ఓటీటీలోకి వచ్చేసిన ధర్మేంద్ర చివరి సినిమా | Dharmendra Ikkis Movie Released In OTT On Rent Basis, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Ikkis OTT Release: వార్ బ్యాక్‌డ్రాప్ మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్

Feb 12 2026 4:37 AM | Updated on Feb 12 2026 1:50 PM

Dharmendra Ikkis Movie OTT Streaming Now

బాలీవుడ్ హీ మ్యాన్ ధర్మేంద్ర.. మూడు నెలల క్రితం అంటే గతేడాది నవంబరు చివరలో చనిపోయారు. తర్వాత నెలకు ఈయన నటించిన చివరి సినిమా థియేటర్లలోకి వచ్చింది. సర్వత్రా ప్రశంసలు అందుకున్న ఆ మూవీ.. ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?

అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త నంద హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఇక్కీస్'. న్యూఇయర్ సందర్భంగా జనవరి 01న థియేటర్లలోకి వచ్చింది. హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులోనే ధర్మేంద్ర కీలక పాత్ర పోషించారు. జైదీప్ అహ్లవత్ కూడా మంచి రోల్ చేశాడు. 1971 భారత్-పాక్ యుద్ధంలో అమరుడైన అరుణ్ ఖేత్రపాల్ జీవితం ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఇప్పుడీ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతోంది. రెండు వారాల తర్వాత ఉచితంగా అందుబాటులోకి రానుంది.

'ఇక్కీస్' విషయానికొస్తే.. బ్రిగేడియర్ ఎంఎల్ ఖేత్రపాల్(ధర్మేంద్ర) ఆర్మీ మాజీ ఉద్యోగి. పాకిస్తాన్‌లోని తన ఫ్రెండ్స్‌ని కలిసేందుకు లాహోర్ వెళ్తారు. అక్కడ ఉన్నన్నీ రోజులు ఈయన బాధ్యతని ఆర్మీ మాజీ ఆఫీసర్ నిస్సార్ అహ్మద్(జైదీప్ అహ్లావత్)పై పడుతుంది. పాకిస్తాన్‌లో తన జ్ఞాపకాలని నెమరవేసుకునేందుకు పలు ప్రాంతాలకు వెళ్లిన ఖేత్రపాల్.. తన కొడుకు అరుణ్ ఖేత్రపాల్ చనిపోయిన ప్రదేశానికి కూడా వెళ్తాడు. ఇంతకీ 1971 భారత్-పాక్ యుద్ధంలో 21 ఏళ్ల సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్(అగస్త్య నంద) చేసిన సాహసమేంటి? యుద్ధభూమిలో అతడికి ఎదురైన సవాళ్లేంటి? అనేదే మిగతా స్టోరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement