● మనవడి కోసం.. అవ్వ సాహసం..
ఆ ఊరి నుంచి బాహ్య ప్రపంచంలోకి రావాలంటే నాగావళి నది దాటాల్సిందే. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు కావడంతో విద్యార్థులు నది దాటేందుకు
అవస్థలు పడుతున్నారు. ఇదంతా ఒకటైతే, ఓ అవ్వ.. దివ్యాంగుడైన తన మనవడి కోసం శక్తిని కూడదీసుకుని పెద్ద సాహసమే చేస్తోంది. కొమరాడ మండలం కొట్టు గ్రామానికి చెందిన డొంక కేశవ అనే దివ్యాంగుడు ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. అతని తల్లిదండ్రులు ఉపాధి నిమిత్తం విశాఖపట్నంలో ఉంటున్నారు. గ్రామంలో నాన్నమ్మ వెంకటమ్మ వద్దే కేశవ ఉంటున్నాడు. ప్రస్తుతం పరీక్షలు
జరుగుతుండడంతో.. నడవలేని స్థితిలో ఉన్న మనవడిని తీసుకుని, ఆ వయసులోనూ ఆ వృద్ధురాలు ప్రతిరోజూ నది దాటి వస్తోంది. పరీక్షకు తీసుకెళ్లి, మరలా ఇంటికి చేర్చుతోంది. మనవడి చదువు కోసం
అవ్వ పడుతున్న కష్టాన్ని చూసి అందరూ ప్రశంసిస్తున్నారు. – సాక్షి, పార్వతీపురం మన్యం
● మనవడి కోసం.. అవ్వ సాహసం..


