సహకారం! | - | Sakshi
Sakshi News home page

సహకారం!

Feb 7 2026 1:36 PM | Updated on Feb 7 2026 1:36 PM

సహకారం!

సహకారం!

యంత్రాంగం సహకారం!

ఇది విద్వేషాలు

రెచ్చగొట్టడం కాదా?

యంత్రాంగం

సాక్షి, పార్వతీపురం మన్యం: తిరుమల లడ్డూ విషయంలో ఒక ఉద్దేశ పూర్వకం, పథకం ప్రకారం విష ప్రచారం జరుగుతున్న విషయం విదితమే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌, వైఎస్సార్‌ సీపీ లక్ష్యంగా టీడీపీ అసత్య దాడులకు తెగబడుతోంది. ప్రజలను భయాందోళనకు గురి చేసేలా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా హిందూ భక్తులను రెచ్చగొట్టేలా విద్వేషాలు రెచ్చగొడుతోంది. ఈ సంస్కృతి పార్వతీపురం వంటి జిల్లాకూ పాకిన విషయం తెలిసిందే. పార్వతీపురం పట్టణంతో పాటు.. పలు మండల కేంద్రాల్లో తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందంటూ హోర్డింగుల ద్వారా తప్పుడు ఆరోపణలకు దిగారు. జిల్లా కేంద్రంలోని రద్దీ కూడళ్లలో ఊరూపేరూ లేకుండా, కేవలం వైఎస్సార్‌ సీపీ నేతలు లక్ష్యంగా ప్రజలను రెచ్చగొట్టేలా వీటిని ఏర్పాటు చేయడం గమనార్హం. దీనిపై మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో కొద్ది రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాటిని తొలగించాలని కోరారు. ఇప్పటి వరకూ ఎటువంటి చర్యలూ లేవు. ఆ హోర్డింగులు అలానే దర్శనం ఇస్తున్నాయి.

రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న రాజకీయ పరిణామాలు, వాటి కారణంగా ఉత్పన్నమవుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు చేయకూడదు. సోషల్‌ మీడియా ద్వారా అసత్య సమాచారం, ద్వేషపూరిత సందేశాలు ప్రచారం చేసిన వారి మీద కూడా చర్యలు ఉంటాయి. ఎస్పీ ప్రకటన చేసిన తర్వాతే హోర్డింగులు ఏర్పాటు చేయడం.. ఫిర్యాదులు వెళ్లిన తర్వాత కూడా వాటిని తొలగించక పోవడం విమర్శలకు తావిస్తోంది. పట్టణంలోని మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోనే రహదారి పక్కనే పెద్ద ఎత్తున హోర్డింగు దర్శనం ఇస్తున్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోక పోవడం గమనార్హం. మున్సిపల్‌ అనుమతులు లేకుండా ఇలాంటి హోర్డింగులు పెట్టడానికి వీలు పడదు. అనుమతులు తీసుకున్నా.. అలాంటి వివాదస్పద బోర్డు పెట్టుకునేందుకు ఎలా అంగీకరించారని వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఆదేశాలతోనే వాటిని తొలగించడం లేదని అంటున్నారు.

జిల్లాలో ప్రస్తుతం పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉంది. ప్రజలను ఉద్రేకపరిచే వాఖ్యలు చేసినా.. అలజడులు సృష్టించినా.. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ఎస్‌.వి.మాధవ్‌ రెడ్డి ఇటీవల హెచ్చరిక ప్రకటన కూడా జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement