టెన్త్ పరీక్షల ఏర్పాట్లు పూర్తి : డీఈఓ
విజయనగరం అర్బన్: వచ్చే నెల మార్చి 16 నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లు డీఈఓ మాణ్యికంనాయుడు తెలిపారు. కలెక్టరేట్‌లో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పరీక్షల నిర్వాహణలో భాగంగా నియమితులైన చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు స్వయంగా సందర్శించి మౌలిక వసతులు సమృద్ధిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలన్నారు. ప్రతి కేంద్రాన్ని నోఫోన్ జోన్‌గా పరిగణించి మొబైల్ ఫోన్ తీసుకు రాకుండా కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పరీక్ష ప్రారంభమైన అర్ధ గంట తర్వాత విద్యార్థులను అనుమతించరాదన్నారు.


