స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మెరుగైన ఫలితాలు సాధించాలి
విజయనగరం: స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వేలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆ దిశగా అందరూ కృషి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ బాలస్వామి కోరారు. ఇదే విషయమై ఆయన నగరంలోని తన కార్యాలయంలో కార్పొరేషన్ సిబ్బంది, శానిటేషన్ కార్యదర్శులతో శుక్రవారం సమావేశమై పలు సూచనలు చేశారు. ఇంటింటి చెత్త సేకరణ శతశాతం తరలించేలా చూడాలని, మరుగుదొడ్ల నిర్వహణలో మెరుగైన విధానాలు తీసుకురావాలని, ప్రజలతో భాగస్వాములై వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరించాలని, పురమిత్ర, ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందే ప్రజల సమస్యలను పరిష్కరించేలా చూడాలన్నారు. డీ అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్‌లు శతశాతం వసూలు చేయాలన్నారు. సమావేశంలో ప్రజారోగ్యాధికారి కొండపల్లి సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.


