breaking news
pre release event
-
‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)
-
‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘మా రాముడు అందరివాడు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘ఐ యామ్ గేమ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా నాగ్ అశ్విన్ (ఫొటోలు)
-
'ధర్మస్థల నియోజకవర్గం' గొప్ప సినిమా అవుతుంది: వివి వినాయక్
సుమన్, సాయికుమార్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలు చేసిన సినిమా ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ నిర్మించారు. ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ ఈ శుక్రవారమే(సెప్టెంబర్ 4) థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన డైరెక్టర్ వివి.వినాయక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.డ్రగ్స్‌కు వ్యతిరేకంగా దర్శకుడు జై జ్ఞాన ప్రభ మంచి సినిమా చేశాడని చంద్రబోస్ నాతో చెప్పారు. కథ బాగా నచ్చి ఈ సినిమాకు ఒక్క రూపాయి తీసుకోకుండా సంతోషంగా అన్ని పాటలు రాశానని ఆయన అన్నారు. ఇది గొప్ప సినిమా అవుతుందనే నమ్ముతున్నాను అని వినాయక్ చెప్పుకొచ్చారు.రంగస్థలం తర్వాత అంత సంతోషంగా ఈ చిత్రానికే పాటలు రాశాను. అద్భుతమైన అర్థవంతమైన సాహిత్యాన్ని అందించే సందర్భాలు ఈ సినిమాలో ఉన్నాయి. అలాంటి సందర్భాలను దర్శకుడు జ్ఞానప్రభ క్రియేట్ చేశారు. ఐదు పాటలు ఎంతో సంతృప్తినిచ్చాయి అని చంద్రబోస్ అన్నారు. -
‘నాతో సినిమా చేయడానికి పొలం అమ్మేశారు’
వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘రోమాంచకం’. సందీప్ రెడ్డి వంగా సమర్పణలో ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని రామానాయడు స్డూడియోస్‌లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.ఎక్కువమంది చదివింది: చిన్నారులే.. కానీ రెమ్యునరేషన్లో తోపులు.. ఎవరికి ఎంతంటే?‘అర్జున్ రెడ్డి సినిమా చేయడానికి సందీప్ నన్ను చాలా నమ్మాడు. నాతో ఆ సినిమా చేయడానికి సందీప్, ప్రణయ్‌లు తమ పొలాన్ని అమ్మాల్సి వచ్చింది. సినిమాపై, నాపై నమ్మకంతో అంతవరకు వెళ్లారు. ఇప్పుడు ఈ సినిమాకి గెస్ట్‌గా వచ్చినందుకు ఆయన థ్యాంక్స్ చెప్తున్నారు. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. సందీప్ పిలిచినప్పుడు రాకపోతే నేను బ్రతికి వేస్ట్. మన ఇద్దరి మధ్య ఉన్న బాండీంగ్లో థ్యాంక్స్ లాంటావి ఉండకూడదు. సందీప్ నాకు బ్రదర్ కాదు, స్నేహితుడు అంతకంటే కాదు. మా బాండింగ్ వేరే.’ అంటూ విజయ్ మాట్లాడుతూ భావోద్వేగం అయ్యాడు.‘రణబాలి’ విషయానికి వస్తే..హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘రణబాలి’. వీరిద్దరి పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చేసిన తొలి సినిమా ఇదే కావడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకుడు. అక్టోబర్ 16 ఈ సినిమా విడుదల కానుంది. బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతుండగా.. విజయ్ ఇందులో యోధుడి పాత్రలో కనిపించనున్నాడు. అజయ్, అతుల్ సంగీతం అందిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. చదవండి: ఓటీటీలోకి 'ఇరుముడి' వచ్చేది అప్పుడేనా? -
‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్...ముఖ్య అతిథిగా విజయ్ దేవరకొండ (ఫొటోలు)
-
కాలేజీలు చదువు చెప్పడానికా? సినిమా ఫంక్షన్లకా?
స్కూల్స్, కాలేజీలు ఉన్నది దేనికి? చదువు చెప్పడానికి. కానీ రీసెంట్ టైంలో వాటిని చదువు కంటే సినిమా ఈవెంట్స్ కోసమే ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రైవేట్ కాలేజీలు ఇదే పనిచేస్తున్నాయి. ఇన్నిరోజులు ఈ విషయాన్ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు గానీ రీసెంట్గా 'టాక్సిక్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో జరిగిన ప్రమాదమే ఇప్పుడు చర్చకు కారణం. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి కాలేజీలో ఇది జరగ్గా.. నలుగురైదుగురు విద్యార్థులు గాయపడటంతో పోలీసు కేసు కూడా నమోదైంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ ఐదు డోంట్ మిస్)మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో పలువురు విద్యార్థులు.. ఎత్తులో పెట్టిన సౌండ్ బాక్సులు పట్టుకుని వేలాడారు. దీంతో అది పట్టుతప్పి కుప్పకూలిపోయింది. ఈ సంఘటనలో ఇద్దరు అబ్బాయిలు తీవ్రంగా గాయపడ్డారు. ఓ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. అసలు చదువుకోవాల్సిన ఈ విద్యార్థులని సినిమా వేడుకకు రమ్మని చెప్పింది ఎవరు? కాలేజీ యాజమాన్యం ఇలా చేస్తుంటే విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? పిల్లలు ముచ్చటపడ్డారని వదిలేశారా? మా సినిమా ఈవెంట్‌కి ఇంతమంది వచ్చారని ఆర్భాటం చూపించుకోవడానికి ఇలా చేశారా?కాలేజీలో సినిమా ఈవెంట్లు చేయడంపై అటు సోషల్ మీడియాలో ఇటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో కోపం కనిపిస్తోంది. చదువు చెప్పే చోట ఇలాంటి కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే హీరోలకు ఫ్యానిజం/బానిసత్వం పేరిట తెలుగు రాష్ట్రాలో యువత చాలామంది చెడిపోయారు, చెడిపోతున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ ఒకరిపై ఒకరు అనవసర విద్వేషం పెంచుకుంటున్నారు. ఇది చాలదన్నట్లు కాలేజీల్లోనూ మూవీ ఈవెంట్స్ పెడుతుండటం షాకింగ్‌గా అనిపిస్తుంది. అందరూ కలిసి యువతని చెడగొట్టాలా ఏమైనా పూనుకున్నారా? అని సందేహం కలుగుతోంది.ప్రైవేట్ కాలేజీలు.. ఇలా సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సాంగ్ లాంచ్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఫ్రీ ప్రమోషనే కారణమని తెలుస్తోంది. సినిమా సెలబ్రిటీలు వచ్చారంటే మీడియా, సోషల్ మీడియాలో వాళ్ల కాలేజీ పేరు వినిపిస్తుంది. తద్వారా ఉచితంగా ప్రమోషన్ దొరుకుతుందని చాలా కాలేజీలు భావిస్తున్నాయి. ఒకరిని చూసి మరొకరు ఇదే పనిచేస్తున్నారు. మరికొన్ని కాలేజీలు అయితే ఏకంగా స్టార్ హీరోహీరోయిన్లతో ప్రకటనలు ఇస్తున్నాయి.అసలు సెలబ్రిటీలకు కాలేజీలతో ఏం సంబంధం? వాళ్లేమైనా దేశ సేవ చేస్తున్నారా? లేదంటే యాడ్ షూటింగ్ చేస్తున్నారా? అని పలువురు నెటిజన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు సోషల్ మీడియాలో కాలేజీ యాజమాన్యాలని నిలదీస్తున్నారు. 'టాక్సిక్' ఈవెంట్లో మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి మాట్లాడుతూ.. 'ఇలా అరిచి గోల చేస్తే ఇకపై ఏ మూవీ ఈవెంట్లకు మన కాలేజీలో అనుమతి ఇవ్వం' అని చెప్పడం విడ్డూరంగా అనిపించింది. ఎందుకంటే కాలేజీలు పెట్టింది చదువు చెప్పడానికి. ఈమె మాటలు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)(ఇదీ చదవండి: హోటల్లో ఏం జరిగిందో మీకు 90% తెలియదు: ఈశ్వర్ సాయి) -
‘టాక్సిక్’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన హీరోయిన్ రుక్మిణి వసంత్ (ఫొటోలు)
-
టాక్సిక్ మేకర్స్‌కు షాక్.. కేసు నమోదు
టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈవెంట్లో తొక్కిసలాట జరగడంతో నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఈవెంట్ నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు టాక్సిక్ చిత్ర యూనిట్‌తో పాటు మల్లారెడ్డి కాలేజీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేజీఎఫ్ స్టార్ యశ్ హీరోగా వస్తోన్న మూవీ టాక్సిక్. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. మల్లారెడ్డి కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవెంట్లో యష్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులకు కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరమ్మాయిలకి గాయలు కాగా.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు స్పృహ కోల్పోయినట్లు తెలిసింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)
-
టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫోటోలు
-
'టాక్సిక్' హైదరాబాద్ ఈవెంట్లో ప్రమాదం
యష్ హీరోగా చేసిన లేటెస్ట్ మూవీ 'టాక్సిక్'. వచ్చే బుధవారం (ఆగస్టు 26) పాన్ ఇండియా వైడ్ థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు రిలీజ్ చేశారు. తాజాగా హైదరాబాద్‌లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో శనివారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో యష్ మాట్లాడుతుండగా భారీ సౌండ్ బాక్స్ సెట్ కుప్పకూలింది. ఈ క్రమంలోనే ఇద్దరు యువకులు కాళ్లు విరిగినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరమ్మాయిలకి గాయలవగా.. వీళ్లలో ఒకామె స్పృహ కోల్పోయింది. వీళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో ఈవెంట్ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తీసిన 'టాక్సిక్' సినిమాలో తండ్రికొడుకులుగా యష్ ద్విపాత్రాభినయం చేశాడు. నయనతార, రుక్మిణి వసంత్, కియారా అడ్వాణీ, తారా సుతారియా, హ్యుమా ఖురేషి హీరోయిన్లు. రవి బస్రూర్ సంగీతమందించాడు. గీతూ మోహన్ దాస్ దర్శకురాలు. -
'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నోరు జారిన అజయ్ ఘోష్...
-
‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్...(ఫొటోలు)
-
‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన నటి కామాక్షి భాస్కర్ల (ఫొటోలు)
-
'పాంచాలి పంచభర్తృక' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
‘అనకాపల్లి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా సోనూ సూద్ (ఫొటోలు)
-
‘KJQ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసిన నటి రేఖా నిరోషా (ఫొటోలు)
-
నారింజ రంగు డ్రెస్‌లో మెరిసిపోతున్న నటి సిరి హనుమంత్ (ఫొటోలు)
-
చెన్నై లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
ఎమోషనల్ రాజా
రుత్విక్, విశాఖ ధిమాన్ జంటగా నటించిన చిత్రం ‘రాజా ది రాజా’. కె. శ్రీలత రెడ్డి సమర్పణలో అనిల్ బోయిడపు దర్శకత్వంలో కె. నిహారిక దాసరి నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలఅవుతోంది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది. గురువారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రుత్విక్ మాట్లాడుతూ–‘‘నిన్న (బుధవారం) జరిగిన ప్రీమియర్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ స్పందన చూసి, నేను చాలా అదృష్టవంతుడిని అనిపించింది.అలాంటి ప్రేమ, ఆదరణ కోసమే ఇన్నాళ్లు ఎదురుచూశాను. మీ అందరి ముందుకు హీరోగా రావడం చాలా ఎమోషనల్‌గా అనిపిస్తోంది. మేము ఎంతో ప్యాషన్‌తో చేసిన సినిమా ఇది’’ అన్నారు. ‘‘ఈ సినిమా ఒక కల. ఆ కలను నిజం చేసుకునే ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయి. మంచి అవుట్‌పుట్ కోసం మేమంతా ఎంతో కష్టపడ్డాం. ఈ సినిమాలోని భావోద్వేగాలు ప్రేక్షకులను కదిలిస్తాయి’’ అన్నారు అనిల్.‘‘ఈ సినిమా కోసం రుత్విక్ పడిన కష్టాన్ని మాటల్లో చెప్పలేను. మా టీమ్‌లోని ప్రతి ఒక్కరూ ఎంతో ప్రేమతో కష్టపడి పని చేశారు. ప్రేక్షకులు కూడా ఇదే ప్రేమతో సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు కె.నిహారిక. సంగీత దర్శకుడు మార్క్ కె. రాబిన్ మాట్లాడారు. -
'ఓ.! సుకుమారి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
జగపతిబాబు-లయ 'వదలా' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'వెంకట్రామయ్య గారి తాలూకా' సినిమా వేడుక... ముఖ్య అతిథిగా హాజరైన కల్వకుంట్ల కవిత (ఫోటోలు)
-
శ్రీకాంత్ 'మిస్టర్ మిడిల్ క్లాస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘నాగబంధం’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
వడ్డే నవీన్ ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)
-
‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్లో మెరిసిన శ్రీముఖి (ఫోటోలు)
-
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫోటోలు)
-
విజయ్ ఆంటోనీ ‘వంద దేవుళ్లు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)
-
తండ్రి-కొడుకుల అనుబంధంతో ‘ఐ యామ్ హ్యాండ్సమ్’
తండ్రి-కొడుకుల అనుబంధం, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన హృదయాన్ని హత్తుకునే చిత్రం ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ (Since 2009). దుర్గా దేవ్ నాయుడు హీరోగా నటిస్తూ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన ఈ చిత్రాన్ని K ఫిలిమ్స్ బ్యానర్ పై, మహేష్ గుడారు సమర్పణలో కేదార్నాథ్ నిర్మించారు. అన్విష కథానాయికగా నటించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్, ప్రీ-రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.ముఖ్య అతిథి కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ, ‘సినిమా విజయానికి అసలు బలం కంటెంట్. మంచి కథ, బలమైన భావోద్వేగాలు ఉన్న సినిమాలు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతాయి. దుర్గా దేవ్ నాయుడు నటుడిగా, దర్శకుడిగా ఒకేసారి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అభినందనీయం. ఆయనలో ఉన్న ప్రతిభ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. సినీ పరిశ్రమలో టాలెంట్‌కు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు, హీరో దుర్గా దేవ్ నాయుడు మాట్లాడుతూ, ‘నేను ఏలూరుకు చెందినవాడిని. మా నాన్న అరటిపండ్ల వ్యాపారి. చిన్న పట్టణం నుంచి వచ్చి ఈ రోజు ఇక్కడ నిలబడటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అందుకే నేను నాకు నేనే స్టార్ అని గర్వంగా చెప్పుకుంటాను. ప్రేక్షకులందరికీ నచ్చే సినిమా తీశాను. ఒకవేళ నచ్చకపోతే ఇంకా మంచి సినిమా తీస్తాను అని నిజాయితీగా చెబుతున్నాను. ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. చిత్ర యూనిట్‌లోని ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారు. డబ్బుల గురించి ఆలోచించకుండా సినిమా కోసం కష్టపడ్డారు. నిర్మాత కేదార్నాథ్, కేఎల్ దామోదర్ ప్రసాద్ ఎంతో సహకారం అందించారు. తెలుగు ప్రేక్షకులతో పాటు మంచి కంటెంట్ కోసం ఎదురుచూసే ప్రతి సినీ ప్రేమికుడికి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది’ అన్నారు.ట్రైలర్ విడుదల అనంతరం చిత్ర బృందం మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించింది. విలేకరులు అడిగిన ప్రశ్నలకు దర్శకుడు దుర్గా దేవ్ నాయుడు, నిర్మాత కేదార్నాథ్, సాంకేతిక నిపుణులు సమాధానాలు ఇచ్చారు. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా చివరి 45 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురి చేస్తాయని, థియేటర్ల నుంచి తృప్తిగా బయటకు వస్తారని వారు తెలిపారు. ‘ఐ యామ్ హ్యాండ్సమ్’ కుటుంబ బంధాలు, త్యాగం, ప్రేమ, భావోద్వేగాల సమ్మేళనంగా ప్రేక్షకులను అలరించేందుకు జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
విజయవాడలో గ్రాండ్ గా ‘పెద్ది ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం..!
రామ్ చరణ్- బుచ్చిబాబు కాంబోలో వస్తోన్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఈవెంట్ జరగనుంది. దీంతో పాస్‌లు పొందిన ఫ్యాన్స్ వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే ఐదున్నర గంటలకే గేట్లు మూసేయడంతో ఫ్యాన్స్ ఆందోళనకు దిగారు.దీంతో పెద్ది సినిమా రిలీజ్ ఈవెంట్ వేదిక దగ్గర గందరగోళం నెలకొంది. పాసులు ఉన్నవారిని అనుమతించడం లేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీ పాసులు తీసుకుని వివిధ జిల్లాల నుంచి అభిమానులు విజయవాడ చేరుకున్నారు. తిరుపతి, నెల్లూరు వంటి సుదూరప్రాంతాల నుంచి ఫ్యాన్స్ పెద్దఎత్తున తరలివచ్చారు. స్టేడియం ఫుల్ అయిపోందంటూ పోలీసులు అభిమానులను అనుమతించడం లేదని తెలుస్తోంది. దీంతో పోలీసులతో అభిమానుల వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. -
కర్నాటకలో పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్
-
రమణి కళ్యాణం : చీరలో మెరిసిపోతున్న నటి దీప్షిక చంద్రన్ (ఫొటోలు)
-
'రమణి కళ్యాణం' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
పాయల్ రాజ్‌పుత్ ముఖ్య అతిథిగా 'ఫస్ట్ టైమ్' మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'పురుష:' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి: ప్రియదర్శి
‘‘దూరదర్శని’ సినిమా ట్రైలర్ చూడగానే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో అందరికీ ప్రపంచాన్ని పరిచయం చేసింది దూరదర్శని. నేను కూడా చిన్నప్ప్పుడు దూరదర్శని చానల్లో సినిమాలు చూసి, స్ఫూర్తి పొంది నటుడిగా మారాను. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల హృదయాలను హత్తుకోవడంతో పాటు మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని హీరో ప్రియదర్శి చెప్పారు. సువీక్షిత్, గీతిక జంటగా కార్తికేయ కొమ్మి దర్శకత్వం వహించిన చిత్రం ‘దూరదర్శిని’. వారాహ మూవీ మేకర్స్‌పై జయశంకర్ రెడ్డి .ఎం, పాటిమీది సంతోష్ నిర్మించిన ఈ చిత్రం నేడు రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు ప్రియదర్శి, ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రదర్శకుడు సాయి కంపాటి అతిథులుగా హాజరయ్యారు. -
'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘దూరదర్శని’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘గోదారి గట్టుపైన..’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
లేడీ ఫ్యాన్ చేసిన పనికి షాకైన ధునుష్.. వీడియో వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సినిమా ఈవెంట్ కోసం ఎప్పుడు వచ్చిన.. ధనుష్‌ని చూసేందుకు ఫ్యాన్స్ భారీగా తరలి వస్తుంటారు. నిన్న(ఏప్రిల్ 26) హైదరాబాద్‌లో నిర్వహించిన ‘కర’ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్లోనూ అదే జరిగింది. ధనుష్ వస్తున్నాడని తెలిసి భారీగా అభిమానులు తరలివచ్చారు. అందులో ఓ మహిళా అభిమాని చేసిన పనికి ధనుష్ షాకయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది?ధనుష్ కోసం..ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో విఘ్నేష్ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్ సతీష్ కుమార్, రాజేశ్‌కుమార్ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ ఈవెంట్‌కి ధనుష్ కూడా వస్తున్నాడని తెలిసి ఓ మహిళా అభిమాని ఆ హోటల్‌కి వెళ్లింది. తన అభిమాన హీరోని లైవ్‌లో చూసి మురిసిపోయింది.మోకాళ్లపై కూర్చోని.. ఈవెంట్ ముగిసిన తర్వాత ధనుష్ వేదికపై నుంచి వెళ్తుండగా.. సదరు మహిళా అతన్ని కలిసేందుకు వచ్చింది. తెలిసిన వారి సహాయంతో ధనుష్‌ను దగ్గరకు వెళ్లింది. అతను ఆమెను పలకరించగానే.. భావోద్వేగానికి లోనైంది. ఒక్కసారిగా మోకాళ్లపై కూర్చొని నమస్కరించింది. ఊహించని ఈ పరిణామానికి ధనుష్ షాకయ్యాడు. క్షణాల్లో తెరుకొని వెంటనే ఆమెను పైకి లేపేందుకు ప్రయత్నించారు. కానీ ఆమె మళ్లీ అలాగే చేయడంతో కాసేపు ఇబ్బందిపడ్డారు. ఆ తర్వాత ఆమెను పైకి లేపి, మాట్లాడి, చివరకు ఆమెతో కలిసి ఫొటో దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. A female fan goes down on her knees to greet #Dhanush at the #Kara event.#MamithaBaiju pic.twitter.com/ZtTLrqPmId— Milagro Movies (@MilagroMovies) April 26, 2026 -
నా హృదయానికి దగ్గరైన సినిమా కర : ధనుష్
‘‘అసాధారణమైన పరిస్థితుల్లో చిక్కుకున్న ఒక సాధారణ మనిషి కథ ‘కర’. నా హృదయానికి దగ్గరైన చిత్రం ఇది’’ అని ధనుష్ అన్నారు. ధనుష్, మమితా బైజు హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘కర’. కుష్మిత గణేష్ సమర్పణలో విఘ్నేష్ రాజా దర్శకత్వంలో డా. ఇషారి కె. గణేశ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కానుంది. సీహెచ్ సతీష్ కుమార్, రాజేశ్‌కుమార్ బొబ్బర ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘కర’ తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ వేడుకలో ధనుష్ మాట్లాడుతూ– ‘‘విఘ్నేష్ రాజా స్పెషల్ ఫిల్మ్‌మేకర్. ‘కర’లాంటి సినిమా ఇచ్చిన తనకు థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు. ‘‘కర’ ట్రైలర్ బాగుంది. ఈ సినిమా విజయం సాధించాలి’’ అంటున్న అతిథి బుచ్చిబాబుని రామ్ చరణ్ ఫ్యాన్స్ ‘పెద్ది’ అప్డేట్ కోసం అడగ్గా.. ‘‘స్పెషల్ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. జూన్ 25న ఈ సినిమాని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. మరో అతిథి వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘సార్’ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో అందుకు రెండున్నర రెట్లు ఎక్కువగా ‘కర’ హిట్ కావాలి’’ అని చెప్పారు. ఇషారి కె. గణేశ్ మాట్లాడుతూ– ‘‘మన జీవితంలో నిత్యం జరుగుతున్నవే ఈ సినిమాలో ఉంటాయి’’ అన్నారు. ‘‘ధనుష్‌గారు ‘కర’కు ఓకే చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ప్రేక్షకుల డబ్బు, సమయాన్ని గౌరవించేలా ఈ సినిమా వారిని ఎంటర్టైన్ చేస్తుంది’’ అని చెప్పారు విఘ్నేష్ రాజా. సతీష్ మాట్లాడుతూ –‘‘ధనుష్ సార్‌తో ఓ మంచి హిట్ సినిమా చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. నా మిత్రుడు రాజేశ్ స΄ోర్ట్ చాలా ఉంది’’ అన్నారు. కేఎస్ రవికుమార్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలోని నా ΄ాత్ర కోసం ్ర΄ోస్థటిక్ మేకప్ వేయడానికి, తీయడానికి నాలుగు గంటలు పట్టేది’’ అని అన్నారు. -
‘గేదెల రాజు కాకినాడ తాలూకా’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)
-
ఆర్య కొత్త సినిమా.. ‘మిస్టర్ ఎక్స్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
‘పాపం ప్రతాప్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'తిమ్మరాజుపల్లి టీవీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘తెరచాప’: మండుటెండలో చెప్పుల్లేకుండా షూటింగ్, చాలా కష్టపడ్డారు
నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించిన తాజా చిత్రం ‘తెరచాప’. అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మిస్తున్న ఈ చిత్రానికి జోయల్ జార్జ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, జబర్దస్త్ అశోక్, నాగి కీలకపాత్రలు పోషించారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంగా తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీ కనకాల మాట్లాడుతూ..ఈ సినిమాలో నాతోపాటు ఎందరో సీనియర్ నటులు నటించారు. అలాగే కొత్త వారు కూడా నటించారు. మండుటెండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నటించడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు. శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తిళ్లు ఎన్ని ఉన్నా కూడా ఆయన వాటిని ఎదిరించి నిలబడ్డారు. అంత కష్టపడి నటించినా ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నాను అని నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనందపడ్డాను.ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు.దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... "సముద్రతీతంగా అటువంటి పరిస్థితులలో ఒక సినిమా తీయడం అనేది ఎంతో కష్టమైన విషయం. అటువంటి సినిమాను ఈ చిత్రం బృందం అంతా కలిసి ఎంతో పట్టుదలతో పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అందరూ వీరిని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను" అన్నారు.‘సినిమా కోసం మేము సముద్ర తీరాన ఎన్నో రోజులు ఎంతో కష్టపడి అక్కడ బ్రతికే మత్స్యకారుల జీవితాలను అర్థం చేసుకొని వారిలో ఒకరిగా కలిసిపోయి చిత్రీకరించాం. ఎంతోమంది ఎన్నో కలలు కని సినిమా తీసినట్లే మేము కూడా చేశాం. మా సినిమాను ప్రేక్షకులు అంతా ఆదరించి మంచి విజయం సాధించేందుకు తోడ్పడుతారని కోరుకుంటున్నాను’ అని హీరో నవీన్‌రాజ్ శంకరాపు అన్నారు. -
నాగశౌర్య 'బ్యాడ్ బాయ్ కార్తీక్' సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
మీది చిన్న సినిమా.. ఇబ్బంది పడతారని చెప్పారు: నిహారిక
మెగా డాటర్ నిహారిక నటిగా రాణిస్తూనే నిర్మాతగా కూడా దూసుకెళ్తున్నారు. కమిటీ కుర్రోళ్లు మూవీ తర్వాత నిర్మాతగా బిజీ అయిపోయారు. ప్రస్తుతం తన సొంతం బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై రాకాస అనే మూవీని నిర్మించారు. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా వస్తోన్న ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం ఏప్రిల్ 03న థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు.ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన నిహారిక నిర్మాతగా తన అనుభవాలను పంచుకుంది. ఇలాంటి సినిమా తీస్తున్నామనగానే చాలామంది సలహాలు ఇచ్చారని తెలిపింది. వీఎఫ్ఎక్స్ విషయంలో పెద్ద పెద్ద సినిమాలే కష్టపడాల్సి వస్తోంది.. మీది చిన్న బడ్జెట్ సినిమా.. చాలా ఇబ్బంది పెడతారు చూసుకోండని నాతో చెప్పారని గుర్తు చేసుకుంది.ఏం చేసినా మాటలు అనే వాళ్లు అంటూనే ఉన్నారు. అందుకే నేను చేయాలనుకున్నది చేస్తూనే ఉంటానని తెలిపింది. ఓ మంచి సినిమా తీశాం.. జనాల్లోకి తీసుకెళ్లడానికి బాగా ప్రమోట్ చేస్తున్నామని నిహారిక వెల్లడించింది. ఇంటింటికి వెళ్లి సినిమా చూపించడానికి కూడా రెడీగా ఉన్నామని నిహారిక పేర్కొంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌లో భాగమైన ప్రతి ఒక్కరికీ సొంతిల్లు, కారు ఉండాలని ఆశిస్తున్నట్లు నిహారిక తన డ్రీమ్‌ను బయటపెట్టింది. కమిటీ కుర్రోళ్లు మూవీతో 11 మంది కొత్త వాళ్లను పరిచయం చేశానని నిహారిక తెలిపింది. -
‘రాకాస’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమా ఫ్లాప్ అయితే.. కోడి రామకృష్ణ మాటలు గుర్తు తెచ్చుకుంటా: ప్రియదర్శి
ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘సుయోధన’. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. పలు హిట్ చిత్రాలను రిలీజ్ చేసిన శ్రీ లక్ష్మి పిక్చర్స్ సంస్థ ‘సుయోధన’ సినిమాను విడుదల చేస్తోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ నుహైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హీరో ప్రియదర్శి మాట్లాడుతూ - ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు మరింత చేరువ కావాలి, వారి ఆదరణ మరింత పొందాలనే ప్రయత్నిస్తుంటాను. ఆ క్రమంలో ఏదైనా సినిమా ఫ్లాప్ అయితే బాధగా ఉంటుంది. అలాంటప్పుడే కోడి రామకృష్ణ లాంటి లెజెండ్స్ నా గురించి బాగా చెప్పారు కదా అనే ధైర్యం, ఆత్మవిశ్వాసం కలుగుతుంటాయి. సాయి కుమార్ , ఆయన కుటుంబం 50 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. పరిశ్రమ అభివృద్ధిలో భాగమవుతున్నారు. ఈ చిత్రంలో సుయోధన పాత్రకు ఆయన తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. అంత బాగా నటించారు. ప్రేక్షకుల ఊహకు అందనంత ఆసక్తికరంగా సాగే చిత్రమిది. ఈ కథ, టైటిల్ విన్నప్పుడే ఇది కొత్తగా ఉంటుందనే నమ్మకం కలిగింది. ఈ సినిమానే నన్ను సెలెక్ట్ చేసుకుందని అనిపిస్తుంటుంది. ఈ చిత్రంతో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నా. హాలీవుడ్ క్లాసిక్ మూవీ డ్యూన్ లెవెల్లో ఈ సినిమా చేయాలని మా మూవీ టీమ్ పట్టుదలగా పనిచేశారు. మా సినిమాను మీరు థియేటర్స్ లో చూసి మంచి సక్సెస్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా’అన్నారు.సాయికుమార్ మాట్లాడుతూ - నేను 1972లో ధుర్యోధనుడి పాత్రను నాటికలో అభినయించాను. అప్పటికి నా వయసు 11 ఏళ్లు. ఇప్పుడు ఈ చిత్రంలో సుయోధనుడిగా నటిస్తుంటే ఆ రోజులు గుర్తుకువచ్చాయి. మీరు చేసిన సీన్స్ చాలా బాగా వచ్చాయని మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెబుతున్నారు. మూవీలో ఎలాంటి మలుపులు ఉంటాయో మాకూ తెలియదు. నెక్ట్స్ ఏం జరుగుతుంది అనే ఆసక్తి కలిగించే చిత్రమిది. ఇలాంటి సినిమాలు తరుచూ రావు. ఈ టీమ్ అంతా చాలా కష్టపడి, ప్యాషనేట్ గా మూవీ చేశారు. రేపు థియేటర్స్ లోకి వస్తున్న సుయోధన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా’ అన్నారు. -
ఘనంగా 'బ్యాండ్ మేళం' ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
సినిమాపై భయం.. అబ్బాస్‌కు మంచి కమ్‌బ్యాక్!: హీరో
ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం హ్యాపీ రాజ్. నటి శ్రీగౌరి హీరోయిన్గా నటించిన ఈ మూవీ ద్వారా నటుడు అబ్బాస్ రీఎంట్రీ ఇస్తున్నాడు. మరియరాజు ఇళంజెలియన్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. బియాండ్ పిక్చర్స్ పతాకంపై జయవర్ధ నిర్మించిన ఈ మూవీకి జయకాంత్ సురేశ్ సహనిర్మాతగా వ్యవహరించాడు.దేనికీ భయపడని వ్యక్తి జస్టిన్ ప్రభాకరన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకుని ఈ నెల 27న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చెన్నైలో నిర్వహించిన ప్రీరిలీజ్ కార్యక్రమంలో జీవీ ప్రకాశ్ కుమార్ మాట్లాడుతూ.. దర్శకుడు మరియరాజు దేనికీ భయపడని వ్యక్తి అన్నారు. ఆయన చెప్పిన కథ నచ్చిందని, అయితే మంచి నిర్మాత కోసం ఎదురుచూస్తున్న సమయంలో జయకాంత్, జయవర్ధ ఈ సినిమా చేసేందుకు ముందుకు వచ్చారన్నారు. మధ్యలోనే వదిలేస్తారా?కొత్త దర్శకుడు, కొత్త నిర్మాతలు కావడంతో ఈ మూవీని పూర్తి చేస్తారా? మధ్యలోనే వదిలేస్తారా? అన్న భయం కలిగిందన్నారు. ఇదే విషయాన్ని వారిని అడిగానన్నారు. అయితే వారు ఈ సినిమాను చాలా బాగా రూపొందించి, బిజినెస్ పూర్తి చేసి రిలీజ్‌కు సిద్ధమవడం సంతోషంగా ఉందన్నారు. హ్యాపీరాజ్ చిత్రం తనకు చాలా సంతోషం కలిగించిందన్నారు. అందరికీ ఏమో కానీ అబ్బాస్‌కు కచ్చితంగా ఈ మూవీ కంబ్యాక్‌గా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన అంత బాగా నటించారని కితాబిచ్చారు. -
‘ఉస్తాద్ భగత్‌సింగ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అన్ని వర్గాలకు నచ్చేలా 'రాయుడు గారి తాలూకా' : ఉలిశెట్టి శ్రీనివాస్
ఉలిశెట్టి శ్రీనివాస్ హీరోగా, రచయితగా పరిచయమవుతున్న తాజా చిత్రం 'రాయుడు గారి తాలూకా'. ఈ సినిమా మార్చి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా నర్సాపురం, విశాఖపట్నంలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్లో స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా హీరో, రైటర్ ఉలిశెట్టి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ.. "ఇదొక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రం. సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతూ మిమ్మల్ని అలరిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలి" అని కోరారు.ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు కళ్యాణ్ కృష్ణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఒక వీడియో సందేశం (AV) ద్వారా ఆయన మాట్లాడుతూ.. "నేను ఇప్పటికే సినిమా చూశాను, నాకు బాగా నచ్చింది. చిత్ర బృందం కొత్తవారైనప్పటికీ, చాలా పరిణతితో అద్భుతంగా నటించారు. ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది. ప్రతి ఒక్కరూ థియేటర్లలోనే సినిమా చూడండి" అని చిత్ర యూనిట్‌కు ఆశీస్సులు అందించారు. మార్చి 6న ఈ చిత్రం విడుదల కానుంది. -
‘సాంప్రదాయని సుప్పినీ శుద్ధపూసనీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
వరలక్ష్మీ శరత్‌కుమార్ ‘సరస్వతి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘సన్ ఆఫ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'D/o ప్రసాదరావు' ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
హే బల్వంత్ నా కెరీర్లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అవుతుంది: సుహాస్
సుహాస్, శివానీ నాగారం హీరో హీరోయిన్లుగా, వీకే నరేష్ కీలక పాత్రలో నటించిన సినిమా ‘హే బల్వంత్’. గోపీ అచ్చర దర్శకత్వంలో బి. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ సినిమా నేడు (శుక్రవారం) విడుదలవుతోంది. నిర్మాతలు–పంపిణీదారులు వంశీ నందిపాటి, బన్నీ వాసు రిలీజ్ చేస్తున్నారు. గురువారం జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో సుహాస్ మాట్లాడుతూ–‘‘ఓ కామన్ మేన్ గా నేనిక్కడి వరకు వచ్చాను.ప్రేక్షకులు పెట్టే ప్రతి రూపాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో కాస్త గ్యాప్ తీసుకుని, ‘హే బల్వంత్’ సినిమా చేశాను. ఈ సినిమా నా కెరీర్లో బిగ్గెస్ట్ రిలీజ్. బిగ్గెస్ట్ సక్సెస్ కూడా అని అనుకోవచ్చు. సుహాస్ ‘2.ఓ’గా ఈ మూవీ ప్రేక్షకులందరినీ అలరిస్తుంది. ఆడియన్స్ కు నేనిస్తున్న గ్యారెంటీ ఇది’’ అన్నారు.‘‘కొత్తదనంతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘హే బల్వంత్’ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. యాక్టర్‌గా సుహాస్ నెక్ట్స్ ఫేజ్‌లోకి వెళ్తున్నాడు’’ అన్నారు వీకే నరేష్. ‘‘650కి పైగా స్క్రీన్స్‌లో మా సినిమాను రిలీజ్ చేయబోతున్నాం. ఇది మా కాన్ఫిడెన్స్ కి నిదర్శనం. పెయిడ్ ప్రీమియర్లు కూడా స్టార్ట్ చేశాం. మేం కచ్చితంగా హిట్ కొట్టబోతున్నాం’’ అన్నారు వంశీ నందిపాటి. -
విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
‘సీతా పయనం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అమరావతికి ఆహ్వానం' హారర్ థ్రిల్లర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘ఎర్రచీర ’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘ఓం శాంతి శాంతి శాంతిః’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి
-
'ఆయన ఆస్ట్రేలియా క్రికెటర్లా ఉంటాడు'..మాస్ మహారాజా రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది అభిమానుల ముందుకు రానున్నారు. సంక్రాంతికి కానుకగా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీతో ఫ్యాన్స్‌ను పలకరించనున్నారు. కిశోర్ తిరుమల డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ జనవరి 13న థియేటర్లలో సందడి చేయనుంది. నేపథ్యంలోనే హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్‌కు హాజరైన రవితేజ మాట్లాడారు.రవితేజ మాట్లాడుతూ.. 'ఈ చిత్రంలో ఆషికా, డింపుల్ అద్భుతంగా చేశారు. ఈ సినిమాలో వాళ్లతో పాటు నేను అందంగా కనిపించానంటే ఆ క్రెడిట్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్లకే దక్కుతుంది. మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్‌తో కలిసి 13 సినిమాలు చేశా. శేఖర్ కంపోజ్ చేసిన మూడు సాంగ్స్ బాగుంటాయి. ఇందులో ఫైట్స్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి. ఇక మా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎక్కువ మాట్లాడరు. అతన్ని చూస్తే ఆస్ట్రేలియన్ క్రికెటర్లా ఉంటాడని అన్నారు. స్టీవ్ వా అనుకుంటా. హిట్‌తో సంబంధం లేకుండా కొంతమంది దర్శకులతో కలిసి ప్రయాణించడాన్ని నేను చాలా ఆస్వాదిస్తా. అలా అనిల్ రావిపూడి, హరీశ్ శంకర్, బాబీ, కిశోర్‌లతో నేను విపరీతంగా ఎంజాయ్ చేస్తా. నా నెక్ట్స్ మూవీ శివ నిర్వాణతో చేస్తున్నా. ఇక ఈ మూవీకి భీమ్స్ అదరగొట్టేశాడు. కిశోర్ తిరుమలతో హిట్ ట్రాక్ అవ్వాలని కోరుకుంటున్నా.' అని అన్నారు.'JAN 13TH - BHARTHA MAHASAYULAKU WIGNYAPTHI - thammullu kaluddham 💥💥💥 '@RaviTeja_offl super confident speech at the #BharthaMahasayulakuWignyapthi grand pre-release event ❤🔥#BMW GRAND RELEASE WORLDWIDE ON JANUARY 13th, 2026.@RaviTeja_offl @DirKishoreOffl… pic.twitter.com/EHB6UXkmQ9— SLV Cinemas (@SLVCinemasOffl) January 10, 2026 -
'మన శంకర వరప్రసాద్‌గారు' ప్రీరిలీజ్‌లో చిరంజీవి ,వెంకీ సందడి (ఫొటోలు)
-
సుమతో అనిల్ రావిపూడి కామెడీ.. పడి పడి నవ్విన చిరంజీవి
-
ప్రభాస్ గారు గ్లోబల్‌స్టార్
‘‘ప్రభాస్‌గారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్‌స్టార్ మాత్రమే కాదు. ఆయన సినిమాలు విదేశాల్లోనూ విడుదల అవుతున్నాయి. ప్రభాస్‌గారు గ్లోబల్‌స్టార్. ‘ది రాజాసాబ్’ సినిమా చేసే విషయంలో నాకు ఒత్తిడి లేదు అని చెప్పలేను. అయితే సినిమా చూసుకున్నాను. హీరో క్యారెక్టర్‌తో పాటు సరికొత్త క్యారెక్టరైజేషన్స్ ను కూడా సినిమాలో చూస్తారు. ప్రభాస్‌గారిని ఎలా చూడాలని ఆడియ న్స్ అనుకున్నారో అలానే చూస్తారు’’ అని చెప్పారు దర్శకుడు మారుతి. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ , రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించగా, సంజయ్‌దత్ మరో ప్రధాన పాత్రలో నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో మారుతి మాట్లాడుతూ– ‘‘నేడు మా సినిమా ప్రీమియర్స్ పడుతున్నాయి. ప్రభాస్ ఫ్యా న్స్ ఎంత సంతోషంతో థియేటర్స్‌కి వెళ్తారో, అంతకు రెట్టింపు ఆనందంతో బయటకు వస్తారు’’అని చెప్పారు. ‘‘హ్యూజ్ హారర్ ఫాంటసీ చిత్రంగా ‘ది రాజాసాబ్’ ఆడియన్స్ ను మెప్పిస్తుంది. ఈ పండక్కి ఏడు సినిమాల వరకు విడుదల అవుతున్నాయి. దీంతో థియేటర్స్‌ను షేర్ చేసుకోకతప్పదు’’ అని చెప్పారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. ‘‘ప్రభాస్‌గారి ఓవరాల్ పెర్ఫార్మె న్స్ ను ఈ సినిమాలో చూస్తారు’’ అన్నారు తమన్ . ‘‘ఈ నెల 9 నుంచి మా సినిమాను థియేటర్స్‌లో చూసి, ఎంజాయ్ చేయండి’’ అని పేర్కొన్నారు కృతీ ప్రసాద్. -
'కానిస్టేబుల్ కనకం 2' సీజన్ 2 ప్రెస్ మీట్ (ఫొటోలు)
-
‘ఓ అందాల రాక్షసి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)
-
మారిపోయిన ప్రభాస్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
ప్రభాస్.. పాన్ ఇండియా నెంబర్ వన్ స్టార్. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ఆయన ఫ్లాపు సినిమాలకు కూడా వందల కోట్ల కలెక్షన్స్ వచ్చేస్తాయి. అలాంటి హీరో బయటకు వస్తే ఎంత హడావుడి చేయాలి? కానీ ప్రభాస్ చాలా సింపుల్‌గా ఉంటాడు. స్టార్ హీరో అనే బిల్డప్ ఆయన ముఖంలో ఎప్పుడూ కనిపించదు. తన సినిమాల గురించి కూడా పెద్దగా గొప్పలు చెప్పుకోడు. సినిమా ఈవెంట్లో ఇచ్చే స్పీచులు కూడా ఒకటి, రెండు నిమిషాలకు మించి ఉండదు. కానీ ‘ది రాజాసాబ్’ ప్రీరిలీజ్ ఈవెంట్లో కొత్త ప్రభాస్ కనిపించాడు. ఎప్పుడూ లేనంతగా చాలా ఎక్కువ సేపు స్పీచ్ ఇచ్చాడు.అందుకే పిలకరాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ దాదాపు 10 నిమిషాల వరకు మాట్లాడితే..అందులో ఎక్కువసేపు ఫ్యాన్స్ ప్రస్తావనే తెచ్చాడు. అభిమానుల కోసమే ది రాజాసాబ్ సినిమా చేశామని చెప్పాడు. అంతేకాదు ‘మీ కోసమే పిలక వేసుకొని వచ్చా’ అంటూ తన పిలక చూపించి..నవ్వించాడు. ఇక ఆయన స్పీచ్ మధ్యలో ఫ్యాన్స్ అంతా ‘బాహుబలి జయహో’ అంటుంటే.. ‘నా స్పీచ్ బోరింగ్‌గా ఉంటుందని మీరు అలా అంటున్నారు కదా.. ఏదో ఒకరోజు స్టేజ్‌పై ఎంటర్టైన్ చేస్తా..మీరంతా షాకైపోతారు’ అంటూ చిన్నపిల్లాడిలా ప్రభాస్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఇక తన పెళ్లిపై కూడా ఆయన ఫన్నీగా స్పందించారు. ‘ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?’ అని సుమ ప్రశ్నించగా.. ‘అది తెలియకనే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు’ అంటూ నవ్వేశాడు. ఫ్యాన్స్: ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయికి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి..?హీరో ప్రభాస్: అది తెలియకే ఇంతవరకూ పెళ్లి చేసుకోలేదు pic.twitter.com/VI5FzMAvFc— PulseNewsBreaking (@pulsenewsbreak) December 27, 2025ఇక సూట్లో వచ్చిన తమన్‌పై కూడా ప్రభాస్ పంచులు వేశాడు. ‘అంత ధైర్యం ఏంటి డార్లింగ్. సీరియస్‌గా చెబుతున్నా.. నేను కూడా ఇలా సూట్ వేసుకోని రావాలని అన్నీ రెడీ చేసుకుంటా. కబోర్డులో దాదాపు 200 వరకు డ్రెస్సులు ఉంటాయి. బాగా రెడీ అయి రావాలనుకుంటాను. కానీ ఓవర్‌గా ఉంటుందిలే అనుకొని సింపుల్‌గా వచ్చేస్తా. తమన్ లాంటి ధైర్యం నాకెప్పుడు వస్తుందో’ అని చెప్పడంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంతా ఫుల్‌గా నవ్వేశారు. ఆ ఒక్క మాటతో..ప్రభాస్ ఎప్పుడూ తన సినిమాల గురించి డబ్బా కొట్టుకోరు. ‘మా సినిమా అదిరిపోయింది..బ్లాక్ బస్టర్ హిట్ పక్కా’ అని ఎక్కడా చెప్పలేడు. కామ్‌గా సినిమా చేసుకొని పోతాడు.హిట్ అయినా, ఫ్లాప్ అయినా పెద్దగా మాట్లాడడు. ఈ సారి కూడా అలానే మాట్లాడారు. ‘ఈ పండక్కి అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్లు అవ్వాలి. అందులో మాది కూడా ఉంటే బాగుంటుంది’ అని మాత్రమే అన్నాడు. ఈ ఒక్క మాట చాలు.. మిగిలిన సినిమాలకు ప్రభాస్ ఎంత గౌరవం ఇస్తున్నాడో చెప్పడానికి. అంతేకాదు సీనియర్ హీరోలను కూడా ఆయన ఎంతో గౌరవిస్తాడు. ‘సీనియర్లు సీనియర్లే. వాళ్ల నుంచి మేమంతా నేర్చుకొన్నాం. వాళ్ల సినిమాలు బాగా ఆడాలి’ అంటూ సంక్రాంతి పోటీలో ఉన్న చిరంజీవి, రవితేజ లాంటి సీనియర్ హీరోలకు తన తరపున ఆల్ ది బెస్ట్ చెప్పాడంతే.. ఆయన సీనియర్లకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక మారుతి ఎమోషల్ అయితే..దగ్గరకు వచ్చి ఓదార్చడమే కాదు.. `మూడేళ్ల కష్టం కన్నీళ్ల రూపంలో వచ్చింది` అంటూ తనదైన శైలీలో కవర్ చేశాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడుతూ.. ‘డార్లింగ్ పెన్నుతో రాశావా… మిషన్ గన్నుతో రాశావా’ అంటూ మారుతిపై ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్ ఫుల్ అవుతున్నారు. They Call him 'Lottery Star' 💔#prabhas #RajaSaab pic.twitter.com/hS3uvAO2ao— Naa_istam 🚩 (@Grookk12) December 28, 2025మొత్తంగా ప్రభాస్ ఎప్పుడూ లేని విధంగా చాలా హుషారుగా, సరదాగా ఎక్కువ స్పీచ్ ఇచ్చాడు. తమ అభిమాన హీరో ఇలా ఓపెన్‌గా మాట్లాడడం చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. -
అరుపులు.. కేకలు.. ప్రభాస్ స్పీచ్ తో దద్దరిల్లిన ఈవెంట్
-
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఫ్యాన్స్ సందడి.. ఫోటోలు
-
సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ అవ్వాలి: ప్రభాస్
‘‘ది రాజా సాబ్’ సినిమాలో మా నానమ్మగా జరీనా వాహబ్గారు నటించారు. ఆమె డబ్బింగ్ చెబుతుంటే నా సీన్స్ మర్చిపోయి నానమ్మ సీన్స్ చూస్తుండిపోయా. ఈ సినిమాలో నాతోపాటు మా నానమ్మ కూడా ఒక హీరో. ఇది నానమ్మ–మనవడి కథ’’ అని ప్రభాస్ తెలిపారు. ఆయన హీరోగా రూ పొందిన చిత్రం ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దీ కుమార్ హీరోయిన్లుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 9న రిలీజ్ కానుంది. శనివారం నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ మాట్లాడుతూ– ‘‘నేను, మారుతి కలిసినప్పుడు అన్నీ యాక్షన్ సినిమాలు అయిపోతున్నాయి... ఫ్యాన్ ్సని ఎంటర్టైన్ చేయాలన్నాను. ఫైనల్‌గా ఈ హారర్ కామెడీ సెట్ అయింది. నేనైతే మారుతిగారి రైటింగ్‌కి ఫ్యాన్ అయిపోయాను. క్లైమాక్స్‌ని పెన్ తో రాశావా? గన్ తో రాశావా? నిజం చెప్పు డార్లింగ్ (మారుతి). కొత్తపాయింట్ ఇది. ఈ సినిమాకి విశ్వప్రసాద్‌గారు హీరో. మూడేళ్లపాటు ఈ మూవీ తీసినప్పుడు.. అనుకున్న బడ్జెట్‌కంటే ఎక్కువ అవుతున్నా మేమైనా భయపడ్డాం కానీ ఆయన భయపడలేదు.. ఏంటి సార్ మీ ధైర్యం (నవ్వుతూ).ఈ మూవీ అనుకున్నప్పుడు తమన్ ఒక్కడే చేయగలడు... ఈ లెవల్ ఆర్ఆర్ చేయగలిగేవారు ఎవరున్నారు మనకి ఇండియాలో అనుకున్నాం. కెమెరామేన్ కార్తీక్‌గారు అద్భుతమైన వర్క్ చేశారు. రామ్–లక్ష్మణ్, సాల్మోన్ మాస్టర్స్ ఫైట్స్ ఇరగదీశారు. మనకి పదిహేనేళ్ల తర్వాత వినోదం అందిస్తున్నారు మారుతిగారు. మరి... చూసుకోండి. అందులోనూ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్‌బస్టర్ అవ్వాలి... మా ‘ది రాజా సాబ్’ కూడా అయిపోతే ఇంకా హ్యాపీ. ఇక వెరీ ఇంపార్టెంట్. సీనియర్ సీనియరే (సంక్రాంతి పోటీలో ఉన్న సీనియర్స్).సీనియర్ దగ్గర నుంచి నేర్చుకున్నదే మేం... సీనియర్స్ తర్వాతే మేం’’ అని చెప్పారు. డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ– ‘‘రాజా సాబ్’ వెనక బలంగా నిలబడింది ఇద్దరు. ఒకరు ప్రభాస్‌గారు, మరొకరు విశ్వప్రసాద్‌గారు. ఈ సినిమా ఎవర్నీ నిరాశపరచదు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌గారు ప్రపంచమంతా గుర్తింపు తెచ్చుకున్నారు. మేము సౌతాఫ్రికాలో చిన్న ఊరిలో షూటింగ్ చేస్తుంటే, అక్కడి వారికి కూడా ప్రభాస్‌గారు తెలియడం మమ్మల్ని సర్ప్రైజ్ చేసింది. రాజమౌళిగారు కష్టపడి చేసినపాన్ ఇండియా ప్రయత్నం మా అందరికీ ఉపయోగపడుతోంది’’ అని చెప్పారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ– ‘‘మా పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో బిగ్గెస్ట్ స్టార్‌తో చేసిన బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. మూడేళ్లు కష్టపడి నిర్మించాం’’ అని పేర్కొన్నారు. క్రియేటివ్ ప్రోడ్యూసర్ ఎస్కేఎన్, నిర్మాత వై. రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్, నార్త్ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని తదితరులుపాల్గొన్నారు. -
‘ఈషా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'దండోరా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆది సాయికుమార్ ‘శంబాల’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఈ హీరో 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో.. ఇప్పుడూ అలాగే!
అరుణ్ విజయ్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన తాజా చిత్రం రెట్ట తల. సిద్ధి ఇద్నాని హీరోయిన్గా నటించిన ఇందులో తాన్యా రవిచంద్రన్, హరీష్ పేరడీ, యోగేష్ స్వామి, జాన్ విజయ్, బాలాజీ మురుగదాస్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బీటీజీ యూనివర్సల్ పతాకంపై బాబీ బాలచందర్ నిర్మించిన ఈ చిత్రానికి మాన్ కరాటే చిత్రం ఫేమ్ క్రిష్ తిరుకుమరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందించారు.ప్రీరిలీజ్ ఈవెంట్నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ నెల 25న విడుదల కానుంది. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం చైన్నెలోని ప్రసాద్ ల్యాబ్‌లో ప్రీ రిలీజ్ కార్యక్రమం నిర్వహించగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్, వడివళగన్, ముత్తయ్య, కిషోర్ ముత్తుస్వామి, బాలాజీ వేణుగోపాల్, గోకుల్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నా శిష్యుడేఈ సందర్భంగా దర్శకుడు ఏఆర్ మురుగదాస్ మాట్లాడుతూ ఈ చిత్ర దర్శకుడు తన శిష్యుడని.. గజిని, తుపాకీ చిత్రాలకు పనిచేశారని పేర్కొన్నారు. ఈ మూవీ టైటిల్ కూడా తనదేదని, తనను అడగ్గానే ఇచ్చానని చెప్పారు. నటుడు అరుణ్ విజయ్ 15 ఏళ్ల క్రితం ఎలా ఉన్నారో, ఇప్పుడు కూడా అలాగే ఉండటం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. ఆయన శ్రమజీవి అని.. మరింత ఉన్నత స్థాయికి చేరుకుంటారనే నమ్మకం ఉందన్నారు.ఛాలెంజింగ్ పాత్రఅరుణ్ విజయ్ మాట్లాడుతూ.. దర్శకుడు కథ చెప్పగానే తనను బాగా ఆకట్టుకుందన్నారు. అదే సమయంలో ఇందులో నటించడం ఛాలెంజ్‌గా అనిపించిందన్నారు. అందుకే ఈ చిత్రంలో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. క్లైమాక్స్ కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని, ఇందులో హీరో ధనుష్ ఒక పాట పాడటం విశేషమని పేర్కొన్నారు. -
యాంకర్ సుమ కొడుకు 'మోగ్లీ' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'త్రీ రోజెస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
టాలీవుడ్ మూవీ ఫెయిల్యూర్ బాయ్స్.. బాబు మోహన్ సందడి
క్రాంతి, అవితేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఈ మూవీకి వెంకట్ త్రినాథ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్‌పై విఎస్ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టాలీవుడ్ నటుడు బాబు మోహన్ హాజరయ్యారు.బాబు మోహన్ మాట్లాడుతూ... 'అందరికీ నమస్కారం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ప్రేక్షకులంతా ఇటువంటి సినిమాలను సపోర్ట్ చేసి విజయాన్ని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నా' అని అన్నారు.దర్శకుడు వెంకట త్రినాథ రెడ్డి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారం. ముందుగా మేము ఈ సినిమా కథ అనుకున్నప్పుడు నిర్మాతలు నన్నే దర్శకత్వం వహించమన్నారు. ఎంతో కష్టపడి విజయవంతంగా ఈ సినిమాను పూర్తి చేశాం. సెన్సార్ వారు ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. నా తొలి చిత్రానికి ఇంతగా సపోర్ట్ చేసి నాకు అండగా నిలబడిన నిర్మాతలకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. హీరో అవి తేజ్ ఈ సినిమా కోసం ఎంతో డెడికేషన్‌తో నటించారు. ఈ సినిమా చూసి మీరు ఫీల్ గుడ్ అవుతారని హామీ ఇవ్వగలను. ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నా" అని అన్నారు. డైరెక్టర్ తెలుగు శ్రీను మాట్లాడుతూ... "అందరికి నమస్కారం. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదాలు. సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినిమా చాలా బాగా వచ్చింది. చిత్ర ట్రైలర్ చూస్తుంటే సినిమాపై నాకు మరింత నమ్మకం వచ్చింది. పాటలు చాలా బాగా వచ్చాయి. నిర్మాణ సంస్థను ప్రారంభించిన నిర్మాత కుమార్ అందరికీ సపోర్ట్ చేస్తూ రావడం చాలా ఆనందంగా ఉంది. డిసెంబర్ 12వ తేదీన విడుదల కానున్న ఈ సినిమాను ప్రేక్షకులు అందరూ థియేటర్లో చూసి ఆనందిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు. ఈ చిత్రంలో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి, కోయల్ దాస్ కీలక పాత్రల్లో నటించారు. -
'ఇట్స్ ఓకే గురు' అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా: మెహర్ రమేశ్
సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్లు చేసిన సినిమా 'ఇట్స్ ఓకే గురు'. మణికంఠ దర్శకత్వం వహించగా.. క్రాంతి ప్రసాద్ నిర్మించారు. ఈనెల 12న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన దర్శకుడు మెహర్ రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డైరెక్టర్ మెహర్ రమేశ్ మాట్లాడుతూ.. 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమాకు పూరి జగన్నాథ్ దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేశాను. బడ్జెట్‌తో సంబంధం లేకుండా సబ్జెక్ట్‌ని నమ్మి చేసిన సినిమా అది. దాని తర్వాత రవితేజ, పూరి జగన్నాథ్ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ సినిమా చూస్తుంటే నాకు మంచి సబ్జెక్టు ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా కూడా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు. -
బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నా సినిమా ఉగాది పచ్చడిలాంటిది: బాలకృష్ణ
‘‘నేను పాదరసంలాంటివాణ్ణి.. ఏ పాత్రలో అయినా ఒదిగి పోతా. నా సినిమా ఉగాది పచ్చడిలాంటిది.. అన్ని రుచులు ఉంటాయి. డిసెంబరు 5న థియేటర్లలో అఖండ తాండవం చూస్తారు’’ అని బాలకృష్ణ చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ, సంయుక్త జంటగా నటించిన చిత్రం ‘అఖండ 2: తాండవం’. ఆది పినిశెట్టి విలన్‌గా నటించారు. ఎం. తేజస్విని సమర్పణలో రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమా డిసెంబరు 5న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘నేను, బోయపాటి సినిమా చేయాలనుకుంటే మూడే నిమిషాలు మాట్లాడుకుంటాం.. నాలుగో నిమిషం ఆ మహాయజ్ఞంలోకి దిగి పోతాం. రామ్, గోపీగార్లు కానీ, నేను కానీ విజయాలకు పొంగి పోం.. అపజయాలకు కృంగి పోం.. నా అభిమానులూ అంతే. మన సినిమా విడుదల సందర్భంగా జీవహింస చేయొద్దని నా అభిమానులను కోరుతున్నా. వాటికి కూడా జీవించే హక్కు ఉంది’’ అని తెలిపారు.బోయపాటి శ్రీను మాట్లాడుతూ– ‘‘చిత్ర పరిశ్రమ ఒక్కరిది కాదు.. అందరిది. ఇక్కడ కుల, మత, భేదాలు లేవు. ప్రజలకు మంచి చెప్పాలి, వినోదం పంచాలన్నది మాత్రమే ఉంటుంది. మన ‘అఖండ 2’ సక్సెస్ కొట్టాలి. ‘ది రాజా సాబ్’ కూడా విజయం సాధించాలి. ఆ తర్వాత వచ్చే చిరంజీవిగారి ‘మన శంకర వరప్రసాద్‌గారు’ కూడా హిట్ కావాలి. ఇలా పరిశ్రమ బాగుండాలి. అప్పుడే అందరూ బాగుంటారు’’ అని తెలిపారు. గోపి ఆచంట మాట్లాడుతూ– ‘‘బోయపాటి, బాలకృష్ణగారి కాంబినేషన్లో వచ్చిన మూడు చిత్రాల కంటే ‘అఖండ 2’ బ్లాక్‌బస్టర్ అవుతుంది’’ అన్నారు. తమన్ మాట్లాడుతూ– ‘‘రామ్ ఆచంట, గోపి ఆచంట, అనీల్ సుంకరగార్లతో ‘దూకుడు, ఆగడు’ వంటి సినిమాలు చేశాను. ఆ చిత్రాల తర్వాత ‘అఖండ 2’ కోసం పనిచేయడం సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. -
‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)
-
కీర్తి సురేశ్ రివాల్వర్ రీటా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
నాగదుర్గ హీరోయిన్గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘ప్రేమంటే’ సినిమా ప్రీ రిలీజ్.. ముఖ్య అతిథిగా నాగచైతన్య (ఫొటోలు)
-
అల్లరి నరేష్ '12ఎ రైల్వే కాలనీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘సంతాన ప్రాప్తిరస్తు’ ప్రీ రిలీజ్ లో మెరిసిన చాందినీ చౌదరి (ఫొటోలు)
-
ఆ ఇష్టంతోనే జానకి రాముడు సినిమా చేశాను: నాగార్జున
‘‘నాకు గత జన్మ సినిమాలంటే ఇష్టం. నాన్నగారి ‘మూగమనసులు’ సినిమాతో నాకు బాగా పరిచయం. నేనూ అదే ఇష్టంతో ‘జానకి రాముడు’ సినిమా చేశాను. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ‘గత వైభవం’ చిత్రం నాలుగు జనరేషన్ల కథ. ట్రైలర్ చూస్తే టీమ్ కష్టం తెలుస్తోంది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ కావాలి’’ అని చె΄్పారు నాగార్జున. ఎస్ఎస్ దుష్యంత్, ఆషికా రంగనాథ్ నటించిన ఫ్యాంటసీ డ్రామా ‘గత వైభవం’. సింపుల్ సుని దర్శకత్వంలో దీపక్ తిమ్మప్ప, సుని నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది.ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తర అమెరికా, కెనడాలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. ‘‘గత వైభవ’ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది’’ అన్నారు దుష్యంత్. ‘‘చాలా ఎమోషనల్‌గా, ప్రేమతో మేం చేసిన సినిమా ఇది’’ అని పేర్కొన్నారు ఆషిక. ‘‘కమర్షియల్ హంగులున్న ప్రయోగాత్మక చిత్రమిది’’ అని చె΄్పారు సింపుల్ సుని. ‘‘ఈ సినిమా టీజర్ చూడగానే ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ సినిమా వైబ్ వచ్చింది’’ అన్నారు చైతన్య రెడ్డి. -
'గత వైభవం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
విష్ణు విశాల్ ’ఆర్యన్‘ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
రష్మికా ‘ది గర్ల్ ఫ్రెండ్’ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
'ప్రేమిస్తున్నా' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సూర్య సేతుపతి ‘ఫీనిక్స్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఫిల్మ్‌నగర్ బాధలు తెలుసు: సుధీర్‌బాబు
‘‘ఒక్క సినిమా చాలు అనుకున్న నేను 20 సినిమాలు చేశాను. వీటిలో హిట్ చిత్రాలకు కారణం నా కష్టమైతే ఫెయిల్యూర్స్‌కి కారణం కూడా నేనే. మహేశ్‌గారు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా, నేను అడగలేదు. నేను ఇరవై సినిమాలు చేయడానికి కారాణం ఒక్కటే. కృష్ణగారి అల్లుడు, మహేశ్‌గారి బావ... సుధీర్‌బాబు. అయితే నా యాక్షన్ వీడియోలు పట్టుకుని ప్రతి ఆఫీస్‌కి తిరిగాను. నాకు కృష్ణానగర్ కష్టాలు తెలియకపోవచ్చు కానీ ఫిల్మ్‌నగర్ బాధలు తెలుసు. అవకాశాల కోసం బస్సులో నేను ట్రావెల్ చేయకపోవచ్చు. కానీ కారులో కూర్చుని ఏడవడం తెలుసు.ఇవన్నీ నేను సింపతీ కోసం చెప్పట్లేదు. మీరందరూ (వేడుకలో వీక్షకులను ఉద్దేశిస్తూ..) మహేశ్బాబుగారిపై ప్రేమతోనే వచ్చారు. థ్యాంక్యూ సో మచ్. కానీ ఇందులో ఎవరో ఒకరు ఏదో మూలన నాకోసం వచ్చి ఉంటారని, నా కోసం చప్పట్లు కొట్టి ఉంటారని నా మనసుకు తెలుస్తోంది. నేను మరింత కష్టపడతాను’’ అని హీరో సుధీర్‌బాబు అన్నారు. సుధీర్‌బాబు, సోనాక్షి సిన్హా లీడ్ రోల్స్‌లో, శిల్పా శిరోద్కర్ కీ రోల్లో నటించిన చిత్రం ‘జటాధర’.ఈ ద్విభాషా (తెలుగు, హిందీ) చిత్రానికి వెంకట్ కల్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 7న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుధీర్‌బాబు మాట్లాడుతూ– ‘‘నేను చేసిన 20 సినిమాల్లో ‘జటాధర’ బెస్ట్ స్క్రిప్ట్. ఇందులో ఘోస్ట్ హంటర్ క్యారెక్టర్ చేశాను. ఈ సినిమా కోసం శివ తాండవం చేయడం అద్భుతమైన అనుభూతి. ఇది ఆ శివుని దీవెనగా భావిస్తున్నాను’’ అని తెలిపారు. ‘‘ఈ సినిమా ఆడియన్స్‌కు నచ్చుతుంది’’ అని పేర్కొన్నారు శివిన్, ప్రేరణ. -
వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా
-
'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)
-
రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి: విక్రమ్ వారసుడు
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ వారసుడు ధ్రువ్(Dhruv Vikram) నటించిన కొత్త సినిమా బైసన్(Bison Kaalamaadan) . ఇప్పటికే కోలీవుడ్‌లో విడుదలైన విషయం తెలిసిందే. ధృవ్‌కు జంటగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమాని మారి సెల్వరాజ్ తెరకెక్కించగా.. పా.రంజిత్ సమర్పించారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ కోసం ధ్రువ్ చాలానే కష్టపడ్డాడు. తమిళ్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న బైసన్ ఈనెల 24న తెలుగులో కూడా విడుదల కానుంది.ఈ నేపథ్యంలో బైసన్ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో హీరో విక్రమ్ తనయుడు ధ్రువ్‌తో పాటు అనుపమ పరమేశ్వరన్ పాల్గొన్నారు. అయితే, టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ధ్రువ్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. 'మీతో మాట్లాడటానికి మూడేళ్లు వెయిట్ చేశాను.. ఈ సినిమా కోసం నేను ప్రొఫెషనల్ కబడ్డీ నేర్చుకున్నాను. మా నాన్న విక్రమ్ మాదిరే నేను చాలా కష్టపడతాను. నాకు ఒక ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా చూడండి. నచ్చితే మాకు సపోర్ట్ చేయండి. నాకు తెలుగులో సినిమాలు చేయాలని ఉంది.. నాకు మీ అందరి సపోర్ట్ కావాలి.' అంటూ తెలుగులోనే స్పీచ్ అదరగొట్టారు. ఏదో ఒక రోజు నాకు కొడుకు పుట్టి ఇలాగే సూట్‌కేస్ కొనడానికి వెళ్తే షాప్ ఓనర్ మీ నాన్న #Dhruv అంటే నాకు చాలా ఇష్టం అనిపించుకోవాలి... రాసుకొచ్చి తెలుగులో ఎక్సలెంట్ స్పీచ్ ఇచ్చిన Hero #DhruvVikram 👌👏 pic.twitter.com/ZthsjHBCks— Rajesh Manne (@rajeshmanne1) October 21, 2025 -
కిరణ్ అబ్బవరం ‘K-ర్యాంప్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘తెలుసు కదా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ మూవీ SWAG ఈవెంట్ (ఫొటోలు)
-
‘మిత్రమండలి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సినిమా పరిశ్రమను కాపాడుకోవాలి : మంత్రి జి.వివేక్
‘‘సినిమా వ్యాపారం అంటేనే రిస్క్. ‘అరి’ చిత్రంతో అలాంటి రిస్క్ చేశారు నిర్మాతలు. వారికి ఈ సినిమా మంచి విజయం అందివ్వాలి. తగినన్ని ప్రోత్సాహకాలు ఇస్తూ, సినిమా పరిశ్రమను కాపాడుకోవడంతో పాటు అభివృద్ధి చెందేలా చూసుకోవాలి. అప్పుడే స్థానికంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలు వస్తాయి’’ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి జి. వివేక్ తెలిపారు. వినోద్ వర్మ, అనసూయ, సాయికుమార్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘అరి’. జయశంకర్ దర్శకత్వం వహించారు. రామిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి (ఆర్వీ రెడ్డి) సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి మారంరెడ్డి, డా. తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, బీరం సుధాకర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏషియన్–సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా నేడు రిలీజ్ అవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ– ‘‘అరి’లాంటి మంచి చిత్రాలను ప్రోత్సహిస్తే ఈ కోవలో మరిన్ని సినిమాలు వస్తాయి’’ అని చెప్పారు. ‘‘మంచి సందేశం ఇచ్చేలా రూపొందిన ‘అరి’ విజయం సాధించాలి’’ అని ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఆకాంక్షించారు. ‘‘మంచి కథతో ఈ చిత్రాన్ని రూ΄÷ందించారు జయశంకర్’’ అన్నారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ‘‘అరిషడ్వర్గాల నేపథ్యంలో తీసిన ‘అరి’కి మంచి విజయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం’’ అని తిమ్మప్ప నాయుడు పురిమెట్ల, శ్రీనివాస్ రామిరెడ్డి తెలి΄ారు. ‘‘నా 50 ఏళ్ల నట జీవితంలో ‘అరి’ లాంటి చిత్రంలో నటించినందుకు గర్వపడుతున్నాను’’ అని నటుడు సాయికుమార్ చె΄్పారు. ఈ వేడుకలో దర్శకుడు జయశంకర్, త్రిదండి అహోబిల రామానుజ జీయర్ స్వామి, తెలంగాణ స్టేట్ ΄్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ జి. చిన్నారెడ్డి తదితరులు మాట్లాడారు. -
‘అరి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి : వరుణ్ సందేశ్
‘నా కెరీర్ లో అక్టోబర్ నెలను మరచిపోలేను. ఎందుకంటే దాదాపు పద్దెనిమిది ఏళ్ల క్రితం నేను నటించిన తొలి చిత్రం "హ్యాపీడేస్" 2007లో ఇదే నెలలో విడుదలై, ఘన విజయం సాధించి, నా కెరీర్ నే మలుపు తిప్పింది. అందుకే నా జీవితంలో అక్టోబర్ మాసం గుర్తుండి పోయింది. ఇప్పుడు కానిస్టేబుల్ చిత్రం కూడా ఇదే నెలలో విడుదలవుతుండటంతో ఆ రోజులు గుర్తుకు వస్తున్నాయి’ అని హీరో వరుణ్ సందేశ్ అన్నారు.వరుణ్ సందేశ్, మధులిక వారణాసి జంటగా జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై ఆర్యన్ సుభాన్ ఎస్.కె. దర్శకత్వంలో బలగం జగదీశ్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ, "సమాజంలో జరుగుతున్న అంశాల ప్రేరణతో ఈ చిత్రాన్ని మలచడం జరిగింది. కమర్షియల్, ఎంటర్టైన్మెంట్, సందేశం వంటి అంశాలను మిళతం చేసి రూపొందించడం జరిగింది" అని అన్నారు.నిర్మాత బలగం జగదీశ్ మాట్లాడుతూ, "ఈ చిత్రానికి సెన్సార్ యు/ఎ సర్టిఫికెట్ లభించింది. ఈ నెల 10న చిత్రాన్ని భారీగా విడుదల చేయబోతున్నాం. ఒక అమ్మాయికి అవమానం జరిగితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్న అంశాన్ని చూపించాం. అమ్మాయిలతో పాటు తల్లి తండ్రులు కూడా ఈ సినిమాను చూడాలి" అని అన్నారు.దర్శకుడు ఆర్యన్ సుభాన్ ఎస్.కె. మాట్లాడుతూ, ట్రైలర్, పాటలకు వచ్చిన స్పందన సినిమా పట్ల మా నమ్మకాన్ని పెంచింది. నిర్మాత కథను నమ్మి స్వేచ్ఛ ఇవ్వడం వల్లనే ఈ సినిమా తెరపైకి వచ్చింది" అని అన్నారు. -
వరుణ్ సందేశ్ ‘కానిస్టేబుల్’ మూవీ ప్రీ రిలీజ్ (ఫొటోలు)
-
‘కాంతార: చాప్టర్ 1’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ (ఫొటోలు)
-
నొప్పితోనే 'కాంతార 1' ఈవెంట్‌కు ఎన్టీఆర్
కొన్నిరోజుల క్రితం ఈ యాడ్ షూటింగ్ జరుగుతుండగా ఎన్టీఆర్ గాయపడ్డాడు. అయితే ప్రమాదం ఏం లేదని ఆయన టీమ్ చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. దీని తర్వాత పెద్దగా బయటకు రాని ఎన్టీఆర్.. ఇప్పుడు 'కాంతార 1' కోసం వచ్చాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్నాడు.రిషభ్ శెట్టి నటించిన ఈ సినిమా.. అక్టోబరు 02న థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే బెంగళూరు, కొచ్చిలో ప్రెస్ మీట్స్ జరగ్గా.. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ఎన్టీఆర్‌ని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఈ వేడుకకు సింపుల్‌గా వచ్చిన కూర్చునేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ కనిపించాడు. భుజం దిగువన చేయి పెడుతూ నొప్పిని ఫీలవుతున్నట్లు కనిపించాడు. ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: మిస్ అవుతున్నా.. తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్) ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్.. 'డ్రాగన్' అనే సినిమా చేస్తున్నాడు. అయితే 'కాంతార 1' చిత్రంలోనూ తారక్ అతిథి పాత్రలో కనిపించనున్నాడని గతంలో రూమర్స్ లాంటివి వచ్చాయి. కాకపోతే ఇవి నిజమా లేదా అనేది తెలియదు. అలానే రిషభ్ శెట్టి అభిమానించే నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. బహుశా ఆ కారణం వల్లనో ఏమో గానీ నొప్పి ఇబ్బంది పెడుతున్నా సరే ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి హాజరయ్యాడు. దీన్ని త్వరగానే ముగించేశారు కూడా!2022లో వచ్చిన 'కాంతార' చిత్రానికి ఇప్పుడు ప్రీక్వెల్ తీశారు. అప్పుడొచ్చిన సినిమాలో ప్రస్తుతం ఏం జరిగిందనే విషయాన్ని చూపించారు. ఈసారి మాత్రం గతంలో అసలేమేం జరిగింది? అనేది చూపించబోతున్నారు. ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థమైంది. అయితే ట్రైలర్లో విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది కానీ స్టోరీ పరంగా పెద్దగా రివీల్ చేయలేదు. మరి థియేటర్లలో ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి?(ఇదీ చదవండి: టాలీవుడ్ డైరెక్టర్ నిశ్చితార్థం.. చైతూ-శోభిత సందడి)Man of Masses @tarak9999 arrives at grand pre-release event of #KantaraChapter1 🔥 pic.twitter.com/FKJjIQwmFT— Telugu Film Producers Council (@tfpcin) September 28, 2025 -
'తాళికట్టు శుభవేళ' సినిమా ప్రీ రిలీజ్ వేడుక
శ్రీ వెంకటా చలపతి ఫిలింస్ పతాకంపై బి. అరుణ్ కౌశిక్ నిర్మాణంలో, వి. జగన్నాధరావ్ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'తాళికట్టు శుభవేళ'. తిలక్ రాజ్, తుంగ హీరోహీరోయిన్. దేవరాజ్ ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్లో శనివారం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటుడు తుమ్మలపల్లి ఆంజనేయులు గుప్త, నటుడు వినోద్ కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై, వీడియో సాంగ్స్, ట్రైలర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 'తాళికట్టు శుభవేళ సినిమా పేరు విన్నప్పుడే ఎంతో పాజిటివ్‌గా అనిపించింది. మూవీలో సంగీతం మధురంగా ఉంది. కొత్త తరానికి విలువలు నేర్పే మంచి కుటుంబ కథతో ఈ చిత్రం నిలిచిపోతుందని నమ్ముతున్నాను' అని చెప్పారు. -
పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమా ప్రీ రిలీజ్ వేడుక (ఫొటోలు)
-
ఈ సినిమాకి ఆ ఇద్దరే స్టార్స్: పవన్ కల్యాణ్
‘‘ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తున్నారని నాకు తెలియదు. ‘ఖుషి’ చిత్రం సమయంలో ఈ జోష్ చూశాను. అలాంటి జోష్ మళ్లీ ‘ఓజీ’కి వచ్చింది. సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత కూడా మీరు (ఫ్యాన్స్) నన్ను వదల్లేదనిపిస్తోంది.. మీరు కదా నాకు భవిష్యత్ ఇచ్చింది’’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్, ప్రియాంకా మోహన్ జోడీగా నటించిన చిత్రం ‘ఓజీ’. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానుంది.ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘ఓజీ’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ–‘‘సుజిత్ నా అభిమాని. ‘జానీ’ మూవీ చూసి నాతో సినిమా తీయాలనుకున్నాడు. ‘సాహో’ సినిమా తర్వాత సుజిత్‌తో సినిమా చేస్తే బాగుంటుందని త్రివిక్రమ్ చెప్పి, నాకు పరిచయం చేశారు. తను కథని ముక్కలు ముక్కలుగా చెప్పినా సినిమా తీసేటప్పుడు తన సత్తా తెలిసింది. ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్... నాట్ పవన్ కల్యాణ్. వారిలో మొదటి క్రెడిట్ సుజిత్‌ది. రెండో క్రెడిట్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ది. ‘నేను డిప్యూటీ సీఎం అని ఈ రోజు మరచిపోయాను.మీరు ఊహించుకోండి.. ఒక ఉప ముఖ్యమంత్రి ఇలా కత్తి పట్టుకుని వస్తే ఊరుకుంటారా? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. నేను సినిమా ప్రేమికుణ్ణి. సినిమా చేసేటప్పుడు దాని ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. రాజకీయాలు చేసేటప్పుడు అదే ఆలోచనలు తప్ప వేరేవి ఉండవు. సుజిత్ టీమ్ చాలా అద్భుతమైనది. ఇలాంటి టీమ్ నేను దర్శకత్వం వహించే టప్పుడు నాకూ ఉండి ఉంటే రాజకీయాల్లోకి వచ్చేవాణ్ని కాదేమో? ట్రైలర్ పూర్తిగా సిద్ధం కాలేదంటే కుదరదు. మా వాళ్లకి (ఫ్యాన్స్) ఈ రోజు ఎంతో కొంత చూపించాల్సిందే.నాకు తెలుసు కదా... అమితాబ్ బచ్చన్ గారి కోసం నేను చిన్నప్పుడు ఎలా కొట్టుకునేవాణ్ణో. ఆయన సినిమాకి టిక్కెట్ దొరక్కపోతే చంపేద్దాం అనిపించేది. ‘ఓజీ’ చిత్రం అందర్నీ రంజింపజేసేలా ఉంటుంది’’ అని చె΄్పారు. ఈ ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు అల్లు అరవింద్, ‘దిల్’ రాజు, వై. రవిశంకర్, రచయిత కోన వెంకట్, ప్రియాంక మోహన్, సంగీత దర్శకుడు తమన్, నటులు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్ మాట్లాడారు. -
భద్రకాళి నిరుత్సాహ పరచదు: విజయ్ ఆంటోని
‘‘భద్రకాళి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా ఎవర్నీ నిరుత్సాహ పరచదని కచ్చితంగా చెప్పగలను’’ అని విజయ్ ఆంటోని చెప్పారు. ‘అరువి’ ఫేమ్ అరుణ్ ప్రభు దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా, తృప్తి రవీంద్ర, రియా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భద్రకాళి’. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని సమర్పణలో రామాంజనేయులు జవ్వాజీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్ కానుంది.ఏషియన్ సురేష్ ఎంటర్టైన్ మెంట్, రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా కలిసి తెలుగులో విడుదల చేస్తున్నాయి. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సురేష్ బాబు మాట్లాడుతూ–‘‘విజయ్‌గారి క్రమశిక్షణే ఆయన్ను గొప్పస్థాయికి తీసుకువెళ్తుంది’’ అన్నారు. ‘‘మంచి పొలిటికల్ థ్రిల్లర్ ఇది’’ అని తెలిపారు అరుణ్ ప్రభు. ‘‘ప్రేక్షకులకు నచ్చే సినిమా ఇది’’ అన్నారు రామాంజనేయులు. ఈ వేడుకలో తృప్తి రవీంద్ర, రియా, రైటర్ భాష్యశ్రీ మాట్లాడారు. -
విజయ్ ఆంటోనీ ‘భద్రకాళి’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘బ్యూటీ’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
‘అందెల రవమిది’ చిత్రం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కొట్టేసిన దేవుడి భూముల్లో OG ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏంటి?
-
‘కిష్కింధపురి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
అమ్మ అడుగుపెట్టగానే నాన్న స్టెప్పులు తడబడ్డాయి: చిరంజీవి కూతురు
మెగాస్టార్ కూతురు సుస్మిత కొణిదెల ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన కిష్కింధపురి ఈవెంట్‌కు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. అమ్మను చూస్తే మీ నాన్నగారికి చిన్నపాటి భయం ఏదైనా ఉందా? అని సుస్మితను అడిగారు. దీనికి సుస్మిత స్పందిస్తూ ఇవాళ జరిగిన విషయాన్ని పంచుకున్నారు.సుస్మిత మాట్లాడుతూ..'ఇవాళే మన శంకర వరప్రసాద్‌గారు మూవీ సాంగ్ షూట్ చేశాం.. అక్కడికి అమ్మ కూడా రావడంతో నాన్న స్టెప్ అటు ఇటు అయింది. నాన్న సరిగ్గా డాన్స్ చేయలేకపోయారు. అమ్మ సెట్లో అడుగుపెట్టడంతో ఆ ఎఫెక్ట్ నాన్నపై పడిందని' పంచుకుంది. మీకు ఏదంటే భయమని సుస్మితను అడగ్గా.. మనకి భయపెట్టడం తప్ప.. భయపడటం ఏమీ ఉండదని సమాధానమిచ్చింది. కాగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కింధపురి చిత్రం ఈనెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. -
‘మధరాసి’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కాబోయే సతీమణితో వేడుకలో పాల్గొన్న నారా రోహిత్ (ఫోటోలు)
-
కాబోయే భార్యతో ఈవెంట్‌కు టాలీవుడ్ హీరో.. సోషల్ మీడియాలో వైరల్!
టాలీవుడ్ హీరో నారా రోహిత్ నటించిన తాజా చిత్రం సుందరకాండ. ఈ చిత్రంలో వృతి వాఘాని, శ్రీదేవి విజయ్ కుమార్ హీరోయిన్లుగా నటించారు. వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వంలో సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేశ్ మహంకాళి నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 27న థియేటర్లలో సందడి చేయనుంది.ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో సుందరకాండ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ఈవెంట్లో నారా రోహిత్, మంచు మనోజ్ సందడి చేశారు. మొదటిసారిగా నారా రోహిత్ తన కాబోయే భార్య శిరీషాతో కలిసి ఈవెంట్‌కు హాజరయ్యారు. తొలిసారి ఈవెంట్లో కాబోయే టాలీవుడ్ జంట కనిపించడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా.. ఈ ఏడాది భైరవం మూవీతో అలరించిన నారా రోహిత్ తనపెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆయన అధికారికంగా ప్రకటించాడు. అయితే నారా రోహిత్, నటి శిరీషాల నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో జరిగింది. త్వరలో పెళ్లి పనులు కూడా మొదలు పెట్టాలని అనుకున్నారు. కానీ ఆయన తండ్రి రామ్మూర్తి నాయుడు (72) నవంబర్‌లో అకాల మరణం చెందడం వల్ల పెళ్లికి బ్రేకులు పడ్డాయి.'ప్రతినిధి2' సినిమాలో నారా రోహిత్ సరసన శిరీష నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీతో మొదలైన వారి స్నేహం ప్రేమగా మారింది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి వారిద్దరు ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఓజీ సినిమాతో శిరీషా ఈ ఏడాదిలో తెరపై సందడి చేయనున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీషా స్వస్థలం రెంటచింతల అని తెలిసిందే. -
‘కన్యాకుమారి’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
చెప్పడం మర్చిపోయాను.. క్షమించండి: ఎన్టీఆర్
ఎన్టీఆర్ హీరోగా నటించిన బాలీవుడ్ సినిమా 'వార్ 2'. హృతిక్ రోషన్ మరో హీరో. ఈ గురువారం మూవీ థియేటర్లలోకి రానున్న సందర్భంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో ఓ విషయం చెప్పడం మర్చిపోయిన తారక్.. ప్రత్యేకంగా ఓ వీడియో రిలీజ్ చేశాడు. క్షమించాలి అని అంటూ తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు)'వేదికపై ముఖ్యమైన విషయం ఒకటి చెప్పడం మర్చిపోయాను, క్షమించాలి. నా 25 ఏళ్ల కెరీర్‌ని అభిమానులతో పంచుకునే ఆనందంలో ఈ తప్పు జరిగింది. ఈ కార్యక్రమానికి సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అలానే హైదరాబాద్ పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ నా కృతజ్ఞతలు. మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నా. మీరు చాలా సహకారం అందించారు. అభిమానులని ఎంతో బాధ్యతగా చూసుకున్నారు. వారి ఆనందానికి కారణమయ్యారు' అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.ఎన్టీఆర్, హృతిక్ చేసిన 'వార్ 2' సినియా.. యష్ రాజ్ స్పై యూనివర్స్‌లో భాగం. కియారా అడ్వాణీ హీరోయిన్ కాగా అయాన్ ముఖర్జీ దర్శకుడు. తెలుగులో సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అందుకే ఆదివారం రాత్రి ఈవెంట్లో నిర్మాత నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా బాగోలేకపోతే తనని పదింతలు ఎక్కువ తిట్టండి అని ఛాలెంజ్ చేశారు. మరోవైపు తారక్ కూడా చిత్ర ఫలితంపై నమ్మకంగా ఉన్నారు. హృతిక్‌తో కలిసి కాలర్ ఎగరేసి మరీ నమ్మకాన్ని చూపించారు.(ఇదీ చదవండి: ఆంధ్రాకు షిఫ్ట్ అయిన సినీ కార్మికుల వివాదం)My sincere thanks to the Government of Telangana and the honourable CM Shri @revanth_anumula garu, as well as the Telangana Police Department @TelanganaCOPs for their support in making the #War2 pre-release event a grand success. pic.twitter.com/krKp8xZejS— Jr NTR (@tarak9999) August 10, 2025 -
హైదరాబాద్‌లో గ్రాండ్‌గా 'వార్ 2' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
'కూలీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెరిసిన శ్రుతి హాసన్ (ఫొటోలు)
-
రజినీకాంత్ 'కూలీ' మూవీ ఆడియో లాంచ్ (ఫొటోలు)
-
‘బకాసుర రెస్టారెంట్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)


