తెలంగాణ గ్రామపంచాయతీలకు గుడ్‌న్యూస్‌ | Good News For Telangana Gram Panchayats | Sakshi
Sakshi News home page

తెలంగాణ గ్రామపంచాయతీలకు గుడ్‌న్యూస్‌

Feb 5 2026 12:22 PM | Updated on Feb 5 2026 12:29 PM

Good News For Telangana Gram Panchayats

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని గ్రామ పంచాయతీలకు గుడ్ న్యూస్. కేంద్రం 15వ ఆర్థిక సంఘం పంచాయితీలకు సంబంధించిన బకాయి నిధులను గురువారం విడుదల చేసింది. తొలి విడతగా రూ.259.36 కోట్లు విడుదల అయ్యాయి.  

తెలంగాణ పంచాయితీలకు కేంద్రం రూ.3 వేల కోట్ల దాకా బకాయిలు ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవతో కొద్ది కొద్దిగా నిధుల విడుదలకు కేంద్రం అంగీకరించింది. అయితే ఈలోపు.. ఎన్నికలు రావడంతో నిధుల విడుదలలో జాప్యం జరిగింది. ఎన్నికలు పూర్తి కావడం, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారుల సంప్రదింపుల అనంతరం నిధుల విడుదలకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement