శ్రీ విష్ణు క్రైమ్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌.. ఆసక్తిగా టీజర్ | Tollywood Hero Sri Vishnu Mrithyunjay Teaser Out now | Sakshi
Sakshi News home page

Mrithyunjay Teaser: నేను హీరో అవ్వడానికి ట్రై చేయడమేంటి మేడమ్?.. ఆసక్తిగా టీజర్

Feb 11 2026 7:50 PM | Updated on Feb 11 2026 8:20 PM

Tollywood Hero Sri Vishnu Mrithyunjay Teaser Out now

టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు నటిస్తోన్న క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ మూవీ మృత్యుంజయ్. ఈ సినిమాకు హుస్సేన్‌ షా కిరణ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన చిత్రం తర్వాత శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా నటిస్తోన్న మూవీ కావడంతో అంచనాలు పెరిగాయి. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 

టీజర్ చూస్తుంటే క్రైమ్ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.  ఓ మర్డర్‌ కేసు ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని టీజర్‌లో అర్థమవుతోంది. కాగా.. ఈ మూవీని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్‌ఫెక్ట్‌ ఎంటర్‌టైన్ మెంట్‌పై సందీప్ గున్నం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ఈ చిత్రంలో సుదర్శన్, రచ్చ రవి, అయ్యప్ప, సిజ్జు, ఐశ్వర్య, బాలాదిత్య, కృష్ణ కౌశిక్, నంద గోపాల్, మృంచి మాధవి కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతమందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement