మారిపోయిన ప్రభాస్‌.. ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ! | Prabhas Funny Speech At The Raja Saab Pre Release Event | Sakshi
Sakshi News home page

మీ కోసమే పిలక.. అది తెలియకనే పెళ్లి చేసుకోలేదు : ప్రభాస్‌ ఫన్నీ స్పీచ్‌ వైరల్‌

Dec 28 2025 10:35 AM | Updated on Dec 28 2025 10:52 AM

Prabhas Funny Speech At The Raja Saab Pre Release Event

ప్రభాస్‌.. పాన్‌ ఇండియా నెంబర్‌ వన్‌ స్టార్‌. కోట్లాది మంది అభిమానులు ఆయన సొంతం. ఆయన ఫ్లాపు సినిమాలకు కూడా వందల కోట్ల కలెక్షన్స్‌ వచ్చేస్తాయి. అలాంటి హీరో బయటకు వస్తే ఎంత హడావుడి చేయాలి? కానీ ప్రభాస్‌ చాలా సింపుల్‌గా ఉంటాడు. స్టార్‌ హీరో అనే బిల్డప్‌ ఆయన ముఖంలో ఎప్పుడూ కనిపించదు. తన సినిమాల గురించి కూడా పెద్దగా గొప్పలు చెప్పుకోడు. సినిమా ఈవెంట్‌లో ఇచ్చే స్పీచులు కూడా ఒకటి, రెండు నిమిషాలకు మించి ఉండదు. కానీ ‘ది రాజాసాబ్‌’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో కొత్త ప్రభాస్‌ కనిపించాడు. ఎప్పుడూ లేనంతగా చాలా ఎక్కువ సేపు స్పీచ్‌ ఇచ్చాడు.

అందుకే పిలక
రాజాసాబ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో ప్రభాస్‌ దాదాపు 10 నిమిషాల వరకు మాట్లాడితే..అందులో  ఎక్కువసేపు ఫ్యాన్స్‌ ప్రస్తావనే తెచ్చాడు.  అభిమానుల కోసమే ది రాజాసాబ్‌ సినిమా చేశామని చెప్పాడు. అంతేకాదు ‘మీ కోసమే పిలక వేసుకొని వచ్చా’ అంటూ తన పిలక చూపించి..నవ్వించాడు. ఇక ఆయన స్పీచ్‌ మధ్యలో ఫ్యాన్స్‌ అంతా ‘బాహుబలి జయహో’ అంటుంటే.. ‘నా స్పీచ్‌ బోరింగ్‌గా ఉంటుందని మీరు అలా అంటున్నారు కదా.. ఏదో ఒకరోజు స్టేజ్‌పై ఎంటర్‌టైన్‌ చేస్తా..మీరంతా షాకైపోతారు’ అంటూ చిన్నపిల్లాడిలా ప్రభాస్‌ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఇక తన పెళ్లిపై కూడా ఆయన ఫన్నీగా స్పందించారు. ‘‍ప్రభాస్‌ని పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీస్‌ ఏంటి?’ అని సుమ ప్రశ్నించగా.. ‘అది తెలియకనే ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు’ అంటూ నవ్వేశాడు. 

ఇక సూట్‌లో వచ్చిన తమన్‌పై కూడా ప్రభాస్‌ పంచులు వేశాడు. ‘అంత ధైర్యం ఏంటి డార్లింగ్‌. సీరియస్‌గా చెబుతున్నా.. నేను కూడా ఇలా సూట్‌ వేసుకోని రావాలని అన్నీ రెడీ చేసుకుంటా. కబోర్డులో దాదాపు 200 వరకు డ్రెస్సులు ఉంటాయి. బాగా రెడీ అయి రావాలనుకుంటాను. కానీ ఓవర్‌గా ఉంటుందిలే అనుకొని సింపుల్‌గా వచ్చేస్తా. తమన్‌ లాంటి ధైర్యం నాకెప్పుడు వస్తుందో’ అని చెప్పడంతో అక్కడ ఉన్న ఫ్యాన్స్‌ అంతా ఫుల్‌గా నవ్వేశారు. 

ఆ ఒక్క మాటతో..
ప్రభాస్‌ ఎప్పుడూ తన సినిమాల గురించి డబ్బా కొట్టుకోరు. ‘మా సినిమా అదిరిపోయింది..బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ పక్కా’ అని ఎక్కడా చెప్పలేడు. కామ్‌గా సినిమా చేసుకొని పోతాడు.హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా పెద్దగా మాట్లాడడు. ఈ సారి కూడా అలానే మాట్లాడారు. ‘ఈ పండక్కి అన్ని సినిమాలు బ్లాక్‌ బస్టర్లు అవ్వాలి. అందులో మాది కూడా ఉంటే బాగుంటుంది’ అని మాత్రమే అన్నాడు. ఈ ఒక్క మాట చాలు.. మిగిలిన సినిమాలకు ప్రభాస్‌ ఎంత గౌరవం ఇస్తున్నాడో చెప్పడానికి. 

అంతేకాదు సీనియర్‌ హీరోలను కూడా ఆయన ఎంతో గౌరవిస్తాడు. ‘సీనియర్లు సీనియ‌ర్లే. వాళ్ల నుంచి మేమంతా నేర్చుకొన్నాం. వాళ్ల సినిమాలు బాగా ఆడాలి’ అంటూ సంక్రాంతి పోటీలో ఉన్న చిరంజీవి, రవితేజ లాంటి సీనియర్‌ హీరోలకు తన తరపున ఆల్‌ ది బెస్ట్‌ చెప్పాడంతే.. ఆయన సీనియర్లకు ఎంత రెస్పెక్ట్‌ ఇస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇక మారుతి ఎమోషల్‌ అయితే..దగ్గరకు వచ్చి ఓదార్చడమే కాదు.. `మూడేళ్ల క‌ష్టం క‌న్నీళ్ల రూపంలో వ‌చ్చింది` అంటూ తనదైన శైలీలో కవర్‌ చేశాడు. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘డార్లింగ్ పెన్నుతో రాశావా… మిష‌న్ గ‌న్నుతో రాశావా’ అంటూ మారుతిపై ప్రశంసలు కురిపించడంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ అవుతున్నారు. 

మొత్తంగా ప్రభాస్‌ ఎప్పుడూ లేని విధంగా చాలా హుషారుగా, సరదాగా ఎక్కువ స్పీచ్‌ ఇచ్చాడు. తమ అభిమాన హీరో ఇలా ఓపెన్‌గా మాట్లాడడం చూసి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement