆగస్టు 11న రూ. 12 లక్షల నగదు పట్టుకుని బంగారం కొనేందుకు శ్రీకాకుళం నుంచి పార్వతీపురం వైపు రిషివర్థన్తో వస్తుండగా.. ముందస్తుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం పార్వతీపురం శివారులో వాటర్ పంప్‌హౌస్ సమీపంలో కొంతమంది వ్యక్తులు హఠాత్తుగా వచ్చి వీరిని భయభ్రాంతులకు గురిచేసి లక్ష్మి చేతిలో ఉన్న నగదు తీసుకుని పరారయ్యారు. వెంటనే బాధితురాలు పార్వతీపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పక్కా స్కెచ్‌తో పట్టించారు.. ఫిర్యాదు అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పార్వతీపురం సీఐ రంగనాథం, రూరల్ ఎస్సై బి.సంతోషికుమారి పక్కా వ్యూహంతో ఈ అంతర్ జిల్లా ముఠా గుట్టు రట్టు చేశారు. ముందుగా రిషివర్థన్ కదలికలపై నిఘా పెట్టి ప్రధాన నిందితుడు అతనే అని నిర్ధారణకు వచ్చారు. అతనితో పాటు పార్వతీపురం, సాలూరు, విజయనగరం, ఒడిశాకు చెందిన మొత్తం 8 మందిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 12 లక్షల నగదుతో పాటు కారు, నాలుగు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. -
గర్జించిన గిరిజనం
● సమస్యలు పరిష్కరించాలంటూ శాంతియుత ర్యాలీ ● ఐటీడీఏ వద్ద బైఠాయింపు సీతంపేట: గిరిజన సమస్యలు పరిష్కరించాలంటూ ఆదివాసీ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో గిరిజనులు నినదించారు. హక్కులు రక్షించాలంటూ ఆందోళన చేశారు. సోమవారం తలపెట్టిన చలో సీతంపేట కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా సీతంపేట వారపుసంత నుంచి ఐటీడీఏ వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు. బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడ్డారు. ఐటీడీఏ ముఖద్వారం వద్ద బైఠాయించారు. సమస్యలు చెప్పాలని ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు గిరిజనులు ధర్నా చేస్తున్న వేదిక వద్దకు వచ్చారు. ఐటీడీఏ పీఓ రావాలని, మా సమస్యలు వినాలని పట్టుబట్టారు. పీఓ పార్వతీపురం వెళ్లారని, ఫోన్లో మాట్లాడాలని మొబైల్ ఇచ్చినా ఆదివాసీ సంఘాల నాయకులు తిరస్కరించారు. పీఓ ఎప్పుడు వచ్చినా పరవాలేదని రోజంతా ఇక్కడే కూర్చుంటామని పట్టుబట్టారు. పీఓ మధ్యాహ్నానికి వస్తారని, అప్పుడు కొంతమంది కలిసి సమస్యలు చెప్పాలని పాలకొండ సీఐ ప్రసాదరావు, ఎస్ఐ వై.అమ్మన్నరావు సర్దిచెప్పారు. గిరిజన సంఘాల జేఏసీ అధ్యక్షుడు బి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఐటీడీఏ, గురుకులం బైలా ప్రకారం ఉపాధ్యాయ, ఉద్యోగ నియామకాలు, బదిలీలు చేపట్టాలన్నారు. మెగా డీఎస్సీ నుంచి గిరిజన సంక్షేమ శాఖ ఉపాధ్యాయ పోస్టులు మినహాయించాలన్నారు. ఐదో షెడ్యూల్ ఏరియాలో నివసిస్తున్న ఆదివాసీల సర్వహక్కులు రక్షించాలని డిమాండ్ చేశారు. సీతంపేట ఐటీడీఏను సీతంపేటలోనే కొనసాగించాలన్నారు. పూర్తిస్థాయి పీఓను నియమించాలన్నారు. షెడ్యూల్ ప్రాంతంలో వంద శాతం ఉద్యోగ కల్పనపై నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టుగా స్థానిక ఐటీడీఏలో కూడా వర్క్‌షాప్ ఏర్పాటు చేయాలన్నారు. 1/70, పెసా, అట్రాసిటీ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. ప్రతీ మండల కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్ ప్రాంత చట్టాలు, ఆదివాసీ వీరుల చరిత్రను పాఠ్యపుస్తకాలలో చేర్చాలన్నారు. అనంతరం పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాథ్‌ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ఆదినారాయణ, గిరిజన సంఘాల జేఏసీ నాయకులు రవి, సవర చిరంజీవి, బి.ఉమామహేశ్వరరావు, బి.రామ్మోహన్రావు, బి.దమయంతినాయుడు, ఎస్.సాయికుమార్, కె.భాస్కరరావు, పి.పురుషోత్తం, ఎన్.కాంతారావు, బి.ఆదిలక్ష్మి, కె.వెంకునాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
మృతి చెందిన పిల్లఏనుగు కోసం తల్లడిల్లుతున్న ఏనుగుల గుంపు
పార్వతీపురం రూరల్: గుంపులో జాగ్రత్తగా చూసుకుంటున్న పిల్లఏనుగు మృతితో ఏనుగుల గుంపు తల్లడిల్లుతోంది. గున్న మృతి చెందిన లక్ష్మీనారాయణపురం సమీపంలోని ముది రాజు చెరువు వద్దనే సోమవారం వెతుకులాడాయి. చెరువులో దిగిన పిల్ల ఏనుగు తిరిగి ఒడ్డుకు చేరకపోవడంతో చెరువు వైపే చూస్తున్నాయి. ఈ దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. పార్వతీపురం మండలంలోని పెదమరికి, చినమరికి, కృష్ణపల్లి, లక్ష్మీనారాయణపురం తదితర గ్రామాల్లో కొద్ది రోజులుగా సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఆదివారం ముదిరాజు చెరువులో దిగాయి. వీటిలో ఏడు నెలల వయస్సు ఉన్న (జూనియర్ హరి) కూడా ఉంది. కొంత సమయం చెరువులో ఉన్న ఏనుగులు తిరిగి ఒడ్డుకు చేరుకుని పొలాల్లోకి వెళ్లిపోయాయి. గుంపులో జూనియర్ హరి కనిపించకపోవడాన్ని గమనించి తిరిగి చెరువు వద్దకు చేరుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చెరువుతో పాటు పరిసర ప్రాంతాల్లో గాలించాయి.ఏనుగులతో జాగ్రత్త..ప్రస్తుతం ఏనుగుల గుంపు ఆందోళన కరంగా ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు జాగ్రత్తలు పాటించాలని అటవీశాఖ సిబ్బంది, అధికారులు స్థానికులను హెచ్చరిస్తున్నారు. -
అర్జీదారుల సంతృప్తే లక్ష్యం
● కలెక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డిపార్వతీపురం రూరల్: అర్జీదారుల సంతృప్తే లక్ష్యం కావాలని కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకరరెడ్డి అన్నారు. సమస్యలు తెలియజేస్తే పరిష్కారమవుతాయనే నమ్మకం అర్జీదారులకు కలిగించాలని అధికారులను సూచించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో జేసీ సి. యశ్వంత్‌కుమార్ రెడ్డితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్జీదారుల నుంచి సుమారు వంద వినతులు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌లను ఏర్పాటు చేశామన్నారు. వీలైనంతవరకు అర్జీదారుని సమక్షంలోనే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరవై రోజులుగా 50 ఎకరాలకు సంబంధించిన వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా లేదని, వెంటనే సమస్య పరిష్కరించాలని గరుగుబిల్లి మండలం సుంకి పంచాయతీకి చెందిన రైతులు వినతి అందజేశారు. అలాగే తమ గ్రామంలో రేషన్ బియ్యం అక్రమంగా రవాణా.. ఉపాధి నిధులు దుర్వినియోగం.. క్షీణించిన పారిశుధ్యంపై వీరఘట్టం మండలం చలివేంద్రి గ్రామానికి చెందిన రామినాయుడు ఫిర్యాదు చేశారు. మార్కెట్ స్థలాన్ని కొందరు ఆక్రమించి రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారని జియ్యమ్మవలస మండలం చినమేరంగి గ్రామానికి చెందిన బెహరా కుటుంబ సభ్యులు కలెక్టర్‌కు అర్జీ సమర్పించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ ఎం. సుధారాణి, అన్నిశాఖల జిల్లాస్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
భవనం నిర్మిస్తేనే... బడికి పంపిస్తాం
గుమ్మలక్ష్మీపురం: కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి తమ గ్రామంలో పాఠశాలకు భవనం నిర్మిస్తేనే పిల్లలను బడికి పంపుతామని గుమ్మలక్ష్మీపురం మండలంలో ని ఇరిడి గ్రామానికి చెందిన ఎంపీపీ స్కూల్ (ప్రస్తు తం మోడల్ ప్రైమరీ స్కూల్) విద్యార్థుల తల్లిదండ్రులు తేల్చిచెప్పారు. భవన నిర్మాణంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ పాఠశాల వద్ద సోమవారం ఆందోళన చేశారు. వర్షాలకు విద్యార్థులు ఇబ్బందు లు పడుతున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం శోచనీయమన్నారు. గాలివీస్తే ఎగిరిపోయే రేకుల షెడ్ లో పిల్లలు ఎలా అభ్యసించగలరని ప్రశ్నించారు. విద్యా ర్థుల ఆందోళన విషయాన్ని ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న ఎంఈఓ బి.చంద్రశేఖర్ పాఠశాల వద్దకు వచ్చారు. గ్రామంలోని రైతు సేవా కేంద్రంలో తరగతులు నిర్వహిస్తామని, పిల్లలను పంపించాలంటూ తల్లిదండ్రులను ఒప్పించారు. ఈ సందర్భంగా స్కూల్ కమిటీ చైర్మన్ దినేష్, తదితరులు మాట్లాడుతూ.. గ్రామంలోని పాఠశాల భవనం పూర్తిగా శిఽథిలావస్థకు చేరడంతో గత ప్రభుత్వ హయాంలో నాడు–నేడు రెండోఫేజ్‌లో నూతన భవనం నిర్మించేందుకు రూ.51లక్షలు మంజూరు చేసిందన్నారు. రూ.9లక్షల విలువైన పనులు జరిగా యన్నారు. అప్పట్లో ప్రత్యామ్నాయంగా పాఠశాల ఆవరణలో రేకుల షెడ్డును తామంతా నిర్మించామ న్నారు. ఈదురుగాలులకు చెట్లకొమ్మలు విరిగిపడుతున్నాయని, ఈ పరిస్థితుల్లో తమ పిల్లల్ని బడికి పంపితే ఏ ప్రమాదం చోటుచేసుకుంటుందోనని భయాందోళనకు గురవుతున్నామన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వాధికారులు స్పందించి అసంపూర్తిగా నిలిచిపోయిన పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాఠశాల భవ నం పనులు పూర్తిచేస్తామని హామీ ఇచ్చి మిన్నకున్న ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తీరును విద్యార్థుల తల్లిదండ్రులు దుయ్యబడుతున్నారు. 56 మంది విద్యార్థులు ఇరిడి గ్రామంలోని మోడల్ ప్రైమరీ స్కూల్లో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు మొత్తం 56 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక హెచ్ఎం, ము గ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. తరగతి గదులు లేకపోవడంతో బోధించేందుకు ఉపాధ్యాయులు, అభ్యసించేందుకు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. -
కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
విజయనగరం రూరల్: యూపీఎస్సీ పరీక్షల్లో కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నావల్ అకాడమీ రాత పరీక్షల్లో మొత్తం 54 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వారిని ప్రిన్సిపాల్ ఎస్ఎస్ శాస్త్రి అభినందించారు. భారత సాయుధ దళాలకు భవిష్యత్ నాయకులను అందించడంలో కోరుకొండ సైనిక్ స్కూల్ నిబద్దతకు ఇది నిలువెత్తు నిదర్శనమని ప్రిన్సిపాల్ సంతోషం వ్యక్తం చేశారు.వ్యక్తి అనుమానాస్పద మృతిపీఎం పాలెం: ఓ వ్యక్తి అనుమానాస్పద మృతిపై పీఎం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. స్థానిక సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి.. పార్వతీపురం మన్యం జిల్లా బాలగూడబ గ్రామానికి చెందిన మువ్వల శివప్రసాద్ (54) భార్య పద్మజతో పీఎం పాలెం రామాలయం సమీపంలోని ఎల్ఐజీ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. ఈయన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నారు. శివప్రసాద్ ఈ నెల 5వ తేదీ ఉదయం 10 గంటలకు స్వగ్రామానికి వెళ్తున్నానని భార్యకు చెప్పి, ఇంటి వద్ద బయల్దేరారు. సోమవారం ఉదయం 6.30 గంటలకు రామాలయం సమీపంలోని కల్వర్టు కింద మృతదేహం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. స్థానికంగా కలకలం రేగడంతో సంఘటన స్థలంలో పరిశీలించి, చనిపోయిన వ్యక్తి తన భర్త శివప్రసాద్గా పద్మజ గుర్తించింది. భర్త మరణంపై అనుమానం ఉందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించి, మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. మృతుడు మద్యం వ్యసనపరుడని, సొంత ఊరులోని ఆస్తిపాస్తులు అమ్ముకున్నాడని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.చికిత్స పొందుతూ వివాహిత మృతిసంతకవిటి: మండల కేంద్రానికి చెందిన మెంటి దేవి (27) చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ వి.రామకృష్ణ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రేగిడి మండలం పెద్దపుర్లి గ్రామానికి చెందిన ఎం.గోవిందరావు, మంగమ్మల కుమార్తె దేవికి సంతకవిటికి చెందిన మహేష్‌తో ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. సెప్టెంబర్ 28న భర్త తాగి రావడంతో బెదిరించాలనే ఉద్దేశంతో దేవి పురుగు మందు తాగింది. వెంటనే కుటుంబ సభ్యులు గుర్తించి రాజాంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం 29న శ్రీకాకుళంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఎం.గోవిందరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.జాతర చూసేందుకు ప్రత్యేక స్క్రీన్లువిజయనగరం: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి జాతర మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు అవసరమైన పెద్ద స్క్రీన్ లను విజయనగరం నగరపాలక సంస్థ అధికారులు ఏర్పాటుచేశారు. మయూరి, అంబేడ్కర్ కూడలిలో స్క్రీన్లను ఏర్పాటు చేసినట్టు కమిషనర్ నల్లనయ్య తెలిపారు. -
మన్యంలో మరణ మృదంగం
సాక్షి, పార్వతీపురం మన్యం/కురుపాం: విద్యార్థుల మరణ మృదంగంతో మన్యం విలవిల్లాడుతోంది. పచ్చకామెర్లు, విష జ్వరాలు పార్వతీపురం మన్యం జిల్లాను కలవరపెడుతున్నాయి. గిరిజన బాలలను కబళిస్తున్నాయి. వారం వ్యవధిలోనే ఇద్దరు విద్యార్థులు మరణించడం కలకలం రేపుతోంది. వంద మందికిపైగా విద్యార్థులు కామెర్లు, జ్వరాలతో పార్వతీపురం జిల్లా ఆస్పత్రి, విశాఖ కేజీహెచ్ల్లో చికిత్స పొందుతున్నారు. వీరంతా కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, ఏకలవ్య పాఠశాల విద్యార్థులే కావడం గమనార్హం. జిల్లాలోని సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో అపరిశుభ్రత, కలుషిత ఆహారం–నీరు, వైద్యసదుపాయాల లేమి, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జ్వరాలు, పచ్చకామెర్లు ప్రబలాయనే వాదన బలంగా వినిపిస్తోంది. గత జులై నుంచి ప్రస్తుత అక్టోబరు వరకు జిల్లాలోని గిరిజన సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో చదువుతున్న 11 మంది విద్యార్థులు వివిధ అనారోగ్య కారణాలతో మరణించడం గమనార్హం. తాగునీటి కలుషితం వల్లేనా? కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల, ఏకలవ్య పాఠశాలల్లో 934 మంది విద్యార్థులు ఉండగా, నాలుగైదు రోజుల్లోనే 120 మంది విద్యార్థులకు పచ్చకామెర్లు, ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయి. తాగునీటి కలుషితం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా మందిలో పచ్చకామెర్లు లక్షణాలు బయటపడటంతో శనివారం పాఠశాలల్లో రక్త పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో 79 మంది ఉన్నారు. విశాఖ కేజీహెచ్‌లో ముగ్గురు ఐసీయూలోనూ, 34 మంది జనరల్ వార్డులోనూ చికిత్స పొందుతున్నారు.మిగిలిన నలుగురు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కామెర్ల బారిన పడిన విద్యార్థినుల్లో గుమ్మలక్ష్మీపురం మండలం కంబగూడకు చెందిన పువ్వల అంజలి గత నెల 26న, కురుపాం మండలం దండసూర గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని తోయక కల్పన ఈ నెల 1న మృతి చెందారు. వారంలోనే ఇద్దరు మృతి చెందడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హడావిడిగా రక్త పరీక్షలు జరిపి, మిగిలిన విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. పచ్చకామెర్ల బాధితుల్లో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి నాలుగు రోజుల క్రితం పాఠశాలను సందర్శించి, ఆర్వో ప్లాంట్ సమస్యపై అధికారులను నిలదీశారు. దీంతో అధికారులు హడావిడిగా కొత్త ప్లాంట్‌ని ఏర్పాటు చేశారు. పట్టించుకోని కూటమి ప్రభుత్వంమన్యం జిల్లాలో గిరిజన పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నా.. ప్రభుత్వంలో చలనం రావడం లేదు. గత ఏడాది జులై నుంచి ఇప్పటి వరకు 11 మంది ఆశ్రమ, సంక్షేమ పాఠశాలల విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారు. వీరంతా అనారోగ్యానికి గురి కావడం.. సకాలంలో సరైన వైద్యం అందకపోవడం వంటి కారణాలతోనే ప్రాణాలు వదిలారు. తాము అధికారంలోకి వస్తే ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకం చేపడతామని చెప్పిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇప్పటివరకు అమలుకునోచుకోలేదు. ఆమె సొంత జిల్లాలోనే గిరిజన విద్యార్థులు విషజ్వరాలు, పచ్చకామెర్ల బారిన పడినా ఇప్పటివరకు పట్టించుకోలేదు.తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆదివారం సాయంత్రం హడా వుడిగా మేల్కొన్న ఆమె విశాఖ కేజీహెచ్‌కు వెళ్లి, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి కూడా ఇప్పటి వరకు విద్యార్థుల పరిస్థితిపై స్పందించకపోవడం విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాలోని రెండు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లకు రెగ్యులర్ పీవోలు లేరు. పార్వతీపురం ఐటీడీఏ డీడీ కూడా ఇన్చార్జే కావడంతో ఆశ్రమ పాఠశాలలు అధ్వానంగా మారాయని విమర్శిస్తున్నారు. భయం వేస్తోంది.. గురుకుల పాఠశాలకు పిల్లలను పంపాలంటేనే భయం వేస్తోంది. నా ఇద్దరు కుమార్తెలు గురుకులంలో ఒకరు పదో తరగతి, ఇంకొకరు ఎనిమిదో తరగతి చదువుతున్నారు. రక్త పరీక్షలు చేసేందుకు తీసుకొచ్చాను. ఇప్పటికే ఇక్కడ ఇద్దరు చనిపోవడంతో భయంగా ఉంది. – బిడ్డిక నాగరాజు, సంగెడ్డ గ్రామం, కురుపాం మండలం, విద్యార్థిని తండ్రి సౌకర్యాలు లేవు ఉన్నత చదువుల కోసం చేర్పిస్తే.. విగతజీవిగా ఇంటికి వస్తున్నారు. పాఠశాలలో వందల మంది పిల్లలకు వసతులు, మరుగుదొడ్లు సరిగా లేవు. కలుషిత నీరో, లేక కలుíÙత ఆహారమో తెలియదు. పచ్చకామెర్ల బారిన పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువైంది. – మండంగి కృష్ణ, లాబేసు గ్రామం, కొమరాడ మండలం, విద్యార్థిని తండ్రి విద్యార్థులందరికీ రక్త పరీక్షలు విద్యార్థులందరికీ రక్తపరీక్షలు నిర్వహించాం. నివేదికలు ఇంకా రాలేదు. జ్వరాలు, పచ్చకామెర్ల అనుమానిత లక్షణాలు ఉంటే మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలిస్తున్నాం. ముందు జాగ్రత్తగా కురుపాం మండలంలోని శివన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలకు ఈనెల 6వ తేదీ నుంచి వారం రోజుల పాటు సెలవులను ప్రకటించాం. – డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, కలెక్టర్, పార్వతీపురం మన్యం సమగ్ర విచారణ జరిపిస్తున్నాం.. బాధిత విద్యార్థులకు వైద్యసేవలు అందిస్తున్నాం. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వ్యాధుల విజృంభణపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించాం. వారు సమగ్ర విచారణ జరిపి, నివేదికలు సమరి్పస్తే తదుపరి చర్యలు తీసుకుంటాం. – ఎం.గౌతమి, గిరిజన సంక్షేమ గురుకుల కార్యదర్శి -
ఆర్చరీలో మెరిసిన అక్కాచెల్లెళ్లు
● రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌కు ఎంపిక సీతంపేట: ఎస్జీఎఫ్ క్రీడల్లో ఆర్చరీ రాష్ట్రస్థాయి పోటీలకు స్థానిక హిమరక ప్రసాదరావు కుమార్తెలు ఎంపికయ్యారు. ఆదివారం శ్రీకాకుళంలో జరిగిన జిల్లా స్థాయి ఆర్చరీ పోటీల్లో సీతంపేట మండలం నుంచి అక్కాచెల్లెళ్లు హాజరు కాగా అండర్ 19లో హెచ్.సంయుక్త, అండర్ 17లో హెచ్.లక్షితలు ఎంపిక కావడం పట్ల ఐటీడీఏ ఏపీఓ చిన్నబాబు, ఐటీడీఏ స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానంద్, కోచ్ మధులతో పాటు పలువురు అభినందించారు. ప్రారంభమైన క్రీడోత్సవంవిజయనగరం: విజయనగర ఉత్సవాల్లో భాగంగా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తలపెట్టిన క్రీడోత్సవం ఆదివారం సాయంత్రం ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా మొత్తం ఏడు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనుండగా స్థానిక ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్ క్రీడాంశాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన పురుష జట్లకు మాత్రమే పోటీలు నిర్వహించగా..టెన్నిస్ క్రీడాంశంలో ఉత్తరాంధ్ర స్థాయిలో పోటీలు నిర్వహించారు. చెస్ క్రీడాంశంలో 15 సంవత్సరాల లోపు వయస్సు గల బాల,బాలికలకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 800 మంది క్రీడాకారులు పాల్గొనగా..ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో పోటీలు జరిగాయి. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు సోమవారం సాయంత్రం బహుమతీ ప్రదానోత్సవం చేయనున్నట్లు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి కె.శ్రీధర్రరావు తెలిపారు. పోటీలను ఆయా క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులు కె.జ్వాలాముఖి, కేవీఎన్ చిన్నారి, కేవీ.ప్రభావతి, వై.కుసుంబచ్చన్, నున్న సురేష్ తదితరులు పర్యవేక్షించారు. అలరించిన థింసా నృత్య ప్రదర్శన విజయనగరం టౌన్: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక లయన్స్ కమ్యూనిటీ హాల్లో పలువురు చిన్నారులు ఆదివారం చేసిన థింసా నృత్య ప్రదర్శన చూపరులను అలరించింది. అలాగే బాలభవన్, నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం కళాకారుల బృందాలు చేసిన జానపద కళా ప్రదర్శనలు సైతం ఆకట్టుకున్నాయి. -
ఏనుగు పిల్ల మృతి
పార్వతీపురం రూరల్: మండలంలోని లక్ష్మీనారాయణపురం గ్రామ ముదిరాజు చెరువులో ఆదివారం ఉదయం ఏనుగుల గుంపులో ఉన్న పిల్ల ఏనుగు మృతి చెందింది. ఇటీవల కొద్ది వారాల నుంచి పార్వతీపురం మండలంలోని తొమ్మిది ఏనుగుల గుంపు సంచరిస్తుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఏనుగుల గుంపులో ఉన్న పిల్ల ఏనుగును పెద్ద ఏనుగులు తొక్కడంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని మరణానికి కారణాలను పరిశీలిస్తున్నారు. ఈ విషయమై ఎలిఫెంట్ మా నటరింగ్ అధికారి మణికంటేశ్వరరావు మాట్లాడుతూ ఏనుగు పిల్ల వయసు ఏడు నెలలని తెలిపారు. పోస్టుమార్టం నిమత్తం కొమరాడ మండలం అర్తాం తరలించామని చెప్పారు. కారు ఢీ కొని లారీ డ్రైవర్‌కు తీవ్రగాయాలురామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలస సమీపంలో గల భారత్ పెట్రోల్ బంకు వద్ద జాతీయ రహదారిపై ఆదివారం కారు ఢీ కొనడంతో ఓ లారీ డ్రైవర్ తీవ్రగాయాల పాలయ్యాడు. ఈ ఘటనపై స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణానికి చెందిన లారీ డ్రైవర్ గేదెల వెంకటరావు లారీతో విజయనగరం వెళ్తూ ముచ్చర్లవలస పెట్రోల్ బంకు వద్ద మూత్ర విజర్జన కోసం జాతీయ రహదారి పక్కన లారీ ఆపి రోడ్డు క్రాస్ చేస్తున్నాడు. ఆ సమయంలో రామభద్రపురం నుంచి విజయనగరం వెళ్తున్న కారు లారీ డ్రైవర్‌ను ఢీ కొట్టింది. దీంతో వెంకటరావు తీవ్ర గాయాలపాలై తుళ్లిపోవడంతో మృతిచెందాడేమోనని భావించి కారు డ్రైవర్ రోడ్డు కారు రోడ్డు పక్కన పెట్టేసి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ప్రథమ చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఎస్సై వి. ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యాన్‌బోల్తా పడి యువకుడి మృతిచీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని తోండ్రంగి గ్రామంలో వ్యాన్ బోల్తా పడి గ్రామానికి చెందిన పెనుమజ్జి కుమార్(25) మృతిచెందాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలో జరుగుతున్న నిర్మాణ పనుల్లో భాగంగా వ్యాన్‌లో ఐరన్ రాడ్లు తీసుకువచ్చారు. ఐరన్‌లోడుతో ఉన్న వ్యాన్‌ను ఎత్తు భాగానికి ఎక్కిస్తుండగా బోల్తాపడింది. దీంతో వ్యాన్ పక్కనే ఉన్న పెనుమజ్జి కుమార్ సంఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. తల్లిదండ్రులు ఆదిబాబు, చిట్టెమ్మ దంపతులకు కుమార్ పెద్ద కొడుకు కాగా సమీపంలో ఉన్న పవర్‌ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. -
సంగీత సాహిత్య సమలంకృతే..!
విజయనగరం టౌన్: సంగీత సరస్వతికి స్వరనీరాజనం పలికారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభమైన విజయనగరం ఉత్సవాల్లో సంగీత కళాకారులు కళామతల్లిని స్తుతిస్తూ చేసిన స్వరాభిషేకం ఆద్యంతం రక్తికట్టించింది. విజయనగర ఉత్సవాల్లో భాగంగా స్థానిక మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో ఘంటసాల, ద్వారం వంటి ఎందరో మహనీయులు సాధన చేసిన కచేరీ మందిరంలో 32 బృందాలు, 315 మంది కళాకారులు తమ స్వరఝరిని వినిపించి, కళ్లకు కట్టినట్లు చూపించి చూపరులను కట్టిపడేశారు. ఆకట్టుకున్న ప్రదర్శనలు ఇవే.. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మండపాక నాగలక్ష్మి నేతృత్వంలో నిర్వహించిన కార్యక్రమాలను జ్యోతిప్రజ్వలన, ప్రార్థనాగీతాలాపన, స్వాగత నృత్యాంజలితో ప్రారంభించారు. ఎన్.గోపాలరావు బృందం నాదస్వరం, శ్రీహరి సంకీర్తన ఝరి ఎన్.వెంకటరావు బృందం గాత్రం, ఎన్.కాళీప్రసాద్ బృందం గాత్రం, కె.ఎ.పద్మప్రియ బృందం వీణకచేరీ, నర్తనశాల డ్యాన్స్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ భేరిరాధికారాణి బృందం నృత్యప్రదర్శన, అమృతవర్షిణి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ టి.సౌమ్య బృందం నృత్యప్రదర్శన ఆద్యంతం అలరించాయి. టి.తన్మయి బృందం నృత్యప్రదర్శన, టి.అమ్మాజమ్మ గాత్రకచేరీ చూపరులను కట్టిపడేశాయి. సీహెచ్.శైలజ గాత్రం, ఎన్వీ.కామేశ్వరరావు ప్లూట్ ఆధ్యాత్మికతను సంతరించుకున్నాయి. ఎస్వీఎన్.వివేక్, శరత్ బృందం మైమ్, అభినయ డ్యాన్స్ స్కూల్ ఎం.సాయి ప్రియబృందం, ఇబ్రహీం ఖాన్ బృందం దూడ శ్రీదేవి, పి.క్రిషిక, కరుణల నృత్యప్రదర్శనలు, జి.రాధిక బృందం, కె.పెంటయ్యనాయుడుల గాత్రకచేరీ, పీవీఎన్ఎల్ సారథి బృందం వయోలిన్, టి.సత్యనారాయణ బృందం నృత్యప్రదర్శన, పి.సూర్యకుమారి, కె.స్వాతిప్రియదర్శిని బృందం నృత్యప్రదర్శన, వి.అప్పలస్వామి నృత్యప్రదర్శన, ఐ.మెహరలత గాత్రకచేరీ, డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి బృందం గాత్రకచేరీ అలరించాయి. కళాకారులకు సత్కారం కె.విద్యాసాగర్ బృందం, డాక్టర్ మండపాక రవి మృదంగం, బి.మంజూష బృందం, ఎ.శైలజల నృత్యప్రదర్శన, శ్రీవారి స్వచ్ఛంద సేవా సంస్థ ఎం.భీష్మారావు బృందం గాత్రకచేరీ ఆద్యంతం ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. అనంతరం కళాకారులను నిర్వాహకులు దుశ్శాలువాలు, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో లైఫ్ మెంబర్స్ పిళ్లా విజయకుమార్, రామయ్యపంతులు, వేదిక ఇన్చార్జ్ అధికారులు కవిత, జానకమ్మ, నాగలక్ష్మిలు సహకారమందించారు. సంగీత సరస్వతికి స్వర నీరాజనం 32 రకాల సంగీత బృందాలు, 315 కళాకారులతో స్వరాభిషేకం ఆహూతుల మన్ననలు పొందిన సంగీత, నృత్యప్రదర్శనలు విజయనగర ఉత్సవ వేదికలో మిన్నంటిన స్వరఝరి -
అలరించిన పెట్ షో
విజయనగరంఫోర్ట్: విజయనగర ఉత్సవాల్లో భాగంగా స్థానిక అయోధ్య మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన పెట్ షో అకట్టుకుంది. పశు సంవర్థకశాఖ ఆధ్వర్యంలో పెట్ షో నిర్వహించారు. సిజ్జు, జెర్మనీ పెషర్డ్, ల్యాబ్, కొమిరేనియా, డాబర్ మెన్ తదితర 20 రకాలకు చెందిన 195 పెట్స్ (పెంపుడు కుక్కలు) షోలో పాల్గొన్నాయి. పెట్షోలో పాల్గొనేందుకు 170 మంది ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోగా, 25 మంది స్పాట్లో రిజిస్టర్ చేసుకున్నారు. పెట్లో షోలో పుంగనూరు జాతి ఆవులు, విదేశీ పావురాలు, గీనీపిక్స్, లవ్‌బర్డ్స్, రాబిట్స్ , పావురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. షోలో పాల్గొన్న పెట్స్ యాజమానులకు జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి డాక్టర్ మురళీకృష్ణ సర్టిఫికెట్స్ అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జి.మహాలక్ష్మి, అసిస్టెంట్ డైరెక్టర్స్ డాక్టర్ కేవీ.రమణ, డాక్టర్ టి. ధర్మారావు, డాక్టర్ ఎల్, విష్ణు, డాక్టర్ ఆర్.శారద, డాక్టర్ పి.అనూరాధ, వీఏఎస్‌ల డాక్టర్ టి.మోహన్ రావు, డాక్టర్ ఎన్.జి.సాగర్, డాక్టర్ వి. భావన, డాక్టర్ ఎ.భాగ్య రాజ్, డాక్టర్ ఎల్.శ్రుతి పాల్గొన్నారు. -
కొట్టక్కి ఉన్నత పాఠశాలకు పురస్కారం
రామభద్రపురం: మండలంలోని కొట్టక్కి ఉన్నత పాఠశాలకు అరుదైన పురస్కారం లభించింది.గత ప్రభుత్వంలో నాడు నేడు కింద కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా నిర్మించిన అదనపు తరగతి గదులతో పాటు మరుగుదొడ్ల నిర్మాణం, అలాగే పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్ధులు పరిశుభ్రత, పచ్చదనం,పర్యావరణ పరిరక్షణలో చేసిన కృషికి గుర్తింపు లభించింది. స్వర్ణాంఽధ్ర–స్వచ్ఛాంధ్ర–2025 జిల్లాస్థాయిలో ప్రభుత్వం పాఠశాలల విభాగంలో మొదటి స్థానం దక్కించుకుంది.ఈ నెల 6వ తేదీన జిల్లా కేంద్రంలో కలెక్టర్ చేతుల మీదుగా సంబంధిత హెచ్ఎం అవార్డు అందుకోనున్నారు. సంతోషంగాఉంది.. మా పాఠశాల స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కింద పురస్కారానికి ఎంపిక కావడం సంతోషంగా ఉంది. ఇది మా పాఠశాల సాధించిన ఘనత. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల సహకారం మరువలేనిది. – ఆమిటి శ్రీనివాసరావు, హెచ్ఎం ఉన్నత పాఠశాల కొట్టక్కి -
మూతపడిన జనరిక్ మందుల షాపు
● అధిక ధరకు మందుల కొనుగోలు ● ఇబ్బందులు పడుతున్న పేదరోగులువిజయనగరం ఫోర్ట్: ఏజబ్బు అయినా సరే మందుల ద్వారానే నయమవుతుంది. అధికశాతం మంది ప్రజలు బీపీ, షుగర్, ఆస్తమా, కిడ్నీ, లివర్, గుండె, అర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఇలా రకరకాల వ్యాధులతో బాధపడుతున్నవారు ప్రైవేట్ మందుల దుకాణాల్లో మందులు కొనుగోలు చేయాలంటే అధిక మొత్తంలో వెచ్చించాల్సిన పరిస్థితి. పేద, మధ్య తరగతి వర్గాలకు అది అదనపు భారమే. ఇటువంటి పరిస్థితుల్లో తక్కువ ధరకు మందులు లభించే జనరిక్ మందుల దుకాణం పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే అవసరమైతే జనరిక్ మందుల దుకాణాలను పెంచాల్సి ఉంది. కానీ ప్రభుత్వసర్వజన ఆస్పత్రి ఆవరణంలో ఉన్న జనరిక్ మందుల దుకాణం మూత పడి రోజులు గడుస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి నిర్వహిస్తున్న షాపు అకస్మాత్తుగా మూతపడినా అధికారులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కువ మంది రోగులు మందుల కొనుగోలు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి నిత్యం ఓపీ విభాగానికి 1000 నుంచి 1200 మంది వస్తారు. వారికి ప్రభుత్వ ఆస్పత్రిలో మందులు ఉచితంగా ఇస్తారు. ఆస్పత్రిలో అందుబాటులో లేని మందులను రోగులు జనరిక్ మందుల దుకాణంలో కొనుగోలు చేసేవారు. అదేవిధంగా బీపీ, షుగర్ , కేన్సర్ వంటి ధీర్ఘకాలిక రోగులు కూడా ఇక్కడే మందులు కొనుగోలు చేసేవారు. ప్రైవేట్ మెడికల్ షాపుల కంటే అతి తక్కువ ధరకు మందులు లభించడంతో అధికశాతం మంది జనరిక్ మందులు దుకాణంలో కొనుగోలు చేయడానికి ప్రాధాన్యం ఇస్తారు. 20 రోజులవుతున్నా పట్టించుకునే వారే కరువు జనరిక్ మందుల దుకాణం మూత పడి 20 రోజులు దాటుతున్నా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకున్న దాఖలాలులేవు. దుకాణం నిర్వహించేవారు ఎందువల్ల తెరవడం లేదనే దానిపై అధికారులు ఆరా కూడా తీయలేదని తెలుస్తోంది.ఆదేశాల మేరకు చర్యలు జనరిక్ దుకాణం నిర్వహించే వారికి ఆస్పత్రి నుంచి ఎటువంటి అనుమతులు లేవు, విద్యుత్ బిల్లులు కూడా ఆస్పత్రి నిధుల నుంచే కడుతున్నాం. అద్దె కూడా చెల్లించడం లేదు. దీనిపై డీఎంఈకు లెటర్ రాశాం. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ అల్లు పద్మజ, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
సిరిమానోత్సవానికి రూట్‌మ్యాప్
విజయనగరం క్రైమ్: పైడతల్లి సిరిమానోత్సవానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వాహనాలను నిర్దేశించిన ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలని ఎస్పీ దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ పైడితల్లి జాతరకు వస్తున్న భక్తులు ఈ నెల 7న తేదీన అమ్మవారి సిరిమానోత్సవం సందర్బంగా వాహనాలపై వచ్చేవారికి పార్కింగ్ చేసేందుకు పలు ప్రదేశాలను ఏర్పాటు చేశామన్నారు. విశాఖపట్నం, కోరుకొండ, జామి, అలమండ, కొత్తవలస పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వారంతా ఎత్తు బ్రిడ్జి మీదుగా మయూరి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వైపు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన కాశిరాజు సర్కస్ గ్రౌండ్ అయోధ్యమైదానం, ఎంఆర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్లో వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. అలాగే ధర్మపురి, డెంకాడ పరిసర ప్రాంతాలనుంచి వచ్చే వాహనాలు ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ మీదుగా కాశిరాజు సర్కస్ గ్రౌండ్ అయోధ్యమైదానం, ఎంఆర్ కాలేజ్ బాయ్స్ హాస్టల్ వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలను పార్క్ చేయాలన్నారు. ఇక నాతవలస, శ్రీకాకుళం, భోగాపురం పరిసర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు రాజీవ్ నగర్ కాలనీ జంక్షన్, దాసన్నపేట జంక్షన్ మీదుగా అయ్యకోనేరువద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో గానీ లేదా రాజీవ్ నగర్ జంక్షన్, రింగ్ రోడ్డు మీదుగా ఫోర్ట్ సిటీ స్కూల్, ఎస్వీఎన్ లేఔట్లో ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలంలో కానీ వాహనాలను పార్కింగ్ చేయాలని సూచించారు. అలాగే నెల్లిమర్ల, చీపురుపల్లి, రాజాం, గరివిడి, గుర్ల ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కొత్తపేట నీళ్ల ట్యాంక్ జంక్షన్ మీదగా, కొత్తపేట మంటపం పాత బస్టాండ్ మీదుగా రాజీవ్ స్పోర్ట్స్ స్టేడియం మీదుగా వచ్చి డీఎస్డీఓ ఇండోర్ స్టేడియంలో పార్కింగ్ చేయాలన్నారు. గజిపతినగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, గంట్యాడ, ఎస్.కోట పరిసర ప్రాంతాల నుంచీ వచ్చే వాహనాలు కలెక్టర్ ఆఫీస్ నుంచి గూడ్స్ షెడ్, సీఎంఆర్ జంక్షన్ మీదుగా సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు వ్యతిరేకంగా ఉన్న స్థలంలో పార్క్ చేయాలని సూచించారు. దీంతో పాటు పీజీ స్టార్ హాస్పిటల్ పక్కన గల ఖాళీ స్థలంలోను, ఎస్బీఐ జంక్షన్ నుంచి రామానాయుడు రోడ్డు మీదుగా ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ వద్ద గల పార్కింగ్ స్థలాల్లో పార్క్ చేయాలని తెలిపారు. ఏడవ తేదీ ఉదయం నుంచి ఎనిమిదివ తేదీ రాత్రి పదిగంటల వరకు. ఈ దిగువన నిర్దేశించిన ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిషేధమని ఎస్పీ పేర్కొన్నారు.1. బాలాజీ జంక్షన్ నుంచి సింహాచలం మేడ జంక్షన్ 2. సింహాచలం మేడ జంక్షన్ నుంచి కోట 3. బాలాజీ జంక్షన్ నుంచి గంట స్తంభం 4. ఎం.ఆర్ కాలేజీ జంక్షన్ నుంచి గురజాడ సర్కిల్ 5. కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి గంటస్తంభం 6. ట్యాక్సీ స్టాండ్ నుంచి గంట స్తంభం 7. సామ్రాట్ లాడ్జి జంక్షన్ నుంచి శివాలయం మీదుగా ఎంజీ రోడ్డు 8.కమ్మవీధి జంక్షన్ నుంచి మూడు లాంతర్లు 9. గుమ్చీ జంక్షన్ నుంచి కోట జంక్షన్ వైపు అన్ని రకాల వాహనాల రాకపోకలు నిషేధించినట్లు ఎస్పీ దామోదర్ వివరించారు. నిషేధిత స్థలాల్లో వాహనాలు పార్కింగ్ చేసిన పక్షంలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు జరిమానా కూడా విధిస్తారని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. -
అర్ధరాత్రి లాఠీ చార్జ్
● జమ్ము గ్రామంలో ఉద్రిక్తత ● గ్రామస్తులపై విరుచుకుపడిన పోలీసులు ● పలువురికి గాయాలుగుర్ల: మండలంలో ఇంతవరకూ లేని సంస్కృతిని పోలీసులు అలవాటు చేస్తున్నారు. కూటమి నేతల ఆశీస్సులు పొందేందుకు వైఎస్సార్సీపీ నేతలపై కక్ష కట్టి అన్యాయంగా లాఠీ చార్జ్ చేస్తూ భయభ్రాంతులకు గురుచేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఎన్ని ప్రభుత్వాలు మారినా ప్రశాంతంగా ఉండే గ్రామం మండలంలోని జమ్ము. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఆ గ్రామంలో టీడీపీ నేతలు పెత్తనం చేయడానికి ప్రయత్నించారు. కానీ వీలు పడకపోవడంతో గ్రామంలో ఎదో ఒక అలజడి సృష్ఠించి పోలీసులను, అధికారులను రంగప్రవేశం చేయించి వారిపై తీవ్ర ఒత్తిడి చేసి వారి మాటను నెగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీని పర్యావసానంగా గ్రామంలో శనివారం దేవీ విగ్రహ నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుగుతుండగా అర్ధరాత్రి సమయంలో వైఎస్సార్సీపీకి చెందిన మహిళులు, పెద్దలు, యువతపై పోలీసులు ఒక్కసారిగా లాఠీ చార్జ్ చేశారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావారణం నెలకొంది. ఈ లాఠీ చార్జ్‌లో గ్రామానికి చెందిన సారంపాటి ఆనంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. మరో పది మంది మహిళలకు ఒంటిపై పోలీసుల లాఠీ దెబ్బలు తీవ్రంగా కనిపిస్తున్నాయి. పోలీసుల తీరుకు ఖండన జమ్ము గ్రామంలో దేవీ విగ్రహ నిమజ్జనోత్సవం జరుగుతుండగా వైఎస్సార్సీపీకి చెందిన వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి విచక్షణా రహితంగా కొట్టడాన్ని వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడు, జెడ్పీటీసీ శీర అప్పలనాయుడు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ఆర్టీఐ వింగ్ కార్యదర్శి కెంగువ మధుసూదనరావు, నియోజక వర్గ బీసీ సెల్ అధ్యక్షుడు జమ్ము స్వామినాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రశాంతమైన పల్లెలో అల్లర్లు సృష్ఠించి ఉద్రిక్త వాతావారణాన్ని నెలకొల్పుతున్న పోలీసుల తీరుపై అగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల లాఠీ చార్జ్‌లో గాయపడి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. -
ఆకట్టుకున్న విద్య, వైజ్ఞానిక ప్రదర్శన
● 166 విద్యాసంస్థల నుంచి 234 సైన్స్ ప్రాజెక్టు నమూనాలువిజయనగరం అర్బన్: విజయనగర ఉత్సవాల్లో పాఠశాల విద్యార్థులు ఆదివారం ప్రదర్శించిన విద్య వైజ్ఞానిక ప్రదర్శనలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 166 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు, ఐటీఐ విద్యాసంస్థల విద్యార్థుల నుంచి 234 సైన్స్ ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. ఇందులో 150 పాఠశాలల నుంచి 182, 15 కళాశాలల నుంచి 32, ఒక ఐటీఐ నుంచి 20 ప్రాజెక్టుల నమూనాలను ప్రదర్శించారు. ప్రదర్శనలో ఉంచిన పలు నమూనాలు సందర్శకులను ఆలోచింపచేశాయి. ఐటీఐ విద్యార్ధులు రూపొందించిన వ్యర్థ ఇనుప పదార్థాల నుంచి సృజనాత్మక పరికరాలు, సోలార్, విండ్ విద్యుత్ ఉత్పాదక నమూనాలు ఆకట్టుకున్నాయి. తాటిపూడి రిజర్వాయర్, భోగాపురం విమానాశ్రయం, దేశంలో ప్రసిద్ధి చెందిన హిందూదేవాలయాల నమూనాలు, డ్రోన్లు, క్రాఫ్ట్, ఆర్ట్ కళల చిత్రలేఖన ప్రదర్శనలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రదర్శనను ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎంఎల్సీలు డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు, వేపాడ చిరంజీవిరావు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, డీఈఓ యూ.మాణిక్యంనాయుడు పాల్గొన్నారు. -
తోటపల్లి ఆధునికీకరణ పనులకు మోక్షం కలిగేనా..!
వీరఘట్టం: ఈ ఏడాది ఖరీఫ్‌కు జూలై 16న తోటపల్లి పాత ఆయకట్టులోని కుడి, ఎడమ కాలువలకు జల వనరుల శాఖ అధికారులు సాగునీరు విడుదల చేశారు. నీరు విడిచిపెట్టి నెల రోజులు గడిచినా పాలకొండ శివారు ఆయకట్టుకు తోటపల్లి కాలువల ద్వారా నీరు అందకపోవడంతో ఆకు మడులు ఎండిపోతున్నాయని, తక్షణమే పాలకొండ శివారుకు నీరందెలా చేయాలని అన్నదాతలు రోడ్డెక్కారు. అన్నదాతలు ఎంత గగ్గోలు పెట్టినా ఎవరూ పట్టించుకోలేదు. చివరకు వరుణదేవుని కరుణతో వర్షాలు పుష్కలంగా కురవడంతో పాలకొండ శివారు ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన వీరఘట్టం మండల సర్వసభ్య సమావేశంలో జల వనరుల శాఖ ఏఈ డి.వి.రమణ స్పష్టం చేశారు. వర్షాలు సకాలంలో కురవడంతో ఖరీఫ్ గెట్టెక్కిందన్నారు. మరో రెండు నెలల్లో ఖరీఫ్ సీజన్ ముగియనుంది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి కాలువ పనులు చేసేందుకు వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అయితే ఎంతో ప్రాధాన్యత ఉన్న తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణ అంశంపై కూటమి ప్రభుత్వం కనీసం స్పందించకపోవడంపై రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటపల్లి పేరుతో ఓట్లు దండుకున్నారు.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కనీసం తోటపల్లి పాత ఆయకట్లు కాల్వల ఆధునికీరణ పనుల అంశాన్ని ప్రస్తావించ లేదు. దీంతో ఇక తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణకు ఎప్పుడు మోక్షం కలుగుతుందా.. అని రైతులు ప్రశ్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నాయకులు తోటపల్లి పేరు చెప్పుకుని ఓట్లు దండుకొని ఇప్పుడు విస్మరించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తోటపల్లి ఊసెత్తని ప్రభుత్వం మరో రెండు నెలల్లో ముగియనున్న ఖరీఫ్ సీజన్ ఈ ఏడాది వరుణిడి కరుణతో గట్టెక్కిన ఖరీఫ్ ఏడాది కిందట తోటపల్లి ఆధునికీకరణ పనులను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం తోటపల్లి పాత ఆయకట్టు పరిధి సుమారు 64 వేల ఎకరాలు తోటపల్లి పాత ఆయకట్టును సస్యశ్యామలం చేస్తామని ఎన్నికల ముందు రైతాంగానికి కల్లబొల్లి మాటలు చెప్పిన కూటమి ప్రభుత్వం ఈ ప్రాంత రైతాంగాన్ని మోసగించింది. ఆపేసిన తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణ పనులను వెంటనే ప్రారంభించాలి. లేదంటే రైతులతో కలసి వైఎస్సార్సీపీ పోరాడుతుంది. – పొట్నూరు లక్ష్మణరావు, రైతు, వైఎస్సార్సీపీ యువజన విభాగం అధ్యక్షుడు, తెట్టంగి, వీరఘట్టం మండలం ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను కూటమి నాయకులకు చిత్తశుద్ధి ఉంటే నిలబెట్టుకోవాలి. తోటపల్లి పాత ఆయకట్టు కాలువ పనులు నిలిపివేయడం పద్ధతి కాదు. చంద్రబాబు ఈ ప్రాంత రైతులకు వెన్నుపోటు పొడిచారు. – దమలపాటి వెంకటరమణనాయుడు, ఎంపీపీ, వీరఘట్టం తోటపల్లి పాత ఆయకట్టు కాలువల ఆధునికీకరణ పనుల విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాం. గతంలో జరిగిన ఈ పనులు 25 శాతం కంటే తక్కువ చేపట్టినందున ఈ పనులు ప్రభుత్వం నిలిపివేసింది. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. – వై.గన్నిరాజు, డీఈఈ, జల వనరుల శాఖ, పాలకొండ డివిజన్ ప్రస్తుతం తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణ పనులు చేపట్టాలంటే రూ.300 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు ఈ ఫైల్‌ను ప్రభుత్వానికి అందజేశాం. అయితే నిధుల కొరత ఉందని ప్రభుత్వం తెలిపింది. ప్రసుత్తం ఈ పనులు నిలిచిపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాం. కనీసం పెద్దబుడ్డిడి వద్ద ఉన్న సైఫన్‌ను బాగు చేసేందుకై నా నిధులు విడుదల చేయాలని కోరాం. – పొదిలాపు విజయరమణి, తోటపల్లి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ -
సోమవారం శ్రీ 6 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
విజయనగరం ఫోర్ట్: విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాన్సాస్ మైదానంలో ఆదివారం ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పుష్పాలను ఆసక్తిగా తిలకించారు. పలు రకాల పుష్పాలతో ఏర్పాటు చేసిన ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పుష్పాలతో ఏర్పాటు చేసిన తంబుర, వయోలిన్, గంటస్థంభం, సీతాకోక చిలుక, కూరగాయలతో తయారు చేసిన మొసలి, డ్రాగన్, సైకత పైడితల్లి ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి కె.చిట్టిబాబు, డీఆర్డీఏ పి.డి. శ్రీనివాసరావు, ఏపీడీ సావిత్రి, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తగ్గుముఖం పట్టిన ‘తోటపల్లి’ ఉధృతి గరుగుబిల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టు వద్ద నాగావళి నీటి ప్రవాహం ఉధృతంగా వచ్చి క్రమేపి తగ్గుముఖం పడుతుంది. దీంతో నాగావళి నది పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టు వద్ద ఆదివారం సాయంత్రం నాటికి 105 మీటర్ల లెవెల్కుగాను 103.6 మీటర్ల లెవెల్లో నీరు నిల్వ వుంది. ప్రస్తుతం నది పైభాగం నుంచి ప్రాజెక్టుకు 5,769 క్యూసెక్కుల నీరు రాగా ఈ మేరకు అధికారులు రెండు గేట్లును ఎత్తివేసి 4,525వేల క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచి పెడుతున్నారు. అలాగే కాలువల ద్వారా 1,070 క్యూసెక్కుల నీటిని విడిచి పెడుతున్నారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 2.53 టీఎంసీలకుగాను 1.692 టీఎంసీల నీటి సామర్థ్యం వున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఇంజినీరింగ్ ఏఈ కిషోర్ పర్యవేక్షిస్తున్నారు. వైభవంగా స్వామివారికి శ్రీచక్ర స్నానం గరుగుబిల్లి: తోటపల్లి శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు సందర్భంగా ఆదివారం స్వామివారికి శ్రీచక్ర స్నానాన్ని వైభవంగా నిర్వహించారు. స్వామి వారికి ఉదయం సుప్రభాతసేవ, చూర్ణోత్సవం, స్వపనం, మంగళాశాసనం, శాత్తుమురై తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను ఆశీనులు చేయించి మంగళ వాయిద్యాలతో జలాభిషేకం, పాలాభిషేకం, పంచామృతాభిషేకం, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను, విశేష అర్చనలను నిర్వహించి స్వామివారికి శ్రీ చక్ర స్నానాన్ని అర్చకులు వీవీ అప్పలాచార్యులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పవిత్ర నాగావళి నదిలో భక్తులు పుణ్య స్నానాలను ఆచరించారు. స్వామివారి శ్రీచక్ర స్నానం వేడుకలలో పాల్గొనేందుకు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సిబ్బంది చర్యలు చేపట్టారు. ఖాజీపురంలో గజరాజులు భామిని: మండలంలోని గజపతినగరం సమీపంలో ఖాజీపురానికి గజరాజుల గుంపు ఆదివారం చేరుకుంది. ఏబీ రోడ్డు సమీపంలో ఉన్న గిరిజన కాలనీ ఖాజీపురానికి నాలుగు ఏనుగులు చేరడంతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే గిరిజనులు పండించే పంటలను ఏనుగులు తినివేయడంతో పాటు ధ్వంసం చేస్తుండడంతో తీవ్ర నష్టం తప్పదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విజయనగరం ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన ఉత్సవాల్లో భాగంగా 11 వేదికల్లో వివిధ రకాల కార్యక్రమాల ను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా ఆదివారం అతిథులు చేతుల మీదుగా ప్రా రంభించారు. ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకోగా... మాన్సాస్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలు చూపరులకు కనువిందు చేశాయి. బొంకుల దిబ్బపై పౌరాణిక నాటకాలు ప్రదర్శించగా, గురజాడ కళా క్షేత్రంలో స్థానిక కళాకారులు ప్రదర్శించిన నాటకాలు అలరించాయి. లయన్స్ కమ్యూనిటీ హాల్లో జానపద కళా రూపా లు ప్రదర్శన విజయనగరం సంస్కృతిని ప్రతిబింబించగా.. అయోధ్య మైదానంలో నిర్వహించిన పెట్ షో అందరినీ ఆకట్టుకుంది. రెండవ రోజైన సోమవారం ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ అయోధ్య మైదానంలో ప్రముఖ సింగర్స్‌తో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేయనున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ఎస్.రాంసుందర్‌రెడ్డి, ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, మార్క్‌ఫెడ్ చైర్మెన్ కర్రోతు బంగారురాజు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జేసీ ఎస్.సేతుమాధవన్ తదితర ప్రముఖులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: జానపద కళలతో కనువిందు చేస్తూ, కళా రూ పాలతో మైమరిపింపజేస్తూ, విచిత్ర వేషధారణల తో ఆకట్టుకుంటూ విజయనగర ఉత్సవ శోభాయా త్ర శోభాయమానంగా జరిగింది. విజయనగర ఉత్సవాల ప్రారంభానికి సంకేతంగా పైడితల్లి అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ఉదయం మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కోట వద్ద ప్రముఖులు ఆసీనులై కళా రూపాలను తిలకించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అతిధి గజపతిరాజు కళాకారులతో కలిసి థింసా నృత్యం చేశారు. శోభాయమానంగా శోభాయాత్ర ర్యాలీలో స్వాగత శకటం, రోలర్ స్కేటర్స్ విన్యాసాలతో, పైడితల్లి అమ్మవారి కలశాలతో మహిళలు, కోటలో చిన్నారుల నృత్య రూపకం తప్పెటగుళ్లు, థింసా నృత్యం, పులి వేషాలు, విచిత్ర వేషాలు, ఆగమ పండితుల బృందం, విజయనగ రం వైభవం, కేరళ వాయిద్యాలు, కర్ర సాము, అడుగుల బొమ్మలు, కొమ్మ కోయ డ్యాన్స్, బిందెల డ్యా న్స్, చెక్క భజన, గంగిరెద్దులు, జముకుల బృందం, కాళీమాత డ్యాన్స్, ఎన్సీసీ కేడేట్స్ మార్చ్, కోలాటం, క్రీడా సంఘాలు మరియు క్రీడాకారులు, అంగన్వాడీ సిబ్బంది, ఎన్.ఆర్.ఇ.జి.ఎస్, ఎస్.హెచ్.జి.గ్రూపులు తదితర బృందాలు అలరించాయి. సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలి ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే పూసపా టి అదితి విజయలక్ష్మి గజపతిరాజు, గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరా వు మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాల ను కాపాడుకొనేందుకు ఇటువంటి పండుగలు దోహదం చేస్తాయనున్నారు. నేటి తరానికి సంప్రదాయాలు, కళలను అందించాల్సిన అవసరం ఉందన్నారు. జానపద కళలను, కళాకారులను ఆదుకునేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో అవసరమ ని అన్నారు. పైడితల్లి అమ్మవారు జిల్లా ప్రజలందరినీ చల్లగా చూడాలని ఆకాంక్షించారు. 11 వేదికల్లో ఆకట్టుకున్న వివిద కార్యక్రమాలు విజయనగరం టౌన్: శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరానికి సర్వం సిద్ధమైంది. అమ్మవారి అనుగ్రహంతో వచ్చిన విత్తనాలను వేసి నాగలి (ఏరు)తో తొలుత దున్నాలి. దానినే తొలి ఏరు అని... తొలేళ్ల ని పిలుస్తారు. అమ్మవారి సిరిమానోత్సవానికి ముందు రోజు దీన్ని సంప్రదాయబద్దంగా నిర్వహిస్తారు. పంటకు ఎలాంటి విపత్తులూ, చీడపీడల బాధలు, దరి చేరకూడదనేది రైతు కోరిక. వారి కోసం నిర్వహించేదే తొలేళ్ల ఉత్సవం. తొలేళ్ల రోజు రాత్రి చదురుగుడి నుంచి అమ్మవారి ఘటాలను కోటలోకి తీసుకువెళతారు. అక్కడ కోటశక్తికి పూజలు చేసి, అమ్మవారి ఆశీర్వచనం పొందిన విత్తనాలను బస్తాలతో ఉంచుతారు. సిరిమాను పూజారి చేతులతో ఆ విత్తనాలను అందించి అమ్మవారు ఆశీర్వదిస్తారు. ఆ విత్తనాలను రైతులు తమ బస్తాలలో కలిపి పొలా ల్లో చల్లుతారు. మంచి దిగుబడులు సాధిస్తారు. విజయాలకు ప్రతీకగా నిలిచిన విద్యల నగరమైన విజయనగరి అమ్మవారి తొలేళ్ల సంబరాలు ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం నుంచి మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం వరకూ అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు కలిగించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు మూడువేల మంది పోలీసు బలగాలను ఉత్సవ విధులకు కేటాయిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఇటు రైల్వేస్టేషన్ వద్దనున్న వనంగుడి, మూడులాంతర్లు వద్దనున్న చదురుగుడి ప్రాంతమంతా విద్యుత్ శోభతో అలరారుతోంది. మరోవైపు విజయనగర ఉత్సవాల సందడితో చారిత్రాత్మక కట్టడాలన్నీ విద్యుత్ అలంకరణలతో శోభాయామానంగా తయారైంది. మహారా జ కోట, గంటస్తంభం, మహారాజా ప్రభుత్వ సంగీ త, నృత్య కళాశాల, మయూరీ కూడలి నుంచి రైల్వేస్టేషన్ మీదుగా సీఎంఆర్ జంక్షన్ వరకూ విద్యుత్ లైట్లు ఆకట్టుకుంటున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించడంతో పాటూ పసుపు, కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారు ఆలయమంతా పుష్పశోభితంగా విరాజిల్లుతోంది. తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా ప్రజ లు, అధికారులు సన్నద్ధమయ్యారు. ●వేకువజామున 3 గంటల నుంచి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారు. ●ఉదయం రాజవంశీకులు, మంత్రులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. ●రాత్రి 10.30 గంటలకు భాజాభజంత్రీలతో అమ్మవారి ఘటాలకు పూజలు చేసేందుకు కోటలో కి పూజారులు వెళ్తారు. కోటశక్తికి, అమ్మవారి ఘటాలకు పూజాధికాలు నిర్వహిస్తారు. ●ఘటాలను తిరిగి చదురుగుడి వద్దకు తీసుకువచ్చి గుడి ఎదురుగా ఉన్న బడ్డీలా ఏర్పాటు చేసిన వాటిపై భక్తుల సౌకర్యార్ధం ఉంచుతారు. అమ్మవారి దర్శనానికి అవకాశం లేని వారందరూ అక్కడే పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లిస్తారు. ●ఘటాలను తీసుకువచ్చిన తర్వాత పూజారి అమ్మవారి చరిత్ర చెప్పి రైతులకు ధాన్యాన్ని పంచుతారు. రైతులు ఆ విత్తనాల కోసం బారులు తీరుతారు. ప్రత్యేక అలంకరణలో పైడితల్లి అమ్మవారు -
డ్వాక్రా బజారులో 19 రాష్ట్రాల సంఘాలు
విజయనగరం టౌన్: అఖిల భారత డ్వాక్రా బజార్లో ఏపీతో పాటు 19 రాష్ట్రాలకు చెందిన మహిళా సంఘాలు పాల్గొనడం అభినందనీయమని డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సరస్‌ను ఆయన సందర్శించి, మహిళా సంఘాలతో స్టాల్స్‌లో సేల్, ఏర్పాట్లు తదితర వాటిపై ఆరాతీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదురోజుల నుంచి నిర్వహిస్తున్న డ్వాక్రా బజారు, సరస్‌కు గతేడాది కంటే ఈ ఏడాది విశేషమైన స్పందన లభించిందన్నారు. గతేడాది రూ.8 కోట్ల అమ్మకాలు జరిగాయని, ఈ ఏడాది రూ. 12 కోట్ల వరకూ జరిగే అవకాశం ఉందన్నారు. పైడితల్లి అమ్మవారి పండగ వేళ వస్త్రాలు, గృహోపకరణాలకు షాపులు చుట్టూ తిరగాల్సి న పనిలేకుండా ఆకట్టుకునే కలంకారీ కాటన్ వస్త్రాలు, కొయ్యబొమ్మలు, జూట్, వెదురు ఉత్పత్తులు ఒకేచోట లభ్యమవుతున్నాయన్నారు. విజయనగర ఉత్సవాల్లో భాగంగా ఉద్యానవనశాఖ సమన్వయంతో ఫ్లవర్‌షోను ఇక్కడే ప్రత్యేక ఆకర్షణతో ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. వివిధ రాష్ట్రాలలోని పలు జాతుల పుష్పాలను తీసుకువస్తున్నామన్నారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ మేనేజర్ రత్నాకర్, డీపీఎంలు రాజ్‌కుమార్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల ఆకలికేకలు..!
విజయనగరం ఫోర్ట్: అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తామని కూటమి సర్కార్ గొప్పలు చెప్పింది. ఒకటో తేదీ మాట దేవుడెరుగు ఏ నెలకు అనెల కూడా జీతాలు పడని పరిస్థితి నెలకొంది. అధికారంలోకి రాకముందు మాటలకు, అధికారం చేపట్టిన తర్వాత మాటలకు పొంతన ఉండడం లేదని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఐసీడీఎస్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలకు గడిచిన రెండు నెలలుగా జీతాలు పడని పరిస్థితి. వచ్చే జీతం తక్కువ. అది కూడా సకాలంలో పడక పోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు అందకపోవడం వల్ల పిల్లల ఫీజులు, కుటుంబ పోషణ కష్టతరంగా మారుతుందని వాపోతున్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. భోగాపురం, విజయనగరం, రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి, వియ్యంపేట, ఎస్.కోట, బాడంగి, గంట్యాడ, గజపతినగరం, గరివిడి ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 293 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2206 మెయిన్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. మినీ అంగన్వాడీ కేంద్రాల్లో మినీ అంగన్వాడీ కార్యకర్తలు, మెయిన్ అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలతో పాటు ఆయాలు పనిచేస్తారు. రెండు నెలలుగా అందని వేతనాలు: అంగన్వాడీలకు రెండు నెలలుగా జీతాలు అందలేదు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలకు సంబంధించి జీతాలు అందలేదు. అంగన్వాడీ కార్యకర్తకు నెలకు రూ.11,500,మినీ అంగన్ కార్యకర్తకు రూ.7000, ఆయాకు రూ.7000 చొప్పన జీతాలు చెల్లించాలి. అయితే రెండు నెలలకు సంబంధించి అంగన్వాడీ కార్యకర్తలకు రూ.23000, మినీ అంగన్వాడీ కార్యకర్తకు రూ. 14 వేలు, ఆయాకు రూ 14 వేలు చెల్లించాల్సి ఉంది. బిల్లు పెట్టాం అంగన్వాడీ కార్యకర్తలకు, ఆయాలకు రెండు నెలలకు సంబంధించి జీతాలకు సంబంధించి బిల్లు పెట్టాం. ఆర్బీఐలో పెండింగ్ ఉండవచ్చు. టి.విమలారాణి, పీడీ, ఐసీడీఎస్ రెండు నెలలుగా అందని జీతాలు -
అమ్మవారి పండగ ప్రశాంతంగా జరగాలి
● జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనితవిజయనగరం అర్బన్: పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరపాలని, ప్రతి సాధారణ భక్తుడికి చక్కటి దర్శనం లభించేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. అధికారులు అందుకు తగ్గట్టుగా సన్నద్ధం కావాలని సూచించారు. ఈ మేరకు శనివారం ఆమె కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డితో కలిసి అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు. తొలుత ఏర్పాట్లపై మంత్రికి కలెక్టర్ వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ పోలీస్ శాఖ, రెవెన్యూ , దేవస్థానం వారు కలిసి కంట్రోల్ రూమ్ నుంచి అనునిత్యం పర్యవేక్షించాలని, విదు్య్త్ అంతరాయం లేకుండా చూడాలని, తాగునీటి సరఫరా ప్లాస్టిక్ రహితంగా సక్రమంగా జరిగేలా చూడాలని తెలిపారు. టాయిలెట్ల ఏర్పాటు, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున 170 బస్సుల వరకు అవసరం అవుతాయని, ఆయా రూట్లలో బస్సులను ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్ అలంకరణలు, నగరమంతా సుందరీకరణ వారం రోజుల పాటు ఉంచాలని, పండగ వాతావరణం వెల్లివిరిసేలా ఉండాలన్నారు. స్థానిక శాసన సభ్యురాలు పూసపాటి అదితి గజపతి రాజు మాట్లాడుతూ వీఐపీ దర్శనాలకు ఇబ్బంది కలగకుండా ప్రోటోకాల్ అధికారులు జాగ్రత్తగా చూడాలన్నారు. రథాలన్నీ తనిఖీలు చేసుకుని, వలంటీర్లకు, సేవా ప్రతినిధులకు ఐడీ కార్డులను జారీ చేయాలన్నారు. 7న పట్టువస్త్రాల సమర్పణ కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి మాట్లాడుతూ దేవదాయ శాఖమంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి అమ్మవారికి 7 వ తేదీన ఉదయం పట్టు వస్త్రాలు సమర్పిస్తారని, అందుకు తగ్గ ఏర్పాట్లను దేవాదాయ శాఖ వారు చేయాలని ఆదేశించారు. సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా , గర్భగుడిలో పూజలు ఎక్కువ సమయం నిర్వహించరాదని, ఆర నిమిషం కన్నా భక్తులను లోపల ఉంచరాదని స్పష్టం చేశారు. విజయనగరం ఉత్సవాల ఏర్పాట్ల పై సంయుక్త కలెక్టర్ సేతుమాధవన్ వివరించారు. సమావేశంలో ఎస్పీ ఏఆర్ దామోదర్, అదనపు ఎస్పీ సౌమ్యలత, కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ యశస్వి, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, జిల్లా అధికారులు పాల్గొన్నారు. విజయనగరం ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి ఈ నెల 5,6 వ తేదీల్లో రెండు రోజుల పాటు విజయనగరం జిల్లాలో ఘనంగా జరగనున్న విజయనగరం ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవానికి హోం మంత్రి వంగలపూడి అనితను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా టూరిజం ఆఫీసర్ కుమారస్వామి విశాఖపట్నంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో మంత్రి అనితకు ఉత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు. అనంతరం మంత్రి ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. విజయనగరం జిల్లా చారిత్రక ప్రాముఖ్యతను దేశమంతటా తెలియజేయాలన్న ఉద్దేశంతో, ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మంత్రి అనిత అధికారులకు సూచించారు. ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
కూటమి ప్రభుత్వంలో రేషన్ కష్టాలు
● వాపోతున్న గిరిజనులు సాలూరు: కూటమి ప్రభుత్వంలో గిరిజన ప్రజలు రేషన్ కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో సాలూరు మండలంలోని తోణాం జీసీసీ డిపోకు గిరిజనులు రేషన్ సరుకుల కోసం శనివారం పిల్లలను పట్టుకుని వచ్చారు. దీంతో కూటమి ప్రభుత్వంలో పెద్దలతో పాటు చిన్నారులకు రేషన్ కష్టాలు తప్పడం లేదని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది.మరోవైపు ఆ రేషన్ సరుకులను అతికష్టంమీద జీపుల్లో ప్రమాదకరప్రయాణాలు చేస్తూ గిరిజనులు తమ గ్రామాలకు తీసుకువెళ్తున్నారు. దీంతో రేషన్‌సరుకుల కొనుగోలు కంటే వాటిని ఇంటికి తీసుకువెళ్లేందుకు అఽధికంగా డబ్బులు ఖర్చవుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. గత జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ పంపిణీ వల్ల ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా సుఖంగా రేషన్ సరుకులు ఇండ్ల వద్దనే తీసుకునేవారమని పలువురు గిరిజనులు నాటి రోజులను గుర్తుచేసుకుంటున్నారు. -
పైడితల్లి జాతర భద్రత ఏర్పాట్ల పరిశీలన
విజయనగరం క్రైమ్: ఈ నెల 5, 6, 7 తేదీల్లో విజయనగరం ఉత్సవాలు, శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్లు, సిరిమానోత్సవం జరగనున్న నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.రామ్సుందర రెడ్డితో కలిసి ఎస్పీ దామోదర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్బంగా అమ్మవారి దేవాలయం వద్ద, భక్తుల దర్శనాలకు ఏర్పాటు చేసిన క్యూలను పరిశీలించారు. ఆలయం ఎదురుగా ఏర్పాటు చేయనున్న రెవెన్యూ, పోలీసు శాఖల తాత్కాలిక కంట్రోల్ రూమ్‌లను, అలాగే ఆలయం పరిసర ప్రాంతాలను, దర్శనాలకు భక్తులు వచ్చి, దర్శనం అనంతరం ఆలయం బయటకు వెళ్ళే మార్గాలను తనిఖీ చేశారు. సిరిమాను తిరిగే మార్గం మూడు లాంతర్ల జంక్షన్, కోట, గురజాడ అప్పారావు రోడ్డు జంక్షన్, మసీదు జంక్షన్, జియర్ కాంప్లెక్స్, కోట లోపల వరకు కాలి నడకన వెళ్లి క్షేత్రస్థాయిలో బారికేడ్లను ఏర్పాటు, కటాఫ్ పాయింట్స్ వద్ద భద్రత, బందోబస్తు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసి, చేయాల్సిన పనుల గురించి దిశానిర్దేశం చేశారు. విజయనగరం ఉత్సవాలు, అమ్మవారి తొలేళ్లు, సిరిమానోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అమ్మవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు ప్రాధాన్యం కల్పించాలని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ ఎస్.రామ్సుందర రెడ్డి, ఎస్పీ ఎఆర్ దామోదర్ ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఆర్డీఓ దాట్ల కీర్తి, డీఎస్పీ ఆర్.గోవిందరావు, దేవదాయశాఖ ఏసీ శిరీష, మున్సిపల్, ఆర్అండ్బీ అధికారులు, పలువురు సీఐలు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. గాంధీ విగ్రహం ధ్వంసం కేసులో 8 మంది గుర్తింపుసాలూరు: మండలంలోని మామిడిపల్లి జెడ్పీ హెచ్ పాఠశాల ఆవరణ వద్ద గురువారం గాంధిజీ విగ్రహం ధ్వంసం చేసిన కేసులో దుండగులను గుర్తించినట్లు ఎస్సై నర్సింహమూర్తి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆయన మా ట్లాడుతూ, ఈ ఘటనలో మామిడిపల్లి గ్రామానికి చెందిన 8 మంది దుండగులను గుర్తించి అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో ఇద్దరు మైనర్లు ఉన్నారని, ఆరుగురిపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేశామని తెలిపారు. -
కూరగాయల రైతు కుయ్యో..మొర్రో..!
రామభద్రపురం: ఈ నెలలో బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస తుఫాన్ల కారణంగా కురుస్తున్న వర్షాలతో కూరగాయ రైతు కుదేలయ్యాడు. రోజూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కూరగాయల పంటలు పూర్తిగా పాడై రైతులు నష్టాలపాలవుతున్నారు. కుటుంబమంతా ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తమ కళ్ల ఎదుటే పాడవడం చూసి రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రకృతి సహకరించక తుఫాన్ల వల్ల రోజులు తరబడి కురుస్తున్న వర్షాల కారణంగా పంట భూముల్లో నీరు చేరి ఊటపట్టి కూరగాయ పంటలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం, బొబ్బిలి, బాడంగి,తెర్లాం మండలాల్లోని రైతులు అధికంగా కూరగాయలు పండిస్తున్నారు. 500 పైబడి ఎకరాలలో వంగ, టమాటో, బెండ, చిక్కుడు, కాలిఫ్లవర్, క్యాబేజీ, పొట్టి, పొడవు చిక్కుడు, దొండ, పర్చిమిర్చి, బంతి, ఉల్లి తదితర పంటలతో పాటు ఆకూరలు సాగవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.అయితే పంటలు ఏపుగా పెరిగి ఆశించిన స్థాయిలో దిగుబడి వస్తుందన్న సమయంలో వరుస తుఫాన్ల ప్రభావం పడింది. దీంతో పంటల్లో నీరు చేరి భూమి ఊటపట్టడంతో వేరు కుళ్లు తెగులు సోకి మిరప, వంగ, టమాటో మొక్కలు చనిపోతున్నాయి. అలాగే దుంప జాతులతో పాటు ఆకుకూరల పంటలు పాడవుతున్నాయి. కాలిఫ్లవర్‌లో నీరు చేరి ఆరుతున్న కొద్దీ కుళ్లిపోతోంది. ఉల్లిపంట భూమి ఇవకపట్టి కుళ్లిపోతోంది. ఆకు కూరలకు మచ్చ తెగులు సోకి నాణ్యత, దిగుబడి తగ్గిపోతున్నాయి. చిక్కుడు, దొండ, కాకర. తదితర తీగ జాతి పంటలకు వివిధ రకాల తెగుళ్లు సోకి పూత, పిందె రాలిపోతున్నాయి. వివిధ రకాల చీడపీడలు ఆశించి పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిలో విలవిలలాడుతున్నారు. ప్రకృతి విపత్తులకు తోడుగా తెగుళ్లు సోకడంతో పెట్టుబడులు సైతం కోల్పోయే పరిస్థితి నెలకొంది. తాము అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి ఎంతో ఆశతో కష్టపడి పండించిన పంట తుఫాన్ల కారణంగా నష్టాల బారిన పడుతున్నామని వాపోతున్నారు. నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.ఈ చిత్రంలో కనిపిస్తున్న రైతు రామభద్రపురం గ్రామానికి చెందిన కర్రి సాంబ. సుమారు ఎకరా విస్తీర్ణంలో వివిధ కూరగాయ పంటలు సాగు చేస్తూ దాదాపు రూ.30 వేలకు పైగా పెట్టుబడి పెట్టాడు.అయితే తుఫాన్ వల్ల ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో చూస్తుండగానే కుళ్లిపోతోంది. పెట్టుబడి పోవడమే కాకుండా లాభం రావాల్సిన మరో రూ.50వేలు పోయే పరిస్థితి నెలకొంది. పంటల సాగుకు అధికంగా పెట్టుబడులు పెట్టడంతో పాటు కుటుంబమంతా ఆరుగాలం కష్టపడినా ప్రకృతి సహకరించడంలేదని చనిపోతున్న మిరప మొక్కలను చూపుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. వరుస తుఫాన్ల ప్రభావంతో కుదేలు ఊటబారి మొక్కలు చనిపోతూ, రాలిపోతున్న పూత, పిందె పెట్టుబడి దక్కదంటున్న రైతులు నియోజకవర్గంలో 500కు పైబడి ఎకరాల్లో సాగవుతున్న కూరగాయ పంటలు పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకోలుపరిశీలిస్తాను.. సాధారణంగా నీరు అధికంగా ఉన్న భూముల్లో వేరు కుళ్లు తెగులు సోకుతుంది. కూరగాయల పంటల్లో నీరు నిల్వ ఉండకుండా బయటకు తీసేయాలి. క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి పంట నష్టాలను అంచనా వేసి, నివేదికలు పంపిస్తాం. ఉద్యానశాఖాధికారులు చెప్పిన యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఆధిక దిగుబడులు సాధించవచ్చు. పి.మోహనకృష్ణ ఉద్యానశాఖ అధికారిప్రభుత్వం ఆదుకోవాలితుఫాన్ కారణంగా కూరగాయ పంటలు మా కళ్ల ఎదుటే నాశనమయ్యాయి.ఆ ప్రభావం దిగుబడులపై పడి పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కూరగాయ పంటలు సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్ట పరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలి. మూడడ్ల పైడితల్లి కూరగాయల రైతు, రామభద్రపురంతీవ్రంగా నష్టపోయాం.. చిన్నప్పటి నుంచి కూరగాయల పంటలు సాగు చేస్తున్నాను. వాతావరణ పరిస్థితుల కారణంగా అధికంగా కూరగాయల పంటలు నష్టపోవడం ఇదే మొదటిసారి చూస్తున్నాను. నోటికాడికి వచ్చిన అన్నం ముద్దను తీసేసిన చందంగా ఉంది. అప్పు చేసి రూ.25 వేలు పెట్టుబడి పెట్టి అర ఎకరా విస్తీర్ణంలో ఉల్లి నాటాను. అలాగే కాలిఫ్లవర్ పంట వేశాను. తుఫాన్ కారణంగా ఉల్లి మొక్క బయటకు రాకముందే కుళ్లిపోతోంది. కాలిఫ్లవర్ పంట చేతికందుతుందన్న సమయంలో పంట పాడవడంతో అప్పులు పాలవుతున్నాను. కర్రి చిన్నమ్మతల్లి. రైతు, రామభద్రపురం -
విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు
● ఏపీ గురుకుల ముఖ్య కార్యదర్శి ఎం.గౌతమి కురుపాం: విద్యార్థులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని, విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని ఆంధ్రప్రదేశ్ గురుకుల ముఖ్య కార్యదర్శి ఎం.గౌతమి హెచ్చరించారు. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను పార్వతీపురం ఐటీడీఏ పీఓ యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి శనివారం సందర్శించారు. మొదటిగా పాఠశాల సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం తరగతి గదులు, మరుగుదొడ్లు, డార్మిటరీ, కిచెన్, స్టాక్ రూమ్‌లను పరిశీలించారు. వంట పనివారికి కిచెన్ నిర్వహణలో పాటించాల్సిన పారిశుద్ధ్య పనులపై సూచనలు చేశారు. రెండు నెలల పాటు పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని ఎంపీడీఓ ఉమామహేశ్వరిని ఆదేశించారు. అదనపు మరుగుదొడ్లను తక్షణమే మంజూరు చేస్తున్నామని అదనపు మరుగుదొడ్లు, తరగతి గదులు డార్మిటరీ నిర్మాణానికి అవసరమైన చర్యలు త్వరలోనే తీసుకుంటామన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికల ఆరోగ్యం నిలకడగానే ఉందని, అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. విశాఖ కేజీహెచ్‌లో 22 మంది, పార్వతీపురం ఏరియా ఆస్పత్రిలో 85 మందికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయన్నారు. నలుగురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉండడంతో కేజీహెచ్‌లో అత్యవసర సేవల విభాగంతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై జిల్లా అధికారులు నిరంతర పర్యవేక్షణ ఉందన్నారు. పాఠశాలలో సమస్యలుంటే వెంటనే ఐటీడీఏ పీఓతోపాటు తనకు నేరుగా తెలపాలని ఆదేశించారు. ఈ సందర్శనలో ఆమె వెంట గిరిజన సంక్షేమశాఖ డీడీ కృష్ణవేణి, ప్రిన్సిపాల్ అనూరాధ, తహసీల్దార్ కె.జయ, గురుకుల కో ఆర్డినేటర్ సురేష్, పంచాయతీ ఈఓ కె.సురేష్ ఉన్నారు. -
చంద్రబాబు పథకాలన్నీ కాపీ పేస్ట్
సాక్షి, విశాఖపట్నం: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, నవ్యాంధ్రప్రదేశ్‌లో కలిపి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. సొంతంగా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా ప్రవేశపెట్టలేదని వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను, పొరుగు రాష్ట్రాల పథకాలను ఆయన కాపీ పేస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వ పాలనలో ఉత్తరాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా పోరాటాలకు సిద్ధమవుతున్నామని వారు స్పష్టం చేశారు. మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. కూటమి నేతలు ఉత్తరాంధ్ర వనరులను కొల్లగొడుతున్నారని, విశాఖలో సదస్సులు నిర్వహించి, పెట్టుబడులను మాత్రం అమరావతికి తరలిస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై ఉన్న ప్రేమతో చంద్రబాబు ఉత్తరాంధ్రపై వివక్ష చూపుతూ.. ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి బాట పట్టిన ఉత్తరాంధ్ర.. నేటి కూటమి పాలనలో భ్రష్టుపట్టిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 10 గంటలకు భీమిలి నియోజకవర్గం పెద్దిపాలెంలోని చెన్నా కన్వెన్షన్ సెంటర్లో పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు అమర్నాథ్, కేకే రాజు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి, విశాఖ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ వంటి కీలక అంశాలపై చర్చిస్తామన్నారు. మూలపేట పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులను ప్రారంభించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కో–ఆర్డినేటర్ కురసాల కన్నబాబు, శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, అరకు ఎంపీ జి.తనూజారాణి, మాజీ మంత్రులు, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరవుతారని తెలిపారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పోరాటం పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారని, వాటిలో పది కళాశాలలను ప్రైవేటుపరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్ర చేస్తోందని అమర్నాథ్, కేకే రాజు మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 9న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వైద్య కళాశాలను సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలిస్తారని వారు వెల్లడించారు. ఏర్పాట్ల పరిశీలన తగరపువలస: పెద్దిపాలెంలోని చెన్నా ఫంక్షన్‌హాలులో ఆదివారం జరిగే వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర విస్తృత స్థాయి సమావేశం ఏర్పాట్లను శనివారం విశాఖ, అనకాపల్లి జిల్లాల పార్టీ అధ్యక్షులు కేకే రాజు, గుడివాడ అమరనాథ్, పార్టమెంట్ ప్రధాన కార్యదర్శి తైనాల విజయకుమార్, భీమిలి సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య తదితరులు పరిశీలించారు. జెడ్పీటీసీ సభ్యుడు కోరాడ వెంకటరావు, ఎంపీపీ దంతులూరి వాసురాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గండ్రెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బంక సత్యం, మజ్జి వెంకటరావు, షిణగం దామోదరరావు, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు షిణగం రాంబాబు, రౌతు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర వనరులను దోచుకుంటున్నారు అమరావతిపై ప్రేమతో ఈ ప్రాంతానికి అన్యాయం స్పీకర్ పదవికి అయ్యన్న అనర్హుడు ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటానికి సిద్ధం వైఎస్సార్ సీపీ అనకాపల్లి, విశాఖ జిల్లాల అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు స్పీకర్ అయ్యన్నపై విమర్శలు స్పీకర్ పదవికి అయ్యన్నపాత్రుడు అనర్హుడని అమర్నాథ్, కేకే రాజు అన్నారు. ‘అయ్యన్నలో కనీసం ఒక్క మంచి లక్షణం కూడా లేదు. అబద్దాలు, అర్థం లేని మాటలు మాట్లాడటం ఆయన నైజం’అని విమర్శించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయ్‌కుమార్, చింతలపూడి వెంకట్రామయ్య పాల్గొన్నారు. -
రైతన్నను ఆదుకోవాలి
● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర సాలూరు: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర డిమాండ్ చేశారు. మండలంలోని తోణాం, కందులపదం పంచాయతీల్లో నేలకొరిగిన అరటి, మొక్కజొన్న పంటలను బాధిత రైతులతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. పంట పెట్టుబడి, నష్టం వివరాలను రైతులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని జిల్లా ఇన్చార్జి మంత్రి, వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును కోరారు. లేదంటే రైతులు అప్పుల్లో కూరుకుపోతారన్నారు. అందరికీ అన్నంపెట్టే రైతును ఆదోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గత ప్రభుత్వం వైఎస్సార్ ఉచిత పంటల బీమాతో విపత్తుల సమయంలో రైతన్నను ఆదుకునే విషయాన్ని గుర్తుచేశారు. ఆయన వెంట రెడ్డి సురేష్, సువ్వా భరత్‌శ్రీనివాస్, మువ్వల ఆదయ్య, సువ్వాడ రామకృష్ణ, కన్నంనాయుడు, సంతోష్, ఆనందరావు, కృష్ణ, నాగేశ్వరరావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
ఎవరిదీ నిర్లక్ష్యం?
–8లోకూరగాయల రైతు కుయ్యో..మొర్రో..! బంగాళాఖాతంలో ఏర్పడిన వరుస తుఫాన్ల కారణంగా కురుస్తున్న వర్షాలతో కూరగాయ రైతు కుదేలయ్యాడు. క్షలు నిర్వహించగా, పచ్చకామెర్లగా తేలింది. ఇటీవల దసరా రోజున జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికే దాదాపు 135 మంది విద్యార్థులు వైద్యకోసం వచ్చారు. వీరిలో గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థినులు 85 మంది వరకు ఉన్నారు. గురుకుల, ఏకలవ్య పాఠశాలల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా.. 24 మందికి పచ్చకామెర్లగా గుర్తించారు. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు కురుపాం పీహెచ్సీ, జిల్లా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న నలుగురు విద్యార్థినులకు విశాఖ కేజీహెచ్‌లో చికిత్స అందిస్తున్నారు. ఒకేసారి ఇంతమంది పిల్లలు అనారోగ్యం పాలవ్వడం.. ఇద్దరు మృతి చెందడంపై గిరిజన, ప్రజాసంఘాల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణలోపమే దీనికి కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడుగడుగునా నిర్లక్ష్యం... ఆశ్రమ, సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. అపరిశుభ్ర వాతావరణం, కలుషితమైన తాగునీరు, విద్యార్థులకు సరైన ఆహారం అందకపోవడం వల్ల ఎక్కువగా విద్యార్థులు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనికితోడు ఏజెన్సీ ప్రాంతంలో దోమల కారణంగా మలేరియా, డెంగీ వంటివి అధికంగా సంభవిస్తున్నాయి. వ్యాధి మొదటి దశలోనే గుర్తించి, చికిత్స అందించేలా ఆశ్రమ పాఠశాలల్లో అవసరమైన వైద్యసిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. కురుపాంలో కలుషిత నీరు, ఆహారం వల్లే ఒకేసారి అనేకమంది పచ్చకామెర్ల బారిన పడి ఉంటారని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుల నియామకం
పార్వతీపురం రూరల్: వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుల నియామకం జరిగింది. ఈ నేపథ్యంలో పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన జమ్మాన ప్రసన్నకుమార్, సవరపు జయమణిలను స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్లుగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించండి పార్వతీపురం రూరల్: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిసారించి, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి ఆదేశించారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శనివారం సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని పంచాయతీల్లో తాగునీరు క్లోరినేషన్ చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. పల్లెలు పరిశుభ్రంగా ఉండేలా మండ లాధికారులు పర్యవేక్షించాలన్నారు. టెలికాన్ఫరెన్స్‌లో డీఆర్వో కె.హేమలత, మున్సిపల్ కమి షనర్లు, డీపీఓ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు తహసీల్దార్లు పాల్గొన్నారు. నేను ఆటో డ్రైవర్ కొడుకునే... సీతంపేట: నేను ఆటో డ్రైవర్ కొడుకునే.. ఆటో డ్రైవర్ల కుటుంబ పరిస్థితులు, కష్టాలు తెలుసు .. ఆటో నడుపుతూనే మా నాన్న నన్ను చదివించారు.. మీరు కూడా ప్రభుత్వ రాయితీలు, పథకాలు సద్వినియోగం చేసుకుంటూ పిల్లలను చక్కగా చదివించాలని పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నా థ్ ఆటో డ్రైవర్లకు సూచించారు. ఐటీడీఏలో జరిగిన ఆటో డ్రైవర్ల సేవా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఆటో నడుపుతూ వచ్చి న డబ్బును కుటుంబ సంక్షేమంతో పాటు పిల్ల ల చదువుకు వెచ్చించాలన్నారు. రవాణా శాఖ నిబంధనలు సక్రమంగా పాటించాలన్నారు. పాలకొండ నియోజకవర్గంలోని 1251 మంది ఆటోడ్రైవర్లకు రూ.1,87,65,000 నమూన చెక్కు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి, సవర తోట ముఖలింగం, నిమ్మల నిబ్రం, ఎం.విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. పాలకొండ రూరల్: జీఓ నంబర్ 85 రద్దుతో పాటు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోరుతూ పీహెచ్సీ వైద్యులు సమ్మెబాట పట్టారు. చలో విజయవాడ కార్యక్రమం చేపట్టడంతో గడిచిన మూడు రోజులుగా పీహెచ్‌సీల్లో వైద్యులేక రోగులకు సేవలు అందడంలేదు. అధిక రక్తపోటు, మధుమేహం తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతూ నిత్యం పీహెచ్‌సీలకు వెళ్లే రోగుల కష్టాలు వర్ణణాతీంగా మారాయి. 104 సేవలు దూరమయ్యాయి. జిల్లాలోని 15 మండలాల్లో సేవలందించే 29 104 వాహనాలు పీహెచ్‌సీలకే పరిమితం కావ డంతో పల్లెప్రజలు ఆందోళన చెందుతున్నారు. అట్టహాసపు సభకు ఆటోడ్రైవర్ల గైర్హాజరు కూటమి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రచార హోరుకు క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల నుంచి స్పందన కరువైందనేందుకు ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. పార్వతీపురంలో శనివారం రాష్ట్ర వ్యవసాయ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమానికి ఆ వర్గం నుంచే స్పందన కరువైంది. కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. జనం లేకపోవడంతో మాట్లాడేందుకు నాయకులు సిగ్గుపడిపోయారు. కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి జిల్లాలో 5,217 మంది లబ్ధిదారులకు ఆటో డ్రైవర్ల సేవ కింద రూ. 7.82 కోట్లు ప్రయోజనం కల్పిస్తున్నట్టు వెల్ల డించారు. సీ్త్రశక్తితో ఉపాధి లేకుండా చేసి ఏడాదిన్నర తర్వాత అరకొర సాయం చేసి కూటమి నేతల ప్రచార ఆర్భాటం చేయడంపై లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. – పార్వతీపురం రూరల్ -
మంచినీరు కరువాయె..
● నాడు ప్రభుత్వ బడుల్లో మినరల్ వాటర్ ప్లాంట్లతో తాగునీరు ● నేడు నిర్వహణ లేక మూతపడిన ప్లాంట్లు.. ● విద్యార్థులకు అందని సురక్షిత నీరు పార్వతీపురం రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యానికి రక్షణ కరువైంది. సురక్షితమైన తాగునీరు అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. తల్లిదండ్రులు ధైర్యంగా బడులకు పిల్లలను పంపించే రోజుల నుంచి ఆందోళన చెందాల్సిన పరిస్థితులు నేడు దాపురించాయి. నాడు–నేడు పథకం నిధులతో ప్రభుత్వ బడులు, సంక్షేమ, గురుకుల పాఠశాలలకు మెరుగైన వసతులు కల్పిస్తూ విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందించేందుకు రూ.లక్షల వ్యయంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంట్లు నేడు నిర్వహణలేక మూలకు చేరాయి. విద్యార్థులు అందుబాటులో ఉన్న కలుషిత నీటిటి తాగుతూ వ్యాధుల బారిన పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. -
7న చలో విజయవాడ
● పోస్టర్లు ఆవిష్కరించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు వీరఘట్టం: విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైన ప్రభుత్వం తీరును ఎండగట్టేందుకు ఉపాధ్యాయ సంఘాలు ఏకతాటిపైకి వచ్చాయి. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ నెల 7న చలో విజయవాడ కార్యక్రమం ద్వారా పోరుబాటకు సమర శంఖారావాన్ని పూరించాయి. ఈ మేరకు శనివారం వీరఘట్టం ఎమ్మార్సీ వద్ద చలో విజయవాడ పోస్టర్లను ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆవిష్కరించారు. సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీలను ఏడాదిన్నరగా విస్మరించడంతో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పోరుబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలు చేపడతామని ఫ్యాప్టో నాయకులు మజ్జి పైడిరాజు, ఎం.మురళీ, ఆర్.ధనుంజయనాయుడు, ఎ.సూర్యనారాయణ, వి.అన్నాజీ, నరహరి తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 20 డిమాండ్లతో కూడిన కరపత్రాలను ఆవిష్కరించారు. గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద నీటి ప్రవాహం క్రమేపీ తగ్గుముఖంపడుతోంది. శుక్రవారం ఉదయం ప్రాజెక్టులోకి 44వేల క్యూసెక్కుల వరదనీరు చేరగా.. శనివారం సాయంత్రం నాటికి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పడుతూ 11,637 క్యూసెక్కులకు చేరింది. అధికారులు స్పిల్‌వే వద్ద మూడు గేట్లను ఎత్తివేసి 10,617 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడిచిపెట్టారు. -
అచ్చెన్నా.. ఆటో డ్రైవర్లు రానన్నారా?
పార్వతీపురం మన్యం జిల్లా: ఆటో డ్రైవర్లకు దసరా కానుక అంటూ ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమానికి స్పందన కరువైంది. ప్రభుత్వ చర్యలతో విసిగిపోయిన ఆటో డ్రైవర్లు.. సభలకు రావడానికి ఇష్టపడటం లేదని విషయం మంత్రి అచ్చెన్నాయుడు చేపట్టిన పార్వతీపురం సభలో తేటతెల్లమైంది. బలవంతంగా ఆటో డ్రైవర్లను ఆయా సభలకు తరలించినా కొన్ని చోట్ల అది సాధ్యం కాలేదు. అది కూడా తాను టీడీపీలో కీలక నేతగా ఫోజులిచ్చే అచ్చెన్న ‘ ఆటో డ్రైవర్ల సేవలో’ సభలో ఎటు చూసినా టీడీపీ శ్రేణులే కనిపించాయి. మరొకవైపు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఆటో డ్రైవర్ల కోసం ఏర్పాటు చేసిన కుర్చీలు ఖాళీగా, బోసిగా మెరిసిపోయాయి. రూ. 15వేలను ప్రభుత్వం ఇస్తామని సభకు రమ్మని పిలిచినా ఆటో డ్రైవర్ల నుంచి సరైన స్పందన కాదు కదా.. కనీస స్పందన కూడా రాకపోవడం గమనార్హం. ఆ సభలో ార్యకర్తలు తప్ప ఆటో డ్రైవర్లు లేకపోవడంతో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే విజయచంద్రలు అవాక్కయ్యారు.చంద్రబాబు చేపట్టిన ఈ కార్యక్రమం ఒక దగా, మోసం అంటూ ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్స్ ఫెడరేషన్ విమర్శల గుప్పించిన నేపథ్యంలో చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘ఆటో డ్రైవర్ల సేవలో’ కార్యక్రమం వార్తల్లో నిలిచింది. ఆటో డ్రైవర్లకు రూ. 15 వేలు ఇస్తామని చెబుతున్నప్పటికీ ఇలా విమర్శలు రావడం ఏంటనేది ఒకటైతే, మంత్రి అచ్చెన్న సభలో ఆటో డ్రైవర్లు కనుచూపుమేర కనిపించకపోవడం కూడా హాట్ టాపిక్ అయ్యింది. ఇదీ చదవండి:ఇది దసరా కానుక కాదు.. దగా, మోసం: ఆటో కార్మిక సంఘం ఫైర్ -
వైఎస్సార్సీపీ శ్రేణులకు అండగా డిజిటల్ బుక్
సాలూరు: రాష్ట్రంలో అమలవుతున్న రెడ్‌బుక్ రాజ్యాంగంలో అన్యాయానికి గురవుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులకు, ప్రజలకు రక్షణగా, అండగా ఉండేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ తీసుకువచ్చారని ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఉప ముఖ్య మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. పట్టణంలోని తన స్వగృహం వద్ద పార్టీ నేతలతో కలిసి డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ పోస్టర్లను శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, నాటి ప్రభుత్వంలో పని చేసిన అధికారులపై అక్రమ కేసులు పెడుతూ తీవ్ర ఇబ్బందులు పెడుతుందన్నారు. అక్రమ కేసులపై కోర్టులు మొట్టికాయలు వేస్తున్న ప్రభుత్వ పెద్దల తీరు మారడం లేదన్నారు. బాధితులు డిజిటల్ బుక్‌లో తగు ఆధారాలతో నమోదు చేయాలన్నారు. అటువంటి వారి వివరాలను డిజిటల్ బుక్ డేటా బేస్‌లో భద్రపరచడం జరుగుతుందన్నారు. తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెడతామన్నారు. కూటమి పాలనలో అన్యాయానికి గురవుతున్న ప్రతీ ఒక్కరికి డిజిటల్ బుక్‌తో అండగా ఉంటామన్నారు. రానున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామన్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఉపముఖ్యమంత్రిగా వివిధ హోదాల్లో తాను ఏనాడూ ఏ అధికారిని చట్ట వ్యతిరేకంగా నడుచుకోమని చెప్పలేదని పేర్కొన్నారు. మంత్రి సంధ్యారాణి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై ఎలా మాట్లాడుతున్నారో అందరూ గమనిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ పార్లమెంట్ కార్యదర్శి, మక్కువ జెడ్పీటీసీ మావుడి శ్రీనువాసులనాయుడు, పార్టీ పట్టణాధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే అంత నిర్లక్ష్యమా?
● డీఎంహెచ్‌వోను అడ్డుకున్న గిరిజన విద్యార్థుల తల్లిదండ్రులు ● గురుకుల పాఠశాల ముందు ఆందోళనకురుపాం: గిరిజన విద్యార్థుల ప్రాణాలంటే మీకు అంత నిర్లక్ష్యమా..! ప్రాణాలు పోతున్నా స్పందించరా..? వసతిగృహంలో అసలేం జరుగుతుంది.. కొన్న రోజులుగా విద్యార్థులు వరుసగా అనారోగ్యానికి గురవుతున్నా ఇలాగేనా.. స్పందిస్తారా... మీ పిల్లలు అనారోగ్యం బారిన పడితే ఇలాగే స్పందిస్తారా? అంటూ.. కురుపాం గురుకుల పాఠశాల, కళాశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు ఐటీడీఏ అధికారుల తీరుపై ధ్వజమెత్తారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలపై పర్యవేక్షణకు శుక్రవారం వచ్చిన డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావును వారు అడ్డుకున్నారు. పిల్లలు అనారోగ్యం, మరణాలపై పూర్తి సమాచారం ఇస్తేనే లోపలికి వెళ్లాలని ఐటీడీఏ అధికారుల తీరును ఎండగడుతూ నిరసన తెలిపారు. గిరిజన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం సరికాదన్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ పిల్లలను ఉన్నత చదువుల కోసం సాలూరు, పార్వతీపురం, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం తదితర దూర ప్రాంతాల నుంచి గురుకుల పాఠశాలలో చేర్పిస్తే తిరిగి అనారోగ్యంతో తమ పిల్లలను అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో అనారోగ్యం బారిన పడి ఎంతకీ తగ్గకపోవడంతోనే తాము తమ పిల్లలను వెంట తీసుకొని వెళ్తున్నామని సరైన వైద్యం, పర్యవేక్షణ ఉంటే ఎందుకు తీసుకువెళ్తామని ప్రశ్నించారు. విద్యార్థులు సెలవులకు వెళ్లిన తరువాతే అనారోగ్యం బారిన పడ్డారని తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. -
వ్యక్తి ఆత్మహత్య...
విజయనగరం క్రైమ్ : నగరంలోని సూర్యనగర్‌లో మద్యానికి బానిస అయిన ఓ వ్యక్తి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించి హెచ్‌సీ అప్పలనాయుడు తెలిపిన వివరాలు.. అప్పలనాయుడు(38) మద్యానికి బానిసై అప్పుల పాలయ్యాడు. అదే సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు. చివరకు అప్పులు బాధ తాళలేక ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు అన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్టు హెచ్‌సీ తెలిపారు. సీతానగరం: మండలంలోని కృష్ణారాయపురం గ్రామానికి చెందిన పెరుమాళి సింహాచలం(57) మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. కృష్ణారాయపురం గ్రామానికి చెందిన సింహాచలం బుధవారం బొబ్బిలిలోని కుమార్తె ఇంటికి త్వరలో నిర్వహించనున్న నందెన్న ఉత్సవాలపై మాట్లాడేందుకు వెళ్లాడు. అక్కడ పిల్లలు తన మాట వినడం లేదని మనస్తాపానికి గురయ్యాడు. అక్కడి నుంచి స్వగ్రామం వస్తుండగా మార్గమధ్యలో కొన్న పురుగుల మందు తాగి ఇంటికి వచ్చాడు. ఇంటికొచ్చిన కొద్ది సేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భార్య గౌరీ, కుమారుడు కలిసి చికిత్స నిమిత్తం పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. భార్య పెరుమాళి గౌరీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఎం.రాజేష్ తెలిపారు. పార్వతీపురం రూరల్: బహిర్భూమికని వెళ్తూ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన పార్వతీపురం మండలం నర్సిపురం వద్ద చోటు చేసుకుంది. శుక్రవారం ఉదయం 8గంటల సమయంలో నర్సిపురం రైల్వే స్టేషన్ సమీపంలో గల ఎల్సీ గేటు వద్ద గల ఇదే గ్రామానికి చెందిన చందాన సింహాచలం (59) పట్టాలు దాటుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో బలమైన గాయాలు తగిలి అక్కడకక్కడే మృతి చెందినట్టు జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ బి.ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. రామభద్రపురం: మండలంలోని జన్నివలస గ్రామానికి చెందిన వ్యక్తి మందు అనుకొని పురుగుల మందు తాగి మృతి చెందిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. జన్నివలస గ్రామానికి చెందిన పత్తిగుళ్ల రామకృష్ణ (47) మండల కేంద్రంలోని ఆల్టాటెక్ సిమెంట్ గోదాంలో కళాసీగా పని చేస్తున్నాడు. ఈ నెల 28న మద్యం సీసా కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాడు. ముందు రోజు పత్తి పంటకు పురుగుల మందు పిచికారీ చేసి మిగిలిన మందు దగ్గర మద్యం సీసా పెట్టాడు. అదే రోజు రాత్రి 9 గంటల సమయంలో మద్యం సీసా అనుకొని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రధమ చికిత్స నిమిత్తం సాలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. భార్య సింహాచలం ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి.ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయనగరం క్రైమ్ : విజయనగరం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బావిలో నీళ్లు తొడేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు జారి బావిలో పడి మృతి చెందారు. ఎస్ఐ అశోక్ శుక్రవారం తెలిపిన వివరాలు.. బియ్యాలపేటకు చెందిన చుక్క ఈశ్వరరావు(37) కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇంటికి అవసరం నిమిత్తం నీళ్ల కోసం గురువారం సమీపంలో ఉన్న బావి వద్దకు వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు జారి బావిలో పడిపోయాడు. నీళ్ల కోసం వెళ్లిన భర్త ఎంతకు ఇంటికి రాకపోవడంతో భార్య అప్పయ్యమ్మ బావి వద్దకు వెళ్లింది. అక్కడ బావిలో ఈశ్వరరావు మృతదేహమై కనిపించాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కురుపాం: మండలంలో వీచిన ఈదురు గాలులు, భారీ వర్షానికి ఉదయపురం పంచాయతీలోని ఉదయపురం కాలనీకి చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లపై శుక్రవారం ఉదయం మట్టి గోడ కూలడంతో కుంబురిక అరవింద్(23) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అన్నయ్య వినయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వినయ్‌ను స్థానికులు భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. సంఘటనపై నీలకంఠాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేగిడి: మండల పరిధిలోని ఉణుకూరు గ్రామంలో శుక్రవారం వేకువజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు అందించిన సమాచారం మేరకు గ్రామానికి చెందిన వంజరాపు సుబ్బినాయుడు (65) వేకువజామున 4గంటల సమయంలో కాగితాపల్లి వైపు బహిర్భూమికి వెళ్తున్నాడు. అదే సమయంలో రాజాం నుంచి వచ్చిన వాహనం ఢీకొనడంతో సంఘటనా స్థలంలోనే బోర్లా పడ్డాడు. కొంత సమయం అటుగా ఎవరూ వెళ్లకపోవడంతో గుర్తించలేదు. దీంతో గ్రామానికి చెందిన కొంతమంది అటుగా వెళ్లి బోర్లా పడి ఉన్న వ్యక్తిని చూసే సరికి తీవ్రగాయాలతో పడి ఉన్నాడు. అప్పటికే మృతి చెందినట్టు గుర్తించారు. మృతుడు సుబ్బినాయుడుకు భార్య లక్ష్మి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో భర్త మృతి చెందడంతో భార్య బోరున విలపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సీతంపేట: దసరా పండగ పూట సరదాగా గడుపుదామని హైదారాబాద్ నుంచి స్వగ్రామమైన పాలకొండ వచ్చి అక్కడ నుంచి సీతంపేట జగతపల్లి వ్యూ పాయింట్ చూడడానికి వచ్చిన పాలకొండకు చెందిన సాహిని సాయికృష్ణ (28) ద్విచక్ర వాహనం ఘాట్రోడ్లో అదుపుతప్పి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాలు పరిశీలిస్తే.. హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న మృతుడు కొద్ది రోజుల కిందట స్వగ్రామమైన పాలకొండకు వచ్చాడు. తన స్నేహితులతో కలసి మండలంలోని జగతపల్లి వ్యూ పాయింట్‌కు వచ్చారు. వేర్వేరు ద్విచక్ర వాహనాలపై వెళ్లిన వీరు తిరుగు ప్రయాణంలో బుధవారం సాయంత్రం 6 గంటల సమయంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి జగతపల్లి మలుపు వద్ద బోల్తా పడింది. భూరి అభిలాష్ డ్రైవ్ చేస్తుండగా వెనుక ఉన్న సాయికృష్ణకు తలపై తీవ్ర గాయమవ్వడంతో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్య సిబ్బంది శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం దసరా రోజున మృతి చెందినట్టు ఎస్ఐ వై.అమ్మన్నరావు తెలిపారు. మృతునికి తల్లి, సోదరుడు వంశీకృష్ణ ఉన్నారు. ఈయన మృతితో పాలకొండలోని కోటదుర్గమ్మ కాలనీలో విషాదం నెలకొంది. పండగపూట ప్రమాదవశాత్తు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరై విలపిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతదేహానికి ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారన్నారు. కొత్తవలస : మండలంలోని కంటకాపల్లి గ్రామం సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారానికి చెందిన కాంట్రాక్టు కార్మికుడు తమటపు రాము(54) శుక్రవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చోటు చేసుకొంది. మృతుడు కుటుంబీకులు, సీఐ షణ్ముఖరావు తెలిపిన వివరాలు.. మండలంలోని బలిఘట్టాం గ్రామానికి చెందిన తమటపు రాము గతంలో జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారంలో పని చేసేవాడు. కర్మాగారాన్ని గత ఏడాది అర్ధాంతరంగా మూసేయండంతో కంటకాపల్లి గ్రామ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఒక కాంట్రాక్టుర్ వద్ద హౌస్ కీపింగ్ పనుల నిర్వహణకు జాయిన్ అయ్యాడు. గురువారం దసరా పండగ అయినప్పటికీ కర్మాగారానికి రాము వెళ్లాడు. మధ్యాహ్నం కర్మాగారం సమీపంలో గల చెరువులో పడి మృతి చెందాడు. రాము ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు సమీపంలో వెతకడం ప్రారంభించారు. శుక్రవారం తెల్లవారుజామున కర్మాగారం సమీపంలో గల చెరువులో శవమై తేలాడు. దీంతో కుటుంబ సభ్యులు గుర్తించి మృతదేహాన్ని ఒడ్డుకు చేర్ఛారు. కర్మాగారంలో విధులకు హాజరై అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో బంధువులు భోరుమని విలపించారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ షణ్ముఖరావు తెలిపారు. క్రైమ్ కార్నర్ -
పిల్లల్లో పెరుగుతున్న ఊబకాయం..!
అవగాహన కల్పిస్తున్నాం... ఐసీడీఎస్ పరిధిలో 239 మంది పిల్లలు ఊబకాయంతో బాధపడుతున్నారు. దీని బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి నెల రోజులు పాటు నిర్వహించే రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో గర్భిణులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నాం. సమతుల్యమైన ఆహారాన్ని అందించాలని చెబుతున్నాం. పిల్లలకు బయట ఆహారం కాకుండా ఇంటి వద్దే తయారు చేసి పెట్టాలని తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. – టి.విమలారాణి, పీడీ, ఐసీడీఎస్ విజయనగరం ఫోర్ట్: బర్గర్లు, పిజ్జాలు, పానీపూరీ, నూడిల్స్ వంటి జంక్ ఫుడ్స్ తినడానికి ప్రస్తుతం ఉన్న పిల్లలు ఆసక్తి చూపుతున్నారు. పిల్లలు మారం చేస్తున్నారని పిల్లలు ఏది అడిగితే అది తల్లిదండ్రులు కొని ఇచ్చేస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దవారు కూడా జంక్ ఫుడ్స్ తింటున్నారు. ఫలితంగా పిల్లలు ఊబకాయం బారిన పడుతున్నారు. ఇది అనేక అనర్ధాలకు దారి తీస్తుంది. ఊబకాయం రావడం వల్ల పిల్లలు అనేక వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది. ఇటీవల చిన్న పిల్లలు కూడా గుండె పోటుకు గురవుతున్నారు. మరి కొంతమంది షుగర్, బీపీ, గుండె జబ్బులు బారిన పడుతున్నారు. ఊబకాయంతో ఆపసోపాలు చిన్న వయసులోనే ఊబకాయం రావడంతో పిల్లలు ఆపసోపాలు పడుతున్నారు. చిన్నపాటి పరుగు తీసినా అలసిపోవడం, ఆయాసంతో ఇబ్బంది పడుతున్నారు. జంక్ ఫుడ్స్ తినడం వల్ల పిల్లలు ఎక్కువగా ఊబకాయం బారిన పడుతున్నారు. గతంలో పిల్లలకు ఇంట్లోనే తయారు చేసి పిండి వంటలు పెట్టేవారు. నువ్వు ఉండలు, వేరుశనగ ఉండలు వంటి ఐరన్ సమృద్ధిగా ఉండేవి పెట్టేవారు. ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా పెట్టేవారు. దీంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండేవారు. దీనికి తోడు పిల్లలు ఎక్కువగా ఆటలు ఆడుకునే వారు. దీంతో ఎంతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా ఉండేవారు. ఇప్పడు పిల్లల పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. పిల్లల్లో శారీరక శ్రమ ఉండడం లేదు. మొబైల్ ఫోన్లుకు అతుక్కుపోతున్నారు. దీనివల్ల వారు ఊబకాయం బారిన పడుతున్నారు. శరీరంలో అధిక కొవ్వు నిల్వలు ఉండడం వల్ల ఊబకాయం వస్తుంది. ఉండాల్సిన బరువు కంటే పిల్లలు ఎక్కువ బరువు ఉంటారు. శరీరానికి అవసరమైన దాని కంటే ఎక్కువ కేలరీలను ఆహారం ద్వారా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. అధిక కొవ్వులు, స్వీట్స్, ప్రాసెస్ చేసిన ఆహారాలు తీపి పానీయాలు వంటి అనారోగ్యకరమైన ఆహార పదార్ధాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల అదనపు కేలరీలు శరీరంలో కొవ్వుగా పేరుకుపోతాయి. ఉబకాయం వల్ల వచ్చే అనర్ధాలు ఊబకాయం ఉన్న వాళ్లు మెట్లు ఎక్కడానికి, నడవడం వంటివి చేసినా కూడా ఊపిరి అందక ఇబ్బంది పడతారు. శరీరం అధిక బరువును మోయడానికి ఎక్కువ శక్తిని వినియోగించడం వల్ల తరుచుగా అలసటగా అనిపించడం, సాధారణ పనులు చేయడానికి కూడా శక్తి లేనట్టు అనిపిస్తుంది. అధిక శరీర బరువు మోకాళ్లు తుంటి పాదాలు, వెన్నెముక వంటి వాటిపై అసాధారణ ఒత్తిడిని కల్గిస్తుంది. దీని వల్ల కీళ్లు అరుగుదలకు దారి తీసి తీవ్రమైన నొప్పులకు కారణమవుతుంది. చర్మం మడతలలో మెడ, గజ్జలు, చంకలు తేమ పేరుకు పోయి దద్దుర్లు, దురద, ఇన్ఫెక్షన్లు వంటి చర్మ సమస్యలు తరచుగా వస్తాయి. ఊబకాయం వల్ల మధుమేహాం, గుండె జబ్బులు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. పెద్దపేగు, రొమ్ము, గర్భాశయ పొర, కిడ్నీ, కాలేయ కేన్సర్లు వచ్చే అవకాశం ఉంది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో.. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 2499 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 239 మంది ఊబకాయం ఉన్న పిల్లలు ఉన్నారు. భోగాపురం, విజయనగరం, రాజాం, చీపురుపల్లి, బొబ్బిలి, వియ్యంపేట, ఎస్.కోట, బాడంగి, గంట్యాడ, గజపతినగరం, గరివిడి ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. పండ్లు, కూరగాయాలు తీసుకోవాలి ఊబకాయం బారిన పడకుండా పండ్లు, కూరగాయాలు, తృణ ధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. స్వీట్స్, కొవ్వు, నూనె పదార్ధాలు తగ్గించాలి. పానీపూరీ, నూడిల్స్, పిజ్జా, బర్గర్లు తినకూడదు. ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ మోతాదులో ఆహారం తీసుకోవాలి. రోజులో కనీసం 30 నుంచి 60 నివిషాలు వ్యాయామం చేయాలి. ఊబకాయం వల్ల వ్యాధులు బారిన పడే అవకాశం తక్కువ వయసులో బీపీ, షుగర్ గుండెపోటుకు గురయ్యే అవకాశం అంగన్వాడీ కేంద్రాల పరిధిలో 239 మంది ఊబకాయం ఉన్న పిల్లలు పెద్దవారిలోనూ అదే పరిస్థితి -
బాలికల ఆరోగ్యంపై కలెక్టర్ ఆరా
పార్వతీపురంటౌన్: జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతున్న కురుపాం బాలికల గురుకుల పాఠశాల/కళాశాల విద్యార్థినులను కలెక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. బాలికలు దసరా సెలవులకు ఇంటికి వెళ్లిన తర్వాత పచ్చకామెర్ల బారిన పడినట్టు ఆయన తెలిపారు. గురుకులంలో చదువుతున్న బాలికలందరికీ వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, అవసరమైన వారిని ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపారు. అస్వస్థతకు గురైన 50 మందిలో 20 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు వెల్లడించారు. ఇద్దరు విద్యార్థినులను మెరుగైన చికిత్సకోసం విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించామన్నారు. బాలికలు అనారోగ్యానికి గురికావడానికి కారణాలు తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించామని తెలిపారు. వారిచ్చే నివేదిక ఆధారంగా ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పా రు. ఆయన వెంట జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ సూపరింటెండెంట్ నాగ శివజ్యోతి, డీసీహెచ్ఎస్ నాగభూషణం, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అరటి రైతు కుదేలు
వీరఘట్టం: మండల వ్యాప్తంగా గురువారం మధ్యాం కురిసిన భారీ వర్షానికి దశుమంతపురం, కంబరవలస, చిట్టపులివలస, కంబర, నడిమికెల్ల, విక్రమపురం, నడుకూరు, వీరఘట్టం గ్రామాల్లో సుమారు 850 ఎకరాల్లో అరటితోటలు, 100 ఎకరాల్లో మొక్కజొన్న, 250 ఎకరాల్లో వరి పంటకు నష్టంవాటిల్లింది. సుమారు రూ.2.50 కోట్లు నష్టం ఉంటుందని అంచనా. పంట నష్టం అంచనా వేస్తు న్నట్టు తహసీల్దార్ ఎ.ఎస్.కామేశ్వరరావు తెలిపా రు. గాలివానతో నాశనమైన పంటలను రైతు సంఘం నాయకుడు బుడితి అప్పలనాయుడు శుక్రవారం పరిశీలించారు. అరటి పంట నష్టపోయిన రైతుకు ఎకరాకు రూ.లక్ష చొప్పున పరిహారం అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
వైద్యుల సమ్మెబాట
● ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిలిచిన వైద్య సేవలుసాక్షి, పార్వతీపురం మన్యం: వైద్యులు సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా విధులను బహిష్కరించారు. గ్రామీణ ప్రజలకు వైద్య సేవలందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులందరూ సమ్మె బాట పట్టారు. ఓపీ, అత్యవసర సేవలు కూడా నిలిపి వేశారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా.. మరో చోట నుంచి వైద్యులను డిప్యుటేషన్ మీద పంపినా.. ఫలితం లేకపోయింది. జిల్లాలో పల్లె వైద్యం పూర్తిగా పడకేసింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత నెల 26 నుంచి నిరసనలు.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు పీజీ కోటా పెంచాలని, ఏజెన్సీ అలవెన్సులు ఇవ్వాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలని పీహెచ్సీ వైద్యులు డిమాండ్ చేస్తున్న విషయం విదితమే. ఆ మేరకు గత నెల 26 నుంచి వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల డిమాండ్ల పట్ల కూటమి ప్రభుత్వం నుంచి సానుకూలత లేకపోవడంతో బుధవారం పూర్తిగా విధులను బహిష్కరించారు. కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. గురువారం విజయవాడ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తారు. వైద్య సేవలకు ఆటంకం మన్యం జిల్లాలో 37 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ పని చేస్తున్న వైద్యాధికారులు సమ్మెబాట పట్టడంతో ఆయా గ్రామాల్లో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడింది. జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. విజయనగరం, పార్వతీపురం జిల్లాల నుంచి ప్రభుత్వ వైద్య కళాశాల, ఆయుష్, ఇతర విభాగాల నుంచి 35 మంది వైద్యులను డిప్యూటేషన్ మీద నియమించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, 24 గంటలూ సిబ్బందిని అక్కడ అందుబాటులో ఉంచి పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వం చేసిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిగా విఫలమయ్యాయి. పీహెచ్‌సీలు పూర్తిస్థాయి సేవ లు అందించలేకపోతున్నాయి. ప్రత్యామ్నాయంగా పంపిన వైద్యులు కొన్ని పీహెచ్‌సీలకు మాత్రమే హాజరై, అక్కడ కూడా కేవలం 30 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోయారు. దీంతో ఎక్కడ చూసినా ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి.శాంతియుతంగానే కష్టాన్ని చెప్పుకుంటున్నాం మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నాం. మాకు ఇస్తామన్న ఎటువంటి అలవెన్సులూ ఇవ్వడం లేదు. ప్రమోషన్లలోనూ నష్టపోతున్నాం. ఏడాదిగా చూస్తాం, చేస్తాం అంటున్నారు. మా కష్టాన్ని శాంతియుతంగానే ప్రభుత్వానికి చెప్పుకుంటున్నాం. న్యాయం చేస్తారని భావిస్తున్నాం. – డాక్టర్ స్వాతి, గుమ్మలక్ష్మీపురం ఆరోగ్య కేంద్రంగతేడాది నుంచి పోరాటం చేస్తున్నాం మా డిమాండ్ల పరిష్కారం కోసం గత ఏడాది కూడా పోరాటం చేశాం. ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. టైం బాండ్ ప్రమోషన్లు, పీజీ కోటా వెయిటేజీ పెంచాలన్న ప్రధాన డిమాండ్లతో సమ్మె చేస్తున్నాం. ప్రభుత్వం దిగి వచ్చేవరకూ పోరాటం ఆపేది లేదు. – డాక్టర్ చాందిని, కుసిమి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కాలయాపన చేస్తున్నారు.. మా డిమాండ్లను పరిష్కరిస్తామని గత ఏడాది మాట ఇచ్చారు. ఇప్పటికీ అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఇన్ సర్వీసు కోటాను 30 నుంచి 15 శాతానికి తగ్గించారు. దానిని పునరుద్ధరించాలి. అలవెన్సులు పెండింగులో ఉంచారు. గిరిజన ప్రాంతాల్లో పని చేస్తున్నా.. ప్రత్యేక అలవెన్సులు ఏమీ లేవు. ప్రమోషన్లు కూడా లేక నష్టపోతున్నాం. – డాక్టర్ అజయ్, తోణాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎన్నోసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.. ఏడాది కాలంగా ఎన్నోసార్లు ప్రభుత్వానికి, అధికారులకు మా డిమాండ్లను వివరించాం. స్పందించడం లేదు. పీజీ కోటా, ప్రమోషన్లు, సంచార చికిత్స, గిరిజన ప్రాంత అలవెన్సులు అడుగుతున్నాం. ఏ ఒక్క విషయంలోనూ ప్రభుత్వం నుంచి సానుకూలత రావడం లేదు. ఈ నేపథ్యంలో గత నెల 26 నుంచి వివిధ రూపాల్లో నిరసన తెలియజేస్తున్నాం. శుక్రవారం నుంచి విజయవాడలో దీక్షలు చేపడతాం. – డాక్టర్ వినోద్ కుమార్, ఏపీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి -
వైద్యుడి కుర్చీలో తహసీల్దార్
● త్రీవంగా ఖండిస్తున్న పీహెచ్సీ వైద్యుల సంఘంపార్వతీపురం రూరల్: రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీ వైద్యులు నిరసనలు చేస్తున్న వేళ, పార్వతీపురం తహసీల్దార్ సురేష్ ఓ పీహెచ్‌సీని సందర్శించి వైద్యాధికారి కుర్చీలో కూర్చోవడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం జాయింట్ కలెక్టర్ స్థాయి కన్నా తక్కువ హోదా అధికారులు పీహెచ్‌సీలను తనిఖీ చేయరాదని, ఈ నేపథ్యంలో తహసీల్దార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి కుర్చీలో కూర్చునే చర్య తమ వృత్తిని అగౌరవపరిచేలా ఉందని ఆంధ్రప్రదేశ్ పీహెచ్సీ వైద్యుల సంఘం తీవ్రంగా ఖండించింది. రెవెన్యూ అధికారులకు ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసే అధికారం లేదని ఈ మేరకు వారు స్పష్టం చేశారు. -
వైభవంగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి దేవస్థానంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేకువజామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశేష హోమాలను అర్చకులు జరిపించారు. శ్రీవారి తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పల్లకిలో అశీనులు చేసి రామతీర్థం పురవీధుల్లో మంగళవాయిద్యాలతో ఊరేగింపు చేశారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గురువారం యాగశాల లో పూర్ణాహుతి, అవబృదం కార్యక్రమా లను జరిపిస్తామని అర్చకులు తెలిపారు. అనంతరం భాస్కరపుష్కరిణిలో శ్రీవారికి చక్రతీర్థ స్నానం కనుల పండువగా చేయిస్తామన్నా రు. 3న జరిగే పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, రామగోపాలాచార్యులు, భక్తులు పాల్గొన్నారు. -
గిరిజనుల విద్య, వైద్యంపై నిర్లక్ష్యం తగదు
గిరిజనులకు మెరుగైన వైద్యం, విద్యా సౌకర్యాల కల్పనలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, దీనికి వారం రోజుల్లో కురుపాం బాలిక గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినుల మృతే నిలువెత్తు నిదర్శనమని మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి అన్నారు. బాలికలు అనారోగ్యంతో మృతిచెందుతున్నా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి, స్థానిక ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి స్పందించక పోవడం ఘోరమన్నారు. కురుపాం సీహెచ్‌సీలో వైద్యసేవలు పొందుతున్న బాలికలను పరామర్శించిన అనంతరం కురుపాం గురుకుల పాఠశాల/కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్, సిబ్బందితో మాట్లాడారు. పాఠశాలలో ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులకు గురైందన్నారు. అనంతరం స్థానిక విలేకరులతో ఆమె మాట్లాడుతూ పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంకా ఎంత మంది బాలికలు అనారోగ్యంబారిన పడతారోనని ఆవేదన వ్యక్తంచేశారు. కురుపాం సీహెచ్‌సీలో సేవలు పొందుతున్న 50 మందిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉండడంతో వివిధ ఆస్పత్రులకు రిఫర్ చేశారన్నారు. గిరిజన బాలికలకు భద్రత కరువు గిరిజన ఆడపిల్లలకు భద్రత కరువైందని పుష్పశ్రీవాణి ఆవేదన వ్యక్తంచేశారు. బాలికలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని సస్పెండ్ చేసి మళ్లీ రూ.లక్షల్లో లంచం తీసుకుని తిరిగి పోస్టింగ్ ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనిపై గిరిజనులకు ఏం చెప్పదలచుకుంటున్నారో..? కూటమి నాయకులు, ఐటీడీఏ అధికారులు ఆలోచించాలన్నారు. గిరిజన విద్యార్థుల ఆరోగ్యంపై ముందు జాగ్రత్త వహిస్తే ఇద్దరు బాలికలు మృతి చెందేవారే కాదన్నారు. -
రేబిస్ వ్యాధితో వ్యక్తి మృతి
● భయభ్రాంతులకు గురవుతున్న గ్రామస్తులు ● కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తిసంతకవిటి: మండలంలోని గోవిందపురం గ్రామానికి చెందిన అదపాక లింగంనాయుడు(37) రేబిస్ వ్యాధితో సోమవారం మృతిచెందాడు. ఆయనకు ఆగస్టు 30న కుక్క కరవడంతో సంతకవిటి పీహెచ్‌సీకి వెళ్లి వ్యాక్సిన్ వేయించుకున్నాడు. ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో శనివారం శ్రీకాకుళంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లగా రేబిస్ వ్యాధి సోకినట్లు వైద్యులు గుర్తించి, మెరుగైన చికిత్స కోసం వైజాగ్ రిఫర్ చేయడంతో ఆదివారం వైజాగ్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈయన మృతితో గ్రామస్తులు భయాందోళన చెంది గ్రామంలో కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
మహిళల ఆర్థికస్వావలంబన పెంపుదలే లక్ష్యం
విజయనగరం టౌన్: మహిళల్లో ఆర్థికస్వావలంబన పెంపొందించడమే లక్ష్యంగా అఖిలభారత డ్వాక్రా బజార్, సరస్‌ను ఏర్పాటుచేశామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎక్స్అఫీషియో సెక్రటరీ, సెర్ప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వాకాటి కరుణ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మాన్సాస్ గ్రౌండ్లో బుధవారం ఏర్పాటు చేసిన డ్వాక్రాబజార్, సరస్ ఎగ్జిబిషన్‌ను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె స్వయం సహాయక సంఘ సభ్యులు ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్‌ను పరిశీలించి, వారితో మమేకమయ్యారు. మహిళల సృజనాత్మకత, శ్రమ, నైపుణ్యాలను ప్రోత్సహించే దిశగా ఇటువంటి కార్యక్రమాలు రూపకల్పన చేశామన్నారు. ఎన్నోరకాల తయారీ ఉత్పత్పులు ప్రదర్శనలో అందుబాటులో ఉంచడం అభినందనీయని ప్రశంసించారు. కార్యక్రమంలో సెర్ప్ హెచ్ఆర్ డైరెక్టర్ కల్యాణ్ చక్రవర్తి, సీ్త్రనిధి మేనేజింగ్ డైరెక్టర్ హరిప్రసాద్, వెలుగు ఏపీడీ సావిత్రి, పీడీ రత్నాకర్, సరస్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, డీపీఎంలు రాజ్‌కుమార్, చిరంజీవి, లక్ష్మునాయుడు, సీతారాం తదితరులు పాల్గొన్నారు. సెర్ప్ సీఈఓ కరుణ -
పైడితల్లి అమ్మవారి ప్రసాదాల నాణ్యత పరిశీలన
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతరకు వినియోగిస్తున్న ప్రసాదాల నాణ్యత తీరును ఫుడ్ ఇన్స్పెక్టర్లు బుధవారం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పుడ్ కంట్రోలర్ ఎస్.ఈశ్వరి మాట్లాడుతూ అమ్మవారి పండగకు సంబంధించి తయారుచేసే లడ్డు, పులిహోర ప్రసాదాలకు సంబంధించిన ఆహారపదార్థాల నాణ్యతను ప్రతిరోజూ చెక్ చేస్తున్నామన్నారు. అందుకు సంబంధించిన శాంపిల్స్‌ను సేకరించామని, వాటిని హైదరాబాద్‌లోని నాచారంలో ఉన్న ఫుడ్ లేబొరేటరీకి పంపిస్తామన్నారు. ప్రసాదాలకు వినియోగించే కందిపప్పు, శనగపప్పు, కాజూ, నెయ్యి తదితర వాటిని చెక్ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఫుడ్‌సేఫ్టీ ఆఫీసర్ నాగుల్ మీరా, ఆలయ సూపర్వైజర్ రమేష్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
విజయనగరం క్రైమ్: నగరంలోని హుకుంపేటకు చెందిన పైడితల్లి(50) విద్యుత్ షాక్ తగిలి మృతి చెందినట్లు విజయనగరం టూటౌన్ ఏఎస్సై రామారావు బుధవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పైడితల్లికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యతో విడాకులు తీసుకుని రెండో భార్యతో నివసిస్తున్నాడు. సైకిల్ టైర్ పంక్చర్ రిపేర్ తో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. రోజులాగానే పనిలోకి వెళ్లిన పైడితల్లికి అక్కడే కరెంట్ షాక్ తగలడంతో మృత్యువాత పడ్డాడు. మృతుడి భార్య మంగ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
పోలీసు, రెవెన్యూ అధికారులు స్పందించాలి..
ఆన్యాయంగా భూమిని అక్రమించుకున్న వ్యక్తిపై పోలీసు, రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలి. ఆక్రమణదారు వద్ద ఎటువంటి ఆధారం లేకుండా పురోహితులు చేస్తున్న భూమిని అన్యాయంగా ఆక్రమించుకున్నారు. సిద్ధాంతం గణపతి, ప్రధాన అర్చకుడు, సంగాం దౌర్జన్యంగా ఆక్రమణ.. దేవాదాయ శాఖకు చెందిన భూమిని టీడీపీ నేత దారుణంగా ఆక్రమించకున్నాడు. దశాబ్దాల కాలం నుంచి ఈ భూమి సంగమేశ్వరస్వామి ఆలయం పురోహితులు సాగుచేసుకుంటున్నారు. ఆ భూమి ఆధారంగా జీవనం సాగిస్తున్నారు. అటువంటి భూమిని ఆక్రమించుకోవడం దారుణం. దర్యాప్తు చేసి దేవాదాయ శాఖ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలి. గేదెల రామకృష్ణ, గ్రామపెద్ద, సంగాం -
దశాబ్దాల నుంచి పురోహితుల ఆధీనంలో..
దశాబ్దాల తరబడి సంగమేశ్వరస్వామి దేవాలయం పురోహితం చేస్తూ సర్వే నంబర్6–3లో 80 సెంట్ల భూమిని నాలుగు కుటుంబాల వారం సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. ఇప్పడు గ్రామానికి చెందిన వెలగాడ మోహనరావు ఆ భూమి తనకు చెందినదని బెదిరించి ఆక్రమించుకున్నాడు. సిద్ధాంతం చిన్నిబాబు, అర్చకుడు, సంగాం ఆక్రమించుకోవడం అన్యాయం.. దేవాదాయ శాఖకు చెందిన భూమిని పురోహితం చేస్తూ మా కుటుంబసభ్యులం అనుభవిస్తున్నాం. అప్పట్లో దేవాదాయ శాఖకు శిస్తు కూడా చెల్లించాం. ఇప్పుడు ఈ భూమిని ఆక్రమించుకోవడం అన్యాయం. మాకు న్యాయం చేయాలి. సిద్ధాంతం పోలిలింగం, అర్చకుడు, సంగాం -
సాఫ్ట్‌బాల్ జిల్లా కార్యవర్గం ఏర్పాటు
బొబ్బిలి: సాఫ్ట్‌బాల్ జిల్లా కార్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్ ఫంక్షన్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో పరిశీలకులు ఎంవీ రమణ, తిరుపతిరావుల సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించారు. అధ్యక్ష, కార్యదర్శులుగా ఎమ్మెల్యే బేబీనాయన, ఐ.విజయకుమార్, కోశాధికారిగా ఎన్.వెంకటి నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సీహెచ్ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా సుంకరి సాయిరమేష్లను ఎన్నుకున్నారు. డివైడర్‌ను ఢీకొని భార్యాభర్తలకు గాయాలుభోగాపురం: మండలంలోని పోలిపల్లి జాతీయ రహదారిపై డివైడర్‌ను బైక్‌తో ఢీకొన్న భార్యాభర్తలు గాయాలపాలయ్యారు. బుధవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళానికి చెందిన భార్యాభర్తలు బైక్‌పై విశాఖపట్నం బయల్దేరారు. మార్గం మధ్యలో పోలిపల్లి చేరుకుసరికి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న భర్తకు తీవ్రగాయాలు కాగా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హైవే అంబులెన్స్‌లో విజయనగరం ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. దీనిపై ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని హెచ్‌సీ శ్రీనివాసరావు తెలిపారు. బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల ర్యాలీవిజయనగరం టౌన్: బీఎస్ఎన్ఎల్ సిల్వర్ జూబ్లీ వేడుకలలో భాగంగా బుధవారం సంస్ధ ఉన్నతాధికారులు, అధికారులు, సిబ్బంది పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ సంస్ధలకు దీటుగా ప్రభుత్వరంగ సంస్ధ అయిన బీఎస్ఎన్ఎల్ పనిచేస్తుందన్నారు. ఈ సందర్భంగా సంస్ధ డీజీఎం దాలినాయుడు మాట్లాడుతూ హుద్‌హుద్ వంటి తుఫాన్లు, విపత్కర పరిస్ధితుల్లో కేవలం బీఎస్ఎన్ఎల్ మాత్రమే అందరికీ అందుబాటులో నిలిచి అందరి మన్ననలు పొందిందన్నారు. 25 ఏళ్ల ఉత్సవాలలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. వినియోగదారులకు అందుబాటులో ఉండేవిధంగా ఫోర్జీ నెట్వర్క్, 100జీబీ స్పీడ్‌తో ఇంటర్నెట్ సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సైతం కొత్తగా టవర్ల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నుంచి నినాదాలు చేస్తూ ర్యాలీ ప్రారంభించి టీటీడీ కల్యాణ మంటపం, లయన్స్ క్లబ్, కోట జంక్షన్, గురజాడ అప్పారావు రోడ్డు మీదుగా తిరిగి కార్యాలయానికి ర్యాలీ చేరింది. చెరువులో పడి వ్యక్తి మృతిపార్వతీపురం రూరల్: మండలంలోని ఎమ్మార్‌నగరం సమీపంలో గల చెరువులో ప్రమాదవశాత్తు పడి గ్రామానికి చెందిన వి.గౌరీశంకర్రావు (31) మృతి చెందినట్లు పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి కుమారి తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, మృతుడు గౌరీశంకరరావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు ఎస్సై, బంధువులు చెప్పారు. రూటు మార్చిన ఏనుగులుభామిని: మండలంలోని ఇసుకగూడ–సన్నాయిగూడ సమీపంలోని మెట్టపై మకాం వేసిన ఏనుగుల గుంపు బుధవారం రూటు మార్చింది. దిమ్మిడిజోల–లోవగూడల వైపు నాలుగు ఏనుగుల గుంపు పయనం ఆరంభించింది. దీంతో భామిని వైపు గల గ్రామాల రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే పొలాల్లో పంటలు నిండుగా ఉన్న తరుణంలో ఏనుగులు చేపట్టనున్న పంటల విధ్వంసంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఏనుగులు ధ్వంసం చేసిన పంట పరిహారం కోసం ఆందోళన
పార్వతీపురం రూరల్: ఏనుగుల గుంపు సృష్టిస్తున్న బీభత్సానికి తమ పంటలు సర్వనాశనమయ్యాయని, తక్షణమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు కలెక్టరేట్ వద్ద బుధవారం నిరసన వ్యక్తం చేశారు. సీపీఐ(ఎంఎల్) లిబరేషన్, గిరిజన సంక్షేమ సంఘం నేతృత్వంలో బుధవారం నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వామపక్షాల నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి కేవలం 5 కిలోమీటర్ల దూరంలోని మరికి, కృష్ణపల్లి తదితర గ్రామాల సమీపంలో 8 రోజులుగా ఏనుగులు సంచరిస్తూ సుమారు 50 ఎకరాల్లో మొక్కజొన్న, వరి, టేకు చెట్లను ధ్వంసం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు కనీసం నష్టాన్ని అంచనా వేయడానికి కూడా రాలేదని సీపీఐ(ఎంఎల్) లిబరేషన్ పార్టీ జిల్లా సభ్యుడు పి. సంగం, గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో జరిగిన నష్టానికి ఇప్పటికీ పరిహారం చెల్లించలేదని, అరకొర సాయం అందించి అధికారులు చేతులుదులుపుకుంటున్నారని, పంట నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి న్యాయమైన పరిహారం చెల్లించాలని, అలాగే ఏనుగులను సురక్షిత ప్రాంతాలకు తరలించి రైతులు, ప్రజల ప్రాణాలకు, పంటలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఏనుగులు సంచరిస్తున్న గ్రామాల రైతులు, ప్రజలు పాల్గొన్నారు. పంట నష్టపరిహారాన్ని త్వరగా అందించేలా చర్యలు ఏనుగులు ధ్వంసం చేసిన పంటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారాన్ని సత్వరమే అందజేయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి డీఎఫ్ఓ జీఏపీ ప్రసూనను ఆదేశించారు. పార్వతీపురం మండలం మరికి, కృష్ణపల్లి గ్రామానికి చెందిన పలువురు రైతులు ఏనుగుల గుంపు తమ పంట పొలాల్లోకి చొరబడి తాము సాగుచేసుకుంటున్న పంటలను ధ్వంసం చేస్తున్నాయని బుధవారం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కావున నష్టపోయిన పంటలకు గాను సంబంధిత రైతులు, కౌలు రైతులకు తగిన నష్టపరిహారాన్ని అందించి తమను ఆదుకోవాలని కలెక్టరుకు దరఖాస్తు అందజేశారు. ఈ దరఖాస్తు పరిశీలించిన కలెక్టర్ వెంటనే స్పందించి, జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికలు అందజేయాలని, అలాగే నష్టపోయిన గిరిజన రైతులకు త్వరగా నష్టపరిహారం అందించే దిశగా సత్వర చర్యలు చేపట్టాలని డీఎఫ్ఓ జీఏపీ పి.ప్రసూనను ఆదేశించారు. దీంతో రైతులు తమ ఆనందం వ్యక్తం చేశారు. -
అర్చకుల ఆర్తనాదం..!
వంగర: మండల పరిధిలోని సంగాంలో వెలసిన పవిత్ర సంగమేశ్వరస్వామి దేవాలయం పరిధిలో దేవదాయ శాఖ భూమిపై టీడీపీ నేత కన్ను పడింది. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇంకెవ్వరు అడ్డు అంటూ గ్రామానికి చెందిన వెలగాడ మోహనరావు సుమారు 80 సెంట్ల భూమిని ఆక్రమించుకున్నాడు. దేవాదాయ శాఖ ఏర్పాటు చేసిన బోర్డును సైతం లెక్క చేయకుండా భూమిని ఆక్రమించేశాడు. కొన్ని దశాబ్దాలుగా సంగమేశ్వరస్వామి దేవాలయం పురోహితులు(అర్చకులు)గా ఉంటున్న సిద్ధాంతం చిన్నిస్వామి, సిద్ధాంతం పోలిలింగం, సిద్ధాంతం విశ్వనాథం, సిద్ధాంతం నాగభూషణరావులు ఆ భూమిని సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే కొన్ని నెలల క్రితం ఈ భూమిని గ్రామానికి చెందిన వెలగాడ మోహనరావు ఆక్రమించుకోవడంతో దేవాదాయ శాఖ ఈవో పొన్నాడ శ్యామలరావు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు సిద్ధాంతం గణపతిరావు ఆధ్వర్యంలో అర్చకుల బృందం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ భూమి వదిలేందుకు ఆక్రమణదారు ముందుకు రాకపోవడంతో బుధవారం గ్రామంలోని ప్రజలంతా పార్టీలకు అతీతంగా ఐక్యమై నిరసన తెలిపారు. ఆక్రమించుకున్న భూమి వద్దకు వెళ్లి కొన్ని దశాబ్దాల నుంచి సంగమేశ్వరస్వామి ఆలయ పురోహితులు అనుభవించే వారని, ఇప్పుడు ఈ భూమి ఎలా దఖలుపడిందని ఆక్రమణదారును ప్రశ్నించారు. అనంతరం గ్రామంలో తిరుగాడుతూ దేవాదాయ శాఖ భూములను రక్షించాలంటూ నినాదాలు చేశారు. న్యాయం చేయాలంటూ వేడుకోలు దేవదాయ శాఖ భూమిని ఆక్రమించిన టీడీపీ నేత పార్టీలకు అతీతంగా గ్రామంలో నిరసన పోలీసులు, రెవెన్యూ, దేవదాయ శాఖలకు ఫిర్యాదు -
అడ్మిషన్లకు ‘పెన్’ చాలు
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఉన్నత విద్య అడ్మిషన్ల ప్రక్రియను సులభతరం చేస్తూ కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. డిగ్రీ వంటి కోర్సుల్లో చేరేందుకు ఇకపై విద్యార్థులు ఎలాంటి సర్టిఫికెట్లు సమర్పించాల్సిన అవసరం లేదని, కేవలం అపార్ ఐడీ, పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ (పెన్) ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి డిగ్రీకి దూరం కాకూడదన్నారు. బడి మానేసిన, 10వ తరగతి, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులను గుర్తించి తిరిగి చేర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం, గార్మెంట్ టెక్నాలజీలో శిక్షణతో పాటు, ప్రతిరోజూ యోగా, హెచ్‌బీ స్థాయి పెంపుపై దృష్టి సారించాలని సూచించారు. 5 నుంచి 10వ తరగతి విద్యార్థులకు కనీస విద్యా ప్రమాణాలైన చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఈఓ రాజకుమార్, ఇతర విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. రైతన్నకు జీఎస్టీ 2.0తో ఊరట వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) 2.0సంస్కరణలు రైతాంగానికి ఎంతో మేలు చేకూర్చనున్నాయని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకర రెడ్డి అన్నారు. ఈ పన్ను తగ్గింపు ప్రయోజనాలపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచారం చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్‌తో కలిసి జీఎస్టీ 2.0 అవగాహన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జీఎస్టీ నోడల్ ఆఫీసర్ డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి -
లేటెస్ట్ టెక్నాలజీని వినియోగించాలి
విజయనగరం క్రైమ్: స్మార్ట్ పోలీసింగ్ ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉండాలని ఎస్పీ దామోదర్ అన్నారు. సీఎం చంద్రబాబు పర్యటన బుధవారం ముగిసిన వెంటనే పెదమానాపురం పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషను పరిసరాలు పరిశీలించి, స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. స్టేషన్ కు వచ్చే బాధితులు, వృద్ధులు, మహిళల పట్ల అప్యాయంగా మాట్లాడి, వారి సమస్యలను ఓపికగా విని, పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులపట్ల సామరస్యంగా, నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు సిబ్బందిని, అధికారులను ఎస్పీ ఆదేశించారు. స్మార్ట్ పోలీసింగ్‌తో ప్రజలకు మెరుగైన సేవలందించాలని, అందుకు టెక్నాలజీని వినియోగించుకోవాలని సూచించారు. చట్టాన్ని ఉల్లంఘించి నేరాలకు పాల్పడే వారిని, గంజాయి, మహిళలు పట్ల దాడులకు పాల్పడే వారిని, బాలలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ ఆదేశించారు. ఎస్పీ దామోదర్ -
పింఛన్ల పంపిణీపై ఉత్కంఠ!
● ఇంటింటికీ వెళ్లేది లేదంటున్న సచివాలయ ఉద్యోగులు సాక్షి, పార్వతీపురం మన్యం: తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం అక్టోబర్ నెల పింఛన్లపై పడేలా కనిపిస్తోంది. వాస్తవానికి సచివాలయ ఉద్యోగులు తాము ప్రకటించిన నిరసనల షెడ్యూల్లో అక్టోబర్ 1న పింఛన్ల పంపిణీని యథావిధిగా చేపడతామని ప్రకటించారు. దీనిపై సచివాలయ ఉద్యోగుల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్ల పంపిణీని ఆపితే గానీ ప్రభుత్వం దిగి రాదని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకులు.. వృద్ధులు, దివ్యాంగులకు మినహా మిగిలిన అందరికీ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు (కార్యాలయ పని వేళల్లో) సచివాలయాల వద్దే పంపిణీ చేస్తామని చెబుతున్నారు. దీనిని మరో వర్గం ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. తాము యథావిధిగా పంపిణీకి వెళ్తామని అంటున్నారు. వీరిలోనే రెండు వర్గాలుగా ఉండడంతో ఈ నెల పింఛన్ల పంపిణీ ఏ విధంగా సాగుతుందన్న విషయంలో సందిగ్ధత ఏర్పడింది. జిల్లాలో 1.40 లక్షల పింఛన్లు ఉన్నాయి. 15 మండలాల పరిధిలో 350 సచివాలయాలు ఉన్నాయి. సుమారు 3,238 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. గతంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి నేరుగా లబ్ధిదారులకు పింఛన్ల మొత్తం అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థకు మంగళం పాడింది. అప్పటి నుంచి సచివాయల ఉద్యోగులతోనే ఆ పని చేయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో గ్రామంలోని ఆలయాల వద్ద, రచ్చబండకు రప్పించి, పింఛన్లు అందించే పరిస్థితి ఉంది. వలంటీర్ల విధుల నుంచి తమను విముక్తి చేయాలని, రెండు సంవత్సరాల సర్వీసుకు రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, డోర్ టు డోర్ సర్వేలను అప్పగించవద్దని, నిర్ధిష్టమైన ప్రమోషన్లు కల్పించాలని, డిప్యుటేషన్ల నుంచి మినహాయించాలని సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో నిరసనలకు దిగారు. అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి వైదొలుగుతున్నారు. ఈ పరిస్థితుల్లో పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటుందో చూడాలి. -
మెడికల్ కళాశాలలపై విషం
గత ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై ఈ కూటమి ప్రభుత్వం విషం చిమ్ముతోంది. కరోనా వంటి విపత్తును ఽధైర్యంగా ఎదుర్కొనేందుకు వైద్యరంగానికి గత ముఖ్యమంత్రి జగన్ ఎంతో ప్రాధాన్యమిచ్చారు. బడుగు, బలహీన వర్గాలకూ నాణ్యమైన వైద్యం, విద్య అందించాలన్న ఉద్దేశంతో 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారు. వాటిని ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు చంద్రబాబు చూస్తున్నారు. మిగిలిన రాష్ట్రాల్లో పీపీపీ విధానాన్ని ఆయా ప్రభుత్వాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇక్కడే చంద్రబాబు ఎందుకు మొగ్గు చూపుతున్నారు? – బి.వెంకటరమణ, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి -
చంద్రబాబుకు బుద్ధి చెబుతాం..
గత ప్రభుత్వ హయాంలో మా నాయకుడు విద్య, వైద్యానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. నాడు–నేడుతో పేద పిల్లలకు ఇంగ్లిష్ మీడియం పాఠశాలలను తీసుకొచ్చి, బడులను బాగు చేశారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారు. ఈ దుర్మార్గమైన కూటమి ప్రభుత్వం.. పేదవారికి ఆ రెండింటినీ దూరం చేస్తోంది. పేదల జోలికొస్తే చంద్రబాబుకు తగిన బుద్ధి చెబుతాం. – నిమ్మకాయల సుధీర్‌కుమార్, కౌన్సిల్ మెంబర్, పార్వతీపురం మున్సిపాలిటీ -
యాదొచ్చిందేటి..!
ఏడాదిన్నరకు..సాక్షి ప్రతినిధి, విజయనగరం: జరిగితే జల్లెడతో నీళ్లు మొయ్యడం అంటే బాబుదేరా.. మొత్తానికి ఆయనకు అలా నడిచిపోతాంది.. ఎల్లప్పుడూ ఎలచ్చన్లప్పుడు వచ్చి ఏదైనా చెప్తారు.. చేయాలంటే ఎనకాముందూ చూడాలి కానీ బొంకులు చెప్పడానికి నోటికి అడ్డేటుంది చెప్మీ... ఏదేదో చెప్పినారు.. గెలిచినారు.. మళ్లీ ఏడాదిన్నరకు వస్తున్నారు.. చెప్పినవాటిల్లో ఒక్కటైనా నాడింగా ఇచ్చినారా.. ఈ లిస్ట్ చూసి టిక్కులు పెట్టుమీ.. తేలిపోద్ది.. ఇదీ గజపతినగరం బస్టాండ్‌లో అప్పలనాయుడు చిరాకు. ఒరే అప్పలనాయుడు దసరాపండగ ముందురోజు చంద్రబాబు మనూరు రావడం గొప్పేరా అన్నాడు పైడిరాజు. ఎందుకురా.. ఎందుకు గొప్ప.. ఎవడికి గొప్ప.. వచ్చినందుకు ఏమైనా చేస్తే గొప్పగానీ కోట్లు తగలేసి వచ్చి.. అలా ఫొటోలకు ఫోజులిచ్చి పెన్షన్లు పంచుకుని వీడియోలు దిగి వెళ్తే ఎవడికిరా గొప్ప అన్నాడు చిరాగ్గా అప్పలనాయుడు. అది కాదురా అప్పిగా.. ఏదైనా సీఎం మనూరు రావడం గొప్పేకదా అన్నాడు పైడిరాజు. ఒరేయ్ ఏదైనా తెస్తే గొప్పగానే.. ఉత్త చేతుల్తో వస్తే ఎవడికిరా గొప్ప అన్నాడు అప్పలనాయుడు.. అయితే ఏటీ ఇవ్వలేదంటావా అన్నాడు పైడి రాజు.. ఏదిరా ఇటు రమ్మిరా.. టెంకిమీద ఒకటిచ్చేయగలను అంటూ ఎలచ్చన్లలో ఇచ్చిన హామీల లిస్ట్ చదివాడు అప్పలనాయుడు.. నోటికొచ్చింది చెప్పడమే తప్ప ఏనాడైనా అవి ఇచ్చామా లేదా అని చూసుకున్నారా.. కిరాణా సామాన్లు తెచ్చినప్పుడు లిస్ట్ ప్రకారం ఉన్నాయా లేదా అనేవి చూసుకుంటామా.. అలాగే మనం ఇచ్చిన హామీలన్నీ చేసినామా లేదా చూసుకోవాలి కదా.. వీటికి సమాధానం ఇవ్వు... 50 ఏళ్లు దాటిన బడుగుబలహీన వర్గాలవారందరికీ కొత్త పెన్షన్లు అన్నాడు.. ఉన్నవాళ్లలో వేలాది మందివి వెరిఫికేషన్ అని లేపేసినాడు.. కొత్తవి ఇవ్వవయ్యా అంటే ఉన్నవి తీసేశాడు. తల్లికి వందనం.. అదొక మహా విచిత్రంగా ఉంది.. ఎవరికి ఇస్తారో.. ఎంత ఇస్తారో.. ఎవరికి ఎందుకు ఎగ్గొడతారో తెలీదు.. ఆడబిడ్డ నిధి కింద మన ఆడవాళ్లకు నెలకు రూ.1500 అన్నారు.. ఇచ్చార్రా.. అవునురా పైడిగా యూరియా కూడా ఇవ్వలేని గవర్నమెంట్‌ను మాత్రం నేను తొలిసారి చూస్తున్నానురా. ఇంత దరిద్రం నా డైబ్భెయేళ్ల జీవితంలో చూడలేదురా.. చెప్పులు.. సంచులు లైన్లో పెట్టుకుని యూరియా కోసం దెబ్బలాడుకోవడం.. అదొక పెద్ద ప్రహసనంరా బాబూ.. అప్పలనాయుడు.. పల్లకోరా అన్నాడు.. పైడిరాజు.. ఏట్రా పల్లకోవడం.. మెడికల్ కాలేజీలు తెచ్చిందిలేదు కానీ.. జగన్ తెచ్చిన పార్వతీపురం కాలేజీని ప్రైవేటుకు అమ్మేస్తున్నాడట.. అక్కడ చివరిదశలో నిర్మాణంలో ఉన్న కురుపాంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీని ఇప్పటికీ అందుబాటులోకి తేలేదురా.. ఇక మన గుంటలకు నిరుద్యోగ భృతి అన్నాడు.. ఓలమ్మ నిబ్బగే గావాల అనుకున్నా.. చూస్తున్నావు కదా.. వట్టిదే అని తేలిపోయింది.. మన జిల్లా గిరిజనులు డోలీ కష్టాలు చూస్తున్నాం కదరా.. ఏమైనా పరిష్కారం చూపారా అంటే ఏం లేదురా.. ఆయన దయవల్ల మనకు నిరంతరం సేవలందించే వలంటీర్లందరి ఉద్యోగాలు పోనాయిరా... బియ్యం బండీ ఆగిపోయిందరా.. ఉద్యోగాలు ఇవ్వడంపోయి చిరుద్యోగులను తొలగించేస్తున్నార్రా.. ఆళ్లంతా ఉసూరుమంటున్నారు.. ఔరా.. పల్లె పండగ అన్నాడు.. రోడ్లు అద్దంలా మెరుస్తాయి అన్నాడు.. ఏదీ ఓసారి నా బండి ఎక్కుమీ అలా బొబ్బిలి కాసి వెల్డుము గానీ అన్నాడు. నాయుడు.. వద్దురా నాయిన.. నడుం జారిపోద్ది.. పండక్కి కుక్కి మంచమే దిక్కయిపోద్ది అన్నాడు పైడి రాజు.. చూశావా.. నువ్వే ఒప్పుకున్నావ్.. చంద్రబాబు ఎప్పుడూ మాటలు చెబుతాడు.. పని చేయడు.. ఇలాంటి షూటింగ్‌లు మాత్రం బాగా చేస్తాడురోయ్.. అంటూ అప్పలనాయుడు బయల్దేరాడు.. నీకు దండంరా బాబు.. నిన్ను ఒప్పించలేం అంటూ పైడి రాజు జారుకున్నాడు. -
బడుగు వర్గాలకు అన్యాయం చేస్తే సహించం
పేదలకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ముందుచూపుతో 17 మెడికల్ కళాశాలలను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఐదు కళాశాలలు పూర్తి చేయగా.. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రైవేటీకరణ విధానాల వల్ల అవన్నీ వృథా అయ్యే పరిస్థితి ఉంది. చంద్రబాబు తన కుమారుడికి అన్ని విధాలా ఉపయోగపడాలన్న ఉద్దేశంతో స్వప్రయోజనాలు చూసుకుంటున్నారు. పేదల పొట్టకొట్టే విధానాలు అవలంభిస్తున్నారు. బడుగు వర్గాలకు అన్యాయం చేస్తే.. ఎంతవరకై నా వెళ్తాం. – గండి భాగ్యవతి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి -
పులిగుహ మెట్టపై ఏనుగులు
భామిని: మండలంలోని తివ్వాకొండల్లోని పులిగృహ మెట్టపైకి మంగళవారం నాలుగు ఏనుగుల గుంపు చేరింది. పగలంతా మెట్టపై ఉండి సాయంత్రం పంట పొలాల్లో సంచరిస్తూ నష్టం చేకూర్చుతున్నాయని గిరిజనులు వాపోతున్నారు. పారాది కాజ్‌వేపై వరద నీరు బొబ్బిలిరూరల్: అంతరరాష్ట్ర రహదారిలో పారాది గ్రామం వద్ద వేగావతినదిపై నిర్మించిన తాత్కాలిక కాజ్‌వేను మంగళవారం వరదనీరు ముంచెత్తింది. నదీ పరీవాహక ప్రాంతంలో కురిసిన వర్షాలకు వేకువజాము నుంచి కాజ్‌వేపై వరదనీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఉదయం ఏడు గంటలకు వరదనీరు తగ్గుముఖం పట్టడంతో ఆర్అండ్బీ అధికారులు వాహనాల రాకపోకలకు అనుమతించారు. ఆర్థిక బకాయిలు చెల్లించండి ● ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి విజయనగరం అర్బన్: ఉద్యోగుల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని, పీఆర్సీ కమిషన్ నియమించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా పరిషత్ మినిస్టీరియల్ హాల్లో మంగళవారం నిర్వహించిన ఏపీటీఎఫ్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కనీసం 30 శాతం మధ్యంతర భృతి అమలు చేయాలని కోరారు. ఉమ్మడి సర్వీసుల సమస్య పరిష్కరించాలని, ఉపాధ్యాయులను బోధనేతర పనుల నుంచి విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. సీఆర్పీ, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెంచాలని, ఎంటీఎస్ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని కోరారు. మున్సిపల్, మోడల్ స్కూల్, కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఎం.బలరామనాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎ.సదాశివరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ధనంజయరావు, రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ ఆర్.కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.వి.పైడిరాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి.వెంకటనాయుడు, వై.మధుసూదనరావు, జిల్లా సహాధ్యక్షులు ఎస్.శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. -
పేదవారు వైద్యవిద్య చదవకూడదా?
పేదవారికి వైద్యం, విద్యను ఈ కూటమి ప్రభుత్వం దూరం చేసింది. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల ఉండాలన్న మంచి ఉద్దేశంతో ఒకేసారి 17 వైద్య కళాశాలలను గత ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చారు. ఈ కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చి, వాటిని ప్రైవేట్‌కు ధారాదత్తం చేయాలని చూస్తోంది. దళిత, బడుగు, బలహీన వర్గాలకు వైద్య విద్యను దూరం చేయాలనే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంలా ఉంది. ఆయా వర్గాల యువతంతా ఆలోచించాలి. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. – మజ్జి అప్పారావు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు, సాలూరు నియోజకవర్గం -
సమగ్ర శిక్షలో ఆకలి కేకలు
● రెండు నెలలుగా అందని వేతనం ● ఆర్థిక ఇబ్బందుల్లో 1238 మంది ఉద్యోగులు ● పట్టించుకోని కూటమి పాలకులు విజయనగరం అర్బన్/రాజాం: సమగ్ర శిక్ష అభియాన్‌లో పనిచేసే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదు. వారి కుటుంబాల్లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఉద్యోగులకు నెలనెలా జీతాలు అందజేయకపోవడంతో ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 42 మండలాల్లో ఎస్ఎస్ఏలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న దాదాపు 1,238 మంది ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శాశ్వత ఉద్యోగులతో పాటుగా కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ విధానంలో సీఆర్ఎంటీలు, మండల్ లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ వంటి పార్ట్‌టైం ఇన్స్ట్రక్టర్లు, ఫిజియోథెరిపిస్టులు, సైట్ ఇంజినీర్లు, మెసెంజర్లు, డ్రైవర్లుగా పనిచేస్తున్నా వేతనం సకాలంలో అందజేయకపోవడంపై ఆవేదన చెందుతున్నారు. ఇంటి అద్దెలు, నిత్యావసర ఖర్చుల కోసం అప్పులు చేస్తున్నారు. మరోవైపు సంక్షేమ పథకాలు కూడా చాలా మందికి వర్తింపజేయపోవడంతో కూటమి తీరుపై భగ్గుమంటున్నారు. గత ప్రభుత్వ పాలనలో నిరవధిక సమ్మె చేసిన సమయంలో ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేశ్ సిబ్బందికి మద్దతు తెలుపుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ అమలు చేస్తామని ట్విట్టర్లో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా హామీ అమలుచేయలేదని నిట్టూర్చుతున్నారు. విధులు ఇలా.. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 42 మండలాల్లో సమగ్ర శిక్షలో 1,238 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. వారిలో ఎమ్మార్సీ సిబ్బంది 130 మంది, సీఆర్‌ఎంటీఎస్‌లు 151, పార్ట్‌టైమ్ ఇన్స్ట్రక్టర్స్ 259 మంది, కేజీబీవీలో పీజీటీలు 105, పీఈటీలు 26, ప్రిన్సిపాల్స్ 26, సీఆర్టీఎస్ 179, ఏఎన్ఎంలు 19, అకౌంటెంట్స్ 26 మంది, ఇన్స్ట్రక్టర్స్ 31, కేజీబీవీల్లో కుక్స్–80, ఇతర సిబ్బంది 138, ఏపీ మోడల్ స్కూల్ హాస్టల్స్ నిర్వహణ సిబ్బంది 58 మంది ఉన్నారు. గత ప్రభుత్వం ఆమోదించిన మినిట్స్‌ను అధికారంలోకి వస్తే అమలుచేస్తామని ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఇప్పటివరకు అమలు కనిపించలేదు. అక్టోబర్ 12లోగా మా సమస్యలు పరిష్కరించాలి. సమగ్ర శిక్ష ఉద్యోగుల జీతాలు సకాలంలో ఇవ్వాలి. లేకుంటే విజయవాడలో జరిగే ఆవిర్భావ సభలో సమ్మె నిర్ణయం తీసుకుంటాం. – నిమ్మక విజయకుమార్, సమగ్రశిక్ష ఉద్యోగి, రాజాం సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల కాంట్రాక్టు ఉద్యోగులకు భద్రత లేదు. పని సమయాలు మాత్రం అధికంగా ఉన్నాయి. సకాలంలో జీతాలు లేవు. కచ్ఛితమైన జాబ్ చార్ట్ లేదు. ఈ విషయాలపై మార్గదర్శకాలు జారీచేయాలి, రెండు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి. జీతాలు లేక అప్పులు చేస్తున్నాం. పండగపూట పస్తులు ఉండాల్సి వస్తుంది. – బోర గోవిందరావు, సమగ్ర శిక్ష ఉద్యోగి, రాజాం -
కూటమి పాలనలో అరాచకాలు, అవినీతి దాడులు
● బాధితుల కోసమే డిజిటల్ బుక్ ● డిజిటల్ బుక్ పోస్టర్లు విడుదల చేసిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీచీపురుపల్లి: కూటమి ప్రభుత్వం పదహారు నెలల పరిపాలనలో అక్రమాలు, అవినీతి, అరాచకాలు, దాడులు, అక్రమ కేసులు తప్ప ఇంకేం లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ పీఏసీ మెంబర్ బెల్లాన చంద్రశేఖర్‌లు అన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు, దాడులకు బలవుతున్న బాధితులకు అండగా నిలిచేందుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన డిజిటల్ బుక్ యాప్‌కు సంబంధించిన పోస్టర్లను మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదహారు నెలల్లో పరిపాలన విషయంలో పూర్తిగా విఫలమైన కూటమి ప్రభుత్వం తమకు ఓట్లు వేసిన ప్రజల ముందు నిలబడాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కూటమి ప్రభుత్వం విఫలమైన తీరును, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న అవినీతి, అక్రమాలను ప్రజలు, ప్రభుత్వం దృష్టికి సోషల్ మీడియా తీసుకువెళ్తున్న తీరును జీర్ణించుకోలేని ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, దాడులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. అందుకనే వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి డిజిటల్ బుక్ అనే యాప్‌ను తీసుకొచ్చినట్లు చెప్పారు. సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు ఎవరైనా కూటమి ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటే ఆ డిజిటల్ బుక్ యాప్‌లో తమ కష్టాలు, వివరాలు నమోదు చేయాలని సూచించారు. అసలైన సైకో బాలకృష్ణ అసలు సిసలైన సైకో, ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ధ్రువీకరణ పొందిన బాలకృష్ణ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిని సైకో అనడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం పాల్పడుతున్న అరాచకాలకు పోలీస్ వ్యవస్థ కూడా వంతపాడడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేవీ.సూర్యనారాయణరాజు, చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం, గుర్ల మండలాల నాయకులు ఇప్పిలి అనంతం, మీసాల వరహాలనాయుడు, వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, తాడ్డి వేణు, కోట్ల వెంకటరావు, మీసాల విశ్వేశ్వరరావు, జెడ్పీటీసీ వాకాడ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పురుగు మందు తాగి యువకుడి ఆత్మహత్య
సీతానగరం: మండలంలోని అంటిపేట పంచాయతీ వెంకటాపురం గ్రామానికి చెందిన సీతారాపు సతీష్(25) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు మృతుడి తండ్రి సీరాపు శ్రీరాములు అందించిన వివరాలిలా ఉన్నాయి. కుమారుడు సతీష్ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు నిరాకరించిన కారణంగా మనస్తాపానికి గురై పురుగు మందు తాగేశాడు. దీంతో చికిత్స నిమిత్తం విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎం.రాజేష్ తెలియజేశారు. సతీష్ సాలూరు ఆర్టీసీ డిపోలో కాట్రాక్ట్ పద్ధతిన డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. యువకుడి ఆత్మహత్యశృంగవరపుకోట: మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన గోకాడ ప్రదీప్(24) అనే యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఎస్.కోట సీఐ వి.నారాయణమూర్తి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన గోకాడ బాపునాయుడు కొడుకు ప్రదీప్ కొంతకాలంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో నెట్వర్క్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం గ్రామానికి వచ్చిన ప్రదీప్ అందరితో కలివిడిగా ఉన్నాడు. సోమవారం సాయంత్రం వరకు సన్నిహితులు, స్నేహితులతో సరదాగా గడిపి సోమవారం రాత్రి తన ఇంటి మేడపైన గదిలో చున్నీతో ఉరిపోసుకున్నాడు. ిస్థిరమైన ఉద్యోగం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. మృతుడు ప్రదీప్‌కు తండ్రి, తల్లితో పాటు పెళ్లైన అక్క ఉన్నారు. -
ఆపద్బాంధవులు
పార్వతీపురం రూరల్/రాజాం సిటీ: మనిషి ప్రాణానికి ప్రత్యామ్నాయం లేదు. అలాగే మనిషి రక్తానికి మరో ప్రత్యామ్నాయం లేదు! ఆధునిక విజ్ఞానం ఎంత అభివృద్ధి సాధించినా, ప్రయోగశాలల్లో రక్తాన్ని సృష్టించలేని పరిస్థితి. అందుకే, ఒకరి ప్రాణాన్ని కాపాడాలంటే మరొకరు అందించే రక్తమే ఏకై క ఆధారం. ఆపదలో ఉన్నవారికి ప్రాణభిక్ష పెట్టే ఆ మహత్తర కార్యానికి గుర్తుగా, ప్రజల్లో చైతన్యం నింపే లక్ష్యంతో ఏటా అక్టోబర్ 1వ తేదీన ‘జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం’ జరుపుకుంటున్నాం. పార్వతీపురం మన్యం జిల్లాలో దాదాపు 1682 మంది స్వచ్ఛంద ప్రత్యక్ష రక్తదాతలు ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారిని గుర్తు చేస్తూ వారిని ఆదర్శంగా తీసుకునే ప్రత్యేక రోజు కేవలం ఒక దినోత్సవం కాదు, మానవత్వం పరిమళించే ఒక మహాయజ్ఞం. ప్రాణం నిలిపే అమృతధార ప్రతిరోజూ మన దేశంలో వేలాది మంది ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రసవ సమయంలో తల్లీబిడ్డలు రక్తహీనతతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. తలసేమియా, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే చిన్నారులు, రోగులకు క్రమం తప్పకుండా రక్తం ఎక్కించాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో, దాతలు అందించే ప్రతి రక్తపు చుక్క ఓ అమృతధారలా మారి ప్రాణాలను నిలుపుతుంది. మన దేశంలో ఏటా సుమారు 1.2 కోట్ల యూనిట్ల రక్తం అవసరం ఉండగా, స్వచ్ఛంద దాతల ద్వారా కేవలం 90 లక్షల యూనిట్లు మాత్రమే అందుతోందని రక్త దాతలు, వైద్యులు చెబుతున్నారు. ఈ అంతరాన్ని పూడ్చాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. అపోహల తెరలను చీల్చుదాం రక్తదానం అనగానే చాలామందిలో అపోహలు, అనవసర భయాలు గూడుకట్టుకుని ఉంటాయి. ‘రక్తదానం చేస్తే నీరసించిపోతాం, అనారోగ్యం పాలవుతాం’ వంటివి కేవలం నిరాధారమైన ప్రచారాలు మాత్రమే. వాస్తవాలను పరిశీలిస్తే.. రక్తం ఇస్తే నీరసం వస్తుందా? మన శరీరంలో సగటున 5–6 లీటర్ల రక్తం ఉంటుంది. దానం చేసేది కేవలం 350 మిల్లీలీటర్లు మాత్రమే. ఈ కొద్దిపాటి రక్తాన్ని మన శరీరం కేవలం 24 నుంచి 48 గంటల్లోనే తిరిగి ఉత్పత్తి చేసుకుంటుంది. ఎలాంటి నీరసం రాదు. రక్తదానం వల్ల ఇన్ఫెక్షన్లు సోకుతాయా? రక్త సేకరణ ప్రక్రియ అత్యంత సురక్షితమైనది. ప్రతి దాతకు కొత్త, స్టెరిలైజ్డ్ సూదిని మాత్రమే ఉపయోగిస్తారు. దీనివల్ల దాతకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకే అవకాశమే లేదు. దాతలే హీరోలు.. రక్తదానం చేయడానికి ప్రత్యేక అర్హతలేమీ అవసరం లేదు. మానవత్వంతో స్పందించే ప్రతి ఒక్కరూ రక్తదాత కావచ్చు. వయస్సు 18 నుంచి 65 సంవత్సరాల మధ్య ఉండాలి. బరువు కనీసం 50 కిలోగ్రాములు ఉండాలి. ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు, అంటువ్యాధులు ఉండకూడదు. హిమోగ్లోబిన్ స్థాయి కనీసం 12.5 గ్రాములు ఉండాలి. పురుషులు ప్రతి మూడు నెలలకు ఒకసారి, మహిళలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చు.ప్రాణదానానికి మొదటి బాట రక్తదానంపై అపోహలను నమ్మవద్దు ఆధునిక వైద్య విధానంలో రక్తదానం 100శాతం సురక్షితం. ప్రతి దాత భద్రతను నిర్ధారించుకున్నాకే రక్తాన్ని స్వీకరిస్తాం. 18 ఏళ్లు వయసు దాటిన వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. నిజానికి, క్రమం తప్పకుండా రక్తదానం చేయడం వల్ల శరీరంలో అధిక ఐరన్ నిల్వలు తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పాత రక్తకణాల స్థానంలో కొత్తవి ఏర్పడి, శరీరానికి నూతనోత్తేజం లభిస్తుంది. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ దీనిని ఒక సామాజిక బాధ్యతగా భావించి ముందుకు రావాలి. – డాక్టర్. జి.నాగభూషణరావు, డీసీహెచ్ఎస్, పార్వతీపురం మన్యం జిల్లాశతక దానానికి ఒక్క అడుగు దూరం మన ఇంట్లో వారికి రక్తం అవసరమైతే ఎంత ఆరాటపడతామో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. బ్లడ్ బ్యాంకులో మనకు తెలియని వారెందరో అదే ఆరాటంతో ఎదురుచూస్తున్నారు. అక్కడ ప్రాణాలతో పోరాడుతున్నది ఎవరో కాదు. మన లాంటి మనుషులే. ఇప్పటికి స్వచ్ఛందంగా ప్రత్యక్ష రక్త దాతగా దైర్యంగా 99 సార్లు ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేశాను. యువత ముఖ్యంగా రక్తదానానికి ముందుకురావాలి. పుట్టినరోజున రక్తదానం చేసి ఆ రోజును మరపురానిదిగా చేసుకునే మంచి ఆలోచనలు యువతలో రావాలి. – బోటు రామకృష్ణ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, పార్వతీపురం ప్రాణాలు నిలబెడుతున్న రక్తదాతలు పార్వతీపురం మన్యం జిల్లాలో 1682 మంది స్వచ్ఛంద రక్తదానం నేడు జాతీయ స్వచ్ఛంద రక్తదాన దినోత్సవం -
సీఎం పర్యటనకు 600 మందితో బందోబస్తు
విజయనగరం క్రైమ్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి సీఎం చంద్రబాబు రాష్ట్ర ఎన్ఆర్ఐ, సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజపతినగరం నియోజకవర్గంలోని దత్తిరాజేరు మండలం దత్తి గ్రామానికి వస్తున్న సంగతి విదితమే. పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు మంత్రి కొండపల్లి ఆధ్వర్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణిలు మంగళవారం పింఛన్లు పంపిణీ చేసే సభా ప్రాంగణాన్ని ఎస్పీ దామోదర్ ,ఏఎస్పీ సౌమ్యలతలతో కలిసి పరిశీలించారు. ఈ మేరకు భద్రతా ఏర్పాట్ల రూట్ మ్యాప్‌లను దగ్గరుండి మంత్రులకు ఎస్పీ దామోదర్ చూపించారు. దాదాపు 600 మంది సిబ్బందితో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ దామోదర్ ఈ సందర్భంగా వివరించారు. సభా స్థలం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్, మీటింగ్ స్థలం, కార్యకర్తలతో సమావేశ స్థలం, పార్కింగ్ స్థలాలు, కాన్వాయ్ వెళ్లే మార్గాలను క్షేత్ర స్థాయిలో ఎస్పీ దామోదర్ పర్యవేక్షించారు. బందోబస్తు, భద్రత విధులు నిర్వహించే పోలీసు అధికారులు, సిబ్బంది నిర్వహించే విధులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు, మహిళా పీఎస్ డీఎస్పీ ఆర్.గోవిందరావు, డీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్, పలువురు సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఇచ్చిన మాటను చంద్రబాబు, లోకేష్ నిలబెట్టుకోవాలి
● ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.రాంబాబుగజపతినగరం: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లిఫ్ట్ కాలువ నుంచి విజయనగరంలోని వెదురు వాడ తాటిపూడి ఎక్స్టెన్షన్ బాలెన్స్ రిజర్వాయర్ తరువాత ఎక్కడా బాలెన్సింగ్ రిజర్వాయర్ లేదని దీంతో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని ఏపీ రైతు సంఘం జిల్లాకార్యదర్శి బి.రాంబాబు అన్నారు. ఈ మేరకు మంగళవారం గజపతినగరం మండలం పురిటి పెంట గ్రామపంచాయతీ కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు బొండపల్లి సభలోను, అలాగే నారాలోకేష్ గంట్యాడ మండలంలో జరిగిన సభలోను ఎలైన్ మెంట్ పరిశీలించి ప్రత్యామ్నాయ మార్గం పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు. నేటికీ ఇచ్చిన ఆ మాటను తండ్రీకొడుకులు నిలబెట్టు కోలేదన్నారు. గుమడాం గ్రామం నుంచి కోటగండ్రేడు వరకు కాలువ లోలెవెల్లో తీసుకుని పోయి అక్కడి నుంచి ఐదు లిఫ్ట్‌ల ద్వారా నీరు పంప్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. జిల్లాలోని మెట్టప్రాంతాలకు సాగునీరందేలా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పోలవరం ఎడమ కాలువ పోరాట కమిటీ జిల్లా కన్వీనర్ చల్లా జగన్, గంట్యాడ మండలం పోరాట కమిటీ కన్వీనర్ కోడెల శ్రీను, కౌలు రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు తొత్తడి పైడిపు నాయుడు, రైతు సంఘం నాయకులు డుదేవర జగన్, దాసరి సింహాద్రి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు రాకోటి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
ఆరేళ్లకే నిండిన నూరేళ్లు
● బస్సు ఢీకొని బాలిక మృతిరాజాం సిటీ: అప్పటి వరకు సరదాగా చిట్టిపొట్టి మాటలు ఆడుతూ తల్లిదండ్రులతో పాటు ద్విచక్రవాహనంపై వెళ్లిన ఆ చిన్నారిని బస్సు రూపంలో మృత్యువు కబళించింది. దసరా ఎంతో సంతోషంగా జరుపుకోవాలని భావించిన ఆ కుటుంబంలో విషాదం నిండింది. ఆరేళ్లకే నూరేళ్లు నిండిపోయాయా అంటూ పెట్టిన తల్లిదండ్రుల రోదన స్థానికులను కలిచివేసింది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కుమార్తె కళ్లెదుటే మృతిచెందడంతో జీర్ణించుకోలేక గుండెలవిసేలా తల్లిదండ్రులు రోదించారు. ఈ హృదయ విదారక ఘటన రాజాంలో మంగళవారం జరిగింది. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు..రేగిడి మండలం బూరాడ గ్రామానికి చెందిన లుకలాపు మోహనరావు మెకానిక్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. భార్య ఇందు, కుమార్తె ద్రాక్షాయణి(6)తో కలిసి ద్విచక్రవాహనంపై బొద్దాం నుంచి రాజాం వస్తున్నారు. అదే సమయంలో బొబ్బిలి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బొబ్బిలి జంక్షన్ సమీపంలో ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. రెండో వైపు పడిపోయిన చిన్నారి తల్లిదండ్రులు వెంటనే తేరుకుని కుమార్తెను చూసి ఒక్కసారిగా భోరున విలపించారు. తన కుమార్తెకు ఏమీ కాదని దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి చిన్నారిని మోసుకుంటూ తండ్రి తీసుకువెళ్లిన దృశ్యం చూసిన స్థానికులు అయ్యో పాపం అంటూ నిట్టూర్చారు. చిన్నారి మృతితో బూరాడ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై రమణమూర్తి తెలిపారు. -
చట్టాలపై అవగాహనతోనే గిరిజనుల సంక్షేమం
● విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం బబితపార్వతీపురం రూరల్: భారత రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన ప్రత్యేక హక్కులు, ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉన్నప్పుడే వారి సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.బబిత ఉద్ఘాటించారు. ఈ మేరకు మంగళవారం పార్వతీపురం మండలంలోని చినమరికి గ్రామంలో నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల సామాజిక, ఆర్థిక సాధికారిత కోసం ఎన్నో ప్రణాళికలు, చట్టాలు దేశంలో ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న బాల్య వివాహాలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, 18ఏళ్ల వయస్సు దాటాకే వారు శారీరకంగా, మానసికంగా పరిణతి చెందుతారన్నారు. చిన్న వయస్సులో వివాహం చేయడం వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని, ఈ క్రమంలో తక్కువ బరువుతో పిల్లల పుట్టడం, నవజాత శిశు మరణాలు, పోషకాహార లోపాలు వంటి అనేక సమస్యలకు దారి తీస్తుందని ఆమె హెచ్చరించారు. అడవి, భూమిని కాపాడుకోవాలి ఈ కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా జడ్జి ఎస్.దామోదరరావు మాట్లాడుతూ గిరిజనుల జీవనానికి, సంస్కృతికి ఆధారమైన అడవి, భూములను కాపాడుకోవడానికి ప్రభుత్వాలు కల్పించిన హక్కులు ఎంతగానో తోడ్పడతాయన్నారు. తమ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ అవగాహనతో తెలుసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, పార్వతీపురం అదనపు జూనియర్ సివిల్ జడ్జి జె.సౌమ్య జోష్పిన్, పార్వతీపురం రూరల్ సీఐ రంగనాథం, ఎస్సై సంతోషికుమారి, తహసీల్దార్ సురేష్, లోక్ అదాలత్ సభ్యులు జోగారావు, మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.వెంకటరావు, స్థానిక సర్పంచ్ గంగ తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకారులకు నష్టం జరిగే చర్యలు విరమించుకోవాలి
విజయనగరం: మత్స్యకారులకు నష్టం కలిగించే చర్యలను ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు, జిల్లా మత్స్యకార సహకార సంఘం అధ్యక్షుడు బర్రి చిన్నప్పన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేట గ్రామం నక్కపల్లి మండలం బల్క్ డ్రగ్స్ పార్క్‌ను వ్యతిరేకిస్తూ స్థానిక మత్స్యకారులు 15రోజుల నుంచి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర హోంమంత్రి అనిత సొంత నియోజకవర్గంలో ఇలాంటి పరిశ్రమను మత్స్యకారుల పొట్టకొట్టే విధంగా ఏర్పాటు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో బల్క్ డ్రగ్స్ పార్కు ఏర్పాటు చేస్తే మత్స్యకారుల జీవనానికి విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు. పార్కును వ్యతిరేకిస్తూ ఉద్యమం చేసిన వారిపై తప్పుడు కేసులు పెడితే మత్స్యకారులకు అండగా రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు అండగా నిలుస్తాయని చెప్పారు. ప్రభుత్వం దుష్ట చర్యలకు పాల్పడకుండా తక్షణమే తీరప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణం ఆలోచన విరమించుకోవడంతో పాటు మత్స్యకారులపై కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. -
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు
● కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మివిజయనగరం: పైడితల్లి జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని కార్పొరేషన్ మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పది అంశాలను అజెండాలో పొందుపరచగా.. సభ్యులు ఆమోదించారు. పైడితల్లి జాతర నేపథ్యంలో కార్పొరేషన్ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను అధికారులు వివరించారు. సమావేశం అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది సహకారంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామన్నారు. వీధి దీపాలు, తాత్కాలిక మరుగుదొడ్లు, పారిశుధ్య పనులపై దృష్టి సారించామని చెప్పారు. ఫ్లోర్‌లీడర్ ఎస్వీవీ రాజేష్ మాట్లాడుతూ.. ఉత్సవాలు విజయవంతం కావడానికి అధికారులు, సిబ్బంది సహకరించాలని కోరారు. సమావేశంలో కమిషనర్ పల్లి నల్లనయ్య, స్టాండింగ్ కమిటీ సభ్యులు అల్లు చాణిక్య, జీవీ రంగారావు, సుంకర నారాయణస్వామి, రేగాన రూపాదేవి, సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్పై సీఎం పర్యటన ఏర్పాట్ల ప్రభావం
● కలెక్టర్, జేసీ లేకపోవడంతో తగ్గిన వినతులు ● డీఆర్ఓ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహణవిజయనగరం అర్బన్: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంపై సీఎం జిల్లా పర్యటన ఏర్పాట్ల ప్రభావం పడింది. వినతుల స్వీకరణ కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు లేకపోవడంతో సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన పలువురు ప్రజలు వెనుదిరిగారు. వినతులు ఇవ్వకుండా వెనుతిరిగిన అర్జీదారుల్లో ఎస్.కోట, విజయనగరం మండలాల నుంచి వచ్చిన రైతులు ఉన్నారు. పీజీఆర్ఎస్కు ప్రతి సోమవారం 200కు పైగా వచ్చే అర్జీలు ఈ వారం 134 మాత్రమే నమోదయ్యాయి. డీఆర్ఓ ఎస్.శ్రీనివాసమూర్తి అధ్వర్యంలో నిర్వహించిన వినతుల స్వీకరణ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వెంకటేశ్వర్రావు, మురళి, నూకరాజు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వాటిని పరిశీలించి, పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపించారు. ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 30 ఫిర్యాదులు విజయనగరం క్రైమ్: ఎస్పీ ఆదేశాలతో విజయనగరం డీఎస్పీ గోవిందరావు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికను పరేడ్ మైదానం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 30 మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలను డీఎస్పీకి విన్నవించారు. -
హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాలి
● 1998 ఎంటీఎస్ ఐపాధ్యాయ సంఘం పిలుపుపార్వతీపురం: ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని ఉమ్మడి విజయనగరం జిల్లా ఎంటీఎస్ ఉపాధ్యాయ సంఘ నాయకుడు ఉమా కామేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలోని చర్చివీధిలో గల వేదాంత జూనియర్ కళాశాలలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 25 ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 98 డీఎస్సీ ఉపాధ్యాయ అభ్యర్థుల్లో వెలుగు నింపి ఉపాధ్యాయులుగా నియమించారన్నారు. ఎంటీఎస్ టీచర్లను రెగ్యులర్ చేయాలని, 12 నెలల జీతాన్ని ఇవ్వాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. న్యాయమైన హక్కుల సాధనకు, న్యాయపోరాటానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని కోరారు. 98 ఎంటీఎస్ సమస్యల పరిష్కారం కోసం, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అక్టోబర్ 11న విజయవాడలో నిర్వహిస్తున్న విజ్ఞాపన సభను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నాయకులు పీవీ రామ మోహనరావు, కె.రమేష్, దామోదరరావు, పూడు శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఐవీ ఎయిడ్స్‌పై అవగాహన కల్పించాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి విజయనగరంఫోర్ట్: హెచ్ఐవీ, ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి తెలిపారు. ఈ మేరకు స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఇటీవల నిర్వహించిన రెడ్‌రన్ మారథాన్ 5కెలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఐవీ రోగుల పట్ల వివక్ష చూపరాదన్నారు. వారి పట్ల ప్రేమ అప్యాయత చూపించాలని సూచించారు. కార్యక్రమంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి తదితరులు పాల్గొన్నారు. -
రీఅసెస్మెంట్ పూర్తయినా అందని టీఏడీఏలు..!
విజయనగరం ఫోర్ట్: దివ్యాంగులకు పింఛన్ వెరిఫికేషన్ పేరిట కూటమి సర్కార్ తీసుకొచ్చిన సదరం సర్టిఫికెట్ల రీవెరిఫికేషన్ నిర్వహించిన వైద్యులకు చెల్లించాల్సిన టీఏ, డీఏలు ఇవ్వకుండా కూటమి సర్కార్ జాప్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రీ అసెస్మెంట్ జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకు టీఏ, డీఏలు చెల్లించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సొంత డబ్బులు పెట్టుకుని వైద్యులు వివిధ ప్రాంతాల నుంచి రీ అసెస్మెంట్ చేయడానికి ఆస్పత్రులకు వచ్చారు. రీ అసెస్ మెంట్ చేసినందుకు గాను వారికి చెల్లించాల్సిన టీఏ. డీఏలకు సంబంధించి డబ్బులు మాత్రం చెల్లించకుండా కూటమి సర్కార్ జాప్యం చేయడం పట్ల వైద్యులు ఆవేదన చెందుతున్నారు. రీ అసెస్మెంట్ నిర్వహించిన ఆస్పత్రులు జిల్లాలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, చీపురుపల్లి, గజపతినగరం, ఎస్.కోట, రాజాం, సాలూరు ఏరియా ఆస్పత్రులు, పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో దివ్యాంగులకు రీ అసెస్మెంట్ నిర్వహించారు. రీఅసెస్ మెంట్లో 40 నుంచి 50 మంది వైద్యులు 2025 జనవరిలో కూటమి ప్రభుత్వం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా దివ్యాంగ పింఛన్లు పొందుతున్న దివ్యాంగులకు రీఅసెస్మెంట్ కార్యక్రమాన్ని చేపట్టింది. జనవరి నెలలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. వారంలో మూడు రోజుల పాటు దివ్యాంగులకు రీ అసెస్ మెంట్ చేసేవారు. బుధ, గురు, శుక్రవారాల్లో ఆయా ఆస్పత్రుల్లో వైద్యులు రీ అసెస్మెంట్ నిర్వహించారు. 30వేల మందికి పైగా దివ్యాంగులకు పరీక్షలు జిల్లాలో వేలాది మంది దివ్యాంగులకు వైద్యులు రీఅసెస్మెంట్ చేశారు. దివ్యాంగులకు అవసరమైన పరీక్షలు నిర్వహించి రీ అసెస్మెంట్ సర్టిఫికెట్స్ ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. కంటి, ఎముకలు, ఈఎన్టీ, మానసిక, న్యూరో విభాగాలకు సంబంధించి 30 వేలమందికి పైగా దివ్యాంగులకు వైద్యులు రీ అసెస్మెంట్ నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వైద్యుల రాక జిల్లాలో దివ్యాంగులకు రీ అసెస్మెంట్ నిర్హహించేందుకు వివిధ విభాగాలకు చెందిన వైద్యులు విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వచ్చేవారు. త్వరలో చెల్లిస్తాం దివ్యాంగులకు రీ అసెస్మెంట్ నిర్వహించడానికి వచ్చిన వైద్యులకు టీఏ, డీఏలు చెల్లించాల్సి ఉంది. నిధులు వచ్చాయి. త్వరలోనే చెల్లిస్తాం. – డాక్టర్ పద్మశ్రీ రాణి, జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి దివ్యాంగులకు సదరం రీ అసెస్మెంట్ చేసిన వైద్యులు జిల్లాలో ఈఏడాది జనవరి నుంచి ప్రారంభమైన ప్రక్రియ 30 వేలకు పైగా దివ్యాంగులకు పరీక్షలు చేసి రీఅసెస్మెంట్ వైద్యులకు టీఏ, డీఏల బకాయి -
సీఎం రాక ఏర్పాట్ల పరిశీలన
దత్తిరాజేరు: దత్తి గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం వస్తున్న సందర్భంగా గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను కలెక్టర్ ఎస్.రామ్సుందర్రెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం పరిశీలించారు. ముఖ్యమంత్రి పింఛన్లు పంపిణీ చేసే ఇళ్లకు వెళ్లే మార్గాలను, వాహనాల పార్కింగ్, కూటమి నాయకులతో సమావేశం కానున్న హాల్‌ను పరిశీలించారు. హెలిప్యాడ్ వద్దకు ఇతరులు రాకుండా కంచెను కట్టుదిట్టంగా వేయాలని, గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధుల రాకపోకలకు అనువుగా అన్ని ఏర్పాట్లు ఉండాలని పోలీస్, ఇతర శాఖల అధికారులను అదేశించారు. -
సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యం
● కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి పార్వతీపురం రూరల్: ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన రెవెన్యూ, సంక్షేమం, అభివృద్ధి రెండు విభాగాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 102 వినతులను కలెక్టర్‌తోపాటు జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి, పాలకొండ సబ్‌కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్ఓ కె. హేమలత, ఎస్డీసీలు పి. ధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, డీఆర్డీఏ, డ్వామా పీడీలు ఎం.సుధారాణీ , కె.రామచంద్రరావులు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శాఖాధికారులు వారికి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేస్తూ సమస్యలను సంపూర్ణంగా విన్నవించుకునే విధంగా అర్జీదారులకు అవకాశం కల్పించామని తెలిపారు. అలాగే ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పలు శాఖల జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రజల పిటిషన్లకు పరిష్కారం ప్రజలకు జవాబుదారీగా వ్యవహరించి పిటిషన్లకు పరిష్కారం చూపిస్తూ, వచ్చిన ఫిర్యాదులను చట్టపరిధిలో పరిష్కరించాలని పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి సంబంధిత పోలీసు శాఖాధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న పలు స్టేషన్ల పరిధుల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి 5 పిటిషన్లు స్వీకరించి, అర్జీదారులతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఎస్పీ ఫోన్లో మాట్లాడి ఫిర్యాదు అంశాలను పరిశీలించి, వాటి పూర్వాపరాలను విచారణ చేసి, ఫిర్యాదు అంశాలు వాస్తవాలైనట్లయితే చట్ట పరిధిలో తక్షణ చర్యలు చేపట్టాలని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ ఆదాం, సీసీఎస్ సీఐ అప్పారావు, తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఐటీడీఏ పీజీఆర్ఎస్కు 23 వినతులు సీతంపేట: స్థానిక ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 23 వినతులు వచ్చాయి. ఏపీఓ జి.చిన్నబాబు అర్జీలు స్వీకరించారు. తాడిపాయికి చెందిన నందిని భాషా వలంటీర్ పోస్టు ఇప్పించాలని కోరారు. పాతూరుకు చెందిన ఢిల్లేశ్వరరావు ఏదైనా ఆశ్రమపాఠశాలలో కుక్, కమాటి పోస్టులో నియమించాలని విజ్ఞప్తి చేశాడు. కొత్తకోటలో ఉన్న అంగన్వాడీ భవనం శిథిలావస్థలో ఉన్నందున కొత్త భవనం మంజూరు చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. మినీగురుకులానికి మౌలికవసతులు కల్పించాలని కె.వీరఘట్టానికి చెందిన బి.నీలకంఠం అర్జీ అందజేశాడు. అచ్యుతాపురానికి చెందిన బి.సుశీల వాటర్‌ప్లాంట్ మంజూరు చేయాలని కోరింది. కార్యక్రమంలో ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ ఈఈ రమాదేవి, డిప్యూటీఈఓ రామ్మోహన్రావు, స్పోర్ట్స్ ఇన్చార్జ్ జాకాబ్ దయానందం తదితరులు పాల్గొన్నారు. -
వైభవంగా శ్రీవారి కల్యాణం
● స్వామివారికి టీటీడీ నుంచి పట్టువస్త్రాల సమర్పణనెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి కల్యాణం సోమవారం వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయంలో ప్రాతఃకాల పూజలనంతరం యాగశాలలో అర్చకులు విశేష హోమాలు జరిపించారు. శ్రీ వేంకటేశ్వరస్వామిని నూతన పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ రామతీర్ధం తిరు వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం రామాలయంలోని వెండి మంటపం వద్ద లక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామిని తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తెచ్చిన పట్టువస్త్రాలతో సుందరంగా అలంకరించి కల్యాణ వేడుకను కనులపండువగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరసింహాచార్యులు, కిరణ్‌కుమార్, రామగోపాలాచార్యులు, నగర పంచాయతీ వైస్‌చైర్మన్ సముద్రపు రామారావు, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు 20 మంది ఎంపిక
బొబ్బిలి రూరల్: రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు 20 మందితో జట్టును ఎంపిక చేసినట్లు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి విజయకుమార్ తెలియజేశారు. ఈ మేరకు బొబ్బిలి మండలంలోని పారాది జెడ్పీహెచ్ పాఠశాలల సోమవారం జరిగిన జిల్లా సీనియర్ మెన్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారుల ఎంపికను పీడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించామని 60 మంది పాల్గొనగా ఉత్తమ ప్రతిభను కనబర్చిన 20 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని వారిని సత్తెనపల్లిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపనున్నామని తెలిపారు. -
వైద్యుల సమ్మె సైరన్
గుమ్మలక్ష్మీపురం: మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రభుత్వ వైద్యులకు ఇన్‌సర్వీస్ కోటా కుదింపును వ్యతిరేకిస్తూ పీహెచ్‌సీల్లో పనిచేస్తున్న వైద్యులు సోమవారం ఓపీ విధులను బహిష్కరించారు. అత్యవసర కేసులకు మాత్రమే వైద్యులు వైద్య సేవలు అందించారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో తాడికొండ, దుడ్డుఖల్లు, రేగిడి, కురుపాం మండలంలోని మొండెంఖల్లు, నీలకంఠాపురం, కొమరాడ మండలంలోని కొమరాడ, కూనేరు రామభద్రాపురం, మాదలంగి, జియ్యమ్మవలస మండలంలోని జియ్యమ్మవలస, రావాడ రామభద్రాపురం, గరుగుబిల్లి మండలంలోని గరుగుబిల్లి, రావివలస గ్రామాల్లోని పీహెచ్‌సీలు నిర్మానుష్యంగా కనిపించాయి. వీరఘట్టం: పీహెచ్సీ వైద్యుల సమ్మెలో భాగంగా సోమవారం ఓపీ సేవలు బహిష్కరించారు. వీరఘట్టం పీహెచ్సీలో 5 ఎమెర్జెన్సీ కేసులకు మాత్రమే చికిత్స అందించినట్లు డాక్టర్ సాయికుమార్ తెలిపారు. ప్రతిరోజు 80 నుంచి 100 వరకు ఓ.పీ ఉండేది. డాక్డర్ల సమ్మెతో వీరఘట్టం పీహెచ్సీ వెలవెలబోయింది. కొందరు రోగులు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించారు. -
తిన్నోళ్లకు తిన్నంత ఉపాధి
ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ, సాలూరులోని కామాక్షమ్మ సోమవారం సరస్వతీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సరస్వతీదేవి జన్మించిన మూలనక్షత్రంను పురస్కరించుకుని అమ్మవార్ల ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. కుంకుమ పూజలు జరిపారు. – పాలకొండ/సాలూరు ● వేతనదారుల కడుపుకొట్టి, అక్రమార్కుల బొజ్జ నింపుతున్న ఎన్ఆర్ఈజీఎస్ ● అధికారులు, ఉద్యోగుల కుమ్మక్కు ● పెద్దఎత్తున నిధులు స్వాహా ఆదుకోండయ్యా... సాక్షి, పార్వతీపురం మన్యం: ●గరుగుబిల్లి మండలంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో భారీగా అవకతవకలు చోటు చేసుకున్నాయి. రూ.20 కోట్ల విలువైన 1,600 పనుల్లో పెద్ద ఎత్తున లోపాలను గుర్తించారు. చెరువు పనుల కొలతల్లో తేడాలు.. హాజరుకా ని వారికి వేతనాల చెల్లింపులు.. ఒకే కుటుంబానికి రెండేసి జాబ్ కార్డులు ఇవ్వడం వంటివి గుర్తించారు. నాగూరు, మరుపెంట క్షేత్ర సహా యకులు ఎక్కువగా అక్రమాలకు పాల్పడ్డార ని.. వారిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.● ●బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో పలువురికి ఇళ్లు మంజూరయ్యాయి. వీటిని 2022లో నిర్మించుకున్నారు. వీరికి ఎన్ఆర్ఆజీఎస్ పథకం నుంచి ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున రావాల్సి ఉంది. ఆ మొత్తం కోసం ఫీల్డ్ అసిస్టెంట్‌ను ఎన్నిసార్లు అడిగినా.. ప్రభుత్వం నుంచి నిధు లు రాలేదంటూ చెప్పుకొచ్చారు. దీనిపై వారు ఆరా తీస్తే.. వీరి మస్తర్లను వేరొకరి పేరుతో వేసి సొమ్ము పక్కదారి పట్టించినట్లు తెలిసింది. దీనిపై ఏపీవో, ఎంపీడీవోలకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని బాధితులు పూడి గంగమ్మ, సురగాల చిన్నమ్మ, సత్యవతి, కరుణ మ్మ, పెద్దింటి లక్ష్మి తదితరులు చెబుతున్నారు. ఇలా గ్రామంలో 30 నుంచి 40 మందికి సంబంధించి బినామీ మస్తర్లతో నిధులను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ● గ్రామీణ ప్రాంత పేదలకు పని భద్రత కల్పించే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. ఆ శాఖలోని అధికారుల కు, క్షేత్ర స్థాయి సిబ్బందికి వరంలా మారుతోంది. వేతనదారుల కడుపుకొట్టి.. వారి బొజ్జలు నింపు కొంటున్నారు. ప్రధానంగా ఉపాధి పనుల కొలత ల్లో తేడాలు, తప్పుడు మస్తర్లు వేయడం.. దస్త్రాల నిర్వహణ సక్రమంగా చేపట్టకపోవడం.. బిల్లుల స్వాహా.. ఇలా ఒక్కటేమిటి అందివచ్చిన ఏ అవకాశాన్నీ సిబ్బంది వదల డం లేదు. ఇటీవల గరుగుబిల్లి మండలంలో పనుల కు సంబంధించి చేపట్టిన సామాజిక తనిఖీల్లో సుమారు రూ.2 లక్షల వరకు కొలతల్లో తేడాలు, బినామీ మస్తర్లను గుర్తించారు. పనిచేయని లబ్ధిదారులకు విత్ హోల్డ్ బిల్లులు దాదాపు రూ. 5 లక్షల వరకు క్షేత్రసహాయకులు స్వాహా చేశారు. పంట పొలాలకు సంబంధించి సాగునీరు వెళ్లే పిల్ల కాలువల కొలతల్లో ఎక్కువ నమోదు చేసి, బిల్లులు పక్కదారి పట్టించారు. జిల్లాలో అనేక చోట్ల అనర్హు లకు జాబ్ కార్డులున్నాయి. గ్రామాల్లో ఎవరికై నా జాబ్ కార్డు కావాలంటే రూ.వెయ్యి చొప్పున వసూ లు చేస్తున్నారు. పనులు కల్పించాలంటే.. వారానికి రూ. వంద చొప్పున ఒక్కో వేతనదారు నుంచి కలెక్షన్ చేస్తున్నారు. బలిజిపేట మండలం పెదపెంకిలో తప్పుడు మస్తర్లు వేసి, పెద్ద ఎత్తున నిధుల స్వాహాపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో సంబంధిత సిబ్బంది రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టారు. జిల్లాలో 4 లక్షల మందికిపైగా వేతన దారులు ఉన్నా రు. 2.15 లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి. ఏటా పెద్ద ఎత్తున ఉపాధి పనులు కల్పిస్తున్నారు. ఉపాధి నిధుల ద్వారా వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. సన్న, చిన్నకారు రైతుల పంట భూముల్లో పండ్ల తోటలతో పాటు.. రహదారుల పక్కన మొక్కలు నాటేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. ఎకరా పొలంలో సుమారు 70 మొక్కలు నాటేందుకు రూ. 95 వేల వరకూ సాయం అంది స్తారు. లెక్కల్లో పనులైతే చూపిస్తున్నారు గానీ.. నిధులు అక్రమార్కులకే కడుపు నింపుతోంది. చిన్న ఉద్యోగుల నుంచి అధికారుల స్థాయి వరకూ ఆదాయ వనరుగా ఉపాధి పథకం మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాకు ముగ్గురు కుమార్తెలు.. కాయకష్టంతో ఇద్దరికి వివాహాలు చేశాను.. మూడో కుమెర్తె పైడి పుట్టుకతోనే వినికిడిలోపంతో పాటు మూగది. ఇంటర్ చదువుకున్న కుమార్తెకు ఉపాధి కల్పించడంతో పాటు వినికిడి యంత్రం అందజేయాలంటూ బలిజిపేట మండలం తుమరాడ గ్రామానికి చెందిన మర్రాపు అమ్మడమ్మ కలెక్టర్‌కు విన్నవించింది. పార్వతీపురం రూరల్: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు పలు సమ స్యలపై కలెక్టర్, ఉన్నతాధికారులకు వినతులు అందజేశారు. ఆదుకోవాలంటూ వేడుకున్నారు. గుమ్మలక్ష్మీపురం మండలంలో ఉపాధిహామీ పథకంలో భాగంగా రూ.35.89 కోట్లతో చేపట్టిన 2,939 అభివృద్ధి పనుల్లో వివిధ దశల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. చెముడుగూడలో చేపట్టిన ఫారంపాండ్‌లో ఆరు పనులు చేపట్టకుండానే రూ. 1.20 లక్షల బిల్లులు డ్రా చేశారు. నెల్లికెక్కువ గ్రామంలో పనికి వెళ్లకుండా 10 మందికి మస్తర్లు వేసి కూలి డబ్బులు చెల్లించారు. దొరజమ్ము ఆశ్రమ పాఠశాల ఆవరణలో చేపట్టిన రక్షణ గోడకు సంబంధించిన రూ.1.20 లక్షలు, బీటీ రహదారులకు సంబంధించిన బిల్లులు వెండరుకు ఇవ్వకుండా, అధికారుల ఖాతాల్లోకి జమ అయ్యాయి. -
కూటమిలో ప్రొటోకాల్ రగడ
సీతంపేట: అన్న క్యాంటీన్ శంకుస్థాపన సాక్షిగా పాలకొండ నియోజకవర్గంలోని కూటమి నాయకు ల అంతర్గత కుమ్ములాటలు మరోమారు బహిర్గతమయ్యాయి. టీడీపీ, జనసేన నాయకుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట గ్రామ సచివాలయం కార్యాలయం వద్ద రూ.60 లక్షలతో నిర్మించనున్న అన్న క్యాంటీన్ కు పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సోమవా రం శంకుస్థాపన చేశారు. ప్రొటోకాల్ ప్రకారం తమను ఎందుకు పిలవలేదంటూ టీడీపీ పాలకొండ నియోజకవర్గ ఇన్చార్జి పడాల భూదేవి, మండల కన్వీనర్ సవర తోట ముఖలింగం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు పి.రాజబాబు, మాజీ ఎంపీటీసీ సభ్యురా లు బి.జయలక్ష్మి, ఏఎంసీ డైరెక్టర్ ఎం.మోహన్‌రావు, ఎస్.మంగయ్య తదితరులు నిర్వాహకులను నిలదీశారు. ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఎమ్మెల్యేను సైతం ప్రశ్నించారు. ఓట్లు వేసిన కార్యకర్తలను వదిలేసి, ఎటువంటి అర్హత లేని వారికి ప్రాధాన్యమివ్వడం తగదన్నారు. చివరకు మాటా, మాటా పెరిగి జనసేన, టీడీపీ కార్యకర్తల మధ్య నువ్వా.. నేనా అన్నస్థాయిలో వాగ్వాదం చెలరేగింది. ఎస్ఐ వై.అమ్మన్నరావు జోక్యం చేసుకుని ఇరువర్గాలను సముదాయించారు. -
సూపర్ జీఎస్టీ, సేవింగ్స్ బ్రోచర్ విడుదల
పార్వతీపురం రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ 2.0తో పేద, మధ్యతరగతి వర్గాలకు చేకూరిన లబ్ధిని తెలియజేసే సూపర్ జీ ఎస్టీ, సూపర్ సేవింగ్స్ బ్రోచర్ కరపత్రాన్ని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి సోమవారం విడుదల చేశారు. ప్రజలకు కలిగే లబ్ధిని క్షుణ్ణంగా వివరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు జేసీ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, డీఆర్వో హేమలత, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. సీతంపేట: సీతంపేటలో సోమవారం జరిగిన వారపు సంత క్రయవిక్రయదారులతో కిక్కిరిసింది. దసరా ముందురోజు సంతకావడంతో పొట్టేళ్లు, నాటుకోళ్ల క్రయవిక్రయాలు జోరుగా సాగాయి. కిలో పైబడి ఉన్న నాటుకోడి పుంజు రూ.1500లు, 15 కిలోల మేక, గొర్రె పోతులు రూ.20వేలు పైబడి ధర పలికాయి. సీజ్ చేసిన వాహనాలు అప్పగించండి ● ఎస్పీ దామోదర్ విజయనగరం క్రైమ్: జిల్లాలో పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను నిబంధనల మేరకు అప్పగించాలని ఎస్పీదామోదర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. చీపురుపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని గజపతినగరం పోలీస్ స్టేషన్‌ను సోమవారం తనిఖీచేశారు. స్టేషన్ ప్రాంగణంలోని వాహనాలను పరిశీలించారు. స్టేషన్ పరిధిలో మరిన్ని ఎక్కువ సీసీ కెమెరాలను అమర్చాలని, గస్తీ, పెట్రోలింగ్‌ను ముమ్మరం చేయాలని, నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని స్టేషన్ సిబ్బందిని ఆదేశించారు. గంజాయి రవాణా, విక్రయించేవారు, మహిళల పట్ల దాడులకు, బాలలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు ఉన్నారు. -
టాస్క్‌ఫోర్స్ ఉందా? లేదా?
● మాదక ద్రవ్యాల సరఫరాపై కొరవడిన నిఘా ● ‘స్పా‘సెంటర్లపై కానరాని దాడులు ● మూడు నెలల్లో ముగ్గురు సీఐల బదిలీవిజయనగరం క్రైమ్: పోలీస్ శాఖలో టాస్క్ ఫోర్స్ ప్రత్యేక విభాగం. సమాజంలో పైకి కనిపించని, పోలీసుల కళ్లు గప్పి చాపకింద నీరులా సాగి పోయే అనైతిక పనులు, చట్టవ్యతిరేక చర్యలకు చెక్ పెట్టేందుకే పోలీస్ శాఖలోంచి ప్రత్యేక విభాగంగా ఏర్పడిందే టాస్క్ ఫోర్స్. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, కొకై న్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాల పంపిణీ జరుగుతుంటే టాస్క్‌ఫోర్స్ నియంత్రించాలి. అయితే జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌లో ఆ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. 2023 నుంచి టాస్క్ పోర్స్ వింగ్ పని తీరు జిల్లాలో అంతగా లేదంటే లేదనే పోలీస్ శాఖ చెబుతోంది. ఈ మధ్యనే విశాఖ రేంజ్ డీఐజీ కాస్త దృష్టి పెట్టడంతో జిల్లాలో మాదక ద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా, స్పాసెంటర్ల పనితీరుపై టాస్క్‌ఫోర్స్ వింగ్‌తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఇటీవల ఆర్టీసీ కాంప్లెక్స్, రింగ్ రోడ్లో పుట్టుకొచ్చిన స్పా సెంటర్లను తనిఖీ చేశారు. రెండు నెలల క్రితం సైబర్ సెల్ సీఐగా ఉన్న బంగారు పాప టాస్క్ ఫోర్స్ సీఐగా బాధ్యతలు చేపట్టి..తనకు వచ్చిన సమాచారంతో రింగ్ రోడ్లో ఉన్న ఓ స్పా సెంటర్ పై దాడి చేసి అక్కడ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టారు. అ తర్వాత రాజాం ఏరియాలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కూడా దృష్టి పెట్టాలని ఆమె వెళ్లారు. అయితే అకస్మాత్తుగా ఆ సీఐని వీఆర్ లోకి పంపించింది పోలీస్‌శాఖ. అంతకు ముందు వన్ టౌన్ సీఐగా పని చేసిన డా.వెంకటరావు టాస్క్ పోర్స్ సీఐగా బాధ్యతలు చేపట్టి కొద్ది నెలలైనా కాలేదు. అకస్మాత్తుగా ఆయనను అనకాపల్లి టాస్క్ పోర్స్ సీఐగా బదిలీ చేశారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర కల్పవల్లి, విజయనగరం ఆడపడుచు శ్రీశ్రీశ్రీ పైడితల్లి పండుగ వస్తున్న వేళ..టాస్క్ పోర్స్ సీఐగా శోభన్ బాబును నియమించింది పోలీస్ శాఖ. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మాదక ద్రవ్యాలు, గంజాయి అక్రమ రవాణా, స్పా సెంటర్ లలో అసాంఘిక కార్యకలాపాలపై కొత్తగా సీఐగా బాధ్యతలు చేపట్టిన శోభన్‌బాబు ఏ విధంగా చర్యలు చేపడతారో వేచి చూడాలి. ఎస్పీ ఆదేశాలతో చర్యలు అసాంఘిక కార్యకలాపాలపై ఎస్పీ ఆదేశాలతో చర్యలు చేపడుతున్నామని విజయనగరం ఇన్చార్జ్ డీఎస్పీ గోవిందరావు అన్నారు. గంజాయి అక్రమ రవాణా నిర్మూలనకు దృష్టి పెట్టామన్నారు. ఈగల్ ఆధ్వర్యంలో కళాశాలలు, పాఠశాల్లో మాదక ద్రవ్యాల వినియోగం, సరఫరాపై అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. టాస్క్ ఫోర్స్ వింగ్ పని తీరు ఏఎస్పీ ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాలతో జరుగుతోందన్నారు. ముగ్గురు సీఐలు మారడం రోజవారీ శాఖ పనిలో భాగమేనన్నారు. -
కోట దుర్గమ్మకు పంచలోహ కవచం వితరణ
కురుపాం: స్థానిక రావాడ జంక్షన్లో వెలసిన కోట దుర్గమ్మవారికి కీర్తిశేషులు నడుకూరు దుర్గ భవాని ప్రసాద్ దంపతుల కుమారుడు నడుకూరు దూళికేశ్వరరావు ఆదివారం అమ్మవారి విగ్రహానికి రూ.లక్షా ముప్ఫై వేల విలువైన పంచలోహ కవచం వితరణగా అందజేశారు. ఈ మేరకు ఆలయ అర్చకుడు శ్రీనివాస నాయక్, ఆలయ కమిటీ సభ్యులకు పంచలోహ కవచాన్ని అందజేసి అమ్మవారికి అలంకరించాలని కోరారు. 50 మందిపై తేనెటీగల దాడినెల్లిమర్ల రూరల్: మండలంలోని పారసాం గ్రామంలో తేనెటీగలు ఆదివారం బీభత్సం సృష్టించాయి. గ్రామ దేవతల ఉత్సవాల సందర్భంగా గ్రామస్తులు అమ్మవారి సన్నిధికి వెళ్లగా డీజే శబ్దాలకు స్థానిక శివాలయం వద్ద ఉన్న తేనె తుట్ట చెలరేగడంతో ఈగలు స్థానికులపై విచ్చలవిడిగా దాడి చేశాయి. దాడిి జరిగిన సమయంలో సుమారు 200 మంది ఉండగా వారిలో 50 మందిని తేనెటీగలు గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని కేంద్రాస్పత్రికి తరలించగా మిగిలిన వారికి కొండవెలగాడ పీహెచ్సీలో చికిత్స అందించారు. క్షతగాత్రుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో పారసాం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నేటి నుంచి రిలే నిరాహార దీక్షలు● జిందాల్ నిర్వాసితుల నిర్ణయం శృంగవరపుకోట: కంపెనీ ఏర్పాటు పేరుతో జిందాల్ తీసుకున్న తమ భూములు తమకే ఇవ్వాలని చేస్తున్న జిందాల్ నిర్వాసితుల దీక్షలు 100వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా నాలుగెకరాల భూమి కోల్పోయి నిరసన చేస్తున్న వందేళ్ల వృద్ధురాలు గొండ గద్దమను ఎమ్మెల్సీ రఘురాజు, ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ తదితరులు ఆదివారం సన్మానించారు. ఈ సందర్భంగా ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి చెందిన నిర్వాసితులు నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు. అనంతరం నిర్వాసితులు మాట్లాడుతూ ఇంత వరకూ తమ పోరాటాలతో అన్ని వర్గాల వారి అభిమానం సాధించుకున్నామని, మన పోరాటానికి ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన కరువైందని, నిద్దరోతున్న ప్రభుత్వాన్ని లేపడానికి నిరాహారదీక్షలు చేయాల్సి రావడం సిగ్గుచేటన్నారు. ఈ పోరాటంలో నిర్వాసితులతో చివరి వరకూ ఉండి, మద్దతిస్తామని రఘురాజు, జగన్‌లు తెలిపారు. -
లక్షణాలు కనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి
ఇటీవల కాలంలో గుండెపోటు కేసుల్లో ఎక్కువగా 40 ఏళ్ల లోపు వారు ఉంటున్నారు. ధూమపానం, కొకై న్, డ్రగ్స్, ఖైనీ వంటివి తీసుకోవడం, ఆహారపు అలవాట్లు మారడం, వ్యాయమం లేకపోవడం, విపరీతమైన మానసిక ఒత్తిడి వంటి కారణాలతో గుండెపోటు వస్తుంది. రక్తంచిక్కగా ఉండడం వల్ల సడన్‌గా ఉండెపోటు వస్తుంది. గుండె పోటు లక్షణాలు ఏమాత్రం కనిపించినా వైద్యులను సంప్రదించాలి. పీచుపదార్థాలు ఉండే కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. తాజా పండ్లు తినాలి. డాక్టర్ జి.సూర్యప్రకాష్, కార్డియాలజిస్టు, విజయనగరం -
హృదయం పదిలమా..!
