రష్మిక-విజయ్ పెళ్లి వేడుక.. కోట్ల రూపాయల డీల్‌కు నో..! | Vijay and Rashmika Marriage Video Deal Price Goes Viral | Sakshi
Sakshi News home page

Vijay - Rashmika: రష్మిక-విజయ్ పెళ్లి వేడుక.. కోట్ల రూపాయల డీల్‌కు నో..!

Feb 12 2026 3:25 PM | Updated on Feb 12 2026 4:40 PM

Vijay and Rashmika Marriage Video Deal Price Goes Viral

టాలీవుడ్‌లో గత కొంత కాలంగా వీరి పెళ్లి చుట్టే చర్చ నడుస్తోంది. ఎంగేజ్‌మెంట్ వార్తల తర్వాత ఆ ఇద్దరు స్టార్స్‌ పెళ్లి వేడుక కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ జంట మరెవరో కాదు.. టాలీవుడ్‌లో మోస్ట్‌ వైరల్‌ ప్రేమజంట రష్మిక- విజయ్ దేవరకొండ. వీరిద్దరి పెళ్లి ఫిబ్రవరిలోనే జరనుందని వచ్చినా డేట్‌ విషయంలో క్లారిటీ లేదు. మొదట ఫిబ్రవరి 2న జరగనుందని వార్తలొచ్చనా అలా జరగలేదు. తాజాగా ఈనెల 26న ఈ గ్రాండ్ వెడ్డింగ్ జరగనుందని టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో విజయ్- రష్మిక పెళ్లికి సంబంధించిన మరో న్యూస్ తెగ వైరలవుతోంది. వీరి పెళ్లి వీడియోను ఏ ఓటీటీకి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ వెడ్డింగ్‌ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ఆఫర్‌తో ముందుకొచ్చనట్లు సమాచారం. అయితే తమ వ్యక్తిగత జీవితంలో బిజినెస్‌ చేసే ఉద్దేశం లేదని ఓటీటీ విజ్ఞప్తిని తిరస్కరించనట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

గతంలో లేడీ సూపర్ స్టార్ నయనతార వెడ్డింగ్ వీడియో విషయంలో ఎదురైన న్యాయపరమైన చిక్కులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే విజయ్- రష్మిక జాగ్రత్త పడుతున్నట్లు టాక్. ముఖ్యంగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వేడుకతో వ్యాపారం చేయడం విజయ్‌కి అస్సలు ఇష్టం లేదని సమాచారం. అందుకే కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా ఓటీటీ డీల్‌ను వీరు సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యుల మధ్య ప్రైవేట్‌గా ఉంచుకోవాలనే ఆలోచనలో ఉన్నారట. ఏదేమైనా వీరిద్దరి పెళ్లి కోసం టాలీవుడ్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement