breaking news
Parvathipuram manyam District News
-
కలెక్టరేట్లో నేడు పీజీఆర్ఎస్
పార్వతీపురం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా వినతులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు మీ కోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని, అర్జీల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయవచ్చని కలెక్టర్ సూచించారు. క్యూఆర్ కోడ్‌తో ఫీడ్‌బ్యాక్ పీజీఆర్ఎస్ ద్వారా అందుతున్న సేవలు, సమస్యల పరిష్కారంపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. మొబైల్ ఫోన్‌తో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పీజీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ పేజీలో వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలు, ఫిర్యాదులను ఆన్లైన్లో సమర్పించవచ్చన్నారు. గ్రామ, వార్డు ఉద్యోగులకు స్పెషల్ గ్రేడ్ స్కేల్● ఆరేళ్ల సర్వీసు పూర్తయిన వారికి ఏఏఎస్ పార్వతీపురం రూరల్: స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్న్స్మెంట్ స్కీమ్ (ఏఏఎస్) ను వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 7 జారీ చేసింది. ఒకే పోస్టు లేదా కేడర్‌లో ఆరేళ్ల అర్హత సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈ స్కీమ్ కింద ‘స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్’ మంజూరు చేయనున్నారు. 2019, 2020 నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై న ఉద్యోగులకు 11వ పీఆర్సీ ఏఏఎస్ నిబంధనలకు లోబడి ఈ స్కేల్ అమలు కానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై ఏపీఎన్జీజీవోస్ అసోసియేషన్ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు జీవీఆర్‌ఎస్ కిశోర్, కార్యదర్శి కె.రంగాచారి స్పందించారు. ఇందుకు సహకరించిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఏపీజేఏసీ చైర్మన్ అలపర్తి విద్యాసాగర్, ఏపీఎన్జీజీవోస్ ప్రధాన కార్యదర్శి డి.వి.రమణలకు వారు ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. బైక్‌ను ఢీకొట్టిన ఆటో: నలుగురికి గాయాలుసీతానగరం: మండలంలోని చినభోగిలి నుంచి ద్విచక్రవాహనంపై బొబ్బిలి వైపు వెళ్తున్న కుటుంబసభ్యులను వెనుక నుంచి వస్తున్న ఆటో ఢీ కొట్టడంతో నలుగురు గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంపై పోలీసులు తెలిపాన వివరాలిలా ఉన్నాయి. చినభోగిలికి చెందిన రాజాన చంటి తన భార్య, ఇద్దరు పిల్లలతో బొబ్బిలి బైక్‌పై వెళ్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి పార్వతీపురం నుంచి బొబ్బిలి వెళ్తున్న ఆటో ఢీ కొట్టడంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న చంటి, ఆయన భార్య పిల్లలు రోడ్డుపై పడి పోవడంతో గాయాలయ్యాయి. గాయాలపాలైన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించినట్లు హెచ్‌సీ తిరుపతిరావు తెలియ జేశారు. పార్వతీపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సేవల సంఘం (అమరావతి) రాష్ట్ర సహాధ్యక్షుడిగా జి.శ్రీరామ్మూర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఆదివారం అమరావతిలో జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో శ్రీరామ్మూర్తి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. రాష్ట్ర సహాధ్యక్షుడిగా ఎన్నికై న ఆయనకు ఏపీ జేఏసీ పార్వతీపురం మన్యం జిల్లా నాయకులతో పాటు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియజేశారు. -
కకావికలమవుతున్న కాపురాలు..!
పార్వతీపురం రూరల్: ఉమ్మడి విజయనగరం జిల్లాలో పక్కదారి పడుతున్న బంధాలతో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. సెల్ఫోన్ల దుర్వినియోగం, సోషల్ మీడియా మోజులో పడి అపరిచితులతో ఏర్పడుతున్న పరిచయాలు పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాయి. విచక్షణ కోల్పోయి క్షణికావేశంలో కట్టుకున్న వారినే కడతేర్చే సంస్కృతి పెరిగిపోతోంది. వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలతో కుటుంబాలు వీధిన పడుతుండగా, కన్నవారి అఘాయిత్యాల వల్ల ఎందరో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. గత ఏడాది (2025)లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏకంగా 30 హత్యలు జరగ్గా, వాటిలో విజయనగరం జిల్లాలో 22, పార్వతీపురం మన్యం జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. అడ్డుతొలగించుకునేందుకు దారుణం పాలకొండ మండలం బర్నసీతంపేటకు చెందిన గిరిజన యువతి బిడ్డిక ఉషారాణి (32) జూన్ 2026లో హత్యకు గురైంది. మాజీ వలంటీర్ రెడ్డి భువనేశ్వర్, ఆమెతో ప్రేమాయణం నడుపుతూనే, అదే సమయంలో తీగల కృపారాణి అనే వివాహితతో సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి చేసుకోవాలని ఉషారాణి ఒత్తిడి చేయడంతో, ప్రియురాలితో కలిసి పకడ్బందీగా పథకం పన్నాడు. జూన్ 6న కారులో తీసుకెళ్లి, కూల్ డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి ఇచ్చి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం మృతదేహం బయటపడకుండా కాళ్లు, చేతులు కట్టేసి, బరువైన రాయి కట్టి తుమరాడ వద్దనున్న చెరువులో పడేశారు. పరువు పోతుందనే భయంతో.. కురుపాం మండలానికి చెందిన ఇద్దరు పిల్లలున్న వివాహిత (30), సీతంపేట మండలానికి చెందిన మరో వివాహితుడు (34) మధ్య కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. వీరు గ్రామం విడిచి హైదరాబాద్ పారిపోగా, కుటుంబసభ్యులు పట్టుకుని తిరిగి సొంతూరికి తీసుకొస్తున్నారు. అయితే గ్రామంలో అడుగుపెడితే తమ భాగోతం తెలిసిపోయి బంధువుల ఎదుట పరువు పోతుందనే భయంతో మార్గమధ్యంలో కారు దిగి పురుగు మందు తాగేశారు (జూలై 2024). ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ ప్రాణాలు వదిలారు. ఉరివేసి..ఆత్మహత్యగా చిత్రీకరించి.. దత్తివలసకు చెందిన వివాహితుడు పెరుమాళ్ల రాంబాబు, నడిమివలసకు చెందిన 19 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె పెళ్లికి ఒత్తిడి చేయడంతో, ఏప్రిల్ 2025లో గొంతు నులిమి చంపేశాడు. స్నేహితుల సాయంతో మృతదేహాన్ని బైక్‌పై దాదాపు 150 కిలోమీటర్లు తీసుకెళ్లి, సాలూరు మండలంలోని గాదెపల్లెవలస వద్ద చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు. సీసీటీవీ ఫుటేజీలు, కాల్ డేటా ఆధారంగా ఈ ఘాతుకం వెలుగులోకి వచ్చింది. అనుమానపు కాటు..మద్యానికి బలి.. జూలై 8న జామి మండలం అలమండలో ఒడిశాకు చెందిన సంజయ్ బెహరా తన భార్యను అనుమానంతో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. దీంతో వారి ఏకై క కుమారుడు అనాథ అయ్యాడు. అలాగే, ఆగస్టు 2025లో సాలూరులో తాపీ మేసీ్త్రగా పనిచేసే రామకృష్ణ.. మద్యం కొనేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో భార్య త్రివేణి మెడకు మిక్సీ వైరు బిగించి దారుణంగా హత్య చేశాడు. జూలై 15న పూసపాటిరేగ మండలం పెద్దనడిపల్లిలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ఓ వివాహితను హతమార్చడంతో ఇద్దరు చిన్నారులు తల్లికి దూరమయ్యారు. మాయమాటల మత్తులో.. మంటగలుస్తున్న మానవత్వం ప్రియుల మోజులో పడి..కట్టుకున్న వారినే కడతేర్చి ఆవేశంలో అఘాయిత్యం..అంధకారంలో చిన్నారుల భవిష్యత్తు ఆధునికత ముసుగులో..అంతరిస్తున్న విలువలుక్షణికావేశం వద్దు.. కుటుంబ భవిష్యత్తే ముఖ్యం..వివాహేతర సంబంధాల మోజులో పడి, విచక్షణ కోల్పోయి అఘాయిత్యాలకు పాల్పడడం అత్యంత బాధాకరం. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల పచ్చని కాపురాలు కూలిపోవడమే కాకుండా, అభంశుభం తెలియని చిన్నారులు అనాథలవుతున్నారు. ఏదైనా దారుణానికి ఒడిగట్టే ముందు ఒక్కసారి కుటుంబం, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ చట్టాలపై కనీస అవగాహన పెంచుకోవాలి. తప్పు చేస్తే చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరన్న భయం ఉండాలి. ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భరోసా నింపుతూ, నేరాల నియంత్రణపై విస్తృత అవగాహన కల్పిస్తున్నాం. కుటుంబంలో కలహాలు, అనుమానాలు వస్తే పెద్దల సమక్షంలో లేదా కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవాలి. అంతేకానీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దు. ప్రశాంత సమాజం కోసం ప్రజలు పోలీసులకు సహకరించాలి. బి.వెంకట్రావు, సీఐ, పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ -
● గణేశుడికి లడ్డూల మాల
బలిజిపేట మండలకేంద్రంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన వినాయకుడికి 40లడ్డూలతో మాల తయారుచేసి వేశారు. స్వామివారికి పూలమాలలు తయారుచేయడం, నోట్లను మాలగా తయారుచేసి వేయడం సాధారణంగా జరుగుతుంది. అయితే లడ్డూల మాలతో స్వామివారిని అలంకరించడం గొప్పగా ఉందని స్థానికులు సంతృప్తి చెందారు. ఈ మాలను ఎంతో ఆశ్చర్యంగా భక్తులు చూశారు. స్థానికుడైన ఒక స్వీట్‌షాపు యజమాని 40లడ్డూలను ఒక మాలగా తయారుచేసి స్వామివారి మెడలో వేశారు. లడ్డూ మాల స్వామివారి మెడలో వేయడం ఇదే ప్రథమమని స్థానికులు తెలిపారు. వినాయకుడి నిమజ్జనం సమయంలో మాలను తీసి లడ్డూ ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. –బలిజిపేట -
మూడు తులాల బంగారం, రూ.20వేలు చోరీ
లక్కవరపుకోట: మండలంలోని భీమాళి గ్రామంలో శనివారం సాయంత్రం జరిగిన దొంగతనం కలకలం రేపింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న నత్తల రవి బస్ మెకానిక్ పనులు చేస్తుంటాడు. ఆయన తల్లి వ్యవసాయ పనులు చేస్తుంది. ఈ క్రమంలో శనివారం ఎప్పటి మాదిరి ఇంటికి తాళాలు వేసి కిటికీ పక్కన చెప్పులు స్టాండ్ వద్ద తాళాలు దాచిపెట్టి తల్లీకొడుకులు ఎవరి పనులకు వెళ్లిపోయారు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు గమనించి తాళాలను తీసుకుని ఇంట్లోకి వెళ్లి బీరువాలో గల వివిధ రకాల మూడు తులాల బంగారు వస్తువులు, రూ.20వేల నగదును దోచుకుపోయారు. పనులు పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తల్లి, కొడుకు చూసేసరికి ఇంటిలో సామగ్రి చిందరవందరగా పడి ఉండడం గమనించి బీరువాలో చూ డగా వస్తువులు కనిపించలేదు. దీంతో ఎల్.కోట పోలీస్‌లకు ఫిర్యాదు చేయుగా ఆదివారం ఉదయం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ వచ్చి ఆధారాలను సేకరించారు. పట్టపగలే దొంగతనం జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. -
భద్రత లేని బడి
సీతంపేట: పై చిత్రంలో రచ్చబండ వద్ద కూర్చుని చదువుకుంటున్న వారు మండలంలోని తోరికవలస ప్రాథమిక పాఠశాల విద్యార్థులు. వీరు చదువుకుంటున్న పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. ఇక్కడ ఒకటి నుంచి ఐదోతరగతి వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. 29 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు పెచ్చులూడి కిందపడుతుండడంతో ఉపాధ్యాయులు ఐటీడీఏ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్థానికంగా ఉన్న అంగన్వాడీ కేంద్రంలో పాఠశాల నిర్వహించాలని అధికారులు సూచించారు. అక్కడ స్థలం లేదంటూ అంగన్వాడీ నిర్వాహకులు ఇవ్వకపోవడంతో ఇదిగో ఇలా వెదురు కర్రలపై పరజా వేసి రచ్చబండపై చదువులు కొనసాగిస్తున్నారు. అలాగే ఎగువదరబలో సైతం పూర్తిగా భవనం లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు వెదురు కర్రలతో నిర్మించిన ఒక షెడ్లో పాఠాలు బోధిస్తున్నారు. రాయిలంక జీపీఎస్ పాఠశాల పూర్తిగా శిఇలావస్థకు చేరుకుని కొద్ది నెలల కిందట ఒక గది కూలింది. దీంతో వీరు కూడా వేరే చోట వెదుర్ల షెడ్డులో బోధన సాగిస్తున్నారు. చావిడివలసలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను మోడల్ పాఠశాలగా మార్చినా అక్కడ భవనాలు లేవు. హెచ్ఎం సొంత నిధులతో రెకుల షెడ్డులు వేసి పాఠశాల నిర్వహించుకుంటున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాథమిక పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయి. దయనీయంగా ప్రాథమిక విద్య గిరిజన గ్రామాల్లో ప్రాథమిక విద్య దయనీయంగా మారుతోంది. విద్యార్థులు చదువుకోవడానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందిందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల్లో తగిన భవనాలు లేకపోవడం, ఉన్నవి శిథిలావస్థకు చేరుకోవడం వంటికారణాలతో పునాది స్థాయిలో ఉన్న ప్రాథమిక విద్యకు గండిపడుతోంది. వానొస్తే విద్యార్థులు, ఉపాధ్యాయుల వెన్నులో వణుకు పుడుతోంది. బాల,బాలికలు బిక్కు,బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సురక్షిత గదులు చదువుకోవడానికి కరువవుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 189 గిరిజన ప్రాథమిక పాఠశాలలున్నాయి. మండల పరిషత్, జీఈఎస్ పాఠశాలలు 108 వరకు ఉన్నాయి. మొత్తం సుమారు 8వేల మంది బాల,బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి బోధన సాగుతోంది. గిరిజన ప్రాథమిక పాఠశాలలు (జీపీఎస్) చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇదీ పరిస్థితి.. 21 గిరిజన ప్రాథమిక పాఠశాలలు (జీపీఎస్) శిథిలావస్థలో ఉన్నాయి. మరో పదికిపైగా రేకుల షెడ్డులలో నడుస్తున్నాయి. 150కిపైగా పాఠశాలలకు సరైన తలుపులు,కిటీకీల వంటివి సరిగా లేవు. గచ్చులు, శ్లాబ్‌పై పెచ్చులు ఊడిపోయే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో తమ పిల్లలను పాఠశాలలకు పంపిస్తుంంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు వాపోతున్నారు. కొత్త భవనాలకు ప్రతిపాదనలు పెట్టాం ఐటీడీఏ పీఓ ఆదేశాల మేరకు ట్రైబల్ వెల్ఫేర్ ఇంజినీరింగ్ శాఖ ద్వారా 35 జీపీఎస్ పాఠశాలలకు కొత్త భవనాలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరైన వెంటనే నిర్మించనున్నాం. అంతవరకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పాఠశాలలు నిర్వహిస్తాం. వెదురు, రేకుల షెడ్డుల్లో పాఠాలు వానొస్తే వణుకే సురక్షిత తరగతి గదులు కరువు బిక్కుబిక్కుమంటున్న విద్యార్థులు, తల్లిదండ్రులు -
వృద్ధురాలిపై దాడిచేసి బంగారు గొలుసు చోరీకి యత్నం
● నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ● చికిత్స పొందుతున్న బాధితురాలు గరుగుబిల్లి: మండలంలోని కొట్నాన రామినాయుడువలస గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం ఇంట్లో ఒంటరిగా వంట చేసుకుంటున్న కోడి గౌరమ్మ (భర్త దివంగత రేగం నాయుడు)పై అదే గ్రామానికి చెందిన బంకురు శ్రీనివాసరావు దాడి చేసి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లేందుకు ప్రయత్నించాడు. గౌరమ్మ కుమారుడు విజయనగరంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండడంతో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసరావు ఆమె ఇంట్లోకి వెళ్లి గౌరమ్మ మెడలోని రెండున్నర తులాల బంగారు గొలుసును లాగేందుకు ప్రయత్నించగా ఆమె ప్రతిఘటించడంతో.. ఆగ్రహించిన నిందితుడు సుత్తితో ఆమె తలపై పలుమార్లు కొట్టడంతో తీవ్ర గాయాలై రక్తస్రావం జరిగింది. గౌరమ్మ కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె కేకలు విన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని అంబులెన్న్స్కు సమాచారం అందించారు. అనంతరం గాయపడిన గౌరమ్మను పార్వతీపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న గరుగుబిల్లి పోలీసులు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఫకృద్దీన్ తెలిపారు. -
గజ ఈతగాడు గెడ్డలో పడినట్లు..!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : ఇంత బతుకూ బతికి ఇంటెనక చావడం అంటే ఇదే మరి... నిన్న మొన్నటి వరకూ మంత్రులు.. ఎమ్మెల్యేలు ఎంపీలను తన గుమ్మం ముందు వెయిట్ చేయించిన చిన్న శ్రీను ఇప్పుడు కారు నిండా బొకేలు శాలువాలు పట్టుకుని టీడీపీ నాయకు లు, ఎమ్మెల్యేల గుమ్మానికి బయలు దేరుతున్నా రు. వారి ఇళ్లకు వెళ్లి తనను తాను పరిచయం చేసు కుని కొత్త చుట్టరికానికి చేతులు చాస్తున్నారు. అటువైపు నుంచి ఇష్టం లేకున్నా అయిష్టంగానే ఆహ్వానించక తప్పని పరిస్థితిలో వారు మొహం మీద నవ్వును పులుముకుని రండి.. రండి.. అంటూ ఆ ఎపిసోడ్‌ను ముగిస్తున్నారు. గత 20 ఏళ్లుగా చిన్న శ్రీను అనుభవించిన పొలిటికల్ సెలబ్రిటీ స్టేటస్‌ను కళ్లారా చూసిన వాళ్లంతా ఔరా... పూలమ్మిన చోట కట్టెలు అమ్మడం అంటే ఇదే కదా! అని లోలోన ముక్కున వేలేసుకుంటున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా.. ఆఖరుకు టీడీపీ ప్రభుత్వం ఉన్నా కానీ జిల్లాలో చిన్న శ్రీను మాటకు తిరుగుండేది కాదు. పలు సందర్భాల్లో టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు సైతం ఆయ నపై కటువైన కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఆయ న్ను రాజ్యాంగేతర శక్తి అని.. అవినీతిపరుడు అని పోరాటాలు.. ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఇప్పుడు ఎకాఎకిన ఎలా ఆహ్వానించి కౌగిలించుకుంటాం అనే ప్రశ్నలు వేస్తున్నారు. కడుపులో కత్తులు.. కళ్లలో నవ్వులు 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ చిన్న శ్రీనుపై కత్తు లు నూరుతూనే ఉంది. జిల్లాపై ఆయన పెత్తనాన్ని పెద్దరికాన్ని పలు సందర్భాల్లో విమర్శిస్తూ ఆయనపై పోరాటం చేస్తూనే వచ్చింది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లు మంత్రులుగా ఉన్నవారు కేంద్ర మంత్రులుగా ఉన్నవారు, గవర్నర్‌గా ఉన్న వారు సైతం ఆయనను టార్గెట్ చేస్తూనే ఉండేవారు. ఇప్పుడు ఒక్కసారిగా చిన్న శ్రీనును తమలో కలుపుకోవాలి అంటే కష్టంగా ఉందని ఓ టీడీపీ నాయకుడు వ్యాఖ్యానించడం ఆయన పట్ల వారిలో ఉన్న అయిష్టతను స్పష్టం చేస్తుంది. 20 ఏళ్లుగా ఉన్న వైరం ఒక్కసారిగా ఎలా పోతుంది అంటూ తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు. పార్టీకి నాయకత్వ లోటు ఏం లేదే ? చిన్న శ్రీనును తమలో చేర్చుకొని ఆయనకు పెద్దరి కం ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యేలు లోలోన గుర్రుమంటున్నారు. తమకు ఏ ఇబ్బంది లేదని, తమవైపు ఎవరూ లేకున్నా జిల్లా మొత్తాన్ని గెలిచామని గుర్తు చేస్తూ ఇప్పుడు ఆయన్ను తమ నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుంటే ఎలా సహిస్తాం అని అంటున్నారు. నలభయ్యేళ్లుగా ఉన్న పార్టీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని గు ర్తు చేస్తూ ఇప్పటికిప్పుడు చిన్న శ్రీను వచ్చి తమను ఏం ఉద్ధరిస్తారని.. ఆయన రాకతో తమకు ఉన్నఫళంగా ఏం లాభం కలుగుతుందని అంటున్నారు. భోజన భేటీలో అప్పడాలు కరకర.. నాయకులు కొరకొర ప్రతి నెలా ఓ ఎమ్మెల్యే ఇంట్లో భోజనం పెట్టే పేరిట ఎమ్మెల్యేలంతా కలసి కూర్చుని మాట్లాడుకోవడం టీడీపీలో ఈ మధ్య వచ్చిన కొత్త సాంప్రదాయం. ఇందులో భాగంగా తాజాగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇంట్లో రణస్థలంలో టీడీపీ ఎమ్మెల్యేలు.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సైతం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. అయితే ఆయన పెద్దరికాన్ని, తమతమ నియోజకవర్గాల్లో ఆయన జోక్యాన్ని ఏమాత్రం సహించరాదని వారంతా కూడబలుక్కుని తీర్మానించినట్లు తెలిసింది. ఆయనకు ఏ చిన్న అవకాశం ఇచ్చినా తమ ఉనికికి ముప్పు కలుగుతుందని, అందుకే ఆయన్ను దూరం పెట్టాలని వారంతా మౌఖికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయన చేరిక తమకు సుతరామూ ఇష్టం లేదని.. కానీ అధిష్టానం నిర్ణయాన్ని కాదనలేక సైలెంట్‌గా ఉన్నామని చెబుతూ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఆయన జోక్యం చేసుకుంటే లేనిపోని చిక్కులు.. గ్రూపు తగదాలకు ఆస్కారం కలుగుతుందని, దానికి అవకాశం ఇవ్వొద్దని వారు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. -
నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గం
విజయనగరం గంటస్తంభం: నాలుగో తరగతి ఉద్యోగుల సంఘానికి నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఈ మేరకు సంఘం కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా చందక శ్రీనివాసరావు, సహాధ్యక్షుడిగా ఎం.శ్రీను, ఉపాధ్యక్షులుగా కె.సూరిబాబు, గొర్లె అర్జున్, కార్యదర్శిగా ఎం.మంగరాజు, సంయుక్త కార్యదర్శులుగా ఎస్.సుమతి, జి.లీలాకుమారి, కోశాధికారిగా టి.రామారావు, ప్రచార కార్యదర్శిగా కె.ఆనందకుమార్ ఎన్నికయ్యా రు. ఉద్యోగుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడంతో పాటు సంక్షేమం కోసం కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపా రు. ఉద్యోగుల హక్కులు, సేవా సమస్యల పరిష్కారానికి ఐక్యంగా పనిచేస్తామన్నారు. ఎన్నికల అధికారులు శ్రీనివాసరావు, చంద్రశేఖర్ రవి యాద వ్, వై.శ్రీనివాసరావు, నూతన కార్యవర్గానికి శుభా కాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం ప్రతి నిధులు జి.రమేష్, పి.మురళీప్రసాద్, శ్వేత తదితరులు పాల్గొన్నారు. -
అదుపు తప్పిన ట్రావెల్స్ బస్సు
విజయవాడ: విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఆదివారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. విజయవాడ నుంచి రాజాం వెళ్తున్న కనకదుర్గ ట్రావెల్స్‌కు చెందిన బస్సు అదుపు తప్పి పంట బోదెలోకి దూసుకెళ్లింది. విజయవాడలో ప్రయాణికులను ఎక్కించుకుని రాజాం వెళ్తుండగా మార్గమధ్యంలో నిడమానూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 30 మంది ప్రయాణం చేస్తున్నారు. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదు అందలేదని పటమట పోలీసులు పేర్కొన్నారు. -
ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
బాడంగి: తాగుడు వ్యసనానకి బానిసై పూర్తి జీతం ఇంటికి తేలేదని భార్య మందలిచినందుకు మనస్తాపం చెంది న ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెర్లాం మండలం కూనాయవలస ఎస్సీ కాలనీకి చెందిన అలజంగి గణపతి (41) బాడంగి మండలంలోని డొంకినవలస రైల్వెస్టేషన్కు వెళ్లే రహదారి పక్కనగల పాత ఎఫ్‌సీఐ గిడ్డంగి వెనుక భాగంలో చీమచింతచెట్టుకు దుప్పటి కట్టుకుని ఉని వేసుకున్నాడు. గణపతి రాజాంలోని జీఎంఆర్ హాస్టల్ కుక్‌గా పనిచేస్తున్నాడని, శనివారం ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి వెళ్లకుండా చుట్టుపక్కల తిరుగుతూ ఆదివారం ఉదయానికి విగతజీవిగా కనిపించాడు. ఆ ప్రాంతానికి చెంది న పశువుల కాపరి చూసి విషయాన్ని గ్రామస్తులతో చెప్పగా అందులో ఒకరు సెల్ఫోన్లో ఫొటో తీసీ వాట్సాప్‌లో పెట్టగా వారి బంధువులు గుర్తించారు. మృతుడికి భార్య వెంకటలక్ష్మి, దీఫు, సమీక్ష అనే 8, 9 ఏళ్లవయస్సు కలిగిన పిల్లలున్నారు. మృతుడి భార్య వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై సూర్యకుమారి కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక సీహెచ్‌సీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు పోలీసులు అప్పగించారు. -
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా జట్లు సిద్ధం
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా జట్టు సిద్ధమయ్యాయి. ఈ మేరకు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర శివారుల్లో గల విజ్జి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ఎంపిక పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 350 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. అండర్–14,16,18,20 వయస్సుల విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహించిన ఎంపికల్లో రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్ అంశాల్లో పోటీలు నిర్వహించారు. పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 130 మంది క్రీడాకారులకు అక్కినేని నాగేశ్వరరావు ఫ్యాన్స్ జిల్లా అధ్యక్షుడు టీ షర్టులు అందజేశారు. జిల్లా స్థాయి పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు వచ్చే నెల 2 నుంచి 4వ తేదీ వరకు కర్నూలు జిల్లా ఆదోనిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, జి.శ్రీకాంత్, కోశాధికారి ఆనందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2న సత్యాగ్రహ దీక్ష● కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ విజయనగరం గంటస్తంభం: కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, పార్ట్‌టైమ్, డైలీవేజ్, కంటింజెంట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమానం వేతనం, పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 2న విశాఖపట్నంలోని గాంధీ విగ్రహం వద్ద కుటుంబ సభ్యులతో కలిసి సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ టీచర్స్ అండ్ వర్కర్స్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బి.కాంతారావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎన్పీఆర్ భవన్లో సత్యాగ్రహ దీక్ష వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉద్యోగ భద్రత, 62 ఏళ్లకు పదవీ విరమణ వయసు పెంపు, మెడికల్, చైల్డ్‌కేర్ సెలవులు తదితర హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని దీక్షను విజయవంతం చేయాలని కోరారు. పిడుగు పడి ఆవు మృతి బొండపల్లి: మండలంలోని గెద్దపేట గ్రామంలో పిడుగు పడి ఆవు మృతి చెందింది. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇల్లాపు శ్రీనుకు చెందిన ఆవును పొలాల్లోకి తీసుకువెళ్లగా అది మేత మేస్తుండగా పిడుగు పడడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయి మృతి చెందింది. ఈ విషయాన్ని బొండపల్లి పశువైద్యాధికారికి బాధిత రైతు కుటుంబసభ్యులు తెలియచేసి వివరాలు అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య బొండపల్లి: ఆర్థిక ఇబ్బందుల కారణంగా మండలంలోని కనిమెరక రైల్వే పట్టాల వద్ద వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా నిలబడి ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వర్రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మరువాడ గ్రామానికి చెందిన భీమవరపు శ్రీనివాసరావు (50) కొద్ది నెలలుగా ఆర్థిక సమస్యలతో బాధ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఏడు గంటల సమయంలో గజపతినగరం నుంచి విజయనగరంవె వెళ్తున్న బొకారో రైలుకు ఎదురుగా నిలబడడంతో వేగంగా వస్తున్న రైలు ధాటికి శ్రీనివాస రావు శరీరం మొత్తం నుజ్జునుజ్జయింది. సంఘటనా స్థలాన్ని బొబ్బిలి రైల్వే హెచ్‌సీ ఈశ్వర్రావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. మృతునికి భార్య లక్ష్మితో పాటు,పెళ్లిళ్లు అయిన కూతురు సంధ్య, కుమారుడు ప్రదీప్ ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ ఏరియా కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించి రైల్వే పోలీసులు కేసు నయోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. -
●బ్రహ్మోత్సవాల్లో నృత్య నీరాజనం
● గ్రామస్తులతో మొట్టికాయలు ● ఇరు వర్గాల మధ్య ఘర్షణ రాజాం బాలభవన్‌లో నాట్య శిక్షణ పొందుతున్న పలువురు విద్యార్థులు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొని శభాష్ అనిపించారు. ఆదివారం హనుమత్ వాహన సేవలో పాల్గొని తమ నృత్య ప్రదర్శనలతో స్వామికి నృత్య నీరాజనం అందించారు. విద్యార్థినులతో పాటు బాలభవన్ డైరెక్టర్ డాక్టర్ సుంకరి రమేష్, డ్యాన్స్ మాస్టరు తారక్‌లను పలువురు అభినందించారు. – రాజాం సాక్షి, పార్వతీపురం మన్యం: అధికార పార్టీ నేత మెప్పు పొందాలనే అత్యుత్సాహంతో కొందరు ’తెలుగు తమ్ముళ్లు’ సొంత ఊరిలోనే పరువు పోగొట్టుకున్నారు. తమ సొంత ప్రభుత్వంలోనే.. కలెక్టర్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు ఫేక్ ఆడియోలు, వీడియోలతో కుట్రకు తెరలేపి అడ్డంగా దొరికిపోయారు. పార్వతీపురం మండలంలోని ఓ గ్రామంలో ఉపాధి హామీ నిధుల వసూళ్ల పేరిట స్థానిక అధికార పార్టీ నేతలు ఒక కట్టుకథకు రూపకల్పన చేశారు. పార్వతీపురం మండలంలో గల లక్ష్మీనారాయణపురం గ్రామంలోని ఒక చోటా నాయకుడి దర్శకత్వంలో.. ఉపాధి హామీ కూలీల వద్ద నుంచి, వారి ఆధ్వర్యంలోనే స్వయంగా డబ్బులు వసూలు చేసి, ఆ నెపాన్ని కలెక్టర్‌పై నెట్టేసేందుకు విఫలయత్నం చేశారు. ఈ క్రమంలోనే కలెక్టర్‌కు వ్యతిరేకంగా ఫేక్ వీడియోలు సృష్టించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశారు. ఎన్నడూ లేని విధంగా గ్రామంలో ఇలాంటి విష సంస్కృతికి తెరలేపడంపై గ్రామస్తులు, వేతనదారులు తీవ్రంగా మండిపడ్డారు. వారే వసూళ్ల డ్రామా ఆడుతూ, అధికారులపై నిందలు వేయడాన్ని తప్పు పడుతూ, ఆ నేతలను నిలదీశారు. ఇలాంటి పనుల వల్ల ఊరికి చెడ్డ పేరు వస్తుందని కలత చెందారు. దీంతో ఆ గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. జిల్లా స్థాయి అధికారిపైనే ఇలాంటి దుష్ప్రచారానికి ఒడిగట్టడంపై సంబంధిత శాఖల ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఇటీవల మంత్రి ఆధ్వర్యంలో ఇలాంటి సందర్భాలను దృష్టిలో పెట్టుకునే కలెక్టర్ ప్రభాకర రెడ్డి మాట్లాడారు. ఫేక్ కథనాలతో ప్రభుత్వాన్ని, అధికారులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. కలెక్టర్ హెచ్చరించి రెండు రోజులు తిరగక ముందే, ఏకంగా ఆయన్నే లక్ష్యంగా చేసుకుని విష ప్రచారానికి తెర తీయడం గమనార్హం. ఈ ప్రచారంపై విచారణ నిమిత్తం త్వరలోనే అధికారిక బృందం ఆ గ్రామానికి వెళ్లనుంది. నాయకుల మెప్పు కోసం స్వామి భక్తి చాటుకునేందుకు వెళ్లి, చివరికి తమ గ్రామంలోనే స్థానికులు ముందు నిందితులుగా నిలబడాల్సిన దుస్థితిని ఆ నాయకులు స్వయంగా కొనితెచ్చుకున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. కలెక్టరును ఇరికించే ప్రయత్నంలో.. తమ్ముళ్ల అత్యుత్సాహం! -
రామతీర్థంలో వైభవంగా శ్రీ వేంకటేశ్వరస్వామి కల్యాణం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ రామస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 14వ తేదీ నుంచి జరుగుతున్న శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేకువజామున ప్రాతఃకాలార్చన, బాలభోగం, యాగశాలలో విశేష హోమాలు జరిపించారు. అనంతరం వెండి మంటపం వద్ద వేద పండితుల వేద మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల మధ్య శ్రీలక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణ వేడుక నిర్వహించారు. కల్యాణం అనంతరం శ్రీవారిని పల్లకిలో ఉంచి గ్రామంలో తీరు వీధి ఉత్సవం జరిపించారు. కార్యక్రమంలో ఈఓ వై శ్రీనివాసరావు, అర్చకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
ప్రభుత్వం దృష్టికి జర్నలిస్టుల సమస్యలు
విజయనగరం: జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి సర్కారు అండగా ఉంటుందని రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖమంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వాస్తవాలు వెలుగు తీసి ప్రభుత్వానికి గైడ్ చేయాలని, వాస్తవాలు ప్రజలకు తెలపాల్సిన బాధ్యత జర్నలిస్టుల దేనన్నారు. ఏపీయూడబ్ల్యూజే 27 వ మహాసభ విజయనగరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు ప్రభుత్వానికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. మంత్రిని దుశ్శాలువాతో యూనియన్ నాయకులు సత్కరించారు. కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్ డి.సోమసుందర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 న నిర్వహించే ఏపీయూడబ్ల్యూజే జాతీయస్థాయి నిరసనలో జర్నలిస్టుల గొంతు ప్రభుత్వానికి, ప్రజలకు వినిపించాలని కోరారు. అమరావతి మార్మోగాలని ఆయన పిలుపునిచ్చారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ సుబ్బారావు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల కోసం ఉద్యమించే ఏకై క యూనియన్ ఏపీయూడబ్ల్యూజే అన్నారు. ప్రభుత్వాలు హామీలు ఇచ్చి నెరవేర్చడంలో మాట తప్పుతున్నాయని మండిపడ్డారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఆర్థిక భద్రతపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా రాష్ట్ర అధ్యక్షుడు వై.శివ, సామ్నా అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ఐజే యూ జాతీయ కార్యవర్గ సభ్యుడు అజయ్ బాబు, సీనియర్ నాయకుడు దిమిలి అచ్యుతరావు, రామచంద్ర రావు తదితరులు జర్నలిస్టుల హక్కులు, పోరాటాలపై ప్రసంగించారు. జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర మహాపాత్రో సభకు స్వాగతం పలికారు. సభలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, ఎస్పీ ఏఆర్ దామోదర్, జిల్లా సమాచార పౌర సంబంధాల ఉప సంచాలకుడు గోవిందరాజులు, జర్నలిస్టు నాయకులు టి.రాధాకృష్ణ, ఎం ఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు గురజాడ అప్పారావు విగ్రహానికి, సర్ సీవై చింతామణి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
వ్యాన్ ఢీకొని ఇద్దరికి గాయాలు
గండేపల్లి: ఎద్దులను తరలిస్తున్న ఓ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటనపై స్థానికుల సమాచారం మేరకు విజయనగరం జిల్లా అలమండ సంత నుంచి ఏలూరుకు 8 ఎద్దులను తరలిస్తున్న మినీ బొలెరో వ్యాన్ కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలోని జెడ్ రాగంపేట సీహెచ్‌సీకి వెళ్లే మార్గంలోకి వచ్చే సరికి మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో మోటార్ సైకిల్ నడుపుతున్న తాళ్లూరుకు చెందిన సాయి తీవ్రంగా గాయపడగా, మర్రిపాక నుంచి మిరప కోతకు యల్లమిల్లి వెళ్తున్న లక్ష్మి గాయపడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సీహెచ్‌సీకి తరలించగా తీవ్రంగా గాయపడిన సాయిని జగ్గంపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఎద్దులను తరలిస్తున్న వ్యాన్‌ను గండేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా వ్యాన్‌లో తరలిస్తున్న ఎద్దులకు ఎటువంటి ఆహార పానీయాలు లేకపోగా కనీసం కాలు కదపలేని స్థితిలో కిక్కిరిసిన ప్రయాణంతో వేదన పడుతున్న తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాహనంలో కిక్కిరిసి ఎద్దుల తరలింపు -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల
పార్వతీపురం రూరల్: జిల్లాలోని 15 మండలాలకు సంబంధించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల తుది జాబితాను డీఎల్డీవో త్రివిక్రమరావు ఆధ్వర్యంలో అధికారులు అధికారికంగా విడుదల చేశారు. ప్రజలు, పోటీ చేసే అభ్యర్థుల సమాచారం నిమిత్తం ఈ పోలింగ్ కేంద్రాల పూర్తి వివరాలను కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోని నోటీస్ బోర్డులో ప్రదర్శించారు. పౌరులందరూ ఈ తుది జాబితాను పరిశీలించి, తమ పోలింగ్ కేంద్రాల సమాచారాన్ని తెలుసుకోవాలని అధికారులు సూచించారు. కార్యక్రమంలో పార్వతీపురం ఎంపీడీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
కట్‌కటలే!
ఆదివారం శ్రీ 20 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● నీరూ రాదు.. కరెంట్ ఉండదు ● ఎల్‌నినో కాదు.. ప్రభుత్వ ముందస్తు చర్యలు లేకపోవడమే కారణం ● వేసవిని మించి ఇబ్బందులు బురదనీరు సరఫరాపై కమిషనర్ కార్యాలయం ఎదుట బైఠాయించిన మహిళలు, స్థానికులు సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం వల్ల వేసవిని మించి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉక్కబోత, వేడి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు తాగునీరు సరిగా సరఫరా కావడంలేదు. విద్యుత్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు తీసివేస్తారో తెలియని పరిస్థితి. గుక్కెడు తాగునీటి కోసం పల్లె, పట్టణ ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకునేవారే లేరు. తాగునీరు, విద్యుత్ సరఫరాలో ప్రభుత్వ ముందస్తు చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. వీటిని కప్పిపుచ్చుకునేందుకు ఎల్‌నినో కారణమని నేతలు చెబుతుండడంపై జనం మండిపడుతున్నారు. సాధారణంగా ఇటువంటి పరిస్థితి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కనిపిస్తుందని, సెప్టెంబర్ చివరికి వచ్చినా.. తాగునీరు, విద్యుత్ సరఫరాలో కోతలు పెడుతున్నారంటే ప్రభుత్వ అసమర్థతే కారణమని ప్రజలు అంటున్నారు. నీటి కోసం రోడ్డెక్కుతున్న ప్రజలు జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్ల నుంచి తాగునీరు రావడం లేదు. కనిష్ట స్థాయికి జలమట్టం పడిపోతోంది. జిల్లా కేంద్రం పార్వతీపురంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కుళాయిల ద్వారా కొద్దిరోజులుగా బురదనీరే సరఫరా అవుతోంది. ఈ నీరు తాగేందుకు కాదు కదా, వాడుకకు కూడా వినియోగించలేకపోతున్నామని మహిళలు వాపోతున్నారు. శనివారం బురదనీటిని సీసాలతో తీసుకొచ్చి, మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ● 30 వార్డులున్న పార్వతీపురంలో 62 వేల మంది జనాభా నివసిస్తున్నారు. మొత్తం గృహ వినియోగ కుళాయి కనెక్షన్లు 7,050 ఉండగా.. వీటికి సరిపడేలా రోజుకు 8.5 ఎంఎల్డీ తాగునీరు అవసరం. ప్రస్తుతం మూడురోజులకోసారి 2.9 ఎంఎల్డీ మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. మూడో వంతు మాత్రమే నీటిని అందించగలుగుతున్నారు. అది కూడా బురదనీరే కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ● 28 వార్డులున్న పాలకొండ నగర పంచాయతీలో 38 వేల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ రోజుకు నాలుగు ఎంఎల్డీ తాగునీరు అవసరం కాగా.. ప్రస్తుతం 2.4 ఎంఎల్డీ మాత్రమే అందిస్తున్నారు. దీనివల్ల అనేక ప్రాంతాలు నీటి సమస్య ఎదుర్కొంటున్నాయి. సాలూరు మున్సిపాలిటీలోనూ ఇదే పరిస్థితి ఉంది. ట్యాంకర్లతో తాగునీరు సరఫరా చేస్తేనే ప్రజలకు శుద్ధ జలం అందేది. చెరువులు, నదులు ఎండిపోవడంతో గ్రామాల్లో సైతం ప్రజలు తాగునీటికి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఓవైపు ఉక్కబోత.. మరోవైపు కరెంటు కోత వేసవిని తలపించే ఎండలు ఉంటాయని ముందుగానే ప్రభుత్వానికి హెచ్చరికలు ఉన్నా.. ముందస్తు జాగ్రత్తలు లేకపోవడం వల్ల ఈఎల్ఆర్ (ఎమెర్జన్సీ లోడ్ రిలీఫ్) అనివార్యమవుతోంది. రోజుకు రెండు, మూడు గంటలకుపైగా పల్లె, పట్టణమన్న తేడా లేకుండా కరెంట్ కోత విధిస్తున్నారు. జిల్లాలో అన్ని కేటగిరీలూ కలిపి 2,87,725 విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో గృహ విద్యుత్ కనెక్షన్లే 2,36,917. ఈ కాలంలో సాధారణంగా జిల్లాలో 80 మెగావాట్ల విద్యుత్ వినియోగమయ్యేది. ప్రస్తుతం మండుతున్న ఎండలతో వినియోగం అమాంతం పెరిగింది. వంద మెగావాట్లకు చేరింది. దీనికితోడు వ్యవసాయ కనెక్షన్లకు అదనంగా మరో 10 మెగావాట్లు అవసరం అవుతోంది. అదనపు వినియోగానికి సరిపడా ఉత్పత్తిని ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల.. ఉక్కబోత వల్ల ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వినియోగం పెరగడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈఎల్ఆర్ పేరిట కరెంటు కోతలు విధిస్తున్నారు. పగలూరాత్రి తేడా లేకుండా కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. -
పైడితల్లి హుండీల ఆదాయం లెక్కింపు
విజయనగరం క్రైమ్: శ్రీపైడితల్లి వనంగుడి అమ్మవారి దేవాయలంలో భక్తులు హుండీలో వేసిన కానుకల లెక్కింపు శనివారం జరి గింది. రామతీర్థం శ్రీ సీతారా మ దేవస్థానం సహాయ కమిషనర్,ఈఓ వై.శ్రీని వాసరావు ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది.మొత్తం రూ.ఏడు లక్షల,68 వేల 379 భక్తులు కానుకలుగా హుండీలో సమర్పించారని ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.ఈ లెక్కింపు ధర్మకర్త మండలి సభ్యులు కామేశ్వరరావు,లలిత కుమారి, ఆనందరావులు దేవస్థానం సిబ్బంది సమక్షంలో జరిగిందన్నారు. సమకూరిన ఆదాయం రూ.7 లక్షలు -
విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి
వీరఘట్టం: అప్పటివరకు ఇంట్లో అందరితో కబుర్లు చెప్పిన యువకుడు మిత్రులతో కలిసి వీధిలోకి వెళ్లాడు. అంతలో కరెంట్ తీగ రూపంలో ఆ యువకుడిని మృత్యువు కబంళించింది. వీరఘట్టం మండలంలోని చిదిమి గ్రామంలో శనివారం రాత్రి విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పుర్రు సాయి(24), చంద్రయ్య, ముచ్చు కామేష్ వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా వీధి గుండా వెళ్తున్న 11కెవీ విద్యుత్ లైన్లో ఒక వైరు తెగిపడింది. ఆ ముగ్గురిలో చంద్రయ్య,కామేష్‌లు షాక్ తగిలి దూరంగా పడిపోయారు. అయితే సాయి మాత్రం అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఇంటి నుంచి వెళ్లిన కొడుకు అంతలోనే చనిపోయాడని తెలియడంతో తల్లిదండ్రులు గంగులు, గంగమ్మలు భోరున విలపించారు. ఇంటికి పెద్దదిక్కుగా ఉన్న కుమారుడిని ఆ దేవుడు పగబట్టి చంపేశాడంటూ రోదించారు. గొర్రెలు కాస్తూ ఇంటిని పోషిస్తున్న సాయి మృతి చెందడంతో ఆ ఇంటికి పెద్దదిక్కు లేకుండా పోయిందని ఎంపీపీ దమలపాటి వెంకటరమణ అన్నారు.ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. అనంతరం ఏఈ సోమేశ్వరరావు, ఎస్ఈ షణ్ముఖరావులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. చికిత్స పొందుతూ మహిళ.. నెల్లిమర్ల: మండలంలోని కొత్తపేట గ్రామానికి చెందిన బందపు లక్ష్మి(51) రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈనెల 14న వినాయకచవితిరోజున వినాయక పూజ చేసి సాయంత్రం వినాయకప్రతిమను స్థానిక చంపావతి నదిలో నిమజ్జనం చేసి తిరిగి కొత్తపేట వస్తుండగా నెల్లిమర్ల నుంచి అలుగోలు వెళ్తున్న పొందూరు హరిబాబు స్థానిక సువ్వాని పేట జంక్షన్ వద్ద ద్విచక్రవాహనంతో బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన లక్ష్మిని వెంటనే విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించగా పరిస్థితి విషమించి శనివారం మృతిచెందింది. ఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
చెరువులో చొరబడి..!
సాక్షి టాస్క్ ఫోర్స్: పార్వతీపురం మండలంలోని డీకే పట్నం రెవెన్యూ పరిధిలో జల వనరులు కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. చెరువుల పరిరక్షణకు చట్టాలు ఉన్నప్పటికీ, స్థానికంగా అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల (తెలుగు తమ్ముళ్లు) అండదండలతో ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాలు, పర్యావరణ పరిరక్షణకు కేంద్రబిందువైన చెరువులను ఇష్టారాజ్యం ఆక్రమించి, వ్యాపారంగా మారుస్తున్న తీరుపై స్థానిక గిరిజన, బొడ్డవలస గ్రామ రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఉన్నతాధికారులకు ఎన్ని ఫిర్యాదులు చేసినా క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం చోద్యం చూస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది. పూర్తిగా ఆక్రమించారు.. డీకే పట్నం గ్రామంలోని సర్వే నంబర్లు 115/3, 126, 129/2 పరిధిలో సుమారు 9.35 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ చెరువులను అధికార పార్టీ శ్రేణులు పూర్తిగా ఆక్రమించారు. చెరువు గర్భంలో పామాయిల్ తోటలు సాగు చేస్తూ, దాని సహజసిద్ధమైన నీటి నిల్వ సామర్థ్యాన్ని, నీటి ప్రవాహ మార్గాలను పూర్తిగా ధ్వంసం చేశారు. వాల్టా చట్టం, బోర్డు స్టాండింగ్ ఆర్డర్స్‌కు తూట్లు పొడుస్తూ సాగుతున్న ఈ అక్రమ దందాపై స్థానికులు మండిపడుతున్నారు. ఉపాధి హామీ పథకం కింద చెరువులో పూడికతీత పనులు చేపట్టేందుకు అధికారులు ప్రయత్నించినా, తమ పలుకుబడితో ఆ పనులను నిలిపివేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా, పాఠశాల ఆవరణలోని టేకు చెట్ల నరికివేత, దళితుల రుణాలు పక్కదారి పట్టడం, దీపం పథకం గ్యాస్ కనెక్షన్ల విక్రయం వంటి అవకతవకలకు సైతం డీకే పట్నానికి చెందిన స్థానిక నాయకులే కేంద్ర బిందువుగా మారారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రూ.16 లక్షలకు చెరువు విక్రయం.. తాజాగా ఈ కబ్జా బాగోతం సరిహద్దులు దాటింది. అక్రమార్కులు డీకే పట్నం పరిధిలోని కృష్ణసాగరం చెరువులోని కొంత భాగాన్ని మూకుమ్మడిగా ఒడిశాకు చెందిన కొందరికి ఏకంగా రూ.16 లక్షలకు విక్రయించినట్లు తెలుస్తోంది. భూమిని కొనుగోలు చేసిన సదరు వ్యక్తులు ఇటీవల దానిని స్వాధీనం చేసుకునేందుకు గ్రామానికి రాగా, బొడ్డవలస గ్రామస్తులు, గిరిజన రైతులు మూకుమ్మడిగా అడ్డుకున్నారు. ప్రభుత్వ చెరువును ఎలా కొనుగోలు చేస్తారని, మీకెవరు విక్రయించారంటూ నిలదీయడంతో ఆ వ్యక్తులు అక్కడి నుంచి వెనుదిరిగారు. తమ జీవనాధారమైన జల వనరులను ఇలా ఇష్టానుసారం కబ్జా చేసి అమ్ముకుంటుంటే స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం కళ్లప్పగించి చూస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రకృతి, జల వనరులే జీవనాధా రం. తరతరాలుగా ఈ చెరువుల మీదే ఆధారపడి మా ప్రాంతంలో వ్యవసాయం చేసుకుంటున్నాం. సహజసిద్ధమైన ఈ నీటి వనరులు ఆక్రమణలకు గురైతే సహజమైన వనరుల మూలాల మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. దయచేసి అధికారులు, ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుని ఈ సహజ వనరులను కాపాడి గిరిజన రైతులను ఆదుకోవాలని వేడుకుంటున్నాం. –జిలకర్ర భాస్కరరావు, రైతు, బొడ్డవలస సాగునీటి వనరులను అభివృద్ధి చేస్తే గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం మరింతగా బాగుపడుతుంది. గిరిజనులకు మరింత ఆసరాగా ఉంటుంది. కానీ, ఉన్న చెరువులు ఆక్రమణల పాలవడం ఎంతో ఆవేదన కలిగిస్తోంది. కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, చెరువులను అభివృద్ధి చేసి రైతులకు అండగా నిలవాలని మనవి చేస్తున్నాం. –పీడిక అప్పన్న, బొడ్డవలస గ్రామస్తుడు చెరువు గర్భాల్లో అక్రమాలను సహించేది లేదని, ఆక్రమణలు తొలగిస్తామని కలెక్టర్, ప్రభుత్వ పెద్దలు పదేపదే ప్రకటనలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణ శూన్యంగా మారింది. పక్కా ఆధారాలతో కలెక్టర్‌కు సైతం ఫిర్యాదులు వెళ్లినా, అధికార పార్టీ ఒత్తిళ్ల మేరకే స్థానిక రెవెన్యూ అధికారులు మిన్నకుండిపోతున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, మ్యాపింగ్ ద్వారా చెరువుల అసలు హద్దులను గుర్తించి, దోపిడీకి పాల్పడుతున్న ఆక్రమణదారులపై వాల్టా చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన రైతులు డిమాండ్ చేస్తున్నారు. చెరువులను మింగేస్తున్న కబ్జా దారులు రూ. 16 లక్షలకు ఒడిశా వాసులకు కృష్ణసాగరం విక్రయం? స్వాధీనానికి రాగా అడ్డుకున్న బొడ్డవలస గిరిజన రైతులు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే దందా చోద్యం చూస్తున్న క్షేత్రస్థాయి రెవెన్యూ యంత్రాంగం -
పాముకాటుతో రైతు..
భామిని: పత్తి పంటలో పురుగు మందు కొట్టడానికి శనివారం వెళ్లిన రైతు పాముకాటుకు గురై పొలంలోనే మృతి చెందడంతో నేరడి–బి గ్రామంలో విషాదం అలుముకుంది. భామిని మండలం నేరడి–బికి చెందిన రైతు సరిసాభద్ర మిన్నారావు(60) పత్తి పొలంలో పొడ పాము కాటుకు గురై మృత్యువాత పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న సమీప రైతులు పరుగున వెళ్లి గాయ పడిన రైతు మిన్నారావు(60)ను భామిని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించిన అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. మృతుడికి భార్య పగడాలు, కొడుకు ఖగేశ్వరరావు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.రైతు మృతితో నేరడి, గురండి, బిల్లుమడ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చి విషాదానికి గురై సంతాపం తెలిపారు. -
వైఎస్సార్సీపీలో 25 కుటుంబాల చేరిక
లక్కవరపుకోట (శృంగవరపుకోట): శృంగవరపుకోట మండలం మామిడిపల్లి గ్రామానికి చెందిన మండ త్రినాథ్, మండ సుగుణ, నాగులపల్లి జగన్నాథం తదితర 25 కుటుంబాల వారు శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుల సమక్షంలో వైఎస్సార్సీపీలో శనివారం చేరారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ, కడుబండి శ్రీనివాసరావులు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు.వారి భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత పార్టీ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.పార్టీ పూర్వ వైభవానికి కృషి చేయాలని చూచించారు. పార్టీ ఎప్పడు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సీహెచ్. రమణ, పార్టీ నాయుకుడు కిలారి రవి, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, పార్టీ సీనియర్ నాయకుడు రొంగలి జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. -
పిడుగు పడి కుప్పకూలిన మహిళలు
● పొలం పనికి వెళ్లివస్తుండగా పిడుగుల వాన ● మడిగట్లపైనే ప్రాణం విడిచిన మహిళా రైతు కూలీలు ● జి.వెంకటాపురంలో విషాదంపాలకొండ రూరల్: పుట్టినప్పటి నుంచి వ్యవసాయ పనులు తప్ప మరో పని తెలియని ఆ మహిళలు పొట్ట చేతబట్టుకుని కూలి పనికి వెళ్లి పిడుగుపడి కుప్పకూలి మృతిచెందారు. వ్యవసాయమే ఆధారంగా జీవనం గడుపుతున్న ఆ ఇద్దరి కుటుంబాలపై విధి చిన్నచూపు చూసింది. వ్యవసాయ పనులకు వెళ్లివస్తున్న క్రమంలో పిడుగుపాటుకు గురై మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన వివరాల్లోకి వెళ్తే..పాలకొండ మండలం డోలమడ పంచాయతీ జి.వెంకటాపురం గ్రామానికి చెందిన గొర్ల లక్ష్మి (65), వారాడ రామలక్ష్మి (50) వ్యవసాయ కూలీలు. కుటుంబ పోషణలో భాగంగా వారు గ్రామ సమీపంలోగల వరిపొలాల్లో కలుపు మొక్కలు తీసేందుకు శనివారం వెళ్లారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావతంతో సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చిరుజల్లులు కురవడంతో సహచర కూలీలు వర్షం పడుతుందని భావించి ముందుగా ఇళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో గొర్ల లక్ష్మి, వారాడ రామలక్ష్మి వారు పనిచేస్తున్న పొలాల నుంచి బయటకు వచ్చి గట్లపై నడుస్తుండగా భారీ శబ్దంతో పిడుగు పడింది. దీంతో వారిద్దరు ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. ఈ విషయం గమనించిన సహచర కూలీలు భయాందోళకు గురై ఈ సమాచారాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. అప్పటికే గ్రామంలో కొలువుదీర్చిన గణనాఽథుని నిమజ్జనోత్సవానికి సిద్ధమవుతున్న ప్రజలంతా ఒక్కసారిగా ఘటనా స్థలానికి పరుగులు తీశారు. అప్పటికే ఆ మహిళలు ఇద్దరూ మృత్యువాత పడ్డారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అందరితో కలివిడిగా.. వ్యవసాయ నేపథ్యం కలిగిన గొర్ల లక్ష్మిది మధ్యతరగతి కుటుంబం కావడంతో జీవనోపాధిలో భాగంగా పొలాల్లో భర్త జోగినాయుడితో కలిసి వ్యవసాయం చేస్తూ నెట్టుకొస్తున్నారు. వారికి పిల్లలు లేకపోవడం, తోడునీడగా ఉన్న భార్య పిడుగుపాటుకు గురై మరణించడంతో జోగినాయుడు గుండెలవిసేలా రోదించాడు. అందరితో కలివిడిగా ఉంటూ గ్రామస్తులకు తలలో నాలులా ఉన్న లక్ష్మి మరణంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులకు ఒంటరి అయిన జోగినాయుడిని ఓదార్చడం వారితరం కాలేదు. నన్ను వదిలి వెళ్లిపోయావా.. పిడుగు పడి తన భార్య మరణించడంతో వారాడ రామలక్ష్మి భర్త అప్పలనాయుడు గుండెలు బాదుకుంటూ కన్నీరుమున్నీరయ్యాడు. కలుపు తీసేందుకు వెళ్లిన భార్యపై విధి చిన్నచూపు చూపిందని తనకు దిక్కెవరని రోందించిన తీరు అందరినీ కలిచివేసింది. తన ఇద్దరు పిల్లలు జీవనోపాధికి వలస వెళ్లగా నువ్వుకూడా నన్ను వదివెళ్లావా అంటూ భార్య మృతదేహంపై పడి రోదించాడు. ఈ విషయం తెలుసుకున్న పాలకొండ డిప్యూటీ తహసీల్థార్ సీహెచ్ రమేష్, ఆర్ఐ మహేష్ మృతుల గ్రామానికి చేరుకుని వారి కుటుంబాలను ఓదార్చారు. ఘటన జరిగిన తీరుపై ఆరా తీశారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. ఈ ఘటనపై ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తమ ప్రగాఢ సంతాపాన్ని మీడియా ముఖంగా తెలిపారు. -
హత్య కేసులో నిందితురాలి అరెస్ట్
● మెజిస్ట్రేట్ ఎదుట హాజరు చీపురుపల్లిరూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కందిపేట గ్రామంలో తాను కలిసి ఉంటున్న ధనాల శ్రీనును హత్య చేసిన కేసుకు సంబంధించి నిందితురాలు రాములమ్మను పోలీసులు అరెస్టు చేశారు. కందిపేట గ్రామంలో కలిసి జీవనం సాగిస్తున్న ధనాల శ్రీనుపై ఈనెల 16న రాములమ్మ దాడి చేసి సిమెంట్ దిమ్మెతో తలపై కొటి హత్య చేసిన సంఘటన విదితమే. మృతుడు శ్రీను తండ్రి చిన్న అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ జి.శంకరరావు కేసు దర్యాప్తు చేసి నిందితురాలు రాములమ్మను శనివారం అరెస్టు చేసి చీపురుపల్లి మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచినట్లు ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపారు. సుందరాకాండ లోకకల్యాణానికి శుభప్రదంరేగిడి: సుందరాకాండ చదివినా విన్నా లోకకల్యాణానికి ఎంతో మంచిదని గుంటూరు జిల్లా నంబూరు శ్రీకాళీ వనాశ్రమ పీఠాధిపతి శ్రీనివాస రామానుజదాస్ అన్నారు. ఈ మేరకు రేగిడి దత్తపీఠంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకుని సుందరకాండ ప్రవచనాలను శనివారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరామానుజదాస్ మాట్లాడుతూ హనుమాన్‌చాలీసా, సుందరాకాండ వంటి ప్రవచనాలను ప్రతిరోజూ రామమందిరాలు, ఆంజనేయస్వామి ఆలయాల్లో ప్రవచనం చేస్తే ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారన్నారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు. -
మన్నించయ్యా బొజ్జ గణపయ్యా..!
● వెక్కిరిస్తున్న వర్షాభావం ● అడుగంటిన చెరువులు ● నీళ్లు లేక తేలియాడుతున్న విగ్రహాలుపార్వతీపురం రూరల్: వినాయక చవితి ఉత్సవాల అనంతరం భక్తిశ్రద్ధలతో సాగుతున్న నిమజ్జన ఘట్టాలకు వర్షాభావం అడ్డంకిగా మారింది. మంటపాల నుంచి డప్పు చప్పుళ్లు, కోలాహలం నడుమ శోభాయమానంగా సాగిన విగ్రహాల ఊరేగింపులు స్థానిక చెరువుల వద్దకు చేరుకోగానే భక్తులకు నిరాశే మిగులుతోంది. ఆశించిన వానలు కురవక, స్థానిక జలాశయాలు అడుగంటడంతో చెరువుల్లో చుక్కనీరు కరువైంది. దీంతో ఘనంగా తరలివచ్చిన బొజ్జ గణపయ్యలకు గంగమ్మ ఒడిలో పూర్తిగా మునిగే భాగ్యం లేకపోయింది. లోతైన జలాలు లేకపోవడంతో, కేవలం అడుగు లోతు నీటిలోనే విగ్రహాలను వదిలిపెడుతున్నారు.ఫలితంగా జలగర్భంలోకి చేరాల్సిన విఘ్నేశ్వరుడు..నీటిలో మునగకుండా అలా సగంలోనే కూర్చున్నట్లు దర్శనమిస్తూ భక్తులను కలవరపెడుతున్నాడు. నిండు కుండల్లా తొణకాల్సిన జలాశయాలు వెక్కిరిస్తుండడం, కొద్దిపాటి నీటిలోనే కొలువుదీరిన విగ్రహాలను చూస్తుంటే ప్రాంతంలో నెలకొన్న వర్షాభావ తీవ్రత కళ్లకు కట్టినట్లు స్పష్టమవుతోంది. నిండిన చెరువులను చూడాల్సిన కళ్లకు, బీటలు వారిన నేలలు దర్శనమిస్తుండడం చూపరులను బాధిస్తోంది. ‘సరైన జల వనరులు లేక నీటిలో పూర్తిగా నిమజ్జనం చేయలేకపోయాం, మన్నించయ్యా విఘ్నేశ్వరా‘ అంటూ భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
చట్టాలపై అవగాహనతోనే హక్కుల పరిరక్షణ
బొబ్బిలిరూరల్: ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడం ద్వారా వారి హక్కుల పరిరక్షణ జరుగుతుందని జిల్లా జడ్జి ఎం.బబిత అన్నారు. ఈ మేరకు శనివారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో న్యాయ అవగాహన సదస్సును నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు ఆయా శాఖల ఉన్నతాధికారుల పర్యవేక్షణ అవసరమన్నారు. ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరుపై ఆయా శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహ కల్పించాలన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలను పాందడం పౌరుల ప్రాథమిక హక్కని అన్ని ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలు, వారి హక్కుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్జిలు కృష్ణ ప్రసాద్, రాధాకృష్ణ మూర్తి, స్థానిక న్యాయ మూర్తులతో పాటు బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బి.రవి, ఎంపీడీఓ రవికుమార్, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా జడ్జి ఎం బబిత -
సత్ప్రవర్తనకు వేదిక కావాలి
● ఖైదీల్లో మానసిక పరివర్తనే కీలకం పార్వతీపురం రూరల్: కారాగారం కేవలం శిక్షలకే పరిమితం కాదని, అది మానసిక పరివర్తనకు, ప్రవర్తనా సంస్కరణలకు వేదిక కావాలని పార్వతీపురం రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మాధురి స్పష్టం చేశారు. స్థానిక సబ్ జైలు వద్ద జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఖైదీలకు శనివారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. గతాన్ని సమీక్షించుకుని, చేసిన తప్పులను సరిదిద్దుకుని నవ జీవనం వైపు అడుగులు వేయాలని సూచించారు. విద్యావకాశాలు కోల్పోయిన వారు సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా చదువును కొనసాగించి, ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలన్నారు. ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖైదీల ప్రవర్తనలో గుణాత్మక మార్పు తీసుకురావడమే జైళ్ల శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వృత్తి నైపుణ్య శిక్షణ, విద్యావకాశాలు ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. జైలులో వసతులు, ఆరోగ్యం, భోజన సదుపాయాలను ప్రత్యేక కమిటీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయని వెల్లడించారు. జైలు జీవితాన్ని ఒక గుణపాఠంగా తీసుకుని, సానుకూల దృక్పథంతో సమాజంలోకి అడుగుపెట్టాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎ.కృష్ణప్రసాద్, డీఆర్వో కె.హేమలత, డీఈఓ పి.బ్రహ్మాజీరావు, జిల్లా వైద్యాధికారి, ప్యానెల్ న్యాయవాదులు పాల్గొన్నారు. -
సామాజిక పింఛన్ల కోసం 51,644 దరఖాస్తులు
బొండపల్లి: జిల్లావ్యాప్తంగా 51,644 మంది సామాజిక పింఛన్ల కోసం సచివాలయాల్లో అన్లైన్లో దరఖాస్తు చేసుకున్నట్లు డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ పాణి తెలిపారు. ఈ మేరకు బొండపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని శనివారం సందర్శించిన అయన విలేకరులతో సామాజిక భద్రత పింఛన్లపై మాట్లాడుతూ సచివాలయాల ద్వారా వచ్చిన దరఖాస్తుల న్నింటిని ఈనెల 21 వ తేదీలోగా పరిశీలించి అర్హత గల వారిని ఎంపిక చేసి పింఛన్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రకియ అంతా ఈ నెలలోనే పూర్తి చేసి అక్టోబరు 1న కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ పింఛన్లు అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను సచివాలయం వెల్పేర్ సహయకులతో పాటు ఎంపీడీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖలకు చెందిన అయా అధికారులు పరిశీలించి అర్హత ఉన్న వారిని గుర్తించి ఎంపీడీఓ లాగిన్లోకి వివరాలు పంపించనున్నట్లు చెప్పారు. అన్ని అర్హతలు ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేసే పక్రియను డీఆర్డీఏ ద్వారా చేపడుతూ అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ అరసాడ రఘుపతిరావు, డిప్యూటీ ఎంపీడీఓ జి.జనార్దనరావు తదితరులు పాల్గొన్నారు. డీఆర్డీఏ పీడీ శ్రీనివాస్ పాణి -
పైడితల్లికి పూజలు
విజయనగరం క్రైమ్: మూలా నక్షత్రం సందర్భంగా శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి దేవాలయాల్లో శనివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. అటు మూడులాంతర్లు దగ్గరున్న చదురగుడిలోను రైల్వే స్టేషన్ దగ్గరున్న వనంగుడిలో శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు పూజలు చేశారు. వనంగుడిలో మూలా నక్షత్రం సందర్భంగా చండీ హోమం జరిగింది. ఆలయ అర్చకులు కృష్ణస్వామి, తాతారావులు భక్తులతో చండీహోమం నిర్వహించారు. కుక్కకాటుతో ముగ్గురికి గాయాలుభామిని: మండలంలో కుక్కల స్వైర విహారం పెరుగుతూ దాడులకు దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం భామిని మండలం బిల్లుమడ కాలనీలో ముగ్గురిని కుక్క కరవడంతో తీవ్రంగా గాయపడ్డారు. కుప్పిలి యశోద. పిలకా సీతమ్మ, విద్యార్థి అర్లి జగన్‌లు గాయపడడంతో తీవ్ర గాయాల పాలైన కుప్పిలి యశోదను భామిని పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవల అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు.మిగతా ఇద్దరు భామిని సీహెచ్‌సీలో వైద్య సేవలు పొందుతున్నారు. పశువులు తరలిస్తున్న రెండు బొలెరోలు సీజ్● ఎనిమిది పశువులు స్వాధీనం కురుపాం: మండలంలోని నీలకంఠాపురం పోలీస్‌స్టేషన్ సమీపంలో ఉన్న చర్చి ఎదురుగా పశువులు అక్రమంగా తరలిస్తున్న రెండు బొలెరో వాహనాలు సీజ్ చేసినట్లు నీలకంఠాపురం ఎస్సై పి.రమేష్‌నాయుడు తెలిపారు. శనివారం వాహనాలు తనిఖీ చేస్తుండగా రెండు బొలెరో వాహనాల్లో 8 పశువులను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. వారి వద్ద ఎటువంటి అనుమతులు లేనందున వారిపై కేసు నమోదు చేసి వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 800 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసంగుమ్మలక్ష్మీపురం: మండలంలోని జాబుగూడ గ్రామ శివారులో సారా తయారీ కోసం డ్రమ్ముల్లో పులియబెట్టిన సుమారు 800 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు ఎల్విన్‌పేట ఎస్సై బి.శివప్రసాద్ శనివారం తెలిపారు. జాబుగూడ పరిసరాల్లో సారా తయారు చేస్తున్నట్లు తమకు వచ్చిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా బెల్లపు ఊటను గుర్తించి ఆ ప్రదేశం వద్ద సారా తయారు చేస్తున్న ఓ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. అలాగే 20 లీటర్ల సారాను గుర్తించి సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు. పట్టుబడిన నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. ఆయన వెంట పోలీస్ సిబ్బంది ఉన్నారు. యువకుడిపై పోక్సో కేసు నమోదుసంతకవిటి: మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిపై పోక్సో కేసు నమోదుచేసినట్లు ఎస్పై ఆర్.గోపాలరావు తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాధిత బాలిక వంగర మండలంలోని మడ్డువలస గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఇటీవల రాఖీ పండగకు ఇంటికి వచ్చిన బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు మాయమాటలు చెప్పి బలవంతం చేసినట్లు అమ్మాయి తల్లి శనివారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
దండాలయ్యా..అంటున్నా..!
● రూమ్‌లోకి తీసుకెళ్లి ఎస్సై చావగొట్టారు ● మీడియా ముందు వాపోయిన బాధితుడు కొమరాడ/కురుపాం: ఎవరు ఫిర్యాదు చేశారో తెలియదు..ఏమి తప్పుచేశానో చెప్పలేదు..నన్ను కురుపాం ఎస్సై పి.నారాయణ రావు శుక్రవారం మధ్యాహ్నం స్టేషన్‌కు తీసుకెళ్లారు.. రూమ్‌లోకి తీసుకెళ్లి చావగొట్టారు.. దండం..దండం అంటున్నా విడిచిపెట్టలేదు.. ఏం చేశాను సార్ అని ప్రశ్నించినా వినిపించుకోకుండా లాఠీతో తట్టులు తేరేలా కొట్టారంటూ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం మాదలింగి గ్రామానికి చెందిన బర్ల ఆదినారాయణ శనివారం మీడియా ముందు వాపోయాడు. తనను కొడుతుండగా విడిచిపెట్టాలంటూ తమవారు ప్రాధేయ పడితే మెడ పట్టుకుని ఎస్సై గెంటేశారంటూ కన్నీరుపెట్టాడు. లాఠీ దెబ్బలను మీడియాకు చూపించాడు. ఫిర్యాదు చేసిన వారు ఎవరో కూడా తమకు తెలియదన్నాడు. అయితే, మేకల పెంపకం అంశంలో తలెత్తిన వివాదంపై గుజ్జివాయికి చెందిన గిరిజన మహిళలు ఆదినారాయణపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. పోలీసుల తీరుపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. తప్పుచేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలే తప్ప ఇలా భౌతికంగా దాడిచేయడం సరికాదని పేర్కొంటూ ఎస్సై తీరును తప్పుబట్టాయి. -
ప్రైవేట్ వృత్తి విద్య జూనియర్ కళాశాలల సంఘం జిల్లా కమిటీ ఏకగ్రీవం
విజయనగరం అర్బన్: జిల్లాలోని ప్రైవేట్ ఒకేషనల్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ జిల్లా కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ద్వారపూడిలోని సెయింట్ థామస్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలో శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లాలోని కళాశాలల కరస్పాండెంట్లు పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పి.ప్రకాశరావు (ఎస్ఎస్పీ, విజయనగరం), ఉపాధ్యక్షుడిగా పి.శ్రీను (సాయిరాం–బొబ్బిలి), కార్యదర్శిగా జె.కృష్ణ (ఎస్వీఎన్, ఎస్.కోట), సంయుక్త కార్యదర్శిగా శ్రీనివాసరావు (న్యూటన్, పెద్దమానాపురం), కోశాధికారిగా ఎం.గోవింద్ (శ్రీసూర్య, భీమసింగి) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా జగన్నాథం (గోస్తనీ, జామి), ఎ.రమేష్ (ఏవీఎన్, ఎస్.కోట), బి.తిరుపతి (గణేష్, బొబ్బిలి)లను ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియకు పార్వతీపురం జిల్లా అధ్యక్షుడు వి.జగదీశ్వరరావు (వెంకటేశ్వర, సాలూరు) ప్రొసీడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. సంఘం చీఫ్ ప్యాట్రన్లుగా వి.జగదీశ్వరరావు, పి.జాన్ (సెయింట్ థామస్, ద్వారపూడి)లను నియమించారు. అనంతరం నూతన కమిటీ బాధ్యతలు తీసుకుని ప్రమాణ స్వీకారం చేపట్టారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎం.స్వాత్విక్ (వేదశ్రీ, పార్వతీపురం), డి.చిన్నంనాయుడు (శారద, గుమ్మలక్ష్మీపురం)తోపాటు పలువురు కళాశాల కరస్పాండెంట్లు పాల్గొన్నారు. -
గెస్ట్ ఫ్యాకల్టీకి దరఖాస్తుల ఆహ్వానం
సాలూరు రూరల్: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గెస్టు ఫ్యాకల్టీ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ అల్లు సత్యవతి తెలిపారు. ఈ మేరకు శనివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వృత్తి విద్య కోర్సుల్లో అఫీస్ అసిస్టెన్స్‌షిప్ ఒకేషనల్ కోర్సులో పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. గుర్తింపు కలిగిన యూనివర్సిటీలో ద్వితీయ శ్రేణిలో ఎం.కాం పూర్తి చేసిన వారు ఈనెల 22 వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ నెల 23న 10.30 గంటలకు ఒరిజినల్ సిర్టిఫికెట్లతో హాజరు కావా లని సూచించారు. అర్హులైన వారిని మెరిట్ ఆధారంగా పోస్టుల్లో భర్తీ చేస్తామని తెలిపారు. వంజరంపేట పాఠశాల మూసివేతబలిజిపేట: మండలంలోని వంజరంపేట పాఠశాల మూతబడిందని ఎంఈఓ–1సామల సింహాచలం తెలిపారు. 2026–27విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలలో ఒకే ఒక విద్యార్థిని ఉండేది. కొంతకాలం గడిచిన తరువాత ఆవిద్యార్థిని కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్లిపోతుండగా ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు, ఎంఈఓ–1సామల సింహాచలం గ్రామంలో పెద్దలు, తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి విద్యార్థిని పాఠశాలకు రాకపోతే పాఠశాల మూతపడే అవకాశాలున్నాయని అందువల్ల గ్రామస్తులు దీనిపై దృష్టిసారించి పాఠశాల మూతపడకుండా సహకరించాలని కోరారు. అయినప్పటికీ విద్యార్థులు ఎవరూ రాకపోవడంతో పాఠశాలను మూసివేసినట్లు తెలిపారు. విద్యార్థిని పేరు డ్రాప్‌బాక్స్‌లో పెట్టివేసినట్లు ఎంఈఓ–1సామల సింహాచలం చెప్పారు. పలువురు ఇంజినీర్లకు స్థానచలనం, పదోన్నతిపార్వతీపురం రూరల్: తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో బదిలీల పర్వం, పదోన్నతుల ఘట్టం ఆరంభమైంది. పరిపాలనా సౌలభ్యం కోసం యంత్రాంగంలో మార్పులు–చేర్పులు చేస్తూ, సంస్థ సీఎండీ ఇమ్మణ్ణి పృథ్వీతేజ్ ఆదేశాల మేరకు పలువురు ఇంజినీర్లకు స్థానచలనం, పదోన్నతులు కల్పిస్తూ తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. పదవులు, బాధ్యతల మార్పుల వివరాలిలా ఉన్నాయి..పాలకొండ ఆపరేషనన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ)గా ఉన్న కె.విష్ణుమూర్తి శ్రీకాకుళం టెక్నికల్ ఈఈగా బదిలీ అయ్యారు. పార్వతీపురం ఎస్పీఎం డిప్యూటీ ఇంజినీర్ రామకృష్ణ ఈఈగా పదోన్నతి పొంది, పాలకొండకు మారారు. పాలకొండ డిప్యూటీ ఇంజినీర్ మోహనర్్ చక్రవర్తి సైతం ఈఈగా ప్రమోషన్న్ అందుకుని, కార్పొరేట్ కార్యాలయంలో ఓఅండ్ఎం బాధ్యతల్లో కొలువుదీరారు. ఏలూరులో విధుల్లో ఉన్న ఎ.చంద్రమౌళికి డిప్యూటీ ఈఈగా పదోన్నతి ఇచ్చి పాలకొండకు పంపగా, భోగాపురం సహాయ ఇంజినీర్ (ఏఈ) ఎస్.కె.మస్తాన్‌వలి కొమరాడ ఏఈగా బదిలీ అయ్యారు. ఖైదీలకు ఉచిత న్యాయ సహాయంపాలకొండ: ఖైదీలకు ఉచిత న్యాయ సహయం అందించేందుకు చర్యలు తీసుకున్నామని శ్రీకాకుళం జిల్లా మూడవ అదనపు జడ్జి వివేకానంద శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక సబ్ జైల్‌ను జిల్లా న్యాయ సేవా సంఘం కార్యదర్శి కె హరిబాబు, స్థానిక జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ హరిప్రియలతో కలిసి ఆయన సందర్శించారు. జైలులో ముద్దాయిలకు అందుతున్న సేవలను తెలుసుకున్నారు. ఖైదీలతో మాట్లాడి వారి అవసరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొంతంగా న్యాయవాదులను పెట్టుకోలేని ఖైదీలకు ఉచితంగా న్యాయ సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేశామని తెలిపారు. జైలు పరిసరాలు శుభ్రంగా ఉంచాలని, అందుబాటులో తాగునీరు ఉంచాలని, ఖైదీలకు మెనూ ప్రకారం భోజనం అందించాలని జైల్ సూపరింటెండెంట్ రమణయ్యను ఆదేశించారు. -
బాలల హక్కుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
● డీఎల్ఎస్ఏ కార్యదర్శి డాక్టర్ కృష్ణప్రసాద్విజయనగరం లీగల్: విద్యా సంస్థల్లో విద్యార్థులకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించడంలో ఉపాధ్యాయులు, లెక్చరర్లు అత్యంత కీలకపాత్ర పోషించాలని, బాలల హక్కులను పరిరక్షించడం సమాజంలో ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) కార్యదర్శి, న్యాయమూర్తి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీ వెంకటేశ్వర ఏఐఏటీ జూనియర్ కళాశాలలో డీఎల్ఎస్ఏ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ‘బాలల రక్షణ అంశాల’పై అవగాహన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బాలలపై జరిగే హింస, లైంగిక వేధింపులు, దాడులు, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలల అక్రమ రవాణా వంటి సమస్యలను ప్రాథమిక దశలోనే గుర్తించి తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ’పోక్సో చట్టం’తో పాటు బాలల రక్షణకు సంబంధించిన వివిధ చట్టాలపై ఉపాధ్యాయులు, లెక్చరర్లు పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులలో ఆకస్మికంగా కనిపించే ప్రవర్తనా మార్పులు, భయం, మానసిక ఒత్తిడి లేదా ఇతర సమస్యలను అధ్యాపకులు సున్నితంగా పరిశీలించాలని కోరారు. ఏవైనా సంక్షోభ పరిస్థితులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి, బాధిత బాలలకు అవసరమైన న్యాయసాయం, రక్షణ అందేలా సహకరించాలని పిలుపునిచ్చారు. బాలల హక్కుల రక్షణలో పాఠశాలలు, కళాశాలలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రభుత్వ శాఖల మధ్య నిరంతర సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. చట్టపరమైన లేదా ఉచిత న్యాయ సహాయం కావాల్సిన వారు టోల్ ఫ్రీ నంబర్ 15100ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశంలో ప్యానెల్ అడ్వకేట్ పైలా సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ బోర్డు ఆర్ఐఓ తవిటినాయుడు, డిప్యూటీ డీఈవో రమణమ్మ, కాలేజ్ ప్రిన్సిపాల్ గుప్తా, వివిధ కళాశాలల ఉపాధ్యాయులు, లెక్చరర్లు పాల్గొన్నారు. -
సంతోష్‌ది హత్యే
బొబ్బిలి: ఈనెల 9 న అర్ధరాత్రి మండలంలోని పారాది వంతెన వద్ద అదే గ్రామానికి చెందిన ఉత్తరావిల్లి సంతోష్ కుమార్(30)ను అతని స్నేహితుడే హత్య చేసినట్లు డీఎస్పీ ఆర్ గోవిందరావు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక పోలీసుస్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 9న సంతోష్ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు, బంధువులు తమకు సమాచారం ఇచ్చారని, ఈ సంఘటనను అప్పుడు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేసినట్లు వెల్లడించారు. ఎస్పీ ఆదేశాలతో డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంలతో చేపట్టిన దర్యాప్తులో సంతోష్‌ను అతని స్నేహితుడు అల్లాడ పైడిరాజు హత్య చేసినట్లు తెలిపారు. నిత్యం వారిద్దరూ వంతెన సమీపంలో మద్యం తాగుతుంటారని ఈ క్రమంలో ఈనెల 9న మద్యం తాగుతూ వివాహేతర సంబంధాల నేపథ్యంలో వారి మధ్య ఘర్షణ జరిగిందన్నారు. తనను అవమానపర్చాడన్న కోపంతో ఉన్న పైడిరాజు అప్పటికే మద్యం మత్తులో పడి ఉన్న సంతోష్‌ను అక్కడున్న కర్రతో తలపై గట్టిగా కొట్టి వెళ్లిపోయాడన్నారు. దీంతో సంతోష్ మృతి చెందాడన్నారు. పైడిరాజును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని చెప్పారు. దర్యాప్తులో సీఐ కె.నారాయణ రావు, ఎస్సై డి.కొండల రావు, సిబ్బంది చూపిన చొరవను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. డీఎస్పీ గోవిందరావు వెల్లడి -
అడ్మిషన్లు ఓకే.. బోధకులు ఉన్నారా..?
● పోర్టల్‌లో ఉన్నా..కళాశాలకు వెళ్తున్నారా? ● ప్రైవేట్ ఐటీఐలపై అనుమానాలు ● ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు, పరికరాల పరిస్థితిపై.. ● విద్యార్థి సంఘాల ఆందోళన విజయనగరం అర్బన్: బోధకుడు ఉంటేనే అడ్మిషన్.. పరికరాలుంటేనే ప్రాక్టికల్ శిక్షణ. అంటూ కేంద్రప్రభుత్వం కొత్త నిబంధనలు ఈ ఏడాది తీసుకొచ్చినా..జిల్లాలోని ప్రైవేట్ ఐటీఐల్లో పరిస్థితి ఎంతవరకు మారిందన్నదే ఇప్పుడు ప్రశ్న. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో ప్రవేశాల ప్రక్రియ తాజాగా ముగిసింది. తరగతులు ప్రారంభమయ్యాయి. అడ్మిషన్లకు ముందు ఇన్‌స్ట్రక్టర్ల వివరాలు, వారి అర్హత ధ్రువీకరణ పత్రాలను పోర్టల్‌లో అప్లోడ్ చేయించి పరిశీలించినప్పటికీ..క్షేత్రస్థాయిలో అదే స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని 26 ప్రైవేట్ ఐటీఐల్లో సుమారు 4,300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ వంటి ప్రధాన ట్రేడుల్లోనే వేలాది సీట్లు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరిన నేపథ్యంలో వారికి అవసరమైన ఇన్స్ట్రక్టర్లు, ల్యాబ్‌లు, యంత్ర పరికరాలు, వర్క్‌షాప్‌లు అందుబాటులో ఉన్నాయా? అనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ అవసరమని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. సీట్ల సంఖ్యను బట్టి చూస్తే శిక్షణ వసతులు కూడా అదే స్థాయిలో ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, వెల్డర్ వంటి ట్రేడుల్లో పుస్తకాలతో మాత్రమే శిక్షణ పూర్తయ్యే పరిస్థితి ఉండదు. యంత్రాలు, పరికరాలను వినియోగిస్తూ విద్యార్థులు ప్రాక్టికల్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రతి సంస్థలో అనుమతించిన సీట్లకు అనుగుణంగా పరికరాలు, ల్యాబ్‌లు, వర్క్‌షాప్‌లు ఉన్నాయా? అన్నది కీలకంగా మారింది. అడ్మిషన్ తర్వాత అసలు పరీక్ష అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. దీంతో ఇప్పుడు అసలు పరీక్ష ప్రారంభమైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థులు చేరారు. ఇక వారికి నాణ్యమైన శిక్షణ అందుతోందా? అన్నది అధికారులు పరిశీలించాల్సిన అంశంగా మారింది. ఇన్స్ట్రక్టర్లు పాఠ్యాంశాల ప్రణాళికను పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉండగా.. భవిష్యత్తులో బోధన ప్రక్రియను సంబంధించిన వీడియోలను కూడా అప్లోడ్ చేసే విధానం తీసుకురావాలనే ఆలోచన ఉన్నట్లు అధికారులు గతంలో వెల్లడించారు. ఇది అమల్లోకి వస్తే తరగతుల నిర్వహణపై కొంత మేర పర్యవేక్షణ పెరిగే అవకాశం ఉంది. బోగస్‌కు బ్రేక్ పడిందా? ఇన్స్ట్రక్టర్లు, సౌకర్యాల విషయంలో కొన్ని ప్రైవేట్ ఐటీఐలపై విద్యార్థి సంఘాలు గతంలో ఫిర్యాదులు చేశాయి. ఇన్స్ట్రక్టర్లు లేకపోయినా ఉన్నట్లు చూపించడం, అవసరమైన పరికరాలు లేకుండానే ట్రేడులు నిర్వహించడం వంటి ఆరోపణ లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సంఘాల ప్రతి నిధులు చెబుతున్నారు. కొత్త నిబంధనలతో ఇలాంటి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు చెబుతున్నప్పటికీ.. అడ్మిషన్లు పూర్తయిన తర్వాత కూడా తనిఖీలు కొనసాగించాల్సి అవసరం ఉందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి.పర్యవేక్షణ బాధ్యతపై ఆదేశాలు రావాలి కేంద్రప్రభుత్వం కొత్త నిబంధనల మేరకు ఈ ఏడాది ప్రైవేటు ఐటీఐల ప్రవేశాలకు ముందు బోధన అందించబోతున్న ఇన్స్ట్రక్టర్ వివరాలను ఎస్ఐడీహెచ్ అనే ప్రత్యేక పోర్టర్లో నమోదు చేశాం. ఇన్స్ట్రక్టర్లు నమోదైన కోర్సులలో మాత్రమే ప్రవేశాలకు అనుమతి ఇచ్చాం. పోర్టల్‌లో నమోదైన ఇన్‌స్ట్రక్టర్ల హాజరు, విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్, ల్యాబ్ వినియోగం తదితర అంశాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన బాధ్యతకు సంబంధించిన ఆదేశాలు ఇంకా రావాల్సి ఉంది. టీ.వీ.గిరి, ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్, విజయనగరం పోర్టల్‌లో ఉన్నా..కాలేజీకి వెళ్తున్నారా? కొత్త నిబంధనల ప్రకారం సంబంధిత ట్రేడుల్లో పనిచేసే ఇన్‌స్ట్రక్టర్ల వివరాలు, ధ్రువీకరణ పత్రాలు ఎస్ఐడీహెచ్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి వచ్చింది. నోడల్ కళాశాల కన్వీనర్ వాటిని పరిశీలించి ఆమోదించిన తర్వాతే ప్రవేశాలకు అనుమతి లభించింది. అయితే పోర్టల్‌లో ఇన్స్ట్రక్టర్ పేరు ఉండడం..వాస్తవంగా ప్రతిరోజూ తరగతిలో బోధించడం రెండూ ఒకటేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇన్‌స్ట్రక్టర్ల హాజరు, విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రాక్టికల్స్, ల్యాబ్ విని యోగం తదితర అంశాలపై కూడా పర్యవేక్షణ ఉండాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. -
ఆధారాల వేటకు.. ‘ఆధునిక’ రథం
● మన్యం జిల్లాకు మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ● నిశితంగా పరిశీలించిన ఎస్పీ మాధవ్ రెడ్డి పార్వతీపురం రూరల్: నేర దర్యాప్తులో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ, ఆధారాల అన్వేషణను మరింత పదునెక్కించేందుకు పార్వతీపురం మన్యం జిల్లాకు అత్యాధునిక ’మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్’ అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కేటాయించిన ఈ వాహనాన్ని శుక్రవారం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్థానిక పోలీసు కార్యాలయంలో పరిశీలించారు. వాహనంలోని పరికరాల పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. నేరస్థలంలో లభించే చిన్న ఆధారం కూడా కేసు కొలిక్కి రావడంలో కీలకమే. నిందితులు ఆధారాలను చెరిపేసే ప్రయత్నం చేసినా, పక్కాగా వాటిని వెలికితీసేలా ఈ వాహనంలో సదుపాయాలున్నాయి. ఇందులో హై–ఇంటెన్సిటీ లైట్లు, రక్తపు, డీఎన్ఏ నమూనాల సేకరణ కిట్లు, మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాల స్క్రీనింగ్ కిట్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఆధారాల డాక్యుమెంటేషన్ కోసం స్టీరియో మైక్రోస్కోప్, డీఎస్ఎల్ఆర్ కెమెరా, డిజిటల్ ఇన్వెస్టిగేషన్ కిట్, ఫోరెన్సిక్ ఇమేజర్, ఫీల్డ్ ట్రయాజ్ టూల్స్ వంటివి పొందుపరిచారు. ఘటనా స్థలంలోనే తక్షణమే ఆధారాలను సేకరించడం వల్ల అవి కనుమరుగయ్యే లేదా రూపాంతరం చెందే ప్రమాదం తప్పుతుందని ఈ సందర్భంగా ఎస్పీ పేర్కొన్నారు. తద్వారా న్యాయస్థానాల్లో నేరాన్ని సులువుగా నిరూపించవచ్చన్నారు. దర్యాప్తు వ్యవస్థను ఆధునికీకరిస్తూ ఈ వాహనాన్ని మంజూరు చేసిన డీజీపీకి ఎస్పీ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్ రెడ్డి, ఆర్ఐలు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ, ఎస్సై నీలకంఠం పాల్గొన్నారు. -
పోలీసుల సంక్షేమానికి ప్రాధాన్యం
పార్వతీపురం రూరల్: శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం నిమగ్నమయ్యే పోలీసు సిబ్బంది సంక్షేమానికి, వారి సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నట్లు పార్వతీపురం మన్యం ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ‘పోలీస్ వెల్ఫేర్ డే’ (గ్రీవెన్స్ డే) కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందితో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి వ్యక్తిగత, వృత్తిపరమైన ఇబ్బందులతో పాటు ఆరోగ్యపరమైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరి వినతులను సావధానంగా ఆలకించిన ఆయన, వాటి పూర్వాపరాలు పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. విధి నిర్వహణలో నిమగ్నమయ్యే సిబ్బంది ఆరోగ్య, శాఖాపరమైన ఇబ్బందులను తీర్చేందుకు వేగంగా చర్యలు చేపడతామన్నారు. తన దృష్టికి వచ్చిన అర్జీలలో ప్రధానంగా అనారోగ్య సమస్యలు, బదిలీలు కోరుతూ వచ్చినవే ఎక్కువగా ఉన్నాయని ఎస్పీ వెల్లడించారు. నిరంతరం ప్రజాసేవలో ఉండే సిబ్బందికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో సీసీ సంతోష్ కుమార్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ మాధవ్ రెడ్డి -
బుకింగ్ మోసాలపై అప్రమత్తం అవసరం
పట్టణంలో జరుగుతున్న మోసాలపై చిరు, వ్యాపారులు, టెంట్‌హౌస్ నిర్వాహకులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఇటీవల అన్నదానం పేరుతో నకిలీ ఆర్డర్లు ఇచ్చి వ్యాపారులను ముంచేస్తున్న ఘరానా మోసగాళ్ల పట్ల వ్యాపారులు సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ప్రతి వ్యాపారి తమ షాపు వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి. దీని వల్ల అనుమానాస్పద వ్యక్తుల కదలికలు రికార్డ్ అవుతాయి. ఆర్డర్ ఇచ్చే గుర్తు తెలియని వ్యక్తుల వద్ద ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా తీసుకోవాలి. అక్కడికక్కడే కాల్ రింగ్ చేసి కన్ఫామ్ చేసుకోవాలి. ఏదైనా మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే 100/112కి డయల్ చేసి ఫిర్యాదు చేయాలి. – టి.శ్రీనివాసరావు, టూటౌన్ సీఐ, విజయనగరం -
పింఛన్ల కోసం దరఖాస్తుల వెల్లువ
● జిల్లాలో 49,572 మంది దరఖాస్తు ● ఎంపీడీఓ వద్ద అధికంగా పెండింగ్‌లో దరఖాస్తులు ● తిరస్కరించినవి–140 విజయనగరం ఫోర్ట్: చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవరకు కొత్తగా ఒక్క పింఛన్ కూడా మంజూరు చేయలేదు. కొత్తగా దరఖాస్తు చేసేందుకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఎట్టకేలకు ఈ నెల 7వ తేదీ నుంచి పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీంతో జిల్లా వ్యాప్తంగా వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. వృద్ధాప్య, వితంతు, చేనేత, గీతకార్మిక, మత్స్యకార, దివ్యాంగ, చర్మ, డప్పు కళాకారులు మొత్తం 49,572 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో నమోదుకాని దరఖాస్తులు ఎంపీడీఓల వద్ద వేలాదిగా ఉన్నాయి. వేల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ (డబ్ల్యూఈఏ)ల వద్ద 33,199, ఎంపీడీఓల వద్ద 13,360, అసిస్టెంట్ సోషల్ వేల్పేర్ అధికారి ( ఏఎస్డబ్ల్యూఓ)ల వద్ద 353, మత్య్సశాఖ అధికారి వద్ద 52 , చేనేత, జౌళిశాఖ డీడీ వద్ద 23, తహసీల్దార్ల వద్ద 56, జిల్లా అధికారుల వద్ద 392 పెండింగ్‌లో ఉన్నాయి. 140 దరఖాస్తులు తిరస్కరించారు. 1597 దరఖాస్తులను మాత్రమే ఎంపీడీఓలు ఆమోదించారు. -
ఆటో ప్రమాదంలో పలువురికి గాయాలు
కురుపాం:/జియ్యమ్మ వలస రూరల్: జియ్యమ్మవలస మండలంలోని జోగిరాజుపేట సమీపంలో శుక్రవారం ఆటో, స్కూటీ ఢీ కొన్న ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. పార్వతీపురం నుంచి కురుపాం వస్తున్న ఆటో, కురుపాం నుంచి పార్వతీపురం వెళ్తున్న స్కూటీ ఎదురెదురుగా బలంగా ఢీ కొట్టుకొని బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన జియ్యమ్మవలస మండలం నిమ్మలపాడుగ్రామానికి చెందిన మండంగి పొట్ట య్య, కురుపాం మండలం పట్టాయిదొరవలస గ్రామానికి చెందిన ఇ.కామేశ్వరరావులను కురుపాం సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించా రు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యసేవల కోసం పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.అలాగే ఈ ప్రమాదంలో స్వల్పగాయలైన గంట అప్పలనాయుడు, డి.సోమినాయుడు లను ప్రథమ చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తులసివలస పాఠశాలలో అరుదైన పాముకొమరాడ: మండలంలోని కెమిశీల పంచాయతీ తులసివలస ప్రాథమిక పాఠశాల ఆవరణలో అరుదైప పాము కనిపించి కలకలం రేపింది. ఈ మేరకు శుక్రవారం విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఆటలు అడుకుంటుండగా బొప్పాయి చెట్టు వద్ద పాము ఉండడంతో వెంటనే ఉపాధ్యాయల దృష్టి తీసుకుని వెళ్లారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులను పిలిచి పామును హతమార్చారు. ఈ పాము అరుదుగా ఉంటుందని ఈ ప్రాంతానికి సంబంధించిన పాము కాదని చెబుతున్నారు. పాఠశాలలో ప్రహరీ లేకపోవడంతో పాములు, కుక్కలు, పలు జంతువులు పాఠశాలలోకి చేరుకుంటున్నాయి. విద్యార్థులు చదువుతున్న గదుల వద్దకు కుక్కలు వస్తున్నాయిని ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల చుట్టూ ప్రహరీ నిర్మాణం కోసం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు ప్రహరీతో పాటు అదనపు గదులు మంజూరు చేయాలని కోరుతున్నారు. పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్యరామభద్రపురం: మండలంలోని బూసాయవలసలో మద్యానికి బానిసైన ఓ వ్యక్తి గడ్డి మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఉమ్మిరెడ్డి రామారావు(60)కు మద్యం తాగే అలవాటు ఉంది.రోజూ విపరీతంగా మద్యం తాగుతూ ఉండేవాడు. మద్యం తాగి ఆరోగ్యం పాడుచేసుకోవడమెందుకని భార్య భారతి మందలించింది.ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన రామారావు గడ్డిమందు తాగేశాడు. అనంతరం ఓ తోటలో వాంతులు చేసుకుంటూ సొంగలు కక్కుతుండగా స్థానికులు చూసి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వెంటనే కుటుంబసభ్యులు ప్రథమ చికిత్ప నిమిత్తం 108లో బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. ఆరోగ్యం విషమించడంతో మెరుగైన వైద్యం నిమిత్తం విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.భార్య భారతి ఫిర్యాదు మేరకు ఎస్ఐ జ్ఞానప్రసాద్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు బాలిక అప్పగింతతుని: ఇంటిలో ఎవరికీ చెప్పకుండా రైలులో వచ్చిన విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన ఏడిబిల్లి భానును తుని జీఆర్పీ సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ మేరకు శుక్రవారం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు భాను విజయనగరం నుంచి విశాఖ రైల్వేస్టేషన్‌కు చేరుకుని అక్కడ కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్ ఎక్కి జనరల్ బోగీలో కూర్చుంది. బెదురు చూపులు చూస్తున్న ఆమె గురించి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు ఆమెను కాకినాడ జిల్లా తునిలో దించి రైల్వే పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి సమాచారం సేకరించారు. బాలిక తల్లి జానకి ఏఎన్ఎంగా పని చేస్తున్నట్లు గుర్తించి ఆండ్ర పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చి తుని వచ్చిన తల్లిదండ్రులు, బంధువుల సమక్షంలో బాలికను అప్పగించారు. -
ఆదివాసీ బిడ్డలకు రక్షణేదీ?