● మానవుని జీవన శైలిలో మార్పులు ● పెరుగుతున్న గుండెజబ్బులు ● తక్కువ వయసులోనే గుండెపోటు ● బీపీ, సుగర్ నియంత్రణలో ఉంచుకోవాలివిజయనగరం ఫోర్ట్: మానవుని ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పులు వచ్చాయి. ఉరుకులు పరుగులతో జీవనం సాగిస్తున్నారు. అదేవిధంగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. ఉద్యోగులు పని ఒత్తిడికి, నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలు వారు జీవనం ఏవిధంగా సాగించాలనే అనే ఆందోళన, విద్యార్థులకు భవిష్యత్తుపై ఇలా ప్రతి ఒక్కరిలోను ఏదో ఒక ఆందోళన ఉంటుంది.దీని వల్ల అత్యంత ప్రధానమైన గుండెకు హాని జరిగే ప్రమాదం ఉంది. సోమవారం ప్రచంచ గుండె దినోత్సవం. గుండెను పరిరక్షించుకోకపోతే మానవుని ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ప్రతి వ్యక్తి గుండెను పరిరక్షించుకోవడం కోసం ప్రత్యేక శ్రద్ధ చూపాలి. సరైన ఆహార నియామలు పాటించకపోవడం, కొవ్వు అధికంగా ఉంటే ఆహార పదార్థాలను అధికంగా తినడం తదితర కారణాల వల్ల ఎక్కువ మంది గుండెజబ్బుల బారిన పడుతున్నారు. వ్యాధిని గుర్తించడం ఇలా వ్యాధిలో సాధారణంగా ఎటువంటి లక్షణాలు కనిపించవు. బీపీని వైద్యులు పరీక్షల ద్వారానే గుర్తించడం సాధ్యం.రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు మాత్రమే కొన్ని లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, శ్వాసతీసుకోవడంలో కష్టం, ఛాతీలో నొప్పి లక్షణాలు కనిపిస్తాయి. అధిక రక్తపోటు రక్తనాళాల్లో రక్తం సాధారణ ఒత్తిడికంటే ఎక్కువ ఒత్తిడితో ప్రసరించినప్పుడు దానిని అధిక రక్తపోటు అంటారు. తరచూ రక్తపోటు తనిఖీ చేయించుకోవాలి. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రక్తపరీక్షలు చేయించుకోవాలి. హైపర్ టెన్షన్ ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించాలి. అధిక రక్తపోటుకు కారణం: నూడిల్స్, చాట్స్, పానీపూరీ వంటి జంక్ ఫుడ్స్ తినడం వల్ల, టీవీ అధికంగా చూడడం వల్ల శారీరక వ్యాయమం లేకపోవడం, ఒకే చోట 8 నుంచి 12 గంటలు పాటు పనిచేయడం, మానసిక ఒత్తిడి, సంఘర్షణ, ఆత్మన్యూనత, పొగతాగడం, ఆల్కహాల్ సేవించడం వంటి వాటి వల్ల అధిక రక్తపోటు వస్తుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ప్రతిరోజు అరగంట పాటు వ్యాయమం చేయాలి. మానసిక ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా గడపాలి. పొగతాగడం, మద్యం తీసుకోవడం పూర్తిగా మానివేయాలి. యోగా, ధైవభక్తి పెంపొదించుకోవాలి. ఉప్పు, మసాలాల వాడకం తగ్గించుకోవాలి. అధికపిండి పదార్ధాలు, జంక్ ఫుడ్ తగ్గించుకోవాలి. 30 సంవత్సరాలుపై బడిన వారు ప్రతి 6 నెలలుకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. -
ఘనంగా మిస్టర్ ఆంధ్ర పోటీలు ప్రారంభం
విజయనగరం గంటస్తంభం: పట్టణంలోని ఆనంద గజపతి కళాక్షేత్రం వేదికగా కనకల ఎర్రయ్య మె మోరియల్ మిస్టర్ ఆంధ్రా రాష్ట్రస్థాయి బాడీబిల్డింగ్ పోటీలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. విజయనగరం జిల్లా బాడీబిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాడీబిల్డింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకల కృష్ణ మాట్లాడుతూ, కనకల ఎర్రయ్య జ్ఞాపకార్థం ఈ ఏడాది 12వ మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దసరా, పైడితల్లి అమ్మవారి ఉత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పోటీలను నిర్వహించడం విశేషమన్నారు. ఈ సారి మొత్తం 164 మంది క్రీడాకారులు పోటీల్లో తమ ప్రతిభను ప్రదర్మించారని వెల్లడించారు. విజేతలకు రూ.1.30 లక్షల నగదు ప్రోత్సాహకంతో పాటు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులందరికీ తగిన వసతులు కల్పించామని, ఈ పోటీల ద్వారా విజయనగరం ప్రతిష్ఠను రాష్ట్రవ్యాప్తంగా చాటుకోవడమే లక్ష్యమని అసోసియేషన్ నాయకులు తెలపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు, కార్యదర్శి బైక్ రమేష్, నాయకులు పిన్నింటి సూర్యనారాయణ, రాఘవరెడ్డి, రాజేందర్ రెడ్డి, జనప్రియ శ్రీనివాస్, శ్రీనివాస్ వర్మ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు
విజయనగరం గంటస్తంభం: భగత్‌సింగ్, మహాత్మాగాంధీ జయంతుల సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐల ఆధ్వర్యంలో జిల్లాస్ధాయిలో నిర్వహించిన వాలీబాల్ పోటీలు ఎంఆర్ గ్రౌండ్లో ఆదివారం పోటాపోటీగా జరిగాయి. ఒకటవ పట్టణ ఎస్సైలు లక్ష్మీప్రసన్నకుమార్, లక్ష్మునాయుడులు పాల్గొని భగత్‌సింగ్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి క్రీడాపోటీల వల్ల విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి కలుగుతుందన్నారు. ఈ క్రీడాపోటీల్లో జిల్లా స్థాయిలో విన్నర్‌గా జేఎన్టీయూ టీమ్, రన్నరప్‌గా జీఎంఆర్‌ఐటీ టీమ్ నిలిచాయి. మొదటి విజేతకు రూ.10వేలు, ద్వితీయ విజేతకు రూ.5వేలు నగదు బహుమతులు అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు డి.రాము, సీహెచ్.వెంకటేష్‌లు మాట్లాడుతూ భగత్‌సింగ్,గాంధీజీ స్ఫూర్తితో ఏటా యువతలో క్రీడాప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
యూపీహెచ్సీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి
విజయనగరం ఫోర్ట్: పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల (యూపీహెచ్సీ) ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ఆ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు జి.అప్పలసూరి డిమాండ్ చేశారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీహెచ్సీ ఉద్యోగులు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఎఫ్ఆర్ఎస్ యాప్‌లో సమస్యలు పరిష్కరించకుండా చిరు ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. సమావేశంలో సంఘం నాయకులుల బాలరాజు, శంకర్, సుమిత్ర, హరికృష్ణ, మురళీమోహన్, సాంబమూర్తి పాల్గొన్నారు. -
లాటరీ ద్వారా డ్వాక్రా బజార్ స్టాల్స్ కేటాయింపు
విజయనగరం టౌన్: పైడితల్లి అమ్మవారి పండగ, విజయనగర ఉత్సవాల సందర్భంగా సెర్ప్, డీఆర్ డీఏ ఆధ్వర్యంలో అక్టోబరు 8 వరకూ నిర్వహించనున్న అఖిల భారత డ్వాక్రా బజారుకు పెద్ద ఎత్తున మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన, అమ్మకాని కి వచ్చినట్టు డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం వచ్చిన మహిళా సంఘాలకు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి స్టాల్స్ కేటాయింపు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటూ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళా సంఘ సభ్యులకు స్టాల్స్ కేటాయింపును లాటరీ ప్రక్రియ ద్వారా డ్రా నిర్వహించారు. నాబార్డ్‌కు 60, మెప్మాకు 26, ఆర్వైఎస్ఎస్కి 15 స్టాల్స్ కేటాయించామన్నారు. స్టాల్స్ నిర్వహకులకు భోజనం, తాగునీరు, పబ్లిక్ టాయిలెట్స్ సౌకర్యాలు ఏర్పాటు చేశామని, శానిటేషన్ విషయంలో ఎటువంటి అలసత్వం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఇన్చార్జ్ మంత్రి వంగలపూడి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మిగజపతిరాజు, కలెక్టర్ తదితరులు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. డీఆర్డీఏ అదనపు సంచాలకులు కె.సావిత్రి, సరస్ స్టేట్ కోఆర్డినేటర్ శ్రీనివాస్, సెర్ప్ పీడీ రత్నాకర్, సీ్త్ర నిధి డీజీఎం సిద్ది శ్రీనివాస్, కృష్ణంనాయుడు, డీపీఎంలు రాజ్‌కుమార్, చిరంజీవి, సీతారామయ్య, లక్ష్మునాయుడు పాల్గొన్నారు. -
కూటమి నిర్లక్ష్యంతో... కమ్ముకోనున్న చీకట్లు
పార్వతీపురం రూరల్: కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో విద్యుత్ ఉద్యోగుల సహనం కట్టలు తెంచుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి, తమ సమస్యలను పట్టించుకోకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందన కరువవడంతో, వచ్చే నెల అక్టోబర్ 15వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) అల్టిమేటం జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో విద్యుత్ సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. విద్యుత్ ఉద్యోగుల పట్ల కూటమి ప్రభుత్వం మొండి వైఖరి ఇలాగే కొనసాగితే రాష్ట్రం కారు చీకట్లలోకి జారుకునే ప్రమాదం పొంచి ఉంది. మొండి చేయి చూపుతున్న ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక ఇప్పుడు తమ గోడును పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరణ వంటి కీలక హామీలపై ప్రభుత్వం ఉలుకుపలుకు లేకుండా వ్యవహరిస్తోందని జేఏసీ నేతలు మండిపడుతున్నారు. నెలలు తరబడి శాంతియుతంగా నిరసనలు, ధర్నాలు, కార్యాలయాల ఎదుట ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో సమ్మె తప్ప మరో మార్గం లేదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రాల్లోనూ, విద్యుత్ కార్యాలయాల వద్ద దశల వారీగా నిరసనలు చేపట్టినా ఫలితం శూన్యం కావడంతో ప్రస్తుతం వీరి ఉద్యమం రెండో దశకు చేరుకుంది. ఏళ్లుగా మేము కోరుతున్న పీఆర్సీ అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, కారుణ్య నియామకాలు వంటి కీలకమైన అంశాలపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తోంది. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు. మా హక్కులు సాధించేంత వరకు మా పోరాటాన్ని దశల వారీగా మరింత ఉధృతం చేస్తాం. విద్యుత్ ఉద్యోగులందరూ ఈ నిరసనలో ఐక్యంగా పాల్గొంటారు. – వంగపండు లక్ష్మణ, జేఏసీ చైర్మన్, పార్వతీపురం మన్యం జిల్లా రాష్ట్ర వ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా, ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 1200 మంది విద్యుత్ ఉద్యోగులు కూడా ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలో నిరసన తెలిపి, తమ సమస్యల తీవ్రతను తెలియజేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి, రాష్ట్ర జేఏసీ నేతలను చర్చలకు పిలిచి, ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో వచ్చే నెల 15వ తేదీ నుంచి జరిగే సమ్మెలో జిల్లా ఉద్యోగులంతా ఏకతాటిపై నిలిచి పాల్గొంటారని, ప్రజలకు కలిగే అసౌకర్యానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. మొత్తం మీద ప్రభుత్వ ఉదాసీన వైఖరి విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభానికి దారితీసేలా ఉంది. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి తక్షణమే స్పందించి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే, దాని పర్యవసానాలు తీవ్రంగా ఉండనున్నాయని విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు. హామీలు అమలు చేయకపోవడంతో రోడ్డెక్కిన విద్యుత్ ఉద్యోగులు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రెండో దశకు చేరుకున్న నిరసనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన బాట పట్టిన 1200 మంది ఉద్యోగులు ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఉద్యోగుల అల్టిమేటం అక్టోబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు సై -
జాతరో..జాతర
విజయనగరం టౌన్: తనను కొలిచిన వారికి కొంగుబంగారమై, చింతలు తీర్చే చింతమానును ఎంపిక చేసుకుని సిరిమానుగా మలుచుకుని సిరుల ఉత్సవానికి సిద్ధమవుతున్న చిన్నారి పైడితల్లి జాతర మహోత్సవాలకు భక్తులు పెద్దఎత్తున తరలిరావాలని ఊరూ.. వాడా పండగ వాతావరణం చేసుకోవాలని రామవరపు చినపైడిరాజు బృందం ఆదివారం సాయంత్రం చదురుగుడిలో కొలువైన అమ్మవారికి మనవి చెప్పి ఆలయం ఆవరణలో భాజాభజంత్రీలతో, మేళతాళాలల నడుమ పండగ చాటింపు వేశారు. డప్పు వాయిద్యాలతో, ధూపదీప నైవేద్యాలను అమ్మకు సమర్పించారు. సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావుతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతీ ఏటా నిర్వహించే సిరిమాను జాతర ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా నిర్వహించేలా చూడాలని అమ్మను ప్రార్ధించారు. అనంతరం ఆలయం ఆవరణలో దండోరా వేశారు. అక్టోబరు 6న పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరం, 7న సిరుల తల్లి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని చాటింపు వేశారు. అక్కడ నుంచి డప్పు వాయిద్యాలతో కోట వద్దకు వెళ్లి కోట శక్తికి మనవి చెప్పి చాటింపు వేశారు. అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారిణి కె.శిరీష మాట్లాడుతూ అక్టోబరు 22 వరకూ పండగ ఘనంగా నిర్వహిస్తామని, ప్రధాన ఘట్టాలైన తొలేళ్ల సంబరాలు, సిరిమానోత్సవానికి చాటింపు ప్రక్రియ ఆనవాయితీగా వస్తోందన్నారు. నెల రోజుల పండగలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకోవాలని ఆమె కోరారు. -
ఏఐటీటీ పరీక్షల్లో గిరిజన విద్యార్థుల ప్రతిభ
సీతంపేట: ఈ ఏడాది జూలైలో జరిగిన ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ పరీక్షల్లో స్థానిక ప్రభుత్వ ఐటీఐలో ఒక ఏడాది కోపా (కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్) కోర్సును చదువుతున్న గిరిజన విద్యార్థిని తంబర ఝాన్సీ లక్ష్మీభాయి 600 మార్కులకుగాను 600 సాధించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అలాగే డ్రెస్ మేకింగ్ కోర్సులో సవర రవీంద్ర 600 మార్కులకుగాను 580 మార్కులు సాధించి దేశంలోనే బాలుర విభాగంలో రెండో స్థానంలో నిలిచాడు. ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో మూటక లావణ్య 1200 మార్కులకుగాను 1193, మెకానిక్ మోటార్ వెహికల్ ట్రేడ్‌లో సవర చరణ్ 1200 మార్కులకుగాను 1192 మార్కులు సాధించారు. వివిధ ట్రేడ్లలో 600మార్కులకుగాను 599, 597, 596 మార్కులు పలువురు విద్యార్థులు సాదించి ప్రతిభ చాటారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ మూటక గోపాలకృష్ణ, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. -
నేడు ఐటీడీఏలో పీజీఆర్ఎస్
సీతంపేట: స్థానిక ఐటీడీఏలోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నారు. పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ వినతులు స్వీకరించనున్నారు. గిరిజనులు తమ సమస్యలపై వినతులు సమర్పించవచ్చని అధికారులు తెలిపారు. వైద్యుల సమ్మెకు ల్యాబ్ టెక్నీషియన్ల మద్దతు వీరఘట్టం: తమ సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుల సమ్మెకు తమ సంపూర్ణ మద్దుతు ప్రకటిస్తున్నామని జిల్లా ల్యాబ్ టెక్నీషియన్ల అసోషియేషన్ అధ్యక్షుడు వై.తిరుపతిరావు తెలిపారు. ఆదివారం ఆయన వీరఘట్టంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 26 నుంచి అన్ని పీహెచ్‌ల్లో వైద్యులు సమ్మె బాట పట్టారని, ఇందులో భాగంగా ఆన్లైన్ రిపోర్టింగ్ సేవలు బంద్ చేశారన్నారు. ఈ నెల 29న అన్ని పీహెచ్‌సీల్లో ఓపీ సేవలు బంధ్, 30న జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, అక్టోబర్ 1న జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీలు, అక్టోబర్ 3న చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్టు తిరుపతిరావు తెలిపారు. ఇందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు మద్దతు తెలిపి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. పల్లకిలో పోలమాంబ తిరువీధి మక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఆలయంలో ఈవో బి.శ్రీనివాస్ ఆధ్వర్యంలో సప్తప్రాకార సేవ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. పోలమాంబ అమ్మవారిని గ్రామంలో పల్లకిలో తిరువీధి కార్యక్రమం నిర్వహించగా, మహిళలు కలశాలతో వెంట నడిచారు. పూజారి జన్ని పేకాపు భాస్కరరావు అమ్మవారి ఉత్సవమూర్తిని వనంగుడి చుట్టూ తలపై మోసుకుంటూ ప్రదక్షణలు చేశారు. వేదపండితులు కె.శ్రీనివాస్‌శర్మ హోమం, సప్తప్రాకారసేవ పూజలను అత్యంత వైభంగా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ట్రస్ట్‌బోర్డు చైర్మన్లు, సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. విజయనగరం టౌన్: రాష్ట్రంలో పీపీపీ విధానాన్ని రద్దు చేసి అన్ని మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నడిపించాలని ఏఐఎఫ్టీయూ జిల్లా నాయకులు రెడ్డి నారాయణరావు, ఎన్.అప్పలరాజురెడ్డి డిమాండ్ చేశారు. ఏఐఎఫ్టీయూ న్యూ ఆధ్వర్యంలో ఆదివారం గాంధీ పార్కు నుంచి గంటస్తంభం వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పది ప్రభుత్వ కళాశాలలను లీజుకిచ్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, జీవో నంబరు 107, 108లను రద్దు చేసి 100శాతం ఎంబీబీఎస్ సీట్లను ప్రభుత్వ కోటాలో భర్తీ చేయాలన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ప్రభుత్వమే అందుబాటులోకి తీసుకురావాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో గుజ్జూరు శంకరరావు, గోవింద్, త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. -
డిజిటల్ బుక్‌తో భరోసా
దని నిలదీశారు. అమ్మకు వందనం అందరికీ అందించడంలో విఫలమయ్యామని, కేంద్రం నుంచి నిధులు రాకే ఇబ్బందులు వచ్చాయని విద్యా శాఖా మంత్రి ప్రకటించడం వారి చిత్తశుద్ధి ఏమిటో తేటతెల్లం అవుతుందన్నారు. ప్రతీ నిరుద్యోగికి ప్రతి నెలా రూ.3 వేలు హామీ ఏమైందని ఎద్దేవా చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడం ఖాయమని అన్నారు. అనంతరం డిజిటల్ బుక్‌లో నమోదుకు క్యూఆర్ కోడ్‌తో ముద్రించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వర్రి నర్సింహమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు కేవీ సూర్యనారాయణరాజు, నెక్కల నాయుడుబాబు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అల్లు అవినాష్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గదుల సత్యలత, జిల్లా కార్యదర్శి ఇప్పిలి అనంత్, గొర్లె రవికుమార్, చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మజ్జి సిరి సహస్ర తదితరులు పాల్గొన్నారు. సీబీఐకి అప్పగించిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నా.. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావడం లేదన్నారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను వంచించిన కూటమి ప్రభుత్వం, ఆ పార్టీల నాయకులు సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ అని చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు. తమ హయాంలో ప్రతీ ఏటా రైతులకు అందించే రైతుభరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవగా మార్చి రెండేళ్లలో కేవలం రూ.5 వేలు అందించి రూ.35 వేలు ఎగ్గొట్టిన ఘనత కూటమి ప్రభుత్వానికే చెందుతుందన్నారు. ఖరీఫ్‌లో వరి సాగుకు రైతులకు సక్రమంగా యూరియా అందించని పరిస్థితి నెలకొందన్నారు. యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూటమి పార్టీల ఎమ్మెల్యేలే అసెంబ్లీలో చర్చించే పరిస్థితులు ఉన్నాయన్నారు. 50 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికీ సామాజిక పింఛన్లు అందిస్తామన్న హామీ అటకెక్కించారని, 18 ఏళ్లు నిండిన ప్రతీ ఆడబిడ్డకు రూ.15 వేల పథకం ఏమైంప్రజలకు మేలు చేసేలా చట్టసభల్లో శాసనాలు చేయాల్సిన చోట ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని, ఆయనలో అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. ఐదేళు ముఖ్య మంత్రిగా పని చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డిపై శాసనసభలో చేసిన అనుచిత వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వన్నె తెచ్చి, రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మవిభూషణ్ అవార్డు స్వీకరించిన, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు బాలకృష్ణ అహంభావానికి నిదర్శనమని అన్నారు. ఈ విషయంపై చిరంజీవి వెంటనే స్పందించడం హర్షణీయమని పేర్కొన్నారు. -
అభ్యంతరకర పోస్టులు పెడితే వ్యవస్థీకృత నేరం
● ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్ /విజయనగరం క్రైమ్: సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని అభ్యంతరకర, అసభ్యకరమైన పోస్టులు పెట్టేవారిపై పోలీసుశాఖ చర్యలు తీసుకోనున్నట్లు విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి స్పష్టం చేసినట్లు ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విశాఖ రేంజ్ డీఐజీ పలు జిల్లాల ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను అగౌరవ పరిచేలా, సమాజంలో అశాంతిని రెచ్చగొట్టేలా పోస్టు సృష్టించేవారిని ఉపేక్షించేదే లేదని, వారిని వ్యవస్థీకృత నేరగాళ్లుగా పరిగణించి కఠిన చర్యలు తీసుకోవాలని డీఐజీ ఆదేశించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక బృందాలతో నిరంతర నిఘా పెట్టి సోషల్ మీడియాలో పెట్టే ప్రతీపోస్టును క్షుణ్ణంగా పరిశీలించేందుకు కార్యాచరణ చేశామన్నారు. ఈ నేరాల నియంత్రణకు ప్రతి జిల్లాలో ఒక నోడల్ అధికారిని నియమించి వారి పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విజయనగరం ఎస్పీ దామోదర్ కూడా డీఐజీ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. సోషల్ మీడియా పోస్టులపై దృష్టి పెట్టాలని డీఐజీ సూచించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. -
శాశ్వత లోక్ అదాలత్‌ను వినియోగించుకోండి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబితవిజయనగరం లీగల్: శాశ్వత ప్రజా న్యాయ పీఠం సేవలను అందరూ వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత అన్నారు. ఈ మేరకు జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవగాహన సదస్సులో న్యాయమూర్తి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారులు, అనధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ శాశ్వత ప్రజా న్యాయపీఠం సేవలను అందరూ వినియోగించుకోవాలని సూచించారు. శాశ్వత న్యాయ పీఠం ఈ కింది సేవలకు సంబంధించిన తగాదాలను రాజీ మార్గం ద్వారా లేదా తుది తీర్పు ద్వారా పరిష్కరించనున్నట్లు తెలిపారు. బీమా, బ్యాకింగ్, ఆర్థిక సంస్థలు, విద్యాసంస్థలు, ప్రయాణికులు, వస్తువులు చేరవేసే రోడ్డు, వాయు, జల రవాణా సేవలు, పోస్టల్ టెలిఫోన్ టెలిగ్రాఫ్ సేవలు, ప్రజలకు సప్లై చేసే విద్యుత్, కాంతి, నీటి సరఫరా సేవలు, ప్రజారక్షణ వ్యవస్థ, పారిశుద్ధ్య సేవలు ఆస్పత్రి లేక నర్సింగ్ హోమ్ సేవలకు సంబంధించిన తగాదాలను రాజీమార్గం ద్వారా కానీ లేదా తుది తీర్పు ద్వారా పరిష్కరించుకోవచ్చునన్నారు. ఇది సులువైన ప్రత్యామ్నాయ పరిష్కారమని చెప్పారు. కార్యక్రమంలో చైర్మన్ శ్రీ దుర్గయ్య, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి ఎ. కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. -
పొట్టచేతబట్టుకుని వెళ్లి..
చీపురుపల్లి రూరల్(గరివిడి): కుటుంబపోషణ కోసం పొట్ట చేతబట్టుకుని ఊరికాని ఊరు వెళ్లిన గరివిడికి చెందిన కె. ప్రసన్నకుమార్ (45) ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయపూర్‌లో గల గోదావరి స్టీల్ ప్లాంట్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ సంఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు స్థానికులు తెలిపిన వివరాల మేరకు ప్రసన్నకుమార్‌కు రాయపూర్‌లో గల గోదావరి స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగావకాశం రావడంతో 20 రోజుల క్రితం ఇంజినీర్ హోదాలో ఉద్యోగంలో చేరారు. అప్పటినుంచి భార్యాపిల్లలను గరివిడిలో ఉంచి తాను రాయపూర్‌లో ఒక రూమ్ అద్దెకు తీసుకుని ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు. రాయపూర్‌లో అంతా అనుకూలంగా ఉండడంతో పిల్లలను తీసుకుని తన వద్దకు వచ్చేయాలని భార్యకు చెప్పాడు. ఈ మేరకు భార్య భవాని తన ఇద్దరు పిల్లలతో వెళ్లేందుకు సిద్ధమవ్వగా, వారికి తోడుగా మృతుని అన్నయ్య కూడా బయల్దేరాడు. వారంతా రాయపూర్ ప్రయాణమై మార్గమధ్యంలో ఉండగానే స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ప్రసన్నకుమార్ మృతి చెందాడన్న వార్త తెలియడంతో దారిలోనే కుప్పకూలిపోయారు. ప్లాంట్‌లో నిర్మాణం జరుగుతున్న సమయంలో బీమ్ పడిపోవడంతో సంఘటన స్థలంలోనే ప్రసన్నకుమార్ ప్రాణాలు విడిచాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు కొడుకు, కూతురు ఉన్నారు. కుటుంబపెద్ద మృతితో భార్యా పిల్లలు అనాథలుగా మిగిలారు. ఈ సంఘటనతో గరివిడి పట్టణంలోని టీచర్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాయపూర్‌లో గరివిడి వ్యక్తి మృతి ఉద్యోగంలో చేరిన నెల గడవకముందే ప్రమాదం అనాథలైన భార్యాపిల్లలు -
244 స్టాల్స్‌లో ఎస్‌హెచ్‌జీ ఉత్పత్తుల ప్రదర్శన
● నేటి నుంచి అఖిలభారత డ్వాక్రా బజార్ ● కలెక్టర్ ఎస్.రామసుందర్ రెడ్డి విజయనగరం అర్బన్: దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారుచేసిన ఉత్పత్తుల ప్రదర్శనకు అఖిల భారత డ్వాక్రా బజార్ వేదికగా నిలవనుందని కలెక్టర్ ఎస్.రామసుందర్‌రెడ్డి పేర్కొన్నారు. విజయనగరం పట్టణంలో ఆదివారం ప్రారంభం కానున్న ఈ ప్రదర్శనను ప్రజలంతా సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం, దసరా వేడుకలు, విజయనగరం ఉత్సవాల్లో భాగంగా స్థానిక మాన్సాస్ గ్రౌండ్స్‌లో ఈ నెల 28 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు అఖిల భారత డ్వాక్రా బజార్ కొనసాగుతుందన్నారు. 244 స్టాల్స్‌లో హస్తకళలు, కలంకారీ, చేనేత, వెదురు, ఆర్టిఫీషియల్ నగలు, డ్రైఫ్రూట్స్, పచ్చళ్లు, జ్యూట్‌బోర్డు ఉత్పత్తులు, నాబార్డు, పోచంపల్లి, గద్వాల్ వస్త్రాలు ఈ ప్రదర్శనలో విక్రయిస్తారని తెలిపారు. మన రాష్ట్రం నుంచి 26 జిల్లాల్లోని గ్రామీ ణ, పట్టణ ప్రాంత స్వయం సహాయక సంఘాలు పాల్గొంటున్నట్టు వెల్లడించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఇంటర్ పరీక్ష ఫీజులకు వేళాయె..!
పాలకొండ రూరల్: రానున్న ఏడాదిలో నిర్వహించనున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ క్రమంలో ఎటువంటి ఆపరాద రుసుము లేకుండా అక్టోబర్ 10వ తేదీ తుది గడువుగా సంబంధిత బోర్డు స్పష్టం చేసింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజుల స్వీకరణకు వచ్చే నెల 10 వరకు గడువు నిర్దేశించిన సంబంధిత బోర్డు 11 నుంచి 21 తేదీల మధ్య రూ.వెయ్యి అపరాధ రుసుముతో కలిపి చెల్లించేలా అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో సదరు విద్యార్థులు అదనపు మొత్తం చెల్లించే అవకాశం ఇవ్వకుండా వచ్చే నెలలోగా చెల్లించడం ఉత్తమమని కళాశాలల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఫీజుల చెల్లింపు ఇలా.. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంఽధించిన జనరల్, ఒకేషనల్ విద్యార్థులు థియరీ పరీక్షల కోసం రూ.600, జనరల్ కోర్సులు చదువుతున్న ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులు ప్రాక్టికల్స్‌కు రూ.275 చెల్లించాల్సి ఉంటుంది. ఒకేషనల్ కోర్సులు చదవుతూ బ్రిడ్జి కోర్సు చేసే విద్యార్థులు బ్రిడ్జి సబ్జెక్టులకు పరీక్ష ఫీజుగా రూ.165 చెల్లించాలి. ద్వితీయ సంవత్సరం చదువుతూ మొదటి సంవత్సరం పరీక్షలు తప్పిన విద్యార్థులు ప్రథమ, ద్వితీయ ఏడాదులకు థియరీ ఫీజుతో కలిపి రూ.1,200 చెల్లించాలి. ఒకేషనల్ కోర్సులు చదువుతూ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్‌కు హాజరు కావాల్సిన విద్యార్థులు రెండేళ్లకు కలిపి రూ.550 చెల్లించాలి. బ్రిడ్జి కోర్సులు చదువుతున్న విద్యార్థులు రెండేళ్లకు రూ.330 చెల్లించాలి. ప్రథమ, ద్వితీయ ఏడాదుల్లో ఉత్తీర్ణత పొంది మార్కులు పెంచుకునేందుకు పరీక్షలు రాయదలచిన ఆర్ట్స్ విద్యార్థులు రూ.1,350, సైన్స్ విద్యార్థులు రూ.1,600 ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో కళాశాలలు పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని 15 మండలాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు–14, హైస్కూల్ ప్లస్–2, కేజీబీవీలు–14, మోడల్ స్కూల్స్–4, సాంఘిక సంక్షేమ కళాశాలలు–5, గిరిజన సంక్షేమ కళాశాలలు–9, ప్రైవేట్ విభాగంలో 38 జూనియర్ కళాశాలలు నడుస్తున్నాయి. ప్రభుత్వ కళాళాలల్లో ప్రథమ సంవత్సరం–9,050మంది, ద్వితీయ సంవత్సరం 9,100 మంది విద్యార్థులు బోధన పొందుతున్నారు. ప్రైవేట్ జూనియర్ కళాశాల్లో 2,165 పైచిలుకు విద్యార్థులు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి.సకాలంలో చెల్లిస్తే మేలు ఫీజుల స్వీకరణ ప్రారంభమైంది. విద్యార్థులు ఈ విషయం గమనించి సకాలంలో నిర్దేశిత ఫీజులు చెల్లించాలి. లేకుంటే అధనపు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన 86 జూనియర్ కళాశాలలకు ఆదేశాలు అందించాం. యాజమాన్యాలు విద్యార్థులకు అవగాహన కల్పించి, నిర్దేశిత గడువు ముగిసే సమయానికి శతశాతం ఫీజులు చెల్లించేలా చూడాలి. లేకుంటే విద్యార్థులపై అదనపు భారం పడుతుంది. – వై.నాగేశ్వరరావు, డీఐఈవో, పార్వతీపురం మన్యం అక్టోబర్ 10తో ముగియనున్న గడువు గడువు ముగిశాక రూ.వెయ్యి అపరాధ రుసుం సకాలంలో ఫీజులు చెల్లించాలంటున్న అధికారులు