ఉద్యోగుల జీతాల చెల్లింపు.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం! | Telangana Government Brings Salaries under IFMIS System | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు జీతాల చెల్లింపు.. తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం!

Feb 5 2026 7:55 PM | Updated on Feb 5 2026 8:02 PM

Telangana Government Brings Salaries under IFMIS System

సాక్షి,హైదరాబాద్‌: ఉద్యోగుల జీతాల విడుదలపై తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జీతాలు విడుదల చేసే విధానంలో మార్పులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏప్రిల్‌ నెల నుంచి IFMIS (Integrated Financial Management and Information System) పరిధిలో ఉన్న ఉద్యోగులకు మాత్రమే జీతాలు విడుదల చేయబడతాయి. ఈ నిర్ణయం ద్వారా జీతాల చెల్లింపులో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం, కార్పొరేషన్‌ ఉద్యోగులు అందరూ ఐఎఫ్‌ఎంఐఎస్‌ పరిధిలోకి వస్తారు. అంటే, రాష్ట్రంలోని అన్ని విభాగాల ఉద్యోగుల జీతాలు ఇకపై ఐఎఫ్‌ఎంఐఎస్‌ ద్వారా మాత్రమే విడుదల అవుతాయి.

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాల విషయంలో ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశాన్ని వచ్చే కేబినెట్‌ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. 

కాగా, ఐఎఫ్‌ఎంఐఎస్‌ ద్వారా జీతాల విడుదల చేయడం వల్ల ఆర్థిక క్రమశిక్షణ సాధ్యమవుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే అకౌంటబిలిటీ పెరుగుతుంది. జీతాల చెల్లింపులో ఆలస్యం తగ్గి, ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందే అవకాశం ఉంటుందని ఆర్ధిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement