రష్మిక, శ్రీలీల బాటలో కాంతార బ్యూటీ.. టాలీవుడ్ కలిసొస్తుందా? | Rukmini Vasanth Tollywood Entry With Jr Ntr Will Be Luck In Telugu cinema | Sakshi
Sakshi News home page

Rukmini Vasanth: ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ.. కాంతార బ్యూటీకి కలిసొచ్చేనా?

Feb 12 2026 7:50 PM | Updated on Feb 12 2026 8:35 PM

Rukmini Vasanth Tollywood Entry With Jr Ntr Will Be Luck In Telugu cinema

కన్నడ బ్యూటీలకు టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉంది. రష్మిక, శ్రీలీలకు ఇప్పటికే తెలుగులో స్టార్ హీరోయిన్లుగా తమ పేరును లిఖించుకున్నారు. పుష్ప మూవీతో రష్మిక మందన్నా రేంజ్‌ పూర్తిగా మారిపోయింది. అలా కన్నడ భామలు ఇలా వచ్చి తెలుగులో సూపర్‌ పవర్‌గా ఎదిగారు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలో తెలుగమ్మాయిల కంటే శాండల్‌వుడ్ భామలకే ఫుల్ డిమాండ్ ఉంటోంది.

ఇప్పుడదే అదే బాటలో మరో కన్నడ బ్యూటీ అడుగులేస్తోంది. గతేడాది కాంతార-2 మూవీతో అందరి చూపులు తనవైపు తిప్పుకున్న భామ రుక్మిణి వసంత్.  ఇప్పుడు టాలీవుడ్‌పై దృష్టి సారించింది. సప్త సాగరాలు దాటి లాంటి కన్నడ మూవీతో సూపర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఛాన్స్ కొట్టేసింది. ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న చిత్రంలో అవకాశం దక్కించుకుని టాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.

ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో వస్తోన్న చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ విషయాన్ని మేకర్స్ కూడా అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ మూవీతోనైనా రుక్మిణి వసంత్ టాలీవుడ్‌లో క్రేజ్ దక్కించుకుంటుందేమో వేచి చూడాల్సిందే. రష్మిక, శ్రీలీల మాదిరిగానే ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్‌లో స్టార్‌గా హోదాను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. టాలీవుడ్‌లోనూ తన కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తుందని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రుక్మిణి వసంత్ ఇప్పటికే తెలుగులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రంలో నటించింది. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement