నేను ఊరుకోను.. మెగా కోడలు స్ట్రాంగ్ వార్నింగ్ | Lavanya Tripathi Reacts To Social Media Trolls On Mega Family And Ram Charan Upasana Twins, Video Went Viral | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: అలాంటి ట్వీట్ వేయడం పూర్తిగా తప్పు

Feb 12 2026 12:34 AM | Updated on Feb 12 2026 1:47 PM

Lavanya Tripathi Reacts Ram Charan Twins And Mega Trolls

మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. తమ కుటుంబంపై వచ్చిన ట్రోల్స్‌పై మరోసారి స్పందించింది. కొన్నిరోజుల క్రితం రామ్ చరణ్-ఉపాసన దంపతులతు కవలలు పుట్టిన సందర్భంగా కొందరు.. మెగాస్టార్ చిరంజీవిపై దారుణమైన విమర్శలు చేశారు. అప్పుడే సదరు నెటిజన్‌కి ఇచ్చిపడేసిన లావణ్య.. ఇప్పుడు ఆ సందర్భం గురించి మరోసారి మాట్లాడింది.

'రామ్ చరణ్‌కి ట్విన్స్ పుట్టిన ఆనందంలో మేం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆ సమయంలో అలాంటి ట్వీట్ వేయడం పూర్తిగా తప్పు. మా కుటుంబానికి ఏమైనా అంటే నేను ఊరుకోను' అని లావణ్య స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈమె ప్రధాన పాత్ర చేసిన 'సతీ లీలావతి' వచ్చే నెల 6న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్ర ఈవెంట్ సందర్భంగానే మెగా ఫ్యామిలీపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించింది.

గతంలో చిరంజీవి, ఓ సందర్భంలో మాట్లాడుతూ తమ కుటుంబంలో అందరూ ఆడపిల్లలే ఉన్నారని, మెగా లెగసీని కొనసాగించే మగబిడ్డ కోసం ఎదురుచూస్తున్నానని అన్నారు. అయితే చిరు.. ఆడపిల్లల్ని చిన్నచూపు చూస్తున్నారని చెప్పి.. చరణ్‌కి కవలలు పుట్టిన సందర్భంగా ట్రోల్స్ వచ్చాయి. దీనిపై ఆ రోజు స్పందించిన లావణ్య.. చిరంజీవి తన కుటుంబంలోని మహిళల్ని, ముఖ్యంగా తన మనవరాళ్లని ఎంత ప్రేమగా, గౌరవంగా చూస్తారో ఈ విమర్శలు చేసేవారికి అస్సలు అవగాహన లేదు. ఆయన చేసే పనుల్లో 1 శాతం కూడా చేయలేని వాళ్లు.. ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడటం సరికాదు అని అప్పుడు కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు మాట్లాడుతూ.. ఫ్యామీలీ జోలికొస్తే ఊరుకోనని చెప్పుకొచ్చింది.

Advertisement
 
Advertisement
Advertisement