వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన చిత్రం ‘శ్రీ చిదంబరంగారు’. వినయ్ రత్నం దర్శకత్వం వహించారు. చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా వినీషా రెడ్డి, చింతా గోపాలకృష్ణా రెడ్డి నిర్మించారు. చింతా రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదల కానుంది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిహారిక కొణిదెల, ఆనంద్ దేవరకొండ హాజరైయ్యారు.