● గిరిజన విద్యార్థి ఆర్పిత్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలి ● పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి సీతంపేట: గిరిజన విద్యాసంస్థల్లో చదువుతున్న ఆదివాసీ బిడ్డలకు రక్షణ కరువైందని పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి శుక్రవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ‘మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్యమోడల్ రెసిడెన్షి యల్ పాఠశాలలో ఏడోతరగతి చదువుతున్న సీతంపేట మండలం ఎర్రన్నగూడ గ్రామానికి చెందిన సవర అర్పిత్ మృతిపై విచారం వ్యక్తం చేశారు. విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం వెనుక కారణమేమిటన్నది సమగ్ర దర్యాప్తు చేయాలని అధికార యంత్రాంగాన్ని కోరారు. గిరిజన విద్యార్థులు పిట్టల్లా రాలిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. గిరిజన విద్యను గాడిలో పెట్టాల్సిన గిరిజన మంత్రి నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. గిరిజన విద్య, సంక్షేమంపై నిర్లక్ష్యం తగదన్నారు. తమ పిల్లలు చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎన్నో ఆశలతో పాఠశాలలకు పంపిస్తే వారి ఆశలను అడియాశలు చేసి ఇళ్లకు మృతదేహాలను పంపిస్తున్నారన్నారు. బడికి పంపితే తమ పిల్లలు ఏమైపోతారోననే ఆందోళన ఇప్పుడు తల్లిదండ్రుల్లో మొదలైందన్నారు. గిరిజన విద్యార్థులకు పాఠశాలల్లో భద్రత కరువైందన్నారు. ప్రతి విద్యార్థి ప్రాణానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. లేదంటే పోరాటాలు తప్పవని ప్రకటనలో హెచ్చరించారు. -
26న జేఎన్టీయూ జీవీలో మెగా జాబ్ డ్రైవ్
విజయనగరం రూరల్: జేఎన్టీయూ–జీవీలో ఈ నెల 26న నిర్వహించనున్న మెగా జాబ్ డ్రైవ్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జేఎన్టీయూ–జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు శుక్రవారం తెలిపారు. జేఎన్టీయూ–జీవీ, నిర్మాణ్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్ డ్రైవ్ ఈ నెల 26న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నట్లు వీసీ తెలిపారు. ఈ జాబ్ మేళాలో 2023 నుంచి ప్రస్తుత విద్యా సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు పాల్గొనవచ్చని తెలిపారు. మెకానికల్, ఈసీఈ, ఈఈఈ, ఆటోమొబైల్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, అనుబంధ కోర్ బ్రాంచిలకు చెందిన బీటెక్, డిప్లమో, ఐటీఐ అభ్యర్థులతో పాటు బి.ఫార్మశీ, బీఎస్సీ కెమిస్ట్రీ, ఇతర గ్రాడ్యుయేట్లకు అవకాశాలు లబిస్తాయన్నారు. ఈ జాబ్ డ్రైవ్‌కు విప్రో ఇన్ఫ్రాస్టక్చర్, మేథా సర్వో, టీవీఎస్ సుందరం, గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్, ఎంఆర్ఎఫ్ టైర్స్, టెక్ మహీంద్రా, సదర్లాండ్, కాన్సన్ట్రిక్స్, డిల్పి టీవీఎస్, కియా, రాయల్ ఎన్ఫీల్డ్, ఇసుజు, హూందై, సీఐఈ ఆటోమోటివ్, కేఎస్‌హెచ్ ఇంటర్నేషనల్ సంస్థలు హాజరవుతాయని తెలిపారు. ఈ సందర్భంగా జాబ్ డ్రైవ్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. జాబ్ డ్రైవ్‌కు హాజరయ్యే అభ్యర్థులు పాస్‌పోర్టు సైజు ఫొటో, రెజ్యూమె, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పాన్‌కార్డు జిరాక్స్ కాపీలు తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు ఫోన్ 9985219897 (రవివర్మ), 9642193019 (ప్రవీణ్), 9866894969 (మహేష్)నంబర్లను సంప్రదించాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలన్నారు. కార్యక్రమంలో జేఎన్టీయూ జీవీ రిజిస్ట్రార్ కేసీబీ రావు, పరిశ్రమల, ప్లేస్మెంట్ డైరెక్టర్ కె.శ్రీకుమార్, టీపీవో డాక్టర్ పి.శ్రీదేవి, నిర్మాణ్ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో.. ఎల్లోనినో ఎఫెక్ట్
● చంద్రబాబు నిర్వాకం వల్లే కరువు పరిస్థితులు ● ముందస్తు కార్యాచరణలో పాలనా యంత్రాంగం విఫలం ● కమీషన్లు మాట్లాడుకోవడానికే జిల్లా ప్రజా ప్రతినిధుల సమీక్షలు పరిమితం ● విద్యుత్ కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టదా? ● రైతులు, ప్రజలకు అండగా ఉంటాం.. ● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో కరవు పరిస్థితులు పొంచి ఉన్నాయని.. ఇది ఎల్‌నినో ప్రభావం కాదని.. ‘ఎల్లోనినో ఎఫెక్ట్’ అని వైఎస్సా ర్ సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు అన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ... ఇది ప్రకృతి వల్ల వచ్చిన కరవు మాత్రమే కాదని.. ప్రభుత్వ ముందు చూపు లేకపోవడం, ప్రజా ప్రతినిధుల వైఫల్యం, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వాకం వల్లే తీవ్రత పెరిగిందని పేర్కొన్నారు. ఎల్ నినో ప్రభావంపై ఫిబ్రవరి 4నే సీఎం చంద్రబాబు వెల్లడించారని.. వచ్చే పరిస్థితిని ఎదుర్కోవడంలో ఎలాంటి ముందస్తు కార్యాచరణ చేపట్టలేదని గుర్తు చేశారు. నేడు జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని.. ప్రభుత్వ మాటలు నమ్మి సాగులోకి దిగిన రైతులు ఇప్పుడు ఏం చేయాలో తెలియక, ఎండుతున్న పంటలను చూసి గుండెలు పగిలేలా రోదిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఖరీఫ్ వరి సాధారణ విస్తీర్ణం 72,829 హెక్టార్లు కాగా.. ప్రభుత్వం మాటలు నమ్మి, ఆలస్యంగానైనా సాగుకు సిద్ధమైన రైతులు నీటి తడులు లేక, దిగులు చెందుతున్నారని తెలిపారు. అధికారుల లెక్కలు కాగితాలకే పరిమితం అవుతున్నా యన్నారు. ఖరీఫ్‌కు ఉపయోగపడే జూన్ నుంచి ఇప్పటి వరకూ జిల్లాలోని వీరఘట్టం, పాలకొండ, కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, మక్కువ, బలిజిపేట, సాలూరు, పాచిపెంట మండలాల్లో లోటు వర్షపాతం ఉందన్నారు. సీతానగరం, భామిని మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైందన్నారు. ●జూన్ నుంచి నేటి వరకూ జిల్లాలో 677.2 మి.మీ సగటు వర్షపాతం కురవాల్సి ఉండగా.. 414.8 మి.మీ. మాత్రమే పడిందని.. 38.8 మి.మీ లోటు ఉందని వివరించారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో అధిక మండలాలు కరవు పరిస్థితులను ఎదుర్కోక తప్పదని చెప్పారు. ●దాదాపు 11 వేల హెక్టార్లలో సుమారు 18 వేల మంది రైతులు మాత్రమే పంటల బీమాలో నమోదు కావడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశా రు. ఇది కూడా ఆశించిన స్థాయిలో జరగలేదని తెలిపారు. రైతులను చైతన్యం చేయడంలో యంత్రాంగం విఫలమైందన్నారు. ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు నష్టపోయే ప్రమాదం ఉందని చెప్పారు. ●వరుసగా మూడు నెలలు వర్షపాతం లోటు స్పష్టంగా కనిపిస్తున్నా ప్రభుత్వం, జిల్లా ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందించలేదని, కరవు మండలాల ప్రకటన కోసం కనీసం ప్రతపాదనలు అయినా పంపారా? అని ప్రశ్నించారు. కరవు ముంచుకొస్తున్నా ప్రత్యామ్నాయ విత్తనాలు సిద్ధం చేయలేదని, పశుగ్రాసాన్ని జిల్లాలకు పంపలేదని, కనీసం ఉపాధి హామీ అదనపు పనిదినాలు కూడా కోరలేదని గుర్తు చేశారు. జిల్లాలో అధికారులతో మంత్రుల సమీక్షలన్నీ వారి కమీషన్ల కోసం మాట్లాడుకోవడానికి, పోట్లాడుకోవడానికి తప్ప.. ఆచరణలో చేపట్టే పనులేవీ లేవని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి గానీ, జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు గానీ, ఇన్చార్జి మంత్రి అయిన వ్యవసా య శాఖ మంత్రికి గానీ రైతులకు మేలు చేసే ఆలోచన ఉందా? అని పరీక్షిత్ రాజు ప్రశ్నించా రు. ఎక్కడా ముందస్తు ప్రణాళిక లేదన్నారు. రైతు భరోసా కింద పీఎం కిసాన్ కాక, ఇస్తానని చెప్పిన రూ.20 వేలు అన్నదాత సుఖీభవ మొ త్తం ఇవ్వలేదన్నారు. ఈ మూడేళ్లలో ఆ పథకంలో మొత్తం రూ.60 వేలు ఇవ్వాల్సి ఉంటే.. ఇచ్చింది కేవలం రూ.19 వేలు మాత్రమే అని గుర్తు చేశారు. ఒక్కో రైతుకు రూ.41 వేలు బాకీ పడ్డారని తెలిపారు. కనీసం రైతులకు ఈ సమయంలో ఇచ్చినా భరోసాగా ఉండేదన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ ఊసే లేదని, సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారని చెప్పారు. మొంథా, ఇతర తుపానుల వల్ల నష్టపోయిన రైతులకు నిబంధనల పేరు చూపి, ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదన్నారు. ఇక జిల్లాలో కరెంటు కోతలకు అంతే లేదని.. పగలు, రాత్రి తేడా లేకుండా విద్యుత్తు సరఫరా నిలుపు చేస్తున్నారని తెలిపారు. ఓ వైపు వేసవిని తలపిస్తున్న వాతావరణం, మరో వైపు ఈఎల్ఆర్ పేరిట కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే కరవు మండలాలు ప్రకటించాలని పరీక్షిత్ రాజు డిమాండ్ చేశారు. రైతులకు ఉచిత పంటల బీమాను వెంటనే పునరుద్ధరించాలన్నారు. అన్నదాత సుఖీభవ కింద మూడేళ్లకు ఎగ్గొట్టిన రూ.41 వేలు ప్రభుత్వం వెంటనే ఇవ్వాలన్నారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులకు కూడా వర్తింపచేయాలని.. వారికి మూడేళ్లకు కలిపి ఒక్కో రైతుకు రూ.60 వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. కరవు వల్ల నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. రైతులకు సున్నా వడ్డీ కింద గత ప్రభుత్వ హయాంలో ఏ మాదిరిగా ఇచ్చేవాళ్లమో, అదే మాదిరిగా ఈ మూడేళ్లకు సంబంధించి కూడా సున్నా వడ్డీ వర్తింపచేయాలని కోరారు. పశుగ్రాసం ఉచితంగా రైతులకు అందజేయాలన్నారు. కరువు వల్ల వ్యవసాయ పనులకు దూరమైన కూలీలకు అదనపు ఉపాధి పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాదీవెన, వసతి దీవెన డబ్బులు చెల్లించాలని.. తద్వారా రైతులకు, వారి పిల్లలకు తోడుగా నిలవాలని కోరారు. జిల్లాలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొందని.. పార్వతీపురం వంటి పట్టణాల్లో బురద నీరు కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్నారని.. ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేయాలన్నారు. ప్రజలు, రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ కచ్చితంగా ఉంటుందని పరీక్షిత్ రాజు తెలిపారు. వీటన్నింటిపైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. సమస్యల పరిష్కారానికి తగిన కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. రైతుల సమస్యలపై ప్రజల్లోనూ అవగాహన పెంచి, ప్రభుత్వం దిగి వచ్చేలా ఉద్యమాలకు సిద్ధం అవుతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటర్ మ్యాన్ కాదనీ... ‘మ్యాన్ మేడ్ కరువు’ అని పరీక్షిత్ రాజు విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడనున్నట్లు గత ఫిబ్రవరిలోనే హెచ్చరికలు ఉన్నా.. ముందస్తు కార్యాచరణ లేకపోవడం దురదృష్టకరం అన్నారు. జిల్లా పరిస్థితుల రీత్యా మున్ముందు వర్షాలు కురవకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుందని, తిండి గింజలకు కూడా కష్టం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచిత పంటల బీమా ఉండి ఉంటే, సాగు చేయని రైతుకు ఎకరాకు కనీసం రూ.15 వేలు ప్రివెంటివ్ సోయింగ్ కింద ఇన్సూరెన్స్ వచ్చేదని గుర్తు చేశారు. సాగు చేసిన ప్రతి ఎకరాకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు బీమా పరిహారం అందేదన్నారు. జిల్లాలోని ప్రాజెక్టుల్లో కూడా నీరు లేని పరిస్థితి నేడు ఉందన్నారు. -
● విగతజీవులుగా మారుతున్న విద్యార్థులు ● తల్లిదండ్రులకు గర్భశోకం ● విద్యాలయాల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బంది
సాక్షి, పార్వతీపురం మన్యం : జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ విద్యాలయాల్లో విద్యార్థుల మరణాలు సర్వసాధారణం అవ్వడం ఆందోళన కలిగించే విషయమే. ప్రభుత్వ పాఠశాలలతో పోల్చుకుంటే ఆశ్రమ విద్యాలయాలు, గురుకులాల్లో పిల్లల మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటోంది. కారణాలేదైతేనేం.. విద్యాలయాల్లో పర్యవేక్షణ, క్రమశిక్షణ దారి తప్పుతోందనడానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. కొండకోనలను వదిలి, తల్లిదండ్రులను విడిచిపెట్టి, భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో దూరంగా వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు.. విగతజీవులుగా మారిపోతుండటం కలవరపెట్టే అంశమే. ఘటన జరిగినప్పుడు హడావిడి చేస్తున్న యంత్రాంగం.. పరిహారం ప్రకటనతో సరిపుచ్చుకుంటున్న ప్రభుత్వం.. పిల్లల తల్లిదండ్రుల కన్నీటి ఘోషకు సమాధానం చెప్పడం లేదు. వారి కడుపుకోతకు విలువ కట్టడం లేదు. అప్పటి వరకు ఆడుతూపాడుతూ గడిపిన తమ చిన్నారుల మరణ వార్త ఆ కుటుంబంలో చీకట్లు నింపుతోంది. తమ బిడ్డలు అకస్మాత్తుగా ఎందుకు మరణిస్తున్నారో తెలియక భోరున విలపిస్తున్నారు. గతేడాది కురుపాం గురుకుల పాఠశాల బాలికలు పచ్చకామెర్లతో మృతి చెందితే.. కనీసం పరిహారం కూడా ఇవ్వలేని అచేతన స్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. జరిగిన ఘటనకు విచారణ వ్యక్తం చేసిన మంత్రులు, ఉన్నతాధికారులు.. తర్వాతయినా అటువంటి ఘటనలు జరగకుండా అడ్డుకట్ట వేయగలిగారా? అంటే అదీ లేదు. ఏటా పదుల సంఖ్యలోనే మృత్యువాత పార్వతీపురం మన్యం జిల్లాలో ఆశ్రమ పాఠశాలలు 64 ఉన్నాయి. సుమారు 28 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్లో సుమారు 37 వేల మంది వరకు విద్యార్థులున్నారు. మొత్తం ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 1,507 ఉండగా.. ఇక్కడ 87 వేల మంది వరకు చదువుతున్నారు. ఒక్కో విద్యాసంస్థలో వందలాది మంది విద్యార్థులు ఉంటున్నారు. ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల విద్యార్థులు అనారోగ్యం, ఇతర కారణాలతో తరచూ మృత్యువాత పడుతున్నారు. మన్యం జిల్లాలో ఇటువంటి ఘటన నెలకు ఒక్కటైనా బయటపడుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అధిక శాతం మంది విద్యార్థుల్లో ఆ తల్లిదండ్రులకు లేకలేక కలిగిన సంతానమే కావడం యాదృచ్ఛికంగా జరుగుతున్నా.. వారి కడుపు కోతకు ప్రభుత్వ యంత్రాంగం ఏం సమాధానం చెబుతుంది? సిఫారసుల సిబ్బంది.. పెత్తనంతోనే విధి! ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో ఎక్కువ మంది పొరుగుసేవలు, కాంట్రాక్టు ప్రాతిపదికనే పని చేస్తున్నారు. వీరంతా అధికార పార్టీ సిఫారసుతోనే విధుల్లో చేరుతున్నారు. రెగ్యులర్ హెచ్ఎంలు, వార్డెన్లు కూడా ప్రజాప్రతినిధులకు, ఉన్నతాధికారులకు ఎంతో కొంత ముట్టజెప్పి, కోరుకున్న స్థానంలో తిష్ట వేస్తున్నారు. వీరిలో కొంతమంది అధికార పార్టీ పేరు చెప్పుకొని విద్యాలయాల్లో రుబాబు చేస్తున్నారు. అసలు విధులను పక్కనపెట్టి, విద్యార్థులపై పెత్తనం చేస్తున్నారు. ఒకరో, ఇద్దరో నిజాయితీగా పని చేసిన ఉద్యోగులున్నా.. ఇమడనీయడం లేదు. పిల్లలకు పెట్టాల్సిన ఆహారాన్ని అరకొర చేసి, సరకులను పక్కదారి పట్టిస్తున్నారు. మక్కువ మండలం అనసభద్ర ఘటనకు సంబంధించి విద్యాలయంలో ఓ ఉద్యోగిని.. తాను మంత్రి మనిషినంటూ హడావిడి చేస్తారని వినికిడి. పిల్లలకు ఇక్కడ సరైన ఆహారం కూడా పెట్టడం లేదు. ఆమె పెట్టినంతే తినాలి. వండిందే మెనూ! సరకులు పక్కదారి పడుతున్నాయని విద్యార్థులే చెబుతున్నారు. కురుకుట్టి పాఠశాలలోనూ పిల్లలకు వండి పెట్టాల్సిన ఆహార పదార్థాలు రహస్యంగా తరలిపోతుండగా గ్రామస్తులు గతంలో పట్టుకున్నారు. కరాసవలస కేజీబీవీ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదన్న ఆరోపణలతో హడావిడి చేసిన మంత్రి సంధ్యారాణి.. అక్కడి ఎస్వో ప్రశాంతితోపాటు, పలువురి సిబ్బందిని విధుల నుంచి తొలగించారు. అదే పరిస్థితి అనేకచోట్ల ఉన్నా.. ఎందుకు తనిఖీలు చేయడం లేదు, వారిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని గిరిజన సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నచ్చితే ఒకలా.. నచ్చకపోతే మరోలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నాయి. -
రాష్ట్రస్థాయి సెమినార్‌కు మన్యం విద్యార్థుల ఎంపిక
పార్వతీపురం రూరల్: ‘ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047–ప్రతిపాదనలు, సవాళ్లు’ అనే అంశంపై శుక్రవారం పార్వతీపురంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా స్థాయి సైన్స్ సెమినార్‌ను నిర్వహించారు. జిల్లా సైన్స్ అధికారి గిరడ లక్ష్మణరావు పర్యవేక్షణలో జరిగిన విజ్ఞాన సదస్సులో వివిధ మండలాల నుంచి 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పునరుత్పాదక ఇంధన వనరులు, అణు, జల, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ వినియోగం తదితర అంశాలపై వారు చేసిన విశ్లేషణలు, శాసీ్త్ర య ప్రదర్శనలు ఆలోచింపజేశాయి. జ్యూరీ సభ్యు ల నిశిత మూల్యాంకనంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన జియ్యమ్మవలస మండలం బీజే పురం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఎం.లీలాగౌతమ్ (10వ తరగతి ), కురుపాం జెడ్పీహెచ్ఎస్ విద్యార్థిని ఎం.శ్రావ్యశ్రీ (9వ తరగతి) విజేతలుగా నిలిచి రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్ పోటీలకు అర్హత సాధించారు. వీరికి డీఈ ఓ పి.బ్రహ్మాజీరావు ప్రశంసాపత్రాలను అందజేశా రు. కార్యక్రమంలో హెచ్ఎం రామయ్య, ఎంఈఓ లు కె.ప్రసాదరావు, సామల సింహాచలం, ఎన్జీసీ కో–ఆర్డినేటర్ జి.రాజు, నోడల్ సైన్స్ టీచర్లు శైలజ, సంతోష్, గైడ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పార్టీ మారే ప్రసక్తే లేదు
పార్వతీపురం రూరల్: తనపై కొందరు కావాలనే బురదజల్లుతు న్నారని, తాను పార్టీ మారుతున్నట్లు జరు గుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో కొందరు పనిగట్టుకుని చేస్తున్న విష ప్ర చారాన్ని ఆయన శుక్రవారం ఓ ప్రకటనలో ఖండించారు. గత ప్రభుత్వంలో తనకు సముచిత స్థానం కల్పించి, శాసనసభ్యుడిగా ప్రజాసేవ చేసే అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి నేటి కీ, ఏనాటికీ విధేయుడిగానే ఉంటానన్నారు. పార్టీ శ్రేణుల మద్దతుతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి, పార్టీ జెండాను ఎగురవేస్తామని జోగారావు ధీమా వ్యక్తం చేశారు. పార్వతీపురం రూరల్: ‘వికసిత్ భారత్–2047’ కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీ లు నిర్వహించనున్నట్లు డీఈఓ బ్రహ్మాజీరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 10 వరకు జరిగే డ్రాయింగ్, వక్తృత్వ పోటీల్లో 6 నుంచి 12వ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు. ప్రజా సేవ, దేశ నిర్మాణం, వికసిత్ భారత్ లక్ష్యాలపై విద్యా ర్థుల్లో అవగాహన, సృజనాత్మకత పెంచడమే ఈ పోటీల ఉద్దేశమని పేర్కొన్నారు. పార్వతీపురం రూరల్: సర్కారు బడుల రూపురేఖలు మార్చి, కార్పొరేట్ స్థాయికి దీటుగా తీర్చిదిద్దడమే ‘బడికోసం’ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక మన్యం కళావేదికలో శుక్రవా రం విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దాతలు, ప్రజా భాగస్వామ్యంతో బడుల్లో మౌలిక వసతులు, డిజిటల్ విద్యను పెంపొందించేందుకు త్వరలో ప్రత్యేక మొబైల్ యాప్ తీసుకువస్తామ ని వెల్లడించారు. ఆంగ్లం, హిందీ, తెలుగు, గణి త సబ్జెక్టుల్లో విద్యార్థులు పట్టుసాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. పాఠశాలలకు అవసరమైన సదుపాయాల జాబితా సమర్పిస్తే నిధులను బట్టి మంజూరు చేస్తామన్నారు. కార్యక్రమంలో డీఈఓ పి.బ్రహ్మాజీరా వు, అధికారులు, హెచ్ఎంలు పాల్గొన్నారు. సీతానగరం: దీర్ఘకాలంగా ఉపాధి కోల్పోయిన ఎన్‌సీఎస్‌లో పనిచేసే కూలీలను కాదని కర్మా గారంలో క్లీనింగ్ కోసం విజయనగరం జిల్లా గుర్ల మండలం నుంచి కూలీలను రప్పించడా న్ని స్థానికులు శుక్రవారం అడ్డుకున్నారు. యాజమాన్యం తీరుపై ఆందోళన వ్యక్తం చేశా రు. స్థానికంగా కూలీలకు ఉపాధి కల్పించకుండా ఇతర ప్రాంతాల నుంచి కూలీలను తెప్పించడంపై యాజమాన్య ప్రతినిధులను నిలదీశా రు. తక్షణమే 12 నెలల వేతన బకాయిలు చెల్లించాలని, స్థానికులకు ఉపాధి కల్పించాలని యూనియన్ నాయకులు సతీష్, వెంగళరావు డిమాండ్ చేశారు. కూలీల ఆందోళన సమాచా రం అందుకున్న ఎస్ఐ ఎం.హేమలత కర్మాగా రం వద్దకు చేరుకున్నారు. స్థానికులకు పనికల్పించేలా చూడాలని యాజమాన్యంతో మాట్లాడారు. దీంతో వివాదం సద్దుమణిగింది. -
ఐటీడీఏ వద్ద గిరిజనుల ధర్నా
● ఆర్డీవో, తహసీల్దార్‌పై చర్యలకు డిమాండ్పార్వతీపురం రూరల్: ముందస్తు నోటీసులు లేకుండా సాగులో ఉన్న భూములను ఆక్రమించి, జీడిమామిడి తోటలను ధ్వంసం చేసిన బొబ్బిలి ఆర్డీవో, రామభద్రపురం తహసీల్దార్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం వద్ద గిరిజనులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కె.రామస్వామి మాట్లాడుతూ..ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలోని పుల్లేరు గుడ్డువలస, వంగర గుడ్డువలస, జాకరమ్మ కొత్తవలస గ్రామాలకు చెందిన 60 కుటుంబాలు రామభద్రపురం మండలం కొట్టక్కి రెవెన్యూ పరిధిలో సుమారు 100 ఎకరాల్లో 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాయన్నారు. 2009లో 17 కుటుంబాలకు అటవీ పట్టాలు కూడా ఇచ్చారని తెలిపారు. అయితే, ఈ నెల 9న రెవెన్యూ, పోలీసు అధికారులు యంత్రాలతో వచ్చి పంటలను ధ్వంసం చేసి, అడ్డుకున్న రైతులను అరెస్టు చేశారని ఆరోపించారు. 2017లో ఏపీఐఐసీకి ఇచ్చిన ఈ భూమిని ప్రస్తుతం ‘రాధిక ఆయిల్స్ అండ్ మినరల్స్’కు విక్రయించామని చెబుతూ, దౌర్జన్యంగా పంటలను నాశనం చేసిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేయాలని, పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అది రెవెన్యూ భూమి అయితే 2009లో అటవీ పట్టాలు ఎలా ఇచ్చారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు ప్రశ్నించారు. సాగుదారులకు భూసేకరణ చట్టం ప్రకారం నోటీసులు ఇచ్చి, జిరాయితీతో సమానంగా పరిహారం చెల్లించాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించారని ప్రజానాట్యమండలి జిల్లా కార్యదర్శి కోరాడ ఈశ్వరరావు ఆక్షేపించారు. గిరిజనులకు పట్టాలు ఇచ్చి న్యాయం చేయాలని కోరుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో పోరాట కమిటీ నాయకులు జాంబ్రి, రంజు, వెంకట్, మోహన్, కస్తూరి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎవరికీ పట్టదా ఈ బాధ!
● పెదపెంకి గ్రామంలో 200మందికి పైగా వ్యాధిగ్రస్తులు ● మందులు వాడితేనే నొప్పికి ఉపశమనంసాక్షి, పార్వతీపురం మన్యం: అడుగు తీసి అడుగు వేయలేరు.. పెద్ద పెద్ద బండలను కట్టుకుని మోస్తున్నట్లు, మెలిపెట్టి తిప్పేసినట్లుగా కాళ్లు.. భరించలేనంత నొప్పితో విలవిలలాడుతున్నా.. భరిస్తూనే సాగిపోతోంది వారి జీవ నం. ఒకటా, రెండా.. దాదాపు నాలుగు దశాబ్దాలు. ఒకరా, ఇద్దరా వందల్లో బాధితులు. శరీరానికే కాదు .. వారి జీవితాల్లో సైతం నొప్పి, అవమానం, ఆర్థిక ఇబ్బందులు కలిసి వెంటాడుతున్నాయి. చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నా.. పూర్తి స్థా యి ఉపశమనం దొరకక బాధితుల పరిస్థితి దుర్భరంగా మారుతోంది. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామంలో వందలాది మంది నిత్యం పడే బోదకాలు వ్యాధి బాధలివి. పెదపెంకి గ్రామంలో బోదకాలు వ్యాధిగ్రస్తులు వందలాది మంది ఉన్నారు. దాదాపు 40 ఏళ్లుగా ఈ వ్యాధి ఇక్కడి వారి జీవితంలో ఒక భాగమైపోయింది. నిత్యం వారు పడే బాధలు అన్నీఇన్నీ కావు. గ్రామ జనాభా సుమారు 12 వేలు. దాదాపు అందరికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 3 వేల మంది బాధితులున్నారు. ఒక్క పెదపెంకి గ్రామంలోనే ప్రస్తుతం 250 మంది వరకు ఉన్నారని గ్రామస్తులు చెబుతున్నారు. వ్యాధితో మానసికంగా కుంగిపోయిన వారు కొందరైతే.. ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఇంకొందరు. కారణాలేమైనా సరే.. కుంగిపోవాల్సిందే దశాబ్దాలుగా వ్యాధి పట్టి పీడిస్తున్నా కారణాలపై సరైన స్పష్టత రావడం లేదు. దోమలు, పారిశుద్ధ్య లోపమే కారణమని చెబుతున్నారు. ఎస్సీ కాలనీ వైపు ఉన్న తాగునీటి ట్యాంకరు నీరు కూడా కారణమని కొందరు భావిస్తున్నారు. కొన్నాళ్ల క్రితం గ్రామంలో పైలేరియా నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొద్ది రోజులకే అది మూతపడింది. సాధారణంగా బోద అంటే కాలికే ఎక్కువగా సోకుతుంది ఇక్కడ కాళ్లు, చేతులతోపాటు ఛాతీపైనా వస్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. నెలకు పింఛన్ రూ.4 వేల నుంచి రూ.6 వేల చొప్పున అందుకున్న వారూ ఉన్నారు. కొందరు సామాజిక పింఛన్లు అందుకుంటున్నారు. మందులకే ఆ మొత్తం సరిపోతోంది. ప్రభుత్వం ఉచితంగా మందులు ఇస్తున్నా, పని చేయడం లేదని.. అందుకే బయట కొనుగోలు చేసుకుంటున్నామని బాధితులు చెబుతున్నారు. ఇక్కడ వ్యాధి తీవ్రతపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూ.6 కోట్లకుపైగా నిధులు మంజూరు చేయించారు. ఆ నిధులతో మ్యాజిక్ డ్రైన్లు, సీసీ రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకున్నారు. గత మార్చి నెలలో ప్రారంభమైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వాటి వల్ల ఉన్న సమస్య పరిష్కారం కాకపోగా.. కొత్త ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. మా గ్రామంలో బోద వ్యాధి తీవ్రత వల్ల ఒకానొక దశలో ఈ ఊరిలో పిల్లలను చేసుకునేందుకు చాలా మంది అయిష్టత చూపేవారు. సుమారు 40 ఏళ్లుగా వ్యాధి తీవ్రత ఉంది. ఐదేళ్లుగా కొత్తగా కేసులు నమోదు కానప్పటికీ.. ఉన్నవారు మందులు వాడుకుంటూ గడుపుతున్నారు. పారిశుద్ధ్యం, దోమల బెడద తగ్గించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కోట్లాది రూపాయల నిధులు ఇచ్చారు. కానీ, ఇక్కడ పనులు అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి. దీనివల్ల కొత్త సమస్యలు ఏర్పడుతున్నాయి. – గులిపిల్లి అప్పలనాయుడు, పెదపెంకి -
కౌశల్యం..కొలువుల మేళా
విజయనగరం గంటస్తంభం: కలెక్టరేట్లోని ఆడిటోరియంలో నిర్వహిస్తున్న కౌశల్యం ఉద్యోగ మేళాకు నిరుద్యోగ యువత నుంచి విశేష స్పందన లభించింది. గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఈ మేళాలో మొత్తం 700 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. తొలిరోజు గురువారం మధ్యాహ్ననికి 136 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు అధికారి ఎం. కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, అర్హత కలిగిన యువత ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్ విద్యార్హతలు కలిగిన 18–32 ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులని తెలిపారు. ఎంపికై న వారికి నెలకు రూ.15,500 నుంచి రూ.16,500 వరకు వేతనంతో పాటు వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పిస్తారని పేర్కొన్నారు. ఉద్యోగ మేళా శుక్రవారం కూడా కొనసాగుతుందని తెలిపారు. -
20 న ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలు
● యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ శివ ప్రసాద్ విజయనగరం: ఏపీయూడబ్ల్యూజే 27వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఏపీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ పీఎస్‌ఎస్‌వీ. శివ ప్రసాద్ కోరారు. ఈ మేరకు గురువారం ప్రెస్‌క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా 27వ మహాసభల వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఏపీయూడబ్ల్యూజే నిరంతరం కృషి చేస్తూనే ఉంటుందని చెప్పారు. జిల్లాస్థాయిలో రెండు విడతలుగా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రడిటేటషన్ల మంజూరుకు కృషి చేసినట్లు చెప్పారు. ఫ్రీ లాన్స్ జర్నలిస్టులకు కూడా అక్రిడిటేషన్ల మంజూరు కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర మహాపాత్రో మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం హక్కుల సాధన కోసం ఏపీడబ్ల్యుజే రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం సమన్వయంతో ముందుకెళ్తున్నాయని చెప్పారు. ఈనెల 20న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగే 27వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. అదే రోజు మధ్యాహ్నం యూనియన్ జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహాసభల వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎలిశెట్టి సురేష్ కుమార్, విజయనగరం జర్నలిస్టుల సంక్షేమ కమిటీ అధ్యక్షుడు లింగాల నరసింగరావు, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎస్ఎన్ రాజు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు టి.రాధాకృష్ణ యూనియన్ నాయకులు కేజే శర్మ, పంచాది అప్పారావు, సముద్రాల నాగరాజు, వైఎస్ పంతులు, శెట్టి గోవిందరావు, బంకురు శంకరరావు, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు . -
కళ్లముందే కష్టమంతా బూడిద
సంతకవిటి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగి కోట్లలో నష్టం వాటిల్లింది. సంతకవిటి మండలంలో గురువారం జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మద్దూరు రామయ్య అగ్రహారంలో సుగంధం చందు అనే వ్యక్తి ఎస్సీఎస్ఆర్ ఫర్నిచర్, ఎలక్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, బీరువాలు మాన్యుఫ్యాక్చరింగ్ షాప్ నడుపుతున్నారు. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో విద్యుత్ మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు గమనించి విషయం తెలియజేయడంతో కుటుంబసభ్యులు వచ్చి షట్టర్లు తెరిచి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించి అందులో ఉన్న ఒక దివాన్కాట్ను బయటకు తీశారు. మిగతా వస్తువులు తీద్దామనుకునే లోపే మంటలు షాప్ మొత్తం వ్యాపించాయి. కనీసం దగ్గరకు కూడా వెళ్లలేనంతగా మంటలు వ్యాపించాయి. షాపులో ఉన్న ఏసీలు, టీవీలు, మంచాలు, పరుపులు, ప్లాస్టిక్ కుర్చీలు, కుక్కర్లు, ఇన్వర్టర్లు, కంప్యూటర్, వాషింగ్ మెషీన్లు, కూలర్లు అన్నింటికీ మంటలు వ్యాపించాయి. ఇంతలో గ్రామస్తులు తేరుకుని డీజిల్ ఇంజిన్ ఏర్పాటు చేసి షాప్‌లోకి పైపుల సహాయంతో నీటిని తీసుకు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇంతలో రాజాంలో నివసిస్తున్న యజమాని చందు వచ్చి పరిస్థితి చూసి సొమ్మసిల్లి పడిపోయాడు. సమయానికి రాని ఫైర్ ఇంజిన్ మండలంలోని చాలా గ్రామాలు పొందూరు ఫైర్ స్టేషన్ పరిధిలో ఉన్నాయి. ప్రమాదం జరిగిన మద్దూరు రామయ్య అగ్రహారం కూడా పొందూరు ఫైర్ స్టేషన్ పరిధిలోనిదే. రోడ్డు బాగోలేదనే కారణంతో గ్రామానికి రాలేమని ఫైర్ సిబ్బంది చెప్పినట్లు గ్రామస్తులు తెలిపారు. అనంతరం రాజాం నుంచి ఫైర్ ఇంజిన్ రాగా ఇప్పుడెందుకు వచ్చారని గ్రామ మహిళలు ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి ఏం లాభమని నిలదీశారు. ఫైర్ సిబ్బంది మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేశారు. దాదాపు రూ 1.20 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఫైర్ ఆఫీసర్ వై.గోవిందరావు తెలిపారు. 25 లక్షల యూవీ ప్రింటింగ్ మెషీన్ అగ్గిపాలు 15 రోజుల క్రితం బీరువాలపై ప్రింటింగ్ వేసేందుకు రూ.25 లక్షలు ఖర్చు చేసి యూవీ ప్రింటింగ్ మెషీన్‌ను బెంగళూరు నుంచి యజమాని చందు తీసుకు వచ్చారు. కనీసం గంట ముందు ఫైర్ ఇంజిన్ వచ్చినా ఈ మెషీన్ అయినా మిగిలి ఉండేదని యజమాని భోరున విలపించాడు. -
శ్రమజీవులకు స్ఫూర్తిదాత విశ్వకర్మ
పార్వతీపురం రూరల్: శిల్పకళ, వాస్తుశాస్త్రం, యంత్ర సాంకేతికానికి ఆద్యుడు, ప్రపంచ తొలి వాస్తుశిల్పి శ్రీ విశ్వకర్మ అని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, దేవశిల్పి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ.. విశ్వకర్మ కేవలం దేవతల శిల్పి మాత్రమే కాద ని, చేతివృత్తుల కళాకారులకు, ఇంజనీర్లకు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయుడన్నారు. కృష్ణుడు పాలించిన ద్వారకానగరం వంటి అద్భుత కట్టడాలను ఆయన నిర్మించినట్లు పురాణాలు చెబు తున్నాయని గుర్తుచేశారు. ఆధునిక యుగంలోనూ ఆయన సృజనాత్మక సిద్ధాంతాలు, నిర్మాణ శాస్త్ర సూత్రాలు ఎంతో ఆచరణీయమని స్పష్టం చేశారు. పట్టుదల, కష్టపడే తత్వం, వృత్తి నైపుణ్యం ఉంటే ఏదైనా సాధించవచ్చనే సందేశాన్ని ఆయన జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, పాలకొండ, ఏఆర్ డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి, సీఐలు రమణమూర్తి, మారూఫ్, జీఏవీ రమణ, ఎస్సైలు, పోలీసు సిబ్బంది నివాళులర్పించారు. -
నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు
● సిబ్బందికి ఎస్పీ ఏఆర్.దామోదర్ ఆదేశాలు విజయనగరం టౌన్: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల్లో నిందితులకు న్యాయస్ధానాల్లో శిక్షలు పడే విధంగా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పాత్ర క్రియాశీలకమని ఎస్పీ ఏఆర్.దామోదర్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఎస్సైలు, సీఐలు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బందితో జూమ్ మీటింగ్‌ను గురువారం ఎస్పీ నిర్వహించారు. వారు నిర్వహించాల్సిన విధులు, న్యాయస్ధానాల్లో వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వివిధ కేసుల్లో నిందితులు అరెస్టు అయిన సమయంలో పూర్తి వివరాలను సంబంధిత ఎస్సైలు రిజిస్టర్లో నమోదుచేయాలని సూచించారు. న్యాయస్ధానాలు, పోలీసు స్టేషన్ల మధ్య కోర్టు కానిస్టేబుళ్లు, సీఎంఎస్ అధికారులు వారధిగా పనిచేయాలన్నారు. కేసుల విచారణ సమయంలో నిందితులపై నేరారోపణలు రుజువు చేసేందుకు సాక్షులు సకాలంలో హాజరయ్యేందుకు సమన్లను సకాలంలో అమలుచేయాలని, కోర్టులు జారీచేసిన నాన్‌బెయిల్‌బుల్ వారంట్లను ఎగ్జిక్యూట్ చేసి, నిందితులు కోర్టు వాయిదాలకు క్రమం తప్పకుండా హాజరయ్యేవిధంగా చూడాలని సూచించారు. మహిళలపై జరిగే దాడులు, పోక్సో, గంజాయి కేసుల్లో నిందితులు కఠినంగా శిక్షకు గురయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. కేసుల విచారణ వివరాలను ఎప్పటికప్పుడు సీసీటీఎన్ఎస్లో అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. జూమ్ కాన్ఫరెన్స్‌లో అడిషనల్ ఎస్పీ పి.సౌమ్యలత, పలువురు డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
పూరిల్లు దగ్ధం
వేపాడ: మండలంలోని శింగరాయి గ్రామంలో గురువారం ఉదయం 10గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక పూరిల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో వనమోజు అప్పలనరసమ్మ నివాసం ఉంటున్న పూరిల్లు కాలిపోగా, ఇంట్లో ఉన్న వంట సరుకులు పాత్రలు, దుస్తులు రెండు ఫ్యాన్లు, విద్యుత్ మీటరు, దాచుకున్న 20,000 వేల నగదు అగ్నికి ఆహుతైనట్లు ఆమె చెప్పింది. గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు గ్రామ రెవెన్యూ అధికారి గనివాడ సోమరాజు దర్యాప్తు జరిపి ఆస్తి నష్టం రూ.20 వేల వరకు ఉంటుందని నివేదికను సమర్పించినట్లు మండల రెవెన్యూ అధికారిణి జె.రాములమ్మ తెలిపారు. పూసపాటిరేగ : భోగాపురం మండలం రెడ్డికంచేరులో రెండు పూరిళ్లు దగ్ధ మయ్యాయి. గ్రామానికి చెందిన వనం అప్పయ్యమ్మ, ముడసల అచ్చియ్యమ్మలకు చెందిన గృహాలు కాలిపోయాయి. పూరిళ్ల ఉన్న గృహోప కరణాలు కొంత మేర దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన యువత వచ్చి కొంత మేర మంటలను అదుపుచేయడంతో ఆస్తి, ప్రాణనష్టం తప్పింది. జేఎన్టీయూ జీవీలో ‘సాహిత్యం సామాజిక ప్రయోజనం’విజయనగరం రూరల్: జిల్లా కేంద్రం శివారు జేఎన్టీయూ–జీవీలో ‘సాహిత్యం–సామాజిక ప్రయోజనం’ అంశంపై ప్రత్యేక సాహిత్య కార్యక్రమం గురువారం నిర్వహించారు. జేఎన్టీయూ జీవీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలలోని ప్రాథమిక శాస్త్రాలు–హ్యుమానిటీస్ విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జేఎన్టీయూ – జీవీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వీఎస్.వకుళ మాట్లాడుతూ విద్యార్థులు సాహిత్యాన్ని కేవలం పఠనానికే పరిమితం చేయకుండా, సమాజాన్ని అర్థం చేసుకోవడానికి, మానవీయ విలువలను పెంపొందించుకోవడానికి ఒక సాధనంగా భావించాలని సూచించారు. తెలుగు సాహితీ సమితికి చెందిన సాహితీవేత్తలు, కవులు చీకటి దివాకర్, డాక్టర్ జీవీఎస్. జయపాలరావు, రత్నాల బాలకృష్ణ, వి.వెంకటరావు, పప్పు భోగారావులు మాట్లాడుతూ సాహిత్యం వ్యక్తిలో ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను, సామాజిక బాధ్యతను పెంపొందిస్తుందన్నారు. సమాజంలోని సమస్యలను ప్రతిబింబిస్తూ సానుకూల మార్పునకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో పఠనాశక్తిని పెంపొందించడం, మాతృభాషపై అభిమానం పెంచడం, సాహిత్యాన్ని సామాజిక చైతన్యానికి అనుసంధానం చేయడం అవసరమని అన్నారు. అనంతరం వచ్చేనెల 10 నుంచి విశాఖలో జరగనున్న సాహిత సమ్మేళనం –2026 కార్యక్రమం గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల సీఎస్ఈ విభాగానికి చెందిన అధ్యాపకులు డిడివి. ఆర్.శివరాం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా వాణిశ్రీ, శ్రీనువిజయనగరం: విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న స్కూల్ గేమ్స్ కార్యదర్శులుగా ఎంఆర్ సంస్కృత హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్ పీడీ రావాడ వాణిశ్రీ, జామి మండలం భీమసింగి జెడ్పీహెచ్ఎస్ పీఈటీ బైరెడ్డి శ్రీనులు ఎంపికయ్యారు. అండర్ 14, 17, 19 అడ్మిన్‌గా వీరు వ్యవహరించనున్నారు. ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. స్కూల్‌గేమ్స్ ఆధ్వర్యంలో క్రీడల నిర్వహణ బాధ్యతలు చేపట్టనున్నారు. -
క్రీడాస్ఫూర్తిని జీవితానికి అనుసంధానం చేయాలి
విజయనగరం టౌన్: క్రీడాస్ఫూర్తిని నిజ జీవితానికి ప్రతి ఒక్కరూ అనుసంధానం చేసుకోవాలని ఎస్పీ ఏఆర్.దామోదర్ సూచించారు. ఈ మేరకు సారిపల్లిలోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీకానిస్టేబుల్స్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించిన స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు వేడుకలను పరేడ్ గ్రౌండ్లో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ నిబంధనలకనుగుణంగా క్రీడాస్ఫూర్తితో సమష్టిగా, ఒకరితో మరొకరు సమన్వయం చేసుకుని ఆడుతూ విజయం సాధించాల్సి ఉంటుందన్నారు. అదేరకమైన స్ఫూర్తిని నిజజీవితంలో కూడా ప్రదర్శించి, చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించి, క్రమశిక్షణ కలిగిన పౌరులుగా,ఉద్యోగిగా ప్రవర్తించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. క్రీడాస్ఫూర్తితో నిబంధనలు పాటిస్తూ, సమష్టిగా సమన్వయంతో ఆడి ఎలాగైతే విజయం సాధిస్తామో, అదేవిధంగా మనం వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చినప్పటికీ విధినిర్వహణలో ఒకరికొకరు సహాయపడుతూ శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఏటా నిర్వహించే రాష్ట్రస్ధాయి పోటీల్లో ప్రతిభ కనబర్చితే అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్, సర్వీసులో ప్రోత్సహకాలు ఉంటాయన్నారు. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆటలో నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. అనంతరం విజేతలకు బహుమతులు, ట్రోఫీలు, మెడల్స్ ప్రదానం చేశారు. ముగింపు వేడుకల్లో అడ్మిన్ ఎస్పీ పి.సౌమ్యలత, ఏఆర్. అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, మహిళా పీఎస్ డీఎస్పీ పీవీవీ .నరసింహారావు, ఎస్సీ,ఎస్టీ సెల్ డీఎస్పీ ఎం.వీరకుమార్, పలువురు సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గుర్తు తెలియని యాచకుడి మృతికొత్తవలస: మండల కేంద్రంలోని విజయనగరం రోడ్డులో గల బస్‌షెల్టర్‌లో గుర్తు తెలియని యాచకుడు మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గమనించారు. మృతుడికి సుమారు 60 సంవత్సరాలు ఉంటాయని అంచనా. ఆయన గత 30 రోజులుగా స్థానికంగా యాచిస్తూ రాత్రి వేళ బస్‌షెల్టర్‌లో ఉంటున్నట్లు స్థానికులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు పంచాయతీ పారిశుధ్య కార్మికులు మృతదేహాన్ని పక్కనే గల శ్మశాన వాటికలో ఖననం చేశారు. -
ఆరిపోయిన ఆశల దీపం
● ఎదిగి వస్తాడనుకున్న కొడుకు మరణంతో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● పాఠశాల గదిలో అపస్మారక స్థితిలో విద్యార్థి గుర్తింపు ● ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి ● ఏకలవ్య పాఠశాలలో విషాదం ● విధుల్లో నిర్లక్ష్యంపై ప్రిన్సిపాల్ సస్పెన్షన్, వార్డెన్ తొలగింపుపార్వతీపురం రూరల్ /మక్కువ: చక్కగా చదువుకుంటూ అన్ని రంగాల్లో ముందుండే ఆ పసివా డు అనంత లోకాలకు పయనమయ్యాడు. ఎదిగి వచ్చి ఇంటికి పెద్ద దిక్కు అవుతాడనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అర్థాంతరంగా ఆవిరయ్యాయి. ‘ఏం కష్టమొచ్చింది నాన్నా.. ఎవరితో చెప్పుకోలేక ఎందుకిలా చేశావ్ అసలు ఏమైంది అంటూ’ ఆ కన్నవారు కుమిలిపోతున్న తీరు చూపరులను కలిచి వేసింది. పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం అనసభద్ర ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న సవర అర్పిత్ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. గురువారం ఉదయం తరగతి గదిలో అర్పిత్ అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది.. హుటాహుటిన డోకిశీల పీహెచ్‌సీకి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి పార్వతీపురం కేంద్రాస్పత్రికి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా..మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధారించారు. సీతంపేట మండలంలోని ఎర్రన్నగూడకు చెందిన రాంబా బు, చామంతి దంపతులకు ఇద్దరు కుమార్తెల తర్వాత పుట్టిన అర్పిత్ మరణవార్త విని ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, ఎప్పుడూ చలాకీగా ఉండే అర్పిత్.. ఉరి వేసుకుని చనిపోతానని ఉదయం తనతో చెప్పిన ట్లు స్నేహితుడు హర్షవర్ధన్ తెలపగా, ఇంటికి వెళ్లిపోతానని గతంలో చెప్పినట్లు మరో విద్యార్థి లోకేష్ వెల్లడించాడు. అప్పుడప్పుడు ఆటపట్టిస్తుంటాడని భావించిన తోటి విద్యార్థులు ఈ ఊహించని సంఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విద్యార్థి మృతి ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు చేపట్టింది. పాలనాపరమైన వైఫల్యాలకు బాధ్యుడ్ని చేస్తూ.. అనసభద్ర ఈఎంఆర్ఎస్ ప్రిన్సిపాల్ కె.సురేష్‌పై తక్షణమే సస్పెన్షన్ విధిస్తూ ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ (ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశా రు. సస్పెన్షనన్కు గురైన ప్రిన్సిపాల్ తాడేపల్లి ప్రధాన కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించగా, సీనియర్ పీజీటీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితుల నేపథ్యంలో హాస్టల్ వార్డెన్ (అతిథి అధ్యాపకుడు)ఎ.మహేశ్వరరావును విధుల నుంచి తొలగిస్తూ తక్షణ ఆదేశాలు అమలు చేశారు. బందోబస్తు నిర్వహించిన పోలీసులు ఈ ఘటన సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబసభ్యులు భారీగా ఆటోల్లో జిల్లా ఆస్పత్రికి చేరుకుంటున్న నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆస్పత్రికి ముందుగా చేరుకున్న ఉత్తరాంధ్ర గిరిజన సంక్షేమ నాయకుడు పాలక రంజిత్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు తహసీల్దార్ భానుప్రసాద్ పాఠశాలకు చేరుకుని ఏడో తరగతి విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు పాఠశాలను సందర్శించి దర్యాప్తు ముమ్మరం చేశారు. విద్యార్థి ఉరి వేసుకున్నట్లుగా భావిస్తున్న గది కిటికీని ఏఎస్సై శ్రీనివాసరావు పరిశీలించగా, క్లూస్ టీమ్ ఆ గదిని తమ ఆధీనంలోకి తీసుకుని కీలక ఆధారాలు సేకరిస్తోంది.పార్వతీపురం రూరల్: మక్కువ మండలంలోని అనసభద్ర ఏకలవ్య పాఠశాలలో గురువారం ఏడో తరగతి విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై సమాచారం అందుకు న్న వెంటనే ఐటీడీఏ ఏపీవో ప్రభాకరరావు కేంద్రాస్పత్రికి చేరుకున్నారు. అక్కడ మృతుడి తల్లి దండ్రులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఆయన ప్రభుత్వం తరఫున కీలక హామీలు ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ.5 లక్షల వరకు నష్టపరిహారం అందజేస్తామని ఏపీవో స్పష్టం చేశారు. దీనికి తోడు, ఆ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఔట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. -
క్రీడాకారుల భవితతో.. ఆటలు!
● విజయనగరంలో ఇటీవల ఓ క్రీడకు సంబంధించి రాష్ట్రస్థాయి ఎంపికలు జరిగాయి. నామమాత్రంగా పోటీలు నిర్వహించారు. జిల్లా క్రీడాప్రా ధికార సంస్థకు, క్రీడా అధికారులకు పోటీల వివరాల సమాచారం లేదు. కేవలం రాజకీయ నాయ కులను ముఖ్యఅతిథిగా పిలిపించి తమకు నచ్చిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ● ఓ క్రీడకు సంబంధించి రెండు నుంచి మూడు సంఖ్యలో అసోసియేషన్లు ఉన్నా యి. ఒక్కో ప్రాంతానికి, ఒక్కో వీధికి ఒక్కో అసోసియేషన్ ఉంది. వీరంతా జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. ఉపయోగ పడని ధ్రువపత్రాలు ఇస్తున్నారు. కీడాకారులు ఇవి తెలుసుకోవాలి పోటీల్లో పాల్గొనే ముందే సంబంధిత సంఘానికి గుర్తింపు ఉందా లేదా అనేది తెలుసుకునేందుకు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిని సంప్రదించాలి. క్రీడా యాప్‌లో వ్యక్తిగతంగా నమోదు అయితే తెలుసుకోవచ్చు. వీటి నిర్వహణ తీరు సంతృప్తికరంగా లేకపోతే విజయవాడలోని శాప్ కార్యాలయానికి ఫిర్యాదు చేయొచ్చు. కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు నిబంధనలు పాటించే అసోసియేషన్లు ఎన్ని....? గుర్తింపు పొందాల్సిందే.. ప్రతి క్రీడా సంఘం తప్పనిసరిగా గుర్తింపు పొందాల్సిందేనని శాప్ నుంచి ఆదేశాలు వచ్చాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిన సంఘాల వివరాలు క్రీడా యాప్‌లో నమెదు చేసుకోవాలి. అలా గుర్తింపు పొందిన సంఘాలకు మాత్రమే జిల్లా స్థాయి గుర్తింపు వస్తుంది. రెండు, మూడు సంఘాలు ఉండటానికి వీలులేకుండా చర్యలు చేపడుతున్నాం. క్రీడాకారులు గుర్తింపు సంఘాల నిర్వహించే పోటీల్లో పాల్గొంటేనే వారి ధ్రువపత్రాలకు విలువ ఉంటుంది. లేనిపక్షంలో నష్టపోతారు. – ఎస్.వెంకటేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి, విజయనగరంవిజయనగరం: తమ పిల్లలు క్రీడల్లో రాణించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తారు. దీనికోసం చిన్నప్పటి నుంచే శిక్షణ ఇప్పిస్తారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేస్తారు. పతకాలు సాధిస్తే ఆనంద పడతారు. ఉజ్వల భవిత లభిస్తుందని ఆశ పడతా రు. తాజాగా కూటమి ప్రభుత్వంలో చేపట్టిన మెగా డీఎస్సీలో స్పోర్ట్ కోటాలో చేపట్టిన ఉపాధ్యాయుల నియామకాల్లో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం క్రీడల్లో పతకాలు సాధించిన, ప్రతిభ చూపిన క్రీడాకారులు, వారి తల్లిదండ్రులను కలవరపెడుతోంది. అసోసియేషన్ల పేరుతో కొన్నాళ్లుగా సాగుతున్న దందా చర్చనీయాంశంగా మారింది. ప్రతిభ చూపే క్రీడా కారులను పక్కనపెట్టి క్రీడా అసోసియేషన్ల పేరుతో పలువురు సాగిస్తున్న వ్యాపారం క్రీడాలోకాన్ని విస్మయపరుస్తోంది. ప్రభుత్వ పెద్దల సాక్షిగా సాగుతున్న క్రీడాకోటాలో ఉద్యోగవ్యాపారం ఆవేదనకు గురిచేస్తోంది. పోటీలో పాల్గొని గెలవకపోయినా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పతకాలు సాధించినట్టు సర్టిఫికెట్లు ఇవ్వడం విస్తుపరుస్తోంది. ఎంత మొత్తంలో చేతులు మారకుంటే ఈ తరహా దందాకు దిగుతారన్న వాదన బలంగా వినిపిస్తోంది. గుర్తింపు లేని అసోసియేషన్లే ఎక్కువ..! స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధికారిక లెక్కల ప్రకారం మొత్తంగా 37 క్రీడా అసోసియేషన్లు ఉన్నాయి. ప్రతి క్రీడకు ఒక అసోసియేషన్ ఉంటుంది. ఒలింపిక్ సంఘం అనుసంధానంగా క్రీడా సంఘాలు ఉంటాయి. ఇవి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఉన్న అసోసియేషన్లకు అనుసంధానమై ఉంటాయి. ఏటా అండర్–12, 14, 17, 19 పాఠశాల, కళాశాల స్థాయి పోటీలు నిర్వహిస్తారు. ఇవి కాకుండా వివిధ క్రీడా అసోసియేషన్ల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించి ప్రతిభ చూపిన వారిని మండలాల వారీగా ఎంపిక చేసుకుని జిల్లాస్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం కల్పిస్తారు. ఇక్కడ ప్రతిభ కనబరిచిన వారికి రాష్ట్రస్థాయి, అక్కడ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి అవకాశం వస్తుంది. ఇక్కడ జారీ చేసే ధ్రువపత్రాలు ఎంతో విలువైనవి. ప్రభుత్వ ఉద్యోగాలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. అయితే, 37 క్రీడా సంఘాల్లో 2025 సంవత్సరంలో రెన్యువల్ చేయించుకున్న సంఘాలు 9 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 28 సంఘాల వాటి గుర్తింపును రెన్యువల్ చేయించుకోలేదని, మరికొన్ని గుర్తింపుకూడా పొందలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన పరిశీలిస్తే అనధికారి అసోసియేషన్లు క్రీడాకారుల జీవితాలతో ఆటలాడుతున్నట్లు తెలుస్తోంది. గుర్తింపు లేని సంఘాలతో క్రీడాకారులకు అన్యాయం రాష్ట్ర, జిల్లా స్థాయిలో రెన్యువల్ చేయించడంలో నిర్లక్ష్యం ఈ సంగతి తెలియక మోసపోతున్న క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు అర్హత కల్పిస్తామంటూ వసూళ్ల దందా మెగా డీఎస్సీలో వెలుగులోకి వచ్చిన నకిలీ సర్టిఫికెట్లతో సర్వత్రా ఆందోళన ఇకపై గుర్తింపు తప్పనిసరి అంటున్న జిల్లా క్రీడాభివృద్ధి అధికారులు రాష్ట్ర క్రీడా సంఘాల గుర్తింపు క్రమబద్ధీకరించకపోవడంతో వందలాదిమంది సీనియర్ జాతీయస్థాయి క్రీడాకారులు ఆటలో శ్రమించి సాధించిన ధ్రువపత్రాలు పనికి రావడం లేదు. ఒకవైపు అసో సియేషన్ ప్రతినిధుల నిర్లక్ష్యం, మరోవైపు ఆధిప త్య పోరుతో క్రీడాకారుల జీవితాలు అంధ కారమయమవుతున్నాయి.వాస్తవానికి ప్రతి పోటీకి ఒలింపిక్ అసోసియేషన్ నుంచి ప్రతినిధి, అలాగే క్రీడా అధికారులు రావాల్సి ఉంటుందన్నది నిబంధన. క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఒక్కో క్రీడకు మూడు, నాలుగు అసోసియేషన్లు ఏర్పాటు చేసుకొని నామ మాత్రపు పోటీలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించడం సాధారణ విషయం కాదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల క్రీడాకారులు హాజరవుతారు. రెండు, మూ డు రోజుల వరకు పోటీలు జరుగుతాయి. హాజరైన క్రీడాకారులతో పాటు శిక్షకులకు భోజన వసతితో పాటు బాల బాలికలకు వేర్వేరుగా వసతి కల్పించాల్సి ఉంది. నామమాత్రంగా పోటీలు నిర్వహించి మిన్నకుండి పోతున్నారు. ప్రయోజనాలు ఇలా.. గుర్తింపు ఉన్న క్రీడా సంఘాల్లో ఉంటే ప్రభు త్వం నుంచి ఆర్థిక సాయం, క్రీడాసామగ్రి అందుతుంది. గ్రూప్–1, గ్రూప్–2, డీఎస్సీ, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు క్రీడాకోటాలో రిజర్వేషన్ లభిస్తుంది. శాప్ గుర్తింపు లేకుండా, రెన్యువల్ చేయకుండా పోటీలు నిర్వహించకూడదు. సర్టిఫికెట్ ఉంటే చాలా....? రాష్ట్రస్థాయి పోటీల్లో ఓడినా, గెలిచినా.. పాల్గొన్నా ధ్రువపత్రం కోసం ప్రస్తుతం జిల్లా ఎంపికల్లో ప్రాధాన్యత కనపడుతోంది. ప్రతిభ లేకున్నా సరే.. జిల్లాస్థాయి ఎంపికల్లో పాల్గొన్న అనంతరం రాష్ట్రస్థాయి పాల్గొన్నారనే ధ్రువపత్రం కోసం కొందరు తహతహలాడుతున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని పలు అసోసియేషన్లు సొమ్ముచేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని అసోసియేషన్లు స్పోర్ట్స్ కోటా కింద పిల్లలకు ఉద్యోగాలు వస్తాయంటూ తల్లిదండ్రులకు ఆశ చూపి భారీగానే దండుకుంటున్నట్టు సమాచారం. -
నేరస్తులకు శిక్ష పడితేనే ఖాకీకి సార్థకత
● నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డిపార్వతీపురం రూరల్: నేరస్తులకు కోర్టులో శిక్షలు పడేలా నాణ్యమైన దర్యాప్తు సాగినప్పుడే పోలీసు శాఖకు గౌరవం దక్కుతుందని, సమాజంలో నేరం చేయాలంటే వణుకు పుడుతుందని ఎస్పీ ఎస్.వి.మాధవ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి మాసాంతపు నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హత్యలు, ప్రాపర్టీ నేరాల దర్యాప్తులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయుధంగా మలుచుకోవాలని సూచించారు. బందోబస్తు విధుల్లో సిబ్బంది తప్పనిసరిగా బాడీవోర్న్ కెమెరాలు ధరించాలని, సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో గగనతల పహారా కొనసాగించాలని ఆదేశించారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అత్యంత సున్నితమైన (హైపర్ సెన్సిటివ్) గ్రామాలపై నిఘా పెంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. దత్తత గ్రామాల పోలీసులు ‘మన్యంతో మమేకం’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో విస్తృతంగా చేపట్టాలని కోరారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి శాఖలో ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. గంజాయి అదుపు, ఆస్తుల రికవరీ, కేసుల ఛేదనలో కీలకంగా వ్యవహరించిన 38 మంది సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బందికి ఈ సందర్భంగా ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వరరావు, డీఎస్పీలు రాంబాబు, థామస్ రెడ్డి, సీఐలు రమణమూర్తి, మారూఫ్, రమణ, ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిపాదనలు కను‘మరుగు?
రామభద్రపురం: స్వచ్ఛతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. ఇందులో భాగంగా పశువైద్యశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని కూటమి ప్రభుత్వ పాలకులు ప్రచార ఆర్బాటాలు చేశారు. అలాగే ఏఏ పశువైద్యశాలల్లో మరుగుదొడ్లు అవసరమో,ఎంత నిధులు అవసరమో నివేదికల రూపంలో ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.దాంతో హమ్మయ్యా ఏళ్లుగా ఉన్న సమస్య తీరిపోతుందని సంబరపడి పశువైద్యశాఖాదికారులు ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు.అయితే ఆ ప్రతిపాదనలు చెత్తబుట్టలోకి వెళ్లాయో ఏమో గాని ప్రతిపాదనలు పంపించి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మరుగుదొడ్ల నిర్మాణాలకు చర్యలు కానరావడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 85 పశువైద్యశాలలకు రూ.1.40 కోట్లతో ప్రతిపాదనలువ్యవసాయం తర్వాత పాడిపోషణే ఎక్కువ మందికి జీవనాధారం.వ్యాధుల బారిన పడే పశువులకు వైద్యం అందించేందుకు ఆస్పత్రులలో చాలా చోట్ల మరుగుదొడ్లు లేవు. మరికొన్ని చోట్ల ఉన్న అవి దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో వినియోగానికి వీలు లేని విధంగా పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛభారత్ నిధులతో 85 పశువైద్యశాలల్లో మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారు చేసి పంపించారు. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి సుమారు రూ.1,65 లక్షలు చొప్పున రూ.1,40,25,000 నిధులు అవసరమని అంచనా వేసి ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇప్పటి వరకు పైసా విడుదల కాలేదు. ఆ ప్రతిపాదనలకు నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శలు ఉన్నాయి. పశువైద్యశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు లేక సిబ్బంది,ఆస్పత్రులకు పశువులు తీసుకొచ్చిన పాడిరైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పుకోలేక సిబ్బంది అవస్థలు ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నామంటూ ప్రచారాలు తప్ప వాటి ఆచరణకు సరైన సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం దృష్టిపెట్టడంలేదు. పశువైద్యశాలల్లో మూత్రశాలలు,మరుగుదొడ్లు లేక సిబ్బంది,ఆస్పత్రులకు పశువులు తీసుకొచ్చిన పాడిరైతులు ఇబ్బందులు పడుతున్నారు.ఇందులో మహిళల పరిస్థితి చెప్పుకోలేని స్థితిలో ఉంటోంది. కొన్ని చోట్ల ఉన్నా శిథిలావస్థకు చేరడంతో పాటు వాటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో అత్యవసర సమయంలో మూత్రానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మధుమేహం ఉన్న వారు తరుచూ మూత్రశాలకు వెళ్లాల్సి వస్తోంది. దీంతో పురుషులు మహిళలు సిగ్గుపడుతూ ఒంటికీ, రెంటికీ తుప్పల చాటుకు వెళ్లాల్సిన దుస్థితి. లేందటే ఉగ్గబట్టుకుని ఉండాల్సిన పరిస్థితి ఉంది. గంటల తరబడి మూత్రం ఉగ్గబట్టుకున్నా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికై నా నిధులు విడుదల చేసి పశువైద్యశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సిబ్బంది, పాడిరైతులు కోరుతున్నారు.కొట్టక్కి పశువైద్యశాలలో పాడిపశువుకు వైద్య పరీక్షలు చేస్తున్న మహిళా సిబ్బంది జిల్లాలో అవసరమైన 85 పశువైద్యశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు తయారు చేసి పంపించాం. ప్రస్తుతం ప్రాసెస్‌లో ఉంది.నిధులు విడుదలైన వెంటనే నిర్మాణాలకు చర్యలు చేపడతాం. ఎస్.మన్మథరావు, జేడీ, జిల్లా పశువైద్యశాఖ, విజయనగరం -
విద్యుత్ బస్సుల ముసుగులో ఆర్టీసీ ఆస్తుల పంపకం
పార్వతీపురం రూరల్: కార్మికుల చెమట చుక్కలతో ఏర్పాటైన ఆర్టీసీని ప్రైవేట్ శక్తులకు ధారాదత్తం చేసే కుట్రలను ఐక్య పోరాటాలతో తిప్పికొట్టాలని ఎస్‌డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వి.రాములు పిలుపునిచ్చారు. పార్వతీపురం డిపో వద్ద బుధవారం ఎస్‌డబ్ల్యూఎఫ్ 48వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ ఉద్యోగి ఎస్వీ రమణ సంఘం జెండాను ఆవిష్కరించారు. అనంతరం డిపో కార్యదర్శి ఏఎస్టీ బాబు అధ్యక్షతన జరిగిన సభలో రాములు మాట్లాడుతూ.. కార్మికుల హక్కుల సాధనకు ఎస్‌డబ్ల్యూఎఫ్ దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. పినాకిల్ కంపెనీ పేరుతో యాజమాన్యం విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టి ఆర్టీసీ ఆస్తులను అప్పగించే ప్రయత్నం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పార్వతీపురం, బొబ్బిలి ప్రాంతాల్లో చార్జింగ్ పాయింట్ల ఏర్పాటు సన్నాహాలు ఈ ప్రైవేటీకరణకు అద్దం పడుతున్నాయన్నారు. ఆర్టీసీ సిబ్బందితోనే బస్సులు నడిపేలా జేఏసీ ఆధ్వర్యంలో పోరాడి సాధించినప్పటికీ, పినాకిల్ కంపెనీ డిపోలను పరోక్షంగా స్వాధీనం చేసుకునే యోచనలో ఉందన్నారు. ఈ ముప్పును ఎదుర్కోవడానికి ఉద్యోగులంతా ఏకతాటిపైకి రావాలని ఉద్ఘాటించారు. కార్మికులు అప్రమత్తంగా ఉండి, హక్కుల సాధనకు ముందడుగు వేయాలని సీఐటీయూ నాయకులు సూచించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు రెడ్డి వేణు, ప్రధాన కార్యదర్శి వై.మన్మథరావు, కోశాధికారి గొర్లి వెంకటరమణ, నాయకులు బి.సూరిబాబు, టి.వెంకటి, ఎంవీఏ నాయుడు, ఎస్ఏ రాజు, బీఎస్ రావు, జీఎస్ రావు, జీకే రావు, కేఈ నాయుడు, ఆర్వీ రావు తదితరులు పాల్గొన్నారు. ఐక్య పోరాటాలతో ప్రైవేటీకరణను అడ్డుకోవాలి ఎస్‌డబ్ల్యూఎఫ్ ఆవిర్భావ సభలో రాష్ట్ర కార్యదర్శి రాములు -
ఎన్నికల సంబడి
● ఈ నెల 29న ఎస్ఎంసీ ఎన్నికలు ● చేతులెత్తే పద్ధతి ద్వారా అభ్యర్థుల ఎంపిక ● ఈ సారి ప్రైవేట్ పాఠశాలల్లోనూ ఎన్నికలు వీరఘట్టం: బడిలో ఎన్నికల సందడి మొదలు కానుంది. సర్కారు బడుల అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వాములను చేసేందుకు రెండేళ్లకు ఒకసారి విద్యాశాఖ ఎస్ఎంసీ (స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) ఎన్నికలను నిర్వహిస్తుంది. రెండేళ్ల క్రితం ఎన్నికై న ఎస్‌ఎంసీల కాలపరిమితి ముగిసింది. దీంతో ఈ ఎన్నికలకు సంబంధించి ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 29న ఎన్నికల నిర్వహించేందుకు బుధవారం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే ఈసారి ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఎన్నికలు నిర్వహించాలని నిశ్చయించారు. ఎటువంటి రాజకీయ ప్రమేయం ఉండకూదని నిబంధనలు చెబుతున్నాయి. అయితే రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో చాలా చోట్ల రాజకీయ నాయకులు చొరబడడంతో తగాదాలు జరిగాయి. మరి ఈసారి ఏ పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తారో చూడాలి. విద్యార్థుల తల్లిదండ్రులు చేతులెత్తే పద్ధతి ద్వారా ఎస్ఎంసీ చైర్మన్, వైఎస్ చైర్మన్లను ఎన్నుకుంటారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో ఎన్నికలను జరిపించేందుకు విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదీ పరిస్థితి.. పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రాథమిక, మోడల్ ప్రైమరీ, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్, ప్రభుత్వ ఉన్నత, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, కేజీబీవీ ఇలా అన్ని మేనేజ్మెంట్లలో 1,604 సర్కారు బడులు ఉన్నాయి. అలాగే 98 ప్రైవేట్ పాఠశాలలతో కలిపి 1702 విద్యా సంస్థలు ఉన్నాయి. వాటిలో 1,65,352 మంది విద్యార్థులు ఈ ఏడాది చదువుతున్నారు. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు ఓటర్లు లిస్టు(తల్లిదండ్రులు) జాబితా ప్రచురుణ చేస్తారు. 25న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఓటరు జాబితాపై అభ్యంతరాలు/ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3–4 గంటల మధ్యలో తుది ఓటరు జాబితా ప్రచురణ చేస్తారు. రాజకీయ జోక్యం లేకుండా 29న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట లోపు ఎస్ఎంసీ ఎన్నికలను నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్మన్, వైస్ చైర్మన్లతో ప్రమాణ స్వీకారం చేయించి, మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.30 గంటల మధ్య తొలి సమావేశాన్ని నిర్వహిస్తారు. 15 మండలాలకు ఎన్నికల ప్రత్యేకాధికారులు.. ప్రభుత్వ, ప్రైవేట్ బడుల్లో ఈ నెల 29న జరగనున్న ఎస్ఎంసీ ఎన్నికలను పర్యవేక్షించేందుకు విద్యాశాఖకు సంబంధించిన అధికారులను జిల్లాలోని 15 మండలాలకు నియమించారు. వీరు ప్రతి మండలంలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతారు. అలాగే ఇక్కడ జరిగే ఎన్నికల ప్రక్రియను ఉన్నతాధికారులకు నివేదిస్తారు. -
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తాం
ఈనెల 29న ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ముమ్మర ఏర్పా ట్లు చేస్తున్నాం. అలాగే ఈ ఎన్ని కలను పర్యవేక్షించేందుకు అన్ని మండలాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తున్నాం. నోటిఫికేషన్లో ఉన్న నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు చేపడతాం. ప్రశాంత వాతావరణంలో ఎస్ఎంసీ ఎన్నికలు జరిగేలా తల్లిదండ్రులు తమ సహకారాన్ని అందించేలా అవగాహన కల్పిస్తాం. ప్రైవేటు పాఠశాల్లో కూడా ఎన్నికలు జరిగేలా చర్యలు చేపడతాం. పి.బ్రహ్మాజీరావు, డీఈఓ, పార్వతీపురం మన్యం జిల్లా -
ఉన్నవి అవస్థలే!
మ్యాజిక్ లేదు.. మంత్రం లేదు...● ఈ చిత్రంలోని వ్యక్తి పేరు పెంకి నారాయణ. పెదపెంకి గ్రామంలోని ప్రధాన రోడ్డులో నివసిస్తున్నాడు. కాలువల కోసమని వీరి ఇంటి ముందు చాలా రోజుల క్రితమే గొయ్యిలు తవ్వేసి వదిలేశారు. ఇంటికి వెళ్లడానికి మార్గం కూడా లేకుండా చేసేశారు. అక్కడ నీరు నిల్వ ఉండిపోతోంది. ఇసుక, సిమెంట్ బస్తాలనే మెట్ల మార్గంగా చేసుకున్నామని.. బాగున్న ఊరిని నాశనం చేసి వదిలేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.గ్రామమంతా ఇళ్ల ముందు మెట్లు కొట్టేయడంతో ఇటువంటి దృశ్యాలే..సాక్షి, పార్వతీపురం మన్యం: బలిజిపేట మండలం పెదపెంకి గ్రామాన్ని బోధవ్యాధి ఎన్నో ఏళ్లుగా వేధిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం దోమలు, పారిశుధ్య లోపమని గుర్తించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. గ్రామాన్ని దత్తత తీసుకుని దాదాపు రూ.6 కోట్లకుపైగా నిధులు మంజూరు చేయించారు. ఊరంతా సిమెంట్ రోడ్లు, మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వీబీ జీ రామ్‌జీ పథకం కింద గ్రామంలో 66 సీసీ రహదారులు 79 మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి ప్రతిపాదించారు. మూడు, నాలుగు నెలల క్రితమే పనులు ప్రారంభమయ్యాయి. రెండు, మూడుసార్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో ప్రారంభోత్సవానికి సన్నాహాలు కూడా అధికారులు చేసేశారు. ఇక్కడ పనులపై నివేదిక తెప్పించుకున్న ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనే కాదు.. గ్రామస్తులు సైతం పనుల పట్ల కోపోద్రిక్తులవుతున్నారు. అధికారులు ఊరిలో అడుగు పెడితే చాలు.. దుమ్మెత్తి పోస్తున్నారు. ఆనందం లేదు.. మిగిలిందంతా గొయ్యిలు, రాళ్లే! గ్రామమంతా సీసీ కాలువలు, మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తామని అధికారులు చెప్పడంతో ప్రజలంతా సంతోషించారు. మ్యాజిక్ డ్రైన్ల ద్వారా ఎక్కడికక్కడ గోతుల్లో నీరు ఇంకిపోతుందంటే ఆనందించారు. తీరా అస్తవ్యస్త పనులు గ్రామస్తులకు నరకం చూపిస్తున్నాయి. రాజకీయ ప్రమేయంతో కాంట్రాక్టర్లు మారి, అడ్డుసుడి పనులు చేశారు. వీధులు పొడువునా ఇళ్ల ముందు కాలువల కోసం మెట్లు తవ్వి వదిలేసిన గొయ్యిలే. తలుపులు, చెక్కలను రహదారి మార్గంగా ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. కాలువల్లో ఇసుక, చిప్స్, చిన్న రాళ్లు మూడు దశల్లో వేసి, కొన్ని చోట్ల ఇంకుడు గుంతల మాదిరి గోతులు తీశారు. వర్షం, వాడుక నీరు అక్కడే భూమిలోకి ఇంకిపోవడం దీన్ని ప్రధాన ఉద్దేశం. పనుల కాంట్రాక్టుల కోసం ప్రజాప్రతినిధుల స్వార్థం, అరకొర.. అస్తవ్యస్త పనులు, అధికారుల అలసత్వం, స్థానికుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం కొరవడటంతో కొత్త ఇబ్బందులు పుట్టుకొస్తున్నాయి. అడుగు పెట్టలేని దుస్థితి కాలువలు, రోడ్లు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఇటీవల వేసిన మ్యాజిక్ డ్రైన్ల నుంచి వర్షం నీరు ఇంకకపోగా.. రోజుల తరబడి నిల్వ ఉండి, రహదారులపైకి వస్తోంది. గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆ డ్రైన్లను అధికారులు మరలా తవ్వేశారు. కాపువీధి, ఎస్సీవీధి, కూరాకులవీధి, దత్తివీధి, ప్రధాన రహదారి, బంకురువీధి, వెలమవీధి.. ఇలా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. భారీ గోతులు, పిక్క, ఇసుక నిల్వలు, రాళ్లతో నిండిన రహదారులు.. ఇవే దృశ్యాలు ఊరంతా కనిపిస్తున్నాయి. కొన్ని ఇళ్లు దిగువకు ఉండటం వల్ల వర్షం కురిసిందంటే చాలు.. కాలువలు, రహదారిపై నీరంతా వారి ఇళ్లల్లోకి చేరుతోంది. వాటిని తోడుకుంటూ రాత్రంతా జాగారమే అవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటి వరకు చేసిన పనుల వల్ల రూ.కోట్ల నిధులు బుగ్గిపాలు అయ్యాయని గ్రామస్తులు వాపోతున్నారు. తిట్టిపోస్తున్న పెదపెంకి వాసులు మ్యాజిక్ డ్రెయిన్ల పేరిట ఊరంతా ఎక్కడికక్కడ సమస్యలు నెలలు గడుస్తున్నా తీరని ఇబ్బందులు -
ఇంటింటికీ మన్యం పోలీస్‌పై ఎస్పీ సమీక్ష
పార్వతీపురం రూరల్: ప్రజల చెంతకే రక్షకభటులు చేరి, వారి కష్టసుఖాలు తెలుసుకునేలా పార్వతీపురం మన్యం జిల్లాలో చేపట్టిన ‘ఇంటింటికీ మన్యం పోలీస్’ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో ప్రతి గడపకూ తీసుకెళ్లాలని ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో ఆయన జూమ్ వేదికగా వర్చువల్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు వృత్తిని కేవలం విధి నిర్వహణగా కాకుండా బాధ్యతగా స్వీకరించాలన్నారు. ప్రజలను సొంత కుటుంబ సభ్యుల్లా ఆప్యాయంగా పలకరిస్తూ వాడవాడలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని సూచించారు. ప్రతి ఒక్క సిబ్బంది తమకు కేటాయించిన దత్తత గ్రామాల్లోని ప్రతీ ఇంటినీ సందర్శించి, క్షేత్ర స్థాయి పరిస్థితులపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సున్నిత అంశాలపై ముందస్తు సమాచార వ్యవస్థను పటిష్ఠం చేసుకోవాలని స్పష్టం చేశారు. దత్తత గ్రామంలో ‘విలేజ్ పోలీస్’గా చెరగని ముద్ర వేసుకోవాలని, మీ రక్షణ కోసమే మేమన్న భరోసాను కల్పించాలన్నారు. -
హ్యూమన్ రైట్స్ రాష్ట్ర డైరెక్టర్‌గా అదృష్టకుమార్
బొబ్బిలి: పట్ట ణానికి చెందిన కె.అదృష్ట కుమార్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ రాష్ట్ర డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఇటీవలే నియామక సమాచారం అందుకున్న అదృష్ట కుమార్ బుధవారం కాకినాడలోని జేఎన్టీయూ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షుడు టి. ప్రసన్నకుమార్ చేతులమీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు. రాష్ట్ర డైరెక్టర్‌గా నియామకమైన అదృష్టకుమార్ను ఈ సందర్భంగా పట్టణ వాసులు అభినందిస్తున్నారు. సమర్ధవంతమైన చర్యలతో నేరాల తగ్గుముఖంవిజయనగరం టౌన్: జిల్లా పోలీసుశాఖ చేపడుతున్న పటిష్టమైన భద్రత చర్యలు, సమర్థవంతమైన పోలీసింగ్‌తో గతేడాది కంటే ఈ ఏడాది నేరాలు తగ్గుముఖం పట్టాయని ఎస్పీ ఏఆర్.దామోదర్ పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం వివరాలు వెల్లడించారు. క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్‌కి సంబంధించి గతేడాది 304 కేసులు నమోదుకాగా, ఈ ఏడాదిలో 217 కేసులు మాత్రమే నమోదయ్యాయన్నారు. క్రైమ్ ఎగినెస్ట్ చిల్డ్రన్‌కి సంబంధించి పోక్సో కేసులు గత ఏడాది 44 నమోదు కాగా, ఈ ఏడాదిలో 20 కేసులు నమోదయ్యాయన్నారు. క్రైమ్ ఎ గినెస్ట్ ఉమెన్ కేసుల్లో 31 క్రైమ్, ఎగినెస్ట్ చిల్డ్రన్ కేసుల్లో 36, మొత్తం 67 కేసుల్లో నిందితులకు న్యాయస్ధానాల్లో శిక్షలు పడ్డాయని తెలిపారు. గంజాయి కేసుల్లో గతేడాది 78 కేసులు నమోదు చేసి 1147.856 కిలోల గంజాయిని సీజ్ చేసి, 246 మందిని అరెస్టు చేసి, 35 వాహనాలను సీజ్ చేశామన్నారు. ఈ ఏడాదిలో 23 కేసులు మాత్రమే నమోదుకావడం, 655.225 కిలోల గంజాయి సీజ్ చేసి, 118 మందిని అరెస్ట్ చేసి, 25 వాహనాలు సీజ్ చేశామని తెలిపారు. రహదారి ప్రమాదాల్లో ఈ ఏడాది ఇప్పటివరకూ 350 రహదారి ప్రమాదాలు జరిగి, 137 మంది మరణించగా, 444 మంది గాయపడ్డారన్నారు. గతేడాది కంటే రహదారి ప్రమాదాలు 15.5శాతం తగ్గాయని వివరించారు. రెవెన్యూ రికార్డుల మార్పుపై ఫిర్యాదు పూసపాటిరేగ: మండలంలోని కొల్లాయివలసకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేశారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు తహసీల్దార్ ఎన్వీ రమణను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. సర్వే నంబర్ 76–1లో భూములు మార్పు చేశారని దువ్వు అప్పలస్వామితో పాటు పలువురు తెలిపారు. దీనిపై తహసీల్దార్ రమణ స్పందిస్తూ విచారణ చేసి హక్కుదారుల పేర్లు నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ఎంవీజీ శంకరరావు, నర్సన్న, తదితరులు పాల్గొన్నారు. లారీ ఢీకొని వ్యక్తి మృతి● గరివిడి ఆర్ఓబీ సమీపంలో ప్రమాదం చీపురుపల్లిరూరల్(గరివిడి): విజయనగరం–పాలకొండ ప్రదాన రహదారిలో గరివిడి ఆర్ఓబీ సమీపంలో పెట్రోల్‌బంకు ఎదురుగా బుధవారం ఉదయం ఓ బైక్‌ను లారీ ఢీకొనడంతో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్ల మండలానికి చెందిన ద్విచక్రవాహనదారు బోడసింగి లక్ష్మణరావు(37) సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ఈ ప్రమాదానికి సంబంధించి గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు ఉదయం 11గంటల సమయంలో విజయనగరం నుంచి చీపురుపల్లి వైపు వెళ్తున్న లారీడ్రైవర్ మితిమీరిన వేగంతో వాహనాన్ని నడుపుతూ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గుర్ల మండలంలోని కొండగండ్రేడు గ్రామానికి చెందిన బోడసింగి లక్ష్మణరావు తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఈశ్వరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతుడికి భార్యతో పాటు డిగ్రీ చదువుతున్న కూతురు నీలిమ, ఏడో తరగతి చదువుతున్న బాలుడు యుగంధర్ ఉన్నారు. చిన్నపాటి వ్యవసాయం, కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్న ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. -
వివాహేతర సంబంధం.. అంతులేని విషాదం
● నడిపల్లి మహిళ హత్యకేసు ఛేదించిన పోలీస్‌శాఖ ● నిందితుడి అరెస్ట్, రిమాండ్‌కు తరలింపు ● వివరాలు వెల్లడించిన ఎస్పీ ఏఆర్ దామోదర్విజయనగరం టౌన్: వివాహేతర సంబంధాలతో కుటుంబాలు ఛిన్నాభిన్నమై, అంతులేని విషాదం మిగులుతుందని వాటి జోలికి పోవద్దని ఎస్పీ ఏఆర్.దామోదర్ హెచ్చరించారు. జీవితాలను నాశనం చేసే వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండాలని, మాయ మాటలతో ప్రలోభాలకు గురిచేస్తే, వాటిని తిప్పికొట్టాలని సూచించారు. కుటుంబ వ్యవస్ధతో పాటు చిన్నారులు దిక్కూముక్కూ లేనివారవుతారని, ప్రతి ఒక్కరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. పూసపాటిరేగ మండలంలోని నడిపల్లి గ్రామంలో జరిగిన హత్య ఉదంతంపై ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. అనుమానం..పెనుభూతమై.. పూసపాటిరేగ మండలంలోని నడిపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న శీల అప్పారావు..తన భార్య రమ (37) కనిపించడం లేదని పూసపాటిరేగ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఉమెన్ మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం రమ మృతదేహం లభించడంతో మిస్సింగ్ కేసు కాస్త హత్యకేసుగా మార్చి ఉమెన్ పీఎస్ డీఎస్పీ పీవీవీ నరసింహరావు, ఇన్చార్జ్ డీఎస్పీ ఎస్.రాఘవులు ఆధ్వర్యంలో భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు దర్యాప్తు వేగవంతం చేశారు. హత్యకు గురైన రమకు హత్యకు పాల్పడిన నిందితుడు 28 ఏళ్ల లంకలపల్లి బంగారుబాబు మధ్య నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. గత నాలుగు నెలలుగా రమ తన ప్రియుడు బంగారుబాబును దూరం పెట్టడం, బంగారుబాబు ఫోన్‌కాల్స్‌కు సరిగ్గా స్పందించకపోవడంతో ఆమె వేరెవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానం పెంచుకుని, ఆమైపె కక్ష పెంచుకున్నాడు. నిందితుడు ఈ నెల 14న 11 గంటల ప్రాంతంలో రమకు ఫోన్ చేయగా ఆమె కొద్ది సమయం మాత్రమే ఫోన్ మాట్లాడి పెట్టేసింది. అనంతరం మధ్యాహ్న సమయంలో మరోసారి ప్రియుడు ఫోన్ చేయడంతో ఇంట్లో ఎవరూ లేరని, తనతో వివాహేతర సంబంధం కొనసాగించాలని, మాట్లాడుకుందామని ఇంటికి రమ్మని చెప్పడంతో, ప్రియుడి మాటలు నమ్మి రమ వారింటికి వెళ్లింది. వివాహేతర సంబంధాన్ని తనతో కొనసాగించకపోతే విషయాన్ని భర్తకు చెప్పేస్తామని ఆమెను బెదిరించడంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన బంగారుబాబు ఆమె ముక్కు, నోరుపై దిండును పెట్టి, ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశాడు. అనంతరం గోనె సంచిలో ఆమె శవాన్ని దాచిపెట్టి, మోటారు సైకిల్ ముందు పెట్టుకుని, సారిపల్లి కొండ సమీపంలోకి తీసుకుని వెళ్లి పడేశాడు. దర్యాప్తులో భాగంగా లంకలపల్లి బంగారుబాబుపై అనుమానంతో దర్యాప్తు అధికారులు సాంకేతికను వినియోగించి ఆధారాలు సేకరించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని, విచారణ చేయగా, నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. నేరస్థలాన్ని క్షుణ్ణంగా క్లూస్ టీమ్ సహకారంతో పరిశీలించి, సాంకేతిక, శాసీ్త్రయ ఆధారాలు సేకరించామని ఎస్పీ వివరించారు. రమ మృతదేహాన్ని తరలించేందుకు ఉపయోగించిన మోటార్ సైకిల్, నిందితుడు వినియోగిస్తున్న మొబైల్ ఫోన్ ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో సీజ్ చేశామన్నారు. కేసులో దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి, న్యాయస్ధానంలో నిందితుడిపై త్వరలో అభియోగపత్రం దాఖలు చేసి, నిందితుడ్ని శిక్షించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసులో క్రియాశీలకంగా పనిచేసిన భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, పూసపాటిరేగ ఎస్సై అరుణ్ కిరణ్, కానిస్టేబుల్స్ సతీష్, వాసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో డీఎస్పీలు ఎస్.రాఘవులు, పీవీవీ.నరసింహారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ .లీలారావు, పూసపాటిరేగ ఎస్సై అరుణ్‌కిరణ్, నెల్లిమర్ల ఎస్సై గోపాలరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆండ్ర రిజర్వాయర్ భద్రతపై తనిఖీ
● పరిశీలించిన ఐపీఈఓ బృందం ● నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి నివేదిక అందజేస్తామని వెల్లడిమెంటాడ: ఆండ్ర జలాశయ డ్యామ్ భద్రతా అంశంపై స్వతంత్ర నిపుణుల ప్యానెల్ (ఐపీఈఓ) సభ్యులు బుధవారం విస్తృతంగా పరిశీలించారు. తనిఖీల అనంతరం ప్యానెల్ చైర్మన్, రిటైర్డు చీఫ్ ఇంజినీర్ పోలేశ్వరరావు, సభ్యులు (రిటైర్డు చీఫ్ ఇంజినీర్లు) ఎం.టి.రాజు, చిట్టిబాబులతో కలసి మీడియాతో మాట్లాడారు. ఆండ్ర రిజర్వాయరు భద్రతా పరంగా బాగానే ఉందని, చిన్న చిన్న లోటుపాట్లను సరి చేసుకుంటే సరిపోతుందని వారు స్పష్టం చేశారు. ప్రాజెక్టు వద్ద విద్యుదీకరణ పనులు కూడా ప్రారంభమయ్యాయని తెలిపారు. పరిశీలించిన అన్ని అంశాలను నివేదిక రూపంలో నేషనల్ డ్యామ్ భద్రతా అథారిటీకి అందజేస్తామని ప్యానెల్ సభ్యులు చెప్పారు. విజయనగరం ఇరిగేషన్ ఈఈ గోవిందరావు, డీఈ రామునాయుడు, హైడ్రాలజీ డీఈ నర్మదా పట్నాయక్, ఏఈ సుధీర్, రిజర్వాయరు ఏఈ కృపానంద్ పాల్గొన్నారు. -
ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీయే నిర్వహించాలి
● ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య విజయనగరం: ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ సమీపంలో రెవెన్యూ భవన్లో ఉమ్మడి విజయనగరం జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సీ్త్రశక్తి పథకం మరింత విజయవంతం కావాలంటే భవిష్యత్‌లో రాబోయే ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే కొని నిర్వహించడం ద్వారా సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రతకు సంబంధించి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో యాజమాన్యంతో చర్చలు జరిపి, ఉద్యోగులకు భద్రతతో పాటు భరోసా కల్పించేలా పలు అంశాలపై ఒప్పందాలు సాధించామని తెలిపారు. ఆర్టీసీలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగికి ఉద్యోగ భద్రత, సంక్షేమం, పదోన్నతులు, ఖాళీల భర్తీ, కొత్త బస్సుల కొనుగోలు, విద్యుత్ బస్సుల విషయంలో ఉద్యోగుల ప్రయోజనాల పరిరక్షణ వంటి అంశాలపై ఎంప్లాయీస్ యూనియన్ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి.భానుమూర్తి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జేఏసీ చేసిన పోరాటాల ఫలితంగానే పలు అంశాలపై యాజమాన్యం సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ సమావేశంలో ఈయూ రాష్ట్ర కార్యదర్శి డి.అరుణ మాట్లాడుతూ ఐక్యంగా ఉంటేనే హక్కుల సాధన సాధ్యమవుతుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులంతా ఐక్యంగా ఉండాలని, యూనియన్లకు అతీతంగా ఉద్యోగుల ప్రయోజనాల కోసం, ఆర్టీసీ పరిరక్షణ కోసం యూనియన్ చేస్తున్న కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. సమావేశంలో కె.కృష్ణారావు, ఎల్ఏరావు, కేవీ రమణ, యుఎస్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సమష్టిగా పని చేసి విజయం సాధిద్దాం
సాలూరు రూరల్: రానున్న స్థానిక ఎన్నికల్లో సమష్టిగా పని చేసి వైఎస్సార్సీపీ విజయం సాధించేలా కృషి చేద్దామని మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర అన్నారు. గత జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు మళ్లీ గుర్తు చేస్తూ ఓటు అడగాలని, ఓటరుగా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. పార్టీ క్యాంపు కార్యాలయంలో పట్టణ వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందన్నారు. ముఖ్యంగా మహిళలకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. నిరుద్యోగులకు నెలకు రూ.3000 ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండడంతో పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించిందని, కానీ ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబును నమ్మడం లేదన్నారు. అన్ని వర్గాల ప్రజల్లో ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకం ఉందన్నారు. మంత్రికి కక్ష సాధింపులే తప్ప హామీలు గుర్తుండవు.. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణికి కక్ష సాధింపులే తప్ప ఇచ్చిన హామీలు గుర్తుకు రావని రాజన్నదొర ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో చిరుద్యోగులపై కక్ష సాధించిన తీరు ప్రజల్లో గుర్తుందన్నారు. దళిత, గిరిజన మహిళలని చూడకుండా అన్ని వర్గాల వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడున్నారన్నారు. ఈ తరుణంలో మంత్రి సంధ్యారాణి తీరుపై ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు. తన ఎమ్మెల్యే పదవీ కాలంలో ఏ ఒక్క ఉద్యోగిని ఇబ్బందులకు గురి చేయలేదన్నారు. మంత్రి అయిన వెంటనే పట్టణంలో మరుగుదొడ్లుపై మహిళల ఆత్మగౌరవం గురించి మాట్లాడిన మంత్రి ఇప్పుడు ఉన్న మరుగుదొడ్లును పూడ్చేస్తున్నారే తప్ప వాటిని బాగు చేసిన దాఖలాలే కనిపించడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు మహిళల ఆత్మగౌరవం గుర్తుకు రావడం లేదా? అని ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓటు అడగడమే కాదు.. అండగా నిలవాలి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. గత ప్రభుత్వంలో సంక్షేమం ప్రజలకు గుర్తు చేయాలి మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర -
కలెక్టర్ x ఎమ్మెల్యే
సాక్షి, పార్వతీపురం మన్యం: కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర నడుమ తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఎప్పటి నుంచో ఇరువురి మధ్య అంతర్గతంగా సాగుతున్న విభేదాలు.. జిల్లా మంత్రి సమక్షంలోనే ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. పెద్ద కేకలతో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. ఐఏఎస్ అధికారి అన్న కనీస మర్యాద మరిచి, పార్వతీపురం ఎమ్మెల్యే విజయ్‌చంద్ర.. కలెక్టర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఆరోపణలకు దిగారు. వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ, జిల్లా అధికారుల ముందటే ఆయన్ను అగౌరవపరిచారు. దీన్ని కలెక్టర్ ప్రభాకరరెడ్డి దీటుగా తిప్పికొట్టారు. మైకు ఉందని ఇష్టానుసారం మాట్లాడవద్దని హెచ్చరించారు. జిల్లాలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై బుధవారం పార్వతీపురం మన్యం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి, పాలకొండ, పార్వతీపురం ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ, బోనెల విజయ్‌చంద్రతో పాటు.. కలెక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి, ఇతర జిల్లా అధికారులంతా హాజరయ్యారు. వ్యవసాయం, పశుసంవర్థక, మత్స్య, అటవీ, ఉద్యానవన, మహిళా సంక్షేమం, గిరిజన, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, ఆరోగ్యం తదితర అంశాలపై సమీక్ష చేపట్టారు. ఈ క్రమంలో బలిజిపేట మండలం పెదపెంకి రోడ్ల కాంట్రాక్టు విషయంలో ఎమ్మెల్యే విజయ్‌చంద్ర లేవనెత్తారు. డ్రైనేజీ, ఆక్రమణల తొలగింపు వ్యవహారంతో పాటు.. కాంట్రాక్టరును మార్చడంపైనా ప్రశ్నించారు. అధికారుల తీరును.. ముఖ్యంగా కలెక్టరు ప్రభాకరరెడ్డి వైఖరిని తప్పుపట్టారు. ఈ అంశాన్ని కలెక్టరు తీవ్రంగా ఖండించారు. ఆరోపణలు చేయడం సరైంది కాదని బదులిచ్చారు. నిబంధనలు, చట్టం ప్రకారం తాము కూడా పని చేస్తామని స్పష్టం చేశారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యే.. చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ అధికారులను ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. శ్రీమీకు ఏమైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో, లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందించండి. రోడ్డును ఆక్రమించకుంటే కొట్టకూడదు. చెరువును కబ్జా చేస్తే తొలగించకూడదు. వారికి మీరే హామీ ఇచ్చేస్తారు. తిరిగి మమ్మల్నే అంటారు. మేం చట్టప్రకారం చేస్తున్నామా, లేదా? చట్ట ప్రకారం పని చేస్తున్నామా, లేదా? వ్యక్తిగత అంశాలను ఇక్కడ తీసుకురాకూడదు. అధికారుల మీద ఎప్పుడూ పడతారెందుకు?శ్రీ అంటూ కలెక్టరు గట్టిగా సమాధానమిచ్చారు. ఒకరిపై ఒకరు కేకలు వేసుకోవడంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన మంత్రి సంధ్యారాణి సముదాయించే ప్రయత్నం చేశారు. శ్రీఒక కలెక్టరు, ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం సరికాదు. ఇక్కడ ఒక మంత్రి ఉన్నా.. చూడరా? మీకు ఏమైనా సమస్యలుంటే ఛాంబరులో కూర్చొని ఇలాంటివి మాట్లాడుకోండి.శ్రీ అని హితవు పలికారు. లేనిపోని వార్తలు ప్రసారం చేసే దుర్మార్గులుంటారు జాగ్రత్త : కలెక్టర్ ఈ వివాదం సద్దుమణిగాక, జిల్లా అధికారులనుద్దేశించి మంత్రి, ఎమ్మెల్యేల సమక్షంలోనే కలెక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను బ్లేమ్ చేద్దామని, దాని ద్వారా తృప్తి చెందుదామని, ఇష్టానుసారం మీడియా ద్వారా వార్తలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సబ్బు వార్తలు రాయించుకుని, తనను బ్లేమ్ చేయాలని కొంతమంది చూస్తున్నారని తెలిపారు. ‘ఉద్దేశపూర్వకంగా నకిలీ వీడియోలు, ఆడియోలు చేయడం, ఆడియో రికార్డులు, లేనిపోనివి ప్రచారం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారు దుర్మార్గులు. ఫేక్ న్యూస్ అయితే ఫేక్ అని ఖండించండి. సీఎం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇకపై సీరియస్ యాక్షన్ ఉంటుంది. సైబర్ క్రైం కూడా ఉంది. మీ శాఖల పరంగా ఏ విధంగా ప్రభుత్వంపై చెడ్డ పేరు వచ్చినా సహించవద్దు. ఫేక్ న్యూస్ ఏ రకంగా వచ్చినా ఊరుకునేది లేదు. ఖండించండి.’ అని అధికారులకు సూచించారు. ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్యే విజయ్‌చంద్రను ఉద్దేశించే కలెక్టర్ చేశారని అర్థమవుతోంది. రోడ్డు పనుల జాప్యంపై మంత్రి ఆగ్రహం రోడ్డు పనుల జాప్యంపై మంత్రి సంధ్యారాణి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాను ప్రతి 15 రోజులకోసారి చెబుతున్నానని, అయినా పట్టించుకోరా? అని అధికారుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండు నెలల తరా్వాత టెండరు అయిన సాలూరు–మక్కువ రోడ్డు తన నియోజకవర్గంలో ఇంకా ప్రారంభం కాలేదన్నారు. కాంట్రాక్టర్లతో ఎందుకు మొహమాటమని ప్రశ్నించారు. బాగువలస నుంచి మక్కువ రహదారిని నేటికీ ప్రారంభించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బాధ్యులకు షోకాజ్ నోటీసు ఇవ్వాలని కలెక్టరుకు సూచించారు. ఏ రోడ్డు అయినా ఏడాది దాటినా ప్రారంభించకపోతే టెండరును రద్దు చేయాలని స్పష్టం చేశారు. మంత్రి సమక్షంలోనే తీవ్ర వాగ్వాదం వ్యక్తిగత అంశాలతో కలెక్టర్‌ను ఇరికించే ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే విజయ్‌చంద్ర గట్టిగా బదులిచ్చిన కలెక్టర్ చట్టప్రకారం చర్య తీసుకుంటే అడ్డుపడతారా? మైకు ఉందని ఇష్టానుసారం మాట్లాడవద్దని ఎమ్మెల్యేను హెచ్చరించిన కలెక్టర్ -
పోస్టుల్లేవ్!
సొమ్ములిచ్చేశారు..సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల పోస్టుల భర్తీకి గత ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ ప్రకటనలో మొత్తం 258 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మే నెల 21, 22వ తేదీల్లో అభ్యర్థులకు మౌఖిక పరీక్షలు నిర్వహించారు. నాలుగు నెలలు గడిచినా నేటికీ నియామకాలు పూర్తి చేయలేదు. మధ్యలో ఓసారి అంగన్వాడీ సహాయకుల పోస్టు లను భర్తీ చేసేందుకు సమాయత్తమయ్యారు. ఎంపికై న వారికి ఫోన్ ద్వారా సమాచారం కూడా అందించారు. మరుసటి రోజు వచ్చి, ప్రజాప్రతినిధుల ద్వారా నియామకాలు అందుకోవాలని తెలిపారు. ఈలోగా తాము సూచించిన కొంతమందికి పోస్టులు రాకపోవడంతో అధికార పార్టీ నాయకులు కొర్రీ పెట్టారు. అంతే... పోస్టుల్లేవ్, గీస్టుల్లేవ్.. తూచ్! అంటూ నియామక పత్రాల జారీ ప్రక్రియను నిలుపుదల చేశారు. అప్పటి నుంచి అసలు పోస్టులు తీస్తారా, తీయరా? అన్న సందేహాలు దరఖాస్తుదారుల్లో రోజురోజుకూ అధికమవుతున్నాయి.జాబితా ఎందుకు బయటపెట్టడం లేదు..? మౌఖిక పరీక్షలు ముగిసినప్పటికీ నియామక జాబితా ఎందుకు బయటపెట్టడం లేదు. నెలలు గడుస్తున్నాయి. అర్హులైన అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. తక్షణమే మెరిట్ జాబితాను విడుదల చేయాలి. ఈ పోస్టుల నియామకాల్లో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. దీనిపై అధికారులే స్పష్టత ఇవ్వాలి. – కె.సాంబమూర్తి, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఏం జరుగుతోందో తెలియక..! అధికారులకు, ప్రజా ప్రతినిధులకు మధ్య సయోధ్య కుదరకనే పోస్టుల భర్తీ నిలిచిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అంగన్వాడీ నోటిఫికేషన్ వెలువడింది మొదలు.. పోస్టులను దక్కించుకునేందుకు పలువురు అభ్యర్థులు అధికార పార్టీ నాయకులను ఆశ్రయించారు. అడిగినంత మొత్తంలో రూ.లక్షల్లో డబ్బులిచ్చేశారు. ఇంటర్వ్యూలు కూడా అయిపోయాయి.. పోస్టుల్లో చేరిపోవడమే తరువాయి.. అన్న సంతోషంతో చాలామంది ఉన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు ఉద్యోగుల పేరిట డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులిచ్చి, ఇంటర్వ్యూలకు హాజరైన వారిలో చాలామందికి కనీస పరిజ్ఞానం కూడా లేనట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్క పోస్టుకూ ప్రజాప్రతినిధుల నుంచి సిఫారసు లేఖలు రావడంతో, అర్హులు నష్టపోవడం ఒకటైతే, తీవ్ర విమర్శలు వస్తాయన్న ఆలోచనతో జిల్లా ఉన్నతాధికారి ఈ జాబితాను పక్కన పెట్టేసినట్లు వినిపిస్తోంది. నెలలు గడుస్తున్నా ఈ ప్రక్రియ ఒక్క కొలిక్కి రాకపోవడంతో అసలు ఏం జరుగుతుందో తెలియక అభ్యర్థులు అయోమయంలో ఉన్నారు. డబ్బులిచ్చిన వారి పరిస్థితి ఏమిటి? ఉన్న ఊరిలో పోస్టులు దక్కుతాయన్న ఆశతో ప్రజాప్రతినిధులకు చాలామంది అభ్యర్థులు రూ.లక్షల్లో ముట్టుజెప్పినట్లు తెలుస్తోంది. నెలలు గడుస్తున్నా.. ఉద్యోగాల్లేవు. డబ్బులూ రావు! నియామక ప్రకటన కోసం ఆశావహులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. పోస్టులు రాకపోతే తమ డబ్బులైనా ఇచ్చేయాలని ఛోటా నాయకుల చుట్టూ పలువురు అభ్యర్థులు తిరుగుతున్నట్లు తెలుస్తోంది. లేకుంటే, ప్రభుత్వానికి ఫిర్యాదు చేసేందుకై నా సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు. అంగన్వాడీ పోస్టుల నియామకాలపై సందేహాలు ఇప్పటికే ఛోటా నేతలకు డబ్బులిచ్చేసిన అభ్యర్థుల్లో ఆందోళన తమ నగదు వెనక్కి ఇచ్చేయాలని ఒత్తిడి? -
చైతన్యంతోనే రజకుల అభివృద్ధి సాధ్యం
● రాష్ట్ర రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి విజయనగరం క్రైమ్: చైతన్యంతోనే రజకుల అభివృద్ధి సాధ్యమని ఏపీ రజక అభివృద్ధి,సంక్షేమ కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి అన్నారు. ఈ మేరకు బుధవారం ఊటగడ్డ చాకిరేవులో రజక సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రజక సంక్షేమ అండ్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి మాట్లాడుతూ తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న రజకుల సంక్షేమం, అభివృద్ధి చైతన్యం పొందడం ద్వారా మాత్రమే.సాధ్యమని ఉద్బోధించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రజకుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాయని సరైన చైతన్యం లేక వాటిని రజకులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, క్షేత్రస్థాయిలో రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో వారిని చైతన్యం చేసే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్త పర్యటనలో భాగంగా విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నామని తెలిపారు రజకులు సంఘ చైతన్యంతో తమ హక్కులను కాపాడుకోవడానికి ముందుకు రావాలని అందుకు తమ అండదండలు అందిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా రజక సంఘాల ఐక్యవేదిక నాయకులు గురజాపు సత్యారావు కెల్లసత్యం. మద్ది పైడిరాజు తామాడ అచ్చన్న రాయవలస వెంకటరమణ గోవింద్ వెల్దుర్తి నాగరాజు జిల్లా రజక వెల్ఫేర్ కమిటీ సభ్యులు. జొన్నాడశ్రీనివాస రావు కొత్తకోట శ్రీనివాసరావు, తాళ్ల,వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలో బుధవారం ఆమె ఉదయం 8గంటల నుంచి 10:30 వరకు పుల్లయ్య కోనేరు. రోళ్లవాక. గజపతినగరం. దోబీ ఘాట్లను పరిశీలించి రజకులతో చర్చించారు. వినతి పత్రాలు స్వీకరించారు అకస్మాత్తుగా మృతిచెందిన వెల్దుర్తి గౌరినాయుడు, కందివలస ఉమామహేశ్వరరావు కుటుంబాలను. పరామర్శించి ఓదార్చారు. ప్రభుత్వం నుంచి సహాయం అందేవిధంగా చూస్తామని పేర్కొన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి విజయనగరం: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని జిల్లా రజక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తంగేటి భాస్కరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర రజక ఫెడరేషన్ చైర్పర్సన్ సావిత్రికి వినతిపత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని హమీ ఇచ్చి అమలు చేయడం లేదన్నారు. ఎన్నో ఏళ్లుగా ఇదే సమస్యపై ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నా ఫలితం లేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని హమీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రజకులకు న్యాయం చేసి ఆర్ధికంగా, సామాజికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి జంప చిన్న, ఉపాధ్యక్షుడు శీల తాతారావు, నగర గౌరవ అధ్యక్షుడు ఈశ్వరరావు, పైడి చిట్టి, అప్పలరాజు, సతీష్, సింహాచలం, శ్రీను, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
శభాష్ పోలీస్..!
● రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా పోలీసుల ప్రతిభవిజయనగరం టౌన్: రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో జరిగిన రాష్ట్రస్ధాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్, డ్యూటీమీట్‌లో విశాఖ రేంజ్ తరఫున జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొని పతకాలు సాధించారు. ఈ మేరకు ఎస్పీ ఏఆర్.దామోదర్ బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పతకాలు సాధించిన పోలీసులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర పోలీస్ హెడ్ క్వార్టర్లో రాష్ట్రస్థాయి పోలీస్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్, డ్యూటీమీట్లను ఇటీవల నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో జిల్లా పోలీసుశాఖలో పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, విశేష ప్రతిభ కనబర్చారన్నారు. జిల్లా పోలీసు శాఖకు చెందిన 34 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వివిధ క్రీడా పోటీల్లో విశాఖ రేంజ్ తరఫున పాల్గొని 35 గోల్డ్ మెడల్స్, 18 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్‌తో సహా 66 పతకాలను సాధించి, రాష్ట్రస్ధాయిలో విశాఖ రేంజ్ ఆల్ రౌండర్ చాంపియన్ షిప్ సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించారన్నారు. అదేవిధంగా పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో కూడా జిల్లా పోలీసుశాఖకు చెందిన 8 మంది 4 గోల్డ్ మెడల్స్ , 3 సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్ సహా 8 మెడల్స్‌ను రాష్ట్రస్ధాయిలో సాధించారని చెప్పారు. మెడల్స్ సాధించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించి, వారి క్రీడాప్రతిభను, వృత్తి నైపుణ్యాన్ని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ పి.కిరణ్‌కుమార్, ఏఆర్ డీఎస్పీ ఈ.కోటిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ. లీలారావు, భోగాపురం రూరల్ సీఐ ఎన్.శ్రీనివాసరావు, ఆర్ఐ ఎన్.గోపాలనాయుడు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
సంక్షేమానికి గ్రహణం
టీడీపీ పాలనలో ● స్థానిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులు సిద్ధం కావాలి ● మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర పాచిపెంట: టీడీపీ పాలనలో ప్రజా సంక్షేమానికి గ్రహణం పట్టిందని మాజీ డిప్యూటీ సీఎం, సాలూరు మాజీ ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర అన్నారు. పాచిపెంట మండల కేంద్రంలోని ఓ కల్యాణ మండపంలో పార్టీ మండలాధ్యక్షుడు గొట్టాపు ముత్యాలనాయుడు, పార్టీ సమన్వయకర్త పాచిపెంట వీరంనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన మండల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పాచిపెంట మండలం వైఎస్సార్సీపీకి కంచుకోటగా పేర్కొన్నారు. స్థానిక సమరానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేసి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను విజేతలుగా నిలపాలని కోరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. రెండున్నరేళ్లుగా కొత్త పింఛన్లు మంజూరు చేయలేని దుస్థితిలో టీడీపీ ప్రభుత్వం ఉందన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పింఛన్ల మంజూరు పేరుతో టీడీపీ కొత్త డ్రామాకు తెరలేపిందన్నారు. ఇటీవల టీడీపీలో చేరిన జిల్లాకు చెందిన ఓ నాయకుడిపై గతంలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటారా? అని ప్రశ్నించారు. అనంతరం పార్టీ అనుబంధ విభాగాల ప్రతినిధులకు ఐడెంటిటీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బి.ప్రమీల, వైస్ ఎంపీపీ మీసాల నారాయణ, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు సలాది అనూరాధ, పార్టీ నాయకులు శనపతి నారాయణరావు, కలువలపల్లి పెద్దిబాబు, బోను ధనుంజయ్, సలాది అప్పలనాయుడు, చింత సీతయ్య, కిర్ల రామకోటేశ్వరరావు, సోముల లచ్చయ్య, మాదల సింహాచలం, డోనేరు లచ్చయ్య, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
కుటుంబ యజమాని సరైనవారు అయితే ఆ కుటుంబం సన్మార్గంలో పయనిస్తుంది. నాయకుడు మంచివారైతే ఆ దేశం, రాష్ట్రం, ప్రాంతం, గ్రామం ప్రగతి పథంలో పయనిస్తుంది. ప్రజలకు సంక్షేమం సమకూరుతుంది. ప్రగతిలో శాశ్వత ముద్ర కనిపిస్తుంది. అచ్చంగా అలానే.. వైఎస్సార్, వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో ఉమ్మడి విజయనగరం జిల్లాలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. ప్రభుత్వ వైద్య కళాశాల, జేఎన్టీయూ, తోటపల్లి, జంఝావతి, గిరిజన వర్సిటీ, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రాజెక్టులు జిల్లాకు సమకూరాయి. ఇది ‘మన విజయనగరం’ అనేలా ప్రగతి కళ్లకు కట్టింది. సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందాయన్నది జిల్లా ప్రజల మాట. -
పింఛన్ ఆశలపై నీళ్లు!
సాక్షి, పార్వతీపురం మన్యం: కొత్తగా సామాజిక పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో గ్రామ/వార్డు సచివాలయాలు రద్దీగా మారుతున్నాయి. ఇప్పటికే సుమారు 20 వేల దరఖాస్తులు జిల్లా వ్యాపితంగా అందాయి. ఇంకా వేలాది మంది సచివాలయాలు, అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. గడువు తక్కువ ఇవ్వడం.. వరుస మూడు రోజుల పాటు సెలవులు రావడంతో దరఖాస్తుదారుల్లో ఆందోళన అధికమైంది. తొలుత ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం బుధవారం ఆఖరి రోజు. గడువు పెంచాలని వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ నెల 18వ తేదీ వరకూ అవకాశం కల్పించారు. మొరాయిస్తున్న సర్వర్ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండున్నరేళ్లుగా కొత్త పింఛన్ల ఊసెత్తలేదు. స్థానిక సంస్థల ఎన్నికలు నేపథ్యంలో ఒక్కసారిగా కొత్త పెన్షన్లు మంజూరు అంటూ తేదీలను ప్రకటించింది. ఈ నెల ఏడు నుంచి 16వ తేదీ వరకూ మాత్రమే దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటించింది. గడువు తక్కువగా ఉండడంతో అర్హత ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, వితంతులు సచివాలయాల వద్ద బారులు తీరుతున్నారు. సర్వర్ పనిచేయక దరఖాస్తులను అప్లోడ్ చేయడం కష్టంగా మారింది. ప్రస్తుతం జిల్లాలో 1,36,470 మంది లబ్ధిదారులకు 15 రకాల సామాజిక పింఛన్లు అందిస్తున్నారు. రూ.4 వేలు నుంచి రూ. 15 వేల వరకు వివిధ కేటగిరీల్లో మొత్తం లబ్ధిదారులకు అందుతోంది. వేలమంది నిత్యం కొత్త పింఛన్ కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. తాజాగా దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారి ఆశలపై నేడు నీళ్లు కుమ్మరిస్తున్నారు. వారు సచివాలయానికి వెళ్లిన సమయంలో అక్కడి సిబ్బంది నుంచి ఎదురవుతున్న ప్రశ్నలు, అడుగుతున్న పత్రాలు అర్హులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కుల ధ్రువీకరణతో పాటు ఐటీ, గ్యాస్ బిల్లు, ఇంటి పన్ను రశీదు తదితర పత్రాలు కావాలంటూ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. ఇంటి పన్ను చెల్లిస్తేనే.. దరఖాస్తు చేసుకోవాలన్న అదనపు నిబంధన పెడుతున్నారు. వితంతువులకు వారి భర్త మరణ ధ్రువీకరణ పత్రం ఉన్నప్పటికీ రేషన్‌కార్డులో అతని పేరు ఉంటే దరఖాస్తు తీసుకోవడం లేదు. ఇప్పటికిప్పుడు రేషన్ కార్డులో భర్త పేరు ఎలా తొలగించాలి, అవసరమైన పత్రాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని వితంతువులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని చోట్ల మ్యాపింగ్ కాలేదంటూ తిప్పి పంపుతున్నారు. కొంతమందికి స్టడీ సర్టిఫికెట్లు తేవాలని అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఇన్ని పత్రాలు ఎలా తేవాలంటూ.. అర్హులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులను నమోదు చేస్తున్న సమయంలో సర్వర్లు మొరాయిస్తుండటంతో అటు సిబ్బంది, ఇటు దరఖాస్తుదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గంటల కొద్దీ సర్వర్ పని చేయకపోవడంతో దరఖాస్తుదారులను సచివాలయాల్లో కూర్చోపెడుతున్నారు. ఈ సమస్య వల్ల ఓటీపీలు కూడా రావడం లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. జిల్లాలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్పిన వారికే దరఖాస్తులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. తొలుత ప్రభుత్వం ఈ నెల 16వ తేదీ లోపు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి గడువుగా నిర్ణయించింది. రెండో శనివారం, ఆదివారం, సోమవారం వినాయక చవితి పండగ కావటం వల్ల వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో దరఖాస్తులకు ఆటంకం ఏర్పడింది. సెలవులు ముగిశాక కేవలం రెండు రోజుల గడువే ఉంది. సర్వత్రా ఆందోళనల నేపథ్యంలో దరఖాస్తు గడువును మరో రెండు రోజులపాటు పెంచుతున్నట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళవారం రాత్రి ప్రకటించారు. పలు ఆంక్షలు, సమస్యల నేపథ్యంలో కొత్త పింఛన్లు ఇచ్చే చిత్తశుద్ధి కూటమి ప్రభుత్వానికి లేదని పలువురు దరఖాస్తుదారులు వాపోతున్నారు. మొరాయిస్తున్న సర్వర్ ధ్రువపత్రాల కోసం ఇబ్బందులు పడుతున్న దరఖాస్తుదారులు దరఖాస్తు గడువు రెండు రోజులపాటు పొడిగింపు -
భూ సమస్యను పరిష్కరించకుంటే చావే శరణ్యం
● పురుగు మందు డబ్బాలతో తహసీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీ రైతుల ధర్నారామభద్రపురం: కాళ్లరిగేలా తిరుగుతున్నా తమ భూ సమస్యను పరిష్కరించడంలేదని, ఇక చావే శరణ్యమంటూ రామభద్రపురం మండలం ఇట్లామామిడిపల్లి ఎస్సీ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. పురుగు మందు డబ్బాలు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ఆందోళన చేశారు. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 161లో ఎస్సీలకు చెందిన సుమారు 3 ఎకరాల భూమిని విజయనగరానికి చెందిన ఓ పెత్తందారు కబ్జాచేసి కంచె ఏర్పాటు చేశాడని ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించడంలేదని ఆరోపించారు. సమస్య పరిష్కరించకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. దీనిపై తహసీల్దార్ స్పందిస్తూ బుధవారం భూమిని పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
అభివృద్ధిలో.. శాశ్వత ముద్ర
● జిల్లాకు ప్రగతి ఫలాలు అందించిన వైఎస్సార్ కుటుంబం ● అందుబాటులోకి విద్య, వైద్యం ● సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం సాక్షి ప్రతినిధి, విజయనగరం: విజయనగరం జిల్లాకు ఏదైనా మంచి జరిగింది అంటే గత పాతికేళ్లలో వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనాకాలంలోనే. జిల్లాకు ఒక ప్రాజెక్టు వచ్చినా.. ఒక కాలేజీ వచ్చినా.. కొత్తగా ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పడినా అదంతా వైఎస్ కుటుంబం... బొత్స సత్యనారాయణ హయాంలో వచ్చినవే అని ఘంటాపథంగా చెప్పవచ్చన్నది జిల్లా వాసుల మాట. వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న సాన్నిహిత్యంతో కొన్ని ప్రాజెక్టులు, ఆ తర్వాత వైఎస్ జగన్ పాలనలో మరికొన్ని కాలేజీల రాకతో జిల్లా ముఖచిత్రం మారిపోయింది. అభివృద్ధి పనులు సాకారం కావడంలో జిల్లా వైఎస్సార్సీపీ నేతల కృషి దాగిఉంది. రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు దశాబ్దాల నాటికల అయినా కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు కూడా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగింది. బొబ్బిలి, చీపురుపల్లి పట్టణాల్లో కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాలనా వికేంద్రీకరణ జరిగి ప్రజలకు తమ సమీపంలోని మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. పార్వతీపురం మన్యం జిల్లాగా అవతరించింది కూడా గత ప్రభుత్వ హయాంలోనే. చీపురుపల్లికి తోటపల్లి నీరు.... మాజీ మంత్రి, ప్రస్తుత శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కృషితో తోటపల్లి ప్రాజెక్టు త్వరితగతిన సాకారమైంది. ఎన్నో దశాబ్దాలుగా ఉమ్మడి విజయనగరం జిల్లా రైతులు ఎదురు చూసిన తోటపల్లి ప్రాజెక్టు బొత్స కృషితో దివంగత మహా నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి చొరవతో శరవేగంగా 2004లో ప్రారంభమై 2009 నాటికి 90 శాతం పనులు పూర్తి చేసు కుంది. 2004కి ముందు ఎంతోకాలంగా తోటపల్లి ప్రాజెక్టు కోసం రైతులు ఎదురు చూస్తున్నప్పటికి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోలేదు. 2004లో మహానేత వై.ఎస్. రాజశేఖరరెడ్డి సీఎం అవ్వగానే తోటపల్లి ప్రాజెక్టుకు తొలిదశలో రూ.478 కోట్లు నిధులు విడుదల చేయడంతో త్వరితగతిన పనులు జరిగాయి. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో చీపురుపల్లి మండలంలో 1319 ఎకరాలు, గరివిడి మండలంలో 4,296 ఎకరాలు, గుర్ల మండలంలో 9,941 ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వచ్చింది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి హారంగా నిలిచే భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన, పనులు ప్రారంభం కూడా గత ప్రభుత్వంలోనే సాగాయి. దీని వెనుక బొత్సతో పాటు జిల్లా వైఎస్సార్సీపీ నాయకుల కృషిదాగి ఉంది. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి పనులు పూర్తిచేసిన ఘనత వైఎస్సార్ కుటుంబానికే దక్కిందని, జిల్లా అభివృద్ధిలో శాశ్వత ముద్ర వారికే దక్కుతుందని జిల్లా ప్రజల నోటి నుంచి తరచూ వినిపిస్తుంది. గత ప్రభుత్వాలు మొదలుపెట్టి చిత్తశుద్ధి కొరవడి వదిలేసిన సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి తుదిరూపు ఇచ్చినది గత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వమే. రూ.834 కోట్ల బడ్జెట్‌తో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు కాగా దానికి సంబంధించిన భూ సేకరణ, శంకుస్థాపన, పనులు ప్రారంభించిన ఘనత గత ప్రభుత్వానిదే. వర్సిటీలో కోర్సుల అడ్మిషన్లు కూడా మొదలు పెట్టింది. నాటి విద్యాశాఖ మంత్రి బొత్స పట్టువదలకుండా కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తూ పనులు..అనుమతులు పూర్తి చేసి వర్సిటీకి తుదిరూపు ఇచ్చారు. వైఎస్సార్ ప్రభుత్వం ఏర్పడ్డాక 2007లో విజయనగరంలో జేఎన్టీయూ కళాశాలను స్థాపించారు. వెనుకబడిన జిల్లాలో సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థుల ఉజ్వల భవితకు పునాదివేశారు. కళాశాల జిల్లాకు మంజూరు వెనుక బొత్స కృషి దాగి ఉంది. గత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హయాంలో జేఎన్టీయూ కళాశాలను వర్సిటీగా స్థాయి పెంచారు. విద్యార్థులకు సకల విద్యాసదుపాయాలు కల్పించారు. ఇప్పుడు ఇది వేలాది మంది విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తూ వారి జీవితాల్లో విద్య, ఉద్యోగ వెలుగులు పూయిస్తోంది. ఇంజినీరింగ్ విద్యకు శాశ్వత చిరునామాగా మారింది. -
చేరువైన వైద్య విద్య
విజయనగరం, పార్వతీపురం వంటి వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు అంటే ఊహకందని అంశం. కానీ గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక అందులో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కృషితో రూ.500 కోట్ల ఖర్చుతో విజయనగరం మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తిచేసుకుంది. వైద్యవిద్య, మెరుగైన వైద్యసదుపాయాలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, రూ.155 కోట్లతో కురుపాంలోని ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో మిగులు పనులు పూర్తిచేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చొరవచూపడంలేదు. ఫలితం.. గిరిజన విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య అందని ద్రాక్షగా మారింది. -
నిలకడగా తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: అల్పపీడన ప్రభావంతో ఒడిశాలో కురుస్తున్న వర్షాల నాగావళి నదిలో తోటపల్లి ప్రాజెక్టువద్ద నీటి ప్రవాహం నిలకడగా ఉంది. మంగళవారం సాయంత్రం నాటికి 105 మీటర్లకు 104.15 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో 3,570ల క్యూసెక్కుల నీరు చేరుతుండగా, రెండు గేట్లను ఎత్తేసి 4,706 క్యూసెక్కుల నీటిని తిరిగి నదిలోకి విడిచిపెడుతున్నారు. కుడి ప్రధాన కాలువకు 800, పాతకుడి కాలువకు 40, ఎడమ కాలువకు 414 క్యూసెక్కుల నీటిని విడిచిపెడుతున్నట్టు ప్రాజెక్టు ఏఈ కిశోర్ తెలిపారు. వీరఘట్టంలో కుండపోత వీరఘట్టం: వీరఘట్టంలో మంగళవారం ఉదయం వేసవిని తలిపించే ఎండతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఉక్కపోత, ఎండ తీవ్రతతో అల్లాడిపోయారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం 6 గంటల వరకు ఏకదాటిగా కుండపోతగా వర్షం కురిసింది. 4.8 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు తహసీల్దార్ రాజేశ్వరరావు తెలిపారు. పొలాల్లో నీరు చేరడంతో రైతులు సంతోషపడుతున్నారు. నవంబర్ 15న ఎన్ఎంఎంఎస్ఎస్ రాతపరీక్ష పార్వతీపురం రూరల్: జాతీయ ప్రతిభ ఆధారిత పేదరిక నిర్మూలన ఉపకార వేతన పథకం (ఎన్ఎంఎంఎస్ఎస్) రాతపరీక్ష ఈ ఏడాది నవంబర్ 15న జరగనుందని డీఈఓ పి.బ్రహ్మాజీరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, ఏపీ మోడల్, ఎయిడెడ్ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. ఏడో తరగతిలో 55 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 50 శాతం) సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.3.50 లక్షల లోపు ఉండి, తహసీల్దార్ ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు రుసుము కింద ఓసీ, బీసీలు రూ.100, ఎస్సీ, ఎస్టీలు రూ.50 చొప్పున ఎస్బీఐలో చెల్లించాలి. పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఆర్థిక సాయం అందుతుంది. ఆసక్తిగల విద్యార్థుల దరఖాస్తు చేసేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. కొత్తవలస: వినాయక చవితి పర్వదినాన జరిగిన రోడ్డు ప్రమాదం ఆ కుంటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. ఆనందగా గడపాల్సిన వేళ యువకుడిని మృత్యువు కాటేసింది. అరుకు–విశాఖపట్నం జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందగా,.. మరో యువకుడు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో పోరాడుతున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లూరి సీతారామాజు జిల్లా అరకు సమీపంలోని అనంతగిరి ప్రాంతానికి చెందిన బిడ్డక చరణ్ (21), బిడ్డక రాజు ఇంటి వద్ద వినాయక పూజలు ముగించుకొని ద్విచక్రవాహనంపై విశాఖపట్నం బయలుదేరారు. కొత్తవలస మండలం జిందాల్ ఫ్యాక్టరీకి సమీపంలోని చెరువు వద్ద మరమ్మతులతో రోడ్డుపై నిలిపివేసిన బొలోరా వాహనాన్ని బైక్‌తో ఢీకొట్టారు. ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఎస్.కోట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడకు చేరుకునే సరికి తలకు తీవ్రగాయాలు కావడంతో చరణ్ (21) మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రాజు కొన ఊపిరితో వైద్యసేవలు పొందుతున్నాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. -
స్థానిక పోరు షురూ!
సాక్షి, పార్వతీపురం మన్యం: పురపాలక ఎన్నికల నిర్వహణ దిశగా ఎన్నికల సంఘం అడుగులు వేస్తోంది. తొలి విడతలో జిల్లాలోని పాలకొండ నగర పంచాయతీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. ఓటర్ల జాబితాల ప్రక్రియ కూడా ఇక్కడ ముగిసింది. పార్వతీపురం, సాలూరుకు సంబంధించి కోర్టు కేసుల వల్ల ఓటరు జాబితా ప్రచురణ కాస్త ఆలస్యం అయ్యింది. తాజాగా ఇక్కడ కూడా మున్సిపల్ సమరానికి అత్యంత కీలకమైన వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాల ప్రచురణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించి ఈ నెల 22న తుది ఓటర్ల జాబితాలను అధికారికంగా ప్రచురించనున్నారు. ఇందులో 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 29 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు ఉన్నాయి. వీటిలో జిల్లాకు సంబంధించి సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలను కూడా చేర్చారు. దీంతో జిల్లాలో మున్సిపల్ పోరుకు సంబంధించిన కసరత్తు ఊపందుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు వేర్వేరు నోటిఫికేషన్లను జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం వెల్లడించారు. ఫారం–1 నోటీసుతో పాటు వార్డుల వారీ ఫొటో ఓటర్ల జాబితాలను ఈనెల 22న ప్రకటించాలని తెలిపారు. 2026 జనవరి 1ని అర్హత తేదీగా పరిగణించి, తాజా అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా రూపకల్పన చేయాలని సూచించారు. రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఈ ఓటర్ల లెక్కలే కీలకం కానున్నాయి. ఆదేశాలు రావడమే తరువాయి... 2013లో ఏర్పడిన పాలకొండ నగర పంచాయతీ ఇప్పటి వరకూ 20 వార్డులతో ఉంది. ప్రస్తుతం పునర్విభజన తర్వాత 8 పెరిగి.. 28 వార్డులతో ఎన్నికలకు వెళ్లనుంది. సాలూరులో 29 వార్డులు ఉండగా.. 32 వార్డులకు, పార్వతీపురం పాలక సంఘంలో 30 వార్డులను 36గా విభజించారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తును అధికార యంత్రాంగం ఒక కొలిక్కి తీసుకొచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలు రావడం తరువాయి.. ఎన్నికల నిర్వహణకు సిద్ధం కానుంది. కూటమిలో సీట్ల పంచాయితీ.. స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమిలోని భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేనల్లో ఎవరికి వారు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్నికల్లో బలాబలాలు, పోటీ చేసేందుకు ఉన్న ఆసక్తిపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. పొత్తుల్లో భాగంగా జనసేన ఎక్కడ కోరుకోవాలి అన్న అంశంపైనా ఆరా తీశారు. మరోవైపు బీజేపీలో కూడా ఆశావహులు క్యూ కడుతున్నారు. ఇక, టీడీపీలో కుర్చీల కోసం ఎదురు చూసిన వారి జాబితా చాలా పెద్దదే ఉంది. రిజర్వేషన్లు ఖరారు అయిన తర్వాత పందెం బరిలో నిలిచే వారు బయటకు వచ్చే యోచనలో ఉన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు కూడా ఒక్కొక్కరుగా ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. జిల్లాలో ఓ టీడీపీ సీనియర్ నేత.. 30 ఇయర్స్‌కు పైగా ఇండస్ట్రీ అని చెప్పుకునే నాయకుడు.. జనసేన వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో చాలా పదవులు పొందినప్పటికీ.. కొన్నాళ్లుగా ఆయన పార్టీ నేతలతో స్థానికంగా ఉన్న విభేదాల వల్ల అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇటీవల కాలంలో విబేధాలు మరింత పెరిగి, వీధికి కూడా ఎక్కారు. జిల్లాలో బలమైన కొప్పల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఆ నాయకుడు.. జనసేనలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ఇటీవల జిల్లా పర్యటనకు వచ్చిన నాగబాబును కూడా కలిసి తన మనసులో మాట చెప్పేందుకు సిద్ధమైనట్లు సమాచారం. చివరి నిమిషంలో అందుకు బ్రేక్ పడింది. మరికొంత మంది కూడా సీట్ల సర్దుబాటులో కలిసి వస్తుందేమో అని పక్క చూపులు చూస్తున్నారు. మున్సిపాలిటీల్లో మోగనున్న నగారా సాలూరు, పార్వతీపురంల్లోనూ 22న తుది ఓటర్ల జాబితా ప్రచురణ ఎన్నికల నిర్వహణకు వడివడిగా అడుగులు -
మార్కుల ట్యాంపరింగ్‌పై విచారణ కమిటీ
● బాధ్యులపై చర్యలు తప్పవు ● జేఎన్టీయూ జీవీ ఉపకులపతి వి.వి.సుబ్బారావువిజయనగరం రూరల్: జిల్లాలో ప్రతిష్టాత్మకమైన జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం – గురజాడ విజయనగరంలో గత కొన్నేళ్లుగా జవాబుపత్రాల్లో జరుగుతున్న మార్కుల ట్యాంపరింగ్ వివాదంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశామని వర్సిటీ ఉపకులపతి వి.వి.సుబ్బారావు తెలిపారు. ఇటీవల మార్కుల ట్యాంపరింగ్‌పై ఈ నెల 7న ఫిర్యాదులు అందడంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరపగా ఐదుగురు విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చినా ఎక్కువ మార్కులు వేసి ఉత్తీర్ణత చేసినట్లు విచారణలో తేలింది. అయితే, అసలు దొంగలు తప్పించుకుని పరీక్షా విభాగానికి ఏ సంబంధం లేని ఔట్సోర్సింగ్ ఉద్యోగి సనపతి సంతోష్‌పై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన సంతోష్ మానసిక ఆందోళనతో మూడు రోజుల కిందట నాలుగు పేజీల సూసైడ్ లేఖ రాసి తన స్వగ్రామంలో ఆత్మాహత్యాప్రయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఆయన మృతిచెందాడు. నలుగురు కాంట్రాక్ట్ ప్రొఫెసర్లపై ఆరోపణలు సంతోష్ తన సూసైడ్ లేఖలో వర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న నలుగురు అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులే మార్కుల ట్యాంపరింగ్‌లో కీలక సూత్రదారులని పేర్కొన్నారు. ఇది కొద్ది రోజులుగా జరుగుతున్న తంతుకాదని, తాను ఉద్యోగంలో చేరకముందు నుంచే గత మూడు నాలుగేళ్లుగా జరుగుతుందని పేర్కొన్నాడు. మూడేళ్ల నుంచి జవాబు పత్రాలను పరిశీలిస్తే దోషులు ఎవరో తేలుతుందని, వర్సిటీ ఉపకులపతి దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు. ట్యాంపరింగ్ నిజమే ఈ విషయమై ఉపకులపతి వి.వి.సుబ్బారావును వివరణ కోరగా తమకు అందిన సమాచారం మేరకు జవాబు పత్రాలను పరిశీలించగా ఐదుగురు విద్యార్థులకు వారికి వచ్చిన మార్కులు కంటే అధికంగా మార్కులు వేసి ట్యాంపరింగ్ చేసినట్టు గుర్తించామని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. గత మూడేళ్లు జవాబు పత్రాలను పరిశీలించేందుకు కమిటీ వేశామని, వారి విచారణలో మార్కుల ట్యాంపరింగ్ జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. -
అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తులు
● 17వ తేదీలోగా అందజేయాలి ● ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కృష్ణ విజయనగరం అర్బన్: విజయనగరం టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంఈఏటీ) విభాగంలో అతిథి అధ్యాపక పోస్టు భర్తీకి అర్హులైన అఽభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కృష్ణ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా కళాశాల కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. మెకానికల్ బ్రాంచ్‌లో బీటెక్ లేదా సమానమైన డిగ్రీలో ద్వితీయ శ్రేణితో కనీసం 50 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు ఈ నెల 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, విజ యనగరం టౌన్లో నిర్వహించే డెమో తరగతులకు విధిగా హాజరు కావాలని తెలియజేశారు. మొక్కజొన్న పంట ధ్వంసంపార్వతీపురం రూరల్: మండలంలోని రావికోన పంచాయతీ గంగమాంబాపురంలో ఏనుగులు పంటలను, ఇళ్లను మంగళవారం ధ్వంసం చేశాయి. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ఏడాది వరి వేయలేక, తనకున్న 1.50 సెంట్ల భూమిలో ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న సాగుచేసిన కేండ్రుక శ్రీనివాసరావు ఆశలపై ఏనుగుల దాడి నీళ్లు చల్లింది. ఆరుగాలం కష్టించి పెంచిన పంటను సుడిగాలిలా వచ్చి సర్వనాశనం చేయడంతో ఆ రైతు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇదే గ్రామానికి చెందిన ఉర్లక రఘు ఇంటిపైనా గజరాజులు ప్రతాపం చూపాయి. ఇంటి గేటుతో పాటు కిటికీలను నుజ్జునుజ్జు చేయడంతో ఆ కుటుంబం భయంతో ఆవేదన వ్యక్తం చేస్తోంది. అటవీశాఖ అధికారులు తక్షణమే నష్టాన్ని అంచనా వేసి పరిహారం చెల్లించాలని మాజీ సర్పంచ్ కడ్రక రామస్వామి అధికారులను కోరారు. చికిత్స పొందుతూ వ్యక్తి మృతిదత్తిరాజేరు: మండలంలోని మరడాం వద్ద జాతీయ రహదారి దాటుతుండగా శుక్రవారం ఉదయం వెనుక నుంచి బైక్ ఢీకొన్న సంఘటనలో గాయపడిన మరడాం గ్రామానికి చెందిన గుగ్గిలపు నారాయణరావు(60) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు, ఈ మేరకు ఎస్.బూర్జవలస ఎస్సై ప్రయోగమూర్తి తెలిపారు. నారాయణ రావు ఇంటి నుంచి రోడ్డుకు వెళ్తుండగా బైక్ ఢీకొనడంతో తలకు బలమైన గాయాలు కాగా విజయనగరంలోని మహారాజా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు చెప్పారు. మృతుడికి భార్య రమణమ్మ వివాహమైన కుమార్తె ఉన్నారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. ప్రొఫెసర్లపై ఫిర్యాదువిజయనగరం టౌన్: జేఎన్టీయులో ఇటీవల జరిగిన పరీక్షల జవాబు పత్రాల్లో మార్కుల టాంపరింగ్ జరిగినట్లు వీసీ దృష్టికి వెళ్లడంతో ఆయన విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. దీనిపై రిజిస్ట్రార్ కె.చంద్రభూషణరావు వీసీ ఆదేశాలకు మేరకు మంగళవారం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేశారు. కొందరు ప్రొఫెసర్లపైన, ఉద్యోగులపైన ఆరోపణలు చేశారని రూరల్ పోలీసులు తెలిపారు. యువకుడి దుర్మరణంవిశాఖపట్నం: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. విశాఖపట్నంలోని ఆరిలోవ లా అండ్ ఆర్డర్ ఎస్సై వరహాలునాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన పిసిని పవన్శేఖర్(20) విశాఖలోని డాల్ఫిన్ హోటల్లో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం మధురవాడలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లి భోజనం చేసి, తన స్నేహితుడు ఆకుల ప్రసాద్‌తో కలిసి బైక్‌పై జగదాంబ వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఎండాడ కూడలి దాటిన తర్వాత వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో పవన్ శేఖర్ కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై వరహాలు నాయుడు సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రామతీర్థంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో శ్రీ లక్ష్మీ సమేత వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ప్రాతఃకాలార్చన పూజలనంతరం యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలను జరిపించారు. అనంతరం గ్రామ బలిహరణ పూర్తిచేసి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ధ్వజస్తంభంపై గరుత్మంతుడి చిత్రపటాన్ని ఎగురవేసి సమస్త దేవతామూర్తులను బ్రహ్మోత్సవాల వేడుకకు ఆహ్వానం పలికారు. ధ్వజారోహణంతో ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 23వ తేదీ వరకు ప్రతిరోజూ శ్రీవారిని గ్రామ తిరు వీధుల్లో ఊరేగింపు, 20న స్వామివారి కల్యాణోత్సవం, 24న పుష్పాంజలి కార్యక్రమాలు జరిపిస్తామని అర్చకులు తెలిపారు. -
29న ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసీ ఎన్నికలు
● పాఠశాలల్లో పారదర్శకంగా నిర్వహించాలి ● డీఈఓ మాణిక్యం నాయుడువిజయనగరం అర్బన్: జిల్లాలోని 1,767 ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీ (ఎస్ఎంసీ)ల పునర్వ్యవస్థీకరణ ఎన్నికలను ఈ నెల 29న సక్రమంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అఽధికారి, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త యూ.మాణిక్యం నాయుడు ఆదేశించారు. కేంద్రప్రభుత్వం జారీ చేసిన ఎస్ఎంసీ మార్గదర్శకాలు–2026 ఆధారంగా రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పాఠశాల విద్య, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ ఇదీ.. మంగళవారం ఉదయం 10గంటలకు ఎస్ఎంసీ సభ్యులు, చైర్పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నికల నిర్వహణనకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 18న మధ్యాహ్నం 2 గంటలకు పాఠశాల నోటీసు బోర్డుపై ఓటర్ల జాబితా ప్రదర్శన. 25న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 గంటల వరకు తుది ఓటర్ల జాబితా ఖరారు చేసి ప్రదర్శన. 29న ఉద యం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎస్ఎంసీ సభ్యుల ఎన్నికలు. మధ్యాహ్నం 1.30 గంటలకు చైర్పర్సన్ ఎన్నిక, మధ్యాహ్నం 2 గంటలకు ప్రమాణ స్వీకారం. 3 నుంచి 3.30 గంటల వరకు నూతన ఎస్ఎంసీ తొలి సమావేశం నిర్వహించాలి. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా డిప్యూటీ ఈఓలు, సెక్టోరిల్ అధికారులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు అవసరమైన సమాచారం అందించాలని డీఈఓ సూచించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశించారు. పాఠశాల పర్యవేక్షణ, మెరుగైన యాజమాన్యం, విద్యార్థులకు మెరుగైన వాతారణం కల్పించడంలో ఎస్‌ఎంసీల పాత్ర కీలకమని పేర్కొంటూ కమిటీల ఏర్పాటును ప్రోత్సహించాలని మండల స్థాయి విద్యాశాఖ ఆధికారులకు సూచించారు. -
భూసేకరణను వేగవంతం చేయాలి
● పారిశ్రామిక ప్రాజెక్టులకు సకాలంలో భూములు అప్పగించాలి ● కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డివిజయనగరం గంటస్తంభం: జిల్లాలో వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు చేపడుతున్న భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టుల వారీగా భూముల వివరాలు, అవార్డు ప్రక్రియ, పరిహారం చెల్లింపులు, పెండింగ్ అంశాలను పరిశీలించారు. నోటిఫికేషన్లు, సర్వేలు, రికార్డుల ధ్రువీకరణలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏపీఐఐసీ ఆధ్వర్యంలోని అంబటివలస రిషి డెకర్స్, ఆంధ్ర కార్న్ ప్రొడక్ట్స్, కాపుసంబం ఎంఎస్ఎంఈ పార్కు, మరుపల్లి అన్షుమి ఇండస్ట్రియల్ పార్కు, శ్రీరాంపురం మై వీడు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్లాంట్, ఆకులకట్ట ఫుడ్ పార్కు తదితర ప్రాజెక్టుల భూసేకరణ పురోగతిని సమీక్షించారు. కాపుశంభాం ఎంఎస్ఎంఈ పార్కు పనులకు సంబంధించి భూసేకరణ, పరిహారం చెల్లింపులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎస్ఐపీబీ పరిధిలో రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రాజెక్టుకు భూమి అప్పగించి పనులు ప్రారంభించినందుకు అధికారులను అభినందించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్, డీఆర్వో సీహెచ్.సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు. -
గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య
గుర్ల: మండలంలోని గూడెంగ్రామానికి చెందిన శనపతి సంతోష్(34) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన శనపతి సంతోష్ జిల్లా కేంద్రంలోని జేఎన్టీయూలో అవుట్ సోర్సింగ్‌లో మొటలర్జీ డిపార్ట్మెంట్ అటెండర్‌గా పనిచేస్తున్నాడు. జేఎన్టీయూలో తనతో పాటు పనిచేస్తున్న అదే డిపార్ట్మెంట్కు చెందిన ఏడుగురు సిబ్బంది సంతోష్‌ను తరచూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఆ వేధింపులు తట్టుకోలేక గూడెంలోని తన నివాసం వద్ద గడ్డి మందు కూల్ డ్రింక్‌లో కలుపుకుని తాగేశాడు. గడ్డి మందు తాగే ముందు నా ఆత్మహత్యకు జేఎన్టీయూలో పనిచేస్తున్న ఏడుగురు వ్యక్తులే కారణమని లేఖలో రాశాడు. గడ్డి మందు తాగిన సంతోష్ పరిస్థితిని కుటుంబ సభ్యులు చూసి వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. మృతుడికి వివాహం కాలేదు. తల్లి రాములమ్మ, తమ్ముడు సతీష్ ఉన్నారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గుర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. -
ప్రజాసేవకు కాదు
● చివరి మండల సమావేశంలో ఎంపీపీ బి.ప్రమీల భావోద్వేగ ప్రసంగంపాచిపెంట: ఐదేళ్ల పదవీకాలంలో ప్రజలతో మమేకమై పనిచేసిన అనుభవాలు.. అభివద్ధి పనుల్లో ఎదురైన సవాళ్లు.. ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన ప్రయత్నాలు.. ఇవన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. మండల పరిషత్ పాలకవర్గానికి చివరి సర్వసభ్య సమావేశం కావడంతో పాచిపెంట మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఎంపీపీ బి. ప్రమీల అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో శాఖల వారీగా అధికారులు ప్రగతి నివేదికలను సభ్యులకు వివరించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ..ప్రజా సమస్యలు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. రాజకీయ పార్టీలు ప్రతి ఐదేళ్లకోసారి మారుతుంటాయని, అయితే అధికారులు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించాల్సిన బాధ్యత కలిగి ఉంటారని పేర్కొన్నారు. పదవులు శాశ్వతం కాదు.. ప్రజలకు చేసిన సేవలే మిగులుతాయన్న భావనతో ప్రజాప్రతినిధులు పనిచేయాలని ఆమె సూచించారు. తన పదవీకాలంలో మండలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేసిన కృషి, అధికారులతో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా తమకు ఎంపీపీ, ఎంపీటీసీ పదవులు కల్పించి ప్రజాసేవకు అవకాశం కల్పించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనన్్ రెడ్డి మాజీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర లకు ప్రమీల కతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్ల పదవీకాలానికి ముగింపు పలుకుతున్న సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ఎంపీపీ బి. ప్రమీలతో పాటు ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఐదేళ్ల పాటు కలిసి పనిచేసిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు. పదవీకాలం ముగిసినా ప్రజలతో తమ అనుబంధం కొనసాగుతుందని ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. బలిజిపేట: మండల పరిషత్ సమావేశాలకు బుధవారంతో తెరపడనుంది. ఎంపీటీసీ సభ్యుల పదవీకాలం ఈనెల 23తో ముగియనుంది. బలిజిపేటలో చివరి మండల సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహిస్తారు. మండలంలో 17ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గలావల్లిలో సర్పంచ్, ఎంపీటీసీలుగా మామిడి చంద్రచూడామణి విజయం సాధించడంతో ఎంపీటీసీ పదవికి రాజీనామా చేశారు. దీంతో 17స్థానాలకు గాను 16మంది ఎంపీటీసీలే ఉన్నారు. వారిలో ఇటీవల పెద్దింపేట ఎంపీటీసీ ఎం.సాంబమూర్తి మృతిచెందారు. దీంతో మండల పరిషత్ సభ్యులు 15మంది, కో ఆప్షన్ సభ్యుడు ఒకరు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న బాడీ 2021వ సంవత్సరం సెప్టెంబరు 24న ఏర్పాటైంది. ఇప్పటివరకు 25సమావేశాలు అప్పట్లో కొత్తగా ఏర్పాటైన సభ్యులతో డిసెంబర్ 10, 2021న మొదటి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు మండల పరిషత్ బడ్జెట్‌సమావేశాలు 25 నిర్వహించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 15సమావేశాలు నిర్వహించగా, చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత 10 సమావేశాలు నిర్వహించారు. నేడు చివరి సమావేశం నిర్వహించనున్నారు. ఇంకా అందని గౌరవ వేతనం సభ్యులకు నెలకు రూ.3వేలు గౌరవ వేతనం కింద ఇస్తారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంకా 8నెలల గౌరవ వేతనం సభ్యులకు అందాల్సి ఉంది. ఒక్కో సభ్యుడికి రూ.24వేల వంతున అందాలి. పదవీకాలం పూర్తవుతున్నా గౌరవ వేతనం ఇంకా పూర్తికాలేదనే చలోక్తులు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత సభ్యులకు గౌరవం లేదు, గౌరవ వేతనం సక్రమంగా అందలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రెండున్నర ఏళ్లలో సమస్యలు పరిష్కారం కాలేదు: చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత మండల సర్వసభ్య సమావేశాల్లో సభ్యులు ప్రస్తావించిన సమస్యలు పరిష్కారం కాలేదని, సమావేశాల్లో అధికారులకు సమస్యలు తెలియచేయడం, ఆ తరువాత వాటిపై నిలదీయడమే తప్ప ఎటువంటి సమస్య పరిష్కారం కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల సర్వసభ్యసమావేశానికి హాజరవడం, రిజిస్టరులో సంతకం చేయడం, సమావేశంలో కార్యాలయం వారు ఇచ్చే స్నాక్స్ తినడం, టీ తాగి వెళ్లిపోవడమే తప్ప ఒరిగేదేమీ లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన పడకేసిందని, క్షేత్రస్థాయిలో ఉండే కార్యదర్శులు ఏమాత్రం గ్రామాలను పట్టించుకోవడం లేదని, ప్రజల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉన్నాయి తప్ప వాటిపై చర్యలు లేవనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఎంపీటీసీ సభ్యుల పరంగా ఎటువంటి అభివృద్ధి పనులు నిర్వహించలేదు. అంతా డమ్మీగానే ఉంది. అధికారుల వ్యవహారశైలి మారిందని చెప్పవచ్చు. ఎంపీటీసీల గౌరవ వేతనం చెల్లించాలి. గ్రామాల్లో పేరుకుపోతున్న సమస్యలను పరిష్కరించాలి. వి.సాయిరాం, మండల ఉపాధ్యక్షుడు, బలిజిపేట -
పీటీసీలో స్పోర్ట్స్‌మీట్ ప్రారంభం
విజయనగరం టౌన్: శారీరక దృఢత్వాన్ని పెంపొందించేవి క్రీడలని, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తి, సమయపాలన, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందిస్తాయని పీటీసీ ప్రిన్సిపాల్ డి.రామచంద్రరాజు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసు శిక్షణ కళాశాలలో శిక్షణ పొందుతున్న 473 మంది మహిళా కానిస్టేబుల్స్‌కు రెండు రోజుల పాటు నిర్వహించే స్పోర్ట్స్ మీట్‌ను మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పోలీస్ విధుల్లో ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా, సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే శారీరకంగా దృఢంగా ఉండడంతో పాటు మానసికంగా కూడా బలంగా ఉండాలన్నారు. శారీరక దారుఢ్యం ప్రతి పోలీసు అధికారికి వృత్తిపరమైన బాధ్యతగా భావించాలని సూచించారు. ఓటమి అంతిమం కాదని, అది మరింత మెరుగ్గా ఎదగడానికి ఒక అవకాశమన్నారు. ప్రతి పోటీ నుంచి ఒక కొత్త అనుభవాన్ని, ఒక కొత్త పాఠాన్ని నేర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డి.కోటేశ్వరబాబు, డీఎస్పీలు పి.రమేష్, ఎం.చంద్రశేఖర్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్సైలు, కళాశాల సిబ్బంది, శిక్షణ అధికారులు, మహిళా కానిస్టేబుల్ శిక్షణార్థులు పాల్గొన్నారు. పాల్గొన్న 473 మంది శిక్షణ కానిస్టేబుల్స్ -
దివ్యాంగులకు కృత్రిమ అవయవాల పంపిణీ
కొత్తవలస: మండలంలోని మంగళపాలెం గ్రామం సమీపంలో గల గురుదేవా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సహకారంతో 350 మంది దివ్యాంగులకు కృత్రిమ ఆవయవాలు, ఉపకరణాలను ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రఘురాం మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ముందుగా ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రి, కేన్సర్ ఆస్పత్రి, కృత్రిమ అవయవాల తయారీ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. దివ్యాంగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు.కృత్రిమ అవయవాల తయారీ విధానాన్ని ట్రస్టు చైర్మన్ రాపర్తి జగదీష్‌బాబు సమగ్రంగా వివరించారు. అనంతరం రఘురాం మాట్లాడుతూ గురుదేవా చారిటబుల్ ట్రస్టు దివ్యాంగుల సేవలో పరితపిస్తోందన్నారు. వారికి నడక నడత నేర్పి ఎంతో సహకారం చేస్తోందని కొనియాడారు. కార్యక్రమంలో పాల్గొన్న దివ్యాంగులకు ఉచితంగా ట్రైసెకిల్స్, పోలియో కాలిపవర్స్, చెవిటి మిషన్లు, వీల్‌చైర్స్, వాకింగ్ స్టిక్స్‌ను అందజేశారు. అనంతరం పలువురు వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు, హిందుస్థాన్ షిప్ యార్డు లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు. -
700 ఉద్యోగాలకు కౌశలం డ్రైవ్
● 17,18 తేదీల్లో కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 17,18 తేదీల్లో విజయనగరంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో కౌశలం డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్(జీటీఐ)ఆధ్వర్యంలో ఫౌండ్రీ విభాగంలో 400, మెషినింగ్ విభాగంలో 300 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 32 ఏళ్ల వయస్సు గల పురుష అభ్యర్థులు, ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్(మెకానికల్) తదితర విద్యార్హతలు కలిగిన వారు, ఫ్రెషర్లు కూడా హాజరుకావచ్చన్నారు. ఎంపికై వారికి రూ.15,500 నుంచి రూ.16,500 వరకు వేతనంతో పాటు హాజరు బోనస్, నైట్ షిఫ్ట్, వర్క్‌స్టేషన్ అలవెన్సులు, ఉచిత భోజనం, వసతి, ఈపీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు అందనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ప్రతిభ, ఆసక్తి ఉన్న వారికి సెర్బియాలోని సంస్థ గ్రూప్ కంపెనీలో ఏడాది పనిచేసే అవకాశం కూడా లభించవచ్చన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఫోన్ 90305476667 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. -
‘బాల సంజీవని’ టెండర్లలో అవకతవకలు
● బాల సంజీవని టెండర్లలో గోల్‌మాల్‌పై స్వతంత్ర విచారణ జరపాలి విజయనగరం గంటస్తంభం: చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించే బాల సంజీవని పథకాన్ని కొద్ది మంది బడా కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు పరిమితం చేయడం సరికాదని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్మి బుగత అశోక్ విమర్శించారు. బాల సంజీవని, బాల సంజీవని ట్రైబల్ టెండర్లలో జరిగినట్టు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై స్వతంత్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీపీఐ నాయకులతో కలిసి కలెక్టరేట్లో డీఆర్ఓ, అదనపు జిల్లా మెజిస్ట్రేట్ సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని 26 జిల్లాలను నాలుగు యూనిట్లుగా విభజించి నిర్వహించిన టెండర్ల మొత్తం వార్షిక విలువ సుమారు రూ.172.80 కోట్లు కాగా, కిట్ ధరలు పెరిగాయని తెలిపారు. ట్రైబల్ కిట్ఽ ధర రూ.350 నుంచి రూ.446కు, సాధారణ కిట్ ధర రూ.241 నుంచి రూ.283.19కు పెరగడం వల్ల సుమారు రూ.29.22 కోట్ల మేర అదనపు ప్రజాధనం భారం పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ వ్యయానికి సంబంధించిన పూర్తి లెక్కలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని కోరారు. టెండర్ నిబంధనల్లో సొంత తయారీ యూనిట్, ఫుడ్ సేప్టీ లైసెన్స్, ఉత్పత్తి సామర్థ్యం వంటి అర్హతలు ఉన్నప్పటికీ, తయారీ యూనిట్లు లేని సంస్థలకు కాంట్రాక్టులు ఎలా దక్కాయో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. గతంలో అనర్హతకు గురైన సంస్థలకు తిరిగి ఎలా అర్హత కల్పించారో విచారించాలన్నారు. పలువురు బిడ్డర్లు ఒకే ధరను కోట్ చేయడం వంటి అంశాలపై అనుమానాలు ఉన్నాయని తెలిపారు. జోన్ విధానాన్ని రద్దు చేసి జిల్లా వారీగా టెండర్లు నిర్వహించాలని, డ్వాక్రా సంఘాలు, మహిళా స్వయం సహాయక గ్రూపులకు పథకాన్ని అప్పగించాలని అశోక్ డిమాండ్ చేశారు. టెండర్లపై ఆర్థిక ఆడిట్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఐ జిల్లా సమితి సభ్యులు పొందురూ అప్పలరాజు, బూర వాసు పాల్గొన్నారు. -
జాతీయ లోక్ అదాలత్ సక్సెస్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత ● అదాలత్‌లో 7051 కేసులు పరిష్కారంవిజయనగరం లీగల్; రాజీయే రాజ మార్గమని కేసులను సామరస్య పూర్వకంగా, స్నేహ పూరిత వాతావరణంలో ఎటువంటి వివాదాలు లేకుండా పరిష్కరించే ఏకై క మార్గం లోక్ అదాలత్ అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన జాతీయ లోక్ అదాలత్‌కు హాజరై న్యాయమూర్తి మాట్లాడారు. ఈ లోక్ అదాలత్ వలన కక్షిదారులకు సమయం, డబ్బు వృధా కాకుండా వారి జీవితాలలో ప్రశాంతత కలిగి ఉంటారన్నారు. జాతీయ లోక్ అదాలత్‌లో పలు సివిల్, క్రిమినల్ కేసులు, రాజీ పడదగిన కేసులను రాజీ మార్గంలో ఇరు పార్టీల సమ్మతితో శాశ్వతంగా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జాతీయ లోక్ అదాలత్ ఉమ్మడి జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలలోని కోర్టులైన విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు, శృంగవరపుకోట, చీపురుపల్లి, గజపతినగరం, కొత్తవలస, కురుపాం కోర్టులలో మొత్తంగా 7051 కేసులను పరిష్కరించినట్టు తెలిపారు. వాటిలో సివిల్ కేసులు 162, క్రిమినల్ కేసులు 6866, ప్రీ లిటిగేషన్ కేసులు 23 ఉన్నాయన్నారు. ఇన్సూరెన్స్ కంపెనీకి చెందిన 9,73,16,602 లక్షల రూపాయలు మోటార్ ప్రమాద బీమా కేసులో పిటిషనర్‌కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా అందజేశారు. జాతీయ లోక్ అదాలత్‌కు హాజరైన కక్షిదారులకు సీనియర్ న్యాయవాదులు పీఏఎన్ రాజు, పంపాన రవికుమార్, కుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మొదటి శ్రేణి అదనపు జిల్లా న్యాయమూర్తి చైర్మన్ దుర్గయ్య, కుటుంబ న్యాయ స్థానం అదనపు జిల్లా న్యాయమూర్తి ఓ.విజయ కళ్యాణి, బి.అప్పలస్వామి, నాల్గవ శ్రేణి అదనపు న్యాయమూర్తి, శ్రీధర్, సీనియర్ సివిల్ జడ్జి రమేష్‌నాయుడు, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణప్రసాద్, ఫస్ట్‌క్లాస్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనివాసరావు, జూనియర్ సివిల్ జడ్జి బుజ్జి, మొబైల్ కోర్ట్, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.ఖతేజా చక్రవర్తి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, ఇజి.శ్రీ విద్య, మూడవ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, నలితం రమేష్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లాన రవి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు, కోర్టు సిబ్బంది, వివిధ శాాఖల అధికారులు, పోలీస్, ఇన్సూరెన్సు అధికారులు, బ్యాంకు మేనేజర్లు, న్యాయ వాదులు, కక్షిదారులు పాల్గొన్నారు. -
అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభ
గుమ్మలక్ష్మీపురం: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన రాష్ట్ర రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన క్రీడాకారులు ఉత్తమ ప్రతిభను కనబరిచి పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పార్వతీపురం మన్యం జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు భాస్కరరావు, పత్తిక చంద్రమోహన్ తెలిపారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కనబరిచిన అత్యుత్తమ ప్రతిభ ఆధారంగా జిల్లా నుంచి పాల్గొన్న 50 మంది క్రీడాకారుల్లో 18 మంది గోల్డ్ మెడల్స్‌ను, 20 మంది సిల్వర్ మెడల్స్‌ను, 12 మంది కాంస్యం మెడల్స్‌ను పొందారని తెలిపారు. పైడితల్లి జాతరలో 21 పనులకు టెండర్ల ఆహ్వానం విజయనగరం క్రైమ్ : ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ఆడపడుచు శ్రీ పైడితల్లి జాతరకు సంబంధించిన ఏర్పాట్లు పనులకు టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు దేవదాయ శాఖ ఆలయ ఈఓ శిరీష శనివారం తెలిపారు. సిరిమాను సంబరం, తొలేళ్ల పండగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఏర్పాటు పనులకు టెండర్లు ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. చదురగుడి, వనంగుడులలో ఎలక్ట్రికల్ పనులు, చలువ పందిళ్లు వేయటానికి, క్యూ లైన్లు, వనంగుడిలో ఆర్చి, లడ్డూ ప్రసాదం తయారీ వంటి 21 పనులు చేయించేందుకు ఈ నెల 16వ తేదీలోపు టెండర్లను దేవదాయ శాఖ కోరుతోందని ఈఓ శిరీష తెలిపారు. వివిధ రకాల పనులు, వాటి వ్యయాల బట్టి, వంద నుంచీ యాభై వేల రూపాయల వరకు దేవస్థానం పేరుతో డీడీ తీసి టెండర్‌కు జతపరచి బాక్స్‌లో వేయాలని తెలిపారు. కార్మికుడి మృతి కొత్తవలస : మండలంలోని కంటకాపల్లి గ్రామ సమీపంలో గల శారడ మెటల్స్ అండ్ ఎల్లోయిస్ కర్మాగారంలో అస్వస్థతతో కాంట్రాక్టు కార్మికుడు చింత గౌరినాయుడు (45) శనివారం మృతి చెందాడు. దీనికి సంబంధించి సీఐ టి.వి.విజయకుమార్ తెలిపిన వివరాలు.. వేపాడ మండలం బొద్దాం గ్రామానికి చెందిన మృతుడు చింత గౌరినాయుడు శారడ కర్మాగారంలో చిన్నారావు అనే లేబర్ కాంట్రాక్టర్ వద్ద గత కొద్ది కాలంగా రాయి కొట్టే పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఎప్పటి మాదిరిగానే శనివారం పనికి వచ్చి మధ్యాహ్నం భోజనం అనంతరం ఒంట్లో నలతగా వుందని తోటి కార్మికులకు చెప్పి చెట్టు కింద కూర్చున్నాడు. ఇంతలోనే వాంతులు చేసుకోవడంతో తోటి కార్మికులు గమనించి వెంటనే కొత్తవలసలో గల ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం పెందుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు మృతుడు భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. బాలింత..సీతంపేట: మండలంలోని శిలిగాం గ్రామానికి చెందిన ఐదు నెలల బాలింత కె.రేణుక (36) శనివారం శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. జ్వరం, విరేచనాలతో బాధ పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటికే బీపీ పూర్తి స్థాయిలో పడిపోవడంతో ప్రాధమిక చికిత్స చేసి శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేసినట్టు ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. రేణుక అంగన్వాడీ హెల్పర్‌గా పని చేస్తుంది. ఐదు నెలల కిందట కుమార్తెకు జన్మనిచ్చింది. ఈమె మృతితో భర్త కిషోర్ గుండెలవిసేలా రోదిస్తున్నారు. గుర్తు తెలియని మహిళ మృతి మెరకముడిదాం : మండలంలోని బిళ్లలవలస గ్రామంలో శనివారం రామాలయం వద్ద గుర్తు తెలియని మహిళ మృతి చెందింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మృతి చెందిన మహిళ బిళ్లలవలస గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామంలో తిరుగుతూ వుండేదని, హిందీలో మాట్లాడేదని, ఎవరు తినేందుకు ఏమి పెట్టినా తినేది కాదని గ్రామస్తులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున రామాలయం వద్ద విగత జీవిగా పడి వుందని తెలిపారు. విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు తెలియజేయడంతో బుదరాయవలస ఎస్ఐ తన సిబ్బందితో పాటు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతురాలు ఎక్కడ నుంచి వచ్చింది.. ఏ ప్రాంతానికి చెందినది అన్న వివరాలు తెలియరాలేదు. దీంతో గ్రామస్తులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. -
విఘ్నాల్లేకుండా వినాయక ఉత్సవాలు
విజయనగరం టౌన్: విఘ్న నాయకునికి పూజలు నిర్వహించే వారంతా విఘ్నాల్లేకుండా వినాయక ఉత్సవాలు నిర్వహించుకునేందుకు జిల్లా పోలీసు శాఖ పూర్తి సహాయ, సహకారాలను అందిస్తోంది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టింది. అడుగడుగునా ఆయా స్టేషన్ల పరిధిలో ప్రతి పోలీస్ ఉద్యోగి సమాచారాన్ని సేకరించే విధంగా ఏర్పాట్లు చేసింది. నిఘా నేత్రంతో నిశిత పరిశీలన చేస్తోంది. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే వెంటనే సమాచారమివ్వాలని ప్రజలను కోరింది. నిబంధనలు పాటించాలని పేర్కొంది. మండపాలు ఏర్పాటు చేసే వారందరూ సంబంధిత శాఖల నుంచి అవసరమైన అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతులకు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. మండపం వద్ద ఎల్లప్పుడూ నిర్వహకులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. మండపం వద్ద అగ్నిమాపక పరికరాలు, అత్యవసర భద్రతా ఏర్పాట్లు అందుబాటులో ఉంచాలి. అత్యవసర సమయాల్లో ప్రజలు మండపం నుంచి బయటకు వెళ్లేందుకు మార్గం ఖాళీగా ఉంచాలి. సాధ్యమైన చోట మండపం, పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వాటిని నిరంతరం పనిచేసే స్థితిలో ఉంచాలి. లౌడ్ స్పీకర్లు, డీజేలు ఉపయోగించేటప్పుడు సంబంధిత అనుమతులు తప్పనిసరిగా తీసుకుని, ప్రభుత్వం నిర్దేశించిన సమయాలు, శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలి. విగ్రహ ఊరేగింపు నిర్వహించే ముందు పోలీసు శాఖకు సమాచారమందించి, వారు సూచించిన మార్గం, సమయాన్ని మాత్రమే పాటించాలి. మహిళలు, చిన్నారులు, వృద్ధులు భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రతి వినాయక మండపానికి నిర్వహకులు ఒక బాధ్యత గల వ్యక్తిని నోడల్ పర్సన్‌ను నియమించాలి. మొబైల్ నెంబర్, పూర్తి వివరాలను సంబంధిత పోలీసుస్టేషన్‌కు ముందుగానే అందజేయాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించవద్దు అసాంఘిక కార్యకలాపాలకు తావీయ్యొద్దు అడుగడుగునా నిఘా నేత్రం : ఎస్పీ దామోదర్ భక్తిశ్రద్ధలతో ఉత్సవాలు నిర్వహించుకోవాలి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, ఎవరి మనోభావాలు దె దెబ్బతినకుండా, భక్తిశ్రద్ధలతో వినాయక చవితి మహోత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలి. పోలీస్ శాఖ అధికారులు, సిబ్బందితో పాటూ ప్రత్యేకంగా నిఘా నేత్రంతో పరిశీలన చేస్తుంటుంది. మండపాలకు అనుమతులు తప్పనిసరిగా ఉచితంగా తీసుకోవాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా, అనుమానాస్పద పరిస్థితులు తలెత్తినా వెంటనే డయల్ 112/100కి సమాచారమివ్వాలి. – ఏఆర్ దామోదర్, ఎస్పీ -
ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ
● ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభలో వక్తలువిజయనగరం: ఐక్య ఉద్యమాలతోనే జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ సాధ్యమని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు అన్నారు. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు కె.రమేష్‌నాయుడు అధ్యక్షతన ఆరో జిల్లా మహాసభలు శనివారం జరిగాయి. ఇందులో పాల్గొన్న ఆంజనేయులు మాట్లాడుతూ జర్నలిజం వృత్తి సంక్షోభంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఇళ్ల స్థలాలు పెన్షన్ తదితర సంక్షేమ పథకాలు సాధించేందుకు ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలన్నారు. జాతీయ కౌన్సిల్ సభ్యుడు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ఫెడరేషన్ ముందుంటుందన్నారు. డీపీఆర్ఓ పి.గోవిందరాజులు, రాష్ట్ర నాయకులు ఎన్.మధుసూదనరావు, శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి భీమారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా శివకేశవనాయుడు, అప్పారావు ఎన్నికయ్యారు. -
21 వరకు మద్యం దుకాణాలకు రెన్యువల్ గడువు
విజయనగరం రూరల్: ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు జిల్లాలోని మద్యం దుకాణాల లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ ఈ నెల 21 వరకు చేపట్టనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి, ఎకై ్సజ్ అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బొగ్గులదిబ్బ వద్దనున్న పట్టణ ఎకై ్సజ్ స్టేషన్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వై.శ్రీనివాస చౌదరి ఆధ్వర్యంలో మద్యం లైసెన్స్‌దారులతో దుకాణాల రెన్యువల్ ప్రక్రియపై శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీ శ్రీనివాసచౌదరి మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 21 సాయంత్రం 5 గంటలలోపు మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ పూర్తవుతుందని, ఆలోపే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. మద్యం దుకాణాల లైసెన్స్‌దారులు ఈ ఏడాది మద్యం దుకాణాల రెన్యువల్‌కు ప్రభుత్వం జీవో 579 జారీ చేసిందని వివరించారు. ఈ జీవోను అనుసరించి జిల్లాలో ఓపెన్ కేటగిరి, గీత కార్మికులకు సంబంధించి మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియ చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఓపెన్ కేటగిరిలో 153 మద్యం దుకాణాలు ఉండగా, గీత కార్మికులకు సంబంధించి 16 మద్యం దుకాణాలు ఉన్నాయన్నారు. 50 వేల జనాభా కలిగిన ప్రాంతాల్లోని 17 ఓపెన్ కేటగిరి మద్యం దుకాణాలకు వార్షిక రుసుం రూ. 60.50 లక్షలు, ఆర్ఈటీ రెన్యూవల్ ఫీజు రూ.23 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలతో కలిపి రూ.88.50 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా కలిగిన ప్రాంతాల్లోని 136 ఓపెన్ కేటగిరి దుకాణాలకు వార్షిక ఫీజు రూ.71.50 లక్షలు, రెన్యూవల్ ఫీజు రూ.27.20 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలతో మొత్తంగా రూ.1.06 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. జిల్లాలోని గీత కులాల మద్యం దుకాణాలకు జనాభా ప్రాతిపదికన ఫీజులు నిర్ణయించినట్టు తెలిపారు. 50 వేల జనాభా ఉన్న ప్రాంతాల్లోని దుకాణాలకు వార్షిక ఫీజు రూ.30.30 లక్షలు, ఆర్ఈటీ రెన్యువల్ ఫీజు రూ.11.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.5 లక్షలతో కలిపి రూ.46.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. 50 వేల నుంచి 5 లక్షలలోపు జనాభా కలిగిన ప్రాంతాల్లోని 14 దుకాణాలకు వార్షిక ఫీజు రూ.35.80 లక్షలు, రెన్యూవల్ ఫీజు రూ.13.50 లక్షలు, పర్మిట్ రూమ్ ఫీజు రూ.7.5 లక్షలతో మొత్తంగా రూ.56.80 లక్షలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రస్తుత లైసెన్స్‌దారులు ఈ నెల 21లోపు రెన్యువల్ చేసుకోవాలని ఆయన తెలిపారు. రెన్యువల్ చేసుకోని మద్యం దుకాణాలకు ఈ నెల 22 నుంచి 29 వరకు కొత్త దరఖాస్తులు స్వీకరించి, ఈ నెల 30న లాటరీ విధానం ద్వారా అర్హులైన వారికి మద్యం దుకాణాలు కేటాయిస్తామని తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను లైసెన్స్‌దారులు పూర్తిగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా రెన్యువల్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని ఆయన తెలిపారు. అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, అసిస్టెంట్ ఎకై ్సజ్ అధికారి ఎస్.దొర, జిల్లాలోని వివిధ స్టేషన్ల సీఐలు, ఏ – 4 దుకాణాల లైసెన్స్‌దారులు పాల్గొన్నారు. -
పణుకువలస వంతెనపై.. వాహన రాకపోకలు బంద్
● వంతెనకు ఇరువైపులా గోడల నిర్మాణం ● శిథిలమైన వంతెనను పరిశీలించిన ఆర్అండ్బీ, పోలీస్ అధికారులు తెర్లాం: రాజాం – రామభద్రపురం ఆర్అండ్బీ రోడ్డులో మండలంలోని పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పైనుంచి వాహనాల రాకపోకలను శనివారం ఉదయం నుంచి ఆర్అండ్బీ, పోలీస్ అధికారులు పూర్తిగా నిషేధించారు. పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ వంతెనను మండల ఆర్అండ్బీ ఏఈ రాజు తన సిబ్బందితో పరిశీలించి వంతెన ప్రమాదకరంగా ఉందని, ఎప్పుడైనా పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని గుర్తించారు. దీంతో వంతెన పైనుంచి రాకపోకలు సాగించే వాహనాలు వెళ్లకుండా పూర్తిగా బంద్ చేశారు. వంతెన పైనుంచి వాహనాలు రాకుండా ఉండేలా వంతెనకు ఇరువైపులా రోడ్డు మధ్యలో సిమెంట్ ఇటుకలతో గోడలు కట్టారు. వంతెన మీదుగా వాహనాలు, ప్రయాణికులు వెళ్లే ప్రమాదం ఉందని గుర్తించిన పోలీస్ అధికారులు వంతెనకు రెండు వైపులా స్టాఫర్లు, ఇసుకతో నింపిన డ్రమ్ములు ఏర్పాటు చేశారు. -
టిప్పరు దగ్ధం
చికెన్పాలకొండ రూరల్: మండలంలోని గొట్ట మంగళాపురం సమీపంలో నాగావళి తీరంలో గల ఇసుక ర్యాంపు నుంచి ఇసుక తరలించేందుకు సిద్ధం చేసిన టిప్ప రు శనివారం దగ్ధమైంది. విజయనగరానికి చెందిన ఈ వాహనం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు పాలకొండ ఆగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. అగ్నిమాపక అధికారి జామి సర్వే శ్వరరావు శకటంతో సహా ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో వాహనం క్యాబిన్, తొట్టె పూర్తిగా కాలిపోయాయని అధికారి తెలిపారు. ఈ సందర్భంగా సదరు వాహన యజమాని రాగోలు సత్యనారాయణ మాట్లాడుతూ రూ.10 లక్షల వరకూ నష్టం వాటిల్లినట్లు వాపోయారు. -
పెదపెంకిలో డ్రెయిన్లతో మ్యాజిక్!
● కాలువల నిర్మాణంలో విన్యాసాలు ● అప్పుడు వేసి.. ఇప్పుడు తొలగించి... ● వృథా అవుతున్న రూ.కోట్లాది నిధులు సాక్షి, పార్వతీపురం మన్యం/బలిజిపేట: బలిజిపేట మండలం పెదపెంకిలో మ్యాజిక్ డ్రైన్ల పేరిట అధికారులు విన్యాసాలు చేస్తున్నారు. అవగాహన ఉండి చేస్తున్నారా.. లేక, ఉప ముఖ్యమంత్రి దత్తత గ్రామం కావడం వల్ల తెలియకపోయినా బుర్ర ఊపేశారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొన్నటి వరకు నిర్మించిన డ్రైన్లను ఇప్పుడు తొలగిస్తున్నారు. దీనివల్ల రూ.కోట్లాది నిధులు మట్టి పాలవుతున్నాయి. పెదపెంకి గ్రామాన్ని దాదాపు మూడు దశాబ్దాలుగా బోధ వ్యాధి పీడిస్తున్న విషయం విదితమే. అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ పరిస్థితిని అధిగమించాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ భావించారు. ఎక్కడికక్కడ మురుగు నీరు నిల్వ ఉండిపోవడం వల్ల దోమల వ్యాప్తి చెందుతోందని భావించి.. ఇక్కడ మ్యాజిక్ డ్రైన్లు, సిమెంట్ రోడ్లు, పలు అభివృద్ధి పనుల కోసం రూ.6.5 కోట్లు మంజూరు చేయించారు. వర్షం నీరు, వాడుక నీరు అక్కడే భూమిలోకి ఇంకిపోయేలా మ్యాజిక్ డ్రైన్లు నిర్మించాల్సి ఉంది. రాజకీయాలతో పనులకు గ్రహణం రూ.కోట్లలో నిధులు వస్తుండటంతో రాజకీయ నేతల కన్ను పనులపై పడింది. అప్పటి వరకు పనులు చేసిన కాంట్రాక్టర్‌ను తొలగించి, తమవారికి అప్పగించాలని అధికార పార్టీకి చెందిన నేత పట్టుబట్టారు. ఆయన సూచించిన కాంట్రాక్టరు చేసిన పనుల్లో నాణ్యతాలోపం స్పష్టంగా కనిపించింది. ఈ పనుల నిర్వహణపై సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండుసార్లు ఆయన ప్రారంభోత్సవానికి పెదపెంకి రావాల్సి ఉన్నా.. పనులు పూర్తి కాకపోవడంతో పర్యటన వాయిదా పడింది. మరోవైపు అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పనులకు కొంతమంది స్థానికుల నుంచి కూడా సహకారం కరువైంది. అడుగడుగునా అడ్డుపడుతున్నారు. దీనికి తోడు మొదట్లో అధికారులు ప్రధాన రహదారి పక్కన వేసిన మ్యాజిక్ డ్రైన్‌న్ అడ్డుసుడి పనులు ఫలితంగా ప్రజలకు అవస్థలు అధికమయ్యాయి. అడ్డదిడ్డం పనులు.. ఆగ్రహించిన ప్రజలు గ్రామంలో గాంధీ విగ్రహం నుంచి బస్టాండు వరకు ఉండే ప్రధాన రహదారికి ఒకవైపు వేసిన మ్యాజిక్ డ్రైన్‌న్ పనిని అధికారులు ఇష్టారాజ్యంగా వేయడంతో సమస్య తలెత్తింది. కాలువలలో మురుగునీరు నిల్వ ఉండిపోవడం, నివాస గృహాల్లోకి నీరు చేరిపోవడం వంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం అధికారులు గ్రామంలోకి వచ్చినప్పుడు గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసేది లేక అధికారులు ప్రధాన రహదారికి పక్కగా వేసిన మ్యాజిక్ డ్రైన్న్లో ఉన్న పిక్కను తొలగించి మురుగునీరు బయటకు వచ్చేలా చేశారు. తొలగించిన మ్యాజిక్ డ్రైన్‌ను తిరిగి వేస్తారా? వేస్తే పాత పిక్కనే వినియోగిస్తారా? కొత్త పిక్కను వేసి ఇప్పటికై నా మ్యాజిక్ డ్రైన్‌న్ నిర్మాణం పక్కాగా చేపడతారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నెలలు గడిచిపోతున్నా పెదపెంకిలో అభివృద్ధి పనులకు ఒక రూపు రావడం లేదు. -
కొనసాగుతున్న తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: ఎగువన ఉన్న ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు, జిల్లాలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలకు తోటపల్లి సాగునీటి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతుంది. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు శనివారం సాయంత్రం బ్యారేజీ వద్ద నీటిమట్టం 105 మీటర్లకుగాను 104.25 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొత్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.058 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజీకి సగటున 8,497 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, ఈ మేరకు మూడు గేట్లును ఎత్తి సగటున 7,691 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. కుడి ప్రధాన కాలువ ద్వారా 800 క్యూసెక్కులు, పాత కుడి కాలువ ద్వారా 40 క్యూసెక్కులు, పాత ఎడమ కాలువ ద్వారా 414 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు వద్ద నీటి పరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు బి.కిషోర్‌కుమార్, శ్రీనివాసరావు పర్యవేక్షిస్తున్నారు. ప్రాజెక్టుకు అధికంగా వరద వస్తే దిగువకు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. ఐపీహెచ్ఎల్ ప్రారంభం సీతంపేట: స్థానిక ఏరియా ఆస్పత్రి నూతన భవనంలో ఐపీహెచ్ఎల్ (ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబరోటరీ)ని వర్చువల్ మోడ్‌లో కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమానికి పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ, ఆర్ఎంఓ డీవీ శ్రీనివాస్, సూపరింటెండెంట్ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అల్లంత దూరాన ధర
● ప్రస్తుతం మార్కెట్లో కిలో అల్లం రూ.250 పైనే.. పార్వతీపురం: వంటింట్లో ఏ కూర వండాలన్నా అల్లం తప్పనిసరి. అలాంటి అల్లం కొనుగోలు చేయాలంటే పేద, మధ్య తరగతి వారు అమ్మో.. అంత ధర అని.. విస్తుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గతంలో ఎన్నడూ లేని విధంగా నెల రోజుల నుంచి అల్లం ధర ఆకాశాన్ని అంటుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో అల్లం ధర రూ.250ల నుంచి రూ.280 వరకు పలుకుతోంది. దీంతో అల్లం కొనుగోలు చేయాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో అల్లం సాగు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతిచేసుకునే అల్లం పైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. హోల్‌సేల్ వ్యాపారుల నుంచి రూ.230లకు కొనుగోలు చేసుకొని చిరు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం కారణంగా అల్లం పంట చేతికి రాకపోవడంతో ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. అదే బాటలో ఉల్లి, వెల్లుల్లి ధరలు దూసుకుపోతున్నాయి. -
విజయమే లక్ష్యంగా సాగుదాం
జియ్యమ్మ వలస రూరల్: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీ వాణి పిలుపునిచ్చారు. అప్పుడే గ్రామ స్వరాజ్యానికి, పార్టీకి మనమిచ్చే గౌరవమన్నారు. చినమేరంగిలోని పార్టీ క్యాంపు కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షత్ రాజు ఆధ్వర్యంలో కురుపాం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శనివారం నిర్వహించారు. గరుగుబిల్లి, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, జియ్యమ్మవలస మండలాల పార్టీ కన్వీనర్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ, సర్పంచ్, ముఖ్యనేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మోసాలను ఎండగట్టాలి.. 2024 ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పి 143 దొంగ హామీలతో చంద్రబాబు గెలుపొందారు. అనంతరం వాటి అమలును గాలికొదిలేశారు. ఈ మోసాలను ప్రజలకు వివరంగా తెలియజెప్పాలి. అందులో భాగంగానే గత వైఎస్సార్ సీపీ హయాంలో ప్రజలకు అందించిన పథకాల గురించి ప్రజలకు గుర్తు చేయాలి. నిరుద్యోగ యువత, రైతులు, విద్యార్థులు, మహిళలకు చేసిన మోసాలపై కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని’ పుష్పశ్రీవాణి, పరీక్షిత్ రాజు సూచించారు. దీటైన వారే నిలబడాలి.. ‘ఐదు మండలాల్లోని అన్ని పంచాయతీలోనూ వైఎస్సార్సీపీ తరఫున దీటైన అభ్యర్థులను బరిలో దించాలి. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల స్థానాలు గెలిపించాలి. ప్రజాస్వామ్య బద్ధంగా జరి గిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీనే విజయం సాధిస్తుంది. అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు, బెదిరింపులకు తలొగ్గొద్దు. అలాంటి వాటిని ముందుగానే గుర్తించి సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని’ నేతలు పిలుపునిచ్చారు. సైనికుడిలా కష్టించాలి.. ‘ప్రతి కార్యకర్త సైనికుడై వైఎస్సార్సీపీ కోసం కష్టపడి మన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి. కూటమికి ఓటమిని చూపించే విధంగా ప్రతి కార్యకర్త నిలబడాలి. పార్టీలో అంతర్గత కలహాలు తావివ్వకూడదు. ఎవరికై తే పార్టీ బీ–ఫారంను అందిస్తుందో వారు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిగా భావించి గెలిపించాలి. ఈ రోజు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల విజయమే 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయంగా భావిస్తాం. ఎన్నికల బరిలో నిలిచిన ప్రతి అభ్యర్థికి అన్నివిధాలా అండగా ఉంటామని’ పుష్పశ్రీవాణి, పరీక్షిత్‌రాజు ధైర్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీతోనే గ్రామ స్వరాజ్యం సాధ్యం ‘స్థానిక’ సమరానికి సిద్ధం కావాలని పరీక్షిత్ రాజు పిలుపు కార్యకర్తల బలమే పార్టీ విజయమని పుష్పశ్రీవాణి వ్యాఖ్య -
చివరి ఆశలు చిగురించేనా..?
శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026● ఎన్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ● సెప్టెంబర్ నాటికీ పూర్తికాని ఉడుపులు ● అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న మోస్తరు వర్షాలుపాలకొండ రూరల్/మక్కువ/బలిజిపేట: ఖరీఫ్ ప్రారంభం నుంచి అన్నదాతలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. సాగునీటి వనరుల ద్వారా రైతుల పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించకపోవడం, ఆశించిన మేర వానలు కురవక పోవడంతో జిల్లా వ్యాప్తంగా సీజనల్ వరి సేద్యంతో పాటు ఇతర వాణిజ్య, కూరగాయపంటల సేద్యం, దిగుబడి ప్రశ్నార్థకంగా మారింది. ఈ తరుణంలో అండగా ఉండాల్సిన యంత్రాంగం, ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందంటూ రైతన్నలు మండిపడుతున్నారు. సాగునీరు అందక నాట్లు వేసేందుకు అవకాశం లేక సెప్టెంబర్ నెల గడిచిపోతున్నా వేలాది ఎకరాలు ఖాళీగా దర్శనమిస్తున్నా యి. శివారు భూములకు కీలక సమయంలో తడులు అందక వరి, కాయగూరల పంట భూములు బీడువారిపోయాయి. అల్పపీడనంతో చిగురించిన ఆశలు నాట్లు వేసే సమయం ముగిసిపోవడం, సిద్ధం చేసి న నారు ముదిరిపోవడం, సాగునీరు లేక రైతు నీరసించిపోయాడు. వెదలు, తొలి దశలో చేపట్టిన ఉడుపులు ఎండుముఖం పట్టడంతో భారం భగవంతుడి పై వేసిన కర్షకులకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జీవం నిలిపింది. గడిచిన మూడు రోజులుగా కురుస్తున్న మోస్తరు వర్షాలతో ఆశలు కొంతమేర చిగురించాయి. సాధారణ వర్షపాతంతో పోల్చితే ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 32 శాతం వర్షపాతం తక్కువగా నమోదైంది. శుక్రవారం నాటికి అత్యల్పంగా సాలూరు మండంలో 10.6 మిల్లీమీటర్లు, అత్యధికంగా సీతంపేట ఏజెన్సీలో 73.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువన ఉండే ఒడి శా రాష్ట్రాల్లో వర్షాలు కురిసినా ఇక్కడికి ఆ నీరు నదుల ద్వారా చేరితే కొంతమేర లాభం ఉంటుంది. మరో వారం రోజులు వర్షాలు కొనసాగితే తప్ప పంటలపై ఆశలు ఉండవని రైతులు చెబుతున్నారు. నేటికీ సాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. జిల్లాలో.. అధికారిక లెక్కల ప్రకారం జిల్లా వ్యాప్తంగా అన్నిరకాల పంటలకు సంబంధించి సాగువిస్తీర్ణం 88,858 హెక్టార్లు. ఈ ఏడాది వరి 72,829 హెక్టార్లలో సేద్యం చేపట్టారు. ప్రస్తుతానికి 66,325 హెక్టార్లల్లో నాట్లు వేయగా దాదాపు 20 వేల ఎకరాల్లో ఉడుపులు జరగలేదని రైతులు చెబుతున్నారు. రైతులకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పంటల బీమా భారం రైతులపైనే వేసింది. -
●అధికారుల చొరవ లేదు
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవవని తెలిసి సంబంధిత అధికారులు అవసరమైన చర్యలపై దృష్టి పెట్టలే దు.ఫలితం అన్నదాతకు తీరని నష్టం. తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో శివారున ఉన్న 16 గ్రామాలకు సాగునీరు ఇవ్వలేమని తేల్చేశారు. పైగా ఎరువులు, క్రిమిసంహారక మందుల సేకరణకు సాంకేతికత ముడిపెట్టారు. కౌలు రైతులపై దృష్టి ెపెట్టలే దు. తొలి దశలో వెదలు జల్లిన రైతులు నీరు లేక పంటలు నష్టపోవడంతో రెండుమూడు దఫాలు వెదలు వేసి అదృష్టం పరీక్షించుకుని నష్టపోయారు. మండలవ్యాప్తంగా వందలాది ఎకరాల్లో ఉడుపులు జరగలేదు. నారు ముదిరిపో యి ఇబ్బందులు పడుతున్నారు. నీటికోసం రైతులే సొంత మదుపులతో కాలువలు బాగుచేసుకున్నారు. మోటార్లు పెట్టి ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఈ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి. –కండాపు ప్రసాదరావు, రైతు సంఘం నాయకుడు, రుద్రిపేట, పాలకొండ మండలం -
●కష్టాన్ని నమ్ముకుని..
కష్టాన్ని నమ్ముకుని సేద్యం చేస్తున్నాం. ఈ ఏడాది వరి రెండెకరాల్లో, కాయగూర పంటలు ఓ ఎకరాలో వేశాం. కీలక దశల్లో సాగునీరు లేక మోటార్లు, బోర్లుపై ఆధారపడ్డాం. అయినా నమ్మకం లేదు. ఇప్పటివరకూ దాదాపు రూ.60 వేల వరకూ పెట్టుబడులు పెట్టాం. కుటుంబమంతా కష్టపడుతున్నాం. ఈ వర్షాలు కంటితుడు పు మాత్రమే. పరిస్థితి ఇలానే కొనసాగితే అప్పులు చేసి పెట్టిన మదుపులు కూడా రావు. ఆశలన్నీ వరుణిడిపైనే పెట్టుకున్నాం. –జి.లక్ష్మణరావు, రైతు, అంపిలి, పాలకొండ మండలం కుటుంబ పోషణకు సేద్యాన్ని నమ్ముకున్నాం. మూడు ఎకరాలు కౌలుకు చేస్తున్నాను. ఇప్పటికే వేలాది రూపాయలు మదుపులు పెట్టాను. దుక్కులు చేసి నారుపోసి మూడు నెలలు గడుస్తోంది. సాగునీరు లేక సకాలంలో ఉడుపులు చేపట్టలేకపోయాను. వర్షపు నీటి ఆధారంగా ముదిరిన నారు వేశాం. భగవంతుడిదే భారం. తిండి గింజలైనా వస్తాయన్న ఆశతో ఉన్నాను. రానున్న రోజు ల్లో వానలు కురవకుంటే మట్టే మిగులుతుంది. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. –ఎం.రమణమ్మ, కౌలురైతు, పెదపెంకి, బలిజిపేట మండలం -
ఆకతాయిల దాడిలో వంటమనిషికి తీవ్ర గాయాలు
పార్వతీపురం రూరల్: కళాశాల విద్యార్థుల మధ్య రేగిన పాతకక్షలు రచ్చకెక్కగా, ఆ గొడవతో ఏమాత్రం సంబంధం లేని ఒక అమాయక వంట మనిషి గాయాలపాలయ్యాడు. ఈ సంఘటన పార్వతీపురం పట్టణంలోని ఇందిరా కాలనీ సమీప ప్రధాన రహదారిపై కలకలం రేపింది. స్థానిక కల్యాణ మంటపంలో నిర్వహించిన ఓ ప్రైవేటు కళాశాల వేడుకల అనంతరం, కేటరింగ్ సామగ్రితో ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తున్న వంట మనిషిని, మరో విద్యార్థిని కొందరు యువకులు మార్గమధ్యంలో అడ్డగించారు. సదరు విద్యార్థితో పాత విషయాలపై వాగ్వాదానికి దిగి భౌతిక దాడికి పూనుకున్నారు. అక్కడే ఉన్న వంట మనిషి గమనించి, వారిని వారించేందుకు జోక్యం చేసుకోగా.. ఉన్మాదంతో రగిలిపోయిన ఆకతాయిలు వంటమనిషిపై కూడా విరుచుకుపడ్డారు. సమీపంలో ఉన్న సిమెంట్ రేకుల ముక్కలు, పిడికిళ్లతో దారుణంగా కొట్టడంతో ఆ వంట మనిషి తల, పెదవికి తీవ్ర రక్తగాయాలయ్యాయి. బాధితుడిని గమనించిన ఓ స్థానిక ఆటో డ్రైవర్ తక్షణమే స్పందించి పార్వతీపురం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఈ కొట్లాటకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సమాచారం అందుకున్న పోలీసులు దాడులకు పాల్పడిన విద్యార్థులు, ఇతర గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. -
●సాగునీరు అందక..
మక్కువ మండల వ్యాప్తంగా దాదాపు మూడువేల ఎకరాలమేర వరి సేద్యానికి సిద్ధమయ్యా రు.ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేవు. అదును దాటడంతో వెదలు కుళ్లిపోయాయి. నీరు లేక ఉభాలు సక్రమంగా జరగకపోవడంతో వేలాది ఎకరాల్లో నాట్లు పడలేదు. వెంగళరాయ సాగర్ ద్వారా నీరు అందించలేకపోయారు. తూరుమామి డి, చంద్రయపేట, కొయ్యానపేటలో వరి పంట నీరు లేక బీడుపోయింది. ప్రభుత్వ సహకారం లేదు. బీమా మొత్తాలను రైతులే చెల్లించాలని చెప్పారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు తాత్కాలిమే. రానున్న కీలక దశలో వానలు కురవకుంటే రైతులు ఆశలు వదులకోవాల్సిందే. –టి.శ్రీనివాసరావు, రైతు, కంచేడువలస గ్రామం, మక్కువ మండలం -
పెరిగిన తోటపల్లి నీటి ప్రవాహం
గరుగుబిల్లి: ఎగువన ఉన్న ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు, అల్పపీడనం కారణంగా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం కొనసాగుతోంది. గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు శుక్రవారం సాయంత్రం బ్యారేజీవద్ద నీటిమట్టం 105 మీటర్లకు గాను 104.38 మీటర్లుగా నమోదైంది. ప్రాజెక్టు మొ త్తం నీటి సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.140 టీఎంసీల నీటి నిల్వ ఉంది. బ్యారేజీకి సగటున 10వేల క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, ఈమేరకు మూడు గేట్లు ఎత్తి సగటున 8,200 క్యూసెక్కుల నీటిని నదిలోకి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టువద్ద నీటిపరిస్థితిని ఇంజినీరింగ్ అధికారులు బి.కిషోర్ కుమార్, శ్రీనివాసరావవులు పర్యవేక్షిస్తున్నారు. ప్రా జెక్టుకు అధికంగా వరద వస్తే దిగువకు నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సాలూరు రూరల్: ఎట్టకేలకు రెండేళ్ల తరువాత కొత్త పెన్షన్ల ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. అదికూడా ఒక్క వారం రోజులు గడువులోగా దరఖాస్తులు పూర్తిచేసుకోవాలి. దీంతో పెన్షన్ పథకానికి అర్హత ఉన్నవారంతా గడిచిన నాలుగురోజులుగా మీసేవ, సచివాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పట్టణంలోని మీసేవ కేంద్రాలకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు క్యూకడుతున్నారు. రో జంతా కష్టపడి ఎలాగోలా దరఖాస్తుచేసుకుని వాటిని ఆమోదింపచేసేందుకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ పెన్షన్ ప్రక్రియ ప్రారంభించడంపై ప్రజల్లో కాసింత ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్వతీపురం రూరల్: అనకాపల్లి జిల్లా ఎలమంచిలి జూనియర్ సివిల్ జడ్జి కె.రమేష్ సతీమణి జి.అనూష పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ కేంద్రాస్పత్రిలో శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. జడ్జి రమేష్ అత్తవారిది పార్వతీపురం పట్టణమే కావడంతో, కుటుంబ సభ్యులు ఆమెను స్థానికంగా ఉన్న సర్కారు దవాఖానాలోనే చేర్పించారు. ఓ సివిల్ జడ్జి హోదాలో ఉన్న వ్యక్తి తన భార్యను ప్రసవం కోసం ప్రభుత్వాస్పత్రిలో చేర్పించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పాలకొండలోని జ్ఞాన సరస్వతి మందిరంలో భక్తులు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాస అమావాస్య సందర్భంగా జ్ఞాన సరస్వతీ దేవిని 108 చీరలతో అలంకరించారు. లలితా సహస్రనామాలు, మహా మణిదీప వర్ణన, సరస్వతి అష్టోత్తర శతకాన్ని పఠించారు. అర్చకుడు షరత్కుమార్ నేతృత్వంలో శాస్త్రోక్తంగా శ్రావణ మాస, మాస అమావాస్య పూజలు జరిపారు. – పాలకొండ రూరల్ -
విద్యార్థులకు క్రీడా తరహా దుస్తులు
● యూనిఫారానికి బదులుగా ఇవ్వాలని ప్రతిపాదించిన కలెక్టర్సాక్షి, పార్వతీపురం మన్యం: అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో పార్వతీపురం మన్యం కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి ముఖ్యమైన ప్రతిపాదనను సమర్పించారు. ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్ పథకం కింద రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రస్తుతమున్న సంప్రదాయ యూనిఫాంల స్థానంలో సౌకర్యవంతమైన స్పోర్ట్స్ తరహా యూనిఫాం ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు. గిరిజన ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన దర్జీల కొరత వల్ల ప్రస్తుత యూనిఫాంల కుట్టు నాణ్యత సరిగా ఉండడం లేదని, త్వరగా చిరిగిపోతున్నాయని సమావేశం దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల లోగోతో కూడిన గాలి పీల్చే కాటన్ ఫ్యాబ్రిక్ టీ–షర్ట్, ట్రాక్ ప్యాంట్లను ప్రవేశపెట్టడం ద్వారా విద్యార్థులకు ఉచితంగా కదిలేందుకు మెరుగైన సౌకర్యం లభించడమే కాక.. క్రీడా స్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత, పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని వివరించారు. ఈ ప్రతిపాదనను పైలట్ ప్రాజెక్ట్‌గా ముందస్తుగా కొన్ని పాఠశాలల్లో అమలు చేయడానికి అనుమతించాలని కోరారు. ● కలెక్టర్ల కాన్ఫరెన్‌న్స్‌లో పార్వతీపురం మన్యం కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి వివిధ అంశాలపై మాట్లాడారు. మన్యం జిల్లాలోని విద్యాశాఖ బడ్జెట్ సమన్వయంతో బాలురు, బాలికలకు సంబంధించి క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కలిగిన వారిని ఇప్పటికే ఎంపిక చేశామని, రాబోయే రెండు వారాల్లో వారికి ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నట్లు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఒలింపిక్ క్రీడలను లక్ష్యంగా చేసుకుని ముందస్తు కార్యాచరణ రూపొందించాలని సీఎం సూచించారు. ● యువత నైపుణ్యాభివృద్ధికి చేపట్టిన ‘నైపుణ్యం’ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో జిల్లా ఏకంగా 65.8 శాతం సాధించి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ● జిల్లాలో ఈ–ఆఫీస్ ఫైళ్ల సమర్థ నిర్వహణపై సీఎం ప్రశంసించారు. కలెక్టర్‌కు వచ్చే ప్రతి ఫైల్‌ను సగటున కేవలం 5 గంటల వ్యవధిలోనే పరిష్కరించి క్లియర్ చేస్తున్న తీరుపై అభినందనలు తెలిపారు. ప్రజలకు, అర్జీదారులకు వేగంగా న్యాయం జరిగేలా మన్యం జిల్లా చూపిస్తున్న ఈ పనితీరును అందరూ స్ఫూర్తిగా తీసుకుని అమలు చేయాలని సూచించారు. ● జిల్లాలో సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు పంపిణీ చేసిన స్టూడెంట్ కిట్ల నాణ్యత చాలా బాగుందని, ఈ మార్పు పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారని ముఖ్యమంత్రికి కలెక్టర్ వివరించారు. కేవలం భౌతిక వసతులు, కిట్ల పంపిణీతోనే సరిపెట్టకుండా విద్యార్థులకు అందే విద్యా ప్రమాణాలను పెంచడం అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ● జిల్లాలో ఉద్యాన పంటల విస్తరణ, పురోగతిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో రైతులకు నిలకడైన ఆర్థిక పరిపుష్టి అందించేందుకు చేపడుతున్న ఉద్యాన అభివృద్ధి చర్యలను కలెక్టర్ వివరించారు. పైనాపిల్, జీడిమామిడి, పసుపు పంటల ప్రగతిని తెలియజేశారు. -
●ప్రజల్లోకి వాస్తవాలు తీసుకెళ్లాలి
గత ప్రభుత్వంలో అమలైన పథకాలు, ప్రస్తుత పాలనలో నెలకొన్న పరిస్థితులపై ప్రజలకు స్పష్టమైన అవగాహన కల్పించాలి. స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ప్రతి కార్యకర్త క్రియాశీలకంగా వ్యవహరించి పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలి. జిల్లాలో పార్టీ పటిష్టతకు పెద్దల మార్గదర్శకత్వంలో అందరం కలిసికట్టుగా అడుగులు వేద్దాం. మున్సిపాలిటీ, మండల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జెండా ఎగురవేసేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగాలి. –మామిడి శ్రీకాంత్, తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ -
బాలసంజీవని టెండర్లలో అవకతవకలు
● సమగ్ర విచారణకు సీపీఐ డిమాండ్ ● జేసీకి వినతిపత్రం అందజేత పార్వతీపురం రూరల్: బాల సంజీవని, బాల సంజీవని ట్రైబల్ పథకాల టెండర్ల ప్రక్రియలో జరిగిన అవకతవకలపై సీఎం చంద్రబాబు నాయుడు తక్షణమే జోక్యం చేసుకుని, సమగ్ర స్వతంత్ర విచారణకు ఆదేశించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సీపీఐ మన్యం జిల్లా కార్యదర్శి కూరంగి మన్మథరావు, కార్యవర్గ సభ్యులు ఆర్వీఎస్ కుమార్.. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆర్.వైశాలిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టెండర్ల నిర్వహణ లో నిబంధనలకు నీళ్లొదిలి, కొద్దిమంది కాంట్రాక్టర్లకే గంపగుత్తుగా ప్రయోజనం చేకూర్చారని ఆరోపించారు. టెండర్ల రేట్ల పెంపుతో సుమారు రూ.29.22 కోట్ల ప్రజాధనం అదనంగా ఆవిరయ్యే ప్రమాదం ఉందన్నారు. గతంలో అనర్హత వేటు పడిన సంస్థలకు టెండర్లలో పచ్చజెండా ఊపడంపై విచారణ జరపాలన్నారు. టెండర్ల కేటాయింపులు, నాణ్యతా పరీక్షలు, భారీ చెల్లింపులపై పూర్తిస్థాయిలో ఆడిట్ నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన అధికారులు, కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో మహిళా స్వయం సహాయక సంఘాలకు, చిన్న, మధ్యతరహా సంస్థలకు టెండర్లలో సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఇదే వ్యవహారంపై సీఎంకు లేఖరాసినట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య తెలిపారు. -
వైభవంగా సహస్ర దీపాలంకరణ
నెల్లిమర్ల రూరల్: సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో సహస్ర దీపాలంకరణ సేవను ఆలయ అర్చకులు శుక్రవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిపించారు. శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో ఉంచి దీపారాధన మంటపంలో ఉన్న ప్రత్యేక ఊయలలో వేంచేపుజేశారు. ఈ సందర్భంగా సహస్ర దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి దీపాల కాంతుల శోభలో స్వామికి విశేష అర్చనలు, ఊంజల్ సేవ జరిపించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.8మంది మేకల దొంగల అరెస్ట్మక్కువ: మండలంలోని ఎర్రసామంతవలస, కాశీపట్నం, తూరుమామిడి గ్రామాలకు చెందిన పలువురి మేకలు ఇటీవల చోరీకి గురికాగా పోలీస్ స్టేషన్లో నమోదైనప ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు నిర్వహించి శుక్రవారం ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన నిందితుల్లో మార్కొండపుట్టి, దుగ్గేరు, పనసభద్ర గ్రామాలకు చెందిన ఆరుగురితో పాటు మరో ఇద్దరూ మైనర్లు ఉన్నారు. వారు దొంగిలించిన 10 మేకలు, రవాణాకు ఉపయోగించిన ఆటో, బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎనిమిది మందిలో ఆరుగురిని జుడిషియల్ రిమాండ్‌కు ఇద్దరు మైనర్లను జువైనల్ కోర్టుకు పంపించినట్లు ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. పామాయిల్ గెలల ట్రాక్టర్ బోల్తాకొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారి భారీగా గోతుల మయం కావడంతో వాహన చోదకులు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో అల్ప పీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు గోతుల్లో నీరు చేరడంతో శుక్రవారం రామభద్రపురం సమీపంలో పామాయిల్ గెలలతో వెళ్తున్న ట్రాక్టర్ గోతిలో బోల్తా పడింది. ఈ క్రమంల అంతర్రాష్ట్ర రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. నేడు ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహాసభవిజయనగరం: ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా మహసభ ఈనెల 11న జిల్లా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు కె.రమేష్ నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం జరగనున్న మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయనున్నామని తెలిపారు. మహాసభకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.వెంకటరావు, జి.ఆంజనేయులు, జిల్లా పౌర సంబంధాల అధికారి పి.గోవిందరాజులు, రాష్ట్ర జిల్లా నాయకులు హాజరు కానున్నారని తెలిపారు. ఉదయం పది గంటలకు ప్రారంభం కానున్న మహాసభలకు జిల్లాలో, నగరంలో ఉన్న జర్నలిస్టు మిత్రులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో యూనియన్ నాయకులు.బి.ప్రసాదరావు, నాగరాజు పాల్గొన్నారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిబొబ్బిలి: క్రైస్తవ ప్రార్ధనల అనంతరం చర్చి నుంచి ఇంటికి వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. బొబ్బిలి పట్టణంలోని ఫ్లైఓవర్ వద్ద జరిగిన త ప్రమాదంపై సీఐ కె.నారాయణ రావు తెలిపిన వివరాల ప్రకారం పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ మండలం మార్కొండ పుట్టి గ్రామానికి చెందిన నారాయణ పురం లక్ష్మయ్య(53)బొబ్బిలిలోని ఐటీఐ కాలనీలో గల చర్చికి వచ్చాడు. ప్రార్థనల అనంతరం తిరిగి గ్రామానికి వెళ్లేందుకు ఫ్లైఓవర్ వైపు వెళ్తుండగా రామభద్రపురం నుంచి పార్వతీపురం వెళ్తున్న గుర్తు తెలియని వాహనం లక్ష్మయ్యను ఢీకొని మీదుగానే వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు సీహెచ్‌సీకి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. లక్ష్మయ్య తండ్రి రామయ్య ఫిర్యాదు మేరకు ట్రాఫిక్ ఎస్సై లోవరాజు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
విశాఖపట్నం: తండ్రి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విశాఖపట్నంలోని మారికవలసలో జరిగిన ఈ సంఘటనపై పీఎంపాలెం ఇన్స్పెక్టర్ జి. బాలకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. విజయనగరం జిల్లా ఎస్.కోటకు చెందిన గోర్లపల్లి చైతన్య (29)కు అనకాపల్లి జిల్లా అడ్డురోడ్డుకు చెందిన ఝాన్సీ (23)తో 2025లో వివాహమైంది. వీరు మారికవలస విశ్వనాథ్ అవెన్యూలోని 202వ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. చైతన్య ఇన్ఫోసిస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తూ వర్క్ ఫ్రం హోమ్ విధులు నిర్వహిస్తున్నాడు. సుమారు తొమ్మిది నెలల క్రితం చైతన్య తండ్రి రవికుమార్ మృతి చెందాడు. అప్పటి నుంచి చైతన్య మానసికంగా కుంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. దీనికి భార్యాభర్తల మధ్య తలెత్తిన చిన్నచిన్న మనస్పర్థలు కూడా తోడయ్యాయని, ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి భార్యాభర్తలిద్దరూ బెడ్రూమ్లోకి వెళ్లారు. శుక్రవారం తెల్ల వారుజామున 3 గంటల సమయంలో ఝాన్సీ నిద్రలేచి చూడగా చైతన్య పక్కన లేకపోవడంతో మరో బెడ్రూమ్లోకి వెళ్లి చూడగా తలుపు గడియపెట్టి ఉంది. ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారి సహకారంతో తలుపు బద్దలుకొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ చైతన్య తువ్వాలుతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉండడాన్ని గుర్తించారు. తన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని, ఆయన మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని పేర్కొంటూ ఝాన్సీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పీఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు ఎస్.కోట వాసి -
పణుకువలసలో వణుకు..!
● ప్రమాదకరంగా వంతెన ● వాహనాల రాకపోకలు నిలిపివేత ● పరిశీలించిన రెవెన్యూ, ఆర్ అండ్ బీ అధికారులుతెర్లాం: రాజాం–రామభద్రపురం ఆర్ అండ్ బీ రోడ్డులో తెర్లాం మండలంలోని పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయింది. వంతెనకు దక్షిణ దిక్కున ఉన్న రక్షణ గోడ, వంతెన కొంత భాగం శుక్రవారం ఉదయం పూర్తిగా కూలిపోయింది. గురువారం రాత్రి నుంచి వర్షం కురుస్తుండడంతో ఆ వర్షానికి వంతెనకు ఓ వైపు శిథిలావస్థకు గురైన రక్షణ గోడ, వంతెనలో సగభాగమంతా పూర్తిగా పడిపోయింది. పణుకువలస జంక్షన్ వద్ద ఉన్న వంతెన పాక్షికంగా కూలిపోయిందని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు తహసీల్దార్ ఆర్.ధనం, డిఫ్యూటీ తహసీల్దార్ జి.సత్యనారాయణ, ఆర్అండ్బీ ఏఈ రాజు, మాజీ ఎంపీపీ ప్రతినిధి నర్సుపల్లి వెంకటేశ్వరరావులు వెంటనే వంతెన వద్దకు వెళ్లి పరిశీలించారు. వర్షానికి పూర్తిగా తడిసిపోవడంతో మిగిలిన వంతెన భాగం కూడా ప్రమాదకరంగా మారిందని, భారీ వాహనాలు వంతెన పైనుంచి రాకపోకలు సాగిస్తే పూర్తిగా పడిపోయే ప్రమాదం ఉందని గుర్తించిన అధికారులు ఆ వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. వంతెన పైనుంచి కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్లేందుకు అనుమతినిచ్చారు. ప్రమాదకరంగా ఉన్న వంతెన పరిస్థితిని కలెక్టర్‌కు తెలియజేస్తానని తహసీల్దార్ ధనం తెలిపారు. పణుకువలస వద్ద ఉన్న వంతెన రక్షణగోడ ఓ పక్క పూర్తిగా పడిపోయిందని, మిగిలిన వంతెన భాగం ప్రమాదకరంగా ఉందన్న విషయాన్ని మాజీ ఎంపీపీ ప్రతినిధి వెంకటేశ్వరరావు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన దృష్టికి తీసుకువెళ్లారు. ఆర్ అండ్ బీ శాఖకు చెందిన ఉన్నతాధికారులకు వంతెన పరిస్థితిని ఏఈ రాజు తెలియజేశారు. వంతెన పైనుంచి భారీ వాహనాలు రాకుండా రెండు వైపులా స్టాపర్లు ఏర్పాటు చేశారు. వంతెన మీదుగా భారీ వాహనాలు రాకుండా చూడాలని పణుకువలస వీఆర్ఏను తహసీల్దార్ ఆదేశించారు. ఇబ్బందిపడుతున్న వాహన చోదకులు, ప్రయాణికులు పణుకువలస వంతెన ఓ పక్క పూర్తిగా కూలిపోవడం, వంతెన పైనుంచి భారీ వాహనాల రాకపోకలు నిలిపివేయడంతో వాహన చోదకులు, ప్రయాణికులు ఇబ్బందిపడుతున్నారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన భారీ వాహనాలు, కార్లు, బస్సులు ఎక్కువగా ఈ వంతెనపై నుంచి వెళ్తుంటాయి. వంతెన ప్రమాదకరంగా ఉండడంతో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేయడంతో రామభద్రపురం, బొబ్బిలి వైపు నుంచి రాజాం, శ్రీకాకుళం వైపు వస్తున్న వాహనాలు, శ్రీకాకుళం, రాజాం వైపు నుంచి సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి వైపు వస్తున్న వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీకాకుళం నుంచి సాలూరు, బొబ్బిలి వెళ్లేందుకు వస్తున్న బస్సులు పణుకువలస జంక్షన్ వద్ద నిలిపివేస్తున్నారు. సాలూరు, రామభద్రపురం, బొబ్బిలి వైపు నుంచి వస్తున్న వాహనాలు తెర్లాం జంక్షన్ వద్ద నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాధ్యమైనంత వేగంగా వంతెనకు మరమ్మతులు చేపట్టాలని, లేదా వంతెన పక్క నుంచి వాహనాలు వెళ్లేందుకు డైవర్షన్ ఇప్పించాలని ప్రయాణికులు, వాహనచోదకులు కోరుతున్నారు. -
గిరిజనులకు అన్యాయం చేస్తారా?
● పార్వతీపురం మన్యం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం.కృష్ణమూర్తి రామభద్రపురం: చంద్రబాబు ఇచ్చేయమంటే దశాబ్దాల కాలంగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూములు స్వాధీనం చేసుకుని పరిశ్రమల పేరిట పెత్తందార్లకు కట్టబెట్టి గిరిజనులకు అన్యాయం చేసేస్తారా? అని పార్వతీపురం మన్యం జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎం కృష్ణమూర్తి ప్రశ్నించారు. ఈ మేరకు మండలకేంద్రంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రామభద్రపురం మండలంలోని కాకర్లవలస వద్ద గిరిజన రైతుల పంటలను రెవెన్యూ, పోలీసు అధికారులు కలిసి నిరా్ద్క్షిణ్యంగా ధ్వంసం చేయడం ఘోరమని మండిపడ్డారు. భూమి మీద సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదని, ఎంతో కాలం కష్టపడి పండించిన పంటలు పోలీసు ఫోర్స్ ఉపయోగించి దౌర్జన్యంగా ధ్వంసం చేయించిన ఆర్డీవో, తహసీల్దార్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పంటలు అధికారులే ధ్వంసం చేయించి అడ్డుకున్న గిరిజన రైతులను అక్రమ అరెస్టులు చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పెత్తందార్లు ఎలా చెబితే అలా ప్రభుత్వం చేస్తే పేదల ఉసురు తగులుందన్నారు. గిరిజనులు భూములు వదిలేదిలేదని, ధ్వంసం చేసిన పంటలకు సంపూర్ణ నష్టపరిహారం అందించి న్యాయం జరిగే వరకు పోరాటాలు సాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్వతీపురం మన్యం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు మర్రి శ్రీనివాసరావు, సీపీఎం నాయకుడు బలస శ్రీనివాసరావు, పలువురు గిరిజన రైతులు పాల్గొన్నారు. -
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓటర్ల జాబితాల విడుదల
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల జాబితాలను శుక్రవారం ప్రచురించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పార్వతీపురం మన్యం జిల్లాలోని 15 మండలాల్లో 15 జెడ్పీటీసీ స్థానాలకు.. 226 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన జాబితాలను ప్రచురించినట్లు ఉమ్మడి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎ.లవరాజు తెలిపారు. ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లోనూ.. 15 జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించిన ఓటర్ల జాబితాలను విజయనగరం జిల్లా ప్రజాపరిషత్ కార్యా లయంతో పాటు.. పార్వతీపురం డివిజనల్ అభి వృద్ధి కార్యాలయంలోనూ ప్రజల పరిశీలనార్థం అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి జిల్లా పరిషత్ ఉమ్మడి విజయనగరంలో కలిసి ఉండటం వల్ల గత జిల్లా ప్రాతిపదికనే తీసుకున్నారు. జిల్లా పరిషత్ పునర్విభజనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి మార్గదర్శకాలూ విడుదల కాలేదు. మన్యం జిల్లా లో సుమారు 6.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల 24వ తేదీతో ప్రస్తుత పాలక వర్గం ముగియనుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికనే వచ్చే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. -
స్థానిక సమరానికి సన్నద్ధం కావాలి
పార్వతీపురం రూరల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమన్వయంతో అడుగులేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం పార్వతీపురంలో మాజీ శాసనసభ్యుడు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిడి శ్రీకాంత్, అలాగే జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వార్డు సభ్యులు హాజరయ్యారు.సభలో నాయకులు మాట్లాడు తూ.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో జరి గిన సంక్షేమ కార్యక్రమాలను, ప్రస్తుత కూటమి ప్ర భుత్వ పాలన తీరును గడపగడపకూ వెళ్లి ప్రజలకు వివరించాలని కేడర్‌కు సూచించారు. వార్డు స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అన్ని స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలో నిలపాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం ప్రతి కార్యకర్తా ఒక సైనికుడిలా పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బలగ శ్రీరాములు నాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మి రమేష్, పాలవలస మురళీకృష్ణ, జెడ్పీటీసీలు అలజంగి రవికుమార్, మామిడి బాబ్జీ, బల గ రేవతమ్మ, ఎంపీపీలు బలగ రమణమ్మ, మజ్జి శోభారాణి, గుడివాడ నాగమణి, వైస్ ఎంపీపీలు సిద్ధా జగన్నాథం, బి.రవికుమార్, వెలిది సాయిరాం, పార్టీ ప్రధాన కార్యదర్శులు పోల సత్యనారాయణ, తప్పిట ప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ బోను గౌరీశ్వరి, మాజీ వైస్ చైర్పర్సన్ కొండపల్లి రుక్మిణి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో వివి ధ హోదాల్లో ఉన్న ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, అసెంబ్లీ నియోజకవర్గ నలుమూలల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్వతీపురం మున్సిపాలిటీతో పాటు మూడు మండలాల్లోని ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాలను కచ్చితంగా కై వసం చేసుకుంటాం. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తను నాయకుడిగా తీర్చిదిద్దే బాధ్య త నాది. నేను పార్టీ మారుతున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నా రాజకీయ ప్రస్థా నం ఉన్నంతకాలం వైఎస్ జగన్ వెంటే నడుస్తాను. గ్రామ, మండల స్థాయిలో ప్రతి ఇంటికీ వెళ్లి రెండు ప్రభుత్వాల పాలనల మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరిస్తాం. –అలజంగి జోగారావు, మాజీ ఎమ్మెల్యే పార్టీకి నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ కార్యకర్తలే పార్టీకి అసలైన బలం. ఉమ్మడి జి ల్లా రాజకీయ పరిణామాలతో సంబంధం లేకుండా పార్వతీపురం నియోజకవర్గం పార్టీకి కంచుకో టగా నిలుస్తుంది. రానున్న మున్సిపల్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతి ఒక్క రూ సమన్వయంతో పనిచేసి వైఎస్సార్సీపీని విజయపథంలో నడపాలి. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా పార్టీని తిరిగి క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి మంచి ఫలితాలు సాధించేందుకు కేడర్ అంతా సన్నద్ధం కావాలి. –శత్రుచర్ల పరీక్షిత్ రాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు సమష్టి కృషితో విజయబావుటా ఎగురవేయాలి అన్ని స్థానాల్లో పోటీకి పార్టీ సిద్ధం పార్టీ శ్రేణులకు రీజినల్ కోఆర్డినేటర్ ముత్యాలనాయుడు దిశానిర్దేశం -
జీతాలడిగితే.. జులుం
● ఎస్ఎస్ఏ సిబ్బంది తీరుపై సీఆర్‌ఎంటీల ఆగ్రహం ● విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన పార్వతీపురం రూరల్: జీతాలు చెల్లించాలని అడిగితే సర్వశిక్ష కార్యాలయ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంపై పార్వతీపురం జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట సీపీఎం, జేఏసీల నేతృత్వంలో సీఆర్ఎంటీలు శుక్రవారం ఆందోళనకు దిగారు. గత నెల 20వ తేదీనే జీతాలకు సంబంధించిన బడ్జెట్ విడుదలైనప్పటికీ, ఎస్ఎస్ఏ సిబ్బంది నిర్వాకం వల్ల జీతాలు అందలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నెలవారీ ఈఎంఐలు, కుటుంబ బాధ్యతల నేపథ్యంలో సకాలంలో బిల్లులు పెట్టాలని కోరిన పాపానికి.. ‘దిక్కున్న చోట చెప్పుకోండ’ని సిబ్బంది దుర్భాషలాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులైన సిబ్బంది తక్షణమే క్షమాపణలు చెప్పాలని, వెంటనే వేతనాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. సీఆర్‌ఎంటీల నిరసనకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీ రమణ సంఘీభావం తెలిపారు. -
సిండికేట్‌కు స్పెషల్ ఆఫర్!
సాక్షి, పార్వతీపురం మన్యం: మద్యం ఏరులై పారించడమే లక్ష్యంగా రాష్ట్రంలోని చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ పాలసీని తీసుకొచ్చిన విషయం విదితమే. గత వైఎస్సార్సీపీ సర్కారులోని ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసి.. ప్రైవేట్ వ్యాపారాలకు కట్టబెట్టి, దొరికినంత దోచుకోండంటూ పచ్చ తివాచీ పరిచింది. 2024–26 కాలపరిమితితో జిల్లాలోని 56 మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించారు. మద్యం షాపుల లీజు గడువు కొద్దిరోజుల్లో ముగియనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న వారికే మరికొన్నాళ్లు లైసెన్సు పునరుద్ధరించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీనికి సంబంధించి నేడో, రేపో ఉత్తర్వులు రానున్నాయి. 2024–26 లైసెన్సు రుసుములే కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ఏడాది కాలానికి లైసెన్సుల పునరుద్ధరణకు 38 శాతం ఫీజుగా ఉంటుందని సమాచారం. అక్టోబర్ 1 నుంచి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు నూతన విధానం అమల్లో ఉండే అవకాశం ఉంది. దోచుకోవడానికే ‘పర్మిట్’ జిల్లాలోని 15 మండలాల్లో ఐదు ఎకై ్సజ్ స్టేషన్లు ఉన్నాయి. వీటి పరిధిలో 56 ప్రైవేట్ మద్యం దుకా ణాలు నడుస్తున్నాయి. ఒక్కో షాపులో రోజుకు బీరు, మద్యం సీసాలు కలిపి 700కుపైగా అమ్ముడవుతున్నాయి. ఇక.. బెల్టు దుకాణాల్లో అమ్మకాలు 24 గంటలూ సాగుతున్నాయి. నియంత్రణ లేక, ప్రతి గ్రామంలోనూ మద్యం ఏరులై పారుతోంది. చంద్రబాబు ప్రభుత్వం సిండికేట్ వ్యాపారానికి పరోక్షంగా సహకారం అందిస్తోందన్న విమర్శలున్నాయి. నేరుగానే మద్యం దుకాణాల్లో సీసాపై రూ. 10 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఎకై ్సజ్ అధికారులకు తెలిసినా.. చర్యలు ‘మామూలే’! ఈ నేపథ్యంలో మందబాబుల జేబు లకు చిల్లులు పడుతున్నాయి. సిండికేట్‌కు మేలు చేస్తూ విక్రయాలపై వ్యాపారులకు 10 శాతం ఉన్న మార్జిన్‌ను 15 శాతానికి ప్రభుత్వం పెంచింది. మరోవైపు మద్యం అమ్మకాలు పెంచుకునేందుకు ప్రతినెలా ఎకై ్సజ్ అధికారులకు లక్ష్యం విధిస్తోంది. దీంతో సిండికేట్ల ఇష్టారాజ్యంగా మారింది. ఎకై ్సజ్ పాలసీకి విరుద్ధంగా ఎంఆర్పీ ధరకు మించి అమ్మకాలు చేస్తున్నారు. ఒక్కో షాపు పరిధిలో బెల్టు దుకాణాలకు లెక్కే ఉండడం లేదు. చాలాచోట్ల వేళాపాళా లేకుండా అమ్మకాలు సాగిపోతున్నాయి. తక్కువ ధరకే నాణ్యమైన మద్యం అంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబా బు.. చేతల్లోకి వచ్చేసరికి మందుబాబులకు చుక్క లు చూపిస్తున్నారు. రూ.99 చీప్ లిక్కర్ మినహా మిగిలిన బ్రాండ్లుపై రెండేళ్లలో బాటిల్ ఎంఆర్పీ ధరకు రూ.20లు అదనంగా పెంచారు. మద్యం సేవించే వారిలో అధిక శాతం మంది పేద, మధ్య తరగతి వర్గాల వారే. రూ.99 చీప్ లిక్కర్ బ్రాండ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా రూ.120ల ఓఏబీ. రూ.130ల మంజీర, రూ.150 క్లాసిక్ బ్లూ, ఏసీ బ్లాక్, పార్టీ స్పెషల్, సిల్వర్ బ్రాండ్లు, అలాగే మధ్యతరగతి వర్గాల వారు రూ.190ల ఎంసీ, ఐబీ, ఐకానిక్ వైట్, ఆఫ్టర్ డార్క్, రూ.190ల ఎంహెచ్ బ్రాందీ, రూ.230ల 8 పీఎం తదితర క్వార్టర్ బాటిల్స్ కొనుగోళ్లు చేస్తుంటారు. ప్రతి సీసా పైనా రెండేళ్లలో ప్రభుత్వం రూ.20 పెంచింది. మద్యం సిండికేట్లు రూ.10లు అదనంగా వసూలు చేస్తుండగా, బెల్టుషాపుల్లో మరింత దోపిడీ సాగిపోతోంది. గతంతో పోలిస్తే ప్రభుత్వం, సిండికేట్ బాదుడుతో బాటిల్ ధర రూ.30లు అదనంగా పెరిగింది. విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో ఇప్పటికే బాగానే ఆర్జించిన సిండికేట్ వర్గాలు గడువు ముగుస్తున్న తరుణంలో నష్టాల పేరిట మరింత దోపిడీకి తెర తీస్తున్నారన్న ఆరోపణలు విని పిస్తున్నాయి. భారీగా లైసెన్స్ ఫీజులు చెల్లించామని, అమ్మకాలపై 20 శాతం మార్జిన్ ఇస్తామ ని చెప్పి ప్రభుత్వం కోత పెట్టడంతో తీవ్రంగా నష్టపోయామంటున్నారు. లీజు గడువు పెంచాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ సిండికేట్ ప్రభుత్వ పెద్దలతో పైరవీలు చేసినట్టు తెలు స్తోంది. ఈ క్రమంలోనే పాతవారికే తిరిగి షాపు లు కట్ట బెట్టే పనిలో ప్రభుత్వం ఉంది. షాపులన్నింటినీ తిరిగి రెన్యువల్ చేయనున్నట్టు టీడీపీ శిక్షణ తరగతుల్లో చంద్రబాబు వెల్లడించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం షాపు లు ప్రభుత్వ అధీనంలో ఉండటంతో నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు చేసేవారు. షాపు ల వద్ద కొనుగోలు చేసి తీసుకువెళ్లిపోవడమే తప్ప పర్మిట్ రూమ్‌లు, బెల్టుషాపులు ఉండేవికావు. మద్యం అమ్మకాలపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు చేరి తిరిగి సంక్షేమం రూపంలో పేదలకు అందేది. కూటమి పాలనలో మద్యం ఆదాయం చాలా వరకు కూటమి నేతలు, సిండికేటు జేబుల్లోకి వెళ్లిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. -
ఇద్దరు బైక్ దొంగల అరెస్టు
పాలకొండ: ఒక్క వాహనం పోయిందని వచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయగా ఐదు ద్విచక్రవాహనాల దొంగతనం గుట్టు రట్టయింది. నిత్యం వాహనాలు పోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో పోలీసులు చిన్న ఆధారంతో దర్యాప్తు చేసి వాహనాల దొంగలను అదుపులోకి తీసుకున్నారు. వాహనాలు దొంగలించి వాటిని అమ్మి ఆ సొమ్ముతో జల్సా చేస్తున్న వీరఘట్టం పట్టణానికి చెందిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించి డీఎస్పీ ఎం.రాంబాబు గురువారం స్థానిక డీఎస్పీ కార్యాలయం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు వీరఘట్టం మండలం కంబరవలస వెటర్నరీ అసిసెంట్ పశువుల ఆస్పత్రి వద్ద తన ద్విచక్రవాహనం పార్కింగ్ చేసి విధులు నిర్వహిస్తున్న సమయంలో తన వాహనం చోరీ జరిగిందని ఈ నెల 1న వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన ఎస్సై దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం వీరఘట్టం–పార్వతీపురం రహదారిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి ద్విచక్రవాహనం వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించారు. అది గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరఘట్టం బీసీ కాలనీకి చెందిన పొందూరు మురళీకృష్ణ, చేతల చంద్రమౌళిలుగా గుర్తించి వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి విచారణ చేశారు. ఈ విచారణలో పట్టుబడిన వాహనం చోరీ చేసినదే అని గుర్తించారు. నిందితులను తమ దైన శైలిలో విచారణ చేయడంతో ఈ వాహనంతో పాటు మరో నాలుగు పల్సర్ ద్విచక్రవాహనాలు దొంగతనం చేసినట్లు నిందితులు అంగీకరించారు. వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించి కేసును త్వరగా ఛేదించిన వీరఘట్టం ఎస్సై ఎస్ షణ్ముఖరావు, సిబ్బందిని డీఎస్పీ అబినందించారు. సమావేశంలో సీఐ ఎ ప్రసాద్, పోలీసు సిబ్బంది ఉన్నారు. ఐదు బైక్‌లు స్వాధీనం -
ఆయిల్‌పామ్ సాగుపై రైతుల ఆసక్తి
గరుగుబిల్లి: వర్షాభావ పరిస్థితులు, రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వెరసి వరి సాగు రైతులను కష్టాలు చుట్టుముడుతున్నాయి. పెట్టుబడి కూ డా రావడం లేదు. అప్పుల్లో కూరు కుపోతున్నారు. దీని నుంచి బయట పడేందుకు అధిక మంది రైతులు ఆయిల్‌పామ్ సాగుపై ఆసక్తి చూపుతున్నారు. మొక్కలను ఉద్యానవనశాఖ, ఆయిల్ పరిశ్రమలు రాయి తీపై అందజేస్తుండడం రైతులకు ఊరటనిస్తోంది. 4,500 ఎకరాల్లో సాగు పార్వతీపురం డివిజన్ పరిధిలో గరుగుబిల్లి, సీతాన గరం, పార్వతీపురం, కురుపాం, కొమరాడ, గుమ్మలక్మీపురం మండలాల్లో 4,500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగులో ఉంది. వరి పంటకు ప్రత్యామ్నాయంగా మరో 1,200 ఎకరాల్లో రైతులు సాగుచేస్తున్నారు. ప్రకృతి వైపరీత్యాలు, ఎల్‌నినో వంటి విపత్తుల నుంచి బయటపడవచ్చని భావిస్తున్నారు. మొక్క నాటిన నాలుగో ఏడాది నుంచి 25 ఏళ్ల వర కు దిగుబడి వస్తుంది. మొక్కతోట నుంచి ఎకరాకు నాలుగు టన్నుల దిగుబడి రాగా, ఏడో ఏడాది నుంచి ఎకరాకు పది టన్నుల దిగుబడి వస్తుందని అధి కారులు చెబుతున్నారు. వాతావరణం అనుకూలిస్తే ఈ దిగుబడులు మరింత పేరిగే అవకాశం ఉంటుంది. ఖరీఫ్‌లో జూన్ నెల నుంచి గెలల దిగుబడి ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ఆయిల్ రికవరీని బట్టి గెలల ధరను నిర్ణ యిస్తుంది. ప్రతీనెలా 10వ తేదీ దాటిన తర్వాత ధర నిర్ణయం జరుగుతుంది. రైతులకు ఉచితంగా మెక్కలు ఆయిల్‌పామ్ సాగుచేసే రైతులకు హెక్టారుకు రూ.29వేల విలువైన 240 మొక్క లు ఉచితంగా అందజేస్తున్నారు. ఎకరాకు 50 నుంచి 57 మొక్కలు వేయాల్సి ఉంది. హెక్టారుకు ఏడాదికి రూ.10,500 చొప్పున వరుసగా నాలుగేళ్లు రైతులకు పెట్టుబడి సాయం అందుతుంది. -
ప్రతిచోటా పోటీ చేద్దాం.. గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం
సాలూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిచోటా పోటీచేద్దాం.. అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా కలిసికట్టుగా పనిచేద్దాం.. పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి జగనన్నకు కానుకగా ఇద్దామని పార్టీ శ్రేణులకు మా జీ డిప్యూటీ సీఎం, పార్టీ పీఏసీ సభ్యుడు పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. సాలూరు పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలందరికీ చంద్రబాబు ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు. టీడీపీ నాయకులు చెప్పే మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. టీడీపీ ప్రజావ్యతిరేక విధాలను, గత వైఎస్సార్సీపీ పాలనలో ని సంక్షేమ పాలనను ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ఆశావహులందరూ ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. నూతన పింఛన్ మంజూరు ఓ నాటకం ప్రజలకు రెండున్నరేళ్లు సుదీర్ఘ నిరీక్షణ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల వేళ చంద్రబాబు ప్రభు త్వం చేపట్టిన పింఛన్ల మంజూరు అంశం ఓ బూ టకమని రాజన్నదొర విమర్శించారు. దరఖాస్తు చేసేందుకు వారం రోజులే గడువు ఇవ్వడం దారు ణమన్నారు. అర్హుల పింఛన్ దరఖాస్తులు ఆన్లైన్ చేయకుంటే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. అబద్ధాలు చెప్పడంలో ఆరితేరారు.. రాజకీయాల్లో కళ్లార్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు ప్రథమస్థానంలో నిలవగా, మంత్రి సంధ్యారాణి రెండో స్థానంలో ఉన్నారని రాజన్నదొర విమర్శించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరుచేసి చేపట్టిన పనులను టీడీపీ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియామకంపై మంత్రి చేసిన తొలి సంతకం నేటికీ అమలుకాలేదని, మహిళల ఆత్మగౌరవం కాపాడతామని రెండున్నరేళ్లయినా పట్టణంలో సామాజిక మరుగు దొడ్ల నిర్మాణాలు చేపట్టలేదని, పట్టణంలో మెయిన్‌రోడ్డు నుంచి వేదసమాజం వరకు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి ఏడాదిదాటుతున్నా నేటికి పనులు జరగలేదని, ఇది మంత్రి పనితీరుకు నిదర్శమని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీలో ఫుల్‌జోష్.. సమావేశానికి సాలూరు నియోజకవర్గం నలుమూలల నుంచి వైఎస్సార్సీపీ శ్రేణులు తరలివచ్చారు. జై జగన్, జై రాజన్నదొర నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. పార్టీలోని వివిధ కమిటీల సభ్యులకు మండలాల వారీగా ఐడీ కార్డులను రాజన్నదొర అందజేశారు. టీడీపీ వెన్నుపోటు పాలనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల 12 నుంచి మండల స్థాయిలో, 25 నుంచి గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టా లని రాజన్నదొర సూచించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకుడు మరిశర్ల బాపూ జీనాయుడు, మక్కువ జెడ్పీటీసీ సభ్యుడు మావుడి శ్రీనివాసులనాయుడు, పార్టీ మండలాధ్యక్షులు మావుడి రంగునాయుడు, వంగపండు అప్పలనాయుడు, సువ్వాడ భరత్‌శ్రీనివాస్, గొట్టాపు ముత్యాలునాయుడు, రావిపల్లి రామారావు, పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పద్మావతి, ఎంపీపీ బడ్నాన ప్రమీల, రెడ్డి సురేష్, దండి శ్రీనివాసరావు, వీరంనాయుడు, రెడ్డి సన్యాసినాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
కుష్ఠు వ్యాధిని త్వరగా గుర్తించాలి
● డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్. జీవనరాణి విజయనగరం ఫోర్ట్: కుష్ఠు వ్యాధిని త్వరగా గుర్తించాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి అన్నారు. కుష్ఠు వ్యాధిపై ఈనెల 11 నుంచి 24 వతేదీ వరకు ఇంటింటా కుష్ఠు రోగుల గుర్తింపు సర్వే జరగనుంది. ఈ కార్యక్రమంపై గ్రామాల్లో ప్రచారం చేసేందుకు ప్రచార వాహనాన్ని గురువారం జెండా ఊపి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే అంతమంచిదన్నారు. నొప్పి, స్పర్శ లేని మచ్చలు ఉంటే కుష్ఠు వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని సూచించారు. ఇటువంటి మచ్చల పట్ల నిర్లక్ష్యం చేయకూడదన్నారు. వ్యాధి పట్ల నిర్లక్ష్యం చేస్తే అంగవైకల్యం బారిన పడే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, డాక్టర్ అర్చన దేవి తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్ బియ్యం పట్టివేతమక్కువ: మండలంలోని కొండబుచ్చమ్మపేట గ్రామసమీపంలో శ్రీకాకుళం విజిలెన్స్ అధికారులు గురువారం పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. దీనిపై విజిలెన్స్ అధికారులు అందించిన వివరాల ప్రకారం మక్కువ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ ఆటోపై పీడీఎస్ బియ్యం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు కాపుకాసి పట్టుకున్నారు. మొత్తం 842 కేజీల బియ్యాన్ని తన సొంత మహేంద్ర ఎలక్ట్రికల్ ఆటోలో తరలిస్తుండగా పట్టుబడ్డాయి. పట్టుకున్న బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు, వాహనాన్ని పోలీసులకు అప్పగించినట్లు విజిలెన్స్ అధికారులు తెలిపారు. విజయనగరం: కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ జ్ఞానపీఠ్ విరాజితుడని గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రధాన కార్యదర్శి కాపుగంటి ప్రకాష్ అన్నారు. విశ్వనాథుని జయంతి పురస్కరించుకుని తెలుగు భాషా పరిరక్షణ సమితి అధ్యక్షుడు, శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్ సముద్రాల గురుప్రసాద్ ఆధ్వర్యంలో గురజాడ స్వగృహంలో గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వేయిపడగల నవలా సృష్టికర్తకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సముద్రాల గురుప్రసాద్ మాట్లాడుతూ.. విశ్వనాథుడి కలం నుంచి జాలువారిన ప్రతి అక్షరం తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకని కొనియాడారు. కార్యక్రమంలో గురజాడ వెంకటేశ్వరప్రసాద్, సాహితీవేత్తలు చీకటి దివాకర్, కాగుపాటి నారాయణమూర్తి, ఎం.సుభద్రాదేవి, పసుమర్తి సన్యాసిరావు , గాంధీ తదితరులు పాల్గొన్నారు. బ్రోచర్ ఆవిష్కరణ విజయనగరం రూరల్: విద్యార్థుల్లో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యాలను పెంపొందించమే లక్ష్యంగా నిర్వహించనున్న స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (ఎస్ఐహెచ్) – 2026లో భాగంగా అధికారిక బ్రోచర్‌ను జేఎన్టీయూ ఉప కులపతి వీవీ సుబ్బారావు గురువారం ఆవిష్కరించారు. జేఎన్టీయూ జీవీ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..విశ్వవిద్యాలయంలో ఈ నెల 16న నిర్వహించనున్న అంతర్గత హ్యాకథాన్‌లో అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సాంకేతిక ప్రతిభను ప్రదర్శించాలని కోరారు. ఈ హ్యాకథాన్‌కు సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా డాక్టర్ జి.జయసుమ వ్యవహరించనుండగా, విద్యార్థి సమన్వయకర్తలుగా ఎం.లిఖిత్‌కుమార్, కె.ప్రవళ్లిక వ్యవహరించనున్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కె.చంద్రభూషణరావు, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీఎస్ వకుల, వివిధ విభాగాల అధిపతులు, తదితరులు పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలి
చికెన్పార్వతీపురం రూరల్ : అపార క్రీడా నైపుణ్యాలకు మన్యం జిల్లా నెలవని, అయితే సరైన ఆదరణ కరవై ఆణిముత్యాల్లాంటి గిరిజన క్రీడాకారుల ప్రతిభ అడవులకే పరిమితమవుతోందని కాంగ్రెస్ స్పోర్ట్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జీవీవీఎస్ కమలాకరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు డీసీసీ అధ్యక్షుడు వంగల దాలినాయుడు అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్చరీ, అథ్లెటిక్స్, వాలీబాల్ తదితర క్రీడల్లో ప్రతిభావంతులైన యువతను గుర్తించి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో కనీసం రన్నింగ్ ట్రాక్, మినీ స్టేడియం లేకపోవడం శోచనీయమన్న ఆయన.. మన్యంలో తక్షణం క్రీడా పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హయాంలో క్రీడలకు పెద్దపీట వేయగా, ప్రస్తుత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో విద్యావ్యవస్థకే మచ్చతెచ్చేలా నీట్ పేపర్ లీక్ జరిగిందని విమర్శించారు. ఏఐసీసీ ఎలక్టెడ్ మెంబర్ వైరిచర్ల శృతిదేవి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే ప్రజాస్వామ్యమని, క్రీడల్లో మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం దక్కాలన్నారు. గిరిజన సంస్కృతి, ఆటపాటలకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా జిల్లాలో పారాలింపిక్స్ తరహా క్రీడలు నిర్వహించాలన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం నేతలు స్థానిక వాకర్స్ ప్రతినిధులు, విద్యార్థులతో క్రీడా సదుపాయాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో నాయకులు గేదెల రామకృష్ణ, బాత దిలీప్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ డిమాండ్ -
కొత్త పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించాలి
పార్వతీపురం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం నూతన పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు చేసుకునేందుకు విధించిన గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించాలని లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు పి.సంగం డిమాండ్ చేశారు. కొత్త పింఛన్ల ప్రక్రియ కోసం ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ నెల 16తో ముగుస్తున్న దరిమిలా, పత్రాల సేకరణకు ఈ సమయం ఏమాత్రం సరిపోదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు పార్వతీపురం మండలంలోని గంగాపురం గ్రామ సచివాలయానికి గురువారం వెళ్లి, అక్కడి అడ్మిన్‌తో దరఖాస్తుల స్వీకరణలో సామాన్యులు పడుతున్న సాధకబాధకాలను ఆయన చర్చించారు. అనంతరం మాట్లాడుతూ.. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు దరఖాస్తులకు అవసరమైన ధ్రువపత్రాలు సమకూర్చుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. కాగితాల కష్టాలతో అర్హులైన పేదలు ఆందోళన చెందుతున్నారని, సకాలంలో పత్రాలు సమర్పించడానికి వారికి మరింత వెసులుబాటు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నిరుపేదల ఆశలపై నీళ్లు చల్లక, అర్హులందరికీ న్యాయం జరిగేలా ఆలోచించి ఈ నెల 30 వరకు దరఖాస్తులకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే ప్రభుత్వ లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు నాయకులు వెలమల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కరిగిపోతున్న కాలం..!
వీరఘట్టం: ఈమె పేరు సీరాపు లిఖిత..వీరఘట్టానికి చెందిన ఈమెకు ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమెకు ఐదేళ్ల బాబు ఉన్నాడు. నాలుగు నెలల క్రితం భర్త అనార్యోగ్యంతో మృతి చెందాడు. వితంతు పింఛన్ కోసం ఇటీవల వీరఘట్టం సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసింది.అయితే ఆ దరఖాస్తును స్వీకరించడం లేదు. ఎందుకని ఆరా తీస్తే హౌస్ హోల్డింగ్‌లో ఆమె పుట్టింటిలో ఈమె పేరును జత చేశారు. ఈ హౌస్ హోల్డ్‌లో ఉన్న వాళ్ల నాన్నమ్మకు వృద్ధాప్యపు పింఛన్ వస్తోంది. వీరు వేర్వేరుగా నివసిస్తున్నప్పటికీ, వేర్వేరుగా రేషన్‌కార్డులు ఉన్నప్పటికీ వారంతా ఒకే హౌస్ హోల్డ్‌లో ఉండడంతో ఆమెకు పింఛన్ పెట్టేందుకు దరఖాస్తును కంప్యూటర్ స్వీకరించడం లేదని అధికారులు చెబుతున్నారు. వింతంతు పింఛన్‌కు ఈమెకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తు కూడా పెట్టలేని పరిస్థితి. ఇలా ఈమె ఒక్కరు మాత్రమే కాదు. ఇటువంటి వారు చాలా మంది హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌ల వల్ల పింఛన్ దరఖాస్తులు పెట్టలేకపోతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటుతున్నా ఇంతవరకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదు. మరో నెల రోజుల తర్వాత స్థానిక ఎన్నికలు జరగనుండడంతో ఒక్కసారిగా వృద్ధులు, వింతతువులు, దివ్యాంగులపై ప్రేమ కురిపిస్తూ ఈనెల 7 నుంచి 16 వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రకటన చేశారు. కేవలం తొమ్మిది రోజుల్లో లక్షకు పైగా ఉన్న అర్హులు పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడం సాధ్యపడడం లేదు.ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా సచివాలయాల వద్ద పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆపసోపాలు పడుతున్నారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ కష్టాలు.. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఇంటింటికీ పర్యటించిన అధికారులు ప్రతి ఇంటిలో ఎంత మంది ఉన్నారో తెలుసుకుని వారందరి ఆధార్‌కార్డు నంబర్లను ఓకే హౌస్ హోల్డింగ్‌లో మ్యాపింగ్ చేశారు. తర్వాత కొంత మందికి పెళ్లై అత్తవారింటికీ వెళ్లిపోయినా ఇంకా పాత హౌస్ హోల్డింగ్‌లోనే ఉన్నట్లు చూపిస్తోంది. అటువంటి దరఖాస్తులను అధికారులు స్వీకరించలేకపోతున్నారు. దీంతో పింఛన్లు పొందేందుకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ దరఖాస్తు చేసుకోలేక అర్హులైన వారంతా కార్యాలయాల చుట్టూ కాళ్ల చెప్పులు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. సర్వర్ ప్రోబ్లం.. వీరఘట్టం మేజర్ పంచాయతీలో నాలుగు సచివాలయాలు ఉన్నాయి. ఉదయం 10 గంటల నుంచి పింఛన్‌దారుల దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఒక్కొక్క దరఖాస్తు పరిశీలించి వారి ధ్రువీకరణ పత్రాలను స్కానింగ్ చేసి అప్లోడ్ చేసేందుకు ఒక్కో దరఖాస్తుకు అరగంట సమయం పడుతోంది. దీంతో రోజుకు ఒక సచివాయలంలో 12 నుంచి 16 కంటే ఎక్కువ రఖాస్తులు అప్లోడ్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో గురువారం నాటికి 350 సచివాలయాల్లో సుమారు 16 వేల దరఖాస్తులు అప్లోడ్ అప్ అయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. దరఖాస్తు గడువు పెంచాలి.. పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 7 నుంచి 16 వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఇప్పటికి నాలుగు రోజులు గడిచిపోయాయి.ఇంకా దరఖాస్తు కు ఆరు రోజులు మాత్రమే సమయం ఉంది.ఇందులో ఈనెల 12న రెండవ శనివారం,13న ఆదివారం,14న వినాయక చవితి వరుసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో దరఖాస్తు చేసుకునేందు కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంటుంది. ఈ సమయం సరిపోనందున పింఛన్లకు దరఖాస్తు చేసుకునే గడువు పెంచాలని అర్హులైనవారు కోరుతున్నారు. మరో ఆరురోజులే గడువు అందులో మూడు రోజులు సెలవులు అర్హులకు పెన్షన్ టెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు ఆపసోపాలు వెంటాడుతున్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కష్టాలు జిల్లాలో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న సుమారు 1 లక్షమంది మరో వైపు మొరాయిస్తున్న సర్వర్లు సమయం పెంచాలని వేడుకుంటున్న పింఛన్ దరఖాస్తు దారులు -
దళిత సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు
● అధికారుల తీరుపై ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం అసహనం ● శ్మశానవాటికలకు తక్షణమే దారులు కల్పించాలి: ఎంఆర్ఓలకు ఆదేశం పార్వతీపురం రూరల్: ప్రోటోకాల్ పాటించడంలో అధికారుల నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు రావాడ సీతారాం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం పార్వతీపురం ఎంపీడీవో కార్యాలయంలో దళితుల సమస్యలపై ఆయన ప్రత్యేక గ్రీవెన్స్, సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం వస్తున్న తమకు ఆర్డీఓ కార్యాలయం నుంచే ప్రోటోకాల్ అందాల్సి ఉండగా, ఆ బాధ్యతను సాంఘిక సంక్షేమ శాఖకు బదిలీ చేయడం దారుణమన్నారు. ‘ప్రోటోకాల్ పాటించకపోవడానికి మేమేమైనా వార్డు మెంబర్లమా? ఈ నిర్లక్ష్యపు తీరు పునరావృతమైతే అధికారులను కమిషన్ ముందు నిలబెడతాం. మీ కెరీర్‌కు మచ్చ తెచ్చుకోవద్దు‘ అని ఘాటుగా హెచ్చరించారు. అనంతరం మన్యం జిల్లాలోని సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో దళితుల శ్మశానవాటికల ఆక్రమణలపై ఆయన స్పందించారు. ప్రాణం పోయాక కూడా దళితులకు ప్రశాంతత కరువయ్యేలా ఆక్రమణలు జరగడం శోచనీయమన్నారు. శ్మశానాలకు దారులు లేకపోతే, ప్రైవేటు భూములైనా సేకరించి (ల్యాండ్ అక్విజిషన్) మార్గం సుగమం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆక్రమణలకు గురికాకుండా తక్షణమే రక్షణ గోడలు, కందకాలు నిర్మించాలన్నారు. దళిత భూసమస్యల పరిష్కారంలో అధికారులంతా నిబద్ధతతో పనిచేసి న్యాయం చేయాలని సూచించారు. అంతకుముందు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ఆదేశాల మేరకు జోగంపేట, గురుగుబిల్లి ఎస్సీ వసతిగృహాలను తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకోవాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. -
గజరాజుల గమనం..కుంకీల కదనం
● సరిహద్దు గ్రామాల్లో ఏనుగుల సంచారం ● గ్రామస్తుల తీవ్ర ఉత్కంఠపార్వతీపురం రూరల్: గజరాజుల గమనం, కుంకీల కదనం మధ్య పార్వతీపురం, కొమరాడ మండలాల సరిహద్దుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పంటలు పాడుచేస్తూ, గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్న అడవి ఏనుగుల గుంపునకు అడ్డుకట్ట వేసేందుకు కుంకీ ఏనుగులు అహర్నిశలు పహారా కాస్తున్నాయి. ఇటీవల ఆంధ్రా–ఒడిశా సరిహద్దులకు వెళ్లిన అడవి ఏనుగులు, అక్కడి ప్రజల తరిమివేతతో వెనుదిరిగి వచ్చి ప్రస్తుతం గంగమాంబపురం, చందలింగి, వరహాల గడ్డ రిజర్వాయర్ పరిసరాల్లో సంచరిస్తున్నాయి. ఈ మదపుటేనుగులు పెద్దమరికి పంచాయతీ గ్రామాల్లోకి ప్రవేశించకుండా కుంకీ ఏనుగులైన ’అభిమన్యు, జయంత్’లు కంచెలా నిలబడి సమర్థవంతంగా కట్టడి చేస్తున్నాయి. బుధవారం రాత్రి ఈ రెండు గుంపులు ముఖాముఖి ఎదురుపడగా, గురువారం నాటికి కేవలం కొద్ది కిలోమీటర్ల దూరంలోనే మకాం వేశాయి. శిక్షకుడు సాయి, మావటీల పర్యవేక్షణలో కుంకీ ఏనుగులకు తగిన ఆహారం, నీరు అందిస్తూ అటవీశాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. పగటి పూట గిరిజన గ్రామాల్లో, మెట్ట ప్రాంతాల్లో కుంకీలు సంచరిస్తుండడంతో తమ ప్రాణ, ఆస్తులకు రక్షణ లభించిందని రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే, రాత్రివేళ ఈ రెండు గుంపులు మరింత చేరువవుతున్న తరుణంలో అటవీశాఖ అధికారులు ఎలాంటి ఆపరేషన్ నిర్వహించనున్నారు? గజరాజుల మళ్లింపు సాధ్యమవుతుందా? అన్న ప్రశ్నలతో స్థానికుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కంటిమీద కునుకులేకుండా జరిగే పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
ముమ్మరంగా కంటి పరీక్షలు
● 607 పాఠశాలల్లో 51,235 మందికి పూర్తయిన స్క్రీనింగ్ ● 2,651 మందికి ఉచితంగా కళ్లద్దాల పంపిణీకి సన్నాహాలుపార్వతీపురం రూరల్: బడిపిల్లల భవితకు వెలుగులు పంచేలా పాఠశాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా ఉచిత నేత్ర వైద్య పరీక్షల పర్వం ముమ్మరంగా సాగుతోంది. జులై 15న విజయవాడలో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శ్రీకారం చుట్టిన ఈ బృహత్తర ప్రాజెక్టు రాష్ట్రవ్యాప్తంగా చురుగ్గా సాగుతోంది. జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ ఆదేశాలతో మన్యం జిల్లాలో ఈ కార్యక్రమం పకడ్బందీగా అమలవుతోంది. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్ పి.విజయలక్ష్మి, డీఈఓ పి.బ్రహ్మజీరావుల సమన్వయంతో, ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ జగన్ మోహన్ ఆధ్వర్యంలో అధికారులు కంటి వెలుగుల పండగను పరుగులు పెట్టిస్తున్నారు. జిల్లాలోని 1,563 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలే లక్ష్యంగా నేత్ర వైద్య అధికారి జీరు నగేష్ రెడ్డి పర్యవేక్షణలో ఆఫ్తాల్మిక్ సిబ్బంది పరీక్షలు వేగవంతం చేశారు. ఇప్పటివరకు 607 బడుల్లో 51,235 మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 2,651 మందికి దృష్టి లోపాలున్నట్లు గుర్తించగా, వారందరికీ త్వరలో ఉచితంగా కళ్లద్దాలు పంపిణీ చేయనున్నారు. తీవ్రమైన సమస్యలు ఉండి, శస్త్రచికిత్సలు అవసరమైన ఐదుగురు చిన్నారులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నారు. విద్యార్థులకు ప్రాథమిక కంటి పరీక్షలు నిర్వహించేలా 607 మంది ఉపాధ్యాయులకు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఫిబ్రవరి నెలాఖరు నాటికి జిల్లాలోని విద్యార్థులందరికీ నేత్ర పరీక్షలు పూర్తి చేసి, కంటివెలుగులు పంచుతామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు స్పష్టం చేశారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది వద్ద కొత్తగా నిర్మించిన వంతెన సమీపంలో అదే గ్రామానికి చెందిన ఉత్తరావల్లి సంతోష్(37) అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందాడు. ఈ ఘటనపై సీఐ నారాయణరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రివరకు బ్రిడ్జికి ఆవల వైపు ఉన్న పొలాల వద్ద స్నేహితులతో మద్యం తాగిన అనంతరం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో బ్రిడ్జి పైన ఉన్న రహదారిపైకి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో సంతోష్ మృతి చెంది ఉంటాడని తెలిపారు. శరీరంపై ఎక్కడా గాయాలు కాలేదని, కేవలం తల, నుదురు భాగంలో మాత్రమే తీవ్రమైన గాయముందని, వాహనం ఢీకొట్టగానే రోడ్డుపైనుంచి కిందికి పడిపోయి మృతిచెంది ఉండవచ్చని తెలిపారు. డీఎస్పీ ఆర్ గోవిందరావు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పరిసర ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్, ఫోరెన్సిక్ టీంతో విచారణ చేపట్టారు. ఎటువంటి క్లూస్ లభించ లేదని తేల్చారు. అయితే సంతోష్ మృతి పట్ల తండ్రి తిరుపతిరావు తన కుమారుడి మృతి అనుమానాస్పదంగా ఉందని దర్యాప్తు చేయాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సందర్భంగా విలేకరులుతో మాట్లాడుతూ అప్పలరాజు పేట రహదారిలో వాటర్ ప్లాంట్ వద్ద బుధవారం రాత్రి 8 మంది స్నేహితులతో కలిసి సంతోష్ మద్యం తాగాడని రాత్రి 11 గంటల వరకు సంతోష్‌కు ఫోన్ పనిచేసిందని, అనంతరం ఫోన్ పనిచేయలేదని, అలాగే మృతదేహం సమీపంలోను, సంఘటనా స్థలంలో సంతోష్ ఫోన్ కూడా లభ్యం కాలేదని దీంతో ఎవరైనా గిట్టనివారు, లేదా మద్యం మత్తులో హత్య చేశారా అన్న అనుమానాలను వ్యక్తం చేస్తూ పోలీసులకు ఇచ్చన ఫిర్యాదులో పేర్కొన్నాడు. మృతుడికి తల్లి సింహాచలం, తమ్ముడు సాయి ఉన్నారు. ఫిర్యాదు మేరకు సీఐ నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శుక్రవారం శ్రీ 11 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
● పింఛను దరఖాస్తులకు అర్హతలివే.. ● సచివాలయాల్లో దగ్గరుండి పత్రాలు పరిశీలిస్తున్న ‘తమ్ముళ్లు’ ● డిజిటల్ అసిస్టెంట్ సీట్లలో కూర్చొని దరఖాస్తుల నమోదు సాక్షి, పార్వతీపురం మన్యం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోంది. ఈ కాలంలో ఇప్పటి వరకు ఒక్క కొత్త పెన్షన్ అయినా ఇచ్చిన దాఖలాలు లేవు. తమ అర్హత పత్రాలను పట్టుకుంటూ, కాళ్లీడ్చుకుంటూ వేలాది మంది అర్హులు అధికారుల వద్దకు తిరగని రోజు లేదు. ఇప్పటి వరకు గుర్తు రాని పేదల పింఛన్లు.. అకస్మాత్తుగా, అందునా స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి మొదలయ్యే సమయానికి గుర్తొచ్చాయి. పోనీ, ఇన్నాళ్లకయినా దయ తలిచారనుకుని.. వితంతువులు, వృద్ధులు, దివ్యాంగులు గ్రామ, వార్డు స్వర్ణ సచివాలయాలకు వెళ్తున్నారు. అక్కడ వారికి సచివాలయ సిబ్బందికి బదులు కూటమి నాయకులు.. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కనిపిస్తున్నారు. దరఖాస్తుతోపాటు.. ఎన్ని అర్హతలున్నా సరే... ‘హా, వీళ్లు మనవాళ్లు. వీరి ఓటు మనకే’ అన్న ‘ట్యాగ్‌లైన్’ ఉంటేనే దగ్గరుండి, దరఖాస్తును ఆన్లైన్ ‘చేస్తున్నారు’. లేకుంటే, సర్వర్ సమస్య అంటూ తిప్పి పంపుతున్నారు. ఉన్న సమయమే తక్కువ.. అందునా వరుస సెలవులు కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల మంజూరు కోసం ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వ ఆదేశాలతో గ్రామ, వార్డు స్వర్ణ సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్న విషయం విదితమే. పింఛను లబ్ధి పొందేందుకు వేలాది మంది దరఖాస్తులు పట్టుకుని, ప్రతి రోజూ ఆయా కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. ఉన్న సమయమే తక్కువ. అందులోనూ వరుసగాసెలవు దినాలు రెండో శనివారం, ఆదివారం, సోమవారం(వినాయక చవితి) వస్తున్నాయి. ఒకవైపు అవసరమైన అర్హత పత్రాల కోసం తిరుగుతూ, ఆందోళన చెందుతున్న దరఖాస్తుదారులు ఒక్కసారిగా సచివాలయాలకు క్యూ కడుతున్నారు. అక్కడ వారికి సర్వర్ సమస్య వేధిస్తోంది. గంటలకొద్దీ వేచి ఉంటున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. మరోవైపు అసలు అర్హతలు కంటే.. ‘తమ్ముళ్ల’ సిఫారసే ప్రధాన అర్హతగా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలే సచివాలయాల్లో దగ్గరుండి తమ వారి పేర్లకే ‘అనుమతి’ ఇస్తున్నారు. కురుపాం సచివాలయం–2లో డిజిటల్ అసిస్టెంట్ కాదు కుర్చీలో తెలుగుదేశం పార్టీకి చెందిన కాార్యకర్త దర్జాగా కుర్చీలో కూర్చొని తతంగాన్ని నడపడం చర్చనీయాంశంగా మారింది. ఆయన అంతా చేస్తుంటే.. పక్కనే సిబ్బంది చేతులు కట్టుకుని నిల్చోవడం గమనార్హం. జిల్లాలో దాదాపు అన్ని చోట్లా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ‘ఈ తాత మనోడేనా? టీడీపీ జెండా మోశా డా? అయితేనే దరఖాస్తు అప్లోడ్ చేయు.. ఈ అవ్వ మన పార్టీకి ఓటెయ్యలేదా? అయితే సైట్ ‘సర్వర్ ఎర్రర్’ అని చూపించు, దరఖాస్తును పక్క న పెట్టేయ్’ అని అనధికార ఆదేశాలిచ్చేస్తున్నారు. పింఛన్ల కోసమని వస్తున్న దరఖాస్తుదారులకు అక్కడ ఏకంగా సచివాలయాలకు బదులు ‘పచ్చ పార్టీ బ్రాంచ్ ఆఫీస్’లు కనిపిస్తున్నాయి. అర్హుల జాబితా తయారయ్యేసరికి... పచ్చ కండువా కప్పుకున్న వాళ్లకు మాత్రమే పింఛన్లు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అధికార దర్పంతో వ్యవస్థలనే ‘తెలుగు తమ్ముళ్లు’ హైజాక్ చేస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. కురుపాం–2 సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ సీట్లో కూర్చొని పింఛన్ దరఖాస్తులు అప్లోడ్ చేస్తున్న టీడీపీ ఉత్తమ కార్యకర్త సుఖేష్ చంద్ర పండా సుఖేష్ చంద్రపండాకు ఉత్తమ కార్యకర్తగా నారా లోకేశ్ ఇచ్చిన ప్రశంసా పత్రం -
శ్లాబ్ పైనుంచి పడి వ్యక్తి మృతి
నెల్లిమర్ల: నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట గ్రామంలో ఓ ఇంటి శ్లాబ్‌పై పనిచేస్తున్న తాపీ పని కార్మికుడు పెందుర్తి పైడిరాజు (47) ప్రమాదవశాత్తు జారి నేలపై పడి మృతి చెందాడు. గురువారం జరిగిన ఈ సంఘటనలో శ్లాబ్ పైనుంచి కిందకు పడి తీవ్ర గాయాలపాలైన పైడిరాజును వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మార్గమధ్యంలోనే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడు పైడిరాజు గుర్ల మండలం గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి. ఈ సంఘటనపై నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయనగరం సర్వజన ఆస్పత్రికి తరలించారు. -
మర్యాదపూర్వక కలయిక
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి, పార్టీ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పలు అంశాలపై చర్చించారు. – గుమ్మలక్ష్మీపురం రెడ్‌క్రాస్‌లో పోస్టులకు 22న ఇంటర్వ్యూలు విజయనగరం ఫోర్ట్: రెడ్‌క్రాస్ సొసైటీలో వివిధ కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 22న రెడ్‌క్రాస్ సొసైటీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు సొసైటీ కార్యదర్శి సత్యం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. టెక్నికల్ సూపర్ వైజర్ (బీఎస్సీ ఎంఎల్టీ), డీఎంఎల్టీగా ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారు, ల్యాబ్ టెక్నీషియన్ (డీఎంఎల్టీ విద్యార్హత) ఒక సంవత్సరం అనుభవం, స్టాఫ్‌నర్సు జీఎన్ఎం ఒక సంవత్సరం అనుభవం ఉన్నవారు అర్హులని తెలిపారు. విమానాశ్రయ భూముల పరిశీలన బాడంగి: బాడంగి సమీపంలోని విమానాశ్రయ భూములను విశాఖ ఏన్డీఏకు చెందిన అధికారులు బొబ్బిలి ఆర్డీఓ రామమోహన్‌రావు, తహసీల్దార్ వరప్రసాద్‌తో కలిసి గురువారం పరిశీలించారు. ఎన్డీఏకు చెందిన డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ స్థాయి అధికారులు విమానాశ్రయ గచ్చు రోడ్డుకు చేరుకొని కారుపై నలుమూలల తిరిగి నిశితంగా పరిశీలించారు. విమానాశ్రయానికి చెందిన రన్‌వేతో కలిపి సుమారు 247 ఎకరాల భూములకు కేవలం రన్వేగచ్చు రోడ్డు 50 ఎకరాలు మినహా మిగిలిన 197ఎకరాలు రైతుల ఆక్రమణలో ఉన్నట్టు నిర్ధారణకొచ్చారు. ఆక్రమిత భూముల్లో ప్రస్తుతం నీలగిరి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలు సాగవుతుండడాన్ని గమనించారు. భూములు ఆక్రమణకు గురికాకుండా చూడాలని రెవెన్యూ ఽఅధికారులను కోరారు. విమానాశ్రయ భూములను త్వరలో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. -
నేర నియంత్రణపై సమీక్ష
విజయనగరం టౌన్: నేర నియంత్రణ, దర్యాప్తులో పురోగతి, నేరస్తులపై చర్యలు, ప్రజా భద్రత, తదితర అంశాలపై ఐజీ గోపీనాథ్ జెట్టీ విశాఖ పట్టణంలోని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో బుధవారం ఐదు జిల్లాల ఎస్పీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో విజయనగరం జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్, పార్వతీపురం మన్యం ఎస్పీ మాధవ్‌రెడ్డి, శ్రీకాకుళం ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బర్ధార్, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాలు పాల్గొని.. జిల్లాల్లో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం మహిళలపై నేరాలు, ఆస్తి నేరాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు ఎన్డీపీఎస్ కేసులు, రోడ్డు ప్రమాదాల తగ్గింపు, సోషల్ మీడియా క్రైమ్స్, పల్లెనిద్ర, డిజిటల్ అరెస్టులు, మెగా వెహికల్ చెకింగ్లు, వినాయక చవితి పండగకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఐజీ గోపీనాథ్ జెట్టీ దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయా జిల్లాల డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలు పాల్గొన్నారు. -
మూడుకొండల ఆవల.. 24 గంటలు
గురువారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026సీతంపేట: కొండకోనల్లో తప్పిపోయిన బాలుడి ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు, సీతంపేట పోలీసు లు, గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నా రు. వివరాల్లోకి వెళ్తే.. సీతంపేట మండలం కిండంగి పంచాయతీ గులుమూరు గ్రామానికి చెందిన సవర రామ్మూర్తి, మహేశ్వరి దంపతుల పెద్దకుమా రుడు నాలుగేళ్ల వయస్సున్న సిద్ధు మంగళవారం ఉదయం నుంచి కనిపించలేదు. తండ్రి ఉపాధి పనులకు వెళ్లాడు. తల్లి ఇంటివద్ద వంట పనులు చేసుకుంటోంది. ఈ సమయంలో బాలుడి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.గ్రామంలో ఎక్కడో ఓ దగ్గర ఆడుకుని వస్తాడులే అని కుటుంబ సభ్యు లు అనుకున్నారు. సాయంత్రం వరకు బాలుడు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. గ్రామస్తులతో కలిసి చుట్టుపక్కన గ్రామాలతో పాటు బంధువుల ఇళ్లల్లో గాలించా నా బాలుడి ఆచూకీ దొరకలేదు. వెంటనే సీతంపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్ఐ వై.అమ్మన్నరావు ఎస్పీ ఎస్.వి.మాధవ్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు పాలకొండ డీఎస్పీ, సీఐల ఆధ్వర్యంలో ఎస్ఐ, స్థానిక పోలీస్ సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి. రాత్రి సమయంలో వర్షం కురుస్తున్నా గాలించాయి. కొండమార్గాలు, లోయలు, దట్టమైన అడవిని జల్లెడ పడుతూ, గ్రామస్తులతో కలిపి గాలించారు. గంటలు గడుస్తు న్న కొద్దీ కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చివరకు బుధవారం ఉదయం 11 గంటల సమ యంలో గులుమూరు గ్రామానికి ఆనుకుని కొండప్రాంతంలోని లోయ పక్కన బాలుడి ఆచూకీ కను గొన్నారు. గ్రామానికి మూడు కిలోమీటర్లు దూరంగా విస్తరించి ఉన్న మూడు కొండలు దాటి బాలుడు వెళ్లిపోయాడు. రాత్రంతా వర్షంలో తడుస్తూ ఒంటరిగానే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆహారం, నీరు లేకపోవడంతో నీరసించిపోయాడు. బాలుడిని వెంటనే తల్లిదండ్రుల సమక్షంలో ప్రాథమిక చికిత్స కోసం కుశిమి పీహెచ్‌సీకి తరలించారు. -
ఓవరాల్ చాంపియన్‌గా విశాఖ రేంజ్
● క్రీడాకారులను అభినందించిన ఐజీ గోపీనాథ్ జెట్టీవిజయనగరం టౌన్: మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి నాలుగు వరకు నిర్వహించిన తొలి ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో విశాఖ రేంజ్ పోలీసులు అద్వితీయ ప్రతిభ కనబరిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 విభాగాల నుంచి సుమారు 1900 మంది పోలీసు అధికారు లు, క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో విశాఖ రేంజ్ పరిధిలోని జిల్లాలు, కమిషనరేట్ మొత్తం 338 పతకాలు ( 197 స్వర్ణాలు, 82 రజతాలు, 59 కాంస్యాలు) సాధించి రాష్ట్రస్ధాయిలో అగ్రస్థానంలో నిలిచాయి. ఈ మేరకు ఐజీ విజేతలను బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. విజయనగరం జిల్లా పోలీసులు 39 స్వర్ణాలు, 21 రజతాలు, 14 కాంస్యాలతో మొత్తం 74 పతకాలు సాధించారని చెప్పా రు. విశాఖ సిబ్బంది 70 స్వర్ణాలు, 22 రజతాలు, 17 కాంస్యాలు.. అనకాపల్లి జిల్లా సిబ్బంది 44 స్వర్ణాలు, 18 రజతాలు, 8 కాంస్యాలు.. శ్రీకాకుళం జిల్లా సిబ్బంది 18 స్వర్ణాలు, 9 రజతాలు, 6 కాంస్యాలు.. పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యోగులు 14 స్వర్ణాలు, 9 రజతాలు, 9 కాంస్యాలు.. అల్లూరి సీతారామరాజు జిల్లా సిబ్బంది 12 స్వర్ణాలు, 3 రజతాలు, 5 కాంస్య పతకాలు సాధించారన్నారు. -
కదం తొక్కిన సచివాలయ ఉద్యోగులు
విజయనగరం గంటస్తంభం: హక్కుల సాధన కోసం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు కదం తొక్కారు. ఇచ్చిన హామీ మేరకు సమస్యలను తక్షణ మే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. జోన్–1 సచివాలయ ఉద్యోగ సంఘాల సమైక్య (ఎస్జీఎస్డబ్ల్యూ) ఆధ్వర్యంలో బుధవారం విజ యనగరం కలెక్టరేట్ వేదికగా ఆందోళన చేశారు. రాత్రి 9.30 గంటల వరకు బైఠాయించి తమ నిరసన తెలిపారు. సమస్యలు పరిష్కరించాలంటూ తొలుత డీఆర్వో సీహెచ్ సత్తిబాబుకు వినతిపత్రం అందజేశారు. అనంతరం జేసీ వచ్చి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. జేసీ వచ్చేవరకు కలెక్టరేట్ ప్రాంగణంలో ఆందోళన కొనసాగించారు. జేసీ వచ్చాక సమస్యలను వినిపించి వినతిపత్రం అందజేశారు. గతంలో చేపట్టిన దీక్షల సమయంలో గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్ వారం రోజుల్లో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారని, గడువు ముగిసినా నేటికీ ఎలాంటి స్పందన లేకపోవడం దారుణమని సంఘ నేతలు మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తూ అహర్నిశలు శ్రమిస్తున్న తమను విస్మరించడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళ మహిళా ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు విధులకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా బాధ్యతాయుతంగా పనిచేస్తున్నారు. గతంలో దీక్షలు చేసినప్పుడు వారం రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని డైరెక్టర్ హామీ ఇచ్చి విరమింపజేశారు. నేటీకీ ఎలాంటి స్పందన లేదు. – బి.శంకరరావు, జేఏసీ రాష్ట్ర సభ్యుడు గత కొన్నేళ్లుగా మా సర్వీసు సమస్యలు పరిష్కారం కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రొబేషన్ పూర్తయిన 9 నెలల బకాయి వేతనాలు, రెండు నోషనల్ ఇంక్రిమెంట్లు మా న్యాయమైన హక్కులు. వీటిని తక్షణమే పరిష్కరించాలి. – వి.కాశీనాయుడు, జేఏసీ జిల్లా సభ్యుడు పరిష్కరించాలి వార్డుల్లో ప్రజా సేవలకు ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాం. కనీ స బేసిక్ పే రూ.30,000 అమ లు చేయడం, డిప్యుటేషన్లను రద్దు చేసి శాఖాపరమైన ప్రమోషన్లు కల్పించడం వంటి ప్రధాన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి. మా సమస్యలు తీరేవరకు మా శాంతియుత నిరసన కొనసాగుతుంది. – ఆర్.శివప్రసాద్, వార్డు జేఏసీ విజయనగరం సభ్యుడు ప్రధాన డిమాండ్లు ఇవే... ఉద్యోగులకు రావాల్సిన రెండు నోషనల్ ఇంక్రిమెంట్లను తక్షణమే మంజూరు చేయాలి. ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్‌ను తక్షణమే అమల్లోకి తేవాలి. ప్రొబేషన్ పూర్తయిన నాటి నుంచి పెండింగ్ లో ఉన్న 9నెలల బకాయి జీతాలను విడుద ల చేయాలి. సర్వీస్ కాలానికి అనుగుణంగా వార్షిక ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ప్రమోషన్ చానెల్‌తో పాటు కనీస బేసిక్ పే రూ.30,000 ఉండేలా చర్యలు తీసుకోవాలి. దీనికోసం జీవో నం.11 ప్రయోజనాలను అమలు చేయాలి. విధి నిర్వహణలో ఉద్యోగులు మృతి చెందితే వారి కుటుంబాలకు 3 నెలల్లో ప్రయోజనాలతో పాటు కారుణ్య నియామకాలు కల్పించాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఎస్జీఎస్డబ్ల్యూ ఉద్యోగ సంఘాలకు తగిన ప్రాతినిథ్యం కల్పి ంచాలి. శాఖాపరమైన ప్రమోషన్లు కల్పి స్తూ ఇతర విభాగాల నుంచి తెచ్చిన డిప్యుటేషన్లను రద్దు చేయాలి. హక్కుల సాధన కోసం కలెక్టరేట్ వద్ద ఆందోళన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ రాత్రి 9.30 గంటల వరకు బైఠాయింపు జేసీకి వినతిపత్రం అందజేసిన ఉద్యోగ సంఘ నాయకులు -
మున్సిపాలిటీ నుంచి తొలగించండి..
● గ్రామసభలో అధికారులకు తేల్చి చెప్పిన కొత్తవలస గ్రామస్తులురాజాం: రాజాం మున్సిపాలిటీలో రోజుకొక వివాదం తెరమీదకు వస్తోంది. 21 ఏళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఈ మున్సిపాలిటీకి ఎన్నికలు జరగలేదు. ఈ సారి ఎలాకై నా ఎన్నికలు జరిపించేందుకు అధికారులు అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సమయంలో మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డుకు చెందిన కొత్తవలస గ్రామస్తులు.. తమ గ్రామాన్ని మున్సిపాలిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. రెండురోజుల కిందట తమకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కలెక్టర్ కార్యాలయంలో అర్జీ సమర్పించారు. దీంతో కలెక్టర్ ఎం.రాంసుందర్‌రెడ్డి స్పందిస్తూ కొత్తవలస గ్రామంలో గ్రామసభ నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాజాం మున్సిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు, తహసీల్దార్ ఎం.రాజశేఖరం, ఎంపీడీఓ ఆనందరావు, పట్టణ సీఐ నవీన్‌కుమార్, తదితరులు గ్రామంలో బుధవారం ప్రజావేదిక నిర్వహించారు. ఈ వేదికకు పెద్ద ఎత్తున గ్రామస్తులు హాజరయ్యారు. పంచాయతీగా ఉంటాం.. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమ గ్రామం 2005కు ముందు ఏ మాదిరిగా పంచాయతీగా ఉందో అదేవిధంగా ఉంచాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో విలీనం చేయడం వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు అధికంగా ఉన్నాయని తెలిపారు. పంచాయతీగా ఉంటే తమకు నచ్చిన వ్యక్తిని సర్పంచ్‌గా చేసుకుని, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపాలిటీలో ఉన్నప్పటి నుంచి సక్రమంగా పారిశుధ్య పనులు కూడా చేపట్టడం లేదని వాపోయారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఉంగటి శంకర్, తవిటినాయుడు, వాన అసిరినాయుడు, బట్న మురళీకృష్ణ, హరి, వాన అలివేలమ్మ, ఉంగటి సూరీడు, పసుపురెడ్డి సత్యవతి, నక్క గౌరి, వాన రమణమ్మ, తదితరులు మాట్లాడారు. టీడీపీ నేతల కొత్త డ్రామా.. ఇదిలా ఉండగా గ్రామసభ జరుగుతుండగా ఈ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన పలువురు టీడీపీ నేతలు అధికారులను కలిశారు. గోపాలపురం, అమ్మవారికాలనీ, ఆదర్శనగర్, తదితర ప్రాంతాలను మున్సిపాలిటీలోనే ఉంచాలని కోరుతూ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందించారు. ఇంతపెద్ద ఎత్తున కొత్తవలసలో ప్రజలు మున్సిపాలిటీని వ్యతిరేకిస్తుంటే, ఆ గ్రామసభకు టీడీపీ నేతలు నేరుగా వచ్చి పంచాయతీ పరిధిలోని కొన్ని గ్రామాలను మున్సిపాలిటీలోనే ఉంచాలనే వినతిపత్రం ఇవ్వడంపై సర్వత్రా చర్చ నడుస్తోంది. -
సేంద్రియ పంటల పరిశీలన
కురుపాం: మండలంలో జట్టు సంస్థ ఆధ్వర్యంలో సాగు చేస్తున్న పంటలను ఆఫీస్ ఆఫ్ ఇంటర్నల్ ఓవర్ సైట్ సర్వీసెస్ (ఓఐఓఎస్) చెందిన సభ్యులు కరోలిన్ కురియా, జోసెఫిన్ బుధవారం పరిశీలించారు. ఆగంగూడ, తిత్తిరి, బొడ్డమానుగూడ, దూళికుప్ప గ్రామాల్లో పర్యటించి, జట్టు సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో కొనసాగుతున్న జీవనోపాధి కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా నాటుకోళ్ల ఫారం, ఔషధ మొక్కల సాగు, సేంద్రియ పంటల సాగు విధానంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ కుటుంబాలకు స్థిరమైన జీవనోపాధి కల్పించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగ పడతాయని వారు అభిప్రాయపడ్డారు. 12న ఉరుసు ఉత్సవం విజయనగరం క్రైమ్: స్థానిక కుముందన్ వీధిలో ఈ నెల 12వ తేదీన హజ్రత్ సయ్యద్ బాబా ఉరుసు ఉత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు షేక్ దాదా, షేక్ జాన్‌లు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదే రోజు సాయంత్రం 7 గంటలకు దర్గా వద్ద విశాఖపట్నానికి చెందిన హఫీజ్ ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందన్నారు. తొలుత దర్గా నుంచి చందనోత్సవం ఊరేగింపు అట్టహాసంగా జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధిపై అవగాహన ● డీఎంహెచ్ఓ జీవనరాణి విజయనగరం ఫోర్ట్: ప్రతి గ్రామంలో కుష్టువ్యాధిపై అవగాహన కల్పించాలని డీఎంహెచ్ఓ ఎస్. జీవనరాణి తెలిపారు. బుధవారం స్థానిక జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కుష్టువ్యాధి కేసుల గుర్తింపుపై పీహెచ్సీ వైద్యాధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కుష్టువ్యాధిని త్వరగా గుర్తించడం ద్వారా అంగవైకల్యం భారిన పడకుండా కాపాడవచ్చని తెలిపారు. మేల్ వలంటీర్, ఆశ కార్యకర్తతో కూడిన బృందం ఇంటింటి చేపట్టి, అనుమానితులను గుర్తించి, వైద్యసేవలు అందేలా చూడాలన్నారు. అంతకుముందు వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా కుష్టు, ఎయిడ్స్, క్షయ నివారణధికారి కె. రాణి, తదితరులు పాల్గొన్నారు. జెడ్పీ చైర్మన్ పదవి ఎస్సీలకు కేటాయించాలి నెల్లిమర్ల రూరల్: విజయనగరం జెడ్పీ చైర్మన్ పదవిని ఈసారి ఎస్సీలకు కేటాయించాలని జైభీమ్‌రావ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు టొంపల నరసయ్య కోరారు. ఇదే విషయమై ఆయన మండలంలోని సతివాడ గ్రామంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటివరకు జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని ఎస్సీలకు కేటాయించలేదని, దళితుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికై నా ఎస్సీలకు జెడ్పీ చైర్మన్ సీటు కేటాయించాలన్నారు. ఎస్సీ యువతను రాజకీయాల్లో ప్రోత్సహించాలని, ఈ విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. ముగిసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు విజయనగరం క్రైమ్: స్థానిక లేడీస్ రిక్రియేషన్ క్లబ్లో ప్రబోధ సేవా సమితి ఇందూ జ్ఞాన వేదిక, విజయనగరం కమిటీ ఆధ్వర్యంలో కొన్ని రోజులుగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు బుధవారం ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ మాజీ డిప్యూటీ మేయర్, వైఎస్సార్ సీపీ నాయకురాలు కోలగట్ల శ్రావణి హాజరై కాసేపు ప్రసంగించారు. ప్రతిఒక్కరూ ఆధ్యాత్మిక భావం కలిగి ఉండాలని, రోజులో ఎంతో కొంత సమయాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కేటాయించాలన్నారు. శ్రీకృష్ణుడు బోధనలు అనుసరణీయమని, ఆయన అనుసరించిన మార్గాన్ని అందరూ అనుసరించాలన్నారు. అనంతరం పురవీధుల్లో శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఊరేగించారు. రాజీవ్‌నగర్ కాలనీ, దాసన్నపేట, రింగురోడ్డు, కోట జంక్షన్ మీదుగా సాగిన ఈ ఊరేగింపులో పలువురు చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణల్లో అలరించారు. -
క్రీడాకారిణికి అభినందనలు
సీతంపేట: జాతీయస్థాయి జావెలిన్ త్రో పోటీలకు ఎంపికైన గిరిజన బాలిక బి.సుశీలను పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్చార్జి పీఓ పవార్ స్వప్నిల్ జగన్నాఽథ్ తన కార్యాలయంలో బుధవారం అభినందించారు. సుశీల భామిని ఏకవల్య మోడల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. గత నెల 11న తిరుపతిలో జరిగిన సౌత్‌జోన్ క్రీడా పోటీల్లో జావెలిన్‌త్రోలో ప్రతిభ కనబరిచి గోల్డ్‌మెడల్ సాధించి జాతీయ స్థాయికి అర్హత సాధించింది. త్వరలో జరగనున్న జాతీయస్థా యి పోటీల్లో కూడా ఇదే స్ఫూర్తితో తలపడి ఉత్తమ ప్రతిభ కనబరచాలని, ఉన్నతస్థాయికి ఎదిగి తల్లిదండ్రులకు, గిరిజన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గంగాదేవి, పీఈటీ సింహాచలం, సిబ్బంది పాల్గొన్నారు. రేగిడి: మండలంలోని సంకిలి గ్రామంలో గురువారం ఉదయం 10 గంటలు ఏపీ చెరకు రైతు సంఘం, సంకిలి సుగర్ ఫ్యాక్టరీ పరిరక్షణ సమి తి ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నదని చెరకు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడితి అప్పలనాయుడు బుధవారం తెలిపారు. చక్కె ర కర్మాగారం పరిరక్షణలో భాగంగా భవిష్యత్తు కార్యాచరణపై రైతులు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరారు. విజయనగరం క్రైమ్: ఆర్టీసీ డిపోలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ అశోక్, జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు డిమాండ్ చేశారు. ఇదే విషయమై వారు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీనివాస్‌ను బుధవారం కలిసి వినతిపత్రం అందజేశా రు. యాజమాన్యం నిర్ణయించిన ప్రకారం కార్మికులకు కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఎస్.కోట ఆర్టీసీ డిపో పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రతినెల 10వ తేదీలోపు జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాల ని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సూర్యకుమార్, కార్యదర్శి కళారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాసశివరాత్రి పూజలు విజయనగరం క్రైమ్: స్థానిక శంకర మఠంలో మాసశివరాత్రి పూజలు బుధవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తొలుత గణపతి పూజ అనంతరం పుణ్యాహవచనం, మండపారాధన, మహాన్యాస పారాయణం, మహారుద్ర పారాయణం చేపట్టారు. 11 మంది రుత్వికులతో వేదపఠనం, పారాయణం, రుద్రహోమం చేశారు. -
అరెస్టులు చేసి.. పంటలు ధ్వంసం చేసి...
● పోలీసుల పహారా నడుమ మొక్కజొన్న పంట ధ్వంసం ● గగ్గోలు పెట్టిన గిరిజన రైతులు ● పంట చేతికొచ్చేవరకు ఆగండయ్యా అంటూ వేడుకోలు ● గిరిజనుల గోడు వినిపించుకోని అధికారులు ● రాధిక వెజిటబుల్స్ పరిశ్రమ వర్గాల ఫిర్యాదుతో గిరిజనులపై ప్రతాపం ● పరిశ్రమ పనులను అడ్డుకున్న రైతులను బాడంగి పోలీస్ స్టేషన్‌కు తరలింపు న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదు.. రెవెన్యూ ఉన్నతాధికారులు పెత్తందార్లు ఇచ్చిన ముడుపులకు అమ్ముడు పోయి పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నారు. రెవెన్యూ అధికారులది నూటికినూరు శాతం తప్పు. గిరిజనులు పండించిన పంటలను ధ్వంసం చేయడం దారుణం. వందల పరిశశ్రమలు మూతపడి వేలాది మంది నిరుద్యోగులు వలస వెళ్లిపోతున్నారు. వాటిని తెరింపించే చర్యలు లేకుండా పరిశ్రమలు ఏర్పాటుచేస్తామంటూ సాగు భూములను లాక్కొంటున్నారు. గిరిజన రైతులకు పరిహారంగా జిరాయితీతో సమానమైన భూమి ఇవ్వాలి. వారికి న్యాయం జరిగేవరకు పోరాటం ఆగదు. ఇలాంటి అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. – ఎం.కృష్ణమూర్తి, సీపీఎం జిల్లా నాయుకుడు సాగు భూమిలో పనులు అడ్డుకుంటూ బైఠాయించిన గిరిజన రైతులతో పోలీసుల వాగ్వాదంసాగులో ఉన్న భూమి వద్ద ధర్నా చేస్తున్న గిరిజన రైతులు మొక్కజొన్న పంటను బ్లేడు ట్రాక్టర్లతో ధ్వంసం చేస్తున్న దృశ్యం చేతికందిన పంటను ధ్వంసం చేస్తుండడంతో విలపిస్తున్న గిరిజన మహిళ రామభద్రపురం: రామభద్రపురం మండలం కాకర్లవలసలో పోలీసులు, అధికారుల సాక్షిగా బుధవారం సాగిన రాక్షసకాండపై గిరిజన రైతులు గగ్గోలు పెట్టారు. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలను యంత్రాల సాయంతో ధ్వంసం చేయడంతో కన్నీరుపెట్టారు. కొన్నాళ్లు ఆగండయ్యా.. పంట చేతికొస్తుందని వేడుకున్నా వినిపించుకోని అధికారుల తీరుపై దుమ్మెత్తి పోశారు. పదుల సంఖ్యలో పోలీసులు మోహరించి అమాయక గిరిజన రైతులు సాగుచేసిన పంటలను నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేయడాన్ని తప్పుబట్టారు. కొన్నేళ్లుగా గిరిజన రైతుల సాగులో ఉన్న భూమిని స్వాధీనం చేసుకునే క్రమంలో ప్రభుత్వం చేపట్టిన చర్యలను విమర్శించారు. రాధికా వెజిటబుల్స్ పరిశ్రమ కోసం రెవెన్యూ, పోలీస్ అధికారులు చేపట్టిన దమనకాండను ఖండించారు. మండలంలోని కొట్టక్కి రెవెన్యూ, మిర్తివలస పంచాయతీ పరిధిలోని కాకర్లవలస, కారేడువలస గ్రామాల వద్ద 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ పుల్లేరుగుడ్డివలస గ్రామానికి చెందిన పలువురు గిరిజన రైతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది. ఆ భూమిని రాధిక వెజిటల్బుల్స్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఏపీఐఐసీ అమ్మేయడాన్ని నిరసిస్తూ గత నెల 27, 28వ తేదీలలో గిరిజన రైతులు ఆందోళన చేశారు. పరిశ్రమ పనులను అడ్డుకున్నారు. అప్పట్లో వెనుకకు తగ్గిన పరిశ్రమ ప్రతినిధులు ముందుగానే రెవెన్యూ, పోలీస్ అఽధికారులకు ఫిర్యాదు చేసి బుధవారం పనులు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న గిరిజన రైతులు, సీపీఎం నాయకులు ఎం.కృష్ణమూర్తి, కోరాడ ఈశ్వరరావు తదితరులు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిశ్రమ ప్రతినిధుల ఫిర్యాదుతో ఆర్డీఓ రామ్మోహనరావు, డీఎస్పీ గోవిందరావు, బొబ్బిలిటౌన్, రూరల్, గజపతినగరం సీఐలు కె. నారాయణరావు, మల్లికార్జునరావు, సన్యాసినాయుడు, సుమారు 50 పోలీస్ సిబ్బంది మొహరించారు. పరిశ్రమ పనులను అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని సీపీఎం నాయకులతో పాటు 48 మంది గిరిజన రైతులను అరెస్టుచేసి బాడంగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రైతులు సాగుచేసిన మొక్కజొన్న పంటను రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారుల సమక్షంలోనే ఆరు బ్లేడు ట్రాక్టర్లతో నిర్ధాక్షిణ్యంగా ధ్వంసం చేశారు. పంట చేతికందే సమయంలో యంత్రాలతో నాశనం చేయడాన్ని చూసి రైతులు కన్నీరుపెట్టారు. ఏళ్లుగా గిరిజనుల సాగులో ఉన్న భూమిని అధికార బలంతో దౌర్జన్యం చేసి లాక్కొంటున్నారంటూ విలపించారు. రెవెన్యూ, పోలీస్ అధికారులకు పెద్ద మొత్తంలో ముడుపులు ముట్టడంతోనే పెత్తందార్లకు కొమ్ముకాస్తున్నారంటూ గొగ్గోలు పెట్టారు. సీపీఎం నాయుకులను ఈడ్చుకెళ్తున్న పోలీసులు -
ఆహ్లాదకర జీవనం..
ఎటు చూసినా ఎత్తైన కొండలు.. పచ్చని చెట్లు... మెలికలు తిరిగే ఘాట్ రోడ్లు.. కొండ వాలున నిర్మించుకున్న చిన్నచిన్న ఆవాసాలు.. అక్కడ నివసిస్తున్న గిరిజనుల సంప్రదాయాలు, కట్టుబాట్లు.. చిన్నారులను సంరక్షించే పిల్లలు.. సాలూరు మండలంలోని గిరిశిఖర గ్రామం శిఖపరువును సందర్శించేవారిని ఆకర్షిస్తాయి. కొండలను చదునుచేస్తూ.. వర్షపు నీటితో వారు పండించే పోడు పంటలు అబ్బురపరుస్తాయి. ఆలోచింపజేస్తాయి. వరిలో కాలిబాటలు, వరుసల్లో నాటిన కూరగాయల మొక్కలు ఆధునిక వ్యవసాయాన్ని తలపిస్తాయి. – సాక్షిఫొటోగ్రాఫర్, విజయనగరం -
ఎవరి కోసం ఈ పనులు..?
విజయనగరం అర్బన్: ప్రజల మౌలిక వసతుల కల్పన కోసం వినియోగించాల్సిన అభివృద్ధి నిధులు అసలు ఎక్కడ ఖర్చవుతున్నాయి..? పట్టణంలో అత్యవసర మౌలిక వసతుల కంటే, రియల్ ఎస్టేట్ అవసరాలకు అనుగుణంగా రహదారులు నిర్మించారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విజయనగరం పట్టణంలో వీఎంఆర్డీఏ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల తీరుపై ఇప్పుడు ఇవే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 98 అభివృద్ధి పనులకు రూ.9.99 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరయ్యాయి. తాజాగా అందుబాటులో ఉన్న అధికారిక నివేదికల ప్రకారం వీటిలో 97 పనులు పూర్తయ్యాయి. వీటి విలువ రూ.9.59 కోట్లు. మరో పని రూ.39.80 లక్షలతో రద్దయినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇన్ ప్రొగ్రెస్‌లో గానీ, గ్రౌండింగ్ కోసం ఎదురుచూస్తున్న పనులేవీ లేవని లెక్కలు చెబుతున్నాయి. లెక్కల్లో ఫుల్.. పనుల సంఖ్యను చూస్తే దాదాపు 99 శాతం పూర్తయినట్లుగా అధికారిక రికార్డులు చెబుతున్నాయి. ఖర్చు పరంగా కూడా దాదాపు 96 శాతం విలువైన పనులు పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే నగరంలోని శివారు కాలనీల్లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పట్టణంలోని కామాక్షినగర్, ధర్మపురి, వైఎస్సార్‌నగర్, గాజులరేగ, మజ్జిపేట, బీసీ కాలనీ, దుప్పాడ, తదితర శివారు ప్రాంతాల్లో నేటీకి గుంతల రహదారులే దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో రోడ్ల మీదనే వర్షపు నీరు, మురుగునీరు నిల్వ ఉంటోంది. దీంతో రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అవసరం ఉన్నచోట కాకుండా అవసరం లేని చోట్ల రోడ్లు ఏర్పాటు చేస్తున్నారన్న ఆరోపణలు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. లే అవుట్లకు ఎందుకంత ప్రాధాన్యం.. ప్రత్యేక పాలనలో ఉన్న సమయంలో అభివృద్ధి పనుల ఎంపికలో ప్రజాప్రతినిధుల ప్రత్యక్ష జోక్యం లేకపోవడంతో అధికార యంత్రాంగం మాటే చెల్లుబాటు అవుతుంది. ఈ పరిస్థితిని అధికార పా ర్టీకి చెందిన కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా జనావాసాలు లేని ప్రాంతాల్లో వెడల్పాటి రహదారులు, లే అవుట్లు, రియల్ ఎస్టేట్‌కు ఉపయోగపడేలా రోడ్లు వేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లే అవుట్లలో సంబంధిత యజమానులు రోడ్లు వేయాలి. కాని ఇక్కడ ప్రభుత్వ ధనంతో రోడ్లు వేయించి, లేఅవుట్ యజమానులకు మేలు చేస్తున్నారు. ఇప్పటికే జనాభా అధికంగా ఉన్న.. ప్రజలు ఇబ్బందులు పడుతున్న కాలనీల్లో రోడ్లు, డ్రైనేజీకి తగిన ప్రాధాన్యం దక్కలేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఏయే పనులు ఏ ప్రాంతాల్లో చేపట్టారు..? వాటి ఎంపికకు ప్రాతిపదిక ఏమిటి..? ఆయా రహదారుల వల్ల ప్రస్తుతం ఎంతమంది ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం కలుగుతోంది..? రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు ప్రయోజనం కలిగే ప్రాంతాల్లో చేపట్టిన పనుల సంఖ్య ఎంత..? వంటి వివరాలను బహిర్గతం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. లే అవుట్లలో రహదారుల జోరు శివారు కాలనీల్లో అధ్వానపు తీరు రియల్ ఎస్టేట్‌కు ఉపయోగపడేలా రోడ్లు వేస్తున్న అధికారులు కాలనీ వాసులకు తప్పని ఇక్కట్లుసామాజిక ప్రయోజనం ఎంత..? 98 పనులకు దాదాపు రూ.10 కోట్ల నిధులు వెచ్చించిన నేపథ్యంలో.. ప్రతి పనికి సంబంధించిన వార్డు, ప్రాంతం, పనితీరు, వ్యయం, రహదారి పొడువు, లబ్ధిదారుల సంఖ్య, తదితర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని నగరవాసులు కోరుతున్నారు. అధికారిక లెక్కల్లో పనులు దాదాపు పూర్తయినట్లు కనిపిస్తున్నప్పటికీ.. ఆ పనుల్లో ఎన్ని ప్రజల అత్యవసర అవసరాలను తీర్చాయి? ఎన్ని భవిష్యత్ వాణిజ్య, రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ఉపయోగపడే ప్రాంతాల్లో ఉన్నాయి? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి నిధులు ఖర్చు చేయడం ఒక్కటే లక్ష్యమా.. లేక ప్రజలకు అత్యవసరమైన చోటే ఖర్చు చేయడమే అసలు లక్ష్యమా? అన్న ప్రశ్నలకు అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. -
రహదారులా.. నరకకూపాలా..?
● పాలకులకు పట్టదు.. అధికారులకు చేతకాదు.. ● రాకపోకలకు ఇబ్బంది పడుతున్న గిరిజనంకురుపాం: మండలంలోని రహదారులకు మోక్షమెప్పుడని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. రాళ్లు తేలి గోతులమయంగా మారిన రహదారులతో గిరిజనులు ఏళ్ల తరబడి అవస్థలు పడుతున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే రహదారులు తప్పనిసరిగా ఉండాలి.కాని మండల పరిధిలోని చాలా గ్రామాలకు రహదారులు లేకపోవడంతో కనీసం 104, 108 వాహనాలు కూడా రావడం లేదు. తమ గ్రామాలకు రహదారులు మంజూరు చేయాలని కలెక్టర్, ఐటీడీఏ పీఓలకు గతంలో వినతిపత్రాలు అందజేసినా, అదుగో.. ఇదుగో.. అంటూ కాలం వెళ్లదీస్తున్నారే తప్ప పరిష్కార మార్గం చూపడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నీలకంఠాపురం పంచాయతీలోని గంగన్నదొరవలస గ్రామ రహదారి రాళ్లు తేలి అధ్వానంగా ఉండడంతో పాటు వర్షం పడితే బురదమయంగా మారి రాకపోకలు నిలిచిపోతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జరడ గ్రామ రహదారి కోసం గ్రామస్తులు ఏకంగా అర్ధనగ్న ప్రదర్శనలతో నిరసనలు తెలియజేసినా అధికారుల్లో గాని పాలకుల్లో గాని చలనం రాకపోవడం విశేషం. ఉదయపురం పంచాయతీలోని రెల్లిగూడ గ్రామస్తులు అధికారులు, నాయకులు స్పందించక పోవడంతో శ్రమదానంతో గ్రామానికి రోడ్డు వేసుకుని తామేంటో నిరూపించుకున్నారు. అదే పంచాయతీలోని జాకరగూడ గ్రామానికి వెళ్లే రహదారి కూడా బురదమయంగా ఉండడంతో గతంలో నాట్లు వేసి గిరిజనులు నిరసన తెలిపారు. ఇన్ని రకాలుగా నిరసనలు తెలియజేస్తున్నా ఐటీడీఏ అధికారుల్లో గాని పాలకుల్లో గాని స్పందన రాకపోవడంపై గిరిజనులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించకుంటే పోరాటం ఉధృతం చేయకతప్పదని ఆయా గ్రామాల గిరిజనులు స్పష్టం చేశారు. -
12న వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి సమావేశం
విజయనగరం: వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా విస్తృత స్థాయి సమావేశం ఈ నెల 12న నిర్వహించనున్నట్టు శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ వెల్లడించారు. విజయనగరం ప్రదీప్‌నగర్‌లో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య నివాసంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తల తో బుధవారం సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. కొందరు పార్టీని వీడడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేదని, పార్టీ శ్రేణులంతా త్వరలో జరగను న్న స్థానిక సమరానికి సన్నద్ధం కావాలన్నారు. సమాజం అంటే భయం, భక్తి ఉండాలని, అప్పుడే గౌరవం లభిస్తుందని వాఖ్యానించారు. పార్టీకి విధేయులైన కార్యకర్తలు, నాయకులే ప్రధాన బలమన్నారు. ఇకపై వారితోనే పార్టీ కార్యకలాపాలు సాగుతాయని స్పష్టంచేశారు. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ జిల్లా స్థాయి సమావేశాలు పూర్తయ్యాయన్నారు. విజయనగరం జిల్లా స్థాయి సమావేశం ఈ నెల 12న ఉదయం 10 గంటలకు పూల్‌బాగ్‌లోని జగన్నాథ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, జిల్లా కమిటీ సభ్యులు, నియోజకవర్గ కమిటీ సభ్యులు, పార్టీలోని రాష్ట్ర కమిటీ సభ్యులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరవుతారని స్పష్టం చేశారు. అలాగే, ఈ నెల 16 నుంచి రోజుకు రెండు నియోజకవర్గాల్లో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఆ సమావేశాలు అనంతరం మండల స్థాయి సమావేశాలు నిర్వహించాలని పార్టీ సమన్వయకర్తలకు సూచించారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, ఏపీ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్స య్య, శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పలనాయుడు, రాజాం నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ తలే రాజేష్, తదితరులు పాల్గొన్నారు. 16 నుంచి నియోజకవర్గ స్థాయి సమావేశాలు పార్టీ శ్రేణులంతా స్థానిక సమరానికి సమాయత్తం కావాలి శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ పిలుపు -
పెన్షన్లకు ఎన్నో అడ్డంకులు..!
● ఎన్నో మెలికలతో ప్రకటన విడుదల ● అర్హులందరికీ పెన్షన్లు అనుమానమే ● బడ్జెట్, వాయిదా పద్ధతిన మంజూరు చేస్తామంటున్న ప్రభుత్వంబలిజిపేట: పింఛన్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో ఎన్నో అడ్డంకులు కనిపిస్తున్నాయి. దీంతో అర్హులైన ప్రతివారికీ పింఛన్ వస్తుందనే నమ్మకం లేదనే చర్చ మొదలైంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో కూటమి ప్రభుత్వం పింఛన్ల మంజూరుకు ప్రకటన జారీ చేసిందే తప్ప.. లబ్ధిదారులపై ఎటువంటి ప్రేమలేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో అర్హతే ప్రామాణికంగా అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేశారు. నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ కేటాయింపు, దశలవారీగా మంజూరు అంటూ కొన్ని మెలికలు పెట్టారు. దీంతో పెన్షన్ల మంజూరులో పారదర్శకత కనిపించడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎంపీడీఓ కార్యాలయం నుంచే పింఛన్లు మంజూరయ్యేవి. ఇప్పుడు వారి నుంచి సెర్ఫ్‌కు, అక్కడ నుంచి ప్రభుత్వం వద్దకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేరుతాయి. ఎంపీడీఓను దాటిన తర్వాత సెర్ఫ్‌కు వెళ్లేటప్పుడు అంతా జంతర్,మంతర్ జరగవచ్చని.. ఈలెక్కన అర్హులకు మొండిచేయి మిగులుతుందని చర్చించుకుంటున్నారు. దీనికి తోడు నియోజకవర్గానికి ఇన్ని పింఛన్లు అని చెప్పి కేటాయింపులు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన వాటిని పచ్చ నాయకులు సర్దుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్నో మెలికలు.. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునేవారి ఆధార్‌కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలనే నిబంధన పెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మందికి ఈ పరిస్థితి లేదు. దీంతో వారు ఓటీపీ చెప్పే అవకాశం ఉండదు కనుక అలాంటి వారిని తప్పించే అవకాశం ఉంది. ఇక డప్పు కళాకారులు దరఖాస్తు చేసుకోవాలంటే సాంఘిక సంక్షేమ శాఖ జారీచేసిన సర్టిఫికెట్‌ను పొందుపరచాల్సి ఉంది. అది ఇప్పుటికప్పుడు కష్టసాధ్యంగా కనిపిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒంటరి మహిళలకు సంబంధించి వివాహితురాలైతే కోర్టు లేదా అదాలత్ నుంచి విడాకుల పత్రం.. అవివాహితురాలైతే తహసీల్దార్ నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంది. ఇవన్నీ కూడా లబ్ధిదారులకు ఇబ్బంది కలిగించే అంశాలే. ఎలా దరఖాస్తు చేసేది.. సమయం తక్కువుగా ఉంది. సచివాలయాల్లో సిబ్బంది కూడా పెద్దగా లేరు. సర్వర్లు సక్రమంగా పనిచేయడం లేదు. పైగా లేనిపోని నిబంధనలు పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో దరఖాస్తు ఎలా చేసేది. – దయానంద్, దరఖాస్తుదారు, పెదపెంకి -
జాతీయ అథ్లెటిక్స్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయ స్థాయిలో జరగనున్న అథ్లెటిక్స్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు పలువురు జిల్లా క్రీడాకారులకు అవకాశం లభించింది. ఇటీవల తిరుపతిలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు క్రీడాకారులు ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి సౌత్ జోన్ అథ్లెటిక్స్ పోటీలు అర్హత సాధించారు. జావిలిన్ త్రోలో ఉదయ్, 400 మీటర్ల పరుగు పోటీలో సిహెచ్.సందీప్, త్రిపుల్ జంప్‌లో పి.పవన్‌కళ్యాణ్, 400/800 మీటర్ల పరుగు పోటీలో సిహెచ్.యశోద జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న వారిలో ఉన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచటంతో పాటు జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.లీలాకృష్ణ, శ్రీకాంత్, కోశాధికారి ఆనంద్కిషోర్లు అభినందించారు. -
‘అక్షరాలా అమరజీవి’ పుస్తకావిష్కరణ
విజయనగరం: ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు సమగ్ర జీవిత చరిత్రపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తెలుగు భాషా విశిష్ట పురస్కార సేవాగ్రహీత సముద్రాల గురుప్రసాద్ రాసిన అక్షరాలా అమరజీవి పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు ఇల్లూరు లక్ష్మయ్య మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు భారతదేశ చిత్రపటాన్ని పునర్లిఖింపజేసిన మహనీయుడన్నారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన తెలుగు తేజం పొట్టి శ్రీరాములు జీవనయానం స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకులు తవ్వా మోహనరావు, సంఘం జిల్లా అధ్యక్షుడు బోండా రమేష్, కార్యదర్శి బాలకృష్ణ, పట్టణ శాఖ అధ్యక్షుడు గాయత్రీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డొస్తే... అడ్డంగా నరికేస్తా...
● వైఎస్సార్సీపీ నాయకునిపై ఓ వ్యక్తి దౌర్జన్యంగజపతినగరం రూరల్ (జామి): ‘అడ్డొస్తే... అడ్డంగా నరికేస్తా...అమ్మ తోడు...’ ఇది ఓ సినిమాలో ఓ ప్రముఖ కథనాయకుడు చెప్పిన డైలాగ్. ఇది అప్పట్లో బాగానే వర్కవుట్ అయ్యింది. సినిమా కూడా హిట్ అయ్యింది. మరి ఈ సినిమా చూశాడో ఏమోగాని... ప్రస్తుతం ఓ వ్యక్తి వైఎస్సార్సీపీ నాయకుడిని ఇలాగే... బెదిరిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే...జామి మండలం భీమసింగి గ్రామంలో మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పాండ్రంగి సంజీవిపై అదే గ్రామానికి చెందిన విజినిగిరి శంకరరావు దౌర్జన్యానికి దిగిన సంఘటన ఇది. దీనిపై పాండ్రంకి సంజీవి జామి పోలీసులకు సోమవారం ఫిర్యాదు కూడా చేశాడు. ఇదే విషయమై సంజీవి స్థానిక విలేకరులకు మంగళవారం వివరాలు వెల్లడించారు. భీమసింగి గ్రామకంఠం సర్వే నంబరు 120లో సంజీవికి 19 సెంట్లు స్థలం ఉంది. ఆ స్థలానికి అడ్డంగా అదే గ్రామానికి చెందిన విజినిగిరి శంకరరావు సోమవారం ట్రాక్టర్ లోడ్ రాయి తీసుకువచ్చి వేయించాడు. దీంతో సంజీవికి తన స్థలంలోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. ఇదేమిటని ప్రశ్నించిన సంజీవిపై శంకరరావు దౌర్జన్యానికి దిగాడు. ఈ స్థలం నాది.. అడ్డొస్తే నరికి చంపుతానని.. బెదిరిస్తూ దుర్భాషలాడాడు. దీంతో గత్యంతరం లేక సంజీవి జామి పోలీసులను ఆశ్రయించాడు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ వీర జనార్దన్ మంగళవారం తెలిపారు. దర్యాప్తు చేపట్టి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.


