కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు! | Telangana Municipal Elections 2026: BRS MLAs As Congress coordinators | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ కోఆర్డినేటర్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు!

Feb 5 2026 4:13 PM | Updated on Feb 5 2026 4:32 PM

Telangana Municipal Elections 2026: BRS MLAs As Congress coordinators

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రచార హడావిడితో రాజకీయం హీటెక్కింది. ఈ క్రమంలో గురువారం ఓ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల కోసం కోఆర్డినేటర్ల జాబితాను టీపీసీసీ విడుదల చేసింది. అయితే అనూహ్యంగా ఈ జాబితాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పేర్లు కనిపించడం చర్చనీయాంశమైంది. 

నిజామాబాద్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ గా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ, ఇల్లందు మున్సిపాలిటీకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, షాద్ నగర్ మున్సిపాలిటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పేర్లు టీపీసీసీ లిస్టులో దర్శనిమిచ్చాయి. పైన చెప్పుకున్న ముగ్గురికి అనర్హత వివాదంలో స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే. 

కారు గుర్తు మీద పార్టీ ఫిరాయించారని 10 మందిపై బీఆర్‌ఎస్‌ తెలంగాణ స్పీకర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. వీళ్లలో ఇప్పటిదాకా కడియం శ్రీహరి, దానం నాగేందర్‌ తప్ప మిగతా 8 మందికి స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. వాళ్లు పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాల్లేవని.. ఇంకా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగానే ఉన్నారంటూ తీర్పు ఇచ్చారు. మున్సిపల్‌ ఎన్నికలు సాధారణంగా పార్టీ గుర్తు మీద జరిగే ఎన్నికలు. ఈ తరుణంలో.. నెక్ట్స్‌ ఏం జరగనుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement